Activities calendar

13 June 2016

21:40 - June 13, 2016

ఢిల్లీ : యూనివర్సిటీల్లో కేంద్రం అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య విమర్శించారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి రాసిన బహిరంగ లేఖ రాశారు. మోదీ మాటల గారడి ఆపి దేశాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. యువత, విద్యార్థులు ఎన్నో ఆశలతో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారని, కానీ వారి ఆశలు నెరవేరడం లేదని కన్హయ్య లేఖలో దుయ్యబట్టారు. మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు.

ప్రకటనల ప్రధాని మోదీ : కన్హయ్య
జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌.. ప్రధాని మోదీకి బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు. యువత, విద్యార్థులు, రైతులు తమ సమస్యలు పరిష్కరిస్తారని మోదీని గద్దెనెక్కించారని, కానీ మోదీ ప్రకటనలకే పరిమితమై ప్రజా సమస్యలను గాలికొదిలేశారని కన్హయ్య లేఖలో విమర్శించారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోదీ సర్కార్‌ విఫలమైందని కన్హయ్య ఆరోపించారు. రెండేళ్ల మోదీ పాలనలో ప్రకటనల కోసం 200 కోట్లు ఖర్చు చేశారని, కానీ విద్యార్థులకు 99 కోట్ల స్కాలర్‌షిప్‌లు చెల్లించడానికీ మోదీ సర్కార్‌కు చేతకాలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు చదువుకోలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కన్హయ్య లేఖలో పేర్కొన్నాడు.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్న కన్హయ్య ...
మోదీ ఏలుబడిలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, మతోన్మాద దాడులు పెరిగిపోయాయని కన్హయ్య లేఖలో స్పష్టం చేశాడు. అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో మాటల గారడి ఆపి.. దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోదీకి కన్హయ్య సూచించారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులయ్యేలా మోదీ సర్కార్‌ కార్పొరేట్ల కొమ్ము కాస్తోందని కన్హయ్యకుమార్‌ దుయ్యబట్టారు. ఉపాధ్యాయులు, వివిధ వర్గాల ప్రజల ప్రాథమిక హక్కులను సైతం కాలరాసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సమస్యలపై ఉద్యమించే అధ్యాపకులు, విద్యార్థులపై మోదీ సర్కార్‌ అణచివేత ధోరణితో ముందుకు పోతోందని, యూనివర్సిటీల్లో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని కన్హయ్యకుమార్‌ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

ప్రజా సమస్యలపై మాట్లాడటానికి మోదీకి సమయం లేదు: కన్హయ్య
నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయాలని, లేకపోతే త్వరలోనే మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని కన్హయ్య హెచ్చరించాడు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి కూడా మోదీకి సమయం లేదని కన్హయ్య ఎద్దేవా చేశారు. మాటల గారడి ఆపి మోదీ.. దేశాభివృద్ధికి పాటు పడాలని కన్హయ్యకుమార్‌ లేఖలో ప్రస్తావించాడు. 

21:32 - June 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదుల చలో హైకోర్టు కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ సాగింది. పోలీసులు లాయర్లను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు. హైకోర్టు వరకూ చేరుకున్న న్యాయవాదులు సీజేఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. న్యాయాధికారుల ఆప్షన్‌ను తొలగించేవరకూ పోరాడాలని.. తమ కార్యాచరణను కొనసాగిస్తామని న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది.

టీ. న్యాయవాదుల చలో హైకోర్టు ...
తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన చలో హైకోర్టు కార్యక్రమం... నిరసనలు.. అరెస్టుల మధ్య సాగింది. ఉదయం 9 గంటలకే తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు ప్రాంగణంలోకి చేరుకున్నారు. హైకోర్టులో నినాదాలు చేయవద్దంటూ పోలీసులు వారికి పదేపదే విజ్ఞప్తి చేసినా.. న్యాయవాదులు బేఖాతరు చేశారు. న్యాయాధికారులకు ఆప్షన్‌ ఇవ్వరాదంటూ నినదించారు.

సీ.జే. చాంబర్ ముందు బైఠాయింపు...

ఆందోళన కార్యక్రమంలో భాగంగా.. ముందుగా నిర్దేశించుకున్నట్లే.. సీ.జే. చాంబర్ ముందు న్యాయవాదులు బైఠాయించారు. తమ డిమాండ్స్‌పై మరోసారి చర్చించాలని కోరారు. అయితే న్యాయాధికారుల ఆప్షన్స్ పై మూడు నెలల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఏసీజే వారికి హామీ ఇచ్చారు. అలాగే అరెస్ట్ అయిన 400 మంది న్యాయవాదులను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు. హైకోర్టు నుంచి ర్యాలీగా సిటీ సివిల్ కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆప్షన్స్ విధానం పై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయవాదులు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

జూలై 1 నుంచి నిరవధిక సమ్మె...
మంగళవారం నుంచి కోర్టులను బహిష్కరిస్తూ..14న రిలే నిరహారదీక్ష, 15న మౌన ప్రదర్శన,16న వంట వార్పు, 17న ఫోస్టల్ కార్డ్స్‌తో నిరసన తెలుపుతూ సీమాంధ్ర ప్రాంత జడ్జీలకు, సీజేకు లేఖలు రాయనున్నారు. న్యాయవాదులకు మద్దతుగా తెలంగాణ న్యాయస్థాన ఉద్యోగుల సంఘాలు సమ్మెకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈమేరకు హైకోర్టు పరిపాలన రిజిస్ట్రార్‌కు ఆయా సంఘాల నేతలు సమ్మె నోటీసులు అందజేశారు. జూలై 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు... న్యాయవాదుల అరెస్టులను టీ అడ్వకేట్ జేఏసీ ఖండించింది.

21:13 - June 13, 2016

ఓ పక్క తానే పెంచి పోషించిన ఉగ్రవాదం .. మరో పక్క అడ్డూ అదుపు లేని గన్ కల్చర్ .. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచానికి పెద్ద అన్నట్టుగా భావించే అమెరికా ఇప్పుడు సొంతింట్లో రేగుతున్న చిచ్చుని అదుపుచేయలేని పరిస్థితిలో పడింది. అక్కడ చాక్లెట్లు దొరికినట్టుగా తుపాకులు దొరుకుతున్నాయి. .. వీడియో గేమ్ ఆడినంత ఈజీగా గన్ పేలుస్తున్నారు.. బ్లైండ్ గా ఫిక్సవుతున్నారు...వైల్డ్ గా ఎటాక్ చేస్తున్నారు.. ఓవరాల్ గా అమెరికాలో ఎప్పుడే ఘటన జరుగుతుందో తెలియని ఆందోళన ఏర్పడింది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం. అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమౌతోంది . ప్రపంచానికి నీతి బోధలు చేసే అమెరికా ఇప్పుడు తన ఇల్లు తగలబడుతుంటే దిక్కుతోచని స్థితిలో పడింది. అడ్డూ అదుపు లేకుండా బహిరంగ మార్కెట్ లో దొరికే ఆయుధాలు ఇప్పుడా దేశాన్ని దారుణ అభద్రతలోకి నెడుతున్నాయి. మారణాయుధాలనే నమ్ముకుంది అమెరికా. కానీ, చివరకు తన బిడ్డలను కూడా అవే మారణాయుధాలకు బలితీసుకుంటుంటే విలవిల్లాడుతోంది . అమెరికాలో జరుగుతున్నన్ని తుపాకీ చావులు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదు. అమెరికాలో తుపాకీ కాల్పులు వినిపించని రోజంటూ కనిపించటం లేదు. బుల్లెట్ కు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.. ఏ భాషా రాదు. అందుకే పెంచి పోషించిన వారినే బలితీసుకుంటోంది.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.. అతడికి గే సంస్కృతి అంటే ఇష్టం లేదు. అలాంటి విషయాల్ని కలలో కూడా ఊహించలేడు. వాళ్లని చూస్తే అతడికి తీవ్ర అసహనం. అదే లక్షణం అతడిని మారణహోమానికి కారణంగా మార్చింది. 50మందిని బలితీసుకునేలా చేసింది. ఓర్లాండోలో జరిగిన ఘటనలో ఒమర్ మతీన్ స్వలింగ సంపర్కులను యాక్సెప్ట్ చేయలేని స్థితిలో దారుణానికి తెగబడ్డాడు. అమెరికాలో తుపాకుల సంస్కృతిని మళ్లీ గుర్తు చేశాడు. ఓ పక్క ఆయుధాలు తయారు చేసి ప్రపంచంపై డంప్ చేస్తారు.. తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తారు.. తన ఆయుధ సంస్థలకు లాభాల కోసం ప్రపంచాన్ని నాశనం చేయటానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు అదే సమస్య ఆ దేశానికే ఎదురవుతోంది. ఇప్పటికైనా అమెరికా ద్వంద్వ ప్రమాణాలను వదులుకుంటుందా? లాభాపేక్షతో, సామ్రాజ్యవాద ధోరణులతో వ్యవహరించినంత కాలం ఆయుధాలే రాజ్యమేలుతాయి. అక్కడ కన్నీటికి స్థానం ఉండదు.. ఎందుకంటే బుల్లెట్ కు ఎలాంటి ఎమోషన్స్ ఉండవు.. ఏ భాషా రాదు. అందుకే మొదట.. ప్రపంచం నుదుటిపై గురిపెట్టిన ఆయుధాన్ని అమెరికా గుర్తించాల్సి ఉంది. అదే సమయంలో నిజాయితీగా తన సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. లేదంటే మరిన్ని మారణకాండలు తప్పవు..

20:41 - June 13, 2016

కారు పార్టీలో కాళ్లారజాపుకుని కూర్చుంటున్న వలస నేతలు..బంగారు తెలంగాణలో భరోసాలు లేని రైతులు....'షీ 'టీమ్ ల్లాగా 'గాడ్' టీమ్ లను కూడా పెట్టాలంటున్న జనాలు...థంప్స్ అప్ సీసాలో సచ్చిపడిన పాము పిల్ల...బతికుండంగనే చావు చేసిన చుట్టాలు ...కల్తీ అయిన ఫ్రూటీ డబ్బా...గ్యాస్ నూని పట్టుకోని సెల్ టవర్ఎక్కిన అబ్బాయి...బతుకుండగానే సమాధిలో పడేసిన బంధువులు...ఇటువంటి గరం గరం వార్తలన్నీ మల్లన్న ముచ్చట్లల్లా చూడుండ్రి మరి...మరి మరి ఇనాలంటే ఈ విజువల్ ని క్లిక్ చేయాలే...మరి జాగెందుకు సెపుండ్రి....

20:22 - June 13, 2016

పంజాబ్‌ : పంజాబ్ లో అత్యంత తేలికైనది డ్రగ్స్ వ్యాపారమేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఒక్క నెలలోనే రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామని ప్రకటించారు. బిజెపి-అకాళిదళ్‌ పార్టీలు చట్ట విరుద్ధ కార్యక్రమాలకు ఊతమిస్తున్నాయని రాహుల్‌ ఆరోపించారు. పంజాబ్ లో పెరిగి పోయిన మత్తపదార్థాల వినియోగం, శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్ నాయకత్వంలో జలంధర్లో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది.

ఉడ్తా పంజాబ్ సినిమాతో హాట్ టాపిక్ గా పంజాబ్ డ్రగ్స్...
ఉడ్తా పంజాబ్ సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో పంజాబ్ డ్రగ్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పంజాబ్ యువత డ్రగ్స్ కి బానిసవ్వడానికి కారణం ఏమిటి? ఇందులో రాజకీయ నాయకుల పాపమెంత?

పంజాబ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్...
డ్రగ్స్.... డ్రగ్స్... ఈ పదమే పంజాబ్ ను కుదిపేస్తోంది. ఈ ఒక్క పదమే ఆ సుసంపన్న రాష్ట్రం పరువు తీస్తోంది. అక్కడి యువత ప్రాణాలతో చెలగాటమాడుతోంది.

15శాతం భుక్కీకి బానిసలు...
పంజాబ్ యువత డ్రగ్స్ కీ, మత్తు మాదకద్రవ్యాలకీ బానిసలయ్యారు. ప్రతి పదిమందిలో నలుగురు వీటికి దాసోహమయ్యారు. వీరిలో సగం మంది యువరైతులే. పంజాబ్ లో 15శాతం మంది పొప్పి హస్క్ లేదా భుక్కీకి బానిసలైతే, 20శాతం మంది సింథటిక్ డ్రగ్స్ మాయలోపడ్డారు. మంచి పేరు ప్రతిష్టలున్న కుటుంబాల పిల్లలు కూడా వీటికి బానిసలైపోయారు. పంజాబ్ లో ఏడాదికి 17వేలకు పైగా కేసులు నమోదవుంతుడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి ఏటా ఆరేడు వందల కేజీల డ్రగ్స్ పట్టుబడుతుండడం అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో కళ్లకుకడుతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం వల్ల పంజాబ్ హెచ్ ఐ వి కేసులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.

యువతను డ్రగ్స్ కి బానిసలను చేస్తున్నారంటున్న రాహుల్ ...
పంజాబ్ లో డ్రగ్స్ వ్యసనం అత్యంత భయంకరరూపం దాల్చింది. పంజాబ్ యువతను డ్రగ్స్ కి బానిసలను చేస్తున్నారంటూ గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారమే రేపింది. పంజాబ్ లో ఈ స్థాయిలో డ్రగ్స్ కల్చర్ విస్తరించడానికి రాజకీయ నాయకుల పాపాలే కారణం. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసులు, బిఎస్ఎఫ్ వీరంతా ఈ పాపంలో భాగస్వాములే.

90 మంది ప్రముఖులకు నేరసామ్రాజ్యంతో లింక్ లు....
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అకాలీదళ్ ప్రభుత్వం మత్తు మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఓ కన్నేసింది. అధికారులతో రహస్య నివేదికలు తయారు చేయించింది. ఆ రిపోర్టులో కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఒకరా ఇద్దరా కనీసం 90 మంది విఐపిలకు నేరసామ్రాజ్యంతో లింక్ లున్నట్టు బయటపడింది. వీరిలో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ పోలీస్ అధికారులు, డిఎస్పీలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, స్టేషన్ అధికారులు వున్నారంటూ ఆ రిపోర్ట్ గుట్టువిప్పింది. అంతే. ఆ రిపోర్ట్ ను అకాలీదళ్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. దాన్ని రహస్యంగా వుంచింది. ఆ నివేదికను రాబట్టేందుకు కొంతమంది సామాజిక ఉద్యమకారులు ఆర్ టిఐ ద్వారా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అసలు అలాంటి రిపోర్టేదీ తయారు చేయలేదంటూ ప్రభుత్వం బుకాయించింది.
ప్రముఖుల అండదండలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా ...
2008లో పంజాబ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఐడిసీ రిపోర్ట్ డ్రగ్ మాఫియాకీ, పోలీస్ లకీ వున్న సంబంధాలను ఏకరువుపెట్టింది. డిప్యూటీ సిఎం తోడల్లుడు, కేంద్ర మంత్రి సోదరుడు, ఆరోగ్య శాఖ మంత్రికి సన్నిహితంగా వుండే బిజెపి నాయకుడు , రెవెన్యూమంత్రి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది ప్రముఖులకు డ్రగ్స్ మాఫియా తో సంబంధాలున్నట్టు వార్తలొచ్చాయి. శిరోమణి అకాలీదళ్ లీడర్లు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ జాబితాలో కనిపిస్తారు. ఇంతమంది ప్రముఖుల అండదండలుండడంతో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. చాలా ఈజీగా దొరకడం వల్లనే 70శాతం మంది యువత వాటికి బానిసలవుతున్నట్టు గుర్ నానక్ దేవ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. 12 ఏళ్ల లోపు పిల్లలను కూడా డ్రగ్స్ వ్యాపారంలో వినియోగిస్తుండడం మరో దారుణాతిదారుణమైన విషయం. గత లోక్ సభ ఎన్నికల్లో 800 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, నార్కోటిక్స్ పట్టుబడడం పంజాబ్ యువత ఎంత విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుందో తేటతెల్లం చేస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ లో ఉత్పత్తి చేసే చరస్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు చేసే ఓపియంతో పాటు పాకిస్తాన్ మీదుగా అఫ్గనిస్తాన్ సరఫరా చేసే హెరాయిన్ పంజాబ్ యువత నవనాడులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. 

20:03 - June 13, 2016

టీడీపీ నేత ...మాటల మాంత్రికుడు ...సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రం నిర్వహించింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఏమిటి అంటే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష అని టక్కున చెప్పవచ్చు... ఈ అంశంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అయిన సోమిరెడ్డి ఏమంటున్నారో ....తెలుసుకుందాం ..... ఏపీ రాష్ట్రం లోటు బడ్జెట్ తో పాలన మొదలైందన్నారు....ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో అమలు జరుగుతున్నాయన్నారు...ఈ పరిస్థితుల్లో కూడా కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి నిధులు కేటాయించి ఫంక్షనింగ్ కూడా జరుగతోందనీ....ఇటువంటి సమయంలో ముద్రగడ దీక్షను చేపట్టంపై ఆయన తీవ్రంగా ఖండిచారు.. ఇలా ఏపీలో కాపు రిజర్వేషన్లు...దీక్షలు..ఆందోళనలు...పలువురు ప్రతిపక్ష నేతలు కామెంట్స్...డిమాండ్స్...విమర్శలు ఇలా కాపుల జపంతో ఏపీ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే..ఈ అంశాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి మరిన్ని విషయాలను తెలుసుకోండి....

19:58 - June 13, 2016

హైదరాబాద్ : పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఈ నెల 14వ తేదీలోగా పరష్కరించకపోతే 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌ స్పష్టం చేసింది. ప్రధానంగా కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఆలోగా కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాల చెల్లింపు డిమాండ్లు సహా మొత్తం 34 డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత నెల 19న విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు సమ్మెనోటీస్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 13 విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక సంఘాల కలయికతో ఏర్పడిన ఈ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో మింట్‌ కాంపౌండ్‌లో ఆందోళనలు నిర్వహించారు. 

జోక్ చేసిన పైలట్ ...క్షమాపణ చెప్పిన సంస్థ...

బ్యాంకాక్‌: మాజీ ప్రధాని ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిందని ఓ పైలట్‌ జోక్‌ చేశాడు. సదరు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. బడ్జెట్‌ క్యారియర్‌ నోక్‌ఎయిర్‌ పైలట్‌ ఒకరు మాజీ ప్రధానమంత్రి యింగ్లక్‌ షినవత్రా ఎక్కిన విమానం కూలిందని గ్రూప్‌ చాట్‌లో పైలట్ పోస్ట్‌ చేశారు. గ్రూప్‌చాట్‌లో 30 మంది పైలట్స్‌ ఉన్నారు. షినవత్రా తన కుమారుడితో కలిసి విమానం ఎక్కుతున్న ఫొటోను పోస్ట్‌ చేసి.. వీరు బాధితులు అంటూ పేర్కొన్నారు. దీనిపై మరో పైలట్‌ కూడా స్పందించారు. ఈ గ్రూప్‌ చాట్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్‌ బయటకు రావడంతో తీవ్ర వివాదాస్పదంగా మారింది.

సీఆర్‌పీఎఫ్ జవాన్ల దాడిలో ఉగ్రవాది హతం...

జమ్మూ కశ్మీర్ : ఉదంపూర్ జిల్లా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి కూడ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది తప్పించుకున్నాడని, అతని కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు జమ్మూ-కాశ్మీర్ జోన్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రానా తెలిపారు.

ఈ తీర్పు కీలకమైనది : షాహిద్ కపూర్

ముంబై: ఉడ్తా పంజాబ్ సినిమాపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైనదని ఆ మూవీ హీరో షాహిద్ కపూర్ తెలిపారు. ఉడ్తాపంజాబ్ లో అభ్యంతరకర సన్నివేశాలుగానీ, మాటలు గానీ, దేశ సమగ్రతను దెబ్బతీసే అంశాలేవీ లేవని బాంబే హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాహిద్ మాట్లాడుతూ ఉడ్తా పంజాబ్ సినిమాకు భావ ప్రకటనా స్వేచ్చ దొరికింది. సినిమాపై వచ్చిన అభ్యంతరాలను అధిగమించేందుకు అభిమానులు, ప్రజలు అందించిన మద్దతు మరువలేనిది. ఇది మీరు సాధించిన విజయమంటూ షాహిద్ ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

మాయావతి, ములాయం తోడు దొంగలు : మోదీ

ఉత్తరప్రదేశ్ : మాయావతి, ములాయం తోడు దొంగల్లా వ్యవహరిస్తూ చెరి ఐదేళ్లు పాలిస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని పేర్కొన్నారు. అలహాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌‌లో బిజెపికి అధికారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తూ అధికారం ఇచ్చాక ప్రజలకు నష్టం కలిగిస్తే తమను తన్ని తరిమెయ్యాలన్నారు. మాయావతి, ములాయంల నుంచి ఉత్తరప్రదేశ్‌కు విముక్తి కల్పించి బిజెపికి పట్టం కట్టాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌ను ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. యూపీ అభివృద్ధి చెందితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని తెలిపారు. 

పోలీసుల అదుపులో మాజీ సర్పంచ్ ...

కరీంనగర్: గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన కమాన్‌పూర్ మండలం జెల్లారం మాజీ సర్పంచ్ జి రాజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెల్లారం గ్రామ పంచాయతీకి చెందిన రూ.78లక్షల నిధులను అక్రమంగా దుర్వినియోగం చేసినట్టు గుర్తించిన గోదావరిఖని టూటౌన్ పోలీసులు రాజయ్యను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

నియంతల్లా ఇద్దరు సీఎంలు : రామకృష్ణ

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తోందని మండిపడ్డారు.. ఏపీలో కుల రాజకీయాలను చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

గుల్బర్గ్ మారణహోమం నిందితులకు శిక్ష వాయిదా...

ఢిల్లీ : గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. సిట్‌ ప్రత్యేక కోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 2న 66 మంది నిందితుల్లో 24 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది.11 మందిని ఉరి తీయాలని కోర్టులో వాదించారు.

సంచలన తీర్పునిచ్చిన ప్రకాశం కోర్టు...

ప్రకాశం : ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అర్థవీడు మండలం పాగోలులో 2011లో జరిగిన వ్యక్తి హత్య కేసులో 12మందికి జీవిత ఖైదును విధించింది.ఈ కేసులో నిందితులుగా ఐదుగురు మహిళలు కూడా వున్నారు. 

18:50 - June 13, 2016

ప్రకాశం : చీటీల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి...అయినా కొత్త కొత్తగా...రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలతో వస్తున్న కంపెనీలను నమ్మి అమాయకులు బోల్తా కొడుతూనే ఉన్నారు...పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసిన కేటుగాళ్లు..బిచాణా ఎత్తేందుకు సిద్ధమయ్యారు..ఈ విషయాన్ని పసిగట్టిన బాధితులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి కేటుగాళ్లను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు..

రూ. కోటికి కుచ్చుటోపీ పెట్టిన సాయిభావన...
ప్రకాశం జిల్లా చీరాలలో కోటి రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన సాయిభావన చిట్‌ఫండ్స్‌పై అధికారులు, పోలీసులు కొరడా ఝుళిపించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాయిభావన చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ ఆదినారాయణతో పాటు మేనేజర్‌ శంకర్‌, చీరాల వాసి రాధాకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని కోర్టుకు తరలించారు. అనధికారికంగా నిర్వహించిన డిపాజిట్లు, చిట్టీల రూపంలో వసూలు చేసిన డబ్బును ఏంచేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

జిల్లా రిజిస్ట్రార్‌ ఆకస్మిక తనిఖీలు....
మరోవైపు సాయిభావన చిట్‌ఫండ్‌ చీటింగ్‌పై జిల్లా రిజిస్ట్రార్‌ సైతం సీరియస్‌గా స్పందించారు. చిట్‌ఫండ్స్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారం రోజులు ముందస్తుగా నోటీసులిచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో..సాయిభావన చిట్‌ఫండ్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీజ్‌ చేశారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనధికార చిట్‌ఫండ్స్...
ఎన్నో ఆశలతో చిట్టీలు వేస్తే తమను నిండా ముంచారని బాధితులు లబోదిబోమంటున్నారు. చిట్టీల రూపంలో తమనుంచి వసూలు చేసిన డబ్బును వెనక్కి ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనధికార చిట్‌ఫండ్‌ సంస్థలు పేద, మధ్య తరగతి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. పెద్దమొత్తంలో వసూలు చేసి బిచాణా ఎత్తేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని గుర్తుంచుకోండి. 

18:46 - June 13, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తోందని మండిపడ్డారు.. ఏపీలో కుల రాజకీయాలను చంద్రబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

18:38 - June 13, 2016

మహబూబ్ నగర్ : ఒకప్పుడది మారుమూల కుగ్రామం. తాగునీరు లేదు.. రోడ్లు లేవు. తాగునీటి ట్యాంకు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉందన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడా గ్రామ స్వరూపమే మారిపోయింది. మౌలిక వసతులన్నీ సమకూరాయి. పల్లెవాసులంతా సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏదా గ్రామం..? ఆ ప్రగతికి కారణమెవరు?? వాచ్‌ దిస్ స్టోరీ...

సకల సౌకర్యాలతో వెలిగిపోతున్న మురహరిదొడ్డి...
మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు మండలం మురహరిదొడ్డి. ఒకప్పుడిది కనీస వసతులు కూడా లేకుండా చాలా వెనుకబడ్డ గ్రామం. కానీ ప్రస్తుతం ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌-మెయిల్‌ ఈ గ్రామానికి కొత్త శోభను తీసుకు వచ్చింది.

రికార్డు స్థాయి మౌలిక వసతులు......
మారుమూలన ఉన్న మురహరిదొడ్డి గ్రామంలో 250 కుటుంబాలున్నాయి. దత్తతలో భాగంగా మెగా కంపెనీ.. లక్ష లీటర్ల సామర్ధ్యం గల సంపు, 40 వేల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకు ఏర్పాటు చేసి ఇంటింటికి నల్లా సౌకర్యం కల్పించారు. గ్రామంలోని అన్ని వీధులకూ సీసీ రోడ్లు, వాటికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. 2000 లీటర్ల సామర్థ్యం గల మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, సోలార్‌ వీధి దీపాలు అమర్చి ప్రతి ఇంటికి రెండు బల్బులు ఒక సాకెట్‌ అందజేశారు. ప్రతి ఇంటికి డ్రైనేజీ వసతి కల్పించారు. పాఠశాలల్లో ఫర్నీచర్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతులు కల్పించారు. సోలార్‌ విద్యుత్ కోసం ప్రత్యేక సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి గ్రామాన్ని ఆదర్శంగా నిలిపారు.

గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంఈఐఎల్ సంస్థ...
మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ఛైర్మన్‌ పీపీరెడ్డి, ప్రెసిడెంట్‌ గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెనుకబడ్డ గ్రామంగా ఉన్న మురహరిదొడ్డిని ప్రగతి పథంలో నిలిపారు. మెగా ఇంజీనీరింగ్‌ కంపెనీ చొరవ వల్లే తమ గ్రామానికి ఇంత అభివృద్ధి సాధ్యమైందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే మండలంలోని పసుపుల గ్రామంలోనూ ఇదే తరహా వెలుగులు నింపుతోంది మెయిల్‌ సంస్థ. 

18:24 - June 13, 2016

విజయవాడ : ఏపీలో వచ్చే మూడేళ్లలో 53లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ నిధి సంస్థ ఏర్పాటుపై పలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలతో కోడెల సమావేశమయ్యారు.. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణంపై చర్చించారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు... స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కోడెల తెలిపారు.

18:19 - June 13, 2016

గుంటూరు : అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. అగ్రిగోల్డ్‌ బాధితుల్లో చిన్న మొత్తాల పొదుపుదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. బాధితులు ఆత్మహత్యలకు పాల్పకుండా కాపాడేందుకు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు కోరారు. రెండువేల కోట్ల రూపాయల వరకు ఆస్తులు వేలం వేసి, తద్వారా వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాలని విన్నవించారు. బాధితులకు న్యాయం చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 15న గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర మహాదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 

18:01 - June 13, 2016

ఢిల్లీ : గుల్బర్గ్ సొసైటీ మారణహోమం కేసులో దోషులకు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. సిట్‌ ప్రత్యేక కోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ నెల 2న 66 మంది నిందితుల్లో 24 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. మిగిలిన 36 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దోషులుగా తేల్చిన 24 మందిలో 11 మందిపై హత్య కేసును నమోదు చేయగా, 13 మందిపై సాధారణ కేసులు నమోదు చేశారు. గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడికి ఎటువంటి ప్రణాళికలు రచించలేదని, అప్పటికప్పుడు దాడి జరిగినట్లు కోర్టు తెలిపింది.11 మందిని ఉరి తీయాలని కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. నిందితులకు కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో కాంగ్రెస్ నేత ఎహసాన్‌ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. 

17:56 - June 13, 2016

హైదరాబాద్ : వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలను సమన్వయంతో రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అనుమతులు లేని నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా వదలమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతేకాదు హైదరాబాద్‌ను 25 జోన్లుగా విడదీసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్‌ ప్రకటించారు. 

17:36 - June 13, 2016

హైదరాబాద్ : పేరుకే బంగారు తెలంగాణ..జరిగేది మాత్రం నియంతృత్ర భూసేకరణ అని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. 123 జీవో పేరుతో అధికారులను, రైతులను బెదిరింపులకు గురిచేస్తూ ప్రాజెక్టులకు భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. రైతులకు లాభం చేకూరేలా ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ సౌకర్యం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా భూసేకరణలో పాల్గొంటుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

ఇండియా 100/1..

హరారే : జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా 22 ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిసన జింబాబ్వే 126 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు 58 పరుగుల వద్ద రాహుల్ (33) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం నాయర్ 31, రాయుడు 24 పరుగులతో ఆడుతున్నారు.

విజయవాడకు రానున్న వెంకయ్య..

విజయవాడ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈనెల 16న విజయవాడకు రానున్నారు. 16 మధ్యాహ్నం స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ..

హైదరాబాద్ : ఆంధ్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ న్యాయవాద సంఘం ఇచ్చిన ఛలో హైకోర్టు పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టుల్లో విధులను బహిష్కరించారు.

17:12 - June 13, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కాపునేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాసరి నారాయణ రావు, చిరంజీవి, సి.రామచంద్రయ్య, కన్నబాబు, అంబటి రాంబాబు, బొత్స పాల్గొన్నారు. ముద్రగడ దీక్షపై ప్రభుత్వ వైఖరి..భవిష్యత్ కార్యాచరణ పై నేతలు చర్చిస్తున్నారు. 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ లో మహిళ మృతి..

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ఖ అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేపట్టారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : భారీ నష్టాలతో ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్లు కోలుకోలేదు. చివరకు స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తోనే ముగిశాయి.

ముద్రగడ దీక్షపై కాపు నేతల సమాలోచన..

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేస్తున్న దీక్షపై కాపు నేతలు సమావేశమయ్యారు. పార్క్ హయత్ హోటల్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దాసరి నారాయణరావు, బొత్స, చిరంజీవి, సి. రామచంద్రయ్య, అంబటి రాంబాబు తదితర నేతలు హాజయ్యారు.

16:40 - June 13, 2016

ఆత్మీయులకు ప్రత్యేక సందర్భాలలో గిఫ్ట్స్ ను అందించి మన ప్రేమను చాటాలనుకుంటాం. అవే గిఫ్ట్స్ ను మన చేతులతో తయారుచేస్తే అది ఇంకా ప్రత్యేకం. అలాంటి గిఫ్ట్స్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇవాళ్టి సొగసులో చూసి నేర్చుకుందాం..

16:38 - June 13, 2016

బాగా చదువుకుంటేనే సక్సెస్ అవుతామా? బాగా పనిచేస్తేనే సక్సెస్ అవుతామా? రెండూ నిజమే, వీటితో పాటు, క్రియేటివ్ గా ఆలోచించినా కూడా సక్సెస్ అవుతాం. అలాంటి సక్సెస్ మంత్రాతో, ముందుకు సాగుతున్న దోశ ట్రక్ డైరెక్టర్ అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి. అమ్మ వేసే క్రిస్పీ దోశ తెలుసు. అమ్మమ్మ ప్రేమతో వేడిగా తినిపించే మెత్తటి దోశలు, ఇంకా మసాలా దోశలు కూడా తెలుసు. మరి పిజా దోశ, తీన్ మార్ దోశ ఎప్పుడైనా విన్నారా? తెలీదు కదా? పదండి టేస్ట్ చూపిస్తాం. అందరూ నడిచే దారిలో నడిస్తే, అందరూ చేసే వృత్తిలో స్థిరపడి, అందరూ చేసేలాగే రొటీన్ పద్ధతిలో వ్యాపారం చేస్తే, సక్సెస్ ఛాన్సెస్ తక్కువే. కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే, క్వాలిటీతో కూడిన సర్వీస్ ని కస్టమర్స్ కి అందిస్తే, ఎలాంటి వ్యాపారమనే విజయపథాన పయనిస్తుందని నిరూపిస్తున్న శ్రీవిద్యకి మానవి అభినందనలు...తెలియచేస్తోంది.

16:21 - June 13, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు.. కాంగ్రెస్‌నుంచి గెలిచి గులాబీ కండువా ఎలా కప్పుకుంటారని ప్రశ్నించారు.. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

సమాజ్ వాదీ ఎమ్మెల్యేల సస్పెండ్..

ఢిల్లీ : ఇటీవల రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలను సమాజ్ వాదీ పార్టీ సస్పెండ్ చేసింది.

భారత్ 42/0...

హరారే : జింబాబ్వే తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. జింబాబ్వే 126 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. పది ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. రాహుల్ 22, కరుణ్ నాయర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

15:51 - June 13, 2016

హైదారాబాద్ : పెళ్లీడు అబ్బాయిలు పారాహుషార్‌.. ఆలస్యం చేస్తే అంతే సంగతులు. వెంటనే కల్యాణానికి సిద్ధపడకపోతే అమ్మాయిలు దొరకడమే కష్టమంటున్నాయి గణాంకాలు. దీంతో భవిష్యత్తులో అబ్బాయిలు పెళ్లిల్లు పెద్దలకు తలనొప్పిగా మారనున్నాయి.

భవిష్యత్తులో అబ్బాయిలకు.. వధువు దొరకడమే గగనం...
దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం చదువు.. కట్నం.. ఉద్యోగం.. ఇవన్నీ ఉంటేనే పెళ్లికి ఓకే అంటున్నారు అబ్బాయిలు. ఇప్పుడిలా డిమాండ్ చేస్తున్నా... భవిష్యత్తులో వధువు దొరకడమే గగనంగా మారడం ఖాయమని గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లీడుకు రాబోతున్న అబ్బాయిల కన్నా.. అమ్మాయిలు సంఖ్య చాలా రోజురోజుకు తగ్గుతోంది.

అబ్బాయిల కంటే.. అమ్మాయిల సంఖ్య తక్కువ...
కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలను చూసుకుంటే...ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆరు నుంచి పదిహేడేళ్ల లోపు సంఖ్యను పరిశీలిస్తే.. ఈ తేడా భారీగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈ వయసు అబ్బాయిల సంఖ్య 16లక్షల పైనే ఉండగా... అమ్మాయిల సంఖ్య 15లక్షలే. అటు ఏపీలోనూ అబ్బాయిలి 21లక్షలకు పైగా ఉండగా.. అమ్మాయిల సంఖ్య 20లక్షలే. ఇది ఇలాగే కొనసాగితే.. నాలుగేళ్లలో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉండబోతుంది. పదేళ్లలో అమ్మాయిల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నాలుగేళ్లలో ఏర్పడనున్న అమ్మాయిల కొరత...
ప్రస్తుతం 30 ఏళ్లకు పైబడిన పెళ్లికాని అబ్బాయిలు ఎక్కువగానే ఉన్నారు. పెళ్లి కోసం అంత తొందరపడడం లేదు. ఆచి.. తూచి అడుగేస్తున్నారు. వారి ఉద్యోగానికి.. చదువుకు సరిపడా అర్హతులున్న అమ్మాయిలనే కోరుకుంటున్నారు. అటువంటి వారి కోసం వెయిట్‌ చేస్తున్నారు. దీంతో పెళ్లీడు అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. ఇంచుమించు అమ్మాయిల పరిస్థితి అలానే ఉంది. వారికి నచ్చిన లక్షణాలున్న వారి కోసం ప్రయత్నిస్తున్నారు.

అబ్బాయిలు..అమ్మాయిల నిష్పత్తిలో మార్పులు...
మారుతున్న సమాజ స్థితిగతులకనుగుణంగా.. దంపతులు ఒక్కరో.. ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నారు. వారినే సరిగ్గా పెంచగలిగితే చాలానుకుంటున్నారు. దీంతో అబ్బాయిలు..అమ్మాయిల నిష్పత్తిలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదని నిపుణుల విశ్లేషణ.

ఫ్లోరిడా ఘటనకు కారణం తామేనన్న ఇస్లామిక్ స్టేట్..

కైరో : ఒర్లాండో నైట్‌క్ల‌బ్‌లో జ‌రిగిన మార‌ణ‌కాండ‌కు తామే కార‌ణ‌మంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు స్ప‌ష్టం చేశారు. ఐఎస్ఐఎస్‌కు చెందిన అల్‌బ‌యాన్ రేడియో ఈ విష‌యాన్ని ప్ర‌సారం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఫ్లోరిడాలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో 50 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే.

 

సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి - మంత్రి లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై చర్యలు తీసుకోవాలిన మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్‌వో)లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు.

జగన్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి - సోమిరెడ్డి..

విజయవాడ : వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల‌పై విచార‌ణ‌ను కింది కోర్టులు జాప్యం చేస్తున్నాయని టిడిపి నేత సోమిరెడ్డి పేర్కొన్నారు. జ‌గ‌న్‌పై కేసుల విచార‌ణ‌ను వేగ‌వంతం చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జ‌గ‌న్ అశాంతి సృష్టిస్తున్నార‌ని ఆయన అన్నారు.

చిరంజీవి దిష్టి బొమ్మ దగ్ధం..

హైదరాబాద్ : నగరంలోని అంబేద్కర్ విగ్ర‌హం వ‌ద్ద నిర్వహించిన మాల మహనాడు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చిరంజీవికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌ను దగ్ధం చేశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో చిరంజీవిని తిర‌గ‌నివ్వ‌బోమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

15:43 - June 13, 2016

ఉత్తరప్రదేశ్‌ : ప్రధాని నరేంద్రమోది రెండేళ్ల పాలన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వేగంగా దూసుకుపోతోందని తెలిపారు. యుపిఏ హయాంలో 4.25 శాతానికి పడిపోయిన జిడిపి రేటు ప్రస్తుతం 7.9 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మోది పాలనలో వ్యవసాయ అభివృద్ధి 2.4 శాతానికి చేరుకుందని తెలిపారు. రైల్వే, రోడ్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ అలహాబాద్‌లో ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి రోడ్‌ మ్యాప్‌ తయారు చేయనుంది.

15:33 - June 13, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ ఎత్తును ప్రభుత్వం తగ్గించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దీనిపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ ముందు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.

15:21 - June 13, 2016

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా బాహుబలి -2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. ఎవో కొన్ని అడపదపడా ఫొటోలు బయటకు వస్తున్నాయి. చిత్ర షూటింగ్ విషయంలో రాజమౌళి ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారంట. పది వారాల పాటు నిర్విరామంగా పతకా సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నట్లు ఇటీవలే చ్రి బృందం తెలియచేసిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్ షూటింగ్ ను సోమవారం నుండి ప్రారంభించినట్లు ట్విట్టర్ ద్వారా చిత్ర బృందం తెలియచేసింది. చిత్ర హీరో ప్రభాస్, ప్రతినాయకుడు రానా సెట్ లో దిగిన ఫొటోలతో పాటు దర్శకుడు రాజమౌళి యూనిట్ సభ్యులకు ఎదో వివరిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అనుష్క, తమన్నా, రమకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

15:20 - June 13, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిధి గృహంలో తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం..తిరుపతి మహానాడులో తీసుకున్న తీర్మానాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎల్ రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి, గరికపాటి, ఉమా మాధవరెడ్డి, టిటిడి బోర్డు చైర్మన్ అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు. చాలా కాలం తరు వాత టీ.టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. సీనియర్‌ నేతలంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. నీటి వివాదాలు, హైకోర్టు విభజన అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని అంశాలపై విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

జింబాబ్వే 126 ఆలౌట్..

హరారే : భారత్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో కూడా జింబాబ్వే పేలవ ఆట తీరును ప్రదర్శించింది. కేవలం 34.3 ఓవర్లలోనే 126 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో కేవలం సిబంద (53) పరుగులు చేసి రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు సాధించడానికి జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ కష్ట పడ్డారు. బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. పటేల్, కులకర్ణి తలా రెండు, శ్రాన్, చాహల్ లు ఒక వికెట్ తీశారు.

సమ్మెలోకి వెళ్లనున్న టి.విద్యుత్ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్..

హైదరాబాద్ : ఈనెల 15 నుండి తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ సమ్మెలోకి దిగబోతోంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 20 వేల మందిని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చర్చల ద్వారానే ముద్రగడ దీక్షకు పరిష్కారం -ఆకుల సత్యనారాయణ..

తూర్పుగోదావరి : చర్చల ద్వారానే ముద్రగ దీక్షకు పరిష్కారం లభిస్తుందని, కేసులు ఎత్తివేయడం సాధ్యం కాదని రాజమండ్రి అర్చన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు.

పనుల్లో పారదర్శకత తీసుకొస్తాం - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : మ‌హాన‌గ‌రంలో ప‌నుల్లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకొస్తామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప‌నులు పూర్తి కావ‌డానికి విధించిన‌ కాల‌ప‌రిమితిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని చెప్పారు. ఢిల్లీలో రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్ర‌ణ కోసం అనుస‌రిస్తోన్న ఉత్త‌మ విధానాన్ని స‌మీక్షిస్తామని అన్నారు.

14:53 - June 13, 2016

తూ.గోదావరి : కాకినాడ కలెక్టరేట్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలయిపోయింది. ప్రభుత్వం ఇచ్చే ఫించన్ కోసం వచ్చిన వృద్ధుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎండ తాకిడి తట్టుకోలేక శోష వచ్చి పడిపోతుంటారు. వయసు మీద పడడం..బీపీ, షుగర్ వంటి అనేక రకాల అనారోగ్యం కారణాలతో వృద్దులు ఇబ్బందులు పడుతుండడం తెలిసిందే. ఇచ్చే పెన్షన్ల కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్లకు తిరుగుతున్న వృద్ధులు అనేక కష్టనష్టాలను భరిస్తున్నారు. తాజాగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. గత ఏడు నెలల నుండి తనకు పెన్షన్ అందటం లేదని ప్రభుత్వ అధికారులకు తన బాధలు తెలుపుకుందామని వచ్చిన వెంకటలక్ష్మి అనే వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది. తీవ్రమైన ఎండి తాకిడి భరించలేక కళ్లు తిరిగి పడిపోయింది. ఆ ప్రాంతంలో వున్న వారు వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించారు. కాగా అంబులెన్స్ రావటం ఆలస్యం కావటంతో...మరో వాహనంలో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే సదరు వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెన్షన్ల కోసం వచ్చిన వృద్ధుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవంపై పలు విమర్శలు వస్తున్నాయి. 

కష్టాల్లో జింబాబ్వే...

హరారే : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే కష్టాల్లో పడిపోయింది. 33 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. శిబంద (53) ఒక్కడే రాణించాడు. 33 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన 121 పరుగులు చేసింది.

14:44 - June 13, 2016

ఏంటీ ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ ఎలా పాస్ అవుతారు ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం జేడీయూ మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా ఇది నిజం చేసి చూపించారు. ఇటీవల బీహార్ లో పరీక్షల టాపర్స్ స్కాం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆ నిజం బయటకు వచ్చింది. ఈ స్కాంలో ఉషా సిన్హా పేరు వినపడింది. గతంలో ఎన్నికల సందర్భంగా ఆమె ఎన్నికల కమిషన్ కు సమర్పించిన విద్యార్హత సర్టిఫికేట్లన్నీ నకిలీవేనని తెలుస్తోంది. అఫిడవిట్ లో ఆమె ఎనిమేదళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేసినట్లు, రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఒకే ఏడాదిలో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అవధ్ యూనివర్సిటీ 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పొందినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి యూరంనివర్సిటీ 1976లో ప్రాభం కావడం గమనార్హం. ఇక 23 ఏళ్ల వయస్సులో పీహెచ్ డీ పట్టా పొందినట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ ఉషా సిన్హా పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ లో హిందీ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు ఛైర్మన్ గా గతంలో ఈమె భర్త పనిచేశారు. ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

గుల్బర్గ్ సొసైటీ శిక్షల ఖరారు మరోసారి వాయిదా..

గుజరాత్ : 2002లో చెలరేగిన గుల్బర్గ్ సొసైటీ అల్లర్ల కేసులో దోషులుగా తేలిన వారికి శిక్షల ఖరారు అంశం మళ్లీ వాయిదా పడింది. శిక్షల ఖరారును ఈనెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

రూ.5 భోజనం చేసిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరాభివృద్ధికి రూపొందించిన వంద రోజుల ప్రణాళిక పురోగతిని ఆయన సమీక్షించారు. షాపూర్ నగర్ లో పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రూ. 5 భోజనం చేశారు.

ముగిసిన బాబుతో టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో టి.టిడిపి నేతలు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మహనాడు..మినీ మహనాడులో చేసిన తీర్మానాల అమలుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

కాకినాడ కలెక్టరేట్ లో వృద్ధురాలి మృతి..

కాకినాడ : కలెక్టరేట్ లో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ రాలేదని చెప్పేందుకు గ్రీవెన్స్ డేకు ఓ వృద్ధురాలు (70) వచ్చింది. ఎండతీవ్రతతో సృహ తప్పిపడిపోయింది. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో వేరే వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ వృద్ధురాలు శ్వాస విడిచింది.

జింబాబ్వే 99/3...

హరారే : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే నిలకడగా ఆడుతోంది. మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం వికెట్ కాపాడుకొవడానికి బ్యాట్స్ మెన్స్ ప్రయత్నిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శిబంద 46, రాజా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 99 పరుగులు చేసింది.

13:38 - June 13, 2016

హైదరాబాద్ : బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని వివేక్ బ్రదర్స్‌ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న కేసీఆర్‌కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌లో తమకు ఎంతో సహకరించిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు చెప్పారు.

 

 

13:36 - June 13, 2016

హైదరాబాద్ : 'చలో హైకోర్టు'కు తెలంగాణ న్యాయవాదుల పిలుపు నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఏపీ న్యాయమూర్తుల కేటాయింపులు, హైకోర్టు విభజన ఆలస్యంపై నిరసనగా న్యాయవాదులు 'చలో హైకోర్టు' నిర్వహిస్తున్నారు. నాంపల్లి కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరిన లాయర్లను పోలీసులు అ్డుకున్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్... తాత్కాలిక చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ...హైకోర్టు వద్ద లాయర్లు బైఠాయించారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీరంగారావు మాట్లాడుతూ... న్యాయవ్యవస్థకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి. ఉమ్మడి న్యాయవ్యవస్థలో ఎలాంటి అన్యాయం జరిగిందో విభజన తరువాత కూడా అదే అన్యాయం జరుగుతోందని శ్రీరంగారావు ఆరోపించారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులను నింపేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ తత్వాన్ని ఆంధ్రా న్యాయవాదులు ప్రశ్నించే తత్వాన్ని కూడా మర్చి పోరారు. ఇప్పటికైనా న్యాయం జరిగేలా చూడాలని... లేని పక్షంలో ఆంధ్రా జడ్జిలు పని చేసే కోర్టులకు తాళాలు వేస్తామని, వారిని తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వమని హెచ్చరించారు.

13:32 - June 13, 2016

హైదరాబాద్ :ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి తన మార్క్ పాలనను చూపించారు. సామాన్య ప్రజల బాగు కోసమే పార్టీ పెట్టిన కేజ్రీవాల్ ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని పేదల పక్షాన నిలిచారు. అతి సామాన్యుడిలా ప్రజల్లో ఒకరులాగా నడుచుకునే కేజ్రీవాల్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 

జింబాబ్వే 43/3...

హరారే : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 43 పరుగులు చేసింది.

 

మథుర ఘటనలో జ్యుడిషియల్ విచారణ – అఖిలేష్..

ఉత్తర్ ప్రదేశ్ : మథురలో హింస జరగడం విచారకరమని సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తామని, దీనిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించడం జరిగిందన్నారు.

 

విజయవాడ ఆర్టీఏలో కుంభకోణం..

విజయవాడ : ఆర్టీఏ ఆఫీసులో కుంభకోణం వెలుగు చూసింది. ఏడు లారీలకు ఆర్టీవో మృత్యంజయరావు నకిలీ రిజిస్ట్రేషన్ చేశారు. సూర్యారావు పేటలో ఆర్టీఏ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం మృత్యంజయరావుతో పాటు మరో వ్యక్తిని అధికారులు సస్పెండ్ చేశారు.

 

'బాబును పొగడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి'

అనంతపురం : జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబును పొగడడం మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి శైలజనాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హాయాంలో చేపట్టిన ప్రాజెక్టు అనంతను తిరిగి ప్రారంభించాలని సూచించారు.

 

మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి - చాడ..

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యావిధానంలో చాలా మార్పులు - రోశయ్య..

విశాఖపట్టణం : తమిళనాడు గవర్నర్ రోశయ్య సోమవారం విశాఖ జిల్లాకు వచ్చారు. సేవాసదన్ ఎయిడెడ్ పాఠశాల అదనపు భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని, అందువల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మొగల్తూరులో యువకుడి మృతి..

పశ్చిమగోదావరి : మొగల్తూరు మండలం పాతపాడులో ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ, మృతదేహంతో బంధువుల ఆందోళన చేశారు.

 

12:51 - June 13, 2016

ఢిల్లీ : బ్లాక్ మనీ విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని యోగా గురువు రామ్ దేవ్ బాబా మండిపడ్డారు. పార్లమెంటులో...నల్లధనం గురించి వినే నేతలు... బయట మాత్రం మాట్లాడటం లేదన్నారు. కేంద్రం తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.... ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడినట్టు తెలిపారు. అయితే బ్లాక్‌మనీ విషయంలో కేంద్రం తీరును తప్పుపట్టిన రామ్ దేవ్...అవినీతిని నిరోధించడంలో.. మోదీ సర్కార్ బాగా పనిచేస్తోందంటూ..

ప్రశంసలు కురిపించారు. 

12:48 - June 13, 2016

ఢిల్లి : విజయ్‌ మాల్యా.. ఈడీ కంటే చాలా వేగంగా స్పందించాడు. ఇటీవల తన ఆస్తులను జప్తు చేయడానికి ముందే... అమ్మేశాడు. కూర్గ్ సమీపంలో ఉన్న రెండు ఖరీదైన ఆస్తులను అధిక ధరకు విక్రయించాడు. మాల్యా ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే... ఈ డీల్ జరిగినట్లు ఈడీ విచారణలో తేలింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిరాకరించింది. అయితే ఇలాంటి ఆస్తులు కొనడం చట్టప్రకారం చెల్లదని ప్రకటించింది.

 

రాజస్థాన్ లో కూలిన ఎంఐజీ 27 విమానం..

రాజస్థాన్ : జోధ్ పూర్ లో సోమవారం ఉదయం ఎంఐజీ 27 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. రెండు నివాసాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12:23 - June 13, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో మనో వేదనకు గురయ్యానని... కాంగ్రెస్ పార్టీ కోసం చిత్త శుద్ధితో పని చేశానని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా. కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ ఎంపి వివేక్, వినోద్, సీపీఐ ఎమ్మె ల్యే రవీంధ్ర, భాస్కర్ రావు, జువ్వాడి నర్శింగారావు, కృష్ణారావు కూడా ఈనెల 15న టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. జానారెడ్డి నిండు కుండ లాంటి వ్యక్తి. వారు ఇచ్చిన సలహాలు మా అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగ పడ్డాయి. నేను, భాస్కర్ రావు జానారెడ్డికి కుడి భుజం లాంటి వారం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతఃకలహాలను చూసి మనో వేధనకు గురై... తెలంగాణ అభివృద్ధికి సహాయ పడాలని, నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి సహకరించాలని ఉద్దేశ్యంతో టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి వేగవంతం కావడానికి మేము కూడా భాగస్వాములుకావాలని, నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. డబల్ బెడ్ రూంకు ఆకర్షితులమయిన మేము తిరిగి టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు మాజీ ఎంపి వివేక్ తెలిపారు. కేసీఆర్ తమని పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ప్రజాభివృద్ధిని కాంక్షించే టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వినోద్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృధ్ధిని, దేవర కొండ ను అభివృద్ధి కోసమే టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు సిపీఐ ఎమ్మెల్యే రవీంధ్ర తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినప్పటికి గిరిజనుల అభివృద్ధి కోసం కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పై లేఖ రాసిన మాట వాస్తవమేనని, దాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తి పడ్డానని గుత్తా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

టాస్ గెలిచిన భారత్..

ఢిల్లీ : కాసేపట్లో జింబాబ్వే - భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కానుంది.

12:15 - June 13, 2016

సమాజం మీద ప్రభావితం చేసే నాయకులు..ఇతర వ్యక్తుల మీద సినిమాలు వస్తుంటాయి. ఈ కోవలో వచ్చిన అనేక సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలో 'మన్మోహన్ సింగ్' చేరారు. మన్మోహన్ సింగ్...భారతదేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. 2004-2014 వరకు ఏకంగా పదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు. ఆయనపై పలు విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. విపక్షాలు ఆయన్ను మౌనమునిగా సంబోధింస్తుటాయి. సంజయ్ బారు అనే వ్యక్తి మన్మోహన్ సింగ్ వద్ద 2004-2008 వరకు మీడియా సలహాదారుడిగా పనిచేశారు. ఆయన కథతో సంజయ్ 'ద యాక్సిడెంటల్ పీఎం' అనే పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం ఈ పుస్తకం సినిమాగా మారుతోంది. చిత్రం తీయడానికి సునీల్ బోహ్రా ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ పాత్రలు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నాయని తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ పాత్ర కోసం పంజాబ్ కు చెందిన ఓ నటుడు ఎంపికైనట్లు, సోనియా పాత్ర కోసం విదేశీ నటిని వెతుకుతున్నట్లు వినికిడి. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు అందాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి.

అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నా - ఎంపీ గుత్తా..

హైదరాబాద్ : రాష్ట్రాభివృద్దికి సహకరించాలనే ఉద్దేశ్యం..నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతోందని టి.కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా కాంగ్రెస్ రెండుసార్లు అవకాశం ఇచ్చిందని, పార్టీలో జరిగే అంతర్గత కలహాలతో తీవ్ర మనోవేదనకు గురి కావడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కోసం చిత్తశుద్ధితో పనిచేయడం జరిగిందని పేర్కొన్నారు. జానారెడ్డి నిండుకుండలాంటి వ్యక్తి అని, ప్రాజెక్టుల విషయంతో తమ సంపూర్ణ సహకారం అందించాలని తాము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

11:56 - June 13, 2016

హైదరాబాద్ : నిజామాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... పలు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ తదితర పార్టీలతో పాటు పలు సంఘాల ప్రతినిధులు తీర్మానం చేశారు. బాన్సువాడలో వర్ని కోటగిరి బీర్కుర్ బాన్సువాడ మండలాలు ఉన్నాయి. వర్ని మండలం పరిధిలో 20 గ్రామాలు కోటగిరి మండల పరిధిలో 24 గ్రామాలు బాన్సువాడ మండల పరిధిలో 14 బీర్కురు మండల పరిధిలో 17 గ్రామాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి, జుక్కల్ నారాయణ ఖేడ్ ప్రాంతాలు సుమారుగా 50 కిలొమీటర్ల పరిధిలోనే ఉన్నాయని, బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

1952లో బాన్సువాడ గ్రామ పంచాయతీగా...

1952లో బాన్సువాడ గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఇప్పటి వరకూ అదే స్థాయిలో కొనసాగుతోంది. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా మార్చితే.. తమ బతుకుల్లో వెలుగులు వస్తాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. బాన్సువాడను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. 

ప్రైవేటు పాఠశాలలపై దాడులు..

విశాఖపట్టణం : మంత్రి గంటా ఆదేశాల మేరకు గాజువాకలోని ప్రైవేటు పాఠశాలలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 10 పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.

 

 

నాంపల్లి వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : చలో హైకోర్టు నేపథ్యంలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీస్తోంది. నాంపల్లి కోర్టు వద్ద లాయర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు.

11:53 - June 13, 2016

వరంగల్‌ : జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు దోపిడీకి తెరలేపుతున్నాయి. అడ్డగోలు ఫీజుల వసూలుతో పాటు పుస్తకాలు, స్టేషనరీ పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు పడేలా చేస్తున్నాయి. అప్పు చేసైనా సరే తమ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటున్న తల్లిదండ్రుల వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటున్న కొన్ని పాఠశాలలు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ చదువులకే స్కూల్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజు అంటూ రకరకాల ఫీజులను దండుకుంటున్నాయి. అంతటితో ఆగకుండా చిన్నారులను బడిలో చేర్పించిన తర్వాత నోట్‌బక్స్‌, టెక్ట్స్‌ బుక్స్‌ అంటూ పక్తూ వ్యాపార ధోరణిలో దోపిడీ చేస్తున్నాయి.

పాఠశాలల్లోనే పుస్తక విక్రయ కేంద్రాలు...

వరంగల్‌ నగరంలో, జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లోనే పుస్తక విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో తొమ్మిది నోట్‌ పుస్తకాలు, నాలుగు టెస్ట్‌బుక్స్‌ మాత్రమే ఉండాలి. దీనికి అదనంగా డ్రాయింగ్‌, మ్యూజిక్‌, కంప్యూటర్‌ పుస్తకాలు ఉంటాయి. ఒక్కో నోట్‌బుక్‌ ఐటీసీ కంపెనీది అయినా 25 రూపాయల లోపు ఉంటుంది. స్టేట్‌ సిలబస్‌ బోధించే ప్రైవేటు పాఠశాలల్లో..బ్రాండ్‌ పేరుతో భారీ ఎత్తున విద్యార్థులతో నోట్‌ పుస్తకాలు కొనిపిస్తున్నారు.

15 రూపాయలు కూడా ఖరీదు చేయని నోట్‌బుక్‌కు ...

15 రూపాయలు కూడా ఖరీదు చేయని నోట్‌బుక్‌కు 20 నుంచి 25 రూపాయలకు అంటగడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే పుస్తకాలను సైతం అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. పాఠశాలకు అనుబంధంగానే పుస్తకాల వ్యాపారం చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇటు ఫీజులు, అటు పుస్తకాల ద్వారా అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డ ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు యూనిఫామ్స్‌ కూడా కొనాలని ఒత్తిడి.....

మరికొన్ని పాఠశాలలైతే.. పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు యూనిఫామ్స్‌ కూడా కొనాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కో యూనిఫాం కు దాదాపు 600 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బ్యాడ్జీలు, బెల్టులు, డైరీలు, బూట్లు, సాక్సులు, ఫైల్స్‌ అన్నింటిని పాఠశాలల్లోనే కొనాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలా ఒక్కో విద్యార్థికి సగటున 4500 నుంచి 6000 వేల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బలహీనతను అడ్డం పెట్టుకునే కార్పొరేట్‌, టెక్నో పాఠశాలలు కోట్లు...

కేవలం తల్లిదండ్రుల బలహీనతను అడ్డం పెట్టుకునే కార్పొరేట్‌, టెక్నో పాఠశాలలు కోట్లు దండుకుంటున్నాయి. ఇష్టానుసారం ఫీజులు పెంచి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఫీజు దోపిడీపై తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. స్కూల్ యాజమాన్యాలు ముట్టజెప్పే లంచాలకు అలవాటు పడి.. అధికారులు చర్యలు తీసుకోవడం మానేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

11:50 - June 13, 2016

హైదరాబాద్ : 'చలో హైకోర్టు'కు తెలంగాణ న్యాయవాదుల పిలుపు నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఏపీ న్యాయమూర్తుల కేటాయింపులు, హైకోర్టు విభజన ఆలస్యంపై నిరసనగా న్యాయవాదులు 'చలో హైకోర్టు' నిర్వహిస్తున్నారు. అటు లాయర్ల ఆందోళన, ఇటు పోలీసుల భద్రతతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఇవాళ కేసులున్న వారినే లోనికి అనుమతిస్తుండటంతో.. మిగతా పనులపై వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. 

11:48 - June 13, 2016

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు పాఠశాల బస్సులపై నిఘా పెట్టారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ పాఠశాల బస్సులను విస్త్రతంగా తనిఖీ చేస్తున్నారు. బస్సు ఫిట్‌నెస్‌, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేని, ఫిట్‌నెస్‌ లేకుండా నడుపుతున్న బస్సులను సీజ్‌ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 5, హైదరాబాద్‌లో 5 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. పాఠశాల బస్సులను సరైన పత్రాలు లేకుండా నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు

11:45 - June 13, 2016

ఖమ్మం : పాల్వంచ కేటీపీఎస్‌ గేటు ముందు తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మహా ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే 15వ తేదీ నుంచి విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు విద్యుత్‌ ఉద్యోగుల సంఘం టీయూఎఫ్‌ సమ్మెకు పిలుపునిచ్చింది. 

11:44 - June 13, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. 100రోజుల ప్రణాళికలో భాగంగా జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డ్, మెట్రో, విద్యుత్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాణ్యత లేని రహదారుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, విద్యుత్ విభాగం, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు. మూడు నుంచి ఆరు అడుగుల లోతులో తవ్విన పొడవాటి గుంతలను చూసి, స్కూళ్లు తెరచిన వేళ, ఎవరైనా పిల్లలు అందులో పడిపోతే, ఎవరిది బాధ్యతంటూ అధికారులపై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ తదితరులు ఉన్నారు.

11:32 - June 13, 2016

అమ్మాయి వేషం వేసుకుని ఏకంగా 11 మందితో పెళ్లి చేసుకున్నాడో ఓ మోసగాడు. నిత్యం అమ్మాయిలా అందంగా ముస్తాబై ఆన్ లైన్ లో ఛాటింగ్ కు వచ్చి మోసగించేవాడు. 11వ బాయ్ ఫ్రెండ్ అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసగాడి నైజం గుట్టురట్టైంది. చైనాలో సొంగోటో (27) అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను అమ్మాయి వేషం ధరించి రకరకాల పేర్లతో ఛాటింగ్ చేసేవాడు. ఆడగొంతుతో మాయ చేసేవాడు. కేవలం వెబ్ ఛాటింగ్ ద్వారా వారిని పెళ్లి పీఠలు ఎక్కించడాంటే ఎంత మాయగోడో అర్థమవుతోంది. ఏడాదిలోనే 11 మంది బాయ్ ఫ్రెండ్ లను ఆడవేషంలో వివాహం చేసుకున్నాడు. రెండు రోజుల పాటు జాగ్రత్తగా వారితో మెంటెన్ చేసేవాడు. వారింట్లో డబ్బులు..ఇతరత్రా వాటిని దొంగిలించి జంప్ అయ్యేవాడంట. 11వ బాయ్ ఫ్రెండ్ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయిలాగా వివాహంలో దర్శనమిచ్చి సొంగాటో అసలు రంగు బట్టబయలైంది. సొంగాటో ఇంటిపై పోలీసులు దాడి చేసి స్త్రీలు ఉపయోగించే దుస్తులు..మేకప్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.

పాదాచారులపైకి దూసుకెళ్లి కారు..

ఢిల్లీ : దేశ రాజధానిలోని జనక్ పురి ప్రాంతంలో ఓ కారు పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలి - పొన్నం..

కరీంనగర్ : ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 123 వెంటనే రద్దు చేయాలని, కొత్త జిల్లాల ఏర్పాటులో స్థానికులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

నగరంలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్ లో 5 బస్సులు..తిరుమలగిరిలో ఒక బస్సును అధికారులు సీజ్ చేశారు.

 

కాశీపట్నంలో వంద కిలోల గంజాయి స్వాధీనం..

విశాఖపట్టణం : అనంతగిరి మండలం కాశీపట్నంలో వంద కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు.

ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుంది: వైద్యులు

రాజమండ్రి: ముద్రగడ హెల్త్ బులిటిన్ ను వైద్యులు విడుదల చేశారు. ముద్రగడ వైద్యానికి సహకరించడం లేదని వైద్యులు తెలిపారు. 

కాసేపట్లో టి.టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : కాసేపట్లో లేక్ వ్యూ అతిథి గృహంలో టి.టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీ లో తెలంగాణ లో పార్టీ బలోపేతం పై చర్చించనున్నట్లు సమాచారం.

ఐదోరోజుకు చేరిన ముద్రగడ దీక్ష

తూ.గో : రాజమండ్రిలో ముద్రగడ దీక్ష ఐదోరోజుకు చేరింది. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మరోవైపు ఇవాళ చలో రాజమండ్రి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

10:45 - June 13, 2016

తూ.గో : రాజమండ్రిలో ముద్రగడ దీక్ష ఐదోరోజుకు చేరింది. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. మరోవైపు ఇవాళ చలో రాజమండ్రి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

10:43 - June 13, 2016

ప్రకాశం : మానవత్వం మంటగలిసిపోతోంది. బతికుండగానే మనిషిని సమాధుల్లోకి చేర్చే నీచ నాగరికతకు మనిషి దిగజారిపోతున్నాడు. ఆస్తి కోసం తపన పడే వారు...కాటికి కాళ్లు చాచాక..కాలదన్నుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన దుర్ఘటనే ఇందుకు సాక్ష్యం.

ఈమె కథ విన్న వారెవరైనా ...

అందరూ ఉన్న అనాధ.! ప్రకాశం జిల్లా చీరాలలోని ఎల్‌బిఎస్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే ఈమె కథ విన్న వారెవరైనా ఇలాంటి కష్టాలు శత్రువుకి కూడా రాకూడదనుకుంటారు. చీరాల గడియారస్తంభం సెంటర్‌లోని టీ క్యాంటిన్ లో పనిచేసే సుజాత కు ఎల్‌బిఎస్ నగర్‌లో కొంత స్థలముంది.. అవసాన దశలో అక్కరుకొస్తారని అన్నదమ్ములకు ఆస్తి అప్పజెప్పింది. స్థలం పుచ్చుకున్నంతవరకూ బాగానే ఉన్న అన్నదమ్ములు ఆ తరువాత ఆమెని పట్టించుకోవడం మానేశారు.

సుజాతను ఆసుపత్రిలో చేర్చిన బంధవులు......

సుజాత ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యం పాలవడంతో బంధువులు ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు.. సుజాత బతకదని ఆమెను తీసుకెళ్లమని వైద్యలు తీసుకు వెళ్లిపొమ్మన్నారు. బంధువులు ఆమెను వదిలేస్తే దూరపు బంధువులెవరో ఆమెను వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేసి గడియార స్తంభం సెంటర్‌లోని గుడి ముందు వదిలేసి వెళ్ళారు.. గుడిముందు రాత్రి వేళలో పడి ఉన్న ఆమె తెల్లారేసరికి చీరాల లూధరన్ చర్చి సమీపంలోని ఆంధ్రరత్న రోడ్ లోని స్మశాన వాటికలో చేరింది.. కొందరు రిక్షా కార్మికులు తెచ్చి అక్కడ పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు.. సుజాత సజీవంగానే ఉండటంతో స్థానికులు అవాక్కయ్యారు...బతికుండగానే మనిషిని స్మశానానం లో వదిలారని తెలిసి, ఆవేదన వ్యక్తం చేశారు. పడిపోతున్న మానవతా విలువలకు ఇలాంటి ఘటనలే నిదర్శనమని, ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలని ప్రజలు కోరుతున్నారు. 

శ్రీనగర్ కాలనీలో మంత్రి కేటీఆర్ తనిఖీలు..

హైదరాబాద్ : నగరంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంత్రి రోడ్లను పరిశీలించారు. ఆయనతో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్థన్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.

10:33 - June 13, 2016

నయనతార..టాలీవుడ్ లోనే కాక ఇతర వుడ్ లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ ముద్దుగుమ్మపై పలు రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో శింబు..ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపినట్లు..వివాహం చేసుకున్నట్లు ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. చివరి అపార్థాలు తలెత్తడంతో వారితో తెగదెంపులు చేసుకున్నట్లు టాక్. చివరకు సినిమాలకు గుడ్ బై చెబుదామని అనుకున్నా ఇతరులు వారించడంతో రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతను దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలో నయన్ నటించిన సంగతి గమనార్హం. మరి ఈ వార్త నిజమా ? ఫేకా ? అనేది తెలియాలంటే నయన్ నోరు విప్పితేగాని తెలియదు.

10:26 - June 13, 2016

మెగస్టార్ చిరంజీవి చిందేశాడు. నగరంలో జరిగే ఓ వేడుకల్లో చిరంజీవి డ్యాన్స్ చేస్తాడని గత కొన్ని రోజులుగా కథనాల మీద కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. నగరంలో సినిమా అవార్డ్స్ వేడుకలోల 'గ్యాంగ్ లీడర్' చిత్రంలోని టైటిల్ సాంగ్ కు చిరు స్టెప్పులేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ లో హీరోలు సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ, శ్రీకాంత్, సునీల్ లు కూడా జత కలిపినట్లు తెలుస్తోంది. 150వ సినిమాకు చిరు బాగానే కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. స్టేజి ఫెర్మామెన్స్ ఇవ్వని చిరు ఇప్పుడు ఇలా డ్యాన్స్ చేయడంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారంట. మొన్న జరిగిన శ్రీజ సంగీత్ లో చిరు స్టెప్పులు వేస్తూ కనిపంచిన సంగతి తెలిసిందే.

10:25 - June 13, 2016

అవునండి..పొడవుగా ఉన్న వారే 'గట్టి' వారని ఓ సర్వే వెల్లడించిదంట. పొట్టిగా ఉన్నవారికే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ ఇదంతా ఉట్టిదేనని తేలిపోయింది. పొడవైన వారే సక్సెస్ ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారంట. పొట్టిగా..లావుగా ఉండే వారి జీవితాలు ఏమంత సంతృప్తికరంగా ఉండవని ఈ అధ్యయనం తేలింది. పొట్టివారికి విద్యాబుద్ధులు కూడా పెద్దగా అబ్బవంట కూడా. పొట్టి వారి జీవన ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయని, లక్షకు పైగా బ్రిటీష్ పౌరుల నుండి సేకరించిన డేటాను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాన్ని తేల్చినట్లు సర్వే నిర్వాహకులు వెల్లడిస్తున్నారంట.

 

10:23 - June 13, 2016

న్యూఢిల్లీ : భారత క్రికెట్ చీఫ్ కోచ్ కు భారీ పోటీ నెలకొంది. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశ్రాస్త్రి, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని కథనాలు వెలువడుతున్నాయి. కోచ్ పదవికి దేశవిదేశాల నుండి మొత్తం 57 దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం నిబందనలకు లోబడి ఉన్నవాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని బీసీసీఐ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మాజీ భారత క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, బల్విందర్ సందూ, హృశికేశ్ కనిత్కర్ లు కూడా పోటీ పడుతున్నారు. కోచ్ అప్లికేషన్ కు బీసీసీఐ జూన్ 10వ తేదీన డెడ్ లైన్ గా విధించిన సంగతి తెలిసిందే.

10:22 - June 13, 2016

వర్షాకాలం వచ్చేస్తుందంటే కొన్ని సమస్యలు వస్తుంటాయి. అనారోగ్యం..ఇతర సమస్యలు వచ్చి పడుతుంటాయి. ప్రధానంగా అనారోగ్యానికి కారణమయ్యే ఈగలు అధికమౌతుంటాయి. ఇవి ఇంటిల్లిపాదిని ఇబ్బందిపెట్టడమే కాకుండా అనారోగ్యానికి కారణమవుతాయి. మరి వీటికి పరిష్కారం లేదా ?
వర్షకాలంలో ఎప్పటికప్పుడు గిన్నెలను కడిగేసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం ఉంటే అక్కడ ఈగలు వాలిపోతాయి కనుక. అలాగే వంటగదిని..ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
వేడి నీటిలో వెనిగర్ తో పాటు నిమ్మరసం, ఉప్పు గదిలో ఉంచాలి. వేడి నీళ్లలో లావెండర్ నూనెను కలిపి ఇంట్లో చల్లాలి.
పుదీనా..టమటా..బంతి మొక్కలు పెంచడం వల్ల ఈగలు ఇంట్లోకి రాకుండా చేస్తాయి. వీటిని గుమ్మం దగ్గర పెంచడం మంచింది.

10:21 - June 13, 2016

కొందరు యుక్త వయస్సులో ఉండగానే శరీరంపై ముడతలు వస్తుంటాయి. వృద్దాప్యపు ఛాయల్ని సూచిస్తుంటాయి. అలాగే వయస్సు పెరిగే కొద్ది నుదురు, కళ్ల కింద, నోటికి ఇరువైపులా సన్నని ముడతలు మొదలువుతుంటాయి. మరి వీటికి పరిష్కారం లేదా ? అందుకు కొన్ని చిట్కాలు...
రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె, అంతే మెతాదు కలిగిన నిమ్మరసం కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాతే కడిగేయాలి.
గుడ్డులోని తెల్లసొనను తీసుకుని గిలకొట్టి ముఖానికి పూతలా రాసుకోవాలి. ఆరిన అనంతరం గోరెవచ్చని నీళ్లతో కడిగేయాలి.
ఒక టేబుల్ స్పూన్ గులాబీ నీటిని తీసుకుని అంతే మోతాదులో గ్లిజరిన్ ను కలుపుకోవాలి. పది హేను నిమిషాల అనంతరం కడిగేయాలి.
కొబ్బరినూనె తీసుకుని ముఖంపై మెల్లిగా మర్దన చేయాలి. అనంతరం కడిగేసుకోవాలి.

హైకోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ : హైకోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. నేడు లాయర్లు చలో హైకోర్టుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. లాయర్లను తనిఖీలు చేసి కోర్టులోకి పంపుతున్నారు.

గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గ్రేటర్ లో పర్యటిస్తున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో రైలు, విద్యుత్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలను మంత్రి తనిఖీ చేయనున్నారు.

నేడు మహబూబ్ నగర్ లో వికాస్ పర్వ్‌..

మహబూబ్‌నగర్: జిల్లాలో నేడు వికాస్‌పర్వ్‌ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రారంభించనున్నారు.

సంగారెడ్డి స్కూల్ బస్సుల సీజ్..

మెదక్ : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు స్కూల్‌ బస్సులను అధికారులు సీజ్‌‌ చేశారు. జిల్లాలోని సంగారెడ్డిలో స్కూల్ బస్సులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

సైనాకు సీఎం బాబు అభినందనలు..

విజయవాడ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను రెండోసారి గెలుచుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సైనాను చూసి యావత్ భారత్ గర్విస్తుందని చంద్రబాబు తెలిపారు.

09:34 - June 13, 2016

హైదరాబాద్ : నేడు చలో హైకోర్టుకు తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఏపీ న్యాయమూర్తుల కేటాయింపును నిరసిస్తూ చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. న్యాయవాదులు తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి లేదంటూ.. సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన చలో హైకోర్టుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంక్షల నేపథ్యంలో ఎవరూ హైకోర్టుకు రావొద్దని పోలీసులు సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిని పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు.. వాహనాలు రాకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఆప్షన్ మార్చుకోని న్యాయాధికారులపై ఒత్తడి పెంచేలా నిరసనలు తెలపాలని..న్యాయవాదుల జేఏసీ నిర్ణయించిన తరుణంలో.. తలపెట్టిన చలో హైకోర్టు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల ఆందోళన..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల ఆందోళన చేపట్టారు. లండన్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్ వేసే విమానాన్ని అధికారులు రద్దు చేశారు. లండన్ నుండి రావాల్సిన విమానం రాకపోవడంతో సర్వీసును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించడంతో ఎయిర్ పోర్టులో సుమారు 250 మంది ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. వీరందరికీ నోవాటెల్ లో బస ఏర్పాటు చేశారు.

కాసేపట్లో గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాసేపట్లో గ్రేటర్ లో పర్యటించనున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో రైలు, విద్యుత్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలను మంత్రి తనిఖీ చేయనున్నారు.

బాపుఘాట్ వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు...

హైదరాబాద్ : లంగర్ హౌజ్ బాపుఘాట్ వద్ద ఆర్టీఏ తనిఖీలు నిర్వహిస్తోంది. స్కూల్ బస్సులు, వాహనాలను అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

రేపే వైసీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం..

విజయవాడ : మంగళవారం వైసీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బందర్ రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలతో సహా పలు ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి.

విషమించిన ముద్రగడ ఆరోగ్యం..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో దీక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రి పరిసరాల్లో కఠిన ఆంక్షలు పోలీసులు అమలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం..

విజయవాడ : నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఆన్ లైన్ లో పీజీ మెడికల్ మూల్యాంకనంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యూరో ఫుట్ బాల్ లో నేడు..

ఢిల్లీ : యూరో ఫుట్ బాల్ టోర్నీలో నేడు స్పెయిన్ తో చెక్ రిపబ్లిక్ జట్టు ఢీకొననుంది. సాయంత్రం 6:30కి ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ లో ఐర్లాండ్ తో స్వీడన్ జట్టు ఢీకొనుంది. రాత్రి 9:30కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. బెల్జియంతో ఇటలీ జట్టు మ్యాచ్ ఆడనుంది. రాత్రి 12:30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి, బయట కూడా లైన్లు కట్టారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది.

07:28 - June 13, 2016

హైదరాబాద్: జెండాలు మారుతున్నా.. నాయకులు ఒకరే నని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. టీ-కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగలబోతుంది. ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌లు కారెక్కడం ఖాయమైంది. ఈనెల 15న సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. వారిని ఎలాగైనా ఆపేందుకు హస్తం నేతలు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ వలసలు టిఆర్ ఎస్ తోనే ప్రారంభం అయ్యాయా? ఓటుకు నోటు కేసు తరువాత టిఆర్ ఎస్ రాజకీయ వలసలను ప్రోత్సహిస్తోందా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యమైంది. పార్టీ అభివృద్ధిని చూసి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయా? ఏపీ ప్రభుత్వం వర్సెస్ ముద్రగడ లా కొనసాగుతుందా? ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వం హింసిస్తోందా? కాపుల అంశం సామాజిక అంశాన్ని రాజకీయ అంశంగా ఎవరు మారుస్తున్నారు? శాంతియుతంగా దీక్ష చేపట్టిన ముద్రగడ దీక్షను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేయాలనుకుంటోంది? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వైసీపీ నేత వేణుగోపాల్, బిజెపి నేత కోటేశ్వరరావు, టిఆర్ ఎస్ నేత రాకేష్, కాంగ్రెస్ నేత సుందరరామశర్మ , టిడిపి నేత వెంకన్న పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నేటి నుంచి తెలంగాణ లో ఎస్ఎఫ్ఐ ఆందోళన

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళలు చేపట్టనుంది. రాష్ట్రంలో స్కూలు ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంజనీరింగ్, డాక్టర్ విద్య కంటే ఎక్కువ ఫీజులు పాఠశాలలో వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఫీజులు కట్టలేక కొంత మంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు తెలుపుతున్నారు.

స్థిరంగా కదులుతున్న రుతుపవనాలు...

విశాఖ : కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను ఇప్పటికే తాకిన రుతుపవనాలు తెలంగాణ వైపు స్థిరంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడితే రుతుపవనాలు ఊపందుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రం మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.

07:13 - June 13, 2016

హైదరాబాద్ : బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సినిమాకు సిబిఎఫ్ సి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది... సెన్సార్ బోర్డు ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలో వ్యవహరించిన తీరుపై బాలీవుడ్ ఇప్పటికే భగ్గుమన్న విషయం అందరికి విదితమే... ఇప్పటికైతే టైటిల్ మార్పుపై సిబిఎఫ్ సిఎలాంటి సూచనలు చేయలేదు...

07:08 - June 13, 2016

ఢిల్లీ :అలహాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశమయింది. ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు అంశాలపై పార్టీ పెద్దలు చర్చించారు. ప్రస్తుతం దేశంలో పథకాల అమలు తీరు రానున్న ఎన్నికల్లో పార్టీ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ...

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే దానిపై చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను యూపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. త్వరలో జరగబోయే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

పలు తీర్మానాలు ఆమోదం....

ఈ రెండు రోజుల సమావేశాల్లో రాజకీయ, ఆర్ధిక, విదేశాంగ విధానాలపై తీర్మానాలు ఆమోదించనున్నారు. ఆఫీస్ బేరర్లతో పది నిమిషాలు మాట్లాడిన నరేంద్ర మోదీ పలు విలువైన సూచనలిచ్చారు. కాలానుగుణమైన మార్పులతో కొత్త ఆలోచనలు, కొత్త కార్యచరణతో ముందుకు దూసుకెళ్లాలని మోదీ సూచించారు. 

రెండు రోజుల పాటు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం

ఢిల్లీ : కేంద్రంలో ఎన్డీఏ పాలన కొనసాగుతూ.. రెండేళ్లు గడుస్తున్న తరుణంలో... బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో.. తాజా ఎన్నికల్లో పార్టీ ఓటమిపై... వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ.. పథకాల అమలు తీరును ప్రజల ముందుంచడం వంటి పలు విషయాలపై పార్టీ చర్చించింది. 

07:05 - June 13, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధికి మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అభినందించారు. ఈమేరకు కేటీఆర్ కి లేఖ రాశారు. టీ హబ్‌ ద్వారా స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడాన్ని అభినందించారు. ఈ విషయంలో రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వంతో కలిసిపని చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో జరుగున్న రక్షణ పరిశోధనలకు టీ హబ్‌ ఎంతో అనుకూలమని చెప్పారు. రక్షణపరిశోధనాభివృద్ధి సంస్థ అధికారులు టీ హబ్‌ను సందర్శించి వెళ్లిన విషయాన్ని పారికర్‌ గుర్తు చేశారు. తెలంగాణ ఐటీ ప్రగతిని ప్రశంసిస్తూ రక్షణ మంత్రి లేఖ రాయడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో డిఫెన్స్‌, ఎయిరో స్పేస్‌ ఇంక్యూబేటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మనోహర్‌ పారికర్‌ను కోరనున్నట్టు కేటీఆర్ తెలిపారు. మలేషియా అంతర్జాతీయ వ్యాపార, పరిశ్రమల శాఖ మంత్రి ముస్తాఫా మహ్మద్‌ కూడా కేటీఆర్ కి లేఖ రాసింది. మలేషియా బృందం తెలంగాణను సందర్శించి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు మలేషియా సందర్శించాలని కేటీఆర్ ను కోరారు. 

07:03 - June 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో సస్పెన్స్ థ్రిల్లర్‌లా పొలిటికల్ ఈక్వేషన్లు మారుతున్నాయి. పార్టీలోకి వస్తున్న వలస నేతలతో ఎవరికి ఎలాంటి పదవులు దక్కుతాయనే టెన్షన్‌ నేతలను వెంటాడుతోంది. దీనిపై నేతల మధ్య ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతోంది. ఇదిలావుంటే.. పార్టీ మాత్రం ఆపరేషన్‌ ఆకర్ష్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది.

గులాబీ నేతలతో అనుమానాలు...

తెలంగాణలో అధికార పార్టీలోకి వలసలు భారీగా పెరగడంతో.. వలస నేతలకు పదవులు దక్కుతున్నాయన్న అనుమానాలు గులాబీ నేతల్లో మరింత బలపడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున అధికార పార్టీ గూటికి చేరారు. వారిలో మెజార్టీ నేతలకు కీలక పదవులను ఇప్పటికే పార్టీ అధినేత కట్టబెట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఇవే పునరావృతమవుతాయనే అనుమానం కార్యకర్తలో కనిపిస్తోంది.

నియోజకవర్గాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు ...

నియోజకవర్గాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని గులాబి బాస్ టిఆర్ ఎస్ లోకి నేతలను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు, ఖమ్మం జిల్లా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ నేతలకు నేరుగా మంత్రివర్గంలో స్థానం కల్పించారు సీఎం. తాజాగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతల వలసలు మొదలు కానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి పదవులు దక్కనున్నాయనే అంశం పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

గుత్తాకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం ...

నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్ఎ స్ లో చేరడం ఖరారు కావడంతో.. గుత్తాకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు గుత్తా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. శాసనమండలి సభ్యుడిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డిని నల్గొండలో ఎంపీ పదవికి పోటీ చేయించే చాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. గుత్తా TRSలో చేరడం.. రాజీనామా చేయడం లాంటి అంశాలపై తుది నిర్ణయం జరగకపోయినా.. పార్టీలో మాత్రం ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి.

మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ లు కూడా ...

ఇక వీరితో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ లు కూడా మరో సారి టిఆర్ ఎస్ లో చేరేందుకు ముహర్తం ఖరారైందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈనెల 15వ తేదీన గులాబిగూటికి చేరుకుంటున్నారని సమాచారం. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉండడం వివేక్ బ్రదర్స్ కు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పార్టీ నేతల్లోనూ గుబులు...

ఏది ఏమైనా పార్టీలో చేరాలనుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో.. పార్టీ నేతల్లోనూ గుబులు మొదలైంది. దీంతో పార్టీలో చేరేవారికి ఎలాంటి పదవులు దక్కనున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలోకి వస్తున్న నేతలకు ఏదో ఒక పదవి సీఎం కట్టబెడుతుండడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుతోంది.

06:59 - June 13, 2016

ఖమ్మం : అసంపూర్తిగా భవనాలు, చీకటి గదులు, తిరగని ఫ్యాన్లు, విరిగిన తలుపులు, కానరాని నీటి వసతులు, నిరుపయోగంగా మరుగుదొడ్లు...ఇదీ ఖమ్మం జిల్లాలో సర్కారీ బడుల దుస్థితి. ఇలా సవాలక్ష సమస్యల మధ్య మరో విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తిష్టవేయటంతో... విద్యార్ధుల సంఖ్య దిగజారిపోతుంది. దీంతో ఈ ఏడాది విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి.

ప్రభుత్వం విద్యకోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా....

ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది. ప్రభుత్వం విద్యకోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఫలితం లేకుండాపోతుంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈ సారైనా ప్రభుత్వం పాఠశాలలో హాజరుశాతం పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న బడిబాట కార్యక్రమం అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు.

2,897 ప్రభుత్వ పాఠశాలలుండగా....

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో 2,897 ప్రభుత్వ పాఠశాలలుండగా 2 లక్షల 50 వేలమంది వరకు చదువుతున్నారు. ఏటా రాజీవ్ విద్యా మిషన్ కింద మౌళిక సదుపాయాల కల్పనకు 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. జిల్లాలో అసంపూర్తిగానే పాఠశాల భవనాలు కనిపిస్తున్నాయి.

24 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు .....

జిల్లాలో 24 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండగా.. 17 పండిట్ పోస్టులు ,123 ఎస్ జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీలో 25 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 241 ఎస్ జిటి పోస్టులు, 25 పండిట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండటం లేదని ఆరోపణలున్నాయి. ఖమ్మం , కొత్తగూడెం, పాల్వంచ , మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర లాంటి పట్టణ కేంద్రాల్లోనే మకాం ఉండి రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాలో 41 మండలాలకు 36 మండలాల్లో ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

107 పాఠశాలలో లేని కరెంటు ......

ఇక జిల్లాలోని అనేక పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 107 పాఠశాలలో కరెంటు లేదు... 1957 పాఠశాలలో వాటర్ సౌకర్యం లేదు. 2047 పాఠశాలల్లో కిచెన్ షెడ్స్ లేవు. 17 పాఠశాలకు భవనాలు అసలు లేవు. ఏజెన్సీలో చెట్ల కిందనే , పాకలోనే పాఠశాలలు నడుస్తున్నాయి. 1430 పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు. 494 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేవు. 412 పాఠశాలలో కంప్యూటర్ టీచర్స్ లేరు. ఒక్క కంప్యూటర్ పని చేయటం లేదు. 847 పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. 2114 పాఠశాలలో అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో.. విద్యార్ధులే అటెండర్స్‌గా మారాల్సిన పరిస్థితి ఉంది.

కనీస వసతులు లేమితో పాఠశాలలు...

ప్రతి ఏడు పాఠశాలల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామంటున్న పాఠశాలలో కనీస వసతుల లేమి కనిపిస్తూనే ఉంది. కోట్లు విడుదల చేస్తున్నా.. పాఠశాలల అభివృద్ది ఎందుకు జరగడం లేదన్నది విద్యాసంఘాల వాదన .. ఏది ఏమైనా విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న వేళ సమస్యలే.. మరోసారి స్వాగతం పలుకుతున్నాయి. 

06:55 - June 13, 2016

హైదరాబాద్ : నేటి నుంచి స్కూల్స్‌ తెరుచుకోనున్నాయి. రెండు నెలల పాటు సెలవులను సంతోషంగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పుస్తకాలతో బడిబాట పట్టనున్నారు. బుజానికి బ్యాగ్‌, చేతిలో లంచ్‌బాక్స్‌తో మళ్లీ పాఠశాలలకు బయలుదేరనున్నారు. స్కూల్‌ బస్సులు, ఆటోలు, వ్యాన్లు రోడ్లపైకి రాబోతున్నాయి. దీంతో మళ్లీ ట్రాఫిక్‌ కిటకిటలాడనుంది.

పని వేళల్లో మార్పులు ......

మరోవైపు ఈ విద్యాసంవత్సరం పాఠశాలల పని గంటల్లో మార్పులు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు పని చేసే ఉన్నత పాఠశాలలను 4 గంటల 45 నిమిషాల వరకే కుదించారు. ఈ 15 నిమిషాల సమయాన్ని భోజన విరామ సమయంలో కోత విధించారు. దీంతో 45 నిమిషాల పాటు భోజన విరామ సమయం ఇచ్చారు. హైస్కూళ్లు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు.. ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు దాదాపు 7 గంటల 15 నిమిషాలు పని చేయనున్నాయి. అదేవిధంగా.. ప్రాథమిక పాఠశాలలు 7 గంటలు పని చేయనున్నాయి.

ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్‌ విధానం.....

ఇక ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు కానున్నది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం బుధవారంతో ముగియనుంది. అదేవిధంగా ప్రైవేట్‌ విద్యాసంస్థల పోటీని తట్టుకునే విధంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానాన్ని వరంగల్‌ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఓవైపు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రుల ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు దర్శనమిస్తూనే ఉన్నాయి. మరి వీటిపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారిస్తుందో చూడాలి. 

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

హైదరాబాద్ : నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రెండు నెలల పాటు సెలవులను ఎంజాయ్‌ చేసిన పిల్లలు.. కొత్త ఆశలతో నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. హాలీడేస్‌ను హ్యాపీగా గడిపిన పిల్లలు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. 

06:52 - June 13, 2016

హైదరాబాద్ : నేడు చలో హైకోర్టుకు తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఏపీ న్యాయమూర్తుల కేటాయింపును నిరసిస్తూ చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. న్యాయవాదులు తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి లేదంటూ.. సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఉధృతమౌతోన్న న్యాయవాదుల ఆందోళన....

తెలంగాణలో న్యాయవాదుల ఆందోళన ఉధృతమవుతోంది. రాష్ట్ర హైకోర్టును విభజించాలని,.. తెలంగాణలో కొనసాగుతామని.. ఆప్షన్‌ పెట్టుకున్న ఏపీకి చెందిన న్యాయమూర్తులు తమ నిర్ణయాలు మార్చుకోవాలంటూ న్యాయవాదులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చలో హైకోర్టుకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లాయర్లందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం...

న్యాయమూర్తులు తమ డిమాండ్లు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ఇక పోలీసులు చలో హైకోర్టును అడ్డుకుంటే ఆంధ్రా న్యాయమూర్తులకు ప్రభుత్వం సకహకరిస్తున్నట్లే అవుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి అన్నారు.

అనుమతి లేదంటున్న పోలీసులు...

ఇదిలా ఉంటే తెలంగాణ న్యాయవాదులు తలపెట్టిన చలో హైకోర్టుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంక్షల నేపథ్యంలో ఎవరూ హైకోర్టుకు రావొద్దని పోలీసులు సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిని పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు.. వాహనాలు రాకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఆప్షన్ మార్చుకోని న్యాయాధికారులపై ఒత్తడి పెంచేలా నిరసనలు తెలపాలని..న్యాయవాదుల జేఏసీ నిర్ణయించిన తరుణంలో.. తలపెట్టిన చలో హైకోర్టు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

06:49 - June 13, 2016

రాజమండ్రి : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగుతోంది. మంచినీళ్లు మాత్రమే తీసుకున్నారని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఆహారం తీసుకోకపోవడంతో ముద్రగడ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని వారు తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని బంధువులతో విజ్ఞప్తి చేయించినా ముద్రగడ వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు.

తండ్రి ఆరోగ్యం పై స్పందించిన ముద్రగడ కుమారుడు...

మరోవైపు ముద్రగడ కుమారుడు బాలు సైతం తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని హింసిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ముద్రగడ దీక్ష విరమించరని స్పష్టం చేశారు.

తరలివస్తున్న నేతలు...

ఇదిలాఉంటే ముద్రగడను పరామర్శించేందుకు నేతలు తరలివస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు.. ముద్రగడను పరామర్శించేందుకు రాజమండ్రి వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి ఆనంద్‌ హోటల్‌ వద్ద వీహెచ్‌ను అదుపులోకి తీసుకొని వన్‌టౌన్‌ పీఎస్‌కు తరలించారు.

కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాపు నేతల సమావేశం....

ఇక విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఏపీ కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఆధ్వర్యంలో కాపుల సమావేశం నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తోందని ఏపి కాంగ్రెస్‌ కాపు రిజర్వేషన్ సాధికారత విభాగం ఛైర్మెన్ లింగంసెట్టి ఈశ్వరరావు అన్నారు. తుని ఘటనలపై సీబీఐ తో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ MLC రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. తుని ఘటనలపై రాజకీయ పార్టీగా తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు.

కసబ్ కంటే ఘోరంగా....

కసబ్‌ కంటే ఘోరంగా ముద్రగడను ప్రభుత్వం ట్రీట్‌ చేస్తోందని.. మనం అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా... లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోందని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు...

మరోవైపు ఏపీలోని జిల్లాల్లో ముద్రగడకు మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారుతుండడంతో పరిస్థితులు దిగజారకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపడుతున్నారు.

కొనసాగుతున్న ముద్రగడ దీక్ష...

రాజమండ్రి : ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆసుపత్రిలో వైద్య సేవలను నిరాకరిస్తూ దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏపీలోని పలు చోట్ల ముద్రగడ దీక్షకు మద్దతుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నేతలు ముద్రగడను పరామర్శించేందుకు రాజమండ్రికి వస్తుండగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. 

ఫ్లోరిడా నైట్‌క్లబ్‌లో నరమేధం :50 మంది మృతి

హైదరాబాద్ : అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. ఫ్లోరిడా.. ఓర్లాండోలోని గే క్లబ్‌పై ఆదివారం ఉదయం ఓ దుండుగుడు తుపాకితో విరుచుకుపడ్డాడు. ఈ కాల్పుల్లో 50 మంది మృతి చెందగా.. మరో 53 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఘాతుకానికి పాల్పడిన దుండగుడిని మూడు గంటల పాటు జరిగిన కాల్పుల అనంతరం మట్టికరిపించారు పోలీసులు. కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘాతుకం వెనుక ఉగ్రవాద చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 

06:44 - June 13, 2016

హైదరాబాద్ : ఎస్ బిహెచ్ తో పాటు వివిధ స్టేట్ బ్యాంక్ లను ఎస్ బిఐలో విలీనం చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. మరోవైపు బ్యాంక్ ల ఉద్యోగులు విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. జులైలో సమ్మె చేసేందుకు ఎస్ బిహెచ్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. బ్యాంక్ ల విలీన ప్రక్రియను బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? బ్యాంక్ ల విలీనం వల్ల లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? ఎస్ బిఐలో విలీనం వల్ల ప్రాంతీయ బ్యాంక్ ల ఉద్యోగులకు జరిగే నష్టం ఏమిటి? రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత రాంబాబు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:41 - June 13, 2016

హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ బ్యాంక్ లతో పాటు కొత్తగా స్థాపించిన మహిళా బ్యాంక్ ను కూడా ఎస్ బిఐలో విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ బ్యాంక్ లన్నింటినీ విలీనం చేయడం ద్వారా ఎస్ బిఐ మరింత పటిష్టమవుతుందనీ, దాదపు 50 కోట్ల మంది ఖాతాదారులు కలిగిన అతిపెద్ద వ్యవస్థగా అవతరిస్తుందంటూ కేంద్రం భావిస్తోంది. నిర్వహణా వ్యయం కూడా తగ్గుతుందన్నది ప్రభుత్వవర్గాల వాదన.

వినియోగదారులకు నష్టమే...

అయితే, బ్యాంక్ ల విలీనం వల్ల వినియోగదారులకు జరిగే లాభమేమీ వుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణలో లీడ్ బ్యాంక్ గా వ్యవహరిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఆయా బ్యాంక్ లు లీడ్ బ్యాంక్ లుగా సేవలందిస్తున్నాయి. నిజాం కాలంలో ఏర్పాటైన ఎస్ బిహెచ్ ఏటా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల లాభాన్ని సంపాదిస్తోంది. దాదాపు 50వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రైతులకు వ్యవసాయ రుణాల పంపిణీ, చిరు వ్యాపారులకు రుణాల పంపిణీలో ప్రముఖపాత్ర పోషిస్తూ పారిశ్రామికాభివ్రుద్ధికీ ఊతమిస్తోంది. ఎస్ బిహెచ్ ఆర్జించే లాభాలపై వచ్చే పన్నుల్లో కొంత భాగం రాష్ట్రానికి వాటాగా వస్తోంది. అయితే ఎస్ బిహెచ్ ఎస్ బిఐలో విలీనమైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటా మొత్తం కేంద్రానికే పోతోంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి నష్టం. రాష్ట్రంలో సెంట్రల్ కార్యాలయమూ వుండదు. మరోవైపు ఎస్ బిహెచ్ ఉద్యోగుల పదోన్నతులు ప్రమాదంలో పడతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ట్రావెన్‌ కోర్‌ ను ఎస్ బిఐలో విలీనం చేయడాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకిస్తోంది. ఇదే తరహాలో ఎస్ బిహెచ్ విలీనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలన్న సూచనలొస్తున్నాయి. బ్యాంక్ లను విలీనం చేయడం కంటే వాటికి నిధులిచ్చి, మరింత పరిపుష్టం చేయడమే తెలివైన మార్గమన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ ల విలీనం వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభం జరిగి, రైతులకు, చిరు వ్యాపారులకు నష్టం జరుగుతుందన్న వాదనలూ వున్నాయి.

కొన్ని బ్రాంచ్ లు మూసివేసే ప్రమాదం.....

విలీనం వల్ల కొన్ని బ్రాంచ్ లు మూసివేసే ప్రమాదం వుంది. ఏటిఎమ్ లు మూసివేయతప్పదు. అంటే బ్యాంక్ కస్టమర్లకు కొత్త కష్టాలు తప్పవన్నమాట. ప్రభుత్వరంగంలో బ్యాంక్ లో సంఖ్య తగ్గిపోయి, ప్రయివేట్ ఆధిపత్యాన్నికి బాటలు వేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల సంఖ్యను కుదించడం, రిక్రూట్ మెంట్లు నిలిపివేయడం లాంటి అవాంఛనీయ పరిణామాలు తప్పకపోవచ్చు. దీంతో నిరుద్యోగ సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వాల ద్వారా వచ్చే సబ్సిడీలు, గ్రాంట్ లు లబ్దిదారులకు చేరడంలో జాప్యం జరిగే అవకాశం వుంది. ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బ్యాంక్ ల విలీనం పై విస్త్రుత స్థాయిలో చర్చించాల్సిన అవసరమూ వుంది. 

చలో హైకోర్టుకు అనుమతి లేదు : సీపీ

హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ నేడు నిర్వహించనున్న ‘చలో హైకోర్టు’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతిలేదని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంపై నిషేధం ఉందన్నారు. నిషేధాజ్ఞలు అతిక్రమించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాల ప్రకారం ప్రాక్టిసింగ్ అడ్వకేట్‌లకు అనుమతిస్తామని తెలిపారు.

06:24 - June 13, 2016

బాహుబలి ది కంక్లూషన్, ఘాజి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రానా.. ఇటీవల పంజాబీ భాషలో 50 కోట్లు వసూలు చేసిన సర్దార్‌జీ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్‌ని రానా సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహించే అవకాశం వుందని, ఇందులో రానా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సర్దార్ అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. ఈ షూటింగ్ లో రానా పాల్గొంటున్నాడు.


 

విజయవాడలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

విజయవాడ: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన విజయవాడ ఎంజీ రోడ్డులోని పీవీటీ మాల్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

06:14 - June 13, 2016

హైదరాబాద్ :‘సరైనోడు’తో విలన్‌గా మారిన కథానాయకుడు ఆది పినిశెట్టి. ఆయన త్వరలోనే అనుష్కకి జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్‌మతి’ చిత్రం తెరకెక్కబోతోంది. అశోక్‌.జి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా ఒక కథానాయకుడు కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.

06:06 - June 13, 2016

హైదరాబాద్:'లౌక్యం', 'జిల్‌' వంటి వరుస విజయాలందుకున్న హీరో గోపీచంద్‌ ప్రస్తుతం మరో హిట్‌ అందుకునేందుకుసిద్ధమవుతున్నారు. తాజాగా 'ఆక్సిజన్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం గురించి పుట్టిన రోజు (ఆదివారం) సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ, 'ఈ చిత్ర కొత్త కథ కాకపోయినప్పటికీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. గతంలో నేనెప్పుడూ ఇలాంటి చిత్రాన్ని చేయలేదు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా ఒక సామాజిక సమస్యను చర్చిస్తుంది. ఆ పాయింట్‌ హార్ట్‌ టచ్చింగ్‌గా ఉంటూ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మా నాన్న(టి.కృష్ణ) చిత్రాల తరహాలో ఈచిత్రం ఉంటుంది. కచ్చితంగా ఇదొక డిఫరెంట్‌ చిత్రమవుతుంది. చిన్నప్పట్నుంచి నాకు యాక్షన్‌ చిత్రాలంటే ఇష్టం. ఎందుకంటే రియల్‌ లైఫ్‌లో చేయలేని యాక్షన్‌ సీన్స్‌ను సినిమాల్లో హీరో చేస్తే ప్రేక్షకులు చూడాలనుకుంటారు. రెగ్యులర్‌ లైఫ్‌లో కామెడీని చాలా సార్లు చూస్తాం, ఆనందిస్తాం. నా నుంచి ఆడియెన్స్‌ ఎక్కువగా కామెడీ చిత్రాలను ఆశిస్తారని అనుకోవడం లేదు. యాక్షన్‌ను రియల్‌ లైఫ్‌లో రెగ్యులర్‌గా చేయలేం. అందుకే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశాం. యాక్షన్‌ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం అందరిని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. దీంతోపాటు మరో రెండు ప్రాజెక్టులకు సైన్‌ చేశాను. అందులో ఒకటి పరుచూరి మురళి దర్శకత్వంలో, మరొకటి శ్రీవాస్‌ దర్శకత్వంలో ఉంటుంది. ఈ బర్త్‌డేకి ప్రత్యేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ నా వరకు నేను మంచి సినిమాలతో అలరించాలను కుంటున్నాను' అని అన్నారు.

Don't Miss