Activities calendar

14 June 2016

21:56 - June 14, 2016

ఢిల్లీ : కింగ్ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ విషయంలో మాల్యాను ఉద్దేశపూర్వక నేరస్తుడిగా ముంబై స్పెషల్ కోర్టు ప్రకటించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్లు ఎగ్గొట్టి, లండన్ పారిపోయిన మాల్యాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ కు తిరిగి రావాలని, లొంగిపోవాలని మాల్యాకు సూచించినా పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం చెప్పిన ప్రాంతంలో, చెప్పిన సమయానికి ముప్పై రోజుల్లోగా హాజరుకావాలి.. అలా చేయని పక్షంలో ఏ వ్యక్తిని అయినా ఉద్దేశపూర్వక నేరగాడిగా పేర్కొంటారని తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో.. మాల్యాను వెనక్కి రప్పించేందుకు .. ఇంటర్ పోల్ ను సంప్రదించి మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు అందజేసే అవకాశాలున్నాయి.

21:53 - June 14, 2016

హైదరాబాద్: హెచ్‌సీయూలో సస్పెన్షన్‌ కు గురైన అధ్యాపకులు కె.వై రత్నం, తథాగత్‌ సేన్‌ గుప్తాలు వర్సిటీ ఎదుట నిరసనకు దిగారు. మార్చి 22న వర్సిటీలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో వర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ ఇద్దరికీ నోటీసులు జారీ చేయగా, అనంతరం సస్పెండ్‌ చేసింది. ఇరువురు అధ్యాపకులు మద్దతుగా వర్సిటీలోని విద్యార్థులు సైతం నిరసనకు దిగారు. 

21:48 - June 14, 2016

మెదక్ : జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల నిరసనలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి..అధికారుల మాయమాటలకు మోసపోయి కోందరు రైతులు దోంగతనంగా భూముల్ని రిజస్ట్రేషన్ చేయించుకోవటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించిన వారి దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున గ్రామస్థులు పాల్గోని అక్రమ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

21:44 - June 14, 2016

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆస్పత్రిలో గర్బిణిలు పడుతున్న ఇక్కట్లపై హైకోర్టు సిరియస్ గా స్పందించిది. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటగా స్వీకరించిన హైకోర్టు... తెలంగాణ వైద్యా విద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్స్, కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరెండెంట్ లను ప్రతివాదులుగా చేర్చింది. ఆస్పత్రిలో సౌకర్యాలపై ఇద్దరు సీనియర్ మహిళా న్యాయవాదులతో కమిటీ వేసింది. మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అదేశించింది. నిండు గర్భినీలు... వైద్యం కోసం చెట్లకింద పడుకోవడం. గంటల కొద్ది నిల్చోవడం వంటి అసౌకర్యాల గురించి పత్రికల్లో వచ్చిన వార్తలపై... జస్టిస్ దుర్గాప్రసాద్ స్పందించి... కేసును సుమోటోగా తీసుకోవాలని ఛీప్ జస్టిస్ కు లేఖ వ్రాశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి. బోసలే, నవీన్ రావుతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. 

21:38 - June 14, 2016

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు.. ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈద్గా, మసీదుల దగ్గర పండుగ రోజుకు అవసరమైన కార్యక్రమాలను తక్షణమే చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రార్థన మందిరాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లకు సీఎం ఆదేశం ..
రంజాన్ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. అన్ని ప్రార్థన మందిరాల వద్ద పండుగను ఘనంగా జరుపుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న నిజాం కళాశాలలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఇఫ్తార్‌కి నగరంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మతపెద్దలు, రాయబారులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26నే అన్ని ప్రాంతాల్లో ఇఫ్టార్ విందులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26నే అన్ని ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు-కేసీఆర్
జిల్లా కేంద్రాల్లో జరిగే రంజాన్‌ వేడుకలకు కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పండుగ సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది పేద ముస్లిం కుటంబాలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్ నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు.

2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టల పంపిణీ..
పేద ముస్లింలు, మైనారిటీల విద్య, ఉపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్బంగా సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది మైనారిటీలకు ప్రభుత్వపరంగా భూ పంపిణీ జరిగినట్లు లెక్కలున్నాయని, క్షేత్ర స్థాయిలో వాటి పరిస్థితిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీల భూములు వందశాతం వారికే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలొ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ తో పలువురు అధికారులు పాల్గొన్నారు.

21:29 - June 14, 2016

విజయవాడ : జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్‌.. టీడీపీ తీరుపై విరుచుకుపడ్డారు. మళ్లీ చెప్పులు, చీపుళ్ల ప్రస్తావన తెచ్చారు. అబద్దాలు చెప్పి, మోసాలు చేసే నాయకులకు చెప్పులు, చీపుర్లు చూపించిన నాడే వ్యవస్థలో మార్పు వస్తుందని జగన్‌ అన్నారు. వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బతకదన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు.

జగన్‌పై టీడీపీ ఎదురుదాడి...
వైఎస్‌ జగన్‌పై టీడీపీ ఎదురుదాడికి దిగింది. ప్రభుత్వంపై జగన్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. వ్యవసాయ రుణాల మాఫీ, సామాజిక పెన్షన్ల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని జగన్‌ వక్రీకరిస్తున్నారని విమర్శించారు. అనేక కేసుల్లో జగన్‌ నిందితునిగా ఉన్నాడని మంత్రి నారాయణ, జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ ఎద్దేవా చేశారు. 

ఏటీఎం చోరీ కేసులో మరో నిందితుడు అరెస్ట్ ..

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో జరిగిన ఏటీఎం చోరీ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌వాసి షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్నాడు. కోటగిరి మండలం పోతంగల్ ఏటీఎం వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఏడుగురు దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు.

21:08 - June 14, 2016

బడిగంట మోగింది.. బండెడు పుస్తకాలు.. బరువైన ఫీజులు.. కొత్త బట్టల హడావుడి. ఓవరాల్ గా కొంత సందడి.. అంతులేని ఒత్తిడి. చదువు వ్యాపారంగా మారిన తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలంటే తల్లిదండ్రులు వణికిపోవలసిందే. నెలనెలా ఉండే రెగ్యులర్ ఖర్చులతో పాటు.. అదనంగావచ్చే స్కూల్ ఫీజులు, డొనేషన్లకోసం పేరెంట్స్ పడే యాతన అంతా ఇంతా కాదు.. మరి ఈ ఫీజులుం ఎన్నాళ్లు..? చదువు ఎందుకిలా అందనిదైపోతోంది? విద్య వ్యాపారంగానే నిలిచిపోవలసిందేనా? ఈ ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ కొనసాగవలసిందేనా? ఈ రోజు వైడాంగిల్ లో ఇదే అంశం విద్యా వ్యాపారం పరిధులు దాటుతోంది. మాఫియాను తలపించే దశకు చేరుతోంది. లాభార్జనే ధ్యేయంగా, ఫక్తు వ్యాపార ధోరణితో నడుస్తున్న విద్యా సంస్థలు భారీ వ్యాపారాలకే తెరలేపాయి. తల్లిదండ్రులకు తీరని నష్టాన్ని, ఒత్తిడిని మిగులుస్తున్నాయి. చట్టాలు తుంగలోతొక్కుతున్నారు.. జీవోలను లైట్ తీస్కుంటున్నారు...అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు.. ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని పరిశీలిస్తే కనిపించే సంగతులివి.. నగరంలో స్కూళ్ళ ఫీజులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. టీజర్ స్కూల్ ఫీజు కంటే ఇంజనీరింగ్, మెడిసిన్ ఫీజులే తక్కువ... మెడిసిన్ ఫీజుల కంటే, ఎల్ కేజీ ఫీజు చాలా తక్కువ.. ఇంటర్నేషనల్ స్కూల్ డొనేషన్ కంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీజు కూడా చాలా తక్కువ. పాఠశాల విద్య ఇంత కాస్ట్ లీ గా ఎందుకు మారింది. సామాన్యులను దోచుకునేలా విద్యాసంస్థలు ఎందుకు మారుతున్నాయి? ఒకనాడు కళకళలాడిన సర్కారీ బడుల స్థానంలో ఈ దోపిడీ సంస్థలెలా వచ్చాయి? తాము ఎన్ని కష్టాలు పడ్డా.. పిల్లలకు బంగారు భవిత ఇవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు.. కానీ, ఇదే ఎలిమెంట్ ప్రైవేట్ స్కూళ్లకు కాసులు కురిపిస్తోంది. లక్షలాది కుటుంబాలను అప్పుల కుప్పలుగా మిగులుస్తోంది. మరో పక్క సర్కారీ విద్య నానాటికీ నాణ్యతను, నమ్మకాన్ని కోల్పోతోంది.. ఇవన్నీ కలిసి విద్యా వ్యాపారానికి ఊతమిస్తున్నాయి. విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో భాగంగా, ప్రభుత్వం సర్కారీ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించకుండా గాలికొదిలేసి విద్యావ్యవస్థను గందరగోళపరుస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి, రెండు విద్యా సంస్థలే మోనోపలీ సాధించటమే దీనికి ఉదాహరణ. పైగా ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ సంస్థలు ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాయంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత హీనంగా ఉందో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

20:54 - June 14, 2016

ఉత్తరప్రదేశ్‌ : ఎన్నికల్లో బిజెపి మళ్లీ మత తత్వాన్ని తెరపైకి తేవాలని చూస్తోంది. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా ఎన్నికల ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కమలనాథులు చేసిన ఇలాంటి యత్నం బెడిసి కొట్టింది. కైరానాలో ముస్లింలకు భయపడి హిందువులు వలస వెళ్తున్నారంటూ బిజెపి లేవనెత్తిన అంశం ఉత్తిదేనని తేలిపోయింది.

కైరానా నుంచి హిందువులను వెళ్లగొడ్తున్నారని రెచ్చగొట్టే ప్రసంగం...
ఎన్నికలు వచ్చాయంటే మతతత్వాన్ని అస్త్రంగా మలచుకోవడం బిజెపికి రివాజుగా మారింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుల సమీకరణలు హిందుత్వ రాజకీయాలను.. అలహాబాద్‌ సమావేశం వేదికగా తెరపైకి తెచ్చింది. కైరానా మరో కశ్మీర్‌గా తయారవుతుందంటూ బిజెపి చీఫ్‌ అమిత్‌ షా ఆవేశంగా మాట్లాడారు. కశ్మీర్‌ నుంచి పండిట్లను వెళ్లగొట్టినట్లే కైరానా నుంచి హిందువులను వెళ్లగొడ్తున్నారని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు.

కైరానా నుంచి 346 మంది హిందువులు వెళ్లిపోయారని లిస్ట్‌...
గతవారం కైరానా నుంచి 346 మంది హిందువులు ఇళ్లను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని బిజెపి ఎంపి హుకుంసింగ్‌ ఓ లిస్టును అమిత్‌షాకు అందజేశారు. ముస్లిం రౌడీల గూండాయిజానికి భయపడి జాట్‌, దళిత కుటుంబాలు పట్టణం నుంచి పారిపోయారని ఆ లిస్టులో పేర్కొన్నారు.
కైరానాలో 119 మంది పేర్లను పరిశీలించిన అధికారులు..
వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. హుకుంసింగ్‌ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించింది. 119 పేర్లను పరిశీలించగా...ఇందులో నలుగురు చనిపోయారు. మరో 68 మంది దశాబ్దం క్రితమే పట్టణం విడిచి వెళ్లిపోయారు. మరో 35 మంది బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి భంగమూ వాటిల్లలేదని పేర్కొన్నారు.

అధికార గణాంకాలతో బిజెపి యు టర్న్...
అధికారులిచ్చిన గణాంకాలతో కంగుతిన్న బిజెపి... కైరానాపై యు టర్న్‌ తీసుకుంది. ఇది హిందు-ముస్లింల సమస్య కాదని హుకుంసింగ్‌ అన్నారు. కైరానాలో నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఈ లిస్టులో కొంత గందరగోళం జరిగిందని, దాన్ని కార్యకర్తలు తయారు చేశారని మాట మార్చారు. ఈ అంశంపై విపక్షాలు కావాలనే మతం రంగు పులుముతున్నాయని ఆరోపించారు. కైరానా నిజాలను బయట పెట్టేందుకు ఓ బృందాన్ని పంపనున్నట్లు బిజెపి ప్రకటించింది.

2013లో ముజఫర్‌నగర్‌ అల్లర్లలో 60 మంది మృతి....
లోక్‌సభ ఎన్నికలకు ముందు 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్లలో 60 మంది మృతి చెందారు. 60 వేల ముస్లిం కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. ముస్లింలు అధికంగా ఉన్న కైరానాలో కమలనాథుల ప్రకటనల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓట్ల కోసం బిజెపి మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఎస్పీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. 

20:44 - June 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలపై కూడా సందేహాలు మొదలయ్యాయి. గతంలో వరుసగా జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని.. ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అనుమతులు లేని... భద్రతా ప్రమాణాలు పాటించని.. స్కూలు బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫిట్‌ నెస్‌ లేని స్కూల్‌ బస్సుల తనిఖీలు...
భద్రతా ప్రమాణాలు పాటించని స్కూలు బస్సుల వల్ల చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నైపుణ్యం లేని డ్రైవర్లు, ఫిట్‌నెస్‌ లేని బస్సులతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో లాభాపేక్షే ధ్యేయంగా.. బస్సుల నాణ్యత, భద్రతలను గాలికి వదిలేసిన స్కూలు యాజమాన్యాలపై ఆర్టీఏ కొరడా ఝుళిపించింది.

మెరుపు దాడులతో హడలెత్తించిన ఆర్టీఏ అధికారులు...
తెలుగు రాష్ట్రాల్లో స్కూలు బస్సులపై ఆర్టీఏ సోదాలు ముమ్మరం చేసింది. ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నడుపుతున్న బస్సుల ఫిట్‌నెస్‌ ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌, రామాంతపూర్‌ ఆర్టీఏ అధికారులు ప్రైవేట్‌ స్కూలు బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు స్కూలు బస్సులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా విద్యార్థులను తీసుకు వెళుతున్న బస్సులు, ఆటోలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. కనీస ప్రమాణాలు పాటించన ఓ స్కూలు బస్సును అధికారులు సీజ్‌ చేశారు.

గుంటూరులో ఒకే రోజు 11 బస్సులు సీజ్‌...
ఏపీలోనూ స్కూల్‌ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. గుంటూరులో భద్రతా ప్రమాణాలు పాటించని స్కూలు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించి ఏకంగా 11 బస్సులను సీజ్‌ చేశారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఒకే సారి ఆర్టీఏ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

కడపలో 10 బస్సులు సీజ్‌ చేసిన అధికారులు...
కడప జిల్లాలోనూ ఫిట్‌నెస్‌ లేని 10 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న సంబంధింత పాఠశాలలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

బస్సుల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ దృష్టి...
మొత్తానికి పాఠశాలలు మొదలైన రెండో రోజే స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపే పాఠశాలలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలంటూ అటు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. స్కూలు ప్రారంభ కాలంలో మాత్రమే హడావుడి చేయకుండా.. తరచూ నిఘా పెడితే.. స్కూలు బస్సుల ప్రమాదాలను పూర్తిగా నియంత్రించ వచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు.

20:37 - June 14, 2016

విజయవాడ : రాజధాని అమరావతిలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా తాత్కాలిక సచివాలయం నిర్మాణ జరుగుతున్న వెలగపూడితోపాటు తుళ్లూరు, నవులూరుల్లో వీటని ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. అన్న క్యాంటీన్లలో ఒక్క రూపాయికే సాంబారు ఇడ్లీ అందించాలని నిర్ణయించారు. అలాగే పులిహోర, పొంగలికి ఐదు రూపాయలు వసూలు చేస్తారు. పెరుగన్న మూడు రూపాలయే అందిస్తారు. 

20:34 - June 14, 2016

కళాకారులు కారు దిగుతుంటే ...లీడర్లు మాత్రం కార్లో కూసుంటున్రు..రైతు ఏడిసిన రాజ్యం..ఎద్దు ఏడిసిన వ్యవసాయం మంచిగుండదన్నట్టుగుంది తెలంగాణల రైతు సంగతి...లుంగీ కట్టి అరక దున్నిన మంత్రి పల్లె ...రక్షక భటుడే రాక్షసుడై ఖాకీ ఆకతాయిని గల్లా పట్టి నాలుగేసిన ఆడామే...సంగీతం సారు అమ్మాయిలతో అసభ్య ఏసాలు... పోలీసోల్లమని పైసలు గుంజుతున్న దొంగలు...గడ్డి మేస్కుంటాబోయి బాయిలో వడ్డ ఎద్దు...మల్లన్న ముచ్చట్లలో మరిన్ని ముచ్చట్లు చూడాలంటే ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి...మరిన్ని ముచ్చట్లు తెలుసుకోండ్రి....

20:27 - June 14, 2016

ఢిల్లీ : రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై దిగ్విజయ్‌తో చర్చించారు. రేపు పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుందని, అన్ని అంశాలపై ఈ భేటీలో చర్చిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

20:20 - June 14, 2016

ఢిల్లీ : పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలో.. జయలలిత 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రానికి సహకరించాలని ప్రధాని కోరినట్టు సమాచారం. 

19:49 - June 14, 2016

హైదరాబాద్‌ : దేశంలో మళ్లీ కలకలం మొదలైంది. పొలిమేరలదాకా తరిమిన భూతం తిరిగి వస్తోంది. పసివారినే టార్గెట్‌చేసి కబళించడానికి మరోసారి కోరలు చాపింది. హైదరాబాద్‌ మురుగునీటిలో సరికొత్తగా స్థావరాన్ని ఏర్పరచుకున్న పోలియోమహమ్మారిపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ..
హైదరాబాద్‌ మురుగునీటిలో పోలియో వైరస్‌...
హైదరాబాద్‌లోని అంబర్‌పేట మురుగునీటిలో పోలియోవైరస్‌ ఉందన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికతో .. తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖలో హడావుడి మొదలైంది. వైద్యాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి...నివారణపై చర్చించారు. వైరస్‌ చిన్నారులకు వ్యాపించకుండా కార్యాచరణ చేపట్టారు. ఈనెల 15వ తేదీ నుంచి నుంచి17 వరకు.. హైదరాబాద్‌, రంగారెడ్డిజిల్లో ఇంటింటి సర్వే నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా మూసీ మురుగు ప్రవహించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు. తర్వాత ఈనెల 20 నుంచి వరుసగా 6 రోజులపాటు పోలియోటీకాలు వేయడానికి వైద్య ఆగ్యోశాఖ నిర్ణయించింది.

మురుగునీటి శాంపుల్స్‌ను పుణేలో పరీక్షించిన డబ్ల్యూహెచ్‌ఓ...
కొద్దిరోజుల కిందట అంబర్‌పేటలోని నాలా మురుగునీటిని సేకరించిన... రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ...ఆ శాంపిల్స్‌ను ముంబై పూణెలోని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రయోగాశాలకు పంపించింది. అక్కడ నీటిని పరీక్షించిన నిపుణులు విస్మయానికి గురైయ్యారు. నిర్మూలించామనుకుంటున్న పోలియోక్రిములు మళ్లీ కనిపించాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. దీనిపై ఈనెల ఏడునే ...తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది డబ్ల్యూహెచ్‌వో .

మానవ వ్యర్ధాలనుంచే వ్యాపించిందా..?...
ఇంతకీ ఈ వైరస్‌ ఎక్కడనుంచి వచ్చింది...? దీనిపైనే ఇపుడు రాష్ట్ర వైద్యశాఖాధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మానవ వ్యర్థాల ద్వారా పోలియో వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాల్లో నివసించే ఎవరైనా వ్యక్తి నుంచి ఈ పోలియో వైరస్‌ మురుగు నీటిలోకి చేరిఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

శాంపిల్స్‌ను పుణె , ఢిల్లీ, అమెరికా పరిశీలన..
అసలు ఈవైరస్‌ మళ్లీ ఎక్కడ నుంచి వచ్చిందన్న దానిపై క్లారిటీ రావాలంటే... మరికొద్దిరోజులు ఆగాల్సి ఉంటుంది. మురుగనీటి శాంపిల్స్‌ను పుణె , ఢిల్లీతోపాటు అమెరికా కూడా పంపించారు. అక్కడ నుంచి ఫలితాలు వచ్చాక అసలు విషయం బయటపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రాంతాలనుబట్టి పోలియోవైరస్‌లో తేడాలుంటాయని వారంటున్నారు. నమూనాను పరిశీలించి వైరస్‌ ఏదేశంనుంచి వచ్చిందో చెప్పవచ్చంటున్నారు.

చిరుల్లో కనిపించని పోలియోవైరస్‌...
అయితే.. కొద్దిగా ఊరట కలిగించే విషయం ఏంటంటే.. మురుగునీటిలో కనిపించిన పోలియోవైరస్‌..చిన్నారుల్లో ఎక్కడా బయటపడలేదు. అదే చిన్నపిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడి ఉంటే... పోలియో మహమ్మారిపై మనదేశం సాధించిన విజయం ప్రశ్నార్థకంగా మారేది. కాని.. పిల్లల్లో వ్యాధి లక్షణాలు ఇంతవరకు బయట పడనందున ప్రజలు భయడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యాధికారులు. ఒకవేళ ఆ మురుగునీరు ఎక్కడైనా మంచినీటి పైపుల్లోకి ప్రవేశిస్తే... పోలియో వైరస్‌ చిన్నారుల శరీరాల్లోకి చేరే అవకాశం ఉందంటున్నారు. అందుకే మూసీ మురుగు ప్రవహించే ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. సర్వే తర్వాత ఈనెల 18,19వ తేదీల్లో తగిన ప్లాన్‌ రూపొందించి... చిన్నారులకు టీకాలు వేసేందుకు నిర్ణయించారు.

2011లో చివరి కేసు నమోదు...
భారతదేశంలో 2011 జనవరిలో చివరిసారిగా పోలియోకేసు నమోదైంది. తర్వాత పోలియోరాక్షసి కనిపించకుండా పోయింది.దీంతో 2014 మార్చి 27న భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. టైప్‌2 పోలియో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించినట్టుగా డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. అప్పటివరకు అమల్లోవున్న మూడురకాల పోలియో వైరస్‌లతోకూడిన టీకాల నుంచి టైప్‌ 2 వైరస్‌ను తొలగించింది. కేవలం టైప్‌1 టైప్‌3 వైరస్‌ల నిర్మూలనకు ఉద్దేశించిన పోలియో చుక్కలను మాత్రమే చిన్నారులకు అందిస్తోంది. పోలియో చుక్కల మందును కొనసాగిస్తూ... కొత్తగా ఇంజక్షన్ రూపంలో టీకాను కూడా వ్రవేశపెట్టింది. దేశంలోనే పూర్తిగా నిర్మూలించామని ప్రకటించినా... ముందస్తు చర్యలుగా రెండు రూపాల్లో పోలియోటీకాలను ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మురగునీటిలో పోలియో వైరస్‌ను గుర్తించడంతో మళ్లీ కలకలం మొదలైంది. 

19:18 - June 14, 2016

కడప : మిర్రర్ ఇమేజ్ రివర్స్ రైటింగ్‌లో కడప యువకుడు ప్రపంచరికార్డు సృష్టించాడు.. కేవలం 108 సెకన్లలో వందేమాతర గీతాన్ని రివర్స్‌లో రాసి అందరినీ అబ్బురపరిచాడు.. ఇతని స్పీడ్‌ చూసిన ఏడు ప్రపంచ రికార్డు సంస్థలు ప్రశంసల వర్షం కురిపించాయి..

108 సెకన్లలో వందేమాతరం గీతం ...
ఇంగ్లీషులో ఎవరైనా ఎడమనుంచి కుడికి రాస్తారు.. కడపకుచెందిన శ్రీహర్షది మాత్రం డిఫరెంట్ స్టయిల్‌.. కుడినుంచి ఎడమకు అదికూడా రివర్స్‌లో రాస్తాడు.. ఇదే పద్ధతిలో వందేమాతరం గీతాన్ని 108 సెకన్లలో రాసి ప్రపంచరికార్డు సృష్టించాడు.. ఈ యువకుడి ప్రతిభను గుర్తించిన ఏడు ప్రపంచరికార్డు సంస్థలు అతన్ని ప్రశంసలతో ముంచేశాయి..

యునైటెడ్ వరల్డ్ రికార్డ్, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్...
కడపకు చెందిన శ్రీహర్ష సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు.. చిన్నతనం నుంచి సరదాగా అక్షరాల్ని వెనక్కి రాసేవాడు.. తండ్రి ప్రోత్సాహంతో దీనిపై మరింత దృష్టిపెట్టాడు.. వేగంగా రివర్స్‌లో రాయడంలో నైపుణ్యం సాధించాడు.. బాలసాహిత్య పరిషత్‌ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని 108 సెకన్లలో రాసేశాడు.. ఈ రికార్డును యునైటెడ్ వరల్డ్ రికార్డ్, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్, వర్మ బుక్ ఆఫ్ రికార్డ్ వంటి సంస్థలు గుర్తించాయి..
నటనలోనూ ప్రతిభ చూపుతున్న శ్రీహర్ష...
బాల సామ్రాట్‌ పురస్కారం అందుకున్న శ్రీహర్ష ఒక్క రివర్స్ రైటింగే కాదు.. శ్రీహర్షకు నటనలోనూ ప్రవేశముంది.... ఏకపాత్రాభినయంలో యాక్టింగ్‌కు బాల సామ్రాట్‌ పురస్కారం దక్కించుకున్నాడు... చదువుతోపాటు.. ఆటల్లోనూ రాణించాడు.. ఇన్ని రంగాల్లో ప్రతిభచూపిన ఈ కళాకారుడిని జన విజ్ఞానవేదిక సన్మానించింది.. ఈ కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని కేవలం 101 సెకన్లలోనే పూర్తిచేశాడు..

లిమ్కా బుక్‌ కు యత్నం...
మొత్తానికి రాయడంలోనూ కొత్తదారి ఎంచుకున్న శ్రీహర్ష... లిమ్కా బుక్‌లో స్థానంకోసం ప్రయత్నిస్తున్నాడు.. ఇందుకోసం మరింత వేగంగా రాతను ప్రాక్టీస్ చేస్తున్నాడు..

19:07 - June 14, 2016

గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బుధవారం గుంటూరు నాగార్జునా యూనివర్సిటీ దగ్గర పోరు దీక్ష చేపట్టాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బాధితులందరూ పాల్గొనాలని సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరావు విజ్ఞప్తి చేశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడ్డ అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లను అరెస్టు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. 

19:02 - June 14, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అటవీ భూములను బదలాయించే ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి ఫైలు పంపినా.. భూముల బదలాయింపుపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో ఏం చేయాలో తెలియక రాష్ట్రాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి ఫైలు పంపినా పురోగతి శూన్యం..
అమరావతి నిర్మాణానికి అటవీ భూములను బదలాయించే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి ఫైలు పంపినా.. భూముల బదలాయింపుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రాజధాని ప్రాంతంలో ఉన్న దాదాపు 19 వేల హెక్టార్ల అటవీ భూమి రాజధానికి అవసరమని, దాన్ని డీనోటిఫై చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ గత ఏడాది కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే నిబంధనల ప్రకారం డీనోటిఫై చేయడం కుదరదని డైవర్షన్ పద్ధతిలో అటవీ భూములను తీసుకునే విధంగా ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచించింది. అనంతరం రాజధానికి అవసరమైనంత భూమికి ప్రతిగా.. అంతే రెవెన్యూ భూమిని ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, కడప జిల్లా ప్రొద్దుటూరు, కడప డివిజన్లలో ఇస్తామని పేర్కొంటూ రాష్ట్రం రెండోసారి కేంద్రం వద్దకు ఫైల్ పంపింది. భూములను డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్-డీజీపీఎస్ సర్వే చేసి ప్రతిపాదనలు అందించాలని కేంద్రం మరోసారి ఫైల్ ను తిరిగి పంపింది. దాంతో కడప జిల్లాలో 9,500 హెక్టార్లు, ప్రకారం జిల్లాలో 4 వేల హెక్టార్ల రెవెన్యూ భూములను అటవీ శాఖకు అప్పగించేలా డీజీపీఎస్ సర్వే ద్వారా గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మూడోసారి ఫైల్ ను కేంద్రానికి పంపారు అధికారులు .

కొండ ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు ...
రాజధాని ప్రాంతంలోని అటవీ భూముల్లో కొండ ప్రాంతాలను ఎలా సంరక్షిస్తారో తెలపాలని, అలాగే అటవీ భూముల్లో ఏయే నిర్మాణాలు చేపడతారో స్పష్టం చేయాలని కేంద్రం కోరినట్లు సమాచారం. కొండ ప్రాంతాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధికారులు హామీ ఇచ్చారని తెలుస్తోంది. కేంద్ర బృందం దీనిపై రాష్ట్రంలో పర్యటించి వెళ్లి.. ఆరువారాలు దాటినా అక్కడి నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే.. అటవీ భూముల అప్పగింత ఇప్పట్లో లేనట్లేనని అటవీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రజాసంఘాల వ్యతిరేకత ...
ప్రభుత్వ ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగానే.. అటవీ భూముల డీనోటిఫికేషన్‌కు సంబంధించి ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతి సంపద అయిన అటవీ భూములను ఎలా నాశనం చేస్తారని ఆయా పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

సందిగ్ధంలో ఏపీ అధికారులు...
సాధారణంగా అటవీ భూముల డీ నోటిఫికేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర అటవీ సలహా సంఘం పరిశీలిస్తుంది. ఏవైనా సమస్యలుంటే వాటిని ఎలా అధిగమిస్తారని మినిట్స్‌ రూపంలో రాష్ట్రాలకు పంపిస్తారు. కానీ ఇంతవరకు అమరావతి అటవీ భూముల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి మినిట్స్‌ రాష్ట్రానికి అందలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఏపీ రాష్ట్ర అధికారులు సందిగ్ధంలో పడ్డారు.

18:53 - June 14, 2016

చిత్తూరు : టిటిడి పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా తిరుపతి అలిపిరిలో ఎస్వీబీసీ స్టుడియో నిర్మాణానికి 14 కోట్లు కేటాయించారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి అవసరమైన 3.75 లక్షల కేజీల జీడిపప్పు కొనుగోలుకు 25 కోట్లు, అలాగే 36 వేల కేజీల యాలకుల కొనుగోలుకు 3.99 కోట్ల రూపాయలు కేటాయించారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు అదనపు వేతనం ఇవ్వాలని.. దుకాణాల లైసెన్స్‌ రెన్యువల్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమల కళ్యాణకట్టలో పని చేస్తున్న ఐదుగురు మిరాశీ క్షురకులకు టైం స్కేల్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

18:50 - June 14, 2016

మెదక్ : చినుకు చినుకు ఒక్కటైతే వరద పోటెత్తుతుంది. గరిక గరిక ఒక్కటైతే.. మదగజాన్నైనా బంధించే శక్తి వస్తుంది. ఇదే సూత్రంతో ముందుకు సాగుతున్నారు మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లోని యువత. తాము తలచుకుంటే సాధించలేనిదంటూ ఉండదని... రెట్టించిన చైతన్యంతో మల్లన్నసాగర్‌ యువకులు... ముంపు గ్రామాల ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. లక్షల జీతాలను వదులుకుని.. తమ గ్రామాలను కాపాడుకునేందుకు ఉద్యమబాట పడుతున్నారు. యువతరం సత్తా ఏంటో చాటుతామంటున్న యువతపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...!

లక్షల జీతాలను వదిలి ఊరికోసం ఉద్యమబాట...
లక్షల జీతాలు వదులుకుని.. ఒకరినొకరు కలుపుకొని.. యవకెరాటాలన్నీ ఏకమయ్యాయి. దిక్కుకొకరుగా ఉన్నవాళ్లంతా కదిలి.. బిక్కుబిక్కుమంటు గడుపుతున్న కుటుంబాలను ఏకం చేశాయి. కొండల్ని పిండి చేసే యువశక్తి తమదంటూ.. చాటుతున్న మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల యువకుల పట్టుదలకు ఇప్పటికే అన్ని వర్గాల నుంచి మద్ధతు లభించింది. ఆరు నూరైనా.. తమ భూములను, ఊళ్లను వదిలేది లేదంటున్నారు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల యువకులు. అంతేకాదు.. గుండెల నిండా దుఃఖంతో బెంగటిల్లుతున్న తమ కుటుంబాలకు అండగా నిలిచేందుకు.. ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై లాంటి ప్రదేశాలను వదిలి.. లక్షల జీతాలను సైతం లెక్క చేయకుండా ప్రాజెక్టు వద్దని కరాఖండిగా చెబుతూ.. అందరిలో చైతన్యాన్ని ప్రోది చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రచారం ...
మొక్కిన గుడి.. అక్షర జ్ఞానాన్నిచ్చిన బడి.. చిన్నప్పుడు ఆడుకున్న చెట్లు, స్నేహితులంతా కలిసి చేసిన హంగామా.. ఇలా అనేక అనుభూతులను దూరం చేసుకోలేని యువకులంతా గ్రామం కోసం కదిలివచ్చారు. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ఏటిగడ్డ కిష్టాపూర్ యువకులు సోషల్‌ మీడియాలో తమ గ్రామానికి జరుగుతున్న దారుణాన్ని ప్రపంచానికి తెలియజేశారు. చిన్నప్పటి నుంచి తమ ఊరు తమకు ఎంతో ఇచ్చిందని, అలాంటి ఊరును ఎలా పోగొట్టుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు.

ఊరికోసం ఉద్యమ బాట ...
కష్టపడి చదువుకుని వివిధ ప్రాంతాల్లో మంచి హోదాల్లో స్థిరపడిన యువకులు తమ గ్రామం కోసం తల్లడిల్లుతున్నారు. అంతా సంఘటితమై ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. మరికొందరైతే ఉన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ఊరికోసం ఉద్యమ బాట పట్టారు.

సభలు, సమావేశాలతో ధైర్యాన్ని నూరిపోస్తున్న యువకులు..
ఉన్న వనరులనుపయోగించుకుని.. వ్యవసాయం చేసి పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులకు.. ఇప్పుడా పిల్లలే వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడి, పైసా పైసా కూడబెట్టి ఇళ్లు వాకిలి నిర్మించుకుంటే వాటిని నేల మట్టం చేస్తామనడం ఎంతవరకు సమంజసమని బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏటిగడ్డ కృష్ణాపూర్‌ వాసి ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తోందని, తమకు న్యాయం జరిగే వరకు గ్రామంలోనే ఉండి పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. 2103-చట్టాన్ని అనుసరించి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలతో తమకు ఇబ్బందులు కలిగించవద్దని యువకులు కోరుతున్నారు.

యువకుల చైతన్యానికి సర్వత్రా ప్రశంసలు...
ముంపు బాధితులకు అండగా నిలిచి... యువత ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు 14 గ్రామాల్లో ప్రజలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చారు. లక్షల జీతాలు కూడా వదులుకుని.. ఊరికోసం ఉద్యమిస్తున్న ఏటిగడ్డకిష్టాపూర్‌ యువకుల చైతన్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

ప్రధానితో జయలలిత భేటీ...

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భేటీ అయ్యారు. ఇవాళ ఆమె మోదీని కలిసి 29 డిమాండ్లతో కూడిన మెమోరాండం సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంకు సంబంధించి పలు సమస్యలను వివరించి ఆర్థిక సాయం అందించాలని కోరినట్టు తెలుస్తోంది. కాగా, ఇవాళ సీఎం జయలలిత చెన్నై నుంచి ఢిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకోగానే తమిళనాడు భవన్ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

మాల్యా అరెస్ట్ రంగం సిద్ధం కానుందా?!...

ముంబై: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిగా ప్రకటించింది. మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్లను రుణంగా తీసుకుని తిరిగి చెల్లించలేనని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం. బ్యాంకుల ఫిర్యాదులన్నింటిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) మాల్యా అరెస్టుకు కోర్టును ఆశ్రయించింది. మాల్యాపై ఇప్పటికే నాన్ బెయిలబుల్‌తో పాటు పలు అరెస్ట్ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

అవినీతి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు : జ్యోతుల

విజయవాడ : వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై ఇటీవల తెదేపాలో చేరిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వైకాపాను నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా నడిపించాలన్న ఆలోచన జగన్‌కు లేదన్నారు. అవినీతిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని... ఆ అంశంపై జగన్‌ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత మంచిదని ఎద్దేవా చేశారు. జగన్‌ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

17:53 - June 14, 2016

హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 800 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ దక్కడంతోనే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కేవలం కాంట్రాక్టులను దక్కించుకోవటానికే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి చేరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీ ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలను దాదాపు ఖాళీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు గులాబీ బాస్ కన్ను కాంగ్రెస్ నేతలపై పడింది. అనుకున్నదే తడవుగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు గులబీ గూటికి చేరుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి వలస నేతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లోకి వెళ్లేముందు కాంగ్రెస్‌ ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చని సుఖేందర్‌రెడ్డి పార్టీ వీడినంత మాత్రాన పార్టీకి నష్టంలేదని పాల్వాయి అన్నారు. 

17:48 - June 14, 2016

హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద క్రిమినల్ కోర్టు అయిన నాంపల్లి తెలంగాణ కోర్టు వద్ద టీ. న్యాయవాదులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కోర్టులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షకు దిగారు న్యాయవాదులు. న్యాయాధికారులకు ఆఫ్షన్ విధానం రద్దు చేసేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు. విధులను బహిష్కరించిన న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయాధికారులకు ఆప్షన్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ తో వారు దీక్షలు చేపట్టారు. ప్రొవిజన్ లిస్ట్ రీకాల్ అయ్యేంతవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంగా ఈనెల 17 వరకూ ఒక కార్యాచరణ ను రూపొందించుకున్నామనీ...ఈరోజు రిలే..రేపు మౌన ప్రదర్శన తరువాత వంటావార్పు కార్యక్రమం ..తరువాత ఆంధ్రా న్యాయమూర్తులందరికీ పోస్టు కార్డుల ద్వారా తమ విజ్ఞప్తులను తెలియజేస్తామన్నారు. అప్పటికీ తమకు స్పష్టమైన హామీ రాకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు.

17:46 - June 14, 2016

హైదరాబాద్ : ఈ ఏడాది రంజాన్‌కు 2లక్షల మంది పేద ముస్లింలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో రంజాన్ ఏర్పాట్లపై సీఎం రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్‌లో వంద చోట్ల, జిల్లాల్లో 95 ప్రదేశాల్లో దుస్తులు పంపిణీ చేయనున్నారు. ఈనెల 26న నిజాం గ్రౌండ్స్‌లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది పేద ముస్లింలకు భూములు పంపిణీ చేసినట్టు లెక్కలున్నాయని.. అవి మైనార్టీలకే ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

17:42 - June 14, 2016

లాటిన్ అమెరికా దేశాల సాకర్ సమరం కోపా అమెరికాకప్ లో క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గ్రూప్ సీ లీగ్ నుంచి...మెక్సికో, వెనిజ్వేలా జట్లు నాకౌట్ రౌండ్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి. సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్స్ సమరంలో మాజీ చాంపియన్ అర్జెంటీనాతో వెనిజ్వేలా, డిఫెండింగ్ చాంపియన్ చిలీతో మెక్సికో తలపడనున్నాయి. మాజీ చాంపియన్లు ఉరుగ్వే, బ్రెజిల్ గ్రూప్ లీగ్ రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి. అమెరికా ఖండ దేశాల సాకర్ సమరం...2016 కోపా అమెరికా కప్ టోర్నీ..16 జట్ల గ్రూప్ లీగ్ సమరం ముగింపుదశకు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరే జట్లేవో దాదాపుగా ఖరారయ్యింది. అమెరికాలోని మొత్తం పదినగరాలు వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ లో 16 జట్లు, నాలుగు గ్రూపుల రౌండ్ రాబిన్ లీగ్ సమరం ముగిసి...ఎనిమిదిజట్ల క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది. మాజీ చాంపియన్లు బ్రెజిల్, ఉరుగ్వేజట్ల పోటీ ..గ్రూప్ లీగ్ దశలోనే ముగియడం..సెంటినరీ కోపా అమెరికా కప్ పోటీల ప్రత్యేకతగా మిగిలిపోతుంది.

గ్రూప్ సీ నుండి...
ఉరుగ్వే, జమైకా, వెనిజ్వేలా, మెక్సికో జట్లతో కూడిన గ్రూప్- సీ లీగ్ నుంచి...మెక్సికో, వెనిజ్వేలా జట్లు క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించాయి. ఆఖరిరౌండ్ పోటీల్లో ఉరుగ్వే 3-0 గోల్స్ తో జమైకాను చిత్తు చేసినా ప్రయోజనం లేకపోయింది. మొత్తం మూడు రౌండ్లలో ఉరుగ్వే రెండు పరాజయాలు, ఓ విజయంతో గ్రూప్ లీగ్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు..జమైకా మూడుకు మూడురౌండ్లలోనూ ఓడి..గ్రూప్ -సీ లీగ్ ఆఖరిస్థానంలో నిలిచింది. గ్రూప్- సీ లీగ్ టాపర్ కోసం జరిగిన మరో ఆఖరిరౌండ్ పోటీలో మెక్సికో, వెనిజ్వేలా జట్లు అసాధారణ పోరాటమే చేసాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో వెనిజ్వేలా ముందుగా గోలు చేసినా..ఆ ఆధిక్యాన్ని మ్యాచ్ ముగిసేవరకూ కాపాడుకోలేకపోయింది. మెక్సికో ఆటగాళ్లు తుదివరకూ పోరాడి..కళ్లు చెదిరే గోల్ తో మ్యాచ్ ను 1-1తో డ్రాగాముగించగలిగారు. దీంతో ..రెండుజట్లూ చెరో ఏడు పాయింట్లు చొప్పున సాధించి సమఉజ్జీలుగా నిలిచినా..గోల్స్ సగటున మెక్సికో గ్రూప్ టాపర్ గా..క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

గ్రూప్- D విజేత అర్జెంటీనాతో గ్రూప్-C రన్నరప్ వెనిజ్వేలా తలపడుతుంది.
గ్రూప్- C టాపర్ మెక్సికోతో ..గ్రూప్- D రన్నరప్ చిలీతో ఢీ కొంటుంది.
ఇతర క్వార్టర్ ఫైనల్స్ పోటీల్లో...గ్రూప్-A విజేత అమెరికాతో గ్రూప్- B రన్నరప్ ఈక్వెడార్ తలపడుతుంది.
మరో క్వార్టర్ ఫైనల్లో ..గ్రూప్- B విన్నర్ పెరూతో ..గ్రూప్-A రన్నరప్ కొలంబియా తలపడాల్సి ఉంది.

17:39 - June 14, 2016

2016 యూరోపియన్ సాకర్ గ్రూప్ E లీగ్ ప్రారంభ పోటీలో మాజీ చాంపియన్ ఇటలీ అదిరిపోయే విజయం సాధించింది. టౌలోస్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ పోటీలో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న బెల్జియంను ఇటలీ 2-0 గోల్స్ తో చిత్తు చేసింది. ఆట 32వ నిముషంలో ఇమాన్యుల్ గియాచెనిని..ఇటలీకి తొలిగోల్ అందించాడు. ఆట రెండో భాగంలో గ్రాజియానో పెల్లీ ..ఓ కళ్లు చెదిరే గోల్ తో ఇటలీకి 2-0 విజయం అందించాడు. ఏదశలోనూ ఇటలీకి బెల్జియం సమ ఉజ్జీకాలేకపోయింది. ఇదే గ్రూపులో జరిగిన మరో తొలిరౌండ్ పోటీని స్వీడన్, ఐర్లాండ్ చెరో గోల్ తో డ్రాగా ముగించాయి.

17:25 - June 14, 2016

హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తో బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ స్టెప్పులు వేశారు. వీరిద్దరూ 'కుంగ్ ఫూ యోగా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇండియా - చైనాలకు సంబంధించిన అంశాలతో రూపొందించారు. ఈ చిత్రంతో వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇటీవలే చైనాలో జరిగిన షాంఘై ఫెస్టివల్ కు సోనూసూద్ హాజరయ్యారు. దలేర్ మెహందీ పాడదిన పంజాబీ పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఈ వీడియోను సోనూసూద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బ్రదర్ తో అనుకోకుండా డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అన్న క్యాంటీన్లపై సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి, తదితర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్లతో సీఎం బాబు వీడియో కాన్ఫరెన్స్..

విజయవాడ : కలెక్టర్లతో సీఎం చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల బదిలీలపై చర్చించారు. బదిలీలలో మార్గదర్శకాలు పాటించాలని, బదిలీలపై అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.

మోడీతో జయ భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత భేటీ అయ్యారు. తమిళనాడు అభివృద్ధి, పార్లమెంట్ లో సహకారంపై చర్చ జరుగుతోంది.

కాంట్రాక్టు జూ.లైన్ మెన్లను క్రమబద్ధీకరిస్తాం - మంత్రి జగదీష్..

హైదరాబాద్ : త్వరలో కాంట్రాక్టు జూనియర్ లైన్‌మెన్లను క్రమబద్దీకరిస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో విద్యుత్ ఉద్యోగి చనిపోతే పరిహారం రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. ఒకవేళ గాయపడితే క్షతగాత్రునికి పూర్తిగా ప్రభుత్వమే వైద్యసాయం అందిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో అదనపు పోస్టుల భర్తీకి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రంజాన్ సందర్భంగా టి.సర్కార్ ఇఫ్తార్ విందు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రంజాన్ పండుగపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈనెల 26న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఈ ప్రధాన కార్యక్రమంలో పాల్గొనున్నారు.
26నే రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందులు జరగనున్నాయి.
ఈనెల 17 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని వంద ప్రాంతాల్లో, జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బట్టల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
మదర్సాలు, అనాథశరణాలయాల్లో కూడా బట్టల పంపిణీ ఉండనుంది.

బాబు సీఎం అయ్యాక ఉద్యోగులను తొలగిస్తున్నారు - జగన్..

విజయవాడ : బాబు సీఎం అయ్యాక ఉద్యోగులను తొలగిస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా స్పందిస్తున్నామని వైసీపీ నేత జగన్ పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోస పూరిత హామీలతో బాబు అధికారంలోకి వచ్చారని, మోసం చేసే వారికి జనం చెప్పుర్లు..చీపుర్లు చూపించాలంటూ మరోసారి విమర్శలు గుప్పించారు.

16:12 - June 14, 2016

హైదరాబాద్ : కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో వసతుల దుస్థితిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో వసతుల పరిశీలన కోసం జయంతి,పద్మజ అనే మహిళా న్యాయవాదులతో న్యాయస్థానం ఓ కమిటీని వేసింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మెటర్నిటీ ఆసుపత్రిలో వున్న సదుపాయాలూ...సిబ్బంది పనితీరు...కల్పించాల్సిన వసతులు...ఇలా అన్ని విషయాలపై సమగ్రంగా నివేదిక అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా పలు పత్రికలలో వచ్చిన కథనాలపై న్యాయస్థానం కేసును సుమోటోగా తీసుకోవటం గమనించాల్సిన విషయం.

తుని అరెస్టులపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : తుని ఘటన నిందితుల అరెస్టుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 41 సీఆర్ సీపీ ప్రకారం నోటీసులు ఇచ్చిన తరువాతే అరెస్టు చేయాలని అఖిల భారత కాపు జాగృతి పిటిషన్ దాఖలు చేసింది.

కోఠి మెటర్నటీ ఆసుపత్రి వసతులపై హైకోర్టు ఆరా...

హైదరాబాద్ : కోఠి మెటర్నటీ ఆసుపత్రి వసతులపై హైకోర్టు ఆరా తీసింది. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. ఆసుపత్రిలో వసతుల పరిశీలనకు జయంతి, పద్మజ న్యాయవాదుల ఆధ్వర్యంలో కమిటీ నియమించింది. రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని కోర్టు ఆదేశించింది.

 

నెల్లూరు జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనాలు..

నెల్లూరు : జిల్లాలో మళ్లీ స్వల్ప భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. వింజమూరు, వరికుంటపాడు, దుప్పలూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.

కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారని, రూ. 800 కోట్ల విలువైన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కోసమే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారని తెలిపారు. పార్టీ వీడుతున్న నేతల ఆరోపణల్లో నిజం లేదని, పార్టీలో ఇంకా కొందరు కేసీఆర్ కు కోవర్టుగా ఉండి వందల కోట్ల కాంట్రాక్టులు సంపాదించారని వ్యాఖ్యలు చేశారు.

ముద్రగడను హైదరాబాద్ కు తరలించాలని పిటిషన్..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడను హైదరాబాద్ కు తరలించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజమండ్రిలో ముద్రగడకు ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

15:53 - June 14, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి గుత్తా బయటకు వెళ్లినందుకు పెద్ద శని పోయిందని కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాజీనామా చేసి గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అంతేకాదు వారు గెలిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనని రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరో సవాల్‌ విసిరారు. 

15:50 - June 14, 2016

ఆహారంలో కొంతమంది పెరుగు వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. కానీ ఆహారంలో పెరుగును వాడాలని పలువురు సూచిస్తున్నారు.

 • విటమిన్ బి 12 శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడమే కాకుండా నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రో బయోటిక్స్ శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి.
 • ఇందులో లభించే కాల్షియం కారణంగా ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహద పడుతుంది.
 • విటమిన్ బి12, రైబో ఫ్లేవిన్, ఫాస్పరస్ వంటివి ఎక్కువగా ఉండడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి.
 • రోజూ పెరుగు తినేవారిలో ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువే.
 • పెరుగులోని ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్థాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి.
 • అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు..
 • చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
 • ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.
 • పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
 • ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
 • పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
 • చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
 • పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది.
15:49 - June 14, 2016

హైదరాబాద్ : మంత్రి జగదీష్‌రెడ్డితో విద్యుత్‌ కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. దశలవారిగా సమస్యల పరిష్కారానికి జగదీష్‌రెడ్డి హామీ ఇవ్వడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించారు. దాదాపు నాలుగు గంటలపాటు మంత్రి జగదీష్ రెడ్డితో విద్యుత్ కార్మిక జేఏసీ నాయకులు మంత్రి జగదీష్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. విద్యుత్ కార్మికులు 34 డిమాండ్లను దశలవారీగా పరిష్కరిస్తామన్న మంత్రి జగదీష్ రెడ్డి హామీతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇకనుండి ఏ కాంట్రాక్టర్ తోనూ సంబంధం లేకుండా నేరుగా డిపార్ట్ మెంటే వేతలనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద పరిహారం 10 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. విద్యుత్‌ కార్మికులు ప్రమాదానికి గురైతే పూర్తి వైద్యం అందిస్తామని.. కాంట్రాక్ట్‌ ఏజెన్సీల నుంచి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి జగదీష్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

15:48 - June 14, 2016

జామపండు..మార్కెట్లో లభించే పండ్లలో అత్యంత పోషక విలువు కలిగినది. దీనిని తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు కూడ పెరుగుతుంది.
జామపండు గుజ్జును ముఖానికి రాసుకుని మృదువుగా మర్ధన చేసుకుని ఇరవై నిమిషాల అనంతరం కడిగేయాలి.
జామలో పీచు పదార్థాలు ఉండడం వల్ల జీర్ణక్రియ వృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇందులో గ్లూకోజ్ స్థాయి చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది.
జామలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహంతో బాధ పడుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.

15:47 - June 14, 2016

బాహుబలి..తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటింది. మళ్లీ బాహుబలి -2 రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మే నెల విరామం తరువాత మళ్లీ సోమవారం నుండి షూటింగ్ ప్రారంభమైంది. రామోజీ ఫిల్మి సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు. ఏకంగా పది వారాల పాటు ఈ షూటింగ్ కొనసాగనుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో క్లైమాక్స్ కు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మొదటి బాహుబలి క్లైమాక్స్ చిత్రీకరణ కోసం రూ. 10 కోట్లు ఖర్చు పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బాహుబలి -2 క్లైమాక్స్ చిత్రీకరణ కోసం ఏకంగా రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌కు బాలీవుడ్‌ నుంచి ప్రముఖులు వచ్చారు. గతంలో లింగా, బాహుబలి ది బిగినింగ్‌ సినిమాలకు యాక్షన్‌ డైరెక్షన్‌ చేసిన లీ వీట్టేకర్‌, బ్రాడ్‌ అలన్‌, అతడి బృందం మొత్తం రామోజీ ఫిలిం సిటీకి వచ్చింది. ఇంతకుముందు సల్మాన్‌ నటించిన 'సుల్తాన్‌' తో పాటు 'ద హంగర్‌ గేమ్స్‌' సిరీస్‌కు పని చేసిన లార్నెల్‌ స్టోవాల్‌, 'ద హాబిట్‌' సినిమాకు చేసిన వాన్‌ టాండర్‌ లాంటి వాళ్లు కూడా వచ్చారు. మరి ఈ బాహుబలి కైమాక్స్ ఎలా ఉండనుందో ఎలాంటి రికార్డులు సృష్టించనుందో వేచి చూడాలి.

15:41 - June 14, 2016

విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగిసాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి స్కూల్స్ పున : ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 'విద్యార్ధులు - 'టార్గెట్ చదువులు' ఎంతవరకూ అవసరం అనే అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో డా.ప్రసాద్ (జన విజ్ఞాన వేదిక), ఉమా శంకర్ (సమజ్ఞ మాంటిస్సోరీ స్కూల్ )పాల్గొన్నారు. ఈచర్చలో పాల్గొన్న నిపుణులు పిల్లల చదువుల పట్ల సూచనలు చేశారు. చదువులు మానసిక వికాశం పెంపొందేలా చదువులు వుండాలని నిపుణులు పేర్కొన్నారు. చదువు డబ్బు సంపాదించటానికి మార్గాలని తల్లిదండ్రులు ఆలోచించటం మంచిదికాదని వారు సూచించారు.. మార్కులే పిల్లల చదువులకు కొలమానం కాదనే విషయం పేరెంట్స్ గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని పిల్లలకు బాల్యం నుండే అలవాటు చేయాలని తెలిపారు. ఈ అంశంపై నిపుణులు ఇచ్చిన సూచనలు మరిన్ని తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...

15:40 - June 14, 2016

విజయవాడ : ఏపీ రాజధాని భూములు సింగపూర్ కంపెనీకి కట్టబెట్టేందుకు సర్కారు యోచిస్తోంది. అభివృద్ధి పేరుతో విదేశీ కంపెనీలకు తాకట్టు ప్రయత్నం చేస్తోంది. రాజధాని మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్, సెమ్బ్‌కార్ఫ్, సెంబ్రిడ్జి కన్సాల్టియంలను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పలుమార్లు సింగపూర్‌ వెళ్లి ఆ కంపెనీ ప్రతినిధులతోను సంప్రదింపులు జరిపారు.

కన్సాల్టియంకు 99 ఏళ్ల పాటు భూమి లీజు...
సింగపూర్ ప్రైవేట్ కంపెనీ కన్సాల్టియంకు 99 ఏళ్లపాటు సర్వహక్కులతో భూమిని లీజుకు కట్టబెట్టేందుకు మౌలికసదుపాయాల చట్టాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రాజధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ ప్రైవేట్‌ కంపెనీల కన్సాల్టియంకు 58శాతం వాటా, సర్కారుకు 42శాతం వాటాతో సరిపుచ్చుకోవాలని నిర్ణయించింది. అయితే ఇందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం అంగీకరించదు. దీంతో చట్టసవరణకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంకా ఏఏ సవరణలు తీసుకురావాలో అనే అంశాలపై న్యాయవాదులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

తొలిదశలో సింగపూర్ కంపెనీకి 1700 ఎకరాలు..
సింగపూర్ ప్రవేట్‌ కంపెనీల కన్సాల్టియంకు మొదట 17 వందల ఎకరాలను ఇవ్వనున్నారు. అందులో వాణిజ్య నిర్మాణాలను చేపట్టడంతోపాటు ఇతర మౌలికసదుపాయాలు సమకూర్చేందుకు అవసరమైన పెట్టుబడులను సింగపూర్ కంపెనీలు తీసుకొస్తాయి. ఆ నిర్మాణాలను విక్రయించగా, వచ్చిన డబ్బుల ద్వారా పెట్టుబడిని రాబట్టుకోనున్నాయి. మౌలికసదుపాయాల కల్పనకు వెచ్చించిన నిధులను టోల్‌, యూజర్‌ చార్జీలు ఇతర ఫీజుల ద్వారా వసూలుకు ప్రయత్నిస్తాయి. రెండోదశ మరో 13 వందల ఎకరాలను ఇదే విధంగా సింగపూర్‌కు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రాష్ట్ర సర్కారు రాజధానిని వ్యాపారంగా మారుస్తోంది-సీపీఎం
రాష్ట్ర ప్రభుత్వం భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించడం ద్వారా అభివృద్ధి పేరున నష్టం వాటిల్లనుందని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో రాష్ట్ర సర్కారు రాజధానిని వ్యాపారంగా మారుస్తోందంటూ సీపీఎం ఆరోపిస్తోంది.

కోట్లు దండుకోవటానికే సర్కార్ యోచన..
లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని వైసీపీనేత గౌతంరెడ్డి విమర్శించారు. ప్రజలను మోసం చెయ్యడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి, అవసరమైన భూములను మాత్రమే విదేశీ కంపెనీలకు అప్పగించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

15:33 - June 14, 2016

హైదరాబాద్ : సమాజానికి రక్షణ గా వుండాల్సిన రక్షక భటులు దారితప్పి ప్రజలను వేధిస్తుంటే ఇక ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలను రక్షించటానికి పోలీసు వ్యవస్థ ఏర్పాటయ్యింది. మరి ప్రజలను రక్షించాల్సి స్థాయిలో వున్న ఓ పోలీసు అధికారి ఓ మహిళపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపదలో వుండి ఫిర్యాదు చేయటానికి వచ్చిన లలిత అనే మహిళను సీఐ శ్రీనివాస్ బెదిరించి భయభ్రాంతులకు గురించేశాడు. ఈ ఘటన చిలకగూడ పీఎస్ లో చోటు చేసుకుంది. కొంతమంది ఫైనాన్షియర్లు తనను వేధిస్తున్నారని లలిత అనే మహిళ చిలకలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేయటానికి వచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న సీఐ శ్రీనివాస్ బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిన లలిత హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేసింది. 

15:00 - June 14, 2016

ఢిల్లీ : ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆప్‌ ప్రతిపాదించిన లాభాపేక్ష లేని పార్లమెంట్‌ కార్యదర్శి పదవులకు సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలపలేదు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడం వల్ల 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. 21 సీట్లకు తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. 2015లో 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు కట్టబెట్టింది. వారికి లాభం చేకూర్చేందుకే ఈ పదవిని కట్టబెట్టారని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కంగుతిన్న కేజ్రీవాల్‌ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుక ఈ పదవికి లాభాపేక్ష లేకుండా బిల్లు తెచ్చారు. తమ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా ప్రధాని మోది అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఈ పదవులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కేవలం ఢిల్లీ ప్రభుత్వాన్నే మోది టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

విద్యుత్ కార్మికుల చర్చలు సఫలం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డితో తెలంగాణ తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమిస్తున్నట్లు విద్యుత్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు. 34 డిమాండ్లతో గత నెల 19న యాజమాన్యాలకు విద్యుత్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసునిచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రి జగదీశ్వర్ తో నేతలు చర్చలు జరిపారు. ప్రమాద పరిహారం రూ. 10 లక్షలకు పెంచేందుకు అంగీకారం కుదిరింది. విద్యుత్ కార్మికుల ప్రమాదానికి గురైతే పూర్తిగా వైద్యం అందించనున్నారు.

14:57 - June 14, 2016

హైదరాబాద్‌ : పోలియో వైరస్‌ ఆనవాళ్లు బయటపడటంతో.. హైదరాబాద్‌లో అధికారులు అలర్ట్‌ అయ్యారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పోలియో చుక్కలు వేయడానికి వైద్య ఆరోగ్యశాఖ రెడీ అయ్యింది. ఈనెల 20 నుంచి 26వరకు ఐదేళ్లలోపు చిన్నారులకు వాక్సిన్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5ఏళ్లలోపు చిన్నారుల సంఖ్యపై సర్వేచేయాలని కూడా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 

చిలకలగూడ సీఐపై హెచ్చార్సీలో ఫిర్యాదు..

హైదరాబాద్ : చిలకలగూడ సీఐ శ్రీనివాస్ పై హెచ్చాఆర్సీలో లలిత అనే మహిళ ఫిర్యాదు చేసింది. సీఐ శ్రీనివాస్ నుండి ప్రాణహాని ఉందని ఫైనాన్షియర్లు వేధిస్తున్నారని పీఎస్ లో ఫిర్యాదు చేస్తే సీఐ బెదిరిస్తున్నారని బాధితురాలు లలిత ఆరోపణలు చేసింది.

 

తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళన

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కోర్టులను బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. ఆప్షన్ విధానాన్ని రద్దు చేయాలని హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

రేపు టీఎన్జీఓలు నిరసన

హైదరాబాద్ ఏపీ స్థానికత ఉన్న 83 మంది ఎస్ వోలు, 15 మంది ఏఎఫ్వఓలను తెలంగాణకు కేటాయించడం పై ఏపీ నుంచి ఎస్ వోలు, ఏఎస్ వోలు వచ్చే వరకు ప్రమోషన్ల నిలిపివేతపై మండిపడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవోలు సమావేశం అయ్యి రేపు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్...

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో నలుగురు నకిలీ పోలీసుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మీర్‌పేట్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో నకిలీ పోలీసు ముఠా సభ్యులు సంచరిస్తున్నారు. పోలీసులమని చెప్పి బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు వాళ్లు దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 తులాల బంగారం, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు సస్పెండెడ్ హోంగార్డు కూడా ఉన్నారు.

 

13:50 - June 14, 2016

హైదరాబాద్ : తమకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 27 నుంచి కేవలం మున్సిపల్ శాఖ మాత్రమే వెలగపూడి నుంచి పరిపాలన సాగిస్తుందని ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పారు. మిగిలిన శాఖలు జూలై ఆఖరికి లేదా ఆగస్టు 15 కల్లా అమరావతికి వెళ్లనున్నాయన్నారు. ఉద్యోగుల తరలింపుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. 

'20 నుండి 26 వరకు పోలియో, టీకాల కార్యక్రమం'

హైదరాబాద్ : నగరంలో పోలియో కేసు పై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సమీక్ష నిర్వహించారు. 20 నుండి 26 వరకు పోలియో, టీకాల ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల లోపు చిన్నారులు ఎంత మంది ఉన్నారో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని 12 పీహెచ్ సిలలో ప్రబుత్వం పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

13:48 - June 14, 2016

టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆ అందాల చందమామ ప్రేమలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ! ముంబై కి చెందిన ఓ వ్యాపార వేత్త తో నిండా ప్రేమలో మునిగిందట !ఇక్కడైతే తమ ప్రేమాయణం తెలిసిపోతుందని విదేశాలు చెక్కేస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తుందట. ఇంతకీ ఎవరా చందమామ? కాజల్ మూడేళ్ల నుంచి సింగిల్ గా ఉంటున్నానని చెప్పింది. మళ్లీ నచ్చిన వ్యక్తి దొరికితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోతానని చెప్పింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తతో వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉందని బాలీవుడ్ చెబుతుండగా, వేరే రంగానికి చెందిన వ్యక్తి అయితే అనుబంధం పెరుగుతుందని చెప్పింది. రియల్ లైఫ్‌ తానంత రొమాంటిక్ కాదని కాజల్ చెప్పింది. నిద్రలేచిన దగ్గర్నుంచి అతనికి ఐ లవ్ యూ చెప్పడం తనవల్ల కాదని తెలిపింది. తనకు నచ్చిననట్టు ఉంటానని చెప్పింది. మంచి అవగాహన ఉంటే చాలని తెలిపింది. మూడేళ్ల క్రితం ఎవరితో ప్రేమాయణం నడిపిందో మాత్రం చెప్పలేదు. ఈ ముద్దుగుమ్మ ఎవరిని పెళ్లి చేసుకోనుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ..

13:47 - June 14, 2016

విజయవాడ : చంద్రబాబు పాలన వద్దని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఐదేళ్ల క్రితం తాను, తన అమ్మ విజయమ్మ మాత్రమే వైసీపీలో ఉన్నామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనే 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో అతి పెద్ద పార్టీగా ఆవతరించామని చెప్పారు. 

 

13:47 - June 14, 2016

రీసెంట్‌గా మిల్కీబ్యూటీ తమన్నాపై పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. తమ్మూ పెళ్లికి రెడీ అయిందనే గాసిప్స్ ఊపందుకున్నాయి. గత రెండేళ్లుగా.. ముంబాయికు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్‌తో తమన్నా డేటింగ్ చేస్తోందట. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న అతన్ని వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనుందని టాక్. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి పెళ్లి అనంతరం తమన్నా సినిమాలకు దూరం కానుందనే న్యూస్ ప్రస్తుతం ఫిలింవర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అయితే పెళ్ళయ్యాక సినిమాలు మానేసి.. తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ కంపెనీ వైట్ అండ్ గోల్డ్ బిజినెస్ చూసుకుంటుందని వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సీక్వెల్‌లో నటిస్తున్న తమ్మూ...బాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. రోహిత్ శెట్టి సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటిస్తుంది.

 

13:46 - June 14, 2016

నెల్లూరు : జిల్లాలో డెంగ్యూ ఫీవర్‌ ఓ బాలుడి ప్రాణాల్ని బలితీసుకుంది. గత ఐదు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఐదేళ్ల రమేష్ అనే బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం ఏకొల్లు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కొద్ది రోజుల నుంచి బాలుడు రమేష్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు తిరుపతి, నెల్లూరులోని ఆసుపత్రుల్లో చూపించారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి డెంగ్యూ ఫీవర్ ఉందని నిర్థారించి చికిత్స ప్రారంభించారు. అయినా జ్వరం తీవ్రం కావడంతో చివరకు మృతిచెందాడు. 

 

13:46 - June 14, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. ముద్రగడ ఆరోగ్యం పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. కేవలం బీపీ మాత్రమే చెక్‌ చేసేందుకు ముద్రగడ అనుమతి ఇస్తున్నారన్నారు. మరో గంటలో రక్త నమూనాలు ఇస్తానని ముద్రగడ చెప్పారని వైద్యులు తెలిపారు. 

 

13:46 - June 14, 2016

ఓ ఆరేడు నెలల క్రితం వరకు వరుణ్ మణియన్ ఎవరో తమిళ పరిశ్రమవారికి బాగా తెలుసు. కానీ, త్రిష పుణ్యమా అని ఇరుగు, పొరుగు రాష్ర్టాల వాళ్లకి కూడా వరుణ్ మణియన్ ఎవరో తెలిసిపోయింది. ఇతగాడు పెద్ద వ్యాపారవేత్త అనీ, తమిళ చిత్రాలు నిర్మిస్తాడనీ అందరికీ తెలిసింది. అది మాత్రమే కాదు.. త్రిష అతనితో ప్రేమలో పడిన విషయం, ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. నిశ్చితార్థం జరిగి మూడు నెలలు పైనే అయినా ఇంకా మూడుముళ్ల బంధానికి సంబంధించిన తేదీని ప్రకటించలేదు. ఈలోపు వరుణ్, త్రిషల మధ్య మనస్పర్థలు వచ్చాయనే ఊహాగానాలు నెలకొన్నాయి. అవి ఊహాగానాలు కాదు.. నిజమేననిపిస్తోందని కొంతమంది బలంగా చెబుతున్నారు. దానికి కారణం, వరుణ్ మణియన్ తన ట్విట్టర్లో పేరు చెప్పకుండా ఎవరినో 'స్లట్' అన్నాడు. అతనా ట్వీట్ పోస్ట్ చేసిన కొంతసేపటికి త్రిష అతన్ని ట్విట్టర్లో అన్ ఫాలో అయ్యింది. వరుణ్ స్లట్ అని పెట్టిన ట్వీట్ ని డిలిట్ చేసేశాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఈ ఇద్దరికీ మధ్య మనస్పర్థలు నెలకొన్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఇక వరుణ్‌తో బ్రేకప్ తర్వాత లైఫ్ ప్లానింగ్ ఎలా వుంది ? మళ్లీ ప్రేమలో పడే ఆలోచన ఏమైనా వుందా అని అడిగితే, కచ్చితంగా మరో వ్యక్తితో ప్రేమలో పడటానికి సిద్ధంగా వున్నాను అని బదులిచ్చిందంట. అయితే ఆ ప్రేమ సొసైటీ కోసమో లేక జీవితంలో ఏదో ఓ రోజు పెళ్లి చేసుకోవాలి కనుక ప్రేమిద్దాం అన్నట్లుగా కాకుండా తనకి నచ్చిన మనిషి కనిపిస్తే కచ్చితంగా ప్రేమలో పడతానని స్పష్టం చేసిందంట.

'హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృధ్ధి చేస్తాం'

హైదరాబాద్ : వరంగల్ లో డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ పట్టణాభివృధ్ధికి బడ్జెట్ లో రూ.300 కోట్లు, హైదరాబాద్ తరహాలో వరంగల్ ను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు.

13:44 - June 14, 2016

ఎయిడ్స్ ఉందని నిర్భయంగా చెప్పారా ? అందులో యాంకర్ ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఇది నిజం కాదని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజం. అసలు ఎవరా ఈ యాంకర్ ? ఏ ఛానల్ అని ఏవోవో ప్రశ్నలు వేసుకోకండి. అసలు వివరాల్లోకి వెళితే...ఎయిడ్స్ డే సందర్భంగా టీవీ లైవ్ షో లో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో తనకు ఎయిడ్స్ ఉందని యాంకర్ ప్రకటించాడు. తనకు ఎయిడ్స్ ఉందని 2003లోనే వైద్యులు నిర్ధారించారని, అయినా వైద్యుల పర్యవేక్షణలో తాను సేఫ్ గా..ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఈ యాంకర్ భారతదేశానికి సంబంధించిన కారు. రష్యాకు చెందిన యాంకర్. లోవ్ కోట్ అనే రష్యన్ న్యూస్ యాంకర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అదండి సంగతి.

రాహుల్ గాంధీతో ముగిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

ఢిల్లీ : రాహుల్ గాంధీతో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితులు, పార్టీ ఫిరాయింపులపై రాహుల్ కు ఉత్తమ్ వివరించినట్లు సమాచారం. తెలంగాణ లో పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని టీ.పీసీసీ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

స్వార్థ రాజకీయాల కోసమే పార్టీ ఫిరాయింపులు: జానా

హైదరాబాద్ : సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ ప్రభుత్వం కాంగ్రెస్ పై కృతజ్ఞత చూపడం లేదన్నారు. ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులను తీవ్రంగా ఖండిస్తునట్లు తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసమే పార్టీ ఫిరాయిస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపులకు నిరసనగా పార్టీ పదవులను త్యాగం చేస్తానని.. అయితే సోనియా గాంధీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. గుత్తా, భాస్కరరావు పోవడంతో పార్టీకి శనిపోయిందన్నారు.

13:36 - June 14, 2016

గుంటూరు : జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది.  ట్యాంకర్‌లోని ఆయిల్‌ పమాయిల్ కావడంతో స్థానికులు బక్కెట్లు, బిందెలతో ఆయిల్‌ను తీసుకువెళ్తున్నారు. సుమారు పది బిందెల వరకు ఆయిల్‌ను ఇళ్లకు తరలిస్తున్నారు. 

 

సిరిసిల్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

కరీంనగర్ : సిరిసిల్ల అభివృద్ధిపై కౌన్సిలర్లలతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్యతో పాటు పారిశుధ్య నిర్వాహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీర్చాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

పోలియో కేసుపై ప్రభుత్వం అప్రమత్తం..

హైదరాబాద్ : వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి తివారీ సమీక్ష జరిపిన సమావేశం ముగిసింది. నగరంలోని పోలీయో కేసుపై ప్రభుత్వం అప్రమత్తమైంది. 20 నుండి 26 వరకు పోలియో, టీకాల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు ఎంత మంది ఉన్నారో సర్వే చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని 12 పీహెచ్ సీలలో పోలీయో చుక్కలు కార్యక్రమం చేపట్టనుంది.

 

13:28 - June 14, 2016

ఢిల్లీ : తమిళనాడు సీఎం జయలలిత ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్రమెడీతో సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలో గంటపాటు సమావేశం సాగనుంది. తమిళనాడు అభివృద్ధికి సహకరించాలని మోడీకి జయలలిత వినతిపత్రం ఇవ్వనుంది. కావేరీ జలాలు, ముల్లైపెరియార్, తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దాళాల దాడులు, కచ్చదీవుల సమస్యలను ప్రధానికి వివరించనున్నారు. 

13:15 - June 14, 2016

చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్ లో ఘోరం జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రైల్వే క్యాంటీన్ లో పని చేస్తున్న వ్యక్తులగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు అబ్దుల్లా, మేరీకూమార్ లుగా తెలుస్తోంది. మరో వ్యక్తి పేరు తెలియలేదు. రైల్వే స్టేషన్ లో భోజనం సరఫరా చేసే కూలీలుగా గుర్తించారు. వీరు ముగ్గురు రైల్వే క్యాంటీన్ లో డెయిలీవేజ్ లేబర్ గా పని చేస్తున్నారు. వీరిని ఎవరైనా హత్య చేసి పడేశారా.., ట్యాంకు పెద్దదిగా ఉన్నందున అందులో ఈతకు వెళ్లి.. మృతి చెందారా.. అని అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో మద్యం సీసాలు ఉన్నాయి.... దీంతో మద్యం సేవించి.. గొడపడి ఆ ఘర్షణలో మృతి చెందారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రెండేళ్ల కుమారుడిని విక్రయించిన తండ్రి..

కర్నూలు : నంద్యాల నూనెపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల కుమారుడిని రూ. 1.3 లక్షలకు తండ్రి విక్రయించాడు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

డెంగ్యూతో బాలుడి మృతి..

నెల్లూరు : జిల్లాలో డెంగ్యూ కలకలం సృష్టించింది. ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న రమేష్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. తిరుపతి, నెల్లూరు ఆసుపత్రిలో చూపించగా డెంగ్యూ అని వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

12:54 - June 14, 2016

'కులాలు, మతాలు, వికలాంగుల మీద జోకులు వేయకుండా బూతులు లేని హాస్యాన్ని ఇవ్వడానికి మొదట్నుంచి ప్రయత్నిస్తున్నాను. అందుకోసం చాలా కష్టపడాల్సి వస్తోందని'ని అంటున్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. నితిన్‌, సమంత, అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన 'అ..ఆ' చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఆదివారం గుంటూరులో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమా తీసేటప్పుడు మామూలు కథను బలంగా చెప్పాలి, ఎక్కువ మలుపులు ఉండకూడదు. రక్తపాతం లేకుండా మన కుటుంబ సభ్యుల మధ్య ఉండే చిన్న చిన్న విషయాలను ఎందుకు చెప్పకూడదనుకున్నాను. నేను దర్శకుడి కంటే ముందు రచయితను, అంతకంటే ముందు మధ్యతరగతి మనిషిని. వీటన్నికంటే మనిషే ముఖ్యం. అతని ఆలోచనలు గొప్ప వైతే మనిషి గొప్పగా ఎదుగుతాడు. తక్కువగా ఉంటే వెనకబడిపోతాం. ఇది కాకుండా మనం ఇంకా ఏదో ఆలోచిస్తున్నాం. మాట్లాడుకోవడం మానేశాం. ప్రపంచం బాగుండాలంటే ఇద్దరు మనుషులు మనసు విప్పి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇలాంటి విషయాల నేపథ్యంలో కులాలు, మతాల గురించి కాకుండా ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఇవ్వాలనుకున్నాను. బూతు మాట్లాడితే నవ్వుతారు, కానీ చిన్నచూపు చూస్తారు. అందుకే ఆలస్యమైనా మంచినే చెప్పాలనుకుని ఈ చిత్రాన్ని రూపొందించా. బిరియాని, మసాలాలు తిన్న మనకు ఎప్పుడైనా ఫుడ్‌ పాయిజన్‌ అయితే డాక్టరు చారన్నం తినమంటాడు. నా దృష్టిలో ఈచిత్రం చారన్నంలాంటిది. ఏ తప్పు చేయకుండా బతకడం తేలిక కాదు, మామూలుగా బతికిన వాళ్ళే మహానుభావులవుతారు' అని అన్నారు. 'సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్టుకు సమానమైన పేరు వచ్చింది. దానికి కారణం డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఆయనే అసలైన హీరో. మిక్కీ.జె.మేయర్‌ సంగీతం, నటరాజ్‌ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. నేను ప్లాప్స్‌లో ఉన్నప్పుడు అన్నయ్య పవన్‌ కళ్యాణ్‌ 'ఇష్క్‌' ఆడియోకి వచ్చారు, అది హిట్‌ అయ్యింది. ఈ సినిమా ఆడియో వేడుకకీ వచ్చారు, ఇది కూడా పెద్ద విజయం సాధించింది' అని నితిన్‌ తెలిపారు.
కొన్ని సినిమాల విషయంలో మ్యాజిక్‌ : దిల్ రాజ్  
దిల్‌ రాజు మాట్లాడుతూ, 'మా డిస్ట్రిబ్యూటర్స్‌కి కొన్ని సినిమాల విషయంలో మ్యాజిక్‌ జరుగుతుంటుంది. ఈ చిత్రానికి ఆ మ్యాజిక్‌ జరిగింది. చినబాబుతో ఉన్న పరిచయంతో ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కొన్నాను. రెండు మూడేండ్ల వరకు హీరోలందరూ 50కోట్ల క్లబ్‌లోకి వెళ్ళాలని తెలుగు సినిమా ఇండిస్టీకి ఓ టార్గెట్‌ ఉంది. ఇప్పుడు అందరూ వందకోట్ల క్లబ్‌లోకి వెళ్ళాలనే టార్గెట్‌తో ఉంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని చెప్పారు. 'ఇలాంటి మంచి సినిమాలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు, సహనటీనటులకు కృతజ్ఞతలు' అని కథానాయికల్లో ఒకరైన అనుపమా పరమేశ్వరన్‌ తెలిపారు. 'అ..ఆ. త్రివిక్రమ్‌గారి మరో మ్యాజికల్‌ హిట్‌. నితిన్‌, సమంత్‌కు ఈ సినిమా గ్రేట్‌ ఫిల్మ్‌ అయ్యింది' అని నదియా చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, అజరు, హరితేజ్‌, పమ్మి సాయి, మధు నందన్‌, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీ పేరిట మోసం - ధర్మాన..

విజయవాడ : రుణమాఫీ పేరిట మోసం చేశారని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని, ఏపీలో సామాన్యుడు చదువుకొనే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఏపీలో 80 శాతం వైద్యం ప్రైవేటు పరం అయ్యిందన్నారు. అన్ని వర్గాలకు పథకాలకు అందించిన ఘనత వైఎస్ దని, చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అభివృద్ధి నిరోధకులని ముద్ర వేస్తున్నారని ధర్మాన వ్యాఖ్యానించారు.

వాడి వేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్..

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీలోల కౌన్సిల్ లో వాడి వేడి చర్చ జరుగుతోంది. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ఇళ్లు ఎలా నిర్మిస్తారని మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

12:49 - June 14, 2016

టి.కె.రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో 'శభాష్‌ నాయుడు' చిత్రంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర దర్శకుడు రాజీవ్‌ కుమార్‌ లైమె అనే వ్యాధితో బాధపడుతున్నారు. దర్శకత్వం వహించలేని స్థితిలో ఉండడంతో చివరికి ఆ బాధ్యతను కమల్‌ హాసనే తీసుకున్నారట. ఈ విషయాన్ని కమల్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. 'గత కొన్ని రోజులుగా చిత్ర షూటింగ్‌ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతోంది. మొదట రాజీవ్‌ అస్వస్థతకు గురి కావడంతో ఒక డాన్స్‌ పోర్షన్‌ వరకు నేను దర్శకత్వం వహించాను. రాజీవ్‌ త్వరగా కోలుకుంటాడని భావించాం. కానీ ఆయనకి అమెరికా, యూరప్‌లో వచ్చే అరుదైన లైమె వ్యాధి సోకింది. దీంతో తప్పని పరిస్థితిలో నేను ఈ చిత్రం మొత్తానికి దర్శకత్వం వహించాల్సి వస్తుంది. రాజీవ్‌ను బెస్ట్‌ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నాం. అయితే మధ్యలో దర్శకత్వం వహించడం నాకు కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే జరిగింది. నేను దర్శకత్వం వహించడానికి ప్రధాన కారణం అనుకున్న టైమ్‌కి సినిమాని కంప్లీట్‌ చేయాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాం. ఈ షెడ్యూల్‌ను జులై లోపు లేదా ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటిస్తున్నారు.

 

కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం - మంత్రి గంటా..

విశాఖపట్టణం : కాపుల సంక్షేమానికి తమ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తుని స‌భ‌లో విధ్వంసం సృష్టించిన వారిని విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేయ‌డం భావ్యం కాద‌న్నారు. నిందితుల‌ను పోలీసులు నాలుగు నెల‌లుగా క‌ష్ట‌ప‌డి గుర్తించార‌ని, నిందితుల‌ని పూర్తి ఆధారాల‌తో అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

12:44 - June 14, 2016

హైదరాబాద్ : వలసలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ చర్యలు హేయమైనవని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులు ఇది గమనించాలన్నారు. పార్టీ ఫిరాయింపులు చట్ట విరుద్ధమన్నారు. ఫిరాయింపులపై అనేక సార్లు హెచ్చరించాం.. అయినా ఆగడం లేదన్నారు. పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లడం దుర్మార్గమైన చర్య అన్నారు. పార్టీ ఫిరాయిపులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎంతమంది వెళ్లినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ముందుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము ఎంతో కృషి చేశామని చెప్పారు. రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు కంటతడి పెట్టే పరిస్థితులు వచ్చాయని వాపోయారు.  

 

పార్టీ ఫిరాయింపులు చట్ట విరుద్ధం - జానా..

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు చట్ట విరుద్ధమని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, వలసలను ప్రోత్సాహిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్యలు హేయమైందన్నారు. పార్టీని వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ప్రజాస్వామిక వాదులు ఇది గమనించాలని, తమ నిజాయితీని ఎవరూ శంకించాల్సినవసరం లేదన్నారు. తెలంగాణ సాధనకు తాము ఎంతో కృషి చేయడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ముందుంటామన్నారు.

12:13 - June 14, 2016

హైదరాబాద్ : లీలావతిది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆమె సోదరుడు ఆరోపించారు. లీలావతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. అత్తింటివారు నిత్యం వేధించేవారని లీలావతి తమకు ఫోన్లు చేసేదని పేర్కొన్నారు. కొత్తగా పెళ్లైంది కదా సర్దుకుపోతానని పదే పదే తమతో చెప్పేది. శశికిరణ్, అతని తల్లి అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవాళ్లని తెలిపారు. రోజూ ఆరాస్మెంట్ చేసేవాడని,  డబ్బులు తేవాలంటున్నారని చెప్పేదన్నారు. అన్నం కూడా పెట్టేవారు కాదని చెప్పేదని తెలిపారు. ఇది పక్కా మర్దర్ అని చెప్పాడు. తమ చెల్లిలి రెండు చేతులు కోసుకుపోయాని పేర్కొన్నారు. తమ చెల్లెలి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిశకిరణ్ ఎంఎస్ చేశాడు. అతను చదువుకున్న మూర్ఖుడని మండిపడ్డారు. 
పోలీసు అధికారి..
'13 వ తేదీ మధ్యాహ్నం మల్కాజ్ గిరిలో వివాహిత అనుమానాస్పందంగా మృతి చెందిందని మాకు సమాచారం అందింది. దీంతో విజయవాడలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి మాకు ఫిర్యాదు చేశారు. లీలావతిది ఆత్మహత్య కాదని.. హత్యని, చిత్ర హింసలు పెట్టి చంపేశారని ఆరోపిస్తూ... ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో శశికిరణ్, అతని తల్లిపై హత్య, వరకట్న వేధింపుల చట్టాల కింద కేసు నమోదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నాము. శశికిరణ్ ను విచారిస్తున్నామని' అని చెప్పారు. 
వివరాల్లోకి వెళితే....
హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో వివాహిత లీలావతి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాకు చెందిన లీలావతికి, శశికిరణ్ తో 8నెలల క్రితం వివాహమైంది. అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద మూడు ఎకరాలు,  15 లక్షల రూపాయలు, కట్న కానుకలు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయితే పెళ్లి జరిగి రెండు మూడు నెలలు గడవకముందే..అత్తింటి వారు కట్నం తెమ్మని లీలావతిని వేధించేవారు. వేధింపులకు సంబంధించిన విషయాలను లీలావతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఈనేపథ్యంలో మల్కాజ్ గిరిలోని తన నివాసంలో ఆమె అనుమానాస్పందగా మృతి చెందింది. ఆమె చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉంది. లీలావతి మృతిపై ఆమె బంధువులు భర్త శశికిరణ్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. అత్తింటి వారి వేధింపులే లీలావతి మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే కేసు దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

బాబు లేఖను బయటపెడుతాం - మంత్రి హరీష్..

వరంగల్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. నాగుల చెరువులో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ ప్రారంభించారు. సిద్ధేశ్వరం చెరువుకు రూ. 50 లక్షలు..భద్రకాళి చెరువు కట్ట మరమ్మత్తులకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. పాలమూరరు, కాళేశ్వరం ప్రాజెక్టులు అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు. తమ ప్రాజెక్టులకు చంద్రబాబు..జగన్ అనుమతి అవసరం లేదన్నారు. బాబు రాసిన లేఖను బయటపెడుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

రాహుల్ తో ఉత్తమ్ భేటీ..

ఢిల్లీ :ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై రాహుల్ కు ఉతమ్ వివరించారు.

బండ్లమిట్ట వద్ద దుకాణాల తొలగింపు..ఉద్రిక్తత..

ప్రకాశం : ఒంగోలులోని బండ్లమిట్ట వద్ద షాపులను అధికారులు తొలగిస్తున్నారు. షాపుల తొలగింపు విషయంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని దుకాణ యజమానులు ఆందోళన చేపట్టారు. యజమానులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వడం జరిగిందని, తొలగించిన షాపులకు మరోచోట స్థలాలిచ్చే విషయాన్ని పున:పరిశీలిస్తామని కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు.

ముద్రగడ ఆరోగ్యం క్షీణించింది - వైద్యులు..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు వెల్లడించారు. ఆయన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. బీపీ మాత్రమే చెక్ చేసేందుకు ముద్రగడ అనుమతించారని, మరో గంటలో రక్త నమూనాలు ఇస్తామని చెప్పారని వైద్యులు వెల్లడించారు.

11:42 - June 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో విద్యుత్ ఉద్యోగులు సమావేశం అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 34 డిమాండ్లతో విద్యుత్ కార్మిక సంఘాలు గత నెల 19న యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే రేపటి నుంచి సమ్మె చేయానలి ఉద్యోగులు నిర్ణయించారు. 

హాజరు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు..

విజయవాడ : జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అమర్ నాథ్, రోజా, విజయసాయిరెడ్డిలు హాజరు కాలేదు.

కొనసాగుతున్న ధర్మకర్తల మండలి సమావేశం..

చిత్తూరు : తిరుమలలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం కొనసాగుతోంది. 14 అంశాలపై ధర్మకర్తల మండలి చర్చిస్తోంది.

 

కొనసాగుతున్న వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం..

విజయవాడ : వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. జగన్ అధ్యక్షతన ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. ఐదేళ్ల కిందంట వైసీపీలో అమ్మ..తాను మాత్రమే ఉన్నామన్నారు. అంచెలంచెలుగా పార్టీ అభివృద్ధి చెందిందని, రాజన్న రాజ్యం కోసం నిరంతరం పోరాడుతున్నామన్నారు.

11:29 - June 14, 2016

ఏపీ ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీయైన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన 'సాక్షి'పత్రిక ను చంద్రబాబు సర్కార్ స్వాధీనం చేసుకోనుందా ? ఆయన సంబంధించిన ఆస్తులతో పాటు సాక్షి పత్రికను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రులు కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై టిడిపి పార్టీలో కీలక నేతగా ఉన్న సోమిరెడ్డి స్పందించారు. ఆయన టెన్ టివితో పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ , సీబీఐలు 'సాక్షి'ని మానిటరింగ్ చేస్తోందని, ఒక సంవత్సరం లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. జగన్ లాంటి కేసులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 11 కేసుల్లో ఒక కేసులో కూడా తీర్పునివ్వకపోవడం సరికాదన్నారు. రాజశేఖరరెడ్డి హాయంలో ఉండగా రెండు పత్రికలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. ప్రస్తుతం కొత్త రాజధాని కోసం భూ సమీకరణ చేస్తే లక్ష కోట్లు దోపిడి అంటున్నారని, ఇలా ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటవన్నీ చూస్తూ ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు. మీడియాను అడ్డం పెట్టుకుని రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలు మానుకోవాలని..వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో వీడియోలో చూడండి.

11:27 - June 14, 2016

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ముద్రగడ ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోమారు ఆయన దీక్షకు పూనుకున్నారు. ఈనేపథ్యంలో అధికారపక్షం పలు విమర్శలు చేస్తోంది. ఈనేపథ్యంలో టిడిపిలో కీలక నేతగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో టెన్ టివితో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన కాపుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యలను..పనులను వివరించారు. శాంతియుతంగా ఆందోళన చేయాలి కానీ..తుని లాంటి హింసాత్మక ఉద్యమాలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి రైట్..లెఫ్ట్ హ్యాండ్ లుగా ముద్రపడిన బోత్స..రఘువీరా..లతో ముద్రగడ చర్చలు జరపడం సరికాదన్నారు. ఇంత దిగజారుతారని అనుకోలేదన్నారు. కాపుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందన్నారు. ఇంకా కాపుల రిజర్వేషన్లు..ముద్రగడ అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో వీడియోలో చూడండి.

11:23 - June 14, 2016

రంగారెడ్డి : నయిమ్ అనుచరుడు, రౌడీ షీటర్ షకీల్ గుండెపోటుతో మృతి చెందాడు. నల్గొండ జిల్లా బహిష్కరణ ఆదేశాలతో షకీల్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. మేడ్చల్ లో షకీల్ గుండెపోటుతో మరణించాడు. షకీల్ 150 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.  

 

11:12 - June 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఇంజనీరింగ్‌ కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటా విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా కన్వీనర్ కోటా ప్రవేశాలు ప్రారంభం కాకముందే మేనేజ్‌మెంట్‌ సీట్లు అమ్మేందుకు సిద్ధమవుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే డొనేషన్లు అమాంతంగా పెంచేశాయి.
డొనేషన్లు పెంచేసిన కాలేజీలు
తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు గతేడాదితో పోల్చుకుంటే  ఈ ఏడాది డొనేషన్లు అమాంతంగా పెంచేశాయి. డొనేషన్ల పేరుతో 4లక్షల నుంచి 11లక్షల రూపాయల వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు భర్తీ అవుతుండగా, 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాలో భర్తీ అవుతున్నాయి. మిగిలిన 15శాతం మేనేజ్‌మెంట్‌ సీట్లతోపాటు ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సైతం అడ్డగోలుగా మారుస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నాయి.  కాలేజీల్లో  లోపాల కారణంగా గతేడాది పలుకాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించలేదు. ఈ ఏడాది ఎన్నికాలేజీలకు అనుమతి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఈ సందిగ్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకొని తమవే టాప్‌ కాలేజీలంటూ ప్రచారం చేసుకొని మేనేజ్‌మెంట్‌ సీట్లకు లక్షల బేరం కుదుర్చుకుంటున్నాయి.
అమలు కాని కామన్‌ ఫీజు విధానం
రాష్ట్రంలో అమల్లో ఉన్న కామన్‌ ఫీజు విధానం ప్రకారం అన్ని కేటగిరి సీట్ల ప్రవేశాలకు ఒకే విధానం అమలు చెయ్యాలి. ఒకటో రెండో కాలేజీలు తప్ప చాలా కాలేజీలు ఈ విధానాన్ని పట్టించుకోవడం లేనదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కామన్‌ ఫీజు విధానం పకడ్బందీగా అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తే తప్ప కాలేజీ యాజమాన్యాల దూకుడును అరికట్టడం అసాధ్యం.

 

11:02 - June 14, 2016

హైదరాబాద్ : మురిపించిన రుతుపవనాలు వెనక్కుతగ్గాయి. ఇప్పటికే తెలుగరాష్ట్రాల్లో విస్తరించాల్సి రుతుపవనాలు నాలుగు రోజులుగా ఎక్కడికక్కడే నిలిచిపోయి. దీంతో చినుకుల సందడి నిలిచిపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ మరోసారి ఉష్ణోగ్రతలు ప్రతాపం చూపిస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

 

భద్రతా బలగాల్లో ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : త్రాల్ సమీపంలోని గుల్షన్ పోరా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో హిజ్బూల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ హతమయ్యాడు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డితో విద్యుత్ ట్రేడ్ చర్చలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ నేతలు చర్చలు ప్రారంభించారు. 34 డిమాండ్లతో గత నెల 19న యాజమాన్యాలకు విద్యుత్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసునిచ్చాయి. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, వేతనాల చెల్లింపు..అదనపు పోస్టుల భర్తీ..జీపీఎఫ్ కు బదలాయింపు వంటి పలు సమస్యలను ముందుంచారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమవుతే రేపటి నుండి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు.

తిరుపతిలో రైల్వే స్టేషన్ లో ముగ్గురు మృతదేహాలు..

తిరుపతి : రైల్వే స్టేషన్ సమీపంలోని వాటర్ ట్యాంక్ లో ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే స్టేషన్ క్యాంటిన్ లో పనిచేస్తున్న వ్యక్తులుగా గుర్తించారు.

10:54 - June 14, 2016

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌ సితార హోటల్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై హోటల్‌ రిసెప్షనిస్టు అత్యాచారయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్టణానికి చెందిన శ్వేత అనే యువతి ముంబైలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఆఫీసు పనిమీద హైదరాబాద్‌ వచ్చిన శ్వేత రాత్రి ఎల్బీ నగర్ లోని సితార హోటల్లో బస చేయడానికి వచ్చింది. ఇదే అదనుగా భావించిన హోటల్ రిసెప్షనిస్టు శేఖర్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ప్రతిఘటించిన శ్వేత శేఖర్‌ నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు శేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

 

10:46 - June 14, 2016

హైదరాబాద్ : స్కూళ్లు తిరిగి ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో ఫిట్‌నెస్ లేని ప్రైవేట్ స్కూలు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. హైటెక్‌ సిటీ, జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఫిటెనెస్‌ లేని స్కూలు బస్సులపై నిన్నటి నుంచి ఆర్టీఏ దాడులు జరుగుతున్నాయి. 

 

10:37 - June 14, 2016

దళితుడిపై గ్రామపెద్దల జులుం..భూ తగదా విషయంలో గొడవలు..

కాలం మారినా మనిషిలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ అనాగరికమే కొనసాగుతోంది. పచ్చని పల్లెల్లో పెత్తనం చేస్తున్న ఎందరో పెదరాయుళ్లు..సామాన్య కుటుంబాలతో చెలగాటమాడుతున్నారు. వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. వెలివేస్తూ ఊరికి..ఆ పల్లె వాసులకు దూరం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భూ తగదా విషయంలో గొడవలు చెలరేగడంతో ఓ దళితుడిని గ్రామ బహిష్కరణ చేశారు. దీనికి తీవ్ర మనస్థాపానికి గురైన బాధితుడు టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మరి అతడిని ఏం చేశారు ? తదితర వివరాల కోసం వీడియో చూడండి.

10:30 - June 14, 2016

అదృశ్యమౌతున్న మహిళల ఆచూకీ ఏదీ ? రాజధాని శివారులో ఏం జరుగుతోంది ?

కళ్ల ముందు కనిపించిన చిన్నారుల జాడ తెలియడం లేదు. స్కూల్ కు వెళ్లిన బాలికలు..కాలేజీకి వెళ్లిన అమ్మాయిలు కనిపించడం లేదు. భర్తతో గొడవపడో..మరో ఇతర సమస్య మీద గడప దాటిన ఇలాళ్లు మాయమై పోతున్నారు. వీరంతా ఏమై పోతున్నారు. వీరి బతుకులను నాశనం చేస్తున్నది ఎవరు ? రాజధాని శివారులోని శంషాబాద్ మండలంలో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. తల్లి కూతురు మిస్సింగ్ అయ్యారు. భాగ్యనగరంలో అంతర్ రాష్ట్ర ముఠాలు తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

10:29 - June 14, 2016

హరారే : జింబాబ్వే టూర్‌లో ధోనీసేన దూకుడు కొనసాగుతోంది.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ షోతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.  మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. 
టీమిండియా ఖాతాలో మరో సిరీస్‌ 
వన్డే మాజీ చాంపియన్‌ టీమిండియా మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకున్న భారత జట్టు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ ధోనీసేనకు పోటీనేలేకుండా పోయింది.  ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు మరోసారి తేలిపోయింది. గౌరవప్రదమైన స్కోర్‌ కూడా నమోదు చేయలేక చేతులెత్తేసింది.  భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో 34.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. సిబందా 53 పరుగులు చేసినా మిగతా బ్యాట్స్ మెన్‌ విఫమవ్వడంతో 150 పరుగుల మార్క్‌ కూడా దాటలేకపోయింది. భారత బౌలర్లలో ధవళ్ కులకర్ణీ, శ్రణ్, చెరో రెండు వికెట్లు...స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టారు.
127 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్  
127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్లు కరుణ్‌ నాయర్‌, రాహుల్‌ శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశాడు. రాహుల్‌ 33 పరుగులకు ఔటైనా.... వన్‌డౌన్‌లో వచ్చిన అంబటి రాయుడు  కరుణ్ నాయర్‌తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. తొలి బంతి నుంచే జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రాయుడు...దూకుడుగా ఆడటంతో మరో 178 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
సిరీస్‌ 2-0తో సొంతం
20.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. జింబాబ్వే జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన యజ్వేంద్ర చహాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్ దక్కింది. ఇదే జోరు కొనసాగిస్తే వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ధోనీ సేనకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

 

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఎక్కడ ?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు మందగించాయి. ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. నాలుగు రోజులుగా రుతుపవనాల కదలికలు కనిపించడం లేదు. ఇప్పటికే కేరళకు రుతుపవనాలు చేరుకున్న సంగతి తెలిసిందే.

ప్రారంభమైన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం..

విజయవాడ : వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు..ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

కర్నూలు..విజయవాడలో ఆర్టీఏ తనిఖీలు..

విజయవాడ : జిల్లాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఐదు స్కూల్‌ బస్సులను సీజ్‌ చేశారు. మరోవైపు కర్నూలులో సి. క్యాంప్‌ సెంటర్‌లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 10 స్కూల్‌ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

వరంగల్ లో మిషన్ కాకతీయ పనులు...

వరంగల్ : హన్మకొండ మండలం కడిపికొండలో మంత్రి హరీశ్‌రావు మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మేయర్ నరేందర్‌..తదితరులు పాల్గొన్నారు.

కోడూరు జడ్పీటీసీ సభ్యుడిపై హత్యాయత్నం..

కృష్ణా : జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, కోడూరు జడ్పీటీసీ సభ్యుడు బండి శ్రీనివాస్ పై హత్యాయత్నం జరిగింది. గత రాత్రి ప్రత్యర్థులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

09:33 - June 14, 2016

కోల్ కతా : ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మ చూపుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో పడిపోయారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆగస్టు 9వ తేదీన వీరి వివాహం జరగబోతోందని తెలుస్తోంది. అసలు వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే దానిపై మంత్రి సుప్రీయో వివరణనిచ్చారు. యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి విమాన ప్రయాణం చేయడం జరిగిందని, తన ఎంపీ సీటు అభ్యర్థిత్వం కోసం చర్చించడం జరుగుతోందని తెలిపారు. సీటు వస్తే తప్పకుండా గెలుస్తారని ఎయిర్ హోస్టెస్ రచన పేర్కొన్నారని, అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోయిందన్నారు.

09:33 - June 14, 2016

తన సినిమాలు అందరూ చూడాలని..అందుకోసం వీలైతే తాను నటించిన సినిమాల టికెట్ల ధరలను తగ్గిస్తానని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సుల్తాన్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ స్పందన వస్తోంది. రూ. 200 కోట్లు..రూ. 300..రూ. 500 కోట్లు తన సినిమా వసూళ్లు రాబడుతుందని ప్రేక్షకులు అంచనా వేసుకుంటూ ఉంటారని, కానీ రికార్డును బద్దలు కొట్టకపోతే అది ప్లాప్ అయ్యిందని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల తాను నటించిన 'జయహో' చిత్రం రూ. 200 కోట్లు వసూళ్లు రాబడుతుందని అందరూ అంచనా వేశారని కానీ టికెట్ ధర రూ. 200 ఉండడంతో కేవలం రూ. 138 కోట్లను మాత్రమే రాబట్టిందని తెలిపారు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా రూ. 238 కోట్లను రాబట్టిందని..'భజరంగీ భాయిజాన్' తో పోల్చి 'ప్రేమ్ రతన్..' ప్లాప్ చిత్రంగా జమ కట్టారన్నారు. ఎక్కువ టికెట్ల ధరలు పెంచేసి అభిమానులను ఇబ్బంది పెట్టాలని అనుకోమని, తాను చేయబోయే సినిమాలకు టికెట్ ధర తగ్గించాలని అనుకుంటున్నట్లు సల్లూ భాయ్ పేర్కొన్నారు. సల్మాన్..అనుష్క శర్మ జంటగా నటించిన 'సుల్తాన్' సినిమా జులై 6వ తేదీన విడుదల కానుంది.

 

09:32 - June 14, 2016

కడప : జిల్లాలో విషాదం నెలకొంది. బస్సు లోయలో పడి ఇద్దరు మృతి చెందారు. 40 మందితో బస్సు బెంగుళూరు నుంచి కడప వెళ్తుంతోంది. రాయచోటి వద్ద 5 మంది ప్రయాణికులు దిగారు. మార్గంమధ్యలో సీకే దిన్నె మండలంలోని గువ్వలచెరువు వద్ద తెల్లవారుజామున 5 గంటల సమయంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో బస్సు కండక్టర్, ప్రయాణికుడు మృతి చెందారు. మరో 26 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పిరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కడప రాజీవ్ గాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ కు తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

09:31 - June 14, 2016

అయోడిన్..ఇది లోపిస్తే థైరాయిడ్ సమస్య ప్రధానంగా వస్తుంటుంది. థైరాయిడ్ వచ్చిందని గుర్తించే లక్షణాల్లో వెంట్రుకలు రాలిపోవడం ఒక కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. దీనివల్ల హార్మోన్లలలో అసమతుల్యత ఏర్పడుతుంది. కొంతమంది దీనిని నుండి బయటపడడానికి ఉప్పు శాతం పెంచుతుంటారు. కానీ ఇది అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపని తొక్కతో సహా ఉడికించి తినడం వల్ల అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. రోజు గ్లాసు పాలు తాగినా..ఉడకబెట్టిన గుడ్డు తిన్నా సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. రొయ్యలు..చేపల్లో కూడా అయోడిన్ పుష్కలంగా లభిస్తుందని..వీటిని వారానికొకసారి తీసుకుంటే మంచిదని పేర్కొంటున్నారు. ఇక శాఖాహారులైతే మాత్రం స్టాబెర్రీలు..పెరుగు..గ్రీన్ బీన్స్ లను తరచూ తీసుకుంటే అయోడిన్ అందుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

09:30 - June 14, 2016

వానాకాలం వచ్చేసింది. వానలో తడవడం వల్ల జుట్టు బాగా తడిసిపోతుంటుంది. ఫలితంగా జుట్టు పాడైపోతుంది. ఇందుకు కొన్ని చిట్కాలు..మీ కోసం..
రెండు అరటిపండ్లు తీసుకుని వాటిని బాగా మెత్తగా చిదమాలి. దీనికి రెండు చెంచాల తేనె కలిపి జట్టుకు రాసుకోవాలి. అరగంట అనంతరం స్నానం చేసేయాలి.
రెండు చెంచాల బాదం నూనెకి, ఒక చెంచా తేనె కలిపి కొద్దిగా వేడి చేయాలి. దీనిని మాడుకు తగలకుండా జాగ్రత్తగా జుట్టుకు పట్టించాలి. పదిహేను నిమిషాల అనంతరం షాంపూతో కడిగేయాలి.
మూడు కప్పుల వేడి నీళ్లలో గుప్పెడు బంతిపూలను వేయాలి. గంట తరువాత ఈ నీటితో జుట్టును కడిగేయాలి.
షాంపూ చేసుకున్న తరువాత రెండు చెంచాల పెరుగులో ఒక గుడ్డు వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.
అరకప్పు మెంతులను రెండు గ్లాసుల నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీళ్లతో జుట్టు కడిగేయాలి.

రౌడీషీటర్, నయీమ్ అనుచరుడు షకీల్ మృతి

హైదరాబాద్ : రౌడీషీటర్, నయీమ్ అనుచరుడు షకీల్ మృతి చెందాడు. మేడ్చల్ లో షకీల్ గుండె పోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 150 కేసుల్లో షకీల్ నిందితుడు. మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య కేసులో షకీల్ ప్రధాన నిందితుడు.

ఎదురు కాల్పుల్లో 12 మంది మావోల మృతి

ఛత్తీస్ గఢ్ : నారాయణపూర్ జిల్లా కీలంచేటు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందగా.. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను రాయపూర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెనాలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

గుంటూరు : తెనాలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు ఆగ్రహంతో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కశ్మీర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు...

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ రాజౌరి జిల్లా ఫూంచ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజేసుకుంది. దీంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.

ఢిల్లీకి టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ పిలుపు మేరకు హుటాహుటీన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ తో భేటీ అవుతారు. ఫిరాయింపులు, వలసలు, పార్టీలో నెలకొన్న పరిస్థితిపై ఆయన నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

తెనాలిలో రేపటి నుండి రాష్ట్రస్థాయి చెస్ పోటీలు..

గుంటూరు : జిల్లా, రాష్ట్ర చదరంగ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు తెనాలిలోని ఎన్‌జివో కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్‌ సంఘ కార్యదర్శి చల్లా రవీంద్ర రాజు ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు 15వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు జూలై 8 నుంచి 19వ తేదీ వరకు ఉత్తర ప్రదేశ్‌ నోయిడాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇతర వివరాల కొరకు 9948198809ను సంప్రదించాలన్నారు.

నగరంలో పోలియో వైరస్...

హైదరాబాద్: రాజధానిలో పోలియో వైరస్ వెలుగు చూసింది. నగరంలోని మురికి నీళ్లల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కి పడింది. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్‌లో వెలుగుచూడడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని మురికి నీళ్ల నమూనాలను ముంబైలోని ఒక పరిశోధన కేంద్రంలో పరీక్షించాక ఈ విషయాన్ని గుర్తించారు. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతున్నట్లు సమాచారం.

నగరంలో కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్ : నగరంలో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులపై రెండో రోజు కూడా ఆర్టీఏ ఆధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైటెక్ సిటీ, జేఎన్ టీయూహెచ్ ప్రాంతాల్లో ముమ్మరతనికీలు చేపట్టారు.

పారిస్ లో కాల్పులు : ఇద్దరి మృతి

హైదరాబాద్ :పారిస్‌లోని మాగ్నవిల్ ప్రాంతంలో దుండగుడు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారి సహా ఆయన భార్య మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపి దుండగుడిని హతమార్చారు. ఈ కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన 3 ఏళ్ల చిన్నారిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

09:00 - June 14, 2016

పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం సరికాదని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, టీఆర్ ఎస్ నేత మన్నే గోవర్ధర్,  కాంగ్రెస్ నేత విజయ్ పాల్గొని, మాట్లాడారు. పార్టీ పిరాయింపులే ప్రధాన లక్ష్యంగా టీఆర్ ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు. ప్రలోభాలకు గురి చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు 3గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారని 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు.

గోపలాయిపల్లిలో దారుణం

నల్గొండ : నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లిలో దారుణం జరిగింది.తల్లి 13 ఏళ్ల కూతురును గొంతుకోసి చంపింది. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్త పారిజాత ఆత్మహత్యాయత్నం చేశారు. పారిజాత పరిస్థితి విషమంగా మారటంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పారీస్ లో కాల్పుల కలకలం..

పారీస్ : మాగ్నవిల్ ప్రాంతంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో పోలీసు అధికారి దంపతులు మృతి చెందారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.

08:55 - June 14, 2016

'ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం పవిత్రమైనది. అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని సినిమాగా రూపొందించడం అభినందనీయం' అని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. సుమన్‌, శివకృష్ణ, ప్రీతినిగమ్‌, మధుబాల ప్రధాన పాత్రధారులుగా మిరియాల రవి కుమార్‌ దర్శకత్వంలో ప్రేమా మూవీస్‌ పతాకంపై కొత్తపల్లి సతీష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం 'త్యాగాల వీణ'. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ, 'తెలంగాణ ఉద్యమం ఎంతో స్ఫూర్తివంతమైనది. తెలంగాణ కోసం కేసీఆర్‌ కూడా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. తెలంగాణ సాధన గొప్ప పరిణామం. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇలాంటి టైమ్‌లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించడం మంచి పరిణామం. మున్ముందు మరిన్ని సినిమాలు రావాలి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, 'తెలంగాణ సమస్తం త్యాగాలతో కూడుకుని ఉంది. అనేక మంది త్యాగల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కొత్త తరానికి సినిమా మాద్యమం ద్వారా చెప్పడం అభినందనీయం' అని అన్నారు. 'ఒక రాష్ట్రం కోసం ఇన్ని ఆత్మ బలిదానాలు జరగడం దేశంలో ఎక్కడా జరగలేదు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై సాధించుకున్న తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంకితమిస్తున్నాను' అని దర్శకుడు చెప్పారు. 'ఈ సినిమాకు ఈటల రాజేందర్‌ ద్వారా ప్రభుత్వంతో మాట్లాడి రాయితీ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను' అని టీఆర్‌ఎస్‌ నాయకుడు శంకర్‌ రెడ్డి తెలిపారు.

ఆయిల్ ట్యాంకర్ బోల్తా..

గుంటూరు : పిడుగురాళ్ల మండలం బ్రహ్మణపల్లి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రాణ..ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఎల్బీనగర్ సితారా హోటల్ లో దారుణం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ సితారా హోటల్ లో దారుణం చోటు చేసుకుంది. విశాఖ నుండి వచ్చిన యువతిపై హోటల్ సిబ్బంది అత్యాచారయత్నం చేశారు. ఎల్ బినగర్ పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

08:44 - June 14, 2016

గత 20 ఏళ్ల కాలంలో విద్యుత్ రంగంలో చాలా మార్పులొచ్చాయి. విద్యుత్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. కనెక్షన్స్ లు, లైన్ లు పెరిగాయి. దానికి తగ్గట్టుగా క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల, సిబ్బంది సంఖ్య పెరగలేదు.  ప్రతి వెయ్యి సర్వీసులకు ఒక లైన్‌ మెన్‌, హెల్పర్‌ అవసరం కాగా  మూడు నుంచి 5 వేల సర్వీసులకు ఒకరు చొప్పున విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో సిబ్బంది మీద పని ఒత్తిడి పెరిగి, అది అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. 
కారుణ్య నియామకాల్లో జాప్యం
తెలంగాణ విద్యుత్ సంస్థలో అనేక విభాగాలున్నాయి. ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్ పిడిసిఎల్, ఎన్ పిడిసిఎల్ ఇలా  వివిధ విభాగాల్లో కొన్ని వేల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.  నిరంతర విద్యుత్ సరఫరాలో విద్యుత్ సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేయడమంటే నిరంతర ప్రమాదాలతో సహజీవనం చేయడమే. విద్యుత్ స్తంభాల మీద నుంచి కిందపడిపోయి, షాక్ లు కొట్టి అనేక మంది ఉద్యోగులు సిబ్బంది గాయపడడం,  కాళ్లు చేతులు పోగొట్టుకోవడం, ఒక్కొక్కసారి చనిపోవడం లాంటి విషాదాలు జరగుతున్నాయి.  ఇలా చనిపోయినవారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల విషయంలో అంతులేని జాప్యం జరుగుతోంది. దీంతో ఆయా కుటుంబాలు వీధినపడుతున్నాయి. కరెంట్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు విద్యుత్ ఉద్యోగుల కష్టనష్టాల గురించి, వారి యోగక్షేమాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం వుంది. 
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టిఆర్ఎస్ వాగ్థానం 
తెలంగాణ విద్యుత్ శాఖలో 20 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారున్నారు.  కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ టిఆర్ఎస్ వాగ్థానం చేసింది. ఆ కల నేరవేరే రోజు కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి తీపి కబురేదీ రాకపోవడం వీరంతా ఆందోళనలో వున్నారు. గత సెప్టెంబర్ లో తెలంగాణ విద్యుత్ శాఖలోని 13 కార్మిక సంఘాలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ పేరుతో ఏకమయ్యాయి. పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన 34 రకాల సమస్యలపై ట్రాన్స్ కో, జెన్ కో అధికారులకు వినతిప్రతాలిచ్చారు. పెరిగిన విద్యుత్ లైన్లు, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా విద్యుత్ ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సిన అవసరం వుంది. అయితే ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. 

 

08:40 - June 14, 2016

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నేత ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాటపట్టారు. విద్యుత్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ గా ఏర్పడ్డ 13 కార్మిక సంఘాలు రేపటి నుంచి సమ్మెలో పాల్గొంటున్నాయి.  దాదాపు 50 వేల మంది విద్యుత్‌ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. 
తెలంగాణలో  విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు కారణం ఏమిటి.? వీరు ప్రభుత్వం ముందు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? వాటికి ప్రభుత్వ స్పందన ఎలా వుంది? విద్యుత్ ఉద్యోగుల వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? ఇలాంటి అంశాలపై ఈయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

08:36 - June 14, 2016

హైదరాబాద్ : తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కాపు నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముద్రగడకు తామంతా అండగా ఉన్నామని ప్రకటించారు. ఇదిలావుంటే మంత్రులు మాత్రం.. కాపుల శ్రేయస్సుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని చెబుతున్నారు. దీంతో ముద్రగడ దీక్ష.. అటు కాపు నాయకులు, ఇటు మంత్రుల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోస్తోంది. 
తుని ఘటనను సమర్థించబోమన్న చిరంజీవి
కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏ చెడు జరిగినా, తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్‌ నాయకుడు చిరంజీవి హెచ్చరించారు. తుని ఘటనను తామెవరమూ సమర్థించబోమని తెలిపారు. ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందిన వాళ్లు లేరని, పులివెందుల వారే ఉన్నారని ప్రభుత్వ ప్రతినిధులు ఆరోపించారని గుర్తుచేశారు. మరిప్పుడు గోదావరి జిల్లాల యువకులను బంధించి ,జైళ్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 
ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న దాసరి
కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముద్రగడను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందని సినీదర్శకుడు దాసరినారాయణరావు అన్నారు. ఇది ఒక సామాజిక సమస్యఅని, కానీ ప్రభుత్వం దాన్ని ఒక ఉగ్రవాద సమస్యగా భావిస్తుండటం దారుణమని చెప్పారు. ప్రభుత్వం, ముద్రగడతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. 
ప్రభుత్వం కాపుల శ్రేయస్సుకు కట్టుబడి ఉందన్న చినరాజప్ప
కాపునేతల వ్యాఖ్యలపై మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప స్పందించారు. ముద్రగడ ఆరోగ్యవిషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చినరాజప్ప అన్నారు. కొంతమంది కాపునేతలు కావాలనే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని,.. పదవులు అనుభవించిన వీరు ఏరోజయినా కాపులను పట్టించుకున్నారా...అని ప్రశ్నించారు. 
సర్కారు చేపట్టిన పనులు ప్రజలకు తెలుసు -నారాయణ
మరోవైపు కాపునాయకులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అనే విషయాలను కాపు నాయకులు విశ్లేషణ చేయలేకపోయారని మంత్రి నారాయణ విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులను కాపుల కోసం చంద్రబాబు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం తగదని అన్నారు. ముద్రగడ దీక్ష కాపునాయకులను ఏకం చేస్తోంది. ఇప్పుడు వీరంతా కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లను ఎంతవరకు సాధిస్తారన్నది  వేచి చూడాలి.

 

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్...

ఛత్తీస్ గఢ్ : నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెదారు.  నారాయణపూర్ జిల్లాలోని కేలంబస్ అటవీప్రాంతంలో మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రాయపూర్ ఆస్పత్రికి తరలించారు.

08:28 - June 14, 2016

ఛత్తీస్గఢ్ : నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెదారు. నారాయణపూర్ జిల్లాలోని కేలంబస్ అటవీప్రాంతంలో మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ లో రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టులు చనిపోయారని అధికారికంగా చెప్పడం లేదు.

 

ఛత్తీస్ గడ్ లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్ గడ్ : నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

నేడు కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి శిద్ధా రాఘవరావు భేటీ

ఢిల్లీ : నేడు కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి శిద్ధా రాఘవరావు భేటీ అయ్యారు. నెల్లూరు టోల్ గేట్ వివాదంపై చర్చించనున్నారు. 

ఎల్ బీ నగర్ లో ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్ : నగరంలోని ఎల్ బీ నగర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 13 బస్సులపై కేసు నమోదు చేశారు. ఓ బస్సును సీజ్ చేశారు. 

07:48 - June 14, 2016

ఉత్తరప్రదేశ్ : అలహాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌‌లో బిజెపికి అధికారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తూ అధికారం ఇచ్చాక ప్రజలకు నష్టం కలిగిస్తే తమను తన్ని తరిమెయ్యాలన్నారు. మాయావతి, ములాయం తోడు దొంగల్లా వ్యవహరిస్తూ చెరి ఐదేళ్లు పాలిస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. 

 

07:44 - June 14, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపంపై పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి, డ్రైనేజీల నిర్వహణ తీరుపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా.. నగరంలో అక్రమ నిర్మాణాలపైనా కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. అక్రమ నిర్మాణదారులు ఎంతవారైనా సహించబోనన్నారు. 
హైదరాబాద్‌లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు
అమెరికా పర్యటన ముగించుకొని ఆదివారమే తిరిగి వచ్చిన మంత్రి  కేటిఆర్... వచ్చీ రాగానే విధుల్లోకి దిగారు. సోమవారం హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ, షాపూర్‌నగర్‌ ప్రాంతాల్లో మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి పర్యటించారు. జీహెచ్ ఎంసీ, మెట్రో రైల్ , వాట‌ర్ బోర్డు, విద్యుత్ శాఖల పనితీరును పరిశీలించారు. 
అధికారులను నిలదీసిన కేటీఆర్ 
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడా మెయిన్ రోడ్లను త‌వ్వి  నెల‌లు గ‌డుస్తున్నా ఎందుకు ప‌నులు పూర్తి చేయడం లేదంటూ కేటీఆర్‌... జీహెచ్‌ఎంసీ అధికారులను నిలదీశారు. వివిధ డిపార్టుమెంట్ల అధికారులు పొంత‌న లేని స‌మాధానం ఇవ్వటంతో.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీన‌గ‌ర్ కాల‌నీలో ఉన్న వాట‌ర్ పైపులైన్లోకి మురుగు నీరు వెళ్తే మ‌రో బోల‌క్ పూర్ అవుంద‌ని హెచ్చరించారు. ప‌నులు తక్షణమే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 
జీహెచ్ ఎంసీ 5 రూపాయల భోజనాన్ని తిన్న కేటీఆర్
ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తించిన కేటీఆర్.. మధ్యాహ్నం భోజన సమయంలో.. జీహెచ్‌ఎంసీ పంపిణీ చేస్తున్న ఐదు రూపాయల భోజనాన్ని ఆరగించారు. కుత్బుల్లాపూర్‌లో మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డితో కలిసి ఐదు రూపాయల భోజనాన్ని రుచి చూశారు. ఆహారపు నాణ్యత, శుభ్రతలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రితోపాటు.. 
అధికారులతో మంత్రి సమీక్ష 
అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గుంతలులేని రోడ్లు, ఎగుడు దిగుడు మ్యాన్‌హోల్స్ లేని రోడ్లు రావాలని ఆకాంక్షించారు. అధికారుల పనితీరు మెరుగుపడలన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. మూస పద్ధతులు మానుకోవాలని సూచించారు.
శాఖల్లో సమూల మార్పులు
నగర ప్రజల శ్రేయస్సు కోసం అన్ని శాఖల్లో సమూలమైన మార్పులు తేవాలన్నారు. హైదరాబాద్ నగర రోడ్ల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష అని కేటీఆర్‌ అన్నారు. మొత్తానికి ఆకస్మిక పర్యటనతో అధికారులను హడలెత్తించిన కేటీఆర్.. తరచూ ఇలాంటి పర్యటనలు చేస్తే తమ కాలనీలు బాగుపడతాయని బస్తీవాసులు అభిప్రాయపడ్డారు. 

 

07:38 - June 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో నలుగురు ముఖ్య నేతలు గుడ్‌ బై చెప్పేశారు.. సీపీఐ ఏకైక ఎమ్మెల్యేకూడా గులాబీ గూటికి చేరుతున్నానంటూ ప్రకటించారు.. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ మరింత పెరిగింది.. ఎవరు ఎప్పుడు కార్‌ ఎక్కేస్తారో తెలియక పార్టీల పెద్దలు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు.. 
టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్‌తోపాటు.. సీపీఐకీ షాక్ ఇచ్చింది.. నల్లగొండ జిల్లాలో పార్టీకి బలమైన నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే తాను గులాబీ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించేశారు.. 
టీఆర్‌ఎస్‌లోకి జగిత్యాల కాంగ్రెస్ ఇంచార్జ్ 
నిన్నటి వరకు గులాబీదళంపై తీవ్ర విమర్శలు చేసిన గుత్తా.... ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులో సవాల్‌ కూడా చేశారు.. టీఆర్‌ఎస్‌కు సై అంటే సై అంటూ సమాధానం ఇచ్చిన సుఖేందర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం నేతలందరినీ ఆశ్చర్యపరిచింది..   గుత్తాతోపాటు... కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్‌లుకూడా గులాబీ కండువా కప్పుకుంటామంటూ తేల్చేశారు.. ఉద్యమ సమయంలో హస్తాన్ని వదిలి కారు ఎక్కిన వివేక్ బ్రదర్స్... ఎన్నికలకుముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన ఈ సోదరులు కొంతకాలంగా సైలెన్స్ పాటిస్తున్నారు.. రాష్ట్రాన్నిచ్చిన సోనియాకు కృతజ్ఞతగానే అప్పట్లో కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లామని వారు చెబుతున్నారు. 
టీఆర్‌ఎస్‌ జోరు
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌ జోరు సాగుతోంది. ఈనేపథ్యంలో వివేక్‌ సోదరులూ అధికార పార్టీలో చేరేందుకు డేట్‌ ఫిక్స్ చేసుకున్నారు.. తమతోపాటు  మాజీ మంత్రి రత్నాకర్ రావు కొడుకు... జగిత్యాల కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సింగరావు గులాబీ పార్టీలో చేరుతున్నారంటూ ప్రకటించేశారు.. వీరితోపాటు సిఎల్పీ నేత జానారెడ్డి అనుచరుడు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావూ వివేక్ బ్రదర్స్ తో కలిసి అధికార పార్టీలోకి అడుగుపెట్టబోతున్నారు.. 
సీపీఐని తాకిన వలసలు 
అటు కాంగ్రెస్‌, టీడీపీలకే పరిమితమైన వలసలు ఇప్పుడు సీపీఐనీ తాకాయి. ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ కూడా గులాబీదళంలో చేరతానంటూ స్పష్టం చేశారు.. తన నియోజక వర్గ అభివృధ్ది కోసం ఈనెల 15న పార్టీ మారతానని చెప్పారు.. 
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ఫైర్‌
మరోవైపు పార్టీ ఫిరాయింపులపై..  కాంగ్రెస్‌ ఫైర్‌ అవుతూనే ఉంది.. కండువా మార్చేస్తున్న నేతలు ప్రస్తుత పార్టీ వల్ల దక్కిన పదవులకు రాజీనామా చేయాలని ఆపార్టీ నేతలు డిమాండ్‌  చేస్తున్నారు. ఇలా వరుసగా టీఆర్‌ఎస్‌లోకి నేతలు క్యూ కట్టడంతో కాంగ్రెస్‌ పార్టీలో టెన్షన్ మరింత పెరిగింది. ఉన్న నేతల్ని కాపాడుకునేందుకు పార్టీ పెద్దలు ఆపసోపాలు పడుతున్నారు.

 

బస్సు లోయలో పడి ఒకరి మృతి

కడప : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడి ఒకరు మృతి చెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. బస్సు బెంగుళూరు నుంచి కడప వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 

నేడు మోడీతో జయలలిత సమావేశం

ఢిల్లీ : తమిళనాడు సీఎం జయలలిత నేడు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. తీరప్రాంతం వెంబడి మత్స్యకారుల అరెస్టు, తమిళనాడుకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి జోగు రామన్న

 హైదరాబాద్ : తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగు రామన్న నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశంలో జోగు రామన్న పాల్గొననున్నారు. 

07:19 - June 14, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక సచివాలయ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు ఉద్యోగుల తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. రాజధానికి ఉద్యోగుల తరలింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. 
ఈనెల 27వరకు రాజధానికి ఉద్యోగులు  
నవ్యాంధ్ర రాజధానికి ఉద్యోగుల తరలింపు వ్యవహారం రోజురోజుకు స్పీడందుకుంటుంది. ఈనెల 27లోగా ఉద్యోగులంతా రాజధానికి రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులు కూడా ఊపందుకున్నాయి. 
ఉద్యోగుల తరలింపుపై మార్గదర్శకాలు జారీ
ఇక రాజధానికి సచివాలయ ఉద్యోగుల తరలింపుపై  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సీఎస్‌ టక్కర్‌ సమీక్ష నిర్వహించి.. మార్గదర్శకాలు విడుదల చేశారు. శాఖలు, ఉద్యోగుల తరలింపు కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. అమరావతిలో పని చేసే ఉద్యోగులకు వేర్వేరుగా హాస్టల్‌ వసతి కల్పించాలని నిర్ణయించారు. ఇక మహిళా ఉద్యోగుల భద్రత బాధ్యతను కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. పురుష ఉద్యోగుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. 
సచివాలయం, హెచ్‌వోడీలకు వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణాశాఖలో ప్రత్యేక సెల్‌ ద్వారా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్‌ తెలిపారు. 
ఉద్యోగుల పిల్లల అడ్మిషన్లకు ప్రత్యేక సెల్‌ 
ఇక రాజధానికి ఫైల్స్‌, ఫర్నిచర్‌ తరలించేందుకు ఆర్ధికశాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే.. వీటి బాధ్యత ఆ శాఖలదేనని స్పష్టం చేసింది. అలాగే రాజధానికి తరలించే సామాగ్రికి రవాణా శాఖ నిర్ణయించిన ధరను మాత్రమే చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా రాజధానిలో ఉద్యోగుల పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేందుకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు. ఈ సెల్‌ ద్వారా పిల్లల అడ్మిషన్లకు తలెత్తిన ఇబ్బందులను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరికొంత సమయం కావాలంటున్న ఉద్యోగులు 
మొత్తానికి అనుకున్న సమయానికి ఉద్యోగులను రాజధానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కొంతమంది ఉద్యోగులు మాత్రం.. హైదరాబాద్‌ వీడి రాజధానికి రావాలంటే మరికొంత సమయం కావాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

07:11 - June 14, 2016

హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలో దారుణం జరిగింది. ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. కృష్ణా జిల్లాకు చెందిన లీలావతికి, శశికిరణ్ తో 8నెలల క్రితం వివాహమైంది. అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద మూడు ఎకరాలు,  15 లక్షల రూపాయలు, కట్న కానుకలు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయితే పెళ్లి జరిగి రెండు మూడు నెలలు గడవకముందే..అత్తింటి వారు కట్నం తెమ్మని లీలావతిని వేధించేవారు. వేధింపులకు సంబంధించిన విషయాలను లీలావతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఈనేపథ్యంలో మల్కాజ్ గిరిలోని తన నివాసంలో ఆమె అనుమానాస్పందగా మృతి చెందింది. ఆమె చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉంది. లీలావతి మృతిపై ఆమె బంధువులు భర్త శశికిరణ్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. అత్తింటి వారి వేధింపులే లీలావతి మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే కేసు దర్యాప్తు చేసి, నిందితులను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

 

తెలంగాణలో నేటి నుంచి జిల్లా కోర్టుల్లో విధుల భహిష్కరణ

హైదరాబాద్ : నేటి నుంచి జిల్లా కోర్టుల్లో విధుల భహిష్కరణ చేయనున్నారు. తెలంగాణకు ఎపి న్యాయమూర్తుల కేటాయింపులపై నిరసన తెలుపుతున్నారు. 

నవ వధువు అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : నవ వధువు లీలావతి అనుమానాస్పదంగా మృతి చెందింది. వరకట్న వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.  ఫ్యాన్ కు ఉరివేసి హత్య చేశారని మృతురాలి బంధవులు అంటున్నారు.  మల్కాజ్ గిరిలోని భర్త ఇంటి ఎదుట ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. బంధువులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 8 నెలల క్రితం శశికిరణ్ తో లీలావతికి వివాహం అయింది. 

Don't Miss