Activities calendar

16 June 2016

23:11 - June 16, 2016
23:11 - June 16, 2016
23:07 - June 16, 2016
22:48 - June 16, 2016
22:02 - June 16, 2016

కూరగాయలు నిలువునా గాయాల్నే చేస్తున్నాయి. జేబు నిండా డబ్బుతో వెళ్తే సంచినిండా కూరలు రావటం లేదు. టమాటా, మిర్చి, దొండ, బెండ, బీర, కాకర.. దేన్ని కదిపినా మంటలు రేగుతున్నాయి. ఆకాశాన్నంటే ధరలతో కొనాలంటే షాక్ ఇస్తున్నాయి. మధ్యతరగతి జీవి ఈ ధరలతో అల్లాడిపోతుంటే.. ఇక బీద బతుకులకు పచ్చడి మెతుకులు, నీళ్లచారే పరిష్కారమౌతోంది. దీనికి పరిష్కారం లేదా? ప్రభుత్వాలు ఏం చేయలేవా? ఏ నిర్లక్ష్యం ఈ దుస్థితికి కారణం? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం..

నిన్న మొన్నటి వరకు ఉల్లిగడ్డ..

ఇవ్వాళ టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. అసలు మార్కెట్‌లో ఏ రోజు ఏ ధర ఉంటుందో సామాన్య ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వాలు మేల్కోవటం లేదు. ఫలితంగా సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటాను కూరల్లో అధికంగా ఉపయోగిస్తారు. రోజూ టమాటా వినియోగించని వంటిల్లు ఉండదని చెప్పాలి. అలాంటిది.. అలాంటిది ఇప్పుడు కిలో వంద రూపాయలు దాటితే విలవిల్లాడిపోతున్నారు.. సగటున పదిరూపాయలకు ఒక టమాటా కూడా రాని పరిస్థితిలో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు..వందరోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు... రెండేళ్లు దాటింది.. ఫలితం శూన్యం..కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల ధరలు జేబు గుల్ల చేస్తున్నాయి. ఒకదాని వెంట మరొకటి వరుసగా ధరల నిచ్చెన ఎగబాకి ఆమ్ ఆద్మీని అష్టకష్టాలు పెడుతున్నాయి. ధరలు తగ్గిస్తామని వాగ్దానాలు చేసిన ప్రభుత్వాలు సైలెంట్ గా చోద్యం చూస్తున్నాయి. గత కాలము మేలు వచ్చు కాలకంటెన్ … అనేది అన్ని సందర్భాల్లో నిజం కాకపోయినా, కూరగాయలు, నిత్యవసరాల విషయంలో మాత్రం పూర్తిగా నిజమనిపిస్తోంది. ఎందుకంటే అనూహ్యంగా పెరుగుతున్న ధరలు ఇదే సంకేతాలిస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అనుకూలించని వాతావరణ పరిస్థితులు భవిష్యత్తును భయపెడుతున్నాయి.ప్రకృతి వల్ల వచ్చే కష్ట నష్టాలకంటే, సర్కారీ నిర్లక్ష్యమే ప్రజల్ని ఎక్కువ ఇక్కట్లకు గురిచేస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల రాత్రికి రాత్రి జరిగేది కాదు. సర్కారుకు ఈ పెరుగుదల ఎందుకు ఎలా జరుగుతుందో అర్ధం కానిది కాదు. కానీ, కేవలం ప్రజాసంక్షేమం పట్ల నిర్లక్ష్యమే ఈ ధరల పోటుకు కారణమౌతోంది. ఇప్పటికైనా కూరగాయలు సాగు, నిత్యావసరాల ఉత్పత్తి, వాటి నిల్వల విషయంలో ప్రభుత్వం సరైన ప్రణాళికను అనుసరించి, ధరలను నియంత్రించాలని సామాన్యుడు కోరుకుంటున్నాడు. 

లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేస్తాం : రోశయ్య

తమిళనాడు : కేంద్ర ప్రభుత్వం సవరించనున్న లోక్‌పాల్‌ చట్టం ఆధారంగా రాష్ట్రంలో లోకాయుక్త ను ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చింది. పారదర్శక పాలన కోసం పటిష్టమైన లోకాయుక్త వ్యవస్థను తీసుకొస్తామని రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ రోశయ్య... ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. అమ్మ పేరుతో ప్రారంభించిన అన్ని పథకాలు... కొనసాగుతాయని చెప్పారు.

మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా...

ఢిల్లీ : నిత్యావసర సరకుల ధరలను నియంత్రించడంతో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. ఢిల్లీలో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.బీజేపీ ధికారంలోకి వస్తే మంచిరోజులు వస్తాయని ఎన్నికల ప్రచారంలో మురిపించిన మోదీ... అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మరచిపోయారని విమర్శించారు. పప్పుల ధరలు నిప్పులా మండుతున్నా... కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నా.. ప్రధాని పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

21:56 - June 16, 2016

ముంబై : ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగాయి. సుప్రీంకోర్టు, హర్యానా హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఉడ్‌తా పంజాబ్‌ చిత్నాన్ని నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాలని స్వచ్ఛంద సంస్థకు సూచించింది. సింగిల్ కట్‌తో సినిమా విడుదలకు హర్యానా కోర్టు సమ్మతించింది. ఉడ్‌తా పంజాబ్‌ రేపు విడుదల కానున్న నేపథ్యంలో సెన్సార్‌ కాపి ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిస్తామని సెన్సార్‌బోర్డు ఛైర్మన్‌ పహలాజ్‌ నిహ్లాని తెలిపారు. ఉడ్‌తా పంజాబ్‌ శుక్రవారం 8 వేల థియేటర్లలో విడుదల కానుంది.

21:52 - June 16, 2016

ఢిల్లీ : నిత్యావసర సరకుల ధరలను నియంత్రించడంతో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. ఢిల్లీలో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.బీజేపీ ధికారంలోకి వస్తే మంచిరోజులు వస్తాయని ఎన్నికల ప్రచారంలో మురిపించిన మోదీ... అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మరచిపోయారని విమర్శించారు. పప్పుల ధరలు నిప్పులా మండుతున్నా... కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నా.. ప్రధాని పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

21:48 - June 16, 2016

తమిళనాడు : కేంద్ర ప్రభుత్వం సవరించనున్న లోక్‌పాల్‌ చట్టం ఆధారంగా రాష్ట్రంలో లోకాయుక్త ను ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చింది. పారదర్శక పాలన కోసం పటిష్టమైన లోకాయుక్త వ్యవస్థను తీసుకొస్తామని రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ రోశయ్య... ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. అమ్మ పేరుతో ప్రారంభించిన అన్ని పథకాలు... కొనసాగుతాయని చెప్పారు.

21:42 - June 16, 2016

ఢిల్లీ : వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కావడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కమల్ నాథ్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఆమెను నియమించే అవకాశముందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు షీలా దీక్షిత్ నిరాకరించారు. సిక్కుల ఊచకోతతో సంబంధం ఉందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఇంచార్జిగా ఉండేందుకు కమల్‌నాథ్ విముఖత చూపారు.

21:39 - June 16, 2016

మహారాష్ట్ర : ఓ శివసేన నేత రౌడీలా ప్రవర్తించాడు. యవత్‌మాల్‌కు చెందిన శివసేన నేత ప్రదీప్‌ షిండే ఆయన స్నేహితుడితో కలిసి బ్యాంకులో ఓ ఉద్యోగి చెంప ఛెళ్లుమనిపించాడు. అధికారుల ముందే ప్రదీప్ ఆ ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. ప్రదీప్‌ దౌర్జన్యం సిసిటీవీలో రికార్డయింది. సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

21:36 - June 16, 2016

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ సమావేశమయ్యారు.. అయితే శాఖలవారీగా ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత రాలేదు.. దీంతో వచ్చేవారం మరోసారి సమావేశం కావాలని సీఎస్‌ నిర్ణయించారు.. అప్పుడు సమగ్ర నివేదికతో రావాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

20:58 - June 16, 2016

మదము.. మస్తీ.. బలుపు.. కొవ్వు.. కండకావరం అన్ని గల్పితె అమలాపురం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ అన్నట్టు.. అగో పోలీసాయినను వట్కోని గంత గంత మాటలంటున్నవేందని అనిపిస్తున్నదా..? ఆయిన లళితకళలు జూపిస్తె మీరు నాకంటె ఎక్వంటరు.. సూస్తరా..? తయ్యారుండ్రిమరి తిట్టెతందుకు.. రెడీ వన్ టూ త్రీ..

పోరాని చోట్లకు పోతె.. రారాని నిందలొచ్చినట్టు.. ఒక పెద్దమన్షి ఉన్నతానుండక మా ఊర్లె బాతురూం పయ్యకాండ్ల అవినీతి అయ్యింది జర్ర చర్యలు దీస్కోండ్రని పొయ్యిండు.. మళ్ల అదిగూడ అధికార పార్టీ సర్పంజికి వ్యతిరేకంగ పోతరా గట్ల..? సూడబుద్దిగాకపోతె కండ్లు మూస్కోని ఉండాలెగని.. అట్ల జేస్తె కోపంరాదా సర్పంజి సారుకు..? కోపమొస్తె ఏమైతదో తెల్సా.?. గిట్లైతది....

ముసలితనానికి కుసుమగూడాలని అంటరు ఎందుకు..? వైసోళ్లు జేయవల్సిన పనులు ముసలోళ్లు జేస్తె ఈసామెత ఇసుర్తరు కదా..? కని ఇసొంటి సామెతల మీద యుద్దానికే దిగిండు ఒక ముసలాయిన.. పనులకు వైసుకు సంబంధమేంది..? మాకు శాతగాదా..? మేము మన్సులంగాదా అంటున్నడు..

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ పేరు ఇంటె చంద్రబాబుకు సలిజరమొస్తది చినబాబుకు చీమిడిగార్తది.. జగన్ బాబుకు బుగులు జొస్తది ఎందుకో ఎర్కేనా... బైరెడ్డి కడ్పుల ఏం దాస్కోడు మొఖం మీదనే తిడ్తడు.. తెలంగాణల కేసీఆర్ ఎట్లుండెనో రాయలసీమల బైరెడ్డి అట్ల తయ్యారైండు.. ఇంతా ఇంతా సిరియస్ కొచ్చింది సారు మాటల పదును....గిటువంటి మస్తు సంగతులు మన మల్లన్న మోసుకొచ్చిండు మరి మల్లన్న చెప్పిన మరిన్ని ముచ్చల్లు చూడాలనుంటున్నా..మరి జాగెందుకు ఈ వీడియో క్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుతరు మరి....

బురిడీ బాబా శివానంద్ అరెస్ట్ ...

హైదరాబాద్ : బురిడీ బాబా శివానంద్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులో శివానంద్ స్వామిని అదుపులోకి తీసుకున్నారు. రేపు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం. కాగా హైదారబాద్ లో లైఫ్ స్టైల్ ఛైర్మన్ మధుసూధన్ రెడ్డిని బోల్తా కొట్టించి భారీ మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బురిడీ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దొంగబాబా చేసిన పలు మోసాలు బయటపడ్డాయి.

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి...

ఖమ్మం : ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న లోకేష్ ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

రేపే తెలంగాణ టెట్ ఫలితాలు....

హైదరాబాద్ : తెలంగాణ టెట్ ఫలితాలు ఎట్టకేలకూ రేపు రేపు ఉదయం 11గంటలకు విడుదల కానున్నాయి. పరీక్ష నిర్వహించి ఇప్పటికే చాలా రోజులు గడిచిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. రేపే తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

బ్యాంకర్లతో ముగిసిన సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం..

హైదరాబాద్: బ్యాంకర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం ముగిసింది. ఖరీఫ్ లో రైతులను ఇబ్బంఇ పెట్టకుండా బ్యాంక్ లు రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలో మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన వడ్డీ వసూలు చేయవద్దని బ్యాంకులకు సూచించారు. 

భక్తుల రద్దీతో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.78 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఇప్పటివరకు శ్రీవారిని 49,300 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, దివ్యదర్శనానికి 7 గంటలు సమయం పడుతుంది.

మసాజ్ సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి...

హైదరాబాద్‌: కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలోని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి చేశారు. ఈ తనిఖీల సమయంలో ఇద్దరు యువతులతో పాటు మసాజ్ సెంటర్‌ నిర్వాహకుడని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 3100 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరెస్ట్ ను అధిరోహించిన మిజోరాం మహిళ...

మిజోరాం : నుంచి మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించిన మొట్టమొదటి మహిళ లాల్‌రింట్లుంగికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గత మే 21న లాల్‌రింట్లుంగి ఎన్‌సీసీ క్యాడెట్స్‌తో కలిసి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. 

విడిపోతున్న మరో బాలీవుడ్ జంట ....

ముంబై: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కరిష్మాకపూర్, సంజయ్‌కపూర్‌ దంపతుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా విడాకుల కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు ముంబై ఫ్యామిలీ కోర్టు ఎట్టకేలకు విడాకులు మంజూరు చేసింది. గత డిసెంబర్‌లో సంజయ్ తరుపు న్యాయవాది అమన్‌హింగోరనీ విడాకుల కోసం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆరు నెలల తర్వాత నిబంధనల ప్రకారం కోర్టు కరిష్మా, దంపతులకు విడాకులను మంజూరు చేసింది.

19:49 - June 16, 2016
19:45 - June 16, 2016

అగ్రిగోల్డ్‌ బాధితులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఆస్తులను హవాలా మార్గంలో విదేశాలను తరలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీబీఐతోపాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆలిండియా అగ్రిగోల్డ్ ఏజెంట్ల, ఖాతాదారులు సంఘం అధ్యక్షులు రమేష్ బాబు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల రెండు రాష్ట్రాల సీఎంలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 30 రోజుల గడువును ఇస్తున్నామనీ... గడువులోపు తాము డిమాండ్ చేసినట్లుగా తొలివిడత తెలంగాణ నుండి రూ.500ల కోట్లు ఆంధ్రా నుండి రూ.1000 కోట్లు బాధితులకు చెల్లించకపోతే ఈ సమస్యలను ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో ఒక వ్యక్తి వేసిన చెక్ బౌన్స్ అయితే కేసు నమోదు చేసిన జైల్లో పెడుతుంటే రూ.700ల కోట్ల రూపాయల చెక్స్ బౌన్స్ అయితే దానికి సంబంధించిన సంస్థపై ఎటువంటి చర్యలూ తీసుకోవటం ఈ రెండూ ప్రభుత్వాలూ ఎందుకు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై రమేష్ బాబు ఎటువంటి విషయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:44 - June 16, 2016

టీడీపీ నిరంకుశ వైఖరి : సీపీఎం మధు

విజయవాడ : ఏపీలో టీడీపీ నిరంకుశ వైఖరి తారాస్థాయికి చేరిందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. గోదావరి జిల్లాల్లో పోలీసులను నింపి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఓట్లు పొందిన టీడీపీ, అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించడం సబబు కాదన్నారు. పాఠశాలల్లో మకాం వేసిన పోలీసులను తక్షణమే పంపించివేయాలని డిమాండ్‌ చేశారు.

18:50 - June 16, 2016

అనంతపురం : మున్సిపల్ కౌన్సిల్‌ మీటింగ్ రసాభాసగా మారింది.. ఈ సమావేశంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ పలువురు టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య వాగ్వాదం జరిగింది.. నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని జేసీ ఆరోపించారు.. తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని ప్రభాకర్‌ సమాధానమిచ్చారు.. ఇలా సమావేశంలో నేతల రగడపై ఎమ్మెల్సీ గేయానంద్‌ అసహనం వ్యక్తం చేశారు.. ప్రజల సమస్యలు చర్చించకుండా కౌన్సిల్‌ సమావేశాన్ని రాజకీయ సమస్యలకు వేదికగా చేసుకున్నారని మండిపడ్డారు.

రసాభాసగా అనంతపురం కౌన్సిల్ సమావేశం..

అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. ఈసారి కౌన్సిల్‌ సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి కీలక అంశాలను అజెండాలో చేర్చడంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి హాజరయ్యారు.నగరంలోని రామ్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం కొద్దిరోజుల క్రితం మొదలైంది. దీనికోసం రైల్వేగేటు సమీపంలో ఉన్న మున్సిపల్‌ దుకాణాల భవనాన్ని తొలగించాల్సి ఉంది. ఆర్వోబీ నిర్మాణం అవసరమని ఎంపీ, ఎమ్మెల్యే సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆర్వోబీ నిర్మాణం జాప్యం చేయడానికి చూస్తున్నారంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిపై..

తవ్వేకొద్దీ బయటపడుతున్న ' దొంగబాబా' మోసాలు...

హైదారబాద్ : మహానగరంలో ఘరానా మోసానికి పాల్పడ్డ బురిడీ బాబా ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా బయటపడుతున్నాయి. పోలీసులు శోధిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శివానంద బాబాగా హైదరాబాద్‌లో భారీ మోసం చేసి ఈ దొంగ స్వామి చిత్తూరు జిల్లాలో కూడా అనేక మోసాలు చేసినట్లు అనుమానిస్తున్నారు... చిత్తూరు జిల్లాలో శివయ్య స్వామిగా చెలామణి అవుతూ ఇప్పటికే ఆరుగురిని బురిడీ కొట్టించి 63 లక్షలు దోచుకున్నట్లు తెలుస్తోంది... అలిపిరిలో శివయ్య స్వామిపై కేసులు నమోదయ్యాయి...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యువతి అదృశ్యం..

హైదారబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో యువతి అదృశ్యం అయింది. పూణె వెళ్లేందుకు వైజాగ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చి కైరవి శర్మ అనే యువతి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదృశ్యం అయ్యింది. కళాశాలకు రాలేదని కాలేజీ యాజమాన్యం కైరవి శర్మకు ఫోన్ చేయటంతో ఈ విషయం బైటపడింది. కాగా యువతికి పూణెలో చదవటం ఇష్టంలేదనే విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యువతి తండ్రికి, కాలేజీకి సమచారం అందించకుండా స్నేహితుల ఇంటిలో వుండొచ్చు అని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. 

17:57 - June 16, 2016

హైదారబాద్ : ఎక్కడ చూసినా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ వెలుగులు. ప్రత్యేక అలంకరణలతో పాటు.. హలీమ్‌ ఘుమఘుమలు. సాయంత్రం అయిందంటే చాలు.. సందర్శకుల కిటకిటలతో హైదరాబాద్‌ నగరం సందడిగా మారుతోంది. రంజాన్‌ మాసం కావడంతో చార్మినార్‌, పాతబస్తీ తదితర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.

విద్యుత్‌ వెలుగులతో కళకళలాడుతున్న నగరం ...
రంజాన్‌ మాసం కావడంతో ఎక్కడ చూసినా విద్యుత్‌ వెలుగులతో నగరం కళకళలాడుతోంది. నగరంలోని ఛార్మినార్‌, పత్తర్‌గట్టి, పటేల్ మార్కెట్‌తో పాటు మదీనా బిల్డింగ్‌ తదితర ప్రాంతాలు ప్రత్యేక శోభతో అలరారుతున్నాయి. వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చే సందర్శకులతో ఛార్మినార్‌, మక్కా మసీదు, పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. అందంగా ముస్తాబైన నగరంలోని పలు చారిత్రక కట్టడాలు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

సందర్శకులతో కిక్కిరిసిపోతున్న రాత్‌ బజార్‌...
రంజాన్‌ మాసంలో రాత్‌ బజార్‌ పేరుతో ఛార్మినార్‌ ప్రాంతంలో ప్రత్యేక షాపింగ్‌ కొనసాగుతోంది. ఉపవాసాలుండే ముస్లింలు కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్‌ చేసేందుకు వస్తుండటంతో పాతబస్తీ ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. వస్త్రాలు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, తళతళ మెరిసే గాజులు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. షాపింగ్ పూర్తయ్యాక తినుబండారాలను రుచి చూసేందుకు వస్తున్న సందర్శకులతో హోటళ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి.

దూరప్రాంతాల నుంచి వస్తోన్న సందర్శకులు...
సాధారణ రోజలతో పోలిస్తే.. రంజాన్‌ మాసంలో హైదరాబాద్‌, అందులో నైట్ బజార్‌ ప్రత్యేకంగా ముస్తాబై చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జిగేల్‌మనే విద్యుత్‌ కాంతుల్లో ప్రత్యేక అందాలను ఆస్వాదించాలంటే మాత్రం రంజాన్‌ మాసంలో భాగ్యనగరం బాట పట్టాల్సిందే. 

17:49 - June 16, 2016

హైదారబాద్ : ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీపై ప్రజాసంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి.. రోజుకోరకంగా నిరసన తెలుపుతున్న సంఘాలు.. తమ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి.. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని.... ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

ఫీ'జులుం'పై పోరుబాట పట్టిన ప్రజాసంఘాలు..

హైదరాబాద్ :   ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీపై ప్రజాసంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి.. రోజుకోరకంగా నిరసన తెలుపుతున్న సంఘాలు.. తమ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి.. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని.... ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

17:45 - June 16, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు ఇతర పార్టీల నేతలను ఫిరాంపులకు పోత్సహించిన తమ పార్టీలో చేర్చుకోవటంపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం నాడు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లోకి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై పలు సంచలనాత్మక విమర్శలు చేశారు.కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ ప్రజాసేవ మీద లేదని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ స్థిరత్వం అంటే టీఆర్‌ఎస్‌ స్థిరత్వమని.. ఆర్థిక స్థిరత్వం అంటే కేసీఆర్‌ కుటుంబ స్థిరత్వమని అన్నారు. కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

ఫిరాయింపులపై ఉన్న ప్రేమ ప్రజాసేవపై లేదు : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ ప్రజాసేవ మీద లేదని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ స్థిరత్వం అంటే టీఆర్‌ఎస్‌ స్థిరత్వమని.. ఆర్థిక స్థిరత్వం అంటే కేసీఆర్‌ కుటుంబ స్థిరత్వమని అన్నారు. కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

17:37 - June 16, 2016

హైదారాబాద్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 123 జీవో ప్రకారం భూసేకరణపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ జీవోపై రైతుల పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. రైతులకు ఇష్టం లేకుండా భూమి లాక్కోవద్దని జిల్లా కలెక్టర్, భూ సేకరణ కమిటీకి ఆదేశాలు జారీచేసింది. దీంతో కొరకొండకు చెందిన 24 మంది రైతులకు ఊరట లభించింది. రైతుల అభ్యర్థనను పరిశీలించాలని.. అప్పటి వరకు భూ సేకరణను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.

123 జీవో భూసేకరణపై హైకోర్టు అభ్యంతరం ...

హైదారాబాద్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 123 జీవో ప్రకారం భూసేకరణపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ జీవోపై రైతుల పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. రైతులకు ఇష్టం లేకుండా భూమి లాక్కోవద్దని జిల్లా కలెక్టర్, భూ సేకరణ కమిటీకి ఆదేశాలు జారీచేసింది. దీంతో కొరకొండకు చెందిన 24 మంది రైతులకు ఊరట లభించింది. రైతుల అభ్యర్థనను పరిశీలించాలని.. అప్పటి వరకు భూ సేకరణను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.

విద్యార్థులకు పాఠాలు చెప్పిన సీఎం...

విజయవాడ : విద్యాంజలి కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చదువుపట్ల పిల్లల్లో ఆసక్తిని కలిగించాలన్నారు. ఆత్కూరు జిల్లాపరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు ఆయన పాఠం చెప్పారు. పిల్లల్ని బాగా చదివిస్తే.. పిల్లలు దేశానికి గొప్ప ఆస్తిగా తయారవుతారని బాబు అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జిహబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్కూళ్లలో టీచర్ల కొరతలేకుండా వచ్చే ఏడాది నుంచి ఉపాధ్యాయనియామకాలు చేపడతామన్నారు చంద్రబాబు. 

సోనియాతో షీలా దీక్షత్ భేటీ...

ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ భేటీ అయ్యారు. ఇవాళ ఆమె సోనియా నివాసానికి వెళ్లి కలిశారు. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను బరిలోకి దించుతున్నట్టు వార్తలు వస్తోన్న నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్యాంకు అధికారిపై సైనికుడు దాడి..

ముంబై : మహారాష్ట్రలోని యవత్‌మల్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. స్థానికంగా వున్న శివ అనే ఓ సైనికుడు బ్యాంకు అధికారి చెంపను చెళ్లుమనిపించాడు. శివసేన నేత ప్రవీణ్ షిండే తన స్నేహితులతో కలిసి బ్యాంకుకు వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా బ్యాంకు అధికారిపై సదరు వ్యక్తి ఎందుకు దాడి చేశాడో తెలియరాలేదు. ఈ దృశ్యాలన్ని బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ టీవీలో రికార్డ్ అవటంతో ఈ విషయం బైటపడింది.

హరిత హారం పేరుతో దాడులు : వామపక్షాలు

హైదరాబాద్ : తెలంగాణలోని పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు అండగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.. హైదరాబాద్‌లోని ఎంసీపీఐ కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు.. హరిత హారం పేరుతో గిరిజన రైతులపై దాడులను ఖండించారు... గిరిజనులపైకి గిరిజన యువకులను హోంగార్డుల పేరుతో ప్రభుత్వం ఉసిగొల్పుతుందని మండిపడ్డారు.

హెచ్ సీయూ దీక్షకు మల్లేపల్లి మద్ధతు..

హైదరాబాద్ : దళిత అసోసియేట్ ప్రొఫెసర్‌ల సస్పెన్షన్‌లపై ఎత్తివేయాలని హెచ్ సీయూ ముందు చేప్టటిన రిలేని నిరాహారదీక్ష ముడో రోజుకు చేరుకుంది. క్యాంపస్ గేటు ముందు ఏర్పాటుచేసిన దీక్షాశిబిరంలో మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక వేత్త సాంబశివరావు పలువురు ప్రొఫెసర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రొఫెసర్ రత్నం, అస్టిస్టెంట్ ప్రొఫెసర్ తధాగత్ సేన్ గుప్తాపై విధించిన అక్రమ సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వీసీ అప్పారావుపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆరెస్ట్ చేయాలన్నారు. 

కేసీఆర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ వివరణ ఇవ్వాలి : రేవంత్

హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి తెలంగాణలో రాష్ట్రపతిపాలనకు కుట్ర చేశారని సీఎం కేసీఆర్‌ అనడాన్ని టీడీపీ ఖండించింది. ఈ విషయంలో అసదుద్దీన్‌ ఒవైసీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తారనే భయంతో.. కుట్రలు చేస్తున్నారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణకు పట్టిన చెదలు అంటూ రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:53 - June 16, 2016

హైదరాబాద్ : టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి తెలంగాణలో రాష్ట్రపతిపాలనకు కుట్ర చేశారని సీఎం కేసీఆర్‌ అనడాన్ని టీడీపీ ఖండించింది. ఈ విషయంలో అసదుద్దీన్‌ ఒవైసీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తారనే భయంతో.. కుట్రలు చేస్తున్నారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణకు పట్టిన చెదలు అంటూ రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:50 - June 16, 2016

హైదరాబాద్ : దళిత అసోసియేట్ ప్రొఫెసర్‌ల సస్పెన్షన్‌లపై ఎత్తివేయాలని హెచ్ సీయూ ముందు చేప్టటిన రిలేని నిరాహారదీక్ష ముడో రోజుకు చేరుకుంది. క్యాంపస్ గేటు ముందు ఏర్పాటుచేసిన దీక్షాశిబిరంలో మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక వేత్త సాంబశివరావు పలువురు ప్రొఫెసర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రొఫెసర్ రత్నం, అస్టిస్టెంట్ ప్రొఫెసర్ తధాగత్ సేన్ గుప్తాపై విధించిన అక్రమ సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వీసీ అప్పారావుపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆరెస్ట్ చేయాలన్నారు. 

16:45 - June 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు అండగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.. హైదరాబాద్‌లోని ఎంసీపీఐ కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు.. హరిత హారం పేరుతో గిరిజన రైతులపై దాడులను ఖండించారు... గిరిజనులపైకి గిరిజన యువకులను హోంగార్డుల పేరుతో ప్రభుత్వం ఉసిగొల్పుతుందని మండిపడ్డారు.

16:42 - June 16, 2016

మహబూబ్ నగర్ : జిల్లా ధర్మపూర్‌ స్టేజ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది...ఈ ప్రమాదంలో అక్కడిక్కడమే నలుగురు మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి...క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...మహబూబ్ నగర్ నుంచి పోతన్ పల్లికి వెళ్తున్న ఆటో, దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ వస్తున్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సు ధర్మపూర్‌ స్టేజ్‌ వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది...దీంతో మహబూబ్ నగర్- రాయ్ చూర్ ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

అగ్నిప్రమాదం ...ఆదుకున్న టీడీపీ ఎమ్మెల్యే...

.గోదావరి : ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 ఇళ్లు దగ్ధంమయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధిత కుటుంబాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి రూ.25 వేల చొప్పున టీడీపీ ఎమ్మెల్యే శేషారావు ఆర్థికసాయమందించారు. అంతేకాక ప్రభుత్వ సహాయంతో పక్కా ఇంటిని నిర్మించి ఇస్తామని ఆయన హామినిచ్చారు. ఇంటి నిర్మాణం జరిగేలోపు వారు ఉండేందుకు వసతిని కూడా ఆయన కల్పించారు. ఆపదలో ఉన్న ప్రతివారికి నా చేతనైనంత సాహయం అందిస్తానని ఆయన అన్నారు.

మావో నేత గజ్జెల కృష్ణారెడ్డి లొంగుబాటు ...

కర్నూలు: మావోయిస్టు నేత గజ్జెల కృష్ణారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు ఎదుట కృష్ణారెడ్డి లొంగిపోయాడు. పది కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న గజ్జెల కృష్ణారెడ్డి పై రూ.4 లక్షల రివార్డు ఉంది. 1975 నుంచి రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో గజ్జెల కృష్ణారెడ్డి కీలకంగా పనిచేస్తూ వచ్చారు.

'లైఫ్ ' స్టైల్ మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన గుత్తా..

హైదరాబాద్ : 1.30 కోట్ల రూపాయల మోసానికి గురైన లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంధువు కావడంతో ఆయనను కలిసేందుకు వచ్చానని అన్నారు. ఈ సంఘటన గురించి ఆయనతో ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఇలాంటప్పుడు దొంగతనం ఎలా జరిగిందని ఎలా అడుగుతామని ఆయన ప్రశ్నించారు. అలాంటివి పోలీసులు అడుగుతారని, తన పనికాదని అన్నారు. బంధువులు కోలుకోవడమే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు.

యువతిపై హాస్టల్‌ యజమాని అత్యాచారయత్నం..

హైదరాబాద్ : ఎస్సార్‌ నగర్‌లో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. బీకే గూడాలోని అర్రు హాస్టల్‌లో ఉంటున్న యువతిని అదే హాస్టల్‌ యజమాని నరేందర్‌రెడ్డి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే యువతి నరేందర్‌రెడ్డి నుంచి తప్పించుకొని ఎస్సార్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

మీడియా ప్రతినిధులపై దాడికి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డకిష్టాపూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మీడియాపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తీసుకుంది. అంతేకాదు మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి కూడా క్షమాపణలు చెప్తున్నామని టి పిసిసి తరపున దాసోజు శ్రవణ్‌, అద్దంకి దయాకర్‌ తెలిపారు. సంగారెడ్డికి వచ్చి మరీ జర్నలిస్టులను కలిసి క్షమాపణలు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహా 4గురు మృతి ...

మహబూబ్ నగర్: జిల్లాలోని ధర్మాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు- ఆటో ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్నారి, వృద్ధురాలు ఉన్నారు. ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు మహబూబ్ నగర్ మండలం పోతన్ పల్లి వాసులుగా గుర్తించారు. ఆర్టీసీ బస్సు దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ వెళుతోంది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

15:52 - June 16, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డకిష్టాపూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మీడియాపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తీసుకుంది. అంతేకాదు మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి కూడా క్షమాపణలు చెప్తున్నామని టి పిసిసి తరపున దాసోజు శ్రవణ్‌, అద్దంకి దయాకర్‌ తెలిపారు. సంగారెడ్డికి వచ్చి మరీ జర్నలిస్టులను కలిసి క్షమాపణలు తెలిపారు.

15:48 - June 16, 2016

విజయవాడ : విద్యాంజలి కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చదువుపట్ల పిల్లల్లో ఆసక్తిని కలిగించాలన్నారు. ఆత్కూరు జిల్లాపరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు ఆయన పాఠం చెప్పారు. పిల్లల్ని బాగా చదివిస్తే.. పిల్లలు దేశానికి గొప్ప ఆస్తిగా తయారవుతారని బాబు అన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జిహబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్కూళ్లలో టీచర్ల కొరతలేకుండా వచ్చే ఏడాది నుంచి ఉపాధ్యాయనియామకాలు చేపడతామన్నారు చంద్రబాబు. 

15:46 - June 16, 2016

హైదరాబాద్ : ఎస్సార్‌ నగర్‌లో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. బీకే గూడాలోని అర్రు హాస్టల్‌లో ఉంటున్న యువతిని అదే హాస్టల్‌ యజమాని నరేందర్‌రెడ్డి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే యువతి నరేందర్‌రెడ్డి నుంచి తప్పించుకొని ఎస్సార్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

15:05 - June 16, 2016

ఢిల్లీ : ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించిన గల్లంతైన ఫైళ్లపై కొత్త కోణం వెలుగు చూసింది. హోంశాఖ అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్ ఈ కేసులో సాక్షి అశోక్‌ కుమార్‌ల మధ్య జరిగిన సంభాషనల ఆడియోను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ బయటపెట్టింది. ఈ ఆడియోలో బికె ప్రసాద్‌ విచారణకు సంబంధించిన ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో అశోక్‌కుమార్‌కు సూచించారు. ఈ పేపర్‌ చూశారా అంటే చూడలేదని చెప్పాలని అశోక్‌కు ప్రసాద్‌ ఫోనులో సూచించారు. దీనిపై స్పందించిన బికె ప్రసాద్‌ తాను ఎందరో అధికారులతో మాట్లాడుతుంటానని వారికి ఎన్నో సూచనలిస్తుంటానని చెప్పుకొచ్చారు. తాను మాత్రం నిష్పక్ష పాతంగానే విచారణ జరిపించానని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. సాక్షులపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించిన గల్లంతైన ఫైళ్లపై కేంద్ర హోంశాఖ అంతర్గత దర్యాప్తు కమిటీ 52 పేజీల నివేదికను బుధవారం సమర్పించింది.

14:56 - June 16, 2016

హైదరాబాద్ : తెలంగాణకోసం తాము పోరాడితే... క్రెడిట్‌మాత్రం కేసీఆర్‌కు దక్కిందన్నారు కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌నేత వి.హన్మంతరావు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే విపక్షపార్టీల ఎంపీ,ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారని వీహెచ్‌ మండిపడ్డారు. తాను రాజ్యసభనుంచి రిటైర్‌ అయినా... రాజకీయాల్లోనే కొనసాగుతునన్నారాయన. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు వీహెచ్‌.

14:34 - June 16, 2016

రాజస్థాన్ ఏటీఎంలో దొంగల బీభత్సం..నిద్రిస్తున్న సెక్యూర్టీ గార్డుపై దాడి..

ఏటీఎంలపై దాడులు కొనసాగుతున్నాయి. డబ్బులు కావాలంటే ఏటీఎంలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖాలకు మాస్క్ లు వేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. అడ్డుగా ఉన్న గార్డులపై..ఖాతాదారులపై ఇష్టమొచ్చినట్లుగా దాడులకు తెగబడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు భయాన్ని సృష్టిస్తున్నాయి. అదే సమయంలో పోలీసుల నిఘా కొరవడడం కూడా కారణాలకు కారణమౌతున్నాయి. రాజస్థాన్ లో ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎం సెక్యూర్టీ గార్డుపై దుండగులు అరాచకం సృష్టించారు. ఎలా హత్య చేశాడో..మిగతా ఏటీఎంలలో నిందితుల దాడులకు సంబంధించిన వాటిని వీడియోలో చూడండి...

14:32 - June 16, 2016

అనుమతులు తీసుకోలేదు...నిబందనలు పాటించలేదు...రిజిస్ట్రేషన్ చేసుకొనేలేదు. పక్కా వ్యూహంతో కోట్లు కొల్లగట్టారు..శ్రీసాయి చిట్ ఫండ్స్ అక్రమాల డొంక..

ఎప్పుడో ఎదో ఒక చోట చిట్టీల పేరిట బోర్డులను తిప్పేస్తూనే ఉన్నారు. మోసపోయిన వారు లబోదిబోమంటూనే ఉన్నారు. మళ్లీ కొత్తగా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చిట్టీల పేరిట డబ్బులను కాజేసి ఉడాయించిన వాళ్లు అమాయకుల కోసం కాచుకకూర్చొన్నారని తెలుసుకోలేకపోతున్నారు. నల్గొండ జిల్లాలోని శ్రీసాయి చిట్ ఫండ్స్ అక్రమాల డొంక కదిలింది. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

నష్టాల్లో స్టాక్ మార్కెట్..

ముంబై : బుధవారం నాడు 330 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్, గురువారం 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ-50 130 పాయింట్లు పడిపోయి, 8,100 స్థాయి నుంచి దిగజారింది. 

స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్..

హైదరాబాద్ : స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ కు చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరబాద్ స్థానంలో కరీంనగర్ ను కేంద్రం ఎంపిక చేసింది. 

వట్టెం రిజర్వాయర్ భూ సేకరణపై హైకోర్టు అభ్యంతరం..

హైదరాబాద్ : పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్ భూ సేకరణపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 

కాంట్రాక్టు..కార్మికుల క్రమబద్దీకరణపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : టీఎస్ కాంట్రాక్టు, కార్మికుల క్రమబద్దీకరణపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. 

ముద్రగడ హెల్త్ బులెటిన్..

రాజమండ్రి : ముద్రగడ పద్మనాభం హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష కొనసాగుతోందని, చికిత్స కు ముద్రగడ సహకరించడం లేదని వైద్యులు వెల్లడించారు. సెలైన్ పెట్టుకొనేందుకు ముద్రగడ నిరాకరించారని, ముద్రగడకు బీపీ 130/80 గా ఉందన్నారు. 

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తుని ఘటన నిందితులు..

తూర్పుగోదావరి : బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిఠాపురం కోర్టులో తుని ఘటన నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

తుమ్ముడిహట్టి ప్రాజెక్టు ఎత్తు ఎందుకు పెంచలేదు - హరీష్ రావు..

మెదక్ : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తుమ్ముడిహట్టి ప్రాజెక్టు ఎత్తు ఎందుకు పెంచలేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. అందుకే దిగ్విజయ్ లేనిపోని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. సొంతపార్టీని చక్కదిద్దు కోలేని వారు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అవివేకమన్నారు. 

వాణిజ్య..వ్యాపార సంస్థలు 365 రోజులు - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : వాణిజ్య..వ్యాపార సంస్థలు 365 రోజులు తెరిచే ఉంచాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం ..ప్రకటిత సెలవు దినాల్లో కూడా వాణిజ్య..వ్యాపార సంస్థలు తెరిచి ఉంచేలా వెసులుబాటు కల్పించనున్నట్లు ప్రకటించారు. ప్రతి కార్మికుడికి వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలని సూచించారు. అదనపు గంటలు పనిచేస్తే అదనపు వేతనం చెల్లించాలని సూచించారు. రాత్రి 11గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. ఆలస్యమయ్యే పక్షంలో రవాణా సౌకర్యం కల్పించాలని, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. 

13:50 - June 16, 2016

కరీంనగర్ : స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చోటు లభించింది. హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌కు జాబితాలో ఎంపిక చేస్తూ తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సమర్పించి తర్వాత తదుపరి స్మార్ట్ సిటీ రేసులో కరీంనగర్ పాల్గొననుంది. డిపిఆర్ రూపకల్పనకు కేంద్రం రెండు కోట్లు విడుదల చేసింది. స్మార్ట్ సిటీగా కరీంనగర్ ఎంపిక కావడం పట్ల ఎంపీ వినోద్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. 

 

13:47 - June 16, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంత్రి మాణిక్యాలరావు, జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. జడ్పీ చైర్మన్‌పై మంత్రి మాణిక్యాలరావు ఏపీ టిడిపి అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం సీఎం వద్దకు చేరుకోవడంతో పంచాయతీ మరింత ముదిరింది. మంత్రికి తెలియకుండా జిల్లాలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు చేస్తుండడంతో ఈ విషయం మంత్రి మాణిక్యాలరావుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఊళ్లో తాను లేని సమయంలో ఇలా ప్రభుత్వ కార్యక్రమాలను చేయడం మంచిది కాదని జెడ్పీ చైర్మన్‌ను వారించారు. గతంలో కూడా వీరిద్ధరు మంత్రి శిద్ధారాఘవరావు సమక్షంలోనే ఘర్షణకు దిగారు. మళ్లీ తాజాగా మంత్రి లేని సమయంలో జడ్పీ చైర్మన్ బాపిరాజు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో ఆగ్రహించిన మంత్రి..ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వివాదం సీఎం వద్దకు చేరుకోవడంతో ఇవాళ మంత్రి విజయవాడకు వెళ్తున్నారు. 

13:02 - June 16, 2016

విజయవాడ : మూడేళ్లలో దేశంలోని ప్రతీ పేద ఇంటికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ఓ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర, దేశ రాజధానులతో మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ చేస్తామన్నారు. పప్పుధాన్యాల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో కేంద్రం ముందుకు పోతుందని తెలిపారు. 

 

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 123 జీవో ప్రకారం భూ సేకరణపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 123 జీవో ప్రకారం భూములు లాక్కొంటున్నారన్న రైతుల పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. రైతులకు ఇష్టం లేకుంటే భూమి లాక్కోవద్దని జిల్లా కలెక్టర్, భూ సేకరణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొరకొండకు చెందిన 24 మంది రైతులకు ఊరట లభించనుంది. 

కొనసాగుతున్న వామపక్ష పార్టీ నేతల సమావేశం..

హైదరాబాద్ : ఎంసీపీఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత నర్సింహ, పద్మ, వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, నిర్వాసితుల పోరాటాలు, ఐక్య ఉద్యమ కార్యాచరణపై చర్చ జరుగుతోంది. 

12:57 - June 16, 2016

మాటలు ముత్యాల్లా రాలుతుంటాయి.. వాడి వేడి చర్చల్ని సైతం చాలా చాకచక్యంగా నడిపిస్తుంటారు. స్పష్టమైన ఉచ్చరణతో న్యూస్ కు జీవం పోస్తారు. ఈ ఇంట్రడక్షన్ టీవీ యాంకర్ల గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. టీవీల్లో నిత్యం గడగడా మాట్లాడే యాంకర్స్ స్టూడియోలో ఎలా ఉంటారో తెలుసా? అప్పుడప్పుడు ఎలాంటి ఫన్నీ మిస్టేక్స్ చేస్తారో చూడాలనుందా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి..

రాజస్వ జ్ఞాన్ సంఘ్ ను ప్రారంభించిన మోడీ..

న్యూఢిల్లీ: రాజస్వ జ్ఞాన్‌సంఘ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సీనియర్ ట్యాక్స్ అడ్మినిస్టేటర్స్ సమావేశాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం..

రంగారెడ్డి : జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతోంది. జెడ్పీ హాల్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

 

దలైలామా..ఒబామా కలుసుకోవడంపై చైనా ఆగ్రహం..

ఢిల్లీ : అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా వైట్‌హౌజ్‌లో బౌద్ధ మ‌త‌గురువు ద‌లైలామాను కలుసుకోవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మాన‌వ హ‌క్కులు, వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఒబామా..దలైలామా చర్చించినట్లు తెలుస్తోంది. 

12:52 - June 16, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ యాజమాన్యం దగ్గర సీఎం చంద్రబాబు 200 కోట్లు ముడుపులు తీసుకున్నారని వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇందిరాపార్క్ దగ్గర ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతు ప్రకటించిన లక్ష్మీపార్వతి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు చంద్రబాబు వినిపించడంలేదన్నారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. 

 

రేపు నగరానికి రానున్న మనోహర్ పారికర్..

హైదరాబాద్ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజలు పాటు ఆయన ఆర్మీ భూముల వివాదాలపై చర్చించనున్నారు. 

నగరంలో 24 గంటల్లో 6చోట్ల స్నాచింగ్స్..

హైదరాబాద్ :నగరంలో ఛైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కేవలం 24గంటల్లో ఆరు చోట్ల ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. కర్మన్ ఘాట్, బోయిగూడ, తుకారంగేట్, గోపాలపురంలో స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. స్నాచర్ల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. వీరి కోసం గాలింపులు చేపడుతున్నారు. 

12:45 - June 16, 2016

హైదరాబాద్‌ : బంజారాహిల్స్ లో సినీఫక్కీలో జరిగిన భారీ దోపిడీ కేసును ఛేదించేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కోటి 33 లక్షలతో ఉడాయించిన దొంగబాబా కోసం వేట ముమ్మరం చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో దొంగబాబా కారు డ్రైవర్‌ శివను అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా వాహనాన్ని సీజ్‌ చేసి డ్రైవర్‌ను హైదరాబాద్‌కు తరలించి దొంగబాబా ఆచూకీ కోసం కూపీ లాగుతున్నారు. మరోవైపు అపోలో ఆస్పత్రిలో లైఫ్‌స్టైల్‌ యజమాని మధుసూదన్‌ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉండటంతో..సృహలోకి రాగానే నకిలీ బాబాకు సంబంధించి సమాచారాన్ని రాబట్టాలనుకుంటున్నారు. ఫేక్‌ బాబాతో మధుసూదన్‌ రెడ్డికి సంవత్సర కాలంగా పరిచయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దొంగ బాబాను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నకిలీ బాబా ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. 

 

టీకా వికటించి 6నెలల చిన్నారి మృతి..

తూర్పుగోదావరి : తూర్పుమన్యంలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి (మం) పెద్దమల్లంపాడు అటవీ ప్రాంతంలో టీకా వికటించి 6 నెలల చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. 

రాజ్యసభ సీటు ఒక్కడు ఇస్తే తీసుకుంటానా - వెంకయ్య..

విజయవాడ : రాజ్యసభ సభ్యత్వం కోసమే తాను టిడిపితో మంచిగా ఉన్నానని పేర్కొంటున్నారని, ఒకడు ఇస్తే తీసుకుంటానా అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ఆలస్యమైనా అమరావతిని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చుతామని, దేశంలో వైద్యుల కొరత ఉందని మెడికల్ కాలేజీల సంఖ్య పెంచాలని సూచించారు. జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయింపుపై ప్రధాని దృష్టి పెట్టడం జరిగిందని, ఏ అమెరికా అయితే మోడీకి వీసా నిరాకరించిందో అదే అమెరికా సైన్యం కవాతు చేసిందన్నారు. 1981లో కాంగ్రెస్ చేసిన శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును తాము ప్రారంభిస్తామన్నారు. 

12:33 - June 16, 2016

హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్లు  రెచ్చిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో 10 చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఒక్క సికింద్రాబాద్ లోనే నాలుగు ప్రాంతాల్లో స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అడ్డగుట్ట, తుకారాంగేట్, మహంకాళితోపాటు మరో ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరిగాయి. గత నాలుగు రోజుల్లో 20వరకు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయి. స్నాచింగ్ లను అరికట్టేందుకు, చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈజీ మనీ కోసం యువత పెడదారి పడుతున్నారు. గొలుసు దొంగల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. చైన్ స్నాచర్లు మొదటగా ఒక బైక్ ను చోరీ చేస్తారు. ఆ బైక్ పై వెళ్లి...చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతారు. లోకల్ స్నాచర్లతో పాటు బీహార్ కు చెందిన దుండగులు నగరంలో చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారు. గతంలో మల్కాజ్ గిరి, ఎల్ బి నగర్ లో చైన్ స్నాచింగ్ ఘనటలు జరిగాయి. చైన్ స్నాచింగ్ లను అరికట్టేందుకు ఐదు టీమ్ లకు సైబారాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శిక్షణ ఇచ్చాడు. 

 

12:29 - June 16, 2016

జబ్బు నయం చేస్తానన్నాడు..డబ్బు..నగలతో పూజలు చేయాలన్నాడు..ఆ తరువాత ఏమైంది ?

మాయలు అంటాడు..మంత్రాలు అంటాడు..ఏం చెప్పినా మొత్తంమీద రోగాలను నయం చేస్తానని అంటాడు. స్వాముల వేషాల్లో వస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. రకరకాల అనుమానాలు రేకెత్తించి అమాయికులను పుట్టిముంచుతున్నారు. మూఢ నమ్మకాలతో ఉన్న వారిని ఎంచుకుని నిలువు దోపిడి చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఓ దొంగబాబ హస్తలాఘవం ప్రదర్శించాడు. కూతురు అనారోగ్యాన్ని బాగు చేస్తానని నమ్మబలికి అందినకాడికి దోచుకున్నాడు. మిగతా విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

12:22 - June 16, 2016

విశాఖ పోలీసు యాక్షన్..రంగంలోకి దిగిన బాస్ లు..ఇళ్లు చక్కదిద్దే పనిలో పడిన కాప్స్ లు..

ఫిర్యాదు వస్తే స్పందించరు..అందుకు ఫోన్ లో వస్తే వత్తిళ్లకు తలొగ్గుతారు. ఉన్నోడికి ఒక న్యాయం..అమాయకులకు అన్యాయమే. ఇలా ఎన్నో ఆరపణలు ఎదుర్కొంటున్న విశాఖ పోలీసులు..ఇకపై అలా ఉండరు. ఇందుకు కారణం కొత్తగా వచ్చిన పోలీసు బాస్ లే. ఇంటిని చక్కదిద్ది ఆ తరువాత నేరాలగాళ్లపై అసలైన యాక్షన్ ఉంటుందని పోలీసు బాస్ లు పేర్కొంటున్నారు. ఇప్పటికే కాప్ బాసులు యాక్షన్ లోకి దిగడంతో కిందిస్థాయి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంట. ఇక నేరగాళ్లపై ఎలాంటి సీరియస్ యాక్షన్ ఉంటుందో చూడాలి. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి..

తెలుగు రాష్ట్రాల సీఎంలు స్నేహితులే - దిగ్విజయ్..

ఆదిలాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు లిద్దరు స్నేహితులే అని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. వలసలను ప్రోత్సహిస్తూ కేసీఆర్‌ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ ఉందని ఆయన స్పష్టం చేశారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 340 పాయింట్లు...నిఫ్టీ 110 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతున్నాయి.

 

12:05 - June 16, 2016

ఢిల్లీ : 36వ హీరో హాకీ చాంపియన్స్ ట్రోఫీ .. రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ రెండో విజయం సాధించడం ద్వారా..పతకం ఆశల్ని సజీవంగా నిలుపుకొంది. లండన్ లోని లీ వాలీ హాకీ సెంటర్లో ముగిసిన నాలుగోరౌండ్ పోటీలో  భారత్ 2-1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను అధిగమించింది. భారత్ దూకుడుతో సాగిన ఈ పోటీ..39వ నిముషంలోనే కెప్టెన్ సునీల్ తన జట్టుకు తొలిగోల్ అందించాడు. ఆ తర్వాత 57 వ నిముషంలో కొరియా ఈక్వలైజర్ గోల్ సాధించి సమఉజ్జీగా నిలిచింది. ఆట ఆఖరిభాగంలో నిక్కిన్ తిమ్మయ్య సాధించిన గోల్ తో భారత్ విజేతగా నిలిచింది. మొత్తం నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించినా భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరు జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో జర్మనీతో పోటీని డ్రాగా ముగించిన భారత్ బెల్జియం చేతిలో ఓడినా...ఇంగ్లండ్, కొరియాజట్ల పై సాధించిన విజయాలతో పాయింట్ల సంఖ్యను ఏడుకు పెంచుకొంది. గురువారం జరిగే ఆఖరిరౌండ్ పోటీలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ పోటీపడుతుంది.

 

12:00 - June 16, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులంతా ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న బాధితులంతా తమకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఏపీ సీఐడీ వేస్ట్ అంటూ ఉన్న ప్లకార్డులతో ఆందోళను దిగారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు సంఘీభావం తెలిపారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

11:57 - June 16, 2016

హైదరాబాద్‌ : నగరంలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు దొరికింది. మాదాపూర్‌లో డైరెక్టర్‌ ఆఫ్ ఫ్యాక్టరీస్‌ అధికారిగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. విజయ్‌కుమార్‌కు ఆదాయానికి మించి సుమారు 40 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని అలకాపురి, నల్లకుంటలో రెండు ఇండ్లు, మాదాపూర్‌లో ఓ ప్లాటు, హయత్‌నగర్‌లో 2 ఎకరాలు, ఆదిభట్లలో 4 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 3 ఎకరాల స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాదు విజయ్‌కుమార్‌ భార్య పేరిట పలు కంపెనీలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ ఇంటిపై ఏసీబీ దాడులు..

విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ శేఖర్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటి విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. 

సీఎం బాబుతో చిన రాజప్ప భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప భేటీ అయ్యారు. ముద్రగడ దీక్ష, తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

 

ఏఎస్పీ అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ స్పందన..

విశాఖపట్టణం : పాడేరు ఏఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పందించారు. ఘటనాస్థలం నుండి పిస్టల్ మ్యాగజైన్ లభ్యమైనట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీనియర్ అధికారితో దర్యాప్తు చేయిస్తున్నట్లు, ఏఎస్పీ శశికుమార్ కు రెండో పోస్టింగ్ అని తెలిపారు.

ఏపీలో విద్యాంజలి కార్యక్రమం ప్రారంభం..

పశ్చిమగోదావరి : ఉంగటూరు మండలం ఆత్కూరులో విద్యాంజలి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. 

ప్రారంభమైన టి.పిసిసి వర్క్ షాప్..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో కాసేపటి క్రితం టి.పిసిసి వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సమావేశానికి కొప్పుల రాజు, కుంతియా, జానారెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 

పత్తి రైతులకు బోనస్ ఇవ్వాలి - దిగ్విజయ్..

ఆదిలాబాద్ : పత్తి రైతులకు బోనస్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. విడతలవారీగా రుణమాఫీతో రైతులకు లాభం లేకుండా పోయిందని, కాంగ్రెస్ హాయాంలో ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. 

రేపు శ్రీవారి ఆలయంలో జేష్టాభిషేకం..

చిత్తూరు : రేపటి నుండి శ్రీవారి ఆలయంలో జేష్టాభిషేకం జరగనుంది. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టిటిడి వెల్లడించింది. 

ఇందిరాపార్కు వద్ద అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి భారీగా బాధితులు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు టి.కాంగ్రెస్ నేత వీహెచ్ సంఘీభావం తెలిపారు. వైట్ కాలర మోసాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని, అగ్రిగోల్డ్ ఆస్తులని అమ్మి బాధితులకు న్యాయం చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. 

స్మార్ట్ సిటీ జాబితాలో అమరావతి - వెంకయ్య..

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆయన గురువారం విజయవాడకు వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా కొరత లేకుండా ప్రధాన మంత్రి మోడీ చర్యలు తీసుకుంటున్నారని, ఆర్థిక మందగమనంలో ఉన్నా దేశం అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు.

జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : గత కొన్ని రోజులుగా సరిహద్దులో భారత బలగాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తంగ్దార్ సెక్టార్ లో ఉగ్రవాదులకు..భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

 

ఈజిప్టులో దుండగుల కాల్పులు..

కైరో : ఉత్తర సినాయ్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

 

 

11:04 - June 16, 2016

హైదరాబాద్‌ : నగరంలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి మీద బెంగతో మూడో అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా బెజూర్‌కు చెందిన సిలివేరు సుకన్య కుత్బుల్లాపూర్‌ కొంపల్లిలోని నారాయణ గర్ల్స్ క్యాంపస్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. నాలుగు రోజుల క్రితం కాలేజీలో చేరిన సుకన్య ఇంటికి ఫోన్‌ చేసి తనను హాస్టల్‌ నుంచి తీసుకెళ్లమని కోరింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటి మీద బెంగతో మనస్తాపానికి గురై మూడో అంతస్తు నుంచి కిందకి దూకింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఆమెను ఆస్పత్రికి తరలించింది. అప్పటికే విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

10:55 - June 16, 2016

హైదరాబాద్ : ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు అంటున్నారు జనం. అవును ప్రసుతం మార్కెట్లో కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు విపరీతంగా పెరగడంతో జనాలు బేంబెలెత్తుతున్నారు. ఇలా ఉంటే ఇక ఏం కొంటామని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి కిలో రూ.వందకు చేరుకున్నాయి. బీర, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ ధరలు అదే స్థాయిలో పెరిగాయి. ఆకు కూరలు సంగతి అంతే...పది రూపాయలకు రెండు కట్టలు మాత్రమే విక్రయిస్తున్నారు.  దీంతో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు ఎవరూ సాహసించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు..ప్రజలు ఏం అనుకుంటున్నారో వీడియోలో చూడండి..

10:52 - June 16, 2016

విజయవాడ : ఏపీలో టీడీపీ నిరంకుశ వైఖరి తారాస్థాయికి చేరిందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. గోదావరి జిల్లాలను పోలీసులతో నింపి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఓట్లు పొందిన టీడీపీ, అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించడం సబబు కాదన్నారు. పాఠశాలల్లో మకాం వేసిన పోలీసులను  తక్షణమే పంపించివేయాలని డిమాండ్‌ చేశారు. 

 

10:50 - June 16, 2016

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్ చోరీ ఘటనలో పురోగతి వచ్చింది. మహబూబ్‌నగర్ ఎర్రవల్లిలో బాబా కారు డ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైఫ్‌స్టైల్ షోరూం ఓనర్ మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి కోటిన్నర నగదు, బంగారంతో దొంగ స్వామి ఉడాయించాడు. సీసీటీవీ పుటేజ్ లో నకిలీ బాబా దృశ్యాలపై స్పష్టత లేదు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి దొంగబాబా కోసం మహబూబ్ నగర్, బెంగుళూరు, సుచిత్రలో గాలిస్తున్నారు. పోలీసు ప్రత్యేక బృందం బెంగళూరు వెళ్లింది. నకిలీబాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటల్లో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఘటన తర్వాత సుచిత్రర, శామీర్ పేట్ లో ఇద్దరితో బాబా ఫోన్ లో మాట్లాడిట్లుగా గుర్తించారు. 
హైదరాబాద్ లోని కొందరు ప్రముఖులతో బాబాకు సంబంధాలున్నట్లు సమాచారం.  
వివరాల్లోకి వెళితే.. 
నగరం నడిబొడ్డులో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. బంజారాహిల్స్‌లోని లైఫ్‌స్టైల్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కోటి 30 లక్షలతో ఓ మాయగాడు తస్కరించాడు. బేగంపేట లైఫ్‌స్టైల్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లో తన ఇంటికి ఈ మధ్యే మరమ్మతులు చేయించాడు. నిర్మాణానంతరం పూజ చేయించుకోవాలనే ఉద్దేశంతో తనకు పరిచయం ఉన్న కర్నాటకకు చెందిన శివ అనే బాబాను ఆశ్రయించాడు. మంగళవారం రోజు బాబా నగరానికి చేరుకున్నాడు. ఇతనికి ఓరిస్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఇక బుధవారం నాడు మదుసూదన్‌రెడ్డి ఇంట్లో పూజలు నిర్వహించారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగ బాబా ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో ప్రసాదంలో మత్తు మందు కలిపి మదుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఇచ్చాడు. అనంతరం సమీపంలో ఉన్న దేవాలయంలో కూడా పూజలు చేయాలని నమ్మించి..పూజలో పెట్టిన డబ్బుతో సహా మదుసూదన్‌రెడ్డి కుమారుడిని తనతోపాటు తీసుకెళ్లాడు. 
కోటి 30 లక్షలు కొట్టేసిన బాబా
అనంతరం మదుసూదన్‌రెడ్డి కుమారుడితో పాటు బాబా హోటల్‌కు చేరుకున్నాడు. హోటల్‌ గదిలో ధ్యానం చేయమని ఆ అబ్బాయికి చెప్పి వాహనంలో ఉన్న కోటి 30 లక్షల రూపాయలను తన వాహనంలోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత తాను వెళ్లిపోతున్నట్లు చెప్పి బాబా కర్నాటకకు వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన తనయుడికి.. ఇంట్లో తల్లిదండ్రులు మత్తులో పడి ఉండడం గమనించాడు. దీంతో అనుమానం వచ్చి.. వాహనంలో తనతో పాటు తీసుకెళ్లిన డబ్బును వెతికాడు. అయితే అవి కనిపించడలేదు. దీంతో దోపిడీని పసిగట్టిన వారు పోలీసులను ఆశ్రయించారు. 
మధుసూదన్‌రెడ్డి ఆస్పత్రికి తరలింపు 
మత్తులో ఉన్న మదుసూదన్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మదుసూదన్‌రెడ్డి కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాబా ముసుగులో వచ్చి భారీ మొత్తంలో నగదును తస్కరించడంతో నగరవాసుల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మితే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోక తప్పదని పోలీసులు అంటున్నారు. 

10:46 - June 16, 2016

ఫోన్..ఇప్పుడు ప్రతొక్కరి చేతిలో కనిపిస్తోంది. ఇందులో రకరకాల ఫీచర్స్ తో రోజుకో సెల్ ఫోన్ లను కంపెనీలు మార్కెట్లో వదులుతున్నాయి. కానీ ఈ సెల్ ఫోన్ వల్ల కొంతమంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రయాణాలు..పనులు చేసే సమయంలో ఫోన్ ఉపయోగిస్తుంటే పక్కన ఉన్న వారు తొంగి చూస్తూ ఉంటుంటారు. ఇది చాలా మందికి అసౌకర్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ ను యూజ్ చేస్తుంటే తాము ఏం చూస్తున్నామో..ఎం చేస్తున్నామో ఎవరికీ కనిపించకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఫోన్ యూజ్ చేసే సమయంలో పక్కన ఉన్నవారు చూసిన వారికి ఏం కనిపించదంట. అవును ఇది నిజం. ఇలాగే సమస్యను ఎదుర్కొన్న వ్యక్తి ఓ సాధానాన్ని తయారు చేశాడు. అదే 'చిప్'...టర్కీకి చెందిన సెలల్ అనే వ్యక్తి చిప్ ను రూపొందించాడు. ఈ చిప్ ను స్మార్ట్ ఫోన్ లలో అమర్చగానే స్ర్కీన్ మొత్తం నల్లగా మారిపోతుంది. తరువాత స్ర్కీన్ ని ప్రత్యేకంగా రూపొందించిన కళ్లజోడుతో చూసే విధంగా మరో చిప్ ను రూపొందించాడు. బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కళ్లజోడుని స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక మనం మొబైల్ లో ఏం చేసినా.. ఏం చూసినా.. మనకు మాత్రమే కనిపిస్తుంది. పక్కన ఎవరున్నా, ఎంతమంది ఉందన్నా డోంట్ కర్ అనొచ్చు. నిర్భయంగా మన పని మనం చేసుకోవచ్చు.

అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నుమూత..

న్యూఢిల్లీ : అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ దత్తా (64) గురువారం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు.

 

పీఎస్ఎల్ వీ సీ -34 ప్రయోగం వాయిదా..

నెల్లూరు : పీఎస్ఎల్ వీ సీ -34 వాహన నౌక ప్రయోగం వాయిదా పడింది. ఈనెల 20న ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

 

బీకే గూడలో యువతిపై అత్యాచారయత్నం..

హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్ పరిధిలోని బీకే గూడలో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఓ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి యత్నించాడు. యువతి తప్పించుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

హిమాచల్ లో వర్షాలు..వరి పంట నష్టం..

హిమాచల్ ప్రదేశ్ : గత 24గంటలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దాదౌర్ గ్రామంలోని వరి పంట మొత్తం నానిపోయింది.

డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు..

హైదరాబాద్ : మాదాపూర్ లోని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భారీగా ఆస్తులున్నట్లు గుర్తించింది. అలకాపురి, నల్లకుంటలో రెండిళ్లు, మాదాపూర్ లో ప్లాటు, హయత్ నగర్ లో రెండు ఎకరాలు, ఆదిభట్లలో 4 ఎకరాలు, ఐదు లక్షల నగదు, విజయ్ కుమార్ భార్య పేరిట పలు కంపెనీలున్నట్లు అధికారులు గుర్తించారు.

మహంకాళిలో ఛైన్ స్నాచింగ్..

హైదరాబాద్ : మహకాంళి పీఎస్ పరిధిలో ఛైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మెడలో నుండి రెండు తులాల గోల్డ్ ఛైన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు.

09:46 - June 16, 2016

ఇటీవల ప్రజల్లో సెల్ఫీలపై మోజు బాగా పెరుగుతోంది. సెల్ఫీ తీసుకోవడం కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయినప్పటికీ సెల్ఫీ మీద మోజు మాత్రం తగ్గడం లేదు. సరిగ్గా అలాంటి ఓ సెల్ఫీ పిచ్చోడిగా అల్లరి నరేష్‌ ఏకంగా పాముతోనే సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా మరో చేతిలో కెమెరా లేని ల్యాండ్‌ ఫోన్‌ పట్టుకున్నాడు. ఇదంతా దేనికి? సెల్ఫీ తీసుకుంటున్నానని పాముని బుట్టలో వేయడానికా?, పాముతోనే సెల్ఫీ తీసుకుంటున్నానని వేరే వాళ్ళని బుట్టలో వేయడానికా..? దేనికనేది మాత్రం వెండితెర మీద చూడాల్సిందేనని అంటోంది చిత్రయూనిట్‌. అల్లరినరేష్‌, సాక్షి చౌదరి, కమ్నా రనవత్‌ హీరోయిన్లుగా జి.ఈశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యానర్‌పై చలసాని రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం 'సెల్ఫీరాజా'. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌, టీజర్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో బుధవారం మరో రెండు పోస్టర్లను విడుదల చేశారు. పామును చేతిలో పట్టుకుని కెమెరాలేని ల్యాండ్‌ఫోన్‌తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న ఫొటో చూస్తుంటే సెల్ఫీపై ఆయనకున్న పిచ్చి చెప్పకనే చెబుతోంది కదూ. ఇలాంటి లీలలు సినిమాలో చాలా ఉన్నాయని అంటోంది చిత్రయూనిట్‌. సాయి కార్తీక్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను త్వరలో విడుదల చేసి, జులైలో సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

 

09:42 - June 16, 2016

అలనాటి అందాల తార శ్రీదేవి 'మామ్‌'గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవి, అద్నాన్‌ సిద్దిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్‌ ప్రధాన పాత్రధారులుగా మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న బాలీవుడ్‌ చిత్రం 'మామ్‌'. ఈచిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల జార్జియాలో ఒక షెడ్యూల్‌ నిర్వహించారు. -7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ శ్రీదేవి యాక్ట్ చేయడం విశేషంగా భావిస్తున్నామని చిత్రయూనిట్‌ ప్రశంసల వర్షం కురిపించింది. జార్జియాలోని వాతావరణం షూటింగ్‌కి అనుగుణంగా లేదు. అయినప్పటికీ ఆర్టిస్టులందరూ బాగా సహకరించారు. వారి సహకారంతోనే అనుకున్న సమయంలో జార్జియా షెడ్యూల్‌ని పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా శ్రీదేవి అందించిన సహకారం మరువలేనిది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం షూటింగ్‌ సజావుగా సాగేందుకు శ్రీదేవి ఎంతో దోహదపడ్డారని చిత్రయూనిట్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. రవి ఉదరువర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'పులి' చిత్రం తర్వాత శ్రీదేవి నటిస్తున్న చిత్రమిది.

 

09:36 - June 16, 2016

బాలీవుడ్ లో ప్రస్తుతం వివాదస్పద చిత్రంగా మారిన 'ఉడ్తా పంజాబ్' కు మరో షాకింగ్ న్యూస్ తగిలింది. మర రెండు రోజుల్లో ప్రేక్షకుల ఎదుట రావాల్సిన ఈ సినిమా మొత్తం బయటకు వచ్చేసిందనే కథనాలు వెలువడుతున్నాయి. పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన సంచలనాత్మక చిత్రం 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే టోరెంట్లలో లీక్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరు లీక్ చేశారు ? ఎలా లీక్ అయ్యింది ? అనేది తెలియడం లేదు. దీనికి కారణం సెన్సార్ వాళ్లే కావచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెన్సార్ చేయడానికి ఇచ్చిన ప్రింటును యథాతథంగా లీక్ చేశారని, ఇందుకు వారే కారణమని ఆరోపిస్తున్నారు.

సెన్సార్ తో వివాదం..
'ఉడ్తా పంజాబ్'...బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వ వహించి షాహీద్ కపూర్ హోరోగా ఈ చిత్రంలో నటించారు. దీనిపై తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ అనంతరం సెన్సార్ కు వెళ్లింది. అయితే ఈ సినిమాలో పంజాబ్‌ స్టేట్‌ కు సంబంధించిన అంశాలన్నింటిని తీసివేయాలని సెన్సార్‌ బోర్డు స్పష్టం చేసింది. దాదాపు 89 సీన్స్‌ ను కట్‌ చేయాలని పేర్కొంది. దీనితో చిత్ర బృందం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చివరకు 13 కట్ లతో సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి వివాదస్పద సీన్లు లేవని ఒక్క కట్ తో 48 గంటల్లోగా 'ఉడ్తా పంజాబ్' కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని న్యాయస్థానం సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీనితో ఈ సినిమా జూన్ 17న విడుదలవుతుందని కోర్టు స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సినిమాపై స్టే విధించాలని ఎన్జీఓ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

09:32 - June 16, 2016

చిత్తూరు : వైసీపీ నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికార పక్షమైన టిడిపిలోకి జంప్ అవుతూ వైసీపీకి ఝలక్ ఇస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే పచ్చకండువా కప్పుకోనున్నారు. తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాభివృద్ధి సహకరించడానికే తాము పార్టీని మారుతున్నట్లు వలస నేతలు చెప్పుకొస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమానేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి టిడిపి గూటికి చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం ఉదయం 11.30 గంటలకు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 19 ఎమ్మెల్యేలు టీడీపీకి గూటికి చేరిన సంగతి తెలిసిందే. అమర్ నాథ్ చేరికతో ఆ సంఖ్య 20 కి చేరనుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
 

 

వీరమరణం పొందిన జవాన్ కు ఘననివాళులు..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన అజయ్ చౌదరీ జవాన్ మృతదేహానికి ఆర్మీ ఉన్నతాధికారులు నివాళులర్పించారు. మచిల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ చౌదరీ వీరమరణం పొందారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు.

09:23 - June 16, 2016

పంటి నొప్పి..ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఏది తిననివ్వదు..కనీసం కాఫీ..టీ..జ్యూస్ తాగాలంటే ఎంతో బాధ పడుతుంటుంటారు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. అందర్నీ తరచూ ఇబ్బంది పెడుతుంటుంది. ఈ పంటి నొప్పి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పంటినొప్పిని తొందరగా మాయం చేసే సింపుల్ హోమ్ టిప్స్..
పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాటు నమలండి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. నమలడం ఇష్టం లేకపోతే ఉల్లి ముక్క తీసుకుని నొప్పి ఉన్న పంటిపై పెట్టుకోవాలి.
ఎన్నో గుణాలు కలిగిన లవంగాన్ని పొడి చేయాలి. ఇందులో ఆలీవ్ లేదా వెజిటెబుల్ ఆయిల్ కలపాలి. నొప్పిగా ఉన్న పంటిపై ఈ పేస్టు పెట్టండి.
ఉప్పు, మిరియాల పొడిని సమానంగా తీసుకోవాలి. కొంచెం నీటితో బాగా కలపాలి. ఈ పేస్టును నొప్పిగా ఉండే పంటిపై డైరెక్టుగా అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పంటినొప్పి తగ్గుతుంది.
ఒక రెబ్బ వెల్లుల్లిని తీసుకుని దీనిని మెత్తగా చేయాలి. దీనికి టేబుల్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ కలపాలి. అనంతరం నొప్పిగా ఉన్న పంటిపై అప్లై చేయాలి.

09:12 - June 16, 2016

దక్షిణ అమెరికా ఖండంలో తొలిసారిగా ఒలింపిక్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బ్రెజిల్ లో జరిగే రియో ఒలింపిక్, పారా ఒలింపిక్ కోసం 'ఏ న్యూ వరల్డ్' (కొత్త ప్రపంచం) అనే స్లోగన్ విడుదల చేశారు. ప్రతి ఒలింపిక్స్ కోసం పతకాలను..టార్చ్ ను, మస్కట్ ను, స్లోగన్ లను ప్రత్యేకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్‌, పారాలింపిక్‌ పోటీల కోసం స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఆవిష్కరించారు. సమ్మర్‌ ఒలింపిక్స్‌ కోసం మొత్తంగా 2,488 పతకాలను ఆవిష్కరించారు. ఇందులో 812 స్వర్ణ, 812 రజత, 864 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒకొక్కటీ 500 గ్రాములు బరువు ఉన్నాయి. పారా ఒలింపిక్‌ కోసం 2,642 పతకాలు ఆవిష్కరించారు. ఇందులో 877 బంగారు, 876 రజత, 889 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ పారా ఒలింపిక్‌ పతకా లన్నింటీ మీద 'రియో 2016 పారాలింపిక్‌ గేమ్స్‌' అని బ్రయిలీ లీపిలో రాశారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడారు. రియో ఒలింపిక్స్ గొప్ప అనుభూతినివ్వనున్నాయని, ఒలింపిక్స్ కు ముందు..తరువాత కూడా రియో డి జనెరియో ఉత్తమ నగరం..50 రోజుల్లో దీనిని చూడనున్నారని తెలిపారు.

09:07 - June 16, 2016

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'రోబో 2.0'. 2010లో విడుదలైన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. 'రోబో 2.0' చిత్రం షూటింగ్‌ ప్రారంభించి బుధవారంతో 100 రోజులైందని దర్శకుడు శంకర్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. నేటితో 100 రోజుల షూటింగ్‌ పూర్తయ్యింది. ఇన్ని రోజుల షూటింగ్‌లో రజనీకాంత్‌, అక్షరుకుమార్‌ పాల్గొనగా క్లయిమాక్స్‌తోపాటు రెండు భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని పూర్తి చేశాం. దీంతో 50% శాతం షూటింగ్‌ పూర్తయ్యిందంటూ ట్వీట్‌తోపాటు సెట్‌లో రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోని కూడా పోస్ట్‌ చేశారు. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ స్వరాల్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన అమీజాక్సన్‌ నటిస్తుండగా, ప్రతినాయకుడిగా అక్షరుకుమార్‌ నటిస్తున్నారు.

 

09:05 - June 16, 2016

ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 24న ధర్మశాలలో జరగనుంది. కోచ్ ఎంపికతో పాటు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంంది. ఈ సమావేశానికి ఒక్క రోజు ముందు ధర్మశాలలోనే రంజీ ట్రోఫీ జట్ల కోచ్ లు, కెప్టెన్లు సమావేశం అవుతుండడం చర్చనీయాంశమైంది. ఇది సాధారణ సమావేశమని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నా ప్రస్తుత ప్రధాన అంశమైన కోచ్ ఎంపికీ ఈ భేటీలోనే జరగనుందని వార్తలు వెలువడుతున్నాయి. లోథా కమిటీ సిఫార్సులు అమలు పరచడంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశ్రాస్త్రి, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని కథనాలు వెలువడుతున్నాయి. కోచ్ పదవికి దేశవిదేశాల నుండి మొత్తం 57 దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం నిబందనలకు లోబడి ఉన్నవాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని బీసీసీఐ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మాజీ భారత క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, బల్విందర్ సందూ, హృశికేశ్ కనిత్కర్ లు కూడా పోటీ పడుతున్నారు. కోచ్ అప్లికేషన్ కు బీసీసీఐ జూన్ 10వ తేదీన డెడ్ లైన్ గా విధించిన సంగతి తెలిసిందే.

08:56 - June 16, 2016

తమ మధ్య మూడో వ్యక్తికి ప్రవేశానికి తాను అనుమతించడం జరగదని బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఇటీవల అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మధ్య విబేధాలు పొడచూపినట్లు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా 'సరబ్ జిత్' స్ర్కీనింగ్ సమయంలో అభిషేక్..ఐశ్వర్య కలిసి ఫొటోలు తీసుకొనే సమయంలో మధ్యలోనే ఐశ్వర్యను వదిలిపోయినప్పటి నుండి పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఐశ్వర్య లిప్ స్టిక్ పై కూడా అభిషేక్ వివాదాస్పదంగా మాట్లాడడంతో వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు వెలువడ్డాయి. అయితే దీనికంతటికి అభిషేక్ తెరిదించే ప్రయత్నం చేశారు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు అంశాలను పేర్కొన్నారు. ఏది నిజమో తనకు తెలుసని..మీడియాను ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలో కూడా తనకు తెలుసని పేర్కొన్నారు. తమ మధ్య మూడో వ్యక్తి ప్రవేశానికి తాను అనుమతించడం జరగదని, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో తమకు తెలుసని పేర్కొన్నారు. వీరిపై వస్తున్న వార్తలు బ్రేక్ పడుతాయా ? లేదా ? అనేది చూడాలి.

08:46 - June 16, 2016

విశాఖ : జిల్లాలో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాడేరు ఏఎస్పీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శశికుమార్ 6 నెలల క్రితం పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇతను తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన వ్యక్తి. ఇదిలా ఉంటే చేతిలో ఉన్న పిస్టల్ పేలడంతో శశి కుమార్ కుప్పకూలాడు. వెంటనే తోటి వారు ఇది గమనించి రక్తపు మడుగులో ఉన్న శశికుమార్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ అతను మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. శశికుమార్ తలపై బుల్లెట్ గాయాన్ని గుర్తించారు. ఏఎస్పీ మృతిని పోలీసులు ధృవీకరించారు. రివాల్వర్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి చనిపోయాడా ? లేక ఆత్మహత్యా చేసుకున్నాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గన్ మిస్ ఫైర్ కావడంతో శశికుమార్ మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సంఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పాడేరు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

జెడ్పీ ఛైర్మన్ పై మంత్రి మాణిక్యాలరావు ఆగ్రహం..

పశ్చిమగోదావరి : మంత్రి మాణిక్యాలరావు...టిడిపి జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య విబేధాలు పొడచూపాయి. జెడ్పీ ఛైర్మన్ అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడం లేదని మంత్రి ఆగ్రహంతో ఉన్నారు. టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావుకు మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఫిర్యాదు చేయనున్నారు.

బంజారాహిల్స్ చోరీలో పురోగతి..

హైదరాబాద్ : బంజారాహిల్స్ చోరీ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. మహబూబ్ నగర్ ఎర్రవెల్లిలో స్వామిజీ కారు డ్రైవర్ ను శివను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి లైఫ్ స్టైల్ షోరూం యజమాని మధుసూధన్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రసాదంలో మత్తుమందు కలిపి కోటిన్నర నగదు, బంగారంతో దొంగ స్వామి ఉడాయించిన సంగతి తెలిసిందే.

గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ : శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 ప్రైవేటు బస్సులపై కేసు నమోదు చేశారు.

 

ప్రధాని నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ..

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాసారు. లేఖలో ఆర్ బిఐ గవర్నర్ రఘురామరాజన్ పై మనీ ల్యాండరింగ్ ఆరోపణలు చేశారు. రఘురామరాజన్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. రఘురామరాజన్ పై అవినీతి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

 

గోవాలో విద్యుత్ శాఖ మంత్రుల సదస్సు..

విజయవాడ : గోవాలో రెండు రోజుల పాటు విద్యుత్ శాఖ మంత్రులు సదస్సు జరగనుంది. శుక్రవారం నుండి శనివారం వరకు జరిగే ఈ సదస్సులో ఏపీ మంత్రి కె. అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.

 

08:28 - June 16, 2016

టీసర్కార్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందని వక్తలు పేర్కొన్నారు. 'టీసర్కార్ వ్యవహార శైలి..పార్టీ ఫిరాయింపులు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రజాశక్తి మాజీ ఎడిటర్, విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు జగన్ లాల్ నాయక్, బిజెపి నేత రాకేష్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘింస్తోందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

08:25 - June 16, 2016

శరీర సౌష్టవం పెంచుకొనేందుకు..ఆరోగ్యం ఉండేందుకు మంచి ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి. వ్యాయామంలో కూడా స్కిప్పింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ప్రతి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి స్కిప్పింగ్ చేసి ఫలితాలను చూడమంటున్నారు.
స్కిప్పింగ్ చేయడానికంటే ఐదు నిమిషాల ముందు వార్మప్ వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.
రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం ధృడత్వం ఉండడంతో పాటు పూర్తిస్తాయిలో ఫిట్ గా ఉంటుంది. ఎముకలు గట్టిపడుతాయి. చర్మపై ఏర్పడిన ముడతలు తొలగిపోతాయి.
శరీరంలోని అవయవాల కదలికను వేగవంతం చేయడంతో పాటు వాటి మధ్య సమన్వయానికి తోడ్పడుతుంది.
స్కిప్పింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల నొప్పి కలుగుతుంది. దీనితో పాటు పగుళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక బూట్లు తప్పకుండా వేసుకోవాలి.
బరువు తగ్గించడంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. 

08:19 - June 16, 2016

ప్రస్తుతం..కళ్లజోడు అందరికీ వస్తోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కళ్లజోడు పెట్టుకొనే పరిస్థితి వస్తోంది. అయితే కొంతమంది రెగ్యులర్ గా పెట్టుకొనే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనివల్ల ముక్కు మీద మచ్చలు ఏర్పడుతుంటాయి. మచ్చలు కనిపించకుండా ఉండాలని పలు ప్రయత్నాలు చేస్తుంటారు. మచ్చలు కనిపించకుండా చర్మాన్ని తాజాగా మార్చాలంటే కొన్ని చిట్కాలు...
తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది.
రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
కీరదోసను గుజ్జులా చేసి మచ్చపడిన ప్రాంతలో పూతలా వేయాలి. అంతేగాకుండా కీరదోస రసంలో టమాట..బంగాళాదుంపల రసం కలిపి కూడా ముక్కుకు పట్టించాలి. కాసేపటి తరువాత కడిగేసుకోవాలి.
నిమ్మరసంలో రెండు..మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. 

08:14 - June 16, 2016

విశాఖను మంచినీటి కష్టాలు చుట్టుముట్టాయి. నాలుగు బిందెలు నీళ్లు అవసరమున్న చోట ఒక్క బిందెతోటే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జల వనరులున్నా, సమస్య పరిష్కారానికి మార్గాలున్నా, విశాఖవాసులు గుక్కెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. విశాఖపట్టణం గుక్కపట్టి ఏడుస్తోంది. గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తోంది. మనుషులకు నీళ్లు లేవు. పరిశ్రమలకు నీళ్లు లేవు. ఎక్కడ చూసినా పానిపట్టు యుద్ధాలే.  ధర్నాలు, ఆందోళనతో ఉక్కునగరం దద్దరిల్లుతోంది. 
విశాఖకు రోజుకి 200 ఎంజిడిల నీరు అవసరం 
విశాఖ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరం. సిటీ జనాభా 20 లక్షలు దాటింది. దాదాపు 5 లక్షల కుటుంబాలున్నాయి. సగం ఇళ్లకు కూడా నీటి కులాయిలు లేవంటే ఆశ్చర్యపోకండి. కేవలం లక్షా 80 వేల కుటుంబాలకు మాత్రమే నీటి కులాయిలున్నాయి. విశాఖకు రోజుకి కనీసం 200 ఎంజిడిల నీరు అవసరం. కానీ, వేసవి ప్రారంభానికి ముందు కేవలం 95 ఎంజిడిలు మాత్రమే సరఫరా చేసేవారు. ఇప్పుడు అది 50 ఎంజిడిలకు పడిపోయింది. అంటే, విశాఖ మంచినీటి అవసరాల్లో పావు శాతం కూడా తీర్చలేని దుస్థితి.  ఆరిలోవ, మధురవాడ, గాజువాక, పెందుర్తి, వన్ టౌన్, కొండవాలు ప్రాంతాలు, మురికివాడలు రెండు రోజులకోసారి అరగంట ఇచ్చే నీళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 
బాగా విస్తరించిన విశాఖనగరం 
గత 15 ఏళ్లలో విశాఖనగరం బాగా విస్తరించింది. జనాభా పెరిగింది. కానీ, అందుకుతగ్గట్టుగా మంచినీటి ప్రాజెక్టులు చేపట్టలేదు. ఈ ఏడాది మంచినీటి సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా చుట్టుముట్టింది. స్టీల్ ప్లాంట్ లో ని కొన్ని విభాగాల్లో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. మరికొన్ని పరిశ్రమలకూ నీటి కష్టాలు తప్పడం లేదు. 
ఏలేరులో నిలిచిపోయిన నీటి సరఫరా 
విశాఖపట్టణానికి గోదావరి, ఏలేరు, మేఘాద్రిగడ్డ, తాడిపూడి, రైవాడ ప్రధాన జలవనరులు. గోదావరి, ఏలేరు రిజర్వాయర్ ల ద్వారా వచ్చే నీళ్లలో ఎక్కువ భాగం స్టీల్ ప్లాంట్, ఎన్ టిపిసి, గంగవరం పోర్టు, ఇతర పరిశ్రమలకు కేటాయించారు. ఏలేరులో నీటి సరఫరా నిలిచిపోయింది. మేఘాద్రిగడ్డలో నీరు తగ్గింది. ముడసరిలోవ, గంభీరం చిన్న రిజర్వాయరులు ఎండిపోయాయి. 
గోదావరి నికర జలాల్లో విశాఖకు 400 ఎంజిడిల నీరు 
బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నికర జలాల్లో 400 ఎంజిడిల నీళ్లను విశాఖకు కేటాయించారు. 1980లో ఈ కేటాయింపులు జరిగాయి. కానీ,  ఈ 36 ఏళ్ల నుంచి విశాఖ కేటాయించిన నీళ్లన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి.  గోదావరి నది మీద పురుషోత్తపట్నం దగ్గర ఎత్తిపోతల పథకం నిర్మిస్తే పోలవరం ఎడమ కాలవ ద్వారా విశాఖకు నీటి సరఫరా చేయొచ్చు. కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర స్రుజల స్రవంతికి 2009లో శంకుస్థాపన చేశారు. 7800 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్ట్ కి ఇప్పటి దాకా ఖర్చు చేసింది కేవలం మూడు కోట్ల. ఇప్పుడు ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న ఈ నిర్లక్ష్యమే విశాఖ మంచినీటి సమస్యకు కారణం. 

బంజారాహిల్స్ దోపిడి ఘటనపై డీసీపీ వివరణ..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో దోపిడి ఘటనపై లైఫ్ స్టైల్ ఛైర్మన్ ఇంట్లో వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీసీపీ వివరాలు మీడియాకు తెలియచేశారు. మధుసూధన్ రెడ్డి ఏడాది నుండి కర్ణాటకకు చెందిన ఓ స్వామిజీతో పరిచయం ఉందని, ఇంటి మరమ్మత్తుల అనంతరం కర్ణాటక నుండి స్వామిని మధుసూధన్ రెడ్డి పిలిపించారని పేర్కొన్నారు. మంగళవారం నగరానికి వచ్చిన స్వామిజీ బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో బస చేశాడని తెలిపారు. బుధవారం ఉదయం 11గంటలకు మధుసూధన్ రెడ్డి నివాసంలో పూజలు జరిగినట్లు, ఇంట్లో పూజలు రూ. 1.30 కోట్లను మధుసూధన్ రెడ్డి ఉంచారని తెలిపారు.

08:05 - June 16, 2016

విశాఖలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని విశాఖపట్టణం సిపిఎం నేత గంగారామ్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనథపం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'విశాఖపట్టణాన్ని మంచినీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ స్మార్ట్ సిటీలో సగానికి సగం నీటి సరఫరా పడిపోయింది. బిందెడు నీళ్ల కోసం జనం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? మంచినీటి సమస్యవల్ల సాధారణ ప్రజలతో పాటు స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? విశాఖ మంచినీటి సమస్యకు పరిష్కారం ఏమిటి? దానికున్న వనరులేమిటి? విశాఖలో మంచినీటి సమస్యకు బాధ్యులెవరు? లోపమెక్కడ వుంది? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:00 - June 16, 2016

హరారే : జింబాబ్వే టూర్‌లో ధోనీసేనకు పోటీనే లేకుండా పోయింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ముగిసిన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వేపై సునాయాస విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 
టీమిండియా ఖాతాలో మరో సిరీస్‌
వన్డే మాజీ చాంపియన్‌ టీమిండియా మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకున్న భారత జట్టు....ఆఖరి వన్డేలోనే అదే జోరు కొనసాగించింది. బౌలర్లు చెలరేగడంతో ఆతిధ్య జట్టును తక్కువ పరుగులకే స్కోర్‌ చేసిన భారత్‌...సునాయాస విజయాన్ని నమోదు చేసింది. 
మరోసారి తేలిపోయిన జింబాబ్వే 
హరారే స్పోర్ట్స్ క్లబ్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు మరోసారి తేలిపోయింది. గౌరవప్రదమైన స్కోర్‌ కూడా నమోదు చేయలేక చేతులెత్తేసింది.  భారత బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో 42.2  ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. 
150 పరుగుల మార్క్ దాటని జింబాబ్వే 
టాప్‌ ఆర్డర్‌లో చిబాబా, సిబందా ఫర్వాలేదనిపించినా...మిగతా బ్యాట్స్ మెన్‌ విఫమవ్వడంతో జింబాబ్వే టీమ్‌ 150 పరుగుల మార్క్ కూడా దాటలేకపోయింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా...స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 
భారత ఓపెనర్లు శుభారంభం
124 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్లు ఫజల్‌, రాహుల్‌ శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి  వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం జోడించి జట్టు విజయానికి పునాది వేశారు. రాహుల్‌ సూపర్‌ ఫామ్‌ కంటిన్యూ చేయగా....ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన ఫజల్‌ సైతం సత్తా చాటాడు. ఆడిన తొలి వన్డేలోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన రెండో భారత క్రికెటర్‌గా ఫజల్‌ అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు.
ఓపెనర్లిద్దరూ హాఫ్‌ సెంచరీలు
ఓపెనర్లిద్దరూ హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో ....భారత జట్టు మరో 169 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
3-0తో సిరీస్‌ సొంతం
21.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. 10 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి జింబాబ్వే జట్టును 123 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్‌ బుమ్రాకే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. మూడు వన్డేల్లోనూ కలిపి 196 పరుగులు చేసి సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన భారత ఓపెనర్‌ రాహుల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.
భారత జట్టు విజయంలో బౌలర్లదే కీలక పాత్ర
ఓవరాల్‌గా వన్డే సిరీస్‌లో భారత జట్టు విజయంలో బౌలర్లదే కీలక పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ధోనీ నాయకత్వంలోని టీమిండియా వన్డే టోర్నమెంట్‌  నెగ్గడం ఇది 12వ సారి కావడం విశేషం. సిరీస్‌ వన్డే సిరీస్‌లో తేలిపోయిన జింబాబ్వే జట్టు టీ 20ల్లో అయినా భారత జట్టుకు కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి.

 

07:52 - June 16, 2016

ఢిల్లీ : ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న పౌర విమానయాన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన పౌర విమాన యాన విధానానికి మోడీ సర్కార్‌ ఆమోదం తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రయాణికుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన ఏవియేషన్‌ విధానాన్ని రూపొందించింది. దేశంలోని చిన్న పట్టణాలకు విమానాల రాకపోకలను పెంచాలనే లక్ష్యంతో వైమానిక సంస్థలకు కేంద్రం పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది.
గంట ప్రయాణానికి ఛార్జి రూ.2500  
ప్రయాణ ఛార్జీలపై ఆంక్షల విధింపు కారణంగా గంట ప్రయాణానికి ఛార్జి కేవలం 2 వేల 500 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. అరగంట లోపు ప్రయాణించే విమాన చార్జీలను 13 వందలుగా నిర్ణయించాలని సమాచారం. చిన్న పట్టణాలకు వెళ్ళేందుకు టిక్కెట్ల ధరపై ఆంక్షల వల్ల విమానయాన సంస్థలకు వచ్చే నష్టంలో 80 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని నూతన విధానంలో ప్రతిపాదించారు. 
2027 నాటికి 20 కోట్ల టికెట్లు విక్రయించాలని లక్ష్యం
2022 నాటికి డొమొస్టిక్‌ సెక్టార్‌లో 30 కోట్లు, 2027 నాటికి 50 కోట్ల ఎయిర్‌ టికెట్లను విక్రయించడమే లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందించారు. అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించి 2027 నాటికి 20 కోట్లు టికెట్లు విక్రయించాలన్నది ధ్యేయంగా పెట్టుకున్నారు. 
ప్రతి చార్జీకి రీఫండ్‌ 
ప్రోమో స్పెషల్‌ ఫెయిర్స్ తో పాటు ప్రతి చార్జీకి రీఫండ్‌ వర్తిస్తుంది. రీఫండ్‌ ప్రాసెసింగ్‌ పేరుతో అధిక రుసుము వసూలు చేయడానికి వీల్లేదు.  ట్రావెల్‌ ఏజెన్సీలు, ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా బుక్‌ చేసి టికెట్లకు సంబంధించిన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ 15 రోజుల్లోగా రీఫండ్‌ చెల్లించాల్సి ఉంటుంది. వికలాంగులకు ప్రాధాన్యత నివ్వడం కోసం నిబంధనల్లో మార్పు తెస్తున్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్నప్రాంతీయ అనుసంధాన నిధి కోసం విమాన టిక్కెట్లపై 2 శాతం సెస్ విధించనున్నారు.
20 విమానాలుంటే అంతర్జాతీయ సర్వీసులు నడపొచ్చు
గతంలో ఉన్న నిబంధన ప్రకారం ఐదేళ్లు అనుభవం, 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడపవచ్చు. కానీ ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం ఎటువంటి అనుభవం లేకపోయినా కనీసం ఇరవై విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడపవచ్చు. కొత్త నిబంధనతో విస్తారా, ఎయిర్‌ ఏషియా సంస్థలు లబ్ధిపొందనున్నాయి. వీరు చేయాల్సిందల్లా విమానాల సంఖ్యను 20కు పెంచుకోవడమే. గత 18 నెలల నుంచి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అనేక చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలు రూపొందాయి. కొత్త వైమానిక పాలసీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న వార్తతో విమానయాన సంస్థల షేర్లు దాదాపు 5శాతం పెరిగాయి.

 

నేడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనలు..

హైదరాబాద్ : హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల ఎదుట తెలంగాణ న్యాయవాదుల మౌనదీక్ష చేపట్టనున్నారు. అక్కడే వంటవార్పు చేస్తూ తమ నిరసనను తెలియచేయనున్నారు. 

నేడు టీఎస్ పీజీ ఈసెట్ ఫలితాలు..

హైదరాబాద్ : నేడు టీఎస్ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఉదయం 11గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

07:44 - June 16, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో బడి పిలుస్తోంది కార్యక్రమం కొనసాగుతోంది.. డ్రాపౌట్స్ తగ్గింపు, సర్కారు బడుల్లో సౌకర్యాల పెంపు లక్ష్యంగా అధికారులు వారం రోజులపాటు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.. ఊరూ వాడా తిరుగుతూ పిల్లల్ని స్కూళ్లలో చేరుస్తున్నారు. బడి ఈడు పిల్లలంతా పాఠశాలల్లో ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ నెల 21వరకూ ఇది కొనసాగనుంది. ఇందులో జిల్లాల డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు.. బడి పిలుస్తోందిలోభాగంగా ఈ నెల 15న కృష్ణా జిల్లాలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడం, చిన్నారులను స్కూళ్లలో చేర్పించడం చేశారు..
ఈ నెల 16న బడి ఉత్సవం నిర్వహణ
గురువారం బడి ఉత్సవం నిర్వహించబోతున్నారు.. ఈ ఉత్సవంలో సర్పంచ్‌లను భాగస్వామ్యం చేస్తారు.. చిన్నారులను స్కూళ్లకు పంపేలా తల్లిదండ్రులతో మాట్లాడతారు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ చేస్తారు.. జానపద నృత్యాలు, కళాజాతాలతో చదువు ఆవశ్యకత వివరిస్తారు.. వెనకబడిన పల్లెల్లో రాత్రి బస చేస్తారు.. 
ఈ నెల 17న బాలికా ఉత్సవం
17న బాలికా ఉత్సవానికి అధికారులు ప్లాన్ చేశారు.. కస్తూర్బా బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలను మండలస్థాయి బృందాలు సందర్శిస్తాయి..
పేదరికం, అసౌకర్యాలు, ఇబ్బందులను అధిగమిస్తూ చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరిస్తారు.
ఈ నెల 18న ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లల ఉత్సవం
ఈ నెల 18న ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లల ఉత్సవానికి ఏర్పాట్లు చేశారు.. దృష్టిలోపం, వినికిడి సమస్య, మూగ, డిస్ లెక్సియాతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులను భవిత కేంద్రాలకు ఆహ్వానిస్తారు.. భవిత కేంద్రాల్లో పిల్లలకు అందే ప్రయోజనాలు చెబుతారు.. డ్రాపౌట్స్ గా మారినవారు మళ్లీ చదువు కొనసాగేలా చూస్తారు.. 
ఈ నెల 19న విద్యా సదస్సు 
ఈ నెల 19న విద్యా సదస్సుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు.. పాఠశాల యాజమాన్య కమిటీలతో మండలస్థాయిలోవిద్యా సదస్సులు నిర్వహిస్తారు. పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనంలాంటి సౌకర్యాలను ప్రజలకు వివరిస్తారు..
ఈ నెల 20న విద్యార్థుల ఉత్సవం
ఈ నెల 20న విద్యార్థుల ఉత్సవం నిర్వహించబోతున్నారు.. ప్రతి పాఠశాలలో విద్యార్థులు పదో తరగతి వరకు చదువు కొనసాగించేలా విద్యార్థుల్లో ప్రేరణ నింపుతారు. స్టుడెంట్స్‌తో ప్రతిజ్ఞ చేయిస్తారు.. వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, చర్చలు నిర్వహిస్తారు. విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు..
ఈ నెల 21న జన భాగస్వామ్య దినం
చివరిరోజైన 21వ తేదీన జన భాగస్వామ్య దినంగా పాటించనున్నారు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు అంతాకలిసి మధ్యాహ్న భోజనం తింటారు. భోజన నాణ్యత పెంచడంపై చర్చిస్తారు.

07:39 - June 16, 2016

కృష్ణా : విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్జెటరీ నిధులతోపాటు, భూసేకరణకు కేటాయించాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో మెట్రో నిర్మాణ పనులు కార్పొరేషన్‌కు తలనొప్పిగా మారాయి. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్య పట్టిపీడిస్తోంది. 2018నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారుతోంది.
ఒక్కపైసా విడుదల కాలేదు
రాష్ట్ర బడ్జెట్‌లో తొలి ఏడాది ప్రకటించిన 300కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా విడుదల కాలేదు. కేంద్రబడ్జెట్‌లో 100కోట్ల రూపాయలకు మించి నిధులు వెచ్చించలేదు. దీంతో మెట్రోరైలు ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. వచ్చే కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారా అన్నది సందిగ్ధంగానే ఉంది. ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా భూసేకరణ జరగాలి. భూసేకరణకు దాదాపు 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మైట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
నిధుల విడుదలే సమస్య
కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం భూసేకరణకు సిద్ధంగా ఉన్నా, నిధుల విడుదలే సమస్యగా మారింది. నెలన్నర క్రితం సీఎం చంద్రబాబు అమరావతి మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డితో దీనిపై చర్చించారు. 150 కోట్లరూపాయలను తక్షణమే విడుదల చేస్తామని హామి ఇచ్చారు. అయినా నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. మెట్రో నిర్మాణ కోసం నిధులు ఇవ్వడానికి జపాన్‌ కంపెనీ 'జైకా' ముందుకు వచ్చినా ఆ నిధులు కేవలం నిర్మాణ పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూసేకరణకు ఖర్చు పెట్టడానికి వీల్లేదు.  దీంతో విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి కేంద్రం  హామీలు ఇచ్చినా.. వాటిని అమలు చెయ్యడానికి వెనుకంజ వేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని భూసేకరణ, నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. లేదంటే విజయవాడ మెట్రో రైలుకు ఇప్పట్లో మోక్షం లభించేలాలేదు. 

 

కుటుంబ సభ్యులతో కలిసి నేడు బ్రిటన్ వెళ్లనున్న జగన్

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు బ్రిటన్ వెళ్లనున్నారు. 

నేడు గ్రేటర్ పరిధిలో ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నేడు గ్రేటర్ పరిధిలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష చేయనున్నారు. 

పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆత్మహత్య

విశాఖ : పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. 6 నెలల క్రితం పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 

07:18 - June 16, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో సినీఫక్కీలో దోపిడీ జరిగింది. ఇల్లు మరమ్మతులు చేసుకుని పూజ చేయమని పిలిస్తే ఇంటినే ఊడ్చేశాడు మాయగాడు. పూజ పేరుతో కోటి 30 లక్షలతో ఉడాయించాడు దొంగ బాబా. అయితే నోట్ల కట్టలు చూసి ఆశతో దోపిడీకి పాల్పడ్డాడా లేక పక్కా ప్లానింగ్‌తో మాయ చేశాడా తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 
సినీఫక్కీలో దోపిడీ 
నగరం నడిబొడ్డులో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. బంజారాహిల్స్‌లోని లైఫ్‌స్టైల్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కోటి 30 లక్షలతో ఓ మాయగాడు తస్కరించాడు. బేగంపేట లైఫ్‌స్టైల్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లో తన ఇంటికి ఈ మధ్యే మరమ్మతులు చేయించాడు. నిర్మాణానంతరం పూజ చేయించుకోవాలనే ఉద్దేశంతో తనకు పరిచయం ఉన్న కర్నాటకకు చెందిన శివ అనే బాబాను ఆశ్రయించాడు. మంగళవారం రోజు బాబా నగరానికి చేరుకున్నాడు. ఇతనికి ఓరిస్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఇక బుధవారం నాడు మదుసూదన్‌రెడ్డి ఇంట్లో పూజలు నిర్వహించారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగ బాబా ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో ప్రసాదంలో మత్తు మందు కలిపి మదుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఇచ్చాడు. అనంతరం సమీపంలో ఉన్న దేవాలయంలో కూడా పూజలు చేయాలని నమ్మించి..పూజలో పెట్టిన డబ్బుతో సహా మదుసూదన్‌రెడ్డి కుమారుడిని తనతోపాటు తీసుకెళ్లాడు. 
కోటి 30 లక్షలు కొట్టేసిన బాబా
అనంతరం మదుసూదన్‌రెడ్డి కుమారుడితో పాటు బాబా హోటల్‌కు చేరుకున్నాడు. హోటల్‌ గదిలో ధ్యానం చేయమని ఆ అబ్బాయికి చెప్పి వాహనంలో ఉన్న కోటి 30 లక్షల రూపాయలను తన వాహనంలోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత తాను వెళ్లిపోతున్నట్లు చెప్పి బాబా కర్నాటకకు వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన తనయుడికి.. ఇంట్లో తల్లిదండ్రులు మత్తులో పడి ఉండడం గమనించాడు. దీంతో అనుమానం వచ్చి.. వాహనంలో తనతో పాటు తీసుకెళ్లిన డబ్బును వెతికాడు. అయితే అవి కనిపించడలేదు. దీంతో దోపిడీని పసిగట్టిన వారు పోలీసులను ఆశ్రయించారు. 
మధుసూదన్‌రెడ్డి ఆస్పత్రికి తరలింపు 
మత్తులో ఉన్న మదుసూదన్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మదుసూదన్‌రెడ్డి కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాబా ముసుగులో వచ్చి భారీ మొత్తంలో నగదును తస్కరించడంతో నగరవాసుల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మితే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోక తప్పదని పోలీసులు అంటున్నారు. 

 

07:10 - June 16, 2016

తూర్పుగోదావరి : ముద్రగడ దీక్ష విరమణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముద్రగడ దీక్ష విరమించినట్లు భావిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. మరోవైపు తన తండ్రి దీక్ష విరమించే ప్రసక్తే లేదని ముద్రగడ కుమారుడు స్పష్టం చేస్తున్నారు. దీంతో దీక్ష వ్యవహారంపై మరింత సందిగ్ధిత కొనసాగుతోంది. 
ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉంది : చినరాజప్ప
దీక్ష కొనసాగిస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకున్నారని హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. ఇప్పటివరకూ ఐదు సెలైన్‌ బాటిళ్లను ఎక్కించారని తెలిపారు. బీపీ, షుగర్‌ లెవెల్‌లు సాధారణంగానే ఉన్నయని వైద్యులు తెలిపారని మంత్రి అన్నారు. 
తుని కేసులో 13మంది విదుదలయ్యాకే దీక్ష విరమణ 
అయితే.. ముద్రగడ దీక్ష విరమణపై సర్వత్రా సందిగ్ధిత కొనసాగుతోంది. తన తండ్రి ఆమరణ దీక్ష విరమించేదిలేదని ముద్రగడ కుమారుడు బాలు చెప్పడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. తుని కేసులో రిమాండ్‌లో ఉన్న 13 మందికి బెయిల్‌ వచ్చేలా సహకరిస్తామని.. ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే తన తండ్రి వైద్యానికి సహకరించారన్నారు. సీఐడీతో పునర్విచారణ జరిపిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారన్నారు. జైల్లో ఉన్నవాళ్లు విడుదలయ్యాకే తన తండ్రి దీక్ష విరమిస్తారని బాలు తెలిపారు. 
ముద్రగడ దీక్ష విరమించినట్లు భావిస్తున్నాం : చినరాజప్ప
ముద్రగడ తనయుడి వ్యాఖ్యలను మంత్రులు ఖండించారు. కోర్టుల ఉన్న కేసులపై తాము నిర్ణయం తీసుకోలేమని మంత్రులు చినరాజప్ప, గంటా స్పష్టం చేశారు. తుని ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు. మరోవైపు ముద్రగడ ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవడంతో దీక్ష విరమించినట్లుగా తాము భావిస్తున్నామన్నారు చినరాజప్ప. తుని ఘటనలో అరెస్టైన వారిని వదిలిపెడతామని హామీ ఇవ్వలేదన్నారు స్పష్టం చేశారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మళ్లీ ఏ మలుపు తిరుగుతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది. 

 

07:06 - June 16, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే.. పడగొట్టేందుకు అనేక కుట్రలు జరిగాయని కేసీఆర్‌ ఆరోపించారు. అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రం ఆర్ధికంగా, రాజకీయంగా బలపడాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. 
కాంగ్రెస్‌ పై సీఎం కేసీఆర్‌ ఫైర్
కాంగ్రెస్‌ నేతలు గుత్తా, భాస్కర్‌రావు, వినోద్‌, వివేక్‌లు టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం భ్రష్టుపడుతుందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని.. కాంగ్రెస్‌ పార్టీయే భ్రష్టుపడుతుందన్నారు. ఉద్యమం సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలను అప్పుడు కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 
ఎంఐఎం ముందుకు వచ్చి మద్దతిచ్చింది : కేసీఆర్‌
ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజలు 63సీట్లలో టీఆర్ఎస్‌ను గెలిపించినా.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్‌, టీడీపీలు కుట్రపన్నాయన్నారు కేసీఆర్‌. తాను అప్పటికీ  సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకపోయినా.. ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కుట్ర విషయం తెలిసిందన్నారు. అయితే.. ఆ సమయంలో.. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ముందుకువచ్చి మద్దతు ప్రకటించారని కేసీఆర్‌ తెలిపారు. 
రాజకీయ పునరేకీకరణ అవసరమన్న కేసీఆర్‌ 
తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నవాళ్లు.. రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుట్రలకు పాల్పడ్డారన్నారు. ఇలాంటి రాజకీయ నేతల కుట్రలకు తెలంగాణను బలికానివ్వమని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్సే తమకు అద్భుత కవచమని భావిస్తున్న ప్రజల నమ్మకాన్ని నిజం చేసేందుకు.. రాష్ట్రం ఆర్ధికంగా, రాజకీయంగా స్థిరపడేందుకు రాజకీయ పునరేకీకరణ అవసరమని కేసీఆర్‌ అన్నారు.
 

నేడు వేములవాడలో మంత్రి హరీష్ రావు పర్యటన

కరీంనగర్ : నేడు వేములవాడలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

నేడు రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల ఎదుట టీ.న్యాయవాదుల మౌనదీక్ష, వంటావార్పు

హైదరాబాద్ : నేడు రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల ఎదుట తెలంగాణ న్యాయవాదుల మౌనదీక్ష, వంటావార్పు కార్యక్రమాలు చేయనున్నారు. హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నేడు పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఉదయం 11.30 గంటలకు తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విడుదల చేయనున్నారు. 

నేటితో ముగియనున్న అగ్రికల్చర్ ఎమ్మెల్సీ దరఖాస్తు గడువు

హైదరాబాద్ : తెలంగాణలో అగ్రికల్చర్ ఎమ్మెల్సీ దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. 

Don't Miss