Activities calendar

17 June 2016

22:21 - June 17, 2016

హైదరాబాద్ : ఇటలీలో జరిగే వికీపీడియా అంతర్జాతీయ సదస్సు.. మికీమేనియా 2016కు తెలంగాణకు చెందిన ప్రణయ్‌రాజ్‌ వంగరి ఎంపికయ్యారు. గడచిన మూడు సంవత్సరాలుగా ప్రణయ్‌రాజ్‌ చేస్తున్న కృషిని గుర్తించిన వికీమీడియా ఫౌండేషన్‌.. ఆయనకీ అరుదైన గౌరవాన్ని అందించింది.

వికీపీడియాకు మూడేళ్లుగా తెలుగు వ్యాసాలు రాస్తున్న ప్రణయ్‌..
వికీపీడియా.. ! ఇంటర్నెట్‌తో కొద్దిపాటి పరిచయం ఉన్నవారికైనా చిరపరిచితమైన సెర్చ్‌ ఇంజన్. ఏ అంశంపై వివరాలు కావాలన్నీ.. వికీపీడియానే ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 64వేలకు పైగా వ్యాసాలున్నాయి. అట్లాంటి వికీపీడియాకు.. నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్‌రాజ్‌ వంగరి, మూడేళ్లుగా తెలుగు వ్యాసాలు రాస్తూ వస్తున్నాడు. అతడి కృషిని గుర్తించిన వికీపీడియా సంస్థ ఈఏడాది ఇటలీలో నిర్వహించే వికీమేనియా 2016 అంతర్జాతీయ సదస్సుకు ప్రణయ్‌రాజ్‌ను ఎంపిక చేసింది. జూన్‌ 22 నుంచి 26 వరకూ ఇటలీలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 550 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో పాల్గొనే అపురూపమైన అవకాశం తెలంగాణ కుర్రాడైన ప్రణయ్‌రాజ్‌ను వరించడం విశేషం. ప్రణయ్‌రాజ్‌కు చాలా చిత్రమైన పరిస్థితుల్లో వికీపీడియాతో అనుబంధం ఏర్పాటైంది. థియేటర్‌ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఫిల్‌ చేస్తున్న ప్రణయ్‌.. తన కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం వికీపీడియాలో అన్వేషించి.. అది లభ్యం కాకపోవడంతో.. తనలాగే మరొకరు ఈ అంశంలో ఇబ్బంది పడరాదని వికీపీడియన్‌గా మారారు.

30 మంది చురుకైన వికీపీడియన్లలో.. ప్రణయ్‌రాజ్‌ ..
తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం రాస్తున్న 30 మంది చురుకైన వికీపీడియన్లలో.. ప్రణయ్‌రాజ్‌ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రథమ స్థానంలో ఉన్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌కే పరిమితం కాకుండా.. గ్రామాలు, చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు, సినిమా తదితర అంశాలకు సంబంధించిన వ్యాసాలూ రాశారు. తెలంగాణకు సంబంధించిన సమాచారం వికీపీడియాలో చాలా తక్కువగా ఉందని.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వ్యక్తుల గురించిన వ్యాసాలను వికీపీడియాలో రాసే పనిలో ఉన్నారు ప్రణయ్‌రాజ్‌. ఈ ప్రయత్నంలో మరికొంత మంది ఔత్సాహికులు వికీ వ్యాసాల రచనకు ముందుకు వస్తే బావుంటుందని ప్రణయ్‌ కోరుతున్నారు. అంతేకాదు.. ఉత్సాహవంతులకు తగిన శిక్షణలూ ఇస్తూ వస్తున్నారు.

22:06 - June 17, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతరకు ప్రభుత్వం తెరతీసింది. మొత్తం 10వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా నాలుగు వేల తొమ్మిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వగా, పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ద్వారా ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి పోస్టుల భర్తీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఏపీపీఎస్సీ పోస్టుల్లో గ్రూప్-1 ద్వారా 94, గ్రూప్‌-2లో 750 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు పంచాయితీ కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్ రానుంది. 

22:04 - June 17, 2016

హైదరాబాద్ : ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంస్థలోని అధికారులు, సిబ్బంది కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఆర్టీసీ బలోపేతంపై హైదరాబాద్‌ మారియట్‌ హొటళ్లో కేసీఆర్‌ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ ప్రయాణికుల ద్వారానే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానూ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు... కొరియర్‌, సరుకు రవాణా, మినీ బస్సులు ఏర్పాటు, బస్టాండ్లు, బస్సులపై వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.. తిరుపతి, షిర్డీ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రయాణికులకు దైవదర్శనం, వసతి విషయాల్లో ప్రాధాన్యమివ్వాలని సూచించారు... పర్యాటకశాఖతో ఆర్టీసీని అనుసంధానం చేసి ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు... అలాగే పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల విహారయాత్రలకు ఆర్టీసీ బస్సులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు.  

22:01 - June 17, 2016

హైదరాబాద్ : ముద్రగడ దీక్షపై మంత్రుల వ్యాఖ్యలు సరిగాలేవన్నారు కాపునేతలు. ముద్రగడ దీక్ష, ప్రస్తుత పరిణామాలపై హైదరాబాద్‌లో కాపునేతలు సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఇంట్లో జరిగిన ఈ భేటీకి... చిరంజీవి, అంబటి, బొత్స, సీ.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్‌, ఇతర కాపు సంఘాల నేతలు హాజరయ్యారు. ముద్రగడ దీక్షపై రెండు రోజుల సమయం ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. మంత్రుల వ్యాఖ్యలు ముద్రగడకే కాదు.. జాతికే అవమానకరమన్నారు. కాపులపట్ల మోసపూరితంగా వ్యవహరిస్తే రాజమండ్రి వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు..కాగా మంత్రుల వ్యాఖ్యలు ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉన్నాయనీ...ముద్రగడ కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

21:55 - June 17, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ అధ్యాపకులు కె.వై రత్నం, తథాగత్‌ సేన్‌ గుప్తా సస్పెన్షన్‌పై వర్సిటీ యాజమాన్యం దిగివచ్చింది. వారి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ నిరసన ఫలించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గత మార్చి 22న వర్సిటీలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ సాకుతో.. వర్సిటీ యాజమాన్యం ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్‌ చేసింది.

21:53 - June 17, 2016

సికింద్రాబాద్ : బొల్లారంలో కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ ను కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ మల్లారెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ కు వివరించారు. ఆర్మీ సైనికులు తరచూ రహదారులను మూసివేయడం, ఆంక్షలు పెట్టడం వలన ప్రజలకు పెను సమస్యగా మారిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

21:52 - June 17, 2016

ప్రొఫెసర్ల సస్పెన్షన్ పై దిగివచ్చిన హెచ్ సీయూ...

హైదరాబాద్ : హెచ్‌సీయూ అధ్యాపకులు కె.వై రత్నం, తథాగత్‌ సేన్‌ గుప్తా సస్పెన్షన్‌పై వర్సిటీ యాజమాన్యం దిగివచ్చింది. వారి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ నిరసన ఫలించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గత మార్చి 22న వర్సిటీలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ సాకుతో.. వర్సిటీ యాజమాన్యం ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్‌ చేసింది. 

21:42 - June 17, 2016

గుజరాత్ : గుల్బర్గ్‌ అల్లర్ల కేసులో ఎట్టకేలకు అహ్మదబాద్‌ కోర్టు తీర్పు వెలువరించింది. 24 మంది దోషుల్లో 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో12 మందికి ఏడేళ్ల జైలు, ఒక్కరికి పదేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సిట్‌ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. నేరం చాలా తీవ్రమైందని, దోషులందరికి యావజ్జీవ కారగార శిక్ష విధించాలని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ ఆర్‌సి కోడేకర్‌ స్పష్టం చేశారు.

ఊచ‌కోత కేసులో శిక్ష ఖరారు చేసిన ప్రత్యేక కోర్టు...
గుజరాత్‌లో సంచలనం సృష్టించిన గుల్‌బ‌ర్గ్ సొసైటీ ఊచ‌కోత కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును వెలువ‌రించింది. గుల్‌బ‌ర్గ్‌ మార‌ణ‌హోమానికి పాల్పడ్డ 11 మందికి జీవిత‌ఖైదు శిక్షను ఖ‌రారు చేసింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న వీహెచ్‌పీ నేత అతుల్‌ వేద్‌ సహా మ‌రో 12 మందికి ఏడేళ్లు, మ‌రో వ్యక్తికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2002 గుల్బర్గ్‌ సొసైటీలో జరిగిన మారణకాండ పౌర సమాజ చరిత్రలోనే చీకటి రోజని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

తీర్పుపై ఎహసాన్‌ జాఫ్రి భార్య జకియా జాఫ్రి తీవ్ర అసంతృప్తి ...
కోర్టు తీర్పుపై ఎహసాన్‌ జాఫ్రి భార్య జకియా జాఫ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషులకు చాలా తక్కువ శిక్ష వేశారని, చట్టం తనకు న్యాయం చేయలేదన్నారు. న్యాయం కోసం మళ్లీ కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

2002 ఫిబ్రవరి 27న రైలుకు నిప్పు...59 మంది మృతి...
2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టగా 59 మంది మరణించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 28న గుల్బర్గ్ సొసైటీపై ఓ వర్గానికి చెందిన 20 వేల మంది దాడి చేసి ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఎహసాన్‌ జాఫ్రీని బట్టలూడదీసి రోడ్డుపై పరుగెత్తించి కాళ్లు చేతులు నరికి సజీవ దహనం చేశారు. మహిళలు, పిల్లలని కనికరం చూపకుండా అమాయకులందర్ని అగ్నికి ఆహుతి చేశారు.

జూన్‌ 224 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు...
ఈ కేసులో తొలుత 66 మందిని నిందితులుగా గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో వీరిలో 36 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. విచారణ సమయంలో మరో ఐదుగురు మృతిచెందగా.. ఓ వ్యక్తి కన్పించకుండా పోయాడు. జూన్‌ 2న 24 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.

 

21:26 - June 17, 2016
21:15 - June 17, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనతో కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పంటపండుతోంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో భారీగా ధరలు పెరిగితే, జగిత్యాలలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి.

సిరిసిల్లలో రియల్ బూమ్.....
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనతో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. గత కొద్ది రోజుల్లోనే సిరిసిల్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు రెండు మూడు రెట్లు పెరిగాయి. సిరిసిల్ల, వేములవాడ జంట నగరాలుగా అభివ్రుద్ధి చెందుతాయన్న అంచనాతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో మరింత ఊపు వచ్చింది. ఇప్పటికే టెక్స్ టైల్ పార్క్, పోలీస్ బెటాలియన్, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ కి పునాదులు పడ్డాయి. ఈ ప్రాంతంలో ధరలు పెరుగుతాయన్న అంచనాతో కొంతమంది రెండేళ్ల క్రితమే భూములు కొనిపెట్టుకున్నారు. రెండేళ్ల క్రితం ఎకరం ధర రెండు మూడు లక్షల దాకా వెళ్లింది. ఇప్పుడు ఆరు నుంచి పది లక్షలు చెబుతున్నారు. కరీంనగర్ - సిరిసిల్ల- కామారెడ్డి, సిద్ధిపేట వెళ్లే ప్రధాన రహదారుల వెంట గుంట భూమి ధర ఏడు నుంచి పది లక్షల దాకా పలుకుతోంది. ఈ ఏడాది భూ క్రయ విక్రయాలు పెరిగినట్టు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.

రియాల్టర్ల దందాలు,కబ్జాలూ , కిడ్నాప్...
ఓ వైపు ధరలు పెరుగుతుంటే, మరోవైపు కబ్జాలూ పెరుగుతున్నాయి. సిరిసిల్ల రింగ్ రోడ్డు పరిధిలోని రగుడు గ్రామంలో రియాల్టర్ల దందాలు వెలుగుచూస్తున్నాయి. బుచ్చయ్య అనే వ్యక్తి ని కిడ్నాప్ వ్యవహారం కలకలం స్రుష్టించింది. ఆయన కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డా ప్రాణభయం వెన్నాడుతోంది.

ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో రియల్ బూమ్...
ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో రియల్ బూమ్ పరుగులుతీస్తోంది. ఆలయ అభివ్రుద్ధికి నిధులు, సిరిసిల్లలో విలీనం లాంటి చర్యలు కలిసొచ్చాయి. పట్టణ శివారు ప్రాంత వ్యవసాయ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. నాంపల్లి, అగ్రహారం, ఇంద్రనగర్, కోదరురుపా, సంగెపల్లి, మారుపాక ప్రాంతాల్లో ఎకరం 15 లక్షలు పలుకుతోంది. సిరిసిల్ల, వేములవాడల్లో వందల ఎకరాలు రియాల్టర్ల చేతులుమారుతున్నాయి. పేద మధ్యతరగతి భూములు కొనలేని పరిస్థితి వచ్చింది.

50 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ...
జగిత్యాలలో పరిస్థితి మరోరకంగా వుంది. అక్కడ ప్రభుత్వ భూములు కబ్జాలో వున్నాయి. దరూర్ మోతె రహదారి పక్కనున్న 50 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు సమాచారం. జగిత్యాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే ప్రయివేట్ భూములు కొనుక్కోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.

కామారెడ్డి లో హాట్ కేక్ లా ప్లాట్ల అమ్మకాలు...
జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనతో కామారెడ్డి దశ తిరుగుతోంది. హైదరాబాద్ కి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే వున్న ఈ పట్టణంలోని ప్లాట్లు హాట్ కేక్ లా ఊరిస్తున్నాయి.

కామారెడ్డిలో రియల్ బూమ్...
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రియల్ బూమ్ పరుగులుతీస్తోంది. సదాశివనగర్ మండలంలో మిషన్ కాకతీయ పనుల ప్రారంభించిన సందర్భంలో కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో ఏడాది క్రితమే బూమ్ మొదలైంది. భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. దేవునిపల్లి, టేక్రియాల్; సరంపల్లి, అడ్లూర్, ఇచ్చీపూర్ గ్రామాల్లోని వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారాయి. క్రిష్ణజివాడి, దేవునిపల్లి, లింగాపూర్ గ్రామ శివార్లలోనూ ప్లాట్లు చేసి, విక్రయిస్తున్నారు. ఈ ఎనిమిది గ్రామాల్లో ఏడాదిన్నరలో 80 వెంచర్లు ఏర్పడడం రియల్ బూమ్ కు నిదర్శనం. ఒక్క అడ్లూర్ లోనే 33 వెంచర్లు వెలిశాయి. ప్రతి నెల వాయిదాలు, బంపర్ డ్రాలు ఆఫర్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

కామారెడ్డిల గజం ధర 20 నుంచి 30 వేల రూపాయలు...
గతంలో కామారెడ్డిలో ఎకరం ధర 30 నుంచి 40 లక్షలుండేది. జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనతో ఇప్పుడు 80 లక్షల నుంచి కోటి రూపాయలకు చేరింది. రెండు మూడు వేల రూపాయలున్న గజం ధర 5వేలు దాటింది. విద్యానగర్, అశోక్ నగర్, శ్రీరాంనగర్, వివేకానందకాలనీ, ఎన్జీ వోస్ కాలనీలలో ఖాళీ ప్లాట్లు దొరకడం లేదు. విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీలలో గజం ధర 20 నుంచి 30 వేల రూపాయల దాకా పెరిగింది. కరీంనగర్ జిల్లా గంభీరావ్ పేట్, ఎల్లారెడ్డి పేట్, సిరిసిల్ల పట్టణాలతో పాటు రామాయంపేట్, దుబ్బాక మండలాలకు చెందినవారు కామారెడ్డిలో స్థిరపడుతూ, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో భూములు అమ్ముకుని, కామారెడ్డి టౌన్ లో ప్లాట్లు కొనేందుకు చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్ కి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే వుండడంతో కామారెడ్డి రియల్ బూమ్ కి మరింత ఊపునిస్తోంది.

మంచిర్యాల ప్రాంతంలో భూములు వెంచర్లుగా మార్పు...
మంచిర్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలతో రియల్ ఎస్టేట్ దందాకు తెర లేచింది. అన్ని అనుమతులు పొందకుండానే వ్యవసాయ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అన్ని అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేసినవారు భవిష్యత్ లో నష్టపోవాల్సి వుంటుంది.

మంచిర్యాలలో అక్రమ లే అవుట్లు..
ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల చుట్టుపక్కల వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంగా అవతరిస్తే, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు భారీగా భూమి అవసరం. మంచిర్యాల మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ తో పాటు, చుట్టు పక్కల మొత్తం 200 ఎకరాల ప్రభుత్వ భూమి వున్నట్టు అంచనా. అధికారులు సర్వే కూడా చేయడంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారులు వాలిపోయారు. ముల్కల్ల, వేంపల్లి, గుడిపేట, హాజీపూర్ , నస్పూరు, తీగల్ పహాడ్ గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటున్నారు. అయితే, వీటికి అనుమతుల్లేవు.

పచ్చటి పొలాలన్నీ ప్లాట్లుగా ...
మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వెళ్లే రహదారి వెంట వున్న పచ్చటి పొలాలన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. మంచిర్యాల టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి ఆనుకుని 14కి పైగా అక్రమ లే ఔట్లు వెలిశాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలంటే రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు చెల్లించాల్సిన వన్ టైం నాలా పన్ను చెల్లించాలి. లౌ అవుట్ అనుమతి పొందాల్సి వుంటుంది. గ్రామపంచాయితీకి పన్ను కట్టాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినట్టు అనుమతి పత్రం చూపించి, గ్రామ పంచాయతీకి భూమి విలువలో 5 శాతం సెక్యూరిటీ డిపాజిట్ కింద జిపి ఖాతాలో జమ చేయాల్సి వుంటుంది. అయితే, వన్ టైం నాలా పన్ను మాత్రమే చెల్లించి లే అవుట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది.

అక్రమ లే అవుట్ల కొనుగోలుతో ఇబ్బందులు ...
భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆర్డీవో ద్వారా చేయించిన ల్యాండ్ కన్వర్షన్ పత్రం, టౌన్ ప్లానింగ్ పేరున వెయ్యి రూపాయల ఇన్ స్పెక్షన్ రుసుము చెల్లించాలి. మూడు కాపీల లే అవుట్ ప్లాన్ అప్రూవల్ కాపీలు సమర్పించాలి. ప్లాట్లు చేసే సమయంలో 33 ఫీట్ల వెడల్పు రోడ్డు వేయాలి. డ్రయినేజీ, విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు అన్ని రకాల అభివ్రుద్ధి పనులు చేపట్టాలి. మొత్తం ప్లాట్లలో 30శాతం భూమిని రోడ్లకు, 10శాతం భూమిని గ్రామ పంచాయితీ అవసరాలకు కేటాయించాలి. 60 శాతం భూమిని మాత్రమే ప్లాట్లుగా చేసుకునేందుకు అనుమతి వుంటుంది. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. అనుమతి పత్రంతో పాటు జిపికి కట్టిన చలానును జత చేస్తూ లే అవుట్ కోసం జిల్లా పంచాయితీ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ, అవేవీ పూర్తి చేయకుండానే ప్లాట్లు అమ్ముకుంటున్నారు. ఇలాంటి ప్లాట్లు కొనుక్కున్నవారు తర్వాత అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.

దాదాపు 100 ఎకరాల్లో 14 అక్రమ లే అవుట్లు ...
మంచిరాల మండలంలో దాదాపు 100 ఎకరాల్లో 14 అక్రమ లే అవుట్లు వేశారు. వేంపల్లిలో 57 ఎకరాలు, ముల్కల్లలో 7 ఎకరాలు, గుడిపేటలో 10 ఎకరాలు, హాజీపూర్ లో ఒక ఎకరం భూమిలో అక్రమ లౌ అవుట్లు వున్నాయంటూ పంచాయితీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. భూ యజమానులు గ్రామ పంచాయితీల అనుమతి తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.

గుంటకు పది లక్షల రూపాయల దాకా ధర ...
మంచిర్యాల సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని వున్న ప్లాట్లకు గుంటకు పది లక్షల రూపాయల దాకా ధర వుండగా, కాస్త లోపల వున్న భూములకు 5 లక్షల దాకా పలుకుతోంది. 100 ఎకరాల్లో గ్రామ పంచాయితీ అనుమతి తీసుకుంటే, అందులో 10 ఎకరాలు గ్రామ పంచాయితీకి ఇవ్వాల్సి వుంటుంది. గుంటకు 5 లక్షల ధర వేసినా, ఈ పది ఎకరాల విలువ 20 కోట్లు వుంటుంది. అయితే, అనుమతులు లేకుండానే లే అవుట్లు వేస్తున్న వ్యాపారులు గ్రామపంచాయితీకి ఇవ్వాల్సిన పది ఎకరాలను కూడా ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు. వ్యవసాయ భూములను ఎకరానికి పది పదిహేను లక్షల ధరతో రిజిస్ట్రేషన్ చేయించుకుని, దాదాపు కోటీ 80 లక్షల రూపాయలకు ప్లాట్లు అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన రిజిస్ట్రేషన్ శాఖకీ దక్కాల్సిన ఆదాయంలో గండిపడుతోంది. రిజిస్ట్రేషన్లు, జిపికి పదిశాతం భూమి, లౌ అవుట్ అనుమతి ఫీజు ఇవన్నీ కలుపుకుంటే 22 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంత మొత్తంలో లాభపడుతుంటే, భవిష్యత్ లో డ్రయినేజీలు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు లాంటి మౌలిక వసతుల కల్పనకు గ్రామ పంచాయితీలు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 

21:09 - June 17, 2016
21:08 - June 17, 2016
20:50 - June 17, 2016

హైదరాబాద్‌ : బోడుప్పల్‌ ఆంధ్రా బ్యాంక్‌ మేనేజర్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు.... మంజూరైన రుణాలను ఇవ్వకుండా సతాయిస్తున్నారని మండిపడ్డారు.. బ్యాంక్‌ మేనేజర్‌ను వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. ఈ సమస్యను పరిష్కరిస్తామని బ్యాంక్ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.. ఈ బ్యాంక్‌లో రెండువేలమందికి పొదుపు ఖాతాలున్నాయి.. ఈ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమచేసినా బ్యాంక్ మేనేజర్‌ తమను తీసుకోనివ్వడంలేదని మహిళలు ఆరోపిస్తున్నారు.

20:42 - June 17, 2016

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఎర్రవల్లి గ్రామం..ఈ గ్రామం పేరు ఈ మధ్య తరచూ వినబడుతోంది...ఎందుకంటారా...మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ నిర్మాణం చేపట్టాలని తలపెట్టింది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆ ప్రాంతంలోని దాదాపు 14 గ్రామాలు ముంపుకు గురవబోతున్నాయి. ఈ ముంపు గ్రామాలలో ఎర్రవెల్లి గ్రామం ఒకటి...ఈ గ్రామం ముంపుకు గురవుతుంది కాబట్టి ఖాళీ చేయించాలని సర్కారు యోచిస్తోంది. కానీ ఈ గ్రామస్తులు అందుకు అంగీకరించటంలేదు..ఎందుకంటే పుట్టిపెరిగి అక్కడే ఎన్నో జ్ఞాపాకాలు...చిన్ననాటి గుర్తులు.. నీటిలో కలిసిపోతాయి.. ఆడుకున్న ఆటలూ...పాటలు పాడుకున్న చెట్టూ, చేమలూ...ఇలా అన్నీ నీటిలో మునిగిపోతాయి.కొంతకాలానికి ఆ ప్రాంతంలో కొన్ని ఊర్లు ఉండేవట అని చెప్పుకోవటానికీ....చరిత్రలో చదువుకోవటానికి మాత్రమే కనిపిస్తుంది...కానీ కొంత మేలు జరగాలంటే....కొంత నష్టపోవాల్సిందే అనేది నానుడి....కానీ రిజర్వాయర్ లు నిర్మాణానికి కొంత భూమి అవసరమే....కానీ ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడింది... చదువుకున్న కొందరు యువకులు..తాము ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాదుకానీ...ప్రభుత్వం తమ అవసరాలకు ప్రత్నామ్నాయం చూపించిన తరువాతనే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని పేర్కొంటున్నారు.... ఈ నేపథ్యంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తిని మన మల్లన్న మనముందుకు తీసుకొచ్చాడు..అతను ఎవరంటే ...ఈయన ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీచేసిన బూరుగుపల్లి ప్రతాపరెడ్డి. ఈయన చెప్పే సంగతులేంటో తెలుసుకుందాం...ముఖ్యమంత్రికి తాను తెలిపేది ఏమంటే ...రిజర్వాయర్ కట్టాలంటే నదులమీద..వాగులమీదా కడతారు కానీ కేసీఆర్ ఊర్లమీద ప్రాజెక్టులు కడుతున్నారని ఆయన విమర్శించారు. ఊర్లకు ఊర్లే లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణానికి తలపెట్టారని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.10,000కోట్లు అంటున్నారు...కానీ తనకు వెయ్యి కోట్లు ఇస్తే ప్రాజెక్టు నిర్మించి ఇస్తానన్నారు. ....దీనికి సంబంధించి ఆయన లెక్కల తో సహా వివరించారు. ...ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికీ స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందని ఆరోపించారు. .. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వలన ముంపు గ్రామాల ప్రజలు తమ ఆవేదనూ...ఆక్రోశాన్ని...నిసహాయతనూ..వెలిబుచ్చారు...ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి ...మరింత సమాచారం తెలుసుకోండి...

 

20:08 - June 17, 2016

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్లు ముభావంగా ఉంటే చూడలేం. తెరపైనా అంతే...అమాయకపు క్యారెక్టర్లతో, హాస్యంతో ఆకట్టుకునే కథానాయకులను అలాగే చూడలనుకుంటాం. భిన్నంగా కనిపిస్తే...ఒంటబట్టించుకునేందుకు కొంతం సమయం పడుతుంది. ఇలాగే...నాని జెంటిల్ మన్ సినిమా పోస్టర్ లో సీరియస్ లుక్స్ తో కనిపించగానే...ఇదేంటి...నాని ఇలాగేంటి.. అనుకున్నారంతా. ఐతే నాని చేస్తున్నాడంటే ఏదో కొత్తదనం సినిమాలో ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. మరి ఈ నమ్మకం జెంటిల్ మన్ సినిమాతో నిలబడిందా...? లేదా..?.సమీక్షలో చూద్దాం...

ఇద్దరు అమ్మాయిలు నివేద, సురభి విమానంలో ప్రయాణిస్తుంటారు. మాటలు కలిసి స్నేహితులవుతారు. సురభి తను త్వరలో పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి...నివేద తన ప్రేమికుడి గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు. ఈ కబుర్లు ఇద్దరికీ ఆసక్తికరంగా ఉంటాయి. విమానం దిగగానే సురభి కోసం ఎదురుచూస్తున్న నాని....నివేద ప్రేమించిన అబ్బాయి ఒక్కరే. ఇది కథలో ప్రధాన మలుపు. నివేద ప్రేమించిన నాని....సురభికి కాబోయే భర్త ఎలా అయ్యాడన్నది ఫ్లాష్ బ్యాక్ తో సాగిన మిగిలిన కథ.......

 

థ్రిల్లర్ కథగా ప్రచారం చేసుకున్న జెంటిల్ మన్ లో థ్రిల్లింగ్ విషయాలేవీ లేవు. పైగా ఇలా ప్రచారం చేసుకోవడం వల్ల సినిమాకు నష్టమే జరిగింది. మొదట హీరోయిన్లు చెప్పుకున్న రెండు ప్రేమ కథలు కాస్త బాగున్నాయి. ఇవి సినిమా టేకాఫ్ కు పనికొచ్చాయి. ఐతే కథానాయకుడు నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన సన్నివేశాలు బలహీనంగా తయారయ్యాయి. హైప్ తీసుకురావాల్సిన ఆ ఘట్టాలన్నీ తేలిపోయాయి. హీరో ఎందుకు ఇలా మారాడన్న అయోమయం ఏర్పడింది. కాసేపు సినిమా ఎటెల్తుందో ప్రేక్షకులకు అర్థం కాదు. మళ్లీ చివరి పది నిమిషాల్లో కథకు స్పష్టతనిచ్చాడు దర్శకుడు. కథనాన్ని ఇంకాస్త సరిచేస్తే మంచి సినిమా

నటీనటుల ప్రతిభ చూస్తే....నటనపరంగా ఎప్పుడూ తన సినిమాల్లో నానిదే పైచేయి. తను బాగా నటించాడని పేరొచ్చాకే..మిగతా వాళ్ల పేర్లు వినిపిస్తాయి. కానీ జెంటిల్ మన్ సినిమాలో ఈ పేరు నాయిక నివేదకు దక్కింది. మొత్తం సినిమాను లీడ్ చేసింది తనే. నాని నటించలేక కాదు...కథలో ఆ పాత్రకు అవకాశం లేదు. వెన్నెల కిషోర్ చేసిన పాత్ర బాగా నవ్వించింది. సినిమాలో ప్రేక్షకులకు ఈ పాత్రే ఉపశమనం కలిగించింది. అవసరాల శ్రీనివాస్ నెగిటివ్ క్యారెక్టర్ లో మెప్పించాడు. మణిశర్మ స్వరాల్లో అలజడి..అలజడి అనే పాట బాగుంది. నేపథ్య సంగీతం కథనాన్ని బాగా ఫాలో అయ్యింది. పీజీ విందా సినిమాటోగ్రఫీ అలరించింది. మొత్తానికి నాని కొత్త సినిమా మల్టీఫ్లెక్సులు, ఏ సెంటర్ల వరకు నిలబడొచ్చు. బీ, సీ సెంటర్లలో ఫలితం మిశ్రమంగానే వచ్చే అవకాశాలున్నాయి...

ఫ్లస్ పాయింట్స్....

1.నివేద నటన

2.వెన్నెల కిషోర్ హాస్యం

3.మణిశర్మ సంగీతం

మైనస్ పాయింట్స్...

1.పట్టులేని కథనం

2.సెకండాఫ్ సన్నివేశాలు

3.కథానాయకుడి పాత్ర

19:39 - June 17, 2016

హైదరాబాద్: మాజీ ఎంపీ పల్లంరాజు నివాసంలో కాపునేతలు భేటీ ముగిసింది. కాపు సమాజిక మంత్రులు ముద్రగడ దీక్షపై చేసే ప్రకటనలు చాలా బాధాకరంగా వున్నాయనీ కాపునేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వంద వైఖరిపై ముద్రగడ అవేదన వ్యక్తం చేస్తున్నారని కాపునేతలు తెలిపారు.మంత్రులు చేసే వ్యాఖ్యలు ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడేలా వున్నాయని నేతలు పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని దాసిరి నారాయణ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ భేటీకి కాపు ప్రముఖ నేతలు చిరంజీవి, దాసరి నారాయణ రావు, అంబటి, బొత్స, రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, ఇతర కాపు సంఘాల నేతలు హాజరయ్యారు. కాగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ కాపునేత ముద్రగడ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పలు పరిణామాలు సంభవించిన విషయమూ తెలిసిందే.

ముగిసిన కాపునేతల భేటీ ...

హైదరాబాద్: మాజీ ఎంపీ పల్లంరాజు నివాసంలో కాపునేతలు భేటీ ముగిసింది. కాపు సమాజిక మంత్రులు ముద్రగడ దీక్షపై చేసే ప్రకటనలు చాలా బాధాకరంగా వున్నాయనీ కాపునేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వంద వైఖరిపై ముద్రగడ అవేదన వ్యక్తం చేస్తున్నారని కాపునేతలు తెలిపారు.మంత్రులు చేసే వ్యాఖ్యలు ముద్రగడ ప్రాణాలతో చెలగాటం ఆడేలా వున్నాయని నేతలు పేర్కొన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని దాసిరి నారాయణ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

19:07 - June 17, 2016

కర్నూలు : చంద్రన్న రంజాన్ తోఫాను ఈ సంవత్సరం 12లక్షల ముస్లిం కుటుంబాలకు అందజేస్తున్నామని ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకోవాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు రంజాన్ తోఫాను ఇస్తున్నట్లు ఆమె తెలిపారు . ఈ తోఫాలో 5 కేజీల గోధుమపిండి, 2కేజీల చెక్కర, 1కేజీ సేమియా,100 గ్రాముల నెయ్యి వంటి వస్తువులను అందజేస్తామని పరిటాల సునీత చెప్పారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని 1000మంది చెంచులను గుర్తించి వారికి ఏవైఎల్  కార్డులను అందజేస్తున్నామన్నారు.

18:59 - June 17, 2016

హైదరాబాద్ : న‌గ‌రంలో అడుగ‌డుగున‌ రంగురంగుల యాడ్స్ తో అంద‌ర్ని ఆక‌ర్షించే హోర్డింగ్స్ .విద్యుత్ కాంతులతో క‌నువిందు చేస్తాయి. ఆ కాంతుల వెనుక ఎన్నో చీక‌ట్లు దాగి ఉన్నాయి. ఏ నిముషానికి ఏదికూలుతుందో తెలియ‌ని పరిస్థితి. గ్రేట‌ర్ లో కూలేందుకు సిద్దంగా ఉన్న హోర్డింగ్స్ ఎన్ని... జూబ్లీహిల్స్ హోర్డింగ్ ఘ‌ట‌న‌తో మేల్కొన్న బ‌ల్దియా స‌ర్వేలో ఏం తేలింది.

నేల కూలిన పలు హోర్డింగ్స్...
గ్రేట‌ర్ లో ఇటివ‌ల కురిసిన గాలివాన‌ల‌కు పలు హోర్డింగ్స్ నేల‌కూలాయి. అదృష్టావ‌శాత్తు ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌న‌ప్ప‌టికి .. ఆస్తి న‌ష్టం భారీగానే జ‌రిగింది. దాంతో సిటిలోని హోర్డింగ్స్ ఫై ఒక్కసారిగా చ‌ర్చమొద‌లైంది. ఇప్పటికే హైకోర్టు సైతం ఈ అంశంపై జీహెచ్ఎంసి మొట్టికాయ‌లు వేసింది. అస‌లు హోర్డింగ్స్ ఎక్కడ ఏర్పాటు చెయ్యచ్చు. ఎంత ఎత్తు ఉండాలి.. నిర్మాణం సామ‌ర్థ్యం ఎలా ఉండాలి..అందుకు ఉప‌యోగించే మెట‌ల్ ఎలా ఉండాలి వంటి అనేక అంశాలు సిటిలో హాట్ ట్రాఫిక్ గా మారాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో భారీ హోర్డింగ్ కూలీపొయింది. దీంతో అలెర్ట్ అయినా బ‌ల్దియా......., హోర్డింగ్స్ ఫిట్ నెస్ పై దృష్టి సారించింది.

2, 684 హోర్డింగ్స్ ను చెక్ చేసేందుకు కమిటీ..
ఇక సిటిలో ఉన్న 2, 684 హోర్ంగ్స్ ను చెక్ చేసేందుకు నిఫుణుల‌తో క‌మీటిని ఎర్పాటు చేసింది. ఇందులో జిహెచ్ఎంసికి చెందిన చిఫ్ సిటి ప్లాన‌ర్, చిఫ్ ఇంజ‌నీర్, రెవిన్యూ అద‌న‌పు క‌మీష‌న‌ర్, ఆర్థిక శాఖ అద‌న‌పు క‌మీష‌న‌ర్ల‌తో పాటు జెన్టీయు, ఐఐటి హైద‌రాబాద్ కు చెందిన ఇంజ‌నీరింగ్ ప్రోఫెస‌ర్ల‌ను నియ‌మించింది . హోర్డింగ్స్ స్ట్రక్చర‌ల్ స్టెబీలిని స్టడి చేసేందుకు ఐదు క‌న్సల్టేన్సిల‌ను ఫైన‌ల్ చేసింది ఈ క‌మీటి. సివిల్ ఎడ్, స్పెల్లార్, డెకాన్, బిల్లింగ్ ప్లాన‌ర్, జాకి సంస్థల‌కు చెందిన ఇంజ‌నీర్లు ప్రతి హోర్డింగ్ స్థితిగ‌తులను క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు.

ఆక్రమ హోర్డింగ్స్ 600ల‌కు పైగా ఉన్నట్లు గుర్తింపు...
దాంతో జిహెచ్ఎంసి ద్వారా వ‌చ్చే ఆదాయం పెంచేంద‌కు పక్కాప్లాన్ రూపొందిస్తుంది. ఇక ప‌నిలో ప‌నిగా ఆక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ పై కూడా న‌జ‌ర్ పెట్టింది బల్దియా. గ‌తంలో ఆక్రమ హోర్డింగ్స్ 600ల‌కు పైగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిలో రెగ్యుల‌రైజ్ చేయ్యడానికి వీలైన‌ వాటికి ప‌ర్మిష‌న్స్ ఇచ్చి... నిబంద‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న వాటిని పూర్తిగా తొలంగించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక గ్రేట‌ర్ ఉన్న ప్రభుత్వ భూముల‌తో పాటు స్మశాన వాటిక‌ల్లో ఉన్న హోర్డింగ్స్ పై ఆదాయం త‌క్కువ‌గా వ‌స్తుందని గుర్తించింది బ‌ల్దియా. కేవ‌లం టాక్స్ మాత్రమే వ‌సూలు చేస్తున్న జీహెచ్ఎంసి......., ఆయా భూముల‌పై రెంట్ వ‌సూలు చేయ్యాల‌ని భావిస్తుంది. అయితే ఇప్పటివ‌ర‌కు జీహెచ్ఎంసి ఆదాయానికి గండి కొడుతున్న ప్రయివేటు వ్యక్తుల‌నుండి డ‌బ్బురాబ‌ట్ట గలుగుతుందా లేదా అనేది మాత్రం కాల‌మే నిర్ణయించాలి. 

18:50 - June 17, 2016
18:44 - June 17, 2016

పల్లంరాజు నివాసంలో కాపునేతల భేటీ...

హైదరాబాద్ : కాపునేత ముద్రగడ దీక్ష నేపథ్యంలో మాజీ ఎంపీ పల్లంరాజు నివాసంలో కాపు సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి కాపు ప్రముఖ నేతలు చిరంజీవి, దాసరి నారాయణ రావు, అంబటి, బొత్స, రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, ఇతర కాపు సంఘాల నేతలు హాజరయ్యారు. ముద్రగడ దీక్షపై భివష్యత్ కార్యాచరణను ఈ భేటీలో చర్చించనున్నారు. 

17:59 - June 17, 2016

హైదరాబాద్ : నగరంలో 15వ తేదీన సాయంత్రంలో ఎమ్మెల్యే కాలనీ రోడ్ నం: 12 బంజారాహిల్సలో ఓ రియల్టర్ నివాసంలో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందుతుడు శివను అతనికి సహకరించిన దామోదర్ లను అరెస్ట్ చేశామని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ శివ అనే వ్యక్తి మధుసూధన రెడ్డికి మోహన రెడ్డి అనే వ్యక్తి ద్వారా దాదాపు ఒక సంత్సరన్న క్రితం పరిచయమయ్యాడని తెలిపారు. మోహన రెడ్డి కి అతీత శక్తులున్నాయని మధుసూధన్ రెడ్డికి తెలిపాడు. శివ గతంలో మధుసూధన్ రెడ్డికి ఒక మ్యాజిక్ చేసిన లక్ష రూపాయల్ని రెండు లక్షలు చేసిన చూపించాడు. దాంతో శివను నమ్మిన మధుసూధన్ రెడ్డి లక్ష్మీ పూజ ద్వారా నగదును డబుల్ చేయటమే కాక ఒక పురాతన నాణాన్ని విదేశాలలో విక్రయిస్తే కోట్లల్లో డబ్బు వస్తుందని నమ్మబలికాడు. దీంతో శివను పూర్తిగా నమ్మిన మధుసూధన్ బెంగుళూరు నుండి శివను హైదరాబాద్ కు రప్పించి ఓ హోటల్ లో బస ఏర్పాటు చేశాడు. 15వ తేదీన మధుసూధన్ రెడ్డి నివాసంలో పూజను ఏర్పాటు చేశారు. పూజకు ముందుగా తమమీద నమ్మకం పెరగటానికి శివ పూనుకున్నాడు. ఈ క్రమంలోనే రూ. 1.5 లక్షలు పూజలో పెట్టమన్నాడు. వారు ఆ విధంగానే చేశారు. దీంతో వారిని ఏమార్చి వారు కూడా తీసుకువచ్చిన రూ.3లక్షలను పూజలో పెట్టారు. నగదును ఎక్కువ మొత్తంలో పెడితే ఎక్కువ అవుతుందనీ మరింత నమ్మించాడు. దీంతో కుటుంబ సభ్యులు రూ.1.3కోట్లు పూజలో పెట్టారు. మధ్యహ్నాం రెండు గంటల వరకూ పూజ కొనసాగింది. ఈ నేపథ్యంలో తాను తయారు చేసిన ప్రసాదాన్ని తినిపించాడు. అనంతరం మినిస్టర్ క్వార్డర్స్ లో వుండే దేవాలయానికి మధుసూధన్ రెడ్డి కుమారుడ్ని తీసుకుని వెళ్లాడు. తరువాత సందేశ్ ను తీసుకుని శివ బస చేసిన హోటల్ కి తీసుకువెళాడు. నగదుని కారులోనే వుంచి కార్ లాక్ చేసిన రూమ్ కు తీసుకువెళ్లి మెడిటేషన్ చేయటానికి సందేశ్ వద్ద వున్న మెటల్స్ ని తీసి పక్కన పెట్టమన్నాడు. కార్ తాళాలు పక్కన పెట్టి సందేశ్ మెడిటేషన్ లోకి వెళ్లాడు. ఈక్రమంలో కారు కీస్ తీసుకుని శివ కారులో వున్నటువంటి క్యాష్ ను తీసుకుని కిందికి వెళ్లి సందేశ్ కారులో వున్న క్యాష్ ను తన కారులోకి మార్చుకున్నాడు. మిగతా వివరాల కోసం ఈ వీడియో చూడండి. బురిడీ బాబా ఎలా బురిడీ కొట్టించాడో తెలుసుకోండి...

17:16 - June 17, 2016
17:15 - June 17, 2016

బైకుపై వెళ్తుండగా వ్యక్తికి గుండెపోటు..మృతి..

హైదరాబాద్: నగరంలోని నేరెడ్‌మెట్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బైకుపై వెళ్తుండగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో యువకుడు బైకు ఆపాడు. కాసేపట్లోనే మృతిచెందాడు. మృతుడిని రవికుమార్ (35)గా గుర్తించారు.

కోస్తాంధ్రకు భారీ వర్షసూచన..

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్రపై ప్రభావం చూపుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇతర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాల్లో కదలిక వచ్చి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రవేశంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

హ్యండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా బొంతు..

హైదారాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ్మెహన్ తెలంగాణ హ్యండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సమావేశమైన అసోసియేషన్ రామ్మెహన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో కలిసి హ్యాండ్ బాల్ క్రీడాభివృద్థికి తన వంతు సహాకారం అందిస్తానని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 

16:55 - June 17, 2016

హైదారాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతురామ్మెహన్ తెలంగాణ హ్యండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సమావేశమైన అసోసియేషన్ రామ్మెహన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో కలిసి హ్యాండ్ బాల్ క్రీడాభివృద్థికి తన వంతు సహాకారం అందిస్తానని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 

16:52 - June 17, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో జుడిషియల్‌ కమిటీ స్టేటస్‌ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అగ్రిగోల్డ్‌ సంస్థ హైకోర్టును తప్పుదారి పట్టించిందని రిపోర్టులో వెల్లడయ్యింది. ముఖ్యంగా 17 ఆస్తుల్లో 15 ఆస్తులకు అనుమతులు లేవని తేల్చింది. మిగిలిన రెండు ఆస్తులు అమ్మితే వచ్చింది కేవలం 11 కోట్లే బయటపడగా, వీటి నిర్వహణ ఖర్చే 60 లక్షలుగా తేలింది. ఇదిలా ఉంటే అగ్రి గోల్డ్‌ ఆస్తుల వేలం నుంచి 6వేల కోట్లు సమకూర్చడం కష్టమేనని తేలింది. ఇక అటాచ్‌ చేసిన ఆస్తులన్నింటినీ వేలం వేయాలంటే అగ్రిగోల్డ్‌ సహకరించాల్సిందేనని తేలింది. ఇక సీఆర్‌డీఏ పరిధిలో అగ్రిగోల్డ్‌ భూములుగా భావిస్తున్న 175 ఎకరాల స్థలంలో కేవలం 80 ఎకరాలకు మాత్రమే అనుమతి ఉందని తేలింది. ఇరు రాష్ట్రాలు జ్యుడిషియల్‌ కమిటీకి కనీస సౌకర్యాలు సైతం కల్పించలేదనే సంగతి బయటపడింది. జుడిషియల్‌ కమిటీ స్టేటస్‌ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అగ్రిగోల్డ్‌ సంస్థ హైకోర్టును తప్పుదారి పట్టించిందని రిపోర్టులో వెల్లడయ్యింది. ముఖ్యంగా 17 ఆస్తుల్లో 15 ఆస్తులకు అనుమతులు లేవని తేల్చింది. మిగిలిన రెండు ఆస్తులు అమ్మితే వచ్చింది కేవలం 11 కోట్లే బయటపడగా, వీటి నిర్వహణ ఖర్చే 60 లక్షలుగా తేలింది. ఇదిలా ఉంటే అగ్రి గోల్డ్‌ ఆస్తుల వేలం నుంచి 6వేల కోట్లు సమకూర్చడం కష్టమేనని తేలింది. ఇక అటాచ్‌ చేసిన ఆస్తులన్నింటినీ వేలం వేయాలంటే అగ్రిగోల్డ్‌ సహకరించాల్సిందేనని తేలింది. ఇక సీఆర్‌డీఏ పరిధిలో అగ్రిగోల్డ్‌ భూములుగా భావిస్తున్న 175 ఎకరాల స్థలంలో కేవలం 80 ఎకరాలకు మాత్రమే అనుమతి ఉందని తేలింది. ఇరు రాష్ట్రాలు జ్యుడిషియల్‌ కమిటీకి కనీస సౌకర్యాలు సైతం కల్పించలేదనే సంగతి బయటపడింది. 

16:41 - June 17, 2016

విజయవాడ : జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది.. బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారంటూ బాధితులు రోడ్డెక్కారు.. కొందరు మహిళలు కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు జక్కంపూడిలో ఇళ్ల కేటాయించారు. ఈ క్రమంలో ఇళ్ళ కేటాయింపుకు సంబంధించిన బాధితులకు తహల్దార్ ఓ చిట్టీపై రాసిచ్చారనీ..ఇప్పుడు ఆ చీటీ ప్రకారం కేటాయించిన ప్రకారం నివాసముంటున్న బాధితులను ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇళ్లు ఖాళీ చేయిస్తున్న పోలీసులను బాధితులు అడ్డుకున్నారు. ఇక్కడి ఉన్న పళంగా వెళ్లిపొమ్మంటే పిల్లలతో ఎక్కడిపోవాలో దిక్కుతోచటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అగ్నిప్రమాదం సంభవించిన బాధితులకు వైఎస్సార్ కాలనీలో స్థావరం ఏర్పరిచారు. వున్న ప్రాంతం నుండి కూడా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని బాధితులు ఆక్రోశిస్తున్నారు.

16:36 - June 17, 2016

తూ.గోదావరి : తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టి ధ్వంసం చేసిన కేసులో విచారణ సీఐడీ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసి.. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు 14రోజులు రిమాండ్ కోర్టు తీర్పు విధించింది. రిమాండ్ లో వున్న 4గురిని తమ కస్టడీకి అప్పగించాలంటూ శుక్రవారం సీఐడీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాగా నలుగురు నిందితుల్లో శ్రీనివాస్ అనే ఒక్క నిందితుడిని మాత్రమే కోర్టు సీఐడీకి అప్పగించింది. దీంతో శ్రీనివాస్ రేపటి నుండి మూడురోజులపాటు సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. కాగా ఈ కేసులో శ్రీనివాస్ ఏ25 నిందితుడిగా వున్నాడు. ఇదిలా వుండగా అరెస్ట్ చేసినవారందరినీ తక్షణమే విడుదల చేస్తేనే తన దీక్షను విరమిస్తానని కాపునేత ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మిగిలిన వారిని కూడా తమకు అప్పగించాలని సీఐడీ మరోమారు పిటీషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

తుని కేసు విచారణ వేగవంతం...

తూ.గోదావరి : తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టి ధ్వంసం చేసిన కేసులో విచారణ సీఐడీ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసి.. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు 14రోజులు రిమాండ్ కోర్టు తీర్పు విధించింది. రిమాండ్ లో వున్న 4గురిని తమ కస్టడీకి అప్పగించాలంటూ శుక్రవారం సీఐడీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాగా నలుగురు నిందితుల్లో శ్రీనివాస్ అనే ఒక్క నిందితుడిని మాత్రమే కోర్టు సీఐడీకి అప్పగించింది. దీంతో శ్రీనివాస్ రేపటి నుండి మూడురోజులపాటు సీఐడీ కస్టడీలోకి తీసుకుంది.

వృద్ధురాలిపై దాడి..రూ.3లక్షలు దోపిడీ..

హైదరాబాద్ : నగరంలోని సైనిక్ పురి ప్రాంతంలో దొంగతనం జరిగింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నుండి రూ.3లక్షలు డ్రా చేసిన ఓ వృద్దురాలు నడుచుకుంటూ వెళుతుండగా దారి కాసిన దుండగులు ఆమెపై దాడి చేసిన నగదు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం మ.1.00గంటలకు జరిగింది. ఇంటిలో జరుగుతున్న శుభకార్యాం నిమిత్తం డబ్బులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. షాక్ నుండి తేరుకున్న ఆమె నేరేడ్ మెట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ పుటేజ్ ని పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. 

15:53 - June 17, 2016

మెదక్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు మద్దుతుగా జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు సీపీఎం పార్టీ చేపట్టిన రిలే నిరాహరదీక్షలు 12 వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి సందర్శించి సంఘీబావం తెలిపారు. భూ నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా, ప్రాజెక్టు కట్టలేరని ఆయన అన్నారు. కాగా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణకు వ్యతిరేకంగా ఏటికృష్టాపురం గ్రామస్తులకు సీపీఎం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 

15:46 - June 17, 2016

హైదరాబాద్: ఆగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాల పై స్టేటస్ రిపోర్టును జూడిషియల్ కమిటి హైకోర్టుకు సమర్పించింది. అగ్రిగోల్డ్ కంపెనీ తరపు న్యాయవాది తరచూ వాయిదాలు కోరడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 లక్షలు డిపాజిట్ చేయకపోతే.. జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ప్రతి విచారణకు హైకోర్టు వద్దకు భాదితులు భారీగా చేరుకుంటున్నారు. 

అగ్రిగోల్డ్ న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం...

హైదరాబాద్: ఆగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాల పై స్టేటస్ రిపోర్టును జూడిషియల్ కమిటి హైకోర్టుకు సమర్పించింది. అగ్రిగోల్డ్ కంపెనీ తరపు న్యాయవాది తరచూ వాయిదాలు కోరడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 లక్షలు డిపాజిట్ చేయకపోతే.. జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ప్రతి విచారణకు హైకోర్టు వద్దకు భాదితులు భారీగా చేరుకుంటున్నారు. 

15:33 - June 17, 2016

గుజరాత్ : ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా సింహాల ముందు పెద్ద సాహసమే చేశారు. కొన్ని అడుగుల దూరంలోనే సింహాలకు ఎదురుగా కూర్చొని ఏమాత్రం జంకు లేకుండా ఆయన భార్య రీవా సోలంకితో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. సెల్ఫీలు తీసుకొని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జడేజా భార్య స్నేహితులతో కలిసి గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలోగల సాసన్ గిర్కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. 

సాహసం చేసి కేసులో ఇరుక్కున్న క్రికెటర్ ..

గుజరాత్ : ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా సింహాల ముందు పెద్ద సాహసమే చేశారు. కొన్ని అడుగుల దూరంలోనే సింహాలకు ఎదురుగా కూర్చొని ఏమాత్రం జంకు లేకుండా ఆయన భార్య రీవా సోలంకితో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. సెల్ఫీలు తీసుకొని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జడేజా భార్య స్నేహితులతో కలిసి గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలోగల సాసన్ గిర్కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.

బ్రిటన్‌ మహిళ ఎంపీ జోకాక్స్‌ దారుణ హత్య...

బ్రిటన్‌ : ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన మహిళ ఎంపీ జోకాక్స్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ చేరే విషయమై ప్రచారం నిర్వహిస్తున్న జోకాక్స్‌పై ఓ దుండగుడు కత్తితో దాడికి దిగి మూడు రౌండ్లపాటు కాల్పులు జరిపాడు. ముందుగా కాల్పులు జరిపి ఆ తర్వాత కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడుల్లో మరో వ్యక్తి గాయపడ్డాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన ఉత్తర ఇంగ్లాండ్‌లోని బాట్లే అండ్ స్పైన్‌లో గురువారం చోటు చేసుకుంది.

ఆర్టీసీ ఆదాయం పెంపుకు కేసీఆర్ ఆదేశాలు..

హైదరాబాద్ : టీఎస్‌ ఆర్టీసీలో ఆదాయం పెంచేందుకు రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే పుణ్యక్షేత్రాలు, దూరప్రాంతాలకు పండగల నెలలో బస్సులు పెంచాలని సూచించారు. వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. పాఠశాలలకు, కాలేజీల టూర్లకు ఆర్టీసీ బస్సులను వాడాలన్నారు. డిమాండ్లు ఉన్న రూట్లను గుర్తించి ఆ రూట్లలో సర్వీసులు పెంచాలని ఆదేశించారు. వరంగల్‌, నిజామాబాద్‌లకు ఏసీ బస్సులను పెంచాలన్నారు. 

తొలిసారిగా హాకీ ఫైనల్స్ లోకి భారత్ ...

ఇంగ్లాండ్ : చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్స్ కు భారత్ తొలిసారిగా చేరుకొంది. లండన్ లో జరుగుతున్న ఆరుదేశాల ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ 7 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరిరౌండ్ పోటీలో భారత్ 2-4 గోల్స్ తో పోరాడి ఓడినా..గ్రేట్ బ్రిటన్‌- బెల్జియం జట్ల పోటీ 3-3 గోల్స్ తో డ్రాగా ముగియడంతో ఫైనల్స్ చేరుకోగలిగింది. బంగారు పతకం కోసం జరిగే పోటీలో ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

14:59 - June 17, 2016

హైదరాబాద్‌ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల మృతికి కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు ప్రొఫెసర్‌ సాయిబాబా. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్లు కెవై.రత్నం, తథగత్‌ సేన్‌ గుప్తాల నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు. రోహిత్‌ వేములది ముమ్మాటికీ రాజకీయ హత్యే నంటున్న ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోపించారు. విద్యార్థి ఉద్యమాలకు బాసటగా ఉన్న ప్రొఫెసర్స్‌ను సస్పెండ్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. వాస్తవానికి తను కూడా సస్పెన్షన్‌లోనే ఉన్నానని.. అన్ని యూనివర్సిటీలలో పరిస్థితి ఇలానే ఉందని ఆయన ఆరోపించారు.
మాకు ఎటువంటి న్యాయం జరగలేదు: రోహిత్ తల్లి
రోహిత్‌ చనిపోయి ఐదు నెలలు గడిచినా.. ఎటువంటి న్యాయం జరగలేదని రోహిత్‌ తల్లి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోగా.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సటీలో ఇద్దరు ప్రొఫెసర్స్ ని సస్పెండ్‌ చేశారని ఆమె అన్నారు. కుట్ర పూరితంగానే ప్రొఫెసర్స్‌ను సస్పెండ్‌ చేశారని ఆమె ఆరోపించారు. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేములు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. 

14:53 - June 17, 2016

హైదరాబాద్ : టీఎస్‌ ఆర్టీసీలో ఆదాయం పెంచేందుకు రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే పుణ్యక్షేత్రాలు, దూరప్రాంతాలకు పండగల నెలలో బస్సులు పెంచాలని సూచించారు. వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. పాఠశాలలకు, కాలేజీల టూర్లకు ఆర్టీసీ బస్సులను వాడాలన్నారు. డిమాండ్లు ఉన్న రూట్లను గుర్తించి ఆ రూట్లలో సర్వీసులు పెంచాలని ఆదేశించారు. వరంగల్‌, నిజామాబాద్‌లకు ఏసీ బస్సులను పెంచాలన్నారు. 

14:48 - June 17, 2016

ఇంగ్లాండ్ : చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్స్ కు భారత్ తొలిసారిగా చేరుకొంది. లండన్ లో జరుగుతున్న ఆరుదేశాల ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ 7 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరిరౌండ్ పోటీలో భారత్ 2-4 గోల్స్ తో పోరాడి ఓడినా..గ్రేట్ బ్రిటన్‌- బెల్జియం జట్ల పోటీ 3-3 గోల్స్ తో డ్రాగా ముగియడంతో ఫైనల్స్ చేరుకోగలిగింది. బంగారు పతకం కోసం జరిగే పోటీలో ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

14:47 - June 17, 2016

లాడ్జీల్లో భద్రత లేదు..నట్టింట్లో రక్షణ కరువు..హాస్టల్ లో అరాచకమే..
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే దారితప్పింది.కూతురిని మృగాళ్లకు అమ్మేసింది. మరోవైపు హాస్టల్ సేఫ్ గా ఉంటుందని అనుకున్న ఓ యువతిపై యజమాని కన్నేశాడు. దుర్మార్గుల చెర నుండి తప్పించుకున్న బాలిక..యువతి పోలీసుల రక్షణలో ఉన్నారు. ఇంకా ఎంతకాలం..ఒంటరిగా కనిపించే ఆడవాళ్ల పరిస్థితి ఏంటీ ? ఎన్ని చట్టాలు వచ్చినా ఎందుకు కాపాడ లేకపోతున్నాయి. ఎక్కడుంది లోపం..?
ఎస్ఆర్ నగర్ లోని ఓ హాస్టల్ లో యువతిపై యజమాని అత్యాచారయత్నం చేయబోయాడు. దుర్మార్గుడి నుండి తప్పించుకున్న యువతి పోలీసుల రక్షణలో ఉంది. ఇదిలా ఉంటే మరో ఘటనలో ఓ కూతురిని అమ్మ అమ్మేసింది. తన సుఖాలకు అడ్డుగా వస్తోందని అరాచకం చేసింది. మృగాళ్ల చేతులు మారుతూ వ్యభిచార గృహానికి చేరింది. ఈ దుర్మార్గంలో హోంగార్డు పాత్ర ఉంది. ఈ బాలికను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు రక్షించారు.

14:46 - June 17, 2016

మొన్నటి మొన్న ఓ చిరుద్యోగి ఆస్తి రూ. కోటి అంటే అవాక్కయ్యారు..ఆ తరువాత మరో అధికారి ఆస్తి ఐదు కోట్లు..ఇంకో అధికారి అక్రమాస్తి పది కోట్లు..ఇలా బయటపడుతున్న అక్రమాస్తులు చూసిన ఏసీబీ షాక్ తింటోంది. అయితే వీరిని మించిన మరో ఆఫీసర్ బాగోతం బయటపడింది. ఇప్పటి వరకు పది కోట్ల వరకు మాత్రమే ఉంటే ఈ అధికారి ఆస్తి మాత్రం పది కోట్లను దాటేసింది. అక్రమార్కులకు రోల్ మోడల్..ఈ విజయ్ కుమార్...మాదాపూర్ డైరెక్ట్ ఆఫ్ బాయిలర్ విజయ్ కుమార్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. తనిఖీల్లో బయటపడుతున్న నగదు..ఇతరత్రా వాటిని చూసి ఏసీబీ షాక్ తింది. మరిన్ని విషయాలకు వీడియోలో చూడండి..

14:45 - June 17, 2016

ఏఎస్పీ డెత్ మిస్టరీపై అనేక అనుమానాలు...కీలకం మారనున్న పోస్టుమార్టం నివేదిక..ప్రమాదవశాత్తు జరిగిందా ? ఆత్మహత్యనా ?

అక్రమార్కుల పట్ల ఆయన సింహస్వప్నం..ఆయన రంగంలోకి దిగాలంటే కరడుగట్టిన నేరస్తులు సైతం పరుగులు తీయాల్సిందే. అలాంటి పోలీసు అధికారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చుకున్నాడా ? లేక గన్ మిస్ ఫైర్ అయ్యిందా ? లేక అక్రమార్కులు కుట్ర పన్నారా ? అసలు ఏం జరిగింది ? పాడేరు ఏఎస్పీ శశికుమార్ డెత్ లో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా ? ఆత్మహత్యనా ? వాస్తవం తెలుసుకొనేందుకు పోలీసులు శోధన జరుపుతున్నారు..మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి.

13:41 - June 17, 2016

హైదరాబాద్ : తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రప్రభుత్వం వివక్షత చూపుతుందని టీఆర్ ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. గత రెండేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రాజ్యాంగ బద్ధంగా కేవలం రూ.1500 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతీ పైసాను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. కేంద్రం ఎపికి ఇచ్చిన నిధులతో పోల్చుకుంటే సగం నిధులను మాత్రమే తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తక్కువ నిధులు ఇస్తూ ఎక్కువ నిధులు ఇస్టున్నట్లు బిజెపి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఆంధ్రాకు ఎన్ని నిధులు వస్తున్నారో తెలంగాణకు కూడా అన్ని నిధులు తీసుకురావాలని బీజేపీ నేతలకు ఆమె సూచించారు. టీఆర్ ఎస్ ప్రజల కోసం పనిచేస్తోందని..కేంద్రప్రభుత్వం ప్రచారం కోసం పని చేస్తుందని ఎద్దేవా చేశారు. లాయర్ల ఆందోళనకు బాధ్యతా రాష్ట్ర ప్రభుత్వానిదా లేక కేంద్రానిదా అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్.. కాంట్రాక్టర్లకు టిక్కెట్లు ఇస్తుందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ నీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్నవి చేరికలు కాదని.. రాజకీయ పునరేకీకరణ జరుగుతందన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

 

 

13:41 - June 17, 2016

హైదరాబాద్ : దొంగ బాబా శివానందపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ 307, 420, 379 సెక్షన్ల కింద  పోలీసులు కేసులు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పోలీసులు బాబాను విచారిస్తున్నారు. శివానందతోపాటు మరో ముగ్గురిని కూడా విచారిస్తున్నారు. మరోవైపు మధుసూదన్ రెడ్డి కొడుకు సందేష్ రెడ్డిని బంజారా హిల్స్ ఎసిపి ఉదయ్ కుమార్ విచారిస్తున్నారు. శివానందస్వామి నమ్మించి మోసం చేస్తాడని అనుకోలేదని సందేష్ రెడ్డి ఆదేన వ్యక్తం చేశారు. ఆపోలో ఆస్పత్రిలో మధుసూదన్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. దొంగ బాబా వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోగా దొంగ బాబాను పోలీసుల మందు ప్రవేశపెట్టనున్నారు. 

 

13:39 - June 17, 2016

విశాఖ : నగరంలోలో విషాదం నెలకొంది. ఇల్లు కూలి బాలుడు మృతి చెందాడు. రాత్రి కురిసిన వర్షానికి చిట్టి వలస జూట్ మిల్లు క్వార్టర్స్  కూలింది. దీంతో బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. 

రాష్ట్ర బీజేపీని పట్టించుకోని కేంద్ర మంత్రి పారికర్...

హైదరాబాద్ : కేంద్ర మంత్రి పారికర్ నగరానికి చేరుకున్నారు. కానీ రాష్ట్ర బీజేపీని పారికర్ ను పట్టించుకోలేదు. షెడ్యూల్ వివరాలను అడిగినా పారికర్ స్పందించలేదు. పారికర్ పై టి.బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే విందుకు పారికర్ హాజరు కానున్నారు.

అంబటి రాకముందే తాము రాజకీయాల్లో ఉన్నాం - ఎమ్మెల్యే మోహన్ రెడ్డి..

గుంటూరు : వైసీపీ నేత అంబటి రాజకీయాల్లోకి రాకముందే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పేర్కొన్నారు. డబ్బులకు అమ్ముడుపోయామని నిరూపిస్తే రాజకీయాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తాము నిజాలు చెబితే జగన్ కు ఇబ్బంది ఉంటుందని, జగన్ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించడం సరి కాదన్నారు.

కాంగ్రెస్ ను దిగ్విజయ్ గాడిలో పెట్టాలి - ఎంపీ కవిత..

హైదరాబాద్ : దిగ్విజయ్ కాంగ్రెస్ ను గాడిలో పెడితే మంచిదని, సమైక్య నేతలకు కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. కేంద్రం నుండి రూ. 1500 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. కేంద్రం వైఖరి కారణంగానే న్యాయవాదులు రోడ్లపైకి వచ్చారన్నారు. హైకోర్టు విభజనపై బీజేపీ నేతలు ఏమంటారని ప్రశ్నించారు.

ఆర్టీసీపై కొనసాగుతున్న కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష కొనసాగుతోంది. ఆర్టీసీని లాభాల బాట పట్టించే విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆర్టీసీలో ఆదాయం పెంచేందుకు రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. పర్యాటక శాఖకు రవాణాను టీఎస్ఆర్టీసీ ద్వారానే చేయాలని డిమాండ్లు ఉన్న రూట్లను గుర్తించాలని సూచించారు. వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చేలా చేయాలన్నారు.

 

వైఎస్ఆర్ కాలనీలో ఉద్రిక్తత..

విజయవాడ : జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు జక్కంపూడిలో ఇళ్లను అధికారులు కేటాయించారు. లబ్ధిదారుల్లో సగానికిపైగా అనర్హులు ఉన్నారంటూ బలవంతంగా అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

13:19 - June 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వ్యాపార, వాణిజ్య సంస్థలు 365 రోజులూ తెరచివుంచే విధానాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా వ్యాపారం నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కార్మిక శాఖ జీవో జారీ చేసింది. 
విధానంపై కేసీఆర్‌ సమీక్ష 
రాష్ట్రంలో ఏడాది పొడవునా వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరచి ఉంచుకునే విధానం సత్ఫలితాలిచ్చింది. ఏడాది  క్రితం ప్రయోగాత్మకంగా చేపట్టిన దీని కాలపరిమితి ఈనెల 15తో ముగిసింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విధానంపై సమీక్షించారు. అన్ని వైపుల నుంచి వచ్చిన సమాచారాన్ని బేరీజు వేసుకుని... 365 రోజులు షాపులు తెరచి ఉంచుకునే విధానాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
ఈ విధానం అందరికీ అనుకూలం 
గతంలో  ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో షాపులను మూసివేసే విధానం అమల్లో ఉండేది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు. ప్రజలతోపాటు, వ్యాపార, వాణిజ్య సంస్థల  యజమానులకు ఉపయోగపడేలా సెలవు రోజుల్లో కూడా తెరచివుంచుకునే వెసులుబాటు కల్పించారు. దీనికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడంతోపాటు, వాణిజ్య పన్నుల రూపంలో ఖజానాకు కాసులు తెచ్చిపెట్టింది. దీంతో ఈ విధాన్ని పొడిగిస్తూ కార్మిక శాఖ జీవో జారీ చేసింది. 
రాత్రిళ్లు పని చేసే మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యం 
ఇదే సమయంలో వాప్యార, వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు వ్యాపార సంస్థలను తెరిచి ఉంచాలి. రాత్రి 8 గంటల తర్వాత మహిళా సిబ్బందితో పనిచేయించుకోవాల్సి వస్తే .. ఇంటికి వెళ్లేందుకు రవాణ సౌకర్యం కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బందితో రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేసేలా నిబంధనలు రూపొందించారు.  వారానికి 48 గంటలు  పని... ఒకరోజు సెలవు ఇవ్వాలని జీవోలో స్పష్టం చేశారు. కార్మికులు ఎన్ని గంటలు పనిచేసింది వేతనాల రిజిస్టర్‌లో రాయాలి. జీతాలను బ్యాంకు ఖాతాల్లో  జమ చేయాలి. ప్రతి ఉద్యోగికి నియామక పత్రం ఇవ్వడంతో పాటు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని జీవోలో పేర్కొన్నారు. జీవోలోని ప్రతి అంశం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరారు. 

 

పాడేరు ఏఎస్పీ మృతిపై అధికారుల విచారణ..

విశాఖపట్టణం : పాడేరు ఏఎస్పీ శశికుమార్‌ మృతిపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని సీఐడీ అధికారులు పరిశీలించగా క్లూస్ టీం సాక్ష్యాలు సేకరించింది.

నేరెడ్ మెట్ లో దారి దోపిడి..

హైదరాబాద్ : నేరేడ్ మెట్ లో దారి దోపిడి జరిగింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న వృద్ధురాలి వద్ద రూ. 3లక్షలను దొంగలు అపహరించుకపోయారు.

బురిడి బాబాపై కేసులు నమోదు..

హైదరాబాద్ : బురిడి బాబాపై 420, 379, 307 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని లైఫ్‌స్టైల్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కోటి 30 లక్షలు తీసుకుని దొంగ బాబా పరారైన సంగతి తెలిసిందే.

హెచ్ సీయూ వద్ద ప్రొఫెసర్ల ఆందోళన..

హైదరాబాద్ : సస్పెన్షన్ ను నిరసిస్తూ హెచ్ సీయూ ప్రధాన గేటు వద్ద ప్రొ.రత్నం, తదాగత్ సేన్ ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరికి ప్రొ.సాయిబాబా, రోహిత్ తల్లి రాధిక సంఘీభావం తెలిపారు. ప్రొఫెసర్ల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రొ. సాయిబాబా డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో దళిత వివక్ష కొనసాగుతోందని, ప్రశ్నించే వాళ్లను అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు.

ఆర్టీసీని బలోపేతం చేయాలి - తమ్మినేని..

హైదరాబాద్ : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సినవసరం ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. హెచ్ సీయూ వీసీ అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని, ఇద్దరు ప్రొఫెసర్లపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

12:54 - June 17, 2016

హైదరాబాద్ : మళ్లీ అదే నిర్లక్ష్యం...స్కూల్స్ ప్రారంభమయ్యాయో లేదో తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార యంత్రాంగం తనిఖీలు చేపడుతున్నా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటుడడం గమనార్హం. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. మొన్ననే ఓ ప్రైవేటు స్కూల్ బస్సు టైర ఊడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదాలు జరిగి సమయంలో ఇతర ప్రాంతాల్లో అధికారులు స్కూల్ బస్సులను తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు జరుగుతున్నా ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. స్కూల్ బస్సులు ఫిట్ గా ఉంటున్నాయా ? లేదా ? బస్సు డ్రైవర్ సుశిక్షుతుడై ఉన్నాడా ? లేదా అనే దానిపై అధికారులు, స్కూల్ యాజమాన్యం దృష్టి సారించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అదే నిర్లక్ష్యం..
జస్వంత్ (6) విద్యార్థి జీడిమెట్లలోని వివేకానందనగర్ లో విజ్ఞాన సుధ టాలెంట్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నాడు. రోజులాగే విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ దగ్గర వదిలి వెళ్లారు. బాలుడు స్కూల్ వైపు నడిచి వస్తున్నాడు. దీనిని గమనించని స్కూల్ బస్సు డ్రైవర్ రివర్స్ చేశాడు. దీనితో జస్వంత్ బస్సు టైర్ల కింద పడి తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీనితో కన్నతల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు..

ఏపీలో...
విజయనగరం జిల్లాలోని ఎస్‌కోట మండలం కాపుసోంపురం వద్ద రవితేజ స్కూలుకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఘటనకు కారకుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల అధికారులు, స్కూల్ యాజమాన్యాలు మేల్కొని ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

12:45 - June 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ సంచాలకులు కిషన్ విడుదల చేశారు. పేపర్-1లో 54.45 శాతం ఉత్తీర్ణత, పేపర్ -2లో 25.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్ -1లో 134 మార్కులతో మెదక్‌ జిల్లాకు చెందిన స్నేహలత మొదటి స్థానంలో నిలిచింది. పేపర్ -2లో 126 మార్కులతో కరీంనగర్ జిల్లాకు చెందిన శారదావాణి ప్రథమ స్థానంలో నిలిచింది. పేపర్ -1లో కరీంనగర్ జిల్లా ఫస్ట్, రంగారెడ్డి జిల్లా చివరిస్థానంలో నిలిచింది. పేపర్-2లో మ్యాథమెటిక్స్/సైన్స్ విభాగంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం నిలవగా..మెదక్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. పేపర్-2లో సోషల్ స్టడీస్ లో హైదరాబాద్ ఫస్ట్, మెదక్ చివరిస్థానంతో సరిపెట్టుకుంది. టెట్ మార్కుల మెమోలను ఈనెల 21 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కిషన్ తెలిపారు. మే 22న 2016న టెట్ పరీక్ష జరిగింది. 

12:42 - June 17, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. బొమల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భారత్‌ భద్రతా దళాలకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. అయినా మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు కాల్పుల్ని కొనసాగిస్తున్నాయి. 

 

12:39 - June 17, 2016

ఢిల్లీ : గుల్బర్గ్ హత్యాకాండ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో దోషులకు శిక్షలు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార జైలు శిక్ష విధించగా.. 12 మందికి  ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఒకరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఈ గుల్బర్గ్ హౌసింగ్‌ సొసైటీ నరమేథంలో 69 మంది మృతి చెందారు.  

 

12:31 - June 17, 2016

హైదరాబాద్ : సంసారం-వ్యభిచారం...ఇదీ ఇప్పుడు కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్య సెగలు పుట్టిస్తోంది. నాడు టీఆర్ఎస్ నేతలను చేర్చుకున్న కాంగ్రెస్....ఇప్పుడు వలసలపై గగ్గోలు పెట్టడం ఏంటని గులాబీ బాస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ...రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని హస్తం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్
రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. నువ్వా...నేనా...నీకంటే నేనే ఎక్కువ అంటూ పోటీపడి టార్గెట్ చేసుకుంటున్నాయి రెండు పార్టీల నేతలు. వరుస గెలుపులతో ఊపుమీదున్న టీఆర్ఎస్....ఆకర్ష్ పాలిటిక్స్‌కు తెరలేపి కాంగ్రెస్‌కు చుక్కులు చూపిస్తోంది. దీంతో టీఆర్ఎస్‌పై హస్తం నేతలు రగిలిపోతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌తో హస్తం నేతలు చిటపటలాడుతున్నారు...
టీఆర్ఎస్‌ గూటికి హస్తం నేతలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో పాటు మాజీ ఎంపీ వివేక్ బ్రదర్స్ టీఆర్ఎస్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే...వీరి చేరిక సమయంలో గులాబీ బాస్ కాంగ్రెస్‌ను ఏకి పారేశారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు నీతులు చెబుతుందంటూ విరుచుకుపడ్డారు. అక్కడితో ఆగకుండా...నాడు కాంగ్రెస్ చేస్తే సంసారం...ఇప్పుడు మేము చేస్తే వ్యభిచారమా..అంటూ కేసీఆర్ సంధించిన ప్రశ్నపై...ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్ బరితెగింపు ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారంటూ భగ్గుమంటున్నారు. ఫిరాయింపులతో తానే రాజకీయ వ్యభిచారం చేస్తున్నానని కేసీఆర్ చాటుకున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు హస్తం నేతలు...
కేసీఆర్ పై మల్లురవి ఫైర్ 
కేసీఆర్.. రాజకీయ వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చి రాజకీయాలను రెడ్ లైట్ ఏరియాగా మార్చేశారని కాంగ్రెస్ నేత మల్లురవి మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకంలేకనే ....ఇతర పార్టీల నేతలను కొనగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు...అల్లుడు హరీష్ ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారోనన్న భయంతో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మల్లురవి అన్నారు. ఇప్పుడు ఉప్పు-నిప్పుగా ఉన్న అధికార, ప్రతిపక్షాలు...నీవంటే ...నీవు రాజకీయ వ్యభిచారం చేస్తున్నావంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గతానికి..వర్తమానానికి లింక్ చేస్తూ...పోటీపడీ తిట్ల దండకం అందుకుంటున్నారు.

 

12:25 - June 17, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన బురిడీ బాబా ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎలా స్వామిగా మారాడు..? శివయ్య స్వామిగా చెబుతున్న ఆ దొంగ స్వామి అసలు నిత్యకృత్యమేంటి..?
అసలు పేరు గుడ్పగారి శివ..
అసలు పేరు గుడ్పగారి శివ..అలియాస్..సూర్యా...శివయ్య స్వామి...మహాగనగరంలో శివానంద స్వామి... ఇలా ఎన్నో రకాల పేర్లు మార్చుకుంటున్న శివయ్య సొంత ఊరు కర్నాటక,ఆంధ్రప్రదేశ్‌ బోర్డర్‌లోని కుప్పం సమీపంలో ఉన్న వెండుగాంపల్లి...ఇక్కడే పుట్టి పెరిగిన గుడ్డప్పగారి శివ ఇంటర్‌ చదివాడు..ఆ తర్వాత చదువు మానేసి ఇంట్లో గొడవపడి డబ్బులు ఎత్తుకుని పారిపోయాడు....
కేరళలో తేలిన శివ...
ఇలా ఇంటి నుంచి పారిపోయిన శివ..అలియాస్ శివయ్య స్వామిగా మారి స్వగ్రామం చేరాడు..కేరళలో ఉన్నంతకాలంలో నేర్చుకున్న పూజలు..విద్యలన్నీ ఇక్కడ మొదలుపెట్టాడు..కొత్తదనంతో పాటు శివయ్య చెప్పేదాంట్లో కొంత అనుకూలంగా ఉండడంతో అతన్ని స్వామిని చేశారు అమాయకజనం...ఇలా మొదలయిన శివయ్యస్వామి లీలలు ఎన్నో ఉన్నాయి...
శివ మోసాలు 
స్వామి అవతారం ఎత్తిన శివ ఇక మోసాలు చేయడం మొదలుపెట్టాడు...ఇలా ఒక్క తిరుపతిలోనే దాదాపు 80 లక్షలు మోసం చేసినట్లు కేసులయ్యాయి..ఆ తర్వాత జైలు పాలయ్యాడు కూడా...రకరకాలుగా పూజల పేరుతో మోసాలు చేయడమేగాక ప్రాంతాల వారిగా పేరు కూడా మార్చేశాడు...

 

12:18 - June 17, 2016

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ప్రకాశ్‌ కారత్‌, కేరళ సీఎం విజయన్‌, మాణిక్‌ సర్కార్‌ సహా పోలిట్‌ బ్యూరో సభ్యులంతా హాజరవుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ఈ సమవేశంలో చర్చించనున్నారు. పోలిట్‌బ్యూరోలో ఖరారు చేసిన ముసాయిదాపై రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే కేంద్రకమిటీలో సమావేశంలో సుధీర్ఘంగా చర్చించనున్నారు. మోడీ రెండేళ్ల పాలన, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై కూడా కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.  

 

అధికారులపై మండిపడిన మంత్రి జోగు రామన్న..

ఖమ్మం :హరితహారం, విద్యాశాఖ పనితీరుపై మంత్రులు తుమ్మల, జోగు రామన్న, జూపల్లిలు సమీక్ష నిర్వహించారు. హరితహారంపై అధికారులపై మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలు లేకుండా సమావేశానికి ఎందుకొచ్చారని అధికారులపై జోగు రామన్న మండిపడ్డారు. విద్యాశాఖ పనితీరుపై కూడా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

12:14 - June 17, 2016

విజయనగరం : జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో త్రీవంగా గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌కోట మండలం కాపుసోంపురం వద్ద రవితేజ స్కూలు బస్సు బోల్తా పడింది. ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

 

టెట్...పేపర్ 1 లో 54.45 శాతం ఉత్తీర్ణత..

హైదరాబాద్ : కాసేపటి క్రితం టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్-1లో 54.45శాతం ఉత్తీర్ణ‌త రాగా పేప‌ర్-2లో 25.04శాతం ఉత్తీర్ణత న‌మోద‌యింది. పేప‌ర్‌-1లో 134మార్కుల‌తో మెద‌క్ జిల్లా అభ్య‌ర్థి స్నేహ‌ల‌త మొద‌టి ర్యాంకు సాధించారు. పేప‌ర్‌-2 లో 126మార్కుల‌తో శార‌దావాణి  ప్రథమ స్థానం సాధించారు. పేపర్ 1లో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా రంగారెడ్డి చివరి స్థానంలో నిలిచింది. పేపర్ 2 లో ఖమ్మం జిల్లా మొదటి స్థానం...మెదక్ జిల్లా లాస్ట్ లో నిలిచింది. ఈనెల 21 నుండి టెట్ మెమోల కోసం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 22వ తేదీన టెట్ పరీక్ష జరిగింది.

 

కామారెడ్డిలో మంత్రి హరీష్ పర్యటన..

నిజామాబాద్ : జిల్లాలోని కామారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. టిడిపి, కాంగ్రెస్ లు మల్లన్న సాగర్ ను అడ్డుకుంటూ శిఖండి పాత్రను పోషిస్తున్నాయన్నారు. ఈ ఏడాది 250 ఇంగ్లీష్ మీడియం, 30 మహిళా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. 203 జీవోను ఉత్తమ్ అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

కొనసాగుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రకాశ్ కరత్, సీఎంలు విజయన్, మాణిక్ సర్కార్ లు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశ ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై పొలిట్ బ్యూరో చర్చించనుంది.

ఘోర్కా అటవీ ప్రాంతంలో కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లా ఘోర్కా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాల్లో ఎవరైనా మృతి చెందారా ? అనేది తెలియరాలేదు.

టెట్ లో స్నేహలతకు మొదటి ర్యాంకు..

హైదరాబాద్ : కాసేపటి క్రితం టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్ కు చెందిన స్నేహలతకు మొదటి ర్యాంకు వచ్చింది. పేపర్ -2 లో 126 మార్కులతో కరీంనగర్ కు చెందిన శారదావాణి మొదటి ర్యాంకు సాధించింది.

గుల్బర్గ్ హత్యాకాండ కేసులో తీర్పు...

ఢిల్లీ : గుల్బర్గ్ హత్యాకాండ కేసులో దోషులకు శిక్షలు ఖరారయ్యాయి. 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పింది. ఒకరికి పదేళ్ల జైలు, 12 మందికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2002లో గుజరాత్‌లోని గుల్బర్గ్‌ సొసైటీలో జరిగిన హత్యాకాండలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

 

హోటల్ లో ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : హోటల్ మారియట్ లో ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

గేట్ వే హోటల్ లో పౌష్టికాహార సదస్సు...

విజయవాడ : యూనిసెఫ్ ఆధ్వర్యంలో గేట్ వే హోటల్ పౌష్టికాహార సదస్సు జరుగుతోంది. స్పీకర్ కోడెల, ఏపీ మండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు పీతల, మృణాలినిలు హాజరయ్యారు.

 

11:54 - June 17, 2016

హైదరాబాద్ : నగరంలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ చేయడానికి దుండగులు ప్రయత్నించారు. వనస్థలిపురం సహారా ఎస్టేట్‌ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడి.. నగదు అపహరించేందుకు కొందరు ప్రయత్నం చేశారు. అయితే ఏటీఎం మిషన్‌ తెరుచుకోకపోవడంతో దుండగులు పరారయ్యారు.    

11:40 - June 17, 2016

రంగారెడ్డి : జిల్లాలోని జీడిమెట్లలో విషాదం నెలకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి ప్రాణం తీసింది. స్కూల్ బస్సు కింద పడి ఎల్ కేజీ విద్యార్థి మృతి చెందాడు. జస్వంత్  రెడ్డి (6) విద్యార్థి జీడిమెట్లలోని వివేకానందనగర్ లో విజ్ఞాన సుధ టాలెంట్ స్కూల్ లో ఎల్ కేజీ  చదువుతున్నాడు. రోజులాగే విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ దగ్గర వదిలి వెళ్లారు. బాలుడు స్కూల్ వైపు నడిచివస్తుంగా అదే స్కూల్ కు చెందిన బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జస్వంత్ బస్సు టైర్ల కింద పడ్డాడు. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. జీడిమెట్ల పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవరు నిర్లక్ష్యంవల్లే తమ బాబు మృతిచెందాడని బాలుడి తల్లిదండ్రులు స్కూలు ముందు ఆందోళనకు దిగారు. 

11:29 - June 17, 2016

రంగారెడ్డి : దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజురోజకు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని పేట్ బషీర్ బాగ్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. సుచిత్ర చౌరస్తా వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంకులో ఇద్దరు దండగులు చోరీకి విఫలయత్నం చేశారు. రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇద్దరు దండగులు సుత్తితో ఆంధ్రాబ్యాంకు షెటర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. శబ్ధాలు విన్న స్థానికులు అక్కడి వచ్చి చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తిని పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడుగా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 

ఖైరతాబాద్ గణపతికి భూమిపూజ..

హైదరాబాద్ : సెప్టెంబర్ నెలలో జరిగే వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

కోపా..సెమీ ఫైనల్లో అమెరికా..

సీటెల్ : కోపా అమెరికా కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో అతిథ్య అమెరికా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సెంచరీ ఫీల్డ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈక్వెడార్ ను 2-1తో ఓడించింది.

జగన్ ఓ మానసిక రోగి - ఆనం..

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జ‌గ‌న్‌కి ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం ధ్యాస ఉండ‌బోద‌ని, ఆయ‌న‌కి కేవలం డ‌బ్బుపైనే దృష్టి ఉంటుంద‌ని విమ‌ర్శించారు.

11:17 - June 17, 2016

మెదక్ : రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండించే వారికి ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు. 

 

టెట్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ టెట్ - 2016 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ విడుదల చేశారు. పేపర్ -1 లో 63.5 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ టాప్ లో ఉండగా పేపర్ 2 లో సోషల్ స్టడీస్ లో హైదరాబాద్ టాపర్ గా నిలిచింది. పేపర్ 2 గణితంలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. పేపర్ 1లో 54.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పేపర్ -2 లో 25.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 

విజయనగరంలో పిడుగుపాటు..ఇద్దరు మృతి..

విజయనగరం : జిల్లాలో సాలూరు మండలం మారయ్యపాడులో పిడుగు పాటుకు మహిళ మృతి చెందింది. గజపతినగరం మండలం ముచ్చర్లలో యువకుడు కూడా పిడుగుపాటుకు మృతి చెందాడు.

ఏరోస్పేస్ కు రేపే శంకుస్థాపన..

హైదరాబాద్ : ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో భాగస్వామ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న వైమానిక విడిభాగాల తయారీ పరిశ్రమకు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు బోయింగ్, టాటా సంస్థల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వికారాబాద్ లో గంజాయి స్వాధీనం..

రంగారెడ్డి : జిల్లా వికారాబాద్ మండలంలో సిద్దులూరు, గొట్టిముక్లలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

10:41 - June 17, 2016

నానీ..టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. 'అలా మొదలైంది' సినిమా తరువాత నానికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 'భలే భలే మొగడివాయ్'. అనంతరం 'జెంటిల్ మెన్' తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో రెండు షేడ్స్ తో నటించాడు. విలన్ ? హీరో ? అని ప్రశ్నించారు. దీనితో ఈ సినిమాలో నాని విలన్ ? హీరో ? అనే ప్రశ్నలు ఉదయించాయి. ఈ నేపథ్యంలో నానితో టెన్ టివి ముచ్చటించింది. దీనిపై పలు కామెంట్స్ చేశారు. పబ్లిషిటీ కోసమే అలా పెట్టడం జరిగిందని, ఇంత ఆదరణ వస్తుందని ఆశించలేదనన్నారు. ఇందులో విలన్..హీరో అంటూ రెండూ ఉంటాయని, ఎందుకు మంచి ? ఎందుకు చెడు ? అనేది తెలియాలంటే సినిమలో చూడాల్సిందేనని నాని పేర్కొన్నారు.

 

10:36 - June 17, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ చోరీ కేసులో దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో దొంగ బాబా శివను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బొల్లారం పీఎస్ లో దొంగ బాబాను పోలీసులు విచారిస్తున్నారు. బాబాతో పాటు ఆరెస్టైన సుధీర్, షాజహాన్ లను పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బాబా అనుచరులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి కూపీ లాగుతున్నారు. ఇవాళా లేదా రేపు మీడియా ముందు దొంగబాబాను ప్రవేశపెట్టనున్నారు.
బంజారాహిల్స్ లో దోపిడి 
బంజారాహిల్స్ లోని లైఫ్‌స్టైల్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కోటి 30 లక్షలు తీసుకుని ఓ దొంగ బాబా పరారైన సంగతి తెలిసిలందే. మాయమైన బురిడీ బాబా బెంగళూరులో ప్రత్యక్షమయ్యాడు...దొంగ బాబా నగరంలో దోచుకుని రాత్రే బెంగళూరుకు పారిపోయినట్లు కాల్‌డేటా...సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు...వెంటనే అరెస్టు చేసిన పోలీసులు దొంగ బాబా నుంచి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధించి దొంగ బాబా కారు డ్రైవర్‌ శివను ఉదయాన్నే పోలీసులు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఎర్రవల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో వెళ్తున్న డ్రైవర్‌ దొరికిపోయాడు. కారును సీజ్‌ చేసి డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి దొంగ బాబా వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు దొంగబాబా పెట్టిన మత్తు ప్రసాదం తిన్న మధుసూదన్‌ రెడ్డి ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

మంత్రి వెంకయ్యకు ఘన స్వాగతం..

హైదరాబాద్ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నగరంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

ఏసీబీ విచారణకు ఆదేశించిన లెఫ్టినెంట్ గవర్నర్..

ఢిల్లీ : రూ. 400 కోట్ల ట్యాంకర్ల కుంభకోణం కేసులో ఏసీబీ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్ విచారణను ఏసీబీకి అప్పగించారు.

 

సోపూర్ లో కాల్పులు..ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : సోపూర్ లోని బోమాయిలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒక ఉగ్రవాది మృతి చెందాడు. కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం.

స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల బాలుడు మృతి..

రంగారెడ్డి : జీడిమెట్లలోని వివేకానంద నగర్ లో విషాదం చోటు చేసుకుంది. విజ్ఞాన్ సుధ స్కూల్ బస్సు వెనుకటైర్ల కిందపడి ఆరేళ్ల బాలుడు యశ్వంత్ మృతి చెందాడు. బస్సు రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

09:49 - June 17, 2016

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీపై మరికాసేట్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి టీఎంయూను ఆహ్వానించడంపై ఈయూ నిరసన తెలుపుతున్నారు. ఎన్నికలకోడ్ అమలులో ఉండగా టీఎంయూను ఎలా ఆహ్వానిస్తారు..? దీనిపై ఈసీ, కార్మికశాఖకు ఫిర్యాదుచేస్తాని ఈయూ ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘమైన ఈయూను ఆహ్వానించాలి. లేదంటే సమావేశం ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. 

09:44 - June 17, 2016

హైదరాబాద్ : ప్రైవేట్‌ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. దాడులు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను సీజ్‌  చేశారు. హైదరాబాద్‌లోని హయత్‌ నగర్‌, పెద్ద అంబర్‌పేట్‌లోని ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో గగన్‌పహడ్‌ వద్ద 21 బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. 13 బస్సులపై కేసులు నమోదు చేశారు.

 

09:37 - June 17, 2016

హైదరాబాద్ : ఇప్పటి వరకు ఎస్ సీ, ఎస్ టీలు మైనారిటీలకు వర్తింప చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని... ఇకపై బీసీలకు కూడా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపచేస్తూ 2016-17 బడ్జెట్‌లో  చేసిన ప్రకటనకు కార్యరూపం ఇస్తోంది. ఇందుకు సబంధించిన మార్గదర్శకాలను  రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత  అధికారులను ఆదేశించారు. పెళ్లికి  ముందే వధువు తల్లికి 51 వేల రూపాయలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. 
కల్యాణలక్ష్మి పథకానికి మంచి ఆదరణ 
నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రుకు భారం కాకూడదన్న ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ముందుగా ఎస్సీ,ఎస్టీలకు కల్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబార్‌ పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బీసీలకు కూడా దీనిని వర్తింపచేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు చేసిన విన్నపాన్ని మన్నించిన  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2016-17 వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 
బీసీలకు కల్యాణలక్ష్మిపై మార్గదర్శకాలు 
బీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పాదరదర్శకంగా అమలు చేస్తూ... పేదింటి ఆడపిల్ల కుటుంబంలో ఆనందం నింపాలని కోరారు. 
కల్యాణలక్ష్మికి ఇంతవరకు రూ.530 కోట్లు వ్యయం 
ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీ వధువులకు ఈ పథకం అమలు జరుగుతున్న తీరుతెన్నులపై కూడా కేసీఆర్‌ సమీక్షించారు. ఈ పథకం కింది ఇంతవరకు 530 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తద్వారా  లక్షా 4వేల 57 మంది  లబ్ధి పొందారు. వీరిలో  44,351 మంది ఎస్సీలు, 25,793 మంది ఎస్టీలు ఉన్నారు. అలాగే 33,913 మంది మైనారిటీ వధువులకు సహాయం అందించారు. బీసీలు, ఓబీసీలకు ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు 2016-17 బడ్జెట్‌లో 300 కోట్ల రూపాయలు కేటాయించారు. అర్హులందరికీ సహాయం  అందిచాలని కేసీఆర్‌ ఆదేశించారు. అవసరమైతే బడ్జెట్‌ కేటాయింపుల  కంటే ఎక్కువ నిధులు ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించారు. బాల్య వివాహాల నియంత్రణతోపాటు సామాజిక మార్పుకు దోహదంచేసే కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. 

 

09:35 - June 17, 2016

ఏంటీ అప్పటి హీరో రాజశేఖర్ తో ఇప్పటి హీరో గోపించంద్ కు సమస్యలా ? ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు ? ఇలా అనేక ప్రశ్నలు ఉదయించవచ్చు. కానీ ఇవన్నీ నిజ జీవితంలో కాదు. సినిమాలో అవును గోపిచంద్ నటించబోయే చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నటించే అవకాశాలున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజశేఖర్ ని ఎంచుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. గోపీచంద్ తో 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలు చేసి హిట్ కొట్టిన దర్శకుడు శ్రీవాస్‌. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టాలని తన బ్యానర్ పైనే సినిమా చేస్తున్నారు.
ఆహుతి, తలంబ్రాలు చిత్రాలతో నెగిటివ్ రోల్స్ తోనే కెరీర్ మొదలెట్టి హీరో గా సక్సెస్ అయిన రాజశేఖర్ మళ్లీ విలన్ గా చేస్తే తమ సినిమాకు మైలేజి బాగా వస్తుందని దర్శకుడు శ్రీవాస్ భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌, వినోదం మేళవించిన ఈ చిత్రంలో కుటుంబ బంధాలకూ ప్రాధాన్యం ఉంటుందని శ్రీవాస్ పేర్కొంటున్నారు. గోపీచంద్‌ ప్రస్తుతం 'ఆక్సిజన్‌' చిత్రంతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాకే శ్రీవాస్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

09:32 - June 17, 2016

హైదరాబాద్ : నష్టాలతో కష్టాలు పడుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. డిపో మేనేజర్ స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు అందరు అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు . అత్యంత కీలకమైన సమావేశానికి కార్మిక సంఘాల నేతలు హాజరుకానున్నారు. 
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ
గతంలో ప్రకటించిన విధంగా ఆర్టీసిని బాగు చేసేందుకు ఆర్టీసిలోని అన్ని స్థాయిల అధికారులతో సమావేశం జరపాలని నిర్ణయించారు సిఎం కేసిఆర్. తెలంగాణలో ఆర్టీసికి ఉన్న ఆస్తులు, అప్పులు లాంటి వివరాలతో పాటు రోజువారీ ఆపరేషన్స్, సిబ్బంది వివరాలు, ఆదాయ, వ్యయాల వివరాలన్నింటినీ సిఎంకు వివరించేందుకు నివేదికలు తయారు చేస్తున్నారు అధికారులు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చేసే అవకాశముంది. 
కార్మిక సంఘాల నేతలను అవకాశం కల్పించాలని డిమాండ్
మరోవైపు ఆర్టీసికి సంబంధించిన వాస్తవ స్థితిగతులను అధికారులు మరుగున పరుస్తున్నారని ఆరోపిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్టుగా ఈ సమీక్ష సమావేశంలో కార్మిక సంఘాల నేతలను కూడా ఇన్ వాల్వ్ చేయాలని వారు కోరుతున్నారు. ఆర్టీసి యాజమాన్యం ఇచ్చే నివేదికకు... కార్మికుల వైపు నుండి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నాయో తెలిపే వీలునందువల్ల తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు..
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు 
అన్ని వివరాలతో సమీక్షకు రావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల మంత్రి గుజరాత్ మోడల్ అని ప్రకటించడం, బిఓటి వివరాలు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనడంతో ఈ సమావేశంలో ఆస్తులపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశముంది.

 

09:26 - June 17, 2016

సూపర్ రజనీకాంత్ ఆరోగ్యానికి ఏమైంది ? అమెరికాలో ఎన్ని రోజులు ఉంటారు ? అక్కడ ఎలాంటి చికిత్స చేయించుకుంటున్నారు ? ఇలా అనేక ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. కుటుంబసభ్యులతో అమెరికా వెళ్లిన రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని..అందుకే కబాలి ఆడియో సాదాసీదగా జరిపించారనే పుకార్లు వినిపించని సంగతి తెలిసిందే. దీనిపై రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చివరకు కుటుంబసభ్యులు స్పందించారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవదవద్దని, ఆయన బాగానే ఉన్నారని ప్రకటించారు. దీనితో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కబాలి సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన అనంతరం కుటుంబసభ్యులతో రజనీ అమెరికాకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగిరాకపోతుండడం..ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ వదంతలు వ్యాపించాయి. దీనితో తమిళ చిత్రసీమ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వదంతులకు పుల్‌స్టాప్‌ పెడుతూ రజనీ కుటుంబీకులు ప్రకటన విడుదల చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, త్వరలోనే స్వదేశానికి తిరిగి వస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

09:20 - June 17, 2016

విశాఖ : వర్షాల్లేక ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఐఎండి శుభవార్త అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ ప్రభావంతో నేడు కోస్తా, ఒడిశాలో వర్షాలు కురవనున్నాయి. రాజస్తాన్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా మధ్య పశ్చిమ బెంగాల్‌ వరకూ ద్రోణి కొనసాగనుంది. దీని ప్రభావంతో ఆంధ్రాలో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తోంది. అలాగే తెలంగాణాలోనూ ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. అయితే మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

 

సుచిత్రా ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం..

రంగారెడ్డి : షేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో సుచిత్ర వద్దనున్న ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం చేశారు. ఈఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

 

దొంగబాబాను విచారిస్తున్న కాప్స్...

హైదరాబాద్ : బంజారాహిల్స్ భారీ దోపిడి కేసులో బొల్లారం పీఎస్ లో దొంగ బాబాను పోలీసులు విచారిస్తున్నారు. బెంగళూరులో సుధీర్, షాజహాన్ లను అరెస్టు చేశారు. వీరిని కూడా నగరానికి తీసుకొచ్చారు.

 

ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమనేత ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదలైంది. గత ఎనిమిది రోజులుగా ఆయన దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు శుక్రవారం ప్రకటించారు. రాత్రి మరోసారి ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరిగిందని, శరీరంలో కిటోన్స్ లెవల్స్ పెరుగుతున్నాయన్నారు.

09:16 - June 17, 2016

సుహాసిని ప్రధాన పాత్రధారిణిగా సుమంత్‌ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న 'నాని' చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై టి.రామసత్యనారాయణ 'శివగామి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ బుధవారం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్‌ మోషన్‌ పోస్టర్‌ను, వెంకట్రావు థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'బేబి సుహాసిని, సీనియర్‌ సుహాసినిల నటన హైలైట్‌గా నిలుస్తుంది. జూన్‌ 24న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. హర్రర్‌ చిత్రాల్లో ఈ సినిమా సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుంది' అని అన్నారు.

 

09:14 - June 17, 2016

బిపిన్‌ హీరోగా నటిస్తూ శిరిడి సాయి క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'బంగారు తెలంగాణ'. శ్రీహర్ష, లయన్‌ ఏ.వి.స్వామి, కోదండరామ్‌, బాబూ మోహన్‌, గౌతంరాజు, గుండు హనుమంతరావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, 'బిపిన్‌ గతంలో 'శిరిడి' సినిమా చేసి తనేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. తనే నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ వచ్చేలా నా వంతు కృషి చేస్తాను. చిన్న సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలి' అని అన్నారు. 'కేసీఆర్‌ చేసిన తెలంగాణ ఉద్యమం నుంచి మొన్న జరిగిన గ్రేటర్‌ ఎన్నికల వరకు ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. సినిమాను సీఎం కేసీఆర్‌కు అంకితమిస్తున్నాను. సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, ఆ వెంటనే సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని హీరో బిపిన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.వి.స్వామి, రాగిణి, విజరుకుమారి, ప్రతిభ, కిష్టంపల్లి సురేందర్‌రెడ్డి, బిల్లా ప్రభాకర్‌ రావు, వేల్పుల సంజీవ్‌, పొన్న క్రిష్ణ మంచిరేవుల తదితరులు పాల్గొన్నారు.

 

09:08 - June 17, 2016

వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతేడాది విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంలో మా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. దర్శకుడు శేఖర్‌ కమ్ముల అద్భుతమైన స్టోరీ టెల్లర్‌. వరుణ్‌తేజ్‌ ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 
జులై 25న ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించి, ఆగస్టు చివరికి తెలంగాణ షెడ్యూల్‌ మొత్తం పూర్తి చేసుకుని, ఆక్టోబర్‌లో అమెరికాలో షూటింగ్‌ జరుపనున్నాం. దీంతో షూటింగ్‌ పూర్తి అవుతుంది. చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి కెమెరా: విజరు కుమార్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాను' అని అన్నారు.

 

09:07 - June 17, 2016

ప్రస్తుతం కబాలీ ఫీవర్ నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే టీజర్ విడుదలై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఆడియో కూడా విడుదలైంది. నిరండబరంగా ఈ ఆడియో ఫంక్షన్ జరగడంపై అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉంటే 'కబాలి' సినిమాలోని తమిళ సాంగ్ టీజర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. 'నిరుప్పుడా' అనే సాంగ్ లో రజనీ తన దైన స్టైల్ లో అదుర్స్ అనిపించారు. దీనితో అభిమానులు సంతోషంగా మునిగిపోతున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో సంతోష్ నారాయణన్ సంగీతంలో ఈ చిత్రం రూపొందింది. జులై 16న చిత్రాన్ని విడుదల చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రజనీ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం విడుదలైన తరువాత ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

09:05 - June 17, 2016

ప్రభుత్వం అగ్రిగోల్డు యాజమాన్యంతో రాజీపడి బాధితులకు న్యాయం చేయడం లేదని వక్తలు ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత బీ.వెంకట్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత మాల్యాద్రీ, అగ్రిగోల్డు బాధితుల సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు పాల్గొని, మాట్లాడారు. అగ్రిగోల్డు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అగ్రిగోల్డు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:54 - June 17, 2016

ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ పథకం రైతులను నిండా ముంచింది. అప్పులు మాఫీ కాకపోగా, అపరాధ వడ్డీలతో రుణభారం మరింత పెరిగింది. రైతులకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు మాఫీ చేస్తామన్నది టిడిపి ఎన్నికల వాగ్ధానం.  తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంక్ లకు బకాయిలు చెల్లించవద్దంటూ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం సాగించారు. అప్పట్లో వైసిపి రుణమాఫీ సాధ్యం కాదంటూ చెప్పింది. జగన్ రుణమాఫీని వ్యతిరేకించడం చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేకూర్చింది. బాబు వస్తే రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు టిడిపి వైపు మొగ్గారు. 
మొత్తం 87, 612 కోట్ల రూపాయలు 
2014 జూన్ 8న టిడిపి ప్రభుత్వం ఏర్పడింది. 2014 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో కలిపి మొత్తం 87, 612 కోట్ల రూపాయలున్నట్టు లెక్కతేలింది. టిడిపి ఎన్నికల వాగ్ధానం ప్రకారం ఇవన్నీ రద్దవుతాయని రైతులంతా భావించారు. కానీ, ప్రభుత్వం ఎటూ తేల్చకుండా కొన్ని నెలలపాటు నానబెట్టింది. కోటయ్య కమిషన్, కుటుంబరావు కమిషన్ పేరుతో కొంతకాలం గడిచిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకంతో బకాయిలు చెల్లించని రైతుల మీద వడ్డీల భారం పెరిగింది. లక్ష రూపాయల లోపు పంట రుణం వున్నవారు ఏడాదిలోగా అప్పు తీరిస్తే వడ్డీ వుండదు. మూడు లక్షల రూపాయల వరకు కేవలం పావలా శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ఏడాది గడువు దాటితే 11 నుంచి 14శాతం దాకా వడ్డీ పడుతుంది. దీంతో 2014 సెప్టెంబర్ నాటికి 87 612 కోట్లుగా వున్న రైతు రుణాలు 98 555 కోట్లకు చేరాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన నిధులు బ్యాంక్ లకు జమ చేసి వుంటే, ఇంత అపరాధ వడ్డీ పెరిగేది కాదు.
పెరిగిన రైతుల రుణభారం 
ఓ వైపు రైతుల రుణభారం పెరిగింది. మరోవైపు రుణమాఫీ అర్హుల విషయంలో ప్రభుత్వం మెలికలు పెట్టింది.  వడపోసింది. ఒక్కొక్క కుటుంబానికి లక్షన్నర చొప్పున మాఫీ చేస్తామంటూ ప్రకటించింది. 50 వేల లోపు అప్పును ఒకే విడతలో మాఫీ చేస్తామన్నారు.  కానీ అదీ చేయలేదు. 
18,500 కోట్లు దాటిన అపరాధ వడ్డీ విలువ
లక్షన్నర లోపు రుణాలను అయిదు విడతల్లో మాఫీ చేస్తామన్నారు. కేవలం 24000  కోట్ల రూపాయల రుణాన్ని మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించింది. దీంతో కొన్ని లక్షల మంది రైతుల రుణం మాఫీకాకపోగా, వారంతా అపరాధ వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులంతా కలిసి భరించిన అపరాధ వడ్డీ విలువే 18,500 కోట్లు దాటింది. 
బ్యాంక్ ల్లో కేవలం 7500 కోట్లు మాత్రమే జమ  
24వేల కోట్ల రూపాయలను ఐదు విడతలుగా మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటిదాకా బ్యాంక్ ల్లో జమ చేసింది కేవలం 7500 కోట్లు మాత్రమే. ఇంకా 17,500 కోట్లు బ్యాంక్ ల్లో జమ చేయాలి. ప్రభుత్వం ఇప్పటి దాకా బ్యాంక్ లకు చెల్లించిన మొత్తం రైతులందరి నెత్తినపడ్డ అపరాధ వడ్డీలో సగం కూడా లేకపోవడం అత్యంత బాధాకారం.
అప్పుల వలయంలో రైతులు  
 ఓ వైపు రుణాలు మాఫీ కాలేదు. మరోవైపు, బకాయిలున్న రైతులకు బ్యాంక్ లు కొత్త రుణాలివ్వడం మానేశాయి. బ్యాంకుల్లో అప్పుపుట్టకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు ప్రయివేట్ అప్పులు చేయాల్సి వచ్చింది. అసలే కరవుకాలంలో పెరిగిన వడ్డీల భారం రైతులను అప్పుల వలయంలోకి ఈడ్చుకెళ్లింది. 
500 మంది రైతులు ఆత్మహత్య 
అప్పుల బాధ భరించలేక ఆంధ్రప్రదేశ్ లో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 200 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కానీ, 20శాతం మందికే ఎక్స్ గ్రేషియా చెల్లించింది. 

 

08:48 - June 17, 2016

సీఎం చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం రైతుల రుణమాఫీ చేయాలని ధ్రప్రదేశ్ రైతు సంఘం నేత నర్సింహారావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పథకం రైతులను మరింత రుణగ్రస్తులుగా చేసింది. అప్పులు మాఫీ అవుతాయని ఆశ పడితే అపరాధ వడ్డీలు తడిసిమోపడయ్యాయి. బంగారం వేలంపాటకెళ్లింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? రైతు రుణ మాఫీ విషయంలో క్షేత్ర స్థాయి వాస్తవాలేమిటి? రైతులకు ఎదురవుతున్న అనుభవాలేమిటి? రుణమాఫీ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిందేమిటి? రైతు సంఘాలు చేస్తున్న సూచనలేమిటి? ఇదే అంశంపై నర్సింహారావు మాట్లాడారు. 
మరిన్ని వీడియోలో చూద్దాం....

 

08:42 - June 17, 2016

ఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డ్...చీఫ్ కోచ్ వేట తుదిదశకు చేరింది. దేశ, విదేశాలకు చెందిన మొత్తం 57 మంది క్రికెట్ గ్రేట్లు ..భారత క్రికెట్ చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తే..తుది 21 మంది జాబితాను బీసీసీఐ ఖరారు చేసింది. ఏడాదికి ఆరుకోట్ల రూపాయల వేతనంపై పనిచేసే చీఫ్ కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను మాస్టర్ సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహామండలి పైన ఉంచింది......
కోచ్ పదవి కోసం 57 మంది.. దరఖాస్తులు 
బీసీసీఐ...ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డ్. ఏడాదికి ఆరుకోట్ల రూపాయల జీతం అంటూ ..తన వెబ్ సైట్ ద్వారా ప్రకటన ఇచ్చిందో..లేదో...స్వదేశీ, విదేశీ క్రికెట్ మాజీ ప్రముఖులు 57 మంది..పోలోమంటూ దరఖాస్తులు పంపారు.
కోచ్ పదవికి దరఖాస్తు చేసిన ప్రముఖులు 
భారత క్రికెట్ చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసిన ప్రముఖుల్లో...మాజీ కెప్టెన్లు రవిశాస్త్రి, అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్, ఆల్ రౌండర్ సందీప్ పాటిల్, ప్రవీణ్ ఆమ్రే, విక్రమ్ రాథోడ్,... విదేశీ మాజీ గ్రేట్లలో స్టీఫెన్ ఫ్లెమింగ్, టామ్ మూడీ, డేనియల్ వెట్టోరీ, స్టువర్ట్ లా సైతం ఉన్నారు.
2015 సీజన్.... రవిశాస్త్రి చేతికి జట్టు పగ్గాలు
2000 సీజన్ నుంచి గత పదిహేను సంవత్సరాలుగా..జాన్ రైట్, గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్ స్టెన్, డంకన్ ఫ్లెచర్ లాంటి విదేశీ కోచ్ లతో..బండిలాగిస్తూ వచ్చిన బీసీసీఐ..2015 సీజన్లో మాత్రం జట్టు పగ్గాలను రవిశాస్త్రి చేతికి అప్పజెప్పింది. బీసీసీఐ టీవీ కామెంటీటర్ గా ఏడాదికి 4 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వేతనం పొందిన రవిశాస్త్రి...చీఫ్ కోచ్ కమ్ టీమ్ డైరెక్టర్ హోదాలో ఆరు కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుకొన్నాడు. రవిశాస్త్రితో కాంట్రాక్టు ముగియడంతో..ప్రస్తుత జింబాబ్వే పర్యటనలో మాత్రం భారతజట్టు కోచ్ పగ్గాలను సంజయ్ బంగర్ కు ఇచ్చారు.
స్వదేశీకోచ్ ను నియమించాలా?
వెస్టిండీస్ పర్యటనకు ముందే...భారత జట్టుకు చీఫ్ కోచ్ ను అందించాలన్న పట్టుదలతో బీసీసీఐ పెద్దలు ఉన్నారు. అయితే..జస్టిస్ ముద్గల్ కమిటీ సిఫారసులు, సుప్రీం కోర్ట్ మొట్టికాయలతో జాగ్రత్తపడిన బీసీసీఐ ...చీఫ్ కోచ్ ఎంపిక కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది. స్వదేశీకోచ్ ను నియమించాలా? లేక మరోసారి విదేశీ కోచ్ వైపే మొగ్గుచూపాలా ? అన్న విషయంపై ఎటూ తేల్చులేక సతమతమైపోయింది.
భారత క్రికెట్ పై జాన్ రైట్ తనదైన ముద్ర
2000 సీజన్ నుంచి ఐదేళ్లపాటు భారత విదేశీ తొలికోచ్ గా..న్యూజిలాండ్ కు చెందిన జాన్ రైట్ విలక్షణసేవలు అందించారు. భారత క్రికెట్ పై తనదైన ముద్రవేశారు. ఆ తర్వాత వచ్చిన ..రెండో విదేశీ కోచ్ గ్రెగ్ చాపెల్ మాత్రం..మాస్టర్ సచిన్ తో సహా ప్రధానఆటగాళ్ల మనోభావాలతో ఆడుకొని అవమానకర రీతిలో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక..చాపెల్ కు బదులుగా వచ్చిన భారత మూడో విదేశీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ మాత్రం టీమిండియాను విజయపథంలో నడిపారు. భారత్ క్రికెట్ కు సేవలు అందించిన అత్యుత్తమ విదేశీ కోచ్ గా గుర్తింపు తెచ్చుకొన్నారు.
డంకన్ ఫ్లెచర్ కు మిశ్రమ ఫలితాలు 
2011 సీజన్ నుంచి 2015 సీజన్ వరకూ భారత చీఫ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన డంకన్ ఫ్లెచర్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత 2015-16 సీజన్లో మాత్రం రవిశాస్త్రి టీమ్ డైరెక్టర్ హోదాలో జట్టును నడిపించాడు. ఏడాదికి ఆరుకోట్ల రూపాయల వార్షిక వేతనం పై...భారత క్రికెట్ జట్టుకు రవిశాస్త్రి సేవలు అందించాడు. అంతేకాదు..టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి అత్యంత ఇష్టమైన కోచ్ గా రవి శాస్త్రి నిలిచాడు.
సంజయ్ బంగర్ కు తాత్కాలిక కోక్ బాధ్యతలు 
భారత క్రికెట్ బోర్డుతో రవిశాస్త్రి కాంట్రాక్టు ముగియడంతో...జింబాబ్వే టూర్ కు..తాత్కాలిక కోచ్ బాధ్యతలను ..ఇప్పటి వరకూ బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందించిన సంజయ్ బంగర్ కు కట్టబెట్టారు.
నాణ్యమైన స్వదేశీ కోచ్ కోసం ఎదురుచూపులు
విదేశీకోచ్ ల ప్రయోగం ద్వారా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకొన్న భారత క్రికెట్ బోర్డు..ఇప్పుడు నాణ్యమైన స్వదేశీ కోచ్ కోసం ఎదురుచూస్తోంది. భారత మాజీ కెప్టెన్లు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, రవిశాస్త్రితో పాటు సెలెక్షన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ సందీప్ పాటిల్ సైతం కోచ్ పదవి రేస్ లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. వీరిలో ..రవిశాస్త్రికి 80 టెస్ట్ లు, 150 వన్డేల రికార్డు తో పాటు...ఏడాదికాలం టీమిండియాకు టీమ్ డైరెక్టర్ గా సేవలు అందించిన అనుభవం,  టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు..బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ కు 29 టెస్ట్ లు, 45 న్డేల రికార్డు తో పాటు...1996లో భారత కోచ్ గా ఆరునెలల అనుభవం సైతం ఉంది. భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ అనీల్ కుంబ్లే గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది. క్రమశిక్షణకు, నిజాయితీకి,అంకితభావానికీ మరో పేరుగా ఉన్న అనీల్ కుంబ్లేకి 619 టెస్ట్ వికెట్లు, 337 వన్డే వికెట్ల  అసాధారణ రికార్డు ఉంది. అదీ చాలదన్నట్లు.. ఎన్ సీఏ చైర్మన్ గా, ఐసీసీ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనుభవం కూడా ఉన్నాయి..
రాహుల్ ద్రావిడ్ 
భారత చీఫ్ కోచ్ రేస్ ప్రధాన అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న రాహుల్ ద్రావిడ్ కు ..ఇండియా-ఏ,అండర్ -19 జట్ల కోచ్ గా అనుభవం మాత్రమే కాదు...అసాధారణ క్రికెట్ పరిజ్ఞానం ఉన్న క్రికెటర్ గా పేరుంది. మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్, ప్రవీణ్ ఆమ్రే, మాజీ సెలెక్టర్ విక్రమ్ రాథోడ్ లాంటి పలువురు మాజీలు పోటీలో ఉన్నా...నామమాత్రమే అనిచెప్పాలి. కోచ్ బరిలో న్యూజిలాండ్ మాజీకెప్టెన్లు డేనియల్ వెట్టోరీ, స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు టామ్ మూడీ,  స్టువర్ట్ లా సైతం కోచ్ ల రేస్ లో ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శిక్షకులుగా వ్యవహరించిన అనుభవం ఈ విదేశీ కోచ్ లకు ప్రధానబలంగా ఉంది. చీఫ్ కోచ్ పదవి కోసం 57 దరఖాస్తులు వస్తే..అందులో 21 మందిని మాత్రమే ఎంపిక చేసి..తుదిజాబితాను ..సచిన్ , గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న ముగ్గురు సభ్యుల కమిటీ ముందుంచారు.
తుదిజాబితాలోని 21 మంది అభ్యర్ధులతో ఇంటర్వ్యూలు
తుదిజాబితాలోని 21 మంది అభ్యర్ధులతో ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు..పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారి అభ్యర్థలను, వ్యూహాలను పరిశీలించి..తుదినిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఏదిఏమైనా...ఈనెల 25న సరికొత్త కోచ్ ఎవరో అధికారికంగా ప్రకటించాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. అప్పటి వరకూ...ఆ అదృష్టవంతుడు ఎవరో అనుకొంటూ అభిమానులు ఎదురుచూస్తూ ఉండాల్సిందే మరి.

08:41 - June 17, 2016

ఇంగ్లండ్ : చాంపియన్స్ హాకీ ట్రోఫి ఫైనల్ లో చేరాలని భారత్ ఉవ్విళ్లూరింది. మూడు దశాబ్ధాల నిరీక్షకు తెరదించాలని అనుకుంది. కానీ భారత్ ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. ఫలితంగా గురువారం నాడు జరిగిన పోటీలో భారత్, ఆసీస్ చేతిలో 2-4 తేడాతో పరాజయం పాలైంది. నేడు బ్రిటన్ - బెల్జియంపై నెగ్గితే భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు భారత్ క్యాంసం కోసం పోరాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండోస్థానంలో ఉంది.
ఆట ఆరంభం కాగానే ఆసీస్ దూకుడు ప్రదర్శించింది. పదే పదే గోల్ పోస్టుపై దాడులు చేయడంతో భారత క్రీడాలు ఆందోళనకు లోనయ్యారు. 9వ నిమిషంలో ఆసీస్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. అందరూ ఆసీస్ గోల్ చేస్తుందని భావించారు. కానీ రక్షణ పంక్తి సమర్థవంతంగా తిప్పికొట్టడంతో తొలి క్వార్టర్ లో గోల్ నమోదు కాలేదు. గోల్ కీపర్ శ్రీజిత్ అడ్డుకుని ప్రత్యర్థి ఆశలపై నీళ్లు చల్లాడు. కానీ 21వ నిమిషంలో మిట్లోన్ కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్ తో ఆసీస్ కు ఒక గోల్ ను సాధించి పెట్టాడు. ఆ వెంటనే జాలిస్కి కూడా గోల్ కీపర్ ను బోల్తా కొట్టించి గోల్ ను నమోదు చేశాడు. ఫలితంగా 2-0 స్కోరు నమోదైంది. ఈ తరుణంలో ఆసీస్ కు మరో పెనాల్టీ లభించింది. ఇది కూడా విఫలమైంది. కాసేపటికే ఒగిల్వి మరో పెనాల్టీ కార్నర్ తో గోల్ చేశాడు. దీనితో ఆసీస్ 3-0 అధిక్యం సంపాదించింది. 45వ నిమిషంలో భారత క్రీడాకారుడు రఘునాథ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. కానీ ఆసీస్ మరో గోల్ చేసింది. 49వ నిమిషంలో ఆసీస్ క్రీడాకారుడు మన్ దీప్ కూడా మరో గోల్ చేయడంతో అధిక్యాన్ని 2-4కి తగ్గించాడు.

రామకుప్పంలో ఏనుగుల బీభత్సం..

చిత్తూరు : జిల్లాలోని రామకుప్పం మండలం పల్లికుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటలను ధ్వంసం చేశాయి. మామిడి తోటలు, టమాటా పంటలు నస్టం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

08:30 - June 17, 2016

ఢిల్లీ : ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించిన గల్లంతైన ఫైళ్లపై కొత్త కోణం వెలుగు చూసింది. హోంశాఖ అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్- సాక్షి అశోక్‌ కుమార్‌ల మధ్య జరిగిన సంభాషణల ఆడియోను ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ బయటపెట్టింది. అయితే తాను నిష్పక్షపాతంగానే విచారణ జరిపించినట్లు ప్రసాద్‌ చెప్పారు.
సంభాషణ టేపులను బయటపెట్టిన ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ 
ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి గల్లంతైన ఫైళ్ల విచారణ అధికారి హోంశాఖ అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్, మాజీ హోంశాఖ డైరెక్టర్‌ ఈ కేసులో సాక్షి అశోక్‌ కుమార్‌తో టెలిఫోన్‌లో జరిపిన సంభాషణ టేపులు లీక్‌ అయ్యాయి. ఈ టేపును ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ బయటపెట్టింది. ఈ ఆడియోలో బికె ప్రసాద్‌ విచారణకు సంబంధించిన ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో అశోక్‌కుమార్‌కు సూచించారు. ఈ పేపర్‌ చూశారా అంటే తాను ఏ కాగితాన్ని చూడలేదని చెప్పాలని అశోక్‌కు ప్రసాద్‌ ఫోనులో సూచించారు. 
ఏప్రిల్‌ 26న ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రతినిధి బికె ప్రసాద్‌కు కాల్‌
ఏప్రిల్‌ 26న ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రతినిధి బికె ప్రసాద్‌కు కాల్‌ చేశారు. ఆయన మరోఫోనులో మాట్లాడుతుండగా ఆ ఫోను సంభాషణను రిపోర్టర్‌ రికార్డ్‌ చేయడంతో ఇది వెలుగు చూసింది. ప్రసాద్‌ మరో ఫోనులో ఎవరితోనైతే మాట్లాడుతున్నారో మరుసటిరోజు అదే వ్యక్తి అశోక్‌ కుమార్‌ సాక్షిగా ఉండడం గమనార్హం. మార్చి 2011 నుంచి డిసెంబర్‌ 2011 వరకు హోంశాఖలో డైరెక్టర్‌గా పనిచేసిన అశోక్‌కుమార్‌ ఆ సమయంలో ఇష్రత్‌ జహా కేసును చూస్తున్నారు.
ఫోనులో కేవలం ప్రసాద్‌ మాటలు మాత్రమే రికార్టు 
ఫోనులో కేవలం ప్రసాద్‌ మాటలు మాత్రమే రికార్డయ్యాయి. 'ఇష్రాత్‌ జహా కేసు విచారణ జరుగుతోంది నీకు తెలుసా? ఇష్రత్‌ జహా పేపర్‌ మిస్సింగ్‌ విచారణ గురించి తెలుసు కదా.. నీవు కూడా ఈ కేసును డీల్‌ చేశావు కదా...ఈ కేసుకు సంబంధించి అందర్నీ విచారించాల్సి ఉంది. విచారణలో మీరు ఈ పేపర్‌ చూశారా? అంటే నేను ఈ పేపర్‌ చూడలేదని చెప్పాలి. లేదా నీవే పేపర్‌ మాయం చేశావని అందరూ అనుకునే అవకాశం ఉందని ప్రసాద్‌ నవ్వారు. అంతేకాదు ఈ ఫైళ్లను నా జీవితంలోనే డీల్‌ చేయలేదని చెప్పాలని' సూచించారు. మీరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో ఉన్నారా...కామర్స్ లో ఉన్నారా...ఏం చూస్తున్నారంటూ' అశోక్‌కుమార్‌తో ప్రసాద్‌ సంభాషణ ముగించారు.
ఆడియో లీక్‌పై స్పందించిన బికె ప్రసాద్‌ 
ఆడియో లీక్‌పై స్పందించిన బికె ప్రసాద్‌ తాను ఎందరో అధికారులతో మాట్లాడుతుంటానని వారికి ఎన్నో సూచనలిస్తుంటానని చెప్పుకొచ్చారు. తాను మాత్రం నిష్పక్ష పాతంగానే విచారణ జరిపించానని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. సాక్షులపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు.
52 పేజీల నివేదిక 
ఇష్రత్ జహాన్ కేసులో గల్లంతైన ఫైళ్లపై కేంద్ర హోంశాఖ అంతర్గత దర్యాప్తు కమిటీ 52 పేజీల నివేదికను సమర్పించింది. 2009లో హోంశాఖ నుంచి తెలిసో, తెలియకో ఎవరైనా తీయడం వల్లనో, మరేదైనా కారణం వల్లనో ఈ  డాక్యుమెంట్లు కనిపించకుండా పోయాయని దర్యాప్తులో తేలింది. వాటిలో ఒకటి మాత్రం దొరికినట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్ తన నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం పేరు కానీ యూపీఏ ప్రభుత్వంలోని నేతల పేర్లను ప్రస్తావించలేదు.

 

08:29 - June 17, 2016

కార్యాలయాలు...అపార్ట్ మెంట్లు..ఇతర్రా వాటిల్లో లిఫ్ట్ కామన్ అయిపోయాయి. ఒక అంతస్తుకు వెళ్లాల్సిన ఉన్నా కొంతమంది లిఫ్ట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదని వైద్యులు పేర్కొంటున్నారు. మెట్లు ఎక్కడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైందంట. మెదడు వయస్సు తగ్గడమే కాకుండా ఎంతో చురుగ్గా పనిచేస్తుందంట. కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన జాసన్‌ స్టెఫెనర్‌ బృందం ఈ పరిశోధనపై 'న్యూరో బయోలజీ ఆఫ్‌ ఏజింగ్‌' పత్రిక ఇటీవల వ్యాసం ప్రచురించింది. 19-79 సంవత్సరాల మధ్య వయసున్న 331 మంది ఆరోగ్యవంతులతో మెట్లు ఎక్కించారు. కళాశాలలకు పంపారు. వీరి మెదళ్లలో న్యూరాన్లకు నిలయమైన గ్రేమ్యాటర్‌ పరిమాణాలను గమనించారు. ఒక ఏడాది చదుకోవడం వల్ల మెదడు వయస్సు 0.95 సంవత్సరం, రోజూ రెండు అంతస్తులు ఎక్కడం వల్ల 0.58 సంవత్సరం చొప్పున తగ్గుతున్నట్లు జాసన్ లెక్కగట్టఆరు. సో..నిత్యం వీలైనన్నీ మెట్లు ఎక్కి మెదడును చురుగ్గా ఉంచుకోండి..

08:28 - June 17, 2016

ఎక్కడ ఏమి పెట్టామో..ఇంతకుముందు ఏం జరిగిందో కొందరికి గుర్తు రాదు. దీనినే మతిమరుపు అంటారు. ఈ మధ్య కాలంలో ఈ సమస్య అధికమౌతోంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. గజిగజిగా ఉండడంతో మనిషి గందరగోళంలో పడిపోతున్నాడు. రోజులో ఎక్కువ సమయం పనికే కేటాయిస్తున్నాడు. కనీసం నిద్రపోవడానికి కూడా టైమ్ సరిపోవడం లేదని పలు అధ్యయనాల్లో తేలిదంట. మతిమరపు ఎక్కువగా 65 సంవత్సరాలు దాటిన వారికి వచ్చేది. కానీ ఇప్పుడు 45 ఏళ్లకే వచ్చేసింది. లండన్ కు చెందిన ఓ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. పదేళ్లపాటు ఏడు వేల మందిపై రీసెర్చ్ చేసి ఈ విషయాని వెల్లడించారు. ల్కహాల్‌ తీసుకోవడం, స్మోక్‌ చేయడం, డిప్రెషన్‌, నిద్రలేమి, పెయిన్‌ కిల్లర్స్‌, న్యూట్రీషినల్‌ డెఫిషియన్సీ, యాంటీ డిప్రెసెంట్‌ డ్రగ్స్‌ లాంటివి కూడా మతిమరుపునకు కారణమవుతున్నాయి. అంతేగాకుండా గుండె జబ్బులు, హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ ఉన్నవాళ్ళల్లో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. మంచి ఆహారాపు అలవాట్లతో పాటు ఒత్తిడి తగ్గించుకోవడం..యోగాలాంటి వ్యాయామాలు చేయడం ద్వారా మతిమరుపు రాకుండా కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

08:17 - June 17, 2016

విజయవాడ : పెరుగుతున్న ఖర్చులు.... తరుగతున్న వనరులు...రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీంతో అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలు తలకు మించిన భారంగా మారుతున్నాయి. తాజాగా చంద్రబాబు సర్కార్ 1500 కోట్ల రూపాయల అప్పు చేయడంతో పెరుగుతున్న వడ్డీల పై ఆందోళన నెలకొంది.
ఏపీ రాష్ట్రం అప్పులు రూ. 94 వేల కోట్లు
ఒకపక్క రాజధాని నిర్మాణం..మరోపక్క ఎన్నికల హమీలు, సంక్షేమ పథకాల అమలు.. పుట్టెడు ఆర్థిక కష్టాలతో నెట్టుకొస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఉద్యోగుల జీతాలు, ఇతరత్రా సాధారణ పాలనా అవసరాల కోసం పరిమితికి మించి అప్పులు చేయక తప్పడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఫలితంగా వాటికి చెల్లించాల్సిన వడ్డీలు రాష్ట్ర ఖజానాకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ప్రస్తుత అప్పులు 94 వేల కోట్ల రూపాయల వరకు ఉండగా మరో పదేళ్ల వరకు వాటికి చెల్లించాల్సిన వడ్డీలే 80 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటాయని ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది.
తాజాగా మరో రూ. 1500 కోట్ల అప్పు
తాజాగా ఈ వారంలో మరో 1500 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై 8.09 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత నెలలో కూడా 8.01 శాతం వడ్డీపై  1500 కోట్ల రూపాయల రుణాన్ని బాబు సర్కార్ సేకరించింది. చూసేందుకు రెండు వడ్డీల మధ్య తేడా తక్కువగానే ఉన్నప్పటికీ పదేళ్ల కాలపరిమితిలో చెల్లించాల్సిన మొత్తం భారీగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు తీసుకున్న రుణాలు 94 వేల కోట్లకు చేరుకున్నాయి.
విభజన సమయంలో ఆంధ్రాకు అప్పు  రూ. 68,263 కోట్లు
రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ రెండో తేదీ వరకు రెండు రాష్ట్రాల మధ్య 1.17 లక్షల కోట్ల వరకు మార్కెట్ రుణాలు ఉండగా, అందులో జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 48 వేల 786 కోట్ల రూపాయలు, ఆంధ్రాకు 68 వేల 263 కోట్ల రూపాయల పంపకాలు జరిగాయి...కాగా విభజన అనంతరం చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ఆర్థిక లోటు, అవసరాల దృష్ట్యా 2016 మార్చి వరకు మరో 29 వేల 50 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది...దీంతో మొత్తం  రుణం 97వేల 313 కోట్ల రూపాయలకు చేరుకుంది...ఇందులో మార్చి వరకు 3 వేల 710 కోట్ల రూపాయలు, ఈ ఏడాది 1, 796 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఈ చెల్లింపుల్లో అప్పు 91 వేల 908 కోట్ల రూపాయలకు తగ్గగా, తాజాగా మే, జూన్ నెలల్లో మూడు వేల కోట్లు తీసుకోవడంతో మళ్లీ అప్పుల భారం 94 వేల 908 కోట్ల రూపాయలకు చేరింది..
రుణాలకు సగటున 7.5 నుంచి 8.2 శాతం వరకు వడ్డీ 
ప్రతిసారీ తీసుకున్న రుణం అప్పటి నుంచి పదేళ్ల కాలంలో చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు సగటున 7.5 నుంచి 8.2 శాతం వరకు వడ్డీ పడుతోంది. ఈ లెక్కన వచ్చే పదేళ్లలో 80వేల కోట్ల వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం ఆర్థిక పుష్టి సాధించకుంటే.. మున్ముందు మరిన్ని అప్పులు పెరిగి ఫలితంగా వడ్డీలు పెరిగే అవకాశం ఉంది.

 

వనస్థలిపురంలో ఏస్ బీఐ ఏటీఎం చోరీకి యత్నం..

హైదరాబాద్ : వనస్థలిపురం సహారా ఎస్టేట్స్ వద్దనున్న ఎస్ బీఐ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం యంత్రం తెరుచుకోలేకపోవడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

08:07 - June 17, 2016

హైదరాబాద్ : నగ‌రంలో అడుగ‌డుగున‌ రంగురంగుల యాడ్స్ తో అంద‌ర్ని అక‌ర్షించే హోర్డింగ్స్ విద్యుత్ కాంతులతో క‌నువిందు చేస్తాయి. ఆ కాంతుల వెనుక ఎన్నో చీక‌ట్లు దాగి ఉన్నాయి. ఏ నిముషానికి ఏది కూలుతుందో తెలియ‌ని పరిస్థితి. గ్రేట‌ర్ లో కూలేందుకు సిద్ధంగా ఉన్న హోర్డింగ్స్ ఎన్ని...  జూబ్లీహిల్స్ హోర్డింగ్ ఘ‌ట‌న‌తో మేల్కొన్న బ‌ల్దియా స‌ర్వేలో ఎం తేలింది.
కాంతుల వెనక చీకట్లు
గ్రేట‌ర్ లో ఇటివ‌ల కురిసిన గాలివాన‌ల‌కు పలు హోర్డింగ్స్ నేల‌కూలాయి. అదృష్టావ‌శాత్తు ప్రాణ‌న‌ష్టం జ‌రుగ‌న‌ప్ప‌టికి .. ఆస్తి న‌ష్టం భారీగానే జ‌రిగింది. దాంతో  సిటిలోని  హోర్డింగ్స్  ఫై ఒక్కసారిగా చ‌ర్చమొద‌లైంది. ఇప్పటికే హైకోర్టు సైతం ఈ అంశంపై జీహెచ్ఎంసి మొట్టికాయ‌లు వేసింది. అస‌లు హోర్డింగ్స్ ఎక్కడ ఏర్పాటు చెయ్యచ్చు. ఎంత ఎత్తు ఉండాలి.. నిర్మాణం సామ‌ర్థ్యం ఎలా ఉండాలి..అందుకు ఉప‌యోగించే మెట‌ల్ ఎలా ఉండాలి  వంటి అనేక అంశాలు సిటిలో హాట్ ట్రాఫిక్ గా మారాయి. జూబ్లీ హిల్స్  చెక్ పోస్ట్ లో భారీ హోర్డింగ్ కూలీపొయింది. దీంతో అలెర్ట్ అయినా బ‌ల్దియా.......,  హోర్డింగ్స్ ఫిట్ నెస్ పై దృష్టి సారించింది. 
హోర్డింగ్స్ చెక్ చేసేందుకు కమిటీ ఏర్పాటు 
ఇక సిటిలో ఉన్న 2, 684  హోర్డింగ్స్ ను చెక్ చేసేందుకు నిఫుణుల‌తో  క‌మీటిని ఎర్పాటు చేసింది. ఇందులో  జిహెచ్ఎంసికి చెందిన  చిఫ్ సిటి ప్లాన‌ర్, చిఫ్ ఇంజ‌నీర్,  రెవిన్యూ అద‌న‌పు క‌మీష‌న‌ర్,  ఆర్థిక శాఖ అద‌న‌పు క‌మీష‌న‌ర్ల‌తో పాటు జెన్టీయు, ఐఐటి హైద‌రాబాద్ కు చెందిన ఇంజ‌నీరింగ్ ప్రోఫెస‌ర్ల‌ను నియ‌మించింది . హోర్డింగ్స్   స్ట్రక్చర‌ల్ స్టెబీలిని  స్టడి చేసేందుకు ఐదు క‌న్సల్టేన్సిల‌ను ఫైన‌ల్ చేసింది ఈ క‌మీటి.  సివిల్ ఎడ్, స్పెల్లార్,  డెకాన్,  బిల్లింగ్ ప్లాన‌ర్, జాకి సంస్థల‌కు చెందిన  ఇంజ‌నీర్లు  ప్రతి హోర్డింగ్ స్థితిగ‌తులను క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు.  
ఆదాయం పెంచేంద‌కు పక్కాప్లాన్ 
దాంతో జిహెచ్ఎంసి ద్వారా వ‌చ్చే ఆదాయం పెంచేంద‌కు పక్కాప్లాన్ రూపొందిస్తుంది.  ఇక ప‌నిలో ప‌నిగా ఆక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ పై కూడా న‌జ‌ర్ పెట్టింది బల్దియా.  గ‌తంలో ఆక్రమ హోర్డింగ్స్ 600ల‌కు పైగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిలో  రెగ్యుల‌రైజ్ చేయ్యడానికి వీలైన‌ వాటికి ప‌ర్మిష‌న్స్ ఇచ్చి... నిబంద‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న వాటిని   పూర్తిగా తొలంగించాల‌ని డిసైడ్ అయ్యారు.   
ప్రయివేటు వ్యక్తుల‌ నుండి డ‌బ్బురాబ‌ట్ట గలుగుతుందా 
ఇక గ్రేట‌ర్ ఉన్న ప్రభుత్వ భూముల‌తో పాటు స్మశాన వాటిక‌ల్లో ఉన్న హోర్డింగ్స్ పై ఆదాయం త‌క్కువ‌గా వ‌స్తుందని గుర్తించింది బ‌ల్దియా. కేవ‌లం టాక్స్ మాత్రమే వ‌సూలు చేస్తున్న జీహెచ్ఎంసి, ఆయా  భూముల‌పై రెంట్ వ‌సూలు చేయ్యాల‌ని భావిస్తుంది. అయితే ఇప్పటివ‌ర‌కు జీహెచ్ఎంసి ఆదాయానికి గండి కొడుతున్న ప్రయివేటు వ్యక్తుల‌ నుండి డ‌బ్బురాబ‌ట్ట గలుగుతుందా లేదా అనేది మాత్రం కాల‌మే నిర్ణయించాలి. 

 

టీఎంయూను ఆహ్వానించడంపై ఈయూ నిరసన..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీఎంయూను ఆహ్వానించడంపై ఈయూ నిరసన వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీఎంయూను ఎలా ఆహ్వానిస్తారని, దీనిపై ఈసీకి, కార్మిక శాఖ దృష్టికి తీసుకెళుతామని ఈయూ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. గుర్తింపు సంఘాలను ఆహ్వానించాల్సి వస్తే రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘమైన ఈయూను ఆహ్వానించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీఎంయూను ఆహ్వానించారని, యాజమాన్యం వెంటనే స్పందించిన ఈయూను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు..

విశాఖపట్టణం : పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తన ప్రభావం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

07:59 - June 17, 2016

చిత్తూరు : వైసీపీ నుంచి మరో వికెట్ పడింది. పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను అధికార పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు. పనిలోపనిగా వైసీపీ అధినేత పైనా విమర్శలు చేశారు. వైసీపీలో ఎమ్మెల్యేలకు గౌరవంలేదన్నారు. చంద్రబాబే ఏపీని గాడిలో పెట్టగలరని అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. అమర్‌నాథ్‌రెడ్డి రాకతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల  సంఖ్య 20 కి చేరింది...

 

07:56 - June 17, 2016

హైదరాబాద్ : అరకొర సదుపాయాలతో...  అర్హతలేని  అధ్యాపకులతో ఎలాగోలా నెట్టుకొస్తున్న మెడికల్‌ కాలేజీలకు గట్టి దెబ్బ తగలనుంది. ఇప్పటివరకూ గట్టెక్కుతూ వస్తున్న ప్రమాణాలు పాటించని మెడికల్‌ కాలేజీలపై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించనుంది.
మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ 
మెడికల్‌ విద్యలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలని మెడికల్‌కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తూనే వస్తోంది. వైద్య కళాశాలలను ప్రత్యక్షంగా పరిశీలించాకే అనుమతులు ఇవ్వడం జరుగుతోంది. ఇకపై అవతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఎంసీఐ సీరియస్‌గా దృష్టి సారించింది.
లెక్షరర్ల వివరాలు ఆధార్‌తో అనుసంధానం
మెడికల్‌ కాలేజీల్లో ఒకే అధ్యాపకుడు నాలుగైదు కాలేజీ రికార్డుల్లో కనిపించడం షరా మామూలే. ఇలాంటి వారిని కట్టడిచేసేందుకు వారి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చెయ్యాలని నిర్ణయించింది ఎంసీఐ . ఇకనుంచి వైద్యబోధకులు వ్యక్తిగతంగా డిక్లరేషన్‌ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వైద్య బోధకుల అర్హతలేంటన్న దానిపై క్లారిటీ రానుంది.
ఆ అధ్యాపకులపై కొరడా
ఇప్పటి వరకు ఎలాంటి ధృవపత్రాలు సమర్పించని అధ్యాపకులపై కొరడా ఝళిపించనుంది ఎంసీఐ. వసతులు లేని కాలేజీల్లో మెడికల్‌ సీట్లను తగ్గించాలని భావిస్తోంది. దీంతో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని, మెడికల్‌ సీట్ల తగ్గింపుతో విద్యార్థుల నష్టపోతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎంసీఐ కీలక నిర్ణయాలు 
మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా తనిఖీ సమయంలో ఆ కాలేజీ అధ్యాపకులు మరో కాలేజీలో పనిచేయడం లేదనే ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. బోధనేతర సమయంలో ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తే ఆ వివరాలు సమర్పించాలి. అప్పటికీ అధ్యాపకుల్లో మార్పు రాకపోతే ఇండియన్‌ మెడికల్‌ రిజిస్టర్‌ నుంచి సదరు వ్యక్తి పేరు తొలగించాలని కీలక నిర్ణయాలు తీసుకుంది. 
బోధకుల వివరాలు ఆన్‌లైన్లో
దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలు ఇచ్చిన బోధకుల వివరాలను ఆన్‌లైన్లో పొందుపరిచారు. ఆ జాబితాను మరోసారి క్షణ్ణంగా తనిఖీ చెయ్యాలని ఎంసీఐ నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆధార్‌, పాన్‌ కార్డు సర్వర్‌ డేటాను వినియోగించుకోవాలని భావిస్తోంది.

జూట్ మిల్లు క్వార్టర్ పై కప్పు కూలి నాలుగేళ్ల బాలుడు మృతి..

విశాఖపట్టణం : రాత్రి భీమిలిలో భారీ వర్షానికి చిట్టివలస జూట్ మిల్లులో క్వార్టర్ పై కప్పు కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ లో కార్మికులు నివాసముంటున్నారు.

నేటి యూరో కప్ మ్యాచ్ లు...

ఢిల్లీ : నేడు పలు జట్ల మధ్య యూరో కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు ఇటలీ - స్వీడన్ తలపడనుండగా రాత్రి 9.30గంటలకు జరిగే మరో మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ - క్రొయేషియా జట్లు ఢీకొననున్నాయి. రాత్రి 12.30గంటలకు స్పెయిన్ తో టర్కీ తలపడనుంది.

07:49 - June 17, 2016

హైదరాబాద్ : రంజాన్ మాసం కావడంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్లో పండ్ల కొరత లేనప్పటికీ రంజాన్ పండగ సీజన్ నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. 
మండిపోతున్న పండ్లరేట్లు 
రంజాన్ మాసం.. అందునా... పండ్లను ఫలహారంగా తీసుకునే ఆచారం.. వీటన్నింటిని ఆసరాగా తీసుకుంటున్న పండ్ల వ్యాపారులు రేట్లను పెంచేసి సామాన్యులకు దూరం చేస్తున్నారు. మార్కెట్ లో పండ్లు విరివిగా దొరుకుతున్నా.. పండ్ల రేట్లను పెంచేస్తున్నారు. అదేం అంటే.. సీజన్ లేదంతే.. అనే సమాధానం.. దీంతో చేసేది లేక అటు కొనలేక .. ఇంత రేటు పెట్టలేక పోతున్నారు సామాన్య ప్రజలు. 
రంజాన్‌ మాసంలో ఖర్జూరకు మొదటి ప్రాధాన్యం
రంజాన్‌ మాసంలో ముస్లింలు మొదటి ప్రాధాన్యం ఖర్జూరకు,  రెండో ప్రాధాన్యం ఎండుఫలాలకు ఇస్తారు. వీటికి తోడు రంజాన్‌ ఆద్యాంతం ఇతర పండ్లను సహార్‌, ఇఫ్తార్‌ సమయాల్లో ఉపవాసం ఉన్న వారు ఆరగిస్తారు. అరటిపండు , యాపిల్‌, దానిమ్మ, బత్తాయి, సపోటా, పైనాపిల్‌, ద్రాక్ష, మామిడి, కర్బూజా, తర్బూజ్‌ వంటి ఫ్రూట్స్ ను  రంజాన్‌ ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా అధికంగా వినియోగిస్తారు. పది రోజుల క్రితం ఉన్న ధరలతో పోల్చి చూస్తే రంజాన్‌ మాసంలో ధరలు 25 శాతంకుపైగా పెరిగినట్లు వ్యాపారులే అంగీకరిస్తున్నారు. 
కిలో ద్రాక్ష ధర 100 నుంచి 130 రూపాయలు
పెరిగిన ధరలతో ద్రాక్ష సామన్యుడికి అందకుండా మరింత పుల్లగా మారిందనే చెప్పవచ్చు. కిలో ద్రాక్ష ధర  100 నుంచి  130 రూపాయలకు ధర పెరిగింది.  ఇక సైజును బట్టి  పైనాపిల్‌ ధర 70 నుంచి  100 వరకు పలుకుతోంది. వీటితో పాటు కర్బూజా సైతం 25 నుంచి 40 రూపాయలకు  కిలో విక్రయిస్తుండగా, తర్బూజా 50 రూపాయలకు పైగా  కిలో విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే  డజన్‌ అరటి పండ్ల ధర 30 నుంచి 50 వరకు పెరిగింది. డిమాండ్ పెరగగానే వ్యాపారులు అమాంతం రేట్లు పెంచుతుండటంతో సామాన్యులకు పండ్లు కొనుక్కోవడం భారంగా మారింది. దీనిపై సంబంధిత మార్కెటింగ్ శాఖ నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు సామాన్యులు అంటున్నారు. 

 

కామారెడ్డి పల్లి వద్ద ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి..

వరంగల్ : పరకాల మండలం కామారెడ్డిపల్లి దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

నగరంలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ : నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. మొత్తం 13 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు.

 

నేడు జేఏసీ బస్సు యాత్ర..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు జేఏసీ బస్సు యాత్ర నిర్వహించనుంది. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో జేఏసీ నేతలు పర్యటించనున్నారు. గత కొంతకాలంగా మల్లన్న సాగర్ బాధితులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

07:44 - June 17, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో సంచలనం సృష్టించిన దోపిడి కేసులో దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. లైఫ్‌స్టైల్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కోటి 30 లక్షలు తీసుకుని ఓ దొంగ బాబా పరారైన సంగతి తెలిసిలందే. మాయమైన బురిడీ బాబా బెంగళూరులో ప్రత్యక్షమయ్యాడు...దొంగ బాబా నగరంలో దోచుకుని రాత్రే బెంగళూరుకు పారిపోయినట్లు కాల్‌డేటా...సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు...వెంటనే అరెస్టు చేసిన పోలీసులు దొంగ బాబా నుంచి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధించి దొంగ బాబా కారు డ్రైవర్‌ శివను ఉదయాన్నే పోలీసులు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఎర్రవల్లిలో తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో వెళ్తున్న డ్రైవర్‌ దొరికిపోయాడు. కారును సీజ్‌ చేసి డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి దొంగ బాబా వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు దొంగబాబా పెట్టిన మత్తు ప్రసాదం తిన్న మధుసూదన్‌ రెడ్డి ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలు ఏం జరిగింది ?
బేగంపేట లైఫ్‌స్టైల్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లో తన ఇంటికి ఈ మధ్యే మరమ్మతులు చేయించాడు. నిర్మాణానంతరం పూజ చేయించుకోవాలనే ఉద్దేశంతో తనకు పరిచయం ఉన్న కర్నాటకకు చెందిన శివ అనే బాబాను ఆశ్రయించాడు. మంగళవారం రోజు బాబా నగరానికి చేరుకున్నాడు. ఇతనికి ఓరిస్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఇక బుధవారం నాడు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పూజలు నిర్వహించారు. అయితే పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగ బాబా ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో ప్రసాదంలో మత్తు మందు కలిపి మధుసూదన్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఇచ్చాడు. అనంతరం సమీపంలో ఉన్న దేవాలయంలో కూడా పూజలు చేయాలని నమ్మించి..పూజలో పెట్టిన డబ్బుతో సహా మధుసూదన్‌రెడ్డి కుమారుడిని తనతోపాటు తీసుకెళ్లాడు. 
కోటి 30 లక్షలు కొట్టేసిన బాబా
అనంతరం మధుసూదన్‌రెడ్డి కుమారుడితో పాటు బాబా హోటల్‌కు చేరుకున్నాడు. హోటల్‌ గదిలో ధ్యానం చేయమని ఆ అబ్బాయికి చెప్పి వాహనంలో ఉన్న కోటి 30 లక్షల రూపాయలను తన వాహనంలోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత తాను వెళ్లిపోతున్నట్లు చెప్పి బాబా కర్నాటకకు వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన తనయుడికి.. ఇంట్లో తల్లిదండ్రులు మత్తులో పడి ఉండడం గమనించాడు. దీంతో అనుమానం వచ్చి.. వాహనంలో తనతో పాటు తీసుకెళ్లిన డబ్బును వెతికాడు. అయితే అవి కనిపించడలేదు. దీంతో దోపిడీని పసిగట్టిన వారు పోలీసులను ఆశ్రయించారు. 
ఈ నకిలీ బాబా ఇంకా ఎలాంటి దోపిడిలకు పాల్పడ్డాడో పోలీసుల విచారణలో తేలనుంది.

07:40 - June 17, 2016

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తెలంగాణ సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీఎం అధ్యక్షతన సమావేశమైన కమిటీ పాతపాటే పాడింది. సమావేశాన్ని వచ్చే వారానికి వాయిదా వేయడం తప్ప క్రమబద్ధీకరణ దిశగా ఒక్క అడుగూ ముందుకు వెయ్యలేకపోయింది.
సమావేశం వచ్చే వారానికి వాయిదా
తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం కొలిక్కి రావడం లేదు. కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపిన సర్కారు, ఆ బాధ్యతను సీఎస్ రాజీవ్‌శర్మకు అప్పగించింది సర్కార్ . అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 శాఖల ఉంటే.. కేవలం 12 శాఖలకు సంబంధించిన సమగ్రనివేదికలు మాత్రమే అందాయి. క్షేత్రస్థాయి నుంచి ఉద్యోగుల సమాచారం లేకపోవడంతో మిగిలిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో  ఎటూ తేల్చకుండానే సమావేశం వచ్చే వారానికి వాయిదా పడింది.
సమగ్ర సేకరణ తరువాతే క్రమబద్ధీకరణకు అధికారుల మెగ్గు
కాంట్రాక్టు ఉద్యోగుల సమాచార సేకరణకు ఎలాంటి గడువు లేకపోవడంతోనే క్రమబద్ధీకరణ అంశం ఆలస్యమవుతోందని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం సమాచారం అందిస్తే సరిపోదని, సమగ్ర వివరాలను సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తమ పరిధిలోని పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను ముందుంచుకొని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఉద్యోగులు అందించిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాకే పైస్థాయికి వివరాలు పంపిస్తున్నారు. అందుకే ప్రక్రియ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఓ గడువు విధించాలని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అలా జరగకపోతే క్రమబద్ధీకరణ అంశం మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని అంటున్నారు. 

 

07:31 - June 17, 2016

తూర్పుగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ముద్రగడ వియ్యంకుడు సోమేశ్వర్‌రావు అన్నారు. కుటుంబ సభ్యులుగా ముద్రగడ ఆరోగ్యంపై తీవ్ర విచారంలో ఉన్నామని ఆయన తెలిపారు.  ముద్రగడను కాపాడే అవకాశం భగవంతుడికి గానీ లేదా చంద్రబాబు చేతిలోగానీ ఉందని అన్నారు. ముద్రగడ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరం : వియ్యంకుడు సోమేశ్వర్ రావు

 

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత పర్యటన

నిజామాబాద్ : మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.  

నేడు, రేపు తెలంగాణలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ పర్యటన

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ పర్యటించనున్నారు. ఆర్మీ భూముల వివాదాలపై చర్చ జరుపనున్నారు. కంటోన్మెంట్ జనరల్ ఆస్పత్రిని పారికర్ ప్రారంభించనున్నారు. 

 

నేడు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : నేడు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు.

నేడు సీపీఎం పొలిట్ బ్యూర్ సమావేశం

ఢిల్లీ : నేడు సీపీఎం కేంద్రకార్యాలయంలో పొలిట్ బ్యూర్ సమావేశం జరుగనుంది. ఈనెల 18, 19, 20 తేదీల్లో కేంద్రకమిటీ సమావేశాలు జరుగనున్నాయి. 

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు జరుగనున్నాయి. పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

Don't Miss