Activities calendar

18 June 2016

23:13 - June 18, 2016

మల్లన్నసాగర్‌ సర్కార్ మరో ముందడుగు..

హైదారబాద్ : మల్లన్నసాగర్‌ విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు వరకు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని వ్యాప్‌కో సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నివేదిక తర్వాత ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. 

22:25 - June 18, 2016

ఢిల్లీ : టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు లబ్ధి జరిగింది ఏమీలేదన్నారు తెలంగాణ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడం లేదని వాపోయారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉధృతంగా ఉద్యమాలు చేయాలని, సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయనున్నట్లు తమ్మినేని తెలిపారు. 

22:07 - June 18, 2016

లండన్ : ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా లండన్‌లో ఉన్నట్లు రుజువైంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాల్యా ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమంలో లండన్‌లోని భారత రాయబారి కూడా పాల్గొనడం వివాదానికి దారితీసింది.

మాల్యాను ఆహ్వానించలేదన్న లండన్‌ స్కూల్‌ ఆఫ్ ఎకనామిక్స్‌...
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా భారత్‌ వదిలి లండన్‌ వెళ్లిపోయారన్న వార్తలకు బలం చేకూరింది. లండన్‌లో జరిగిన "మంత్రాస్‌ ఫర్‌ సక్సెస్‌" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాల్యా ప్రత్యక్షంగా కనిపించారు. రచయిత సుహేల్‌ సేథ్‌.. జర్నలిస్టు సన్నీ సేన్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భారత హై కమిషనర్‌ నవతేజ్‌ సర్నా కూడా హాజరు కావడం వివాదస్పదంగా మారింది.

మాల్యాకు మేము ఆహ్వానించలేదు : లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్
అంశం వివాదస్పదం కావడంతో విదేశీ మంత్రిత్వశాఖ స్పందించింది. విజయ్‌ మాల్యా కనిపించగానే నవతేజ్‌ సర్నా వెళ్లిపోయారని పేర్కొంది. ఈ కార్యక్రమం భారత రాయబార కార్యాలయంలో జరగలేదని లండన్‌ స్కూల్‌ ఆఫ్ ఎకనామిక్స్‌లో నిర్వహించారని వివరణ ఇచ్చింది. మాల్యాకు తాము ఆహ్వానించలేదని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ భారత హైకమిషనర్‌కు రాసిన లేఖలో తెలిపింది. ఈ కార్యక్రమానికి సోషల్‌ మీడియా ద్వారానే ప్రచారం చేయడం జరిగిందని, ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఓపెన్‌ ఈవెంట్‌ కావడంతో మాల్యా హాజరయ్యారన్న రచయిత సేథ్..
ఈ విషయమై సేథ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం ఓపెన్‌ ఈవెంట్‌ కావడం వల్ల మాల్యా కూడా హాజరై ప్రేక్షకుల్లో కూర్చున్నారని చెప్పారు. మాల్యా ప్రేక్షకుల్లో ఉండడాన్ని గమనించిన భారత హై కమిషనర్‌ నవతేజ్‌ సర్నా కార్యక్రమం పూర్తికాకుండానే వెళ్లిపోయారని సేథ్‌ పేర్కొన్నారు.

బ్యాంకులకు 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన మాల్యా..
బ్యాంకులకు 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా సీబీఐ నుంచి భారత్‌లో విచారణను ఎదుర్కొంటున్నారు. మనీ లాండరింగ్‌ కేసుల్లోనూ ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్షంగా హాజరవ్వాలంటూ పలు మార్లు కోర్టు ఆదేశించినా లెక్క చెయ్యకుండా మాల్యా దేశం వదిలి యూకేకి వెళ్లిపోయారు. ఈడీ సిఫారసు మేరకు విదేశి మంత్రిత్వశాఖ మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది.

21:55 - June 18, 2016

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో నిందితురాలైన సంగీత ఛటర్జీకి ఉచ్చు బిగుస్తోంది. సంగీతకు చెందిన బ్యాంకు లాకర్లను చిత్తూరు పోలీసులు ఓపెన్‌ చేశారు. కోల్‌కత్తాలోని ఆమె ఇంటిపై దాడులు జరిపిన పోలీసులు పెద్ద మొత్తంలో బంగారం, వెండి, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సంగీత ఛటర్జీకి చెందిన రెండు కలకత్తా బ్యాంకు లాకర్ల నుంచి రెండున్నర కిలోల బంగారం, కిలో వెండి, పది సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, 28 లక్షల ఖరీదైన ఓ ఫ్లాట్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంగీత ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉందని.. దానిని రద్దు చేసి కస్టడీకి తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చిత్తూరు పోలీసులు తెలిపారు. 

21:51 - June 18, 2016

హైదరాబాద్ : బురిడీ బాబా శివతో పాటు మరో ఇద్దరికి పదిరోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. శివతో పాటు నిందితులు దామోదర్, శ్రీనివాస్ రెడ్డిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. డబ్బు కోసం తాను మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని చంపాలనుకున్నానని శివ బంజారాహిల్స్ పోలీసుల విచారణలో చెప్పాడు. తనకు శ్రీనివాసరెడ్డి, దామోదర్ సహకరించినట్లు తెలిపాడు. పూజలో పెట్టిన 1.30 కోట్లను పది కోట్ల రూపాయలుగా చేస్తానని వాళ్లను నమ్మించానన్నాడు. మధుసూదన్ రెడ్డిని తనకు మొదట్లో పరిచయం చేసిన మోహన్‌రెడ్డి.. తన వద్ద 20 వేల రూపాయలు తీసుకున్నాడని చెప్పాడు. రైస్ పుల్లింగ్, డబ్బును డబుల్ చేయడం, బ్లాక్ మ్యాజిక్ పేర్లతో తాను ఇన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించాడు. దొంగబాబా శివను ఐదురోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును బంజారాహిల్స్ పోలీసులు కోరారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

21:43 - June 18, 2016

హైదారబాద్ : మల్లన్నసాగర్‌ విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు వరకు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని వ్యాప్‌కో సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నివేదిక తర్వాత ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. 

21:40 - June 18, 2016

విజయవాడ : ఈనెల మూడో వారంలో ఏపీలో స్మార్ట్‌ పల్స్‌ సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం సర్కారు సన్నాహకాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఈ అంశంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఫలాలు మధ్యవర్తలు జోక్యం లేకుండా.. నేరుగా ప్రజలకే అందేలా చేర్చడమే స్మార్ట్‌ పల్స్‌ సర్వే ఉద్దేశమని ఆయనన్నారు .

చంద్రబాబునాయుడు.. వీడియో కాన్ఫరెన్స్‌...
ఏపీలో చేపట్టనున్న స్మార్ట్‌ పల్స్‌ సర్వేపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, 13 జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుందని.. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతోన్న పల్స్‌ సర్వే అంతకుమించిన సమగ్ర వివరాలను అందిస్తుందని చంద్రబాబు అన్నారు.

 

ఆదాయం, ఆరోగ్యం, సామాజిక భద్రత తెలుసుకునే అవకాశం...
పల్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబ తలసరి ఆదాయం, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపకరించే సర్వే కావడంతో ప్రతి ఒక్క అధికారి అంకితభావంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పల్స్‌ సర్వేలో భూముల వివరాలు, నేల స్వభావం, పంటల వివరాలను కూడా సమీకరించాలని సీఎం ఆదేశించారు. వీటితో పాటే.. పెన్షన్లు, స్కాలర్ షిప్స్‌, రుణాల వివరాలనూ సర్వేలో సేకరించాలని సూచించారు.

సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తున్న సర్వే : చంద్రబాబు
ఆధార్‌ అనుసంధానం చేసిన అనంతరం నిర్వహిస్తున్న సర్వే ఇదేనని, దేశంలో వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తున్న సర్వే కూడా ఇదేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

21:28 - June 18, 2016

హైదారాబాద్ : తెలంగాణలో గత ఏడాది 38వేల 90కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో... మైనింగ్, పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌ కే పరిమితం చేయడం లేదని.. ఉపాధే లక్ష్యంగా జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేటీఆర్ తెలిపారు.

గురుకుల పాఠశాలల్లో మంత్రి గంటా తనిఖీలు...

విశాఖ: సింహాచలం గురుకుల పాఠశాలను శనివారం ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనిఖీ చేశారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని పాఠశాల ప్రిన్సిపల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులకు గంటా ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి రైతులకు శుభవార్త...

విజయవాడ: రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ప్రారంభమయింది. భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలుకుతోంది. సోమవారం సాయంత్రం 4గంటలకు తుళ్లూరు మండలం నేలపాడులో భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు మంజూరు చేయనున్నారు. భూములిచ్చిన రైతులు రావాలని సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను గుంటూరు జేసీ శ్రీధర్‌ పరిశీలించారు. కాగా రైతుల నుండి భూములు తీసుకుని వారిని నిండా ముంచారని ప్రతిపక్షాల నోటికి ఈ కీలక ఘట్టంతో నోటికి తాళం పడనుంది.

తెలంగాణలో 'వాస్తు' పాలన : మంత్రి పారికర్

హైదరాబాద్ : తెలంగాణలో పరిపాలన వాస్తు ప్రకారం సాగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. రెండేళ్లలో మోదీ చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని పారికర్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తును బాగా నమ్ముతారని ఆయన సన్నిహితులు పేర్కొంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్రమంత్రి పారికర్ ఈ రకంగా టీ. సర్కార్ పట్ల సెటైర్ వేశారు.

మధుసూదన్ రెడ్డి హత్యకు బురిడీ బాబా ప్లాన్?!...

హైదారాబాద్:   లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని 1.33 కోట్ల రూపాయలకు బురిడీ కొట్టించిన నకిలీబాబా శివ, పోలీసు విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడని తెలిపారు. కోటిన్నర రూపాయలను మూడు కోట్ల రూపాయలుగా మారుస్తానని మధుసూదన్ రెడ్డిని శివ నమ్మించాడు. దీంతో వారు ఈ డబ్బు తెచ్చి శివ ముందు పూజలకు పెట్టినట్టు తెలుస్తోంది. వారి నుంచి డబ్బు కాజేసిన అనంతరం వారిని హత్య చేసేందుకు పథకం రచించాడని సమాచారం. వారి నుంచి కొట్టేసిన 1.33 కోట్ల రూపాయలతో బెంగళూరు శివార్లలో ఓ విల్లా కొనుక్కుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు.

ఏపీలో తెలంగాణ మంత్రి ...

తిరుమల : ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కనిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం హరీష్ రావు తొలిసారి ఏపీలో అడుగుపెట్టారు. హరీష్ రావు వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు. హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హరీష్ రావు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అలిపిరి నుంచి ఆయన కాలి నడకన తిరుమల బయల్దేరారు. అలాగే తెలంగాణ సిద్ధించిన సందర్భంగా గతంలో మొక్కుకున్న మొక్కులు చెల్లించుకున్నారు.

20:39 - June 18, 2016

వంద ఉపన్యాసాలూ....వెయ్యి మాటలూ....కంటే ఒక పాట మనసుల్ని కదిలిస్తుంది...ఉద్యమాల బాట నడిపిస్తుంది...కొందరూ తమ భావాలను మాటలతో...చేష్టలతో...సైగలతో చెబుతారు..కానీ పాట రూపంలో చెప్పింది మాత్రం హృదయాలకు హత్తుకుపోతుంది కదా...అందుకే శ్రమను మరచిపోవటానికి శ్రామికులతంతా పాటల రూపంలో వ్యక్తపరుస్తూంటారు.....ప్రజా వాగ్గేయకారులు తమ భావాల్ని గేయాలు రాసి పాడుతూంటారు...ఉద్యమకారులు ఉద్యమంలో వుండే తీవ్రతను తెలిపటానికి మాటకంటే పాటల రూపంలోనే వ్యక్తం పరుస్తారు...పాటకు అంతటి స్పందన వుంటుంది...అదే బాటలో మల్లన్న సాగర్ ప్రాంతంలో నిర్వాశితులు తమ ఆవేదనను పాటల రూపంలో తెలిపారు....అలాగే ఓయూ జేఏసీ నాయకులు కూడా కవీ..గాయకుడు..ఉద్యమకారుడు అయిన దరువు ఎల్లన్న కూడా ఎర్రవెల్లి దీన గాథను రాగం రూపంలోనే వ్యక్త పరిచారు... తెలంగాణ రాష్ట్రం రాకముందు 'అంగట్లో ఆగమయింది అనే పాటలు పాడామనీ..ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా...అంగడిలో ఆగమైన తీరుగా నున్నవే..తల్లీ నా ఎర్రవెల్లీ అంటూ పాటను అందుకున్నాడు....ఎర్రవెల్లి సర్పంచ్ కూడా తనకు పదవి కంటే ఊరే ముఖ్యమని తెలిపారు.....మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో ఒకటైన పల్లెపాడు గ్రామంలో 10 రోజుల నుండి గ్రామస్థలు నిరాహార దీక్షలు చేస్తున్నారు.... మండలానికి సంబంధించిన ...జెట్పీటీసీ పరిపూర్ణాచారి, సర్పంచ్ మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ...2013 చట్టమూ...123 జీవో మాకొద్దనీ...మా ఊరే మాకు కావాలి తప్ప ప్రాజెక్టు మాకొద్దని వారు ఖరాఖండీగా తెలిపారు... ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మా అస్థిత్వమే ప్రశ్నార్ధకమయిపోతుందన్నారు...ప్రజలకోసం తమ పదవులకు వదులుకోవటానికి కూడా తాము సిద్ధంగా వున్నామంటున్నారు....

 

ఎర్రచందనం స్మగ్లర్ సంగీతాఛటర్జీ ఆస్తులను స్వాధీనం ...

చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ సంగీతాఛటర్జీ ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలకత్తాకు చెందిన సంగీతాఛటర్జీ ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తుంటుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆమెపై పులు కేసులు నమోదై విచారణ ఎదుర్కొంటుంది. కేసు దర్యాప్తు చేస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు కోల్‌కతాలోని యూకో బ్యాంక్‌లో సంగీతాఛటర్జీకి చెందిన లాకర్‌ను ఓపెన్ చేశారు. రెండు కేజీల బంగారం, కేజీ వెండి, ల్యాప్‌టాప్, 9 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

20:05 - June 18, 2016

సింగర్, ర్యాపర్ స్టార్ , యాక్టర్, అమేజింగ్ డాన్సర్ అయిన నోయిల్ తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్ .. నోయిల్ బైటకు వెళితే అమ్మాయిలు విపరీతంగా కొడుతున్నారంట?!...ఎందుకోమరి...తనకునెగిటివ్ రోల్స్ అంటేనే ఇష్టమని నోయిల్ అంటున్నాడు..ఎందుకో... నోయిల్ షూటింగ్ కి అమెరికా వెళ్లినప్పుడు ఫోన్ మాట్లాడుతూ...అనుకోకుండా ఓ బటన్ ప్రెస్ చేసేశాడట...ఇంకేముంది...ఆ హోటల్ లో వున్నవారంతా బయటకు వచ్చేశారు. ఇంతకీ ఆ బటన్ ఏమంటే ఫైర్ కి సంబంధించిన బటన్ అట....టకటకా ఫైర్ ఇంజన్ లు వచ్చేశాయ్...పోలీసులు వచ్చేశారు...నోయిల్ స్కూల్ డేస్ లో వున్నప్పుడు..ఓ టీచర్ టాయ్ లెట్ కు వెళ్తే..బయటనుండి బోల్ట్ పెట్టేశేవాడంట...అర్థరాత్రి సమయంలో టీచర్ కి ఫోన్ చేసి ఏడిపించటం...జోవియల్ నోయిల్ తో స్పెషల్ చిట్ చాట్ చాలా ఫన్నీగా...సరదాగా...గడిచిపోయింది....ఎంతమంది  ఫ్రాంక్ కాల్ చేసిన కనిపెట్టేసి వారినే ఆటపట్టించిన నోయిల్ చిట్ చాట్ మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ...ఈ వీడియోను క్లిక్ చేయండి...మీ టెన్షన్స్ అన్నీ మరచిపోతారు...ఖచ్చితంగా...మరి ఆలస్యమెందుకు.... క్లిక్ ద నోయిల్ చిట్ చాట్

19:45 - June 18, 2016
19:42 - June 18, 2016
19:31 - June 18, 2016

అనంతపురం : సింగిల్‌గా వస్తాడు.. సింపుల్‌గా పనిపూర్తి చేస్తాడు. ఐరన్‌ రాడ్డుతో వస్తాడు..ఈజీగా తాళాలు తెరిచేస్తాడు..ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా దూసుకుపోతాడు. 11 ఏళ్ల చిరుదొంగ.. కరుడుగట్టిన నేరగాడిగా మారిపోయాడు. అతిపిన్న వయసులోనే చోర శిఖామణిగా మారిపోయాడు. ఆ కుర్రాడు ఎందుకు ఇలా మారాడు..? వాచ్‌ దీస్‌ స్టోరీ..

వరుస చోరీలతో హల్‌చల్‌....
లేత వయసులో ఉన్న ఈ కుర్ర దొంగ పేరు గంగాధర్‌. తాళాలు వేసిన ఇళ్లే ఇతడి టార్గెట్‌. జనంతో పాటు పోలీసులకూ కంటిమీద కునుకులేకుండా చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఇతడు కొల్లగొట్టిన ఇళ్లు.. ఇతడు ఎదుర్కొంటున్న నేరాలు సెంచరీకి పైమాటే. ఇక జైలంటే ఇతడికి అత్తారిల్లే. బాలనేరస్తుడిగానే జైలు జీవితం రుచిచూశాడు. ఆ తర్వాత పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. కానీ ఎప్పుడూ మనోడి తీరు మాత్రం మారలేదు. బెయిల్‌ మీద బయటకు రావడం మళ్లీ దొంగతనాలతో చెలరేగిపోవడం పరిపాటిగా మారింది. అనంతపురంతో పాటు కడప, జమ్మలమడుగు, కర్ణాటకలో పలు ఇళ్లకు కన్నాలు వేశాడు. చోరీసొత్తుతో జల్సాలు చేశాడు. పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడాడు. చోరీల్లో సెంచరీ సాధించిన గంగాధర్‌.. అసలు ఎందుకిలా మారాడు...?

చిన్న వయసులోనే సినిమా కష్టాలు....
అనంతపురం కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన గంగాధర్‌ను చిన్న వయసులోనే సినిమా కష్టాలు చుట్టుముట్టాయి. 11 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో బరువు బాధ్యతలు పెరిగాయి. అతడు పనిచేస్తే గానీ పూట గడవని పరిస్థితి ఏర్పడింది. అలా కుటుంబ పోషణ కోసం దొంగగా మారిన గంగాధర్‌ అలియాస్ సాయి...చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఈజీమనీ కోసం దోపిడీలు, దొంగతనాలతో రెచ్చిపోయాడు.

ఊచలు లెక్కించినా మారని తీరు.....
వ్యసనాలకు బానిసైన గంగాధర్‌ అనతికాలంలోనే కరుడుగట్టిన నేరగాడిగా మారిపోయాడు. 11 ఏళ్లలో 100 నేరాలకు పైగా చేశాడు. ఈ కుర్రదొంగపై నజర్‌ పెట్టిన పోలీసులు సస్పెక్ట్‌ షీట్‌ కూడా తెరిచారు. గాండ్లపేట పీఎస్‌ పరిధిలో ఓ చోరీ కేసుకు సంబంధించి నాలుగేళ్లు జైలు జీవితం అనుభవించాడు. ఈ ఏడాది హైకోర్టు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన గంగాధర్‌ దొంగతనాలతో విజృంభించాడు. నిఘా పెంచిన పోలీసులు యువదొంగను వలపన్ని పట్టుకున్నారు. అతడి నుంచి 18 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఈజీ మనీ కోసం అడ్డదారులు..
చాలామంది.. జీవితాన్ని అక్రమమార్గం వైపు మళ్లించడానికి తీసుకునే సమయాన్ని.. నీతిగా బతకడానికి ఉన్న మార్గాలేంటో వెతుక్కోలేకపోతున్నారు. కలల్లో తేలిపోతూ ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నారే తప్ప.. నిజాన్ని గ్రహించలేకపోతున్నారు. దీనికి గంగాధర్‌ జీవితమే ఓ ఉదాహరణ.

 

19:17 - June 18, 2016

విశాఖ : మీడియాలో నెగిటివ్‌ వార్తలే తనకు ఇష్టమని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జర్నలిస్ట్‌ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్‌ మీట్‌ను ఆయన ప్రారంభించారు. మాకు తెలియకుండా చాలా తప్పులు జరుగతాయని..వాటిని పత్రికల ద్వారా తెలుసుకుని సరిదిద్దుకుంటామని అన్నారు. అందుకే పత్రికల్లో వచ్చిన విమర్శనాత్మక వార్తలనే ఎక్కువగా చదువుతానని అన్నారు.

నెగిటివ్‌ వార్తలే ఇష్టం : అయ్యన్నపాత్రుడు

విశాఖ : మీడియాలో నెగిటివ్‌ వార్తలే తనకు ఇష్టమని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జర్నలిస్ట్‌ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్‌ మీట్‌ను ఆయన ప్రారంభించారు. మాకు తెలియకుండా చాలా తప్పులు జరుగతాయని..వాటిని పత్రికల ద్వారా తెలుసుకుని సరిదిద్దుకుంటామని అన్నారు. అందుకే పత్రికల్లో వచ్చిన విమర్శనాత్మక వార్తలనే ఎక్కువగా చదువుతానని అన్నారు. 

19:02 - June 18, 2016

అనంతపురం : నిత్యావసర సరుకుల ధరల పెంపుపై అనంతపురంలో ఐద్వా కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. మెడలో కూరగాయల దండలు వేసుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. ధరలను వెంటనే నియంత్రించకపోతే రాష్ట్రంవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఐద్వా నేతలు హెచ్చరించారు.

అధిక ధరలపై ఐద్వా వినూత్న నిరసన...

అనంతపురం : నిత్యావసర సరుకుల ధరల పెంపుపై అనంతపురంలో ఐద్వా కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. మెడలో కూరగాయల దండలు వేసుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. ధరలను వెంటనే నియంత్రించకపోతే రాష్ట్రంవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఐద్వా నేతలు హెచ్చరించారు.

18:59 - June 18, 2016

విజయవాడ : రాజీవ్‌గాంధీ పార్క్‌ అగ్ని ప్రమాద బాధితులకు జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో కేటాయించిన ప్లాట్ల నుంచి అధికారులు ఖాళీ చేయించడంపై సీపీఎం నిరసన వ్యక్తం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధితులతో కలిసి వైఎస్సార్ కాలనీ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. నాలుగు నెలల క్రితం కేటాయించిన ప్లాట్ల నుంచి ఉన్నపలంగా వెళ్లిపొమ్మని ఆదేశించడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించిన పాట్లను ఖాళీ చేయిస్తే సహించబోమని సీపీఎం నాయకులు హెచ్చరిస్తున్నారు.

'హోంగార్డ్‌కు ఎక్కువ.. కానిస్టేబుల్‌కు తక్కువ':భూమన

హైదరాబాద్ : హోంమినిస్టర్ చినరాజప్ప హోంగార్డ్‌కు ఎక్కువ... కానిస్టేబుల్‌కు తక్కువగా తయారయ్యారని విమర్శించారు. ఫిరాయింపులు అనైతికం అంటున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే ఫిరాయింపుదారుల నిరోధక చట్టాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.. మీ స్నేహితుడైన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కూనీచేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

18:54 - June 18, 2016

హైదరాబాద్ : హోంమినిస్టర్ చినరాజప్ప హోంగార్డ్‌కు ఎక్కువ... కానిస్టేబుల్‌కు తక్కువగా తయారయ్యారని విమర్శించారు. ఫిరాయింపులు అనైతికం అంటున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే ఫిరాయింపుదారుల నిరోధక చట్టాన్ని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.. మీ స్నేహితుడైన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని దారుణంగా కూనీచేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

18:50 - June 18, 2016

అనంతపురం : రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు.

జేసీ-ప్రభాకర్ చౌదరి మధ్య పోరు...
జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కి అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది.. జేసీ బ్రదర్స్ , ప్రభాకర్ చౌదరి ఎప్పుడు.. ఎక్కడ ఎదురు పడినా గొడవ ఖాయం అనే పరిస్థితి జిల్లాలో నెలకొంది. తాజాగా, మొన్నటి జెడ్పీ సమావేశంలోనూ ఈ ఇద్దరు నేతలు పరస్సరం తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయిలో నడిచింది.
జెడ్పీ సమావేశంలో ఇద్దరు నేతల నడుమ వాగ్వాదం...
జేసీ దివాకరరెడ్డి, వైకుంఠం ప్రభాకరరెడ్డిల వాగ్వాదం విన్నవారికి.. ఇది పాలక, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రచ్చ అన్న భావనే కలిగింది. ఆస్థాయిలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం , ఆక్రమణల తొలగింపు, రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ఈ రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీంతో ప్రతిపక్షం వైసీపీ కి ఇక్కడ మాట్లాడే అవకాశమే రాకపోలేదు....

ఇరు అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం..
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య తీవ్ర ఘర్షణ కొత్తేమీ కాదు. గతంలోనూ చాలాసార్లు ఇద్దరు నేతల మధ్య వాగ్యుద్ధాలు.. పరస్పరం అవమానించుకోవడాలూ నడిచాయి. గతంలో ఓసారి అనంత ఎమ్మెల్యే ఇంటి ముందు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి అనుచరులు గలాటా సృష్టించారు... దీంతో ఎమ్మెల్యే అనుచరులూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో గొడవకు దిగారు.. అప్పుడు కూడా సేమ్ సీన్.. అదే గందరగోళం... అభివృద్ది పనుల విషయంలో తమమధ్య కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయని గతంలో జేసీ బ్రదర్స్ చెప్పినా ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరుగుతోందని తెలుగు తమ్ముళ్లంటున్నారు...

జేసీ కనుసన్నల్లోనే పయ్యావుల ....
గతంలో పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయమంతా ఆయన కనుసన్నల్లో నడిచేది... జెసీ దివాకర్ రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ కాంగ్రెస్ లో ఆయన తాడిపత్రికి మాత్రమే పరిమితమయ్యే వారు.. 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా టీడీపీ టిక్కెట్ పై జేసీ దివాకర్ రెడ్డి గెలిచారు.. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.. అప్పట్నుంచి జిల్లాలో అనంతపురం ఎంపీ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, స్థానిక ఎమ్మెల్యేలపై జేసీ పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు... ఉరవకొండ టీడీపీ ఇంచార్జ్ పయ్యావుల కేశవ్ కూడా జేసీ కనుసన్నల్లోనే నడుస్తున్నారు.. కానీ అనంతపురం... జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ మరింత పట్టుకోసం జేసీ బ్రదర్స్ ప్రయత్నించడమే వివాదాలకు కారణమైందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

పట్టు సాధించేందుకు జేసీ బ్రదర్స్‌ ప్రయత్నం...
మరో వైపు జెసీ తనయుడు జేసీ పవన్ రెడ్డిని అనంతపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు జేసీ ప్రయత్నిస్తున్నారని అందుకే అనంతపురం పై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జేసీ బ్రదర్స్‌.. ప్రభాకరచౌదరిల మధ్య వివాదాలొస్తున్నాయని టీడీపీ శ్రేణుల సమాచారం. గతంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేసుకున్నారు.. సీఎం పిలిచి మాట్లాడారు కూడా.. కానీ సమస్య సద్దుమణగలేదు.. తాజా పరిణామాలను చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.. 

బొలెరో -బైక్ ఢీ..ఇద్దరు మృతి...

నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు రక్తసిక్తమవుతున్నాయి. కోటగిరి మండలం రాయకూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం-బైక్ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్ లో దారుణ హత్య...

కరీంనగర్: గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడ్ని గొంతుకోసిన దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గోదావరిఖనిలో చోటుచేసుకుంది. మృతుడిని 8 ఇంక్లెన్ కాలనీకి చెందిన వరప్రసాద్‌ (32)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

18:16 - June 18, 2016

ఆదిలాబాద్ : ఆస్పత్రికి వెళ్లాలన్నా.. సంతకు వెళ్లాలన్నా.. సొంత ఊరు వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిందే... సొంత జిల్లాలోని పట్టణాలకు వెళ్లాలంటే కనీసం 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే... దీంతో చేసేదేమిలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఐదు కిలోమీటర్ల పడవ ప్రయాణం చేస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు అంత రిస్క్ చేసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమిటీ అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ...

ప్రాణాలతో చెలగాటం...తప్పని ప్రయాణం..
ఆదిలాబాద్ జిల్లా కౌటాల, బెజ్జూరు మండలాల్లో ప్రాణహిత నది తీరం ఉంది. నది అవతలి వైపున మహారాష్ట్ర రాష్ట్రంలోని పలు గ్రామాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నది ఒడ్డున దాదాపు 30 గ్రామాలున్నాయి. జిల్లాలోని ఇతర పట్ఠణాల కంటే మహారాష్ట్రలోని పలు పట్టణాలు ఈ గ్రామాలకు అతి సమీపంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవాలంటే రోడ్డు మార్గాలు లేవు. కేవలం నాటుపడవ ప్రయాణం ఒక్కటే దారి. దీంతో ప్రాణాలకు ముప్పు అని తెలిసిన ప్రజలు అక్కడికి వెళ్లడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

అహేరి పట్టణం ఐదు కిలోమీటర్ల దూరం...
మారుమూల ప్రాంతాలైన ఈ గ్రామాలకు మహారాష్ట్రలోని అహేరి పట్టణం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆస్పత్రికి వెళ్లాలన్నా... సంతకు వెళ్లాలన్నా.. నదిలోనే ప్రయాణిస్తున్నారు. ఇదే పట్టణానికి రోడ్డు మార్గాన వెళ్లాలంటే 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. అందుకే రిస్క్ ఎక్కువైనా ఇలా పడవలో ప్రయాణిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటి వరకు పడవ ప్రయాణం వల్ల 11 మంది మృతి చెందారని... 20 మందికి పైగా గాయాలయ్యాయని వాపోతున్నారు.

బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ ప్రాణాలు కాపాడాలని స్థానికుల కోరిక..
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో తెలియక సతమతమవుతున్నామని... అధికారులు వెంటనే స్పందించి నది మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

ప్రమాద నివారణ చర్యలు తీసుకోవలంటున్న స్థానికులు...

ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఈ ప్రమాదాలను శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

18:00 - June 18, 2016

హైదరాబాద్ : ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. మూడు నెలలుగా భర్త ఆచూకీ కోసం వెదికిన భార్య.. చివరికి అత్తవారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన మీనాక్షి-తిర్మల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలం కాపురం చేశాక... భర్త ఇంటికి రావడం మానేశాడు. దీంతో ఇంటిఅద్దెనుకూడా చెల్లించలేక మీనాకక్షి నానా యాతన పడుతున్నారు. దీంతో భర్త ఆచూకీకోసం ఆల్వాల్‌ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

పెళ్లి చేసుకుని పరారయిన ప్రబుద్ధుడు...

హైదరాబాద్ : ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడు.. చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. మూడు నెలలుగా భర్త ఆచూకీ కోసం వెదికిన భార్య.. చివరికి అత్తవారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన మీనాక్షి-తిర్మల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలం కాపురం చేశాక... భర్త ఇంటికి రావడం మానేశాడు. దీంతో ఇంటిఅద్దెనుకూడా చెల్లించలేక మీనాకక్షి నానా యాతన పడుతున్నారు. దీంతో భర్త ఆచూకీకోసం ఆల్వాల్‌ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

17:56 - June 18, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని... బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విమర్శించింది. రెండేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి 90 వేల కోట్ల రూపాయల నిధులు అందాయని సమావేశానికి హాజరైన పార్టీ నేతలు చెప్పారు. పన్నులు రూపంలో 22 వేల కోట్లు, గ్రాంట్ల రూపంలో 34 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వివరించారు. వివిధ పథకాల కింద మరో 50 వేల కోట్ల వరకు నిధులు అందాయని కార్యవర్గం దృష్టికి తెచ్చారు. ఇచ్చిన నిధులు ఖర్చుపెట్టమని కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖలు రాసే పరిస్థితి వచ్చిందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఈ సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌.... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాస్తును పరిపాలనలో భాగం చేసిందని విమర్శించారు.

17:52 - June 18, 2016

హైదారబాద్ : పార్టీ మారిన అవకాశవాదులను మళ్లీ పార్టీలోకి తీసుకునేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంత మంది నేతలు పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలతో భేటీఅయిన ఆయన 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అబద్దాలతో మాయ చేస్తున్న అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులతో సాహా పలువురు నేతలు గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే.

మాజీ దేశాక్షుడికి జీవిత ఖైదు ...

ఈజిప్టు : ఒకప్పుడు అతను ఆ దేశానికి అధ్యక్షుడు. అతనికి ఆ దేశ న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. ఎవరా దేశాధ్యక్షుడు అనుకుంటున్నారా? పిరిమిడ్స్ కు పేరు పొందిన ఈజిప్టు దేశానికి అతను 2012 నుండి 2013 వరకూ ఆయన అధ్యక్షుడిగా పదవిని నిర్వహించారు. ఖతర్‌తో గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఇవాళ ఈ తీర్పును వెలువరించింది. కాగా, ఈజిప్టు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి మోర్సీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

యువకుడు వేధింపులు..టీచర్ ఆత్మహత్య..

హైదరాబాద్: యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ టీచర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హయత్‌నగర్‌కు చెందిన చందన(23) అనే యువతి ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. చౌటుప్పల్‌కు చెందిన మహేశ్ అనే యువకుడు చందనను పెళ్లి చేసుకోవాలని రోజూ వెంట పడుతున్నాడు. యువకుడి వేధింపులు తట్టుకోలేక చందన సరూర్‌నగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

17:23 - June 18, 2016

నిజామాబాద్ : ఏళ్లనాటి కల నెరవేరబోతుంది.. చిరకాల వాంఛ తీరబోతుంది.. నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగిన కామారెడ్డిని ప్రభుత్వం కొత్త జిల్లాగా ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డిని జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం...
తెలంగాణాలో కొత్త జిల్లాలు ఖరారు అయ్యాయి. ఇందులో భాగంగా నిజామాబాద్‌లోని కామారెడ్డిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించారు. పది లక్షల అరవై ఎనిమిది వేల మంది ఉన్న కామారెడ్డిని జిల్లాగా చేయాలని పలుమార్లు అఖిలపక్షం, విద్యార్థి సంఘాలు ఆందోళనలు, బంద్‌లు చేశాయి. ఓ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ కూడా కామారెడ్డిని జిల్లాగా మార్చుతామని హామీ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా దసరా నాడు ముఖ్యమంత్రి కామారెడ్డిని జిల్లాగా ప్రకటించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డిని ఆనుకొని జాతీయ రహదారి, రైల్వే లైన్‌...
కామారెడ్డిని ఆనుకొని జాతీయ రహదారి.. రైల్వే లైన్‌.. బస్టాండ్‌ ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, కార్యాలయాలు ఉన్నాయి. అన్ని విధాల అందరికి అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం కామారెడ్డిని జిల్లా ఎంపిక చేసింది. దీంతో కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.అంతేకాకుండా వ్యాపారం..వ్యవసాయంలో కూడా కామారెడ్డి మండలం ముందంజలో ఉంది. కొత్తగా ఏర్పాటు కానున్న కామారెడ్డి జిల్లాలో.. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ,జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలో 21 మండలాలు ఉండనున్నాయి. కామారెడ్డిని కామారెడ్డి, దేవున్‌ పల్లిగా విభజించనున్నారు.

జిల్లా ప్రకటనతో స్థానికుల హర్షం...
సీఎం హామీ వల్లో.. స్థానికుల ఆందోళన వల్లో..ఎట్టకేలకు కామారెడ్డి ప్రాంతీయుల కల నిజమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

17:10 - June 18, 2016

విజయవాడ : రాజధాని ప్రాంతంలో పుష్కర పనులు ఊపందుకున్నాయి. అనుకున్న సమయానికే పనులు పూర్తయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగవచ్చనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

తాళ్లాయపాలెంలో పుష్కర పనులు వేగవంతం...
రాజధానికి ప్రధాన ఘాట్‌గా ఉండబోతున్న తాళ్లాయపాలెంలో పుష్కర పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు కిలోమీటర్ దూరం నిర్మిస్తున్న ఈ ఘాట్‌లో మెట్లనిర్మాణ పనులు సాగుతున్నాయి. రోజుకి లక్ష మందికి పైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఘాట్‌ల నిర్మాణం జరుగుతోంది. తాత్కాలిక సచివాలయానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండటంతో పాటు రవాణా సదుపాయం కూడా సులువుగా ఉండటంతో ఈ ఘాట్‌కు ప్రాధాన్యత కలగనుంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి నుంచి ఈ ప్రాంతానికి త్వరగా చేరకోవడానికి అవకాశం ఉండటంతో భక్తుల తాకిడి అధికంగా ఉండనుందని భావిస్తున్నారు.

మరోవైపు అమారావతిలోనూ జోరుగా పుష్కర పనులు...
మరోవైపు ఏపీ రాజధానిగా నామకరణం చేసిన అమరావతిలో పుష్కర పనులు వేగంగా సాగుతున్నాయి. అమరలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి ధ్యానబుద్ధ ప్రాజెక్టు వరకూ జరగాల్సిన పనులు ఊపందుకున్నాయి. విజయవాడ తరవాత అమరావతికే భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అతిపెద్ద ఘాట్‌ నిర్మాణం చేపట్టడంతోపాటు, పుష్కర నగరాలను నిర్మిస్తున్నారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు దగ్గర పష్కర నగరి నిర్మించి, అక్కడే వసతి సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఘాట్‌లో స్నానమాచరించిన తర్వాత నేరుగా అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవడానికి వీలుగా రహదారులు ఏర్పాటు చేస్తున్నారు.

పనులు వేగవంతం పట్ల భక్తులు హర్షం...
రాజధాని ప్రాంతంలో పుష్కర పనులు వేగవంతంగా జరగడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వేగంతో పనులు పూర్తిచేసి, కృష్ణా పుష్కరాలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నారు. 

16:58 - June 18, 2016

హైదరాబాద్ : బురిడీ బాబా శివతో పాటు మరో ఇద్దరికి పదిరోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. శివతో పాటు నిందితులు దామోదర్, శ్రీనివాస్ రెడ్డిలను చంచల్ గూడ జైలుకు తరలించారు. 17 మంది సాక్షులను రిమాండ్ రిపోర్టులో చేర్చిన పోలీసులు వారం రోజుల పాటు తమకు కస్టడికి ఇవ్వాలని పిటిషన్ వేసేందుకు సిద్దమయ్యారు. న్యాయవాదుల కోర్టు బహిష్కరణ ఉండటంతో నిందుతులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోలేదు. 

16:55 - June 18, 2016

విశాఖ : యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకం కోసం ఏపీ సెట్‌ ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రాయూనివర్సిటీకి అప్పగించారు. ఏపీ సెట్‌కు ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. వచ్చే నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. యూజీసీ నిబంధనల ప్రకారం మొత్తం 31 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఏవీ నారాయణ చెబుతున్నారు. 

ఏపీ సెట్ కు నోటిఫికేషన్ ...

విశాఖ : యూనివర్సిటీలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకం కోసం ఏపీ సెట్‌ ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రాయూనివర్సిటీకి అప్పగించారు. ఏపీ సెట్‌కు ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. వచ్చే నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. యూజీసీ నిబంధనల ప్రకారం మొత్తం 31 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఏవీ నారాయణ చెబుతున్నారు. 

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్‌ :  మరోసారి భారీవర్షం ముంచెత్తింది. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అమీర్ పేట, జూబ్లీహిల్స్‌లో భారీవర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో.. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. అక్కడక్కడా ట్రాఫిక్‌ జామ్‌తో... వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

మాదకద్రవ్యాల కేసులో అలనాటి హీరోయిన్?!....

హైదరాబాద్ : డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో దొంగ పోలీస్ సినిమాలో నటించిన హీరోయిన గుర్తుందా. ఆమేనండీ బాబు అందాల మమతా కులకర్ణి. ఆమె ఇప్పుడు సంచలమైయ్యింది. ఏ విషయంలోననుకుంటున్నారా? నేరచరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఒకేసారి రూ.2 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత కేసులో సినీ నటి మమతా కులకర్ణి మెడచుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. మమతతోపాటు ఆమె భర్త, అంతర్జాతీయ స్మగ్లర్ విక్కీ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు తనకు ఎలాటి సంబంధంలేదని మమత వాదిస్తోంది. విక్కీ కూడా మమత తన భార్య కాదని చెప్పుకొచ్చాడు.

16:37 - June 18, 2016

బాలల ఎదుగుదల విషయంలో భారత్ కొన్ని సబ్‌ సహారన్ దేశాలకన్నా చాలా వెనుకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్న బాలల్లో భారత్‌లోనే మూడోవంతు మంది ఉన్నారు. దేశంలోని 38.7 శాతం మంది బాలలు ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్నట్టు ఓ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 23.8 శాతం మంది బాలలు పోషకాహార లోపంతో ఎదగలేకపోతున్నారని గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ (జీఎన్‌ఆర్) వెల్లడించింది. బాలల్లో ఎదుగుదల లోపాలపై 132 దేశాల్లో అధ్యయనం నిర్వహించగా, భారత్ 114వ స్థానంలో ఉంది. అయితే భారత్‌లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యల మూలంగా 2030 నాటిని ఘనా లేదా టోగో, 2055 నాటికి చైనాను చేరుకోగలదని ఆ నివేదిక తెలిపింది. బాలల ఎదుగుదల లోపానికి సంబంధించి ఘనా 52వ స్థానంలో, టోగో 80వ స్థానంలో ఉండగా, చైనా 26వ స్థానంలో ఉంది. గత పదేండ్ల కాలంలో భారత్ బాలల ఎదుగుదల లోపాల సమస్యను రెండు రెట్లు తగ్గించగలిగిందని ఆ నివేదిక పేర్కొంది.

స్నూకర్ చాంపియన్ షిప్ లో అమీ కామని మొదటి స్థానంలో నిలిచింది. స్నూకర్ లో కొత్త ఆశలు కలిగిస్తోంది. జాతీయస్థాయి మహిళల స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ ర్యాంకింగ్స్‌లో అమీ కామని మొదటి స్థానంలో నిలిచింది. మాదాపూర్‌లోని బల్క్‌లైన్‌ క్యూస్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా బుధవారం ముగిసిన టోర్నీలో విద్యాపిళ్ళే, వర్ష సంజీవ్‌ రెండు, మూడు స్థానాలను సాధించారు. ఇక అరాంట్‌క్సా శాంచెజ్‌, చిత్ర, నీతా సంఘ్వి, ఇందిర గౌడ వరుసగా తరువాత స్థానాలు నెగ్గారు. కాగా 6 రెడ్‌ స్నూకర్‌ టోర్నీలోనూ కామని ముందంజ వేసింది. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో కామని 3-0తో వర్ష సంజీవ్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో చిత్ర 3-2తో విద్యా పిళ్ళేపై విజయం సాధించింది.

ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పూర్తిదాయక ప్రదర్శన చేసింది. అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని మట్టికరిపిస్తూ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఆదివారం సిడ్నీలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా చైనా క్రీడాకారుణి సున్, యును ఓడించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను రెండుసార్లు కైవసం చేసుకున్న తొలి క్రీడాకారిణి సైనానే.

ఎస్ బీ బీ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరో పురస్కారానికి ఎంపికైంది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సేవల విభాగంలో అరుంధతీ భట్టాచార్యకు ప్రత్యేక అవార్డు లభించింది. అలాగే పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన స్వాతి పిరమాల్ ఇంకా రాజశ్రీ బిర్లాకు ఈ కార్యక్రమంలో జీవితకాల సాఫల్య అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడ్నవీస్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, నీరజ్ బజాజ్ కూడా హాజరయ్యారు.

16:27 - June 18, 2016

కాలం మారింది. పూర్వపు రోజుల్లో పెళ్లి సంబంధాల కోసం పెళ్లిళ్ల పేరయ్యల మీద ఆధారపడేవారు. ఇప్పుడు వారితో పనిలేదు. అంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. మ్యాట్రిమోనియల్స్ ఆ పని చేసేస్తున్నాయి. టెక్నాలజీ పెరిగినందుకు సంతోషించాలో.. లేక బాధపడాలో అర్ధం కాని పని నెలకొంది. ఎందుకంటే ఆన్ లైన్ పెళ్లి సంబంధాలు చాలా మటుకు పెటాకులవుతున్నాయి. తప్పుడు ప్రొఫైల్స్ తో బోల్తా కొట్టించి మోసం చేసేవాళ్లు ఎక్కువైపోయారు. దీంతో మాట్రిమోనియల్ వెబ్ సైట్లను నియంత్రించే పనిలో పడింది కేంద్రప్రభుత్వం. మ్యాట్రిమోనియల్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్ల ద్వారా సంపన్నులైన మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారిని టార్గెట్‌ చేస్తున్న మోసగాళ్ల కేసులు రోజుకొకటి బయటపడుతున్నాయి. మోసగాళ్ల నకిలీ ప్రొఫైల్స్‌ పట్ల ఆకర్షితులై, వాళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను గుడ్డిగా నమ్మి, చాలా మంది యువతులు నష్టపోతున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు అనేకం నమోదవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం ప్రకటించింది. ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు సూచించింది.మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తాకొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునేవారికి త్వరలో ముకుతాడు పడనుంది. ఇప్పటివరకు కేవలం వధువు లేదా వరుడి వివరాల్లో ఫోన్ నంబర్‌ను మాత్రమే తీసుకుని యూజర్లకు మెసేజ్ ద్వారా వివరాలను పంపుతున్న వెబ్‌సైట్లు, ఇకపై ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి లేదా ఏదైనా ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ ను తప్పనిసరిగా తమ అకౌంట్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నియమ నిబంధనలు మారనున్నాయి. ఇకముందు మాట్రిమోనియల్ లో అకౌంట్‌ను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారనే ప్రశ్నకు కూడా వినియోగదారుడు సమాధానం రాయాల్సి ఉంటుందని, అప్పుడే అకౌంట్ ఓపెన్ అవుతుంది. గత కొద్దికాలంగా ఆన్ లైన్ ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుని అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఫేక్ ప్రొఫైల్స్ తో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాట్రిమోనియల్ వెబ్ సైట్లను నియంత్రించే పనిలో పడింది. మాట్రిమోనియల్ వెబ్ సైట్ ను నడిపే ప్రతి ఒక్కరూ.. వెబ్ సైట్ లో గ్రీవియన్స్ ఆఫీసర్ పేరుతో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని.. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు రాగానే స్పందించే మెకానిజాన్ని ఏర్పాటు చేయాలనే సూచనలు చేస్తోంది. 2014లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తొలిసారి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. పెళ్లి కోసం ఆన్ లైన్ లో సమాచారాన్ని ఉంచుతున్న అమ్మాయిలను తప్పుడు ప్రొఫైళ్ల ద్వారా అబ్బాయిలు మోసగిస్తున్నారనే ఫిర్యాదులు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. భారత్ మ్యాట్రిమోనీ, జీవన్ శాంతి తదితర సంస్థల సీనియర్ ప్రతినిధులను పిలిపించి, తగిన భధ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పెళ్లి పేరుతో మోసపోయే వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నట్లు ఆమె వివరించారు. తాజా నిబంధనలతో ప్రొఫైళ్లను తయారుచేసినప్పుడు ఐపీ అడ్రసును వెబ్ సైట్లు రికార్డు చేసుకోనున్నాయి. ఒక సంవత్సర కాలంలో అకౌంట్ ను ఎన్ని మార్లు ఎక్కడెక్కడి నుంచి ఉపయోగించారో కూడా ఈ రికార్డుల్లోకి రానుంది. వివాహ సంబంధాల వెబ్‌సైట్లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఆ సైట్లకు తప్పనిసరిగా పాటించాల్సిన పలు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటిదాకా ఓ ఫోన్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ ఉంటే చాలు. మ్యాట్రిమోనియల్‌ సైట్లలో ఎవరైనా సరే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. కేంద్ర ఐటీ, టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ మేరకు మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లకు సంబంధించి ఓ అడ్వైజరీని ఆమోదించారు. 

'కేసీఆర్ ఫాం హౌస్ భూమిని ఎకరం రూ.10 లక్షలకు ఇస్తారా'

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ భూమిని ఎకరా రూ.10 లక్షలకు ఇస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రాజెక్టులను తాము అడ్డుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

15:53 - June 18, 2016

ఢిల్లీ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యాదర్శి మధు డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులపై కేంద్ర కమిటీలో చర్చించనున్నారు. 

15:49 - June 18, 2016

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై నేతలు చర్చింస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు లబ్ధి జరిగింది ఏమీలేదన్నారు తెలంగాణ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడం లేదని వాపోయారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉధృతంగా ఉద్యమాలు చేయాలని, సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయనున్నట్లు తమ్మినేని తెలిపారు. 

అమరావతి ఉద్యోగులకు ప్రత్యేక రైలు..

హైదరాబాద్‌: ఈనెల 20 నుంచి సికింద్రాబాద్‌-విజయవాడల మధ్య సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడులు ఈ రైలును ప్రారంభించనున్నారు. అమరావతి వచ్చే ఉద్యోగులు, కుటుంబ అవసరాల వీలుగా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. తొలి రోజు రాత్రి 9గం.కు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఇది బయలుదేరనుంది. ఆదివారం మినహా వారంలో 6 రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నారు. ఈనెల 22 నుంచి రైలు రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌లో ఉ.

చంచల్ గూడకు బురిడీ బాబా...

హైదారబాద్ : పలువురుర ప్రముఖులకు కుచ్చుటోపీ పెట్టి కోట్ల రూపాయల్ని దోపిడీ చేసిన బురిడీ బాబా అలియాస్ శివానంద్ ను రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకి తరలించారు. ప్రముఖ సంస్థ 'లైఫ్ స్టైల్' బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డిని 1.33 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి బెంగళూరుకు పారిపోయి, ఒక్కరోజులోనే బురిడీ బాబా అలియాస్ శివానందబాబాను హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతనిని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు.

15:28 - June 18, 2016

మరో ఘనత సాధించిన 'నాసా'...

అమెరికా : అమెరికా  అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బ్యాటరీతో నడిచే విమానాన్ని రూపొందిస్తోంది. దీనికి ‘ఎక్స్‌-57’ అనే పేరుతో పాటు, ‘మ్యాక్స్‌ వెల్‌’ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. తక్కువ ఇంధనంతో, తక్కువ ధరకే లభించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దీనిని రూపొందించనున్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. తక్కువ శబ్దంతో, వేగంగా ప్రయాణించేందుకు వీలుగా, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తయారు చేయనున్నట్టు నాసా పేర్కొంది. 14 ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ తో కొత్త ప్రొపల్షన్‌ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా నాసా ఈ విమానాన్ని తయారుచేయనున్నట్టు చెబుతోంది.

ఏపీలో ఏరువాక వేడుకలు..

విజయవాడ : ఏరువాకకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఏరువాకను ఘనంగా ప్రారంభించేందుకు సంకల్పించింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో రైతులను భాగస్వాములు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంది. 

15:18 - June 18, 2016

విజయవాడ : ఏరువాకకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఏరువాకను ఘనంగా ప్రారంభించేందుకు సంకల్పించింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో రైతులను భాగస్వాములు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంది.

ఏరువాకకు ఏపీ ప్రభుత్వం సంకల్పం...
వర్షాకాలం ప్రారంభంకానుండడంతో ఏపీ ప్రభుత్వం ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నహాకాలు చేస్తోంది. వానకాలం ఆరంభమైన వెంటనే రైతులు పౌర్ణమి రోజు ఎడ్లను రంగులతో అలంకరించి, ఎడ్లకు కట్టే కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడాన్నే ఏరువాక పౌర్ణమి అంటారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలనూ వేసింది.

20న ప్రారంభంకానున్న ఏరువాక పౌర్ణమి...
ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈ నెల 20న సీఎం చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తారు. ఎన్సీఎం రైతులతో పాటు, మహిళా రైతులు, రైతుమిత్ర గ్రూపులు, ప్రగతిశీల రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనుంది. రైతులు దుక్కి దున్నే ముందు సంప్రదాయ కోలాటం, ఇతర సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను... ప్రభుత్వ పథకాలను చాటేలా ఛాయాచిత్ర ప్రదర్శనలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా రైతు శిక్షణ కేంద్రాల ద్వారా భూసార పరీక్ష కార్డులు, భూముల్లో ఉపయోగించాల్సిన ఎరువుల వివరాలను తెలియజేయనున్నారు. ఒకే వ్యవసాయ క్షేత్రంలో వీలైనన్ని ఎక్కువ పంటలు పండించే రైతులను ప్రోత్సహించనున్నారు.

ఐటీతో పొలాల ఈ-క్రాప్ బుకింగ్‌...
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పొలాల ఈ-క్రాప్ బుకింగ్ చేస్తారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకునేందుకు సెరీ కల్చర్, హార్టీ కల్చర్, ఫిషరీస్, ఏపీ సీడ్స్, ఏపీ యాగ్రోస్‌ తదితర స్టాల్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులను, ఎరువులు వినియోగించకుండా పనిచేసే రైతులను సన్మానించడం వంటివి ఏరువాక కార్యక్రమంలో చేపట్టనున్నారు.

ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు సన్మానం...
రైతులకు తక్షణం ఉపయోగపడేలా సీడ్ ట్రీట్‌మెంట్, సేద్యం చేసేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు చేపట్టడం.. భూసార పరీక్షలు నిర్వహించడం, ఎరువులు వినియోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం వంటివి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లాల వారీగా ఏరువాక కార్యక్రమ నిర్వహణకు లక్షరూపాయల వరకు నిధులను ప్రభుత్వం అందించనుంది. 

భార‌త హాకీ ప్లేయ‌ర్ల‌పై ప్రధాని ప్రశంసల జల్లు...

ఢిల్లీ : చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ టోర్న‌మెంట్లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన భార‌త ప్లేయ‌ర్ల‌పై ప్ర‌శ‌సంల వ‌ర్షం కురుస్తోంది. భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. ఆట‌గాళ్ల అద్భుతంగా ఆడారు, వాళ్ల ఆట‌తీరు ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త ప్లేయ‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న స్పూర్తిదాయ‌కంగా ఉంద‌ని మోదీ ట్వీట్ చేశారు.

మల్లన్న సాగర్ పై వివక్షలు రాద్దాతం: పోచారం

హైదరాబాద్: రాష్ట్రంలోని బీడు భూములను సాగు భూములుగా మార్చేందుకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కంకణం కట్టుకున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీళ్లందించేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేయిస్తున్నారని వివరించారు. ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రీ డిజైనింగ్ చేస్తున్నారని తెలిపారు. 

ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 12మంది అరెస్ట్...

బెల్జియం : పోలీసులు 12 మంది ఉగ్ర అనుమానితుల‌ను అరెస్టు చేశారు. బ్ర‌సెల్స్‌లో మూడు నెల‌ల క్రితం జ‌రిగిన పేలుళ్ల త‌ర్వాత స్థానిక పోలీసులు తొలిసారి భారీ స్థాయిలో ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. అరెస్టు అయిన 12 మంది దేశంలో ఉగ్ర దాడుల‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ దాడుల్లో మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. బ్ర‌సెల్స్ న‌ర‌గం చుట్టు ఉన్న 16 మున్సిపాల్టీల్లో దాడులు జ‌రిగాయి. గ‌త మార్చి 22న జ‌రిగిన దాడిలో సుమారు 32 మంది మ‌ర‌ణించారు. త‌నిఖీల స‌మ‌యంలో అనుమానితుల ద‌గ్గ‌ర ఎటువంటి పేలుడు ప‌దార్థాలు ల‌భించ‌లేదు.

'ఆకాశమే' హద్దుగా దూసుకుపోతున్న అమ్మాయిలు ....

హైదరాబాద్ : ఒకసారి యుద్ధవిమానంలోకి అడుగుపెట్టాక అమ్మాయా, అబ్బాయా అనే ప్రశ్నే రాదు. ముందున్న లక్ష్యమే కళ్లముందు కనబడుతుంది. ఈ మాటలు... ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో తొలిసారి అడుగుపెట్టిన మహిళాపైలెట్లవి. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణపూర్తిచేసుకున్న ముగ్గురు మహిళా పైలెట్లు ...తొలిసారిగా భారత వైమానిక దళంలో ప్రవేశించారు. రక్షణమంత్రి మనోహర్‌పారికర్‌ సమక్షంలో పైలెట్లుగా బాధ్యతలు స్వీకరించారు. 

14:45 - June 18, 2016

హైదరాబాద్ : నగర శివారులోని ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్‌ సంస్థ యూనిట్‌కు కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయల వ్యయంతో మూడు నెలల్లో ఏరోస్పేస్ యూనిట్ పూర్తికానుంది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్‌రి మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : కేటీఆర్
హైదారబాద్
: రక్షణరంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రమని ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆధిభట్లలోని టాటా బోయింగ్‌ అండ్‌ ఏరోస్పేస్‌ కంపెనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిఫెన్స్‌ టెక్నాలజీలో ఇప్పటికే హైద్రాబాద్‌లో ముందంజలో ఉందన్నారు. రక్షణరంగ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తమ ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా.. గతి 10నెలల్లోనే 2వేలకు పైగా కంపెనీలకు సత్వర అనుమతులు మంజూరుచేసినట్టు మంత్రి చెప్పారు. 

14:41 - June 18, 2016

విశాఖ : మరో సంస్థ బోర్డుతిప్పేసింది. 2కోట్లరూపాయలకు జనంనెత్తిన టోపిపెట్టింది. 'అక్జాల్ట్‌ ఐటీ' అనే పేరుతో ఏర్పటు చేసిన సంస్థ... 5నెలల్లోనే మూతపడింది. ఫిబ్రవరి 28న మంత్రి గంటాశ్రీనివాసరావు చేతులమీదుగా ప్రారంభించారు. 3వందల మది ఉద్యోగులను కూడా నియమించుకుందా సంస్థ. ఒక్కక్కిరి నుంచి 60వేల నుంచి లక్షన్నర వరకు డిపాజిట్లు వసూలు చేశారు. చివరికి జీతాలు కూడా ఇవ్వకుండా మోసగించారని ఉద్యోగులు పీఏపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

14:39 - June 18, 2016

హైదరాబాద్‌ : పహాడిషరీఫ్‌లోని జల్‌పల్లి వద్ద సినీ నటుడు మంచు విష్ణు భార్య కారుకు ఆక్సిడెంట్ అయింది.. ప్రమాదంలో విష్ణు భార్యకు స్వల్ప గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. హారన్ కొట్టకుండా విష్ణు భార్య వేగంగా వచ్చి తమ కారును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని మరో కారు యాజమాని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఏరోస్పేస్‌ యూనిట్‌కు మంత్రి పారికర్ శంకుస్థాపన...

హైదరాబాద్ : నగర శివారులోని ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్‌ సంస్థ యూనిట్‌కు కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయల వ్యయంతో మూడు నెలల్లో ఏరోస్పేస్ యూనిట్ పూర్తికానుంది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్‌రి మహేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ...

విశాఖ : మరో సంస్థ బోర్డుతిప్పేసింది. 2కోట్లరూపాయలకు జనంనెత్తిన టోపిపెట్టింది. 'అక్జాల్ట్‌ ఐటీ' అనే పేరుతో ఏర్పటు చేసిన సంస్థ... 5నెలల్లోనే మూతపడింది. ఫిబ్రవరి 28న మంత్రి గంటాశ్రీనివాసరావు చేతులమీదుగా ప్రారంభించారు. 3వందల మది ఉద్యోగులను కూడా నియమించుకుందా సంస్థ. ఒక్కక్కిరి నుంచి 60వేల నుంచి లక్షన్నర వరకు డిపాజిట్లు వసూలు చేశారు. చివరికి జీతాలు కూడా ఇవ్వకుండా మోసగించారని ఉద్యోగులు పీఏపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మంచు విష్ణు భార్యకారుకు ప్రమాదం....

హైదరాబాద్‌ : పహాడిషరీఫ్‌లోని జల్‌పల్లి వద్ద సినీ నటుడు మంచు విష్ణు భార్య కారుకు ఆక్సిడెంట్ అయింది.. ప్రమాదంలో విష్ణు భార్యకు స్వల్ప గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. హారన్ కొట్టకుండా విష్ణు భార్య వేగంగా వచ్చి తమ కారును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని మరో కారు యాజమాని బంధువులు ఆరోపిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో సినీనటుడు మంచు విష్ణు భార్యకు గాయాలు

రంగారెడ్డి : పహాడీషరీఫ్ జల్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సినీ నటుడు మంచు విష్ణు భార్య కారును మరో కారు ఢీకొట్టింది. విష్ణు భార్యకు గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

 

13:57 - June 18, 2016

విజయవాడ : ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులపై వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది....గత ఏడాది డిసెంబర్ 31 నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామమని చెప్పిన మంత్రి నారాయణ మాట ఇప్పటికీ  ఆచరణకు నోచుకోలేదు...అయితే ఈసారి ఈనెల 20 నుంచి ప్లాట్ల కేటాయిస్తామంటున్న అధికారుల మాటలు అమలుకు నోచుకుంటాయా లేక యధావిధిగా వాయిదాల పర్వం కొనసాగుతోందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
రాజధాని నిర్మాణానికి రైతుల భూ సేకరణ
ఏపీ రాజధాని నిర్మాణానికి రైతుల నుండి ప్రభుత్వం భూములను సేకరించింది...రైతుల భూములకు బదులుగా ఎకరానికి 1000, 100 గజాల  కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇస్తామని హమీ ఇచ్చింది...రాజధాని శంకుస్ధాపన పూరైన వెంటనే ప్లాట్ల కేటాయింపు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు...గత డిసెంబర్ 31 నుంచి ఇప్పటివరకు వాయిదాల పర్వం కొనసాగుతుంది...జనవరి 31 అని ఒకసారి, మార్చి 31 అని మరోసారి, మే 31 అని ఇంకోసారి ప్రకటనలు చేశారు...చివరిగా ఈ నెల 10 నుంచి ఒకసారి...కాదు 20 నుంచి ఇస్తామని మరోసారి ప్రకటించారు...ఎలాగైనా ఈ నెల 20 నుంచి ప్లాట్లు కేటాయింపు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు...
ప్లాట్ల కేటాయింపునకు వీలుగా మాస్టర్ డెవలపర్ ఎంపిక
ప్రధానంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామాల్లో నిర్దేశించిన రెసిడెన్షియల్ జోన్, వాణిజ్య జోన్లలో రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది...ఇందుకు గ్రామాల వారీగా ప్లాట్లు కేటాయించాలి...ప్లాట్ల కేటాయింపునకు వీలుగా మాస్టర్ డెవలపర్ ఎంపిక, భూమి చదును పనులు, భూమి అభివృద్ధి, లే అవుట్  డిజైన్ పూర్తయిన తర్వాత రైతుల పేర్లతో లాటరీ తీసి ప్లాట్లు కేటాయించాలి...లేదా రైతులు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం వారు కోరిన ప్రదేశాల్లో ప్లాట్లు ఇవ్వాలి...ఇలా చేయడానికి ముందస్తుగా చేయాల్సిన కసరత్తును ఎప్పటికీ పూర్తి చేస్తారనేది అధికారులు స్పష్టం చేయడం లేదు... భూ సమీకరణ ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి 28 న అధికారికంగా ముగిసింది...అయినా ఇంకా అనధికారికంగా కొనసాగిస్తున్నారు...
వారిని మభ్య పెట్టేందుకు చేపట్టిన భూముల అభివృద్ధి పనులు 
ఫిబ్రవరి 28న సమీకరణలో భూములివ్వని రైతులను మభ్య పెట్టేందుకు హడావిడిగా అధికారులు,మంత్రులు నేలపాడు, శాఖమూరు, ఐనవోలు తదిదర గ్రామాల్లో భూమి చదును పనులు చేపట్టారు. గ్రామానికి 100 ఎకరాల్లో చదువు చేసి మమా అనిపించారు. కానీ ఆ తరువాత మళ్లీ వీటి జోలికి పోలేదు...కేవలం భూమిని ఇవ్వని రైతుల నుంచి భూ సమీకరణ కోసం భూమ చదును పనులు చేపట్టారని.. రైతుల నుంచి భూములను సమీకరించి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. కేవలం కంప్యూటర్లో డిజైన్లు చూపుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. రైతులకు సత్వరం ప్లాట్లు కేటాయించి మిగతా భూములను ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలకు కేటాయిస్తే నిర్మాణాలు ప్రారంభమై రాజధానికి ఒక కళ వస్తుందనేది నిపుణల వాదన...మరీ ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నెల 20 నుంచి ప్లాట్ల కేటాయింపులు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే...

 

13:50 - June 18, 2016

హైదరాబాద్ : ఆషాడ మాసంలో ప్రారంభమయ్యే తెలంగాణ బోనాలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమైంది. బోనాల పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ విడుదల చేశారు. జూలై 10న గోల్కొండలో బోనాలు ప్రారంభమై 25న సికింద్రాబాద్‌లో ముగుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పండుగను ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు. 

13:48 - June 18, 2016

రంగారెడ్డి : ప్రభుత్వం వెంటనే ధరలను నియంత్రించాలని కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిన కూరగాయల ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులపై పెనుభారం పడుతోందని మండిపడ్డారు. కూరగాయల ధరలను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

13:38 - June 18, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని వెల్దుర్తిలో  ప్రైవేట్‌ స్కూల్‌బస్సులను గ్రామాస్తులు అడ్డుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమపిల్లలను  ప్రవైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేకుండా పోయారు.  గ్రామపెద్దల నిర్ణయం మేరకు.. ప్రైవేట్‌ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను దించేసి... ప్రభుత్వ పాఠశాలకు పంపారు. వేలకువేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లకంటే... ఉచితంగా చదువు చెబుతున్న ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపాలని గ్రామస్తులు నిర్ణయించారు. 

13:36 - June 18, 2016

మహబూబ్ నగర్ : నిన్న హైదరాబాద్ లో జరిగిన చిన్నారి మృతి ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. మరో చిన్నారి స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ పట్టణంలోని రైతు కాలనీలో ప్రతిరోజు లాగే విద్యార్థులను తీసుకెళ్లడానికి వచ్చిన కాకతీయ హైస్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుంది. అయితే విద్యార్థులతో పాటు తోడుగా వచ్చిన రెండేళ్ల నందిని అనే బాలిక ప్రమాద వశాత్తు బస్సు వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.

 

13:30 - June 18, 2016

విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. కొండ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. భారీ వర్షాలకు ఈదురుగాలులతో కూడిన చలిగాలులు కూడా తోడవ్వడంతో  ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. భారీ వర్షాల ధాటికి ప్రకాశం బ్యారేజిలో నీటిమట్టం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

 

13:27 - June 18, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో జరుగుతున్న పొలిటికల్ వలసలు నేతల్లో మంత్రి పదవులపై ఆశలు పెంచుతున్నాయి. కొత్త జిల్లాలు....కొత్త మంత్రులు అన్న నినాదం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన నేతల నుంచి పాత నేతల్లో కూడా మంత్రి పదవులపై ఆశలు పెరుగుతున్నాయి.
దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ... 
మంత్రివర్గ ప్రక్షాళన అంశం గులాబి నేతల్లో కొత్త  ఆందోళనలు రేపుతోంది. రెండేళ్లుగా అప్పుడు.. ఇప్పుడూ అంటూ  జరుగుతున్న ప్రచారం  దసరా నాటికి నిజం అవుతుందని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 10 జిల్లాలను ఏర్పాటు చేస్తుండడంతో.. ఆయా జిల్లాలకు చెందిన నేతలను దృష్టిలో ఉంచుకుని ప్రక్షాళన  తప్పదని పార్టీలో సీనియర్ నేతలు అంటున్నారు.
ఎంపీ గుత్తాకు మంత్రి పదవి ?
ఇటీవల కారెక్కుతున్న  కొంతమంది సీనియర్ నేతలకు సైతం మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే... మంత్రి పదవి లేదా అంతకు సమానమైన హోదా కల్పించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. దీనికితోడు నల్గొండ  పార్లమెంట్ ఉప ఎన్నికలను కూడా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు  చర్చ జరుగుతోంది.
కడియంకు మండలి ఛైర్మన్‌ పదవి ?
మాజీ ఎంపీ వివేక్ తిరిగి గులాబి గూటికి చేరుకోవడంతో మంత్రివర్గ ప్రక్షాళన సమయంలో వివేక్‌కు మంత్రి  పదవి లేదంటే.. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కడియం శ్రీహరికి మండలి చైర్మన్ పదవి కట్టెబెట్టనున్నట్లు సమాచారం.  తెలుగదేశం పార్టీ నుంచి గులాబి పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇస్తామనే హామీని ముఖ్యమంత్రి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  
మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు 
జిల్లాల విభజనను దృష్టిలో ఉంచుకుని.. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయని పార్టీ నేతలంటున్నారు. మొత్తం మీద మంత్రి వర్గ ప్రక్షాళనపై మరోసారి పార్టీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది నేతల్లో సస్పెన్ష్‌ పెంచుతోంది. 

సీఎస్, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ : ముఖ్యకార్యదర్శులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్స్ స్మార్ట్ సర్వేపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా పల్స్ స్మార్ట్ సర్వే ఉంటుందన్నారు. 

నిలకడగా ముద్రగడ ఆరోగ్యం

తూర్పుగోదావరి : కాపు నేత ముద్రగడ పద్మనాభం హెల్త్ బులిటెన్ విడుదల అయింది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ముద్రగడ వైద్యానికి సహకరిస్తున్నారని తెలిపారు. గుండెకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. 

గోదావరిఖనిలో విషాదం

కరీంనగర్ : గోదావరిఖని 8న ఇన్ క్లైన్ కాలనీలో విషాదం నెలకొంది. నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు సల్మాన్, మోహిద్ లుగా గుర్తించారు. 

 

సీపీఎం కేంద్రకమిటీ సమవేశాలు ప్రారంభం....

ఢిల్లీ : సీపీఎం కేంద్రకమిటీ సమవేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు కొనసాగున్నాయి. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్రకార్యాలయంలో సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశ ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, మోడీ పాలన వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

12:54 - June 18, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని తొర్రేడులో నారాయణ కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి, క్లీనర్ కు  గాయాలవ్వడంతో వారిని రాజమండ్రి హస్పటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు...పాఠశాల బస్సుల కండీషన్ పై నిఘా పెంచాలని చినరాజప్ప అధికారులకు సూచించారు..

12:49 - June 18, 2016

ఖమ్మం : ఓ పక్క గుక్కెడు మంచినీళ్లు దొరక్క ఆదివాసీలు అలమటిస్తుంటే.. మరోపక్క పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగేలా గోదావరి నదిలో ఇసుకను తోడేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్ లను అదివాసీ సోసైటీలకు అప్పగించామని  ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందాను కొనసాగిస్తూ.. కోట్లు దండుకుంటున్నారు. అధికార పార్టీ అండదండలతో.. వాల్టా చట్టానికి విరుద్ధంగా మన్యంలోని వాగుల్లో .. అందినకాడికి తవ్వుకుంటున్న ఇసుక తోడేళ్లపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం... 
యథేచ్ఛగా ఇసుకు అక్రమ దందా 
ఖమ్మం జిల్లా ఏజెన్సీ గోదావరి పరివాహ ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుకు అక్రమ దందా కొనసాగుతోంది. వాల్టా చట్టానికి విరుద్ధంగా మన్యంలోని వాగుల్లో ఇసుక రీచ్‌లను తవ్వేస్తున్నారు. ఈ దందాలో అధికార పార్టీ అండదండలుండటంతో ఇసుక మాఫియా ఆగడాలను అడ్డూ ఆపూ లేకుండా పోయింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లను తలదన్నేలా మన్యంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో అనధికారిక క్వారీలు కొనసాగుతున్నాయి. రేయింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తోడేస్తూ లక్షల రూపాయాలు ఆర్జిస్తున్నారు.  అక్రమాన్ని అడ్డుకొనేందుకు మండల, నియోజకవర్గస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాల్టా కమిటీలు మామాళ్లకు అలవాటు పడటంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో ఒక్క ట్రాక్టర్ ఇసుకను 2వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. 
16 ఇసుక రీచ్‌ల మంజూరు
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ఖమ్మంలో గోదావరి నదిలో 16 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలోని వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఆశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో గుర్తించిన ఇసుక రీచ్‌లలో ఏడాదిలో 31 లక్షల 46వేల 925 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వాడానికి అనుమతించింది.  నిబంధనల ప్రకారం అయితే కేవలం అదివాసీలు ప్రాతినిధ్యం వహించే సహకార సంస్థలకు మాత్రమే ఇసుక తవ్వకాల అనుమతులు ఇవ్వాల్సి ఉంది. మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు రైజింగ్ కాంట్రాక్టర్ల పేరుతో రంగ ప్రవేశం చేసి ఈ సొసైటీలను  గుప్పట్లో పెట్టుకుని డమ్మీలుగా మార్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అదివాసీ సొసైటీలతో ఒప్పందం చేసుకుని నిర్వహణ బాధ్యతను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీలో మంజూరు చేసిన మొత్తం ఇసుక విలువ రీచ్‌ల వద్ద 180 కోట్లు కాగా, దాన్ని మూడు రెట్ల ధరకు అమ్మటం ద్వారా కాంట్రాక్టర్లకు.. ఇప్పటికే దాదాపు 540 కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఆదివాసీ సొసైటీ ఛైర్మన్‌,  రైజింగ్ కాంట్రాక్టర్లు ఇసుక వ్యాపారంలో కోట్లు దండుకుంటుంటే.. అదే సొసైటీ సభ్యులు మాత్రం రోజు కూలీలుగా మారి కేవలం రెండు వందల రూపాయలకు  పనిచేయాల్సిన దీన పరిస్థితి నెలకొంది.
ప్రజాధనం లూటీ 
మరోవైపు మన్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సైతం..  రైజింగ్ కాంట్రాక్టర్లు వాగుల్లోని ఇసుకను అక్రమంగా వినియోగిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. వాజేడు మినహా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ రీచ్‌లున్నా ఎక్కడా  అభివృద్ధి పనులకు క్యూబిక్‌ మీటరు ఇసుకను కొనుగోలు చేసింది లేదని టీఎస్‌ఎండీసీ అధికారులు  చెబుతున్నారు. 
కనిపించని ప్రభుత్వ రీచ్‌లు
వాజేడు మండలంలో ప్రభుత్వ రీచ్‌లు ఒక్కటీ లేకపోవడంతో ఇసుక అక్రమాలకు హద్దులేకుండా పోయింది. అయ్యవారిపేట, వాజేడు, పూసూరు ప్రాంతాల్లో అనధికార తవ్వకాలు జరుపుతూ అభివృద్ధి పనులకు తరలిస్తున్నారు. వెంకటాపురం మండలం పాతమరికాల, వీరభద్రవరం, మొర్రవానిగూడెం, ఆలుబాక, కొండాపురం, ఎదిర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలతో వాగులను మాయం చేస్తున్నారు. చర్ల మండలంలో దందాకు కొద్ది నెలల కిందట అధికారులు కొరడా ఝుళిపించినా తర్వాత చేతులెత్తేశారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక, చిన్నగుబ్బలమంగి, దుమ్ముగూడెం నదీ పరివాహా ప్రాంతం అడ్డాగా రోజూ ఇసుక రవాణా సాగుతోంది. 
ఇసుకాసురుల ఆగడాలపై చర్యలు
వెంకటాపురంలో తారా స్థాయికి చేరిన ఇసుకాసురుల ఆగడాలపై రెవిన్యూ, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఐదు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించారు. అయితే ఇలాంటి చర్యలను అంతటా కొనసాగిస్తేనే అక్రమార్కుల భరతం పట్టే అవకాశం ఉందని, అక్రమ ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

12:41 - June 18, 2016

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఓత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా తీరానికి సమీపంలో ఆవరించి ఉందని తెలిపింది. దీంతో రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని.... ఇవాల్టి నుంచి మూడురోజుల పాటు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

చెట్టును ఢీకొట్టిన కాలేజీ బస్సు

రాజమండ్రి : తొర్రేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి, క్లీనర్ గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. 

విశాఖలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

విశాఖ :  విశాఖలో బోర్డు ఐటీ కంపెనీ తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో 300 మంచి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది. ఎక్సెల్ట్ సంస్థ ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో పీఎం పాలెం పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేపింది. 

12:01 - June 18, 2016

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల నుంచి కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ నుంచి రాష్ర్ట కార్యదర్శులు మధు, తమ్మినేని, ఇటు కేంద్ర కమిటీ సభ్యులు పాటూరి రామయ్య, ఎస్. పుణ్యవతి, మల్లు స్వరాజ్యం, ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు, ఎం.ఎ గఫూర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ రెండేళ్ల పాలన వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై సీపీఎం నాయకులు విస్తృతంగా చర్చించనున్నారు. 

 

11:42 - June 18, 2016

ఢిల్లీ : నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం సీపీఎం పోలిట్ బ్యూరో ఖరారు చేసిన ముసాయిదాపై కేంద్ర కమిటీ చర్చించనుంది..దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలపై పొలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది... ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపే విధంగా వ్యవహరించడాన్నిసీపీఎం పొలిట్ బ్యూరో తప్పుపట్టింది..

 

11:40 - June 18, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ అధ్యాపకులు, విద్యార్థుల పోరాటం ఫలించింది. హెచ్‌సీయూ అధ్యాపకులు కె.వై రత్నం, తథాగత్‌ సేన్‌ గుప్తా సస్పెన్షన్‌పై వర్సిటీ యాజమాన్యం దిగివచ్చింది. వారి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ నిరసన ఫలించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గత మార్చి 22న వర్సిటీలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ సాకుతో.. వర్సిటీ యాజమాన్యం ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్‌ చేసింది. 

 

11:28 - June 18, 2016

హైదరాబాద్ : నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సినీ నటి విజయశాంతి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎమ్మెల్యే కాలనీలోని విజయశాంతి ఇంట్లో రాత్రి దోంగలు చోరబడి డైమండ్ చెవిదుద్దులు, నగలు, నగదు ఎత్తుకెళ్లారు. వెంటనే బంజారాహిల్స్ పీఎస్ లో విజయశాంతి సోదరుడు ప్రసాదు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

మహబూబ్ నగర్ : ఫరుఖ్ నగర్ మండలం ఈద్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాకతీయ స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. 

 

సినీనటి విజయశాంతి నివాసంలో చోరీ

హైదరాబాద్ : సినీనటి విజయశాంతి ఇంట్లో భారీ చోరీ జరిగింది. డైమండ్ చెవిద్దులు అపహరించారు. విజయశాంతి సోదరుడు ప్రసాద్ బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

10:38 - June 18, 2016

హైదరాబాద్ : దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో రక్షణమంత్రి మనోహర్‌ పారికార్‌ గౌరవవందనం స్వీకరించారు. ఈసందర్భంగా కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న దళాల పాసింగ్‌ఔట్‌ పరేడ్‌ జరిగింది. మొదటిసారిగా  శిక్షణ పూర్తి చేసుకున్న ముగ్గురు మహిళా పైలెట్లను రక్షణమంత్రి అభినందించారు. దేశరక్షణలో మహిళలు ముందున్నారని ఆయన ప్రశంసించారు. 

ముగ్గురు మహిళా పైలెట్లను అభినందించిన రక్షణమంత్రి

హైదరాబాద్ : రక్షణమంత్రి మనోహర్‌ పారికార్‌ దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో గౌరవవందనం స్వీకరించారు. ఈసందర్భంగా కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న దళాల పాసింగ్‌ఔట్‌ పరేడ్‌ జరిగింది. మొదటిసారిగా శిక్షణ పూర్తి చేసుకున్న ముగ్గురు మహిళా పైలెట్లను రక్షణమంత్రి అభినందించారు. దేశరక్షణలో మహిళలు ముందున్నారని ఆయన ప్రశంసించారు. 

10:19 - June 18, 2016

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు వచ్చేసాయి. రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. ఎపిలో రుతుపవనాలు విస్తరించాయి. మరో 24 గంటల్లో తెలంగాణకు విస్తరించే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన చేసింది. 

ఎపిలో విస్తరించిన రుతుపవనాలు

హైదరాబాద్ : ఎపిలో రుతుపవనాలు విస్తరించాయి. మరో 24 గంటల్లో తెలంగాణకు విస్తరించే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్రాకు భారీ వర్ష 
సూచన చేసింది. 

నేటి నుంచి సీపీఎం కేంద్రకమిటీ సమవేశాలు...

ఢిల్లీ : నేటి నుంచి సీపీఎం కేంద్రకమిటీ సమవేశాలు జరుగనున్నాయి. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్రకార్యాలయంలో ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  నేటి నుంచి మూడు రోజులపాటు సమావేశాలు కొనసాగున్నాయి. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశ పరిస్థితులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ పాలన వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, 
ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు కేంద్రకమిటీ సభ్యులు హాజరుకానున్నారు. 

నేడు నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

నిజామాబాద్ : నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రొ.కోదండరాం హాజరుకానున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 

 

08:34 - June 18, 2016

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టీడీపీ నేత శ్రీరాములు,  బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. నష్టాలొస్తే ఆర్టీసీని మూసేయాలనడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ చాలా నష్టపోయిందన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పిస్తూ.. ఆర్టీసీని లాభాల్లోకి తచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:12 - June 18, 2016

సినీనటి ఇలియానా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వనుంది. తనకు టాలీవుడ్‌ అంటే ఇష్టమని, మళ్లీ ఇక్కడి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది ఇల్లీ బేబీ. దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా, ఆ తర్వాత మరెన్నో చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. 2012లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, అక్కడే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌ సరసన 'రుస్తుం' చిత్రంలో నటిస్తున్న ఇలియానా, తానెప్పుడూ బాలీవుడ్‌లోనే సెటిల్‌ అవుదామనుకోలేదని తెలిపింది. 'బర్ఫీ' విజయవంతం కావడంతో బాలీవుడ్‌లోనే స్థిరపడతానని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, అందుకే తనకు తెలుగునాట అవకాశాలు ఇవ్వడం మానేశారని చెప్పింది. అయితే తనకు టాలీవుడ్‌ అంటే ఇష్టమని, మళ్లీ ఇక్కడి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది. 'తెలుగులో తిరిగి నటించడాన్ని ఇష్టపడుతున్నా... టాలీవుడ్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఇక్కడ వరుస సినిమాలు చేశా. బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి అలా లేదని' ఇల్లీ చెప్పింది. 'నేను టాలీవుడ్‌కి తిరిగి రావాలనుకుంటున్నా.. ఇప్పటికీ దర్శకులు పూరీజగన్నాథ్‌, త్రివిక్రమ్‌తోపాటు రానాతో కూడా టచ్‌లో ఉన్నా. ఇక్కడి సినిమాలే కాదు.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా మిస్సవుతున్నాన'ని ఇలియానా అంటోంది. 

08:11 - June 18, 2016

ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్లుగా 'బ్రాహ్మణ' చిత్రం రానుంది. శ్రీనివాస్‌ రాజు డైరెక్షన్ లో వచ్చిన కన్నడ చిత్రం 'శివం' ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని విజరు.ఎమ్‌, గుర్రం మహేష్‌ చౌదరి సంయుక్తంగా 'బ్రాహ్మణ' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. సి.ఆర్‌.మనోహర్‌ సమర్పణలో విజి చెరిష్‌ విజన్స్, శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై సినిమా రూపొందనుంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరోలు శ్రీకాంత్‌, తరుణ్‌ సంయుక్తంగా విడుదల చేయగా, మరో ట్రైలర్‌ను ఏ.ఎం.ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత గిరీష్‌ రెడ్డి, క్రిబీ కన్‌స్ట్రక్షన్స్‌ సౌత్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సదానంద్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస రాజు మాట్లాడుతూ ''దండుపాళ్యం' నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కూడా నచ్చుతుంది. ఎవరినీ డిజాప్పాయింట్‌ చేయదు' అని చెప్పారు. హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. 'దండుపాళ్యం' చిత్రంతో శ్రీనివాస్‌ రాజు ఎంతటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. ఆ చిత్రానికి ఎంత మాత్రం తీసిపోని విధంగా 'బ్రాహ్మణ' సినిమా ఉంటుంది. నా స్నేహితులైన చిత్ర నిర్మాతలు విజరు, మహేష్‌, కేశవ్‌లకు మంచి విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఉపేంద్ర సినిమాలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమాను కన్నడలో చూశాను. తెలుగులో కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది' అని తరుణ్‌ తెలిపారు. 'సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు' అని టి.రామసత్య నారాయణ చెప్పారు. 'ఉపేంద్ర నటన, శ్రీనివాసరాజు దర్శకత్వ ప్రతిభ, మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియోను ఈ నెలలోనే రిలీజ్‌ చేసి, సినిమాను అతి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు. 

08:08 - June 18, 2016

బాలీవుడ్ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రానికి రచయిత కోనవెంకట్‌ కథ అందిస్తున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోన వెంకట్‌ మాట్లాడుతూ.. 'ఇదొక కొత్త కథ. అభిషేక్‌కి చాలా బాగా నచ్చి, ఈ చిత్రాన్ని తానే నిర్మించడం ఆనందంగా ఉంది' అని తెలిపారు. శ్రీదేవి ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న 'మామ్‌' చిత్రానికి కూడా కోనవెంకట్‌ కథ అందించారు. ఈ చిత్రాన్ని బోనీకపూర్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా ప్రస్తుతం 'అభినేత్రి' చిత్రంలో నటిస్తున్నారు. తమన్నా, సోనూసూద్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణతో కలిసి కోనవెంకట్‌ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి కూడా కోనవెంకటే కథ అందిస్తున్నారు. ప్రభుదేవా ఈ చిత్రంతోపాటు తమిళంలో 'కలవాడియా పోజుతుగల్‌' చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే అభిషేక్‌ బచ్చన్‌ తాజాగా నటించిన 'హౌస్‌ఫుల్‌ 3' ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.

 

07:58 - June 18, 2016

ఢిల్లీ : ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ కు..లక్ కుదిరింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్స్ కు తొలిసారిగా చేరుకొంది. ఫైనల్స్ చేరడం ద్వారా ఇప్పటికే రజతపతకం ఖాయం చేసుకొన్న భారత్...టైటిల్ ఫైట్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ చాంపియన్ భారత్ ను అనుకోని అదృష్టం వరించింది. రియో ఒలింపిక్స్ కు సన్నాహకంగా లండన్ లో జరుగుతున్న 36వ చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్స్ కు తొలిసారిగా చేరుకొంది. బంగారు పతకం కోసం టైటిల్ సమరంలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
పలు జట్లతో తలపడనున్న భారత్
ప్రపంచహాకీలో మొదటి ఆరు అత్యుత్తమజట్ల మధ్య జరుగుతున్న ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, ఒలింపిక్ చాంపియన్ జర్మనీ, నాలుగోర్యాంకర్ ఇంగ్లండ్, ఐదోర్యాంకర్ బెల్జియం, 9వ ర్యాంకర్ దక్షిణ కొరియాజట్లతో....భారత్ తలపడింది. ఐదు రౌండ్లలో రెండు విజయాలు, రెండు పరాజయాలు, ఓ డ్రా రికార్డుతో ఏడు పాయింట్లు సాధించి..ఆరుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది.
భారత్ కు లక్ చిక్కింది
ఫైనల్స్ చేరాలంటే.. ప్రపంచ నెంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరిరౌండ్ పోటీలో నెగ్గితీరాల్సిన భారత్..తుదివరకూ పోరాడి 2-4 గోల్స్ తేడాతో ఓడినా.. బెల్జియం- గ్రేట్ బ్రిటన్ జట్ల పోటీ 3-3 గోల్స్ తో డ్రాగా ముగియడం ద్వారా..భారత్ కు లక్ చిక్కింది. భారత్ ను 4-2 గోల్స్ తో ఓడించడం ద్వారా...ఆస్ట్రేలియా 10 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.
రెండో స్థానంలో భారత్ 
ఏడు పాయింట్లతో భారత్ రెండోస్థానంలో నిలిస్తే....ఐదు పాయింట్లతో గ్రేట్ బ్రిటన్ మూడు, నాలుగు పాయింట్లతో బెల్జియం నాలుగుస్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి రెండుస్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, భారత్ జట్లు స్వర్ణ పతకం కోసం, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గ్రేట్ బ్రిటన్ , జర్మనీ జట్లు కాంస్య పతకం కోసం పోటీపడతాయి. నెదర్లాండ్స్ వేదికగా 1982లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కాంస్య పతకం సాధించిన భారత్...మూడుదశాబ్దాల విరామం తర్వాత...చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు అర్హత సంపాదించడం విశేషం.

నేడు హుస్నాబాద్ బంద్ కు అఖిలపక్షం పిలుపు

కరీంనగర్ : నేడు హుస్నాబాద్ బంద్ కు అఖిలపక్షం పిలుపిచ్చింది. హుస్నాబాద్ ను కరీంనగర్ లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

07:44 - June 18, 2016

హైదరాబాద్ : ప్రశ్నకు ప్రశ్న.. కౌంటర్‌కు ప్రతికౌంటర్‌.. అంతేకాదు సేమ్‌ ప్లేస్‌.. సేమ్‌ సబ్జెక్ట్‌ తో కేసీఆర్‌కు చుక్కలు చూపించాలని తహతహలాడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. గులాబీ బాస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు కౌంటర్‌ ప్రజంటేషన్‌కు రెడీ అయిన హస్తం పార్టీ.. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ కుదిరితే ఈనెలాఖరులో ప్రజంటేషన్‌ ఇవ్వనుంది. 
కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైన్‌కు తెరలేపడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. అడ్డగోలు ప్రతిపాదనలతో ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టిందని కేసీఆర్‌ ఆరోపించడమే కాకుండా.. అసెంబ్లీ వేదికగా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 
ప్రాజెక్టులలో రాష్ట్రం వెనకబడిపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. దీంతో అప్పటినుండి టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పార్టీ రగిలిపోతూ అవకాశం కోసం ఎదురుచూస్తోంది. 
కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్‌ ఆరోపణలు 
కేసీఆర్‌ ప్రజంటేషన్‌ తర్వాత.. అదే నెలలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించింది. అయితే వలసలు, ఎన్నికల్లో ఓటములు.. నేతల మధ్య కుమ్ములాటలు ఇలా అన్నీ ఒకేసారి రావడంతో ప్రజంటేషన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్‌పై సెటైర్లు విసురుతోంది. వీటితో పార్టీకి నష్టమని భావించిన హస్తం పార్టీ పెద్దలు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సిద్ధమవుతున్నారు. 
జాగ్రత్తలు తీసుకుంటున్న హస్తం నేతలు
ఇక ప్రజంటేషన్‌ ఆషామాషీగా ఉండకుండా నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సాగునీటి రంగ నిపుణులు సూచనలు, సలహాలు తీసుకున్నారు. లెక్కలతో సహా ప్రజంటేషన్‌ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లెక్కలన్నీ బయటకు తీశారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్పు వల్ల.. జాతీయ హోదా ప్రాజెక్ట్‌ కోల్పోయామని కాంగ్రెస్‌ నేతలంటున్నారు ప్రాజెక్టుల రీ-డిజైన్‌తో జరిగే నష్టాన్ని ప్రజలకు సవివరంగా వివరిస్తామంటున్నారు. 
అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రజంటేషన్‌ 
ఇక కేసీఆర్‌ ఇచ్చిన చోటే తాము కూడా ప్రజంటేషన్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కలిసి కోరనున్నారు. అది సాధ్యం కాకపోతే.. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రజంటేషన్‌ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ అదికూడా వీలు కాకపోతే.. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ప్రజంటేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సీఎంతో మేధావులు, నిపుణులను ఆహ్వానించాలని నిర్ణయించింది కాంగ్రెస్‌ పార్టీ. మొత్తానికి కాస్త లేట్‌ అయినా.. లేటెస్ట్‌గా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని ఉరకలేస్తోంది హస్తం పార్టీ. మరి ఈ ప్రజంటేషన్‌తోనైనా గులాబీ బాస్‌పై కాంగ్రెస్‌ పైచేయి సాధిస్తుందో లేదో చూడాలి. 

 

07:32 - June 18, 2016

విశాఖ : పెళ్లి పనుల కోసం మూడు రోజులు సెలవు పెట్టారు...అంతలోనే బుల్లెట్‌ గాయంతో మరణం చెందారు...ఇది హత్యా..? ఆత్మహత్యా..? లేక ప్రమాదమేనా..? యువ ఐపీఎస్‌ డెత్‌ మిస్టరీగా మారింది.. విధి నిర్వహణలో దూకుడే ఆయన మరణానికి కారణమయిందా..? లేక సమస్యలు చుట్టుముట్టి ఆత్మహత్యకు ప్రేరేపించాయా..? ఎవరైనా కుట్ర చేశారా..? ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలున్న ఏఎస్పీ శశికుమార్‌ డెత్‌కు అసలు కారణాలేంటో బయటపెట్టేందుకు సీఐడీ విచారణ వేగం పెంచింది..
యువ ఐపీఎస్‌ డెత్‌ మిస్టరీ చేధించేందుకు సీఐడీ విచారణ...
విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ శశి కుమార్‌ డెత్‌ మిస్టరీగా మారింది...ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు మొదలయ్యాయి...మిస్‌ఫైర్ కావడం వల్లే బుల్లెట్‌ తలలోకి దూసుకెళ్లిందని అధికారులు చెబుతున్నా ఐపీఎస్‌ మరణంలో మాత్రం అనేక అనుమానాలకు చెలరేగుతున్నాయి... ఇప్పటికే శశి కుమార్‌ మరణంపై పూర్తిగా విచారించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది..దీనిపై సీఐడీ అధికారులు రంగంలోకి దిగి వివరాలు ఆరా తీస్తున్నారు..అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు...మిస్‌ఫైర్‌తో ప్రమాదమా..? లేక ఆత్మహత్యనా..? ఏదీ కాకుండా హత్యకు గురయ్యారాన్నది తేలాల్సి ఉంది....
విధినిర్వహణలో దూకుడే...
ఆ స్పీడే ఆఫీసర్లకు దూరం చేసిందా..?
గ్రేహౌండ్స్ నుంచి ఆళ్లగడ్డ ఏఎస్పీగా వస్తూనే ఎర్రచందనం స్మగ్లర్ల పనిపట్టారు. విశాఖ ఏజెన్సీలో అడుగుపెట్టి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. మావోయిస్టుల కదలికలపైనా దృష్టి పెట్టారు..ఈ దూకుడే ఆయనను ఉన్నతాధికారులకు దూరం చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి శశికుమార్ వేధింపులు ఎదుర్కొని ఉండవచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి...
గిరిజన యువకులను పోలీసు సెలక్షన్స్ కు...
మామూలుగా ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని గిరిజనులపై కేసులు పెట్టడం జరుగుతుంది. అయితే యువతకు కేసులు ప్రతిబంధకం కాకూడదని శశికుమార్ వారికి క్లీన్‌ చిట్ ఇస్తూ ప్రభుత్వ సొమ్ముతో దాదాపు 100 మందిని సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సెలక్షన్స్ కు పంపించారు. ఈ విషయంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఉన్నతాధికారులు మందలించారని సమాచారం... దీంతోనే మనస్థాపానికి గురై ఉండవచ్చనేది మరో కోణం...ఇక మరోవైపు ఉక్కుపాదం మోపిన శశికి గంజాయి మాఫియా నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
మావోయిస్టులు కుట్ర చేశారాని అనుమానాలు..?
ఇక ఏఎస్పీ శశి కుమార్‌ మరణం వెనక ఎన్నో అనుమానాల్లో మరో ప్రధానమైనది పాడేరు ప్రాంతంలో 70 మంది మావోయిస్టులు..మిలిషియా సభ్యులు లొంగిపోయారని తెలుస్తోంది...దీన్ని మరో రెండ్రోజుల్లో పోలీసులు అధికారికంగా ధృవీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు..ఈ నేపధ్యంలో మావోయిస్టులు పథకం ప్రకారం ఏఎస్పీని మట్టుబెట్టి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి..
స్పాట్‌లో దొరికిన సూసైడ్‌ లెటర్..?
ఇదిలా ఉంటే శశికుమార్‌ చనిపోయిన సమయంలో అధికారులకు ఓ లేఖ దొరికినట్లు తెలుస్తోంది..దీన్ని బట్టి ఏఎస్పీ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు...అయితే ఆ లేఖలో ఏముందనేది రహస్యంగానే ఉంచారు. ఈ కేసు విషయంపై సీఐడీ అధికారులు పాడేరు లోని ఎస్సీ అఫీసులో తనిఖీలు కూడా చెయ్యడం ఆరంబించారు.
ఏఎస్పీ మరణం కలకలం 
ఇదిలా ఉంటే ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు ఏఎస్పీ శశి కుమార్‌ సెలవుపెట్టారు. సెప్టెంబర్ 4న శశికుమార్ వివాహం జరగనుండడంతో దానికి సంబంధించిన పనుల కోసం సెలవులో వెళ్లేందుకు రెడీ అయిన ఏఎస్పీ మరణం కలకలం రేపింది.

 

యూరోకప్ లో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : యూరోకప్ లో భాగంగా ఇవాళా సాయంత్రం 6.30 గంటలకు బెల్జియంతో ఐర్లాండ్ తో తలపడనుంది. 
రాత్రి 9.30 గంటలకు ఐస్ లాండ్, హంగేరి ఢీకొననున్నాయి. రాత్రి 12.30 గంటలకు పోర్చుగల్ తో ఆస్ట్రియా తలపడనుంది. 

నేడు తెలంగాణ బీజేపీ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు తెలంగాణ బీజేపీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

07:13 - June 18, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జిల్లాల సమగ్ర నివేదికలను ప్రధాన భూపరిపాలన కమిషనర్‌కు ఇచ్చేందుకు కలెక్టర్లు రెడీ అయ్యారు. దీనిని సమగ్రంగా పరిశీలించి సీసీఎల్‌ఏ జాబితాను ఫైనలైజ్‌ చేయనుంది. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. 
కసరత్తు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం
కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా అధికార యంత్రాగం కసరత్తును పూర్తి చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రొఫార్మాను రెవిన్యూ అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు అందించినట్లుగా  తెలుస్తోంది. ఈ నివేదికలను సోమవారం సీసీఎల్‌ఏకు ఇచ్చేందుకు కలెక్టర్లు సిద్ధమవుతున్నారు. 
జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్న రేమండ్‌ పీటర్‌
ఇక ఈ నివేదికలు అందిన వెంటనే జిల్లాల ఏర్పాటు ప్రక్రియను సీసీఎల్‌ఏ కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ చేపట్టనున్నారు. ఈనెల 30లోపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సూచనలు, సలహాలు.. అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 5న జరిగే కలెక్టర్ల సమావేశంలో ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలపై చర్చిస్తారు. సీఎం కేసీఆర్‌ కూడా ప్రజాప్రతినిధుల సూచనలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాలు జిల్లాలవుతాయి ? జిల్లాల్లో ఎన్ని మండలాలు ఉంటాయి.. కొత్తగా ఏయే గ్రామాలను మండలాలుగా చేస్తారనే అంశాలపై క్లారిటీ వస్తుంది. దీనిపై కలెక్టర్లు, సీఎస్‌ నేతృత్వంలో రెవెన్యూ, సీసీఎల్‌ఏ అధికారులతో కూడిన కమిటీలతో విస్తృతంగా చర్చించిన అనంతరం సీఎం నిర్ణయం తీసుకుంటారు. 
అక్టోబర్‌ 11 దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు 
 ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై జులై 10 లేదా 11న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ఏవైనా అభ్యంతరాలుంటే సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ చర్చిస్తుంది.. ఆ తర్వాత మిగతా ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 4 నుంచి 10 తేదీలోపు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్‌తో కొత్త జిల్లాల స్వరూపం పూర్తిగా వస్తుంది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై గడువులోపు ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. వాటిని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి లేదా సీసీఎల్‌ఏ కమిషనర్‌కు పంపిస్తారు. వీటిని చర్చించిన అనంతరం సీసీఎల్‌ జాబితాను ఫైనల్‌ చేస్తుంది. ఇక ఈ ప్రక్రియ మొత్తాన్ని సెప్టెంబర్‌ 15 నాటికి పూర్తి చేసి.. అక్టోబర్‌ 11 దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయి. 

 

07:08 - June 18, 2016

హైదరాబాద్ : ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంస్థలోని అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు సీఎం కేసీఆర్‌... ప్రత్యామ్నాయ మార్గాల ద్వారాకూడా ఆదాయం పెంచుకునేందుకు చర్యలు  చేపట్టాలని ఆదేశించారు... ఆర్టీసీ సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు.. 
ఆదాయం పెంచే మార్గాలు అన్వేశించాలని ఆదేశం
ఆర్టీసీపై సమీక్షా సమావేశంలో కేసీఆర్‌ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీపై హైదరాబాద్‌ హోటల్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.. 95 డిపోల మేనేజర్లతో కేసీఆర్‌  మట్లాడించారు. లాభాలు, నష్టాలు చర్చించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సృజనాత్మకతతో ఆలోచించి ఆదాయం  పెంచే వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించారు..  
సమ్మెలకు దూరంగా ఉండాలని సూచన
తెలంగాణలోని 95 ఆర్టీసీ డిపోల్లో కేవలం 5 మాత్రమే లాభాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు కేసీఆర్‌. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు.. అధికారులు, కార్మికులు కష్టపడి  పనిచేయాలని కోరారు. కార్మికులు కూడా చీటికిమాటికి సమ్మె అనడం వల్ల నష్టం జరుగుతుందన్నారు.. కార్మికులు, అధికారులు కలిసి కుటుంబ సభ్యుల్లా పనిచేయాలని కోరారు..   కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. 
హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టాలను భరించనున్న జీహెచ్‌ఎంసీ 
ఆర్టీసీ సంస్థ కార్మికులదని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదేనని కేసీఆర్‌ చెప్పారు.. ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ భరిస్తుందని స్పష్టం చేశారు.. ప్రభుత్వం ఎంత చేసినా ఇంకా నష్టాలే వస్తే అసలు ఆర్టీసీ ఎందుకన్న ప్రశ్న వస్తుందన్నారు.. 
పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలని సూచన
ఆర్టీసీ నష్టాలు తగ్గించేందుకు కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.. బస్టాండ్లు, డిపోలలో సౌకర్యాలు పెంచడానికి ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.. పుణ్యక్షేత్రాలకు బస్సులు  నడపాలని చెప్పారు.. డిపోల వారీగా స్థానికంగా జరిగే పెద్ద కార్యక్రమాల జాబితా తయారు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.. ఆర్టీసీలో అవినీతిని పూర్తిగా తగ్గించాలని  ఆదేశించారు.. పలు అంశాలపై ఈ సమావేశంలో కేసీఆర్‌ చర్చించారు.. ముఖ్యమంత్రి నిర్ణయాలపై... భేటీకి హాజరైన టిఎంయూ కార్మిక సంఘం నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఈడీలు, డీఎంలు, రీజియనల్ మేనేజర్లు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

నేడు పరిశ్రమలశాఖ వార్షిక నివేదిక విడుదల

హైదరాబాద్ : నేడు పరిశ్రమలశాఖ వార్షిక నివేదిక విడుదల కానుంది. వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్నారు.  

నేడు సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

నెల్లూరు : సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు సీఎంవో ప్రకటించారు. 

హైదరాబాద్ లో నేడు రక్షణమంత్రి పారికర్ రెండో రోజు పర్యటన

హైదరాబాద్ : నగరంలో నేడు రక్షణమంత్రి మనోహర్ పారికర్ రెండో రోజు పర్యటించనున్నారు. ఆదిభట్లలో టాటా బోయింగ్ వైమానిఇక విడి భాగాల తయారీ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

00:09 - June 18, 2016

Don't Miss