Activities calendar

19 June 2016

సోమవారం ఎంసీహెచ్చార్డీ లో మంత్రి కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : సోమవారం ఎంసీఆర్ హెచ్చార్డీలో జీహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ పనుల్లో వేగం, నాణ్యత పెంపు, హరితహారం, చెత్త నిర్వాహణ, టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ట్రాఫిక్, విద్యుత్ శాఖలపై చర్చించనున్నారు.

రానున్న రోజుల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

రైతుల ప్లాట్ల కేటాయింపు వేదిక మార్పు...

గుంటూరు : రైతులకు ప్లాట్లను ఇచ్చే వేదికను అధికారులు మార్చారు. వర్షాల కారణంగా తుళ్లూరు నుండి నేలపాడుకు మార్చారు. నేలపాడుకు చెందిన 700 మంది రైతులకు దాదాపు 2వేల ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించనుంది.

సోమవారం జింబాబ్వే - భారత్ రెండో టీ - 20..

హరారే : సోమవారం జింబాబ్వే - భారత్ రెండో టీ -20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ తొలి టీ -20 మ్యాచ్ లో పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలవాలని భారత్..సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని జింబాబ్వే జట్లు యోచిస్తున్నాయి. 

మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాధన సభ పలు తీర్మానాలు...

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు సాధన సభ పలు తీర్మానాలు చేసింది. మల్లన్న సాగర్ ముంపు రైతులతో ప్రభుత్వం మాట్లాడి నష్టపరిహారం చెల్లించాలి..ముంపు వాసుల కొత్త గ్రామానికి పాత పేరు పెట్టాలని..ప్రాజెక్టు మత్స్యసంపద హక్కు ముంపు బాధితులకే కల్పించాలని..నాలుగు గ్రామాల రైతులను అడ్డుపెట్టుకుని మూడు వేల గ్రామాలను ఇబ్బంది పెట్టవద్దని..మల్లన్న సాగర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని..తీర్మానాలు చేశారు.
 

సోమవారం పశ్చిమగోదావరిలో సీఎం బాబు పర్యటన..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమగోదావరిలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు నర్సాపురం నియోజకవర్గంలో ఎల్ ఈడీ ఫ్యాన్ల పంపిణీ చేయనున్నారు. చిట్టవరంలో ఏరువాక కార్యక్రమంలో సీఎం బాబు పాల్గొనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత మూడు రోజులుగా 2200 కేసులు నమోదు చేశారు. ఆదివారం 307 కేసులు నమోదు చేసి 145 వాహనాలను సీజ్ చేశారు. 

21:34 - June 19, 2016

కర్ణాటక : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించారు. తన మంత్రివర్గం నుంచి 14 మంత్రులను తొలగించిన సిద్ధరామయ్య... కొత్తగా 13 మందిని తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ వజూభాయ్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో 9 మంది కేబినెట్ మంత్రులు, మరో నలుగురు సహాయ మంత్రులు ఉన్నారు. మరోవైపు ఉద్వాసనకు గురైన 14మంది మంత్రుల అనుచరులు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. 

21:32 - June 19, 2016

ఢిల్లీ : ఎన్ఎస్ జీ లో భారత్‌కు కచ్చితంగా సభ్యత్వం వస్తుందని ఆశిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు. రెండేళ్ల ఎన్‌డీఏ ప్రభుత్వం పాలనపై మంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎంట్రీకి చైనా వ్యతిరేకం కాదన్నారు. అలాగే పాకిస్తాన్ ఎన్ఎస్జీలోకి వచ్చేందుకు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని సుష్మా స్పష్టం చేశారు.

21:30 - June 19, 2016

హైదరాబాద్ : మొన్నటి ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగంపేటలోని ఆక్టోపస్‌ ప్రధాన కార్యాలయంలో కానిస్టేబుల్‌ శివకుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలకు చెందిన శివకుమార్‌ 13వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌. అతని గొంతులో నుంచి తలలో గుండా బుల్లెట్‌ దూసుకెళ్లింది. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి ఘటన జరిగిందా? లేక శివకుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆక్టోపస్‌ కార్యాలయంలో రక్తపు మడుగులో పడి ఉన్న శివకుమార్‌ను తోటి సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శివకుమార్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రిలో శివకుమార్‌ మృతదేహాన్ని ఆక్టోపస్‌ డీజీ గోవింద్‌సింగ్‌ పరిశీలించారు.

21:26 - June 19, 2016

అనంతపురం : మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు అన్నిచర్యలు చేపడుతున్నామని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. అనంతపురంలో పర్యటిస్తున్న రాజకుమారి సమాజంలో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న వారిలో మహిళలే అధికం ఉండడం దురదృష్టకరమన్నారు. వివాహితలు ఇచ్చిన ఫిర్యాదుల్లో భర్త కన్నా ముందు అత్త ఆడపడుచుల పేర్లు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఒకరికొకరు అండగా ఉండాలి తప్ప వేధింపులకు గురి చేసుకోవడం మహిళలు తలదించుకోవాల్సిన విషయమని ఆమె అన్నారు.

21:24 - June 19, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నయంగా ఎదిగే శక్తి బీజేపీకే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రెండు రోజుల కార్యవర్గ సమావేశాల్లో భాగంగా పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని కేంద్రమంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన రూ.700 కోట్లను ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి చెందుతుందన్నవారికి నిరాశే మిగిలిందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 

21:21 - June 19, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారుల కసరత్తు శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. రేపు అన్ని జిల్లాల కలెక్టర్లు కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఇటు స్థానిక నేతల నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే వాటిని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కొన్నిచోట్ల అందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి.

జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై కేసీఆర్ పరిశీలన..
తెలంగాణ రాష్ర్టంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ స్పీడందుకుంది. అధికారులు ఉరుకులు ప‌రుగుల మీద నివేదిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖారులో ప్రతిపాదిత జిల్లాలు, మండ‌లాలు, గ్రామాల స‌రిహ‌ద్దులపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ‌కు సిద్ధమవుతోంది. మ‌రోసారి అధికారుల‌తో సీఎం కేసిఆర్ భేటి కానున్నారు. గ‌త స‌మావేశంలో రోడ్ మ్యాప్ ప్రక‌టించిన ముఖ్యమంత్రి... జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై నేరుగా తానే ప‌రిశీల‌న చేస్తున్నారు. ఇక జిల్లాల పేర్లు, స‌రిహ‌ద్దుల ఏర్పాటు, జిల్లా కేంద్రం, కొత్త మండలాల రూప‌క‌ల్పన వంటి అంశాలపై సీఎస్ నేతృత్వంలో నియ‌మించిన క‌మిటీ సైతం ఇదే ప‌నిలో ఉంది.

జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఎ ఆదేశం..
ఇటు కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల కసరత్తు పూర్తైంది. సమగ్ర నివేదికను ప్రధాన భూపరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్‌కు అందజేసేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటును సిసిఎస్ఏ ఫైనలైజ్ చేస్తుంది. జూన్ 30లోపు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ చేయనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్నందున ప్రస్తుతం ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.. కొత్త జిల్లాల్లో ఇప్పుడున్న ఉద్యోగులు సరిపోతారా..? సరిపోకపోతే ఏ ఏ డిపార్ట్‌మెంట్‌కు ఎంత మందిని కొత్తగా తీసుకోవాలి..? అనే వివరాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ ఏ ఆదేశించింది.

జులై 10 లేదా 11వ తేదీల్లో అఖిలపక్ష సమావేశం..
సిసిఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30లోపు ప్రజా ప్రతినిధులతో అభిప్రాయ సేకరణ చేయనున్నారు. జులై 5న జిల్లాల కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులతో చర్చించిన అంశాలు, అభ్యంతరాలపై కేసీఆర్‌తో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు చర్చించనున్నారు. వీటిపై ముఖ్యమంత్రి కూడా... ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సలహాలపై అధికారులతో చర్చించనున్నారు. అటు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికార యంత్రాంగమంతా చర్చించి ఓ క్లారిటీకి వస్తారు. ఫైనల్‌గా తీసుకున్న నిర్ణయాలపై జులై 10 లేదా 11 తేదీల్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సిఎస్ నేతృత్వంలోని కమిటీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్‌లు, కొత్త మండలాలు, వాటి పరిధి వంటి అంశాలపై అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనూ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే.. అధికారులు ఫైనల్ చేసిన మండలాలు కాకుండా ఇంకా ఏమైనా సలహాలు ఇచ్చినా.. వాటిపైన సిఎస్ నేతృత్వంలోని కమిటీ అఖిలపక్ష నేతలతో చర్చిస్తుంది. లేదంటే సిఎం దృష్టికి తీసుకెళ్తుంది.

దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు..
ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్‌తో మొత్తం కొత్త జిల్లాల స్వరూపం వచ్చినట్లే. ప్రభుత్వం ఇచ్చిన డ్రాఫ్టు నోటిఫికేషన్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే...ప్రకటన జారీ అయినా నియమిత గడువులోపు చెప్పవచ్చు. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన సంపూర్ణ పక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తి అవుతుంది. అక్టోబర్ 11న దసరా పండుగ రోజున కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జిల్లాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. 

21:18 - June 19, 2016

గుంటూరు : వైసీపీ నేతల బృందం అమరావతి పర్యటన ఉద్రిక్తంగా మారింది. సదావర్తి సత్రం భూములపై ఏర్పాటైన పార్టీ నిజనిర్ధారణ కమిటీని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. అమరావతి వేలుపు అమర రామలింగేశ్వరుడి ఆస్తుల విక్రయంలో కుంబకోణం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. చెన్నైలోని సదావర్తి సత్రం భూముల వేలంలో భారీగా అవకతవకలు జరిగాయన్నది ఆ పార్టీ వాదన. ఈ నేపథ్యంలో.. నిజనిర్ధారణ కోసం.. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివారం.. అమరావతిలో అమర రామలింగేశుని ఆస్తుల పరిశీలనకు ధర్మాన బృందం వచ్చింది. వీరిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ధర్మానను అడ్డుకున్న టిడిపి శ్రేణులు..
అమరావతిలోని సదావర్తి సత్రాన్ని సందర్శించి స్ధానికులతో మాట్లాడేందుకు ధర్మాన కమిటీ గ్రామంలోకి వెళుతుండగా టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి వైసీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. ధర్మాన కాన్వాయ్‌కి అడ్డంగా కూర్చుని.. గోబ్యాక్‌ అంటూ నినదించారు. ఓదశలో వైసీపీ నేతల వాహన శ్రేణిపై దాడికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం స్థానిక వైసిపి కార్యకర్తలు అక్కడికి చేరుకుని ధర్మాన బృందాన్ని తీసుకు వెళ్లారు. ఉద్రిక్తతల నడుమే.. సదావర్తి సత్రాన్ని చేరుకున్న ధర్మాన బృందం.. స్ధానికులతో మాట్లాడింది. సత్రానికి సంబంధించిన కార్యకలాపాలు, ఆస్తుల వివరాలను సేకరించింది. కుంభకోణానికి సంబంధించిన భూములు చెన్నైలో ఉండటంతో ఈనెల 26 వ తేదీన అక్కడికి వెళ్లాలని వైసిపి నేతలు నిర్ణయానికి వచ్చారు. అయితే వాస్తవాలను పరిశీలించేందుకు వచ్చిన తమను టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కుంబకోణాన్ని మరుగున పరిచేందుకే టీడీపీ యత్నిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. మరోవైపు టీడీపీ మిత్రపక్షం బిజెపి కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉందనే వార్తలు వస్తున్నాయి. బిజెపికి చెందిన ఎమ్మెల్యే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ గుట్టుచప్పుడుకాకుండా వేలం నిర్వహించటంపై మంత్రి మాణిక్యాలరావు రగిలిపోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. 

20:56 - June 19, 2016

నేరాలు చేసిన వాళ్లు ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఘోరాలకు కారకులైన వారు గుట్టుచప్పుడు కాకుండా బతికేస్తున్నారు. చట్టానికి చిక్కనంత వరకు అందరూ దొరలే. భోగభోగ్యాలను హాయిగా అనుభవిస్తుంటారు. సుశీల అనే వృద్ధురాలు హత్యకు గురైంది. తన తల్లి ఉంటున్న ఇంటికి ఓ ఆగంతకురాలు వచ్చిందని అమెరికాలో ఉంటున్న సుశీల కొడుకు పేర్కొన్నాడు. సుశీల హత్యకు కారకులైన వారికోసం క్రైం డిటెక్టివ్ బృందం గాలిస్తోంది. ఈ తరుణంలో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. సుశీల చనిపోయిన తీరు..వృద్ధురాలు చనిపోయిన తీరు ఒకేలా ఉంది. ఆమెకున్న బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఓ మహిళ ఈ హత్య చేసిందని స్థానికులు పేర్కొన్నారు. చేతికానితనం వారిని హత్య చేస్తున్న వారు ఎవరు ? ఇంకా ఎంత మందిని చంపబోతోంది ? ఈ హత్యలకు అడ్డుకట్ట వేశారా ? క్రైం డిటెక్టివ్ హంతకురాలిని పట్టుకుందా ? అనేది తెలియాలంటే వీడియోలో చూడండి. 

విశాఖలో టిడిపి నేతపై బాంబు దాడి..

విశాఖపట్టణం : బుచ్చయ్యపేట మండలం గుంటికొర్లాం వద్ద టిడిపి నేత సత్యనారయణపై బాంబులతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

20:20 - June 19, 2016

బాహుబలి..ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపెట్టింది. రాజమౌళి నిర్మించిన ఈ బాహుబలి అన్ని బాషల్లో రిలీజై రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి -2 షూటింగ్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రక్తపు మరకలు ఉన్న తన చేయిని ఎవరో ఎత్తి, ఆపన్న హస్తం అందిస్తున్నట్టు చూపించారు. ఈ చేయి ప్రభాస్ దా ? లేక మరెవరిది ? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉదయిస్తున్నాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చిత్ర విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. 

20:07 - June 19, 2016

కొత్త సినిమా పాటలు వచ్చాయంటే కనీసం ఇద్దరు ముగ్గురు గాయకులు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. అంతగా పరిశ్రమలో కొత్త గాయకుల రక్తం ప్రవహిస్తోంది. ఇంతటి పోటీలోనూ కొందరు గాయనీమణులు తమదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు. అందులో రమ్య బెహరా ఒకరు. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎం. ఎం. కీరవాణి రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు. లచ్చిందేవికి ఓ లెక్కుంది, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, బాహుబలి :ద బిగినింగ్, టెంపర్ తదితర చిత్రాల్లో పాటలు పాడింది. ఇటీవలే విడుదలైన 'అ..ఆ' సినిమాలో కూడా పాడారు. ఈ సందర్భంగా రమ్య బెహరాతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను తెలియచేసింది. అంతేగాకుండా పలు చిత్రాల్లోని పాటలు కూడా పాడింది. ఆమె ఎలాంటి విశేషాలు తెలియచేశారో..పాటలు వినాలంటే వీడియో క్లిక్ చేయండి..

అన్ని వసతులు కల్పిస్తాం - ప్రత్తిపాటి..

హైదరాబాద్ : రాజధానికి తరలివస్తున్న ఉద్యోగులందరికీ అన్ని వసతులు..సదుపాయాలు కల్పిస్తుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు 600 మంది మహిళా ఉద్యోగుల కోసం రెసిడెన్సీ కాంప్లెక్సును అందుబాటులోకి తేనున్నామన్నారు. 

19:46 - June 19, 2016

'వేణువై వచ్చాను భువనానికి' అనే ఈ పాట 1993 లో వచ్చిన 'మాతృదేవోభవ' అనే చిత్రంలోనిది. వేదాంత ధోరణిలో సాగే ఈ పాటని వేటూరి సుందరరామ్మూర్తి గారు అత్యద్భుతంగా రచించారు. ఈ పాటను చిత్ర పాడారు. చిత్ర అంటే తనకెంతో ఇష్టమని టెన్ టివితో రమ్య బెహరా పేర్కొన్నారు. చిత్రతో షో చేయడానికి కువైట్ వెళ్లడం జరిగిందని, ఆమెను సమీపం నుండి చూడడం జరిగిందన్నారు. ఆమె పాడిన వేణువై వచ్చిన భువనానికి పాట అంటే ఇష్టమని రమ్య బెహరా పేర్కొన్నారు. ఈ పాట ఎలా పాడారో వీడియో క్లిక్ చేయండి..

19:35 - June 19, 2016

పోలీస్ స్టేషన్..ఏకంగా ఓ ఎస్ఐ ఓ మహిళతో మసాజ్ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోయ్ పీఎస్ లో చోటు చేసుకుంది. ఇక్కడ సబ్ ఇన్స్ పెక్టర్ గా సంజయ్ యాదవ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం చేసి చేసి అలసిపోయానని భావించాడో ఏమో కాని మసాజ్ చేయించుకోవాలని అనుకున్నాడో ఏమో గాని ఓ మహిళను పీఎస్ కు పిలిపించుకున్నాడు. బట్టలు తీసేశాడు..కొంద కూర్చొన్నాడు..సదరు మహిళ సంజయ్ కు మసాజ్ చేసింది. ఆయనకు ఎదురుగా మరో మనిషి కూర్చొన్నాడు. ఇదంతా చూసిన ఎవరో ఒకరు వీడియో తీసేశాడు. సోషల్ నెట్ వర్కింగ్ లో పెట్టేశాడు. ఇంకేముంది వైరల్ లా చుట్టేసింది. అలా..ఇలా..డీజీ గారికి తెలిసింది. ఊరుకుంటారా ? విచారణను జరిపించి సస్పెండ్ చేశారంట. 

రేపల్లెలో కూలిన బీసీ బాలికల హాస్టల్ పిట్టగోడ..

గుంటూరు : రేపల్లెలో బీసీ బాలికల హాస్టల్ పిట్టగోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థినిలకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య...

హైదరాబాద్ : బేగంపేట ఆక్టోపస్ కార్యాలయంలో గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను ఆదిలాబాద్ కు చెందిన వాడు. 

భీమిలి వద్ద తప్పిన బోటు ప్రమాదం..

విశాఖపట్టణం : భీమిలి సముద్ర తీరం వద్ద బోటు ప్రమాదం తప్పింది. అడుగుభాగ ఊడిపోవడంతో బోటులోకి నీరు చేరింది. వెంటనే మత్స్యకారులు అప్రమత్తమైన బోటును తీరానికి చేర్చారు. బోటులో ఎనిమిది మంది ప్రయాణీకులున్నారు. 

19:12 - June 19, 2016

రమ్య బెహరా..అతి తక్కువ కాలంలో మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. తన పాటతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి రమ్య బెహరాతో ముచ్చటించింది. తనకు డాడి సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని పేర్కొన్నారు. డాడీ అన్నింటికంటే ఎక్కువ అని, మాటల్లో చెప్పలేనన్నారు. తాను ఇంట్లో విశ్వరూపం చూపిస్తానని, అన్నీ నాన్న భరిస్తారన్నారు. అమ్మ..డాడీ తనకు ఇద్దరూ క్లోజ్ అని,
ఏ సమస్య వచ్చినా తాను డాడీతో చర్చించడం జరిగిందన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో వీడియోలో చూడండి. 

19:08 - June 19, 2016

తెలుగు సినీ హాస్య రచయితల్లో ఆయనొక మహోత్తుంగ తరంగం..హాస్య చిత్రాల దర్శకత్వంలో ఆయనొక మేరువు..తెలుగు సినీవినీలాకాశంలో ఆయనొక ధ్రువతార. ఆరోగ్యకరమైన హాస్యంతో ఎన్నో దశాబ్దాల కాలంపాటు తెలుగు ప్రేక్షకుల పొట్టల్ని చెక్కలు చేసిన నవ్వుల యోగి ఆయన. వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అన్న తన వంటి పేరుతో ఎవరికీ తెలికయకపోయినా జంధ్యాల అనే తన ఇంటి పేరుతో లక్షలాదిమంది తెలుగు వాళ్లకి ప్రియమైన వ్యక్తిగా మారిన జంధ్యాలని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రాల విశిష్టత పై ప్రత్యేక కథనం..

నవరసాలు అలవోకగా పలికించే వారు..
హాస్యం అనే పదానికున్న అర్ధాలు వెతకడానికి తెలుగు నిఘంటువు తిరగేస్తే అందులో ఓ మూడక్షరాలు కనిపించకపోవచ్చు. కానీ తెలుగు సినిమాకి ఓ నిఘంటువు తయారు చేస్తే అందులో హాస్యం అనే పదానికి ఎదురుగా తప్పకుండా ఉండే మూడక్షరాలు జంధ్యాల. అటు పెన్నుతోనూ, ఇటు మెగా ఫోన్ తోనూ నవరసాలనూ అలవోకగా పలికించిన జంధ్యాలకి వ్యక్తిగతంగా ఇష్టమైనది హాస్యరసం. బహుశా అందుకేనేమో, హాస్యం ద్వారానే అధికశాతం ప్రేక్షకులకి దగ్గరయ్యారాయన. అందుకే మెజారిటీ ప్రేక్షకులకి జంధ్యాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది కేవలం హాస్యమే. ఎంత చేదు వాస్తవానికైనా హాస్యం అనే పంచదార పూత పూసి ప్రేక్షకులచేత అవుననిపించడంలో నిష్ణాతుడు జంధ్యాల. రచయిత,దర్శకుడు అన్నవి జంధ్యాలలో రెండు ముఖ్య పార్శ్వాలు. నాటక రచన నుంచి సినిమా రచనకి వచ్చి, సినిమాలకి రాస్తూనే దర్శకుడిగా మారి, సినిమాలు తీస్తూనే రాయడం కొనసాగించి, రెండు పడవల ప్రయాణాన్ని కడవరకూ విజయవంతంగా కొనసాగించడం అంత సులువైన పనేమీ కాదు. కానీ దాన్ని అలవోకగా, అలవాటు గా మార్చకున్నారు జంధ్యాల.

అరుదైన ఆణిముత్యం..
విశ్వనాథ్ లాంటి కళాత్మక దర్శకుడికి దొరికిన అరుదైన ఆణిముత్యం జంధ్యాల. విశ్వనాథ్ ఆలోచనల్ని అచ్చుగుద్దినట్టుగా అందిపుచ్చుకొని కలంతో చెలరేగడం జంధ్యాలకు మాత్రమే సాధ్యమైంది. అందుకే విశ్వనాథుని చిత్రాల్లో సంభాషణలు మన మనసుల్ని చాలా బలంగా తాకుతాయి. కళకీ కళాకారుడికీ మధ్య ఉండే సంబంధాన్ని 'సిరిసిరిమువ్వ'ల సవ్వడుల నేపధ్యంలో ప్రేక్షకులకి చెప్పాలన్నా, ఓ శాస్త్రీయ సంగీత విద్వాంసుడికీ ఓ వేశ్యకీ మధ్య ఏర్పడ్డ మానసిక అనుబంధానికి శంకరాభరణం రూపంలో దృశ్య రూపం ఇవ్వాలన్నా, ఓ జంటకి కులాంతర వివాహం చేసి వాళ్ళచేత సప్తపది తొక్కించాలన్నా, సరిగమలతో చదరంగమాడే అనంతరామ శర్మ అహంభావానికి మసకబారిన స్వాతికిరణం కథని చెప్పాలన్నా, తను ఆరాధించే ఓ మహోన్నత వ్యక్తి కూతురికి కష్టమొస్తే ఆపద్భాంధవుడై అన్నీ తానై ముందుకు నడిపిన ఒక మంచి మనషి కథ చెప్పాలన్నా, కళాతపస్వికి వెన్నుదన్నుగా నిలిచిన కలం జంధ్యాలదే. జంధ్యాల చిత్రాల్లో పాత్రలన్నీ మన పక్కింట్లోనో, మన వెనక వీధిలోనో, లేక మనకు బాగా తెలిసిన వాళ్ళలోనో బాగా తెలిసిన ముఖాలుగా ఉండడం గొప్ప విశేషం. అందుకే ఆ పాత్రల్లో నటన ఉండదు, కేవలం ప్రవర్తించడమే ఉంటుంది.

నవ్వుల్లో ముంచేశారు..
దర్శకుడు సమర్దుడైతే సినిమాలో ఎన్ని లోపాలనైనా కప్పేయగలడు అనడానికి కూడా ఉదాహరణ జంధ్యాలే. పడమటి సంధ్యారాగం సినిమాలో సహాయ పాత్రలని పోషించిన వాళ్ళందరూ విదేశంలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు. నటన వాళ్ళ వృత్తి కాదు. అందుకే పట్టి చూస్తే వాళ్ళ నటనలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కానీ తనదైన మార్కు డైలాగు విరుపులతోనూ, చమక్కులతోనూ ప్రేక్షకులని అటువైపుగా చూడనివ్వలేదు జంధ్యాల. తన సినిమాల్లో హాస్య పాత్రలన్నీ మన మధ్య నుంచి వచ్చినవే. అధికశాతం పాత్రలు మధ్య తరగతి మందహాసాలే. సినిమా కథలు వర్ణించి చెప్పేవాళ్ళు, మనిషి కనబడితే చాలు సొంత డబ్బా మొదలెట్టేసే వాళ్ళు, కవితలతో చావగొట్టే నవకవులు, మితిమీరిన భాషాభిమానం ఉన్నవాళ్ళు.. ఇలా అందరూ మనకి సమూహంలో కనిపించే వాళ్ళు. కాకపొతే వాళ్ళలో అతిగా అనిపించే లక్షణాన్ని కొంచం పెద్దది చేసి చూపించడం ద్వారా మనల్ని నవ్వుల్లో ముంచేశారు జంధ్యాల.

కంటతడి పెట్టించడం..
హాస్యంతో నవ్వించడంమే కాదు సెంటిమెంట్ తో కంటతడి పెట్టించడం కూడా జంధ్యాలకు బాగా తెలుసు. కాకపోతే ఆ విద్యను అప్పుడప్పుడూ ప్రదర్శించేవారు ఆయన. సినిమాలో పూర్తి ట్రాజెడీ ఉన్నా సరే, జనాన్ని రిలాక్స్ చేయడానికి మళ్లీ కామెడీ మంత్రం ప్రయోగించేవారు జంధ్యాల. హాస్య చిత్రాలు తీస్తూ హాస్య బ్రహ్మ గా వెలిగిపోతున్న సమయంలో కూడా సెంటిమెంట్ తో తనకున్న సెంటిమెంట్ ని వదులుకోలేక పోయారు జంధ్యాల. బెజవాడ బాబాయ్ హోటల్ లో తను ఇష్టంగా తిన్న ఇడ్లీలు, పెసరట్లతో పాటు వాటిని ఆప్యాయంగా వండి వడ్డించిన బాబాయ్ ప్రేమ ఆయన చేత బాబాయ్ హోటల్ సినిమా తీయించింది. గురజాడ అప్పారావు కరుణరసాత్మక గేయం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ థీమ్ ఆయన చేత పుత్తడొబొమ్మ సినిమా చేయించింది. అక్కినేనితో మొదటిసారిగా అమరజీవి అనే సినిమా చేయించిందీ ఆ సెంటిమెంటే. హిందూ ముస్లీమ్ భాయ్ భాయ్ అనే నినాదాన్ని నెలవంక రూపంలో సెల్యులాయిడ్ కెక్కించిందీ అందుకే . ఈ సినిమాలన్నీ జంధ్యాలకు కమర్షియల్ విజయాలు అందించలేకపోయినా ఆయనకు సెంటిమెంట్ కలిగిన సినిమాల మీద ఎంత మక్కువుందో తెలియచెప్పాయి.

చిత్రాలు వేటికవే ప్రత్యేకం..
జంధ్యాల మాటలు రాసిన, దర్శకత్వం వహించిన చిత్రాలు వేటికవే ప్రత్యేకం. వీటిలోని హాస్యం కాని, వీటి లోని సంభాషణలు కానీ వేటికీ ఒకదానితో ఒకటి పోలికలే ఉండవు. అంతేకాదు ఏ హాస్య సన్నివేశాన్ని కానీ మరో చిత్రంలో ఎప్పుడూ ఉపయోగించలేదు.శాస్త్రీయ సంగీతంతో కూడిన శంకరాభరణం, పూర్తి మాస్ మసాలా చిత్రం వేటగాడు, అడవిరాముడు, కుటుంబ బంధాలతో కూడిన 'విజేత,' స్వీయ దర్శకత్వంలో తీసిన హాస్య భరిత చిత్రం 'చంటబ్బాయి, ఊహల్లో తిప్పి తీసుకొచ్చే జగదేక వీరుడు-అతిలోక సుందరి, విశ్వనాధ్ 'ఆపద్భాందవుడు, వీటిలో ఏ రెంటిని పోల్చగలం? ఆమాటకొస్తే జంధ్యాల తీసిన పూర్తి స్థాయి హాస్యరస చిత్రాలన్నీ కూడా వేటికవే ప్రత్యేకం. నరేష్, రాజేంద్రప్రసాద్ లాంటి కథానాయకులతో పాటు 'సుత్తి ద్వయం, ' శ్రీలక్ష్మి లాంటి ఆయనకీ ఇష్టమైన కొందరు నటులు అన్ని సినిమాలలోనూ కనిపించడం మినహాయిస్తే ఇతరత్రా పోలికలు వెతకడం కష్టమైన పనే. ఇక జంధ్యాల దర్శకుడిగా మారింది ముద్దమందారంతోనే అయినా, ముందుగా తల్చుకోవాల్సింది జాతీయ అవార్డు పొందిన ఆనంద భైరవి' గురించి. ఈ రెండూ డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన పూర్తి విభిన్న చిత్రాలు.

టైటిల్స్ గమ్మత్తు..
జంధ్యాల సినిమాలకు పెట్టే టైటిల్సే గమ్మత్తుగా ఉండడమే కాదు, కామెడీ గానూ, క్రేజీగానూ అనిపించడం విశేషం. ముఖ్యంగా ఆయనకు పాత సినిమాలంటే ఇష్టం ఉండడం వల్ల అందులోని మాటల్ని, పాటల పల్లవుల్ని ఆయన సినిమాలకు టైటిల్స్ గా మారడం ఇంకా విడ్డూరం. పాత సినిమాలన్నా, ముఖ్యంగా వాటిలో పాటలన్నా జంధ్యాలకి ఎంత ఇష్టమో తెలుసుకోడానికి ఆయన తీసిన సినిమాల పేర్లు చాలు. ఒక్క మాయాబజార్ పాటల పల్లవులనుంచే అహనా పెళ్ళంట, ఒహోనా పెళ్ళంట 'చూపులు కలిసిన శుభవేళ, వివాహభోజనంబు, బావా బావా పన్నీరు' హై హై నాయకా లాంటివి తన సినిమాలకి పేర్లుగా పెట్టేశారు. ఇంకా జయమ్ము నిశ్చయమ్మురా, ప్రేమ ఎంత మధురం, నీకూ నాకూ పెళ్లంట లాంటి పాటల పల్లవుల్ని తన సినిమాల టైటిల్స్ గా వాడుకున్నారు. సంగీతానికీ తన సినిమాల్లో పెద్ద పీట వేసేవారు జంధ్యాల. ఆయన తీసినవి ఎక్కువగా హాస్య చిత్రాలే అయినా అందులో పాటలు మాత్రం అద్భుతమైన మెలోడితో నిండి ఉండడం ఆయన అభిరుచికి నిదర్శనం అని చెప్పాలి. ముద్దమందారంలోని అలివేణీ ఆణిముత్యమా..నాలుగు స్థంభాలాటలోని చినుకులా రాలి, ఆనంద భైరవిలోని చైత్రము కుసుమాంజలి, పిలిచిన మురళికి, చంటబ్బాయి లో నేను నీకై పుట్టినానని, రెండు రెళ్ళు ఆరులో కాస్తందుకో దరఖాస్తందుకో, శ్రీవారికి ప్రేమలేఖలో సరిగమ పదని స్వరధార, బాబాయ్ అబ్బాయ్ లో తెలుసా నీకు తెలుసా, హైహై నాయకాలో ముద్దొచ్చే పాపా, బావా బావా పన్నీరు లో ముద్దబంది రావే, సీతారామ కళ్యాణంలో రాళ్ళల్లో ఇసకల్లో రాసాను ఇద్దరి పేర్లూ, వివాహభోజనంబు లో జుంతనననన తకజం లాంటి ఎన్నోపాటలు అద్భుతమైన మెలోడి గీతాలుగా నిలిచిపోయాయి.
రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు జంధ్యాల సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల… మచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో ఎన్నో జీవిత సత్యాలు మనకు కనిపిస్తాయి. నిజంగా జంధ్యాల వెళ్లిపోయిన తరువాత తెలుగు తెర నుంచి ఆరోగ్యకరమైన హాస్యమూ వెళ్లిపోయింది. జంధ్యాలకు ఘననివాళులర్పిస్తోంది 10 టివి.  

బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యం - దత్తాత్రేయ..

హైదరాబాద్ : బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన రూ.700 కోట్లను ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 

ఔరంగాబాద్ లో పేలిన మందుపాతర..

ఔరంగాబాద్ : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతి చెందగా మరో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. 

18:37 - June 19, 2016

విజయవాడ : సీపీఎఫ్ విధానాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం యూటీఎఫ్‌ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఉపాధ్యాయ లోకానికి న్యాయం జరిగే విధంగా పీడీఎఫ్ ఫోరం కృషి చేస్తుందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బొడ్డునాగేశ్వరరావు తెలిపారు. కొత్త పద్ధతి అమలు చేయడం వలన లక్షా 64 వేలమంది ఉపాధ్యాయులు అన్ని విధాల నష్టపోవాల్సి వస్తుందని, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన పింఛన్ ఇచ్చే దిశగా సహకరించాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. 

18:34 - June 19, 2016

విజయవాడ : కాపు కార్పొరేషన్‌ నుంచి బీసీ కాపులకు కూడా ప్రాధాన్యత కల్పిస్తామని కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ హామీనిచ్చారు. బీసీ కాపులు తమకు బంధువులేనని వారి అభ్యున్నతి కోసం సీఎంతో మాట్లాడతానని రామానుజయ తెలిపారు. బీసీ కాపుల కోసం ప్రత్యేక జీవో సైతం తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆర్థికంగా ఎవరు వెనుకబడి ఉన్నారో వారి గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని, వీరి బాధలు ఎక్కువగా ఉన్నాయని ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసకెళుతామన్నారు. ఇంకా రామానుజయ ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

18:31 - June 19, 2016

హైదరాబాద్ : అమరేశ్వరుడి భూముల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం కుంభకోణంలో పెదబాబు..చినబాబుకు సమాచారం ఉందని తెలిపారు. నిజాలు తెలుసుకునేందుకు తమ పార్టీ నేతలు వెళితే.. టీడీపీ నేతలు అడ్డుకోవడం దురదృష్టకరమని అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఈ భూములపై న్యాయపోరాటం చేస్తామని అంబటి ప్రకటించారు. దేవుడు భూములు, ప్రభుత్వ భూములు ఎమ్మెల్యేల ద్వారా లాక్కోవడం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. 

18:28 - June 19, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా ? ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా చిత్తడి..చిత్తడి వాతావరణం కనిపిస్తోంది. జూన్ 27వ తేదీలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఏ మేరకు అమలువతాయనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల పై వర్షాలు అధికంగా ప్రభావం చూపుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్ల నిర్మాణంతో పాటు భవనాల వెలుపల జరుగుతున్న పనులు మొత్తం నిలిచిపోయాయి. మరోవైపు సచివాలయం లోపల జరుగుతున్న మౌలిక వసతుల పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అమరావతి వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

రాజ్ పథ్ వద్ద బాబా రాందేవ్ యోగా..

ఢిల్లీ : రాజ్ పథ్ లో బాబా రాందేవ్ నిర్వహిస్తున్న యోగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. సుమారు 35వేల మంది వస్తారని అంచనా. 

పుల్వామాలో కాల్పుల కలకలం..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, భారత బలగాలు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఉత్తరాఖండ్ లో బస్సు ప్రమాదం..

ఉత్తరాఖండ్ : ముల్యా గ్రామంలో ఓ బస్సు బోల్తా ఘటనలో 7 గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 26 మంది ఉన్నట్లు సమాచారం. 

కేజ్రీవాల్ ఇంటి ఎదుట ధర్నా..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

1 నుండి రంజాన్ తోఫా - మంత్రి సునీత..

గుంటూరు : జులై 1 నుంచి 'చంద్రన్న రంజాన్ తోఫా' పథకాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గుంటూరులోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగులను ఆమె పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మందికి 'రంజాన్ తోఫా' సరుకులు పంపిణీ చేస్తామన్నారు. 

17:44 - June 19, 2016

ఆదిలాబాద్ : చేసింది పదిశాతం... మెక్కేసింది వందశాతం.. మిషన్‌ కాకతీయలో జరుగుతున్న అక్రమాల లెక్కలివి... ఏదో ఓ పథకం ఉంది... అందులోని డబ్బులు ఎలా నొక్కేద్దామా అని చూస్తున్న కాంట్రాక్టర్లు ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము దర్జాగా భోంచేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ చెరువు పనులే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మిషన్‌ కాకతీయలో ఎలాంటి అక్రమాలకు తావులేదని ప్రభుత్వం ప్రకటించింది. తప్పులు చేసే వారి తాట తీస్తామనీ హెచ్చరించింది. కాంట్రాక్టర్లు, అధికారులు ఏమాత్రం చేతివాటం చూపినా కఠిన చర్యలు తప్పవని సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఇక మంత్రులైతే చెరువును చూడగానే అక్రమాలను సహించబోమంటూ హెచ్చరికలు జారీ చేయడం రివాజు. కానీ క్షేత్ర స్థాయిలో.. ఇవన్నీ తాటాకు చప్పుళ్లే అని తేటతెల్లమవుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో మిషన్‌ కాకతీయ కింద పనులు జరుగుతున్నాయి. పని జరిగింది కేవలం పదిశాతం కాంట్రాక్టర్లు మాత్రం పనంతా పూర్తయిందంటూ బిల్లులు పెట్టేశారు. మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులు... పూర్తి బిల్లులు మంజూరుచేసేశారు. పోనీ చేసిన ఆ కాస్త పనులైనా సరిగా ఉన్నాయా అంటే అదీ లేదు. పనులను నాసిరకంగా చేసేసి.. సర్కారు సొమ్మును కాంట్రాక్టర్లు దిగమింగేస్తున్నారు.

స్పందించిన ఎంపీపీలు...
ఖానాపూర్‌ మండలంలోని కప్పలకుంట పంచాయతీలోని బొడ్డోనిచెరువు, మస్కాపూర్‌ గ్రామ పంచాయితీల్లోని ఆరె చెరువు, ఇక్బాల్‌పూర్‌ చెరువు, సూర్జాపూర్‌ గ్రామంలోని రెంకొని చెరువు... ఇలా ఒకటేమిటి ఎన్నో చెరువులు. దాదాపుగా అన్నింటా అక్రమాలే. దాదాపు ప్రతి చెరువు వద్ద పనుల్లో... కాంట్రాక్టర్ల రాజ్యమే నడుస్తోంది.. చెరువుల్లో పనుల తీరు చూసి ప్రజా ప్రతినిధులు అవాక్కవుతున్నారు. బిల్లు చెల్లింపులకు క్షేత్రస్థాయి పనులకు అంతరం చూసి బేజారవుతున్నారు. చెరువు తవ్వకాల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పర్యవేక్షణ మరచి నిద్రమత్తులో జోగుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. తమ మండలంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులపై ఎంపీపీ తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ విషయం తీసుకువెళతానని విజిలెన్స్ విచారణను కోరతానని తెలిపారు.

17:40 - June 19, 2016

హైదరాబాద్ : ఎక్కడ చూసినా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ వెలుగులు. ప్రత్యేక అలంకరణలతో పాటు.. హలీమ్‌ ఘుమఘుమలు. సాయంత్రం అయిందంటే చాలు.. సందర్శకుల కిటకిటలతో హైదరాబాద్‌ నగరం సందడిగా మారుతోంది. రంజాన్‌ మాసం కావడంతో చార్మినార్‌, పాతబస్తీ తదితర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. రంజాన్‌ మాసం కావడంతో ఎక్కడ చూసినా విద్యుత్‌ వెలుగులతో నగరం కళకళలాడుతోంది. నగరంలోని ఛార్మినార్‌, పత్తర్‌గట్టి, పటేల్ మార్కెట్‌తో పాటు మదీనా బిల్డింగ్‌ తదితర ప్రాంతాలు ప్రత్యేక శోభతో అలరారుతున్నాయి. వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చే సందర్శకులతో ఛార్మినార్‌, మక్కా మసీదు, పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. అందంగా ముస్తాబైన నగరంలోని పలు చారిత్రక కట్టడాలు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

రాత్ బజార్..
రంజాన్‌ మాసంలో రాత్‌ బజార్‌ పేరుతో చార్మినార్‌ ప్రాంతంలో ప్రత్యేక షాపింగ్‌ కొనసాగుతోంది. ఉపవాసాలుండే ముస్లింలు కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్‌ చేసేందుకు వస్తుండటంతో పాతబస్తీ ప్రాంతాలు రద్దీగా మారుతున్నాయి. వస్త్రాలు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, తళతళ మెరిసే గాజులు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. షాపింగ్ పూర్తయ్యాక తినుబండారాలను రుచి చూసేందుకు వస్తున్న సందర్శకులతో హోటళ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి. సాధారణ రోజలతో పోలిస్తే.. రంజాన్‌ మాసంలో హైదరాబాద్‌, అందులో నైట్ బజార్‌ ప్రత్యేకంగా ముస్తాబై చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జిగేల్‌మనే విద్యుత్‌ కాంతుల్లో ప్రత్యేక అందాలను ఆస్వాదించాలంటే మాత్రం రంజాన్‌ మాసంలో భాగ్యనగరం బాట పట్టాల్సిందే. 

17:35 - June 19, 2016

ఆదిలాబాద్ : చదువుల తల్లి కొలువైన చోట... అనంతమైన అవినీతి. భక్తులు ఇచ్చే లక్షలాది రూపాయల కానుకలు... ఆలయ సిబ్బంది కైంకర్యం చేస్తున్నారు. చివరికి ఆలయ భూముల్ని సైతం అమ్మకానికి పెట్టినట్టు విజిలెన్స్‌ తనిఖీల్లో తేలింది. ఇదేందని అడిగితే అంతా మాఇష్టం... అంటున్నారు అక్కడి అధికారులు. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో అవినీతి విశ్వరూపం ధరించింది. అధికారులు..సిబ్బంది అన్న తేడా లేకుండా.. ఎవరి స్థాయిలోవారు వసూళ్లకు పోటీపడుతున్నారు. ఇందులో కొందరు పూజారులకు కూడా వాటాలు ముడుతున్నట్టు ఆలయ ఉద్యోగులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

అమ్మవారి నగలు మాయం..
బాసర క్షేత్రానికి వెళ్లితే చదువుల బాగా వస్తాయని భక్తులు నమ్ముతారు. కాని.. ఆలయంలో చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒక కొలువు ఉంటే చాలు. కాసులు బాగా సంపాదించవచ్చని ఇక్కడి ఉద్యోగులు నమ్ముతున్నారు. అక్షరాభ్యాసం నుంచి అన్నప్రాసన, లడ్డూప్రసాదం ఇలా ప్రతిటిక్కెట్ల అమ్మకాల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. వీళ్లను అడిగేవారే లేరు. డ్యూటీలు వారే వేసుకుంటారు.. జీతాలు వారే ఇచ్చుకుంటారు. చివరికి బ్యాంక్‌ లాకర్లలో ఉంచిన అమ్మవారి 70కేజీల వెండివీణ, ఇతర నగలు మాయమైనట్టు విజిలెన్స్‌ తనఖీల్లో తేలినా.. ఒక్కరంటే ఒక్కరిపైనా చర్యలు తీసుకోరు. సంవత్సరాలకు సంత్సరాలు ఆలయంలోనే తిష్టవేసి.. అందిన కాడికి మేసేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. బాసర గుడిలో అవినీతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే... సిబ్బంది తెలివిగా సమాధానం చెబుతారు. ' తప్పులు జరుగుతుంటాయ్‌.. పైఅధికారులు మెమోలు ఇస్తరు.. మేం సమాధానం ఇస్తాం... వారు సంతృప్తి చెందుతారు.. మధ్యలో మీరడిగేదేంటి..?' అని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారు నగల కనిపించకుండా పోవడంతో... విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. అవినీతి జరిగినట్టు తేలింది. అయినా.. ఇక్కడ ఉద్యోగులకు ఏమాంత్రం జంకులేదు. అంతా మామూలే... అంతా మారాజ్యమే అన్నట్టు మాట్లాడుతున్నారు.

బకాయిలు రూ.1కోటి 27లక్షలు..
మరోవైపు.. ఆలయభూములను కూడా కొందరు కబ్జాపెట్టారు. విజిలెన్స్ నివేదికలో ఈ విషయం వెలుగు చూసింది. ఆలయానికి 180ఎకరాల భూమి ఉంది గత కొన్నేళ్లుగా ఆ భూమికి కౌలు కూడా రావడంలేదు. మొత్తం 'కోటి 27లక్షల రూపాయలు' ఆలయానికి రావాల్సిన బకాయిలు ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి. అయితే...అవి వసూలు చేసేవారే కరువయ్యారు. అటు కొందరు అర్చకులు కూడా ఆలయభూమిని తమపేరిట మార్చుకుని అమ్మకానికి కూడా పెట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆలయంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై విజిలెన్స్ నివేదికలు ఇచ్చినా... ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదు. ఆలయాల అభివృద్ధిపై తెగహడావుడి చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు... బాసర ఆలయంలోని ఆగడాలు కనిపించడంలేదా... అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుంటుందో లేదో చూడాలి. 

17:31 - June 19, 2016

హైదరాబాద్ : సభలు, ర్యాలీలు, సమావేశాలతో పార్టీ మారిన బండారం బయటపెట్టడంతో పాటు.. జంప్‌ జిలానీల ఇళ్ల ముందు నిరసనలు, ధర్నాలు చేసి వారి రాజీనామాకు డిమాండ్‌ చేయాలని అధిష్టానం భావిస్తోంది. అయితే ఇదేదో మొదట్లోనే చేసి ఉంటే పార్టీకి ఇంత డ్యామేజ్‌ జరిగి ఉండేది కాదని, మొత్తానికి ఆలస్యంగానైనా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లుంది.. తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి. నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నా.. పట్టించుకోని ఆ పార్టీ.. ఇప్పుడు జంప్‌ జిలానీలపై రివేంజ్‌ తీసుకునే పనిలో పడింది. గోడ దూకిన నేతల ప్రాంతాల్లో సభలు, ర్యాలీలతో.. వలస జీవులను ఎండగట్టాలని నిర్ణయించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ యోచిస్తోంది. తెలంగాణలో కష్టాల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌.. వాటి నుంచి తేరుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. వరుస ఓటములతో ఇప్పటికే తీవ్ర నైరాశ్యంలో మునిగిన పార్టీ శ్రేణులను ఇటీవలి అగ్రనేతల వలసలు మరింతగా కుంగదీశాయి. అందుకే పార్టీ కార్యకర్తలకు కొంతలో కొంతైనా ధైర్యాన్నిచ్చేందుకు పార్టీ నేతలు ప్రణాళిక ఖరారు చేశారు. ఇకముందు పార్టీ నేతలు చేజారిపోకుండా తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని పార్టీ నిర్ణయించింది.

కారెక్కిన ఏడుగురు ఎమ్మెల్యేలు..
ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మొదలు... తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కారెక్కిపోయారు. ఇక ఎమ్మెల్సీలు, పలువురు నేతలు చాలామందే టీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. కొందరు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే, మరికొందరు సొంత పార్టీలోని అంతర్గత పోరు కారణంగా పార్టీని వీడారు. అయితే పార్టీ చీఫ్‌ ఉత్తం, సీఎల్పీ నేత జానారెడ్డి లాంటి నేతలు.. అసంతృప్తులతో మాట్లాడి ఉంటే చాలామంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేవారు కాదని కాంగ్రెస్‌ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా గుత్తా, భాస్కర్‌రావు, వివేక్‌ బ్రదర్స్‌ మూకుమ్మడిగా పార్టీ మారడంతో.. కాంగ్రెస్‌ హైకమండ్‌ జంప్‌ జిలానీలకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదన్న నిర్ణయంతో..పీసీసీకి కార్యచరణను ఇచ్చింది. పార్టీకి చేయిచ్చిన నేతల నియోజకవర్గాల్లో.. రివెంజ్‌ తీసుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం సూచించింది. దీనిలో భాగంగా మిర్యాలగూడలో తొలి సభను ఏర్పాటు చేయాలని, ఆ సభలో ఇటీవల పార్టీ మారిన భాస్కర్‌రావు పార్టీకి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.

రామగుండంలో భారీ బహిరంగసభ..
మరోవైపు వివేక్‌ పార్టీ మారడంపై ఆయన సొంత నియోజవర్గ కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు.. ఇటీవల పీసీసీ చీఫ్‌ను కలిసిన రామగుండం నేతలు తమకు కార్యాచరణ ఇవ్వాలని కూడా కోరారు. అప్పటికే పార్టీ కేడర్‌లో మనోధైర్యాన్ని నింపాలన్న యోచనతో ఉన్న అధిష్ఠానం.. రామగండంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, వివేక్‌ పార్టీకి చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్న నిర్ణయానికి వచ్చింది. సభలు, ర్యాలీలు, సమావేశాలతో పార్టీ మారిన వారి బండారం బయటపెట్టడంతో పాటు.. జంప్‌ జిలానీల ఇళ్ల ముందు నిరసనలు, ధర్నాలు చేసి వారి రాజీనామాకు డిమాండ్‌ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అయితే ఇదేదో మొదట్లోనే చేసి ఉంటే పార్టీకి ఇంత డ్యామేజ్‌ జరిగి ఉండేది కాదని, కనీసం ఇప్పటికైనా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. మరి కాంగ్రెస్ నిర్ణయాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

అమరేశ్వరుడి భూముల్లో భారీ స్కాం - అంబటి..

విజయవాడ : అమరేశ్వరుడి భూముల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని నిజాలు తెలుసుకోవడానికి వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వెళితే టిడిపి నేతలు అడ్డుకోవడం దురదృష్టకరమని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో పెద్దబాబు..చిన్న బాబు కూడా ఉన్నారన్నారు. అమరేశ్వరుడి భూములపై న్యాయపోరాటం చేస్తామని, ఈనెల 26న నిజనిర్ధారణ కమిటీ భూముల ఉన్న చైన్నైకు వెళుతుందని అంబటి పేర్కొన్నారు. 

16:34 - June 19, 2016

చెన్నై : ఏంటీ 500 దుకాణాలకు తాళాలు పడ్డాయా ? మరిన్ని లిక్కర్ దుకాణాలు బంద్ చేస్తారా ? అయ్యే మందు ఎలా తాగాలి ? కిక్ ఎక్కాలంటే ఏం చేయాలి ? అని ఆలోచిస్తున్నారు. దుకాణాలకు తాళాలు పడింది తెలంగాణ, పక్కనున్న ఏపీ రాష్ట్రంలో కాదు. పొరుగున్న ఉన్న తమిళనాడులో. అవును. అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో జయ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ చర్యలు తీసుకొంటోంది. 
దశల వారీగా తమిళనాడు రాష్ట్రంలో మద్య నిషేధంపై జయ సర్కార్ దృష్టి పెట్టింది. ఈ రోజు నుండి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాలకు తాళాలు పడ్డాయి. అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యం దుకాణాలు మూసివేస్తామని అన్నాడీఎంకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన జయ సర్కార్ ఆదివారం నుండి చర్యలు తీసుకొంటోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 500 దుకాణాలను మూసివేశారు. 

16:30 - June 19, 2016

హైదరాబాద్ : సాహిత్యానికి సమాజానికి ఉండే సంబంధాల విశ్లేషణపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ ఇండిపెండెన్స్ రీసెర్చ్ సంధ్య ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. తెలుగు కథకు సంబంధించి 1990 నుండి 2014 వరకు మధ్య జరిగిన అంశాలపై చర్చించారు. రచయితలు రాసిన కవితలను విశ్లేషణ చేయడానికి సదస్సు నిర్వహించినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు. రచయితల అభిప్రాయాలు..మరిన్ని వివరాలకు వీడియోలో చూడండి..

16:21 - June 19, 2016

విజయవాడ : నగరంలో సంచలనం సృష్టించిన నిర్మల కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని బంగారు నెక్లెస్ చోరీ కేసులో చిక్కుముడి వీడింది. మాయమాటలు చెప్పి నెక్లెస్ ను అపహరించిన వ్యక్తి దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. పుట్టిన రోజు సందర్భంగా ఓ విద్యార్థిని నెక్లెస్ ధరించి వచ్చింది. ఈ సమయంలో ఓ యువకుడు ఆ బాలికను అడ్డగించాడు. ఖరీదైన బంగారు నగలు స్కూల్ కు ధరించి రావొద్దని హెచ్చరించి నెక్లెస్ తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు. బాలికను అనుసరించడం..నెక్లెస్ తీయడం..అనంతరం అక్కడి నుండి వెళ్లడం తదితర దృశ్యాలన్నీ సీసీ కెమెరాలోల రికార్డయ్యాయి. 

నెల్లూరు కార్పొరేషన్ పై ఏసీబీ దాడి..

నెల్లూరు : నగర కార్పొరేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. ఓ వ్యక్తి నుండి రూ. 50 వేలు తీసుకుంటుండగా అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మునిరత్నం ఏసీబీకి చిక్కాడు.

 

ఎన్ఎస్‌జీలో సభ్యత్వం దేశానికి చాలా అవసరం - సుష్మా..

ఢిల్లీ : ఎన్ఎస్‌జీలో సభ్యత్వం దేశానికి చాలా అవసరమని, రెండేళ్లలో పలు దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకున్నామని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. తీవ్రవాదంపై పోరాటం కోసం పలుదేశాల మద్దతు పొందామని, గల్ఫ్ లో చిక్కుకున్న భారతీయుల్లో చాలామందిని కాపాడామని తెలిపారు. 

16:10 - June 19, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అవినీతి లేకుండా చేయాలని కమిషనర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై వేటు వేస్తున్నారు. తాజాగా సర్కిల్ 10లో పనిచేస్తున్న డాక్టర్ మనోహర్ ను కమిషనర్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇటీవలే శానిటరీ సూపర్ వైజర్ వెంకటేశ్వర్లను కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీలో శానిటేషన్ విభాగంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టెన్ టివి కూడా పలు కథనాలు ప్రసారం చేసింది. కార్మికుడు చనిపోయినా అతని పేరు మీద వేతనాలు పొందుతున్నారనే మనోహర్ పై ఆరోపణలున్నాయి. కానీ ఎలాంటి వేతనాలు తాను తీసుకోలేదని మనోహర్ పేర్కొన్నారు. దీనిపై నియమించబడిన దర్యాప్తు బృందం నివేదికలు కమిషనర్ కు సమర్పించింది. ఈ నివేదికలో వాస్తవాలు వెల్లడి చేసింది. చనిపోయినా వేతనాలు తీసుకున్నట్లు పేర్కొంది. కార్మికులు హాజరు కాకపోయినా సూపర్ వైజర్ లు హాజరు వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వేటుతో నైనా అవినీతికి చెక్ పడుతుందా? లేదా? అనేది చూడాలి. 

జీహెచ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్ పై వేటు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో మరో మెడికల్ ఆఫీసర్ పై వేటు పడింది. సర్కిల్ 10 లో పనిచేస్తున్న డాక్టర్ మనోహర్ ను కమిషనరన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేశారు. పారిశుధ్య కార్మికు వేతలను కాజేశారని మనోహర్ పై వేటు పడింది. 

15:54 - June 19, 2016

తెలంగాణ రాష్ట్రంలో విస్తరించిన రుతుపవనాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఎవరూ వేళెత్తి చూపకుండా పాలన - జైట్లీ..

పంజాబ్ : తమవైపు ఎవరూ వేళెత్తి చూపకుండా పాలన కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పంజాబ్‌లోని బటిండాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమ రెండేళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో అవినీతి అనే పదమే లేకుండా చేశామని చెప్పుకొచ్చారు. 

15:47 - June 19, 2016

హైదరాబాద్ : సుల్తాన్ బజార్ చోరీ కేసును పోలీసులు చేధించారు. 24గంటల్లోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం. రూ. 12 లక్షల రూపాయలను నిందితులు దోచుకపోయిన సంగతి తెలిసిందే. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా పోలీసు అధికారి మీడియాతో మాట్లాడారు. సిద్దంబర్ బజార్ లో ఉంటున్న వ్యాపారి దుకాణం మూసివేసి రాంకోఠిలో ఉన్న అతని ఇంటికి వెళుతున్న సందర్భంలో నిందితులు చోరీ చేయడం జరిగిందన్నారు. ఏడుగురిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 10.70 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఫిర్యాదు దారుడి హోండా ఆక్టివాను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మల్లిఖార్జున్, ఆసీఫ్ వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పట్టుకున్న వారికి నేర చరిత్ర లేదని, విచారణలో నేర చరిత్ర ఉందా ? లేదా ? అనేది తేలుతుందన్నారు. వ్యాపారి నిత్యం డబ్బులు తీసుకెళుతాడని నిందితులు తెలుసుకున్నారని, గతంలో ప్లాన్ చేసినా విఫలమయ్యారని పేర్కొన్నారు. కానీ శనివారం మాత్రం సక్సెస్ అయ్యారని తెలిపారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:37 - June 19, 2016

విశాఖపట్టణం : పనికి మాలిన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోందని, కొద్దిమందికి ఈ విషయం బాధ కలిగించవచ్చని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎం.వీ.ఎస్ శర్మ పేర్కొన్నారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు విధ్వంసాన్ని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ 33వ వర్ధంతి సందర్భంగా కాలుష్యంపై కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వనం కోసం మనం అంటూ ప్రభుత్వం పిలుపునిచ్చిందని, ఈ పిలుపు వికృతంగా ఉందన్నారు. మనం కోసం వనం..కాదు..వనం..కోసం మనం అని అన్నారు. కాలుష్యం వల్ల ప్రజలు నివసించే పరిమితులు దాటిపోయాయని, విశాఖనగరం ప్రజలు నివాసం ఉండడానికి అనుకూలం కాదని నివేదికలు ఇచ్చినా పరిశ్రమలు పెరిగిపోతున్నాయన్నారు. వైజాగ్ ఏర్పడడానికి పరిశ్రమలే కారణమని, అదే పరిశ్రమల కారణంగా నేడు నగరం ఖాళీ అవుతోందని తెలిపారు. 

15:30 - June 19, 2016

కర్నూలు : జిల్లా ఎస్పీ రవికృష్ణ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. యోగా ప్రత్యేకత తెలిపే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. యోగా ద్వారా మానసిక వత్తిడి దూరం అవుతుందని ఈ ఫిల్మ్ ద్వారా తెలిచేయనున్నట్లు తెలిపారు. ఎంత ఒత్తిల్లో ఉన్నా యోగా చేయడం ద్వారా లాభం కలుగుతుందన్నారు. ఎస్పీ రవికృష్ణ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరింత విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

తప్పు చేశా - ఎమ్మెల్యే డేవిడ్ రాజు..

ప్రకాశం : దురదృష్టకరమైన పరిస్థితుల్లో తాను తప్పు చేయడం జరిగిందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు పేర్కొన్నారు. జీవితాంతం టిడిపిలోనే కొనసాగుతానని తెలిపారు. 

ఎంసీఆర్ హెచ్చార్డీలో రేపు మంత్రి కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : రేపు ఎంసీఆర్ హెచ్చార్డీలో జీహెచ్ఎంసీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ పనుల్లో వేగం, నాణ్యత పెంపు, హరితహారం, చెత్త నిర్వాహణ, టౌన్ ప్లానింగ్, నీటి సరఫరా, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ట్రాఫిక్, విద్యుత్ శాఖలపై చర్చించనున్నారు.

 

బీసీల్లో ఉన్న కాపులు తమ బంధువులే - కాపు కార్పొరేషన్ ఛైర్మన్..

విజయవాడ : బీసీల్లో ఉన్న కాపులు కూడా తమ రక్తపు బంధువులేనని, బీసీల్లో ఉన్న కాపు ఉప కులాల వారందరికీ కాపు కార్పొరేషన్ లో రుణాలు ఇచ్చే అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి జీవో తీసుకొస్తామని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పేర్కొన్నారు.

 

రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడం హర్షణీయం - కోడెల..

ప్రకాశం : రూ. 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అభినందించాల్సిన విషయమని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కేరాఫ్ అడ్రస్ ను వెతుక్కోవడమే సరిపోయిందన్నారు. రాజకీయ ఉద్ధేశ్యంతో విభజన చేసిన వారు రాజకీయ మూలాలను కోల్పోయారని విమర్శించారు. 

15:06 - June 19, 2016

శ్రీకాకుళం : సువిశాల సాగరతీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో విధించే చేపల వేట నిషేదం ముగిసినా.... నిషేధ సమయంలో అందించాల్సిన భృతి చెల్లించేందుకు మాత్రం సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో సాగరాన్నే నమ్మకొని జీవిస్తున్న మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారు. శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఈ సీజన్‌ చేపల వేటపై నిషేధం ముగిసింది. చేపలు గుడ్లు పెట్టె పునరుత్పత్తి కాలం కావడంతో ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ ప్రభుత్వం చేపలవేటపై నిషేధం విధిస్తోంది. గతంలో కేవలం 47 రోజులు మాత్రమే ఉండే ఈ నిషేధాన్ని 61 రోజులకు పెంచింది రాష్ట్ర సర్కారు. అయితే నిషేధ సమయం లో మత్స్యకారులను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చేపలవేట పై నిషేధం ముగిసి నాలుగు రోజులవుతున్నా ఇంతవరకూ మత్స్యకారులకు ఆ పరిహారం అందలేదు. నిషేధ సమయం లో మత్స్యకారులకు అందించాల్సిన పరిహారం విషయంలో ప్రతిఏడాది సమస్యలు వస్తున్నా, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

పరిహారం ఇవ్వాలంటున్న మత్స్యకారులు..
శ్రీకాకుళం జిల్లా లో 193 కిలోమీటర్ల పరిధి లో సువిశాల సాగరతీరం ఉంది. తీరం వెంబడి మొత్తం 104 మత్స్యకార గ్రామాలు ఉండగా.. అందులో 98,450 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరికి 1225 ఇంజన్ బోట్లు, 2598 నాటు పడవలు ఉన్నాయి. అయితే కేవలం రిజిస్ట్రేషన్ అయిన వాటికే నిషేధ సమయంలో అందించే భృతి ఇవ్వాలని మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేవలం 1035 బోట్లు మాత్రమే పరిహారం విషయం లో నివేదికలో చోటు సంపాదించాయి. ఒక్కో ఇంజన్ బోటుకు ఆరుగురు చొప్పునన 6210 మంది మత్స్యకారులకు నాలుగు వేలు చొప్పున్న భృతి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు అవసరమని నివేదికలు సైతం మత్స్యశాఖ అధికారులు సిద్ధం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో చెల్లింపు జరుగుతాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. నిషేధ సమయం ముగిసినప్పటికీ తమకు పరిహారం అందలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పశ్చిమగోదావరి లో సోమవారం బాబు పర్యటన..

పశ్చిమగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. చిటవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. 

14:38 - June 19, 2016

రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ జివి హర్షకుమార్‌ విమర్శించారు. తుని సంఘటనతో సంబంధంలేకపోయినా.. దళితులపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని హర్షకుమార్‌ మండిపడ్డారు. ప్రభుత్వ అణచివేతను చూస్తుంటే..కాపు ఉద్యమనేత ముద్రగడకు ప్రాణహానిఉందనే అనుమానం కలుగుతుందన్నారు. ముద్రగడ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటొందని, ముద్రగడ ప్రస్తుత పరిస్థితి జైలు కన్నా దారుణంగా ఉందన్నారు. 

14:37 - June 19, 2016

రాజమండ్రి : తాము ప్రస్తుతం బతుకుదామంటే భయంగా ఉందని తుని ఘటనలో విడుదలైన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఎంపీ హర్షకుమార్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. తాను మీటింగ్ కూడా వెళ్లలేదని, తనపై అవనసరంగా కేసులు పెట్టారని వాపోయాడు. తన భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదన్నారు. వాళ్లకు భోజనం కూడా లేదని కన్నీరు కార్చాడు. దిక్కుమాలై పోయామని, అప్పులు..చేసి వడ్డీలు చేసి తనను విడుదల చేయించారని తెలిపాడు. ప్రస్తుతం వారం..వారం..వాయిదాలకు పీఎస్ కు తిరగాల్సి ఉంటుందని, అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నో కేసులు తమపై నమోదు చేయడం జరిగిందని, బతకాలంటే భయంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాపు ఉద్యమంలో భాగంగా ముద్రగడ చేపట్టిన ఆందోళన హింసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు.ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులను అరెస్టు చేస్తున్నారంటూ ముద్రగడ గత 11 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈతరుణంలో అరెస్టు చేసిన కొంతమందిని విడుదల చేశారు.

14:29 - June 19, 2016

రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. గత 11 రోజులుగా ఆయన దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రత్యేక వైద్యుల బృందం ప్రకటించింది.. బీపీ, పల్స్‌ రేట్‌ బాగానేఉందని తెలిపింది.. పదకొండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ముద్రగడ కాస్త నీరసంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆయన 140/90 హై బీపీతో, పద్మావతి 100/70 లో బీపీతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ప్రతి రెండు గంటలకూ ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం జరుగుతోందని, ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించకుండా ఫ్లూయిడ్స్ ను ఎక్కిస్తున్నామన్నారు.
తుని రైలు దహనం కేసులో నిందితులను విడుదల చేయాలంటూ ముద్రగడ 11రోజులుగా రాజమండ్రిలో దీక్ష చేస్తున్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులే కాక ఇతరులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

సుల్తాన్ బజార్ దోపిడి కేసును చేధించిన పోలీసులు..

హైదరాబాద్ : సుల్తాన్ బజార్ దోపిడి కేసును పోలీసులు చేధించారు. ఐదుగురు నిందితలను అరెస్టు చేసి రూ. 10.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

 

సదావర్తి భూముల అమ్మకాలు గోల్ మాల్ - ధర్మాన..

గుంటూరు : సదావర్తి సత్రం భూముల అమ్మకాల్లో గోల్ మాల్ జరిగిందని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. గుట్టుచప్పుడు కాకుండా వేలం నిర్వహించారని, వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని అమరావతికి వస్తే అధికార పార్టీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే సదావర్తి సత్రం భూముల వేలాన్ని రద్దు చేసి ప్రకటనలు జారీ చేసి వేలం నిర్వహించాలన్నారు.

వరంగల్ నగర పాలక సంస్థలో అధికారులపై వేటు..

వరంగల్ : మహా నగర పాలక సంస్థలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ శివకుమార్, డీఈ కొండల్ రావు, ఏఈ సారంగం లపై సస్పెన్షన్ చేశారు. మరో ఇద్దరు ఏఈలు ప్రసాద్, స్వామిపై వేటుకు ప్రతిపాదనలు పంపారు. హంటర్ రోడ్డులో బొందివాగు పనులకు రెండు ప్రతిపాదనలు పంపినందుకు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

వరంగల్ నగర పాలక సంస్థలో అధికారులపై వేటు..

వరంగల్ : మహా నగర పాలక సంస్థలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ శివకుమార్, డీఈ కొండల్ రావు, ఏఈ సారంగం లపై సస్పెన్షన్ చేశారు. మరో ఇద్దరు ఏఈలు ప్రసాద్, స్వామిపై వేటుకు ప్రతిపాదనలు పంపారు. హంటర్ రోడ్డులో బొందివాగు పనులకు రెండు ప్రతిపాదనలు పంపినందుకు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

 

14:03 - June 19, 2016

గుంటూరు : అమరావతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సదావర్తి సత్రం భూ కుంభకోణంపై నిజాల సేకరణకు వెళ్లిన ధర్మాన బృందాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ధర్మాన గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ తమ పర్యటనను అడ్డుకోవడాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.
ధర్మాన ప్రసాదరావు
'వాసిరెడ్డి.. 150 సంవత్సరాల క్రితం దేవాదాయ, ధర్మదాయశాఖకు వివిధ కార్యక్రమాల నిమిత్తం తన భూములు ఇచ్చారు. అవి దేవాదాయ శాఖకు దఖలు పడిన భూములు. దేవాదాయ, ధర్మాదాయ భూములను ప్రభుత్వ భూములుగా భావించకూడదని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కానీ దానికి విరుద్ధంగా దేవాలయానికి చెందిన 83 ఎకరాల భూమిని అమ్మడానికి గుట్టుచప్పుడు కాకుండా వేలం వేశారు. లంచాలకు మరిగి కోట్ల రూపాయలు విలువ చేసే భూములను లక్షల రూపాయలకు అమ్మడానికి సిద్ధం చేశారు. అడ్డగోలుగా లంచాలు తీసుకుని తక్కువ ధరలకు వేలం వేశారు. రాష్ట్రంలో గూటుపుటాని జరిగింది. ప్రతిపక్షంగా దేవాయల భూములను కాపాడుతామని' చెప్పారు. 
స్థానికులు
'వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సదావర్తి సత్రాన్ని స్థాపించారు. దేవాదాయ భూములను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే రక్షించాల్సిందిపోయి.. భక్షించేందుకు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. వేలం పాటను రద్దు చేయాలి. కారకులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. భూములను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో డ్రామా జరుగుతందని' స్థానికులు ఆరోపించారు. 

 

13:51 - June 19, 2016

గుంటూరు : నైరుతి రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా తాత్కాలిక సచివాలయ ప్రాంతం చిత్తడిగా మారింది. గ్రావెల్‌ ఉపయోగించి 100 అడుగుల రోడ్లు వేస్తుండటంతో అంతా బురదమయంగా మారింది.దీంతో సచివాలయం వెలుపల జరుగుతున్న పనులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే బిల్డింగ్‌ లోపల జరుగుతున్న పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. 

13:49 - June 19, 2016

మెదక్‌ : మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలంటూ సీపీఎం నేతలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నేతలను సంగారెడ్డి రూరల్ పీఎస్‌కు తరలించారు. దీంతో సంగారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. గత 13 రోజులుగా సంగారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు రిలే దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా సీపీఎం నేతలు గత మూడు రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఈనేపపథ్యంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

 

అమరావతిలో వైసీపీ పర్యటన..ఉద్రిక్తత..

గుంటూరు: అమరావతిలో చేపట్టిన వైసీపీ పర్యటన ఉద్రిక్తంగా మారింది. సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో వాస్తవాల అధ్యయనం పేరిట ఈ పర్యటన చేపట్టింది. ఈ పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకే వైసీపీ నేతలు పర్యటిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి పోటాపోటీగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

13:44 - June 19, 2016

ఇటీవల యువ రచయిత్రి చైతన్య పింగళి రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకానికి కేంద్రసాహిత్య యువపురస్కారం దక్కింది. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లోగాక  మహిళలు పూర్తీస్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్థలో చేరి సాయుధ పోరాటం చేసిన అంశాలను రచయిత్రి ఈ పుస్తకంలో ఉటంకించారు.యువ రచయిత్రి చైతన్య పింగళి పుస్తక పరిచయ కథనం.. మీకోసం.. ఆ వివరాను వీడియోలో చూద్దాం....

 

నోయిడాలో అగ్నిప్రమాదం..

నోయిడా : ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాకింగ్ కంపెనీలో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

అనంతపురంలో కుండపోత వర్షం..

అనంతపురం : జిల్లాలో ఆదివారం ఉదయం నుండి వర్షం కురుస్తోంది. గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. డోనేకల్ లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వజ్రకరూర్ మండలం కమలపాడులో రాత్రి కురిసిన వర్షానికి మిద్దెకూలి విద్యార్థి భరత్ మృతి చెందాడు.

రేపే రైతులకు ప్లాట్ల కేటాయింపు - మంత్రి నారాయణ..

గుంటూరు : రేపు సాయంత్రం 4గంటలకు రైతుల సమక్షంలో లాటరీ పద్ధతిలో రైతులకు ప్లాట్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 29 వరకు జరుగుతుందని తెలిపారు. వర్షాలు తగ్గగానే భూమిని చదును చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

22న ఏపీ మంత్రివర్గం భేటీ..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంత్రివర్గం ఈనెల 22న భేటీ కానుంది. ఉద్యోగుల తరలింపు, రాజధానిలో మౌలిక వసతులు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

13:43 - June 19, 2016

చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, మహిళా చేతన, సంస్కృతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా నవతరంతో యువతరం అని ఓ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్ధులు, రచయితల ఆలోచనలు, సృజనాత్మక పరిశీలనలు, కలిపి పండువెన్నెల పేరుతో ఓ సంకలనాన్ని వెలువరించారు. ఈ సంకలనాన్ని ఇటీవల విశాఖలో ఆవిష్కరించారు. ఆ కార్యక్రమ విశేషాలను వీడియోలో చూద్దాం.

 

అతలాకుతలమౌతున్న జావా ప్రావిన్స్...

జకార్త : ఇండోనేషియా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. జావా ప్రావిన్స్ లో భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి దాదాపు 24 మంది మరణించారు. ప్రావిన్స్ లోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

 

రాజన్ పై బీజేపీ వ్యవహరించిన తీరు బాధాకరం - ఆజాద్..

న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ రఘురామ్ రాజ‌న్‌ తో బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరు త‌న‌కు బాధ క‌లిగించింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు. ఏడాది కాలంగా ప‌లువురు బీజేపీ నేత‌లు, ఎంపీలు.. రాజ‌న్‌ను కావాల‌నే ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

రాహుల్ పుట్టినరోజు..వెల్లువెత్తిన శుభాకాంక్షలు..

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాహుల్ 46వ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

13:37 - June 19, 2016

గాయాల తెలంగాణాపై వచ్చినన్ని గేయాలు మరేప్రాంతంలోనూ రాలేదు. ఇక్కడి రచయితలు ప్రతి అంశాన్ని, దృశ్యాన్ని, సవాలక్షసామాజిక సమస్యలను గేయాలుగా రాస్తున్నారు. అలాంటి వారిలో మానుకోట ప్రసాద్ ఒకరు. ఆయన పల్లెను ,నల్లరేగడి నేలను,చెరువులను రైతులను.ఇలా అనేకాంశాలపై ఎన్నో గేయాలు రాశాడు.గేయకవి మానుకోట ప్రసాద్ ను పరిచయం చేస్తున్నారు...మరో ప్రముఖ గేయ రచయిత స్ఫూర్తి ..నేటి జనం పాటలో... ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:35 - June 19, 2016

సాహిత్యం సమాజానికి దర్పణం పడుతుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. ప్రజాపోరాటాలకు మద్ధతునిస్తుంది. ఒక ప్రాంతంలోని ప్రజల జీవనదృశ్యాలను ఆ ప్రాంతపు రచయితలు అక్షరీకరిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ కథనశిల్పి బోయజంగయ్య ప్రత్యేక కథనంతో పాటు ,కేంద్రసాహిత్య అకాడమి యువపురస్కార గ్రహీత చైతన్య పింగళి పుస్తక పరిచయంతో ఈ వారం మీ ముందు కొచ్చింది 10 టి.వి.అక్షరం.
అద్భుత కథలుగా దళితుల జీవన చిత్రాలు  
బోయ జంగయ్య ..ఈ పేరువింటేనే ..తెలంగాణా కథాసాహిత్యం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. తెలంగాణా దళితుల జీవన చిత్రాలను అద్భుత కథలుగా నవలలుగా చిత్రించిన సాహితీ మూర్తి ఆయన.జాతర,జగడం,పుట్టుమచ్చ లాంటి నవలలు ఆయన సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం.ప్రముఖ రచయిత బోయ జంగయ్య సాహిత్యాన్ని విశ్లేషిస్తున్నారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య నేటి ధిక్కార స్వరంలో...
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

మెదక్ : సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం రిలే నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలంటూ 13 రోజులుగా సీపీఎం నేతలు దీక్ష చేస్తున్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ తోపాటు భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ భాస్కర్ లను అరెస్టు చేశారు. వారిని సంగారెడ్డి రూరల్ పీఎస్ కు తరలించారు. 

 

13:22 - June 19, 2016

కృష్ణా : గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త టీచర్లకు విచిత్ర పరిస్థితి ఎదురైంది.. పిల్లలకు పాఠాలు చెబుతామన్నా వారికి అవకాశం దక్కడం లేదు. ప్రస్తుతం వారు పాఠశాలకు బదులు.. ఎంఈవో ఆఫీసులో రిపోర్ట్ చేసి.. కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఎందుకీ దుస్థితి..? వాచ్‌ దిస్‌ స్టోరీ
ఎంఈఓ ఆఫీసుల్లో కాలం వెళ్లదీస్తున్న టీచర్లు... 
టీచర్లు స్కూళ్లకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పాలి. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొందరు కొత్త టీచర్లు మాత్రం.. ఎంఈఓ ఆఫీసుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. అలాగని, వీరు పని దొంగలనుకుంటే పొరపాటే..! పనిచేస్తాం.. ఏదో ఓ స్కూల్లో మాకు బోధనావకాశాలు కల్పించండి మహాప్రభో అంటూ వీరు రోజూ ఎంఈఓను అభ్యర్థిస్తూనే ఉన్నారు. కానీ వారికి ఆ అవకాశం మాత్రం దక్కడం లేదు. 
డీఎస్సీ 2014లో ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు
డీఎస్సీ 2014లో ఎంపికైన టీచర్లకు ప్రభుత్వం ఈమధ్యే నియామకపత్రాలు అందజేసింది.. ఈ డీఎస్సీ ద్వారా గుంటూరు జిల్లాలో 302 మంది, కృష్ణాజిల్లాలో వందమంది ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. నియామక పత్రాలైతే ఇచ్చారు గానీ.. ఎక్కడ పనిచేయాలన్న విషయంలో వారికి స్పష్టత ఇవ్వలేదు. పైగా ఎంఈఓ కార్యాలయాల్లో రిపోర్ట్‌ చేసుకోవాలంటూ నియామక పత్రాల్లో పేర్కొన్నారు. అంతేనా ఈ టీచర్లకు వేతనాలు ఎలా సమకూర్చుతారు..? ఎవరి ద్వారా అందుతాయి..? అన్న అంశాలపైనా క్లారిటీ ఇవ్వలేదు. 
కొత్త టీచర్లకు స్కూళ్లలో పోస్టుల్లేవు...
కొత్త టీచర్లను ఎంఈవో ఆఫీసులకు పంపడానికి వివిధ కారణాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే విద్యార్థులు లేక చాలా ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఆదర్శ పాఠశాలల పరిస్థితీ భిన్నంగా ఏమీ లేదు. ఈ మూతబడిన స్కూళ్ల ఉపాధ్యాయులను మిగతా పాఠశాలల్లో ఎలాగోలా కష్టపడి సర్దుబాటు చేశారు. దీంతో కొత్త టీచర్లకు స్కూళ్లలో పోస్టులు లేకుండా పోయాయి. 
టీచర్ సెలవుపెడితే ఆ స్థానంలో పనిచేయాలంటూ ఆదేశాలు
కొత్త టీచర్లతో ఏం పనిచేయించాలన్న అంశంపైనా అధికారుల్లో స్పష్టత కరువైంది.. మండల పరిధిలో ఎవరైనా టీచర్ సెలవు పెడితే ఆయన స్థానంలో పనిచేయాలంటూ కొందరిని పంపుతున్నారు.. మరికొందరికి మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు.. అలాగే విద్యార్థుల ఆధార్‌ నెంబర్లు, పాఠ్యపుస్తకాలు, ఉచిత దుస్తుల పంపిణీ పర్యవేక్షణ విధులూ కేటాయిస్తున్నారు.. మరికొన్నిచోట్ల ఈ టీచర్లను అకడమిక్‌ కో-ఆర్డినేటర్లుగా నియమించాలని చూస్తున్నారు.. 
రోజువారీ పనులు పూర్తిచేయాల్సిన దుస్థితి
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ విచిత్ర పరిస్థితి టీచర్లను ఇబ్బందిపెడుతోంది.. స్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు...... రోజుకోచోట తిరుగుతూ.. ఉన్నతాధికారులు ఇచ్చిన రోజువారీ పనులు పూర్తిచేయాల్సిన దుస్థితి పట్ల వారు ఆవేదన చెందుతున్నారు. అధికారులుమాత్రం కొత్త టీచర్ల సమస్యను త్వరలో పరిష్కరిస్తామంటున్నారు... కొద్దికాలం వేచిచూడాలని... ఆలోపు స్కూళ్లను కేటాయిస్తామని స్పష్టం చేస్తున్నారు.. 

13:21 - June 19, 2016

ఇండియా..38 ఏండ్ల చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ కు చేరింది..ఎన్నో ఆశలు..స్వర్ణకాంతులను తీసుకొస్తుందని ఎందరో క్రీడాభిమానులు ఎదురు చూశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టే కొత్త సారథి శ్రీజేష్ నాయకత్వంలో క్రీడాకారులు ఆడారు. కానీ పెనాల్టీ షూటౌట్ ఫైట్ ఆఖరిలో టీవీ అంపైర్ తీసుకున్న నిర్ణయం భారత్ ను సిల్వర్ మెడల్ కే పరిమితం చేసింది....గోల్ కీపర్ శ్రీజేష్ సారథ్యంలోని హాకీ ఇండియా..ఎలిజబెత్ ఒలింపిక్ పార్కులో అదరగొట్టింది. పటిష్టమైన రక్షణ వలయంతో కంగారులకు ఒక్క గోల్ కూడా భారత్ ఇవ్వలేదు. అంటే క్రీడాకారులు ఎలాంటి పోరాటం చేసిందో అర్థం చేసుకోవచ్చు. కానీ షూటౌట్ లో టీవీ అంపైర్ అనుచిత నిర్ణయంతో మరో పెనాల్టీ షూటౌట్ లో అదనంగా పొందిన ఆస్ట్రేలియా 3-1తో భారత్ పై పై చేయి సాధించింది.  లీగ్ దశలో భారత్ పై 4-2 తో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. సహజసిద్ధమైన శైలిలో దూకుడుగా ఆడిన ఆసీస్ కు భారత్ డిఫెన్స్ తో సమాధానమిచ్చింది. దీనితో ఎన్నిసార్లు గోల్ చేద్దామని అనుకున్న ఆసీస్ కల నెరవేరలేదు. కెప్టెన్, గోల్ కీపర్ శ్రీజేష్ కళ్లు చెదిరే డిఫెన్స్ ఆసీస్ ను నిలువరించింది. ఆట సమయం పూర్తయ్యింది. కానీ ఫలితం తేలకపోవడంతో షూటౌట్ నిర్ణయంచారు.

షూటౌట్..
షూటౌట్‌ మొదలైంది. ఆసీస్‌ అప్పటికే 1-0 ఆధిక్యంలో ఉండగా.. భారత్‌ నుంచి ఉతప్ప తృటిలో టార్గెట్‌ మిస్‌ అయ్యాడు. ఇక రెండో పెనాల్టీ షూట్‌కు ఆసీస్ మిడ్ ఫీల్డర్ బిలె డానియెల్‌ వచ్చాడు. గోల్‌ పోస్ట్‌ దిశగా కదులుతున్న దశలో బంతి గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ కాళ్ల నడుమకు వచ్చింది. కొద్దిసేపు తటపటాయించిన డానియెల్‌ బంతిని బయటకు తీసుకుని కొట్టినా.. మిస్‌ ఫైర్‌ అయ్యాడు. బంతి శ్రీజేష్‌ ప్యాడ్‌ కింద ఉండటంతో డానియెల్‌ వీడియో రిఫరల్‌ కోరాడు. డానియెల్‌ అభ్యర్థనను పరిశీలించిన టీవీ అంపైర్‌ నెల్‌ డియోన్‌ (దక్షిణాఫ్రికా) ఆసీస్‌కు మరో పెనాల్టీ అవకాశాన్ని అందించాడు. మరో పెనాల్టీ షూట్‌ పొందిన డానియెల్‌ ఈ సారి గురి తప్పలేదు. ఇలా ఆధిక్యంలోకి వెళ్లిన ఆసీస్‌ అదే జోరుతో పెనాల్టీ షూటౌట్‌ను 3-1తో ముగించి.. విజేతగా అవతరించింది.

భారత్ అభ్యంతరం...
ఆస్ట్రేలియాకు మరో పెనాల్టీ షూట్ ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే చాంపియన్స్ ట్రోఫీ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసింది. భారత్‌ ఫిర్యాదును పరిశీలించిన టోర్నీ జ్యూరీ.. సుమారు గంటన్నర తర్వాత టీవీ అంపైర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. విజేత ప్రకటన ఆలస్యం కావటంతో బహుమతి ప్రధానత్సోవం మైదానంలో కాకుండా.. మీడియా కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగింది. చాంపియన్స్‌ ట్రోఫీలో రజతం సాధించిన హాకీ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని నరెంద్ర మోడీ సహా క్రీడా రంగ ప్రముఖులు టీమ్‌ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

13:18 - June 19, 2016

ఆహారం..పిల్లల ఎదుగుదలకు పునాది. అవును శారీరక ఎదుగదల కూడా పిల్లలో ప్రమాణాల మేరకు ఉంటుంది. పాలపై ఆధారపడిన వయసు దాటిన తరువాత పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం విషయంలో తల్లిదండ్రులు కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సమతుల ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా దేహధారుఢ్యం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మూడు నాలుగు నెలల వయస్సు దాటితే ఎదుగుదల వేగం పుంజుకుంటుంది. అందువల్ల వారికి తల్లిపాలతో పాటు పళ్ల రసాలు ఇవ్వాలి. వీటివల్ల జలుబు చేస్తుందని కొందరు అనుకొంటూ ఉంటుంటారు. కానీ ఇది కేవలం అపోహ అని వైద్యులు పేర్కొంటున్నారు. ఉడికించిన కూరగాయల రసం, పప్పుతేట, గంజి వంటి పదార్థాలను ఇవ్వాలి. విటమిన్లు, ఇనుమువంటి ఖనిజ లవణాలు పిల్లలకు లభిస్తాయి.
ఇక ఆరు నెలల నుండి పండ్ల రసాలతో పాటు మెత్తగా ఉడికించిన ధాన్యాలు, పప్పులు, చిక్కటి గంజి, ఉడికించిన కూరగాయలు, అరటి, బొప్పాయి, ఆపిల్, మామిడి తదితర పండ్లను గుజ్జుగా చేసిన తినిపించాలి. ఆరు, ఏడు నెలలకు పిల్లలకు ధాన్యం, పప్పు, బెల్లం కలిపి చేసిన మిశ్రమాన్ని ఆహారాన్ని ఇవ్వాలి. మొలకలను ఆరబెట్టి పిండి చేసి అనుబంధంగా ఆహారంగా ఇస్తే బాగుంటుంది.
తొమ్మిది, పది నెలలనుంచి కిచిడీ, అటుకులు, ఇడ్లీ, ఉడికించిన మాంసం, చేపలు తాలింపు, కారం లేకుండా తినిపించాలి.
పదకొండు, పన్నెండు నెలలలో పెద్దలు తీసుకునే ఆహారాన్ని కొంచెం మెత్తగా కారం, మసాలాలు లేకుండా పెట్టాలి. ఈ వయసులోనే అన్ని రకాల ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయాలి.
సరియైన ఆహారాన్ని అందించకుండా లేనిపోని అపోహలు, అర్థం లేని అనుమానాలు పెంచుకుంటూ ఉంటారని, పిల్లల ఎదుగుదలను అడ్డుకోవడం అవివేకమే అవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

13:17 - June 19, 2016

ఖర్జూరం..ఈ పండ్లలో అధిక మోతాదులో కార్బొహైడ్రైట్స్ ఉంటాయి. ఈ పండును తినండం వల్ల ఇన్ఫెక్షన్లను తట్టుకొనే వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తస్రావాన్ని అరికడుతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరం చేస్తాయి. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకోవడం వల్ల జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లను కూడా కరిగించే శక్తి ఈ ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లు...ఉదర సంబంధమైన వ్యాధులు..రక్తపోటును తగ్గిస్తాయి. గర్భిణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులువు అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పూర్తయ్యాక చాలా మంది ఖర్జూరాలను తింటుంటారు. మరికెందుకు ఆలస్యం..ఖర్జూరాలను తినేయడం మొదలెట్టండి...

13:15 - June 19, 2016

మెదక్ : జిల్లాలోని మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పరిహారంకోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. సంగారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర దీక్షలోఉన్న పల్లెపహాడ్‌ గ్రామస్తుడు రమేశ్‌ ఆరోగ్యం క్షీణించింది.. ఆయన్ని  స్థానిక ఆస్పత్రికి తరలించారు. మిగతావారి ఆరోగ్యంకూడా బాగాలేదని వైద్యులు తెలిపారు. అటు ఇదే అంశంపై రిలేదీక్షలుకూడా 14వరోజుకు చేరాయి. ప్రభుత్వం దిగివచ్చిన భూసేకరణచట్టంప్రకారం నష్టపరిహారం ఇచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని సీపీఎం స్పష్టం చేసింది.

 

నిలకడగా ముద్రగడ ఆరోగ్యం

పశ్చిమబోగోదావరి : ముద్రగడ దీక్ష 11వ రోజుకు చేరినా ఆరోగ్యం నిలకడగాఉంది. ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా కనిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపునకు ఉన్నతాధికారుల అనుమతి కోరతామని వైద్యులు అన్నారు. 

12:41 - June 19, 2016

ముంబై : మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలోని వెంకటాపూర్ అటవీప్రాంతాల్లో నిన్న రాత్రి గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శోభన్ గా గుర్తించారు. వారి శవాలను మైదాన ప్రాంతాలకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

 

మిద్దె కూలి విద్యార్థి మృతి

అనంతపురం : జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. డోనేకల్ లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వజ్రకరూరు మండలం కమలపాడులో రాత్రి కురిసిన వర్షానికి మిద్దెకూలి విద్యార్థి భరత్ మృతి చెందాడు. 

12:28 - June 19, 2016

పశ్చిమగోదావరి : ఉప్పొంగుతున్న సముద్రం ఆ ఊరిని మింగేసింది. 10 ఏళ్ల క్రితం చెట్లు, పంటపొలాలు, చెరువులతో నిండుగా ఉన్న ఆ ఊరును సముద్రం తనలో కలిపేసుకుంది. ఇప్పుడు మరో ఊరును మింగేసేందుకు ఉరకలేస్తోంది. పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం మండలంలోని పెద్దమైనివానిలంకను మింగేయడానికి ముందుకు వస్తున్న సముద్రం కోతను గురించి తెలుసుకోవాలంటే.. చినమైనివానిలంక గుండె ఘోషను వినాల్సిందే... సముద్రుడి ఉగ్రతాపానికి తీర ప్రాంత గ్రామాలన్ని వణిపోతున్నాయి. ఊరంటే.. ఇళ్లు.. పొలాలు.. మనుషులు .. పశువులే కనిపిస్తాయి. కాని ఇక్కడ అవేవీ ఉండవు.. అంతా నీరే..
సముద్రం ఉగ్రరూపానికి నిదర్శనం
ఇది నిజం సముద్రం ఉగ్రరూపానికి నిదర్శనమే.. ఈ గ్రామం. కొంచెం కొంచెంగా  ముందుకు వస్తూ... గ్రామాలను తనలో కలిపేసుకుంటుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనివానిలంక. దీన్ని మ్యాపుల్లో మాత్రమే చూడాలి...ఎందుకంటే.. నేడు ఈ గ్రామమే లేదు. తెల్లారితే... బ్రతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని సముద్రంలో వేటకు వెళ్లే..నిరుపేదలు.. ఈ గ్రామవాసులు. వారు చదువుకోవడానికి ఒక బడిని..గ్రామాలను కలుపుతూ.. ఇక బ్రిడ్జిని కట్టించింది ప్రభుత్వం. ఒకప్పుడు సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే... చినమైనివానిలంకను నేడు ఆ స్కూలు ఆనవాళ్లతోనే గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
సముద్రంలో కలిసిపోయిన చినమైనివానిలంక
నాలుగేళ్ల క్రితం వరకు తీరానికి కిలో మీటరువరకు ఇసుకమేటలు ఉండేవి.  చినమైనివానిలంక గ్రామం మొత్తం సముద్రంలో కలిసిపోవడంతో... అలల మద్యలో కనిపిస్తున్న ఈ వంతెనే ఇందుకు సాక్ష్యం. నాలుగేళ్లలో సముద్ర ప్రకోపానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సముద్రం ఇంకా ముందుకు వస్తూ.. పెద్దమైనివానిలంకకు  చేరువవుతుండడంతో గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి.
సముద్రపు కోత నివారణచర్యలు చేపట్టడంలో అలసత్వం
సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో.. లంకలో ఇప్పటి వరకు 600 ఎకరాలపైనే పట్టా భూములు సముద్రంలో కలిసిపోయాయి. పెదమైనివానిలంకలో ఇప్పటివరకు వేల ఎకరాల పొలాలు.. చెరువులు.. సముద్రం కోతకు గురయ్యాయి. ఎన్నికలసమయంలో... సముద్రం కోత నివారణకు చర్యలు చేపడతామని.. చెప్పుకుంటూ..వస్తున్ననేతలెవరు చొరవచూపడంలేదని వాపోతున్నారు గ్రామస్తులు. ఈ పెదమైనవానిలంకను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నారు. కోతను అడ్డుకుంటామని.. హామీ అయితే ఇచ్చారు కాని..నేటికి అది జరగలేదని అంటున్నారు
ఆందోళనలో లంక గ్రామాలు
ప్రస్తుతం నిర్మలాసీతారామన్‌ వేరే రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. తాజాగా గ్రామాల్లో ఆందోళన మొదలైంది. సముద్రకెరటాలు ఎగసిపడుతుండడం... పశ్చిమగోదావరిజిల్లాలోని చాలా గ్రామాలు కోతకు గురవుతుండడంతో.. ప్రాణాలనుగుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు ప్రజలు. ఏళ్లుగా సముద్రం కోతకు గురవుతున్న ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని.. ఈ నెల 20 వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు నరసాపురం పర్యటించనుండడంతో.. తమ సమస్యను మరోసారి సీఎం ముందు పెట్టడానికిప్రజలు ఎదురుచూస్తున్నారు.
 

12:13 - June 19, 2016

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రామాయపట్నంకు చెందిన 8 మంది మత్స్యకారులు ఆటోలో వెళ్తున్నారు. సింగరాయకొండ బైపాస్‌ రోడ్ దగ్గర ప్రమాదవశాత్తు ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారికి వేరే ఆస్పత్రికి తరలించారు. 

 

ఆర్టీసీ కళ్యాణమండలంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సభ

హైదరాబాద్ : ఆర్టీసీ కళ్యాణమండలంలో తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సభ నిర్వహించనున్నారు.  నిర్వాసితులు సభను అడ్డుకుంటారని సమాచారం రావడంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

11:44 - June 19, 2016

చిత్తూరు : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తిరుమలకు వచ్చిన హరీశ్‌రావు తన మొక్కు తీర్చుకున్నారు. కాలినడకన శ్రీవారి ఆలయానికి చేరుకున్నారాయన. మిషన్‌కాకతీయతోపాటు నీటిపారుదుల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తికావాలని... బంగారు తెలంగాణ సుసాధ్యం కావాలని స్వామివారిని కోరుకున్నట్టు హారీశ్‌రావు చెప్పారు. హరీశ్ రావుతోపాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. 

 

11:40 - June 19, 2016

డొనాల్డ్ ట్రంప్ కు బర్త్ డే సెలబ్రేట్ చేసిన హిందుసేన, చాలామంది మైగ్రేడ్ అవుతున్నారని జానారెడ్డి ప్రస్టేట్ అవుతున్నారంట. భారత్ క్రికెట్ కోచ్ పదవికి 57 ఎంట్రీలు వచ్చాయట. భారత్ దేశంలో బట్టల బాధలు... ప్రాథమిక పాఠశాలలో టీచర్లు జీన్స్ వేసుకోవద్దని హర్యానా ప్రభుత్వం నిషేదం. దేవుళ్లకు ఆర్ ఎస్ ఎస్ యూనిఫాం, వినాయకుళ్లకు జీన్స్ ప్యాంట్స్, గుంటూరులో కోతి దొంగ, పంచర్లలో స్కాం, తాబేలుకు చక్రాలు.. ఈ అంశాలపై క్రేజీన్యూస్ ను వీడియోలో చూద్దాం.. 

 

11:24 - June 19, 2016

ప్రస్తుత చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ హవా నడుస్తోంది. గతంలో ఐటెమ్ సాంగ్స్ లో కథానాయిక కాకుండా వేరే హీరోయిన్ నటించేవారు..కానీ ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్ లో కథానాయికనే నటిస్తోంది. ఆ పాటలు, డ్యాన్స్ హిట్ అవుతుంది కూడా. ఇప్పుడొచ్చే ప్రతి సినిమాలో దాదాపు ఐటెమ్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుంది. బాలీవుడ్ మొదలుకొని.. టాలీవుడ్ వరకు టాప్ హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ లో నటించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నూతన నటీనటుల దగ్గర్నుంచి స్టార్‌ హీరోయిన్ల వరకు ఐటెమ్‌ సాంగ్స్ లో నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్‌, కత్రినాకైఫ్‌, ప్రియాంక చోప్రా, టాలీవుడ్‌లో తమన్నా, శ్రియా, ఛార్మి,.. ఇలా చాలామంది స్టార్‌హీరోయిన్లు ఐటెమ్స్‌ సాంగ్స్ లో మెరిసి మెప్పించినవాళ్ళే. కానీ ఓ టాప్ హీరోయిన్ మాత్రం ఐటెమ్ సాంగ్స్ కు నో చెబుతోంది. ప్రత్యేక గీతాల్లో నటిస్తానే తప్ప ఐటెమ్‌ సాంగ్స్ లో మాత్రం నటించనంటుంది. ప్రత్యేక గీతాల్లో డాన్స్ పర్‌ఫార్మెన్స్‌ కి ప్రాధాన్యత ఉంటుంది... కానీ ఇప్పుడొచ్చే ఐటెమ్‌ సాంగ్‌ల ఉద్దేశమే మారిపోయిందని చెబుతున్నారు. ఇంతకీ ఆ హారోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ఆమె రాధికా ఆప్టే. స్పెషల్‌సాంగ్స్, ఐటెమ్‌ సాంగ్స్ ఈ రెండింటిలో మీరు దేనికి ప్రాధాన్యమిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆప్టే సమాధానంగా చెబుతూ..'ఐటెమ్‌ సాంగ్స్ లో మెరిసి మెప్పించిన తారలందరికీ నేను భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. మనమేమిటో నిరూపించుకోవడానికి ప్రత్యేక గీతాలు బాగా ఉపయోగపడతాయి. కానీ ఐటెమ్‌ సాంగ్స్ లో అలాంటిదేమీ ఉండదు. పైగా ఇటువంటి గీతాల్లో నటించే తారలను పొట్టి దుస్తుల్లో మాత్రమే చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే వాటికి దూరంగా ఉండాలనుకున్నాను' అని చెప్పింది. ఆప్టే ప్రస్తుతం 'కబాలి' తమిళ చిత్రంలో రజనీకాంత్‌ సరసన నటిస్తోంది. దీంతోపాటు 'ద ఫీల్డ్', 'బొంబాయి రియా' వంటి బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. మరి ఇదే నిర్ణయానికి ఆప్టే కట్టుబడి ఉంటుందా... లేదా  చూడాలి మరి.. 

 

11:07 - June 19, 2016

పవన్‌కళ్యాణ్‌, శ్రుతిహాసన్‌ హీరోహీరోయిన్స్ గా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఫ్యాక్షనిస్ట్ లీడర్‌ ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈచిత్రంలో ప్రతినాయకుడిగా అజయ్ ముఖ్య భూమికను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈచిత్రాన్ని నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. జులై నుంచి షూటింగ్‌ జరుగనుంది. ఈ చిత్ర ప్రారంభ సమయంలో 'సేనాపతి' అనే టైటిల్‌ సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేసింది. తాజాగా 'కడప కింగ్‌' అనే టైటిల్‌ సందడి చేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ ను మూటగట్టుకుంది. రాబోయే ఈ సినిమా హిట్ అవుతుందో.. ఫట్ అవుతుందో చూడాలి మరీ.. 

రెండో రోజు ప్రారంభమైన సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు

ఢిల్లీ :  సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్రకార్యాలయంలో సమావేశాలు కొనసాగుతన్నాయి. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశ ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 

 

వరంగల్ సెంట్రల్ జైలు సిబ్బందిపై తిరగబడ్డ ఖైదీలు

హన్మకొండ : వరంగల్ సెంట్రల్ జైలు సిబ్బందిపై ఖైదీలు తిరగబడ్డారు. హైసెక్యూరిటీ బ్యారక్ లో ముగ్గురు ఖైదీల వద్ద సెల్ ఫెన్లు లభ్యం అయ్యాయి. స్వాధీనం చేసుకునేక్రమంలో జైలు సిబ్బందితో ఘర్షణ తలెత్తింది. దీంతో జైలు సిబ్బందిపై ఖైదీలు తిరగబడ్డారు. 

 

అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు

 వరంగల్ : మహానగర పాలక సంస్థలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ శివకుమార్ డీఈ కొండలరావు, ఏఈ సారంగంలను సస్పెండ్ చేశారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం...వర్షాలు

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొనిఉన్న ఈ ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. మరోవైపు కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.. ఇక తెలంగాణ విషయానికివస్తేదక్షిణ తెలంగాణలో హైదరాబాద్ నుంచి రామగుండం వరకు రుతుపవనాలు విస్తరించాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

10:30 - June 19, 2016

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొనిఉన్న ఈ ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. మరోవైపు కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.. ఇక తెలంగాణ విషయానికివస్తేదక్షిణ తెలంగాణలో హైదరాబాద్ నుంచి రామగుండం వరకు రుతుపవనాలు విస్తరించాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

10:29 - June 19, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా విషాదం నెలకొంది. ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈదరవాడకు చెందిన రోగి జుత్తిగ నాగరాజు కొద్దిరోజుల క్రితం ఎముకలకు సంబంధించిన ఆపరేషన్‌ చేయించుకున్నాడు. మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో నాగరాజును తణుకులోని అనిల్‌ ఆర్థో క్రిటికల్‌కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు ఇది లివర్‌కు సంబంధించిన వ్యాధి అని చెప్పడంతో మనస్తాపానికిగురై నాగరాజు ఆస్పత్రి బాత్‌రూంలో ప్లాస్టిక్‌ ట్యూబ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

09:28 - June 19, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారపార్టీకి, జేఏసీకి మద్య మాటలయుద్ధం పెరుగుతోంది. గులాబిపార్టీ టీజాక్ ను రాజకీయకోణంలో చూస్తోంది. జాక్ చైర్మన్ కోదండరాం ఇటీవల చేసిన వ్యాఖ్యలతో అధికార పార్టీకి టీజాక్  మద్య వివాదం రాజుకుంది. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ప్రభుత్వంపై టీ-జేఏసీ చేసిన విమర్శలను గులాబీ పార్టీ సీరియస్‌గా తీసుకుంటోంది. అయితే.. ప్రభుత్వ వైఖరిని ప్రజాసంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు బహిరంగంగానే తప్పుపడుతున్నాయి. 
ప్రభుత్వ తీరును విభేదిస్తున్న కోదండరాం
తెలంగాణ విద్యావంతుల వేదిక, టీ జేఏసీ చైర్మన్ కోదండరాంలు.. ప్రాజెక్టుల భూనిర్వాసితులు, ఓపెన్ కాస్ట్ మైనింగ్ తదితర అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విభేదించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదనే విమర్శలు కొన్ని రోజుల క్రితం కోదండరాం చేయడంతో అధికార పార్టీ.. టీజేఏసీ మధ్య దూరం పెరిగింది.
టీజేఏసీ పై టీఆర్ఎస్ నిప్పులు
టీ-జేఏసీ వ్యవహరిస్తున్న తీరుపై గులాబి పార్టీ నేతలు.. జేఏసీ చైర్మన్‌పై  నిప్పులు చెరిగారు. అంతే ధీటుగా టీ-జేఏసీ కూడా స్పందించింది. ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.  అధికార పార్టీ నేతల విమర్శలతో  అత్యవసరంగా  సమావేశమైన  టీ-జేఏసీ.. ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. బెదిరింపులు వచ్చినా వెనుకడుగు వేయమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మెదక్‌ జిల్లాలో చేపడుతున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం ఉద్యమ సంఘానికి.. అధికార పార్టీకి మరింత చిచ్చురేపేలా కనిపిస్తోంది. 
టీజేఏసీ ని అడ్డుకోవాలన్న హరీష్ రావు
మెదక్ జిల్లా మల్లన్న సాగర్  భూనిర్వాసితుల పక్షాన ఉండాలని నిర్ణయం తీసుకున్న టీ-జేఏసీ త్వరలో అక్కడ భూసేకరణ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం సొంతజిల్లా కావడంతో.. అధికారపార్టీ నేతలు ఇప్పటి నుంచే టీ-జేఏసీపై మరోసారి విమర్శలు మొదలుపెట్టారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను  తాము ఆదుకుంటామని చెబుతూనే టీ-జేఏసీని గ్రామాల్లోకి రానియ్యకుండా అడ్డుకోవాలని గులాబిపార్టీ నేతలు పిలుపునిచ్చారు. 
అందరిలోనూ టెన్షన్‌ 
టీ-జేఏసీతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన గులాబిపార్టీ.. ఉద్యమ సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు టీ-జేఏసీని అడ్డుకోవాలని పిలునివ్వడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది. 

09:22 - June 19, 2016

హైదరాబాద్ : తాగిన మైకంలో ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేస్తూ ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు గాయాలపాలయ్యారు. సంతోష్‌నగర్‌ పీఎస్ పరిధిలోని ఓవైసీ ఆసుపత్రి దగ్గర డివైడర్‌ని ఆల్టోకారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సందీప్‌, శరత్‌, సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన వారిగా గుర్తించారు.

09:15 - June 19, 2016

హైదరాబాద్ : నగరం జూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందిపై కేసులు నమోదు చేశారు. 9 కార్లు, 10 బైక్‌లు, ఒక డీసీఎంను సీజ్ చేశారు.

 

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర : గడ్ఛిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఏకే 47తోసహా ఎస్ ఎల్ ఆర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

08:58 - June 19, 2016

విజయవాడ : రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం బట్టీలతో హైదరాబాద్‌లోని వీధులన్నీ ఘుమ ఘుమ లాడుతుంటాయి. అయితే ఈ హలీం ఘుమ ఘుమలు ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని విజయవాడకు కూడా చేరాయి. రంజాన్‌ ఉపవాస దీక్షల అనంతరం హలీమ్‌ రుచులను ఆరగించేందుకు విజయవాడలోని భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. బెజవాడ వించిపటలో లభించే హలీం, ఇతర నాన్‌ వెజ్‌ రుచులపై ప్రత్యేక కథనం.  
రంజాన్ నెలలో గుర్తొచ్చేది హలీం
పవిత్ర రంజాన్ నెల ప్రారంభమైన వెంటనే చాలా మంది భోజన ప్రియులకు గుర్తొచ్చేది హలీం. కేవలం ఈ మాసంలో మాత్రమే స్పెషల్ గా లభించే హలీంను టేస్ట్ చేసేందుకు ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తుంటారు. హలీంను ఆరగించేందుకు విజయవాడ, వైజాగ్‌ లాంటి కోస్తా ప్రాంతాల నుంచి సైతం హైదరాబాద్‌కు వెళ్లేవారు. అయితే ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని విజయవాడలోని వించిపేటలోనూ హైదరాబాద్‌ తరహా పసందైన హలీం లభిస్తోంది. 
నవ్యాంధ్రలోని వించిపేట హలీంకు ఫేమస్
హలీమ్ తయారీలో హైదరాబాద్ పాతబస్తీ మాదిరిగానే నవ్యాంధ్రలోని వించిపేట ఫేమస్ అవుతుందని బెజవాడ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వించిపేటలో గతంలో ఒకటి రెండు దుకాణాలు మాత్రమే ఉండేవి. గత ఐదేళ్లుగా 25కు పైగా దుకాణాలు ఏర్పాటు చేశారు.
హలీమ్ దుకాణాలు 
వించిపేటతో పాటు విజయవాడ నగరంలోని భవానీపురం, అరండల్ పేట, లబ్బీపేట, బెంజ్ సర్కిల్, మహానాడు సెంటర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ హలీమ్ దుకాణాలు ఈ ఏడాది ఎక్కువగా వెలిశాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వ్యాపారం జరుగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ  హలీమ్‌ను రుచి చూస్తుంటారు. 
హలీంతో పాటు పలు నాన్ వెజ్ వంటకాలు 
ఇక పంజా సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిపై అనేక దుకాణాలలో హలీంతో పాటు పలు నాన్ వెజ్ వంటకాలు ఆకర్షిస్తున్నాయి. రంజాన్ ప్రత్యేక వంటకాల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారని, నిపుణులైన పనివారితో వీటిని తయారు చేయిస్తున్నామని దుకాణ యజమానులు చెబుతున్నారు. 

 

గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ దాడులు

హైదరాబాద్ : గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 25 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. రెండు బస్సులను సీజ్ చేశారు. 

'హెడ్నే ఎన్ కౌంటర్ బూటకం'....

ఛత్తీస్ గడ్ : సుకుమా జిల్లా గోపాండులో ఆంధ్ర, తెలంగాణ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు పర్యటించారు. ఈనెల 13న జరిగిన హెడ్నే (16) ఎన్ కౌంటర్ బూటకమని హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. హెడ్నేను భద్రతా బలగాలు అత్యాచారం చేసి చంపారని కమిటీ సభ్యులు అనుమానిస్తున్నారు. 

 

08:03 - June 19, 2016

గుంటూరు : ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల పంపిణీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారయ్యింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించనున్నారు.  ముందుగా నేలపాడులో పాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో  లాటరీ పద్ధతిలో నివాస, వాణిజ్య స్థలాలు కేటాయిస్తారు. ఒక రైతు ఒకే వైశాల్యం గల స్థలాలు రెండు, మూడు కోరుకుంటే అవన్నీ పక్కపక్కనే వచ్చేలా ఇస్తారు. తమకు ఏ వైశాల్యం గల స్థలాలు కావాలో ఇప్పటికే రైతులు సీఆర్‌డీఏకు దరఖాస్తులు అందజేశారు. దాని ఆధారంగా నేలపాడు గ్రామానికి సంబంధించిన తుది లేఅవుట్‌ను అధికారులు రూపొందించారు. ఇక రైతులకు ఇచ్చే స్థలాల నెంబర్లు వాయువ్య దిశ నుంచి మొదలవుతాయని అధికారులు తెలిపారు. 

 

08:00 - June 19, 2016

హరారే : టీ 20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు భారత్‌కు షాకిచ్చింది. వన్డే సిరీస్‌లో తేలిపోయిన ఆతిధ్య జట్టు..తొలి టీ20లో సమిష్టిగా రాణించి సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టుచిగుంబురా కేవలం 26 బంతుల్లోనే 7 సిక్స్‌లు, ఒక్క ఫోర్‌తో 54 పరుగులు నమోదు చేయడంతో జింబాబ్వే టీమ్‌...భారత్‌ ముందు 171 పరుగుల లక్ష్యాన్నుంచింది. అయితే భారత జట్టు 20 ఓవర్లలో 168 పరుగులే చేయగలిగింది. చివరి ఓవర్‌లో మద్జీవా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి జింబాబ్వే జట్టుకు సంచలన విజయాన్నందించాడు.2 పరుగుల తేడాతో నెగ్గిన జింబాబ్వే  జట్టు...మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

 

07:58 - June 19, 2016

ముంబై : కోట్లాది రూపాయల మాదకద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి మెడచుట్టూ ఉచ్చు  బిగుసుకుంటోంది. ముంబై శివారు పట్టణం థానేలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్‌లో మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాతో సంబంధం ఉన్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో మమతా కులకర్ణి ఆమె భర్త విక్కీ గోస్వామి పేర్లు బయటపడ్డాయి. త్వరలోనే వారిని విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కెన్యాలో ఉన్న మమతపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ ను కోరతామని, అలాగే మమత, గోస్వామి లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తామని పోలీసులు పేర్కొన్నారు. బాలీవుడ్‌లో మమత, విక్కీలతో సంబంధమున్న వారిపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.

 

07:53 - June 19, 2016

ఢిల్లీ : రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌ పదవిలో కొనసాగేందుకు రఘురాం రాజన్‌ విముఖత వ్యక్తం చేశారు. దీంతో గత కొద్దిరోజులుగా రాజన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలకు పుల్‌స్టాప్‌ పడింది. అయితే.. రెండోసారి తనకు ఈ పదవి దక్కదనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా ? అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
సెప్టెంబర్‌ 4న ముగియనున్న రాజన్‌ పదవీకాలం
రిజర్వ్ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ రెండోసారి పదవిని చేపట్టేందుకు నిరాసక్తత వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 4న పదవీకాలం ముగియగానే తన పూర్వవృత్తికి తిరిగి వెళ్తానని రాజన్‌ తన సహచరుల వద్ద ప్రకటించారు. అలాగే తన తర్వాత పదవిని చేపట్టేవాళ్లు దేశాన్ని మరింత ఎత్తుకు తెస్తారన్న నమ్మకం తనకుందన్నారు రాజన్‌.
రాజన్‌ వ్యాఖ్యల వెనక అనేక అనుమానాలు ?
అయితే.. రాజన్‌ తాజా వ్యాఖ్యల వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రాజన్‌కే రెండోసారి పదవిని చేపట్టడం ఇష్టం లేదా ? లేక మోదీ సర్కార్‌ తనను కొనసాగించేందుకు సుముఖంగా లేదన్న విషయం తెలిసి రాజన్‌ ముందే ఈ నిర్ణయం తీసుకున్నారా ? అనే సందేహాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు. రాజన్‌ను గవర్నర్‌గా కొనసాగించవద్దని.. ఆయన అచ్చం అమెరికా మనిషేనని.. ఆయన ఆలోచనలన్నీ ఆ విధంగానే ఉంటాయని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎన్నోసార్లు చెప్పారు. అయితే జైట్లీ మాత్రం రాజన్‌ను కొనసాగించేందుకే మొగ్గు చూపారు. కానీ.. ప్రస్తుతం రాజన్‌ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 
రాజన్‌ పనితీరును ప్రశంసించిన జైట్లీ 
రాజన్‌ తాజా వ్యాఖ్యల అనంతరం.. జైట్లీ స్పందించారు. ఆర్బీఐ కొత్త గవర్నర్‌ నియామకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజన్‌ పనితీరును ప్రశంసిస్తూనే.. తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెళ్లాలన్న రాజన్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. 
రాజన్‌ సరైన నిర్ణయం తీసుకున్నారన్న సుబ్రహ్మణ్యస్వామి
అయితే.. రాజన్‌ కొనసాగింపును వ్యతిరేకిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి మాత్రం రాజన్‌ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజన్‌ వ్యాఖ్యలు చేసిన అనంతరం పలువురు ప్రముఖులు స్పందించారు. రాజన్‌ అంత్యంత ప్రతిభావంతుడని.. ఆర్బీఐ విశ్వసనీయతను పెంచేందుకు అనేక విధాలుగా కృషి చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక రాజన్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ తనకే అన్నీ తెలుసుననే భ్రమలో నిపుణుడైన రాజన్‌ను వదులుకుంటున్నారని ఆరోపించారు. కష్టకాలంలో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి.. దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రాజన్‌కు తన అభినందనలు తెలిపారు. మొత్తానికి రాజన్‌ రెండోసారి కొనసాగుతారా ? లేదా ? అనే సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. మరి రాజన్‌ స్థానంలో కేంద్రం.. ఆర్బీఐ పగ్గాలు ఎవరికి అప్పగిస్తుందో చూడాలి. 

 

07:48 - June 19, 2016

హైదరాబాద్ : కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు జోరందుకోనున్నాయి. వచ్చే బుధవారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతలంలో  ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. రాయలసీమ, తెలంగాణ, ఛత్తీస్ గడ్ వంటి పలు ప్రాంతాలలో వర్షాలు పడనున్నాయి ... 
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రెండు రోజులుగా బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం..ప్రస్తుతం దక్షిణ ఒడిశా తీరం పరిసరాల్లో కేంద్రీకృతమైంది.ఇది వాయువ్యంగా పయనించే అవకాశం ఉందని..వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ సీజన్ లో ఆవర్తనాలు..అల్పపీడనాల వల్ల దక్షిణనైరుతి వైపు వర్షాలు కురుస్తుంటాయి. 
కోస్తాలో భారీ వర్షాలు  
వీటి ప్రభావంతో.. తెలుగురాష్ట్రాల్లో  రానున్న 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో... కోస్తాలో.. అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. నూజివీడు అవనిగడ్డలో...8 , ప్రకాశం బ్యారేజీ మంతాలయంలో 6 రేపల్లె తిరువూరు , మచిలీపట్నం లలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పోర్నగంజ్ వరకు విస్తరించిన రుతుపవనాలు 
అటు తెలంగాణలోను కొన్న ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడంతో.. తెలంగాణ అంతటా  వర్షాలు కురిశాయి. రుతుపవనాల కదలికలు ఆశించిన స్థాయిలో ఉండడంతో.. రుతుపవన రేఖ కన్వార్ , హన్మకొండ రాంచీ మీదుగా పోర్నగంజ్ వరకు విస్తరించాయి. దక్షిణ కోస్తా తీరం పరిసరాల్లో కేంద్రీ కృతమైంది.  దీని ప్రభావంతో.. నల్లగొండ ,మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో 5 సెంటీ మీటర్లు , టేకులపల్లిలో 5.5 , ఆదిలాబాద్ లో 2.7 శాతం వర్షపాతం నమోదైంది.
ఖమ్మంజిల్లా బయ్యారంలో 2.7 
ఖమ్మంజిల్లా బయ్యారంలో 2.7  ఇల్లందు 2.6 చండ్రుగొండ 2.5 సత్తుపల్లి 2.2 సెంటీమీటర్ల వర్షపాతంనమోదైంది.  బాసర వంటి ప్రాంతాలలో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో 6.2  సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా తీరం పరిసరాల్లో  కేంద్రీకృతమైంది. కాగా రుతుపవనాలు  మరింతగా ముందుకుసాగి  ఉత్తర కర్ణాటక కొంకణ్‌ ,గోవా, మరాఠ్వాడా, విదర్భ, మద్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు  రెండు, మూడురోజుల్లోచేరుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తుల దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. 

 

యూరో కప్ లో నేటి మ్యాచులు

హైదరాబాద్ : యూరో కప్ లో భాగంగా నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు రుమేనియా వర్సెస్ అల్బేనియా తలపడున్నాయి. రాత్రి 12.30 గంటలకు స్విట్జర్లాండ్ వర్సెస్ ఫ్రాన్స్ ఢీకొనన్నాయి. 

 

నేడు అమరావతిలో వైసీపీ బృందం పర్యటన

గుంటూరు : నేడు అమరావతిలో వైసీపీ బృందం పర్యటించనుంది. ధర్మాన నేతృత్వంలో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేల బృందం పర్యటన చేయనుంది. అమరావతి సత్రం భూ కుంభకోణంపై నిజాలను సేకరించనున్నారు. 

07:19 - June 19, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది. రెండో విడత హరిత హారంలో.. గ్రేటర్‌ పరిధిలోనే పాతిక లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది. దీనికి జులై 11ను ముహూర్తంగా నిర్ణయించింది. 
రెండో విడత హరితహారం 
భాగ్యనగరంలో హరితహారం రెండో విడత కార్యక్రమానికి తెలంగాణ సర్కారు సమాయత్తమైంది. ప్రజల భాగస్వామ్యంతో... నగరాన్ని హరిత వనంలా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈసారి వర్షాలు కూడా సమృద్ధిగానే కురుస్తాయన్న అంచనాలతో.. ఉద్యమంలా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. హరితహారం తొలిదశ తప్పులు పునరావృతం కాకుండా ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 
రెండో దశలో పది లక్షల మంది భాగస్వామ్యం
హరిత హారం రెండో దశలో.. ఆరు నుంచి పది లక్షల మంది ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 11న సైరన్‌ మోగించగానే మొక్కలు నాటడాన్ని ప్రారంభించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రజా ప్రతినిధులతో పాటు.. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన, మహిళా సంఘాల సభ్యులను ఇందులో భాగస్వాములను చేయనున్నారు. నగరంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సహా.. అనువైన అన్ని ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలని భావిస్తున్నారు. ప్రజలందరికీ మొక్కలను అందించేందుకు 27 సెంటర్లను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. 
రంగంలోకి దిగిన మంత్రులు, మేయర్‌  
హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మంత్రులు, జీహెచ్ ఎంసీ మేయర్‌కూడా రంగంలోకి దిగారు. ఖాళీ జాగాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాదే.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే.. సరైన ప్రణాళిక లేక.. సకాలంలో వర్షాలు కురవక కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. నీరందక నాటిన మొక్కలు కూడా ఎండిపోయాయి. ఈసారి అలా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజల స్పందనను బట్టి.. హెచ్‌ఎండీఏ పరిధిలోనే 50 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం సంకల్పించింది. హరిత హారం రెండో దశలో నాటే మొక్కల్ని జాగ్రత్తగా పరిరక్షించి.. వచ్చే ఏడాదికల్లా నగరాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

 

07:11 - June 19, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ వ్యూహం మారిందా ? ఆపరేషన్‌ ఆకర్ష్ తో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న గులాబీ పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేరికకు రెడ్‌ సిగ్నల్‌ వేసిందా ? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకు గులాబీ దళపతి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణమేంటి? 
ఎమ్మెల్యేల చేరికకు తాత్కాలిక విరామం
టీఆర్‌ఎస్‌ తన ఎమ్మెల్యేల సంఖ్యను సెంచరీకి చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలిక విరామం ప్రకటించింది. 63 స్థానాలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా కాలుపెట్టిన గులాబీదళం.. ఇప్పుడు ఆ సంఖ్యను 90కి పెంచుకుంది. కేసీఆర్‌ వ్యూహాలకు అసెంబ్లీలో వైసీపీ, సీపీఐలు పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోయాయి. టీడీపీ కూడా 15 స్థానాల్లో విజయం సాధించినా.. వారి సంఖ్య ఇప్పుడు మూడుకు పడిపోయింది. 
మరో ఐదారుగురు టీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతుంది. ఇప్పటికే అనేకమంది టీఆర్‌ఎస్‌లో చేరగా.. మరో ఐదారుగురు అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కూడా నేడో రేపో కారెక్కుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎవరూహించని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఇప్పట్లో టీఆర్‌ఎస్‌లో చేర్చుకోరాదనే అభిప్రాయంతో గులాబీ బాస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ నుంచి తాత్కాలికంగా వలసలకు బ్రేక్‌ పడినట్లేనని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న జానారెడ్డిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 
కమలనాథులపై దృష్టి పెట్టిన గులాబీ బాస్‌ 
అయితే.. ఇప్పటివరకు తమకు చిక్కని కమలనాథులపై గులాబీ పార్టీ దృష్టి సారించినట్లు సమాచారం. బీజేపీలో ఉన్న కుమ్ములాటలను అనుకూలంగా మలచుకునేందుకు గులాబీ బాస్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు కారెక్కేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కమలనాథుల్లో ఇద్దరు మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఇక బీజేపీ వంతు పూర్తయితే గులాబీ పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న ఎంఐఎం.. అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ బారిన పడకుండా మిగిలినట్లవుతుంది. 

 

07:06 - June 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గత ఏడాది 38వేల 90కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో... మైనింగ్, పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహిస్తామన్న కేటీఆర్.. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని పునరుద్ఘాటించారు. 
పరిశ్రమల శాఖ పాలసీ 
హైదరాబాద్‌లో పరిశ్రమలశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అనుమతిపొందిన పారిశ్రామిక సంస్థలకు సంబంధిత పత్రాలను అందజేశారు. పరిశ్రమల శాఖ పాలసీ తెలంగాణ ప్రభుత్వ విధానమని ప్రకటించారు. ఇండస్ట్రీల ఏర్పాటు హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా.. జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాది కల్పనతో పాటు.. అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. 
వచ్చేఏడాది రూ. 4వేల కోట్ల ఆదాయం లక్ష్యం
గనుల శాఖ రెండో వార్షిక నివేదికనుకూడా కేటీఆర్‌ విడుదలచేశారు.. గత ఏడాది మైనింగ్‌శాఖనుంచి 2,772 కోట్ల ఆదాయం ఆర్జించామని తెలిపారు.. వచ్చేఏడాది 4వేల కోట్ల రూపాయల్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.. మైనింగ్ కార్మికుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను కేటీఆర్ వివరించారు. భవిష్యత్తులో పారిశ్రామిక విధానంలో మరింత పారదర్శకమైన విధానాలు అమలుచేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.. తెలంగాణ యువతకు ఎక్కువ ఉపాది అవకాశాలు దక్కేలా శిక్షణ ఇస్తామని తెలిపారు.. 

 

నేడు రెండో రోజు సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు

ఢిల్లీ : నేడు రెండో రోజు సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు జరుగనున్నాయి. ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్రకార్యాలయంలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

బైక్ రేసింగుకు పాల్పడిన యువకుల అరెస్టు

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో బైక్ రేసింగుకు పాల్పడిన 20 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరి నుంచి 18 బైకులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

 

సూల్తాన్ బజార్ సీఎస్ పరిధిలో దారి దోపిడీ

హైదరాబాద్ : సూల్తాన్ బజార్ సీఎస్ పరిధిలో రాత్రి దారి దోపిడీ జరిగింది. రాజధాని టైర్ల షాప్ యజమాని షాపు మూసి ఇంటికి వెళ్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు అతని నుంచి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు. 

Don't Miss