Activities calendar

20 June 2016

మంగళవారం డీఈఓ ఆఫీసుల వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన...

హైదరాబాద్‌: ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని నిరసిస్తూ మంగళవారం నగరంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో డీఈఓ ఆఫీసుల వద్ద ఆందోళనలు చేపట్టాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. 

22న పీఎస్ఎల్వీ సీ -34 రాకెట్ ప్రయోగం..

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో సీ-34రాకెట్‌ను ఇస్రో బుధవారం ప్రయోగించనుంది. 20 శాటిలైట్లను సీ-34 రాకెట్ ద్వారా ఒకేసారి అంతరిక్షంలోకి పంపనున్నారు. సోమవారం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 

మంగళవారం భారత కోచ్ కు ఇంటర్వ్యూలు..

ఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపికకు సర్వం సిద్ధమైంది. చీఫ్ కోచ్‌ను ఎంపిక చేయడానికి సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సన్నద్ధమయ్యింది. పోటీ పడుతున్నవారిని సీఏసీ మంగళవారం ఇంటర్య్వూ చేయనుంది. షార్ట్ లిస్ట్ చేసిన 21 మంది సభ్యులు మాత్రమే ఇంటర్య్వూకు హాజరుకానున్నట్లు బీసీసీఐ తెలిపింది.

మంగళవారం రాజ్ భవన్ లో యోగా వేడుకలు..

హైదరాబాద్ : మంగళవారం ఉదయం.7.10 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌తో పాటు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. 

సంజీవయ్య పార్కులో యోగా వేడుకలు..

హైదరాబాద్ : ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం సంజీవయ్య పార్కు లో వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు, తదితరులు హాజరు కానున్నారు.

 

కేంద్ర మంత్రి సురేష్ ప్రభుతో సీఎం బాబు భేటీ..

విజయవాడ : కేంద్రమంత్రి సురేష్‌ప్రభుతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో కృష్ణా పుష్కరాలకు కావాల్సిన నిధులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. 

21:32 - June 20, 2016

హరారే : జింబాబ్వేపై రెండో టి20 మ్యాచ్‌ ను భారత్ గెలిచింది. 100 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ 47 పరుగులు, మన్‌దీప్ సింగ్ 52 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 99 పరుగులే చేసింది. బరీందర్ స్రాన్ కీలకమైన 4 వికెట్లు తీయగా, బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. 

21:31 - June 20, 2016

ఢిల్లీ : సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. మోది రెండేళ్ల పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య తీవ్రమైందని సిపిఎం ధ్వజమెత్తింది. ధరల పెరుగుదలకు నిరసనగా దేశ వ్యాప్తంగా జూలై 11 నుంచి 17 వరకు ఆందోళన నిర్వహించాలని కేంద్ర కమిటి నిర్ణయించింది. మోది రెండేళ్లపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే బిజెపి సంబరాలు జరుపుకుందని సిపిఎం మండిపడింది. పప్పులు, కూరగాయలు, నిత్యావసరవస్తువుల ధరలు పెరగడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తులు ముఖ్యంగా డీజిల్‌ ధర పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఆరేళ్ల క్రితానికి పడిపోయిందని తెలిపింది. జులై 11 నుండి 17వ తేదీ వరకు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై దేశ వ్యాప్త ఆందోళన చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది.

సెప్టెంబర్ 2 సమ్మె..
పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం కార్యకర్తలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ఎన్నికల్లో 176 మంది సిపిఎం కార్యకర్తలను టిఎంసి పొట్టన పెట్టుకుందని ఆరోపించింది. 60 వేల మంది కార్యకర్తలు నిరాశ్రయులయ్యారని పేర్కొంది. ఎన్నికల్లో బిజెపి, టిఎంసికి వ్యతిరేకంగా 2 కోట్ల 15 లక్షల మంది ఓటేశారని ఏచూరి చెప్పారు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా వ్యవసాయం కుంటుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోయాయి. 2015లో 3 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని సిపిఎం తెలిపింది. మోది కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2 దేశ వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల సమ్మెకు పిలుపునిచ్చింది. మోది ప్రభుత్వ హయాంలో మతపరమైన దాడులు అధికమౌతున్నాయన్నారు. ఆర్టికల్ 356ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని సిపిఎం ధ్వజమెత్తింది. జీఎస్టీ బిల్లుపై నెలకొన్న అభ్యంతరాలను మోది అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

21:29 - June 20, 2016

హైదరాబాద్ : నగర రోడ్ల స్థితిగతులపై ప్రజలు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శాఖల మధ్య సమన్వయం తీసుకురావాలని నిర్ణయించామని.. రోడ్ల విషయంలో టెండర్ల విధానం మారుస్తామని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతను ఒక ప్రత్యేక సంస్థకు అప్పగిస్తామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చీఫ్‌ ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కమిటీ సూచనల మేరకు రోడ్ల నిర్వహణ బాధ్యతను ఏజెన్సీలకు అప్పగిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

 

21:27 - June 20, 2016

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యల హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్స్ ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం తప్పుపట్టింది. జాబితాలో సగానికి పైగా పేర్లు ఇతరత్రా కారణాల వల్ల అత్మహత్యలు చేసుకున్నవారివేనని ఉన్నత న్యాయస్థానికి వివరణ ఇచ్చింది. అయితే అంకెలపై సంతృప్తి చెందని ధర్మాసనం.. రెండు వారాల్లో పూర్తి ఆధారాలతో ఆఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అదేశించింది. గత ఏడాది రుణభారం, కరవుతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణలో చాలామంది రైతన్నలు బలవన్మరణం చెందారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలంటూ  ప్రొఫెసర్ కొదండరామ్, వ్యవసాయ సంఘాల నేత శ్రీహరి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పిటిషన్ వేశాయి. దీనిపై విచారణలో భాగంగా పిటిషనర్లు చూపినట్లుగా 345 మంది రైతులు ఆత్మహత్య చేసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు 113 మంది మాత్రమేనని తెలిపారు.

దర్యాప్తు కొనసాగుతోంది..
త్రిసభ్య కమిటీతో ఆత్మహత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రత్యేక న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్లు చెప్పిన 345 మంది జాబితాలో 40 మంది పేర్లు పునరావృతమయ్యాయని చెప్పారు. వరంగల్‌లో 5గురు రైతులు ఆత్మహత్య చేసుకోకుండానే చేసుకున్నట్లు పిటిషనర్స్ పేర్లు ఇచ్చారని వాదించారు. జాబితాలో 301 మంది రైతుల పేర్లను... ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పరిశీలించగా.. 188 మంది ఆత్మహత్య చేసుకోలేదని తెలిపారు. పాముకాటుకు, కరెంట్ తీగలు తగిలి చనిపోయినా కూడా ఆత్మహత్యల లెక్కలో జమ చేశారన్నారు. అధికంగా భార్య, భర్తల గొడవలతో మద్యం సేవించి చనిపోయిన వారు ఉన్నట్లు కమిటీ దర్యాప్తులో తెలిందని రాష్ర్ట ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.  ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో మరో 43 మంది నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 70 మంది అప్పుల బాధతో చనిపోతే 60 మందికి నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. ప్రభుత్వ లెక్కలు, పిటిషనర్ల జాబితాకు పొంతన లేకపోవడంతో... రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతకంటే ముందు... రైతుల ఆత్మహత్యలకు కారణమైన బ్యాంకులు... వారికి రుణాలు సరిగా ఇవ్వడం లేదని పిటిషనర్ శ్రీహరి ధర్మాసనానికి నివేదించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారంపై మాత్రమే విచారణ జరుపుతున్నామని.. సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులతో పని చేయించుకోవాలని న్యాయస్థానం సూచించింది. 

21:24 - June 20, 2016

హైదరాబాద్ : జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లతో సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాలు, మండలాల ప్రతిపాదనలు, ఉద్యోగుల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిపాలనకు అవసరమైన భవనాలు, స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని.. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. 

21:23 - June 20, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఏరువాక ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి రోజున పొలం పనులకు రైతులు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో.. ముఖ్యమంత్రి స్వయంగా ట్రాక్టర్‌ నడిపి వరినాట్లు వేసి.. ఏరువాకను ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనీ సందర్భంగా హామీ ఇచ్చారు. విజయవాడ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న చంద్రబాబు.. అక్కడినుంచి హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం చేరుకున్నారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత డాక్టర్‌ మంగిన వెంకటేశ్వరరావు స్వగ్రామమైన చిట్టవరంలో... ఎంవీ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంబించారు. అనంతరం ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి వరినాట్లు వేశారు.

వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి...
చిట్టవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. గడచిన పదేళ్లలో ఎరువుల కోసం రైతులు నానా అవస్థలు పడేవారని సీఎం అన్నారు. క్యూలో నిలబడి వెనక్కి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని,. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఆ కష్టాలన్నీ లేకుండా.. లాభం చేకూరేలా చేస్తోందని అన్నారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు తీసుకొస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు.

త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్..
ఇక త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు చంద్రబాబు. యాంత్రీకరణ, ఉత్పత్తిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆయన సూచించారు. ఈ ఏడాది నుంచి ఈ-క్రాప్‌ విధానం అమలు చేస్తామన్నారు. మరోవైపు కాపులకు ఎంతో మంది హామీలిచ్చినా చేసిందేమీ లేదని.. తాము వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. కాపులను బీసీ జాబితాలో ఖచ్చితంగా చేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమం ద్వారా రైతుకు మేలు జరుగుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. 

21:21 - June 20, 2016

ఢిల్లీ : 2015 తర్వాత మరోసారి భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలకు నరేంద్రమోది ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విదేశి పెట్టుబడులకు సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కీలకమైన రక్షణ, విమానయాన, ఈ కామర్స్, ట్రేడింగ్ తదితర రంగాలకు సంబంధించిన అత్యంత వివాదాస్పద నిర్ణయాన్ని చడీచప్పుడు లేకుండా ప్రకటించేసింది. డిఫెన్స్‌, ఎయిర్‌లైన్స్‌ రంగాల్లో వందకి వంద శాతం, ఫార్మా రంగంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం బార్లా తలుపులు తెరిచింది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతంగా ఉండేది. దీనిని ఒకేసారి 100 శాతానికి పెంచడం చరిత్రలో ఇదే తొలిసారి.

రక్షణ రంగంలో..
రక్షణ రంగంలో ఎఫ్‌డిఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం-1959కి సవరణలు చేసింది. దీనిద్వారా చిన్న చిన్న ఆయుధాల తయారీలో కూడా విదేశీ పెట్టుబడులకు అనుమతి లభిస్తుంది. రక్షణ రంగంలో ఎఫ్‌డిఐలకు సంబంధించి 2014లో యూపీఏ హయాంలోనే చర్చలు మొదలయ్యాయి. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ.. కీలకమైన రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్ డీఐలకు అనుమతి సరికాదని ఆందోళనలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. 2015లో ప్రభుత్వ అనుమతితోనే వంద శాతం ఎఫ్‌డిఐలకు అనుమతిస్తామని చెప్పిన మోది ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చింది. 2016 నాటికి డిఫెన్స్‌లో 49 శాతం ఎఫ్‌డిఐలు ఆటోమేటిగ్గా అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే పెట్టుబడులకు ఒకే చెప్పింది. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు.

సిపిఎం విమర్శలు..
అమెరికా పర్యటనలో మోది ఒబామాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రక్షణ శాఖలో వంద శాతం ఎఫ్‌డిఐలకు కేంద్రం తలుపులు బార్లా తెరచిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఫార్మా రంగంలో ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారానే 74 శాతం ఎఫ్‌డిఐలకు ప్రభుత్వం అనుమతించింది. విదేశి పెట్టుబడుదారులు ప్రభుత్వ అనుమతి లేకుండానే 74 శాతం పాత కంపెనీలలో పెట్టుబడులు పెట్టే వీలుంది. కొత్తగా పెట్టే ఫార్మాసూటికల్‌ కంపెనీల్లో వంద శాతం పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్ రంగంలో కూడా వంద శాతం పెట్టుబడులకు ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఇందులో 49 శాతం ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఆటోమేటిక్‌ రూట్లో పెట్టుబడులు రానున్నాయి. ట్రేడింగ్‌లో మాత్రం ప్రభుత్వ అనుమతితోనే వంద శాతం పెట్టుబడులు రానున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో ఫార్మా, ఏవియేష‌న్‌, ర‌క్షణ రంగాల్లో మ‌రిన్ని విదేశీ పెట్టుబ‌డులు రానున్నాయి. అయితే భారతదేశ ఆర్థికవ్యవస్థను పెట్టుబడిదారుల గుప్పిట్లో పెట్టడమే ఆర్థికసంస్కరణల ప్రధాన ఉద్దేశం.

21:17 - June 20, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు గడువు సమీపిస్తోంది. దీనితో ఏపీ సీఎస్ టక్కర్ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈనెల 24 నుండి దశల వారీగా కార్యాలయాలు తరలించాల్సిందేనని సీఎస్ స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన హాస్టళ్ల సౌకర్యం కల్పించాలని..భద్రత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ కార్యాలయాలకు సరైన భవనాలు దొరకలేదని హెచ్ వోడీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 

21:06 - June 20, 2016

గుంటూరు : సదావరిసత్రం భూముల వ్యవహారం ముదురుతోంది. ఈ అంశంపై వైసీపీ ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు గొడ్డళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటన అమరావతి (మం) నరుకుళ్ల పాడులో చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో 9మందికి గాయాలయ్యాయి. ఇందులో ఆరుగురు వైసీపీ కార్యకర్తలుండగా ముగ్గురు టీడీపీ కార్యకర్తలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సదావర్తిసత్రం భూముల వ్యవహారంలో వైసీపీ పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ప్రాంతంలో వైసీపీ నేత ధర్మాన పర్యటించారు. ఈ పర్యటనను టిడిపి నేతలు అడ్డుకున్నారు. దీనితో ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

వైసీపీ - టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..

గుంటూరు : అమరావతి (మం) నరుకుళ్ల పాడులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. టీడీపీ వర్గీయులు గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 9మందికి గాయాలయ్యాయి. 

ప్రత్యేక సంస్థకు రోడ్ల నిర్వాహణ బాధ్యత - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : రోడ్ల స్థితిగతులపై ప్రజల నుండి సలహాలు..సూచనలు వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐదు శాఖల మధ్య సమన్వయం తీసుకరావాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రోడ్ల విషయంలో టెండర్ల విధానం మారుస్తామన్నారు. నగరంలో రోడ్ల నిర్వాహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగిస్తామని వెల్లడించారు. 

20:31 - June 20, 2016

వేములగట్టు..మల్లన్న సాగర్ ప్రాజెక్టు చేపడితే వేములగట్టు మునిగిపోతుంది. ఈ విషయం తెలిసిన ప్రజలు కన్నీళ్లు కార్చుతున్నరు. ఇక్కడ ఎన్నో కులవృత్తుల వారున్నరు. ప్రాజెక్టు కడితే తమ బతుకులు ఛిద్రం అవుతాయని వారు పేర్కొంటున్నరు. వారి ఆవేదన..కన్నీళ్లు తెలుసుకొనేందుకు ఆ గ్రామానికి టెన్ టివి 'మల్లన్న' వెళ్లిండు. వారి బాధలను..ఆవేదనను తెలియచేసే ప్రయత్నం చేసిండు. తమ బతుకు నాశనం చేస్తున్న ఈ ప్రాజెక్టు వద్దంటే వద్దంటున్నరు. ఊరి ఖాళీ అయితే పని ఉండదని..బయటకు పోతే చెప్పేవాడు ఉండడు. ఇక్కడే ఛస్తం అని అంటున్నరు. వీరు చెబుతున్నట్టు చూస్తే ప్రాజెక్టు వల్ల గ్రామం మునిగిపోతే కులవృత్తులు ఛిన్నాభిన్నమవడం ఖాయం. వారి ఆవేదన..తీవ్ర ఆందోళనలో ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:23 - June 20, 2016

ప్రజలు..ఆ తరువాత ప్రభుత్వాలు..కానీ మల్లన్న సాగర్ పరిస్థితి చూస్తే ఇది నిజం కాదనిపిస్తోంది. మల్లన్న సాగర్ వద్దు అంటూ మొత్తుకుంటున్నా సర్కార్ లో చలనం లేదు. తాము ఇక్కడనే ఛస్తామని..చట్టాలు..జీవోలు వద్దు అంటూ గొంతెత్తి అరుస్తున్నరు. ఇంత జరుగుతున్న సర్కార్ కు చీమ కుట్టినట్లైనా లేదు. దీనితో వారంతా ఏకమయ్యారు. గత కొన్ని రోజులుగా దీక్షలు చేపట్టిండ్రు. ఇలా చేపట్టి 19 రోజులవుతోంది. ఇక్కడకు వస్తున్న వారు చెబతున్న మాటలతో తమలో ధైర్యం వస్తోందని..ఇక్కడే ఛస్తాం అని అంటున్నరు. అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుకొనేందుకు టెన్ టివి 'మల్లన్న' ప్రయత్నించిండు. వారి బాధలు..ఆవేదనను బాహ్యా ప్రపంచానికి తెలియచేసిండు. మరి వారి ఆవేదన..వారి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కేజ్రీ..షీలా దీక్షిత్ లపై ఎఫ్ఐఆర్..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్...మాజీ సీఎం షీలాదీక్షిత్ పై ఎఫ్ఐఆర్ దాఖలైంది. వాటర్ కుంభకోణంలో కేసు నమోదైంది. కేజ్రీవాల్ పై లెఫ్టినెంట్ గవర్నర్ కు బీజేపీ నేత విజయేంద్ర గుప్తా ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీకి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. వాటర్ ట్యాంకర్ల కేసులో 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కూచనపల్లిలో 60 మంది విద్యార్థులకు అస్వస్థత..

మెదక్ : కూచనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

19:45 - June 20, 2016

నో వేకెన్సీ. ఉద్యోగాల్లేవ్.. ఉపాధి మీద ఆశల్లేవ్.. మీరెంత చదివినా కొలువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. సర్టిఫికెట్లు దేనికీ పనికి రానివిగా మారిపోయే రోజులు వస్తున్నాయి. ఇవన్నీ వట్టి మాటలు కాదు.. నివేదికలు చెప్తున్న సత్యం.. ఏడేళ్లుగా క్రమంగా తరిగిపోతున్న ఉద్యోగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధి రేటు పెరుగుతోంది తప్ప ఉపాధి పెరుగుదల నిల్ గా మారుతోంది. దీనికి కారణాలేంటి? ఏ విధానాలు ఈ సమస్యను పెంచుతున్నాయి? దీనిపై ప్రత్యేక కథనం..

వృద్ధి పెరుగుతోంది..
అంకెలు గొప్పగానే ఉంటాయి. కానీ, వాటి ఫలితం అంతగా గొప్పగా ఉండటం లేదు. అభివృద్ధి చెందుతున్నాం.. అంటే, దాని ఫలితాలు అందరికీ అందాలి. వృద్ధి పెరుగుతోంది అంటే.. అది అన్ని రంగాలపైనా కనిపించాలి. కానీ, ఇక్కడ ఆర్ధిక వృద్ధి అంకెలు ఘనం తప్ప ఉపాధి అవకాశాలు మాత్రం అడుగంటి పోతున్నాయి. సర్వేలు చెప్తున్న వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉపాధి అనూహ్యంగా పడిపోతోంది. సర్కారీ ఉద్యోగాలు లేవు. చిన్నా చితకా ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి. స్వయం ఉపాధి మార్గాలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఓవరాల్ గా పని దొరకని దేశంగా భారత్ మారుతోంది. మరో పక్క ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతూ లక్షలాది మంది రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. దేశంలో ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోతున్నాయన్నది స్పష్టం. ప్రభుత్వోద్యోగాల మాట తర్వాత. ప్రైవేటు ఉద్యోగాలది కూడా అదే పరిస్థితి. చిన్నా చితకా పని దొరకటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి. మొన్నటికి మొన్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏలు చదివిన వారు కూడా రావటం పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది. మరోపక్క నైపుణ్యం లేక కొందరు, నైపుణ్యం.. ఉన్నా ఉపాధి దొరక్క మరికొందరు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

ఆ రంగాలను గాలికొదిలేస్తే..
డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్ట్ అప్‌ ఇండియా లాంటి పథకాలు ఎన్నున్నా, వ్యవసాయ ప్రధాన దేశంలో మట్టిని నమ్ముకుని బతికే ప్రజలు మెజారిటీగా ఉన్నదేశంలో వ్యవసాయాన్ని, వ్యవసాయ ఆధారిత రంగాలను గాలికొదిలేస్తే బతకటానికి కోట్లాదిమంది అష్టకష్టాలు పడటం తధ్యం. ఉపాధి కోసం రోడ్డున పడటం ఖాయం. పథకాలను ప్రచార ఆర్భాటంతో కాకుండా, క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలు కూడా ఉండేలా చూస్తే తప్ప నిరుద్యోగం మరింత పెరగకుండా అపే అవకాశం ఉండదు. మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను గాలికొదిలి.. ఉద్యోగాలు తగ్గాయని లెక్కలు వేయటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

భారత్ ఘన విజయం..

హరారే : జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారేలో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేసింది. జింబాబ్వే జట్టులో మూర్ (31), వాలర్ (14), ట్రిపానో (11), చిబాబా (10), మసకద్జ (10) పరుగులు చేశారు. అనంతరం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత ఓపెనర్లు జింబాబ్వేకు చుక్కలు చూపించారు. జింబాబ్వే బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 13.1 ఓవర్లలోనే 103 పరుగులు చేశారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన బరీందర్ శ్రాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

19:28 - June 20, 2016

టీఎస్ ఆర్టీసీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీలే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం ఓ హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికంటే ముందు సమ్మెలు చేస్తే ఆర్టీసీని మూసివేద్దామా ? అని సీఎం కేసీఆర్ అన్నట్లు పలు వార్తలు వచ్చాయి. సర్కార్ చర్యలతో మళ్లీ లాభాల బాట సాధ్యమేనా ? కేసీఆర్ సమీక్షపై కార్మిక సంఘాల రియాక్షన్ ఏంటీ ? ఆర్టీసీ మార్గాలను ప్రైవేటు పరం చేస్తారా ? ప్రాంతాల వారీగా ఆర్టీసీ కార్పొరేషన్లు ఏర్పాటవుతాయా ? టీఎస్ ఆర్టీసీ గాడిన పడుతుందా ? అనే అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అశోక్ (ఎన్ఎంయూ), థామర్ రెడ్డి (టీఎంయూ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తదితర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

హెచ్చార్సీని ఆశ్రయించిన మల్లన్న సాగర్ నిర్వాసితులు..

మెదక్ : మానవ హక్కుల కమిషన్ ను మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఆశ్రయించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పేరిట ప్రభుత్వం ఇళ్లు, భూములను బలవంతంగా తీసుకొంటోందని ఫిర్యాదు చేశారు. 

ముగిసిన టీఎస్ సీఎస్ సమీక్షా సమావేశం.

హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో జరిపిన టీఎస్ సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కొత్త జిల్లాలు, మండలాల ప్రతిపాదనలు, ఉద్యోగుల అంశాలపై కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సుదీర్ఘంగా చర్చించారు. పరిపాలనకు అవసరమైన భవనాలు, స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

ముగిసిన టీఎస్ సీఎస్ సమీక్షా సమావేశం.

హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో జరిపిన టీఎస్ సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కొత్త జిల్లాలు, మండలాల ప్రతిపాదనలు, ఉద్యోగుల అంశాలపై కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సుదీర్ఘంగా చర్చించారు. పరిపాలనకు అవసరమైన భవనాలు, స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

టీపీసీసీ భూ సేకరణ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీ పీసీసీ భూ సేకరణ సబ్ కమిటీ భేటీ అయ్యింది. 2013 భూ సేకరణ చట్టం, 123 జీవోపై చర్చించారు. ఈ సమావేశానికి ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, డీకే అరుణలు హాజరయ్యారు.

 

ముగిసిన ఏపీ సీఎస్ సమావేశం..

విజయవాడ : హైదరాబాద్ సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ఏపీ సీఎస్ టక్కర్ జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. 24 నుండి పైలట్ ప్రాజెక్టుగా తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని, మహిళా ఉద్యోగుల భద్రతపై పటిష్టమైన చర్యలు తీసుకోవావలని సీఎస్ సూచించారు. ఉద్యోగుల తరలింపు ప్రక్రియలో వేగం పెంచాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

18:59 - June 20, 2016

అర్జెంటీనా వండర్ లయనెల్‌ మెస్సీ....పోర్చుగల్‌ థండర్‌ క్రిస్టియానో రొనాల్డో. మోడ్రన్ సాకర్‌లో తిరుగులేని స్ట్రైకర్లుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరి మధ్యలో...ఎప్పటినుంచో ఆధిపత్య పోరు జరుగుతోంది. అమెరికాలో లయనెల్‌ మెస్సీ అర్జెంటీనా జట్టుని ముందుండి నడిపిస్తుంటే యూరో కప్‌లో పోర్చుగల్‌ కెప్టెన్‌ రొనాల్డో మాత్రం రేంజ్‌కు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. రెండు మెగా టోర్నీల్లో ఈ ఇద్దరు సూపర్‌ స్టార్ల ప్రదర్శనపై స్పెషల్‌ ఫోకస్‌. ఓ వైపు యునైటెడ్‌ స్టేట్స్ లో కోపా అమెరికా ..మరోవైపు ఫ్రాన్స్ లో యూరో కప్‌ పోటీలు, సాకర్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఫీఫా వరల్డ్ కప్‌ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రెండు మెగా టోర్నీల్లో ఎంతమంది ఆటగాళ్లున్నా ఫుట్‌బాల్‌ అభిమానులందూ ఇద్దరూ స్టార్‌ ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

కోపా అమెరికాలో మెస్సీ...
కానీ కోపా అమెరికాలో లయనెల్‌ మెస్సీ అర్జెంటీనా జట్టుని ముందుండి నడిపిస్తుంటే యూరో కప్‌లో పోర్చుగల్‌ కెప్టెన్‌ రొనాల్డో మాత్రం రేంజ్‌కు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమైన మెస్సీ...రెండో మ్యాచ్‌లో పనామాపై పెద్ద సంచలనమే సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి మెస్సీ..కేవలం 19 నిమిషాల్లోనే హ్యాట్రిక్‌గోల్స్‌తో అదరగొట్టాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో మెస్సీ స్కోర్‌ చేయకపోయినా బొలీవియా గోల్‌కీపర్‌ కార్లోస్‌ లాంపేతో ఆటాడుకున్నాడు. కార్లోస్‌ను బోల్తా కొట్టించి మెస్సీ నట్‌మెగ్‌ చేసిన విధానం టోర్నీకే హైలైట్‌గా నిలిచిపోయింది. వెనిజ్వెలాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక గోల్‌ స్కోర్‌ చేసిన మెస్సీ....మరో గోల్‌కు అసిస్ట్ చేసి ఆకట్టుకున్నాడు. ఇలా కోపా అమెరికాలో మెస్సీ ...కెప్టెన్‌గా, స్ట్రైకర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.....అర్జెంటీనా జట్టును సెమీఫైనల్స్ చేర్చాడు. అంతే కాదు కోపా అమెరికాలో మెస్సీనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

యూరో కప్ లో రొనాల్డో...
కానీ యూరో కప్‌లో రొనాల్డో ...మెస్సీలా మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు. ఐస్‌లాండ్‌తో ముగిసిన తొలి మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయిన రొనాల్డో ఆస్ట్రియాతో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లోనూ రొనాల్డో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ ద్వారా సులువుగా గోల్‌ చేసే అవకాశం వచ్చినా క్రిస్టియానో తేలిపోయాడు. ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టుగా రాణించలేకపోతున్న రొనాల్డో ప్రస్తుతం తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నాడు.ఒక్క మ్యాచ్‌ నెగ్గలేకపోయిన పోర్చుగల్‌ జట్టు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ చేరినా మరింత పటిష్టమైన జట్టుతో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం మూడో రౌండ్‌ పోటీలో రొనాల్డో ఎలా రాణిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ సాకర్‌ దిగ్గజాలు, విమర్శకులు, అభిమానులు సైతం ఈ రెండు టోర్నీల్లో ఇద్దరి ప్రదర్శన పోల్చి చూస్తే మెస్సీనే ది బెస్ట్ అని చెబుతున్నారు. కోపా అమెరికాలో మెస్సీ మ్యాజిక్‌తో అర్జెంటీనా టైటిల్‌ రేస్‌ ఎలాగూ జోరు మీదున్నాడు. రొనాల్డో సైతం గాడిలో పడితే పోర్చుగల్‌ జట్టుకు తిరుగుండదు. విమర్శకులకు ఎప్పుడూ తన ఆటతోనే సమాధానం చెప్పే క్రిస్టియానో రొనాల్డో యూరో కప్‌లో ఇకనైనా చెలరేగుతాడో లేదో చూడాలి.  

18:57 - June 20, 2016

కోపా అమెరికాకప్ సాకర్ సెంటినరీ టోర్నీ సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది. హ్యూస్టన్ వేదికగా జరిగే తొలిసెమీఫైనల్లో ఆతిథ్య అమెరికాతో అర్జెంటీనా, చికాగో లో జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చిలీతో కొలంబియా ఢీ అంటే ఢీ అంటున్నాయి. అర్జెంటీనా, చిలీ జట్లు మాత్రమే హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. మొత్తం పదహారుజట్ల గ్రూప్ లీగ్ దశ నుంచి...ఎనిమిదిజట్ల క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ కు అర్హత సాధించిన జట్లలో ..హాట్ ఫేవరెట్ అర్జెంటీనా, డిఫెండింగ్ చాంపియన్ చిలీ, ఆతిథ్య అమెరికా, ప్రపంచ మూడోర్యాంకర్ కొలంబియాజట్లు మాత్రమే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలిగాయి. తొలిక్వార్టర్ ఫైనల్లో ఈక్వెడార్ ను 2-1 గోల్స్ తో అధిగమించిన అమెరికా..2016 కోపా అమెరికా సెమీస్ చేరిన తొలిజట్టు ఘనతను సొంతం చేసుకొంది.

సెమీస్ లో కొలంబియా..
మరోవైపు... పెరూతో ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో...పెనాల్టీ షూటౌట్లో నెగ్గిన కొలంబియా సైతం సెమీస్ లో చోటు సంపాదించింది. ఆఖరి రెండు క్వార్టర్ ఫైనల్స్ లో ...వెనిజ్వేలాపై 4-1 అర్జెంటీనా, మెక్సికో పై 7-0తో చిలీ భారీవిజయాలు సాధించడం ద్వారా...సెమీస్ వార్ కు సిద్ధమయ్యాయి. హ్యూస్టన్ వేదికగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో టాప్ ర్యాంకర్ అర్జెంటీనాతో 31వ ర్యాంకర్ అమెరికా అమీతుమీ తేల్చుకోనుంది. 23 ఏళ్ల తర్వాత తొలిఅంతర్జాతీయ టైటిల్ కు గురిపెట్టిన అర్జెంటీనా ఫైనల్లో చోటు సాధించడమే లక్ష్యంగా పోటీకి దిగుతోంది. ఇప్పటికే నాలుగు గోల్స్ సాధించి దూకుడు మీదున్న స్టార్ ప్లేయర్ లయనల్ మెస్సీ మ్యాజిక్ పైనే...అర్జెంటీనా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

క్లింట్ పై అమెరికా ఆశలు..
అతిథ్య అమెరికా మాత్రం..తన తురుపుముక్క క్లింట్ డింప్సే పైన కొండంత ఆశ పెట్టుకొంది. అయితే ..డింప్సే అండ్ కో ఆటలు పవర్ ఫుల్ అర్జెంటీనా ముందు ఏమాత్రం సాగుతాయన్నది అనుమానమే. చికాగో సోల్జర్ ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ , 5వ ర్యాంకర్ చిలీకి మూడోర్యాంకర్ కొలంబియా సవాల్ విసురుతోంది. ఆఖరి క్వార్టర్ ఫైనల్లో మెక్సికో ను 7-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా..టాప్ గేర్ లో ఉన్న చిలీకి...కొలంబియా ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. ఈ రెండు సెమీఫైనల్స్ లో...అర్జెంటీనా, చిలీ జట్లు మాత్రమే హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి.

18:46 - June 20, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణ, పరిహారంపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతుందని.. జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలోని ప్రాజెక్ట్ నిర్వాసిత జేఏసీ నేతలు ఆరోపించారు. 2003 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా.. సర్కార్‌ 123 జీవో తెస్తామనడం ఎంతవరకు సబబు అన్నారు జస్టిస్‌ చంద్రకుమార్‌. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్న జేఏసీ నేతలు.. ప్రభుత్వం మెరుగైన పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తమ ఆవేదనను హేళన చేస్తూ.. ప్రభుత్వమే అనేక సంఘాలతో సభలు పెట్టించడం దారుణమన్నారు నిర్వాసిత జేఏసీ నేతలు. 

18:34 - June 20, 2016

చిత్తూరు : తిరుపతిలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు నయా దందా మొదలుపెట్టాయి. ఫీజు రీయింబర్స్ మెంట్‌ సొమ్మును దండుకునేందుకు విద్యార్ధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కాలేజీలకు రాకపోయినా.. అటెండెన్స్ వేస్తామని, బయోమెట్రిక్‌ను మేనేజ్ చేస్తామని విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ కేంద్రం వద్దే బహిరంగంగా విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇలా ఈ తతంగాన్ని నడిపిస్తున్న ఓ దళారీ 10 టీవీ కెమెరాకు అడ్డంగా దొరికాడు. పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతోంది. ఇక్కడకు శేషాచల, శ్రీరామ, ప్రియదర్శిని ప్రైవేటు కళాశాలల సిబ్బంది చేరుకున్నారు. తమ కళాశాలలో చేరిపించేందుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నాలుగేళ్లు కోర్సు ముగిసిన తరువాత ప్లేస్ మెంట్ ఇస్తామని పక్కా హామీలిస్తున్నారు. ఇందుకు బాండ్ పేపర్ పై సంతకం చేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:26 - June 20, 2016

గుంటూరు : చేసేది ప్రభుత్వ ఉద్యోగం..అయినా డబ్బు సంపాదించాలని కొంతమంది ఉద్యోగులకు అత్యాశ. అందులో భాగంగా అడ్డదారులు తొక్కుతుంటారు. లంచం తీసుకోవడం..ఇతరత్రా మార్గాల ద్వారా డబ్బులను వెనకేసుకొంటుంటారు. కానీ వీరి అక్రమాలు ఎప్పుడో ఒకసారి బయటపడుతుంటాయి. ఇలాగే ఓ ట్రెజరీ చేతివాటం బహిర్గతమైంది. ట్రెజరీ నిధులను స్నేహితుడి ఖాతాల్లోకి మళ్లించి బుక్కయ్యాడు. తెనాలీ సబ్ ట్రెజరీలో వరుణ్ బాబు ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను ట్రెజరీ నిధులను దారి మళ్లించాడు. స్నేహితుడి ఖాతాలోకి నిధులను మళ్లించాడు. ఇలా రెండు మాసాలుగా జరుగుతోంది. నిధులపై సందేహం వచ్చిన ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. దీనితో వరుణ్ బాబు మోసం బయటపడింది. మొత్తంగా రూ. 20 లక్షల నిధులను మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వరుణ్ బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కోటి రూపాయల వరకు నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

18:19 - June 20, 2016

పశ్చిమగోదావరి : విలువైన ఆభరణాలు..నగదు ఇంట్లో పెట్టుకొంటే సమస్యలు వస్తాయని కొందరు బ్యాంకులో దాచుకుంటుంటారు. బ్యాంకు అయితే భద్రం అని భావిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది బంగారం తాకట్టు పెట్టి లోన్ ద్వారా డబ్బులను తీసుకుంటుంటారు. లోన్ తీరిన అనంతరం వారి బంగారాన్ని తీసుకెళుతుంటారు. కానీ ఆకువీడు కార్పొరేషన్ బ్యాంకులో తమ బంగారం కనిపించకపోయేసరికి ఖాతాదారులు ఘొల్లుమంటున్నారు. సుమారు రూ. 75 లక్షల విలువైన బంగారం మాయమైంది. కానీ ఇంకా ఎక్కువ స్థాయిలో బంగారం మాయమైనట్లు తెలుస్తోంది.
ఆకువీడు కార్పొరేషన్ బ్యాంకులో కొంతమంది బంగారం తాకట్టు పెట్టి లోన్ లు తీసుకున్నారు. సోమవారం లోన్ తీర్చి బంగారం తీసుకోవడానికి రాగా ఈ విషయం బట్టబయలైంది. 320 కాసులు అంటే 2 కిలోల 600 గ్రాముతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా కనిపించడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. బ్యాంకులో బంగారం కనిపించడం లేదనే విషయం దావానంలా వ్యాపించడంతో ఖాతాదారులు పెద్ద ఎత్తున బ్యాంకుకు చేరుకున్నారు. పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయో వేచి చూడాలి. 

తెనాలి సబ్ ట్రెజరీలో ఉద్యోగి చేతివాటం..

గుంటూరు : తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగి అరుణ్ బాబు చేతివాటం ప్రదర్శించాడు. ట్రెజరీ నిధులను తన స్నేహితుని ఖాతాలోకి మళ్లించాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 

ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీఎంయూ ప్రచార సభ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దయవల్లే ఆర్టీసీ కార్మికులు తలెత్తుకు తిరుగుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో టీఎంయూ ప్రచార సభ జరిగింది. ఈసభకు మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్టీసీ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.

 

తుని విధ్వంసం కేసులో ముగ్గురికి బెయిల్...

తూర్పుగోదావరి : తుని విధ్వంసం ఘటన కేసులో ముగ్గురికి బెయిల్ లభించింది. ఆకుల రామకృష్ణ, నల్ల విష్ణు, వాసురెడ్డి ఏసుదాసులకు పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

మల్లన్న సాగర్ కు నిర్వాసితులు వ్యతిరేకం కాదు - జస్టిస్ చంద్రకుమార్..

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌కు నిర్వాసితులు వ్యతిరేకం కాదని పరిహారం పెంచాలని అడుగుతున్నారని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్వాసితులకు కేవలం రూ.5.80 లక్షలు ఇస్తామనడం సరికాదని, ప్రపంచంలో ఎక్కడా కాల్వలపై 50 టీఎంసీల రిజర్వాయర్‌ లేదని ఆయన తెలిపారు. 

మల్లన్న సాగర్ ప్రాజెక్టులో న్యాయం కోసం పోరాటం - రేవంత్..

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు అండగా 48 గంటల పాటు దీక్ష చేస్తానని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. 

కీలక రంగాల్లో ఎఫ్ డీఐలకు వ్యతిరేకం - ఏచూరి..

న్యూఢిల్లీ : కీలక రంగాల్లో వంద శాతం ఎఫ్ డీఐలను వ్యతిరేకిస్తున్నామని, దేశ స్వతంత్రకు ఎఫ్ డీఐ వల్ల విఘాతం కలుగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. జులై 11 నుండి 17వ తేదీ వరకు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొద్దిసేపటి క్రితం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2 దేశ వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల సమ్మె ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తోందన్నారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి ట్రేడ్ కాగా, నిఫ్టీ 68 పాయిట్ల లాభపడి ముగిసింది. 

17:14 - June 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరవు నెలకొన్న పరిస్థితుల్లో ఎంతో మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యలకు నివారణ చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. తాజాగా హైకోర్టులో రైతు ఆత్మహత్యలపై విచారణ జరిగింది. 345 మంది ఆత్మహత్య చేసుకున్నారనేది అవాస్తవమని, 188 మంది నకిలీ ఆత్మహత్యలేనని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. పది కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. రెండు వారాల్లోగా పూర్తి ఆధారాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

17:12 - June 20, 2016

విజయవాడ : ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియాలో ఎమ్మెస్ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి నరేష్ పడవ షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నరేష్ కాల్వలో గల్లంతయ్యాడు. ఇతని కోసం గాలింపులు చేపడుతున్నారు. గల్లంతైన నరేష్ మృతి చెందాడా ? లేదా ? అనేది తెలియరావడం లేదు.
నరేష్ గల్లంతైన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ..ఇతర విద్యార్థులతో కుటుంబసభ్యులు మాట్లాడినా వివరాలు తెలియరాలేదేని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందిచింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి..ఇతర మంత్రులు అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడారు. గల్లంతైన నరేష్ క్షేమంగా రావాలని బండిపాలెం గ్రామస్తులు కోరుకుంటున్నారు. 

కాలిఫోర్నియాలో విద్యార్థి నరేష్ మృతి..

విజయవాడ : కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థి నరేష్ కాలిఫోర్నియాలో ఓ నదిలో గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి పడవ షికారుకు వెళ్లాడు. కాలిఫోర్నియాలో ఎమ్మెస్సీ సెకండియర్ చదువుతున్నాడు. జగ్గయ్యపేట మండలం బండిపాలెం నరేష్ స్వస్థలం.

యూపీలో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన మాయవతి..

ఉత్తర్ ప్రదేశ్ : ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీ నుండి మాయావతి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వేటు వేశారు. 

జులై 11-17 వరకు ఆందోళన - సీపీఎం..

న్యూఢిల్లీ : జులై 11 నుండి 17వ తేదీ వరకు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై ఆందోళన నిర్వహిస్తున్నట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2 దేశ వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల సమ్మె ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తోందన్నారు. 

వాణిజ్య, పన్ను కార్యాలయానికి ఉగ్రవాదుల లేఖ..

చిత్తూరు : జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి ఉగ్రవాదుల పేరిట బెదిరింపు లేఖ వచ్చింది. జిల్లా న్యాయస్థానంలో ఇటీవల బాంబు పేల్చింది తామేనంటూ లేఖలో ఉగ్రవాదులు పేర్కొన్నారు. ది బేస్ మూమెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ అల్లా అని లేఖలో రాతలున్నాయి. లేఖపై ఒసామా బిన్ లాడెన్ ముఖచిత్రం ఉంది. లేఖపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ విచారణ ముమ్మరం చేశారు. 

బండేగాదం అటవీ ప్రాంతంలో కాల్పులు..

ఛత్తీస్ గఢ్ : దంతెవాడ జిల్లా బండేగాదం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

 

వోల్గాపూర్ లో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

వరంగల్ : ఆత్మకూరు (మం) వోల్గాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాళేశ్వరం నుండి వరంగల్ కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఆకువీడు కార్పొరేషన్ బ్యాంకులో బంగారం మాయం..

పశ్చిమగోదావరి : ఆకువీడు కార్పొరేషన్ బ్యాంకులో రూ. 75 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. రుణం కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టారు. 

16:13 - June 20, 2016

కృష్ణా : తొలకరి చినుకుల్లో ఏరువాక కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. దత్తత గ్రామమైన గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమ ఏరువాక నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని టెన్ టివితో మాట్లాడారు. నీరు - మీరు చెట్టు, చెరువుల్లో పూడికతీత ద్వారా తీసిన మట్టిని..రైతులకు సేంద్రీయ ఎరువుగా అందిస్తామన్నారు. ఈ ఏరువాక ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు ఏ ముళ్లు..రాయి గుచ్చుకుంటుందో తెలుసుకోవాలని సూచించారు. రైతు కష్టం..ఆవేదన..పంటను ఎలా బతికిస్తున్నాడో తెలుసుకోవాలన్నారు. 

16:00 - June 20, 2016

వస్తున్నది వర్షాకాలం..ఈ వర్షాకాలంలో నీళ్లలో ఎక్కువగా నిలవడం..పనిచేయడం వల్ల పాదాలు నిర్జీవంగా అయిపోతుంటాయి. మరి పాదాలు మెరవాలంటే ఏం చేయాలి. ఏం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
టమాట గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి.
కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును పాదాలకు రాయాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి.
సమపాళ్లలో కీరదోస, నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి. పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 

15:59 - June 20, 2016

చర్మ సమస్యలు..ఈ సమస్య పరిష్కారం కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. చర్మతత్వాన్ని బట్టి వాడాల్సిన ఉత్పత్తుల కోసం మార్కెట్లో వచ్చే వాటిని కొంటూ ప్రయోగాలు చేస్తుంటారు. దీనివల్ల ఉన్న సమస్య పోకుండా ఇతర సమస్యలకు వస్తుంటాయి. ఇలా ఖర్చు చేయబోయే ముందు ఇంటిలోనే దొరికే వస్తువులతో చర్మ సమస్యలు దూరం చేసుకోవచ్చు. అవేంటేమిటో చూద్దాం..
చర్మం నిర్జీవంగా ఉందా ? అయితే బొప్పాయి గుజ్జు, కమలాఫల రసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి.
జిడ్డు చర్మం గల వారు సెనగపిండి, చిటికెడు పసుపు, నిమ్మరసం మిశ్రమాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. అలాగు తేనె, నిమ్మరసం కలిపిన నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఓట్స్, నీళ్లు కలిపి నలుగుపిండిలా తయారు చేసి వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు పట్టడం తగ్గుతుంది.
ఇక పొడి, సాధారణ చర్మతత్వం గల వారు ఓట్స్, బాదం, పాలమీగడలు కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి. తరువాత తక్కువ గాఢత కలిగిన ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. 

కేంద్ర సాయంతో పోలవరం పూర్తి - సీఎం బాబు..

పశ్చిమగోదావరి : కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏరువాక నిర్వహించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. భవిష్యత్ లో మూడో పంటకు కూడా నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతిలో ముందుకెళ్లాలని, బీమా కోసం ఖరీప్ లో 2 శాతం, రబీలో 1.5 ప్రీమియం కట్టాలని సూచించారు. బ్యాంకర్లు వ్యవసాయదారులకు సకాలంలో డబ్బులివ్వాలని, ఈ ఏడాడి నుంది క్రాప్ విధానం అమలు చేస్తామన్నారు. 

తెలంగాణ రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. 345 మంది ఆత్మహత్య చేసుకున్నారనేది అవాస్తవమని, 188 మంది నకిలీ ఆత్మహత్యలేనని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. పది కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. రెండు వారాల్లోగా పూర్తి ఆధారాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

బాబుది దిక్సూచీ లేని వ్యవసాయం విధానం - పార్థసారధి..

విజయవాడ : ఏరువాక సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించడం సంతోషమని, కానీ చంద్రబాబుది దిక్సూచి లేని వ్యవసాయం విధానమని వైసీపీ నేత పార్థసారధి అభివర్ణించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, నీళ్లు ఎప్పుడిస్తారో చెప్పకుండా ఏరువాక కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టం ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. 

15:38 - June 20, 2016

ఆఫ్గనిస్తాన్ : రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మళ్లీ దాడికి తెగబడ్డారు. ఓ మినీబస్‌పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 14 మంది నేపాలి సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో నలుగురు ఆఫ్గనిస్తాన్‌ పౌరులున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు. ఓ విదేశీ కంపెనీకి చెందిన సెక్యూరిటి గార్డులను తీసుకెళ్తున్న మినీబస్‌ను ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారని ఆప్ఘన్‌ హోంశాఖ ప్రతినిధి సిదీక్‌ సిద్ధికి తెలిపారు. కాబుల్‌ దాడిని ప్రధాని నరేంద్ర మోది తీవ్రంగా ఖండించారు. నేపాల్‌ ప్రభుత్వానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

15:37 - June 20, 2016

ఢిల్లీ : బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెంటపడ్డానని, ఆయన వెళ్లిపోయాడని ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంగతి తేలుస్తానంటూ స్వామి అన్నారు. కేజ్రీవాల్ నివాసం బయట నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ నేత మహేశ్ గిరికి స్వామి మద్దతు తెలిపారు. అంతేకాదు... ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌పై కూడా విరుచుకు పడ్డారు. జంగ్‌ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ఆయనను కూడా పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నాడు. ఢిల్లీ నగరపాలక మండల అధికారి ఎంఎం ఖాన్‌ హత్య కేసులో బిజెపి ఎంపి మహేశ్‌ గిరిని ఎల్జీ నజీబ్‌జంగ్‌ కాపాడుతున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. దీంతో కేజ్రీవాల్‌ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మహేశ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

15:32 - June 20, 2016

పశ్చిమగోదావరి : జిల్లా చిట్టవరంలో సీఎం చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు యంత్రం ద్వారా వరినాట్లు వేశారు. రైతులకు ఆదరణ తగ్గే పరిస్థితి నెలకొందని...దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని.. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తామన్నారు. దిగుబడి పెంచేందుకు రైతులు ఆధునిక పద్ధతులు అవలంభించాల్సిన అవసరముందన్నారు చంద్రబాబు. రైతులకు న్యాయం చేస్తాం..అండగా ఉంటాం..వినూత్న మార్గాలను ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1000 మి.మీటర్ల వర్షం కురుస్తోందని, ఏపీ రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఉద్యమ స్పూర్తితో ముందుకెళుతున్నామన్నారు. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చాలని, నదుల అనుసంధానం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 

అనంతలో...
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే రైతులందరికీ వేరుశనగ విత్తనాలను అందించామని, మూడు లక్షల 57 వేల మంది రైతులు సబ్సిడీ వేరుశనగను తీసుకొన్నారని పరిటాల సునీత తెలిపారు. ఇవేకాక సద్దలు, కొర్రలు, జొన్నలు కూడా తీసుకొన్నట్లు చెప్పారు. 

15:26 - June 20, 2016

హైదరాబాద్ : కేబీఆర్ పార్కు వద్ద స్కైవే నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆ ప్రాంతంలో పలు చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కేబీఆర్ పార్కు దగ్గర స్కైవే నిర్మించడం వల్ల 2900 చెట్లు నరికివేస్తున్నారనే దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కేబీఆర్ పార్కు లోపల చెట్లను తొలగించడం లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. చెట్లను తొలగించడం వల్ల పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని..ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. చెట్లను వేరే ప్రాంతంలో నాటాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. వేళ్లతో పాటు తీసుకుని వెళ్లి ఇతర ప్రాంతాల్లో నాటడం సాధ్యం కాదని..ఒక చెట్టు తీసివేస్తే మూడు చెట్లు నాటుతున్నామని ప్రభుత్వ తరపున న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణనను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. 

15:21 - June 20, 2016

ఢిల్లీ : విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచేసింది. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు వద్దని పలువురు ఆర్థిక నిపుణులు..వామపక్షాలు హెచ్చరిస్తున్నా నేడు వంద శాతం ఎఫ్ డీఐలకు అనుమతులు మంజూరు చేసేసింది. రక్షణ..విమానయాన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. ఇందులో వంద శాతం పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ప్రభుత్వం అనుమతి పొందిన ట్రేడింగ్..ఈ కామర్స్, భారత్ లో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై కూడా విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరించింది. అలాగే ఏవియేషన్, డీటీహెచ్, కేబుల్ నెట్ వర్క్, మొబైల్ రంగాలతో పాటు మరికొన్ని రంగాల్లో కూడా వంద శాతం ఎఫ్ డీలకు అనుమతులు మంజూరు చేసింది. పాడి పరిశ్రమ రంగంలో కూడా 100 శాతం ఎఫ్ డీఐలకు..ఫార్మా రంగంలో 74 శాతం ఎఫ్ డీఐలకు అనుమతులు మంజూరు చేసింది. 

ఎఫ్ డీఐలను అనుమతించవద్దు...
సంస్కరణల పేరిట..దేశాభివృద్ధి పేరిట ఇలాంటి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం సరికాదని వామపక్షాలు పేర్కొంటున్న విషయంత తెలిసిందే. కీలక రంగమైన రక్షణ రంగం ప్రభుత్వం చేతుల్లో ఉండాలి కానీ విదేశీయుల చేతుల్లో ఉండడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పౌర విమానయాన 9వ స్థానంలో కొనసాగుతోంది. మోడీ పాలనలో మూడో స్థానంలో వెళ్లాలని కేంద్రం యోచిస్తోంది. అందులో భాగంగా ఎఫ్ డీఐలను అనుమతులను మంజూరు చేస్తోందనే విమర్శలున్నాయి. గతంలో యూపీఏ 50 శాతం ఎఫ్ డీఐలను అనుమతులను ప్రకటిస్తే ఆనాడు వ్యతిరేకించిన బీజేపీ నేడు వంద శాతం ఎఫ్ డీఐలకు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. ఇతర దేశాల వారిని ప్రోత్సాహించడం వల్ల దేశం అభివృద్ధి కుంటుపడుతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

మార్కెట్ ను కొల్లగొట్టడానికే...
భారత మార్కెట్‌ను కొల్లగొట్టడానికే విదేశీ పెట్టుబడులకు ప్రధాని ఆహ్వానిస్తున్నారని సిపిఎం పేర్కొంటున్న విషయం తెలిసిందే. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడానికే ప్రభుత్వం ఎఫ్‌డిఐలకు లైసెన్స్ ఇచ్చిందని, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో దేశంలోని పేదలకు దినసరి జీవనం గడవడమే గగనమైందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగినపుడే ఆర్థికవృద్ధి సాధ్యమవుతుందని పార్టీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో వేచి చూడాలి. 

అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఒకరి అరెస్టు.

గుజరాత్ : 2008 సంవత్సరంలో అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో పరారీలో ఉన్న నజీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని కర్ణాటకలో గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

రక్షణ శాఖలో 100 శాతం ఎఫ్ డీఐ అనుమతులు...

ఢిల్లీ : రక్షణ శాఖలో 100 శాతం ఎఫ్ డీలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అలాగే ఏవియేషన్, డీటీహెచ్, కేబుల్ నెట్ వర్క్, మొబైల్ రంగాలతో పాటు మరికొన్ని రంగాల్లో కూడా వంద శాతం ఎఫ్ డీలకు అనుమతులు మంజూరు చేసింది. పాడి పరిశ్రమ రంగంలో కూడా 100 శాతం ఎఫ్ డీఐలకు..ఫార్మా రంగంలో 74 శాతం ఎఫ్ డీఐలకు అనుమతులు మంజూరు చేసింది. 

14:38 - June 20, 2016

పశ్చిమగోదావరి : రైతులు ఆనందంగా ఉండాలనే లక్ష్యంగా తాను ముందుకెళుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో ఏరువాక ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగసభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిదీసిన సమయంలో ఏపీకి 16వేల లోటు బడ్జెట్..రాజధాని లేదు..ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. అదే తెలంగాణకు ఆదాయం ఎక్కువగానే ఉందని మరోమారు పునరుద్ఘాటించారు. ఆదాయం తక్కువగా ఉన్నా..ఇన్ ఫ్ట్రా స్ట్రక్చర్ లేకపోయినా రైతులు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లానని తెలిపారు. రూ. 7,400 కోట్లను రైతులకు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, మరో రూ. 3,000 కోట్లు చెల్లించడం జరుగుతుందన్నారు. ఇంకా రూ. 500 కోట్ల హార్టికల్చర్..ఇతర రంగాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. రూ. 50వేలు తీసుకున్న రైతుకు పూర్తిగా రుణమాఫి చేయడం జరిగిందని, దేశంలో మొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ తీసుకరావడం జరిగిందన్నారు. 

మంత్రి హరీష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి - వంటేరు ప్రతాప్ రెడ్డి..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ముంపు బాధిత రైతులపై మంత్రి హరీష్ రావు దాడులకు ఉసిగొల్పుతున్నారని, ముంపు ప్రాంత వాసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి పోలీసులు దాడులు చేస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. మంత్రిగా ఉండి దాడులు చేయమని రెచ్చగొట్టిన మంత్రి హరీష్ రావు పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు ఆకుపచ్చ కండువాలు వేసుకుంటే రైతులు కారని, అధికారంలో ఉన్న పార్టీ ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

టి.టిడిపి జిల్లాల ఇన్ ఛార్జీల నియామకం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జీలను పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ నియమించారు. హైదరాబాద్ - పెద్దిరెడ్డి, రంగారెడ్డి - అరవింద్ కుమార్ గౌడ్, నల్గొండ - రేవూరి ప్రకాష్ రెడ్డి, ఖమ్మం - సీతక్క, కరీంనగర్ - వంటేరు ప్రతాప్ రెడద్డి, మెదక్ - కొత్తకోట, మహబూబ్ నగర్ - మోహన్ రావు, వరంగల్ - సండ్ర వెంకట వీరయ్య, నిజామాబాద్ - మల్లన్న యాదవ్, ఆదిలాబాద్ - వీరేందర్ గౌడ్, మంచిర్యాల – మల్లేశంలు నియమితులయ్యారు. 

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొద్దిసేపటికి ముగిశాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. 

14:23 - June 20, 2016

ఖమ్మం : విధి తన తండ్రిని అనారోగ్యం పాలు చేసింది.... కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. ఇలాంటి సమయంలో ఎలాగైనా తన కుటుంబాన్ని గట్టెక్కించుకోవాలని ఒక అమ్మాయి కుల వృత్తినే నమ్ముకుంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన క్షౌరవృత్తితో కుటుంబ భారాన్ని మోస్తోంది.

చదువుకుంటూ కులవృత్తి చేస్తున్న హిమబిందు...
ఈమె పేరు హిమబిందు.. ఖమ్మం జిల్లా మొండికుంటకు చెందిన ఈమె క్షౌరవృత్తిని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మరోవైపు చదువుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

2014లో రాజేష్‌కు బ్రెయిన్‌ ట్యూమర్‌ ...
అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో హిమబిందు తండ్రి ...మేడిచర్ల రాజేష్ క్షౌరవృత్తిని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దకూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన రాజేష్‌కు అప్పులు తప్పలేదు. మిగిలిన ఇద్దరు ఆడపిల్లలను బాగా చదివించాలని కష్టపడేవాడు. అయితే...దురదృష్టం రాజేష్‌ కుటుంబాన్ని వెంటాడింది.. 2014లో రాజేష్‌కు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. డాక్టర్లు కూడా ఏం చెయ్యలేమని చేతులెత్తేశారు. దాదాపు ఆరునెలలపాటు మంచానికే పరిమితమైన రాజేష్..కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చింది.

ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్న హిమబిందు ...
ఇన్ని బాధలు చూసిన, హిమబిందు తట్టుకోలేక పోయింది. ఎలాగైనా తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకొని, కుటుంబ భారాన్ని మోయాలని నిర్ణయించుకుంది. అందుకు కులవృత్తినే నమ్ముకుంది. ఓవైపు చదువుతూనే...మరోవైపు క్షౌరవృత్తిని నిర్వహిస్తోంది. అలా వచ్చిన డబ్బులతో తన చిన్నక్క స్వరూపను డిగ్రీ చదివిస్తోంది. తానూ 9 వ తరగతి చదువుతోంది. తమ దీనగాధను అర్థం చేసుకొని ఎవరైనా ఆర్థిక సహాయం అందించాలని హిమబిందు కోరుతోంది. తనకి కొడుకులు లేకపోయినా కూతురే కుటుంబాన్ని ఆదుకుంటోందని, తన ఆరోగ్య ఖర్చులకే కూతురి సంపాదన సరిపోతోందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలెవరైనా ముందుకొచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నాడు.

14:18 - June 20, 2016

విజయవాడ : రైతుల కోరిక మేరకు ప్లాట్ల కేటాయింపును వాయిదా వేయడం జరిగిందని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ రోజు నుండి అమరావతిలో రైతులకు ప్లాట్ల పంపిణీ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ రైతుల అభ్యర్థన మేరకు ఇది వాయిదా వేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈనెల 25వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని, లాటరీ పద్ధతిపై 29 గ్రామాల రైతులకు ఈనెల 21 నుండి 24 వరకు సీఆర్డీఏ కార్యాలయం వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ప్రతి రోజు మూడు నుండి..నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 

14:12 - June 20, 2016

కరీంనగర్ : ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కడంతో..ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న కరీంనగర్‌ సిటీ రూపు రేఖలు మరింతగా మారనున్నాయి. ఇప్పటికే సుందరీకరణలో ముందంజలో ఉన్న కరీంనగరం.. ఇక శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

స్టార్ట్‌ సిటీ ప్రాజెక్టు రిపోర్టు కోసం రూ.2 కోట్లు విడుదల ...
తెలంగాణ రాష్ట్రం నుంచి స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ రూపురేఖలు మరింతగా మారనున్నాయి. జిల్లాలో జనాభా ప్రాతిపదికన, మౌలిక వసతుల కల్పనలో మరింత ప్లాన్డ్‌గా.. కరీంనగర్‌ను ముందంజలో నిలిపేందుకు అధికారులు నగరాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. స్టార్ట్‌ సిటీకి తగినట్లుగా పూర్తి స్థాయి ప్రాజెక్టు రిపోర్టు కోసం కేంద్రం రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే కేంద్రం నియమావళి ప్రకారం స్మార్ట్‌ సిటీ అర్హత కోసం 87 శాతం మార్కులు పొందిన నగరం.. పూర్తి స్థాయి నిధులు సద్వినియోగం చేస్తామని నమ్మకం కలిగిస్తే 100 శాతం మార్కులతో వంద కోట్ల నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 20, మలివిడతలో 32 నగరాలను స్మార్ట్‌ సిటీ జాబితాలో ఎంపిక చేస్తే.. అందులో 33 వ నగరంగా కరీంనగర్‌ చోటు సంపాదించుకుంది. ఈ స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు వందకోట్ల సమగ్ర ప్రణాళిక నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. దానికి గానూ నగరపాలక సంస్థ లీ అనే కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. నగర పాలక సంస్థ కమిషనర్‌ పర్యవేక్షణలో ఈ సంస్థ ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడింది.

ప్రణాళికలను రూపొందించే పనిలో యాంత్రంగం బిజీ బిజీ ...
కరీంనగర్‌లో దిగువ మానేరు రిజర్వాయర్, ఎలగందుల కిల్లా, బృందావన్ గార్డెన్, టవర్ సర్కిల్, కమాన్ వంటి చారిత్రక ప్రదేశాలతో పర్యాటకంగా అభివృద్ధి చేసి.. ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. నగర ప్రజలకు 24 గంటలు నీటి సరఫరా అత్యాధునిక హంగులతో రహదారుల నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు, శివారు ప్రాంతాల అభివృద్ధి రూపకల్పన, పరిశుధ్యం, నగర పాలన, పౌర సేవలకోసం వివిధ రంగాల ప్రతినిధులతో కమిటీల ఏర్పాటు వీటితో పాటు విద్య, వైద్య రంగాలలో అభివృద్ది అంశాలతో కూడిన వాటిని నివేదికలో పొందు పర్చనున్నారు. ఆదాయ వనరుల పెంపునకు ఆవకాశలన్నింటినీ సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలను రూపొందించే పనిలో నగరపాలక సంస్థ పోందించే పనిలో నగరపాలక యాంత్రంగం బిజీగా ఉంది.

చారిత్రక ప్రదేశాలతో పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు...
కరీంనగర్‌లో దిగువ మానేరు రిజర్వాయర్, ఎలగందుల కిల్లా, బృందావన్ గార్డెన్, టవర్ సర్కిల్, కమాన్ వంటి చారిత్రక ప్రదేశాలతో పర్యాటకంగా అభివృద్ధి చేసి.. ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. నగర ప్రజలకు 24 గంటలు నీటి సరఫరా అత్యాధునిక హంగులతో రహదారుల నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు, శివారు ప్రాంతాల అభివృద్ధి రూపకల్పన, పరిశుధ్యం, నగర పాలన, పౌర సేవలకోసం వివిధ రంగాల ప్రతినిధులతో కమిటీల ఏర్పాటు వీటితో పాటు విద్య, వైద్య రంగాలలో అభివృద్ది అంశాలతో కూడిన వాటిని నివేదికలో పొందు పర్చనున్నారు. ఆదాయ వనరుల పెంపునకు ఆవకాశలన్నింటినీ సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలను రూపొందించే పనిలో నగరపాలక సంస్థ పోందించే పనిలో నగరపాలక యాంత్రంగం బిజీగా ఉంది.

నీటి పారుదలశాఖ, బీహెచ్‌ఈఎల్ అధికారులతో మంత్రి హరీష్ భేటీ..

హైదరాబాద్ : నీటి పారుదలశాఖ, బీహెచ్‌ఈఎల్ అధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పంపులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. 

ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడుతోంది - అంబటి..

హైదరాబాద్ : కాపు ఉద్యమం ప్రమాదకర దశకి వెళుతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ముద్రగడ ప్రాణాలతో చెలగాటమాడుతోందని, ముద్రగడకు ఏవైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని..కాపులని అణిచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

 

 

సీపీఎం కేంద్ర కమిటీ నుండి ఐద్వా ప్రధాన కార్యదర్శి తొలగింపు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ నుండి ఐద్వా ప్రధాన కార్యదర్శి జగ్మతి సాంగ్వాన్ ను తొలగించారు. పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. 

13:53 - June 20, 2016

ఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అంతా సిద్ధమయ్యింది. యెగా డే కోసం కేంద్ర ప్రభుత్వ భారీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పొల్గొననున్నారు. విద్యాసంస్థల్లో కూడా యోగా డేని నిర్వహంచనున్నారు.

యోగా దినోత్సవానికి ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. యోగా డేకి ఇది రెండో ఏడాది. 2015లో మొదటి యోగా దినోత్సవానికి వచ్చిన భారీ స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేశారు.

191 దేశాల్లో యోగా దినోత్సవం ..
ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఎక్కువ దేశాలు యోగా డేని పాటిస్తున్నాయి. యూఎన్‌వోలో 193 దేశాలు ఉంటే 191 దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరపుకుంటున్నాయి. యెమెన్‌, లిబియా యోగాకు దూరంగా ఉంటున్నాయి. శ్యాస మీద ద్యాస పెట్టడం యోగాలో ప్రధానం. శారీరక వ్యాయామం కంటే యోగా ఎన్నో రెట్లు మెరుగని చెబుతారు. శరీరాన్ని, మనసును ఏకకాలలో నియంత్రణలోకి తీసుకొస్తుంది. యోగాసనాలతో దీర్ఘవ్యాధులు నయమవుతాయని చెబుతారు. నిత్యం యోగా చేసే వారు జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు.

యోగా దినోత్సవంలో పాల్గొననున్న 57 మంది కేంద్ర మంత్రులు ..
ఈసారి చండీగఢ్‌లో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పోలెండ్‌లో జరిగే యోగా డేలో పాల్గొనాల్సి ఉండగా... అనారోగ్య కారణాలతో అక్కడకు వెళ్లలేకపోయారు. దీంతో స్వదేశంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు విజయవాడలో జరిగే యోగా దినోత్సవానికి హాజరవుతారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్వహించే యోగా దినోత్సవంలో పది మంది కేంద్ర మంత్రులు పాల్గొంటారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగే యోగా కార్యక్రమాలకు హాజరవుతారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ, విద్యుత్‌ మంత్రి పియూష్‌ గోయల్‌ అహ్మదాబాద్‌, ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ముంబై, రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ కాన్పూర్‌లో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఇలా కేంద్ర మంత్రులందరూ ఒక్కో ప్రాంతంలో జరిగే యోగా డేలో పాల్గొంటారు.

బీఎస్‌ఎఫ్‌ అధికారులు, జవాన్లకు రాందేవ్ బాబా యోగా..
యోగాగురు రాందేవ్‌ బాబా రాజస్థాన్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతమైన జోధ్‌పూర్‌లో సరిహద్దు భద్రతా దళం కోసం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. దాదాపు మూడు వేలమంది బీఎస్‌ఎఫ్‌ అధికారులు, జవాన్లకు యోగాలో శిక్షణ ఇవ్వనున్నారు.

బ్రిటన్‌, ఆస్ట్రేలియాలో యోగా డే ఏర్పాట్లు...
బ్రిటన్‌, ఆస్ట్రేలియాలో యోగా డేని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు అక్కడి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. లండన్‌, కాన్‌బెరా, మెల్‌బోర్న్‌ సహా ఆయా దేశాల్లోని ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని తాను ఇచ్చిన పిలుపుకు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి స్పందన వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ దేశ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. 2014 సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో యోగా ప్రాశస్థ్యాన్ని వివరించిన విషయాన్నిగుర్తు చేశారు. మొత్తంమీద భారత ప్రాచీన యోగ విద్యకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరగడం మంచిపరిణామంగా భావిస్తున్నారు. 

బస్ షెల్టర్లపై హైకోర్టులో పిల్...

హైదరాబాద్ : నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేవంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆర్టీసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

తెలంగాణలో కొనసాగుతున్న న్యాయవాదుల నిరసనలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. అన్ని కోర్టుల్లో 'గంటానాదం పేరిట నిరసన వ్యక్తం చేస్తున్నారు. గంటాలు..కంచాలతో న్యాయవాదులు శబ్ధాలు చేస్తున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు న్యాయాధికారుల ఆఫ్షన్ల ప్రక్రియను నిలిపివేయాలని 14 రోజులుగా న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

తుని విధ్వంసం కేసు..రేపటికి వాయిదా..

తూర్పుగోదావరి : తుని విధ్వంసం కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణనను కాకినాడ సీఐడీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

 

టి.సర్కార్ పై ఉత్తమ్ ఘాటు విమర్శలు..

నల్గొండ : కోదాడలో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ తో కార్యకర్తలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. రుణమాఫీ పేరిట రైతులను, మూడు ఎకరాల పేరిట దళితులను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని ఘాటుగా విమర్శించారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పార్టీ ఫిరాయించిన వారు పదవులకు రాజీనామా చేయాలని, ఎంపీ గుత్తా రాజకీయ వ్యభిచారి అంటూ సంభోదించారు. గతంలో నిర్మించిన ఇళ్లకే బిల్లులు చెల్లించలేదని,ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ ప్రలోభ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 

ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల..

రాజమండ్రి : కాపు ఉద్యమ నేత ముద్రగడ హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. ముద్రగడకు గుండె సంబంధిత వైద్యం అందించామని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నా ఎక్కువ రోజులు సెలైన్లతో వైద్యం చేయలేమన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముద్రగడ సతీమణికి కీ టోన్స్ లెవల్స్ పెరిగాయని తెలిపారు.

13:38 - June 20, 2016

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరీక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపడానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. 48గంటలపాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్‌ రేపు ఉదయం 9గంటల25నిముషాలకు ముగుస్తుంది. 1288 కేజీల బరువైన శాటిలైట్స్‌ను పీఎస్‌ఎల్‌వి సీ-34 రాకెట్‌ నింగిలోనికి మోసుకెళ్లనుంది. 

13:32 - June 20, 2016

పశ్చిమగోదావరి : జిల్లా చిట్టవరంలో చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వరినాటు యంత్రం నడిపి నాట్లు వేశారు. ఇవాళ ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

13:15 - June 20, 2016

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ నిహారిక ఇండస్ట్రీపై బాంబు పేల్చే కామెంట్ చేశారు. ఈ నెల 24వ తేదీన నిహారిక నటించిన 'ఒక మనసు' విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మెగా డాటర్ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో ఒక వర్గానికి గట్టిగా గుచ్చుకున్నాయి.

అసలు విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో లో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదని నిహారిక కామెంట్ చేశారు. మగవాళ్లు వచ్చినంత సింపుల్ గా ఆడవాళ్లు సినిమాల్లోకి రాలేరని చెప్పుకొచ్చారు. ఇదేమీ కొత్త కామెంట్ కాకపోగా.. మెగా కూతురు నోటి వెంట రావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాను సినిమా రంగంలోకి రావడానికి తన కుంటుంబంతో చర్చింన సందర్భాన్ని వివరించుకొచ్చారు. ' సినిమాల్లోకి వచ్చే ముందు నాన్న నాగబాబు, పెదనాన్న చిరంజీవితో మాట్లాడాను.. అయితే వాళ్లు ఈ రంగంలో అమ్మాయిలకు ఉండే ఇబ్బందుల గురించి చాలా విషయాలు చెప్పారు. ఈ రంగంలో ఉండే మంచీ, చెడులను వివరించారు. ఫ్యామిలీ అంతా సినిమా రంగంలో ఉండటంతో నాకు తెలియకుండానే సినిమాలపై ఇంటరెస్టు పెరిగింది.

మెగా ఫ్యామిలీ నుండి వస్తుండటంతో నాపై ఒత్తిడికంటే, బాధ్యత ఎక్కువగా ఉంది. ఫ్యాన్స్ తో మాట్లాడకముందు నాలో ఒక రకమైన బిడియం ఉండేది. కానీ వాళ్లతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. చిరంజీవిని అన్నయ్యగా చూశాము. మిమ్మల్ని మా ఇంటి అమ్మాయిగా చూసుకుంటుమని భరోసా ఇచ్చారు. వారికి చాలా థ్యాంక్స్.

'ఒక మనసు' మూవీ ఒక 'మరో చరిత్ర', 'గీతాంజలి' సినిమాల మాధిరిగా గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాము. ఈ సినిమాలో నా పాత్ర పేరు సంధ్య హీరో పాత్ర సూర్య వీటి చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. ఈ మూవీలో నిజమైన హీరో మాత్రం కథనే.

మున్ముందు సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఎంచుకుంటాను. నాకు కమల్ హాసన్ ఎంతో ఇష్టం. పెదనాన్న చిరంజీవి నా రోల్ మోడల్. 24 తేదీన విడుదల కాబోతున్న చిత్రం కోసం నాతోపాటు, మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నాను.' అంటూ చెప్పుకొచ్చారు.  

12:52 - June 20, 2016

గుంటూరు : ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాశకు గురయ్యారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్ధేశ్యంతో నే ఈ కార్యక్రమాన్ని తాత్కాలింకంగా వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వాతావరణం సహకరిస్తే 23న సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్లాట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీగా వర్షాలుకురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులకు ఈ వర్షం ఆటంకం ఏర్పడింది.

12:48 - June 20, 2016

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి సీసీఎల్ఏ రేమండ్, పీటర్, బీఆర్ మీనా హాజరయ్యారు. కాగా ఇదే విషయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఇప్పటకే సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సమగ్ర నివేదికతో రావాలని సీఎం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి సీఎస్ రాజీవ్ శర్మ సమాశం నిర్వహించారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగాది పండగనాటికి జరిగి తీరాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. 

12:44 - June 20, 2016

స్విట్జర్లాండ్‌ : భారీ మీసాలతో కార్లను, బస్సులను లాగడం చూశాం. నోటిపళ్లతో విమానాలను లాగడం కూడా చూశాం. కానీ, 100 టన్నుల బరువు గల రైలును ఓ కారు అమాంతం లాక్కెళ్లడం మీరు ఎప్పుడైనా చూశారా..? వినడానికి ఆసక్తిగా ఉన్నా ఇది నిజం..! స్విట్జర్లాండ్ లోని ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్స్‌ సంస్థ వినూత్నంగా అడ్వర్‌టైజ్‌మెంట్‌ను రూపొందించింది. ఇది ఇప్పుడు సోషల్ వెబ్‌సైట్లలో తెగ హల్‌చల్‌ చేస్తోంది..! 100 టన్నుల బరువు గల బోగీలను ల్యాండ్ రోవర్ కారు.. రైలుకు ఇంజన్‌గా మారి లాక్కెళ్తోంది. ఈ వినూత్న ప్రచార ప్రకటనను రూపొందించింది ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్స్ సంస్థ. ఈ రైలును ల్యాండ్ రోవర్ కారు 10 కిలోమీటర్ల వరకు లాగింది. ఈ యాడ్‌ను స్విట్జర్లాండ్‌లోని రైనీ నదిపై 85 అడుగుల ఎత్తులో ఉన్న రైల్వే బ్రిడ్జిపై చిత్రీకరించారు. డ్రైవింగ్‌లో నిష్ణాతులైన జేమ్స్ ప్లాట్ , కార్ల్ రిచర్డ్స్‌ అనే డ్రైవర్లతో ఈ యాడ్‌ను రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. లక్షల సంఖ్యలో లైక్స్‌ కొడుతున్నారు. కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు ల్యాండ్ రోవర్ డిస్కవరి స్పోర్ట్స్‌ సంస్థ ఈ యాడ్‌ను రూపొందించింది. 

12:38 - June 20, 2016

నిజామాబాద్ : రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లు నిజామాబాద్‌ జిల్లాలోని మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు అద్దె పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్ కేటాయింపుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడంతో..ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది. ఇదంతా సంబంధిత అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

30 షాపులకు నెలకు 3లక్షల ఆదాయం ...
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో 30 మున్సిపల్ వ్యాపార సముదాయలున్నాయి. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చారు. అయితే వీటి అద్దెల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు..మాముళ్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్దంగా అద్దెను వసూలు చేస్తున్నారు. మార్కెట్‌ ధరకంటే తక్కువగా అద్దెల్ని వసూలు చేస్తూ..ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు.

సంవత్సరాల తరబడి తిష్ట వేసిన వ్యాపారస్తులు...
అంతేకాదు కొందరు వ్యాపారస్తులు సంవత్సరాల తరబడి మున్సిపల్ కాంప్లెక్స్‌లో తిష్ట వేసారు. దీంతో బహిరంగ మార్కెట్‌తో సమానంగా అద్దెలు పెరగడంలేదు. బయట దుకాణాల్లో అద్దె 8నుంచి 10వేలుంటే మున్సిపాలిటీ దుకాణాల్లో కేవలం 3వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు. కానీ ఇదంతా చేస్తోంది సంబంధిత అధికారులు, సిబ్బంది మాత్రమే. ఒక్కో దుకాణానికి నెలకు 10వేల చొప్పున వసూలు చేస్తే 30 షాపులకు నెలకు 3లక్షల ఆదాయం వస్తుంది. కానీ రెండు నుంచి 4వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు అధికారులు. దీంతో ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది.

3ఏళ్ల గడువు పూర్తికాగానే బహిరంగవేలం ...
నిబంధనల ప్రకారం మూడేళ్ల గడువు ముగియగానే బహిరంగ వేలం వేయాలి. కానీ అలాంటిదేమి ఇక్కడ జరగడంలేదు. అంతా తెరవెనకాలే మంతనాలు జరుగుతాయి. అంతేకాదు కొందరు వ్యాపార సముదాయలను మున్సిపాలిటీ నుండి అనుమతి తీసుకొని ఇతరులకు లీజుకిచ్చి 10 నుండి 15 వేల వరకు వసూలు చేసుకుంటున్నారు. అలా చేయటం చట్టరీత్యా నేరం. అయినా ఉన్నతాధికారులు స్పందించకపోవటం విశేషం. గతంలో కొందరు వ్యాపార సముదాయల అవినీతి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సీపీఎం నాయకులు చెప్తున్నారు.

అధికారులు స్పందించాలంటున్న ప్రతిపక్షాలు ...
ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై దృష్టి కేంద్రీకరించాలని ప్రతిపక్షాల నేతలు కోరుతున్నారు.

వాయిదా పడిన అమరావతి ప్లాట్ల కేటాయింపు...

గుంటూరు : ఏపీ రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం సోమవారం ముహూర్తం పెట్టింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో రైతులు కొంత నిరాసకు గురయ్యారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్ధేశ్యంతో నే ఈ కార్యక్రమాన్ని తాత్కాలింకంగా వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 

12:15 - June 20, 2016

ఖమ్మం : జిల్లాలో ఇసుక మాఫియాపై టెన్‌ టీవీలో ప్రసారమైన కథనం సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఉద్యమాలకూ ప్రజా సంఘాలు రూపకల్పన చేస్తున్నాయి.

టెన్‌ టీవీ ప్రసారం....సంచలనం...
ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక దందాపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనం సంచలనమైంది. ఇసుక తోడేళ్ల పేరుతో ప్రసారమైన కథనంపై ప్రజల్లో విశేష స్పందన లభించింది. వాల్టా చట్టాలకు తూట్లు పొడుస్తూ.. కాంట్రాక్టర్ల రూపంలోని ఇసుక బకాసురులు పెచ్చరిల్లిపోతున్నారని దీన్ని టెన్‌ టీవీ అద్భుతంగా ఆవిష్కరించిందని ప్రశంసిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో.. గిరిజనులకు చెందాల్సిన ఇసుక రీచ్‌లను.. కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ కల్పించుకుని గిరిజనుల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లు నడిచేలా చూడాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. గోదావరి ప్రాంతంలో ఇసుక దోపిడీతో పర్యావరణం దెబ్బతింటుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇసుక రీచ్‌లను తవ్వేస్తున్న అక్రమార్కులు....
మన్యంలోని వాగుల్లో యథేచ్ఛగా ఇసుక రీచ్‌లను తవ్వేస్తున్న అక్రమార్కులు.. అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, గిరిజనులకు చెందాల్సిన వనరులను దోపిడీ చేస్తున్నారని సీపీఎం విమర్శించింది. గిరిజనులను కూలీలుగా పెట్టుకుని.. సొసైటీలను గుప్పిట్లో పెట్టుకోవడం సిగ్గుచేటని సీపీఎం నేత మహ్మద్‌ సలామ్‌ విమర్శించారు. ప్రభుత్వం ఇసుక తోడేళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. వెంటనే ఆందోళన చేపడతామని ఖమ్మం జిల్లా టీడీపీ ప్రకటించింది.

పార్టీ నేతల అండదండలపై పలు విమర్శలు ..
ఈ దందాలో అధికార పార్టీ నేతల అండదండలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. గిరిజనులకు చెందాల్సిన వనరులను దోచుకుంటున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ నేత అయితం సత్యం డిమాండ్‌ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ...
ఇసుక తోడేళ్లపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తోన్న అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

12:00 - June 20, 2016

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం జిల్లా కేంద్రంగా అవతరించడం ఖాయమన్న అంచనాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాలిపోయారు. 1/70 యాక్ట్ వర్తించే భూముల్లో సైతం వెంచర్లు వేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్నారు.

కొత్తగూడెం, పాల్వంచల్లో రియల్ బూమ్...
ఖమ్మం జిల్లా కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు గనిగా మారిపోయాయి. ఓ వైపు ధరలు అయిదు నుంచి పది రెట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు మాత్రమే వున్న గజం భూమి ధర పది వేలు దాటింది. కనీసం 30 లక్షల రూపాయలు పెట్టందే చిన్న ఇల్లయినా దొరకని పరిస్థితి. 150 నుంచి 200 గజాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు 30 లక్షల రూపాయల దాకా చెబుతున్నారు. సుజాతనగర్ చుట్టుపక్కల దాదాపు పది వెంచర్లు వెలిశాయి. వీటిలో ఒకటి యాభై ఎకరాల వెంచర్. కాగా, పది పదిహేను ఎకరాల వెంచర్లు మరికొన్ని వున్నాయి. అయితే, వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నవారు నిబంధనలు పాటించడం లేదు. 33 ఫీట్ వెడల్పైన రోడ్లు, డ్రయినేజీలు, విద్యుత్ స్తంభాలు ఇవేవీ కనిపించడం లేదు.

నిబంధనలు పాటించకుంటే ఇబ్బందులు తప్పవంటున్న అధికారులు..
కొత్తగూడెంలో భూముల కొనుగోళ్లు అమ్మకాల విషయంలో చాలా రూల్స్ వున్నాయి. కొత్తగూడెం టౌన్, పాల్వంచ్ టౌన్, సుజాతనగర్ గ్రామంలోని భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ లున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో 1/70 యాక్ట్ అమల్లో వుంది. గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనడానికి వీల్లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమంగా లే ఔట్లు వేస్తున్నారు. ఈ చట్టాన్ని సవరించాలంటే పార్లమెంట్ ఆమోదం పొందల్సి వుంటుంది. రికార్డులు సరి చూసుకోకుండా వీటిని కొంటే, నష్టపోవాల్సి వస్తోందంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు ...
కొత్తగూడెం జిల్లా కేంద్రంగా అవతరిస్తే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి లేదు. సింగరేణి భూములు, భవనాలను తీసుకునే ఆలోచనతో వున్నట్టు తెలుస్తోంది. సింగరేణి బాలికల పాఠశాల, మహిళా డిగ్రీ కాలేజీ భవణాలు, స్థలాల్లో గవర్నమెంట్ ఆఫీసులు పెడతారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 

11:54 - June 20, 2016

హైదరాబాద్‌ : నగరంలో పారిశుద్ధ్యం విషయంలో అధికారులు సగటు పౌరుడిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యలపై అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని, చిన్న వర్షానికే రోడ్లపై చెరువులను తలపించేలా నీళ్లు నిలుస్తున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు. ఎయిర్‌పోర్టు, ఔటర్‌రింగ్‌రోడ్డు మాదిరిగా నగరంలో వున్న అన్ని రోడ్లు ఉండాలని ఆయన సూచించారు. 

వరుస పేలుళ్ల ఘటనలో నిందితుడు అరెస్ట్ ...

గుజరాత్ : అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల నిందితుడు నజీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నజీర్ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. 2008లో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో నజీర్ నిందితుడు.

రోడ్ల దుస్థితిపై కేటీఆర్‌ ఆగ్రహం...

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో సమస్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. నగరంలో రోడ్ల దుస్థితిపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తమదేనని మంత్రి పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని, చిన్న వర్షానికే రోడ్లపై నీళ్లు నిలుస్తున్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు. ఎయిర్‌పోర్టురోడ్డు, ఔటర్‌రింగ్‌రోడ్డు మాదిరిగా నగర రోడ్లు ఉండాలని ఆయన సూచించారు. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేర్పులు చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

11:14 - June 20, 2016

రంగారెడ్డి : శంషాబాద్ లో చిన్నారుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటిముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు చాక్లెట్లు ఆశ చూపించిన లక్ష్మణాచారి అనే వ్యక్తి అయేషా ఖాన్(9) జయాఖాన్ (5) హన్మా ఖాన్ (3) అనే చిన్నారులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అనుమానించిన స్థానికులు కిడ్నాపర్ ని అడ్డుకుని విచారించటంతో పిల్లలకు తాను బంధువునని అందుకే తీసుకెళుతున్నాని తెలిపాడు. ఇతనెవరో తమకు తెలీదనీ... చాక్లెట్లు ఇస్తానంటే వచ్చామని చిన్నారులు అనటంతో ఆగ్రహించిన స్థానికులు కిడ్నాపర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.అనంతరం చిన్నారుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు. కాగా మహబూబ్ నగర్ లో చిన్నారులను విక్రయించేందుకే కిడ్నాప్ కు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం...

హైదరాబాద్ : కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి సీసీఎల్ఏ రేమండ్, పీటర్, బీఆర్ మీనా హాజరయ్యారు.

శంషాబాద్ లో కిడ్నాప్ కలకలం...

రంగారెడ్డి : శంషాబాద్ లో చిన్నారుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. చాక్లెట్లు ఆశ చూపించి లక్ష్మణాచారి అనే వ్యక్తి ముగ్గురు చిన్నారులను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. పిల్లలు కేకలు వేయడంతో పారిపోవటానికి యత్నించాడు. గమనించిన స్థానికులు సదరు వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.అనంతరం చిన్నారుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.

10:45 - June 20, 2016

శ్రీకాకుళం : హిమాలయాలకు ఆనుకొని ఉన్న టిబెట్ ప్రాంతం గురించి తెలియని వాళ్ళు ఉండరు. బౌద్ధ మతానికి సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవాలంటే టిబెట్ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. అయితే అచ్చం టిబెట్ లాంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉంది. అయితే దాన్ని చూడాలంటే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సిందే. జిల్లాకు ఆనుకొని ఉన్న ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో టిబెట్‌ను తలపించే ప్రాంత విశేషాలపై స్పెషల్‌ స్టోరీ.

ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతం...
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం అచ్చం టిబెట్‌లాగే ఉంది అనుకుంటున్నారా. కానీ ఇది టిబెట్‌ కాదు. శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతంలో గల ఈ ఊరు పేరు చంద్రగిరి. ఒడిషాలోని గజపతి జిల్లా చంద్రగిరిలో పద్మ సంభవ మహా విహార పేరుతో ఈ ఆలయం నిర్మించారు. 1960ల్లో ఇక్కడికి ఓ 20 మంది బౌద్ధ మతస్థులు వలస వచ్చారు. ఓ చిన్నపాటి గుడిని, నివాసాల్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి వీరంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా టిబెట్ దేవాలయం...
ఇక ఇక్కడ అచ్చం టిబెట్‌లో మాదిరిగా నిర్మించిన దేవాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాలుగేళ్ల క్రితమే ఇక్కడి దేవాలయ భవన నిర్మాణం పూర్తయినా..ఆధునీకరణ పనులు మాత్రం 2010లో పూర్తయ్యాయి. మొత్తం వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ప్రాంగణంలో ప్రస్తుతం ఓ యూనివర్శిటీ, హైస్కూల్ ఉన్నాయి. మరోవైపు ఒడిషా ప్రభుత్వం కూడా వీరి ఆచార, వ్యవహారాలను, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా టిబెట్‌లో ఉన్నమాదిరిగా ఇక్కడి దేవాయాలన్ని తీర్చిదిద్దేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడి బుద్ధుని విగ్రహం, కళాఖండాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏటా ఇక్కడికి దలైలామా కూడా వచ్చి వెళ్తుంటారని ఇక్కడి బౌద్దులు చెప్తున్నారు. బౌద్ధమతస్తుల పిల్లలు, పెద్దలు హంగామాతో.. నిత్యం ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తుంది.

ఆంధ్రా టిబెట్ గా చంద్రగిరి...
మొత్తానికి టిబెట్ చూడకపోయినప్పటికీ,..ఈ ప్రాంతీయులు మాత్రం చంద్రగిరినే మరో టిబెట్‌గా అభివర్ణిస్తుంటారు. బౌద్దమత ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇక్కడకొచ్చే యాత్రికులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తున్నాయి.

10:37 - June 20, 2016

నెల్లూరు : చేతిలో చిల్లిగవ్వలేదు. అడుగు ముందుకు పడడం లేదు. కేంద్రం సహకరించడం లేదు.. ఇలా ప్రతిసారి ప్రెస్‌మీట్‌ల ముందు నిట్టూరుస్తున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఇప్పుడు దుబారా ఖర్చుకు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపింది ఏపీ సర్కార్. థర్మల్ ప్లాంట్‌కు బొగ్గును తక్కువ ధరకు సరఫరా చేస్తామన్న కంపెనీని కాదని.. ఎక్కువ ధర కోట్ చేసిన కంపెనీలకు రెడ్ కార్పెట్ పర్చడంతో సర్కార్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

పారిశ్రామికాభివృద్ధిలో దూసుకెళ్తున్న నెల్లూరు ...
నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా అనేక పరిశ్రమలు, సెజ్‌లు, థర్మల్ ప్లాంట్లు ఏర్పడ్డాయి. అందులో భాగమే కృష్ణపట్నం థర్మల్ ప్టాంట్. 2012లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ ప్లాంట్‌.. రెండు యూనిట్లలో 1600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఈ థర్మల్ విద్యుత్‌ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్న కోల్ ఇండియా కంపెనీని కాదని, ఎక్కువ ధర కోట్ చేసిన కంపెనీలకు

16 లక్షల టన్నుల విదేశీబొగ్గు దిగుమతి కోసం టెండర్లు ...
ఆరునెలల క్రితం థర్మల్ ప్లాంట్‌కు అవసరమైన 16 లక్షల టన్నుల విదేశీబొగ్గు దిగుమతి కోసం టెండర్లు పిలిచారు. ఎమ్మెస్ టీసీ , ఆదాని, నాలెడ్జ్ ఇన్ ఫ్రా కంపెనీలు టెండర్లు వేశాయి. టెండర్లు దాఖలు చేసిన ఈ 3 కంపెనీలు అటూ ఇటుగా టన్ను బొగ్గును 6000 రూపాయలకు కోట్ చేశాయి. అయితే కోల్‌ఇండియా మాత్రం ఇప్పటివరకు కూడా టన్ను బొగ్గును 4 వేల 300 రూపాయలకే సరఫరా చేస్తూ వస్తోంది. దీంతో రివర్స్ బిడ్డింగ్ హైడ్రామా చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎల్ -1గా ఉన్న ఎమ్మెస్ టీసీ టన్నుకు 50 రూపాయలు తగ్గించింది. ఇదే ధరకు మిగిలిన రెండు కంపెనీలు కూడా బొగ్గును దిగుమతి చేసేందుకు అంగీకరించాయి. దీంతో అధిక ధరతో విదేశీబొగ్గు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 3 కంపెనీలకు కాంట్రాక్టులు అప్పజెప్పేందుకు సర్కార్ నిర్ణయించింది. వీటి ప్రకారం మూడు సంస్థల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనున్న టన్ను బొగ్గు ధర 5950 రూపాయలు. అంటే టన్నుకు కోల్ ఇండియా ధరతో పోల్చితే అదనంగా 1650 రూపాయలు కాంట్రాక్లర్లకు చెల్లిస్తోందన్నమాట. దీన్నిబట్టి చూస్తే 264 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లుకు అప్పనంగా ఇస్తోంది చంద్రబాబు సర్కార్.

4 నెలల క్రితం అధికారులు నిపుణుల కమిటీ...
తక్కువ ధరకు బొగ్గు సరఫరా చేస్తున్న కోల్ ఇండియాను కాదని, ఎక్కువ ధర కోట్ చేసిన ఎమ్మెస్ టీసీ ఆదాని, నాలెడ్జ్ ఇన్ ఫ్రా కంపెనీల ద్వారానే బొగ్గు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో 4 నెలల క్రితం అధికారులు నిపుణుల కమిటీని వేశారు. నిపుణులు కూడా కోల్ ఇండియా ధరతో పోల్చితే టన్నుకు 1650 రూపాయలు ఎక్కువగా ఉందని, దీనివల్ల 264 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని కమిటీ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో టెండర్లును ఫైనల్ చేయకుండా రాష్ర్ట సర్కార్ నిలిపేసింది. అయితే.. ఈ మధ్య ఈ టెండర్లను ఆ మూడు సంస్థలకే ఇచ్చేందుకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో లాలూచీపడి కోట్ల రూపాయలు చేతులు మారడం వల్లే టెండర్లు ఖరారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకే టెండర్లు ఖరారు...
మరోవైపు ఆదాని కంపెనీ ప్రధాని నరేంద్రమోదీ సన్నిహితులకు సంబంధించిందని, గత ఎన్నికల్లో మోదీకి పెట్టుబడి పెట్టడమేకాక, విమానాలను కూడా సప్లయ్ చేసినందువల్లే ఆ కంపెనీకి బొగ్గు కొనుగోలు ఆర్డర్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధపడిందని పలువురంటున్నారు. మరోవైపు ఏపీ జెన్‌కో మాత్రం ప్రభుత్వ ఒత్తిడి మేరకే టెండర్లు ఖరారు చేసి రెండుమూడు రోజుల్లో ఆర్డర్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు....
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది.. అప్పుల్లో ఉంది.. అని పదేపదే చెబుతున్న సీఎం చంద్రబాబు.. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌కు తక్కువ ధరకు బొగ్గును సరఫరా చేస్తున్న కంపెనీలను కాదని, ఎక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకోవడంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. 

10:14 - June 20, 2016

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు అతి సాధరణమైపోయాయి. ప్రమాదం జరగని రోజంటూ వుంటుందా అనిపిస్తుంది. కాగా నగరవాసుల రక్షణకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూంటారు. ఈనేథ్యంలో  విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ వాహనంపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుళ్లు శేఖర్‌, నాగేశ్వర్‌రావు‌, వేణుగోపాల్‌లని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం పెద్ద అంబర్‌పేట్‌ వద్ద జరిగింది.

10:10 - June 20, 2016

హైదరాబాద్‌ : తెలంగాణ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ఏబీవీపీ ముట్టడించింది. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు నియంత్రించాలి..విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం కేజీ టూ పీజీ అంతాఉచిత విద్య అందిస్తామని చెప్పిన సర్కార్ మాటలకే పరిమితమవుతోంది ఆచరణలో మాత్రం లేదంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫీజులుంపై ఏబీవీపీ ధర్నా...

హైదరాబాద్‌ : తెలంగాణ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ఏబీవీపీ ముట్టడించింది. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు నియంత్రించాలి..విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వం కేజీ టూ పీజీ అంతాఉచిత విద్య అందిస్తామని చెప్పిన సర్కార్ మాటలకే పరిమితమవుతోంది ఆచరణలో మాత్రం లేదంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో ....

నెల్లూరు : సీఎస్ఎల్వీ-సీ34 రాకెట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. కౌంట్ డౌన్ 48 గంటలపాటు కొనసాగనుంది. 22న ఉ.9.25 గంటలకు ప్రయోగ వేదిక నుండి రాకెట్ ప్రయోగం జరుగుతుంది. తొలిసారిగా 1,288 కిలోల బరువున్న 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి ఇస్రో పంపనుంది.

ఆర్టీఏ తనిఖీలు...8 బస్సులు సీజ్ ...

హైదారాబాద్ : నగరంలోని పెద అంబర్ పేట ఓఆర్ఓ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న 8 బస్సులపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు.

విషమించిన ముద్రగడ ఆరోగ్యం..

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ దీక్ష 12వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రత్యేక వైద్యబృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబుస్తును ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మృతి...

హైదారాబాద్ : 'స్టార్ ట్రెక్' సినిమాల సిరీస్‌లో 'చెకోవ్' పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు ఆంటోన్ యెల్షిన్ (27) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని అతడి పబ్లిసిస్ట్ జెన్నిఫర్ అలెన్ నిర్ధారించారు. కాగా టీవీ షోలు, చిన్న చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన యెల్షిన్, ఆ తర్వాత ఆల్ఫా డాగ్ లాంటి క్రైం థ్రిల్లర్ సినిమాలతో మంచి బ్రేక్ సాధించాడు. 

తండ్రిని చంపిన కుమారుడు....

గుంటూరు: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావూ అంటే పచ్చని కాపురంలో చిచ్చు రేపుతాను అందట...డబ్బు ను మనిషి సంపాదించే స్థాయి నుండి డబ్బే మనిషిని శాసించే స్థాయికి సమాజం చేరుకుంది. కేవలం డబ్బుకోసం ఎన్నో దారుణాలు..ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. ఇటువంటి ఘటన పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. ఓ కుటుండంలో ఆస్తి వివాదం రాజుకుంది. దీంతో కొడుకు కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో అడ్డొచ్చిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జన్మదినం రోజున 'యువ'పట్టాభిషేకమా ?...

ఢిల్లీ : అభిమానులు యువరాజుగా పిలుచుకునే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా జరుపుకున్నారు.రాహుల్‌ గాంధీ 46వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా గల ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా జరుపుకున్నాయి. న్యూఢిల్లీలోని 12 తుగ్లక్‌ రోడ్డులోని ఆయన నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయాలు అభిమానులు, అగ్రనేతల రాకతో సందడిగా మారాయి. రాహుల్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినవారి మధ్య.. పార్టీకి యువరాజు సారథ్యం అందించే అంశంపైనే ఆసక్తికర చర్చ సాగడం కనిపించింది. ఏఐసీసీ ఉపాధ్యక్షునికి ప్రధాని మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

మిలట్రీ బస్ లో పేలుడు..

ఆఫ్గనిస్థాన్ : దేశ రాజధాని కాబుల్ లో మిలట్రీ బస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఆత్మాహుతి దాడితో ఈ పేలుడు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

08:54 - June 20, 2016

 టీడీపీ..వైసీపీ మధ్య నడుస్తున్న సదావర్తి సత్రం భూముల వివాదంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు), తులసిరెడ్డి (ఏపీ సీసీ ఉపాధ్యక్షులు ), విజయ్ కుమార్ (టీడీపీ నేత), నాగరాజు (వైసీపీ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు...ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి....సమగ్ర సమచారాన్ని తెలుసుకోండి...

'పరువు'కోసం నిండు గర్భిణి హత్య...

పాకిస్థాన్‌ పరువు కోసం కన్నపేగులను బలితీసుకుంటున్న అనాగరింక సభ్య సమాజంలో జరుగుతోంది. పరువు హత్యల ఉదంతాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రేమించిన వ్యక్తితో జీవితం పంచుకోవాలనుకోవడం ఈ అభాగ్యుల పాలిట శాపంగా మారింది. ఇటీవల పాక్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఈ పరువుహత్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఫైసలాబాద్‌లో ఉంటున్న నిండుగర్భిణి అయిన ఆష్కా(26)ను, ఆమె భర్త మహ్మద్‌ షకీల్‌(30)ను నాలుగు రోజుల క్రితం ఆమె సోదరుడు, బంధువులు తుపాకీతో కాల్చి చంపేశారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకోవడమే కారణం.

రోడ్డు ప్రమాదం..3గురు కానిస్టేబుళ్లకు గాయాలు..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు అతి సాధరణమైపోయాయి. ప్రమాదం జరగని రోజంటూ వుంటుందా అని పిస్తుంది. నగరవాసుల రక్షణకు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూంటారు. ఈ క్రమంలో వారి వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుళ్లు శేఖర్‌, నాగేశ్వర్‌రావు‌, వేణుగోపాల్‌లని పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం పెద్ద అంబర్‌పేట్‌ జరిగింది.

చట్టాలూ..నీతులూ..చెప్పేందుకేనా ?....

మధ్యప్రదేశ్ : న్యాయం చెప్పాల్సిన వారు న్యాయం తప్పితే?..నీతులు చెప్పేవారు నీతి తప్పితే?..ఎలా వుంటుంది అంటే ఇలా వుంటుందని న్యాయమూర్తులు రుజువు చేశారు. పొదుపుగా ఉండాల్సిన వారే అదుపు తప్పారు! భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, మరికొందరు జడ్జిలు సతీసమేతంగా పాల్గొన్న విందు కోసం ఏకంగా రూ.6.94 లక్షలు ఖర్చు పెట్టారు. వెండి పళ్లేల్లో వడ్డించారు. ఖరీదైన బహుమతులూ ఇచ్చారు. వెండి సామాగ్రి, బహుమతుల కోసమే రూ.3.57 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తం 244 మందికి ఆహారం కోసం రూ.3.37 లక్షలు చెల్లించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 16న ఈ విందు జరిగింది.

ఎలుగు దాడి...ఒకరుమృతి...

మహబూబ్‌నగర్‌ : ఎలుగుబంటి దాడి చేయటంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో అచ్చంపేట మండలం గుంపన్‌పల్లితండాలో జరిగింది. అడవి పందుల కోసం పెట్టిన వలలో ఎలుగుబంటి చిక్కుకుంది. వల తీసేందుకు వచ్చిన రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. 

బస్ బోల్తా...20మందికి గాయాలు..

మెదక్: ఆర్టీసీ బస్సు బోల్తా పడిండి. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి. నారాయణ్‌ఖేడ్ మండలం నర్సాపూర్ లో సోమవారం నాడు బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని  స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి నారాయణ్‌ఖేడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాని స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని సహాయక చర్యల్ని చేపట్టారు.

07:56 - June 20, 2016

ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. రంజాన్ ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. రంజాన్ పేరు వినగానే హలీమ్ ఘుమఘుమలు నోరూరిస్తాయి. సాయంత్రాలు ఇఫ్తార్ విందులతో సందడిగా వుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఉపవాస దీక్ష అత్యంత కష్టంతోనూ, నిష్టతోనూ కూడుకున్నది. సహర్ నుంచి ఇఫ్తార్ వరకు మధ్య వున్న సమయంలో ఏమీ తినరు. తోటివారికి ఎంతోకొంత సహాయం చేయాలన్న మానవీయ దృక్పథాన్ని పెంపొందించే పవిత్ర మాసమిది. మరోవైపు ప్రభుత్వం కూడా ముస్లింలకు అధికారికంగా ఇఫ్తారు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంకో వైపు పండ్లు, డ్రైఫూట్స్ లాంటి ధరలు కొండెక్కి కూర్చోవడంతో సామాన్యుల కు మోయలేని భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇఫ్తారు విందు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వాలు ముస్లింల సంక్షేమానికి ఎంత వరకు కట్టుబడి పనిచేస్తున్నాయి? ముస్లింలకిచ్చిన వాగ్దానాల అమలు తీరు ఎలా వుంది? రంజాన్ మాసంలో పెరుగుతున్న పండ్లు, డ్రైఫూట్స్ ధరలు ఉపవాస దీక్ష చేస్తున్నవారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్సారీ ఈ చర్చలో మీరు కూడా పాల్గొనవచ్చు.

07:52 - June 20, 2016

జింబాబ్వే : జింబాబ్వే టూర్ లో టీమిండియా అతిపెద్ద పరీక్షకు సిద్ధమయ్యింది. మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ విజయావకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే..హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా సోమవారం జరిగే రెండో మ్యాచ్ లో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. సాయంత్రం 4-30కి ఈ పోటీ ప్రారంభమవుతుంది.....

దెబ్బ తిన్న బెబ్బులిలా ధోనీసేన...
జింబాబ్వేతో ముగిసిన వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన టీమిండియా...ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ లో మాత్రం గట్టిపోటీనే ఎదుర్కొంటోంది. తొలిటీ-20లో జింబాబ్వే కొట్టిన రెండు పరుగుల దెబ్బతో.. ధోనీసేన దెబ్బ తిన్న బెబ్బులిలా ..ప్రతీకారంతో రగిలిపోతోంది.

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా...
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే రెండో టీ-20 మ్యాచ్ లో ...ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అపారఅనుభవం ఉన్న కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో...ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన టీమిండియాకు...తొలిటీ-20లో జింబాబ్వే మిడిలార్డర్ ఆటగాడు, వీరబాదుడు మొనగాడు ఎల్టన్ చిగుంబురా పట్టపగలే చుక్కలు చూపించాడు. భారత యువఫాస్ట్ బౌలర్లు రిషి ధావన్, ఉనద్కత్ లకు.. డెత్ ఓవర్లలో డెత్ అంటే ఎలాఉంటుందో..తన సూపర్ హిట్టింగ్ తో అనుభవమయ్యేలా చేశాడు.

26 బాల్స్ లోనే ఏడు భారీ సిక్సర్లు...

కేవలం 26 బాల్స్ లోనే ఏడు భారీ సిక్సర్లు, ఒక బౌండ్రీతో 54 పరుగుల స్కోరుతో ..మ్యాచ్ ను భారత్ నుంచి లాగేసుకొన్నాడు. రిషీ ధావన్ బౌలింగ్ లో 42, ఉనద్కత్ బౌలింగ్ లో జింబాబ్వే 43 పరుగులు సాధించడం చూస్తే...భారత బౌలింగ్ పస ఏపాటిదో తెలిసిపోయింది.అంతేకాదు...వన్డే అరంగేట్రం మ్యాచ్ లోనే సూపర్ సెంచరీ బాదిన యువఓపెనర్ రాహుల్...టీ-20 అరంగేట్రం మ్యాచ్ లో డకౌట్ కావడం...అనుభవం లేమికి, భారత ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఓపెనర్ మన్ దీప్ సింగ్ నుంచి లోయర్ ఆర్డర్ ఆటగాడు అక్షర్ పటేల్ వరకూ ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు సాధించినా...తమజట్టును విజేతగా నిలుపలేకపోయారు.

మ్యాచ్ కే హైలైట్ గా ...
మ్యాచ్ ఆఖరిబాల్ లో సిక్సర్లు ,బౌండ్రీలు బాదడం ద్వారా తనజట్టుకు గతంలో పలుమార్లు విజయాలు అందించిన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ని..జింబాబ్వే యువబౌలర్ నెవిల్లీ..వైడ్ యార్కర్లతో కట్టడి చేసిన తీరు..ఈ మ్యాచ్ కే హైలైట్ గా మిగిలిపోతుంది. హరారే వేదికగా టీమిండియాపై జింబాబ్వేకు ఇది వరుసగా రెండో టీ-20 విజయం కావడం విశేషం. అయితే..తొలి టీ-20లో ఓటమికి కారణాలు, లోటుపాట్లను ఇప్పటికే పూర్తిగా విశ్లేషించుకొన్న టీమిండియా...తుదిజట్టులో ఒకటి రెండుమార్పులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రధానంగా ఓపెనింగ్ బౌలర్లు ఉనద్కత్, రిషి ధావన్ ల స్థానంలో బరిందర్ శ్రణ్ ను తీసుకొనే అవకాశం ఉంది.

ధోనీ కెప్టెన్సీ సత్తాకు ఈమ్యాచ్ పరీక్ష.....
మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ...టీమిండియా...రెండోమ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ సైతం గాడిలో పడితేనే...జింబాబ్వే కు పగ్గాలు వేసే వీలు ఉంటుంది.యువఆటగాళ్లతో కూడిన టీమిండియాకు మాత్రమే కాదు..జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ సత్తాకు ఈమ్యాచ్ పరీక్ష అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

07:40 - June 20, 2016

గుంటూరు  : హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యయం తడిచిమోపెడవుతోంది. ఇంతేకాదు..తరలించిన ప్రభుత్వ శాఖల భవనాలకు అద్దె మరీ భారంగా మారుతోంది. కోటి కాదు...రెండు కోట్లు కాదు.. అద్దె కోసమే ఏడాదికి వంద కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, తాత్కాలిక సచివాలయం నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుచూపులేకుండా వ్యవహరించడంతోనే ప్రజాధనాన్ని మంచినీటి ప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్‌ టూ అమరావతి.....
ఏపీ పరిపాలన హైదరాబాద్‌ నుంచి అమరావతికి మారుతోంది. సెక్రటేరియట్‌ అమరావతిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయ భవనాల్లోకి మారనున్నాయి. శాఖాధిపతుల కార్యాలయాలు విజయవాడ, గుంటూరుకు తెరలివెళ్లనున్నాయి. వీటి కోసం ప్రవేటు భవనాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను కాకుండా అధిక మొత్తం అద్దెలతో ప్రైవేటు భవనాలను తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఎస్‌ఎఫ్‌టీ అద్దెను రూ. 20 నుంచి 30కి పెంపు ...
శాఖాధిపతులు కార్యాలయాల కోసం తీసుకునే ప్రైవేటు భవనాలను చెల్లించే అద్దెలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒక్కో చదరపు అడుగుకు 20 రూపాయలు మించకూడదని ప్రభుత్వం నియమించిన కమిటీ నిబంధన విధించింది. ఈ అద్దెకు ప్రైవేటు కార్యాలయాలు లభించే పరిస్థితిలేదని కొందరు శాఖాధిపతులు కమిటీకి నివేదించారు. దీంతో ఎస్‌ఎఫ్‌టీకి చెల్లించే అద్దెను 20 నుంచి 30 రూపాయలకు పెంచారు. అన్ని కార్యాలయాల కోసం 50 నుంచి 55 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరమని అంచనా వేశారు. రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మాణంలోఉన్న తాత్కాలిక సచివాలయంలో నాలుగు లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తోంది. ప్రభుత్వం కార్యాలయాల్లో మరో ఆరు లక్షల చదరపు అడుగులు ఆందుబాటులో ఉంది. ఇవిపోగా మరో 40 లక్షల ఎస్‌ఎఫ్‌టీ అవసరమని లెక్క తేల్చారు. ఈ మొత్తానికి ప్రైవేటు భవనాలే దిక్కు కావడంతో ఒక్కో ఆఫీసుకు ఏడాదికి 40 లక్షల రూపాయల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. శాఖాధిపతుల కార్యాలయాల అద్దె భారం ఏడాదికి 100 కోట్ల రూపాయల వరకు అవుతుందని అంచనా వేశారు.

మూడేళ్లలో రూ. 300 కోట్ల అద్దె...
ఒక్కో ప్రైవేటు భవనాన్ని మూడేళ్ల కాలపరిమితికి అద్దెకు తీసుకునే ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రతి ఏటా కొంత శాతంమేర అద్దె పెంపుతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఏడాదికి వంద కోట్ల చొప్పున... మూడేళ్లకు 300 కోట్ల అద్దె కట్టాల్సి వస్తోంది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బును ప్రభుత్వం మంచినీటి ప్రాయంగా ఖర్చు చేస్తోందన్న విమర్శలున్నాయి. మరోవైపు పరిపాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రభుత్వ కార్యాలయాల తరలిపును ఖర్చులో ముడిపెట్టడం మంచిదికాదని అధికార పక్షం వాదిస్తోంది.

ప్రజా ధనాన్నిచ్చుపెట్టే విషయంలో విమర్శలు...
మొత్తంమీద కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వం ముందుపుచూపుతో వ్యవహరించకపోవడంతోనే విలువైన ప్రజా ధనాన్ని అద్దెల కోసం వెచ్చించాల్సి వస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. అద్దెలకు పెట్టే సొమ్ముతో శాశ్వత భవనాలు నిర్మించుకోవచ్చిన సూచిస్తున్నారు. కార్యాలయాల తరలింపు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించేందుకు అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సూచనలను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. 

07:27 - June 20, 2016

హైదారబాద్ : గ్రేటర్ లో అవినీతి అధికారులకు వన్‌ బై వన్ చెక్ పెడుతోంది జీహెచ్ ఎంసీ. కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్న ఆఫీసర్స్ పై నిఘా ఉంచిన కమిషనర్.. వరుసగా చర్యలకు ఉపక్రమించారు. శానిటేషన్ విభాగంలోని అక్రమార్కులపై వేటేస్తూ వస్తున్నారు. తాజాగా జీహెచ్ ఎంసీ మెడికల్ ఆఫీసర్ మనోహర్ ను కమిషనర్ సస్పెండ్ చేశారు.

అవినీతి అధికారులపై కొరడా...
జీహెచ్‌ఎంసీలో అవినీతి అధికారులపై కొరడా ఝళిపిస్తున్నారు కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. ఇష్టానుసారం వ్యవహరిస్తూ... కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్న సిబ్బందిపై నిఘా ఉంచిన కమిషనర్‌. అక్రమార్కులపై వేటేయడం ప్రారంభించారు. గ్రేటర్ కార్పొరేషన్ ఉద్యోగి పేరుతో .. అతని జీతాన్ని తన ఖాతాలో వేసుకున్న మెడికల్ ఆఫీసర్ మనోహర్ ఉదంతంపై విచారణ జరిపి.. ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు.
సర్కిల్ 9 లో పనిచేసిన మెడికల్ అధికారి మనోహర్...
జీహెచ్ఎంసీ సర్కిల్ 9 లో పనిచేసిన మెడికల్ అధికారి మనోహర్ .. చనిపోయిన సూపర్ వైజర్ వెంకటరమణ పేరుతో వేతనాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2014 మార్చిలో వెంకటరమణ చనిపోయినా సెప్టెంబర్ వరకు అతడి వేతనం.. జీహెచ్ఎంసీ ఖజానా నుండి మనోహర్ అకౌంట్‌కు బదిలీ అయినట్లు వెల్లడైంది. వెంకటరమణతల్లి అసూయమ్మ పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఎట్టకేలకు డాక్టర్ మనోహర్ ను సస్పెండ్ చేశారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న శానిటరీ ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లును కూడా సస్పెండ్ చేశారు అధికారులు.

శానిటేషన్ లో కార్మికులు లేకున్నా జీతాలు ...
గతంలో శానిటేషన్ లో ఫీల్డ్ పై ఎలాంటి కార్మికులు లేకుండా జీతాలు కాజేసిన అప్పటి కూకట్ పల్లి సర్కిల్ మెడికల్ అధికారి మురళీధర్ గుప్తాను సొంత డిపార్ట్‌మెంట్ కు సరెండర్ చేయడంతో పాటు.. క్రిమినల్ కేసులూ బుక్ చేశారు. కూకట్ పల్లి సర్కిల్ 9 లో 140 మంది కార్మికులను విధుల్లో చేర్చుకున్న డాక్టర్ రామారావును కూడా సొంత శాఖకు సరెండర్ చేశారు. జీహెచ్‌ఎంసీలో బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

 

నేటి నుండే పోలియో టీకాలు ...

హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పోలియో టీకాలు వేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖతోపాటు జీహెచ్‌ఎంసీ, శిశుసంక్షేమ శాఖ, యూనిసెఫ్, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు పోలియో టీకా స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొననున్నాయి. ఈనెల 26వ తేదీ వరకూ జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 2.5 లక్షల మంది చిన్నారులకు పోలియో టీకాలు ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి డా.పద్మజా తెలిపారు. 

07:09 - June 20, 2016

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోలియో మహమ్మారి నియంత్రణకు అధికారులు సిద్ధమయ్యారు. అంబర్ పేట నాలాలో పోలియో వైరస్ బయటపడటంతో.. ఆరు వారాల పిల్లల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు రేపటి నుంచి వారం రోజుల పాటు పోలియో టీకాలు వేయనున్నారు. మురుగునీటిలో పోలియో వైరస్ గుర్తింపు .

ఈ నెల 20నుంచి 26వరకు పోలియో వ్యాక్సిన్ ..
హైదరాబాద్ అంబర్ పేట్ నాలాలోని మురుగునీటి శాంపిల్ లో.. పోలియో వైరస్ ఉన్నట్టు నివేదిక రావడంతో.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 20నుంచి 26వ తేదీవరకు ఆరువారాల పిల్లల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు పోలియో

ఇంటింటికి సర్వే నిర్వహించిన వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది...
హైద‌రాబాద్ జిల్లాలో 12 సెక్టర్లతో పాటు కంటోన్మెంట్ ప్రాంతాల్లో, సిటి ప‌రిస‌రాల్లోనూ వైద్య, ఆరోగ్య, మ‌హిళా శిశుసంక్షేమ శాఖల సిబ్బంది ఇంటింటికి స‌ర్వే నిర్వహించారు. సర్వే కోసం ప్రయివేటు న‌ర్సింగ్ కళాశాల‌ల విద్యార్థులు, జీహెచ్ఎంసీ శానిటేషన్‌ అధికారులతో పాటు మెప్మా, ఎన్జీఓ సిబ్బందిని ఉప‌యోగిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో స‌ర్వేనూ కూడా పూర్తి చేశారు. సిటిలోని 3 ల‌క్షల మంది చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్ ఇవ్వడానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మూడు లక్షల వ్యాక్సినేషన్ డోసులు సిద్ధం...
గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో పోలియో స్పెష‌ల్ డ్రైవ్‌ కోసం మూడు ల‌క్షల వ్యాక్సినేష‌న్ డోసుల‌ను రెడీ చేశారు అధికారులు. ఇందుకోసం నల్గొండ, మెద‌క్, రంగారెడ్డి, మ‌హ‌బుబ్‌న‌గ‌ర్ జిల్లాల‌ నుంచి ఎఎన్ఎంల‌ను నగరానికి ర‌ప్పిస్తున్నారు. ఇక త‌మ పీహెచ్‌సీల ప‌రిధిలో పోలియో వాక్సినేష‌న్‌కు అక్కడి డాక్టర్లు నోడ‌ల్‌ ఆఫీస‌ర్లుగా వ్యహ‌రించ‌నున్నారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌తోపాటు, పాఠ‌శాల‌ల వ‌ద్ద చిన్నారులకు పోలియో వాక్సిన్ ఇవ్వనున్నారు. 

జూన్ 21 అంతర్జాతీయ యోగా డే ..

ఢిల్లీ : నిర్వహించే యెగా డే కోసం కేంద్ర ప్రభుత్వ భారీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పొల్గొననున్నారు. విద్యాసంస్థల్లో కూడా యోగా డేని నిర్వహంచనున్నారు. 2015లో మొదటి యోగా దినోత్సవానికి వచ్చిన మంచిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. గతేడాది 36 వేల మందితో కలిసి ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన యోగా డేలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఈసారి చండీగఢ్‌లో నిర్వహించే యోగా దినోత్సవానికి హాజరుకానున్నారు.

07:02 - June 20, 2016

ఢిల్లీ : నిర్వహించే యెగా డే కోసం కేంద్ర ప్రభుత్వ భారీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పొల్గొననున్నారు. విద్యాసంస్థల్లో కూడా యోగా డేని నిర్వహంచనున్నారు. 2015లో మొదటి యోగా దినోత్సవానికి వచ్చిన మంచిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేశారు. గతేడాది 36 వేల మందితో కలిసి ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగిన యోగా డేలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఈసారి చండీగఢ్‌లో నిర్వహించే యోగా దినోత్సవానికి హాజరుకానున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగే యోగా కార్యక్రమాల్లో రాజ్‌నాథ్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, నిర్మాలా సీతారామన్‌, మేనకాగాంధీ సహా 10 మంది కేంద్ర మంత్రులు పాల్గొంటారు. 

06:50 - June 20, 2016

గుంటూరు : అమరావతి ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది. భూసమీకరణ ప్రారంభించిన నేలపాడు నుంచే ఈ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ముందుగా భావించారు. అయితే.. వర్షం కారణంగా వేదికను మార్చారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ప్లాట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఫలించిన రైతుల ఎదురుచూపులు...

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీకి సీఆర్‌డీఏ సోమవారం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్యాకేజీ ప్రకారమే.. భూములిచ్చిన జరీబు రైతుల నివాసానికి వేయి గజాలు, వాణిజ్యానికి 450 గజాలు, మెట్ట రైతుల నివాసానికి వేయి గజాలు, 250 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని నిశ్చయించింది.

లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయింపు...
కొంతకాలంగా ప్లాట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్న అధికారులు.. రైతులకు కావాల్సిన ప్లాట్ల వివరాలను 9.18 ఫామ్‌లో ఇప్పటికే స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయంలో అందజేశారు. సేకరించిన వివరాల ప్రకారం రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించబోతున్నారు. రైతుల్లో కొందరు 500 గజాలు, 250 గజాలు తీసుకుంటే, చాలామంది నివాసం కోసం విల్లాలను కూడా ఎంచుకున్నారు. వీటితో పాటు అపార్ట్‌మెంట్లు కట్టుకోవడానికి 2000 గజాల ప్లాట్లను కూడా ఎంపిక చేసుకున్నారు. వీరందరికి లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించనున్నారు.

నేలపాడు నుంచే ఫ్లాట్ల పంపిణీ...
మొదట నేలపాడు నుంచే ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా, వర్షాల కారణంగా తుళ్లూరులోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో నేలపాడు రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. లాటరీ పద్ధతిపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. దీనికోసం ట్రయల్‌ కూడా నిర్వహించారు. రైతులకు ప్లాట్ల కేటాయించే ముందు నాలుగైదు సార్లు ట్రయల్‌ నిర్వహించి, తర్వాత ఫైనల్ లాటరీ తీసి ప్లాట్ల కేటాయింపు చేస్తామని నేలపాడు డిప్యూటీ కలెక్టర్ వసంతరావు తెలిపారు. రైతులందరికి, ఇప్పటికే సమాచారం అందించామని, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా అందరి సమక్షంలో పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేస్తున్నామని తెలిపారు. తాము ఇచ్చిన భూములు ఇక ప్లాట్లుగా మారిపోవడం ఆనందంగా ఉందని నేలపాడు వాసులు అంటున్నారు. అయితే భూములిచ్చే సమయంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పారని, కానీ ప్రస్తుతం నేలను చదును చేయకుండా ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు.

అక్టోబర్ 14 నాటికి 29 గ్రామాల్లో పంపిణీ : మంత్రి నారాయణ
రైతులకు ఇచ్చే ప్లాట్లను ప్రస్తుతం లే అవుట్ల రూపంలో ఇస్తామని, వర్షాలు తగ్గగానే నేలను చదును చేసి ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అక్టోబర్ 14 నాటికి 29 గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. లాటరీ పద్దతి పై ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని, అత్యంత పారదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ పద్దతిని ఎంచుకున్నామని మంత్రి చెప్పారు.

ప్లాట్ల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్ ..
ప్లాట్ల పంపిణీపై రాజధాని రైతుల నిరీక్షణ ఫలించబోతోంది. అదే సమయంలో 29 గ్రామాల్లో కూడా ప్లాట్ల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. 

06:41 - June 20, 2016

గుంటూరు : ఇవాళ ఏరువాక పౌర్ణమి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఏరువాకకు శ్రీకారం చుడతారు.

సంప్రదాయ బద్ధంగా వ్యవసాయ పనులు...
ఏరువాక పౌర్ణమి రోజు సంప్రదాయ బద్ధంగా వ్యవసాయ పనులు ప్రారంభించడం ఏపీలో ఆనవాయితీగా వస్తోంది. రైతులు ఎడ్లకు పూజచేసి, బెల్లం తినిపించి నాగళ్లతో దుక్కిదున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఏడాదంతా వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు. రెండేళ్లు కరవుతో తల్లడిల్లిన అన్నదాతలు... ఈసారి నైరుతీ రుత పవనాల ప్రారంభం నుంచే మంచి వర్షాలు కురుస్తుండటంలో ఆశావహ ధృక్పదంతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు.

.11 నుంచి అన్ని గ్రామాల్లో ఏరువాక ..
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వ్యవసాయ పంచాగకర్తలు ఇందుకు ముహూర్తం నిర్ణయించారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

పశ్చిమగోదావరి ఏరువాకకు శ్రీకారం...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి నరసాపురం మండలం చిట్టవరం ఏరువాకకు శ్రీకారం చుడతారు. జిల్లా అధికారులు ఇందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఏరువాక ఏర్పాట్లను పరిశీలించారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంవీ రావు పొలంలో చంద్రబాబు నాగలిపట్టి దుక్కిదున్నతారు. ఆ తర్వాత రైతులను ఉద్దేశించిన ప్రసంగిస్తారు. ఇదే వేదిక నుంచి విద్యుత్‌ ఆదాచేసే ఫ్యాన్లను ప్రజలకు పంపిణీ చేస్తారు.

ఏరువాక తరహాలోనే మర్ని కార్యక్రమాలు ....
ఏరువాక తరహాలోనే పొలం పిలుస్తోంది-చంద్రన్న రైతుక్షేత్రం కార్యక్రమాలను కూడా ఈనెల 27న చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా వివిధ అంశాల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులను రైతులకు నేర్పిస్తారు.

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపుకు సర్వం సిద్ధం..

గుంటూరు :  అమరావతి ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది. భూసమీకరణ ప్రారంభించిన నేలపాడు నుంచే ఈ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ముందుగా భావించారు. అయితే.. వర్షం కారణంగా వేదికను మార్చారు. తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ప్లాట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఏపీలో ఏరువాక....

గుంటూరు : ఇవాళ ఏరువాక పౌర్ణమి. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఏరువాకకు శ్రీకారం చుడతారు. 

ఐఐటీలో గిరి పుత్రుల హవా..

మధ్యప్రదేశ్ : ఐఐటీలో గిరి పుత్రులు ప్రతిభ చూపారు. ప్రోత్సాహం ఉంటే ఎంతటి కఠిన పరీక్షలనైనా సునాయాసంగా ఎదుర్కొంటామని మధ్యప్రదేశ్ గిరిజనులు నిరూపించారు. మారుమూల గ్రామాల విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడం లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఇంటర్‌తోపాటు వివిధ ఐఐటీ పోటీ పరీక్షలకు వారిని సంసిద్ధులను చేసింది. ఇటీవల వెలువడిన ఐఐటీ ఫలితాల్లో 20మంది గిరిజన విద్యార్థులు సీట్లు సాధించారు.

సభా గౌరవం కోసమే రోజా సస్పెన్షన్ : కోడెల

హైదారబాద్ : సభా గౌరవం కోసమే రోజాను సస్పెండ్ చేశామని, రోజా భాష, హావభావాలు బాగుండలేదని, కోర్టు కూడా రోజాను తప్పు పట్టిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. క్షమాపణలు కోరాలని కోర్టు చెప్పినా రోజా వినలేదని, ఆమె నుంచి క్షమాపణలు కోరే లేఖ ఏదీ తమకు అందలేదని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. తప్పుదిద్దుకునే అవకాశాన్ని రోజా కోల్పోయారని, అనర్హతపై వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదులు సరిగా లేవని కోడెల పేర్కొన్నారు.

Don't Miss