Activities calendar

21 June 2016

ఆగిన రాజధాని కొత్త రైలు..

విజయవాడ : ఏపీ రాజధాని కొత్త రైలు ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని అమరావతికి ఉద్యోగులు రావడానికి వీలుగా రైల్వే శాఖ ఈ సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రత్యేక రైలు మంగళవారం రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీన్ని త్వరలో రెగ్యులర్‌గా నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు.

 

బుధవారం ఒంగోలులో బాబు పర్యటన..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో పర్యటించనున్నారు. మ.2.15లకు ఆయన ఒంగోలు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా జేబీఎం చర్చిలో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం తాగునీటి పథకం పైలాన్‌ ఆవిష్కరిస్తారు. మ.3 గంటలకు ఒంగోలు మినీస్టేడియంలో జరిగే బహిరంగసభ ఆయన పాల్గొని రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేయనున్నారు.

21:36 - June 21, 2016

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సుల్తాన్‌ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా రెజ్లర్‌ అనుభవం గురించి చెబుతూ- రింగ్‌ నుంచి బయటకు రాగానే రేప్‌కు గురైన మహిళల్లా ఫీలయ్యానంటూ వ్యాఖ్యానించాడు. సల్మాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. సల్మాన్‌ తరపున ఆయన తండ్రి సలీం సారీ చెప్పాడు. బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్‌ఖాన్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డాడు. త‌న తాజా చిత్రం 'సుల్తాన్‌' ప్రమోష‌న్‌లో భాగంగా స్పాట్‌బోయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో రెజ్లర్‌గా న‌టించిన‌ అనుభ‌వం ఎలా ఉంద‌న్న ప్రశ్నకు.. రింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రతీసారీ తాను అత్యాచారానికి గురైన మ‌హిళ‌లాగా ఫీల‌య్యేవాడిన‌ని, అడుగులు స‌రిగా ప‌డేవి కావ‌ని స‌ల్మాన్ అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. షూటింగ్‌ సందర్భంగా వివిధ కోణాల్లో ఒకే షాట్‌ను చిత్రీక‌రించేందు కోసం 120 కిలోల మ‌నిషిని ప‌దేప‌దే పైకి ఎత్తి కింద ప‌డేయాల్సి వ‌చ్చేద‌ని స‌ల్మాన్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో విమర్శలు..
సల్మాన్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా ఉద్యమకర్తలు మండిపడుతున్నారు. సల్మాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు లలితా కుమారమంగళం తీవ్రంగా స్పందించారు. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉండే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వారం రోజుల్లోగా సల్మాన్‌ క్షమాపణ చెప్పాలని సల్మాన్‌ను జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించింది. సల్మాన్‌ఖాన్‌ రేప్‌ స్టేట్‌మెంట్‌పై ఆయన తండ్రి సలీంఖాన్‌ స్పందించారు. తన కొడుకు మాటలు ముమ్మాటికి తప్పేనని ట్విట్టర్‌లో చెప్పారు. సల్మాన్‌ ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. కొడుకు సలీం తరపున క్షమాపణ చెప్పారు. సల్మాన్‌ ఖాన్ వివాదాలకు కొత్తేం కాదు. 2002 ముంబైలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫుట్‌పాత్‌పై పడుకున్నవారిపై సల్మాన్‌ కారు తోలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. రాజస్థాన్‌లో సినిమా షూటింగ్‌ సందర్భంగా సల్మాన్‌ కృష్ణజింకలను వేటాడిన కేసు కూడా ఇంకా వెంటాడుతోంది.

21:33 - June 21, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదిపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ మరోసారి ధ్వజమెత్తారు. డిఫెన్స్‌లో వందశాతం ఎఫ్‌డిఐలను తీసుకురావడం ద్వారా దేశ భద్రతను విదేశి హస్తాల్లో పెట్టారని కేజ్రీవాల్‌ విమర్శించారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, రాబర్ట్‌ వాద్రాలాను భయపెట్టినట్లు తనను భయపెట్టలేరని కేజ్రీవాల్‌ అన్నారు. తన ప్రాణాలు పోయినా లెక్క చేయను కానీ అవినీతిని మాత్రం సహించేది లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. సిబిఐ, ఎసిబి, ఢిల్లీ పోలీసులతో తనపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా భయపడేది లేదని కేజ్రీవాల్‌ చెప్పారు.

21:31 - June 21, 2016

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్‌..సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్‌ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేశారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చుచేసి తాను గెలుపొందానని కోడెల ఓ ఇంటర్వ్యూలో చెప్పారని అన్నారు. నిబంధనల ప్రకారం ఓ ఎమ్మెల్యే 28 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని అంబటి గుర్తు చేశారు. కోడెల వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు.

 

21:28 - June 21, 2016

హైదరాబాద్ : విప్లవ గేయ సాహిత్యంలో కీలకపాత్ర పోషించిన ప్రజాకవి గూడ అంజయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. పాట కోసమే పాట రాయకుండా ప్రజల కష్టాన్ని చూసి దాన్ని తాను అనుభవించి చలించాక పాట రాసిన ప్రజాగొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక అంశాలపై పాటలు రాసిన గూడ అంజయ్య చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు. 'భద్రం కొడుకో.. కొడుకో కొమురన్న జర పయిలం కొడుకో' పాట రాసిన ప్రముఖ కవి గూడ అంజయ్య మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంజయ్య రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం రాగన్నగూడెంలో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం నిమ్స్‌లో చికిత్స పొందారని.. ఆయన కోరిక మేరకే ఇంటికి తీసుకువచ్చామన్నారు గూడ అంజయ్య కూతురు.

ఊరు మనదిరా..
తన ఇరవై ఏట తెలంగాణలో దొరల ఆగడాలు ఎక్కువై పోయిన సమయంలో 'ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. ' అనే పాటను అంజయ్య రాశారు. ఈ పాటను ఆర్‌.నారాయణమూర్తి తన సినిమాలో వాడుకున్నారు ఈ పాట తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ పాట 16 భాషల్లోకి అనువాదించారు. అలాగే అంజయ్య రాసిన 'నేను రాను బిడ్డో సర్కార్‌ దవాఖానాకు' పాటకు ఎంతో ఆదరణ లభించింది. తెలంగాణ ఉద్యమంలో అంజయ్య ఎన్నో పాటలు రాశారు. ఇవే కాకుండా ఉద్యమానికి సంబంధించి ఎన్నో పాటలు రాశారు. అంజయ్య కలం నుంచి 'పొలిమేర' అనే నవల వెలువడింది. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల నేపథ్యంలో విప్లవ విద్యార్థి నాయకుడు, ప్రజాగాయకుడు గోపి అన్న ప్రధాన పాత్రను కేంద్రబిందువుగా తీసుకుని ఆనాటి సామాజిక, రాజకీయ పరిణామాలను చక్కటి కథా కథనంతో అంజయ్య ఆవిష్కరించారు. 'గిరిజన మహిళా మేలుకో' అనే నాటికకు విపరీతమైన స్పందన లభించింది. సాహిత్య రత్న, దళిత కళారత్న, దళిత సేవారత్న వంటి అవార్డులను అంజయ్య అందుకున్నారు. గతేడాది సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని పొందారు. అంజయ్య స్వస్థలమైన ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. గూడ అంజయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌, గద్దర్‌, సుద్దాల అశోక్‌తేజ, వందేమాతరం శ్రీనివాస్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

21:25 - June 21, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ యోగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు యోగా శిబిరానికి నేతృత్వం వహించగా, హైదరాబాద్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా యోగాసనాలను.. ప్రదర్శించారు. వేలాది సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని యోగా విశిష్టతను చాటారు. విజయవాడలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి ఉత్సాహం నింపారు. సీఎం చంద్రబాబుతో పాటు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు సైతం పాల్గొన్నారు. యోగా ఒక జీవన విధానమని, అది కుల మతాలకు అతీతమైనదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తణుకులో నిర్వహించిన యోగా దినోత్సవాల్లో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో విద్యార్థినులు యోగా ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన యోగా వేడుకల్లో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక కర్నూలు పట్టణంలో నిర్వహించిన యోగా వేడుకల్లో ఎంపీ బుట్టారేణుక ముఖ్య అతిథిగా పాల్గొనగా, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లోనూ నేతలు యోగా ఉత్సవాల్లో పాల్గొని ఉత్సాహం నింపారు.

తెలంగాణలో..
ఇక తెలంగాణ రాష్ట్రంలో సైతం అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం యోగా డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు లక్ష్మా రెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.యోగా ఒక మతానికి మాత్రమే చెందిన కార్యక్రమం కాదని తెలంగాణ డిప్యూటీ సీఎం తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొన్నారు. యోగాసనాలు వేసి.. ఆహూతులను ఉత్సాహపరిచారు. కరీంనగర్‌లో నిర్వహించిన యోగా దినోత్సవాల్లో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు యోగాభ్యాసంతో పాటు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ లో నిర్వహించిన యోగా వేడుకల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు. ఇక సికింద్రాబాద్‌ లోని ప్రభుత్వ ప్రాణాయామ పరిశోధన కేంద్రంలో పండిట్‌ శేషభట్టర్‌ సుదర్శనాచార్య ఆధ్వర్యంలో యోగా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. గత సంవత్సరమే ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ ఏడాది మరింత వేడుకగా సాగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సైతం యోగా వేడుకలను అధికారికంగా నిర్వహించారు. 

21:21 - June 21, 2016

విజయవాడ : వ్యవసాయం తప్ప మిగిలిన అన్ని శాఖల్లో రేపటిలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌ హాట్‌ హాట్‌గా సాగింది. బదిలీల ప్రక్రియలో జాప్యంపై మంత్రులు అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీల్లో సమన్యాయం పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బదిలీల ప్రక్రియపై మంత్రులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బదిలీల్లో జరుగుతున్న జాప్యంపై అధికారులు, మంత్రులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
బుధవారం లోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖకు తప్ప, మరే ఇతర శాఖకు బదిలీల్లో మినహాయింపులేదన్నారు. ఆరోగ్య శాఖ మరో రెండ్రోజులు గడువు అడిగినా సీఎం ససేమిరా అన్నారు. విద్యాశాఖ కూడా తక్షణం చర్యలు చేపట్టి బదిలీలు పూర్తిచేయాల్సిందేనని తేల్చిచెప్పారు. విద్యా సంస్థల ప్రారంభం నాటికే ఆ శాఖలో బదిలీలు పూర్తి చేయాల్సింది కదా అంటూ సీఎం సీరియస్‌ అయ్యారు. వ్యవసాయ పనులు ఆరంభం కావడం వల్లే వ్యవసాయ శాఖలో బదిలీలనుఆగస్టులో నెలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి అక్రమాలకు తావివ్వరాదని అధికారులకు స్పష్టం చేశారు. బంధుప్రీతి, వర్గ ప్రీతి ప్రాతిపదికగా బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బదిలీల్లో కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు సూచించారు. మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సమన్వయంతో ఉత్తమ టీం ను ఎంపిక చేసుకోవడంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. సక్రమంగా విధులు నిర్వర్తించని వారిని ఎక్కడికైనా బదిలీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. 

21:18 - June 21, 2016

ఢిల్లీ : కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం అసంపూర్తిగా ముగిసింది. 9 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఎలాంటి ఫలితం తేలలేదు. ట్రిబ్యునల్‌ తుది తీర్పు రాకుండా నీటి కేటాయింపులు జరుపుతామంటే ఒప్పుకునేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. రేపు అధికారులు మరోసారి భేటీ కానున్నారు. ట్రిబ్యునల్‌ తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక నీటి కేటాయింపులే జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నీటి పారుదల శాఖల అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై చర్చించడం జరిగిందని, బోర్డు నోటిఫై అంశం చర్చకు రాలేదని తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్ రావు పేర్కొన్నారు. 

ముగిసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం..

ఢిల్లీ : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నీటి పారుదల శాఖల అధికారులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై చర్చించడం జరిగిందని, బోర్డు నోటిఫై అంశం చర్చకు రాలేదని తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్ రావు పేర్కొన్నారు. 

కొనసాగుతున్న కృష్ణా బోర్డు సమావేశం..

ఢిల్లీ : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నీటి పారుదల శాఖల అధికారులు హాజరయ్యారు. 

లాయర్ల ఆందోళనపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : లాయర్ల ఆందోళన నేపథ్యంలో కోర్టుల దగ్గర భద్రతపై టీఎస్‌ సీఎస్‌ రాజీవ్ శర్మ అధికారలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌, వరంగల్‌ సీపీలు పాల్గొన్నారు.

20:10 - June 21, 2016

రాష్ట్రపతి కాడికెళ్లి ప్రధానమంత్రి మీదికెళ్లి.. పట్నాలు పల్లెల దాక.. నడ్ములొంచె దినం జోర్దార్ అయ్యింది అదే యోగా..పేదల పక్షపాతి..? నిరుపేదల పెన్నిధి..అధికార పార్టీ ఎమ్మెల్యే అంటె అంత అలుసా నీకు..? ఆయ్..? గిసొంటోళ్లను మస్తుగ జూశిండ్రుగదా మీరు..? అగో ఇన్నారుల్లో.. పించిండ్లు రానోళ్లు మళ్ల దర్కాస్తు జేస్కుంటున్నరట..ఒక పెద్దమన్షి..? కొడ్కు పన్ను ఊగులాడుతున్నదని..? ఏం జేశిండో..దెయ్యాలంటే మన్సులకే భయముంటదా.?? జంతువులకు గూడ ఉంటదా...నిన్న ఒక హెలికాప్టర్ ను గూడ గద్ద ఢీ కొట్టింది..మరి ఏమైంది..? తదితర వివరాలు తెల్సుకోవాలంటే వీడియో సూడుండ్రి..

20:09 - June 21, 2016

ఏ ఏమనుకున్నవ్..? నేను ఎమ్మెల్యే సారు కుడి భుజాన్ని..? నన్నేగంతమాటంటవా..? నీ నౌకరి దీశేపిస్త ఏమనుకుంటున్నవో..? ఏం తమాష జేస్తున్నవా.? అధికార పార్టీ ఎమ్మెల్యే అంటె అంత అలుసా నీకు..? ఆయ్..? గిసొంటోళ్లను మస్తుగ జూశిండ్రుగదా మీరు..? ఇంకొకలు సీఎం కేసీఆర్ చుట్టాన్ని అంటూ పీఎస్ లోనే దౌర్జన్యం చేసిండు. ఆయన తీరు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:05 - June 21, 2016

దేశ రక్షణ ఎవరి గుప్పిట్లో ఉండబోతుంది?? గగనయానం ఎవరి గుప్పిట్లోకి.. వెళ్ళబోతుంది?? ప్రజల బీమా మదుపులు ఎవరి అభివృద్ధి కోసం ఫణంగా పెట్టబోతున్నారు?? ప్రజారోగ్యం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడబోతోంది? విదేశీ పెట్టుబడికి.. స్వదేశీ దాసోహం తప్ప మరొకటి అవుతుందా? నూరు శాతం ఎఫ్.డి.ఐ లో అసలు మేలు శాతం ఎంత?? ఇది పెట్టుబడా?? లేక విదేశీ కట్టుబడా?? ఇప్పుడు దేశంలోని ఆర్ధిక వేత్తల్ని, నిపుణుల్ని తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. గేట్లు బార్లా తెరిస్తే జరిగే పరిణామాలేంటి? దీనిపై ప్రత్యేక కథనం.. విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించే విషయంలో... ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తున్న అత్యుత్సాహపు తీరు ఇది. విదేశీ పెట్టుబడులు.. ఎంత వరకు అవసరం..?? దానికి పరిమితి ఎంత?? ఏయేరంగాల్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించుకోవచ్చు? అనే విషయాలను పక్కనపెట్టి దేశానికి వెన్నుముకైన కీలక రంగాల్లో విదేశీ జోక్యానికి యూపీఏ పచ్చజెండా ఊపేసింది.

అరవింద్ కమిటీ ఏం సూచనలు చేసింది..
పెట్టుబడిదారీ వర్గాలకిది శుభవార్త. కానీ ప్రజాపక్షాన నిలబడి ఆలోచిస్తే అసలు విదేశీ పెట్టుబడుల వల్ల లాభమా? నష్టమా? అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే కొత్త టెక్నాలజీ వల్ల అభివృద్ధి జరుగుతుందో... ఎక్కడైతే ఉద్యోగావకాశాలు పెరుగుతాయో? ఎక్కడైతే దేశ రక్షణ సమస్యలు తలెత్తవో? ఆయా దేశాల్లోకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించుకోవడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ చిక్కల్లా ఇక్కడే ఉంది. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం.. కీలకమైన మూడు రంగాల భద్రతను మర్చిపోయినట్టుగా నూరుశాతం విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధపడటం విమర్శలకు దారితీస్తోంది. విదేశీ పెట్టుబడుల్ని దేశంలో విస్తరించే నేపథ్యంలో నాటి యూపీఏ సర్కారు అరవింద్ మాయారాం అనే సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ వేసింది. మాయారాం ఒక ఆర్థిక నిపుణులు. ఆ కమిటీ విదేశీ పెట్టుబడులు తెచ్చేందుకు వేర్వేరు రంగాల్లో ఉన్న వేర్వేరు పరిమితులు, వీటన్నింటినీ ఒక పద్ధతిలోకి ఎలా తీసుకురావాలి అనే దానిపై కమిటీ నిర్ధారించి చెప్పింది.. అరవింద్ కమిటీ ఏం సూచనలు చేసింది..?

దేశ సుస్థిరతకు ప్రశ్నార్థకం..
దేశం అంతకంతకు అభివృద్ధి చెందాలి. దానికి విదేశీ పెట్టుబడులూ అవసరమే.. కానీ ఆ అవసరం.. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేది కాకూడదు. దేశానికే గర్వకారణంగా నిలిచే సమాచార, బీమా, రక్షణ రంగాల్లోకి విదేశీ శక్తుల ఆధిపత్యానికి అవకాశం ఇస్తే.. దేశ మనుగడకే ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి రావటం ఖాయం. ఇంటి తాళాలు దొంగలకు ఇవ్వటానికి, నూరు శాతం ఎఫ్డీఐలకు అనుమతివ్వటానికి పెద్ద తేడా ఏం లేదు. నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తావిస్తే జరిగే పరిణామాలను స్కూల్ పిల్లాడు కూడా ఊహించే విషయమే. దేశ ప్రజల రక్షణ, సమాచార, వైమానిక రంగాల్లో పరదేశపు చొరబాటును ఆహ్వానించడం ఎంతవరకూ సమంజసం అనేది పాలకులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు ప్రశ్నార్ధకంగా మారుతుందనటంలో సందేహం లేదు. 

మల్లన్న సాగర్ నిర్వాసితులకు వ్యతిరేకం కాదు - హరీష్..

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, నిర్వాసితులతో చర్చంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. జీవో 123 ప్రకారం మెరుగైన పరిహారం ఇస్తున్నామని ఆయన తెలిపారు. 

బీసీసీఐ వార్షిక సదస్సు ప్రారంభం..

హిమాచల్ ప్రదేశ్ : హెచ్ పీసీఏ స్టేడియంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సదస్సు ప్రారంభమైంది. బీసీసీఐ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తొలిసారి నిర్వహిస్తున్న వార్షిక సదస్సును ప్రారంభించడం చాలా గర్వంగా ఉందని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. 

టీఎస్ పీ ఈసెట్ ఫలితాలు 22న..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్‌పీఈసెట్ - 2016 ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు. 

19:35 - June 21, 2016

హైదరాబాద్ : ప్రముఖ కవి గూడ అంజయ్య మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రచయితలు..కవులు, నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గూడ అంజయ్య (61) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం రంగారెడ్డి జిల్లా రాగన్నగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈసందర్భంగా పలువురు టెన్ టివితో మాట్లాడారు.

తీరని లోటు - ప్రొ.కోదండరాం..
అంజయ్య మృతిపై ప్రొ.కోదండరాం స్పందించారు. ఆయన మృతి తీరని లోటని, పాటలు రాసే వ్యక్తి లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. పాట ద్వారానే తనకు తొలి పరిచయం ఏర్పడిందన్నారు. నగరంలో ఉద్యోగం చేసిన సమయంలో ఆయనతో తనకు సాన్నిహిత్యం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమం బలపడిన సందర్భంలో మంచి మంచి పాటలు రాశారని, ఎంతో మందికి ఉద్యమ స్పూర్తిని అందించారన్నారు. తెలంగాణ కోసం పాటలు రాసిన ప్రముఖుల్లో ఆయన ఒకరని, ఆయన పాటలు ఒక పెద్దదిక్కుగా ఉండేవన్నారు.

ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వారు - ప్రకాష్..
గూడ అంజయ్య చిన్నతనం నుండే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వారని రచయిత ప్రకాష్ పేర్కొన్నారు. 1973లో ఊరు మనదిరా..అంటూ పాట రాశారని తెలిపారు. లింగాపూర్ గ్రామంలో పెత్తనం కింద ఉండేదని, దొరల ఆగడాలను చిన్నతనం నుండే చూశారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలు జీవితం గడిపారని, పీడీఎస్ యూ లో చురుగ్గా ఉండేవారన్నారు. విప్లవ ఉద్యమంలో ఆయన అనేక పాటలు రాశారని పేర్కొన్నారు. కేసీఆర్ తో కలిసి గూడ అంజయ్య అనేక పాటలు రాశారని, ఆయన తీసుకున్న బాణీలు..పాటలు జనాదరణ పొందాయన్నారు. ఆయన మరణం తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘం - గద్దర్..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘమని ప్రజా కవి గద్దర్ పేర్కొన్నారు. గూడ అంజయ్య మృతి తీరని లోటని, ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భూమి..నీళ్లు..వనరులు..పాలన..ప్రేమలు ఈ నాలుగింటిలో భూమి..నీళ్లు సమస్య ప్రధానంగా ఉంటుందన్నారు. భూములు..నీళ్లు మాకే అనే దానిపై అనేక సాహిత్యం వచ్చిందన్నారు. ఎందుకు పేదరికంలో ఉన్నాం ? ప్రశ్నించే క్రమంలో అంజయ్యను చూడాలని పేర్కొన్నారు. అంజన్న సోదరుడు చంద్రన్న తనకు పరిచయం ఉందన్నారు. ఊరు మనదిరా..వాడ మనదిరా అనే పాట అనేక భాషల్లోకి అనువదించడం జరిగిందని తెలిపారు. ఏ ఉద్యమమైనా రంగంలోకి దిగే వారమని, చివరి వరకు జీవించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగాలని ఆకాంక్షించారు.
దేశపతి శ్రీనివాస్ కూడా స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియచేశారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:27 - June 21, 2016

హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య (61) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం రంగారెడ్డి జిల్లా రాగన్నగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కామెర్లు, మూత్ర పిండాల వ్యాధితో ఆయన కొన్ని రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో 1955లో జన్మించారు. తన రచనలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన 'ఊరు మనదిరా..ఈ వాడ మనదిరా' అనే పాట 16 భాషల్లోకి అనువాదమైంది. 'రాజిగా వోరి రాజిగా' పాట తెలంగాణ ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపింది. దాదాపు 20 సినిమాలకు పాటలు రాశారు. గత ఏడాది అక్టోబర్ లో సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు. పొలిమేర, దళిత కథలు అనే రచనలు చేశారు. సాహితీ రత్న, దళిత కళారత్న, దళిత సేవా రత్నతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కీర్తి పురస్కారం అందుకున్నారు. ఈయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తో పాటు పలువురు సంతాపం తెలిపారు. 
ఈ సందర్భంగా గతంలో పలు వేదికల్లో ఆయన పలు పాటలు పాడారు. ఆ పాటలను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

అంజయ్య మృతిపై ప్రొ.కోదండరాం సంతాపం..

హైదరాబాద్ : ప్రజాకవి గూడ అంజయ్య మృతి పట్ల ప్రొ. కోదండరాం సంతాపం తెలిపారు. ఆయన మృతి తమకు కాకుండా, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. పాట ద్వారానే ఆయనతో తొలి పరిచయం ఏర్పడిందన్నారు. 

అంజయ్య మృతిపై తమ్మినేని సంతాపం..

హైదరాబాద్ :  ప్రజాకవి గూడ అంజయ్య మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ్మినేని ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంజయ్య మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని పేర్కొన్నారు. 1974 ఎమెర్జెన్సీ కాలంలో అజ్ఞాతవాసంలో ఉంటూ ప్రజా ఉద్యమాలకు ప్రేరణ అందించారిన కొనియాడారు. 

19:01 - June 21, 2016

హరారే : టీమిండియా, జింబాబ్వేజట్ల మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. ఇప్పటికే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన టీమిండియా...టీ-20 సిరీస్ ను సైతం సొంతం చేసుకోగలనన్న ధీమాతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా రేపు సాయంత్రం 4 గంటల 30 నిముషాలకు ప్రారంభమవుతుంది. టీమిండియా- జింబాబ్వే జట్ల మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్ ల్లో...రెండు జట్లూ చెరో విజయం సాధించి..1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో...ఆఖరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.

యువ ఆటగాళ్లు..
మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో ఎక్కువమంది యువ ఆటగాళ్లతో ..జింబాబ్వేలో మినీ పర్యటనకు వచ్చిన టీమిండియా...ఇప్పటికే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో...క్లీన్ స్వీప్ సాధించింది. అయితే..తొలి టీ-20 సమరంలో మాత్రం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన టీమిండియాకు..జింబాబ్వే రెండు పరుగుల విజయంతో షాకిచ్చింది. తొలి టీ-20 మ్యాచ్ లోనే కళ్లు బైర్లు కమ్మే దెబ్బ తగలడంతో తేరుకొన్న టీమిండియా...చిన్నపామునైనా పెద్దకర్రతోనే కొట్టాలన్న వ్యూహంతో రెండో టీ-20 బరిలోకి దిగింది. దారుణంగా విఫలమైన యువపేసర్లు ఉనద్కత్, రిషీ ధావన్ లను పక్కన పెట్టి..లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ బరిందీర్ శ్రణ్, ధవళ్ కులకర్ణీలను తుదిజట్టులోకి తీసుకొంది. అరంగేట్రం టీ-20 మ్యాచ్ లోనే బరిందర్ చెలరేగిపోయాడు. కేవలం 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి..జింబాబ్వే టాపార్డర్ లోని నలుగురు బ్యాట్స్ మన్ ను పెవీలియన్ దారి పట్టించాడు. మిడిల్ , లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను బుమ్రా అవుట్ చేయడంతో...జింబాబ్వే 99 పరుగులకే కుప్పకూలింది. తొలి టీ-20 హీరో..ఎల్టన్ చిగుంబర కేవలం ఎనిమిది పరుగులకే అవుటయ్యాడు. 

రెండో మ్యాచ్ లో డీల పాడిన జింబాబ్వే..
100 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన టీమిండియా 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం పూర్తి చేసింది. ఓపెనర్లు రాహుల్ 47, మన్ దీప్ సింగ్ 52 స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు. నెగ్గి తీరాల్సిన ఈ పోటీలో టీమిండియా 10 వికెట్ల తేడాతో నెగ్గి ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకొంది. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో టీమిండియా 10 వికెట్ల విజయం సాధించడం ఇదే మొదటిసారి. ఇక సిరీస్ లోని ఆఖరి టీ-20లో సైతం టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. 2-1తో సిరీస్ సొంతం చేసుకోగలమన్న ధీమా ధోనీసేనలో కనిపిస్తోంది. రెండో టీ-20లో నెగ్గిన జట్టునే ఆఖరిమ్యాచ్ లో సైతం కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్ లో తగిలిన దెబ్బతో డీలాపడిన జింబాబ్వే..ఆఖరి మ్యాచ్ లో ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ సొంతం చేసుకొనే అవకాశం ఉండడంతో రెండు జట్లూ విజయమే లక్ష్యంగా పోటీకి సిద్ధమయ్యాయి. ఏదైనా అద్భుతంగా జరిగితే మినహా...ఈ ఆఖరి టీ-20లో టీమిండియా విజయం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

18:56 - June 21, 2016

కోల్ కతా : క్రికెట్ క్రేజీ భారతగడ్డపై తొలిసారిగా నిర్వహించిన పింక్ బాల్ క్రికెట్ మ్యాచ్ విజయవంతమయ్యింది. భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మోహన్ బాగన్, భవానీపూర్ జట్ల మధ్య నిర్వహించిన బెంగాల్ సూపర్ లీగ్ ఫైనల్స్ నాలుగురోజుల ఫైనల్లో ..సాంప్రదాయ ఎరుపు రంగు క్రికెట్ బాల్ స్థానంలో గులాబీ రంగు బంతిని ఉపయోగించారు. ఆస్ట్రేలియాకు చెందిన కూకాబురా కంపెనీ తయారు చేసిన పింక్ బాల్ ను ప్రయోగాత్మకంగా ఈ మ్యాచ్ లో వాడారు. టీమిండియా కమ్ మోహన్ బాగన్ ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ షమీ ఈమ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. పింక్ బాల్ తో బౌల్ చేయడం గొప్ప మజాగా ఉందని, ఊహించినదాని కంటే బంతి ఎక్కువగా స్వింగ్ అవుతోందని మ్యాచ్ అనంతరం షమీ సంతృప్తి వ్యక్తం చేశాడు.

18:30 - June 21, 2016

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మైనర్‌పై జబ్బీర్‌ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. జబ్బీర్‌ను పట్టుకున్న సెక్యూర్టీగార్డు చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. జబ్బీర్‌ అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తాను పోలీస్ ఇన్ ఫార్మర్ అంటూ..ఇతరత్రా చెబుతూ ప్రభుత్వాసుపత్రి వారిని బెదిరించే వాడు. గతంలో ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు ఏమి పెట్టకుండానే విడుదల చేశారు. తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఇతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకు పోలీసు అధికారులందరూ తెలుసని బెదిరించే ప్రయత్నం చేశాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన సెక్యూర్గీ గార్డులు దేహశుద్ది చేశారు. ఈ తరుణంలో అతడిని వదిలిపెట్టాలని ఓ పోలీసు అధికారి ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ అధికారి ఎవరు ? అనేది తెలియడం లేదు. 

18:24 - June 21, 2016

తూర్పుగోదావరి : తుని విధ్వంసం ఘటనలో అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టిన ముద్రగడ పంతం ఫలించింది. విధ్వంసంలో నిందితులంటూ అరెస్టు చేసిన వారందిరినీ అధికారులు విడుదల చేశారు. కాసేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి నలుగురు బయటకు వచ్చారు. వీరు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న ముద్రగడను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
తుని విధ్వంసం కేసులో అమాయకులను అరెస్టు చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా ముద్రగడ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసేందుకు..న్యాయపరంగా వారందరికీ బెయిల్ వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొన్న ఏడుగురు విడుదల కాగా మంగళవారం నలుగురు విడుదలయ్యారు. దీనితో ముద్రగడ దీక్షను విరమిస్తారని తెలుస్తోంది. ఇందుకు ఆయన్ను కిర్లంపూడికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలోనే ముద్రగడ దీక్ష విరమించనున్నట్లు సమాచారం. 

విడుదలైన తుని నిందితులు..

తూర్పుగోదావరి : రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి తుని విధ్వంసం నిందితులు విడుదల కానున్నారు. మరోవైపు దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడను కిర్లంపూడికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

18:18 - June 21, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. మంత్రిగా పనిచేస్తున్న ప్రత్తిపాటి పుల్లారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీలలపై సీఎం బాబు కలెక్టర్లు..అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆలస్యం హాజరు కావడం లేదా గుంటూరు నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నందుకు బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో సమన్వయం చేసుకోవడం లేదంటూ మండిపడ్డారు. మంత్రిగా..మరొకరిని ఇంఛార్జి మంత్రిగా పెట్టి ఉపయోగం ఏంటనీ సూటిగా ప్రశ్నించారు. చెప్పింది అర్థం చేసుకోకుండా సిన్సియార్టీ లేకుండా పనిచేస్తే ఎలా అని నిలదీశారు. మంత్రులు..కలెక్టరుల..సెక్రటరీల మధ్య సమన్వయం ఉండడం లేదని బాబు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకింత ఇగోలతో ఉన్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తనను ఎందుకు ఫాలో కావడం లేదని, ఇంత సమన్వయ లోపంతో ఉంటే రేపు ప్రజల వద్దకు ఎలా వెళుతారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మరి బాబు ఆగ్రహాంతోనైనా మంత్రులు పనితీరును మెరుగు పరుచుకుంటారా ? లేదా అన్నది చూడాలి. 

మంత్రి పుల్లారావుపై సీఎం బాబు ఆగ్రహం..

విజయవాడ : ఏపీ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీలపై సీఎం చంద్రబాబు అధికారులతోవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

సల్మాన్ క్షమాపణ చెప్పాలి - బీజేపీ నేత షైనా..

ఢిల్లీ : సల్మాన్ తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ డిమాండ్ చేశారు. ఆయన నోరు జారి ఉండొచ్చు అయినా మహిళా లోకానికి క్షమాపణ చెప్పక తప్పదని అన్నారు. తన తాజా చిత్రం సుల్తాన్ ప్రమోషన్ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చడంపై కేజ్రీ ఆగ్రహం..

ఢిల్లీ : వాటర్ ట్యాంక్ కుంభకోణంలో తన పేరు చేర్చడంపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై సీబీఐ విచారణ జరిపించడం లేదని, కానీ తనపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మున్సిపాల్టీలపై సీఎం బాబు సమీక్ష..

విజయవాడ : పురపాలక సంఘాలు..నగర పాలక సంస్థలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ పథకంతో పట్టణాల రూపురేఖలు మారిపోతాయని సీఎం పేర్కొన్నారు. 

గూడ అంజయ్య మృతిపై సీఎం కేసీఆర్ విచారం..

హైదరాబాద్ : ప్రముఖ కవి గూడ అంజయ్య మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై  పాటలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణనీయమన్నారు. 

దీక్ష విరమించనున్న ముద్రగడ..

తూర్పుగోదావరి : కొద్ది రోజులుగా దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన దీక్ష విరమించుకుంటారని తెలుస్తోంది. కిర్లంపూడిలో దీక్ష విరమిస్తానని వైద్యులతో ముద్రగడ పేర్కొన్నట్లు సమాచారం. 

17:42 - June 21, 2016

నల్గొండ : చారిత్రక నేపథ్యం కలిగిన నల్లగొండ జిల్లా మూడు ముక్కలు కానుందా? జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం జిల్లా విభజనపై ఓ అభిప్రాయానికి వచ్చిందా? భౌగోళిక పరిస్థితులు, వనరులే కాకుండా..రాజకీయ అవసరాలు కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభావం చూపిస్తున్నాయా.? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానమే వస్తుంది. 'చుట్టుముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ' అంటూ వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళాలను ఉర్రూతలూగించింది బండి యాదగిరి రాసిన నైజాం సర్కారోడో పాట. రెండు, ప్రాంతాల మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఇప్పుడు ఆ పాట కాలగర్భంలో కలిసిపోనుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం అవ్వడంతో నల్గొండ జిల్లా నుంచి సూర్యపేట విడిపోయి కొత్త జిల్లాగా..అలాగే యాదాద్రి పేరుతో మరో జిల్లా ఏర్పాటవుతోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుదీర్ఘ కసరత్తు..
నల్లగొండ జిల్లాలో నూతన మండలాల ఏర్పాటు.. జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘ కసరత్తు ముగిసింది. జిల్లాలో కొత్తగా ఎన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై జిల్లా యంత్రాంగం ఓ నిర్ణయానికి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..మొదట అనుకున్న ప్రకారమే జిల్లాలో 13 మండలాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 72 మండలాలతో జిల్లా పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ ముసాయిదా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సూర్యాపేటలో కలుపుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిల రాజకీయ మంత్రాంగంతో నల్గొండ జిల్లాలోనే మిర్యాలగూడ కలవనుంది.

ప్రజాభిప్రాయ సేకరణ..
ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై పలు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అధికారులు జిల్లాల పునర్విభజన మీద ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా ఏర్పడనున్న మండలాల్లో చేరడానికి సంబంధిత గ్రామాల ప్రజలు సుముఖంగా ఉన్నారో లేదో గ్రామ సభ తీర్మానాల ద్వారా అభిప్రాయం తెలుసుకున్నారు. అయితే ప్రాథమికంగా ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసిన అధికారులు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిదేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజన అనివార్యమైనా..చారిత్రక నేపథ్యం కలిగిన నల్లగొండ జిల్లా మూడు ముక్కలు కావడం జిల్లావాసుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. నల్లగొండ జిల్లాకు సంబంధించి.. కీలక పరిణామాలు జరిగితే తప్ప..అన్నీ అంశాల ఆధారంగా ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలకు దాదాపు అధికార యంత్రాంగం సుముఖంగా ఉంది. 

17:36 - June 21, 2016

హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్ను మూశారు. గత కొంతకాలంగా అంజయ్య మూత్ర పిండాలు, కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పాటలు రాశారు. తెలంగాణ ప్రజలు అంజన్న అని ముద్దుగా పిలుచుకునేవారు. 1955లో ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో జన్మించారు. అంజన్న మరణ వార్త విన్న తెలంగాణ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. 

ఊరు మనదిరా..ఈ వాడ మనదిరా పాట రాశారు.
దాదాపు 20 సినిమాలకు పాటలు రాశారు.
గత ఏడాది అక్టోబర్ లో సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు.
రచనలు : పొలిమేర, దళిత కథలు,
సాహితీ రత్న, దళిత కళారత్న, దళిత సేవా రత్నతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కీర్తిపురస్కారం అందుకున్నారు. 

17:33 - June 21, 2016

ఖమ్మం : పోడు భూములు సాగుచేసుకుంటున్నవారికి కష్టాలొచ్చాయి. చిరుజల్లలు పలకరించాయన్న సంతోషంతో పోడుభూముల్లోకి వెళ్లినవారికి నిర్బంధం ఎదురవుతోంది. భూమిని దున్నబోతే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అడవి బిడ్డల ఆవేదన. ఆగ్రహం. తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేకమంది గుండెల్లోంచి ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి అటవీప్రాంతంలో తాజాగా జరిగిన సంఘటన. పోడు భూములు దున్నుకుంటున్న గిరిజనులతో అటవీశాఖ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుకు తాజా నిదర్శనం. చినుకు పడి, తొలకరి ప్రారంభమైందన్న సంతోషంగా పొలం దున్నేందుకు వెళ్లిన, గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ఇలాంటి ద్రుశ్యాలే కనిపిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ జిల్లా ఏదైనా గిరిజనులకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.

శాపంగా హరితహారం..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహరం పోడు భూములు సాగుచేసుకుంటున్నవారి పట్ల శాపంగా మారుతోంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలంటూ కెసిఆర్ ప్రభుత్వం ఆదేశించడంతో ఫారెస్టు అధికారులు పోడు భూముల్లోకి గిరిజనులను రానివ్వడం లేదు. వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. అరెస్టులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. తరతరాలుగా సాగుచేస్తున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తాతల ముత్తాల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూముల్లోకి తమను రానివ్వడం లేదంటూ గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2006లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి హక్కు పత్రాలివ్వాలి. 2005 డిసెంబర్ 13కి పూర్వం సాగు చేసుకుంటున్నవారందరికీ హక్కు ప్రతాలిస్తామంటూ అప్పట్లో ప్రకటించారు. దరఖాస్తులూ స్వీకరించారు. ఒక్క తెలంగాణలోనే 2 లక్షల 11 వేల 698 మంది హక్కు పత్రాల కోసం అప్లయ్ చేశారు. వీరిలో కేవలం 99 486 మందికి మాత్రమే హక్కు పత్రాలిచ్చారు. మొత్తం 13 లక్షల మూడు వేల 847 ఎకరాలకు హక్కు పత్రాలివ్వాలంటూ దరఖాస్తు చేసుకోగా, కేవలం మూడు లక్షల 29 వేల 571 ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలిచ్చారు.

ఉద్రిక్తతలు..
పోడు భూమిని సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ గరిష్టంగా పది ఎకరాల చొప్పున హక్కుపత్రాలివ్వాలంటూ అటవీ హక్కుల చట్టం స్పష్టం చేస్తుండగా, చాలామందికి ఎకరం రెండు ఎకరాల చొప్పున ఇచ్చి, మమా అనిపించారు. వనసంరక్షణ సమితిలను స్రుష్టించి మరో రకంగా ఈ చట్టం స్పూర్తికి తూట్లు పొడిచారు. సుమారు లక్ష మంది గిరిజన రైతులకు మూడు లక్షల ఎకరాల భూమికి హక్కు పత్రాలిచ్చి, కేవలం 744 కమ్యూనిటీలకు 5 లక్షల 3 వేల 82 ఎకరాలు రాసిచ్చిన తీరుపై అప్పట్లో గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హక్కు పత్రాలు రాని సాగుదారులు ఇప్పటికీ వాటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే వున్నారు. కానీ, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కరికి కూడా హక్కు పత్రాలివ్వలేదు. అవి ఇవ్వకపోగా, ఎప్పటి నుంచో సాగులో వున్న భూముల్లో హరితహారం పేరుతో ఇప్పుడు మొక్కలు నాటతామనడం వివాదస్పదమై, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 

17:27 - June 21, 2016

ఖమ్మం : జిల్లా అశ్వాపురంలో ఎస్‌ఐ పరుశురాం వీరంగం సృష్టించాడు. సోమవారం రాత్రి మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఎస్‌.. ఆటోడ్రైవర్‌ శ్రీనును చితకబాదాడు. ఎవరని అడిగినందుకు.. నేనెవరో తెలియదా అంటూ తుపాకితో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కంగారుపడ్డ శ్రీను.. తన సోదరుడికి ఫోన్‌ చేశాడు. అక్కడికి వచ్చిన అతను.. శ్రీనును ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇవాళ అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

17:21 - June 21, 2016

హైదరాబాద్ : కేంద్రం సహకారంతో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో పురోగతిలో ఉందని, త్వరలోనే పూర్తి అవుతుందని కేటీఆర్‌ తెలిపారు. కేంద్రంతో కొట్లాటలు కోరుకోవడం లేదని, దత్తాత్రేయ అంటే తనకు..పార్టీ నేతలకు చాలా గౌరవమన్నారు. ఎన్నికల సందర్భంలో తమ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటామన్నారు. రాష్ర్టానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. 

ప్రముఖ కవి గూడ అంజయ్య కన్నుమూత..

హైదరాబాద్ : ప్రముఖ గూడ అంజయ్య తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజలుగా ఆయన అనారోగ్యానికి బాధ పడుతున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న గూడ అంజయ్య మంగళవారం కన్నుమూశారు. 

17:07 - June 21, 2016

నల్గొండ : ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉత్తమ్..కోమటిరెడ్డిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాను ఎందుకు పార్టీ మారననే దానిపై ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. ఉత్తమ్..కోమటిరెడ్డి తగాదాలతో పార్టీ వీడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ లాగా తాను ఢిల్లీ నుండి టికెట్ తెచ్చుకోలేదని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్సీలను గౌరవించే సంస్కృతి ఉత్తమ్, కోమటిరెడ్డిలకు లేదని తెలిపారు. టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వారిని మొదట సాంఘీక బహిష్కరణ చేయాలని పేర్కొన్నారు. సుద్దపూసలగా రేవంత్ మాట్లాడుతున్నాడని, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో తెలియడం లేదన్నారు. సాంఘీక బహిష్కరణ చేయాలని అనడం వారికి నైతిక హక్కు లేదన్నారు. దొరికిన దొంగ..జైలుకు పోయిన చరిత్ర ఉందని..సాంఘీక బహిష్కరణ చేయాలని రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మంత్రి ఇంద్రకిరణ్ ను కలిసిన న్యాయవాదులు..

హైదరాబాద్ : మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని పలువురు న్యాయవాదులు కలిశారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల విభజన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టును వెంటనే విభజించాలని, తెలంగాణకు కేటాయించిన ఏపీకి చెందిన న్యాయమూర్తులను వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణ న్యాయవాదులు ఆందోళన నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 

16:55 - June 21, 2016

విశాఖపట్టణం : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలు..కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రమాదాలతో పాటు కాలేజీల మోసాలు ఒక్కోటి బయటపడుతున్నాయి. ర్యాంకులు సాధించాం..మా కాలేజీల్లోనే పిల్లలను చేరిపించండి..సీఏ..సీపీటీల్లో తమ కాలేజీకి పేరుంది..అంటూ ప్రకటనలు గుప్పించిన అందరి నోళ్లలో నానిన 'శ్రీ మేధావి' మోసం చేసింది. ఈ సంస్థ విశాఖలో బోర్డు తిప్పేసింది. ఎంవీపీ కాలనీలో ఈ సంస్థ కాలేజీ ఉంది. వేసవి సెలవుల్లో ఈ కాలేజీ విస్తృత ప్రచారం నిర్వహించింది. పిల్లలను తమ కాలేజీలో చేరిపించాలంటూ తీవ్ర వత్తిళ్లు తెచ్చింది. ఇది నమ్మిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కాలేజీలో చేరిపించారు. ఒక్కో విద్యార్థి నుండి రూ. 20 వేల నుండి రూ. 40 వేల వరకు ఫీజులు వసూలు చేసింది. క్లాసులు ప్రారంభిస్తామని చెపిన సదరు సంస్థ ఇంకా క్లాసులు ప్రారంభించలేదు. దీనితో విద్యార్థులు..వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అంతలోనే శ్రీ మేధావి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాలేజీకి వచ్చి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఒక మంత్రి ఇలాఖాలో ఇలా జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. శ్రీ మేధావి చేసిన మోసంపై సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇంకా ఇలాంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయో రానున్న రోజుల్లో తెలుస్తుంది. 

16:47 - June 21, 2016

ఢిల్లీ : షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై హస్తినలో కీలక సమావేశం జరిగింది. హోం శాఖ అదనపు కార్యదర్శి దిలీప్ కుమార్ నేతృత్వంలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషన్లు..అధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్ 10కి సంబంధించిన అంశంలో 140 ఉమ్మడి సంస్థలలో ఇంకా విభజన ఓ కొలిక్కి రాలేదు. ఉమ్మడి విద్యా మండలి కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. డబ్బులు..ఆస్తుల విభజన కాకపోవడంపై సుప్రీంకోర్టు ఓ తీర్పు కూడా వెలువరించింది. జనాభా నిష్పత్తి ప్రకారం విభజన చేసుకోవాలని కోర్టు సూచించింది. సుప్రీం తీరును ఇతర రంగాలకు వర్తింప చేయాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలియచేస్తోంది. ఈ భేటీలో ఇతర అంశాలు ఏం చర్చించారో తెలియాల్సి ఉంది. 

సీజనల్ వ్యాధులపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై సీఎస్ రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. అంటురోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది అధిక వర్షపాతం ఉన్నందున వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మంచినీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. 

చైనాకు వెళ్లనున్న ఏపీ సీఎం..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుండి 29 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. 

15:52 - June 21, 2016

తలనొప్పి..చాలా మందికి ఈ నొప్పి వస్తుంటుంది. ఇందుకు పలు కారణాలున్నా వాటిని దూరం చేయకుండా వ్యాధి వచ్చినప్పుడు మందులు వాడుతుంటారు. కానీ సమస్య మాత్రం తీరదు. నొప్పి అలాగే ఉంటూ ఉంటుంది. నిద్రలేమి..ఫుడ్, మానసిక ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తుంటుంది. వెన్న, మటన్ ఎక్కువగా తీసుకుంటే కూడా తలపోటు పెరుగుతుంటుందంట. మసాలా ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. పోషకాలు ఉన్న ఆహారంతో పాటు మంచి నిద్ర..కొద్దిపాటి వ్యాయామం వంటివి చేస్తూ తలనొప్పి దూరమవుతాయి.
గోరువెచ్చని ఆవుపాలు తాగినా తలనొప్పి నుండి రిలాక్స్ కావచ్చు.
నీరు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
ఓ గ్లాస్ వేడి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రభావం తొందరగా ఉంటుంది.
కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది. నూనెను నుదుటిపై 15-20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల తలనొప్పి దూరం అవుతుంది. 

విద్యాశాఖకు అధిక నిధులు - కడియం..హరీష్ రావు..

మెదక్ : మానవ వనరులు సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమౌతుందని మంత్రులు కడియం..హరీష్ రావులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా సీఎం కేసీఆర్ విద్యాశాఖకు నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. జిల్లాకు రూ. 80 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అన్ని పాఠశాలలను విద్యుద్దీకరించాలని, పాత బియ్యంతో పాటు సన్నబియ్యం కూడా మధ్యాహ్న భోజనంలో వాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు. 

పుష్కరాల తొక్కిసలాటపై విచారణ..

తూర్పుగోదావరి : గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై రాజమండ్రిలో జస్టిస్ సోమయాజులు విచారణ జరుపుతున్నారు. కమిషన్ ఎదుట రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హజరయ్యారు. తొక్కిసలాటకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను కమిషన్ కు అందచేశారు. 

ట్రాక్టర్ల పంపిణీలో అవినీతి - మల్లు..

నిజామాబాద్ : ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తోన్న ట్రాక్టర్లలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఇసుక దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథలోనూ అవినీతి, అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

తెలంగాణకు పెట్టుబడులు - దత్తాత్రేయ..

హైదరాబాద్ : విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రానికి దేశ, విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రం నుండి కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్ - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ప్రొ.జయశంకర్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ వస్తే తప్ప ప్రజల బతుకులు బాగుపడవని, జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేశారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

15:26 - June 21, 2016

హైదరాబాద్ : ఓ నిందితుడు పోలీసుల చెర నుండి తప్పించుకుని పరారయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది. అరుణ్ శర్మ..బబ్లూ అనే ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలు నుండి మైలార్ దేవులపల్లి వద్దనున్న కోర్టులో నార్సింగి పోలీసులు హాజరు పరిచారు. వాయిదా పడడంతో వీరిని తిరిగి తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా వీరిద్దరూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. వీరిలో బబ్లూను పట్టుకోగా అరుణ్ శర్మ పరారయ్యాడు. అరుణ్ శర్మను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేపడుతున్నారు.
వీరిద్దరూ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు. గండిపేట ఫాం హౌస్ లో వీరు దొంగతనం చేశారు. ఖరీదైన పలు వస్తువులు తస్కరించి పరారవుతున్న సందర్భంలో వీరిని ఓ మైనర్ బాలిక చూసింది. అనంతరం వీరిద్దరూ ఆ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మే 14 జరిగింది. అనంతరం సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు బబ్లూ..అరుణ్ శర్మలను అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

పోలీసుల కళ్లు గప్పి నిందితుడు పరార్..

హైదరాబాద్ : పోలీసుల కళ్లు గప్పి ఓ నిందితుడు పరాయ్యాడు. రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరుస్తుండగా నార్సింగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అరుణ్ శర్మ పరారయ్యాడు. హనుమాన్ టెంపుల్ లో జరిగిన హత్య కేసులో ఇతను నిందితుడు. 

15:16 - June 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో న్యాయవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం..ఏ పార్టీ స్పందించకపోతుండడంతో వారు మంగళవారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు టెన్ టివితో మాట్లాడారు. ఒక కుట్రతోనే ఇదంతా జరుగుతోందని, ఇలా చేయడం వల్ల తాము అన్యాయానికి గురవుతామన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే స్పందించాలని, ఆఫ్షన్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది న్యాయవాదులు సంకెళ్లు వేసుకుని, గంటా నాదంతో నిరసన వ్యక్తం చేశారు. మరింత వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:12 - June 21, 2016

హైదరాబాద్ : విదేశాల్లో మరో తెలుగు వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియాలో జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ విద్యార్థి మృతి చెందిన ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..వనస్థలిపురం కమలానగర్ లో నివాసం ఉంటున్న నంబూరి శ్రీదత్త హైదరాబాద్ లో చదువుకున్నారు. ఎమ్మెస్ పూర్తి చేసుకున్న ఇతను హోరిజాన్ నగరంలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం..ఆదివారం..సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి శ్రీదత్త వాటర్ ఫాల్స్ కు వెళ్లారు. ఎంజాయ్ చేసిన అనంతరం వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో శ్రీ దత్త లోయలో పడిపోయాడు. స్నేహితులు ఎంత గాలించిన ఫలితం కబనడలేదు. మంగళవారం ఇతని మృతదేహం బయటపడింది. ఇతని మృతి చెందాడన్న వార్త కుటుంసభ్యులకు సమాచారం అందించారు. దీనితో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై సలీం క్షమాపణలు..

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన తండ్రి సలీం ఖాన్ స్పందించారు. సల్మాన్ అలా మాట్లాడి ఉంటే అది ఖచ్చితంగా తప్పేనని..సరదాగా ఆ ఉదహారణ జోడించి ఉండవచ్చునని తెలిపారు. కానీ అలా చేయడం కూడా తప్పేనని, సల్మాన్..కుటుంబసభ్యులు..అభిమానుల తరపున తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. సుల్తాన్ షూటింగ్ గురించి సుల్మాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కుస్తీ శిక్షణ తరువాత..షూటింగ్ జరిగినంతకాలం తన పరిస్థితి అత్యాచారానికి గురైన స్త్రీలా ఉండేదని సల్మాన్ చెప్పుకొచ్చాడు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. 

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చే ప్రయత్నాలు - మంత్రి ఈటెల..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల, ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణలు జిల్లా బస్టాండ్ ను సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ..ఆర్టీసీని ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులు అందచేస్తోందని, సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుండి ఆర్టీసీ అభివృద్ధికి రూ. 10 కోట్లు అందిస్తామన్నారు. 

అమెరికాలో వనస్థలిపురం వాసి మృతి..

హైదరాబాద్ : అమెరికాలో నగరానికి చెందిన నంబూరి శ్రీదత్త మృతి చెందారు. ఆదివారం జలపాతంలో శ్రీదత్త పడి మృతి చెందారు. వనస్థలిపురానికి చెందిన ఈయన హర్జాన్ సిటీలో ఉద్యోగం చేస్తున్నారు.

ప్రైవేటు బస్సులతో ఆర్టీసీకి నష్టం - ఆర్టీసీ ఛైర్మన్..

కరీంనగర్ : ప్రైవేటు బస్సులతో ఆర్టీసీకి నష్టం వస్తుందని, ప్రయాణికులకు అనుకూలంగా అన్ని ప్రాంతాల నుండి బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా బస్టాండును ఆయన సందర్శించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రతొక్కరూ సహాయ సహకారాలు అందించాలని, బస్ స్టేషన్ లను ఆధునీకరిస్తామన్నారు. 

14:42 - June 21, 2016

15ఏళ్ల తరువాత జాతీయ మహిళా పాలసీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పాలసీ మార్పులకు..చేర్పులకు సమాయత్తం అవుతోంది. అంతేగాకుండా ఈ పాలసీకి సూచనలు..సలహాలు..అందించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో మానవి 'వేదిక'లో ఈ అంశంపై చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హైమావతి (ఐద్వా), కల్పన (యాక్షన్ ఏయిడ్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తిస్తాయిలో మహిళల ప్రాథమిక హక్కులకు రక్షణ లేదు. సాంఘీక భద్రతకు మరింత ప్రాధాన్యతనివ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు అవసరమని, హింసకు వ్యతిరేకంగా మరిన్ని రక్షణ చర్యలు అవసరమని పలువురు పేర్కొంటున్నారు. విద్య, వైద్యం విషయంలో అనేక అంశాలు చేర్చాలని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచనలు వస్తున్నాయి. హింసకు వ్యతిరేకంగా మరిన్ని రక్షణ చర్యలు అవసరమని, మహిళల ఉద్యోగ కల్పనకు మరిన్ని మెరుగైన అవకాశాలు కావాలన్నారు. పాలసీలో మార్పులు స్పష్టంగా చేర్చాలని, పాలసీని మరింత సమగ్రంగా రూపొందించాలని సూచించారు. మరి వక్తలు ఈ పాలసీపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ? పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:27 - June 21, 2016

గుంటూరు : రైతులను బెదిరించడమే కాదు.. వారు సాగు చేసుకుంటున్న పొలాన్నీ సర్వ నాశనం చేస్తున్నారు సాగుకు పనికిరాకుండా పొలాల్లో చెత్త చెదారం నింపేస్తున్నారు. పెద్దల మంత్రాంగానికి వ్యతిరేకంగా విపక్షం గళం విప్పుతోంది. ఉద్యమాలకు సమాయత్తమవుతోంది. యడవల్లిలో పేద రైతుల భూములను అక్రమంగా కాజేసిన కొందరు పెద్దలు.. మాట వినని వారి పొలాలను ధ్వంసం చేసేస్తున్నారు. క్వారీ పక్కనే ఉన్న పచ్చని పొలాల్లో చెత్తనంతా పడేస్తూ.. ఆ భూములు సాగుకు పనికి రాకుండా చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. జీవనాధారంగా మిగిలిన భూములను ఆక్రమించడం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేదల భూములను కబ్జా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ బతుకుతున్న భూములను కబ్జా చేయడం అన్యాయమని, జీవనాధారమైన తమ భూమి తమకు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. గ్రామంలో దళితులకు అప్పటి కలెక్టర్‌ భూములిచ్చిన విషయం తెలియదని, టెన్‌ టీవీ చిత్రీకరించిన సొసైటీ భూమిలో క్వారీలు ఏమీ లేవని యడవల్లి సర్పంచ్‌ బుకాయిస్తున్నాడు.

స్పందించిన కాంగ్రెస్...
ఇంతకూ దళితుల నోటికాడి కూడును లాక్కొంటుంది ఎవరు ..? అని దళితుల్ని ప్రశ్నిస్తే కొందరు బడా బాబుల పేర్లు చెప్పారు. మంత్రి ప్రమేయంతోనే స్థానిక నాయకులు ఇలా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమకు కష్టం వస్తే ఆదుకుంటారని ఓట్లేసి గెలిపించిన నేతలే తమ భూముల్ని కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. భూముల కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమని, భూముల కబ్జాపై ఆందోళన చేపడతామని బాధిత దళితులు హెచ్చరిస్తున్నారు. దళితుల భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్‌ స్పందించింది. కబ్జా భూముల ఆక్రమణకు సంబంధించిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే దళితుల తరపున సత్యాగ్రహానికి దిగుతానని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితులు, బలహీన వర్గాల వారికోసం కేటాయించిన భూములను వారికే చెందేలా చూడాలని, రాజకీయ నాయకులు ఇప్పటికైనా దళితుల భూముల విషయంలో నిర్ణయం మార్చకుని వారి భూములను తిరిగి ఇచ్చి వేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

14:23 - June 21, 2016

గుంటూరు : అసలే భూములపై వ్యామోహం... ఆ పై విలువైన గ్రానైట్‌ నిలువలు. ఇంకేముంది చేతిలో ఉన్న అధికారాన్ని చెలాయించే పనిలో పడ్డారు కొందరు రాజకీయ నేతలు. బలహీన వర్గాలకు చెందిన భూములని కూడా చూడకుండా.. వాటిని కాజేసే పన్నాగం పన్నారు. తరతరాలుగా సాగులో ఉన్న వందల ఎకరాల భూములను కబ్జా చేశారు. గుంటూరు జిల్లాలో పదవిని అడ్డం పెట్టుకుని దళితుల భూములను మింగేసిన.. బడా నేతల వ్యవహారంపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం..ఇప్పుడా.. అప్పుడా... దాదాపు యాభై ఏళ్ల క్రితం పేదలకు ఇచ్చిన భూములవి...! ఏక పట్టాపై 416 ఎకరాల భూమిని కేటాయించిన అప్పటి కలెక్టర్‌...!నాటి నుంచి నేటి వరకు సాగు చేసుకుంటూ.. ఆ భూములే జీవనాధారంగా బతుకుతున్న దళితులు..! పచ్చని పంటపొలాలను సర్వే నంబర్లు మార్చి కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు..! ఇదీ దళితుల భూములపై కన్నేసిన కబ్జాకోరుల భూ బాగోతం. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న భూములను, లబ్దిదారులు, వారి పిల్లలు, మనవలు అనుభవిస్తూ వస్తోన్న ఆ భూములను.. పదవిని అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ రాబంధులు తన్నుకుపోతున్న వ్యవహారమిది. గుంటూరు జిల్లా చిలకూరిపేట సమీపాన ఉన్న యడవల్లిలోని దళితులు సాగు చేసుకుంటున్న వందల ఎకరాలపై కన్నేసిన రాజకీయ నేతలు.. తమ పదవిని అడ్డంపెట్టుకుని దళితుల భూములను కబ్జా చేశారు.

చేతిలో అధికార దండం..
చేతిలో అధికారదండం ఉందన్న ధీమాతో నేతలు రెచ్చిపోయారు. పచ్చని పంట పొలాలను నాశనం చేసి.. లోపల ఉన్న క్వారీలను తవ్వే పన్నాగం పన్నారు. ఇన్నాళ్లు దళితుల పొట్టలకు పట్టెడన్నం పెడుతున్న... పంట పొలాలను కబ్జా చేసి వారి నోటికాడి కూడును లాక్కొనే కుట్ర చేస్తున్నారు అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు. దళితులకు వందల ఎకరాలు భూములిచ్చారు. ఏకపట్టా రూపంలో పట్టాలిచ్చారు. ఆ భూములకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కూడా కల్పించారు. వందల కుటుంబాలు హాయిగా సాగు చేసుకుంటూ బతుకుతున్న సమయంలో హఠాత్తుగా.. ఆ భూముల్ని కబ్జా చేసి పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.  భూమి లేని దళితుల కోసం యడవల్లి గ్రామంలో 1974లో ఆప్పటి కలెక్టర్‌ భూములిచ్చేందుకు నిర్ణయించి.. చిలకలూరిపేట, కోటప్పకొండ, కట్టుబడివారిపాలెం, యడవల్లి గ్రామాల మధ్యలో 416 ఎకరాల 54 గుంటల భూమిని.. మొత్తం 194 మందికి సాగు కోసం పంపిణీ చేశారు. కలెక్టర్‌ మంజూరు చేసిన భూమిలో వాగులు, కాలవలు పోను 360 ఎకరాల భూమి సాగుకు పనికొచ్చేలా తీర్చిదిద్దారు. దానిలో 120 మంది రైతులు ఒక్కొక్కరు మూడు ఎకరాల చొప్పున భూమిని సాగు చేస్తూ వస్తున్నారు. అప్పుడు భూమిని పొందిన వారి పిల్లలు వారసత్వంగా.. ఇప్పటికీ ఆ భూమిలో సాగుతో బతుకులు వెళ్లదీస్తున్నారు.

ఏక పట్టాపై భూమి..
ఇంతకాలం సాఫీగా సాగుతూ వస్తోన్న దళితుల జీవితాల్లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కొందరు రాజకీయ నేతలు చిచ్చు పెట్టారు. దళితులు సాగు చేస్తున్న భూమిలో గ్రానైట్‌ ఉందని తెలుసుకున్న నేతలు.. ఆ భూములను కబ్జా చేసుకుని... తవ్వకాలు జరుపుతున్నారు. భూముల్ని అమ్ముకోకుండా ఉండేందుకు లబ్ధిదారులకు అప్పటి కలెక్టర్‌ ఏక పట్టాపై భూమిని ఇచ్చారు. అనంతరం రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ భూములకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఆ భూముల్లో గ్రానైట్‌ నిలువలున్నాయని తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ అధికార పార్టీ నాయకులతో కుమ్ముక్కై ఏక పట్టాను మాయం చేశాడు. ఇప్పుడదే సొసైటీ భూమి సర్వే నెంబర్లు మార్చి అక్కడ క్వారీ నడుపుతున్నాడు. ఇదేమి అన్యాయమని అడిగేందుకూ స్థానికులు భయపడుతున్నారు. కడుపులో ఉంచుకుని కాపాడాల్సిన అధినాయకులే.. పేదల కడుపు కొడుతున్నారు. పేదల పక్షాన నిలిచిన మీడియాపైనా దాడులకు తెగబడుతున్నారు.

14:17 - June 21, 2016

ముంబై : ఆయనో ప్రముఖ నటుడు..ఏది మాట్లాడినా..ఏ పని చేసిన జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కానీ బాలీవుడ్ కండల వీరుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళితే..సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్రంలో నటిస్తున్నాడు. త‌న తాజా చిత్రం 'సుల్తాన్‌' ప్రమోష‌న్‌లో భాగంగా స్పాట్‌బోయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో రెజ్లర్‌గా న‌టించిన‌ అనుభ‌వం ఎలా ఉంద‌ని అడిగితే.. రింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రతీసారీ తాను అత్యాచారానికి గురైన మ‌హిళ‌లాగా ఫీల‌య్యేవాడిన‌ని, అడుగులు స‌రిగా ప‌డేవి కావ‌ని స‌ల్మాన్ అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. షూటింగ్‌ సందర్భంగా వివిధ కోణాల్లో ఒకే షాట్‌ను చిత్రీక‌రించేందు కోసం 120 కిలోల మ‌నిషిని ప‌దేప‌దే పైకి ఎత్తి కింద ప‌డేయాల్సి వ‌చ్చేద‌ని స‌ల్మాన్ చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్‌ మీడియాలో సల్మాన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. సల్మాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ఒక సెలబ్రిటీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని..బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సల్మాన్ కు ఓ లేఖ కూడా రాసింది. ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో వివరణ చెప్పాలని లేఖలో పేర్కొంది. వ్యక్తిగతంగా దురుద్ధేశ్యంతో వ్యాఖ్యలు చేయలేదని, సరదాగానే చేశానని..వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి సల్మాన్ సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు వర్గీయులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ సల్మాన్ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. 

13:52 - June 21, 2016

విజయవాడ : వలసలతో కుదేలైన వైసీపీ అధినాయకత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. అసంతృప్తులను బుజ్జగించే చర్యలకు శ్రీకారం చుట్టింది. పలు కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను బుజ్జగించడంతో పాటు.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న నేతలకు వివిధ పదవులు కట్టబెడుతున్నారు.
పార్టీలో అసంతృప్త నేతల గుర్తింపు చేపట్టిన వైసీపీ...
ఏపీలో అధికార పార్టీలోకి తమ నేతలు వలస వెళ్లకుండా వైసీపీ వ్యూహం మార్చుతోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడటంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తోన్న వైసీపీ.. ఇకపై వలసలు కొనసాగకుండా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. 2014 ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డవారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారు.. పార్టీలో ఇప్పటివరకు ఎలాంటి పదవులు పొందని వారిని గుర్తించే పనిలో పడింది వైసీపీ నాయకత్వం. వీరిని కాపాడుకునేందుకు.. పార్టీ పదవులు కట్టబెట్టాలని యోచిస్తోంది.

బాలినేని పార్టీ మారుతున్నారనే ప్రచారం ...
వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం ప్రకాశం జిల్లాలో జోరందుకుంది. బాలినేని అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న వైసీపీ ఆయనతో చర్చలు జరిపింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి కొంతకాలంగా పొసగడం లేదు. ఇటీవల వారి మధ్య గ్యాప్‌ పెరడంతో బాలినేని పార్టీ వీడుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వైసీపీ అప్రమత్తమై బాలినేనికి ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

బొత్స రాకతో అసంతృప్తి....
విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల... బొత్స సత్యనారాయణ రాకతో అసంతృప్తిగా ఉన్నారు. కోలగట్ల కూడా పార్టీ మారతారని ప్రచారం ఊపందుకోవడంతో.. ఆయనకూ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. దాంతో పాటు రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగ కార్యక్రమాల పర్యవేక్షకుడిగానూ బాధ్యతలు అప్పగించారు. అలాగే గతంలో వైసీపీ యూత్ అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి రాధను విజయవాడ సిటీ అధ్యక్షుడిగా నియమించారు. రాధకు యూత్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో రాధ ఎక్కడ పార్టీకి దూరమవుతారోనన్న ఉద్దేశంతో.. ఆయనకు విజయవాడ నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

కోలగట్లకు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి ...
తూర్పుగోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూ వైసీపీని వీడటంతో జిల్లా అధ్యక్ష పదవి జక్కంపూడి విజయలక్ష్మికి ఇస్తారని అందరూ భావించారు. కాని ఆ పదవిని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కూరసాల కన్నబాబుకు ఇవ్వడంతో జక్కంపూడి వర్గం అసంతృప్తికి గురైంది. దాంతో జక్కంపూడి విజయలక్ష్మి కుమారుడు రాజాకు రాష్ట్ర యూత్‌ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ అసంతృప్త నేతలున్నారో.. వారందరినీ గుర్తించి పార్టీ పదవులతో బుజ్జగించే పనిలో పడింది వైసీపీ. జగన్‌ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. 

రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదం - గుత్తా..

నల్గొండ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వారిని మొదట సాంఘీక బహిష్కరణ చేయాలని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ లాగా తాను ఢిల్లీ నుండి టికెట్ తెచ్చుకోలేదని విమర్శించారు. ఉత్తమ్, కోమటిరెడ్డి తగాదాల వల్లే కాంగ్రెస్ ను వీడానని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీలను గౌరవించే సంస్కృతి ఉత్తమ్, కోమటిరెడ్డిలకు లేదని తెలిపారు. 

13:44 - June 21, 2016

హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలనడం.. ఓ కుట్ర అని టీఆర్‌ఎస్‌ నాయకుడు గువ్వల బాలరాజు అన్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే.. రైతుల పొట్టగొట్టినట్టడమే అవుతుందన్నారు. రైతులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే 123జీవో తెచ్చామన్నారాయన. కుట్రపూరితంగానే ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బాలరాజు విమర్శించారు. పార్టీలను బతికించుకోడానికే రైతులను బలిపశువులను చేస్తున్నారని గువ్వల మండిపడ్డారు.

బహదూర్ పల్లి ఆశ్రమం నుండి ముగ్గురు చిన్నారుల అదృశ్యం..

హైదరాబాద్ : బహదూర్ పల్లిలో ఆశ్రమం నుండి ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. చంటి (8), సునీల్ (10) శివలింగం (10) అదృశ్యమైన వారిలో ఉన్నారు. తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపులు చేపట్టారు. 

సాయంత్రానికి కిర్లంపూడికి ముద్రగడ..

తూర్పుగోదావరి : ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, సాయంత్రానికల్లా ముద్రగడను కిర్లంపూడికి తరలిస్తామని వైద్యులు ప్రకటించారు. అక్కడే దీక్ష విరమిస్తానని ముద్రగడ చెప్పడం జరిగిందన్నారు. 

ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో నిలిచిన కరెంటు..

హైదరాబాద్ : నాంపల్లి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో నాలుగు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో ఆపరేషన్లు నిలిచిపోయాయి. రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

బదిలీలపై సీఎం బాబు వీడియో కాన్ఫరెన్స్..

విజయవాడ : ఉద్యోగుల బదిలీలపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటిలోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాలనలో ఉత్తమ బృందాలను ఎంపిక చేసేందుకే బదిలీల ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనందు వల్ల ఆ శాఖ బదిలీలు ఆగస్టులో నిర్వహించడం జరుగుతుందన్నారు. బదిలీల మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలని, ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఏజెన్సీలో పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 

జులై 11న 25 లక్షల మొక్కలు నాటాలి - కేటీఆర్..

హైదరాబాద్ : హరిత హైదరాబాద్ కోసం జులై 11 న 25 లక్షల మొక్కలు నాటుదామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మహాయజ్ఞంలో అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 101 ప్రభుత్వేతర సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. 

జయశంకర్ ఆశయసాధన కోసం జేఏసీ - ప్రొ. కోదండరాం..

హైదరాబాద్ : జేఏసీ కార్యాలయంలో ప్రొ.జయశంకర్ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జయశంకర్ లేకపోవడం సమాజానికి తీరని లోటని ప్రొ. కోదండరాం తెలిపారు. జయశంకర్ ఆశయ సాధన కోసం జేఏసీ పనిచేస్తుందని, మనుషులు శాశ్వతం కాదని..వారి ఆలోచనలే శాశ్వతమన్నారు. తెలంగాణ సాధించడం ఒక ఎత్తు..అభివృద్ధి మరో ఎత్తని, రియల్టర్లు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణ వద్దన్నారు. 

ఏటిగడ్డ కిష్టాపూర్ లో రేవంత్ దీక్ష..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి దీక్ష చేయనున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఈనెల 25,26వ తేదీల్లో దీక్షకు కూర్చొనున్నారు. 

13:41 - June 21, 2016

హైదరాబాద్ : హరితహారంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...'ఈచ్ వన్ ప్లాంట్ 'నినాదంతో ముందు కెళదామన్నారు. ఈ మహాయజ్ఞంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. హరిత హైదరాబాద్ కోసం జులై 11న 25 లక్షల మొక్కలు నాటుదామన్నారు. ఈ కార్యక్రమం పొల్గొనేందుకు 101 ప్రభుత్వేతర సంస్థలు ముందుకొచ్చాయన్నారు. కాగా గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని అధికారులకు సూచించారు. అధికారు అలసత్వంపై గతంలో నాటిని మొక్కలన్నీ చనిపోయాయనీ ..మొక్కలు నాటమే కాక వాటి సరంక్షణ బాధ్యతను అధికారు చేపట్టాలన్నారు. ఇది ఒక క్యార్యక్రమంలా కాక యజ్ఞంలా చేట్టాలన్నారు. ఈ అంశంపై థియేటర్లలో ప్రకటనలు వేయించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాని ఆయన అధికారులకు సూచించారు.  

13:40 - June 21, 2016

హైదరాబాద్ : వికృత చేష్టలతో విద్యార్థినులను బాధిస్తున్న వైనం ఎల్బీనగర్ లో బయటపడింది. ఓ స్కూలు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ 6 సంవత్సరాల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న తమ కుమార్తెను సెక్యూరిటీ గార్డు వేధించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే... గార్డును వెనుకేసుకొచ్చిన స్కూల్‌ యాజమాన్యం దురుసుగా సమాదానం ఇవ్వడంతో పోలీసులు మండిపడుతున్నారు. అయితే.. తాను అమాయకుడనని సెక్కూరిటీ గార్డు అంటున్నాడు. కాగా ఈ గార్డ్ గతంలో కూడా ఇలాగే ప్రవర్తించాడని కూడా విద్యార్థి తెలిపింది.

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డ్...

హైదరాబాద్ : వికృత చేష్టలతో విద్యార్థినులను బాధిస్తున్న వైనం ఎల్బీనగర్ లో బయటపడింది. ఓ స్కూలు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ 6 సంవత్సరాల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న తమ కుమార్తెను సెక్యూరిటీ గార్డు వేధించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే... గార్డును వెనుకేసుకొచ్చిన స్కూల్‌ యాజమాన్యం దురుసుగా సమాదానం ఇవ్వడంతో పోలీసులు మండిపడుతున్నారు. అయితే.. తాను అమాయకుడనని సెక్కూరిటీ గార్డు అంటున్నాడు. కాగా ఈ గార్డ్ గతంలో కూడా ఇలాగే ప్రవర్తించాడని కూడా విద్యార్థి తెలిపింది.

13:32 - June 21, 2016

కర్నాటక : మంగళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద ఘోర స్కూల్ బస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.ఈ ఘటనలో 8 మృతి చెందారు. మరో 12 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్ లో మొత్తం 25 మంది విద్యార్థులు వున్నట్లుగా తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..8మంది మృతి..

కర్నాటక : మంగళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మృతి చెందారు. మరో 12 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్ లో మొత్తం 25 మంది విద్యార్థులు వున్నట్లుగా తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

'ఈచ్ వన్ ప్లాంట్ ' : కేటీఆర్...

హైదరాబాద్ : హరితహారంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...'ఈచ్ వన్ ప్లాంట్ 'నినాదంతో ముందు కెళదామన్నారు. ఈ మహాయజ్ఞంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. హరిత హైదరాబాద్ కోసం జులై 11న 25 లక్షల మొక్కలు నాటుదామన్నారు. ఈ కార్యక్రమం పొల్గొనేందుకు 101 ప్రభుత్వేతర సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు.

12:38 - June 21, 2016

హైదరాబాద్: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ పట్టభద్రులయిన 30 మంది ఎస్టీ యువకులకు 74 రోజులపాటు నేషనల్ ఎకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో వారికి శిక్షణ ఇచ్చామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్, ఫ్లంబింగ్, ల్యాండ్ సర్వేయర్, బీటీ రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్ ల నిర్వాహణ, ప్రాజెక్టుల ప్లానింగ్, కాంట్రాక్ట్ విధానంలో చట్టాలకు సంబంధించి అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యాపార నిర్వాహణ వంటి పలు అంశాలలో వారికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా వారు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులను సొంతంగా నిర్వహించుకునే వారిని తయారుచేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏడాది సుమారు రూ.4కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు జరుగుతూంటాయనీ...గిరిజనులకే కాంట్రాక్ట్ పనులు అప్పగించేలా చర్యలు తీసుకునమని తెలిపారు. దీంతో వారు ఆర్థికంగా బలపడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి...గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకోండి.....

12:12 - June 21, 2016

వరంగల్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ హాట్ కేక్ లా మారుతోంది. ఇక్కడి భూముల మీద పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల నుంచి జనం క్యూ కడుతున్నారు.

చుక్కలంటుతున్న భూముల ధరలు...
మానుకోటగా ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లా మహబూబాబాబాద్ మళ్లీ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 2012 - 2014 మధ్య కాలంలో పడిపోయిన ధరలు ఇప్పుడు మళ్లీ పైకి లేస్తున్నాయి. దీంతో అప్పట్లో భూముల మీద పెట్టుబడులు పెట్టి, దెబ్బతిన్నవారు ఇప్పుడైనా క్యాష్ చేసుకోవాలన్నా ఆలోచనతో వున్నారు. అయితే, మరికొందరు ధర ఇంకా పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

గజం ధర 5 వేలు...
2012కి పూర్వం మహబూబాబాద్ లో గజం ధర అయిదు వేల రూపాయల దాకా వెళ్లింది. అయితే ఆ తర్వాత రెండేళ్ల పాటు డిమాండ్ పడిపోయింది. గజం ధర 3వేలకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ పూర్వపు స్థితికి ధరలు వస్తున్నాయంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

భూములు అమ్మకానికి ఇష్టపడన యజమానులు ...
ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందినవారు మానుకోటలో భూములు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కొనుగోలుదారులు మానుకోట వైపు క్యూ కట్టినా, భూ యజమానులు ఇప్పుడే వాటిని అమ్ముకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే అభివ్రుద్ధి చెందిన రైల్వే స్టేషన్, బస్టాండ్, ట్రాన్స్ పోర్టేషన్ లాంటి సదుపాయాలుండడం మహబూబాబాద్ కి కలిసొచ్చే అంశాలు. మహబూబాబాద్ పట్టణానికి కనీసం మూడు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లితే తప్ప భూమి దొరకడం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. 

జేఏసీ కార్యాలయంలో జయశంకర్ వర్థంతి ...

హైదరాబాద్ : జేఏసీ కార్యాలయం ప్రొ.జయశంకర్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ నేత ప్రొ. కోదండరాం హాజరయ్యారు. జయశంకర్ లేకపోవటం సమాజానాకి తీరనిలోటు అని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం జేఏసీ పనిచేస్తుందని తెలిపారు. మనుష్యులు ఎప్పటికీ శాశ్వతం కాదనీ...వారి ఆలోచనలే శాశ్వతంగా నిలిచిపోతాయని ఆయన గుర్తు చేశారు. రియల్లర్లు, కాంట్రాక్టర్లకు లబ్దిచేకూర్చే తెలంగాణ వద్దన్నారు. తెలంగాణ సాధించటం ఒక ఎత్తు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మరో ఎత్తు అని ఆయన పేర్కొన్నారు.  

11:54 - June 21, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌కూ తాకబోతోందా? గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న ఇద్దరు సీనియర్లు..కారెక్కేందుకు రెడీ అయ్యారా అన్న ఊహాగాలు జోరందుకున్నాయి. జిల్లా పొలిటిక్స్‌లో ఏ నేత ఎప్పుడూ గులాబీ గూటికి చేరుతారో అన్నది హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే కొందరు కాంగ్రెస్ , టీడీపీ పార్టీల నాయకులు కారెక్కుతారన్న ప్రచారం జిల్లాలో ఊపందుకుంది.

కారెక్కేందుకు సిద్ధంగా ఉన్న సురేష్‌రెడ్డి..!...
నల్గొండ జిల్లా ఆపరేషన్ ఆకర్ష్ అనంతరం నిజామాబాద్ జిల్లా మీద దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర పోషించిన డీఎస్ ఎప్పుడో కారెక్కి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. డీఎస్ టీఆర్ఎస్‌లోకి చేరిన అనంతరం ఆయన క్యాడర్ అంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా కారెక్కుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సురేష్ రెడ్డి కూడా కారెక్కేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గులాబీ వైపు మొగ్గు...
మరోవైపు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మనసు కూడా గులాబీ పార్టీ వైపు లాగుతుందన్న ప్రచారం జరుతోంది. జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు. సుదర్శన్ రెడ్డి కూడా మూడు సార్లు బోదన్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఎంపీ కవిత సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగానే ఈ ఇద్దరు సీనియర్లను గులాబీ పార్టీలో చేర్పించే క్రమంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కారెక్కేందుకు రెడీ అవుతున్న మండవ, అన్నపూర్ణమ్మలు...
మరోవైపు టీడీపీలోంచి ఇద్దరు సీనియర్ నేతలు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మలు కూడా కారెక్కుతారన్న ప్రచారమూ సాగుతోంది. టిడిపిలో ఉంటే భవిష్యత్‌లో ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆలోచనతోనే పార్టీ మారాలని ఈ ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు కేసీఆర్‌ కూడా ఈ ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేల వైఖరిపై కేసీఆర్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వారి స్థానంలో రాజకీయ అనుభవం,..మంచి పేరున్న లీడర్లను భర్తీ చేసేందుకు ఎంపీ కవిత ఆలోచన్నారని సమాచారం. దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు మైనార్టీల్లో బలమైన నేతను కూడా లాగేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీని గులాబీ గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు జరిగినా..షబ్బీర్ అలీ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పనట్లు తెలుస్తోంది. మరి నిజామాబాద్ జిల్లాలో కారు పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఎవరిని వరిస్తుందో చూడాలి. 

కారెక్కేందుకు సిద్ధంగా ఉన్న మాజీ స్పీకర్ !.....

నిజామాబాద్ :  నల్గొండ జిల్లా ఆపరేషన్ ఆకర్ష్ అనంతరం నిజామాబాద్ జిల్లా మీద దృష్టి పెట్టింది గులాబీ పార్టీ. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర పోషించిన డీఎస్ ఎప్పుడో కారెక్కి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. డీఎస్ టీఆర్ఎస్‌లోకి చేరిన అనంతరం ఆయన క్యాడర్ అంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా కారెక్కుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

11:47 - June 21, 2016

వరంగల్ : వరంగల్‌ జిల్లాలో ప్రొ.జయశంకర్‌ వర్థంతి కార్యక్రమానికి రాజకీయ నాయకులెవరూ హాజరు కాలేదు. హన్మకొండలోని ఏకశిలా పార్క్‌లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి, కొండా దంపతులు, ఎంపీ సీతారాం నాయక్, 9మంది ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అధికార పార్టీకి సంబంధించి ఏ ఒక్కరూ హాజరుకాకవటం ఆయన్ని అవమానించినట్లేనని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా రెండవ ఏడాదిలో అధికార పార్టీ పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

11:41 - June 21, 2016

హైదరబాద్ : అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బాల క్రిష్ణ యోగాసనాలు చెసరు. హైదరబాద్ లో ని కెబిఅర్ పార్క్ లో జరిగిన యోగ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు 

ఉద్యోగుల బదిలీలపై 'బాబు' వీడియో కాన్ఫరెన్స్...

విజయవాడ : సచివాలయ ఉద్యోగుల బదిలీలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. 

ఏపీ ట్రిబ్యునల్ వద్ద ఉద్రిక్తత ...

హైదరాబాద్ : ఏపీ ట్రిబ్యునల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ వారెంట్ ఇవ్వడంపై న్యాయవాదులు నిరససనకు దిగారు. చైర్మన్ గో బ్యాక్ అంటూ నిరనస నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

11:15 - June 21, 2016

హైదారబాద్ : యోగాను సాధన చేయడం వివాదమేమి కాదని.. తెలంగాణ డిప్యూటీ సీఎం అన్నారు. యోగాకు మతాలతో సంబంధలేదన్నారాయన. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా సాధన చేస్తున్నారని మహమూద్‌ఆలీ చెప్పారు. హైదరాబాద్‌ గచ్చిబౌలీలో జరిగిన కార్యక్రమంలో ఆయన యోగాసనాలు వేశారు. ఈకార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతగిరి గుట్టల్లో ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాతీయా స్థాయిలో ఒక ప్రకృతిచికిత్సాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. 

11:10 - June 21, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ నిర్వాశితులకు మద్దతుగా ఈనెల 25,26 తేదీల్లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముంపు గ్రామమైన కిష్టాపురంలో దీక్ష చేపట్టనున్నారు. కాగా మెదక్ జిల్లా లోని మల్లన్న సాగర్ నిర్మాణానికి వ్యతిరేకంగా పలు వివాదాలు రేగుతున్నాయి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి మద్ధతుగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించకోపోతే తాను దీక్షను చేపడతానని ఆయన ఇప్పటికే తెలిపారు. 2013 చట్టప్రకారమే భూములు సేకరించే కానీ 123 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మల్లన్న నిర్వాశితులకు మద్దతుగా దీక్ష చేపట్టనున్నారు.

10:53 - June 21, 2016

ఖమ్మం : జిల్లాలో ఆదివాసుల పోడు భూములకు పట్టాలు లేవనే కారణంతో ప్రభుత్వం వారి వద్ద నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటుంది. పంటలు ధ్వంసం చేస్తోంది. ఆదివాసీలపై దౌర్జన్యం చేసి అక్రమంగా కేసులు బనాయిస్తోంది. రాళ్లూ రప్పలతో వున్న భూములకు సాగు చేసుకుని పోడు వ్యవసాయం చేసుకుంటున్న మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బాధితులు వాపోతున్నారు. ఈ భూములు తప్ప తాము బ్రతటానికి వేరే ఏ ఆధారం లేదనీ..దాదాపు 30 ఏళ్ళనుండి సాగుచేసుకుంటున్న భూముల నుండి తమను వేరు చేస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామరి ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జయశంకర్ వర్థంతిని పట్టించుకోని అధికార పార్టీ...

వరంగల్ : నేడు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి హన్మకొండ ఏకశిలా పార్కులో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు హాజరు కాని క్రమంలో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మల్లన్న సాగర్ ప్రాంతంలో దీక్ష చేపట్టనున్న రేవంత్ రెడ్డి ...

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ నిర్వాశితులకు మద్దతుగా ఈనెల 25,26 తేదీల్లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి కిష్టాపురంలో దీక్ష చేపట్టనున్నారు. కాగా మెదక్ జిల్లా లోని మల్లన్న సాగర్ నిర్మాణానికి వ్యతిరేకంగా పలు వివాదాలు రేగుతున్న విషయం తెలిసిదే. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు ఇప్పటికే వారం రోజులకు పైగా దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి మద్ధతుగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారు.  

10:35 - June 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 22 నుంచి జ‌ర‌గ‌నున్న ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదట స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్, ఆ తరువాత వెబ్ ఆఫ్షన్‌ల ప్రక్రియ జరగనుంది. అయితే గతంలో కంటే ఈసారి కౌన్సిలింగ్ ఫీజలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది.

మొదట సర్టిఫికేట్ల పరిశీలన.. అనంతరం వెబ్ ప్రక్రియ..
తెలంగాణలో 2016 ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 నుంచి ఎం సెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ జ‌రగనుంది. ప్రస్తుతం కేవలం స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ మాత్రమే జ‌ర‌గ‌నుంది. వెబ్ ఆప్షన్‌ ఎంపిక ప్రక్రియను త్వర‌లో అధికారులు ప్రకటిస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 22 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. జూన్ 22 నుంచి జూలై1 వరకు సర్టిఫికేషన్‌ల ప్రక్రియ జరగనుంది. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌కు మొత్తం 1లక్ష 4వేల మంది అర్హత సాధించారు. మొదటి రోజు 6వేల ర్యాంకుల వరకు పరిశీలన జరగనుంది.

విద్యార్థులు అన్ని సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి- అధికారులు..
కౌన్సిలింగ్ కి వచ్చే విద్యార్ధులు తప్పనిసరిగా అర్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు తమ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ , ఆధార్ కార్డుతో పాటు ssc ఇంటర్ మెమోలు, జనవరి ఒకటి 2016 తరువాత జారీ చేసిన ఆదాయ, కులధ్రువీకరణ పత్రం, హ్యాండికాప్‌ విద్యార్ధులైతే మెడికల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఇక నాన్ లోకల్ విద్యార్ధులు అయితే 10 సంవత్సరాలుగా తెలంగాణలోనే నివాసం ఉంటున్నట్టుగా ధ్రువీకరణ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ కు తీసుకురావాలని తెలిపారు.

పెరగనున్న కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజులు...
అయితే ఈసారి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మార్పులు జరిగాయి. గతంలో ఉన్న కౌన్సిలింగ్ ఫీజులను ఈ ఏడాది పెంచారు. ఎస్సీ ఎస్టీలకు 100 రూపాయిలు, బీసీ, ఓబీసీలకు 200 రూపాయలను పెంచారు. ఫీజులు పెంపుపై విద్యార్ధిసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అభిప్రాయపడుతున్నారు.

10:23 - June 21, 2016

నల్లగొండ : నల్లగొండజిల్లా కోదాడలో రోడ్డుప్రమాదం విషాదాన్ని నింపింది. కోదాడ బైపాస్‌రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. కర్నూలు నుంచి టొమేటోలోడుతో వెళుతున్న డీసీఎంను ... హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న గరుడాబస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన డీసీఎండ్రైవర్‌ శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతిచెందగా... తీవ్రంగా గాయపడిన బస్సుక్లీనర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. హైవేనుంచి సర్వీస్‌రోడ్డుకు మళ్లుతుండగా గరుడబస్సు ఢీకొట్టిందని ప్రయాణీకులు చెప్పారు. ఈప్రమాదంలో బస్సులో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. 

10:16 - June 21, 2016

విజయవాడ : యోగా ఒక జీవన విధానమని... కుల,మతాలతో దానికి సంబంధంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచయోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మనసులోని కలుషితాలను యోగా కడిగేస్తుందన్నారు బాబు. విద్యార్థునులతో కలిసి యాన యోగా సాధన చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏ1 కన్వెన్షన్‌ హాలులో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుతోపాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10:11 - June 21, 2016

చంఢిఘడ్ : ప్రపంచ యోగా దినోత్సవం... విశ్వశాంతికి సందేశం ఇస్తున్న రోజు ఇది. 135దేశాలకు పైగా నిష్టగా ఆచరిస్తున్న అసలు సిసలు భారతీయ జీవన విధానం ఇది. ఉరుకులు పరుగుల జీవితానికి యోగసాధన ఒక స్వాంతన . యోగసాధన ద్వార మనసు స్వాధీనం అవుతుంది. మధిలో కల్మషాలను కడిగి... నియబద్ధమైన జీవితాన్ని అందిస్తుంది. ఆధునిక జీవనశైలిలో ప్రబలుతున్న శారీరక సమస్యలకు ..మానసిక సంఘర్షణలకు యోగతో నియంత్రిచడం సాధ్యం అవుతుంది. ప్రపంచంలో ఎన్నో వైద్యవిధానాలు ఉన్నా... శరీరాన్ని, మనసును సమన్వయం చేసి అద్భుతాలు సృష్టిచడం ఒక్క యోగాతోనే సాధ్యం. కుల, మత, ప్రాంతాలతో యోగాకు సంబంధంలేదు.. అందుకే ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని విశ్వయోగా దినంగా ప్రకటించింది. ఇది భారతదేశానికి దక్కిన గౌరవంగా ప్రజలు భావిస్తున్నారు.

చండీఘడ్‌లో యోగా చేసిన ప్రధానిమోడి...
అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. చండీఘడ్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. సుమారు 45వేలమందితొ కలిసి ప్రధాని యోగసాధన చేశారు. ప్రపంచశాంతికి యోగా ఒక సాధనమని ప్రధాని అన్నారు. భారత్‌ అందించిన యోగాను ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గత ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన ...అంతర్జాతీయ యోగా దినం అతి తక్కువ కాలంలోనే అన్ని దేశాలు పాటించేంత ఘనత సాధించిందని తెలిపారు.

10:09 - June 21, 2016

హైదరాబాద్ : అంబర్ పేటలోని కుమ్మరరవాడిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానకి చేరుకుని క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గ్యాస్ లీక్ అవటం గమనించనకుండా మహిళ గ్యాస్ వెలిగించటంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. గాయపడిన ఫాతిమా అజీజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

09:54 - June 21, 2016

ముంబై : బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ నటిస్తున్న 'మొహంజోదారో ' మూవీ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆశుతోష్ గోవర్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. తాజాగా ట్రైలర్‌తో హైప్‌ మరింత పెరిగింది. ఇక ట్రైలర్‌లోని సన్నివేశాలు చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఓ సన్నివేశంలో హృతిక్,పూజాహెగ్డేని లిప్‌లాక్‌ చేశాడు. రెండోసారి హృతిక్‌-ఆశుతోష్ కాంబినేషన్ మరింత క్రేజ్‌ను పెంచుతోంది. ఆగస్టు 12న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రశాటిలైట్‌ రైట్స్‌ హక్కులు 60 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

ముద్రగడ దీక్షకు అడ్డంకులు తొలగిపోనున్నాయా?!...

తూ.గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. తుని ఘటనలకు సంబంధించి సీఐడీ అరెస్టు చేసిన 13 మందిలో చివరి ముగ్గురికి కూడా బెయిల్‌ మంజూరయ్యింది. నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, ఏసుదాసులకు సోమవారం పిఠాపురం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత శుక్రవారం బెయిల్‌ మంజూరైన 10 మందిలో 8 మంది జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిని సీఐడీ కస్టడీలోకి తీసుకోగా... మరొకరి విడుదలకు సాంకేతిక సమస్యలు అడ్డొచ్చాయి.

09:48 - June 21, 2016

తూ.గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. తుని ఘటనలకు సంబంధించి సీఐడీ అరెస్టు చేసిన 13 మందిలో చివరి ముగ్గురికి కూడా బెయిల్‌ మంజూరయ్యింది. నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, ఏసుదాసులకు సోమవారం పిఠాపురం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గత శుక్రవారం బెయిల్‌ మంజూరైన 10 మందిలో 8 మంది జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిని సీఐడీ కస్టడీలోకి తీసుకోగా... మరొకరి విడుదలకు సాంకేతిక సమస్యలు అడ్డొచ్చాయి. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలన్న డిమాండ్‌తో ముద్రగడ 13 రోజులుగా దీక్ష చేస్తున్నారు.సీఐడీ అరెస్టు చేసిన వారిలో అందరికీ బెయిల్‌ వారడంతో ముద్రగడ ఇవాళ దీక్ష విరమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

యువతిని బెదిరించి అత్యాచారానికి యత్నం..

ఖమ్మం : కొత్తగూడెం లోతువాగు వద్ద బైక్ పై వెళ్తున్న యువతి..యువకుడిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం యువకుడిని బైక్ కు కట్టేసి యువతిపై అత్యాచారానికి యత్నించారు. వారినుండి తప్పించుకున్న సదరు యువతి త్రీ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో దుండగులు పరారయ్యారు.  

కృష్ణాజలాలపై నేడు బోర్డు సమావేశం ...

హైదరాబాద్‌: ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వినియోగం, అమలు యంతాంగ్రం తదితర అంశాలపై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం చర్చించనుంది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు.. పరిధి నిర్ణయిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌, నీటి వాటాలు తేలకుండా పరిధిని నిర్ణయించడానికి వీలులేదని తెలంగాణ గట్టిగా పేర్కొంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

మొక్క పీకితే ...రేషన్ కట్ ....

చిత్తూరు : మడిబాక గ్రామంలో పచ్చదనంతో కళకళలాడుతోంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడు మండలంలో మడిబాక సర్పంచ్ మల్లిఖార్జున రావు తమ గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చి దిద్దాలనుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటికి కానుగ, తురాయి తదితర మొక్కలను పంపిణీ చేయించారు. మొక్కల పంపిణీతోనే తన పని అయిపోయిందని  ఆ సర్పంచ్ అనుకోలేదు . ఈ నేపథ్యంలో ఆయన వినూత్న కట్టుబాటుకు తెర తీశారు. మొక్కను కాపాడే బాధ్యతను విస్మరించే కుటుంబాలకు రేషన్ కట్ చేస్తామని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు.

యోగా డేలో పాల్గొన్న బాలయ్య...

హైదరాబాద్‌: నగరంలోని కేబీఆర్‌ పార్క్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తదితరులు యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. 

సంజీవయ్య పార్కులో యోగాలో పాల్గొన్న బీజేపీ నేతలు ...

హైదరాబాద్‌ : సంజీవయ్య పార్కులో నిర్వహించిన యోగా వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, భాజపా శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రయివేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా...

హైదరాబాద్ : ఆర్టీఏ అధికారులు ప్రయివేట్ ట్రావెల్స్ పై కొరడా ఝుళిపించారు. ఈ క్రమంలో హయత్ నగర్ లోని తనిఖీలు చేపట్టారు. నిబంధనలకువిరుద్ధంగా నడుస్తున్న 32 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.

08:37 - June 21, 2016

2015 తర్వాత మరోసారి భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలకు నరేంద్రమోది ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విదేశి పెట్టుబడులకు సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కీలకమైన రక్షణ, విమానయాన, ఈ కామర్స్, ట్రేడింగ్ తదితర రంగాలకు సంబంధించిన అత్యంత వివాదాస్పద నిర్ణయాన్ని చడీచప్పుడు లేకుండా ప్రకటించేసింది. డిఫెన్స్‌, ఎయిర్‌లైన్స్‌ రంగాల్లో వందకి వంద శాతం, ఫార్మా రంగంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం బార్లా తలుపులు తెరిచింది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతంగా ఉండేది. దీనిని ఒకేసారి 100 శాతానికి పెంచడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో శశికుమార్ (ప్రముఖ విశ్లేషకులు), బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్ అధికార ప్రతినిధి), రాకేష్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమచారాన్ని తెలసుకోండి...

ఉద్యోగుల రైలు వచ్చేసింది...

విజయవాడ : రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రైలుకు విజయవాడలో రిమోట్‌ ద్వారా స్విచ్ ఆన్ చేసి సాగనంపగా నిర్ణీత 9.50 గంటల సమయానికి గుంటూరు రైల్వేస్టేషనకు చేరుకుంది. అప్పటికే వేచి ఉన్న కొంతమంది ఉద్యోగులు ఎక్కగా 9.55 గంటలకు గుం టూరు స్టేషనను విడిచి సికింద్రాబాద్‌ వైపునకు పరుగులు తీసింది. ఈ రైలు రెగ్యులర్‌ సర్వీసు బుధవారం 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

మనకు పూర్వీకులు మనకు ఇచ్చిన సంపద యోగా: బాబు...

విజయవాడ : యోగా మనకు పూర్వీకులు  మనకు అందించిన సంపద అని, మంచి జీవితం గడపడానికి యోగా అవసరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన యోగా కార్యక్రమంలో సీఎం యోగా చేసిన అనంతరం మాట్లాడారు. ఆత్మ, పరమాత్మను కలిపేదే యోగా అని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, కామినేని శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

గచ్చిబౌలిలో యోగా డే వేడుకలు....

హైదరాబాద్ : గచ్చిబౌలిలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఎ.గాంధీ పాల్గొన్నారు.

పేలిన గ్యాస్ సిలిండర్..3గురికి గాయాలు..

హైదరాబాద్ : అంబర్ పేటలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషయమంగా వున్నట్లు సమాచారం.

07:57 - June 21, 2016

జూన్ 23న తెలంగాణ ఆర్టీసిలో సమ్మె జరగబోతోంది. ఇప్పటికే సమ్మె నోటీసులిచ్చిన కార్మిక సంఘాల జెఏసి దీనిని విజయవంతం చేసే సన్నాహాల్లో నిమగ్నమైంది. ఇంతకీ ఈ సమ్మెకి కారణం ఏమిటి? ఆర్టిసి ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి?
జూన్ 23న ఆర్టీసి సమ్మె...
జూన్ 23న సమ్మె చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జెఏసి సమాయత్తమవుతోంది. ఆర్టీసీలో మొత్తం 9 సంఘాలుండగా, ఏడు సంఘాలు ఈ సమ్మెల్లో పాల్గొంటున్నట్టు ప్రకటించాయి. గత నెల 16వ తేదీన 14 డిమాండ్స్ పై కార్మిక సంఘాలు సమ్మె నోటీసిచ్చాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ పై సమీక్షించారు.
2014లో 1100 అద్దె బస్సులు...
ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు కార్మిక సంఘాలను సంత్రుప్తిపరచలేదు. జూన్ 23 సమ్మె తప్పదంటున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రెండేళ్ల కాలంలో ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నది కార్మిక సంఘాల ఆరోపణ. అద్దె బస్సుల సంస్క్రుతి ఆర్టీసీ విస్తరణను, అభివ్రుద్ధిని నిర్వీర్యం చేస్తోందన్నది కార్మిక సంఘాల ఆరోపణ. రెండేళ్లలో ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య రెట్టింపయ్యింది. 2014లో 1100 అద్దె బస్సులుండగా ఈ రెండేళ్ల లో వాటి సంఖ్య 2238కి పెరిగింది. ఇలా అద్దె బస్సులను పెంచుకుంటే పోతే, సంస్థ మనుగడకే ముప్పు వస్తుందన్నది కార్మిక సంఘాల ఆవేదన.

రెండేళ్లలో తగ్గిన ఆర్టీసీకి నిధులు...
ఈ రెండేళ్లలో రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయించిన నిధులు తగ్గిపోయాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో ఆర్టీసీకి 200 కోట్లు కేటాయించారు. ఆ తర్వాతి బడ్జెట్ లో 159 కోట్లు కేటాయించారు. 2016- 17 బడ్జెట్ లో కేటాయించేంది కేవలం 40 కోట్లే. ఏటేటా బడ్జెట్ కేటాయింపులు పెంచకుండా, ఇంత ఘోరంగా తగ్గిస్తూ పోతే, ఆర్టీసీ పరిరక్షణ ఎలా సాధ్యమన్నదే కార్మిక సంఘాల ప్రశ్న.
27. 23శాతానికి పెరిగిన వ్యాట్ ...
ఓ వైపు అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు బడ్జెట్ సపోర్ట్ తగ్గుతోంది. ఇంకో వైపు ఆర్టీసీని అప్పులు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసి రెండు వేల కోట్ల రూపాయల అప్పుల్లో వుంది. ఏటా 189 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అయితే, ఇంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడడం ఎలా? అందుకు ప్రభుత్వం చేయాల్సిందేమిటి? అన్న అంశాలపై రివ్యూ చేయాల్సిన అవసరం వుంది. విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇలా విభిన్నవర్గాలకు ప్రభుత్వం బస్ పాస్ రాయితీలిస్తోంది. కానీ, ఈ రాయితీ సొమ్మును తిరిగి ఆర్టీసికి జమ చేయడం లేదన్నది కార్మిక సంఘాల ఫిర్యాదు. ఒక్క 2015 -16 ఆర్థిక సంవత్సరంలోనే 539 కోట్లు చెల్లించాల్సి వుంది. అంటే రెండేళ్ల బకాయిలు జమ చేస్తే, ఆర్టీసీ సగం అప్పులు తీరిపోతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వసూలు చేసే వ్యాట్ పన్ను కారణంగా ఆర్టీసీ మీద మరో వెయ్యి కోట్ల భారం పడుతోందంటున్నాయి కార్మిక సంఘాలు. 2014 జూన్ కి పూర్వం 22.23శాతం వున్న వ్యాట్ ఈ రెండేళ్లలో మరో అయిదు శాతం పెరిగింది. 27.23 శాతానికి చేరింది. ఒకవైపు ఆర్టీసికి జమ చేయాల్సిన సొమ్ము జమ చేయకుండా ప్రయివేట్ రంగంతో పోటీ పడాలంటూ హితోక్తులు చెప్పడంలో అర్ధం లేదు. ఆర్టీసీ కష్టాలు ఇలా వుంటే, రవాణాలో ఆర్టీసీకి గుత్తాధిప్యతమేమీ లేదంటూ ప్రయివేట్ ట్రావెల్స్ కి, ఆపరేటర్లకి స్వాగతం పలుకుతోంది ప్రభుత్వం. మొత్తానికి ఆర్టీసి మనుగడ అత్యంత ప్రమాదంలో పడింది.

 

07:51 - June 21, 2016

ఎల్లుండి తెలంగాణ ఆర్టీసీలో ఒక్క రోజు సమ్మె జరగబోతోంది. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ పై సమీక్ష నిర్వహించారు. అనేక అంశాలను ప్రస్తావించారు. రవాణాలో ఆర్టీసికి గుత్తాధిపత్యం లేదంటూ ప్రయివేట్ రంగంతో పోటీ పడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని తేల్చేశారు. ఆర్టీసి కార్మిక సంఘాలు సమ్మొ నోటీసు ఇచ్చిన తర్వాత సిఎం చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కార్మిక సంఘాల జెఏసి ఏమంటోంది? ఈ నెల 23న ఆర్టీసి సమ్మెకు కారణం ఏమిటి? ఆర్టిసి పరిరక్షణలో కార్మికుల పాత్ర ఏమిటి? ప్రభుత్వం బాధ్యత ఏమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆర్టీసి కార్మిక సంఘాల జెఏసి నేత రాజిరెడ్డి 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారాన్ని తెలసుకోండి.

07:46 - June 21, 2016

నెల్లూరు : శ్రీహరికోట..ఆకాశవీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. గగనతలంలో మన ఘనతను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన రికార్డుల కోట..మరో కీర్తి శిఖరాన్ని చేరుకోబోతోంది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రేపు ఉదయం 9.26 గంటలకు పీఎస్‌ఎల్వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఒకేసారి 20 ఉపగ్రహాలు ...
నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం..షార్‌ మరో అరుదైన రికార్డును నమోదును చేసేందుకు సిద్దంగాఉంది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడానికి షార్‌ రెడీ అయింది. పీఎస్ఎల్వీ-34 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయి కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9.26 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ నిరంతరాయంగా 48 గంటల పాటు కొనసాగి బుధవారం ఉదయం 9.26 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

నాలుగు దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలను నింగిలోకి...
వాణిజ్యపరంగా నాలుగు దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుండటంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భారత్‌కు చెందిన 727.5 కిలోల కార్టొశాట్‌-2సీతో పాటు విదేశాలకు చెందిన 17, పూణె, సత్యభామ విశ్వవిద్యాలయాలకు చెందిన రెండు ఉపగ్రహాలను రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 20 ఉపగ్రహాలను 505 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెడుతుంది.

భారత్‌కు చెందిన 727.5 కిలోల కార్టొశాట్‌-2సీ ...
కార్డోశాట్‌-2సీని భౌగోళిక సమాచారం కోసం కార్డోశాట్‌ సీరీస్‌ను ఇస్రో 2005లోనే రూపొందించి ఇప్పటికి నాలుగు ఉపగ్రహాలను పంపించారు. 727 కిలోల బరువుండే కార్డోశాట్‌-2సీ భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులోని సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్‌ నుంచి పనిచేస్తుంది. ఇందులో అమర్చిన అత్యంత శక్తివంతమైన పాంక్రోమేటిక్‌ అండ్‌ మల్టీ స్ర్పెక్టరల్‌ కెమెరాలు భూమిని పరిశోధిస్తూ ఫోటోలు తీసి పంపుతుంది. ఈ చిత్రాల ఆధారంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి , తీరప్రాంతపు సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్డు నెట్‌వర్క్‌ సమాచారం, మ్యాపులు తయారుచేయడంలో సహకరిస్తుంది. 

07:40 - June 21, 2016

విజయవాడ : అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. ఇంకా తరలింపునకు వారం రోజులే గడువు ఉండడంతో సీఎస్‌.. ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పురోగతిపై చర్చిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈనెల 24 నుంచి కార్యాలయాల తరలింపు ప్రక్రియను దశలవారీగా చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎస్‌ ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ టక్కర్‌ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు కార్యాలయాల తరలింపు ప్రక్రియ,.. శాఖలకు భవనాల కేటాయింపుపై చర్చించారు.

భవనాల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హెచ్‌వోడీలు...
తమ కార్యాలయాలకు సరైన భవనాలు కేటాయించకపోవడంతో కొంతమంది హెచ్‌వోడీలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే వాటి కోసం ప్రత్యేకంగా కార్యాలయాలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 24 నుంచి తరలింపు పనులు మొదలుపెట్టాలన్నారు. ముందుగా కొన్ని శాఖలను తరలిస్తే.. ఆ తర్వాత మిగతా శాఖలు తరలివస్తాయనే అభిప్రాయాన్ని టక్కర్‌ వ్యక్తం చేశారు. రాజధానికి తరలివచ్చే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించే విషయంలో రాజీపడవద్దని సీఎస్‌ అధికారులకు సూచించారు. మహిళలకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయాలన్నారు.

ఐఏఎస్‌ అధికారులకు రెయిన్‌ ట్రీ అపార్ట్‌మెంట్లలో వసతి ...
ఇక ఐఏఎస్‌ అధికారులకు రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్లలో వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. కుటుంబంతో వచ్చే అధికారులకు.. అలాగే బ్యాచ్‌లర్‌ అకామిడేషన్‌ కావాలనుకునే వారికి వేర్వేరుగా వసతి కల్పించాలన్నారు. ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఈనెల 22న సీఎం రోడ్‌మ్యాప్‌ ప్రకటించనున్నారు. దీంతో తరలింపు ప్రక్రియపై పూర్తి స్పష్టత రానుంది. 

07:33 - June 21, 2016

హైదరాబాద్ : జంటనగరాల ప్రజల నెత్తిమీద ఆస్తిపన్ను పిడుగు పడనుంది. ఆస్తిపన్ను బాదేందుకు జీహెచ్ఎం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా పౌరసదుపాయాలు మెరుగుపరిచేందుకు పన్ను పెంచక తప్పదన్న వాదాన్ని అధికారులు, పాలకులు లేవనెత్తుతున్నారు. ఆస్తిపన్ను ఏ మేరకు పెంచాలన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పిన మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ ... ప్రజలను మానసికంగా సిద్ధం చేశారు.

జీహెచ్‌ఎంసీ కార్యకలాపాలపై కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..
మున్సిపల్‌ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్‌... జీహెచ్‌ఎంసీ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్తిపన్ను పెంపుతోపాటు, నగర సమగ్రాభివృద్ధి, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ నియంత్రణ, జంక్షన్ల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.

ఏటా ఆస్తిపన్ను పెంచేలా అధికారులు పరిశీలన...

ఇకపై ఏటా ఆస్తిపన్ను పెంచే అంశాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నగరంలో పౌర సదుపాయాలు మెరుగు పరిచేందుకు ప్రజలు కూడా కొద్దోగొప్పో భారం మోయక తప్పదన్న అంశంపై చర్చ జరిగింది. ఒకేసారి కాకుండా ఏటేటా కొంత పెంచితే ప్రజలకు భారం కాకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది.

రోడ్ల నిర్వహణపై కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి ...
జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్ల నిర్వహణ తీరుపై కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారులు నిర్వహణకు ఏటా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా...ఫలితం ఉండటంలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. చిన్న వర్షానికే రోడ్లు చెరువుల్లాగా మారుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందని అధికారులను నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం అధికారులు వంతు అయ్యింది.

రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని యోచన...
జంటనగరాల్లోని రోడ్ల నిర్వహణ బాధ్యతల నుంచి జీహెచ్‌ఎంసీ వైదొలగే అవకాశం ఉంది. ఈ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మూడు నుంచి ఐదేళ్లు నిర్వహణ ఖర్చులు భరించేలా రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నారు. కేటీఆర్‌ హితబోధ తర్వాతైనా రోడ్ల నిర్వహణ విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిలో ఎంతవరకు మార్పు వస్తుందో చూడాలి.

 

యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 'బాబు..ప్రభు'..

విజయవాడ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు.

యోగా వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి...

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.

యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ..

ఛండీఘడ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి వేలాదిమంది హాజరైయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ....దేశమంతా యోగా డే నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. యోగా విషయంలో ప్రపంచ దేశాలు భారత్ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. భారత్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21ని యోగాడే గా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. యోగా అనేది మన జీవన విధానంలో ఒక భాగమవ్వాలన్నారు. యోగా సాధనతో శరీరం, మనస్సు, బుద్ధి వృద్ధి చెందుతాయన్నారు. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.

07:02 - June 21, 2016

విజయవాడ : కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి సంబంధించిన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సురేష్‌ ప్రభు..విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడలో ప్రారంభించారు.

విజయవాడ- సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం...
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సురేష్ ప్రభు..రాష్ట్ర రుణాన్ని తీర్చుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే పెద్దల సభకు ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిసి తన ఉడతభక్తిని చాటుకుంటున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడం తన అదృష్టమన్న సురేష్‌ప్రభు..ఆంధ్రప్రదేశ్‌ని తన సొంత రాష్ట్రంలో మాదిరిగా అభివృద్ధి చేస్తానని హామీలు కురిపిస్తున్నారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ రైలును ప్రారంభించారు.

క్రిష్ణపట్నం మల్టీమోడల్ లార్జిస్టిక్ పార్కు శంకుస్థాపన...
దీనితో పాటు 323 కోట్ల రూపాయలతో గుంతకల్ నుంచి కల్లూరు రైల్వే లైను డబ్లింగ్ పనులకు, 240 కోట్ల రూపాయలతో 142 ఎకరాల్లో నిర్మించనున్న క్రిష్ణపట్నం మల్టీమోడల్ లార్జిస్టిక్ పార్కు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇదే వేగంతో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని మంత్రి హామీఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రైల్వేను ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును సురేష్ ప్రభు పరిశీలిస్తున్నారు : సీఎం
సురేష్‌ప్రభు లాంటి డైనమిక్ మంత్రి ఏపి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించటం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. ఏ రాష్ట్రానికి లేనంత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని..ఏపిలోని నౌకాశ్రయాలను కలుపుతూ రైల్వే లైను వేస్తే వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును సురేష్ ప్రభు పరిశీలిస్తున్నారని బాబు తెలిపారు. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని రైల్వే ప్రాజెక్టులను, విశాఖపట్టణానికి రైల్వే జోన్‌ ఇచ్చే విషయంలోనూ సురేష్ ప్రభు ఆసక్తి చూపిస్తున్నారు. 

06:54 - June 21, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లాల మ్యాపులను సిద్ధం చేసిన కలెక్టర్లు..మండలాలు, రెవెన్యూ డివిజన్లపై కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు, కార్యాలయాల గుర్తింపు కోసం సీఎస్‌ రాజీవ్‌శర్మ సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎస్‌ పలు కీలక సూచనలు చేశారు.

గద్వాల ..శంషాబాద్‌ కేంద్రాలుగా కొత్త జిల్లాలు ...
తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు, ఇతర పాలనపరమైన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై సుధీర్ఘంగా చర్చించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అందచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. కొత్త జిల్లాలు ఏర్పాడుతున్న నేపథ్యంలో జిల్లాల్లో ఉద్యోగుల సర్థుబాటు, ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు అవసరమైన స్థలాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుతం సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులనే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని..ఆ దిశగా ఉద్యోగుల సర్దుబాటుపై నివేదికను రూపొందించాలని తెలిపారు. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగించాల్సి ఉన్నందున అందుకు అవసరమైన పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్లకు సీఎస్‌ సూచించారు.

రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటుకు యోచన...
కొత్తగా రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దాదాపుగా 150 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో నుంచే 75 మంది ఉద్యోగులను కొత్త జిల్లాల్లో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదనపు సిబ్బంది అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగులను నియమించుకోవాలని సీఎస్‌ సూచించినట్లు సమాచారం. ఇక అన్ని జిల్లాల్లో స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్ నియామకాల పద్దతికి ప్రభుత్వం స్వస్తి చెప్పనుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మినహా..ఇతర 9 జిల్లాల్లో 9మంది స్పెషల్‌ గ్రేడ్‌ కలెక్టర్లు ఉన్నారు. వీరిని కొత్త జిల్లాల్లో నాన్‌ క్యాడర్‌ జాయింట్‌ కలెక్టర్లుగా నియమించనున్నారు. త్వరలోనే అన్ని శాఖల శాఖాధిపతులతో సమావేశం నిర్వహిస్తామని సీఎస్ తెలిపినట్లు సమాచారం.

ఉన్నతాధికారులతో సాధికారిక కమిటీ....
ఇక కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు, ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సాధికారిక కమిటీని నియమించింది. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కొత్త జిల్లాలపై జిల్లాల కలెక్టర్లతో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఇవాళ జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారని సమాచారం. మొత్తానికి దసరా నాటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రావాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించడంతో కలెక్టర్లు అంతే వేగంతో జిల్లాల ఏర్పాటులో నిమగ్నమైఉన్నారు. 

06:48 - June 21, 2016

ఢిల్లీ : ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాకు పుట్టినిల్లైన భారత్‌ సహా 191 దేశాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా డేకి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చండీగఢలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్లొంటున్నారు. 57 మంది కేంద్ర మంత్రులకు కూడా యోగా దినోత్సవ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా డే...
అంతర్జాతీయ యోగా డేని ఘనంగా నిర్వహిస్తున్నారు. 2014 సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మన ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించారు. గతేడాది మొదటి యోగా డేని నిర్వహించగా... ఇవాళ రెండో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

32 వేల మందిలో యోగా చేయనున్న మోదీ ...
గతేడాది ఢిల్లీలోని రాజ్‌ఫథ్‌లో 36 వేల మందితో కలిసి యోగా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ...ఈసారి చండీగఢ్‌లో జరిగే యోగా డేలో పాల్గొంటున్నారు. చండీగఢ్‌లో క్యాపిటల్‌ కాంప్లెక్స్‌లో ఉదయం ఆరున్నర గంటలకు జరిగే కార్యక్రమంలో మోదీ యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తారు. దాదాపు 32 వేల మంది మోదీతో కలిసి యోగా చేసే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు... ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ను ఎనిమిది భాగాలుగా విభజించారు. మొత్తం 500 మంది యోగా శిక్షకులను ఏర్పాటు చేశారు. యోగా చేసే వారి కోసం 30వేల తివాచీలు పరిచారు. 300 బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. క్యాపిటల్‌ కాంప్లెక్స్‌కు చేరుకునేందుకు 600 బస్సులు ఏర్పాటు చేశారు. చండీగఢ్‌లోని మరో పది ప్రాంతాల్లో జరిగే యోగా దినోత్సవాల్లో మరో పదివేల మంది పాల్గొంటారని ఆశిస్తున్నారు.

ద్యారకా, రోహిణి, యుమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌...
దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు చోట్ల యోగా డే నిర్వహిస్తున్నారు. కన్నాట్‌ప్లేస్‌, లోదీ గార్డెన్‌, నెహ్రూ పార్క్‌, తల్కతోరా గార్డెన్‌, ద్వారకా, రోహిణి, యుమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో కార్యక్రమాలు జరుగుతాయి. ఢిల్లీ యోగా డేని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమన్వయం చేస్తున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌లను విడుదల చేశారు. సూర్య నమస్కార భంగిమలో ఉన్న ఈ పోస్టల్‌ స్టాంప్‌లు వివిధ డినామినేషన్లలో లభిస్తాయి.

విశాఖలో అశోక్‌ గజపతిరాజు ...
పలువురు కేంద్ర మంత్రులకు యోగా డే నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు విశాఖలో జరిగే యోగా డేలో పాల్గొంటారు. కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో యోగా సాధన చేస్తారు. శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తిరుపతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు విజయవాడలో యోగా సాధన చేస్తారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మాలా సీతారామన్‌, మనోహర్‌ పారికర్‌ సహా పది మంది కేంద్ర మంత్రులు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

391 విశ్వవిద్యాలయాల్లో యోగా ...
విద్యాసంస్థల్లో కూడా యోగా డే నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 391 విశ్వవిద్యాలయాలు, 16 వేల కాలేజీలు, 12 వేల పాఠశాలల్లో యోగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ పండిట్‌ రవి శంకర్‌ నేతృత్వం వహిస్తున్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో వంద దేశాల్లో యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ రవిశంకర్‌ ఐరోపా పార్లమెంటులో యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తారు. భారతీయ యోగా సంస్థాన్‌తో పాటు, బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరియా విశ్వవిద్యాయం ఆధ్వర్యంలో కూడా యోగా డే నిర్వహిస్తున్నారు. యోగా గురు రాందేవ్‌ బాబా రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతాదళం అధికారులు, జవాన్లకు యోగా శిక్షణ ఇస్తారు. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌... ఇలా అన్ని దేశాల్లో కూడా యోగా డేని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన విలువపై బహుమతుల్లో యోగా ఒకటిని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌ బుల్‌ ప్రశంసించారు. యోగాకు పెరుగుతున్న ఆదరణకు ఈ మాటే నిదర్శనంగా చెప్పొచ్చు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం...

ఢిల్లీ : ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాకు పుట్టినిల్లైన భారత్‌ సహా 191 దేశాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా డేకి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చండీగఢలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్లొంటున్నారు. 57 మంది కేంద్ర మంత్రులకు కూడా యోగా దినోత్సవ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 

అత్తను చంపిన అల్లుడు...

మెదక్ : నగదు కోసం...నగదు...ఆస్తులు ఇలా పైసాయే పరమాత్మ అన్నట్లుగా సమాజంలో నేరాలకు ఆలవాలంగా మారిపోతోంది. ఈ క్రమంలోనే బంగారం కోసం ఓ అల్లుడు అత్తను చంపిన ఘటన నర్సాపూర్ లో చోటు చేసుకుంది. ఈనెల 18న మండలంలోని నాగులపల్లి పంచాయతీ పరిధిలోని తౌర్య తండాకు చెందిన గిరిజన మహిళ మెగావత్ తార(48) అనే మహిళను అల్లుడు నగల కోసం చంపివేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలిని చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

బస్సు -లారీ ఢీ..డ్రైవర్ మృతి

నల్లగొండ్ : కోదాడ బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గరుడ బస్సును ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. కాగా ప్రయాణీకులంతా సురక్షితంగా బైటపడ్డారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Don't Miss