Activities calendar

22 June 2016

21:36 - June 22, 2016

జింబాబ్వేతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను టీమిండియా 2-1తో సొంతం చేసుకొని..మినీ సఫారీ సిరీస్ ను విజయవంతంగా ముగించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ముగిసిన ఆఖరి సమరంలో ధోనీసేన 3 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించి..విజేతగా నిలిచింది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ ఆఖరిమ్యాచ్ లో...టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. 139 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్ళు మరుమా 23, చిగుంబురా 16 పరుగులతో పోరాడినా..ఆఖరి ఓవర్ ఆఖరిబంతిలో విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో శ్రణ్, ధవళ్ కులకర్ణీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0తో అలవోకగా నెగ్గిన టీమిండియా...టీ-20 సిరీస్ లో మాత్రం జింబాబ్వేతో తుదివరకూ పోరాడాల్సి వచ్చింది.

21:35 - June 22, 2016

జమ్ముకశ్మీర్‌ : అనంత్‌నాగ్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఉదయం పోలింగ్‌ మందకొడిగా సాగింది. అనంతనాగ్‌లో సిఎం మెహబూబా ముఫ్తి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంత్‌నాగ్‌ నుంచి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు మరో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున హిలాల్‌ అహ్మద్‌ షా, నేషనల్ కాన్ఫరెన్స్‌ తరపున ఇఫ్తికార్‌ హుస్సేన్‌ మిస్గర్‌ పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్‌ సయీద్‌ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. సిఎం పీఠాన్ని అధిష్టించిన మెహబూబా ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఉపఎన్నిక ఆమెకు కీలకంగా మారింది. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.

21:32 - June 22, 2016

ఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యంపై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్రంగా ఖండించారు. ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని జైట్లీతో పాటు మరో మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆర్బీఐ గవర్నర్‌ రాజన్‌, ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యంపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలను తాము అంగీకరించమని జైట్లీ స్పష్టం చేశారు. అరవింద్‌ సుబ్రహ్మణ్యం సలహాలు ప్రభుత్వానికి ఎంతో కీలకమన్నారు.

 

21:30 - June 22, 2016

ఢిల్లీ : రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లాలో భూ కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఈడీ నోటీసు జారీ చేసింది. వాద్రా కంపెనీ మెసర్స్‌ స్కైలైట్‌ హాస్పిటాలిటి స్థిరాస్థిపై మనీలాండరింగ్‌ కేసు కింద ఈడీ విచారణ చేపట్టనుంది. ల్యాండ్‌ డీల్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను ఈడీ కోరినట్లు సమాచారం. స్కైలైట్‌ కంపెనీ పేరిట బికనీర్‌ జిల్లాలో 275 ఎకరాల భూమిని వాద్రా కొనుగోలు చేశారు. గత నెల వాద్రా భూముల కొనుగోలుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పత్రాలను ఈడీ ఆధారాలుగా సేకరించింది. ఈడీ నోటీసులు తమకు అందినట్లు ప్రియాంకా గాంధీ ధృవీకరించారు.

21:26 - June 22, 2016

ప్రకాశం: ఏపీలో రైతులకు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒంగోలులో ప్రారంభించారు. రైతుల కళ్లలో ఆనందాన్ని చూసేందుకే రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమన్నారు సీఎం. రైతులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించానని.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అమలు చేశామన్నారు. రెండో విడతలో భాగంగా 3,500 కోట్లు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులను ఆర్థిక సమస్యల నుంచి బయటపడేసి.. వారి కళ్లలో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే రుణమాఫీ చేస్తున్నట్లు బాబు తెలిపారు. దేశంలో 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క టీడీపీదేనన్నారు.

కాంగ్రెస్ దివాలా తీసింది..
పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితికి తీసుకువచ్చిందన్నారు చంద్రబాబు. గతంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు ఎలాంటి సాయం చేయని నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం చిత్రంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఏది ఏమైనా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

21:24 - June 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల వీపుపై చార్జీల మోత మొగనుంది. బస్సు, విద్యుత్ చార్జీలను పెంచేందుకు రాష్ట ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పల్లెవెలుగుల్లో ప్రయాణం సాగించే సామాన్యుల నుంచి...విద్యుత్ వినియోగదారుల వరకు అందరిపై భారాలు మోపేందుకు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి గురువారం అధికారక ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వ రంగ సంస్థల నష్టాల భర్తీ కోసం ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం రెడి అయ్యింది. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... చార్జీలు పెంచక తప్పదని సంకేతాలిచ్చారు. ఆయా సంస్థలు నష్టాల్లో నడుస్తున్నందున ప్రజలు భారం భరించక తప్పదనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తీకరించినట్లు సమాచారం. ప్రభుత్వ సంస్థలను ఆదుకునేందుకు చార్జీల పెంపు తథ్యమన్న భావనలో సీఎం ఉన్నట్లు భోగట్టా.

దాదాపు 26 లక్షల కుటుంబాలపై పడనున్న భారం..
తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నందున విద్యుత్ శాఖ 2144 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చిందన్నది ప్రభుత్వ వాదన. దాంతో పాటు విద్యుత్ కొనుగోలు కోసం గతేడాది 2,700 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. మరోవైపు ఆ శాఖ సిబ్బంది వేతనాలు పెరిగాయి. పెంచిన వేతనాల భారం కూడా విద్యుత్ సంస్థలపై పడింది. రైతాంగానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా కోసం.. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు కోసం మరో 2, 400 కోట్లు ఖర్చు చేసింది. దీని వల్ల విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. వాటిని గట్టెక్కించేందుకు విద్యుత్ చార్జీలు పెంచక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. సామాన్యులపై భారం పడకుండా విద్యుత్ చార్జీలను పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. వంద యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఏలాంటి పెంపు ఉండకూడదని, వంద యూనిట్ల కన్నా విద్యుత్ వినియోగం ఎక్కువైన వారికి స్వల్పంగా చార్జీలు పెంచాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 26 లక్షల కుటుంబాలపై భారం పడనుంది. ఇక పరిశ్రమలపై ఎక్కువ భారాలు ఉండకుండా.. కేవలం 7శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.

చార్జీల పెంపును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు..
2016-17 సంవత్సరానికి సంబంధించి 1,958 కోట్ల మేర చార్జీల పెంపు ప్రతిపాదనలతో డిస్కంలు మార్చి8న విద్యుత్‌ నియంత్రణ సంస్థకు ఏఆర్‌ఆర్‌ నివేదికలు సమర్పించాయి. వాస్తవానికి గతేడాది నవంబర్‌లో ఏఆర్‌ఆర్‌ల సమర్పణ, ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ, జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో డిస్కంల ఏఆర్‌ఆర్‌ల సమర్పణకు ప్రభుత్వం అప్పుడు అనుమతించక పోవడంతో.. గత మార్చిలో సంస్థలు నివేదికలిచ్చాయి. వాటిపై ఏప్రిల్‌లో బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్‌సీ.. మే 1 నుంచి 1,730 కోట్ల మేర చార్జీల పెంపునకు అనుమతించి.. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపారు. ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించాయి.

30 కిలోమీటర్లపైన ప్రయాణానికి రూ.2 పెంపు..
విద్యుత్ చార్జీలే కాదు.. బస్సు చార్జీలను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం 2,275 కోట్ల అప్పు ఉంది. దాంతో పాటు ఉద్యోగుల వేతనాల పెంపు, మెరుగైన రవాణా సౌకర్యాల కోసం వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇది ఆర్టీసీకి పెను భారంగా మారింది. అందుకే బస్సు చార్జీలను స్వల్పంగా పెంచేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. సామాన్యులు, పల్లే ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సులో 30 కిలోమీటర్లు లోపు ఒక్క రుపాయి, 30 కిలోమీటర్లపైన ప్రయాణానికి రెండు రూపాయలు పెంచేందుకు అంగీకారం తెలిపారు. మిగతా బస్సుల్లో పదిశాతం మించకుండా చార్జీలు పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుత చార్జీల మోతలపై ప్రజా స్పందనను బట్టి మరిన్ని భారాలు మోపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బియ్యం, పప్పులు, కూరగాయల రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇప్పుడు కరెంటు, బస్సు చార్జీల మోత కొత్త రాష్ర్టానికి అంత శ్రేయస్కరం కాదంటున్నారు విశ్లేషకులు. 

ఛార్జీలు పెంచడం ప్రజలపై భారం మోపడమే - తమ్మినేని..

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థలు బలపడాలంటే ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఛార్జీలు పెంచడం ప్రజలపై భారం మోపడమేనని, ప్రజలపై ఛార్జీల భారాన్ని మోపడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందన్నారు. రెండేళ్లుగా కరవుతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ఛార్జీలు పెంచడం భావ్యం కాదన్నారు. 

ఛార్జీలు పెంచితే ప్రజాగ్రహం - సీపీఐ..

హైదరాబాద్ : ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపం అన్యాయమన్నారు. వెంటనే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరిచుకోవాలని డిమాండ్ చేశారు. 

20:51 - June 22, 2016

 సినీ నటుడు జేవీ రమణమూర్తి (83) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. బుధవారం స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జేవీ రమణమూర్తి దివంగత నటుడు శంకరాభరణం జేవీ సోమయాజులుకు సోదరుడు. కెరీర్ లో ఆయన 150 చిత్రాల్లో నటించారు.
1933 మే 20న విజయనగరంలో ఆయన జన్మించారు. 1957లో 'ఎమ్మెల్యే' చిత్రం ద్వారా ఆయన చిత్ర రంగప్రవేశం చేశారు. జేవీ రమణమూర్తి తన ఇరవైవ ఏట నుంచే స్వీయ దర్శకత్వంలో గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. ఆకలిరాజ్యం, సిరివెన్నెల, గోరింటాకు, శుభలేఖ, ఆనందభైరవి, కాంచనగంగ, కర్తవ్యం, ఆర్య, మాయాజాలం, శంకర్‌దాదా జిందాబాద్, సప్తపదితోపాటు మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 

20:45 - June 22, 2016

భారత రోదసి పరిశోధనల్లో మైలురాయి. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం. భారత సాంకేతిక ప్రగతి సాధించిన అపూర్వ విజయం ఇది. ఒకేసారి 20 ఉపగ్రహాలు నింగికెగసి చరిత్ర సృష్టించాయి. పీఎస్ ఎల్ వీ సీ34.. వాహక నౌక ప్రయోగం విజయవంతం కావటం ఇస్రో పరిశోధనల్లో పెద్ద ఎఛీవ్ మెంట్ గా నిలిచింది. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. ఆకాశవీధిలో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. గగనతలంలో మన ఘనతను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన రికార్డుల ప్రయోగ కేంద్రం మరో కీర్తి శిఖరానికి బాటలు వేసింది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

ఆనాడు నవ్వుకున్నారు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పొదిలో బ్రహ్మాస్త్రంగా మారిన పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జరిగిన 53 ప్రయోగాల్లో 35 ప్రయోగాలు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌వే కావడం విశేషం. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుంటే అతిచిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయం తెచ్చి పెడుతోంది. ఖగోళంవైపు భారత్ కన్నెత్తితేనే నవ్వుకున్నారు. ప్రచ్చన్నయుద్ధంలో ఏకాకిని చేశారు. అంతరిక్షయానంపై ఆంక్షలు విధించారు. చంద్రమండలంపై త్రివర్ణ పతాకం ఎగరవేస్తే హేళన చేశారు. మంగళయాన్ తో అరుణగ్రహ కక్ష్యలో అడుగిడితే గేలి చేశారు. పేదరికంతో నలిగిపోతున్న ఇండియాకు మార్స్ మురిపెం ఎందుకని ఈసడించారు. కానీ అంతరిక్ష పరిశోధనల్లో వడివడిగా పడుతున్న భారత అడుగులు చూసి ఆశ్యర్యపోతున్నారు. అతి తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలనే మోసుకెళుతున్న పరిజ్ఞానాన్ని చూసి ఖంగుతింటున్నారు. అసలు ఇస్రో ప్రస్థానం ఎలా మొదలైంది... ఎన్ని సంచలన ప్రయోగాలకు ఇస్రో వేదికైంది.

మైలురాయిలా పీఎస్ఎల్వీ 34 ప్రయోగం..
ఇస్రో.. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఒకనాడు ఎడ్లబళ్లపై రాకెట్లను తీసుకెళ్లిన సంస్థ ఇప్పుడు ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతోంది. అగ్రదేశాలకు ధీటుగా అంతరిక్ష రహస్యాలను శోధించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో నాసా లాంటి సంస్థను కూడా దాటేస్తూ అనేక ప్రయోగాలను విజయవంతంగా చేస్తోంది. ఇదే క్రమంలో విజయవంతమై పీఎస్ఎల్వీ 34 ప్రయోగం మరో మైలురాయిలా నిలిచింది. బుడిబుడి అడుగులు ప్రయోగాలనుండి.. ప్రపంచంలోనే మేటి సంస్థగా ఎదిగిన ఇస్రో.. ఇప్పుడు, ప్రయోగాల చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోంది. ఇప్పటికే లో కాస్ట్ ప్రయోగాలతో అనేక సంస్థలను ఆశ్చర్య పరుస్థున్న భారత అంతరిక్ష ప్రయోగసంస్థ పేరు ప్రతిష్టలు, గగనం అంచులు చేరుతున్నాయి.. భారత్ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ఇస్రో ప్రయోగాలు మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆశిద్దాం. 

20:37 - June 22, 2016

కర్ణాటక : పట్టపగలు..అందరూ చూస్తున్నారు.. ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో పొడిచారు. రక్తపు మడుగుల్లో ఆ యువకుడు..కొందరు ఈ ఘాతుకాన్ని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ ఇతడిని కాపాడలేదు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్నాటక జిల్లాలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.
బస్టాపులో యువతితో కలిసి ఉన్న ధనుష్ అనే యువకుడితో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ తరువాత కత్తితో విచక్షణారహితంగా పొడిచేశారు. ఇదంతా చూస్తున్న వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. యువతి ప్రేమ విషయంలో గతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. చివరిలో వచ్చిన పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర పోషించారు. ఆ తరువాత రక్తపు మడుగులో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. 

20:30 - June 22, 2016

నల్గొండ : ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవాలని చూడడం సరికాదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సీపీఎం కార్యాలయంలో సమావేశమైన నేతలు.. ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ.. జీవో 123ని తీసుకువచ్చిందని జూలకంటి అన్నారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారమివ్వాలని.. లేకపోతే కోల్పోయిన భూమికి బదులు.. వేరేచోట భూములు ఇవ్వాలని జూలకంటి డిమాండ్‌ చేశారు. 

20:28 - June 22, 2016

ఢిల్లీ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. ఇందుకు ఢిల్లీ వేదిక అయ్యింది. బుధవారం నాడు విజ్ఞాన్ భవన్ లో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 5వ ప్రత్యేక సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అనంతరం ఉమా భారతి సూచన మేరకు సీడబ్ల్యూసీ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ తో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమలు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తొండి..మొండి వాదన చేస్తోందని విమర్శించారు. కృష్ణా, గోదావరి జిల్లాలో 2500 కోట్ల పంట కాపాడిన చరిత్ర టిడిపిదన్నారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భూ సమస్యను పరిష్కారం..పోలవరం కుడి కాల్వ పనులు పూర్తి చేసి గత సంవత్సరంలో తాగు, సాగునీరందించామన్నారు. 80 టీఎంసీలు కృస్ణా డెల్టాకు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పక్కనున్న రాష్ట్రాలు బాగుండాలని ఉద్ధేశ్యంతో పని చేయడం జరుగుతోందన్నారు.

తెలంగాణది అసత్య ప్రచారం..
ఏపీలో మూడు పంటలు పండుతున్నాయని..తెలంగాణ రాష్ట్రంలో ఒక పంట కూడా పండడం లేదని పేర్కొనడం సబబు కాదన్నారు. గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ముసాయిదా తీర్మానం పంపించడం జరిగిందని, తెలంగాణ, ఏపీ భూభాగంలో ప్రాజెక్టులన్నీ తమ పరిధిలోకి తీసుకుంటామని అందులో పేర్కొనడం జరిగిందన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వాహణ తాము అడుగుతున్నామని తెలంగాణ పేర్కొంటోందని, అసత్యప్రచారానికి వారే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్రాజెక్టు ఎక్కడ తీసుకోవాలో ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం జరిగిందని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు, కేంద్ర జలవనరుల శాఖ పంపించడం జరిగిందని తెలిపారు. కేంద్ర జలవనరుల ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చొబెట్టి ప్రాజెక్టు నిర్మాణాలు..ఇతరత్రా వాటిపై చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ పిలవమని ఏపీ పేర్కొంటోందని, తెలంగాణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. గోదావరి సమస్యలు మాట్లాడటానికి గోదావరి రివర్ బోర్డు ఉందని, ఇందులో సమస్యలు మాట్లాడవచ్చని సూచించారు.

విభజన కోరుకోలేదు..
రాష్ట్ర విభజన తాము కోరుకున్నది కాదని, రాష్ట్రాన్ని విడదీయాలని కోరలేదన్నారు. సోనియా నాయకత్వంలో విభజన కోరుకున్న వారు చట్టాలు రాశారని, ఈ చట్టాలు అమలు చేయాలని కోరడం జరుగుతోందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రావాల్సి ఉందని, తెలంగాణ రాష్ట్రం మొండి..తొండి వాదన చేస్తోందన్నారు. న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. 1976లో బచావత్ ట్రిబ్యునల్ అమల్లోకి వచ్చిందని, 1976 వివిధ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందో తాగు, సాగునీరందించడం జరుగుతోందన్నారు. ఆల్మట్టి వివాదంపై 2004లో వాదనలు ప్రారంభమయ్యాయని, 2014లో నివేదికలు వచ్చాయని గుర్తు చేశారు. పోలవరం నిర్మాణం కావాలంటే 2018 సంవత్సరానికి పూర్తవుతుందని దీనితో సీఎం చంద్రబాబు నాయుడు ముందు దృష్టితో నీరు - ప్రగతి కార్యక్రమం కింద పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి పంటలు కాపాడడం జరిగిందని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. 

భారత్ విజయం..

హరారే : టీ 20 మ్యాచ్ లో కీలక మూడో మ్యాచ్ లో జింబాబ్వే జట్టుపై భారత్ విజయం సాధించింది. మూడు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. దీనితో సిరీస్ ను 2-1 తేడాతో ఇండియా కైవసం చేసుకుంది. 

20:00 - June 22, 2016

ఢిల్లీ : కృష్ణా బోర్డు..సాగునీటి పంపకాల విషయంలో ఏపీ రాష్ట్రం వితండ వాదం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర మంత్రి ఉమా భారతి సూచన మేరకు సీడబ్ల్యూసీ కార్యదరిశ అమర్ జిత్ సింగ్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు..రాష్ట్రాల అనుమతి లేకుండా నదుల అనుసంధానం చేయకూడదని మంత్రి ఉమా భారతి స్పష్టం చేయడం జరిగిందన్నారు. సాగర్ కుడికాల్వ నిర్వాహణను ఏపీకి ఇవ్వాలంటున్నారని ఇది ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. కృష్ణా బోర్డు కేవలం నీటి పంపిణీ చేస్తుందని చట్టంలో ఉందని, కృష్ణా జలాలపై ఏపీ ఇప్పటికే వితండవాదం అవలింబిస్తోందని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు పరిధికి ఇవ్వాలని, నాగార్జున సాగర్ ను మాత్రమే బోర్డు పరిధికి ఇవ్వాలని వితండవాదం చేస్తోందన్నారు. గోదావరి లో తమకు 90 టీఎంసీల హక్కు ఉందని, తమకు మహారాష్ట్ర, కర్ణాటకతో సత్సంబంధాలున్నాయని, ఏపీతోనూ సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు రోజుల సమయాన్ని ఏపీ రాష్ట్రం వృథా చేసిందని విమర్శించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా కృష్ణా నది జలాలు వాడుకోవాలని సూచించారు. ఇరు రాష్ట్రాల మంత్రుల సమావేశం అసమగ్రంగా, అసంపూర్తిగా ముగిసిందన్నారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. మల్లన్న సాగర్ వ్యతిరేకిస్తే అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని, మల్లన్న సాగర్ టెండర్లు పిలవకుండానే అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత పారదర్శకంగా మిషన్ కాకతీయ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

19:31 - June 22, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా పుష్కరాలకు సిద్ధం అవుతోంది. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం చూపిస్తున్న హడావుడి పనుల్లో మాత్రం కనిపించడంలేదు. మరో 40 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానుండగా.. పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తుంటే ఏర్పాట్లు మాత్రం అస్తవ్యస్తంగా తయారైయ్యాయి. నవ్యాంధ్రలో తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలకు కోట్లల్లో భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా. భక్తుల తాకిడిని త‌ట్టుకోవాలంటే, అత్యవసరంగా దుర్గగుడి వ‌ద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి. కాని ఫ్లైఓవర్‌ పనులు మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అనట్టు సాగుతున్నాయి. అధ్వాన్నంగా మారిన స్నానపు ఘాట్లు...విసుగెత్తిస్తున్న రోడ్డు విస్తరణ పనులు... అధికారులు నిర్లక్ష్యాన్ని పట్టి చూపుతున్నాయి.

దుర్గగుడి ఫ్లై ఓవర్..
కుమ్మరిపాలెం నుంచి సీతమ్మవారి పాదాల వరకు ఆరు లైన్ల ఫ్లైఒవర్.. నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం గత ఏడాది నవంబర్లో పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 460 కోట్ల రూపాయలు అంచనాతో ప్రారంభమైన ఈ పనులు ఇంకా 30 శాతం కూడా పూర్తి కాలేదు. నదిలో పిల్లర్లను నిర్మించాల్సిన చోట డ్రెజ్జింగ్ పనులు కూడా నెలలకు నెలలు సాగుతూనే ఉంది. ఇదిలావుంటే పుష్కరాలనాటికి ఫ్లైఒవర్ నిర్మాణం తమ వల్ల కాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తుంటే.. అనుకన్న టైంకి పనులన్నీ పూర్తవుతాయని మంత్రులు చెబుతున్నారు. మరోవైపు.. రాజధాని నిర్మాణ పనుల్ని చేస్తున్న చైనా కంపెనీలు పుష్కర పనుల్లో కూడా భాగం పంచుకుంటున్నాయి. ముఖ్యంగా దుర్గగుడి నుంచి భవానీపురం వరకు 2.1 కిలోమీటర్ల పొడవున ప్రధాన ఘాట్‌ రోడ్డును నిర్మిస్తోంది చైనాకు చెందిన జీఐసీసీ. దీనికోసం ఇప్పటికే 77 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేశారు.  ఇక స్నానఘాట్ల విషయానికొస్తే.. కృష్ణా, గుంటూరు జిల్లాలో కలిపి 99 ఘాట్లను నిర్మిస్తున్నారు. వాటిలో 66 ఘాట్లు కృష్ణా జిల్లాలోనే సిద్ధం అవుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగరంలో మొత్తం 12 ఘాట్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. వాటిలో 2 పెద్ద ఘాట్లనిర్మాణాన్ని చైనా సంస్థ జీఐసీసీ అప్పగించింది ప్రభుత్వం. ఈ ఘాట్ల నిర్మాణాలు కూడా నత్తనడకనే సాగుతున్నాయి.   

ఏపీలో 15 మంది ఐపీఎస్ లు బదిలీలు..

విజయవాడ : ఏపీలో 15 మంది ఐపీఎస్ లు బదిలీలయ్యారు. జైళ్ల శాఖ డీజీగా వినయ్ రంజన్ రే..టెక్నికల్ ఐజీగా హరీష్ కుమార్ గుప్తా..విజిలెన్స్ డీఐజీగా కేవీపీ గోపాల్ రావు..ఏసీబీ జేడీగా నాగేంద్రకుమార్..గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ గా గోపినాథ్ జట్టి..ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా సెంథిల్ కుమార్..

'ప్రయోజనాలు దెబ్బతినకుండా కృష్ణా జలాలు వాడుకోవాలి'..

ఢిల్లీ : రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా కృష్ణా జలాలు వాడుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా నదుల అనుసంధానం చేయబోమని కేంద్ర మంత్రి ఉమా భారతి పేర్కొనడం జరిగిందన్నారు. 

ముగిసిన హరీష్..దేవినేని భేటీ..

ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి తో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమ జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. నీటి కేటాయింపుల అంశంపై మరోసారి కార్యదర్శి అమర్ జిత్ సింగ్ తో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతితో ఇరు రాష్ట్రాల మంత్రులు భేటీ అయ్యారు. 

18:59 - June 22, 2016

ఢిల్లీ : ప్రపంచ మహిళా డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ జోడీ మార్టీనా హింగిస్ - సానియా మీర్జా...సింగపూర్ వేదికగా అక్టోబర్ లో జరిగే డబ్ల్యూటీఏ ఫైనల్స్ కు అర్హత సంపాదించారు. గతేడాది జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో సానియా జోడీ చాంపియన్లుగా నిలవడంతో పాటు విజేతలకు ఇచ్చే 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీని సైతం సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సీజన్లో బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, సెయింట్ పీటర్స్ బర్గ్ ఓపెన్, రోమ్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ నెగ్గి..అత్యంత విజయవంతమైన డబుల్స్ జోడీగా నిలిచారు.

18:56 - June 22, 2016

నాటింగ్ హోమ్ : ఇంగ్లండ్- శ్రీలంకజట్ల ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ సంచలనంతో ప్రారంభమయ్యింది. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫైట్..హైస్కోరింగ్ సూపర్ టై గా ముగిసింది. ఆఖరిబంతికి సిక్సర్ బాదిన ఇంగ్లండ్ టెయిల్ ఎండర్ లైమ్ ప్లంకెట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో వన్డే.. బర్మింగ్ హామ్ వేదికగా ఈనెల 24న జరుగుతుంది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో..టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చండీమల్ 37, ప్రసన్న 59, మహారూఫ్ 31 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, విల్లేస ప్లంకెట్ తలొ రెండు వికెట్లు పడగొట్టారు.

24న రెండో వన్డే..
287 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్...ఒకదశలో 30 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత ప్రారంభించింది. ఓపెనర్లు రాయ్ 3, హేల్స్ 4, వన్ డౌన్ జో రూట్ 2, బెయిర్ స్టో 3 పరుగులకు వెనుదిరిగారు. అయితే మోర్గాన్ 43, జో బట్లర్ 93, ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ 95 నాటౌట్ స్కోర్లు సాధించడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా పుంజుకోగలిగింది. యాభయ్యవ ఓవర్ ఆఖరి బంతికి టెయిల్ ఎండర్ లైమ్ ప్లంకెట్ సిక్సర్ బాదడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులే చేయడంతో...మ్యాచ్ టైగా ముగిసింది. వన్డే క్రికెట్ చరిత్రలో..ఓ మ్యాచ్ హైస్కోరింగ్ టై గా ముగియడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. సిరీస్ లోని రెండో వన్డే.. బర్మింగ్ హామ్ వేదికగా ఈనెల 24న జరుగుతుంది.

18:52 - June 22, 2016

ఢిల్లీ : భారత క్రికెట్ సరికొత్త చీఫ్ కోచ్ ఎవరో శనివారం తేలనుంది. మాస్టర్ సచిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహామండలి..ఇప్పటికే 21 మంది అభ్యర్ధుల్లో ఏడుగురితో ఇంటర్వ్యూలు నిర్వహించి...ప్రెజెంటేషన్లు స్వీకరించింది. బోర్డు ఇంటర్వ్యూలకు ఆహ్వానం అందుకొన్నవారిలో అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, ప్రవీణ్ ఆమ్రే, టామ్ మూడీ, స్టువర్ట్ లా, యాండీ మోల్స్, లాల్ చంద్ రాజ్ పుట్ ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనగా..కుంబ్లే వ్యక్తిగతంగా హాజరై తన అభిప్రాయాలు, వ్యూహాలు, లక్ష్యాలతో కూడిన ప్రెజెంటేషన్ ను సమర్పించాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఇంటర్వ్యూ కార్యక్రమ వివరాలను...బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేకు అందచేసింది. కాబోయే కొత్త కోచ్ వివరాలను ఈనెల 25న బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.

18:49 - June 22, 2016

ఢిల్లీ : టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా 324 అంతర్జాతీయ మ్యాచ్ లకు నాయకత్వం వహించిన ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి టీ-20 మ్యాచ్...జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీకి 324వ మ్యాచ్ కావడం విశేషం. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ ల కెప్టెన్ గా ధోనీ అరుదైన రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.

18:45 - June 22, 2016

విశాఖపట్టణం : ఇంతకాలం ఏం చేసినా పట్టించుకునేవారు లేరనుకున్నారు..ఏం చేసినా చూసేవారు లేరనుకున్నారు..కాని వారి డేటా కలెక్ట్ చేస్తున్నారని మాత్రం ఊహించలేదు...రోజు రోజుకు జరుగుతున్న..మారుతున్న పరిణామాలు..బయటపడుతున్న అక్రమాస్తుల అధికారుల జాతకాలు... అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి...ఓవైపు ఏసీబీ కన్ను..మరోవైపు ఉన్నతాధికారులు...ఉక్కునగరం కాప్స్‌లో కలకలం మొదలయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి అటాక్ జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది మావోయిస్టులు కాదు.. ఉగ్రవాదుల భయం కాదు. డిపార్ట్‌మెంట్లో అక్రమార్కులపై కన్నేసిన ఏసీబీ. మరోవైపు ఉన్నతాధికారుల నిఘా..ఇంతకాలం అక్రమాలు చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్నవారు కొందరైతే...పవర్‌ను అడ్డం పెట్టుకుని ఆడుకున్నవారు మరికొందరు. ఇలా ఎందరో పోలీసు డిపార్ట్‌మెంట్‌ పరువును బజారున పడేస్తున్నారు. వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారంతో ఇక విశాఖ పోలీసుపై డేగకన్ను వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఏసీబీకి ఆదేశాలు ఇవ్వడంతో పాటు అక్రమాలను సహించని అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఉక్కునగరంలో పని చేస్తున్న అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలయింది.

అక్రమార్కుల జాబితా రెడీ..
విశాఖ నగరంతో పాటు జిల్లాలో పోలీసు విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు అక్రమార్కుల జాబితాను రెడీ చేసుకుంది. ఒక్కొక్కరి ఆస్తులను లెక్కలు పెడుతూ సరైన సమయంలో దాడులు చేస్తుంది. గత జనవరి నుంచి మొదలయిన రైడ్స్‌ ఆగడం లేదు... నెలకో ఆఫీసర్‌ జాతకం బయటపడుతుంది. లంచాల పేరుతో విసిగిస్తున్న పెందుర్తి హెడ్‌కానిస్టేబుల్‌ హెచ్.దొర నుంచి తనను తాను కాపాడుకునేందుకు స్క్రాప్‌ వ్యాపారి అయిన ఓ మహిళ ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో విశాఖ జిల్లా పూడిమడక మెరైన్ సిఐ హుస్సేన్ అడ్డంగా దొరికిపోయారు. కోట్ల ఆస్తులు కూడబెట్టి విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న సిఐపై ఆస్తులను బయటపెట్టింది. ఇక తాజాగా జరిగిన దాడుల్లో విశాఖ 4వ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ ఆస్తులపై సోదాలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించారు. బాలకృష్ణ నివాసంతో పాటు పోలీసు స్టేషన్..ఇతర ఇళ్లు..బంధువులున్న నివాసాల్లో ఏకకాలంలో దాడులు చేయగా అక్రమాస్తులను గుర్తించారు...పోలీస్ స్టేషన్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

జిల్లాలో కూడా కొనసాగుతున్న సస్పెన్షన్లు..
డిపార్ట్‌మెంట్లో కొందరివల్ల కోల్పోతున్న విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకునే పనిలో పడ్డ కొత్త కమిషనర్‌ యోగానంద్‌ ముందుగా ఆరోపణలున్న గాజువాక లా ఎండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో ఇన్‌స్పెక్టర్‌ మళ్ల అప్పారావు, ఎస్సై సురేష్ ను సస్పెండ్ చెస్తూ నిర్ణయం తీసుకున్నారు..ఇక విశాఖపట్నం జిల్లాలో కూడా డిపార్ట్‌మెంట్లోని అక్రమార్కులపై పోలీసు బాస్‌లు సీరియస్‌గానే ఉన్నారు. నర్సీపట్నం పరిధిలోని నాతవరంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హోంగార్డులు పట్టుకుని తీసుకువచ్చి అప్పగిస్తే నైట్‌ షిఫ్ట్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ కొండయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణలు కక్కుర్తి పడి స్మగ్లర్ వద్ద ఉన్న రెండులక్షలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం బయటపడ్డంతో వెంటనే అధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ఇలా అక్రమార్కులపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు డిపార్ట్‌మెంట్లో కలకలం రేపుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఇప్పటివరకు తప్పుడు పనులతో అడ్డంగా సంపాదించిన పోలీసుల్లో వణుకుపుడుతోంది.

18:40 - June 22, 2016

విజయనగరం : ఉత్తరాంధ్రలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు చేస్తూ బతికినవారంతా అన్నమో రామచంద్రా అంటూ వలసపోవాల్సి వస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పరిశ్రమలు భారీగా మూతపడుతున్నాయి. వీటిని తెరిపించాల్సిన ప్రభుత్వం కార్మికుల మీదనే నిర్బంధం ప్రయోగిస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్టరీలు కార్మికులతో ఇలా కళకళలాడేవి. ఉపాధి కోల్పోయిన కార్మికులు. ఇక నుంచి ఎలా బతకాలో అర్ధంకాక ఆక్రందిస్తున్న అభాగ్యులు. వీరి ఆవేదన ఇప్పుడు ఆందోళనగా మారింది. ఫ్యాక్టరీలు మూతపడి, ఉన్న ఉద్యోగాలు పోవడంతో వీళ్లంతా ఇప్పుడు పోరుబాట పట్టారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం ఇలా ఉత్తరాంధ్రలో ఎక్కడికెళ్లినా ఇప్పుడు కార్మికుల ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. పోరాట నినాదాలే ప్రతిధ్వనిస్తున్నాయి.

నమ్ముకున్నవారు బతికేదెట్టా?
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర అత్యంత వెనకబడిన ప్రాంతం. విశాఖపట్టణమే పెద్ద దిక్కు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామికాభివ్రుద్ధి చాలా తక్కువ. జ్యూట్ మిల్లులూ, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలే ఇంత కాలమూ ఉత్తరాంధ్రను ఆదుకుంటూ వచ్చాయి. ఇప్పుడివీ మూతపడుతున్నాయి. విజయనగరం జిల్లాలో పది జ్యూట్ మిల్లులు, 14 ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమలున్నాయి. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కొత్త వలస జ్యూట్ మిల్లులు మూతపడ్డాయి. ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద మాంగనీస్ ఫ్యాక్టరీ గరివిడి ఫెర్రో అల్లాయీస్ సంక్షోభంలో చిక్కుకుంది. గర్భం ఆంధ్రా ఫెర్రో కంపెనీ, కొత్తవలస మండలంలోని జిందాల్ కంపెనీతో పాటు 12 ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు మూతపడ్డాయి. ఇన్ని కంపెనీలు ఒక్కసారిగా మూతపడితే ఇక ఉపాధి దొరికేదెక్కడ? వీటినే నమ్ముకున్నవారు బతికేదెట్టా?

అచ్చెన్నాయుడితో ప్రయోజనం లేదు..
ఇన్ని ఫ్యాక్టరీలు మూతపడి, 20వేల మందికిపైగా ఉపాధి కోల్పోయి, వీధిన పడుతుంటే, వీటిని తెరిపించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా వున్న ఏమాత్రం ప్రయోజనం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఉత్తరాంధ్రలో ఇన్ని పరిశ్రమలు మూతపడడానికి కారణం ప్రభుత్వ విధానాలు. విద్యుత్ చార్జీలు మోయలేని భారంగా మారయంటున్నారు ఫెర్రో అల్లాయీస్ కంపెనీల యజమానులు. గత రెండేళ్లలో కరెంట్ చార్జీలు యూనిట్ కి రూపాయిన్నర చొప్పున పెరిగాయి. ఫెర్రో అల్లాయీస్ కంపెనీల ప్రధాన ఖర్చు విద్యుత్ బిల్లులే. ఒక టన్ను ఉత్పత్తి చేస్తే 8వేల రూపాయల నష్టం వస్తోందంటున్నాయి యాజమాన్యాలు. ఈ నష్టాలు భరించలేకే మూసివేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. గతంలో ఉత్తరాంధ్రలో ఫ్యాక్టరీలు లాకౌట్ ప్రకటించినప్పుడల్లా నిర్మాణరంగం ఆదుకునేది. ఇప్పుడు అది కూడా చతికిలపడింది. అక్కడా ఉపాధి దొరకడం లేదు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి వలసలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఒకవైపు పరిశ్రమలు మూతపడుతున్నాయి. మరోవైపు పరిశ్రమలు పెడతామంటూ భూములు తీసుకున్నవారు పత్తాలేకుండా పోతున్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో 40 శాతం పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదు. ఎస్ కోట దగ్గర 8 ఏళ్ల క్రితమే 1600 ఎకరాల భూమి తీసుకున్న జిందాల్ కంపెనీ అక్కడ ఇంత వరకూ పరిశ్రమ స్థాపించలేదు. 

18:32 - June 22, 2016

ప్రకాశం : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు రెండో విడత రుణమాఫీ పత్రాలను అందచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, పండ్లు తింటున్నారని..పాడి పరిశ్రమ..ఇతర పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాలు బాగు పడాలంటే ఒకే పంట కాకుండా వివిధ రకాలైన పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులు పంట మార్పిడి ద్వారా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. 

18:25 - June 22, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రి ఉమా భారతి సూచనల మేరకు తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు దేవినేని, హరీష్ రావులు భేటీ అయ్యారు. నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇరువురు మంత్రులు కూడా పలు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు విజ్ఞాన్ భవన్ లో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 5వ ప్రత్యేక సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమలు హాజరయ్యారు. తెలుగు రాష్ర్టాల నీటి సమస్యలపై ఇరు రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రులు చర్చించుకోవాలని కేంద్రమంత్రి ఉమాభారతి ఇరువురు మంత్రులకు సూచించారు. దీనితో వారు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అంతకంటే ముందు శాఖ ముఖ్య కార్యదర్శి అమర్ జిత్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయన ఎదుట రాష్ట్రాల అభిప్రాయాలు తెలియచేశారు. అనంతరం అమర్ జిత్ ఆధ్వర్యంలో ఇరువురు మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రాల మధ్యనున్న నీటి పంపకాలు..ఇతర వివాదాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎలాంటి కేటాయింపులు జరిగాయో అలాగే ఈ ఏడాది కూడా అలాగే నీటి కేటాయింపులు జరుపుకోవాలని కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న భేటీలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో వేచి చూడాలి. 

18:14 - June 22, 2016

విశాఖపట్టణం : హెటిరో డ్రగ్స్ ప్రమాదం జరిగి ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం హెటిరో డ్రగ్స్ లో రసాయన డ్రమ్ములు ఒక్కసారిగా పేలిపోయాయి. అక్కడనే ఉన్న అప్పారావు కార్మికుడు మృతి చెందగా మరొ ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతుండడంతో పలు కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి ఏ విషయాన్ని యాజమాన్యం బయటకు పొక్కనీయడం లేదు. ఎలాగో విషయం తెలుసుకున్న బాధిత బంధువులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. వాస్తవ పరిస్థితి తెలియచేయాలని, తమకు న్యాయం చేయాలని బాధిత బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

హెటిరో డ్రగ్స్ లో ప్రమాదం..

విశాఖపట్టణం : నక్కపల్లి హెటిరో డ్రగ్స్ లో కెమికల్ డ్రమ్ములు పేలాయి. ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

మంత్రి కేటీఆర్ తో బ్రిటీష్ హై కమిషనర్ భేటీ..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ తో బ్రిటీష్ హై కమిషనర్ డొమినిక్ పింట్ భేటీ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రంగంలో కలిసి పనిచేసేందుకు బ్రిటీష్ హైకమిషనర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఇండో - బ్రిటీష్ వర్క్ షాప్ కు రావాలని మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు. టీఎస్ ఐపాస్, ఐటీ, ఇండ్రస్ట్రీ పాలసీలను పింట్ అభినందించారు. 

రాజ్ భవన్ లో ఎల్లుండి ఇఫ్తార్ విందు..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో ఎల్లుండి సాయంత్రం 6.15గంటలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరు కావాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు పంపారు. ఉభయ రాష్ట్రాల నేతలు..అధికారులే కాక ఇతరులు ఈ విందుకు హజారు కానున్నారు. 

గవర్నర్ ను కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. సదావర్తి భూముల్లో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. 

తెలంగాణలో టీచింగ్..నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 4,616టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

17:46 - June 22, 2016

ఆదిలాబాద్‌ : జిల్లా సరిహద్దుల్లోని... ప్రశాంత వనంలో మళ్లీ కలవరం మొదలైంది. తుపాకుల మోతలతో ఈ ప్రాంతం దద్ధరిల్లుతోంది. ఓవైపు మావోయిస్టులు.. మరోవైపు పోలీసులు.. కరకు ఇనుప తొడుగుల పదఘట్టనలతో పల్లెల్ని వణికిస్తున్నారు. జనమైత్రి పేరిట పోలీసులు.. గిరిజనులతో మావోయిస్టు వ్యతిరేక ర్యాలీలు తీయిస్తున్నారు. ఇంకోవైపు మావోయిస్టులు షెల్టర్‌ కోసం పల్లెల్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా.. ఈ ప్రాంతం.. ఎన్‌కౌంటర్‌లతో నెత్తురోడుతోంది. పోలీసుల కన్నుగప్పి అడవుల నుంచి జనావాసాల్లోకి వస్తున్న మావోయిస్టులు. షెల్టర్‌ కోసం పల్లె ప్రజలను ఆశ్రయిస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్త పరిచేందుకు పోలీసులూ.. పల్లెలకు తరలి వస్తున్నారు. ఈ సందర్భంలో.. ఇరు వర్గాలూ తారసపడడం.. ఎదురు కాల్పులు జరగడం ఇటీవలి కాలంలో నిత్యత కృత్యమైంది. పోలీసులను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు జిల్లా ఎస్పీ దుగ్గల్‌ మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తరచూ పర్యటిస్తున్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తూనే... వారిపై నిఘాను పెంచారు. మావోయిస్టుల ఆచూకీ కోసం.. అడవుల్లోని రహస్య ప్రదేశాలపై అవగాహన ఉన్న సీనియర్‌ పోలీసు అధికారుల సేవలను ఉపయోగించుకుంటున్నారు. తద్వారా మావోయిస్టులు.. సరిహద్దులు దాటకుండా కట్టడి చేస్తున్నారు.

ముగ్గురు కీలక మావోయిస్టుల హతం..
నిఘాతోనే పరిమితం కాకుండా.. మావోయిస్టుల ఆచూకీ కోసం సమాచార, సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. మావోయిస్టులు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్న దృష్ట్యా.. వాటి సిగ్నల్స్‌పై నిఘా పెట్టారు. రహస్య కోడింగ్‌లను చేధించే నిపుణులతో పాటు ప్రత్యేక బైనాక్యలర్లు, అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వినియోగించుకుంటున్నారు. తద్వారా తరచూ మావోయిస్టుల ఆచూకీని గుర్తించగలుగుతున్నారు. కొంతకాలం క్రితం.. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని కాల్చివేసిన ఘటనలోను, ఇటీవల అంతర్రాష్ట్ర వంతెన కోసం తెచ్చిన వాహనాల ధ్వంసం ఘటనలోనూ మావోయిస్టు నేత శోభన్‌ అలియాస్‌ చార్లెస్‌కు కీలక పాత్ర ఉందని తెలుసుకున్న పోలీసులు అతణ్ణి పట్టుకునేందుకు ఇదే తరహాలో సాంకేతిక వ్యవస్థను ఉపయోగించారు. ఈ క్రమంలోనే గడ్చిరోలి జిల్లా అహెరి తాలుకా కాంపెల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగి ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు.

30 మంది కోసం జల్లెడ..
కాంపెల్లి ఘటనలో తప్పించుకున్న 30 మంది మావోయిస్టుల కోసం సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌ బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటు మహరాష్ట్ర, ఇటు ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాణహిత తీరం వెంబడి ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాంతో పాటు నెన్నల, భీమిని, కోటపల్లి, వేమనపల్లి, తిర్యాణి తదితర మండలాల్లో మాజీలపైనా నిఘా పెట్టారు. మరోవైపు.. కాంపెల్లి ఘటనలో దెబ్బతిన్న మావోయిస్టులు.. తమ పల్లెలపై ఎక్కడ విరుచుకు పడతారోనని పల్లెవాసులు భయపడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పోలీసుల భారీ బందోబస్తూ అటవీ పల్లెలను గజగజలాడిస్తున్నాయి. 

17:39 - June 22, 2016

నల్గొండ : అదో పేరున్న ఆసుపత్రి..కానీ అక్కడ ఎలాంటి వైద్యం అందుతుందో ఈ ఘటన చూస్తే తెలిసిపోతుంది. లక్షలకు లక్షలు వసూలు చేసి వైద్యం విషయంలో చేతులెత్తేస్తున్నారు. ఆలస్యంగా ఓ ఘటన వెలుగు చూసింది. ఇంజక్షన్ వికటించడంతో ఓ బాలిక శరీరం నిండా దద్దుర్లు వ్యాపించాయి. ప్రస్తుతం ఈమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
భువనగిరి మండలం యామిని పదో తరగతి చదువుతోంది. ఇటీవలే పరీక్షలు రాసిన అనంతరం ఫిట్స్ వచ్చాయి. దీనితో ఆమె తల్లిదండ్రులు నార్కట్ పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రికి ఈనెల 14న తీసుకొచ్చారు. వివిధ రకాల పరీక్షలు అంటూ రూ. 1.50 వేలు వసూలు చేశారు. అనంతరం ఫిట్స్ తగ్గాలంటే ఇంజక్షన్ ఇవ్వాలంటూ 18వ తేదీన ఇంజక్షన్ చేశారు. అనంతరం యామిని శరీరంలో మార్పులు వచ్చాయి. కాలిపోయిన శరీరం ఎలా ఉంటుందో అలా అయిపోయింది. దద్దుర్లు రావడంతో..పరిస్థితి విషమిస్తోందని కామినేని వైద్యులు గ్రహించారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పురమాయించారు. యామినిని తీసుకుని తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యామినిని పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. 

17:33 - June 22, 2016

ఢిల్లీ : తెలుగు రాష్ర్టాల నీటి సమస్యలపై ఇరు రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రులు చర్చించుకోవాలని సూచించినట్లు కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. విజ్ఞాన్‌ భవన్‌లో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 5వ ప్రత్యేక సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ, ఏపీ నుంచి ఇరిగేషన్‌ శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్‌ రావు, హరీష్‌రావులతో పాటు అన్ని రాష్ర్టాల ఇరిగేషన్‌ మంత్రులు హాజరయ్యారు. దేశంలో నదుల అనుసంధానం, నీటి వినియోగం, జల రక్షణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు పక్కపక్కన ఉండే రాష్ర్టాలు.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఉమా భారతి పేర్కొన్నారు. 

17:30 - June 22, 2016

కరీంనగర్ : ఆ స్కూల్‌లో బడిగంట మోగదు.. పాఠశాల సమయంకాగానే టీచర్‌ వచ్చేస్తాడు.. సాయంత్రంవరకూ అలా ఖాళీగా కూర్చుంటాడు.. ఆ తర్వాత వెళ్లిపోతాడు.. విద్యార్థులు, హడావుడి... పాఠాలు.. ప్రేయర్‌.. ఇలా ఏ సందడిలేకుండా ఆ పాఠశాల సైలెంట్‌గా నడచిపోతోంది.. ప్రభుత్వ స్కూళ్ల దీనస్థితిని చెబుతున్న ఆ ఊరెక్కడ?.. అనేది తెలుసుకోవాలంటే చదవండి.. కరీంనగర్‌ జిల్లా వేములవాడ మండలం నాగాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఇది.. గ్రామంలోని విద్యార్థులంతా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోవడంతో ఈ బడిలో ఖాళీ బల్లలే మిగిలాయి.. ఇలా స్కూల్‌లో టీచర్‌ ఒక్కరే మిగిలాడు. అయినా ఈ ఉపాధ్యాయుడు ఉదయాన్నే స్కూల్‌కు వస్తున్నాడు. సాయంత్రం వరకూ ఇక్కడే కూర్చొని వెళ్లిపోతున్నారు. బడిగంట... ప్రేయర్‌.. పాఠాలు... ఇలా ఏ సందడిలేకుండా ఈ బడిపంతులు రోజు గడచిపోతోంది. గత ఏడాది ఈ స్కూల్‌లో ఆరుగురు విద్యార్థులు ఉండేవారు. ఇందులో నలుగురు ఐదోతరగతి పూర్తి చేసుకొని వేరే స్కూల్‌కు వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దరు స్టూడెంట్స్ ఈ ఏడాది స్కూల్‌కు రాలేదు. అలా చివరకు విద్యార్థులులేని స్కూళ్ల లిస్టులో ఈ పాఠశాల చేరిపోయింది. ఎప్పుడూ చిన్నారుల ఆటపాటలతో సందడిగా ఉండే తరగతి గదులు ఇలా సైలెంట్‌గా మిగిలిపోయాయి.

క్రమంగా పడిపోతున్న విద్యార్థుల సంఖ్య..
కొన్నేళ్లుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పడిపోతోంది. ఈ పాఠశాలల పరిస్థితిని కాస్త ముందుగానే అంచనా వేసిన కొందరు టీచర్లు తమ స్కూళ్లను కాపాడేందుకు పట్టుదలగా ప్రయత్నించారు. తల్లిదండ్రుల్లో చైతన్యం పెంచి స్టూడెంట్స్‌ను స్కూల్‌కు రప్పించుకున్నారు. తమ పాఠశాలకు విద్యార్థులను పంపితే చక్కగా చదువు చెబుతామని ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఉపాధ్యాయులూ ఉన్నారు. కొన్ని గ్రామపంచాయితీల్లో ఏకంగా తీర్మానాలే చేసేలా టీచర్లు ప్రయత్నించారు. ఇక్కడ మాత్రం అలాంటి ప్రయాత్నాలేవీ జరిగినట్లుగా కనిపించడంలేదు. బడిబాటపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఈ స్కూల్ పరిస్థితిపై ఎంఈవో స్పందించారు. ఈ గ్రామంలో మరోసారి బడిబాట నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక ప్రజాప్రతినిధులుకూడా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ తల్లిదండ్రులు వినకపోతే రేషన్‌ ఇవ్వకుండా చేసేలా ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ బడులు మూతబడితే పేదలకు చాలా నష్టం. రూపాయి ఖర్చులేకుండా... పుస్తకాలు, యూనిఫాం... నైపుణ్యంఉన్న ఉపాధ్యాయులున్నా తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్‌ స్కూళ్లకు పంపుతున్నారన్న అంశంపై ఆలోచించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు కారణం తెలుసుకొని పరిష్కారం దిశగా టీచర్లు, అధికారులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అంతాకలిసి అడుగులువేస్తేనే సర్కారు బడి మనుగడ సాధ్యమవుతుంది.. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు. 

17:24 - June 22, 2016

ఢిల్లీ : బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి ఆర్బీఐ గవర్నర్‌ రాజన్‌పై వరుస దాడుల తర్వాత ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ను టార్గెట్‌ చేశారు. అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్ కు సూచించిన అరవింద్ సుబ్రమణ్యంను వెంటనే తొలగించాలని స్వామి తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కూడా అరవిందేనని ఆయన ఆరోపించారు. అరుణ్ జైట్లీకి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న అరవింద్‌ను కూడా పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అరవింద్‌ సుబ్రహ్మణ్యంను కాదు ఏకంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీనే స్వామి టార్గెట్‌ చేశారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. 

కామినేని ఆసుపత్రిలో వికటించిన ఇంజక్షన్..

నల్గొండ : కామినేని ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించడంతో బాలిక అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిట్స్ రావడంతో బాలికను తీసుకరావడంతో కామినేని వైద్యులు ఓ ఇంజక్షన్ ఇచ్చారు. కానీ శరీరంపై దుద్దుర్లు రావడం..పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

17:14 - June 22, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇంకెంత మంది బాధితులు చనిపోయేల చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును కావాలనే జాప్యం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. గత కొంతకాలంగా హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సంస్థకు సంబంధించిన ఆస్తులు వేలం వేయాలని, వచ్చిన డబ్బును బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు పేర్కొంది. కానీ ఈ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బుధవారం కోర్టులో జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్స్ జనరల్ వాదనలు వినిపించారు. వేలానికి సంబంధించిన ఖర్చు రూ. 25 లక్షలు సమర్పించాల్సి ఉండగా దీనిపై జాప్యం చేస్తుండడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మూడో వేలం సందర్భంగా రూ. 25 లక్షలు ముందుగా జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగానే ఉందని, ఇప్పటికే దర్యాప్తు జరుగుతుండడం..సీబీఐకి దర్యాప్తు అప్పగిస్తే బాధితులకు డబ్బుల పంపిణీ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వాదించారు. దీనిపై లిఖిత పూర్వకంగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 
ఇదిలా ఉంటే విచారణ జరుగుతుండగా బాధితులు కోర్టు బయటే వేచి ఉన్నారు. తమకు అనుకూలంగా..ఏదైనా తొందరగా తీర్పు వస్తుందని ఆశించారు. తాము ఇప్పటికే అనేక కష్టాలు అనుభవిస్తున్నామని, వంద మంది చనిపోయినా మేల్కోరా అంటూ బాధితులు ప్రశ్నించారు. 

అగ్రిగోల్డ్ వ్యవహారంపై కోర్టులో విచారణ..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంకెంత మంది చనిపోయేలా చేస్తారని, కావాలనే కేసును జాప్యం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మూడో వేలానికి సంబంధించి రూ. 25 లక్షలు ముందు డిపాజిట్ చేయాలని ఆదేశించి. తాము సీబీఐ దర్యాప్తుకు సుముఖంగానే ఉన్నామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై లేఖ రూపంలో సమర్పించాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. 

17:00 - June 22, 2016

ప్రకాశం : జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఒంగోలులో రెండో రుణమాఫీ పత్రాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై పలువురు రైతులు మాట్లాడారు. తనకు 1.50 వేల రుణమాఫీ జరిగిందని, సంతోషంగా ఉన్నానని ఓ రైతు పేర్కొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. రుణమాఫీ విషయంలో అందరూ తనను తిడుతున్నారని, తనపై కోపం లేదా అని రైతును ప్రశ్నించారు. దీనికి రైతు కోపం లేదని సమాధానం ఇచ్చారు. ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చే వారు కాదని..కానీ తాను అధికారంలోకి వచ్చాక ఇన్ ఫుట్ సబ్సిడీయే కాక రుణమాఫీ కూడా ఇచ్చానని బాబు చెప్పుకొచ్చారు. 97 శాతం న్యాయం చేయడం జరిగిందని, 1.50 వేల రుణమాఫీ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:30 - June 22, 2016

ఆదిలాబాద్ : ప్రజాకవి గూడ అంజయ్య భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. స్వగ్రాగమైన లింగాపూర్ కు ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాకు ప్రజా గాయకుడు గద్దర్ చేరుకుని గూడ అంజయ్య భౌతికదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో అనుబంధం పెనవేసుకున్నారు. అనంతరం అంజయ్య రాసిన పాటలను ఆలించారు. గూడ అంజయ్యను కలకాలం గుర్తించేలా దండేపల్లి మండలానికి అంజయ్య పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ను కోరనున్నట్లు గద్దర్ పేర్కొన్నారు. 

16:18 - June 22, 2016

ఉత్తర్ ప్రదేశ్ : కరెంటు రిపేర్ చేయడానికి పోల్ ఎక్కిన ఓ విద్యుత్ ఉద్యోగి సజీవ దహనమయ్యాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఝాన్సీలో విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రిపేర్ చేయడానికని 11 వేల ఓల్ట్ తో కూడుకున్న విద్యుత్ స్తంభం ఎక్కారు. కానీ ఒక్కసారిగా ఓ ఉద్యోగికి భారీగా షాక్ తగిలింది. వెంటనే మంటలు వ్యాపించడం..ఆ ఉద్యోగి పోల్ పైనే సజీవదహనమయ్యాడు. కిందనున్న మరో ఉద్యోగికి కూడా షాక్ తగిలి తీవ్రగాయాలపాలయ్యాడు. ఇదంతా ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. 

16:12 - June 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుదలకు టి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శాఖలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. సామాన్యులపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద యూనిట్లలోపు ఛార్జీల పెంపు నుండి మినహాయించారు. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు ఏడు శాతం లోపున ఉంటుందని తెలుస్తోంది. పల్లె వెలుగు బస్సులో ప్రతి 30 కిలో మీటర్లకు రూపాయి ఛార్జీ, 30 కిలోమీటర్లపైన రూ. 2 పెంచాలని, మిగతా బస్సుల్లో పది శాతం మించకుండా ఛార్జీలను పెంచాలని యోచించింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు.

ఆ మూడు సంస్థలను బలోపేతం చేస్తాం - సీఎం కేసీఆర్..
ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నష్టాల నుండి గట్టెక్కించేందుకు ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని సూచించారు. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి సంస్థలను కాపాడటం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ప్రభుత్వ రంగం సంస్థలు బాగుపడితే అంతిమంగా ప్రజలకే మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయన్నారు. నష్టాల నుండి గట్టెక్కించేందుకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

16:04 - June 22, 2016

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ శాఖలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ద్వారా ఎంపికైన 392 మందికి మంత్రి జూపల్లి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ..వీరందరికీ మూడు నెలల శిక్షణనివ్వడం జరుగుతుందని, పంచాయతీ రాజ్ లోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా రోడ్లు నిర్మాణం చేపుడుతామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ నిధులను పూర్తిగా ఖర్చు పెట్టేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
పంచాయితీ రాజ్ డిపార్ట్ మెంట్ లో 1065 పోస్టులుంటే అందులో 392 ఖాళీలున్నాయన్నారు. పూర్తిగా పారదర్శకంగా జరిపామని, పోస్టింగ్ విషయంలో ఎవరి ప్రమేయం లేకుండా, పైరవీలు లేకుండా వారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. 

ఇంజినీరింగ్ అఫిలియేషన్ ప్రకటించలేదు - పాపిరెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించి అఫిలియేషన్ ఇంతవరకు ప్రకటించలేదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయ్యేలోపు జేఎన్టీయూ అనుబంధ కాలేజీల జాబితా ప్రకటిస్తే అఫిలియేషన్ కుముందే ఇంజినీరింగ్ సీట్లు అమ్మినా..కొన్నా తప్పేనని తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీలు అఫిలియేషన్ వచ్చిన తరువాత బీ కేటగిరి ఇంజినీరింగ్ సీట్ల విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

పెట్రల్ బంక్ లోకి నీళ్లు..

కృష్ణా : నందిగామ బైపాస్ రోడ్డులోని పెట్రోల్ బంక్ లోకి నీళ్లు వచ్చి చేరాయి. పైపు లైన్ లీక్ కావడంతో బంక్ లోకి నీరు వచ్చి చేరింది. తమకు సంబంధం లేదని యాజమాన్యం పేర్కొంటుండడం...అధికారులు పట్టించుకోకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. 

జేఎంబీ చర్చిలో సీఎం బాబు..

ప్రకాశం : ఒంగోలు జేఎంబీ చర్చి 150 ఏళ్ల వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద తాగునీటి పైలాన్ ను బాబు ఆవిష్కరించనున్నారు. రైతులకు రెండో విడత రుణమాపీ పత్రాలను అందచేయనున్నారు. 

ఆ మూడు సంస్థలను బలోపేతం చేస్తాం - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ఆర్టీసీ, విద్యుత్, సింగరేణిలను బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నష్టాల నుండి గట్టెక్కించేందుకు ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని సూచించారు. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి సంస్థలను కాపాడటం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ప్రభుత్వ రంగం సంస్థలు బాగుపడితే అంతిమంగా ప్రజలకే మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయన్నారు. నష్టాల నుండి గట్టెక్కించేందుకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుదలకు టి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. సామాన్యులపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద యూనిట్లలోపు ఛార్జీల పెంపు నుండి మినహాయించారు. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు ఏడు శాతం లోపున ఉంటుందని తెలుస్తోంది. పల్లె వెలుగు బస్సులో చార్జీ రూపాయి, మిగతా బస్సుల్లో పది శాతం మించకుండా ఛార్జీలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

15:29 - June 22, 2016

గుర్తు పట్టలేదని..నమస్తే పెట్టలేదని..ఆటోవాలను ఓ ఎస్ ఐ చితకబాదాడు. కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన మరో సబ్ ఇన్స్ పెక్టర్..

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఎస్కేపల్లి మెరైన్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా రవికుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ఓవరాక్షన్ చేశాడు. తాను ఏం చేసిన చెల్లుతుందని అనుకున్నాడో...లేక వంటిపై ఖాకీ డ్రెస్ ఉందని అనుకున్నాడో..ఏకంగా కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి నానాయాగీ చేశాడు. ఇతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. దీనితో సదరు ఎస్ఐ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉన్నతాధికారి వద్ద స్థాయి ఉన్న పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు ఇదేనా ?

ఇక మరో ఘటనలో..ఖమ్మం జిల్లా అశ్వాపురంలో సబ్ ఇన్స్ పెక్టర్ గా పరుశురాం విధులు నిర్వర్తిస్తుంటాడు. ఇతను సివిల్ డ్రైస్ లో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ వెళ్లాడు. అంతే డ్రైవర్ ను పట్టుకుని చితగొట్టాడు. ఎందుకంటే గుర్తుపట్టి తనకు దండం పెట్టలేదనే కారణంతో కొట్టాడు. ఎస్ఐ దాష్టికానికి ఆటో డ్రైవర్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

15:25 - June 22, 2016

కరీంనగర్ : డబ్బు..దీనిని సంపాదించడానికి అనేక మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఆలయ హుండీలో వచ్చిన బంగారాన్ని చూస్తే ఏమనిపించందో కానీ అతనికి తస్కరించాలనే ఐడియా వచ్చేసింది. ఇంకేముంది నోటిలో వేసేసుకున్నాడు. ఇతని బండారం బయటపడింది. జిల్లాలోనే కాక ఎంతో ప్రాముఖ్యత గల వేములవాడ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి తమ కోర్కెలు తీర్చాలంటూ మొక్కులు చెల్లించుకుంటుంటారు. బంగారం..నగదు.ఇలా ఎన్నో కానుకలను హుండీలో వేస్తుంటారు. ఈ హుండీ డబ్బును నిర్ణయించిన తేదీల్లో ఆలయ సిబ్బంది లెక్కిస్తుంటారు. అలాగే బుధవారం హుండీ డబ్బులను లెక్కిస్తున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాగరాజు అనే కాంట్రాక్టు ఉద్యోగి కూడా లెక్కింపు చేస్తున్నాడు. ఇతను నోట్లో ఏదో వేసుకోవడం అక్కడున్న భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే అతడిని సోదా చేశారు. బట్టల్లో పెట్టుకుంటే బయటపడుతుందనే ఉద్ధేశ్యంతో నోట్లో వేసుకున్న మూడు గ్రాముల బంగారం బయటపడింది. అనంతరం ఆలయ ఈవోకు భద్రతా సిబ్బంది సమాచారం అందించారు. ఈవో ఫిర్యాదు మేరకు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్ని రోజుల నుండి విధుల్లోకి వస్తున్నాడు ? విధుల సమయంలో ఇంకా ఎలాంటి చోరీలకు పాల్పడ్డాడో దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వేములవాడ ఆలయంలో ఉద్యోగి చేతివాటం..

కరీంనగర్ : వేముల వాడ ఆలయంలో కాంట్రాక్టు ఉద్యోగి నాగరాజు చేతివాటం ప్రదర్శించాడు. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తస్కరించాడు. గమనించిన ఆలయ ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అతడిని సోదాలు జరపగా నోటిలో దాచి పెట్టిన బంగారం బయటపడింది. 

15:14 - June 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం ప్రగతి రథ చక్రాలు ఆగిపోనున్నాయా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని..అందుకు నిరసనగా ఒక రోజు సమ్మెలోకి వెళ్లాలని జేఏసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేఏసీ ఛైర్మన్ కోదండరాం నేతృత్వంలో జేఏసీ నేతలు ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణతో భేటీ కానున్నారు. గురువారం ఒక రోజు సమ్మె నిరసన చేపట్టనున్నామని తెలియచేయనున్నారు. ఉదయం 6గంటల నుండి రాత్రి వరకు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ముందే విషయం గ్రహించిన ప్రభుత్వం తెలంగాణ మజ్దూర్ సంఘ్ యూనియన్ నేతలతో చర్చలు చేపట్టింది. దీనిపై జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక యూనియన్ తో చర్చలు చేపట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. సమ్మెలోకి వెళ్లాలని ఏడు కార్మిక సంఘాలు ఒకే నిర్ణయంపై ఉన్నాయి. దీనికంటే ముందు ఎస్వీకేలో మేథోమథన సదస్సు జరిగింది. కార్మికులు సమ్మెలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కూలంకషంగా చర్చించారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని  గత నెలలో సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సమ్మె చేపట్టలేదు. ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడంతో సమ్మెలో భాగంగా నిరసన తెలియచేయాలని జేఏసీ నిర్ణయించింది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

15:01 - June 22, 2016

శారీరకంగా హింసిస్తున్నారు..మానసికంగా వేధిస్తున్నారు..అదనపు కట్నం కోసం అరాచకం..

కర్నూలు జిల్లాకు ఎమ్మెల్యేగా మురళీ కృష్ణ ప్రజలకు సేవలందించారు. ఇతనిపై ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈయన ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. కాని నట్టింట్లో మాత్రం గెలవలేకపోయారు. కట్టుకున్న ఇళ్లాలిపై వేధింపులకు గురి చేయడంతో పాటు కుటుంబీకులతో కలిసి హింసిస్తున్నారంటూ కేసు నమోదైంది. మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సతీమణి పోలీసులను ఆశ్రయించింది. దీనితో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టులపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష..

హైదరాబాద్ : గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష సమావేశం నిర్వహించింది. హౌసింగ్ బోర్డుతో కలిసి చేపట్టిన ప్రాజెక్టుల గడువు పెంచాలని ప్రైవేటు సంస్థలు కోరుతున్నాయని, మరోమారు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహాల బకాయిల అంశాన్ని పరిశీలిస్తున్నామని, 6,488 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు తెలిపారు. 

మల్లన్న సాగర్ నిర్వాసితులకు టి.కాంగ్రెస్ అండ – వీహెచ్..

మెదక్ : మల్లన్న సాగర్ నిర్వాసితులకు టి.కాంగ్రెస్ అండగా ఉంటూ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

14:39 - June 22, 2016

పసిపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువైతున్నాయి. ఇటీవలే ఓ పసిబాలికపై స్కూల్ బస్ హెల్పర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తల్లిదండ్రులు విపరీతంగా భయపడిపోతున్నారని, పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుతారా ? అనే గాభరాలో పడిపోతున్నారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. పసిపిల్లలపై లైంగిక వేధింపులు అనే అంశంపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. పలు స్కూళ్లలో ఉపాధ్యాయులే వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి చట్టాలున్నాయి..లాయర్ పార్వతి ఎలాంటి సూచనలు..సలహాలు అందించారో వీడియోలో చూడండి. 

14:27 - June 22, 2016

వరంగల్ : ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పెద్ద ఎత్తున తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రభుత్వం వద్దన్నా.. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో దుక్కి దున్నిన అన్నదాతలు.. పత్తి విత్తనాలను నాటారు. వర్షాలు పడకపోవడంతో.. రైతులు బిందెలతో నీళ్లు పోసి మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 70 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను నాటారు. జిల్లాలో నర్మెట్ట, మద్దూరు, జాఫర్‌గడ్‌, సంగెం, గీసుకొండతో పాటు... వర్ధన్నపేట, ములుగు తదితర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పత్తి విత్తనాలను నాటారు. 13 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.. ఇప్పటివరకు 9 లక్షల విత్తనాల ప్యాకెట్లను రైతులకు అందజేసింది. మొలకెత్తే దశలో ఉన్న సమయంలో వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోవడంతో.. రైతులు బిందెలతో నీళ్లు పోసి మొక్కలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మృగశిక కార్తె అయిపోతున్నా.. వానలు పడకపోవడంతో... ఖరీఫ్‌ ఆదిలోనే రైతులు నష్టపోవాల్సి వస్తోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చినుకు తడి లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విత్తిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. వర్షాలు కురవకపోవడంతో.. ఇంకా పలు ప్రాంతాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పు తెచ్చి పత్తి వేస్తే.. అవి మొలకెత్తే పరిస్థితి లేదని, తమను ఆదుకోవాలని నష్టపోయిన రైతులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

14:22 - June 22, 2016

ఢిల్లీ : స్వార్థ ప్రయోజనాలకోసమే కొందరు నేతలు తమ పార్టీని వీడుతున్నారని కాంగ్రెస్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని మల్లు రవి కలిశారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ...తెలంగాణ ఏర్పాటై రెండేళ్లు దాటుతున్నా టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభాల కోసం పార్టీని వదులుతున్నారని సోనియాకు వివరించడం జరిగిందన్నారు. ఎన్ని సంవత్సరాలైనా తెలంగాణ ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా ఉందని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

టి.కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : సచివాలయంలో హౌసింగ్ సొసైటీ ఇళ్ల నిర్మాణంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

 

పోరాటం ఆగదు - కాపు జేఏసీ..

తూర్పుగోదావరి : బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని, ముద్రగడ సారథ్యంలో తమ పోరాటం కొనసాగిస్తామని కాపు జేఏసీ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. 

జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం - ముద్రగడ..

తూర్పుగోదావరి : కిర్లంపూడిలో ముద్రగడ దంపతులు దీక్ష విరమించారు. ఇచ్చిన వాగ్ధానం పక్కనపెట్టి అరెస్టులు చేపట్టారని, దీక్ష ప్రారంభించిన మూడు గంటలకే తమ ఇంటి తలుపులు బద్దలుకొట్టి తీసుకెళాలరని ముద్రగడ తెలిపారు. తన భార్య, కోడల్ని అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపించారు. తన కుమారుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారని, ఏ రాజకీయ నేతకూ ఇలాంటి అవమానం జరగలేదని తెలిపారు. ఇచ్చిన హామీ అమలు చేయమంటే వారికి కోపం వస్తోందన్నారు. మమ్మల్ని అవమానించి వారికి భగవంతుడు శిక్ష విధిస్తాడని, ఆ చల్లని కబురు వచ్చే వరకు తమ ఇంట్లో ఏ పండుగ చేసుకోమన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రెండు లక్షల కోట్ల అవినీతి - మల్లు..

కరీంనగర్ : సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు రాబోయే రోజుల్లో కుంభకోణాలుగా మారనున్నాయని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, భగీరథలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను స్వప్రయోజనాలు, పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారని, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. 

13:38 - June 22, 2016

శ్రీకాకుళం : జిల్లాల అణు కుంపటి రాజుకుంటోంది. తాజాగా ప్రభుత్వం సామాజిక సర్వేకి రెడీ అవడంతో ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా కొత్తగా ఎక్స్ క్లూజివ్ జోన్‌లో గ్రామాల పెంపు, కిలోమీటరు వరకు జనావాసాల నిషేధం లాంటి నిబంధనలు కొవ్వాడ బాధితుల్లో గుబులు రేపుతున్నాయి. తమ బతుకుల్లో చిచ్చుపెడుతున్న ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు బాధితులు సన్నద్దమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడ మత్స్యలేసం గ్రామమిది. గడచిన దశాబ్దన్నర కాలంగా ఈ ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టేందుకు ప్రభుత్వాలు ప్లాన్ వేసాయి. మొదట టిడిప, ఆ తర్వాత కాంగ్రెస్‌, ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం..ఇలా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొవ్వాడ విషయంలో ముందుకు సాగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన నేతలే..అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకూలంగా మారుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకపక్షంగా నిర్ణయాలు ...
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సారి కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టుపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొవ్వాడలో వేగంగా అణుపార్క్ నిర్మించేందుకు దొంగ దెబ్బ తీస్తుందనే వాదన ప్రజాసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంట్లో భాగంగా తాజాగా ఎక్స్ క్లూజివ్ జోన్లో లేని జీరుకొవ్వాడ, తోటపాలెం ప్రాంతాలను కలిపినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో కిలోమీటరు వరకు జనావాసాల నిషేదాన్ని పెంచడమే కాకుండా సామాజిక సర్వే పేరిట భూముల రికార్డులు సవరిస్తామని చెప్తూ..తమను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఎక్స్ క్లూజివ్ జోన్‌తో పాటు స్టెరిలైజ్ద్ జోన్, ఎమర్జన్సీ ప్లానింగ్ జోన్, ఇంపాక్ట్ ఎస్ఎస్మెంట్ జోన్లుగా విభజించి అణువిద్యుత్ కేంద్రం పరిధిలోకి మరిన్ని గ్రామాలను చేర్చాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

గ్రామాల్లోకి వస్తే చూస్తూ ఊరుకోమంటున్న మత్స్యకారులు...
దీంతో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్స్ క్లూజీవ్ జోన్ పరిధిలోకి రామచంద్రాపురం, కొవ్వాడ మత్స్యలేసం, టెక్కలి, గూడెం ప్రాంతాలుండగా తాజాగా కోటపాలెం, జీరు కొవ్వాడ గ్రామాలను చేర్చుతారనే సమాచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల పంచాయతీలకు సర్వే విషయమై నోటీసులు సైతం తిరస్కరణకు గురయ్యాయి. నోటీసులో పేర్కొన్న అంశాలు అస్పష్టంగా ఉండడంతో పాటు ప్రభుత్వ దురుద్దేశాన్ని పసిగట్టిన సర్పంచులు ఎదురు తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత గ్రామస్తులతా ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రెడీ అవుతున్నారు . భూరికార్డుల పరిశీలన తప్ప..సర్వే కోసం గ్రామాల్లోకి వస్తే చూస్తూ ఊరుకోమని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు ...
విన్నారుగా..బాధితుల పక్షాన ఉంటానన్న టీడీపీ..అధికారంలోకి వచ్చాక ఎలా వ్యవహరిస్తుందో. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. భూ అధికరణ చట్టం కింద కొవ్వాడ ప్రాంతంలో సామాజిక ప్రభావ అంచనా గురించి సర్వే చేయడానికి జారీ చేసిన నోటీసును తక్షణం విరమించుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఇటీవలే ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్‌లోని మితివిర్థి నుంచి వెస్టింగ్‌హౌస్‌ కంపెనీ తయారు చేసే ఏపీ 1000 రియాక్టర్‌ను కొవ్వాడలో నిర్మించాలని నిర్ణయించారని సీపీఎం నేత నర్సింగరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ దీనిపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడం విచారకరమని ఎక్కడా పరీక్షించని రియాక్టర్లను అమెరికా ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన రుద్దుతుందన్నారు.

ఎక్స్‌క్లూజీవ్‌ జోన్‌ పరిధి ...
ఇక ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌ పరిధి..ప్రధాన రియాక్టర్‌ నుంచి ఒక కిలోమీటర్‌ వరకు ఉంటుందని,..ఆ ప్రాంతంలో జనావాసాలు ఉండకుండా చూడాలన్నది తొలి నిర్ణయం. తాజా చర్చల్లో ఒక కిలోమీటర్‌ అన్నది కనీసంగా నిర్ణయించి .. అవసరమైతే పెంచుకునేలా ప్రతిపాదించారు. విషవాయువుల ప్రభావం ఉండే స్టెరిలైజ్‌డ్‌ జోన్‌ను ఇకపై ముందస్తు జాగ్రత్తల జోన్‌ గా ఉంటుంది. ఎమర్జెన్సీ ప్లానింగ్‌ జోన్‌.. ప్రధాన రియాక్టర్‌ నుంచి 16 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో అత్యవసర సేవల కోసం సమాచార, రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ అత్యవసర రక్షణ ప్రణాళిక జోన్‌గా పేర్కొనాలని ప్రతిపాదించారు. ఈ జోన్‌లో జనాభా పెరుగుదల నియంత్రణలో ఉరడేలా చూడాలని ప్రతిపాదించారు.ఈ ప్రాంతంలో విద్య, వైద్య సంస్థలేవీ ఉండరాదని ముందుగా నిర్ణయించినప్పటికీ, తాజా ప్రతిపాదనల్లో మాత్రం ఇక్కడ ఉన్న వారి రక్షణ కోసం వాటిని అనుమతించాలని ప్రతిపాదించారు.    

13:37 - June 22, 2016

గుంటూరు : అసలే భూములపై వ్యామోహం... ఆ పై విలువైన గ్రానైట్‌ నిలువలు. ఇంకేముంది చేతిలో ఉన్న అధికారాన్ని చెలాయించే పనిలో పడ్డారు కొందరు రాజకీయ నేతలు. బలహీన వర్గాలకు చెందిన భూములని కూడా చూడకుండా.. వాటిని కాజేసే పన్నాగం పన్నారు. తరతరాలుగా సాగులో ఉన్న వందల ఎకరాల భూములను కబ్జా చేశారు. గుంటూరు జిల్లాలో పదవిని అడ్డం పెట్టుకుని దళితుల భూములను మింగేసిన.. బడా నేతల వ్యవహారంపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది...ఈ కథనంపై దళితుల భూముల కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్‌ స్పందించింది. కబ్జా భూముల ఆక్రమణకు సంబంధించిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే దళితుల తరపున సత్యాగ్రహానికి దిగుతానని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితులు, బలహీన వర్గాల వారికోసం కేటాయించిన భూములను వారికే చెందేలా చూడాలని, రాజకీయ నాయకులు ఇప్పటికైనా దళితుల భూముల విషయంలో నిర్ణయం మార్చకుని వారి భూములను తిరిగి ఇచ్చి వేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. యడవల్లిలో దళితులకు ఇచ్చిన భూమిని ఎవరైనా తీసుకోవటానికి యత్నిస్తే తాము ఉద్యమం చేపడతామని సీపీఎం నేత రామారావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారాన్ని తెలుసుకోండి...

13:20 - June 22, 2016

తూ.గోదావరి : కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ఉద్యమాన్ని కొనసాగిస్తానని ముద్రగడ తెలిపారు. ఎట్టకేలకూ కాపునేత ముద్రగడ తన దీక్షకు తెరపడింది. తుని ఘటనలో నిందుతులకు విడుదల చేయాలనే డిమాండ్ తో కాపునేత ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నిందుతులకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన నివాసంలో దీక్షను విరమించారు. ఈ క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాపునేతలు కూడా భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపులకు రిజర్వేషన్ సాధించే వరకూ తన ఉద్యమాన్నికొనసాగిస్తానని ఆయన తెలిపారు. కాగా తన అరెస్ట నేపథ్యం జరిగిన ఘనటలకు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటి వరకూ ఏ రాజకీయవేత్తకూ జరగని అవమానం నాకూ...నా కుటుంబానికి జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపునేత ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నిందితులకు బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఆయన ఈరోజు దీక్షను వివరించారు. రాజమండ్రి ఆసుపత్రి నుండి తన నివాసానికి చేరుకున్న అనంతరం ఆయన దీక్షను విరమించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు...ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా దీక్ష చేపట్టిన నన్ను..నా కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. దీక్ష ప్రారంభించిన కొంత సేపటికే మా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. నా భార్యనూ ..కోడల్ని అసభ్య పదజాలంతో దూషించారనీ..తన కుమారుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

13:12 - June 22, 2016

హైదరాబాద్ : పంచాయితీరాజ్‌ శాఖలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికైన 392మందికి మంత్రి జూపల్లి నియామకపత్రాలు అందజేశారు.. ఈ అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇస్తామని తెలిపారు.. పంచాయితీ రాజ్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉపాదిహామీ పథకంద్వారా రోడ్లు నిర్మిస్తామని ప్రకటించారు.. గ్రామపంచాయితీ నిధులను పూర్తిగా ఖర్చుపెట్టేలా చర్యలు చేపట్టామని వివరించారు.

12:56 - June 22, 2016

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ  దీక్షను విరమించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులను విడుదల చేయాలని ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్ష చేపట్టిన ఆయన్ని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన వైద్యానికి నిరాకరించి ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో తుని ఘటన నిందుతులకు బెయిల్ మంజూరవటంతో ముద్రగడ తన దీక్షను విరమించారు. ఈరోజు ఉదయం రాజమండ్రి ఆసుపత్రి నుండి తన స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న అనంతరం ముద్రగడ దంపతులు దీక్షను విరమించారు.

12:46 - June 22, 2016

బీహార్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి..బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల ధాటికి బీహార్‌లో 46 మంది మృతి చెందగా, 8మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 13మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. పిడుగుపాటు మరణాలను బీహార్‌ విపత్తు నిర్వహణ సంస్థ ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు బీహార్‌ ప్రభుత్వం 4లక్షల రూపాయల ఎక్స్‌గ్రేసియా ప్రకటించింది. 

ఏ రాజకీయవేత్తకూ జరగని అవమానం నాకు జరిగింది : ముద్రగడ

తూ.గోదావరి : ఇప్పటి వరకూ ఏ రాజకీయవేత్తకూ జరగని అవమానం నాకూ...నా కుటుంబానికి జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపునేత ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నిందితులకు బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఆయన ఈరోజు దీక్షను వివరించారు. రాజమండ్రి ఆసుపత్రి నుండి తన నివాసానికి చేరుకున్న అనంతరం ఆయన దీక్షను విరమించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు...ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా దీక్ష చేపట్టిన నన్ను..నా కుటుంబాన్ని అరెస్ట్ చేశారు.

దీక్ష విరమించిన ముద్రగడ దంపతులు ...

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ దంపతులు దీక్షను విరమించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులను విడుదల చేయాలని ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్ష చేపట్టిన ఆయన్ని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన వైద్యానికి నిరాకరించి దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో తుని ఘటన నిందుతులకు బెయిల్ మంజూరవటంతో ముద్రగడ తన దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం రాజమండ్రి ఆసుపత్రి నుండి తన స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్నారు. నివాసానికి చేరుకున్న అనంతరం ముద్రగడ దంపతులు దీక్షను విరమించారు.

విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ యత్నం..

హైదరాబాద్ : విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడికి టీఎన్ ఎస్ఎఫ్ యత్నించింది. దీంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అనంతరం గాంధీనగర్ పీఎస్ కు తరలించారు.

బీహార్, ఉత్తరప్రదేశ్ లలో పిడుగుల బీభత్సం ...

హైదరాబాద్ : బీహార్, ఉత్తరప్రదేశ్ లలో పిడుగులు పడి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ లో 13 మంది మృతి చెందగా..బీహార్ లో 46 మంది మృతి చెందారు. కాగా మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. 

రంగారెడ్డి కోర్టు వద్ద లాయర్ల అరెస్ట్ ...

హైదరాబాద్ : రంగారెడ్డి కోర్టు వద్ద పదిమంది న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆదిభట్ల పీఎస్ కు తరలించారు. సీమాంధ్ర న్యాయమూర్తుల ఆప్షన్ విధానం రద్దు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు.

రిజర్వేషన్ సాధించేవరకూ ఉద్యమం కొనసాగిస్తాం : కాపు జేఏసీ

తూ.గోదావరి : కాపులకు బీసీ రిజర్వేషన్ వర్తించేవరకూ తమ పోరాటం కొనసగుతుందని కాపు జేఏసీ ప్రకటించింది. ఈ పోరాటం ముద్రగడ పద్మనాభం సారధ్యంలో కొనాగుతుందని జేఏసీ పేర్కొంది. ప్రభుత్వం కాపులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.

11:18 - June 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. 1 ర్యాంక్‌ నుంచి 6 వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 21 కేంద్రాల్లో కౌన్సిలింగ్ జరగనుంది. జూలై 1 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్ లైన్ కేంద్రాలలో కౌన్సిలింగ్ జరుగనుంది. కాగా గత ఏడాది కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగం గత ఏడాది కళాశాలల్లో ఎక్కువగా మిగిలిపోయాయనీ...దీని వలన విద్యార్థులు కోరుకున్న కళాశాలల్లో కోరుకున్న సీట్లు రాలేదనీ..ఈ ఏడాది కౌన్సిలింగ్ ని సక్రమంగా జరిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

11:01 - June 22, 2016

ఢిల్లీ : కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెండో రోజు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు అయింది. మంగళవారం తొమ్మిది గంటలపాటు చర్చించినా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రెండవరోజు కూడా సమావేశమయిన నేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. మంగళవారం తొమ్మిది గంటలపాటు చర్చించినా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రెండవరోజు కూడా సమావేశమయిన నేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. కాగా మంగళవారం సమావేశమయిన నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరని విజయం తెలిసిందే. కాగా నదీ జలాల పంపిణీ పర్యవేక్షణ కోసం ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. లేదంటే తమ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పాటించడం లేదని... డెల్టాకు తాగు నీటి అవసరాల కోసం బోర్డు సూచించిన ఆరు టీఎంసీల నీటికి గాను నాలుగున్నర టీఎంసీలను మాత్రమే విడుదల చేసిందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతర తెలిపింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ఎక్కువ నీరు వాడుకుందని చెప్పింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే దాకా నీటి కేటాయింపులు జరపకూడదని స్పష్టం చేసింది. 

10:45 - June 22, 2016

నెల్లూరు : శ్రీహరికోట మరో అద్భుతానికి వేదికగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టాన 'షార్' ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. విదేశీ పరిజ్ఞానానికి భారత్ ఏమాత్రం తీసిపోదని మరోసారి నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రయోగానికి శ్రీహరికోటలోని ' షార్ ' సాక్ష్యంగా ఇస్రో మరో రికార్డు సృష్టించింది.. అంతరిక్ష చరిత్రలో భారత్‌ పేరు రెపరెపలాడేలా చేసింది.. ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది.. సరిగ్గా 9గంటల 26 నిమిషాలకు శ్రీహరికోటనుంచి సీఎస్ఎల్వీ-సీ 34 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.. ప్రయోగించిన నాలుగు నిమిషాల్లో మొదటి దశపూర్తిచేసుకుంది... 9గంటల 32 నిమిషాలకు రెండో దశ దాటింది.... 9గంటల 35 నిమిషాలకు మూడో దశ విజయవంతమైంది.. 9గంటల 44 నిమిషాలకు నాలుగోదశను పూర్తిచేసింది.. 9గంటల 46నిమిషాలకు ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్‌ ప్రకటించారు.. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నశాస్త్రవేత్తలను ఛైర్మన్‌ అభినందించారు.

ఒకేసారి 20 ఉపగ్రహాలు  ప్రయోగం...

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగంలో 17 విదేశీ, 3 స్వదేశీ ఉపగ్రహాలు రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాయి.. ఇందులో భారత్‌కుచెందిన కార్డోశాట్‌-2తో పాటు విదేశాలకు చెందిన 17 ఉపగ్రహాలున్నాయి.. భౌగోళిక సమాచార సేవలకు కార్డోశాట్‌-2 సహకారం అందించనుంది.. అలాగే పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీరప్రాంత సమాచారం... రోడ్డు నెట్‌వర్కింగ్‌, మ్యాపుల తయారీలో కీలకపాత్ర పోషించనుంది.. ఇక భారత్‌నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించడం ఇదే తొలిసారి.. ఈ ప్రయోగాల్లో ఒకేసారి 37 ఉపగ్రహాలను ప్రయోగించి రష్యా మొదటి స్థానంలో ఉంది.. 2014లో ఈ ప్రయోగం జరిగింది.. ఆ తర్వాత 2013లో ఒకేసారి 29 ఉపగ్రహాలను అమెరికా ప్రయోగించింది.. భారత్‌ విషయానికొస్తే 2008లో 10 ఉపగ్రహాల ప్రయోగం జరిగింది.. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రయోగం..

10:34 - June 22, 2016

నేపాల్‌ : మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్‌స్కేల్‌పై 4.4 తీవ్రవతతో భూమి కంపించింది. రాజధాని ఖాట్మండూకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు... గత ఏడాది ఏప్రిల్‌ లో 7.8 తీవ్రతతో భూకంపం విరుచుకుపడింది.. ఈ విపత్తునుంచి నేపాలీలు ఇంకా తేరుకోకముందే.. మళ్లీ రెండుసార్లు భూకంపాలు వణికించాయి... తాజా భూకంపంతో నేపాల్‌ ప్రజలు మరింత వణికిపోతున్నారు.

నేపాల్‌ లో మరోసారి భూకంపం..

నేపాల్‌ : మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్‌స్కేల్‌పై 4.4 తీవ్రవతతో భూమి కంపించింది. రాజధాని ఖాట్మండూకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు... గత ఏడాది ఏప్రిల్‌ లో 7.8 తీవ్రతతో భూకంపం విరుచుకుపడింది.. ఈ విపత్తునుంచి నేపాలీలు ఇంకా తేరుకోకముందే.. మళ్లీ రెండుసార్లు భూకంపాలు వణికించాయి... తాజా భూకంపంతో నేపాల్‌ ప్రజలు మరింత వణికిపోతున్నారు.

రెండోరోజు ప్రారంభమైన కృష్ణా బోర్డు సమావేశం..

ఢిల్లీ : కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెండో రోజు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు అయింది. మంగళవారం తొమ్మిది గంటలపాటు చర్చించినా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రెండవరోజు కూడా సమావేశమయిన నేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. 

దీక్ష విరమించనున్న ముద్రగడ...

తూ.గోదావరి : కాపునేత ముద్రగడ రాజమండ్రి ఆసుపత్రి నుండి తన స్వగ్రామం కిర్లంపూడికి బయలుదేరారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితులను విడుదల చేయాలని ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథంలో దీక్ష చేపట్టిన ఆయన్ని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన వైద్యానికి నిరాకరించి దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలో తుని ఘటన నిందుతులకు బెయిల్ మంజూరవటంతో ముద్రగడ తన దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిర్లంపూడికి బయలుదేరారు. తన నివాసంలోనే దీక్ష చేపట్టారు కాబట్టి ఇంటికి వెళ్లిన అనంతరం దీక్షను విరమించనున్నారు.  

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన గంటా..

కడప: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలల కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలువగా చివరిస్థానంలో అనంతపురం జిల్లా వున్నట్లు ఫలితాలు తెలిపాయి.

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ34...

నెల్లూరు : శ్రీహరికోట మరో అద్భుతానికి వేదికగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టాన 'షార్' ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. విదేశీ పరిజ్ఞానానికి భారత్ ఏమాత్రం తీసిపోదని మరోసారి నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరో భారీ ప్రయోగానికి శ్రీహరికోటలోని ' షార్ ' సాక్ష్యంగా ఇస్రో మరో రికార్డు సృష్టించింది.. అంతరిక్ష చరిత్రలో భారత్‌ పేరు రెపరెపలాడేలా చేసింది.. ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది..

నింగిలోకి దూసుకెళ్తున్న పీఎస్‌ఎల్వీ-సీ34...

నెల్లూరు : శ్రీహరికోట మరో అద్భుతానికి వేదికగా నిలిచింది. పీఎస్‌ఎల్వీ-సీ34 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళుతోంది17 విదేశీ , మూడు స్వదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ34 నింగిలోకి తీసుకెళుతోంది. ఈ ప్రయోగంలోమొదటి దశ విజయవంతంగా ముగిసింది.

09:26 - June 22, 2016

విశాఖ : ఫోర్త్ టౌన్ సీఐ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయనే ఆరోపణతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ కు సంబంధించిన బంధువుల నివాసాలలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్..

హైదరాబాద్ : నేడు తెలంగాణలో ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. 1 నుండి 6వేల ర్యాంక్ వరకూ కౌన్సిలింగ్ జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్ లైన్ కేంద్రాలలో కౌన్సిలింగ్ జరుగనుంది. 

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్లపై కడియం సమీక్ష...

హైదరాబాద్ : ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్లకు (అనుబంధ గుర్తింపు) సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో బుధవారం కీలక సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్లో భర్తీచేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో యాజమాన్య సీట్ల భర్తీ ఆన్‌లైన్లో నిర్వహించాలన్న అంశం తెరపైకి వచ్చినప్పటికీ దానిని వాయిదా వేస్తున్నట్టు తెలిసింది. ఆన్‌లైన్‌లో యాజమాన్య కోటా సీట్లు భర్తీచేయాలన్న అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.

బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు...

విశాఖ : ఫోర్త్ టౌన్ సీఐ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయనే ఆరోపణతో ఏసీబీ సోదాలు నిర్వహింన్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.

తెలంగాణాలో మరో ఉపఎన్నికలు ?!...

హైదరాబాద్ : ఆపరేషన్‌ ఆకర్ష్‌తో విపక్ష నేతలను చేర్చుకుంటున్న టీఆర్‌ఎస్‌.. తాజాగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని గులాబీ కారెక్కించుకుంది. నల్గొండ జిల్లాలో అంతంత మాత్రం ఉన్న తమ బలాన్ని పెంచుకునేందుకు.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికకు వెళ్లాలని గులాబీ దళం స్కెచ్‌ వేస్తోంది. 

08:46 - June 22, 2016

హైదరాబాద్ : ఆపరేషన్‌ ఆకర్ష్‌తో విపక్ష నేతలను చేర్చుకుంటున్న టీఆర్‌ఎస్‌.. తాజాగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని గులాబీ కారెక్కించుకుంది. నల్గొండ జిల్లాలో అంతంత మాత్రం ఉన్న తమ బలాన్ని పెంచుకునేందుకు.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికకు వెళ్లాలని గులాబీ దళం స్కెచ్‌ వేస్తోంది.

మరో ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న గులాబీ దళం...
వరుసగా ఉప ఎన్నికల్లో సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌.. మరో ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 27 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కారెక్కారు. ఈ ఊపుతో గులాబీ దళం మాంచి జోష్‌లో ఉంది.

పదవికి రాజీనాయా చేసే యోచనలో గుత్తా...
వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ మల్లారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేర్వేరుగా టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే.. గుత్తా సుఖేందర్‌ తన పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయంతో ఉన్నారు. పొంగులేటి, మల్లారెడ్డి విషయాన్ని పక్కనపెడితే.. గుత్తా ఉప ఎన్నికకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుత్తా రాజీనామా నిర్ణయానికి సీపీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపినా.. మరికొద్ది రోజులు వేచి చూడాలనే అభిప్రాయాన్ని గుత్తా వ్యక్తం చేసినట్లు తెలిసింది. గడిచిన రెండేళ్లలో వరుసగా ఎన్నికలు ఎదుర్కోవడంతో.. నల్గొండ ఎన్నికకు మాత్రం మరింత జాప్యం చేసి.. వెళ్లాలనే నిర్ణయంతో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికపై గులాబీ గూటిలో చర్చ...
ముగ్గురు ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరినా ఒక ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు సిద్ధమయితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

భారీ వర్షాలు..రైళ్లకు అంతరాయం...

ముంబై : భారీగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల స‌బ‌ర్బన్‌ రైళ్లకు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. సెంట్రల్ రైల్వే స్టేష‌న్ నుంచి హార్బర్ రూట్లో లోక‌ల్ ట్రైన్లు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. పలు రూట్లలో రైళ్లను రద్దు చేశారు. ట్రాక్‌పై నీళ్లు నిలిచిపోవ‌డంతో లోక‌ల్ రైళ్లు అర‌గంట ఆలస్యంగా న‌డుస్తున్నాయి. మాన్‌కుర్ద్‌, విద్యావిహార్‌, థాన్‌, విక్రోలీ బందూప్ ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. రైళ్ల కోసం ప్రయాణీకులు ప్లాట్‌ఫాంలపై బారులు తీరారు. రైళ్లు ఆలస్యంగా నడవడానికి నిరసనగా థానేలోని దివా రైల్వే స్టేష‌న్‌లో ప్రయాణికులు ధ‌ర్నాకు దిగారు.

ట్విన్‌ టవర్స్‌ కు లైన్ క్లియర్ ...

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ట్విన్‌ టవర్స్‌ భవన నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కావడంతో.. జీహెచ్‌ఎంసీ కీలకమైన రెండు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 135 మీటర్ల ఎత్తైన టవర్స్‌ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. 

08:35 - June 22, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ట్విన్‌ టవర్స్‌ భవన నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కావడంతో.. జీహెచ్‌ఎంసీ కీలకమైన రెండు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 135 మీటర్ల ఎత్తైన టవర్స్‌ నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.

135 మీటర్ల ఎత్తులో 20 అంతస్తుల భవన సముదాయాలు...
ప్రతిష్టాత్మకమైన పోలీసు ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 135 మీటర్ల ఎత్తులో 20 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు మున్సిపల్‌ శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలోనే అతి ఎత్తైన పోలీసు టవర్స్‌ నిర్మించే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి కలిగింది. సిటీ పోలీసు కమిషనర్‌తో పాటు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఇతర పోలీసు విభాగాల ఉన్నతాధికారుల కార్యాలయాలు ఈ సముదాయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లో ఏడు ఎకరాల స్థలంలో వీటిని నిర్మిస్తారు. తొలుత ట్విన్‌ టవర్స్‌ను 40 అంతస్తుల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించారు.

న్యూయార్క్, లండన్‌ తరహాలో అతిపెద్ద కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు...
న్యూయార్క్‌, లండన్‌ తరహాలో ఇక్కడ అతి పెద్ద కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక వ్యవస్థలతోనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ దీనికి శ్రీకారం చుట్టారు. దీనికోసం బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 12లో పోలీసు శాఖ ట్విన్‌ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఎత్తు విషయంలో ఏవియేషన్‌ విభాగం నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత జాప్యం జరిగింది. చివరకు 135 మీటర్ల ఎత్తులో వీటిని నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఏటిగడ్డ కిష్ణాపూర్ లో ధర్నా చేపట్టినున్న బీజేపీ ....

మెదక్ : మల్లన్న ప్రాజెక్ట్ మంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్ణాపూర్ లో నిర్వాసితులకు మద్దతుగా బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పాల్గొననున్నారు.

బోనాల షెడ్యూల్ ను విడుదల...

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బోనాల షెడ్యూల్ ను విడుదల చేసింది. కమిటీ సభ్యులు ఈ యేడాది ఆషాఢమాస బోనాల ఉత్సవాలను 22 ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్వహించే కైంకర్యాలను నిర్వాహకులు తెలియజేశారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 77,047 మంది భక్తులు దర్శించుకున్నారు.

ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన...

ప్రకాశం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రైతులకు రుణమాఫీ పత్రాలను అందించనున్నారు. అనంతరం ఒంగోలులో తాగునీటి పథకం పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఏబీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్టు సమాచారం.

ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు...

విజయవాడ : నేడు ఏపి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ. 9 గంటలకు మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేయనున్నారు.

నేడు గూడ అంజయ్య అంత్యక్రియలు...

ఆదిలాబాద్ : నేడు ప్రజాకవి గూడ అంజయ్య అంత్యక్రియలు దంతేవాడ మండలం లింగాపూర్ లో జరుగనున్నాయి. తెలంగాణ ఉద్యమంలో గూడ అంజయ్య వ్రాసిన గేయాలు ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే..పలు వురు ప్రముఖులు గూడ అంజయ్య మృతికి సంతాపం తెలిపారు.

07:59 - June 22, 2016

2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధం 123 జీవో తేవటాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి..2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాదాంతం చేస్తున్నాయని అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు...ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది...ఈ చర్చలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత) రాకేశ్ (టీఆర్ఎస్ నేత), శ్రీనివాస్ (టీ.కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. ..ఈ అంశంపై వక్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి...

07:52 - June 22, 2016

అడవిలో అలజడి మొదలైంది . చిరుజల్లలు పలకరించాయన్న సంతోషంతో పోడుభూముల్లోకి వెళ్లినవారికి నిర్బంధం ఎదురవుతోంది. భూమిని దున్నబోతే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

ఎలా బతకాలంటున్న అడవిబిడ్డలు...
ఈ మూడు సంవత్స రాల నుంచే ఎందుకు దాడులు చేస్తున్నారు? పోడు భూమి పోయినాక మేము తినాలి బంగారం తినాల్నా? మట్టి తిన్నాల్నా? ఇది అడవి బిడ్డల ఆవేదన. ఆగ్రహం. తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న అనేకమంది గుండెల్లోంచి ఇలాంటి మాటలే వస్తున్నాయి.

గిరిజన రైతులను అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు...
ఖమ్మం జిల్లా కారేపల్లి అటవీప్రాంతంలో తాజాగా జరిగిన సంఘటన ఇది. పోడు భూములు దున్నుకుంటున్న గిరిజనులతో అటవీశాఖ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుకు తాజా నిదర్శనం. చినుకు పడి, తొలకరి ప్రారంభమైందన్న సంతోషంగా పొలం దున్నేందుకు వెళ్లిన, గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిత్యం ఇలాంటి దృశ్యాలే  కనిపిస్తున్నాయి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ జిల్లా ఏదైనా గిరిజనులకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహరం పోడుభూములు సాగుచేసుకుంటున్నవారి పట్ల శాపంగా మారుతోంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలంటూ కెసిఆర్ ప్రభుత్వం ఆదేశించడంతో ఫారెస్టు అధికారులు పోడు భూముల్లోకి గిరిజనులను రానివ్వడం లేదు. వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. అరెస్టులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. తరతరాలుగా సాగుచేస్తున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తాతల ముత్తాల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూముల్లోకి తమను రానివ్వడం లేదంటూ గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2006లో అటవీ హక్కుల చట్టం...
2006లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి హక్కు పత్రాలివ్వాలి. 2005 డిసెంబర్ 13కి పూర్వం సాగు చేసుకుంటున్నవారందరికీ హక్కు ప్రతాలిస్తామంటూ అప్పట్లో ప్రకటించారు. దరఖాస్తులూ స్వీకరించారు. ఒక్క తెలంగాణలోనే 2 లక్షల 11 వేల 698 మంది హక్కు పత్రాల కోసం అప్లయ్ చేశారు. వీరిలో కేవలం 99 486 మందికి మాత్రమే హక్కు పత్రాలిచ్చారు. మొత్తం 13 లక్షల మూడు వేల 847 ఎకరాలకు హక్కు పత్రాలివ్వాలంటూ దరఖాస్తు చేసుకోగా, కేవలం మూడు లక్షల 29 వేల 571 ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలిచ్చారు.

744 కమ్యూనిటీలకు హక్కు పత్రాలు...
పోడు భూమిని సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ గరిష్టంగా పది ఎకరాల చొప్పున హక్కుపత్రాలివ్వాలంటూ అటవీ హక్కుల చట్టం స్పష్టం చేస్తుండగా, చాలామందికి ఎకరం రెండు ఎకరాల చొప్పున ఇచ్చి, మమా అనిపించారు. వనసంరక్షణ సమితిలను స్రుష్టించి మరో రకంగా ఈ చట్టం స్పూర్తికి తూట్లు పొడిచారు. సుమారు లక్ష మంది గిరిజన రైతులకు మూడు లక్షల ఎకరాల భూమికి హక్కు పత్రాలిచ్చి, కేవలం 744 కమ్యూనిటీలకు 5 లక్షల 3 వేల 82 ఎకరాలు రాసిచ్చిన తీరుపై అప్పట్లో గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హక్కు పత్రాలు రాని సాగుదారులు ఇప్పటికీ వాటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే వున్నారు. కానీ, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కరికి కూడా హక్కు పత్రాలివ్వలేదు. అవి ఇవ్వకపోగా, ఎప్పటి నుంచో సాగులో వున్న భూముల్లో హరితహారం పేరుతో ఇప్పుడు మొక్కలు నాటతామనడం వివాదస్పదమై, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 

07:43 - June 22, 2016

హరితహారం అడవిబిడ్డలకు శాపంగా మారుతోంది. పోడు భూముల్లో వ్యవసాయం చేయడానికి వెళ్లినవారిని ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. పోడు భూముల్లో వ్యవసాయం చేసేందుకు రైతులు, దానిని అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తప్పడం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? పోడు భూములు సాగు చేస్తున్న రైతులకీ, అటవీశాఖ అధికారులకీ మధ్య జరుగుతున్న ఘర్షణలు నివారించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? పోడు భూముల విషయంలో వాటిని సాగుచేస్తున్నవారికి వున్న హక్కులేమిటి? 2005 హక్కుల చట్టం ఏం చెబుతోంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శోభన్‌ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మర్నిం సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:37 - June 22, 2016

హైదరాబాద్ : మంత్రుల సమీక్షలతో తెలంగాణ సచివాలయం సందడిగా మారింది. చాలా రోజుల తర్వాత పలువురు మంత్రులు సచివాలయ వేదికగా తమ శాఖలపై రివ్యూలు నిర్వహించారు. దీంతో సచివాలయం కిటకిటలాడింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో సహా నలుగురు మంత్రులు ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించారు.

సందడిగా మారిన తెలంగాణ సచివాలయం...
చాలా రోజుల తర్వాత తెలంగాణ సచివాలయం కిటకిటలాడింది. మంత్రుల రివ్యూలు సచివాలయంలో సర్వ సాధారణమైనప్పటికీ..ఈ మధ్య సచివాలయంలో కాకుండా బయటే ఎక్కువ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం నలుగురు మంత్రులు సెక్రటేరియట్‌లో సమీక్షలు చేయడంతో సచివాలయ ప్రాంగణం అంతా సందడిగా మారింది. మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి తమ తమ శాఖల మీద అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

హరితహారంపై కేటీఆర్ సమీక్ష...
హరితహారం మీద సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కంటోన్మెంట్ అధికారులు, పలు ప్రైవేటు సంస్ధల ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌ నగరంలో ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమాన్ని 'ఈచ్ మన్ ప్లాంట్ ' నినాదంతో ముందుకుతీసుకుపోదామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మెత్తం 40 కోట్ల మెక్కలు నాటనున్నామని కేటీఆర్‌ తెలిపారు.

వేముల వాడ అభివృద్ధి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష...
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేముల వాడ అభివృద్ధి మీద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆధ్యాత్మిక‌త‌కు పెద్దపీట వేస్తూనే పిలిగ్రీమ్ సెంట‌ర్ గా వేముల‌వాడ ప‌రిస‌ర ప్రాంతాలను అభివృద్ది చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారి చేశారు. టీటీడీ త‌ర‌హాలోనే సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాల‌పై దృష్టి సారించాల‌న్నారు. ఇక మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ బోనాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వచ్చే నెలల్లో జరిగే బోనాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే మంత్రి తుమ్మల మహిళా, శిశు సంక్షేమ శాఖ మీద రివ్యూ చేశారు. ఆ శాఖలో ఉన్న సమస్యల మీద సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. మొత్తం మీద అధికారులతో మంత్రుల రివ్యూల సందర్భంగా చాలా రోజుల తర్వాత సచివాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 

07:32 - June 22, 2016

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ ఉమ్మడి సంస్థల విభజనపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షెడ్యూల్ 10లోని 142 సంస్థల విభజనపై చర్చించారు. ఈ సందర్భంగా సుప్రీం తీర్పును అన్ని సంస్థలకు వర్తింపచేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో ఏ నిర్ణయమూ లేకుండానే హోంశాఖ సమావేశం ముగిసింది.

సంస్థల విభజనపై అసంపూర్తిగా ముగిసిన సబ్‌ కమిటీ సమావేశం...
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- షెడ్యూల్‌ 10 లోని 142 సంస్థల విభజనపై ఎటువంటి నిర్ణయం లేకుండానే సబ్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఢిల్లీలో హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశం అయ్యారు.

షెడ్యూల్‌ 10 లోని ఇతర సంస్థలను విభజించాలని ఏపీ వాదన..

ఉన్నత విద్యామండలి విభజనపై సుప్రీం తీర్పును అనుసరించి షెడ్యూల్‌ 10 లోని ఇతర సంస్థలను విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ వాదించింది. ఇందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సుప్రీం తీర్పు షెడ్యూల్‌ 10లోని ఇతర సంస్థలకు వర్తించబోదని దీనిపై రివ్యూ పిటిషన్ వేశామని గుర్తుచేసింది. అప్పటి వరకు షెడ్యూల్‌ 9,10లోని సంస్థల విభజన నిలిపివేయాలంటూ కేసీఆర్‌ లేఖ రాసిన విషయాన్ని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు.

సుప్రీం తీర్పు అన్ని సంస్థలకు వర్తించదని తెలంగాణ వాదన ...
అయితే సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చే వరకు దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకునే అధికారం లేదని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

కోర్టు తీర్పు అనంతరమే సమావేశం జరిగే అవకాశం...
మొత్తానికి తొమ్మిది, పదో షెడ్యూల్‌ విభజన భేటీ ఎటువంటి నిర్ణయం జరగకుండానే వాయిదా పడింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సమావేశం ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ప్రాజెక్టులు పూర్తికి ప్రతిపక్షాల అడ్డుపడుతున్నాయి : హరీష్

హైదరాబాద్ : ప్రాజెక్టులు పూర్తికాకుండా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అడ్డుపడుతున్నాయని.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పట్ల ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నాయకులు అడ్డుపడుతుంటే వాళ్లకు తెలంగాణ ప్రతిపక్షపార్టీలు సహకరించడం దురదృష్టమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. . బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాదాంతం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 

07:10 - June 22, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టులు పూర్తికాకుండా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అడ్డుపడుతున్నాయని.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పట్ల ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నాయకులు అడ్డుపడుతుంటే వాళ్లకు తెలంగాణ ప్రతిపక్షపార్టీలు సహకరించడం దురదృష్టమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. . బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాదాంతం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 

07:02 - June 22, 2016

హైదారాబాద్ :  మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరో పోరుకు సిద్ధమయింది. ప్రభుత్వం వెంట‌నే స్పందించి ముంపు గ్రామాల ప్రజానీకానికి అనుకూలంగా ప్రక‌ట‌న చేయాల‌ని టీడీపీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో రేవంత్‌ రెడ్డి రెండు రోజుల దీక్షకు దిగబోతున్నారు.

మ‌ల్లన్నసాగర్ పై పోరాడేందుకు టీటీడీపీ సన్నద్ధం...
మ‌ల్లన్న సాగ‌ర్ ముంపు గ్రామాల బాధితుల ప‌క్షాన పోరాడేందుకు తెలుగుదేశం తెలంగాణా శాఖ పావులు క‌దుపుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వ‌ల్ల మెద‌క్ జిల్లాలో అనేక గ్రామాల ప్రజ‌లు నిర్వాసితులుగా మారే ప్రమాదం ఉంద‌ని టీడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎన్నో సంవ‌త్సరాల నుంచి పొలాల‌ను సాగుచేసుకుంటూ జీవిస్తున్న ప్రజలను ఒక్కసారిగా ఖాళీ చేయ‌మ‌న‌డం ప్రభుత్వానికి ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని నిలదీస్తున్నారు. మ‌ల్లన్న సాగ‌ర్ నిర్మించి తీరుతామ‌ని చెప్తున్న ప్రభుత్వం నిర్వాసితుల‌కు చెల్లించే న‌ష్టప‌రిహారంలో మాత్రం వెన‌క‌డుగు వేస్తోంద‌ని ఆరోపించారు. ప్రభుత్వం ఆఘ‌మేగాల మీద విడుద‌ల చేసిన 123వ జీవోను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.

మ‌ల్లన్నసాగర్ బాధితుల పక్షాన పోరాడేందుకు టీటీడీపీ సన్నద్ధం...
మల్లన్న సాగ‌ర్ ముంపు గ్రామాల‌ను ప‌ర్యటించి దాదాపు 20 రోజులు పూర్తవుతున్నా టీడిపి నేత‌ల డిమాండ్ ను ప్రభుత్వం ప‌ట్టించుకోకపోవ‌డంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30-40 ఏళ్లుగా గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న గ్రామ‌స్తుల‌ను ప్రాజెక్టు పేరుతో ఖాళీ చేయించ‌డం త‌గ‌ద‌ని వాదిస్తున్నారు. దాదాపు ప‌న్నెండు గ్రామాల ప్రజ‌లు ప్రాజెక్టు వ‌ల్ల నిర్వాసితులుగా మారుతున్నార‌ని.. ప్రాజెక్టు డిజైన్ మార్చుకునే అవ‌కాశం ఉన్నా ప్రభుత్వం కావాల‌నే మొండిగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. బాధితుల త‌రుపున పోరాడేందుకు ఎంత‌కైనా తెగిస్తామ‌ని టీడిపి నేత‌లు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి బాధితుల ప‌క్షాన రెండురోజుల నిరాహార దీక్ష చేసేందుకు ప్రణాళిక ర‌చిస్తున్నారు.

రేవంత్ దీక్షతో ప్రభుత్వం దిగి వ‌స్తుందా ?..
మ‌ల్లన్న సాగ‌ర్ ముంపు గ్రామాల త‌రపున ఇప్పటి వ‌ర‌కు మాట‌ల యుద్ధం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి వ్యూహ ర‌చ‌న చేస్తోంది. రేవంత్ రెడ్డి దీక్షతోనైనా ప్రభుత్వం దిగి వ‌స్తుందా లేక వ్యూహాత్మకంగా వ్యవహారించిందో వేచి చూడాలి..

06:56 - June 22, 2016

ఢిల్లీ : నదీ జలాల పంపిణీ పర్యవేక్షణ కోసం ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. లేదంటే తమ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పాటించడం లేదని... డెల్టాకు తాగు నీటి అవసరాల కోసం బోర్డు సూచించిన ఆరు టీఎంసీల నీటికి గాను నాలుగున్నర టీఎంసీలను మాత్రమే విడుదల చేసిందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతర తెలిపింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ఎక్కువ నీరు వాడుకుందని చెప్పింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే దాకా నీటి కేటాయింపులు జరపకూడదని స్పష్టం చేసింది. దీంతో సమావేశం అంతా వాడివేడిగా జరిగింది. ఇవాళ మరోసారి అధికారులు భేటీ కానున్నారు.

06:53 - June 22, 2016

నెల్లూరు : శ్రీహరికోట..ఆకాశవీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. గగనతలంలో మన ఘనతను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన రికార్డుల కోట..మరో కీర్తి శిఖరాన్ని చేరుకోబోతోంది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 9.26 గంటలకు పీఎస్‌ఎల్వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

హాట్ హాట్ గా సాగిన కృష్ణా బోర్డు సమావేశం....

ఢిల్లీ : నదీ జలాల పంపిణీ పర్యవేక్షణ కోసం ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. లేదంటే తమ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెప్పింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పాటించడం లేదని... డెల్టాకు తాగు నీటి అవసరాల కోసం బోర్డు సూచించిన ఆరు టీఎంసీల నీటికి గాను నాలుగున్నర టీఎంసీలను మాత్రమే విడుదల చేసిందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతర తెలిపింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ఎక్కువ నీరు వాడుకుందని చెప్పింది.

నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ-సీ34..

నెల్లూరు : శ్రీహరికోట..ఆకాశవీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. గగనతలంలో మన ఘనతను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిన రికార్డుల కోట..మరో కీర్తి శిఖరాన్ని చేరుకోబోతోంది. మొట్టమొదటిసారిగా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించబోతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 9.26 గంటలకు పీఎస్‌ఎల్వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 

Don't Miss