Activities calendar

23 June 2016

జర్మనీలో అగంతకుడి కాల్పులు... 50 మందికి పైగా గాయాలు

బెర్లిన్ : జర్మనీలో అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్రాంక్ ఫర్డ్ సమీపంలోని సినిమా కాంప్లెక్స్ లో ఉగ్రదాడి జరిగింది. ఆయుధాలతో ఫ్రాంక్ ఫర్డ్ సమీపంలోని సినీ కాంప్లెక్స్ లోకి అగంతకుడు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో సినీ కాంప్లెక్స్ ను చుట్టుముట్టారు పోలీసులు. అగంతకుడి కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

22:02 - June 23, 2016

హైదరాబాద్ : గోదావరి నదిపై తెలంగాణ నిర్మించనున్న ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఏకాభిప్రాయం కుదిరింది. ముంబైలో పర్యటిస్తున్న తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్‌రావు మేడిగడ్డ, తుమ్మడి హెట్టి ప్రాజెక్టుల ఎత్తుపై అంగీకారం కుదుర్చుకున్నారు. 101 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ ఆనకట్ట, 148 అడుగుల ఎత్తులో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర స్పష్టం చేయగా, అందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది. జూలై రెండోవారం అపెక్స్‌ కమిటీ భేటీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను హైదరాబాద్‌ రావాల్సిందిగా మంత్రి హరీష్‌ రావు ఆహ్వానించారు.    

 

21:59 - June 23, 2016

బెర్లిన్ : జర్మనీలో అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్రాంక్ ఫర్డ్ సమీపంలోని సినిమా కాంప్లెక్స్ లో ఉగ్రదాడి జరిగింది. ఆయుధాలతో ఫ్రాంక్ ఫర్డ్ సమీపంలోని సినీ కాంప్లెక్స్ లోకి అగంతకుడు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో సినీ కాంప్లెక్స్ ను చుట్టుముట్టారు పోలీసులు. అగంతకుడి కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

 

తెలంగాణలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు...

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై మరోభారం మోపింది. తాజాగా విద్యుత్‌ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7.5 శాతం మేర విద్యుత్‌ చార్జీలను పెంచారు. జులై 1 నుంచి పెరిగిన విద్యుత్‌ చార్జీలు అమల్లోకి రానున్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజలపై దాదాపు 16వందల కోట్ల భారం పడనుంది. 100 యూనిట్ల లోపు గృహవినియోగదారులకు చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

21:50 - June 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై మరోభారం మోపింది. తాజాగా విద్యుత్‌ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7.5 శాతం మేర విద్యుత్‌ చార్జీలను పెంచారు. జులై 1 నుంచి పెరిగిన విద్యుత్‌ చార్జీలు అమల్లోకి రానున్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజలపై దాదాపు 16వందల కోట్ల భారం పడనుంది. గృహోపకరణాలకు కొత్త టారీఫ్‌ ను ప్రకటించారు. 100 యూనిట్ల లోపు గృహవినియోగదారులకు చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. 0-50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.45, 51-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.2.60 గా నిర్ణయించారు. 

 

21:31 - June 23, 2016

ఆకాశం నుంచి అగ్నివర్షం కురిసిస్తే...? ఊహించని ప్రమాదాన్ని మోసుకోస్తే...? ఉగ్రమూకల చేతిలో ఆయుధంగా మారితే..? డ్రోన్ లతో దేశానికి ముప్పు పొంచి ఉందా..? ఉగ్రవాదుల చేతిలో ఆయుధంగా మారే అవకాశం ఉందా.? భారత నగరాలు డ్రోన్ దాడుల ప్రమాదంలో ఉన్నాయా..? ఇంటెలిజెన్స్ నివేదికలేం చెప్తున్నాయి.. ? రెండంచుల కత్తిలాంటి టెక్నాలజీ చుట్టూ అనేక భయాలు, నేలకింది భూమినే కాదు.. తలపైన ఆకాశాన్ని కూడా నమ్మలేని రోజలు, డ్రోన్ కాదది డేంజర్..!! ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై వైసీపీ దుష్ప్రచారం : మంత్రి నారాయణ

గుంటూరు : తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో బిల్డింగ్ కుంగిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాత్రి 12 గంటల వరకు సచివాలయంలోనే ఉంటానని ధైర్యముంటే బిల్డింగ్ ఎక్కడ కుంగిందో చూపించాలని సవాల్ విసిరారు. 

 

21:02 - June 23, 2016

ప్రభుత్వం సరైన విధానాలను అనుసరిస్తే విద్యుత్ రంగంలో నష్టాలు ఉండబోవని విద్యుత్ రంగం నిపుణులు వేణుగోపాల్ తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సరైన విధానాలను అనుసరించకపోవడం వల్లే విద్యుత్ రంగంలో నష్టాలు వస్తున్నాయిని, నిర్వీర్యం అవుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రెండు భాగాలుగా సైబరాబాద్ కమిషనరేట్..

హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ ను రెండుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సైబరాబాద్, ఈస్ట్, వెస్ట్ పోలీసు కమిషనరేట్లుగా విభజించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలు, సైబరాబాద్ ఈస్ట్ జోన్ లో భువనగిరి, మల్కాజ్ గిరి, ఎల్ బినగర్ లు రానున్నాయి. సైబరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలోకి బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ లు రానున్నాయి. 

 

20:49 - June 23, 2016

వాన కోసం బాలున్ని నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు, బోనాల సందడి, తిరుమల కొండపై మద్యం బాటిళ్లు డిస్ట్రాయ్, చదువుపై వృద్ధుడి ఆసక్తి...పదో తరగతి చదువుతున్న వృద్ధుడు, కారుపై వాలిన తేనెటీగలు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:44 - June 23, 2016

ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. రెండు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. మార్పు చేసిన సిలబస్ మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు 50 వేలు దాటితే గ్రూప్-1 నుంచి గ్రూప్ -4 వరకు ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకత విధానంలో పరీక్షలు నిర్వహణ ఉంటుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. గ్రూప్-1 లో కలిపిన గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కూడా స్పష్టత ఇచ్చారు. టీచర్ పోస్టుల భర్తీ కూడా చేపట్టాలనుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వతో మాట్లాడతామన్నారు. వయోపరిమితి పెంచితే మంచిదే కానీ ఈ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

న్యాయనిపుణులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమావేశం....

హైదరాబాద్ : న్యాయనిపుణులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్, ఛైర్మన్ కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. 

 

19:10 - June 23, 2016

హైదరాబాద్ : కనీస వేతనాల కోసం చేయని పోరాటం లేదు..ప్రజాప్రతినిధికి మొక్కనిరోజు లేదు.. పోలీసులతో దెబ్బలు తిన్నా...ఉద్యమ స్ఫూర్తిని మాత్రం ఆపలేదు. వీరి ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచుతున్నట్లు హామీ ఇచ్చినా..నేటికి జీతాలు పెరగక..  జీతాలు రాక.. అప్పులతో నెట్టుకొస్తున్న అంగవాడీల తలరాత మారేదెన్నడు.?
లక్షా 3వేల మంది కార్యకర్తలు
రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల 700 సెంటర్లు..లక్షా 3వేల మంది కార్యకర్తలు , హెల్పర్లు అందులో 6 వేల వరకు మినీ సెంటర్లు దాదాపు 50 వేల మంది టీచర్లుఅంగన్ వాడీల సమస్యలు నేటికి నెరవేరక పోగా.. జీవోలు జారీ కాక జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. 
వేతనం రూ.4 ,200..పని 12 గం.లు 
ఇచ్చేది 4,200 అయినా.. పని 12 గంటలు..జీతాల పెంపుపై గతంలో ఉద్యమాలు చేసినా... అంగన్ వాడీల తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రభుత్వ జీవోలు అమలుకు నోచుకోవడం లేదు. ఐసీడీఎస్ పనుల కోసమేకాక ప్రభుత్వంతరపున సర్వేలకోసం అంగన్ వాడీలను వాడుతోంది సర్కార్. అన్ని రకాల సర్వేలకు.. ప్రభుత్వ పథకాల అమలు తీరుకు తమకు వాడుకుంటున్నా.. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అంగన్‌వాడీ వర్కర్లు.
ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచేందుకు.. మంత్రుల జీతాలు పెంచేందుకు బడ్జెట్ ఉంటుంది కాని తమ అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్ వాడీలు అంటున్నారు. 
పిల్లలు లేని స్కూళ్లను వేరే సెంటర్లలో కలిపే ఆలోచన
ఇదిలా ఉంటే.. మరోవైపు అంగన్ వాడీలను ఏరివేత లక్ష్యంగా ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోంది. కొత్తగా ప్రభుత్వం  జారీ చేసిన 3211 మెమో ప్రకారం అంగన్ వాడీ కేంద్రాల్లో యు.కేజీ ఎల్ కేజీ నర్సరీలను ప్రారంభించనుంది. 20 నుండి 30  మెయిన్ సెంటర్లలో మినీ సెంటర్లలో 8 నుండి 10  మంది కనీస ప్రీ స్కూలు పిల్లలుండాలని జీవో జారీ చేసింది ప్రభుత్వం. దీంతో..పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లను వేరే సెంటర్లలో కలిపి వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంట్లో ఉద్యోగులను తొలగించాలని కుట్ర దాగుందంటున్నారు అంగన్ వాడీలు. 
ఆ వ్యాఖ్యపై సంఘాల వ్యతిరేకత 
అంగన్ వాడీల సమస్యల పరిష్కారం జరగాలంటే.. యూనియన్ మారాలని.. ప్రభుత్వ యూనియన్ లతో కలిసి పని చేయాలనడంపై పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేటికి అంగన్ వాడీలకు చేరలేదని.. అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్  నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 
అప్పుల ఊబిలో అంగన్ వాడీల జీవితాలు 
అసలే అరకొర జీతాలు ఆపై 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో అంగన్ వాడీల జీవితాలు..అప్పుల ఊబిలో కూరుకుపోయాయి.  సమావేశాలకు హాజరయినా టీఏ బిల్లులు చెల్లింయడం లేదని.. పక్కా భవనాలు లేని అంగన్ వాడీ కేంద్రాలకు అద్దెలు కూడా సకాలంలో చెల్లించడం లేదని.. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న ఈ కేంద్రాల్లో వాటిపై కూడా కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
అంగన్ వాడీలను ఆదుకోవాలి : యూనియన్ నేతలు 
ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి.. దేశానికి మంచి భవిష్యత్తును అందిస్తున్న అంగన్ వాడీలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందంటున్నారు యూనియన్ నేతలు. మరో ఉద్యమానికి తెరతీసేలోపు  ప్రభుత్వం మేల్కొంటే.. మంచిదని.. లేకపోతే .. తమ ఆగ్రహానికి గురికాక తప్పదని అంగన్ వాడీలు అంటున్నారు.  

 

19:00 - June 23, 2016

హైదరాబాద్ : తప్పనిసరి పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచుతున్నామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఈమేరకు ఛార్జీల పెంపు వివరాలను మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణ ప్రకటించారు. ఆర్టీసీ ఛార్జీలు పెరగడంతో ప్రజలపై రూ.287 కోట్ల భారం పడనుందన్నారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల లోపు ఒక రూపాయి, 30 కిలో మీటర్ల పైన రూ.2 పెంచామని తెలిపారు. సిటీ బస్సులు, డీలక్స్, ఏసీ బస్సుల్లో ఛార్జీలు 10 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 

 

18:52 - June 23, 2016

కడప : యోగి వేమన యూనివర్సిటీ విద్యార్థులపై తేనేటీగలు దాడి చేశాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ కు హాజరయిన విద్యార్థుల మీద ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో విద్యార్థులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కడపరిమ్స్ కు తరలించారు. తేనెటీగల దాడితో కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొంది. 

 

18:48 - June 23, 2016

విజయవాడ : తాను పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ ఎమ్మెల్యే అప్పారావు ఖండించారు. తమపై కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అర్జునుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆయన మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే..ఆయనే వైసీపీ లోకి రావాలే తప్ప జిల్లాకు చెందిన నేతలెవరు పార్టీని వీడరని అప్పారావు అన్నారు. టీడీపీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

 

టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే

ఢిల్లీ : టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే ఎంపిక అయ్యారు. ఏడాది పాటు కోచ్ పదవిలో కుంబ్లే కొనసాగనున్నారు. కుంబ్లే గొప్ప ఆటగాడని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. కోచ్ గా కూడా కుంబ్లే తానేంటో నిరూపించుకుంటాడని తెలిపారు. వెస్టిండీస్ పర్యటన నుంచే కుంబ్లేకు బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. 

 

తెలంగాణలో పలువురు ఐఎఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్ : తెలంగాణలో పలువురు ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

18:32 - June 23, 2016

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. 27వ తేదీ డెడ్‌లైన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో, కీలక శాఖల తరలింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు ఫైళ్లతో వ్యవసాయ శాఖ అధికారులు విజయవాడ బయలుదేరారు. ఇక విజయవాడ బయలుదేరిన విభాగాల్లో హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సైతం ఉన్నారు. ఇప్పటికే పలు శాఖల ఫైళ్లను తరలించేందుకు వీలుగా ప్యాకింగ్‌ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.  

 

18:29 - June 23, 2016

ఢిల్లీ : భారత క్రికెట్ చీఫ్ కోచ్ ఎవరో ఖరారైంది. టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే ఎంపిక అయ్యారు. ఏడాది పాటు కోచ్ పదవిలో కుంబ్లే కొనసాగనున్నారు. స్వదేశీ కోచ్ వైపే భారత క్రికెట్ సంఘం పెద్దలతో పాటు..సచిన్, సౌరవ్, లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహామండలి సైతం మొగ్గు చూపింది. మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లేను పూర్తిస్థాయి చీఫ్ కోచ్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే అధికారిక ప్రకటన చేశారు. కుంబ్లే గొప్ప ఆటగాడని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. కోచ్ గా కూడా కుంబ్లే తానేంటో నిరూపించుకుంటాడని తెలిపారు. వెస్టిండీస్ పర్యటన నుంచే కుంబ్లేకు బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. 

 

 

17:55 - June 23, 2016

గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట మండలం యడవల్లి దళిత భూముల కబ్జా వ్యవహారంపై టెన్‌ టీవీ కథనంపై లోక్‌సత్తా స్పందించింది. దళితుల పక్షపాతులుగా చెప్పుకుంటున్న నాయకులు.. దళితుల భూములపై కన్నేయడం అన్యాయమని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాదాసు భానుప్రసాద్‌ విమర్శించారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దళితుల భూములకు సంబంధించిన సొసైటీని పునరుద్ధరించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధక్ష్యులు శ్రీనునాయక్‌ డిమాండ్‌ చేశారు. 

 

తప్పని పరిస్థితుల్లో ఛార్జీల పెంపు - మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచుతున్నామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయని, ఆర్టీసీ ఛార్జీలు పెరగడంతో ప్రజలపై రూ.287 కోట్ల భారం పడనుందన్నారు.

ఆర్టీసీ ఛార్జీలు ఇలా పెరిగాయి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఈ మేరకు ఈమేరకు మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణలు ప్రకటించారు. ఈనెల 27 అర్ధరాత్రి నుండి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్లు లోపు ఒక రూపాయి..
30 కిలోమీటర్లు పైన రూ.2 పెంచారు.
పల్లె వెలుగు బస్సుల్లో 5 కిలోమీటర్ల వరకు రూ.5 ఉన్న ఛార్జీ రూ.6కు పెరిగింది.
సిటీ బస్సులు, డీలక్స్, ఏసీ బస్సుల్లో ఛార్జీలు 10 శాతం పెరిగాయి.

17:52 - June 23, 2016

గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేటలో దళితుల భూముల కబ్జాపై టెన్‌ టీవీలో ప్రసారమైన కథనం సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ఉద్యమాలకూ ప్రజా సంఘాలు రూపకల్పన చేస్తున్నాయి.  
పలు రాజకీయ పార్టీలు స్పందన 
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి దళితులకు కేటాయించిన భూముల కబ్జాపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనం సంచలనమైంది. చిలకలూరిపేటలో కబ్జాకోరులు పేరుతో ప్రసారమైన కథనంపై పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. అధికార పార్టీ నేతల అండదండలతో స్థానిక సర్పంచ్‌.. దళితుల భూముల్లో గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టిన అంశాన్ని టెన్‌ టీవీ అద్భుతంగా ఆవిష్కరించిందని ప్రశంసిస్తున్నారు. 
భూములను కైవసం చేసుకునే కుట్ర : రాధాకృష్ణ  
అధికార పార్టీకి చెందిన మంత్రి అండదండలతో.. స్థానిక నేతలు దళితులకు చెందాల్సిన భూములను కైవసం చేసుకునే  కుట్రలు పన్నుతున్నారని, కాంగ్రెస్‌ పార్టీ చిలకలూరిపేట ఇన్‌ఛార్జ్‌ రాధాకృష్ణ విమర్శించారు. దళితులకు ఇచ్చిన భూముల సొసైటీని పునరుద్ధరించకపోతే దళిత ఉద్యమాన్ని లేవదీస్తామని ఆయన హెచ్చరించారు. 
మంత్రి పుల్లారావు ప్రోద్బలంతో భూములు కాజేసే కుట్ర : వైసీపీ మాజీ ఎమ్మెల్యే 
దళితుల భూముల సొసైటీని రద్దు చేయడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షులు, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. మంత్రి పుల్లారావు ప్రోద్బలంతోనే భూములు కాజేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సెంటు భూమి కూడా అన్యక్రాంతం కాకుండా దళితుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. పేదలు, దళితులకు అండగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు.. వారి నోట్లో మట్టి కొట్టే చర్యలకు దిగడం దురదృష్టకరమని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. మొత్తమ్మీద.. యడవల్లి దళితుల భూముల కబ్జా వ్యవహారం.. గుంటూరు జిల్లా అంతటా ప్రకంపనలు సృష్టించింది. 

 

రేపు ఢిల్లీకి మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ తో భేటీ కానున్నారు.

 

కృష్ణా జలాలను చట్టప్రకారం విభజించాలి - డొక్కా..

గుంటూరు : కృష్ణా జలాల వివాదాన్ని విభజన చట్టం ప్రకారమే పరిష్కరించాలని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే తెలంగాణ నేతలు సెంటిమెంట్ ను వాదనను వినిపిస్తున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే ఎవరి వాటా ఎంతో ప్రకటించాలని, హరీష్ రావు తొండి..మొండి వాదనలు విడనాడాలన్నారు.

భూ నిర్వాసితుల కుటుంబాలను ఆదుకుంటాం - కేటీఆర్..

హైదరాబాద్ : రైతులకు పగటిపూట 9గంటల విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, భూ నిర్వాసితుల సమస్యలను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భూ నిర్వాసితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

17:45 - June 23, 2016

గుంటూరు : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రైతు రుణమాఫీ చెక్కులను మంత్రి పత్తిపాటి పుల్లారావు రైతులకు పంచారు. రుణమాఫీ సీఎం చంద్రబాబు కృషి వల్ల మాత్రమే సాధ్యం అయ్యిందని తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. 

 

17:40 - June 23, 2016

హైదరాబాద్ : ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కు లేఖ రాశారు. ఆ ప్రాంతంలో తెలంగాణవాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇందుకు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. 

 

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఈమేరకు మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సత్యనారాయణలు ప్రకటించారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీటర్ల వరకు రూ. 1 ఆపైన రూ. 2 ఛార్జీల పెంచారు. ఏసీ బీస్సులో 10 శాతం మేర ఛార్జీలను పెంచారు. ఈనెల 27 అర్ధరాత్రి నుండి పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

17:16 - June 23, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై 10 టివి ప్రసారం చేసిన కథనాలకు స్పందన లభించింది. కృష్ణవేణి, పద్మావతి పుష్కర ఘాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పుష్కర ఏర్పాట్ల పనుల ఆలస్యంపై సీఎం సీరియస్ అయ్యారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పుష్కర ఘాట్ల పనులను మరోసారి పర్యవేక్షిస్తానని చెప్పారు. 

బీసీసీఐ చీఫ్ కోచ్ గా కుంబ్లే !

ఢిల్లీ : బీసీసీఐ చీఫ్ కోచ్ గా అనీల్ కుంబ్లే ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కసరత్తు పూర్తి చేసింది. కాసేపట్లో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. 

17:00 - June 23, 2016

చిత్తూరు : ఓ చిన్నారికి తీవ్ర అనారోగ్యం చేసింది. వారిది పేద కుటుంబం. నయం చేయించడానికి వారి దగ్గర డబ్బులు ల్లేవు. దీంతో పాపనే వదులుకోవాలనుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారిని మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం) కు అనుమతివ్వాలని కోరుకుంటున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలో నివసిస్తున్న దంపతులకు జ్ఞానసాయి అనే 8 ఏళ్ల చిన్నారి ఉంది. ఆ చిన్నారి లివర్ సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. నయం కాలేదు. తమ కుమార్తె మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలంటూ తంబళ్లపల్లి కోర్టులో పాప తల్లిదండ్రులు పిటిషన్‌ వేశారు.. 8నెలల వయసున్న తమ బిడ్డ జ్ఞానసాయి అనారోగ్యంతో బాధపడుతోందని పిటిషన్‌లో తెలిపారు. వైద్యానికి భారీగా ఖర్చవుతుందని.. అంత చెల్లించే స్తోమత తమకులేదని... మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలంటూ పేరంట్స్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీరివాదన విన్న కోర్టు ఈ అంశం తమ పరిధిలో లేదని తేల్చింది. జిల్లా కోర్టుగానీ... హైకోర్టునుగానీ ఆశ్రయించాలని సూచించింది. చిన్నారి మెర్సీ కిల్లింగ్‌ పిటిషన్‌ పలువురిలో ఆవేదన నింపింది.

 

కాసేపట్లో ఆర్టీసీ ఛార్జీల పెంపుదల ప్రకటన..

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. మంత్రి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణలు వెల్లడించనున్నారు. పల్లె వెలుగు బస్సులత్లో 30 కి.మీటర్ల వరకు రూ. 1 ఆపైన రూ. 2 ఛార్జీల పెంపు..మిగతా బస్సుల్లో 10 శాతం మించకుండా ఛార్జీలు పెంచనున్నారు.

16:48 - June 23, 2016

బాహుబలి..ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా బాహుబలి సత్తా చాటింది. ప్రస్తుతం 'బాహుబలి ద కన్ క్లూజన్' చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఏకధాటిగా కొనసాగుతోంది. ఇటీవలే క్లైమాక్స్ షూటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని 'జెంటిల్ మెన్' 'నాని' సందర్శించారు. ఈ విషయాన్ని బాహుబలి చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 'అవర్ జెంటిల్ మెన్ నానీ మేడ్ ఏ సర్ ప్రైజ్ విజిట్ టు అవర్ సెట్స్ ఎస్టర్ డే' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంతేగాకుండా నాని చేసిన సందడిని 9 సెకన్ల నిడివి గల వీడియోను పోస్టు చేశారు.

మంత్రి కేటీఆర్ పర్యటన..ముందస్తు అరెస్టులు..

కరీంనగర్ : జిల్లాలోని సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రిని అడ్డుకుంటారనే నెపంతో టెక్స్ టైల్ పార్క్ కార్మికులను, సీఐటీయూ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.

కుప్వారలో ముగ్గురు మిలిటెంట్ల హతం..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారలో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి. ఓ భవనంలో మరికొంతమంది ఉగ్రవాదులున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భవనాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.

మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో హరీష్ భేటీ..

ముంబై : మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. అపెక్స్ బాడీ సమావేశం కోసం సన్నాహక చర్చలు చేపట్టారు. గోదావరి జిల్లాలపై ఇప్పటికే రెండుసార్లు చర్చలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల సీఎంలు, కేసీఆర్..ఫడ్నవీస్ ల భేటీకి తేదిని ఖరారు చేయనున్నారు.

చైనా అధ్యక్షుడితో మోడీ భేటీ..

తాష్కెంట్ : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఎన్ఎస్ జీలో భారత్ కు సభ్యత్వంపై చైనా అధ్యక్షుడితో మోడీ చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వానికి మెక్సికో మద్దతు ప్రకటించింది. అణు సరఫరా దేశాల బృందంలో భారత్ కు సభ్యత్వం కల్పించాల్సినవసరం ఎంతో ఉందని మెక్సికో రాయబారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

మెదక్ లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత..

మెదక్ : చినశంకరంపేట (మం) పెర్పల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందిరికీ పాఠశాలలోనే వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

16:15 - June 23, 2016

ఖమ్మం : జిల్లాలో పోడు రైతుల కోసం సీపీఎం నేతలు చేసిన పోరాటం ఫలించింది. ఇవాళ స్థానిక అధికారులు, ఎమ్మెల్యే మదన్‌ లాల్ తో కారేపల్లి పోడు రైతులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఐదు ఎకరాల వరకు పోడు సాగుకు అధికారులు అనుమతిచ్చారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. 

 

16:13 - June 23, 2016

మెగాస్టార్ చిరంజీవి చాన్నాళ్లకు మేకప్ వేసుకున్నారు. ఆయన ఎప్పుడు మేకప్ వేసుకుంటారా ? ఎప్పుడు షూటింగ్ ప్రారంభమౌతుందా ? అభిమానుల నిరీక్షణ ఫలించింది. కొద్దిసేపటి క్రితం చిరంజీవి షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ఆయన తనయుడు రాంచరణ్ తేజ తన ఫేస్ బుక్ ద్వారా తెలియచేశారు. చిత్ర షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను, మెస్సెజ్ ను రాంచరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని అనుకుంటారని, ఆ సమయం ఇప్పుడు తనకు వచ్చిందని రాంచరణ్ పేర్కొన్నాడు. తన పనికి నాన్న ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారని, నాన్న టించిన చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గతేడాది తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమెక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, అలాగే మాస్, మసాల అన్ని అంశాలు ఈ చిత్రంలో మిళితమై ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో చిత్రం ఎలా ఉంటుందనే దానిపై చిరు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ లో డ్యాన్స్ వేసి తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని చిరు నిరూపించారు.

16:11 - June 23, 2016

మెదక్ : మల్లన్న సాగర్ నిర్మాణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా భూ సేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మెదక్ లో మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్మాణ విషయంలో ప్రభుత్వతీరు సరైందికాదని అభిప్రాయపడ్డారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న భూ సేకరణకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా రేపు సంగారెడ్డిలో ముంబయి జాతీయరహదారిని దిగ్భందిస్తామని అన్నారు.  

 

రాజ్ నాథ్ కు సీఎం కేసీఆర్ లేఖ..

హైదరాబాద్ : ఏపీ భవన్ గా మారిన ఢిల్లీలోని ప్రాంతాన్ని తమకు తిరిగి ఇచ్చి వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ స్థలాన్ని తమకు అప్పగిస్తే, తాము తెలంగాణ భవన్ ను నిర్మించుకుంటామని లేఖలో పేర్కొన్నారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై :స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. 263 పాయింట్ల లాభంతో 27,002 వద్ద సెన్సెక్స్ ముగియగా 67 పాయింట్ల లాభంతో 8,270 వద్ద నిప్టీ ముగిసింది.

ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వానికి మెక్సికో మద్దతు..

ఢిల్లీ : ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వానికి మెక్సికో మద్దతు ప్రకటించింది. అణు సరఫరా దేశాల బృందంలో భారత్ కు సభ్యత్వం కల్పించాల్సినవసరం ఎంతో ఉందని మెక్సికో రాయబారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉబ్బెకిస్తాన్ లో మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరు కానున్నారు. ఎన్ఎస్ జీలో భారత్ కు సభ్యత్వంపై చైనా అధ్యక్షుడితో మోడీ చర్చించనున్నారు.

15:57 - June 23, 2016

హైదరాబాద్ : ఆర్టీసీని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపేరుతో మరింత నడ్డివిరుస్తున్నాయి. నష్టాలు భరించేందుకు నిధులులిస్తున్నామని బయటకు చెప్పుకుంటూ లోపల మాత్రం సంస్థపై మోయలేని భారం వేస్తున్నాయి. అసలు ఆర్టీసీలో నష్టాలకు కారణమేంటి? ప్రత్యేక కథనం.. 
ఆర్టీసీలో కొనసాగుతున్న సమస్యలు 
ప్రజారవాణా సంస్థ ఆర్టీసీలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి... నిత్యం వేలాదిమందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నా నష్టాలు మాత్రం తప్పడం లేదు.. ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో సంస్థ నడ్డివిరుస్తూ సంస్థ ఇబ్బందుల్ని పెంచుతున్నాయి.. 
లీటర్‌ డీజిల్‌పై 26శాతం ట్యాక్స్‌ 
ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం డీజిల్‌... టీఎస్‌ ఆర్టీసీకి ప్రతినెలా 58లక్షల డీజిల్‌ అవసరమవుతుంది... ఈ ఇంధనాన్ని కేంద్ర పెట్రోలియం శాఖద్వారా సంస్థ కొనుగోలు చేస్తోంది.. ఇంత పెద్దమొత్తంలో డీజిల్‌ తీసుకుంటున్నా కేంద్రం ధరలో ఏమాత్రం రాయితీ ఇవ్వడంలేదు.. ప్రజారవాణా సంస్థ అన్నది చూడకుండా మామూలు రేటుకే విక్రయిస్తోంది.. దీనికితోడు పన్నుపోటుకూడా ఎక్కువగానే ఉంది... లీటర్‌ డీజిల్‌పై 26శాతం ట్యాక్స్‌ కట్టాల్సిరావడంతో లీటరు ఇంధనం ధర 60 రూపాయలకు చేరింది.. 
సర్వీస్‌ ట్యాక్స్‌ల పేరుతో బాదుడు
డీజిల్‌ రేటు, పన్నులేకాదు.. మరోరూపంలోనూ ఆర్టీసీకి వడ్డన తప్పడంలేదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ కేంద్రం డీజిల్‌ ధరలనూ సవరించి సంస్థ నడ్డివిరుస్తోంది.. ఇక ధరలు తగ్గితే ఆ బెనిఫిట్‌ సంస్థకు రాకుండా చేస్తోంది.. సర్వీస్‌ ట్యాక్స్‌లపేరుతో బాదుడు కొనసాగిస్తోంది.. దీంతో లీటరుకు యాభై పైసలు పెరిగినా నెలకు 20కోట్ల రూపాయల భారం సంస్థపై పడుతోంది. డీజిల్‌తో బాధలు ఇలా ఉంటే పాస్‌లపై రాయితీలు తదితర రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల కాక ఆర్టీసీ కష్టాలపాలవుతోంది... సంస్థను నడిపేందుకు డబ్బులేక ఉద్యోగుల కోఆపరేటివ్‌ సంస్థనుంచి దాదాపు 200కోట్ల రూపాయల్ని యాజమాన్యం అప్పుగా తీసుకుంది.. ఇలా రుణాలు, వాటి వడ్డీలు సంస్థపై మరింత భారం పెంచుతున్నాయి.. 
నష్టాల్ని మరింత పెంచుతున్న మోటార్‌ వెహికిల్‌ ట్యాక్స్‌ 
ఈ సమస్యలు ఇలా ఉంటే... మోటార్‌ వెహికిల్‌ ట్యాక్స్‌ సంస్థ నష్టాల్ని మరింత పెంచుతోంది.. ప్రైవేటు వాహనాలతో సమానంగా ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ఎంవీ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది.. పైగా ఈ ట్యాక్స్‌ దేశంలోనే అత్యధికశాతంగా ఉంది.. బెంగాల్‌లో గత వామపక్ష ప్రభుత్వం ఆర్టీసీని ఎంవీ ట్యాక్స్‌నుంచి మినహాయింపు ఇచ్చింది.. ఇప్పుడు మమత సర్కారూ ఇదే పద్ధతి కొనసాగిస్తోంది... కర్ణాటకలోనూ తొమ్మిదేళ్లుగా ఆర్టీసీకి ట్యాక్స్‌ లేదు.. మన దగ్గరమాత్రం ప్రజారవాణా అన్నవిషయాన్ని సర్కారు అస్సలే పట్టించుకోవడంలేదు.... ఇలా ఈ ట్యాక్స్‌లు ఆ ట్యాక్స్‌లంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులమోత మోగిస్తున్నాయి.. డీజిల్‌పై సుంకం, ఎంవీ ట్యాక్స్‌ మినహాయిస్తే ఆర్టీసీకి ఎలాంటి నష్టాలులేకుండా నడుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 
పల్లె వెలుగులో 30 కి.మీ.లోపు రూపాయి
మరోవైపు ఆర్టీసీ నష్టాలపేరుచెప్పి చార్జీల పెంపుకు టీఎస్‌ సర్కారు సిద్ధమైంది.. పల్లెవెలుగులో 30 కిలోమీటర్లలోపు రూపాయి... అది దాటితే రెండు రూపాయలు పెంచాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.. ఈ విధానంలో పెంచిన ఆర్టీసీ చార్జీల వివరాలను స్టేజీలవారీగా తయారుచేయడంలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు.. అయితే ఈ చార్జీల పెంపుతో ఎంత ఆదాయం వస్తుందో ఇప్పటివరకూ సర్కారు క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం... 

 

టి. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు. మొత్తంగా 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ముంబై చేరుకున్న మంత్రి హరీష్ రావు..

ముంబై : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ముంబైకి చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గిరీష్ మహజన్ తో భేటీ కానున్నారు.

 

కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వ తీరును ఖండించిన వైసీపీ..

విజయవాడ : కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ కు ప్రభుత్వం సరైన ప్రణాళికతో వెల్లకపోవడం దారుణమన్నారు. మంత్రి దేవినేని ఉమ నిర్లక్ష్యం ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిందని, కృష్ణా నది జలాల విషయంలో కృష్ణా డెల్టాకు, రాయలసీమకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం రాయలసీమను చిన్న చూపు చూస్తోందని, అందుకే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

15:51 - June 23, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రయోజనాలను మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలంగాణ ముంగిట తాకట్టు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి అదనపు నీటి కేటాయింపుల కోసం పక్కాగా వెళితే ఏపీ మంత్రి మాత్రం ఎలాంటి సన్నద్ధత లేకుండానే భేటీకి వెళ్లారని దుయ్యబట్టారు. కృష్ణా బోర్డు ఎదుట వాదనలు వినిపించడంలో ఏపీ విఫలం అయ్యిందని మండిపడ్డారు  

 

కరీంనగర్ లో టి. కాంగ్రెస్ నేతల పర్యటన..

కరీంనగర్ : హుస్నాబాద్, గౌరవెల్లి, గండుపెల్లి భూ నిర్వాసిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరిట కోట్లు దండుకొంటోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల పునర్ విభజన చేస్తున్నారని తెలిపారు.

కృష్ణా పుష్కర ఏర్పాట్లపై టెన్ టివి కథనానికి స్పందన..

విజయవాడ : కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై టెన్ టివి కథనానికి స్పందన వ్యక్తమైంది. కృష్ణవేణి, పద్మావతి పుష్కర ఘాట్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పుష్కర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కర ఘాట్ల పనులను మరోసారి పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు. గడవులోగా పనులు పూర్తికాకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పుష్కర ఘాట్లే కాకుండా ఇతర ప్రాంతాలను కూడా సుందరీకరించడం జరుగుతుందని తెలిపారు. విజయవాడను కెనాల్ సిటీగా మారుస్తామన్నారు. వారథి నుండి ఇబ్రహింపట్నంలోని పవిత్ర సంగమం వరకు ఆహ్లాదకరమైన పుష్కర ఘాట్లను నిర్మిస్తామన్నారు.

ఎన్ ఎస్ జీలో భారత సభ్యత్వానికి మెక్సికో మద్దతు

ఢిల్లీ : ఎన్ ఎస్ జీలో భారత సభ్యత్వానికి మెక్సికో మద్దతు తెలిపింది. అణు సరఫరా దేశాల బృందంలో భారత్ కు సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని మెక్సికో రాయబారి అన్నారు.

ఉజ్జెకిస్తాన్ లో ప్రధాని మోడీ పర్యటన

ఢిల్లీ : ఉజ్జెకిస్తాన్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరుకానున్నారు. ఎన్ ఎస్ జీలో భారత్ కు సభ్యత్వంపై చైనా అధ్యక్షుడితో మోడీ చర్చించనున్నారు. 

 

15:12 - June 23, 2016

లైంగిక సామర్థ్యం పెంచుతుందంట..పాములే కనకవర్షం కురిస్తాయంట..మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్న గ్యాంగ్ లు..

మొన్నటి వరకు రెండు తలల పాము..ఆ తరువాత మరో జంతువు. ఇప్పుడు తాబేళు. తెలుగు రాష్ట్రాల్లో మూగ జీవితాల వ్యాపారమే ఇప్పుడు హాట్ హాట్. తాబేళును ఇంట్లో పెంచుకుంటే తరతరాలకు సరిపడా సంపద వస్తుందంట. ఇక రెండు తలల పాము ఇంట్లో ఉంటే చాలు కనకవర్షం కురుస్తుందంట. కొంతమంది అపరిచితులు అజ్ఞాతంలో ఉంటూ పుకార్లు..షికార్లు చేయిస్తున్నారు. రెండు తలల పామును లక్షల్లో పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. తాబేళ్లును ఒక్కో ధర రూ. 5వేల పైబడి పలుకుతోంది. లక్ష్మీ కటాక్షం వస్తుందో తెలియదు కానీ కొందరు స్వార్థంతో మరో తరహా మూఢనమ్మకం పెరుగుతుందనడంలో సందేహం లేదు. మూగ జీవాల స్వేచ్చను హరించడమే కాకుండా మూఢత్వంతో వారి ప్రాణాలను హరించి వేస్తున్నారు.
రెండు తలల పాము బరువు బట్టి ధర..అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలు. లోకల్ మార్కెట్లో లక్షలు. దీనికి ఎందుకంత డిమాండ్ అంటారా ? నట్టింట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి నాట్యం చేస్తుందంట. మూఢ నమ్మకాలతో మూలుగుతున్న అమాయకులెందరినో బోల్తా కొట్టిస్తున్న ప్రచారంతో వీటికి డిమాండ్ పెరిగింది. లైంగిక సామర్థ్యం పెంచడానికి రెండు తలల పాము ఉంచుకోవాలంట. .ఇది మూఢత్వమా..మూర్ఖత్వమా ?  ఒక్క పాములే కాదు. ఈ మధ్యకాలంలో తాబేలు. రకరకాలున్నాయ. ఇంట్లో పెంచుకుంటే కనకవర్షం కురుస్తుందంట. యువకులే అక్రమ రవాణా చేస్తున్నారు. డబ్బు సంపాదించుకోవడానికి ఇదో తరహా వ్యాపారం. దీని గురించి ఆసక్తికరమైన విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

14:58 - June 23, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోది ఇవాళ ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కంట్‌ బయలుదేరారు. అక్కడ రెండు రోజుల పాటు జరిగే శాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సులో ప్రధాని పాల్గోనున్నారు. ఎస్‌సిఓ లోని సభ్యత్వ దేశాలు పరస్పర ఆర్థిక సహకారాన్ని అందించుకోనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోది- చైనా రాష్ట్రపతి జిన్‌పింగ్‌ను కలుసుకునే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌జిలో భారత్‌ ప్రవేశం కోసం మోది చైనా మద్దతును కూడబెట్టేందుకు యత్నిస్తారు. ఎస్‌సిఓలో చైనాతో పాటు రష్యా కూడా సభ్యత్వ దేశమే. మరోవైపు ఎన్‌ఎస్‌జిలో భారత సభ్యత్వానికి ఫ్రాన్స్‌ మద్దతు తెలిపింది. సియోల్‌లో జరగనున్న ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశాలకన్నా ముందు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించడం భారత్‌కు పెద్ద విజయంగా భావిస్తున్నారు.

14:44 - June 23, 2016

ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా రెండోదశ కింద మొత్తం 921 చెరువులకు ప్రభుత్వం 320 కోట్లు మంజూరు చేసింది. గత ఐదు నెలల నుంచి చెరువుల్లో పూడిక తొలగించే పనులు చురుగ్గా సాగాయి. దీంతో పాటు చెరువు కట్టలు పటిష్టపర్చటం, తూములు, అలుగులకు శాశ్వత మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు చెరువులను సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వాననీటిని చెరువుల్లో నిల్వ ఉంచేందుకు చెరువు తూములకు షట్టర్లు బిగించే పనులు సాగుతున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో 14 చెరువుల అభివృద్ధికి 3.51 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే పర్యవేక్షక అధికారుల కొరత తీవ్రంగా ఉండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వెలుగుమట్ల పెద్దచెరువులో తాగునీటి ప్రాజెక్టు ఉండటంతో నీరు నింపడానికి పనులు చేపట్టేందుకు వీలుకాలేదు. వేపకుంట్ల గురవారాయని చెరువు, రాంక్యాతండాలోని సుకినికుంట చెరువు పనులు గుత్తేదారుల నిర్లక్ష్యంవల్ల ఇటీవలే ప్రారంభమయ్యాయి. మల్లేపల్లి నల్లకుంట చెరువు శిఖం 10ఎకరాలు ఉండగా పట్టా భూములంటూ రైతులు అడ్డుకున్నారు. దీంతో సుమారు నాలుగున్నర ఎకరాలలో మాత్రమే పూడిక మట్టి తొలగించారు. రఘునాథపాలెంలోని నర్సింహులు చెరువు, కొండారెడ్డి చెరువులలో పూడికమట్టి సక్రమంగా తొలగించలేదు.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్ధితి..
పినపాక నియోజకవర్గంలోని అయిదు మండలాల పరిధిలో మిషన్‌ కాకతీయ రెండో దశ పనులకు వర్షం ఆటంకంగా మారింది. మొత్తం 988 చెరువులను పునరుద్ధరించి 70,579 ఎకరాల అయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడత 130 పనుల కోసం 19.20కోట్లు మంజూరు చేసింది. ఇంకా 7 చెరువుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం రెండో విడత పనులు జరుగుతున్నాయి. రెండోవిడత కింద 155 పనులు చేపట్టగా 13 శాతంలోపే పనులు పూర్తయ్యాయి. 152 చెరువుల పనులకు గుత్తేదారులతో ఒప్పందాలు జరగ్గా..151 పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 21 చెరువుల పనులు పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. 75 శాతానికి పైగా పనులు జరిగినవి 28, 50 నుంచి 75 శాతం పనులు జరిగినవి 47, 25 నుంచి 50 శాతం పనులు జరిగినవి 31, 25 శాతంలోపు పనులు జరిగినవి 24 చెరువులున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంటే రెండో విడత పనులలో ఇంకా మూడొంతుల పనులు మిగిలే ఉన్నాయి. వీటి తో పాటు జిల్లా వ్యాప్తంగా రెండు విడత చెరువుల పునరుద్ధరణ పనులు నత్తనడకనే సాగుతుడంటంతో ఖరీఫ్‌కు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదని స్దానిక నేతలు అంటున్నారు...మిషన్ కాకతీయ పనుల నత్తనడకన సాగుతుండటంతో రైతులు, స్థానిక ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. వర్షాకాలం మొదలైనా..చెరువుల పనులు ఏఒక్కటీ పూర్తిగా లేదు. వేసవి చివర్లో వచ్చిన వర్షాలతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కొన్ని చెరువుల్లో అసలు పనులు చేయలేని పరిస్థితి. అత్యధిక చెరువులు 30 నుంచి 40శాతం పనులు మాత్రమే అయ్యాయి. ఇంకా అలుగులు, తూములు, పూడికపనులు కూడా నిలిచిపోయి ఉన్నాయి.

14:38 - June 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. బాధితులకు భూసేకరణచట్టంపై అవగాన కల్పించేలా సెమినార్‌ ఏర్పాటు చేస్తామని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్ ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. 

14:38 - June 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. బాధితులకు భూసేకరణచట్టంపై అవగాన కల్పించేలా సెమినార్‌ ఏర్పాటు చేస్తామని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు డీపీఆర్ ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. 

13:48 - June 23, 2016

పశ్చిమగోదావరి : జిల్లా దెందులూరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది.. ఆర్టీసీ బస్‌ ఢీకొట్టడంతో ఇద్దరు గొర్రెలకాపరులతోసహా 50గొర్రెలు మృతిచెందాయి.. బస్సు విజయనగరం జిల్లా పార్వతీపురంనుంచి విజయవాడ వెళుతుండగా అదుపుతప్పి గొర్రెలమందపైకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదానికి కారణమైన బస్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

13:44 - June 23, 2016

హైదరాబాద్ : పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తూనేఉంది.. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను ఆ పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి కలిశారు.. పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఫారుక్‌ హుస్సేన్‌, ప్రభాకర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు.. ఫిర్యాదు పత్రాన్ని స్వామిగౌడ్‌కు అందజేశారు..ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతల గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే.

13:41 - June 23, 2016

వరంగల్ : జిల్లా ఏజెన్సీ రైతులను ఒకే ఒక్క భయం వెన్నాడుతోంది. తమ భూమి తమకు దక్కకుండా పోతుందేమోనన్న ఆందోళన వీరికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూముల్లోకి వెళ్లకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారు. వీళ్లంతా పోడు రైతులు. చెట్టుపుట్ట కొట్టి, భూమిని చదును చేసి, ఎప్పటి నుంచో సాగు చేస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ పెద్ద కష్టం వచ్చింది. ఈ భూమి నుంచి వీరిని వెళ్లగొట్టేందుకు ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగారు.

17 మండలాల్లోని 342 గ్రామాల్లో పోడు సేద్యం..
వరంగల్ జిల్లాలో 17 మండలాల్లో పోడు భూములున్నాయి. నర్సంపేట డివిజన్ లో 5 మండలాల్లో, ములుగు డివిజన్ లో 8 మండలాల్లో, మహబూబాబాద్ డివిజన్ లో 4 మండలాల్లో పోడు భూములున్నాయి. 342 గ్రామాల్లో పోడు సేద్యం చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 32775 మంది హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేశారు. వీరంతా 84 617 ఎకరాల్లో సేద్యం చేస్తున్నారు. వీరిలో 14 వేల 16మందికి హక్కు పత్రాలిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, 2939 మందికే హక్కు పత్రాలు ముట్టినట్టు గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇచ్చిన పత్రాలను కూడా అధికారులు లాక్కెళ్తున్నారంటూ పోడు సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కొత్తగూడ, నల్లబెల్లి ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలున్నాయి.

13 మండలాల్లో 80శాతం మంది పోడు రైతులు...
ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలోని 13 మండలాల్లో 80శాతం మంది పోడు రైతులే. 32వేల 75 మంది హక్కు పత్రాల కోసం అప్లయ్ చేశారు. కానీ 14వేల మందికే హక్కు పత్రాలిచ్చారు. మంగపేట మండలంలో 850 హెక్టార్లలో పోడు వ్యవసాయం చేస్తుంటే కేవలం 150 హెక్టార్లకే హక్కు పత్రాలిచ్చారు. 700 హెక్టార్లకు హక్కు పత్రాలివ్వలేదు. ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇదే తంతు. సాగుదారులకు హక్కుపత్రాలివ్వకపోగా, వారిని భూముల్లోకి రానివ్వడం లేదు. పొలం దున్నితే అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. అదేమంటే హరితహారం కోసమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లోంచి వెళ్ల గొడితే వీరెలా బతకాలి? హరితహారం పేరుతో వ్యవసాయాన్ని అడ్డుకోవడం ఇదెక్కడి న్యాయం?

అడవి బిడ్డలను తరిమేస్తున్న అధికారులు ..
ఫారెస్టు అధికారులు గొత్తికోయలను కూడా వదిలిపెట్టడం లేదు. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి ప్రాంతాల్లో 72 చోట్ల గొత్తికోయలున్నారు. వీరిని అడవిలోంచి తరిమేస్తున్నారు. జిల్లా సరిహద్దులు దాటిపోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. బెదిరిస్తున్నారు.

కొండాపురంలో 500 కుటుంబాలు 3500 ఎకరాలు సాగు...
కొన్ని చోట్ల హక్కుపత్రాలు పొందిన రైతులను కూడా ఫారెస్టు అధికారులు వేధిస్తున్నారు. పంటలు ధ్వంసం చేస్తున్నారు. హక్కుపత్రాలు లాక్కెళ్తున్నారు. నల్లబెల్లి మండలం కొండాపురంలో 500 కుటుంబాలు 3500 ఎకరాలు సాగుచేస్తున్నాయి. వంద మందికి పట్టాలిచ్చినట్టు ఇచ్చి మళ్లీ గుంజుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని చెల్పాక, అల్లంవారిగూడెం, దొడ్ల, చిన్నబోయినపల్లి, కొత్తూరు, లింగాపురం, బాసగూడెం పోడు భూముల్లో అధికారులు ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దింపుతున్నారు.

హరితహారం పేరుతో ఆదివాసీల వెతలు ....
మొత్తానికి హరితహారం పోడువ్యవసాయం చేస్తున్నవారికి చుక్కలు చూపిస్తోంది. ఓ వైపు స్మగ్లర్లు అడవులను సర్వనాశనం చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, వ్యవసాయం చేస్తున్న భూముల్లో మొక్కలు పెంచుతామనడానికి మించిన జోక్ మరొకటి వుంటుందా? అడవి బిడ్డల విషయంలో ఎందుకింత నిర్ధయ?  

13:38 - June 23, 2016

ఢిల్లీ : కృష్ణా జలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖామంత్రుల సమావేశం అసంపూర్తిగా ముగిసింది.. రెండుగంటలపాటు కొనసాగిన సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, దేవినేనిమధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.. కేంద్ర జలవనరుల కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగింది.. నదీ జలాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని ఏపీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెలంగాణ నుంచి ఒక్క చుక్కనీటిని కూడా ఆంధ్ర కోరుకోవడం లేదని చెప్పారు. తెలంగాణకు కేటాయించబడిన నీటిని మాత్రమే వారు వాడుకోవాలని దేవినేని స్పష్టం చేశారు. ఏపీ మొండివైఖరివల్లే ఈ అంశంపై స్పష్టతరావడంలేదని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు..

13:38 - June 23, 2016

ముంబై : ఉడ్‌తా పంజాబ్‌ సెన్సార్‌ కాపీ లీక్‌ వ్యవహారంలో ముంబై క్రైం పోలీసులు ఓ వెబ్‌సైట్‌ యజమానిని అరెస్ట్‌ చేశారు. అల్‌జడ్‌మూవీస్‌ డాటిన్‌ వెబ్‌సైట్‌ యజమాని దీపక్‌ టోరంట్‌ ద్వారా సినిమాను తన వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. ఆ వెబ్‌సైట్‌ నుంచి ఇతర వెబ్‌సైట్‌లలోకి యథేచ్ఛగా డౌన్‌లోడు చేసుకున్నట్లు పేర్కొన్నారు. సినిమా విడుదల కన్నా రెండు రోజుల ముందే ఉడ్‌తా పంజాబ్‌ చాలా వెబ్‌సైట్‌లలో లీకైంది. దీనిపై సైబర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు విచారణ తర్వాత దీపక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యా యత్నం...

విశాఖ: అరకులో ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. చేతులు, గొంతు కోసుకుని ఆర్మీ ఉద్యోగి మహేంద్ర సింగ్ రావత్ ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషయమించటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై వివరాలు తెలియరావాల్సి వుంది.

13:22 - June 23, 2016

హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌ దగ్గర ఏపీ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.. గ్రూప్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్ని గ్రూప్‌ 1లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. దీనిపై ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారనీ దీనిపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అరకులో ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం..

విశాఖపట్టణం : అరకులో ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చేతులు, గొంతు కోసుకుని మహేంద్ర సింగ్ రావత్ ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేశాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

హన్మకొండలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశం..

వరంగల్ : హన్మకొండలో ఎన్ఆర్ఆర్ భవన్ లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం యత్నిస్తోందని మల్లు విమర్శించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.

 

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

కరీంనగర్ : మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ను కేటీఆర్ ప్రారంభించారు. నారాయణాపూర్ నుండి కొండాపూర్ వరకు రూ. 9కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేశారు.

 

బాబును కలిసిన బ్రిటీష్ హై కమిషనర్..

విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బ్రిటీష్ హై కమిషనర్ డొమ్మిక్ కలిశారు. యూకే సహకారంతో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రులకు భూ కేటాయింపులు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో అర్బన్ ట్రాన్స్ పోర్టు రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్మిక్ ఆసక్తి వ్యక్తం చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా తమ సంస్థలను ప్రోత్సాహిస్తామని తెలిపారు.

12:44 - June 23, 2016

ఢిల్లీ : జల వివాదంపై కేంద్రం వేసే ముగ్గురు సీనియర్ ఇంజనీర్ల కమిటీకి మేం సిద్ధంగా వున్నామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఈ విషయంగా కేంద్రం ఎప్పుడు పిలిచినా రావటానికి సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ఆదేశాలను పాటించకుండా తెలంగాణ రాయలసీమ ప్రజలకు తాగు నీరు ఇవ్వటానికి అడ్డుపడుతోందన్నారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ తో తెలుగు మంత్రుల భేటీ ముగిసింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. మూడవసారి సమావేశంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు వారి వారి వాదనలను వినిపించారు. కాగా నీటి పంపకాల విషయంలో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కృష్ణా బోర్డు ఆదేశాలను పాటించకుండా తెలంగాణ రాయలసీమ ప్రజలకు తాగు నీరు ఇవ్వటానికి అడ్డుపడుతోందన్నారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను తెలంగాణ ప్రభుత్వం సమర్థిస్తోందన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలరను దెబ్బతీస్తామన్నారు. ఏపీ భూభాగంలో వున్న సాగర్ కుడి కాల్వను మేమే నిర్వహిస్తామంటే తెలంగాణ ఒప్పుకోవట్లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్న కర్నాటక సర్కార్ మీకు మిత్రులా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజను చేసి అప్పులను ఆంధ్ర నెత్తిమీద వేసిన ఈరోజు పంటలు పండించుకోవటానికి త్రాగునీటి కూడా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రా మధ్య చర్చించుకోవటానికి కేంద్రం గడువునిచ్చిందని ఆయన తెలిపారు. 

మండలి ఛైర్మన్ ను కలిసిన షభ్బీర్..పొంగులేటి..

హైదరాబాద్ : మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను కాంగ్రెస్ నేతలు షబ్బీర్ ఆలీ, పొంగులేటిలు కలిశారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, ప్రభాకర్ లపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు ఫారుఖ్, ప్రభాకర్ లపై అనర్హత వేటు వేయాలని స్వామిగౌడ్ ను కోరినట్లు షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. ఈ అంశంపై తాము కోర్టుకు వెళుతామని, తలసాని టిడిపి ఎమ్మెల్యేగా ఉండది మంత్రి కావడం దారుణమన్నారు. రికార్డు కోసమే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని షబ్బీర్ ఆరోపించారు.

 

కూకట్ పల్లిలో 20 విద్యార్థినిలకు అస్వస్థత...

హైదరాబాద్ : కూకట్ పల్లి ఎన్ఆర్ఐ గర్ల్స్ హాస్టల్ లో 20 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ప్రగతి నగర్ పీపుల్ ఆసుపత్రికి తరలించారు.

 

ముంబై బయలుదేరిన మంత్రి హరీష్..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ముంబై బయలుదేరారు. సాయంత్రం మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహజన్ తో చర్చలు జరుపనున్నారు.

12:36 - June 23, 2016

ఢిల్లీ : కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తీసుకొస్తే తెలంగాణకు అభ్యంతరం లేదని కానీ ఈ విషయంలో ఏపీ రాష్ట్రం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణానది జలాల్లో వాటాలపై తేల్చుకొనేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ బాట పట్టిన సంగతి తెలిసిందే. వీరు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గురువారం నాడు మరో దఫా చర్చలు జరిగాయి. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ తో తెలుగు మంత్రులు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మళ్లీ మొదటికొచ్చింది. సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు వారి వారి వాదనలను వినిపించారు. కాగా నీటి పంపకాల విషయంలో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర నిర్ణయాన్ని ఏపీ వ్యతిరేకించింది - హరీష్..
భేటీ అనంతరం రాష్ట్ర మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. జలవివాదంపై కమిటీ వేసి అధ్యయనం చేస్తామన్న కేంద్ర నిర్ణయాన్ని ఏపీ వ్యతిరేకించిందని  పేర్కొన్నారు. నీటి పంపకాలపై ఎటువంటి స్పష్టతా లేకుండానే భేటీ ముగిసిందని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగితే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని తెలిపారు. సాగర్ కుడి కాలువ గేట్లు ఏపీకి అప్పగించటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ నుంచి మాకు చుక్కనీరు కూడా ఎక్కువ అవసరం లేదని, తమకు రావాల్సిన 90 టీఎంసీలు ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే రావడం జరిగిందని, 299 టీఎంసీలకు అదనంగా నీరు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం కాని ఏపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. అక్కడా కూడా న్యాయం జరుగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఇరు రాష్ట్రాలు చర్చించుకునేందుకు కేంద్రం నవంబర్ 1 వరకూ గడువును ఇచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

బ్రిటన్ లో ప్రారంభమైన ఓటింగ్..

లండ‌న్‌: బ్రిట‌న్‌లో చరిత్రాత్మ‌క రెఫ‌రెండ‌మ్‌కు సంబంధించిన ఓటింగ్ కాసేప‌టి క్రిత‌మే మొద‌లైంది. యురోపియ‌న్ యూనియ‌న్‌లో బ్రిట‌న్ కొన‌సాగాలా వ‌ద్దా అన్న‌ది అక్క‌డి ప్ర‌జ‌లు ఇవాళ తేల్చ‌నున్నారు. సుమారు 4 కోట్ల 64 ల‌క్ష‌ల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొంటార‌ని అంచ‌నా.

 

ఏపీ నుండి చుక్క నీరు ఎక్కువసరం లేదు - హరీష్..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తమకు చుక్కనీరు కూడా ఎక్కువ అవసరం లేదని తె తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కృష్ణానది జలాల్లో వాటాలపై కేంద్ర జనవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శితో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రులు నేడు భేటీ అయ్యారు. ఈ భేటీ అసంపూర్తిగా ముగిసింది. అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తమకు రావాల్సిన 90 టీఎంసీలు ఇవ్వాలని చెప్పడం జరిగిందని, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే వచ్చాయన్నారు. 299 టీఎంసీలకు అదనంగా నీరు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. కృష్ణా నదీ జలా పంపిణీలో ఏపీ మొండి వైఖరిని తీసుకువచ్చిందని తెలిపారు.

అసంపూర్తిగా ముగిసిన దేవినేని, హరీష్ చర్చలు..

ఢిల్లీ : తెలుగు రాష్ర్టాల మంత్రులు హరీష్, దేవినేని మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన న నెలకొంది. దీనితో తెలుగు రాష్ట్రాల మధ్య జరిగే నీటి పంపకాలపై కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని కేంద్రం పేర్కొంది. కృష్ణానది జలాల్లో వాటాలపై కేంద్ర జనవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శితో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమలు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో సైతం ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై ప్రతిష్టంభన తొలగలేదు.

12:16 - June 23, 2016

ఎక్కుసార్లు విదేశీ ప్రయాణం ఎవరు చేశారని ప్రశ్నిస్తే మదిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెలుగుతుంటారు. కారణం ఆయన ఎక్కువసార్లు విదేశీయానం చేయడమే. రెండు సంవత్సరాల్లో 40 సార్లు విదేశీయానం చేశారు. దీనిపై ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. తాజాగా మరో వార్త చుట్టేస్తోంది. మోడీకి ఓ స్పెషల్ ఫ్లైట్ కొనుగోలు చేయనున్నారంట. ఈ విమానం కొనుగోలపై ఈనెల 25న కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుందంట. ఆ రోజు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్..ఆధునాతన విమానం బోయింగ్ 777-300 పై అధికారులతో చర్చించనున్నారు.
రెండు దశాబ్దాలుగా భారత ప్రధాన మంత్రుల కోసం బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి విమానం స్థాయిలో అన్ని వసతులు ఇందులో ఉండబోతున్నాయంట. ప్రధాన మంత్రి మోడీకి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక రక్షణ పరికరాలతో కూడిన విమానంగా తయారు చేయాలని రక్షణ శాఖ భావిస్తోందట.

ఇక ఈ విమానంలో ఏమి ఉండబోతున్నాయో చూద్దాం..

అధికారులు పనిచేయడానికి తగిన వర్కింగ్ స్టేషన్లు.
రెండు వేల మందికి ఆహారం నిల్వ చేసే అవకాశం.
అత్యవసర సమయంలో ఆకాశంలోనే ఇంధనం నింపే సౌకర్యం.
19 టీవీ సెట్ లు..బ్రాడ్ బ్యాండ్ రెడియో, టెలిఫోన్ కనెక్షన్ల ఏర్పాటు.
ప్రధాని కోసం ప్రత్యేక కార్యనిర్వాహక కార్యాలయం, 5 స్టార్ వసతి గల బెడ్ రూం.
గ్రేనెడ్, రాకెట్ దాడులను ధీటుగా ఎదుర్కొనే టెక్నాలజీ ఏర్పాటు.
శత్రువుల రాడార్ లను జామ్ చేయడమే కాకుండా దారి మళ్లించగలిగే సామర్థ్యం.
ఎల్లవేలలా డాక్టర్ అందుబాటు. క్లినిక్ ల ఏర్పాటు.
12:10 - June 23, 2016

అవును...మగవారు 30 సెకన్లు కూడ ఆగలేరంట. ఏ విషయంలో అనుకుంటున్నారా ? దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది చదవండి..

ప్రస్తుతమున్న సమాజంలో శాస్త్ర సాంకేతిక ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలిసింది. మనిషి జీవితంలో 'ఫోన్' అనేది కీలకంగా మారిపోయింది. రకరకాల ఫీచర్లు..సాంకేతికతతో ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు..ఆండ్రాయిడ్ ఫోన్లు అంటూ మార్కెట్ ను కొల్లకొడుతున్నాయి. ఎక్కువగా ఈ సార్ట్ ఫోన్ లను ఆడవారు..మగవారు వాడుతున్నారు. కానీ మగవారు మాత్రం వీటిని విడిచి పట్టుమని 30 సెకన్లు కూడా ఉండలేకపోతున్నారంట. జర్మనీలోని వుర్జ్ బర్గ్ వర్సిటీ, బ్రిటన్ లోని నొట్టింగమ్ - ట్రెంట్ విశ్వవిద్యాలయం పరిశోధనలో ఇది తేలిదంట. మహిళలు 57 సెకన్లు ఫోన్ కు దూరంగా ఉంటే మగవారు మాత్రం కేవలం 21 సెకన్ల కంటే ఎక్కవ దూరం ఉండలేకపోతున్నారని తేలిదంట. ఫోన్లు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ వత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అదండి సంగతి...

మంత్రులు హరీష్..దేవినేని ఉమ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదా ?

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మంత్రులు దేవినేని, హరీష్ రావుల భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో కూడా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు వీరిద్దరూ ఢిల్లీ బాట పట్టిన సంగతి తెలిసిందే.

రాజ్ నాథ్ కు కేసీఆర్ లేఖ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. పదో షెడ్యూల్ లోని సంస్థల విభజనపై ఇదివరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించాలని లేఖలో కోరారు.

11:37 - June 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రయాణానికి సామాన్య ప్రజలు ఆధారపడే బస్ ఆర్టీసీ అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో సామాన్యమానవుడి నెత్తిపై సర్కార్ మరో బండను వేయనుంది. ఇప్పటికే నిత్యావసరాలు చుక్కలనంటుతున్న తరుణంలో తాజాగా ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. సర్కారు ఖజానా నింపుకోవటానికి సామాన్య ప్రజలే తప్ప ధనికులు మాత్రం వారికి కనిపించారా? అని ప్రశ్నిస్తున్నారు..తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు హాయి బతకవచ్చు అనుకుంటే ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్ రాష్ట్రంలో సామాన్యుడు బ్రతకటం ప్రశ్నార్థకం అయ్యేలా సర్కారు నిర్ణయాలు తీసుకోవటం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటానికి చాలా మార్గాలు వున్నాయనీ..సగటు మనిషి బ్రతకటానికి కష్టపడే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయం...ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి...ఆర్టీసీ చార్జీల మోతతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోండి...

ఉజ్జెకిస్థాన్ బయలుదేరిన ప్రధాని మోదీ...

ఢిల్లీ : ప్రధాని మోదీ ఉజ్జెకిస్తాన్ వెళ్ళనున్నారు. ఈ పర్యటన నేపథ్యంతో ప్రధాన చైనా, రష్యా రాష్ట్రపతులను ప్రధాని కలవనున్నారు. కాగా ఎన్ ఎస్ జీలో భారత సభ్యత్వంపై ప్రధాని మద్ధతు కోరనున్నారు. కాగా ఉజ్జెకిస్తాన్ లో ఎన్ ఎస్ జీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే.

అటవీ శాఖ అధికారులతో 'బాబు' భేటీ...

గుంటూరు : అటవీ శాఖ అధికారులతో సీఎం చద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ శాండిల్ మొక్కల పెంపకంఐ అధికారులతో బాబు చర్చలు జరుపుతున్నారు. జులై నాటికి కోటి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆయుర్వేద మొక్కల పెంపకంపై బాబా రాందేవ్,జగ్గీవాసుదేవ్ సహాకారం తీసుకోవాలననీ...మొక్కల పెంపకానికి కృషి చేసినవారికి అవార్డులిచ్చి పోత్సహించాలని సూచించారు.  

మోహన్ భగవత్ తో భేటీ కానున్న గజేంద్ర చౌహాన్..

మహరాష్ట్ర : ఎఫ్టీఐఐ ఛైర్మన్ గజేంద్ర చౌహాన్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో భేటీ కానున్నారు.

తిరువనంతపురం రాష్ట్ర బీజేపీ కమిటీ భేటీ..

కేరళ : తిరువనంతపురం బీజేపీ రాష్ట్ర కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన అంశాలు..ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

సాయంత్రం బీసీసీఐ కోచ్ ప్రకటన..?

ఢిల్లీ : బీసీసీఐ నూతన కోచ్ ఎవరో గురువారం తేలనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం సాయంత్రం బీసీసీఐ కోచ్ పేరును ప్రకటించే అవకావం ఉందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

10:45 - June 23, 2016

ఢిల్లీ : కృష్ణా జలాలలపై జలవనరుల కార్యదర్శి నేతృత్వంలో అమర్ జీత్ సింగ్ తో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమా భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్రమంత్రి ఉమాభారతితో సమావేశం కానున్నారు. కాగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాద సరిష్కారం కోసం ఇప్పటికే రెండు రోజులపాటు భేటీ అయ్యారు..కానీ ఇరు రాష్ట్ర మంత్రుల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో ఈరోజుకూడా సమావేశయ్యారు. కాగా  గురువారం  భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య వున్న నీటి పంపకాల విషయంలో క్లారిటీ రానుందో లేదో వేచి చూడాలి. ఈ సమస్యలపై అపెక్స్ కమిటీ వేయాలని ఏపీ కోరుతోంది. దీంతో సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించే అవకాశముంటుందని అభిప్రాయపడుతోంది. ఉమాభారతితో భేటీ అనంతరం తెలంగాణ మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయిన గోదావరి నది ప్రాజెక్టులపై తెలంగాణ-మహారాష్ట్ర మధ్య తుది ఒప్పందం షెడ్యూల్ ఖరారుకు అవకాశమున్నట్లు సమాచారం. 

ద్రవ్యోల్బణం తగ్గించే ఆసనాలు వేయండి - శివసేన..

ముంబై : యోగాడే కు తాము మద్దతు తెలియచేస్తున్నట్లు శివసేన ప్రకటించింది. కానీ ప్రధాన మంత్రి మోడీ వచ్చి ద్రవ్యోల్బణం తగ్గించే ఆసనాలు వేయాలని వ్యాఖ్యానించింది.

బీహార్ లో బాలికపై గ్యాంగ్ రేప్..

బీహార్ : రాష్ట్రంలోని మోతిహరి ప్రాంతంలో ఓ బాలికపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈమెను ఆసుపత్రిలో చేరిపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నారు.

 

ఆర్ఎస్ ఎస్ ఇఫ్తార్ పార్టీపై శివసేన స్పందన..

ముంబై : ఆర్ఎస్ఎస్ ఇవ్వనున్న ఇఫ్తార్ విందుపై శివసేన స్పందించింది. ఇది పక్కగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వేషధారణేనని, కాంగ్రెస్ విమర్శించడానికే ఇఫ్తార్ విందులు ఇవ్వనున్నారని శివసేన పేర్కొంది.

10:36 - June 23, 2016

హైదరాబాద్ : కార్మికుల బకాయిలు చెల్లింపు, డీఏ కోసం డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఒకరోజు సమ్మె పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో ఏడు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేత వి.ఎస్ రావు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం అన్ని చేస్తే కార్మికులకు ఒళ్లు బలిసి సమ్మె చేయట్లేదని .. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే సమ్మెకు దిగామని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీ యాజమన్యం చేసిన ఒప్పందాన్ని తుంగలో తొక్కింది కాబట్టి సమ్మె చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులు కాదు ప్రయివేటు బస్సులను తీసుకుంటామన్నారు. 3000మంది కార్మికుల బతుకులు బుగ్గిపాలయిపోతున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మాకై మేముగా సమ్మె చేయట్లేదనీ...సమ్మె చేస్తే పరిస్థితులు ప్రభుత్వం కల్పించటంతోనే సమ్మె చేస్తే పరిస్థితికి ప్రభుత్వం మమ్మల్ని నెట్టిందని ఆయన పేర్కొంన్నారు. దీనికి ప్రధానంగా ప్రభుత్వానిదే తప్ప జేఏసీ కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రపంచ బ్యాంకు విధానాలను అవలభించటం వల్లనే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి...కార్మిక జేఏసీ సమ్మెపై మర్ని వివరాలు తెలుసుకోండి...

మొక్కల పెంపకానికి ఓ ప్రత్యేకాధికారి - సీఎం బాబు..

విజయవాడ : మొక్కల పెంపకానికి రాష్ట్రస్థాయిలో త్వరలో ఓ ప్రత్యేకాధికారిని నియమిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎర్రచందనం, మొక్కల పెంపకంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. విజయవాడ రాయనపూడిలో త్వరలో వనమహోత్సవం చేపడతామని, మొక్కలు నాటడంతో పాటు పెంపకం, పరిరక్షణ ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

దుర్గం చెరువులో అస్థి పంజరం..

హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువులో ఓ అస్థిపంజరం లభ్యమైంది. ఈ అస్థిపంజరం 30 ఏళ్ల మహిళదిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

 

దుర్గగుడిలో భారీగా ఉద్యోగుల బదిలీలు..

విజయవాడ : దుర్గగుడిలో భారీగా ఉద్యోగులను బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న 36 మంది ఉద్యోగులపై ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.

మహిళా కమిషన్ ఎదుట సల్మాన్ హాజరౌతారా ?

ముంబై : దేశవ్యాప్తంగా దుమారం రేపిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ రేప్‌ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమన్లు జారీ చేసింది. 29న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హాజరు కాకపోతే ఏకపక్షంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరి సల్మాన్ హాజరవుతారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది.

 

ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే దినేష్ మోహనియా అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

మంత్రులు హరీష్..దేవినేని ఉమలు భేటీ..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మంత్రులు హరీష్, దేవినేని ఉమలు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాల విషయంలో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం ఇరువురు మంత్రులు కేంద్ర మంత్రి ఉమా భారతితో సమావేశం కానున్నారు.

10:02 - June 23, 2016

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు మేకప్ వేసుకుంటారా ? షూటింగ్ ఎప్పుడు ప్రారంభమౌతుందా ? అని ఎదురు చూస్తున్న అభిమానుల కలలు ఫలించాయి. చిరంజీవి 150వ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు, ఆయన అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు తెరపడనుంది. నేడు చిరంజీవి షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వెలువడుతున్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గతేడాది తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమెక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, అలాగే మాస్, మసాల అన్ని అంశాలు ఈ చిత్రంలో మిళితమై ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో చిత్రం ఎలా ఉంటుందనే దానిపై చిరు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ లో డ్యాన్స్ వేసి తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని చిరు నిరూపించారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే కథానాయికను ఎంపిక చేయలేదు. అనుష్క, శ్రియ, నయనతార వంటి హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నా ఇంకా క్లారిటీ రాలేదు. చిరు షూటింగ్ ప్రారంభమౌతున్న సందర్భంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారంట.

10:01 - June 23, 2016

సినీ నటుడు బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుకున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే మొరాకోలో షూటింగ్ ముగించుకున వచ్చిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం నగరంలో రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. సోమవారం నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఐదు నెలల పాటు ఈ షూటింగ్ ఉంటుందంట. పోరాట సన్నివేశాలు...పాటలు..చిత్రీకరిస్తారు. హైదరాబాద్..అమరావతి ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుందని, అందుకే ఏకధాటిగా షూటింగ్ జరపడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందని టాక్. డిసెంబర్ చివరి నాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేయాలన్నది క్రిష్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రియ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

111 మందికి హజ్‌యాత్ర అవకాశం....

హైదరాబాద్: హజ్‌యాత్ర-2016 కోసం వెయిటింగ్ లిస్ట్‌లోని 111 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లో 111 నంబర్ వరకు గల అభ్యర్థులు జూలై 4 లోగా పూర్తి స్థాయి చార్జీలను చెల్లించాలని ఆయన సూచించారు. పాస్‌పోర్టుతో పాటు కలర్ ఫొటోలు, వైద్య పరీక్షల ధ్రువీకరణ పత్రాలను హజ్‌హౌస్‌లో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

10:00 - June 23, 2016

రజనీ కాంత్..ప్రస్తుతం 'కబాలి' ఫీవర్ నెలకొంది. ఈ చిత్ర ఆడియో ఈనెల 26న విడుదలకానుంది. ఇటీవలే ఆడియో కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. షూటింగ్ అనంతరం అమెరికాకు వెళ్లిన రజనీ అనారోగ్యానికి గురయ్యాడని పుకార్లు షికార్లు చేశాయి. ఆడియోను సింపుల్ గా విడుదల చేయడం పట్ల అభిమానులు గుర్రుగా ఉన్నట్లు టాక్. చివరకు ఈ ఆడియో వేడుకను 26వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ లు వెల్లడించారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్..టీజర్, యూ ట్యూబ్..సోషల్ మీడియాల్లో విడుదలై కొత్త రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్ సినిమాను ఎంతో బాగా తెరకెక్కించారని, రజనీకాంత్ లోని మరో కోణాన్ని ఆయన ఆవిష్కరించారని చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. రజనీకాంత్‌, రాధికాఆప్టే జంటగా పా రంజిత్‌ దర్శకత్వంలో కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్‌ పతాకంపై 'కబాలి' చిత్రం రూపొందింది.

09:59 - June 23, 2016

నాజూకుగా కనిపించాలని యువతులు ప్రయత్నిస్తుంటారు. అందుకు ఆహారం తీసుకోక..మితిమీరిన ఎక్సర్ సైజులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా బయటపడిన ఒక మానసిక వ్యాధి ప్రపంచంలోని అమ్మాయిల ప్రాణాలను హరిస్తోందంట. దీనిని 'ఎనరెక్సియా నెర్వోసా' అని అంటారు. ఇది ఎక్కువ మంది మోడళ్లలో కనిపించే ఒక మానసిక సమస్య అని నిపుణులు పేర్కొంటున్నారు. తన కన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడి కలత చెందిన ప్రాణాలు తెచ్చుకున్న వారెందరో...
తాజాగా ఇంది భారతదేశంలో అడుగు పెట్టిదంట. 'తషన్' చిత్రంలో కరీనా కపూర్ సన్నదనం చూసిన బాలీవుడ్ తో పాటు అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. ఇంకేముందు తాము అలాగే కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. క్యాలరీలు కట్ చేసుకోవడం మొదలెట్టేశారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, ఒక వేళ సైజ్ జోరో కావాలంటే అనేక పద్ధతులున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో మంటలు..ఏకగ్రాత తగ్గడం..నిద్రలేమి, హార్మోన్లలో అసమతుల్యత, రుతుక్రమంలో లోపాలు వంటి అనేక సమస్యలు వచ్చి పడుతాయని హెచ్చరిస్తున్నారు.
మగవాళ్లు సిక్స్ ప్యాక్ కు ఎలాంటి కష్టం చేస్తున్నారో అమ్మాయిలు కూడా సైజ్ జీరో కోసం కష్టపడాలని సూచిస్తునాన్రఉ.
ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్ సైజ్ లు చేయాలి. ఇందుకు చాలానే టైం పడుతుంది.

జూలై 1న టీ.న్యాయవాదుల విధుల బహిష్కరణ...

హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరిం చుకోవడంతో పాటు ఉమ్మడి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో జూలై 1న హైకోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టులకు చెందిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు మోహనరావు తెలిపారు.

09:57 - June 23, 2016

జీర్ణవ్యవస్థ..మనిషికి చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థ బాగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక జీర్ణవ్యవస్థ బాగా ఉండాలి. ఇందుకు కొన్ని ఆహారపు అలవాట్లు చూద్దాం..
భోజనం చేశాక టీ, కాఫీలకు దూరంగా ఉండండి. వెంటనే వేడివేడి టీ, కాఫీలు తాగడం వల్ల పోషకాలు శరీరానికి పట్టవు.
రాత్రి పూట చల్లటి నీళ్లు సేవించడం మూలంగా అరుగుదలపై ప్రభావం చూపుతాయి. గోరువెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
భోజనం చేసిన వెంటనే పడుకోకుండా తినడానికి..పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండే విధంగా చూసుకోండి.
కొందరు భోజనం చేసిన అనంతరం డ్యాన్స్ లు చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. భోజనం చేసిన తరువాత అటూ..ఇటూ నడవొచ్చు.
భోజనం చేసిన అనంతర స్నానం చేయకూడదు. తప్పని పరిస్థితులో అయితే తప్ప. అదే అలవాటుగా మాత్రం మారకూడదు. ఎందుకంటే స్నానం వల్ల శరీరంలో కదలికలు అతిగా ఉంటాయి. ఈ ప్రభావం జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

 

09:56 - June 23, 2016

ఇంట్లో మహిళలు ఎంత ఆనందంగా ఉంటో కుటుంబం అంత బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతమందికి వీలు కావడం లేదు. ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని రాత్రి పడుకొనే వరకు పరుగులే..పరుగులే.. దీనితో ఆనందం అనేది మిస్ అవుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం..ఆరోగ్యం పెను ప్రభావం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మహిళలు ఎంత ఆనందంగా ఉంటే కుటుంబం అంత ఆనందంగా..ఆరోగ్యంగా ఉంటుందని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.
అనవసర విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు. మానసిక ఆందోళనని పెంచే టీవీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ప్రశాంతత కోసం సంగీతాన్ని వినండి. ఏ పని చేసినా తొందర తొందరగా చేయకుండా..హైరాన పడకుండా చేయండి. తాజా ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయండి. ఇలాంటి కొన్నింటిని పాటించడం వల్ల కుటుంబంతో ఆనందంగా ఉండడంతో పాటు మనసును శాంతంగా ఉంచుతుంది.

 

ఆస్పత్రుల్లో మెరవనున్న ఇంద్రధనస్సులు...

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే దుర్వాశన, మురికి పేరుకుపోయిన దుప్పట్లు, అపరిశుభ్రత గుర్తుకు వస్తాయి కదా? కానీ ఇకపై ఆ పరిస్థితి మారనుంది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పడకలపై ఇక నుంచి రంగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం తెల్లరంగు బెడ్‌షీట్లు మాత్రమే వాడుతుండగా... ఇకనుంచి వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు కనిపించనున్నాయి. ఆస్పత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇతర రోగులు వాడిన దుప్పట్లనే మరో రోగి వాడుతోన్న పరిస్థితి నెలకొంది.

09:55 - June 23, 2016

న్యూఢిల్లీ : అవును మీరు వింటున్నది నిజమే. ఒక కాలుకు ఆపరేషన్ చేయాల్సింది మరో కాలుకు చేశారు. ఈ ఘనత సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వైద్యులు దక్కించుకున్నారు. మోసపోయామని గుర్తించిన తల్లిదండులు పీఎస్ మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళితే...ఢిల్లీలో రవి రాజ్ (24) సీఏ విద్యార్థి నివాసం ఉంటున్నాడు. ఇతను ఆదివారం రాత్రి మెట్లపై నుండి కిందపడిపోయాడు. దీనితో రవి కుడి కాలు చీలమండలో ఫ్రాక్చర్ అయినట్లు ఫోర్టిస్ సూపర్ స్పెషాల్టీ వైద్యులు గుర్తించారు. దీనికి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. అనంతరం వైద్యులు ఆపరేషన్ చూశారు. సృహలోకి వచ్చిన రవి రాజ్..అతని తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. డాక్టర్లు కుడి కాలుకు బదులు ఎడమకాలుకు ఆపరేషన్ చేసేశారు. దీనితో వైద్యులను నిలదీశారు. ఈ విషయం బయట ఎక్కడా చెప్పవద్దంటూ బేరసారాలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రాజ్ తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మరి ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.

తిరుమలలో పయ్యావుల...

తిరుమల: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ దంపతులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం తోమాల సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలను తితిదే అధికారులు అందజేశారు.

అమరావతిలో పర్యటించనున్న బ్రిటిష్‌ హైమిషనర్‌...

విజయవాడ: కొత్తగా నియమితులైన బ్రిటిష్‌ హైమిషనర్‌ డోమినిక్‌ అస్‌క్విత్‌ గురువారం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీనియర్‌ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఇతర రాజకీయ నాయకులను ఆయన కలుసుకుంటారు. రాజధాని అమరావతిని సందర్శిస్తారు.

అంగన్ వాడీలకు భీమాతో ధీమా ...

ఢిల్లీ : అంగన్‌వాడీ వర్కర్లు అంటే సేవకు ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు..సర్కారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా వారి సేవలు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు జరగవనే చెప్పుకోవచ్చు...వారి సేవా నిబంధనల్ని మెరుగుపర్చేందుకు వివిధ రాయితీలు, ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ ప్రకటించింది. అంగన్‌వాడీ కార్యకర్త బీమా యోజన పథకం కోసం వర్కర్లు చెల్లించే రూ.80 మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై అంగన్‌వాడీ వర్కర్లకు 180 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుంది. ప్రతి ఏటా వర్కర్లకు యూనిఫారంగా రెండు చీరల్ని కేంద్రం ఇస్తుంది.

09:39 - June 23, 2016

విజయవాడ : నగరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై వున్న కనదుర్గ దేవాలయంలో అధికారుల అవినీతి చర్యలకు కమిషనర్ బదిలీల వేటు వేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుర్గగుడిలో 36 మంది ఆలయ సిబ్బందిని బదిలీ చేస్తే కమిషనర్ అనూరాధ బదిలీల ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లో ఆరుగురు, అసిస్టెంట్ ఈవోలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురు, జూనియర్ అసిస్టెంటుల్ తొమ్మిదిమంది బదిలీల లిస్టులో వున్నారు. దీంతో దుర్గగుడిలో కలకలం రేగింది. చాలా కాలంగా పాతుకుపోయినటువంటి అధికారులపై బదిలీల వేటు పడింది. ఒకేసారి 36 మంది ఉద్యోగుల్ని బదిలీ చేయటంపై సంచలనం రేగింది. క్రింది స్థాయింనుండి పైస్థాయి వరకూ అవినీతి ఆరోపణలు వస్తూండటంతో బదిలీలు చేసినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు కల్పించుకుని బదిలీలను ఆపాలని ప్రయత్నించినా కమిషన్ అనూరాధ వెనక్కి తగ్గకుండా బదిలీల ఆదేశాలు జారీ చేశారు. అవినీతి అధికారుల బదిలీతో దేవాలయంలో అవినీతి ప్రక్షాళన జరుగుతుందని భక్తులు ఆశిస్తున్నారు. 

దుర్గగుడి అధికారులపై బదిలీల వేటు...

విజయవాడ : నగరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై వున్న కనదుర్గ దేవాలయంలో అధికారుల అవినీతి చర్యలకు కమిషనర్ బదిలీల వేటు వేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుర్గగుడిలో 36 మంది ఆలయ సిబ్బందిని బదిలీ చేస్తే కమిషనర్ అనూరాధ బదిలీల ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లో ఆరుగురు, అసిస్టెంట్ ఈవోలు ఇద్దరు, సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురు, జూనియర్ అసిస్టెంటుల్ తొమ్మిదిమంది బదిలీల లిస్టులో వున్నారు. దీంతో దుర్గగుడిలో కలకలం రేగింది. 

లారీ - వ్యాన్‌ ఢీ.. డ్రైవర్‌ మృతి...

తూర్పుగోదావరి : తుని మండలం జగన్నాదగిరి వద్ద జాతీయ రహదారిపై లారీని వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌ డ్రైవర్‌ నాగరాజు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్‌ విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన డ్రైవర్‌ నాగరాజు విశాఖపట్నంకు చెందిన వ్యక్తిగా తుని రూరల్‌ పోలీసులు గుర్తించారు.

కడప జిల్లాలో మంత్రి గంటా పర్యటన...

కడప : మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం కడప జిల్లా రాజంపేటలో పర్యటించారు. పట్టణంలోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పట్టణంలో మురుగు కాల్వలు అస్తవ్యస్థంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి సక్రమంగా లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి నీరు సక్రమంగా రావడంలేదని మహిళలు మొరపెట్టుకున్నారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్‌, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్‌ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.

విశాఖ, తిరుపతిల నుంచి ప్రత్యేక రైళ్లు...

హైదరాబాద్‌: పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న దక్షిణమధ్యరైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. విశాఖపట్నం-తిరుపతి, విశాఖట్నం-సికింద్రాబాద్‌ల మధ్య 30 సువిధ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జులై 5 నుంచి ఆగస్టు 31వ తేదీల మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

09:14 - June 23, 2016

హైదరాబాద్ : కార్మికుల బకాయిలు చెల్లింపు, డీఏ కోసం డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఒకరోజు సమ్మె పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో ఏడు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతోంది. ఏ డిపోనుండి కూడా ఆర్టీసీ బస్ లు బయట తిరగటంలేదు. ఈ సమ్మెతో ప్రమాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యహ్నాం 11 గంటకు సమ్మె తీవ్రత కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం.

08:37 - June 23, 2016

బ్రిటన్‌ : బ్రెగ్జిట్‌పై ఇవాళ బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగనుంది. 28 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావాలా ... లేదా..అన్న అంశాన్ని ప్రజలు ఓటింగ్‌ ద్వారా నిర్ణయించనున్నారు. మొత్తం 46 మిలియన్ల మంది ఓటర్లు రెఫరెండంలో పాల్గొననున్నారు. ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌తోపాటు, ఆర్ధిక, రాజకీయవేత్తలు, రక్షణశాఖ అధికారులు బ్రిటన్‌ ఈయూ లో కొనసాగాలని కోరుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈయూ లో బ్రిటన్‌ సభ్యదేశంగా కొనసాగుతూ వస్తోంది. దీనివలన బ్రిటన్‌ ఆర్ధిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కొందరు సంప్రదాయవాదులు వాదిస్తున్నారు. అందువల్ల యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకురావాలని కోరుతున్నారు. బ్రెగ్జిట్‌పై ఇవాళ ఓటింగ్‌ జరిగినా ఫలితాలు వెలువడిది మాత్రం శుక్రవారమే.

ఈయూ దేశాల నుంచి బ్రిటన్‌కు భారీగా వలసలు ...
ఈయూ దేశాల నుంచి బ్రిటన్‌లోకి భారీగా వలసలు పెరగడంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇతర దేశాలతో నేరుగా వాణిజ్యాన్ని నిర్వహించకపోతే చాలా అవకాశాలను చేజార్చుకోవాల్సి ఉంటుందని బ్రెగ్జిట్‌ మద్దతుదారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈలో బ్రిటన్‌ కొనసాగాలని మరికొందరు కోరుతున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగితే బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్రెగ్జిట్‌పై ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి హోరాహోరీ ప్రచారం చేశారు. తాజా సర్వే ప్రకారం బ్రిటన్‌ ఈయూ లో కొనసాగాలని 52 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. వ్యతిరేకులు 44 శాతం మంది ఉన్నారు. మిగిలినవారు తటస్థంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.

ఆర్బీఐ అప్రమత్తం...
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో బ్రెగ్జిట్‌ అనిశ్చితి నెలకొనడంతో ఆర్బీఐ అప్రమత్తమయ్యింది. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని రిజర్వు బ్యాంకు అధికారులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. యూరోపియన్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగలా... లేదా .. అన్న అంశంపై బ్రిటన్‌లో జరుగుతున్న అభిప్రాయసేకరణ ఫలితాలు వెలువడే వరకు మార్కెట్లలో అస్థిరత నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏవైనా అనుకోని పరిస్థితులు తలెత్తితే మార్కెట్లను సాధారణస్థితికి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. మన దేశానికి ఈయూతోపాటు, బ్రిటన్‌లో మంచి వాణిజ్య సంబంధాలున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి మన దేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.

టీ.ఎస్ లో మూడు రోజుల పాటు వర్షాలు...

హైదరాబాద్ : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

కేసీఆర్ తో భేటీ కానున్న కేంద్ర మంత్రి గోయల్ ...

హైదరాబాద్ : నేడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ హైదరాబాద్ రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు.

రెండో రోజు టీ.ఎస్ ఎంసెట్ కౌన్సింలింగ్ ...

హైదరాబాద్ : నేడు రెండో రోజు టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ల వెరిఫికేషన్. 6001 నుంచి 16000 ర్యాంకు వరకు గల విద్యార్థులకు ఇవాళ వెరిఫికేషన్ జరుగుతుంది.

మహారాష్ట్ర సీఎంతో భేటీ కానున్న హరీష్ రావు..

మహారాష్ట్ర : సీఎం ఫడ్నవిస్ తో నేడు మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాజెక్టు ఒప్పందాలపై చర్చించనున్నారు.

బంజారాహిల్స్ లో కొండచిలువ హల్ చల్ ...

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసులను కొండచిలువ భయపెట్టింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పేద్ద కొండచిలువ బుధవారం రాత్రి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించింది. గమనించిన పోలీసులు భయంతో పరుగులు తీశారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించటంతో వారు వచ్చి కొండచిలువను పట్టి బంధించి, తీసుకుపోయారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తితో సహా 36 గొర్రెలు మృతి...

పశ్చిమగోదావరి : జిల్లా దెందులూరు చెక్‌పోస్టు సమీపంలో 16వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున బస్సు ఢీ కొని ఓ వ్యక్తి, 36 గొర్రెలు మృతి చెందాయి. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామానికి చెందిన నాగరాజు(22), వెంకటేశ్‌ కొవ్వలి గ్రామం నుంచి పెదపాడుకు గొర్రెలను తరలిస్తుండగా దెందులూరు చెక్‌పోస్ట్‌ వద్దకు రాగానే పార్వతీపురం నుంచి విజయవాడ వెళుతున్న బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన వెంకటేశ్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్‌ ఎస్సై సుభాష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన..

 

నిజామాబాద్ : నేడు జిల్లాలో కేంద్రమంత్రులు సంతోష్ గంగ్వార్, సాద్వి నిరంజన్ జ్యోతి పర్యటించనున్నారు.

కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన...

కరీంనగర్ : నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

తిరుమలలో భారీ సర్పం..భక్తుల పరుగులు...

తిరుమల : ఇటీవలి కాలంలో కొండపై పాములు ప్రత్యక్షమవుతున్న ఘటనలు తరచుగా నమోదువుతున్నాయి. తిరుమల పాపవినాశం మార్గంలో ఉన్న కల్యాణ వేదిక వద్ద భారీ సర్పం కనిపించింది. దాదాపు పది అడుగుల మేర పొడవు వున్న పాము కల్యాణ వేదిక లోపల కనిపించటంతో భక్తులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది అప్రమత్తమయి. పాములు పట్టేవారికి సమాచారం అందించారు. అనంతరం వారు కాలనాగుని పట్టుకుని పాపవినాశం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

నేడు జేఈఈ మెయిన్‌ ర్యాంకుల విడుదల...

హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్షకు అర్హత సాధించేందుకు ఏప్రిల్‌ 3న ఆఫ్‌లైన్‌, 9, 10వ తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరిగాయి. పరీక్ష ర్యాంకులను గురువారం సీబీఎస్‌ఈ ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా పరీక్షకు సుమారు 11,94,938 మంది హాజరుకాగా వారిలో తెలుగురాష్ట్రాల నుంచి 1,32,648 మంది రాశారు. పరీక్ష మార్కులు ఏప్రిల్‌ 27న వెల్లడికాగా, ఇంటర్‌ మార్కులకు 40శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటిస్తారు. ఫలితాలను jeemain.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

07:43 - June 23, 2016

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుదలకు టి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ శాఖలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. సామాన్యులపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద యూనిట్లలోపు ఛార్జీల పెంపు నుండి మినహాయించారు. పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు ఏడు శాతం లోపున ఉంటుందని తెలుస్తోంది. పల్లె వెలుగు బస్సులో ప్రతి 30 కిలో మీటర్లకు రూపాయి ఛార్జీ, 30 కిలోమీటర్లపైన రూ. 2 పెంచాలని, మిగతా బస్సుల్లో పది శాతం మించకుండా ఛార్జీలను పెంచాలని యోచించింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయంతో ప్రజలపై ఎటువంటి భారం పడునుంది అనే అంశంపై 10టీవీ న్యూస్ మర్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ ),పున్న కైలాష్ (టీ.కాంగ్రెస్ నేత), మన్నె గోవర్థన్ రెడ్డి (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు విభిన్న వాదనలను వినిపించారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి ...సమగ్ర సమచారాన్ని తెలుసుకోండి...

07:41 - June 23, 2016

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక సంక్షోభం ముదురుతోంది. ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతపడుతున్నాయి. దీంతో దాదాపు పాతికవేల మంది ఉపాధి కోల్పోయి తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఉత్తరాంధ్రలో పారిశ్రామికరంగం పరిస్థితి ఏమిటి? జ్యూట్; ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడడానికి కారణం ఏమిటి? ఈ సంక్షోభం నివారణకు ప్రభుత్వం ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు విజయనగరం జిల్లా కార్యదర్శి టివి రమణ విశాఖపట్టణం 10టీవీ స్టూడియోకి వచ్చారు. 

07:31 - June 23, 2016

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఈనెల 29 న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగే పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటారు. రాజ్యసభలో NDA బలం పెరిగిన నేపథ్యంలో GST బిల్లు ఆమోదంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి GSTని అమలు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ... అదినెరవేలేదు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సమావేశంలో GSTపై ఏకాభ్రియం వచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఈ బిల్లుకు మోక్షం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు...

హైదరాబాద్ : నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడదల కానున్నాయి.మధ్యహ్నాం 3గంటలకు విడుదల కానున్నాయి. 

07:11 - June 23, 2016

హైదరాబాద్ : సీనియర్‌ సినీ నటుడు జేవీ రమణమూర్తి అనారోగ్యంతో మృతిచెందారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. శంకరాభరణం జేవీ సోమయాజులు ఆయన సోదరుడు. మే 20, 1933లో విజయనగరం జిల్లాలో జన్మించారు. బాల్యం నుంచే నాటకాల్లో వేషాలు వేసిన రమణమూర్తి అత్యుత్తమ ప్రదర్శన పురస్కారం అందుకొన్నారు. ఎన్‌జీవో, ఎవరు దొంగ, కప్పలు, నాటకం, కీర్తి శేషులు, కాలరాత్రి, ఫణి నాటకాల్లో నటించారు. 20వ ఏళ్ల వయసు నుంచి 43 ఏళ్ల పాటు గురజాడ కన్యాశుల్కం స్వీయ దర్శకత్వంలో సుమారు వెయ్యిసార్లు ప్రదర్శించి గిరీశం పాత్ర పోషించారు. 1957లో ఎమ్మెల్యే సినిమాతో తెరంగేట్రం చేసిన జేవీ రమణమూర్తి దాదాపు 150 సినిమాల్లో నటించారు. మాంగల్య బలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, ఆకలి రాజ్యం, సప్తపది, ఆంధ్ర కేసరి, ఆనంద భైరవి, కర్తవ్యం, ఆర్య, శంకరదాదా జిందాబాద్‌ చిత్రాల్లో నటించారు.

07:05 - June 23, 2016

వరంగల్ : తెల్ల బంగారం మెరిసింది. ఐదు సంవత్సరాల తర్వాత క్వింటా తెల్ల బంగారం 6వేలకు చేరుకోవడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే పత్తి అంతా అమ్ముకున్న తర్వాత రేటు పెరగడంతో రైతులు కొంత నిరాశ చెందుతున్నారు. సీజన్‌ ప్రారంభం నుంచి అధిక ధర ఉంటే బాగుండేదని రైతన్నలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్‌ ఏనుమాముల...
ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్‌ వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రత్తిరైతులు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈ మార్కెట్‌లో ప్రత్తికి గత 5ఏళ్లుగా లేని ధర నమోదైంది. ఓ రైతు క్వింటా ప్రత్తిని 5,915 రూపాయలకు అమ్మడంతో ఐదేళ్ల రికార్డులు తారుమారయ్యాయి. గత ఐదేళ్లుగా ఇంతటి ధర రైతులకు అందలేదు. 2011 మార్చిలో క్వింటాల్‌ పత్తికి 5,300 రూపాయల రికార్డు ధర నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ ఈ ధర నమోదు కాలేదు. క్వింటా ప్రత్తి 6వేలకు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..రైతులు తెచ్చే గోనె సంచులకు కూడా 25 రూపాయలు కట్టిస్తామని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రికార్డుస్థాయిలో ప్రత్తిధర ....
అయితే పంట మొత్తం అమ్ముకున్నాకా ప్రత్తిధర పెరగడంతో రైతులు కొంత నిరాశ చెందుతున్నారు. మార్కెట్‌కు సుమారు 6నుంచి 7వేల బస్తాల ప్రత్తిరైతులు విక్రయించేందుకు రావడంతో మార్కెట్‌ కళకళలాడుతోంది. ముఖ్యంగా ప్రత్తి బేళ్ల ధరలు 39వేల నుంచి 41వేలకు చేరుకోవడంతో పాటు ప్రత్తి గింజల ధర 2400కు పెరగడం కూడా ధరల పెరుగుదలకు ఓ కారణమని మార్కెట్‌వర్గాలు అంటున్నాయి. అందులోనూ ఈసారి ప్రత్తి దిగుబడి బాగా తగ్గడంతో వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి ధర పెరగడానికి కారణమైందిని మార్కెట్‌ కార్యదర్శి రాజు చెప్తున్నారు.

మంచి ధరతో రైతులు ఆనందం...
మొత్తానికి తెల్లబంగారం ధరలు మళ్లీ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

07:00 - June 23, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ నూత‌న పాల‌క‌మండ‌లి..నగర అభివృద్దిపై దృష్టిపెట్టింది. మొద‌టి స్టాండింగ్ క‌మిటీ సమావేశంలోనే ప‌లు అభివృద్ది కార్యక్రమాలకు ఆమోద‌ముద్ర వేసింది. గ్రేట‌ర్లో చేపట్టబోతున్న మెగా ప్రాజెక్టుల‌కు అద‌న‌పు ఇంజ‌నీర్లను నియమించాల‌ని నిర్ణయించింది. 14వ ఆర్ధిక సంఘానికి పంపాల్సిన ప్రపోజ‌ల్స్‌పై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది స్థాయిసంఘం.

స్టాండింగ్ క‌మిటీ తొలి సమావేశం ...
జీహెచ్‌ఎంసీ కొత్త పాల‌క‌ మండ‌లి హైదరాబాద్‌ నగర అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇటివ‌లే ఏకగ్రీవంగా ఎన్నికైన స్టాండింగ్ క‌మిటీ తొలి సమావేశం బుధవారం జ‌రిగింది. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో మొత్తం 20అంశాల‌లో 19 అంశాలను ఏక‌గ్రీవంగా ఆమోదించింది స్టాండింగ్‌ కమిటీ.

20 అంశాలలో 19 అంశాలపై ఏకగ్రీవ ఆమోదం ...
ఇక ఎజెండాలోని 20 అంశాల్లో ప‌ది అంశాలు నగర రోడ్ల విస్తరణకు సంబంధించిన‌వే ఉన్నాయి. ఎస్ఆర్‌డిపిలో భాగంగా 16 జంక్షన్లలో చేపట్టనున్న మల్టీలేవ‌ల్ ఫ్లైఓవ‌ర్ల నిర్మాణప‌నుల‌కు స్టాండింగ్ క‌మిటీ పచ్చజెండా ఊపింది. సంతోష్‌నగర్‌ ఓవైసి ఆసుప‌త్రి ఎదురుగా నిర్మించ‌నున్న ఫ్లైఓవ‌ర్‌కు భూసేక‌ర‌ణ‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని నిర్ణయించింది క‌మిటి. ఎస్ఆర్‌డిపి, డ‌బుల్ బెడ్‌రూం లాంటి మెగా ప్రాజెక్ట్‌ల‌ను చేప‌డుతున్నందున కార్పొరేష‌న్‌లో ఇద్దరు ఎస్‌ఈలు, ఆరుగురు ఈఈలు , 14మంది డిఈఈలు, 24మంది ఏఈలు, అదన‌పు ఇంజ‌నీర్ల నియామ‌కానికి కమిటీ ఆమోదం తెలిపింది. కార్పొష‌న్‌లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుకు కూడా కమిటీ ఆమోద ముద్రవేసింది. ఇందిరా పార్కు వ‌ద్ద 700 చ‌ద‌రపు మీట‌ర్ల స్థలాన్ని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ర‌స‌రంజ‌ని సంస్థకు కేటాయించాలని నిర్ణయించింది.

పాలకమండలి ఆమోదం...
ఇప్పటివరకు పాల‌క‌మండ‌లి లేని కార‌ణంగా 13వ ఫైనాన్స్ క‌మిషన్‌ నిదుల‌ను కోల్పోయిన బ‌ల్దియా,.14వ ఫైనాన్స్ క‌మిషన్‌కు నిధుల కోసం ప్రతిపాదనలు పంపింది. నగరంలో నిర్మించే స్కైవేస్, ప్లైఓవ‌ర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ త‌దిత‌ర ప్రతిపాధిత అంశాల‌కు కూడా పాలకమండలి ఆమోద ముద్ర తెలిసింది. 

06:54 - June 23, 2016

హైదరాబాద్ : వెస్ట్‌జోన్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌, అంబేద్కర్ నగర్, ఎల్లారెడ్డి గూడా, జయప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 400 మంది పోలీసులతో ఈ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 61 మంది అనుమనితులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సరైన ధృవపత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా సేకరించారు. వీరితో పాటు కంప్యూటర్ కోచింగ్ తీసుకునే వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. అయితే ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ తమ బస్తీల్లో కార్డెన్ సెర్చ్ చేయాలని కోరుతున్నారు అని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరులు తెలిపారు. 

నగరంలో ఖాప్స్ కార్డెన్ సెర్చ్..

హైదరాబాద్ : వెస్ట్‌జోన్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌, అంబేద్కర్ నగర్, ఎల్లారెడ్డి గూడా, జయప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 400 మంది పోలీసులతో ఈ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 61 మంది అనుమనితులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సరైన ధృవపత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా సేకరించారు. వీరితో పాటు కంప్యూటర్ కోచింగ్ తీసుకునే వారి నుంచి కూడా వివరాలు సేకరించారు.

06:51 - June 23, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు బాబు చైనాలో పర్యటించనున్నారు. ఆ దేశం నుంచి తిరిగొచ్చిన తర్వాత అమరావతి మాస్టర్‌ డెవలపర్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

టూర్ తరువాతనే రైతులకు ప్లాట్ల కేటాయింపు?...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల పాలన పూర్తైనా... రాజధాని అవరావతి నిర్మాణంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాల కేటాయింపు కూడా నత్తనడకన సాగుతోంది. దీంతో రైతుల్లో అసహనం పెరుగుతోంది. చైనా పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత అమరావతి మాస్టర్‌ డెవలపర్‌తోపాటు, రైతులకు ప్లాట్ల కేటాయింపు పై దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

జపాన్‌, సింగపూర్‌ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు...
మాస్టర్‌ డెవలపర్‌ ఖరారైతే రాజధాని నిర్మాణ ప్రక్రియ సాఫీగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. సింగపూర్, జపాన్‌ సంస్థలతోపాటు మరికొన్ని కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రాజధానిలో సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌, హైకో్ర్టులు కీలక. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వీటి నిర్మాణం చేపడతారు. మిగిలిన అన్ని మౌలిక సదుపాయాలను మాస్టర్‌ డెవలపర్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.

సినిమా, మీడియా, వినోదం, వైద్యం.. ప్రతి విభాగానికి ప్రత్యేక హబ్‌ ..
అమరావతిని సెక్టార్ల వారీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలన్నీ ఒకే చోట ఉండేలా చూస్తారు. సినిమా, మీడియా, వినోదం, వైద్యం...ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో హబ్‌ కేటాయిస్తారు. ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించేలా నిర్మాణాలు చేపడతారు. రాజధానిలో ఏయే మౌలికవసతులు ఉండాలో ముందుగానే తెలియజేసి, ఆప్రకారం మాస్టర్‌ డెవలపర్‌కు పనులు అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌ సహా అత్యధిక నిర్మాణాలను సింగపూర్‌ సంస్థలకే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణాల విషయంలో స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అనుసరించి ..ఆసక్తి ఉన్న సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

రాజధానిక నిర్మాణంలో వేగవంతానికి సర్కార్ చర్యలు...
రాజధాని నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం,ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.

06:37 - June 23, 2016

హైదరాబాద్ : బ్రిటన్‌లోని స్టార్టప్‌ ఇకో సిస్టంతో పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌.. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీని వల్ల రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని, నిరుద్యోగులకు ఉపకరించే పరిశ్రమలు వస్తాయని కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై చర్చ...
బ్రిటీష్ హైకమిషనర్‌ ఇన్‌ ఇండియా డొమినిక్‌ యాష్‌ క్విన్త్‌ బృందంతో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ రంగంలో పనిచేసేందుకు బ్రిటీష్‌ హై కమిషనర్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలో నిర్వహించబోయే ఇండో-బ్రిటీష్‌ వర్క్‌ షాప్‌కి రావాలని కేటీఆర్‌ను బ్రిటీష్‌ హైకమిషనర్‌ ఆహ్వానించారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో సహకరిస్తామని హై కమిషనర్‌ తెలిపారు.

ఐటి, పారిశ్రామిక పాలసీలపై చర్చ...
రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ఐటి, పారిశ్రామిక కార్యక్రమాలు, రూపొందించిన పాలసీలపై ఇద్దరూ చర్చించారు. భారత్‌లో పెట్టుబడులకు దేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా.. రాష్ర్టాల్లో ఉన్న ప్రభుత్వాలు, వాటి సౌకర్యాలు, పాలసీల అధారంగా చూడాలని మంత్రి కేటీఆర్‌ బ్రిటీష్‌ హైకమిషనర్‌ను కోరారు. తాము ప్రస్తుతం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని వివరించారు. తమ ప్రభుత్వానికి ఐటి, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పెస్ తదితరాలు ప్రాధాన్యత రంగాలని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చే కంపెనీలకు అన్ని విధాలుగా సహకరిస్తామని వివరించారు.

పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రాంతం తెలంగాణ -కేటీఆర్‌
ఐటి రంగంలో తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని బ్రిటీష్‌ హై కమిషనర్‌కు కేటీఆర్‌ వివరించారు. ప్రపంచంలోని టాప్‌-4 కంపెనీలు అతిపెద్ద క్యాంపస్‌లను రాష్ర్టంలో నిర్మిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే దేశంలోనే అతిపెద్ద బిగ్ డాటా సెంటర్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్ట్లు చెప్పారు. టియస్ ఐపాస్ విధానాన్ని బ్రిటీష్‌ హైకమిషనర్ అభినందించారు. ప్రభుత్వం చేపట్టిన టి హబ్ కార్యక్రమం ద్వారా పరిశోధనలకు ఊతం లభిస్తుందన్నారు. క్లీన్ టెక్ రంగంలో తమ దేశ కంపెనీలు ఆస్తకి చూపిస్తున్నాయని బ్రిటీష్‌ హైకమిషనర్ మంత్రికి తెలిపారు. పెట్టుబడుల అవకాశాలను పెంచేందుకు ఇండో బ్రిటీష్‌ బిజినెస్ కౌన్సిల్‌ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. దీంతోపాటు త్వరలో తాము నిర్వహించబోయే ఇండో బ్రిటీష్‌ వర్క్ షాప్ అన్ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సమావేశానికి మంత్రిని ఆహ్వానించారు.

ఇరు వర్గాల మధ్య అంగీకారం...
మొత్తంగా బ్రిటన్‌లోని స్టార్టప్‌ ఈకో సిస్టంతో పని చేయడానికి ఇరు వర్గాల మధ్య అంగీకారం తెలిపింది. 

మరోమారు భేటీ కానున్న కృష్ణా బోర్డు...

ఢిల్లీ : కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం రెండు రోజు కూడా అసంపూర్తిగా ముగిసింది. కృష్ణా ప్రాజెక్ట్‌ల నిర్వహణ, నీటి వినియోగంపై తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న వివాదం కొలిక్కిరాలేదు. బోర్డు భేటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారులు ఎవరివాదలను వారు వినిపించడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో గురువారం మరోసారి సమావేశం జరుగనుంది. 

Don't Miss