Activities calendar

24 June 2016

22:36 - June 24, 2016
22:26 - June 24, 2016

నవ్వుకుంట గిచ్చిన్న తెలంగాణ సర్కార్..కిరాయిలు పెంచితీర్తం బరాబర్, టీఆర్ఎస్ కార్యకర్త అయితానన్న జానాలు.... ఇప్పుడదే పోస్టులున్నవన్న జనాలు, 
చంద్రబాబు మొగోడేఅంటున్న బంగి.. కర్రులేని నాగలితోటే నడిబజార్లకు, ఎంసెట్ కౌన్సిలింగ్ మీది తేనీగల దాడి... అచ్చినొళ్లకు తెలుస్తున్నది అవిటి వాడి, 
ముచ్చటపెట్టేందుకు వస్తున్న తాతతో మద్యం పానం ఘన స్వాగతం, తిరుమల కొండెక్కిన నాగుబాము.. వామ్మో అక్కడిదిక్కు మేము రాము.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

 

22:18 - June 24, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు చేపట్టడం వెనుక మతలబు ఏంటని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన 'నారాయణ్‌పేట్‌ - కొడంగల్‌' ఇష్టా గోష్టి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చిన్నతరహా ప్రాజెక్టుల కన్నా భారీ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ప్రాధాన్యత  ఇస్తోందని విమర్శించారు. 

 

22:09 - June 24, 2016

విజయవాడ : స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో రాజధాని నిర్మాణానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సింగపూర్‌ కంపెనీల భాగస్వామ్యంతో అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీకి 42 శాతం వాటా.. సింగపూర్‌ సంస్థలకు 58 శాతం వాటా ఉంటుందని సీఎం తెలిపారు. 
స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతికి గ్రీన్ సిగ్నల్
అమరావతి నగరాన్ని స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మించేందుకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 గంటల పాటు జరిగిన కేబినెట్‌ సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధాన ప్రకటన చేశారు. రాష్ట్ర విడిపోయాక కట్టుబట్టలతో విజయవాడకు వచ్చామని, అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. సింగపూర్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు అసెండాస్ సింగ్ బిడ్జి, సెంబ్ కార్ప్ సంస్థలు అమరావతి అభివృద్ధికి ఇచ్చిన ఆఫర్లపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించామన్నారు. అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీకి 42 శాతం వాటా, సింగపూర్ సంస్థలకు 58 శాతం వాటా ఈ పద్ధతిలో ఉంటుందన్నారు. అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీకి, కన్సార్టియంకు 1691 ఎకరాలు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. 50 ఎకరాలు నామమాత్రపు ధరలకు ఇస్తామని, మిగిలినది ఎకరాకు రూ.4 కోట్ల ధర చొప్పున నిర్ణయించామన్నారు. పలు కంపెనీలు, సంస్థలకు కేటాయించిన భూముల వివరాలను తెలిపారు. 
వంశధార ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు     
వంశధార ప్రాజెక్టును పూర్తిచేసేందుకు 433 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయమవుతుందని, త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. అర్బన్ ఏరియా హౌసింగ్ కోసం అర్బన్ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే డిప్యూటేషన్లపై వెళ్లిన వైద్యులు హోం డిపార్ట్ మెంట్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలిచ్చామన్నారు. నాలుగు అగ్రికల్చర్, నాలుగు హార్చికల్చర్, రెండు అగ్రి బిజినెస్‌, రెండు వెటర్నరీ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుమతులిచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 
కమర్షియల్ పోర్టుగా కాకినాడ పోర్టు
కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఫ్యాక్టరీలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. కాకినాడ పోర్టును కమర్షియల్ పోర్టుకు మార్చేందుకు స్విస్ ఛాలెంజ్ కు వెళ్లాలని నిర్ణయించినట్లు చంద్రబాబు చెప్పారు. 

 

22:04 - June 24, 2016

లండన్ : ఐరోపా సమాఖ్యలో బ్రిటన్‌ కొనసాగాలా? లేదా ? అన్న ఉత్కంఠకు తెరపడింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి విడిపోయేందుకే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారు. నాలుగు దశాబ్దాలుగా ఐరోపా సమాఖ్యతో కలిసి ఉన్న బ్రిటన్‌.. ఇప్పుడు వేరుకుంపటికి సిద్ధమైంది. 
బ్రిటన్‌ ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం 
బ్రిటన్‌ ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 43 ఏళ్లుగా యూరోపియన్‌ యూనియన్‌లో కొనసాగుతున్న బ్రిటన్‌ ఆ కూటమి నుంచి విడిపోయేందుకే మొగ్గు చూపారు.  గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 52 శాతం మంది, వ్యతిరేకంగా 48 శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో EU నుంచి బ్రిటన్‌ వేరుపడటం ఖాయమైంది.
ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజాభిప్రాయ సేకరణలో వెలువడిన ఫలితాల ప్రకారం.. ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనుకునే వారి సంఖ్య 1 కోటి74 లక్షల10 వేల 742గా ఉండగా.. కూటమితో కలిసుందామనుకునే వారి సంఖ్య 1 కోటి 61 లక్షల 41 వేల 241గా ఉంది. 12.69 లక్షల ఆధిక్యంతో బ్రెగ్జిట్‌ పక్కా అయింది. ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంశాన్ని బ్రిటిషర్లు పట్టించుకోకపోవడం గమనార్హం.
ఆసక్తికరంగా ఫలితాలు
బ్రిటన్‌లోని నాలుగు ప్రాంతాల వారిగా ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంగ్లండ్‌, వేల్స్‌ ప్రాంతాల్లోని ఎక్కువ మంది EU నుంచి  వైదొలిగేందుకు మొగ్గు చూపగా ...స్కాట్లాండ్‌, నార్త్‌ ఐర్లాండ్‌లోని ఓటర్లు మాత్రం యూరోపియన్‌ యూనియన్‌లో ఉండేందుకే ఓటేశారు. ఇంగ్లాండ్‌లో ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనుకునే వారి సంఖ్య 1 కోటి 51 లక్షల 88 వేల 406 కాగా.. వ్యతిరేకంగా ఉన్నవారి సంఖ్య 1 కోటి 32 లక్షల 66 వేల 996. వేల్స్‌లో వైదొలగాలనుకునే వారి సంఖ్య 8 లక్షల 54 వేల 572 కాగా...కూటమిలో కొనసాగాలనే వారి సంఖ్య 7 లక్షల 72 వేల 347. స్కాట్లాండ్‌లో ఈయూలో ఉండాలనుకునే వారి సంఖ్య 16 లక్షల 61 వేల 191. బ్రెగ్జిట్‌కు మద్దతిచ్చిన వారి సంఖ్య 10 లక్షల 18 వేల 322. నార్త్‌ ఐర్లాండ్‌లో  4 లక్షల 40 వేల 437 మంది కూటమిలో ఉండాలనుకోగా.. 3 లక్షల 49 వేల442 మంది విడిపోయేందుకు మొగ్గుచూపారు.
ఇంగ్లండ్‌ ఓటర్ల ప్రభావంతో బ్రెగ్జిట్‌ ఖరారు
స్కాట్లాండ్‌, నార్త్‌ఐర్లాండ్‌లో ప్రజలు కలిసుందాం అని అనుకున్నా.. ఇంగ్లండ్‌ ఓటర్ల ప్రభావంతో బ్రెగ్జిట్‌ ఖరారైంది. ఇంగ్లండ్‌లో భారీగా ప్రజలు సమాఖ్య నుంచి వైదొలగడం వైపే మొగ్గు చూపారు. ఇంగ్లండ్‌లోని ఓటర్ల మధ్య ఉండాలి, వెళ్లిపోవాలి అన్న దగ్గర ఇరు వర్గాల మధ్య వ్యత్యాసం దాదాపు 30 లక్షలు ఉండడంతో తుది ఫలితాన్ని ప్రభావితం చేసింది.
ప్రజల తీర్పును గౌరవిస్తున్నా : ప్రధాని కామెరాన్‌
బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్‌ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ప్రధాని కామెరాన్‌ చెప్పారు. అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాజా పరిణామాలతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవని అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో దేశానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని పేర్కొన్నారు. కామెరాన్‌ ఈయులో కొనసాగేందుకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే.

 

22:00 - June 24, 2016
21:59 - June 24, 2016

గుంటూరు : ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా ముస్లిం కోసం బడ్జెట్‌లో 750 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం తరపున గుంటూరులో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సహా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తొలిసారిగా రాజధాని ప్రాంతంలో రంజాన్‌ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

21:57 - June 24, 2016

హైదరాబాద్ : రంజాన్‌ మాసం పురస్కరించుకుని ముస్లింలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, తెలంగాణ శాసనసమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జానారెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు హాజరయ్యారు. 

21:55 - June 24, 2016
21:55 - June 24, 2016

టీ.కాంగ్రెస్ మహిళా నేత డికె అరుణ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను ఆమో మాటల్లోనే..
'నన్ను టీఆర్ఎస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు జగుతున్నాయి.  ఇప్పటికే ఆ పార్టీ నుంచి చేరమని ఆఫరొచ్చింది. ఆ పార్టీలో కీలక వ్యక్తే మాతో మాట్లాడారు. కాదన్నందుకు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. మా వ్యాపారాల్లో ఇబ్బందులకు ప్రయత్నించారు. డికె అరుణ అంటే నిప్పు... మా జోలికొస్తే చూస్తు ఊరుకోం. నేను టీఆర్ ఎస్ లో చేరను... పార్టీ మారను. కానీ... చేరుతున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం కూడా కొందరి గేమ్ ప్లాన్ లో భాగం. సీఎం కేసీఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా..? కోదండరాం లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉండేదా..? ఇప్పుడేమో కోదండరామిరెడ్డినే విమర్శించడం సిగ్గు చేటు. నియోజకవర్గ సమస్యలపై కలిస్తే ఇప్పటికీ స్పందన లేదు. 
పీసీసీ పగ్గాలు అప్పగిస్తే చేయడానికి సిద్ధమే 
పీసీసీ పగ్గాలు అప్పగిస్తే చేయడానికి సిద్ధమే. పీసీసీ చీఫ్ పదవి కోసం గతంలో ప్రయత్నించాను..కానీ దక్కలేదు. కొందరు నేతలు అల్లరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. పార్టీలో అతి ప్రజాస్వామ్యం పాలు ఎక్కువయ్యాయి. ప్రతిపక్ష హోదా కోల్పోతే కాంగ్రెస్ కు ఏమీ కాదు. గద్వాల్ ను జిల్లా చేయడానికి అన్ని అర్హతలున్నాయి' అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:16 - June 24, 2016

తూర్పుగోదావరి : ప్రభుత్వాధికారుల మాటలకు...ప్రైవేట్‌ స్కూళ్ల దందాకు పొంతన లేకుండా పోతోంది. టాస్క్‌ఫోర్స్‌తో గుర్తింపులేని ప్రైవేట్‌ స్కూళ్లకు చెక్‌ పెడతామంటూ అధికారులు చెబుతున్న మాటలు..చేతల్లో కనిపించడం లేదు. తమను ఎవరూ అడ్డుకోలేరంటూ... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తింపులేని పాఠశాలలపై ప్రత్యేక కథనం.
ప్రైవేట్‌ స్కూళ్లు ఫీజుల మోత 
గుర్తింపు లేని పాఠశాలల పనిపడతామంటూ ఓవైపు అధికారులు చెబుతునే ఉంటారు. మరోవైపు, కనీసం గుర్తింపు కూడా లేకుండానే  ప్రైవేట్‌ స్కూళ్లు ఫీజుల మోతమోగిస్తూ యథేచ్ఛగా డబ్బులు గుంజుకుంటునే ఉంటాయి. ఇలాంటి స్కూళ్ల సంఖ్య ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు వంద ఉన్నాయంటే.... ఆశ్చర్యం కలగక మానదు.  
నీరుగారిపోతోన్న నిబంధనలు, విద్యాహక్కు చట్టం
జిల్లా కేంద్రం కాకినాడ సహా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రవేట్‌ స్కూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిబంధనలు, విద్యాహక్కు చట్టం పూర్తిగా నీరుగారిపోతోంది. పిల్లల చదువులు బాగుంటాయని వ్యయప్రయాసలతో ప్రైవేట్‌ స్కూల్స్‌లో చేర్పిస్తే, యాజమాన్యాలు తమకిష్టమొచ్చినట్లు ఫీజులు పెంచేస్తున్నాయని  తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ నుంచి ప్రకటనలు వస్తున్నా, ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్‌ స్కూళ్లపై వేటు తప్పదన్న అధికారులు
ప్రైవేట్‌ స్కూళ్లపై వేటు తప్పదంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 83 గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు కలిగిన 1500 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను  ఏర్పాటు చేశామని అన్నారు. మండల స్థాయిలో, డివిజన్‌ స్థాయిలో పాఠశాలల తీరుపై సమీక్షిస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటించని పాఠశాలలను వెంటనే మూసేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 
గుర్తింపులేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి : విద్యార్థి సంఘాలు 
అనుమతులులేని పాఠశాలలపై విద్యాశాఖ దృష్టి సారించాలని విద్యార్ధి సంఘాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వాధికారుల మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని ప్రశ్నిస్తున్నాయి. గుర్తింపులేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనుమతులు లేని పాఠశాలలను మూసివేయాలని...ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దందాను అరికట్టాలని  విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

21:08 - June 24, 2016

విజయనగరం : పచ్చని గ్రామాల్లో క్వారీ చిచ్చు రేగింది. ప్రశాంతంగా ఉండే పల్లెలు నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. గ్రానైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ జీవితాలను బలిపెట్టొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మైనింగ్‌ తవ్వకాలపై భగ్గుమంటున్న గిరిజనులు
విజయనగరం జిల్లాలో మైనింగ్‌ తవ్వకాలపై గిరిజనులు భగ్గుమంటున్నారు. పార్వతీపురం రూరల్ మండలం బుదరవాడ పంచాయితీ పరిధిలోని బోడికొండ చుట్టుపక్కల గ్రామాల్లో రోజుకోరకంగా నిరసనలు తెలియజేస్తున్నారు.. ఈ కొండలో అత్యంత విలువైన కలర్ గ్రానైట్ ఉందని కొద్ది నెలలక్రితం తేలింది... దీనికి వెలికితీసేందుకు ప్రభుత్వం క్వారీని లీజుకు ఇచ్చింది.. ఇది తెలుసుకున్న గిరిజనులు... ఈ కొండను తవ్వేస్తే తాము జీవనాధారం కోల్పోతామంటూ పోరుబాట పట్టారు.
కొండపై ఆధారపడి 750 కుటుంబాలు జీవనం
ఈ కొండపై ఆధారపడి 18 గ్రామాలకు చెందిన 750 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. బోడికొండ ప్రాంతంలోని వంద ఎకరాల్లో పోడు వ్యవసాయంద్వారా వచ్చే ఆదాయంతో కడుపు నింపుకుంటున్నాయి.. అటవీసంపదద్వారా మరికొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి.. గ్రానైట్‌కోసం ఈ కొండను తవ్వాలని నిర్ణయించిన ఏపీ సర్కారు.... గత ఏడాది జులైలో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది.. ఇందులోనూ గిరిజనులు తమ వ్యతిరేకత తెలిపారు..  నిరసనలతో హోరెత్తించారు.. దీనిపై స్పందించిన అధికారులు గిరిజనుల అనుమతిలేకుండా లీజుకు ఇవ్వబోమని స్పష్టంచేశారు.. ఈ నిర్ణయంతో గిరిపుత్రులు శాంతించారు.. 
రహస్యంగా పోకార్నో కంపెనీకి బోడికొండ గ్రానైట్‌ క్వారీ లీజు
ఇలా గిరిజనులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్లీ దొంగచాటుగా తన పని మొదలుపెట్టింది.. రహస్యంగా బోడికొండ గ్రానైట్  క్వారీని పోకార్నో కంపెనీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ నెల 8న పోకార్నో కంపెనీ ఈ కొండ దగ్గర భూమిపూజ చేయడంతో విషయం బయటకొచ్చింది.. మళ్లీ పోరాటానికి దిగిన గిరిజనులకు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.. 
గిరిజనులకు అండగా సీపీఎం
గిరిజనులకు సీపీఎంకూడా అండగా నిలిచింది... గ్రామస్తులతోకలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది.. కార్పొరేట్‌ శక్తులకు భూముల్ని కట్టబెట్టేందుకే సర్కారు ఇలాంటి పనులు చేస్తోందని మండిపడుతోంది..
ప్రశాంతమైన వాతావరణం
బోడికొండ చుట్టుపక్కల ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది. పచ్చని ప్రకృతిమధ్య గిరిజన కుటుంబాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి.. క్వారీతో వీరి జీవితాలన్నీ తలకిందులైపోతాయి.. ఉపాధి పోవడమే కాదు... చుట్టు పక్కల ప్రాంతాలు కాలుష్యబారిన పడతాయి. దుమ్ము, ధూలి నిండిపోయి ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మవ్యాధులు వేధిస్తాయి.. తాగే నీరు, పీల్చే గాలితో కొండకు సుమారు పది కిలోమీటర్ల వరకు కాలుష్యం వ్యాపిస్తుంది. ఈ కొండ జోలికివస్తే ఊరుకోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు... ఆందోళనలద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు..

 

21:00 - June 24, 2016

గుంటూరు : సదావర్తి సత్రం భూముల వేలంపై ఈ టెండర్లను పిలవకపోవడం దారుణమనిపై ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కాల సూరిబాబు అన్నారు. అక్రమ వేలం రద్దు చేయకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేపడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం పథకం ప్రకారమే ఈ తరహా వేలం నిర్వహించిందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 


 

20:58 - June 24, 2016

ఆల్ మోస్ట్ టాలీవుడ్  స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి నిహారిక రావడమే ఫస్ట్ టైమ్.  మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక, హీరో నాగ శౌర్య నటించిన ఒక మనసు సినిమా ఈ రోజు విడుదల అయింది. ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించారు. మరి అంతగా ఎక్స్ పెక్టేషన్స్ తో ధియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..  సినిమా చూడడానికి  వచ్చిన ఆడియన్స్ ఏమన్నారు... ఒక మనసు సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ...తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి Click video For Watch Oka Manasu Movie  Publich Talk 

20:57 - June 24, 2016

హైదరాబాద్ : జూన్‌ 27 డెడ్‌లైన్‌ దగ్గరపడుతున్న కొద్ది సచివాలయం ఉద్యోగులు ఒక్కొక్కరుగా అమరావతికి తరలివెళ్తున్నారు. ఇప్పటికే పలు శాఖలు అమరావతి బాట పట్టగా, మరి కొన్ని శాఖలు ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంల ఏపీ ప్రభుత్వానికి చెందిన ఉద్యోగిని మాత్రం వినూత్న తరహాలో అమరావతికి వెళ్లేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టింది. సొంత రాష్ట్రానికి వెళ్లే సందర్భం చిరకాలం గుర్తుండిపోయేలా ఈ సైకిల్‌ యాత్ర చేపట్టారు.
ఉద్యోగులంతా భావోద్వేగంతో వీడ్కోలు వేడుకలు
ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు అమరావతి తరలివెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉద్యోగులంతా భావోద్వేగంతో వీడ్కోలు వేడుకలు నిర్వహించుకొని ఒక్కో బృందం అమరావతి చేరుకుంటోంది. అయితే వాణిజ్య పన్నుల శాఖకు చెందిన  ఒక ఉద్యోగిని మాత్రం అమరావతికి సైకిల్‌ యాత్ర ద్వారా చేరుకునేలా సాహసయాత్ర చేపట్టింది. 
సైకిల్‌ యాత్రను ప్రారంభించిన అశోక్‌బాబు 
వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేస్తున్న పద్మా చౌదరి సొంతరాజధాని అమరావతికి సైకిల్‌పై బయలుదేరింది. హైదరాబాద్‌ వీడ్కోలును చిరకాలం గుర్తిండిపోయేలా ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా యాత్ర చేపట్టినట్లు పద్మా చౌదరి తెలిపారు. అమరావతి సైకిల్‌ యాత్రను ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. 
ఈ నెల 27 నాటికి సైకిల్ యాత్ర అమరావతికి 
హైదరాబాద్‌లో ప్రారంభమైన సైకిల్‌ యాత్ర విజయవాడ చేరుకునే సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 నాటికి పద్మా చౌదరి చేపట్టిన సైకిల్ యాత్ర అమరావతికి చేరుకుంటుందని పద్మా చౌదరి తెలిపారు.

 

ఎసిబికి చిక్కిన లంచ గొండి అధికారి

హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఓ అధికారి ఎసిబికి చిక్కాడు. షాపూర్ నగర్ ఎలక్ట్రికల్ ఏఈ చిత్తరంజన్ రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. 

ఎపి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుససూదనాచారి, కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఎపి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎపి కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి, మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 

20:32 - June 24, 2016

ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఒక మనసు సినిమాతో మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా తెరంగేట్రం నిహారిక చేసింది. మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక, హీరో నాగ శౌర్య నటించిన ఒక మనసు సినిమా ఈ రోజు విడుదల అయింది. ఈ చిత్రానికి రామరాజు దర్శకత్వం వహించారు. బట్.. హీరోయిన్ రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. అంతేకాదు.. ఆల్ మోస్ట్ టాలీవుడ్  స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి రావడమే ఫస్ట్ టైమ్. మరి అంతగా ఎక్స్ పెక్టేషన్స్ తో ధియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..  సినిమా చూడడానికి  వచ్చిన ఆడియన్స్ ఏమన్నారు... ఒక మనసు సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్ తోపాటు సినిమాపై టెన్ టీవీ పర్ఫెక్ట్ రివ్యూ, రేటింగ్ ఎంత.... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:15 - June 24, 2016

హైదరాబాద్ : బల్దియాలో ప్రజలపై భారం పెరగబోతోందా.., అవుననేనని సంకేతాలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంచుకునేందుకు జీహెచ్ ఎంసీ.. కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందుకోసం అవసరమైతే చట్టాల్లో కూడా మార్పులు చేర్పులు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. 
మరోసారి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరోసారి పన్నులు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మహానగరంలో వేయి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలవుతున్నాయి. జీహెచ్ఎంసీ బడ్జెట్‌ 5500 కోట్లు ఉన్న నేపథ్యంలో.. కార్పొరేషన్‌కు ముఖ్య ఆదాయ వనరైన ఆస్తిపన్ను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. లోపాలను సవరించడంతో పాటు ఆస్తిపన్ను పెంచి కార్పొరేషన్‌ ఖజానాను నింపాలని మున్సిపల్‌ మంత్రి భావిస్తున్నారు. 
ఆదాయ వనరులు పెంచే మార్గాలపై అన్వేషణ 
కొంత కాలంగా జీహెచ్‌ఎంసీపై దృష్టి కేంద్రీకరించిన మంత్రి కేటీఆర్‌.. ఆదాయ వనరులు పెంచే మార్గాలపై అన్వేషణ మొదలు పెట్టారు. ఆస్తిపన్ను వసూళ్లలో ఉన్న లోపాలను గుర్తించిన మంత్రి.. లక్షకు పైగా పన్ను చెల్లిస్తున్న 11 వేల ఆస్తులపై సర్వే చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలువురు కోట్ల రూపాయాల్లో పన్ను చెల్లించడం లేదని గుర్తించారు. దాంతో పాటు ఆస్తిపన్ను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో నగర పరిధిలోని రెసిడెన్సియల్‌ ఆస్తులకు 2001లో ఆస్తిపన్ను పెంచితే.. వాణిజ్య ఆస్తులకు 2007లో పన్నులు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆస్తుల విలువ భారీగా పెరిగినా.. పన్నులు మాత్రం పెంచలేదు. 
శిఖం భూములు, యూఏసీ ల్యాండ్స్‌ పై ఆస్తిపన్ను
మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో శిఖం భూములు, యూఏసీ ల్యాండ్స్‌తో పాటు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై కూడా ఆస్తిపన్ను విధించడానికి అవసరమైతే చట్టంలో మార్పులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై 100 శాతం ఫెనాల్టీతో ఆస్తిపన్ను వసూలు చేసేందుకు రంగం చేస్తున్నారు. నగరంలో ఉన్న ఓపెన్‌ ల్యాండ్స్‌పై 0.5 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. దాంతో పాటు 72 వేల ఆస్తులను సంపూర్ణ సర్వే చేసేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జీహెచ్‌ఎంసీ భూములను, భవనాల విలువను లెక్కించి బాండ్లు విక్రయించడానికి సిద్ధమవుతున్నారు. 
ఆదాయం పెంపుదలే లక్ష్యంగా బల్దియా అధికారులు
ఆదాయం పెంపుదలే లక్ష్యంగా ఉన్న బల్దియా అధికారులు.. బెంగళూర్‌, ముంబై, ఢిల్లీ లాంటి మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్న యోచనలో ఉన్నారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు గుర్రుమంటున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలపై భారం పడనీయమన్న.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ప్రజలపై భారం మోపాలని చూడటం దారుణమని విమర్శిస్తున్నాయి. 

 

19:57 - June 24, 2016

హైదరాబాద్ : పోలీయో విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలీయో ఐపీవీ వ్యాక్సినేషన్లను టీసర్కారు యుద్ధప్రాతిపదికన నిర్వహించిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్ష్మారెడ్డి..పోలియో విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

 

19:53 - June 24, 2016
19:50 - June 24, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తొందరపాటు తగదని ఎంపీ రాపోల్‌ ఆనంద్‌ భాస్కర్‌ సూచించారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. జిల్లాల విభజన  విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొందని.. సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల ఏర్పాటును విరమించుకోవాలన్నారు. ఏ ఆశయం కోసం తెలంగాణ ఏర్పడిందో గుర్తుంచుకుని మసలుకోవాలని సూచించారు.. ఏర్పాటు అనివార్యమైతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను విభజించాలన్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటులో దూకుడు వద్దని హితవు
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ రాపోల్‌ ఆనంద్‌ భాస్కర్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖ పొలిటికల్‌ వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. జిల్లాల పునర్‌ విభజన విషయంలో దూకుడు  పనికిరాదని హితవు పలికారు. ఆచితూచి అడుగులు వేయాలని సూచించారు. 10 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం సరికాదన్నారు. ఇది ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుందన్నారు. 
అనివార్యమైతేనే ముందుకెళ్లాలని సూచన
కొత్త జిల్లాల ఏర్పాటు తప్పనిసరి అని భావిస్తే ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలను విభజించాలని రాపోలు ఆనంద భాస్కర్‌ సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులలో మార్పులు రాకూడదన్నారు. నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లాలోనే ఉండేలా చూడాలన్నారు. శాసనసభ స్థానం పరిధి కూడా ఆ జిల్లాకే పరిమితం కావాలన్నారాయన. 
రాష్ట్ర ఆశయాన్ని మరవరాదన్న రాపోలు
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిందన్నారు రాపోలు ఆనంద భాస్కర్‌. నదీ జలాల వినియోగంలో జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా కేసీఆర్  సర్కార్‌ చేపట్టిన చర్యలను గతంలోనే స్వాగతించినట్లు వెల్లడించారు. జనగామను ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్‌తో ఆత్మబలిదానాల జరగడం దురదృష్టకరమన్నారు. సవాళ్లను దృష్టిలో  ఉంచుకుని జిల్లాల ఏర్పాటును విరమించుకోవాలని సూచించారు రాపోల్ ఆనంద్‌ భాస్కర్. పెన్షన్ల పంపిణిలో అర్హుల ఎంపిక విషయంలో ఇంకా అడ్డంకులు తొలిగిపోలేదని గుర్తుచేశారు. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర  ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తామన్నారు.  

 

19:43 - June 24, 2016

హైదరాబాద్ : ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జడ్జీలకు రక్షణ కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 22వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. టీఎస్‌ ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్ లో బీజేపీ వికాస్ పర్వ్

ఖమ్మం : ఎస్ ఆర్ గార్డెన్స్ లో బీజేపీ వికాస్ పర్వ్ కార్యక్రమం జరుగుతోంది. కేంద్రమంత్రి జెపి.నడ్డా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ హాజరయ్యారు. ఎన్ డీఏ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మోడీ అవినీతిని రూపుమాపారని తెలిపారు. నీతి నిజాయితీలకు మోడీ మారుపేరుగా నిలిచారని చెప్పారు. 

ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై టీప్రభుత్వం ఆగ్రహం

హైదరాబాద్ : ఆందోళన చేస్తున్న టీన్యాయవాదులపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి జడ్జీలకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈనెల 22న ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

19:00 - June 24, 2016

విజయవాడ : అమరావతి నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్‌ పద్ధతికి సీఎం మొగ్గు చూపారు. అధికారుల అభ్యంతరాలన్నీ తోసిరాజన్నారు. నిజానికి స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని టాప్‌ అఫిషియల్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకిలా..? దీనికి ఆసక్తికరమైన సమాధానం వస్తోంది. 
సిఎం, అధికారులకీ మధ్య గ్యాప్
అమరావతి నిర్మాణానికి కాంట్రాక్టర్ల ఎంపిక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకీ, ఉన్నతాధికారుల అభిప్రాయాలకు మధ్య తీవ్రమైన గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలన్నది ముఖ్యమంత్రి అభీష్టం కాగా,  ఉన్నతస్థాయి అధికారులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫైల్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఠక్కర్  సంతకం పెట్టకపోవడం ఆసక్తికరంగా మారింది.  
ఫైల్ పై సంతకం పెట్టేందుకు ఠక్కర్ నిరాకరణ 
సాధారణంగా చీఫ్ సెక్రటరీ ఫైల్ మీద సంతకం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి ఓకే చేస్తారు. స్విస్ చాలెంజ్  పద్ధతిలో కాంట్రాక్టర్ ను ఎంపిక చేయాలన్న ఫైల్ పై ఠక్కర్ సంతకం పెట్టేందుకు నిరాకరించారు. అయిన్నప్పటికీ, ఈ పద్ధతికే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆల్రెడీ సంతకం చేసినట్టు తెలుస్తోంది.   సిఎం సంతకం చేసిన తర్వాత తాను సంతకం చేయడం సర్వీసు నిబంధనలకు  విరుద్ధమన్న అభిప్రాయంతో ఠక్కర్ వున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై అడ్వకేట్ జనరల్ సలహా కోరగా, నిబంధనలననుసరించి నిర్ణయం తీసుకోవాలని  సూచించడంతో, స్విస్ చాలెంజ్ విధానంపై రాష్ట్ర మంత్రివర్గమే నిర్ణయం తీసుకోవాలంటూ ఠకర్ లేఖ రాసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 
స్విస్ చాలెంజ్ విధానంపై అభ్యంతరాలు 
స్విస్ చాలెంజ్ విధానంపై ఏఐఎస్ వర్గాల్లో చాలా అభ్యంతరాలున్నాయి. సీనియర్ అధికారులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో అవకతవకలు జరగడానికి ఎక్కువ ఆస్కారం వుండడమే ఇందుకు కారణం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎదురైన చేదు అనుభవాలు, కేసులు వెంటాడుతుండడంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  టెక్నికల్ గా తాము ఇరుక్కోకుండా జాగ్రత్తపడుతున్నారు. 
2006లో వాడుకలోకి స్విస్ చాలెంజ్ పద్ధతి  
స్విస్ చాలెంజ్ పద్ధతి 2006లో మన దేశంలో వాడుకలోకి వచ్చింది. తొలుత గుజరాత్ తో శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కొన్ని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో దీనిని ఉపయోగించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా 400 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపికచేసేందుకు సిద్ధమైంది. ఎవరు తక్కవకు బిడ్ దాఖలు చేస్తే వారినే కాంట్రాక్టర్ గా ఎంపికచేయడం సాధారణ పద్దతి. అయితే, స్విస్ చాలెంజ్ పద్ధతిలో  వ్యవహారం ఇంకోరకంగా సాగుతుంది. అంతకంటే ఇంకా తక్కువ ధరకు చేస్తారా? అంటూ పోటీలో పాల్గొంటున్న కాంట్రాక్టర్లను అడుగుతారు. నిర్ణీత సమయంలో ఒక కంపెనీ ఎన్నిసార్లైనా బిడ్స్ సవరించుకునే అవకాశం వుంటుంది. అయితే, ఈ పద్ధతిలో అవినీతికి, లాలూచికి  ఆస్కారం ఎక్కువ.  ఇప్పటికే స్విస్ చాలెంజ్ పద్ధతిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వంలోని ముఖ్యులు సింగపూర్ కంపెనీలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నాయి.  ఆదిలోనే వ్యవహారం వివాదస్పదం కావడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
ఫోన్ సంభాషణల్లోనే ఒప్పందం కుదిరందన్న టాక్ 
స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మంచనున్న సింగపూర్ కంపెనీకి 1690 ఎకరాలతో పాటు 52శాతం స్టేక్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ సంభాషణల్లోనే ఒప్పందం కుదిరందన్న టాక్ వినిపిస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో సొంత డబ్బులతో రాజధాని నిర్మించే  సంస్థ టోల్ , ఫీజులు ఇలా వివిధ రూపాల్లో  తాను పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే, స్విస్ చాలెంజ్ విధానం మంచిది కాదంటూ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ నివేదక సమర్పించారు. దేశంలో ఎక్కడా ఈ విధానానికి అనుమతించవద్దంటూ సూచించారు. ఈ నేపథ్యంలో  స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌  నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది.  

 

18:53 - June 24, 2016

శ్రీకాకుళం : తుపానులు వస్తే చాలు శ్రీకాకుళం జిల్లా వాసులకు వెన్నులో వణుకు పుడుతోంది.. విపత్తులు సంభవిస్తే చాలు ప్రభుత్వానికి తీవ్ర నష్టం మిగులుతోంది. దీనికి కారణం సిక్కోలు జిల్లాలో ఉన్న పొడవాటి సముద్రతీరం. అయితే జిల్లాలో తుపానుల తీవ్రత తగ్గించే మార్గాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్గాలేంటి? నిపుణుల సూచనలను అధికారులు పాటిస్తున్నారా? లేదా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. 
అతి పొడవాటి సముద్ర తీరం  
ఆంధ్రప్రదేశ్‌లోనే అతి పొడవాటి సముద్ర తీరం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కొవ్వాడ నుంచి ఇచ్చాపురం దాకా 193 కిలోమీటర్ల సాగరం సిక్కోలు సొంతం. దీనిని నమ్ముకుని వేలాది మత్స్యకారుల కుటుంబాలు బతుకుతున్నాయి. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీరం ఘోరంగా దెబ్బతిని తీర ప్రాంత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు తీరం వెంబడి సరుగుడు చెట్లు విపరీతంగా ఉండేవి..కాలక్రమేనా అవి కోతకు గురవ్వడంతో ఇప్పుడు తీరం బోసిపోయింది. దీంతో గ్రామాల్లో తుపాను తీవ్రత అధికమవుతోంది. 
తుఫానుల తీవ్రత తగ్గించాలంటే
తుఫానుల తీవ్రత తగ్గించాలంటే తీరంపై గల ఇసుక దిబ్బలపై సరుగుడు తోటలు, తాటిచెట్లు ఎక్కువగా పెంచాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సముద్ర తీర ప్రాంత ప్రజల కష్టాలపై అధికారులు చర్యలు ప్రారంభించారు. తీరం పొడవునా సరుగుడు తోటలు, తాటి చెట్లు పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ నర్సరీల నుంచి సరుగుడు మొక్కలను..తాటి టెంకల ద్వారా తాటి మొక్కలను..ఉపాధి హామీ కూలీల ద్వారా తీరం వెంబడి నాటేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. రానున్న అయిదేళ్లలో తుఫాను తీవ్రత తగ్గడంతో పాటు తీరం ఆహ్లాదకరంగానూ మారుతుందని అంచనావేస్తున్నారు. 

 

18:50 - June 24, 2016

రంగారెడ్డి : ప్రైవేటు, కార్పోరేట్ స్కూల్స్ లో పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ఎస్ ఎఫ్ ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్‌ దగ్గర ఆందోళన చేపట్టారు. అదనపు ఫీజులు నియంత్రించి కామన్‌ ఫీజు విధానం తీసుకురావాలని కోరారు.

 

18:45 - June 24, 2016

హైదరాబాద్ : పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని అసోచాం జనరల్‌ సెక్రటరీ రావత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, పెట్టుబడులు వంటి అంశాలపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో విద్యుత్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ వంటి కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత తక్కువ సమయంలోనే అనుమతులు ఇస్తోందని చెప్పారు. 

 

18:42 - June 24, 2016
18:42 - June 24, 2016
18:41 - June 24, 2016

నల్గొండ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం పదవి చేపట్టేది తానేనని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. నల్లగొండలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో సీఎం స్థాయి హోదా కలిగిన వ్యక్తిని తానేనని చెప్పారు. కాంగ్రెస్‌ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. 

18:33 - June 24, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులం యువకుడ్ని ప్రేమించిందని కన్నకూతురిని తల్లిదండ్రులు కడతేర్చారు. జిల్లాలోని నేరడిగొండలో అఖిల అనే యువతి వేరే కులం యువకుడిని ప్రేమించింది. వేరే కులం యువకుడ్ని ప్రేమించిందని అఖిలను తల్లిదండ్రులే చున్నీతో ఉరివేసి చంపారు. అనంతరం తల్లిదండ్రులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం

ఆదిలాబాద్ : జిల్లాలోని నేరడిగొండలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులం యువకుడ్ని ప్రేమించిందని..కూతురు అఖిలను తల్లిదండ్రులే ఉరివేసి చంపారు. అనంతరం తల్లిదండ్రులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

18:19 - June 24, 2016

కృష్ణా : విజయవాడలో జరుగనున్న సీఐటీయూ ఏపీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఆటోనగర్‌లో కళాకారులు చేపట్టిన కళాజాతా అందరినీ ఆకట్టకుంది. ఆటోనగర్‌లో ఈనెల 26 నుంచి 29 వరకు మహాసభలను నిర్వహించడానికి కార్మిక సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మహాసభల్లో కార్మిక సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని సీఐటీయూ నాయకులు చెప్పారు. కార్మికులకు అన్ని రకా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

 

18:14 - June 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని కలిశారు. పార్టీమారిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరారు. పూర్తిమెజారిటీ ఉన్నాకూడా డబ్బు, పదవులతో ప్రలోభపెట్టి తమ నేతల్ని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. 

 

బీటెక్ విద్యార్థి మృతి ఘటనలో కొత్తకోణం

రంగారెడ్డి : బీటెక్ విద్యార్థి అఖిల్ రెడ్డి మృతి ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. డ్రగ్స్ తాగించడం వల్లే చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 
డ్రగ్స్ విషయాన్ని వైద్యులు ధృవీకరించారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో అఖిల్ రెడ్డి చదువుతున్నాడు. అనుమానాస్పద స్థితిలో అఖిల్ రెడ్డి మృతి చెందారు. 

17:55 - June 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్ ముంపుగ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. సంగారెడ్డి క్రాస్‌రోడ్డు వద్ద ముంబై జాతీయ రహదారిని కాంగ్రెస్ కార్యకర్తలు నిర్భందించారు. ఈ ధర్నాలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ పాల్గొన్నారు. జీవో 123 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

 

17:51 - June 24, 2016

రంగారెడ్డి : బీటెక్‌ విద్యార్థి అఖిల్‌రెడ్డి మృతి ఘటనలో కొత్తకోణం వెలుగుచూసింది. డ్రగ్స్‌ తాగించడం వల్లే చనిపోయాడంటూ తమ కుమారుడు చనిపోయాడంటూ అఖిల్‌రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డ్రగ్స్‌ విషయాన్ని వైద్యులు ధృవీకరించారని తల్లి సారికరెడ్డి తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా తమను పరామర్శించలేదని చెబుతున్నారు. తన బిడ్డ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అఖిల్‌రెడ్డి తల్లి డిమాండ్‌ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని సంస్కృతి ఇంజనీరింగ్‌ కాలేజీలో అఖిల్‌రెడ్డి చదువుతున్నాడు. అఖిల్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. 

 

అందరికి ఆమోదయోగ్యమైన రాజధాని ఏర్పాటు : సీఎం చంద్రబాబు

విజయవాడ : అందరికి ఆమోదయోగ్యమైన రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్యలో ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు సమావేశం కొనసాగింది. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి జపాన్ ముందుకొచ్చిందన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన రెండు సంస్థలు అసెండా సింగ్ బ్రిడ్జి, సెమ్ కార్డ్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ముందుకొచ్చాయని తెలిపారు. సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

15:55 - June 24, 2016

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు సమావేశం కొనసాగింది. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అందరికి ఆమోదయోగ్యమైన రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్యలో ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణానికి జపాన్ ముందుకొచ్చిందన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన రెండు సంస్థలు అసెండా సింగ్ బ్రిడ్జి, సెమ్ కార్డ్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ముందుకొచ్చాయని తెలిపారు. సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. 

 

15:20 - June 24, 2016

విజయవాడ : హైదరాబాద్‌ నుంచి కొత్తరాజధానికి ఉద్యోగుల తరలింపు ప్రారంభమైంది. తొలిసారిగా తరలివచ్చిన ఉద్యోగులను విజయవాడలో ఉద్యోగసంఘాల నాయకులు సాదరంగా ఆహ్వానించారు. కొత్తరాజధానిలో సౌకర్యాలపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకుని రావడంపై ఐఅండ్‌పీఆర్‌ ఉద్యోగులు తమ మనోగతాన్ని టెన్ టివితో వెలిబుచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

15:16 - June 24, 2016

లండన్ : ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగింది. 43 ఏళ్ల బంధానికి గుడ్ బై చెబుతూ రెఫరెండంలో అక్కడి ప్రజలు ఎగ్జిట్ కే మొగ్గు చూపారు. ఈయూ నుంచి విడిపోవాలని 52శాతం మంది ఓటేయగా, కలిసి ఉండడానికి 48 శాతం మంది మద్దతు పలికారు. మొత్తంగా కలిసి ఉండాలని కోటీ 74 లక్షల మంది ఓటేయగా, విడిపోవాలని కోటీ 61 లక్షల మంది కోరుకున్నారు. దీంతో ఈయూ నుంచి విడిపోతున్న మొట్ట మొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది. లండన్, స్కాట్లాండ్ కలిసి ఉండాలని పట్టుబడగా, వేల్స్ బ్రెగ్జిట్ కు ఓటేశాయి. బ్రెగ్జిట్ ఎఫెక్ట్ తో అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రిటన్ పౌండు విలువ ఏకంగా 11 శాతం తగ్గి 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 1985 తర్వాత బ్రిటన్ పౌండ్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. జపాన్ మార్కెట్లు ఏడున్నర శాతంపైగా నష్టపోయాయి. దీంతో కాసేపు ట్రేడింగ్ నిలిచిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

 

15:13 - June 24, 2016

లండన్ : బ్రెక్జిట్‌ ఫలితాలతో బ్రిటన్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్‌ ఫలితాలతో బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ నిరాశ చెందారు. ప్రధాని కామెరాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్‌ వరకు ప్రధాని పదవిలో కామెరాన్‌ కొనసాగనున్నారు. అక్టోబర్‌లో కొత్త ప్రధానిని ఎంపిక చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈయూలో కొనసాగడానికే కామెరాన్‌ మొగ్గు చూపారు. ఈయూకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం సేకరణ జరిగింది. సోమవారం యుకె కాబినెట్‌ అత్యవసర సమావేశం కానుంది. 

 

కాసేపట్లో విజయవాడకు కేంద్రమంత్రి పీయూస్ గోయల్

విజయవాడ : కేంద్రమంత్రి పీయూస్ గోయల్ కాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారు. 

ముగిసిన ఎపి కేబినెట్ సమావేశం

విజయవాడ : ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. విజయవాడలో నాలుగు గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

 

నేడు బ్యాంకర్లతో మంత్రి పోచారం సమావేశం

హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం 4 గంటలకు బ్యాంకర్లతో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఖరీఫ్ లో రైతులకు అందించే రుణాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం బ్యాంకర్లకు రూ. 2 వేల కోట్లు విడుదల చేయనుంది. 

 

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన పువ్వాడ అజయ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వినతి పత్రం సమర్పించారు. 

13:50 - June 24, 2016

జూన్ 26 నుండి 29 వరకూ సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరుగనున్నాయి..ఈ మహాసభలలో అనేక కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనున్నారు...ఈ సందర్భంగా సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ గారితో ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికుల చట్టాలు అమలవుతున్నాయా? పనిప్రదేశంలో కార్మికులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? అనే అంశాలపై సీఐటీయూ ఏపీ ప్రధాన కార్యదర్శి గఫూర్ గారు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి....

13:48 - June 24, 2016

ప్రముఖ తమిళ కథానాయకుడు శరత్‌కుమార్‌ తీవ్రమైన గుండె నొప్పితో గురువారం చెన్నైలోని ఆపోలో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. ఆయన పరిస్థితిని సమీక్షించిన ఆనంతరం వైద్య బృందం మాట్లాడుతూ,'ప్రస్తుతం శరత్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. క్రమ క్రమంగా మెరుగుపడుతోంది. త్వరలోనే ఆయన సంపూర్ణంగా కోలుకుంటారు' అని చెప్పారు. నటుడిగా, రాజకీయనాయకుడిగా తమిళనాట శరత్‌కుమార్‌ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కథానాయిక రాధికను వివాహమాడిన శరత్‌కుమార్‌ తమిళ చిత్రాలెన్నో తెలుగు నాట కూడా ప్రదర్శితమై విశేష ఆదరణ పొందాయి. శరత్‌కుమార్‌ ఆరోగ్యం త్వరగా మెరుగు పడాలని సినీ ప్రముఖులు సామాజిక మీడియా ద్వారా స్పీడీ రికవరీ విషెస్‌ తెలిపారు.

13:34 - June 24, 2016

ఖమ్మం : నోటికాడ కూడు లాగేసుకుంటున్నారనే ఆవేదన..పోడు పోతే బతుకు ఉండదనే బాధ..పోడు సాగుదారుల్లో మరింత పట్టుదల, ప్రభుత్వంపై కసిని పెంచింది..పోరాటం చేయకుంటే పోడు పోతుందనే భయం వారికి తెగింపు నిచ్చింది..చావో...రేవో తేల్చుకుందాం అంటూ గిరిజనులు పోడు భూముల కోసం పోరాటం కొనసాగించారు...పోడు పోరు ఫలించటంతో రైతులు హర్షాతికేతాలు వ్యక్తం చేస్తున్నారు.

పోడు రైతులపై ప్రభుత్వ అధికారుల దౌర్జన్యం..
ఏటా పోడు వ్యవహారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఘర్షణలకు కారణమవుతోంది. రాష్ర్ట ప్రభుత్వం హరితహారం పథకం ప్రవేశపెట్టిన తరువాత గిరిజన గ్రామాల్లో పోడు పోరు మరింత ఎక్కువైంది. అడవులను నరికి పోడు సాగు చేస్తున్నారంటూ కేసులు నమోదు చేయటం, భూములు స్వాధీనం చేసుకొని హరితహారం పథకంలో మొక్కలు నాటుతుండటంతో గిరిజన కుటుంబాలు తల్లడిల్లాయి. కళ్ళెదుటే భూముల్లో హరితహారం పనులు జరుగుతుంటే భూమినే నమ్ముకున్న గిరిజన కుటుంబాలు మౌనంగా రోదించాయి. మహిళలు ఆక్రోశంతో శాపనార్ధాలు పెట్టారు.

24 మండలాల్లో 5లక్షల ఎకరాల్లో గిరిజనులు పోడు సాగు..
జిల్లాలోని 24 మండలాల్లో 5లక్షల ఎకరాల్లో గిరిజనులు, పేద గిరిజనేతరులు పోడు సాగు చేస్తున్నారు. కేవలం 84 వేల ఎకరాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆరోవోఆర్) హక్కుల పత్రాలు జారీ చేశారు. దాదాపు 60 వేల మంది దరఖాస్తులను ఫారెస్టు అధికారులు తిరస్కరించారు. 2005 ఆటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న పోడుదారులకు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా నేటికి వారికి పట్టాలు ఇవ్వలేదు.

జిల్లాలో 823 ప్రాంతాల్లో పోడుసాగు...
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 823 ప్రాంతాల్లో పోడు రైతులు పోడు సాగు చేసుకుంటున్నారు. వీరంతా గత 80 నుండి 70 సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు గిరిజనేతరులు. ఫారెస్టు అధికారులు 144 బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ భూముల్లోకి వెళ్లకుండా అటవీశాఖాధికారులు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా సమిష్టిగా పోరాటం చేశారు. మగవారిపై ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యం చేస్తుంటే మహిళలు ఏకంగా అరకలు తీసుకుని పోడు దున్ని పోరాటంలో ముందు వరుస నిల్చున్నారు. వీరికి అండగా నిలిచిన సీపీఎం నేతలపై పోలీసు, ఫారెస్ట్ అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు.

19 మందిపై అక్రమ కేసులు ...
అయితే 19 మందిపై అక్రమ కేసులు పెట్టినా నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది... ట్రైనీ ఐఎఫ్ఎస్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, డిఎఫ్ వో కారేపల్లిలో పోడు సాగు చేసుకుంటున్న రైతులు, సీపీఎం నాయకుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. పోడు దారులను సాగుచేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.

13:28 - June 24, 2016

బ్రిటన్ : బ్రెగ్జిట్ ఎఫెక్ట్‌తో బంగారం ,వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి...ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు రెండున్నరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి..దేశీయంగా పుత్తడి ధర ఏకంగా 1900 రూపాయలు పెరిగింది. దీంతో పదిగ్రాముల బంగారం 31 వేల పైకి చేరింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. కిలో వెండి ధర 1500 రూపాయలు పెరిగి 42 వేల పైకి చేరింది. ఈయూ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నాయి..షేర్ల విలువలు ఘోరంగా పడిపోయాయి.. భయాందోళనలకు గురవుతున్న ఇన్వెస్టర్లు పెట్టుబడులను పసిడి వైపు మళ్లిస్తున్నారు..దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది.

13:24 - June 24, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.

రూ.20వేల కోట్లు ఉన్నాయన్న అగ్రిగోల్డ్‌ ...
అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన బడా సంస్థ. అనుమతులు లేని ఆస్తులను జస్టిస్‌ సీతాపతి కమిటి ఇచ్చి..బడా ఆస్తులను తన వద్దే ఉంచుకుంది. అయితే 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ..అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మొత్తం 8 రాష్ట్రాల్లో 40 లక్షల మంది నుంచి 7 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. 5 సంవత్సరాల తర్వాత మీకు తిరిగి ఇస్తామని నెల వారీగా కొద్ది మొత్తం రాబట్టుకున్నారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి చేతులు ఎత్తేశారు. అయితే ఈ కంపెనీలో 20 మంది డైరెక్టర్స్ ఉన్నారు. వీరి సిస్టర్స్ సంస్థలు 9 వరకు ఉన్నాయి. బినామి రూపంలో డబ్బులను వేరే సంస్థలోకి మళ్లించారని అరోపణ. బాధితులు పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా హై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఏ.పీ. ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది.

8 రాష్ట్రాల్లో 40 లక్షల ఖాతాదారులు...
అయితే 40 లక్షల మంది ఖాతాదారులను మోసం చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే స్పందించిన ఏపీసీఐడీ..అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, హాయిలాండ్ ఎం.డీ. శ్రీరామచంద్రరావును, సదా శివ వరప్రసాద్, అవ్వా శేషు నారాయణను, అహ్మద్ ఖాన్‌లను సీఐడి అరెస్ట్ చేసింది. అయితే ఆస్తులన్నీ అమ్మితే 20వేల కోట్ల రూపాయాలు వస్తాయని..7 వేల కోట్లు చెల్లించేందుకు ఇబ్బందులు లేవని కోర్టుకు తెలిపారు. దీంతో ఆస్తులు అమ్మి బాధితులకు ఇచ్చేందుకు త్రిసభ్య కమిటిని నియమించింది హైకోర్టు. కానీ ఈ కమిటీ పనితీరులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం సీబీఐతో కేసు విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్స్ డిమాండ్ చేయడంతో.. ఏ.పీ ప్రభుత్వం అభ్యంతరాలుంటే చెప్పాలని ఆదేశించింది. అయితే సీబీఐ కేసు విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పడంతో సీబీఐ దర్యాప్తుపై ఆసక్తి నెలకొంది.

ముమ్మరంగా దర్యాప్తు చేయనున్న సీబీఐ ...
సీబీఐతో దర్యాప్తు చేస్తే అనేక లాభాలున్నాయని బాధితులు చెప్తున్నారు. ఖాతాదారుల నుంచి వచ్చిన మొత్తాన్ని ఏ ఏ అకౌంట్లకు బదిలీలయ్యాయో సీబీఐ దర్యాప్తులో తేలనుంది. అలాగే ఆడిట్ రిపోర్టులను కూడా క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా బినామి ఆస్తులపై కూడా ఆరా తీయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఆస్తుల అటాచ్ మెంట్ కంటే ముందు కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంపై కీలక దర్యాప్తు జరుగనుంది. మంత్రి పుల్లారావు అతని భార్య పేరు మీద కోనుగోలు చేసిన ఆస్తుల వివరాలు..విలువైన ఆస్తులను బదలాయించడంపై సి.బి.ఐ.రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలోని రాంఆవాస్ రిసార్ట్స్ అమ్మకం, బెంగళూర్ ఆస్తులు, హాయ్ ల్యాండ్ అమ్మకంలో ఇబ్బందులపై సీబీఐ ముమ్మరంగా దర్యాప్తు చేయనుంది.

ఏపీ సీఐడి తీరుపై హైకోర్టు ఆగ్రహం...
మరోవైపు అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఐడీకి బదులు సీబీఐతో దర్యాప్తు జరిగితే సెబీ అనుమతులు లేకుండా ఎలాంటి మోసాలకు పాల్పడ్డారో.. పక్కా ఆధారాలు లభిస్తాయని హైకోర్టు కూడా భావిస్తోంది. తద్వారా మోసానికి పాల్పడ్డ నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుందనేది కోర్టు భావన. దీంతో అతి త్వరలోనే అగ్రిగోల్డ్‌ కేసు సీబీఐకి అప్పగించే అవకాశం కన్పిస్తోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది హైకోర్టు. 

13:16 - June 24, 2016

గుంటూరు : గుంటూరు జిల్లా యడవల్లి భూ కబ్జాపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనం సంచలనం సృష్టిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితుల భూములను కాజేసిన వ్యవహారాన్ని టెన్‌ టీవీ ప్రసారం చేసింది. దీనిపై పలు పార్టీలు, ప్రజాసంఘాలు స్పందించాయి. రద్దు చేసిన దళిత భూముల సొసైటీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశాయి. పేదల పాలిట బకాసురుల్లా మారిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే దళితుల పక్షాన పోరాటం చేస్తామని పలువురు హెచ్చరించారు.

యడవల్లి భూ మాఫియా..టెన్‌ టీవీ కథనంతో సంచలనం..
గుంటూరు జిల్లా యడవల్లి భూ మాఫియాపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దళితులు, పేదల భూములను అధికార పార్టీ పెద్దలు కాజేయడంపై పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దు చేసిన భూముల సొసైటీని తక్షణమే పునరుద్ధరించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

భూముల వ్యవహారంలో మరో కోణం...
యడవల్లి భూముల వ్యవహారంలో మరో కోణం వెలుగు చూసింది. నాలుగేళ్ల క్రితమే కొందరు నిరుద్యోగులు యడవల్లి గ్రానైట్‌ భూములను లీజుకోసం మైనింగ్ శాఖకు దరఖాస్తు చేశారు. మైనింగ్‌ నిబంధనల ప్రకారం ముందు దరఖాస్తు చేసుకున్న వారికే లీజు కేటాయింపులు జరపాలి. కానీ కొందరు బినామీ పేర్లు సృష్టించి అసలు అర్హులను పక్కకు పెట్టి.. అధికార పార్టికి చెందిన అనుయాయుల పేర్లపై గ్రానైట్‌ లీజులు దక్కించుకున్నారు. అక్కడ ఇప్పటికే మైనింగ్‌ తవ్వకాలు సాగిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తన అనుచరుల ద్వారా మైనింగ్‌ లీజు పొందే పథకాన్ని అమలు చేశారు. అదీ కాక అసలు మైనింగ్ కేటాయింపుల ఆశ చూపే రవికుమార్‌ను అధికార పార్టీలోకి చేర్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో దళితులకు జరిగిన అన్యాయంపై పలువురు స్పందించారు. దళితుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు.

కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాలు డిమాండ్‌...
దళితులకు చెందాల్సిన భూములను దళితులే అనుభవించాలని, పేదల భూములు కాజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మొత్తానికి పేదల భూములను పెద్దలు స్వాహా చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

13:12 - June 24, 2016

జవాన్‌ అండ్‌ కాస్పియన్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై సుధాకర్‌ వినుకొండ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరం'. ఈ సినిమాలో సంజీవ్‌, సాయికృప జంటగా నటిస్తున్నారు. కిరణ్‌ శంకర్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియోను బుధవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'చిత్ర ప్రోమో చాలా బాగుంది. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. దర్శకుడు సుధాకర్‌ మాట్లాడుతూ, మంచి రొమాంటిక్‌, థ్రిల్లర్‌ చిత్రమిది. జులై 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు.

13:09 - June 24, 2016

హైదరబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వన్ వేతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరుగుతాయా లేక ఉపయోగం ఉంటుందా..అన్నదానిపై డిటేల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని కోరింది.
ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు...
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫ్లై ఓవర్ నిర్మించే క్రమంలో ... ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ట్రాఫిక్ పోలీసులు.. ఉన్నతాధికారులతో అధ్యయనం చేయిస్తోంది. వన్ వే ప్రతిపాదన ఉన్నప్పటికీ .. ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతుందా..లేక సత్ఫలితాలను ఇస్తుందా..అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

కేబీఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు..
ప్రస్తుతం ఉన్న రూట్లలో మార్పులు చేసి.. కేబీఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు వెళ్లాలంటే.. 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వన్ వే ప్రతిపాదనతో దాదాపు 5 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మద్యలో ఎక్కడా యూటర్న్ ఆలోచన లేకపోవడం కాస్త ఇబ్బందిగా మారనుంది.
పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల నుండి 7 కిలోమీటర్ల పరిధి..
నగరంలో ఉన్న ట్రాఫిక్ జాం ను తగ్గించాలంటే.. వన్‌వే ప్రతిపాదన వాహనదారులకు కాస్త ఇబ్బందే అయినా.. సాఫీగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ.. 5 కిలోమీటర్ల నుండి 7 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. నాగార్జున సర్కిల్ నుండి మాదాపూర్ వెళ్లే .. వాహనదారులు కేబీఆర్ పార్క్ నుండి నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు వెళ్లేవారు. కాని వన్ ప్రతిపాదన గనక వస్తే.. కేన్సర్ హాస్పిటల్ జగన్నాధటెంపుల్ , ఫిలింనగర్ బాలకృష్ణ ఇంటి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత అధికారులతో మేయర్ సమావేశాలు...
ఇప్పటికే హైదరాబాద్ మేయర్ సంబంధిత అధికారులతో కలిసి అక్కడి రహదారులను పరిశీలించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తాయి..వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫీల్డ్ వర్క్ చేసి మరీ చర్చించారు. అనంతరం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వన్ వే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వాహనదారులు...
ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ రద్దీతో గమ్యాన్ని చేరుకోవాలంటే.. గంటలు పడుతున్న తరుణంలో.. వన్ వే ప్రతిపాదనతో మరింత సమయం పడుతుందని.. వాహనదారులు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.   

12:39 - June 24, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న రహదారుల విస్తరణ సరికొత్త వివాదాలకు దారి తీస్తోంది. రాజధానికి శంకుస్థాపన అంటూ ఓసారి, పుష్కరాలు అంటూ మరోసారి ఇష్టానుసారంగా రోడ్లు విస్తరించడంపై స్థానికులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రోడ్ల విస్తరణతో రాజధాని ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం..

ఇళ్లను, షాపులను కులుస్తుండటంతో ప్రజల ఆగ్రహం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుతో ఏపీ రాజధాని ప్రాంతంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 29 గ్రామాల్లో ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పేరుతో అక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని రహదారుల వెంబడి ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. రోడ్ల విస్తరణ అంటూ ఆరు నెలలకోసారి రోడ్డు వెంబడి ఉన్రన ఇళ్లను, షాపులను కుల్చేస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు తిరగబడుతున్నారు..

ఉండవల్లి టూ రాయపూడి...

రాజధాని శంకుస్థాపన కోసం ఉండవల్లి మొదలుకుని రాయపూడి వరకు రహదారులను విస్తరించారు. శంకుస్థాపన పూర్తై 9 నెలలు గడవకముందే మరోసారి ప్రభుత్వం రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టింది. పుష్కరాలతో పాటు తాత్కాలిక సచివాలయం ప్రారంభం కానుండడంతో ఉండవల్లి నుంచి అమరావతి వరకు రహదారుల విస్తరణ పనులు మొదలు పెట్టారు. అయితే విస్తరణ కోసం రిజిస్ట్రేషన్ ఉన్నా తమ నిర్మాణాలను తొలగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరులో అయితే కొందరు తెలుగు తమ్ముళ్లు మంత్రులతో రికమెండేషన్ చేయించుకుని వారి నిర్మాణాలను తొలగించకుండా చేసుకుంటున్నారు.

నిర్మాణాలను 15 అడుగులు వెనక్కి జరపాలని ఎమ్మార్వో ఆదేశం...
ఇకపోతే తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతున్న మందడం గ్రామంలో అయితే పరిస్థిత మరింత దారుణంగా తయారైంది. సచివాలయానికి ప్రధాన రహదారి మందడం గ్రామం నుండే వెళుతుండడంతో గ్రామంలోని రోడ్డు ప్రక్కనే ఉన్న భవనాలను దాదాపుగా 15 అడుగులు వెనక్కి జరపాలని స్థానిక ఎమ్మార్వో సుధీర్ బాబు ఆదేశించారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఉన్న చిన్న చిన్న వ్యాపారులు తమ బతుకులను నాశనం చేయోద్దని ప్రాధేయపడుతున్నారు...

రోడ్ల విస్తరణతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు...
రోడ్ల విస్తరణ చేస్తే ఒకేసారి చేయాలి గాని.. ఇలా ఇష్టం వచ్చినప్పుడల్లా విస్తరణ అంటే తాము బ్రతికేది ఎట్లాగా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విస్తరణ చేయడంతో ఖాళీగా ఉన్న స్థలమంతా మళ్లీ కట్టుకోవడానికే సరిపోయిందని..ఇప్పుడు మరోసారి కూలుస్తామంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీస నష్టపరిహారమైనా అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

12:31 - June 24, 2016

విజయవాడ: ముస్లీంల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. ఈ నెల నుంచే మసీదుల్లోని ఇమాంలకు, మౌజాలకు 5వేల రూపాయలు గౌరవవేతనం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. రంజాన్‌ సందర్భంగా చంద్రన్నతోఫాను అందిస్తున్నామన్నారు. అలాగే దుల్హన్‌ పథకం కింద ముస్లీం వధువులకు 50వేల రూపాయలు అందిస్తామన్నట్టు మంత్రి చెప్పారు. 

12:15 - June 24, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల బాధితుల తరపున నిరాహార దీక్ష చేసేందుకు తెలుగు దేశం శాసనసభా పక్ష నేత రేవంత్‌ రెడ్డి సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగానే ప్రజలు ఆందోళన బాట పడుతున్నారని రేవంత్‌ తెలిపారు. ప్రభుత్వం వెంటనే భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి భూములు సేకరించాలని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణానికి వ్యతిరేకిస్తున్న వారిపై ఆంధ్రా పార్టీలంటూ టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న విమలక్క, కోదండరాం ఆంధ్రా ప్రాంత వ్యక్తులా అని ఆయన ప్రశ్నించారు.

12:12 - June 24, 2016

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ,ఏపీ సీఎస్ లతో పాటు బీహార్, జార్ఝండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘఢ్ వంటి ఏడు రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు, రోడ్లు, టెలీ కమ్యూనికేషన్ , పీఎస్ ల ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి ఏమేరకు జరుగుతోందని అంశంపై సమీక్షించారు. కేంద్రం కేటాయిస్తున్న నిధులు ఆయా ప్రాంతాలలో పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తున్నారా లేదా అనే అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిరిజన, ఆదివాసీ తెగలు అంతరించే పరిస్థితిలో వుండగా వారికి కేటాయించిన నిధుల నివేదికలను ఏపీ, తెలంగాణ సీఎస్ లు కేంద్రానికి అందించారు. 

11:55 - June 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియట్‌లో మైన్స్‌పై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు.. దక్షిణ భారత దేశంలోనే మైనింగ్‌ ఆదాయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ప్రకటించారు.. ఇసుకద్వారా మరో 400కోట్ల ఆదాయం పెరిగిందని చెప్పారు.. ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు కేటీఆర్‌ తెలిపారు.

నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎస్ లతో రాజీవ్ మహర్షి భేటీ...

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ,ఏపీ సీఎస్ లతో పాటు ఏడు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్ లు హాజరయ్యారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు, రోడ్లు, సెల్ టవర్స్, పీఎస్ ల ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయి.

మైనింగ్ పై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : సచివాలయం నుండి మైనింగ్ అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మైనింగ్ లో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో ఆదాయం 41 శాతం పెరిగిందన్నారు. ఇసుక ద్వారా మరో రూ.400కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. స్థానిక అవసరాలకోసం సమీపంలోని ఇసుక రీచ్ ల నుండి తీసుకునేలా కలెక్టర్లకు అధికారాలిచ్చామని మంత్రి పేర్కొన్నారు. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతికి కేబినెట్ ఆమోదం పలకనుంది. ప్రయివేటు రంగంలో వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు ఆర్డినెన్స్ కు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. విట్ కు 200ల ఎకరాలు, ఇండో యూకే ఆసుపత్రికి 150 ఎకరాల స్థలాలకు ఆమోదం తెలుసనుంది. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మద్య నెలకొన్న జలవివాదంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. 

చిన్నారి జ్ఞానసాయి శస్త్రచికిత్సకు ఏపీ సర్కార్ సాయం...

విజయవాడ : చిత్తూరు జిల్లాలో మెర్సి కిల్లింగ్ కు సిద్ధమైన చిన్నారి జ్ఞానసాయి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని చంద్రబాబు ఆదేశించారు. సర్జరీకి సంబంధించిన పత్రాలతో రావాలని సీఎం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. జ్ఞానసాయి వైద్యం కోసం ఎంత ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారు. 

విడిపోవటానికి ఓట్లు వేసిన బ్రిటన్ ప్రజలు..

బ్రిటన్ : ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన బ్రెగ్జిట్ ఓటింగ్ కు తెరపడింది. కౌంటింగ్ పూర్తవటంతో ఫలితాలు తేటతెల్లమయ్యాయి. యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగాలని ప్రజలు తీర్పునిచ్చారు. బ్రెగ్జిట్ కు అనుకూలంగా 52 శాతం మంది ప్రజలు ఓట్లు వేయగా...వ్యతిరేకంగా 48 శాతంగా మంది ప్రజలు ఓట్లు వేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

10:48 - June 24, 2016

దక్షిణకొరియ : అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై మన దేశానికి నిరాశే ఎదురయ్యింది. భారత్‌కు సభ్యత్వం కల్పించాలన్న అంశంపై ఎన్ఎస్ జీ లో ఏకాభిప్రాయం కుదరలేదు. చైనా సహా పలు దేశాలు భారత్‌కు సభ్యత్యాన్ని వ్యతిరేకింగా, అమెరికా, ఫ్రాన్స్‌తోపాటు మరికొన్ని దేశాలు మద్దతు పలికాయి.

భారత్ ఆశలు నిరాశలు....
అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై మన దేశం పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపు..ఎన్ఎస్ జీ సమావేశంలో భారత్‌కు సభ్యత్వంపై సుదీర్ఘ చర్చ జరింది. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన ఎన్ఎస్ జీ భేటీలో మన దేశానికి సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు.

ఎన్ఎస్ జీ భేటీకి 300 మంది ప్రతినిధులు హాజరు...

ఎన్ఎస్ జీలో సభ్యత్వం కోసం మనదేశం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ గ్రూపులో 48 దేశాలకు సభ్యత్వం ఉంది. సియోల్‌లో జరుగుతున్న అణు సరఫరాదారుల సమావేశానికి సభ్య దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎన్ఎస్ జీలో భారత్‌కు సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. చైనా, టర్కీ, బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. అణ్వాస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్‌ సంతకం చేయనందున ఎన్ఎస్ జీ ల సభ్యత్వం కల్పించరాదని ఈ ఆరు దేశాలు వాదించాయి. మెక్సికో మాత్రం మనకు అనుకూలంగా వాదించింది. ఇటీవల మెక్సికోలో పర్యటించిన మన ప్రధాని మోదీ ఎన్ఎస్ జీలో సభ్యత్వం కోసం ఆ దేశ మద్దతును కూడగట్టారు. అమెరికా, ఫ్రాన్స్‌ సహా 20 దేశాలు మన దేశానికి మద్దతు ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. గ్రూపులోని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంటేనే సభ్యత్వం లభిస్తుంది.

ఎన్ఎస్ జీ సభ్యత్వం కోసం పాకిస్థాన్‌ యత్నం...

ఎన్ఎస్ జీ సభ్యత్వం కోసం మనతోపాటు పాకిస్థాన్‌ కూడా ప్రయత్నిస్తోంది. మన సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న చైనా..ఇదే సమయంలో భారత్‌కు పక్కలో బల్లెంలా మారిన పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతోంది. పాకిస్థాన్‌ కూడా మన ప్రయత్నాలను అడ్డుకునేందుకు శతవిధాల కృషి చేస్తోంది. తక్కువ వ్యయంతో కాలుష్య రహిత అణు ఇంధనం ఉత్పత్తి ద్వారా ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నది భారత్‌ లక్ష్యం. అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అణ్వాయుధాల తయారీకి ఉపయోగించబోమని మన దేశం ఇస్తున్న హామీనిఎన్ఎస్ జీ సభ్య దేశాలు పరిగణలోకి తీసుకోవడంలేదు.

జీ జిన్‌పింగ్‌తో 45 నిమిషాలపాటు మోదీ భేటీ...
మరోవైపు ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య శిఖరాగ్ర సద్సుకు హాజరైన మోదీ..చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు 45 నిమిషాలకుపైగా వివిధ అంశాపై చర్చలు జరిపారు. ఈ సందర్భంలో ఎన్ఎస్ జీ లో సభ్యత్వం అంశం కూడా చర్చకు వచ్చింది. అణు సరఫరాదారల సంఘంలో సభ్యత్వం కోసం భారత్‌కు మద్దతు ఇవ్వాలని మోదీ..చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కోరారు. అయితే ఆయన నుంచి స్పందనలేదు. ఎన్ఎస్ జీ మన సభ్యత్వ ప్రతిపాదనను చైనా వ్యతిరేకించిన తరుణంలో జీ జిన్‌పింగ్‌ దీపిపై ఏమీ మాట్లాడలేదని భావిస్తున్నారు. సియోల్‌లో ఇవాళ కూడా జరిగే న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపు దేశాల సమావేశంలో భారత్‌కు సభ్యత్వం అంశంపై మళ్లీ చర్చ జరుగుతుంది.

10:35 - June 24, 2016

బ్రిటన్ : ఈయూలో బ్రిటన్ ఉంటుందా? లేదా ? అనేదానిపై కాసేపట్లో క్లారిటీ రానుంది.. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే విడిపోదామనే దానికే మెజార్టీ ఉన్నట్లు తెలుస్తోంది..బ్రెగ్జిట్ పై మొత్తం 382 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా 309 కేంద్రాల్లో కౌంటింగ్ పూర్తయింది.. బ్రెగ్జిట్‌ కు 52 శాతం అనకూలంగా ఉన్నారు... లెక్కింపు ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న సంఖ్య ఎక్కువగా ఉండగా...ఆ తర్వాత కొద్దిసేపటికే అందుకు భిన్నంగా ఫలితాల సరళి కనిపించింది. ప్రస్తుతానికి వెలుబడ్డ ఫలితాల ప్రకారం ఈయూ నుంచి వైదొలగాలన్న వాదనకే మొగ్గు కనిపిస్తోంది.

బ్రెగ్జిట్ ఫలితాలు ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం ...
బ్రెగ్జిట్ పలితాలు ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి... ఎగ్జిట్ ఎఫెక్ట్‌ తో స్టాక్ మార్కెన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి..బ్రిటన్ పౌండ్ విలువ ఏకంగా 8 శాతం తగ్గి 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది..ఇటు దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి... సెన్సెక్స్ 700 పాయింట్లు , నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడువుతున్నాయి..రూపాయి విలువ ఇవాళ ఒక్కరో్జే 100 పైసలు తగ్గి నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

బ్రిటన్‌ ఉండాలా? వద్దా?...

బ్రిటన్ : యూరోపియన్‌ సమాఖ్యలో బ్రిటన్‌ ఉండాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలప్రకారం రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ ఉంది.. యూరోపియన్‌ యూనిన్‌ నుంచి విడిపోవాలని కోరుకునేవారి సంఖ్యే స్వల్ప ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడనున్నాయి. 

10:11 - June 24, 2016

హైదరాబాద్ : మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్... సరికొత్త దందా బయటపడింది.. యురేనియం పేరుతో మోసానికి పాల్పడి వందల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు వెలుగులోకొచ్చింది...ఇందులో వీఐపీలు.. సినీతారలు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలపై సీఐడీ లోతుగా శోధిస్తుంది...

సూరి మర్డర్ కేసులో నిందితుడు భానుకిరణ్‌ ...
మహానగరంలో మరో ఘరానా మోసం...బురిడీ బాబా శివానంద మోసం వెలుగుచూసిన కొన్ని రోజుల్లోనే మరో మహా మోసాన్ని సీఐడీ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.. .లైఫ్‌స్టైల్‌ భవన యజమాని మధుసూధన్‌రెడ్డిని కోటి రూపాయలు ముంచేసిన శివానంద మరెందరి వద్దో మొత్తం మీద రెండుమూడు కోట్లు కొట్టేస్తే యురేనియం పేరుతో మాత్రం వందల కోట్ల దందా నడిచింది...నమ్మకాన్ని క్యాష్ చేసుకున్న భారీ మోసం వెలుగుచూసింది..దీనిపై సీఐడీ పోలీసులు లోతుగా శోధిస్తున్నారు...ఇందుకు ప్రధాన కారణం కూడా ఎవరో కాదు..

సూరి మర్డర్ కేసులో నిందితుడు భానుకిరణ్‌ ...
పిడుగు పడినప్పుడు తమ వద్ద ఉన్న పాత్రలో చుట్టుప్రక్కల ఉన్న యురేనియం అంతా చేరుతుందని ప్రచారం చేశారు. యురేనియానికి వెలకట్టలేని ధర పలుకుతుందని ప్రచారం చేశారు...ఇలా బురిడీ కొట్టించే 18 మంది ఉన్న ముఠాకు సూత్రధారి భానుకిరణ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితుల్లో వీఐపీలు..సినీతారలు....
యురేనియం పేరుతో నడుస్తున్న దందాకు గంగాధర్‌రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి అనే ఇద్దరు ముఠాను నిర్వహిస్తున్నారు...ఇక వీరితో పాటు బెంగుళూరులో కోహ్లీ అనే వ్యక్తి ఈ వ్యవహారం నడుపుతున్నాడు...ఒక అక్షయలాంటి పాత్ర ఉందని, పిడుగు పడినప్రదేశంలో ఆ పాత్ర ఉంచితే చుట్టుప్రక్కల ఉన్న యురేనియాన్ని ఆ పాత్ర ఆకర్షిత్తుందని, దానిని అమ్ముకుంటే కోట్లు వస్తాయని చెప్పి వారు ప్రచారం చేస్తున్నారని, వీరి వలలో చాలా మంది వీఐపీలు పడినట్లుగా తెలుస్తోంది....

భాను చెప్పిన అకౌంట్ కు రూ. 150 కోట్లు బదిలీ....
సరిగ్గా 15 రోజుల క్రితం యురేనియం పేరుతో జరిగిన లావాదేవీల్లో మోసపోయిన ఓ ప్రవాసభారతీయుడు డీజీపి దృష్టికి తీసుకురావడంతో సీఐడీ అధికారులకు అప్పగించారు..గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించిన పోలీసులు బెంగళూరులో కోహ్లీని అదుపులోకి తీసుకున్నారు...దాదాపు యురేనియం పేరుతో 300 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన తరుణంలో కోహ్లి ఉచ్చులో చాలా మంది వీఐపీలు సినీతారలు చిక్కుకున్నారు...భాను చెప్పిన అకౌంట్ కు రూ. 150 కోట్లు బదిలీ చేసినట్లు తెలుస్తోంది...

నేడు ఏపీ కేబినెట్ భేటీ...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ఉద్యోగుల తరలింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు.. రాజధాని ప్రాంతంలో కార్యాలయాల ఏర్పాట్లపై మంత్రివర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేయనున్నారు. తెలంగాణతో వస్తున్న నీటి పంచాయతీపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.

09:45 - June 24, 2016

నల్లగొండ : కోదాడ మండలం గోండ్రియాలలో విషాదం చోటుచేసకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాకు తగిలి తండ్రీ, కుమార్తె మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మృతులు రమ(22) వెంకటేశ్వర్లు (45)గా గుర్తింపు. కాగా శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో కుమర్తె రమ బట్టలు ఆరేస్తుండా విద్యుత్ షాక్ తగిలింది. ఇది గమనించిన తండ్రి వెంకటేశ్వర్లు కుమార్తెను కాపాడబోయి తాను కూడా కుమార్తెతోపాటు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

09:40 - June 24, 2016

జమ్మూకశ్మీర్ : కుప్వారాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదుకుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గత మూడు రోజుల్లో మూడు సార్లు ఎన్ కౌంటర్లు జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలపై నిఘాపెట్టిన భద్రతాదళాలు సరైన సమయంలో వారిని ఎక్కడిక్కడ తుదముట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత మూడు రోజుల నుండి ఎన్ కౌంటర్ మూడుమార్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 

09:27 - June 24, 2016

రంగారెడ్డి : విద్యార్ధుల అనుమానాస్పదంగా మృతి చెందుతున్న ఘటనలు ఈమధ్య కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుంటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి శ్రవణ్  కుమార్  అనుమానాస్పదంగా మృతి చెందాడు . ఈ ఘటన ఘట్ కేసర్ మండలంలోని కొండాపూర్ లో చోటుచేసుకుంది. విద్యార్థిని మృతికి ర్యాంగింగే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థి స్వస్థలం గుంటూరు జిల్లా పిడుగురాళ్లగా తెలుస్తోంది. ర్యాగింగ్ ను నిరోధించటానికి ప్రభుత్వం 1997లో ర్యాంగింగ్ నిరోధానికి ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయినా కానీ ఈ ర్యాగింగ్‌ రాక్షసత్వానికి విద్యా కుసుమాలు రాలిపోతూనే ఉన్నాయి..! అమ్మానాన్నల ఆశాదీపాలు అర్ధాంతరంగా ఆరిపోతూనే ఉన్నాయి..! ఈ అకృత్యానికి అంతం పలకాల్సినవారు.. ఈ దారుణానికి అడ్డుకట్ట వేయాల్సినవారే.. వేడుక చూస్తుంటే, విద్యాసంస్థల్లో మాటువేసిన ర్యాగింగ్‌.. నిర్ధాక్షిణ్యంగా కాటేస్తోంది..! అక్షర దీపాలను అన్యాయంగా మింగేస్తోంది..! తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తూ.. విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్న ఈ దారుణంలో.. అందరికన్నా ముందుగా నిందించాల్సింది, బోనులో నిలబెట్టాల్సింది ఆయా కాలేజీల యాజమాన్యాలనే కదా! తమ కళాశాలల్లో చదివే విద్యార్థుల బాధ్యత వారిది కాక మరెవరిది? ఫీజులు కట్టించుకునే శ్రద్ధ విద్యార్ధుల చదువుల విషయంలోనూ..వారి రక్షణ విషయంలోనూ యాజమాన్యాలు తీసుకుంటే ఏ విద్యార్ధులు ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితులు రావుకదా?!..

ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి...

రంగారెడ్డి : సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన ఘట్ కేసర్ మండలంలోని కొండాపూర్ లో చోటుచేసుకుంది. విద్యార్థిని మృతికి ర్యాంగింగే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భారత్ కు ఇచ్చిన నినాదమే బ్రిటన్ లో ...

బ్రిటన్ : వందల సంవత్సరాలు భారత్ ను బానిసత్వంలోకి నెట్టి బ్రిటన్ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. స్వాతంత్ర్యానంతరం స్వదేశానికి పోతూ..విభజించు..పాలించు అనే నినాదాన్ని వదిలి వెళ్లింది.ఇప్పుడు అదే సమస్యలను బ్రిటన్ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే అంశంపై గురువారం నిర్వహించిన రెఫరెండంలో భారతీయ సంతతి ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఓట్లేశారు. దేశంలో ఉన్న 1.2 మిలియన్ల భారత సంతతి ఓటర్లలో అధిక శాతం బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్టు తెలుస్తోంది.

నేడు ఓయూసెట్‌ ఫలితాల విడుదల...

హైదరాబాద్‌ : ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఓయూసెట్‌-2016 ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఓయూ అతిథిగృహంలో నిర్వహించనున్న కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొ.ఇ.సురేశ్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.

భారత్ ను వ్యతిరేకిస్తున్న చైనా...

దక్షిణ కొరియా : అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వంపై భారతకు నిరాశే మిగిలింది. చైనాసహా టర్కీ, ఆస్ట్రీయా, న్యూజిల్యాండ్‌, ఐర్లాండ్‌, బ్రెజిల్‌ భారత్ సభ్యత్వాన్ని వ్యతిరేకించాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గురువారం ఎన్‌ఎస్‌జీ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గురువారం ఎన్‌ఎస్‌జీ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. 48 సభ్యదేశాలు ఉన్న ఎన్‌ఎస్‌జీలో అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా పలుదేశాలు భారత్ మద్దతు పలికాయి.

బ్రెగ్జిట్ అనుకూలం ఓటింగ్ తో 6శాతం పడిపోయిన పౌండ్ విలువ...

బ్రిటన్ : బ్రెగ్జిట్ ఓటింగ్ లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 382 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సాగుతోంది. దీంట్లో 171 కేంద్రాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. బ్రెగ్జిట్ కు అనుకూలంగా 51.3 శాతం ఓట్లు పోల్ అవ్వగా..వ్యతిరేకంగా 48.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మిగతా కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నాం 12 గంల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. బ్రెగ్జిట్ పోల్స్ తో బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే 6 శాతం పౌండ్ విలువ పడిపోయినట్లుగా సమాచారం.

08:18 - June 24, 2016

ఖమ్మం : రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఈఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్‌ నుంచి మణుగూరు వెళ్తున్న బస్సు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 నెలల చిన్నారి మృతి చెందగా, 20 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్రం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడివారిలో నలుగురి పరిస్థితి విషయమంగా వున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాయపడిన వారికి మెరుగైన చికిత్సనందించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా డ్రైవర్ నిద్రమత్తుతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణీలు పేర్కొంటున్నారు. కాగా వర్షంతో భారీగా కురుస్తుండటంతోనే అదుపు తప్పి ప్రమాదానికి కారణమయినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రమాదంలో 18 నెలల చిన్నారి మృతి చెందటంతో తల్లి భోరున విలపిస్తోంది.

ఎన్ కౌంటర్ లో 7గురు ఉగ్రవాదులు హతం...

జమ్మూకశ్మీర్ : కుప్వారాలో మూడు ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదుకుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గత మూడు రోజుల్లో మూడు సార్లు ఎన్ కౌంటర్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 

విద్యుత్ షాక్ తో తండ్రీ కుమార్తె మృతి...

నల్లగొండ : కోదాడ మండలం గోండ్రియాలలో విషాదం చోటుచేసకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాకు తగిలి తండ్రీ, కుమార్తె మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటుచేసకుంది. మృతులు రమ(22) వెంకటేశ్వర్లు (45)గా గుర్తింపు.  

07:44 - June 24, 2016

ఫార్మారంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించారంటూ వార్తలు వచ్చిన వెంటనే చాలామంది కీడును శంకించారు. ఇక పెరగబోయే మందుల దరువుకు కాచుకోవడం తప్ప మనం చేయగలిగేదేమీ లేదన్న భయం ఇప్పటికే చాలామందిలో ఏర్పడిపోయింది.

వందశాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి..
రక్షణ, విమానయానం, ఔషధరంగాల్లోకి వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సంస్కరణల పర్వం మరింత వేగవంతమైంది. నరేంద్రమోడీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంస్కరణలు మరింత కఠినంగా అమలవుతాయన్న అభిప్రాయాలున్నప్పటికీ, ఇంత ఆకస్మికంగా కేబినెట్ ఆమోదిస్తుందని ఎవరూ ఊహించలేదు. రఘురామ్ రాజన్ ఆర్ బిఐ గవర్నర్ పదవి నుంచి నిష్క్రమించడం ఖాయమైన నేపథ్యంలో, మార్కెట్ వర్గాల్లో నెలకొన్న భయానికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మార్కెట్ శక్తుల భయాలను పోగొట్టేందుకు దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టేందుకు సైతం ప్రభుత్వం వెనకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నిబంధనలను తుంగలో తొక్కిన కేంద్రం...
సందర్భం ఏదైనా, కారణం ఏదైనా డిఫెన్స్, ఏవియేషన్, ఫార్మా లాంటి కీలకరంగాల్లోకి వందశాతం ఎఫ్ డిఐలను అనుమతించడం, ఇంతకుముందు వునన నిబంధనలను మరింత సరళీకరించడం తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఫార్మారంగంలో ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్నాయి. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలున్నాయి. మనదేశ ఔషధ రంగంలో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలు తప్పనిసరిగా కొన్ని అనుమతులు పొందాల్సి వుంటుంది. అవన్నీ ఈ దేశ ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను, పరిశ్రమ ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకుని రూపొందించినవి. అయితే, వాటికి చెల్లు చీటీ చెప్పడం, ఇంతకాలం వున్న నిబంధనలను తుంగలో తొక్కడం తాజా పరిణామం.

భారత్ ఔషధరంగంపై పట్టుకోసం బహుళజాతి సంస్థల యాత్నాలు...
మన దేశ ఔషధరంగం మీద సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేందుకు విదేశీ బహుళజాతి సంస్థలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. 1970లో రూపొందించిన పేటెంట్ చట్టం వాటికి ఏమాత్రం మింగుడుపడడం లేదు. వాటి ఒత్తిడి ఫలితంగా 2005లో పేటెంట్ చట్టంలో సవరణలు చేసిన మరుక్షణం నుంచి జూలు విదల్చడం మొదలుపెట్టాయి. మన కంపెనీలలో వాటాలు పెంచుకోవడం, విలీనం చేసుకోవడం, పూర్తిగా కొనేయడం లాంటి ప్రక్రియల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. కారు చౌకగా లభించే మన జెనరిక్ మందులను బహుళజాతి సంస్థలు ఏమాత్రం సహించలేకపోతున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో అమ్మకాలు సాగిస్తున్న మన మందుల కంపెనీల మీద కేసులు పెట్టించి, భారీ జరిమానాలు విధింపచేసి, ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహాలను బహుళాజాతి సంస్థలు అమలుచేస్తున్నాయి. వందశాతం డైరెక్ట్ పెట్టుబడులకు అనుమతించడం ఈ ధోరణి మరింత పెరిగే ప్రమాదం వుంది.

అమెరికాతో పోలిస్తే భారత్ లో మందుల ఉత్పత్తి ఖర్చు తక్కువ...
అమెరికాలాంటి దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మందుల ఉత్పత్తికయ్యే ఖర్చు చాలా తక్కువ. ముఖ్యంగా ఉద్యోగుల వేతనాలు స్వల్పం. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, అంతులేని భూ జల కాలుష్యాలు స్రుష్టించినా అడిగేవారుండరు. ఆమ్యాయాలకు ఆశపడే అధికారవర్గాన్ని, రాజకీయ నాయకత్వాన్ని లోబర్చుకోవడం చాలా తేలిక. దీంతో మన దేశ మార్కెట్ మీద బహుళజాతి కంపెనీలు కన్నేసి వుంచాయి. ఇప్పుడు వాటి పంట పండుతోంది. బహుళజాతి సంస్థలు ఒక్కసారిగా జూలు విదిలిస్తే, చిన్న చిన్న భారతీయ ఫార్మా కంపెనీలు తట్టుకోగలవా? అన్నది ప్రశ్నే. స్వదేశీ ఫార్మా కంపెనీలు మూతపడితే, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది. పోటీ తగ్గి, గుత్తాధిపత్యం పెరిగితే విదేశీ సంస్థలు మందుల ధరలు అమాంతం పెంచే ప్రమాదం వుంది. నిజానికి మన ఫార్మారంగంలో పెట్టుబడుల కొరత లేదు. ఇప్పటికే మనదేశంలో 5వేల కంపెనీలు, పది వేలకు పైగా యూనిట్లు వున్నాయి. 250కి పైగా భారీ పరిశ్రమలున్నాయి. ఏటా 15శాతం చొప్పున వ్రుద్ధి రేటు నమోదు చేస్తున్న మన ఫార్మా రంగం అమెరికా, రష్యా లాంటి దేశాలకు సైతం భారీగా మందులు ఎగుమతిచేస్తోంది. 150 దేశాలకు మన దేశంలో తయారైన టీకాలు సరఫరా అవుతున్నాయి. ఇంత మంచి ట్రాక్ రికార్డున్న మనదేశ ఫార్మా రంగానికి విదేశీ పెట్టుబడుల అవసరం ఏమిటన్న ప్రశ్నకు జవాబు లేదు.

 

07:35 - June 24, 2016

ఔషధరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మారంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత సరళీకరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల మన ఔషధ రంగంలో ఎలాంటి మార్పులొస్తాయా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వదేశీ ఔషధరంగానికి మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? ఎఫ్ డిఐల రాకతో మందుల ధరలు తగ్గే అవకాశం వుందా? పెరిగే ప్రమాదం వుందా? ఫార్మా రంగంలో ఎఫ్ డిఐ లు సామాన్యుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నేత రాజుభట్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి...

07:27 - June 24, 2016

హైదరాబాద్ : విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల ఊబి నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకంలో తెలంగాణ భాగస్వామ్యం కానుంది. ఉదయ్ పథకంలో చేరాలన్న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. డిస్కమ్‌ల నిధులు సమీకరణ కోసం ఎఫ్ఆర్ బీఎం నిబంధనలను సడలించాలని మంత్రిని కోరింది.

ఉదయ్ పథకంలో చేరాలని విజ్ఞప్తి చేసిన మంత్రి ...
ఉదయ్‌ పథకాన్ని కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ సంస్థలను ఆదుకోవడం. ఈ పథకంలో చేరాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే కోరింది. తాజాగా దీనిపై చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ పథకంలో చేరాలని కేసీఆర్‌ను కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

భవిష్యత్ పరిణామాలపై విస్తృతంగా చర్చలు....
ఈ పథకంలో చేరడం ద్వారా జరిగే పరిణామాలపై ఇరువురు విస్త్రతంగా చర్చించారు. దీన్‌ దయాళ్‌ పథకంలో ఎక్కువ నిధులు ఇవ్వడంతో పాటు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారు. తెలంగాణలో 26 నగర పంచాయితీలు, 12 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే ఎల్ ఈడీ వీధిలైట్లను వాడుతున్నట్లు సీఎం చెప్పారు. ప్రతి ఇంటిలో ఎల్ ఈడీ లైట్లు వినియోగించేలా ప్రొత్సహిస్తామని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. త్వరలో ఈసీఐఎల్ తో ఒప్పందాలు చేసుకుని తక్కువ ధరకే ఎల్ ఈడీ బల్బులను అందచేస్తామన్నారు.

తెలంగాణలో 22 లక్షలకు పైగా పంపు సెట్లు..
తెలంగాణలో 22 లక్షలకు పైగా పంపు సెట్లు ఉన్నందున..విద్యుత్ వినియోగం కోసం అధునాతన సోలార్‌ పంపు సెట్లను వాడాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రస్తుత పంపు సెట్లను దశల వారిగా మార్చేందుకు కేంద్రం తగిన సహాయం అందిస్తుందన్నారు. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల కోసం సింగరేణి బొగ్గును కేటాయించాలన్న విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి ప్రణాళికలు, సౌర విద్యుదుత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

07:12 - June 24, 2016

హైదరాబాద్ : ఓయూ పీఎస్ పరిధి లాలపేటలోని పలుబస్తీల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 38 బైకులు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో పాటు 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సీసా మూతలను తయారుచేసే కంపెనీపై దాడి చేసినట్లు డిసీపీ రవీందర్ తెలిపారు. 

07:09 - June 24, 2016

విజయవాడ : ఏపీ రాజధాని నుండి తమ కార్యకలాపాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్న ఎమ్మెల్యేలు..ఇకపై విజయవాడ కేంద్రంగా పనిచేయాలంటూ బాబు తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లేకున్నా విజయవాడలోనే ఉండాలని తమ అధినేత తీసుకున్న నిర్ణయం ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చినట్లయ్యింది...

కొత్త రాష్ట్రంలో ప్రారంభంకాని పూర్తిస్ధాయి పరిపాలన...
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్లు గడిచినా ...ఇంకా పూర్తిస్ధాయి పరిపాలన కొత్త రాష్ట్రంలో ప్రారంభం కాలేదు...గత రెండేళ్లుగా ప్రధాన కార్యకలాపాలన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగుతున్నాయి..కొత్త రాజధాని అమరావతికి తరలివెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముందుగా ఉద్యోగులను తరలించాలనే కాన్సెప్ట్ కాకుండా...తానే స్వయంగా విజయవాడ కేంద్రంగా పనిచేయటం ప్రారంభించారు. కేబినెట్ సమావేశాలతో పాటు కీలకమైన సమావేశాలను కూడా విజయవాడలోనే నిర్వహిస్తున్నారు. దీంతో మంత్రులు కూడా ఎక్కువగా విజయవాడ కేంద్రంగానే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది...ఈ సమయంలోనే అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా పూర్తి చేయటంతోపాటు, అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడకు తరలిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తియిన తర్వాత గానీ పూర్తి స్థాయి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కాలేకపోయింది...

విజయవాడలోనే ఉండాలని గట్టిగా చెప్పిన బాబు....
ఓ వైపు ముఖ్యమంత్రి...మరోవైపు మంత్రులు...తాజాగా అధికార గణం...ఇలా అందరూ ఒక్కొక్కరిగా ఏపీకి తరలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచే జరుగనుంది. అయితే ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యత హైదరాబాద్‌కే ఇస్తుండటంపై ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలోనో లేక హైదరబాద్‌లోనే ఉండే ఎమ్మెల్యేలు ఇకపై నియోజకవర్గంలో లేకపోతే విజయవాడలో ఉండాలని సూచించారు. విజయవాడలోనే తాను, మంత్రులు అందుబాటులో ఉంటున్నప్పుడు..ఎమ్మెల్యేలుగా మీరు మాత్రం హైదరాబాద్ లో ఉండటం మంచి పరిణామం కాదంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకున్నా...విజయవాడలోనే ఉండాలని కొంచెం గట్టిగానే హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

హైదరాబాద్ టూ విజయవాడకు ఏపీ ఎమ్మెల్యేలు...
మొత్తంమీద నిన్నటి వరకు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ వచ్చిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు..ఇకపై విజయవాడకు తమ మకాం మార్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

07:03 - June 24, 2016

విజయవాడ : ఏపీ సచివాలయం తరలింపు హడావుడి మొదలయ్యింది. జూన్ 27 డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో..కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇక్కడి నుంచి తరలివెళ్లిన ఉద్యోగులకు అక్కడి ఉద్యోగులు ఘనస్వాగతం పలుకుతున్నారు. హైదరాబాద్‌లో ఇన్ని సంవత్సరాలు ఉండి ఒక్కసారిగా ఏపీకి తరలి వెళ్లడంతో పలువురు ఉద్యోగులు కంటతడి పెట్టారు.

ద‌శ‌ల వారీగా సచివాలయ కార్యాల‌యాల త‌ర‌లింపు ...
ద‌శ‌ల వారీగా అమరావతికి సచివాలయ కార్యాల‌యాల త‌ర‌లింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. తొలిరోజు వ్యవసాయం, హౌసింగ్, ఐ అండ్ పీఆర్ శాఖలు అమరావతికి తరలి వెళ్లాయి. ఏపీ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని గుంటూరులోని లాం ఫాంకు తరలించారు. కొంత కాలంగా లాంఫాం నుంచే వ్యవసాయశాఖ విధులు నిర్వహిస్తోంది. దీంతో సదరు శాఖకు చెందిన కీలక దస్త్రాలను ప్రత్యేక బస్సులో రాజధాని ప్రాంతానికి తరలించారు. ఇక మున్సిపల్, ఆర్ధిక శాఖ వైద్యశాఖలో కూడా తరలింపు వేగం కనిపిస్తోంది. ఈ శాఖలకు సంబంధించిన దస్త్రాలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక హౌసింగ్, ఐఅండ్ పీఆర్ శాఖలలో కూడా తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆయా శాఖల కీలక దస్త్రాలను కూడా అమరావతికి తరలించారు.

పోలీసు శాఖలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కార్యాలయాన్ని షిఫ్ట్‌...
పోలీసు శాఖలో కీలకమైన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కార్యాలయాన్ని షిఫ్ట్‌ చేశారు. ఏపీ శాఖను గుంటూరు అరండల్‌ పేటలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనంలోకి తరలించారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌..ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ. హైదరాబాద్‌లో హైకోర్టు, సెక్రటేరియట్‌, అసెంబ్లీ వంటి అత్యున్నత హోదా కలిగిన ప్రాంతాలు పూర్తిగా ఎస్‌పీఎఫ్‌ బందోబస్తు పర్యవేక్షణలో ఉంటాయి.

ఉద్యోగులకు ఘనస్వాగతం...
గుంటూరు తరలివెళ్లిన వ్యవసాయ ఉద్యోగులకు అక్కడి ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఒక్కసారిగా హైదరాబాద్ వదిలిరావడం బాధగానే ఉందని కానీ సొంత రాష్ట్ర ప్రజలకు సొంత రాష్ట్రం నుంచే పాలన అందించడం కన్నా ఇది పెద్ద కష్టమేమి కాదని చెబుతున్నారు.

భావోద్యేగంతో కంటతడి పెట్టిన ఉద్యోగులు....
కొందరు ఉద్యోగులైతే భావోద్యేగాన్ని ఆపులేక కంటితడి పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ అని ఏ ప్రాంతీయ భేదాలు లేకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామనితెలంగాణ స్థానికత కలిగిన కొంత మంది ఉద్యోగులు తెలిపారు.

కొన్ని శాఖలకు మరికొంత సమయం...
ఇక విద్యాశాఖ, పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల తరలింపు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తరలింపుల ప్రక్రియలో ఎటువంటి అటంకాలు కలగకుండా ఆయా శాఖల అధిపతులు షిప్టింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద సొంత రాష్ట్రం నుంచే పాలన సాగించాలే ఏపీ ప్రభుత్వం, ఉద్యోగులు సన్నద్ధమయ్యారు. ఈనెల 27వ తేదీకల్లా అన్ని కార్యాలయాలు అమరావతికి తరలివెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అన్ని శాఖలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో 27వ తేదీనుంచి ఏపీ పరిపాలన అమరావతినుంచే సాగనుంది. 

06:57 - June 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల నెత్తిన విద్యుత్‌ చార్జీల పిడుగుపడింది. సగటున 7.5 శాతం మేర చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయి. నెలకు వంద యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే వినియోగదారులకు పెంపుదల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులపై 1527 కోట్ల రూపాయల మేర భారం పడనుంది. చార్జీల పెంపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనల్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

చార్జీల పెంపుకు కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ...
2016-17 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెరిగాయి. చార్జీల పెంపుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బాదుడుకు రంగం సిద్ధమయ్యింది. పెంచిన విద్యుత్‌ చార్జీలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రకటించింది.

రాష్ట్రంలో 86 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులు ..
కరెంట్‌ చార్జీల పెంపులో చిన్న వినియోగదారులకు మినహాయింపు ఇచ్చారు. నెలకు వంద యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారిపై భారం పడదు. రాష్ట్రంలో 86 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులు ఉంటే..ఈ కేటగిరీలో 60 లక్షల మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. దీంతో అత్యధికులపై భారం పడదు. పెంచిన చార్జీలు వర్తించేంది 26 లక్షల మందికేని గణాంకాలు తేల్చారు. నెలకు వంద యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించే వారికి చార్జీల మోత మోగుతుంది.

100-200 యూనిట్లకు రూ.3.60 నుంచి రూ.4.30 పెంపు ...
తెలంగాణలోని వివిధ కేటగిరీల్లో ప్రజలు వినియోగించే విద్యుత్‌పై సగటున 7.5 శాతం మేర చార్జీలు పెరిగాయి. నెలకు 100 నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే వారి నుంచి ప్రస్తుతం యూనిట్‌కు వసూలు చేస్తున్న 3 రూపాయల 60 పైసల చార్జీలని 4 రూపాయల 30 పైసకు పెంచారు. 201 నుంచి 300 యూనిట్ల వరకు కరెంట్‌ వాడుతున్న వారి నుంచి ప్రసుతం యూనిట్‌కు వసూలు చేస్తున్న చార్జీని 6.80 రూపాయల నుంచి 7.20 రూపాయలకు పెంచారు. 301 నుంచి 400 యూనిట్లకు ఇప్పుడు వసూలు చేస్తున్న 7.80 రూపాయలను ఇకపై ఎనిమిదిన్నర రూపాయలు వసూలు చేస్తారు. నెలకు 401 నుంచి 800 యూనిట్లు వాడే వారి నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీ 8.50 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చక్కెర మిల్లులకు రూ.4.90 నుంచి రూ.5.20 పెంపు ...
పరిశ్రమలకు కూడా విద్యుత్‌ చార్జీలు భారీగానే పెరిగాయి. చక్కెర మిల్లుకు ప్రస్తుతం యూనిట్‌కు వసూలు చేస్తున్న 4.90 రూపాయలను 5.20 రూపాయలకు పెంచారు. కోళ్ల పరిశ్రమలకు 3.60 రూపాయల నుంచి 4 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన అన్ని రకాల పరిశ్రమలకు యూనిట్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న 6.40 రూపాయల చార్జీని వచ్చే నెల నుంచి 6.70 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు 10 శాతం విద్యుత్‌ చార్జీలు పెంచాలని అధికారులు ప్రతిపాదించగా,..ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం దీనిని 7 శాతానికే పరిమితం చేశారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 1958 కోట్ల రూపాయల మేర చార్జీల పెంపుదలను ప్రతిపాదిస్తే..ప్రభుత్వం మాత్రం దీనిని 1527 కోట్ల రూపాయలకు పరిమితం చేసింది.

వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ రూ.4,584 కోట్లు ...
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కొనసాగుతుంది. తెలంగాణలో ఉన్న 20 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్‌ అయ్యే 4,584 కోట్ల రూపాయలను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తుంది. అయితే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నర్సరీలు, ఉద్యాన రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తారు. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వాడే క్షౌరశాలను కొత్త కేటగిరీలో చేర్చారు.

చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు మండిపాటు...
ఓ వైపు చార్జీల పెంపు ప్రభుత్వం సమర్ధించుకుంటుంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రజలపై భారం మోపమని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్న విపక్షాలు.... ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

 

నేడే బ్రెగ్జిట్ ఫలితాలు...

బ్రిటన్ : బ్రెగ్జిట్ ఫలితాలపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ. శుక్రవారం 12 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం రాత్రి 10 గంటలకు పోలింగ్ ముగియటంతో శుక్రవారం ఫలితాలు వెలువడనున్నాయి.

పెళ్లి బృందంపై దూసుకెళ్లిన లారీ...

వరంగల్‌: జిల్లాలోని మహబూబాబాద్‌ సలార్‌తండాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అత్యవసర చికిత్సకై సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స చేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.

త్వరలో ఇద్దరు సీఎంలు భేటీ...

హైదరాబాద్: మరో రెండు, మూడు వారాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు.త్వరలో తేదీలు ఖరారు కానున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

బస్ బోల్తా... 20 మందికి గాయాలు..

ఖమ్మం : రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్‌ నుంచి మణుగూరు వెళ్తున్న బస్సు నాయకన్‌గూడెం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 నెలల చిన్నారి మృతి చెందగా, 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Don't Miss