Activities calendar

25 June 2016

22:22 - June 25, 2016

దారుణంగా హత్యలు చేస్తూ.. పోలీసుల కల్లుగప్పి తిరుగుతున్న జగిని అనే బీహారి మహిళ మానసిక పరిస్థితి ఏంటీ... ? ఆవిడ చేత ఇన్ని ఘోరాలు చేయించిన కథ ఏంటీ...? బీహార్ వెళ్లిన డిటెక్టివ్ టీంకు జగిని గురించి తెలిసిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటీ...? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:15 - June 25, 2016

వాషింగ్టన్ : అమెరికాలోని ప‌శ్చిమ వ‌ర్జీనియా రాష్ట్రంలో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. నిరాటంకంగా కురుస్తున్న వ‌ర్షాలకు ఇప్పటివరకు 23 మంది మ‌ర‌ణించారు. భీక‌ర వ‌ర్షాల ధాటికి చెట్లు, విద్యుత్తు ట‌వ‌ర్లు కూలిపోయాయి. భారీగా వ‌స్తున్న వ‌ర‌ద నీరుతో న‌దులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. 

22:12 - June 25, 2016

విశాఖ : విశాఖనగరం రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆగష్టు 31 లోగా విశాఖలో బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుణెలో ఆకర్షణీయ నగరాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశాఖలో చేసిన అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వివరించారు. విశాఖను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
స్మార్ట్‌ సీటిగా రూపుదిద్దుకుంటోన్న విశాఖ
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విశాఖ నగరం.. స్మార్ట్‌ సీటిగా రూపుదిద్దుకుంటోంది. నగరవాసుల కలలకు అనుగుణంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుణెలో ప్రారంభించారు. స్మార్ట్‌నెట్‌ పోర్టల్‌ సహా దేశవ్యాప్తంగా ఇతర ఆకర్షణీయ నగరాల్లో 69 ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు.
స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌'' ప్రాజెక్టు పనులకు శ్రీకారం..
స్మార్ట్‌ సిటీస్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న విశాఖలో '' స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌'' ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయం నుంచి ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.. నగరంలో 94వేల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం లక్ష్యాన్ని తక్కువ వ్యయంతో సాధించబోతున్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం
అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఆగష్టు 31 లోగా విశాఖలో బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని వారికి అర్బన్ ఇన్ఫ్రాస్ర్టక్చర్‌లో భాగంగా గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. బీచ్‌ రోడ్డులో ఉచిత వైఫెని మరింత విస్తరించాలని సూచించారు.
హుద్‌హుద్‌ వల్ల భారీ నష్టం
18 నెలల క్రితం హుద్‌హుద్‌ వల్ల నగరంలో భారీ నష్టం జరిగింది. దాని నుంచి కోలుకుని నగరాన్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దింది రాష్ర్ట ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్‌ వ్యవస్థను విస్తృతం చేశారు. ఆగస్టు నాటికి నగరంలోని ప్రతీ ఇంటికి 20 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా స్మార్ట్‌ సీటిగా విశాఖ నగరం రూపుదిద్దుకోవడానికి పరుగు మొదలుపెట్టింది.

 

22:06 - June 25, 2016

మహారాష్ట్ర : గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ సిటి ప్రాజెక్ట్‌ ఓ ఉద్యమంలా సాగాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. పుణెలో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ను ప్రధాని ప్రారంభించారు. ఒకప్పుడు పట్టణీకరణ అంటే పెద్ద సమస్యగా ఉండేదని, ఇపుడు అది అవసరంగా మారిందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. రోడ్లు, భవనాలుంటేనే నగరం అభివృద్ధి చెందినట్లు కాదని, ప్రతినగరం ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ సిటి ప్రాజెక్ట్‌ ఓ ఉద్యమంలా సాగాలన్నారు. స్వచ్ఛ భారత్‌ మాదిరి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ కూడా ప్రజల సహకారంతో సఫలమౌతుందన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

22:02 - June 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ వ్యవహారంలో సర్కార్‌ వెనక్కి తగ్గింది. నిర్వాసితుల‌కు భూ సేక‌ర‌ణ‌ చ‌ట్టం-2013 ప్రకారమే న‌ష్ట ప‌రిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అయితే.. 123 జీవో కూడా అస్తిత్వంలో ఉంటుందని.. ఎవరైనా కోరుకుంటే.. ఈ జీవో ప్రకారం కూడా పరిహారం చెల్లిస్తామని తెలిపింది. LOOK
భూసేకరణ చట్టం-2013 అమలుకు అంగీకారం
సర్కార్‌పై సమరభేరీ మోగించిన మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల పోరాటం ముందు ప్రభుత్వం తలొంచింది. మ‌ల్లన్నసాగ‌ర్ ముంపు బాధితుల పోరాటం ఫ‌లిచింది. రైతులు కోరుకున్నట్టే.. భూ సేక‌ర‌ణ చ‌ట్టానికి అనుగుణంగా న‌ష్ట ప‌రిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది.
ముంపునకు గురికానున్న 14 గ్రామాలు
మ‌ల్లన్నసాగ‌ర్ ప్రాజెక్టు నిర్మిస్తే.. 14 గ్రామాలు ముంపున‌కు గురికానున్నాయి. దాదాపు 40 వేల ఎక‌రాల భూమి మునిగిపోనుంది. అయినా.. సర్కార్‌ మొండి పట్టుదలతో ముందుకెళ్లింది. భూ సేక‌ర‌ణ చట్టాన్ని కాదని, జీవో నెం-123 తీసుకొచ్చింది. త్వరిత‌గతిన ప్రాజెక్టును పూర్తి చేసే ప్లాన్‌లో భాగంగా 123 జీవోను అమ‌లు ప‌రిచేందుకు ప్రయ‌త్నించింది. ఈ జీవోను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే.. జీవో-123 ప్రకారం ఎక‌రాకు ఐదున్నర ల‌క్షల నష్టపరిహారం మాత్రమే వ‌స్తుంది. దాంతో పాటు పున‌రావాస బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండదు. అంటే.. రైతాంగం ఐదున్నర ల‌క్షలకు త‌మ భూముల‌ను ప్రభుత్వానికి అప్పజెప్పి.. వెళ్లిపోవాల‌న్నమాట‌. వారి ఉపాధి, భ‌ద్రత వంటి అంశాల నుంచి ప్రభుత్వం త‌ప్పుకున్న నేప‌థ్యంలో వారి ప‌రిస్థితి ఆగ‌మ్య గోచ‌రంగా మారింది. అందుకే రైతులంతా సర్కార్‌పై పోరుబాట పట్టారు. 
24 రోజులుగా భూ నిర్వాసితుల నిరాహార దీక్షలు
భూ సేక‌ర‌ణ‌ ప్రయ‌త్నాలు మొద‌లుపెట్టినప్పటి నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు. 24 రోజులుగా నిర‌హార దీక్షలు చేస్తున్నారు. భూ సేక‌ర‌ణ కోసం వ‌చ్చిన అధికారుల‌ను అడ్డుకుంటున్నారు. భూ సేక‌ర‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడే నిల‌దీస్తున్నారు. ఇటు భూ నిర్వాసితులకు బాస‌ట‌గా విప‌క్షాలు, ప్రజా సంఘాలు, జాక్ ముందునుంచి ఉద్యమిస్తున్నాయి. సీపీఎం పాదయాత్ర చేప‌ట్టి.. రైతులకు బాసటగా నిలిచింది. ఇత‌ర పార్టీలు దీక్షల‌కు దిగాయి. భూసేకరణ చట్టాన్ని అమలు పర్చాలని మొదటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. అయినా ప్రభుత్వం వెనక్కు త‌గ్గకపోగా.. పోలీసుల బ‌ల ప్రయోగంతో బ‌ల‌వంత భూ సేక‌ర‌ణ చేయాల‌ని ప్రయత్నించింది. భూములు అప్పజెప్పేలా  రైతాంగాన్ని భయ భ్రాంతుల‌కు గురి చేసింది. క‌రుణాక‌ర్ అనే రైతు నిండు ప్రాణాన్ని సైతం బ‌లి తీసుకున్నారు. మ‌రోవైపు ఆందోళన బాట ప‌ట్టిన రైతులకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లా రైతుల‌ను అధికారపార్టీ నేతలు ఉసికొల్పారు.
బ‌లవంత‌పు భూ సేక‌ర‌ణ‌పై వెన‌క్కు తగ్గిన రాష్ర్ట సర్కార్
ప్రభుత్వ బెదిరింపుల‌కు లొంగ‌ని రైతులు త‌మ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. గ‌వర్నర్, కేంద్ర మంత్రులను క‌ల‌సి త‌మ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్రతిష్టను మూట గ‌ట్టుకున్న ప్రభుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. చివరకు బ‌లవంత‌పు భూ సేక‌ర‌ణ‌పై వెన‌క్కు త‌గ్గింది. భూ సేక‌ర‌ణ‌ చ‌ట్టం 2013 ప్రకారమే న‌ష్టప‌రిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ ఓ ప్రకటన జారీ చేశారు. రైతాంగానికి అమోద‌యోగ్యమైన పద్ధతిలోనే న‌ష్టప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్రకటనలో తెలిపారు. అయితే.. జీవో-123ను మాత్రం సర్కార్‌ ర‌ద్దు చేయ‌లేదు. రెండు చ‌ట్టాల్లో రైతులు ఏది కోరితే.. దాని ప్రకారమే భూ సేక‌ర‌ణ జ‌రుపుతామ‌ని తెలిపింది. అయితే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 
అందరికీ పునరావాసం క‌ల్పించే బాధ్యత ప్రభుత్వానిదే..
భూ సేక‌ర‌ణ‌ చ‌ట్టం-2013 వ‌ల్ల రైతులే కాదు.. కూలీలు కూడా లాభప‌డ‌నున్నారు. రైతులు, కూలీల ఉపాధి, అందరికీ పునరావాసం క‌ల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మార్కెట్ రేటుకు మూడు రెట్లను ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది. గ్రామస‌భ అంగీకరిస్తే త‌ప్ప.. భూ సేక‌ర‌ణ కుద‌ర‌దు. అంతేకాదు.. భూసేకరణ చట్టం అమలు పర్చడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ప్రాజెక్టు వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని వీలైనంత‌గా త‌గ్గించాల్సి ఉంటుంది.  ప్రత్యామ్నాయం లేన‌ప్పుడు మాత్రమే వ్యవసాయ భూములను సేక‌రించాలి. అప్పుడు కూడా మ‌రోచోట సాగుకు ఆమోద‌మైన అంతే భూమిని రైతుల‌కు ఇవ్వాలి. ఇలా రైతాంగానికి మేలు చేసే భూ సేక‌ర‌ణ‌ చ‌ట్టం-2013 అమ‌లుకు కేసీఆర్ స‌ర్కార్ అంగీక‌రించ‌డం శుభ ప‌రిణామంటున్నారు.  కేవ‌లం ప్రక‌ట‌నల‌కే ప‌రిమితం కాకుండా ఖ‌చ్చితంగా భూ సేక‌ర‌ణ‌ చ‌ట్టం-2013 అమ‌లు చేయాలని రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు పునరావాసం, భద్రత, ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

21:58 - June 25, 2016

హైదరాబాద్ : రైతు రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి. మూడో విడతలోని సగం మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2వేల 190 కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు రుణమాఫీ కింద 10వేల 626 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 

21:57 - June 25, 2016

మెదక్ : 'మల్లన్నసాగర్ వద్దు.. మా ఊర్లు మాకే కావాలి' అని ముంపు గ్రామాల బాధితులు వేడుకుంటున్నారు. ఈమేరకు టెన్ టివితో వారి ఆవేదనను వెలిబుచ్చారు. సీఎం కేసీఆర్ స్పందనపై ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రజలు అభిప్రాయాలు పలు అభిప్రాయాలు తెలిపారు. ఆ వివరాలను వారి మాటల్లోనే..  
'మల్లన్నసాగర్ వద్దు.. మా ఊర్లు మాకే కవాలి.. పరిహారం ఆశించలేదు. ఏ జీవోలు మాకు అవసరం లేదు.  మాకున్న చెరువులతో మేము బతుకుతాం. సీఎం కేసీఆర్ అన్నం పెట్టకున్నా సరే కానీ సున్నం పెట్టకు. గుండె పగిలి కొంతమంది చనిపోయారు. అటవీప్రాంతంలో ప్రాజెక్టులు కట్టాలి. శవాలపై ప్రాజెక్టులు కట్టవద్దు. మాకు భూములు కావాలి. మా స్థలం మాకే కావాలి. డబ్బులు వద్దు... మా జాగాలు మాకే కావాలి. సాగర్ వద్దు, చెరువు వద్దు. బంగారు తెలంగాణలో బతకాలనే ఆశ ఉంది. అని స్థానికులు తమ గోడు వినిపించారు. 

 

21:42 - June 25, 2016

నటి సుమలతతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సుమలత తన మనసులో మాటను వెలిబుచ్చారు. తన సినీ కెరీర్, అనుభావాలు తెలిపారు. పలు అసక్తికర విషయాలను వివరించారు. ఆ వివరాలు ఆమో మాటల్లోనే.. 
'సినిమాలకు, టీవీ షోలకు కంపారిజన్ లేదు. అప్పట్లో చేసిన సినిమాలు వేరు.. ఇప్పడు సినిమాలు వేరు. టీవీ టోటల్ డిఫరెంట్. టీవీ ద్వారా మనం ప్రజల ఇంట్లోకి వెళతాం. సినిమాలు చేయడం మానేసాక..టీవీ సీరియల్ చేయమని అడిగారు.. సినిమాలో నటించాను కాబట్టి.. టీవీలో నటించేందుకు ఆసక్తి చూపలేదు. అందుకే సీరియల్ లో నటించలేదు. ఓప్రా.... టీవీ షో నాకు చాలా నచ్చిన షో. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సినిమాలకు రావాలని పెద్దగా నేను ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండానే సినిమాల్లోకి రావడం జరిగిపోయింది. అప్పుడు సినిమాల్లో నటించిన విలువ నాడు తెలియలేదని.. దాని విలువ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఐదు ఇతర భాషల సినిమాల్లో నటించాను. కమర్షియల్ పిక్చర్ వచ్చినా... కాదన్న సందర్భాలున్నాయి. అన్ కన్వెన్షన్ డెసిషన్ కూడా తీసుకున్నాను. నాకు నచ్చని క్యారెక్టర్, సినిమా చేసేవాన్ని కాదు. శుభలేఖ, శృతిలయలు, లాంటి సినిమాలు మలయాళంలో కూడా చేశాను. అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నాకు సూట్ అయ్యే క్యారెక్టర్లు చేశాను. ఇష్టంలేని క్యారెక్టర్లు చేయడానికి ఒప్పుకోలేదు. అయితే కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా చేశాను. అనంతరం ఈ పిక్చర్ చేసి తప్పు చేశానని అనుకున్నాను. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చేయడం అదృష్టం. ఏడ్చే సన్నివేశాలు వచ్చినప్పుడు కంట్లో నీళ్లు వచ్చేందుకు గ్లిజరిన్ అవసరం ఉండేది కాదు. సహజంగానే నీళ్లు వచ్చేవి. శృతి లయలు క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. నాకు సూట్ కాని క్యారెక్టర్లను చేసేదాన్ని కాదు. నేను ట్రెయిన్డ్ డ్యాన్సర్ ను కాదు. ప్రతి హీరోతో యాక్ట్ చేశాను. చిరంజీవి, రజినికాంత్, శోభన్ బాబు, మోహన్ బాబు, మోహన్ లాల్, మమ్ముటి, కమల్ హాసన్ వంటి హీరోలతో కలిసి నటించాను.  చిరంజీవితో 15 సినిమాలు చేశాను. నేను ఇతరులతో పెద్దగా ఇంట్రాక్టు అయ్యేదాన్ని కాదు. నాకు మావారికి మోహన్ బాబు చాలా క్లోజ్ గా ఉండేవాడు.  మోహన్ బాబుది చాలా హెల్ప్ ఫుల్ మైండ్. శుభలేఖ సినిమా చేసేటప్పుడు నాకు 19 సంవత్సరాలు. ఏఎన్ ఆర్ తో కలిసి నటించాను. ఆయన చాలా సరదగా ఉండేవాడు. నాగార్జునను పెళ్లి చేసుకుంటావా అని ఎఎన్ ఆర్ నన్ను అడిగారు. గతంలో నేను చేసిన సినిమాలు టీవీవో వస్తే మాబాబు టీవీ ఆప్ చేస్తాడు. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:08 - June 25, 2016

జానపదాలు, ఒగ్గు కథలను గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరిస్తారు. మల్లన్న ముచ్చట్లలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మల్లన్న ఒగ్గుకథ ప్రసారం అయింది. ఆ కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

20:59 - June 25, 2016

ఢిల్లీ : తన విమర్శలతో జాతీయ నాయకులకే ముచ్చెమటలు పట్టించిన సుబ్రహ్మణ్యస్వామి తాజాగా తిరుమలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టీటీడీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆలయాలను ఏ ప్రభుత్వం కూడా మూడేళ్లకు మించి తమ ఆధీనంలో ఉంచుకోకూడదని స్వామి వ్యాఖ్యానించారు. దేశంలోని ఆలయాలకు ప్రభుత్వాల గుత్తాధిపత్యం నుంచి విముక్తి కల్పించాలని ఢిల్లీలో స్వామి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేసి గెలుస్తానని ఆయన  ధీమా వ్యక్తం చేస్తున్నారు.

20:56 - June 25, 2016

కర్నూలు : అన్ని రంగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని..రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేశారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్న తరుణంలో కోస్తాంధ్రతో రాయలసీమ కలిసి ఉండాలా వద్దా అన్నదానిపై అభిప్రాయ సేకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓజిలి మండలం చిల్లమాను బీసీ బాలుర హాస్టల్‌లో... మద్యం మత్తులో లోకేష్ అనే విద్యార్థిని వార్డెన్ చితకబాదిన ఘటన వెలుగుచూసింది. ఏడో తరగతి చదువుతున్న లోకేష్... వార్డెన్ కొట్టిన దెబ్బలకు గాయపడి.. గూడురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

హైదరాబాద్ లో బస్ పాస్ ధరలు పెంపు

హైదరాబాద్ : నగరంలో బస్ పాస్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలు కానున్నాయి. ఆర్డీనరీ బస్ పాస్ ధర రూ.700 నుంచి రూ. 770 కి పెంపు, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ధర రూ. 800 నుంచి రూ. 880 కి పెంచారు. మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.900 నుంచి రూ.990కి పెంపు పెంచారు. ఎన్ జీవోలకు ఇచ్చే బస్ పాస్ ల ధరల కూడా పెరిగాయి. 

హైదరాబాద్ పలు చోట్ల వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కోఠి, చాదర్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీనగర్, అబిడ్స్, నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్, అమీర్ పేట్ లలో వర్షం పడుతోంది. ఎర్రగడ్డ, మూసాపేట్, కూకట్ పల్లి, లింగంపల్లి, పటాన్ చెరు, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బాగ్ లింగంపల్లిలో వర్షం కురుస్తోంది. విద్యానగర్, తార్నాకా, సికింద్రాబాద్, సోమాజిగూడ, మెహిదీపట్నం, గచ్చిబౌలి, కోండాపూర్ లో వర్షం కురుస్తుంది. లంగర్ హౌజ్, అత్తాపూర్, రాజేంద్రనగర్ లో వర్షం పడుతోంది. 

విశాఖ స్మార్ట్ సిటీ పనులపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

విశాఖ : విశాఖ స్మార్ట్ సిటీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు వివరించారు. హుదుద్ తుపాను వల్ల విశాఖకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. విశాఖలో పూర్తిస్థాయిలో ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించామని చెప్పారు. 

20:31 - June 25, 2016

స్మార్ట్ నెట్ పోర్టల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

మహారాష్ట్ర : పుణెలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరిగింది. స్మార్ట్ నెట్ పోర్టల్ ను ప్రధాని మోడీ  ప్రారంభించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జవదేకర్ హాజరయ్యారు. 

20:15 - June 25, 2016

హైదరాబాద్ : చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రెండు ముఠాలను సికింద్రాబాద్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 27 లక్షల విలువ చేసే 91 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 3 బైక్ లు, 3 సెల్ ఫోన్స్ ను ఫేస్ మాస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

 

20:12 - June 25, 2016

హైదరాబాద్ : నగరంలో విదేశీ మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్న ముఠా సభ్యులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణతో పాటు డ్రైవర్ సునీల్ కుమార్, ఇద్దరూ ఏజెంట్లను అరెస్టు చేశారు. కోటి 70 లక్షలు విలువ చేసే 7 వందల 5 బాటిల్స్ ని అధికారులు సీజ్ చేశారు. ఉక్రెయిన్ నుంచి మద్యం తీసుకొచ్చి.. రహస్యంగా విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

 

20:08 - June 25, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో 2013 చట్టం ఉంటే.. జీవో 123 ఎందుకు తెచ్చారని రైతు సంఘం జాతీయ ఉపాధక్ష్యులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెదిరింపుల ద్వారా భూసేకరణ చేయవద్దని సూచించారు. 2013 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని కోరారు. 
'మల్లన్నసాగర్‌' కట్టాల్సిన అవసరమే లేదు : జస్టిస్‌ చంద్రకుమార్‌ 
అసలు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరమే లేదన్నారు జస్టిస్‌ చంద్రకుమార్‌. 2013 చట్టాన్ని పక్కగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూమికి బదులు మరోచోట వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. 

 

20:05 - June 25, 2016

హైదరాబాద్ : హైకోర్టు విభజనకు ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం కోరుతూ.. లేఖ రాయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని ఆయన కలిశారు. సెక్షన్ 80 ప్రకారం చీఫ్ జస్టిస్ కు ఆదేశాలు ఇచ్చే హక్కులు లేవన్నారు. 

20:01 - June 25, 2016

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. ఇటీవలికాలంలో విద్యార్థులపై టీచర్లు, వార్డెన్స్ దాడులు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వార్డెన్ బరితెగించాడు. మద్యం మత్తులో ఓ వార్డెన్ విద్యార్థిని చావబాదారు. జిల్లాలోని మనుగోలు మండలానికి చెందిన బాలయ్య, కామాక్షి దంపతుల కుమారుడు లోకేష్ ఓజిలి మండలం చిల్లమాను బీసీ బాలుర హాస్టల్ లో ఏడో తరగతి చదువున్నాడు. ఈక్రమంలో హాస్టల్ వార్డెన్ ఆరీఫ్ ఫుల్ గా మద్యం సేవించి.. మద్యం మత్తులో లోకేష్ ను చితకబాదారు. చేతులు, కాళ్లు, శరీరం వెనుకభాగంలో గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం బాలున్ని గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పదిహేను రూపాయలు చోరీ చేశాడని అందుకే లోకేష్ ను కొట్టానని వార్డెన్ చెబుతున్నారు. ఇదిలావుంటే వార్డెన్ ప్రతి రోజు తాగి వస్తాడని.. మద్యం మత్తులో ఉంటాడని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి రోజు విద్యార్థులను వేధిస్తాడని పేర్కొంటున్నారు. 

18:57 - June 25, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. పాంపోర్ లో భీకర కాల్పులు జరిగాయి. సీఆర్ పీఎఫ్ బస్సుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్ పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 20 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతం అయ్యారు. ఈ దాడికి లష్కర్- ఏ -తోయిబా ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించారు. 

18:40 - June 25, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారితో సహా ఓ మహిళ ఉంది.  అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారు డ్రైవర్ హైదరాబాద్ వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

కారు బోల్తా... నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డిపల్లి వద్ద డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారితో సహా ఓ మహిళ ఉంది. 

 

తెలంగాణలో మూడో విడత రుణమాఫీ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో మూడో విడత రుణమాఫీ విడుదల అయింది. రూ. 2, 190 కోట్లు విడుదల చేస్తూ టీసర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

18:24 - June 25, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్‌ మాటల్లో కొత్తదనం ఏమిలేదని సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, గ్రామాలను పోలీస్‌ క్యాంప్‌లుగా మార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి.. సమస్యను పారదర్శకంగా పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 

 

17:58 - June 25, 2016

భారత క్రికెట్ చరిత్రలో.. జూన్ 25వ తేదీకి ప్రత్యేకస్థానమే ఉంది. 1983 జూన్ 25 అనగానే భారత క్రికెట్ అభిమానులకు..హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలో మొట్ట మొదటి సారిగా వన్డే ప్రపంచకప్ గెలుచుకొన్న రోజు మాత్రమే గుర్తుకు వస్తుంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా హాట్ ఫేవరెట్ వెస్టిండీస్ తో ముగిసిన 1983 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 43 పరుగుల విజయంతో సంచలనమే సృష్టించింది. మొహిందర్ అమర్ నాథ్ ఆలౌరౌండ్ షోతో భారత్ విశ్వవిజేతగా నిలవడం...లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో మన కపిల్ డెవిల్స్ ప్రుడెన్షియల్ ప్రపంచకప్ ను సగర్వంగా అందుకోడం తలచుకొంటే..మధురంగా..సుమధురంగా ఉంటుంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఆ అద్భుతఘట్టానికి ఖచ్చితంగా నేటికి 33 సంవత్సరాలు. ప్రపంచకప్ ఎన్నిసార్లు నెగ్గిన తొలిసారి ప్రపంచకప్ గెలుచుకొన్న ఆ క్షణాలకు ఉన్న విలువే వేరు.

17:55 - June 25, 2016

భారత క్రీడాచరిత్రలో అత్యంత జనాదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ నాలుగో సీజన్ సమరానికి ముంబై ఎస్ వీపీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. దేశంలోని ఎనిమిది నగరాలు వేదికగా ఎనిమిదిజట్ల మధ్య ఆరు వారాల పాటు జరిగే ఈ లీగ్ ముంబై అంచెలో భాగంగా నాలుగు మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు జరిగే ప్రారంభ పోటీలో పూణేరీ పల్టాన్ తో తెలుగు టైటాన్స్ ఢీ కొంటుంది. భారత క్రీడాభిమానులను గత మూడు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్ పోటీలకు ...భారత వాణిజ్య రాజధాని ముంబైలో రంగం సిద్ధమయ్యింది. ఎనిమిది జట్ల మధ్య ఎనిమిది నగరాలు వేదికగా ఆరు వారాల పాటు జరిగే ఈ లీగ్ మొదటి మూడు సీజన్ల పోటీలు పట్టణ, పల్లె ప్రాంతాలు అన్న తేడా లేకుండా శత కోటి భారత అభిమానులను ఓలలాడించాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ తర్వాత..అత్యంత జనాదరణ పొందిన లీగ్ గా...ప్రోకబడ్డీ లీగ్ గుర్తింపు సంపాదించుకొంది.

25న ప్రారంభం..
జూన్ 25న ముంబై అంచె పోటీలతో ప్రారంభమై...జులై 31న హైదరాబాద్ లోని గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్స్ తో నాలుగో సీజన్ పోటీలకు తెరపడనుంది. జులై 29 నుంచి 31 వరకూ జరిగే హైదరాబాద్ అంచె పోటీలకు..తెలుగు టైటాన్స్ హోంగ్రౌండ్ గా గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. జూన్ 29 నుంచి జులై 2 వరకూ జరిగే పోటీలకు జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఉంటుంది. జులై 3 నుంచి 6 వరకూ హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగే హైదరాబాద్ అంచె పోటీలలో భాగంగా ఏడుమ్యాచ్ లు నిర్వహిస్తారు. జులై 3న జరిగే పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఢీ కొంటుంది. మరో పోటీలో బెంగాల్ వారియర్స్ తో యూ-ముంబా తలపడుతుంది. జులై 4న జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్ తో పూణేరీ పల్టాన్, తెలుగు టైటాన్స్ తో బెంగాల్ వారియర్స్ జట్లు పోటీపడతాయి.
జులై 5న జరిగే మ్యాచ్ ల్లో తెలుగు టైటాన్స్ తో బెంగళూరు బుల్స్ ఢీ కొంటుంది. జులై 6న జరిగే దబాంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్ తో యూ- ముంబా జట్లు పోటీపడతాయి.
డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్, మాజీ చాంపియన్ యూ-ముంబా, బెంగాల్ వారియర్స్, తెలుగు టైటాన్స్ జట్లు అత్యంత పటిష్టంగా ఉండడంతో నాలుగో సీజన్ లీగ్ పోటీలు మరింత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి. జూన్ 25 నుంచి జులై 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు కబడ్డీలీగ్ హంగామా ప్రారంభమవుతుంది.

17:54 - June 25, 2016

విశాఖ : నగరంలోని ఆంధ్రయూనివర్సిటీ కొత్త హంగులు సమకూర్చుకుంటోంది. కొత్తబిల్డింగ్‌ల నిర్మాణం, కొత్తకోర్సుల ప్రారంభం.. ఖాళీగా ఉన్న ఆచార్యుల పోస్టుల భర్తీ... ఇలా అన్ని సమస్యలకు ఒక్కొక్కటిగా   పరిష్కారం అవుతుండటంతో.. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు సంతోషిస్తున్నారు.  
ఈ ఏడాది నుంచి కొత్త కేలెండర్‌  
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్‌ క్యాంపస్‌తోపాటు అనుబంధ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి కొత్త కేలెండర్‌ అమలు కాబోతోంది. పనిదినాలను ఐదునుంచి ఆరుకు పెంచారు. జూలై1 నుంచి అనుబంధ కళాశాలను ప్రారంభం కానున్నాయి.
3ఏళ్ల అప్లైడ్‌ జియాలజీ కోర్సులు తిరిగి ప్రారంభం
ఈ ఏడాది నుంచే మూడేళ్ల అప్లైడ్‌జియాలజీ కోర్సు ను తిరిగి ప్రారంభిస్తున్నారు. అలాగే 5ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుగా  ఎమ్మెస్సీ కెమిస్ట్రీ నిప్రారంభిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ చెప్పారు. అటు యూనివర్సిటీ మెయిన్‌క్యాంపస్‌లో మరమ్మత్తులతో పాటు కొత్తబిల్డింగ్‌ల నిర్మాణం చేపడుతున్నారు. పదమూడున్నర కోట్లతో రామకృష్ణాబీచ్‌ వద్ద 16వందల మందికి సరిపోయే ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గే ఏయూలో ప్రాచీన కట్టడాలైన టిఎల్‌ఎన్‌ సభా, నెకెట్‌హౌస్‌, జువాలజీ విభాగంలోని ఓపెన్‌థీయేటర్‌ను ఆధునీకరిస్తున్నారు. 
హాస్టళ్ల మోడిఫై 
మరోవైపు హాస్టళ్లలో కూడా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. హాస్టల్స్‌ అన్నింటినీ మోడిఫై చేస్తున్నారు. దీంతో 5వేల మంది విద్యార్థులు వసతి పొందుతారని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. . 
సగానికిపైగా ఆచార్యుల పోస్టులు ఖాళీ
మరోవైపు.. యూనివర్సిటీలో  సగానికిపైగా ఆచార్యుల పోస్టుల ఖాళీగా ఉండటంతో సమస్యగా మారింది. మొత్తం వెయ్యిపోస్టుల్లో 600 పోస్టులు ఖాలీగానే ఉన్నాయంటున్నారు రిజిస్ట్రార్‌. రేషనైలేజేషన్‌ కమిటీ సూచనల ప్రకారం 300 వందల పోస్టులు భర్తీచేసుకునే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి మార్పుచేర్పులతో యూనివర్సిటీ క్యాంపస్‌ మెరవనుంది.  ఏయూకి మంచిరోజులు వస్తున్నాయని విద్యార్థులు సంతోషిస్తున్నారు. 

 

17:50 - June 25, 2016

సెంటినరీ కోపా అమెరికాకప్ టైటిల్ సమరానికి..న్యూజెర్సీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చిలీకి.. ప్రపంచ నెంబర్ వన్ అర్జెంటీనా సవాలు విసురుతోంది. ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా కోపా అమెరికాకప్ కు గురిపెట్టింది. ఈ సూపర్ ఫైట్ లో మెస్సీ ఆర్మీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ప్రపంచ సాకర్ అభిమానులను గత రెండు వారాలుగా ఓలలాడిస్తున్న ..సెంటినరీ కోపా అమెరికాకప్ టోర్నీ క్లయ్ మాక్స్ దశకు చేరింది. అమెరికాలోని మొత్తం పది నగరాలు వేదికగా ..16 జట్ల గ్రూప్ లీగ్, ఎనిమిదిజట్ల క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్, నాలుగు జట్ల సెమీస్ వార్ విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు.. టైటిల్ ఫైట్ తో పాటు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్ ల కోసం ఆరిజోనాలోని గ్లెన్ డేల్ ఫోనిక్స్ స్టేడియం, న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియాలలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

అర్జెంటినా..చిలి..
దక్షిణ, మధ్య అమెరికా ఖండ దేశాల టోర్నీగా జరిగే కోపా అమెరికాకప్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ అర్జెంటీనా, ప్రస్తుత చాంపియన్ చిలీ జట్లు వరుసగా రెండోసారి అర్హత సాధించడం విశేషం. గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో చిలీపై 2-1 గోల్స్ తో నెగ్గిన అర్జెంటీనా...ఫైనల్లో సైతం విజయానికి ఉరకలేస్తోంది. నూరేళ్ల కోపా అమెరికాకప్ చరిత్రలో అర్జెంటీనా ఇప్పటి వరకూ 27 సార్లు ఫైనల్స్ చేరి...14సార్లు చాంపియన్ గా నిలిచిన అరుదైన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు...ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్స్ లో ఆతిథ్య అమెరికాను 4-0 గోల్స్ తో అర్జెంటీనా అలవోకగా ఓడించి ఏకంగా 15వ కోపా అమెరికాకప్ టైటిల్ కు గురిపెట్టింది. ప్రపంచ నెంబర్ వన్, ఆల్-ఇన్- వన్ సూపర్ స్టార్ లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా...23 ఏళ్ల విరామం తర్వాత తమ దేశానికి ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్ అందించాలన్న కసితో పోటీకి దిగుతోంది. ఫైనల్లో అర్జెంటీనా దూకుడును డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఏమాత్రం తట్టుకోగలదన్నది అనుమానమే.

టైటిల్ సాధించే కసిలో చిలి..
మరోవైపు...సెమీఫైనల్లో కొలంబియాను 2-0 గోల్స్ తో ఓడించి..వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరిన చిలీ..బ్యాక్ టు బ్యాక్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. కోపా అమెరికాకప్ చరిత్రలో..ఇప్పటి వరకూ ఐదుసార్లు మాత్రమే ఫైనల్స్ చేరి...2015 లో టైటిల్ నెగ్గిన చిలీ..ఆరోసారి టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది. సూపర్ స్ట్రయికర్లు వర్గాస్, శాంచేజ్ లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లతో దూకుడుమీదున్న చిలీకి అర్జెంటీనా నుంచి అసలు సిసలు పోటీ ఎదురుకానుంది. గత కోపా కప్ ఫైనల్లో చిలీ చేతిలో ఎదురైన ఓటమికి ప్రస్తుత ఫైనల్స్ నెగ్గడం ద్వారా అర్జెంటీనా బదులు తీర్చుకొంటుందా? లేక గ్రూప్ ప్రారంభలీగ్ పోటీలో అర్జెంటీనా చేతిలో ఎదురైన పరాజయానికి చిలీ ప్రతీకారం తీర్చుకొంటుందా? తెలుసుకోవాలంటే మరి కొద్ది గంటల పాటు వేచి చూడక తప్పదు.

17:50 - June 25, 2016

విజయవాడ : భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఆటో రంగమే పెద్దదని, ఈ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ఆటోనగర్ 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ తాను ఎంపీగా గెలవడానికి కూడా ఆటోనగర్ పారిశ్రామిక రంగం ఎంతగానో దోహదపడిందన్నారు. ఆటోనగర్ లోని కార్మికులందరూ రాజకీయాలకు, కులమతాలకతీతంగా ఒక్కటై.. ఆటోనగర్ రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోడె ప్రసాద్, మేయర్ కోనేరు శ్రీధర్ లు, అన్ని అసోసియేషన్ల నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు.

 

17:46 - June 25, 2016

2016 యూరోపియన్ కప్ ఫుట్ బాల్ టోర్నీలో...24 జట్ల తొలిదశ గ్రూప్ లీగ్ సమరం ముగిసింది. పదహారుజట్ల ప్రీ-క్వార్టర్స్ ఫైనల్స్ నాకౌట్ ఫైట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గ్రూప్-F ఆఖరి రౌండ్ పోటీల్లో హంగెరీ- పోర్చుగల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే...ఆస్ట్రియాపై ఐస్ లాండ్ 2-1 గోల్స్ తో సంచలన విజయం సాధించి..ప్రీక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. రేపు జరిగే ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో స్విట్జర్లాండ్ తో పోలెండ్, వేల్స్ తో నార్థర్న్ ఐర్లాండ్ తలపడతాయి. ఆస్ట్రియా జట్లు గ్రూప్ లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 2016 యూరోపియన్ కప్ ఫుట్ బాల్..తొలిదశ గ్రూప్ లీగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 24 జట్లు, ఆరుగ్రూపులుగా జరిగిన లీగ్ దశ నుంచి ..16 జట్లు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి. పూల్-ఏ లీగ్ నుంచి ఆతిథ్య ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ జట్లు నాకౌట్ రౌండ్ చేరితే...రుమేనియా, అల్బేనియా లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాయి. గ్రూప్ - బీ లీగ్ నుంచి ఇంగ్లండ్, వేల్స్, గ్రూప్ - సీ నుంచి జర్మనీ, పోలెండ్, నార్థర్న్ ఐర్లాండ్, గ్రూప్- డీ లీగ్ నుంచి స్పెయిన్, క్రొయేషియా ప్రీక్వార్టర్స్ బెర్త్ సంపాదించాయి. గ్రూప్-ఈ లీగ్ నుంచి ఇటలీ,బెల్జియం, ఐర్లాండ్, గ్రూప్ -ఎఫ్ లీగ్ నుంచి పోర్చుగల్, ఐర్లాండ్, హంగెరీ జట్లు నాకౌట్ రౌండ్ చేరాయి.
జూన్ 25న జరిగే నాకౌట్ సమరంలో స్విట్జర్లాండ్ తో పోలెండ్, వేల్స్ తో నార్థర్న్ ఐర్లాండ్ జట్లు ఢీ కొంటాయి. జూన్ 26 జరిగే పోటీల్లో క్రొయేషియాతో పోర్చుగల్, ఫ్రాన్స్ తో ఐర్లాండ్ తలపడతాయి.
జూన్ 27 జరిగే ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో హంగెరీతో బెల్జియం, డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ తో ఇటలీ అమీతుమీ తేల్చుకొంటాయి.
జూన్ 28న జరిగే ఆఖరి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ సమరంలో ఇంగ్లండ్ కు ఐస్ లాండ్ సవాల్ విసురుతోంది.
రష్యా, ఉక్రెయిన్, రుమేనియా, అల్బెనియా, స్లొవేకియా, టర్కీ, స్వీడన్, ఆస్ట్రియా జట్లు గ్రూప్ లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది.

17:45 - June 25, 2016

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఏలూరు కాలువ మళ్లింపు వ్యవహారంతో చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు దేవినేని నెహ్రు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతిపాదించిన 6 కిలోమీటర్ల కాలువను కాదని.. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన 13.5 కిలోమీటర్లు ప్రతిపాదించిందన్నారు. దీని కారణంగా వందల ఎకరాల భూములను రైతులు కొల్పోతున్నారన్నారు. ఇష్టారాజ్యంగా ఏలూరు కాలువ మళ్లింపుపనులు చేపట్టి పేద రైతుల కడుపు కొట్టొద్దని నెహ్రు కోరారు. ప్రభుత్వం వెంటనే ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతిపాదనను అమలు చేయాలని నెహ్రు డిమాండ్ చేశారు. 

 

17:44 - June 25, 2016

ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 2016 యూరోపియన్ కప్ ఫుట్ బాల్ లో...నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 24 జట్ల గ్రూప్ లీగ్ పోటీలు ముగియడంతో..ఇప్పుడు 16 జట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. సెయింట్ ఇటెన్ని స్టేడియం వేదికగా సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు ప్రారంభమయ్యే తొలి ప్రీక్వార్టర్ ఫైనల్లో ..గ్రూప్-ఏ రన్నరప్ స్విట్జర్లాండ్ తో మ్యాచ్ జరగనుంది. పారిస్ స్టేడియంలో రాత్ర 9 గంటల 30 నిముషాలకు ప్రారంభమయ్యే రెండో ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోటీలో ..గ్రూప్- బీ టాపర్.. వేల్స్ తో గ్రూప్- సీ లో మూడోస్థానం సాధించిన నార్థర్న్ ఐర్లాండ్ తలపడుతుంది. సూపర్ మిడ్ ఫీల్డర్ గారెత్ బాలే నాయకత్వంలోని వేల్స్ దూకుడును నార్థర్న్ ఐర్లాండ్ ఎంత వరకూ అడ్డుకోగలదన్నది అనుమానమే.
లెన్స్ ఫుట్ బాల్ స్టేడియం వేదికగా రాత్రి 12 గంటల 30 నిముషాలకు జరిగే పోటీలో సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ కు...పవర్ ఫుల్ క్రొయేషియా సవాలు విసురుతోంది. గ్రూప్ ఆఖరిరౌండ్ పోటీలో చాంపియన్ స్పెయిన్ పై సంచలన విజయం సాధించిన క్రొయేషియా...పోర్చుగల్ తో ఫైట్ లోనూ అదేస్థాయిలో రాణించాలన్న పట్టుదలతో ఉంది. వన్ మ్యాన్ ఆర్మీ క్రిస్టియానో రొనాల్డో సత్తాకు...క్రొయేషియా అసలు సిసలు సవాలు విసరడంతో...ఈ పోటీ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

17:41 - June 25, 2016

మెదక్ : మామ-అళ్లుళ్లు అయిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులు ప్రజలను మోసం చేస్తున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్‌ ముంపుగ్రామాల బాధితులకు మద్దతుగా ఏటిగడ్డకిష్టాపూర్‌లో రేవంత్‌రెడ్డి దీక్ష చేపట్టారు. రేవంత్‌రెడ్డికి మద్దతుగా గ్రామస్తులు కూడా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే బాగు పడతామని ఆశించిన ప్రజలను.. మామ-అల్లుళ్లైన కేసీఆర్‌, హరీష్‌రావులు గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. భూములు ఇవ్వమన్నందుకు పోలీసులతో దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రావాళ్లను తీవ్రంగా విమర్శించిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చండీయాగానికి ఆంధ్ర నేతలనే పిలిచారన్నారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 

రైతులకు ప్లాట్ల పంపిణీ..వివరాలు..

గుంటూరు : రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. తుళ్లూరులో నేలపాడు రైతులకు లాటరీ పద్ధతిలో భూములు కేటాయించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ భూముల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజధానికి మొదట భూమి ఇచ్చిన నేలపాడు వాసి కొమ్మినేని ఆదిలక్ష్మి అనే మహిళా రైతుకు తొలి ప్లాట్ అందచేశారు. 847 మంది రైతులకు 1916 స్థలాలు కేటాయించారు. 1,167 నివాస భూములు, 769 వాణిజ్య భూములు కేటాయించారు. రైతులకు ఎక్కడ స్థలాలు వచ్చాయో తెలుసుకొనేందుకు ప్రభుత్వం కొత్త సాప్ట్ వేర్ ను రూపొందించింది.

17:31 - June 25, 2016

ఢిల్లీ : గ్రాండ్ స్లామ్ ఎవరెస్ట్ ..వింబుల్డన్ సమరానికి లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ పచ్చికకోర్టులతో ముస్తాబవుతోంది. జూన్ 27 నుంచి జులై 10 వరకూ జరిగే ఈటోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో టాప్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ కు టాప్ సీడింగ్స్ దక్కాయి. జోకోవిచ్ నాలుగో వింబుల్డన్ టైటిల్ కు గురిపెడితే...గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ పై కన్నేశాడు.....
2016 వింబుల్డన్ సమరానికి రంగం సిద్ధం
2016 వింబుల్డన్ సమరానికి లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో రంగం సిద్ధమయ్యింది. జూన్ 27 నుంచి జులై 10 వరకూ జరిగే ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో సీడింగ్స్ వివరాలను నిర్వాహక సంఘం ప్రకటించింది.
పురుషుల, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ కు టాప్ సీడింగ్స్ ఇచ్చారు. 
యాండీ ముర్రేకి రెండు సీడింగ్స్
మాజీ చాంపియన్, బ్రిటీష్ నెంబర్ వన్ ఆటగాడు యాండీ ముర్రేకి రెండు, 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత రోజర్ ఫెదరర్ కు మూడు సీడింగ్స్ దక్కాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ మాజీ చాంపియన్ వావరింకాకు నాలుగు, ఆసియా నెంబర్ వన్ ప్లేయర్ నిషికోరీకి ఐదు సీడింగ్స్ దక్కాయి. ఫ్రెంచ్ వెటరన్ స్టార్ రిచర్డ్ గాస్కేకు ఏడు, మారిన్ సిలిచ్ కు 9 సీడింగ్స్ ఇచ్చారు. ఇక..మహిళల సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ సెరెనా విలియమ్స్ , ఫ్రెంచ్ ఓపెన్ క్వీన్ ముగురుజా..మొదటి రెండు సీడ్లుగా ఉన్నారు. విక్టోరియా అజరెంకా ..గాయంతో వింబుల్డన్ టోర్నీకి దూరమయ్యింది.
క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా జోకోవిచ్ పోటీ 
పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే  మూడు వింబుల్డన్ టైటిల్స్ తో సహా 11 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన జోకోవిచ్...క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా పోటీకి దిగుతున్నాడు. ఏడు వింబుల్డన్ టైటిల్స్ తో పాటు 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచిన రోజర్ ఫెదరర్ ను..ప్రస్తుత సీజన్లో  గాయాలు , ఫిట్ నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి.
ముర్రేకి వింబుల్డన్ లో విజయావకాశాలు  
ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ యాండీ ముర్రేకి వింబుల్డన్ లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే..జోకోవిచ్ ప్రత్యర్థిగా ముర్రేకి అంతంత మాత్రం రికార్డే ఉంది. ఇప్పటి వరకూ జోకోవిచ్ తో తలపడిన15 మ్యాచ్ ల్లో ముర్రే కి 13 పరాజయాలు ఎదురయ్యాయి.
22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో సెరెనా 
మహిళల సింగిల్స్ లో..ఆరు వింబుల్డన్ టైటిల్స్ తో పాటు మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా..22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది. మహిళల డబుల్స్ లో టాప్ సీడింగ్ జోడీ సానియా మీర్జా- మార్టీనా హింగిస్ ..హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగుతున్నారు. పురుషుల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లో భారత వెటనర్ స్టార్ లియాండర్ పేస్ సైతం తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. వచ్చే రెండువారాలూ వింబుల్డన్ తో..ప్రపంచ టెన్నిస్ అభిమానులకు పండుగే పండుగ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 

విశాఖ అభివృద్ధి చెందుతోంది - చంద్రబాబు..

విశాఖపట్టణం : జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హుదూద్ తుపాన్ వల్ల విశాఖకు తీవ్ర నష్టం జరిగిందని, పూర్తిస్థాయిలో ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించామని, విశాఖతో పాటు ఇతర నగరాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆగస్టు నాటికి 20 ఏంబీపీఎస్ వేగంతో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

17:23 - June 25, 2016

చలన చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రేమించి వివాహాలు చేసుకుంటుంటారు. కొంతమంది పెద్దలు కుదిర్చిన వారినే పెళ్లి చేసుకుంటుంటారు. కొంతకాలం వీరి సంసారం సవ్యంగా సాగిన అనంతరం కొద్దికాలానికి మనస్పర్థలు..బేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. దీనితో వారు విడిపోతున్నారు. తాజాగా కళ్యాణి - సూర్య కిరణ్ ల జంట విడిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హోమ్లీ హీరోయిన్ గా కళ్యాణి ముద్ర వేసుకుంది. డైరెక్టర్ సూర్య కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో నాలుగైదే సినిమాలకు దర్శకత్వం వహించిన సూర్య కిరణ్ కు ప్రస్తుతం ఏలాంటి అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కళ్యాణి..సూర్య కిరణ్ ల మధ్య విబేధాలు పొడచూపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్.
ఇక కళ్యాణి విషయానికి వస్తే రాజశేఖర్ సినిమా శేషు తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, రవితేజ, శ్రీకాంత్ వంటి హీరోలతో నటించింది. ఇవి వట్టి పుకార్లేనా ? నిజమా తెలియాలంటే కళ్యాణి..సూర్య కిరణ్ లలో ఎవరో ఒకరు పెదవి విప్పాల్సి ఉంటుంది.

ఆప్ ఎమ్మెల్యేకు జ్యుడిషయల్ కస్టడీ..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియాకు జ్యుడిషయల్ కస్టడీ విధించింది. ఇటీవల పలు ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 27 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు మోడీ ప్రారంభోత్సవం..

మహరాష్ట్ర : పూణెలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తిలకించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

16:59 - June 25, 2016

పాకిస్తాన్ : ఉడ్‌తా పంజాబ్‌ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. పాకిస్తాన్ సెన్సార్‌ బోర్డు ఉడ్‌తా పంజాబ్‌ సినిమాలో వంద సీన్లను కట్‌ చేయడంతో అక్కడ సినిమా విడుదల చేయొద్దని నిర్మాతలు నిర్ణయించారు. సినిమా విడుదల చేస్తే ఆర్థికంగా తమకు నష్టాలు తప్పవని పేర్కొన్నారు. భారత్‌లో కూడా సెన్సార్‌ బోర్డు ఉడ్‌తా పంజాబ్‌లో 89 సీన్లను కట్‌ చేయడంతో దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఒక్క సీన్‌ కట్‌తో కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్‌లో కోర్టుకు వెళ్లి పోరాడే అవకాశం లేదని, అందుకే అక్కడ సినిమాను విడుదల చేయకపోవడమే మేలని భావించామని దర్శకుడు అభిషేక్‌ చౌబే తెలిపారు. ఉడ్‌తా పంజాబ్‌ ఇంటర్నెట్‌లో లీక్‌ కాకుంటే ఈ సినిమా రెవెన్యూ మరింత పెరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో డ్రగ్స్‌ పాక్‌ నుంచి పంజాబ్‌కు సరఫరా అవుతున్నట్లు చూపారు.

 

16:56 - June 25, 2016

ఢిల్లీ : ఆప్‌ ఎమ్మెల్యే దినేష్‌ మోహ్నియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మీడియా సమావేశం జరుపుతున్న దినేష్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. 60 ఏళ్ల వృద్ధుడి చెంప ఛెళ్లుమనిపించారని ఆయనపై ఆరోపణ. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వడం కోసం దినేష్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు గుండాయిజానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దినేష్‌ ఆరోపించారు. నిజాయితీ గల అధికారి ఎం ఎం ఖాన్‌ హత్యలో ఇరుకున్న తమ నేతలను కాపాడుకునేందుకే బిజెపి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. 

16:54 - June 25, 2016

హైదరాబాద్ : భాగ్యనగరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. రంగు రంగుల యాడ్స్‌తో అందరిని ఆకర్షిస్తాయి..విద్యుత్ కాంతులతో కనువిందు చేస్తాయి. అయితే ఆ కాంతుల వెనుక ఎన్ని చీకట్లు దాగున్నాయో తెలియదు. ఏ నిమిషానికి ఏదీ కుప్ప కూలుతుందో తెలియదు. ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందో అంతకన్నా తెలియదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటిలో అక్రమ హోర్డింగ్స్‌ అక్రమాలు అన్నీ ఇన్నికావు. అనుమతి తీసుకున్నది ఒకటైతే...ఏర్పాటు చేసేది మరొకటి. గ్రేటర్‌ సీటిలోని హోర్డింగ్స్ పై 10టీవీ ప్రత్యేక కథనం...
అనుమతి లేని హోర్డింగ్స్  
గ్రేటర్‌లో ఇటీవల కురిసిన గాలి బీభత్సానికి పలు హోర్డింగ్స్ నేలకూలాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగనప్పటికీ..ఆస్తి నష్టం భారీగానే జరిగింది. దాంతో సిటిలోని హోర్డింగ్స్ పై ఒక్కసారిగా చర్చ మొదలైంది. వాటి ఏర్పాటు దగ్గర నుంచి, వాటి సామర్ధ్యం వరకు అందరూ సందేహలు లేవనెత్తుతున్నారు. సిటిలో ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ దర్శనమిస్తుంటాయి. ఏ రోడ్డు చూసినా వేల సంఖ్యలో హోర్డింగ్స్ కనిపిస్తుంటాయి. కానీ బల్దియా పరిధిలో మాత్రం 2,684 హోర్డింగ్స్ కు మాత్రమే అనుమతి ఉంది...అనుమతి లేనివి వందల సంఖ్యలో ఉంటాయంటున్నారు బల్దియా అధికారులు. అక్రమ హోర్డింగ్స్‌ ద్వారా కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. 
అనుమతులు తీసుకున్న హోర్డింగ్స్‌లోనూ గోల్ మాల్
అనుమతి లేనివాటి సంగతి అలా వుంటే...అనుమతులు ఇచ్చిన వాటిలో కూడా గోల్ మాల్ జరుగుతోంది. సిటీలో పలు యాడ్ ఏజెన్సీలకు కుప్పలుతెప్పలుగా హోర్డింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అనుమతులు తీసుకున్న వాటిలో సగం వరకు పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలకు చెందినవే. అయితే వీరికి చెందిన హోర్డింగుల్లోనూ కొన్నింటికి అనుమతులు లేవంటున్నాయి సిటిజన్ ఫోరమ్స్. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో ఓ ప్రముఖ యాడ్ ఏజెన్సీ 14 హోర్డింగ్స్ కు అనుమతి తీసుకొని 17 హోర్డింగ్స్ ఏర్పాటు చేసిందంటున్నారు తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ నేతలు. ప్రస్తుతం యాడ్ ఏజెన్సీలు వాడుతున్న స్పెస్ కు 17,9000 SFT కాగా 8350 SFTకి మాత్రమే కార్పొరేషన్ కు డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. 
అనుమతి కంటే ఎక్కువ SFTలో హోర్డింగ్స్ 
ఇక సిటీలో అనుమతితో ఉన్న చాలా హోర్డింగ్స్..తీసుకున్న అనుమతి కంటే ఎక్కువ SFTలో హోర్డింగ్స్ ను నిర్మించాయి. ఇలా ఏళ్లతరబడి జరగుతుందని, అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. చాలా రోజులుగా ఇలా కార్పొరేషన్ ఖజానాకు గండివేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి రావాల్సిన డబ్బులను వసూలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు సిటిజన్ ఫోరమ్‌ సభ్యులు. అంతేకాదు..హోర్డింగ్ యాజమానులపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. 

కాసేపట్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు మోడీ ప్రారంభోత్సవం..

మహరాష్ట్ర : పూణెలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తిలకించారు. కాసేపట్లో ఆయన స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

16:49 - June 25, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి విజయం సాధించారు. ఆమె 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 8 మంది పోటీలో ఉన్నప్పటికీ మెహబూబా ముఫ్తి, కాంగ్రెస్‌ అభ్యర్థి హిలాల్‌ షా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి ఇఫ్తికార్‌ మిస్గర్‌ ల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. అధికార పక్షం ఈవిఎంలను టాంపరింగ్‌ చేసిందంటూ విపక్షాలు ఓట్ల లెక్కింపును బహిష్కరించాయి. కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. కౌంటింగ్‌ కేంద్రాలకు మీడియాను అనుమతించలేదు. జనవరి 7న మాజీ సిఎం ముఫ్తి మొహ్మద్‌ సయీద్‌ మరణించడంతో ఖాళీ అయిన అనంత్‌నాగ్‌ స్థానంలో జూన్‌ 22న ఉపఎన్నిక జరిగింది. 

కేసీఆర్ ప్రకటనలు చేయడం ఆశ్చర్యకరం - మల్లారెడ్డి..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్యమాలు జరుగుతుంటే కేసీఆర్ ఇప్పుడు మేల్కొని ప్రకటనలు చేయడం ఆశ్చర్యకరమని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో 123 ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.

మల్లన్న సాగర్..కేసీఆర్ వ్యాఖ్యల్లో కొత్తేమి లేదు - తమ్మినేని..

హైదరాబాద్ : మలన్న సాగర్ పై సీఎం కేసీఆర్ చేసిన మాటల్లో కొత్తదనం ఏమి లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రైతులు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చట్ట ప్రకారం ప్రస్తుత మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములకు అదే రేటు వర్తింప చేయాలని, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు పోలీసు క్యాంపులుగా మారాయన్నారు. రైతులను బెదిరించి భూములను తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. పేద రైతులకు నష్టం కలిగించే దేవాదాయ శాఖ జీవో 425ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖకు చెందిన 3.60 లక్షల ఎకరాల భూమిని కౌలుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కౌలుకు తీసుకొనే ముందు హిందువులు మాత్రమే అర్హులనడం సరికాదన్నారు. 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదెకరాల మెట్ట సాగు చేసే పేద రైతులంతా కౌలుకు తీసుకోవడానికి అర్హులేనని తెలిపారు.

విశాఖలో బాబు పర్యటన..

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమంలో బాబు పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడీ పాల్గొనున్నారు.

16:45 - June 25, 2016

విజయవాడ : పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్కరఘాట్ల పనులను పర్యవేక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు, మేయర్‌ కోనేరు శ్రీధర్ ఉదయం నుంచి పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. ప్రతిరోజూ ఘాట్ల వద్దే మకాం వేసి, పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకునేలా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పుష్కర పనుల్లో నాణ్యత లోపించకుండా.. ప్రపంచ స్థాయి ఆధునిక పరిజ్ఞానంతో ఘాట్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు నాని తెలిపారు. 

 

16:38 - June 25, 2016

ఖమ్మం : పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి  డిమాండ్ చేశారు. ఈమేరకు పాల్వంచలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీనికి ప్రభుత్వ అసమర్ధతే కారణమని ఆరోపించారు. సామాన్య ప్రజలపై భారం వేయడం తగదని.. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. పథకాలను సినిమా ట్రైలర్ లా చూపుతూ.. పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.

 

యురేనియం కేసుతో భానుకు లింక్...

హైదరాబాద్ : యురేనియం కేసుతో భారుకిరణ్ కు లింక్ ఉన్నట్లు వెల్లడైంది. ములాఖత్ పై భానును పలుమార్లు యురేనియం నిందితులు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ రెడ్డిలు కలిశారు. భాను ఉన్న మానస బ్యారెక్ లో జైలు సిబ్బంది తనిఖీలు చేశారు. భానును మానస బ్యారెక్ నుండి రెండు లాకప్ లున్న బ్యారెక్ కు పోలీసులు తరలించారు.

కారు బోల్తా నలుగురు మృతి...

మహబూబ్ నగర్ : అడ్డాకుల (మం) కొమ్మిరెడ్డి పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా కొట్టడంతో నలుగురు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి.

16:19 - June 25, 2016

హైదరాబాద్ : కేల్కర్‌ కమిటీ వద్దన్నా.. చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్నే ఎందుకు ఆమోదించారని వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు దుర్బుద్ధిని ప్రజలే గమనించాలన్నారు. స్వలాభాం కోసమే విదేశీ కంపెనీల వెంటపడ్డారని విమర్శించారు. 

 

16:13 - June 25, 2016

'గమ్యం', 'వేదం', 'కంచె'... లాంటి వైవిధ్య చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఆయన ఎంగేజ్ మెంట్ శనివారం జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు ఇతరులు హాజరై కాబోయే దంపతులను ఆశ్వీరదించారు. క్రిష్ - రమ్యలు ఒకరినొకరు ఇష్టపడ్డంతో పెళ్లి ముహూర్తానికి పెద్దలు నిర్ణయించారు. ఆగస్టులో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ కు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, అల్లు అర్జున్, రానా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
వీరి కుటుంబంలో ఇతనే పెద్ద కొడుకు. క్రిష్ తమ్ముడు ఇప్పటికే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తీయడం ద్వారా.. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్.

16:10 - June 25, 2016

గుంటూరు : అమరావతిలో రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రారంభమైంది. లాటరీ విధానంలో రైతులకు సీఎం చంద్రబాబు ప్లాట్ల పత్రాలను పంపిణీ చేశారు. రాజధానికి మొదట భూమి ఇచ్చిన నేలపాడుకు చెందిన కొమ్మినేని ఆదిలక్ష్మికి చంద్రబాబు తొలి ప్లాట్‌ను అందించారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టేక్కించే అవకాశం తనకు కలిగిందని ఈ  సందర్భంగా చంద్రబాబు అన్నారు. 

 

మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అరెస్టు..

హైదరాబాద్ : నగరంలో భారీగా విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.60 కోట్ల విలువైన 705 విదేశీ బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ డ్రైవర్ సునీల్ కుమార్, అభినయ్ కుమార్, అరవింద్ సింగ్ లున్నారు.

ముఫ్తి గెలుపు..

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తి అనంత్‌నాగ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మెహబూబాకు 17,000 ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హైలాల్ అహ్మద్ షాకు 5,589 ఓట్లు వచ్చాయి.

పెట్టుబడులే లక్ష్యంగా బాబు చైనా పర్యటన - పరకాల..

హైదరాబాద్ : పెట్టుబడులే లక్ష్యంగా ఆదివారం నుండి 30 వరకు చైనా పర్యటన కొనసాగుతుందని, తొలి రోజు 5 ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయని పరకాల ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని, రాత్రికి ఢిల్లీ నుంచి చైనా బయల్దేరతారని తెలిపారు.

15:52 - June 25, 2016

ఈ పాత్ర ఉంటే అద్భుతాలే..ఈ పాత్ర అక్షయపాత్రతో సమానమంట.రాత్రికి రాత్రి కోటీశ్వరలవుతారంట...రైస్ పుల్లింగ్ పాత్రతో తలరాతే మారిపోతుందంట..ఆకర్షించే దూరాన్ని బట్టి రేట్లు ఉంటాయంట..

1985 సంవత్సరం రూపాయి నోటు ఉందా ? 2010 సంవత్సరానికి చెందిన పది రూపాయల నాణెం ఉందా ? ఇవన్నీ లేకపోతే 1985 సంవత్సరానికి చెందిన పాత రూపాయి నాణెం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు సంధించే బురిడి బాబాలు అమాయకుల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. 'రైస్ పుల్లింగ్ పాత్ర' అక్షయపాత్రతో సమానమని కట్టు కథలు అల్లుతున్నారు. ఈ మాయగాళ్ల వలలో పడిన కొంతమంది వేలు..లక్షలు పెట్టి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ గారడి వల్ల మాయలో పడవద్దని టెన్ టివి సూచిస్తోంది..తస్మాత్ జాగ్రత్త..

కార్మిక చట్టాలను ఏపీ ప్రభుత్వం కాలరాస్తోంది - పుణ్యవతి..

విజయవాడ : కార్మిక చట్టాలను టిడిపి కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి పేర్కొన్నారు. కనీస వేతనాల అమలుపై సీఎం స్పందించడం లేదని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు అప్పగించి కార్మికులను ఇతర రాష్ట్రాల నుండి రప్పిస్తున్నారని తెలిపారు. ఆదివారం విజయవాడలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయన్నారు. కార్మిక చట్టాలు, కనీస వేతనాల అమలు విషయంపై మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

ముగిసిన బోనాల ఉత్సవ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : బోనాల ఉత్సవాల కమిటీ సమావేశం ముగిసింది. 27న ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఛైన్ స్నాచింగ్ ముఠాల అరెస్టు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రెండు ముఠాలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. 91 తులాల బంగారం, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

15:41 - June 25, 2016

కడప : జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ శ్యాంసుందర్‌  అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుని కోట్ల ఆర్జిస్తున్నారని స్వయంగా పాలక మండలి సభ్యులే  ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 
వివాదాస్పదంగా శ్యాంసుందర్‌ వ్యవహారాలు  
కడపలోని యోగి వేమన యూనివర్సిటీ  వైస్‌ చాన్సలర్‌ బేదనభట్ల శ్యాంసుందర్‌ వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నారు. 2013లో వీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీసీ వ్యవహార శైలి పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది. 
రీవ్యాల్యుయేషన్‌కు డబ్బులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు 
పరీక్షల నిర్వహణలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేన్స్‌ను పక్కన పెట్టి వీసీ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షల్లో తప్పిన విద్యార్ధులు రీ వ్యాల్యుయేషన్‌ పెట్టుకుంటే డబ్బులు తీసుకుని పాస్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ విషయంలో ప్రొద్దుటూరు ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోపోవడాన్ని విద్యార్థి సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. రీవ్యాల్యుయేషన్‌ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 
సౌర విద్యత్‌ కేంద్రం ఏర్పాటు యత్నాలు విఫలం 
యూనివర్సిటీకి ఉన్న 700 ఎకరాల భూమిలో వంద ఎకరాల్లో ప్రైవేటు సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు లీజుకు ఇచ్చేందుకు వీసీ శ్యాంసుందర్‌ చేసిన ప్రయత్నాలను పాలకమండలి తిప్పికొట్టింది. సౌర విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తే యూనివర్సిటీకి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడానికి ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. యోగి వేమన యూనిర్సిటీ విద్యుత్‌ బిల్లులు ఏడాదికి 25 నుంచి 30 లక్షల రూపాయలు మించవు. సౌర విద్యుత్‌ కేంద్రానికి వంద ఎకరాల భూమి లీజుకు ఇస్తే ఏటా 25 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పాలక మండలి అంచనావేసింది. దీనికి బదులుగా కేలవం ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు భూములు కట్టబెట్టేందుకు వైస్‌ చాన్సలర్‌ శ్యాంసుందర్‌ ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. యూనివర్సిటీలో జరిగే నిర్మాణ పనులకు బహిరంగ టెండర్లు పిలవాల్సి ఉండగా... నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నారని అంటున్నారు. 
ఆరోపణలను తిప్పికొట్టిన శ్యాంసుదర్‌
మరోవైపు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను శ్యాంసుదర్‌ తిప్పికొట్టారు. ఇదంగా గిట్టనివారు చేస్తున్న దుష్రచారమని వాదిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న కొందర్ని పక్కన పెట్టానని చెబుతున్నారు. అయితే మరో 15 రోజుల్లో పదవీకాలం పూర్తి కానున్న తరుణంలో వైస్‌ చాన్సలర్‌ శ్యాంసుందర్‌ కొన్ని పనులకు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

15:15 - June 25, 2016

నగర శివారులోని ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ విద్యార్థి అఖిల్ రెడ్డి మృతిలో అనుమానాలు బలపడుతున్నాయా ? ఈ డెత్ మిస్టరీలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. డ్రగ్స్ ఇవ్వడం వల్లే చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కడుపునొప్పితో మృతి చెందాడని కాలేజీ యాజమాన్యం పేర్కొంటోంది. అసలు అఖిల్ రెడ్డి ఎలా చనిపోయాడు ?

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన అఖిల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నాడు. కాలేజీ ఆవరణలో అఖిల్ అస్వస్థతకు గురయ్యాడు. నోటి నుండి రక్తం రావడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే దగ్గరులోని ఆసుపత్రికి..అనంతరం ఉప్పల్ లోని మరో ఆసుపత్రికి..అక్కడి నుండి సనత్ నగర్ లోని ఈఎస్ ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్ రెడ్డి మృతి చెందాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపించాలని, కాలేజీ ప్రిన్స్ పాల్ ఆసుపత్రికి ఎందుకు రాలేదని వారు ప్రశ్నిస్తున్నారు ? అఖిల్ రెడ్డి ఎలా చనిపోయాడనేది తెలియాలంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.

15:04 - June 25, 2016

కులాంతర వివాహం వీరిని కాటేసిందా ? కానిస్టేబుల్ ను పెళ్లి చేసుకోవడం తప్పయిందా ? ఆరు నెలలుగా వేధిస్తున్నారా ?

వారిద్దరూ కానిస్టేబుళ్లు..విధి నిర్వాహణలో పనిచేసే వీరి మనస్సులు కలిశాయి. మంజుల..మహేష్ బాబులు వీరిద్దరూ పటన్ చెరులో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరి మనస్సులు కలవడంతో గత ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్నారు. ఏన్నో ఏళ్ల ప్రేమతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కులాలు అడ్డుగోడలయ్యాయి. అయినా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆరు నెలలు హ్యాపీగా ఉన్నా వీరికి మాత్రం పెద్దల వేధింపులు తప్పలేదు. ఈ క్రమంలో యాక్సిడెంట్ లో ఆ ఇద్దరూ చనిపోయారు. ఇది ప్రమాదమా ? కులాంతర వివాహం చేసుకున్నారని కక్షనా ?

15:01 - June 25, 2016

చెన్నై రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగానే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అతి దారుణంగా చంపాడు. ఈ పని చేసింది ఎవరు ? చంపిన వాడు సైకోనా ? గత వారం గొడవపడిన క్యాబ్ డ్రైవర్ ?


చైన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్ లో పట్టపగలు అందరూ చూస్తుండగా కిరాతకం జరిగిపోయింది. ఉదయం 6.30గంటలకు రెండో రైల్వే ప్లాట్ ఫాంపై సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్వాతి వేచి ఉంది. ఆ సమయంలో ఓ ఆగంతకుడు యువతి మధ్య వాగ్వాదం జరిగింది. అంతే క్షణకాలంలో కొడవలితో స్వాతిని కిరాతకంగా నరికి హత్య చేశాడు. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

14:58 - June 25, 2016

లక్షలు తీసుకుని బంగారం అన్నారు. కోడలు నడుస్తుంటే లక్ష్మీ అన్నారు..డబ్బు ఉందని పసిగట్టారు..ఆస్తులున్నాయని తెలుసుకున్నారు..అంతే ఆ క్షణం నుండి మొదలైన వేధింపులు ఆగలేదు.

ఎళ్లలు దాటి వెళ్లినా మారని ధనదాహ పిశాచుల హింసను భరించింది. లక్షలకు లక్షలు ఇచ్చినా సంతృప్తి చెందలేదు. అత్తమామలు ధన దాహంతో హింసించారు..స్థలం కావాలన్నారు.. ఆ తరువాత లోన్ తీసుకున్నారు. సంతృప్తి చెందని వీరంతా హోటల్ కు ఎసరు పెట్టారు. తమ మాట వినకపోయినా..డబ్బు తేకున్నా వెళ్లాలన్నారు. చివరకు ఆస్ట్రేలియాలో ఉరి తాడుకు వేలాడింది. ఎన్నారై రమ్య డెత్ కేసులో పోలీసుల యాక్షన్ మొదలైంది. ఎన్నారై రమ్య వేధింపులకే బలయింది. ఈ విషాద ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:57 - June 25, 2016
14:52 - June 25, 2016

హైదరాబాద్ : ప్రజల కరువుతో అల్లాడుతుంటే బస్సు, ఆర్టీసీ చార్జీలు పెంచడం సరికాదని వైసీపీ తెలంగాణా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు హైదరాబాద్‌ లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కాగా పోలీసులు వైసీపీ నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

టిటిడిలో సన్నిధి గొల్లలపై వివక్షత...

చిత్తూరు : వంశపారంపర్యంగా కొనసాగుతున్న సన్నిధి గొల్లలను రిటైర్మెంట్ పేరిట టిటిడి సాగనంపుతోంది. అర్చకుల తరహాలో తమను కూడా వంశపపారంపర్యంగా కొనసాగించాలని సన్నిధి గొల్లలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారిని ప్రతి రోజు తొలుత దర్శించుకొనేది సన్నిధి గొల్లలే కావడం తెలిసిందే. 1996 లో మిరాశి వ్యవస్థ రద్దు భాగంలో వీరిని ఉద్యోగులుగా టిటిడి కొనసాగిస్తోంది.

14:46 - June 25, 2016

హైదరాబాద్ : ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాలంటూ దీక్షలు చేస్తారని... టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి మాత్రం ప్రాజెక్టులు ఆపాలంటూ నిరసనలు చేస్తున్నారని టీఆర్ ఎస్ నేత కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. ఈమేరకు ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలంటూ టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రాజెక్టులతో తెలంగాణ సస్యస్యామలమవుతుందన్నారు. 

 

బాబు దోపిడికి తెరలేపారు - సి.రామచంద్రయ్య..

హైదరాబాద్ : అమరావతి నిర్మాణంలో స్విస్ చాలెంజ్ ను ఆహ్వానిస్తూ చంద్రబాబు దోపిడికి తెరలేపారని కాంగ్రెస్ నేత సి.హెచ్. రామచంద్రయ్య తెలిపారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని..దోపిడికి వ్యతిరేకమన్నారు. ప్రతిపక్షాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

 

స్విస్ ఛాలెంజ్ ఎందుకు - బోత్స..

హైదరాబాద్ : కేల్కర్ కమిటీ వద్దన్నా చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎందుకు ఆమోదించారని వైసీపీ నేత బోత్స ప్రశ్నించారు. చంద్రబాబు దుర్బిద్దిని ప్రజలు గమనించాలని, స్వలాభం కోసమే విదేశీ కంపెనీల వెంటపడ్డారన్నారు.

ఆదిలక్ష్మికి తొలి ప్లాట్ అందచేసిన సీఎం బాబు..

గుంటూరు : రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరిగింది. లాటరీ విధానంలో రైతులకు ప్లాట్లను సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. కొమ్మినేని ఆది లక్ష్మి అనే మహిళా రైతుకు తొలి ప్లాట్ ను బాబు అందచేశారు. రాజధానికి మొదట భూమి ఇచ్చింది నేలపాడుకు చెందిన ఆదిలక్ష్మి కావడం విశేషం.

మెహబూబా ముఫ్తి విజయం ?

అనంతనాగ్ : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించినట్లు తెలుస్తోంది. సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు సమాచారం బుధవారం జరిగిన అనంతనాగ్ ఉప ఎన్నికకు శనివారం కౌంటింగ్ నిర్వహించారు.

14:13 - June 25, 2016

అంజలి..టాలీవుడ్ లో అగ్రహీరోల సరసన నటించింది. అంతేగాకుండా కోలివుడ్ లో తన ప్రతిభను చాటి చెప్పింది. తెలుగ‌మ్మాయిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ ముద్దుగుమ్మ షాకింగ్ డిసిషన్ తీసుకొందంట. ప్రస్తుతం అంజలి అవకాశాలు తగ్గాయి. ఇటీవలే విడుదలైన 'సరైనోడు' చిత్రంలో ప్రత్యేక పాటలో అలరించింది. టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకున్న అంజలి.. తమిళ డబ్బింగ్ సినిమా జర్నీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయింది. ఈ సినిమా ఇక్క‌డ కూడా హిట్ అయ్యింది. కానీ ప్రస్తుతం అంజలికి సినిమాలు లేవని టాక్ వినిపిస్తోంది. దీనితో ముందుగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలని అనుకుని పెళ్లికి డిసైడ్ అయిపోయిందంట. త్వరలోనే ఓ కోలీవుడ్ యంగ్ హీరోతో ఈ బ్యూటీ మూడు ముళ్లు వేయించుకుంటోద‌ట‌. వీరి ప్రేమ విషయంలో ఇరు కుటుంబాల వారిని ఒప్పించే పనిలో పడ్డారట. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వెయిడ్ అండ్ సీ...

ఏఐసీబీఈఎఫ్, ఏఐసీబీవోఏ జాతీయ సదస్సు...

హైదరాబాద్ : ఏఐసీబీఈఎఫ్, ఏఐసీబీవోఏ జాతీయ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ కార్మికులను విస్మరిస్తోందని ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ప్రజలకందడం లేదని విమర్శించారు. ఉద్యోగులంతా కలిసి కట్టుగా ఏన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సూచించారు. జులై 12,13 బ్యాంకు ఉద్యోగులు దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు వెల్లడించారు.

14:09 - June 25, 2016

నిజామాబాద్‌ : ప్రభుత్వ ఐటీఐ..! ఇది సాదాసీదా కాలేజీ కాదు. అబలల్ని సబలలుగా మార్చే కార్ఖానా. అవును.. ఇక్కడ చదివిన ఎందరో మహిళలు.. నేడు వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకునేటప్పుడే విద్యతో పాటు.. బతుకు తెరువునూ చూపుతోన్న నిజామాబాద్‌ ప్రభుత్వ ఐటీఐ కళాశాలపై ప్రత్యేక కథనం.

ఆదర్శంగా నిలుస్తోన్ననిజామాబాద్ ఐటీఐ కళాశాల ...
ప్రభుత్వ ఐటీఐ అంటే అన్ని సమస్యలే అనుకుంటారు. కానీ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలోని ప్రభుత్వ ఐటీఐ మాత్రం ఈ నానుడికి పూర్తి భిన్నంగా సకల సౌకర్యాలతో విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ చేరిన వారికి ఉపాధి ఖాయం అన్న స్థాయిలో ఈ కాలేజీ ఖ్యాతి గడించింది. ఇక్కడ నిర్వహిస్తున్న

షార్ట్‌హ్యాండ్‌ కోర్సుతో ఉపాధి అవకాశాలు...
ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా స్వల్పకాలిక శిక్షణలనందిస్తున్న ఐటీఐ కేంద్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందీ కాలేజీ.. డీజిల్‌ ట్రేడ్‌, సివిల్‌ట్రేడ్, ఎలక్ట్రానిక్ ట్రేడ్‌, స్టెనోగ్రఫి వంటి కోర్సులు అందిస్తున్న ఏకైక ఐటీఐ కేంద్రం ఇదేనని శిక్షకులు చెబుతున్నారు. షార్ట్‌హ్యాండ్‌ ద్వారా అనేక మంది అమ్మాయిలకు ఉపాధి దొరుకుతోందని, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందుకుంటున్నారని అంటున్నారు.

ట్రైయినీస్‌ హర్షం వ్యక్తం...
ఇక్కడ శిక్షణ తీసుకోవడం ద్వారా తాము ఉపాధిపొందడమే కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించగలుగుతున్నామని ట్రైయినీస్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కళాశాల అభివృద్ధికి మెచ్చి అవార్డు ప్రకటించిన ఫ్యాబ్సీ...
1990లో కోపా దుస్తుల తయారీ, ఎలక్ట్రానిక్‌, మెకానిక్‌, ఐటీ ఈఎస్‌ఎం కోర్సులతో ఈ కళాశాల ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోనే ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన ఏకైక బాలికల ఐటీఐగా గుర్తింపుపొందింది. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ ఉపయోగిస్తున్న ఏకైక ఐటీఐ కాలేజ్‌గా పేరొందింది. అమ్మాయిలకు ఉపాధి కల్పించడమే కాకుండా, కళాశాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించడంపై ఫ్యాప్సీ ప్రతినిధులు ఈ కళాశాలకు అవార్డును ఇచ్చారు.

ప్రోత్సహించి పురోగమనంలో నడపాలని స్థానికులు ...
రాష్ట్రంలోని ఇతర ఐటీఐలను కూడా.. ఇదే తరహాలో వృద్ధి చేస్తే.. నిరుద్యోగితను కొంతమేరకైనా పారదోలే వీలుంటుందని యువత అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం ఈ కళాశాలను మరింతగా ప్రోత్సహించి పురోగమనంలో నడపాలని స్థానికులు కోరుతున్నారు.

దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి..

మెదక్ : వేముల ఘాట్ లో దీక్షా శిబిరాన్ని టిడిపి నేత రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఏటిగడ్డ కిష్టాపూర్ లో దీక్ష చేపట్టారు.

14:08 - June 25, 2016
14:02 - June 25, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చొరవ పనితీరుతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తపరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ఈనెల 26నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించి పలు రాష్ట్రాలతో ఎంవోయూలు కుదుర్చుకుంటామన్నారు. ఈ పర్యటనలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం సమావేశం అవుతారని పరకాల చెప్పారు. టెక్నాలజీ, ఫూడ్‌ప్రాసెసింగ్‌, షిప్పింగ్‌, ఆక్వారంగాల్లోని ప్రముఖ కంపెనీలతో పలు ఒప్పందాలు జరుగుతాయన్నారాయన. 

13:53 - June 25, 2016

హైదరాబాద్: మల్లన్న సాగర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. నిర్వాసితులు చేస్తున్న ఆందోళనపై కేసీఆర్ సర్కార్ శనివారం స్పందించింది. ఈ విషయంలో సీపీఎం పార్టీ మొదటి నుండి నిర్వాసితులకు మద్దతుగా నిలబడి పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలు..నిరసనలతో ప్రభుత్వంపై వత్తిడి..నిర్వాసితుల ఆవేదనను తెలియచెప్పే ప్రయత్నం చేసింది. ఉద్యమం ఉధృతమౌతున్న సందర్భంలో పలు పార్టీలు మద్దతునిచ్చాయి. ఇదిలా ఉంటే మల్లన్న సాగర్ నిర్వాసితులపై టి.సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ స్పందించారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహారం ఇస్తామని ప్రకటించారు. రైతులు ఏ చట్టం ప్రకారం పరిహారం కోరుకుంటే ఆ ప్రకారమే నష్టపరిహాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మల్లన్న సాగర్ భూ సమీకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలకు అనుగుణంగానే పరిహారాన్ని అందిస్తామని ప్రకటించారు. భూసేకరణ విషయంలో ప్రస్తుతం రెండు చట్టాలున్నాయనీ....మొదటిది 2013 చట్టమయితే ..రెండోది 123 చట్టం అని కేసీఆర్ తెలిపారు. రైతులు ఏ చట్ట ప్రకారం కావాలంటే దాని ప్రకారమే పరిహారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా తమకు న్యాయం చేయాలంటూ 14 ముంపు గ్రామాల ప్రజలు నిరసన దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.

భూసేకరణలో జీవో ముఖ్యం కాదు...చట్టాలే ముఖ్యం: మల్లారెడ్డి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు నిపుణులు, విశ్లేషకులు స్పందించారు. టెన్ టివితో మాట్లాడారు. భూసేకరణ విషయంలో జీవో ముఖ్యం కాదని..చట్టాలు మాత్రం ముఖ్యమని రైతు సంఘం నేత మల్లారెడ్డి తెలిపారు. భూసేకరణకు ముందు భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చార్జీలన్నీ అప్ డేట్ చేయాల్సినవసరం ఉందన్నారు. రెండవది సోషల్ ఎకనమిక్ సర్వే జరపాలి..మూడవది భూసేకరణ జరగాలంటే 70శాతం రైతుల ఆమోదం వుండాలనేవి ముఖ్యమన్నారు. ప్రభుత్వం ఈ మూడింటినీ నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం వున్న వ్యాల్యూ ప్రకారం భూమికి వున్న విలువకు నాలుగు రెట్లుగా ఇవ్వాల్సిన అవసరముందన్నారు. మొదటిసారి భూసేకరణ చేసినప్పుడు సర్కార్ ఇవ్వన్ని ఆలోచన చేయకుండా భూసేకరణ ఎందుకు పూనుకుందని ఆయన ప్రశ్నించారు. ఒక కుటుంబాన్ని ఆ ప్రాంతం నుండి స్థానికరణ చేసినప్పుడు వారికి జీవనభృతి కల్పించటం న్యాయమని తెలిపారు. ఇప్పటికైనా 2013 చట్టాన్ని ప్రభుత్వం అమలు జరిపితే అందరికీ మంచిదని ఆయన పేర్కొన్నారు.

భూమి విలువపై హరీష్ రావు తప్పుడు ప్రచారం : జయరాజ్
మల్లన్న సాగర్ భూపోరాట కమిటీ కన్వీనర్ జయరాజ్ మాట్లాడుతూ...మల్లన సాగర్ ముంపు గ్రామాలలో ఎకరానికి రూ.60వేల భూమి విలువ వుందని మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారని..ఇది వాస్తవం కాదన్నారు. మొత్తం ముంపు గ్రామాలలో తాము పర్యటించి సర్వే చేసామన్నారు..ఇప్పుడు ప్రస్తుతం రూ.5.20 విలువ ఉందని.. ప్రస్తుతం దీనికి నాలుగు రెట్లు వుందని..దాని ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అధికారికంగా గ్రామాల్లోకి వచ్చి గ్రామస్థులతో మాట్లాడిన తరువాతనే ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్ళటానికి తాము ఒప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

13:45 - June 25, 2016

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో బంతిని బాదడమే కాదు..నృత్యాలు చేయడం కూడా చూశాం. తాజాగా అతడిలో మంచి సింగర్ కూడా దాగిఉన్నాడనే ఇటీవలే తెలిసింది. అవును కోహ్లీ తన గొంతుతో పాడి కనువిందు చేయబోతున్నాడు. ప్రీమియర్ ఫుట్సాల్ టోర్నీ అధికారిక గీతం కోసం విఖ్యాత సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన గీతానికి కోహ్లీ తన గళాన్ని వినిపించబోతున్నాడు. రెహమాన్ స్టూడియోలో పాట పాడుతూ తీసిన ఫోటోను సోషల్ మీడియాలో కోహ్లీ అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ టోర్నీకి కోహ్లీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మరి ఆ సాంగ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

మల్లన్న సాగర్ నిర్వాసితుల పోరాటంపై సీఎం కేసీఆర్ స్పందన..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ నిర్వాసితుల పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చింది. గత కొన్ని రోజులు తమకు న్యాయం చేయాలని మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసందే. రైతుల కోరుకున్న విధంగా పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 2013 భూ సేకరణ చట్టం, 123 జీవో ప్రకారం జీవో ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.

13:17 - June 25, 2016

ఒత్తిడి సమస్య పరిష్కారం కోసం బ్రాస్ లెట్ ఉపయోగించుకోవాలా ? అది ఒత్తిడిని దూరం చేస్తుందా ? అని నోరెళ్లబెడుతున్నారా ? కానీ ఇది నిజం అంట. ప్రస్తుతం శాస్త్ర సాంకేతికత ఎంతగానే అభివృద్ధి చెందుతోంది. వైవిధ్యమైన రకాల వస్తువులు మార్కెట్ లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి కోవలోకి చెందిందే ఈ బ్రాస్ లెట్..
ప్రతి ఇంట్లో..ఆఫీసు..ఎక్కడైనా వివాదాలు జరగడం మాములే. ఇన్ని గొడవల మధ్య బీపీ అమాంతం పెరిగిపోతుంటుంది. తీవ్రమైన వత్తిడిలో ఉంటే నరాలు తెగిపోతాయా అనే విధంగా ఉంటుంది. ఓ కంపెనీ దీనికి చెక్ పెట్టింది. 'వెల్ బీ' అనే బ్రాస్ లెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పూర్తిగా సెన్సార్ తో పనిచేస్తుందంట. కోపంగా ఉన్న సమయంలో వెల్ బీ యాప్ లో ఎంత వత్తిడది ఉందో మేసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఈ ఒత్తిడి నుండి దూరం కావడానికి ఎలాంటి జాగ్రత్తలు..సూచనలు పాటించాలో కూడా తెలియచేస్తుంది. ప్రతి మూడు నిమిషాలకొకసారి ఈ బ్రాస్ లెట్ చెక్ చేస్తుందంట.

చట్ట ప్రకారమే పరిహారం చెల్లిస్తాం - కేసీఆర్..

హైదరాబాద్ : రైతులు ఏ చట్ట ప్రకారం పరిహారం కావాలంటే ఆ చట్ట ప్రకారమే చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మల్లన్న సాగర్ భూసమీకరణ విషయంలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా పరిహారం అందచేయడం జరుగుతుందన్నారు. భూ సేకరణలో ప్రస్తుతం రెండు చట్టాలు అమల్లో ఉన్నాయని, మొదటగా తెచ్చింది 2013 చట్టం అని రెండోది 123 చట్టాలు అమలులో ఉన్నాయన్నారు. గత కొన్ని రోజులుగా మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

13:10 - June 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పెంచిన ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు..ఛార్జీలపేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నెత్తిన 1527 కోట్ల భారం వేశారని మండిపడ్డారు.ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు కోత పెట్టారని విమర్శించారు..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్యాయంగా విభజించారు - సీఎం బాబు..

గుంటూరు : రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు వారికి ఓ రాష్ట్రం కావాలని పొట్టిం శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, కట్టుబట్టలతో ఆనాడు కర్నూలుకు వచ్చామన్నారు. తరువాత ఏపీ రాష్ట్రానికి శ్రీకారం చుట్టారని బాబు తెలిపారు. 60 ఏళ్ల అనంతరం కట్టుబట్టలు..అప్పులతో ఇక్కడకు వచ్చామని, అందరికీ సమాన దూరంలో రాజధాని ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనపై నమ్మకంతో రైతులు 33వేల ఎకరాల భూమి ఇచ్చారని తెలిపారు.

12:58 - June 25, 2016

.గోదావరి : మిలటరీ మాధవరం..! ఈ పేరు వినగానే గ్రామం ప్రాముఖ్యత ఏంటో అర్థమైపోయింది కదూ..!! ఓ గ్రామం నుంచి ఒకరో ఇద్దరో యువకులు సైన్యంలో చేరితేనే ఓ విశేషం. కానీ మిలటరీ మాధవరం యువకులు.. పదులు.. వందలు కాదు.. ఏకంగా వేలాదిగా సైన్యంలో చేరారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొని గ్రామానికి యశస్సును సంపాదించారు. ఇంతకీ ఈ గ్రామ యువతకు సైన్యంపై మక్కువ ఎందుకు కలిగింది..? ఇన్ని వేల మంది సైన్యంలో చేరడానికి కారణమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

ఉగ్గుపాలతోనే కూ సైన్యంలో చేరాలనే కసి...
ఆ గ్రామంలో పుట్టే ప్రతి బిడ్డకూ సైన్యంలో చేరాలనే కసి ఉగ్గుపాలతోనే అలవడుతుంది....యుద్ధంలో అమరుల స్ఫూర్తి గ్రామ యువతను కర్తవ్యం వైపు నడిపిస్తుంది...గ్రామంలోని ప్రతి ఇంటి నుంచీ ఓ సైనికుడు దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూనే ఉంటాడు...ఆ ఊరే మాధవరం. కాదు కాదు.. మిలటరీ మాధవరం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని ఓ కుగ్రామం. ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. దాదాపు రెండు వేల మంది యువకుల్ని సగర్వంగా సైన్యంలోకి పంపిన ఇంతకీ మాధవరం గ్రామం నుంచి వేల మంది సైన్యంలో చేరడానికి కారణమేంటి..?

క్రీ.శ 17వ శతాబ్దంలో దక్కన్‌ ప్రాంతాన్ని పాలించిన  గజపతి వంశీయుడు రాజా పూసపాటి 
దీనికి ఘనమైన చరిత్రనే వినిపిస్తారు స్థానికులు. క్రీస్తుశకం 17వ శతాబ్దంలో దక్కన్‌ ప్రాంతాన్ని పాలించిన గజపతి వంశీయుడు రాజా పూసపాటి మాధవవర్మ.. తన రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడటం కోసం ఆరుగొలనులో ఓ కోటను నిర్మించి.. కోటకు ఆరు కిలోమీటర్ల దూరంలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారట. మాధవవర్మ ఏర్పాటు చేసిన సైనిక స్థావరమే.. కాలక్రమంలో గ్రామంగా రూపాంతరం చెందిందనీ.. మాధవవర్మ గ్రామం కాస్తా మాధవరంగా మారిందనీ స్థానికుల కథనం. గ్రామాన్ని నిర్మించిన తొలితరం వారంతా యుద్ధవీరులు... యుద్ధ విద్యల్లో ప్రవీణులు. దీంతో వారి వారసులు.. ఆ తర్వాతి తర్వాత తరాల వాళ్లు కూడా చిన్న నాటి నుంచే సైనిక శిక్షణలో ఆరితేరడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు.

వీరత్వాన్ని చాటుకుంటూన్న మాధవరం...
రాజ్యాలు పోయాయి. రాచరికం అంతరించింది. కానీ మాధవరం మాత్రం వీరత్వాన్ని చాటుకుంటూనే వస్తోంది. దేశానికి సైనికులను అందించడంలో ఇప్పటికీ ముందంజలోనే ఉంది. మాధవరానికి చెందిన దాదాపు 90 మంది యువకులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో హవాల్దార్‌ అంజన్న వీరమరణం పొందారు. రెండో ప్రపంచ యుద్ధంలో పదకొండు వందల మంది పాల్గొంటే.. అందులో 11 మంది వీరమరణం చెందారు. మరో 13 మంది సైనికులు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అన్ని యుద్ధాల్లోనూ ఈ మిలటరీ మాధవరం గ్రామానికి చెందిన సైనికులు..శత్రువులను సరిహద్దులు దాటకుండా తరిమికొట్టినవారే కావడం విశేషం.

అభివృద్ధికి ఆమడదూరంలో మాధవరం...
అదేం చిత్రమో.. దేశానికి వేల మంది సైనికులను అందించిన మాధవరం మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇప్పటికీ మాధవరానికి బస్సు సౌకర్యం లేదు. రోడ్లు, తాగునీటి వసతి, విద్య, వైద్య సౌకర్యాలు మృగ్యం. అయినా ఇక్కడి ప్రజల్లో దేశభక్తికి కొదవే లేదు. ప్రభుత్వాలు.. తమ ఊరికి ఎలాంటి సదుపాయాలూ కల్పించకున్నా గ్రామస్థులు చింతించరు. పైగా తమ పిల్లలను దేశసేవకు అంకితమివ్వడాన్ని గర్వంగా భావిస్తారు.

మాధవరానికి భారత్‌ డైనమిక్స్‌ స్థాయిలో గుర్తింపు...
రాష్ట్ర ప్రభుత్వం మాధవరాన్ని మరిచినా.. ఇండియన్‌ ఆర్మీ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ డైనమిక్స్‌ మాత్రం మాధవరం గ్రామాన్ని గుర్తించింది. గ్రామంలో సైనిక శిక్షణ అకాడమీని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేశ రక్షణకు సేవకులను అందిస్తున్న తమ గ్రామాన్ని... ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష మాధవరం వాసుల్లో వ్యక్తమవుతోంది.

 

ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం..

హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రాణహిత - చేవెళ్లలో 'సాంకేతిక మార్పులు - ఖర్చు తగ్గింపు' అనే అంశంపై చర్చించారు. జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. రిటైర్డ్ ఇంజినీర్ హనుమంతరావు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

తుళ్లూరులో బాబు పర్యటన...

గుంటూరు : తుళ్లూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన వారికి ప్లాట్లను కేటాయించనున్నారు. నేలపాడు రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్ల పంపిణీ జరగనుంది. కాసేపట్లో బాబు చేతుల మీద ఈ కార్యక్రమం జరగనుంది.

 

12:49 - June 25, 2016

హైదరాబాద్ : తెలంగాణా ప్రాజెక్టులలో సాంకేతిక మార్పులు, ఖర్చు తగ్గింపు అనే అంశంపై జస్టిస్‌ చంద్రకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం సోమాజిగూడలో జరుగుతోంది. రిటైర్డ్ ఇంజనీర్‌ టీ. హనుమంతరావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ ఇస్తున్నారు. మిగతా వివరాల కోసం ఈ వీడియోను చూడండి...

12:46 - June 25, 2016

గుంటూరు : అన్నా క్యాంటీన్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు.అనంతరం క్యాంటీన్ లో అల్పాహారాన్ని భుజించారు. వెలగపూడిలో అన్న క్యాంటిన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అన్న క్యాంటీన్లలో అల్పాహారం ఒక రూపాయి, భోజనం ఐదు రూపాయలకు లభించనున్నాయి. క్యాంటీన్లలో ఉదయం 7గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యహ్నాం 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం లభించనున్నాయి. అల్పాహార మెనూలో ఇడ్లీ, ఉప్మా ,పొంగల్, మధ్యాహ్న భోజనం మెనూలో పెరుగన్నం, పులిహోర, సాంబారు అన్నం, రాత్రి భోజనం మెనూలో 2 చపాతి, శాఖాహార కూర లభిస్తాయి. ప్రతీ రోజూ 500 మందికి అల్పాహారం, భోజనం అందేలా చర్యలు తీసుకోనున్నారు. క్యాంటీన్ ప్రారంభం అనంతరం చంద్రబాబునాయుడు క్యాంటిన్‌లో అల్పాహారం సేవించారు.

12:38 - June 25, 2016

కృష్ణా : మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో విజయవాడ కేంద్రంగా పౌరసరఫరాలశాఖ కార్యాలయాలు పనిచేస్తాయని మంత్రి పరటాల సునీత తెలిపారు. గొల్లపూడిలో ఏర్పాటు చేసిన పౌరసరఫరాలశాఖ కార్యాలయాన్ని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, కమిషనర్‌ జయలక్ష్మి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ... చిన్నపాటి ఇబ్బందులున్నా ఉద్యోగులంతా రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు చేరువగా వుండే మా శాఖ అధికారులు అంతా ఏపీకి తరలివచ్చారని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ప్రజలకు అతి చేరువలో వున్న శాఖ ఇక నుండి మా శాఖ కార్యక్రమాలు నిర్వహించటంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 27కల్లా నూతన పరిపాలన అందించాలనే నేపథ్యంలో గడువుకంటే ముందే తమ శాఖకు సంబంధించన అధికారులు, ఉద్యోగులు రావటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు - సీఎం బాబు..

గుంటూరు : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాత్కాలిక సచివాలయంలో అన్న క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం బాబు మీడియాతో మాట్లాడారు. పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు చాలా ముఖ్యమని, రాష్ట్రాభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల నిర్వాహణ చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందచేస్తామని తెలిపారు.

 

మహిళ మెడలో నుండి గొలుసు చోరీ..

హైదరాబాద్ : మీర్ పేట పీఎస్ పరిధిలోని బడంగ్ పేటలో మహిళ మెడలో నుండి గొలుసు అపహరణ. ఓ మహిళ మెడలో నుండి 4.5 తులాల బంగారు గొలుసును దుండగులు లాకెళ్లారు. దీంత సదరు మహిళ పీఎస్ లో ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. 

ఎక్సైజ్ అధికారులు తనిఖీలు..మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్...

హైదరాబాద్ : నగరంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భారీగా విదేశీ మద్యం పట్టివేత. రూ.కోటి 70 లక్షల విలువైన 7,255 మద్యం బాటిళ్లను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్, మంగళ్ హాట్, మీర్ చౌక, నారాయణ గూడలలో అధికారులు దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్సీతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మద్యాన్ని ఉక్రెయిన్ నుండి తరలించి నగరంలో విక్రయిస్తున్నట్లు సమాచారం.

12:12 - June 25, 2016

ఛాంపియన్స్ లీగ్ టీ 20 టోర్నీ రద్దయ్యింది. అయితే దీని స్థానంలో మరో టోర్నీ తీసుకరావాలని బీసీసీఐ ప్రయత్నాలు చేసింది. ఈ కసరత్తు ముందడగు పడింది. సెప్టెంబర్ లో రెండు వారాల పాటు మినీ ఐపీఎల్ టోర్నీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ధర్మశాలలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇందులో 8 ఐపీఎల్ జట్లు పాల్గొనున్నాయి. సెప్టెంబర్ లో బీసీసీఐ మినీ ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోందని..భారతదేశంలో కాక విదేశాలలో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రెండు వారాల వ్యవధిలో టోర్నీని పూర్తి చేయడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. అమెరికా లేదా యూఏఈ లో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

ఇద్దరి మధ్య ఘర్షణ..ఒకరి మృతి...

హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆటోడ్రైవర్ నర్సింహులు, శ్రీను అనే ఇద్దరు మద్యం సేవించి ఇంటికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వాదన పెరిగి పరస్పరం ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శ్రీను చేతికి అందిన బండరాయితో నర్సింహులు తలపై బలంగా మోదటంతో నర్సింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

యాదాద్రిలో కాంగ్రెస్ నేతల నిరసన...

నల్లగొండ : పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అందులోభాగంగా శనివారం నల్గొండ జిల్లా యాదాద్రిలోని ప్రముఖ శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద ప్రభుత్వ తీరుకు నిరససగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు.

బాలుడిపై అధికారి లైంగిక వేధింపులు...

హైదరాబాద్ : అనాథ బాలలకు అండగా ఉండాల్సిన అధికారే వారి పాలిట దుర్మార్గుడిలా మారిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి కృష్ణ స్థానిక 3వ ఫేజ్‌లో ఉన్న సాయిసదన్ అనాథ శరణాలయం నుంచి ఓ మైనర్ బాలుడిని ఇంట్లో పని ఉందని తీసుకెళ్లాడు. అనంతరం బాలుడిపై ఆ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో.. కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం ఆయన్ను అరెస్ట్ చేశారు.

11:46 - June 25, 2016

బిగ్ బి..అమితాబ్ బచ్చన్..తన వయస్సుకు తగిన పాత్రలే కాకుండా ఇతర వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. పికు, తీన్, వజీర్..తదితర సినిమాల్లో వైవిధ్యంగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రయోగం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి 102 ఏళ్ల ముసలాడిగా అమితాబ్ కనిపించనున్నారు. ఉమేష్ శుక్లా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి '102 నాటౌట్' అనే నామకరణం కూడా చేసేశారు. ఈ సినిమా నవంబర్..డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ సినిమా విడదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్‌ మొత్తం సిద్దమైపోయిందని, సినిమా మొత్తం ముంబాయిలోనే చిత్రీకరిస్తామని శుక్లా పేర్కొన్నారు. అమితాబ్‌ 102 సంవత్సరాల వృద్ధుడి పాత్రలో కనిపిస్తారని, అమితాబ్‌కు కొడుకుగా పరమేష్‌ చేయనున్నాడని తెలిపారు. మరి 102 వృద్ధుడి వేషంలో అమితాబ్ ఎలా కనిపించనున్నారో చూడాలంటే చిత్రం విడదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

కలుషితాహారం తిని 55 మంది విద్యార్థులకు అస్వస్థత..

రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ శిక్షణా సంస్థలో కలుషితాహారం తిని 55 మంది విద్యార్థులకు అస్వస్థత. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

అన్నా క్యాంటీన్ ప్రారంభం..

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయంలో అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ క్యాంటిన్ కొనసాగనుంది. రూ. 5కే పులిహోర, ఇడ్లీ, సాంబార్ రైస్ అందించనున్నారు.

గోదావరిఖనిలో పది కొత్త బస్సుల ప్రారంభం..

కరీంనగర్ : జిల్లాలో మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో పది కొత్త బస్సులను వారు ప్రారంభించారు.

11:34 - June 25, 2016

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో ఈ యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇక యోగాలో పలువురు సీఎంలు..తారలు..అధికారులు పాల్గొన్నారు. కర్నాటకలో నిర్వహించిన యోగాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ నిర్వహించిన యోగా శిబిరంలో బాలీవుడ్ నటి బిపాస బసు పాల్గొంది. గంటన్నర పాటు యోగా జరిగింది. కానీ సిద్ధ రామయ్య ప్రభుత్వం యోగా చేసినందుకు బిపాసకు కోటిన్నర రూపాయలు చెల్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముంబై నుంచి ఆమె బెంగుళూరుకు రాకపోకలు..బెంగుళూరులో ఆమె బస కోసం...ఇలా డబ్బును వెదజల్లారని కథనాలు వెలువడుతున్నాయి. బిపాస బసు కాకుండా ఇతర నటీమణిలను పిలిస్తే బాగుండేదనని అనే సెటైర్స్ విసురుతున్నారంట.

అమరావతికి ఫైర్ డీజీ కార్యాలయం తరలింపు...

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలోని ఫైర్ డీజీ కార్యాలయాన్ని ఉన్నతాధికారులు అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రానికి తీరని నష్టం - సీపీఎం సీఆర్డీఏ కన్వీనర్..

విజయవాడ :రాజధాని నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం ఉంటుందని సీపీఎం సీఆర్డీఏ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీలకు భూములివ్వడం ప్రభుత్వం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుందని విమర్శించారు.

విశాఖలో ఏబీవీపీ నేతల అరెస్టు..

విశాఖపట్టణం : ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల దోపిడికి నిరసనగా జూనియర్ కాలేజీలను ఏబీవీపీ నాయకులు మూసివేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు.

 

11:15 - June 25, 2016

మెదక్ : వేములగట్టు..ప్రస్తుతం అక్కడ హృదయవిదాకర వాతావరణం నెలకొంది. ఎవరిని కదలించినా కన్నీళ్లే వస్తున్నాయి. తాము ఊరు నుండి వెళ్లమే వెళ్లమని గ్రామస్తులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. అక్కడి గ్రామస్తులు టెన్ టివితో తమ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎట్ల ఊరు వదిలి వెళుతం..ఇక్కడే ఉంటం..ఇక్కడే ఛస్తం..ఒక్క రైతు ఆత్మహత్య కాలేదు..రెండు పంటలు పండిస్తున్నం..ఇక్కడి నుండి గడ్డి తీసుకుని గజ్వేల్ అమ్మినం..తిండి..తిప్పలకు ఛావాల్సి వస్తుంది..' అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారని, రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని, మంత్రులు..అధికారులు ఇంతవరకు ఇక్కడకు రాలేదని పేర్కొన్నారు.
మరోవైపు..మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా మొదటి నుండి సీపీఎం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమం ఉధృతమౌతున్న దృష్ట్యా పలు పార్టీలు మద్దతు తెలియచేస్తున్నారు. అందులో భాగంగా టి.టిడిపి నేత రేవంత్ 48గంటల పాటు దీక్ష చేయనున్నారు. వేములగట్టును తొలుత రేవంత్ సందర్శించనున్నారు. అక్కడ నిర్వాసితులతో మాట్లాడనున్నారు. అనంతరం ఏటిగడ్డ కిష్టాపూర్ దీక్షా స్థలికి చేరుకోనున్నారు. తరువాత దీక్ష చేపట్టనున్నారు.

11:06 - June 25, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతు టి.టిడిపి మద్దతు తెలిపింది. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు టి.టిడిపి నేత రేవంత్ దీక్ష చేపట్టారు. కొద్దిసేపటి క్రితం మల్లన్న సాగర్ ప్రాజెక్టు దీక్షా స్థలికి బయలుదేరి వెళ్లారు. అంతకంటే ముందు జూబ్లిహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. అప్పుల ఊబిలో ఇరుక్కపోయిన రైతులను టి.సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అంతా మంచిగానే ఉందని..బంగారు తెలంగాణ వచ్చినట్లుగా భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఏ గ్రామాల్లో జీవించామో..చట్ట ప్రకారం కనీసం న్యాయం చేయాలని నిర్వాసితులు వంద రోజులుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దీనికి ప్రతిపక్షాలు..ఉద్యమ సంఘాలు..చివరకు ప్రొ. కోదండరాం మద్దతు తెలిపారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అరెస్టు..

హైదరాబాద్ : కేపీహెచ్ బీలో బాలుడిని లైంగికంగా వేధించిన రంగారెడ్డి జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.

రాజధాని ప్రాంతంలో సీఎం బాబు పర్యటన..

గుంటూరు :రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వెంకటపాలెంలో సీడ్ యాక్సిస్ రోడ్ ను శంకుస్థాపన చేశారు. రూ. 215 కోట్లతో ఆరు వరుసల రహదారి నిర్మాణం కానుంది.

 

కుల్కచర్లలో అక్రమ నిర్మాణాల తొలగింపు..

రంగారెడ్డి : కుల్కచర్లలో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

10:32 - June 25, 2016

అల్లు అర్జున్...సరైనోడు హిట్ అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం కుటంబ కథా చిత్రంగా ఉంటుందని టాక్. బన్నీ ఇమేజ్ కు..బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథను హరీష్ రెడీ చేశారని దిల్ రాజు పేర్కొన్నారు. ఏడేండ్ల అనంతరం తమ బ్యానర్ లో బన్నీ నటిస్తున్నాడని, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం తరువాత హరీష్ శంకర్ తో ఈ చిత్రం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. భారీ బడ్జెట్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుందని, ఆగస్టు - సెప్టెంబర్ లో సినిమాను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. తమ బ్యానర్ లో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ గా చిత్రం నిలుస్తుందనే నమ్మకం ఉందన్నారు.

10:31 - June 25, 2016

బాలీవుడ్ చిత్రాల్లో హీరోలు ప్రయోగాలు చేస్తుంటారు. తమ ఇమేజ్ ను పక్కన బెట్టి పలు పాత్రలు పోషిస్తూ అభిమానులు..విమర్శకుల ప్రశంసలు పొందుతుంటారు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి ప్రయోగాలకు కొంతమంది హీరోలు దూరంగా ఉంటుంటారు. కానీ యువ హీరో 'రామ్' ఓ పాత్ర పోషించడానికి ముందుకొచ్చాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ అంధుడిగా నటించబోతున్నారు. తన కెరీర్ లో 15వ చిత్రంగా రూపొందబోయే చిత్రంలో అంధుడిగా రామ్ నటిస్తుండడం అభినందనీమయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీమ్ విజయంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, రామ్ తో తన చిత్రం ఉంటుందని అనీల్ రావిపూడి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ ఆందోళన..

మహబూబ్ నగర్ : పెంచిన విద్యుత్, బస్సు ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ వనపర్తిలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద ఈ ఆందోళన జరిగింది. ఎమ్మెల్యే చిన్నారెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

 

10:24 - June 25, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని టి.టిడిపి నేత రేవంత్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన ఏటిగడ్డ కిష్టాపూర్ లో 48గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన దీక్షా స్థలికి బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడారు. మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వాన్ని నిలదీయాలనే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో మార్పు రాలేదని, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చుస్తుంటే గొంతెత్తి ఎవరూ ప్రశ్నించడం లేదని, ఈ వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించారని తెలిపారు. రాష్ట్రంలో అంతా మంచిగానే ఉందని..బంగారు తెలంగాణ వచ్చినట్లుగా భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. 25వేల మందిని..21వేల ఎకరాలను ముంచడానికి ప్రభుత్వం ముందుకొస్తే మునగడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు పేర్కొన్నారని తెలిపారు. కానీ ఏ గ్రామాల్లో జీవించామో..చట్ట ప్రకారం కనీసం న్యాయం చేయాలని వారు వంద రోజులుగా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దీనికి ప్రతిపక్షాలు..ఉద్యమ సంఘాలు..చివరకు ప్రొ. కోదండరాం మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కార్ స్పందించడం లేదని, రెచ్చగొట్టే విధంగా మంత్రి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్..హరీష్ ఒంటెద్దు పోకడలు - రేవంత్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు ఒంటెద్దుపోకడలకు పోతున్నారని టిటిడిపి నేత రేవంత్ వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన ఎట్టిగడ్డ కిష్టాపూర్ లో 48 గంటల దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీవోలు చట్టానికి అనుగుణంగా ఉండాలి కానీ ప్రభుత్వానికి కాదని తెలిపారు. రైతులకు న్యాయం చేయమంటే ఆంధ్రాతొత్తులంటారా ? అని ప్రశ్నించారు. జస్టిస్ చంద్రకుమార్ కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ సేకరణ సరికాదని చెప్పారని గుర్తు చేశారు. అలాగే ప్రొ. కోదండరాం కూడా అండగా ఉన్నారని తెలిపారు.

ఇబ్రహీంపట్నంలో గంజాయి స్వాధీనం..

రంగారెడ్డి : జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ సమీపంలో భారీగా గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనలో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టుబడ్డ గంజాయి 1500 కిలోలు ఉన్నట్లు సమాచారం.

నిమ్స్ లో చుక్కా రామయ్య..

హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్తగా ఎదిగిన మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి తీవ్రమైన నడుము నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మిలీనియం బ్లాకులో ఆయనను అడ్మిట్ చేసుకున్న వైద్యులు ఆయనకు చికిత్స అందజేస్తున్నారు.

09:54 - June 25, 2016

నోటి పళ్లు మెరవాలని చాలా మంది డైంటిస్టులు..ఇతరత్రా వాటిని ఉపయోగిస్తుంటారు. పళ్ల ఎనామిల్ పై ప్రభావం చూపే వాటిని తీసుకోవడం వల్ల పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. పళ్ల ఎనామిల్ పై ప్రభావం పడే కొద్ది పళ్లు సున్నితంగా మారిపోయి కొన్ని పదార్థాలు తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. బాగా వేడిగా లేదా అతి చల్లగా ఉన్న వాటిని కొరకడం వల్ల దంతాల అడుగున బీటలు పడుతాయి. పైగా పళ్లపై ఒత్తిడి పడుతుంది. బయటి వస్తువు ఏదైనా సరే నోట్లో పెట్టుకావాలనుకోవడం సరైన పది కాదని వైద్యులు పేర్కొంటున్నారు. వాటికున్న బ్యాక్టరీయా నోట్లో చేరి పళ్లపై..చిగుళ్లపై ప్రభావం చూపుతుందంట. మరి పళ్లు ముత్యాల్లా మెరవాలంటే..యాపిల్, ఆకుపచ్చని ద్రాక్ష, క్యారెట్, అరటిపండ్లు తరచూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

09:54 - June 25, 2016

అవును మనస్సు ఉల్లాసానికి..ఆనందానికి ఆహారం పాత్ర కూడా ఎంతో ఉంది. మూడ్ బాగోలేదని కాఫీ..టీ..ఇతరత్రా వాటిని సేవిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటుంటారు. ఇలాంటివి కాసేపు మాత్రమే ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మూడ్ ని మార్చేస్తుంటాయి. వాటిపై ఓ లుక్కేయండి.
ఇష్టమైన పండ్లు తినడం వల్ల మూడ్ వెంటనే మారిపోతుంది. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. అంతేగాకుండా ఆరోగ్యానికి సంబంధించే విటమిన్లు, ప్రొటిన్లు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి.
ఆకుపచ్చని కూరగాయలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవాలి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ కె., ఎ క్యాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
ఒత్తిడిని తగ్గించడంలో డ్రై ప్రూట్స్ పాత్ర అధికంగా ఉంటుంది. బాదంపప్పు తినడం వల్ల చెడు కొలొస్ట్రాల్ తగ్గుతుంది. అంతేగాకుండా ఇందులో ఉండే ఒలియిక్ ఆమ్లం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.
శరీరానికి అవసరమైన ప్రొటిన్లు..విటమిన్లు అందించడంలో గుడ్లు ఎంతగానే ఉపయోగపడుతాయి. డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఇవి తినాలి. బయట లభించే ఫాస్ట్ ఫుడ్స్ కన్నా ప్రతి రోజు స్నాక్ లా ఉడకపెట్టిన గుడ్డు తినడం చాలా మంచిది.
చేపలు తినడం వల్ల కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. శరీరానికి అవసరమైన ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, కొవ్వున్న పదార్థాలు ఎంతో ఉపయోగపడుతాయి.

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి..

రంగారెడ్డి : శంషాబాద్ ఓఆర్ఆర్ పై లారీ - టాటాఎస్ లు ఢీకొన్నాయి. ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

09:25 - June 25, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతికి రానున్నారు. కీలక ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చంద్రబాబు ముందుగా అమరావతికి దారితీసే స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్‌కు శంకుస్థాపన చేస్తారు. కనకదుర్గ వారధి నుంచి బోరుపాలెం వరకు నిర్మిస్తున్నఈ రోడ్డుకు.. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వెంకటపాలెంలో పనులు ప్రారంభిస్తారు. మొత్తం 22.5 కి.మీ. పొడవున 560 కోట్ల రూపాయలతో చేపడుతున్న స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్డును 9నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వెలగపూడిలో..
వెలగపూడిలోని తాత్కాలిక సచివాయం సమీపంలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. రాజధానికి తరలివస్తున్న ఉద్యోగులతోపాటు, కార్మికులకు ఇది అందుబాటులో ఉండనుంది. రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకే పులిహోర, పొంగల్‌ అందిస్తారు. దీనిని అక్షయ ప్రైవేటు ఏజెన్సీకి నిర్వాహణ కార్యక్రమాలు అప్పగించారు. రానున్న రోజుల్లో ఏ మేర సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.
తుళ్లూరులో..
తుళ్లూరు చేరుకుంటారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలు పంపిణీ చేస్తారు. నేలపాడులో భూ సమీకరణ ప్రారంభమైన దృష్ట్యా ముందుగా ఈ గ్రామ రైతులకే ప్లాట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

గొల్లపూడిలో పౌరసరఫరాల శాఖ కార్యాలయం ప్రారంభం..

విజయవాడ : గొల్లపూడిలో పౌర సరఫరాల శాఖ కార్యాలయాన్ని మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు.

09:11 - June 25, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఉద్యమం ఊపందుకొంటోంది. ఎట్లాంటి పరిస్థితుల్లో సాగర్ ప్రాజెక్టును చేపడుతుమాని చెబుతున్న సర్కార్ పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇక్కడి నుండి వదలివెళ్లేది లేదని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల 14 గ్రామాలు ముంపునకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఏటిగడ్డ కిష్టాపూర్, తదితర గ్రామాల్లో గ్రామస్తులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి నుండి సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించి పోరాటాలు నిర్వహిస్తోంది. ఉద్యమం ఉధృతమౌతున్న సందర్భంలో పలు పార్టీలు వీరికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆందోళనకు మద్దతు తెలిపారు. అంతేగాక దీక్ష చేపట్టారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి గ్రామస్తుల ఆవేదన తెలుసుకొనే ప్రయత్నం చేసింది. మా ఊరు మాకే ఉండాలి..మా ఇళ్లు మాకే ఉండాలి అంటూ 14 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ లోని పెద్దమ్మ త‌ల్లి దేవాల‌యంలో పూజ‌లు నిర్వహించిన రేవంత్ మ‌ల్లన్న సాగ‌ర్‌కు బయలుదేరారు. రేవంత్ రెడ్డి దీక్షతో ప్రభుత్వం దిగి వ‌స్తుందా లేక వ్యూహాత్మకంగా రైతుల‌నే స‌మాధాన ప‌రుస్తుందో వేచిచూడాలి.

బీడు బారిన పొలంలో నీటి బుగ్గ...

ఖమ్మం : కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో పంట పొలంలో నీటి ఉబికిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. బీడు బారిన పొలంలో నీటి చెలమలు పుట్టడంతో దీనిని చూసేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. చుట్టు పంటచేలన్నీ బీడుగా ఉన్న మధ్యలో ఉన్న పొలంలో నీరు ఉబికిరావడాన్ని వింతగా చెబుతున్నారు. కొందరు మాత్రం ఇది దేవుడి సృష్టి అంటున్నారు.

08:48 - June 25, 2016

ఖమ్మం : కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో పంట పొలంలో నీటి ఉబికిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. బీడు బారిన పొలంలో నీటి చెలమలు పుట్టడంతో దీనిని చూసేందుకు పరిసర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. చుట్టు పంటచేలన్నీ బీడుగా ఉన్న మధ్యలో ఉన్న పొలంలో నీరు ఉబికిరావడాన్ని వింతగా చెబుతున్నారు. కొందరు మాత్రం ఇది దేవుడి సృష్టి అంటున్నారు.

08:45 - June 25, 2016

కడప : జిల్లాలో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రొటోకాల్ గొడవ తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంలేదని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడు పిలిచి మరీ అవమానిస్తున్నారని మండిపడుతోంది. జిల్లాలో టీడీపీ నేతలకు ఇచ్చిన గౌరవం..స్థానిక శాసనసభ్యులకు అధికారులు ఇవ్వడంలేదని ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

ప్రోటో కాల్ పై వైసీపీ మండిపాటు...
కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకున్నాయి. తాజాగా అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రోటోకాల్‌ రగడ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల జరిగిన ఏరువాక కార్యక్రమానికి తనను పిలిచి అవమానించారని మైదుకూరు వైసీపీ శాసనసభ్యులు రఘురామి రెడ్డి అధికారుల మీద తిట్ల పురాణం అందుకున్నారు. గ్రామాల్లోకి వస్తే జనాలతో కొట్టిస్తా..అంటూ అధికారుల మీద విరుచుకుపడ్డారు. దీంతో అధికారులు రఘురామిరెడ్డి మీద కేసులు పెట్టారు. దీనికి ప్రతిస్పందనగా జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రొటోకాల్ పాటించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదంతా అధికార పార్టీ నేతలు తమను అవమానించడానికే చేస్తున్నారన్నది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇరు వర్గాల మధ్య ఇరకాటంలో పడుతున్న అధికారులు..
ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలకు తమను ఆహ్వనించకపోవడం పట్ల ఆక్షేపించిన వైసీపీ.. ఇప్పుడు పిలిచి మరీ అవమానించండం పట్ల అగ్గి మీద గుగ్గిలమవుతోంది. స్థానిక శాసన సభ్యులను కాదని..టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలు అధికారులతో రివ్యూ నిర్వహించడంపై మండిపడుతున్నారు. మరోవైపు అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టి నడుమ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యింది. అధికార పార్టీ నేతల మాట వింటే ఒక సమస్య.. వినకపోతే మరో సమస్య అంటూ అధికారులు వాపోతున్నారు. ఇరు పార్టీల నడుమ తాము నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు

08:40 - June 25, 2016

మెదక్ : మ‌ల్లన్నసాగ‌ర్ ముంపు భాదితుల‌కు మ‌ద్దతుగా ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన ఏటిగడ్డక్రిష్టాపూర్ లో టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి కాసేపట్లో దీక్ష చేపట్టబోతున్నారు.. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు మద్దతుగా ఈ నిరసనకు దిగారు.. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్రకారం నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని రేవంత్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

దీక్షకు రెడీ అవుతున్న రేవంత్...
మ‌ల్లన్న సాగ‌ర్ ముంపు బాధితుల ప‌క్షాన పోరాడేందుకు టిడిపి రెడీ అయ్యింది. గ‌త కొంత కాలంగా ప్రభుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా స్ధానికులు దీక్షలు చేస్తున్నారు. ముంపు బాధితులకు మ‌ద్దతుగా శనివారం నుంచి రేవంత్ రెడ్డి మెద‌క్ జిల్లా ఏటిగ‌డ్డ కిష్టాపూర్‌ లో దీక్షకు దిగనున్నారు. ఇప్పటికే మ‌ల్లన్న సాగ‌ర్ వెళ్ళి స్థానిక దీక్షలకు మ‌ద్దతు ప‌లికిన రేవంత్ ప్రభుత్వానికి 15రోజుల స‌మ‌యం ఇచ్చారు. ప్రభుత్వం నుండి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆయ‌న రెండు రోజుల దీక్షకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ లోని పెద్దమ్మ త‌ల్లి దేవాల‌యంలో పూజ‌లు నిర్వహించి మ‌ల్లన్న సాగ‌ర్‌కు వెళ్ళి రెండురోజ‌ల పాటు దీక్షకు దిగ‌నున్నారు. శ‌నివారం ఉద‌యం ప్రారంభం అయ్యే రేవంత్ రెడ్డి దీక్షతో ప్రభుత్వం దిగి వ‌స్తుందా లేక వ్యూహాత్మకంగా రైతుల‌నే స‌మాధాన ప‌రుస్తుందో వేచిచూడాలి.

కాసేపట్లో దీక్ష చేపట్టనున్న రేవంత్ రెడ్డి...

మెదక్ : మ‌ల్లన్నసాగ‌ర్ ముంపు భాదితుల‌కు మ‌ద్దతుగా ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన ఏటిగడ్డక్రిష్టాపూర్ లో టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి కాసేపట్లో దీక్ష చేపట్టబోతున్నారు.. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు మద్దతుగా ఈ నిరసనకు దిగారు.. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్రకారం నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని రేవంత్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

08:32 - June 25, 2016

హైదరాబాద్ : బుల్లితెర నటుడు భరణి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయాడు.. హైదరాబాద్‌ జూబిలీహిల్స్‌ ప్రశ్యాసన్‌ నగర్‌లో పోలీసులు తనిఖీలు జరిపారు.. అటువైపునుంచి ప్రయాణిస్తున్న భరణిని బ్రీత్‌ ఎలైజర్‌తో పరీక్షించారు.. 41శాతం మద్యం మోతాదుఉన్నట్లు ఈ పరీక్షద్వారా నిర్ధారణ అయింది.. ఈ నటుపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్‌ చేశారు.

08:29 - June 25, 2016

హైదరాబాద్ : సికిందరాబాద్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.. ఈ తనిఖీల్లో భారీగా స్టీలు, ఇత్తడి సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. తుకారంగేట్‌ పరిధిలోని మాంగరోడిబస్తీలో పలు అనుమానస్పద ఇళ్లను పోలీసులు తనిఖీచేశారు. దాదాపు 420 మంది పోలీసులు బస్తీని జల్లెడపట్టారు. పట్టుబడిన సామాన్లను రెండు డీసీఎంలలో తరలించారు. వీటితోపాటు 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఇళ్లకు సరైన ధృవీకరణ పత్రాలు లేవని ఈ తనిఖీల్లో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. గతంలో జరిగిన సెర్చ్ కు భిన్నంగా పోలీసులు ఈ సెర్చ్ నిర్వహించారు. బస్తీలో దొంగలు తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలకు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల పట్ల స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా వున్నవారికి కొంత ఇబ్బంది కలింగించినా... గతంలో పోలీసులు చేపట్టిన కార్డెన్ సెర్చ్ లో కొంతమంది చైన్ స్నాచర్లలను..కొంతమంది బాలకార్మికులకు విముక్తిని కలిగించినట్లు తెలుస్తోంది.

మచిలీపట్నంలో ఖాప్స్ కార్డన్ సెర్చ్...

కృష్ణా : మచిలీపట్నం నవీన్‌మిట్టల్‌ కాలనీలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నర్వహించారు. ఈ తనిఖీలో పోలీసులు 16 బైక్‌లు, 4 ఆటోలు, రెండుకార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పోలీసులు తెలిపారు.

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు..

హైదరాబాద్‌: రంగారెడ్డి, హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం చల్లబడింది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు తగ్గింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పాలకుర్తి(వరంగల్‌)లో 12, మంథని(కరీంనగర్‌)లో 11, గుండాల, కొణిజర్ల, అశ్వారావుపేట(ఖమ్మం)లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఆగస్టు 1 నుంచి గ్రేటర్‌లో ప్లాస్టిక్ నిషేధం : బొంతు

హైదరాబాద్‌ : పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోన్న ప్లాస్టిక్‌ కవర్ల వినియో గంపై నిషేధాన్ని ఆగస్టు 1 నుంచి గ్రేటర్‌లో కచ్చితంగా అమలు చేస్తామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం 50 మైక్రాన్లలోపు కవర్లు వాడితే జరిమానా విధిస్తామని, అయినా వైఖరి మార్చుకోకుంటే దుకాణాలూ సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్‌ కవర్ల ఉత్పత్తిదారులు, వ్యాపారులు, హోటల్స్‌, మాల్స్‌ ప్రతినిధులతో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

జంటనగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు...

హైదరాబాద్‌ : శాంతి భద్రతల దృష్ట్యా జంటనగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ చట్టం సెక్షన్‌ 22(1)(ఎ), 22(2)(ఎ) ప్రకారం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎం. మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి జూలై 2వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలు, సచివాలయం, జీహెచ్‌ఎంసీ, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్‌, నాంపల్లి, ఎన్టీఆర్‌ మార్గ్‌ పరిసరాల్లో అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించరాదన్నారు.

కార్డన్ సెర్చ్ పై స్థానికుల ఆగ్రహం...

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని తుకారాంగేట్ మంగోర్‌బస్తీలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఇళ్లలోని సామాన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మంగోర్ బస్తీవాసుల పోలీసులతో వాగ్వాదానికి దాగారు. తము ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దర్నాకు దిగారు. దీంతో డీసీపీ సుమతి రంగంలోకి దిగి మంగోర్ బస్తీ వాసులకు సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కార్డన్ సెర్చ్‌లో పత్రాలు లేని 10 వాహనాలు, రెండు లారీల లోడ్ స్వాధీనం చేసుకున్నారు.

కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల దాడులు...

రంగారెడ్డి : హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారులు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 6 బస్సులపై కేసులు నమోదు చేశారు.

తుకారం గేట్ వద్ద పోలీసులు కార్డెన్ సెర్చ్...

హైదరాబాద్ : నగరంలో పోలీసుల నిర్భంధ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుకారం గేట్ వద్ద పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో ఈ తనిఖీలలో 300లమంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని చేపట్టారు. 300ల కార్లను సీజ్ చేశారు.

07:47 - June 25, 2016

యురోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 43 ఏళ్లుగా యూరోపియన్‌ యూనియన్‌లో కొనసాగుతున్న బ్రిటన్‌ ఆ కూటమి నుంచి విడిపోయేందుకే మొగ్గు చూపారు. గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 52 శాతం మంది, వ్యతిరేకంగా 48 శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో ఈయే నుంచి బ్రిటన్‌ వేరుపడటం ఖాయమైంది. ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఎటువంటి ప్రభావం చూపడనుంది అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. ఈ చర్చలో లక్ష్మీపార్వతి (వైసీపీ జన్ రల్ సెక్రటరీ),కుమార్(బీజేపీ నేత),ఆనంద్ బాబు (టీడీపీ ఎమ్మెల్యే), పాల్గొన్నారు. .....మరి వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాటంలే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారం తెలుసుకోండి....

07:38 - June 25, 2016

ఢిల్లీ : ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం బ్రెగ్జిట్‌ తరహా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. బ్రెగ్జిట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఢిల్లీలో పోలీసింగ్‌, భూవ్యవ‌హారాలు వంటి కీల‌క అంశాల నియంత్రణ కేంద్ర ప‌రిధిలోనే ఉంది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోసం ఆప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర హోదా వ‌ల్ల ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి. గ‌తంలో బీజేపీ కూడా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కోసం డిమాండ్ చేసినా గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టో నుంచి దాన్ని తొల‌గించింది.

07:35 - June 25, 2016

హైదరాబాద్ : రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు కొత్త రుణాలు వెంటనే ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. రుణవిముక్తి పత్రాలు ఇవ్వని దాదాపు 12 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది...లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు 12 నెలలకు వడ్డీ తీసుకోవద్దని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్యాంకులకు ఆదేశించారు....

కొత్త రుణాలను మంజూరు చేయాలని బ్యాంకులకు ఆదేశం ...
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు రుణాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని బ్యాంకర్లను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రైతుల రుణాలు, వడ్డీమాఫీ, కొత్త రుణాల జారీపై చర్చించారు. రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రెండు విడతల మొత్తాన్ని విడుదల చేశామని, మూడో విడతలో సగం మొత్తాన్ని త్వరలోనే ఇస్తామని బ్యాంకర్లకు తెలిపారు. అయితే రైతుల రుణమాఫీకి సంబంధించి వారిని ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ జరిగినట్లు రుణవిముక్తి పత్రాలు ఫామ్-ఎఫ్ రైతులందరికీ జారీ చేయాలన్నారు. ఇప్పటికే చాలా మంది రైతులకు ఈ పత్రాలు ఇచ్చామని మరో 12 లక్షల మందికి ఇవ్వాలన్నారు. గతేడాది సాగు కోసం లక్ష రూపాయల వరకు తీసుకున్న రుణాలను ఏడాది లోపు చెల్లిస్తే....వాటికి ఎలాంటి వడ్డీ తీసుకోవద్దని బ్యాంకర్లను మంత్రి కోరారు. లక్ష నుంచి మూడు లక్షల వరకు రూపాయల రుణం తీసుకుంటే మాత్రం దానికి పావలా వడ్డీ చెల్లించాలని రైతులను కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4,34,340 మంది రైతులకు రుణమాఫీ...
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి రైతుల కోసం చెల్లించిన ప్రీమియాన్ని వెంటనే బీమా కంపెనీలకు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని మంత్రి పోచారం ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 34 వేల 340 మంది రైతులకు రుణమాఫీ మొత్తాన్ని 2 వేల 340 కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకులకు అందించామన్నారు. మిగిలిన మొత్తంతో సంబంధం లేకుండా రుణవిముక్తి పత్రాలు ఇవ్వాలని, కొత్త రుణాలను మంజూరు చేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది 53 వేల మంది రైతులు తాము వేసిన పత్తి పంటకు బీమా చెల్లించారన్నారు. అయితే బీమా ప్రీమియం చెల్లింపునకు సంబంధించిన డెడ్ లైన్ తాము విధించలేదని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందన్నారు. అదే విధంగా జూన్ 14వ తేదీలోపు తీసుకున్న పత్తి రైతుల డీడీలను ఇప్పుడు గడువు ముగిసిన తర్వాత కూడా అంగీకరించాలని చెప్పామని, బ్యాంకులు ఒప్పుకున్నాయని తెలిపారు. బ్యాంకులు అంగీకరించిన అంశాలన్నింటిని కింది బ్యాంకు అధికారులకు రాతపూర్వకంగా పంపాలని మంత్రి పోచారం ఆదేశించారు. తెలంగాణలో వర్షాలు ముఖం చాటేయంతో రైతులు ఇప్పుడే విత్తనాలు వేయవద్దని, కనీసం 60 నుంచి 70 మిల్లిమీటర్ల వర్షపాతం తర్వాతే విత్తనాలు వేయాలని మంత్రి రైతులను కోరారు. విత్తనాల సమయం మించిపోలేదన్నారు.  

07:26 - June 25, 2016

విజయవాడ : ఏపీలో ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. 273 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది... పెంచిన ఫీజులు మూడేళ్ల వరకు అమలు కానున్నాయి. గరిష్టంగా ఫీజు లక్ష ఎనిమిది వేలు, కనిష్టంగా 35 వేలను నిర్థారించారు. ఎంటెక్‌ ఫీజు గరిష్టంగా లక్ష రూపాయలు, కనిష్ట ఫీజు 45 వేలుగా ఖరారు చేశారు. అత్యధికంగా ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజీకీ ఫీజు లక్ష ఎనిమిది వేలుగా నిర్థారించారు. ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆన్‌లైన్‌లో పెంచిన ఫీజుల వివరాలు ఉంటాయి. 

ఏపీలో భారీగా ఇంజనీరింగ్ ఫీజులు ...

విజయవాడ : ఏపీలో ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. 273 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది... పెంచిన ఫీజులు మూడేళ్ల వరకు అమలు కానున్నాయి. గరిష్టంగా ఫీజు లక్ష ఎనిమిది వేలు, కనిష్టంగా 35 వేలను నిర్థారించారు. ఎంటెక్‌ ఫీజు గరిష్టంగా లక్ష రూపాయలు, కనిష్ట ఫీజు 45 వేలుగా ఖరారు చేశారు. అత్యధికంగా ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజీకీ ఫీజు లక్ష ఎనిమిది వేలుగా నిర్థారించారు. ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆన్‌లైన్‌లో పెంచిన ఫీజుల వివరాలు ఉంటాయి. 

07:23 - June 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌, ఆర్టీసి చార్జీలు పెంచ‌డంపై టీ కాంగ్రెస్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వ‌స్తే..చార్జీలను పెంచ‌నన్న కేసీఆర్..ఇప్పుడు ఛార్జీల‌తో ప్రజలపై భారం మోపుతున్నార‌ని మండిప‌డింది హ‌స్తంపార్టీ. ప్రభుత్వం తీరును నిర‌సిస్తూ..రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌తో హోరెత్తించాల‌ని క్యాడ‌ర్‌కు పిలుపునిచ్చింది.

క‌రెంట్, ఆర్టీసి ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ఫైర్...
తెలంగాణ ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్‌కు మ‌రో అస్త్రం దొరికింది. క‌రెంట్, ఆర్టీసీ చార్జీల‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. అధికారంలోకి వ‌స్తే.. ఎలాంటి చార్జీలు పెంచ‌మ‌ని చెప్పిన కేసీఆర్,.క‌రెంట్, ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచి ప్రజ‌ల‌పై భారం మోపుతున్నార‌ని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంద‌ని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న సీఎం..ఇప్పుడు ప్రజలపై చార్జీల భారం ఎందుకు మోపారని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ల వద్ద క‌మీష‌న్ కోసమే ప్రాజెక్టుల అంచ‌నాల‌ను పెంచుతు ప్రభుత్వమే దోపిడి చేస్తుంద‌ని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. పెంచిన ఛార్జీల‌ను వెంటనే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ధ‌ర్నా....
కేసీఆర్ ప్రభుత్వం ధ‌న‌వంతుల‌కు, కాంట్రాక్టర్లకు, వ్యాపారుల‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. క‌రెంట్, ఆర్టీసీ ఛార్జీల‌తో 1800 కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతుంద‌ని మండిప‌డుతున్నారు. ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోస‌మే ఇన్నాళ్ళు చార్జీల‌ను పెంచ‌లేద‌ని..దీంతో ఇప్పుడు కేసీఆర్ నిజ‌స్వరూపం బయటపడిందని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ప్రభుత్వం చార్జీలు పెంచ‌డానికి నిర‌స‌న‌గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధ‌ర్నాల‌కు దిగాల‌ని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అంతేకాదు పెంచిన ధరలను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల‌ని టీ కాంగ్రెస్‌ భావిస్తోంది. దీనికోసం అవ‌స‌ర‌మైతే మిగ‌తా ప‌క్షాల‌తో క‌లిసి ఉమ్మడి కార్యాచ‌ర‌ణ‌కు సిద్దమని ప్రకటించింది కాంగ్రెస్. 

07:11 - June 25, 2016

విశాఖ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ సిటీ తొలి అంచె ఇవాళ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో తొలి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబునాయుడు అంకురార్పణ చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని పనులను సీఎం ప్రారంభించనున్నారు.

అనేక అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.స్మార్ట్ సిటీ తొలి అంచె ప్రారంభంతో పాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏ పనిచేసినా వెంటనే ఫలితాలు రావాలి. ప్రజలు ఆ ఫలాల్ని ఆస్వాదించాలి. స్మార్ట్‌సిటీ ప్రారంభ సూచకంగా ఇలాంటి పనుల్నే ఎంపికచేయమని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండ్రోజుల నుంచి విశాఖపట్టణంలో జీవీఎంసీ అధికారులు ఏడు పనుల్ని ఎంపికచేశారు. నగరమంతటికీ వర్తించేలా ఒక పని.. ఆకర్షణీయ ప్రాజెక్టు ఎంపిక ప్రాంతంలో భాగంగా మరో ఆరు పనుల్ని అధికారులు గుర్తించారు.

జీవీఎంసీలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు...
ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని కార్యాలయాల సమాచారం తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఒకే పేజీలో అన్ని శాఖలకు సంబంధించిన వివరాల్ని అందించేందుకు జీవీఎంసీలో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రారంభించే తొలి ప్రాజెక్ట్‌ ఇదే. కొంతమంది సిబ్బంది ద్వారా ఆయా శాఖలకు సంబంధించిన వివరాలన్నీ నమోదుచేసే బాధ్యతను ఈ కేంద్రం తీసుకుంటుంది. తొలివిడతగా జీవీఎంసీకి సంబంధించిన విభాగాల సమాచారమంతా అందుబాటులోకి తీసుకురానున్నారు. తర్వాత విడతల వారీగా అన్ని విభాగాల సమాచారాన్ని పొందుపరుస్తారు.

545 మందికి పక్కా ఇళ్లను మంజూరు...
అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెదజాలరిపేట వాసులకు పక్కా ఇళ్లు నిర్మించే పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ఇక్కడ సర్వే నిర్వహించారు. 545 మందికి పక్కా ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు వారి ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా అధికారులు పథక రచన చేస్తున్నారు. విద్యుత్తు వినియోగంలోనూ స్మార్ట్‌గా తయారవ్వాలనే ఉద్దేశంతో పైకప్పులపై సౌరవిద్యుత్తు పలకల్ని అమర్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే బీచ్‌లో డిజిటల్‌ రక్షణ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారు.

'స్మార్ట్‌ మీటరింగ్‌' కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం...
సమీకృత విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో భాగంగా నెలలో ఓ తారీఖు నిర్ణయిస్తే.. అదే తేదీనే కరెంటు బిల్లు వచ్చే విధానాన్ని అధికారులు రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక మీటర్లను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా 60 స్మార్ట్‌ మీటర్లు బిగించి..ఆ తర్వాత పథకాన్ని విస్తృతపరిచే 'స్మార్ట్‌ మీటరింగ్‌' కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు.

 

06:49 - June 25, 2016

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను శనివారమే నిర్వహించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించడంతో ఆగమేఘాల మీద పనులు చేస్తున్నారు.

పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.560 కోట్లలో 22.5 కి.మీ. రోడ్డు నిర్మాణం ..
చంద్రబాబు ముందుగా అమరావతికి దారితీసే స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్‌కు శంకుస్థాపన చేస్తారు. కనకదుర్గ వారధి నుంచి బోరుపాలెం వరకు నిర్మిస్తున్నఈ రోడ్డుకు.. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వెంకటపాలెంలో పనులు ప్రారంభిస్తారు. మొత్తం 22.5 కి.మీ. పొడవున 560 కోట్ల రూపాయలతో చేపడుతున్న స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్డును 9నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. కనకదుర్గ వారధి నుంచి అబ్బరాజుపాలెం వరకు 18.3 కి.మీ. మార్గాన్ని మొదటి ప్యాకేజీగా నిర్ణయించారు. రెండో ప్యాకేజీ 4.2 కి.మీ. రాజధాని ఉత్తర దక్షిణ ప్రాంతాలకు కలిపే ఈ రహదారిని బీఆర్‌టీఎస్‌కు అనుకూలంగా ఆరు వరుసలనతో చేట్టాలని నిర్ణయించారు. ముందుగా నాలుగు వరుసలతో చేపడతారు.

రాజధాని ప్రాంతంలో అన్నా క్యాంటీన్‌కు ప్రారంభోత్సవం..
స్పీడ్‌ యాక్సిస్‌ రోడ్డు శంకుస్థాపన తర్వాత వెలగపూడిలోని తాత్కాలిక సచివాయం సమీపంలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. రాజధానికి తరలివస్తున్న ఉద్యోగులతోపాటు, కార్మికులకు ఇది అందుబాటులో ఉంటుంది. రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకే పులిహోర, పొంగల్‌ అందిస్తారు. ఆతర్వాత తాత్కాలిక సచివాలయం పనులను పరిశీలిస్తారు. ఈ నెల 27 నాటికి పూర్తయ్యే బ్లాక్‌ల్లోకి అడుగుపెట్టే ఉద్యోగులు, మంత్రులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలు పంపిణీ ...
వెలగపూడిలో తాత్కాలిక సచివాయల నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత తుళ్లూరు చేరుకుంటారు. సీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలు పంపిణీ చేస్తారు. నేలపాడులో భూ సమీకరణ ప్రారంభమైన దృష్ట్యా ముందుగా ఈ గ్రామ రైతులకే ప్లాట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడ్డ నటుడు..

హైదరాబాద్ : బూబ్లీహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో బుల్లితెర నటుడు భరణి పట్టుపడ్డాడు. భరణి  కారు సీజ్ చేసి..జరిమానా విధించారు.

అమరావతిలో 'బాబు'పర్యటన..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

లారీ -టాటా ఏస్ వాహనం ఢీ..ఇద్దరు మృతి...

రంగారెడ్డి: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని ఓ లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందినవారు మెదక్ జిల్లా సంగారెడ్డి వాసులు గుర్తించారు.

Don't Miss