Activities calendar

26 June 2016

23:20 - June 26, 2016
23:04 - June 26, 2016
22:36 - June 26, 2016

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. చికుమగళూర్‌లో  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను బహిరంగ వేదికపైనే ఓ మహిళ ముద్దుపెట్టుకుంది. అంత బహిరంగంగా మహిళ ముద్దుపెట్టుకుంటుంటే సిద్దరామయ్య ఏ మాత్రం వారించలేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. చికుమగళూర్‌ జిల్లాలోని స్వయానా ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య నియోజకవర్గంలోని ఓ పంచాయతీ సభ్యురాలైన గిరిజా అనే మహిళ సీఎంను బహిరంగంగా ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఆయన నా తండ్రి లాంటి వారని, తొలిసారి ఆయన్ను కలిసిన ఆనందంతో అలా చేశానని, ఇందులో తప్పేమీ లేదని గిరిజా చెప్పడం కొసమెరుపు.

 

22:27 - June 26, 2016

మెదక్ : గజ్వెల్‌లో తల్లుల కడుపుకోత కేసీఆర్‌కు కనిపించడంలేదా..? టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్‌ రెడ్డి రెండు రోజులు దీక్ష చేపట్టారు. ఇవాళ ఆయన దీక్ష విరమించారు. సీఎం కేసీఆర్‌ తీరుపై రేవంత్‌ మండిపడ్డారు. జనం గోడు సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని మండిపడ్డారు. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

 

22:16 - June 26, 2016

హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు నుంచి వివిధ అంశాంపై విరుచుకుపడ్డారు. ఫిరాయించిన  వివిధ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ శాసనసభ్యులుగా పరిగణిస్తూ.. స్పీకర్లు నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని  సుధాకర్‌రెడ్డి తప్పుపట్టారు. దేవరకొండ సీపీఐ... ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను మభ్యపెట్టి టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని సురవరం విమర్శించారు.

22:07 - June 26, 2016

విజయవాడ : సీఐటీయూ ఏపీ రాష్ట్ర 14వ మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు వరకు కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో 13 జిల్లాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ అనంతరం బీఆర్‌టీఎస్‌ రహదారిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌తో పాటు, అఖిలభారత సీఐటీయూ జాతీయ అధ్యక్షులు పద్మనాభన్‌, సీఐటీయూ రాష్ట్రప్రధరాన కార్యదర్శి గఫూర్‌, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మాణిక్‌ సర్కార్‌ మండిపాటు 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మాణిక్‌ సర్కార్‌ మండిపడ్డారు. మోదీ సర్కార్‌ విదేశీ పెట్టుబడుల పేరుతో స్వదేశీ సంస్థల అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ తీరుతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో విదేశీపెట్టుబడులు దేశానికి మంచిదికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. రక్షణ రంగంలో ఎఫ్ డిఐలకు అనుమతివ్వడం దారుణమని అన్నారు. మోదీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ పేదలను విస్మరిస్తోందని మండిపడ్డారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు : రాఘవులు 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబుకు సామాన్య ప్రజలు, కార్మికుల కష్టాలు కనపడడంలేదని రాఘవులు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రాఘవులు పిలుపునిచ్చారు. 
చంద్రబాబుపై గఫూర్ ఫైర్
అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలను పెంచమంటే పెంచని ప్రభుత్వం..ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలను మాత్రం లక్షల్లో పెంచిందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబుపై..అదే కార్మికులు తిరగబడితే ఏమౌతుందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీఐటీయూ, సీపీఎం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. సీఐటీయూ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ..పలు తీర్మానాలు చేయనున్నారు. 

 

22:00 - June 26, 2016

విజయవాడ : ఎపి సర్కార్ పై సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబుపై..అదే కార్మికులు తిరగబడితే ఏమౌతుందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. విజయవాడ సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలను పెంచమంటే పెంచని ప్రభుత్వం..ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలను మాత్రం లక్షల్లో పెంచిందని అన్నారు. 

 

21:53 - June 26, 2016

కామెడీ లెజెండ్ బాబుమోహన్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహిచింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తన సినీ కెరీర్ వివరించారు. సినిమా అనుభవాలను తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే... 'నేను గ్లామర్ బాయ్ ను కాదు.. హ్యాండ్ సమ్ గా లేను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. నో బ్యాక్ గ్రౌండ్,..నో రెకమెండేషన్. సినిమాల్లోకి వచ్చాక తహసీల్దార్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. చిత్ర సీమలో అన్ని చిత్రాలే. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. ఆఖరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. ఇంకా స్టామినా ఉంది.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

21:48 - June 26, 2016

తీగలాగితే డొంకంతా కదిలింది. ఒక మహిళ చేతిలో ఆరుగురు చనిపోయారు. ముగ్గురు ఆడవాళ్లు, ముగ్గురు మగవాళ్లు. వారిలో ముఖ్యులు ఒకరు ఆమె భర్త, మరొకరు పోలీసు ఆఫీసర్. ఇంతమందిని దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న బీహారీ మహిళ జగిని కోసం మన క్రైమ్ డిటెక్టివ్ టీం చాలా చోట్ల వెతుకుతున్నారు. ఇంతరీ ఆవిడ జాడా దొరికిందా..? మరి ఆమెను పట్టుకునే ప్లాన్ ఏమైనా చేశారా మనవాళ్లు... వరుస హత్యలకు అడ్డుకట్ట పడిందా..? మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం..

 

21:41 - June 26, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో ముస్లీల సంక్షేమం కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీ గ్రౌండ్‌లో సీఎం కేసీఆర్‌... ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ ఏడాది 120 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు. మైనార్టీల రిజర్వేషన్లకోసం కమిటీ వేశామని తెలిపారు. నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని... రిజర్వేషన్‌పై తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహ్మూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని హాజరయ్యారు..

 

21:26 - June 26, 2016

కర్నూలు : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లతో రాయలసీమ... మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఉప ముఖ్యమంత్రి కెఈ. కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఏరకమైన అనుమతులు లేవన్నారు. మరోవైపు రాష్ట్రానికి నిధులు కేటాయించే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని కేఈ విమర్శించారు. రాజధాని నిర్మాణానికి కేవలం వెయ్యికోట్ల రూపాయలు ఇచ్చి మోదీ ప్రభుత్వం చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయింపులోకూడా కేంద్రం వివక్ష చూపుతోందనిక కేఈ విమర్శించారు. 

21:22 - June 26, 2016
21:21 - June 26, 2016

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఎపి సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్‌ శక్తులకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా చేపట్టే ఆందోళనలను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. 

 

21:16 - June 26, 2016
21:14 - June 26, 2016

హైదరాబాద్ : తాపేశ్వరం లడ్డు ఖైరతాబాద్‌కు తరలించడంపై నెలకొన్న వివాదంపై సురుచి ఫుడ్స్‌ అధినేత పొలిశెట్టి మల్లిబాబు వివరణ ఇచ్చారు. లడ్డూ తయారీపై ఉత్సక కమిటీ ఇంతవరకు తమను సంప్రదించలేదని..ఈసారి కూడా స్వామివారికి తాము లడ్డూ తయారుచేసి సమర్పిస్తామన్నారు. ఒకవేళ కమిటీ తామే లడ్డూను తయారుచేసుకుంటామంటే..లడ్డూ తయారికి ముడిసరుకుల ఖర్చు కమిటీ భరిస్తే..తాము ఉచితంగా తయారుచేసి ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చుల్ని కూడా తామే భరించి లడ్డూను సమర్పిస్తామన్నారు. 

 

21:07 - June 26, 2016

ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరులో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగబిడ్డను కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు పసిబిడ్డను శిశుసంరక్షణ అధికారులకు అప్పగించగా, ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టిన బాబుకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అయ్యాయని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. గతంతో ఆడ పిల్లలను విడిచిపెట్టిన వెళ్ల సందర్భాలు ఉన్నాయని, ఇటీవల మగబిడ్డలను వదలి వెళ్లుతున్నవారి సంఖ్య పెరుగుతోదంని చెబుతున్నారు. 

 

21:02 - June 26, 2016

హైదరాబాద్ : న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు.. కేటాయింపులను నిరసిస్తూ 120మంది న్యాయవాదులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.. న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడికి రాజీనామా పత్రాలు సమర్పించారు.. గన్‌పార్క్‌నుంచి రాజ్‌భవన్‌వరకూ ర్యాలీ చేపట్టారు.. ర్యాలీ తర్వాత గవర్నర్‌కు రాజీనామా పత్రాలు అందజేయనున్నారు.

20:56 - June 26, 2016

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం పెంచిన బస్సు, విద్యుత్‌  చార్జీలను వెంటనే తగ్గించాలని, ప్రజలపై పెనుభారాన్ని తగ్గించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. టీ సర్కారు పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కరీంనగర్‌ బస్టాండ్‌లో బస్సు చార్జీలపై పెంపుపై అనుకూలమా, వ్యతిరేకమా అన్న అంశాలపై ఓటింగ్‌ నిర్వహించారు. 

20:47 - June 26, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఓ సన్నకారు రైతు బలయ్యాడు. అనేఖానిపల్లి తండాకు చెందిన పీర్యానాయక్‌కు ఎకరన్నర భూమి ఉంది. ఏడాదిన్నర క్రింత ఈ భూమిని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ భూ సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంది. వ్యవసాయం నిమిత్తం ఐదు లక్షలు అప్పు చేశాడు. ఇటు అప్పులు ఎలా తీర్చాలో తెలియక.. అటు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

మైనార్టీల రిజర్వేషన్ల కోసం కమిటీ : సీఎం

హైదరాబాద్ : మైనార్టీల రిజర్వేషన్ల కోసం కమిటీ వేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజాం కళాశాల గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన సీఎం మాట్లాడుతూ కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేసి.. ఢిల్లీకి పంపుతామని చెప్పారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ తోపాటు కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హాజరయ్యారు. 

 

టీ.ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్లార్ విందు ఏర్పాటు

హైదరాబాద్ : నిజాం కళాశాల గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్లార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హాజరయ్యారు. 

19:48 - June 26, 2016

విజయవాడ : ప్రాజెక్టులపై జగన్ అసత్యప్రచారం చేస్తున్నారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్ పర్సనాలిటీ డిసార్డర్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల కోసం రూ. 14700 కోట్లు ఖర్చు పెట్టామని.. దానిపై జగన్ చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. జగన్ అక్రమాలు.. ఆలోచనలేని నిర్ణయాల కారణంగానే వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారని మంత్రి అన్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

19:38 - June 26, 2016

బీజింగ్ : చైనాలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు.. టియాంజిన్‌ నగరంలో వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు.. ఈ భేటీ తర్వాత శ్రీలంక వాణిజ్య వ్యవహారాల మంత్రితో బాబు సమావేశం కానున్నారు.. చైనాలో ఏపీ సీఎం ఐదురోజులపాటు పర్యటించనున్నారు. 

 

19:00 - June 26, 2016

టాలీవుడ్ లో హాట్ హాట్ టాపిక్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం. వివి వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటికీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో ఆ అదృష్టం ఎవరిని వరించనుందనే చర్చపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ముందే అనుష్క, దీపిక, నయన్ ల పేరు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారనుకుంటున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి పేరు ముందుకు వచ్చింది. నర్గిస్ బాలీవుడ్ లో ఇప్పటికే అజహర్, హౌస్ ఫుల్ 3 లాంటి మూవీస్ లో బోల్డు క్యారక్టర్లు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యం చిరంజీవి సరసన ఈ భామ సూటవుతుందా? అనే సందేహం సహజంగానే వస్తుంది.

టాలీవుడ్ లో చిరంజీవి ఇమేజ్ కి నర్గీస్ షూట్ అవ్వదని, అలాగే ఏజ్ గ్యాప్ కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే అందరి హీరోయిన్ల మాధిరిగానే ఈ పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా ఫైనల్ కాలేదు కదా.. కాకపోవచ్చు కూడా అని కొంత మంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా చిరు 150 మూవీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో అని సినీలోకం వెయిట్ ఆతృతగా చేస్తోంది.  

18:39 - June 26, 2016

సూపర్ స్టార్ రజినీ కాంత్ హెల్త్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడనే వార్త ప్రసార మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకూ ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోలేని స్థితిలో ఉన్న సినీ ప్రేమికులకు, రజినీ అభిమానులను షాక్ కు గురి చేసే వార్త మరొకటి తెరపైకి వచ్చింది.

విషయంలోకి వెళ్తే.. తమిళానాడులో రజినీ అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నాయి. అందులో మధురై డిస్ట్రిక్ట్ రజినీ ఫ్యాన్స్ అసోషియేషన్ మెంబర్ శేఖర్ ఏకంగా రజినీ కుటుంబం పైనే బాంబు పేల్చాడు. ఏకంగా పోస్టర్లు తయారు చేసి చెన్నైలో అంటిస్తున్నాడు. పోస్టర్లంటే సినిమా బాగా ఆడాలని తయారు చేసిన పోస్టర్లు కాదు. రజినీ సోదరున్ని టార్గెట్ చేస్తూ తయారు చేసిన పోస్టర్స్. 

ఈ పోస్టర్లో ముఖ్యంగా అభిమాని శేఖర్ రజినీ సోదరుడు సత్యనారాయణపై పలు ఆరోపణలు చేస్తున్నాడు. రజినీ కాంత్ ఆరోగ్యం దెబ్బ తినడానికి, కొచ్చాడయాన్, లింగా సినిమాలు ఫెయిల్ అవ్వడానికి సత్యనారాయణే కారణమని విమర్శలు గుప్పించాడు. ఇటీవల రజినీ గురించి ఒక విషయం సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లాను. అయితే అతను సరిగ్గా స్పందించకపోవడంతోనే జరగకూడని నష్టాలు జరిగాయి. అంటూ పోస్టర్లో శేఖర్ వెళ్లడించాడు. ఈ పోస్టర్ తమిల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
 నేపథ్యంలో కొంత మంది అభిమానులు రజినీ తమ్ముడిపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తూ స్థానిక పోలీసు స్టేషన్లో శేఖర్ పై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అభిమానం గెలుస్తుందా? కుటుంబం గెలుస్తుందా అనే టాక్ చెన్నై ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వెయిట్ అండ్ సీ..

18:31 - June 26, 2016

విజయవాడ : అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీకి తేడా లేదని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ విమర్శించారు. పెట్టుబడిదారులు, కుబేరులతో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. విజయవాడలో సీఐటీయూ ఎపి రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. నిత్యావసరాల ధరలు పెరిగినా ప్రభుత్వం చోద్యం చేస్తోందన్నారు.
కార్మికరంగంపై ప్రభుత్వం దాడులు 
వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని తెలిపారు. కార్మికరంగంపై ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. కేంద్రప్రభుత్వానికి ప్రైవేట జ్వరం పట్టుకుందని..అది ఎంతదాకా వెళ్లిందంటే రక్షణ రంగంలోకి ఎఫ్ డిఐలను ఆహ్వానించే వరకు వెళ్లిందన్నారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు శ్రేయస్కరం కాదని...  దేశానికి మంచిది కాదని తెలిపారు. విద్యుత్, వైద్యం, బీమా రంగాలను ప్రైవేట్ చేయాలని చూస్తోందని పేర్కొన్నారు.
టీడీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు అనేక సమస్యలు 
టీడీపీ ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎపి రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన విధానాలు కావని.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు దేశ వ్యప్తంగా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. దేశంలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. సాధారణం కంటే దారుణంగా మారిపోయాయని తెలిపారు. నిత్యవసరాల ధరలు రోజు రోజూకూ పెరుగుతున్నాయన్నారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెరుగుదల ఉందని వాపోయారు.
సంక్షోభంలో వ్యవసాయ రంగం 
వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు రైతులను ఆదుకోలేకపోతున్నాయని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయం, కూలీ పనులు, బతుకుదెరువు లేక ప్రజలు పొట్టపోసుకోవడానకి పట్టణాలకు వలసపోతున్నారని  తెలిపారు. కార్మికవర్గం పరిస్థితి దయనీయంగా మారిందని.. కార్మిక వర్గంపై ప్రభుత్వ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
పెట్టుబడిదారులు, కుబేరులతో కేంద్రం కుమ్మక్కు 
పెట్టుబడిదారులు, కుబేరులతో కేంద్రప్రభుత్వం కుమ్మక్కు అయిందని ఆరోపించారు. కేంద్రం బడ్జెట్ లో మొత్తంలో బడా పెట్టుబడిదారులకు పెద్దపీట వేశారని తెలిపారు. బడా పెట్టుబడిదారులకు 5 లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చారని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ఉన్నత విద్య, రోడ్లు, ప్రజా అవసరాలకు నిధులు కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వానికి ప్రయివేటీకరణ జ్వరం పట్టుకుందని.. ప్రతి దాన్ని ప్రయివేట్ చేయాలని చూస్తుందన్నారు. వేల కోట్ల అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వస్తున్న వాటిపై మాట్లాడకుండా కేంద్రం గప్ చుప్ గా ఉంటుందన్నారు. ఓ కేంద్రమంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. 

 

18:19 - June 26, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జాన్ జిగిరీ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే.. కానీ వీరి మధ్యలో దర్శకుడు దాసరి నారాయణ రావు ఎందుకొచ్చాడనే కదా మీ డౌటు.. అయితే ఈ వార్త చదవండి..
విషయంలోకి వెళితే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా ఎవరుంటారనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ క్వశ్చన్ కి కారణం నిర్మాత ఎస్. రాధాకృష్ణ. ఈయన రీసెంట్ గా వరుసగా త్రివిక్రమ్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ వస్తున్నారు. త్రివిక్రమే తదుపరి సినిమా కూడా తమ బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే ఈ నిర్మాత ప్రకటించాడు. ఈ ప్రకటనే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. 
పవన్ కళ్యాన్ తన తదుపరి చిత్రం నిర్మాణ బాధ్యతలు దాసరి నారాయణ రావుకు ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం త్రివిక్రమ్ దృష్టికి తీసుకొచ్చారట. దీంతో రాధాకృష్ణ ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో అని ప్రకటించినప్పటికీ మాటల మాంత్రికుడు మాత్రం రాధాకృష్ణకు ఓకే చెప్పలేక పవన్ కు సర్థిచెప్పలేకపోతున్నాడని ఇండస్ట్రీ టాక్. 

17:39 - June 26, 2016

హైదరాబాద్ : మనం ప్రతిరోజు తినే కూరలు, పళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా ? ఎక్కడి నుంచి ఏంటీ, మనవాళ్లు పండించినవే కదా అని అనుకుంటున్నారా ? పండించింది మనవాళ్లే కానీ ఆ పంట మనది కాదు. ఆ సీడ్ మనది కాదు. కొన్ని వందల ఏళ్ల క్రితం విదేశాల్లో నుంచి మన దేశానికి వచ్చిన పంటలు ఇవన్నీ... ఈ రోజు మనం తింటున్న వాటిలో దాదాపు మూడోవంతు విదేశీ పంటలే. 
భారత్ కు విదేశీ పంటలు... 
దక్షిణ అమెరికా నుంచి టమాట.. మధ్య అమెరికా నుంచి మొక్కజొన్న... పశ్చిమాసియా నుంచి ఆలుగడ్డ....తూర్పు ఆసియా నుంచి క్యాబేజీ... ఇవే కాదు..ఆలు, కొబ్బరి, బీన్స్, క్యారెట్, ఆపిల్ ఇవేవీ భారతీయ పంటలు కాదు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చినవే...మన తింటున్నవాటిలో 35 శాతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పంటలే. వందల ఏళ్ల క్రితం   విదేశీయుల ద్వారా భారత దేశానికి ఈ పంటలు వచ్చాయి. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో ఈ విషయం బయటపడింది.  177 దేశాల్లో 132 రకాల కూరగాయలు, పళ్ల మీద పరిశోధనలు చేశారు. ప్రపంచం మొత్తంగా చూస్తే తింటున్నదానిలో దాదాపు 71 శాతం ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవే.
మిరపకాయలు మధ్య అమెరికాలో
పూర్వకాలంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వర్తక, వాణిజ్యం జరిగేది. అప్పుడు ఒక ప్రాంతంలో పండించే పంటలు గురించి తెలుసుకున్న వ్యాపారులు.. తమ దేశంలోనూ అలాంటి పంటలు వేసేవారు..అలా ప్రపంచం మొత్తం ఒక దేశం నుంచి మరో దేశానికి ఇవి వెళ్లాయి.. మనం ప్రతిరోజు వాడే ఉల్లిగడ్డ మొదట పండించింది పశ్చిమాసియాలో. మిరపకాయలు మధ్య అమెరికాలో, యాపిల్స్ మధ్యసియా ప్రాంతంలో తొలిసారిగా పండించారు. వరి తర్వాత మన దేశంలో అత్యధికంగా పండించే గోధుమ పంట కూడా మనది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియాలో మొదటి పండించిన గోధుమ పంట.. ఆ తర్వాత మన దేశానికి వచ్చింది
భారత్ నుంచి చాలా రకాలైన పంటలు విదేశాలకు 
భారత్ నుంచి చాలా రకాలైన పంటలు విదేశాలకు వెళ్లాయని పరిశోధన బృందం తేల్చింది. వరి, అరటి పండు, మామిడి,  వంకాయ ఇవన్నీ మొదట పండించింది మన దేశంలోనే. చెరుకు, టీ ప్రపంచానికి పరిచయం చేసింది భారతే. నిమ్మకాయలు, అల్లం, దోస దేశీయ పంటలే. శాస్త్రవేత్తల బృందం జరిపిన 132 రకాల పళ్లు, కూరగాయాల్లో దాదాపు 20 రకాలు మన దేశంలోనే మొదటిసారిగా పండించారు.

 

17:30 - June 26, 2016
17:30 - June 26, 2016
17:28 - June 26, 2016
17:03 - June 26, 2016

రంగారెడ్డి : జిల్లాలోని కీసరలో లాయర్ ఉదయ్ కుమార్ దారుణహత్యకు గురయ్యాడు. ఉదయ్‌ కుమార్‌ ను చంపి, ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి.. మారుతి కారులో ఉంచి పెట్రోల్‌ పోసి, దుండగులు తగులబెట్టి.. పారిపోయారు. క్లూస్‌ టీం ఘటనా స్థలికి చేరుకుని.. వివరాలు సేకరించింది. కార్ నెంబర్ ఆధారంగా మృతుడు ఉదయ్‌ కుమార్‌గా గుర్తించారు. హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన ఉదయ్‌కుమార్ హత్య గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయ్‌కుమార్ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుంటాడని బంధువులు తెలిపారు. గతంలో జవహర్‌నగర్‌లోని ఐదు ఎకరాల భూవివాదం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ రఫిక్‌ అన్నారు. 

 

కార్మికరంగంపై ప్రభుత్వం దాడి : మాణిక్ సర్కార్

విజయవాడ : కార్మికరంగంపై ప్రభుత్వం దాడి చేస్తోందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. విజయవాడలో సీఐటీయూ ఎపి రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అవేదన వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో విదేశీపెట్టుబడులు దేశానికి మంచిదికాదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

 

16:46 - June 26, 2016

బీజింగ్ : చైనాలోని హునాన్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌లో ఓ పర్యాటక బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి బారికేడ్లను ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 30 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన 26 మందిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

15:53 - June 26, 2016

హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ లో విషాదం నెలకొంది. జీహెచ్ ఎంసీ అధికారుల నిర్ల్యక్ష్యం ఓ యువకుని నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడి యువకుడు మృతి చెందాడు. జార్ఘండ్ కు చెందిన మోతీయాదవ్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈనేపథ్యంలో మోతీయాదవ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు మూత లేని మ్యాన్ హోల్ లో యువకుడు పడి మృతి చెందాడు. జీహెచ్ ఎంసీ అధికారుల నిర్ల్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

15:47 - June 26, 2016

కృష్ణా : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో అందరి భాగస్వామ్యం అవసరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరగాలన్నారు. విజయవాడలో కాసేపట్లో సీఐటీయూ ఎపి రాష్ట్ర మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఐటీయూ కార్యకర్తలు, కార్మికుల భారీ ర్యాలీ ప్రారంభం అయింది. ర్యాలీలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు  బివి.రాఘవులు, సీఐటీయు నాయకురాలు, పుణ్యవతి, ఎంఎ.గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ నూతన రాష్ట్రం అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని చెప్పారు. కార్మికుల పాత్ర లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఎవరి భాగస్వామ్యం లేకుండా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా.. అని ప్రశ్నించారు. కార్మికులను భాగస్వాములు చేయకుండా బలవంతం చేస్తే అభివృద్ధి జరుగదని స్పష్టం చేశారు.
కనీస వేతన అమలు చేయాలి : ఎంఎ గపూర్.. 
కార్మికులకు కనీస వేతన అమలు చేయాలని సీఐటీయూ నేత ఎంఎ గపూర్ డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ఈఎస్ ఐ సౌకర్యం అందరికి కల్పించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలన పరిష్కరించాలని సీఐటీయూ నాయకురాలు ఎస్.పుణ్యవతి అన్నారు. కార్మికుల సమస్యలు, హక్కులు, ప్రభుత్వ విధానాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు చెప్పారు. 

 

న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై టీ.న్యాయవాదులు నిరసన

హైదరాబాద్ : న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై తెలంగాణ న్యాయవాదులు నిరసనగా 120 మంది న్యాయవాదులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడికి న్యాయవాదులు రాజీనామా పత్రాలను ఇచ్చారు. మధ్యాహ్నం 3.30 గంలకు గన్ పార్క్ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లనున్నారు. గవర్నర్ కు రాజీనామా పత్రాలు ఇవ్వనున్నారు. 

కాసేపట్లో సీఐటీయూ ఎపి రాష్ట్ర మహాసభలు ప్రారంభం..

కృష్ణా : విజయవాడలో కాసేపట్లో సీఐటీయూ ఎపి రాష్ట్ర మహాసభలు ప్రారంభం కానున్నాయి. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఐటీయూ కార్యకర్తలు, కార్మికుల ర్యాలీ ప్రారంభం అయింది.ర్యాలీలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు  బివి.రాఘవులు, సీఐటీయు నాయకురాలు, పుణ్యవతి, ఎంఎ.గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ హాజరు కానున్నారు.  

 

15:02 - June 26, 2016

తమిళనాడు : సదావర్తి సత్రం భూముల అమ్మకంలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు  ఆరోపించారు. ఈమేరకు చెన్నైలోని సదావర్తి సత్రం భూముల్లో ఆ పార్టీ నిజ నిర్దారణ కమిటీ పర్యటించింది. భూములను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అక్రమాల వెనక నిజాలు వెలుగులోకి తీసుకోస్తామని చెప్పారు. గతంలో వేసని వేలం పాటను రద్దు చేసి... కొత్తగా భూములను వేలం వేయాలని చెప్పారు. మరో వేలం వేయడానికి ఎపి సర్కార్ కు వచ్చిన ఇబ్బందులు ఏమిటో చెప్పాలన్నారు. 'గత వేలంలో మీ కుమారుడు, మంత్రుల పాత్ర ఏమైనా ఉందా... అని ప్రశ్నించారు. భూమల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. 
 

సదావర్తి సత్రం భూముల్లో వైసీపీ నిజనిర్దారణ కమిటీ పర్యటన

తమిళనాడు : సదావర్తి సత్రం భూముల్లో వైసీపీ నిజ నిర్దారణ కమిటీ పర్యటించింది. ఈ బృందం భూములను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ భూముల అమ్మకంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అక్రమాల వెనక నిజాలు వెలుగులోకి తీసుకోస్తామని చెప్పారు. 

 

నక్కపల్లి పీఎస్ ప్రారంభం..

విశాఖపట్టణం : నక్కపల్లి సర్కిల్‌లో పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అవంతి, ఎమ్మెల్యే గోవింద్ హాజరయ్యారు.

 

టియాంజిన్ నగరంలో సీఎం బాబు..

చైనా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు చైనా పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆయన టియాంజిన్ నగరానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు తోపాటు కొందరు మంత్రులు చైనాకు వెళ్లిన సంగతి తెలిసిదే. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయా రంగాలకు చెందిన వ్యాపార ప్రముఖులతో చంద్రబాబు బృందం ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ గురుద్వార్ లో ఎంపీ కవిత..

హైదరాబాద్ : సికింద్రాబాద్ గురుద్వార్‌ ని నిజామాబాద్ ఎంపీ కవిత సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలో ఆమె పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో సిక్కు కమ్యూనిటీ అండగా నిలిచింది.

వారసత్వ రాజకీయాల వల్లే ఎమర్జెన్సీ - కిరణ్ రిజుజు..

హైదరాబాద్ : వారసత్వ రాజకీయాల వల్లే దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాల వల్ల కేంద్రం నిధులు జనంలోకి వెళ్లడం లేదని తెలిపారు. అభివృద్ధి జనంలోకి వెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేయాలని, ఎవరూ వేలెత్తి చూపని విధంగా మోడీ పాలన ఉందన్నారు. తీవ్రవాదాన్ని ధైర్యం ఎదుర్కొంటామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బాగా ఎదుగుతోందని, ఏపీ, తెలంగాణకు అన్ని విధాల సహాయం చేస్తామన్నారు.

చైనా టూరిస్టు బస్సులో ప్రమాదం..30 మంది మృతి..

చైనా : టూరిస్టు బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇటుకలబట్టి వద్ద కార్మికులు..సూపర్ వైజర్ మధ్య వాగ్వాదం..

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం (మం) కర్ణగూడెంలో ఇటుకలబట్టి వద్ద కార్మికులు, సూపర్ వైజర్ మధ్య గొడవ చెలరేగింది. అనంతరం సూపర్ వైజర్ ను కార్మికులు కొట్టి చంపారు.

కీసరలో మృతదేహం గుర్తింపు..

రంగారెడ్డి : కీసరలో దగ్ధమైన కారులో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం అడ్వకేట్ ఉదయ్ కుమార్ గా గుర్తించారు. హత్య చేసి కారుతో సహా దుండగులు తగులబెట్టారు. కారు నెంబర్ ఏపీ 28 ఎల్ 4850గా నిర్ధారించారు.

స్వామి వ్యాఖ్యలు వక్తిగతం - భాను ప్రకాష్..

చిత్తూరు : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు స్వామి వ్యక్తిగతమని, బీజేపీ నిర్ణయం కాదన్నారు. ఈయన వ్యాఖ్యలపై సీపీఎం నేత మురళి ఖండించారు.

ఇంద్రకీలాద్రిపై పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులను ఎంపీ కేశినేని నాని పరిశీలించారు. రాబోయే రోజుల్లో టిటిడి తరహాలో దుర్గగుడిని అభివృద్ధి చేస్తామని, పుష్కరాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

12:52 - June 26, 2016

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహణపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన తరచూ పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేవాలయాలపై ప్రభుత్వం జోక్యం ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో గత 48గంటలుగా తిరుపతిలో ఆయన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు బీజేపీ పార్టీ సభ్యులను ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ తప్పుబట్టడం విశేషం. ఆయన టెన్ టివితో మాట్లాడారు. రూ. 2,700 కోట్ల వార్షిక బడ్జెట్, 7,000 వేల ఎకరాలకు పైగా తిరుమల విస్తరించి ఉందని తెలిపారు. వేల కోట్ల రూపాయల నగదు ఉన్న సంస్థ ఇది అని, ముగ్గురు ఐపీఎస్ పర్యవేక్షణలో..వివిధ ఉన్నతాధికారుల కో ఆర్డినేషన్ తో ముందుకెళుతోందని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో ఉండకూడదని సుబ్రమణ్యం వ్యాఖ్యానించడం మంచి పద్ధతి కాదని, ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. బీజేపీ పార్టీలో అలాంటి భావన లేదని, దేవాదాయ శాఖ కమిటీ మాణిక్యాలరావు మంచి పని తీరుతో ముందుకెళుతున్నారని తెలిపారు.

ఖండించిన సీపీఎం..
సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలను సీపీఎం ఖండించింది. తిరుమల దేవస్థానాల్లో ప్రభుత్వం జోక్యం లేకుండా మఠాధిపతులకు అప్పగించాలని పేర్కొనడం బాధ్యతారాహిత్యమని సీపీఎం నేత మురళీ పేర్కొన్నారు. వ్యవస్థలో లోపాలున్నాయని, లోపాలు సరిదిద్ది మరింత మెరుగైన విధంగా ముందుకెళ్లాలని సూచించారు.

12:43 - June 26, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్దు మహాప్రభో అని పేదలు నినదిస్తుంటే సర్కార్ మాత్రం మొండిగా ముందుకెళుతోంది..వారి ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదనిపిస్తోంది. శనివారం సీఎం కేసీఆర్ దీనిపై స్పందించి ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఆదివారం ఈ ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ లాంటిదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. నాలుగు జిల్లాల తాగు, సాగు నీరు తీరుస్తుందని, ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఏడు మండలాలను ముంచిన పోలవరంను ఎందుకు అడ్డుకోలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

12:35 - June 26, 2016

చెన్నై : సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో అక్రమాలు జరిగాయంంటూ వైసీపీ పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై వాస్తవాలు తెల్సుకొనేందుకు ధర్మాన నేతృత్వంలో వైసీపీ నిజనిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపీ రాష్ట్రంలో పర్యటించిన ఈ కమిటీ చెన్నైకి చేరుకుంది. అక్కడ సత్రం భూములను ఆదివారం పరిశీలించింది. చెన్నైలో ఉంటున్న ఈ భూములను వేలం పాటల ద్వారా ప్రభుత్వం విక్రయించడం జరిగింది. ఇందులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ బృందంతో పాటు టెన్ టివి కూడా పర్యటించింది. సాప్ట్ వేర్ కంపెనీలు వెలిసిన ప్రాంతంలో ఎకరా ధర రూ. 6 నుండి రూ. 16 కోట్లు పలుకుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. కేవలం ఎకరం ధర రూ. 27 లక్షలకు విక్రయించారని తెలుసుకున్న స్థానికులు నోరెళ్ల బెట్టారని తెలుస్తోంది. పక్కా పథకంతో ఈ వేలం నిర్వహించారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున్న కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం వైసీపీ బృందం టీసీఎస్ సమీపంలో 11 ఎకరాల భూమిని పరిశీలించారు. ఎకరం ధర 25 కోట్ల రూపాయల ధర ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. మొత్తంగా అమరావతి సత్రం భూముల కుంభకోణం వెయి కోట్లు ఉంటుందని ఆరోపణలున్నాయి. మరి దీనిపై టిడిపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

12:22 - June 26, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో కొలువైన ప్రభుత్వం..కేంద్రం మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. ఆప్ ప్రభుత్వానికి..గవర్నర్..కేంద్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల ఆప్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియా అరెస్టుకు నిరసనగా ప్రధాని నివాసానికి ముట్టడికి ఆప్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. నిరసనలో డిప్యూటి సీఎం సిసోడియా కూడా పాల్గొన్నారు. తుగ్గక్ రోడ్డు వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకున్నాయి. అనంతరం 65 మంది ఎమ్మెల్యేలను తుగ్లక్ పీఎస్ కు తరలించారు. పోలీసుల అదుపులో డిప్యూటి సీఎం సిసోడియా కూడా ఉన్నారు.
పలు ఆరోపణలపై ఎమ్మెల్యే ఎమ్మెల్యే దినేష్ మొహనియాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మోడీ సర్కార్ తట్టుకోలేకపోతోందని...అందుకే ఇలాంటి చర్యలకు పూనుకొంటోందని ఆప్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉంటే ఘజియాబాద్ లో డిప్యూటి సీఎం సిసోడియా వ్యాపార సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతిపరులపై తాను వ్యాఖ్యలు చేయడం జరిగిందని, ఇతరులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సిసోడియా పేర్కొంటున్నారు. అంతేగాక ఇటీవలే సీఎం కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. ఆప్ చేస్తున్న నిరసనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

చెన్నైలో వైసీపీ నిజనిర్ధారణ కమిటీ..

చెన్నై : వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తోంది. అమరావతి సదావర్తి సత్రం భూములను ధర్మాన నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది.

లక్ష్మీపేట బాధితులకు అండగా ఉంటాం - కారెం శివాజీ..

శ్రీకాకుళం : లక్ష్మీపేట హత్య కేసులో దళితులకు న్యాయం జరగాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. వంగర మండలం లక్ష్మీపేటలో ఆయన పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ నరమేథంలో అందరి బండారం బట్టబయలవుతుందని, లక్ష్మీపేట బాధితులకు అండగా ఉంటామన్నారు. సీతంపేట ఐటీడీఏలో అవినీతిని ప్రక్షాళన చేయాలని, ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించే చర్యలు చేపడుతామన్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకొంటోంది.

 

మల్లన్న సాగర్ తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం - హరీష్..

హైదరాబాద్ : మలన్న సాగర్ తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ముంపు బాధితులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టులో 17 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, నిర్వాసితులకు నేటికీ పరిహారం అందలేదన్నారు. ఆరువేల కుటుంబాలను నిరాశ్రయులను చేశారని, పులిచింతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అడ్డుకోలేదని పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టిడిపి, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని, చుక్క నీరు రాని ఈ ప్రాజెక్టు కోసం 17 గ్రామాలను ముంచేశారని తెలిపారు.

ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేల ఆందోళన..

ఢిల్లీ : దేశ రాజధానిలో ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహనియా అరెస్టుకు నిరసనగా ప్రధాని నివాసానికి ఎమ్మెల్యేలు బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర డిప్యూటి సీఎం సిసోడియాతో సహా 65 మంది ఎమ్మెల్యేలు పోలీసులు అదుపులో ఉన్నారు.

 

ప్రజాస్వామ్యమే భారత్ కు పెద్ద బలం - మోడీ..

ఢిల్లీ : ప్రజాస్వామ్యమే భారత్ కు అతిపెద్ద బలమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన మన్ కీ బాత్ లో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల కురుస్తున్న వర్షాలపై సానుకూల మాటలు వింటున్నట్లు తెలిపారు. భారతీయు వాయుసేనలో ముగ్గురు మహిళా పైలట్లు రావడం గొప్ప విషయమన్నారు. ట్విట్టర్ లో యోగా చిత్రాలతో పాటు పలు ప్రయోగాలు చేశారని మోడీ పేర్కొన్నారు. యోగా ద్వారా రోగులు మధుమేహాన్ని నియంత్రిగలరని, మధుమేహంపై పోరాటం చేసేందుకు యోగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. యోగాకు సంబంధించి వెబ్ సైట్లో పలు వీడియోలు అందుబాటులో ఉన్నాయని, ప్రపంచంలో యోగా చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు.

11:34 - June 26, 2016

సల్మాన్ ఖాన్ వివాదం చిక్కుకున్నారు. సుల్తాన్ విషయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వర్షాల కోసం ఓ బాలుడిని నగ్నంగా తిప్పారంట. స్వచ్ఛ భారత్ కోసం టీచర్లకు విస్తుగొలిపే ఆదేశాలు..విమానంలో యోగా చేయడం..ఓ మంత్రి ఎలిఫెంట్ స్పెల్లింగ్ ని తప్పుగా రాయడం..ఆర్బీఐ గవర్నర్ గా రెండోసారి కొనసాగేందుకు రాజన్ నిరాకరించడం తదితర అంశాలపై టెన్ టివి 'క్రేజీ న్యూస్'లో విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణ ఎలా ఉందో..తదితర ఆసక్తికరమైన విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

11:29 - June 26, 2016

స్వచ్ఛ భారత్.. కేంద్రం పలు కార్యక్రమాలు చేపడుతోంది. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ ఆదేశాలు కొన్ని విస్తుగొల్పుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని నర్మద జిల్లాలో స్వచ్ఛ భారత్ అవగాహన కోసం టీచర్లకు పలు ఆదేశాలు అందాయంట. హాజరు సమయంలో ఎస్ టీచర్..అని కాకుండా మరుగుదొడ్డి ఉందా ? లేదా విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందంట. లేదు అని ఏదైనా విద్యార్థి చెబితే ఆ టీచర్ ర్యాలీగా తీసుకుని వెళ్లాలంట. ఎక్కడ టాయిలెట్ లేదో వారికి టీచర్ అవగాహన కల్పించాలంట. ఇక రాజస్థాన్ లో..ఓ గ్రామంలో ఉన్న టీచర్లకు కెమెరాలు ఇచ్చారు. బహిరంగంగా మలవిసర్జన చేస్తుంటే ఫొటోలు తీసి వాట్సాప్ లో ఉన్నతాధికారులకు పంపించాలంట. అదండి విషయం..

11:27 - June 26, 2016

స్వచ్చ భారత్..కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను అంబాసిడర్స్ గా నియమించింది. పలు రాష్ట్రాల్లో స్వచ్ఛ భారత్ పై కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని నుండి స్పూర్తిని పొందాడో ఏమో గాని ఓ వర్సిటీ విద్యార్థి టాయిలెట్ ను రూపొందించాడు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే నీళ్ల అవసరం ఉండదంట. అవును ఇది రైల్వే శాఖ వారి కోసం రూపొందించాడంట. గాలి..గురుత్వాకరశక్తి వాడి ప్రాసెసింగ్ ను పూర్తి చేస్తుందంట. టాయిలెట్లు నీళ్లు అవసరం ఏంటీ అని అమెరికన్లు కామెంట్స్ చేస్తున్నారంట. అది సంగతి..

11:26 - June 26, 2016

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. కానీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురవడం లేదు. కానీ కొంతమంది వర్షాలు కురవాలని యాగాలు..పూజలు చేస్తుండడం వింటుంటాం..చూస్తుంటాం. కానీ కర్నాటకలో ఓ ఊరు వారు విచిత్రమైన కార్యక్రమం చేశౄరు. చిత్రదుర్గలోని ఓ గ్రామంలో వాళ్ల ఆచారం ప్రకారం ఓ బాలుడికి బట్టలు లేకుండా నెత్తిపై వినాయకుడి విగ్రహం పెట్టి ఊరు మొత్తం తిప్పారంట. వాన నీళ్లు పడ్డాయో లేదో కానీ బాలల హక్కు సంఘానికి నీళ్లు వచ్చాయంట. పిల్లల హక్కులను కాలరాస్తున్నారంటూ ఆ ఊరిపై కేసు వేశారంట.

10:57 - June 26, 2016

అల్లం..ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నిత్యం మనం వంటకాల్లో ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడవని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
రోజులో కనీసం ఒక లీటర్ వరకైనా జింజర్ వాటర్ తాగాలి. నిత్యం ఈ వాటర్ ను తాగుతుంటే కొద్ది రోజుల్లో అధికంగా పేరుకపోయిన కొవ్వు కరుగుతుందంట.
అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గుతుంది.
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ టీ త్రాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. రుతుక్రమ సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. శ్వాస కోశ సమస్యలను కొంతవరకు తగ్గిస్తుంది.
అల్లం ముక్కను క్యారెట్, టమాటోలతో కలిసి జ్యూస్ చేసి తేనెలో కలపాలి. ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తం శుద్ధి అవుతుంది.

'యోగి వేమన' వర్సిటీలో నాన్ టీచింగ్ సిబ్బంది ఆందోళన..

కడప : యోగి వేమన యూనివర్సిటీలో నాన్ టీచింగ్ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్నారు. మూడేళ్ల నుండి జీతాలు పెంచడం లేదని ఆందోళన చేస్తున్న వీరిని పోలీసులు అడ్డుకున్నారు.

క్లాక్ టవర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

10:41 - June 26, 2016

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టుకు త్రిపుర మాణిక్ సర్కార్ చేరుకున్నారు. ఎంఏ గఫూర్, సీ.హెచ్ బాబురావు..పలువురు ఘన స్వాగతం పలికారు. సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. విజయవాడలో ఆదివారం నుండి నాలుగు రోజుల పాటు సీఐటీయూ రాష్ట్ర మహా సభలు జరగనున్నాయి. ఆదివారం కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ ఉద్యమాలకు ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నిర్వహిస్తున్న మొదటి సమావేశాలు కావడంతో ఈ మహాసభలను ప్రతిష్టాత్మకంగా జరపాలని నిర్ణయించారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు ఏకే పద్మనాభన్‌, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్‌ ఉద్యమాలను ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తారు.

10:36 - June 26, 2016

హైదరాబాద్ : అమెరికాలో ప్రమాదవశాత్తు దుర్మరణం చెందిన నంబూరి శ్రీ దత్త భౌతికకాయం నగరానికి చేరుకుంది. దీనితో దత్త ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. శ్రీదత్త భౌతికకాయానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
వనస్థలిపురం, కమలానగర్ కు చెందిన శ్రీ దత్త టెక్సాస్ రాష్ట్రం హోరిజాన్ నగరంలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేసేవాడు. స్నేహితులతో కలిసి ఓ జలపాతం వద్దకు శ్రీదత్త వెళ్లాడు. తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు శ్రీదత్త జలపాతంలోకి పడిపోయాడు. అనంతరం అతని మృతదేహాన్ని బయటకు తీసి ఆయన స్వగృహానికి తరలించారు.

 

10:28 - June 26, 2016

మెదక్ : 'మాకు చట్టాలు తెలియదు..ఇక్కడే ఉంటం..ఇక్కడే ఛస్తం..గ్రామాన్ని..సొంత ఊర్లను వదలం..ఇక్కడ మంచిగ పంటలు పండుతాయి..దీనిని వదిలి ఎక్కడకు పోవాలె..మాకు పరిహారం వద్దు..ఏమొద్దు'..అంటూ మల్లన్న సాగర్ నిర్వాసితులు పేర్కొంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నిర్వాసితులు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. తమకు చట్టాలు..జీవోలు తెలియవని..ఇక్కడే ఉంటమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 2013 భూ సేకరణ చట్టం లేదా 123 జీవో ప్రకారం పరిహారం చెల్లిస్తామని, ఇందులో ఏది కావాలో నిర్వాసితులు నిర్ణయించుకోవాలని సీఎం కేసీఆర్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్వాసితులు ఏమి అనుకుంటున్నారనో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా పల్లె పాడు గ్రామంలో టెన్ టివి పర్యటించింది. అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడింది. 123 జీవో, 2013 చట్టాలు తమకు తెలియని, ఊర్లను వదిలిపెట్టమన్నారు. చుట్టుపక్కల చెరువులున్నాయని, బహుళ పంటలు పండుతాయని తెలిపారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకోవాలని తాము సూచించడం జరుగుతోందన్నారు. సమీక్షా సమావేశం జరిపించాలని కోరుతున్నారు. ఈ పల్లెపాడు గ్రామస్తుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకుంటుందా ? లేక మొండిగా ముందుకెళుతుందా వేచి చూడాలి.

కీసరలో వ్యక్తి దారుణ హత్య..

రంగారెడ్డి : జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కీసరలో కారులోనే ఓ వ్యక్తిని చంపేసి తగులబెట్టారు. దీనితో కారు పూర్తిగా తగులబడిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10:18 - June 26, 2016

హైదరాబాద్ : ఆదర్శ గ్రామంగా పేరొందిన కేపీహెచ్ బి కాలనీ ప్రగతి నగర్ లో దొంగలు పడ్డారు. ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగులగొట్టి ఈ చోరీలు చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోయారు. ప్రగతి నగర్ లో ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అనంతరం కేపీహెచ్ బీ ఏడో ఫేజ్ లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ప్రగతినగర్ లో ఓ ఇంట్లో రూ. 9.50 లక్షలు నగదును అపహరించారు. కేపీహెచ్ బిలో ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ల్యాప్ టాప్ లు చోరీ చేశారు. సంఘటనకు సంబంధించి బాధితులు మీడియాతో మాట్లాడారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి :శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి 876 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

టి.టిడిపి నేత రేవంత్ పై కేసు నమోదు..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ పీఎస్ లో టి.టిడిపి నేత రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ 504, 290, 188, 27/76 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మాణిక్ సర్కార్..

విజయవాడ : గన్నవరం ఎయిర్ పోర్టుకు త్రిపుర మాణిక్ సర్కార్ చేరుకున్నారు. ఎంఏ గఫూర్, సీ.హెచ్ బాబురావులు స్వాగతం పలికారు. సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా మాణిక్ సర్కార్ హాజరు కానున్నారు.

కేపీహెచ్ బి కాలనీలో చోరీలు..

హైదరాబాద్ : కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రగతి నగర్ లో ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అనంతరం కేపీహెచ్ బీ ఏడో ఫేజ్ లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ప్రగతినగర్ లో ఓ ఇంట్లో రూ. 9.50 లక్షలు నగదును అపహరించారు. కేపీహెచ్ బిలో ఇంటి తాళాలు పగులగొట్టి రెండు ల్యాప్ టాప్ లు చోరీ చేశారు.

 

09:33 - June 26, 2016

నల్గొండ : చదువుల్లో ఫస్ట్‌... ఆట పాటల్లో బెస్ట్‌... అన్ని రంగాల్లోనూ టాప్ ప్లేస్.. ఇంతమంచి రికార్డున్నా ఆ స్కూల్‌ భవనంమాత్రం చుక్కలు చూపిస్తోంది.. పాఠశాలల్లోఉన్నంతసేపూ విద్యార్థులు, ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ పాఠశాల. 400 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ స్టూడెంట్స్‌ అన్నింట్లోనూ టాప్‌లో ఉంటారు. పదో తరగతి ఫలితాల్లో ఈ స్కూల్‌ మండలంలో మొదటిస్థానంలో నిలిచింది. ఆట, పాటల్లోనూ ఈ స్కూల్‌ స్టుడెంట్స్‌ బెస్ట్‌గా నిలుస్తున్నారు. ఇది నాణానికి ఒకవైపే. రెండో వైపుచూస్తే మాత్రం పిల్లల్ని ఎవ్వరూ ఈ స్కూల్‌కు పంపరు. భూత్‌ బంగ్లాలాంటి బిల్డింగ్... ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. తరగతి గదుల్లో తరచూ ఊడిపోతున్న పెచ్చులు. ఇవి కిందపడుతుండగానే విద్యార్థులు, ఉపాధ్యాయుల పరుగులు. స్లాబ్‌లో చిలుముపట్టిన చువ్వలు ఎవరి మీద పడతాయో అంటూ విద్యార్థులంతా ఎప్పుడూ భవనంపైనే చూస్తుంటారు. క్షణంపాటు అదమరిచారా?. ఎవరోఒకరు ఆస్పత్రి బెడ్‌పై మూలగక తప్పదు.

ప్రభుత్వ విప్ సొంత గ్రామం..
ఇక వర్షాకాలం వస్తే అందరికీ దిన దినగండంగా మారుతుంది.. తమ పిల్లల్ని స్కూల్‌కు పంపాలంటే తల్లిదండ్రులకు అనుక్షణం టెన్షన్... ప్రైవేటు స్కూల్‌కు పంపలేక ఈ పాఠశాలలో చదివించలేక నరకం చూస్తున్నారు.. అటు టీచర్లదీ సేమ్‌ సీన్. ఈ భనవం పెచ్చులూడి విద్యార్థులు చాలాసార్లు గాయపడ్డారు. తమ బడిని బాగు చేయాలంటూ ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. అయినా ఎలాంటి ఉపయోగం లేదు. వరంగల్‌, హైదరాబాద్‌ హైవేను ఆనుకొని ఈ స్కూల్ ఉంది.. ఎంతో మంది ప్రముఖులు ఈ దారిపై వెళుతుంటారు. ఎవ్వరూ ఇటువైపు చూసింది లేదు. ఈ విద్యార్థుల బాధను విన్నదీలేదు. పైగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి సొంత గ్రామం ఇది. ఎమ్మెల్యేగాఉన్నా ఏనాడూ ఆమె స్కూల్‌ను పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడేందుకు ఎన్నో చేస్తున్నామంటారు. కోట్ల రూపాయలు ఖర్చవుతోందంటూ లెక్కలు చూపుతారు. స్కూళ్లలో మాత్రం ఇలాంటి దారుణమైన భవనాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లతో పోటీ తట్టుకోలేక హైరానా పడుతున్న ప్రభుత్వ బడుల్లో ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తేనే తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపుతారు. లేకపోతే ఈ స్కూళ్లన్నీ మూతబడక తప్పదు.

09:29 - June 26, 2016

అమెరికా : లేక్ ఇసాబెల్లా అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు వ్యాపించింది. మధ్య కాలిఫోర్నియా పర్వత ప్రాంతాల్లో పొడి గడ్డి , భారీ వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయి. నగరంలోని ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫారెస్ట్ లోని ఓ కంపెనీలో ప్రొపేన్ ట్యాంకులు పేలడంతో.. మంటలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

09:25 - June 26, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. వారి సమస్యలను తీరుస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను నిర్వాసితులు స్వాగతిస్తూనే పలు డిమాండ్లు ప్రభుత్వం ఎదుట ఉంచుతున్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నిర్వాసితులు టెన్ టివితో మాట్లాడారు. 14 గ్రామాల్లో సర్వేలు, రిజిస్ట్రేషన్ లు నిలిపివేయాలని..అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి..ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల 14 గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఈ ప్రాజెక్టు వద్దని తాము ఇక్కడే ఉంటామంటూ నిర్వాసితులు గత రెండు మాసాలుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 123 జీవో ప్రకారం లేదా..2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని శనివారం సీఎం కేసీఆర్ వెల్లడించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు చేస్తున్న డిమాండ్లపై టి.సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

09:20 - June 26, 2016

చెన్నై : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమరావతి సదావర్తి భూముల విషయంలో వాస్తవం తెలుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ధర్మాన నేతృత్వంలో ఓ బృందం ఆలయ భూములను పరిశీలిస్తోంది. ఆదివారం చెన్నైకి చేరుకున్న ఈ బృందం సదావర్తి భూముల్లో పర్యటించనుంది. 81 ఎకరాల సదావర్తి భూములను ఎకరం రూ. 27 లక్షలకే అధికారులు కట్టబెట్టారు. దీనిపై వైసీపీ బృందం దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టెన్ టివితో మాట్లాడారు. ఈ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరిగిందని ఎకరం ఆరు నుండి పది కోట్ల వరకు ధర పలుకుతోందని, కానీ 27లక్షలకే ఇవ్వడం కరెక్టు కాదన్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకొనేందుకు స్థానికులతో మాట్లాడడం జరిగిందని, సదావర్తి భూములను చౌక ధరలకు కొనుగోలు చేసిన వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి సదవర్తి భూముల వ్యవహారంలో సీపీఎం, వైసీపీ పార్టీలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవలే అమరావతిలో ధర్మాన ప్రసాదరావు బృందం పర్యటించింది. ఈ పర్యటనను టిడిపి నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న వైసీపీ బృందంపై టిడిపి ఎలాంటి విమర్శలు చేస్తుందో వేచి చూడాలి.

'2013 చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి'..

మెదక్ : 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని మల్లన్న సాగర్ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. సర్వేలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని, పనులు నిలిపివేయాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

09:08 - June 26, 2016

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు వస్తోంది... ఇక తమ కష్టాలన్నీ తీరిపోయాయని రైతులు ఎంతో సంబరపడ్డారు.. ఇక తమ భూములన్నీ సస్యస్యామలమవుతాయని ఆశపడ్డారు.. ఇంతలో సర్కారు వారికి షాక్ ఇచ్చింది.. డంపింగ్‌ యార్డు పేరుతో మరిన్ని సమస్యల్ని సృష్టిస్తోంది. మొన్నటివరకూ ప్రాజెక్టు కష్టాలతో ఇబ్బందులుపడ్డ రైతులకు ఇప్పుడు డంపింగ్‌ యార్డు సమస్యలొచ్చాయి.... పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో తరతరాలనుంచి వ్యవసాయం చేసుకుంటూ చాలామంది రైతులు జీవనం సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుతో దాదాపు 75శాతం మంది భూములు కోల్పోయారు.. మిగిలిన ఆ కాస్త రైతులు తమకు ఇబ్బందిలేదని సంతోషపడ్డారు. ప్రాజెక్టు నీటితో పంటలు పండిచుకోవచ్చని సంబరపడ్డారు. అయితే వారి ఆశ అడియాసే అయింది. డంపింగ్‌ యార్డు వాళ్లకు మళ్లీ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీనికోసం 2వందల ఎకరాల భూమిని సర్కారు సేకరిస్తోంది.. ఈ భూసేకరణకోసం గత నెలలో జీవోకూడా విడుదలైంది.

ఆందోళన చేస్తామంటున్న రైతులు..
డంపింగ్‌ యార్డుకు భూములు ఇవ్వాలంటూ అధికారులు చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. తమకు చెప్పకుండా ఎలా జీవో విడుదలచేస్తారంటూ మండిపడ్డారు. సారవంతమైన తమ భూముల్ని లాక్కొని అన్యాయం చేయొద్దంటూ 20 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డుకోసం భూమి సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా దీనివెనక మరేదో కారణముందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును కడుతున్న ప్రభుత్వం ముందే డంపింగ్‌ యార్డుకు ఎందుకు ప్లాన్‌ చేయలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. చివరి నిమిషంలో జీవో ఎందుకు విడుదల చేశారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ భూమిని ఏం చేస్తారో చెప్పడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. డంపింగ్‌ యార్డుకోసం సేకరిస్తున్న భూమికి నష్టపరిహారంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకోసం ఎకరానికి దాదాపు 50లక్షలిచ్చిన సర్కారు తమకు మాత్రం కేవలం 16లక్షలతో సరిపెడుతోందని మండిపడుతున్నారు. 2013 భూ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చాకే భూమి సేకరించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు..

చెన్నైలో ధర్మాన బృందం..

విజయవాడ : అమరావతి సదావర్తి భూముల కుంభకోణంపై వైసీపీ విచారిస్తోంది. ధర్మాన ప్రసాద నేతృత్వంలో బృందం చెన్నైకి చేరుకుంది. కాసేపట్లో ఆలయ భూములను పరిశీలించనున్నారు.

08:58 - June 26, 2016

హైదరాబాద్ : గ్రేటర్ రోడ్లు మట్టి కోట్టుకుపోతున్నాయి. వరల్డ్ క్లాస్ సిటీ అని చెబుతున్న నగరంలోని పలు రోడ్లు గోతులతో దర్శనమిస్తున్నాయి. సిటి రోడ్లకు మెట్రో గండం పట్టుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మెట్రో రైల్ వర్క్స్ హైదరాబాద్ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు అంటేనే ట్రాఫిక్ జాం....ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ట్రాఫిక్ జాం అవుతతుందో తెలియని పరిస్ధితి. ఇక సిటిలో ఆడపాదడపా కురిసిన వర్షాలకే రోడ్లన్ని గుంతలమయం అవుతున్నాయి....దీంతో వాహనచోదకులకు మరిన్ని ఇబ్బందులు . వీటికి తోడు సిటిలో మెట్రో రైల్ వర్క్స్ జరుగుతున్న 72 కిలో మీటర్లలో చాలా ప్రాంతాల్లో రోడ్లు చాలా దెబ్బతిన్నాయి. నగరంలోని ముఖ్యప్రాంతాల నుంచి వెళ్తున్న మెట్రో రైల్ నిర్మాణం కోసం ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తవ్వేయడంతో దారుణంగా దెబ్బతిన్నాయి.

నత్తనడకన మెట్రో రైల్ రోడ్డు విస్తరణ పనులు..
ఇక మెట్రో రైల్ నిర్మాణం కోసం పూర్తి చేయాల్సిన రోడ్ల వెడల్పు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల ఆస్తుల సేకరణ పూర్తి కాలేదు. దీంతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోంది...మెట్రో పనుల కోసం రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ సాఫీగా ముందుకు సాగడంలేదు. ప్రధానమైన రోడ్లపై కూడా కేవలం ఒక్క బస్సు మాత్రమే పోయేందుకు వీలు కల్పించారు. మెట్రో పనులు జరుగుతున్న రూట్స్ లో ఉన్న రోడ్లు నిర్వహణా బాధ్యత మెట్రో అధికారులదే అంటుంది జీహెచ్ ఎంసీ. అయితే రోడ్లపై గోతులను మాత్రమే మెట్రో అధికారులు పూడుస్తున్నారు..కొన్ని చోట్ల గోతుల్లో మట్టిని వేస్తున్నారు. దీంతో వాహనదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. రోడ్ల విషయంలో అటు మెట్రో, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు అవలంభిస్తున్న ఉదాసీన వైఖరితో నగరవాసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షకాలం వచ్చిన నేపథ్యంలో ఇకనైనా అధికారులు మేల్కోని రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

08:53 - June 26, 2016

నిజామాబాద్ : రాజుల పైసలు రాళ్లపాలు అంటే ఇదేనేమో. రైతుల కోసం లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రైతు బజార్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రైతులు లేక వెలవెలబోతున్నాయి. యాచకులకు అడ్డాలుగా మారుతున్నాయి. లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వీటిని పట్టించుకునే నాధుడే లేడు. దీంతో ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రైతుబజార్లు వృధాగా పడి ఉన్నాయి. పండించిన కూరగాయలను నేరుగా రైతులు అమ్ముకునేందుకు అప్పటి ప్రభుత్వాలు రైతు బజార్లను ఏర్పాటు చేసింది. మొదట ఎంతో ఆర్బాటంగా ప్రారంభించిన ఇవి. రైతులు లేక బోసిపోతున్నాయి. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్, ఎన్జీవోఎస్ కాలనీల్లో రైతు బజార్లను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ వీటిలో రైతుల ఆచూకీ కనిపించదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పక్కా భవనాలు వృధాగా పడి ఉన్నాయి. రైతులు లేని కారణంగా వినియోగదారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

రావడం మానేసిన రైతులు..
నగర నడి బొడ్డున పూలాంగ్ చౌరస్తాలో రైతు బజారు ఏర్పాటు చేసారు. చుట్టు పక్కల గ్రామాలైన బొర్గాం, మోపాల్, కంజర, కులాస్ పూర్ మంచిప్ప తదితర గ్రామాల నుండి రైతులు తాము పండించిన పంటలను తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయించుకునే వారు. మొదట్లో బాగానే స్పందన వచ్చింది. రైతులు ఎక్కువ సంఖ్యలో రావటంతో వినియోగదారులు సైతం అధికంగా వచ్చేవారు. కానీ రానురానూ రైతులు రావటం మానేసారు. దీంతో వినియోగదారులు కూడా రావటం లేదు. ఈ రైతు బజార్లు ఇప్పుడు యాచకులు, రాత్రివేళల్లో మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకోని వీటిని ఏర్పాటు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

అధికారులు స్పందించాలి..
కొందరు కూరగాయల వ్యాపారులు రైతు బజార్లు కాకుండా తమ ఇష్టారాజ్యంగా రోడ్లపైనే కూర్చుని విక్రయాలు చేస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వాహనదారులు, పాదాచారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. చిన్నాచితక ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఇంత జరుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకొవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు బజార్ల పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

08:48 - June 26, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారిని నిత్యం 70 వేల నుంచి లక్షమంది భక్తులు దర్శించుకుంటుంటారు. అయితే క్షేత్ర సాంప్రదాయం ప్రకారం సన్నిధి గొల్ల శ్రీవారి ఆలయాన్ని తెరచి తొలి దర్శనం చేసుకున్న తరువాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇప్పటికీ ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారంపర్యంగా కోనసాగుతున్న సన్నిధి గొల్ల కుటుంబీకులను సాగనంపే దిశగా టిటిడి అడుగులు వేస్తోంది. తరతరాలుగా స్వామి వారికి సేవ చేసుకొంటున్న తమను కూడా అర్చకులు తరహలోనే వంశపారంపర్యంగా కొనసాగించాలని వీరు కోరతున్నారు. అర్చకులకు మాత్రం వంశపారపర్యంగా కొనసాగిస్తూ సన్నిధి గొల్లలను రిటైర్మెంట్ పేరుతో సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు.

మిరాశీ వ్యవస్థ రద్దు..
1996లో మిరాశీ వ్యవస్థ రద్దులో భాగంగా సన్నిధిగొల్ల కుటుంబం మిరాశీని రద్దు చేసిన టిటిడి వారిని ఉద్యోగులుగా కొనసాగిస్తోంది. ఈ నెల 30న సన్నిధి గొల్ల వెంకటరామయ్య యాదవ్ ను పదవీ విరమణ చేయాలని టీటీడీ సూచించింది. మిరాశీ ప్రకారం వెంకటరామయ్య తరవాత వారి కుంటుంబంలోని వారసులకు సన్నిధి గొల్ల పోస్టు ఇవ్వాలని వారు డిమాండు చేస్తున్నారు. టిటిడి తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి తాము తమ కుటుంబ సభ్యులు రోడ్డున పడాల్సి వస్తుందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1987 టీటీడీ చట్టంలోని సెక్షన్‌ 30 ప్రకారం 1996 మార్చి 19న నుంచి మిరాశీ వ్యవస్థ రద్దయింది. డిసెంబర్‌ 16న జారీ చేసిన 1171 జీవో ప్రకారం మిరాశీ వ్యవస్థలోని అర్చకులు, ఇతర మిరాశీదారుల సర్వీసు నిబంధనలను నిర్దేశించింది. ఈ జీవో ప్రకారం సిబ్బంది పదవీ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, పూర్వ మిరాశీ తితిదే ఆలయాలకు కావాల్సిన సిబ్బంది సంఖ్యను, వేతన శ్రేణిని నిర్ణయిస్తూ 1997 అక్టోబర్ 10న జీవో నెంబర్ 855 ప్రకారం ఉత్వర్లు చేయడం జరిగింది. ఈ జీవో మేరకు తిరుమల శ్రీవారి ఆలయానికి రెండు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి ఒకటి మరియు శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఒకటి కలిపి మొత్తం నాలుగు సన్నిధి గొల్ల పోస్టులు మంజూరు చేశారు.

హైకోర్టులో పిటిషన్..
ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయంలో శాశ్వత ప్రాతిపదికన శ్రీ ఎస్‌.వెంకట్రామయ్య మరియు శ్రీ ఎస్‌.రమేష్‌ సన్నిధి గొల్లలుగా విధులు నిర్వహిస్తున్నారు. తితిదేలో ఇప్పటికీ ఖాళీలు లేకపోయినప్పటికి కూడా శ్రీ ఎస్‌.వెంకట్రామయ్య కుమారుడైన శ్రీఎస్‌.పద్మనాభను 2006వ సంవత్సరం నుంచి సంభావన ప్రాతిపదికన అదనంగా నియమించడం జరిగింది. శ్రీ ఎస్‌.వెంకట్రామయ్య తితిదేలో శాశ్వత ఉద్యోగి(సన్నిధి గొల్ల)గా విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం పి.ఆర్‌.సి. వేతనం కూడా తీసుకున్నారు. అనంతరం తన ఉద్యోగ విరమణ ఉత్తర్వులను నిలుపుదల చేసి మిరాశీ వ్యవస్థ ద్వారా కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా, వీరికి చుక్కెదురయ్యింది. మరి వీరి వివాదానికి తెర పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.

08:43 - June 26, 2016

లండన్ : గ్రాండ్ స్లామ్ ఎవరెస్ట్ ..వింబుల్డన్ సమరానికి లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ పచ్చికకోర్టులతో ముస్తాబవుతోంది. జూన్ 27 నుంచి జులై 10 వరకూ జరిగే ఈటోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో టాప్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ కు టాప్ సీడింగ్స్ దక్కాయి. జోకోవిచ్ నాలుగో వింబుల్డన్ టైటిల్ కు గురిపెడితే...గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ పై కన్నేశాడు. ప్రపంచ టెన్నిస్ అభిమానులకు పండుగే పండుగ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 2016 వింబుల్డన్ సమరానికి లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో రంగం సిద్ధమయ్యింది. జూన్ 27 నుంచి జులై 10 వరకూ జరిగే ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో సీడింగ్స్ వివరాలను నిర్వాహక సంఘం ప్రకటించింది.

పురుషులు..మహిళలు..
పురుషుల, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ కు టాప్ సీడింగ్స్ ఇచ్చారు. మాజీ చాంపియన్, బ్రిటీష్ నెంబర్ వన్ ఆటగాడు యాండీ ముర్రేకి రెండు, 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత రోజర్ ఫెదరర్ కు మూడు సీడింగ్స్ దక్కాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ మాజీ చాంపియన్ వావరింకాకు నాలుగు, ఆసియా నెంబర్ వన్ ప్లేయర్ నిషికోరీకి ఐదు సీడింగ్స్ దక్కాయి. ఫ్రెంచ్ వెటరన్ స్టార్ రిచర్డ్ గాస్కేకు ఏడు, మారిన్ సిలిచ్ కు 9 సీడింగ్స్ ఇచ్చారు. ఇక..మహిళల సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ సెరెనా విలియమ్స్ , ఫ్రెంచ్ ఓపెన్ క్వీన్ ముగురుజా మొదటి రెండు సీడ్లుగా ఉన్నారు. విక్టోరియా అజరెంకా గాయంతో వింబుల్డన్ టోర్నీకి దూరమయ్యింది. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే మూడు వింబుల్డన్ టైటిల్స్ తో సహా 11 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన జోకోవిచ్...క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా పోటీకి దిగుతున్నాడు. ఏడు వింబుల్డన్ టైటిల్స్ తో పాటు 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచిన రోజర్ ఫెదరర్ ను..ప్రస్తుత సీజన్లో గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ యాండీ ముర్రేకి వింబుల్డన్ లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముర్రేకి అంతంత రికార్డు..
అయితే..జోకోవిచ్ ప్రత్యర్థిగా ముర్రేకి అంతంత మాత్రం రికార్డే ఉంది. ఇప్పటి వరకూ జోకోవిచ్ తో తలపడిన15 మ్యాచ్ ల్లో ముర్రే కి 13 పరాజయాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ లో..ఆరు వింబుల్డన్ టైటిల్స్ తో పాటు మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా..22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగుతోంది. మహిళల డబుల్స్ లో టాప్ సీడింగ్ జోడీ సానియా మీర్జా - మార్టీనా హింగిస్ ..హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగుతున్నారు. పురుషుల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లో భారత వెటనర్ స్టార్ లియాండర్ పేస్ సైతం తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. వచ్చే రెండువారాలూ వింబుల్డన్ తో..ప్రపంచ టెన్నిస్ అభిమానులకు పండుగే పండుగ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

విద్యుత్ వైర్లు తగిలి రైతు..రెండు పశువుల మృతి..

వరంగల్ : లింగాలఘనపూర్ (మం) జీడికల్ లో విషాదం చోటు చేసుకుంది. వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి రైతు బుచ్చయ్య (65) దుర్మరణం చెందాడు. ఇతనితో పాటురెండు పశువులు మృత్యువాత పడ్డాయి.

సోమాజీగూడలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : సోమాజీగూడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బేకరీలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

నల్గొండలో భారీ వర్షం..

నల్గొండ : జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. చౌటుప్పల్ మండలం జైకేసారం సమీపంలో చెరువు తెగిపడింది. చౌటుప్పల్ - నలిగొండ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

08:17 - June 26, 2016

విశాఖపట్టణం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరింత బలపడి ఆదివారం రాత్రికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తం ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. వానకు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

08:15 - June 26, 2016

హైదరాబాద్ : బాలానగర్ పారిశ్రామికవాడలో ఓ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...బాలానగర్ లో ఓబులం ఎలక్రిక్టకల్ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి గౌతమ్ నగర్ చెందిన హమీద్ స్టీల్ సామాగ్రిని తీసుకొస్తుంటాడు. యదావిధిగా శనివారం సాయంత్రం కంపెనీకి వచ్చాడు. అక్కడి మెయిన్ గేటు మూసివేసి ఉంది. సెక్యూర్టీ గార్డు గేటు తీసిన అనంతరం ఆటోను లోనికి పోనిచాడు. అదే సమయంలో ఆటో ఆగిపోయింది. ఆటోను స్టార్ట్ చేయడానికని హామీద్ కిందకు దిగాడు. స్టార్ట్ చేసే క్రమంలో అతని కాలు ఓ పౌడర్ పై పడింది. వెంటనే అక్కడ పేలుడు సంభవించింది. హామీద్ పాదం మొత్తం ఛిద్రమై పోయింది. తీవ్రగాయాలైన అతడు అపస్మారక స్థితికి వెళ్లాడు. వెంటనే అక్కడున్న వారు అప్రమత్తమై స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం హామీద్ ను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం, బాంబు స్వ్కాడ్ టీం కంపెనీకి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

బారాముల్లో కాల్పులు..ఇద్దరు మిలిటెంట్లు మృతి..

జమ్మూ కాశ్మీర్ : యూరీ సెక్టార్ లోని బారాముల్లా జిల్లాలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పులను భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

07:37 - June 26, 2016

ఊరిలో దిగ్గానే తోటలోకి పరిగెత్తాను. జనకీకారణ్యంలో బోన్సాయ్ బతుకును మరచి ఆ ఉదయం సహజమైన మెుక్కై పల్లవించాను అంటూ నోస్టాల్జిక్ ఓరియంటెడ్ కవిత్వం రాసిన అనుభూతివాద కవయిత్రి, అనేక కథాసంపుటాలు నవలలు వెలువరించిన సృజనశీలి అల్లూరి గౌరీలక్ష్మి. ఆమె మానవ సంబంధాల మాధుర్యాలను, మానసిక సంఘర్షణలను, కథలుగా అల్లింది.. తను చూసిన దృశ్యాలను అందమైన కవిత్వంగా శిల్పీకరించింది. అతి సున్నిత మనస్కురాలైన ఈ రచయిత్రి మనోచిత్రం, వసంతకోకిలలాంటి కథాసంపుటాలతో పాటు అంతర్గానం లాంటి సంచలన నవలలు వెలువరించారు. ప్రముఖ కథారచయిత్రి, కవయిత్రి, కాలమిస్టు అల్లూరి గౌరీలక్ష్మిపై ప్రత్యక కథనం. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయడి.

07:33 - June 26, 2016

ప్రపంచమెుక పద్మవ్యూహం కవిత్వం తీరని దాహమన్నారు మహాకవి శ్రీశ్రీ. కేవలం కవిత్వమేకాదు సృజనాత్మక కళ ఏదైనా అది తీరని దాహంలానే ఉంటుంది. కొందరు కవిత్వం కోసం బతుకంతా పలవరిస్తారు. మరికొందరు కథారచనలోనే జీవితాన్ని కాస్తా గడిపేస్తారు. ఇంకొందరు గేయాలుగా మారిపోతారు. ప్రజల గాయాల బతుకులను గానం చేస్తారు. ప్రజలను చైతన్య పరుస్తారు. అలాంటివారిలో ఇటీవల కన్ను మూసిన ప్రముఖ గేయ రచయిత గూడ అంజయ్యకు ఒకరు.
ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన పాటల చెలికాడు. దోపిడి వ్యవస్థపై పాటను విల్లంబుగా ఎక్కుపెట్టిన విలుకాడు. తెలంగాణా భాషను యాసను శ్వాసగా మార్చుకుని బడుగుజీవుల గుండెచప్పుళ్ళను పాటల డప్పులుగా మ్రోగించిన కళాకారుడు. ఆయనే ప్రజాకవి గూడా అంజయ్య. ఆ ప్రజాకవి, కళారవి ఇటీవలే కన్నుమూశాడు. అంజయ్య రాసిన ప్రతిపాటా వెండితెరపై కదం తొక్కింది. ప్రజల హృదయాలను ఉర్రూతలూగించింది. దోపిడిదారుల గుండెల్లో దడపుట్టించింది. దుర్మార్గుల మనసుల్లో విస్ఫోటనమై ప్రేలింది. ఆయన పాట ప్రతి చోట, ప్రతి నోటా ప్రతి వేదికపై .. ప్రతి సందర్భంలో ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉంది. ప్రముఖ జానపద వాగ్గేయకారుడు, ప్రజాగేయకవి, కథారచయిత గూడ అంజయ్య మృతికి నివాళులర్పిస్తోంది 10 టివి.అక్షరం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:26 - June 26, 2016

అమెరికా : ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడానికి బ్రిటన్‌ ప్రజలు మొగ్గు చూపిన తర్వాత మరిన్ని వేర్పాటు వాదనలు తెరపైకి వస్తున్నాయి. బ్రెగ్జిట్‌కు అనుకూల తీర్పు వచ్చిన నేపథ్యంలో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా నుంచి టెక్సాస్‌ స్టేట్‌ విడిపోయే అంశం తెరపైకి వస్తోంది. బ్రెగ్జిట్‌ అనుకూల వర్గాలు ఉపయోగించిన ప్రచార సూత్రాలు తామూ పాటించాలని టెగ్జిట్‌ అనుకూల వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ మాదిరిగా టెక్సాస్‌లో కూడా యూఎస్‌ఏతో కలిసి ఉండాలా.. విడిపోవాలా అనే అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని కొందరు కోరుతున్నారు.

టెక్సాస్‌ రెండో అతి పెద్ద రాష్ట్రం..
అమెరికాలోని టెక్సాస్‌ జనాభాపరం గానూ, వైశాల్యంలోనూ రెండో అతి పెద్ద రాష్ట్రం. హ్యూస్టన్‌, శాన్‌ ఆంటోనియో, డల్లాస్‌, ఆస్టిన్‌ లాంటి ప్రముఖ నగరాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. మెక్సికో నుంచి స్వాతంత్య్రం పొందిన టెక్సాస్‌ 1836 సంవత్సరం నుంచి 1845 వరకు స్వతంత్రదేశంగా ఉండేది. 1845లో 28వ రాష్ట్రంగా యూఎస్‌ఏలో చేరింది. అమెరికాలో టెక్సాస్‌ చేరిక కూడా ఆ రోజుల్లో పెను సంచలనానికి తెరతీసింది. 1846లో మెక్సికో అమెరికా యుద్ధానికి దారితీసింది. 1.6 ట్రిలియన్‌ డాలర్ల వార్షికాదాయం గల టెక్సాస్‌ .. దేశంగా ఉంటే ప్రపంచంలో తొలి పది పెద్ద దేశాల జాబితాలో ఉండేదని టెక్సాస్‌ నేషనలిస్ట్‌ ఉద్యమ నేత డేనియల్‌ మిల్లర్‌ అన్నారు. అమెరికాలో ఉండాలా వద్దా అనే విషయంపై టెక్సాస్‌ ప్రజల అభిప్రాయసేకరణ జరగాలని ఆయన అంటున్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో కూడా టెగ్జిట్‌ ఉంది. బ్రెగ్జిట్‌ తర్వాత ఇక టెగ్జిట్‌ కావాలని కొందరు ట్వీట్లు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీచేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రెగ్జిట్‌పై ప్రజల తీర్పు అద్భుతమైనదని కొనియాడారు . ఇప్పుడు టెగ్జిట్‌ పూర్తిగా తెరపైకి వస్తే ట్రంప్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

నగరంలో వర్షం..ముగ్గురు మృతి..

హైదరాబాద్ : నగరంలో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్సార్‌నగర్, హబీబ్‌నగర్‌లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెగిపడ్డ విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మాదాపూర్‌లో తెరిచిన ఉన్న డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

 

బాలానగర్ ఓ కంపెనీలో పేలుడు..

హైదరాబాద్ : బాలానగర్ పారిశ్రామికవాడలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒబులం ఎలక్రిక్టల్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటో డ్రైవరకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కూడా కంపెనీకి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నేడు ఏజెన్సీలో మావోయిస్టుల బంద్..

ఖమ్మం : మహారాష్ట్ర ఎన్ కౌంటర్ కు నిరసనగా నేడు ఏజెన్సీల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. చర్లలో రోడ్డుపై మావోయిస్టులు బాంబు పేల్చారు. మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

నేడు అల్పపీడనం ?

విశాఖపట్టణం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది మరింత బలపడి ఆదివారం రాత్రికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

 

06:45 - June 26, 2016

బ్రిటన్ : యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ పైదొలగాలంటూ ఆదేశ ప్రజలు ఇచ్చిన తీర్పు మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంశంపై మరోసారి రిఫరెండం కోసం పట్టుపడుతున్నారు. ఇందుకోసం సంతకాలు సేకరించేందుకు వెబ్‌సైట్‌లో పెట్టిన పిటిషన్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. దీనిపై సంతకాలు చేసిన వారి సంఖ్య మిలియన్‌ దాటింది. లండన్‌, కేంబ్రిడ్జి,బర్మింగ్‌హామ్‌, మాంచెస్టర్‌ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఈ పిటిషన్‌పై సంతకాలు చేశారు. వీరంతా బ్రెగ్జిట్‌కు వ్యతిరకంగా ఓటేసిన వారే.

పోలైన ఓట్లలో ఇది 48.1 శాతం..
బ్రెగ్జిట్‌పై రెండోసారి సంతకాలు చేసిన పిటిషన్‌ బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చకు రానుంది. ఎగువసభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో దీనిపై చర్చించనున్నారు. విలియన్‌ ఆలీవర్‌ ఈ పిటిషన్‌ను వెబ్‌సైట్‌లో పెట్టారు. మొత్తం 75 శాతం నమోదైన బ్రెగ్జిట్‌ ఓటింగ్‌లో.... ఈయూలో బ్రిటన్‌ ఉండాలా? లేదా ? అన్న అంశంపై 60 శాతం మంది మాత్రమే తమ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది చాలా తక్కువన్న వాదాన్ని ఆయన వినిపిస్తున్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా కోటి 74 లక్షల 10 వేల 742 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో ఇది 51.9 శాతం. వ్యతిరేకంగా కోటి 61 లక్షల 41 వేల 241 ఓట్లు వచ్చాయి. ఇది 48.1 శాతం. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్ల మధ్య పెద్దగా తేడా లేదన్న వాదాన్ని విలియన్‌ ఓలీవర్‌ వినిపిస్తున్నారు. దీంతో మరోసారి అభిప్రాయ సేకరణ చేట్టాలని కోరుతున్నారు. రెండోసారి రెఫరెండం కోసం ఎక్కువ మంది ప్రజలు తమ పేర్లు నమోదు చేయించుకోడానికి ప్రయత్నించడంతో ఈ పిటిషన్‌ కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ ఓ దశంలో స్తంభించింది. ఈఅంశంపై బ్రిటన్‌ పార్లమెంటు ఏ నిర్ణయం తీసుకుంటోదో వేచి చూడాలి.

06:43 - June 26, 2016

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎస్సార్‌నగర్, హబీబ్‌నగర్‌లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెగిపడ్డ విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మాదాపూర్‌లో తెరిచిన ఉన్న డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. ఈ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్‌, నిజాంపేటలో కుండపోత వాన పడింది. అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, మోతీనగర్‌, బేగంపేట్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, ఎర్రగడ్డ, సోమాజిగూడ, బంజారాహిల్స్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమైయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్గొండ జిల్లా సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. మెదక్‌ జిల్లా సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

ఏపీలో..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. విజయవాడ, కైకలూరు, ముదినేపల్లి, మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినవర్షం కురవడంతో పలు చెట్లు నేలకొరిగాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరంతోపాటు విజయనగరం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

06:39 - June 26, 2016

హైదరాబాద్ : ఖరీఫ్ సీజను ప్రారంభమవుతున్నందున ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు . నిరంతరం క్షత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. రైతుల సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం రాష్ట్రస్థాయిలో ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఖరీఫ్ సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీజన్ మొత్తం అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆఫీసుల్లో కూర్చోకుండా, నిరంతం క్షేత్ర స్థాయిలో పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట కాల్వలకు మరమ్మత్తులను ప్రారంభించాలని కోరారు. కాల్వల దగ్గర వుండే డిస్ల్పేబోర్డులు, గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై విధిగా సంబంధిత ఈఈ, డిఈఈ, ఏఈఈ ల పేర్లు, మొబైల్‌ ఫోన్‌ నెంబర్లను రాయాలని సూచించారు.

ఫిర్యాదుల కొరకు రాష్ట్రస్థాయి కాల్‌సెంటర్ ఏర్పాటు..
నీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్న వెంటనే నీటి లభ్యత, సరఫరా వివరాలను రైతులకు తెలియజేయడంతో పాటు ఏయే పంటలు వేస్తున్నారో అన్నదాతలను అడిగి తెలుసుకోవాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకు రెవిన్యూ, వ్యవసాయ శాఖల సహకారం తీసుకోవాలని కోరారు. ఆయకట్టు మ్యాపులు, రైతుల వివరాలను నమోదు చేసి గ్రామ పంచాయతీకి, రెవిన్యూ అధికారులకు పంపించాలన్నారు.. ఆ వివరాలను గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని హరీశ్ సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ, డిస్ట్రిబ్యూటరీ స్థాయిలో రైతులతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి వారి సాధక బాధలు తెలుసుకోవాలని కోరారు. ఇది రైతు ప్రయోజనాల సర్కారు అని వారికి నమ్మకం కలిగేలా వ్యవహరించాలని మంత్రి చెప్పారు .రైతుల సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం రాష్ట్రస్థాయి లో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. కింది స్థాయిలో ఏ పనుల పట్ల నిర్లక్ష్యo జరిగినా, అవి సకాలంలో పూర్తి కాకపోయినా చీఫ్ ఇంజనీర్లే బాధ్యులుగా గుర్తిస్తానని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఏఈఈ నుంచి ఎస్ఈ వరకు ఎక్కడ లోటు పాట్లు జరిగినా సీ.ఈ లే జవాబుదారీ అని మంత్రి వ్యాఖ్యానించారు.

06:37 - June 26, 2016

విజయవాడ : సీఐటీయూ రాష్ట్ర మహా సభలకు విజయవాడ ముస్తాబయ్యింది. ఇవాళ్టి నుంచి నాలుగురోజుల పాటు జరిగే సమావేశాల్లో భాగంగా ఇవాళ కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ ఉద్యమాలకు ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నిర్వహిస్తున్న మొదటి సమావేశాలు. ఈ మహాసభలను ప్రతిష్టాత్మకంగా జరపాలని నిర్ణయించారు.

కార్మిక మహా ప్రదర్శన..
సీఐటీయూ మహాసభల్లో భాగంగా ఇవాళ కార్మిక మహా ప్రదర్శ నిర్వహించనున్నారు. దీనికి ముందు రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లతో కవాతు జరుపుతారు. కళాజాతాలు ప్రదర్శలు ఉంటాయి. సీఐటీయూ మహాసభల కోసం విజయవాడ నగరాన్ని ఎర్రజెండాలతో ముంచెత్తారు. ఎక్కడ చూసినా ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్‌ వరకు సాగే కార్మిక మహాప్రదర్శన తర్వాత, భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు ఏకే పద్మనాభన్‌, సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్‌ ఉద్యమాలను ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తారు. ఈనెల 27న నుంచి ప్రారంభమయ్యే ప్రతినిధులు సభకు మొదటి రోజు వివిధ కార్మిక సంఘాల నాయకులను కూడా ఆహ్వానించారు. ఏపీ చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచేలా ఈ మహాసభల్లో నిర్ణయాలు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మహాసభల్లో వివిధ అంశాలపై తీర్మానాలు ఆమోదిస్తారు. కార్మిక,ప్రజా ఉద్యమాలపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 2న జరిగే సార్వత్రిక సమ్మె సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకుంటారు.

06:35 - June 26, 2016

హైదరాబాద్ : వరుస పరాభవాలు, పార్టీ వలసలు, సొంత పార్టీ కుమ్ములాటలతో తెలంగాణ పీసీసీ చీఫ్‌ నిర్వేదంలోకి వెళ్లిపోయారు. కష్ట సమయంలో కాంగ్రెస్‌ నావను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న ఉత్తం కుమార్‌... ఇప్పుడు ఆ భారం వదిలించుకునే పనిలో పడ్డారనే గుసగుస మొదలైంది. సీనియర్ల సహాయనిరాకరణ, అంతర్గత విబేధాలతో విసిగిన పీసీసీ చీఫ్‌.. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని అధిష్టానం ముందు మొరపెట్టుకున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో జ‌రుగుతున్న వ్యవ‌హారాల‌తో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి విసిగి పోయార‌నే ప్రచారం జోరందుకుంది. ఉత్తమ్‌ పార్టీ బాధ్యత‌లు తీసుకున్నప్పటి నుంచి జరిగిన ఉప‌ ఎన్నిక‌ల్లో వరుస ఓట‌ములు, అధికార పార్టీలోకి వలసలు ఉత్తమ్‌ను మ‌రింత డీలా ప‌డేలా చేసాయి.

జానారెడ్డితో కోల్డ్ వార్..
దీనికి తోడు పార్టీలోని సీనియ‌ర్ల స‌హాయ నిరాక‌ర‌ణ ఉత్తంను మ‌రింత ఇబ్బంది పెడుతోంది. సీనియ‌ర్లు దామోద‌ర రాజ‌న‌ర్సింహ, పొన్నాల‌, స‌ర్వే, వీహెచ్, పొన్నం, మ‌ధు యాస్కీ ఇలా చాలామంది సీనియ‌ర్లు ఉత్తంతో అంటీముట్టన‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక జానారెడ్డితో కోల్డ్ వార్..ఉండ‌నే ఉంది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే.. జిల్లాకు చెందిన కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో పోరు మ‌రోఎత్తు. త‌నను పీసీసీ ఛీఫ్ గా గుర్తించ‌ని ప్రక‌టించిన కోమ‌టి రెడ్డి.. ఇప్పటి వ‌ర‌కు గాంధీభ‌వ‌న్ మెట్లెక్కలేదు. ఇది చాల‌ద‌న్నట్లు ఏకంగా సీఎల్పీ వేదిక‌గా త‌న‌పై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నార‌ట ఉత్తం. వీట‌న్నీంటితో ఇక వేగ‌లేన‌ని నిర్ణయానికి వ‌చ్చిన ఉత్తం కుమార్ రెడ్డి , పీసీసీ ఛీఫ్ నుండి త‌ప్పుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్లు టాక్.

బాధ్యతల నుంచి తప్పించాలని ఉత్తమ్ వినతి ?..
ఇదే విష‌యాన్ని ఇటీవలి ఢిల్లీ టూర్లో.. సోనియా, రాహుల్ గాంధీల‌కు ఉత్తమ్ వివరించినట్లు సమాచారం. ఇన్నీ స‌మ‌స్యల మ‌ధ్య తాను పార్టీని న‌డ‌ప‌లేన‌ని.. త‌న‌కు ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించ‌డంలేదు. వెంటనే బాధ్యత‌ల‌ నుంచి త‌ప్పించాల‌ని ఉత్తమ్ కోరిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఇప్పటికే డీలాప‌డిన పార్టీని ఎలా ప‌ట్టాలెక్కించాల‌ని తంటాలు ప‌డుతున్న అధిష్టానానికి .. ఉత్తం నిర్ణయం మ‌రింత క‌ల‌వర‌పెడుతుంది. ఈ పరిణామాలతో పార్టీకి ఎదురయ్యే లాభ‌నష్టాలు ఏంట‌ని లెక్కలేసుకున్న ఢిల్లీ పెద్దలు.. ఇప్పుడేం చేద్దామని త‌ర్జన‌భ‌ర్జన ప‌డుతున్నారు. మ‌రి ఈ పరిణామాలను హైక‌మాండ్ ఎలా తెర‌దించుతుందో చూడాలి.

06:32 - June 26, 2016

గుంటూరు : అమరావతిలో మొదటి ఘట్టం ప్రారంభమయింది. నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన నేలపాడు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాట్లను పంపిణీ చేశారు. మొత్తం 847 మందికి లాటరీ పద్దతి ద్వారా ప్లాట్లను కేటాయించారు. రాజధానికి మొదట భూమి ఇచ్చిన కొమ్మినేని ఆదిలక్ష్మికి సీఎం తొలి ప్లాటును అందజేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తుళ్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మొత్తం 847 మంది రైతులకు లాటరీ పద్దతిలో ప్లాట్లను కేటాయించారు. ఇందులో 1,167 నివాసిత ప్లాట్లు కాగా.. 796 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ఇక రాజధానికి మొదటగా భూమి ఇచ్చిన కొమ్మినేని ఆదిలక్ష్మికి తొలి ప్లాట్‌ పత్రాలను చంద్రబాబు అందజేశారు. అదే విధంగా రైతులకు ఎక్కడ ప్లాట్లు వచ్చాయో తెలుసుకునేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇక నేలపాడు గ్రామస్తులకు ప్లాట్లు కేటాయించడం ద్వారా మొదటి ఘట్టం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. రాజధాని ఇక్కడ వస్తుందని ఎవరూ ఊహించలేదని.. అందరికీ సమాన దూరంలో ఉండేలా ఆలోచించి రాజధాని ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ప్రతిపక్షాలు అమరావతి నిర్మాణం జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డాయని.. అయినా రైతులు తనపై నమ్మకం ఉంచి 33 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.

అన్న క్యాంటీన్..రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన..
అంతకు ముందు వెలగపూడిలో ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్స్‌,.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మరియు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు భోజనం అందుబాటులో ఉండనుంది. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులకు ఈ క్యాంటీన్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. ప్రతిరోజు దాదాపు 400 మంది దాకా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఈసందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. అనంతరం వెలగపూడిలో సీడ్‌ క్యాపిటల్‌ రహదారుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. తొలిదశలో దొండపాడు నుంచి కొండవీటివాగు స్లూయిస్‌.. వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నారు. అంతర్జాతీయ కంపెనీలతో నాణ్యమైన రహదారులను నిర్మిస్తామని.. రాజధాని నిర్మాణ పనులకు స్థానిక ప్రజలు సహకరించాలని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న పరిపాలన భవన నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు.

06:29 - June 26, 2016

హైదరాబాద్ : గోదావరి పై ఎత్తిపోతల పథకాలకు రిజర్వాయర్లు అవసరం లేదని.. కాలువల ద్వారానే పంటపొలాలకు నీరందించవచ్చని నీటి పారుదల రంగ నిపుణులు హనుమంతరావు పేర్కొన్నారు. జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన.. రైతు సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశంలో.. ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాలకు రిజర్వాయర్లే అవసరం లేదని ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల పోరాటం నేపథ్యంలో ఈయన చేసిన ప్రకటన సరికొత్త చర్చను తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఉన్న ఇరవైకి పైగా జీవనదులలో నీటిని నిల్వచేయడం ద్వారా అనేక లాభాలున్నాయని.. హైదరాబాద్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో.. హనుమంతరావు వెల్లడించారు. ప్రాణహిత పథకంలో గ్రామాల తాగునీటికి, హైదరాబాద్ తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు కలిపి 56 టీఎంసీల నీరు మాత్రమే ఏడాది పొడవునా అవసరముంటుందన్నారు. మిగిలిన నీరు 120 రోజులకు మాత్రమే అవసరమన్నారు. అందుకోసం భారీ రిజర్వాయర్లు అవసరం లేదన్నారు.

అదనపు ఖర్చు..
120 రోజుల్లో 160 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను ఎలా నింపుతారని ప్రశ్నించారాయన. 120 రోజుల పాటు నీటి లభ్యత ఉన్నప్పుడు.. నీటి నిల్వ అవసరం లేదన్నారు టి. హనుమంతరావు. పంటకాలం 120 రోజులు కాబట్టి నీటినిల్వకు రిజర్వాయర్లు నిర్మించడం వల్ల అదనపు ఖర్చవుతుందన్నారు. కాలువల ద్వారా పంటలకు నేరుగా నీరందించవచ్చన్నారాయన. సోవియట్ రష్యా నిర్మించిన ఇరిటీష్ కరగండ ఎత్తిపోతల పథకంలో.. దాదాపు ఐదు వందల కిలోమీటర్లు కాలువల ద్వారానే పంటలు సాగవుతాయన్నారు. నాగార్జున సాగర్ లో 45 లిఫ్ట్ ఇరిగేషన్ ల ద్వారా తాగు సాగు నీటికి ఉపయోగిస్తున్నారన్నారు హనుమంతరావు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారానే నీటిని అన్ని రకాలుగా వాడుకోవచ్చని...లిఫ్ట్ చేసే క్రమంలో.. తప్పని సరిగా .. మోటార్ లను స్టాండ్ బై ఉంచుకోవాలన్నారు హనుమంతరావు .

 

06:26 - June 26, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చైనా పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబు, ఇద్దరు మంత్రులు, 10 మంది అధికారులు చైనాలో పర్యటిస్తున్నారు. మొదటిరోజు ఐదు ద్వైపాక్షిక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సమాఖ్య సమావేశాల్లో.. "సిటీస్‌, డిజైన్‌ నాట్‌ బై డిమాండ్‌',.. "ఆధునిక వ్యవసాయం-సవాళ్లు" అనే రెండు అంశాలపై చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. గతంలో చంద్రబాబు చైనాలో పర్యటించిన తర్వాత.. రాష్ట్రానికి ఐదు వేల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. అయితే అవి ఏ రంగంలో వచ్చాయి ? వీటికి ఇంకా ఏ ప్రోత్సాహకాలు ఇవ్వాలనే అంశంపై ఈ పర్యటనలో ఆయా రంగాల అధిపతులతో చంద్రబాబు సమీక్షిస్తారు. అదే విధంగా టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, షిప్పింగ్‌, ఫార్మా, ఎనర్జీ తదితర రంగాల నిపుణులతో కూడా బాబు భేటీ అవుతారు. ప్రపంచ ఆర్థిక సమావేశాల అనంతరం మరో రెండు రోజులపాటు జియో ప్రావిన్స్‌లో చంద్రబాబు పర్యటించి.. పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇక ఈ పర్యటనలో వాణిజ్య అంశాలే కాకుండా.. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీతో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తలపెట్టిన ఈ పర్యటన రాష్ట్రానికి ఎంత మేరకు పెట్టుబడులు తీసుకువస్తాయో చూడాలి.
 

యూరో కప్ లో నేడు..

పారిస్ : యూరో కప్ టోర్నీలో భాగంగా నేడు ప్రి క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఫ్రాన్స్ - ఐర్లాండ్ జట్ల మధ్య సాయంత్రం 6.30గంటలకు మ్యాచ్ జరగనుంది. రాత్రి 9.30గంటలకు జర్మని - స్లోవేకియా జట్లు ఢీకొననున్నాయి. రాత్రి 12.30గంటలకు హంగేరి - బెల్జియం జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

 

చైనాలో సీఎం చంద్రబాబు పర్యటన..

విజయవాడ : నేటి నుండి సీఎం చంద్రబాబు 30వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. మొదటి రోజు ఐదు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనున్నారు.

విజయవాడలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు..

విజయవాడ : నగరంలో నేటి నుండి సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. కార్మిక చట్టాలు, కనీస వేతనాల అమలు విషయంపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి పేర్కొన్నారు.

సోమవారం ఐచ్చిక సెలవు..

హైదరాబాద్ : హజ్రత్ ఆలీ వీర మరణం (షహదత్) సందర్భంగా ఈనెల 27న ఐచ్చిక సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు..

హైదరాబాద్ : పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. నిజాం కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం ఈ విందు జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మసీదుల్లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.

 

సోమవారం మైనార్టీ గురుకులాలు ప్రారంభం..

హైదరాబాద్ : మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యాబోధన కోసం ఈ విద్యా సంవత్సరం నుండి 71 గురుకుల పాఠశాలల నిర్వాహణకు ప్రభుత్వం అనుమతించింది. వీటిని మూడు రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ సోమవారం బహదూర్ పురా గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నారు.

క్వార్టర్స్ లో పోలండ్...

పారిస్ : యూరో కప్ లో తొలి నాకౌట్ పోరులో పోలండ్ జట్టు హోరాహోరీగా పోరాడి స్విట్జర్లాండ్ ను ఓడించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్ తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీనితో పెనాల్టీ షూటౌట్ లో పట్టువీడని పోలండ్ జట్టు 5-4 తేడాతో ఘన విజయం సాధించింది.

ఉగ్రవాదుల కాల్పులు..8 మంది జవాన్ల మృతి..

జమ్మూ కాశ్మీర్ : పొంపోర్ సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 8 మంది జవాన్లు మృతి చెందగా 24 మందికి గాయాలయ్యాయి. అనంతరం జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఆర్పీఎఫ్ డీజీ వివరించారు.

జ్ఞానసాయి తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం బాబు...

ఢిల్లీ : కాలేయ వ్యాధితో బాధ పడుతున్న జ్ఞానసాయి తల్లిదండ్రులను ఫోన్ లో సీఎం చంద్రబాబు పరామర్శించారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీనిచ్చారు. చిన్నారికి అందుతున్న వైద్యం వివరాలను నిరంతరం పర్యవేక్షించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం బాబు ఆదేశాలు జారీ చేశారు.

Don't Miss