Activities calendar

27 June 2016

22:15 - June 27, 2016
22:13 - June 27, 2016

మంగళవారం ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ప్రారంభం..

విజయవాడ : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయాన్ని రేపు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ప్రారంభమవుతుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ఉదయలక్ష్మీ తెలిపారు. ప్రభుత్వ మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్న సీఎం కేజ్రీవాల్..

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో పర్యటించనున్నారు. రానున్న 13రోజుల్లో కేజ్రీవాల్ మూడు రాష్ర్టాల్లో పర్యటించి వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ముఖాముఖిలో పాల్గొననున్నారు.

మంగళవారం నుండి సీజే బెంచ్ బహిష్కరణ..

హైదరాబాద్ : ఇద్దరు న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సీజే బెంచ్ ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండే సీజే బెంచ్ బహిష్కరణ చేయనున్నారు. న్యాయవాదులు హైకోర్టు బార్ అసోసియేషన్ లో సమావేశమయ్యారు. న్యాయవాదుల ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

రేపటి నుండి జడ్జిల మూకుమ్మడి సెలవులు..

హైదరాబాద్ : రేపటి నుండి 200 మంది తెలంగాణ జడ్జిల మూకుమ్మడిగా సెలవులు పెట్టనున్నారు. ఇద్దరు జడ్జీల సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు విధుల్లోకి చేరేది లేదని జడ్జెస్ అసోసియేషన్ పేర్కొంది.

ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేత..

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ పై మరమ్మతులు నిర్వహించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి బ్యారేజీపై వాహనాలను అనుమతించబోమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు పాదచారులను కూడా బ్యారేజీపైకి అనుమతించమని చెప్పారు.

 

21:34 - June 27, 2016

ఢిల్లీ : క్షిప‌ణి సాంకేతిక నియంత్రణ గ్రూపులో భార‌త్ స‌భ్యదేశంగా చేరింది. ఈ మేరకు విదేశాంగ కార్యద‌ర్శి జైశంక‌ర్ మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రిజిమ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎంటీసీఆర్ ఒప్పందంపై ఫ్రాన్స్ దౌత్యవేత్త అలెగ్జాండ‌ర్ జీగ్‌లర్, నెద‌ర్లాండ్స్ దౌత్యవేత్త అల్ఫోన‌స్ స్టొలింగా, లగ్జంబ‌ర్గ్ దౌత్యవేత్త లారే హూబ‌ర్ట్‌లు సంత‌కం చేశారు. 34 దేశాలున్న ఆ గ్రూప్‌లో ఇప్పుడు భార‌త్ 35వ దేశంగా నిలుస్తుంది. ఎంటీసీఆర్ లో స‌భ్యత్వం వ‌ల్ల భార‌త్ హై-ఎండ్ మిసైల్ టెక్నాల‌జీని పొందే అవ‌కాశం ఉంటుంది. ర‌ష్యాతో త‌న క్షిప‌ణి సాంకేతికతను మ‌రింత స‌మృద్ధి చేసుకోవ‌చ్చు.

 

21:32 - June 27, 2016

వరంగల్ : ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ..హన్మకొండలో బీఈడీ విద్యార్ధులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ ను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ..తరగతులను బహిష్కరించిన స్డూడెంట్స్..జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. విద్యార్ధినీలతో అసభ్యంగా మాట్లాడుతూ..ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ విద్యార్ధినీలు ఆరోపిస్తున్నారు. పెళ్లైన అమ్మాయిలు తెల్లచీర కట్టుకోవాలంటూ వేధిస్తున్నాడని విద్యార్ధినీలు కన్నీటి పర్యంతం అయ్యారు. కనీస వసతులు కల్పించకపోగా..మాటలతో వేధింపులకు గురిచేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. విద్యార్ధినీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ సహాదేవున్ని తక్షణం సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు.

21:29 - June 27, 2016

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమం కోసం 10 కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ నిధిని ప్రతి ఏటా ప్రభుత్వం పెంచుతుందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు నెలకు 3 వేల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు పెన్షన్‌ ఇస్తామన్నారు. తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్టులకు 50 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. జర్నలిస్టుల పిల్లలు జాతీయ స్థాయి జర్నలిజం కళాశాలల్లో విద్యను అభ్యసిస్తే.. లక్షరూపాయల ఆర్థిక సాయం, విదేశాల్లో చదివితే 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని అల్లం నారాయణ చెప్పారు.

21:28 - June 27, 2016

విజయవాడ : సదావర్తి భూములను ఏపీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల విలువైన సదావర్తి భూములను అప్పనంగా బడాబాబులు తన్నుకుపోతుంటే ప్రభుత్వం ఈ వ్యవహారంపై మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. మరోవైపు సదావర్తి భూముల అమ్మకాలపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆల్‌ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ నేతలు ఈ పిటీషన్ వేశారు. పిటీషన్‌ను స్వీకరించిన హైకోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసి తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది.

21:25 - June 27, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల్లో అవగాహనను పెంచేందుకు.. సంబంధిత గ్రామాల్లో పాదయాత్రకు సీపీఎం సన్నద్ధమైంది. జులై ఒకటో తేదీ నుంచి.. పార్టీ తెలంగాణ శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రను చేపట్టనున్నారు. నాలుగు రోజుల పాటు.. ముంపు గ్రామాల్లో పర్యటిస్తారు. పాదయాత్రకు సన్నాహకంగా.. ఈనెల 29న హైదరాబాద్‌లో భూనిర్వాసితుల సదస్సునూ సీపీఎం.. ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ఈ పాదయాత్ర సాగనుంది. జులై ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల పరిధిలో ఈ యాత్ర సాగనుంది. 2013 భూసేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వ జీవో-123 గురించి రైతుల్లో అవగాహనను పెంచేందుకు మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా.. పాదయాత్ర గురించి వివరించారు.

అండగా సీపీఎం..
జీవో ప్రకారం ఎక్కువ పరిహారం వస్తుందని, చట్టం ప్రకారమైతే తక్కువ మొత్తం వస్తుందని మంత్రి హరీశ్‌రావు చెప్పడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే జరిగే నష్టానికి ప్రతిపక్షాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన ప్రజలు, రైతులు చట్టం, జీవోలపై లేవనెత్తిన సందేహాలకు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ సమాధానం చెప్పారు. 123 జీవోకు వ్యతిరేకంగా రైతులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. మల్లన్నసాగర్‌ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు విమర్శించారు. భూ నిర్వాసితుల సదస్సుకు హాజరైన ప్రజలు మల్లన్నసాగర్‌పై సీపీఎం చేపట్టే ఉద్యమాలను అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

21:23 - June 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సహాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రులను కోరారు.. కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో భేటీ అయ్యారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా వరల్డ్‌ సిటీ నిర్మాణానికి 1500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.. కేటీఆర్‌ విజ్ఞప్తిపై స్పందించిన నిర్మలా సీతారామన్‌... తొలి విడతలో 200 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.. ఆ తర్వాత కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్‌, జేపీ నడ్డాతోకూడా భేటీ అయ్యారు.. హరిత హారం రెండో ఫేజ్‌కు రావాలని జేపీ నడ్డాను కేటీఆర్‌ ఆహ్వానించారు.. ఫార్మాసిటీకి అనుమతులివ్వాలని ప్రకాశ్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు.

21:22 - June 27, 2016

చైనా : ఏపీ సీఎం చంద్రబాబు చైనాలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఏపీలో పరిశ్రమల స్థాపించాలంటూ పలు కంపెనీల ప్రతినిధులను కోరారు... సీఎం విజ్ఞప్తితో కృష్ణపట్నంలో గ్యాస్‌ ఆధారిత ఎరువుల కర్మాగారం స్థాపనకు చైనా హాంక్యూ కాంట్రాక్టింగ్ సంస్థ ముందుకొచ్చిది.. విజయవాడ, విశాఖ, తిరుపతినుంచి నేరుగా విదేశాలకు విమానాలు నడిపేందుకు ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌కూడా అంగీకరించింది. చైనాలో రెండో రోజుకూడా ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ యాసుషి అకాహోషితో సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపిస్తే సింగిల్‌ డెస్క్‌ విధానంలో అనుమతులిస్తామని తెలిపారు. చంద్రబాబు విజ్ఞప్తిపై స్పందించిన జెట్రో ప్రెసిడెంట్‌... తాము త్వరలో విజయడకు వస్తామని హామీ ఇచ్చారు. యునైటెడ్‌ పార్శిల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ స్ట్రాటజీ ప్రెసిడెంట్‌ జాన్‌ విల్లెం బ్రీన్‌తోనూ సీఎం భేటీ అయ్యారు.. విశాఖ కృష్ణపట్నం ఓడరేవుల్ని కార్గో హబ్‌లుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.. ఈ సంస్థ 280 దేశాల్లో పార్శిల్ సేవలు అందిస్తోంది. టియాంజిన్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. కృష్ణపట్నంలో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం స్థాపనకు చైనా హాంక్యూ కాంట్రాక్టింగ్‌ కార్పొరేషన్, ఇసోమెరిక్‌ హోల్డింగ్స్, ఎల్‌ఈపీఎల్‌ వెంచర్స్‌తో ఈ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది 10వేల 183 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో ఎరువుల కర్మాగారం నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ కర్మాగారంవల్ల ప్రత్యక్షంగా 5వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి..

విజయ్‌ పునోసామిని కలువనున్న బాబు..
అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ పునోసామినికూడా చంద్రబాబు కలుసుకున్నారు.. విజయవాడ, విశాఖ, తిరుపతినుంచి నేరుగా విదేశాలకు విమానాలు నడిపేందుకు పునోసామి అంగీకరించారు.. ఆ తర్వాత ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి స్పెయిన్‌కుచెందిన ఆక్సియోనా ఎనర్జీ ముందుకొచ్చింది.. 2వందల మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని కంపెనీ టెక్నలాజికల్‌ హెడ్‌ జాక్విన్‌ ఎనిన్‌ తెలిపారు.. అటు ఆహార శుద్ది కర్మాగాల ఏర్పాటుకు డాన్ఫోస్ కంపెనీ బోర్డు ఛైర్మన్‌ జోర్జన్‌ మాడ్స్‌క్లాసన్‌ కూడా ఆసక్తి చూపింది. చైనా ప్రభుత్వ ఎస్సెట్స్‌ సూపర్‌విజన్‌ అండ్ అడ్మినిస్ట్రేటివ్‌ కమిషన్‌ ప్రతినిధులతోకూడా ఏపీ సీఎం సమావేశమయ్యారు.. ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుతో వ్యాపార భాగస్వామిగా ఉండాలని కోరారు. చైనాలో చంద్రబాబుతోపాటు మంత్రులు యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తోపాటు పలువురు అధికారులు పర్యటిస్తున్నారు.

జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..

కరీంనగర్ : జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఐదు గంటలుగా కొనసాగుతున్నాయి. కీలకమైన ఫైలు స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ రజనీని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

 

అంధకారంలో యాదాద్రి..

నల్గొండ : భువనగిరి, ఆలేరు, యాదాద్రిలో భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రిలో అంధకారం నెలకొంది. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఐదుగురిని కాల్చి చంపిన తాలిబన్లు..

కాబూల్ : ఇటీవలే అపహరణకు గురైన 8మందిలో ఐదుగురిని తాలిబన్లు కాల్చి చంపారు. నార్థర్న్ కున్జు ప్రావిన్స్‌లో ఓ బస్సు నుంచి 8మందిని అపహరించుకపోయిన విషయం తెలిసిందే.

ఇతిహద్ వైస్ ప్రెసిడెంట్ తో బాబు భేటీ..

చైనా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామితో భేటీ అయ్యారు.

20:47 - June 27, 2016

ఏ దేశానికైనా గుండెకాయలాంటిది. అలనాడు రాజులు శత్రు దుర్భేద్యమైన రాజధానికి నిర్మించుకునే వారు. ఇప్పుడు ఆకాశహర్మ్యాలు అధునాతన సౌకర్యాలతో సుందర నగరాలు నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతానికి రాజధాని అంశం ఎన్నో సమస్యలకు కారణమయింది. చెన్నపట్నం నుంచి, కర్నూలు, అక్కడి నుంచి హైదరాబాద్, తిరిగి అమరావతి.. ఇలా రాజధాని చుట్టూ అల్లుకున్న కలలు ఎప్పటికప్పుడు చెదరిపోతుంటే ఆంధ్ర ప్రజలకు కొత్త సవాళ్లు వచ్చి పడుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం..దేశమంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నాడు గురజాడ.. కానీ, కాళ్ల కింద మట్టి కూడా ముఖ్యమౌతోంది. మనుషులు మట్టిని వెతుక్కుంటూ తరలి వెళ్లే పరిస్థితి వస్తోంది. రాజధానిని కలలుగంటూ హైదరాబాద్ నుంచి అమరావతికి తరలుతున్న ఆంధ్రప్రదేశ్ ఓ సంక్షోభ సమయాన్ని చూస్తోంది.

చెన్నపట్నం నుంచి కర్నూలు..
చెన్నపట్నం నుంచి కర్నూలు రాజధానిగా మారటం ఓ చారిత్రక సందర్భం. ఎలాంటి ఏర్పాట్లు సౌకర్యాలు లేకుండా నాడు.. కర్నూలు నుంచి పాలన సాగింది. గుడారాలలో సాగిన పాలనతో సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. మూడేళ్లలో హైదరాబాద్ చేరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కర్నూల్ టూ..హైదరాబాద్.. విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత జరిగిన పెద్ద మార్పు. కొత్త రాజధానిగా హైదరాబాద్. నవాబుల నగరంలో అన్నీ రెడీమేడ్ గా ఉన్నాయి. సువిశాల నగరం , భారీ భవనాలు, పరిపాలనకు అత్యంత సౌలభ్యంగా ఉండటంతో రాజధానిగా హైదరాబాద్ స్థిరపడింది. అదే సమయంలో హైదరాబాద్ తో పెంచుకునున్న అనుబంధాన్ని ఇప్పుడు ఎంతోమంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఏపి రాజధాని అమరావతి వైపు పాలన మారుతోంది. ఉద్యోగుల తరలింపు, కార్యాలయాల ఏర్పాటుతో కొత్త రాజధాని వైపు మరిన్ని అడుగులు పడుతున్నాయి.

ఎన్నో ఆకాంక్షలు....మరెన్నో సందేహాలు..
ఈ క్రమంలో ఎన్నో ఆకాంక్షలు....మరెన్నో సందేహాలు..అమరావతి ఆంధ్రప్రజల కలల రాజధానిగా మారుతుందా? లేక రియల్ కేంద్రంగా మిగులుతుందా? బహుళ అంతస్థుల భవనాలు, మెట్రో రైళ్లు, విశాలమైన రోడ్లు, పార్కులు... పేపర్ మీద ప్రణాళిక అద్భుతంగా ఉంది.. వీటిలో వాస్తవ సాధ్యాలెన్ని? ఆధునిక అమరావతి నిర్మాణానికి ఎలాంటి సమస్యలున్నాయి? ఇన్ని సమస్యల మధ్య రాజధాని నిర్మాణం జరిగి, ప్రభుత్వం చెప్తున్న పెట్టుబడులు తరలివచ్చి, అభివృద్ధి ఊపందుకునే సమయం ఎప్పుడూ అంటే చెప్పటం కష్టమే కానీ, రాజధాని అంటే నాలుగు రోడ్లు, పది భవనాలు, ఓ పార్కు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు, వారి బాగోగులు , ఇతర ప్రాంతాలకు కూడా పాలనా పరంగా అందుబాటులో ఉండటం, పారదర్శక విధానాలు అని గుర్తిస్తే, ఆధునిక అమరావతి కల త్వరలోనే సాకారమవుతుంది.

20:24 - June 27, 2016

ముస్లింల రిజర్వేషన్ కోసం సీఎం కేసీఆర్ హామీల మీద హామీలు..ఉభయ రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నేత నారాయణ విసుర్లు..రాష్ట్రంలో దొంగతనాలు..పలు నేరాలు జరుగుతున్నా రాష్ట్ర హోం మంత్రి నాయినీ శాంతిమంత్రం జపిస్తున్నరు. లంచాల కోసం పోలీసోళ్ల కొట్లాట..కర్ణాటక ముఖ్యమంత్రి మెడకు మరో వివాదం చుట్టుకుంది..వర్షాల కోసం ఆడోళ్ల బతుకమ్మ ఆటలు...కట్కలతో పనిలేదు..చప్పట్లతో పని అయిపోతది..తెలుగు సినిమాలో మరో ముందడుగు పడింది. పందిపిల్లతో సినిమా తీస్తున్న రవిబాబు..ఈ అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న' ముచ్చట్లు చెప్పిండు. ఈ ముచ్చట్ల కోసం చూడాలంటే వీడియో క్లిక్ చేసేయండి..

టి.టిడిపి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..

హైదరాబాద్ : నాంపల్లి రెడ్ రోజెస్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ టిడిపి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ విందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తదితర నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

8మంది ఐపీఎస్ ల బదిలీలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ గా నవీన్ చంద్, సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ ఈస్ట్ జాయింట్ కమిషనర్ గా శశిధర్ రెడ్డి, ఆర్బీవీ ఆర్ఆర్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా ఎంకే సింగ్, లా అండ్ ఆర్డర్ డీఐజీగా కల్పనా నాయక్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, ఐజీగా సందీప్ శాండిల్యాలు నియమితులయ్యారు.

20:09 - June 27, 2016

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆనాడు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి షాద్ నగర్ లో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీ మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ జర్నలిస్టు ఈ ప్రశ్న అడిగితే నేను గట్ల అనలేదు సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా మళ్లీ అదే హామీలు గుప్పించిండు. ఇక ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో కూడా ఇదే విషయాన్ని మరలా మాట్లాడారు. మరి సీఎం కేసీఆర్ గతంలో ఏం మాట్లాడారో..ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో వీడియోలో చూడండి..

మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం - హరీష్ రావు..

హైదరాబాద్ : ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో జులై 15వ తేదీన గోదావరి అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇరిగేషన్ మంత్రులు, ముఖ్యకార్యదర్శులు హాజరవుతారని తెలిపారు. ఇది చారిత్రాత్మక ఒప్పందమని, మేడిగడ్డ బ్యారేజీని 101 మీటర్ల ఎత్తు డిజైన్ తో నిర్మించేందుకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర పేర్కొందని తెలిపారు. 100 మీటర్ల ఎత్తు వరకే ప్రస్తుత నీటి నిల్వ ఉంచేందుకు గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు.

ముంబైలో గోదావరి అంతర్ రాష్ట్ర మండలి భేటీ..

హైదరాబాద్ : జులై 15న ముంబైలో గోదావరి అంతర్ రాష్ట్ర మండలి భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, కొరాటా - చనాఖా ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తుది ఒప్పందాలు జరగనున్నాయి.

19:44 - June 27, 2016

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రైతులనుంచి తీసుకున్న భూములను సింగపూర్ కంపెనీలకు కేటాయించడానికి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేబినెట్‌ నిర్ణయం తీసేసుకుంది. ఈ పద్ధతిలో నిర్మాణాలకు ముందుకు వచ్చే కంపెనీలకు భూముల్లో 58 శాతం కేటాయించి, 42 శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేలా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. అయితే ఇలా అధికశాతం వాటా విదేశీ కంపెనీలకు కట్టబెట్టి రాజధాని నిర్మాణం సాగించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి చర్చ చేపట్టింది. ఈ చర్చలో బాబురావు (సీపీఎం), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), ఉదయభాను (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

19:24 - June 27, 2016

జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం - అల్లం నారాయణ..

హైదరాబాద్ : ఆపదలో ఉన్న జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మరణించిన జర్నలిస్టులకు కుటుంబాలకు రూ. లక్షతో పాటు నెలకు రూ. 3వేల పెన్షన్ అందచేయడం జరుగుతుందన్నారు. గాయపడిన జర్నలిస్టులకు రూ. 50వేలు అందచేస్తామని, జర్నలిజం కోర్సు చదివే జర్నలిస్టుల పిల్లలకు జాతీయ స్థాయిలో రూ. లక్ష, విదేశాల్లో చదువుకొంటే రూ. 5లక్షల సాయం అందిస్తామన్నారు.

న్యాయమూర్తుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలి - ప్రొ.కోదండరాం..

హైదరాబాద్: ఇద్దరు న్యాయమూర్తుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని, హైకోర్టు విభజనే ఇందుకు పరిష్కారమని ప్రొ. కోదండరాం వెల్లడించారు. మల్లన్న సాగర్ ముంపు నివారణకు వీలున్న మార్గాలను పరిశీలించాలని, డీపీఆర్ ను వెల్లడించి ప్రభుత్వం చర్చకు పెట్టాలని సూచించారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అవకాశాలు పరిశీలించాలన్నారు.

సదావర్తి భూములపై విచారణకు సిద్ధం - రామానుజయ్య..

విజయవాడ : పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సదావర్తి భూములను ఎందుకు పరిరక్షించలేదని...390 ఎకరాల భూమి ఆక్రమణకు గురైతే ఏం చేశారని.. సదావర్తి భూములపై ఏ విచారణకైనా సిద్ధమని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్య ప్రకటించారు. ఓపెన్ టెండర్ల ద్వారా 22 కోట్లకు భూములు దక్కించుకోవడం జరిగిందని, రాద్ధాంతం చేస్తున్న వారు టెండర్లలో ఎందుకు పాల్గొనడం లేదన్నారు. టెండర్లు పిలిస్తే అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

పలు రాష్ట్రాల్లో హై అలర్ట్...

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. హర్యానా, పంజాబ్, చండీఘడ్ లోనూ హై అలర్ట్ ప్రకటించారు.

రేపటి నుండి జడ్జిల మూకుమ్మడి సెలవులు..

హైదరాబాద్ : రేపటి నుండి 200 మంది తెలంగాణ జడ్జిల మూకుమ్మడిగా సెలవులు పెట్టనున్నారు. ఇద్దరు జడ్జీల సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు విధుల్లోకి చేరేది లేదని జడ్జెస్ అసోసియేషన్ పేర్కొంది.

 

మహిళపై సుత్తితో దాడి..

నల్గొండ : మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై నడిచివెళుతున్న మహిళపై సుత్తితో దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ నర్మద (29) మృతి చెందింది. బైక్ పై వచ్చి దాడి చేసి పరారయ్యాడు. భర్తపైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

రేపటి నుండి జడ్జిల మూకుమ్మడి సెలవులు..

హైదరాబాద్ : రేపటి నుండి 200 మంది తెలంగాణ జడ్జిల మూకుమ్మడిగా సెలవులు పెట్టనున్నారు. ఇద్దరు జడ్జీల సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు విధుల్లోకి చేరేది లేదని జడ్జెస్ అసోసియేషన్ పేర్కొంది.

మహిళపై సుత్తితో దాడి..

నల్గొండ : మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై నడిచివెళుతున్న మహిళపై సుత్తితో దుండగుడు దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ నర్మద (29) మృతి చెందింది. బైక్ పై వచ్చి దాడి చేసి పరారయ్యాడు. భర్తపైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

18:46 - June 27, 2016

విజయవాడ : ఏపీలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇచ్చే ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం నేలపాడు గ్రామంలో మాత్రమే రైతులకు ప్లాట్లు కేటాయించి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఇంకా 28 గ్రామాల రైతులకు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. రైతులకు అధీకృత అధికారి పేరుతో నేలపాడులో ప్లాట్‌ నెంబర్లను కేటాయించి పత్రాలిచ్చారు. అయితే మిగతా గ్రామాలకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు నేలపాడు గ్రామంలో 90 శాతం ప్లాట్ల పంపిణీ పూర్తి చేసిన సీఆర్డీఏ అధికారులు.. మిగతా 28 గ్రామాలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో... తమకెప్పుడు ప్లాట్లు కేటాయిస్తారన్న ఆసక్తి సంబంధిత రైతుల్లో నెలకొంది.

అధికారుల కసరత్తు..
గతేడాది డిసెంబర్‌ నుంచి కసరత్తు చేస్తున్న అధికారులు నేలపాడులోనూ మిగిలిన భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా గ్రామాల్లో ఇంకా అధ్యయనం కొనసాగుతోంది. నేలపాడు, ఉద్దండ్రాయుని పాలెం గ్రామాలు మినహా.. మిగతా గ్రామాల్లో సామాజిక ప్రభావ అధ్యయన నివేదికలపై ఇంకా సభలు నిర్వహించలేదు. త్వరలోనే ఈ సభలు నిర్వహిస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మిగతా గ్రామాల రైతులకు కూడా ప్లాట్లు అందజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో సామాజిక ప్రభావ అధ్యయనంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే ఎనిమిది గ్రామాల్లో భూసేకరణపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్తు 20న ప్రారంభమైన గ్రామకంఠాల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. భూమి ఇవ్వడానికి వ్యతిరేకించిన రైతులు దాఖలు చేసిన అభ్యంతరాలపై స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. పలు అభ్యంతరాలు సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌ జైన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబతున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా భూసేకరణ పూర్తి కాగానే.. త్వరలోనే నోటిఫికేషన్‌ ఇచ్చి మిగతా గ్రామాల్లో ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ సిద్ధమవుతోంది.

18:34 - June 27, 2016

విజయవాడ : తెలంగాణ నుంచి ఏపీకి ప్రభుత్వ శాఖల తరలింపు వేగం పుంజుకుంది. ఇప్పటికే అనేక శాఖలు గుంటూరు, అమరావతిలో ఆయా శాఖల కార్యాలయాల్ని ప్రారంభించగా మరికొన్ని తరలివెళ్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే విజయవాడలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యాలయాన్ని రేపు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ప్రారంభమవుతుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ ఉదయలక్ష్మీ తెలిపారు. ప్రభుత్వ మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ప్రసాదంపాడులో ఉన్న కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె టెన్ టివితో మాట్లాడారు. మంచి బిల్డింగ్ కావాలని ఎదురు చూడడం జరిగిందని, అనంతరం ఈ ప్రాంతంలో అనువైన బిల్డింగ్ లభ్యమైందన్నారు. కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, ఇవి పూర్తికాగానే ఇక్కడి నుండే పరిపాలన చేస్తామన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరుతున్నారని, ఎయిడెడ్ కాలేజీలన్నీ దయనీయంగా ఏవీ లేవని అన్నీ బాగానే ఉన్నాయన్నారు.

18:33 - June 27, 2016
18:32 - June 27, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కొత్తగా 11 కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 27 నుంచి నవ్యాంధ్ర నుంచే పరిపాలన కొనాసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పలువురు మంత్రులు ఆయా కార్యాలయాలను ప్రారంభించారు. విజయవాడలో పంచాయతిరాజ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ భవన్‌ను మంత్రి ఘంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇదే భవనంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని మంత్రి మృణాలిని ప్రారంభించారు. ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. వీటితో పాటు చీఫ్ ఇంజినీర్‌ సీఈడీడీవో, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్, కాపు కార్పొరేషన్‌ తదితర కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో పంచాయితీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తామూ భాగస్వాములమవుతామని తెలిపారు. కొత్త కార్యాలయంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాటన్నింటిని నిలదొక్కుకొని పనిచేస్తామని ఆయన అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొత్తగా ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అయ్యన్నపాత్రుడు, మృణాళిని హాజరయ్యారు. ఉద్యోగులకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. అమరావతిలో నూతనంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర్ రావు, అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. ఇబ్బందులు ఉన్నా.. సొంత రాష్ర్టం నుంచే పాలన కొనసాగించాలని చంద్రబాబు సూచనల మేరకు ఉద్యోగులు అమరావతికి తరలివస్తున్నారని మంత్రులు తెలిపారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ ఎదురుగా పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు.

విజయనగరంలో విజృంభిస్తున్న అతిసార..

విజయనగరం : జిల్లాలో అతిసార విజృంభిస్తోంది. పది రోజుల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీఎం పేట, కొత్తవలస పీహెచ్ సీలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సరిపడా పడకలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

18:23 - June 27, 2016

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చిత్రంపై అందరి కళ్లున్నాయి. ఈ చిత్రం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమిళ చిత్రాన్ని తెలుగులో రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ చిత్రం మొన్న షూటింగ్ ప్రారంభమైంది. చిత్ర షూటింగ్ కు సంబంధించిన ఫొటోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. చిరంజీవి లుక్ బాగుందని టాక్స్ వినిపిస్తున్నాయి. చిత్రానికి 'కత్తిలాంటోడు' టైటిల్ పెడుతున్నట్లు టాక్. అయితే చిరు సరసన ఏ హీరోయిన్ నటించనుందోనన్న ఉత్కంఠ ఇంకా నెలకొంది. పలువురి హీరోయిన్లను పరిశీలించన చిత్ర యూనిట్ చివరకు బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీని ఎంపిక చేశారని తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు 22న రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మరి ఆ రోజున ఫస్ట్ లుక్ విడుదలవుతుందా ? లేదా ? అనేది చూడాలి.

ఈసారి కూడా అధికారికంగా బోనాల పండుగ – నాయినీ..

హైదరాబాద్ : గత సంవత్సరంలాగే ఈసారి కూడా బోనాల పండుగను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర హోం మంత్రి నాయినీ వెల్లడించారు. ఈ సంవత్సరం పండుగ నిర్వహణ కోసం నిధులు పెంచాలని కొందరు కోరారని సీఎం కేసీఆర్‌ను అడిగి విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. బోనాల పండుగపై మంత్రుల సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో బోనాల కమిటీ ఛైర్మన్ నాయిని నర్సింహరెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాదకద్రవ్యాలు లభ్యం..

ఢిల్లీ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజనియా దేశస్థుని నుంచి పది కిలోల సూడోఫెడ్రిన్ అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

హైకోర్టు బార్ అసోసియేషన్ లో న్యాయవాదుల సమావేశం..

హైదరాబాద్ : న్యాయవాదులు హైకోర్టు బార్ అసోసియేషన్ లో సమావేశమయ్యారు. న్యాయవాదుల ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఇద్దరు న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సీజే బెంచ్ ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుండే సీజే బెంచ్ బహిష్కరణ చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్లాలని న్యాయవాద జేఏసీ నేతలు నిర్ణయించారు. హోం మంత్రి, న్యాయశాఖ మంత్రులను నేతలు కలువనున్నారు. హైకోర్టు తాత్కాలిక సీజేను తొలగించాలని సుప్రీం చీఫ్ జస్టిస్ కు న్యాయవాదులు లేఖలు రాయనున్నారు.

టి.న్యాయవాది ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : హైకోర్టును విభజించాలంటూ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని తిరుమల్ అనే న్యాయవాది నిప్పంటించుకున్నాడు. సకాలంలో పోలీసులు మంటలను ఆర్పారు. న్యాయవాది తిరుమల్ కు స్వల్పగాయాలయ్యాయి.

కేంద్ర మంత్రి జవదేకర్ తో మంత్రి కేటీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. పర్యావరణ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జులై 11వ తేదీన రెండో విడత హరితహారం కార్యక్రమానికి హాజరు కావాలని ప్రకాష్ జవదేకర్ ను కేటీఆర్ ఆహ్వానించారు.

 

ఏన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట ఏపీ నిరుద్యోగుల ఆందోళన..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట ఏపీ నిరుద్యోగ యువత బైఠాయించింది. గ్రూప్ 2లో పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

కీసర హత్య కేసును చేధించిన పోలీసులు..

రంగారెడ్డి : కీసరలో లాయర్ హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులు లోకేష్ రెడ్డి, సుమన్ రెడ్డిలను అరెస్టు చేశారు. కారులో ఉదయ్ కుమార్ ను నిందితులు సజీవదహనం చేశారు. ఐదెకరాల భూమి కొనుగోలు విషయంలో వివాదం తలెత్తింది. తగులబెట్టే క్రమంలో నిందితుడు లోకేష్ రెడ్డికి గాయాలయ్యాయి.

17:23 - June 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ జడ్జీలను సస్పెండ్ చేయడం పట్ల న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ న్యాయవాదులు రోడ్డెక్కారు. తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ లను హైకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. ఆదివారం రాజ్ భవన్ కు ర్యాలీ నిర్వహించినందుకు కోర్టు ఈ చర్య తీసుకుంది. ఈ సందర్భంగా అడ్వకేట్స్ టెన్ టివితో మాట్లాడారు. న్యాయం అడిగినందుకు వారిని సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. తెలంగాణ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ఎలాంటి న్యాయం జరగదని పేర్కొన్నారు. సిగ్గుమాలిన పనులను వదిలిపెట్టాలని, వెంటనే వీరిపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలుస్తామన్నారు.

17:12 - June 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల కొర‌త త్వరలో తీరనుంది. కొరత తీర్చడానికి ప‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,335 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కలెక్టర్ల ద్వారా తాత్కాలిక పద్ధతితో విద్యావాలంటీర్ల ఎంపిక జరగాలని, ఉపాధ్యాయుల పోస్టులు భ‌ర్తీ అయ్యే వ‌ర‌కు విద్యా వాలంటీర్ల‌ను కొన‌సాగించాల‌ని తెలిపారు. మరి వీరి నియామకంతో ఉపాధ్యాయుల కొరత తీరుతుందా ? లేదా ? అనేది చూడాలి.

బోనాల పండుగపై సమీక్ష..

హైదరాబాద్: నగరంలో జరిగే బోనాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బోనాల నిర్వహణపై చర్చించారు.

17:04 - June 27, 2016

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వ్యక్తి.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా దేవాలయాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆలయాలను ఏ ప్రభుత్వం కూడా మూడేళ్లకు మించి ఆధీనంలో ఉంచుకోకూడదంటూ స్వామి చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఆలయాలకు ప్రభుత్వ గుత్తాధిపత్యం నుంచి విముక్తి కల్పించాలన్న ఆయన మాటలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి స్పెషల్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి (బీజేపీ), విజయ్ కుమార్ (టిడిపి), మురళీ (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

17:01 - June 27, 2016

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అనగానే ఎంతో గొప్పగా ఊహించేసుకుంటాం. కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగం, వేలల్లో జీతం, అందుబాటులో వెహికల్ సౌకర్యం.. ఇంకేంటి అనుకుంటాం..? కానీ తెలీకుండా పని ఒత్తిడి.. గంటలకొద్దీ కూర్చోవడం వంటి వెంటాడే సమస్యలు కూడా పొంచే ఉంటాయి. అందుకే ఇలాంటి ఉద్యోగినులు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో వీడియోలో తెలుసుకోండి.

16:58 - June 27, 2016

మట్టికి మనిషికి ఎంత అనుబంధముందో, వ్యవసాయానికి మహిళకి కూడా అంతటి అనుబంధమే ఉంది. నాగలి కనిపెట్టి వ్యవసాయం మొదలుపెట్టిన నాటి నుండి, ఆ భూమిని కాపాడుకునేందుకు అంతకంతకూ ఉధృతమవుతున్న అనేకానేక భూ పోరాటాల దాకా మహిళలు నేటికీ ముందే ఉంటున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరుగుతున్న అలాంటి పోరాటానికే ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. అడవిలో అలజడి మొదలైంది. చిరు జల్లలు పలకరించాయన్న సంతోషంతో పోడు భూముల్లోకి వెళ్లినవారికి నిర్బంధం ఎదురవుతోంది. భూమిని దున్నబోతే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక మేమెలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు అడవి బిడ్డలు ? ప్రజాసంక్షేమని చెప్పే పాలకులు ఈ అమాయక గిరిజనుల మాటలను ఆలకించాలని మానవి ఆకాంక్షిస్తోంది. అభివృద్ధి జపం చేస్తున్న పెద్దలు ఈ అడవిబిడ్డల గోడును పట్టించుకోవాలని మానవి కోరుకుంటోంది.

16:54 - June 27, 2016

ఇంటి నుండి కాలు బైట పెట్టి, తిరిగి ఇంటికొచ్చే వరకూ ఆడపిల్లలు నిత్యం అభద్రతకు గురవుతూనే ఉన్నారు. అడుగడుగునా అవమానాలను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇలాంటి సమయాల్లో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలిసుండడం ఎంతో కొంత ధైర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఎంటో వీడియో క్లిక్ చేయండి.

16:52 - June 27, 2016

కళాతృష్ణ ఉండాలే కానీ, ఇంట్లో ఉండే ఏ ఐటమ్ తోనైనా, అందమైన కళాకృతులు చేసుకోవచ్చు. రంగుల కుంచెతో అందమైన కాన్వాస్ లు సృష్టించొచ్చు. అందుకు కొంచెం టైం, ఇంకాస్త ఓపిక ఉంటే చాలు.. మరి అలాంటి కలర్ ఫుల్ పెయింటింగ్స్ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

16:49 - June 27, 2016

భారత మహిళా బాక్సర్లను అంతర్జాతీయ స్థాయిలో మెరవడం కష్టమే అంటుంది ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌. అందుకు తగిన శిక్షణ కొరవడిందని అంటోంది. వరల్డ్‌ కప్‌లో భారత ఆర్చరీ బృందం అదరగొట్టింది. ఆదివారం జరిగిన వరల్డ్‌ కప్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో దీపికా కుమారి, అటన్‌ దాసు జోడీ రజత పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అత్యాచారానికి గురైన మహిళలు ఎలాంటి మానసిక వేదన వర్ణనాతీతం. ఆ వేదన జీవితాంతం ఎలా వేధిస్తుందో చెప్పలేం. అలాంటి బాధితుల కోసం ప్రత్యేక క్లినిక్ ను ఆరంభించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. క్యాన్సర్ మహమ్మారి పేరు చెప్పగానే వణుకు పుట్టినంత పనవుతోంది జనాలకు. అంతగా భయాందోళనలకు గురి చేస్తూ వేధిస్తోన్న క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. మార్పుని స్వాగతిస్తేనే ఫలితాలు మరింత ఫలవంతంగా ఉంటాయి. ఆ మార్పే ఆ ఏడాది కార్మెన్‌హిజోసా ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ అవార్డు అందుకునేలా చేసింది. పూమా వంటి అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థలూ ఆమె సేవలని కోరుతున్నాయి.

16:38 - June 27, 2016
16:34 - June 27, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో భేటీ అయ్యారు. గంటకుపైగా సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా వరల్డ్‌ సిటీ నిర్మాణానికి 1500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాల్లో పురోగతి లేదని వివరించారు. అలాగే రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై నిర్మలా సీతారామన్‌ సానుకూలంగా స్పందించారని కేటీఆర్‌ తెలిపారు. తొలి విడతలో 200 కోట్లు ఇస్తామని, భవిష్యత్ లో మరిన్ని ఇస్తామని హామీనిచ్చారని తెలిపారు. వరంగల్ లో నెలకొల్పబోయే టెక్స్ టైల్ పార్కుకు నిధులు కావాలని కూడా కోరడం జరిగిందని, పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాలని కేంద్ర మంత్రి నిర్మల పేర్కొనడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.

స్వార్థం కోసం పార్టీల ధర్నాలు - ఆర్టీసీ ఛైర్మన్..

హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై ప్రజల నుండి వ్యతిరేకత లేకున్నా కొన్ని పార్టీలు స్వార్థం కోసం ధర్నాలు చేస్తున్నాయని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఛార్జీలు పెంచిందని, ఏపీలో ఆరు నెలల క్రితమే ఛార్జీలు పెంచినా అక్కడ ధర్నాలు చేయని వారు ఇక్కడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

 

సంక్షోభ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ..

హైదరాబాద్ : రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాయితీ కల్పించారు. స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్ ఛార్జీలను రూ. 2కు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్ ఛార్జీని రూ. 1.50కు తగ్గిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఛార్జీలు ఏడాది పాటు అమలులో ఉండనున్నాయి.

విద్యావాలంటీర్ల నియామకానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : పాఠశాల విద్యను మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,335 మంది విద్యావాలంటీర్ల నియామకానికి సీఎం ఆమోదం తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్లు తాత్కాలిక పద్ధతిలో వీవీలను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం అయ్యే రెగ్యులర్ టీచర్లు వచ్చే వరకు విద్యావాలంటీర్లు విధుల్లో కొనసాగనున్నారు.

హైకోర్టులో సదావర్తి భూముల అమ్మకాలపై పిటిషన్..

హైదరాబాద్ : సదావర్తి భూముల అమ్మకాలపై హైకోర్టులో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ పిటిషన్ దాఖలు చేసింది. సంబంధిత అధికారులకు నోటీసులు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 4కు వాయిదా పడింది.

ఎల్లుండి తాత్కాలిక సచివాలయం ప్రారంభం..

విజయవాడ : ఎల్లుండి మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం కానుంది. డీ-5 బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మొదట తాత్కాలిక సచివాలయంలోకి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, కార్మిక, వైద్య ఆరోగ్య శాఖలు వెళ్లనున్నాయి.

హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ పోటీలు..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ పోటీలు ప్రారంభయ్యాయి. ఈ పోటీలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.

వేలంలో పౌత కౌలుదారుల ఆత్మహత్యాయత్నం..

గుంటూరు : మంగళగిరి సీతారామ స్వామి కోవెలకు చెందిన 4.50 ఎకరాల దేవుడి భూమి కౌలు వేలంలో ఘర్షణ చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న తమని కాదని బహిరంగ వేలం నిర్వహించడం వల్ల అధికారులపై పాత కౌలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం రద్దు చేయాలని ఒంటిపై కిరోసిన్ పోసుకుని పాత కౌలుదారులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలం వాయిదా పడింది.

15:55 - June 27, 2016

నాగశౌర్య..నిహారిక కొణిదెల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఒక మనసు'. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా టెన్ టివి డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో ముచ్చటించింది. పలువురు కాలర్స్ అభిప్రాయాలు తెలిపారు. ఈ చిత్రంలో 'నిహారిక' చనిపోవడం కరేక్టనని చిత్ర యూనిట్ పేర్కొంది. సినిమాకు క్లైమాక్సే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ కాలర్ మాట్లాడారు. చిత్రం విమర్శించాడానికే తాను వెళ్లడం జరిగిందని కానీ విమర్శించడానికి చిత్రంలో ఏమీ లేవన్నారు. ప్రేమ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్న కుమారుడు పేర్కొన్నారని కాలర్ పేర్కొన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

15:38 - June 27, 2016

నాగశౌర్య..నిహారిక కొణిదెల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఒక మనసు'. ఈచిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించగా రామరాజు రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకొంటోంది. ఈ సందర్భంగా టెన్ టివి చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను వారు తెలియచేశారు. చిత్ర కథను ముందుగా తాము నాగబాబుకు తెలియచేయడం జరిగిందని, అనంతరం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాము చిత్రం చేయడం జరిగిందన్నారు. చిత్రం చూసిన అనంతరం నాగబాబు ప్రశసించారని తెలిపారు. చిరంజీవి షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల చిత్రం చూడలేదని, త్వరలో చూస్తారని తెలిపారు. వీరితో కాలర్స్ కూడా అభిప్రాయాలు తెలిపారు. మరి చిత్ర యూనిట్ ఎలాంటి అభిప్రాయాలు తెలిపారు ? కాలర్స్ ఏలాంటి వ్యాఖ్యలు చేశారు ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

15:28 - June 27, 2016

ఢిల్లీ : గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కే మరోపేరుగా నిలిచే వింబుల్డన్ ఓపెన్లో ప్రైజ్ మనీ ఏడాది ఏడాదికీ పెరుగుతూ వస్తోంది. ఈ రోజు నుంచి జులై 10 వరకూ జరిగే 2016 వింబుల్డన్ ఓపెన్లో ప్రైజ్ మనీ మొత్తం ఐదు శాతం పెంచినట్లు...నిర్వాహక సంఘం ప్రకటించింది. 2014 టోర్నీతో పోల్చి చూస్తే 2016 చాంపియన్లు 12 శాతం అధికంగా ప్రైజ్‌ మనీ అందుకోబోతున్నారు. 2016 వింబుల్డన్ టోర్నీ ప్రైజ్ మనీ విశేషాలు..గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సర్క్యూట్లో నాలుగు రకాల టోర్నీలు ఉన్నా...లండన్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టుల్లో జరిగే వింబుల్డన్ కు ఉన్న చరిత్ర, ఘనత మరే టోర్నీకి లేవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 13 దశాబ్దాలుగా జరుగుతున్న ఈటోర్నీ కాలానుగుణంగా మార్పులు చేసుకొంటూ వస్తోంది. సంప్రదాయలు, నియమ నిబంధనలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే వింబుల్డన్ లో పాల్గొనటమే గొప్ప గౌరవంగా క్రీడాకారులు భావిస్తే, పోటీలను ప్రత్యక్షంగా వీక్షించడం తమ అదృష్టంగా అభిమానులు మురిసిపోతూ ఉంటారు. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, అమెరికన్ ఓపెన్లకు ధీటుగా వింబుల్డన్ నిర్వాహకులు ప్రైజ్ మనీని సైతం పెంచుకొంటూ వస్తున్నారు. జూన్ 27 నుంచి జులై 10 వరకూ జరిగే 2016 వింబుల్డన్ టోర్నీలో 5 శాతం అధికంగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

పరాజయం చెందిన వారికి..
పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశాలలో తొలిరౌండ్లో నిష్క్రమించిన వారి నుంచి చాంపియన్ గా నిలిచిన వారి వరకూ 275 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా అందచేస్తారు. 2014 వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ చాంపియన్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ 10 కోట్ల 90 లక్షల రూపాయల చొప్పున నజరానాగా అందుకొన్నారు. ఇదే జోడీ 2016 చాంపియన్లుగా చెరో 12 కోట్ల 32 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ సొంతం చేసుకొన్నారు. 2016 సీజన్లో వింబుల్డన్ విజేతలకు 15 కోట్ల 70 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు. వింబుల్డన్ మెయిన్ డ్రా తొలిరౌండ్లోనే పరాజయం పొందిన క్రీడాకారులు దాదాపు 22 లక్షల రూపాయల వరకూ అందుకొనే అవకాశం ఉంది.

హాట్ ఫేవరేట్లు..
వింబుల్డన్ తో పోల్చి చూస్తే... 2015 సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీగా ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో చాంపియన్లకు 19 కోట్ల 50 లక్షల రూపాయలు చొప్పున ప్రైజ్ మనీ అందచేసిన సంగతి తెలిసిందే. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే..అత్యధిక ప్రైజ్ మనీని అమెరికన్ ఓపెన్ విజేతలకు ఇస్తూ వస్తున్నారు. అమెరికన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 15 కోట్ల 70 లక్షల రూపాయలు చొప్పున అందచేసిన సంగతి తెలిసిందే. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్, మాజీ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్, మహిళల సింగిల్స్ లో సెరెనా విలియమ్స్, మారియా షరపోవా హాట్ పేవరెట్లు గా బరిలోకి దిగబోతున్నారు.

టి.జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్షుడు..ప్రధాన కార్యదర్శి సస్పెండ్..

హైదరాబాద్ : తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆదివారం రాజ్ భవన్ కు ర్యాలీ నిర్వహించినందుకు కోర్టు ఈ చర్య తీసుకుంది. రవీందర్ రెడ్డి, వరప్రసాద్ లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్లకు నిరసనగా హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన చేశారు.

 

 

భూ నిర్వాసితులపై బెదిరింపులు మానుకోవాలి - తమ్మినేని..

మెదక్ : మంత్రి హరీష్ రావు భూ నిర్వాసితులపై బెదిరింపులను మానుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం కట్టిస్తామని ప్రకటించిందన్నారు. భూ నిర్వాసితులకు అండగా జులై 1 నుండి 4 వరకు ముంపు గ్రామాల్లో సీపీఎం పాదయాత్ర చేస్తుందని వెల్లడించారు. డీపీఆర్ లేకుండా కలెక్టర్ ఎలా నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టుల పరిట రాజకీయ నేతలు జేబులు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ నాటకమని పేర్కొన్నారు.

కడియం శ్రీహరి ఇంటి ఎదుట పీడీఎస్ యూ ధర్నా..

వరంగల్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఇంటి ముట్టడి జరిగింది. హన్మకొండ టీచర్స్ కాలనీలో కడియం ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీహరి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు.

కేసీఆర్..హరీష్ లు దిగజారుతున్నారు - ఉత్తమ్..

హైదరాబాద్ : కేసీఆర్..హరీష్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇవ్వనంత ఆర్ఆర్ ప్యాకేజీ పులిచింతలో ఇచ్చామన్నారు. నిర్వాసితులకు ఆధునిక వసతులతో గ్రామాలు కట్టించామని, తాను చెప్పింది అసత్యమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. పులిచింతల నుండి తెలంగాణకు 130 మెగావాట్ల విద్యుత్ వస్తోందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టలకు కక్కుర్తి పడుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు.

ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు - జానారెడ్డి..

హైదరాబాద్ : తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులతో ప్రజలను ముంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచి మార్కెట్ ధరకు నాలుగింతలు ఇవ్వాలని 2013 చట్టం చెబుతోందన్నారు.

 

15:06 - June 27, 2016

న్యూస్ పేపర్ చదివాక ఏం చేస్తాం. వేస్ట్ పేపర్ గా వాడుకుంటాం. లేదంటే, షెల్ఫ్స్ దుమ్మ పడకుండా పరుచుకుంటాం. అంతకన్నా ఏం చేయగలం? అంటారా? అయితే కాస్త ఓపికగా, ఇంకాస్త తీరికగా ఉంటే ఆ న్యూస్ పేపర్ కి నయా లుక్ ఇవ్వడం ఎలాగో వీడియోలో చూడండి.

15:04 - June 27, 2016

కొందరి జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. మరికొందరి జీవితం కడలి ఆటుపోట్లలా ఒడిదొడుకుల కుదుపులతోనే నిండి ఉంటుంది. అయినా సరే, జీవితంలోని అలాంటి ఆటుపోట్లకు ఎదురీదుతూనే, ఇతరులకు అండగా నిలవడం అంత తేలికైన వ్యవహారం కాదు. అందుకు సముద్రమంత మనసుండాలి. కొండంత సంకల్ప బలముండాలి. మొక్కవోని దీక్ష కావాలి. అలాంటి ఓ స్పూర్తి ప్రదాతనే ఈమె. కుటుంబ హింస, లైంగిక హింస మొత్తంగా మహిళలపై జరుగుతున్న ఏ రకమైన హింసకూడా ఒకరిద్దరికే పరిమితమై లేదు. ఇది వ్యక్తిగత సమస్య అంతకన్నా కాదు. ఇందుకు కారణం సామాజిక పునాదుల్లోనే ఉంది. ఆ పునాది మారనంత కాలం మహిళల సమస్యకు పరిష్కారం లేదని నమ్ముతున్నారు భానూజ. కొత్త దారిలో పయనించేవారికి అవమానాలు తప్పవు. నలుగురి కోసం బతకాలనుకునే వారికి ముళ్ల బాధలు తప్పవు. అటువంటి ఎన్నో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతున్న భానుజకి మానవి అభినందలు తెలియచేస్తోంది. మరెందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిస్తోంది.

14:54 - June 27, 2016

కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరితో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తిర విషయాలను తెలిపారు. టీసర్కార్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.... కానీ గెయిన్ చేసుకోవడంలో తాము విఫలమయ్యామని చెప్పారు. నేడు స్వార్థ రాజకీయాలున్నాయని తెలిపారు. ఆమె తెలిపిన మరిన్ని వీడియోలో చూద్దాం....

 

14:44 - June 27, 2016

హైదరాబాద్ : బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి...ఐరోపా కూటమి నుంచి వైదొలగాన్న బ్రిటన్ ప్రజల తీర్పుతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. దీంతో పసిడి పరుగులు ఖాయమంటున్నారు విశ్లేషకులు. డిసెబంర్ నాటికి 10 గ్రాముల బంగారం 35 వేల 500 రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ రేటు ఏడాది చివరికల్లా 1,475 డాలర్లకు చేరుకోవచ్చుని చెబుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో అత్యంత భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. ఐరోపా కూటమి నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పుతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి మరింత పెరిగింది. బ్రెగ్జిట్ తోఈక్విటీ మార్కెట్లు భారీగా పతనం కాగా.. గోల్డ్ రేటు కొండెక్కి కూర్చుకుంది. ఈ పరిణామంతో మదుపర్ల దృష్టి మళ్లీ బంగారంపైకి మళ్లిందని, మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి..
బ్రిటన్ ఎగ్జిట్‌తోపాటు అమెరికాలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలు, పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, కరెన్సీ మార్కెట్లలో ఒడిదుడుకులు వంటి అంశాలతో గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి మరింత పెరుగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్‌కల్లా 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల రేటు 35 వేల 500 రూపాయల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయంగా బంగారం ధరలకు ప్రామాణికమైన అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ రేటు ఏడాది చివరికల్లా 1,475 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. లండన్ కమోడిటీ మార్కెట్లో పుత్తడి ధర ఏకంగా 8.2 శాతం ఎగబాకి 1,319 డాలర్లకు చేరుకుంది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లోనూ ధర 30 వేల 875 రూపాయల స్థాయికి పెరిగింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, యూకే సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ద్రవ్య నిబంధనలను సడలించడంతోపాటు పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ అదే గనుక జరిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్‌కు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్రెగ్జిట్ తీర్పు నేపథ్యంలో డాలర్ కొంత బలపడినప్పటికీ.. మున్ముందు మళ్లీ విలువ తగ్గవచ్చని, ఫలితంగా బంగారం డిమాండ్ పెరుగవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. సమీప భవిష్యత్‌లో బంగారం 31 వేల 500 నుంచి 32 వేల 500 రూపాయల స్థాయిల్లో కదలాడవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో 1400 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు.

14:41 - June 27, 2016

కడప : విత్తనం కొద్దీ ఫలసాయమన్నారు పెద్దలు. రైతులు మంచి పంటలు పండించాలంటే మేలిమి విత్తనాలు అవసరం. మంచి విత్తనం లభిస్తే సగం కష్టాలు తీరినట్టే...ఇవేవి తమకు పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేలిమి రకాల విత్తనాల ఉత్పత్తిపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండల పరిధిలోని యస్.ఉప్పలపాడులో వ్యవసాయ విత్తన ఉత్పత్తి ఉంది. 1960లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పాలన కాలంలో దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు, రైతులకు విత్తనాలనందిస్తూ ఓ వెలుగు వెలిగిన విత్తన కేంద్రం, తర్వాత నుంచి క్రమంగా పతనావస్థకు చేరుకుంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విత్తన కేంద్రం అధికారుల అలసత్వంతోనే మూతపడాల్సి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసిన మేలిమి రకాల విత్తనాలను తెప్పించాల్సిన బాధ్యత అధికారులదే. అయితే అధికారుల అసమర్థత, నిధులలేమితో ఈ కేంద్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దుక్కులు, విత్తనం, ఎరువుల పేరిట అధికారులు చేతివాటం చూపించారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ పంటను పండించడం కుదరక, గత ఐదారేళ్లుగా శనగ పంటనే రైతులు పండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయ విత్తన కేంద్రాన్ని పునరుద్దరించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను, పర్యవేక్షకులను నియమిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని సూచిస్తున్నారు.

14:39 - June 27, 2016

'కుందనపు బొమ్మ' సినిమా టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ చిత్రం హీరో హీరోయిన్స్ సుధీర్, చాందిని చౌదరి, దర్శకుడు వర ముళ్లపూడి మాట్లాడారు. సినిమా అందిరినీ ఆకట్టుకుంటుందన్నారు. చిత్రం వివరాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:36 - June 27, 2016

జ్ఞానసాయికి చెన్నై గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల పరీక్షలు..

చెన్నై : కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయిని చెన్నై గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు పరీక్షించారు. జ్ఞానసాయికి పరీక్షలు చేసిన అనంతరం ఆపరేషన్ తేదీ ఖరారు చేస్తామని డాక్టర్లు ప్రభుత్వానికి తెలిపారు. చిన్నారి జ్ఞానసాయి తల్లిదండ్రులతో చైనా నుండి ఫోన్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

14:36 - June 27, 2016
14:31 - June 27, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కోరారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం తక్కువ నష్టపరిహారం వస్తుందని...జీవో 123 ప్రకారం చేస్తే ఎక్కువ వస్తుందనేది అబద్ధమన్నారు. ల్యాండ్ రేట్ ను అప్ డేట్ చేయాలన్నారు. ముంపుకు గురయ్యే బాధితులకు  2013 చట్టం ప్రకారం.. అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. ప్రాజెక్టు కింద
భూములు కోల్పోతున్న ప్రజలు, గ్రామాలు మునుగుతున్న వారికి న్యాయం చేయాలి పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఆర్ డీవో, అధికారులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనపై జానారెడ్డిపై మంత్రి హరీశ్ రావు చేసిన చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవుపలికారు. 

 

14:30 - June 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌ దగ్గర కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన చేశారు. రాష్ట్ర హోం మంత్రి నాయినీని అడ్డుకున్నారు. తమ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియచేయాలని వేడుకున్నారు. తమ సమస్యలను విన్నవించడం కోసం సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై నాయినీ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినా చివరకు సీఎం అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని, సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తమ బాధ సీఎం కేసీఆర్ కు తెలియాలని, తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు.

14:26 - June 27, 2016

మెదక్ : భూమి హక్కు కోసం పోరాడాలని, ఏదో ఒక మాట చెప్పి ఇక్కడున్న వారిని ఒంటరి చేయాలని టి.సర్కార్ చూస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. భూ సేకరణ చట్టం, 123 జీవో ప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013, యోజనాలను వివరించేందుకు సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం ఆధ్వర్యంలో గజ్వేల్‌ పట్టణంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.
పాదయాత్ర...
ఇక్కడున్న పరిస్థితి చూస్తే ఇక్కడే ఉండాల్సిన అవసరం వస్తోందని, అందుకని ఒకటో తేదీ నుండి నాలుగు రోజుల పాటు ప్రతి రోజు పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను ఒక్కడినే కాకుండా ఊరు మొత్తం కదలాలని, ఇది రాజకీయ యాత్ర కాదని మీసం మెలెయ్యడానికి రావడం లేదని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి యొక్కరికి తెలియాలే ఉద్దేశ్యంతో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. భూమి తల్లి కోసం పోరాడాలి..దీనిని కాపాడుకోవాలని పోరాటం చేస్తానన్నారు. ఇక్కడ టిడిపి నేత రేవంత్ నిరహార దీక్ష చేయడం సంతోషమేనని, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకుతోందన్నారు. కానీ టి.సర్కార్ మాత్రం శాపనార్థాలు పెడుతోందని, పులిచింతల ప్రాజెక్టు అంటూ మధ్యలో తీసుకొస్తున్నారని తెలిపారు.

ఒంటరి చేయాలని చూస్తోంది...
ఏదో ఒక మాట చేసి ఒంటరి చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇవి నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ హాయాంలో పులిచింతల ప్రాజెక్టుకు లక్ష..లక్షన్నర ఇచ్చింది వాస్తవమేనని..రైతులను మోసం చేసింది వాస్తవమేనని..టిడిపి ఏడు మండలాలను ముంచేయడం ఇది వాస్తవమేనన్నారు. రైతుకు ఎక్కడ అన్యాయం చేసినా వారి తరపున పోరాడాలన్నారు. మల్లన్నసాగర్ భూమి దక్కించే మనిషి కావాలని సూచించారు. ఇక్కడి కలెక్టర్ మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారని అసలు నోటిఫికేషన్ ఎలా ఇస్తారని తమ్మినేని తనదైన శైలిలో ప్రశ్నించారు.

14:14 - June 27, 2016

విజయవాడ : ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకేసారి పెద్దమొత్తంలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగల్న్‌ ఇవ్వడంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. సర్కార్‌ కొలువును సాధించేందుకు పగలు, రాత్రిలు తేడా లేకుండా తెగ చదివేస్తున్నారు. శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్ల వెంట పరుగులు తీస్తున్నారు. 
చదువులతో నిరుద్యోగులు కుస్తీ  
ఏపీలో నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. సర్కారీ కొలువుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. నిరుద్యోగుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిస్తోంది. ఒక్కసారిగా వారి దృష్టి మళ్లీ చదువులపైకి మళ్లీంది. లైబ్రరీలు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు ఇలా ఎక్కడ చూసినా పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులే కన్పిస్తున్నారు. ఇన్నాళ్లు పుస్తకాలను అటకెక్కించిన విద్యార్థులు కూడా మళ్లీ పుస్తకాల బూజు దులుపుతూ చదువుల్లో మునిగితేలున్నారు.  
పోస్టుల భర్తీకి రాష్ర్ట సర్కార్‌ ఆమోదం 
రాష్ర్ట ప్రభుత్వం ఒకేసారి వివిధ ప్రభుత్వ విభాగాలకు పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో ఈసారి ఖచ్చితంగా సర్కార్‌ కొలువు సాధించాలనే పట్టుదలతో నిరుద్యోగులు ఉన్నారు. అభ్యర్థులు చాలామంది... కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. విజయవాడలో రాష్ర్టస్థాయిలో పేరున్న కోచింగ్‌ సెంటర్లున్నాయి. ఇవన్నీ గ్రూపు పరీక్షలకు శిక్షణ ఇస్తామంటూ  పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తున్నాయి. పెద్దసంఖ్యలో నిరుద్యోగులు రావడాన్ని ఆసరాగా చేసుకుని.. వేలాది రూపాయల ఫీజులను కూడా వసూలు చేస్తున్నాయి. మొత్తంగా ఏపీలో చాలాకాలం తర్వాత పెద్దస్థాయిలో నోటిఫికేషన్ రావడంతో పోటీకూడా తీవ్రంగానే ఉంటుందని విద్యానిపుణులు భావిస్తున్నారు.

 

14:11 - June 27, 2016

హైదరాబాద్ : కీసర వద్ద న్యాయవాది ఉదయ్ కుమార్ సజీవదహనం కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. నిందితులను సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఏఎస్ రావునగర్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన  ఉదయ్‌కుమార్  మల్కాజ్‌గిరి కోర్టులో జూనియర్ అడ్వకేట్‌గా పని చేస్తున్నారు. శనివారం ఉదయం ఇంటినుంచి వెళ్లిన భర్త తిరిగి  రాకపోయేసరికి ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కీసర వద్ద కారు దగ్ధమైన ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులకు  సంఘటన స్థలానికి చేరుకుని కారును పరిశీలించగా అందులో పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్వరీ కీసర ప్రాంతానికి చేరుకుని కారును గుర్తుపట్టింది. అందులో ఉన్నది తనే భర్తేనని నిర్ధారించింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.

 

14:04 - June 27, 2016

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో  అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.26 లక్షలు కేటాయించి రెండు అంబులెన్సులను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు అందించారు. హైదరాబాద్ నగర శివారులో నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. 

కాసేపట్లో జవదేకర్ తో భేటీ కానున్న కేటీఆర్..

ఢిల్లీ : మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.30గంటలకు కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో భేటీ కానున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన రెండు ఇండస్ట్రియల్ కారిడార్లకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసేలా చూడాలని మంత్రిని కోరారు. సాయంత్రం 6 గంటలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలతో కేటీఆర్ సమావేశం కానున్నారు.

 

13:57 - June 27, 2016

ఢిల్లీ : హారన్ల మోత లేదు.. ట్రాఫిక్ జాంలు అసలే లేవు.  అంతా సైలెంట్‌..సాఫీగా సుఖవంతమైన ప్రయాణం..ఇదీ.. రేపటి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌. ఇపడు దేశరాజధానిలో సాధ్యం కాబోతోంది. ఆఫీసుకు ఓ ఐదు నిముషాలు లేటుగా బయలుదేరి ఎక్కడలేని  హడావుడి పడతాడు నగరజీవి. జామ్మని దూసుకుపోయే కార్లు, బైకులు ఉన్నా... అంగుళం కదలడానికి అరగంట పట్టే ట్రాఫిక్‌లో నిత్యం నరకం అనుభవిస్తుంటాడు. ఓ వైపు తొందరగా వెళ్లానన్న ఆతృత...  మరోవైపు హోరెత్తే హారన్లు, పొగ, దుమ్ము. ట్రాఫిక్‌ బాధలు నగరజీవులకు చెప్పాల్సిన పనేలేదు..! 
ట్రాఫిక్ పరేషాన్‌కు ఇక్‌ చెక్‌
ఇప్పటిదాకా.. సిటీబస్సుల పరేషానను మెట్రోరైలు తీరుస్తుందని సంతోషడుతున్నారు నగరజీవులు. ఇపడు అంతకంటే ఈజీ, సుఖవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇక మెట్రోకాదు మెట్రీనో...దీంతో ట్రాఫిక్‌ పరేషాన్‌కు చెక్‌ పడనుంది. కాలుష్యం బాధలు లేని ప్రయాణం..సాకారం కాబోతోంది. డ్రైవర్ల అవసరం అసలే లేదు.. అంతా ఆటోమెటిక్.. ఇది ఎక్కడో జపాన్‌, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో కాదు.. మనదగ్గరే మనఢిల్లీలోనే త‌్వరలో మెట్రీనో ప్రయాణం అందుబాటులోకి రానుంది.  కేంద్రమంత్రి నితిన్‌ గడ్గరి మెట్రినో ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌పై క్లారిటీ ఇచ్చారు.
మొదటి మెట్రినో ఢిల్లీ టూ హర్యానా
పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) సిస్టం. ఢిల్లీలోని దౌలాకువా నుంచి హర్యానాలోని మనేసర్ వరకూ మొదట దీన్ని నిర్మించనున్నారు. సుమారు  70 కిలోమీటర్ల మెట్రినో లైన్‌ను  నిర్మించడానికి కేంద్ర ఉపరితల రవాణశాఖ రెడీ అయ్యింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ-గురుగ్రామ్ నుంచి సోహ్నా రోడ్ వరకూ 13 కిలోమీటర్ల దూరం దీన్ని  నిర్మిస్తారు. దీనికోసం రూ.850 కోట్లు ఖర్చువుతాయట. అయితే మొత్తం ప్రాజెక్టు పూర్తికి కావడానికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కరెంటుతో పనిచేసే మెట్రినో సిస్టమ్‌
మెట్రినో ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ మొత్తం  కరెంటుతో పనిచేస్తుంది. వ్యవస్థమొత్తం  కంప్యూటర్ల నియంత్రణలో ఉంటుంది. వందలాది కెమెరాల కనుసన్నల్లో ఉంటుంది. ఢిల్లీ మెట్రినోలో మొత్తం 1,100 మినీ పాడ్లు ఉండనున్నాయి. ఒక్కో పెట్టెలో  ఐదుగురు ప్రయాణించవచ్చు. మొదట దీనికోసం ఒక రోప్‌వేను నిర్మించి... దానికి ఇలా ఈ ట్రావెల్‌ బాక్కుల్ని అమరుస్తారు. వాటిల్లో కూర్చొని హాయిగా ప్రయాణించవచ్చంటున్నారు అధికారులు. గాల్లో తేలుతూ  వెళ్లే  మినీపాడ్లు.. స్టేషన్ వచ్చేసరికి.. కిందకు దిగుతాయి. అంతేకాదు ఇవి గంటలకు  50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయట. వీటి నిర్మాణ ఖర్చుకూడా మెట్రో రైల్‌తో పోలిస్తే.. చాలా తక్కువేనట. మెట్రోరైల్‌ ట్రాక్‌ నిర్మాణానికి కిలోమీటరుకు 250 కోట్ల రూపాయలు  ఖర్చయితే.. మెట్రినో లైన్లను 50-60 కోట్లతో కంప్లీట్‌ చేయోచ్చంటున్నారు. దీనివల్ల ప్రయాణ చార్జీలు కూడా చాలా తక్కువగానే ఉంటాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.  వాహనకాలుష్యంతో వాతావరణం పాడైపోతుందని... గ్లోబల్‌వార్మింగ్‌కు వాహన కాలుష్యం  కారణమనే మాటలు ఇక ముందు రోజుల్లో వినిపించవేమో.. ఇదంతా చూస్తుంటే. మనమూ స్మార్ట్‌ అయిపోతున్నాం గురూ అనిపిస్తోంది కదూ..!

13:57 - June 27, 2016

ఎన్టీఆర్ తో నా అల్లుడు, అల్లరి నరేష్ తో విశాఖ ఎక్సప్రెస్ చిత్రాలు డైరక్ట్ చేసిన వరా ముళ్లపూడి గ్యాప్ తీసుకుని చేసి, దాదాపు కొత్తవాళ్లు వంటి కాస్టింగ్ తో చేసిన చిత్రం 'కుందనపు బొమ్మ'. ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన అనుభూతిని ఇవ్వాలనే ఆలోచనతో ప్రయత్నం చేశారు. చాందిని చౌదరి, సుధాకర్‌ కొమాకుల, సుధీర్‌ వర్మ, నాగినీడు, షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, ఝాన్సీ తదితరులు నటించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా చాందిని చౌదరి మాట్లాడింది..తన ఇంట్లో చుడీదార్..లంగా ఉండదు..అంతా వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉంటాయన్నారు. కానీ ఈ సినిమాలో తాను అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించడం జరిగిందని పేర్కొన్నారు. లుక్ లో చాలా ఆపోజిట్ గా ఉంటుందని, గెటప్ వేసుకోగానే పల్లెటూరు అమ్మాయిగా కనిపించానని తెలిపింది. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

13:53 - June 27, 2016

తూర్పుగోదావరి : రెండేళ్లు దాటుతున్నా.. తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్‌ పేలుడు విషాద ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోవడం లేదు. రెండు సంవ్సతరాల క్రితం జరిగిన గెయిల్‌ పైప్‌లైన్‌ పేలుడు విషాదం బాధితులను ఇప్పటికీ వెంటాడుతోంది. 29 ప్రాణాలు పోయినా అధికారులు ఇంకా మేల్కొవడం లేదు. ఇప్పటికీ గ్యాస్‌, చమురు తరలిస్తున్న అన్ని డ్రిల్లింగ్‌ పాయింట్ల వద్ద కనీస భద్రత ఏర్పాట్లు లేవు. రక్షణ చర్యల విషయంలో నిర్లక్ష్యం వీడడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:51 - June 27, 2016

హైకోర్టులో ఎమ్మెల్యే వివేకానందగౌడ్ కు చుక్కెదురు...

హైదరాబాద్ : హైకోర్టులో ఎమ్మెల్యే వివేకానందగౌడ్ కు చుక్కెదురైంది. శేర్ లింగంపల్లిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని ఆరు నెలల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎలా అని ప్రశ్నించింది.

నంగేగడ్డ చెరువులో వస్తున్న వేడి ఆవిరి..

కృష్ణా : నాగాయలంక (మం) నంగేగడ్డ చెరువులో రెండు గేదెలు మృతి చెందాయి. చెరువులో వేడిగా ఆవిరి వస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ గ్రామానికి విద్యుత శాఖ సిబ్బంది చేరుకున్నారు. విద్యుత్ షాక్ తో గేదెలు చనిపోయాయని అధికారులు తేల్చారు.

 

తెలంగాణ భవన్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ ఎదుట కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన నిర్వహించారు. సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని రాష్ట్ర హోం మంత్రి నాయినిని కాంట్రాక్టు లెక్చరర్లు అడ్డుకున్నారు. సీఎంను కలిపిస్తానని నాయినీ హామీనిచ్చారు.

 

13:49 - June 27, 2016

సింగపూర్ : సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో విమానం అత్యవసరంగా చాంగి విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న 222 మంది ప్రయాణికులు, 19 మంది సురక్షితంగా బయటపడ్డారు. విమానంలో పెట్రోల్ లీకైన వాసన రావడాన్ని 43 ఏళ్ల ప్రయాణికురాలు గుర్తించింది. సరిపోయినంత ఇంధనం లేకపోవడంతో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించాడు. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరంగా చాంగి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అవుతుండగానే విమానం కుడి రెక్కలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. మంటలను ఆర్పేందుకు ఫోమ్ ను ఉపయోగించారు. మంటలు చెలరేగినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. 

 

ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ మరోసారి మోసం - షబ్బీర్..

హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేశారని, అబద్ధాలు చెప్పడం కేసీఆర్ కు అలవాటైందని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఎంఐఎం డబుల్ గేమ్ ను ముస్లింలు గమనిస్తున్నాయన్నారు.

మల్లన్న సాగర్ భూ సేకరణపై పిటిషన్ కొట్టివేత..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ సేకరణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మెదక్ జిల్లాకు చెందిన 12 మంది రైతులు పిటిషన్ దాఖలు చేశారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అవగాహన సదస్సు..

మెదక్ : గజ్వేల్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు జరిగింది. 2013 భూ సేకరణ చట్టం, 123 జీవోపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ జస్టిస్ చంద్రకుమార్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పాల్గొన్నారు.

13:37 - June 27, 2016

సినిమాల్లో జంతువులు కూడా పాత్రలను పోషిస్తుంటాయి. వీటితో పలు చిత్రాలు నిర్మితమయ్యాయి కూడా. 'ఈగ'తో రాజమౌళి సినిమా తీస్తే తాను 'పందిపిల్ల' పై సినిమా తీయలేనా అని రవి బాబు అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా పందిపిల్లపై సినిమా తీయబోతున్నాడు. 'అల్లరి', 'అనసూయ', 'అవును' సినిమాలు రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా రవిబాబు మీడియాతో మాట్లాడారు. ఏడాది క్రితమే తనకు ఈ సినిమాపై ఆలోచన వచ్చిందని, తెలుగు ఆడియెన్స్ కు తిన విధంగా స్రిప్ట్ ను తయారు చేసినట్లు చెప్పారు. పందిపిల్ల ఎలా ప్రవర్తిస్తుంది ? అనే దానిపై స్టడీ చేయడం జరిగిందని, యానీమెట్రిక్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని పేర్కొన్నారు. సిలికాన్ తో పందిపిల్ల మోడల్ ను తయారు చేయడం జరిగిందని, సినిమా చిత్రీకరించే సమయంలో మోడల్ విరిగిపోయిందని తెలిపారు. అనంతరం నిజమైన పందిపిల్లతో సినిమాను చిత్రీకరించడం జరిగిందన్నారు. మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేశామన్నారు. మరి ఈ పందిపిల్లను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

13:35 - June 27, 2016
13:31 - June 27, 2016

అర్జెంటీనా : కోపా అమెరికా కప్ ఫైనల్లో రెండో సారి విఫలమైన అర్జెంటీనా స్టార్ మెస్సీ ఫుట్ బాల్ గేమ్ గుడ్ బై చెప్పాడు.. ఫైనల్లో చిలీ చేతిలో మెస్సీ టీం ఓటమిపాలైంది... అర్జెంటీనాకు కప్ అందించడంలో విఫలమైన మెస్సీపై సాకర్ దిగ్గజం మారడోనా విమర్శలు గుప్పించాడు..దీంతో మనస్తాపం చెందిన మెస్సీ రిటైర్ మెంట్  ప్రకటించాడు.23 ఏళ్లుగా మేజర్‌ టైటిళ్ల కరవును తీర్చుకునేందుకు శాయశక్తులా శ్రమించిన అర్జెంటీనా ఫైనల్లో తడబడింది. జట్టును ఆదుకుంటాడని ఆశలు పెట్టుకున్న స్టార్‌ ఆడగాడు మెస్సీ ప్రభావం చూపలేకపోయాడు. గతేడాది ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో తమను ఓడించి కప్పు చేజిక్కుంచుకున్న చిలీపై ప్రతీకారం తీర్చుకోవాలన్న అర్జెంటీనా ఆశలు గల్లంతయ్యాయి. గ్రూప్‌ దశలో చిలీపై గెలిచినా ఫైనల్లో మాత్రం అర్జెంటీనా చేతులెత్తేసింది...పెనాల్టీ షూటౌట్‌లో చిలీ నాలుగు గోల్స్‌ చేయగా... మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా కేవలం రెండు గోల్స్‌ మాత్రమే చేసింది. ఈ ఓటమితో మెస్సీ రిటైర్ మెంట్ ప్రకటించాడు.

 

13:27 - June 27, 2016

చర్మం..కొందరికి జిడ్డుగా ఉంటుంది..మరికొందరికి పొడిగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవాళ్లు స్నానం చేయగానే చర్మం బిగుసుకుపోయినట్లు అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి బ్యూటీ పార్లర్లుకు వెళ్లడం..ఇతరత్రా క్రీములు వాడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే పొడిబారకుండా ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా ..
తేనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి. దీనిని చర్మానికి రాసుకోవాలి. ఒక పావుగంట అనంతరం కడుక్కోవాలి.
కొన్ని చుక్కల ఆలీవ్ ఆయిల్ లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ వేసి పచ్చిపాలల్లో దూది ముంచి చర్మాని శుభ్రం చేయాలి.
కలబంద.. దీనిన ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం చల్లబడుతుంది. అంతేగాక గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
నాలుగు లేదా ఐదు బాదం గింజల్ని (రాత్రి నానబెట్టాలి) తీసుకోవాలి. దీని తొక్క తీసి కొన్ని పచ్చిపాలను కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడుక్కొవాలి.
స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బని నూనెతో చర్మాన్ని మెల్లిగా మర్దన చేసుకోవాలి. అనంతరం చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
పాల మీగడలో పసుపు కలిపి ప్రతి రోజు ముఖానికి రాసుకోవాలి. తరువాత ముఖాన్ని శనగపిండి లేదా సున్నిపిండితో కడుక్కోవాలి.

13:25 - June 27, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొత్తగా ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి మంత్రులు అయ్యన్నపాత్రుడు, మృణాళిని హాజరయ్యారు. ఉద్యోగులకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. 
ఉద్యోగుల రాకపై మంత్రి అయ్యన్నపాత్రుడు హర్షం 
విజయవాడ చేరుకున్న ఏపీ పంచాయితీరాజ్‌ ఉద్యోగుల రాకపై మంత్రి అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ పంచాయితీరాజ్‌ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:21 - June 27, 2016

కర్నాటక : మైసూరు మహారాజు యధువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. మూడు రోజులుగా వివిధ ధార్మిక కార్యక్రమాలతో రాజప్రాసాదం సందడిగా మారింది. ఇవాళ ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9 గంటల 35 నిమిషాల మధ్య కర్కాటక లగ్నంలో యధువీర్‌, త్రిషికా కుమారిసింగ్‌ల వివాహం జరిగింది. శనివారం రాత్రే రాజప్రాసాదంలోకి త్రిషికా అడుగుపెట్టారు. అల్లుడికి దుంగార్‌పూర్‌ యువరాజు హర్షవర్ధన్‌సింగ్‌, మహేశ్వరికుమారి వస్త్రాల్ని సమర్పించారు. సాయంత్రం కాశీయాత్రను నిర్వహించారు. దత్తతండ్రి శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయరు చిత్రపటానికి పూజ చేశారు. రాజమాత ప్రమోదాదేవి ఆశీర్వచనం తీసుకున్నారు. ధార్మిక కార్యకలాపాల్లో యధువీర్‌కు రాజమాత ప్రమోదాదేవి చేయూతనిచ్చారు.

 

13:20 - June 27, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల నివేదిక దాదాపు పూర్తి అయింది. సీఎస్ నేతృత్వంలోని నియ‌మించిన క‌మిటీ తుది నివేదికను తుది మెరుగులు దిద్దే పనిలో పడింది. సీఎం ఆమోదం అనంతరం పబ్లిక్ నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు స‌ర్వం సిద్దం చేస్తున్నారు అధికారులు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారుల సిద్ధం చేసిన జాబితా వివ‌రాల పై టెన్ టీవి స్పెష‌ల్ రిపోర్ట్.
కొత్త జిల్లాలపై కసరత్తు పూర్తి 
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది. సీఎం ఆమోదం అనంతరం జూలై మొద‌టివారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో అభిప్రాయసేకరణ చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంకు అందిన వివ‌రాల ప్రకారం కొత్త జిల్లాలు, వాటి ప‌రిధిలో చేర్చే మండ‌లాలు, జ‌నాభా, విస్తీర్ణం లిస్ట్ త‌దిత‌ర అంశాలు పూర్తిగా ఫైన‌ల్ అయ్యాయి. 
హైదరాబాద్ జిల్లా...
హైదరాబాద్ పేరిట ఏర్పడే జిల్లాలో హ‌య‌త్ న‌గ‌ర్, ఇబ్రహీంప‌ట్నం, మంచాల‌, యాచారం, కందుకూరు,మ‌హేశ్వరం, స‌రూర్ న‌గ‌ర్,అంబ‌ర్ పేట‌, ఆసిఫ్ న‌గ‌ర్, బ‌హ‌దూర్ పూర‌, బండ్లగూడ‌, చార్మినార్, గోల్కోండ‌, హిమ‌య‌త్ న‌గ‌ర్, ముషీరాబాద్, నాంప‌ల్లి, సైదాబాద్ మండలాలు అంతర్భాగం కానున్నాయి. 
సికింద్రాబాద్ జిల్లా....
ఇక నగరంలో ఏర్పడే సికింద్రాబాద్ జిల్లాలో మ‌ల్కాజ్ గిరి, మేడ్చల్, కుత్బుల్లా పూర్, రాజేంద్రన‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి, ఉప్పల్,కూక‌ట్‌ప‌ల్లి, స‌న‌త్ న‌గ‌ర్, ఖైరాతాబాద్, సికింద్రాబాద్, జూబ్లిహిల్స్, కంటోన్మెంట్ నియోజకవర్గాలు అంతర్భాగం కానున్నాయి. ఈ జిల్లాలో మొత్తం నగరంలోని 17 మండలాలు అంతర్భాగం కానున్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం-1608.85 చదరపు కిలో మీటర్లు కాగా, జ‌నాభా 42,51, 614గా ఉంది. 
నాగ‌ర్‌ క‌ర్నూలు జిల్లా...
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న నాగ‌ర్‌ క‌ర్నూలు జిల్లాలో అచ్చంపేట‌,క‌ల్వకుర్తి, కొల్లాపూర్, నాగ‌ర్‌క‌ర్నూలు నియోజ‌క వర్గాలు.. 17 మండలాలు భాగం కానున్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7447.42 చదరపు కిలోమీటర్లు కాగా జ‌నాభా 10,48,425 గా ఉంది.  
వనపర్తి జిల్లా
వనపర్తి పేరిట ఏర్పడే జిల్లాలో అలంపూర్, దేవ‌ర‌క‌ద్ర, గ‌ద్వాల‌, కొల్లాపూర్, మ‌క్తల్, వ‌న‌ప‌ర్తి నియోజకవర్గాలు అంతర్భాగం కానున్నాయి. మొత్తం 17 మండలాలు అంతర్భాగం కానున్నాయి. జిల్లా విస్తీర్ణం 4426.38 చదరపు కిలో మీటర్లు కాగా, మొత్తం జ‌నాభా 11,36,983గా ఉంది. 
జగిత్యాల జిల్లా
ఇక కరీంనగర్‌ నుంచి వేరుపడి ఏర్పడనున్న జగిత్యాల జిల్లాలో.. చొప్పదండి, ధ‌ర్మపురి, జ‌గిత్యాల‌, కోరుట్ల, వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గాలు అంతర్భాగం కానున్నాయి. ఇందులో మొత్తం 16 మండ‌లాలున్నాయి ఇక జిల్లా విస్తీర్ణం 3087.41 చదరపు కిలోమీటర్లు కాగా  జ‌నాభా  సుమారు 10,43,000గా ఉంది.
భూపాలప‌ల్లి జిల్లా
ఇక వరంగల్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న భూపాలప‌ల్లి జిల్లాలో భూపాల‌ప‌ల్లి, ములుగు, మంథని మూడు నియోజ‌క‌వ‌ర్గాలు అంతర్భాగం కాగా మొత్తం 19 మండలాలు జిల్లా పరిధిలోకి రానున్నాయి. జిల్లా విస్తీర్ణం 6760.29 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కాగా జ‌నాభా సంఖ్య 8,56,453 గా ఉంది. 
యాదాద్రి జిల్లా
నల్లగొండ జిల్లా నుంచి విడిపోయి ఏర్పడే యాదాద్రి జిల్లాలో ఆలేరు, భువ‌న‌గిరి, స్టేష‌న్ ఘన పూర్, జ‌నగాం, పాల‌కుర్తి  నియోజ‌కవవ‌ర్గాలు భాగం కానున్నాయి. మొత్తం 13 మండలాలు అంతర్భాగం కానున్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 2956.14 చదరపు కిలో మీటర్లు కాగా జ‌నాభా 7,19,131 గా ఉంది.
సూర్యపేట జిల్లా
కొత్తగా ఏర్పడే సూర్యపేట జిల్లాలో హుజుర్ న‌గ‌ర్,కోదాడ‌, మిర్యాల గూడ‌, సూర్యాపేట‌,తుంగ‌తుర్తి నియోజక వర్గాలు భాగం కానున్నాయి. మొత్తం 22 మండలాలు భాగం కానున్నాయి. జిల్లా విస్తీర్ణం-4348.09 చదరపు కిలోమీటర్లు కాగా జ‌నాభా 13,86,883 గా ఉంది. 
మహబూబాబాద్‌ జిల్లా
ఇక కొత్తగా ఖమ్మం, వరంగల్‌ మండలాలతో ఏర్పడనున్న మహబూబాబాద్‌ జిల్లాలో డోర్నక‌ల్, మ‌హ‌బుబాబాద్, ములుగు,న‌ర్సంపేట‌, పాల‌కుర్తి, ఇల్లందు నియోజక వర్గాలు అంతర్భాగం కానున్నాయి. ఇందులో 13 మండలాలు అంతర్భాగం కానున్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 3633.37 చదరపు కిలోమీటర్లు కాగా జ‌నాభా 8,04,136 గా ఉంది. 
భద్రాద్రి జిల్లాలో 
ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న భద్రాద్రి జిల్లాలో సైతం అశ్వారావుపేట‌, భ‌ద్రాచ‌లం, కొత్తగూడెం, పిన‌పాక‌, వైరా, ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గాలు అంతర్భాగం కానున్నాయి. మొత్తం19 మండలాలు భాగం కానున్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 8297.80 చదరపు కిలోమీటర్లు కాగా, జ‌నాభా11,93,807గా ఉంది. 
కామారెడ్డి జిల్లా
ఇక నిజామాబాద్‌ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ‌, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజవకర్గాలు అంతర్భాగం కానుండగా, మొత్తం 18 మండలాలు అంతర్భాగం కానున్నాయి. జిల్లా విస్తీర్ణం 4025.78  చదరపు కిలో మీటర్లు కాగా , జ‌నాభా-10, 68,773గా ఉంది. 
సంగారెడ్డి జిల్లా
ఇక సంగారెడ్డి జిల్లాలో ఆందోల్‌, న‌ర్సాపూర్, ప‌టాన్ చెరు,సంగారెడ్డి, జ‌హీరాబాద్ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 14 మండలాలు అంతర్భాగం కానున్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 3116.32 కాగా  మొత్తం జ‌నాభా 11,86,280 గా ఉంది. 
జిల్లాల జాబితా ఫైనల్  
జిల్లాల జాబితా ఫైనల్ అయినట్లైనని అంటున్నారు అధికారులు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన సంపూర్ణ పక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి అవుతుంది. అక్టోబర్ 11 న దసరా పండుగ రోజున కొత్త జిల్లాలు ఏర్పడుతాయని వార్తలు వెలువడుతున్నాయి.

13:10 - June 27, 2016
13:01 - June 27, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో  విద్యుత్‌ ప్రమాదాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. చిచ్చుబుడ్లలా పేలుతున్నా ట్రాన్స్‌ఫర్మర్లు నగరవాసులను భయపెడుతున్నాయి. వర్షం కురిసిందంటే చాలు... రోడ్లపై నడుస్తున్న వారు కరెంటు షాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు.   
గజిబిజిగా విద్యుత్‌లైన్లు
హైదరాబాద్‌లో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లపక్కన.. వ్యాపార సముదాయాల ముందు.. నివాస ప్రాంతాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాన్స్‌ఫర్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ కంచెలు కూడా లేకపోవడంతో ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అప్పటి దాకా ప్రశాంతంగా ఉంటున్న ట్రాన్స్‌ఫర్మర్లు ఒక్కసారిగా బ్లాస్ట్‌ అవుతున్నాయి. 
రోడ్లపై నడవాలంటేనే భయపడుతున్న జనం
ఇక వర్షం వచ్చిందంటే.. రోడ్డుపై నడిచివెళ్లేవారికి  గుండెలు దడదడలాడుతున్నాయి. ఎక్కడ ఏ వైరు తెగి ప్రాణాలు తీస్తోందనని జనం భయపడుతున్నారు. చిన్నపాటి గాలి వీచినా... విద్యుత్‌ తీగలు పుటుక్కన తెగుతున్నాయి. ఊయల తాళ్లలా వేలాడుతున్న వైర్లు... చెట్లకొమ్మలకు అంటుకుని... కరంటు అడ్రస్‌లేకుండా పోతోంది. చిమ్మచీకట్లో జనం నానా అవస్థలు పడుతున్నారు. వర్షానికి ఈదురుగాలులు తోడై  విద్యుత్‌ స్తంబాలు ఎక్కడపడితే అక్కడ కూలిపోతున్నాయి.  తెగిపడుతున్న కరంటు వైర్లు.. శనివారంనాడు ఇద్దరి ప్రాణాలు తీశాయి. 
విద్యుత్‌ వ్యవస్థ సేఫ్టీమెజర్స్‌ పై కమిటీ రిపోర్ట్‌
గ్రేటర్‌ సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రిసిటీ పంపిణీ సిస్టమ్‌ను సరిదిద్దడానికి డిప్యూటీసీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం  ఓ కమిటీని కూడా వేసింది. ఆకమిటీ పలు సేఫ్టీమెజర్స్‌ను సూచించింది. ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్‌ఫర్మర్లను పూర్తిస్థాయిలో మార్పుచేయాలని, పాత విద్యుత్‌  లైన్లను మార్చడంతోపాటు  ఇళ్లపైనుంచి వెళున్న హైటెన్షన్‌ వైర్లను తొలగించాలని సిఫారస్‌ చేసింది. కాని... ఏఒక్క సూచనను కూడా అధికారులు పట్టించుకోలేదు. ఎప్పటిలాగానే  వర్షాలు రావడం.. జనం ప్రాణాలు పోవడం మామూలైపోయింది. బిల్లుల వసూలుపై ఉన్న తొందర విద్యుత్‌ సరఫరాలో లేదు.
ఎవరి రాజకీయాలు వారివి..
స్వచ్ఛహైదరాబాద్‌ పేరుతో అప్పుడపుడు హడావుడి  చేస్తున్న ప్రజాప్రతినిధులు ఆ తర్వాత ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. అటు  అధికారులు కూడా  ఎప్పటిలాగే సైలెంట్‌ అయిపోతున్నారు. కరెంటు బిల్లుల్ని పైసా వదలకుండా వసూలు చేస్తున్న వారికి సక్రమంగా విద్యుత్తు సరఫరా చేయాలని తెలియదా అని.. గ్రేటర్‌ జనం ప్రశ్నిస్తున్నారు. 

12:57 - June 27, 2016

నెల్లూరు : జిల్లాలోని కనపర్తిపాడు వద్ద హైవేపై ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మృతులు ఇందుకూరుపేట మండలం గంగపట్నం వాసులు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

12:51 - June 27, 2016

ఢిల్లీ : పసిడి ధరలు మరింత ప్రియం కానున్నాయి...డిసెంబర్‌కల్లా 24 క్యారట్ల బంగారం 10 గ్రాములకు 33 వేల 500 రూపాయల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయంగా బంగారం ధరలకు ప్రామాణికమైన అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ గోల్డ్ రేటు ఏడాది చివరికల్లా 1,475 డాలర్లకు చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది..

 

నాంపల్లి స్టేషన్ ఎదుట ద.మ.రైల్వే ఉద్యోగుల సంఘం ధర్నా

హైదరాబాద్ : నాంపల్లి స్టేషన్ ఎదుట ద.మ.రైల్వే ఉద్యోగుల సంఘం ధర్నా చేపట్టింది. కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టింది. 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో  రూపాయి 12 పైసలు బలపడింది. 

 

తాత్కాలిక సచివాలయ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 29న సచివాలయంలోని ఐదో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రారంభం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం నలుగురు మంత్రులు ఉంటారు. 

12:38 - June 27, 2016

ఢిల్లీ : ప్రపంచ హాకీ పురుషుల ర్యాంకింగ్స్ లో...భారతజట్టు తన స్థానాన్ని గణనీయంగా మెరుగు పరచుకొంది. లండన్ లో ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారతజట్టు రన్నరప్ స్థానంతో పాటు...రజత పతకం గెలుచుకోడం ద్వారా...9వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్ కు ఎగబాకగలిగింది. ప్రపంచ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్ మొదటి నాలుగుస్థానాల్లో ఉన్నాయి.  నాలుగు, ఐదుర్యాంకుల్లో ఉన్న గ్రేట్ బ్రిటన్, భారత్ మధ్య కేవలం 8 పాయింట్ల తేడా మాత్రమే ఉంది.

 

12:35 - June 27, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుండి హైదరాబాద్ నుంచి తరలివెళ్లిన అధికారులు నేటి నుంచి విధులు నిర్వహించనున్నారు.   పది రోజులుగా తమ కార్యాలయాలను తరలించిన ప్రభుత్వ అధికారులు.. సిబ్బందికి సోమవారం విజయవాడలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇప్పటికి 30కి పైగా శాఖాధిపతుల కార్యాలయాలు విజయవాడ చుట్టూ కొలువు తీరాయి. సోమవారం 11 కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. 

 

12:32 - June 27, 2016

లండన్ : బ్రెగ్జిట్‌ బ్రిటన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు ఆర్థిక వాణిజ్య రంగాల్లోనే మాత్రమే కాకుండా రాజకీయపక్షాల్లో కూడా సంక్షోభాలకు తెరతీస్తోంది. మరోవైపు బ్రెగ్జిట్‌ నిర్ణయం ఏకంగా బ్రిటన్‌ సమాజాన్ని చీలిక దిశగా అడుగులు వేయిస్తోంది. మరోవైపు రెండో రెఫరెండం పెట్టాల్సిందే నంటూ బ్రిటన్‌ పార్లమెంట్‌ వెబ్‌సైట్‌కు పిటిషన్ల వెల్లువ మొదలైంది. 
బ్రెగ్జిట్‌తో ప్రతిపక్ష లేబర్‌పార్టీలో సంక్షోభం
బ్రిటన్‌లోని ప్రతిపక్ష లేబర్ పార్టీలో సంక్షోభం మొదలైంది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడంలో విఫలమయ్యారంటూ పార్టీ అధినేత జెరిమీ కార్బిన్‌పై అవిశ్వాసానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయంగా లేబర్‌పార్టీకి అనుకూలంగా ఉండే ఉత్తర ఇంగ్లండ్, మిడ్‌లాండ్స్, వేల్స్ ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటువేశారు. దీంతో కార్మికవర్గానికి నచ్చజెప్పడంలో కార్బిన్ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్బిన్ చర్యలకు నిరసనగా ముగ్గురు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. 
ఈయూ నుంచి వైదొలిగే ప్రక్రియ ప్రారంభం
ఈయూ నుంచి వైదొలగాలని నిర్ణయించిన బ్రిటన్ తమ నిష్క్రమణ ప్రక్రియను ప్రారంభించింది. మంగళవారం జరిగే ఈయూ నేతల సమావేశానికి ప్రధాని డేవిడ్ కామెరున్ హాజరై బ్రిటన్ నిష్క్రమణ నిర్ణయాన్ని వివరించనున్నారు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రధాని కామెరాన్ తన వారసుడిని ఎన్నుకొనేంత వరకు పదవిలో కొనసాగుతానని చెప్పారు. మరోవైపు బ్రిటన్ నుంచి విడిపోయి స్వాతంత్య్రం ప్రకటించుకొనేందుకు స్కాట్లాండ్ సిద్ధమవుతున్నది. 
బ్రెగ్జిట్‌పై రెండో రెఫరెండం నిర్వహించాలని డిమాండ్‌
ఇదిలా ఉంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న నిర్ణయంపై రెండో రెఫరెండం నిర్వహించాలంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. బ్రెగ్జిట్ ఫలితం వెలువడిన 48 గంటల్లోనే రెండో రెఫరెండం నిర్వహించాలంటూ దాదాపు 30 లక్షల మందికి పైగా పౌరులు బ్రిటన్ పార్లమెంట్ వెబ్‌సైట్‌లో సంతకాలు చేశారు. నిబంధనల ప్రకారం లక్ష మంది సంతకాలు చేస్తే ఏదైనా అంశంపై దిగువ సభలో చర్చను చేపట్టాలి. ఈ పిటిషన్‌పై మంగళవారం చర్చ జరిగే అవకాశమున్నట్టు తెలిసింది.

11:59 - June 27, 2016

మహేశ్‌భట్‌ తనయగా ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలియా తాజాగా నటించిన చిత్రం 'ఉడ్తా పంజాబ్‌'. ఈచిత్రంలో డీగ్లామరైజ్డ్‌ బిహారీ అమ్మాయిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. ఈసందర్భంగా అలియా మాట్లాడుతూ.. 'ఉడ్తా పంజాబ్‌'లో నా పాత్రకు అప్రిషియేషన్‌ రావడానికి కారణం కేవలం దర్శకుడే. ఆయన ఇచ్చిన సరైన గైడెన్స్‌ వల్లే నేను బాగా నటించగలిగాను. ఇప్పుడే కాదు నా గత చిత్రాల్లో సైతం దర్శకుల నటిగా నేను పేరు సొంతం చేసుకున్నాను. సరైన దర్శకులు దొరికితే ఆకాశమే హద్దుగా అత్యున్నంతగా నటించగలను' 
అని చెప్పింది. అలియా ప్రస్తుతం 'బద్రినాథ్‌కి దుల్హనియా'తోపాటు షారూఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'వాక్‌ అండ్‌ టాక్‌'చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రానికి గౌరీషిండే దర్శకత్వం వహిస్తున్నారు.

 

11:53 - June 27, 2016

లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ పతాకంపై నాగశౌర్య, పారుల్‌ హీరోహీరోయిన్లుగా జి.వి.చౌదరి, నాగరాజు గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రం 'నీ జతలేక'. ఈ చిత్రానికి స్వరాజ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.  ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దర్శకుడు లారెన్స్‌ దాసరి, నిర్మాతలు ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'సినిమా టైటిల్‌ చాలా బాగుంది. ఫీల్‌గుడ్‌ చిత్రంగా నిలుస్తుంది. నాగశౌర్య, సరయు, పారుల్‌ అద్భుతంగా నటించారు. దర్శకుడు లారెన్స్‌ దాసరికి మంచి బ్రేక్‌ అవుతుంది. స్వరాజ్‌ సంగీతం బాగుంది' అని సి.కళ్యాణ్‌ తెలిపారు. నిర్మాత జి.వి. చౌదరి ప్రసంగిస్తూ 'మా బ్యానర్‌లో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. వచ్చే రెండు మూడేండ్లలో వినాయక్‌ దర్శకత్వంలో మహేష్‌తో వందకోట్ల సినిమా, ఎన్టీఆర్‌తో వందకోట్ల సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ చిత్రాన్ని అందరం కష్టపడి నిర్మించాం. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు. 'నిర్మాతల సహకారంతో సినిమాను విజయవంతంగా పూర్తి చేయగలిగాం. కరుణాకరణ్‌ బ్యాక్‌గ్రౌడ్‌ స్కోర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది' అని దర్శకుడు లారెన్స్‌ చౌదరి అన్నారు.

 

11:41 - June 27, 2016

'నిర్మల కాన్వెంట్‌' సినిమాలో హీరో నాగార్జున స్పెషల్ క్యారెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున సమర్పణలో మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ 'నిర్మల కాన్వెంట్‌' నిర్మిస్తున్న చిత్రం నిర్మిస్తుంది. బాలనటిగా సుపరిచితురాలైన శ్రేయాశర్మ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. 'ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ సినిమాకి పెద్ద హైలెట్‌ అవుతుంది. జైపూర్‌, అరకు, నైనిటాల్‌, చిక్‌మంగుళూరు వంటి డిఫరెంట్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని ఎంతో లావిష్‌గా చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జులై 2న ఈ చిత్రం డిజిటల్‌ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో సంక్రాంతికి సూపర్‌హిట్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున 'నిర్మల కాన్వెంట్‌' చిత్రంలో చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌తో మరోసారి అందర్నీ అలరించనున్నార'ని చిత్రయూనిట్‌ తెలిపింది. 

10:43 - June 27, 2016

హైదరాబాద్ : కోపా అమెరికా కప్ ఫైనల్ లో చిలీ సంచలనం విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టుపై గెలుపొందింది. తుది మొట్టుపై అర్జెంటినా బోల్తా పడింది. మెస్సీ బృందానికి మళ్లీ నిరాశే ఎదురైంది. విజేత చిలీ జట్టుకు రూ.25.37 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ అర్జెంటీనాకు రూ.19 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. 

 

10:35 - June 27, 2016

ప్రాజెక్టులు మంచివే కానీ రైతులను కాపాడుకోవాలని వక్తలు అన్నారు. 'మల్లన్నసాగర్ ప్రాజెక్టు.. భూ నిర్వాసితుల ఆందోళన' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత శ్రీరాములు, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. రైతులను ఒప్పించి సరైన పరిహారం ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నిమ్స్ కాంట్రాక్టు కార్మికుల 'ఛలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్'...

హైదరాబాద్ : నిమ్స్ కాంట్రాక్టు కార్మికులు ఛలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలుపిచ్చారు. దీంతో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

అర్జెంటీనాపై చిలీ గెలుపు...

హైదరాబాద్ : కోపా అమెరికా కప్ ఫైనల్ లో చిలీ సంచలనం విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టుపై గెలుపొందింది. తుది మొట్టుపై అర్జెంటినా బోల్తా పడింది. మెస్సీ బృందానికి మళ్లీ నిరాశే ఎదురైంది. విజేత చిలీ జట్టుకు రూ.25.37 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ అర్జెంటీనాకు రూ.19 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు. 

09:38 - June 27, 2016

అణు విద్యుత్ కేంద్రం ప్రమాదకరమని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ అజయ్ శర్మ అన్నారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటును విరమించుకోవాలని సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిచన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఉత్తరాంధ్రకు కొత్త భయం పట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటు చేయతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం పై విభిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రచారోద్యమం సాగుతోంది. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్ర విద్యావంతులు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? ఇది ఉత్తరాంధ్ర మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పర్యావరణానికి జరిగే నష్టాలేమిటి? అణు విద్యుత్ కేంద్రాల విషయంలో ప్రపంచ అనుభవాలేమిటి? అసలు అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అసవరం వున్నదా? ఇలాంటి అంశాలపై అజయ్ శర్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:31 - June 27, 2016

ఉత్తరాంధ్ర గుండెల మీద కు పెద్ద అణు కుపంటి రాబోతోంది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ కేంద్రంగా దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజా ఉద్యమం మొదలైంది.
కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ ప్రాంతం ప్రక్రుతి సౌందర్యానికి నిలయం. మత్స్యకారులు ఎక్కువగా వున్న ప్రాంతమిది. కొవ్వాడ, మత్స్యవేశం ప్రాంతంలో భారీ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సర్వేలు చేశారు. మూడు వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నిజానికి ఈ అణు కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఏర్పాటు చేయాలనుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గుజరాత్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో నరేంద్రమోడీ ప్రధాని అయినతర్వాత తన సొంత రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు మార్చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేశారు.  నేటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు అణు విద్యుత్‌ కేంద్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
వెస్టింగ్ హౌస్ కంపెనీ అణు రియాక్టర్లు సరఫరా
అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ అనే కంపెనీ అణు రియాక్టర్లు సరఫరా చేస్తోంది. ఒక్కొక్క అణు రియాక్టర్ ను లక్షా 40 వేల  కోట్ల రూపాయల చొప్పున మనకు అమ్ముతోంది.  ఈ అణు విద్యుత్ కేంద్రం ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పాతిక రూపాయల దాకా ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. అదే సోలార్ విధానంలో ఉత్పత్తి చేస్తే కేవలం 5 రూపాయలతోనే పనైపోతోంది. అయిన్నప్పటికీ మన ప్రభుత్వం వెస్టింగ్ హౌస్ అణు రియాక్టర్లకే ప్రాధాన్యతనిస్తోంది. ఈ రియాక్టర్లతో విద్యుత్ ఉత్పత్తి లాభసాటి కాదన్న అభిప్రాయంతో అమెరికన్  కంపెనీలు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లను రద్దు చేసుకున్నాయి.  బ్రిటన్, బల్గేరియా లాంటి దేశాలు కూడా ఆసక్తి చూపడం లేదు. ఆ మాటకొస్తే జపాన్, రష్యా లాంటి దేశాలు అణు విద్యుత్ కేంద్రాల జోలికి వెళ్లడం లేదు. రష్యాలోని చర్నోబిల్, జపాన్ లోని ఫుకుషిమా ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలే ఇందుకు కారణం. అణు రియాక్టర్లను అమ్ముతున్న అమెరికాలో కూడా 1979 అణు విద్యుత్ కేంద్రాలను స్థాపించడం లేదు. వున్నవాటినే మూసేస్తోంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలు జరుగుతుండడం, అపార నష్టం వాటిల్లుతుండడం, పర్యావరణం దెబ్బతినడం, వాటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల చుట్టుపక్కలవారికి వ్యాధులు సోకడమే ఇందుకు  కారణం. ప్రపంచంలో ఎక్కడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినా, వాటికి వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల్లోని పర్యావరణ వేత్తలు, స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో  ఉద్యమిస్తున్నారు. కానీ, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచదేశాల అనుభవాలను, ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాలను, నష్టాలను పరిగణలోనికి తీసుకోకుండా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తుండడం తీవ్ర అభ్యంతరకరం. 

 

08:44 - June 27, 2016

కృష్ణా : డ్రైవర్ అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి దూకి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. కార్తీక్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. మార్గంమధ్యలో కృష్ణా జిల్లా కీసర సమీపంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో డ్రైవర్ పక్కనున్న ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. బస్సులో నుంచి దూకి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని సిబ్బంది చెబుతున్నారు. అయితే  ప్రమాదానికి గురైన బస్సు కండీషన్ బాగా లేదని తెలుస్తోంది. ట్రావెల్స్ యాజమాన్యం స్పందించి మరో బస్సును ఏర్పాటు చేశారు. 

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కేటీఆర్‌...

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. పలు పెండింగ్‌ సమస్యలపై కేంద్రమంత్రులను కలవనున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, అటవీశాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్‌, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి అవసరమైన రెండు ఇండస్ట్రీయల్‌ కారిడార్లపై నిర్మలాసీతారామన్‌తో చర్చిస్తారు. అదేవిధంగా జులై 11న హైదరాబాద్‌లో 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి జవదేకర్‌ను కేటీఆర్‌ ఆహ్వానించనున్నారు.

08:24 - June 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పలు పెండింగ్‌ సమస్యలపై కేంద్రమంత్రులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను,.. మధ్యాహ్నం 3.30 గంటలకు అటవీశాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్‌ను.. సాయంత్రం 6 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి అవసరమైన రెండు ఇండస్ట్రీయల్‌ కారిడార్లపై నిర్మలాసీతారామన్‌తో చర్చిస్తారు. అదేవిధంగా జులై 11న హైదరాబాద్‌లో 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి జవదేకర్‌ను కేటీఆర్‌ ఆహ్వానించనున్నారు.

 

08:22 - June 27, 2016

విజయవాడ : అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై నిజానిజాలు తెలుసుకునేందుకు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో చెన్నై వెళ్లిన వైసీపీ నిజనిర్థారణ కమిటీ... సత్రం భూములను పరిశీలించింది. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కారుచౌకగా భూములు అమ్మకం వ్యవహారంపై ఆరా తీసింది. 
చెన్నైలో వైసీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటన
సదావర్తి సత్రం భూముల స్వాహా ఉదంతంపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో వైసీపీ నిజనిర్థారణ కమిటీ చెన్నైలో పర్యటించింది. ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్థానికులతో కలిసి తాంబూరులో ఉన్న సత్రం భూములను కమిటీ సభ్యులు పరిశీలించారు. భూముల వేలం వ్యవహారంపై కమిటీ ఆరా తీసింది. 
తమిళనాడు ప్రభుత్వ రేటు ప్రకారం ఎకరం రూ. 6 కోట్లు
సత్రం భూములు సాఫ్ట్‌వేర్ కంపెనీల మధ్యలో ఉండటంతో తమిళనాడు ప్రభుత్వ రేటు ప్రకారం ఎకరం 6 కోట్ల రూపాయలు పలుకుతుందని కానీ ప్రభుత్వం తమ అనుచరులకు ఎకరాను కేవలం 27 లక్షలకే కట్టబెట్టిందని కమిటీ చైర్మన్ ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మొత్తం 83 ఎకరాల భూమిని కారుచౌకగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు స్వాహా చేశారన్నారు.
చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ధర్మాన 
ఇంత జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ధర్మాన ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను సీఎం దెబ్బతీస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల వ్యవహారంలో మరిన్ని నిజాలు వెలికితీసి.. టీడీపీ ప్రభుత్వం అక్రమాలను ప్రజల ముందు నివేదిక రూపంలో పెడతామని వైసీపీ నిజనిర్థారణ కమిటీ స్పష్టం చేసింది. 

 

08:20 - June 27, 2016

ఉత్తరప్రదేశ్ : ఖాకీలు లంచాలు తీసుకోవడం కామన్‌. అయితే గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసి.. జేబులు నింపుకునే ఖాకీలు కాస్తా రోడ్డునపడ్డారు. నడిరోడ్డుపై వీధిరౌడీల్లా ప్రవర్తించారు. లంచం పంచుకోవడం కోసం పోలీసులు ఘర్షణ పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ షాపు ఓనర్‌ నుంచి వసూలు చేసిన లంచం పంపకాల్లో తేడా రావడంతో.. పట్టపగలు, నడిరోడ్డుపై నలుగురు పోలీసులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. జనం గుమిగూడి చూస్తున్నా.. సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్నా ఖాకీలు పట్టించుకునే సోయిలో లేకుండాపోయారు. వాళ్ల వాటాలు తేలాయో లేదో కానీ.. ఖాకీల తీరుతో డిపార్ట్‌మెంట్‌కు ఉన్న కాస్తంతా పరువు మంటగలిసింది. 

 

08:11 - June 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సుల ఛార్జీలు 10 శాతం పెరగగా..నెలవారీ సీజన్‌ టికెట్‌ ధరలు 35 నుంచి 50 రూపాయల వరకు పెరిగాయి. పల్లెవెలుగు బస్సులో 30 కిలోమీటర్ల వరకు ప్రతి స్టేజిపై ఒక రూపాయి.. ఆ తర్వాత ప్రతి స్టేజికి రెండు రూపాయల వంతున పెంచారు. మిగిలిన అన్ని బస్సుల చార్జీలు 10 శాతం మేరకు పెరిగాయి. ఇక బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. 

 

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

కృష్ణా : కీసర సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి దూకి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. కార్తీక్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం చోటచేసుకుంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని సిబ్బంది చెబుతున్నారు. 

 

నేడు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు

మెదక్ : నేడు గజ్వేల్ లో మల్లన్నసాగర్ నిర్మాణంపై ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,  చంద్రకుమార్ తోపాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. 

నేడు చైనాలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన

హైదరాబాద్ : నేడు చైనాలో ఎపి సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించనున్నారు. పలువురితో సమావేశం కానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నిన్న మొదటిరోజు పర్యటన విజయవంతం అయింది. 

07:49 - June 27, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ భూసేకరణపై విపక్షాల ఆందోళనతో టీఆర్ ఎస్ అప్రమత్తమయ్యింది. ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని వాదాన్ని గులాబీ నేతలు వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.  విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ...సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం విషయంలో ముందుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
2013 భూసేరణ చట్టాన్ని పక్కన పెట్టిన టీ-సర్కార్‌ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకర్గంలో నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలు చేసిన  ఆందోళన అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేసింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం సేకరించే భూమికి పరిహారం చెల్లించే విషయంలో   2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి.. 123 జీవో ఆధారంగా పరిహారం ఇస్తామని ప్రకటించింది. ఈ జీవో ప్రకారం నిర్వాసితులకు నష్టం వస్తుందని సీపీఎం, కాంగ్రెస్‌, టీడీపీలు ఉద్యమించారు. నేతలు, రైతులు, ప్రజలు దీక్షలు చేపట్టడంతో అధికార పక్షం ఖంగుతింది. 
ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్‌... 
ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్‌... పరిహారం విషయంలో మల్లన్నసాగర్‌ నిర్వాసితులు... భూసేకరణ చట్టం, జీవోల్లో ఏది కోరుకుంటే దాని ప్రకారం చెల్లిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఈ పరిణామం అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో.... విపక్షాల వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరంతో ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు, పులిచింత ప్రాజెక్ట్‌తో నల్లగొండ జిల్లాలో 17 గ్రామాలుకు ముంపుకు గురువతున్నా నోరు మెదపని ప్రతిపక్షాలు... మల్లన్నసాగర్‌ను రాజకీయం చేస్తున్నాయన్నది అధికార పక్షం నేతల వాదన. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ప్రజలకు మేలు జేయాలని ప్రభుత్వం తలపెడితే... ప్రతిపక్షాలు నష్టం కలిగించేందకు కంకణం కట్టుకున్నాయని విమర్శిస్తున్నారు. 
విపక్షాలపై మండిపడుతున్న టీఆర్ ఎస్ నేతలు 
ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్న బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి, దీక్ష చేసిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని టీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం న్యాయమనుకుంటే పదవులకు రాజీనామా చేయాలని విపక్ష ఎమ్మెల్యేలకు సవాల్‌ విసురుతున్నారు. విపక్ష నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని విమర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు... ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 

 

07:42 - June 27, 2016

విజయవాడ : చైనాలో ఏపీ సీఎం తొలి రోజు పర్యటన విజయవంతంగా ముగిసింది.. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన సీఎం... ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. సీఎం విజ్ఞప్తితో అన్‌స్టీల్‌ కంపెనీ 3వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.. 
బాబు బృందానికి ఘన స్వాగతం
చైనాలో తొలిరోజు చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.. హాంకాంగ్‌ చేరుకున్న బాబు బృందానికి ఘన స్వాగతం లభించింది.. ఆ తర్వాత చంద్రబాబు హాంగ్జు డింగ్షెన్‌ ఇండస్ట్రీ గ్రూప్‌ ఛైర్మన్‌ జోగ్జినాయ్‌తో భేటీ అయ్యారు.. గనులు, ఖనిజ ఉత్పత్తి రంగంపై చర్చించారు.. విశాఖ, చెన్నై... చెన్నై- బెంగళూరు కారిడార్లద్వారా పారిశ్రామికాభివృద్ధికి ఉజ్వల భవిష్యత్తు ఉందని సీఎం జోగ్జినాయ్‌కి వివరించారు.. 
శ్రీలంక మంత్రి సమరవిక్రమతో బాబు సమావేశం 
శ్రీలంక మంత్రి సమరవిక్రమతోకూడా బాబు సమావేశమయ్యారు.. అమరావతి నిర్మాణ విశేషాలకు సమరవిక్రమ... ఏపీ సిఎంను అడిగి తెలుసుకున్నారు.. పర్యాటకరంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. తమ దేశంలో పర్యటించాలంటూ ఆయన చంద్రబాబును ఆహ్వానించారు..
కువైట్ డెయిరీ కంపెనీ సీఈవోను కిలిసిన చంద్రబాబు 
కువైట్ డెయిరీ కంపెనీ సీఈవోను కూడా సీఎం కలిశారు.. ఈ కంపెనీ తన బ్రాంచ్‌ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిచూపింది.. ఇక లిబ్రా గ్రూప్‌ ఆసియా కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు.. 
మిత్సుబిషీ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తో బాబు భేటీ 
మిత్సుబిషీ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌నిసైతం చంద్రబాబు కలిశారు.. విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హ్యూలెట్‌ అన్‌స్టీల్‌ కంపెనీ వైస్‌ చీఫ్ ఇంజనీర్‌ జువెన్‌ గేంగ్‌తోకూడా బాబు భేటీ అయ్యారు.. ఏపీలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు గేంగ్‌ ఆసక్తి చూపారు.. ఏపీలో పర్యటించి ఉక్కు కర్మాగారం స్థాపనకు అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలని గేంగ్‌కు సీఎం సూచించారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు... ఏపీలోఉన్న అవకాశాలను వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. 

 

07:36 - June 27, 2016

హైదరాబాద్ : భాగ్యనగరం అంటేనే గంగాజమునా తెహజీబ్‌... కలిసిమెలిసి ఉండటం ఇక్కడి సంస్కృతి... దాన్ని కొనసాగిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌ . హైదరాబాద్‌లోని నిజాంకాలేజి గ్రౌండ్‌లో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారాయన. మైనారిటీలకు ఇచ్చిన మాట ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : సీఎం కేసీఆర్‌ 
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సర్కార్‌  ఇచ్చిన  ఇఫ్తార్‌ విందుకు పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దానికోసమే పలు పథకాలు ప్రవేశపెట్టామన్నారు.  బడ్జెట్‌లో 12వందల కోట్లరూపాయలు కేటాయించామన్నారు. అలాగే ఈ ఏడాదినుంచే రాష్ట్రవ్యాప్తంగా 120 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్టు సీఎం చెప్పారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే కమిటీ వేశామని... నివేదిక రాగానే అసెంబ్లీలో చర్చించి.. ఢిల్లీకి పంపుతామన్నారు కేసీఆర్‌. హైదరాబాద్‌లో ప్రజలు గంగా-యమునా సంగమంలా కలిసిమెలిసి ఉంటారని... ఆ సంస్కృతిని కొనసాగిస్తామన్నారు ముఖ్యమంత్రి.  ఈ ఇఫ్తార్‌ విందులో డిప్యూటీ సీఎం మహమూద్‌ఆలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, హోం మంత్రి నాయిని పాల్గొన్నారు. అందరితో కలిసి విందారగించారు. 

 

నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ వర్క్ షాప్

హైదరాబాద్ : నేడు గాంధీభవన్ లో కాంగ్రెస్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధి శ్రీనివాసన్, ఉత్తమ్, జానారెడ్డి, టీపీసీపీ ఆఫీస్ బేరర్స్ హాజరుకానున్నారు. 

ఎస్సై పోస్టుల భర్తీకి నేటి నుంచి ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్టు

హైదరాబాద్ : తెలంగాణలో వివిధ విభాగాల్లోని ఎస్సై పోస్టుల భర్తీకి నేటి నుంచి ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్టు నిర్వహించనున్నారు. 

నేడు ఢిల్లీ వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ అలీ

హైదరాబాద్  : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్ టంకతో చర్చించనున్నారు. 

Don't Miss