Activities calendar

28 June 2016

'బాలయ్య'101 సినిమా 'రైతు'

అనంతపురం : నందమూరి బాలకృష్ణ 101వ సినిమా పేరును ప్రకటించారు. "రైతు" పేరుతో తన 101వ సినిమా రాబోతోందని ఆయన అనంతపురం జిల్లాలో ప్రకటించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు రుణ ఉపశమన పత్రాలు అందజేసిన అనంతరం రైతు సినిమా టైటిల్‌ను బాలకృష్ణ ప్రకటించారు. 

ఎయిర్ ఇండియాపై మంత్రి వెంకయ్య ఆగ్రహం...

ఢిల్లీ : ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ విమానం ఆలస్యంగా రావడంతో హైదరాబాద్‌లో ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌కు వెళ్లలేకపోయారు. ఈ ఘటనపై వెంకయ్య ట్వీట్టర్‌లో స్పందించారు. ఎయిర్ ఇండియా తీరును తప్పుపట్టారు. టైమ్ షెడ్యూల్ పాటించాలని చురకలు అంటించారు. 

రాక్షసత్వాన్ని ప్రదర్శించిన గోరక్షణ సభ్యులు..

హర్యానా : గోరక్షణ సమితి సభ్యులు మానవత్వాన్ని మరిచారు... పశువులే తలదించుకునేలా ప్రవర్తించిన ఘటన గుర్గావ్‌లో వెలుగు చూసింది. బీఫ్ ను ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో రిజ్వాన్‌, ముక్తియార్‌ల చేత బలవంతంగా ఆవు పేడను తినిపించారు. ఈ అకృత్యంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఫ్‌ను ఎలా తింటారో దాని పేడను అలాగే తినాలని వారిపై దౌర్జన్యం చేశారు. పేడను సులభంగా మింగడానికి నీళ్లు ఇచ్చారు. 'గోమాత కీ జై', 'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు చేశారు.

సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌కు బెయిల్ నిరాకరణ...

మహారాష్ట్ర : 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను నిరాక‌రించింది. సాధ్వి బెయిలుకు సంబంధించి గత వారం విచారణ పూర్తయింది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞా గత ఎనిమిదేళ్లుగా జైల్లోనే గడుపుతున్నారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ సప్లమెంటరి చార్జిషీట్‌లో సాధ్వితో పాటు మరో ఆరుగురికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సాధ్వి బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోగా కోర్టు నిరాకరించింది. 2008లో జ‌రిగిన మాలేగావ్‌ బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా... మ‌రో వంద మంది గాయ‌ప‌డ్డారు.

తాంజిల్‌ హత్య కేసులో నిందితుడు మునీర్‌ అరెస్ట్ ...

ఢిల్లీ : ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మునీర్‌ను గజియాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎన్‌ఐఏ అధికారి హత్యతో పాటు మునీర్‌కు పలు నేరాలతో సంబంధం ఉంది. 2015లో ధామ్‌పూర్‌లో 90 లక్షల చోరి, 2014లో ఢిల్లీ సిటీ బ్యాంక్‌ ఎటిఎం నుంచి కోటిన్నర లూటీ కేసులతో మునీర్‌కు సంబంధం ఉంది. మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మునీర్‌పై పోలీసులు 50 వేల బహుమతి కూడా ప్రకటించారు. తాంజిల్‌ అహ్మద్‌ హత్యకేసులో తన పేరు బయటకు రావడంతో మునీర్‌ పారిపోయాడు.

21:54 - June 28, 2016

ఢిల్లీ : ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మునీర్‌ను గజియాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎన్‌ఐఏ అధికారి హత్యతో పాటు మునీర్‌కు పలు నేరాలతో సంబంధం ఉంది. 2015లో ధామ్‌పూర్‌లో 90 లక్షల చోరి, 2014లో ఢిల్లీ సిటీ బ్యాంక్‌ ఎటిఎం నుంచి కోటిన్నర లూటీ కేసులతో మునీర్‌కు సంబంధం ఉంది. మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మునీర్‌పై పోలీసులు 50 వేల బహుమతి కూడా ప్రకటించారు. తాంజిల్‌ అహ్మద్‌ హత్యకేసులో తన పేరు బయటకు రావడంతో మునీర్‌ పారిపోయాడు. గత ఏప్రిల్‌ నెలలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బిజనౌర్‌ వద్ద తాంజిల్‌ అహ్మద్‌ కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఎన్‌ఐఏ అధికారి అక్కడికక్కడే మృతి చెందారు.

21:51 - June 28, 2016

మహారాష్ట్ర : 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను నిరాక‌రించింది. సాధ్వి బెయిలుకు సంబంధించి గత వారం విచారణ పూర్తయింది. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞా గత ఎనిమిదేళ్లుగా జైల్లోనే గడుపుతున్నారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ సప్లమెంటరి చార్జిషీట్‌లో సాధ్వితో పాటు మరో ఆరుగురికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సాధ్వి బెయిల్‌ కోసం అప్పీలు చేసుకోగా కోర్టు నిరాకరించింది. 2008లో జ‌రిగిన మాలేగావ్‌ బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా... మ‌రో వంద మంది గాయ‌ప‌డ్డారు. పేలుళ్లకు పాల్పడ్డ బైక్‌ సాధ్వి పేరిట ఉంది. పేలుడు ఘటన కన్నా రెండేళ్ల ముందు నుంచే తన బైక్‌ను రామ్‌చంద్ర్‌ కల్‌సాంగ్రా వాడుతున్నారని సాధ్వి చెప్పారు. రామచంద్ర్‌ పరారీలో ఉన్నాడు.

21:46 - June 28, 2016

హర్యానా : గోరక్షణ సమితి సభ్యులు మానవత్వాన్ని మరిచారు... పశువులే తలదించుకునేలా ప్రవర్తించిన ఘటన గుర్గావ్‌లో వెలుగు చూసింది. బీఫ్ ను ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో రిజ్వాన్‌, ముక్తియార్‌ల చేత బలవంతంగా ఆవు పేడను తినిపించారు. ఈ అకృత్యంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఫ్‌ను ఎలా తింటారో దాని పేడను అలాగే తినాలని వారిపై దౌర్జన్యం చేశారు. పేడను సులభంగా మింగడానికి నీళ్లు ఇచ్చారు. 'గోమాత కీ జై', 'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు చేశారు. మేవాత్‌ నుంచి ఢిల్లీకి కారులో 3 వందల కేజీల బీఫ్‌ను అక్రమంగా తరలిస్తుండగా గోరక్షణ సమితి కార్యకర్తలకు రిజ్వాన్, ముక్తియర్‌లు పట్టుబడ్డారు. వారిని పోలీసులకు అప్పగించారు. 

21:42 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వీసీలు లేని యూనివర్శిటీలకు తక్షణమే వీసీలను నియమించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటిలో టీజాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్య స్థితిగతులపై రౌండ్ టేబుల్‌ సమావేశం జరిగింది. ఉన్నత విద్యకు నిధులు కేటాయించి యూనివర్శిటీల అభివృద్ధికి దోహదపడాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో వందల సంఖ్యలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయని... వాటన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. జడ్జిల సస్పెన్షన్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. 

21:40 - June 28, 2016

మెదక్ : రిజర్వాయర్ సామర్థ్యం 50 టీఎంసీలకు తక్కువ కాకుండా మల్లన్నసాగర్‌ నిర్మించి తీరుతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టంచేశారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ రైతుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు.  

21:38 - June 28, 2016

చైనా : ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా పర్యటిస్తున్నారు. టియంజిన్‌ నుంచి బీజింగ్‌ వరకు 140 కిలోమీటర్లు బుల్లెట్‌ట్రైన్‌లో చంద్రబాబు ప్రయాణించారు. 140 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం 31 నిమిషాల సమయమే పట్టింది. చంద్రబాబు ప్రయాణించిన ట్రైన్‌ గంటకు 295 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ముఖ్యమంత్రి వెంట యనయల కూడా ప్రయాణించారు. బుల్లెట్‌ ట్రైన్లు, హైస్పీడ్‌ ట్రైన్లపై అధ్యయనం చేశారు. అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్‌ మార్గాల్లో బుల్లెట్‌ లేదా హైస్పీడ్‌ ట్రైన్లు ప్రవేశపెట్టే అవకాశాలను చంద్రబాబు పరిశీలించారు.

21:34 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో న్యాయాధికారుల ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్స్‌ కోసం మెట్టు దిగేది లేదని తెలంగాణ న్యాయాధికారులు తేల్చి చెప్తున్నారు. మరోవైపు నిబంధనలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారన్న కారణంతో న్యాయాధికారులపై హైకోర్టు కొరఢా ఝలిపించింది. ఇప్పటికే 11 మంది న్యాయమూర్తులను సస్పెండ్‌ చేసిన హైకోర్టు మరికొంత మందిపై వేటు వేసేందుకు సిద్ధమయింది. దీంతో సస్పెన్షన్‌పై మండిపడుతున్న న్యాయాధికారులు..15 రోజుల పాటు మూకుమ్మడి సెలవుపై వెళ్తున్నట్లు ప్రకటించారు. సీజేకు వ్యతిరేకంగా చలో హైకోర్టుకు కూడా పిలుపునిచ్చారు.

ఉమ్మడి హైకోర్టు నిర్ణయంపై మండిపడుతున్న న్యాయాధికారులు...
ఉమ్మడి హైకోర్టు నిర్ణయంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. మంగళవారం సస్పెండ్ చేసిన ఇద్దరు న్యాయాధికారులను విధుల్లోకి తీసుకోవాలంటూ న్యాయాధికారులు చేపట్టిన అందోళన మరింత తీవ్రరూపం దాల్చింది.

15 రోజుల పాటు 200 మంది న్యాయాధికారుల సెలవులు...
సస్పెండ్‌ చేసిన న్యాయమూర్తులను విధుల్లోకి తీసుకునే వరకు తమ ఆందోళనల్ని ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ జడ్జ్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్ణయించింది. అంతేకాదు 15 రోజుల పాటు 200 మంది న్యాయాధికారులు ముకుమ్మడి సెలవులపై వెళ్లి నిరసన తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దాంతో పాటు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ను కూడా తెలంగాణ న్యాయవాదులు బహిష్కరించారు. అయితే బార్ అసోసియేషన్‌ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఉమ్మడి హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రార్‌ విజిలెన్స్ ర్యాలీలో పాల్గొన్న మరో 9 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇండ్రస్టియల్ ట్రిబ్యునల్ ఛైర్మన్ మురళిధర్, జడ్జ్సె అసోసియేషన్ ఉపాధ్యాక్షులు శ్రీనివాస్ రెడ్డితో పాటు జడ్జిలు, సబ్ జడ్జిలైన చంద్రశేఖర్ ప్రసాద్, రాధాకృష్ణ చౌహాన్, తిరుపతి, రమాకాంత్, సరితా, వేణు, రాజులను సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పటివరకు సస్పెండ్ అయిన న్యాయాధికారుల సంఖ్య 11కు చేరింది. న్యాయమూర్తుల సస్పెన్షన్‌పై న్యాయవాదులు మండిపడుతున్నారు.

సస్పెన్షన్‌ ఎత్తేసేంతవరకు ఆందోళనలు ...
మరి కొంతమంది న్యాయాధికారులను కూడా సస్పెండ్ చేస్తున్నారని వచ్చిన వార్తలతో న్యాయాధికారులు ఆందోళనల్ని మరింత ఉధృతం చేశారు. నాంపల్లికోర్టు వద్ద సీజేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆందోళన చేసిన న్యాయవాధులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్స్‌కు తరలించారు. అయితే అరెస్టుకు నిరసనగా నాంపల్లికోర్టులో గంప వెంకటేశ్ అనే న్యాయవాది ఎం.ఎస్.జే చాంబర్ ముందు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. మరో న్యాయవాది జయవింద్యాల చార్మినార్‌ పీఎస్‌లో ఆమరణ దీక్ష చేపట్టారు. న్యాయమూర్తుల సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకూ దీక్ష కొనసాగుతుందని జయవింద్యాల ప్రకటించారు.

బుధవారం పెన్‌డౌన్‌ చేయాలని నిర్ణయం...
జడ్జీల సస్పెన్షన్‌పై మండిపడ్డ ఉద్యోగులు సహాయనిరాకరణ ఉద్యమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో రిజిస్టర్‌లో సంతకాలు చేసి విధులకు గైర్హాజరయ్యారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే..బుధవారం పెన్ డౌన్ చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. జూలై 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. న్యాయవాదులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హైకోర్టులోకి కేసులు వాదించే న్యాయవాదులను మాత్రమే పంపించారు. మరోవైపు న్యాయవాదులు చేపట్టిన చలో హైకోర్టుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బుధవారం కేసులు లేకుండా ఎవరు కోర్టులోపలికి వచ్చినా..నినాదాలు చేసినా అరెస్ట్‌లు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీకి వెళ్లిన అడ్వకేట్స్ బృందం న్యాయశాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని కలిసి తాత్కాలిక సి.జే విడుదల చేసిన ప్రొవిజినల్ లిస్ట్ అక్రమాలపై చర్చించారు. బుధవారం సుప్రీంకోర్టు సీజేను కలిసి హైకోర్టు సీజేపై ఫిర్యాదు చేయనున్నారు. మొత్తానికి నిబందనలకు విరుద్ధంగా న్యాయవాదులు వ్యవహరిస్తున్నారని ఒకవైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..మరోవైపు సస్పెండ్‌ చేసిన న్యాయమూర్తులను విధుల్లోకి తీసుకోవాలంటూ తెలంగాణ న్యాయాధికారులు పట్టు పడుతున్నారు. 

20:50 - June 28, 2016

సమాజమే దేవాలయం అంటాం. కానీ, ఆ దేవాలయం లోపలి దేవాలయాల సంపద కొందరికే చెందాలని వాదిస్తాం. ఇది ఎంత వరకు కరెక్ట్. ప్రజల జేబుల్లోంచి వచ్చిన సొమ్ముతో నిండే హుండీల ఆదాయం తిరిగి ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడితే తప్పేముంది. ఆ ప్రాసెస్ లో దేవాలయాలపై ఆజమాయిషీ ప్రభుత్వం చేతిలో ఉండాలా? లేక ధార్మిక సంస్థలు స్వాముల చేతిలో ఉండాలా? ఇదీ ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. చర్చకు కారణమవుతున్నాయి. దేవాలయాలపై ఆజమాయిషీ ప్రభుత్వం నుంచి ధార్మిక సంస్థల చేతిలో ఉండాలనే వాదనపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీటీడీని టార్గెట్ గా ఏపీ సర్కారుని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తున్న వ్యాఖ్యలను కమల నేతల తీరు కూడా అనేక సందేహాలకు తావిస్తోంది..ఏ మఠాలకు దేవాలయాలను అప్పగించాలి? ఏ ధార్మిక సంస్థల చేతిలో గుళ్లను పెట్టాలి? కొన్ని ఆశ్రమాలపై, కొందరు స్వామీజీలపై ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్న సమయం. ఆశ్రమాలను సొంత సామ్రాజ్యాలుగా నిర్వహిస్తూ, ధార్మిక సంస్థల పేరుతో మతాన్ని అడ్డుకుపెట్టుకుని వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న సమయం. అలాంటపుడు ఆలయాల నిర్వహణ అప్పగించటమనే వాదన సరైనదేనా? మానవ సేవే మాధవ సేవ అయినపుడు మాధవుడి సొమ్ము మానవుడిది కాదా? దేశంలో చాలా దేవాలయాలు కళకళలాడుతున్నాయి. వందల కోట్ల హుండీ సొమ్ముతో విలసిల్లుతున్నాయి. ఏటా అంచనాలకు మించిన ఆదాయంతో రికార్డులు నెలకొల్పుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఆలయాలు .. వాటి సంపదకు సంబంధించిన వివరాలు చూద్దాం.. మానవ సేవే మాధవ సేవ అయినపుడు మాధవుడి సొమ్ము మానవుడిది కాదా? కేవలం కొన్ని ధార్మిక సంస్థల చేతిలో మాత్రమే ఎలా పరిమితం చేయటం? అది ఎంతవరకు సమంజసం? సుబ్రహ్మణ్య స్వామి వాదనలతో తెరపైకి వచ్చిన ప్రశ్న ఇది. దేశంలో వేల కోట్లుగా ఉన్న దేవాలయ సంపదను, ఆదాయాన్ని ఎలా సద్వినియోగం చేయవచ్చో ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది. సమాజమే దేవాలయం అంటాం. అలాంటపుడు సమాజంలో భాగమైన దేవాలయాల సొమ్ము అతిపెద్ద దేవాలయం సమాజానికి చెందకుండా ఉంటుందా? రక్తాన్ని చెమటగామార్చి, సంపాదించిన సొమ్ము కావచ్చు.. లేదంటే పాపభీతి వెంటాడుతూ ఉండొచ్చు. కాని ఆ సొమ్ము సమాజం నుంచి పుట్టిందే కదా. అలాంటి దేవాలయాలపై హక్కు ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై ఉండాలని, ఆ సొమ్ము ప్రజా సంక్షేమానికి వినియోగం కావాలని ఆశించటంలో ఏ మాత్రం తప్పులేదు. …

20:30 - June 28, 2016

మల్కాపురంలో గుండు కిందనుండి దూరితే కడుపు నొప్పులు పోతున్నయంట...కడుపునొప్పులు తగ్గించుకోనీకి జనాలంతా నిజామాబాద్ జిల్లా మల్కాపురానిక లైను కట్టిండ్రు...గిర్ జాతి ఆవు మూత్రంలో బంగారం వున్నదంట..లవ్ డాల్ ను మనువు చేసుకున్న మంత్రి, 25 మంది సేతిలో గులాబీ పూలు పెట్టిన కేసీఆర్ సారు...మీ పిలకాయలను సర్కారు బడికి పంపమటున్న ఈటెల...మొక్కలు నాటిన బాలయ్య...50ఏళ్ళనుండి అంగీలేని నారాయణ.. గిటువంటి ఎన్నో ముచ్చట్లు చెప్పనీకి మన మల్లన్న సిద్ధంగా వున్నడు..మరి ఎందుకు జాగు..ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి..ముచ్చటైన మల్లన్న ముచ్చట్లు చూడుండ్రి...

20:09 - June 28, 2016

హైకోర్టు న్యాయాధికారుల విభజనపై తెలంగాణ న్యాయాధికారుల ఆందోళన కొనసాగుతోంది. వారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 11మంది న్యాయాధికారులను సస్పెండ్ చేసింది. ఈ అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా కు దిగుతానని ఇప్పటికే వెల్లడించారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ అంశంపై కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ..హైకోర్టు విభజనపై కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ కేజ్రీవాల్ లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై 10 టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ నేత), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత), అరుణ్ (ప్రముఖ న్యాయవాది) పాల్గొన్నారు. ఈ అంశంలో వక్తలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి... 

ఉక్కు పీఠం మాదే : గంటా...

విశాఖ : మేయర్‌ పీఠం తమదేనని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా టీడీపీకి చెందిన వ్యక్తే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు లను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని ఆయన తెలిపారు. రెండు పార్టీల వారికి ఆమోదయోగ్యమైన వ్యక్తినే మేయర్‌ అభ్యర్థిగా ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు. మేయర్ పీఠం తమదేనని, అందులో ఎలాంటి సందేహం వద్దని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

జడ్జీల సస్పెన్షన్ కు నిరసనగా జయవింద్యాల దీక్ష...

హైదరాబాద్ : తెలంగాణ న్యాయమూర్తుల సస్పెన్షన్ కునిరసనగా పౌరహక్కుల ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయవింద్యాల ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేసేవరకూ చార్మినార్ పీఎస్ లో దీక్ష కొనసాగిస్తానని జయవింద్యాల వెల్లడించారు.

ప్రైవేటుకు ధీటుగా : హరీష్ ...

మెదక్ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలో విద్యనందిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లా సదాశివపేటలో మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సంగారెడ్డిలో రెండు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. సంప్రదాయ విద్యతో పాటు ఆంగ్లవిద్యను కూడా అందిస్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు.

ఏపీలో జ‌న ఔష‌ధిలో చౌకగా మందులు...

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే రోగులకు అత్యంత చవకగా నాణ్యమైన మందులు, ఇతర ఔషధాలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు ఢిల్లీలో కేంద్ర‌మంత్రి అనంత‌కుమార్ అధ్య‌క్ష‌త‌న జ‌న ఔష‌ధిపై స‌మావేశం నిర్వ‌హించారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఏపీలోని ప్ర‌తీ మండ‌లంలో జ‌న ఔష‌ధి కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మావేశంలో కేంద్రం ప్ర‌భుత్వం తెలిపింది. దీని కోసం నిధులు కేటాయిస్తున్న‌ట్లు పేర్కొంది. ఒక్కొక్క కేంద్రానికి 2.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

సుకుమాలో 3గురు మావోలు మృతి..

ఛత్తీస్ ఘఢ్ : సుకుమా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. గాదిరాతి పీఎస్ పరిధిలోని వరిశెట్టి అడవుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందినట్లు సమాచారం. 

ఏపీకి 1000 మెడికల్ సెంటర్స్...

ఢిల్లీ: ఏపీకి వెయ్యి ఔషధి కేంద్రాలు ఇచ్చినందుకు సంతోషమని చెప్పారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని. ఏటా 500 రకాల మందులను కేంద్రం సరఫరా చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారాయన. కేన్సర్‌ లాంటి వ్యాధులకు మందులను సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు మంత్రి కామినేని శ్రీనివాస్.

ఖమ్మం జిల్లాలో మరో ప్రేమోన్మాది..

ఖమ్మం : అశ్వారావు పేటలో ఓ యువకుడు హల్ చల్ సృష్టించాడు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని యువతిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తన కూమార్తెనిచ్చి వివాహం చేయాలని గొడ్డలి పట్టుకుని యువతి తండ్రిపై సదరు యువకుడు దాడికి యత్నించాడు. సత్తుపల్లి పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కాగా పోలీసులు సదరు యవకుడికి మద్దతునిస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. 

అనంతపురంలో అనాగరికం...

అనంతపురం: పెనుకొండ మండలం గుట్టూరు దగ్గర దారుణం జరిగింది. ఆస్తి తగాదాలకు మహిళ బలైంది. స్థానికంగా అంజినమ్మ అనే మహిళను ఆమె బంధువులే మట్టుబెట్టారు. అది కూడా అమానుషంగా రాళ్లతో కొట్టి చంపారు. సమీప బంధువొకరు ఇందుకు ముఖ్య కారణమని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

'బుల్లెట్' లో 'బాబు'...

చైనా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బులెట్‌ట్రైన్‌లో ప్రయాణించారు. 140 కి.మీ దూరంలోని బీజింగ్‌కు టియాంజిన్‌ నుంచి 31 నిమిషాల్లోనే చేరుకున్నారు. చంద్రబాబు ప్రయాణించిన ట్రైన్ గంటకు 295 కి.మీ వేగంతో నడిచంది. ముఖ్యమంత్రి వెంట యనయల కూడా ప్రయాణించారు.

హైకోర్టులో సీబీఐ ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు...

హైదరాబాద్ : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సీబీఐ ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ కేసులో భాగస్వాములు చేయాలని సీబీఐ పిటీషన్ వేసింది. ఈ కేసులో తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. దీంత దర్యాప్తు బాధ్యతలను అప్పటించిన తరువాత సీబీఐకి ధర్మాసనం సూచించింది.

ఆంధ్రా బ్యాంక్ వద్ద అనే వ్యక్తి ఆందోళన...

.గోదావరి : టి.నర్సాపురం ఆంధ్రా బ్యాంక్ వద్ద రామకృష్ణ అనే వ్యక్తి ఆందోళన చేపట్టాడు. అప్పు తీర్చి మూడు నెలలు గడుస్తున్నా..రుణానికి సంబంధించిన కాగితాలు ఇవ్వటంలేదని ఆవేదనతో ఆందోళన చేపట్టాడు. కాగా రామకృష్ణ బంధువులు కూడా బ్యాంక్ లో రుణం తీసుకున్నారనీ వారు కూడా అప్పు కడితేనే పత్రాలు ఇస్తామని బ్యాంక్ వారు అంటున్నారనీ రామకృష్ణ వాపోతున్నాడు. కాగా బ్యాంక్ వారు తన పత్రాలు ఇవ్వకుంటే  ఆత్మహత్య చేసుకుంటానని సదురు వ్యక్తి డిమాండ్ చేస్తున్నాడు.

18:46 - June 28, 2016

చిత్తూరు : ఓ అమ్మాయి భయంతో వణుకుతోంది...ఏం జరుగుతుందోనని ఆ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు..దాదాపు 25 రోజులు గడిచినా న్యాయం దొరకలేదు..స్పందన లేదు..మృగాళ్ల బారిన పడ్డ కూతురు మంచానికి పరిమితమైంది...ఓ సామాన్యురాలికి అన్యాయం జరిగితే ఇంతేనా..? తిరుపతి చంద్రిక పరిస్థితి ఏంటి..? అచేతన స్థితిలో ఉన్న ఆమె భవిష్యత్తు ఏంటి..??

పంజా విసిరిన ప్రేమోన్మాదం...
తిరుపతిలో ప్రేమోన్మాదం పంజా విసిరింది...తమను ప్రేమించలేదన్న కారణంతో ఇద్దరు యువకులు యువతిని బైక్‌తో డీకొట్టారు..హత్యాయత్నానికి పాల్పడి ఆ తర్వాత ఆమెపై పంజా విసిరేందుకు ప్రయత్నించారు..స్థానికుల సాయంతో ఆ యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా, వెన్నెముకకు గాయమై, ప్రస్తుతం మంచానికి పరిమితమైంది.

మంచానికి పరిమితమైన చంద్రిక...
కదల్లేక..మెదల్లేక మంచంలో పడిఉన్న యువతి పూర్ణచంద్రిక..తిరుపతి పట్టణానికి చెందిన చంద్రిక ఇంటర్‌ పూర్తి చేసింది...ఫ్యాషన్ డిజైనర్ కావాలన్న కోరికతో బెంగళూరులోని కాలేజీలో సీటు సంపాదించింది...ఈ నెల 27న కాలేజీలో చేరాల్సి ఉంది...కాని దుర్మార్గుడి పంజాకు ఇలా మంచానికి పరిమితమైంది...

ప్రేమ పేరుతో వెంటపడ్డ నవీన్...
ఈ ఫోటోలు కనిపిస్తున్న వీరిద్దరే నవీన్,యశ్వంత్‌లు...ఇంటర్ చదువుతున్న సమయం నుంచి పరిచయమున్న నవీన్‌ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు..తన కెరీర్ ముఖ్యమనుకున్న ఆమె యువకుడిని దూరం చేసింది..ఆ తర్వాత ప్రాజెక్ట్‌ రిపోర్టు తయారు చేసుకునే క్రమంలో పరిచయమైన యశ్వంత్ కూడా కొన్నాళ్లకు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు..అతన్ని కూడా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.. నవీన్‌ గతంలో ప్రేమించి వెంటపడుతున్నాడని తెలుసుకున్న యశ్వంత్ కూడా అతనికి స్నేహితుడయ్యాడు..ఇక వీరిద్దరూ కలిసి యువతిని నిత్యం వెంటాడ్డం మొదలుపెట్టారు...

ప్రేమను కాదన్నదని కక్ష...
తమ ప్రేమను కాదన్న చంద్రికపై ఇద్దరూ పగ పెంచుకున్నారు. ఈ నెల ఒకటవ తేదిన ఓ స్నేహితులరాలి బైక్ పై వెళుతున్న చంద్రికను, మరో బైక్ పై వచ్చిన నవీన్, యశ్వంత్ లు ఢీ కొట్టారు..దీంతో వెనుక ఉన్న చంద్రిక కింద పడిపోయి, స్పృహ కోల్పోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్, యశ్వంత్ లు కింద పడ్డ చంద్రిక పై మరోసారి దాడికి యత్నించారు. భుజాన వేసుకుని తీసుకెళ్లడానికి యత్నించారు. అయితే అప్పటికీ స్థానికులు గుమి గూడి వారిని ప్రతిఘటించడంతో ఆ దుర్మార్గులు పారిపోయారు.

కన్నవారికి సమాచారం అందించిన స్థానికులు...
స్థానికులు చంద్రిక కన్నవారికి సమాచారం అందించారు..అప్పటికే ఆమె తండ్రి రావడంతో వెంటనే తిరుపతి రుయాసుపత్రికి తరలించారు...ఆ తర్వాత తనకు సిటి స్కాన్, ఎం ఆర్ ఐ పరీక్షలు నిర్వహించారు. వెన్నెముక కింది భాగంగా వెన్నుపూసకు గాయమైంది. దీంతో ఇక అప్పటి నుంచి చంద్రిక ఇంట్లో మంచానికే పరిమితమైంది. ఆ ఇద్దరు యువకుల కారణంగా తనకూతురికి ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు కన్నవారు..

కేసు పెట్టినా లైట్ తీసుకున్న పోలీసులు..
ఘటన జరిగాక ఇటు పోలీసులు పట్టించుకోకుండా..అటు కేసు వాపస్ తీసుకోవాలంటూ వేధింపులు...ఇలా న్యాయం దొరక్క ఆ కుటుంబం ఎన్నో కష్టాలు పడింది...చివరకు ఎస్సీ ఎస్టీ సంఘంవారికి..ఆ తర్వాత మీడియా దృష్టికి తీసుకురావడంతో ఆలస్యంగా ఘోరం వెలుగుచూసింది...ఈ దారుణానికి కారకులైన ఇద్దరు యువకులు తల్లిదండ్రులు తమతో రాజీకి యత్నించారని, కానీ తాము అంగీకరించలేదని ఆయన అంటున్నాడు. జరిగిన ఘోరాన్ని తలుచుకుని కుమిలిపోతున్న చంద్రిక భవిష్యత్తుపై భయం వెంటాడుతోంది..తన జీవిత లక్ష్యం సాధించలేనన్న వ్యథ ఆమెను కృంగదీస్తోంది...తనకు న్యాయం చేయాలని ..ఆ మృగాళ్లను వదిలిపెట్టొద్దంటూ వేడుకుంటుంది...

పోలీసుల నిర్లక్ష్యానికి కారణాలేంటి?...
ఓ ఘోరం జరిగిందని తెలిస్తే వెంటనే స్పందించాల్సిన పోలీసులు ఆలస్యం చేయడానికి కారణాలేంటి..? ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు ఓ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయారా..? ఎస్పీ జయలక్ష్మి స్పందిస్తేగాని పట్టించుకోని పోలీసులు ఇక సామాన్యుల ఫిర్యాదులకు ఎలా స్పందిస్తారు...మృగాళ్ల విషయంలో కఠినంగా ఉండాలని పదే పదే అధికారులు..పాలకులు చెబుతున్నా కొందరు పోలీసుల వల్ల కేసులు నీరుగారిపోతున్నాయనడానికి ఈ ఘోరమే ఉదాహరణ.

18:33 - June 28, 2016

కరీంనగర్ : నమ్మిన సిద్ధాంతం.. ఆధ్యాత్మిక చింతన కోసం అతను సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాడు. ఎంత సాదాసీదా జీవితమంటే.. కనీసం ఒంటిపై చొక్కా కూడా వేసుకోడాయన. పూటకో చొక్కా మార్చుకునే జనాలున్న ఈ రోజుల్లో.. అరవై ఏళ్ల నుంచి ఒంటిపై ఎలాంటి చొక్కా లేకుండా జీవించడాన్నే తన శైలిగా మార్చుకున్నాడాయన. ఇంతకీ ఆయన చొక్కాను ఎందుకు వదిలేశాడు..? వాచ్‌ దిస్ స్టోరీ..! వయస్సు..ఎనభై ఏళ్లు. చేసేది చేనేత వృత్తి. కావాలనుకుంటే.. తన చేత్తో వంద చొక్కాలు నేసి పూటకో చొక్కా వేసుకోవచ్చు. కానీ అసలాయన చొక్కా వేయడమే మానేశాడు. అప్పుడా.. ఇప్పుడా.. ఏకంగా అరవై ఏళ్ల నుంచి ఆయన అంగీ ధరించిందే లేదు. కేవలం పంచెకట్టు మీదనే ఉంటూ పండు వృద్ధాప్యంలో సైతం ఎంతో హుషారుగా తన చేనేత వృత్తిని కొనసాగిస్తున్నాడు.

అరవై ఏళ్లుగా చొక్కా వేసుకోకుండా జీవితం...
కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన ఈయన పేరు దూస నారాయణ. అరవై ఏళ్లుగా చొక్కా లేకుండానే కాలం గడుపుతున్నాడు. ఆ ఊరికి వెళ్లిన వారు ఆయన్ను గుర్తు పట్టాలన్నా.. దూస నారాయణ అంటూ ఆయన పేరుతో పిలిచినా.. ఎవరూ ఆచూకీ చెప్పరు. కానీ అంగీలేని నారాయణ అనగానే.. ఊరు ఊరంతా తరలి వచ్చి ఆయన్ను చూపుతుంది. అంతలా పాపులర్‌ అయ్యారాయన. గ్రామంలో చిన్నా పెద్దా అందరూ ఆయన్ను ఇంటి పేరుకంటే కూడా అంగిలేని నారాయణగానే పిలుస్తున్నారు. ఇంతకీ నారాయణ ఇలా చొక్కాను ఎందుకు వదిలేశాడు..? ఈ ప్రశ్న ఆయన్ని అడిగితే.. ఆధ్యాత్మిక చింతనే కారణమని బదులిస్తాడు.

స్వశక్తితో చేనేత వృత్తిని కొనసాగిస్తున్న నారాయణ...
ఎనభై ఏళ్ల వయస్సులో కూడా మన చొక్కాలేని నారాయణ ఇతరులపై ఆధారపడకుండా.. చేనేత వృత్తిని కొనసాగిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇప్పటికీ స్వశక్తితో చేనేత వృత్తిని కొనసాగిస్తున్న నారాయణ.. తన ఆరోగ్యానికి తాను నమ్మిన ఆధ్యాత్మిక చింతనే కారణమని చెబుతుంటారు. అంతేకాదు.. పండు వయస్సులోనూ గ్రామంలో ఆరోగ్య సూత్రాలను ప్రచారం చేస్తూ.. అందిరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చొక్కా వేసుకోకుండా.. చొక్కానే ఇంటిపేరుగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న నారాయణ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుందాం. 

18:23 - June 28, 2016

అనంతపురం : చిలమత్తూరు మండలం కోడూరుతోపు హైవేపై సిమెంట్ లారీ-ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈఘటనలో ముగ్గురు మృతి చెందాగా..మరో ముగ్గురి కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చిలమత్తూరు మండలం కోడూరుతోపు హైవేపై అనంతపురం- కర్నాటక సరిహద్దు ప్రాంతంలో జరిగింది. బెంగుళూర్ నుండి అల్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న సిమెంట్ లారీ యూ టర్న్ తీసకుంటున్న సమయంలో అనంతపురం నుండి అతి వేగంగా వచ్చిన ఐచర్ వస్తున్న ఐచర్ వాహనం లారీ ఢీకొంది. దీంతో ఐచర్ వాహనంలో వున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. తక్కిన మరో ముగ్గురికీ తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిని వారిని కర్నాటక రాష్ట్రంలోని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా లారీ యూటర్న్ చేసుకుంటున్న సమయంలో సమీపంలో నిలుచున్న 10వ తరగతి విద్యార్థి మీదకు దూసుకుపోవటంతో విద్యార్థి కూడా మృతి చెందింది. ఒకరు చేసిన పొరపాటుకు ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. 

లారీ-ఐచర్ వాహనం ఢీ..3గురు మృతి...

అనంతపురం : చిలమత్తూరు మండలం కోడూరుతోపు హైవేపై సిమెంట్ లారీ-ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈఘటనలో ముగ్గురు మృతి చెందాగా..మరో ముగ్గురి కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులో్ల ఓ విద్యార్థి, ఇద్దరు మహిళలు వున్నట్లుగా సమాచారం.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు.

కేంద్రమంత్రిపై ఫైర్ అయిన టీ.న్యాయవాదులు...

హైదరాబాద్: కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడపై తెలంగాణ న్యాయవాదులు ఫైర్ అయ్యారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రం మరోసారి నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన సమస్యను తేల్చకుండా నాన్చుతుందని దుయ్యబట్టారు. ఆంధ్రా హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలంగాణ సర్కారు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. హైకోర్టు విభజనను ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకోకపోతే పదేళ్లపాటు కేంద్రం ఇలాంటి అన్యాయాన్నే కొనసాగిస్తుందా? అని ప్రశ్నించారు.

కశ్మీర్ ఉగ్రదాడికి ప్లాన్ వేసిన హఫీజ్ అల్లుడు...

హైదరాబాద్‌ : కశ్మీర్‌లోని పంపోర్‌ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి పూర్తిగా లష్కర్‌-తొయిబా నేత హఫీజ్‌ సయీద్‌ అల్లుడు ఖలీద్‌ వలీల్‌ కనుసన్నల్లోనే జరిగినట్టు భారత ఇంటలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో ఎనిమిది జవాన్లు చనిపోయారు. దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఈ దాడికి వ్యూహరచనను ఖలీద్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. జూన్‌ 15-20 తేదీల్లో పాక్‌ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు. వీరికి భారత్‌లో వసతిని అదుదుజనా అనే ఉగ్రవాది సమకూర్చినట్టు వెల్లడయింది.

'బాబు' హిట్లర్ లా వ్యవహరిస్తున్నారు : ఉండవల్లి

తూ.గోదావరి : కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిట్లర్, ముసోలినిలా వ్యవహరించారని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, హిట్లర్, ముసోలినిల పరిపాలన కాలంలో ప్రజాఉద్యమాలను నిర్వీర్యం చేసి అణచి వేసేవారని అన్నారు. వారిలాగే చంద్రబాబు కూడా ముద్రగడను 13 రోజులు ఆసుపత్రిలో నిర్బంధించి, మానసికంగా బలహీనం చేయాలని చూశారని ఆరోపించారు.

సంక్షోభంలో వర్శిటీలు..పట్టించుకోని సర్కార్ : కోదండరాం

హైదరాబాద్ : తెలంగాణ‌లోని యూనివ‌ర్సిటీల స్థితిగ‌తుల‌పై హైద‌రాబాద్ తార్నాక‌లోని ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో తెలంగాణ ఐక్య కార్యాచ‌ర‌ణ సమితి(ఐకాస‌) ఈరోజు స‌మావేశం నిర్వ‌హించింది. మాజీ వైస్ ఛాన్స‌ల‌ర్స్, ఆచార్యులు, విద్యార్థులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. స‌మావేశంలో ప్రొ.కోదండ‌రాం మాట్లాడుతూ.. విశ్వ‌విద్యాల‌యాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. విశ్వ‌విద్యాల‌యాల‌కు ఉప‌కుల‌పతుల‌ను వెంట‌నే నియ‌మించాలని ఆయ‌న అన్నారు. స‌మాజ‌, ఆర్థిక అభివృద్ధిలో విశ్వ‌విద్యాల‌యాలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని కోదండ‌రాం అన్నారు.

'కబాలి' పోస్టర్ పై వివాదం...

ముంబై : కబాలి సినిమా ఇప్పటి వరకూ రికార్డులు, సంచలనాలే సృష్టించింది. కానీ తాజాగా క‌బాలి మూవీ పోస్ట‌ర్‌పై వివాదం చెల‌రేగింది. క‌బాలి నిర్మాత‌లు మాదారి చిత్ర‌ పోస్ట‌ర్‌ను కాపీ కొట్టార‌ని బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ పేర్కొన్నారు. రెండు పోస్ట‌ర్ల‌లోనూ బిల్డింగ్‌లు, స్కైస్క్రేప‌ర్ల మ‌ధ్య‌లో హీరోల ముఖాలు క‌నిపిస్తాయి. అయితే ఈ పోస్ట‌ర్ల గురించి ఇర్ఫాన్‌ను ప్ర‌శ్నించ‌గా ఆయ‌న వెరైటీగా స‌మాధానం ఇచ్చారు. ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న కబాలి చిత్ర నిర్మాత‌లు త‌మ పోస్ట‌ర్‌ను కాపీ కొట్టార‌ని, అయితే ఇందులో వివాదం ఏమీ లేద‌ని ఇర్ఫాన్ అన్నారు.

ఏపీ స్పీకర్ పై చర్యలు తీసుకోండి : రోజా

హైదరాబాద్‌: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కోరారు. మంగళవారం ఏపీ సచివాలయంలో భన్వర్‌లాల్‌ను వైసీపీ నేతలు రోజా, వాసిరెడ్డి పద్మ కలిశారు. గత ఎన్నికల్లో రూ. 11.5 కోట్లు ఖర్చు చేశానని ఓ ఇంటర్వ్యూలో స్పీకర్‌ కోడెల చెప్పారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పీకర్‌పై అనర్హత వేటు వేయాలని వారు కోరారు.

17:27 - June 28, 2016

గొడవలు లేవు..పంచాయతీలు లేవు..కుటుంబ కలహాలు అంతకన్నా లేవు..అయినా ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎలా చనిపోయిందో ?

హైదరాబాద్ కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హేమ ఎలా చనిపోయింది. భర్తతో కలిసి తిరుపతి నుండి వచ్చిన ఆమె కొంతసేపటికే ఇంట్లో శవమై తేలింది. ఎలాంటి గొడవలు లేవని భర్త చెబుతున్నాడు. మరి హేమ ఎలా ఆత్మహత్య చేసుకుంటుంది ? ఏ సమస్య లేని హేమ ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది ? ఇది కట్టుకున్న వాడి కట్టు కథ ? లేక మరైదేనా కారణం ఉందా ? ఇది హత్యా ? ఆత్మహత్యా ? బెజవాడకు చెందిన హేమ అదే ప్రాంతానికి చెందిన సాయి కిరణ్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

17:15 - June 28, 2016

సినీ నటుల ఇంటి పక్కనే విల్లాలు..ఆరు నెలల్లో పెట్టుబడి మూడింతలు..అర సంవత్సరంలో కోటీశ్వరులు..మీరు కొన్నారంటే మీ దశ తీరినట్లే.

సినీ హీరోల నివాసం పక్కనే విల్లాలు..మీ పెట్టుబడి మూడు నెలల్లో ఆరింతలు..నిర్మించడమే ఆలస్యం.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. మంచి తరుణం మించినా దొరకదు..ఇదేదో వ్యాపార ప్రకటన మాత్రం కాదు. కేటుగాళ్లు జనాలను బురిడి కొట్టించడానికి కొత్త రూటు. ఇలాంటి మాటలతోనే జనాలను నిండా ముంచారు. కథ అడ్డంగా తిరగడంతో బుక్కయ్యారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:10 - June 28, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నారనీ హడావిడి చేస్తున్న అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ బాధితుల పిటీషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగింది. హైకోర్టు ఖాతాలో రూ.25 లక్షలు అగ్రిగోల్డ్ యాజమాన్యం జమ చేసింది. ఇప్పటి వరకూ వేలంపాటలో రూ.15 కోట్లు వచ్చాయనీ...జ్యుడిషియల్ కమిటీ కోర్టుకు తెలిపింది. 4వ ఫేజ్ వేలానికి ఆస్తులు లేవన్న జ్యుడిషియల్ కమిటీ కోర్టుకు తెలిపింది. సీబీఐ దర్యాప్తుపై కోర్టుకు రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జులై 13న తీర్పు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. 

హైకోర్టులో అగ్రిగోల్డ్ బాధితుల పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఖాతాలో రూ. 25 లక్షలను అగ్రిగోల్డ్ జమ చేసింది. ఇప్పటి వరకు వేలంలో రూ. 15 కోట్లు వచ్చాయని జ్యుడిషియల్ కమిటీ పేర్కొంది. నాలుగో ఫేజ్ వేలానికి ఆస్తులు లేవని కమిటీ పేర్కొంది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నారని హడావుడి చేస్తున్నారంటూ అగ్రిగోల్డ్ సంస్థపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తుపై రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఏపీ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. 13న మధ్యంతర తీర్పు జారీ చేస్తామని వెల్లడించింది.

16:56 - June 28, 2016

బాలకృష్ణ మాంఛి జోరు మీదున్నట్లున్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు ప్లాన్ చేసేస్తున్నారు. ఇటీవలే బాలయ్య 150వ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిని బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' పేరిట రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుద‌ల చేయాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే 101 సినిమా పేరును కూడా బాలయ్య ఖరారు చేశారు. దీనికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తారని మంగళవారం ప్రకటించేశారు. ఈ చిత్రానికి 'రైతు' పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. రైతు క‌థ బాల‌య్య‌కు విపరీతంగా నచ్చడంతో... కృష్ణ‌వంశీతో 101వ సినిమాగా తెర‌కెక్కించ‌డానికి బాలకృష్ణ సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. సో..బాలయ్య అప్పటి వరకు పుల్ బిజీ అన్నమాట.

16:48 - June 28, 2016

అమెరికా : చిలుక జోస్యం గురించి వినే ఉంటారు .. కానీ ఎప్పుడైనా చిలుక సాక్ష్యం గురించి విన్నారా ?ఓ హత్యకేసులో ఇప్పుడు చిలుక సాక్ష్యంగా మారింది...ఏంటా చిలుక..ఏంటీ ..కేసు అనుకుంటున్నారా అయితే చూడండి.

హత్యకేసులో రామచిలుక సాక్ష్యం...
నీ మాటలు..చిలుకపలుకులు అంటూ... మన సినిమాల్లో హీరోయిన్‌ను పడేయటానికి హీరో చేసే ట్రిక్కులు ... కాకపోతే అమెరికాలో పోలీసులకు ఓ హత్యకేసులో రామచిలుకే ఇప్పుడు ప్రధాన సాక్ష్యం ..అవును మరి.

హత్య కేసులో రామచిలుక సాక్ష్యం...
ఓ హత్య కేసులో రామచిలుక సాక్ష్యంగా మారిన ఘటన అమెరికాలోని మిచిగన్‌లో చోటుచేసుకుంది. కేసును విచారిస్తున్న పోలీసులు ఆ రామచిలుక పలుకుతున్న మాటలు చూసి నిర్ఘాంతపోతున్నారు. మిచిగన్‌లోని సాండ్‌లేక్‌ పట్టణంలో గత ఏడాది మేలో భర్త మార్టిన్‌ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెన్న డురమ్‌ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 5 బుల్లెట్‌ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భర్త పక్కనే తలకు బుల్లెట్‌ గాయంతో గ్లెన్న కూడా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పలుకులతో ఆశ్చర్యపరిచిన రామచిలుక..
ఈ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత వారి ఇంట్లో పెంచుకుంటున్న ఓ చిలుక ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో అరవడం ప్రారంభించింది. 'ఇంట్లోంచి వెళ్లిపో..', 'ఎక్కడికి వెళ్లాలి..' 'నన్ను కాల్చొద్దు..' అనే చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. అయితే ఇలాంటి సాక్ష్యం కోర్టులో అనుమతించదగ్గ సాక్ష్యం అవుతాందా? కాదా? అని నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్‌ రాబర్ట్‌ తెలిపారు.

చిలుక మాటలే కీలకం...
ఈ కేసులో నిజనిర్ధరణకు చిలుక మాటలే కీలకం కానున్నాయి. అయితే అమెరికా న్యాయవ్యవస్థ ఇందుకు ఒప్పుకుంటుందో..లేదో ..చూడాలి.

101 సినిమా పేరును ప్రకటించిన బాలయ్య..

హైదరాబాద్ : సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వందో చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తికాకముందే 101 సినిమాకు ప్లాన్ చేశారు. ఈ చిత్రంపై బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. తన 101 చిత్రం పేరు 'రైతు' అని, ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు.

జడ్జీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలి - ప్రొ.కోదండరాం..

హైదరాబాద్ : జడ్జిల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. న్యాయాధికారుల చేపడుతున్న ఆందోళనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇప్పటి వరకు 48 మంది జడ్జీలను హైకోర్టు సస్పెండ్ చేసింది.

న్యాయవాదుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు - జానా..

హైదరాబాద్ : హైకోర్టు విభజనలో జాప్యం సరికాదని కాంగ్రెస్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. న్యాయవాదుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని, జడ్జీలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

అమలు కాని రుణమాఫీ - నారాయణ..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ సరిగా అమలు కావడం లేదని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. రైతు సమస్యలపై రేపు తహసీల్దార్‌ కార్యాలయాల దగ్గర సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు ఆయన తెలిపారు.

16:41 - June 28, 2016

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిదిలో లేదని న్యాయశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రం పై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో హైకోర్టు పదేళ్లపాటు కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారని.. అంతకు ముందే ఏపీ ప్రభుత్వం మౌళిక వసతులు కల్పిస్తే హైకోర్టు విభజన జరుగుతుందని సదానంద గౌడ చెప్పారు. కేసీఆర్‌ ఢిల్లీలో ధర్నా చేస్తే స్వాగతిస్తామని అన్నారు. న్యాయాధికారుల సమస్యలను సహచర మంత్రి బండారు దత్తాత్రేయ.. సదానందగౌడకు వివరించారు. 

16:39 - June 28, 2016

ఢిల్లీ : టీమిండియా మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఈసారి క్రీడాకారులు ప్రకటించారు. అది కూడా సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ లో. బీసీసీఐ ట్విట్ట‌ర్ అకౌంట్ల‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగే టెస్ట్‌, వ‌న్డే క్రికెట్ సిరీస్ షెడ్యూల్‌ను వెరైటీగా ప్ర‌క‌టించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫ‌స్ట్ టెస్టు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ నెల‌ల్లో ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. కాన్‌పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో కివీస్‌తో తొలి టెస్టు జ‌రుగుతుంద‌ని కోహ్లీ ట్వీట్ చేశాడు. కాన్ పూర్ నుండి సెప్టెంబర్ 22 నుండి కొత్త సీజన్ ప్రారంభమౌతుందని పేర్కొన్నాడు.
ఇండోర్‌లోని హోల్క‌ర్ స్టేడియంలో సెప్టెంబ‌ర్ 30 నుంచి రెండో టెస్టు మొద‌లువుతుంద‌ని మరో క్రికెటర్ అజింక్య ర‌హానే ట్వీట్ చేశాడు.
మూడో టెస్టు ఈడెన్ గార్డెన్‌లో అక్టోబ‌ర్ 8 నుంచి మొద‌లువుతుంద‌ని మొహ‌మ్మ‌ద్ స‌మీ ట్వీట్ చేశాడు.
అక్టోబర్ 26వ రాంచికి టీమిండియా చేరుకుంటుదని జేఎస్ సీఏ స్టేడియంలో నాలుగో వన్డే జరుగుతుందని, మద్దతివ్వాలని అశ్విన్ రవిచంద్రన్ ట్వీట్ చేశాడు.
ధ‌ర్మ‌శాల‌లో కివీస్‌తో అక్టోబ‌ర్ 16న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత ఢిల్లీ, మొహాలీ, రాంచీ, విశాఖప‌ట్ట‌ణంలో మిగ‌తా వ‌న్డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అభిమానులంతా వ‌చ్చి విశాఖ వ‌న్డేలో టీమిండియాకు మ‌ద్దతు ఇవ్వాల‌ని కొత్త కోచ్ అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు. అలాగే మందీప్ సింగ్, శిఖర్ ధావన్, రిషి ధావన్, మహ్మద్ షమీలు కూడా ట్వీట్ చేశారు.
 

మ్యాచ్ తేదీ వేదిక
మొదటి టెస్టు సెప్టెంబర్ 22-26 కాన్ పూర్
రెండో టెస్టు సెప్టెంబర్ 30-అక్టోబర్ 4 కోల్ కతా
మూడో టెస్టు అక్టోబర్ 8-12 ఇండోర్
మొదటి వన్డే అక్టోబర్ 16 ధర్మశాల
రెండో వన్డే అక్టోబర్ 19 ఢిల్లీ
మూడో వన్డే  అక్టోబర్ 23 మొహాలీ
నాలుగో వన్డే అక్టోబర్ 26 రాంచి
ఐదో వన్డే అక్టోబర్ 29 వైజాగ్

 

 

16:28 - June 28, 2016

క‌డ‌ప‌ : ప్రొద్దుటూరులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డి శ్రీ‌వాణి పాఠ‌శాల‌లో ఓ చిన్నారి మృతి చెందింది. పాఠ‌శాల‌లోని బీరువా మీద ప‌డ‌డంతో భార్గ‌వి అనే ఎల్ కేజీ విద్యార్థిని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళన చేపట్టారు. స్కూలుపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భార్గవిపై బీరువా పడిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసలు విచారణ చేపట్టారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 26,524 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 8,127 వద్ద ముగిసింది.

కేసీఆర్‌ ధర్నా చేస్తే స్వాగతిస్తాం : సదానంద

ఢిల్లీ : హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్‌ ఎంపీలతోనూ చర్చించామన్నారు. కేసీఆర్‌ జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నా చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. హైకోర్టు విభజనపై కేసీఆర్‌ కేంద్రంపై అభాండాలు వేయడం సరికాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. మంగళవారం సదానందతో దత్తాత్రేయ బృందం భేటీ అయ్యింది. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో లేదని, ఉమ్మడి హైకోర్టు విచారణలో ఉందని తెలిపారు. దీనిపై పలు దఫాలుగా ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించామని అయినా కేసీఆర్‌ కేంద్రాన్ని విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన అన్నారు.

అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసూతి కేంద్రాలు: లక్ష్మారెడ్డి

హైదరాబాద్: మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మంగళవారం కుటుంబ సంక్షేమశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 500 ప్రసూతి కేంద్రాలను డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన స్థాయిలో ఆధునీకరించాలన్నారు. ప్రజారోగ్యంపై అలసత్వం వద్దని, నెలవారీగా ఫలితాలను సమీక్షించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..22 మందికి గాయాలు..

మెదక్ : జిల్లాలోని రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భన్వర్ లాల్ ను కలిసిన వైసీపీ నేతలు..

హైదరాబాద్ : సచివాలయంలో ఈసీ భన్వర్ లాల్ ను వైసీపీ నేతలు కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్పీకర్ కోడెలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన ఎన్నిక కోసం రూ. 11.5 కోట్లు ఖర్చు చేశారని స్పీకర్ కోడెల స్వయంగా ఒప్పుకున్నందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అంబటి, రోజా, ధర్మశ్రీ, వాసిరెడ్డి పద్మ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

బీరువా మీద పడి విద్యార్థిని మృతి...

ప్రొద్దుటూరులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డి శ్రీ‌వాణి పాఠ‌శాల‌లో ఓ చిన్నారి మృతి చెందింది. పాఠ‌శాల‌లోని బీరువా మీద ప‌డ‌డంతో భార్గ‌వి అనే విద్యార్థిని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి ఏరుకుని పరిశీలించారు. ప్రొద్దుటూరు మండ‌లం లింగాపురంకు చెందిన ఈ చిన్నారి ఆ పాఠ‌శాల‌లో ఎల్‌కేజీ చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై పోలీసులు పూర్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో పాఠ‌శాల యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం ఉందా..? అనే అంశాన్ని ఆరా తీస్తున్నారు.

కేజ్రీవాల్ లా కేసీఆర్ వ్యవహారం - సదానందగౌడ..

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజన కేంద్రం పరిధిలో లేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ తేల్చిచెప్పారు. హైకోర్టు విభజనకు సంబంధించి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించడం జరిగిందని, తన ప్రయత్నం తాను చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రంపై కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదని, జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ ధర్నా చేస్తే అభ్యంతరం లేదని, కేజ్రీవాల్ లా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి అంశానికి కేంద్రాన్ని విమర్శిస్తూ ధర్నాలు చేస్తే ప్రజలే ధీటైన సమాధానం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ పరిస్థితులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఇరు రాష్ట్రాల గవర్నర్ కు లేఖ రాస్తానని వెల్లడించారు.

ముద్రగడ ఇంట ఉండవల్లి...

తూ.గోదావరి : కాపు ఉద్యమ నేత, 13 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభంను కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. ఈ ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వచ్చిన ఉండవల్లి, కాసేపు ఆయనతో ముచ్చటించారు. దాదాపు గంటకు పైగా సమావేశమైన ఉండవల్లి, ముద్రగడ, ఆయన భార్య, దీక్షలో కూర్చున్న కోడలు తదితరుల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. దీక్ష సందర్భంగా పోలీసుల వైఖరి గురించి ముద్రగడ ఆయనకు వివరించినట్టు తెలిసింది.

15:56 - June 28, 2016

మహిళలకు అత్తింటిలో జరుగుతున్న హింసపై దేశ ఉన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మెట్టినింట జరిగే ఆరళ్ళపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ వేదిక చర్చనుచేపట్టింది. ఈ చర్చలో ఉమారాణి (ఎండీ,టెక్ ప్లాస్, యూఎస్ఎ) పునీత ( డెవలప్ మెంట్ ప్రొఫెషనల్ ) పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

11 మంది న్యాయాధికారులు సస్పెండ్ ...

హైదరాబాద్ : తెలంగాణ‌లో న్యాయాధికారుల ఆందోళ‌న‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈరోజు మొత్తం 11 మంది న్యాయాధికారుల‌ను తొల‌గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయాధికారులు క్రమశిక్ష‌ణారాహిత్యానికి పాల్ప‌డుతున్నారని హైకోర్టు పేర్కొంది. మరోవైపు న్యాయాధికారుల‌ తొల‌గింపుల‌ను నిరసిస్తూ హైకోర్టు ముందు న్యాయ‌వాదుల‌ ఆందోళ‌న కొన‌సాగుతోంది. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి ఎందుకు లెట‌ర్ రాయడం లేద‌ని న్యాయ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు.

మహిళా ట్యాక్సీ డ్రైవర్‌ భారతీ వీరత్ ఆత్మహత్య...

కర్నాటకక : బెంగళూరులో తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా పేరుగాంచిన భారతీ వీరత్ ఇక లేరు. రెండేళ్ల క్రితం తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా ఉబెర్ సంస్థలో చేరి చరిత్ర సృష్టించారు. 33 ఏళ్ల భారతీ వీరత్ సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. 

పట్టపగలు 3గురు దారుణ హత్య...

ప్రకాశం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పర్చూర్ మండలం చెన్నుబొట్ల ఎస్సీకాలనీలో ముగ్గురు దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

15:37 - June 28, 2016

నెల్లూరు : టీపీ గూడూరు మండలంలోని ఎన్ సీసీ పవర్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌పైప్‌ లైన్‌లో మంటలు చెలరేగడంతో...ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

15:33 - June 28, 2016

ప్రకాశం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పర్చూర్ మండలం చెన్నుబొట్ల ఎస్సీకాలనీలో ముగ్గురు దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ఎన్ సిసి పవర్ ప్రాజెక్టు బాయిలర్ లో మంటలు..

నెల్లూరు : తోటపల్లిగూడురు ఎన్ సిసి పవర్ ప్రాజెక్టులో బాయిలర్ లో మంటలు చెలరేగాయి. 8మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

 

 

 

14:49 - June 28, 2016

విశాఖ: విశాఖ జిల్లా పాయకరావు పేట పాల్మన్‌ గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో 15 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాతకక్షల కారణంగానే ఈ దాడులు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గతకొద్ది కాలంగా పాల్మన్‌పేట గ్రామస్థులకు, రాజయ్యపేట గ్రామస్థులకు వివాదాలు నడుస్తున్నాయని, ఇవే గొడవలకు కారణమని తెలిపారు.

14:45 - June 28, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనలో జాప్యం, న్యాయాధికారుల నియామకాల్లో అన్యాయం, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్ లను ప్రశ్నిస్తూ తెలంగాణ లాయర్లు చేపట్టిన ఆందోళనలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఆందోళనలకు మద్దతిచ్చారన్న కారణాన్ని చూపి ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్ వేటు వేసిన హైకోర్టు నేడు కూడా తన విశేషాధికారాన్ని ప్రయోగించింది. పరిస్థితులు చక్కబడకపోవడం, సాక్షాత్తు న్యాయమూర్తులే ఆందోళనలకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలపై కొద్దిసేపటి క్రితం మరో ఐదుగురు జడ్జీలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా సస్పెన్షన్ కు గురైన వారిలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాసరెడ్డి,చంద్రశేఖర్ ప్రసాద్ లతో పాటు న్యాయమూర్తులు రాధాకృష్ణ చౌహాన్, రమాకాంత్, తిరుపతి ఉన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంతోనే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాజ్ నాథ్ తో ముగిసిన దత్తాత్రేయ భేటీ..

హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తో కేంద్ర మంత్రి దత్తాత్రేయ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఉమ్మడి హైకోర్టు సమస్యలు, విభజన చట్టం అమలుపై చర్చించారు. హైకోర్టు విభజన, జడ్జీలు, న్యాయవాదుల నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.

14:35 - June 28, 2016

సీనియర్స్ స్టార్స్ అయినా, యంగ్ స్టార్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళతో నటిస్తూ వచ్చిన ఆఫర్స్ ను టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న యంగ్ హీరోయిన్స్ సద్వినియోగం చేసుకుంటున్నారు. అందాల సమంతా కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోంది. మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమే నాగచైతన్య, నితిన్‌ పక్కన కూడా చక్కగా ఒదిగిపోతుంటుంది. ఇటీవల నితిన్‌తో కలిసి ‘అ..ఆ’లో నటించిన సమంత తదుపరి నాగచైతన్యతోనూ జోడీ కట్టబోతోందని సమాచారం. ఇక రవితేజ, పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబుతో ఆడిపాడిన కాజల్‌, శ్రుతి హాసన్‌, తమన్నా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, నాగచైతన్య, అల్లు అర్జున్‌లాంటి యువ కథానాయకుల చిత్రాల్లో అవకాశాలు అందుకొంటున్నారు. అదే తమన్నా, కాజల్‌ ఇప్పుడు నాగార్జున, చిరంజీవిలాంటి అగ్ర కథానాయకులతోనూ నటించేందుకు సై అంటున్నారు. నవతరం భామలు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాశీ ఖన్నా, రెజీనా కూడా సీనియర్‌, జూనియర్‌ అనే ముద్ర లేకుండా కెరీర్‌ని తీర్చిదిద్దుకొంటున్నారు. ఇదివరకు రవితేజ, గోపీచంద్‌తో కలిసి నటించిన వీళ్లు ఇప్పుడు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నటిస్తున్నారు. ఒకప్పుడు అగ్ర కథానాయికలుగా గుర్తింపు తెచ్చుకొన్న భామలు స్టార్‌ ఇమేజ్‌ లేని యువ హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపేవాళ్లు కాదు. కానీ ఇప్పుడలా కాదు. కుర్ర హీరోలతో కలిసి నటిస్తే లాంగ్‌ రన్‌ ఉంటుంది కదా అనే భావన కథానాయికల్లో కనిపిస్తోంది. ఎన్నేళ్లుగా పరిశ్రమలో ఉన్నా కథానాయికలు మాత్రం వాళ్లపై సీనియర్‌ ముద్ర పడకుండా చూసుకొంటున్నారు.

చిన్నేంటి ? పెద్దేంటి? ఆఫర్ ఆఫరే. వాళ్ళు కావాలి, వీళ్ళూ కావాలి. ఎవరైనా టాప్ హీరోలే కదా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. సీనియర్ హీరోలతో నటిస్తే .. కుర్రహీరోల సినిమాల్లో ఛాన్స్ లు మిస్ అవుతాయోమోననే టెన్షనే లేకుండా ప్రస్తుత హీరోయిన్స్ కొత్త ట్రెండ్ సెట్ చేసిపెట్టారు. మిగతా హీరోయిన్స్ దాన్నే ఫాలో అవుతున్నారు. ఈ విధానాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే.

14:29 - June 28, 2016

అందాల అనుష్క ఆరంభంలోనే సీనియర్ హీరో అయిన నాగార్జున తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అమ్మడు కుర్రహీరోలతో జతకట్టింది. ఇటు సీనియర్స్ తోనూ, అటు యంగ్ హీరోస్ తోనూ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ రేస్ లో దూసుకుపోయింది. స్వీటీ.. అనుష్క అసలు పేరు ఇదే. మంగళూరులో పుట్టిన ఈమె బెంగళూరులో చదువుకుంది. కంప్యూటర్స్‌లో డిగ్రీ చేసినా కొన్నాళ్లు యోగా టీచర్‌గానూ పనిచేసింది. తొలిసారిగా 'సూపర్' సినిమాతో సీనియర్ హీరో నాగార్జున సరసన హీరోయిన్ గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ లవ్లీ హీరోయిన్ 'విక్రమార్కుడు', 'లక్ష్యం', 'అరుంధతి' లాంటి చిత్రాలతో అనుష్క టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 'సింగమ్', 'వానమ్', 'తాండవం' లాంటి సినిమాలు ఈమెను తమిళ ప్రేక్షకులకూ బాగానే దగ్గర చేశాయి. ప్రస్తుతం మూడు పదులు దాటినా ఇంకా కథానాయికగానే చిత్రసీమను ఏలుతున్న అనుష్క కెరీర్ ప్రారంభమై కేవలం పదేళ్లే అయ్యిందట.

40 సినిమాలు..
ఈ పదేళ్లలో దాదాపు 40 సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ సీనియర్ హీరోలైన నాగార్జున తో సూపర్ , రగడ లాంటి చిత్రాల్లో నటిస్తే , వెంకీల సరసన చింతకాయల రవిలో నటించింది. యంగ్ హీరో ప్రభాస్ తో బిల్లా, మిర్చి, బాహుబలిలో ఆడిపాడింది. ఇక రుద్రమదేవి సినిమా కోసం ఏ రేంజ్‌లో కష్టపడిందో తెలియని విషయం కాదు..ఈ ఒక్క చిత్రం కోసం రెండున్నర ఏళ్లు కష్టపడిన అనుష్క, ఇందులో యంగ్ హీరో రానా సరసన రొమాన్స్ చేసింది. త్వరలో 'భాగ్‌మతి'లో ఆది పినిశెట్టితో జోడీ కట్టబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన ఆమెని మరో నాలుగైదేళ్లయినా కుర్రభామే అనాల్సి ఉంటుందేమో. ఆ తర్వాత 'సైజ్ జీరో' తో తమిళ్ యంగ్ హీరో ఆర్యతోనూ నటించింది. సూర్య సరసన సింగం మూడు పార్టుల్లోనూ ఆమెనే హీరోయిన్. ఇప్పుడు బాహుబలి 2 లో ప్రభాస్ తో మరోసారి రొమాన్స్ పండిస్తూ ప్రేక్షకుల్నితన అందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అమ్మడు ఇటు సీనియర్స్ తోనూ, అటు యంగ్ హీరోస్ తోనూ నటిస్తూ దూసుకుపోతోంది. చిరంజీవి 150 వ చిత్రం కోసం అనుష్కని కూడా సంప్రదించారు. ఆమె నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. మొత్తం మీద అనుష్క ఈ వయసులో కూడా తన అందంతో కనికట్టు చేస్తోంది.
 

14:25 - June 28, 2016

సౌత్ టాప్ హీరోయిన్‌ నయనతార 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31లోకి అడుగుపెట్టింది. నయనతార పేరుకు తగ్గట్టే ఎప్పుడు చూసినా ఏ సినిమాలో చూసినా కొత్తగానే కనిపిస్తుంది. వెండితెరపై 12 ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్‌లోనే నయనతార టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. 12 ఏళ్ల కెరీర్‌లో రెండుసార్లు లవ్‌లో ఫెయిల్ అయినా.. మళ్ళీ కెరీర్‌పై దృష్టిపెట్టి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా ఇప్పటికీ టాప్‌ఛైర్‌లో కూర్చుంది. చాలా మంది హీరోయిన్స్ మాదిరి మోడలింగ్ రంగం నుంచి వచ్చి ఒక సినిమాలో మాత్రమే నటిద్దామనుకుని కెరీర్ స్టార్ట్ చేసి... నయన తక్కువ టైంలో 50 సినిమాలు పూర్తి చేసింది. అడుగుపెట్టిన ప్రతి లాంగ్వేజ్‌లోనూ క్రేజీ హీరోయిన్నే. తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. ఇలా ఇన్ని భాషలను ఏలిన హీరోయిన్ ఈ మధ్యకాలంలో నయనే. కాంట్రవర్సీలతో కాపురం చేసినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పర్సనల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలొచ్చినా... ఇప్పటికీ నయనతార మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కెరీర్ సాగిస్తోంది. అందం.. అభినయం.. ఒకే చోట వుండడం చాలా అరుదు. ఒకవేళ ఈ రెండూ వున్నా.. అదృష్టం వుండదు. ఈ మూడు కలబోసిన భామ నయనతార. నిండైన చీరకట్టులో మురిపించినా.. బికినీ వేసి కవ్వించినా అది నయనతారకే సాధ్యం.

12 ఏళ్లు..
కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ అందం క్రేజ్ చెక్కు చెదరలేదు. తమిళ్ యంగ్ హీరోలు ఆర్య.. జయం రవి తో పాటు సీనియర్ హీరో రజనీకాంత్ తో కూడా ఆడిపాడింది. ఇక తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లాంటి అగ్ర కథానాయకులతో ఆడిపాడిన నయనతార ఆ తర్వాత రానాలాంటి యువ కథానాయకుడితోనూ జోడీ కట్టి ఇప్పటికీ తాను కుర్రభామనే అని చాటి చెప్పింది. ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరి పక్కన సెట్ అయిపోతుంది కాబట్టే.. అందరికీ నయనతారే కావాలి. ఏ హీరోయిన్ చేతిలో లేనన్ని సినిమాలు నయనతారకున్నాయి. నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో వెంకటేశ్ ప్రక్కన మూడోసారి నటించడానికి రెడీ అవుతోంది నయన. కలిసొచ్చిన హీరోతో.. తెలుగులో సక్సెస్‌ఫుల్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుందని ఆశిద్దాం.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల నియామకాలపై చర్చించారు. ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి జితేంద్రసింగ్‌ కలిసిన వారిలో ఉన్నారు.

ఆరుగురు యువకులను హతమార్చిన నక్సలైట్లు..

జార్ఖండ్‌ : పీపుల్స్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) ద‌ళానికి చెందిన న‌క్స‌లైట్లు ఆరుగురు యువ‌కుల‌ను హ‌త‌మార్చారు. కుంటీ-రాంచీ స‌రిహ‌ద్దు స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

14:09 - June 28, 2016

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోయిన్స్ లో చాలా మార్పొచ్చింది. నిన్న మొన్నటి వరకూ స్కిన్ షో తో అదరగొట్టిన ముద్దు గుమ్మలంతా ఇప్పుడు కథలో కీలకమైన పాత్రలు పోషిస్తూ జనాన్ని మెప్పించడం మొదలెట్టారు. ఈ మార్పు మన టాలీవుడ్ లో ఈ సంక్రాంతి నుంచే మొదలైందని చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళ లిస్ట్ అరడజను పైగానే ఉంది. హీరోతో సమాన ప్రాధాన్యం కలిగిన పాత్రలు పోషిస్తున్న అలాంటి హీరోయిన్స్ పై కథనం..

2016లో బోణి..
2016 లో టాలీవుడ్ ఓ మంచి లవ్ స్టోరీతో బోణి కొ్ట్టింది. సినిమా పేరు నేను శైలజ. ఇందులో శైలజ రోల్ పోషించిన కీర్తి సురేష్ తొలి తెలుగు చిత్రం ఇదే అయినా, తను మలయాళీ అయినా, హీరోతో సమాన ప్రధాన్యం కలిగిన పాత్ర పోషించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అమ్మడు గ్లామర్ కు ఎలాంటి ప్రధాన్యత ఇవ్వకుండా కేవలం పాత్రతో మాత్రమే ట్రావెల్ చేసింది. ఏ హీరోయిన్ అయినా, ఫస్ట్ ఎటెమ్ట్ లో తనను తాను ప్రూవ్ చేసుకోడానికి గ్లామర్ నే ప్రధాన ఆయుధంగా వాడుతారు. కానీ నేను శైలజతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మాత్రం పాత్రకే తొలి ప్రాధాన్యతనిచ్చి.. యువతను బాగా ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో పరిణత గల నటన ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. తండ్రి ప్రేమకి దూరమై, మనసులోని భావాలకి మాటలివ్వలేని ఇంట్రావర్ట్‌ శైలజగా కీర్తి సురేష్ అదరగొట్టేసింది. ఆమె నటనలో మంచి పరిణతి కనబరిచింది. హావభావాలు బాగున్నాయి. సినిమాలో ఎక్కడా కీర్తి స్కిన్ షో చేయాలని తాపత్రయ పడకపోవడం మెచ్చుకోదగ్గ అంశం. అందుకే కీ్ర్తి శైలజ పాత్రలో
తెలుగువారికి అంత దగ్గర కాగలిగింది.

రకూల్ ప్రీత్ సింగ్..
నిన్న మొన్నటివరకూ గ్లామర్ డాల్ గానే అలరించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాన్నకు ప్రేమతో చిత్రంతో సరికొత్త మేకోవర్ తో కనిపించింది. ఈ సినిమాలో రకుల్ గ్లామర్ తో పాటు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు కూడా ప్రిఫరెన్స్ నిచ్చింది. ఇంచుమించు హీరోతో సమానమైన పాత్రపోషించి మెప్పించింది. నాన్నకు ప్రేమతో సినిమా ఎమోషన్స్ తో నిండిఉన్న ఒక రివెంజ్ స్టోరీ. హీరో తండ్రిని మోసం చేసి తాను కోటిశ్వరుడవుతాడు ఒకడు. తన తెలివితేటలు ఉపయోగించి, వాడ్ని తన తండ్రి పొజీషన్ కు తీసుకురావడమే హీరో లక్ష్యం. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ విలన్ కూతురి గా నటించింది. డబ్బున్న ప్రతీ అమ్మాయికి ఉండే పొగరు, అహంకారం, దర్పం లాంటివన్నీ ఆమెకూ ఉన్నాయి. కాకపోతే హీరో పెక్యులర్ కేరక్టర్ ఆమెకు కొత్తగా కనిపిస్తుంది. అతడితో ప్రేమలో పడుతుంది..అతడితో ట్రావెల్ చేస్తుంది. చివరికి అతడి రివెంజ్ లో తనూ భాగం పంచుకుంటుంది. ఈ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ అన్ని రకాల హావభావాల్ని అద్భుతంగా పలికించింది. అంతేకాదు ఇందులో తన పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటు గ్లామర్ తో పాటు అటు పెర్ఫార్మెన్స్ ను అదరగొట్టి మంచి పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

లావణ్య త్రిపాఠి..
అందాల రాక్షసితో అందరి యూత్ హృదయాలు కొల్లగొట్టిన లావణ్య త్రిపాఠి గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత పెద్దగా ఇవ్వదు. కేవలం పెర్ఫార్మెన్స్ కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. లాస్టియర్ భలే భలే మగాడివోయ్ లో అద్భుతమైన పాత్ర పోషించిన లావణ్య...ఈ సంవత్సరం సొగ్గాడే చిన్నినాయనలో దాన్ని మించిన పాత్రలో ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. పని ధ్యాసలో పడి భార్యను పట్టించుకోని భర్తమీద ఏ అమ్మాయికైనా కోపం, బాధ దాన్ని మించి ఆందోళన ఉండడం సహజం. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఎలాంటి అమ్మాయైనా కొంచెం గయ్యాళి తనం, మరికొంచెం గడుసుతనం చూపించాలి. ఈరెండూ కలగలిసిన అలాంటి పాత్రను లావణ్య త్రిపాఠి అద్భుతంగా పోషించి మెప్పించింది. ఎంతసేపూ ల్యాప్ టాప్ ను ఒళ్ళోనే పెట్టుకునే భర్త ఉంటే ఏ అమ్మాయైనా ఎలా ఫీలవుతుంది ? ఈ పాత్రకు లావణ్య నూటికి నూరుపాళ్ళూ న్యాయం చేసింది. అంతేకాదు గ్లామర్ కు ఏమాత్రం స్కోపివ్వక, కేవలం పెర్ఫార్మెన్స్ తోనే
ఆకట్టుకునే ప్రయత్నం చేసిన లావణ్య త్రిపాఠికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మాళవిక నాయర్..
లాస్టియర్ ఎవడే సుబ్రహ్మణ్యంతో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది మాళవికా నాయర్. ఇందులో అమ్మడి గ్లామర్ కన్నా పెర్ఫార్మెన్స్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. మళ్లీ ఈ సంవత్సరం ఈ ముద్దుగుమ్మ కళ్యాణ వైభోగమే చిత్రంతో మరోసారి మంచి పాత్రపోషించి శభాష్ అనిపించుకుంది. దివ్య ఎంబీబీఎస్ చదువుతూ, ఆ తర్వాత ఫారిన్లో ఎండీ చదవాలని కోరుకుంటున్న అమ్మాయి. కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఆమె పెళ్లికోసం తొందరపడతారు. తనను పెళ్లిచేసుకున్న అబ్బాయికూడా తన టైపే కావడంతో ఇద్దరూ పెళ్లిచేసుకొని ఆ తరువాత విడాకులు తీసుకోవాలని డిసైడవుతారు. ఈ ప్రాసెస్ లో వీళ్లిద్దరి మధ్యా నిజంగానే ప్రేమపుడుతుంది. దివ్యగా మాళవిక నాయర్ అదగొట్టేసింది. అందం అభినయం రెండింట్లోనూ ఆకట్టుకుంది. పాత్రల్లో ఇమిడిపోయింది. నిత్యామీనన్ తరహాలో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రతిభ ఆమె సొంతం. నాగశౌర్య మాళవికల జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. అతడితో మాళవిక కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నేటి తరం అమ్మాయిగా మాళవిక పెర్ఫార్మెన్ సినిమాకే హైలైట్.

ఆదాశర్మ..
ఎప్పుడూ గ్లామర్ రోల్స్ లో అదరగొట్టే ఆదాశర్మ... ఈ సంవత్సరం ఓ మంచి పాత్రతో, ఓ సెన్సేషనల్ సినిమాతో మన ముందుకొచ్చింది. సినిమా పేరు క్షణం. ఇందులో ఆదా చక్కగా గ్లామరస్ గా కనిపించడమే కాకుండా, అద్భుతమైన పెర్ఫర్మెన్స్ తో అందరినీ కట్టిపడేసింది. హీరోయిన్ తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారంటుంది. కానీ ఆమెకు అసలు కూతురే లేదంటారు అందరూ. చివరికి హీరో కూడా ఆమెను అనుమానిస్తాడు. హీరో ఇంటి లోపలికి వెళ్తే.. హీరోయిన్ తన కూతురు పెరిగి పెద్దవుతున్న టైంలో తన పొడవును కొలుస్తూ గోడల మీద వేసిన మార్క్స్ కనిపిస్తాయి. అప్పుడతడికి నిజం తెలుస్తుంది. కానీ ఇటు తిరిగేసరికి ఘోరం జరిగిపోతుంది. 'క్షణం' సినిమాకు హైలైట్ అనదగ్గ సన్నివేశం ఇది. నిజానికి ఇలాంటి రోల్స్ చేయడానికి గ్లామర్ రోల్స్ చేసే ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు. పైగా పెళ్ళైన అమ్మాయిగా చేయాలంటే ఎవరైనా వెనక్కితగ్గుతారు. కానీ ఆదాశర్మ అదేం పట్టించుకోకుండా తనకిచ్చిన పాత్రకినూటికి నూరుపాళ్ళూ న్యాయం చేసింది. ఆదాశర్మ ఇలా తనకు నప్పే పాత్రలు ఎంచుకుంటే బెటర్. తెలుగులో ఇప్పటిదాకా ఆదా చేసిన పాత్రల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. గుర్తుంచుకోదగ్గది. ఆమె పాత్రకు తగ్గట్లుగా నటించింది.

సమంత..
ఈ సంవత్సరం సమంత కెరీ్ర్ లో ఓ మరిచిపోలేని సినిమా తెరకెక్కింది. ఆ సినిమా అ, ఆ. అందులో ఆమె పాత్రను అద్భుతంగా మలిచాడు దర్శకుడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేదిలో ఆమెను గ్లామర్ కోణంలోనే చూపించిన త్రివిక్రమ్ అ, ఆ లో మాత్రం మరో కోణంలో అభినయాన్ని వెలికితీసాడు. అనసూయ రామలింగం అమ్మ చేతిలో తానో ఆటబొమ్మలా అయిపోయానని.. తనకంటూ ఏ స్వేచ్ఛా లేకపోయిందని బాధపడే అమ్మాయి. తనకు ఇష్టం లేని పెళ్లి నిర్ణయించడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేస్తుంది. అయినా ఆమె తల్లి మహాలక్ష్మి లో ఏ మార్పూ ఉండదు. ఇలాంటి స్థితిలో మహాలక్ష్మి ఊరెళ్తే ఆమెకు తెలియకుండా పల్లెటూర్లోని తన అత్తయ్య వాళ్లింటికి వెళ్తుంది అనసూయ. అక్కడ అత్తయ్య కొడుకు ఆనంద్ విహారి ఆమెకు తెగ నచ్చేస్తాడు. ఐతే ఆనంద్ కుటుంబానికి.. మహాలక్ష్మి అంటే పడదు. పైగా ఆస్తుల అంతరమూ ఉంటుంది. దీంతో ఆనంద్.. అనసూయకు దూరం దూరంగా ఉంటుంటాడు. పైగా అతను తప్పనిసరి పరిస్థితుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చి ఉంటాడు. ఐతే పది రోజులు పల్లెటూర్లో ఉన్నాక తన తల్లి తిరిగి ఇంటికి వస్తోందని తెలిసి తిరిగి సిటీకి బయల్దేరుతుంది అనసూయ. రాగానే ఆమె పెళ్లికి ఏర్పాట్లు మొదలైపోతాయి. ఇందులో సమంత అనుకున్నట్లే అదరగొట్టేసింది. ఆమె హావభావాలు.. చిలిపి నటన కట్టిపడేస్తాయి. సమంత పాత్ర.. ఆమె నటన.. ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయి.

జెంటిల్ మెన్ హీరోయిన్లకు మంచి పేరు..
ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో జెంటిల్ మేన్ ఓ ప్రత్యేక తరహా చిత్రం. ఈ సినిమా పక్కా థ్రిల్లర్ మూవీగా జనాన్ని ఆకట్టుకుంటోంది. ఇందులో నటించిన ఇద్దరు హీరో్యిన్స్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో ముఖ్యంగా నివేదా థామస్ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ 'జెంటిల్ మన్'లో హీరోయిన్లిద్దరికీ మంచి ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నివేదా థామస్ పోషించిన కేథరిన్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆమె నటన కూడా అందరినీ మెప్పించింది. తెలుగులో హీరోయిన్ పాత్రకు ఇంత ప్రాధాన్యం ఉండటం.. ఆ పాత్రలో హీరోయిన్ అంత బాగా రాణించడం అరుదైన విషయం. జెంటిల్ మన్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నివేదాకు మంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. నివేదా థామస్ అంతటి బలమైన ముద్ర వేపింది . నివేదా మంచి నటి అనే విషయం తొలి సన్నివేశంలో ఆమె హావభావాలు చూస్తేనే తెలిసిపోతుంది. తన ప్రియుడు ప్రాణాలతో లేడని తెలిసిన సన్నివేశంలో ఆమె నటన ఇంకా గుర్తుండిపోతుంది .అలాగే ఇందులో నటించిన మరో హీరోయిన్ సురభి కూడా ఇందులో ప్రాధాన్యం కలిగిన పాత్రనే పోషించింది. జెంటిల్ మేన్ సినిమా, ఇద్దరు హీరోయిన్లతో గ్లామర్ ఒలికించకపోయినా ఇద్దరి హావాభావాలతోనే సూపర్ హిట్టు కొట్టేసింది.

నిహారిక..
రీసెంట్ గా రిలీజైన ఒకమనసు తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మెగా వారసురాలు కొణిదెల నిహారిక. ఈ ఒక్క సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా లో ఎక్కడా గ్లామర్ ఒలికించకుండా కేవలం తన నటనతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో కొంతవరకూ విజయం సాధించింది. అనిల్ కపూర్ వారసురాలు సోనమ్ కపూర్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ , శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి లాంటి హీరోయిన్స్ అందరూ తొలి సినిమాతోనే గ్లామర్ ను ఓ రేంజ్ లో ఒలికించారు. కానీ టాలీవుడ్ లో ఇప్పటి జనరేషన్ లో వచ్చిన తొలి వారసురాలు నిహారిక మాత్రం గ్లామర్ జోలికి పోకుండా కేవలం తన నటనతోనే తన పాత్రని సిన్సియర్ గా రక్తికట్టించే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని చోట్ల ఆమె హావభావాలు ఆకట్టుకున్నా మరికొన్ని చోట్ల చాలా బ్లాంక్ గా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక మనసు సినిమాతో అందంతో పాటు అభినయానికి కూడా మంచి మార్కులు వేయించుకుంది నిహారిక. ఎలాంటి హీరోయిన్ కైనా అందం తగ్గగానే గ్లామర్ కి బ్రేక్ పడిపోతుంది. ఆఫర్స్ కరువైపోతాయి. ఫేడవుట్ కు రంగం సిద్ధమైపోతుంది. కానీ అభినయానికి ఏజ్ లిమిట్ లేదు. దానికి గ్లామర్ తోనే సంబంధం లేదు. పెర్ఫార్మెన్స్ తో జనాన్ని మెప్పిస్తే దానికి లాంగ్ రన్ లో లైఫ్ ఉంటుందని టాలీవుడ్ హీరోయిన్స్ కి ఇప్పుడిప్పుడే అర్ధమౌతోంది.

14:09 - June 28, 2016

హైదరాబాద్ : భారతదేశానికి ప్రపంచ గుర్తింపు రావడానికి పీవీ తీసుకున్న చర్యలే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పీవీ 95వ జయంతి ఉత్సవాలు సందర్భంగా  ఆయన నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలు, భూసంస్కరలతో  దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్పవ్యక్తి పీవీ అని తెలిపారు. 

14:07 - June 28, 2016

బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధానిలోని మసీదును లక్ష్యంగా చేసుకుని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రంజాన్ మాసం సందర్బంగా అబు ఘరైట్ మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.

14:04 - June 28, 2016

హైదరాబాద్ : ఎపి, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. హైదరాబాద్ రామాంతపూర్‌లో కురిసిన భారీవర్షం కారణంగా మూసీ కాలువలు పొంగిపొర్లాయి. సాయికృష్ణ కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు విద్యుత్‌సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్‌ శివారులో భారీవర్షం
హైదరాబాద్‌ శివారులోని బోడుప్పల్‌, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లు చెరువులను తలపించాయి. సుమారు మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోపక్క వర్షం కారణంగా విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుద్దానగర్‌ రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జనజీవనం అస్తవస్త్యం 
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవస్త్యమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చిన నగర వాసులు ట్రాఫిక్  చిక్కుకున్నారు. ముఖ్యంగా.. పంజాగుట్ట, మోడల్ హౌస్, ఆలుగడ్డబావి, మెట్టుగూడ, మలక్‌పేట్, తార్నాక, హబ్సిగూడ, శ్రీనగర్ కాలనీ, తిరుమలగిరి, బేగంపేట్, రాజ్‌భవన్ రోడ్డు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మరో వైపు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవటంతో ఉదయం 8.30 నుంచి ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. హైటెక్‌సిటీతో పాటు మాదాపూర్, గచ్చిబౌలికి వెళ్లేవారికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భువనగిరిలో భారీ వర్షం
నల్లగొండ జిల్లా భువనగిరిలో కురిసిన భారీ వర్షానికి మూసీనది పొంగిపొర్లుతోంది. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలకు పలుచోట్ల  వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసీ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారి మురికినీరు రోడ్లపపైకి రావడంతో బయటకు రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 
ఏపీలో 
ఏపీలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలన్నీ జలమయమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో వర్షాలు కురుస్తున్నాయి. 

 

13:57 - June 28, 2016

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కాదని.. తెలుగు దొంగల పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆమె  హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బినామీల కోసమే సింగపూర్ కంపెనీలకు రాజధాని నిర్మాణం అప్పగించారని ఆరోపించారు. భూములన్నీ బినామీల పేరుతో కొనుగోలు చేయించారని తెలిపారు. అమరావతి భూములను సింగపూర్ కు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. నాడు తెల్లదొరల పాలనను తరిమికొడితే నేడు అదే తెల్లదొరల చేతుల్లో రాష్ట్ర భూములను చంద్రబాబు పెడుతున్నారని మండిపడ్డారు. భగవంతుడంంటేనే భయం లేని చంద్రబాబుకు ప్రజలను ఏం గౌరవిస్తాడని చెప్పారు. ప్రపంచదేశాల్లో చంద్రబాబు తెలుగువారి గౌరవాన్ని మంటగలుపుతున్నాడని విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎన్నో లోపాలున్నాయని తెలిపారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని గుర్తు చేశారు. స్విస్ చాలెంజ్ విధానాన్ని అడ్డుకునేందుకు వైసీపీ పోరాడుతుందని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు బాంబు పెట్టి ప్రజల భవిష్యత్ ను పేల్చాలనుకుంటున్నారా...అని అన్నారు. చంద్రబాబు విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తే తెలుగు ప్రజలు క్షమించరని చెప్పారు. 

 

45 మంది జడ్జీలపై వేటు..

హైదరాబాద్ : న్యాయాధికారుల చేపడుతున్న ఆందోళనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 48 మంది జడ్జీలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు 48 మంది జడ్జీలను హైకోర్టు సస్పెండ్ చేసింది.

మూడో రోజు సీఐటీయూ రాష్ట్ర మహాసభలు...

విజయవాడ : మూడో రోజు సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ..చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు..జీవో 273 రద్దు..కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశాలపై తీర్మానం చేశారు. మహాసభలో తీర్మానించిన అంశాలపై కార్యచరణ ప్రకటిస్తామని, రుణమాఫికి రూ. 7300 కోట్లు మాత్రమే విడుదల చేశారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. రక్షిత మంచినీరు అందిస్తామని చేతులెత్తేశారని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు విదేశీ సంస్థలకు భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు.

రాజ్యసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది - విజయసాయిరెడ్డి..

ఢిల్లీ : తొలిసారి రాజ్యసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యత్వాన్ని అలంకారంగా భావించడం లేదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

మరో న్యాయాధికారిపై కొరఢా..

హైదరాబాద్ : మరో న్యాయాధికారిపై హైకోర్టు కొరఢా ఝులిపించింది. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఛైర్మన్ గా పనిచేస్తున్న జడ్జి మురళీధర్ రావును సస్పెండ్ చేసింది.

 

ప్రకాశంలో ముగ్గురి దారుణ హత్య..

ప్రకాశం : పర్చూరు (మం) చెన్నుబొట్ల ఆగ్రహారంలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తులను దుండగులు హతమార్చారు. పాతకక్షలే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

టి.టిడిపి ఎస్సీ సెల్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఎస్సీ సెల్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొట్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.

సింగపూర్ కంపెనీలకు రాజధాని అప్పగింతకు ప్రయత్నం - రోజా..

హైదరాబాద్ : సింగపూర్ కంపెనీలకు రాజధానిని అప్పగించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శించారు. ఏపీని తెల్లదొరల చేతుల్లో పెడుతున్నారని, చంద్రబాబు సీఎం ఏపికా ? సింగపూర్ కా ? అని ప్రశ్నించారు. భూములను అడ్డగోలుగా దోచేస్తున్నారని, బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించాలని డిమాండ్ చేశారు.

 

13:10 - June 28, 2016

మహారాష్ట్ర : తాగింది..కిక్కు ఎక్కింది. ఇంకేం వీరంగం సృష్టించింది. ఈ మధ్యన పలువురు యువతులు మద్యం సేవించి వీరంగాలు సృష్టిస్తున్న కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ యువతి ఏకంగా పోలీసులపై దాడికి యత్నించింది. అడ్డుగా వచ్చిన వారిని తన్నింది..కొట్టింది..బూతులు తిట్టింది. ఇదంతా షూట్ చేస్తున్న వారిపై తన ప్రతాపం చూపెట్టింది. ఇదంతా ఏకంగా పీఎస్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో యువతి పట్టుబట్టింది. అనంతరం ఆ యువతిని..ఇతర యువకులను పీఎస్ తీసుకొచ్చారు. అసలు కథ అక్కడ మొదలైంది. పోలీస్ స్టేషన్ లో బూతు పురాణం మొదలుపెట్టింది. అక్కడ కుర్చీల్లో కూర్చున్న పోలీసులను వరుసగా చెంప దెబ్బలు కొట్టేసేంది. యువతి కావడం..మద్యం సేవించి ఉండడంతో పోలీసులు నివారించేందుకు పలు ప్రయత్నాలు చేశారు. చివరకు ఆమె స్నేహితులే రంగంలోకి దిగి నిలువరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ యువతి ఎలాంటి వీరంగం సృష్టించిందో చూడాలంటే వీడియో క్లిక్ చేసేయండి.

13:07 - June 28, 2016

హైదరాబాద్‌ : నగరంలోని మెహదీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హుమయూన్‌నగర్ ప్రాంతంలో తనూజ అనే ఏడేళ్ల బాలిక ఆడుకుంటూ, విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకుంది. దీంతో కరెంట్‌షాక్‌కు గురై బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల విద్యుత్‌ స్తంభాలు తడిసి, ఇలా జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 

 

13:01 - June 28, 2016

హైదరాబాద్ : హైకోర్టు విభజనపై అమీతుమీకి సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా   చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ న్యాయమూర్తులకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళన చేయాలని యోచిస్తున్నారు. కేంద్ర వైఖరిపై అసహనంతో ఉన్నారు. 

 

12:57 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల న్యాయపోరాటం కొనసాగుతోంది. నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టును విభజించాలని డిమాండ్‌ చేస్తూ నాంపల్లి కోర్టులో వెంకటేష్ అనే న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. ట్యాబెట్లు మింగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 
న్యాయవాదులు విధుల బహిష్కరణ
తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల న్యాయపోరాటం కొనసాగుతోంది. న్యాయాధికారుల కేటాయింపులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తెలంగాణ జడ్జీలు గత కొద్ది రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ జడ్జీల సంఘం నేతలను సస్పెండ్ చేస్తూ ఉమ్మడి హైకోర్టు పరిపాలన విభాగం అధిపతిగా తాత్కాలిక సీజే తీసుకున్న తప్పుబడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 
వరంగల్ కోర్టు వద్ద లాయర్లు ఆందోళన చేపట్టారు. న్యాయవాదులు రేపు ఛలో హైకోర్టుకు పిలుపిచ్చారు. 

భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

కరీంనగర్ : రామగుండంలో భారీ వర్షం కురవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నాలుగు ఓపెన్ కాస్టు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది.

గోదావరి, కృష్ణా నీటి వినియోగంపై బీజేపీ వర్క్ షాప్..

హైదరాబాద్ : గోదావరి, కృష్ణా నీటి వినియోగంపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ వర్క్ షాప్ కు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. అంతర్ రాష్ట్ర వివాదాలతో మిగులు జలాలు వాడుకొనే పరిస్థితి లేకుండా పోయిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి 152 మీటర్లను దృష్టిలో ఉంచుకుని నిర్మించాలని, బచావత్ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణ హక్కు కోసం పోరాడుతామన్నారు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలపై మేధావులకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

చలో హైకోర్టుకు న్యాయవాదుల పిలుపు..

హైదరాబాద్ : న్యాయవాదుల అరెస్టులకు నిరసనగా బుధవారం చలో హైకోర్టుకు తెలంగాణ న్యాయవాదులు పిలుపునిచ్చారు. హైకోర్టును విభజించాలని గత కొన్ని రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేయడంపై తాజాగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

12:46 - June 28, 2016

గుంటూరు : అన్న క్యాంటీన్‌కు మంచి స్పందన లభిస్తోంది. అతి తక్కువ రేట్లకే.. రుచికరమైన ఆహారం లభిస్తుండడంతో.. ప్రజలు క్యాంటీన్‌కు ఎగబడుతున్నారు. వంటకాలన్నీ కౌంటర్‌లో ఉంచిన గంటలోపే సేల్‌ అయిపోతున్నాయి. ప్రారంభించిన మూడు రోజుల్లోనే వహ్వా అనిపిస్తున్న అన్న క్యాంటీన్‌పై స్పెషల్ స్టోరీ.. 
ఎంతో రెస్పాన్స్‌..
అన్న క్యాంటీన్‌..! ప్రారంభించి నాలుగు రోజులైనా కాలేదు..! ఇంతలోనే ఎంతో రెస్పాన్స్‌..!! రుచికరమైన ఆహారం.. అతి తక్కువ ధరకే లభిస్తుండడంతో.. ప్రజలు అన్న క్యాంటీన్‌లకు ఎగబడుతున్నారు. ఆహా ఏమి రుచి అంటూ అన్న క్యాంటీన్లలో ఆహారాన్ని ఆరగిస్తున్నారు
క్యాంటీన్‌ ముందు జనం క్యూ 
అతి తక్కువ ధర.. అదిరిపోయే టేస్ట్‌ ఉండటంతో ఉదయం నుంచే క్యాంటీన్‌ ముందు జనం క్యూ కడుతున్నారు.. ఉదయం ఏడున్నరకు ప్రారంభయ్యే ఈ క్యాంటీన్‌లో రూపాయికే ప్లేట్‌ ఇడ్లీ... మూడు రూపాయలకే టొమాటో బాత్‌... అదే ధరకు పొంగల్‌... టిఫిన్‌గా ఇస్తున్నారు.. పదకొండున్నర గంటల నుంచి భోజనం మెనూ స్టార్ట్ చేస్తున్నారు.. 5రూపాయలకు పులిహోర... అదే రేటుకు సాంబార్‌ అన్నం.. 3 రూపాయలకు పెరుగన్నం పెడుతున్నారు.. రుచి కూడా అద్భుతంగా ఉండడంతో.. తెచ్చిన గంటలోపే ఈ పదార్థాలన్నీ  ఖాళీ అయిపోతున్నాయి.. 
రూపాయికి ప్లేట్ ఇడ్లీ 
రూపాయికి విలువేలేని రోజులివి... అలాంటిది అన్న క్యాంటీన్లో మాత్రం రూపాయికి ప్లేట్ ఇడ్లీ దొరుకుతోంది.. ఇక 3రూపాయలకు మార్కెట్‌లో పెరుగుకూడా దొరకదు.. ఈ క్యాంటీన్లోమాత్రం పెరుగన్నం లభిస్తోంది.. పులిహోర, టొమాటో బాత్, పొంగల్‌ అన్నీ ఐదు రూపాయలకే దొరకడం... మంచి నాణ్యతతోపాటు.. రుచికూడా నచ్చడంతో అంతా టిఫిన్, భోజనంకోసం ఇక్కడే క్యూ కడుతున్నారు..
ఈ నెల 25న అన్న క్యాంటీన్‌ ప్రారంభం 
రాజధానికి భూములు ఇచ్చేయడంతో.. ఈ చుట్టుపక్కల ప్రాంతాల కూలీలు దైనందిన ఉపాధిని కోల్పోయారు. వీరు పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్‌.. స్థానికులకు వరంగా మారింది. తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడి, మల్కాపురం గ్రామాల సమీపంలో ఈ నెల 25న అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొదటి రోజు నుంచే ఈ క్యాంటీన్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది.. రైతులు, వ్యాపారులు... అధికారులు.. పోలీసులు.. సచివాలయం పనులు చేస్తున్న కార్మికులు ఈ వంటల్ని రుచి చూస్తున్నారు.. ఆహారం నాణ్యతపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. 
అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ 
ఇంతకీ ఇంతటి రుచికరమైన ఆహారాన్ని వండి వారుస్తున్నదెవరు..? పేరుకు ప్రభుత్వ పథకమే అయినా నిర్వాహకుల నేపథ్యం ఏంటి..? అన్న క్యాంటీన్‌ను అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వహిస్తోంది. ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా 15లక్షలమంది స్కూల్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఫౌండేషన్‌... ప్రపంచంలోనే అతి భారీస్థాయిలో అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తోంది.. దేశంలోని 11 రాష్ట్రాల్లో పదివేల 550 స్కూళ్ల విద్యార్థులకు అన్నం పెడుతోంది.. ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడని ఈ సంస్థ... పోషకాలతోకూడిన వేడి వేడి ఆహార పదార్థాలతో చిన్నారుల కడుపు నింపుతోంది.. ఇప్పుడు రాజధాని అమరావతి పరిసరాల ప్రజలకు.. అన్న క్యాంటీన్‌ ద్వారా.. తనదైన నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తూ.. వారి ఆకలిని తీరుస్తోంది.. అక్షయపాత్ర ఫౌండేషన్‌.
మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి : స్థానికులు 
అన్న క్యాంటీన్‌లో అందించే వంటకాలను రాయపుడి గ్రామంలో ఈ సంస్థ సిబ్బంది తయారు చేస్తున్నారు. ప్రతిరోజూ వంటలు పూర్తయ్యాక ప్రత్యేక ఫుడ్‌ కమిటీ వీటిని రుచి చూస్తుంది. అన్నీ బావున్నాయని ఈ కమిటీ నిర్ధారించాకే ఆహార పదార్థాలను క్యాంటీన్‌కు తరలిస్తారు. మొదలైన మూడు రోజుల్లోనే ప్రజాదరణ పొందిన అన్న క్యాంటీన్‌ కౌంటర్లను మరిన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

12:40 - June 28, 2016

హైదరాబాద్ : తక్షణమే హైకోర్టును విభజించాలని టీఆర్ ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. హైకోర్టు విభజన, ఆప్షన్ల విధానంపై కేంద్రం నిర్లక్ష్యం వీడాలన్నారు. హైకోర్టు విషయంలో ప్రధాని ఇంత వరకు స్పందించలేదని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కేంద్రం హైకోర్టును విభజన చేయడం లేదని ఆరోపించారు. న్యాయ స్థానాల్లో న్యాయం జరగకపోతే తాము ఎక్కడి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్లు తమపై పెత్తనం చేలాయించాలని చూస్తారని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై దీక్ష చేపట్టాలని పిలుపిచ్చారు. కేంద్రం పరిధిలో జడ్జీల నియామకం జరగాలని కోరారు. 

వీరమరణం పొందిన జవాన్లకు సీఎం అఖిలేష్ పరిహారం..

ఉత్తర్ ప్రదేశ్ : పాంపోర్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరిహారాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

క్లిష్ట పరిస్థితుల్లో పీవీ మార్గనిర్దేశ్యం - మోడీ..

ఢిల్లీ : దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీ నరసింహరావు మార్గ నిర్దేశ్యం చేశారని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. పీవీకి ఆయన నివాళులర్పించారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశానికి పీవీ చేసిన సేవలను ప్రధాని మోడీ కొనియాడారు.

నూతన రాజ్యసభ్యుల ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ : నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఏపీ నుంచి సురేశ్ ప్రభు, విజయసాయిరెడ్డి ప్రమాణం చేశారు.

12:20 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ కు ప్రత్యేక  హైకోర్టు  లేనందువల్లే న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. చీఫ్ జస్టిస్ వెంటనే గతంలో ఇచ్చిన ఆదేశాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తులు.. న్యాయవాదులు సామూహిక సెలవులకు  పిలుపివ్వడం సబబయిందేనన్నారు. తెలంగాణకు ముమ్మాటికి అన్యాయం జరుగుతున్నప్పుడు దానిని అరికట్టకపోవడం శోచనీయమని వినోద్ అన్నారు. సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కు కేంద్రమంత్రులకు విన్నవిస్తామన్నారు.   

12:12 - June 28, 2016

హైదరాబాద్ : టీ.న్యాయవాదుల జేఏసీ నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జేఏసీ భేటీ కానుంది. ఇద్దరు జడ్జీలపై వేసిన సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రులను కోరనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పుడున్న హైకోర్టు ఉమ్మడి హైకోర్టు కాదని ఏపీ హైకోర్టని ఆరోపిస్తున్న టీ.న్యాయవాదుల జేఏసీ హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తోంది. 

 

12:01 - June 28, 2016

టాలీవుడ్ లో కామెడీ కింగ్ గా ఎదిగిన నటుడు 'బ్రహ్మానందం'. ఒక‌ప్పుడు హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం లేని స్టార్ హీరో సినిమా ఉండేది కాదు. ఏ పెద్ద హీరో సినిమాలోనైనా బ్ర‌హ్మానందం కామ‌న్ గా ఓ రోల్ పోషించే వారు. కొన్ని సినిమాల్లో స్టార్ హీరో క్యారెక్ట‌ర్ ఫెయిలైన బ్ర‌హ్మీ ఉంటే ఆ సినిమా గట్టెక్కే పరిస్థితులు కనిపించేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరేగా ఉన్నాయంట. 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో బ్రహ్మానందం కనిపించారు. గ‌త‌ రెండేళ్లలో ఆయన కేవలం ‘సర్దార్ గబ్బర్‌సింగ్‌, సరైనోడు’చిత్రాల్లో నామ‌మాత్రంగా కనిపించారు. అనంతరం వచ్చిన 'బ్రహ్మోత్సవం'లో అసలు కనిపించలేదు. ఇక 'అతడు' నుంచి త్రివిక్రమ్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే ఆయన 'అ..ఆ' లో కూడా కనిపించలేదు. బ్రహ్మానందం కెరీర్ గాడి తప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం యువ కమెడీయన్లు దూసుకరావడమేనని టాక్ వినిపిస్తోంది. ముందుగానే సినిమాకు గుడ్ బై చెప్పాలని బ్రహ్మానందం అనుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

12:00 - June 28, 2016

ఏఎన్నార్ వారసత్వాన్ని ఒణికిపుచ్చుకున్న నాగార్జున నవ మన్మథుడిగా నిరూపించుకున్నారు. ఈ వయసులోనూ ప్రేమ పాత్రలు అలవోకగా పోషిస్తున్నారు. రీల్ లైఫ్ లో కూడా అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయులు నడుస్తున్నట్లు ఉంది. నాగ చైతన్య - సమంత మధ్య ప్రేమ చిగురించిందని..వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వదంతులు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా సమంత వ్యాఖ్యలు కూడా వీటికి బలం చేకూర్చాయి. తాజాగా అఖిల్ కూడా ప్రేమలో మునిగితేలుతున్నాడంట. ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉన్న ఓ కుటుంబంలోని అమ్మాయితో అఖిల్ ప్రేమలో పడ్డాడంట. అఖిల్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడంట కూడా. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో అఖిల్ లవ్‌ని నాగ్, అమల ఓకే చేసినట్టు టాక్. మొత్తానికి నాగ చైతన్య, అఖిల్ కూడా నాగ్ బాటలోనే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే.

వరంగల్ కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన..

వరంగల్ : కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళనకు దిగారు. హైకోర్టును విభజించాలని గత కొన్ని రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపత్యంలో ఇద్దరు జడ్జిలను సస్పెండ్ చేయడంపై తాజాగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

టీఎస్ ఉన్నత విద్య స్థితిగతులపై రౌండ్ టేబుల్ సమావేశం..

హైదరాబాద్ : టీ జాక్ ఆధ్వర్యంలో టీఎస్ ఉన్నత విద్య స్థితిగతులు, పరిశీలన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రొ. కోదండరాం, ప్రొ.రమా మెల్ కోటే, ప్రొ. సత్యనారాయణ, ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు పాల్గొన్నారు.

 

ముగిసిన హైదరాబాద్ సమన్వయ కమిటీ మీటింగ్..

హైదరాబాద్ : మెట్రో రైల్ భవన్ లో హైదరాబాద్ సమన్వయ కమిటీ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రతి గురువారం డిప్యూటి కమిషనర్ లెవల్ లో అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైల్, వాటర్ బోర్డు, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు.

11:50 - June 28, 2016

హైదరాద్ : గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై మహారాష్ట్ర-తెలంగాణ సర్కార్‌ల మధ్య అధికారిక ఒప్పందానికి ముహూర్తం ఖరారైంది. జులై 15న ముంబైలోని ఇరువురు సీఎంలు సమావేశమై అగ్రిమెంట్‌ చేసుకోనున్నారు. ఇదిలావుంటే ఈ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు, నీటిరంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందని భారీ ర్యాలీ చేపట్టిన అధికార పార్టీ.. మరోసారి ఒప్పందం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
జులై 15న ముంబైలో భేటీకానున్న ఇరువురు సీఎంలు
ప్రాజెక్టుల రీ-డిజైన్‌లో భాగంగా గోదావరి నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందానికి తెలంగాణ సర్కార్‌ సిద్ధమవుతోంది. జులై 15న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, తుమ్మడిహెట్టి, కొరటా-చనాఖా బ్యారేజీలకు సంబంధించి ఒప్పందం జరగనుంది. 
100 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ ఉండేలా గేట్లు
రెండు రాష్ట్రాల మధ్య జరగనున్న ఒప్పందం చారిత్రాత్మకమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజిని 101 మీటర్ల ఎత్తు డిజైన్‌తో నిర్మిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. దీంతో 100 మీటర్ల ఎత్తు వరకే ప్రస్తుతం నీటి నిల్వ ఉండేలా గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో 101 మీటర్ల ఎత్తులో నీటిని నింపే విషయమై నిర్ధారిస్తారు. ఇక తుమ్మిడిహట్టి బ్యారేజి 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని హరీష్‌రావు అన్నారు. 15న జరిగే సమావేశంలో ఇద్దరు సీఎంలతో పాటు.. జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రజలను మభ్యపెట్టేందుకే టీఆర్‌ఎస్‌ యత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

11:43 - June 28, 2016

ఢిల్లీ : యూరో సాకర్ క్వార్టర్ ఫైనల్స్ కు ఆతిథ్య ఫ్రాన్స్ చేరుకొంది. ఐర్లాండ్ తో సూపర్ సండే ఫైట్ గా జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-1 తో విజయం సాధించింది. ఆట ప్రారంభంలోనే ఐర్లాండ్ ..పెనాల్టీ ద్వారా గోల్ తో 1-0 ఆధిక్యం సాధించింది. అయితే ..రెండో భాగంలో ఫ్రెంచ్ టీమ్ చెలరేగి ఆడి..ఆంటోనీ గ్రీజ్ మాన్ ద్వారా బ్యాక్ టు బ్యాక్ గోల్స్ సాధించి...ఫైటింగ్ విక్టరీ సొంతం చేసుకొంది. ఇంగ్లండ్- ఐస్ లాండ్ జట్లతో జరిగే ప్రీక్వార్టర్ ఫైనల్లో నెగ్గినజట్టుతో ..క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ పోటీపడుతుంది.

 

11:41 - June 28, 2016

ముంబై : రాష్ట్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా రూ. 12 కోట్లను కొల్లగట్టారు. థానేలో జరిగిన ఈ భారీ దోపిడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు నగదుతో వ్యాన్ వెళుతోంది. ఒక్కసారిగా గుర్తు తెలియని దుండగులు వ్యాన్ సిబ్బందిని బెదిరించారు. అనంతరం వ్యాన్ లో ఉన్న రూ. 12 కోట్ల నగదును అపహరించారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వీరిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

11:33 - June 28, 2016

హైదరాబాద్ : మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు 95వ జయంతి ఉత్సవాలు ట్యాంక్‌బండ్‌లో జరుగుతున్నాయి. పి.వి.జ్ఞానభూమి ప్రాంతంలో ఉన్న పి.వి. సమాధిని పలువురు నేతలు సందర్శించారు. మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు నివాళులర్పించారు.

 

ఘనంగా పీవీ జయంతి వేడుకలు..

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ 95వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. నెక్లెస్‌ రోడ్డులోని జ్ఞానభూమి వద్ద డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఏపీ మండలి చైర్మన్‌ చక్రపాణిలు మంత్రి ఈటెల, టి.కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌బాబు లు నివాళులర్పించారు.

 

తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం - ఎంపీ కవిత..

హైదరాబాద్ : తెలంగాణ కోర్టుల్లో ఆంధ్ర జడ్జీలను నియమిస్తున్నారిన ఎంపీ కవిత పేర్కొన్నారు. న్యాయాధికారుల కేటాయింపులో ఆప్షన్ విధానం రద్దు చేయాలని, తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే కేంద్రం స్పందించాలని కోరారు.

ఉమ్మడి హైకోర్టు వల్ల తెలంగాణకు అన్యాయం - ఎంపీ వినోద్..

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ బాధతో ఉన్నారని, లాయర్ల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించకుంటే జంతర్ మంతర్ వద్ద సీఎం కేసీఆర్ నిరసన చేపట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల కోసం సీఎం దీక్ష చేస్తాననడం దేశంలోనే తొలిసారి అని తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. కేసీఆర్ నిరసన చేపట్టకముందే కేంద్రం న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పీవీ దేశం గర్వించదగ్గ పౌరుడు - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : పీవీ నరసింహరావు దేశం గర్వించదగిన పౌరుడని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన తెలంగాణ బిడ్డ అని, ఆర్థిక సంస్కరణలకు మార్గ నిర్ధేశకుడని తెలిపారు. తెలంగాణకు జరిగిన అన్యాయం సవరించడానికి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేశారన్నారు. చరిత్రలో పీవీకి సుస్థిర స్థానం ఉంటుందన్నారు.

కరీంనగర్ జిల్లా కోర్టులో ఉద్రిక్తత..

కరీంనగర్ : జిల్లా కోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి అనే న్యాయవాది కిరోసిన్ డబ్బా తీసుకుని కోర్టు హాల్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. న్యాయమూర్తుల సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

11:14 - June 28, 2016

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, అనుష్క శర్మ జంటగా నటించిన 'సుల్తాన్‌' చిత్రం టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రం జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం హ-ర్యాణకు చెందిన మల్లయోధుడు సుల్తాన్‌ అలీ ఖాన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. సుల్తాన్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, జయాపజయాల నేపథ్యంలో సినిమా సాగుతుంది.

 

11:08 - June 28, 2016

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో కుప్వారా ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హత మయ్యారు. కుప్వారా ప్రాంతంలోని ఓ ఇంట్లో హిజ్బుల్‌ కమాండర్‌ ఉన్నట్లు సమాచారమందుకున్న భద్రతా బలగాలు ఆ ఇంటిని ముట్టడించి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు కూడా ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్‌ కమాండర్‌ సమీర్ వాణి హతమైనట్లు సమాచారం. కుప్వారాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్ కౌంటర్ ముగిసింది. 

 

10:56 - June 28, 2016

విశాఖ : అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతానికి అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడిందని ఇవిశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమైందని వెల్లడించింది. అల్పపీడనానికి ఆనుకుని  ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. తెలంగాణలో నేటి నుంచి మరింత విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంటోంది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం సూచించింది.

 

రోడ్లపై వర్షపు నీరు..నిలిచిన ట్రాఫిక్..

హైదరాబాద్: నగరంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పంజాగుట్ట, బేగంపేట, మలక్ పేట, ఆలుగడ్డబావి, మెట్టుగూడలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

తిరుపతిలో దారుణం..

చిత్తూరు : తిరుపతిలో ప్రేమించలేదని ఓ యువతిని ఇద్దరు యువకులు బైక్ తో ఢీకొట్టారు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. వెంటనే ఈమెను ఆసుపత్రికి తరలించారు. యువకులపై కేసు నమోదు చేశారు.

 

హైకోర్టు వద్ద భారీ బందోబస్తు..

హైదరాబాద్ : హైకోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు జడ్జిల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని నిన్నటి నుండి న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అంతకంటే ముందు హైకోర్టు విభజన కోరుతూ గత కొన్ని రోజులుగా అడ్వకేట్స్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఢిల్లీకి చేరుకున్న టి. అడ్వకేట్స్ జేఏసీ..

ఢిల్లీ : తెలంగాణ న్యాయవాదుల జేఏసీ బృందం హస్తినకు చేరుకుంది. మధ్యాహ్నం మూడు గంటలకు న్యాయశాఖ మంత్రితో, సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు.

స్కూల్ వాహనం బోల్తా..

కర్నూలు : కోడుమూరు (మం) వర్కూరు వద్ద బనవాసీ నవోదయ స్కూల్ వాహనం బోల్తా కొట్టింది. ఈఘటనలో నవోదయ స్కూల్ ప్రిన్స్ పాల్, వైస్ ప్రిన్స్ పాల్ తో సహా ఐదుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెనాలీ సబ్ ట్రెజరీ నిధులలో గోల్ మాల్..

గుంటూరు : తెనాలి సబ్ ట్రెజరీ నిధులలో గోల్ మాల్ వ్యవహారం చోటు చేసుకుంది. ఏటీవో వెంకటేశ్వర్లు, అకౌంటెంట్లు రాయల్, వరుణ్ బాబులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

కూతురును చంపేసి తాను ఆత్మహత్య..

రంగారెడ్డి : ధరూర్ మండలం చిట్టెంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి కూతురు చంపేసింది. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది.

10:26 - June 28, 2016

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇవాళ పారిశ్రామిక పెద్దలతో భేటీ కానున్నారు. చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వృత్తి నిపుణులు కూడా హాజరయ్యే ఈ భేటీలో కొత్తగా ప్రవేశ పెట్టిన 'ఆదాయ వెల్లడి పథకం, 2016' పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్‌ నెలాఖరు వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు వెలుగులోకి రాని నల్లధనం, ఆస్తులు వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా స్వచ్ఛందంగా ఈ పథకం కింద ఆస్తుల వివరాలు వెల్లడిస్తే 45 శాతం పన్నుతో వదిలి పెడతారు. ఆ నగదు, ఆస్తులు ఎలా సంపాదించారనే విషయం కూడా అడగరు. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి.. విజయవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

 

10:23 - June 28, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కొత్త కళ వస్తోంది. హైదరాబాద్‌ నుండి ఉద్యోగులు అమరావతికి తరలివస్తుండడంతో.. రాజధానిలో పండుగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి పాలన కొనసాగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈనెల29వ తేదీ మధ్యాహ్నం నలుగురు మంత్రులు గృహ ప్రవేశం చేయబోతున్నారని తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కుప్వారాలో యుద్ధవాతావరణం..

జమ్మూ కాశ్మీర్ :గత కొన్ని రోజులుగా భారతదేశంలోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు జరుపుతున్నారు. వీరిని భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. నేడు ఉదయం కుప్వారాలో ఉగ్రవాదులు..భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ ఇంట్లో హిజ్బుల్ కమాండర్ ఉన్నట్లు బలగాలు అనుమానించాయి. ఇంటిని సైన్యం ముట్టడించింది. దీనితో ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొంది.

10:02 - June 28, 2016

ఐఎస్..భయంకర ఉగ్రవాద సంస్థ..రెచ్చగొట్టే విధంగా చేయడం ద్వారా యువతను ఆకర్షించే విధంగా ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చేరాలని ప్రయత్నించిన పలువురు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో చేరవద్దని అన్నందుకు కన్నతల్లినే ఇద్దరు కవలలు పొడిచేశారు. ఈ అమానుష ఘటన సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చోటు చేసుకుంది. ఖాలిద్..సాలెహ్ అల్ అరి అనే ఇద్దరు కవలలున్నారు. ఐఎస్ లో చేరాలని వారి కోరిక. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అందులో చేరవద్దని కోరారు. కానీ వారు అందుకు అంగీకరించక కోపోద్రిక్తులై తల్లిని కత్తితో పొడిచి చంపేశారు. అక్కడే ఉన్న తండ్రి..సోదరుడు ఈ ఘాతుకాన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ వారిని కూడా తీవ్రంగా గాయపరిచారు ఆ కవలలు. అనంతరం ఘటనాస్థలి నుండి కారులో పరారయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

10:01 - June 28, 2016

పైలట్..ఎస్కార్ట్ వాహనాలకు మంత్రులు దూరంగా ఉండనున్నారు. ఒక వీవీఐపీ, వీఐపీ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేస్తుండడం..గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం తదితర పరిణామాలు చూసిన సదరు మంత్రులు పై నిర్ణయం తీసుకున్నారు. అబ్బా..ఎంత మంచి నిర్ణయం...నగర హైదరాబాద్ లో ఎంతో కొంచెం ట్రాఫిక్ సమస్య తీరుతుందని అనుకుంటున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఈ నిర్ణయం తీసుకోలేదు.
ఇటీవలే అధికారంలోకి వచ్చిన కేరళ రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారంట. మంత్రులు పైలట్, ఎస్కార్ట్ వాహనాలను వాడేందుకు విముఖత చూపుతున్నారు. కాన్యాయ్ ఇతర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని, దీనివల్ల నిరాడంబర సంకేతాలను ప్రజల్లోకి పంపాలని ఎల్డీఎఫ్ ప్రభుత్వం యోచిస్తోంది. సామాజికంగా..రాజకీయంగా ఉద్రిక్తత లేని ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎస్కార్ట్ అవసరం లేదని, కేవలం ఇంటి నుండి కార్యాలయానికి వెళ్లే సమయంలో ముందు..వెనుక ఎస్కార్ట్ వాహనాలను అనుసరించడం అనవసరమని ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ పేర్కొంటున్నారు. రోజుకు అక్కడ సగటున 600-700 మంది పోలీసులు ఎస్కార్ట్, పైలట్ విధులు నిర్వహిస్తున్నారంట. వీరిని ఇతర విధుల్లోకి వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొంటున్నారు. సో..ఏదైనా ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మాత్రం ఇరుకుగా ఉన్న కేరళ రోడ్లపై కొంత రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని, ఇతర రాష్ట్రాల వారు ఈ నిర్ణయం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

09:59 - June 28, 2016

ప్రస్తుతం యువతులు ఎక్కువగా బ్యూటీ పార్లర్లపై ఆధార పడుతున్నారు. తమ అందాన్ని మెరుగుపరుచుకోవాలని వారు ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఇంట్లోనే సింపుల్ గా తయారు కావచ్చు. ఇందుకు కొన్ని టిప్స్..
బార్లీ గింజలు..గసగసాలు తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఐదు చుక్కల నిమ్మసరం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా తయారైన పేస్టును ముఖానికి రాసుకుని అరగంట అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. కమలా పండు..వీటి తొక్కలను ఎండలో ఎండబెట్టండి. అనంతరం దీనిని పౌడర్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక చెండా పౌడర్, మరో చెంచా పెరుగు, ముల్తాని మట్టీ, ఒక చెంచా చందనం పొడులను కలుపుకోవాలి. నీటితో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట అనంతరం నీటితో శుభ్రం చేసుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ దాల్, రెండు చెంచాల దోసకాయ విత్తనాలు, రెండు చెంచాల శనగపప్పు లను తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. పసుకొమ్ముల పొడి, కాస్త దోసకాయ సరం కలిపితే మెత్తటి పేస్టు తయారవుతుంది. ఈ పేస్టును చర్మంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండకు కమిలిపోయిన చర్మం మెరుగవుతుంది. ట్రై చేయండి..ఫలితం చూడండి.

09:51 - June 28, 2016

రంగారెడ్డి : మళ్లీ దొంగలు రెచ్చిపోతున్నారు. నగర శివారులో ఉన్న నివాసాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. కూకట్ పల్లి కేపీహెచ్ బీలోని ప్రగతి నగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటన మరిచిపోకుముందు రంగారెడ్డి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఇంట్లో వారికి మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం పూడూరులో ఓ ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. అనంతరం అత్తా..కోడలికి మత్తు మందు ఇచ్చారు. వారు సృహ కోల్పోయిన అనంతరం నగదు..బంగారాన్ని దోచుకున్న దొంగలు అక్కడి నుండి ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెలరోజుల క్రితం అద్దెకు దిగిన వారే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

 

09:48 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాల్లో రహదారులు జలమయమవుతున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ తడిసిముద్దయింది. ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలిచిపోవడంతో రోడ్లు చెరువులను తలపించాయి. అబిడ్స్‌, బాలానగర్‌, చార్మినార్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఎర్రగడ్డ,తార్నాక, చందానగర్‌, రామాంతాపూర్‌ ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. వర్షానికి ఆమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లితో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.వర్షంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారు.
ఆదిలాబాద్ 
ఆదిలాబాద్ జిల్లా కనకాపూర్ గ్రామంలో కురిసిన భారీ వర్షానికి సర్వీస్ రోడ్డు కోతకు గురయ్యింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
ఖమ్మం
మరోవైపు ఖమ్మంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బయటకు రావడానికి స్థానికులు అనేక అవస్థలు పడ్డారు. 

09:45 - June 28, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. తెలంగాణలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కోస్తా మీదుగా తమిళనాడు వరకు  ద్రోణి అవరించింది. ఖమ్మం జిల్లాలోని కోహెడలో  అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

 

09:43 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో న్యాయాధికారుల ఆందోళన ఉధృతంగా సాగుతోంది. ఇవాళ నుంచి న్యాయాధికారులు మూకుమ్మడి సెలవుపై ఉన్నారు. అంతేకాదు.. నిరాహార దీక్ష చేయాలని భావిస్తున్నారు. ఇవాళ న్యాయాధికారుల సంఘం అత్యవసరంగా భేటీకానుంది. ఇటు ఏసీజే కోర్టులో విధుల బహిష్కరణకు న్యాయవాదుల సంఘం పిలుపునిచ్చింది. ఇక ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో న్యాయవాదుల జేఏసీ భేటీ కానుంది. మరోవైపు హైకోర్టు విభజనపై అమీతుమీకి సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా   చేయాలని భావిస్తున్నారు.  దీనిపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ న్యాయమూర్తులకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళన చేయాలని యోచిస్తున్నారు. 

09:37 - June 28, 2016

హైకోర్టు విభజన అంశంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నగేష్, కాంగ్రెస్ నేత జగన్ లాల్ నాయక్, టీఆర్ఎస్ నేత రాకేశష్, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేత అరుణ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. హైకోర్టు విభజన విషయంలో ఎపి ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని వక్తలు ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

124 ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు - జీహెచ్ఎంసీ కమీషనర్..

హైదరాబాద్ : సోమవారం రాత్రి కురిసిన వర్షానికి 124 ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ఏడు ప్రాంతాల్లో చెట్లు కూలాయని, చెట్లును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగిందని వెల్లడించారు.

పూడూరులో దోపిడి..

రంగారెడ్డి : మేడ్చల్ (మం) పూడూరులో ఓ ఇంట్లో దోపిడి జరిగింది. అత్తాకోడళ్లకు మత్తుమందు ఇచ్చి నగదు, నగలను అపహరించారు. నెల రోజుల క్రితం అద్దెకు దిగిన వారి పనిగా గుర్తించారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.

వాడపల్లి ఎస్ఐ..హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్..

నల్గొండ : వాడపల్లి ఎస్ఐ వీరరాఘవులు..హెడ్ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. ఓ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి, బాధితుడిని వేధించారని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల వివాదం పరిష్కారం..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల వివాదం పరిష్కారమైంది. సన్నిధిగొల్ల వెంకట్రామయ్యను కొనసాగించాలని టిటిడి నిర్ణయించింది. ఈనెల 30న వెంకట్రామయ్య పదవి విరమణ చేయాల్సి ఉంది. అర్చకుల తరహాలోనే తమనూ వంశపారంపర్యంగా కొనసాగించాలని కోరడంతో టిటిడి అంగీకరించింది.

 

మాజీ మంత్రి వ్యక్తిగత డ్రైవర్ పై దాడి..

వరంగల్ : హన్మకొండ ఆదాలత్ సెంటర్ లో మాజీ మంత్రి బసవరాజు సారయ్య వ్యక్తిగత డ్రైవర్ పై కత్తితో దాడి జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకు తరలించారు. అశోక్ అనే వ్యక్తితో పాటు మరికొందరు దాడికి పాల్పడ్డారు.

 

 

కొండపల్లి ల్యాంకో టౌన్ షిప్ లో భారీ చోరీ..

విజయవాడ : కొండపల్లి ల్యాంకో టౌన్ షిప్ లో భారీ చోరీ జరిగింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం తాళాలు పగులగొట్టి 8 కిలోల బంగారం, 8 కేజీల వెండి, నగదు అపహరించారు.

09:24 - June 28, 2016

'ప్రతి సన్నివేశంలోనూ వినోదంతోపాటు సందేశాన్ని మేళవించి రూపొందించిన ఆలోచనాత్మక ప్రేమకథా చిత్రం 'ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్‌' అని పోల్కంపల్లి నరేందర్‌ అన్నారు. గోపీనాథ్‌ హీరోగా పరిచయం అవుతూ బీ.ఆర్‌.ఎస్‌.ఐ పతాకంపై దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్‌'. విష్ణు ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని పోల్కంపల్లి నరేందర్‌ నిర్మిస్తున్నారు. ఆర్‌.కె.స్టూడియోస్‌పై ఈచిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.. 'మా లవర్స్‌తోపాటు సినిమా లవర్స్‌ అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 'గుంటూరు టాకీస్‌' వంటి హిట్‌ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ బ్యానరైన ఆర్‌.కె. స్టూడియోస్‌ ద్వారా త్వరలోనే ఈ చిత్రం విడుదలవుతుండటం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'సినిమా బాగా నచ్చి నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాను' అని ప్రతాని రామకృష్ణగౌడ్‌ తెలిపారు. 'ఈ చిత్రానికి సంగీతమందించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు' అని కనిష్క తెలిపారు.

 

09:12 - June 28, 2016

నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ9 సమర్పణలో రామరాజు దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం 'ఒక మనసు'. ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో మధుర శ్రీధర్‌ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 'ఏ దర్శక, నిర్మాత అయినా సినిమా తీసేటప్పుడు అనుక్షణం సినిమా బాగా రావడానికే తపిస్తాడు. మేం అలా తపించి తీసిన చిత్రమే ''ఒక మనసు'' అని చెప్పారు నిర్మాత మధుర శ్రీధర్‌. ''ఒక మనసు'' చిత్రం విడుదలయ్యాక తొలుత మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. రొమాన్స్‌ ఓవర్‌ డోస్‌ అవ్వడం వల్ల పస్టాఫ్‌ స్లోగా ఉందని చాలా మంది చెప్పారు. అందరి సూచన మేరకు 14 నిమిషాలు ట్రిమ్‌ చేశాం. దీంతో ఇప్పుడు స్పీడందుకుని ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతోంది. కలెక్షన్లు కూడా చాలా బాగున్నాయి. ఓ చిన్న నిర్ణయం సినిమాపై అభిప్రాయాన్నే మార్చేసింది. ఎమోషనల్‌గా ఇప్పుడు అందరికీ బాగా కనెక్ట్‌ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్‌లో చివరి అర్ధగంట సినిమాకు హైలైట్‌. ఈ క్లైమాక్స్‌కు ఏ నిర్మాత ఒప్పుకోడు. కానీ మూస ధోరణిలో కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు తీయాలనే ఉద్దేశ్యంతో ఈ క్లౖెెమాక్స్‌ను ఒప్పుకుని సినిమాను నిర్మించాం. ఈ క్లైమాక్స్‌కు 'మరోచరిత్ర', 'ప్రేమిస్తే', 'గీతాంజలి' చిత్రాలే స్ఫూర్తి. వాటిని ఆదరించిన ప్రేక్షకుల ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం. నిహారిక పాత్రను చూసి వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంది. అమెను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నారో, అలాంటి పాత్రే దొరికింది. నాగశౌర్య బ్రిలియంట్‌ యాక్టర్‌. నాగశౌర్య, నిహారిక జంట తెరపై చాలా అందంగా కనిపించారు. దర్శకుడు రామరాజు ఎక్స్‌లెంట్‌ డైరెక్టర్‌. ఆయన తీసే విధానం నాకు బాగా నచ్చింది. ప్రస్తుత సమాజంలో కులంపై ఉన్న అభిప్రాయాన్ని సినిమాలో చూపించడం జరిగింది. ప్రేమకు కులాలు అవసరం లేదు. కానీ రాజకీయాలకు కులాలే ప్రధానమన్న పాయింట్‌ను ఎత్తి చూపడం జరిగింది. కులం అనే ఫీలింగ్‌ రోజు రోజుకు మరింత పెరుగుతోందని ఈ చిత్రంలో చూపించాం. ఈ చిత్రాన్ని 'అషిఖీ 2'తో పోల్చుతున్నారు. ఆ సినిమా మాదిరిగానే మా సినిమా కూడా సూపర్‌హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. నిర్మాతగా నా తదుపరి చిత్రం రామరాజు దర్శకత్వంలోనే ఉంటుంది. అలాగే దర్శకుడిగా రెండు స్క్రిప్టులపై వర్క్‌ చేస్తున్నాను. ఈ ఏడాది చివర్లో ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నా' అని అన్నారు.

 

09:03 - June 28, 2016

రజనీకాంత్‌, రాధికా ఆప్టే జంటగా పా.రంజిత్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌.థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్‌ బ్యానర్‌పై కె.వి.చౌదరి, కె.ప్రవీణ్‌ కుమార్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'కబాలి'. సంతోష్‌ నారాయణ్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను వరుణ్‌ తేజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..'రజనీకాంత్‌ను తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానిస్తారు. ఆయన భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు దొరికిన కోహినూర్‌ డైమాండ్‌' అని టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. 'రజనీకాంత్‌ యాక్టింగ్‌, డాన్సులు, ఫైటింగ్స్‌ ఇలా ఏదీ చేసినా సంచలనమే. నేను కూడా రజనీతో 'జీవన పోరాటం' చిత్రం తీసాను. ఈ చిత్రం పెద్ద హిట్‌ కావాలి' అని అన్నారు. 'తెలుగులో విడుదల చేసే రైట్స్‌ తీసుకోవడంలోనే నిర్మాతలు సక్సెస్‌ అయ్యారు. దర్శకుడు రంజిత్‌ గత రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది' అని కోదండరామిరెడ్డి తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... 'రజనీకాంత్‌ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈ చిత్రం కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుంది' అని తెలిపారు. వరుణ్‌ తేజ్‌ చెబుతూ, 'మేమంతా రజనీకాంత్‌కి పెద్ద ఫ్యాన్స్‌. పెద్దనాన్న, రజనీకాంత్‌ మంచి స్నేహితులు. 'బాషా' తర్వాత అలాంటి రజనీ సినిమాను మిస్‌ అయ్యాం. మళ్ళీ అలా చూపిస్తున్న రంజిత్‌కు కృతజ్ఞతలు' అని అన్నారు. 'సినిమాపై అందరిలోనూ చాలా అంచనాలున్నాయి. అంచనాలు నేరవేర్చగలుగుతానని నమ్ముతున్నాను. తమిళంలో కంటే తెలుగులో గ్రాండ్‌గా ఆడియోను విడుదల చేయడం హ్యాపీగా ఉంది' అని దర్శకుడు పా.రంజిత్‌ తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ, 'భారీ సినిమాలు చేయాలని షణ్ముక ఫిలింస్‌ బ్యానర్‌ను ప్రారంభించాం. ఈ చిత్రం మాకు రావడానికి మోహన్‌బాబు ఎంతో సహకరించారు. ఆయనకు కృతజ్ఞతలు. అలాగే ఫైనాన్షియల్‌ సపోర్ట్‌తోపాటు తెలుగు రైట్స్‌ ఇప్పించడంలోనూ అల్లు అరవింద్‌ పాత్ర కీలకంగా ఉంది. ఈ సినిమాను హిట్‌ చేసి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

 

జడ్డీల ఆందోళన... పరిణమాలపై సీఎం కేసీఆర్ మనస్తాపం

హైదరాబాద్ : జడ్డీల ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న పరిణమాలపై సీఎం కేసీఆర్ మనస్తాపం చెందారని సీఎం కార్యాలయం తెలిపింది. హైకోర్టు విభజన మొదలుకుని జడ్జీల నియామకం వరకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపింది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తోందని.. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు చేస్తున్నారని తెలిపింది. 

జమ్మూకాశ్మీర్ కుప్వారాలో ఎన్ కౌంటర్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కుప్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 

రాజేంద్రనగర్ లో ఆర్టీఏ తనిఖీలు

రంగారెడ్డి : రాజేంద్రనగర్ గగన్ పహాద్ చౌరస్తా వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 14 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేశారు. 

08:34 - June 28, 2016

మల్లన్నసాగర్ లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి కేవలం అక్కడికే పరిమితం కాదు. రేపు తెలంగాణలో ఎక్కడైనా, ఎవరిమీదైనా జీవో 123 కత్తి వేలాడే ప్రమాదం వుంది. ఎందుకంటే, దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని సేకరించే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం వున్నట్టు తెలుస్తోంది. 
2013 చట్టానికి తూట్లు
తనకు దక్కాల్సిన వాటాను హక్కుగా పొందడానికీ, ఇతరులు  దయతో    ఇస్తున్న దానిని తీసుకోవడానికి ఎంత తేడా వున్నదో 2013 భూ సేకరణ చట్టానికీ, జీవో నెంబర్ 123కి అంత తేడా వుంది.    సాగు, తాగు నీటి ప్రాజెక్టులు, కాలువలు, రోడ్లు,  ఎయిర్ పోర్టులు, బస్టాండ్ లు, పరిశ్రమలు; ఫ్యాక్టరీలు, విద్యుత్ ఉత్పత్తి  కేంద్రాలు లాంటి   అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు  వాటికోసం కొంతమంది తమ భూములు, ఆస్తులు, వ్రుత్తులు, వ్యాపారాలు త్యాగం చేయాల్సి రావడం, మరికొందరు లబ్ది పొందడం అనివార్యం. అయితే, తాము నిర్వాసితులుగా మారుతూ, ఇంకెవరో లాభపడుతుంటే, తామెందుకు త్యాగం చేయాలన్న ప్రశ్న, ఆవేదన, బాధ నష్టపోతున్నవారిలో వ్యక్త కావడం సహజం.  ఇలాంటి సహజమైన, న్యాయమైన ప్రతిస్పందనలనుంచి, ఉద్యమాల నుంచి తయారైందే 2013 భూసేకరణ చట్టం. ఇంతకు పూర్వపు చట్టాలన్నింటికంటే ఇది చాలావరకు బెటర్ అన్న అభిప్రాయం వుంది. దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ తలపెట్టినా ఈ చట్టం ప్రకారం నడుచుకోవాలి.  కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీనికి తూట్లు పొడవడం ప్రారంభించాయి.  ఈ చట్టాన్ని తూచ్ అంటూ జీవోలు తీసుకొస్తున్నాయి. తెలంగాణలో తీసుకొచ్చిన జీవో 123 ఇలాంటిదే.  
హాట్ టాపిక్ గా 123 జీవో 
ఇప్పుడు మల్లన్నసాగర్ నిర్వాసితుల పోరాటాల కారణంగా 123 జీవో హాట్ టాపిక్ గా మారింది.  ఇది కేవలం మల్లన్నసాగర్ కు మాత్రమే పరిమితమయ్యే వ్యవహారం కాదు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అయిదు లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఇలా ప్రతి జిల్లాలోనూ భూ సేకరణ సన్నాహాలు నడుస్తున్నాయి. కాబట్టి, తెలంగాణ బిడ్డల్లో ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులుగా మారక తప్పదు.  ప్రభుత్వాలు ఇవాళ మల్లన్నసాగర్ లో చేస్తున్నపనినే రేపు ఎక్కడైనా   ప్రవర్తించే వీలుంది. 
పార్లమెంట్ లో 2013 భూసేకరణ చట్టం ఆమోదం
2013 భూసేకరణ చట్టం భారత పార్లమెంట్ లో ఆమోదం పొందింది. దానికో చట్టబద్దత వుంది. ఈ చట్టం పరిధిలో భూమిని సేకరించాలంటే అనేక నియమ నిబంధనలు పాటించాలి. నిర్వాసితులకు కనీసం మూడు రెట్లకు తక్కువ కాకుండా పరిహారం అందించాలి. పునరావాసం చూపించాలి. గ్రామసభ ద్వారా ఆమోదం పొందాలి. సామాజిక ప్రభావాలను అంచనా వేయాలి.  భూ సేకరణకు ముందుగా ప్రకటన జారీ చేయాలి. అభ్యంతరాలు స్వీకరించాలి.  కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123 ప్రకారం ఇవేవీ చేయాల్సిన పనిలేదు. అసలు అది అసెంబ్లీలో ఆమోదం పొందలేదన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. తన ఇష్టమొచ్చినట్టు రేటు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించుకునే ఉద్దేశంతో తీసుకొచ్చింది జీవో 123. నిర్వాసితులకు చట్టబద్దమైన హక్కులు ప్రసాదిస్తున్న చట్టమే వున్నప్పుడు, దాన్ని అమలు చేయకుండా మళ్లీ ఈ జీవోల తిరకాసులెందుకు? ప్రజలు సాధించుకున్న చట్టబద్దమైన హక్కులకు తూట్లు పొడవడమెందుకు? 2013 భూ సేకరణ చట్టం కంటే జీవో నెంబర్ 123 మంచిదంటూ చెబుతున్న హరీష్ రావు ఒక విషయం గుర్తించాలి. భూ సేకరణ చట్టం చెబుతున్న మూడు రెట్ల పరిహారం అప్పర్ లిమిట్ కాదు. అది కనీసంలో కనీసంగా ఇవ్వాల్సిన పరిహారం. 

 

08:29 - June 28, 2016

మల్లన్న సాగర్ భూనిర్వాసితుల అంగీకారంతోనే ప్రాజెక్టును నిర్మించాలని వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ అన్నారు. బాధితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాంత వాసులకు ఇష్టం లేకుండా ప్రాజెక్టు నిర్మించరాదని చెప్పారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. రైతులు, ప్రజలకు అన్యాయం చేసి ప్రాజెక్టు నిర్మించడం సరికాదన్నారు. 'మల్లన్నసాగర్...జీవో నెంబర్ 123... భూ సేకరణ చట్టం 2013.. గత కొద్దిరోజులుగా  ఈ అంశమే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు జీవో నెంబర్ 123 ప్రకారం నష్టపరిహారం ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో    ఈ రెండింటిలో రైతులు ఏది కోరుకుంటే అదే ఇస్తామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. 2013 భూ సేకరణ చట్టం కంటే జీవో నెంబర్ 123 ద్వారా రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందంటూ మంత్రి హరీష్ రావు  చెబుతున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరిస్తున్నామంటూ కోర్టులో అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు. ఇంతకీ ఏది నిజం? 2013 భూసేకరణ చట్టానికీ, జీవో నెంబర్ 123 కి వున్న తేడాలేమిటి? ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనది? దేశవ్యాప్తంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం వుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు వేరే జీవో జారిచేయడం వెనక పరమార్ధమేమిటి?  ఈ రెండింటిలో రైతులు ఏది కోరుకుంటే అదే ఇస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలేమంటున్నాయి? ఇలాంటి అంశాలపై వెంకట్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:50 - June 28, 2016

విజయవాడ : కష్టజీవుల పోరాటాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఐటీయూ సంఘాలు దిక్సూచిలా పనిచేస్తున్నాయని సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు పద్మనాభన్ ప్రశంచించారు. విజయవాడలో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్రమహాసభలు రెండో రోజు ఘనంగా జరిగాయి. మహాసభల సందర్భంగా పలువురు నేతలు కీలకప్రసంగాలు చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగ కార్మిక సంఘాలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు.  
ప్రముఖుల కీలక ప్రసంగాలు
విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర 14వ మహాసభలు రెండో రోజు ఘనంగా జరిగాయి. రెండో రోజు మహాసభల్లో ప్రముఖులు కీలక ప్రసంగాలు చేశారు. విధాన పక్షపాతం లేకుండా యూపీఏ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ఎన్డీఏ కూడా కొనసాగిస్తోందని అఖిల భారత సీఐటీయూ జాతీయ అధ్యక్షులు పద్మనాభన్‌ మండిపడ్డారు. పీవీ నరసింహారావు ఏర్పాటు చేసిన ఎల్.పి.ఏ విధానాలనే మోడీ సర్కార్ కొనసాగిస్తోందన్నారు. దేవుడు, మతం, కులం పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. 
ఉద్యోగులు అందరూ కమ్యూనిస్టులే : అశోక్ బాబు
ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షులు అశోక్ బాబు మాట్లాడుతూ ఏపి ఎన్జీవో సంఘానికి సీఐటీయూ, ఏఐటీయూసీ అన్నదమ్ముల లాంటివి అన్నారు. లెఫ్ట్ పార్టీలు అన్నీ కార్మిక సంఘాలు అయితే ఉద్యోగులు అందరూ కమ్యూనిస్టులే అని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సీఐటీయూ చేసే ఏ పోరాటాలకైనా ఏపి ఎన్జీవో సంఘం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పబ్లిక్ సెక్టార్ పై తెలుగుదేశం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. 
తీర్మాణాలను ప్రవేశపెట్టిన గఫూర్  
సీఐటీయూ రెండో రోజు మహాసభల ప్రతినిధుల సమావేశంలో పది తీర్మాణాలను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో కార్మికులందరికీ 18 వేలు కనీస వేతనంగా నిర్ణయిస్తూ కార్మికశాఖ చేత దీన్ని ఖచ్చితంగా అమలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గఫూర్‌ అన్నారు. కనీస వేతనాల షడ్యూల్డ్‌లో ఉన్న అన్ని తరగతుల వేతనాలను సవరించాడానికి కనీస వేతనాల సలహా బోర్డును తక్షణం నియమించాలి. అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని గఫూర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాల్లో ఉన్నాయి. వీటన్నంటిని ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
తీర్మాణాలను ఆమోదించిన సభ 
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ప్రవేశపెట్టిన పది తీర్మాణాలను సభ ఆమోదించింది. ఈ తీర్మాణాల మేరకు ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రాఘవులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు పుణ్యవతి, అన్ని కార్మిక సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 

 

07:43 - June 28, 2016

వరంగల్‌ : జిల్లాలో పత్తి కొనుగోలు దారులు , కమిషన్‌ ఏజెంట్ల మధ్య నెలకొన్న వివాదం రైతులకు ప్రాణ సంకటంలా మారుతోంది. ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరొందిన ఏనుమాముల మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్ల నిర్వాకంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. దళారీ వ్యవస్థ ఇంతలా మార్కెట్‌ను శాసిస్తున్నా మార్కెటింగ్‌ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. 
బోర్డు ఎత్తేసిన కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీ
వరంగల్‌ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీ సుమారు రెండున్నర కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసి బోర్డు ఎత్తేసింది. దీంతో తమకు బాకీ పడినందుకు గానూ కమీషన్‌ ఏజెంట్లు నిరసనగా ఏకంగా మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను నాలుగు గంటల పాటు నిలిపివేసారు. ఒక వైపు ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు కమీషన్‌ ఏజెంట్ల నిర్వాకం, అలాగే అధికారుల నిర్లక్ష్యంతో రైతులు లబోదిబోమన్నారు. 
సదరు కంపెనీపై కేసు నమోదు 
అయితే సదరు కంపెనీపై పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్వహణలోని మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంట్ల అజమాయిషీ ఎంతలా పెరిగిపోయిందో అద్దం పడుతోంది. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు, వ్యాపారులకు నడుమ కమీషన్‌ ఏజెంట్లు దళారులుగా ఉంటూ.. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూసేందుకు ఏర్పాటు చేసిన అడ్తిదారీ వ్యవస్థ ఇప్పుడు ఏకంగా మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. 
మార్కెట్‌ను నిలిపివేయడం నిబంధనల ఉల్లంఘనే
ఇదిలాఉంటే మార్కెట్లో ముందస్తు అనుమతి లేకుండా ఖరీదులు నిలిపివేయడానికి ఎవరికీ అనుమతి లేదు. ఇవేవీ పట్టకుండా కమీషన్‌ ఏజెంట్లు కొనగోళ్లు నిలిపివేశారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మార్కెట్‌ను నిలిపివేయడం నిబంధనల ఉల్లంఘనేనని తేలింది. మరోసారి ఇలా చే‌స్తే కఠిన చర్యలకు వెనుకాడమని సంబంధిత మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు.

 

07:27 - June 28, 2016

హైదరాబాద్ : వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి హరీష్‌రావు. భారీ వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఒక్క చెరువు తెగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 
చెరువుల రక్షణకు చర్యలు 
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో చెరువులు, కుంటల్లో భారీగా నీరు చేరినందున.. చెరువుల రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్రిందిస్థాయి నుంచి సీఈ వరకు అందరూ అప్రమత్తంగా ఉండి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. 
చెరువులు, కుంటలను కాపాడాలని ఆదేశం
వరదల సమయంలో రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ..  చెరువులు, కుంటలను కాపాడాలని అధికారులకు సూచించారు హరీష్‌రావు. జాగ్రత్తగా లేకపోతే పనుల నాణ్యతపై విమర్శలు తలెత్తే అవకాశం ఉందన్నారు. చెరువులు, కుంటలు తెగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని.. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హరీష్‌రావు హెచ్చరించారు. 
హెచ్‌ఆర్‌ఏలో కోత ? 
ఇక.. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పలువురు ఇంజనీర్లు, సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు సమాచారం ఉందని.. వారందరిపై చర్యలు తీసుకుంటామని హరీష్‌రావు తెలిపారు. అలాంటివారికి హెచ్‌ఆర్‌ఏలో కోత విధించాలని ఉన్నతాధికారులకు సూచించారు. మొత్తానికి ప్రతిరోజు రివ్యూలు చేస్తూ ఇరిగేషన్‌ అధికారులను మంత్రి హరీష్‌రావు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. 

 

గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై నిపుణులతో బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్ : గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై నిపుణులతో బీజేపీ నేతల సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

నేడు మాజీ ప్రధాని పివి నర్సింహారావు జయంతి

ఢిల్లీ : నేడు మాజీ ప్రధాని పివి నర్సింహారావు జయంతి. దేశ వ్యాప్తంగా ఆయన జయంతిని నిర్వహించనున్నారు. పలు కార్యక్రమాలను చేయనున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది.  నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 85,079 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 

07:05 - June 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. 'మాట్లాడుకుందాం, కలిసిపోదాం, బలపడదాం' అనే త్రీ ఫార్ములాతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మూస ధోరణిని పక్కనపెట్టి.. కొత్త టెక్నిక్స్‌ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. నైరాశ్యంలో ఉన్న కేడర్‌లో మనోస్థైర్యం నింపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
రంగంలోకి మెంటర్‌ ప్రశాంత్‌ కిషోర్‌ 
తెలంగాణలో పుట్టెడు కష్టాల్లో ఉన్న పార్టీకి చికిత్స ప్రారంభించింది కాంగ్రెస్‌ అధిష్టానం. వలసలు, కుమ్ములాటలు, ఓటములతో ఉక్కిరిబిక్కిరవుతున్న పార్టీకి జీవం పోసి.. బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ హస్తవాసి మార్చేందుకు పార్టీ మెంటర్‌ ప్రశాంత్‌ కిషోర్‌ రంగంలోకి దిగారు. 
మూసధోరణకి స్వస్తి 
నైరాశ్యంతో ఉన్న కేడర్‌కు మనోస్థైర్యం నింపేందుకు కాంగ్రెస్‌ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న మూసధోరణికి గుడ్‌బై చెప్పాలని డిసైడ్‌ అయ్యింది. కొత్త టెక్నిక్స్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందుకే గాంధీభవన్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఢిల్లీ దూత శ్రీనివాస్‌ హాజరై.. కొత్త ట్రిక్స్‌తో దిశా నిర్దేశం చేశారు. 
మూడు సూత్రాలతో ప్రభుత్వంపై పోరాటం
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి మూడు సూత్రాలను అందించింది అధిష్టానం. మాట్లాడుకుందాం.. కలిసిపోదాం.. బలపడదాం.. అనే ఫార్ములాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీనికోసం మంచి ప్రచార నినాదాలను సెలెక్ట్‌ చేసి.. వాటిని విస్తృత ప్రచారం జరిగేలా నేతలు ముందుకు సాగాలని నిర్ణయించారు. అంశం ఏదైనా సూటిగా.. సుత్తిలేకుండా ప్రజల్లో నాటుకుపోయే విధంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో భూసేకరణ, కేసీఆర్‌ కుటుంబ పాలన, హామీల అమలులో వైఫల్యంతో పాటు పలు అంశాలపై పదునైన విమర్శనా‌స్త్రాలతో టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయాలని నేతలకు సూచించింది. 
ప్రసంగాలపై దృష్టి సారించాలని నేతలకు సూచన
ఇక నేతలు ముఖ్యంగా తమ ప్రసంగాలపై దృష్టి సారించాలని సూచనలు చేసింది. ఎంతసేపు మాట్లాడామన్నది కాకుండా.. తాము చెప్పిన అంశాలు ఎంతవరకు ప్రభావితం చేశాయో గమనించాలని.. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉపన్యాసాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత.. ఒక్కో నియోజకవర్గానికి 30 మంది కీలకనేతలను ఎంపిక చేసి.. ప్రచారానికి ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఇక వీరందరికి మరో వర్క్‌షాప్‌ నిర్వహించి.. ప్రశాంత్‌ కిషోర్‌ చేత దిశా నిర్దేశం చేయించనున్నట్లు సమాచారం. మొత్తానికి గాంధీభవన్‌ వీడి గ్రౌండ్‌లో తేల్చుకునేందుకు కాంగ్రెస్‌ పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరి ఈ ప్రణాళికలు కాంగ్రెస్‌కు ఏ మేర ఉపయోగపడుతాయో చూడాలి. 

07:01 - June 28, 2016

హైదరాబాద్ : ఏపీ స‌చివాల‌యం నుంచి వెల‌గ‌పూడి తాత్కాలిక స‌చివాల‌యానికి ఉద్యోగులు తరలింపు వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు శాఖలు విజయవాడ, గుంటూరుల్లో తమ పనులను ప్రారంభించగా. ఈనెల  29 మ‌ధ్యాహ్నం మరో నాలుగు కీలక శాఖ‌లు ప్రారంభం కానున్నాయి. మిగిలిన శాఖ‌లు ద‌శ‌ల వారీగా తాత్కాలిక స‌చివాల‌యానికి త‌ర‌లి వెళ్లనున్నాయి. ఆగ‌స్టు నుంచి పూర్తిస్థాయిలో పాల‌న కొత్త రాజ‌ధాని నుంచి జ‌ర‌గ‌నుంది.
ఇప్పటికే పలు శాఖలు తరలింపు... 
ఈ నెల 27 డెడ్‌లైన్‌ లోగా వెల‌గ‌పూడి తాత్కాలిక స‌చివాల‌యానికి శాఖలన్నీ తరలిరావాల్సి ఉండగా, ఇప్పటికే పలు శాఖలు విజయవాడ, గుంటూరులోని వివిధ కార్యాలయాలకు చేరుకొని విధులు ప్రారంభించారు. అయితే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భవనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. దీంతో అక్కడ ఇంకా శాఖలు తమ పనులు మొదలు పెట్టలేదు. 
ఈనెల 29న నాలుగు కీలక శాఖ‌లు విధుల ప్రారంభం  
అయితే నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసి ఈ నెల 29 మ‌ధ్యాహ్నం 2 గంటల 59 నిముషాల‌కు తాత్కాలిక స‌చివాల‌యంలో నాలుగు కీలక శాఖ‌లు త‌మ విధులను ప్రారంభించనున్నాయి. న‌లుగురు మంత్రులు వెల‌గ‌పూడిలో నిర్మాణంలో ఉన్న  తాత్కాలిక స‌చివాల‌యం  నుంచి విధులు నిర్వహిస్తారు. అయితే  మిగిలిన శాఖ‌లు ఎప్పుడు త‌ర‌లి వెళ‌తాయి అనే దానిపై త్వర‌లోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
ఆగ‌స్టు 31 క‌ల్లా త‌ర‌లింపు ప్రక్రియ పూర్తి 
గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, కార్మిక‌శాఖ‌, పంచాయితీరాజ్, ఆరోగ్య శాఖ  ఈ శాఖ‌లు  29 నుంచి పనులు ప్రారంభించాల్సి ఉంది. దీంతో ఆయా శాఖల తరలింపు ప్రక్రియ యుద్ధ ప్రాతిప‌దిక‌త‌న జరుగుతోంది. వ‌చ్చేనెల  6, 15, 21తేదీల్లోగా మిగిలిన శాఖ‌లు వెలగపూడి తరలి వెళ‌తాయి. ఆగ‌స్టు 31 క‌ల్లా ఈ త‌ర‌లింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. 
హైదరాబాద్ లోని స‌చివాల‌యంలో ఉండనున్న కొద్దిమంది సిబ్బంది
ఇక కొద్దిమంది సిబ్బందిని హైద్రాబాద్ లో స‌చివాల‌యంలో ఉంచనుంది ఏపీ సర్కార్. దీర్ఘకాలిక  జ‌బ్బులు ఇలా కొన్ని స‌మ‌స్యలు ఉండే ఉద్యోగుల విష‌యంలో కొంత వెసులుబాటు ఇవ్వనుంది. అయితే వీరి విష‌యంలో కూడా త్వర‌లోనే స్పష్టత రానుంది. ఉద్యోగులు త‌ర‌లింపుపై  సచివాల‌యంలో ఏపీ సీఎస్ ఎస్పీ ట‌క్కర్ అధికారుల‌తో స‌మావేశ‌మయ్యారు. తరలింపు ప్రక్రియపై రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే దాదాపు 50కిపైగా హెచ్ వోడిలు తరలి వెళ్లినట్లు సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. 

 

06:53 - June 28, 2016

హైదరాబాద్ : జడ్జీల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో ధర్నాకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. హైకోర్టు విభజన, జడ్జీల నియామకంపై కేంద్ర ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని ఆయన భావిస్తున్నారట. దీనిపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ న్యాయమూర్తులకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళన చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో మరోసారి తెలంగానం వినిపించడానికి కేసీఆర్‌ రెడీ అవుతున్నారు.  

 

06:51 - June 28, 2016

హైదరాబాద్ : న్యాయాధికారుల తాత్కాలిక కేటాయింపుల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని తెలంగాణ జడ్జ్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను హైకోర్టు సస్పెండ్ చేయడంతో ఈ వివాదం కాస్తా తారాస్థాయికి చేరింది. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ..తెలంగాణ స్థానికత జడ్జిలు 200 మంది మూకుమ్మడి సెలవులపై వెళ్లారు. విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. 
జడ్జిలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం 
తెలంగాణలో తాత్కాలిక న్యాయాధికారుల కేటాయింపులపై ఆందోళనలు చేస్తున్న జడ్జిలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జిలు ఉద్యోగ సంఘాలతో న్యాయవాదులతో సమావేశం కావడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. 120 మంది న్యాయవాదులు  రాజీనామా చేసి అసోసియేషన్ అధ్యక్షునికి ఇవ్వడంపై సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు జడ్జిలను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండ్ అయిన వారిలో జడ్జిల అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్‌లు ఉన్నారు. అయితే ఉమ్మడి హైకోర్టు తీసుకున్న సస్పెన్షన్‌ నిర్ణయంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. 200 మంది తెలంగాణ న్యాయాధికారులు మూకుమ్మడి సెలవుపై వెళ్లారు. మంగళవారం నుంచి విధులకు హాజరుకావద్దని నిర్ణయించిన జడ్జిల అసోసియేషన్,.హైకోర్టు వద్ద ఆందోళన చేపట్టారు.
200 మంది న్యాయాధికారుల మూకుమ్మడి సెలవు 
ఇద్దరు న్యాయమూర్తులను సస్పెండ్ చేశారని తెలుసుకున్న న్యాయవాదులు వివిధ కోర్టుల్లో ధర్నాలు చేశారు. సిటీసివిల్ కోర్టులో న్యాయవాది తిరుమల్ రావు ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేలోపు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్పల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు జరుగుతున్న కుట్రపై హైకోర్టు బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మంగళ వారం నుంచి ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. ఏ ఒక్క న్యాయవాది కూడా కోర్టు లోపలికి వెళ్లరాదని నిర్ణయించారు. సీ.జేను వెంటనే వెనక్కి పిలిచేలా..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయాలని నిర్ణయించారు. అలాగే బుధవారం తెలంగాణ అడ్వకేట్ నేతలందరు ఢిల్లీ వెళ్లి హోంమంత్రిని, న్యాయశాఖ మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు. జూలై 1 నుంచి ఉద్యోగులంతా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.  
నేటి నుంచి సీజే బెంచ్‌ను బహిష్కరించాలని నిర్ణయం 
ఇక విజయవాడలో శ్రీకాంత్‌చారీ అనే తెలంగాణ న్యాయమూర్తిని అవమానపర్చేలా వ్యవహారించి బెంచ్ దింపారని హైకోర్టు న్యాయవాదులు మండిపడుతున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి.. తెలంగాణ న్యాయవాదులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. సీజే నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇప్పటికే  200 మంది జడ్జిలు మాస్ లీవ్‌పై వెళ్లితే.. వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఇప్పటికే నోటీసులిచ్చారు. దీంతో తెలంగాణలో ఉన్న కోర్టులన్నీ స్థంభించే అవకాశాలు ఉన్నాయి. 

నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెల, ఎంపీ కవిత పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవిత పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు. 

ఎపిలో నేటి నుంచి ప్రయోగాత్మకంగా పల్స్ సర్వే

హైదరాబాద్ : ఎపిలో నేటి నుంచి ప్రయోగాత్మకంగా పల్స్ సర్వే నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలో ఒక మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక వార్డులో పైలట్ ప్రాజెక్టుగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు. 

నేడు టీటీడీపీ ఎస్సీ సెల్ కార్యవర్గం ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు ఎన్ టిఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ ఎస్సీ సెల్ కార్యవర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. బొట్ల శ్రీనివాస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేడు టీ.న్యాయశాఖ ఉద్యోగులు సహాయ నిరాకరణ

హైదరాబాద్ : నేడు తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు. కోర్టుకు హాజరై మౌనంగా కూర్చోవాలని ఉద్యోగులు నిర్ణయించారు. 

Don't Miss