Activities calendar

29 June 2016

22:12 - June 29, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌ ఆస్తులపై ఈడీ మరోసారి కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌తో సహా, బెంగళూరు నివాసం, మరికొన్ని కంపెనీల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈడీ అటాచ్‌ చేసిన ఈ ఆస్తుల విలువ 750 కోట్ల రూపాయలు ఉన్నట్టు సమాచారం. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ ఐదు వేల కోట్లు ఉటుందని అంచనా వేస్తున్నారు.

జగన్‌కు మరో గట్టి దెబ్బ ...
అక్రమాస్తుల కేసులో.. వైసీపీ అధినేత జగన్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జగన్‌కు చెందిన మరికొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌ లోటన్‌ పాండ్‌లోని నివాసంతో పాటు, బెంగళూరులోని మంత్రి కామర్స్‌ వాణిజ్య భవన సముదాయం, రఘురాం సిమెంట్స్‌, శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌, పెన్నా ప్రతాప్‌రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్‌

చార్జ్‌షీటులో ఆభియోగాల ఆధారంగా ఈడీ అటాచ్‌...
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన ఆరో చార్జ్‌షీటు, సీబీఐ ఫైల్‌ చేసిన తొమ్మిదో చార్జ్‌షీటులో నమోదు చేసిన ఆభియోగాల ఆధారంగా ఈడీ ఈ ఆస్తులను అటాచ్‌ చేసింది. భారతి సిమెంట్స్‌కు 152 కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి గనులను అక్రమంగా కేటాయించినట్టు నిర్ధారణ అవ్వడం వల్లే ఈ చర్యను తీసుకున్నట్లు భావిస్తున్నారు. లోటస్‌ పాండ్‌లోని ఇంటిని ఈడీ అటాచ్‌ చేయడంతో జగన్‌ ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జప్తు చేసిన ఆస్తుల క్రయవిక్రయాలు జరగకుండా ఒక ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో ఉంచాలని ఈడీ కోర్టు ఆదేశిచింది.

జప్తు చేసిన ఆస్తులు విలువ రూ.4,200 కోట్లు ...
జగన్‌కు సంబంధించి ఇంతకు ముందు దఫదఫాలుగా సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగనపై నమోదైన అభియోగాలు హైదరాబాద్‌ కోర్టులో రుజువైతే అటాచ్‌ చేసిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 

22:04 - June 29, 2016

ముంబై : జులై 29న కోర్టు ఎదుట హాజరుకావాలని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యాకు ముంబై ప్రత్యేక కోర్టు నోటీసు జారీ చేసింది. ఆరోజు ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఉండాలని ప్రత్యేక న్యాయమూర్తి పీఆర్ భావకే ఆదేశించారు. కోర్టు ఆదేశాలకు సంబంధించిన నోటీసు ముంబై దినపత్రికలో విడుదలైంది. పలు జాతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల మేర రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యా ఈ ఏడాది మార్చి 2న లండన్‌కు పారిపోయారు. రుణాల ఎగవేత కేసులో కోర్టుకు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలు జారీ కాగా తనకు గడువు కావాలంటూ ఆయన లేఖ రాశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయ్ మాల్యాను చట్టబద్ధంగా భారత్‌కు రప్పించేందుకు యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.

22:01 - June 29, 2016

ఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లుకు అందరూ సహకరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పార్లమెంటు సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో 45, లోక్‌సభలో 25 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. జిఎస్‌టి బిల్లు దేశానికి ఎంతో కీలకమని విపక్షాలకు సందేహాలుంటే నివృత్తి చేస్తామని, ఈ బిల్లుకు అందరూ సహకరించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. 

21:54 - June 29, 2016

హైదరాబాద్ : ఉగ్రవాదుల కదలికలతో హైదరాబాద్‌ వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. నగరంలో భారీ పేలుళ్లకు ఐసిస్‌ ఉగ్రవాదులు పన్నిన కుట్ర కలకలం రేపింది. సకాలంలో ఎన్ఐఏ  అధికారులు 11 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

భాగ్యనగరంలో భారీ పేలుళ్లకు కుట్ర....
ప్రపంచాన్ని గడగడలాడిస్తూ, మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ హైదరాబాద్‌ పాతబస్తీ కేంద్రంగా పనిచేస్తోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. భాగ్యనగరంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు భగ్నం చేయడంతో జంటనగరాల ప్రజలకు పెద్ద ముప్పు తప్పింది.

12 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు...
నగరంలో ఉగ్రవాదుల కదలికను గుర్తించిన ఎన్‌ఏఐ అధికారులు..ఒకటి కాదు... రెండు కాదు... పాతబస్తీలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నగర పోలీసులు సహకారంతో మంగళవారం అర్ధరాత్రి పాతబస్తీని జల్లెడ పట్టారు. తాలబ్‌కట్ట, భవానీనగర్‌, మొగల్‌పురా, బార్కస్‌, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్‌, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా ... తదితర ప్రాంతాల్లో క్షణ్ణంగా గాలించారు. ఐసిస్‌తో సంబంధాలున్న 11 మందిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్‌ ఇబ్రహీం యజ్దాని, మహ్మద్‌ ఇలియాస్‌ యజ్దాని, అబ్దుల్లాబిన్‌ అహ్మద్‌ అల్మోది, అబిన్‌ మహ్మద్‌, ముజఫర్‌ హుస్సేన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, హబీబ్‌ మహ్మద్‌, సయీద్‌ నైమత్‌ ఉల్లా హుస్సేనీ, ముజఫర్‌ హుస్సేన్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ అతుల్లా రహ్మాన్‌, మహ్మద్‌ అర్బాజ్‌ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివినవారు కూడా ఉన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాదులుతో సిరియా, ఇరాక్‌ల్లోని ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. పాతబస్తీలో మరికొందరు ఐసిస్‌ సానుభూతిపరులు ఉండే అవకాశం ఉందని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.

విదేశీ కరెన్సీ,9ఎంఎం పిస్టళ్లు రెండు, ఎలక్ట్రానిక్ వస్తువులు...
అరెస్టైన నుంచి భారీగా పేలుడు పదార్ధాలతోపాటు 15 లక్షల రూపాయల నగదు, విదేశీ కరెన్సీ, రెండు 9ఎంఎం పిస్టళ్లు, 23 సెల్‌ ఫోన్లతోపాటు, ఎయిర్‌గన్‌, ఏడు పెన్‌ డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.అలాగే ట్యాబ్‌, సీపీయూ, డాంగిల్‌, టార్గెట్‌ బోర్డులు, హీటర్‌ టైమర్‌, ప్రజర్‌ టైమర్‌, కండెన్సర్‌, విదేశీ కత్తులు, బిగ్‌ స్క్రీన్‌ డ్రైవర్స్‌, పెయింట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లతోపాటు రసాయనాలు, యూరియాను కూడా స్వాధీనం చేసుకున్నారు.

నెట్‌ వర్కింగ్‌ సైట్లలో బృందంగా ఏర్పాటు ...
హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకుని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు కుట్ర పన్నినట్టు ఎన్‌ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్లలో ఒక బృందంగా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈ ఏడాది జనవరిలోనే గుర్తించారు. అప్పుడు కూడా దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కూడా ముందుగా హైదరాబాద్‌లోనే అనుమానితుల్ని అరెస్టు చేశారు. ఇప్పుడు మరోసారి అరెస్టులు జరగడం... ఐసిస్ వేళ్లు ఇక్కడ ఎంత బలంగా ఉన్నాయో చూపుతున్నాయి. ఏదేమైనా ఎన్ఐఏ అప్రమత్తత, స్థానిక పోలీసుల తోడ్పాటుతో... మరో మారణహోమం తప్పిందనిపిస్తోంది. అయితే ఐసిస్ మాలాలున్న అందరిని అరెస్ట్ చేసే వరకు సమస్య పూర్తిగా తొలగిందని భావించలేమంటున్నారు నిపుణులు. 

21:44 - June 29, 2016

ఢిల్లీ : తెలంగాణలో హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆందోళనలపై కేంద్రం అలెర్టయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ్‌..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. మరోవైపు తెలంగాణలో న్యాయవాదుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. న్యాయమూర్తుల సస్పెన్షన్‌ ఎత్తివేసేంత వరకు ఆందోళనల్ని ఆపే ప్రసక్తే లేదని న్యాయాధికారులు తేల్చిచెప్పడంతో కేంద్రం ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిసారించింది.

లాయర్లు, జడ్జిల ఆందోళనపై కేంద్రం సీరియస్‌...
తెలంగాణ వ్యాప్తంగా లాయర్లు, జడ్జిల ఆందోళనపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించింది. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాగూర్‌తో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఉమ్మడి హైకోర్టు విభజన, తెలంగాణలో జడ్జీల నియామకాలు, అడ్వకేట్ల మూకుమ్మడి సెలవులు, ఆందోళనలను సీజేకు వివరించారు. దీనిపై ఏం చేయాలన్న దానిపై చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌తో చర్చించారు.
సదానందగౌడతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ...
అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణ న్యాయాధికారుల సమస్యలు, హైకోర్టు విభజనపై వారు మంత్రితో సవివరంగా చర్చించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై గవర్నర్‌తో మాట్లాడానని సందానందగౌడ చెప్పినట్లు టీ.కాంగ్రెస్ నేతలు వివరించారు.

ఉధృతమైన లాయర్ల, జడ్జీల ఆందోళన...
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల, జడ్జీల ఆందోళన ఉధృతమైంది. బుధవారం ఛలో హైకోర్టు పిలుపు నేపథ్యంలో హైకోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టుకు వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి..అనంతరం కోర్టు లోనికి అనుమతించారు. ఈ క్రమంలో నలుగురు న్యాయవాదులు పోలీసుల కళ్లు గప్పి హైకోర్టు వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హైకోర్టుకు వచ్చే అన్ని దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

రంగారెడ్డి జిల్లాకోర్టు ముందు న్యాయవాదులు రాస్తారోకో..
తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర న్యాయమూర్తుల ఆప్షన్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లాకోర్టు ముందు న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను అరెస్ట్‌చేసి పీఎస్‌కు తరలించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రిపై టీ. న్యాయవాదుల ఫిర్యాదు ...
హైకోర్టును విభజించాలనే డిమాండుతో ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు కేంద్ర న్యాయశాఖ మంత్రిపై సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల జేఏసీ..గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు విభజనపై మంత్రి హామీ ఇచ్చి మాట తప్పారని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు న్యాయాధికారుల ఆందోళనలపై టి టిడిపి, టీఎన్జీవో మద్దతు తెలిపాయి. న్యాయం జరిగే వరకు న్యాయాధికారుల తరపున పోరాటం చేస్తామన్నారు.

15రోజుల పాటు మూకుమ్మడి సెలవు పెట్టిన న్యాయాధికారులు ...
ఇదిలా ఉంటే మరోవైపు..15రోజుల పాటు మూకుమ్మడి సెలవు పెట్టిన న్యాయాధికారులు కోర్టులకు హాజరుకాలేదు. న్యాయమూర్తులపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేంతవరకు ఆందోళనల్ని విరమించే ప్రసక్తేలేదని న్యాయాధికారులు తేల్చిచెప్పారు. జూలై 1న చలో హైదరాబాద్‌కు న్యాయవాదులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని అడ్వకేట్‌ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులపై హైకోర్టు స్పందించింది. హైకోర్టు అనుమతి లేకుండా సెలవులు పెడితే చర్యలు తీసుకుంటామని హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ సర్క్యూలర్‌ జారీచేశారు.

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం..
ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదుల ఆందోళన ఉధృతమైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన, జడ్జీల సస్పెన్షన్‌, న్యాయవాదుల ఆందోళనపై గవర్నర్‌కు సీఎం వివరించారు. కొద్ది రోజులుగా న్యాయాధికారుల కేటాయింపులపై తెలంగాణ న్యాయవాదులు ఆందోళనలు చేస్తుండడంతో దీనిపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా 11మంది న్యాయాధికారులపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో ఆందోళనలు ఉధృతమయ్యాయని గవర్నర్‌కు వివరించారు. 

21:30 - June 29, 2016

గుంటూరు : ఏపీలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం సరిగ్గా 2.59 నిమిషాలకు హైదరాబాద్ నుంచి వచ్చిన నాలుగు శాఖలకు చెందిన దాదాపు 200మంది ఏపీ ఉద్యోగులు తాత్కాలిక సచివాలయంలోకి ప్రవేశించారు. ఈ వేడుకపై చైనా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ... ఇదొక అపురూప ఘట్టమని... తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ట్వీట్ చేశారు.
ఏపీ చరిత్రలో ఓ సువర్ణధ్యాయం ...
అమరావతి చరిత్రలో ఓ మహత్తర ఘట్టానికి అడుగుపడింది. ఎన్నేళ్లు పడుతుందో అనుకున్న సచివాలయ పాలన.. రెండేళ్లలోనే మొదలైంది. అమరావతి చరిత్రలో ఓ అపురూప సన్నివేశం బుధవారం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం సరిగ్గా..2.59 నిమిషాల శుభ ముహూర్తాన..ఏపీ ఉద్యోగులు, కొంతమంది మంత్రులు వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలోకి ప్రవేశించారు. దీంతో ఏపీ చరిత్రలో ఓ సువర్ణధ్యాయం ప్రారంభమైంది.

ఐదో బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో అమాత్యుల పూజలు ...
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం ఐదో నంబర్‌ భవనం కింది అంతస్తులో సచివాలయ కార్యకలాపాలు బుధవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఐదో బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన మంత్రి అయ్యన్నపాత్రుడికి ఉద్యోగులు పూలదండలు వేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ టక్కర్‌, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పలు శాఖల సెక్రటరీలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఐదు బస్సుల్లో వెలగపూడికి చేరుకున్న 200 ఉద్యోగులు...
అంతకుముందు హైదరాబాద్ నుంచి ఐదు బస్సుల్లో వెలగపూడికి చేరుకున్న 200 మంది సచివాలయ ఉద్యోగులు కూడా వేదమంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోకి అడుగుపెట్టారు. సచివాలయానికి చేరుకున్న ఉద్యోగులకు సీఎస్‌ టక్కర్‌, ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. తాత్కాలిక సచివాలయంలో మొత్తం నాలుగు శాఖల కార్యాలయాలు బుధవారం ప్రారంభమయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, కార్మిక శాఖకు చెందిన కార్యాలయాలు ప్రారంభమయ్యాయి.
వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ...
ఇక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని కూడా ఐదో బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్మించిన తనశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి మృణాళిని కార్యాలయంలోకి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించగానే మంత్రికి ఆశాఖ ఉద్యోగులు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

వెలగపూడి నుండే పాలన...
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు అంకిత భావం వల్లే రికార్డు స్థాయిలో సచివాలయ నిర్మాణం పూర్తయిందన్నారు. జూలై చివరికల్లా అన్ని మంత్రిత్వ శాఖలు వెలగపూడికి తరలివస్తాయని, మంత్రులు కూడా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తారని తెలిపారు. జూలై చివరి నుంచి లేదంటే ఆగస్టు మొదటి వారం నుంచి ఏపీ పరిపాలన అంతా వెలగపూడి కేంద్రంగానే కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు.

వెలగపూడిలో పండగ వాతావరణం ...
సచివాలయం ప్రారంభం సందర్భంగా వెలగపూడిలో పండగ వాతావరణం చోటుచేసుకుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల సందడితో వెలగపూడి జన జాతరను తలపించింది. అమరావతి నుంచి విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఉద్యోగులు చెప్తున్నారు.

రికార్డు స్థాయిలో 125 రోజుల్లోనే....
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం రికార్డు స్థాయిలో 125 రోజుల్లోనే ప్రపంచస్థాయి ప్రమాణాలతో పూర్తైంది. సచివాలయం మొత్తం ఆధునిక హంగులతో అలరారుతోంది. ఎల్‌ఈడీ బల్బులు, అత్యాధునిక సీటింగ్, కార్పొరేట్ తరహా ఫినిషింగ్, సువిశాలమైన పోర్టుగో లాంటివన్నీ ఉన్నాయి ఈ కొత్త సచివాలయంలో సెంట్రలైజ్ట్ ఏసీ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కేవలం 131 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదో భవనం అమరావతిలో తొలి పరిపాలనా భవనంగా చరిత్రకెక్కింది. అంతేకాదు..కేవలం రెండేళ్లలోనే రాజధాని నుంచి పరిపాలన చేసే వెసులుబాటు రావడంతో ఏపీలో ఆనందోత్సాహాలు నింపుతోంది.

55 మంది ఎంపీలు కోటీశ్వరులేనంట?!...

ఢిల్లీ : కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే 13 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల ఎన్నికైన 57 మంది ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులేనని తెలిపింది. వీరిలో ఎన్సీపీకి చెందిన ప్రఫుల్‌ పటేల్‌ అత్యధికంగా రూ.252 కోట్ల ఆస్తులను అఫిడవిట్‌లో చూపించారు. తర్వాత స్థానంలో రూ.212 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కపిల్‌ సిబల్‌, ఆ తర్వాత రూ.193కోట్లతో బీఎస్పీకి చెందిన సతీష్‌ చంద్ర మిశ్రా ఉన్నారు.

సుప్రీం ఛీఫ్ జస్టితో ముగిసిన సదానంద సమావేశం...

ఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ తో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ్ సమావేశం ముగిసింది. ఉమ్మడి హైకోర్టు విభజన, తెలంగాణలో జడ్జీల నియామకాలు ,న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులు, ఆందోళనలపై సీజేఐ కి సదానంద వివరించారు.

21:01 - June 29, 2016

చిన్నారుల జీవితాలకు భరోసాలేదు.. ఏ మహమ్మారి కబళిస్తుందో, ఏ మాయరోగం మింగేస్తుందో తెలియని పరిస్థితి. నవ్వుల పువ్వులు విరిసే ఇంట్లో ఏ క్షణాన విషాదం నిండుతుందో ఊహించలేని కాలం. బుడిబుడి అడుగుల బుజ్జాయిల బతుకు ఏ ప్రమాదంలో ఉందో ఊహించలేని సందర్భం. వినటానికే కటువుగా, బాధగా ఉన్నా నమ్మాల్సిన నిజాలివి. దేశంలో అయిదేళ్ల లోపు శిశుమరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి దూసుకుపోతున్నామంటున్న మనదేశం శిశుమరణాల్లో అత్యంత దీనపరిస్థితిలో ఉందంటే వణికిపోవల్సి వస్తోంది. దీనికి కారణాలేంటి? పరిష్కారాలేంటి? కొంచెం జాగ్రత్త, కొంచెం అవేర్ నెస్.. ప్రభుత్వం నుంచి కాస్త సపోర్ట్. ఇవి చాలు లేత చిన్నారులను రేపటి దివ్వెలుగా వెలిగించుకోటానికి. కానీ, ఈ మాత్రం చేయలేని వ్యవస్థ లక్షలాది పసివాళ్లు బలవుతుంటే చోద్యం చూస్తోంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో లక్షల మంది పసికూనలు ఏటా మృత్యువాత పడుతుంటే నిర్లక్ష్యంగా వదిలేస్తోంది. ఇవన్నీ గాలి మాటలు కాదు. చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందనే నిజాన్ని యూనిసెఫ్ రిపోర్ట్ అంకెలతో సహా రుజువు చేస్తోంది. మనదేశం అయిదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్యం గాల్లో దీపంలో ఉందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. చిన్నారుల ఉసురు తీస్తున్న కారణాలేంటి? ఏ సమస్యలు పసికూనలను బలితీసుకుంటున్నాయి ? ఏ రోగాలు నిత్యం పొంచి ఉంటున్నాయి? యూఎన్ వో వెల్లడించిన గణాంకాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది.? చిన్నారుల ఉసురు తీస్తున్న కారణాలేంటి? శిథిల భారతానికి కారణమెవరు? చిన్నారుల ఉసురు తీస్తున్న కారణాలేంటి? ఏ సమస్యలు పసికూనలను బలితీసుకుంటున్నాయి ? ఏ రోగాలు నిత్యం పొంచి ఉంటున్నాయి? ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల్లో భారత్ ఏ స్థానంలో ఉంది.? కర్ణుడి చావులాగా శిశుమరణాల రేటులో కూడా అనేక కారణాలున్నాయి. అభివృద్ధి రేట్ల గారడీల్లో ప్రభుత్వాలు దశాబ్దాలు వెళ్లదీశాయి. కానీ సాధించింది శూన్యం. పైగా అసమర్ధ విధానాల ఫలితంగా గ్రామీణ వ్యవస్థ నానాటికీ సమస్యల సుడిగుండంలో పడుతూ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పేదవాడి బతుకు రోజువారీ జూదంలా తయారవుతోంది. దీని ఫలితం పేదవాడి ఇంట పుట్టిన చిన్నారులపై పడుతోంది. వాస్తవాలు చేదుగా ఉన్నా అంగీకరించక తప్పదు.. వ్యవసాయం పడకేసింది.. గ్రామీణ విద్య, వైద్యం, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలు...అన్నీ నీళ్లొదిలే పరిస్థితిలో ఉన్నాయి. ఉన్న ఉపాధి హామీకి నిధులు తగ్గిస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే మన గ్రామీణ భారతం ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుకుంటోంది. నగరాల్లో బస్తీలు నీరసంతో వేలాడుతున్నాయి. త్వరలో సరైన చికిత్స చేయకపోతే పాలకులు మూల్య చెల్లించక తప్పదు.. చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. 

20:41 - June 29, 2016

అరుదైన రికార్డు సృష్టించిన హైదరబాద్ కుక్కలు.. లా 61,749 వేలమందిని పీకేసినియంట పిక్కలు ... కుక్కకాట్ల చేత పట్టాభిషేకం చేయాలంటున్న కుక్కకాటు బాధితులు..ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రధాన పాత్రధారులుగా బాబు, కేసీఆర్ గా బీటీటీ బ్యానర్ లో తెరకెక్కిన అద్భుత చిత్రం 'హైకోర్టుల ఆటాడుకుందాం' ఈ చిత్రంలో ఇలన్లు వుండరంట?!..అందరూ ఈరోలేనంట...నాయం చెప్పేటోల్లే జైలుకెలతారంట!...బల్దియా అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ ఐకమత్యంతోని కలిసి మూసీ నదికి పుష్కరాలు చేసిండు.. గద్వాలను జిల్లాగా చేయమనేది సర్కారు ముందు ఆకాంక్షల శంఖం ఊదుతానంటున్న గద్వాల్ జేజమ్మ...డిల్లీల దేవుడ్ని మొక్కనీకి వచ్చి దేవుని కిరీటాలు, నగలు మూటకట్టుకుని పోయిన పోరగాడు..గిటువంటి గరం గరం ముచ్చట్లు ముచ్చట్లు చెప్పనీకి మన మల్లన్న సిద్ధంగా వున్నాడు మరి జాగెందుకు ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి..మల్లన్న చెప్పే ముచ్చట్లన్నీ ఇనుండ్రి..కాదు కాదు చూడుండ్రి...

జడ్జీల సెలవుల అధికారాన్ని రద్దు చేసిన హైకోర్ట్ ...

హైదరాబాద్‌: న్యాయాధికారుల చేతుల్లో ఉన్న సెలవుల అధికారాన్ని హైకోర్టు రద్దు చేసింది. కొద్ది రోజులుగా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అంశంపై న్యాయవాదులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మరింత ఉదృతం కానివ్వకుండా హైకోర్టు న్యాయవాదులపై ఆంక్షలు విధించింది. ఇరు రాష్ట్రాల్లోని న్యాయాధికారులు సెలవులు కావాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ సూచించారు.

కశ్మీర్‌ అంశంలో నెహ్రూది చారిత్రక తప్పిదం : అమిత్ షా

ఢిల్లీ: భాజపా అధ్యక్షుడు అమిత్‌షా భారత మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూని తీవ్రంగా విమర్శించారు. కశ్మీర్‌ అంశంలో ఆయన చేసింది ‘చారిత్రక తప్పిదమ’ని అన్నారు. దిల్లీలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్‌)లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌షా మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంలో నెహ్రూ చేసినంత పెద్ద తప్పు ఏ జాతీయ నాయకుడూ చేయలేదని పేర్కొన్నారు. 1948లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కశ్మీర్‌ అంశంలో నెహ్రూ సంధి ప్రకటించడంపై అమిత్‌షా విమర్శలు చేశారు. ఆయన ఎందుకు సంధి ప్రకటన చేశారో ఇప్పటికీ కారణం ఎవ్వరికీ తెలియదన్నారు.

19:29 - June 29, 2016

11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. హైకోర్టు విభజన అతి త్వరగా చేయాలనే డిమాండ్ రోజు రోజుకూ ముదురుతోంది. దీనికి కారకులు ఎవరు? ఏపీ ప్రభుత్వమా? తెలంగాణ ప్రభుత్వమా? లేకుంటే కేంద్ర ప్రభుత్వానిదా? ఎవరిది ఈ బాధ్యత? ఈ అంశంపై సెక్షన్ 30 ఏం చెబుతోంది? ఇటువంటి అంశాలపై విస్పష్టమైన విశ్లేషణ అందించటానికి ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ..ప్రస్తుతం విశ్రాంత న్యాయమూర్తిగా వున్న జస్టిస్ చంద్ర కుమార్ గారితో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది.. ఈ అంశంపై సెక్షన్ 30లో సవరణ కోరితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేంటున్నారు జస్టిస్ చంద్రకుమార్ గారు...న్యాయాధికారుల ఆప్షన్స్ విషయంలో చీఫ్ జస్టిస్ నిర్ణయంలో తప్పులేంటున్నారు చంద్రకుమార్ ....రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టును విభజించాలని సీఎం కేసీఆర్, మంత్రులు, తెలంగాణకు సంబంధించిన న్యాయాధికారులు, న్యాయమూర్తులు కోరుతున్నారు కానీ ... తొలుత పునర్విభజన చట్టంలో సెక్షన 30పై సమరణ కోరాలంటున్నారు..అప్పటికీ స్పందించకపోతే ఈ బాధ్యత కేంద్రం తీసుకుని పరిష్కరించాలంటున్న జస్టిస్ చంద్ర కుమార్ గారు ఈ అంశంపై తెలిపిన వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...సమగ్ర సమాచారం తెలుసుకోండి....

మంత్రి వెంకయ్యకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా..

ఢిల్లీ : ఎయిరిండియా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పింది. నిన్న ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం వెనుక కారణాన్ని కేంద్ర మంత్రికి ఆ సంస్థ వివరించింది. గుర్గావ్ లోని సెక్టార్ 21లో నివసిస్తున్న ఎయిర్ ఇండియా పైలట్ నివాసానికి 9:45 నిమిషాలకు కారును పంపించామని, అయితే అది ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో వేరే కారు చూసుకుని విధులకు వెళ్లిపోవాలని డ్రైవర్ పైలట్ కు ఫోన్ ద్వారా తెలిపాడని, దీంతో ఆయన వేరే క్యాబ్ ను చూసుకుని ఎయిర్ పోర్టుకు వస్తుండగా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలోని ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడని దీంతో సమయానికి ఎయిర్ పోర్టుకు చేరుకోలేకపోయాడని ఎయిరిండియా తెలిపింది.

జగన్ ఆస్తులపై ఈడీ అటాచ్ మెంట్ ను స్వాగతిస్తున్నాం : రావెల

విజయవాడ : వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి చెందిన రూ.749 కోట్ల ఆస్తుల ఈడీ అటాచ్ మెంట్ ను స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి రావెల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతోందని, జగన్ కరడుగట్టిన ఆర్థిక నేరస్తుడని, ఆయనకు చెందిన సంస్థలన్నింటినీ మూసివేయాలని రావెల అన్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం, పార్టీ మూసేయడం ఖాయమని అన్నారు.

ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయి : పారికర్

ఢిల్లీ: దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖమంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. జమ్ము కశ్మీర్‌లో దాడులు పెరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లోని పాంపోర్‌లో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడిలో 8 మంది భద్రతా సిబ్బంది అమరులైన నేపథ్యంలో పారికర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జూన్‌ 25 సాయంత్రం జరిగిన భీకర ఎదురు కాల్పుల పోరులో 24 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ వర్గాల తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది ఈ సమయానికి 34 మంది ఉగ్రవాదులు హతం కాగా..

గోవా సీఎంపై ఢిల్లీ సీఎం ఫైర్ ...

గోవా : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్‌పై మండిపడ్డారు. ఇవాళ గోవాలో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ మలవాంకర్ (లక్ష్మీకాంత్ పర్సేకర్ బావమరిది)ను సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

గణేష్ ఉత్సవ కమిటీతో టీ. సీఎస్ సమావేశం..

హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమావేశమయ్యారు. గణేశ్ విగ్రహాల ఎత్తు, కాలుష్యం తగ్గింపు, రంగుల వినియోగంపై సమావేశంలో చర్చించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విగ్రహాలు ఎత్తు ఉండాలని తెలిపారు. విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించకూడదని వెల్లడించారు. మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. విగ్రహాల తయారీకి సహాజసిద్ధమైన రంగులు వినియోగించాలని సూచించారు.

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ తో సదానంద భేటీ...

ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌తో కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు కోసం ఉద్యమం నడుస్తుండటంతో కేంద్రం దిగివచ్చింది. నిన్న తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై ఏం చేయలేమంటూ దాటవేసిన సదానందగౌడ ఈ రోజు సీజేఐతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

18:40 - June 29, 2016

అనంతపురం : సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. బాలకృష్ణ వాహనంలో హిందూపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా... కారుపై వేసిన పూలమాలలు వేయడంతో డ్రైవర్ కన్‌ ఫ్యూజన్‌ కు గురయ్యాడు. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఘటనలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అనంతరం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు వెళ్లిపోయారు. 

18:38 - June 29, 2016

హైదరాబాద్ : జగన్ కేసులో ఈడీ కొరడా ఝుళిపించింది. ఈ కేసులో రూ.  749 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక అటాచ్‌ చేసింది. ఇందులో బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ భవనంతో పాటు... బెంగళూరులోని కామర్స్‌ మంత్రి వాణిజ్య సముదాయాన్ని కూడా అటాచ్ చేసింది. వీటితో పాటు పలు కంపెనీల్లో జగన్‌, భారతీ షేర్లను అటాచ్‌ చేసింది. భారతి సిమెంట్స్‌ చార్జిషీట్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. 

జగన్ కేసులపై కొరడా ఝుళిపించిన ఈడీ ...

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ కేసులపై ఈడీ కొరఢా ఝుళిపించింది. ఈ క్రమంలో బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ భవనాన్ని కూడా ఈడీ అటాచ్ చేసింది. జగన్ కేసుల్లో రూ.749 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసింది. బెంగుళూరులోని కామర్స్ మంత్రి వాణిజ్ యసముదాయం...ఇలా పలు కంపెనీల్లో జగన్, భారతీ షేర్లను...భారతి సిమెంట్స్ చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిపింది. 

ట్రిపుల్ తలాక్ సీరియస్ : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ముస్లిం సంప్రదాయంలో వివాహ రద్దు (విడాకుల) కోసం ఆచరణలో ఉన్న తలాక్ (ట్రిపుల్ తలాక్) విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ, ముస్లిం పర్సనల్ లాబోర్డులో సంస్కరణలు కావాలంటూ ముస్లిం మహిళలు చేస్తున్న ఆన్ లైన్ పోరాటానికి ఫలితం దక్కేలా కనిపిస్తోంది. తలాక్ అనైతికం అంటూ ఆ విధానం రద్దు చేయాలని కోరుతూ 50,000 మంది ముస్లింలు సంతకాలు కూడా చేశారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ సందర్భంగా మీడియాను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది.

గడ్చిరోలిలో మావోయిస్టు హతం...

ఛత్తీస్ ఘఢ్ : కాంకేర్ జిల్లా గడ్చిరోలి అటవీప్రాంతంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. 

41 కు పెరిగిన ఇస్తాంబుల్ మృతుల సంఖ్య...

టర్కీ: టర్కీలోని ఇస్తాంబుల్‌ విమానాశ్రయ దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. 41 మంది మృతిచెందగా.. మరో 239 మంది గాయపడినట్లు ఇస్తాంబుల్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. మృతుల్లో 13 మంది విదేశీయులున్నారు. ఐదుగురు సౌదీ పౌరులు, ఇద్దరు ఇరాక్‌ వాసులు, చైనా, జోర్డాన్‌, ట్యునీషియా, ఉజ్బెకిస్థాన్‌, ఇరాన్‌, ఉక్రెయిన్‌ దేశాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ ఎయిర్‌పోర్టులో భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే. ముగ్గురు ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టులోకి చొరబడి.. కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు వారిని అడ్డుకునేలోపే తమను తాము పేల్చుకుని మరణించారు.

6 నెలల్లో 74 పులులు మృతి...

ఢిల్లీ: భారతదేశంలో పులుల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2016 సంవత్సరం జనవరి 1 నుంచి జూన్‌ 26 వరకు దాదాపు 74 పులులు మరణించాయి. దేశంలోని వివిధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో స్వచ్ఛంద సంస్థలు సేకరించిన గణాంకాల ప్రకారం వేటగాళ్ల చేతిలో పులులు అధికంగా మరణించాయి. వీటిలో 14 పులులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుదాఘాతం, విషాహారం వల్ల ప్రాణాలు కోల్పోయాయి. భారతీయ వన్య సంరక్షణ సొసైటీ అందించిన వివరాల ప్రకారం ఇదే సమయంలో 16 పులుల చర్మం, ఎముకలు, పంజాలు, అస్థిపంజరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య...

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హరికీర్తన ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమంటూ పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

17:55 - June 29, 2016

మెదక్ : ఏటా రెండు పంటలు.. వరుణుడు కరుణిస్తే మూడో పంట కూడా వేసే రైతులు.. అచ్చంగా కోనసీమను పోలిన గ్రామం...! మెదక్‌ జిల్లాలోని పల్లెపహాడ్‌ను దర్శించిన వారు ఎవరైనా ఇలాగే వర్ణిస్తారు. కానీ అంతటి పచ్చందనాల గ్రామం.. పొలాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కింద ఈ గ్రామం కూడా ముంపునకు గురవుతోంది. ప్రాజెక్ట్‌ కట్టితీరతామన్న ప్రభుత్వ ప్రకటనలతో తమ బతుకులు ఏమవుతాయోనని కలత చెందుతోన్న పల్లెపహాడ్‌ రైతుల వెతలపై 10TV స్పెషల్‌ స్టోరీ.
జలకళతో ఉట్టిపడే పల్లె చెరువు....
మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం పల్లెపహాడ్‌ . పచ్చని పొలాలతో కోనసీమను తలపించే పల్లెసీమ నిత్యం జలకళతో ఉట్టిపడే పల్లె చెరువు.. కొద్దిపాటి శ్రమకే ఉబికి వచ్చే భూగర్భ జలాలతో కరవు, అన్నదాతల ఆత్మహత్యలు అన్నవి ఎరుగని పల్లె... ఈ పల్లెపహాడ్‌..!

ప్రజల జీవితాల్లో మొదలైన కల్లోలం...
సంబరంగా సాగే పల్లెపహాడ్‌ ప్రజల జీవితాల్లో ఇప్పుడు కల్లోలం మొదలైంది. ముఖ్యంగా గడచిన రెండు నెలలుగా వీరిలో అంతులేని అలజడి నెలకొంది. మల్లన్నసాగర్‌ ముంపుతో వందలాది ఎకరాల సారవంతమైన భూములు, తాతలు, తండ్రులు కట్టించిన ఇళ్లు ముంపుకు గురయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రాజెక్ట్‌ కోసం ఉన్న ఊరిను, పంట పొలాలను వదిలివెళ్లాలని అధికారులు, పాలకులు చేస్తున్న ప్రకటనలతో వీరు ఆందోళన చెందుతున్నారు. ఉన్నఇల్లు, నమ్ముకున్న పొలం లేకుండా బతికేదెలా అంటూ గొల్లుమంటున్నారు. మంచి చెరువులతో బహుళపంటలు పండించుకునే తమకు మల్లన్నసాగర్‌ అవసరంలేదంటున్నారు. ప్రాజెక్ట్‌ విషయంలో ప్రభుత్వం పంతానికి పోవడాన్నిపల్లెపహాడ్‌ వాసులు తప్పుపుడుతున్నారు.

మంత్రి మాటలపై నమ్మకం లేదంటున్న పల్లెవాసులు...
ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించని పల్లెపహాడ్‌ వాసులు.. తమ మానాన తమను బతకనిస్తే చాలంటున్నారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఇస్తున్న హామీలపై తమకు నమ్మకంలేదంటున్నారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న తమ నుంచి మల్లన్నసాగర్‌ కోసం భూమి లాక్కుంటే భుక్తి గడవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పల్లెపహాడ్‌ వాసుల విన్నపంపై సర్కార్ ఏం చేస్తుందో ?...
ప్రభుత్వం మొండిపట్టుదలకు పోకుండా మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ విషయంలో పునరాలోచనలో చేయడమో ... లేక ప్రత్యామ్నాలను పరిశీలించడమో చేయాలంటున్న పల్లెపహాడ్‌ వాసుల విన్నపంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తూందో చూడాలి. 

17:47 - June 29, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో మార్పులు జరగడం దాదాపు ఖాయమని తేలింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై కాసేపట్లో.. మోడీతో అరుణ్ జైట్లీ, అమిత్ షా.. భేటీ కానున్నారు. రేపు పార్లమెంటులో మోదీ అధ్యక్షతన కేంద్రం మంత్రిమండలి సమావేశం కానుంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల లోపు కేబినెట్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

17:45 - June 29, 2016

హైదరాబాద్  :  టీచర్ల ఎంపిక బాధ్యతలను టీఎస్ పీఎస్ సీ కి అప్పగించామని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రేషనలైజేషన్‌ పూర్తయ్యాకే కొత్త టీచర్ల నియామకం జరుగుతుందని స్పష్టం చేశారు.. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా 9వేల 335మంది విద్యావాలంటీర్ల నియామకానికి అనుమతులిచ్చామన్నారు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు నోటీసులిచ్చినట్టు మంత్రి తెలిపారు.

బాలయ్య కారుకు ప్రమాదం...

అనంతపురం: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హిందూపురం నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా ధ్వంసమైందని తెలిసింది. అయితే ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

17:33 - June 29, 2016

విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఏపీ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ప్రైవేట్‌ స్కూల్స్‌కు ధీటుగా నిలబడేలా మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు గుర్తించేలా సమగ్ర

సర్కారు పాఠశాలల్లో ప్రమాణాల పెంచేందుకు ప్రభుత్వం దృష్టి ..
నవ్యాంధ్ర రాజధానిలో పాఠశాల విద్యపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి ప్రయోగం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మూడు జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కోజిల్లా నుంచి మూడు పాఠశాలలను ఎంపిక చేసుకొని ఆ పాఠశాలల్లోని విద్యార్థులకు రాత పరీక్ష, మౌఖిక ప్రశ్నలతో విద్యా ప్రమాణాలను గుర్తించనున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల ఆధారంగా గ్రేడ్ లు కూడా ఇవ్వనున్నారు. దీనిద్వారా భవిష్యత్తులో విద్యా ప్రమాణాల మార్పులు, పరీక్షా విధానాలు, ఇతర అంశాలపై దృష్టిసారించడంతోపాటు సమూల మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మొత్తం 27 పాఠశాలల్లోని విద్యార్ధులకు పరీక్షలు...
మొదటిదశలో గుంటూరు, అనంతపురం, విజయనగరం జిల్లాలలోని పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 27 పాఠశాలలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కుల్లో ఆ విద్యార్థికి వచ్చే మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఉంటాయి. ఈ గ్రేడ్ల ఆధారంగా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, వారిలోని సృజనాత్మకత ఏ విధంగా ఉందనే అంశాలను అంచనా వేస్తారు. వీటితోపాటే కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. ఈ పరీక్ష కేవలం 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

తల్లిదండ్రులు హర్షం వ్యక్తం....
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నంపై విద్యార్ధుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటి అమలులో జాప్యం జరగకుండా చూడాలని కోరుతున్నారు. 

17:28 - June 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ కోసం క్షేత్ర స్ధాయిలో పనిచేస్తున్న కమ్యూనిటీ కార్యకర్తలు రోడ్డెక్కారు. 12 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్రం వేతనాలు మంజూరు చేసినా రాష్ట్రం తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రాజెక్టు పీడీ స్పందిస్తూ ఈ సంవత్సరానికి మూడు నెలల వేతనాలు చెల్లిస్తామన్నారు. గత సంవత్సరం బకాయిలు... ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

అన్ని ఉగ్రవాద సంస్థలు ఒకే తాటిపైకి వచ్చాయా ?

హైదరాబాద్ : అన్ని ఉగ్రవాద సంస్థలు ఒకే తాటిపైకి వచ్చినట్లు ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఐఎస్ఐ, ఇండియన్ ముజాహిదిన్, ఆల్ ఖైదాలపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. 11 మంది అనుమానితులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. భారీ విధ్వంసాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు, ఆరు నెలలుగా సోషల్ నెట్ వర్క్ కు దూరంగా ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు.

కొత్త జిల్లాలపై 90 శాతం ఏకాభిప్రాయం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. జిల్లాల వారీగా నివేదికలను ఎంపీ కేకేకు జిల్లాల ఇన్ ఛార్జీ మంత్రులు అందించారు. కొత్త జిల్లాలపై 90 శాతం ఏకాభిప్రాయం కుదిరింది. వరంగల్ జిల్లాలో కొత్తగా జయశంకర్ జిల్లా, ఆదిలాబాద్ లో కొమురం భీం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల నివేదికలను సీఎం కేసీఆర్ కు కేకే అందచేయనున్నారు. నివేదికల ఆధారంగా అఖిలపక్ష సమావేశంలో పార్టీ వైఖరిని వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు.

17:25 - June 29, 2016

హైదరాబాద్ : నగరంలో పేలుళ్ళ కుట్రపై ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. భారత్ లో పేలుళ్లు జరిపేందుకు బలమైన ఉగ్రవాద సంస్థలు ఏక తాటిపైకి వచ్చినట్లుగా ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంలో విచారణలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ పేలుళ్ళ కుట్రపై ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం అరెస్ట్ చేసిన ఉగ్రవాదులను అధికారులు విచారిస్తున్నారు. భారీ విధ్వంసం కోసం బాండులు తయారు చేయాలని ఉగ్రవాదులు కార్యకలాపాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు రాకుండా వారు ఆరు నెలలుగా సోషల్ నెట్ వర్క్ కు దూరంగా వున్నట్లుగా విచారణలో బైటపడింది. భారత్ లో పేలుళ్ళ జరిపేందుకు ఇండియన్ ముజాహిద్ధీన్,ఐసిస్, ఐఎస్ఐ వంటి పలు బలమైన ఉగ్రవాద సంస్థలు ఏకమైనట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా రానున్న బోనాలు, గణేష్ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఉగ్రసంస్థలు పేలుళ్ళను టార్గెట్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

17:06 - June 29, 2016

చెన్నై : రెండేళ్ల క్రితం ప్రమాదం జరిగినా ఇంతవరకు బాధితులకు సాయమే అందలేదు. హామీలు ఇచ్చిన పాలకులు చేతులు దులుపుకున్నారు. పొట్ట చేత పట్టుకుని చెన్నైకు వెళ్లి.. అయినవాళ్లను పోగొట్టుకున్న కుటుంబాలు రోడ్డునపడ్డాయి. బిల్డర్లు, బడా కాంట్రాక్టర్లను ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి. మరి బజారున పడిన బతుకులకు ప్రభుత్వాలు ఏమైనా సాయం చేశాయా? వారి బతుకులకు ఎంతవరకు భరోసా లభించింది ? మౌళీవాక్కం భవనం కూలి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన ఘోరం.. కూలిన 11 అంతస్తుల భవనం..
చెన్నైలోని మౌలివాక్కంలో రెండేళ్ల క్రితం ఘోర ప్రమాదం జరిగింది. 11 అంతస్తుల భవనం కుప్పకూలడంతో 61 మంది కూలీలు సజీవసమాధి అయ్యారు. అప్పుడు కేవలం నామమాత్రం సాయం చేసిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తర్వాత వారిని పట్టించుకోలేదు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

ప్రభుత్వం నుంచి సాయం అందక ఇబ్బందులు పడుతున్న బాధితులు..
మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సరైన సాయం అందకపోవడంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద సమయంలో సాయం చేస్తామని హామీలు ఇచ్చినా.. అవి నెరవేరలేదంటున్నారు బాధిత కుటుంబాలు. పొట్టకూటి కోసం ప్రాంతం కాని ప్రాంతం వచ్చి ఉన్నవారిని పోగొట్టుకొని ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచారణకు ఆదేశించిన తమిళనాడు సర్కార్‌..
ఇక ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన తమిళనాడు సర్కార్‌.. నివేదిక వచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నాణ్యతాలోపం వల్లే భవనం కూలిందని.. దీనికితోడు అధికారుల నిర్లక్ష్యమే కారణమని జస్టిస్‌ రఘుపతి నివేదికలో పేర్కొన్నారు. అయినా భవన యజమానులపై అధికారులు చర‌్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.

అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పలు భవనాలు...
ఇదిలావుంటే.. ఇంకా నగరంలో అనుమతులు లేకుండా.. ఇష్టారీతిన అనేక భవంతులు వెలుస్తూనే ఉన్నాయి. దీనికి అధికారుల అలసత్వమే కారణమని పలువురంటున్నారు. మరోవైపు కూలీ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కూలీలు చెన్నైకు వలస వస్తూనే ఉన్నారు. చెన్నైలో దాదాపు 2 లక్షల మంది ఆంధ్ర కూలీలు బతుకీడుస్తున్నట్లు లెక్కలున్నాయి. పొట్టకూటి కోసం ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి ఇబ్బందులు పడుతున్నా.. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పట్టించుకునే నాదుడే లేడని కూలీలు వాపోతున్నారు. 

17:06 - June 29, 2016

హ్యాపీ బర్త్ డేలు..మనుషులు చేసుకుంటారు కానీ..చెట్లకు ఉండడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? ఎందుకు చేయరాదా ? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చెట్ల వళ్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్న విషయం అందరికీ తెలిసిందే. దగ్గర దగ్గరగా పెంచిన చెట్లు శబ్ద కాలుష్యాన్ని బాగా తగ్గిస్తాయి. 30 నుండి 40 అడుగులు ఎత్తు కలిగిన వృక్షాలు,100 అడుగుల విస్తీర్ణంలో ఉన్నప్పుడు అవి తమ ద్వారా ప్రయాణించే శబ్దాన్ని సగానికి సగం వరకు తగ్గిస్తాయంట. అన్ని విషయాలు తెలిసినా చెట్లను పెంచడానికి కొంతమంది ఆసక్తి చూపరు. కొందరికి వెసులు ఉండదు. కానీ భోపాల్ మాత్రం పురాతన చెట్లకు బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22లోకి అడుగు పెట్టిన ఓ 'వేప' చెట్టుకు బర్త్ డే నిర్వహించారు. గత 21 సంవత్సరాలుగా వేప చెట్టుకు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని భోపాల్ లోని ఆదర్శ్ మార్కెట్ కు చెందిన వ్యాపారి సుదీర్ కుమార్ పాండ్యా జైన్ వెల్లడించారు. ఈ చెట్టును స్థానికులు అందంగా అలంకరించారు. హ్యాపీ బర్త్ డే అంటూ బ్యానర్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరైతే వేడుకల్లో భాగంగా స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఇంకొందరు డ్రమ్స్ వాయిస్తూ వేడుకకు ఊపు తెచ్చారు. స్థానికులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.

16:52 - June 29, 2016

హైదరాబాద్ : 11 మంది జడ్జీల సస్పెన్షన్ వియంలో ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకునేలా చొరవచూపాలని న్యాయశాఖమంత్రిని కోరామన్నారు షబ్బీర్ అలీ. 11 మంది జ్యూడిషియల్ ఆఫీసర్‌ లను సస్పెండ్ చేసిన విషయం.. తమ దృష్టికి వచ్చిందని కేంద్రన్యాయశాఖమంత్రి సదానందగౌడ చెప్పారని ఎమ్మెల్సీషబ్బీర్ అలీ తెలిపారు. ఇరురాష్ట్రాల న్యాయశాఖనిపుణులు కమిటీ వేసుకోవాలని.. కాని ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం కరెక్ట్ కాదని అన్నారని షబ్బీర్ తెలిపారు. 

16:48 - June 29, 2016

హైదరాబాద్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని... టీ.టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయవాదుల పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు. ఏ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులను అదే రాష్ట్రానికి పంపాలని సూచించారు. తెలంగాణకు చెందిన వారినే ఇక్కడ నియమించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

16:42 - June 29, 2016

గుంటూరు : అమరావతి చరిత్రలోనే ఇది అపూర్వ ఘట్టం. ఏపీ ఉద్యోగులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఉద్విగ్నభరిత క్షణాలు రానే వచ్చాయి. వెలగపూడిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక సచివాలయం కాసేపటి క్రితమే వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి నాలుగు శాఖలకు చెందిన దాదాపు 200మంది ఏపీ ఉద్యోగులు తాత్కాలిక సచివాలయంలోకి సరిగ్గా మధ్యాహ్నం 2.59 నిమిషాలకు ప్రవేశించారు. ఇరిగేషన్, పంచాయితీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గృహనిర్మాణ శాఖలకు చెందిన ఉద్యోగులు సచివాలయంలోకి ప్రవేశించారు. వీరికి ఏపీ సీఎస్‌ టక్కర్‌ ఘనస్వాగతం పలుకగా చిరునవ్వుతో కార్యాలయంలోకి ప్రవేశించారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాక్ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైంది. మంత్రి అయ్యన్నపాత్రుడు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్‌ కట్‌చేసి ఐదో బ్లాక్‌లో నిర్మించిన ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ టక్కర్‌, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పలు శాఖల సెక్రటరీలు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

ఐదో బ్లాక్‌ని ప్రారంభించిన మంత్రులు ...
మంత్రి అయ్యన్నపాత్రుడితో పాటు మరో మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని కూడా ఐదో బ్లాక్‌లోని తన కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి కార్యాలయంలోకి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించగానే మంత్రికి ఆశాఖ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొన్ని కీలక ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. ఉద్యోగులు, మంత్రుల రాకతో వెలగపూడిలో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగులు ఉద్విగ్నభరితంగా, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన క్షణాలు రావడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో ఇవాల్టి నుంచి ఏపీ పాలన వెలగపూడి నుంచే మొదలు కానుంది. ఏపీ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయమని మంత్రులు, ఉద్యోగులు అంటున్నారు. 

16:39 - June 29, 2016

టాలీవుడ్ లో తన ఇమేజ్ కు భిన్నంగా వ్యవహరిస్తున్న నటుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎందుకంటే ఆయన వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ చిత్రంలో నటిస్తున్నారు. వెంకటేష్, నయనతార జంటగా మారుతీ దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ చిత్ర ఆడియోను జులై 9వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మారుతి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియచేశారు. సినిమా మొత్తం బాగా వచ్చిందని..ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని వెల్లడించారు. సితారం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. జులై నెలలో 'బాబు బంగారం' చిత్రం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోందంట. మరి ఈ సినిమాలో వెంకటేష్ ఎలా నటించారో..ఆయన పాత్రకు అభిమానులు ఎలా స్పందన వ్యక్తం చేస్తారనేది చూడాలి.

16:37 - June 29, 2016

నాగార్జున..టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన ఈ నటుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఈయన 'అమల'ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇతని కుమారులైన 'నాగ చైతన్య', 'అఖిల్' లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య - సమంతలు ప్రేమించుకున్నట్లు..వీరి వివాహం త్వరలో జరగబోతున్నట్లు ఈ మధ్య విపరీతమైన ప్రచారం జరింది. చైతు బాటలోనే అఖిల్ కూడా వెళ్లినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫ్యామిలీ ఫ్రెండ్ తో ప్రేమలో అఖిల్ ఉన్నట్లు, వీరి వివాహం కూడా త్వరలోనే జరగబోతున్నట్లు తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వస్తున్న కామెంట్లపై 'నాగార్జున' స్పందించారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు. 'చైతూ తన మనసుకు నచ్చిన అమ్మాయిని వెతుకున్నందుకు తాను..అమల చాలా హ్యాపీగా ఉన్నాం' అని చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక అఖిల్ ప్రేమ విషయంలో నాగ్ ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 'అఖిల్ కూడా ఓ అమ్మాయి చూసుకున్నాడు.. కానీ వారిద్దరికీ ఎంగేజ్ మెంట్ అని వస్తున్న వార్తలు అబద్ధం' అని కొట్టిపారేశాడు. ఇద్దరూ కెరీర్ లో బిజీగా ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ఆ 'ముచ్చట' చేసేస్తామని స్పష్టం చేశారు.

జంపన్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్..

వరంగల్ : గోవిందారవు పేట వద్ద జంపన్ వాగులో ఆర్టీసీ బస్ చిక్కుకుంది. బస్సులో 50మంది ప్రయాణీకులున్నట్లు సమాచారం. 

సీఐటీయూ ఏపీ అధ్యక్షుడిగా సీ.హెచ్. నర్సింగరావు..

విజయవాడ : సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. 149 మందితో సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా సీ.హెచ్. నర్సింగరావు, ప్రధాన కార్యదర్శిగా గఫూర్, ఉపాధ్యక్షులుగా పుణ్యవతితో పాటు 9మంది ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా 8మంది ఎన్నికయ్యారు. పలు తీర్మానాలకు రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపింది.

భూ నిర్వాసితుల కమిటీ ఎన్నిక..

హైదరాబాద్ : భూ నిర్వాసితుల రాష్ట్ర సదస్సు కొద్దిసేపటి క్రితం ముగిసింది. 51 మందితో భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఎన్నికైంది. కన్వీనర్ గా బి.వెంకట్ నియమితులయ్యారు. నిర్వాసితుల సమస్యలపై మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. జులై 4న దొడ్డి కొమరయ్య వర్ధంతిని నిర్వాసితుల దినంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అసహనం..

ఢిల్లీ : ఏడో వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జులై 11న దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూల వేతనంలో 16 శాతం పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. 2016 జనవరి 1 నుండి వేతన సవరణ పెంపుదల వర్తించనుంది. కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

 

 

తిరుమల వరహస్వామి వద్ద యువకుడి వీరంగం..

చిత్తూరు : తిరుమల వరహస్వామి అతిథి గృహం వద్ద యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో భక్తులు..స్థానికులపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అభివృద్ధి పేరిట విధ్వసం - ప్రొ.హరగోపాల్..

హైదరాబాద్ : అభివృద్ధి పేరిట విధ్వసం జరుగుతోందని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో భూములు, ఉపాధి కోల్పోవడం అవసరమా ? ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల ప్రయోజనాలు ముఖ్యమా..ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నిర్వాసితుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఐదు లక్షల ఎకరాల భూమిని లాక్కొంటున్నారు - తమ్మినేని..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల భూమిని అక్రమంగా లాక్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. భూములు కాపాడటానికి ప్రజల తరపున పోరాడుతామని, గత ప్రభుత్వ విధానాలే కేసీఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రయోజనాల కోసం చేపట్టే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, కాంట్రాక్టుర్ల జేబులు నింపే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకమన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

 

16:00 - June 29, 2016

బాలీవుడ్ కండల వీరుడు తరచూ ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటున్నాడు. ఇటీవలే 'సుల్తాన్' షూటింగ్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి కూడా. క్షమాపణలు చెప్పాలంటూ ఏకంగా మహిళా కమిషన్లు నోటీసులు పంపాయి. తాజాగా ఈ వివాదంపై సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ 'లులియా' స్పందించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉండాల్సి కాదని..ఇలాంటి విషయాలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచనలు చేసిందని టాక్. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో పేరు..ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించిదంట. సల్మాన్ ఖాన్..వంతుర్ లులియాలు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లులియా అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వస్తున్న కథనాలపై ప్రాధాన్యతన ఏర్పడింది.

బాలుడి ఊపిరి తీసిన ప్లాస్టిక్ కవర్ ..

హైదరాబాద్ : ఓ ప్లాస్టిక్ కవర్ బాలుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. శ్రీయాన్(4) అనే బాలుడు ప్లాస్టిక్ కవర్ తలకు తగిలించుకుని ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్ మెడకు చుట్టుకుని ఊపిరి ఆడక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

15:54 - June 29, 2016

హైదరాబాద్ : ఓ ప్లాస్టిక్ కవర్ బాలుడి ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. శ్రీయాన్(4) అనే బాలుడు ప్లాస్టిక్ కవర్ తలకు తగిలించుకుని ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్ మెడకు చుట్టుకుని ఊపిరి ఆడక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

15:52 - June 29, 2016

వరంగల్ : ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్ వర్కర్స్ ఆసుపత్రుల ప్రతినిధి ప్రవీణ్‌ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ లో ఇండియన్ మెడికల్ హాల్ లో సమావేశం అయ్యారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ లను పరిష్కరించే వరకు సేవలు అందంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

15:48 - June 29, 2016

హైదరాబాద్ : అన్ని ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మరోసారి స్పష్టం చేశారు. కొన్ని ప్రాజెక్టులు, వాటి రిడిజైనింగ్‌లను తాము తప్పుబడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాల్ని నిరూపించడానికి తాము సిద్ధమని సర్కారుకు సవాల్‌ విసిరారు.. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో భూనిర్వాసితుల సదస్సు జరిగింది.. ఈ కార్యక్రమానికి తమ్మినేనితో పాటు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు.. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ఉద్యమిస్తామన్నారు.

తిరుమలలో యువకుడి వీరంగం...

తిరుమల : వరాహస్వామి అతిథి గృహం వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంజాయి మత్తులో భక్తులు, స్థానికులపై రాళ్ళతో దాడి చేశాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

హై స్కూల్ లో స్వీపర్, క్లీనర్ ఉండేలా చర్యలు - కడియం..

హైదరాబాద్ : ప్రతి హై స్కూల్ లో ఒక స్వీపర్, ఒక క్లీనర్ ఉండేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగిందని, 9335 మంది విద్యావాలంటీర్ల నియామకాలకు టీచర్ల ఎంపిక బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించడం జరిగిందన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త టీచర్ల రిక్రూట్ మెంట్ ఉంటుందని, త్వరలో 3500 ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు.

15:38 - June 29, 2016

హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో 5గురు ఉగ్రవాదులను ఎన్ ఐఏ అధికారులు హాజరుపరిచారు. నగరంలో ఎన్ ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలోనే నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్ ఐఏ హాజరుపరిచింది. స్థానిక పోలీసులు సహకారంతో 12 ప్రాంతాలల్లో ఎన్ ఐఏ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వారిలో ఇలియాస్, ఇబ్రహీం, అబీబ్, ఇర్ఫాన్, అబ్దుల్లా అనే ఉగ్రవాదులను నాపంల్లి కోర్టులో హాజరుపరిచారు. మిగతా అరుగురి నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారు. కోర్టు సూచన మేరకు ఎన్ ఐ ఏ కార్యాలయానికి తరలించే అవకాశమున్నట్లు సమాచారం. పాతబస్తీలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పాతబస్తీలోని అనుమానితులపై పోలీసులు నిఘా వేసి వారి కదలికల పట్ట నట్లు సమాచారం. కాగా నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఫైరింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో పేలుళ్లు, మతకల్లోలాల ద్వారా ఉగ్రవాదులు అలజడికి యత్నించారని ఆయన చెప్పారు. విదేశీ నిఘా బృందాల నుంచి కేంద్రానికి అందిన కీలకసమాచారంతో తాము ఉగ్రవాదులను పట్టుకున్న విషయం తెలిసిందే.

గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్టు తదితర అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.

హైకోర్టు విభజన చేయకపోవడం బాధాకరం - షబ్బీర్..

హైదరాబాద్ : రెండేళ్లయినా హైకోర్టు విభజన చేయకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. కేంద్రంపై కేసీఆర్‌ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు.

ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం - లోకేష్..

విజయవాడ : ముస్లిం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో పంజా సెంటర్‌లో నిర్వహించిన రంజాన్‌ తోఫా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. గత పాలకులు ఇచ్చిన హామీలు నెరేవర్చలేదని విమర్శించారు.

ఉగ్రవాదులను కోర్టులో హజరుపరిచిన ఎన్ఐఏ..

హైదరాబాద్ : నగరంలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఐదుగురు ఉగ్రవాదులను కోర్టులో హజరు పరిచారు. మరో ఆరుగురు వ్యక్తుల వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు.

కోర్టులో ఐదుగురు ఉగ్రవాదులను హాజరుపరిచిన ఎన్ ఐఏ ...

హైదరాబాద్ : నగరంలో ఎన్ ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్ ఐఏ హాజరుపరిచింది.

గ్రూప్-1 వేరుగానే నిర్వహించాలి: సుప్రీంకోర్టు

ఢిల్లీ: గ్రూప్-1 పరీక్షను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు పాత సిలబస్‌ ప్రకారం తెలంగాణ పరీక్షలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అలాగే పరీక్షల ప్రక్రియను 3నెలల్లో పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అమరావతిలో అనవసర ఆర్భాటం : వైసీపీ శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అనవసర ఆర్భాటం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 200 ఏళ్ల పాలించిన బ్రిటీష్‌వాళ్లు కూడా ఇలా చేయలేదన్నారు. తాత్కాలిక సచివాలయాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించిన శ్రీకాంత్‌రెడ్డి దివాళా తీసిన కంపెనీకి రాజధాని నిర్మాణ బాధ్యతలా అని నిలదీశారు.

ఆత్మాహుతి దాడి నుంచి తృటిలో తప్పించుకున్ హృతిక్...

టర్కీ: ఆత్మాహుతి దాడి నుంచి తృటిలో తప్పించుకోగలిగారు బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్, అతని ఇద్దరు కుమారులు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 36 మంది మృతి చెందగా వంద మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హృతిక్ రోషన్ ఇండియాకు బయల్దేరిన కొద్దిసేపటిలోనే అక్కడ ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే తమ క్షేమ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు హృతిక్ రోషన్. దాడి విషయం తెలిసి చాలా షాక్‌కు గురయ్యానని అన్నాడు.

రాజధాని తరలింపు పేరిట హడావుడి - ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి...

హైదరాబాద్ : రాజధాని తరలింపు పేరిట ప్రభుత్వం హడావుడి చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల రాజధాని కావాలిఆ..కార్పొరేట్ సంస్థల రాజధాని కాదని, అన్ని కార్యాలయాలను తరలిస్తున్న చంద్రబాబు హైకోర్టును ఎందుకు తరలించరని ప్రశ్నించారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని, కేంద్రానికి చంద్రబాబు లేఖ రాస్తే హైకోర్టుకు సీమ వస్తుందన్నారు.

వైసీపీ కోరిక నెరవేరదు : పరిటాల సునీత

చిత్తూరు : అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రెడ్డిపై ఎన్నిసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టినా ప్రతిపక్షం వైసీపీ కోరిక నెరవేరదని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో కరువుదీరా వర్షాలు పడుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని ఆమె చెప్పారు. పార్టీలకు అతీతంగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. 

ఏపీలో ఒప్పొ పెట్టుబడులు : చంద్రబాబు..

చైనా : ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పొ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని, 25వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఒప్పో హామీ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. జులైలో ఏపీలో పర్యటించి భూములు ఎంపిక చేసుకోవాలని ఒప్పొ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. చైనాలో అతిపెద్ద డేటా సెంటర్‌ చైనా యూనికామ్‌ను సందర్శించిన చంద్రబాబు దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్స్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ను చంద్రబాబు పరిశీలించి వారితో మాట్లాడారు.

ప్రధాని మోదీపై కేసు నమోదు...

బీహార్ : భారత ప్రధాని నరేంద్ర మోదీపై బిహార్‌లో కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌ జిల్లా చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్‌ 21 రోజున మోదీ యోగా చేస్తూ జాతీయపతాకాన్ని అవమానించారని, కేవలం ఒక వస్త్రం ముక్కగా పరిగణించి దానిపై కూర్చున్నారని, దానితో చేతులు, మొహం తుడుచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలతో పతాకాన్నే కాక లక్షలాది ప్రజల మనోభావాలను కించపరిచారంటూ పోఖ్‌రైరా గ్రామానికి చెందిన ప్రకాశ్‌ కుమార్‌ అనే వ్యక్తి పిటిషన్‌లో పేర్కొన్నాడు.

గవర్నర్ తో కొనసాగుతున్న కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్టు తదితర అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.

14:58 - June 29, 2016

రోడ్డుపై వెళుతూ కావాలనే వాహనం హారన్ మోగించారా ? అయితే మీ జేబుకు చిల్లు పడినట్లే. ఎందుకంటే త్వరలోనే కొత్త చట్టం రాబోతుందంట. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిసిందని కథనాలు వస్తున్నాయి. రోజుకు రోజుకు జనాలు పెరుగుతున్నట్లుగానే వాహనాల సంఖ్య కూడా అధికమౌతున్నాయి. నగర కూడళ్లలో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. దీనితో ముందుకు వెళ్లాలంటే హారన్ కొడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉత్నన్నమౌతోంది. ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాల్సిన సందర్భంలో హెడ్లైట్ ఫ్లాష్ చేయడం..లేదా చిన్నగా హారన్ కొడితే తప్పు లేదు కానీ అదే పనిగా హారన్ కొడితే మాత్రం జరిమాన తప్పదంట. సుమారు రూ. 500 నుండి రూ. 5వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మోటార్ వాహన చట్టానికి సవరణలు చేయాలని, వచ్చే వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది. మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే డీలర్లు..గ్యారేజీ యజమానులకు కూడా జరిమాన విధించే అవకాశం ఉందని టాక్. సైలంట్ జోన్లు..ఆసుపత్రులు..స్కూళ్లు తదితర ప్రాంతాల్లో హారన్ కొట్టరాదన్న బోర్డులు ఉండే ప్రాంతాల్లో తొలుత ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుందంట. జూలై 18 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేస్తారా ? లేదా ? అనేది వేచి చూడాలి.

14:55 - June 29, 2016

వరకట్నం, మరణాలు, వేధింపులు వంటి వివిధ అంశాలపై అడ్వకేట్ పార్వతి గారు ఈరోజు మన మై రైట్ ఈరోజు మనముందుకు వచ్చేసింది. వివాహానంతరం మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతుంటారు. వాటిలో ప్రధానమైనది వరకట్నం వేధింపులు, వరకట్న మరణాలు, గృహహింస వంటివి..ఈ రకమైన బాధలు అనుభవించే మహిళలను న్యాయ సలహాలు సూచనలు తెలపటానికి అడ్వకేట్ పార్వతి గారు సిద్ధంగా వున్నారు. మరి అడ్వకేట్ పార్వతిగా ఎటువంటి సలహాలు, సూచనలు అందించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత న్యాయ సలహాలను, సూచలను తెలుసుకోండి....

తాత్కాలిక సచివాలయం ప్రారంభం..

విజయవాడ : తాత్కాలిక సచివాలయం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం మంత్రి అయ్యన్న పాత్రుడు సచివాలయాన్ని ప్రారంభించారు. ఏపీ ఉద్యోగులు సచివాలయానికి చేరుకున్నారు.

14:41 - June 29, 2016

యంగ్ హీరో నాని కేరీర్ ఇప్పుడు బ్రేకుల్లేని బైక్‌లో సూప‌ర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. గ‌తేడాది వ‌చ్చిన ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, ఈ యేడాది ఆరంభంలో వ‌చ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జెంటిల్‌మ‌న్ సినిమాతో మ‌రో థ్రిల్ల‌ర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం నాని 'ఉయ్యాల జంపాల' ఫేం విరించి వర్మ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడంట. ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని, ఈ చిత్రంతో రీల్ లైఫ్‌లోనూ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. దీనికి 'మజ్ను' పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

14:41 - June 29, 2016

హైదరాబాద్ : పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే న్యాయాధికారులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఏపీ పునర్వభజన చట్టం ప్రకారం ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి కేటాయించాలే తప్ప ఆప్షన్ల విధానం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఆంధ్ర ప్రాంత న్యాయాధికారులు ఆప్షన్ల ద్వారా తెలంగాణను కోరుకోవడం వల్ల భవిష్యత్తులో తెలంగాణ న్యాయాధికారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. 

వాట్సప్ ను నిషేధానికి సుప్రీం నిరాకరణ..

ఢిల్లీ : యాప్ వాట్సాప్ నిషేధం విధించాలంటూ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై కేంద్రాన్ని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్ ల ద్వారా నేరాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే నిషేధించాలని హర్యాణకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

 

 

14:34 - June 29, 2016

చిత్తూరు : అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రెడ్డిపై ఎన్నిసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టినా ప్రతిపక్షం వైసీపీ కోరిక నెరవేరదని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో కరువుదీరా వర్షాలు పడుతున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని ఆమె చెప్పారు. పార్టీలకు అతీతంగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. 

14:31 - June 29, 2016

చైనా : ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పొ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని, 25వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఒప్పో హామీ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. జులైలో ఏపీలో పర్యటించి భూములు ఎంపిక చేసుకోవాలని ఒప్పొ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. చైనాలో అతిపెద్ద డేటా సెంటర్‌ చైనా యూనికామ్‌ను సందర్శించిన చంద్రబాబు దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్స్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ను చంద్రబాబు పరిశీలించి వారితో మాట్లాడారు.

చైనాలో చంద్రబాబు నాలుగోరోజు పర్యటన ...
ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నాలుగో రోజు సాగుతోంది. ఏపీని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని గుయాంగ్‌ ప్రావిన్స్‌ వైస్‌ గవర్నర్‌ను చంద్రబాబు కోరారు.. నీరు-చెట్టు విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్నామని తెలిపారు.పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనంతరం ఒప్పొ మొబైల్‌ ఉత్పత్తుల కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌..ఎండీ, ప్లానింగ్‌ డైరెక్టర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. హార్డ్‌వేర్‌కు ఎంతో డిమాండ్‌ ఉందని, పాలనలో ఐటీ వినియోగంలో తాము ముందున్నామని చంద్రబాబు వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, 21 రోజుల్లో సింగిల్‌ డెస్క్‌ ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. 

 

14:27 - June 29, 2016

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఈరోజు నుంచి కార్యకలాపాలు మొదలు కానున్నాయి. హైదరాబాద్ నుంచి నాలుగు శాఖలకు చెందిన దాదాపు 200మంది ఉద్యోగులు సచివాలయానికి తరలివెళ్లారు. ఇరిగేషన్, పంచాయితీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గృహనిర్మాణ శాఖలకు చెందిన ఉద్యోగులు వెలగపూడికి బయలుదేరారు. మధ్యాహ్నం 2:59 గంటలకు ఐదో బ్లాక్ ప్రారంభంకానుంది. మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్యాహ్నం 2:59 గంటలకు తాత్కాలిక సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యాలయాలను మంత్రి మృణాళిని ప్రారంభించనున్నారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..

జమ్మూ కాశ్మీర్ : రిజర్వేషన్ బిల్లు తీసుకరావాలని జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విపక్ష సభ్యులతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

టీమిండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే బాధ్యతల స్వీకరణ..

ఢిల్లీ : టీమిండియా హెడ్ కోచ్ గా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే కొద్దిసేపటి క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కోచ్ పదవి కోసం ఇటీవల జరిగిన సుదీర్ఘ కసరత్తులో భాగంగా కుంబ్లే ను ఎన్నుకున్నారు.

13:44 - June 29, 2016

హైదరాబాద్ : గవర్నర్‌ నరసింహాన్‌తో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్ట్‌పై గవర్నర్‌తో చర్చించనున్నారు. 

 

13:44 - June 29, 2016

ఆదిలాబాద్ : 'అంతా చట్టప్రకారమే... నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'.. ఇది ప్రభుత్వ అధికారుల మాట. 'అనుమతుల్లేవు..అయినా తవ్వుతాం. అడగటాకి మీరెవరు'..? ఇది అక్కడి కాంట్రాక్టర్ల మాట... ఆదిలాబాద్‌ జిల్లాలో అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ..
కరిగిపోతున్న మట్టికొండలు
సహజసిద్ధమైన మట్టి కొండలకు ఇలా తూట్లు పెడుతున్నారు. ఓపెన్‌కాస్ట్‌ గనిలా ఇంత పెద్దమొత్తంలో మొరంమట్టి  తరలిపోతోంది. ఆదిలాబాద్‌జిల్లాలో అక్రమ తవ్వకాలకు అడ్డేలేకుండా పోయింది. 
అనుమతుల్లేకుండానే మొరం తవ్వకాలు
ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ మండలలో మొరంమట్టి తవ్వకం జోరుగా సాగుతోంది. ముథోల్‌ నుంచి తానూర్‌ వరకు జరుగుతున్న రోడ్డుపనులకు ఈ మొరంను తరలిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలా జేసీబీలతో  మొరంమట్టిని తోడేస్తున్నారు.  ఈ అక్రమాలను రెవెన్యూ అధికారులుగాని, గనులశాఖవారు గాని ప్రశ్నించడంలేదు. అధికారులు సైలెంట్‌గా ఉండటంతో కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. వేలాది క్యూబిక్‌మీటర్ల మట్టిని రోడ్లు యథేచ్చగా తరలిస్తున్నారు. ఇక్కడ తోడేస్తున్న మట్టిని కొత్తరోడ్డుపై పోసీ లక్షల రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సైలెంట్‌గా ఉంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అనుమతుల్లేకుండానే మట్టిని ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నిస్తే.. అంతా మాఇష్టం.. అడగడానికి మీరెవరు అంటున్నారు కాంట్రాక్టర్లు. మట్టిని తవ్వడానికి రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం కాగా... గ్రామస్థాయి ఉద్యోగి అనుమతి ఉందంటూ చెప్పుకొస్తున్నారు.  
తెలియనట్టే ఉంటున్న రెవెన్యూ అధికారులు
ఇక్కడ ఇంతపెద్దమొత్తంలో మట్టి తరలిపోతుంటే.. రెవెన్యూ అధికారులు మాత్రం మాకసలే తెలియదంటున్నారు. మట్టితవ్వకాలు మాదృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చట్టాన్ని  ఫ్రెష్‌గా గుర్తుచేసుకుంటున్నారు. 
లారీలు, టిప్పర్లతో డస్ట్‌పొల్యూషన్‌
రోజు వందల సంఖ్యలో తిరుగుతున్న లారీలు, టీప్పర్లతో  సమీప గ్రామాల్లో విపరీతంగా దుమ్ములేస్తోంది. రోడ్లన్నీ పాడవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏసీగదుల్లో కూర్చొని ఉద్యోగాలను ఎంజాయ్‌ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 

13:42 - June 29, 2016

హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపి 13 మందిని అదుపులోకి తీసుకొన్న ఎన్ఐఏ అధికారులు..వారిని ఢిల్లీకి తరలించారు. హైదరాబాద్ నగర శివార్లలోని  నిర్మానుష్య ప్రాంతాల్లో ఉగ్రవాదులు  ఫైరింగ్ ప్రాక్టీస్‌ చేస్తుండగా పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.  హైదరాబాద్‌లో పేలుళ్లు, మతకల్లోలాల ద్వారా ఉగ్రవాదులు అలజడికి యత్నించారని ఆయన చెప్పారు. విదేశీ నిఘా బృందాల నుంచి కేంద్రానికి అందిన కీలకసమాచారంతో తాము ఉగ్రవాదులను పట్టుకున్నామన్నారు. ఐసిస్ దక్షిణాదిని తొలి టార్గెట్‌ చేసిందని విదేశీ నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందిందన్నారు. పకడ్బందీవ్యూహంతో కర్ణాటక, తెలంగాణ పోలీసులతో ఎన్‌ఐఏ జాయింట్‌ ఆపరేషన్‌ చేసిందన్నారు. హైదరాబాద్‌లో 12 చోట్ల సోదాలు జరిపామని ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సిరియా నుంచి వచ్చిన ఆదేశాలతో వీరు  పనిచేస్తూ హైదరాబాద్‌లో దాడులకు కుట్రపన్నారని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల నుంచి రూ.15 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా హైఅల్టర్‌ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులు, రద్దీ ప్రాంతాల్లో భద్రత పెంచారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇలియాస్ జగ్దానీ, మహ్మద్ ఇలియాస్ ఇబ్రహీం అనే సోదరులు సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్రవాదుల కుట్ర భగ్నం 
నగరంలో పేలుళ్లకు పాల్పడేందుకు సమాయత్తం అయిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల కుట్రను ఎన్‌ఐఏ అధికారులు భగ్నం చేశారు. నిఘావర్గాల సమాచారం మేరకు ఎన్‌ఐఏ అధికారులు,  పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నేడు సోదాలు చేపట్టారు. మొఘల్‌పురా, భవానీనగర్, మీర్‌చౌక్, చంద్రాయణగుట్ట, తలాబ్‌కట్ట, బార్కాస్‌లో తనిఖీలు  చేపట్టారు. ఈ సందర్భంగా 13 మంది ఐఎస్‌ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనుమానిత ఉగ్రవాదులు నగరంలో గడిచిన మూడు, నాలుగు  నెలలుగా తలదాచుకుంటున్నారు. పలు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.

 

13:29 - June 29, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో మార్పులు జరగనున్నాయా ? రేపు మంత్రి వర్గణ విస్తరణకు ముహుర్తం కుదిరిందా ? కేంద్రమంత్రి వర్గ విస్తరణపై ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో యూపీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పులు జరగునున్నాయనే ప్రచారం జరుగుతోంది. యూపీ నుంచి మరికొందరిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.

13:27 - June 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో హైకోర్టు వివాదం రోజుకింత ముదురుతోంది. 11మంది న్యాయాధికారులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు వచ్చే నెల 15వరకు సామూహిక సెలవులు పెట్టారు. దీంతోపాటు నేడు న్యాయవాదులు చలో హైకోర్టు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. దీంతో హైకోర్టు వద్ద పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. మదీనా వద్ద కొంతమంది న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. 

13:19 - June 29, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఏడో వేతన సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. దీంతో కోటీ మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఏడో వేతన సవరణతో మూల వేతనంపై 16 శాతం జీతం పెరుగుతుంది. 2016 జనవరి 1 నుంచి పెరుగుదల వర్తిస్తుంది. 
కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ(సీఓఎస్) వేతన సంఘం సిఫార్సులపై నివేదికను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్ల జీతభత్యాలకు సంబంధించి ఏడో వేతన సంఘ సిఫార్సులను అమలు చేసేందుకు హైపవర్ కమిటీని కూడా కేంద్రం నియమించింది. బేసిక్‌పై 14.27 పెంచాలని సంఘం సిఫార్సు చేయగా ఆరో వేతన సంఘం 20% పెంపును సిఫార్సు చేసింది. ప్రారంభ వేతనం నెలకు ప్రస్తుత రూ. 7 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాలని, అత్యధిక వేతాన్ని రూ. 90 వేల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని పే కమిషన్ సిఫార్సు చేసింది.

 

13:13 - June 29, 2016

ప్రముఖ మలయాళ రచయిత్రి కమలా సూరయ్య జీవితం ఆధారంగా రూపొందుతున్న మలయాళ చిత్రానికి 'ఆమి' టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో కమలా సూరయ్యగా విద్యాబాలన్ నటిస్తోంది. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ త్వరలో 'ఆమి'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్‌ దర్శకుడు కమల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈచిత్రంలో మాధవదాస్‌గా (కమలా భర్త) అనూప్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి విద్యా మాట్లాడుతూ,'ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నా. కమలా సూరయ్య జీవిత నేపథ్యం చాలా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే ఆమె రచనలు కూడా. అటువంటి గొప్పవ్యక్తి జీవిత కథలో నటిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా' అని చెప్పింది. విద్యా ప్రస్తుతం 'కహానీ' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న 'కహానీ2' చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే, మెల్‌బోర్న్‌లో ఆగస్ట్‌లో జరగబోయే ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా విద్యా ఎంపికయ్యారు. మహిళా సాధికారత థీమ్‌తో ఈయేడాది భారతీయ చలన చిత్రోత్సవాలు జరుగనున్నాయి.

 

జిల్లాల పునర్ విభజనలో త్వరలో అఖిలపక్షం - కేసీఆర్..

హైదరాబాద్ : జిల్లాల పునర్ విభజనలో త్వరలో అఖిలపక్ష సమవేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 14 జిల్లాలు, 7 కొత్త మండలాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాల ఏర్పాటుపై రాజకీయ విమర్శలను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.

గ్రూప్ 1 పరీక్ష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు....

ఢిల్లీ : గ్రూప్ 1 పరీక్ష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించుకోవాలని, 2011 నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా పాత సిలబస్ ప్రకారం తెలంగాణ కూడా పరీక్ష నిర్వహించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పరీక్ష ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్ఐఏ అదుపులో 13 మంది..

హైదరాబాద్ : నగరంలో తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన 13 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మహ్మద్ ఇబ్రహీం, యూజ్ ధాని, మహ్మద్ ఇలియాస్, యూజ్ ధాని సోదరులు, అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్మోడీ, అబిన్ మహ్మద్, ముజాఫర్ హుస్సేన్, మహ్మద్ ఇర్ఫాన్ లను అదుపులోకి తీసుకున్నారు. సిరియా నుండి వచ్చిన ఆదేశాలతో ఉగ్రదాడులకు పన్నాగం నిర్వహించారు. వీరంతా హైదరాబాద్ శివారులో ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తున్నారు.

13:08 - June 29, 2016

'దిగ్బంధన'..యువత దశ, దిశ తెలిపే చిత్రమని అహోబిలం రామానుజ చిన జీయర్‌ స్వామి అన్నారు. ప్రవీణ్‌, వంశీ, రమేష్‌, శ్రావణి, గాయత్రి ప్రధాన పాత్రధారులుగా డి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో డి విజన్‌ పతాకంపై యగ్నిక పీఠం సమర్పణలో రూపొందిన చిత్రం 'దిగ్బంధన'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన అహోబిలం రామానుజ చిన జీయర్‌ స్వామి ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు శ్రీనివాస్‌ దేవాలయాలపై చిత్రీకరించిన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. ఆయన ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా, అసభ్యతకు తావు లేకుండా రూపొందించడం ఆనందంగా ఉంది. సినిమాలోని డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉంటాయి. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడకుండా రిచ్‌గా తెరకెక్కించారు' అని అన్నారు. 'నేడు సమాజంలో మనుషులు చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి 'దిగ్బంధన' టైటిల్‌ను పెట్టాం. హీరో ప్రవీణ్‌ చిన్న వయసులోనే పెద్ద పాత్ర పోషించారు. అద్భుతంగా నటించారు. సినిమా బాగా రావడానికి టీమ్‌ అంతా సహకరించారు. డబ్బు కోసం కాకుండా ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై 1న సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని దర్శకుడు తెలిపారు.

 

12:59 - June 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ న్యాయమూర్తుల ఉద్యమం కాంగ్రెస్‌కు కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. జ‌డ్జిల స‌స్పెన్షషన్‌తో వేడిక్కిన ఉద్యమాన్ని టిఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోవ‌డంతో.. దీన్ని  ఎదుర్కోవడం  హ‌స్తం పార్టీకి స‌వాల్‌గా మారింది. జడ్జీల ఉద్యమాన్ని నెత్తికెత్తుకోలేక‌.. టిఆర్ఎస్ స్పీడ్‌కు త‌ట్టుకోలేక ఆత్మరక్షణలో పడిందా పార్టీ. 
క్రెడిట్‌కోసం అధికార, ప్రతిపక్షాల తహతహ
తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు  షురూ చేసిన లొల్లి.. ఇప్పుడు రాజకీయ‌ సెగ‌లు రేపుతోంది. ఎప్పుడూ లేని విధంగా జ‌డ్జిలే న్యాయం కావాలంటూ.. రోడ్డెక్కడంతో.. రాజకీయం మ‌రింత  హీట్ ఎక్కింది. జడ్జీల ఆందోళ‌న‌లు, రాజీనామాల సెగ‌ .. ఇప్పుడు రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీల‌కు తాకింది. ముఖ్యంగా అధికార , ప్రతిప‌క్షాలు ఉద్యమ క్రెడిట్‌ కోసం తహతహలాడుతున్నాయి . 
ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టీఆర్‌ఎస్‌ 
ఇప్పటికే ఆక‌ర్ష్ పాలిట్రిక్స్‌తో ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ .. జడ్జీల పోరాటాన్ని త‌మకు అనుకూలంగా మ‌లుచునేందుకు అన్నీ ప్రయత్నాలు  చేస్తోంది. న్యాయమూర్తుల ఉద్యమానికి మద్దతు ప‌లికిన కేసీఆర్ ... ఏకంగా  డిల్లీలో ధ‌ర్నాకు రెడీ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్యమం ఢిల్లీదాకా చేరనుండటంతో ...కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. అధికారపార్టీనే పోరుబాట పడుతుంటే... ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ రోల్‌ ఏంటనే ప్రశ్న ముందుకొచ్చింది.  
ఇరకాటంలో కాంగ్రెస్‌
ఇప్పటికే  ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్‌ను సొంతం చేసుకోలేక డీలాపడిన కాంగ్రెస్.. ఇపుడు మౌనంగా ఉంటే జనంలోకి రాంగ్‌మెసేజ్‌ వెళుతుందేమోనని భయపడుతోంది. అలాగని... చొరవ తీసుకుని జడ్జీల ఉద్యమానికి మద్దతు ఇద్దామంటే... విభజన చట్టం చేసింది.. తమ ప్రభుత్వంలోనే కావడం... ఆపార్టీకి ఇరకాటంగా మారింది. 
కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ మాటల తూటాలు
అయితే .. ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి తమపార్టీకి లేదంటున్నారు కొందరు కాంగ్రెస్‌ నాయకులు. జడ్జీల పోరాటానికి మూలం విభజన చట్టంలోనే ఉందని...ఆ చట్టం రూపొందించినపుడు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ.. జడ్జీల ఉద్యమంలోకి దూరాలని వాదిస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ అసమర్థత వల్లే హైకోర్టు విభజనతోపాటు న్యాయవాదుల సమస్యలు పరిష్కారం కాలేదని ఎదురుదాడికి దిగుతున్నారు.  
వేచిచూసే ధోరణి కాంగ్రెస్‌కు ప్లస్సా..? మైనస్సా..?
అయితే.. మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు మాత్రం... ప్రస్తుతానికి వేచిచూసే వ్యూహమే కరెక్ట్‌ అంటున్నారు. న్యాయమూర్తుల ఉద్యమానికి మద్ధతు ఇస్తూనే... పోరాటంలో దూకుడుగా ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీలకే సమస్యను వదిలేయాలంటున్నారు. మొత్తానికి వేయిట్ అండ్ సీ పాలసీతో కాంగ్రెస్ .. దూకుడుతో  టిఆర్ఎస్ క్రెడిట్ ను స్వంతం చేసుకోవాలని త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. మ‌రి ఇది ఎవ‌రికి ప్లస్ అవుతుందో .. ఎవ‌రికి మైన‌స్ అవుతుందో వేచిచూడాలి. 

 

12:59 - June 29, 2016

టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి దాని సహాయంతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. క్లోనింగ్‌ బేబీస్‌ దగ్గరి నుంచి కావలసిన లక్షణాలు ఉన్న పిల్లల డిజైనర్‌ బేబీస్‌ ను సృష్టించే వరకు మనిషి వచ్చేశాడు. అందులో రోబో కూడా ఒకటి. అచ్చం మనిషి చేసే అన్ని పనులు తయారు చేసే విధంగా ఈ రోబోలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోబోలను పెట్టి పనులు కూడా చేసేసుకుంటున్నారు. తాజాగా ఓ మాట్లాడే రోబోను సృష్టించారు. బెల్జియంలోని ఎ.జెడ్ దామియాన్ ఆసుపత్రిలో ఏకంగా 19 భాషలు మాట్లాడే రోబో ఉంది. ఈ ఆసుపత్రికి వచ్చే వారి సమస్యలు తెలుకుని వాటిని పరిష్కరిస్తుందంట. వారికి నచ్చిన భాషల్లో మాట్లాడి సంబంధిత గదులను..ఇతరత్రా సూచిస్తుందంట. జోరా బోట్స్ అనే సంస్థ రూపొందించిన ఈ రోబో అందర్నీ ఆకర్షిస్తోంది.

12:57 - June 29, 2016

విశాఖ : జిల్లాలో దారుణం జరిగింది. అనకాపల్లిలోని ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీలో తోటి విద్యార్థి అకారణంగా చేయిచేసుకోవడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన మృతికి గణేష్ అనే విద్యార్థి కారణమంటూ.. విద్యార్థిని తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. 

అర్దాంతరంగా ఊపిరి తీసుకోవడానికి కారణం ఎవరు? ..
విశాఖలో మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంతకీ ఆ అమ్మాయి ఇలాంటి తెగింపు నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.

ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య...
నేటి యువతరం చిన్న చిన్న కారణాలకే నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. చదువు, కెరీర్‌, ప్రేమ, పెళ్లి.. ఇలా ఏ విషయంలో ఎదురుదెబ్బ తగిలినా ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని మళ్ల ధరణి ఇదే తరహాలో తన ప్రాణాలను బలవంతంగా తీసుకుంది.

కొంతకాలంగా ముభావంగా ఉంటున్న ధరణి..
మళ్ల ధరణి స్థానికంగా ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఈయర్‌ చదువుతోంది. కొన్నిరోజులుగా ఈమె కళాశాలకు వెళ్లకుండా.. ఎవ్వరితో మాట్లాడకుండా ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాత్రి ఇంట్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించేసరికి ఆమె మృతిచెందింది. సహవిద్యార్థి గణేశ్‌ తనను అందరిముందు కొట్టడంతో మనస్తాపం చెందానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఏనాడు అతన్ని చూసి నవ్వలేదని..ఏ తప్పు చేయకపోయినా కాలేజీ యాజమాన్యం మందలించిందని నోట్‌లో రాసింది. తన తప్పు ఉన్నట్లుగా అనుమానించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. కాలేజీలో ధరణితో గణేశ్‌ ప్రవర్తించిన తీరును తల్లిదండ్రులతో పాటు బంధువులు తప్పుబడుతున్నారు.

గణేశ్‌ ధరణిని ఎందుకు కొట్టాడు? ...
ఇంతకీ ధరణిని గణేశ్‌ ఎందుకు కొట్టాడు. వారి మధ్య ఘర్షణకు కారణాలేంటీ? ప్రేమ వ్యవహారమే కారణమా? కాలేజీలో మరేదైనా జరిగిందా? ఇలా ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఏదీ ఏమైనా క్షణికావేశంలో ధరణి తీసుకున్న నిర్ణయం..ఆమె నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే తుంచేసింది. అదే సమయంలో కూతురుపై కోటి ఆశలు పెట్టుకున్న కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

 

 

గవర్నర్ తో కేసీఆర్ అత్యవసర భేటీ..

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ అత్యవసరంగా భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్టు తదితర అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.

పెద్దవాగు ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత..

పశ్చిమగోదావరి : పెద్దవాగు ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేశారు. ఏలేరు పాడు (మం) కమ్మరిగూడెంలో 30 ఇళ్లు నీట మునిగాయి. భయంతో స్థానికులు గుట్టలపైకి చేరుకున్నారు.

12:56 - June 29, 2016

హైదరాబాద్ : చలో హైకోర్టుకు పిలుపునిస్తూ బయలుదేరిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు వద్ద న్యాయాధికారుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాస్తఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
మహిళా న్యాయవాదులు వినూత్న నిరసన 
హైకోర్టును విభజించాలంటూ.. తెలంగాణ మహిళా న్యాయవాదులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును కేటాయించనుందుకుగాను మూతి మూసుకుని నిరసన తెలిపారు. న్యాయాధికారులపై సస్పెన్షన్  ఎత్తివేయాలంటూ.. డిమాండ్ చేశారు.   

2.59 గంటలకు సచివాలయ ఐదో బ్లాక్ ప్రారంభం..

విజయవాడ : మధ్యాహ్నం 2:59 గంటలకు ఐదో బ్లాక్ ప్రారంభం కానుంది. మంత్రి అయ్యన్నపాత్రుడు తాత్కాలిక సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యాలయాలను మంత్రి మృణాళిని ప్రారంభించనున్నారు.

కాసేపట్లో వెలగపూడికి ఏపీ ఉద్యోగుల బస్సు..

విజయవాడ : హైదరాబాద్ నుంచి నాలుగు శాఖలకు చెందిన దాదాపు 200మంది ఉద్యోగులతో బయలుదేరిన బస్సు కాసేపట్లో వెలగపూడికి చేరుకోనుంది. ఇరిగేషన్, పంచాయితీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గృహనిర్మాణ శాఖలకు చెందిన ఉద్యోగులు వెలగపూడికి బయలుదేరారు.

 

అమరావతికి సైకిల్ పై చేరుకున్న పద్మజ..

విజయవాడ : హైదరాబాద్ నుండి అమరావతికి సైకిల్ పై బయలుదేరిన పద్మయ విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ మంత్రులు దేవినేని ఉమ, సిద్దారాఘవరావు ఆమెకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

12:24 - June 29, 2016

హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు పాల్పడేందుకు సమాయత్తం అయిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల కుట్రను ఎన్‌ఐఏ అధికారులు భగ్నం చేశారు. నిఘావర్గాల సమాచారం మేరకు ఎన్‌ఐఏ అధికారులు,  పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నేడు సోదాలు చేపట్టారు. మొఘల్‌పురా, భవానీనగర్, మీర్‌చౌక్, చంద్రాయణగుట్ట, తలాబ్‌కట్ట, బార్కాస్‌లో తనిఖీలు  చేపట్టారు. ఈ సందర్భంగా 13 మంది ఐఎస్‌ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనుమానిత ఉగ్రవాదులు నగరంలో గడిచిన మూడు, నాలుగు  నెలలుగా తలదాచుకుంటున్నారు. పలు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు సమాచారం
గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు 
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒక గ్రూప్‌గా ఏర్పడి  ఉగ్రదాడులకు వ్యూహం రచించాలన్నది ఈ గ్రూప్‌ లక్ష్యం. వీరి ప్రయత్నాల్ని పసిగట్టిన ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. పలువురు అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.  అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని  పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకొని.. వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు కుట్ర పన్నినట్లుగా అధికారులకు సమాచారం. 
ఢిల్లీకి అనుమానితులు తరలింపు 
ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ బృందం అనుమానితులను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఓ బృందంగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యూహాలు పన్నిన కుట్ర ఎన్‌ఐఏ బృందం గుర్తించింది. అప్పుడు కూడా  దాడులు నిర్వహించి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. ఆసమయంలో కూడా హైదరాబాద్‌ లోనే తొలుత అనుమానితుల్ని అదుపులోకి తీసుకోన్నారు.

 

ఇస్తాంబుల్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ..

ఢిల్లీ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇస్తాంబుల్ దాడి అమానుషమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

12:18 - June 29, 2016

ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో జరిగిన పేలుళ్లలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వివరించారు. ఎయిర్ పోర్టు సిబ్బంది వల్లే తాను క్షేమంగా బయటపడినట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 36 మంది మృతి చెందగా మరో 40 మంది గాయపడిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తన ఇద్దరు పిల్లలు రిహాన్, హృదాన్ తో టర్కీ టూర్ కు వెళ్లాడు. ఘటనకు ముందు రోజు ఇస్తాంబుల్ నుండి బాలీవుడ్ కు తిరుగు పయనమయ్యాడు. కానీ ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయ్యింది. మరో విమానం వెళ్లేందుకు హృతిక్ కు బిజినెస్ టికెట్లు లభించలేదని తెలుస్తోంది. దీనితో ఎయిర్ పోర్టులోనే పిల్లలతో హృతిక్ నిరీక్షించాడు. కొంత సమయం తరువాత ఎకానమీ క్లాస్ లో అక్కడున్న సిబ్బంది హృతిక్ కు టికెట్లు ఇప్పించారు. దీనితో తన ఇద్దరు కుమారులతో ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు నుండి వచ్చేశారు. తనకు సహకరించిన ఎయిర్ పోర్టు సిబ్బందికి హృతిక్ కృతజ్ఙతలు తెలిపారు.

12:16 - June 29, 2016

ఢిల్లీ : హైకోర్టు విభజన చేయాలంటూ.. టీ కాంగ్రెస్ నేతలు కేంద్రన్యాయశాఖమంత్రి సదానందగౌడను కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయాధికారుల ఆందోళనల నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరామని షబ్బీర్ అలీ అన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరైంది కాదని పాల్వాయిగోవర్ధన్ రెడ్డి చెప్పారు. వెంటనే హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును కేటాయించాలని రాజ్యసభ ఎంపీ ఆనంద్ భాస్కర్ అన్నారు.

టీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. జిల్లాల పునర్ విభజన, హైకోర్టు విభజన అంశాలపై చర్చించారు.

రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టిడిపి ధర్నా..

రంగారెడ్డి : పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా టిడిపి ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

హైకోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన..

హైదరాబాద్ : న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ న్యాయవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. చలో హైకోర్టు పిలుపులో భాగంగా నాంపల్లి కోర్టు వద్ద వీరు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఏడో వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

ఢిల్లీ : ఏడో వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూల వేతనంలో 16 శాతం పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది. 2016 జనవరి 1 నుండి వేతన సవరణ పెంపుదల వర్తించనుంది. కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

11:58 - June 29, 2016

అనంతపురం : సేద్యాన్ని కరవు కాటేసింది. వరుణుడి కరుణ లేక.. వానలు రాక.. చెరువులు ఎండిపోయాయి. ఫలితంగా భూగర్భ జలాలూ ఇర్రింకి పోయాయి. ఎలా చూసినా వ్యవసాయం అనుకూలించడం లేదు.. పైగా ఉన్న ఊళ్లో పని దొరికే దారీ కనిపించడం లేదు. స్థానికంగా  ఉన్న కంపెనీలు కాదు పొమ్మంటున్నాయి. దీంతో.. అనంత కార్మికుడు, రైతన్న.... ఉపాధి కోసం.. వలస బాట పడుతున్నాడు. 
సొంతూళ్లను వదిలి వెళ్తున్నారు...
దూరమైన బతుకుదెరువు కన్నీళ్లను మిగిలిస్తే.. భారంగా బతుకు బండిని నెట్టుకొస్తున్నారు.. భయపెడుతున్న భవిష్యత్‌ను తలుచుకుంటూ.. ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వెళ్తున్నారు. కరవు వెక్కిరిస్తోంది. అనంతపురం జిల్లా ప్రజల జీవితాల్లో అణువణువునా గరళాన్ని నింపుతోంది. వర్షాలులేవు... పంటలు లేవు... ఉపాధీ లేదు.. బతుకుదెరువును వెతుక్కుంటూ... హిందూపురంలోని ప్రతి కార్మికుడూ భార్యా బిడ్డలను వదిలేసి, తెల్లవారక ముందే రైలులో కర్ణాటక రాష్ట్రానికి తరలి వెళుతున్నారు. తిరిగి చీకటిపడ్డాక ఏఅర్ధరాత్రో అపరాత్రో ఇంటికి చేరుతున్నాడు. 
వలసలు నిత్యకృత్యం
నిత్య క్షామపీడిత అనంతపురం జిల్లాలో వలసలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ కార్మికులు, రైతులు కూలిపనులు వెతుక్కుంటూ కర్నాటక తరలి వెళుతున్నారు. వేకువనే హిందూపురం నుంచి బెంగళూరు వెళ్లే ప్యాసింజర్‌ రైలులో.. కన్నడ రాజధానికి చేరి పనులు చేసుకుంటూ.. తిరిగి అదే రైలులో రాత్రికి సొంతూరికి చేరుతున్నారు. కార్మికులు.. కూలీలను తీసుకువెళుతున్న ఈ ప్యాసింజర్‌ రైలు పేరు కూడా ఇప్పుడు లేబర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయింది. 
పొట్టకూటి కోసం కర్ణాటకకు పయనం 
హిందూపురం నుంచి పొట్టకూటి కోసం పొరుగు ఉన్న కర్ణాటకకు ప్రతిరోజూ షటిల్‌ సర్వీస్‌ చేస్తోన్న కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. హిందూపురం-బెంగళూరు ప్యాసింజర్‌ రైలు వీరి జీవనోపాధికి ఊతంగా నిలుస్తోంది. సూర్యుడు రాకముందే ఇల్లువదిలే కార్మికులు తిరిగి ఏ అర్ధరాత్రో ఇళ్లకు చేరుకుంటారు. నిద్రలేక, కటుంబంతో గడిపే సమయం లేక బిజీబిజీగా... గజిబిజీగా గడుపుతున్నారు. 
ఉ. 5 గం.లకే వలస కార్మికులు, కూలీల దినచర్య ప్రారంభం 
ఉదయం 5 గంటలకే వలస కార్మికులు, కూలీల దినచర్య ప్రారంభమవుతుంది. ఆరుగంటలకు బయలుదేరే హిందూపురం-బెంగళూరు ప్యాసింజర్ రైలులో పనులకు పోతారు. ఏదైనా తినాలకున్నా..ట్రెయిన్‌లోనే.. తిరిగి రాత్రి ఏ తొమ్మిదికో పదికో ఇల్లు చేరుకుంటారు. హిందూపురం చుట్టుపక్కల నుంచే కాకుండా.. మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల నుంచి కూడా పెద్దఎత్తున లేబర్ ఎక్స్ ప్రెస్‌లో కూలీలు కర్ణాటకకు పోతున్నారు. హిందూపురంలోని కార్మికుల కంటే ఓ గంటసేపు ముందే వీరి దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం బస్సులు లేకపోతే.. లారీలు, జీపులు, ఆటోల్లో హిందూపురం రైల్వేస్టేషన్‌ చేరుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలూ పోతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఈ దుర్భర పరిస్థితులు సమాజాన్ని చిన్నబుచ్చుకునేలా చేస్తున్నాయి.
'అనంత' ఆడబిడ్డల కష్టాలు...
ఉపాధి లేక అనంత ఆడబిడ్డల కష్టాలు అన్నీ ఇన్నీకావు. పనుల కోసం ఉదయాన్ని నిద్రలేచి.. వంట చేసుకుని.. పరుగు పరుగునా.. రైలెక్కి కర్ణాటకకు వెళ్తున్నారు. చీకటిలో మొదలై, చీకటిలోనే ముగుస్తోంది వారి ప్రయాణం..! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది సొంత నియోజకవర్గంలో మహిళా కార్మికులు.. దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేనూ చెలకల్లో తీరక లేకుండా గడపాల్సిన వీరంతా.. పొట్టకూటికోసం నిత్యం పరుగులు పెడుతున్నారు. పంట చేలకు జీవం పోయాల్సినవారు.. జవజీవాలు కోల్పోతున్నారు.. పంట చేలో తెల్లవారాల్సిన జీవితాలు.. కారు చీకట్లోనే కూరుకుపోతున్నాయి..
కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న మహిళలు
హిందూపురం నియోజకవర్గంలోని మహిళలు ఉదయం 4 గంటలకే నిద్రలేచి వంటచేసుకుని, పిల్లలను చూసుకుని పనులకు పోవాలి. ఒక్కరోజు పనిలేకపోతే కడుపులు నిండని ఇలాంటి జీవితాలెన్నో ఈ లెబర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాయి. ఓవైపు వయస్సు మీదపడుతోంది.. మరోవైపు జీవితం తరుముతోంది.. అయినా కాలంతో పోరాడుతూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న మహిళలు ఈ ట్రెయిన్‌లో మనకు కనిపిస్తారు. 
ఆలస్యమైతే పని దొరకదు
హిందూపురం స్టేషన్ తర్వాత తొండేబావి, గౌరిబిదనూరు మీదుగా దొడ్డబళ్ళాపూర్ చేరుకుంటారు. మొత్తం రెండు గంటల ప్రయాణం. దొడ్డబళ్ళాపూర్‌లో రైలు దిగినప్పటి నుంచీ ఇక ఒక్కటే పరుగు.. అడ్డాకు చేరడం ఆలస్యమైతే పని దొరకదు. ఆ భయంతో పరుగులందుకుంటారు. దొడ్డబళ్ళాపూర్ రైల్వేస్టేషన్ ఎదుటవున్న బస్ షెల్టర్ వద్ద మహిళలందరూ గుమిగూడతారు. వారుపనిచేసే ఫ్యాక్టరీ బస్సులు అక్కడకు వచ్చి.. వారిని తీసుకుపోతాయి. సంతలో పశువులను తరలించినట్టుగా బస్సుఎక్కడానికి చోటు దొరకనంత మందిని తరలిస్తారు. ఈ ఫ్యాక్టరీ బస్సులు వచ్చేలోపు చాలామంది మహిళలు, ఇంకా తెరవని షాపుల ముందు కూర్చుని వెంట తెచ్చుకున్న టిఫిన్స్‌ తింటూ కనిపిస్తారు. 
వారి వేదనా వర్ణనాతీతం
కన్నవాళ్లను.. కన్నతల్లిలాంటి సొంతూరినీ వదిలి సుదూర తీరాలకు తరలి వెళుతున్న వారి వేదనా వర్ణనాతీతం. ముఖ్యంగా కన్నబిడ్డలకు దూరమవుతూ.. వారి ఆలనాపాలన చూడలేక.. వారిపై బెంగటిల్లి.. పనిచేసే చోట ప్రమాదాలు వెంటాడుతుంటే..  ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తామో.. అసలు వస్తామో రామో తెలియని స్థితిలో ఈ మహిళల వేదన.. ఎవరినైనా కదిలించక మానదు.
అసలు హిందూపురంలో పరిశ్రమలే లేవా..? 
అసలు హిందూపురంలో పరిశ్రమలే లేవా..? ఉంటే.. స్థానికులకు ఉపాధి కల్పించే పని ఎందుకు చేయడంలేదు. ఈ విషయంలో మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడం లేదు. పొట్టకూటికోసం వందల మైళ్లు వెళుతున్న కార్మికుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు.
హిందూపురంలో ఫ్యాక్టరీలు 
హిందూపురంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ హయాంలోనే హిందూపురంలో పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. అయితే వీటి నిర్వాహకులు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందాన వ్యవహరిస్తున్నారు. హిందూపురం ఇండస్ట్రియల్ ఏరియా, పరిగి ప్రాంతాల్లోని కంపెనీలు స్థానికులకు ఉపాధి చూపించకుండా.. పక్కరాష్ర్టాలకు చెందిన కార్మికులకు పని చూపిస్తున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించుకుని వారితో తక్కువ కూలీకే పని చేయించుకుంటున్నారు. 
మేధావులు ఆందోళన 
స్థానికులకు ఉపాధి కల్పించని ఫ్యాక్టరీల విషయంలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే జిల్లాలో ముఖ్యమంత్రి పదిసార్లకు పైగా పర్యటించారు. జిల్లాలో ఫ్యాక్టరీలు పెట్టి.. వలసలను ఆపుతామని ప్రకటించి.. హామీలను ఎప్పుడో మరిచారు. దీంతో వలసలు ఆగడం లేదు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తానంటూ పదేపదే గొప్పలు చెబుతున్న చంద్రబాబు హామీలు కేవలం అమరావతికే పరిమితమవుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. దుర్భర జీవితాలను గడుపుతున్న అనంత కార్మికుల బతుకులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరిపోతున్న జీవితాలకు జీవం పోయాలి.  ఉపాధి కోల్పోతున్న కార్మికునికి అండగా నిలవాలి. ఈ తక్షణ కర్తవ్యానికి కార్యరూపం ఇచ్చి, వేల మంది జీవితాలకు ఉపాధి ఇవ్వాల్సిన గురుతర బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదే..

11:49 - June 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వాస్తవాలు వెల్లడించారు. జరుగుతున్న మోసాలు..ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను ఆయన ఎండగట్టారు. రాజధాని నిర్మాణం -విదేశీ కంపెనీల పెత్తనం అనే అంశంపై రాఘవులు ప్రసంగించారు. ఆయన మాటల్లోనే...

గాలి..వెలుతురు ప్రాంతాల్లో నిర్మాణం..
''అమరావతి నిర్మాణ దశల్లో రకరకాల మోడల్స్ పెట్టారు. వీటన్నింటిపై చర్చ జరుగుతోంది. మన వాతావరణం..సంస్కృతికి సరిపోయేదేనా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల విశాఖపట్టణంలో కాన్ఫరెన్స్ సమ్మిట్ నిర్వాహించారు. ఈ సమ్మిట్ కు విదేశీ, దేశీయ ఆర్కిటెక్చర్స్ వచ్చారన్నారు. ఈ నిర్మాణం చేసే పద్ధతి ఎలా ఉందంటే విపరీతమైన గాలి..వెలుతురు రాని ప్రాంతాల్లో నిర్మాణాలు చేస్తున్నారని.. భవనం చుట్టూ గ్లాస్ పెట్టడం సూటబుల్ కాదని..విదేశీ ఆర్కిటెక్చర్ పేర్కొన్నారు. వేడి లోనికి రాకుండా చూసుకోవాలి కానీ చల్లబడడానికి ఎనర్జీ ఖర్చు చేయడం బాగా లేదని విదేశీ ఆర్కిటెక్చర్ పేర్కొన్నాడు.

మొదటి అబద్ధం..
రాజధాని నిర్మాణం ఎలా చేస్తారు ? అలాంటి నిర్ణయాలు జరగలేదు..ఆగస్టు 15వ తేదీ అనంతరం నిర్ణయాలు జరగబోతున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇది మొదటి అబద్ధం...మొదటి మోసం..రాజధాని ఎవరు నిర్మాణం చేయాలనే దానిపై 2014 డిసెంబర్ 8వ తేదీన నిర్ణయం జరిగిపోయింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మంత్రి ఒప్పందాలు చేసుకున్నారు. మాస్టర్ డెవపలర్ సింగపూర్ ఇస్తుందని, దీనికి ఏపీ సర్కార్ సమ్మతిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇది ఆషామాషి ఒప్పందం కాదు. ఈ ఒప్పందం రద్దయ్యింది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు.

రెండో అబద్ధం...
మాస్టర్ డెవలపర్ కాకుండా ఫస్ట్ ఫేజ్ లో ప్లానింగ్ లో ఖర్చులు ఎలా భరించాలని అనేది కూడా ఉంది. ప్లానింగ్..ఇలాంటి వ్యవహారాలు సింగపూర్ ప్రభుత్వం చూస్తుందని..ఇదంతా ఫ్రీగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఆనాడు పేర్కొనడం జరిగింది. సింగపూర్ కంపెనీకి షుబానా ఇంటర్నేషనల్ కంపెనీ ప్లాన్ ఇచ్చింది..ఇందుకు రూ. 14 కోట్ల రూపాయలు చెల్లించారు. 2015 ఆగస్టులో సీఆర్డీఏ సమావేశం జరిగింది..ప్లాన్ తయారు చేసిచ్చారు కనుక షుబానా కంపెనీకి రూ. 11.9 కోట్ల రూపాయలు చెల్లించాలని సమావేశంలో తీర్మానం చేసుకున్నారు. అనంతరం సీఆర్డీఏ రెండో సమావేశంలో మూడో తీర్మానం చేయడం జరిగింది. ఇందులో రూ. 11.9 కోట్ల నుండి రూ. 14 కోట్లు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. లాభం కోసమే పనిచేస్తున్నాం..నష్టాలను పరిగణలోకి తీసుకుని షేర్ హోల్డర్స్ ఇంట్రస్ట్ పరిగణలోకి తీసుకుని లాభాల్లో పనిచేస్తామని షుబానా కంపెనీ పేర్కొంది.

టెమాసిట్ కంపెనీలో సింగపూర్ సర్కార్ పెట్టుబడులు..
మాస్టర్ డెవలప్ లో మోసాలకు అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇంటర్నేషనల్..నేషనల్ కంపెనీలు బీరకాయ పీచులాగా ఉంటాయి. కన్సార్టీయం పుట్టుక గురించి తెలుసుకోవాలి. దీనికి తల్లి సంస్థ టెమాసిట్. ఇది సింగపూర్ ప్రభుత్వం యొక్క సంస్థ. దీనిని 1974లో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపార పద్ధతిలో రన్ చేయడం కోసం టెమాసిస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తామిచ్చిన డబ్బును కూడా తినేసే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం జరుగుతంది. 51 శాతం సింగపూర్ ప్రభుత్వం..49 శాతం వాటా ప్రైవేటు వారిది ఉంది'. అని రాఘవులు పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

12 ప్రాంతాల్లో సోదాలు - ఎన్ఐఏ..

హైదరాబాద్ : 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం జరిగిందని ఎన్ఐఏ పేర్కొంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు, దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఐసీస్ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. రూ. 15 లక్షలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని చిన్నారి మృతి..

హైదరాబాద్ : కేపీహెచ్ బీ నిజాంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ప్లాస్టిక్ కవర్ ను బాలుడు శ్రీయాన్ (4) తలకు చుట్టుకున్నాడు. దీనితో ఊపిరి ఆడక పోవడంతో బాలుడు మృతి చెందాడు.

పశ్చిమగోదావరిలో భారీ వర్షం..

పశ్చిమగోదావరి : కుక్కనూరు, వేలేరు పాడు మండలాల్లో భారీ వర్షం నెలకొంది. ఎద్దువాగు, గుండేటి వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తోంది. గోదావరి నీటి ఉధృతం పెరుగుతోంది.

10:55 - June 29, 2016

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కబాలి'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ప్రవీణ్‌కుమార్‌, కేపీ చౌదరి ఆధ్వర్యంలోని షణ్ముక ఫిలింస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జె.ఆర్.సిలో 'కబాలి' ఆడియో వేడుక కార్యక్రమం జరిగింది. ఈ ఆడియో వేడుకకు సినీ ప్రముఖులు విచ్చేశారు. కార్యక్రమానికి హాజరైన యువ నటుడు 'నాని' రజనీ డైలాగ్స్ తో సందడి చేశారు. నాని 'కబాలి' తెలుగు టీజర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. 'స్వతహాగా నేను శంకర్ గారి వీరాభిమానిని..కానీ నేను 'రోబో 2.0' కంటే 'కబాలి' సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాను..రజనీకాంత్ గారిని 'రోబో'లా చూడడం కంటే.. ఆయన్ను 'రజనీ'లా చూడడమే ఎక్కువగా ఇష్టపడతాను..ఆయన్ని 'కబాలి'లో చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా? అని చాలా ఆత్రంగా ఉంది' అని పేర్కొన్నారు. ఆయన డైలాగ్స్ పలికారో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

10:49 - June 29, 2016

ఢిల్లీ : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్‌లో ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. ఏడో వేతన సంఘం సిఫార్సులను ఆమోదించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు పెరగనున్నాయి. అలాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. 

10:43 - June 29, 2016

ముంబై : కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉత్తర భారతమంతా తడిసి ముద్దవుతున్నది.  మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాన నదుల్లో నీటిమట్టాలు గరిష్ఠానికి చేరుకొన్నాయి. వర్షాల ప్రభావంతో ఉత్తర భారతంలోని పలు రాష్ర్టాల్లో ఉష్ణ పరిస్థితులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.  విదర్భ, మరట్వాడా ప్రాంతాల్లో తేలిక నుంచి ఓ మోస్తరు వానలు, ఈ నెల 30 నుంచి జూలై 1 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణశాఖ తెలిపింది.
పలు ప్రాంతాలను ముంచెత్తుతున్న వర్షాలు 
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుడడంతో రేపటి నుంచి జూలై 1 తేదీ వరకు  భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావారణశాఖ అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో గత రెండు, మూడు రోజులుగా ఒడిశా తీరాన్ని, రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా  ఉండటంతో రానున్న 24 గంటల్లో ఒడిశాలో భారీ వర్షాలు పడే అవకాశముందని చెబుతున్నారు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో మోస్తరు వానలు పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖంగా పట్టాయి. 

 

సదానందగౌడపై లాయర్ల ఫిర్యాదు...

హైదరాబాద్ : సరూర్ నగర్ పీఎస్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడపై లాయర్లు ఫిర్యాదు చేశారు. హైకోర్టును విభజిస్తామని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చెప్పి ప్రస్తుతం తమ పరిధిలో లేదని మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

 

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం..

ఖమ్మం : జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. కిన్నెర సాని ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 390 అడుగులుగా ఉంది. భద్రాచలం రామాలయ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్నదాన సత్రంలోకి భారీగా వరద నీరు చేరింది. భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టు రెండు గేట్లు తెరిచారు. ఇల్లందులో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు యాజమాన్యాలు సెలవు ప్రకటించారు.

 

కడియంను కలిసిన పేరెంట్స్ అసోసియేషన్..

హైదరాబాద్ : మంత్రి కడియం శ్రీహరిని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. స్కూల్ ఫీజుల రెగ్యులరైజేషన్ పై చర్యలు తీసుకొంటానని మంత్రి కడియం హామీనిచ్చారు.

 

10:32 - June 29, 2016

మెగాస్టార్ చిరంజీవి..జైల్లో ఉన్నారా ? ఏమైంది ? మొన్ననే 150వ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు...అని ఎదోదో ఊహించుకోకండి. ఇది రియల్ లైఫ్ లో కాదు...రీల్ లైఫ్ లో...ప్రస్తుతం ఆయన నటిస్తున్న 150వ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది. ఇటీవలే పూజలు ప్రారంభించి మొన్న షూటింగ్ ఆరంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఖైదీ డ్రస్సులో ఉన్న ఓ ఫొటో నెట్ లో చక్కర్లు కొడుతోంది. చిరు డ్రెస్ పై 150అనే నెంబర్ కనిపిస్తోంది. తన 150వ సినిమా కాబట్టే అదే అంకెని ఖైదీ నెంబర్ గా మార్చారని టాక్. ఈ చిత్ర షూటింగ్ చంచల్ గూడలో జరుగుతోంది. జైలు నుండి తప్పించుకొనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వి.వి.వినాయక్ తనదైన స్టైల్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చినట్లు సమాచారం. ఇక చిరు సరపన ఏ హీరోయిన్ నటించనుందో తెలియరాలేదు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చిరు చిత్రానికి సంబంధించిన ఫొటో..వార్తలపై అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

10:28 - June 29, 2016

వర్షకాలం..అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చల్లగాలులు వీచడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. పెదాలు కూడా తడారిపోతాయి. ఈ కాలంలో పెదాలను కాపాడుకోవాలంటే కొన్ని హెల్త్ టిప్స్ మీ కోసం...
మజ్జిగను చూస్తే కొంతమందికి చిరాకుగా ఉంటుంది. కానీ ఇది తీసుకోవడం చాల మంచి శ్రేయస్కరం.
కొంచెం కుంకుమపువ్వు తీసుకుని పెరుగులో కలపాలి. ఈ పెరుగును పెదాలపై రోజుకు రెండు లేదా మూడుసార్లు రాస్తే మంచి రంగు వస్తాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెలో పది చుక్కల పుదీనా నూనె కలపాలి. ఈ విశ్రమాన్ని రాత్రి నిద్రించేముందు పెదాలకు రాసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయాల రసాలు తాగాలి. భోజనంలో మజ్జిగ తీసుకోవడం మంచిది. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

10:26 - June 29, 2016

పోటీ ప్రపంచంలో కాలానికి అనుగుణంగా యువత ఆలోచనలు మారుతున్నాయి. భారీ లక్ష్యాలు నిర్ధేశించుకుంటున్నారు. పేరు కోసం..డబ్బు కోసం..స్టేటస్ ఇలా...నేటి యువత తమ శక్తికి మంచి పని చేస్తున్నారు. అతిగా పని ఉండడం వల్ల విపరీతమైన శారీరక, మానసిక వత్తిడిలకు లోనవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని గంటలు పనిచేయడం వల్ల వారి ప్రాణాలకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మటుకు ఎవ్వరూ గుర్తించడం లేదని పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలు ఏర్పడుతాయి ? వీటికి పరిష్కారాలు ఏంటో చూడండి...
ఉద్యోగంలో భాగంగా కొంతమంది ఎయిర్ కండీషన్డ్ గదిలో గడుపుతున్నారు. ఇలాంటి వారి శరీరంలో చెమటోడ్చే అవకాశం ఉండదు. దీనితో శరీరంలోని ఉప్పు వ్యర్థాల రూపంలో బయటకు పోయే అవకాశం ఉండదు. వేళకు ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది.
ఇక ఎక్కువ గంటలు పనిచేసే వారిలో అశాంతి, నిద్రలేమి వంటి సమస్యలు ప్రారంభమౌతాయి. పనిలో ఉన్న సమయంలో కూల్ డ్రింకులు, కాఫీలు..టీలు ఎక్కువగా సేవిస్తుంటారు. వెన్నెముక నొప్పి..కంటిచూపు మందగించడం తదితర సమస్యలు ఏర్పడుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.

పరిష్కారాలు..
ముందుగా శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలని గుర్తుంచుకోండి. ఒత్తిడి బారిన పడకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగండి. వర్కును ఎంజాయ్ చేస్తూ శరీరానికి కావాల్సింతన విశ్రాంతినిచ్చే ప్రయత్నం చేయండి. కొత్త ప్రదేశాలకు వెళుతూ కొత్త మనుషులను కలుస్తూ ఉండడం చేయాలి. నిత్యం జిమ్ కు వెళ్లడం..యోగాలు చేయడం..మంచి ఆహారం తీసుకోవడం..ఇతరత్రా చేయడం వల్ల సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది.

10:23 - June 29, 2016

హైదరాబాద్ : తెలంగాణా కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్‌ తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించడం,.. హైకోర్టు వివాదంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో వ్యూహం రచించనున్నారు. 
24 జిల్లాలు చేసేందుకు ప్రణాళిక 
తెలంగాణాలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న పది జిల్లాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 24 జిల్లాలు చేసేందుకు అధికార పార్టీ ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో సమావేశమై ప్రాథమికంగా ఓ నిర్ణయానికి కూడా  ప్రభుత్వం వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన జిల్లాలు, మండలాలతో అన్ని జిల్లాల్లోనూ అసంతృప్తులు రగులుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమవుతోంది.
స్వపక్ష సభ్యులతో జిల్లాకు ఒక కమిటీ 
ఇందులో భాగంగా స్వపక్ష పార్టీ సభ్యులతో ఒక్కో జిల్లాకు ఒక్కో కమిటీని వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. అయినా పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలు, కొత్త మండలాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. త్వరలోనే జిల్లాల విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా ఇవ్వనుంది. అంతలోపే అధికార పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు గులాబీ బాస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాల ఏర్పాటు అంశంతో పాటు తాజాగా తెరపైకి వచ్చిన హైకోర్టు విభజన అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సైతం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరగడంతో.. అధికార పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. 

 

టీఎస్ ఠాకూర్ ను కలువనున్న సదానందగౌడ..

ఢిల్లీ : సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ను కేంద్ర మంత్రి సదానందగౌడ కలువనున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల నియామకాలపై చర్చించనున్నారు.
 

సదానందగౌడను కలిసిన టి.కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్వాయి, రాపోలు, షబ్బీర్ ఆలీలు కలిశారు. తెలంగాణ న్యాయమూర్తుల, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సమస్యలపై గవర్నర్ తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారని నేతలు పేర్కొన్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

10:19 - June 29, 2016

హైదరాబాద్ : నగరంలో బల్దియా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. శిశు ఆధార్ పేరుతో కొత్త పథకం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పుట్టిన ప్రతిబిడ్డకు 20 నిమిషాల్లో ఆధార్ కార్డ్ జనన ధృవీకరణపత్రం జారీ చేయనున్నారు. వైద్యాఆరోగ్యశాఖ జనన ధృవీకరణపత్రం ఇచ్చే అధికారాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఇవ్వనున్నది. 

 

మరో రెండు రోజులు వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సహా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

చైనాలో బాబు నాలుగో రోజు..

చైనా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైనాలో నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇంజో ప్రావిన్స్ వైస్ గవర్నర్ క్విన్ రూపీతో సీఎం బృందం భేటీ అయ్యింది. ఏపీలో వేయి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అప్పో మొబైల్ ఉత్పత్తుల సంస్థ సంసిద్ధత తెలియచేసింది.

 

ఎస్ఐ అభ్యర్థుల దేహధారుఢ్య పరీక్షల్లో ప్రతిష్టంభన...

వరంగల్ : ఎస్ఐ అభ్యర్థుల దేహధారుఢ్య పరీక్షల్లో సందిగ్ధత నెలకొంది. లాంగ్ జంప్, హై జంప్ నిర్వాహణలో పోలీసులు ఏటూ తేల్చుకోలేక పోతున్నారు. వరంగల్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురవడంతో మైదానాలు తడిసిపోయాయి.

 

ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..

కడప: జిల్లా మైదుకూరు డి.కొట్టాల సమీపంలో ఆగిఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ సహా 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

తిరుమలలో మంత్రి పరిటాల సునీత..

చిత్తూరు : ఏపీ మంత్రి పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నదానం సముదాయంలో భోజనం రుచిగా ఉందని, తిరుమలలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయని ఆమె చెప్పారు.

09:52 - June 29, 2016

హైదరాబాద్‌ : నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దీంతో పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది. ఐఎస్ ఉగ్రవాదులు హైదరాబాద్‌లోకి ప్రవేశించినట్టు సమాచారం. ఆరుగురు అనుమానితులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భారీగా పేలుడు పదార్థాలు.. విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తోంది. 

 

09:49 - June 29, 2016

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణలోని 200 మంది న్యాయాధికారుల సామూహిక సెలవులకు పూనుకున్నారు. న్యాయాధికారుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ..నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నేడు చలో హైకోర్టుకు లాయర్ల జేఏసీ పిలుపునిచ్చింది. నేడు న్యాయాధికారుల కమిటీ గవర్నర్ కు కలవనుంది. దాంతో పాటు సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కలవనుంది. తెలంగాణ న్యాయశాఖ సిబ్బంది రెండో రోజు సహాయ నిరాకరణ కొనసాగించనుంది.

 

09:45 - June 29, 2016

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని 127 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌ పరిపాలన బాధ్యతలను గ్రేటర్‌కి అప్పగించాలని నిర్ణయించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ కలిసి పనిచేయనున్నాయన్నారు. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌లో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పథకాన్ని ఆయన సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చెన్నై, బెంగళూరు, ముంబై, కోలకత్తా వంటి నగరాల్లో పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

 

09:42 - June 29, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ రూపొందించిన ప్రధాని జన ఔషది యోజనా పథకం కింద కేంద్రంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పంద పత్రం కుదుర్చుకుంది. ఏపీలోని ప్రతి మండలంలో జన ఔషద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఒక్కొక్క కేంద్రానికి రెండున్నర లక్షల రూపాయలు కేంద్రం ఇవ్వనుందని... అగస్టు 15 నుంచి ఈ కేంద్రాలను ఏపీలో ప్రారంభించనున్నామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. 

09:37 - June 29, 2016

హైదరాబాద్‌ : జీడిమెట్లలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో .. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

 

09:34 - June 29, 2016

'నేను నమ్మే ఆ స్వామి కృప వలన ఇప్పటి వరకు నా జీవితంలో చాలా మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి కూడా అంతా మంచే జరుగుతుంది. ఆ స్వామి వారి ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం' అంటూ సోషల్‌ మీడియాలో రాఘవేంద్రరావు పేర్కొన్నారు. నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌ దిగ్విజయంగా మొదలైందని రాఘవేంద్రరావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. పూజా కార్యక్రమాల సందర్భంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 25వ తారీఖున 'ఓం నమో వెంకటేశాయ' ముహూర్తం షాట్‌ దిగ్విజయంగా మొదలైంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాఘవేంద్రరావు, నాగార్జున, కీరవాణి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే.

 

భారత్ లోని ఎయిర్ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ : ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలోని ఎయిర్ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబై ఎయిర్ పోర్టులో బాంబ్, డాగ్ స్క్వార్డ్ లతో తనిఖీలు చేపట్టారు. 

హైదరాబాద్ లో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర

హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఎన్ ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోకి ఐసిస్ ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం. నలుగురు అమానుమానితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా నగదు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

నేడు టీఆర్ ఎస్ పార్లమెంటరీ, ఎల్పీ సమావేశం

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ పార్లమెంటరీ, ఎల్పీ సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జిల్లాల పునర్ విభజన సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

08:58 - June 29, 2016

విజయ్ దేవరకొండ (ఎవడే సుబ్రమ్మణ్యం ఫేం), రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌,వినూతన గీత బ్యానర్స్‌పై రాజ్‌ కందుకూరి, యస్‌.రాగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పెళ్ళి చూపులు'. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నిర్మాతలు రాజ్‌ కందుకూరి, యస్‌.రాగినేని మాట్లాడుతూ.. 'నవ్యమైన కథతో లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'పెళ్ళి చూపులు' చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. హీరోహీరోయిన్ల నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకునేలా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నేచురల్‌ స్టార్‌ నాని ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. టీజర్‌, పోస్టర్స్‌ చాలా బాగున్నాయని యూనిట్‌ని అభినందించారు. చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు.

 

08:51 - June 29, 2016

ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని వక్తలు కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీడీపీ రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. జడ్జీలపై సస్పెన్షన్ వేటు దురదృష్టకరమన్నారు. న్యాయ మూర్తులను సస్పెండ్ చేయడం సరైందికాదని అభిప్రాయపడ్డారు.  ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలిపారు.  హైకోర్టు విభజనకు కేంద్రప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విధ్వేషాలు రగిలించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:46 - June 29, 2016

హైదరాబాద్ లో వానకాలంలో వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఫ్యాకా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'చినుకు పడితే హైదరాబాద్ వాసులను కష్టాలు చుట్టుముట్టుడుతున్నాయి. చిన్నవానకే రోడ్ల మీద నీరు ప్రవహించడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, వాటిలో పడి చనిపోవడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు, హోర్డింగ్ లు, చెట్లు విరిగిపడడం ఇలాంటి అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? మహానగరంగా, విశ్వనగరంగా, ఆధునిక అభివృద్ధికి చిరునామాగా విరాజిల్లుతున్న హైదరాబాద్ లో ఇన్ని కష్టాలెందుకొస్తున్నాయి? వానకాలం సమస్యలకు పరిష్కారం ఏమిటి? ఇలాంటి అంశాలపై అంజయ్య మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

నేడు సింగపూర్ వెళ్లనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు సింగపూర్ వెళ్లనున్నారు. సౌతిండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో 
కేటీఆ్ర పాల్గొననున్నారు. 

నేడు చలో హైకోర్టుకు లాయర్ల జేఏసీ పిలుపు

హైదరాబాద్ : న్యాయాధికారుల సస్పెన్షన్ కు నిరసనగా నేడు చలో హైకోర్టుకు లాయర్ల జేఏసీ పిలుపిచ్చింది. 4 గంటలకు న్యాయవాదుల జేఏసీ సీజేఐను కలవనుంది. తెలంగాణ న్యాయాశాఖ సిబ్బంది రెండో రోజు సహాయ నిరాకరణ కొనసాగించనున్నారు. 

 

నేటి నుంచి 200 మంది న్యాయాధికారులు సామూహిక సెలవులు

 హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి 200 మంది న్యాయాధికారులు సామూహిక సెలవులు తీసుకున్నారు. నేడు గవర్నర్ ను న్యాయవాధికారుల కమిటీ కలవనుంది. 

నేడు ఒడిశాలో కొత్త మిసైల్ ను పరీక్షించనున్న అధికారులు

భువనేశ్వర్ : నేడు ఒడిశాలోని రక్షణ శాఖ కేంద్రంలో అధికారులు కొత్త మిసైల్ ను పరీక్షించనున్నారు. 

నేడు ఎపి తాత్కాలిక సచివాలయం ప్రారంభం

గుంటూరు : అమరావతిలో నేడు మధ్యాహ్నం 2.59 నిమిషాలకు ఎపి తాత్కాలిక సచివాలయం ప్రారంభం కానుంది. ఆర్టీసీ ప్రధాన సెంటర్ల నుంచి సర్వీసులను ప్రారభించింది. గొల్లపూడి-కృష్ణలంక బస్టాండ్, రామరపాడు రింగ్ రోడ్డు, సత్తినారాయణపురం బస్టాండ్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేకం సర్వీసులను నడపనుంది. 

 

నేడు ముస్లింలకు 'చంద్రన్న' రంజాన్ తోఫా అందజేత

విజయవాడ : నేడు పశ్చిమ నియోజకవర్గంలో 10 వేల మంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా అందజేయనున్నారు. నారా లోకేష్ చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ జరుగనుంది. 

 

07:52 - June 29, 2016

వానలు సమృద్ధిగా కురిస్తే జలాశయాలు నిండుతాయి. భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. పచ్చదనం పరుచుకుంటుంది. అంతా ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ అదేమి శాపమోకానీ చినుకుపడితే చాలు హైదరాబాద్ లో కన్నీటి కష్టాలు మొదలవుతాయి. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇదెక్కడి నరకంరా దేవుడా అన్నేంత బాధ కలుగుతుంది. 
కోటి మందికి పైగా హైదరాబాద్ లో జీవనం... 
కోటి మందికి పైగా జీవిస్తున్న మహానగరం హైదరాబాద్. ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది జనాభా పెరుగుతున్న విశ్వనగరం. మనదేశంలో అత్యధిక జనాభా వున్న నగరాలలో 4వ స్థానం ఆక్రమిస్తోంది మన భాగ్యనగరం. 2001 లో 36 లక్షల 37 వేల మంది వున్న హైదరాబాద్ జనాభా సంఖ్య 2011 నాటికి 68 లక్షలు దాటింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి జీహెచ్ఎంసి జనాభా కోటీ 20 లక్షలు దాటుతుందన్న అంచనాలున్నాయి. అయితే, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా సదుపాయాలూ, సౌకర్యాలూ సమకూరుతున్నాయా? అన్నదే ప్రశ్న.
తీరని ప్రజల కష్టాలు  
హైదరాబాద్ లో అభివృద్ధి జరగడం లేదని ఎవరూ అనరు. మన కళ్లెదుటే చాలా మార్పులొస్తున్నాయి. ఫ్లయ్ ఓవర్లు, అవుటర్ రింగ్ రోడ్డులు, ఎక్స్ ప్రేస్ వేలు, అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు, మెట్రో రైలు మార్గం నిర్మాణాలు, రోడ్ల వెడల్పులాంటి కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి. కానీ, ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇవన్నీ లేన్నప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ట్రాఫిక్ కష్టాలు అనుభవించారో ఇప్పుడు అదే రీతిలో బాధపడుతున్నారు. అంటే ఎక్కడో మన ప్రణాళికల్లోనే లోపం వుంది. ప్రజల అవసరాలకు ధీటుగా ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోవడం, ఎవరికివారు వ్యక్తిగత వాహనాల మీద ఆధారపడాల్సిన దుస్థితిని సృష్టించడమూ ట్రాఫిక్ సమస్య ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కావొచ్చు. 
డ్రైనేజీ పరిస్థితి ఘోరం
హైదరాబాద్ లో డ్రైనేజీ పరిస్థితి రోజురోజుకీ ఘోరంగా మారుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ జీవనదిగా పేరొందిన మూసీనదే పెద్ద మురికికాలవగా మారిపోయి, కంపు కొడుతోంది.  ఒకప్పుడు హైదరాబాద్ దాహార్తిని తీర్చిన చెరువులు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఒకవేళ ఎక్కడైనా మిగిలినా అవి పారిశ్రామిక వ్యర్థాలతో నిండిపోయి, కాలకూటవిషంగా మారుతున్నాయి.  నాళాలు మూసుకుపోతున్నాయి. కాలువలు పూడ్చేస్తున్నారు. ఆక్రమిస్తున్నారు. ఇవన్నీ హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి. 
చిరుజల్లులు పెద్ద పెద్ద సమస్యలు
డ్రైనేజీలు శుభ్రం చేయడం, డ్యామేజీ అయినచోటల్లా మరమ్మతులు చేయడం, రోడ్ల మీద గుంతలు పూడ్చడం,  రోడ్లు కిరువైపులా అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం, ఇష్టానుసారంగా అమర్చిన హోర్డింగ్ లను తీసేయడం,  
ఇవన్నీ వర్షాకాలం ప్రారంభానికి ముందే విధిగా చేయాల్సిన పనులు. కానీ, వీటినే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితమే చిరుజల్లులే పెద్దపెద్ద సమస్యలు సృష్టిస్తున్నాయి. కనీసం ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్స్ ను  కూడా మూసివేయడం లేదు. వాన కురిసిన ప్రతిసారీ మ్యాన్ హోల్స్ లో పడి మనుషులు చనిపోతున్నా, అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. 
ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లోపం
వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యాత్మకంగా మారుతోంది. కేబుల్ పనుల కోసం ఒకరు, డ్రైనేజీ పనుల కోసం ఇంకొకరు, వాటర్ వర్క్స్ కోసం ఇంకొకరు, మొక్కలు నాటడం కోసం ఇంకొకరు ఇలా రోజుకొకరు వచ్చి రోడ్లు తవ్వేస్తుంటారు. తవ్వినవారు తమ పనైపోగానే వెంటనే బాధ్యతగా పూడ్చివేయరు. ఒకరు తర్వాత ఒకరుగా తవ్వినచోటనే తవ్విపోస్తుంటారు.  దీనివల్ల ప్రజాధనం వ్రుధా అవడమే కాకుండా లేనిపోనిసమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. 

 

07:41 - June 29, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌... ఈ పేరింటేనే ఇపుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ' 2013 భూసేకరణచట్టం' ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. 
హైకోర్టులో మెత్తబడిన సర్కారు 
కుర్చీమీద కూర్చున్నది మొదలు... తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తొలిషాక్‌ మల్లన్నసాగర్‌ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. పరిహారం చెల్లింపుపై మంత్రి హరీష్‌రావు  ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శితో సమాలోచనలు జరుపుతున్నారు.  
123జీవో ప్రకారం 1లక్షా90వేల ఎకరాల సేకరణ
జీవో నంబర్‌ 123 ప్రకారం ఇప్పటిదాకా లక్షాతొంబైవేల ఎకరాలకుపైగా సేకరించింది కేసీఆర్‌ సర్కార్‌. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఇంకా 2లక్షల ఎకరాల వరకు  భూసేకరణ చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. కానీ... మల్లన్నసాగర్‌ దగ్గరకు వచ్చేసరికి భూసేకరణ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వాసితులు పోరుబాటపట్టారు. సర్కారు తీరును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో... పాలకులు దిగిరాకతప్పలేదు. 123జీవో ప్రకారం భూములను ఇచ్చేందుకు ఇష్టడని రైతులకు... 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇస్తామంటూ.. న్యాయస్థానం ముందు ఒప్పుకోవాల్సి వచ్చింది.
123జీవో వద్దు.. 2013 చట్టమే ముద్దు- నిర్వాసితులు
కోర్టు ఆదేశంతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టైంది కేసీఆర్‌ ప్రభుత్వానికి.  ఇంకా సేకరించాల్సిన లక్షలాది ఎకరాలకు  2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటే ...ఖర్చు తడిసిపోపెడయ్యే అవకాశం ఉంది. పైగా జీవో123 ప్రకారం తమ భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు ...తమకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాలని పేచీపెడుతున్నారు. దీంతో  మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరవుతోంది టీఆర్‌ఎస్‌ సర్కారు. జీవో 123 ప్రకారం అయితే... భూములకు మాత్రమే పరిహారం ఇస్తే సరిపోయేది. కాని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారంతోపాటు... నిర్వాసితులకు పునరావాసం కూడా కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం వేసుకున్న అంచనాలకు... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకుండా పోవడంతో... మొత్తం  ఖర్చు ఎంతొస్తుందోనని లెక్కలు కడుతున్నారు మంత్రి హరీష్‌రావు. 
4ఏళ్లలో ప్రాజెక్టు పూర్తికాకుంటే భూములు వాపస్‌ ఇవ్వాల్సిందే
ఇదిలావుంటే... అటు టీజేఏసీ మరింత స్పీడ్‌ పెంచింది. నిర్వాసితుల తరపున జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ గొంతుపెంచారు. భూసేకరణలో లొసుగులను ప్రజల్లో ఎత్తిచూపుతున్నారు. 2013 చట్ట ప్రకారం పరిహారం ఇచ్చినా... 4ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేయకుంటే.. భూములను తిరిగి ఇచ్చేయాలనే నిబంధనలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.
ప్రభుత్వానికి తలనొప్పి 
మొత్తనానికి మల్లన్నసాగర్‌ దగ్గరకు వచ్చేసరికి సర్కార్‌కు నీళ్లుతాగించారు నిర్వాసితులు. దీనికి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తోడవడంతో ప్రభుత్వానికి  తలనొప్పిగా మారింది. అయినా.. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామంటూ పాలకులు మేకపోతుగాభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

07:30 - June 29, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ మరో ఉద్యమానికి సిద్ధమవుతోంది. హైకోర్టును తక్షణమే విభజించాలంటూ కేంద్రంపై ఒత్తిడి  పెంచుతున్నారు. జడ్జీల నియామకంపై కేంద్ర హోంమంత్రి,.. సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రికి కేసీఆర్‌ లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో, కేంద్రంలోనూ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 
తీవ్ర అసంతృప్తిలో టీఆర్‌ఎస్‌
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లైనా.. హైకోర్టును విభజించకపోవడంతో అధికార గులాబీ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని రెండేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా న్యాయాధికారుల కేటాయింపుపై న్యాయవాదులతో పాటు.. జడ్జీలు కూడా ఆందోళనలు చేపట్టారు. దీంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల సీఎం కేసీఆర్‌ అసంతృప్తికి లోనయ్యారు. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని భావిస్తున్నారు. దీంతో హైకోర్టు విభజన అంశంపై ఢిల్లీలో ఆందోళన చేయాలని భావిస్తున్నారు. దీనిపై నేతలతో వ్యూహరచన చేస్తున్నారు. 
కేంద్రానికి లేఖ రాసిన కేసీఆర్‌
ఇందులో భాగంగా న్యాయాధికారుల నియామకంపై కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఉమ్మడి హైకోర్టును త్వరగా విభజించాలని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, డీవోపీటీ మంత్రి జితేందర్‌సింగ్‌లను లేఖలో కోరారు. మే 5న విడుదల చేసిన తాత్కాలిక కేటాయింపుల జాబితా న్యాయాధికారుల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు. విభజన చట్టంతోపాటు.. గతంలో రాష్ట్ర విభజన సమయంలో చేసిన విధంగా న్యాయాధికారుల కేటాయింపు జరగాలని.. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల ఏర్పాటు విధానాన్ని లేఖలో ప్రస్తావించారు.
న్యాయవ్యవస్థలో తెలంగాణకు అన్యాయం : ఎంపీ వినోద్‌
న్యాయవ్యవస్థలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఎంపీ వినోద్‌ అన్నారు. తెలంగాణకు ప్రత్యేక  హైకోర్టు  లేనందువల్లే న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందన్నారు. రెండేళ్లుగా హైకోర్టును విభజించాలని కోరుతున్నా ఏపీ సర్కార్‌ అడ్డుపడుతుందని తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంటున్నారు. మొత్తానికి హైకోర్టు విభజన అంశంపై మరోపోరుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఆందోళనలు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశాలను ఈరోజు జరగనున్న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో చర్చించి.. వ్యూహం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 

 

07:25 - June 29, 2016

గుంటూరు : అమరావతి రాజధాని కళ సంతరించుకుంటోంది. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోని అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొలువుతీరుతున్నాయి. ఈరోజు వెలగపూడిలో ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.59 నిమిషాలకు నాలుగు శాఖల కార్యాలయాలను కొత్త సచివాలయంలో మంత్రులు ప్రారంభించనున్నారు. ఏపీ తాత్కాలిక సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. అమరావతి నుంచే పాలన అంటూ ఊరిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు పాలన ప్రారంభమయ్యే తేదీని ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల 59 నిమిషాలకు తాత్కాలిక సచివాలయంలో విధులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
సచివాలయ సిబ్బంది తరలింపుపైనా దృష్టి 
వివిధ శాఖల సిబ్బందిని హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరులకు తరలించిన ప్రభుత్వం.. ఇప్పడు సచివాలయ సిబ్బంది తరలింపుపైనా దృష్టి సారించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి తాత్కాలిక సచివాలయంలో పాలన ప్రారంభం కావాలన్నది ప్రభుత్వ యోచన. దీనికోసం వెలగపూడి గ్రామ పరిధిలో 42 ఎకరాల్లో 200 కోట్లతో జీప్లస్ 1 భవనాలు రెడీ అయ్యాయి. జూన్ మొదటి వారానికల్లా మొత్తం భవనాలు పూర్తికావాల్సి ఉన్నా.. వర్షాలు ...నిర్మాణ సంస్థ లోపాల కారణంగా భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం 5వ బ్లాక్‌ను సిద్ధం చేసింది ఎల్ఎం టీ కంపెనీ. బుధవారం మద్యాహ్నం 5 వ బ్లాక్ ను.. జూలై 6 న ఫస్ట్ ఫ్లోర్ ను ప్రారంభించాలని నిర్ణయించింది సర్కార్.
అధికారుల కొలువుదీరే బ్లాకులు నిర్ధారణ
తాత్కాలిక సచివాలయంలో అమాత్యులు, అధికారుల కొలువుదీరే బ్లాక్‌లను ఇప్పటికే నిర్ధరించారు. 5వ బ్లాక్ , గ్రౌండ్ ఫ్లోర్ లో నలుగురు మంత్రులు , వారి శాఖలకు చెందిన కార్యదర్శులు, ఉద్యోగులు ఉండబోతున్నారు. వైద్య ఆరోగ్య, గృహనిర్మాణం, కార్మిక-ఉపాధి, పంచాయతీ రాజ్ శాఖల కార్యాలయాలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫ్లోర్ కంప్లీట్ కాగానే అందులో ఆర్ అండ్ బీ శాఖను తరలించాలనుకుంటోంది సర్కార్.
శరవేగంగా 5వ బ్లాక్ పనులు 
ప్రస్తుతం 4 శాఖల మంత్రులు అధికారులు రాబోతుండడంతో 5 వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని శరవేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే గదులకు సంబంధించిన పార్టిషన్ ను పూర్తి చేశారు. గదుల్లో సెంట్రల్  ఏసీ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్ వాటర్ సప్లై ..బాత్ రూమ్ ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేశారు అధికారులు. బుధవారం మద్యాహ్నానికి ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగుల చేరికకు అనువుగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
అమరావతి పరిసరాల్లో ఉత్సాహం
మొత్తానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 25నెలలకు.. ఏపీ పాలన స్వరాష్ట్రం నుంచే మొదలు కాబోతోంది. దీంతో అమరావతి పరిసరాల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చే ఉద్యోగులను స్థానికులు సాదరంగా స్వాగతిస్తున్నారు. 

 

07:15 - June 29, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రామ్‌కోఠి సెంటర్‌లో గంధం నాగరాజు అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రెండు వాహనాలపై వచ్చిన దుండగులు.. రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. నాగరాజును స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. నాగరాజుపై గతంలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో కూడా దాడి జరిగింది. 

07:11 - June 29, 2016

అంకారా : టర్కీలో బాంబుల మోత మోగింది. ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. దేశ రాజధాని, పర్యాటక కేంద్రమైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో కాల్పులు, ఆత్మాహుతి దాడులకు పాల్పడి 36 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరో 150 మందికి గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ టెర్మినలే లక్ష్యంగా మంగళవారం రాత్రి 10 గంటలకు ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఎయిర్ పోర్టు లోపల మూడు చోట్ల పేలుళ్లు జరిగినట్లు పోలీసులు తెలిపారు. 
దాడి ఇలా జరిగింది...
భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదులు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చిచంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తోన్న వందల మంది ప్రయాణికులపై ఎకె 47 తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్ వాతావరణం, పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది. ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహంగా మారిపోయింది. ఆత్మాహుతికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయినట్లు తెలిసింది. దాడులకు పాల్పడింది ఐఎస్ అనుబంధ సంస్థే అయి ఉండొచ్చని టర్కీ పోలీసులు భావిస్తున్నారు.
దాడులను ఖండించిన ఆ దేశ అధ్యక్షుడు  
ప్రపంచంలో అత్యంత రద్దీ పర్యాటక నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను ఆ దేశ అధ్యక్షుడు  ఖండించారు. దాడి సమాచారం తెలియగానే ప్రధానమంత్రి ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలు టర్కీకి సహకరించాల్సిందిగా కోరారు. విదేశీ టూరిస్టులే లక్ష్యంగా ఇటీవల టర్కీలో ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో గత డిసెంబర్ లో జరిగిన పేలుడులో ఇద్దరికి గాయపడ్డారు. ఇప్పుడు మరోసారి దాడి చేసిన టెర్రరిస్టులు 36 మందిని పొట్టన పెట్టుకున్నారు.
పేలుళ్ల ఘటనకు ప్రధాని మోడీ ఖండన
ఇస్తాంబుల్ పేలుళ్ల ఘటనను ప్రధాని మోడీ ఖండించారు. పేలుళ్ల మృతులకు సంతాపం ప్రకటించారు..గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా కలిసిపోరాడాలన్నారు.

 

 

న్యాయవాది జయవింధ్యాల ఆమరణ దీక్ష భగ్నం

హైదరాబాద్ : హైకోర్టులో న్యాయవాది జయవింధ్యాల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జయవింధ్యాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని నిన్న మధ్యాహ్నం నుంచి హైకోర్టులోని 11 వ నెంబర్ కోర్టులో జయవింధ్యాల ఆమరణ దీక్ష చేపట్టింది. 

జీడిమెట్లలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : జీడిమెట్లలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాద జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పొగలు  దట్టంగా అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

టర్కీలో మారణ హోమం.. 40 మంది మృతి

టర్కీ : ఉగ్రవాదులు టర్కీలో మారణ హోమం సృష్టించారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో మూడు చోట్ల ఆత్మాహుతి దాడులకు ప్పాలడ్డారు. పేలుళ్లలో 40 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఆత్మాహుతి దాడులకు ముందు ఎయిర్ పోర్టులోని కారు పార్కింగ్  లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 

Don't Miss