Activities calendar

30 June 2016

ఎన్ ఎంయూలో ఇరువర్గాల మధ్య సయోధ్య

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ ఎన్ ఎంయూలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. గుర్తింపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. 

22:04 - June 30, 2016

తెలుగు జనం నెత్తిమీద పుట్టెడప్పులు...రేపు రేపు ఉడకవిక మన పప్పులు, కేసీఆర్ చేతలమీద మేధావుల నజర్.. ప్రభుత్వం తప్పుజేస్తుందని నయా కబర్, మన్ కీ బాత్ కాపీ కొట్టిన నరేంద్రయ్య.. జనం బాత్ ఎప్పుడింటవయ్య, శరందప్పిన పనిజేసిన నెల్లూరు కాఖులు...ఎస్పీగారే ఆదుకోవాలంటున్న లోకులు, అస్సాంలో రోడ్డెక్కిన  అడివి జంతువు...రెండ్రోజులసంది అక్కడంత ఆగమాగం, డబుల్ సెంచరీకి చేరువలో చిన్నోడు... పదేండ్లకే పట్టుదప్పిన చిన్నోడు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

 

21:56 - June 30, 2016

హైదరాబాద్ : ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ ఇవాళ మరోసారి భేటీ అయింది. ఎపిఎఫ్, న్యాన్ క్యాడర్ డీఎస్పీలు, అడిషనల్ డీఎస్పీలు, కన్ఫర్మ్‌డ్‌ ఎస్పీల విభజనపై కమిటీ చర్చించింది. ఇక రేపు మొత్తం విభజన అంశాలపై అడ్వయిడరీ బోర్డ్ మీటింగ్ జరగనుంది. దీనికి డీవోపీటీ సభ్యులతో పాటు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, రీ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు దాదాపు 95శాతం డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగుల విభజన పూర్తయినట్లు కమల్ నాథన్ కమిటీ పేర్కొంది. 

21:54 - June 30, 2016

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. మొత్తం ఐదు రోజుల పర్యటనలో  టియాంజిన్‌, గుయాంగ్‌, గిజో, బీజింగ్‌ నగరాలను సందర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పారిశ్రామిక సంస్థల అధిపతులతో చర్చించి, పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా చైనా నుంచి రాష్ట్రానికి 58 వేల కోట్ల రూపాయాల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. LOOK..
చివరి రోజు చంద్రబాబు బృందం గిజోలో పర్యటన
చైనా పర్యటన చివరి రోజు చంద్రబాబు బృందం గిజోలో పర్యటించింది. గిజో నగరంలో జరిగిన ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో సీఎం పాల్గొన్నారు. రెండు వందలకు పైగా చైనా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు హాజరైన ఈ భేటీలో... ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవశాలను చంద్రబాబు వివరించారు. ఆయా సంస్థ యాజమాన్యాలు లేవనెత్తిన సందేహాలను బాబు నివృత్తి చేశారు. 
పవర్‌ చైనా గిజో ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులకు ఓకే 
పవర్‌ చైనా గిజో ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్‌ రంగాల్లో ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు కుదిరిన ఒప్పందాలపై పవర్ చైనా గిజో ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ గో వీ, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణ కిశోర్‌ సంతకాలు చేశారు. అలాగే చైనా స్టేట్‌ కన్‌స్ట్రక్షన్‌ ఫోర్త్‌ ఇంజినీరింగ్‌ కంపెనీతో కూడా ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పరిశ్రమల అభివృద్ధికి ఈ సంస్థ సహకారం అందిస్తుంది. 
పలు కంపెనీలతో ఒప్పందం..
ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సౌత్‌ హ్యూటన్‌ కంపెనీతో  చంద్రబాబు బృందం ఒప్పందం చేసుకుంది.  మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం గిజో మ్యారిటైం సిల్క్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీతో ఏపీ ప్రభుత్వం అగ్రిమెంట్‌ చేసుకుంది. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నెలకొల్పనున్న భవన నిర్మాణ పరికరాల తయారీ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన  గిజో చాంగ్‌ తైయువాన్‌ ఎనర్జీ-సేవింగ్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌  కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే గనుల తవ్వకంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చేందుకు  ఎసెడ్రిల్స్‌ రాక్‌ టూల్స్‌ కంపెనీతో అగ్రిమెంట్‌  చేసుకుంది.మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఈ ఒప్పందాలతో   రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
ప్రపంచలోని పది రాజధానుల్లో అమరావతి ఒకటి 
అమరావతి ప్రాధాన్యత ప్రస్తావన 
చైనా పెట్టుబడిదారులతో సమావేశమైన చంద్రబాబు... ఏపీ రాజధాని అమరావతి ప్రాధాన్యతను ఎక్కువగా ప్రస్తావించారు.  ప్రపంచంలోని పది అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్న విషయాన్ని చైనా పారిశ్రామికవేత్తల దృష్టికి  తీసుకెళ్లారు. రాజధాని నిర్మాణంలో  సింగపూర్‌, జపాన్‌, బ్రిటన్‌ దేశాలు భాగస్వామ్యమవుతున్న తరహాలోనే చైనా కూడా పాల్గొనాలని కోరారు. 
ఏపీలో పర్యాటక రంగంలో అవకాశాలు 
ఏపీలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను చంద్రబాబు చైనా బృందాల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రంగంలో 5.2 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వారికి తెలిపారు. చైనా పర్యటన ముగించుకున్న చంద్రబాబు బృందం గురువారం అర్ధరాత్రికి హాంకాంగ్‌ మీదుగా ఢిల్లీ చేరుకుంటుంది.  శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రు అరుణ్‌ జైట్లీ, ఉమాభారతితో బాబు భేటీ  అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన అపరిష్కృత సమస్యలపై చర్చిస్తారు.  

21:49 - June 30, 2016

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఎన్ ఐఎ అధికారులు అరెస్టు చేసిన ఐసిస్‌ సానుభూతిపరులకు నాంపల్లి కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌  విధించింది. నగరంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు వీరు పన్నిన కుట్రల గురించి మరింత  సమాచారం రాబట్టేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్ ఐఎ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నాంపల్లి క్రిమినల్‌ కోర్టు శుక్రవారం విచారించనుంది. 
ఐసిస్‌ సానుభూతిపరులకు 14 రోజులు రిమాండ్‌ 
హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఐసిస్‌ సానుభూతి పరులు ఐదుగురిని పోలీసులు నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వీరిని కోర్టుకు హాజరుపరిచారు. అభియోగాలను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితులకు జులై 14 వరకు రిమాండ్‌ విధించింది. 
పోలీసుల అదుపులో 11 మంది అనుమానితులు
బుధవారం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు అధికారులు పదకొండు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత ఆరుగురిని వదిలేశారు. మిగిలిన ఐదుగురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితులకు రిమాండ్‌ విధించగానే.. వారిని తమ కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఐటీ అధికారులు పిటిషన్‌ వేశారు. 
దేశవ్యాప్తంగా పేలుళ్లు, విధ్వంసానికి కుట్ర 
ఐఎస్‌ఐఎస్‌ అనుమానితులు జంటనగరాలతోపాటు దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు పాల్పడి విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నారని ఎన్‌ఐఏ అధికారులు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల వీరిని లోతుగా ప్రశ్నించిందుకు 15 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం పూర్తి వాదనల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
భాగ్యలక్ష్మి ఆలయం పేల్చివేతకు పన్నాగం 
ఐఎస్‌ఐఎస్‌ సానుభూతి పరులను అదుపులోకి తీసుకుని, ప్రశ్నించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.... కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం.. పాతబస్తీ చార్‌మినార్‌ను అనుకుని ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని పేల్చివేసేందుకు వీరు పన్నిన కుట్ర ఎన్‌ఐఏ అధికారుల కారణంగా భగ్నమైనట్లు సమాచారం. అలాగే నగరంలో  ఎక్కువ మంది భక్తులు సందర్శించే  మరికొన్ని దేవాలయాలను కూడా నిందితులు లక్ష్యంగా ఎంచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో  బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు హైదరాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌ను కూడా పేల్చివేడానికి వీరు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఐసిస్‌ సానుభూతిపరులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత వారి కుట్రలు మరిన్ని బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

21:44 - June 30, 2016

గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో దళితుల సాగు భూములు లాక్కునేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా... దళితుల సొసైటీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. జిల్లాకే చెందిన ఓ మంత్రి కనుసన్నల్లో గుట్టుచప్పుడు ఈ వ్యవహారం నడుస్తోంది. సొసైటీ భూముల్లో ఉన్న 5వేల కోట్ల విలువైన మైనింగ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ కుట్ర జరిగింది. అక్రమ పద్ధతిలో సొసైటీ రద్దుకు సంబంధించిన కీలక పత్రాలను టెన్ టీవీ సంపాదించింది. 

21:40 - June 30, 2016

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ అత్యాచార బాధిత మహిళలపై చేసిన వ్యాఖ్యలకు గాను జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు జారీ చేసింది. జూలై 8న కమిషన్‌ ముందు హాజరు కావాలని సల్మాన్‌ను ఆదేశించింది. అంతకు ముందు పంపిన నోటీసుపై సల్మాన్‌ఖాన్‌ క్షమాపణ చెప్పకపోవడంతో సంతృప్తి చెందని మహిళా కమిషన్‌- మళ్లీ సమన్లు జారీ చేసింది. త‌న తాజా చిత్రం 'సుల్తాన్‌' ప్రమోష‌న్‌లో భాగంగా స్పాట్‌బోయ్‌కు  ఇచ్చిన ఇంటర్వ్యూ సంద‌ర్భంగా సల్మాన్‌ఖాన్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  సినిమాలో రెజ్లర్‌గా న‌టించిన‌ అనుభ‌వం ఎలా ఉంద‌న్న ప్రశ్నకు.. రింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రతీసారీ తాను అత్యాచారానికి గురైన మ‌హిళ‌లాగా ఫీల‌య్యేవాడిన‌ని, అడుగులు స‌రిగా ప‌డేవి కావ‌ని స‌ల్మాన్ అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. సల్మాన్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

21:32 - June 30, 2016

హైదరాబాద్ : దేశంలో పేలుళ్లకు పథకం రచించిన ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులకు నాంపల్లి కోర్టు జులై 14వరకు రిమాండ్ విధించింది. దీంతో వీరిని చర్లప్లలి జైలుకు తరలించారు. మరోవైపు నిందితులను విచారించేందుకు అనుమతి కోరుతూ.. ఎన్ ఐఎ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూల్చేందుకు.. ఐసిస్ సానుభూతిపరులు కుట్రపన్నారని ఎన్‌ఐఏ విచారణలో వెల్లడయింది. 

 

21:23 - June 30, 2016

హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరుల రిమాండ్ రిపోర్ట్ ను.. టెన్ టీవీ ఎక్స్‌ క్లూజివ్‌ గా.. సంపాదించింది. ఇవాళ ఐదుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఐఏ... వారిని 30 రోజుల కస్టడీకి కోరింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందున... చట్టంలో ప్రత్యేక మినహాయింపు ఇస్తూ 30రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ ఐఎ విజ్ఞప్తి చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 121A, 122తో పాటు..  పేలుళ్ల చట్టం 1908 ప్రకారం 4,5, 18, 18డి, 35, 38 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 157, రెడ్ విత్ 165 సీఆర్పీసీ సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు విన్నవించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 2 పిస్టల్స్, బుల్లెట్స్, ఎయిర్ గన్, టార్గెట్ బోర్డ్, కెమికల్ ఎక్స్‌ప్లోజివ్ కూడా ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది. అంతకుముందు... ఎన్‌ఐఏ విచారణలో నిందితులు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూల్చేందుకు, హైదరాబాద్‌లో ఓ పోలీస్ స్టేషన్ పేల్చేందుకూ కుట్ర, నగరంలోని పలు ఆలయాలను టార్గెట్ చేసినట్లు నిందితులు వెల్లడించారు. 

21:09 - June 30, 2016

ప్రచారం హోరెత్తించారు..  అమెరికాపై పొగడ్తలు కురిపించారు... చివరికి భంగపాటే మిగిలింది...ఎన్ ఎస్ జీ సభ్యత్వంతో భారత్ కు ఒరిగేదేంటీ..? ఎన్ ఎస్ జీ కోసం కేంద్రం ఎందుకు ఆరాటపడుతోంది.?.  అణు రాజకీయంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.... ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:59 - June 30, 2016

డైరెక్టర్ కోదండరామిరెడ్డితో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన సినీ కెరీర్ ను వివరించారు. సినిమాల అనుభవాలను తెలిపారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

టెన్ టివి చేతిలో ఐసిస్ సానుభూతిపరుల రిపోర్టు

హైదరాబాద్ : టెన్ టివి చేతికి ఐసిస్ సానుభూతిపరుల రిపోర్టు చిక్కింది. ఈ రిపోర్టులో పలు విషయాలు వెల్లడయ్యాయి. 

 

20:13 - June 30, 2016

నెల్లూరు : అసలే పోలీసులు...అందులో సింహపురి పోలీసులు... జిల్లా పేరులోనే సింహం...తమ టోపీపైన సింహం ఉందనుకుంటున్న కొందరు పోలీసుల ఓవరాక్షన్ ఎన్నో తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి...కండకావరంతో కొందరు పోలీసుల వ్యవహారం పరువును బజారుకీడుస్తుంది... వరుసగా జరుగుతున్న ఘటనలు ఉన్నతాధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..తాజాగా జరిగిన మరో సంఘటన నడివీధిలో పడేస్తుంది...
యాక్షన్ తక్కువ...ఓవరాక్షన్ ఎక్కువ...
నెల్లూరు జిల్లా పోలీసుల యాక్షన్‌ తక్కువయింది... ఓవరాక్షన్‌తో తలనొప్పులు తెస్తున్నారు..ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే సిబ్బందిని హెచ్చరిస్తున్నా ఎవరో ఒకరు చేస్తున్న తప్పులు డిపార్ట్‌మెంట్‌ పరువును బజారుకీడుస్తున్నాయి.... తాజాగా రామలింగాపురం జంక్షన్‌లో జరిగిన ఘటన కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లయింది...
ఢీ కొట్టింది పోలీసు అధికారే...?
ఆస్పత్రిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న ఇతను జిలాని బాషా...నెల్లూరు రూరల్‌ మండలం కొమ్మరపూడి చెందిన జిలానీ బాషా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు..రోజూలానే రామలింగాపురం జంక్షన్‌లో ప్రయాణికుల కోసం చూస్తున్నాడు ..అదే సమయంలో దూసుకువచ్చిన AP 02 AJ 5679 నంబర్‌గల ఇన్నోవా వాహనం మూడు ఆటోలను ఢీ కొట్టింది... వాహనం నడుపుతున్నది ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ అధికారి కావడంతో అక్కడున్న ఆటోవాలాలు భయంతో పరుగులు తీశారు..సారు వారు మద్యం మత్తులో ఢీ కొట్టడంతో జిలానీ బాషా గాయాలపాలయ్యాడు...
బాషాతో బేరసారాలు..?
ఇక విషయం బయటపడ్డంతో వచ్చిన పోలీసులే తమవాడే కదాని విషయం బయటపడకుండా గాయపడ్డ ఆటోవాలా జిలాని బాషాను బుజ్జగించే పనిలో పడ్డారు..బేరసారాలు చేసిన పోలీసులు చివరకు బాధితుడిని ప్రభుత్వాసుపత్రిలో పడేశారు...సిఐ సాబ్ ను కాపాడేందుకు పోలీసులు గప్ చుప్ గా ఆనవాలు లేకుండా చేశారు...ఇక ఈ విషయంపై ఆరా తీస్తే పోలీసులు మాత్రం అసలేం జరిగిందన్నట్లు వ్యవహరిస్తున్నారు..చివరకు అసలు విషయం బయట పడడంతో ఈ ఘనకార్యానికి పాల్పడింది సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ అనితేలింది...
నంబర్‌తో ట్రేస్ చేస్తామంటున్న కాప్స్..
ఇక విషయం బయటపడడంతో పోలీసులు కూడా దిగిరావాల్సి వచ్చింది... కేసు నమోదు చేసేందుకు సిద్ధం కావాల్సి వచ్చింది..మీడియా వెళ్లి పోలీసులను వివరణ కోరితే నంబర్‌తో వాహనం ఎవరిదో తెలుసుకుంటామని..ఆ తర్వాత ఎవరు నడిపారో తెలుసుకుని నిర్ధారిస్తామని చెబుతున్నారు..
సింహపురి పోలీసుల కావరం కొత్తేం కాదు..
మరో ఇన్‌స్పెక్టర్ బూతుపురాణం 
ఇక నెల్లూరు జిల్లాలోని పోలీసు డిపార్ట్‌మెంట్లో కొందరి వ్యవహారం ఇప్పటికే బయటపడింది... మొన్నటికి మొన్న కలెక్టర్‌ చాంబర్లోకి దూసుకువెళ్లిన చిందులేసిన ఇస్కపల్లి మైరేన్‌ ఎస్సై రవికిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు..అంతకు ముందు కలిగిరి సీఐ సాంబశివరావు బాధితురాలిపట్ల వికృతంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు తలదించుకునేలా చేశాయి...
డిపార్ట్‌మెంట్‌ పరువు బజారుపాలు 
ఇలా ఎందరో పోలీసులు వారి చేష్టలతో డిపార్ట్‌మెంట్‌ పరువును కాస్త బజారుపాలు చేస్తున్నారు... ఇప్పటికైనా ఉన్నతాధికారులు సరైన చర్యలతో తప్పుడు దారిలో వెళ్తున్న సిబ్బందిని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది...

 

20:07 - June 30, 2016

పశ్చిమగోదావరి : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుక్కునూరు- వేలేరుపాడు మండలాల్లో ప్రధాన రోడ్లన్నీ  పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మండలాల్లో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. ఆర్‌&బి పంచాయితీ అధికారులు రోడ్లను పరిశీలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:57 - June 30, 2016

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకొని అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. దీంతో రాబోయే 3రోజుల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి చెప్పారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

జులై 14 వరకు నిందితులకు రిమాండ్

హైదరాబాద్ : ఎన్ ఐఎ అధికారులు.. ఐసిస్ సానుభూతిపరులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఐసిస్ సానుభూతిపరులు కుట్రపన్నారని ఎన్ ఐఎ విచారణలో వెల్లడించారు. నగరంలోని పలు ఆలయాలను టార్కెట్ చేశారని వెల్లడైంది. జులై 14 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. ఎన్ ఐఎ కస్టడీ పటిషన్ దాఖలు చేసింది. ఎన్ ఐఎ కస్టడీ పిటిషన్ పై రేపు విచారణ జరుగనుంది.  

 

సరూర్ నగర్ మండల ఆఫీస్ లో ఎసిబి సోదాలు

హైదరాబాద్ : సరూర్ నగర్ మండలం ఆఫీస్ లో ఎసిబి సోదాలు నిర్వహించింది. షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

నైజీరియాలో విశాఖ వాసి శ్రీనివాస్ కిడ్నాప్‌...

విశాఖ : నైజీరియాలో విశాఖ వాసి సాయి శ్రీనివాస్ కిడ్నాప్‌కు గురయ్యాడు. జిబోకో నగరంలో సాయి శ్రీనివాస్ కిడ్నాప్ జరిగింది. విశాఖ సిరిపురంకు చెందిన సాయి శ్రీనివాస్ నైజీరియాలోని డంకోటా సిమెంట్‌లో మూడేళ్లుగా సివిల్ ఇంజినీర్ గా... పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో శ్రీనివాస్ ఇవాళ కిడ్నాప్ కు గురయ్యాడు. అతని కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. 

19:38 - June 30, 2016

విశాఖ : నైజీరియాలో విశాఖ వాసి సాయి శ్రీనివాస్ కిడ్నాప్‌కు గురయ్యాడు. జిబోకో నగరంలో సాయి శ్రీనివాస్ కిడ్నాప్ జరిగింది. విశాఖ సిరిపురంకు చెందిన సాయి శ్రీనివాస్ నైజీరియాలోని డంకోటా సిమెంట్‌లో మూడేళ్లుగా సివిల్ ఇంజినీర్ గా... పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో శ్రీనివాస్ ఇవాళ కిడ్నాప్ కు గురయ్యాడు. అతని కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. 

 

19:30 - June 30, 2016

నల్గొండ : కొత్త జిల్లాలు ప్రజలకు ఏం మేలు చేస్తాయో కానీ.. రియల్టర్లకు మాత్రం కనక వర్షం కురిపిస్తున్నాయి. భూముల ధరలకు విపరీతమైన రెక్కలొచ్చేస్తున్నాయి. జిల్లా, మండలం, గ్రామం అన్న తేడా లేకుండా... ఎక్కడ సెంటు భూమి కనబడ్డా.. దాన్ని సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు రియల్‌ వ్యాపారులు. ఇక దళారుల హడావుడి చెప్పనలవి కాదు. నల్లగొండ జిల్లాలో కొత్త జిల్లాల పేరిట రియల్టర్ల దందాపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. 
భూముల ధరలకు రెక్కలు
తెలంగాణలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఇంతకాలం హైదరాబాద్‌కే పరిమితమైన రియల్‌ వ్యాపారం.. ఇప్పుడు జిల్లాలకూ పాకింది. మరీ ముఖ్యంగా.. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఇలా షురూ అయిందో లేదో... రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రయ్యిన దూసుకు పోతోంది. 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం
రాజధానికి సమీపంలోని నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్వవస్థీకరించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ఇంతకాలం స్థబ్దుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. ప్లాట్లను అమ్మేసుకునేందుకు వ్యాపారులు తీరొక్క కథలు చెబుతున్నారు. ఇదిగో ఇక్కడే ఫలానా ప్రభుత్వ కార్యాలయం వస్తోందంటూ ఊరిస్తూ.. కస్టమర్లను వలలో వేసుకుంటున్నారు. దళారులు.. రియల్‌ వ్యాపారులు కలిసి.. వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ముఖ్యంగా నల్లగొండతో పాటు, సూర్యాపేట, భువనగిరి, యాదాద్రి ప్రాంతాల్లో ఈ రకం దందా జోరుగా సాగుతోంది. 
భూముల ధరలు పెంపు
నల్గొండ అర్బన్‌, సూర్యాపేట అర్బన్‌, భువనగిరి అర్బన్‌, కోదాడ అర్బన్‌, మిర్యాలగూడ అర్బన్‌, గట్టుప్పల్‌, హాలియా పరిధిలోని తిరుమలగిరి, కొండమల్లేపల్లి, అడ్డగూడూరు, మోటకొండూరు, నేరేడుగొమ్ము, మాడ్గులపల్లి, నాగారం... కొత్త మండలాలుగా ప్రతిపాదించిన నేపథ్యంలో సందట్లో సడేమియలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి దళారులు తమ పని కానిస్తున్నారు. సూర్యాపేటను కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందని సీఎం ప్రకటించినప్పటి నుంచి రియల్టర్లు ఈ ప్రాంతంపై కీలకంగా దృష్టిని కేంద్రీకరించారు. ఎప్పుడూ లేని విధంగా భూముల ధరలు పెంచేశారు.  
ఎకరా భూమి.. కోటిన్నర 
ఇంతవరకు కార్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకున్నా.. ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బాలెంల, గాంధీనగర్‌, కాసరబాద, కుడకుడ ప్రాంతాల్లో రియల్‌ దందా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో గతంలో 25 లక్షలు ఉన్న ఎకరా భూమి, ఇప్పుడు కోటిన్నర వరకు పలుకుతుంది.  
తాత్కాలికంగా అద్దె భవనాల్లో కార్యాలయాలు 
కొత్త జిల్లాలు ఏర్పాటైనా... అసలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే అవకాశం లేదనేది మరో వాదన. తాత్కాలికంగా అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా.. ఫలానా చోట కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారంటూ.. రియల్ దళారులు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. అందుకే.. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే ఓ ప్రకటన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
'రియల్' దళారులు
యాదాద్రి పేరుతో రూపు దిద్దుకోనున్న కొత్త జిల్లాలో భువనగిరి ఆలేరు, నకిరేకల్‌, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల నుంచి మొత్తం 17 మండలాలు చేరబోతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంతాల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయలన్నట్లు కొనసాగుతోంది. జిల్లాల ప్రభావం అంతగా లేనప్పటికీ.. రియల్ దళారులు మాత్రం తమకనుకూలంగా ప్రచారం నిర్వహిస్తూ.. గుట్టలు, కొండలు చదును చేస్తూ... వెంచర్ల రూపంలో సొమ్ముచేసుకునే పనిలో పడ్డారు.  
యాదగిరిగుట్ట సమీప మండలాల్లో భూ క్రయవిక్రయాల నిలిపివేత 
భువనగిరి ప్రాంతంలో, యాదాద్రి టెంపుల్ సిటీ కోసం భూసేకరణలో భాగంగా.. గుట్ట సమీప మండలాల్లో భూ క్రయవిక్రయాలను ప్రభుత్వం నిలిపేసింది. దీన్ని కూడా రియల్‌ వ్యాపారులు అవకాశంగా మలుచుకుని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి వెంట యాదాద్రి నుంచి హైదరాబాద్‌ వరకు రియల్‌ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకున్నా.. ఈ ప్రాంతంలో వెంచర్లు వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా..  జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టతనివ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

18:13 - June 30, 2016

పేద ప్రజల కన్నీటి  ప్రవాహం  మీద, మహిళల జీవనోపాధికి  సమాధి కట్టే శిధిలాల మీద,  అందరికీ అన్నం పెడుతున్న  అన్నదాతల  కడుపు ల మీద, తరాల జీవన విధానానికి  చెల్లించలేని  అపారమూల్యం  మీద అభివృద్ధి పేరుతో  జరపబోతున్న  నిర్మాణం మల్లన్న సాగర్.  ఈ యజ్ఙంలో  బాధితులకు  దక్కే  ప్రయోజనమెంత ? మహిళల కుండే  ఉపాధి అవకాశాలెంత ? వారికి దక్కే ఆత్మగౌరవమెంత ? తిరిగి వారు నిర్మించుకునే  జీవితమెంత? మానవి ప్రత్యేక కథనం. 

ఏ అభివృద్ధి నమూనా అయినా ఎలా ఉండాలి? ఎంత తక్కువ నష్టంతో  నిర్మాణం జరగాలి?  అంతిమంగా వాటి  ఫలాలు ఎవరికందాలనేదే  అభివృద్ధి పేరుతో  అపారనష్టం జరిగే  విధ్వంసం  సాక్షిగా, ప్రతిసారీ  ఎజెండా మీదకొచ్చే అంశం. ఇప్పుడు  మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం  విషయంలో మరోసారి తెరమీదకొచ్చిన  అంశం. ఎట్టిపరిస్థితుల్లోనూ  తమ భూములు వదులుకునేది లేదని మహిళలు ముక్తకంఠంతో చేస్తున్న నినాదం. 

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల మరింతమంది బాధిత మహిళల  కన్నీటి గోస వినేముందు మానవిలో ఇప్పుడో స్వల్ప విరామం.

ముంపుగ్రామాల ప్రజలు, మహిళలు, విద్యార్థులు  ఇంతగట్టిగా వ్యతిరేకిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  ప్రత్యామ్నాయమే  లేదా? పాలకులు ఎందుకు ఆ దిశగా ఆలోచించడం లేదు. 

ప్రభుత్వం ఇకనైనా మహిళల గోస ఆలకించాలని మానవి కోరుకుంటోంది.  ముంపు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు , నిపుణుల చెప్తున్న ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించాలని  ఆకాంక్షిస్తోంది. మహిళల సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నామని చెప్పే పాలకులు ముంపు గ్రామాల మహిళల  ఆవేదనని అర్థం చేసుకుంటారని ఆశిస్తోంది. 

17:56 - June 30, 2016

హైదరాబాద్ : జడ్జిల నియామకం అనేది సుప్రీం కోర్టు పరిధిలో ఉంటుందని..దానికి కొలిజియం వ్యవస్థ అనేది ఒకటి ఉంటుందని.. దాని ప్రకారమే జరుగుతుందని ఏపీ టీడీపీ నేత కేశినేని అన్నారు. సెక్షన్ 30 ప్రకారం పదేళ్ల వరకు ఉమ్మడిగానే హైకోర్టు కొనసాగాలని ఉందని గుర్తు చేశారు. దీంతో టీడీపీ పార్టీకిగాని చంద్రబాబుకు కాని ఏం సంబంధం ఉందని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద విద్వేషాలను రగులుస్తున్నారని పేర్కొన్నారు.

 

17:53 - June 30, 2016

ఢిల్లీ : ప్రపంచ హాకీ పురుషుల ర్యాంకింగ్స్ లో భారత జట్టు తన స్థానాన్ని గణనీయంగా మెరుగు పరచుకొంది. లండన్ లో ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు రన్న రప్ స్థానంతో పాటు రజత పతకం గెలుచుకోడం ద్వారా 7వ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్ కు ఎగబాకగలిగింది. ప్రపంచ హాకీ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్ మొదటి నాలుగుస్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్న గ్రేట్ బ్రిటన్, భారత్ మధ్య కేవలం 8 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. మహిళల ర్యాంకింగ్స్ లో నెదర్లాండ్స్, అర్జెంటీనా మొదటి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ ర్యాంకింగ్స్..రియో ఒలింపిక్స్ ముగిసే వరకూ ఉంటాయి. రియో ఒలింపిక్స్ హాకీ పోటీలు ముగిసిన తర్వాత మరోసారి ర్యాంకింగ్స్ ను సవరిస్తారు.

17:50 - June 30, 2016

లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ కు టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ చేరుకొన్నారు. మహిళల సింగిల్స్ లో మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా రెండోరౌండ్ కు అర్హత సాధించింది. 10వ సీడ్ థామస్ బెర్డిచ్ సైతం అతికష్టం మీద రెండోరౌండ్ బెర్త్ సంపాదించాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టులో ముగిసిన రెండోరౌండ్ పోటీల్లో...అడ్రియన్ పై జోకోవిచ్, మార్కుస్ పై ఫెదరర్ విజయాలు సాధించారు. రెండో రౌండ్లో జోకోవిచ్ కు అడ్రియన్ నుంచి గట్టి పోటీనే ఎదురయ్యింది. చివరకు జోకో 6-4, 6-3, 7-6 విజయంతో మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. మరో రెండో రౌండ్ పోటీలో బ్రిటీష్ క్వాలిఫైయర్, 772వ ర్యాంకర్ మార్కుస్ విల్స్ ను అధిగమించడానికి మూడో సీడ్ ఫెదరర్ కొద్దిపాటిగా మాత్రమే శ్రమించాడు. తొలిసెట్ ను 6-0తో నెగ్గిన ఫెదరర్ కు ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. రెండోసెట్ ను 6-3, ఆఖరి సెట్ ను 6-4తో ఫెదరర్ నెగ్గి..మూడో రౌండ్లో చోటు సంపాదించాడు. అయితే..అన్ సీడెడ్ మార్కుస్ మాత్రం..తొమ్మిది ఏస్ లు, 24 మ్యాచ్ విన్నర్లతో అభిమానులను అలరించాడు.

వర్షం ఆటంకం..
వర్షం కారణంగా ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలో 10వ సీడ్ థామస్ బెర్డిచ్ విజయం కోసం తుదివరకూ పోరాడాల్సి వచ్చిది.ఇవాన్ డోడిగ్ తో జరిగిన నాలుగుసెట్ల సమరంలో బెర్డిచ్ 7-6, 5-7, 6-1, 7-6తో విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ లో...రెండుసార్లు చాంపియన్, చెక్ స్టార్ ప్లేయర్ పెట్రా క్విటోవా..2016 వింబుల్డన్ లో తొలివిజయం నమోదు చేసింది. రుమేనియా ప్లేయర్ సోరానా క్రిస్టియా పై క్విటోవా 6-0, 6-4 విజయంతో రెండోరౌండ్లో అడుగుపెట్టింది. ఇప్పటికే రెండుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన క్విటోవా..మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగింది. మొత్తంమీద 2016 వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లను..విజయవంతంగా ముగించగలిగారు.

17:46 - June 30, 2016

హైదరాబాద్ : ప్రో-కబడ్డీ నాలుగో సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతుంటే తెలుగు టైటాన్స్ మాత్రం వరుస పరాజయాలతో అట్టడుగుకు పడిపోయింది. ముంబై అంచెలో భాగంగా ఈరోజు జరిగే ఆఖరి మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ తో బెంగళూరు బుల్స్ ఢీ కొంటుంది. ముంబై అంచెలో భాగంగా జరిగిన పోటీల్లో తెలుగు టైటాన్స్ ను జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబాను పట్నా పైరేట్స్ జట్లు అధిగమించాయి. మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తో ముగిసిన పోటీలో తెలుగు టైటాన్స్ నాలుగు పాయింట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆట ప్రారంభంలో జోరు ప్రదర్శించిన తెలుగు టైటాన్స్...ఆ తర్వాత పోటీ కీలక దశలో పొరపాట్లు చేసి వెనుకబడిపోయింది. టైటాన్స్ స్టార్ రైడర్ సందీప్ నర్వాల్ 6 పాయింట్లు, వినోద్, నీలేశ్ చెరో నాలుగు పాయింట్లు సాధించినా జైపూర్ ను నిలువిరించలేకపోయారు.

మొదటి ఆట భాగంలో పూర్తి ఆధిపత్యం.
జైపూర్ రైడర్ రాజేశ్ నర్వాల్ అత్యధికంగా 8 పాయింట్లు సాధిస్తే...జస్వీర్ సింగ్ , అమిత్ హుడా చెరో మూడు పాయింట్లు సంపాదించారు. టాక్లింగ్ లో జైపూర్ డిఫెండర్ మహీపాల్ నర్వాల్ 2 పాయింట్లు సాధించాడు. ప్రస్తుత సీజన్లో తెలుగు టైటాన్స్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా జైపూర్ పింక్ పాంథర్స్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగిన మరోపోటీలో హాట్ ఫేవరెట్ పట్నా పైరేట్స్ 36-34 పాయింట్లతో యూ-ముంబాను అధిగమించింది. రైడింగ్, బ్లాకింగ్ అంశాలలో రెండుజట్లూ సమఉజ్జీలుగా తలపడ్డాయి. అయితే..పట్నా పైరేట్స్ ఆట మొదటిభాగంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తే రెండో భాగంలో యూ-ముంబా పుంజుకొని ఆడి గట్టి పోటీ ఇచ్చింది.

పల్టాన్ 2 విజయాలు..
పట్నా పైరేట్స్ రైడర్లలో కుల్దీప్ 5, బాజీరావ్ 4 పాయింట్లు సాధించారు. బాజీరావ్ కేవలం టాక్లింగ్ ద్వారా నాలుగు పాయింట్లు సాధించడం విశేషం. యూ-ముంబా ఆటగాళ్లలో రిషాంక్ దేవడిగ ఒక్కడే 11 పాయింట్లు నమోదు చేశాడు. అనూప్ కుమార్ 6 పాయింట్లు, సుర్జీత్, రాకేశ్ చెరో మూడు పాయింట్లు తమ జట్టుకు అందించారు. యూ-ముంబా తుది వరకూ పోరాడినా...2 పాయింట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు రౌండ్లలో పూణేరీ పల్టాన్ 2 విజయాలు, ఓ టై, ఓ ఓటమితో 14 పాయింట్లు సాధించి...లీగ్ టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. పట్నా పైరేట్స్ రెండుకు రెండు రౌండ్లూ నెగ్గి 10 పాయింట్లతో రెండు, బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మూడు,నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలుగు టైటాన్స్ రెండుకు రెండు రౌండ్లు ఓడి..ఒకే ఒక్క పాయింట్ తో లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయింది.

17:38 - June 30, 2016

మెదక్ : జిల్లాలోని ఘన్‌పూర్‌ ఆనకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూసేకరణ నోటిఫికేషన్ లేకుండానే ఆనకట్ట ఎత్తు పెంచే పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పనులను గ్రామస్తులు, సీపీఎం నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసుల మోహరించారు. నోటిఫికేషన్ లేకుండా భూసేకరణ చేయడం చట్ట ఉల్లంఘనేనని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్‌ అన్నారు. ప్రభుత్వం, అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభత్వం చట్టం విరుద్ధంగా, అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నిబంధనలు, చట్టాలను అతిక్రమించి కడితే శవాలపై ప్రాజెక్టుల కట్టినట్టే అవుతుందని చెప్పారు. 

ఐసీస్ సానుభూతి పరులకు రిమాండ్..

హైదరాబాద్ : ఐసీసీ సానుభూతిపరులకు కోర్టు రిమాండ్ విధించింది. కొద్దిసేపటి క్రితం ఐదుగురు సానుభూతి పరులను ఎన్ఐఏ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. పదిహేను రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది. జులై 14 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు..

హైదరాబాద్ : తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం రూ. 300 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేటు ఆసుపత్రులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం మాట తప్పిందని పేర్కొంటున్నాయి. రూ. 300 కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ. 40 కోట్లే డిపాజిట్ చేసిందని తెలిపింది.

17:22 - June 30, 2016

హైదరాబాద్ : సామాన్య మానవుడికి మళ్లీ ఆరోగ్య కష్టాలు రానున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోనున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌ల సంఘం ప్రకటించింది. గతంలో సమ్మె చేపట్టినా బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీనిచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన మాట ప్రభుత్వం నిలపెట్టుకోలేదని సంఘం పేర్కొంటోంది. 133 ఆసుపత్రులకు సంబంధించి రూ. 300 కోట్ల బకాయిలున్నాయని, వెంటనే బకాయిలు తీర్చాలని మే 2వ తేదీన అల్టిమేటం జారీ చేసింది. దీనితో ప్రభుత్వం దిగివచ్చిన వారితో చర్చలు జరిపింది. అనంతరం నాలుగైదు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని హామీనిచ్చింది. కానీ ఈ గడిచిన రోజుల్లో కేవలం పదిహేను శాతం అంటే రూ. 40కోట్లు మాత్రమే ప్రభుత్వం డిపాజిట్ చేసిందని సంఘం తెలుపుతోంది. ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చింది. కానీ సమస్య మాత్రం తీరకపోవడంతో సమ్మెలోకి వెళ్లాలని గురువారం నిర్ణయించుకుంది. నష్టాలతో తాము ఆసుపత్రులను నిర్వహించుకోవడం జరుగుతోందని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. మరి ప్రభుత్వం స్పందించి బకాయిలను చెల్లిస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

17:16 - June 30, 2016

హైదరాబాద్ : నగరంలో భారీ విధ్వంసానికి ఎన్ఐఏ చెక్ పెట్టింది. బుధవారం నగరంలో 13 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వీరి నుండి పలు విషయాలు రాబట్టింది. అనంతరం ఆరుగురుని విడిచిపెట్టారు. మిగతా ఐదుమందిని కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. జస్టిస్ ఛాంబర్ లో ఎన్ఐఏ అధికారులు ఐసీస్ అనుమానితులను హాజరు పరిచే సమయంలో ఎవరని లోనికి అనుమతించలేదు. పదిహేను రోజుల పాటు వీరిని కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది.

పేలుళ్లకు కుట్ర..
ఇక ఎన్ఐఏ రూపొందించిన రిమాండ్ రిపోర్టులో విచారణలో సంచలనాత్మక విషయాలు పొందుపరిచారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని కూల్చేందుకు పక్కా వ్యూహ రచన చేసినట్లు తేలింది. అంతేగాకుండా హైదరాబాద్ లో ఓ పీఎస్ ను పేల్చివేసేందుకు.. నగరంలో పలు ఆలయాలను వీరు టార్గెట్ చేశారని వెల్లడైంది. ప్రస్తుతం ఐసీస్ అనుమానితులను ఎన్ఐఏ కస్టడీకి ఇస్తుందా ? వీరిని ఢిల్లీకి తీసుకెళుతారా ? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎన్ఐఏ పెద్ద విధ్వంసాన్ని ఆపివేసినట్లైంది.

  • నగరంలో ఉగ్రవాదుల కదలికను గుర్తించిన ఎన్‌ఏఐ అధికారులు..ఒకటి కాదు... రెండు కాదు... పాతబస్తీలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
  • నగర పోలీసులు సహకారంతో మంగళవారం అర్ధరాత్రి పాతబస్తీని జల్లెడ పట్టారు. తాలబ్‌కట్ట, భవానీనగర్‌, మొగల్‌పురా, బార్కస్‌, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్‌, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా ... తదితర ప్రాంతాల్లో క్షణ్ణంగా గాలించారు.
  • ఐసిస్‌తో సంబంధాలున్న 11 మందిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
  • మహ్మద్‌ ఇబ్రహీం యజ్దాని, మహ్మద్‌ ఇలియాస్‌ యజ్దాని, అబ్దుల్లాబిన్‌ అహ్మద్‌ అల్మోది, అబిన్‌ మహ్మద్‌, ముజఫర్‌ హుస్సేన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, హబీబ్‌ మహ్మద్‌, సయీద్‌ నైమత్‌ ఉల్లా హుస్సేనీ, ముజఫర్‌ హుస్సేన్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ అతుల్లా రహ్మాన్‌, మహ్మద్‌ అర్బాజ్‌ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నారు.
  • వీరిలో ఆరుగురిని విడుదల చేశారు.
  • అరెస్టైన నుంచి భారీగా పేలుడు పదార్ధాలతోపాటు 15 లక్షల రూపాయల నగదు, విదేశీ కరెన్సీ, రెండు 9ఎంఎం పిస్టళ్లు, 23 సెల్‌ ఫోన్లతోపాటు, ఎయిర్‌గన్‌, ఏడు పెన్‌ డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
  • ట్యాబ్‌, సీపీయూ, డాంగిల్‌, టార్గెట్‌ బోర్డులు, హీటర్‌ టైమర్‌, ప్రజర్‌ టైమర్‌, కండెన్సర్‌, విదేశీ కత్తులు, బిగ్‌ స్క్రీన్‌ డ్రైవర్స్‌, పెయింట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లతోపాటు రసాయనాలు, యూరియాను కూడా స్వాధీనం చేసుకున్నారు.
16:52 - June 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ఫైళ్ల తరలింపులో వివాదం తలెత్తింది. మాసబ్ ట్యాంక్ లోని బీసీ సంక్షేమ భవన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణకు దిగారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఫైళ్లను ఏపీకి తరలిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో.. ఉద్రిక్తత నెలకొంది. ఫైళ్ల తరలింపు ప్రక్రియ ఆగిపోయింది. 

నాంపల్లి కోర్టులో ఐసీస్ సానుభూతి పరులు...

హైదరాబాద్ : ఐదుగురు ఐసీస్ సానుభూతి పరులను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. పదిహేను రోజుల కస్టడీ ఎన్ఐఏ కోరనుంది. విచారణలో కీలక విషయాలు రాబట్టింది. పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని కూల్చేందుకు..హైదరాబాద్ లో ఓ పీఎస్ ను పేల్చివేసేందుకు.. నగరంలో పలు ఆలయాలను వీరు టార్గెట్ చేశారని వెల్లడైంది.

16:16 - June 30, 2016

హైదరాబాద్‌ : నగరంలో ఐసిస్‌ సానుభూతిపరుల అరెస్ట్‌తో సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కారిడార్‌లోని... ఇనార్బిట్‌మాల్‌, సైబర్‌ టవర్లలో తనిఖీలు చేపట్టారు. మాదాపూర్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో అణువణువూ గాలిస్తున్నారు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు... జులై 6వరకూ అన్నిరకాల పాస్‌లు రద్దు చేశారు.. సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు..

హైదరాబాద్ : ఐసీస్ సానుభూతిపరులు పట్టుబడడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్లతో తనిఖీలు నిర్వహించారు. డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 

16:08 - June 30, 2016

హైదరాబాద్‌ : పాతబస్తీలో అరెస్టయిన ఇద్దరు సోదరుల్లో ఒకరిని ఎన్ ఐఎ విడుదల చేసింది. బుధవారం హబీబ్‌ అబ్దుల్ ఖాదర్‌, హబీబ్‌ మహ్మద్‌ జిలానీని అధికారులు అరెస్ట్‌ చేశారు. విచారణ తర్వాత అబ్దుల్‌ ఖాదర్‌ని విడుదల చేశారు. అతను ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భారత చట్టాలపై తనకు నమ్మకముందని... మరో కొడుకు కూడా విడుదలవుతాడని... విశ్వాసం వ్యక్తం చేశారు.

 

16:03 - June 30, 2016

కాబూల్ : ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. కాబూల్‌లో పోలీస్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది పోలీసులు మృతి చెందారు. పోలీసు వాహనంపై దాడి జరిపింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఇదిలావుంటే నిన్న టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతిచెందగా.. మరో 239 మంది గాయపడ్డారు. 

 

15:57 - June 30, 2016

హైదరాబాద్ : సిమెంట్‌ రోడ్లు విన్నాం..తారు రోడ్లు విన్నాం...కానీ కరెంట్‌ రోడ్లను ఎప్పుడైనా విన్నారా...లేదు కదూ. కరెంట్‌తో నడిచే కార్లకు, ట్రక్కులకు విద్యుత్‌ ఉత్తత్పి కోసం ఏకంగా కరెంట్‌ రోడ్లే తయారు చేస్తున్నారు స్వీడన్‌ శాస్త్రవేత్తలు. ఇక నుంచి కరెంట్‌ రోడ్లపై కార్లు రయ్యిరయ్యిమని దూసుకెళ్లేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.
రోడ్డు మీద కరెంటు 
కరెంటుతో నడిచే కార్లు గురించి విన్నాం. మరి వాటికి కరెంటు ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ బ్యాటరీ ఛార్జ్‌ చేసుకొని ఎక్కడైనా వెళ్తుంటే మధ్యలో బ్యాటరీ అయిపోతే... కష్టమే కదా. అందుకే స్వీడన్‌ శాస్త్రవేత్తలు ఏకంగా కరెంటు రోడ్లే తయారు చేస్తున్నారు. అంటే కరెంటుతో పని చేసే కారు... రోడ్డు మీద కరెంటు అందుకొని రయ్యి రయ్యిమని దూసుకుపోతుందన్నమాట. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న సాంకేతికతను 2030 కల్లా అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. 
భారీ వాహనాలను నడపొచ్చు.. 
ఈ రోడ్లపై ఏకంగా ట్రక్కుల్లాంటి భారీ వాహనాలను కూడా నడపొచ్చంటున్నారు. ఇప్పటికే ట్రయల్‌ రన్స్‌ జరుగుతున్నాయి. ఈ కరెంటు రోడ్లపై ఎలక్ట్రిక్‌ రైళ్లకు ఉన్నట్లుగా విద్యుత్తు కేబుళ్లు ఉంటాయి. ఆ కేబుళ్లను తాకేలా ట్రక్కుకు పైన హ్యాంగర్‌ లాంటి ఏర్పాట్లు చేశారు. దాని నుంచి విద్యుత్తు అందుకొని వాహనం నడుస్తుంది. మరోవైపు రోడ్డుకింద ప్రత్యేక ఏర్పాట్లు చేసి... ఆ రోడ్డు నుంచి వచ్చే విద్యుత్తు శక్తితో కారు నడిచేలా మరో ప్రయోగం కూడా జరుగుతోంది.

 

15:54 - June 30, 2016

టర్కీ : ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ ఎయిర్‌పోర్టులో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే దాడులకు పాల్పడి ఉంటారని టర్కీ ప్రభుత్వం భావిస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు అటాటర్క్‌ ఎయిర్‌పోర్టులోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 41 మంది మృతిచెందగా.. మరో 239 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే దాడులకు పాల్పడి ఉంటారని టర్కీ ప్రభుత్వం భావిస్తోంది.

15:51 - June 30, 2016

వాషింగ్టన్ : అమెరికాకు ఇస్లామిక్‌ స్టేట్‌ ముప్పు పొంచి ఉందని ఆ దేశ నిఘా సంస్థ హెచ్చరిస్తోంది. తమ దేశంలోనూ ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ ఇస్తాంబుల్‌ తరహా దాడులకు పాల్పడే అవకాశముందని సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జాన్‌ బ్రెనాన్‌ అన్నారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల దుర్మార్గాల్లో ఒకటని బ్రెనన్‌ అభిప్రాయపడ్డారు. ఐఎస్‌ఐఎస్‌ను అంతమొందించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. సంకీర్ణ దళాలతో కలిసి.. సిరియా, ఇరాక్‌లలో వైమానిక దాడులకు పాల్పడుతూ.. ఐఎస్‌ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ ప్రభావంతో ఐఎస్‌ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఎంతైనా ఉందని బ్రెనన్‌ అభిప్రాయపడ్డారు. దేశ నిఘాసంస్థ డైరెక్టర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

15:47 - June 30, 2016

ఢిల్లీ : అవినీతి ఆరోపణలతో గత పదేళ్ల నుంచి తనను టార్గెట్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ఈడీ నోటీసులు పంపడంపై స్పందించిన వాద్రా- ఇలాంటి నోటీసులకు తాను భయపడేది లేదని తన కామెంట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. గత పదేళ్లుగా ప్రభుత్వం తనపై  నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క కేసు కూడా రుజువు చేయలేరని ఆయన స్పష్టం చేశారు. తనను రాజకీయంగా వాడుకుంటున్నారని, తనపై వస్తున్న ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హరియాణాలో భూకుంభకోణానికి సంబంధించి జస్టిస్‌ ధీంగ్రా కమిటీ ప్రభుత్వానికి తన రిపోర్టును ఇవాళ సమర్పించనుంది.

 

15:47 - June 30, 2016

క్షణిక సుఖాలు పవిత్ర బంధానికి మచ్చ తెస్తున్నాయి. ఏడడుగుల బంధాన్ని అపహాస్యం చేస్తున్నాయి. నిధుల పేరిట ఆశలు కల్పించారు. కోట్ల రూపాయలు వస్తాయని పేక మేడలు వేశారు. వీటిని నమ్మిన అమాయకుడు తల ఊపుకుంటూ వారివెంట వెళ్లాడు. ఆ తరువాత ఏమైంది. ?

నమ్మకం అనే పునాదిపై ఏర్పడిన మాంగళ్య బలాన్ని పేక మేడల్లా కూల్చేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన హత్య ఇప్పుడు బయటపడింది. పక్కా స్కెచ్ వేసి అతడిని సజీవ దహనం చేశారు. నర్సింహులు..యాదమ్మ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. వీరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగింది. కానీ యాదమ్మ ఒకరితో ప్రేమలో మునిగిపోయింది. దీనికి భర్త అడ్డుగా వస్తున్నాడని అనుకున్న ఆ భార్య హత్య చేయాలని ప్లాన్ చేసింది. అనంతరం ప్రియుడితో పక్కా స్కెచ్ వేసింది. అనంతరం నర్సింహులును హత్య చేసింది. భర్త ముంబై వెళ్లాడని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. యాదమ్మ..ప్రేమించిన వ్యక్తితో డబ్బుల విషయంలో వివాదం చెలరేగింది. దీనితో హత్య విషయం బయటపడింది. పూర్తి విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:45 - June 30, 2016

రెండు కుటుంబాల మధ్య ఎన్నాళ్ల నుండో ఘర్షణ..ఎక్కడున్నారో తెలుసుకుని మరీ పంజా విసురుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదించినా మారడం లేదు..

ఏలూరు కాల్పులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. దశాబ్ధాలుగా రెండు కుటుంబాల మధ్య వైరం మరోసారి హత్యాయత్నంతో వారి మధ్య కక్షలు రగులుతూనే ఉన్నాయని చెప్పకనే చెబుతోంది. కూరపాటి, భూతం కుటుంబాల మధ్య వైరం ఎన్నాళ్ల నుండో కొనసాగుతోంది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఘర్షణపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. వైరానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపై జరగడానిక వీల్లేదని హుకుం జారీ చేశారు. నాగరాజుపై ఎలా దాడి చేశాడు ? దీనిపై పోలీసు ఉన్నతాధికారుల స్పందన తెలుసుకొనేందుకు వీడియో క్లిక్ చేయండి.

 

15:45 - June 30, 2016

ఢిల్లీ : కేంద్రం కాబినెట్‌ విస్తరణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం మంత్రులతో సమావేశం కానున్నారు. మంత్రుల పనితీరుకు సంబంధించిన రిపోర్ట్‌ కార్డును ప్రధాని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన మంత్రుల పనితీరుపై సమీక్షించి ఓ నిర్ణయానికి రానున్నారు. మంత్రుల మార్పులు చేర్పులకు సంబంధించి ప్రధాని మోది బుధవారం బిజెపి చీఫ్‌ అమిత్‌షాతో 5 గంటలపాటు చర్చించారు.  జూలై 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. జూలై 6 కన్నా ముందే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లకు పదోన్నతి కల్పిస్తారని సమాచారం.

ఏపీ, తెలంగాణ ఉద్యోగుల ఘర్షణ..

హైదరాబాద్ : బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీకి ఫైళ్ల తరలింపులో వివాదం తలెత్తింది. ఉమ్మడి ఫైళ్లను ఏపీకి తరలిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 

ఘన్ పూర్ ఆనకట్ట వద్ద ఉద్రిక్తత..

మెదక్ : జిల్లా ఘన్ పూర్ ఆనకట్ట వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ సేకరణ నోటిఫికేషన్ లేకుండానే ఆనకట్ట ఎత్తును పెంచే పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పనులను సీపీఎం శ్రేణులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. 

15:04 - June 30, 2016

మెదక్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం అన్యాయంగా రైతులు భూములు లాక్కోవడం సరికాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యనం చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం,  రైతుల భూములు లాక్కోవడం సరికాదని అన్నారు. భూములు తీసుకోవడం తప్పనిసరైతే, 2013చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు న్యాయం కోసం నాలుగురోజుల పాటు సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జూలై1 నుంచి జూలై 4 వ తేదీ వరకు పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. పాదయాత్ర ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. న్యాయం కోసం సీపీఎం ప్రజాసంఘాలతో కలిసి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

 

15:03 - June 30, 2016

'అనుష్క' టాలీవుడ్ లో అగ్ర సరసన హీరోలతో పాటు కుర్ర హీరోలతో ఆడిపాడి నటి. ప్రస్తుతం కొన్ని వుడ్ లలో నటిస్తున్న ఈ స్వీటీ ఒక పాత్ర కోసం సాహసమే చెయబోతున్నట్లు తెలుస్తోంది. ఎంటా సాహసం..అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
'వేదం' సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ 'బాహుబలి' పస్ట్ పార్ట్ లో బానిసగా నటించింది. 'రుద్రమదేవి'లో రాణిగా నటించిన ఈ ముద్దుగుమ్మ విమర్శకుల ప్రశంసలే కాకుండా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ స్వీటీ 'భాగమతి' లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో..'సింగం -3'..మూడు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా నాగార్జున - రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడ నటించబోతోందంట. వీరి కాంబినేషన్ లో 'హథీరామ్' అనే భక్తిరస చిత్రం నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సన్యాసి పాత్ర కోసం 'నాగ్'..'రాఘవేంద్రరావు' లు అనుష్కను సంప్రదించారంట. ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క ఓకే చెప్పినట్లు వినికిడి. నాగ్ చిత్రాల్లో గెస్ట్ రోల్ పాత్ర వేసిన ఈ యోగా బ్యూటీ సన్యాసి పాత్రలో ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి. 

14:50 - June 30, 2016

రజనీకాంత్ 'కబాలి'పై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై వివాదాలు ముసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అభిమానులు కొంత నిరుత్సాహంలో ఉన్నారని టాక్. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి...

చాలాకాలం తరువాత స్టైలిష్ లుక్ లో ఈ చిత్రంలో రజనీ కనిపించబోతున్నారు. గత కొంతకాలంగా రజనీ భిన్నమైన సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొత్త ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. తాజాగా కబాలిలో డాన్ క్యారెక్టర్ పాత్రలో అదరగొడుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ లో డాన్ పాత్రకు..డైలాగ్స్ కు విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని జులై 15న విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ రజనీ డాన్ క్యారెక్టర్ 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని, సినిమా మొత్తం రజనీ మాములుగానే ఉంటాడని ప్రచారం జరుగుతోంది. మలేషియా నేపథ్యంలో ఓ సామాన్య కూలీ డాన్ గా ఎలా మారాడన్నదే కథ అనేది తెలిసిందే. డాన్ పాత్రలో రజనీని చూడాలని అభిమానులు అనుకుంటారని, కానీ ఆ పాత్ర కేవలం 20 నిమిషాలు ఉంటే మాత్రం బెడిసికొట్టే ప్రమాదం ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి డాన్ క్యారెక్టర్ పాత్రలో రజనీ ఎంత సేపు ఉన్నాడు..అనేది చూడాలంటే వేచి ఉండాల్సిందే. 

14:45 - June 30, 2016

రంగారెడ్డి : జిల్లా కోర్టు ఎంప్లాయిస్‌ అసోసియేషన్ నుంచి నలుగురు ఉద్యోగులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. హైకోర్టు విభజన, ఉద్యోగుల ఆప్షన్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగిన.. శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ వెంకటరంగారెడ్డితో పాటు కృష్ణయ్య, రతన్‌రాజులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. 

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికావు - ఏపీ ఎంపీలు

విజయవాడ : కోర్టులను కించపరిచేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. జడ్జీలకు ప్రాంతీయ వాదాన్ని ముడిపెట్టడం దారుణమన్నారు. అమరావతిలో హైకోర్టుకు స్థలం కేటాయించామని, కేంద్రం నిధులు రాగానే నిర్మిస్తామన్నారు.
 

సీబీఐ విచారణలో భాగంగానే ఆస్తుల అటాచ్ మెంట్..

హైదరాబాద్ : సీబీఐ విచారణలో భాగంగానే జగన్ ఆస్తుల అటాచ్ మెంట్ జరిగిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈడీ న్యాయ వ్యవస్థ కాదని, పోలీసు వ్యవస్థ అని ఈడీ చేసింది అటాచ్ మెంటే కాని జప్తు కాదన్నారు. వైసీపీని మూసివేస్తారని టిడిపి విషప్రచారం కల్పిస్తోందన్నారు. జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కమల్ నాథన్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ కొద్దిసేపటి క్రితం భేటీ అయింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించిన బాబురావు..

గుంటూరు : తాత్కాలిక సచివాలయాన్ని సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సీ.హెచ్.బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడారు...ప్రభుత్వ ప్రకటనలకు..వాస్తవాలకు చాలా తేడా ఉందని, భవనాలను లాంఛనంగా ప్రారంభించినా ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించలేదన్నారు. రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయలేదన్నారు.

కేసీఆర్ దీక్ష అమరావతిలో చేయాలి - బీజేపీ..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని..అమ‌రావ‌తిలో అని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. హైకోర్టు విభ‌జ‌న అంశంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూర్చోబెట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

13:46 - June 30, 2016

అమెరికా : ఆ విమానంలో సీటు బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారుపూత వుంటుంది. బాత్‌రూంలోని కొళాయిలకు కూడా బంగారు పూత వుంటుంది. సాధారణంగా బోయింగ్‌ విమానం కెపాసిటీ 200 మందికి పైగా వున్నా.. 43 మంది మాత్రమే ప్రయాణించేందుకు సౌకర్యాలు ఏర్పాటుచేయడం ఈ విమానం విశేషం. అసలు విమానం ఏంటి.. ఇంతకీ అదెవరిది ?దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బోయింగ్ విమానం అంటేనే దాదాపు 200 మంది ప్రయాణికులు.. నిత్యం అందుబాటులో ఎయిర్ హోస్టస్ లు ... ఇలా సందడి వాతావరణం కనబడుతుంది. బంగారం లాంటి విమానం అని మనం అనుకోవడమే కాని నిజంగా అచ్చం బంగారం లాంటి విమానాన్ని చూడాలంటే..అమెరికా వెళ్లాల్సిందే..

పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ దే ఖరీదైన విమానం..
ఈ ఖరీదైన విమానం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ది . అత్యాధునిక వసతులు కలిగిన బోయింగ్ 757 విమానంలో కేవలం 43 మంది ప్రయాణికులు ప్రయాణించేలా మాత్రమే అంతర ఏర్పాట్లు చేశారు నిర్వహకులు. ప్రస్తుతం దీని నిర్వాహణ బాధ్యతలు స్టాంబాగ్ ఏవియేషన్ చూస్తోంది.

బాత్‌రూంలోని కొళాయిలకు కూడా బంగారు పూత ...
ఈ విమానాన్ని ట్రంప్‌ మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ అల్లెన్‌ నుంచి 2005 లో కొనుగోలు చేశాడు. అనంతరం తన అభిరుచికి తగినట్టుగా డిజైన్‌ చేయించాడు. సమావేశ మందిరాలు, బెడ్‌రూంలు, బాత్‌రూంలు, లగ్జరీ సీట్లతో విమానంలో వసతులు కల్పించారు. సీటు బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారుపూత వుంటుంది. బాత్‌రూంలోని కొళాయిలకు కూడా బంగారు పూత పూయించాడు ట్రంప్ . ఇందులోనే ట్రంప్‌ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

విమానం విలువ 100 మిలియన్‌ డాలర్లు...
అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ అంటారు. క్షిపణుల దాడిని కూడా విమానం తట్టుకునేలా ఉంటుంది. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానం విలువ 325 మిలియన్‌ డాలర్లు కాగా ట్రంప్‌ విమానం విలువ 100 మిలియన్‌ డాలర్లు వుండటం విశేషం. దీంతో ట్రంప్‌ వినియోగిస్తున్న విమానాన్ని ట్రంప్‌ ఫోర్స్‌ వన్‌ అనే పేరుతో పిలుస్తున్నారు.

13:40 - June 30, 2016

హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. హెల్త్‌ కార్డులపై అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిద వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. 

హిజ్రాలపై ఉన్న తీర్పును సవరించేందుకు సుప్రీం నిరాకరణ..

ఢిల్లీ : హిజ్రాలపై 2014 తీర్పును సవరించేందుకు సుప్రీం నిరాకరించింది. స్వలింగ సంపర్కునలు మూడో వర్గంగా పరిగణించాలని, హిజ్రాలను మాత్రమే మూడో వర్గంగా పరిగణించాలని సుప్రీం పేర్కొంది.

మైలవరంలో మంత్రి దేవినేని పాదయాత్ర...

విజయవాడ : మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమ పాదయాత్ర నిర్వహించారు. రుణమాఫీ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు దేవినేని పాదయాత్ర చేపట్టారు. రెడ్డిగూడెం మండలం నాగలూరు, రంగాపురంలో రైతులకు రెండో విడత రుణమాఫీ పత్రాలను అందచేశారు.

 

పుష్కరాల పనుల్లో బయటపడిన విగ్రహాలు..

గుంటూరు : అమరావతిలో పుష్కరాల పనుల్లో పురాతన నాగశాసనం, లక్ష్మీదేవి విగ్రహాలు బయటపడ్డాయి. స్థానిక మ్యూజియానికి ఈ విగ్రహాలను తరలించారు.

13:38 - June 30, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు సీపీఎం నడుం బిగించింది. నిర్వాసితులకు అండగా ఉండి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమైంది. ఇందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని నాలుగు రోజుల పాటు సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతున్నట్లు తమ్మినేని ప్రకటించారు. జూలై 1 నుంచి జూలై 4 వతేదీ వరకు పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. ఎర్రవెల్లి నుండి పాదయాత్ర ప్రారంభమై కిష్టాపూర్ లో ముగుస్తుందని తెలిపారు. మల్లన్న సాగర్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ విధానాలే సీఎం కేసీఆర్ అవలింబిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చెయకుండా రాష్ట్ర ప్రభుత్వం, రైతుల భూములు లాక్కోవడం సరికాదని అన్నారు. భూములు తీసుకోవడం తప్పనిసరైతే, 2013చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సిందేనని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

తుమ్మిడిహడ్డి బ్యారేజ్ పై అధ్యయనానికి నిధులు..

హైదరాబాద్ : ప్రాణహిత - తుమ్మిడిహడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో తుమ్మిడిహడ్డి బ్యారేజ్ నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక పర్యావరణ అనుమతులపై అధ్యయనం చేసేందుకు ఈటీటీఆర్ఐ సంస్థకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ. కోటి 25 లక్షల నిధులను కేటాయించారు.

నలుగురు కోర్టు ఉద్యోగుల సస్పెండ్...

రంగారెడ్డి : జిల్లా కోర్టులో నలుగురు ఉద్యోగులను హైకోర్టు సస్పెండ్ చేసింది. త‌మ డిమాండ్ల‌ను సాధించుకొని తీరుతామ‌ని తెలంగాణ న్యాయ‌వాదులు స్పష్టం చేస్తున్నారు. త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

13:34 - June 30, 2016

చైనా : ప్రపంచంలోని ఉత్తమ విధానాలను శోధించి వాటిని రాష్ట్రంలో పరిస్థితులకు తగ్గట్లు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన గిజో ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి దాదాపు 200కి పైగా చైనా కంపెనీలు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలు, రాష్ట్ర సమర్థతలపై పవర్‌పాయింట్‌ ద్వారా చంద్రబాబు వివరాంచారు. జపాన్‌, యూకే, సింగపూర్ వంటి దేశాలు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయని, అమరావతి రూపంలో చైనీస్‌ కంపెనీలకు సువర్ణావకాశం ముందుకొచ్చిందని ఆయన చెప్పారు.

ఏపీలో పెట్టుబడులకు అనుకూలం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. చైనా పర్యటనలో ఉన్నఆయన...ఏపీలో మౌలికసదుపాయాలు, రోడ్, ఎయిర్, రైల్‌, పోర్ట్‌ కనెక్టివిటీ బాగా ఉన్నాయని తెలిపారు. పర్యాటక రంగంలో, ఐటీ రంగంలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధిలో ఇండియాలోనే రెండవస్థానంలో ఉన్నామని, కచ్చితంగా మొదటిస్థానంలో నిలుస్తామని అన్నారు. ఏపీ అభివృద్ధికి ఏపీ, చైనాల పరస్పర సహకారం ఎంతైనా అవసరమని తెలిపారు.

13:22 - June 30, 2016

విజయనగరం : అనుమానం..ఆవేశం.. వుంటే మనిషి పశువుగా మారిపోతాడు. ఈ క్షణంలో ఆ మనిషికి విచక్షణాజ్ఞానం కోల్పోతాడు. అర్థంలేని అనుమానాలతో పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్తవలసనలో దారుణం చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కొత్తవలసలో నివాసం ఉంటున్న దంపతులు పాపారావు - లక్ష్మి దంపతులు 20 ఏళ్లుగా కాపురముంటున్నారు. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వాగ్వాదాలు జరుగతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పాపారావు భార్య లక్ష్మిపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. కాగా అనుమానించిన వ్యక్తి శ్రీనివాస్ పై పాపారావు దాడి చేశాడు కానీ స్వల్ప గాయాలతో బైటపడ్డాడు. ఇద్దరిపైనా దాడి చేసిన పాపారావు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

భార్యను కొట్టి చంపిన భర్త...

విజయనగరం : జిల్లా కొత్తవలసలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను రాడ్ తో కొట్టి చంపాడు. అనంతరం ఆ భర్త పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా..

హైదరాబాద్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా జరుగుతోంది. పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ కార్డులపై అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రేపు ధర్నా చౌక్ వద్ద అడ్వకేట్స్ ఆందోళన..

హైదరాబాద్ : న్యాయవాదుల ఆందోళన ఉధృతమైంది. రేపు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ నిర్ణయించింది. ఉమ్మడి రాష్ర్టాల హైకోర్టును వెంటనే విభజించాలని...తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా న్యాయమూర్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని..హైకోర్టు సస్పెండ్ చేసిన తెలంగాణ న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

12:58 - June 30, 2016

ఢిల్లీ : పార్టీ ఫిరాయంపులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కాగా ఏపీలో పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు స్పీకర్ చర్యలు తీసుకోవటంలేదని వైసీపీ పిటీషన్ లో పేర్కొంది. ఈక్రమంలో గురువారం నాడు జస్టిస్ అనిల్ దవే, లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసం సూచించింది. కాగా విచారణను వారం రోజులపాటు వాయిదా వేయాలని వైసీపీ కోరింది. దీనకి అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

బేగంపేటకు చేరుకున్న ఎన్ఐఏ..

హైదరాబాద్ : బేగంపేట కార్యాలయానికి ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. నగరంలో అరెస్టయిన ఐసీస్ అనుమానితులను ట్రాన్సిట్ రిమాండ్ తో ఢిల్లీకి తీసుకెళ్లి విచారించనున్నారు.

 

 

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ..

జ‌మ్మూ క‌శ్మీర్ : సీఎం మెహ‌బూబా ముఫ్తీ ఇవాళ అనంత్‌నాగ్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇటీవ‌లే జ‌రిగిన అనంత్‌నాగ్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో పీడీపీ అభ్య‌ర్థిగా మెహ‌బూబా 12 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

బేగంపేటకు చేరుకున్న ఎన్ఐఏ..

హైదరాబాద్ : బేగంపేట కార్యాలయానికి ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. నగరంలో అరెస్టయిన ఐసీస్ అనుమానితులను ట్రాన్సిట్ రిమాండ్ తో ఢిల్లీకి తీసుకెళ్లి విచారించనున్నారు.

 

జిల్లా విభజనపై నగర మంత్రుల సమావేశం..

హైదరాబాద్ : జిల్లా విభజనపై అధికారులతో నగర మంత్రులు తలసాని, పద్మారావులు సమావేశమయ్యారు. దసరా లోపున కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

12:44 - June 30, 2016

అమెరికా : మానవత్వాన్ని కూడా అందం...ఆహార్యం..ఎలా ప్రభావితం చేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించిందో ఆరేళ్ల పాప వీడియో. రోజుకు ఎంతో మంది నిజంగా అవసరంలో ఉన్న చిన్నారులు సహాయం అందక ఎంతగా అల్లాడిపోతున్నారో తెలియజెప్పే వీడియోను యూనిసెఫ్ విడుదల చేసింది. ఫేస్‌బుక్‌ లో ప్రస్తుతం ఈ వీడియో హల్‌చల్‌ చేస్తూ..నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.

అందంగా ముస్తాయైన చిన్నారి...
ఆరేళ్ల చిన్నారి అందంగా ముస్తాబై చక్కని దుస్తులు ధరించి రోడ్డు మీద ఒంటరిగా నిల్చుంది. అటుగా వెళ్లే వాళ్లలో ఎంతో మంది ఆమె దగ్గరికి వచ్చి నీ పేరేంటి.. ఎక్కడ ఉంటావు.. అంటూ దగ్గరికి తీసుకున్నారు. ఒంటరిగా ఎందుకున్నావంటూ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అదే చిన్నారి తర్వాత చక్కగా తయారై రెస్టారెంట్‌కు వెళ్లింది. ఒక్కో టేబుల్‌ దగ్గరికి వెళ్తుంటే అంతా ముద్దు చేశారు. ఏం కావాలంటే అది

నల్లరంగుతో..మాసినబట్టలతో చిన్నారి..
అదే ఆరేళ్ల అమ్మాయి మాసిపోయిన బట్టలతో.. ముఖానికి నల్ల రంగుతో.. వీధి బాలల లాగా అదే రోడ్డుపై అక్కడే నిల్చుంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

చీదరింపులకు బాధపడిన చిన్నారి...
మళ్లీ అదే చిన్నారి మురికి బట్టలతో రెస్టారెంట్‌లోకి వెళ్లింది. రోడ్డు మీద అలా ఉంటే పట్టించుకోకుండా వెళ్లారు కానీ.. ఇప్పుడు పాపను బయటకు పంపించమని రెస్టారెంట్‌ సిబ్బందిని కోరారు. ఆరేళ్ల అనానో రెస్టారెంట్‌లో నుంచి ఏడ్చుకుంటూ వచ్చేసి ఇక నటించలేకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. అంటే మురికిబట్టల్లో ఉన్న ఆమె పట్ల ప్రజల ప్రవర్తనకు చిన్నారి ఎంతగా నొచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు.

'ఫైట్‌ అన్‌ఫెయిర్‌' యూనిసెఫ్ పిలుపు...
ఇలా రోజుకు ఎంతో మంది నిజంగా అవసరంలో ఉన్న చిన్నారులు సహాయం అందక ఎంతగా అల్లాడిపోతున్నారో తెలియజెప్పేదే ఈ వీడియో. 'ఫైట్‌ అన్‌ఫెయిర్‌' అంటూ యునిసెఫ్‌ ఈ వీడియో ద్వారా పిలుపునిచ్చింది. 

12:36 - June 30, 2016

హైదరాబాద్ : మూఢనమ్మకాలు మారుమూల పల్లెల్లోనే కాదు...మహానగరంలో కూడా పెరుగుతోంది...మొన్నటికి మొన్న శివానంద బాబా బురిడీ కొట్టించిన వైనం మర్చిపోకముందే నగరంలో కాలేజీ ముందు క్షుద్రపూజలు చేశారన్న ఫిర్యాదు కలకలం రేపుతోంది..బెదిరింపులకు పాల్పడేందుకు కొందరు..దోచుకునేందుకు మరికొందరు చేస్తున్న దుర్మార్గాలు అపోహలను పెంచుతోంది...

భయాన్ని సృష్టించేందుకు డ్రామాలు..
ఇది హైదరాబాద్‌ రామాంతపూర్‌లోని ఓ ప్రయివేటు కాలేజీ...ఇక్కడే అర్థరాత్రి సమయంలో ఓ దుండగుడు వచ్చాడు..ఆ తర్వాత కొద్ది సేపు తచ్చాడాడు... వెనక్కి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తి ఓ గేటు ముందు తనతో తెచ్చిన పొట్లంలోంచి అక్కడ చల్లేశాడు..

తెల్లారేసరికి కలకలం...
తెల్లారేసరికి కాలేజీ ముందున్న పసుపు,కుంకుమలతో ఆందోళన చెందిన కళాశాల యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు...సిసికెమెరాకు చిక్కిన వ్యక్తిని వెంకటేశ్వర్‌రావుగా గుర్తించారు...అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు...క్షుద్రపూజల పేరుతో కాలేజీ నిర్వాహకులను బెదిరించేందుకు చేసిన కుట్రగా అనుమానిస్తున్నారు...తమపై కక్షగట్టినవారే ఇలాంటి చీప్‌ ట్రిక్కులు ప్లే చేస్తున్నారంటూ కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తుంది...

మహానగరంలో మూఢనమ్మకాలు...
మూఢనమ్మకాలు మహానగరాన్ని కూడా తాకాయి...మొన్నటికి మొన్న లైఫ్‌స్టైల్ యజమానిని బురిడీ కొట్టించిన శివానంద బాబా వ్యవహారం బయటపడిన కొన్ని రోజుల్లోనే కాలేజీ ముందు క్షుద్రపూజలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదును బట్టి నగరంలో మూఢత్వాన్ని పెంచి పోషించేవారితో పాటు దీన్ని అవకాశంగా తీసుకుని అపోహలు పెంచి బెదిరించేవారున్నారని తేలింది...

12:30 - June 30, 2016

విశాఖ : గ్రేటర్ విశాఖ ఎన్నికల సందడి మొదయ్యింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా మొదలు కాక ముందే అధికార భాగస్వామ్య పక్షాల మధ్య విబేధాలు పొడచూపుతున్నాయి. ఒక వైపు మేము కలిసి పోటీ చెస్తామని చెబుతూనే మేయర్ సీటు మాకు కావాలంటే మాకు కావాలనీ ఇరు పక్షాలు ఇప్పటికే కత్తులు దూస్తున్నాయి.

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ..
గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ ఇంకా వెలువడక పోయినా రానున్న రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతో పాటుగా వివాదంలో ఉన్న గ్రామ పంచాయితీలను కూడా గ్రేటర్‌లో కలుపుకొని ఎన్నికలకు పోవాలనేది ప్రభుత్వ భావన. దీనికి సంబంధించి ఏర్పాట్లను జీవీఎంసీ యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది.

75 వార్డులకు మాత్రమే పరిమితం అయిన జీవీఎంసీ...
గతంలో కేవలం 75 వార్డులకు మాత్రమే పరిమితం అయిన జీవీఎంసీ ఈ రెండు మున్సిపాలిటీలు పంచాయితీలను కలుపుకొని దాదాపు 100కు పైగా వార్డులు రానున్నాయి. 2013 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే జీవీఎంసీ పాలన నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి.

మేయర్ పీఠం మాదేనంటూ టీడీపీ ధీమా...
ఇటీవల మహానాడుని నగరంలో నిర్వహించిన టీడీపీ ఎట్టి పరిస్థితులనైనా మేయర్ సీటును కైవసం చేసుకోవాలని వ్యూహం రచిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా మిత్రపక్షం బీజేపీపై దాడి చేసింది. రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలపై బీజేపీపై దాడి చేశారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు రాజధానికి మేం ఎన్నో నిధులు ఇచ్చాం ప్రత్యేక హోదా వస్తుంది అంటూ ఎదురుదాడి చేశారు.

టీడీపీ అభ్యర్ధే మేయర్‌గా ఉంటారు : గంటా
ఇదిలాఉంటే టీడీపీ అభ్యర్ధే మేయర్‌గా ఉంటారని దీనిలో మరోఆలోచన లేదని స్పష్టం చేశారు మంత్రి గంటా శ్రీనివాసరావు. బీజేపీతో కలిసే పోటీ చేస్తామని వారి బలం అధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.

టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది : బీజేపీ
జీవీఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీదే మేయర్‌ పీఠమని ఎలా ప్రకటిస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమకు విశాఖ నగరంలో ఓ ఎమ్మెల్యే ఓ ఎంపీ ఉన్నారనీ ఇంతే కాకుండా 4 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నారని అలాంటిది మిత్రపక్షంగా తమను కనీసం సంప్రదించకుండా మేయర్ అభ్యర్థిత్వం ప్రకటించడం ఏంటని విమర్శిస్తున్నారు.

మేయర్ పీఠంపై సర్వత్రా ఆసక్తి...
ఇదిలాఉంటే విశాఖనగర పరిధిలోని అన్నిడివిజన్లలో బలం పెంచుకునే ప్రయత్నాల్లో బీజేపీ పడింది. ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్న ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంతే కాకుండా తమ వల్లనే విశాఖకు స్మార్ట్ సిటీ హోదా దక్కిందనీ ప్రచారం చేస్తున్నారు. ఒక వైపు కలిసి పోటీ చెస్తామని చెబుతూనే ఇరు పక్షాలు కత్తులు దూస్తున్నాయి. దీంతో విశాఖ నగర వాసులు ఎవరికి పట్టం కడతారనేది సందేహంగా మారింది. 

12:22 - June 30, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ శాఖలు అమరావతికి తరలివెళ్తున్న వేళ.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక ఫైళ్ల విభజన కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఫైళ్ల విభజన కోసం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు రెడీ అవుతోంది ఏపి సర్కార్.
ఇక దస్త్రాల వంతు....
ఏపి పాలన అమరావతి నుండి లాంచనంగా ప్రారంభం అయ్యింది. ప్రభుత్వ శాఖలన్ని ఒక్కొ క్కటిగా అమరావతికి తరలివెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కీలక దస్త్రాల విభజనపై దృష్టిపెట్టింది ఏపీ సర్కార్. రాష్ట్ర విభజనానంతరం రాష్ట్ర పాలనకు సంబంధించిన కీలక ఫైళ్లన్నీ ఏపి ప్రభుత్వం అజామయిషీలోనే ఉండిపోయాయి. కాగా ప్రస్తుతం రాష్ట్ర పాలన అమరావతికి మారడంతో. ఇరు రాష్ట్రాల మధ్యఫైళ్ల విభజన చేపట్టాలని ఏపి సర్కార్ బావిస్తోంది.

ఫైళ్ళ ప్రక్రియకు ప్రత్యేక కమిటీ వేయాలంటున్న ఏపీ సర్కార్...
అయితే ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే ఇరు రాష్ట్రాలు సమన్వయంగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకొవాలనేది ఏపి వాదన. దీనికి సంబంధించి ఏపీ అధికారులు తెలంగాణ సర్కార్ కు లేఖ రాసేందుకు సిద్దమయ్యారు. కాగా ప్రస్తుతం సచివాలయంలో రికార్డ్ లైబ్రరీ, సెంట్రల్‌ రికార్డు బ్రాంచ్‌, న్యాయశాఖ లైబ్రరీ, ప్లానింగ్‌ లైబ్రరీలు ఉన్నాయి. కీలకమైన ఫైళ్లు అన్నీ ఈ నాలుగు విభాగాల్లోనే నిల్వ ఉన్నాయి.

కీలక శాఖల్లో కీలక ఫైళ్లు...
న్యాయశాఖ లైబ్రరీలో దాదాపు 20 వేల వరకు పుస్తకాలు, ఫైళ్లు ఉన్నాయి. అలాగే ప్రణాళిక శాఖ లైబ్రరీలో ఏడు వేలు, సాధారణ పరిపాలన విభాగంలో రెండు రాష్ట్రాలకు సబంధించిన 14,300 ఫైళ్లు ఉన్నట్లు ప్రాధమికంగా అంచనా వేశారు. వీటిల్లో గెజిట్‌, చట్టాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక జనాభా లెక్కల వివరాలు, నిజాం కాలం నాటి పత్రాలు కూడా భారీగానే ఉన్నాయి. వీటిలో రెండు రాష్ట్రాలకు మధ్య పంపిణికావాల్సిన వాటికి త్వరిత గతిన విభజించాలని ఏపి కోరుకుంటోంది. మరీ ఈ విషయంలో తెలంగాణ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఎర్రవెల్లిలో సీపీఎం పాదయాత్ర - తమ్మినేని..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ, మలన్నసాగర్ నిర్వాసితులకు మద్దతుగా సీపీఎం పాదయాత్ర చేపట్టబోతోంది. జులై 1 నుండి ఎర్రవెల్లి నుండి పాదయాత్ర ఉంటుందని, ఈ పాదయాత్ర కిష్టాపూర్ వరకు ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందని, మల్లన్న సాగర్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ విధానాలే సీఎం కేసీఆర్ అవలింబిస్తున్నారని విమర్శించారు.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని, హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. విచారణను వారం రోజులు వాయిదా వేయాలని కోరింది. దీనితో ధర్మాసనం వారం రోజుల పాటు వాయిదా వేసింది.

ఇసుక ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి..

గుంటూరు : అచ్చంపేట (మం) కోగంటివారి పాలెంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

12:13 - June 30, 2016

హైదరాబాద్ : స్కూల్‌ ఫీజులు నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌ ఈస్ట్‌మారేడ్‌పల్లి శ్రీ అమృత విద్యాలయం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులక ఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌సీఏ, యూటీఎఫ్‌, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. 

జైట్లీతో రాజన్ భేటీ..

ఢిల్లీ : ఆర్థిక మంత్రి జైట్లీతో ఆర్ బీఐ గవర్నర్ రాజన్ భేటీ అయ్యారు. గత కొంతకాలంగా రాజన్ పై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల అనంతరం రాజన్ పదవీ విరమణ చేయనున్నారు.

పండ్ల వ్యాపారి కుటుంంబం ఆత్మహత్యాయత్నం..

కృష్ణా : గుడివాడ వన్ టౌన్ పోలీసుల వేధింపులు తాళలేక పండ్ల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రతి రోజు స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని మున్సిపల్ కార్యాలయంపైకి ఆత్మహత్యాయత్నం చేసింది.

 

11:32 - June 30, 2016

హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుల కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఈ విచారణలో భాగంగా అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో నిందితులకు ఎంతకాలంగా సంబంధాలను కొనసాగిస్తున్నారు? ఏ ప్రాంతాలలో దాడులు చేసేందుకు ప్రణాళికలు చేశారు? అనే విషయంలో కీలక సమాచారాన్ని విచారణలో రాబట్టినట్లు సమాచారం.
వనస్థలిపురంలో నిందితులు శిక్షణ పొందిన ప్రదేశాన్ని అధికారులు గురువారం ఉదయం పరిశీలించారు. ఇదిలా ఉంటే వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని నాంపల్లి కోర్డులో హాజరుపరచనున్నారు. ఎన్ఐఏ కు సంబంధించిన న్యాయమూర్తి సస్పెండ్ కు గురయిన కారణంగా  ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో నిందితులను ప్రవేశపెట్టనున్నారు.
కాగా బుధవారం నాడు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 11మంది ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిందితులుగా భావిస్తున్న వారు అత్యంత ప్రమాదకరమైన బాంబులను తయారు చేస్తున్నట్లు విచారణలో తెలుసుకున్నారు. బ్రస్సెల్స్ తరహాలో భారత్ లో కూడా పేలుళ్ళకు పాల్పడటానికి వీరు సిద్ధపడినట్లుగా విచారణలో తెలిసింది. కాగా నిందితులలో ఆరుగురు వ్యక్తులను విడుదల చేశారు. కాగా వారిపై ప్రత్యేక నిఘాను వేసినట్లుగా తెలుస్తోంది. 

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు..నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి, సింగరేణి డివిజన్లలో భారీ వానలు పడుతుండడంతో డోర్లి-1, డోర్లి-2, కైరిగూడ ఓపెన్‌కాస్ట్‌లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

 

స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నిందితుడు మృతి..

కడప : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిన్న అరెస్టయిన ప్రసాదరెడ్డి రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్నందుకే రిమ్స్ కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. కానీ ఇది లాకప్ డెత్ అని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.

ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం..

హైదరాబాద్ : ఐసీస్ సానుభూతిపరుల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. వనస్థలిపురంలో ఐసీస్ అనుమానితులు శిక్షణ పొందిన ప్రదేశాన్ని ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. ఆరుగురు అనుమానితులను అధికారులు విడిచిపెట్టారు.

11:09 - June 30, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏలేరు పాడు మండలం మేడేపల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తేశారు. దీంతో కమ్మరిగూడెం సహా 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మరిగూడెంలో వరద ప్రవాహానికి 75 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు రోజులుగా గ్రామాలు.. అంధకారంలో నిలిచిపోయాయి. అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెద్దవాగులో ఓవృద్ధుడు బుధవారం రాత్రంతా చిక్కుకుపోవడంతో.. అతన్ని స్థానికులు గురువారం తెల్లవారుజామున కాపాడారు. 

11:05 - June 30, 2016

సెల్ఫీ..ఇది పిచ్చిగా మారిపోతోంది. పడుకొంటే సెల్ఫీ..కూర్చొంటే సెల్ఫీ..చనిపోతూ సెల్ఫీ..ఇలా సెల్ఫీ మాయలో పడిపోతున్నారు జనం. ఇటీవలే 'సుల్తాన్' సినిమా ఇంటర్వ్యూలో భాగంగా సినీ నటుడు సల్మాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ చేసిన అనంతరం తన పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉంటుందని సల్మాన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం చెలరేగుతుండానే మరో వివాదం చెలరేగింది. అదేదో తెలుసుకోవాలంటే చదవండి..

సొంత మనుషుల చేతిలో ఘోరంగా అత్యాచారానికి గురైంది. ఈమెను పరామర్శించి..ధైర్యం చెపాల్సింది పోయి ఆమెతో సెల్ఫీ దిగింది. ఈమె మాములు వ్యక్తి కూడా కాదు. ఓ మహిళా కమీషన్ సభ్యురాలు. ఇది ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో అదనపు కట్నం కోసం..భర్త..అతని సోదరులు తీవ్రంగా హింసించడమే కాకుండా గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే కదా. అంతేగాకుండా ఆమె శరీరంపై టాటూలు వేయించారు. ఈ బాధితురాలితో మాట్లాడేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ వెళ్లింది. కమిషన్ సభ్యురాలైన సోమ్యా గుర్జార్ బాధితురాలితో సెల్ఫీ దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని కమిషన్ ఛైర్మన్ సుమన్ శర్మ కోరారు. అయితే సోమ్యా తీసిన ఫొటోలో సుమన్ శర్మ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తాను గమనించలేదని సుమన్ శర్మ పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

11:02 - June 30, 2016

ఇండోనేషియ : అతడి వయస్సు 10 ఏళ్లు ... బరువు 192 కిలోలు. నిరంతరం ఆకలితో బాధపడే ఈ బాలుడు ప్రపంచంలోనే అత్యంత బరువున్న వ్యక్తిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏ క్షణం ఏ మవుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆర్య పర్మానా ఊబకాయంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

పదేళ్లకే 192 కిలోల బరువు ...
ఇండోనేషియాకు చెందిన ఆర్య పర్మానా ఊబకాయంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నిరంతరం ఆకలితో బాధపడే ఆర్య..పదేళ్లకే 192 కిలోల బరువు పెరిగాడు. ఆర్య ప్రపంచంలోనే అత్యంత బరువున్న బాలుడిగా రికార్డుల్లోకెక్కాడు. రోజువారీ ఆహారంలో కోతపెడుతున్నా.. శరీరం మాత్రం విపరీతంగా పెరగుతుండడంతో అతడి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఆవేదనల తల్లిదండ్రులు...
ఇండోనేషియా సిపువార్సి గ్రామానికి చెందిన ఈ భారీ కాయుడు సంపన్నుడేం కాదు. రైతు కుటుంబానికి చెందిన రోకయ, సోమంతిల రెండో సంతానం. నార్మల్ డెలివరీ ద్వారానే జన్మించిన ఆర్య.. పుట్టినప్పుడు 3.8 కిలోలు మాత్రమే ఉన్నాడు. కాని రెండేళ్లు పూర్తవగానే ఆర్య బరువు ఆసాధారణంగా పెరుగుతూ.. ప్రస్తుతం 192 కిలోలకు చేరుకున్నాడు. దీంతో కుటుంబం గ్రామంలోని చాలా మంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లినా.. బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని .. ప్రమాదమేమి లేదని తెలిపారట దీంతో ఈ విపరీత పరిణామం అర్థకాక తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు.

ఇద్దరు తినే ఆహారాన్ని ఒకేసారి తింటున్న ఆర్య..
ఒకసారి పెద్దవాళ్లు ఇద్దరు తినే ఆహారాన్ని.. ఆర్య ఒకేసారి తినేస్తాడు. రోజుకి ఐదుసార్లు అన్నం, బీఫ్ , చేపలు, కూరగాయలు సూప్ ఇది ఒక రోజు మెను. నిరంతరం ఆకలితో ఉండే.. తమ కుమారుడికి భోజనం పెట్టలేకపోతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు తెచ్చి మరీ వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు.

వైద్యానికి సహకరించని ఆర్థిక స్థోమత...
ప్రస్తుతం ఖరీదైన వైద్యం చేయించాలంటే..తమ ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని.. ఏదో ఒక రోజు తమ కుమారుడు అందరిలా మామూలు పిల్లవాడిలా మారతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది కుటుంబం. 

10:52 - June 30, 2016

ఇది వింటే పిచ్చి ముదిరినట్లే అనిపిస్తోంది కదా. ఇటీవల ఫోన్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ను విడిచి పెట్టి యువత కొన్ని క్షణాల పాటు ఉండలేకపోతున్నట్లు ఇటీవలే ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కు సంబంధించిన ఓ తాజా వార్త బయటకు వచ్చింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ కు చెందిన ఆరోన్ అనే యువకుడు ఏకంగా స్మార్ట్ ఫోన్ ని పెళ్లాడాడు. వరుడైన ఆరోన్ పెళ్లి దుస్తుల్లో హాజరు కాగా, వధువు అయిన స్మార్ట్ ఫోన్ నూతన బాడీ కేస్ ధరించింది. వీరే ఇలా తయారయ్యారంటే వివాహం కూడా ఘనంగా జరిగిందంట. మరి ఈ పెళ్లిని లీగల్ గా గుర్తించిందా ? అనేగా మీ సందేహం. అక్కడి ప్రభుత్వం లీగల్ గా గుర్తించడానికి నిరాకరించిందంట. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ? ఫోన్ లతో మనం ఎంతగా కనెక్ట్ అయ్యామో...వాటికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో తెలియచేసేందుకే ఈ పెళ్లి అంటూ ఆరోన్ పేర్కొన్నాడంట. అదండి అసలు సంగతి...

10:43 - June 30, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో ఉన్న ఎన్ఐఏ బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది. బుధవారం ఎన్ఐఏ అధికారులు పలువురు ఐసీస్ అనుమానితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని ఢిల్లీకి తరలించేందుకు ఎన్ఐఏ బృందం ఇక్కడకు రానుంది. హైదరాబాద్ లో టెర్రర్ ఏక్టివిటీస్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుండి వచ్చే ఎన్ఐఏ బృందం మరింత లోతుగా విచారణ చేయనుంది. కాగా నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గాడ్జెస్ట్ ద్వారా మరింత సమాచారం తెలువనుందని అధికారులు భావిస్తున్నారు.
వీరికి సిరియాతో వున్న సంబంధాలు ఉన్నట్లు బహిర్గతం కావడంతో అధికారులు ఇంటరాగేషన్ జరుపనున్నారు. పేలుళ్ళ కుట్రకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించనున్నారు. బాంబులను ఎంత పటిష్టంగా...ప్రమాదకరంగా తయారు చేయవచ్చో అనే విషయాన్ని గూగుల్ సెర్చ్ ద్వారా ఉగ్రనిందితులు తెలుసుకుంటున్నట్లు విచారణలో తెలిసినట్లు సమాచారం..హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాలలో నిందితులు ఎవరెవరితో సంబంధాలను కొనసాగిస్తున్నారనే విషయంలో విచారణ కొనసాగుతోంది. కాగా నేడు 11 గంటలకు ప్రత్యేక కోర్టులో ఈ నిందితులను హాజరుపరచనున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోలో తెలుసుకోండి....

10:41 - June 30, 2016

ప్రకాశం : గతంలో రెండు నెలల క్రితం చిన్నారి అలేఖ్య కిడ్నాప్ కథ ఎట్టకేలకూ సుఖాంతమైంది. ఒంగోలు రైల్వే స్టేషన్ లో చిన్నారి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. చిన్నారి ఆచూకి దొరికిందని సమాచారం అందుకున్న పీఎస్ కు చేరుకున్న అలేఖ్య తల్లి తన బిడ్డ అలేఖ్యను గుర్తించింది. చైల్డ్ లైన్స్, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్ చేసిన మహిళను టూటౌన్ పీఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. చిన్నారిని అపహరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ మహిళ మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించారు. సహకరించిన ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

శ్రీ అమృత విద్యాలయం వద్ద తల్లిదండ్రుల ఆందోళన..

హైదరాబాద్ : వెస్ట్ మారేడ్ పల్లి శ్రీ అమృత విద్యాలయం వద్ద ఫీజులు నియంత్రించాలని మళ్లీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ సీఏ, యూటీఎఫ్ విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇటీవలే టీసీలు ఇచ్చారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్..కమిషనర్ భేటీ..

హైదరాబాద్ : చార్మినార్ సర్ధార్ మహల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్, కమిషనర్ భేటీ అయ్యారు. రోడ్ల మరమ్మత్తులు, మ్యాన్ హోల్స్ పర్యవేక్షణ..చెత్త తొలగింపుపై సమీక్ష జరిగింది.

సైబర్ క్రైమ్ పై వర్క్ షాప్..

విజయవాడ : సైబర్ క్రైమ్ ను అరికట్టడంపై విజయవాడలో వర్క్ షాప్ జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీసులు హాజరయ్యారు.

 

10:29 - June 30, 2016

రజనీకాంత్..'కబాలి' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులే కాదు..సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో కబాలి ఫీవర్ నెలకొంది. ఇటీవలే విడుదలైన కబాలి టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. అదే సమయంలో వివాదాలు..పుకార్లు చుట్టుముట్టుతున్నాయి. రజనీ ఆరోగ్యం బాగా లేదంటూ తొలుత వదంతులు వ్యాపించాయి. తాజాగా రజనీ కాంత్ పబ్లిసిటీ పోస్టర్ గురించి వివాదం నెలకొంది. దీనిపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బాలీవుడ్ నటుడు 'ఇర్ఫాన్ ఖాన్' నటించిన 'మదారి' అనే సినిమాకు సంబంధించిన పోస్టర్ ను 'కబాలి' టీమ్ కాపీ కొట్టిందనేది వివాదంగా తయారైంది. దీనిపై నిర్మాత కళైపులి థాను వివరణ ఇచ్చారు. కబాలి పోస్టర్ అభిమానులు తయారు చేసిందనీ..దానిని పట్టుకుని నిజాలు తెలుసుకోకుండా వివాదం రేపడం మంచిది కాదని హితవు పలికారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలో ఈ సినిమా గురించి ఎలాంటి పబ్లిసిటీ వస్తుందో వేచి చూడాలి.

అదృశ్యమైన చిన్నారి ఆచూకి లభ్యం..

ఒంగోలు : రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన చిన్నారి ఆలేఖ్య ఆచూకి లభ్యమైంది. చిన్నారి ఆలేఖ్యను తల్లి గుర్తించింది. ఛైల్డ్ లైన్స్, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రిమ్స్ లో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. కిడ్నాప్ చేసిన మహిళను టూ టౌన్ పీఎస్ లో విచారిస్తున్నారు.

పరకాల వద్ద తెగిన డైవర్షన్ రోడ్డు..

వరంగల్ : భూపాలపల్లి వద్ద మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూపాలపల్లి - పరకాల వద్ద డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

 

ఉధృతంగా ప్రవహిస్తున్న పెనుగంగ నది..

ఆదిలాబాద్ : సిర్పూర్ (మం) వెంకట్రావు పేట పెనుగంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బెజ్జూరు (మం) కుకుడ గ్రామం వద్ద వాగు పొంగిపొర్లుతోంది. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఛత్రినాక పీఎస్ పరిధిలో చిన్నారి దారుణ హత్య..

హైదరాబాద్ : ఛత్రినాక పీఎస్ పరిధిలోని కందికల్ గేటు వద్ద 10 నెలల చిన్నారిని దుండగులు గొంతునులిమి హత్య చేశారు.

వరద ప్రవాహానికి కొట్టుకపోయిన 75 ఇళ్లు..

పశ్చిమగోదావరి : ఏలేరు పాడు (మం) మేడేపల్లి వద్ద పెద్దవాగు ప్రాజెక్టు గేట్టు ఎత్తివేశారు. కమ్మరిగూడెంలో వరద ప్రవాహానికి 75 ఇళ్లు కొట్టుకపోయాయి. కమ్మరిగూడెం సహా 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుఆ గ్రామాలు అంధకారంలో నిలిచిపోయాయి. అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రాత్రి పెద్దమ్మవాగులో కొట్టుకపోయిన వృద్ధుడిని గురువారం ఉదయం స్థానికులు కాపాడారు.

09:57 - June 30, 2016

కొందరికి రింగుల జట్టు..మరికొందరికి ఒత్తు జుట్టు..ఇంకా కొంతమందికి చిక్కుల జుట్టు..ఇలా ఉంటుంటాయి. మరి వీరందరూ దువ్వెనలు ఎలాంటివి వాడుతున్నారు. జట్టు అలా ఉండాలి..ఇలా ఉండాలి అనుకుంటూ షాంపులు..ఇతరత్రా వాడుతుంటారు. కానీ జుట్టును శుభ్రం చేసే దువ్వెనలపై దృష్టి పోదు. జుట్టుతత్వాన్ని బట్టి దువ్వెన వాడాలని బ్యూటీషన్లు పేర్కొంటున్నారు.
చిక్కుల జుట్టు ఉన్న వారు వెడల్పాటి పళ్లున్న బ్రష్ వాడాలి. చిన్న చిన్న పళ్లు మరింత దగ్గరగా ఉన్న బ్రష్ వాడాలని బ్యూటీషన్లు సూచిస్తున్నారు. జుట్టు అదుపులో ఉండేందుకు కొద్దిపాటి నూనె అప్లయ్ చేస్తుండాలి. అలాగే జుట్టు చిక్కులు త్వరగా విడిపోయే ఉత్పత్తులను ఉపయోగించాలి.
ఇక రింగుల జుట్టు ఉన్న వారు కూడా వెడల్పాటి బ్రష్ ను ఉపయోగించాలి. ఉంగరాలను పెంచుకోవాలని అనుకొనే వారు లీవ్ ఇన్ కండిషనర్ ఉపయోగించాలి. హెయిర్ డ్రైయర్ ను తరచూ వాడకూడదు.
పల్చని జుట్టు వారు పళ్లు బాగా దగ్గరదగ్గరగా ఉండే బ్రష్ ఉపయోగించాలి.
స్ట్రెయిట్ హెయిర్ ఉన్న వారు డ్రైయర్ నుండి కొంత వేడిగాలితో డ్రై చేయాలి. జుట్టు లేయర్లు బాగా కట్ చేసినట్లయితే దానిని ట్విస్ట్ చేసి, తడిపొడిగా ఉన్నప్పుడే బన్ తో రోల్ చేసుకోవాలి.
దానికన్నా ముఖ్యం...నెమ్మదిగా దువ్వుకొనే తీరిక..ఓర్పు రెండు ఉండాలి.

09:49 - June 30, 2016

నిజామాబాద్ : వన్యప్రాణుల రక్షణకోసం ఎన్ని చట్టాలున్నా...ఫలితం కనిపించడం లేదు. శిక్షలెంత కఠినంగా ఉన్నా వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవడంలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిజామాబాద్‌ జిల్లాలో అరుదైన వ్యన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి

జోరుగా సాగుతున్న వన్యప్రాణుల వేట...
నిజామాబాద్‌ జిల్లాలో వన్యప్రాణుల వేట జోరుగా కొనసాగుతోంది. రాత్రివేళ్లలో అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ముఠాలు సంచరిస్తున్నాయి. అటవీ రక్షణచట్టాలు ఎన్నిఉన్నా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అరుదైన అడవి జంతువులు వేటగాళ్ల చేతిలో హతమవుతున్నాయి.

నిజామాబాద్‌జిల్లాలో 167వేలహెక్టార్లలో అటవీప్రాంతం..
నిజామాబాద్‌జిల్లా వ్యాప్తంగా 167హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. కామారెడ్డి డివిజన్లో 90వేల హెక్టార్లలో, నిజామాబాద్‌ డివిజన్‌లోనే 77వేల హెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. జుక్కల్, బిచ్కుంద, మద్నూరు, కోటగిరి, నాగిరెడ్డిపేట్‌, లింగంపేట్‌ ప్రాంతాలతో పాటు గాంధారి, బాన్సువాడ, సదాశివనగర్‌, వర్ని ప్రాంతాల్లో అటవీ జంతువులు ఎక్కువగా ఉన్నాయి. జింకలు, కొండగొర్రెలు, నీల్గాయి, మనుబోతులు, సాంబార్‌దుప్పులు, వీటితోపాటు... జాతీయపక్షి నెమలి కూడా ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంది.

అటవీ అధికారుల పర్యవేక్షణ లేక రెచ్చిపోతున్న స్మగ్లర్లు..
అటవీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌, ముంబై, నాందేడ్‌ ప్రాంతాలనుంచి వేటగాళ్ల ముఠాలు వస్తున్నాయి. నాటుతుపాకులు, వేటకొడవళ్లతో వన్యప్రాణులను వెంటాడి చంపుతున్నారు. తాజాగా రెంజల్‌ మండలంలో జింకలను వేటాడి చంపేయడం స్థానికంగా కలకలంరేపింది. అటవీ అధికారులు మాత్రం.. స్మగ్లర్ల ఆటకట్టిస్తామని ఎప్పటి మాటే చెబుతున్నారు.

జోరుగా సాగుతున్న చర్మాల వ్యాపారం...
జిల్లాలో వన్యప్రాణుల చర్మాల వ్యాపారం జోరుగా సాగుతోంది. వీటిలో జింక చర్మాలను స్మగ్లర్లు అధికంగా కొంటున్నట్టు స్థానికులు అంటున్నారు. జింకల చర్మాలతో పాటు కొమ్ములకు కూడా మంచి గిరాకీ ఉండటంతో... వేటగాళ్లు పెద్దసంఖ్యలో ఈ మూగజీవులను చంపేస్తున్నారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన వేటగాళ్లు ఈ జింకలను చంపి చర్మాలు, కొమ్ములను తీసుకుని వాటి కళేబరాలను ఇలా వదిలేశారు. ఇప్పటికైనా నిజామాబాద్‌ అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న స్మగ్లర్లను అదుపుచేయాలని.. స్ధానికులు కోరుతున్నారు.  

09:41 - June 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ పై టి జాక్ స్వరం పెంచింది. ప్రజాసమస్యల ఎజెండా తో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతోంది. ప్రతిపక్షాన్ని మించి ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీంతో ఉద్యమకాలంలో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన టీఆర్‌ఎస్‌, టీజెఏసీల మధ్య ఇప్పుడు ప్రత్యక్ష పోరు మొదలైంది.

తనదైన శైలిలో గులాబీ సర్కార్ కు టీజాక్ చురకలు...
చత్తీస్‌గఢ్‌ పిపిఎ, కరవుయాత్ర, విద్యుత్ చార్జీల పెంపు, మల్లన్నసాగర్, విద్యారంగ సమస్యలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఇలా ప్రతిపక్షాలు లేవనెత్తాల్సిన అంశాలను తన భుజాలపై వేసుకొని సమయం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో వాణిని వినిపిస్తోంది టి జేఏసీ.

కరువు యాత్రపై సర్కార్ కు టీజాక్ సూచనలు..
తెలంగాణ ఏర్పాటైన తరువాత జేఏసీతో పనేముంది అంటూ పలు ఉద్యోగ సంఘాలు వీడినప్పటికి కలిసొచ్చే సంఘాలు, వ్యక్తులతో కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు సాగింది తెలంగాణ రాజకీయ ఐకాస. చత్తీస్‌ఘడ్ పిపిఎల విషయంలో ఈఆర్‌సీని కలిసి ప్రజానుకూలమైన తమ వాదనను వినిపించింది కోదండరాం బృందం. వివిధ జిల్లాల్లో కరువు యాత్రను నిర్వహించి కరవు నివేదికను ప్రభుత్వానికిచ్చి తీసుకోవాల్సిన చర్యలను సర్కారుకు సూచించింది.

గులాబీ నేతలు ఎదురు దాడికి  బెదరని టీజాక్...
ఇక మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో 123 జీవో కాకుండా భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని బాహటంగానే మండి పడింది. దీనిపై మంత్రులు సైతం మాటలతో ఎదురుదాడి చేసినప్పటికి వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉంటే తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలు, ఆర్టిసి చార్జీలపై సైతం తమ గళం విప్పింది టీజేఏసీ. ఇక ఉన్నత విద్యపై జీవో నెంబర్ 78 ని వెనక్కు తీసుకోవాలని, ఇది యూనివర్శిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని జేఏసీ విమర్శించింది. గవర్నర్‌ను సైతం ఈ విషయంలో కలవనున్నారు.

భూసేకరణ చట్టం అవగాహన సదస్సులు...
ఇక నేడోరేపో గజ్వేల్ లో మల్లన్నసాగర్ బాధితుల పక్షాన భూసేకరణ చట్టం అవగాహన సదస్సులు నిర్వహించబోతుంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలకు రెడీ అవుతోంది టీజేఏసీ. ఈ ప్రయత్నంలో టీజేఏసీ ఎంత మేర సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.

ముగిసిన బాబు చైనా పర్యటన..

చైనా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైనా పర్యటన ముగిసింది. హాంకాంగ్ మీదుగా ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి జైట్లీతో బాబు భేటీ కానున్నారు.

మేదరమెట్లలో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం : మేదరమెట్లలో కారు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుండి పాతగుంటూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నాగరాజు, చిన్ని కృష్ణ, వాసవి, శ్రీ కృష్ణలు మృతి చెందిన వారిలో ఉన్నారు.

చైనాలో సీఎం చంద్రబాబు నాయుడు..

చైనా : సీఎం చంద్రబాబు నాయుడు చైనాలో పర్యటిస్తున్నారు. గిజో - ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశానికి 200 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

 

మెట్రో రైలు ఎండీ పదవీకాలం పొడిగింపు..

హైదరాబాద్ : మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలం పొడిగించారు. మరో ఏడాది పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

నేడు కోర్టుకు ఐసీస్ అనుమానితులు..

హైదరాబాద్ : ఐసీస్ అనుమానితులను నేడు నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరు పరచనున్నారు. అనంతరం పీటీ వారెంట్ పై ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న 11 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

09:24 - June 30, 2016

హైదరాబాద్ : బుధవారం నాడు నగరంలో ఉగ్రవాదుల ఆరోపణలను ఎదుర్కొంటున్న 11 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని గురువారం నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ హాజరుపరచనున్నారు. అనంతరం పిటీ వారెంట్ పై ఢిల్లీకి తరలించే అవకాశమున్నట్లు సమాచారం. మిగిలిన ఆరుగురిని ఎన్ఐఏ అధికారుల క్షుణ్ణంగా విచారిస్తున్నారు. బ్రస్సెల్స్ తరహా దాడులు భారతదేశంలో పాల్పడటానికి ఉగ్రవాదులు ఆలోచన చేస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయిన పదార్ధాలతో బాంబులను తయారుచేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ దాడులతో ప్రపంచ దేశాలను ఆకర్షించటానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో త్వరంలో జరుగనున్న బోనాలు, గణేష్ ఉత్సవాలను టార్గెట్ చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నిందితులపై దేశద్రోహం, పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులు నమోదు చేసేందుకు పోలీసుల సిద్ధంగా వున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను చూడండి...

ముంబై భారీ అగ్నిప్రమాదం...

ముంబై : నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంథేరీలోని ఔషధ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం.

గజరాజుల బీభత్సం..

చిత్తూరు: అడవులను వదిలి గజరాజుల బృందం తండాలపై పడుతున్నాయి. ఈ క్రమంలోనే రామకుప్పం మండలం దిరుగుండలపల్లి, నన్యాలతండా శివారులో పంటలపై ఏనుగుల మంద దాడి చేసింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. ఏనుగుల దాడితో గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. 

ఆరుగురు ఉగ్ర నిందితుల విడుదల..

హైదరాబాద్: నగరంలో నిన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న 11 మంది నిందితుల్లో ఆరుగురిని విడుదల చేశారు. యాసర్, రిజ్వాన్,మహ్మద్‌ రహమాన్, అబ్దుల్, ఎఎం అజార్, మహ్మద్‌ అర్బాజ్ అహ్మద్‌లను ఎన్ఐఏ విడుదల చేసింది. ఐసిస్‌ సానుభూతిపరులన్న అనుమానంతో ఎన్‌ఐఏ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. 

చైనా ఐదోరోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన ...

చైనా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైనా దేశ పర్యటన ఐదోరోజు కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల పోత్సాహక సమావేవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశానికి దాదాపు 200మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై బాబు షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు. ఏపీలో గ్రాన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామనీ..ప్రపంచంలో పది అత్యుత్తమ రాజధానుల్లో అమరావతిని నిలుపుతామని ఆయన తెలిపారు.   

ప్రసూతి సెలవు 26 వారాలు!...

ఢిల్లీ: ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచటానికి వీలుకల్పిస్తూ.. మాతృత్వ ప్రయోజన చట్టానికి సవరణలు చేయటానికి కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రి మనేకా గాంధీ ఇటీవల ప్రసూతి సెలవు పొడిగింపుపై దత్తాత్రేయతో చర్చించినతర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. దీనిపై దత్తాత్రేయ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ గత సెప్టెంబరులో ప్రసూతి సెలవును పెంచాలనే ప్రతిపాదన చేసింది.

అదిగదిగో చిరుత ...

తిరుమల: తిరుమలలోని నివాస ప్రాంతాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల బాలాజీనగర్‌లో చిరుత దుప్పిని వేటాంది. అనంతరం నివాస ప్రాంతాల్లో కూడా చిరత సంచిరించిందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు బాలాజీనగర్‌ చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు.

08:26 - June 30, 2016

ప్రకాశం : మేదరమెట్ల బైపాస్ పై రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఆగి వున్న ఓ కారు ను లారీ ఢీకొనటంతో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా చికిత్స నందిస్తున్న సమయంలో తీవ్ర గయాలయిన నిత్య అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారి నిత్యకు తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించటానికి వెళ్లివస్తున్నట్లుగా బాధితులు తెలిపారు. తిరుమల వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు పాడవటంతో రోడ్డు పక్కగా ఆపి రిపేరు చేస్తున్న సమయంలో లారీ ఢీకొన్నట్లు తెలుస్తోంది. మృతులు డ్రైవర్ నాగరాజు, చిన్నికృష్ణ, వాసవి, శ్రీకృష్ణ, నిత్యలు కాగా గాయపడినవారు సుధాకర్ రావు, అశోక్ కుమార్, రంగమ్మ ,రంగారావు, అరవింద్ లు.  వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 

రోడ్డు ప్రమాదంలో 5కు పెరిగిన మృతుల సంఖ్య...

ప్రకాశం : మేదరమెట్ల బైపాస్ పై రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్యం 5కు పెరిగింది. ఆగి వున్న ఓ కారు ను లారీ ఢీకొనటంతో ఈప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా చికిత్స నందిస్తున్న సమయంలో తీవ్ర గయాలయిన నిత్య అనే చిన్నారి మృతి చెందింది. కాగా చిన్నారి నిత్యకు తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించటానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

07:46 - June 30, 2016

జగన్ ఆస్తుల కేసులో ఈడీ కొరడా ఝుళిపించింది. ఈ కేసులో రూ. 749 కోట్ల రూపాయల ఆస్తులను తాత్కాలిక అటాచ్‌ చేసింది. ఇందులో బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ భవనంతో పాటు... బెంగళూరులోని కామర్స్‌ మంత్రి వాణిజ్య సముదాయాన్ని కూడా అటాచ్ చేసింది. వీటితో పాటు పలు కంపెనీల్లో జగన్‌, భారతీ షేర్లను అటాచ్‌ చేసింది. భారతి సిమెంట్స్‌ చార్జిషీట్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ అంశంపై టెన్న టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వకుళాభరణం కృష్ణ మోహన్ ( టీఆర్ఎస్ నేత ), రామకృష్ణ ప్రసాద్ (టీడీపీ నేత), కొండారాఘవరెడ్డి (వైసీపీ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాటంలే ఈ వీడియోను క్లిక్ చేయండి... సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి...

నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు...

హైదరాబాద్ : నేపాల్ లో వరుసగా భూ ప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ నేపాల్ లోని బాజ్ హంగ్ జిల్లాలో సంభవించిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై వరుసగా 5, 4 గా నమోదయ్యాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఎలాంటి నష్టం సంభవించలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది సంభవించిన భారీ భూకంపంతో నేపాల్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

పంద్రాగష్టు వేడుకలు ఏపీలోనే : సీఎస్ టక్కర్

విజయవాడ : ఈ పంద్రాగష్టు వేడుకలు ఏపీలో జరుగుతాయని ఏపీ సీఎస్ టక్కర్ ఉత్సాహంగా ప్రకటించారు. సొంత రాష్ట్రం నుంచే పాలన మొదలైన నేపథ్యం... నవ్యాంధ్ర ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. బుధవారం నాడు ఐదో బ్లాకులో తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాదు నుంచి ఐదు బస్సుల్లో వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులు జోరుగా వర్షం కురుస్తున్నా ముందడుగే వేశారు. సచివాలయ ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఉద్యోగుల ఉత్సాహాన్ని చూసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్...

మద్యం మత్తులో 3 ఆటోలను ఢీకొట్టిన సీఐ...

నెల్లూరు : నిబంధనలు జారీ చేసినవారే వాటిని అతిక్రమిస్తే ఎలా వుంటుంది? ప్రజలకు ఆదర్శంగా వుండాల్సిన వారే దారి తప్పితే ఎలా వుంటుంది? మద్యం త్రాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ప్రకటనలిస్తూంటారు. కానీ ఉన్నతస్థానంలో వున్న పోలీసు అధికారి మద్యం సేవించి కారు నడిపిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ సీఐ మూడు ఆటోలను ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా రామలింగాపురం సెంటర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు.

07:04 - June 30, 2016

చైనా : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన అప్పో.. ఫ్యాక్స్‌కాన్‌ సంస్థలు ముందుకొచ్చాయి. చైనా పర్యటనలో భాగంగా చంద్రబాబు.. వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, అనుకూలతలను వివరించారు.

చైనాలో నాల్గవ రోజు పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి..
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. గియాన్‌ నగరాన్ని సందర్శించారు. తన బృందంతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిజో జో ప్రావిన్స్‌ వైస్‌ గవర్నర్‌ క్విన్‌ రు పీ తో భేటీ అయిన చంద్రబాబు... వివిధ అంశాలపై చర్చించారు.

గియాన్‌ తరహా ఏపీ రాజధానికి బాబు యోచన..
ని
ష్కళ నీటి వనరులతో హరితవనంలా ఉన్న గియాన్‌ తరహాలోనే, ఏపీ రాజధాని అమరావతిని తీర్చి దిద్దాలన్న ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు. ఈ విషయంలో గిజో జో సహకారాన్నితీసుకోవాలని ప్రతిపాదించారు. ఇందుకు కఠిన నిబంధనలు, ప్రజల సహకారం అవసరమని గిజో జో వైస్‌ గవర్నర్‌ క్విన్‌ రు పీ... చెప్పగా... ఏపీ ప్రజలు అన్నింటికీ సానుకూలంగా ఉంటారని చంద్రబాబు చైనా పాలకులు దృష్టికి తెచ్చారు.

అప్పోతో 25 వేల మందికి ఉద్యోగావకాశాలు ...
చైనా మొబైల్‌ దిగ్గజ సంస్థ అప్పో ఉపాధ్యక్షుడు ఎరిక్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోన్‌, ప్లానింగ్‌ డైరెక్టర్‌ స్పెటర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వెయ్యి కోట్లతో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు అప్పో ముందుకొచ్చింది. దీని ద్వారా 25 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనావేస్తున్నారు. గియాన్‌లోని ఫ్యాక్స్‌కాన్‌ ఫెసిలిటీ సెంటర్‌నూ చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా జరిపిన చర్చల్లో... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్యాక్స్‌కాన్‌ సుముఖత వ్యక్తం చేసింది. వచ్చేనెలలో ఏపీని సందర్శించి, అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే భూమిని కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఏపీలోని యూనివర్సిటీల్లో చైనా ఉత్తమ విద్యా విధానాలు...
గియాన్‌ నగరంలోని ఆరు యూనివర్సిటీల్లో గుయాన్‌ వైద్య విశ్వవిద్యాలయం, గిజో జో యూనివర్సిటీలను సందర్శించిన చంద్రబాబు... విద్యార్థులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చైనా యూనివర్సిటీల్లోని ఉత్తమ విధానాలు తమ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత జీఐసీసీ పారిశ్రామిక సముదాయానికి వెళ్లి, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వైద్య పరికరాల తయారీ కేంద్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. జీఐసీసీ సీపీవో ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. పెట్టుబడుల ప్రాజెక్ట్‌లకు ఏకగవాక్ష విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతి ఇవ్వడంతోపాటు, ప్రోత్సహకాలు, పన్నుల రాయితీలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విజయవంతమైన బాబు చైనా పర్యటన...
మొత్తంమీద చంద్రబాబు నాలుగు రోజుల చైనా పర్యటన జయవంతమయ్యిందని ఆయన వెంట ఉన్న మంత్రులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

06:55 - June 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది.. దసరా నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన సాగించాలని సర్కారు పట్టుదలగా ఉంది.... ముందు టీఆర్‌ఎస్‌ నేతలు... ఆ తర్వాత అఖిలపక్ష అభిప్రాయం తీసుకునేలా ప్లాన్‌ చేసింది.

కొత్త జిల్లాల ప్రతిపాదనపై నివేదికలు ఇవ్వాలని నేతలకు ఆదేశం...
జిల్లాల పునర్విభజనపై టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకుంటోంది టీఎస్‌ ప్రభుత్వం.. ఈ అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.. జిల్లాల వారీగా సిద్ధం చేసిన ప్రతిపాదనపై నివేదికలు ఇవ్వాలని నేతల్ని ఆదేశించారు.. పాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలోపెట్టుకునే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ భేటీలో కేసీఆర్‌ ప్రకటించారు.. ఈ విషయంలో రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు.. జిల్లాల పునర్విభజన పూర్తికాక కేంద్రంనుంచి రావాల్సిన అభివృద్ధి పనులు ఆగిపోయాయని సమావేశంలో చెప్పారు.. కొత్త జిల్లాల ప్రక్రియ త్వరగా పూర్తిచేస్తే ఈ పనులకు అనుమతులు మంజూరు చేయించుకోవచ్చని

కొత్త ప్రతిపాదనల ప్రకారం జిల్లాకు 20 మండలాలు...
తెలంగాణ ఉద్యమ సమయం నుంచే కొత్త జిల్లాల విషయాన్ని పలు సభల్లో కేసీఆర్‌ ప్రస్తావించారు.. చిన్న జిల్లాలద్వారా పాలన మరింత సులభమవుతుందని ప్రకటించారు.. తాము అధికారంలోకిరాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకుముందు హామీ ఇచ్చారు.. కొత్త రాష్ట్రం వచ్చాక జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టిపెట్టారు.. కలెక్టర్లు, మంత్రులతో సమీక్ష జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.. వీటి ఆధారంగా తెలంగాణలో 14 కొత్త జిల్లాలు, 74మండలాల్ని ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు.. కొత్త ప్రతిపాదనల ప్రకారం జిల్లాకు 20 మండలాలు ఉండే అవకాశముంది.. పట్టణాల్లో ఎక్కువ జనాభావున్న ప్రాంతాలను అర్బన్‌ మండలాలుగా మార్చాలని ప్లాన్‌ చేస్తున్నారు..

కొత్త జిల్లాలపై ప్రతిపక్షాల సూచనలు తీసుకోనున్న ప్రభుత్వం...
పార్టీ నేతల సూచనలు తీసుకుంటూనే కొత్త జిల్లాలపై ప్రతిపక్షాల సలహాలూ తీసుకోవాలని టీఎస్‌ సర్కారు నిర్ణయించింది.. జిల్లాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతోంది.. ఈ సమావేశంలో వచ్చే సూచనలప్రకారం ప్రస్తుత ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది.. మరోవైపు కొత్త జిల్లాల డిమాండ్లపై ఆందోళనలు ఇప్పటికే హోరెత్తిపోతున్నాయి.. జిల్లాల విభజనపై నోటిఫికేషన్‌ విడుదలైతే ఈ అంశం రాజకీయంగా మరింత దుమారం రేపే ఛాన్స్ ఉంది.. ఈ సమస్యలన్నీ వేగంగా పరిష్కరించి దసరా నాటికి కొత్త జిల్లాలనుంచి పాలన సాగించాలని సర్కారు ప్రయత్నిస్తోంది..

 

06:49 - June 30, 2016

మెదక్ : పటాన్ చెరు మండలం రుద్రారంలో ఓ ఆటో లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురుకి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన చికిత్సనందిస్తున్నారు. ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు విధులు పూర్తి చేసుకుని ఆటోలో వస్తుండగా ఈ ప్రమాం జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా రోడ్డుకు ఇరువైపులా వున్న దాబాలు, మోటారు రిపేరు షాపులు వుండటంతో ఈ ప్రదేశంలో తరచూ ప్రమాదాలు చోటు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

06:43 - June 30, 2016

ప్రకాశం : మేదరమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొనటంతో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తిరుమలకు  వెళ్లి  గుంటూరు తిరుగివస్తున్న సమయంలో గురువారం తెల్లవారుఝామున 4.00గంటలకు కారును లారీ ఢీకొన్నట్లుగా బాధితులు తెలిపారు.మృతులు డ్రైవర్ నాగరాజు, చిన్నికృష్ణ, వాసవి, శ్రీకృష్ణలు  కాగా  గాయపడినవారు సుధాకర్ రావు, అశోక్ కుమార్, రంగమ్మ ,రంగారావు, అరవింద్ వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. 

రుద్రారంలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..

మెదక్ : పటాన్ చెరు మండలం రుద్రారంలో ఓ ఆటో లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురుకి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన చికిత్సనందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..

ప్రకాశం : మేదరమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొనటంతో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా డ్రైవర్ రెండు రోజుల నుండి నిద్ర లేకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. 

Don't Miss