Activities calendar

01 July 2016

21:56 - July 1, 2016

జార్ఖండ్ : బీజేపీ అధ్యక్షుడు తాలా మరాండీ కొడుకు మున్నా పెళ్లి వివాదస్పదంగా మారింది. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకుని మరో అమ్మాయి మెళ్లో మున్నా తాళి కట్టి మోసం చేశాడని ఓ అమ్మాయి కోర్టుకెక్కింది. అంతేకాదు...మున్నా 11 ఏళ్ల మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడం రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మున్నా మరాండి పెళ్లి వివాదం...
జార్ఖండ్‌ బిజెపి అధ్యక్షుడు తాలా మరాండి కుమారుడు మున్నా మరాండి 11 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వివాదస్పదమైంది.

మున్నా పెళ్లిపై కోర్టుకెక్కిన యువతి...
మున్నా పెళ్లిపై ఓ యువతి కోర్టు కెక్కింది. తనతో సన్నిహితంగా ఉండి శారీరకంగా రెండేళ్లకు పైగా వాడుకుని ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ గొడ్డా జిల్లా కోర్టులో యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మున్నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మున్నా తనతో ఎంతో స్నేహంగా ఉండేవాడని, ఓ మొబైల్ ఫోన్ను కానుకగా ఇచ్చాడని బాధితురాలు పేర్కొంది. మున్నా తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ జార్ఖండ్ మహిళ కమిషన్కు ఫిర్యాదు చేసింది. మున్నాపై విచారణ జరిపిస్తామని మహిళ కమిషన్ బాధితురాలికి హామి ఇచ్చింది.

11 వయస్సున్న బాలికతో పెళ్లి...ఆరోపణలు..
మున్నా మరండి వివాహం గత మంగళవారం జరిగింది. అయితే మున్నా వివాహం చేసుకున్న అమ్మాయి వయసు 11ఏళ్లేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయి వయసు 18 ఏళ్లు ఉండాలి. అమ్మాయి మైనర్‌ కావడంతో మున్నా తండ్రి తాలా మరాండికి రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు పంపించినట్లు సమాచారం.

వివాదాస్పదంగా మారిన మున్నా వివాహం...
మున్నా వివాహ విందు జరిగిన రోజు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. వేడుకకు హాజరు కాకపోవడం గమనార్హం. ఈ రెండు ఘటనలతో మున్నా వివాహం వివాదాస్పదంగా మారింది. దీనిపై విచారణ జరిపించాలని, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని తొలగించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గిరిజన నాయకుడైన మరాండిని బిజెపి గత నెల జార్ఖండ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.

21:49 - July 1, 2016

ఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి మధ్య కొనసాగుతున్న వార్‌ సుప్రీంకోర్టుకు చేరింది. కీలక అధికారుల నియామకాల్లో తమ ఇష్టానికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్న ఆప్ సర్కార్ ఈ విషయంపై తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారంనాడు విచారణ జరపనుంది. అధికారం విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తుతున్నందున ఢిల్లీలో పూర్తి పాలన జరగడం లేదని, ఢిల్లీని రాష్ట్రంగా పరిగణించాలో లేదో న్యాయస్థానం నిర్ణయించాలని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఢిల్లీ రాష్ట్రానికి ప్రస్తుతం పాక్షిక హోదా మాత్రమే ఉంది. పోలీస్, భూవ్యవహారాలు వంటివి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

21:45 - July 1, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ కోసం భూసేకరణ చేస్తున్న విధానంపై చాలా సందేహాలొస్తున్నాయన్నారు.... సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. డ్యాంకోసమే అయితే భూసేకరణచట్టం ప్రకారం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల్లో పాదయాత్ర చేసిన తమ్మినేని.... నిర్వాసితులకు అండగా ఉంటామని ప్రకటించారు.

సీపీఎం పాదయాత్రకు భారీ స్పందన ...
మెదక్‌ జిల్లాలోని మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల్లో సీపీఎం పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. నిర్వాసితుల్లో ధైర్యం నింపేందుకు... భూసేకరణ చట్టంపై అవగాహన పెంచేందుకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టింది... శుక్రవారం ఉదయం ఎర్రవెల్లి నుంచి పాదయాత్రను విమలక్క ప్రారంభించారు..

ఎర్రవెల్లి నుంచి పల్లెలకు పాదయాత్రగా వచ్చిన తమ్మినేని బృందం..
ఎర్రవెల్లి నుంచి పల్లెలకు పాదయాత్రగా వచ్చిన తమ్మినేని బృందానికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలు చెప్పుకున్నారు.. తమ ఊళ్లను వదిలిపోమంటూ కన్నీరు పెట్టుకున్నారు..

కష్టంలో అండగా వున్నది సీపీఎం పార్టీయేనంటున్న గ్రామస్థులు...
డ్యాం నిర్మాణంతో ఇబ్బందుల్లో పడ్డ తమకు అండగా నిలిచింది సీపీఎం పార్టీయే అని గ్రామస్తులు చెప్పారు.. గత నెలలో పార్టీ పాదయాత్రవల్లే తమకు భూసేకరణ చట్టం గురించి తెలిసిందన్నారు.. తాత ముత్తాలకాలంనుంచి ఇక్కడే ఉంటున్నామని.. డ్యాం వస్తే తాము ఎక్కడికి వెళ్లాలని ఓ చిన్నారి ప్రశ్నించడం ఆకట్టుకుంది.

భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం : తమ్మినేని
మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని... తమ్మినేని డిమాండ్ చేశారు... బలవంతంగా భూమిని సేకరించడం సరికాదన్నారు.పలు గ్రామాల్లో యాత్ర చేసిన సీపీఎం బృందం పల్లెపహాడ్‌లో బస చేసింది.. ఈ నెల 4వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది.

21:39 - July 1, 2016

హైదరబాద్ : న్యాయాధికారుల తాత్కాలిక కేటాయింపులు రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ న్యాయవాదులు తేల్చిచెప్పారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించకపోతే 10 వేల మందితో పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో ఇందిరాపార్క్‌ దగ్గర మహాధర్నా చేశారు.

తెలంగాణ న్యాయవాదుల నినాదాలతో హోరెత్తిన ఇందిరాపార్క్...
హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ తెలంగాణ న్యాయవాదుల నినాదాలతో హోరెత్తిపోయింది.. న్యాయాధికారుల తాత్కాలిక కేటాయింపు రద్దు, హైకోర్టు విభజన కోరుతూ లాయర్లు మహాధర్నా చేపట్టారు.. ఈ ఆందోళనకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, ఎంఐఎం, బీజేపీ, సీపీఎం, సీపీఐతోపాటు.... ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.. లాయర్లకు సంఘీభావం తెలిపారు... పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చారు..

బీజేపీ నిరంకుశ పాలనే కారణం : ఎంఐఎం
బీజేపీ నిరంకుశ పాలనవల్లే లాయర్లకు ఈ పరిస్థితి వచ్చిందని ఎంఐఎం మండిపడింది. వెంటనే హైకోర్టును విభజించే ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసింది.

లాయర్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి: కోదండరాం
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన లాయర్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని టీజేఏసీ కన్వినర్‌ కోదండరాం కోరారు.. హైకోర్టును విభజించి తెలంగాణ సమగ్ర రాష్ట్రంగా ఆవిర్భవించేవరకూ తాము మద్దతుగా ఉంటామని ప్రకటించారు..

10వేల మందితో పార్లమెంట్‌ను ముట్టడికి నిర్ణయం..
ఈ మహాధర్నాలో లాయర్లు పలు తీర్మానాలు చేశారు. కేంద్రం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి... విభజన చట్టం సెక్షన్ 80 ప్రకారం అధికారులను విభజించాలన్నారు. సస్పెండ్ చేసిన న్యాయాధికారులను, ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఉద్యమం కొనసాగిస్తామని తీర్మానించారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించకపోతే పదివేల మందితో పార్లమెంట్‌ను ముట్టడించాలని లాయర్లు నిర్ణయించారు..
లాయర్లు విధుల్లోకి రావాలి: జస్టిస్ బోస్లే
మరోవైపు లాయర్లు విధుల్లోకి రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరోసారి విజ్ఞప్తి చేశారు.. ప్రజాప్రయోజనాలకోసం సమ్మె విరమించాలని ప్రెస్‌నోట్‌లో కోరారు.. లాయర్ల డిమాండ్లను సరైన సమయంలో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.. లాయర్లు మాత్రం సమ్మె కొనసాగించేందుకే సిద్ధమయ్యారు.. 

21:30 - July 1, 2016

విజయవాడ : హైకోర్టు అంశం కేంద్రం పరిధిలో లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోర్టు విభజన అంశం సుప్రీం కోర్టు పరిదిలో ఉన్నదని ఆయన చెప్పారు. కట్టుబట్టలతో వచ్చిన తాము కోర్టును వదులుకోవడం పెద్ద లెక్క కాదన్నారు. అమరావతిలో హైకోర్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుత కోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుందన్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని హైకోర్టు పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. 

21:22 - July 1, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న ఆయన హస్తినలో బిజీబిజీగా పర్యటించారు. కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, ఉమాభారతి,రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.

చైనా పర్యటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు...
చైనా పర్యటన ముగించుకుని దిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయ్యారు. చైనా పర్యటన వల్ల రాష్ట్రానికొచ్చే పెట్టుబడులను జైట్లీకి వివరించారు. 2014-15 ఆర్థిక లోటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హమీల అమలు చేయాలని కోరారు. పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులను పెంచాలన్నారు. రాజధాని నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో 5 వేల కోట్లుకు పైగా నిధులు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక గజపతి రాజు, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ ఉన్నారు.

రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ....
అనంతరం చంద్రబాబు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలను పరిష్కరించాలని కోరారు. ఏపీ భవన్‌సహా అన్ని సంస్థలు విభజన చట్టం ప్రకారం జరగాల్సిందేనని రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పినట్లు సుజనా చౌదరి తెలిపారు. హైకోర్టు విభజనకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న ఆరోపణలను సుజనా చౌదరి ఖండించారు. హైకోర్టు నిర్మాణానికి అమరావతిలో ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించిందని దాన్ని కేంద్ర బృందం సైతం పరిశీలించి వెళ్లినట్లు గుర్తు చేశారు.

ఉమాభారతిని పరామర్శించిన చంద్రబాబు..
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అనారోగ్యంతో ఉన్నందున ఆమెను ముఖ్యమంత్రి పరామర్శించారని ఇతర విషయాలు చర్చించలేదని సుజనా చౌదరి తెలిపారు. అంతకు ముందు ఏపీ భవన్‌లో సీఎంను.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్‌ సిద్దార్ధనాథ్ సింగ్‌ భేటీ అయ్యారు. టీడీపీ కేంద్రంపై అసంతృప్తితో ఉందన్న ఆరోపణలను సిద్ధార్థ్ నాథ్ ఖండించారు. అనంతరం ఏపీ భవన్‌లో నూతనంగా నిర్మించిన తన కార్యాలయ ప్రాంగణంలో చంద్రబాబు మొక్కలు నాటారు. సాయంత్రం తిరిగి విజయవాడకు వెళ్లిపోయారు. 

21:04 - July 1, 2016

ఢిల్లీ : హైకోర్టు అంశంపై రాద్ధాంతం చేయటం సరికాదన్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. హస్తినలో చంద్రబాబుతో కలిసి.. పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిశారు. రాష్ట్ర సమస్యలను చంద్రబాబు... కేంద్రం దృష్టికి తీసుకొచ్చారని మంత్రి తెలిపారు.

21:00 - July 1, 2016

ఖమ్మం : పెద్దవాగు ప్రాజెక్టు పొంగడంతో రెండు మండలాలు చిన్నాభిన్నం అయిపోయాయి...రోడ్లు తేగిపోవడంతో 80 గ్రామాలకు పైనే రాకపోకలకు అంతరాయం కలిగింది..ముంపు గ్రామాలన్నీ అంధకారంలో ఉన్నాయి..ఇళ్లకు ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.. వేల ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి...నాలుగురోజులుగా కురిసిన వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలాల పరిస్ధితి పూర్తిగా చిన్నాభిన్నమైంది.
నాలుగు రోజులగా అంధకారంలో 60 గ్రామాలు...
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ముంపు మండలాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల పరిస్ధితి అత్యంత దయనీయంగా మారిపోయింది.. వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెంలో 75 ఇళ్లు పెద్దవాగు ప్రవాహంలో కొట్టుకుపోగా చాలా వరకు ఇళ్లులు నేల మట్టం అవ్వడంతో అనేకమంది నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలారు. దాదాపుగా 2000 ఎకరాలకు పైనే పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి..60 గ్రామాలకు పైనే నాలుగు రోజులుగా అంధకారంలో ఉన్నాయి..
80 గ్రామాలకు రాకపోకలు బంద్ ...
నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి...పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరడంతో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తేశారు. దీంతో రెండు మండలాల్లో పెను ప్రమాదమే చోటుచేసుకుంది..పెద్దవాగు పొంగడంతో ఈ రెండు మండలాల్లోని 80 గ్రామాలకు పైనే రాకపోకలు నిలిచిపోయాయి... కుక్కునూరు-రుద్రమకోట, వేలేరుపాడు-తాళ్లవాగు రహదారులు పూర్తిగా కొట్టుకుపోయాయి..ఇక్కడి ప్రజలు నాలుగు రోజులుగా ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహయం అందలేదని ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ముంపు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సర్కారు...
పోలవరం ముంపు మండలాల్లో ఉన్న ఈ ప్రజలు ఎలాగైనా ఖాళీ చేసేస్తారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ప్రభుత్వం పూర్తిగా ముంపు మండలాల ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది... ఒక పక్క వర్షాలు...మరోపక్క వరదనీరు గ్రామాలపై విరుచుకు పడుతున్నా అధికారులు ఎవ్వరూ స్పందించకపోవడం ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి.

20:44 - July 1, 2016

పోలీసు బైకుల నుండి పెట్రోలు తీసి సొంత బైకుల్లో పోసుకుంటున్న పోలీసు పెద్దమడిసి..రోడ్డు మీద నడిసినట్టుగా సెట్టు ఎక్కేసిన ..జార్ఖాండ్ లో పువ్వుగుర్తు పెద్దమడిసి తన 18 ఏండ్ల కొడుకుకి 11 ఏండ్ల పసిబిడ్డతో పెండ్లి చేసిండు..తెలంగాణ రాష్ట్రంల ఆరోగ్య శ్రీ పథకానికి రోగమొచ్చిందంట..ఆరోగ్య శ్రీ సేవల్ని బంద్ చేస్తామంటున్న కార్పొరేట్ దవాఖానాలు...వానలక కొట్టికుపోయిన రోడ్లు..మురికివాడలెక్కన బెజవాడ...ఖమ్మం జిల్లాలో దంచికొడుతున్న వాన...చెరువులో ఇల్లుకట్టుకున్నట్టుగా వున్నాయి ఇండ్లు..మోకాల్లోతు నీళ్లల పసిబిడ్డతో అవస్థలు పడుతున్న ఆడబిడ్డ...మాదాపూర్ ఇండ్లపై క్రషర్ మిషనోడు రాస్తున్న రాతలు... ఫామ్ హౌస్ లో ఇస్త్రీ బట్టలేసుకోని ఎగసాయం సేత్తున్న గుత్తన్న ..గిటువంటి ముచ్చటైన ముచ్చట్లతో మన మల్లన్న ఈరోజు మనముందుకొచ్చేసాడు..మరి జాగు చేయకుండా ఈ వీడియోను చూడుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి...

19:59 - July 1, 2016

సుప్రీం కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి కేసుతో ఆలయాలకు న్యాయం జరగుతుందని తెలుగు గజల్స్ కు చిరునామా అయిన గజల్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కళా సాహితీ సేవల మేళవింపుగా.మూడు దశాబ్దాల పాటు ఆయన ప్రస్థానం..గజల్ శ్రీనివాస్ తో టెన్ టీవీ ఫేస్ టూ ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. ఆలయాల పరంగా ..ఆధ్యాత్మికంగా అనేక వివాదాలు చుట్టుకుంటున్న నేపథ్యంలో గజల్ శ్రీనివాస్ మనోగతంలోకి తొంగిచూసే ప్రయత్నం చేద్దాం... ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం విషయంలో ఆయన ఆయన ఏమంటారో విందాం.. ఆదాయాలు వచ్చే ఆలయాలపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని విమర్శించారు. ఎటువంటి ఆదరణా లేక శిధిలావస్థలకు చేరుకుంటున్న దేవాలయాల విషయంలో ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ తీసుకోవటంలేదని ప్రశ్నించారు. వీఐపీలకు ఇచ్చినంతగా గౌరవాన్ని మెట్టు మెట్టుకూ బొట్టు పెట్టుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులను సమాన స్థాయిలో ఎందుకు చూడటంలేదని ప్రశ్నించారు. ముస్లింలు మక్కాను...క్రైస్తవులు వాటికన్ ను ఎంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారో తిరుమలను కూడా హిందువులు అంత భక్తి శ్రద్ధలతో చూడాలని సూచించారు. తిరుమలను  పర్యాటక కేంద్రంగా కాకుండా భక్తితో చూడాల్సిన అవసరముందన్నారు. మసీదులను, చర్చిలను, గురుద్వార్ లను పాలనలోకి తీసుకోని ప్రభుత్వం కేవలం తిరుమల దేవస్థానాన్ని మాత్రమే ఎందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతోందన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది వుంటే ఆలయ భూములను పర్యవేక్షించాలన్నారు. సర్కారు నియమించే ట్రస్టులు రాజకీయ పునరావాసాలుగా మారిపోయాయన్నారు. దేవాలయాలు ప్రజల ఆస్తి వాటిమీద ప్రజలకే హక్కువుండాలన్నారు. ఆలయాలను ఏటీఎం సెంటర్ గా ప్రభుత్వం మార్చవద్దని ఆయన సూచించారు. దేవాలయాల భూముల్ని సంవత్సరాల తరబడి లీజ్ కివ్వటం దారుణమన్నారు.  భారత దేశంలో 'వేదం ఎంత ముఖ్యమో రైతు స్వేదం'  కూడా దేశానికి అంతే ముఖ్యమన్నారు. 'గిన్నిస్ రికార్డ్ కంటే గిన్నెలో మెతుకులే ' అవసరమన్నారు. చినజీవర్ , స్వరూపానంద, పరిపూర్ణానంద స్వాములవి ఆధ్యాత్మిక ఆవేదనే తప్ప ఆరోపణలు కావన్నారు. మరి భారత దేవాలయాలు...పాటల ప్రస్థానంపై గజల్ శ్రీనివాస్ ఎటువంటి విశేషాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి ....

19:56 - July 1, 2016

ఎప్పుడు ఎలాంటి విపత్తు పొంచివుంటుందో ఎవరం ఊహించం. ఏ ఆకతాయి ఎప్పుడు మీద పడతాడో కనిపెట్టలేం. ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండటమే కాదు, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలిసుండడం మంచిది. అలాంటి కొన్ని టెక్నిక్స్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి నిర్భయ. 

19:54 - July 1, 2016

రొటీన్ పెయింటింగ్స్ కి భిన్నంగా కొత్తగా పెయింటింగ్ వేయాలనుందా? అయితే ఇంకెంకాలస్యం... పెన్సిల్ వర్క్ తో అందమైన పెయింటింగ్ నేర్చుకోవాలనుకుందా? పదండి ఇవాళ్టి సొగసులో నేర్చుకుందాం. 

19:52 - July 1, 2016

ఉద్యోగినులకు మరో శుభవార్త. అనేక విజ్నాపనలు, చర్చల తర్వాత ప్రసూతి సెలవులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజండా ఊపింది. చట్టసవరణకు సిద్ధమైంది.

ఆయుధ రవాణా తర్వాత మనుషుల మనషుల అక్రమరవాణా నే అతి పెద్ద వ్యాపారంగా ఉంది. ఈ వ్యాపారంలో ఎందరో మహిళలు, చిన్నారులు సమిధలుగా మారుతున్నారు.

పడిన చోటే లేచింది. పరుగు ఆపిన చోటే మళ్లీ పరుగు మొదలుపెట్టింది. నిషేధాన్ని దాటుకుని ఆ పరుగు రియో ఒలింపిక్స్ కు చేరుకుంది.

మూడు సార్లు 'తలాక్‌' అని పలకడం ద్వారా భార్యకు విడాకులిచ్చే ముస్లిం ఆచారాన్ని రాజ్యాంగ చట్రం అనే గీటురాయిపై పరీక్షకు గురి చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ముస్లిం సమాజాన్ని విస్తృత స్థాయిలో ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశమని కోర్టు అభిప్రాయపడింది.
లైంగిక దాడికి గురైన మహిళను పరీక్షించే విధానానికి సంబంధించి చట్టం స్పష్టమైన సూచనలు చేసింది. విచారణకు సంబంధించి కూడా ఇన్ కెమెరా లో చేయాలని చెప్పింది., కానీ, ఇటీవల జరిగిన ఓ లైంగిక దాడి కేసులో బాధితురాలి విషయంలో డాక్టర్లు ఆ నిబంధనలకు నీళ్లొదిలారు. నిషేధిత పద్ధతిలో పరీక్షలు నిర్వహించారు. 

ఏ వయసులోనూ, ఏ ప్రదేశంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతున్నా దశలో అనేక సంస్థలు , వారి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేను తయారు చేసాయి. ఇప్పుడు అదే కోవలో మరో స్వచ్ఛంద సంస్థ అలాంటి మరో ద్రావకాన్ని తయారు చేసి, విడుదల చేసింది. 

ఉత్తరాఖండ్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు..

ఉత్తరాఖండ్‌ : వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. పితోర్‌గఢ్‌, చమోలీ జిల్లాల్లో కుంభవృష్టి కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. దేవ్‌ప్రయాగ్‌ సమీపంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రిషికేశ్‌-బద్రినాథ్‌ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌ పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షిస్తున్నారు.

18:51 - July 1, 2016

విశాఖ : గత సంవత్సరం ముఖం చాటేసిన వరుణుడు ఈ ఏడాది ముందుగానే చిరు జల్లులు కురిపిస్తున్నాడు..దీంతో అగస్ట్ లో ప్రాంరంభం కావాల్సిన ఖరీఫ్ సీజన్ ఈనెలలోనే ప్రారంభమైంది. విత్తనాలకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..కొన్ని రోజులుగా వర్షాలు కరువడంతో...విశాఖ జిల్లాలో ఖరీఫ్‌ ఏర్పాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు.

విశాఖ జిల్లాలో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు ..
విశాఖ జిల్లాలో ముందస్తుగానే వర్షాలు కరువడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. విస్తారంగా కరుసిన వర్షాల వల్ల రిజర్వాయర్లు నిండటంతో ఏరువాక పనులను రైతుల ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా భీమిలి అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల, చోడవరంతో పాటుగా ఏజన్సీలోని అన్ని ప్రాంతాలలో ఏరువాక పనులు జోరుగా సాగుతున్నాయి.

విత్తనాల కోసం ఎదురు చూస్తున్న రైతులు..
పొలాలను చదును చేస్తున్న రైతులు, విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి... జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో, విత్తన సరఫరా కేంద్రాలు ఏపీ సీడ్స్‌ ద్వారా విత్తానాలు పంపిణీ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.

వాణిజ్యపంటలపై దృష్టిసారించాలని మంత్రి ప్రత్తిపాటి సూచన...
విశాఖ జిల్లాలో చెరకుతో పాటుగా జొన్న, వేరుశనగ వంటి పంటలను రైతులు సాగు చేస్తారు..అయితే ఇటీవల నగరానికి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు .. ముందస్తుగానే వర్షాలు పడటంతో రైతులు ఖరీఫ్ సీజన్‌ త్వరగా ప్రారంభించాలని అన్నారు. కేవలం వరి మీదనే దృష్టి పెట్టకుండా వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులను ఆదేశించారు.
23 లక్షల గ్రామీణ జనాభాకు వ్యవసాయమే ఆధారం ...
విశాఖ జిల్లాలో 38 లక్షల జనాభాలో, 23 లక్షల గ్రామీణ జనాభా వ్యవసాయ రంగం మీదనే అధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో 2లక్షల 87 వేల ఎకరాల్లో వరిని సాగుచేస్తున్నారు. 2015-16 ఖరీఫ్‌లో 2 లక్షల 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో, లక్షా ఎనభైవేల హెక్టార్లలోనే వరి సాగైంది. అయితే విత్తనకేంద్రాల ఏర్పాటుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, అవి మండల కేంద్రంలోనే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తాము మండలాలలకు వెళ్లి, అధికారుల కోసం పడిగాపులు కాయడం ఇబ్బందిగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.

విత్తనాలు రైతులకు అందుబాటులో వుండాలంటున్న రైతన్నలు..
విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, విత్తనాలను తమకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాధికారులు ఆదిశగా ఆలోచిస్తే పంటలను సవ్యంగా పండించుకోగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

చైనా నుండి ఏపీ పెద్ద ఎత్తున పెట్టుబడులు : చంద్రబాబు

విజయవాడ : చైనా దేశం నుండి ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. చైనా పర్యటన ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంల జరిగిన విశేషాలను మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నేథ్యంలోనే చైనా పర్యటించిన ఆయన చైనా దేశం నుండి ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. రోండోసారి చైనా వెళ్ళిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నానన్నారు.

18:31 - July 1, 2016

నల్లగొండ్ : సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. శిథిలావస్థకు చేరిన హాస్టళ్లు ఎప్పుడు కూలుతాయోనన్న టెన్షన్‌ అందరినీ వెంటాడుతోంది. అయినా పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నీళ్లు కారడంతో ఒక గదికి తాళం ...
శ్లాబ్‌ పైపెచ్చులూడుతూ ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనన్న టెన్షన్‌ విద్యార్థినులను వెంటాడుతోంది. ఎప్పుడో కట్టిన భవనం కావడంతో హాస్టల్‌ శిథిలావస‌్థకు చేరుకుంది. చిన్నపాటి వర్షానికే గోడల వెంట నీళ్లు కారి గదుల్లోకి చేరుతున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హాస్టల్‌లో హాల్‌తో పాటు రెండు చిన్న గదులున్నాయి. వర్షానికి నీళ్లు కారడంతో ఒక గదికి అధికారులు తాళం వేశారు. ఇక ఉన్న ఒక్క గదిలోనే విద్యార్థులంటా ఉండాల్సిన పరిస్థితి.
గదులు లేక విద్యార్థుల ఇబ్బందులు ...
తమకు సరిపోను గదులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులంటున్నారు. వర్షం పడినప్పుడు గోడల వెంట నీరు కారుతుందని.. పైపెచ్చులు ఊడిపడుతున్నాయంటున్నారు. అంతేకాకుండా హాస్టల్‌లో ఉన్న అనేక సమస్యలతో తాము చదువుపై దృష్టిసారించలేకపోతున్నామంటున్నారు విద్యార్థినులు.

పాలకుల నిర్లక్ష్యం...
పాలకుల నిర్లక్ష్యంతో హాస్టల్‌లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులంటున్నారు. వెంటనే హాస్టల్‌కు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొత్త హాస్టల్‌ కట్టించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

18:24 - July 1, 2016

వరంగల్ : చీటీల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి...అయినా కొత్త కొత్తగా...రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలతో వస్తున్న కంపెనీలను నమ్మి అమాయకులు బోల్తా కొడుతూనే ఉన్నారు...పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసిన కేటుగాళ్లు..బిచాణా ఎత్తేస్తున్నారు. ఓరుగల్లులో మరో చిట్‌ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. కోటి రూపాయలకు శఠగోపం పెట్టింది.

ఉప్పొంగిన ఆవేశం....
వీరి ఆగ్రహం వెనుక తమను మోసం చేశారన్న బాధ ఉంది. వీరి ఆవేశం వెనక తమ కష్టార్జితాన్ని దోచుకున్నారన్న వ్యధ ఉంది. వీరి ఆక్రోశానికి కారణం బాధితుల రాళ్లదాడి చేశారు.

వరంగల్‌లో బోర్డు తిప్పేసిన హిమాన్వీ చిట్‌ఫండ్‌ ...
హిమాన్వి చిట్‌ఫండ్‌..కూల్‌గా మాట్లాడి ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టింది. నైస్‌గా మాట్లాడి ఐస్‌ చేసి కోటి రూపాయలు కొల్లగొట్టింది. వరంగల్‌లో ఎన్‌ఐటీ సెంటర్‌లో గతేడాది సెప్టెంబర్‌లో హిమాన్వి చిట్‌ఫండ్ సంస్థ ప్రారంభమైంది. హన్మకొండ, సూర్యాపేటలో బ్రాంచ్‌లు తెరిచి ఆకర్షనీయ ప్రకటనలతో ఆకట్టుకుంది. ఐదుగురి భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ చిట్‌ఫండ్‌లో.. 200 మంది ఖాతాదారులు చిట్టీలు వేశారు. చిట్టీలు పాడుకున్న వారికి మొదట్లో సమయానికి డబ్బులు చెల్లించిన సంస్థ... ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చారు.

చెక్కులు బౌన్స్‌ కావడంతో మోసం వెలుగులోకి..
సూర్యాపేట బ్రాంచ్‌లో ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో ఖాతాదారులు ధ్వజమెత్తారు. తాడోపేడో తేల్చుకునేందుకు సంస్థ చైర్మన్, ఎండీని కలిసేందుకు వరంగల్‌ బ్రాంచ్‌కు వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎండీ రమేష్‌ పారిపోయినట్లు బాధితులకు సమాచారం అందింది. సిబ్బందిని నిలదీసినా వారు స్పందించకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయానికి తాళాలు వేయడంతో సంస్థ బోర్డును రాళ్లతో ధ్వంసం చేశారు.
న్యాయం చేయాలని బాధితుల డిమాండ్...
హిమాన్వీ చిట్‌ఫండ్‌ బోర్డ్‌ తిప్పేసిన విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరుగా వరంగల్‌ బ్రాంచ్‌కు వస్తున్నారు. తమకు న్యాయం

18:19 - July 1, 2016

ఖమ్మం : నలభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న పోడు దారులపై ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ.. ఖమ్మం జిల్లా సీపీఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. మొండికట్ట గ్రామంలో పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని సీపీఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

18:16 - July 1, 2016

మహారాష్ట్ర : తెలంగాణ- మహారాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం మేరకు నేడు బాబ్లీ గేట్లను అధికారులు ఎత్తారు. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు నీటిని దిగువకు విడుదల చేసారు. నీటి విడుదలను త్రిసభ్య కమిటీ పర్యవేక్షిస్తోంది. జులై 1 నుంచి- అక్టోబర్‌ 28 వరకు బాబ్లీ గేట్లను ఎత్తాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్‌ వద్ద 0.6 టీఎంసీలతో 1097 అడుగుల నీరు ఉంది. బాబ్లీ నుంచి శ్రీరామ్‌సాగర్‌కు నీరు చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. ఈ నీటి కోసం ఆయకట్టు పరిధిలోని నిజామాబాదు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు ఆశగా ఎదురు చూస్తునారు. 

మత్తు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్...

నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 225 కిలోల గంజాయి, రూ. 7.12 లక్షల నగదు, కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన రాజ్‌కుమార్, విజయ్‌పాల్, నిజామాబాద్‌కు చెందిన శంకర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ముఠాను అరెస్టు చేశామని ఎస్పీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.

300 ఏళ్ల నాటి బుద్ధవిగ్రహాం విక్రయానికి యత్నం..

హైదరాబాద్ : మైత్రివనం వద్ద 300 ఏళ్ల నాటి బుద్ధవిగ్రహాన్ని విక్రయించటానికి యత్నం. పులివెందులకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుండి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. 

ప్రధాని మరోసారి విదేశాల పర్యటన ...

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనతో బిజీబిజీగా గడుపుతున్నారు. స్వదేశంలో కంటే ప్రధాని విదేశాలలో వుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు. ఆఫ్రికా దేశాల్లో వరుస పర్యటనలు కొనసాగించనున్నారు. మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది. జులై 7నుంచి 11 వరకు ఐదు రోజులపాటు ప్రధాని ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. అణుఒప్పందం, రక్షణరంగంలో భాగస్వామ్యం, సముద్ర తీరప్రాంతాల వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అంశాలపై ఆయా దేశాధినేతలతో సమావేశమై చర్చించనున్నారు. 

ఏరోబ్రిడ్జిని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం ...

ముంబై: ముంబై నుంచి రియాద్ కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఏరోబ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటన సీఎస్టీ విమానాశ్రయంలో జరిగింది. ఈ ప్రమాదంలో విమానం ఎడమవైపు ఇంజిన్, ఎయిరోబ్రిడ్జి దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. 

17:36 - July 1, 2016

రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానుల సంతోషానికి హద్దు ఉండదు. ఆయన సినిమా చూడటానికి ఎగబడుతుంటారు. తాజాగా ఆయన నటించిన 'కబాలి' పై ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం ఆయనకు ఉన్న ఈ క్రేజ్ ని వాడుకోవడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'కబాలి' మూవీ ప్రమోషన్ ను.. ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ తమదైన స్టైల్లో చేస్తోంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పెయింటింగ్‌తో తమ విమానాలను రిడిజైన్ చేసింది. ఇదిలా ఉంటే పుదుచ్చేరి ప్రభుత్వం ఓ మంచి పనికి వాడుకునే ప్లాన్ చేసింది. 'సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి టికెట్స్ ఉచితంగా పొందాలంటే మీ ఇంట్లో టాయిలెట్స్ నిర్మించుకోండి' అని ప్రచారం చేస్తోంది.
772నివాసాలలో 447 ఇండ్లకు మరుగుదొడ్లు లేవని గుర్తించిందట. వారిచే టాయిలెట్ లు నిర్మించ చేయాలని భావించి ఈ ప్లాన్ చేసిందంట. మరి ఎంత మంది టాయిలెట్ లు నిర్మించుకుని టికెట్లు ఫ్రీగా పొందుతారో వేచి చూడాలి.

ఖమ్మం మేయర్ ను నిర్భందించిన కార్మికులు..

ఖమ్మం : మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ మేయర్ పాపాలాన్ ను కాంట్రాక్టు కార్మికులు గదిలో నిర్భందించారు. సీఐటీయూ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

17:12 - July 1, 2016

బాధ్యతలేని వాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు...అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు భానుశంకర్ సుమారుగా 55 మంది కొత్త నటీనటులతో 'అర్ధనారి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఎమ్.రవికుమార్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా టెన్ టివి అర్జున్..మౌర్యాని తో ముచ్చటించింది. ఈ చిత్రంలో హిజ్రా పాత్ర కోసం అధ్యయనం చేయడం జరిగిందని అర్జున్ పేర్కొన్నారు. దీనికి కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరిగిందన్నారు. చిత్ర రిలీజ్ అయిన అనంతరం కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేయడం జరిగిందన్నారు. చిత్రంలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ మౌర్యాని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆడియెన్స్ సమక్షంలో చూసినందుకు సంతోషంగా ఉందని హీరో, హీరోయిన్స్ పేర్కొన్నారు. వీరు ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

17:05 - July 1, 2016

వరంగల్ : జనగామను జిల్లాను చేయాలంటూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియిన వ్యక్తులు  నిప్పు పెట్టారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. వరంగల్ - హైదరాబాద్ రహదారిపై ప్రజలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. రోడ్డుపై బైఠాయించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జులై 8 నుండి తెలంగాణలో హరితహారం..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జనవాడలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జులై 8 నుండి రెండు వారాల పాటు హరితహారం జరగనుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మొక్కలు నాటాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అటవీశాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు అసరమైన ఏర్పాట్లు చేసింది. నర్సరీలో 46 కోట్ల మొక్కలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. దాదాపు 197 రకాల మొక్కలను నాటడానికి రంగం సిద్ధం చేసింది.

16:39 - July 1, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో పట్టుబడ్డ ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఐసిస్‌ ఉగ్రవాదులను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. నిందితులను విచారించడానికి 24 గంటల సమయం సరిపోలేదని... వారిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు సామాగ్రి ఎక్కడి నుంచి వచ్చాయి, నగదు ఎవరు అందించారు తదితర అంశాలపై విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఎన్‌ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం వారిని 12రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిందితులను విచారించడానికి 24 గంటల సమయం సరిపోలేదని... వారిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు  కోరారు. దీంతో కోర్టు నిందితులను ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. కాగా వీరివద్ద నుండి పూర్తిస్థాయి వివరాలు రాబట్టేందుకు ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం ఢిల్లీకి తరలించే అవకాశాలున్నట్లు సమాచారం.

16:29 - July 1, 2016

'టెంపర్, 'నాన్నకు ప్రేమతో' సినిమాలతో జోరుమీదున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత..నిత్యామీనన్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో త్వరలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీత బాణిలను సమకూర్చారు. జులై 22న విడుదల చేయాలని నిర్ణయించారంట. తొలుత ఈ వేడుక ఇతర ప్రాంతాల్లో జరపాలని చిత్ర యూనిట్ భావించిందని, చివరకు హైదరాబాద్ లోనే ఆడియో వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 12న విడుదల చేయటానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఐసిస్ సానుభూతిపరులకు కస్టడీ..

హైదరాబాద్ : ఐసిస్ సానుభూతిపరులకు కోర్టు కస్టడీ విధించింది. ఐసిస్ సానుభూతిపరుల కస్టడీపై కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి 12 రోజుల కస్టడీ ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. ఎన్ఐఏ వాదనలను నిందితుల తరపు న్యాయవాది వ్యతిరేకించారు. అన్ని రోజులు పోలీసు కస్టడీ అవసరం లేదని వాదించారు. చివరకు 12 రోజుల పోలీసు కస్టడీ ఇస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది.

16:19 - July 1, 2016

హైదరాబాద్ : న్యాయాధికారుల ధర్నాకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోస్తే స్పందించారు. న్యాయాధికురులు ఆందోళన విరమించాలని జస్టిస్ భోస్లే కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమస్యను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. న్యాయాధికారుల సమస్యలన్నింటినీ హైకోర్టు పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బోస్లే హామీ పట్ల తమకు ఎటువంటి నమ్మకం లేదనీ ప్రొవిజన్ లిస్ట్ ను పూర్తిగా రద్దు చేస్తేనే తాము ఆందోళన విరమిస్తామనీ న్యాయాధికారులు స్పష్టం చేశారు. కాగా న్యాయాధికారుల ఆందోళనతో న్యాయవ్యవస్థ స్థంభించిపోయింది. ఇరు రాష్ట్రాలలోనూ పలు కేసులు పెండింగ్ లో పడిపోయాయి. హైకోర్టు విభజించాలనే డిమాండ్లతో అందోళన చేస్తున్నారు. సస్పెండైన న్యాయధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ కమిటీకి రవిశాస్త్రి గుడ్ బై..

ముంబై : ఐసీసీ క్రికెట్ కమిటీకి రవిశాస్త్రి గుడ్ బై చెప్పారు. కుంబ్లే అధ్యక్షతన ఉన్న కమిటీ నుండి రవిశాస్త్రి వైదొలిగారు. రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి దక్కాలని అనుకున్నారు. కానీ, ఆ పదవి అనిల్ కుంబ్లేకు దక్కిన విషయం తెలిసిందే. దీనితో రవిశాస్త్రి మనస్థాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.

 

ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. చైనా నుండి తిరిగి వచ్చిన సీఎం చంద్రబాబు శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి ఉమా భారతితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో చర్చించారు.

 

మలేషియా ప్రధాని సలహాదారుతో మంత్రి కేటీఆర్ భేటీ..

మలేషియా : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మలేషియాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం మలేషియా ప్రధాని సలహాదారు ఇడ్రిస్ లతో సమావేశమయ్యారు.

పెరిగిన బంగారం..వెండి ధరలు..

ముంబై : రెండో రోజు వరుసగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 200 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30,550కి చేరింది. వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 44,600కు చేరింది.

ఆందోళన విరమించాలన్న హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్..

హైదరాబాద్ : న్యాయాధికారులు ఆందోళన విరమించాలని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ బోస్లే సూచించారు. గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అర్థం చేసుకోవాలని, ప్రజలకు నష్టం కలిగించవద్దని సూచించారు. న్యాయాధికారుల సమస్యలన్నింటినీ హైకోర్టు పరిష్కరిస్తుందన్నారు.

 

15:58 - July 1, 2016

హైదరాబాద్ : రేపో మాపో దుకాణం మూసేసే పార్టీ వైసీపీ అని టీడీపీ నేత జూపూడి ఎద్దేవా చేశారు . స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడం దారుణమన్నారు టీడీపీ నేత జూపూడి ప్రభాకర్. ఎందరో ఈ పద్ధతిలో రాజధానిని నిర్మిస్తామని వచ్చారని.. కాని తక్కువ కోట్ కు చేయలేమని చెప్పడంతోనే.. ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. వైసీపీకి చేతనైతే..రాజధానిని నిర్మించేందుకు స్విస్ చాలెంజ్ లో కోట్ చేయమని సవాల్ విసిరారు. 2029లో నెం 1 రాష్ట్రంగా అమరావతిని నిలపాలనేదే తమ అజెండా అని అన్నారు. పార్టీని నిలపుకునే స్థితిలో వైసీపీ లేదని ఆయన పేర్కొన్నారు.

కాసేపట్లో ఐసిస్ అనుమానితుల కస్టడీ తీర్పు..

హైదరాబాద్ : ఐసిస్ అనుమానితుల కస్టడీపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి 12 రోజుల కస్టడీ ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. ఎన్ఐఏ వాదనలను నిందితుల తరపు న్యాయవాది వ్యతిరేకించారు. అన్ని రోజులు పోలీసు కస్టడీ అవసరం లేదని వాదించారు. కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడి కానుంది.

15:55 - July 1, 2016

హైదరాబాద్‌ : అసెంబ్లీ అవరణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మౌనదీక్ష చేపట్టారు. విజయవాడలో గాంధీ విగ్రహం ధ్వంసం, ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేతకు వ్యతిరేకంగా వీహెచ్‌ మౌనదీక్ష చేపట్టారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పొంగులేటి కూడా దీక్షలో ఉన్నారు. 

15:52 - July 1, 2016

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ ఇవాళ మరోమారు భేటీ అయింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు, ఉద్యోగుల విభజన అడ్వైజరీ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. నిన్నటి రోజు కమల్ నాథన్ కమిటీ తెలంగాణ సెక్రటేరియెట్‌లో సమావేశమై.. తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులను.. ఏపీ పరంగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. నిన్న పోలీస్ విభజనపై కసరత్తు చేసిన కమల్ నాథన్, ఇవాళ ఆరోగ్య వైద్య విభజన చర్చిస్తున్నారు. 

15:49 - July 1, 2016

హైదరాబాద్‌ : ఇందిరాపార్క్‌ వద్ద అడ్వకేట్లు ఆందోళనకు దిగారు. బీజేపీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ రవీందర్‌ మాట్లాడుతుండగా లాయర్లు అడ్డుకున్నారు. హైకోర్టును విభజించాల్సింది బీజేపీ నేతలే అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇందిరాపార్కు వద్ద న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు. తాత్కాలిక కేటాయింపులు రద్దు, హైకోర్టు విభజించాలనే డిమాండ్లతో అందోళన చేస్తున్నారు. సస్పెండైన న్యాయధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

రీజెన్ పవర్ టెక్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన..

నెల్లూరు : తడ (మం) మాంబట్టు సెజ్ లోని రీజెన్ పవర్ టెక్ ఫ్యాక్టరీ లో కార్మికులు ఆందోళన చేశారు. రాత్రి నుండి ఈ నిరసన కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీ గేటు వద్ద సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

ఐసిస్ కు మేము వ్యతిరేకం : అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ : తాము ఐఎస్ఐఎస్‌కి వ్య‌తిరేక‌మ‌ని ఎంఐఎం పార్టీ ఎంపీ  అసదుద్దీన్ ఓవైసీ ఆయన స్పష్టం చేశారు. దాన్ని అంత‌మొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇస్లామిక్ స్టేట్ కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గ‌తంలో ముష్క‌రుల నుంచి బెదిరింపులు ఎదుర్కున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్ర‌కుట్ర బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో ఈరోజు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల అంశంలో ఆయ‌న మ‌రోసారి స్పందించారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ముష్క‌రుల‌ను మిల‌ట‌రీ ద‌ళాలు అంత‌మొందించాల‌ని ఆయ‌న సూచించారు.

15:35 - July 1, 2016

న్యాయవాదుల పోరాటం న్యాయ సమ్మతమైనది : కోదండరాం

హైదరాబాద్ : న్యాయవాదుల పోరాటం న్యాయ సమ్మతమైనదనీ...వారికి సంఘీభావంగా ఎక్కడిక్కడ ప్రజలు న్యాయవాదులకు సంఘీభావం తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు. తాత్కాలిక కేటాయింపులు రద్దు, హైకోర్టు విభజించాలనే డిమాండ్లతో అందోళన చేస్తున్నారు. సస్పెండైన న్యాయధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. న్యాయవాదుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజాక్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ..న్యాయవాదులు చేసే సమ్మె న్యాయసమ్మతమైనదనీ...సస్పెండ్ చేసిన న్యాయాధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రొ.కోదండరాం డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కావాలని డియాండ్ చేశారు. ఇది ఎవరి స్వార్థం కోసమో పోరాటం కాదనీ..న్యాయం కోసం పోరాటమని ఆయన తెలపారు. న్యాయం కోసం 60ఏళ్లుగా తెలంగాణ చేస్తున్న పోరాటంలో భాగమే ఈ ప్రత్యేక హైకోర్టు అంశం అని ఆయన అన్నారు. న్యాయాధికారుల వాదిస్తున్ అంశాలను పరిశీలిస్తే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశమందనీ..అలా చేయకుండా న్యాయాధికారులను సస్పెండ్ చేస్తే కేసుల పరిష్కారానిక జాప్యం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా గౌరవిస్తేనే న్యాయస్థానం అవుతుంది కానీ లేకుండా అది న్యాయస్థానమని ఎలా అంటామన్నారు. హైకోర్టు తీసుకున్న అనాలోచిన నిర్ణయం పట్ల పున:సమీక్షించాలని ఆయన సూచించారు. న్యాయవ్యవస్థపై ప్రజలకున్న గౌరవాన్ని కోర్టు కాపాడవలసిన అవసరముందన్నారు. ఈ విషయంలో కేంద్ర తన బాధ్యను స్వీకరించాలనీ..అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. తెలంగాణ న్యాయవాదులు ఆందోళన రోజురోజుకూ ఉధృతంగా సాగుతోంది. 

15:24 - July 1, 2016

మృగాల పైశాచిక పరాకాష్టానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. వాంఛలు తీర్చుకోవడానికి ఓ యువతిని అతికిరాతకంగా హింసించారు. కత్తితో 30 పొట్లు పొడిచారు. కేరళలో రెండు నెలల క్రితం జరిగిన న్యాయ విద్యార్థిని జిషా కేసు విచారణలో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఈ ఘోరకలిపై మహిళలు భగ్గుమన్నారు. దేహంలో 30 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. అత్యాచారంతో పాటు మర్మాంగాలను ఛిద్రం చేసినట్లు వెల్లడించారు. రెండు నెలల తరువాత తమిళనాడు కాంచీపురంలో అస్సాంకు చెందిన అమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం అమీర్ కాంచీపురంలో ఉద్యోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు చెప్పిన వివరాలను నిర్ధారించుకొనేందుకు అమీర్ ను కాంచీపురం నుండి చైన్నైకు తరలించారు. అద్దె గదిని పరిశీలించారు. హత్యకు వాడిన మారణాయుధాన్ని వాడారు. ఈ ఘోరకలికి సంబంధించిన మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

న్యాయవాదుల పోరాటం సమ్మతమైందే - కోదండరాం..

హైదరాబాద్ : న్యాయవాదులు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమైందని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఇందిరాపార్కు వద్ద జరిగిన న్యాయవాదుల మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యాయాధికారుల సస్పెండ్ చేయడం సమంజసం కాదన్నారు. అడ్వకేట్స్ లపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

 

ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన...

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. ముందుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన చంద్రబాబు... 2014-15 ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించారు. పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

14:47 - July 1, 2016

గుంటూరు : సొంత రాష్ట్రం నుండి పాలన సాగిచాలంటూ గత ఏడాది కాలంగా ఏపీ ప్రభుత్వం చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. తాత్కాలిక సచివాలయం భవనాలను లాంఛనంగా ప్రారంభించింది. అయితే ప్రభుత్వం మౌలిక వసతులను నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్లు వేయలేక, మౌలిక వసతులు కల్పించలేక నానా తంటాలు పడుతున్నారు. ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం అయిపోయింది. హైదరాబాద్ లోని మొత్తం ఉద్యోగులు వెలగపూడికి చేరిపోయారు..ఇప్పుడు వెలగపూడి అంతా ఉద్యోగులతో సందడిగా మారిపోయింది. ప్రస్తుతం భవనాలు పూర్తి అయినాగాని, మౌలిక వసతులు కల్పించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

టెండర్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం...
మౌలిక వసతులు, రోడ్లుకు సంబంధించిన టెండర్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది. మౌలిక వసతులకు సంబంధించిన టెండర్లను ఆలస్యంగా జూన్ 4,5 తేదీల్లో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఈ నిర్లక్ష్యం ప్రభావం ఇప్పుడు మొత్తం తాత్కాలిక సచివాలయంపై పడింది.

5 భవనాలకు నిర్మాణానికి అయిన ఖర్చు 210 కోట్లు. ..
తాత్కాలిక సచివాలయంలో నిర్మిస్తున్న 5 భవనాలకు సంబంధించి నిర్మాణానికి అయిన ఖర్చు 210 కోట్లు. కాని వాటిలో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం వెచ్చిన ఖర్చు అక్షరాల 300 కోట్లు. అయితే ప్రభుత్వం మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణాలను జూన్ 10 నుండి ప్రారంభించింది. పనులు ప్రారంభమైన రెండు రోజులకే భారీ వర్షాలు రావడంతో పనులు ఆగిపోయాయి.

మౌలిక వసతులు లేకపోవడంతో నానా ఇబ్బందులు...
సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పుడు రోడ్లు, మౌలిక వసతులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సచివాలయం చుట్టు ప్రక్కల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. వాహనాలు చేరుకోవడం కష్టంగా మారింది.

పురాతన కాలంలో నిర్మించిన డొంక రోడ్డు ఆధారం...
సచివాలయం ప్రారంభం అయిన బ్లాక్ ఎదురుగా లారీలు దిగబడిపోతున్నాయంటే పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్ధం అవుతుంది. అయితే మందడం ప్రధాన రహదారి నుండి సచివాలయానికి చేరుకోవడానికి ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన డొంక రోడ్డునే ఉపయోగిస్తున్నారు. ఉద్యోగులు, మంత్రులు, కార్మికులు, లారీలు ఇలా ఏది రావాలన్నా ఆ పురాతన డొంక రోడ్డే దిక్కు. భవనాల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల పై దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే, ఓ బిటీ రోడ్డు కూడా ఎందుకు వేయలేకపోయిందని సీపీఎం నేతలు ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం రహదారులపై దృష్టి పెట్టాలి...
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి , వర్షాలు ఆగిన వెంటనే రహదారుల పనులు పూర్తి చేసి, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. ఉద్యోగులకు, ప్రజలకు సచివాలయం చేరుకునే మార్గం మెరుగ్గా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజకీయపక్షాలు డిమాండ్‌చేస్తున్నాయి.

 

హరితహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్ష సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 3 లేదా 4న హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు సమాచారం.

డీకే అరుణ అరెస్టు..

మహబూబ్ నగర్ : గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ ఎర్రవల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా డీకేకు మద్దతుగా తన అనుచరులతో కలిసి ఆందోళనకు వచ్చారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు డీకే అరుణ, సంపత్ లను అరెస్ట్ చేశారు.

ఉమాభారతితో సమావేశం కానున్న సీఎం బాబు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి జైట్లీ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర జలనవరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ అయ్యేందుకు సీఎం చంద్రబావు వెళ్లారు. కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై బాబు ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జైట్లీతో బాబు భేటీ..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి బాసటగా నిలవాల్సినవసరం ఉందని, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల విడుదలలో వేగాన్ని పెంచాలని జైట్లీని బాబు కోరినట్లు తెలుస్తోంది.

 

14:38 - July 1, 2016

విజయవాడ : బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని రాజధానిలోని తాడిగడపలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని రాజధానిలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. బెజవాడలోని తాడిగడపలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరయి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.9 10 షెడ్యూల్ లో ఉన్న సంస్థలు తప్ప మిగతావన్ని ఏపీ నుండే పాలనను కొనసాగిస్తున్నాయన్నారు. 

14:34 - July 1, 2016

ఉత్తరాఖండ్‌ : పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలి, పితోర్‌గఢ్‌ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టి కారణంగా సుమారు 30 మంది మృతి చెందినట్లు సమాచారం. చమేలిలో 9 మంది, పితోర్‌గఢ్‌లో 8 మంది మృతి చెందారు. చమోలీ జిల్లాలో వరదల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి అనేక ఇళ్లు, మనుషులు, పశువులు కూడా కొట్టుకుపోయాయి. అలకనంద నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. రిషికేష్‌-బద్రీనాథ్‌ 58 వ నెంబర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

14:29 - July 1, 2016

విజయవాడ : ఈ నెల 4న ఏపీ మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నాం 3గంటలకు సీఎం క్యాప్ కార్యాలయంలో సమావేశం జరుగనుంది. సీఎం చైనాలో ఐదురోజుల పర్యటనన నేపథ్యంలో చైనా దేశంలో ఏపీలో పెట్టనున్న పెట్టుబడులు..వాటికి సంబంధించిన భూకేటాయింపులు, హైదరాబాద్ నుండి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు వసతి.. కార్యాలయాకు రాకపోకలకు కావాల్సిన ఏర్పాట్లు , కార్యాలయాల నిర్వాహణ, పూర్తిస్థాయిలో వెలగపూడి నుండి పాలనకు సీఎం చైనా టూర్, ఏపీలో చైనా పెట్టుబడులు..చైనా పెట్టుబడుల నేపథ్యంలో పరిశ్రమలకు కేటాయించాల్సిన భూ కేటాయింపులు, నూతన విద్యాసంస్థలకు కేటాయించాల్సి భూ కేటాయింపులు వంటి పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
చైనా పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. ముందుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన చంద్రబాబు... 2014-15 ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించారు. పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో రూ.5వేల కోట్లకు పైగా నిధులు ఇవ్వాలని కోరారు.రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించాలని... నిధుల విడుదలలో జాప్యం నివారించాలని కోరారు.

 

ముగిసిన కమల్ నాథన్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : కొద్దిసేపటి క్రితం కమల్ నాథన్ కమిటీ భేటీ ముగిసింది. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల విభజన, సచివాలయంలోని 4వ తరగతి ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు. మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

ఐసిస్ నిందితుల కస్టడీపై కోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఐసిస్ నిందితుల 30 రోజుల కస్టడీపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. కస్టడీపై అభ్యంతరాలు ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులకు కోర్టు సూచించిది.

పల్లె సంస్కృతి విధ్వంసం చేస్తూ ఊరుకోం - విమలక్క..

మెదక్ : ప్రభుత్వం మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గురించి ఆలోచించడం లేదని, ప్రాజెక్టుల కింద ప్రభుత్వానికి ముడుపులు అందాయని విమలక్క పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరిట పల్లె సంస్కృతిని విధ్వంసం చేస్తే ఊరుకోమన్నారు. నీటి పారుదల నిపుణులు హనుమంతరావు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

 

చెన్నైలో తిరుపతి పోలీసుల సోదాలు..

చెన్నై : సిడ్ కో పారిశ్రామిక వాడలో తిరుపతి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ గోదాంలో ఏడు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో పట్టుబడిన వారి సమాచారంతో చెన్నైలో సోదాలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. స్మగ్లర్లకు సహకరిస్తున్న స్థానికులపై నిఘా పెంచడం జరిగిందన్నారు.

 

వాద్రాకు మళ్లీ ఈడీ నోటీసులు..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్లుడు రాబర్ట్ వాద్రాకు మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. భూమి స్కాంలో ఈ నోటీసులు జారీ చేసింది. కేవలం రాజకీయ కక్షతోనే ఈ నోటీసులు జారీ చేస్తున్నారనే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

జులై 4న ఏపీ మంత్రివర్గ సమావేశం..

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం జులై 4వ తేదీన జరగనుంది. సీఎం క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరగనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

14:01 - July 1, 2016

తమిళ స్టార్ విక్రమ్ మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడంట. చాలాకాలంగా ఫ్లాప్ లతో సతమతమౌతున్న ఈ నటుడి ఆశలన్నీ ఇరుమురుగన్ పైనే ఉన్నాయి. ఈ చిత్రం ప్రచారం కోసం కొత్త వేడుకను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడంట.
ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో విక్రమ్ కూడా ఘనుడే. కమల్ హాసన్ తరువాత ప్రయోగాలు చేసిన నటుల్లో విక్రమ్ ఒక్కడు. పాత్ర కోసం ఇతను ప్రాణాలు సైతం లెక్క చేయడు. 'ఐ' సినిమా కోసం విక్రమ్ ఏకంగా 40 కేజీల బరువు తగ్గాడంటే పాత్ర కోసం ఎంతైనా కష్టపడుతాడో తెలుస్తుంది. కానీ అలాంటి ఈ హీరోకు గత కొంత కాలంగా హిట్ లు లేవు. అతని చిత్రాలు ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోవడం లేదు. 'ఐ' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు. తాజాగా 'ఇరుమురుగన్' చిత్రంలో విక్రమ్ నటిస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విక్రమ్ భావించాడు. అందుకు సైమా వేడుకలను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. ఈ వేడుకల్లో టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వ్యక్తమౌతుందని చిత్ర యూనిట్ అనుకొంటోందంట. సెప్టెంబర్ 5 వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

13:51 - July 1, 2016

గత కొద్దికాలంగా 'త్రిష' అరకొర సినిమాలతో కెరీర్ ను నెట్టుకొస్తోంది. అనుకున్నంత ఛాన్స్ లేకపోవడంతో వచ్చిన అవకాశాలే చాలు అనుకుని ముందుకెళుతోంది. ఈ బ్యూటీకి కొత్తగా అవకాశాలు రావడం కష్టమేనని సినీ క్రిటిక్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంట. ఇలాంటి కామెంట్స్ చేసిన వారి దిమ్మ తిరిగేలా రెండు క్రేజీ ఛాన్స్ లు పట్టేసింది. వరుసగా వస్తున్న ఆఫర్లతో ఈ ముద్దుగుమ్మ సంతోషం వ్యక్తం చేస్తోంది.
మూడు భాషాలలో నిర్మితమౌతున్న 'నాయకి' మరో హర్రర్ కామెడీ మూవీలో మోహినీగా నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. బాలీవుడ్ 'క్వీన్' రీమెక్ లో నటించే ఛాన్స్ 'త్రిష'ను వర్తించింది. ఈ పాత్ర కోసం రెండేళ్లుగా నిర్మాత త్యాగరాజన్ అన్వేషణ చేస్తున్న సంగతి తెలిసిందే. 'క్వీన్' రీమెక్ కు నటి రేవతి దర్శకత్వం వహించనుండగా మరో నటి సుహాసిని డైలాగ్స్ రాయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో క్వీన్ రీమెక్ ను నిర్మించే ప్లాన్ చేస్తున్నారంట. మరి సౌత్ 'క్వీన్' గా త్రిష ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి. 

13:46 - July 1, 2016

ఖమ్మం : చుట్టూ ఎత్తైన కొండలు...ఎటూ చూసినా పచ్చని చెట్లు...కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం....చూపరుల్ని కట్టిపడసే అందాలు...వర్షకాలం వచ్చిందంటే చాలు ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను  రా.. ..రమ్మంటూ తన వైపు లాగేస్తోంది... ఏంటీ ఈ జలపాతం ఎక్కడుందో చూడాలనుందా...అయితే పదండీ..
రధం గుట్ట జలపాతం
ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతంలో రథంగుట్టపై జాలువారుతుంది. అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలోని రథంగుట్టపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను కనువిందుచేస్తోంది...వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతంలో వర్షకాలం వచ్చిందంటే చాలు ముణుగూరు ప్రాంతం ప్రజలకు రధంగుట్ట జలపాతం ఆహ్లదాన్ని పంచుతోంది...
వందమీటర్ల పై నుంచి జాలువారుతున్న నీరు
రథం గుట్ట జలపాతం వంద మీటర్ల నుంచి జూలువారుతోది...ఈ జలపాతాన్ని చూసేందుకు స్దానిక ప్రజలే కాక, ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పర్యాటకలు తరలివస్తుంటారు. ఈ జలపాతం వద్ద పిల్లలు, పెద్దలు వయసు మరిచిపోయి ఆనందంగా గడుపుతారు...అయితే ఈ జలపాతం ప్రధాన రహదారికి అరకీలోమీటరు దూరంలో ఉంది కానీ అక్కడి నుంచి వెళ్లడానికి సరైన రహదారి లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మాణం చేట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. 
పర్యాటకలు సందడి
రథం గుట్ట వద్ద పర్యాటకలు సందడి నెలకోంది...వర్షాలు పడటంతో జలపాతంలో భారీగా నీరు కిందకు పడటంతో ఆ అందాలను తిలకిస్తూ ప్రకృతి ప్రేమికులు ఆనందంగా గడుపుతున్నారు.

13:42 - July 1, 2016

ఢిల్లీ : రాష్ట్ర అభివృద్థికి సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. ఈమేరకు అరుణ్ జైట్లీతో ఆయన సమావేశమయ్యారు. ఏపీ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, లోటు బడ్జెట్ పై చర్చించారు. కేంద్ర నిధులను త్వరగా విడుదల చేయాలని బాబు కోరారు. చైనా నుంచి రాష్ట్రానికి రానున్న పెట్టుబడుల అంశాలను ఆర్ధిక మంత్రికి  సీఎం వివరించారు.

 

13:37 - July 1, 2016

హైదరాబాద్ : రంజాన్‌ మాసం చివరి శుక్రవారం కావడంతో పాతబస్తీలో సందడి నెలకోంది. పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పాతబస్తీ, చార్మినార్ , మక్కా మసీదు వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు - వీజీవో..

చిత్తూరు : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఘాట్ రోడ్డులో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని వీజీవో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ లో నిబంధనలు అతిక్రమించిన 1300 వాహనాలకు అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. 53 మంది లడ్డూ దళారీలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఎర్రవెల్లిలో సీపీఎం పాదయాత్ర..

మెదక్ : మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎర్రవెల్లి నుండి సీపీఎం పాదయాత్ర చేపట్టనుంది. నాలుగు రోజుల పాటు పాదయాత్ర కొనసాగించడం జరుగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎర్రవెల్లిలో సీపీఎం పాదయాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి రైతుల భూములు తీసుకుని నిర్వాసితులుగా మార్చే ఆలోచన మానుకోవాలన్నారు. ప్రాజెక్టు గురించి మంత్రులు..అధికారులు వివరించకుండా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. ముంపు గ్రామాలన్నీ ఐక్యంగా నిలవాలని సూచించారు.

శ్రీవారి ఆదాయం రూ. 89 కోట్లు..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని జూన్ లో 24.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని 94 లక్షల లడ్డూలు భక్తులకు అందచేయడం జరిగిందని టిటిడి ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. జూన్ మాసంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 89 కోట్లు అని తెలిపారు. తిరుమలలో చిరుతలు సంచరించే ప్రాంతంలో స్థానికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తిరుమలలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు.

12:55 - July 1, 2016

హైదరాబాద్ : మూడుముళ్లు పడి పెళ్లి ముచ్చట్లు ఇంకా తీరనే లేదు..ఎన్నో ఆశలతో కాపురానికి వెళ్లిన నవవధువు అంతలోనే శవమై తేలింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరికీర్తన ఎలా చనిపోయింది? అత్తింటివారి ధనదాహానికి బలైపోయిందా? కట్టుకున్నవాడి పైశాచికాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా? 
ఉసురు తీసిన ధనపిశాచాలు..
మూడు ముళ్లు వేశాడు... మూడు నెలల కాపురం చేశాడు..వేధింపులతోనే మెట్టినింట్లో స్వాగతం..చివరకు ఉరితాడుగా మారిన తాళి....ఉసురు తీసిన ధనపిశాచాలు..ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం...
కూతురిని ఎంతో చదివించారు.
కూతురిని ఎంతో చదివించారు....ఆమె చదువుకు..ఆమెకు తగ్గట్లుగా ఉండాలని కూతురితో సమానంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు...కూతురు సుఖంగా ఉంటుందనుకున్నారు...కాని ఆమె మాత్రం అడుగుపెట్టిన క్షణం నుంచి నరకం చూస్తూనే ఉంది... లక్షలు కట్నం తీసుకున్నా ఆ ధనపిశాచాల్లో దాహం తీరలేదు...ప్రతీ క్షణం డబ్బు కోసం హింసించారు...ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నా సంతృప్తి చెందలేదు.. చివరకు వారి వేధింపులే తాళిని ఉరితాడుగా మార్చేసింది...
కట్న వేధింపులకు నవ వధువు బలి.. 
కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు కట్న వేధింపులకు బలైపోయింది. పెళ్లైన మూడునెలలకే అత్తారింట్లో సాఫ్ట్‌వేర్‌  ఇంజనీర్‌ హరికీర్తన అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...  
డబ్బు కోసం నిత్యం హింస...
విశాఖ ఉక్కునగరం సెక్టార్‌-11 ప్రాంతానికి చెందిన స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి శ్రీనివాసరావు, పద్మావతి దంపతుల రెండో కూతురు  హరికీర్తన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. గాజువాక వుడా కాలని దరి వినాయకనగర్‌కు చెందిన భానుతేజ  కూడా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికి మార్చి 23న ఘనంగా పెళ్లి జరిపించారు అమ్మాయి  కన్నవారు. 10 లక్షల కట్నం, 25తులాల బంగారంతో పాటు ఇతర లాంఛనాలు సమర్పించారు. పెళ్లయిన వారం రోజుల  నుంచే హరికీర్తనకు అధనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. దీనికి తోడు అత్తింటి వారి వేధింపులు, సాధింపులు  పెరిగాయి. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో కాపురం పెట్టినా హరికీర్తనకు వేధింపులు మాత్రం ఆగలేదు.
కట్న వేధింపులే కారణమంటున్న అమ్మాయి పేరెంట్స్.. 
మంగళవారం ఉదయం హరికీర్తన విధులకు వెళ్లగా.. 10గంటలకు భానుతేజ ఫోన్‌ చేయడంతో మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లి్ంది.  అంతలోనే ఇంట్లో ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హరికీర్తన ఉరివేసుకుని  చనిపోయిందని అత్తింటివారు చెప్తుండగా.. కీర్తన మృతికి అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు  ఆరోపిస్తున్నారు. అయితే హడావుడిగా హరికీర్తన మృతదేహాన్ని కిందకు దింపి ఆస్పత్రికి తరలించడంపై మృతురాలి  కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
ఆ గంట సమయంలో ఏం జరిగింది? 
ఇంటికి వచ్చిన గంట సమయానికే హరికీర్తన ఎలా చనిపోయిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. దంపతుల మధ్య  కీచులాట జరిగిందా? మనస్తాపంతో హరికీర్తన ఉరివేసుకుందా? లేక భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడా? మృతురాలి బంధువుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సనత్‌నగర్‌ పోలీసులు..ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం అనంతరం  డెడ్‌బాడీని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు విశాఖకు తరలించారు. నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు భర్త భానుతేజ నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 

 

12:50 - July 1, 2016

వరంగల్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి...చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి..వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి..నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసాయి...దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి..ఏజెన్సీప్రాంతంలో కూడా భారీ వర్షం పడింది. 
ఎడతెరపి లేకుండా వర్షాలు
నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కరుస్తున్న వర్షాలతో వరంగల్ జిల్లా సహ ఏజెన్సీలో వాగులు ఉప్పొంగుతున్నాయి.. చెరువులకు, కుంటలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది...వరంగల్ జిల్లావ్యాప్తంగా 47 మండలాల్లో భారీగా వర్షం కురిసింది...అత్యధికంగా ఏటూరునాగారంలో 59.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది..భారీ వర్షాలకు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి..లోతట్టు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది..
ఉధృతంగా ప్రవహిస్తోన్న జీడివాగు 
ఏటూరునాగారం మండలంలో జీడివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది..దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..చిన్నబోయినపల్లి వద్ద వట్టివాగు ఉప్పొంగడంతో వరంగల్-ఏటూరునాగరం మధ్య రవాణా స్తంభించింది.. గోగుపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది..మేడారంలోని జంపన్నవాగు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రెండు బ్రిడ్జిలకు ఆనుకుని వరదనీరు పరవళ్లు తోక్కింది.  పస్రా వద్ద దయ్యాల వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందిపడ్డారు. తాడ్వాయి ఏటూరునాగారం, తాడ్వాయి పస్రా మధ్య కల్వర్టు పనులు జరుగుతుండగా, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 
మంగపేటలో ఇండ్లు ధ్వంసం
ఏజెన్సీలోని కొత్తగూడలో వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. మంగపేటలో భారీవర్షానికి ఇండ్లు ధ్వంసమయ్యాయి. రమణక్కపేట, రాజుపేట, చింతకుంట, చెరుపల్లి, బోరునర్సాపురం, కమలాపురం ఒరిస్సాకాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. చింతకుంట, తక్కళ్లగూ డెం సమీపంలోని కాజ్‌వే కొట్టుకుపోయింది. మంగపేట శివారులోని గౌరారం వాగు, రాజుపే ట సమీప ముసలమ్మ వాగు, కమలాపురం ఎర్ర వాగు ఉధృతంగా ప్రవహించాయి. వర్ధన్నపేట, జనగామలో ఓ మోస్తరు వర్షం కురిసింది. హన్మకొండ మండలంలోని కొండపర్తిలో ఊరచెరువు కట్టకు గండిపడింది. డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, నర్సింహులపేట, కురవిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పరకాల నియోజకవర్గంలో కురిసిన వర్షానికి చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా నీరు చేరింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్షం పడింది.
మోరంచవాగులో చిక్కుకున్న ఇద్దరు యువకులు
గణపురం మండల కేంద్రం-ధర్మారావుపేట గ్రామాల మధ్య మోరంచవాగులో ఇద్దరు యువకులు చిక్కిపోయారు.  చాక చక్యంతో ఇద్దరు యువకులను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నర్సంపేట సబ్‌డివిజన్‌లోని ఖానాపూర్ మండలం పాకాల సరస్సుకు జల కళ సంతరించుకుంది. ఏజెన్సీలో లక్నవరం సరస్సు 19 అడుగుల నీటిమట్టానికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు మండలంలో కురిసిన వర్షానికి భీముని జలపాతం పరవళ్లు తొక్కుతోంది. భూపాలపల్లి ఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి బొగ్గు గనులు, ఓసీల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోయింది.
రైతులు ఆనందం
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు కాస్తా ఆలస్యమైనప్పటికీ కుండపోతగా కురుస్తున్న వర్షాలు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి.

 

జనగామలో ఉద్రిక్తత..

వరంగల్ : జనగామను ప్రత్యేక జిల్లా ప్రకటించాలంటూ జేఏసీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. హైదరాబాద్ జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్భందించారు. జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలో 20కిపైగా పోలీసు, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి.

బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..

మహారాష్ట్ర : రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లను అధికారులు కొద్దిసేపటి క్రితం ఎత్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు తరలుతోంది.

12:46 - July 1, 2016

ఢిల్లీ : ఎల్‌సీఏ లో భాగంగా బెంగుళూరుకు చెందిన హిందుస్థాన్ ఎరోనాటిక్స్ సంస్థ తయారు చేసిన మరో రెండు తేజస్ యుద్ధ విమానాలు భార‌త వైమానిక ద‌ళంలో చేరాయి. స్క్వాడ్రన్ 45 ఫ్లయింగ్ డాగ‌ర్స్ ద‌ళంలోకి  ఈ విమానాల‌ను ప్రవేశ‌పెట్టారు. 2018 వ సంవ‌త్సరంలోపు  ఈ ద‌ళంలోకి మ‌రో 18 యుద్ధ విమానాలు చేరుతాయని ఏవియేషన్ తెలిపింది. ఎయిర్ మార్షల్ జ‌స్బీర్ వాలియా తేజ‌స్ యుద్ధ విమానాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ తేజస్ యుద్ధ విమానాలలో ఇజ్రాయిల్ రాడార్ టెక్నాలజీని వాడారు. బ్రిటీష్ ఎజెక్షన్ సీటును కూడా రూపొందించింది సంస్థ. విమానంలో ఫ్లై బైవర్ సిస్టమ్ తో పాటు కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్ ను భారత్ తయారు చేసింది. 

 

పుకార్లు నమ్మవద్దు - సీపీ మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగరం ప్రశాంతంగా ఉందని, నేడు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

కడియం నివాసం ముట్టడి..

వరంగల్ : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలంటూ డిప్యూటి సీఎం కడియం ఇంటిని విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ముట్టడించారు. వీరిని పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్టు చేశారు.

వైద్య రంగంలో ప్రభుత్వ పురస్కారాలు - చందూలాల్, లక్ష్మారెడ్డి..

ఖమ్మం : భద్రాచలం సీతారామ స్వామిని మంత్రులు చందూలాల్, లక్ష్మారెడ్డిలు దర్శించుకున్నారు. వచ్చే ఏడాది నుండి వైద్యరంగంలో ప్రభుత్వ పురస్కారాలు అందచేయనున్నట్లు తెలిపారు. ఉత్తమ వైద్యులు, సిబ్బంది, ఆసుపత్రులకు పురస్కారకాలు అందచేయనున్నట్లు వెల్లడించారు.

 

12:43 - July 1, 2016

గుంటూరు : సొంత రాష్ట్రం నుండి పాలన సాగిచాలంటూ గత ఏడాది కాలంగా ఏపీ ప్రభుత్వం చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. తాత్కాలిక సచివాలయం భవనాలను లాంఛనంగా ప్రారంభించింది. అయితే ప్రభుత్వం మౌలిక వసతులను నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్లు వేయలేక, మౌలిక వసతులు కల్పించలేక నానా తంటాలు ఎదురవుతున్నాయి.  
తాత్కాలిక సచివాలయం ప్రారంభం
ఏపీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం అయిపోతుంది. హైదరాబాద్ లోని మొత్తం ఉద్యోగులు వెలగపూడికి చేరిపోయారు..ఇప్పుడు వెలగపూడి అంతా ఉద్యోగులతో సందడిగా మారిపోయింది. ప్రస్తుతం భవనాలు పూర్తి అయినాగాని, మౌలిక వసతులు కల్పించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. 
ప్రభుత్వం నిర్లక్ష్యం
మౌలిక వసతులు, రోడ్లుకు సంబంధించిన టెండర్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది. మౌలిక వసతులకు సంబంధించిన టెండర్లను ఆలస్యంగా జూన్ 4,5 తేదీల్లో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఈ నిర్లక్ష్యం ప్రభావం ఇప్పుడు మొత్తం తాత్కాలిక సచివాలయంపై పడింది.
నిర్మాణానికి అయిన ఖర్చు రూ.210 కోట్లు
తాత్కాలిక సచివాలయంలో నిర్మిస్తున్న 5 భవనాలకు సంబంధించి నిర్మాణానికి అయిన ఖర్చు 210 కోట్లు. కాని వాటిలో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం వెచ్చిన ఖర్చు అక్షరాల 300 కోట్లు. అయితే ప్రభుత్వం మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణాలను  జూన్ 10 నుండి ప్రారంభించింది. పనులు ప్రారంభమైన రెండు రోజులకే భారీ వర్షాలు రావడంతో పనులు ఆగిపోయాయి. 
కార్యాలయాలు ప్రారంభం
సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇప్పుడు రోడ్లు, మౌలిక వసతులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సచివాలయం చుట్టు ప్రక్కల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. వాహనాలు చేరుకోవడం కష్టంగా మారింది. 
పురాతన డొంక రోడ్డు
సచివాలయం ప్రారంభం అయిన బ్లాక్ ఎదురుగా లారీలు దిగబడిపోతున్నాయంటే పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం అవుతుంది. అయితే మందడం ప్రధాన రహదారి నుండి సచివాలయానికి చేరుకోవడానికి ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన డొంక రోడ్డునే ఉపయోగిస్తున్నారు. 
ప్రభుత్వం నిర్లక్ష్యం... విమర్శలు 
ఉద్యోగులు, మంత్రులు, కార్మికులు, లారీలు ఇలా ఏది రావాలన్నా ఆ పురాతన డొంక రోడ్డే దిక్కు. భవనాల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల పై దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే, ఓ బిటీ రోడ్డు కూడా ఎందుకు వేయలేకపోయిందని సీపీఎం నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, వర్షాలు ఆగిన వెంటనే రహదారుల పనులు పూర్తి చేసి, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. ఉద్యోగులకు, ప్రజలకు సచివాలయం చేరుకునే మార్గం మెరుగ్గా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజకీయపక్షాలు డిమాండ్‌చేస్తున్నాయి. 

 

12:35 - July 1, 2016

మహబూబ్ నగర్ : జిల్లాలోని గద్వాల్ ను జిల్లాగా ప్రకటించాలంటూ...స్థానికులు ఆందోళనకు దిగారు. నగరంలోని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల జాబితాలో గద్వాల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.   

 

12:31 - July 1, 2016

రంగారెడ్డి : జిల్లాలోని మేడ్చల్ లో సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్ చల్ చేశాడు. గత 8 నెలల క్రితం చింతల్ భరత్ నగర్ లో పెళ్లిచూపులు అయ్యాయి. అయితే అమ్మాయి తండ్రి పెళ్లికి నిరాకరించిడంతో సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకోని యువకుడిని సముదాయించి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

దేవాలయాల తొలగింపుపై బాబుతో చర్చ - కంభంపాటి..

ఢిల్లీ : కృష్ణా పుష్కరాల కోసం రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న దేవాలయాలను తొలగించే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించినట్లు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. దేవాలయాలకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటామని, దేవాలయాల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారని పేర్కొన్నారు.

టి.సీఎస్ ను కలిసిన శ్రీలంక ప్రతినిధులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మను శ్రీలంక ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధిపై చర్చించారు.

విజయవాడలో విగ్రహాల కూల్చివేతపై వీహెచ్ మౌన దీక్ష..

హైదరాబాద్ : గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేత వీహెచ్ మౌన దీక్ష చేపట్టారు. విజయవాడలో గాంధీ విగ్రహం..ఆంజనేయ స్వామి, ఆలయం కూల్చివేతకు వ్యతిరేకంగా వీహెచ్ నిరసన చేపట్టారు.

11:53 - July 1, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబుతో ఏపీ బిజెపి రాష్ట్ర ఇన్ చార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం, నామినేట్ పదవులపై చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కేవలం మర్యాదపూర్వకంగానే కలవడం జరిగిందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించడం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధికి టిడిపి, బీజేపీ కట్టుబడి ఉన్నాయన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా లేదని, ఏపీకి ప్రత్యేక హోదా రాజ్యాంగపరమైన అంశమని, చట్టపరమైన రాష్ట్రానికి చేయాల్సివన్నీ చేస్తామన్నారు. చట్టంలో లేని అంశాల అమలుపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే కాసేపట్లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

11:53 - July 1, 2016

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. సుల్తాన్ సినిమా సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈయన చేసిన కామెంట్స్ పై బాలీవడ్ బాద్ షా స్పందించారు.
తాను కూడా గతంలోనే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్నానని తెలిపారు. అలాంటిది మరొకరు చేసిన కామెంట్స్ పై తాను ఎలా స్పందించాలంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. స‌ల్మాన్ కామెంట్స్‌పై మాట్లాడ‌టానికి నేనెవ‌ర్నంటూ అత‌డు త‌ప్పించుకున్నాడు. బాలీవుడ్ బాద్ షా కూడా గతంలో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కొద్ది సేపటి తరువాత సల్మాన్ తో క‌లిసి స‌రదాగా దిగిన ఫొటోను షారుక్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

భారత వైమానిక దళంలోకి తేజస్..

ఢిల్లీ : భారత వైమానిక దళంలో తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్' చేరింది. బెంగళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' చేరికతో భారత వైమానిక దళం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లు చెప్పొచ్చు.

 

11:33 - July 1, 2016

విజయవాడ : ఏపీలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. దీంతో ఏపీలోని ప్రతి ప్రాంతం తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల.. ఇప్పటికే పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
రికార్డు స్థాయి వర్షపాతం 
కొద్ది రోజలుగా ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో జూన్ నెలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలోను, అటు రాయలసీమలోను ఇప్పటికే గతేడాది కంటే.. మూడు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు,వంకలు నదులు పొంగిపోర్లుతున్నాయి.  
కోస్తాంధ్రలో జూన్ నెల సాధారణ వర్షపాతం 98.6 మిల్లీమీటర్లు 
కోస్తాంధ్రలో జూన్ నెల సాధారణ వర్షపాతం 98.6 మిల్లీమీటర్లు కాగా.. ఈఏడాది ఇప్పటికే 176.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రవాణాకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరిలో 285 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలోను 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు , వీలేరుపాడులో 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో  రుద్రంకోట రహదారి కొట్టుకుపోయింది. 
తూ.గో... 241 మి.మీ వర్షపాతం 
అటు తూర్పుగోదావరిజిల్లాలోను 241 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లి.. కల్వర్టులు..బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
కృష్ణా జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయి వర్షపాతం
కృష్ణా జిల్లా వ్యాప్తంగా జూన్ నెల రికార్డుస్థాయి వర్షపాతం నమోదవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 50 మండలాలకుగాను 46 మండలాల్లో 273 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదవుతోంది. జగ్గయ్యపేట, వత్సవాయి, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం మండలాలలో గతేడాది కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. విజయవాడరూరల్ 208 మిల్లీమీటర్ల, విజయవాడ అర్బన్ 112 మిల్లీమీటర్ల, మచిలీపట్నం 261 మిల్లీమీటర్ల మేర అధిక వర్షపాతం నమోదైంది. 
రాయలసీమలో 176.0 మి.మీ వర్షపాతం  
ఇటు రాయలసీమలోరే సాధారణ వర్షపాతం 66.2 మిల్లీమీటర్ల కాగా గడిచిన 29 రోజుల్లో దాదాపు మూడింతలుగా అంటే 176.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చిత్తూరులో 135 మిల్లీమీటర్లు , కడప జిల్లాలో 133 మిల్లీమీటర్లు కురిసింది. మరికొద్ది రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

 

పెనుకొండలో రంజాన్ తోఫా..

అనంతపురం : ముస్లీంల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. పెనుకొండలో ముస్లింలకు రంజాన్‌ తోఫాను మంత్రి సునీత పంపిణీ చేశారు.

ఆదిలాబాద్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి...

ఆదిలాబాద్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కైరిగూడ, డోర్లి-1, డోర్లి-2 ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల భారీగానే నష్టం కలిగినట్లు తెలుస్తోంది.

 

 

కేసీఆర్ కేంద్రంపై పోరాడుతామనడం సరికాదు - చిన రాజప్ప..

కాకినాడ : న్యాయస్థానాలకు ప్రాంతీయతత్వం ఆపాదించడం తగదని ఏపీ డిప్యూటి సీఎం చిన రాజప్ప పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రంపై పోరాడుతామనడం సరికాదన్నారు.

 

తాడిగడపలో బీసీ సంక్షేమ డైరెక్టరేట్...

విజయవాడ : తాడిగడపలో బీసీ సంక్షేమ డైరెక్టరేట్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పల్లె, దేవినేని, జడ్పీ ఛైర్ పర్సన్ అనురాధ పాల్గొన్నారు. ప్రజలకు చేరువుగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో తాడిగడపలో బీసీ సంక్షేమ డైరెక్టరేట్ ను ప్రారంభించడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నేటి నుండి బీసీ సంక్షేమ శాఖ పూర్తిస్థాయిలో ఏపీ నుండే పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 9, 10 షెడ్యూల్ లో ఉన్న సంస్థలు తప్ప మిగిలవన్నీ తరలివచ్చాయన్నారు.

మలేషియాలో మంత్రి కేటీఆర్ పర్యటన..

మలేషియా : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మలేషియాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం మలేషియా ప్రధాని సలహాదారు ఇడ్రిస్ జ‌ల‌తో మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు.

 

రోడ్డుపై బైఠాయించిన డీకే అరుణ..

మహబూబ్ నగర్ : గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే డీకే అరుణ రోడ్డుపై బైఠాయించారు. పాలమూరు జిల్లాలోని ఎర్రవలి చౌరస్తా వద్దకు వచ్చిన ఆమె జాతీయ రహదారిపై కూర్చొన్నారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

బాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు భేటీ..

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జీ సిద్ధార్థ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సమావేశమయ్యారు. టిడిపి, బీజేపీ మధ్య సమన్వయం..నామినేట్ పదవులు..ఆలయాల వ్యవహరాల అంశాలపై చర్చించారు.

 

10:45 - July 1, 2016

ఖమ్మం : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనతో భద్రాచలం ఐటీడీఏ రూపురేఖలే మారిపోతుండగా.. ఏజెన్సీలో ఆదివాసీలకు కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ముంపు మండలాలకు భద్రాచలం ఐటీడీఏ నుంచి సాయం ఆగిపోవడంతో.. గిరిపుత్రుల నానాఅవస్థలు పడుతున్నారు. 
1993లో భద్రాచలంలో  ఐటీడీఏ  ఏర్పాటు
అతిపెద్ద ఐటీడీఏ గా గుర్తింపు భద్రాచలం  గిరిజనాభివృద్ధి సంస్థ... జిల్లాల పునర్విభజనతో ముక్కలవుతోంది.. ఏజెన్సీవాసుల అభివృద్ధి కోసం ఖమ్మంలో 1975 మార్చి 3న ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి.. ఖమ్మంలో ఉన్న ఆఫీసును 1979లో పాల్వంచకు తరలించారు... అక్కడ నుంచి 1993లో భద్రాచలంకు మార్చారు. ఏ ఐటీడీఏకులేనివిధంగా అధునాతన భవనాలు, సువిశాలమైన స్థలం సమకూరాయి.  
ఆదివాసీలకు అందని సాయం
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో దాదాపు 76శాతం విస్తీర్ణం ఏజెన్సీ ప్రాంతంగా ఉంది.. ఖమ్మంజిల్లాలో 4 డివిజన్లు ఉండగా... 3 డివిజన్‌లు ఏజెన్సీ పరిధిలోనివి.... రాష్ట్ర విభజన జరగక ముందు భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలోని 29 మండలాలు పూర్తిగా... సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి.. ఇందులో ట్రైబల్ సబ్‌ప్లాన్ పరిధిగా గుర్తించిన 19 మండలాలకు ఐటీడీఏ ద్వారా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగేది. కాని... రాష్ట్రవిభజన నేపథ్యంలో  భద్రాచలం ఐటీడీఏ పరధిలోని 7మండలాలు... ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. ఆతర్వాత పట్టించుకోవడం మానేశారని గిరిపుత్రులు  ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడుతుండటంతో విషజ్వరాలు ప్రభలి ఎక్కడ ప్రాణం తీస్తాయోని భయపడుతున్నారు. 
భద్రాచలం ఐటీడీఏ నుంచి అందని సాయం
ఇప్పటిదాకా  అక్కడి ఏజెన్సీ ప్రాంతాలకు  భద్రాచలం ఐటీడీఏ నుంచే  సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం.. చింతూరులో ఏపీ ప్రభుత్వం ఐటీడీఏ ఏర్పాటు చేసింది. అయితే..అక్కడ ఇంకా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీంతో  ఏపీలో కలిసిన 7 మండలాల్లోని ఆదివాసీలు భయంగుప్పిట్లో బతుకుతున్నారు. రెండు రాష్ట్రప్రభుత్వాలు  బాధ్యతను దులపరించుకున్నాయని...ఏజెన్సీ వాసులు మండిపడుతున్నారు.
ఆదివాసీల కష్టాలు 
రాష్ట్రవిభజన, ఆ తర్వాత కొత్తజిల్లాల ఏర్పాటు నేపథ్యంలో భధ్రాచలం ఐటీడీఏ పరిధి తగ్గిపోతుండగా... ముంపు మండలాల్లోని ఆదివాసీల కష్టాలు మాత్రం పెరిగిపోయాయి.  ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ముంప ప్రాంతాల్లో గిరిజనులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 

 

 

న్యాయావాదుల మహా ధర్నా ప్రారంభం..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు. న్యాయాధికారుల కేటాయింపులు రద్దు..హైకోర్టు విభజన..సస్పెండ్ చేసిన న్యాయాధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

10:39 - July 1, 2016

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ధృవ. 'తుఫాన్‌' తర్వాత రామ్‌ చరణ్‌ 'ధృవ' చిత్రంలో పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. చరణ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. సెట్‌లో రామ్‌ చరణ్‌తో దిగిన ఓ సెల్ఫీని నటుడు నవదీప్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఎప్పటికీ బెస్ట్‌ కో సూపర్‌ స్టార్‌. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది' అని నవదీప్‌ పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో చెర్రీ, నవదీప్‌ పోలీస్‌ డ్రెస్‌లో ఫోజిచ్చారు. ఈ చిత్రం కోసం చరణ్‌ శాఖాహారిగా మారి కఠినమైన డైట్‌ పాటిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక విదేశీ ట్రైనర్ల సహకారంతో ఫిట్‌నెస్‌ కసరత్తులు కూడా చేశారు. తమిళంలో గతేడాది విడుదలై భారీ హిట్‌ సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 

 

కాసేపట్లో ఇందిపార్టీ వద్ద న్యాయవాదుల మహాధర్నా...

హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద  కాసేపట్లో న్యాయవాదులు మహాధర్నా చేపట్టనున్నారు. అన్ని పార్టీల నాయకులను ఆహ్మానించారు. తాత్కాలిక కేటాయింపులు రద్దు, హైకోర్టు విభజించాలనే డిమాండ్లతో అందోళన చేస్తున్నారు.  సస్పెండైన న్యాయవాధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల నుంచి న్యాయవాదులు భారీగా తరలివస్తున్నారు. 

10:32 - July 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉధృతంగా సాగుతోంది. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించారు. తాత్కాలిక కేటాయింపులు రద్దు, హైకోర్టు విభజించాలనే డిమాండ్లతో అందోళన చేస్తున్నారు. సస్పెండైన న్యాయధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల నుంచి న్యాయవాదులు భారీగా తరలివస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండేండ్లు గడిచినా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో పాటు దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామకాలు, కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుండటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన లక్షంతో పాటు, న్యాయాధికారుల కేటాయింపుల జాబితాను రీకాల్ చేయాలనే డిమాండ్లు ప్రధాన ఎజెండాగా ఈ ధర్నా సాగనుంది. ఆందోళన చేపట్టిన తెలంగాణ న్యాయాధికారులను ఉమ్మడి హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని న్యాయవాదులు తప్పుగా పరిగణిస్తున్నారు. మరి వారు చేపడుతున్న ఆందోళనపై ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో వేచి చూడాలి.

 

10:22 - July 1, 2016

పాండిచ్చేరి : పదవుల్లో కూర్చున్నాక లీడర్లకు ...ప్రొటోకాల్‌ సమస్య వచ్చిపడుతుంది. అప్పటిదాకా  ప్రజలతో ఉన్న ప్రత్యక్షసంబంధం దూరంఅవుతుంది. జనంతో సరదా కబుర్లకు బ్రేక్‌పడుతుంది.  కాని.. ఆమె రూటే సెపరేట్‌...అధికారిగా ఉన్నా... రాజకీయాల్లో ఉన్నా.. చివరికి రాజ్యాంగపదవుల్లో ఉన్నా... ఒకటే తీరు. ప్రజలతో కలిసిపోవడానికి హోదాలు అడ్డంకావని నిరూపిస్తున్నారు పుదుచ్చేరి గవర్నర్‌. 
పుదుచ్చేరీ గవర్నర్‌గా జోష్‌లో కిరణ్‌బేడీ
కిరణ్‌బేడీ... ఇపుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌.  కేజ్రీవాల్‌ పార్టీకి గుడ్‌బైచెప్పిన తర్వాత.. బీజేపీలో చేరిన ఈ మాజీ ఐపీఎస్‌ అధికారిణి.. ఇపుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వచ్చారు. అయితే.. అందరి గవర్నర్లలాగా సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ సమస్యలు  ఏవీ  ఈమెకు లేవు.. ప్రజాఉద్యమాల్లో ఉన్నా... రాజకీయల్లో ఉన్నా... ఇపుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నా.. ప్రజలతో ప్రత్యక్షసంబంధాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 
ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రీగా కబాలి చూపిస్తామన్న కిరణ్‌బేడీ 
తాజాగా పుదుచ్చేరీకి స్వచ్ఛభారత్‌  ప్రచారకర్తగా ఉండాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను ఆహ్వానిస్తూ టీట్టర్లో మెసేజ్‌ పెట్టారు కిరణ్‌బేడీ. ఇది ఇపుడు తమిళనాడు, పుదచ్చేరిల్లో హాట్‌టాపిక్‌గ్గా మారింది. ఇదే సమయంలో పాండిచేరి కలెక్టర్‌ మరో అడుగు ముందుకేశారు.  కబాలి చిత్రం  ప్రివ్యూటిక్కెట్లను ఫ్రీగా  ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు. దీనిపై స్పిందించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ... కబాలి చిత్రం చూసిన తర్వాత ఉత్సాహంగా పనిచేస్తారా.. అని ఉద్యోగులను అడిగి మరింత ఉత్సాహపరిచారు. పుదుచ్చేరిని ప్రధాని మోడీ ఆశించినట్టుగా అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ.. పదవిచేపట్టిన మొదట్లో చెప్పుకున్న కిరణబేడీ... అదే జోష్‌ను కొనసాగిస్తున్నారు. 
 

10:15 - July 1, 2016

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజన, తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా న్యాయమూర్తులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో న్యాయవాదులు ఆందోళన మరింత ఉధృతమయ్యింది. ఓ వైపు  సస్పెన్షన్‌లు కొనసాగుతుండగా... మరోవైపు ఉద్యమం తీవ్రతరమవుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు ఉద్యోగులను హైకోర్టు ఈరోజు సస్పెండ్‌ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఇవాళ ఇందిరా పార్క్‌ దగ్గర మహా ధర్నా చేపట్టాలని తెలంగాణ న్యాయవాదుల జెఎసి నిర్ణయించింది. 
మరో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ 
క్రమశిక్షణ ఉల్లంఘన కింద హైకోర్టు గురువారం మరో నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. సెలవులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించారన్న అభియోగంపై రంగారెడ్డి జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సీహెచ్‌ వెంకట రంగారెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు కృష్ణయ్య, కోశాధికారి రత్న రాజులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. 
మంగళవారం మరో తొమ్మిది మందిపై వేటు 
న్యాయాధికారుల విభజనను నిరసిస్తూ ఆదివారం ప్రదర్శన నిర్వహించిన న్యాయాధికారుల్లో ఇద్దిర్ని సోమవారం హైకోర్టు సస్పెండ్‌ చేయగా, మంగళవారం మరో తొమ్మిది మందిపై వేటు వేసింది. వీటిని నిరసిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనతో తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఇదే క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర మహా ధర్నా నిర్వహించాలని తెలంగాణ అడ్వకేట్స్‌ జేఏసీ నిర్ణయించింది. 
హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదు : కేఈ 
మరోవైపు హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకంకాదని ఏపీ  ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోసం అమరావతిలో స్థలం కేటాయించామని, నిర్మాణం కోసం నిధులు  ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో హైకోర్టుతో పాటు నగరంలోని వివిధ కోర్టుల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేతపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందనన..

హైదరాబాద్ : ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు కాసేపటి క్రితం తనకు సమాచారం వచ్చిందని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి నుండి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బకాయిలు చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతానని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడి పేదలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఉధృతంగా గోదావరి నది..

ఖమ్మం : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. శుక్రవారం ఉదయం 10.2 అడుగులకు చేరింది. 1 లక్ష 67 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

10:08 - July 1, 2016

జట్టు వత్తుగా ఉండాలని..ఆకర్షణీయంగా కనిపించాలని..అందరి దృష్టి తమ మీదనే ఉండాలని తహతహలాడుతుంటారు. కానీ కేశాలతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇందుకు మార్కెట్లో దొరికే ఏవో ఒక షాంపులు పెట్టుకుని స్నానం చేసేస్తుంటారు. మంచి షాంపూను ఎన్నుకోవడం తెలియని వారికి కొన్ని చిట్కాలు...
కురులు ఆరోగ్యంగా ఉండాలంటే షాంపూలే వాడకుండా వాటితో పాటు కండీషనర్లు కూడా వాడాలి. మొదటిసారి షాంపూతో తల కడిగితే మురికి పూర్తిగా పోతుంది. రెండోసారి షాంపూ వాడినప్పుడు తలలో ఉన్న నూనె పొర తొలగిపోతుంది.
ప్రతి రోజు తలస్నానం చేయాలి. కుదరనిపక్షంలో వారంలో కనీసం రెండు సార్లైనా చేయాలి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
షాంపూలు కొనేముందు వాటిపై రాసి ఉన్న వివరాలను చదివితే పి.హెచ్ శాతాని గుర్తించవచ్చు.
ఔషధ గుణాలనున్న షాంపూల్లోనూ పి.హెచ్.శాతం లభిస్తుంది. కాబట్టి వీటిని ఎంచుకోవచ్చు.
యాసిడ్, బేసిక్, నూట్రల్ వంటి రకాల్లో షాంపూలు లభిస్తాయి. బేసిక్ రకాలన్నీ గాఢత ఎక్కువగా ఉన్న షాంపులని తెలుసుకోవాలి. వీటిని ఎంత తక్కువ వాడితే అంత మంచిది.
పి.హెచ్. శాతాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాల్సి ఉంటుంది. పి.హెచ్ శాతం 5.5 ఉన్న షాంపూలను మాత్రమే వాడాలి. ఈ షాంపూలను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది. 

10:07 - July 1, 2016

హైదరాబాద్ : కబాలి సినిమా ప్రమోషన్‌ వినూత్నంగా జరుగుతోంది. మూవీ ప్రమోషన్ ను.. ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ... తమదైన స్టైల్లో చేస్తోంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పెయింటింగ్‌తో తమ విమానాలను రిడిజైన్ చేసింది. కబాలి పోస్టర్‌ తో ఉన్న ఈ విమానాలు ఇప్పుడు క్రేజ్ గా మారాయి. 

10:06 - July 1, 2016

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని..మ్యాచ్ లేకుంటే సరద..సరదాగా గడుపుతుంటాడు. తనకిష్టమైన బైక్ లపై రయ్యిమంటూ దూసుకెళ్తుంటాడు. తాజాగా జింబాబ్వే సిరీస్ నెగ్గిన మిస్టర్ కూల్ కెప్టెన్ రాంచీలో రయ్యి..రయ్యిమంటూ వెళుతున్నాడు. జోరుగా కురుస్తున్న వర్షంలో తడిసిముద్దవుతున్నాడు. ఎక్కువ కాలం ధోని రాంచీలో గడుపుతున్నాడు. రాంచీ రోడ్లపై బైక్ పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. 'వానలో బైక్ పై ప్రయాణం..రాంచీలో వానలు ఇంకా బాగా కురవాలి' అంటూ తన ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే అక్టోబర్ లో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ధోనికి విశ్రాంతి లభించనున్నమాట. మరోవైపు వెస్టిండీస్ తో ఈనెల 21 నుండి జరిగే టెస్టు మ్యాచ్ లో తలపడేందుకు టీమిండియా సమాయత్తం అవుతోంది.

 

10:04 - July 1, 2016

లండన్ : శాస్త్ర విజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. రోబోలను తయారు చేసిన మానవుడు దానిని ఇతర రంగాలకు వాడుకుంటున్నాడు. తాజాగా ఓ లాయర్ రోబో చేస్తున్న కృషిపై ప్రశంసలు జల్లు కురుస్తున్నాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్లిన సమయంలో వాహనాన్ని పార్కింగ్ లో ఆపి వెళ్తాం.. కదా..తిరిగి వచ్చి చూసే సరికి వాహనం కనిపించదు. సరైన ప్రాంతంలో పార్కింగ్ చేయలేదని..ఇతరత్రా కారణాలు పేర్కొంటూ ట్రాఫిక్ పోలీసులు తీసుకెళుతుంటారు. జరిమాన విధించాలని ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలు..తాము సరైన చోటనే పార్కింగ్ చేశామని చెప్పినా వినిపించుకోరు..జరిమాన కట్టాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తారు. అయితే దీనికి ఈ 'రోబో' లాయర్ చెక్ పెట్టేసింది.
అమెరికా, బ్రిటన్ లలో అన్యాయంగా వేసిన 1.60 లక్షల జరిమానాలను ఈ రోబో లాయర్ తిప్పి కొట్టింది. దీనిని స్టాన్ ఫర్డ్ వర్సిటీకి చెందిన 19 ఏళ్ల బ్రిటన్ విద్యార్థి జోషువా బ్రౌడర్ రూపొందించాడు. ఆన్ లైన్ ద్వారా అప్పటికప్పుడే క్షణాల్లో సేవలందిస్తుంది. పార్కింగ్ కు అన్యాయంగా జరిమానా విధించినా..పార్క్ చేసిన స్థలం..ఫైన్ వివరాలు..ఆ దేశం యొక్క చట్టాలను పరిశీలించి చట్టంపరంగా ఫైన్ ను ఎలా తిప్పికొట్టాలో సంబంధిత బాధితుడికి ఈ రోబో వివరిస్తుంది. ఇలా వివరించడం ద్వారా న్యూయార్క్ నగరాల్లో వాహనదారులకు 30 లక్షల పౌండ్లను ఆదా చేసిందంట. ఇతర సేవలను కూడా అందిస్తోందంట...

09:59 - July 1, 2016

పశ్చిమగోదావరి : మూడురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటిలో చిక్కుకుని పోలవరం ముంపు మండలాలు వణుకుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు పాటించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. 
ముంచెత్తుతున్న వర్షాలు
పశ్చిమ గోదావరి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు పొంగడంతో రోడ్లన్ని కొట్టుకుపోయాయి. వేలేరుపాడులోని ప్రధాన రహదారులన్ని వరదకు పూర్తిగా దెబ్బతినడంతో 45 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వర్షాల దెబ్బకి ఏపీలో కలిసిన ఏడు పోలవరం ముంపు మండలాలు వణికిపోతున్నాయి. 
పూర్తిగా దెబ్బతిన్న ప్రధాన రోడ్లు 
అలాగే కుక్కునూరు- వేలేరుపాడు మండలాల్లో ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు మండలాల్లో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. రెండు రోజుల నుంచి గ్రామాల్లోని ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రుద్రమకోటలో వరద దాటికి పైపులైన్ విరగడంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మత్తులు మొదలుపెడతామని అధికారులు తెలిపారు.  
రోడ్డున పడ్డ ప్రజలు  
ఎడతెరిపి లేని వర్షాల వల్ల అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం పూర్తిగా దెబ్బతింది. దాదాపుగా 75 పూరిళ్లు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను తెలంగాణ నుంచి విడదీసిన ఏపీ సర్కారు.. కష్ట సమయంలో కనీసం తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడుతున్నారు. 

 

09:55 - July 1, 2016

హైదరాబాద్ : నగరంలోని చార్మినార్, మక్కామసీద్ పరిసరాలలో రంజాన్ ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి పరిశీలించారు. ఇక రోజువారి ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ దగ్గర పడుతున్న తరుణంలో ఆయన ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.
రంజాన్ మాసంలో చివరి జుమా(శుక్రవారం)ను ముస్లింలు ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజును ఈదుల్ మోమినీన్ అని కూడా అంటారు. అంతేకాకుండా రంజాన్ మాసానికి వీడ్కోలు పలికే పవిత్ర పండుగ అని అర్థం. నగరంలోని అన్ని మసీదుల్లో కూడా మసీదు కమిటీలు జుమ్మతుల్ విదాకు భారీ ఏర్పాట్లు చేశారు. జుమ్మతుల్ విదా కోసం మక్కా మసీదుతోపాటు అటు శాలిబండ, ఇటు షయారాన్ మార్కెట్ వరకు ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు.

 

తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు..

హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర మధ్య గోదావరి నదిపై ఉన్న కీలక ప్రాజెక్టు బాబ్లీ గేట్లు నేడు తెరచుకోనున్నాయి. ఇరు రాష్ఠ్రాల నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారుల సమక్షంలో నేడు బాబ్లీ ప్రాజెక్టులోని 14 గేట్లు తెరచుకోనున్నాయి. అక్టోబర్ 28 దాకా ఓపెన్ గానే ఉండే ఈ గేట్ల నుంచి తెలంగాణ, అటు నుంచి ఏపీకి నీరు నిరంతరాయంగా విడుదల కానుంది.

09:41 - July 1, 2016

జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు ప్రేక్షకుల మనసులపై బలమైన ముద్రని వేశాయి. బాండ్‌... జేమ్స్‌బాండ్‌ అంటూ పెద్దోళ్ళ దగ్గర్నుంచి చిన్న పిల్లల వరకు ఓ ఊత పదంలా వాడుతున్నారంటేనే తెలుస్తోంది.. ఆ సినిమాలు ఎంతటి బలమైన ముద్రవేశాయో. స్టయిలీష్‌ బాండ్‌ క్యారెక్టర్‌, కళ్ళు చెదిరే లొకేషన్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. వంటి తదితర ప్రత్యేకతలతో విజువల్‌ వండర్స్‌గా విశేష ఆదరణ పొంది కలెక్షన్ల సునామీ సృష్టించాయి. 
1962లో జేమ్స్‌బాండ్‌ సిరీస్‌ ప్రారంభం
బ్రిటీష్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ బాండ్‌ ప్రధానంగా సాగే ఈ జేమ్స్‌బాండ్‌ సిరీస్‌ మొదట 1962లో ప్రారంభమైంది. 2015వ సంవత్సరం వరకు 24 సినిమాలొచ్చాయి. యాక్షన్‌ థ్రిల్లర్స్‌గా రూపొందే బాండ్‌ చిత్రాల్లో హీరో క్యారెక్టర్‌తోపాటు హీరోయిన్ల పాత్ర కూడా అత్యంత కీలకమే. బాండ్‌ గర్ల్స్‌గా అందచందాలతోపాటు అడ్వంచరెస్‌ సీక్వెన్స్‌ల్లోని వారి ప్రతిభ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. దీంతో బాండ్‌గర్ల్స్‌కి విశ్వవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది. 'బాండ్‌ గర్ల్స్‌'గా డానియెల బయాంచి, డయానా రిగ్గ్‌, బార్బరా బాచ్‌, మాడ్‌ ఆడమ్స్‌, తాన్య రాబర్ట్స్‌, కారో లోవెల్‌, ఇజాబెల్లా స్కోరుప్కో, మిచెల్లీ యెయిహో, ఎవా గ్రీన్‌, నవోమి హారిస్‌, లీ సెడాక్స్‌ వంటి కథానాయికలు ఎంతగా పాపులర్‌ అయ్యారో మనకు తెలిసిందే. బాండ్‌ సిరీస్‌ చిత్రాల్లో భాగంగా తాజాగా 25వ బాండ్‌ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఈసారి బాండ్‌గర్ల్‌గా నటించే లక్కీ ఛాన్స్‌ హాలీవుడ్‌ హీరోయిన్లకు కాకుండా బాలీవుడ్‌ కథానాయికలకు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, ఇషాగుప్తా వంటి కథానాయికల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, 25వ జేమ్స్‌బాండ్‌ చిత్రంలో బాండ్‌గా నటించేందుకు హాలీవుడ్‌ నటుడు డానియెల్‌ క్రెగ్‌ సుముఖత చూపని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేమ్స్‌బాండ్‌గా ఎవరు నటిస్తారనే దానితోపాటు బాండ్‌గర్ల్స్‌గా బాలీవుడ్‌ కథానాయికల పేర్లు వినిపిస్తుండడంతో హాట్‌టాపిక్‌ అయ్యింది. బాలీవుడ్‌ బాండ్‌ గర్ల్‌ ఎవరన్నది తెలియాంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..!

 

09:33 - July 1, 2016

మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు 2013 చట్టం అమలు పరచాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు పాదూరి కరుణ పాల్గొని, మాట్లాడారు. 2013 చట్టం ప్రకారం అమలు పరచమని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. ఎవరైనా 2013 చట్టమే అమలు పరచమని చెబుతారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:23 - July 1, 2016

నాడు సేవాభావంతో వైద్యం చేయించేవారు.. కానీ నేడు వ్యాపారమయం అయిందని విశాఖ కెజిహెచ్ లో వైద్య సేవలందిస్తున్న డాక్టర్ ఎన్ ఎన్ రాజు అన్నారు. ఇదే అంశంపై జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇవాళ జులై ఫస్ట్. డాక్టర్స్ డే.  వైద్యవృత్తిలో వున్న వారందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్లను దైవ సమానులుగా భావించి గౌరవించే సమాజం మనది. అయితే, ఈ మధ్య కాలంలో డాక్టర్ల మీద, ఆస్పత్రుల మీద దాడులు పెరుగుతున్నాయి. డాక్టర్లకీ పేషెంట్లకీ మధ్య వున్న అనుబంధంలో అపనమ్మకం పెరుగుతోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? సమాజంలో డాక్టర్ల పాత్ర ఏమిటి? వారు పాటించాల్సిన  విలువలేమిటి? వృత్తిపరంగా డాక్టర్లు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి?' ఇలాంటి అంశాలపై ఎన్ ఎన్ రాజు మాట్లాడారు. అ వివరాలను వీడియోలో చూద్దాం...

09:18 - July 1, 2016

నటుడు, డెరెక్టర్ సుమద్రఖని జీవితం ఆధారంగా చిత్రం తెరకొక్కెనుంది. ప్రస్తుతం అరడజనుకుపైగా చిత్రాల్లో నటుడిగా నటిస్తోన్న ఆయన 'అప్పా', 'కిత్నా' అనే చిత్రాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. 'అప్పా' చిత్రంలో ఓ ప్రధాన భూమికనూ పోషిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 11 భాషల్లో రీమేక్‌ చేసేందుకు సముద్రఖని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ చిత్ర కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. ఇది విభిన్న అంశాలను చర్చించేదిగా ఉంటుంది. దేశం మొత్తంలో ఎక్కడైనా విడుదలచేసే కంటెంట్‌ ఈ చిత్రానికి ఉంది. అందుకే తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని 11 భాషల్లో రీమేక్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే కన్నడలో శివరాజ్‌కుమార్‌తో చర్చలు జరిపాం. తెలుగులో వెంకటేష్‌, నాగార్జునతో చర్చిస్తున్నాను. దర్శకుడు ప్రియదర్శన్‌ త్వరలో సినిమాను చూడనున్నారు. ఒకవేళ ఆయనకిది నచ్చితే హిందీలో తనే స్వయంగా నిర్మిస్తానని చెప్పారు. ఇలా 11 భాషల్లో రీమేక్‌ చేస్తా. ఈ చిత్రాన్ని నైవేలిలో షూటింగ్‌ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. నా స్నేహితులు తిరిగి వెళ్ళిపోదామని చెప్పారు. కానీ షూటింగ్‌ కంప్లీట్‌ చేయకుండా తిరిగి వెళ్లేది లేదని షూటింగ్‌ పూర్తి చేశాను. దీంతో అనుకున్న టైమ్‌లోనే సినిమా కంప్లీట్‌ అయ్యింది. ముగ్గురు నాన్నలు, వారి పిల్లల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో నేనొక తండ్రిగా నటిస్తున్నాను. నా నిజ జీవితం ఆధారంగా ఈ తండ్రి పాత్రను డిజైన్‌ చేశాను. అంతేకాదు ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉంది?. దాన్ని తల్లిదండ్రులు ఎలా ఫీలవుతున్నారు? సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌కి ఎలాంటి అంశాలు దోహదపడతాయనే అంశాలను ఇందులో చర్చించాం. పిల్లలతో కలిసి నటించడం చాలా ఈజీ. ఎంజారు చేస్తూ నటించాను. పిల్లలు కూడా ఛాలెంజ్‌గా తీసుకుని సహజంగా నటించారు. వారిని చూస్తుంటే ముచ్చటేసింది. జులై 1న ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను' అని చెప్పారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శక, నిర్మాతగా రాణిస్తున్నారు సముద్రఖని. కె.బాలచందర్‌ వద్ద సుమద్రఖని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. 2003లో 'ఉన్నై చరనడైందెన్‌' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంతో తమిళనాడు స్టేట్‌ అవార్డును అందుకున్నారు. 'నిరంజా మనసు', 'నాలో', 'శంభో శివ శంభో' 'పూరాలి', 'జెండా పై కపిరాజు' వంటి విభిన్న చిత్రాలను రూపొందించారు. 'శంభో శివ శంభో' చిత్రం మూడు భాషల్లోకి రీమేక్‌ అయ్యింది. నటుడిగానూ సముద్రఖని మెప్పించారు. 'విసారణై'లో ఆయన నటనకుగానూ ఉత్తమ సహయ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. 

గద్వాలలో 144 సెక్షన్ అమలు..

మహబూబ్ నగర్ : జిల్లా జాతీయ రహదారి దిగ్భందానికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. దీనితో పోలీసు అధికారులు గద్వాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

 

ఆంధ్రాబ్యాంకు సెక్యూర్టీ గార్డు విద్యాద్ఘాతంతో మృతి..

తూర్పుగోదావరి : ఐనవల్లి (మం) తొత్తరమూడి ఆంధ్రాబ్యాంకులో విద్యుత్ షాక్ తో సెక్యూర్టీ గార్డు మృతి చెందాడు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

 

మక్కా మసీదును సందర్శించిన జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : మక్కా మసీదు వద్ద రంజాన్ ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించారు. ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 

నేడు జుమా ప్రార్థనలు..

హైదరాబాద్ : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా జరిపే ప్రార్థనలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మక్కా మసీదులో జుమా నమాజ్(సామూహిక ప్రార్థనలు) శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలకు జరగనున్నాయి.

నేడు కేంద్ర మంత్రులతో బాబు భేటీ..

ఢిల్లీ : చైనా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చంద్రబాబు నేడు భేటీ కానున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన వారితో చర్చించనున్నట్లు సమాచారం.

బాబుకు ఘన స్వాగతం..

ఢిల్లీ : చైనా పర్యటన ముగించుకుని భారత్‌ చేరుకున్న చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటిలులు స్వాగతం పలికారు.

 

నారావారిపల్లెకు చేరుకున్న నారా లోకేష్..

చిత్తూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. మరికాసేపట్లో రామచంద్రాపురంలో కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీకి చంద్రగిరి నియోజకవర్గంలోని పార్టీ యువ నేతలంతా హాజరవుతున్నారు.

నేటి నుండి శ్రీవారి డాలర్ల విక్రయాలు..

చిత్తూరు : నేటి నుంచి శ్రీవారి చిత్రపటాలతో కూడిన బంగారు డాలర్ల విక్రయాన్ని టీటీడీ లాంఛనంగా ప్రారంభించనుంది. ఒక్కోటి 2 గ్రాముల బరువున్న ఈ డాలర్లను టీటీడీ భక్తులకు విక్రయించనుంది. ఇందుకు తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ పేర్కొంది.

తగ్గిన చమురు ధరలు..

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఈసారి కాస్తంత తగ్గాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్ క్రూడాయిల్ ధరల్లో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు గురువారం రాత్రి ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ పై 89 పైసలు, లీటర్ డీజిల్ పై 49 పైసల మేర ధరలను తగ్గిస్తూ ఆ సంస్థలు ప్రకటించాయి.

 

08:36 - July 1, 2016

డాక్టర్లు వృత్తి అత్యంత బాధ్యతాయుతమైనది. చిన్న జలుబు చేసినా ముందుగా మనం పరుగెత్తేది డాక్టర్ దగ్గరకే.  వైద్యులు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టం.   పేషెంట్ల ప్రాణాలు కాపాడేందుకు అనుక్షణం తపించే డాక్టర్లు మన చుట్టూ ఎందరో వున్నారు. అయితే, కొంతమంది డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది.  వైద్యరంగంలో విలువలు పతనమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 
డాక్టర్స్ డే..డా. బిసి రాయ్ జీవితం
జూలై 1న నేషనల్ డాక్టర్స్ డే గా పాటించడానికి కారణం డాక్టర్ బిసి రాయ్ జీవితం. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిసి రాయ్ జన్మించిందీ మరణించిందీ జూలై 1 కావడం యాదృచ్చికం. 1882 లో బీహార్ లోని పాట్నాలో జన్మించిన బిసి రాయ్ కలకత్తా, లండన్ లలో వైద్య విద్యను అభ్యసించి, కలకత్తాలోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. మెడికల్ కాలేజీలలో అధ్యాపకుడిగానూ పనిచేశారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారాయన. గాంధీజీకి వైద్యుడిగానూ, స్నేహితుడిగానూ వ్యవహరించారాయన. డాక్టర్ గానూ, వైద్య విద్య అధ్యాపకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా బహుముఖ సేవలందించిన బిసి రాయ్ 1961 లో భారతరత్న అవార్డు అందుకోవడం విశేషం.  ముఖ్యమంత్రగా ఎంతగా బిజీగా వున్న ప్రతి రోజూ కనీసం ఒక గంట సేపైనా పేద రోగులకు స్వయంగా వైద్య సేవలందిస్తూ, వైద్య వ్రుత్తిపట్ల తనకున్న  మమకారాన్ని చాటుకున్నారు.   వైద్య వ్రుత్తికే వన్నె తెచ్చిన బిసిరాయ్ ఎందరికో స్పూర్తినిచ్చారనడంలో సందేహం లేదు.  జాతీయోద్యమ కాలంతో ప్రభావితులైన తొలితరం నాయకులు, వృత్తి నిపుణులు ప్రదర్శించిన కొన్ని విలువలకు ఆయనో ఉదాహరణ.  
నేటితరం డాక్టర్ల వ్యవహార శైలి..చర్చనీయాంశం 
జూలై 1న డాక్టర్స్ డే గా పాటిస్తున్న సందర్భంలో నేటితరం డాక్టర్ల వ్యవహార శైలి సహజంగానే చర్చనీయాంశమవుతుంది.  తొలి తరం డాక్టర్లు పాదుకొల్పిన విలువలతో  నేటి తరం డాక్టర్ల తీరు తెన్నులను పోల్చిచూసిన్నప్పుడు మనసంతా భారమవుతుంది. 
డాక్టరంటే ప్రాణదాత..
డాక్టరంటే కేవలం వృత్తి నిపుణుడు మాత్రమే కాదు. ప్రాణదాత. మృత్యుకుహరంలో చిక్కుకున్నవారిని సైతం క్షేమంగా ఒడ్డుకు చేర్చగల శక్తిమంతులు డాక్టర్లు. అందుకే వారిని దైవ సమానులుగా గౌరవిస్తారు. అభిమానిస్తారు. ఆరాధిస్తారు. అయితే, ఇవాళ ఎంతమంది డాక్టర్లు తమ పేషెంట్లకు ఆరాధనీయులుగా మారుతున్నారన్నది ప్రశ్న. 
ఒకప్పుడు వైద్యం వ్యాపకం
ఒకప్పుడు వైద్యం వ్యాపకం. మానవీయ స్పందనలు, సేవా భావం వున్నవారు వైద్య వ్రుత్తిలో ప్రవేశించేవారు. కానీ, ఇప్పుడు వైద్యం వ్యాపారమైంది.  కార్పొరేట్ కల్చర్ రాజ్యమేలుతోంది. ప్రాణాలు నిల్పాల్సిన ఆస్పత్రుల్లో మానవీయ స్పందనలు మాయవుతున్నాయి. నిండు గర్భిణిలను సైతం నిర్ధయగా బయటకు గెంటేస్తున్న  సంఘటనలు జరుగుతున్నాయి.    పసిపిల్లలకు వైద్య సేవలందించే విషయంలోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా ద్రుశ్యాలూ మన కంట పడుతూనే వున్నాయి.  ప్రాణాపాయ పరిస్థితుల్లో మ్రుత్యువుతో పోరాడుతున్నవారికి  కూడా అత్యవసర వైద్యం ప్రారంభించడం లేదు.     ముఖ్యమంత్రి హోదాలో వుండికూడా బిసిరాయ్ లాంటి వారు ప్రతి రోజూ కొంత సమయం వైద్యానికి కేటాయిస్తే, అసలు ఇంజక్షన్ చేయడమేరాని వారు ఇవాళ ఆస్పత్రులు పెట్టి, వ్యాపారం చేస్తున్నారు.  
పర్సు తీస్తేనే పల్స్ 
పర్సు తీస్తేనే పల్స్ చూస్తున్నారు. అడ్వాన్స్ క్యాష్ కట్టనిదే ట్రీట్ మెంట్ ప్రారంభించడం లేదు. చివరకు పేషెంట్ చనిపోయినా,  ఐసియులలో పెట్టి, వైద్యం చేస్తున్నట్టుగా నటిస్తూ, లక్షల్లో బిల్లులు గుంజే దుర్మార్గపు సంస్కృతీ    కొనసాగుతోంది. చాలా ఆస్పత్రులలో కనిపిస్తున్న ఇలాంటి దృశ్యాలు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యమే తమవారిని పొట్టనబెట్టుకుందంటూ తరచూ ఆస్పత్రుల ఎదుట బంధువులు ఆందోళనలు చేస్తున్నారు. 
పరిస్థితులు ఎందుకు దిగజారుతున్నాయి?
వైద్యరంగంలో పరిస్థితులు ఎందుకు ఇంతగా దిగజారుతున్నాయి? ఆస్పత్రుల నిర్వాహకులు, డాక్టర్లు ఎందుకిలా కనికరం లేని యంత్రాల్లా మారుతున్నారు? ఈ పరిస్థితికి బాధ్యులెవరు? వైద్యుడికీ, పేషెంట్ కి మధ్య అనుబంధం ఎందుకు దెబ్బతింటోంది? పేషెంట్లు తమకు వైద్యం చేస్తున్న డాక్టర్లను నమ్మలేని పరిస్థితికి ఎందుకు ఏర్పడుతోంది? ఇవన్నీ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలు. 
సరుకుగా మారిన వైద్య విద్య 
వైద్య విద్య అత్యంత ఖరీదైన సరుకుగా మారిందనడంలో సందేహం లేదు. వైద్య కాలేజీలలో సీట్ల సంఖ్య పరిమితంగా వుంది. దేశం మొత్తం మీద ప్రభుత్వ ప్రయివేట్ కాలేజీలలో కలిపి కేవలం 54వేలు మాత్రమే అందుబాటులో వున్నాయి.     వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో వున్నవి పాతిక వేల సీట్లే.  ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు అందుబాటులో వుండాలి. కానీ, మన దేశంలో  2000 మందికి ఒకరున్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరం.  ప్రపంచ ఆరోగ్య సంస్థ   అంచనాల ప్రకారం 2020 నాటికి మనదేశానికి 11 లక్షల మంది డాక్టర్లు అవసరం. కానీ, ప్రస్తుతం వున్న డాక్టర్ల సంఖ్య 7 లక్షల కంటే తక్కువ.  అంటే రాబోయే  మూడు నాలుగేళ్లలో మరో నాలుగు లక్షల మంది డాక్టర్లను తయారు చేసుకోవాల్సి వుంటుంది. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 40 వేల మంది డాక్టర్లు మాత్రమే పట్టాలు పొందుతున్నారు.  డాక్టర్ల సంఖ్య తక్కువగా వుండడం, స్పెషలిస్టుల సంఖ్య ఇంకా తక్కువగా వుండడంతో డిమాండ్ మరింత పెరుగుతోంది. కనీసం కోటి రూపాయల  డొనేషన్ సమర్పించుకోనిదే ప్రయివేట్ కాలేజీలలో సీటు దొరకడం లేదు. ఇంత డబ్బు పోసి సీట్లు కొనుక్కున్నవారు  పేషెంట్ల పట్ల మానవీయంగా స్పందిస్తారనుకోవడం భ్రమ. 
కాస్ట్లీగా మారిన వైద్య విద్య 
ఒక వైపు వైద్య విద్య కాస్ట్లీగా మారింది. మరోవైపు ఆస్పత్రుల నిర్వహణకు, అత్యాధునిక పరికరాల కొనుగోలుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంకో వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో  సౌకర్యాల లేమి, పోస్టులు భర్తీ చేయకపోవడం వెక్కిరిస్తున్నాయి. మత్తుమందు ఇచ్చే ఎనస్థీషియన్ లేని కారణంగా ఒక్కొక్కసారి ఆపరేషన్ లను వాయిదా వేయాల్సిన పరిస్థితి అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వుంది. ఇలాంటి పరిణామాలన్నీ డాక్టర్ల మీద ఒత్తిడి పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.  కారణం ఏదైనా ఇవాళ వైద్య వ్యవస్థ వ్యాపార వలయంలో   చిక్కుకుంది.   వ్యాపారం వున్న చోట మానవత్వం వుండదు. మన వైద్య వ్యవస్థకే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

 

08:18 - July 1, 2016

హైదరాబాద్ : పీవీ నర్సింహారావు జీవితం కాంగ్రెస్‌ పార్టీని నిరంతరం వెంటాడుతుందని... ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. పీవీ జీవితంపై రాసిన అనువాద గ్రంథావిష్కరణలో ఆయన మాట్లాడారు. హాఫ్‌ లయన్‌ పేరుతో ఇంగ్లీషులో రాసిన ఈ బుక్‌ను .. నరసింహుడు పేరుతో తెలుగులోకి అనువదించారు. రచయిత వినయ్‌సీతాపతి  ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ .. పీవీ జీవితంపై పుస్తకం రాయడం తనకు ఆనందం కలిగించిందన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు.. ప్రముఖులు పాల్గొన్నారు. 

08:01 - July 1, 2016

హైదరాబాద్ : సిట్టింగ్ శాసనసభ్యులకు  జిల్లాల పునర్విభజన కొత్త చిక్కులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం రెండు, మూడు జిల్లాలకు విస్తరిస్తోంది. దీంతో రాజకీయంగా కూడా  కొత్త సమీకరణలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల విభజన కొంత మంది ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది.
శాసనసభ్యుల్లో ఆందోళన
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ పార్టీల శాసనసభ్యుల్లో ఆందోళన రేపుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించిన నేతలకు ఇప్పుడు మరో కొత్త చిక్కు ఎదురవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు రెండేసి జిల్లాల్లో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలు రెండేసి జిల్లాల్లో కార్యకలాపాలు సాగించడం కష్టంగా భావిస్తున్నారు.
కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలు రంగారెడ్డి, హైదరాబాద్‌లో విలీనం
విస్తీర్ణంలో పెద్దగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలు కొత్త ప్రతిపాదనల ప్రకారం రంగారెడ్డి, హైదరాబాద్‌లో విలీనం కానున్నాయి. అయితే ఆ నియోజకవర్గాలు మొత్తం కాకుండా నియోజకవర్గంలోని  కొన్ని మండలాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతుండగా, మరికొన్ని మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి చేరనున్నాయి.
వరంగల్‌, యాదాద్రి జిల్లాలతో మండలాల పంపిణీ
ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న జనగాం నియోజకవర్గం పరిస్థితి దాదాపు ఇదే వరంగల్ తో పాటు యాదాద్రి జిల్లాలో కూడా ఈ నియోజకవర్గం మండలాలు  కొత్త ప్రతిపాదనల ప్రకారం చేరుతున్నాయి. ప్రస్తుతం ఒకే జిల్లాలో ఉన్న నియోజకవర్గం రెండు జిల్లాలకు విస్తరిస్తే. అధికారికంగా కూడా సమస్యలు పెరిగే  చాన్స్ ఉంటుందని  నేతలు అంటున్నారు. మొత్తం మీద జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న నియో జకవర్గాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి.

 

07:55 - July 1, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్‌లో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల‌కు జిహెచ్ఎంసి, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే  20కోట్లు కేటాయించి జిహెచ్ఎంసి మెరుగైన సేవ‌లు అందించేందుకు అవస‌ర‌మైతే మ‌రిన్ని నిధుల్ని కూడా ఖ‌ర్చు చేస్తామంటున్నారు.
ప‌నుల్ని ప‌ర్యవేక్షిస్తున్న మంత్రులు 
హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాల్లో ఎంతో వైభ‌వంగా నిర్వహించే బోనాల పండ‌గ‌ కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ సాంప్రదాయ ఉత్సవమైన బోనాల పండ‌గ‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా ఉండేలా న‌గ‌రానికి చెందిన మంత్రులు ద‌గ్గరుండి ప‌నుల్ని ప‌ర్యవేక్షిస్తున్నారు. 
మేయ‌ర్, కార్పొరేట‌ర్లతో నాయిని భేటీ
ఇప్పటి వ‌ర‌కు జ‌రుగుతున్నప‌నుల‌పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్ , కార్పొరేట‌ర్లతో  హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి స‌మావేశమయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఉత్సవాల్లో ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత‌ అధికారులు, ప్రజా ప్రతినిధుల‌పై ఉంద‌న్నారు. 
ఏర్పాట్లు ముమ్మరం : మేయర్ 
నగరంలోని మందిరాల వ‌ద్ద పండ‌గ‌కు కావాల్సి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయ‌రి మేయ‌ర్ బోంతు రామ్మోహ‌న్ తెలిపారు. ఇప్పటికు కార్పొరేష‌న్ ద్వారా 14కోట్ల రూపాయ‌ల‌తో ప‌నులు చేస్తున్నామ‌న్నారు. ఈ సందర్భంగా  పుట్ పాత్ ల నిర్మాణం, పారిశుధ్యం సదుపాయాల కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇక మందిరాల వద్ద  భ‌క్తుల సౌక‌ర్యార్థం జ‌ల‌మండ‌లి త్రాగునీటి వ‌స‌తి క‌ల్పిస్తోంది.  

 

07:50 - July 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఐటీశాఖామంత్రి కె.తారకరామారావు మలేషియా, సింగపూర్‌ పర్యటనల్లో బిజీబీజీగా ఉన్నారు. పరిశ్రమల స్థాపనకోసం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన వివరిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తున్నారు.  రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులను ఆర్షించడమే లక్ష్యంగా ఈ టూర్‌ను ఆయన ఉపయోగించుకుంటున్నారు. 
పలు కంపెనీల సీఈవోలతో మంత్రి కేటీఆర్‌ చర్చలు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ సింగపూర్ పర్యటనలో  బిజీబిజీగా ఉన్నారు.  వరుస కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. పలువురు ఐటీరంగ నిపుణులతో ఆయన చర్చలు జరుపుతున్నారు.    సింగపూర్ లో జరిగిన సౌతిండియా బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన కేటీఆర్... 12 విభాగాల్లో బిజినెస్ అచీవర్లకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో 200పైగా కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నాలజీ, స్టార్ట్ అప్స్, పరిపాలన అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. 
మలేషియా పర్యటనలో ఐటీ ఐకాన్స్‌తో సమావేశం
అంతకు ముందు మలేషియా పర్యటనలో కూడా మంత్రి పలువురు ఐటీ ఇండస్ట్రీ ఐకాన్స్‌తో సమావేశం అయ్యారు. కౌలాలంపూర్‌లో జరిగిన  ఏసియాన్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్లో ఆయన మాట్లాడారు.  కంపెనీల స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను మంత్రి వివరించారు.  ఈసందర్భంగా 'తెలంగాణ అకాడమీఆఫ్ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్‌' తో కలిసి పనిచేసేందుకు .. మలేషియాకు చెందిన 'కౌలాలంపూర్‌ రీజినల్ సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌' ముందుకు రావడం తంతోషంగా ఉందన్నారు కేటీఆర్‌. అలాగే  మలేషియా రాజధానిలో సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన యంఆర్‌సీబి సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఇంటర్‌సిటీ బస్‌టెర్మినల్‌ నిర్మించేందుకు యంఆర్‌సీబీని ఆహ్వానించారాయన. భారత యువతలో అద్భుతమైన  టాలెంట్ దాగి ఉందని... టెక్నాలజీ సహాయంతో వారికి సరైన సహకారం అందించి ఆ నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చని  కేటీఆర్‌ చెప్పారు. 

 

07:46 - July 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తాగునీటి పథకం మిషన్‌ భగీరథ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే వేలాది కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. వచ్చే డిసెంబర్‌నుంచి విడతల వారీగా గ్రామాలకు  మంచినీరు సరఫరా  చేయడానికి  అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తాగునీటి ప్రథకం మిషన్‌భగీరథ పనులకు వర్షాలు అడ్డంకిగా మారాయి. వేసవిలో ఎండల తీవ్రతతో మందకొడిగా సాగిన పనులు.. ఇపుడు వర్షాలతో మరికొంత ఆలస్యం అయ్యేలా ఉన్నాయి. 
మిషన్‌భగీరథ పనులపై సీఎం కేసీఆర్‌ దృష్టి
రాష్ట్రంలో ప్రతిఇంటికీ తాగునీరు అందించలేక పోతే.. 2019 ఎన్నికల్లో ఓట్లు అడగేదిలేదని ప్రకటించిన ముఖ్యత్రి కేసీఆర్‌.. మిషన్‌భగీరథ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రత్యేక అధికారులను నియమించి పనులను పర్యవేక్షిస్తున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో ప్రతిఇంటికి నల్లానీళ్లు అందించాలన్న లక్ష్యంతో మొదలు పెట్టిన పథకం పనులు ...వ్యాప్కోస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే  పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి 6వేల గ్రామాలకు తాగునీరు అందిస్తామంటున్నారు అధికారులు. అలాగే  2017 డిసెంబర్‌కు 12వేల గ్రామాలకు, 2018 డిసెంబర్‌లోపు మరో 10వేల గ్రామాలకు మంచినీరు అందించాలని లక్ష్యంగా పినచేస్తున్నాట్టు అధికారులు చెబుతున్నారు. 
ఇప్పటికే వేలాది కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం 
ఇప్పటికే వేలాది కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం జరిగినట్టు అధికారులు అంటున్నారు. రంగారెడ్డిజిల్లా మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌లలో 250 కిలోమీటర్లులైన్లు పూర్తికాగా... వరంగల్‌జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, పాలకుర్తిల్లో 1470 కిలోమీటర్లు.... నల్లగొండజిల్లా ఆలేరు, తుంగతుర్తి ప్రాంతాల్లో 1500..... మెదక్‌జిల్లా, సిద్ధిపేట, దుబ్బాకల్లో మరో 1500 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం కంప్లీట్‌ అయినట్టు చెబుతున్నారు. అటు గోదావరి నుంచి హైదరాబాద్‌ నగరానికి తాగునీరందించే పైపులైనుకు రెండుచోట్ల ట్యాపింగ్‌ పాయింట్ల ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్‌ సమీపంలోని ఘన్‌పూర్‌గుట్టదగ్గర ఒకటి, మెదక్‌జిల్లా కొండపా దగ్గర మరో ట్యాపింగ్‌ పాయింట్‌ను పెడుతున్నారు. వీటిద్వారానే రాష్ట్రంలోని 9జిల్లాలకు తాగునీరు అందిస్తామంటున్నారు అధికారులు. 
పైపులైన్ల నిర్మాణ పనులకు వర్షాలు ఆటంకం
వేగంగాసాగుతున్న పైపులైన్ల నిర్మాణ పనులకు వర్షాలు ఆటంకంగా మారాయి. పైపులు వేయడానికి తీస్తున్న గోతుల్లో వర్షపునీరు చేరి... రెండు మూడు రోజుల వరకు పనులు లిపియాల్సి వస్తోందంటున్నారు కార్మికులు. అయితే.. ఇంటెక్‌వెల్స్‌ లాంటి ప్రధాన పనులు ఇప్పటికే కంప్లీట్‌ అయినందున... అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తామంటున్నారు.  అటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో నిర్మిస్తున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల స్టేటస్‌పై అధికారులు చర్చించారు. రాష్ట్రప్రభుత్వం, హడ్కోనుంచి నిధులు వస్తుండటంతో  ఏ ఆటంకం లేకుండా..వచ్చే అక్టోబర్‌-నవంబరు నాటికి అన్ని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను పూర్తిచేస్తామంటున్నారు. ఓవైపు ఇంటెక్‌, హెడ్‌వర్క్స్‌ పూర్తి చేస్తూనే... మరోవైపు పైపులైన్ల నిర్మాణం చేస్తున్నారు. 
నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు
అనుకున్న సమయానికి పనులు  పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో...అధికారులు తెగహడావుడి పడుతున్నారు. ఈ క్రమంలో భగీరథపనులను ఆదరాబాదరాగా కానిచ్చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

నేడు బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత

మహారాష్ట్ర : నేడు బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేయనున్నారు. నీటి ప్రవాహం సాయంత్రానికి బాసర చేరుకోనుంది. 

 

నేడు తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా

హైదరాబాద్ : నేడు ఇందిరాపార్కు వద్ద తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నా చేపట్టనున్నారు. అన్ని పార్టీల నేతలకు అడ్వకేట్ల జేఏసీ ఆహ్వానించింది.

సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎర్రవల్లిలో నేటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు.  ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రలో పాల్గొననున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 

నేడు జమ్మూకాశ్మీర్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన

శ్రీనగర్ : నేడు జమ్మూకాశ్మీర్ లో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 

 

07:21 - July 1, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని కార్పొరేట్‌ ఆస్పత్రులు నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నాయి. చేసిన ఆపరేషన్లకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ఈ యాజమాన్యాలు  బంద్‌ చేయనున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులు తీసుకున్న ఈ నిర్ణయం రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. 
'ఆరోగ్య శ్రీ' బకాయిలు రూ.300 కోట్లు 
ఆరోగ్య శ్రీ పథకం కింది వైద్య సేవలు అందించిన కొర్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. కోటి కాదు, రెండు కోట్లు కాదు... దాదాపు 300 కోట్ల రూపాయల బకాయిలు పడింది. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన ఎన్నిసార్లు విన్నవించినా... సర్కార్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో గురువారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను బంద్‌ చేయాలని కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి. 
బకాయిలు చెల్లిస్తామని గతంలోనే హామీ 
ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా బకాయిలు రాబట్టుకునేందుకు గత నెలలో కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి. నాలుగు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇవ్వడంతో  ఈ సేవలను పునరుద్ధరించారు. అయితే మొత్తం బకాయిల్లో కేవలం 15 శాతం  బిల్లులు మాత్రమే చెల్లించింది. మూడొందల కోట్ల బకాయిలను కాను  40 కోట్లు మాత్రమే చెల్లించడంతో... ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యారోగ్యానికి  ఆరు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినా... ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ తీరును కార్పొరేట్‌ ఆస్పత్రులు యాజమాన్యాలు తప్పుపడుతున్నాయి. 
రోగులు ఆవేదన
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు అందించే 130 ఆస్పత్రుల్లో వైద్యం నిలిచిపోతే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి వైద్య సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేదలకు సంజీవనిలా ఉపయోగపడుతున్న  ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని కార్పొరేట్‌ ఆస్పత్రులు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 

 

07:16 - July 1, 2016

విజయవాడ : కృష్టా జిల్లాలో ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 50 మంది ప్రయాణికులతో హైదారబాద్‌ నుంచి విశాఖ వెళ్తోంది. మార్గంమధ్యలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఔటుపల్లి వద్ద వేగంగా దూసుకొస్తున్న బస్సు ఒక్కసారిగా ఫల్టీకొట్టడంతో ప్రయాణీకులు భయకంపితులైయ్యారు. ఈ ప్రమాదంలో 30మంది గాయపడగా... వారిలో 10మందికి త్రీవగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. 

కృష్ణా జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా

విజయవాడ : ఉంగుటూరు ఎన్ హెచ్ పై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 

నేడు అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎపి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

Don't Miss