Activities calendar

02 July 2016

22:38 - July 2, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ఆరు నెలలపాటు రోడ్ల తవ్వకం నిషేధించినట్లు జీహెచ్ ఎంసీ మేయర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా పనులు జరుగుతుంటే సూచీ బోర్డులను పెట్టాలని అన్నారు.

 

22:30 - July 2, 2016

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో ఒకరు భారతీయ మహిళ ఉన్నారు. మరో 13 మంది బందీలను సురక్షితంగా విడిపించారు. 10 గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఓ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. ముష్కరుల దాడిని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తీవ్రంగా ఖండించారు. 
ఢాకా రెస్టారెంట్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో బందీలను విడిపించేందుకు 10 గంటల పాటు సాగిన సైనిక ఆపరేషన్‌ ముగిసింది. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఎక్కువ శాతం జపాన్‌, ఇటలీకి చెందినవారున్నారు. విదేశీయులతో పాటు మొత్తం 13 మంది బందీలను  భద్రతా బలగాలు సురక్షితంగా విడిపించ గలిగాయి.
ఆరుగురు ఉగ్రవాదులు హతం 
భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ముష్కరులు తమ ఆధీనంలో ఉన్న బందీలపై కాల్పులు జరపకుండా పదునైన ఆయుధంతో చంపినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది విదేశీయులున్నట్లు బ్రిగేడియర్‌ జనరల్‌ చౌదరి తెలిపారు.
దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిప్ ప్రకటన
ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉగ్రవాదులు మానవ హననానికి పాల్పడడాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా   తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు హింస తప్ప మతంపై విశ్వాసం లేదన్నారు.
రెస్టారెంట్ లోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు
కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్‌ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్‌ రెస్టారెంట్‌లోకి శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. రెస్టారెంట్‌ సిబ్బందితో పాటు పలువురు విదేశీ పర్యాటకులతో పాటు మొత్తం 20 మందిని బందీలుగా చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. భద్రతా బలగాలు, సాయుధ ఉగ్రవాదులకు మధ్య 11 గంటలపాటు  భీకర పోరు జరిగింది. హోలీ ఆర్టిసాన్‌ రెస్టారెంట్‌కు ఎక్కువ మంది విదేశీయులే రావడంతో ఉగ్రవాదులు దీన్ని టార్గెట్‌ చేశారు.

 

22:23 - July 2, 2016

కేరళ : ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను వ్యతిరేకించాలని కేరళ ముస్లింలు తీర్మానించారు. రంజాన్‌ మాసం ఆఖరు శుక్రవారం సందర్భంగా స్వాలత్‌నగర్‌, మలప్పురంలో వేలాది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఐసిస్‌ ముస్లిం వ్యతిరేక విధానాలకు అవలంబిస్తోందని వారు ఆరోపించారు. ఉగ్రవాదులు ఇస్లాం మతాన్ని అడ్డుపెట్టుకుని మానవత్వం లేకుండా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ముస్లిం మత పెద్దలు ముక్త కంఠంతో ఖండించారు. ఇస్లాం మతం ప్రేమ, సహనం, మర్యాదను బోధిస్తుందని...అలాంటిది ఐసిస్‌ క్రూర ఆటవిక చర్యలకు పాల్పడుతోందని మత పెద్ద సయ్యద్‌ ఇబ్రహీం ఖలీల్‌ బుఖారి దుయ్యబట్టారు. ఇస్లాం వ్యతిరేక చర్యలను తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

 

22:16 - July 2, 2016

మెదక్ : ప్రజావ్యతిరేకమైన ప్రాజెక్టులు ఎక్కడ చేపట్టినా అక్కడ భూ నిర్వాసితులకు.. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం భరోసా ఇచ్చారు. మల్లన్నసాగర్ యాత్రలో భాగంగా... ఇవాళ వేములఘాట్‌  గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నామని హరీష్‌రావు చేసే ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రాజెక్టులకు..పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకంగా ఆందోళన చేసే ఉద్దేశం తమకు లేదని అయితే ప్రజావ్యతిరేకమైన ప్రాజెక్టులు ఎక్కడ చేపట్టినా అక్కడ భూ నిర్వాసితులకు.. రైతులకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. 

22:12 - July 2, 2016

హైదరాబాద్ : ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నటికీ పోటీ కానే కాదన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇండియా టూడే డిజిటల్ రంగంలో ప్రకటించిన బ్లేజర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఐటీలో హైదరాబాద్ వేగంగా పురోగమిస్తుందని తమకు పోటీ  షాంఘై, యూరప్ దేశాలతోనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపు లైన్ల ద్వారా గ్రామాలకు బ్రాడ్ బాండ్ సౌకర్యాన్నీ కల్పిస్తామన్నారు.  ప్రతి గ్రామాన్ని ఇంటర్ నెట్‌తో అనుసంధానం చేసేందుకు ఫైబర్ కేబుల్ ను విస్తరిస్తామని కేటీఆర్ తెలిపారు. 

22:06 - July 2, 2016

వృత్తిపరంగా రెండు , మూడు, నాలుగు, ఎన్నో గ్రూపులు ఉండోచ్చు. కానీ ఒకరి నుండి ఒకరు విడిపోయి.. ఎవరికి వారు సపరేట్ అయినవారు. కానీ వారి మధ్య ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఏర్పడితే ఫలితమేంటీ.? అలాంటి వాటికి తావిచ్చి... ఎదుటివారి జీవితాలు నాశనం చేసి.. వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. ఎవరు..? అసూయను ఆశ్రయించినవారు. నీకష్టాన్ని ఆశ్రయించు నీకు సుఖ సంతోషాలనిస్తుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:58 - July 2, 2016

గిన్నిస్ బుక్కోలకు ఇక గిరాకేగిరాకి..రాశి ఫలాల హరితహారం చేసుడే బాకి, పండితపుత్రుడయితున్న లోకేషంబాబు... జగనాలు చెప్పుకు వన్నేతెచ్చే పని. జిల్లాల పంచాయితికి జీవం పోసిన జనం.. తొండరవడితే ఆగమైతే మనం, మల్లన్న సాగర్ లెక్క అయిన మళ్లొక్క ఊరు.. కరీంనగర్ జిల్లాల కదిలిన మరోపోరు. కమలం పువ్వును కరువజూసిన గులాబీ... పోలీసోళ్లు లేకుండా నాగం సారు పొర్కపర్కే, తిరుమల ఎంకన్నకే గుండు కొట్టిండ్రు... సీక్రెట్ కెమెరాలు పెట్టి టెన్ టివోళ్లు పట్టిండ్రు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:48 - July 2, 2016

సింగర్ దీపుతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దీపు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. తన కేరీర్ విషయాలు వెల్లడించారు. తన అనుభవాలను తెలిపారు. పలు పాటలు పాడి వినిపించారు. తన భార్య స్వాతి ప్రాంక్ కాల్ చేసి ఆట పట్టించారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:42 - July 2, 2016

తమిళనాడు : చెన్నై పోలీసుల వేట ఫలించింది. స్వాతి హత్య కేసు నిందితుడు మొత్తానికి దొరికిపోయాడు. మద్రాస్‌ హైకోర్టు జోక్యంతో రంగంలోకి దిగిన సుమారు వందమంది పోలీసులు తమిళ రాష్ట్రాన్ని దాదాపుగా జల్లెడ పట్టేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా అనుమానిత ప్రాంతాల్లో వేట కొనసాగించారు. పక్కా సమాచారం సేకరించి తిరునల్వేలిలో ప్రేమోన్మాదిని పట్టుకున్నారు. పోలీసులను చూడగానే నిందితుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 
స్వాతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌.. 
చెన్నైలో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతి దారుణహత్య కేసును వారం రోజుల్లో పోలీసులు ఛేదించారు. శుక్రవారం నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో స్వాతిని అతి కిరాతకంగా నరికిచంపిన నిందితుడిని  పోలీసులు పట్టుకున్నారు. హై రిజల్యూషన్‌ ఫోటోతో వేట సాగిస్తుండగా.. తిరునల్వేలిలో నిందితుడు తలదాచుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో రామ్‌కుమార్‌ను అదుపులోకి  తీసుకున్నారు. పోలీసులను ముందే పసిగట్టిన నిందితుడు బ్లేడుతో పీకకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 
కొడవలితో నరికి హత్య  
తిరునల్వేలిలోని సెన్‌గొట్టయి గ్రామానికి చెందిన రామ్‌కుమార్‌ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో చెన్నైకి వచ్చాడు. నుంగంబాకం రైల్వే స్టేషన్‌కి దగ్గర్లోని చూలైమెడ్‌ హాస్టల్‌లో ఉంటున్న రామ్‌..ఓ బట్టలషాప్‌లో పనిచేస్తూ 3 నెలలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. గంగై అమాన్‌ కోయిల్‌ స్ట్రీట్‌లోని స్వాతి నివాసం.. రామ్‌కుమార్‌ ఉంటున్న హాస్టల్‌ ఎదురెదురుగా ఉండటంతో రామ్‌ కుమార్‌ కన్ను స్వాతిపై పడింది. కొంతకాలంగా ప్రేమపేరుతో వేధించాడు. రామ్‌కుమార్‌ ప్రేమను స్వాతి నిరాకరించడంతో అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో హత్యకు ముందు కూడా ప్రేమించాలని స్వాతిని వేధించాడు. ఆమె స్పందించకపోవడంతో విచక్షణకోల్పోయిన రామ్‌కుమార్‌ పాశవికంగా కొడవలితో నరికి చంపాడు.     
నిందితుడి ఫోటోను గుర్తించిన మహిళలు..
స్వాతి హత్య అనంతరం నిందితుడు నుంగంబాకం రైల్వే స్టేషన్‌ నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిగా అనుమానిస్తున్న యువకుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఈ ఫోటోలోని యువకుడిని కొందరు మహిళా ప్రయాణికులు గుర్తించారు. రోజూ నుంగంబాక్కమ్ స్టేషన్ నుంచి రైలెక్కేవాడని, లేడీస్ కంపార్ట్‌  మెంట్‌లో ఎక్కుతుండగా అతడ్ని పలుమార్లు చూశామని తెలిపారు. స్వాతి హత్యకు గురైన రోజు నుంచి రామ్‌కుమార్‌ తన గదిలో లేనట్లు పోలీసులు తెలుసుకున్నారు. హత్య జరిగిన సమయంలో అతడి మొబైల్‌  సిగ్నల్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించి రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.  సరిగ్గా వారం రోజులు...కంటిమీద కునుకులేకుండా చేసింది..యావత్‌ పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది.. పాలకుల పరువు సమస్యగా మారింది...భద్రతలో డొల్లతనాన్ని బయటపెట్టింది... టెక్కీ స్వాతి హత్యోదంతంపై వారం రోజులుగా సాగిన ఎన్నో అనుమానాలు..అపోహలను నివృత్తి చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.. ఊపిరి పీల్చుకున్నారు...
అట్టుడికించిన స్వాతి హత్య కేసు...
యావత్‌ తమిళనాడు రాష్ట్రాన్ని అట్టుడికించిన టెక్కీ స్వాతి హత్యోదంతం పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది..హైకోర్టు జోక్యంతో కంటిమీద కునుకులేకుండా చేసింది... పట్టపగలు అందరూ చూస్తుండగానే రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘోరం కలకలం రేపింది..వారం రోజుల పాటు ఎక్కడ నలుగురు తమిళులు కలిసినా స్వాతి హత్య గురించే చర్చగా సాగింది...జరిగిన కిరాతకం ఆడపిల్లల కన్నవారిలో కలవరాన్ని రేపగా పోలీసు యంత్రాంగాన్ని కదిలించింది...
ఆధారం ఇచ్చిన సీసీ కెమెరా...
సరిగ్గా వారం రోజుల క్రితం నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో రైలు కోసం నిరీక్షిస్తున్న స్వాతిని గుర్తు తెలియని వక్తి హతమార్చి దర్జాగా వెళ్లిపోవడం కలకలం రేపింది...ఈ ఘటన రాష్ట్రంలో భద్రత డొల్లతనాన్ని బయటపెట్టింది..ఆ తర్వాత ఈ కేసులో రైల్వే పోలీసులు పట్టించుకోపోవడం... హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతోపాటు కేసును చెన్నై పోలీసులు విచారించాలంటూ ఆదేశించింది..దీంతో అటు రైల్వే..ఇటు చెన్నై పోలీసులు రంగంలోకి దిగి కేసును సవాలుగా తీసుకున్నారు...సీసీ కెమెరాల్లో దొరికిన కొన్ని వీడియో దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నా ఆశించిన రీతిలో పోలీసులకు ఫలితాలు దొరక్కపోవడంతో ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగారు..
సీసీ కెమెరాలో దొరికిన ఆనవాళ్లు..
ఇదిలా ఉంటే రైల్వేస్టేషన్‌లో స్వాతిని చంపిన నిందితుడు చూలైమేడులోని సౌరాష్ట్రనగర్‌ వరకు నడుచుకుంటూ వెళ్లినట్లు..ఆ తర్వాత బైక్‌పై పారిపోయినట్లు తేలింది...నడుస్తూ వెళ్తున్నప్పుడు... మోటారు సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలను ఆ ప్రాంతంలో ఉన్న మరో సీసీ కెమెరాలో దొరికాయి. 
ఇక బైక్‌ నంబర్‌తో పాటు అనుమానం ఉన్న సెల్‌ఫోన్ల నంబర్లపై దర్యాప్తు వేగం చేశారు..దాదాపు ఐదు లక్షల మొబైల్‌ కాల్స్‌ను సేకరించిన పోలీసులు అందులో చివరకు 150 నంబర్లను అనుమానించారు...ఇలా కొనసాగిన దర్యాప్తు చివరకు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులకు క్లూ దొరికేలా చేసింది.. ఎట్టకేలకు స్వాతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ నీడలా వెంటాడినవాడే హంతకుడిగా తేల్చి అదుపులోకి తీసుకోవడంతో తమిళనాడు పోలీసులు ఊపిరిపీల్చుకున్నట్లయింది...
ఘటనపై స్పందించిన యావత్‌ తమిళనాడు 
మరోసారి ప్రేమోన్మాదం పంజా విసరింది...తన పనేదో తాను చేసుకుని హాయిగా జీవితాన్ని సాగిస్తున్న అమ్మాయిని నీడలా వెంటాడాడు... ఆ తర్వాత తన ప్రేమను కాదన్నందుకు వేటాడాడు...అందరూ చూస్తుండగా నరికేసిన ప్రేమోన్మాది తాపీగా తప్పించుకున్నాడు... పట్టపగలు రైల్వే స్టేషన్లో జరిగిన ఉన్మాదాన్ని అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేదు...ఓ అమాయకురాలు రక్తపు మడుగులో కొట్టుకుని విలవిలలాడుతూ తుదిశ్వాస విడిచింది... మానవత్వాన్ని ప్రశ్నించిన ఘటనపై యావత్‌ తమిళనాడు స్పందించింది..అక్కడి ఉన్నత న్యాయస్థానాన్ని కదిలించింది..భద్రతలో డొల్లతనాన్ని ప్రశ్నించింది...అంతే వారం రోజులపాటు సాగిన పోలీసుల వేటకు ఉన్మాది దొరికాడు...పోలీసులను చూడగానే గొంతు కోసుకున్నాడు... ఉన్మాదం తలకెక్కిన ఆ దుర్మార్గుడి వికృతానికి ఓ కుటుంబం కన్నీటిలో తడిసి ముద్దవుతోంది...

 

21:21 - July 2, 2016

హైదరాబాద్ : 'ఆరోగ్యశ్రీ'పై ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో టీసర్కార్ చర్చలు విఫలం అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రూ. 100 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో హాస్పిటల్స్ ఖాతాలో చేరతాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రకటనపై ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని గత రెండో రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు విఫలం

హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. 

 

21:07 - July 2, 2016

కర్నూలు : సమాజానికి కొంతైనా చేయాలన్న వాళ్ల సంకల్పం నెరవేరే సమయం ఆసన్నమైంది. మహిళా పొదుపు సంఘం సభ్యులు స్వశక్తితో నిర్మించిన పాఠశాల భవనం శంఖస్థాపనకు సిద్ధమైపోయింది. సకల హంగులతో సిద్ధమైన భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని మహిళా సంఘం సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఇంతటి ఘనతను సొంతం చేసుకున్న పొదుపు ఐక్య సమాఖ్య ప్రస్థానం ఏంటి..? ఓ లుక్కేద్దాం. 
పొదుపు లక్ష్మి ఐక్య సంఘం 
ఓర్వకల్లు మహిళలు.. డ్వాక్రా మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు ఎన్నో కార్యక్రమాలతో తమ విశిష్టతను చాటుతున్నారు. నిరక్షరాస్యత కారణంగా ముందు తరాల వారు ఎలాంటి ఇబ్బందులూ పడరాదన్న భావనతో వీరు విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని సారించారు. తమలోని నిరక్షరాస్యుల్లో అక్షర వెలుగులు నింపేందుకు రాత్రిపూట బడి నిర్వహింప చేస్తున్నారు. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పదో తరగతి పాసై.. ఇంగ్లీష్‌, హిందీ భాషలపై పట్టు సాధించేలా పలు అంశాలపై శిక్షణను ఏర్పాటు చేశారు.  ఆర్థిక స్థోమత లేక చదువుకోలేని దాదాపు 2500 మంది బాల కార్మికులకు విద్యనందిస్తున్నారు. సమాజం, దేశం పట్ల బాధ్యత గల పౌరుల్ని తీర్చిదిద్దడమే మోటోగా పాఠశాల రూపుదిద్దుకుంది. పొదుపు సమాఖ్య సభ్యుల త్యాగం దేశానికే ఆదర్శమని పలువురు కొనియాడుతున్నారు. 
సాటి డ్వాక్రా గ్రూపులకు ఆదర్శం 
ఓర్వకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్య సంఘం...! కేవలం విద్యాభివృద్ధిలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ సాటి డ్వాక్రా గ్రూపులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇరవై ఏళ్ల క్రితం పది మంది సభ్యులతో ప్రారంభమైన సాదా సీదా డ్వాక్రా సంఘం నేడు.. వెయ్యి సంఘాలు, పదివేల మంది సభ్యులతో ఐక్య సంఘంగా అలరారుతోంది. ఒకప్పుడు కడు పేదరికంలో మగ్గి, కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన మహిళలు.. నేడు ఆర్థికంగా పరిపుష్టతను సాధించారు. వీరి విజయం ఉన్నది కూడా ఓ మహిళే కావడం విశేషం. ఆమే ఓర్వకల్లు మండల సమాఖ్య సలహాదారు విజయభారతి.  
ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి... 
పొదుపులక్ష్మి ఐక్య సమాఖ్య కేవలం ఓర్వకల్లుకే పరిమితం కాలేదు. వీరి విజయగాథలు.. ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. ఆ విజయ రహస్యం చెప్పమని ఎందరో వీరిని ఆహ్వానించారు. ఆదిశగా.. ఇప్పటికే భారత్‌లోని 16 రాష్ట్రాలు, పొరుగు దేశాల్లోనూ పర్యటించిన ఓర్వకల్లు డ్వాక్రా మహిళలు.. అయా ప్రాంతాల్లోని పేద మహిళలను గుర్తించి పొదుపు ఆవశ్యకతను, పేదరికం నుంచి గట్టెక్కే మార్గాలను వివరించారు. ఎంతో మంది మహిళలను చైతన్య పరుస్తూ సాగుతున్నారు. పొదుపు గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలకు వసతి కోసం.. తమ పొదుపు మొత్తంతో..  ఓర్వకల్లులోనే ఓ భవనాన్నీ వీరు నిర్మించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందులోనే వసతి.. శిక్షణ.. అందిస్తున్నారు. 
హార్వర్డ్‌ యూనివర్సిటీలో విజయభారతికి ప్రసంగించే అవకాశం  
పేదరిక నిర్మూలన-పొదుపు ఆవశ్యకతపై ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరిగిన చర్చా గోష్ఠిలో ఓర్వకల్లు మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతికి ప్రసంగించే అవకాశం రావడం...డ్వాక్రా మహిళల సంఘటిత శక్తిని ఖండాంతరాలు దాటిందనడానికి నిదర్శనం. విజయభారతి కృషి వల్లనే తమ పిల్లలు చదువుల్లో రాణిస్తున్నారని మహిళలు అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ కోసం ఇప్పటికీ పాఠశాలకోసం పనిచేస్తామని మహిళలు చెబుతున్నారు. 
చిన్నారులకు శిక్షణ 
ఐదో తరగతి వరకు విద్యనందిస్తూ.. ఆరో తరగతి నుంచి రెసిడెన్సియల్‌ పాఠశాలలో సీటు సంపాదించేలా చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఎంతో మంది భవిత పాఠశాలలో చదివినవారు..ప్రస్తుతం మంచి ఉద్యోగాలు సంపాదించారు. సంపూర్ణ అక్షరాస్యత కోసం సమర శంఖం పూరించిన పొదుపు సంఘం మహిళలు..  త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్కూల్‌ నూతన భవనాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. మొత్తానికి మహిళలు తలచుకుంటే కాదేదీ అసాధ్యం అని ఓర్వకల్లు పొదుపు లక్ష్మీ సంఘం సభ్యులు నిరూపిస్తున్నారు. వీరి కృషి.. ఇతర ప్రాంతాల డ్వాక్రా మహిళల్లోనూ స్పూర్తిని నింపాలని.. ప్రతి గ్రామం ఓర్వకల్లులా విద్యాపరిమళాలు వెదజల్లాలని ఆశిద్దాం. 

 

20:57 - July 2, 2016

గుంటూరు : దళితుల భూములను దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గుంటూరు జిల్లా యడవల్లిలో మైనింగ్‌ మాఫియా  చెలరేగి పోతోంది. బడుగులను రోడ్డు పాల్జేసే సర్కారీ పెద్దల నిర్ణయాలకు సంబంధించిన సాక్ష్యాలు.. 10 టివి సాధించింది. కీలక పత్రాలు బయటకి రావడంతో.. అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 
416 ఎకరాల దళితుల భూములు కబ్జా 
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 416 ఎకరాల దళితుల భూముల కబ్జా వ్యవహారానికి సంబంధించి టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనాలు గుంటూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 40 ఏళ్లుగా దళితుల ఆధీనంలో భూముల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ పెద్దలు కుట్ర పన్నారన్న విషయాన్ని టెన్‌ టీవీ వెలుగులోకి తెచ్చింది. బాధితుల వేదనకు బలం చేకూర్చే కీలక డాక్యుమెంట్లు టెన్‌టీవీ చేతికి చిక్కాయి. సొసైటీ రద్దుకు సంబంధించి పాలక పెద్దలు క్రియేట్‌ చేసిన కీలక పత్రాలు టెన్‌ టీవీ చేతికి చిక్కడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. 
విలువైన బ్లాక్‌ గ్రానైట్‌ నిక్షేపాలు 
యడవల్లి దళితుల భూముల్లో కోట్ల రూపాయల విలువైన బ్లాక్‌ గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని, వాటిని తవ్వితే ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు ఉపాధి దొరుకుతుందన్న వంకతో అక్షరాల ఐదు వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకునేందుకు సర్కారీ పెద్దలు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ప్లాన్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు దళితుల సొసైటీని గుట్టు చప్పుడు కాకుండా రద్దు చేశారు. సొసైటీ రద్దు సమాచారాన్ని ఏమాత్రం బయటకు పొక్కనీయకుండా రహస్యంగా దాచిపెట్టారు. దళితుల భూములను కాజేసేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావుతో పాటు అధికార టీడీపీ పెద్దలు ప్రయత్నం చేయడాన్ని టెన్‌ టీవీ వివరాణాత్మకంగా ప్రసారం చేసింది. 
గోప్యంగా సొసైటీ రద్దు విషయం 
అధికారులు సైతం సొసైటీ రద్దు విషయాన్ని గోప్యంగా ఉంచారు. దానికి సంబంధించిన పత్రాలను టెన్ టీవీ సేకరించి వాస్తవాలను వెల్లడించింది. దళితుల అధీనంలోని భూములు సాగుకు పనికిరావంటూ అధికారులు ఇచ్చిన నివేదికలు, ప్రభుత్వ సూచనల మేరకు తాము సొసైటీని రద్దు చేసినట్లు  అధికారులు స్పష్టంగా అందులో పేర్కొనడం గమనార్హం. అయితే సొసైటీ రద్దు సమాచారం దళిత రైతులకు తెలుపకుండానే.. పంచాయతీ ద్వారా వారికి సమాచారం ఇచ్చామని పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది.
సొసైటీ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి..
ఏళ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న రైతులకు మైనింగ్ పర్మిషన్లు ఇవ్వాలి కానీ, ఎవరికో మైనింగ్ అనుమతులు కట్టబెట్టాలన్న ప్రయత్నం సరి కాదని పలువురు నేతలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సొసైటీ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.
స్పందించిన మంత్రి పత్తిపాటి
మరోవైపు దళితుల భూముల వ్యవహారంపై మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. సొసైటీ రద్దు విషయం తనకు తెలియదంటూనే మైనింగ్ ఉన్న చోట కూలీల ఉపాధికోసం మైనింగ్ తవ్వకాలు చేయాల్సిందేనని, అవసరమైతే నష్టపోయే రైతులకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామంటూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. 
ఖనిజం మైనింగ్‌ మాఫియాకు హస్తగతం
దళితులకు తృణమో పణమో ముట్టజెప్పి ఐదు వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని మైనింగ్‌ మాఫియాకు హస్తగతం చేసే ప్రయత్నంలో  అధికార పార్టీ నేతలు.. తాము చేస్తున్న పని సవ్యమైనదేనంటూ బుకాయించడం హస్యాస్పదం. మంత్రి పుల్లారావు వ్యాఖ్యలపై అటు దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సాగు చేసుకుంటున్న దళిత రైతులకు మైనింగ్‌ పర్మిషన్లు కేటాయించాలి తప్ప.. మరొకరికి లీజుకిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

 

ఎపిలో పలువురు ఐఎఎస్ లు బదిలీ

విజయవాడ : ఎపిలో పలువురు ఐఎఎస్ లు బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా సతీష్ కుమార్ కౌషి, కృష్ణాపుష్కరాల ప్రత్యేక అధికారిగా రాజశేఖర్, విజయవాడ దుర్గగుడి ఈవోగా ఎ.సూర్యకుమారి, రైతు బజార్ సీఈవోగా వీ.బి. రమణ, ఆయిల్ ఫెడ్ ఎండీగా ఫణి కిషోర్ బదిలీ అయ్యారు. 

 

కాళేశ్వరం, డిండి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కాళేశ్వరం, డిండి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే లిఫ్టుల ద్వారా నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్ కు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్ వరకు నిర్మించనున్న ప్రధాన రిజర్వాయర్ల నుంచి నీటిని చెరువులకు మళ్లించాలన్నారు. రెండేళ్లలో మల్లన్న సాగర్ ను పూర్తి చేయాలని తెలిపారు. 

 

అరుణ్ జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్ : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను చట్టప్రకారం రూ.30 వేల కోట్లు ఇవ్వాలని సీఎం కోరారు. మిషన్ కాకతీయ పురోగతికి చేపట్టిన కార్యక్రమాలను లేఖలో కేసీఆర్ జైట్లీకి వివరించారు. 

జీహెచ్ ఎంసీ పరిధిలో ఆరు నెలలపాటు రోడ్ల తవ్వకం నిషేధం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ఆరు నెలలపాటు రోడ్ల తవ్వకంపై నిషేధం విధించినట్లు జీహెచ్ ఎంసీ మేయర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా పనులు జరుగుతంటే సూచీ బోర్డులను పెట్టాలని సూచించారు. 

సీఎం కేసీఆర్ ను కలిసిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయ నిర్వాహకుల కమిటీ

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ ఆలయ నిర్వాహకుల కమిటీ సీఎం కేసీఆర్ ను కలిసింది. 5న జరిగే అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాలని మంత్రి తలసాని నేతృత్వంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. 

మైదుకూరు ఎమ్మెల్యే రాజీనామా నాకు అందలేదు : కోడెల శివప్రసాద్

హైదరాబాద్ : ఎపిలో ఎన్నికల్లో తాను రూ. 11 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పలేదని.. రూ.11 కోట్లు ఖర్చువుతున్నాయని మాత్రమే చెప్పానని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని చెప్పారు. 
మైదుకూరు ఎమ్మెల్యే రాజీనామా తనకు అందలేదన్నారు. 

19:49 - July 2, 2016

కరీంనగర్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పోరాటం ఇతర ప్రాంతాల రైతుల్లోనూ స్పూర్తిని నింపుతోంది. మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల దారిలోనే తామూ ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వ జీవో తమకొద్దని.. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే పరిహారం చెల్లించాలని పట్టుబడుతున్నారు. తాము అభివృద్ధికి అనుకూలమే గాని.. సరైన పరిహారం ఇవ్వాల్సిందేనంటూ తెగేసి చెబుతున్నారు. భూములు..ఇళ్లు తీసుకుని.. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ముంపు గ్రామాల ప్రజలు పోరాటబాట 
పరిశ్రమల పేరుతో ప్రభుత్వం..పచ్చని బతుకుల్లో చిచ్చు రేపుతోంది. అడ్డగోలుగా భూములను.. ఇళ్లను లాక్కొని ప్రజలను నిర్వాసితులను చేస్తోంది. కేంద్ర చట్టాలు ఉన్నా.. రైతులకు ప్రయోజనం చేకూరని రీతిలో విడిగా జీవోలు విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసిత రైతులు ఉద్యమించి.. ప్రభుత్వం మెడలు వంచారు. చట్టం ప్రకారమే పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం అంగీకరించేలా చేశారు. వీరి పోరాటం ఇప్పుడు ఇతర ప్రాంతాల నిర్వాసితుల్లోనూ స్పూర్తిని నింపుతోంది. కరీంనగర్ జిల్లా అనంతగిరి రిజర్వాయర్ భూనిర్వాసితులు న్యాయమైన పరిహారం చెల్లించాలంటూ పోరుబాట పట్టారు. 
అనంతగిరి గ్రామం వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రణాళికలు
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామం వద్ద కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దులో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పదో పాక్యేజీ కింద అనంతగిరి గ్రామం వద్ద రిజర్వాయర్‌ను నిర్మించనుంది. దీనివల్ల అనంతగిరి గ్రామంతో పాటు మెదక్ జిల్లా సిద్దిపేటలోని కోచగుట్టపల్లి, చెలుకలూరిపల్లె గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. తమకు మార్కెట్‌ రేటు ప్రకారమే పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అయితే  ఈ గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో  ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. 
నష్టపరిహారం చెల్లింపు కోసం సిద్దిపేటలో సర్వే
భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు.. తన నియోజకవర్గం పరిధిలోని నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపు అంశంపై ప్రత్యేక శ్రద్ధతో సర్వే చేయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో.. అనంతగిరి నిర్వాసితులకు మాత్రం పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు నాయకులు కుట్ర పన్నుతున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. గ్రామంలో ఆరు వందల కుంటుంబాలు ఉండగా.. 2,700ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వాయర్ నిర్మాణం కింద రైతులు కోల్పోనున్నారు. వీరంతా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలి
జీవో నెంబర్‌ 123 ప్రకారం కాకుండా.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మాత్రమే తమకు నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఏ నాయకుడునీ తమ ఊరి సరిహద్దుల్లోకి రానివ్వబోమంటూ హెచ్చరిస్తున్నారు. వామపక్ష, ప్రజా, రైతు సంఘాల మద్దతుతో అనంతగిరి నిర్వాసిత రైతులు పోరుబాట పడుతున్నారు .
ప్రజా పోరాటాలు తప్పవు... 
ప్రాజెక్టు నిర్మాణాలు అవసరమే. అదే సమయంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న తమకు తగిన పరిహారం చెల్లించడమూ ప్రభుత్వ బాధ్యత అన్నది నిర్వాసిత ప్రాంతాల రైతుల మాట. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళితే.. ప్రజా పోరాటాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

19:31 - July 2, 2016

ఖమ్మం : జిల్లాలోని ఇల్లెందులో విషాదం చోటుచేసుకుంది. సింగరేణి ఓపెన్‌కాస్టు నుంచి మట్టి తీస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు పైన పడి ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జేసీబీల సహాయంతో అధికారులు ఇద్దరి మృతిదేహాలను బయటకు తీశారు. మృతులు నిరుపేదలు కావడంతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

19:29 - July 2, 2016

ఖమ్మం : జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలంలో గోదావరికి జలకళ వచ్చేసింది.భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, చర్ల వెంకటాపురంలో గత 4 రోజులుగా వర్షాలు  కురుస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన్న ఉన్న  చిన్నవాగులు పొంగడంతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉండడంతో.. లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీరు గోదావరిలో కలిసింది.దీంతో గోదావరి నీటి మట్టం 16 అడుగులకు చేరింది.

 

19:25 - July 2, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ లోకి 2,300 క్యూసెక్కుల వరదనీరు చేరుతుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుగా కాగా ప్రస్తుతం 675 అడుగులకు చేరుకుంది. జిల్ల్లాలో వర్షాలు  భారీగా కురుస్తుండడంతో.. ఇన్ ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు డీఈ  తెలిపారు.

19:22 - July 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండో రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.  ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం కోసం రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ..తమకు బకాయిలున్న 300 కోట్ల రూపాయలను విడుదల చేసేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచాలని ఆరోగ్యశ్రీ సేవలున్న హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి.

 

19:16 - July 2, 2016

హైదరాబాద్ : వచ్చే మూడేళ్లలో మిషన్ కాకతీయకు ఐదువేల కోట్ల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఏపీ పునర్విభన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని లేఖలో సూచించారు. మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలకు చట్ట ప్రకారం రావాల్సిన 30వేల 570 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. 

 

18:59 - July 2, 2016

హైదరాబాద్‌ : నగరంలో ఎన్ ఐఎ సానుభూతిపరుల అరెస్ట్‌తో పోలీసులు భద్రత పెంచారు. ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.. మాదాపూర్‌లోని ఐటీ సెక్టార్‌లోకూడా వాహనాలను తనిఖీ చేశారు. కుషాయిగూడలోకూడా వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సుల్లో తనిఖీలు జరిపారు. అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి  తీసుకుంటున్నారు.

 

18:54 - July 2, 2016

వరంగల్ : చీటీల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి...అయినా కొత్త కొత్తగా...రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలతో వస్తున్న కంపెనీలను నమ్మి అమాయకులు బోల్తా కొడుతూనే ఉన్నారు...పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసిన కేటుగాళ్లు..బిచాణా ఎత్తేస్తున్నారు. ఓరుగల్లులో మరో చిట్‌ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. కోటి రూపాయలకు శఠగోపం పెట్టింది. 
బోర్డు తిప్పేసిన హిమాన్వీ చిట్‌ఫండ్‌
ఆవేశం ఉప్పొంగింది..  ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆక్రోశం నిరసన గళమెత్తింది.. వీరి ఆగ్రహం వెనుక తమను మోసం చేశారన్న బాధ ఉంది. వీరి ఆవేశం వెనక తమ కష్టార్జితాన్ని దోచుకున్నారన్న వ్యధ ఉంది. వీరి ఆక్రోశానికి కారణం బాధితుల రాళ్ల దాడిలో ధ్వంసమవుతున్న ఈ చిట్‌ఫండ్‌  కార్యాలయమే కారణం.. 
కోటి రూపాయలకు కుచ్చుటోపీ
హిమాన్వి చిట్‌ఫండ్‌..కూల్‌గా మాట్లాడి ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టింది. నైస్‌గా మాట్లాడి ఐస్‌ చేసి కోటి రూపాయలు కొల్లగొట్టింది. వరంగల్‌లో ఎన్‌ఐటీ సెంటర్‌లో గతేడాది సెప్టెంబర్‌లో హిమాన్వి  చిట్‌ఫండ్ సంస్థ ప్రారంభమైంది. హన్మకొండ, సూర్యాపేటలో బ్రాంచ్‌లు తెరిచి ఆకర్షనీయ ప్రకటనలతో ఆకట్టుకుంది. ఐదుగురి భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ చిట్‌ఫండ్‌లో.. 200 మంది ఖాతాదారులు చిట్టీలు  వేశారు. చిట్టీలు పాడుకున్న వారికి మొదట్లో సమయానికి డబ్బులు చెల్లించిన సంస్థ... ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చారు.   
చెక్కులు బౌన్స్‌ కావడంతో మోసం వెలుగులోకి.. 
సూర్యాపేట బ్రాంచ్‌లో ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో ఖాతాదారులు ధ్వజమెత్తారు. తాడోపేడో తేల్చుకునేందుకు సంస్థ చైర్మన్, ఎండీని కలిసేందుకు వరంగల్‌ బ్రాంచ్‌కు వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న  ఎండీ రమేష్‌ పారిపోయినట్లు బాధితులకు సమాచారం అందింది. సిబ్బందిని నిలదీసినా వారు స్పందించకపోవడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయానికి తాళాలు వేయడంతో సంస్థ బోర్డును  రాళ్లతో ధ్వంసం చేశారు. హిమాన్వీ చిట్‌ఫండ్‌ బోర్డ్‌ తిప్పేసిన విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరుగా వరంగల్‌ బ్రాంచ్‌కు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

18:49 - July 2, 2016

చిత్తూరు : ఎప్పటికప్పుడు ఎత్తులు వేయడంలో స్మగ్లర్లను మించినవారు లేరు.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యావత్‌ పోలీసు డిపార్ట్‌మెంట్ కంటిమీద కునుకులేకుండా విధులు నిర్వహిస్తుండగా భారీ ఎత్తున రెడ్‌సాండిల్ ఎల్లలు దాటి వెళ్తుంది...ఇదెలా సాధ్యం..? స్మగ్లర్లు ఏం మాయ చేస్తున్నారు..? ఇంత మంది పోలీసుల కళ్లు గప్పి ఎలా తరలిస్తున్నారు...కోట్లాది విలువైన చందనం విదేశాలకు ఎలా వెళ్తుంది...ఇదంతా అంతుచిక్కని రహస్యంగానే ఉందా అనుకుంటే కాదు... స్మగ్లర్లు ఎప్పటికప్పుడు వేస్తున్న ఎత్తులే... పోలీసుల ఆలోచనలకు అందకుండా ప్లాన్‌ చేయడంలో ఆరితేరిపోయారు... తాజాగా బయటపడ్డ సమాచారం ప్రకారం జల్సా చేస్తున్న యూత్‌కు నోట్ల కట్టలు చూపించి వాడుకుంటున్నారని తేలింది...పోలీసు రికార్డుల్లో కాదు కదా..కనీసం పోలీసు స్టేషన్‌ను కూడా చూడని వారిని ఎంచుకుని నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపడింది.
స్మగ్లింగ్‌లో కొత్త కొత్త విషయాలు..
ఎర్రచందనం...అరుదైన ఈ సంపదను కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు వేస్తున్న ఎత్తులో చిత్తవుతుంది యువతరం..జిల్లాలోని యువకులను.. పనీపాటలేని కొందరిని చేరదీసి స్మగ్లింగ్‌లో సహకారం తీసుకుంటున్నారు..ఇందుకు గాను కొందరికి భారీగా డబ్బు ఇస్తున్నారు..మరికొందరికి రోజువారి కూలీ ఇస్తున్నారు...ఎలా అవకాశం ఉంటే అలా వారిని ఇందులోకి లాగుతున్నారు..అయితే యూత్‌ మాత్రం ఆ రోజు ఖర్చుల కోసం జల్సాలు చేసేందుకు వారికి సహకరిస్తున్నారు..కొందరు తెలిసి చేస్తుండగా..మరికొందరు తెలియకుండా చేస్తున్నారు..దీంతో వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది...
స్థానికుల సహకారంతోనే చెట్లు నరికివేత..
తమిళనాడు రాష్ట్రం సరిహద్దుల్లో పనిదొరక్క సంచరించే కూలీలను చేరదీసి వారికి డబ్బు ఆశ చూపిస్తూ స్మగ్లర్లు తరలిస్తున్నారు.. పోలీసుల దాడులు పెరగడంతో ప్రయాణికుల్లా వచ్చేవారిని రిసీవ్ చేసుకునేందుకు చిత్తూరు జిల్లాలోని కొంతమంది యువకులను ఏర్పాటు చేశారు.. ఇలా నెట్‌వర్క్‌ బిల్డప్ చేసిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం తరలించే పనిలో పడ్డారు...
బయటపడ్డ భారీ డంప్...
ఈ మధ్యకాలంలో పట్టుకున్న ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి సమాచారం అందుకుని చెన్నైలోని ఓ గోడౌన్ లో తిరుపతి పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి భారీగా ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నారు...పట్టుబడిన సరకు ఖరీదు ఏడు కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది...
సిడ్కో పారిశ్రామిక వాడలో డంప్...
చిత్తూరు జిల్లా నుంచి కొల్లగొట్టిన ఎర్రచందనాన్ని దాదాపు నాలుగు ప్రాంతాల్లో డ్రైవర్లతో పాటు వాహనాలను మార్చి చెన్నై సరిహద్దులకు చేర్చారు..ఇక అక్కడ తమిళనాడుకు చెందిన డ్రైవర్,వాహనం ద్వారా పారిశ్రామికవాడలోని రహస్య ప్రాంతానికి తరలించారు..మొత్తంగా ఏడుకోట్లు విలువజేసే దుంగలను కంటైనర్‌లో పెట్టి షిప్‌ ద్వారా విదేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేయడంతో పోలీసులు సమాచారం అందుకుని దాడులు చేయగా పట్టుబడింది.
సరుకు రవాణాకు ఇన్‌ఫార్మర్లు...
తిరుపతిలో పట్టుబడిన సర్థార్ రమేష్, లోక నాథ రెడ్డిలతో పాటు చెన్నైకు చెందిన రమేష్, విశాల్ అనే వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఎర్ర చందనం డంప్ ను స్వాధీనం చేసుకున్నారు...వీరంతా స్మగ్లింగ్ కు పైలట్లు,  ఇన్ ఫార్మర్లుగా పనిచేశారు..
కొత్త చట్టం ప్రకారం శిక్షలే...
తిరుపతి ప్రాంతంలో ఎంతో  మంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న సమాచారం సేకరించిన పోలీసులు వారిపై నిఘా పెంచారు..ఇప్పటికే రెడ్‌ శాండిల్‌ స్మగ్లింగ్‌పై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసు అధికారులు నిత్య పర్యవేక్షణ చేస్తున్నారు...ఇక స్మగ్లర్లకు..కూలీలకు సహకరించినా...ఆశ్రయం కల్పించినా..వారికి కావాల్సినవి అందించినా..వారిని కొండపైకి తీసుకువెళ్లినా...ఇలా ప్రతీ చోటా సహకరిస్తున్నవారిని వదిలేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు...జిల్లాలోని రంగంపేట,ఎర్రవారిపాలెం, జిల్లాలోని ఎన్నో ప్రాంతాల్లో ఇలాంటివారి వివరాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు...వారు చిక్కితే మాత్రం కొత్త చట్టం కింద శిక్షార్హులేనని హెచ్చరిస్తున్నారు. భారీగా స్మగ్లింగ్‌లకు పాల్పడుతున్నవారు రూటు మార్చేశారు.. పోలీసులకు అనుమానం రాకుండా ..ఇప్పటివరకు కేసుల్లో లేనివారిని చేరదీస్తున్నారా..? దీన్ని బట్టి కొత్తగా స్మగ్లర్లు తయారవుతున్నట్లే.

18:41 - July 2, 2016

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో వెలగపూడి సందడిగా మారింది. ఓ వైపు ఉద్యోగులు, మరోవైపు సమీప గ్రామాల ప్రజల రాకతో వెలగపూడి పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. జనం రద్దీ పెరగడంతో అటు ఆర్టీసి కూడా బస్‌ సర్వీసుల్ని నడుపుతోంది. రాజధాని ప్రాంతం కావడంతో ప్రయాణికులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి 10నిమిషాలకు ఓ బస్సు సర్వీసును ఆర్టీసి నడుపుతోంది. వెలగపూడికి ఆర్టీసి బస్సుల రాకతో రాజధాని ప్రాంతం కళకళలాడుతోంది.
మెట్రో బస్సులు క్యూ
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి మెట్రో బస్సులు క్యూ కడుతున్నాయి. ప్రయాణికులతో పని లేకుండా ఆర్టీసి బస్సు సర్వీసులను సచివాలయానికి నడుపుతోంది. గుంటూరు జిల్లాలోని అన్ని ప్రధాన డిపోల నుండి వెలగపూడికి బస్సు సర్వీసులను ఆర్టీసి నడుపుతోంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుండి అయితే ప్రతి పది నిమిషాలకు ఓ బస్సు నడుస్తోంది. ప్రస్తుతానికి సచివాలయంలో పాలన ఇంకా ప్రారంభం కానప్పటికీ ప్రజలకు అవగాహన ఉండేవిధంగా బస్సు సర్వీసులను నడుపుతోంది ఆర్టీసి. 
రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు సంతోషం 
మొన్నటి వరకు తాత్కాలిక సచివాలయానికి చేరుకోవడానికి కేవలం విజయవాడ-అమరావతి రూట్‌లో నడిచే 301 నెంబర్ బస్సు మాత్రమే ఉండేది. మంగళగిరి, గుంటూరుకు చేరుకోవాలంటే ఆటోలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం సచివాలయం కారణంగా వెలగపూడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడంతో..రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
బస్సు రాకపోకలను గమనించేందుకు ప్రత్యేక అధికారి 
మరోవైపు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, సత్తెనపల్లె, పిడుగురాళ్ల, పొన్నూరు ఇలా ఎక్కడి నుండి బస్సు వచ్చినా అది వెలగపూడిలోని సచివాలయం వరకు వచ్చి అక్కడ కాసేపు ఆగి వెళ్లాలని అధికారులు నిబంధన పెట్టారు. అంతేకాదు సచివాలయం వద్ద బస్సు రాకపోకలను గమనించడానికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ప్రస్తుతం సర్వీసులు తక్కువగానే ఉన్నప్పటికీ,. మరో నెల రోజుల్లో పెరిగే అవకాశం ఉందని మంగళగిరి డిపో మేనేజర్‌ శేషగిరిరావు చెప్తున్నారు. 
రోడ్ల విస్తరణ లేకపోవడంతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు 
రాజధాని ప్రాంతంలో పెంచిన బస్సు సర్వీసులను అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో..బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాపురం నుండి సచివాలయానికి వెళ్లే రోడ్డు చిన్నదిగా ఉండడంతో ఎదురెదుగా రెండు బస్సులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుడోతంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయానికి వెళ్లే రోడ్డు పెద్దది చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 

రామంతపూర్ లో ఎస్ వోటీ పోలీసుల దాడులు

హైదరాబాద్ : ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. నకిలీ మందుల తయారీ కేంద్రంపై దాడి చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ మందులను స్వాధీనం చేస్తున్నారు.

18:28 - July 2, 2016

కడప : ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ అరికట్టాలని డివైఎఫ్ ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు సమాఖ్య నేతలు కడప జిల్లా వైద్యాఆరోగ్యశాఖ కార్యాలయం ముదు ధర్నా చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రుల మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ...ఆసుపత్రులంటేనే ప్రజల్లో భయం పుట్టేలా ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వైద్యశాఖలోని పోస్టులు ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. 

 

18:24 - July 2, 2016

జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పొరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం 'ఆటాడుకుందాం.. రా' (జస్ట్‌ చిల్‌). ఏఎన్నార్‌ నటించిన 'దేవదాసు' చిత్రంలోని 'పల్లెకు పోదాం..' అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేస్తున్నారు. ఆ విశేషాలను నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు తెలియజేస్తూ, 'యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం పాటలు మినహా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ చిత్రం కోసం నటసామ్రాట్‌ డా.అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దేవదాసు' చిత్రంలోని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ 'పల్లెకు పోదాం.. పారుని చూద్దాం చలో చలో' పాటని రీమిక్స్‌ చేయడం ఆనందంగా ఉంది. శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో ఈ పాటను ఇటీవల నాలుగు రోజులపాటు పోచంపల్లి, ఆర్‌ఎఫ్‌సిలో చిత్రీకరించాం. పాట అద్భుతంగా వచ్చింది. ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నాలుగు పాటల్ని ఫారిన్‌లో ప్లాన్‌ చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'అని అన్నారు. 'తాతగారు ఏఎన్నార్‌ పాటను రీమిక్స్‌ చేయడం, ఆ పాటలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నా. శేఖర్‌ మాస్టర్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ పాటను తీశారు. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది' అని సుశాంత్‌ తెలిపారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, 'దేవదాసు' చిత్రంలోని పాటను మా చిత్రంలో రీమిక్స్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటలో సుశాంత్‌ చాలా బాగా చేశాడు. సుశాంత్‌కి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. సెంటిమెంట్‌, ఎమోషన్‌తోపాటు అందర్నీ థ్రిల్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయి' అని అన్నారు.

 

18:14 - July 2, 2016

హైదరాబాద్ : భానుకిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించాలని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. జైలు అధికారుల విజ్ఞప్తి మేరకు కోర్టు తీర్పునిచ్చింది. మద్దెలచెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్‌ నిందితుడుగా ఉన్నాడు. 

 

18:10 - July 2, 2016

అనంతపురం : ఐసీస్‌ సానుభూతిపరులు ఐదు రోజులపాటు అనంతపురంలో బస చేశారని ఎన్‌ఐఏ విచారణలో తేలడంతో.. అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలోనూ.. నగర శివారుల్లో ఉండే అపార్టమెంట్‌లలోనూ తనిఖీలు చేశారు. లాడ్జ్‌లకు వచ్చే వారి నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే వారికి రూమ్‌లు ఇవ్వాలని యజమానులకు పోలీసులు సూచించారు. ఎవరి మీదైనా అనుమానం వసతే వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పారు.

18:07 - July 2, 2016

విజయవాడ : వైసీపీ అధినేత జనగ్‌కు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసిన నేపథ్యంలో... పార్టీ ఆఫీస్ ను వెంటనే మూసివేయాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశాడు. ఒక పార్టీ అధ్యక్షుడు  ఉంటున్న నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని జప్తు దేశంలో ఇదే మొదటిసారని ఎద్దేవా చేశారు. జగన్‌ లాంటి అవినీతి పరుడు రాజకీయాల్లో కొనసాగడం నీచమని మండిపడ్డారు. వైసీపీ అధినేతగా జగన్‌ కొనసాగడం అనైతికమన్నారు. 

 

18:00 - July 2, 2016

మహబూబ్ నగర్ : బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డిపై దాడికి టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.. మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నాగం ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు..దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగింది..పోలీసులు అందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. 

 

17:57 - July 2, 2016

హైదరాబాద్ : ఏపీలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కోడెల శివప్రసాద్ డిస్మిస్ చేశారు. పిటిషన్‌లో సాంకేతిక లోపాలున్నాయని స్పీకర్ కార్యాలయం తేల్చింది. 

 

17:51 - July 2, 2016

విశాఖ : గత సంవత్సరం ముఖం చాటేసిన వరుణుడు ఈ ఏడాది ముందుగానే చిరు జల్లులు కురిపిస్తున్నాడు..దీంతో అగస్ట్ లో ప్రాంరంభం కావాల్సిన ఖరీఫ్ సీజన్  ఈనెలలోనే  ప్రారంభమైంది. విత్తనాలకు సంబంధించి  రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..కొన్ని రోజులుగా  వర్షాలు కరువడంతో...విశాఖ జిల్లాలో ఖరీఫ్‌ ఏర్పాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు.
వ్యవసాయ పనులు ప్రారంభం
విశాఖ జిల్లాలో ముందస్తుగానే వర్షాలు కరువడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. విస్తారంగా కరుసిన వర్షాల వల్ల రిజర్వాయర్లు నిండటంతో ఏరువాక పనులను రైతుల ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా భీమిలి  అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల, చోడవరంతో పాటుగా ఏజన్సీలోని అన్ని ప్రాంతాలలో ఏరువాక పనులు జోరుగా సాగుతున్నాయి.
విత్తనాల కోసం ఎదురుచూపులు 
పొలాలను చదును చేస్తున్న రైతులు, విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి... జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో, విత్తన సరఫరా కేంద్రాలు ఏపీ సీడ్స్‌ ద్వారా విత్తానాలు పంపిణీ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
వాణిజ్య పంటలపై దృష్టిసారించాలి : మంత్రి ప్రత్తిపాటి 
విశాఖ జిల్లాలో  చెరకుతో పాటుగా జొన్న, వేరుశనగ వంటి పంటలను  రైతులు సాగు చేస్తారు..అయితే ఇటీవల నగరానికి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు .. ముందస్తుగానే వర్షాలు పడటంతో  రైతులు ఖరీఫ్ సీజన్‌ త్వరగా ప్రారంభించాలని అన్నారు. కేవలం వరి మీదనే  దృష్టి పెట్టకుండా వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులను ఆదేశించారు.
గ్రామీణ జనాభాకు వ్యవసాయమే ఆధారం 
విశాఖ జిల్లాలో 38 లక్షల జనాభాలో, 23 లక్షల గ్రామీణ జనాభా వ్యవసాయ రంగం మీదనే అధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో 2లక్షల 87 వేల ఎకరాల్లో వరిని సాగుచేస్తున్నారు.  2015-16 ఖరీఫ్‌లో 2 లక్షల 4 వేల  హెక్టార్ల విస్తీర్ణంలో, లక్షా ఎనభైవేల హెక్టార్లలోనే వరి సాగైంది. అయితే విత్తనకేంద్రాల ఏర్పాటుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, అవి మండల కేంద్రంలోనే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తాము మండలాలలకు వెళ్లి, అధికారుల కోసం పడిగాపులు కాయడం ఇబ్బందిగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, విత్తనాలను తమకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాధికారులు ఆదిశగా ఆలోచిస్తే పంటలను సవ్యంగా పండించుకోగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

17:45 - July 2, 2016

హైదరాబాద్ : దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ పి. ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థి నేతలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

17:44 - July 2, 2016

హైదరాబాద్‌ : నగరంలోని గాంధీభవన్‌లో పబ్లిక్ రంగ సంస్థల్లోని  కార్మిక సంఘాల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సెప్టెంబర్‌ 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 

17:41 - July 2, 2016

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై రైల్వే స్టేషన్ లో గతవారం హత్యకు గురైన ఇన్ఫోసిన్‌ ఉద్యోగిని స్వాతి కేసులో అనుమానితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో లభించిన దృశ్యాల ఆధారంగా తిరునెల్వేలిలో 24ఏళ్ల రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అయితే పోలీసులను చూడగానే.. వారి రాకను గమనించిన రామ్‌కుమార్‌ బ్లేడ్ తో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు స్వాతి ఇంటికి సమీపంలో ఉండేవాడని పోలీసులు గుర్తించారు.
గత నెల 24న స్వాతి హత్య 
గత నెల 24న చెన్నై రైల్వేస్టేషన్లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి స్వాతిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఓ వ్యక్తిని అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు అతడి ఫొటోను విడుదల చేశారు. అందులో గళ్ల చొక్కా వేసుకుని భుజానికి బ్యాగు తగిలించుకున్న వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. స్వాతి హత్యకు గురైన రోజు నుంచి రామ్‌కుమార్‌ తన గదిలో లేనట్లు పోలీసులు తెలుసుకున్నారు. అంతేగాక.. ఘటన జరిగిన సమయంలో అతడి మొబైల్‌ కూడా రైల్వేస్టేషన్‌ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే రామ్‌కుమార్‌ను విచారిస్తేనే గానీ.. పూర్తి వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. స్వాతి హత్యకు ప్రేమే కారణమై ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

17:33 - July 2, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని యువతిని ఓ యువకుడు హత మార్చాడు. భైసాంలో 16 ఏళ్ల సంధ్య అనే యువతి నివాసముంటుంది. అదే ప్రాంతంలో మహేష్ (21) అనే యువకుడు నివాసముంటున్నాడు. మహేష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ప్రేమించాలని సంధ్యను గత కొద్ది కాలంగా మహేష్ వేధిస్తున్నాడు. తరచుగా ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయితే విషయం యువతి తల్లిండ్రులకు తెలియడంతో సంధ్యను చదువు మాన్పించారు. అప్పటినుంచి యువతి ఇంట్లోనే ఉంటుంది. ఈనేపథ్యంలో మహేష్ తరచుగా ఫోన్ చేసి... సంధ్యను వేధిస్తూ బయటికి రావల్సిందిగా కోరుతున్నాడు. సంధ్య తల్లికి తలనొప్పిగా ఉండడంతో ఆమెకు మాత్రలు తీసుకొచ్చేందుకు సంధ్య బయటికి వచ్చింది. మాత్రలు తీసుకొని ఇంటికి వెళ్తుండగా భూపాలపల్లి చౌరస్తాలో మహేష్ సంధ్యను పట్టుకుని కత్తితో ఆమె మెడ కోశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్దిదూరం వెళ్లాక...స్థానికులు మహేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

ఆదిలాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. యువతిని ఓ యువకుడు హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 
ప్రేమించడం లేదనే కారణంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్ కు నాగం లేఖ

మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ కు నాగం జనార్ధన్ రెడ్డి లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డిపోతల పథకంలో 4 ప్యాకేజీల మీద అభ్యంతరం తెలిపామని లేఖలో పేర్కొన్నారు. టీఆర్ ఎస్ నాయకులు తనపై దాడులు చేస్తున్నారని చెప్పారు. 

చెరువుల్లో సెన్సార్లు ఏర్పాటు : సీఎం చంద్రబాబు

విజయవాడ : 100 ఎకరాల కంటే ఎక్కువ నీరు తీసుకునే చెరువుల్లో సెన్సార్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎంత నీరు బయటికి పోతుందో సెన్సార్ల ద్వారా తెలుస్తుందన్నారు. భూమిని భూగర్భజలాశయంగా మార్చడమే లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల పంపు సెట్లు ఉన్నాయని తెలిపారు.  

 

వర్షపు నీటిని కాపాడుకునేందుకు చర్యలు : సీఎం చంద్రబాబు

విజయవాడ : వర్షపు నీటిని కాపాడుకునేందుకు వేగంగా చర్యలు చేపడతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాభావ సందర్భంలో రోజుకు లక్ష ఎకరాలకు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిందు సేద్యం, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నీరు-ప్రగతి పథకం కింద 2015-16లో కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. నీరు-ప్రగతికి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 

ఈనెల 6న పట్టిసీమ నీళ్లు విడుదల : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఈనెల 6న పట్టిసీమ నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈమేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశలవారిగా నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. 

16:00 - July 2, 2016

విజయవాడ : ఈనెల 6న పట్టిసీమ నీళ్లను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈమేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశలవారిగా నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. వర్షపు నీటిని కాపాడుకునేందుకు వేగంగా చర్యలు చేపడతున్నామని తెలిపారు. వర్షాభావ సందర్భంలో రోజుకు లక్ష ఎకరాలకు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిందు సేద్యం, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నీరు-ప్రగతి పథకం కింద 2015-16లో కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. నీరు-ప్రగతికి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. 100 ఎకరాల కంటే ఎక్కువ నీరు తీసుకునే చెరువుల్లో సెన్సార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంత నీరు బయటికి పోతుందో సెన్సార్ల ద్వారా తెలుస్తుందన్నారు. భూమిని భూగర్భజలాశయంగా మార్చడమే లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల పంపు సెట్లు ఉన్నాయని తెలిపారు.  

 

15:33 - July 2, 2016

విశాఖ : నగరంలో నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముఠా గుట్టు రట్టు అయింది. ముఠా సభ్యులను పోలీసులు ఆరెస్ట్ చేసారు. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

15:24 - July 2, 2016

హైదరాబాద్ : నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు జలమండలి సహా, పలువురు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు రీడిజైన్ పై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు భూ సేకరణ.. కాలువల విస్తరణ వంటి పలు అంశాలపై  ఆరా తీశారు.

 

15:20 - July 2, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పుష్కర పనులు పూర్తి చేయడానికి నెల మాత్రమే సమయం ఉందని, పనులు ముమ్మరం చేయాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తికాకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తుల కోసం రహదారికి ఒక వైపు బారికేడ్లు ఏర్పాటు చేయాలి, రహదారి నిర్మాణం, విద్యుత్‌ పనులు వేగంగా సాగాలని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.216 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

15:07 - July 2, 2016

ఢిల్లీ : తెలుగు రాష్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బోస్లే హస్తిన పర్యటనలో బిజీబీజీగా గడుపుతున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమై ఉమ్మడి హైకోర్టు పరిధిలో జరుగుతున్న పరిణామాలను భోసలే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జె.ఎస్ కెహర్, అనిల్ దర్ దవేతో దిలీప్ బోస్లే సమావేశమయ్యారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల నియామకాలు, తెలంగాణలో న్యాయవాదులు అందోళన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో చర్చించారు. 

 

జగన్ కు చెందిన రూ.749 కోట్ల ఆస్తుల జప్తు : సోమిరెడ్డి

హైదరాబాద్ : జగన్ కు సంబంధించిన రూ.749 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.7500 కోట్లు ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యాలయం జప్తు చేయడం దేశంలోనే తొలిసారి అని అన్నారు. జగన్ పార్టీని ఎలా కొనసాగిస్తాడని.. వైసీపీని మూసీవేయాలి లేదా అధ్యక్షుడిని మార్చుకోవాలని సూచించారు. 

 

ఐదేళ్లలో 46,531 చెరువుల పూర్తి : మంత్రి తుమ్మల

ఖమ్మం : మిషన్ కాకతీయ కింద ఐదేళ్లలో 46,531 చెరువులను పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి ఏడాది 20 శాతం చెరువు పనులు చేపడతామని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది సాగు నీరందిస్తామని తెలిపారు. కరువు ప్రాంతమైన పాలేరుకు తాగు నీరందిస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద 2 లక్షల మంది నిర్వాసితులవుతుంటే మాట్లాడని వారు అధికార దాహం కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా హితం కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టినట్లు చెప్పారు. ఆందోళనలు చేస్తే జిల్లాల పునర్విభజన కాదన్నారు. 

డిండి ఎత్తిపోతలపై మంత్రి హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్ : డిండి ఎత్తిపోతలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. 

బంగ్లాదేశ్ లో ఉగ్రదాడిలో 20 మంది పౌరుల మృతి

ఢాకా : బంగ్లాదేశ్  లో ఉగ్రవాదుల దాడుల్లో 20 మంది పౌరుల మృతి చెందారు. భద్రతా దళాలు ఆరుగురు తీవ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. ఇద్దరు శ్రీలంక, ఒకరు జపాన్ వాసులతోపాటు మరో 13 మందిని ఆర్మీ రక్షించింది. 

 

ముగిసిన గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ...

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.  

14:04 - July 2, 2016

విశాఖ : ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కులాంటి విశాఖపట్టణంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అక్కడి గాలి, నీరు, నేల అన్నింటిలోనూ కాలుష్యం మోతాదు మించిపోతోంది. కాలుష్యకారక జబ్బులు పెరుగుతున్నాయి.

కాలుష్య మేఘాలు...
ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. కమ్ముకొస్తున్న ఆ మేఘాలను జాగ్రత్తగా గమనించండి. పొరపాటున కూడా ఇలాంటి మేఘాలకు స్వాగతం చెప్పకండి. ఎందుకంటే, ఇవి అత్యంత భయంకరైమన, అపాయకరమైన మేఘాలు. ఇవి విశాఖను కమ్మేశాయి. పైన ఆకాశంలో ముసురుకున్న మేఘాలే కాదు కాళ్ల కింత భూమి కూడా అత్యంత ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. విశాఖపట్టణంలోని మట్టిని పొరపాటున కూడా ఇలా దోసిట్లోకి తీసుకునే సాహసం చేయకండి.

కాలుష్యానికి ఎండిపోతున్న పచ్చని మొక్కలు...
ఈ భూమి మీద పెరిగిన మొక్కలు ఎలా తలలు వాల్చేస్తున్నాయో చూడండి. ఈ మొక్కల ఆకుల మీద పేరుకుపోయిన మట్టిని చూడండి. ఈ మొక్కలకు కాసే కాయలు, పండ్లు కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ టమటో పండును చూడండి. ముదురు ఎరుపు రంగులో నిపిస్తున్న ఈ టమాటో పండు విశాఖకు పెద్ద డేంజర్ సిగ్నల్. ఉత్తరాంధ్రకే పెద్దదిక్కులాంటి విశాఖ ఎంత విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నదో అర్ధం చేసుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న శాంపిల్స్ మాత్రమే.

కాలుష్య కోరల్లో పంచభూతాలు?!...

గాలి, నీరు, భూమి, ఆకాశం, ఆకు, కాయ, పండు .... ప్రతిదీ ఇలా మారిపోతుంటే ఇక్కడ బతికేదెట్టా? ఇదే ప్రశ్న ఇప్పుడు విశాఖవాసులను భయపెడుతోంది. క్షణక్షణం పెరుగుతున్న పొల్యూషన్ లెవల్స్ కలవరపెడుతున్నాయి.

విశాఖలో ఇంతగా కాలుష్యం పెరగడానికి కారణం? ..
కొన్నాళ్ల క్రితం కాన్వెంట్ జంక్షన్, జ్ణానాపురం, సెబాస్టియన్ కాలనీ, వన్ టౌన్ ఇలా నాలుగైదు ప్రాంతాల్లోనే దుమ్ము ధూళి కనిపించేది. కానీ, ఇప్పుడు విశాఖపట్టణం మొత్తం ఇది వ్యాపించింది. దీనికంతటికీ కారణం విశాఖ ఓడరేవు. భారీ స్థాయిలో ఇనుప ఖనిజం, బొగ్గు ఎగుమతి, దిగుమతిలకు ఇది కేంద్రం. ఇక్కడి నుంచి విడుదలయ్యే దుమ్ము ధూళి విశాఖను కమ్మేస్తున్నాయి.

గంగవరం పోర్టు నుంచే విడదలయ్యే కాలుష్యం...
గంగవరం పోర్టు నుంచే విడదలయ్యే కాలుష్యం గాజువాక పరిసర ప్రాంతాలకు శాపంగా మారుతోంది. రోడ్లు, కాలనీలు అన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి. చివరకు యారాడ్ బీచ్ కి కూడా ప్రమాదం ముంచుకొచ్చింది. గంగవరం పోర్టు కాలుష్యాన్ని నివారించకపోతే, యారాడ్ బీచ్ సర్వనాశనం అవుతుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోర్టులకు నిత్యం వచ్చే వాణిజ్య నౌకలు సరుకులతో పాటు అత్యంత ప్రమాదకరమైన బంకర్ ఫ్యూయల్స్ ను మోసుకొస్తున్నాయి. ఆకాశంలో కారుమబ్బుల్లా కాలుష్యపు మేఘాలు కమ్ముకోవడానికి ఇవే కారణం. రోడ్ల మీద తిరిగే వాహనాలూ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. విశాఖలో తిరుగుతున్న వెహికిల్స్ సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటింది. ధనిక, పేద, కలెక్టర్, ఫ్యూన్, చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ కాలుష్యం కాటేస్తోంది. కంటైనర్ లోడ్ దించుతున్నప్పుడు ఏర్పడే పెద్దపెద్ద శబ్ధాల ధాటికి మనుషులే కాదు ఇళ్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి. చాకలి గడ్డ ఏరియాలో గోడలు బీటలువారుతున్నాయి.

ముద్రంలో కలుస్తున్న ఫార్మా రసాయనాలు...
ఫార్మా కంపెనీలు విడుదల చేసే రసాయనాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో మత్స్యసంపద నాశనమవుతోంది. ఒకప్పుడు 500కు పైగా వున్న మత్స్యగ్రామాల సంఖ్య 400కి తగ్గిపోవడానికి కారణం ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యమే. ఫార్మా కంపెనీలలో తరచూ జరిగే ప్రమాదాలు, వాటి నుంచి వచ్చే పొగ కొత్తకొత్త జబ్బులు తెస్తున్నాయి. విశాఖలో కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతున్నాయి. చర్మ సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి.

కాలుష్య నివారణకు 1500 కోట్ల ఖర్చు?!..
1500 కోట్ల రూపాయలు కుమ్మరిస్తే తప్ప అదుపు చేయలేని స్థితిలో విశాఖ కాలుష్యం లెవల్స్ పెరగడానికి ఇంతకాలం ప్రదర్శించిన నిర్లక్ష్యమే కారణం. విశాఖ పోర్టు ట్రస్ట్ నుంచి వెలువడే కాలుష్యం నివారణ చర్యల్లో భాగంగా 2000 సంవత్సరం నాటికే ఏర్పాటు కావాల్సిన పౌర సంఘాన్ని ఇప్పటికీ నియమించలేదు. కాలుష్యం బారిన పడే ప్రదేశాల్లోని రోడ్లను ట్యాంకర్లతో తడుపుతూ వుండాలన్న నిబంధననూ పోర్టు యాజమాన్యం గాలికొదిలేసింది. ధూళిని వేరు చేసే యాంత్రిక విధానాన్ని జనరల్ కార్గో బెర్త్ లోని అన్ని స్టాక్ యార్డుల్లో ఏర్పాటు చేయాలన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. బల్క్ కార్గో, మాన్యువల్ హాండ్లింగ్, ఓపెన్ స్టోరేజీలను 2002 నాటికే నిలిపివేయాలన్న సూచనలను పోర్టు నిర్లక్ష్యం చేస్తోంది.

చేతులెత్తేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్ట్ ...
కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేతులెత్తేసి కూర్చుంది. ఓ వైపు కొండలు, మరో వైపు సముద్రంతో కూడిన బౌల్ ఏరియాలో విశాఖపట్టణం వున్నందున పొల్యూషన్ కంట్రోల్ చేయడం కష్టమవుతోందంటూ సెలవిస్తున్నారు. 1500 కోట్ల రూపాయల ఖర్చు పెడితే కాలుష్యం నివారణకు అవకాశం వుందంటున్నారు. పర్యావరణ క్లినిక్ పేరుతో ఏపి పొల్యూషన్ బోర్డు చేపట్టిన కార్యక్రమం అభాసుపాలైంది. ఇందులో పాల్గొన్న పర్యావరణ వేత్తలు కోపం పట్టలేకపోయారు. ఇలాంటి ఆగ్రహాలను చూసిన తర్వాతైనా పొల్యూషన్ నియంత్రణ చర్యల మీద ప్రభుత్వం ద్రుష్టి సారించకపోవడమే అత్యంత విషాదం.  

13:54 - July 2, 2016

విశాఖ : పెందుర్తిలో అనుమానాస్పద స్థితిలో ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. తన భార్య తరపు బంధువులే తన బిడ్డ ప్రాణాలు తీశారని పాప తండ్రి రాజేష్‌ ఆరోపిస్తున్నాడు. పెందుర్తి పీఎస్‌లో భార్య తరపు బంధువులపై ఫిర్యాదు చేశాడు.

శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘటన...
విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన రాజేష్‌కు విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిక్కాలపేటకు చెందిన ఉమతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది నుంచి భార్య భర్తల మధ్య విబేధాలు పొడచూపాయి. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్ ఉపాధి కోసం కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి.. అక్కడ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో ఉమ కేసు పెట్టింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం రాజేష్‌ కుతూరు రేష్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ విషయాన్ని రాజేష్‌ కుటుంబ సభ్యులకు ఉమ బంధువులు చెప్పలేదు. విషయం తెలుసుకున్న రాజేష్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉమ తరపు బంధువులే రేష్మను చంపారని రాజేష్‌ ఆరోపిస్తున్నాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న రేష్మ మృతదేహాన్ని చూపిస్తూ.. ఉమ బంధువులే రేష్మను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

13:49 - July 2, 2016

మహబూబ్ నగర్ : టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. నాగం జనార్థన్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ల నాగం ప్రెస్ మీట్ ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పీఎస్ కు తరలించారు. గతంలో నాగం పాలమూరు ఎత్తిపోత పథకంపై కోర్టులో ఒక పిటీషన్ వేశారు. దీనికి సంబంధించి నాగం దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఈ అంశంపై నాగం పెట్టిన ప్రెస్ మీట్ ను టీఆర్ ఎస్ నేతలు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. 

13:45 - July 2, 2016

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో ఇరువురు న్యాయాధికారుల నియామకం, హైకోర్టు విభజనపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా, హైకోర్టును విభజించాలని, తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా న్యాయాధికారులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీ అడ్వొకేట్స్, జడ్జీలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.

13:37 - July 2, 2016

హైదరాబాద్‌ : నగరంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరేందుకు ప్రయత్నించడంతో .. నగరం మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు . ఈ నేపథ్యంలో ఎలాంటి ఫ్రూఫ్ లు లేకుండా ఇల్లు అద్దెకు ఇవ్వకూడదని పోలీసులు  హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం..గత కొద్దిరోజుల క్రితం 5 గురు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ఎన్ ఐ ఏ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నగరంలోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని.. ముఖ్యంగా ఐడీప్రూఫ్ లు చూడకుండా అద్దెకు ఇల్లు ఇవ్వకూడదంటున్నారు పోలీసులు. నగరంలో ఉగ్రకదలికల నేపథ్యంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి. దీంతో బ్యాచిలర్స్ కి.. కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు తప్పకుండా తీసుకోవాలని ఇల్లులు అద్దెకు ఇచ్చేవారికి పోలీసులు సూచిస్తున్నారు.

ఖాప్స్ కార్డన్ సెర్చ్ ...
ఇప్పటికే పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తే కాని తమ ఇంట్లో ఎవరు ఉంటున్నారనే విషయం యజమానికి తెలియట్లేదు. దీంతో పోలీసులు ప్రతిసారి ఇంట్లో ఉంటున్నవారిపై నిఘా ఉంచడం వీలుపడని నేపథ్యంలో యజమానులే వారి వివరాలు తీసుకుని సరిగా చూసుకుని మరీ ఇల్లులు అద్దెకు ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన ఇంట్లో వాహనాలను ఉంచినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు.

13:29 - July 2, 2016

నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు, లే అవుట్ లు జోరుగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నుల్లొ చొటామోటా నేతలు కొందరు నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు మాత్రం మూముళ్ల మత్తులో మునిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి...

నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా లే-అవుట్లు, నిర్మాణాలు...
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణాలు, లేఅవుట్ లు నియమనిబంధనలు విరుధ్దంగా అక్రమంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మిస్తున్నారు...ఎలాంటి అనుమతులు లేకుడా లేఅవుట్ వేస్తూ, నిర్మాణాలు చేపడుతూ కార్పొరేషన్ ఆదాయానికి గండిపెడుతున్నారు...నగర కార్పొరేషన్ కు కొత్త మాస్టర్ ప్లాన్ త్వరలో అమలు కానుంది...ఈ నేఫథ్యంలో కూడా అక్రమ నిర్మాణాలు లేఅవుట్ ల పై ఎలాంటి చర్యలు తీసుకొవటం లేదు, ఈ వెంచర్ల పై చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు ప్రజా ప్రతినిధులు తమకు నచ్చిన రీతిలొ పనులు చేస్తున్నారు. స్మార్ట్ సిటి జాబితాలొ చేరనున్న ఈ నగరానికి అన్ని సమస్యలే ఉన్నాయి.

నిజామాబాద్ కార్పొరేషన్ గా మారి దశాబ్దకాలం...
ఎమ్మెల్యేలు, ఎంపీలు నగర అభివృద్థికి నిధులు తీసుకొని వస్తున్న పరిస్థితి మాత్రం కనిపించటం లేదు. నిజామాబాద్ కార్పొరేషన్ గా మారి దశాబ్ద కాలం అయింది. జనాభా సైతం మూడున్నర లక్షలకు పైగా చేరింది. నగరంతో పాటు గూపన్ పల్లి, పాంగ్ర, కాలూరు, సారంగపూర్ తదితర గ్రామాలు అభివృద్థి చెందాయి. నగరంలోని బిల్డింగ్ ప్లానర్లదే హవా కొనసాగుతోంది వారు చెప్పిందే వేదంగా మారింది పరిస్థితి. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ చుట్టూ పక్కల గ్రామాల అభివృద్థి చెందుతున్నాయనే ఉద్దేశ్యంతొ కొందరు బడా వ్యాపారులు అక్రమ వెంచర్లు నిర్మించారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ వెంచర్లు నిర్మిస్తున్నారు. అయితే వీటికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.

అధికార పార్టీ నేతల పేర్లు చెబుతూ పబ్బం గడుపుతున్న వ్యాపారులు..
కానీ కొందరు అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. అయామక ప్రజలను మోసం చేస్తూ వారివద్ద నుంచి ఎంతో కొంత నగదు తీసుకొని వారికి మాయమాటలు చెప్పి ప్లాట్లను విక్రయిస్తున్నారు. తీరా మున్సిపల్ కార్పొరేషన్ లొ ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు ఇలాంటి వెంచర్ల పై ఉక్కు పాదం మోపాల్సిన అదికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్ధానికుల నుంచి పెద్దఎత్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్దంగా వెంచర్లు ...
గతంలొ కూడా కొందరు నిమయ నిబంధనలకు విరుద్దంగా వెంచర్లు పరిశీలించిన అధికారులు మాత్రం వాటిని కూల్చి వేశారు. కానీ అధికార పార్టీ నేతల పేర్లు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పటంతొ అధికారులు సైతం వెనక్కి తగ్గుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అమాయక ప్రజలతొ చెలగాటమాడుతున్న వారిపై అధికారులు ఇప్పటికైనా కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

13:20 - July 2, 2016

ఉత్తరాఖండ్‌ : వర్షం బీభత్సం సృష్టించింది. కుంభవృష్టితో వరదనీరు పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ గ్రామాలను ముంచెత్తుతున్నాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. పితోరాగఢ్, చమోలి జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 25మందికిపైగా గల్లంతయ్యారు. పితోరాగఢ్‌లో ఏడు గ్రామాలు నీటమునిగాయి. వర్ష ప్రభావి త గ్రామాల్లో ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు సహాయచర్యలు ప్రారంభించాయని పితోరాగఢ్ కలెక్టర్ హెచ్‌సీ సెమ్వాల్, చమోలి ఆర్డీవో ఎస్‌కే బర్న్‌వాల్ తెలిపారు. 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలకనంద నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నది. 

నాగంపై టీఆర్ఎస్ నేతల దాడి...

మహబూబ్ నగర్ : బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. మహబూబ్ నగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ల నాగం ప్రెస్ మీట్ ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పీఎస్ కు తరలించారు.

గవర్నర్‌ తో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీఅయ్యారు. రాష్ట్రంలో న్యాయవాదుల ఆందోళనలు, చోటు చేసుకుంటున్న సమస్యలకు పరిష్కారాల గురించి కేసీఆర్ గవర్నర్‌తో చర్చించనున్నారు. ఈ భేటీలో హైకోర్టు విభజనతోపాటు, పలు అంశాలపై చర్చించనున్నారని సమాచారం.

గన్‌పార్క్ వద్ద 'న్యాయం' మౌనదీక్ష...

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు చేస్తోన్న దీక్ష ఉధృతంగా కొనసాగుతోంది. ఈమేరకు ఇవాళ లాయర్లు, జడ్జీలు తెలంగాణ అమరవీరుల స్థూపం గన్‌పార్క్ వద్ద మౌనదీక్ష చేపట్టారు. వీరి ఆందోళనకు రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా సంఘీభావం ప్రకటించారు.

చీరాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కామినేని...

ప్రకాశం : చీరాల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కామినేని సందర్శించారు. ఆసుపత్రిలో వుండే మౌలిక వసతులపై రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల లోపంపై సూపరింటెండెంట్ , సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చర్లపల్లి టూ చంచల్‌గూడకు భాను కిరణ్...

హైదరాబాద్: సూరి హత్యకేసులో నిందితుడైన భానుకిరణ్‌ను అధికారులు చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సూరి హత్యకేసులో భాను కిరణ్ నాలుగేళ్లుగా చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు. భానుకు ప్రాణహాని ఉండటంతో నాంపల్లి కోర్టు అనుమతితో పోలీసులు ఈ తరలింపును చేపట్టారు. అధికారులు భానుకిరణ్‌కు చంచల్‌గూడ జైలులో ప్రత్యేక బ్యారక్‌ను సిద్ధం చేశారు.

12:31 - July 2, 2016

శ్రీకాకుళం : దశావతారాల్లో ద్వితీయ అవతారంగా ప్రాముఖ్యత కలిగిన కూర్మావతారం... ప్రాచీన శిల్పకళా శోభితానికి చిహ్నం. శ్రీకాకుళం జిల్లాలో వెలసిన ఈ గొప్పక్షేత్రం రెండు ధ్వజ స్తంభాలు కలిగిన ఏకైక దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి. అంతటి కీర్తి కలిగిన ఈ పురాతన పుణ్యక్షేత్రం...బహుళ ద్వాదశి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ...కూర్మావతార పుణ్యక్షేత్రంపై ప్రత్యేక కథనం.

అబ్బురపరిచే 70 నల్లరాతి స్తంభాలు ...
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీకాకుళంలోని శ్రీకూర్మం ఒకటి. రెండు ధ్వజస్తంబాలు ఉండటం ఒక ప్రత్యేకతయితే.. ద్వారాలు, స్తంభాలపై చక్కని శిల్పసంపద మరింత ఆకర్షణగా నిలుస్తోంది. అబ్బురపరిచే శిల్పాలు, కుడ్యా చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ.. ఇక్కడ 108 రాతి స్తంభాలు ఉన్నాయి. కాని ఒకదానితో మరొకటి పోలిక ఉండదు. పవిత్ర శ్వేత పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు, కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత.చరిత్ర కలిగిన ఈ ప్రాచీన దేవాలయంలో శ్రీకూర్మనాధ జయంతిని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయ గోడల చిత్రాలు...
శ్రీకాకుళం జిల్లా గార మండలం లోని శ్రీకూర్మం లో వెలిసిన క్షేత్రమిది.. కృతయుగం నాటి శాసనాల ద్వారా రెండవ శతాబ్దం లో శ్రీకూర్మనాధ స్వామి ఆలయాన్ని నిర్మించారు. 8వ శతాబ్ధంలో ఆదిశంకరాచార్యులు, 11వశతాబ్ధంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్ధంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్ధులు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. ప్రదక్షిణ మండపం చుట్టూ 70 నల్లరాతి స్తంభాలు అబ్బురపరుస్తాయి. మండప గోడలకు ఆకుపసరు చిత్రాలు 500 సంవత్సరాల క్రితం గీసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెయ్యాల్సిన అవసరముందని భక్తులు సూచిస్తున్నారు.

అంతంతమాత్రంగా మౌలిక సదుపాయాలు ...
ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ దేవాలయానికి దేశంనలుమూలల నుంచి భక్తులు వస్తారు. అయితే భక్తులకు కల్పించిన మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అపురూప దివ్యక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెయ్యాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

12:25 - July 2, 2016

చైనా : ఓ బుల్ రెచ్చిపోయింది. నగరంలోని రద్దీ ప్రాంతమయిన సౌత్ వెస్ట్ స్ట్రీట్ లో బుల్  అడ్డువచ్చిన వారిపై కుమ్మలాటకు దిగింది. రద్దీ ప్రాంతం కావడంతో.. పాదచారులపై దూసుకెళ్లింది. ప్రక్కనే రహదారిపై వెళ్తున్న వాహనదారులపై దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. 

నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు...

విశాఖ : నగరంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

12:21 - July 2, 2016

విశాఖ : నగరంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రముఖ విద్యాసంస్థలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి ఒక్కొక్క సర్టిఫికెట్ కు 50 వేల నుండి 80 వేలు వసూలు చేస్తున్నారు. సదరు సంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్లను నెట్ లో నుండి డౌన్ లోడ్ చేసుకుని నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గాజువాకలో వున్న బీగ్రేడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ , దొండపర్తిలో వున్న రాఘవేంద్ర స్టడీ సెంటర్, అమిత్ షా దూరవిద్యాకేంద్రం, లీడ్ ప్రొవైడర్స్ వంటి ఐదు సంస్థలు నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో భానుప్రకాశ్, సునీల్ కుమార్, నాయుడు బాబు, పల్లపురాజు ఈ నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. 

12:03 - July 2, 2016

హైదరాబాద్ : ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసే మాయగాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ కొంతమంది నిరుద్యోగులను యుగంధర్‌ అనే వ్యక్తి మోసం చేశాడు. 24మంది నుంచి దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక... ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైదాబాద్‌ పోలీసులు నిందితుడు యుగంధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ లోకల్ ఛానల్ లో పనిచేస్తున్న యుగంధర్ హోంమంత్రి నాయిని తనకు సన్నిహిత బంధువని..తానో ఛానల్లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాని ప్రచారం చేస్తూ దాదాపు 24 మంది నిరుద్యోగుల వద్ద నుండి రూ.కోటి వసూలు చేశాడు. 

11:56 - July 2, 2016

మెదక్ : జిల్లా మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా సీపీఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. నేడు పల్లెపహడ్ నుంచి నగరతండాకు వరకు పాదయాత్ర చేశారు....నగరతండా గ్రామస్తులతో మచ్చటించిన తమ్మినేని వీరభద్రం అనంతరం దగ్గరలోని మల్లన్న చెరువును పరిశీలించారు. తమ్మినేనితో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ తో పాటు రైతు సంఘం నాయకులు ఉన్నారు. తాము కష్టాలలో వున్నప్పుడు సీపీఎం పార్టీ తమకు అండగా వుందనీ గ్రామస్థులు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి సిద్ధంగా వున్నామనీ..తమ మద్ధతుగా సీపీఎం నిలబడాలని గ్రామస్తులు కోరారు.

రెండోరోజుకు చేరిన సీపీఎం పాదయాత్ర...

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో రెండోరోజు సీపీఎం పాదయాత్ర కొనసాగుతోంది. పల్లెపహాడ్ నుండి నగర తండాకు పాదయాత్ర చేరుకుంది. ఈ క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నిర్వాశితులతో తమ్మినేని వీరభద్రం ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడారు. అనంతరం మల్లన్న చెరువును పరిశీలించారు.

11:34 - July 2, 2016

కడప : వైసీపీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి మనస్థాపం చెందారు. దీంతో తన పదవికి రాజీనామా చేసి కొరియర్, ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. కాగా స్థానికంగా టీడీపీ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా తమకు అవమానిస్తున్నారని కడప జిల్లాలో కొన్ని రోజుల క్రితం ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రొటోకాల్ పాటించటంలేదని మనస్థాపం చెంది రాజీనామా చేశారు. వైసీపీ నేతలను పదే పదే అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

11:29 - July 2, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భేటీ అయ్యారు. తెలంగాణలో న్యాయవాదులు, న్యాయాధికారుల పరిణామాలలపై చర్చించనున్నారు. సమస్య పరిష్కారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై జస్టిస్ లు చర్చించనున్నారు. తెలుగు రాష్ట్ర్రాల విభజనతో ఉమ్మడి ఆస్తులు..ఉమ్మడి పాలనకు సంబంధించి పలు వివాదాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదులు ధర్నాలు చేపట్టారు. ఈ అంశం చిలికి చిలికి గాలివానగా మారి ఢిల్లీకి చేరింది. దీనికి సంబంధించి చర్చించటానికి శనివారం ఇరు జస్టిస్ లు భేటీ అయ్యారు.

11:00 - July 2, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా చేసిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌కు కౌంట‌ర్ ప్రజంటేష‌న్ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ రెడీ అవుతోంది. కేసీఆర్‌ పవర్‌ ప్రజెంటేషన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అస్త్రాలను వాడుకుంటోంది. ఆచితూచి వ్యవహరించకపోతే నవ్వుల పాలవుతామనే ధ్యాసతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

ఈనెల 11న జ‌ల దృశ్యం చూప‌నున్న కాంగీ...
గులాబి బాస్ కు దీటుగా సాగునీటి ప్రాజెక్టుల పవ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే స‌మ‌గ్ర స‌మాచారాన్ని సేక‌రించిన హ‌స్తం నేత‌లు.. ప్రజెంటేష‌న్‌లో త‌ప్పులు దొర్లకుండా ఒక‌టికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా కుదిరితే ఈనెల 11న జ‌ల దృశ్యం చూప‌నుంది కాంగ్రెస్.

కేసీఆర్ చెప్పిన కోటి ఎక‌రాల సాగు ప‌చ్చి అబ‌ద్దం : కాంగ్రెస్
అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ చెప్పిన కోటి ఎక‌రాల సాగు ప‌చ్చి అబ‌ద్దం అంటున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి కోటి 13 ల‌క్షలు ఉందని.. దీనిలో ప్రస్తుతం కొన‌సాగుతున్న ఆయ‌క‌ట్టు. తమ హయాంలో చేపట్టిన జ‌ల‌య‌జ్ఙం ప్రాజెక్టులు పూర్తయితే సాగులోకి వ‌చ్చే ఆయ‌క‌ట్టు కలిపితే 98 లక్షల ఆయ‌క‌ట్టు అవుతుంది. వీట‌న్నింటి గురించి చెప్పకుండా తానే కోటి ఎక‌రాలకు సాగునీరు అందిస్తున్నట్టు కేసీఆర్ ప్రజ‌ల‌ను మ‌భ్యపెడుతున్నార‌ని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఈనెల 11న ముహూర్తం ఖరారయ్యే అవకాశం ...
ఇప్పటికే ప‌లుమార్లు స‌మావేశాలు , స‌ద‌స్సులు, నిపుణుల ఆలోచ‌న‌లు, సూచ‌న‌ల‌ను తీసుకుని .. పూర్తిస్థాయిలో ప్రజెంటేష‌న్ కు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఈనెల 11న ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఆ రోజు తెలంగాణ‌లో మొట్టమొద‌టి భారీ నీటిపారుద‌ల ప్రాజెక్ట్ నిజాం సాగ‌ర్ నిర్మాణం చేసిన అలీ న‌వాబ్ జంగ్ బ‌హ‌దూర్ జ‌యంతి కావ‌డం విశేషమని నేతలు పేర్కొంటున్నారు.  

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా...

కడప : వైసీపీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి మనస్థాపం చెందారు. దీంతో తన పదవికి రాజీనామా చేసి కొరియర్, ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. కాగా స్థానికంగా టీడీపీ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా తమకు అవమానిస్తున్నారని కడప జిల్లాలో కొన్ని రోజుల క్రితం ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

10:42 - July 2, 2016

హైదరబాద్ : తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో నీటిపారుదల శాఖ ప్రణాళికబద్దంగా అడుగులు వేస్తోంది. నిన్నటి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టగా.. తాజాగా కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై దృష్టి సారించింది. పాలమూరు జిల్లాలో ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై నివేదికలు సిద్ధం చేయాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై చర్చ ...
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆన్‌గోయింగ్‌ సాగునీటి పథకాలపై తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఉన్నతాధికారులతో ఈరోజు మంత్రి హరీష్‌రావు సమావేశం నిర్వహించబోతున్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై చర్చించనున్నారు.
ఇప్పటివరకు 86,956 ఎకరాల సేకరణ...
కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల కోసం మొత్తం 96,485 ఎకరాలను సేకరించాల్సి వుండగా.. 86,956 ఎకరాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రాధాన్యతపరంగా మరో 600 ఎకరాలను సేకరిస్తే.. నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చిన అధికారులంటున్నారు. శుక్రవారం అధికారులతో సమావేశమైన హరీష్‌రావు... కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు, స్థానికశాసనసభ్యుల సమన్వయంతో పని చేసి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సాగునీరు అందించేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని.. లేకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రాజెక్టుల పూర్తికి హరీష్ రావు సమీక్షలు..
మొత్తానికి విపక్షాలు ప్రాజెక్టుల విషయంలో ఎన్ని ఆందోళనలు చేస్తున్నా.. హరీష్‌రావు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

10:34 - July 2, 2016

శ్రీకాకుళం : సరిహద్దులు దాటుకుంటూ ప్రయాణిస్తాయి...మూడు నెలలు విడిది చేస్తాయి..గుడ్లు పెట్టి పొదిగి..పిల్లలు ఎదిగేదాక ఇక్కడే ఉండి,మళ్లీ తమ దేశాలకు ఎగిరిపోతాయి. ఇది శతాబ్ధాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ... సిక్కోలు స్థానికులకు అదో అనుభూతి...శ్రీకాకుళం జిల్లాలో సందడి చేయడానికి వచ్చేసిన విదేశీ పక్షులపై ప్రత్యేక కథనం..

పక్షుల రాకతోనే వర్షాలు వస్తాయని స్థానికుల నమ్మకం..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలో వలసపక్షుల సందడి ప్రారంభమైంది. సరిహద్దును దాటుకుంటూ వచ్చే ఈ అందమైన అతిధుల విహారం స్థానికులను కనువిందు చెయ్యడానికి సిద్ధమైంది. ప్రతి ఏటా జూలైలో సైబీరియా నుంచి వలసవచ్చే ఈ పక్షులను స్థానికులు ఎంతో సంప్రదాయబద్ధంగా చూసుకుంటారు. ఓపెన్ బిల్డ్ స్పార్క్ శాస్త్రీయ నామం గల వీటిని స్థానికులు నత్తగొట్టు పక్షులుగా పిలుచుకుంటారు. జులై మాసంలో వచ్చే ఈ వలస పక్షులు మూడు నెలల పాటు తేలుకుంచి లోనే విడిది చేస్తాయి. ఇవి వస్తే కానీ వర్షాలు కురవవన్న నమ్మకం తో పాటు, ఏటా గుడ్లు పెట్టి పొదిగే సమయం లో ఇక్కడికి సైబీరియా పక్షులు రావడం ఆనవాయితీగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

పక్షులను అతిధులుగా భావించే స్థానికులు..
ఈ పక్షులు తూర్పు, దక్షిణ ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక మొదలుకొని తూర్పు ప్రాతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. ఈ సీజన్ ఈ తేలుకుంచి చేరుకుని ఇక్కడి చెట్లపై జూలై నుంచి జనవరి వరకు నివాసం ఉండి తరువాత వెళ్లిపోతాయి. ప్రతి సంవత్సరం ఈ సీజన్‌లో పక్షులను చూడటానికి వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ పక్షుల రాక, తమ తాత ముత్త్తాతల నుంచి జరుగుతోందని .... అప్పటి నుంచి వీటిని తమ ఊరుకు వచ్చే అతిధుల్లా భావిస్తామని గ్రామస్థులు అంటున్నారు.

సెప్టెంబర్ మొదటి వారం లో తిరుగుప్రయాణం ...
ప్రతి ఏడాది జూలై నెలలో వచ్చి సెప్టెంబర్ మొదటి వారం లో తిరుగుప్రయాణం అవుతుంటాయి వలస పక్షులు. తేలుకుంచి లో గల వలసపక్షుల విడిది కేంద్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే.. సందర్శకులూ వస్తారు, తమకు ఆనందంగా ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. అటవీశాఖ అధికారులు ఆ విధంగా ఆలోచించాలని సూచిస్తున్నారు.

ఉద్యోగాలిప్పిస్తామని రూ.కోటికి టోకరా..

హైదరాబాద్ : ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసే మాయగాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగతోంది. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగాలిప్పిస్తాని రూ.కోటి వసూలు చేసిన యుగంధర్ అనే మాయగాడిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నేడు విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన..

విశాఖ : విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన ఆయన శనివారం సాయంత్రం 4.10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. పార్కు హోటల్‌ లో ఏపీఐఐసీ ఆరోగ్య నగరంలో స్థలాలు కేటాయించిన ఆసుపత్రుల యజమానులతో సీఎం సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి 6 వరకూ నౌకాదళ అధికారులతో సమావేశమవుతారు. పాండురంగాపురం కూడలి వద్ద సాయంత్రం 6.15 గంటల నుంచి 6.45 గంటల వరకు సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం బే మారథాన్‌ను ప్రారంభిస్తారు.

09:43 - July 2, 2016

విశాఖ : నగరంలో నిర్వహిస్తున్న బే మారథాన్‌లో పాల్గొనేందుకు నగర వాసులు ఉత్సాహం చూపిస్తున్నారు. పలు విభాగాల్లో పరుగెత్తేందుకు ఇప్పటికే సుమారు 5వేల మంది స్వచ్చందంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ బే మారథాన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అధితిగా హజరవుతున్నారు.

మారథాన్ కు ఏర్పాట్లు పూర్తి...
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మారథాన్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. యువత పెద్దసంఖ్యలో ఈ మారథాన్ రన్ లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

24 ప్రదేశాల్లో సంస్కృతిక కార్యక్రమాలు ...
మారథాన్‌లో భాగంగా బీచ్ రోడ్డు లో మెుత్తం 24 ప్రదేశాల్లో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే భద్రత కూడ కట్టుదిట్టం చేసారు. ఈ మారథన్ లో పాల్గోనే ప్రతి ఒక్కరికి మెడల్ అందజేయనున్నారు.

మారథాన్‌ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు...
బే మారథాన్‌ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం మూడు గంటల నుండి బీచ్ రోడ్డు లో ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బీచ్ రోడ్డుకు వచ్చే ప్రయాణికులు గాని, బీచ్ రోడ్డులో నివాసితులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసు అదికారులు తెలిపారు. 

09:38 - July 2, 2016

వరంగల్ : వరంగల్ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే .. ఉపేక్షించబోమని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ జా అన్నారు. జనజీవనానికి భంగం కలిగించవద్దని శాంతియుతంగా నిరసన తెలపాలన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే ..కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ హెచ్చరించారు. కాగా జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆందోలకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు. 

09:28 - July 2, 2016

చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలిలో తలదాచుకుంటున్న రామ్ కుమార్‌ను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. తిరునల్వేలి చెందిన రామ్‌కుమార్‌ ఇంజినీరింగ్ ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో చెన్నైకు వచ్చినట్లు గుర్తించారు. స్వాతి నివాసం ఉండే ప్రాంతంలోనే రామ్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత నెల 24న చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.

09:25 - July 2, 2016

బంగ్లాదేశ్‌ : రాజధాని ఢాకాలో టెర్రర్‌ ఆపరేషన్‌ పూర్తయ్యింది. ఉగ్రవాదుల దగ్గర ఉన్న 60మంది పౌరులను భద్రతా దళాలు విడిపించాయి. కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్‌ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్‌ బేకరీలోకి శుక్రవారం రాత్రి దాదాపు 9 మంది దుండగులు చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. ఇటలీ, జపాన్‌ దేశస్థులు సహా కనీసం 60 మందిని బందీలుగా తీసుకున్నారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా అదనపు పోలీసు కమిషనర్‌ సహా దాదాపు 30 మంది గాయపడ్డారు.

ఘటనకు తమదే బాధ్యత అంటూ ఐసీస్‌, అల్‌కాయిదా ప్రకటనలు....
ఢాకాలో జరిగిన తాజా దాడి తమ పనేనంటూ అటు ఇస్లామిక్‌ స్టేట్‌, ఇటు అల్‌ఖైదా స్థానిక విభాగం వేరువేరుగా ప్రకటించుకున్నాయి. కాగా భారత హైకమిషన్‌ సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ఢిల్లీలో తెలిపారు. ఢాకాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు సైతం బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలిపాయి. బంగ్లాదేశ్‌కు అండగా ఉంటామని హామీనిచ్చాయి.
నరమేధం సృష్టిస్తున్న ఉగ్రవాదులు...
ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు ప్రపంచ వ్యాప్తంగా నరమేధం సృష్టిస్తున్నారు. ఇక్కడ.. అక్కడ అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ రక్తపాతం సృష్టిస్తున్నారు. ముంబై, బీరుట్, పారిస్, బాలి, మాలి... ఇక్కడా అక్కడా అని కాదు ప్రపంచమంతటా ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఎక్కడ ఎప్పుడు ఎటునుంచి ముష్కరమూకలు విరుచుకుపడతారో తెలియని పరిస్థితి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఉగ్రవాదులు ఒక్కరుగా, ఇద్దరుగా, గుంపుగా.. ఎలాగైనా పంజా విసురుతున్నారు. తుపాకీ కాల్పులు, బాంబులతో దాడులే కాదు.. తామే మానవబాంబులుగా మారి మారణహోమం సృష్టిస్తున్నారు. గత పదిహేనేళ్లలో దాదాపు లక్షన్నర మందిని బలితీసుకున్నారు. అంతకుముందు చెదురుమదురుగా ఉన్న ఉగ్రవాదులు.. ఉగ్రవాద దాడులు.. 21వ శతాబ్దం ఆరంభం నుంచీ విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ పదిహేనేళ్లలో ఏకంగా పది రెట్లు పెరిగిపోయాయి. గతంలో ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు.. లేదంటే, మత పెద్దలు లక్ష్యంగా సాగిన ఉగ్రదాడులకు.. ఇప్పుడు సాధారణ పౌరులే లక్ష్యంగా మారిపోయారు. ప్రపంచంలోని 123 దేశాలు ఉగ్రవాద రక్తదాహాన్ని చవిచూశాయి. ప్రధానంగా.. మధ్య ఆసియా - ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా, సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుకుని నిత్యం రక్తమోడుతున్నాయి. ఈ దాడులు పాశ్చాత్య దేశాలకూ వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడుల్లో ముప్పావు భాగం.. ఐదు ప్రధాన ఉగ్రవాద సంస్థలవేనని తాజా లెక్కలు చెప్తున్నాయి.

అంతకంతకూ విస్తరిస్తున్న ఉగ్రవాదం...
ఇటీవలే ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ విమానాశ్రయంలోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కొద్ది నిమిషాల క్రితం ప్రశాంతంగా, భద్రంగా కనిపించిన విమానాశ్రయంలో... ఏరులైపారిన రక్తం, బుల్లెట్లు, ప్రయాణికుల హాహాకారాలతో భీతావహస్థితి ఏర్పడింది. అటాటర్క్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌ ప్రవేశద్వారం వద్ద కాల్పులు జరిపి ఆ తర్వాత ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది మృతి చెందారు. భారీ ఆయుధాలతో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ వద్దకు చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదులు మొదట సెక్యూరిటీ గార్డులను కాల్చి చంపి లోపలికి ప్రవేశించారు. అప్పటికే అక్కడ విమానాల కోసం ఎదురుచూస్తున్న వందల మంది ప్రయాణికులపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత తమను తాము పేల్చుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న టెర్మినల్‌ వాతావరణం పేలుళ్లలో ఒక్కసారిగా మారిపోయింది.

బుల్లెట్ల వర్షం... విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు
ఈ మధ్యే వరుస బాంబు పేలుళ్లతో బ్రస్సెల్స్‌ నగరం కూడా దద్దరిల్లింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ విమానాశ్రయంతో పాటు మెట్రో రైల్వేస్టేషన్‌లో ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోగా.. 261 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడింది తామేనంటూ ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇందులో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

పారిస్ లోనూ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
తేదీ 2015 సంవత్సరంలో పారిస్‌లో ఏకంగా ఆరుచోట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 128 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 200 మంది క్షతగాత్రులయ్యారు. రాక్‌ బ్యాండ్‌ జరుగుతున్న కాన్సెర్ట్‌ హాల్లోనే ఏకంగా 82 మందిని ఉగ్రవాదులు ఊచకోత కోశారు. ఈ దాడులు తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది. ఇలా ప్రపంచాన్ని ఉగ్రవాదులు గడగడలాడిస్తున్నారు.

ఢాకాలో బందీలను విడిపించిన కమాండోలు...

బంగ్లాదేశ్ : ఢాకాలో ఆపరేష్ టెర్రర్ పూర్తయింది. బందీలుగా వున్న 60 మందిని భద్రతా దళాలు విడిపించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. దౌత్యం ప్రాంతంలోని బేకరీలోకి ముష్కరులు చొరబడి అరాచకం చేశారు. కేఫ్ ను చుట్టుముట్టిన కమాండోలు బందీలుగా వున్న వారిని విడిపించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ ఘటనకు తమదే బాధ్యత అంటూ ఐసిస్, ఆల్ ఖాయిదా ఉగ్రసంస్థలు ప్రకటించాయి. 

జనగామలో 144 సెక్షన్ ....

వరంగల్ : జనగామను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆందోలకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ లు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే ఉపేక్షించమని రూరల్ ఎస్పీ అంర్ కిషోర్ జా హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

హెచ్ సీయూ రిజిస్ట్రార్ గా సర్ధార్ సింగ్...

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా పి.సర్ధార్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన స్వస్థలం మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్. మహాత్మాగాంధీ అంతరాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం, వార్ధాలో పలు స్థానాల్లో విధులు నిర్వహించారు. ఫైనాన్స్ ఆఫీసర్, జాయింట్ రిజిస్ట్రార్‌లతో పాటుగా ఇందిరా కళాసంగీత్ విశ్వవిద్యాలయ, ఛత్తీస్‌గడ్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. 

08:34 - July 2, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఈడీ మరో నోటీసు జారీ చేసింది. వాద్రా ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. బికనీర్‌లో భూస్కాంకు పాల్పడ్డారని వాద్రాపై ఆరోపణలున్నాయి. వాద్రాపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది.

వాద్రాకు బిగుస్తున్న ఉచ్చు...
కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఉచ్చు బిగుస్తోంది. బికనీర్‌ భూ కుంభకోణానికి సంబంధించి వాద్రాకు ఎనఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌ కంపెనీ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని వాద్రాపై అభియోగం. మనీల్యాండరింగ్‌ చట్టాల కింద ఆయనకు ఈడీ నోటీసులు పంపింది.

వాద్రాకు వారాల సమయం ఇచ్చిన ఈడీ ...
వాద్రాకు ఈడీ రెండు వారాల సమయం ఇచ్చింది. ఈడీ ముందు హాజరై తన వాంగ్మూలం చెప్పాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వాద్రా కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల దస్తావేజులను విచారణాధికారి కోరినట్లు తెలుస్తోంది.

జూన్‌ 24న ఈడీ ముందు హాజరు కాలేక పోయిన వాద్రా...
అంతకు ముందు బికనీర్‌ భూ కుంభకోణంపై జూన్‌ 24న హాజరు కావాలని వాద్రాను ఈడీ ఆదేశించింది. అయితే వాద్రా ఈడీ ముందు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాది హాజరయ్యారు. న్యాయవాది కంపెనీకి సంబంధించిన ఎలాంటి దస్తావేజులు తీసుకురానందున వాద్రానే హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది.

వాద్రాపై కేంద్రం కక్షపూరిత చర్య...
బికనీర్‌లో భూ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలను కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. సోనియా అల్లుడు కావడంవల్లే వాద్రాపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించింది.

ప్రభుత్వం వేధిస్తోందంటూ రాబర్ట్‌ వాద్రా ఆవేదన...
గత పదేళ్లుగా తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వం వేధిస్తోందంటూ రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయ లబ్ది కోసం తనని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

2010లో బికనెర్‌లో 70 ఎకరాల భూమిని 70 లక్షలకు కొన్న వాద్రా...
2010లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో 70 ఎకరాల భూమిని 70 లక్షలకు కొని మూడేళ్ల తర్వాత ఆ భూమిని 5 కోట్లకు అమ్ముకున్నారని వాద్రాపై ఆరోపణలున్నాయి. మరోవైపు హర్యానాలో వాద్రా భూ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించి బిజెపి ప్రభుత్వం రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధింగ్రా నేతృత్వంలో గత ఏడాది విచారణ కమిటీ వేసింది. ధింగ్రా కమిటి తన తుది నివేదికను సమర్పించడానికి ఆగస్టు వరకు ఖట్టర్ ప్రభుత్వం సమయమిచ్చింది. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వాద్రాకు లాభం చేకూర్చేలా వ్యవహరించిందని ఆరోపణలున్నాయి. 2008లో గుడ్గావ్‌లో 3.5 ఎకరాల ప్లాట్‌ను వాద్రా 7 కోట్ల 50 లక్షలకు కొని రియల్‌ ఎస్టేట్ సంస్థ డిఎల్‌ఎఫ్‌కు 58 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలున్నాయి.

సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా దోనేపూడి ...

ప్రకాశం : సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా తెనాలికి చెందిన దోనేపూడి దిలీప్‌రాజా నియమితులయ్యారు. ఈ మేర కు కేంద్ర, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు ఉత్తర్వులు అందాయి. సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ సభ్యుడి హోదాలో దిలీప్‌రాజా రెండేళ్లు కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

వృద్దులకు ఏపీ ఆర్టీసీ రాయితీలు...

గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం వయో వృద్ధులకు ఆర్టీసీలో ప్రకటించిన రాయితీ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్టీసీలో ప్రయాణించే 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఆర్టీసీ రాయితీ అందించనున్నది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం ఆర్టీసీకి అందజేసింది. 60 ఏళ్ళు పైబడిన వయో వృద్ధులకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ కల్పిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలను అనుమతి..

విజయవాడ : ప్రకాశం బ్యారేజీపై శుక్రవారం సాయంత్రం నుండి వాహన రాకపోకలను నీటి పారుదల శాఖ అధికారులు అనుమతించారు. గత నాలుగు రోజులుగా బ్యారేజీ స్కవర్‌ గేట్ల నిర్మాణ మరమ్మతులు జరుగుతున్నందున ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర..

హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అమర్ నాథ్ కు యాత్ర ప్రారంభమయ్యింది. బల్తాల్ బేస్ క్యాంప్ నుండి భక్తులు యాత్రకు బయలుదేరారు. ఈ యాత్ర 48 రోజులపాటు కొనసాగనుంది.

07:42 - July 2, 2016

హైకోర్టును తక్షణమే విభజించాలంటూ శుక్రవారం నాడు న్యాయవాదులు ఇందిపార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. హైకోర్టు విభజన సమస్యలనేవి మా స్థాయిలో పరిష్కారమయ్యే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో గొడవ పెట్టుపెట్టుకోవటానికి తాను సిద్ధంగా లేని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర చొరవ తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాజధానికి కేంద్ర ఇచ్చింది కేవలం రూ.2,500ల కోట్లు మాత్రమేనన్నారు. రాజధానిని నిర్మాణం చేసుకుంటున్న మేము హైకోర్టును నిర్మాణం చేసుకోలేమా? అని ప్రశ్నించారు. ఈఅంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టంది. ఈ చర్చలో ధర్మశ్రీ (వైసీపీ అధికార ప్రతినిధి), శ్రీరాములు (టీడీపీ అధికార ప్రతినిధి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి ..మరింత సమాచారం తెలుసుకోండి...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 8 మంది అరెస్టు..

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 8మంది వాహనదారులు పట్టుబడ్డారు. నాలుగు ద్విచక్రవాహనాలు, 3 కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య కేసులో నిందితుడు అరెస్ట్ ...

చెన్నై : సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేరిలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసిన నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అడ్డుకున్న రామ్ కుమార్ ను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 

07:01 - July 2, 2016

హైదరాబాద్ : చేనేత కార్మికులు ఉద్యమబాట పట్టబోతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆగస్టు 7వ తేదీ వరకు సమస్యలు పరిష్కరించకపోతే.. 22న జాతీయ రహదారులను దిగ్భంధనం చేయాలని చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక నిర్ణయించింది. చేనేత కార్మికుల ఆందోళనకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.

జూన్‌ 23న మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలిలో బస్సుయాత్ర ప్రారంభం..
టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చేనేతలు ఉద్యమ శంఖారావం పూరించబోతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూన్‌ 23న మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలిలో ప్రారంభమైన చేనేత చైతన్య బస్సుయాత్ర నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లికి చేరింది. చేనేత కార్మికులకు పలు పార్టీలు, టీ-జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు.

ప్రభుత్వానికి ఆగస్టు 7 వరకు గడువు...
తమ సమస్యల పరిష్కారంపై కేసీఆర్‌ వెంటనే దృష్టి సారించాలని చేనేత సంఘాల నేతలు కోరారు. జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7న వరకు తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని.. లేకుంటే ఆగస్టు 22న జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక హెచ్చరించింది.

ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ కేటాయించలేదు: ఉత్తమ్
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని టీ-పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

చేనేత కార్మికుల సమస్యలకు సీపీఎం మద్ధతు...
చేనేత కార్మికుల సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. కష్టజీవులు, రైతులు, కార్మికుల గురించి పట్టుంచుకునే సమయం, ఓపిక ముఖ్యమంత్రికి లేకుండాపోయిందన్నారు.

ప్రభుత్వం చేనేత వృత్తిని గుర్తించాలి : కోదండరాం
చేనేత వృత్తిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేయాలని టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఆగస్టు 7న అందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భుత్వం ఇప్పటికైనా తమ సమస్యల పట్ల దృష్టి సారించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

06:55 - July 2, 2016

విజయవాడ : తనకు ఉత్తమ మిత్రుడు టెక్నాలజీయేనని సీఎం చంద్రబాబు అన్నారు. చైనా పర్యటన నుంచి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు పర్యటనలో విశేషాలను తెలిపారు. ఈ సందర్భంగా చైనా నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

స్పీడ్‌, స్కిల్‌, స్కేల్‌కు చైనా మారు పేరు : బాబు
చైనా పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటన విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు చైనా నుంచి వస్తున్నాయని తెలిపారు. అలాగే స్పీడ్‌, స్కిల్‌, స్కేల్‌కు చైనా మారు పేరని తెలిపారు.

ప్రపంచంలోని వేగవంతమైన 60శాతం రైళ్లు చైనాలోనే : బాబు
నీతి, నిజాయితీగా ఏపీలో ఉన్న పారిశ్రామికవేత్తలను ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లలో 60శాతం చైనాలోనే ఉన్నాయని సీఎం తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ఆన్‌స్టీల్‌ సంస్థ, లిబ్రా గ్రూప్‌ నౌకాయానం, ఆతిథ్య రంగంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

తెలంగాణతో గొడవకు నేను సిద్ధంగా లేను : చంద్రబాబు
అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో గొడవ పడేందుకు తాను సిద్ధంగా లేనని చంద్రబాబు అన్నారు. విభజన సమస్యలు చర్చల ద్వారానే సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కాకుంటే కేంద్ర పెద్దల వద్ద కూర్చుందామన్న విధానానికి తాను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

హైకోర్టు, ఏపీ భవన్‌ అంశాలపై వివాదం చేయ్యొద్దు: సీఎం
హైకోర్టు, ఏపీ భవన్‌.. ఇలా ప్రతి అంశాన్నీ వివాదం చేయడం తెలంగాణకు సరికాదని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తమకూ నష్టమేనని కేంద్రం గ్రహించాలని సూచించారు.

06:49 - July 2, 2016

హైదరాబాద్ : ఉద్యోగుల విభజనాంశం కొలిక్కి వస్తోంది. రెండురోజుల పాటు ఇరు రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయిన కమలనాథన్‌ కమిటి.. విభజనలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించింది. ఎలాంటి స్పష్టత లేని కీలకమైన ఆరుశాఖల విభజనపై..కమిటీ సీరియస్‌గా దృష్టిసారించింది. కేటాయింపులపై అభ్యంతరాలుంటే..ఉద్యోగులు నేరుగా కేంద్రానికి లేఖ రాసి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఉద్యోగుల విభజనను పూర్తిచేయాలని కమలనాథన్‌ రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండేళ్లు పూర్తయినా..ఉద్యోగుల విభ‌జ‌న మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఏపీకి ఉద్యోగుల త‌ర‌లింపు జ‌రుగుతున్న ప్రస్తుత ప‌రిస్థితుల్లో క‌మ‌ల నాధన్ క‌మిటీ రెండు రోజుల పాటు స‌మావేశ‌మ‌యింది. రెండు రాష్ట్రాల సీఎస్‌ల‌తో విస్త్రృతంగా చర్చలు జ‌రిపింది. ఇప్పటి వ‌ర‌కు 153 శాఖ‌ల‌కు సంబంధించి 57,213 మంది ఉద్యోగుల‌ విభ‌జ‌నపై క‌మ‌ల్ నాధ‌న్ క‌మిటీ క‌స‌ర‌త్తు చేసింది. అయితే ఇంకా ఆరు శాఖల్లోని ఉద్యోగుల విష‌యంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఆరు శాఖల్లో మొత్తం 16వేల మంది ఉద్యోగులున్నారు. దీంతో పూర్తిస్థాయి నివేదిక తయారు చేయడానికి ఆలస్యమవుతోంది. అయితే మ‌రో రెండు నెలల్లో ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని కమలనాథన్‌ కమిటీ కృత నిశ్చయంతో ఉంది.

కీలకంగా మారిన 16 వేల‌కుపైగా ఉద్యోగుల విభజన...
అయితే డీజీపీ, మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్, ఇండియన్ మెడిసిన్, ఎస్పీఎఫ్, ఈఎన్‌సీ ప‌బ్లిక్ హెల్త్ శాఖ‌ల్లో ఉన్న 16 వేల‌కుపైగా ఉద్యోగుల విభజన అత్యంత కీలకంగా మారింది. వీరిలో కొంత మంది ఆప్షన్ల విష‌యంలో కొన్ని ఇబ్బందులు చెప్తున్నారు. వీటిపై క‌మ‌ల్ నాధ‌న్ క‌మిటీ ఇప్పటికే అధ్యయనం పూర్తిచేసింది. వైద్య విద్యలో సుమారు 2,900 పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరి విభ‌జ‌న‌తో పాటు ఎస్సీఎఫ్‌లో 4,743మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే వైద్యశాఖ‌లోని 6వేల మంది ఉద్యోగుల విష‌యంలో విభ‌జన చేయాల్సి ఉంది.

ఉద్యోగుల కేటాయింపులపై స్పష్టతకు రానున్న కమిటీ ...
ఉద్యోగుల విభ‌జ‌న త‌ర్వాత వారికి వ్యక్తిగతంగా ఏవైనా స‌మ‌స్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వివరణ తీసుకోవచ్చని కమలనాథన్‌ కమిటీ స్పష్టం చేస్తోంది. ఆగ‌స్టు 31లోపు ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలనే సంకల్పంతో కమిటీ ఉన్నట్లు సమాచారం. ఆ త‌ర్వాత పూర్తినివేదికను కేంద్రానికి పంపించి ఉద్యోగుల కేటాయింపులపై కమిటీ స్పష్టత ఇవ్వనుంది. 

06:42 - July 2, 2016

హైదరాబాద్ : హరితహరం విజయవంతం కోసం తెలంగాణ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో గ్రీనరీ పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. హరితహారంపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన సీఎం... ప్రాజెక్ట్ విజయవంతం కోసం తగు సూచనలు చేశారు.

23 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంపు..
తెలంగాణలో 23 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలని నిర్దేశించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... హరితహారం విజయవంతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈనెల 8 నుంచి హరితహారం...
రెండో విడత హరిత హరం కార్యక్రమం ఈ నెల 8న ప్రారంభమై రెండు వారాల పాటు కొనసాగనుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ముఖ్యమంత్రి వరకు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు, అన్ని స్థాయిల వారు.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ రూపంలో చేపట్టాలని కేసిఆర్ పిలుపు నిచ్చారు. ఈ యేడాది 46 కోట్ల మొక్కలు నాటి చరిత్ర సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 4న మరోమారు సమావేశం నిర్వహించి ప్రణాళికపై చర్చించనున్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటి పారుదల, ఆర్ ఎండ్ బి శాఖల మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు.

సెంటిమెంట్ ఉన్నవారికి తగ్గట్టుగా మొక్కల పంపిణీకి ఆదేశం...
ఇదిలా ఉంటే సెంటిమెంట్‌గా జన్మ నక్షత్రం, రాశిని బట్టి ఎవరు ఏ మొక్కను నాటడం మంచిదనే విషయంలో సీఎంకు ప్రతిపాదనలు రావడంతో... అందుకు తగ్గట్లుగా ఎర్రచందనం, పనస, మామిడి, రావి, జమ్మి, మర్రి మోదుగ వంటి మొక్కలను సరఫరా చేయాలని సియం ఆటవీ శాఖ అదికారులను ఆదేశించారు

యాక్టివ్‌గా పాల్గొన్న వారికి ప్రోత్సాహకాలు ...
హరిత హరం కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖలను గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు కేసిఆర్. ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉన్న పారిశ్రామిక వాడల్లో విరివిగా మొక్కలు నాటేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద గత ఏడాది అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకొని ఈసారి హరితహరం సక్సెస్ అయ్యేందుకు కేసీఆర్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

06:37 - July 2, 2016

బంగ్లాదేశ్‌ : రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్‌ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్‌ బేకరీలోకి శుక్రవారం రాత్రి దాదాపు 9 మంది దుండగులు చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. ఇటలీ, జపాన్‌ దేశస్థులు సహా కనీసం 60 మందిని బందీలుగా తీసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో సుమారు 20 మంది విదేశీయులు.. పోలీసులు, భద్రతా సిబ్బంది ఈ రెస్టారెంట్‌ను చుట్టుముట్టారు. ఉగ్రవాదులు అడపాదడపా కాల్పులు జరపడంతోపాటు ప్రతిఘటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా అదనపు పోలీసు కమిషనర్‌ సహా దాదాపు 30 మంది గాయపడ్డారు.

దుండగులతో చర్చలు జరిపేందుకు అధికారుల ప్రయత్నాలు...
ఢాకాలో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. రెస్టారెంట్‌లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడమే తమ ముందున్న మొదటి లక్ష్యమని వివరించారు. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి ఒకరు తప్పించుకొని బయటపడ్డాడు. రాత్రి 8.45 గంటల సమయంలో పలువురు సాయుధులు చొరబడి, ప్రధాన షెఫ్‌ను బందీగా తీసుకున్నట్లు అతడు చెప్పాడు. నాటు బాంబులు కూడా పేల్చారని, దీంతో అందరూ భయాందోళనల్లో మునిగిపోయారని తెలిపాడు. గుల్షన్‌ ప్రాంతంలో పలు దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి.
దాడికి కారణమంటూ ప్రకటించిన ఇస్లామిక్‌ స్టేట్‌, ఇటు అల్‌ఖైదా..
ఢాకాలో జరిగిన తాజా దాడి తమ పనేనంటూ అటు ఇస్లామిక్‌ స్టేట్‌, ఇటు అల్‌ఖైదా స్థానిక విభాగం వేరువేరుగా ప్రకటించుకున్నాయి. కాగా భారత హైకమిషన్‌ సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ఢిల్లీలో తెలిపారు. ఢాకాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు సైతం బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలిపాయి. బంగ్లాదేశ్‌కు అండగా ఉంటామని హామీనిచ్చాయి.

బందీలుగా 20మంది విదేశీయులు ...
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు రెచ్చి పోయారు. బేకరీలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి 60 మందిని బందీలుగా చెరబట్టారు. వీరిలో 20 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు విదేశీ దౌత్యవేత్తలను సైతం ఉగ్రవాదులు కాల్చి చంపారు. 

ఢాకాలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు..

బంగ్లాదేశ్‌ : రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్‌ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్‌ బేకరీలోకి శుక్రవారం రాత్రి దాదాపు 9 మంది దుండగులు చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. ఇటలీ, జపాన్‌ దేశస్థులు సహా కనీసం 60 మందిని బందీలుగా తీసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీరిలో సుమారు 20 మంది విదేశీయులు.. పోలీసులు, భద్రతా సిబ్బంది ఈ రెస్టారెంట్‌ను చుట్టుముట్టారు. ఉగ్రవాదులు అడపాదడపా కాల్పులు జరపడంతోపాటు ప్రతిఘటిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Don't Miss