Activities calendar

04 July 2016

ఎపిలో 20 మంది వైద్యులపై ప్రభుత్వం ఆగ్రహం

హైదరాబాద్ : ఎపిలో 20 మంది వైద్యులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల్లో అలసత్వం వహిస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ నడుపుతున్న 20 మంది వైద్యులకు మూడేళ్లపాటు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

21:59 - July 4, 2016

చెన్నై : కొండముచ్చులా ఉన్నావంది...రూపం చూసుకోమంటూ హేళన చేసింది...అప్పటివరకు ప్రేమను పెంచుకున్న రాంకుమార్‌ ఆమెపై కక్షను పెంచుకున్నాడు..అటో ఇటో తేల్చేయాలనుకున్న రాంకుమార్‌ పక్కా ప్లాన్‌తోనే వెళ్లాడు... టెక్కీ స్వాతిని అంతం చేశాడు.. పోలీసుల విచారణలో.. న్యాయమూర్తి తీసుకున్న వాంగ్మూలంలో అనేక విషయాలు చెప్పాడు...
ప్రేమను నిరాకరించింది...
ప్రేమించాను...ఇష్టపడ్డాను ..కాని ఆమె మాత్రం నిరాకరించింది...ఆమెతోనే జీవితమని ఎన్నో కలలు కన్నాను..ప్రతీ రోజూ ఆమెను నీడలా వెంటాడుతూ గమనించేవాడిని... రోజూ చూస్తూ ఉండిపోయేవాడిని..నాలోని ప్రేమను చెప్పా...నిరాకరించింది..అయినా వెంటపడ్డా... తిరస్కరించింది.. చివరకు కొండముచ్చులా ఉన్నావంటూ హేళన చేసింది...అందంగా లేవంటూ ఆమె అన్న మాటలు గుచ్చుకున్నాయి...నాలోని రాక్షసుడు నిద్రలేచాడు...నేను నేనుగా లేను...ఆమెను చంపాలనుకున్నాను..అదే పనిచేశాను...ఈ మాటలు అన్నది ఎవరో కాదు... రాంకుమార్.. తమిళనాట సంచలనం రేపిన టెక్కీ స్వాతి దారుణహత్యలో నిందితుడు రాంకుమార్... తనను హేళన చేయడం వల్లే చంపేశానంటూ చెబుతున్న రాంకుమార్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కన్పించలేదు... హత్య చేసి జైలుకు వెళ్తున్నందుకు ఎలాంటి భయం కన్పించడం లేదు.. ఉన్మాదిగా మారిన రాంకుమార్‌ ఓ అమాయకురాలి నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు..అదే సమయంలో తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు....
టెక్కీ స్వాతి హత్యలో పోలీసుల స్పీడ్..
తమిళనాట సంచలనం సృష్టించిన టెక్కీ స్వాతి హత్యోదంతంలో విచారణ వేగవంతమైంది...ఇప్పటికే నిందితుడిని పట్టుకోగలిగిన పోలీసులు హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు....పోలీసులు పట్టుకోగానే గొంతు కోసుకున్న నిందితుడు రాంకుమార్‌ను తిరున్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే... రాంకుమార్‌ పరిస్థితి మెరుగు పడడంతో అంబులెన్స్‌లో చెన్నయ్‌లోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..చికిత్సానంతరం నిందితుడు రామ్‌కుమార్‌ వాంగ్మూలాన్ని 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి గోపినాథ్‌ ఆసుపత్రికి వెళ్లి అక్కడనే తీసుకున్నారు...ఈ నెల 18 వరకు నిందితుడు రాంకుమార్‌ను జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంచాలంటూ కోర్టు ఆదేశించింది..

 

21:56 - July 4, 2016

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను సిబిఐ అరెస్ట్‌ చేసింది. కంప్యూటర్ల కొనుగోళ్లలో 50 కోట్ల స్కాం జరిగిందన్న ఆరోపణలతో సిబిఐ ఆయనను అరెస్ట్‌ చేసింది. రాజేంద్ర కుమార్‌తో పాటు డిప్యూటి కార్యదర్శి తరుణ్‌ శర్మ, సందీప్‌ కుమార్, దినేష్‌ కుమార్, అశోక్‌ కుమార్‌లను కూడా సిబిఐ అరెస్ట్‌ చేసింది. ఈ స్కాంలో రాజేంద్ర కుమార్‌ కింగ్‌పిన్‌లా వ్యవహరించారని సిబిఐ చెబుతోంది. 2006లో రాజేంద్ర కుమార్ తన సమీప బంధువుల పేరిట ఫేక్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను సృష్టించి లాభం చేకూర్చారని సిబిఐ  ఆరోపణ. రాజేంద్ర కుమార్‌ అరెస్ట్‌తో కేంద్రం నిజస్వరూపం బయటపడిందని డిప్యూటి సిఎం మనీష్‌ సిసోడియా అన్నారు. సమర్థులైన అధికారులను తొలగించడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

 

21:53 - July 4, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర ముగిసింది. నాలుగు రోజుల పర్యటనలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని పాదయాత్ర ముంపు గ్రామాల ప్రజల్లో భరోసా నింపింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. భూములు వదులుకునే ప్రసక్తే లేదని నిర్ణయానికి గ్రామస్తులు వచ్చారు. 
తమ్మినేని పాదయాత్ర 
మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలంటూ కోరుతూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర ముగిసింది. నాలుగు రోజుల పాటు చేసిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. పాదయాత్రలో భారీగా నిర్వాసితులు పాల్గొని జయప్రదం చేశారు. పాదయాత్ర ముగింపు సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. 
భూ నిర్వాసితులను మోసం చేసిన ప్రభుత్వం తమ్మినేని
ప్రభుత్వం భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా మోసం చేస్తుందని తమ్మినేని అన్నారు. జీవో 123 ద్వారానే ఎక్కువ పరిహారం అందుతుందని పాలకులు మాయమాటలు చెబుతున్నారన్నారు. 2013 చట్టం కంటే.. జీవో 123 మేలు అని పాలకులు నిరూపించగలరా ? అని తమ్మినేని ప్రశ్నించారు. ఇక ఈ పోరాటంలో 14 గ్రామాల ప్రజలు ఐక్యంగా ముందుకుపోతే తప్పకుండా విజయం సాధిస్తామన్నారు.
నిపుణుల మాటలు పట్టించుకోని ప్రభుత్వం : జస్టిస్ చంద్రకుమార్
మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం అవసరమే లేదని నిపుణులు చెబుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. 
అది అభివృద్ధే కాదు : హరగోపాల్ 
గ్రామాలను ముంచుతూ చేసే అభివృద్ధి.. అభివృద్ధే కాదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మొత్తానికి తమ్మినేని పాదయాత్ర ముంపు గ్రామాల ప్రజల్లో భరోసా కలిగించింది. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా భూములను వదిలే ప్రసక్తే లేదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. 

 

21:46 - July 4, 2016

హైదరాబాద్ : ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకాలు అందించడం మంచిదికాదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సమాఖ్య సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. కష్టపడి సంపాదించుకుని అన్నం తింటే ఉండే సంతృప్తి ఉచిత భోజనంతో ఉండదన్నారు. చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం, ఉపాధి లభించినప్పుడు ఉచిత పథకాలను ఆస్కారం ఉండదన్నారు. విద్యార్థి దశలోనే యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

 

21:43 - July 4, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫిక్కీ జాతీయ స్థాయి సదస్సుకు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్‌, పెట్టుబడుల విషయంలో రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పరిశ్రమలు వచ్చాయన్నారు.

 

21:39 - July 4, 2016

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పై ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించారు. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. చెల్లించని పక్షంలో తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యాలు తెలిపారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాలని గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. 

 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొనసాగనున్న ఆరోగ్యశ్రీ సేవలు...

హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. సమ్మె విరమించినట్లు ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు తెలిపారు. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. చెల్లించని పక్షంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడిస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించనున్నట్లు తెలిపారు.

21:02 - July 4, 2016

టెర్రర్ టైమ్... ! ఢాకా దద్దరిల్లింది... సౌదీ ప్రమాదంలో పడింది... ప్రపంచ నలుమూలలా ఉగ్రభూతం విధ్వంసం సృష్టిస్తోంది.. కబళించటానికి వేయి కోరలతో ముంచుకొస్తుంది. ఈ విధ్వంసానికి మూలాలెక్కడ...? ఏ నరకమేధానికి ఎవరు ఆజ్యం పోస్తున్నారు..? ఏ ఉగ్రవాదం వెనుక ఏ అగ్రవాదం ఉంది..? పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:56 - July 4, 2016

 రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. రైల్వే ఉద్యోగులు.. సమ్మె... అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎస్ సీఆర్ ఎంయూ డివిజన్ సెక్రటరీ శివకుమార్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె యథాతథంగా జరుగుతుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..   

20:48 - July 4, 2016

యాదాద్రి పవర్ ప్లాంటుకు బొంద పూజ.. ఖేల్ కతం జేస్తున్నరని మీడియా భాజా, ఏమో అంటవు... నాగం జనార్ధన్ రెడ్డి సారూ, నేదునూరు ప్రాజెక్టుకు పాతర.. అధికారం మారినోళ్లదే ఈ జాతర, మంత్రం లేని సంధ్యకు మరచెంబు నీళ్లు... మాటిచ్చిమరిచిపోయిన బీజేపీవోళ్లు... చిక్కటిపాలని విషం తాగుతున్నరూ.. యూరియతోని దందావెట్టిన దళారి, గురు రావణ, గురు కుంభకర్ణ... మందుకు పత్తం...  మాటకు సత్తం... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:33 - July 4, 2016

శ్రీకాకుళం : ఆ బడిని చూస్తే చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు వణికిపోతున్నారు. ఆ బడి భవనం ఎప్పుడు కూలి మీద పడుతుందోనన్న భయంతో చదువుకునేందుకు పాఠశాలకు రావటానికే జంకుతున్నారు ...శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలల భవనాల చూసి పిల్లలను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు సైతం భయపడుతున్న పరిస్ధితి ......ఇదీ శ్రీకాకుళం జిల్లాలో పూర్ణబద్ర ప్రభుత్వ పాఠశాల దుస్థితి...
శిధిలావస్థకు చేరిన పాఠశాల భవనం
శ్రీకాకుళం జిల్లా పలసా మండలంలోని పూర్ణబద్ర గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాల...స్కూల్ లోని భవనాలు చూస్తే దాదాపుగా అన్ని శిథిలాస్థకు చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఆ భవనాలలోనే పాఠాలు బోధిస్తున్నారు...దీంతో ఎప్పుడూ శిథివాస్థకు చేరిన భవనాల పై కప్పులు కూలి పడతాయోనన్న భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ విద్యనభ్యసిస్తున్నారు...గతంలో గచ్చులు పూర్తిగా పగిలి, గోడలు బీటలు వాలి...పై కప్పులు పెచ్చులు ఊడి విద్యార్థుల మీద కూడా పడుతున్నాయి...దీంతో పిల్లలలను బడికి పంపడానికి  తల్లిదండ్రులు సైతం భయపడుతున్నారు..
విద్యార్ధులు ఆదేవన 
గడిచిన నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్ధితి ఉన్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విద్యార్ధులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలు క్రితం బడికి వచ్చిన ప్రదానోపాధ్యాయుడు వెంకటేశ్వర పట్నాయక్ పాఠశాల పరిస్ధితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు... ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్ధులను సైతం ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకోచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో నెలకోన్న మౌళిక సదుపాయాల పరిస్థితులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై మాత్రం దృష్టిసారించటం లేదు..సామాన్య ప్రజలకు అక్కరకు రాని పథకాల కోసం వేల కోట్లరూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వాలు...భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలలను మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
పిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు వెనకడుగు 
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్ధులను బడికి పంపాలంటే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. అధిక ఫీజులు ఉన్నప్పటికి ప్రైవేటు పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. తప్పా సర్కార్ బడుల వైపు పంపే సాహాసం చేయ్యడంలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిధిలావస్థలో ఉన్న పాఠశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

20:22 - July 4, 2016

శ్రీకాకుళం : మొన్న బారీష్‌ మంత్ర పేరుతో లైఫ్‌స్టైల్ యజమానికి కుచ్చుటోపీ పెట్టారు. పురాతన నాణెంతో పూజలు చేస్తే నోట్ల కట్టల వర్షం కురుస్తుందని బురిడీ కొట్టించారు. కోటీన్నర దోచుకున్న శివబాబా చివరకు దొరికిపోయాడు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు కేటుగాళ్లు ఇదే తరహాలో అమాయక జనానికి శఠ గోపం పెట్టారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ నాణెం పేరు చెప్పి లక్షలు దండుకున్నారు. కానీ పోలీసుల డేగ కళ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.  
రాత మారిపోతుందని కోతలు.. 
50 లక్షలుంటే చాలు మీ ఇంట్లో నోట్ల కట్టల వర్షం కురుస్తుంది. 50 లక్షల అని నోరు వెళ్లబెట్టకండి. కోట్లు వస్తుంటే లక్షలు ఒక లెక్కా. ఇదే ఆలోచన మోసగాళ్లకు జాక్ పాట్‌లా మారింది. ఈ ఉచ్చులో పడ్డవారిని మాత్రం బికారులను చేస్తోంది. 
ఈస్ట్‌ఇండియా కంపెనీ నాణెంకు గిరాకీ ఉందంటూ ప్రచారం.. 
ఈస్ట్‌ఇండియా కంపెనీకి చెందిన అతిపురాతన కాయిన్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని కేటుగాళ్లు ప్రచారం చేస్తారు. ఇది ఎంతో మహత్యం కలిగిన నాణెం అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఉంటే కనకంతో పాటు నోట్ల కట్టల వర్షం కురుస్తుందని కోతలు కోస్తారు. మధ్యలో తెల్లకాగితాలు పైన కింద అసలు నోట్లు ఉన్న కట్టలు చూపించి బుట్టలో పడేస్తారు. ఈ అవకాశం మిస్సయితే కోట్లు చేజారిపోతాయని భయం కల్పిస్తారు. ఇది కొన్నవారు ఇప్పటికే కోటిశ్వరులు అయ్యారని నమ్మబలుకుతారు. 
50 లక్షలు వసూలు.. 
విజయనగరానికి చెందిన దేవుడు బాబు విశాఖ పట్టణానికి చెందిన సురేష్, ప్రసాదరావు, రమేష్‌లు ముఠాగా ఏర్పడ్డారు. గతనెల 27న విశాఖకు చెందిన శ్రీనివాసరావును బురిడీ కొట్టించారు. వీరి మాయలో పడ్డ అతడు 50 లక్షలు ముట్టజెప్పాడు. అయితే కేటుగాళ్లు చెప్పినట్లుగా ఏ అద్భుతం జరగకపోవడంతో.. అనుమానంతో వచ్చిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి  47 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు, 1 ల్యాప్ ట్యాప్, నోట్లు లెక్కించే మెషిన్, డమ్మిగన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావు నుంచి తీసుకున్న డబ్బుతో జల్సాలు చేశారు..సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు మారుస్తూ తప్పించుకు తిరిగిన ఈ బురిడీ బ్యాచ్‌ పోలీసులకు  అడ్డంగా దొరికిపోయారు. పరారీలో ఉన్న గిరిజనుల కోసం గాలింపు ముమ్మ చేశారు. 
మోసగాళ్ల వలలో అత్యాశపరులు
అత్యాశపరులు, మూఢనమ్మకాలు ఉన్నవారు ఇటువంటి మోసగాళ్ల వలలో సులువుగా పడుతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకోవడమే కాదు చివరికి కటకటాల పాలవుతున్నారు. మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న వారు మళ్లీ కొత్త అవతారం ఎత్తుతున్నారు. మోసంలో కిటుకు తెలియడంతో వారు మరికొందరిని మోసం చేయడానికి బయల్దేరుతున్నారు.

 

20:14 - July 4, 2016

విజయవాడ : ఆలయాల కూల్చివేతను నిరసిస్తూ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీ గోకరాజు గంగారాజుతో పాటు బీజేపీ నేతలు, వివిధ మఠాల పీఠాధిపతులు హాజరయ్యారు. గోశాల, శనైశ్చరస్వామి ఆలయాలను తిరిగి పునర్నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు.  అయితే.. ఆలయాల కూల్చివేతకు కారణమైన ఎంపీ కేశినేని నాని వెంటనే క్షమాపణ చెప్పాలని బహిరంగ సభలో పలువురు ఆందోళన చేపట్టారు.

 

20:12 - July 4, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులను ఈనెలాఖరు కల్లా పూర్తి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విజయవాడలో నిర్మాణంలో ఉన్న పుష్కర ఘాట్ల పనులను చంద్రబాబు పరిశీలించి, అధికారులు, కాంట్రాక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా చూశారు. కొండపై వాటర్‌ ఫౌంటెన్‌ బాగుందని ప్రశంసించారు. ఆ తర్వాత మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో కంట్రోల్‌ రూమును పరిశీలించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. కృష్ణా - గోదావరి నదులు సంగం స్థానం ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

19:57 - July 4, 2016

హైదరాబాద్ : ఏపీలో స్థానికతపై ముసాయిదా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ప్రతి సీఎం పరిశీలనలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. తెలంగాణ నుంచి తరలి వచ్చే ఇతర రంగాల వారికీ స్థానికత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. స్థానికత కల్పించే బాధ్యతను స్థానిక తహశీల్దార్లకు అప్పగించనున్నట్లు భోగట్టా. 
ఏపీకి వచ్చే అందరికీ స్థానికత
తెలంగాణ నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత అంశంపై రూపొందించిన మార్గదర్శకాలకు తుది కసరత్తు జరుగుతోంది. విభజన అనంతరం ఏపీకి వెళ్ళేవారికి స్ధానికత కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించారు. దీంతో అధికారులు మార్గదర్శకాలనూ సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారు కోరుకున్న ప్రాంతంలోనే స్థానికత ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. 
అన్ని రంగాల వారికీ స్థానికత 
తెలంగాణలోని పది జిల్లాల్లో నివసిస్తూ ఏపీకి శాశ్వతంగా తరలి వచ్చేవారికి మాత్రమే స్థానికత వర్తించనుంది.  కేవలం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే స్ధానికతను పరిమితం చేయకుండా, ఇతర రంగాల వారికీ వర్తింపచేయనున్నారు. దీంతో ప్రయివేటు సంస్థల్లో పనిచేసే వారు, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డవారు, ఇతర కార్మికులు కూడా ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 
జోనల్‌ స్థానికత ఇచ్చేందుకు కూడా ప్రతిపాదన
ఇక తెలంగాణ నుంచి ఏపికి తరలివెళ్లే వారికి జిల్లాల ఆధారంగా జిల్లా, జోనల్‌ స్థానికతపై కూడా స్పష్టత ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఉద్యోగి, లేదా ప్రయివేటు రంగానికి చెందిన వారు ఏ జిల్లాకు వెళ్తే వారికి ఆ జిల్లాలోనే స్థానికత కల్పించడం.. ఆ ప్రాంతానికి చెందిన జోనల్‌ స్థానికత ఇవ్వడంపైనా ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చింది. 
స్థానికత ధ్రువీకరణ జారీలో తహశీల్దార్లకు అధికారం 
ఏపికి తరలివెళ్లిన వారు తమకు నచ్చిన జిల్లాల్లోని ప్రాంతాల్లో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. ఆయా ప్రాంతాల్లోని తహశీల్దార్లకు దరఖాస్తులను సమర్పిస్తే.. వారు పరిశీలించి స్థానికత ధృవీకరణ పత్రాలను అందించనున్నారు. కేవలం విద్యా సంబంధిత సంస్ధల్లోనే కాకుండా,  ఉద్యోగాల్లో సైతం స్థానికత కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించారు. 

 

ఎరువుల ధరలను తగ్గించిన కేంద్రం

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించింది. టన్ను డీఎపీపై రూ.2.500 తగ్గింపు, టన్ను ఎంవోపీపై రూ.500 తగ్గింపు, 50 కిలోల ఎంవోసపీ బస్తాపై రూ.250లకు తగ్గించారు. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్..

జమ్మూకాశ్మీర్ : అంద్వాడలో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతన్నాయి.

గవర్నర్ ను కలిసిన తెలంగాణ బిజెపి నేతలు

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు కలిశారు. ఉగ్రవాదులకు న్యాయసాయం చేస్తామన్న ఓవైసీ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఓవైసీ వ్యాఖ్యలు దేశ భద్రతకే ముప్పని హెచ్చరించారు. మిత్రపక్షం ఓవైసీ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. 

 

కేజ్రీవాల్ సీఎస్ రాజేంద్రకుమార్ అరెస్టు

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ ను సీబీఐ అరెస్టు చేసింది. రాజేంద్రకుమార్ తో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారని తెలిపారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసింది. రూ.50 కోట్ల స్కాంలో రాజేంద్రకుమార్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 

ఆలయాలను కూల్చివేత మతపరమైన సమస్య : పార్థసారధి

విజయవాడ : ఆలయాలను కూల్చడం మతపరమైన సమస్య అని.. ఇది రెండు పార్టీల సమస్య కాదని వైసీపీ నేత పార్థసారధి అన్నారు. ఎంపీ కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఆలయాలు, మసీదులు కోల్పోయి ప్రజలు బాధలోఉన్నారని తెలిపారు. ఓ నాయకుడి ఆస్తి కాపాడటం కోసం ఆలయాలను కూల్చివేయడం సరికాదన్నారు. 

చంద్రబాబుతో శివస్వామి, విద్యాధరరావు భేటీ

విజయవాడ : తొలగించిన హిందూ ఆలయాల వ్యవహారంపై చంద్రబాబుతో శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, విశ్వహిందూ పరిరక్షణ వేదిక న్యాయకులు విద్యాధరరావులు హాజరయ్యారు. 

 

19:21 - July 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రం ఉద్యోగాలను పొందిందని రాష్ట్రమంతా నిరుద్యోగంలో మగ్గుతోందని ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య మండిపడ్డారు. హైద్రాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద డీఎస్‌సీ అభ్యర్ధులు చేపట్టిన మహాధర్నాలో ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేవలం ఉపన్యాసాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్న కేసీఆర్ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసారని విరుచుకుపడ్డారు. 

 

19:17 - July 4, 2016

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రాజెక్టు నిర్వాహిత గ్రామాల్లో తమ్మినేని చేపట్టిన పాదయాత్ర ఇవాళ ముగిసింది. చివరిరోజు ఏటిగట్టు కిష్టాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు జస్టిస్ చంద్రకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ప్రజల కోరిక ప్రకారమే ప్రభుత్వం భూసేకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వీడి.. వారి అభ్యంతరాల పరిష్కారానికి కృషిచేయాలని తమ్మినేని సూచించారు. 

19:11 - July 4, 2016

హైదరాబాద్ : ఈ నెల 8 నుంచి ఏపీ వ్యాప్తంగా గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. రెండేళ్ల టీడీపీ పాలన వైఫల్యాలను అన్ని గ్రామాల్లోని ప్రతీ గడపకు వివరించేలా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రంలో టీడీపీ రెండేళ్ల పాలనలో జరిగిన అవినీతి చిట్టాలను పొందుపరచామని తెలిపారు. 

18:59 - July 4, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో కాషాయీకరణ చొచ్చించే ప్రయత్నం చేస్తుందని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహం కేసులు పెడుతుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులు బాధాకరమన్నారు. అమెరికా వల్ల మన దేశానికి ఎప్పటికైనా ముప్పేనన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రవాదుల దాడులను పెంచి పోషించేది అమెరికానే అని నారాయణ ఆరోపించారు.  

18:51 - July 4, 2016

కర్నూలు : ఆరోగ్యానికి హాని కలిగించే నానో కెమికల్‌ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద బలపనూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆరోగ్యానికి హాని కలిగించే నానో కెమికల్‌ ఫ్యాక్టరీని తమ గ్రామంలో నిర్మించవద్దని డిమాండ్‌ చేశారు. బలపనూరు గ్రామస్తులకు బైరెడ్డి మద్దతు తెలిపారు. రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బైరెడ్డి తెలిపారు.
 

18:44 - July 4, 2016

కృష్ణా : విజయవాడ నగర అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా సహించేది లేదని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురంలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను ఎంపీలు కేశినేని, కొనకళ్ల నారాయణలు ప్రారంభించారు. ఈ సంద్భంగా నాని మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునేందుకు గుళ్లు గోపురాల పేరిట రాజకీయం చేస్తున్నాయని కేశినేని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునేందుకు అనవసర ఆందోళనలు చేస్తున్నాయన్నారు. 
 

18:38 - July 4, 2016

హైదరాబాద్ : హైకోర్టు విభజన, ఇతర సమస్యలపై.. తెలంగాణ న్యాయవాదులు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సస్పెన్షన్‌ చేసిన న్యాయాధికారులు, ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. అయితే ఆందోళనలు విరమించాలని గవర్నర్‌ కోరారని న్యాయవాదులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అడ్వకేట్స్‌ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 

 

ఆదిలాబాద్ లో విషాదం...

ఆదిలాబాద్ : జిల్లాలోని దండేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దండేపల్లి ఎంపీపీ కుమారుడు 11 ఏళ్ల రిషీ.. ఉయ్యాల ఊగుతుండగా తాడు మెడకు చుట్టుకుంది. అపస్మారక స్థితికి చేరుకున్న రుషిని... కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

హరితహారంపై తెలంగాణ సీఎస్ రాజీవ్‌ శర్మ రివ్యూ

హైదరాబాద్ : హరితహారంపై తెలంగాణ సీఎస్ రాజీవ్‌ శర్మ.. సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, పోచారం, తుమ్మలతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 8 నుంచి 2వారాల పాటు హరితహారం పెద్దఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 

 

18:30 - July 4, 2016

ఆదిలాబాద్ : సరదాగా ఉల్లాసం, ఉత్సాహం కోసం పిల్లలు ఊయల ఊగుతారు. కానీ ఆ ఉయ్యాలే ఓ బాలుడి పాలిట యమపాశం అయింది. ఉల్లాసం ఇచ్చే ఊయల ప్రాణాలు తీసింది. ఆ బాలునికి మృత్యువు ఊయల రూపంలో దాపురించింది. ఆప్పటివరకు నవ్వుతూ గడిపిన బాలుడు.. ఊయల తాడు గొంతుకు చుట్టుకోవడంతో ప్రాణాలు ఒదిలాడు. జిల్లాలోని దండేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దండేపల్లి ఎంపీపీ కుమారుడు 11 ఏళ్ల రిషీ.. ఉయ్యాల ఊగుతుండగా తాడు మెడకు చుట్టుకుంది. అపస్మారక స్థితికి చేరుకున్న రుషిని... కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి రోధనలు మిన్నంటాయి. 

18:20 - July 4, 2016

హైదరాబాద్ : హరితహారంపై తెలంగాణ సీఎస్ రాజీవ్‌ శర్మ.. సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 8 నుంచి 2వారాల పాటు హరితహారం పెద్దఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 

18:07 - July 4, 2016

కర్నూలు : టీడీపీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. జిల్లాలోని నంద్యాలలో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. శోభా సర్కిల్‌ వద్ద వాహనానికి అడ్డువచ్చారని తండ్రి కొడుకులను టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. నడిరోడ్డుపై ఈ ఘటన జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.

కేబినెట్లో చోటు కోసం ఆశావహుల విన్నపాలు

ఢిల్లీ : అమిత్‌షా ఇంట్లో ఆశావహుల మంతనాలు జోరుగా సాగుతున్నాయి. రేపటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో చోటు కోసం... అనుప్రియ పాటిల్, ఎస్ఎస్ అహ్లువాలియా, ఎంజే అక్బర్, విజయ్ గోయల్, పురుషోత్తమ్ రుపాల... అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈసారి ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల ఎంపీలకు.. రేపు అధిక ప్రాధాన్యం దక్కనుంది. 

 

18:00 - July 4, 2016

ఢిల్లీ : అమిత్‌షా ఇంట్లో ఆశావహుల మంతనాలు జోరుగా సాగుతున్నాయి. రేపటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో చోటు కోసం... అనుప్రియ పాటిల్, ఎస్ఎస్ అహ్లువాలియా, ఎంజే అక్బర్, విజయ్ గోయల్, పురుషోత్తమ్ రుపాల... అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈసారి ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల ఎంపీలకు.. రేపు అధిక ప్రాధాన్యం దక్కనుంది. 

 

17:57 - July 4, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ఆరోపించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నూతన సచివాలయం, ఐఏఎస్‌ అధికారులకు కొత్త క్వార్టర్ల పేర వేల కోట్లు వెచ్చిస్తుందే తప్ప.. పేదల ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి.. ఆరోగ్యశ్రీ సేవలు త్వరగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు. 

 

17:54 - July 4, 2016

హైదరాబాద్ : తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సీడ్ కంపెనీల కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీడ్ ఉత్పత్తికి రైతులను ప్రభుత్వం ప్రోత్సహించేందుకు సిద్దంగా ఉందని అన్నారు.  తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా సీడ్ ను ఎగుమతి చేసే స్ధాయికి చేరుకున్నామని ఆయన వెల్లడించారు. 

 

17:52 - July 4, 2016

గుంటూరు : హైకోర్టు సహా అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు సహా అన్ని సమస్యలను తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలతో కలిసి కూర్చుని పరిష్కరించుకోడానికి తనకు అభ్యంతరంలేదన్నారు. హైకోర్టుతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి ఆస్తుల పంపకంపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించాల్సి ఉందన్నారు. తెలంగాణ సర్కార్‌, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎపికి అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటే మంచిదికాదని హితవు పలికారు. సమస్యల పరిష్కారం విషయంలో భేషజాలకు పోనని చంద్రబాబునాయుడు చెప్పారు. 

 

కోరుకున్న చోటే... స్థానికత

హైదరాబాద్ : ఏపీలో స్థానికత మార్గదర్శకాలు తుదిమెరుగులు దిద్దుకున్నాయి. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లాలనుకునే వారు కోరుకున్న చోటే... స్థానికత ఇచ్చే బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార రంగంలో ఉన్న... తెలంగాణలోని ఎవరికైనా ఏపీలో స్థానికత ఇచ్చే వెసులుబాటు కల్పించారు. దీనికి 2017..జూన్2 వరకు  కటాఫ్ తేదీగా నిర్ణయించారు. సాయంత్రం ఫైలుపై చంద్రబాబు సంతకం చేశాక తుది ప్రకటన రానుంది. 

పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

విజయవాడ : పుష్కర ఘాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పుష్కర పనులు నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. దుర్గాఘాట్ వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులు ఏర్పాటు చేస్తామన్నారు. 

ఎంపి కంభంపాటి ఇంటిముందు నిర్మించిన అక్రమకట్టడం కూల్చివేత

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లోని ఎపి ఎంపి కంభంపాటి హరిబాబు ఇంటిముందు నిర్మించిన అక్రమ కట్టడాన్ని జీహెచ్ ఎంసీ కూల్చివేసింది. 

 

అసుదుద్దీన్ వ్యాఖ్యలపై హెచ్ ఆర్సీలో లాయర్ల జేఏసీ ఫిర్యాదు

హైదరాబాద్ : అసుదుద్దీన్ వ్యాఖ్యలపై హెచ్ ఆర్సీలో లాయర్ల జేఏసీ ఫిర్యాదు చేసింది. ఐసిస్ ఉగ్రవాదులకు సాయిం చేస్తానన్న అసద్ వ్యాఖ్యలు  ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయిని టీజేఏసీ ఫిర్యాదు చేసింది. 

 

మౌనిక హత్య కేసులో తండ్రి మల్లయ్య అరెస్టు

కరీంనగర్ : దేశాయిపేటకు చెందిన మౌనిక హత్య కేసులో తండ్రి మల్లయ్యను పోలీసులు అరెస్టు చేశారు. కూతరు తనను అసహ్యించుకునంటుందనే కారణంతో చీరతో ఉరివేసి చంపినట్లు నిందితుడు మల్లయ్య ఒప్పుకున్నాడు. 

16:53 - July 4, 2016

కృష్ణా : పుష్కరాల అభివృద్ధి పనుల కోసం విజయవాడలో దేవాలయాల కూల్చివేత వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రార్ధనా మందిరాల కూల్చివేత విషయంలో ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో రోడ్ల మీద ప్రార్ధనా మందిరాలు నిర్మించడం కూడా తప్పని సుతిమెత్తగా చురకలు అంటింటారు. 

16:48 - July 4, 2016

గుంటూరు : వెలగపూడిలోనే శాసనసభ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనుల్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వర్షాలు, నేల స్వభావం వల్ల పనులు ఆలస్యమైందని ఐదారురోజుల్లో భవనాలు సిద్ధమవుతాయని ప్రకటించారు. ఆగస్టు చివరినాటికి పూర్తిస్థాయిలో ఉద్యోగుల తరలింపు ఉంటుందని బాబు చెప్పారు. ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగులు సర్దుకుపోవాలని సూచించారు. కార్పొరేట్‌ కార్యాలయాలకు ధీటుగా ఏపీ సచివాలయం ఉంటుందని బాబు అన్నారు. 

 

హైదరాబాద్ మలక్ పేటలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : నగరంలోని మలక్ పేటలో అగ్నిప్రమాదం జరిగింది. బాంటియా ఫర్నీచర్ షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సిబ్బంది బయటికి రావడంతో ప్రమాదం తప్పింది.

16:35 - July 4, 2016

హైదరాబాద్ : ఏపీలో స్థానికత మార్గదర్శకాలు తుదిమెరుగులు దిద్దుకున్నాయి. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లాలనుకునే వారు కోరుకున్న చోటే... స్థానికత ఇచ్చే బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార రంగంలో ఉన్న... తెలంగాణలోని ఎవరికైనా ఏపీలో స్థానికత ఇచ్చే వెసులుబాటు కల్పించారు. దీనికి 2017..జూన్2 వరకు  కటాఫ్ తేదీగా నిర్ణయించారు. సాయంత్రం ఫైలుపై చంద్రబాబు సంతకం చేశాక తుది ప్రకటన రానుంది. 

 

16:19 - July 4, 2016

హైదరాబాద్ : నగరంలోని మలక్ పేటలో అగ్నిప్రమాదం జరిగింది. బాంటియా ఫర్నీచర్ షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సిబ్బంది బయటికి రావడంతో ప్రమాదం తప్పింది. పర్నీచర్ దగ్ధం అవుతుంది. సంఘనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్ మధ్యలో బాంటియా షోరూం ఉన్నందువల్ల రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

 

16:00 - July 4, 2016

హైదరాబాద్ : సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలిందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు.  కోట్లరూపాయలు తీసుకుంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు... ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాడానికి ఉచితసేవలా ఫీలవుతున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు- ప్రభుత్వం మధ్య పంతాలతో పేదలు నలిగిపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రెండేళ్లుగా ఆరోగ్యశ్రీమీద ఎంత ఖర్చుచేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రావుల డిమాండ్‌ చేశారు. 

 

15:56 - July 4, 2016

ఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి . దీంతో నదులు ఉప్పొంగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత 24 గంటల నుంచి ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి.  శారదా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇటు గంగానదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా.. దక్షిణ ప్రాంతంలో పాక్షికంగా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మట్టిలోకూరుకుపోయిన ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. 
ఉత్తరాఖండ్ లో ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్న నదులు 
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లోని నదులన్నీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థానాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు అప్రమత్తం చేశారు. రిషీకేష్- బద్రినాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు ఇంకా ప్రాంరభం కాలేదు.  గంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారిపై రాకపోకల పునరుద్ధరణకు  మరి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదలతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలలో సహాయ, పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
కుండపోతగా వర్షాలు..  పలువురు మృతి  
మరో వైపు ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముంబయి పట్టణంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పిలిభిత్‌ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలహాబాద్‌లో గోడకూలి ఐదుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు.  అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. 
పాట్నాలో 19మిమీ వర్షం 
పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు బిహార్‌ ప్రజలకు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. పాట్నాలో 19మిమీ వర్షం కురిసింది. పశ్చిమ్‌ బంగాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానల వల్ల వర్షాల లోటు 9 శాతానికి తగ్గింది.

 

15:53 - July 4, 2016

ఇది రంజాన్ మాసం. చార్మినార్ అంతా కన్నులపండుగగా కనిపించే మాసం. ఇలాంటి కోలాహలంలో పార్టీవేర్ డ్రెసెస్ కోసం చార్మినార్ లో చక్కర్లు కొడితే బాగుంటుంది కదూ.. పదండి ఇవాళ సొగసులో అలాంటి వెరైటీ డ్రెసెస్ ని మీకు పరిచయం చేస్తున్నాం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:51 - July 4, 2016

ఉన్నత విద్య అభ్యసించినా, ఉన్నతోద్యోగం స్థిరపడే అవకాశమున్నా వాటిని కాదనుకుని, మట్టి పరిమళాల కోసం, అది పిల్లలకు చేరువ కావాలనే సంకల్పం కోసం, మహిళలకు తోడుగా ఉండాలనే లక్ష్యం కోసం ముందుకు సాగుతున్న ఓ చైతన్య కెరటం అనుభవాలు, ఆలోచనలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.  
బియ్యం ఏ చెట్ల నుండి వస్తాయి? 
బియ్యం ఏ చెట్ల నుండి వస్తాయి? మనం తినే ఇతర ఆహార పదార్థాలు  ఎక్కడ కాస్తాయనే ఈ తరం పిల్లల ప్రశ్నలకి  విసుక్కోకుండా  సమాధానం చెప్పే వారెందరు? వారిని క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి, ప్రకృతి ఒడిలో  సేదతీర్చేదెందరు?  సమాజానికి మంచి సహజ ఆహారాన్ని అందించాలని తపన పడేవారెందరు? ఇలాంటి పనులన్నింటిలోనూ  నిమగ్నమయింది దీప్తి. 
మాతృత్వానికి గౌరవం అవసరం
ప్రకృతిని, మహిళల్ని సమన్వయం చేసుకోవడం అవసరం. మాతృత్వానికి గౌరవం అవసరం. మహిళల శక్తియుక్తులు ఈ సమాజ ఉత్పత్తిలో భాగం చేయాల్సిన అవసరముందని గుర్తించి, అందుకోసం కృషి చేస్తున్న దీప్తికి మానవి అభినందనలు తెలియచేస్తోంది. మరెందరికో స్ఫూర్తిని కలిగించాలని ఆశిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టీఎంయూకు హనుమంతు రాజీనామా

హైదరాబాద్ : ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు రాష్ట్ర కార్యదర్శి హనుమంతు రాజీనామా చేశారు. ప్రధాన కార్యదర్శి వైఖరికి నిరసనగా రాజీనామా చేశారు. తన అనుచరులతో హనుమంతు ఎన్ ఎంయూలో చేరారు. టీఎంయూ అగ్రనాయకత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని హనుమంతు విమర్శించారు. 

ముంపు గ్రామాల ప్రజలు ఐక్యంగా ఉండాలి : తమ్మినేని

హైదరాబాద్ : ముంపు గ్రామాల ప్రజలు ఐక్యంగా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.  4 రోజుల్లో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్.. 15 రోజులు దాటినా ఎందుకు ఇవ్వలేదని  ప్రశ్నించారు. 

 

15:29 - July 4, 2016

బాలకృష్ణ రిపోర్టర్ గా నటించనున్నాడా ? ఆయన వందో చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. మరో చిత్రానికి ఒప్పుకున్నారా ? అని ఆశ్చర్యపోకండి. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ ది. 'పటాస్' విజయం తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. సినిమాలో కళ్యాణ్ రామ్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. వైవిధ్యభరితమైన టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు, 'రిపోర్టర్ బాలకృష్ణ' అని పేరు పెట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ పేరు ఈ చిత్రంలో బాలకృష్ణ..రిపోర్టర్ గా వర్క్ చేస్తాడు కనుక 'రిపోర్టర్ బాలకృష్ణ' అయితే బెటర్ అని అనుకుంటున్నారంట. అతి త్వరలోనే ఈచిత్రం టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే చిత్ర యూనిట్ వెల్లడిస్తుందని తెలుస్తోంది.

15:23 - July 4, 2016

విశాఖ : పట్టణంలో అల్లూరి సీతారామరాజు 118 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  అల్లూరి విగ్రహానికి బీజేపీ, సీపీఐ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీమిలి తదితర ప్రాంతాల్లో అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

15:19 - July 4, 2016

రంగారెడ్డి : హైకోర్టును విభజించాలంటూ న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది.. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టు ముందు లాయర్లు నిరసనకు దిగారు.. కోర్టులోపలికి వెళుతున్న న్యాయమూర్తులను అడ్డుకున్నారు.. న్యాయపరమైన డిమాండ్లకోసం ఉద్యమిస్తున్న తమకు జడ్జీలుకూడా మద్దతు ఇవ్వాలని కోరారు.. ప్రత్యేక హైకోర్టు సాధించేవరకూ పోరాటం ఆపబోమని ప్రకటించారు.. 

15:17 - July 4, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో విజిలెన్స్‌ అధికారులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. 2007లో జరిగిన హెల్త్‌ అసిస్టెంట్ల నియామకంలో అవకతవకలపై ఆరా తీసున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు పలు పత్రాలు చెక్‌ చేస్తున్నారు. 

 

15:11 - July 4, 2016

సమంత..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మపై తెగ వార్తలు వస్తున్నాయి. నాగార్జున కుమారుడు నాగ చైతన్యతో వివాహం చేసుకోబోతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ యువ నటుడిని ప్రేమిస్తున్నట్లు సమంత పేర్కొనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి ప్రేమ వివాహంపై నాగ్ కూడా స్పందించారు. ఇదిలా ఉంటే సమంత కొత్త ప్రాజెక్టులకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. వివాహం కారణంగానే కొత్త చిత్రాలకు ఒప్పుకోవడం లేదని టాలీవుడ్ టాక్.
సమంత ప్రస్తుతం 'జనతా గ్యారేజ్', ధనుష్‌తో 'వడ చెన్నై' సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే తెలుగు, తమిళంలో విడుదలైన 'అ..ఆ', '24', 'తేరి' సినిమాలు మంచి విజయాన్నే నమోదు చేసుకున్నాయి. 'బ్రహ్మోత్సవం' ఫెయిలైనా ఆ ప్రభావం సమంతపై కనిపించలేదు. కొత్త ప్రాజెక్ట్‌లకు ఓకే చెబితే తీరిక ఉండదు కాబట్టే సినిమాలూ ఒప్పుకోవడం లేదని సమాచారం. ఏది ఎలా ఉన్నా 'సమంత' మనసులో ఏముందో ఎవరికేం తెలుసు...

15:10 - July 4, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్..కబాలి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. కారణాలు మాత్రం బయటకు తెలియడం లేదు కానీ ఈ చిత్ర రిలీజ్ పై తెగ సస్పెన్ష్ నెలకొంది. 'కబాలి' సినిమా జులై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ తేదీని వాయిదా వేసినట్లు, చివరకు రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు మళ్లీ వార్తలు వస్తున్నాయి. జులై 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోందని టాక్. నిర్మాతలు మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు.

15:08 - July 4, 2016

టాలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తూ ముందుకెళుతున్న యువ నటుడు 'శర్వానంద్' పై తమిళ దర్శకుడు చేరన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజాధి రాజ' చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర ప్రమోషన్ కు రావాలని కోరినా శర్వానంద్ అంగీకరించక నెగటివ్ ప్రచారం చేశాడని, ఈ సమయంలో హీరోయిన్ నిత్యామీనన్ కూడా అలాగే వ్యవహరించారని చేరన్ ఆరోపణలు గుప్పించారు. శర్వానంద్ మంచి నటుడే కానీ..ఇలా నిర్మాతలను ఇబ్బందిపెట్టడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొన్నారు. శర్వానంద్‌, నిర్మాత రవికిషోర్‌ ఈ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రవి కిషోర్‌, శర్వానంద్‌లు పని గట్టుకుని ఈ సినిమాపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని తెలిసిందని, ఒక మంచి సినిమాని తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న ఒక దర్శకుడిని ప్రోత్సహించాల్సిన వారే ఇలా చేయడం బాధనిపించిందని వ్యాఖ్యానించారంట. ప్రస్తుతం చేరన్ చేసిన ఆరోపణలపై శర్వానంద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

15:06 - July 4, 2016

'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ చిత్రం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు నటించే చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ఈనెల 29న ప్రారంభం కానున్న ఈ చిత్రంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ పోషించనున్నట్లు టాక్. ఒక పాత్రలో ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తే .. మరో పాత్ర ప్రొఫెసర్ గా ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ ఏ చిత్రంలో డ్యూయల్ రోల్ చేయలేదు. మరి ఈ పుకార్ల నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే మురుగదాస్ చెప్పాల్సి ఉంటుంది. ఇక మహేష్ పక్కన బాలీవుడ్ భామ పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

ముగిసిన వైసీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం

హైదరాబాద్: వైసీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై చర్చించామని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామంచంద్రారెడద్డి తెలిపారు. ఈనెల 8 నుంచి ఐదు నెలలపాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలపై కార్యక్రమంలో 100ప్రశ్నలతో ప్రజా బ్యాలెట్ ను సిద్ధం చేశామన్నారు. 

జీహెచ్ ఎంసీలో అవకతవకలపై విజిలెన్స్ విచారణ ప్రారంభం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో హెల్త్ అసిస్టెంట్ల నియామకంలో అవకతవకలపై విజిలెన్స్ విచారణ ప్రారంభం అయింది. 2007లో హెల్త్ అసిస్టెంట్ల నియామకం జరిగింది. 

ఆలయాలు కూల్చడం తప్పే - చిన జీయర్ స్వామి..

చెన్నై : ఏపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడ మంచిది కాదని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. ఆలయాలు కూల్చడం ఎవరు చేసినా తప్పేనని, ప్రత్యేకంగా హిందూ ఆలయాలు కూల్చివేస్తోన్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

 

ఆరోగ్య శ్రీని ప్రభుత్వం కొనసాగిస్తుందా ? లేదా ? రావుల..

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా ? లేదా ? అని టిడిపి నేత రావుల ప్రశ్నించారు. పేదల ఆరోగ్యంతో చెలగాటం వద్దని, ప్రైవేటు ఆసుపత్రులతో ఎంతకాలం చర్చలు జరుపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులు మూడు పర్యాయాలు వైద్యం నిలిపవేశాయన్నారు. ఆరోగ్య శ్రీ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి - సీఎం బాబు..

విజయవాడ : రోడ్ల విస్తరణలో ఆలయాలు, చర్చీలు, మసీదుల తొలగింపుపై ప్రజల మనోభావాలు తెలుసుకోవాని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అదే సమయంలో రోడ్ల విస్తరణ కూడా ముఖ్యమేనని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ఆలయాల నిర్మాణాలు చేస్తామని వెల్లడించారు. దీనిపై టిడిపి, బిజెపి నేతలు సంయమనం పాటించాలని సూచించారు.

ఏటిగడ్డ కిష్టాపూర్ కు చేరుకున్న తమ్మినేని పాదయాత్ర..

మెదక్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని చేపట్టిన పాదయాత్ర ఏటిగడ్డ కిష్టాపూర్ కు చేరుకుంది. ఈ పాదయాత్రలో హైమావతి, సీపీఎం నేత జ్యోతి, చుక్కా రాములు తదితరులు పాల్గొన్నారు.

13:38 - July 4, 2016

ఢిల్లీ : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎలక్షన్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగరి నుంచి ఎమ్మెల్యేగా రోజా ఎన్నిక చెల్లదంటూ గతంలో హైకోర్టులో పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. రోజా వివరణ సమర్పించే అవకాశం కల్పించాలని హైకోర్టును ఆదేశించింది. రోజా ఎన్నిక సరికాదంటూ ఎన్నికల సమయంలో ఆస్తుల విషయంలో తప్పులు ఉన్నాయంటూ రాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సవాల్ చేస్తూ రోజా పిటిషన్ దాఖలు చేశారు. రెండు కలిపి ఒకసారి విచారణ జరపడం సరికాదంటూ సుప్రీంలో రోజా పిటిషన్ దాఖలు చేసింది. ఏడాది చివరికల్లా హైకోర్టు విచారణ చేయాల్సి ఉంటుంది.

13:32 - July 4, 2016

విశాఖపట్టణం : నైజీరియాలో ఇటీవల కిడ్నాప్ కు గురైన విశాఖకు చెందిన ఇంజనీర్ సాయి శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి పరామర్శించారు. సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు..సాయి శ్రీనివాస్ తో మరో అనిల్ అనే వ్యక్తిని డంగోటీ అనే సంస్థ కిడ్నాప్ చేసినట్లుగా నైజీరియా ప్రభుత్వం ధృవీకరరించిందనీ నైజీరియన్ ప్రభుత్వంతో డంగోటీ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఏపీ భవన్ నుంచి ఓ అధికారి నిరంతరం నైజీరియాలోని భారత హై కమీషనర్ తో సంప్రదిస్తున్నారని తెలిపారు. తాము ఈ విషయంలో కేంధ్ర విదేశాంగ శాఖ మంత్రి సుస్మస్వరాజ్ తో సంప్రదింపులు చేస్తున్నామని పల్లె తెలిపారు.

13:29 - July 4, 2016

చెన్నై : ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌ను భారీ భద్రత మధ్య చెన్నయ్‌కు తరలించారు. శనివారంనాడు రాంకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులను చూసి రాంకుమార్‌ గొంతుకోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. పోలీసులు వెంటనే తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రిలో రాంకుమార్‌ను చేర్పించారు. రాంకుమార్‌ పరిస్థితి మెరుగు పడడంతో అంబులెన్స్‌లో చెన్నయ్‌లోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి గోపినాథ్‌ ఆసుపత్రికి వెళ్లి అక్కడనే రాంకుమార్‌ వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

13:26 - July 4, 2016

చిత్తూరు : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి టీచర్లు సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన ఓ హెడ్‌మాస్టర్‌ మద్యానికి బానిసయ్యాడు. ఫుల్లుగా మందుకొట్టి స్కూల్‌కువచ్చి వీరంగం సృష్టించాడు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల జడ్పీ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ జయప్రకాశ్ మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడు. విద్యార్థులు, టీచర్లపై తిట్ల దండకం అందుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హెచ్‌ఎంను నిలదీశారు. ఎంఈవోకు సమాచారం అందించారు. దీంతో ఆగ్రహించిన జయప్రకాశ్ గ్రామస్తులతో అసభ్యంగా మాట్లాడాడు. స్కూల్‌కు వచ్చిన ఎంఈవోను కూడా అసభ్య పదాలతో దూషించాడు. హెచ్‌ఎంకు మెమో జారీ చేశామని చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు.

13:24 - July 4, 2016

ఖమ్మం : పోలీసులు ఎంతమందిని అరెస్ట్‌ చేస్తున్నా కల్తీపాల దందా కొనసాగుతూనే ఉంది.. తాజాగా ఖమ్మంలో కల్తీపాలు తయారుచేస్తూ మరో వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురానికిచెందిన మురళి ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. యూరియా, అమోనియా, నూనె, పంచదార, పిండిని కలిపి పాలలాంటి ద్రవాన్ని తయారుచేశాడు. ఓ మిషిన్‌లో వీటన్నింటినీ మిక్స్‌చేసి పాలపేరుతో జనాలకు అమ్ముతున్నాడు. ఈ కల్తీపాల సమాచారం తెలుసుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. అతనికి సహకరిస్తున్న వ్యక్తుల్ని కూడా అరెస్ట్‌ చేశారు.

 

13:22 - July 4, 2016

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మెర్సీ కిల్లింగ్ పిటిషన్ దాఖలైంది. చిన్నారి జ్ఞానసాయిను మెర్సీకిల్లింగ్ కు అనుమతించాలంటూ తల్లిండ్రులు కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుకొచ్చింది. తాజాగా ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థిని మెర్సీ కిల్లింగ్ కు అనుమతినివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. నారాయణ, శ్యామలారెడ్డి దంపతులకు మాధవి అనే కూతురు ఉంది. ఈమె ఇంటర్ మీడియట్ చదువుతోంది. బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతోంది. బెంగళూరు, చెన్నై, తిరుపతిలలో వైద్య చికిత్స చేయించారు. సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఇంకా పదిహేను లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉండిపోయారు. సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టులో కారుణ్య మరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు పిటిషన్‌ పెట్టుకుని కన్నీరుపెట్టుకుంటున్నారు. తనకు చికిత్స అయ్యే డబ్బు తన తల్లిదండ్రుల వద్ద లేదని, అందుకే తనను చంపేయాలని కోరినట్లు మాధవి తీవ్ర ఆవేదనలో తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా ? సహాయం చేస్తుందా ? అనేది చూడాలి.

 

హెల్త్ అసిసెంట్ల నియాకమంలో విచారణ ప్రారంభం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ హెల్త్ అసిసెంట్ల నియామకంలో అవకతవకలపై విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభమైంది. 2007లో హెల్త్ అసిసెంట్ల నియామకం జరిగింది.

తరుషికి కేంద్ర మంత్రి సుష్మా నివాళులు..

ఢిల్లీ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఢాకా ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన తరుషికి నివాళులర్పించారు.

రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. 79 మందికి పరిహారం చెల్లించడం జరిగిందని, మరికొంత మందికి ఆత్మహత్యలపై పున:దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. పరిహారం చెల్లింపునకు కొంత సమయం కావాలని కోరింది. వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణనను రెండు వారాలకు వాయిదా వేసింది.

12:53 - July 4, 2016

ఢిల్లీ : ఢాకా, కాబూల్‌, బాగ్దాద్‌, అంతకు ముందు.. పారిస్‌, బ్రసెల్స్‌. దేశం ఏదైనా..ప్రాంతంతో సంబంధంలేదు. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తుపాకులు, బాంబులతో మారణహోమం సృష్టిస్తున్నారు. జాతీయ నిఘా సంస్థల మెలకువతో హైదరాబాద్‌లో ఉగ్రముప్పు తప్పినా... బంగ్లాదేశ్‌నుంచి మరింత మంది ముష్కరులు దేశంలోకి చొరబడ్డారనే సమాచారం కలవరం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పంజావిసురుతున్న ఉగ్రభూతం... దేశాలన్నిటిని భయపెడుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ...ఐసిస్‌ సపాగిస్తున్న నెత్తుడి క్రీడ మెత్తం మానవసమాజాల మనుగడనే విషాదంలో నింపుతోంది. బాంబుపేలుళ్లు... ఊచకోతలతో ముష్కర ముఠాలు బరితెగిస్తున్నాయి. స్థానికులను ఉగ్రరొంపిలోకి దించుతున్నాయి. ఐసిస్‌ ప్రభావంలో పడినవారు సొంతపౌరులపైనే దాడులకు తెగిస్తున్నారు. గతనెల 28న టర్కీలోని ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలోకి జొరబడ్డ ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులు ఆటోమేటిక్‌ ఆయుధాలతో కాల్పులకు తెగబడి బాబులతో విధ్వంసం సృష్టించారు. తర్వాత రెండు రోజులకు జూలై 1న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో పంజావిసిరింది ఉగ్రభూతం. శుక్రవారం అర్ధరాత్రి ఏడుగురు ఉగ్రవాదులు ఢాకాలోని ఒక బేకరీలోకి వెళ్లి విదేశీయులను బందీలుగా పట్టుకుని ఊచకోత కోశారు. ఓ భారతీయ యువతినికూడా గొంతుకోసి చంపేశారు. అంతకు ముందు గత ఏడాది నవంబర్‌ 30నాటి పారిస్‌ దాడులు మరకవముందే ...బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ముష్కరులు మారణహోమానికి పాల్పడ్డారు. గత మార్చి 22 బ్రసెల్స్‌ విమానాశ్రయంలో జరిపిన బాంబుదాడిలో 32 మంది ప్రాణాలు కోల్పోగా 3వందల మందికి పైగా గాయపడ్డారు. తర్వాత అమెరికాలో పంచావిసిరిన ఐఎస్‌ ప్రేరేపిత ఉగ్రవాది... ఓ పబ్‌లో కాల్పులకు తెగబడి 50 మందిని పొట్టపెట్టుకున్నాడు.

హైదరాబాద్‌లో బెడిసికొట్టిన ఐసిస్‌ ప్లాన్‌...
ఢాకాతరహా దాడులను ఇండియాలోకూడా చేయాలని ఐసిస్‌ ముఠాలు పథకరచన చేశాయి. అయితే... మన నిఘా వర్గాల అప్రమత్తతతో హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించాలని వేసుకున్న ప్లాన్‌ బెడిసికొట్టింది. నిఘావ్యవస్థ ముందుగానే పసిగట్టడంతో ఓ విలయాన్ని ఆపగలిగారు. లేకుంటే.. మరోసారి మన హైదరాబాద్‌ ఉగ్రముఠాల దాడికి చిగురాకులా వొణికి పోయేదే. ఇలా వరుస దాడులతో ప్రపంచవ్యాప్తంగా పెట్రేగిపోతోంది ఐసిస్‌. దేశాలు, ప్రాంతాలు తేడాలు లేకుండా రెచ్చిపోతున్న ఐసిస్‌...సిరియాను ప్రధాన అడ్డాగా చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా... తమ భావజాలానికి ఆకర్షితులైన వారిని చేరదీసి విషసర్పాలుగా మారుస్తోంది. ఆయుధాలు వాడటం, బాంబులు తయారు చేయడంలో శిక్షణ ఇస్తోంది. దీనికోసం ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటోంది. టెక్నాలజీ సహాయంతో ఇంట్లోనే కూర్చుని ఎక్కడో సిరియానుంచి వస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నారు ఉగ్రవాదులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సానుభూతిపరులను స్లీపర్‌సెల్స్‌గా ఉపయోగించుకుంటుంది. మామూలు మనుషుల్లోనే కలిసిపోయి ఐసిస్‌నుంచి ఆదేశాలు రాగానే ఉన్నట్టుండి విరుచుకు పడుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. సిరియాలో తిష్ఠ వేసిన షఫీక్‌ ఆర్మర్‌ హైదరాబాద్‌లో ఉన్న మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీని సహాయంతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఈ షఫీక్‌ ఆర్మర్‌కు వివిధ దేశాలకు చెందని ఉగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరంతా కలిసే మారణహోమాలకు ప్లాన్స్‌ వేస్తుంటారు. దీనిలో భాగంగానే వివిధ దేశాల్లోని ముఠాలను ఉసిగొల్పి ఒక దేశం తర్వాత మరో దేశంలో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు.

దేశంలోకి చొరబడిన బంగ్లా ఉగ్రవాదులు..!
ఇదిలావుంటే..దేశంలోని పలునగరాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు చొరబడినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం 70 నుంచి 90 మంది ఉగ్రవాదులు పశ్చిమబెంగాల్‌ మీదుగా దేశంలోకి వచ్చారని జాతీయ నిఘా సంస్థలు పసిగట్టాయి. జమాత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ కు చెందిన వీరు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబయి నగరాల్లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు.

12:49 - July 4, 2016

ఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత 24 గంటల నుంచి ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. శారదా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఇటు గంగానదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా.. దక్షిణ ప్రాంతంలో పాక్షికంగా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో రెండు రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టిలో కూరుకుపోయిన ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.

ఉత్తరాఖండ్ లో నదులు..
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లోని నదులన్నీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థానాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు అప్రమత్తం చేశారు. రిషీకేష్- బద్రినాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు ఇంకా ప్రాంరభం కాలేదు. గంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారిపై రాకపోకల పునరుద్ధరణకు మరి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదలతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలలో సహాయ, పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.

11 మంది మృత్యువాత..
మరో వైపు ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముంబయి పట్టణంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పిలిభిత్‌ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలహాబాద్‌లో గోడకూలి ఐదుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు బిహార్‌ ప్రజలకు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. పాట్నాలో 19మిమీ వర్షం కురిసింది. పశ్చిమ్‌ బంగాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానల వల్ల వర్షాల లోటు 9 శాతానికి తగ్గింది.

12:45 - July 4, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తుకారాంగేట్‌ లో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు కొందరు యువకులు. తీవ్రగాయాల పాలైన మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. రెండు కుటుంబాల మధ్య గొడవ పెద్దది కావడంతో.. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణలో ఓ మహిళపై దాడి చేసిన యువకులు పెట్రోల్‌పోసి నిప్పంటించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

12:43 - July 4, 2016

ఢిల్లీ : మళ్లీ నీట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్‌ నిర్వహణపై కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ప్రైవేట్‌ వైద్య కళాశాలలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు జస్టిస్‌ అనిల్‌ దవే ధర్మాసనానికి బదిలీ చేసింది. నీట్‌ నిర్వహించాల్సిందేనని గతంలో అనిల్‌ ఆర్‌ దవే ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మే 24వ తేదీన ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ కళాశాలలకు మినహాయింపు ఇచ్చింది. 20 రాష్ట్రాల్లో విద్యార్థులు నష్టపోతారని, ఇంగ్లీషు, హిందీ భాషల్లో పరీక్ష రాయాల్సి ఉంటుందని..విద్యార్థులు నష్టపోతారని పలు రాష్ట్రాలు పేర్కొన్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం పలు చర్చలు జరిపింది. ఈనెల 24వ తేదీన రెండో దశ నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దీనితో సోమవారం ప్రైవేటు కళాశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

12:40 - July 4, 2016

గుంటూరు : భజరంగ్‌జూట్‌ మిల్లు కార్మికుల ఆందోళన తీవ్రతరమైంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట భజరంగ్ మిల్లు కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లు తెరిపించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావుతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. లాకౌట్ ను ప్రకటించిన యాజమాన్యం వెంటనే మిల్లును తెరిపించాలని డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు మిల్లును తెరిపిస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. 7 ఎకరాల 79 సెంట్ల భూమిలో ఈ కంపెనీ ఉందని, రూ. 250 కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. దీనిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాది గడిచినా స్పందించకపోవడంతో సోమవారం పెద్ద ఎత్తున ఊరేగింపు చేపడితే పీఎస్ కు తరలించారని, దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యంపై వత్తిడి తెచ్చి మిల్లును తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం యాజమాన్యం పక్షాన నిలుస్తోందన్నారు.

12:37 - July 4, 2016

తమిళనాడు : రాష్ర్టం కృష్ణగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శూలగిరి రహదారిపై వెళ్తున్న ఏనుగును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏనుగుకు తీవ్రగాయాలయ్యాయి. శూలగిరికిరివైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. తెల్లవారుజామున ఏనుగులు రోడ్డును దాటడం పరిపాటిగా మారింది. సోమవారం ఉదయం రోడ్డు దాటుతున్న ఏనుగును బెంగూళుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీనితో రోడ్డుపై ఏనుగు కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఏనుగును తరలించేందుకు శ్రమించారు. క్రేన్ సహాయంతో ఏనుగును తరలించారు. కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సుప్రీంలో నీట్ పై పిటిషన్..

ముంబై : నీట్ నిర్వాహణపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రైవేటు వైద్య కళాశాలలు పిటిషన్ దాఖలు చేశాయి. జస్టిస్ అనిల్ ఆర్ దవే ధర్మాసనానికి పిటిషన్ బదిలీ చేసింది. విచారణ జులై 7కి వాయిదా వేసింది.

12:29 - July 4, 2016

విజయవాడ : నగరంలో ఆలయాలు తొలగింపులో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వెంటనే చర్చలు జరపాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా ఆలయాల తొలగింపు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా బాబురావు సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్లాట్ల నిర్మాణం..బ్రిడ్జీల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కావాలని, ఈ సాకు చెప్పి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు నిరంకుశంగా వ్యవహరించడం ఏ మాత్రం సబబు కాదన్నారు. పేద ప్రజల ఇళ్లు తొలగించడం..పురాతన ఆలయాలు..ఇతరత్రా వాటిని తొలగించడం జరుగుతోందన్నారు. సున్నితమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరిస్తూ సమస్యను జఠిలం చేస్తోందన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మత సంస్థల కట్టడాలు తొలగించే అవసరం ఉన్నప్పుడు చర్చలు జరపాల్సి ఉంటుందని, మంత్రుల కమిటీ ఇందుకు పూనుకుని సమస్య జఠిలం కాకుండా చూడాలన్నారు. బీజేపీ నాయకత్వం..బీజేపీ ప్రజాప్రతినిధులు..ఆర్ఎస్ఎస్ కు చెందిన కొంతమంది నేతలు ఈ ఘటనను ఆసరగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏకపక్ష తీరును అడ్డం పెట్టుకుని విజయవాడలో వాతావరణాన్ని కలుషితం చేయడానికి..మతం పేరిట రాజకీయాలు చేయడం గర్హనీయమన్నారు. ఏ రోజు విజయవాడలో సమస్యలు పట్టించుకోని బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం హడావుడి చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్నారని చెబుతూ ఏజెండాలకు అనుకూలంగా వాడుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిధంగా వ్యవహరించడం కరెక్టు కాదన్నారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి విషయంలో తొలగించాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని బాబురావు పేర్కొన్నారు.

ఆరు నుండి ప్రజా సాధికార సమ్మె - సీపీఐ..

విజయవాడ : ఈ నెల 6 నుండి ప్రజా సాధికార సమ్మె చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ప్రజలను చైతన్యం చేస్తామని, హైకోర్టు విభజన సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

గవర్నర్ ను కలిసిన టి.న్యాయవాదులు..

హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదులు రాజ్ భవన్ లో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఆప్షన్ విధానం రద్దు..సస్పెన్షన్ లు ఎత్తివేసేలా చూడాలని గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.

మెర్సీకిల్లింగ్ కు అనుమతినివ్వాలని విద్యార్థిని పిటిషన్..

చిత్తూరు: మెర్సీకిల్లింగ్ కు అనుమతినివ్వాలని మదనపల్లి కోర్టులో ఇంటర్ విద్యార్థిని రెడ్డి మాధవి పిటిషన్ దాఖలు చేసింది. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో రెడ్డి మాధవి బాధ పడుతోంది. వైద్యం కోసం రూ. 7 లక్షలు ఖర్చు చేశారని, ఇకపై వైద్య ఖర్చులకు తల్లిదండ్రుల వద్ద ఏమీ లేదని, మెర్సీ కిల్లింగ్ కు అనుమతినివ్వాలని పిటిషన్ లో వివరణనిచ్చింది.

రాజేంద్రనగర్ లో న్యాయవాదుల ఆందోళన..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జడ్జీలను కోర్టులోకి వెళ్లనీయకుండా న్యాయవాదులు అడ్డుకున్నారు.

భజరంగ్ జూట్ మిల్లు కార్మికుల ఆందోళన..

గుంటూరు : జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట భజరంగ్ మిల్లు కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లు తెరిపించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావుతో పాటు పలువురిని అరెస్టు చేశారు.

నెల్లూరులో పర్యటించనున్న డీజీపీ రాముడు..

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసు అధికారులతో జరిగే సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. శాంతి భద్రతలపై పోలీసు అధికారులతో చర్చించనున్నారు.

12:01 - July 4, 2016

గుంటూరు : 'మిల్లును తెరిపించండి..లేదా జైల్లో పెట్టండి' అంటూ భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు నినదిస్తున్నారు. గత ఏడాది క్రితం మిల్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఏడాది అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు. మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం హామీనిచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

అధికారులతో బాబు టెలికాన్ఫరెన్స్..

గుంటూరు :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎల్ఈడీ బల్బులు, కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ లాంటి కార్యక్రమాలు మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారని, వంటగ్యాస్, విద్యుత్ సరఫరా చేస్తున్నామని బాబు అన్నారు.

ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ సరిహద్దులోని పొందుగుల చెక్‌పోస్ట్‌ దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు తెలంగాణ బస్సులను నిలిపివేశారు.

వెలగపూడిలో సీఎం చంద్రబాబు...

గుంటూరు : వెలగపూడికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. గత నెలలో ప్రారంభించిన మంత్రుల భవనాలు..మరో ఐదు భవనాలను సీఎం పరిశీలించారు. 10.30కి పుష్కర ఘాట్లను బాబు పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎంతో మంత్రులు సమావేశం కానున్నారు.

యూరోకప్ సెమీస్ లో ఫ్రాన్స్..

ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ యూరోక‌ప్ సెమీస్ కు చేరింది. సంచ‌ల‌నాల ఐస్‌లాండ్‌ను 5-2 తేడాతో చిత్తుగా ఓడించి జ‌ర్మ‌నీతో అమీతుమీకి రెడీ అయింది. ఒలివ‌ర్ గిరోడ్ రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

11:33 - July 4, 2016

ప్రోకబడ్డీ నాలుగోసీజన్ మొదటి రెండు అంచెల పోటీలు ముగిసే సమయానికి పూణేరీ పల్టాన్, జైపూర్ పింక్ పాంథర్స్ మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి. జైపూర్ లెగ్ ఆఖరిరోజు పోటీల్లో దబాంగ్ ఢిల్లీ, పూణేరీ పల్టాన్ జట్లు విజయాలు సాధించాయి. పట్నా పైరేట్స్, యూ-ముంబాతో బెంగాల్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ప్రొఫెషనల్ కబడ్డీ నాలుగోసీజన్...ముంబై, జైపూర్ అంచె పోటీల్లో పూణేరీ పల్టాన్ విజయవంతమైన జట్టుగా నిలిచింది. మొత్తం ఐదురౌండ్ల మ్యాచ్ లు ఆడి..మూడు విజయాలు, ఓ టై, ఓ ఓటమితో 19 పాయింట్లు సంపాదించి లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

జైపూర్ చిత్తు..
జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముగిసిన ఐదోరౌండ్ పోటీలో పూణేరీ పల్టాన్ 33-28 పాయింట్లతో ఆతిథ్య జైపూర్ పింక్ పాంథర్స్ ను చిత్తు చేసింది. ఐదు పాయింట్ల తేడాతో కీలకం విజయం సాధించడం ద్వారా ఎనిమిది జట్ల లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నెంబర్ వన్ స్థానం కాపాడుకోగలిగింది. మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 5 రౌండ్లలో 2 విజయాలు, ఓ టై, రెండు పరాజయాలతో 15 పాయింట్లు సంపాదించి...రెండోస్థానంలో నిలిచింది.

చిత్తైన్న బెంగళూరు బుల్స్...
జైపూర్ అంచెలో భాగంగా జరిగిన మరో ఆఖరిరౌండ్ పోటీలో దబాంగ్ ఢిల్లీ32-24 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ ను చిత్తు చేసింది. దబాంగ్ ఢిల్లీ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. 8 పాయింట్ల తేడాతో బెంగలూరు బుల్స్ లాంటి పవర్ ఫుల్ జట్టుపై స్ఫూర్తిదాయక విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా మరికాసేపట్లో జరిగే పోటీల్లో తెలుగు టైటాన్స్ తో పట్నా పైరేట్స్, యూ-ముంబాతో బెంగాల్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి.

11:28 - July 4, 2016

హైదరాబాద్ : దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్స్ పరీక్షను మొదటిసారిగా నిర్వహించేందుకు వరంగల్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జాతీయస్థాయిలో జేఈఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో సివిల్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం ఉండేది. తాజాగా వరంగల్లోనూ ఏర్పాటు చేస్తుండడంతో ఎక్కువమంది అభ్యర్థులకు సౌకర్యంగా ఉండనుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2016 పరీక్షను ఆగస్టు 7న జరగనుంది. దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షను యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో నిర్వహించనున్నది.

జేఈఈ పరీక్ష..
జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక జేఈఈ పరీక్షను వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. ఆ అనుభవంతో సివిల్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేసేందుకు జిల్లా కలెక్టర్ కరుణ ప్రణాళికను సిద్ధం చేశారు. వరంగల్ జిల్లా నుంచి 10,858 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 19 ప్రాంతాల్లో 23పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష మెటీరియల్‌కు పటిష్టమైన బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటి సారిగా పరీక్ష నిర్వహిస్తున్నందున ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా కలెక్టర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి నిర్ధిష్టమైన సూచనలు చేశారు. జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కోఆర్డినేషన్ చేస్తున్నారు కలెక్టర్.

11:25 - July 4, 2016

విజయవాడ : ఏపీలో టీడీపీ ఫైర్‌ బ్రాండ్‌లంతా కామ్‌ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన నేతలంతా.. అధికారంలోకి వచ్చాక సైలెంట్‌ అయ్యారు. ఇంతకీ వారెవరు..? ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? వారిలో జోష్‌ తగ్గడానికి కారణాలు ఏంటి ?? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్‌ నేతల పరిస్థితి విచిత్రంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడి.. ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నేతలంతా పార్టీ అధికారంలోకి వచ్చాక కామ్‌ అయిపోయారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టకుండా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో పరాజయంతో నేతల్లో నైరాశ్యం..
దశాబ్దం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు.. పయ్యావుల కేశవ్‌, దూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, వర్ల రామయ్య, లింగారెడ్డి, నన్నపనేని రాజకుమార్‌, పంచమర్తి అనురాధ వంటి నేతలు తమ వాక్పటిమతో అండగా నిలబడ్డారు. నిత్యం మీడియాలో కనిపిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసేవారు. పదేళ్ల తర్వాత కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీన్‌ రివర్స్‌ అయ్యింది. వాక్చాతుర్యం కలిగిన నేతలంతా అపజయం పాలై నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు... పయ్యావుల, సోమిరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మరికొంత మందికి కార్పొరేషన్‌ పదవులు అప్పగించారు. దీంతో వారు వారి పనుల్లో బీజీగా మారిపోయారు.

సైలెంట్‌గా మారిన నన్నపనేని రాజకుమారి...
అనంతలో మంత్రులు పల్లె, పరిటాల సునీత పవర్‌ సెంటర్లుగా మారడంతో పయ్యావుల స్థానిక రాజకీయాలకే పరిమితమైపోయారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ, ఆనం సోదరుల రాకతో సోమిరెడ్డి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అడపాదడపా మీడియాలో కనిపిస్తున్నా.. ఇంతకుముందు జోష్‌ ఆయనలో కనిపించడం లేదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు జగన్‌ పేరు ఎత్తితే తీవ్రంగా విరుచుకుపడిన వర్ల రామయ్య మౌనవ్రతం పాటిస్తున్నారు. టీడీపీకి మంచి పట్టున్న పామర్రు నియోజకవర్గంలో ఓటమి పాలు కావడంతో.. ఆయన దూకుడుకు బ్రేక్‌ పడింది. అనంతరం ఆయనకు కేటాయించిన హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ తన పనేదో తాను చూసుకుంటున్నారు. అదేవిధంగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి పొందిన నన్నపనేని రాజకుమారి.. రాజ్యాంగబద్ధ పదవి కావడంతో సైలెంట్‌ అయిపోయారు. ఇక పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంతో దూళిపాళ్ల ఇంతకు మునుపటిలా యాక్టివ్‌గా ఉండడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లింగారెడ్డి,.. మహిళా సాధికారిత చైర్మన్‌ పంచమర్తి అనురాధ పదవీ బాధ్యతల్లో బిజీగా ఉంటూ.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక గాలి ముద్దుకృష్ణమనాయుడు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ అందరికంటే కాస్తా బెటర్‌ అని అనిపించుకుంటున్నారన్నది పార్టీ నేతల మాట. కారణాలు ఏవైనప్పటికీ టీడీపీ ఫైర్‌ బ్రాండ్‌లంతా మూకుమ్మడిగా మౌనం పాటించడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో కొత్తనీరు వచ్చి చేరుతున్నా.. విపక్షాలపై దూకుడును ప్రదర్శించే సీనియర్ల వాగ్ధాటి లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

11:22 - July 4, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీకి ఉద్యమాల సెగ తాకడం మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండేళ్ల తర్వాత అధికారిక నిర్ణయాలతో గులాబీ పార్టీ నేతలకు ఉద్యమాల వేడి తగులుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అధికార పార్టీ నేతలకు చిక్కులు మొదలయ్యాయి.తెలంగాణలో రెండేళ్లుగా అధికార పార్టీకి పెద్దగా ప్రజా వ్యతిరేకత లేదు. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఉద్యమాలకు కారణమవుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఓ రకంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళనల బాట పడుతున్నాయి.

మల్లన్న సాగర్ రాజకీయ ప్రకంపనాలు..
తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటున్న ప్రాజెక్టు రీడిజైనింగ్, జిల్లాల పునర్విభజన అంశాలు అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే మల్లన్నసాగర్‌ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. టీజాక్‌, ప్రతిపక్షాల దీక్షలతో హీట్‌ను పెంచుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా 14 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అన్ని జిల్లాల్లో దూమారం రేపుతున్నాయి. జనగాం, గద్వాల, ఇల్లందు ఇలా ప్రత్యేక జిల్లా డిమాండ్లు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఏకంగా ప్రత్యేక జిల్లా ఉద్యమాలు ఉద్రిక్తతలకు సైతం దారి తీసుకున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండేళ్ల తర్వాత గులాబి పార్టీ ప్రభుత్వానికి ఉద్యమాలు వేడి మొదలు కావడంతో అధికార పార్టీ ఎలా ఎదుర్కొనేది ఆసక్తిగా మారింది.

లోటస్ పాండ్ లో వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం..

హైదరాబాద్ : లోటస్ పాండ్ లో వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. గడపగడపకూ అనే కార్యక్రమంపై చర్చిస్తున్నారు.

10-12 మంది కేబినెట్ లో ?

ఢిల్లీ : కేంద్ర పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నవారు : ఎన్.ఎస్.ఆహ్లువాలియా, కృష్ణరాజ్, పురుషోత్తం రావల్, అనుప్రియా పటేల్, కఠేరియా, మహేంద్ర నాథ్ పాండే, అర్జున్ రాం, రాందాస్ అథావ్లే, శివసేన నుండి అనిల్ దేశాయ్ కు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. సంజీవ్ బాలియా, ధర్మేంద్ర పధాన్, పీయూష్ గోయల్ కు కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. కేబినెట్ రేసులో ఉన్న వారిని చాయ్ పార్టీ అని అమిత్ షా సంబోంధించారు.

దేవాలయాల ధ్వంసంపై సీఎం సమీక్ష...

విజయవాడ : దేవాలయాల ధ్వంసంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆలయాల తొలగింపుపై బీజేపే, టిడిపి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

మద్యం మత్తులో స్కూల్ కు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు..

చిత్తూరు : చౌడేపల్లి (మం) చారాలలో ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. గ్రామస్తులు ఇతనిని అడ్డుకుని మండల విద్యాధికారితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

10:24 - July 4, 2016

హైదరాబాద్ : రెండేళ్ల పాటు నైజీరియాలో బందీలుగా చిక్కుకున్న 11 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారు. వీరిలో తెలంగాణకు చెందిన మనోజ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న మనోజ్‌కుమార్‌ తాము భారత్‌ కు చెందిన నితిన్‌ సందేశ్‌ సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలిపారు. పాలమూరుకు చెందిన మనోజ్‌ 2013లో మెరైన్‌ ఇంజనీర్‌గా కంటెయినర్‌ షిప్‌ పనిచేస్తున్నాడు. మనోజ్‌ పనిచేస్తున్న షిప్‌ నైజీరియాలో సముద్ర జలాల్లో ప్రవేశించడంతో అక్కడి కోస్ట్‌ గార్డ్స్‌ అక్రమంగా అరెస్టు చేసారు.

10:20 - July 4, 2016

అర్జెటినా : కోపా కప్‌లో పూర్ ఫెర్ఫామెన్స్‌తో ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. మెస్సీ పునరాగమనం కోసం అభిమానులు పెద్ద ఎత్తున కదిలారు. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓ వైపు వర్షం కురుస్తునా లెక్క చేయకుండా తమ స్టార్ ప్లేయర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. మెస్సీ తీసుకున్న వీడ్కోలు నిర్ణయం ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదంటూ గళం కలపడం విశేషం.

10:17 - July 4, 2016

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ ను మంగళవారం పునర్ వ్యవస్థీకరించనున్నారు. దీనితో ఎవరు ఉంటారో ? కొత్తవారు ఎవరొస్తారు ? ఎవరు పదవిని కోల్పోతారనే ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేబినెట్ లో ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు కేబినెట్ లో చోటు కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న మోదీ నాలుగు దేశాల పర్యటనకోసం ఆఫ్రికా వెళుతున్నారు.. ఆలోపే కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు..
యూపీ నుండి గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యానాథ్, అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్ కేబినెట్ కు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే యువజన, క్రీడల మంత్రి పదవిపై బీజేపీ ఎంపీ రామన్ దేకా ఆశపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టిన శర్వానంద్ సోనోవాల్‌... కేంద్ర క్రీడలశాఖమంత్రి పదవికి రాజీనామా చేశారు.. ఈ శాఖతోపాటు మరికొన్ని శాఖలకు మంత్రులు లేరు.. వీటి భర్తీతోపాటు... కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశముందని తెలుస్తోంది.. ఇవాళ జరగబోయే బీజేపీ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రివర్గ కూర్పులపై తుదినిర్ణయం తీసుకునే అవకాశముంది.
ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలు దీనిపై తర్జనభర్జనలు పడుతున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో చర్చలు జరుపుతున్నారు. మరి ఎవరు ఉంటారో ? ఎవరు వస్తారనేది తెలియాలంటే కొద్ది గంటలు వేచి ఉండాల్సిందే.

10:09 - July 4, 2016

హైదరాబాద్ : నగరంలో భారీ విధ్వంసానికి చెక్ పెట్టి ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. హైదరాబాద్ లో ఐదుగురు ఐసిస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. మూడో విచారణలో పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీరికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయి ? ఆయుధాలను ఎవరు సమకూర్చారు ? సిరియాకు ఎక్కడి నుండి వెళ్లాలని అనుకున్నారు ? వీరికి సహకరించింది ఎవరు ? అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగా నిందితులను నాందేడ్ కు తీసుకెళ్లి అక్కడ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్నట్లు సమాచారం. పక్కా సమాచారం తీసుకున్న అనంతరం వీరిని అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించాలని ఎన్ఐఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఐదుగురు ఐసిస్ సానుభూతి పరులను శామిర్ పేటలో రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. మూడో రోజు వీరి విచారణ జరుగుతోంది. నిందితుడు ఇబ్రహిం చెప్పిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును చేపడుతున్నారు.

09:35 - July 4, 2016

త్రిపుర : రోడ్డు మరమ్మత్తులు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీ వర్షాలతో ఎనిమిదో నెంబర్‌ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. 20కిలోమీటర్లవరకూ బురదతో నిండిపోయింది. దీంతో ఈ రోడ్డునుంచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 4వేల 500లకుపైగా ట్రక్కులు రోడ్డుపైనే ఆగిపోయాయి.
ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మందులు, ఆహారం, ఇంధనంలేక అల్లాడిపోతున్నారు. లీటర్‌ పెట్రోల్‌ ధర 250 రూపాయలకు చేరింది. నిత్యావసరాల కొరత వేధిస్తోంది. వాతావరణం అనుకూలించక రోడ్లకు మరమ్మత్తు పనులు ముందుకు సాగడంలేదు. నిత్యావసరాల్ని బంగ్లాదేశ్‌నుంచి రవాణా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 

09:28 - July 4, 2016

ఇరాక్ : బాంబు మోతలతో బాగ్దాద్‌ దద్దరిల్లింది. వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 172కి చేరింది.. గాయపడ్డవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది . ఈ దాడులు తామే జరిపామని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. .ఐసిస్ దాడులతో ఇరాక్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. శనివారం అర్థరాత్రి బాగ్దాద్‌లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడ్డారు. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాల్లో బాంబు దాడులు జరిపారు.

రంజాన్ మాసం..
రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్థాలను నింపి పేల్చారు. ఈ ఘటనలో వంద మందిపైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన మరో కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఇస్లామిక్ స్టేట్...
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

ఏడు సార్లు బాంబుల మోత..
ఈ ఏడాదిలో 7సార్లు ఇరాక్‌లో బాంబుల మోత మోగింది.. ఆత్మాహుతిదాడులు వందలాదిమంది ప్రజల ప్రాణాలు తీశాయి.. 2016 ఫిబ్రవరిలో మొదటి బ్లాస్ట్ జరిగింది.. 30మంది చనిపోయారు.. మార్చి 6న హిల్లాలో ఆయిల్‌ ట్యాంక్‌ పేలి 47మంది చనిపోయారు.. మళ్లీ 20రోజుల్లోనే ఇస్కందారియాలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ఆత్మాహుతి దాడిలో 32మంది మరణించారు.. ఇక మే అయితే బాంబుల మోతతో ఇరాక్‌ దద్దరిల్లింది... మే 1, 11, 17 తేదీల్లో బాంబు పేలుళ్లు జరిగాయి.. ఈ పేలుళ్లలో దాదాపు 200మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. ఆ తర్వాత జూన్‌ 9న రెండు ఆత్మాహుతి దాడుల్లో 30మంది చనిపోయారు.

సిరియా నుండి ఆదేశాలు..
ప్రపంచవ్యాప్తంగా పంజావిసురుతున్న ఉగ్రభూతం... దేశాలన్నింటిని భయపెడుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ...ఐసిస్‌ సాగిస్తున్న నెత్తుడి క్రీడ మెత్తం మానవసమాజాల మనుగడనే విషాదంలో నింపుతోంది. బాంబుపేలుళ్లు... ఊచకోతలతో ముష్కర ముఠాలు బరితెగిస్తున్నాయి. స్థానికులను ఉగ్రరొంపిలోకి దించుతున్నాయి. ఐసిస్‌ ప్రభావంలో పడినవారు సొంతపౌరులపైనే దాడులకు తెగిస్తున్నారు. దేశాలు, ప్రాంతాలు తేడాలు లేకుండా రెచ్చిపోతున్న ఐసిస్‌...సిరియాను ప్రధాన అడ్డాగా చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా... తమ భావజాలానికి ఆకర్షితులైన వారిని చేరదీసి విషసర్పాలుగా మారుస్తోంది. ఆయుధాలు వాడటం, బాంబులు తయారు చేయడంలో శిక్షణ ఇస్తోంది. దీనికోసం ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటోంది. టెక్నాలజీ సహాయంతో.. ఇంట్లోనే కూర్చుని ఎక్కడో సిరియానుంచి వస్తున్న ఆదేశాలను అమలు చేస్తున్నారు ఉగ్రవాదులు.

స్లీపర్ సెల్స్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సానుభూతిపరులను స్లీపర్‌సెల్స్‌గా ఉపయోగించుకుంటుంది. మామూలు మనుషుల్లోనే కలిసిపోయి. ఐసిస్‌నుంచి ఆదేశాలు రాగానే ఉన్నట్టుండి విరుచుకు పడుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. సిరియాలో తిష్ఠ వేసిన షఫీక్‌ ఆర్మర్‌ హైదరాబాద్‌లో ఉన్న మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీని సహాయంతో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఈ షఫీక్‌ ఆర్మర్‌కు వివిధ దేశాలకు చెందని ఉగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరంతా కలిసే మారణహోమాలకు ప్లాన్స్‌ వేస్తుంటారు. దీనిలో భాగంగానే వివిధ దేశాల్లోని ముఠాలను ఉసిగొల్పి ఒక దేశం తర్వాత మరో దేశంలో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు.

09:22 - July 4, 2016

వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ తెరచి మూడు వారాలైంది. అవే బడులు. అవే సమస్యలు. ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలంటూ, ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలంటూ పేరెంట్స్, స్టూడెంట్స్ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు ప్రభుత్వం కానీ, పాఠశాలల యాజమాన్యాలు కాని స్పందిస్తున్నాయా? ప్రయివేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో వున్న నిబంధనలేమిటి? వాటి అమలుతీరు ఎలా వుంది? ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులను ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది? ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాల పరిస్థితి ఏమిటి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ మాట్లాడారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి.

తుకారంగేట్ వడ్డెర బస్తీలో దారుణం..

హైదరాబాద్ : తుకారంగేట్ వడ్డెర బస్తీలో దారుణం చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే మహిళపై యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

09:11 - July 4, 2016

ఢిల్లీ : ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు..మారణహోమం సృష్టిస్తున్నారు..ప్రపంచంలో ఎక్కడో ఒక చోట రోజూ పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో విధ్వంసం సృష్టించిన ముష్కరులు రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ఊచకోతకు తెగబడ్డారు. బాగ్దాద్ లో కూడా పేలుళ్లకు పాల్పడ్డారు. తాజగా సౌదీ అరేబియాలో జెద్దాలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో ఆత్మాహుతి దాడికి దిగారు. భారత కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ పేలుళ్లలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. తామే ఈ ఘటనకు పాల్పడినట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దాడితో భయభ్రాంతులకు గురైన కాన్సులేట్ సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆత్మాహుతి దాడితో సౌదీ లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. టూరిజం, విదేశీ ప్రతినిధులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడుతున్నారు.

విజయవాడలో పీఠాధిపతుల నిరసన ప్రదర్శన...

విజయవాడ : ధర్మపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆలయాల కూల్చివేతపై విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో 40 మంది పీఠాధిపతులు పాల్గొంటారు.

 

విశాఖలో బ్రిక్స్ ఇంధన సదస్సు..

విశాఖపట్టణం : నగరంలో రెండు రోజుల పాటు బ్రిక్స్ ఇంధన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఎల్ ఈడీ బల్బులు వినియోగం, ఇంధన ఆదాపై చర్చిస్తారు.

 

నేటి నుంచి ఎఫ్ఏటీపీసీసీఐ శతాబ్ధి వేడుకలు..

హైదరాబాద్ : నేటి నుంచి ఎఫ్ఏటీపీసీసీఐ శతాబ్ధి వేడుకలు నగరంలో జరగనున్నాయి. ఈ వేడుకలను ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు.

నాలుగో రోజు నిలిచిన ఆరోగ్య శ్రీ సేవలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. నేటి నుండి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నారు. రూ. 300 కోట్లు బకాయిలు విడుదల చేయాలని, 20 శాతం ప్యాకేజీ పెంచాలని, ఎంఓయూ ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

సౌదీలో హై అలర్ట్..

ఢిల్లీ : సౌదీ అరేబియాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జెడ్డాలో అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి చేయడంతో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. దాడితో భయభ్రాంతులకు గురైన కాన్సులేట్ సిబ్బందిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆత్మాహుతి దాడితో సౌదీ హై అలర్ట్ ప్రకటించింది.

08:29 - July 4, 2016

ఆ టెంపుల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత..ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఇంకా పటిష్టంగా, పోలీసు పహారాల నీడ లో కనిపిస్తాయి. కానీ ఈ టెంపుల్ లో మాత్రం అందరూ చూస్తుండగానే చోరీ జరిగిపోతుంది. అక్కడున్న జనం లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ గుడిలో దొంగతనాలు చేయాలనే ఆచారం ఉందట. ఈ వింత ఆచారం ఎక్కడా ? అనేది తెలుసుకోవాలంటే ఉత్తరాఖండ్ వెళాల్సిందే.
ఉత్తరాఖండ్...రూర్కీ జిల్లాలోని చూడియాలలో 'చూడామణి' ఆలయం ఉంది. ఈ ఆలయం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతానం కలుగుతుందని ప్రచారం ఉంది. అయితే ఈ ఆలయానికి వచ్చే వారు దొంగతనం చేయాలి. పట్టపగలు..అందరూ చూస్తుండగానే ఈ దొంగతనం చేయాలి. దొంగతనం అంటే ఏదో ఒకటి కాదు. అమ్మవారి కాళ్లపై ఉన్న చెక్కబొమ్మను దొంగిలించాలి. ఈ చెక్కబొమ్మను ఎవరైతే చోరీ చేస్తారా వారు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని ఓ నమ్మకం ఉంది. చెక్కబొమ్మను దొంగిలించిన అనంతరం పుట్టిన బిడ్డతో మళ్లీ ఆలయానికి వచ్చి ఆ చెక్కబొమ్మను తీసుకున్న చోటనే పెట్టాలి. దీనితో పాటు మరియొక్క చెక్క బొమ్మను కూడా సమర్పించాలంట.

08:12 - July 4, 2016

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. తమ డిమాండ్లు తీర్చలేదని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి. దీనితో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు మొత్తం ఒకేసారి చెల్లించాలంటూ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనితో మంత్రి లక్ష్మారెడ్డి యాజమాన్యాలతో చర్చించారు. రూ. వంద కోట్లు విడుదల చేస్తామని, మిగిలిన రూ. 200 కోట్లను దశల వారీగా విడుదల చేస్తామని వెల్లడించారు. కానీ బకాయిలు విడుదల చేయకపోవడం..మొత్తంగా ఒకేసారి బకాయిలను విడుదల చేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. గత నాలుగు రోజులగా వైద్య సేవలు నిలిచిపోయాయి. అంతేగాకుండా ఇస్తున్న ప్యాకేజీకి అదనంగా 20 శాతం పెంచాలని వారు కోరుతున్నారు.

రోగుల ఇబ్బందులు..
మొదటి నుండి కూడా కార్పొరేట్ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మెలో పాల్గొనలేదు. తాజాగా వీరు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అప్పులు చేసి సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలు నడుపలేమని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎంవోయు ప్రకారం ముందుకు సాగాలని, ఆజమాయిషి చలాయిస్తే సహించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. 190 ఆసుపత్రుల్లో 130 ప్రైవేటు ఆసుపత్రులు..60 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. సర్కారీ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందదని భావించే రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుంటారు. ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో రోగులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై మరోమారు వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో సోమవారం భేటీ కానున్నారు. ఈసారి చర్చల్లోనైనా సమస్య తీరుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తెలిసిపోనుంది.

07:58 - July 4, 2016

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల ఆందోళనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ జోక్యం చేసుకున్నారు. ఆందోళన విరమించాలని, సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని ఠాకూర్ వెల్లడించారు. దీనిపై సమావేశమై నిర్ణయం తీసుకుంటామని న్యాయవాదులు పేర్కొన్నారు. మరోవైపు ఏపీ రాష్ట్రంలో ఆలయాల తొలగింపు చిచ్చు రేపుతోంది. టీడీపీ, బీజేపీ మధ్య వాగ్వాదం చెలరేగుతోంది. ఇక దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈనెల 11 నుండి దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొంటే ప్రయాణీకులు, సరుకు రవాణా పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), గోవర్దన్ రెడ్డి (టీఆర్ఎస్), నక్కా ఆనంద్ బాబు (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), విష్ణువర్ధన్ రెడ్డి (బీజేవైఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

07:51 - July 4, 2016

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు..యువ హీరోలు సంవత్సరానికి రెండు..మూడు సినిమాలు చేస్తుంటే ఆ హీరో మాత్రం ఒక్క సినిమాకే పరిమితమయ్యాడు. మూడేళ్లుగా ఒకే సినిమాకు అంకితమయ్యాడు. ఆయనే 'ప్రభాస్'..బాహుబలిలో నటించిన ప్రభాస్ 'బాహుబలి 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. దీనితో జోరు పెంచాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడని టాలీవుడ్ టాక్. బాహుబలి శరీర ధారుడ్యం..బరువును పెంచేసిన ప్రభాస్ కొత్త సినిమాకు బరువు తగ్గాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమా చేయడానికి ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఆగస్టులో బాహుబలి షూటింగ్ పూర్తి కాగానే నవంబర్ లో ప్రభాస్..సుజిత సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ హీరో కూడా వరుస సినిమాలతో అలరించాలని అనుకుంటున్న అభిమానుల కోరికలు నెరవేరుతాయా ? లేదా ? అనేది చూడాలి.

07:48 - July 4, 2016

అన్నీ వేసి చూడు..చివర్లో నన్ను వేసి చూడు అని ఉప్పు అంటుందంట. వంటకాల్లో ఉప్పు లేకపోతే రుచి రాదు. అదే సందర్భంలో వంటకాల్లో ఉప్పు ఎక్కువయితే ఏమి చేయలేమని కొందరు అనుకుంటుంటారు. వండినదంతా వేస్ట్ అని భావిస్తుంటారు. అలాగని కూరలు బయట పడేయకుండా అలాగే తింటుంటారు. కానీ దీనికి ఒక సమస్య పరిష్కారం ఉంది.
కూరలో ఉప్పు ఎక్కువయితే కొద్దిగా కొబ్బరి పాలు జత చేయండి. ఇలా చేయడం ద్వారా తగ్గి రుచికరంగా ఉంటుంది.
పచ్చి బంగాళాదుంప తొక్క చెక్కేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు పది నిమిషాల పాటు అందులో ఉడకనిస్తే ఉప్పు తగ్గిపోతుంది.
ఉప్పు ఎక్కువైన కూరలో ఇది వరకే ఉల్లిపాయ..టమాట పేస్ట్ వేసినట్లైతే మరికొంత ఉల్లి, టమాట పేస్ట్ ను జత చేయండి.
అంతేగాకుండా రెండు లేద మూడు కప్పుల పెరుగును కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు..రుచి కూడా పెరుగుతుంది.
ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాకుండా రుచికరంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.

07:47 - July 4, 2016

ఆరోగ్యంగా ఉండాలంటే మిటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు లోపించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో 'డి' విటమిన్ కూడా ప్రధానం. ఇది లోపిస్తే రకరకాల సమస్యలు మొదలవుతాయి. మరి ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం...
కొందరికి క్షణక్షణానికి మన:స్థితి మారిపోతుంటుంది. ఈ సమస్య తరచూ కనిపెడుతుంటే అది విటమిన్ డి లోపం అని భావించాలి.
విటమిన్ డి శరీరానికి అందిన సమయంలో మేలు చేసే హార్మోను సెరటోనిన్ విడుదలవుతుంది. అది లోపించిన సమయంలో కొవ్వు క్రమంగా కరుగుతుంది.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తలలో చెమటలు పట్టడం, దురదగా, చిరాగ్గా అనిపించడం జరుగుతుంది.
విటమిన్ డి లోపించడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. శరీరానికి కాల్షియం సరిగా అందక ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతాయి.
ఎన్ని నియమాలు పాటించినా, విశ్రాంతి తీసుకున్నా అలసట..ఒత్తిడి బాధిస్తే విటమిన్ డి లోపం అని భావించాలి.
ప్రతి రోజు పాలు, దానిమ్మ, నారింజ, చేపలు, బాదం, ఆకుకూరలు అధిక మోతాదులో తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

నేటి నుండి బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు..

హైదరాబాద్ : నేటి నుండి బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు.

జైల్ భరోకు జేఏసీ పిలుపు..

వరంగల్ : జనగామ జిల్లా చేయాలని జైల్ భరో కార్యక్రమానికి జేఏసీ పిలుపునిచ్చింది. గత కొన్ని రోజులుగా జనగామలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ రాముడు..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని డీజీపీ రాముడు దర్శించుకున్నారు. త్వరలోనే పోలీసు శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని, తిరుమలలో మరింత భద్రతను పెంచుతామన్నారు. టిటిడి సీవీఎస్ లో పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

కరీంనగర్ వివాహిత అత్యాచారయత్నం కేసులో కీలక మలుపు..

కరీంనగర్ : మేడిపల్లి (మం) దేశాయిపేటకు చెందిన వివాహిత మౌనిక కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తండ్రి మల్లయ్యను నిందితుడని పోలీసులు నిర్ధారించారు. కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేశాడు. కూతురు ప్రతిఘటించడంతో చీరతో ఉరివేసి తండ్రి చంపేశాడు. నిందితుడు మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తుమందు చల్లి తన కూతురును కిడ్నాప్ చేశారని మలయ్య పోలీసులకు తెలిపిన సంగతి తెలిసిందే.

 

06:44 - July 4, 2016

వరంగల్ : వారు బ్యాంకు ఉద్యోగులు కాదు.. కానీ లోన్లు ఇప్పిస్తామంటారు. లక్షకు 5వేలు కమిషన్ ఇస్తే చాలంటారు... నమ్మితే ఇక అంతే. నిలువునా ముంచేస్తారు. వరంగల్‌ జిల్లాలో మహిళల నుంచి లక్షల్లో వసూలు చేసి ఉడాయించిన మహా మాయగాళ్ల ముఠా ఉదంతమిది. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న వరంగల్‌ జిల్లాలో ఆర్థిక నేరగాళ్లూ అదే వేగంతో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా జిల్లాలో రుణాలిప్పిస్తామంటూ ఓ ముఠా మహిళలను నిలువునా ముంచేసిన ఘటన వెలుగు చూసింది. ఒక రూపాయి వడ్డికే భారీ రుణాలిప్పిస్తామని.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ తరఫున ఈ రుణాలు వస్తాయని నమ్మబలికారు. ఒక్కొక్కరికి లక్ష నుంచి పది లక్షల వరకూ రుణాలు వస్తాయన్నారు. అయితే రుణంగా లభించే మొత్తంలో ఐదు శాతం అంటే లక్షకు ఐదువేల రూపాయల చొప్పున తమకు ముందే చెల్లించాలన్నారు. అసలు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి ఏపని చేస్తుందో కూడా తెలుసుకోలేని మహిళలు.. గుడ్డిగా ఈ మాయగాళ్ల వలలో పడ్డారు.

కనబడకుండా పోయిన ముఠా..
ఓరుగల్లు నగరంలోని రాంనగర్, కాకతీయ యూనివర్సిటీ ఏరియా, బ్యాంక్ కాలనీలకు చెందిన ప్రజలు.. రుణాలిప్పిస్తామన్న మాయగాళ్లను నమ్మి.. తాము కోరుకున్న రుణాలకు తగ్గ పర్సెంటేజీ మొత్తాన్ని చెల్లించేశారు. ముఠా మాయమాటలు నమ్మి డబ్బులు కట్టిన వారికి ఎంతకూ లోన్లు రాకపోవడంతో ముఠాలోని వ్యక్తిని మహిళలు నిలదీశారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరిగడంతో.. మాయగాళ్లు రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. దీంతో వారికి డబ్బులు కట్టిన మహిళలు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

న్యాయం చేయాలంటున్న బాధితులు..
ప్రస్తుతం పరారీలో ఉన్న ముఠా గత చరిత్ర మొత్తం మోసాలమయమేనని పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. వర్థన్నపేట మండలం ఐనవోలు గ్రామానికి చెందిన బీటెక్‌ చదివిన అనిల్.. మరో 7గురు సభ్యులతో ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నారని సమాచారం. గతంలో నగరంలోని రంగంపేటలో మహిళా సంఘాల వద్ద 20లక్షలు వసూలు చేసి పరారైన ఈ ముఠా సభ్యులు ఆ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. రెండో దఫాలో ఇప్పుడు ప్రజల నుంచి 3లక్షల 10వేలు వసూలు చేసి పరారయ్యారు. ఒక్క రూపాయికే వడ్డీ.. 12సంవత్సరాలు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టే విధంగా లోన్ ఇప్పిస్తామని తమను మోసం చేశారంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు. ప్రజల అమయాకత్వాన్ని అసరాగా చేసుకోని మోసం చేసేందుకు మోసగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

06:39 - July 4, 2016

హైదరాబాద్ : అర్ధరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా నడిచివెళ్ళిన రోజునే నిజమైన స్వాతంత్రమొచ్చినట్టు అన్నాడో మహానుభావుడు రాత్రి మాట దేవుడెరుగు పగలు నడవటానికే మహిళలు భయపడాల్సిన రోజులివి. ఎన్ని చట్టాలు తెచ్చినా.. సమాజంలో హత్యలు తగ్గడం లేదు..ఎన్ని శిక్షలు వేసినా, మానవ మృగాల్లో మార్పు రావడం లేదు..తెలంగాణ జిల్లాల్లో ఒకే రోజు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఆదిలాబాద్ జిల్లాలో యువతిని గొంతుకోసి చంపిన ఘటన మరువకముందే రాష్ట్రంలో పలు ఘటనలు ఇంకా ఈ సమాజంలో కిరాతకులు మారలేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సికింద్రాబాద్‌ బొల్లారంలో పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడో కీచకుడు...శంషాబాద్‌లో మరోబాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడో కామాంధుడు. కరీంనగర్‌లో నవ వధువును కిడ్నాప్‌ చేసి హతమార్చారు. ఇలా వరుస ఘటనలు జరుగుతుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.

శంషాబాద్ లో..
శంషాబాద్‌లో జహంగీర్ అనే ఆటోడ్రైవర్‌ కూతరును అదే ప్రాంతానికి చెందిన జగన్‌ అపహరించాడు. నిర్మానుష్య ప్రదేశంలోనికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నేరం బయటపడుతుందన్న భయంతో బాలిక గొంతులో బలవంతంగా విషం పోసి, తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కట్టెల కోసం వెళ్లిన స్థానికులకు చెట్ల పొదల మధ్య నురుగలు కక్కుతూ ఇద్దరూ కనిపించడంతో ...బాలిక తండ్రికి సమాచారమందించి, పోలీసుకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ లో...
హైదరాబాద్ డౌటన్ బజారులో నివాసముంటున్న దంపతులు ఓ కల్లుపాకలో కల్లుతాగేందుకు పోయారు. దంపతుల వెంట తమ పదేళ్ల కూతురు కూడా ఉంది. కల్లు దుకాణంలో తల్లిదండ్రులు మత్తులో ఉండగా ఓ కామాంధుడు ఈ పదేళ్ల బాలికను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశంలోకి ఎత్తుకెళ్లాడు. లైంగిక దాడి చేసి బండరాయితో మోది చంపాడు. కొన్ని రోజుల కిందటే జైలు నుంచి విడుదలైన అనిల్‌ అనే ఈ నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్..
కరీంనగర్‌ జిల్లా మేడిపల్లి మండలంలో దారుణం జరిగింది. దేశాయ్‌పేట్‌ శివారులో మహిళ దారుణ హత్యకు గురైంది. దేశాయిపేట్‌కు చెందిన మౌనికను మోట్కూరావుపేట్‌కు చెందిన మహేష్‌కు ఇచ్చి ఇటీవలే పెళ్లి చేశారు. అయితే ఆశాడమాసం కావడంతో తల్లిగారింటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని మృతురాలి తండ్రి తెలిపాడు. కూతురి కోసం చాలాచోట్ల వెతికినా దొరకక పోవడంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దేశాయ్‌పేట్‌ శివారులో మౌనిక శవమై ఉండటంతో ఎవరు కిడ్నాప్‌ చేసి చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు అమలులోకి వచ్చినా హత్యలు ఆగడం లేదు. మహిళలపై అత్యాచారాలు తగ్గడం లేదు. నేరగాళ్లను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తేగానీ, సమాజంలో మార్పు రాదంటున్నారు మహిళలు. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

06:36 - July 4, 2016

హైదరాబాద్ : పీడిత, అణగారిన వర్గాల కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన ఘనత ఆయనది..అన్యాయలు, అక్రమాలు, దౌర్జాన్యాలు చేస్తున్న వారితో వీరోచితంగా పోరాటం చేసిన గొప్ప చరిత్ర ఆయనది. మొదటి నుంచి చివరి శ్వాస వరకు గిరిజనుల హక్కుల సాధనకు కోసం కృషి చేసిన గొప్ప మహానీయుడు ఆయన. ఆయనే అల్లూరి సీతారామరాజు.. అల్లూరి పేరిట విశాఖను జిల్లాగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అలనా పాలనా చూసే వారు లేక అల్లూరి స్మారక చిహ్నాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు.. పీడిత వర్గాల కోసం అలుపెరగకుండా పోరాడిన మన్యం వీరుడు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పాండ్రంగిలో జన్మించాడు. ఆ కాలంలో ఆయన నివాసం ఉన్న చుట్టుపక్కల కొండలు, అడవుల్లో తిరుగుతూ.. గిరిజనుల జీవన విధానాన్ని గమనించేవాడు. వారి కష్టాలు, బాధలు తెలుసుకునేవాడు.
గిరిజనులకు అండగా నిలిచిన అల్లూరి సీతారామరాజు..

వేగు చుక్క..
ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన్యంలో గిరిజనుల జీవితాలు దుర్భరంగా ఉండేవి. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి..వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలకు పాల్పడేవారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో బ్రీటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. మన్యం వాసుల కష్టాలను పరిష్కరించడానికి గిరిజనులకు అల్లూరి వేగుచుక్కై నిలిచాడు.

విచారణ లేకుండానే రాజును కాల్చి చంపిన గుడాల్‌..
తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి వారికి అండగా నిలిచి.. పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశాడు. గిరిజనులకు యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి.. వారిని పోరాటానికి సిద్ధం చేశాడు. మొదట పోలీసు స్టేషన్లపై దాడి చేసి.. ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో విప్లవాన్ని ప్రారంభించాడు. రాజును ఎదుర్కొవడానికి నాటి బ్రిటీష్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను గురిచేశారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేశారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా.. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా విచక్షణ లేకుండా చంపారు. ఈ సమయంలో జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రూథర్‌ ఫర్డ్‌ ముందు అల్లూరి లొంగిపోయాడు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. ఈ విషయాన్ని రాజు తల్లికి కూడా తెలియజేయలేదు. మే 8న రాజు పార్థివదేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేశారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

ఇచ్చిన హామీని పరిష్కరించని రాష్ర్ట ప్రభుత్వం..
అల్లూరి మరణించి దాదాపు 90 సంవత్సరాలు దాటాయి.. కానీ, రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో మర్చిపోయింది. విశాఖ జిల్లాను అల్లూరి జిల్లాగా ప్రకటిస్తామన్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. చివరకు అల్లూరి జన్మించిన పాండ్రంగిని గానీ, అల్లూరి సమాధి ఉన్న కేడీపేటను గానీ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ విశాఖ జిల్లాను అల్లూరి జాల్లాగా ప్రకటిస్తామని చెప్పడం..ఇక్కడ ప్రజలు దాన్ని నమ్మడం తప్ప ఇంత వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అల్లూరి వర్ధంతి రోజు రాష్ర్ట సర్కార్‌ కార్యక్రమాలు నిర్వహించడం మినహా ఏమీ చేయడం లేదు. కనీసం ఆయన సమాధిని, జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక స్థలంగా మారుస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడో విస్మరించారు. మన్యం ప్రజలకు కోసం చివరి శ్వాసవరకు అలుపెరగకుండా పోరాడిన వీరుడు అల్లూరి విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం అల్లూరి స్మారక మందిరాన్ని నిర్మించి.. అల్లూరి సమాధిని పర్యాటక ప్రాంతంగా చేయాలని విశాఖ వాసులు కోరుతున్నారు.

06:33 - July 4, 2016

విజయవాడ : రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో అన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గతంలోలాగా... ఎరువులు, విత్తనాల కోసం.. రైతులు ఇబ్బందులు పడకుండా.. ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నైరుతి సీజన్ ఆరంభంలో అధిక వర్షాలు కురుస్తుండటంతో ఏపీ వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు ఊపందుకుంది. జూన్ నెలాఖరు వరకు రాష్ట్రంలో 63శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఇప్పటి వరకు 5.62 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు వేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని ఆ శాఖ డైరెక్టర్ ఆదేశించారు.
ఇకపై రోజుకు లక్ష నుంచి రెండు లక్షల హెక్టార్ల వరకు పంటలు వేసే అవకాశాలున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 13 జిల్లాల్లో 43.86 లక్షల హెక్టార్లలో పలురకాల పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటివరకు అనంతపురంలో అధికంగా 1.28 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా, తూర్పు గోదావరిలో అత్యల్పంగా 2,700 హెక్టార్లలో సాగయ్యాయి.

కూరగాయలు, అపరాల సాగు పెంచాలని నిర్ణయం..
వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. అపరాలు, పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. గతేడాది 6.4 లక్షల హెక్టార్లలో పత్తి వేయగా. ఈ ఏడాది 5 లక్షల ఎకరాలకు పత్తి సాగును పరిమితం చేసి.. అపరాలు, కూరగాయలు సాగు పెరగనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

06:31 - July 4, 2016

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. బ్యారేజీ, రిజర్వాయర్ నిర్మాణానికంటే ముందు పంపుహౌజ్‌లు నిర్మించి, గోదావరి జలాలను ఎత్తిపోయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదలశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఒకవైపు పంపుహౌజ్‌లు, బ్యారేజీల స్థలాల పరిశీలనపై కసరత్తు చేయడంతోపాటు మరోవైపు పంపులు, మోటర్ల తయారీ నిర్ణీత సమయంలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు కాళేశ్వరం పంపు హౌజ్‌లు, బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రెండు రోజుల క్రితమే భోపాల్‌లోని బీహెచ్‌ఈఎల్‌ను సందర్శించిన మరో అధికారుల బృందం పంపులు, మోటర్ల తయారీని పర్యవేక్షించింది. దీంతో రెండువారాల్లో ప్రతిపాదిత నిర్మాణ స్థలాలవద్ద క్యాంపులు ఏర్పాటుచేసి, వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టేందుకు కాంట్రాక్టర్లు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇంజినీర్ల బృందం పర్యవేక్షణలో మేడిగడ్డ బ్యారేజీ స్థలాన్ని ఖరారు చేయగా.. మిగిలిన రెండు బ్యారేజీలపై తుది కసరత్తు చేస్తున్నారు. మూడు బ్యారేజీల కోసం భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు అధికారులను కోరారు.

సమీక్షిస్తున్న మంత్రి..
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణపై కరీంనగర్ జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల దగ్గర క్యాంప్‌లను ఏర్పాటు చేసి, పనులు ప్రారంభించాలని కోరడంతో ఇరిగేషన్ యంత్రాంగం రంగంలోకి దిగింది. బ్యారేజీ, పంపు హౌజ్‌ల సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులన్నీ ఏకకాలంలో జరగాలని సూచించారు. ఈ నెల 15న ముంబయిలో తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల చారిత్రక సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షించాలని, ఆయా పనులను పర్యవేక్షించాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ముందుగా అనుకున్న ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కన్నెపల్లి అనువైనదిగా గుర్తించారు. ఇక్కడ వంద మీటర్ల ఎత్తులో నిర్మించే బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటి నిల్వ ఉండనుందని అధికారులు తుది నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ బ్యారేజీ పనులు వెంటనే మొదలుపెట్టేందుకు ఇంజినీరింగ్ యంత్రాంగం దాదాపుగా పచ్చజెండా ఊపినట్లేనని స్పష్టమవుతున్నది.

06:28 - July 4, 2016

కృష్ణా : విజయవాడలో ఆలయాల కూల్చివేత అంశం ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య చిచ్చును రాజేసింది. కృష్ణా పుష్కరాల అభివృద్ధి పేరిట.. దేవాలయాలను తొలగించడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయాలు కూల్చిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు వచ్చిన కమలనాథులను స్థానికులు అడ్డుకున్నారు. అటు ఆలయాల కూల్చివేతపై సోమవారం ఆందోళన చేపట్టాలని శైవక్షేత్ర పీఠాధిపతి పిలుపునిచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో.. ఐదుగురు మంత్రుల కమిటీ ఆలయాల కూల్చివేత అంశంపై ప్రత్యేకంగా భేటీ అయింది. ఆలయాలను యథావిధిగా పునర్నిర్మించాలని నిర్ణయించింది.

టీడీపీ, బీజేపీ నేతల మధ్య వివాదం..
అభివృద్ధి పేరిట రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆలయాలను కూల్చడంతో.. వివాదం రాజుకుంది. ఈ చర్యను టీడీపీ మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆదివారం ఉదయం.. ఇంద్రికీలాద్రి వద్ద గోశాల తొలగించిన ప్రదేశాన్ని బీజేపీ నేతలు సోమువీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ బృందం సందర్శించింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నేతృత్వంలోని టీడీపీ బృందం... బీజేపీ నేతలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆవేశానికి లోనైన రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. పరిస్థితి తోపులాటకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింప చేశారు. రోడ్ల విస్తరణ పేరిట ఆలయాలను కూల్చడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని వారు ఆరోపించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు. హిందూధర్మ సంరక్షణ పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కమనాథులు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ, బీజేపీ నేతల వాగ్యుద్ధం ఇలా కొనసాగుతున్న తరుణంలోనే.. ఆలయాల కూల్చివేత వ్యవహారంపై శైవక్షేత్ర పీఠమూ స్పందించింది. కూల్చివేసిన ఆలయాలన్నింటినీ ఎక్కడవి అక్కడే పునరుద్ధరించాలని.. లేకుంటే సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించింది.

స్పందించిన సర్కార్..
రోడ్ల విస్తరణలో భాగంగా ఆలయాలను కూల్చివేసిన అంశం వివాదాస్పదం కావడంతో.. ప్రభుత్వం తక్షణమే స్పందించింది. దీనిపై ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా స్థానిక గెస్ట్‌హౌస్‌లో సుదీర్ఘంగా చర్చలు సాగించారు. అనంతరం.. ఆలయాలు కూల్చివేసిన ప్రదేశాలను, గోశాలను పరిశీలించారు. రోడ్ల విస్తరణ, దేవాలయాల తొలగింపు అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం వల్లే జరిగిందన్న అభిప్రాయానికి వచ్చారు. విజయేశ్వరస్వామి, వినాయకుడి దేవాలయాలను అంగుళం కూడా కదల్చమని హామీ ఇచ్చిన మంత్రులు.... తొలగించిన ఆంజనేస్వామి ఆలయాన్ని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. శనీశ్వరాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొత్తానికి ఆలయాల కూల్చివేత వ్యవహారం.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ఎమ్మెల్యే భూమాకు అస్వస్థత..

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తరలించి చికిత్స అందిస్తున్నారు.

నేడు సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా శాఖల ప్లాన్ ఆధారంగా పూర్తిస్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని ఫైనల్ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమీక్ష నిర్వహించనున్నారు.

నేడు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం..

ఢిల్లీ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సత్వరం అనుమతులు - కేంద్ర జల సంఘం పోషించాల్సిన పాత్ర అనే అంశంపై సోమవారం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి పీకే సిన్హా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

9న ఎంసెట్ 2...

హైదరాబాద్ : మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్-2కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు నిర్వహించే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రాసేందుకు 56వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

2016-17 అఫిలియేషన్ ఖరారు..

ఢిల్లీ : 2016-17 అఫిలియేషన్ ను జేఎన్టీయూ ఖరారు చేసింది. 158 ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఖరారయ్యాయి. ఇంజినీరింగ్ కాలేజీల కోసం 241 దరఖాస్తులు రాగా అందులో 83 కాలేజీలకు అనుమతిని నిరాకరించారు. ఫార్మసీ కాలేజీల కోసం 89 దరఖాస్తులు వచ్చాయి. నాలుగు వేల ఫార్మా సీట్లను ఖరారు చేశారు.

నేడు దొడ్డి కొమరయ్య స్మారక భవనం ప్రారంభోత్సవ సభ..

వరంగల్ : దేవరుప్పల (మం) కడవెండిలో దొడ్డి కొమరయ్య స్మారక భవనం ప్రారంభోత్సవ సభ జరగనుంది.

 

నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్న జగన్..

హైదరాబాద్ : నేడు లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు, ఇన్ ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు జగన్ భేటీ కానున్నారు. ఈనెల 8న తలపెట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమం, నియోజకవర్గాల సమస్యలపై చర్చించనున్నారు.

నేడు టి. లా కాలేజీల్ బంద్ కు పిలుపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లా కాలేజీల బంద్ కు న్యాయవాదులు పిలుపునిచ్చారు. న్యాయవాదుల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Don't Miss