Activities calendar

05 July 2016

22:03 - July 5, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంకు ఈడీ సమన్లు జారీ చేసింది. 2జీ కుంభకోణంలో ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంలోని మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ వారంలో కార్తీ చిదంబరం స్వయంగా లేదా తన ప్రతినిధి ద్వారా ఈడీ ముందు హాజరవ్వాలని.. వ్యక్తిగత ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు, కంపెనీతో సంబంధం ఉన్న డాక్యుమెంట్లు తీసుకురావాలని ఈడీ ఆదేశించింది. గత ఏడాది నుంచి కేసు విచారణ జరుగుతుండగా తొలిసారి ఈడీ.. కార్తీకి నోటీసులు పంపించింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే ఈడీ, ఆదాయపన్ను శాఖ కార్తీ కంపెనీలో ఇదివరకే సోదాలు జరిపింది. 

22:01 - July 5, 2016

ఢిల్లీ : ప్రధాని మోడీ 'మన్‌కిబాత్‌' కార్యక్రమం మాదిరి కేజ్రీవాల్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. టాక్‌టుఏకే.కామ్‌ ద్వారా కేజ్రీవాల్‌ త్వరలోనే ప్రజలతో మాట్లాడనున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌ పనులు దాదాపు పూర్తయ్యాయి. జులై 17 ఆదివారం 11 గంటలకు తొలి ఎపిసోడ్‌ను ప్రారంభించనున్నారు. 

21:58 - July 5, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతోంది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో "ప్రాజెక్ట్‌ ప్రతిపాదన చర్చ' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సమావేశానికి టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హాజరయ్యారు. చట్టం ప్రకారం భూనిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోదండరామ్‌ అన్నారు. 

 

21:56 - July 5, 2016

విజయవాడ : సదావర్తి భూముల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. టెండర్లలో ఎకరం 50 లక్షలకు సర్కార్‌ నిర్ణయించగా.. ఎవరూ ముందుకు రానందుకే 27 లక్షల 188 రూపాయలతో ఒకొక్క ఎకరాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అంతకంటే ఎక్కువకు కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా.. మళ్లీ టెండర్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. 

 

21:52 - July 5, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్..  రేపు విజయవాడ వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్న గవర్నర్... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. హైకోర్టు విభజన, నీటి వివాదాలపై...  గవర్నర్.. బాబుతో చర్చించనున్నట్టు సమాచారం. హైకోర్టు విభజనపై తెలంగాణలో ఆందోళనల నేపథ్యంలో... ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 

 

21:49 - July 5, 2016

హైదరాబాద్ : కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న న్యాయశాఖ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతో భేటీ అయ్యారు. తమ డిమాండ్లు, సమస్యలపై చర్చించారు. సమ్మె సమయంలో నలుగురు ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్‌ తొలగింపు అంశంతోపాటు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై చర్చించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్నాథం తెలిపారు. 

 

21:40 - July 5, 2016

కేబినెట్ ను ఇస్తరాకును చేసిన మోడీ.. ఇప్పుడన్న సురువైతదా నీవాడి, పాలమూరు కాడ మాటదప్పిన పెద్దసారు.. మల్లన్నసాగర్ అసొంటిదే చేస్తున్నరు పోరు, ఆట సభలకు పిలిచి అవమానించిండ్రు... ఏడ్చినట్టు చేసిన రసమయి బాలకిషన్, విదేశీపర్యటనలకు తయరైన ప్రధాని... ఇదేమన్నా కొత్తముచ్చటన గానీ, నంద్యాల కాడ తలుగుదెంపుకున్న తమ్ముడు... బైకును ఢీకొట్టి... తర్వాత బెల్టుతోటి కొట్టి.. పాముకు చుచ్చుపోపిచ్చిన తల్లి ఎలుక... పామునోట్లకెల్లి బయటపడ్డ పిల్ల ఎలుక... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:26 - July 5, 2016

ఎపి నూతన రాజధాని అమరావతి స్విస్ చాలెంజ్ పద్ధతిలో నిర్మించడం సరికాదని విశ్రాంత ఐఎఎస్‌ ఈఏఎస్‌ శర్మ తెలిపారు. ఈమేరకు టెన్ టివి ఆయనతో  ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా శర్మ పలు అసక్తికరమైన విషయాలను వెల్లడించారు. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని నిర్మించడం నష్టదాయకమన్నారు. అమరావతి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందన్నారు. చట్టాల ఉల్లంఘన మంంచిది కాదని హితవుపలికారు. రాయలమసీమ, ఉత్తరాంధ్రకు నష్టం కలుగుతుందని చెప్పారు. ఆరోగ్య రంగం, విద్యారంగం తీవ్ర ప్రభావం పడుతుందని వాపోయారు. నిరంకుశంగా, ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరించడం భావ్యం కాదన్నారు. ప్రజల అభిప్రాయాలును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇకపోతే అధికారులు ప్రజా సంక్షేమమే ధ్వేయంగా పని చేయాలని.. రాజకీయ నేతల మాటలు వినకూడదని  చెప్పారు.  ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:14 - July 5, 2016

విజయవాడ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టీసీలు ఇచ్చి... స్కూలు మూసివేసిన సంఘటన విజయవాడ ఆవనిగడ్డలో జరిగింది. దీనిపై గ్రామస్థులు, సీపీఎం, సీపీఐ నాయకులు స్కూలు ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కరిసినేని నాయకమ్మ స్మారక విద్యార్థుల సంఘం 1968లో బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఈ స్కూల్‌లో చదువుకున్న ఎందరో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అయితే ఇప్పుడా స్కూల్‌లో ఉపాధ్యాయులు లేరనే కారణంతో  స్కూల్ మూసివేయాలని కరస్పాడెంట్‌ నిర్ణయించారు. తక్షణమే స్కూల్‌ను తెరవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.  

21:05 - July 5, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో ఎన్‌ఐఏ మళ్లీ తనిఖీలు చేపట్టింది. అరెస్టైన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో... బార్కాస్, తలాబ్‌కట్టలో సోదాలు జరిపింది. ఇందులో 17బుల్లెట్లు, 2కంప్యూటర్లు, 2 స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు.

 

20:55 - July 5, 2016

విజయవాడ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలుస్తామని ప్రగల్భాలు పలికిన నేతలు.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేస్తున్నారు. కృష్ణా పుష్కరాల పేరుతో.. ఎన్నో ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కరకట్ట ప్రాంత వాసులను తరిమేందుకు పాలకులు యత్నిస్తున్నారు. ఈరోజు ఇళ్లను తొలగించేందుకు వచ్చిన అధికారులు, పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 
కరకట్ట ప్రాంతవాసులు ఆందోళన 
విజయవాడలో కృష్ణా కరకట్ట ప్రాంత వాసులు మరోసారి ఆందోళనకు దిగారు. కృష్ణా పుష్కరాల పేరిట కరకట్ట ప్రాంతంలో ఇళ్లను తొలగించేందుకు అధికారులు, పోలీసులు యత్నించారు. దీంతో బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఇళ్లను తొలగించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ నివాసాలను తొలగిస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
బాధితుల ఆందోళనకు సీపీఎం, వైసీపీ నేతలు మద్దతు
బాధితుల ఆందోళనకు సీపీఎం, వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. కృష్ణా పుష్కరాల పేరిట ప్రభుత్వం కరకట్ట ప్రాంతంలో నివాసాలను తొలగించడం సరైంది కాదని ఆరోపించారు.  ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీడీపీ ఎన్నికలకు ముందు ఓ మాట.. ఇప్పుడో మాట చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుపై విమర్శలు 
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు. కృష్ణలంక ప్రాంత వాసులను తొలగిస్తే బాధితులు అండగా ఉంటానని చెప్పిన గద్దె.. ఇప్పుడు ఈ ప్రాంతంవైపు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.  స్థానికుల ఆందోళన నేపథ్యంలో కృష్ణా కరకట్ట ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఎపిలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

హైదరాబాద్ : ఎపిలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. సివిల్ సప్లై కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యదర్శిగా బి.రాజశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. మహిళా శిశుసంక్షేమ సంఘం కార్యదర్శిగా జి.జయలక్ష్మీ నియమించారు. 

20:40 - July 5, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. ఏపీ పరిశ్రమల శాఖ తమ సమాచారాన్ని చోరీ చేసిందంటూ తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారాన్ని తమకు తెలియకుండానే.. ఏపీ పరిశ్రమల శాఖ తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు వివరించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

 

రేపు పట్టిసీమ నుంచి నీటి విడుదల చేయనున్న చంద్రబాబు

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఉదయం 10 గంటలకు లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటి విడుదల ప్రారంభిస్తారు. అయితే పోలవరం కుడికాలువ పూర్తిగా సిద్ధం కాదందున తొలిరోజు కొన్ని పంపులను మాత్రమే రన్ చేయనున్నారు. అనంతరం సీఎం పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. 

20:35 - July 5, 2016

హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఉదయం 10 గంటలకు లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటి విడుదల ప్రారంభిస్తారు. అయితే పోలవరం కుడికాలువ పూర్తిగా సిద్ధం కాదందున తొలిరోజు కొన్ని పంపులను మాత్రమే రన్ చేయనున్నారు. అనంతరం సీఎం పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. 

 

వరంగల్ లో పిడుగుపాటుకు 10మందికి తీవ్రగాయాలు

వరంగల్ : జిల్లాలోని నెల్లికుదురు మండలం భూక్యాతండాలో పిడుగుపాటు సంభవించింది. పిడుగుపాటు ధాటికి 10మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

20:22 - July 5, 2016

నల్గొండ : టీ.ప్రభుత్వం నిరంకుంశంగా వ్యవహరిస్తూ రైతుల పొట్ట కొడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రాజెక్టు కట్టితీరతాం అని హరీష్ రావు మళ్లీ ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సాగులో లేని భూములను మాత్రమే ప్రాజెక్టుల కోసం సేకరించాలని.. ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతుందని విమర్శించారు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టుల పేరుతో జరిగే భూ దోపిడికీ తాము వ్యతిరేకమని తమ్మినేని తెలిపారు.

 

20:16 - July 5, 2016

హైదరాబాద్ : భవిష్యత్‌ కార్యాచరణపై న్యాయాధికారులు సమావేశమయ్యారు. సస్పెన్షన్‌ చేసిన 11 మంది న్యాయాధికారులను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టును కోరారు. సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు విధులకు హాజరుకావద్దని నిర్ణయించారు.

 

20:14 - July 5, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం మొదలైంది. తమ పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌ను కాపీ చేశారంటూ... ఏపీ ప్రభుత్వంపై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేసినట్లు మంత్రి కేటీఆర్... నిర్మలా సీతారామన్‌కు లేఖరాశారు. కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

 

పాతబస్తీలో ఎన్ ఐఏ తనిఖీలు

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఎన్ ఐఏ తనిఖీలు చేపట్టారు.  బార్కాస్, తలాబ్ కట్టలో  సోదాలు నిర్వహించారు. 17 బుల్లెట్లు, 2 కంప్యూటర్లు, 2 స్కానర్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఉగ్రవాదులిచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించారు. 

సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన న్యాయాధికారులు

హైదరాబాద్ : సమ్మె విరమిస్తున్నట్లు న్యాయాధికారులు ప్రకటించారు. రేపటి నుంచి న్యాయవాదులు విధులకు హాజరుకానున్నారు. 
పదిరోజులుగా న్యాయాధికారులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. 

19:37 - July 5, 2016

నిజమాబాద్‌ : ఎప్పుడు... ఎక్కడ పుట్టారో వారికి తెలియదు. తల్లి గోరుముద్దల రుచి ఎరుగరు. కన్నతండ్రి లాలన ఎలా వుంటుందో తెలియదు. ముద్దు మురిపాలు అసలే ఎరుగరు. చెత్తకుప్పలే పురిటి పాకలుగా.. ఊరి చావళ్లే చిరునామాగా పెరిగిన పసికూనలు వాళ్లు. అడుగడుగునా అవమానం.. అంతులేని దుఃఖం.. భవిష్యత్తు అగమ్య గోచరం. ఇది వారి గతం..! వర్తమానానికి వస్తే.. పరిస్థితి మారింది. వారిప్పుడు అందరు పిల్లల మాదిరిగానే హాయిగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. బంగారు భవిష్యత్‌కు చక్కటి బాటలు వేసుకుంటున్నారు. ఇదెలా సాధ్యమైంది..?  వాచ్‌ దిస్‌ స్టోరీ.
మానవత సదన్‌ 
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు..!  పదుల సంఖ్యలో చిన్నారులు. అయినవారెవరూ లేని అనాథలు. దారం తెగిన గాలిపటంలా ఏ దరికో చేరాల్సిన వారికి... మానవత సదన్‌ అమ్మయింది. కన్నవారే కాదనుకుని పారేసుకుంటున్న ఈ రోజుల్లో..  వారందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది.. 
అద్భుత ఆవాసం
అనాథలను అక్కున చేర్చుకున్న ఈ సదనం.. ఏ స్వచ్ఛంద సంస్థో నిర్వహిస్తోందనుకుంటే పొరపాటే. అచ్చంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. సర్వశిక్షాభియాన్‌ పథకం కింద నడుస్తోన్న అద్భుత ఆవాసం. 
అభాగ్యులకు భాగ్యప్రదాతగా 
నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ మానవత సదన్‌.. అభాగ్యులకు భాగ్యప్రదాతగా విలసిల్లుతోంది. ఈ కేంద్రంలోకి అడుగు పెట్టిన వారికి.. చదువు సంధ్యలతో.. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపే పిల్లలు కనిపిస్తారు. ఇక్కడి సిబ్బంది తల్లీతండ్రీ తామే అయి.. పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు అనునిత్యం శ్రమిస్తూ కనిపిస్తారు. 
బాలబాలికలకు ఉచిత భోజనం, విద్య 
సదన్‌లోని బాలబాలికలకు ఉచిత భోజనం, విద్యను అందించడమే కాదు.. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లోనూ తర్ఫీదునిస్తున్నారు. అమ్మానాన్నల పెంపకంలోని బాలబాలికలకు ఏ మాత్రం తీసిపోకుండా.. వీరూ ఎదిగేలా.. మానవత సదన్‌లో అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. ఇక్కడి సిబ్బంది మొత్తం.. పిల్లల్ని సొంతబిడ్డల్లా చూసుకుంటారంటే అతిశయోక్తి కాదు. 
డిచ్‌పల్లి కేంద్రంగా మానవత సదన్‌ 
ఆవాస కేంద్రం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి 21 ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా.. అందులో డిచ్‌పల్లి కేంద్రంగా మానవత సదన్‌ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్ చొరవతో సదన్‌కు నిధులు సమకూర్చుతున్నారు. ప్రస్తుతం 84 మంది చిన్నారులు  ఈ సదన్‌లో విద్యనభ్యసిస్తున్నారు. పిల్లలంతా కూడా ఇప్పటి నుంచే ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా తర్ఫీదునిస్తున్నారు. 
మానవత సదన్‌ కు అండదండలు
మానవత సదన్‌ను స్థానికులు.. ప్రముఖ సంస్థలు ఓ ప్రభుత్వ వసతి గృహంగా భావించడం లేదు. తోచిన రీతిలో అండదండలు అందిస్తున్నారు. డిచ్‌పల్లిలోని మానవత సదన్‌ను అభివృద్ధి చేయడానికి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 96 లక్షల నిధులతో కంపౌండ్‌ వాల్‌, డైనింగ్‌ హాల్‌, సోలార్‌ ఫెన్సింగ్ లాంటి వసతులు ఏర్పాటు చేస్తోంది. దీంతో పాటు మరికొంతమంది ప్రైవేటు వ్యాపారులు మానవత సదన్‌కు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఎంతో మంది అనాథల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న ఈ అవాస కేంద్రం మిగిలిన సేవా సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 

19:08 - July 5, 2016

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హిట్‌ అండ్‌ రన్‌ కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. మహారాష్ట్ర సర్కార్‌ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఫాస్ట్‌ ట్రాక్‌ తీర్పు ఇవ్వాలన్న మహారాష్ట్ర వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఫాస్ట్‌ ట్రాక్‌ తీర్పు కోసం ప్రధాన న్యాయమూర్తికి వినతి చేయాలని సూచించింది. కనీసం 6 నెలలోగా తీర్పు ఇవ్వాలని మహారాష్ట్ర అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2002లో బాంద్రాలోని ఓ బేకరీ ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపై నుంచి సల్మాన్‌ ల్యాండ్‌ కూజర్ కారు తోలాడు. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

 

19:05 - July 5, 2016

ఖమ్మం : 20 సంవత్సరాల నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి హరితాహారం పేరుతో తెలంగాణ ప్రభుత్వం భూములను లాక్కోవాలని చూస్తోందని సీపీఎం నేతలు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో రైతుల భూముల్లోకి వచ్చిన ఫారెస్టు అధికారులను గ్రామస్థులతో కలిసి అడ్డుకున్నారు. భూములివ్వని రైతులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. 

 

19:01 - July 5, 2016

హైదరాబాద్ : దంపతుల మధ్య తగాదాలతోనే సింథియా మర్డర్‌ జరిగిందని శంషాబాద్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. కొంత కాలంగా భార్య తీరుపై అనుమానం,.. ఆర్ధిక ఇబ్బందులతో నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయన్నారు. హత్యకు ముందు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఆవేశంలోనే సింథియాను రూపేష్‌ హత్య చేశాడని డీసీపీ తెలిపారు. పూర్తి దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

18:55 - July 5, 2016

మహిళలు.. మెటర్నిటీ యాక్టు అంశంపై వక్తలు మాట్లాడారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో అడ్వకేట్ ముజీప్ కుమార్, జాహ్నవి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ శాంతి పాల్గొని, మాట్లాడారు. మెటర్నిటీ యాక్టు 1961 లో చేయబడిందన్నారు. ఈ చట్టం ప్రకారం ఉద్యోగం చేసే మహిళలకు డెలివరి నుంచి మూడు నెలల వరకు సెలవు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:34 - July 5, 2016

విశాఖపట్నం : విశాఖ పోర్టు ట్రస్ట్‌లో పని చేస్తున్న 400 మంది  ప్రైవేట్‌ పూల్‌ కలాసీలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. తొలిగించిన కాలాసీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌... పోర్ట్‌ ట్రస్ట్‌ పరిపాలనా భవనం దగ్గర మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన ప్రైవేటు కళాసీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గణేష్‌కుమార్‌ హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:29 - July 5, 2016

హైదరాబాద్‌ : భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎల్బీనగర్, చిక్కడపల్లి, అమీర్‌పేట, కూకట్‌పల్లిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి పడుతున్న వానతో... రోడ్లన్ని జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో... వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ ఎంసీకి చెందిన అన్ని టీములు.. సిద్ధంగా ఉండాలని కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఆదేశించారు.

 

సికింద్రాబాద్ లో కలుషిత నీరు తాగి 60మందికి అనారోగ్యం

హైదరాబాద్ : సికింద్రాబాద్ లాలాపేట రైల్వేక్వార్టర్స్‌లో కలుషిత నీరు తాగి 60మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

16:29 - July 5, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ లాలాపేట రైల్వేక్వార్టర్స్‌లో కలుషిత నీరు తాగి 60మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

16:22 - July 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో భూనిర్వాసితుల సమస్యలపై పాదయాత్రలు చేపట్టాలని భూనిర్వాసితుల పోరాట కమిటీ నిర్ణయించింది.  ఈనెల 7 నుంచి 18 వరకు నాలుగు జిల్లాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్టు పోరాట కమిటీ కన్వీనర్‌ బీ వెంకట్‌ చెప్పారు. జులై 7 నుంచి 9 వరకు పాలమూరు, 12, 13 తేదీల్లో కరీంనగర్‌, 14న ఖమ్మం జిల్లాలో పాద యాత్ర చేస్తారు. ఈనెల 16 నుంచి 18 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ఫార్మా సిటీ నిర్వాసితులు సమస్యలపై పాదయాత్ర చేపడతారు.  ప్రాజెక్ట్‌ల కోసం 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని  వెంకట్‌ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 123, 124 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 2013  భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకపోతే భూములు ఇవ్వమని పాదయాత్ర సందర్భంగా రైతుల నుంచి సంతకాలు తీసుకోవాలని పోరాట కమిటీ నిర్ణయించింది. 

 

అగ్రిగోల్డ్‌ కేసు... పలువురికి నోటీసులు

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్ల బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ సీఐడీ సహా ముగ్గురు డైరెక్టర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 

16:18 - July 5, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్ల బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ సీఐడీ సహా ముగ్గురు డైరెక్టర్లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 

 

హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, కోఠి, నాంపల్లి, ఆబిడ్స్, బాగ్  లింగంపల్లి, నారాయణగూడ, కాచిగూడ తదిరత ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

 

16:06 - July 5, 2016

థాయిలాండ్‌ : మందుపాతర పేలి కాలు కోల్పోయిన థాయిలాండ్‌ ఏనుగు మోషాకు తొమ్మిదో కృత్రిమ కాలు అమర్చారు. పదేళ్లక్రితం థాయ్‌లాండ్‌, మయన్మార్‌ సరిహద్దులో మందుపాతర పేలడంతో 12 ఏనుగులు గాయపడ్డాయి. ఈ ఏనుగులకు కృత్రిమ అవయవాలు తయారు చేసేందుకు థాయ్లాండ్ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ థెర్డ్చాయ్ సాయపడ్డారు. మోషాకు వయసు ఏడు నెలల వయసప్పుడు ఈ ప్రమాదం జరిగింది.. అప్పటినుంచి 8 కాళ్లను వైద్యులు అమర్చారు. ఈ వారం ఆసియన్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ఆస్పత్రి తొమ్మిదో కాలును అమర్చింది.

 

16:02 - July 5, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబసభ్యులు, సంగీత దర్శకుడు యం.యం. కీరవాణి, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, సినీదర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి తిరుమలకు వచ్చారు. విఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. 

 

15:58 - July 5, 2016

నిజామాబాద్ : పక్కాగా రెక్కీ నిర్వహిస్తారు.. టైం, డేట్‌ అన్నీ ఫిక్స్‌ చేసుకొని రంగంలోకి దిగుతారు... ప్లాన్‌ ప్రకారం అంతా దోచుకొని పారిపోతారు.. నగరం దాటారా? ఇక వారిని గుర్తించడం... పట్టుకోవడం... రెండూ కష్టమే... నిజామాబాద్‌ జిల్లాలో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న దొంగతనాలపై స్పెషల్ స్టోరీ.. 
దోచుకొని దర్జాగా ఉడాయిస్తున్నారు..
నిజామాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికినంత దోచుకొని దర్జాగా ఉడాయిస్తున్నారు. ప్రతి ఏడాది కోట్ల రూపాయలు చోరీ అవుతున్నా... పోలీసులు మాత్రం అందులో సగంకూడా రికవరీ చేయలేకపోతున్నారు.. దొంగల్నిపట్టుకోవడంలోకూడా విఫలమవుతున్నారు.
కత్తులతో బెదిరించి, హత్యలుచేసి దోపిడీలు
నిజామాబాద్‌ జిల్లా కర్నాటక, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉంది... ఇదే దొంగలకు వరంగా మారింది.. ఇక్కడ చోరీలు చేస్తున్న దొంగలు కొన్ని గంటల్లోనే మహారాష్ట్ర పారిపోతున్నారు.. ఆ డబ్బంతా జల్సా చేశాక మళ్లీ జిల్లాకు వస్తున్నారు.. ఇలా మహారాష్ట్ర సరిహద్దులో దాదాపు 10 ముఠాలు సంచరిస్తున్నాయి... ఒక్కో ముఠా ఒక్కో పద్దతిలో చోరీ చేసి జనాల సొమ్ము దోచుకుంటున్నాయి.... పక్కాగా రెక్కీ నిర్వహించి ఆ తర్వాతే ఈ దొంగల టీంలు చోరీలు చేస్తాయి.. కత్తులతో బెదిరించి కొన్నిసార్లు.. హత్యలుచేసి మరికొన్నిసార్లు చోరీలకు పాల్పడుతున్నాయి.... పోలీసులు అప్రమత్తమయ్యేలోపు రైళ్లద్వారా జిల్లా సరిహద్దు దాటేస్తున్నాయి.  
2013లో 421 దొంగతనాలు, రూ. 4 కోట్ల 50లక్షలు చోరీ
మూడేళ్లనుంచి జరుగుతున్న దొంగతనాలు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.. 2013లో 421 దొంగతనాలు జరగగా... దాదాపు 4కోట్ల 50లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు.. ఇందులో పోలీసులు 2కోట్ల 29లక్షలను రికవరీ చేశారు.. 2014లో 357 చోరీలుచేసిన దొంగలు.. 4కోట్ల 41లక్షల రూపాయలు దోచుకున్నారు.. ఇక్కడా కేవలం 2కోట్ల 12లక్షల రూపాయలు మాత్రమే రికవరీ అయ్యాయి.. ఇక 2015లో 335చోట్ల దొంగలు ప్రతాపం చూపారు.. 4కోట్ల 34లక్షలు చోరీ చేశారు.. ఈ దొంగల్లో కొందరిని పట్టుకున్న పోలీసులు కోటి 78లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. ఈ మూడేళ్లలో మొత్తం 11వందల 13 చోరీచేసిన దొంగలు... 13కోట్ల 25లక్షలతో దొంగలు ఉడాయించారు.. ఇందులోనూ 6కోట్ల 19లక్షలే రికవరీ అయ్యాయి... ఇలా కోట్లకు కోట్లు ఎత్తుకుపోతున్నా అందులో సగం డబ్బుకూడా రికవరీ కావడంలేదు.
20 శాతం అపార్ట్‌మెంట్లకు మాత్రమే సీసీ కెమెరాలు
దొంగలు ఈ స్థాయిలో విజృంభించడానికి చాలా కారణాలున్నాయని స్థానికులు చెబుతున్నారు.. ముఖ్యంగా జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు లేక దొంగలు దర్జాగా జిల్లా దాటేస్తున్నారు.. సీసీ కెమెరాలు లేకపోవడంతోకూడా దొంగల్ని గుర్తించడం కష్టంగా మారుతోంది.. నగరంలో 120 అపార్ట్‌మెంట్లు ఉండగా.... 20 శాతం భవనాలకుమాత్రమే సీసీ కెమెరాలున్నాయి.. మిగతా చోట్ల చోరీలు జరిగినా దొంగల్ని గుర్తించే పరిస్థితి లేదు.. సీసీ కెమెరాలున్న ప్రదేశాల్లోమాత్రం దొంగలు ఎక్కువశాతం పోలీసులకు దొరికిపోతున్నారు. జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తే ఈ చోరీలు కాస్త తగ్గే అవకాశముంది.. అలాగే ముఖ్యమైనా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుద్వారాకూడా దొంగతనాలు తగ్గుతాయి.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

15:44 - July 5, 2016

హైదరాబాద్ : దేశాలు వేరైనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. మనుసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు గుర్తుగా కూతురు కూడా పుట్టింది. 11 ఏళ్లు హాయిగా సాగిన కాపురంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వేరే వ్యక్తి మోజులో పడ్డ భార్య క్షణికసుఖాల కోసం పరుగులు తీయడం కాపురంలో కల్లోలం సృష్టించింది. హైదరాబాద్‌లో భర్త చేతిలో దారుణహత్యకు గురైన సింథియా ఉదంతంలో నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి.     
సింథియా హత్య కేసులో ట్విస్ట్.. 
హైదరాబాద్‌లో సంచలనం రేపిన సింథియా మర్డర్‌ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. సింథియా భర్త రూపేశ్‌ను లోతుగా విచారిస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. సింథియా వివాహేతర సంబంధమే దంపతుల మధ్య తగాదాకు కారణమని తెలుస్తోంది. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సింథియా.. విడాకులు కోరినందుకే రూపేశ్ కుమార్ అగర్వాల్ ఆమెను అంతం చేసినట్లు సమాచారం. 
ఫ్రెంచ్‌ యువకుడి ప్రేమ మైకంలో సింథియా..  
దక్షిణాఫ్రికాలో రూపేశ్ కుమార్‌కు కాంగో దేశస్తురాలు సింథియాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం హాయిగా సాగింది. వీరికి 7 ఏళ్ల కూతురు సానియా ఉంది. ఫ్రెంచ్‌ యువకుడితో సింథియాకు ఏర్పడ్డ ఫేస్‌బుక్‌ స్నేహం.. ప్రేమగా మారింది. ఫ్రెంచ్‌ నుంచి ఇండియా చేరిన అతడు.. సింథియాను కలిసి పెళ్లి విషయంపై చర్చించాడు. వీసా, పాస్‌ పోర్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. కూతురు సానియాను కూడా తమ వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది సింథియా. 
గొంతు నులిమి భార్య హత్య..  
అప్పటికే షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రూపేశ్‌కు భార్య ప్రవర్తన మరింత ఆగ్రహానికి గురిచేసింది.  విడాకులు ఇవ్వాలని భార్య ఒత్తిడి పెంచడం అతడిలో అసహనాన్ని పెంచింది. కూతురును తన దగ్గరే వదిలి వెళ్లాలన్న  షరతును భార్య తిరస్కరించడంతో ఆదివారం రాత్రి మళ్లీ గొడవ పడ్డారు. మాటమాట పెరగడంతో ఇద్దరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో రూపేశ్‌ భార్య గొంతు నులిమి హత్య చేశాడు.  
కూతురుకు తెలియకుండా రూపేశ్‌ జాగ్రత్తలు 
బ్యాగుతో సహా భార్య మృతదేహానికి నిప్పు.. 
సోమవారం ఉదయం కూతురు సానియాను స్కూల్‌కు పంపాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ ముక్కలను పెద్ద బ్యాగ్‌లో ప్యాక్ చేశాడు. సాయంత్రం కుమార్తె ఇంటికి రాగానే.. అద్దెకు తెచ్చుకున్న ఫోర్డ్‌ కారులో ఆ బ్యాగ్‌ను పెట్టి.. చెత్తను కాల్చేసి వద్దామని కూతురుతో చెప్పాడు. శంషాబాద్ శివారులోని మదన్‌పల్లికి రాత్రి 7గంటలకు కారులో వచ్చాడు. కూతురును కొద్ది దూరంలోనే దించేశాడు. కారును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బ్యాగును కిందకు దించి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు.  వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో బయలుదేరాడు. మదన్‌పల్లి శివారులోకి వెళ్లగానే బురదలో కారు ఇరుక్కుపోయింది. దూరంగా మంటలు కనిపించడం.. రూపేష్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రూపేశ్‌తో పాటు అతడి కుమార్తెనూ అదుపులోకి తీసుకున్నారు.

 

13:45 - July 5, 2016

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శులు జరిపిన భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కృష్ణా జలాల తాత్కాలిక నీటి కేటాయింపులపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్రంతో ఉభయ రాష్ట్రాలకు చెందిన మంత్రులు చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మంగళవారం తెలంగాణ సచివాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శులు భేటీ జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటిక్రితం ముగిసింది. కృష్ణా బోర్డు నిర్వాహణ విధి విధానాలపై చర్చించడం జరిగిందని ఏపీ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ వేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు, కమిటీ విధి విధానాలు వచ్చాక తమ వాదనలు వినిపిస్తామన్నారు. వాదనల ఆధారంఆ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బోర్డు విధి విధానాలపై మరోసారి భేటీ అవుతామన్నారు.
మరో రెండు, మూడు రోజుల్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కేవలం అభిప్రాయాలను మాత్రమే పంచుకోవడం జరిగిందని, దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ముగిసిన ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శుల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శులు జరిపిన భేటీ కొద్దిసేపటిక్రితం ముగిసింది. కృష్ణా బోర్డు నిర్వాహణ విధి విధానాలపై చర్చించడం జరిగిందని ఏపీ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ పేర్కొన్నారు.

13:31 - July 5, 2016

గుంటూరు : వైఎస్ జగన్ ఏపీ అభివృద్థికి సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, జగన్ అడ్డుపడకుంటే మెనిఫెస్టోలో లేని పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పారు. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం చేపట్టే ముందు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

13:27 - July 5, 2016

హైదరాబాద్ : వీణా..వాణి ఆపరేషన్ పై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆపరేషన్ కు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం నీలోఫర్‌ ఆస్పత్రి వైద్యులతో వీణ, వాణి తల్లిదండ్రుల భేటీ అయ్యారు. సర్జరీకి అంగీకారం తెలుపుతూ తల్లిదండ్రుల లేఖ ఇచ్చారు. ప్రస్తుతం ఈ లేఖపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
గత కొంతకాలంగా వీణా..వాణి ఆపరేషన్ పై తర్జనభర్జనలు పడిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ చేయడం వల్ల ఎవరో ఒకరికి ప్రాణముప్పు కలిగే అవకాశం ఉందని, ఆపరేషన్ సాధ్యం కాదనే వాదనలు తెరమీదకు వచ్చాయి. అంతేగాకుండా వీరిని పోషించడం తమ వల్ల కాదని, ప్రభుత్వం ఆదుకోవాలని వీణ..వాణి తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనితో వీణ..వాణిలను ఉంచుకోవడం సాధ్యం కాదని...ఏదైనా హోంకు తరలించాలని తాజాగా వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో తల్లిదండ్రులు ఆపరేషన్ కు సుముఖత వ్యక్తం చేశారు. శస్త్ర చికిత్సకు సుముఖంగా ఉన్నామని, ఏమైతే అదే కానీయ్యండని లేఖలో పేర్కొన్నారు. తాము పేదవారిమని, వారిని పోషించడం భారంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

13:21 - July 5, 2016

ఢిల్లీ : మోదీ కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ప్రకాశ్‌ జవదేకర్‌కు కేబినెట్ హోదా దక్కింది. మొత్తం 19 మంది కొత్త ముఖాలకు కేబినెట్‌లో అవకాశం కల్పించారు. ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి, ఫాగన్‌ సింగ్ కులస్తే, ఎస్‌ఎస్‌ ఆహ్లువాలియా, రమేశ్ చందప్ప, విజయ్‌ గోయల్‌, రాందాస్‌ అత్వాలే, రాజెన్‌ గోహైన్‌, అనిల్‌ మాధవ్ దావే, పురుషోత్తమ్‌ రుపాలా, ఎం జే అక్బర్‌, అర్జున రామ్‌, జశ్వంత్‌ సిన్హ్, మహేంద్రనాథ్ పాండే, అజయ్‌ టాంటా, మన్‌సుఖ్‌ మాండవీయ, సీఆర్‌ చౌదరికి కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు... ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళా ఎంపీలు కృష్ణరాజ్, అనుప్రియా పటేల్‌లు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వివిధ రాష్ట్రాలకు పదవులు..
ఈ మంత్రివర్గ విస్తరణలో రాజస్థాన్‌కు 4, ఉత్తరప్రదేశ్‌కు 3, గుజరాత్‌కు 3 మంత్రి పదవులు వచ్చాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు 3, మహారాష్ట్రకు 2, అసోం, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలనుంచి ఒక్కొక్కరికి కేంద్రమంత్రిపదవులు దక్కాయి. వచ్చే ఏడాది జరగబోతున్న యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ విస్తరణలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. కృష్ణరాజ్ బీజేపీ ఎంపీ కాగా, అనుప్రియా పటేల్ ఎన్డీయే మిత్రపక్షం ఆప్నా దళ్ ఎంపీగా ఉన్నారు.

ఉద్వాసన...
కొత్తవారికి మంత్రివర్గంలో చోటిచ్చిన ప్రధాని పాత మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన పలికారు. జలవనరులశాఖ మంత్రిగా ఉన్న సన్వర్‌లాల్‌ ఝాట్‌, పంచాయితీరాజ్‌ మంత్రి నిహాల్‌ చంద్‌, హెచ్‌ఆర్‌డీ మంత్రిగా ఉన్న ఆర్‌ఎస్‌ కతారియా, వ్యవసాయ శాఖమంత్రి మోహన్‌ భాయ్‌ కుందారియా, ట్రైబల్‌ మినిస్టర్‌గాఉన్న మన్షుక్‌ భాయ్‌ వాస్తవలను మంత్రివర్గం నుంచి తొలగించారు. 

ఇందిరాపార్కు వద్ద న్యాయవాదుల ఆందోళన..

హైదరాబాద్ : త‌మ డిమాండ్ల సాధ‌న కోసం న్యాయ‌వాదులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందిరా పార్క్ వ‌ద్ద తెలంగాణ‌ న్యాయ‌వాదులు ఆందోళ‌న‌కు దిగారు. బీజేపీ లీగ‌ల్ సెల్ ఆధ్వ‌ర్యంలో ఈ ఆందోళన జరుగుతోంది.

ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శుల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శులు భేటీ అయ్యారు. కృష్ణా జలాల తాత్కాలిక నీటి కేటాయింపులపై చర్చిస్తున్నారు.

 

సదావర్తి భూముల విషయంలో ఎన్నో ఆరోపణలు - ధర్మాన..

హైదరాబాద్ : సదావర్తి భూముల విషయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. సీఎం ఆదేశాలతో భూములను అమ్మకానికి పెట్టారని, చట్టాలకు అనుగుణంగా అమ్మకాలు జరగాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా తప్పులను ఎత్తిచూపుతామన్నారు.

 

ప్రతిపక్షాల మద్దతు కోరిన రేవంత్..

హైదరాబాద్ : అసెంబ్లీలో టీడీఎల్పీ గదులు ఇతరులకు కేటాయించడంపై ప్రతిపక్షాల మద్దతును టిటిడిపి నేత రేవంత్ కోరారు. బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానారెడ్డితో రేవంత్ మాట్లాడారు. టిడిపికి మద్దతుగా ఉంటామని ప్రతిపక్షాలు హామీనిచ్చాయి.

ఐదుగురికి ఉద్వాసన..

ఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీ కేబినెట్ నుండి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. నిహాల్ చంద్, రామశంకర్ కఠారియా, సన్వర్ లాల్, మన్ సుక్ వాసవ, మోహన్ కుందారియాకి ఉద్వాసన పలికారు.

తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు..

పశ్చిమగోదావరి : తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది.

 

12:52 - July 5, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ టీఆర్ఎస్ కార్యాలయమా ? స్పీకర్ ఆఫీసా ? అని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టి.టిడిపి ఎల్పీకి కేటాయించిన గదులను శాసనసభా సంఘాల ఛైర్మన్లకు స్పీకర్ కేటాయించారు. నోటీసులు ఇవ్వకుండా గదులను కేటాయించడంపై టిడిఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మైనార్టీ వెల్ఫేర్ కమిటీ కి వారికి గదులు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులను ఆఫీసులో పడేసి పోయారని, కార్యాలయ సిబ్బందికి గాని..తనకు గాని..సండ్ర కు సమాచారం అందలేదన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి సమాచారం ఇవ్వకుండా..చర్చించకుండా కార్యాలయాన్ని ఇతర వెల్ఫేర్ కమిటీలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే స్పీకర్ అయ్యారని, పార్టీలతో అనుబంధాలు తెంచుకోవాలన్నారు. 119 మంది సభ్యులకు సభా నాయకుడని, సభ్యుల హక్కుల కాపాడాలల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నారని, తమ కార్యాలయాన్ని ఇతర వెల్ఫేర్ కమిటీలకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పైశాచిక ఆనందం కోసం కేటీఆర్ ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారని విమర్శించారు. భూసేకరణ, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు పోరాటానికి సిద్ధమౌతుంటే సెంటిమెంట్ కు తెరలేపుతున్నారని, చర్చలను పక్కదోవ పట్టించడానికి పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. ఉత్తమ్, జానారెడ్డి, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలతో తాను మాట్లాడడం జరిగిందని, సమాచారం పూర్తిగా తెలపడం జరిగిందన్నారు. ఈ అంశాలను వారు కూడా ఖండించారని, స్పీకర్ తో మాట్లాడుతామని వారు పేర్కొనడం జరిగిందన్నారు. అందరూ కలిసి కట్టుగా ఉండి ఇలాంటి తప్పుడు నిర్ణయాలను ఖండిస్తామని వారు పేర్కొన్నారని తెలిపారు. న్యాయస్థానాల తలుపు తట్టాలని యోచిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు.

12:47 - July 5, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరించారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేబినెట్ మంత్రిగా ప్రకాష్ జవదేకర్ కు పదోన్నతి లభించగా కొత్తగా 19 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో మహారాష్ట్ర రాజ్యసభ ఎంపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ దాస్ అత్వాలే కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చదివే సమయంలో తత్తరబాటుకు గురయ్యారు. 'మే' అనగానే, తన పేరును ఉచ్చరించకుండా రామ్ దాస్ ప్రమాణ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ తప్పును గమనించారు. పేరును చదవాలని సూచించారు. అనంతరం అత్వాలే పలుమార్లు ప్రమాణ పత్రాన్ని చదవడంలో ఇబ్బందులు పడ్డారు. దీనిని గమనించిన ప్రణబ్ జోక్యం చేసుకున్నారు. ప్రణబ్ స్వయంగా ఆయనతో కొన్ని పదాలు పలికించారు.

12:17 - July 5, 2016

మెదక్ : 'మా ఊరు మాకే కావాలి..తమ పిల్లలకు నౌకర్లు లేవు..యేడ పోవలె..మా ఊరు విడవం..ప్రాజెక్టు కడ్తే అందులో ఛస్తం..గిక్కడకు ఎవర్ని రానియ్యం..ఈ ప్రాజెక్టు వద్దే వద్దు..పిల్లలను పట్టుకుని ఎక్కడకు వెళ్లాలి' అంటూ మహిళలు కళ్లనీళ్లు పెట్టుకుంటూ పేర్కొంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. వేములగట్టు వద్ద ప్రాజెక్టుపై ఓ చర్చ చేపట్టారు. ఈ సదస్సులో ప్రొ. కోదండరాం పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు 14 గ్రామస్తులందరూ వచ్చారు. ఈసందర్భంగా పలువురు మహిళలు టెన్ టివితో తమ ఆవేదనను పంచుకున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు తమకు వద్దని మరోసారి స్పష్టం చేశారు. నీళ్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకోవాలని సూచించారు. రెండు పంటల భూమి పండుతుందని, 25 చెరువులతో పాటు పెద్దవాగు ఉందన్నారు. బంగారు భూములను వదిలి ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం చర్చించడానికి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

12:04 - July 5, 2016

ఢిల్లీ : ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 19 మందిని తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. మంగళవారం ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్ లో కొత్తమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దపీఠ వేశారు. దళిత ఎంపీలకు స్థానం కల్పించారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

పేరు రాష్ట్రం
ఫాగ్గన్ సింగ్ మధ్యప్రదేశ్
ఆహ్లువాలియా బెంగాల్
రమేష్ చంద్రప్ప జిగనగి కర్ణాటక
విజయ్ గోయల్ రాజస్థాన్
రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ, మహరాష్ట్ర
రాజేన్ గొహైన్ అస్సాం
అనిల్ మాధవ్ దవే మధ్యప్రదేశ్
పురుషోత్తం రూపాల, రాజ్యసభ గుజరాత్
ఎంజే అక్బర్   రాజ్యసభ మధ్యప్రదేశ్
అర్జున్ రాం మేఘ్ వాల్ రాజస్థాన్
జశ్వంత్ సిన్హ్ గుజరాత్
మహేంద్ర నాథ్ పాండే ఉత్తర్ ప్రదేశ్
అజయ్ టమ్ ట ఉత్తరాఖండ్
కృష్ణారాజ్ షాజహాన్, ఉత్తర్ ప్రదేశ్
మన్సుఖ్ మాండవీయ రాజ్యసభ గుజరాత్
అనుప్రియ పటేల్ అప్నా దళ్ ఎంపీ మిర్జాపూర్, ఉత్తర్ ప్రదేశ్
సీఆర్ చౌదరి నాగౌర్, రాజస్థాన్
పీపీ చౌదరి పాలి, రాజస్థాన్
శుభాష్ రామ్ రావ్ భామ్రే ధూలే, మహారాష్ట్ర

కొత్త కేంద్ర మంత్రులు..

ఢిల్లీ : కొద్దిసేపటి క్రితం కేంద్ర పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు పదోన్నతి లభించింది. కొత్తగా మంత్రులు అయిన వారు : ఆహ్లువాలియా, ఫగ్గన్ సింగ్, రమేష్ చందప్ప, విజయ్ గోయల్, రామ్ దాస్ అథవలే, రాజెన్ గొహేన్, అనిల్ మాధవ్ దవే, పురుషోత్తమ్ రూపాల, ఏంజే అక్బర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జశ్వంత్ సిన్హ్, మహేంద్ర నాథ్ పాండే, అజయ్ టంట, కృష్ణరాజ్, మందానియా, అనుప్రియ పటేల్, సీఆర్ చౌదరి, పీపీ చౌదరి, శుభాష్ రామ్ భామ్రే లున్నారు.

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారు..

ఢిల్లీ : కొద్దిసేపటి క్రితం కేంద్ర పునర్ వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు పదోన్నతి లభించింది.

పదోన్నతి లభించిన వారు..

ఢిల్లీ : కాసేపటి క్రితం కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరించారు. రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకర కార్యక్రమం జరిగింది. ప్రకాష్ జవదేకర్, ఆహ్లువాలియాలకు పదోన్నతి లభించింది.

ప్రకాష్ జవదేకర్ కు పదోన్నతి..

ఢిల్లీ : కాసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రారంభమైంది. సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రకాష్ జవదేకర్ కు పదోన్నతి లభించింది.

11:04 - July 5, 2016

పులి నోట్లె ఏళ్లు వెట్టెటోళ్లను జూశిండ్రా..? పులి నోట్లె ఏలుగాదుగదా..? దాని దిక్కు ఏలెత్తి సూశె ధమ్ముగూడ ఉండది ఎవ్వలు వెడ్తరు నోట్లె ఏలుఅంటరా..? ఉన్నడు.. సింహాలతోని ఆడుకునె మన్షి ఉన్నట్టే చిర్తపులలతోని గూడ ఆడుకునె మన్షి దొర్కిండు. సూడాలంటే వీడియో సూడుండ్రి.

 

11:02 - July 5, 2016

కొంతమంది తల్లి దండ్రులు ఎంత నిర్లక్ష్యంతోని ఉంటరంటే.. రోడ్ల మీద పిల్లలు ఆడుకుంటుంటే వాళ్లను పట్టిచ్చుకోనే పట్టిచ్చుకోరు.. తొవ్వొంట బండ్లు వోతుంటయ్.. బస్సులొస్తుంటయ్ ఏమన్న ఆపాయంగాగళ్ల అని సూడరు.. ఆడుకోనీతియ్ అని ఇడ్సిపెడ్తరు.. ఏమన్న అపాయంగాంగనే అగో అగో అని మొత్తుకుంటరు.. గసొంటిది ఒక్కటి ఈ వీడియోలో జూడుండ్రి.. ఇది జూశ్నంక తల్లిదండ్రులు జర్రంత జాగ్రత్త పడుండ్రి..

కాసేపట్లో కేంద్రమంత్రి వర్గ విస్తరణ..

ఢిల్లీ : కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 19 మంది కొత్తవారికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ వాయిదా..

హైదరాబాద్ : విజయ్ మాల్యా చెక్ బౌన్స్ పై కోర్టులో విచారణ జరిగింది. విచారణనను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

 

10:53 - July 5, 2016

అదో బృహత్తర ప్రాజెక్టు. సీమను సస్యశ్యామలం చేసి.. నాలుగు జిల్లాల ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఉద్దేశించిన పథకం. ఎప్పుడో 33 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో.. ప్రాజెక్టు పనులు నత్తలతో పోటీ పడుతున్నాయి. కృష్ణా జలాలను కుప్పం వరకూ తీసుకు వెళ్లే క్రమంలో నిర్మిస్తోన్న టన్నెల్‌ పనులు ఎంతకీ ముందుకు సాగడం లేదు. చిత్తూరు జిల్లాలో.. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై ప్రత్యేక కథనం..హంద్రీ నీవా సుజల స్రవంతి...! రాయలసీమ జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన నీటి పథకం. ఈ ప్రాజెక్టు సంకల్పించి 33 ఏళ్లు కావస్తున్నా.. ఇంకా పూర్తి కావడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను కుప్పం తీసుకువస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే చెప్పారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామన్నారు. కానీ.. ఇచ్చిన హామీ ఇప్పటీకీ అమలు కాలేదు. పనుల వేగాన్ని పరిశీలిస్తే.. ప్రాజెక్టు మరో దశాబ్దానికైనా అందుబాటులోకి వస్తుందా అన్న అనుమానం కలగక మానదు.

ముగ్గురు ముఖ్యమంత్రులు..
హంద్రీనీవా పథకం అసలు పూర్తవుతుందో లేదో అన్న అనుమానం ప్రజల్లో కలగడానికి కారణం లేకపోలేదు. ఈ ప్రాజెక్టును చకచకా పూర్తి చేయాలంటే కనీసం 1200 కోట్లు తక్షణమే కావాలి. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కేవలం 212 కోట్లే. అంటే.. అవసరమైన దాంట్లో ఆరోవంతు కూడా కేటాయించలేదు. అది కూడా నాలుగు జిల్లాల్లో పనులకు సర్దాలి. అలా చూసినా చిత్తూరు జిల్లాకు మహా అంటే ఓ అరవై కోట్ల రూపాయలు అందుతాయంతే. ఈ లెక్కన ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది..?  ఇప్పటికి సీమకు చెందిన ముగ్గురు ప్రముఖులు.. చంద్రబాబు, వైఎస్‌రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. కానీ హంద్రీనీవా ప్రాజెక్టుకు మాత్రం మోక్షం లభించలేదు. ఒక్క అనంతపురం జిల్లా మినహా... మిగిలిన జిల్లాల్లో పనులు నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి సిమెంట్ నిర్మాణాలు, కాలువల నిర్మాణం, తూములకు భూసేకరణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. నిధులు లేకుంటే అధికారులు మాత్రం ఏం చేస్తారన్నది ప్రజల ప్రశ్న.

పథకం ఉద్దేశ్యం..
శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి 40 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించడం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఉద్దేశం. కర్నూలు నుంచి అనంతపురం, చిత్తూరు, జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లిస్తారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించే బృహత్తర లక్ష్యంతో 2004లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి 1305 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ 2007 నాటికి అది కాస్తా 2774 కోట్ల రూపాయలకు పెరిగింది. మొదటి దశలో కర్నూలు, అనంతపురం కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశలో చిత్తూరు, కడప జిల్లాల్లో కాలువల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

చిత్తూరుకు దక్కేది కేవలం 10 టీఎంసీలే..
వాస్తవానికి హంద్రీ-నీవా ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల కృష్ణా మిగులు జలాల్లో చిత్తూరు జిల్లాకు దక్కేది కేవలం 10 టీఎంసీలే. ఆ నీటితో జిల్లాలో కరవు పీడిత ప్రాంతాలను ఆదుకునేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులు ఓ దశలో జోరుమీద ఉన్నట్లు కనిపించాయి. కానీ, మదనపల్లె దగ్గర భారీ సొరంగం నిర్మాణం దగ్గరకొచ్చేసరికి పనుల వేగం మందగించింది. జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందునా ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని కంకణం కట్టుకున్నారు. అలాంటప్పుడు ఈ పథకానికి నిధులు వరదలా పారతాయని ఎవరైనా భావిస్తారు. కానీ వాస్తవం భిన్నంగా ఉంది.

వేయి కళ్లతో ఎదురు చూస్తున్న జనం..
నాలుగు జిల్లాలకు చెందిన లక్షల మంది ప్రజలు హంద్రీ-నీవా ప్రాజెక్టు కోసం వేయి కళ్లతో ఎదురు చేస్తున్నారు. ప్రధానంగా కుప్పం కెనాల్‌కు నీరందాలంటే మాత్రం మదనపల్లి టన్నెల్‌ పూర్తవ్వాల్సిందే. త్వరలోనే టన్నెల్‌ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంలో మరికొంత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి.. సీమ ప్రాంతానికి నీరందించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.  చిత్తూరు జిల్లాలో మదనపల్లె, తంబళ్ల పల్లె, పీలేరు ప్రాంతాల్లో హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో మొత్తంగా జిల్లాలో గడచిన 33 ఏళ్లలో... 50 శాతం పనులు పూర్తయినట్లయింది. అయితే జిల్లాలో పుంగనూరు బ్రాంచి కెనాల్ దాటాకే.. కుప్పం బ్రాంచి కెనాల్‌కు నీరు వెళుతుంది. ప్రాజెక్టులోని 59వ ప్యాకేజీ కింద పుంగనూరు బ్రాంచి కెనాల్ కు మదనపల్లె సమీపంలో నీటి ప్రవాహ మార్గానికి భారీ కొండలు అడ్డంకిగా మారడంతో... అక్కడ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు కిలోమీటర్ల మేర కొండను తవ్వేశారు. కాట్లాటపల్లె రామిరెడ్డి గారి పల్లె మధ్య సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున ఈ టన్నెల్ నిర్మిస్తున్నారు. అధికారులు మాత్రం అక్టోబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, నవంబరులో నీటిని తీసుకువస్తామని అంటున్నారు.

పనుల్లో వేగం పెంచాలి..
అధికారులు చెబుతున్న దానికీ, వాస్తవానికి పొంతన కుదరడం లేదు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కుప్పంకు హంద్రీనీవా జలాలు తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చినా.. ఇంతవరకు ఆ పనులు పూర్తి కాలేదు. కుప్పం బ్రాంచి కెనాల్‌కు ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉంది. చాలా మండలాల్లో భూ సేకరణకు సంబంధించి వివాదాలున్నాయి. చాలా మంది రైతులు ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు. దాదాపు 110 స్థానిక చెరువులను అనుసంధానం చేస్తూ హంద్రీనీవా ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. వీటిలో చాలా వాటికి ఇంకా క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. అదే విధంగా దారిపొడవునా నిర్మించాల్సిన కట్టడాల్లో కొన్నింటికి మాత్రమే ఆమోదం లభించింది. కుప్పం కెనాల్‌ పూర్తి కావడానికి ఇంకా కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు. అధికారులు మాత్రం నాలుగైదు నెలల్లో పూర్తి చేస్తామనడం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు.  ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్నప్పటికీ.. పనులు సాగుతున్న తీరు ఎవరిలోనూ ఆ నమ్మకాన్ని కలిగించడం లేదు. నత్తనడకన సాగుతున్న పనుల్లో వేగం పెంచి త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

10:46 - July 5, 2016

ముంబై : 3777..ఇది కోడ్‌ వర్డ్‌ కాదు.. పాస్‌వర్డ్‌ అంతకన్నా కాదు.. ముద్దుగుమ్మ ఇష్టపడి కోనుగోలు చేసిన లగ్జరీ కార్లు, బైకుల ఫ్యాన్సీ నెంబర్‌....లక్షల విలువైన వాహనాలు, విలాసవంతమైన బంగ్లాలు..ఇవన్నీ కొనుగోలు చేసింది ఓ చిరుద్యోగి...నెలకు 18 వేలు జీతం తీసుకునే ఆ చిన్నది కోట్లు ఎలా కూడబెట్టిందో తెలుసా? ముంబై గరీబ్‌వాడలో ఉండే ఓ ముద్గుగుమ్మ తన కుమారుడి బర్త్‌డే వేడుకలు కళ్లు చెదిరేలా చేసింది. ఏసీ ఫంక్షన్‌ హాల్‌లో 13 లక్షల ఖర్చుతో అంగరంగ వైభవంగా నిర్వహించింది. నెలకు 18 వేలు జీతం తీసుకునే ఓ మహిళ 13 లక్షల ఖర్చుతో పుట్టినరోజు వేడుకలు చేయడం అప్పట్లో టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడు ఖర్చుచేసిన దాంట్లో జస్ట్‌ ఇది శ్యాంపిలే.

పనిచేస్తున్న కంపెనీకే ఎగనామం..
ఈమె కూడబెట్టిన అక్రమ సొమ్ము విలువ తెలిస్తే ఎవ్వరైనా నోళ్లు వెల్లబెట్టాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కోట్ల 32 లక్షలు. ముంబైకి చెందిన వృషాలీ బమానే కేసును దర్యాప్తు చేస్తున్న ఖాకీలే ఖంగుతింటున్నారు. కోట్లు కొల్లగొట్టిన కిలాడీ లేడీ వృషాలితో పాటు ఆమె భర్తను వారం క్రితమే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె ఖాతా లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. 13 లక్షల ఖర్చు విషయమై వివరణ కోరగా గతేడాది నవంబర్‌ 28న తన కొడుకు బర్త్‌డే వేడుకలకు వెచ్చించినట్లు పేర్కొంది. ముంబై గరీబ్‌వాడకు చెందిన వృషాలీ..తన కొడుకు నాలుగో బర్త్‌డే వేడుకలు డొంబివిలిలోని ఏసీ బ్యాక్వెట్‌ హాల్‌లో ల్యావీష్‌గా నిర్వహించింది. పార్టీకి సంబంధించిన ఫోటో అల్బమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వృషాలీ దంపతులను విచారిస్తున్న పోలీసులు..
ఇంటర్‌ వరకే చదువుకున్న ఈ భామ..తన మాస్టర్‌ బ్రెయిన్‌తో కోట్లు కొల్లగొట్టేందుకు పెద్ద స్కేచే వేసింది. సరైన సమయం చూసి తను పనిచేసే కంపెనీకే టోకరా ఇచ్చింది. మూడేళ్ల క్రితమే తన ప్లాన్ అమలు చేసిన వృషాలీ.. కంపెనీ ఖాతాలను తారుమారు చేసి కుటుంబ సభ్యులు, బంధువుల ఖాతాల్లోకి కోట్లకు కోట్లు ట్రాన్స్ ఫర్ చేసింది. మొదట్లో వేలు, లక్షలు మాయం చేసిన వృషాలి.. 2016లో ఏకంగా 6 కోట్లు కొట్టేసింది. ఇలా 16 కోట్లా 32 లక్షలను హాంఫట్ చేసేసింది. ఆ డబ్బుతో లగ్జరీ లైఫ్‌ అనుభవించింది. కరాడ్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్‌తో కూడిన 7 గదుల భవనం.. డోంబీవాలీలో 5 ఫ్లాట్లు, 4 లగ్జరీ కార్లు, 2 బైకులు కొనుగోలు చేసింది. ఈ వాహనాలకు 3777 ఫ్యాన్సీ నంబరు మెయింటైన్ చేసింది. ఇప్పటికే పోలీసులు వృషాలితో పాటు ఆమె బంధువుల బ్యాంకు అకౌంట్లు సీజ్ చేశారు.

మనుసుఖ్ భాయ్, మేగ్వాల్ పార్లమెంట్ కు పయనం..

ఢిల్లీ : మనుసుఖ్ భాయ్, అర్జున్ మేగ్వాల్ లు పార్లమెంట్ భవన్ కు పయనమయ్యారు. వీరు సైకిల్ పై వెళ్లడం విశేషం. ఉదయం 11గంటలకు కేబినెట్ విస్తరణ చేపట్టనున్న సంగతి తెలిసిందే. వీరికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

కక్ష్యలోకి ప్రవేశించిన జునో..

ఢిల్లీ : గురుగ్రహం కక్ష్యలోకి జునో విజయవంతంగా ప్రవేశించింది. జునో విజయంతో నాసా చరిత్ర సృష్టించినట్లైంది. గురుగ్రహం రహస్యాలను జునో చేధించనుంది.

 

కూసుమంచి జెడ్పీటీసీపై దాడి..

ఖమ్మం : కూసుమంచి జెడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది.

10:26 - July 5, 2016

ఢిల్లీ : కేంద్రంలో తన నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ రెండేండ్ల పాలన తర్వాత మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్‌ వ్యవస్థీకరించేందుకు ప్రధాని మోడీ నిర్ణయించారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇది రెండో మంత్రివర్గ విస్తరణ. ఇందులో 9మందిని మంత్రివర్గంలోకి కొత్తగా చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. నూతనంగా చేరే మంత్రులతో మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కీలక శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవని తెలుస్తోంది. అరుణ్‌జైట్లీ అదనంగా నిర్వహిస్తున్న సమాచార-ప్రసార శాఖను కొత్తవారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రాల నుంచి కొందరికి అవకాశాలు కల్పించనున్నట్టు సమాచారం. యూపీలో 13 శాతం ఉన్న బ్రాహ్మణుల నుంచి మహేంద్రనాథ్‌ పాండేకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతోపాటు అదే కులానికి చెంది, పర్యాటకశాఖ (స్వతంత్ర హోదా) నిర్వహిస్తున్న మహేశ్‌ శర్మకు కేబినెట్‌ హోదా ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మహారాష్ట్ర నుండి ఇద్దరు..
ప్రస్తుతం వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా ఉన్న యూపీకి చెందిన జాట్‌ నేత సంజయ్ బల్యాన్‌కు స్వతంత్ర హోదా కల్పించనున్నట్లు, ఉత్తరాఖండ్‌ నుంచి బీజేపీ ఎంపీ అజయ్ తమ్తాను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మహారాష్ట్ర నుంచి కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. భాగస్వామ్య పక్షం శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్‌దేశాయ్ కి లభించే అవకాశం ఉంది. వయసుపైబడిన కారణంగా మైనారిటీ వ్యవహారాల శాఖ నుంచి నజ్మా హెప్తుల్లాను తొలగించి, ఆమె స్థానంలో ప్రస్తుతం అదే శాఖ సహాయమంత్రిగా ఉన్న ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీకి పదోన్నతి కల్పించనున్నట్టు వినికిడి. విద్యుత్‌శాఖ సహాయమంత్రి పీయూష్‌ గోయెల్‌, చమురుశాఖ సహాయమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ కూడా కేబినెట్‌ హోదా పొందనున్నట్టు తెలుస్తున్నది. కొత్తగా ఎవరు వస్తారు ? ఎవరు పదవులు కోల్పోతారనేది కాసేపట్లో తేలుస్తుంది.

10:17 - July 5, 2016

రంగారెడ్డి : భార్యను ముక్కలు చేసిన ఘటన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారణలో పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సింథియా విడాకులు కోరినందుకే భర్త రూపేష్ హత్య చేసినట్లు తేలింది. ఫేస్ బుక్ లో ఫ్రెంచ్ యువకుడితో సింథియాకు పరిచయం ఏర్పడడం..ఇది ప్రేమగా మారింది. ఇటీవలే ఇండియాకు వచ్చిన ఆ యువకుడిని సింథియా కలిసింది. యువకుడితో సింథియా పెళ్లికి సిద్ధమైందని సమాచారం. విడాకులు ఇస్తానని..తనతో పాపను తీసుకెళుతానని సింథియా పేర్కొంది. దీనికి భర్త రూపేష్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కాలని..విడాకులు తీసుకోవడం ఉత్తమైన మార్గమని సింథియా భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. సోమవారం కూడా ఇదే విషయంపై ఘర్షణ చెలరేగింది. మెడను గట్టిగా నొక్కడంతో సింథియా మృతి చెందింది.
అనంతరం పక్కా ప్రణాళికతో ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టుకున్నాడు. అనంతరం శంషాబాద్‌ మండలం మదనపల్లికి వెళ్లి తగులబెట్టే ప్రయత్నం చేశాడు. తిరిగి వెళ్లే సమయంలో వాహనం బురదలో కూరకపోవడం..స్థానికులు గమనించడం జరిగిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో జరిగిన ఘోరం బయటకు వచ్చింది. నిందితుడు ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడో వేచి చూడాలి.

సంతోషంగా ఉంది - మనుసుఖ్ భాయ్..

ఢిల్లీ : అభివృద్ధిలో భాగస్వామౌతున్నందుకు సంతోషంగా ఉందని మనుసుఖ్ భాయ్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ ఉదయం 11గంటలకు పునర్ వ్యవస్థీకరణ సంగతి తెలిసిందే.

నెల్లూరులో పిచ్చికుక్క స్వైరవిహారం..

నెల్లూరు : ఏఎస్ పేటలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు, ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

సింథియా హత్య కేసులో కొత్త విషయాలు..

రంగారెడ్డి : భార్యను ముక్కలు చేసి తగులబెట్టిన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సింథియా విడాకులు కోరినందుకే భర్త రూపేష్ హత్య చేసినట్లు తేలింది. ఫేస్ బుక్ లో ఫ్రెంచ్ యువకుడితో సింథియాకు పరిచయం ఏర్పడిందని, ఆ యువకుడితో పెళ్లికి సిద్ధమైందని రూపేష్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. పాపను తీసుకెళ్తానని సింథియా చెప్పడాన్ని వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. ఘర్షణ హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

స్పీకర్ నిర్ణయంపై టి.టిడిపి ఆగ్రహం..

హైదరాబాద్ : టి.టిడిపి ఎల్పీకి కేటాయించిన గదులను శాసనసభా సంఘాల ఛైర్మన్లకు స్పీకర్ కేటాయించారు. నోటీసులు ఇవ్వకుండా గదులను కేటాయించడంపై టిడిఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయంపై టిడిపి కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది.

కార్తీ చిదంబరంకు ఈడీ సమన్లు..

ఢిల్లీ : ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కుంభకోణంలో కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ సమన్లు పంపింది.

 

కేబినెట్ లో వస్తున్నందుకు సంతోషం - పీపీ చౌదరి..

ఢిల్లీ : మోడీ కేబినెట్ లోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని రాజస్థాన్ కు చెందిన నేత పీపీ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు తనకు లెటర్ అందిందని ఓ జాతీయ ఛానెల్ తో తెలిపారు.

కృష్ణా జిల్లా జెడ్పీ స్టాండింగ్ కమిటీ నేడు..

విజయవాడ : కృష్ణాజిల్లా జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు విజయవాడలో జరుగనుంది. నగరంలో ఆలయాల తొలగింపు, కృష్ణా పుష్కరాల ఏర్పాట్లతో పాటు పలు కీలక అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశముంది.

నేడు కడపలో జగన్ పర్యటన..

కడప : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొంటారు.

హాస్టల్ లో మంత్రి రావెల తనిఖీలు..

విశాఖపట్టణం : ఎంవీపీ కాలనీలో ఎస్టీ బాలికల హాస్టల్ లో మంత్రి రావెల తనిఖీలు నిర్వహించారు. పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

మెంటపల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం..

మహబూబ్ నగర్ : వనపర్తి (మం) మెంటపల్లిలో నేడు టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు.

 

కరీంనగర్ లో మంత్రి తుమ్మల పర్యటన..

కరీంనగర్ : జిల్లాలో నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. వేములవాడలో నూతన బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

08:26 - July 5, 2016

మెదక్: ప్రాజెక్టుల్లో నష్టపోతున్న నిర్వాసితుల అభివృద్ధి గురించి తొలుత ఆలోచించాలని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సేకరణ అంశం అత్యంత వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అరవై ఎకరాల భూమిని సేకరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోతామని గత కొద్ది రోజులుగా 14 ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొ.హరగోపాల్ తో టెన్ టివి ముచ్చటించింది. భూమి తీసుకున్న అనంతరం మనిషి ఎలా బతుకుతాడు ? అనే ప్రశ్న వస్తుందన్నారు. భూ సేకరణ చేయాలి అనుకుంటే నిర్వాసితుల అభివృద్ధి గురించి మొదట ఆలోచించాలన్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చూస్తున్నారని విమర్శించారు. మనిషి కోణం నుండి అభివృద్ధి చూడాలన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల మనిషి బాగు పడుతాడా ? మనిషి ఏమవుతాడు ? అనేది ఆలోచించాలన్నారు. అభివృద్ధిలో తమ పాత్ర లేనప్పుడు భూమి ఎందుకివ్వాలని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. భూ సేకరణ చట్టం కాంగ్రెస్ హాయాంలో చేశారని, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ అంగీకరించాల్సి ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. కానీ ఇవేవి చేయలేదని, ప్రజలను భాగస్వామ్యం చేయడం..ప్రజాస్వామ్య పద్ధతిలో అవలంబించలేదన్నారు. అభివృద్ధి పేరిట బలవంతంగా భూములు సేకరించకూడదని..భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని..14 గ్రామ ప్రజలతో చర్చించి వారి అంగీకారంతో ముందుకెళ్లాలని సూచించారు.

08:21 - July 5, 2016

నల్గొండ : జిల్లాలో కేశినేని నాని ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ముగ్గురు ప్రాణాలు బలి తీసుకుంది. మృతులంతా మహిళలే. వివరాల్లోకి వెళితే...చీదెళ్లకు చెందిన కొంతమంది ఆటోలో వెళుతున్నారు. చివ్వెంల మండలం గుంజలూరు సమీపంలో ఆటో రైట్ టర్న్ తీసుకొంటోంది. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన కేశినేని ట్రావెల్స్ బస్సు (ఎపి 16టిబి 8100) ఆటోను ఢీకొట్టింది. దీనితో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఆటో ఉన్న మహిళలిద్దరు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆరుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు అతివేగంగా నడపడమే కారణమని తెలుస్తోంది. మందడి సుభద్ర, చింత గోపమ్మ, గుడిపుడి కవిత మృతి చెందిన వారిలో ఉన్నారు. ఆటోను ఢీకొన్న అనంతరం బస్సును ఆపకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సు కోసం గాలింపు చేపట్టారు. కొద్దిదూరంలో బస్సును స్వాధీనం చేసుకున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

08:00 - July 5, 2016

బాలనటుడిగా ప్రవేశం చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలకు అతీంగా చిత్రాలు చేస్తున్నారు. 13 ఏళ్ల కెరీర్ లో 'అభిమన్యు', 'హరేరామ్', 'ఓమ్ త్రీడి' వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి వైవిధ్యానికి పెద్ద పీట వేసే కథానాయకుడిగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అతనొక్కడే'..'పటాస్' వంటి బ్లాక్ బస్టర్స్ విజయాలు నమోదు చేసుకున్నాడు. ఆయన పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న చిత్రానికి 'ఇజం' అనే టైటిల్ ఖరారు చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. చిత్ర టైటిల్ ఆవిష్కరణ సందర్భంగా కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు. పూరీతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది అన్నారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ జర్నలిస్టు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని, ఆయన కెరీర్ లో ఇదో డిఫరెంట్ చిత్రమౌతుందన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని, డైరెక్టర్ గా తనకు ఒక పవర్ పుల్ చిత్రమవుతుందన్నారు. ఆగస్టు 9 నుండి నెలాఖరు వరకు స్పెయిన్ లో భారీ షెడ్యూల్ ను నిర్వహించనున్నట్లు, సెప్టెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా 'ఇజం' ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పూరీ పేర్కొన్నారు. ఆదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, గొల్లపూడి మారుతి రావు, పోసాని కృష్ణ మురళి తదితరులు నటిస్తున్నారు.

07:59 - July 5, 2016

చర్మంపై ఏర్పడిన మురికిని తొలగించుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు కొన్ని క్రీములు..ఇతరత్రా వాడుతుంటారు. ఇలా కొన్ని వాడకం వల్ల చర్మం పాడడంతో పాటు పలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. మన ఇంట్లోనే మురికిని తొలగించే సహజ క్లెన్సర్ లున్నాయి. అవేంటో చూద్దాం..
నిమ్మ తొక్కల పొడిలో కాసిన్ని పాలు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖం..మెడకు రాసుకుని మర్దన చేసుకోవాలి.
రెండు యాపిల్ ముక్కలను గుజ్జుగా చేసి అందులో రెండు చెంచాల పెరుగు, ముఖానికి రాసుకోవాలి. ఓ పావుగంటయ్యాక తడి చేసి కడిగేసుకోవాలి.
రెండు చెంచాల కలబంద గుజ్జులో ఒక చెంచా చక్కెర..కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మెల్లిగా మర్దన చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయాలి.
నీళ్లు..తేనె ఒక్కో స్పూన్ మోతాదులో తీసుకుని ముఖానికి మర్దన చేసుకోవాలి. ఓ అరగంట అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
బాగా పండిన టమాటను గుజ్జుగా చేయాలి. ఈ గుజ్జులో రెండు చెంచాల చొప్పున పాలు, నిమ్మరసం చేర్చాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని మర్దన చేసుకుని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
గుడ్డులోని తెల్లసొనలో చెంచా తేనె, రెండు చెంచాల బాదం పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి..మెడకు..మోచేతులకి రాయాలి. పొడి అయిన అనంతరం గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే బాగుంటుంది.

07:32 - July 5, 2016

ఏపీలో దేవాలయాల కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నగరాభివృద్ధిలో భాగంగానే రోడ్ల విస్తరణను చేస్తున్నామని సీఎం చంద్రబాబు, రాష్ట్రమంత్రులు చెబుతున్నారు. రోడ్లమీద దేవాలయాలు నిర్మించడం తప్పని కూల్చివేతను సమర్ధిస్తున్నారు. మరోవైపు రోడ్ల విస్తరణ పేరుతో రాష్ట్ర సర్కారు దేవాలయాల విధ్యంసానికి పాల్పడుతోందని పీఠాధిపతులు, మఠాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ప్రజల మనోభావాలను రెచ్చగొడుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు కేంద్రంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరించనున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చలో నగేష్ (విశ్లేషకులు), శ్రీధర్ (బిజెపి), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

 

విశాఖలో బ్రిక్స్ దేశాల సదస్సు..

విశాఖపట్టణం : నగరంలో బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతోంది. రెండో రోజైన మంగళవారం ఇంధన పొదుపు సామర్థ్యంపై వర్క్ షాప్ జరగనుంది.

 

ప్రొ.కబడ్డీలో నేటి మ్యాచ్ లు..

హైదరాబాద్ : ప్రొ.కబడ్డీలో నేడు పలు జట్లు ఢీకొననున్నాయి. పురుషుల విభాగంలో టైటాన్స్ - బెంగళూరు జట్లు ఢీకొననున్నాయి. మహిళల విభాగంలో ఫైర్ బర్డ్స్ - స్మార్ట్ క్వీన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

 

మెదక్ లో ప్రొ.కోదండరాం పర్యటన..

మెదక్ : జిల్లాలో నేడు ప్రొ.కోదండరాం పర్యటించనున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేములఘాట్ లో 2013 భూ సేకరణ చట్టం, 123 జీవోపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

06:49 - July 5, 2016

వ్యవసాయ సీజన్ మొదలవ్వడంతో కౌలు రైతుల కష్టాలు మరోసారి తెర మీదకు వస్తున్నాయి. కౌలు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్ర స్థాయి పరిస్థితి మరో రకంగా వుంటోంది. ఈ ఏడాది కూడా పాత కష్టాలే వెంటాడుతున్నాయి. వానాకాలం వచ్చింది. వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతులంతా పొలంబాట పడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, అప్పులు వీటన్నింటినీ సకాలంలో సమకూర్చుకోగలిగితే రైతులకు సగం భారం తగ్గినట్టే. కానీ, ఇవే తలకు మించిన భారంగా మారుతున్నాయి. నాలుగు చినుకులు పడడమే ఆలస్యం వ్యాపారులు విత్తనాలు బ్లాక్ చేసి, రేట్లు అమాంతం పెంచుతున్నారు. కేజీ మిర్చి విత్తనాల ధర లక్ష రూపాయలకు అమ్ముతుండడం బ్లాక్ మార్కెట్ శక్తుల ప్రభావానికి నిదర్శనం. విత్తన వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచుతుంటే వాటిని నిరోధించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?

పశ్చిమగోదావరి..
సకాలంలో విత్తనాలు, ఎరువులు, బ్యాంక్ రుణాలు దొరక్క ప్రతి ఏటా లక్షలాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. వ్యవసాయదారుల్లో 70శాతం మంది కౌలు రైతులే అయినా, వీరిలో పది శాతం మందికి కూడా బ్యాంక్ రుణాలందని దుస్థితి. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల మంది కౌలు రైతులున్నారు. గత ఏడాది వీరిలో రెండు లక్షల పాతిక వేలమందికి రుణ అర్హత కార్డులిచ్చినా కేవలం 23 వేల మందికే అప్పులిచ్చారు. మిగిలిన వారంతా ప్రయివేట్ అప్పులనే ఆశ్రయించాల్సి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది మూడు లక్షల మంది రైతులకు రుణ అర్హత కార్డులిచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, బ్యాంక్ల్లో అప్పు పుట్టడం లేదు. జిల్లాల వ్యవసాయ రుణ ప్రణాళికల్లోనూ కౌలు రైతులకు రుణాలివ్వడానికి ప్రత్యేక కేటాయింపుల్లేవు. కాబట్టి, ప్రభుత్వాలు ఇప్పటికైనా కౌలు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

06:46 - July 5, 2016

కౌలు రైతుల కష్టాలు తీరడం లేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి షరా మామూలుగానే వుంది. కౌలు రైతులకు నామమాత్రంగానే బ్యాంక్ రుణాలిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? వ్యవసాయ రంగంలో కౌలు రైతుల పాత్ర ఏమిటి? వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లేమిటి? కౌలు రైతుల పట్ల ప్రభుత్వం, బ్యాంక్ లు ఎలా వ్యవహరిస్తున్నాయి? రుణ అర్హత కార్డుల జారీ లో ఈ ఏడాది కౌలు రైతులందరికీ న్యాయం జరిగిందా? రుణ అర్హత కార్డులున్న కౌలు రైతులకు బ్యాంక్ రుణాలు లభిస్తున్నాయా? కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు రంగారావు మాట్లాడారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియోలో చూడండి.

06:44 - July 5, 2016

చెక్‌ రిపబ్లిక్‌ వెటరన్‌ థామస్‌ బెర్డిచ్‌ సైతం నాలుగో రౌండ్‌లో ఎంటరయ్యాడు. మూడో రౌండ్‌లో అలెగ్జాండర్‌ జెరేవ్‌తో పోటీపడ్డ బెర్డిచ్‌ నాలుగు సెట్లలో నెగ్గాడు. ప్రస్తుత టోర్నీలో 10వ సీడ్‌గా బరిలోకి దిగిన బెర్డిచ్‌...తొలి రెండు సెట్లను దక్కించుకుని శుభారంభం చేశాడు. మూడో సెట్‌ను 4-6తో కోల్పోయిన థామస్‌...నాలుగో ఎ సెట్‌లో అలెగ్జాండర్‌కు చాన్స్‌ ఇవ్వకుండా చెలరేగి ఆడాడు. 6-1తో నాలుగో సెట్‌ దక్కించుకుని ప్రీ క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు.

06:36 - July 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పని చేయాలని డిసైడ్‌ అయ్యింది. అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలో ప్రజల పక్షాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్‌ నుంచే ఈ కార్యక్రమానికి టీ-జాక్ శ్రీకారం చుట్టింది. తెలంగాణా ఆవిర్భావం తర్వాత తొలిసారి ఉద్యమాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాగు, తాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ విషయంలో విపక్షాలు ప్రభుత్వం తీరును తప్పుపడుతుండగా.. టీ-జాక్‌ మాత్రం ప్రతిపక్షాల కంటే ఓ అడుగు ముందుకేసీ.. ప్రభుత్వంపై పోరుకు సై అంటోంది. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడవద్దంటూ గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రజలకు భూసేకరణపై అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా మల్లన్నసాగర్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుండడంతో ప్రభుత్వానికి టీ-జాక్‌కు మధ్య విబేధాలు కూడా బయటపడ్డాయి.

మల్లన్న సాగర్...
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా.. నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని టీ-జాక్ నిర్ణయించుకుంది. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం లేదా 123 జీఓ ప్రకారం భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటన చేసినా.. భూ సేకరణపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీ-జాక్ కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మొదటిసారి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. ప్రజల్లో కార్యక్రమాలను నిర్వహించడం చర్చనీయంశంగా మారింది. మెదక్ జిల్లా తొగుట మండలం వేములగట్టులో మల్లన్నసాగర్ ప్రాజెక్టు అవగాహనపై ముంపు గ్రామాల ప్రజలను భాగస్వామ్యంతో బహిరంగ చర్చను ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు సాగునీటి రంగ నిపుణులు, న్యాయ నిపుణులతో భూ సేకరణపై అవగాహన కల్పించడమే సదస్సు లక్ష్యంగా టీజాక్ చెబుతోంది. మరోవైపు భూసేకరణపై ప్రభుత్వం కూడా అంతే సీరియస్‌గా వ్యవహరిస్తోంది. భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయంతో ఉంది. ముందుగా ముంపు గ్రామాల్లో ఇప్పటికే ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న రైతులతో భూసేకరణను కూడా మొదలుపెట్టింది. మొత్తంగా మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు విషయంలో సర్కార్‌ అవలంబిస్తున్న తీరును ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.

06:33 - July 5, 2016

విజయవాడ : దేవాలయాల కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నగరాభివృద్ధిలో భాగంగానే రోడ్ల విస్తరణను చేస్తున్నామని సీఎం చంద్రబాబు, రాష్ట్రమంత్రులు చెబుతున్నారు. రోడ్లమీద దేవాలయాలు నిర్మించడం తప్పని కూల్చివేతను సమర్ధిస్తున్నారు. మరోవైపు రోడ్ల విస్తరణ పేరుతో రాష్ట్ర సర్కారు దేవాలయాల విధ్యంసానికి పాల్పడుతోందని పీఠధిపతులు, మఠాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ప్రజల మనోభావాలను రెచ్చగొడుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దేవాలయాల కూల్చివేత వ్యవహారంపై ఆధ్యాత్మిక వేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని దేవాలయాలను ప్రభుత్వం, అధికారులు తొలగించాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధి కొనగళ్ల విద్యాధరరావు చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల ప్రతినిధులందరినీ సంఘటితం చేసేందుకు తమ సమితి వేదికవుతుందని ప్రకటించారు. శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దేవాలయాలను పరిరక్షిస్తామని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ దుమారం..
ఇంతటి రాజకీయ దుమారం రేపుతున్న దేవాలయాల వ్యవహారంపై చంద్రబాబు స్పందిచారు. రోడ్ల మీద ప్రార్ధనా మందిరాలు నిర్మించడం కూడా తప్పని సుతిమెత్తగా చురకలు అంటింటారు. అయితే ప్రార్ధనా మందిరాల కూల్చివేత విషయంలో ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునేందుకు గుళ్లు గోపురాల పేరిట రాజకీయం చేస్తున్నాయని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. నగర అభివృద్ధికి ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదని నాని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు దేవాలయాల వ్యవహారంపై ప్రభుత్వ తీరును నిలదీస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా వ్యవహరించడాన్ని సీపీఎం నేత బాబురావు తప్పుబట్టారు. సున్నితమైన సమస్యలపై నిరంకుశంగా వ్యవహరిస్తూ జఠిలం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మతపరమైన కట్టడాలను తొలగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వం తమ తీరును సమర్థించుకుంటే, ఆలయ పీఠాధిపతులు మండిపడుతున్నారు. ఇంతటి రాజకీయ దుమారం రేపుతున్న ఈ వ్యవహారం ఎప్పుడు సద్దుమనుగుతుందో వేచి చూడాలి.

06:30 - July 5, 2016

హైదరాబాద్ : న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, గవర్నర్‌ నరసింహన్‌ చెబుతుంటే.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని న్యాయవాదులు తేల్చి చెబుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ డిమాండ్ల కోసం తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఆందోళనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. రాజ్యాంగం సరిగ్గా అమలయ్యేలా చూడాలని కోరుతూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్‌ విగ్రహాలను వేడుకున్నారు. ఇక రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లి కోర్టు లోపలికి ఆంధ్ర ప్రాంతానికి జడ్జిని వెళ్లకుండా అడ్డుకోవడంతో.. పోలీసులు, న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది.

సమ్మె విరమించాలని సూచించిన గవర్నర్‌..
ఆదివారం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో భేటీ అయిన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు.. గవర్నర్‌ నరసిహన్‌ను కలిశారు. న్యాయవ్యవస్థలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. న్యాయాధికారుల కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా సస్పెన్షన్‌ చేసినవారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందించారు. అయితే.. సమ్మె విరమించాలని గవర్నర్‌ సూచించినట్లు న్యాయవాదులు తెలిపారు.

సమ్మె విరమించే ప్రసక్తే లేదంటున్న న్యాయవాదులు..
ఇదిలావుంటే న్యాయవాదులు మాత్రం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తమ డిమాండ్ల కోసం న్యాయవాదుల ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఇవాళ అన్ని కోర్టుల్లో సామూహిక ప్రార్ధనలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రంజాన్‌ తర్వాత తరగతులు బహిష్కరించేందుకు లా కాలేజీ విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

06:27 - July 5, 2016

విజయవాడ : అమరావతి కోర్‌ క్యాపిటల్‌ నిర్మాణాన్ని స్విస్‌చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు అప్పగిస్తూ ఏపీసర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగపూర్ నిర్మాణ సంస్థ ఇచ్చిన ప్రపోజల్‌కు ఆమోద ముద్రవేస్తూ ఉత్వర్వులు జారీచేసింది. దీంతో రాజధాని నిర్మాణంలో కీలకమైన కోర్‌క్యాపిటల్‌ ప్రాంతానికి మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ నిర్మాణసంస్థ వ్యవహరించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో కీల‌క నిర్ణయం తీసుకుంది. కోర్ క్యాపిట‌ల్‌ నిర్మాణ బాధ్యతలను స్విస్ చాలెంజ్ విధానంలో సింగ‌పూర్ నిర్మాణ రంగ సంస్థలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాజధానిలోని ప్రధాన నగరం కోసం.. కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేస్తామని గ‌తంలొనే ప్రభుత్వం ప్రకటించింది. 2016 మార్చి 21న కోర్‌క్యాపిటల్ నిర్మాణానికి సింగ‌పూర్ ప్రభుత్వం ముందుకొచ్చి ప్రపోజల్స్ అందజేసింది. సింగ‌పూర్ కంపెనీలు అంద‌జేసిన ప్రపోజ‌ల్స్‌కు రాష్ట్ర సర్కారు ఆమోద ముద్రవేస్తూ 170 వ నెంబర్ జీవోను విడుదల చేసింది.

ఉచితంగా ఇసుక సరఫరాకు ఏపీ సర్కారు నిర్ణయం..
కోర్‌ క్యాపిట‌ల్ ప‌రిధిలొని 1691 ఎకరాలను సింగపూర్ అసెండాస్, సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ సంస్థలతో కలసి ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్ కు అప్పగించనున్నారు. ఇక్కడ నిర్మాణాలు జ‌రిపే సింగపూర్ సంస్థలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు కల్పిస్తారు. ఇక్కడ చేపట్టే నిర్మాణాలకు ఏపీ సర్కార్‌ ఉచితంగా ఇసుక సరఫరా చేయనుంది. ఈ ప్రాంతంలో మౌలిక నిర్మాణాలకు అవసరమైన నిధులను సీఆర్‌డీఏ సమకూరుస్తుంది. భవిష్యత్ లో ఇసుకతో పాటు ఏదైనా వ్యయంలో ఇబ్బందులు వస్తే అ ఖ‌ర్చులు సర్కారే భరించాల్సి ఉంటుంది.

ఈ విషయాన్ని టెండర్‌లో పేర్కొంటాయని అంచనా..
క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ అండ్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్, విజయవంతమైన బిడ్డర్ తో ఒప్పందం చేసుకుంటుంది. ఇందులో ప్రతిపాదిత అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్ తో కలసి 42 శాతం ఈక్విటీ తీసుకుంటారు. నిర్దేశిత సమయంలో మౌలికసదుపాయాల కల్పనకు 5 వేల 5వందల కోట్ల రూపాయల మేర బడ్జెట్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సింగపూర్ సంస్థలకు కేటాయించే భూమిలో అభివృద్ధి చేసే ప్లాట్లను పూర్తి హక్కులతో విక్రయించుకోవచ్చు. అయితే సింగపూర్ సంస్థలు తమకు వచ్చే లాభాల్లోఎంత వాటా ఇస్తాయనే విషయాన్ని మాత్రం జీవోలో ప్రస్తావించలేదు. దీన్ని టెండర్ లో పేర్కొనే అవకాశం ఉంది.

06:24 - July 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవల బంద్‌ను విరమించాయి. ఇకనుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయని ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యాలు ప్రకటించాయి. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెపై ప్రతిష్టబంభన తొలగిపోయింది. ప్రభుత్వంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. రాష్ర్ట వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి హామీతో సమ్మె విరమించామని వెల్లడించారు.

నెలాఖరులో మిగతా బకాయిలు..
ఇవాళ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం 100 కోట్లు విడుదల చేసిన సర్కార్‌.. నెలాఖరులోగా మిగతా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. నెలాఖరులోగా మిగతా బకాయిలు చెల్లించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు స్పష్టం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి.

06:22 - July 5, 2016

రంగారెడ్డి : తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు..ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా జిల్లా శంషాబాద్‌ మండలం మదనపల్లి వద్ద అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. రూపేష్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె మృత దేహాన్ని ముక్కలుగా చేసి, సూట్‌కేసులో తీసుకొచ్చి శంషాబాద్‌ సమీపంలోని మదనపల్లి వద్ద పెట్రోల్‌ పోసి తగలపెట్టి పారిపోతుండగా అతడ్ని స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. అతడి కారు బురదలో కూరుకుపోవడంతో పట్టుబడ్డాడు. నిందితుడు సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రూపేష్‌గా గుర్తించారు. ఈ ఘటన సమయంలో నిందితుడితో పాటు కారులో ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై భాస్కర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి,
షేర్ మార్కెట్ లో నష్టాలు...
రూపేష్ అనే వ్యక్తి ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లో ఉంటున్న వీరికి సానియా కూతురు ఉంది. రూపేష్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. సోమవారం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన రూపేష్ భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం బాత్ రూంలో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. సూట్ కేసులో పెట్టుకుని దహనం చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో స్థానికులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చివ్వెంల మండలంలో కేశినేని ట్రావెల్స్ బస్సు బీభత్సం..

నల్గొండ : చివ్వెంల మండలం గుంజలూరు సమీపంలో కేశినేని ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మందడి సుభద్ర, చింత గోపమ్మ, గుడిపుడి కవిత మృతి చెందిన వారిలో ఉన్నారు. పెన్ పహాడ్ (మం) చీదెళ్ల వాసులుగా గుర్తించారు. కోదాడ వద్ద బస్సును పోలీసులు పట్టుకున్నారు. ఎపి 16 టిబి 8100 నెంబర్ గల కేశినేని ట్రావెల్స్ బస్సు సూర్యాపేటకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో భద్రత సెస్సు..

హైదరాబాద్ : నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో భద్రత సెస్సు అమలు చేయనున్నారు. ప్రయాణీకుల నుండి అదనంగా రూ. 1 వసూలు చేయనున్నారు. ప్రయాణీకులపై అదనంగా రూ. 100 కోట్ల భారం పడనుంది. పల్లెవెలుగు బస్సులు మినహా అన్ని బస్సుల్లో భద్రత సెస్సు అమలు చేయనున్నారు.

నేటి నుండి ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలో 2016-17 సంవత్సరానికి సంబంధించి కొనసాగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో మంగళవారం నుండి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

 

కృష్ణా బోర్డు నిర్వాహణపై నేడు భేటీ..

ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీని పర్యవేక్షించాల్సిన కృష్నా నదీ యాజమాన్య బోర్డు నిర్వాహణపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి ఆహ్వానం మేరకు రెండు రాష్ట్రాల అధికారులు మంగళవారం సమావేశం కానున్నారు.

 

నేటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు..

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ సేవలు మంగళవారం నుండి యథావిధిగా కొనసాగిస్తామని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. సోమవారం ఉదయం మంత్రి లక్ష్మారెడ్డితో బకాయిలపై చర్చించినట్లు, నెలాఖరులోగా వాటిని చెలిస్తామని ఆయన హామీనిచ్చారని ఆసుపత్రి యాజమాన్యలు పేర్కొన్నాయి.

కేంద్ర కేబినెట్ నేడు కొత్త రూపు..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ కు నేడు కొత్త రూపు రానుంది. ఉదయం 11గంటలకు ముహూర్తం నిర్ణయించారు. 19 మంది కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొందరికి ఉద్వాసన..మరికొందరికి పదోన్నతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లో ఉదయం 11గంటలకు కొత్తవారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వం సోమవారం తెలిపింది.

ఆటా వేడుకల్లో కీలక నిర్ణయాలు...

అమెరికా : అమెరికాలో తెలుగు సంఘాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో చికాగోలో జులై 1,2,3 తేదీల్లో జరిగిన ఆటా వేడుకల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటా, నాటా, టాటా ఆధ్వర్యంలో 2018లో ఉమ్మడిగా మెగా కాన్ఫరెన్స్ నిర్వాహణ, 2018 నుండి ప్రతి రెండేళ్లకొకసారి ఉమ్మడిగా మెగా కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 2017లో జరగనున్న టాటా ఆఖరి కాన్ఫరెన్స్ జరగనుంది.

శ్రీకాకుళం పలు మండలాల్లో భూ ప్రకంపనలు..

శ్రీకాకుళం : ఎచ్చర్ల, పొందూరు, లావేరు మండలాల్లో స్వల్ప భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. నెల వ్యవధిలో పలుసార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తొలసి, కింతలి, కనిమెట్ట, రాపాక పరిసర గ్రామాల్లో కూడా స్వల్పంగా భూమ కంపించింది.

Don't Miss