Activities calendar

06 July 2016

విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

నల్గొండ : బీబీ నగర్ మండలం మాదారంలో విషాదం నెలకొంది. బోరు మోటర్ తీస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు మృతి చెందారు. మృతులు అనీల్, కుమార స్వామిగా గుర్తించారు.  

21:56 - July 6, 2016

పేదోళ్లను సంపితేనే పెరుగుతది అభివృద్ధి... తెలుగు రాష్ట్రాల పోంట తెగల జనం తెర్లు తెర్లు, ఆవేశానికి లోనౌతున్న దిష్టిబొమ్మలు.. అవమానిస్తున్న నిరసన కారులు, ఇందిరమ్మ బిల్లు కాయితాలకు చెదలు... డబుల్ బెడ్ రూంలు ఎప్పుడు మొదలు, సంజీవిని మొలకను దొరకవట్టిన సారు, ఆరుద్ర పురుగులను అమ్ముతున్న జనం... తెల్వకతప్పుజేస్తునమట మనం, సూట్ కేసులో పరారైతున్న పోరడు... ప్లాటు ఫాం మీద ప్లాప్ అయిన సినిమా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:43 - July 6, 2016

ఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ శాఖను మోది ఎందుకు మార్చారు? మొదట్లోనే హెచ్‌ఆర్డీ మంత్రిగా ప్రమోషన్‌ కొట్టేసిన ఇరానినీ ఉన్నట్టుండి డిమోషన్‌ ఎందుకు చేశారు? విశ్వవిద్యాలయాల వివాదాలే కారణమా? 
స్మృతి ఇరానీకి డిమోషన్‌ 
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ ఇరానికి అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖను మోడీ అప్పగించడం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయంగా ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ రెండేళ్లు తిరక్కముందే స్మృతికి ఉన్నట్టుండి అంతగా ప్రాధాన్యత లేని టెక్స్‌టైల్‌ శాఖను అప్పగించడమంటే డిమోషన్‌ చేయడమేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న స్మృతీ ఇరానీ  
మానవ వనరుల శాఖ మంత్రిగా స్మృతీ ఇరానీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. స్మృతీ ఇరానీ డిగ్రీపై వివాదం నేపథ్యంలో ఆమెకు విద్యాశాఖను ఎలా అప్పగిస్తారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. హెచ్‌సియు, జెఎన్‌యు వివాదాలు ఇరానిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మంత్రి రాజీనామా కోరుతూ విపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి. ఆ సమయంలో కేంద్రం ఆమెకు అండగానే నిలిచింది. 
స్మృతి ఇరానికి టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ 
స్మృతి ఇరానికి టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖను అప్పగించడమంటే ఆమె ప్రాధాన్యతను తగ్గించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపక్షాలపై దాడి సందర్భంగా ఆమె ఫైర్‌బ్రాండ్‌లా వ్యవహరించిన తీరుపై పార్టీలోనే కాదు ప్రభుత్వంలో కూడా అసహనం వ్యక్తమైంది. ప్రతి చిన్న విషయానికి ఆమె ఉద్రేకానికి గురవుతారన్న ఆరోపణలున్నాయి.
స్మృతి పనితీరుపై సంఘ్‌పరివార్‌ అసంతృప్తి 
స్మృతి ఇరాని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతలతో మాత్రం మంచి సంబంధాలనే కొనసాగించినా ఆమె పనితీరుపై సంఘ్‌పరివార్‌ సంతృప్తిగా లేదు. పార్టీకి మంత్రిత్వ శాఖకు మధ్య సమన్వయం కొరవడింది. మంత్రి ఆదేశాలను అధికారులు పట్టించుకునేవారు కాదు. ఆమె తీరు వల్ల కొంతమంది అధికారులు హెచ్‌ఆర్‌డి నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నారు. విద్యాశాఖ పని తీరుపై మోది కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని అంశాల్లో పిఎంఓ కార్యాలయానికి హెచ్‌ఆర్‌డి శాఖకు పొంతన కుదరలేదు. దూకుడు స్వభావంతో స్మృతి స్వయంగా నష్టాన్ని కొనితెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 

21:37 - July 6, 2016

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపటి నుంచి ఐదురోజుల పాటు 4 ఆఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కీన్యా దేశాల్లో ప్రధాని పర్యటిస్తారు.  రేపు ఆయన మెుజాంబిక్‌ రాజధాని మపుటోకు చేరుకుంటారు. 34 ఏళ్ల తర్వాత మొజాంబిక్‌ పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోది. భారత్‌లో పప్పుల కొరత తీర్చేందుకు మొజాంబిక్‌ నుంచి వచ్చే నాలుగేళ్లలో 2 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకోవాలని మోది కాబినెట్‌ నిర్ణయించింది. మొజాంబిక్‌ నుంచి ప్రతియేటా 70 వేల టన్నుల పప్పును భారత్‌ దిగుమతి అవుతోంది. ఆఫ్రికా దేశాల పర్యటనలో మోది హైడ్రో కార్బన్స్, సముద్రతీరప్రాంత భద్రత, వ్యాపారం, పెట్టుబడులు, వ్యవసాయం, ఆహారం తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. 

 

21:34 - July 6, 2016

ఢిల్లీ : కేంద్ర సమాచార శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ పథకాలను మరింత చేరువగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని వెంకయ్య తెలిపారు.  అభివృద్ధి, సుపరిపాలనను దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ తనకు ఈ శాఖ కేటాయించారని చెప్పారు. రెండేళ్ల పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా తన వంతు పాత్ర తాను సమర్థవంతంగా నిర్వర్తించానన్నారు.. 

 

21:24 - July 6, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గేట్ వే హోటల్ లో గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అర్ధగంట పాటు చర్చలు జరిగాయి.  ఈ సమావేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం విందుకు గవర్నర్ ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు గవర్నర్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. 

 

విజయవాడలో గవర్నర్ నరసింహన్ పర్యటన

విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

 

21:14 - July 6, 2016

జూ.ఎన్ టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ టీజర్ విడుదలయింది. చిత్ర యూనిట్... టీజర్ ను విడుదల చేసింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త లుక్ తో యంగ్ టైగర్ అదరగొట్టాడు. 

చంద్రబాబు ఇంటికి చేరుకున్న గవర్నర్ నరసింహన్

విజయవాడ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఎపి సీఎం చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. గవర్నర్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. గేట్ వే హోటల్ లో 20 నిమిషాలు సీఎం, గవర్నర్ చర్చలు జరుపనున్నారు. 

 

20:45 - July 6, 2016

కడప : జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ వీసీ బేతనభట్ల శ్యాంసుందర్ అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీసీఐడీని ఆదేశించారు. వీసీపై వస్తున్న ఆరోపణల  నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీసీ అక్రమాల మీద విచారణకు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యూనివర్శిటీ పాలకమండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా సీఎం నిర్ణయంపై విద్యార్థి సంఘాలు, పాలకమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

20:42 - July 6, 2016

గుంటూరు : అమరావతి.. ఆంధ్రుల ఆశానగరి.. అందరికీ ఉద్యోగాలు దొరకాలి. వాణిజ్య రాజధానిగా నిలవడంతో పాటు అభివృద్ది కేంద్రంగా మారాలన్నదే ఆంధ్రులందరి కల. కానీ అమరావతి ప్రస్థానం ఎలా సాగుతోంది. అనుకున్న దిశగా వెళ్తోందా.. తప్పుదారి పడుతోందా.. ఈ అంశాలపై తాజాగా ఓ పుస్తకమే వచ్చింది. మహాద్భుతమైన రాజధాని నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆలోచనను మెచ్చుకుంటూనే ఈ పుస్తకం అమరావతి మంచి చెడులను వివరిస్తోంది. 
సింగపూర్ మాస్టర్‌ ప్లాన్‌ సరికాదు..  
ఆంధ్రుల ఆశాకిరణమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ సరికాదని రాజధాని నిర్మాణంపై రాసిన ఓ పుస్తకం వెల్లడించింది. సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌లో అనేక ప్రమాదాలు కనబడుతున్నాయనే విషయాన్ని ఈ పుస్తకంలో వివరంగా రాశారు. ఒండ్రుమట్టితో కూడిన నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే కృష్ణానది ఎడారిగా మారుతుందని పుస్తకంలో హెచ్చరించారు. సింగపూర్‌ ప్లాన్‌ వల్ల భవిష్యత్‌లో మంచినీటి సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని పుస్తక రచయిత ప్రొఫెసర్‌ విక్రం సోనీ తెలిపారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ రోమి ఖోస్లాతో కలిసి సోనీ అమరావతి సహజ నగరం పేరుతో రూపొందించిన ముసాయిదా ప్లాన్‌ను, పుస్తకరూపంలో ఆవిష్కరించారు. 
స్విస్ చాలెంజ్ పద్ధతి ప్రణాళికలకు యూరోపియన్‌ దేశాలు స్వస్తి
సింగపూర్‌ తరహా ప్రణాళిక ప్రపంచంలో ఎక్కడా అమలు చేయడం లేదని, యూరోపియన్‌ దేశాలు కూడా ఆ తరహా ప్రణాళికలకు స్వస్తి చెప్పాయని విక్రం సోనీ తన ముసాయిదాలో తెలిపారు. పచ్చని పంట భూముల్లో నిర్మాణాలు చేపట్టడం సరి కాదనిన్నారు. ప్రతి కిలోమీటరున్నరకూ పంటలను వదిలి, అనంతరం నిర్మాణాలు చేపట్టే పద్ధతిలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించారు.  
సింగాపూర్‌ ప్లాన్‌.. వరదలు, కరవులు 
కృష్ణానది వరదల సమయంలో కొట్టుకువచ్చే ఒండ్రుమట్టి, ఇసుక వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడమే కాకుండా ఏడాది పొడవునా 300 రకాల పంటలు పండుతున్నాయని విక్రమో సోనీ అన్నారు. సహజ సిద్ధ నీటి వనరులను అందుబాటులోకి తేవడం ద్వారా తాగునీటి కష్టాలు మటుమాయమవుతాయని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు దేశంలో నిర్మాణం, ప్లానింగ్‌ రంగ నిపుణులు లేరన్న విధంగా ప్రచారం చేయడం సరికాదని, 30 ఏళ్ల క్రితమే చండీగఢ్‌ను పూర్తిగా దేశవాళీ ఇంజనీరింగ్‌ నిపుణులతో నిర్మించారని గుర్తుచేశారు. సింగపూర్‌ ప్లాన్‌ తెచ్చుకున్నామని గొప్పగా చెప్పకుంటున్నప్పటికీ, అక్కడ ప్లానింగ్‌ రంగంలో ఉన్న వారిలో 90 శాతం మంది భారతదేశానికి చెందినవాళ్లేనని అన్నారు. సింగాపూర్‌ ప్లాన్‌తో భవిష్యత్‌లో వరదలు, కరవులు వచ్చే పరిస్థితి ఉందని రైతులు విమర్శిస్తున్నారు. ప్రకృతికి ఎలాంటి ఆటంకం కలగకుండా సహజ అమరావతి నగర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

20:37 - July 6, 2016

మెదక్ : జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముంపు గ్రామాల ప్రజలు రోజురోజుకు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వీరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణ జేఏసీ సభ్యులు సైతం భూసేకరణ చట్టాలపై వీరికి అవగాహన కల్పిస్తున్నారు. 
వివాదస్పదంగా మారిన మల్లన్నసాగర్ 
తెలంగాణలో రెండునెలల నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆంశం అత్యంత వివాదస్పదంగా మారింది. ప్రాజెక్టు కట్టితీరుతామని ప్రభుత్వం ఓ వైపు అంటుంటే... ప్రాజెక్టు కట్టనీయమని గ్రామస్తులు అంటున్నారు. మెదక్ జిల్లాలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. వీరి ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలన్ని మద్దతుగా నిలిచాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. అలాగే టీఎస్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. 
టీజేఏసీ... అవగాహన సదస్సు 
తాజాగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన సదస్సు జరిగింది. డిపిఆర్ లేకుండా భూ సేకరణ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం లేదని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం... ఇప్పుడెలా భూసేకరణకు పాల్పడుతుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలోనే ఉంది కాబట్టి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి తెలిపారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. 
భూమికి భూమినే పరిహారంగా ఇవ్వాలి : అంజిరెడ్డి             
భూసేకరణలో తమకు నష్టపరిహారం వద్దని.. భూమికి భూమినే పరిహారంగా ఇచ్చి ప్రాజెక్టు కట్టాలని కిసాన్ సంఘ్‌ నేత అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు డబ్బులు ఏం చేయాలో తెలియదని... భూమిని ఏం చేయాలో మాత్రమే తెలుసన్నారు. 
ప్రాజెక్టుకు భూములివ్వమంటున్న ప్రజలు
ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ప్రాజెక్టుకు భూములివ్వమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తమకు ప్రాజెక్టు వద్దు.. తమను ఇలాగే బతకనివ్వమని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ భూములను లాక్కోవద్దని కన్నీరుమున్నీరవుతున్నారు.

 

20:31 - July 6, 2016

హైదరాబాద్ : సరోజిని కంటి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం 13 మంది రోగులను అంధులను చేసింది. శుక్లాలు తొలగిస్తే మంచి చూపు వస్తుందన్న ఆశతో ఆపరేషన్‌ చేయించుకుంటే మొదటికే మోసం వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే.. పదే పదే ఆపరేషన్లు చేస్తూ.. రోగులను ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ బాధితుల ఆందోళనను 10టీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో సర్కారు కదిలి.. ఘటనపై విచారణకు ఆదేశించింది. 
అంధులైపోయిన 13 మంది 
సరోజిని ఆస్పత్రి.. ఎంతో పేరున్న నేత్ర వైద్యశాల. అయితే.. డాక్టర్స్‌ ఓవర్‌ కాన్ఫిడెన్సో లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ.. ఆపరేషన్‌ చేయించుకున్న 13 మంది అంధులైపోయారు. వారం రోజుల క్రితం కంటిలో శుక్లాలు తొలగించేందుకు 13 మందికి ఆపరేషన్‌ చేశారు. వీరికి ఆపరేషన్‌ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ సోకింది. అయితే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వారిని ఇంటికి పంపించివేశారు. రెండు, మూడు రోజులైనా పరిస్థితి మారకపోవడంతో బాధితులు మళ్లీ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులకు సమస్య చెబితే.. మళ్లీ ఆపరేషన్‌ చేశారు. అయినా అదే పరిస్థితి. తగ్గలేదని రోగులు రావడం.. వారికి వైద్యులు ఆపరేషన్‌ చేయడం ఇలా.. వారం రోజుల్లోపే ఒక్కొక్కరికి రెండు, మూడు సార్లు ఆపరేషన్‌ చేశారిక్కడి వైద్యులు.
మళ్లీ ఆపరేషన్‌కు రోగులకు పిలుపు 
ఈరోజు మళ్లీ ఆపరేషన్‌ చేసేందుకు రోగులను ఆస్పత్రికి పిలిపించారు. అయితే.. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కంగారుపడ్డ వైద్యులు వారిని వెనక ద్వారం గుండా ఇంటికి పంపించే ప్రయత్నాలు చేశారు. వైద్యుల చర్యపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు.
బాధిత బంధువులు ఆందోళన 
రెండు, మూడు సార్లు ఆపరేషన్‌ చేసిన తమవారికి నయం కాకపోవడంతో బాధిత బంధువులు ఆందోళన చెందుతున్నారు. చూపు మెరుగుపడకపోయినా.. ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలా వుందో అలా పంపిస్తే చాలంటున్నారు. తమ గోడును వైద్యులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
సెలైన్‌ వల్లే ఇన్‌ఫెక్షన్‌ 
మరోవైపు ఆపరేషన్‌ చేసేందుకు ఉపయోగించిన పరికరాలు,.. ఆపరేషన్‌ అనంతరం రోగి కంటిని క్లీన్‌ చేసేందుకు వాడిన సెలైన్‌ వల్లే ఇన్‌ఫెక్షన్‌ జరిగిందని వైద్యులంటున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. 
ప్రభుత్వ స్థాయిలో కలకలం
బాధితుల ఆందోళనను 10టీవీ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ స్థాయిలో కలకలం రేగింది. ఆపరేషన్లు వికటించిన అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా రవీందర్‌గౌడ్‌ను నియమించింది. 13మందికి చూపు పోయిన ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాంటే మరికొన్ని రోజులు ఆగాలి. 

అధికారులతో సీఎం చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్

విజయవాడ : అధికారులతో సీఎం చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. 

19:30 - July 6, 2016

కర్నూలు : జిల్లాల్లో పెద్దమొత్తంలో వెండి, బంగారం, నగదు పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా గోల్డ్‌, సిల్వర్‌ బిస్కెట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి ఒక కేజీ బంగారాన్ని, 35కిలోల వెండితోపాటు వీటితోపాటు 32లక్షలరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులు కర్నూల్లోని బళ్లారి చౌరస్తా దగ్గర అనుమానంగా సంచరిస్తుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

19:26 - July 6, 2016

విజయవాడ : సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌తో అనేక ప్రమాదాలున్నాయని ప్రొఫెసర్ విక్రమ్‌సోనీ తెలిపారు. విజయవాడ ఐఎంఏ హాల్‌లో ప్రొఫెసర్ విక్రమ్‌సోనీ రాసిన అమరావతి సహజ నగరం పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ రోమి ఖోస్లాతో కలిసి విక్రం సోనీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజధానిని సహజసిద్ధంగా ఎలా నిర్మించుకోవాలి అనే అంశంపై ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సింగపూర్‌ ప్లాన్‌ వల్ల భవిష్యత్‌లో మంచినీటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. యూరోపియన్‌ దేశాలు కూడా సింగపూర్ తరహా ప్లాన్‌కు స్వస్తి పలికాయని తెలిపారు. ప్రతి కిలోమీటరున్నరకూ పంటలను వదిలి..అనంతరం నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు. 30 ఏళ్ల క్రితమే దేశవాళీ ఇంజనీరింగ్‌ నిపుణులు చండీగఢ్‌ను నిర్మించారని గుర్తు చేశారు. సింగపూర్‌ ప్లానింగ్‌ రంగంలో ఉన్న వారిలో 90 శాతం భారతీయులన్నారు. సింగాపూర్‌ ప్లాన్‌తో భవిష్యత్‌లో వరదలు, కరవులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటే ప్రజలందరికీ రాజధాని ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. 

 

కాసేపట్లో విజయవాడ చేరుకోనున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కాసేపట్లో వియవాడకు చేరుకోనున్నారు. గవర్నర్ తో సీఎం చంద్రబాబు  సమవేశం కానున్నారు. ఈ సమవేశంలో హైకోర్టు విభజన, కృష్ణా జలాల వివాదంపై చర్చించనున్నారు.

18:58 - July 6, 2016

విశాఖ : కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ తెలిపారు. విశాఖ నగరంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల వచ్చే పర్యావసానాలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని శర్మ తెలిపారు. ప్రధానంగా కొవ్వాడ భూకంపాల జోన్ లో ఉందని.. ఇక్కడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

 

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

హైదరాబాద్ : ముస్లిం సోదరులకు ప్రముఖులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

అశ్వత్థామరెడ్డిపై అసత్య ప్రచారం : టీఎంయూ నేతలు

హైదరాబాద్ : టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ నేతలు తిరుపతి, థామస్ రెడ్డి తెలిపారు. సీఎంకు రాసిన లేఖలో ఉన్నవన్నీ అసత్యాలేనని, ఆ లేఖ వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసన్నారు. సీఎం కార్యాలయం నుంచి రోటీన్ లేఖ మాత్రమే వచ్చిందని చెప్పారు. కార్మికులు వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు. అబద్ధపు ప్రచారాతో టీఎంయూ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆరోపణలన్నీ అవాస్తవాలని వెల్లడించారు. 

'సరోజినిదేవి' ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : సరోజినిదేవి కంటి ఆస్పత్రిని మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. 13 మంది కంటి చూపు కోల్పోవడంపై ఆరా తీశారు. 

18:40 - July 6, 2016

విశాఖ : జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. దీంతో అనేకమంది ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పది మంది మృత్యువాత పడ్డారు. ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో డయేరియాతో బాధపడుతూ ఈరోజు ఇద్దరు మృతి చెందారు. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. 

 


 

విశాఖ జిల్లాలో డయేరియాతో ఇద్దరు మృతి

విశాఖ : జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పది మంది మృతి చెందారు. ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో డయేరియాతో బాధపడుతూ ఈరోజు ఇద్దరు మృతి చెందారు. మరోవైపు భీమిలి నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు. 

18:21 - July 6, 2016

ఆదిలాబాద్ : అటవీ మంత్రి ఇలాఖాలో అడవులు అంతరించి పోతున్నాయి. స్మగ్లర్ల ధాటికి అటవీ సంపద అక్రమంగా తరలిపోతోంది. అధికారుల ఉదాసీన వైఖరే దీనికి కారణమన్న ఆరోపణలున్నాయి. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేలా హరించుకు పోతున్న అటవీ సంపదపై 10టివి స్పెషల్‌ రిపోర్ట్‌...
యథేచ్చగా అడవుల నరికివేత...
ఆదిలాబాద్‌.. అడవుల జిల్లాగా ప్రసిద్ధి. అయితే ఈ ఖ్యాతి సమసిపోయేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. జిల్లాలో పెట్రేగి పోతోన్న అడవి దొంగల వల్ల.. వనం శరవేగంగా అంతరించుకు పోతున్నాయి. ముఖ్యంగా కడెం మండలంలోని గంగాపూర్‌ సెక్షన్‌ పరిధిలో.. టేకు వృక్షాలను స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా నరికేస్తున్నారు. గంగాపూర్‌ గ్రామానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ వనమేధం యథేచ్ఛగా సాగుతున్నా.. అటవీశాఖ అధికారులు నిద్ర మత్తు వీడటం లేదు.
అటవీ సంపద నరికివేతతో బోసిపోతోన్న వనం
ఆదిలాబాద్ జిల్లాలో లభించే కలపను బంగారంతో పోలుస్తారు. అత్యంత నాణ్యతగా ఉండే ఈ కలపను స్మగ్లర్లు యథేచ్చగా కొల్లగొడుతున్నారు. కలప తరలింపునకు కాదేదీ అనర్హం అన్నట్లు ఆటోలు, కార్లు, డీసీఎం వ్యాన్లు, లారీలు ఇలా ప్రతి వాహనంలో కలప తరలిపోతూనే ఉంది.. వందల సంవత్సరాల వయస్సున్న పెద్దపెద్ద టేకు వృక్షాలను నరికివేస్తుండటంతో వనం బోసిపోతోంది.  అటవీ శాఖ అధికారుల నిఘా లేకపోవడంతో లక్షల విలువ చేసే కలప అక్రమంగా రవాణా అవుతోంది.
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు తరలింపు
అడవుల్లోని కలపను అక్రమంగా తరలించేందుకు.. స్మగ్లర్లు గోదావరి నదిని ఉపయోగించుకుంటున్నారు. ఖానాపూర్, కడెం మండలాల నుంచి.. గోదావరి నది ద్వారా.. ఆవలి తీరానికి కలపను తరలించుకు పోతున్నారు. కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్, మూలరాంపూర్, నిజామాబాద్ జిల్లా గుమిర్యాల్ గ్రామాల్లో కొందరు వ్యాపారులు ఆదిలాబాద్ కు చెందిన స్మగర్ల నుంచి కలపను కొనుగోలు చేసి నిజామాబాద్ కు తరలించి.. అక్కడ భారీ మొత్తానికి టేకును అమ్ముకుంటున్నారు. 
అధికారుల ఉదాసీనత
అడవులను పరిరక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉండడం.. చెట్లు నరుకుతున్న ప్రాంతం వైపు.. నామమాత్రంగా కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టేకు వృక్షాలను పెద్దఎత్తున నరికి.. అక్రమంగా తరలిస్తోన్న స్మగ్లర్లకు అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
మొక్కుబడిగా అధికారుల తనిఖీలు 
అటవీ అధికారులు అదపాదడపా తనిఖీలు నిర్వహిస్తున్నా.. అవి మొక్కుబడి తంతుగానే సాగుతున్నాయి. కఠిన చర్యలు లేకపోవడంతో స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. అంతరించుకు పోతున్న అడవులపై ప్రభుత్వం దృష్టి సారించక పోతే..  చెట్ల జిల్లాకే కాదు.. పరిసరాల పర్యావరణానికి చేటు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. 

18:12 - July 6, 2016

హైదరాబాద్ : మొక్కలు నాటి, చెట్లను పరిరక్షించే విషయంలో హైదరాబాద్‌లో విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హరితహారం కార్యక్రమం కింద ఒక వైపు ప్రభుత్వం ఏటా లక్షల మొక్కలు నాటుతుంటే... మరోవైపు కరెంటు తీగలకు అడ్డం వస్తున్నాయన్న కారణంతో ఏపుగా ఎదిగిన చెట్లను విద్యుత్‌ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నరికేస్తున్నారు. హరితహారం కార్యక్రమం లక్ష్యాలకు విద్యత్‌ శాఖ తూట్లు పొడుస్తోంది. ప్రణాళికాబద్ధంగా హరితహారం చేపట్టాలని నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:58 - July 6, 2016

నల్లగొండ : జిల్లాలోని యాదగిరిగుట్ట  మండలంలోని గౌరాయిపల్లిలో చిరుత కలకలం నెలకొంది. నిన్న రాత్రి గ్రామంలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో.. అటవీశాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. ఆనవాళ్లను పరిశీలించి.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే.. వెంటనే అధికారులు చిరుత పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

 

17:36 - July 6, 2016

పట్నా : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్‌ ఖేతాన్‌పై పంజాబ్‌లో కేసు నమోదైంది. మత భావోద్వేగాలను రెచ్చగొట్టారన్న కారణంతో ఆశిష్‌ ఖేతాన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ మెనిఫెస్టోకు సంబంధించిన ఓ పోస్టర్‌ను అమృత్‌సర్‌లో విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో అమృత్‌సర్‌ స్వర్ణమందిరాన్ని చూపడంతో పాటు ఆప్‌ గుర్తు చీపురును కూడా ముద్రించడం వివాదస్పదంగా మారింది. అంతేకాదు...మెనిఫెస్టోను సిక్కుల పవిత్ర గురు గ్రంథ్‌ సాహెబ్‌తో పోల్చడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆశిష్‌ ఖేతాన్‌ క్షమాపణ చెప్పారు. పవిత్ర గ్రంథాన్ని తక్కువ చేసి చూపడం తన అభిమతం కాదని ఆశిష్‌ వివరణ ఇచ్చారు.

 

17:34 - July 6, 2016

టర్కీ : టూరిస్టుల స్వర్గధామం టర్కీలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్ధం ఆవరించింది. టెర్రరిస్టుల బీభత్సకాండతో   ఇస్తాంబుల్‌ నిర్మానుష్యంగా మారింది. బిజినెస్‌లు లేక హోటళ్లు, యాత్రాస్థలాలు వెలవెలబోతున్నాయి. పర్యాటక నగరంలో ఉగ్రవాదులుదాడి తర్వాత ఆప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం వణికిపోతున్నారు. 
నిర్మానుష్యంగా మారిన టూరిస్ట్‌ స్పాట్‌లు
వేలసంఖ్యంలో టూరిస్టులు... కోట్లాది డాలర్ల బిజినెస్‌...  ఇది నిన్నటి మాట..ఉగ్రవాదుల దాడితో... టర్కీటూరిజం నిస్తేజంగా మారింది. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే  ఇస్తాంబుల్‌నగరం... నిర్మానుష్యంగా మారిపోయింది.  షాపింగ్  చేసేందుకు స్థానికులు సైతం  భయపడిపోతున్నారు. సందర్శకులతో ఎప్పుడూ రష్ గా కనిపించే షాపింగ్‌మాల్స్‌ ...ఖాళీగా కనిపిస్తున్నాయి. 
జూన్‌ 30న ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టుపై ఉగ్రదాడి
గత నెల 30న ఇస్తాంబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులతో మారణహోమానికి తెగబడిన ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. దీంతో  టర్కీపౌరులతోపాటు.. ఆదేశానికి వెళ్లే యాత్రీకులు సైతం వీధుల్లో తిరగాలంటేనే భయపడుతున్నారు.  ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న  ఇస్తాంబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు  ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ప్రాచీన మసీదులు, అద్భుతమైన సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి ఎసెట్‌గా ఉన్నాయి. అటువం ఉన్నత చారిత్ర  వారసత్వపు దేశం ఇపుడు ఉగ్రవాదుల దాడులతో చిగురాటాకులా వణికిపోతోంది.  ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ భయపెట్టాయి.   టర్కీవైపు వెళ్లాలంటేనే టూరిస్టులు వణికిపోతున్నారు. దీంతో  కొనుగోలుదారులు లేక ఇస్తాంబుల్‌ నగరంలో షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా  మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు పర్యాటకులు లేక  బోసిపోతున్నాయి. 
తీవ్రంగా దెబ్బతిన్న టూరిస్ట్ ఇండస్త్రీ
ఇస్తాంబుల్ దాడులు స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని టూరిస్ట్ గైడ్లు వాపోతున్నారు.  జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీని తీవ్రంగా దెబ్బతీసింది. చారిత్రక కాలం నుంచి ఎన్నో యుద్ధాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న తమదేశం...ఇపుడు జీహాదీలను కూడా సమర్ధంగా ఎదుర్కొంటుందని  సాధారణ టర్కీపౌరులు మాత్రం ధీమావ్యక్తం చేస్తున్నారు.  

 

17:26 - July 6, 2016

హైదరాబాద్ : టీఎస్‌ ఆర్టీసీ కార్మికనేత అశ్వత్థామరెడ్డిపై అరోపణలు వెల్లువెత్తాయి. అశ్వత్థామరెడ్డిపై ఆరోపణలు చేస్తూ మురళీధర్‌ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. ఆర్టీసీ మెకానిక్‌గా జాయిన్‌ అయిన అశ్వత్థామరెడ్డి.. అక్రమంగా డ్రైవర్‌గా విధులు చేపట్టడాని ఆరోపించారు. ఉద్యోగులు, అధికారులను బెదిరిస్తూ వందల కోట్లు సంపాదించాడని లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై రవాణా శాఖ స్పందించింది. వారంలోగా విచారణ జరిపించాలని రవాణా శాఖ.. ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. 

 

మళ్లీ దాడులు - ఐసిస్....

ఢిల్లీ : బంగ్లాదేశ్ లోని ఢాకాలో చేసిన దాడులు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఢాక దాడి చిన్నదని..ఇంకా అలాంటివి చాలా జరుగుతాయని వీడియోలో బంగ్లాదేశీ ఉగ్రవాది హెచ్చరించాడు.

కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటించారు. దత్తత తీసుకున్న ముస్తాబాద్ మండలం చీకోడులో పర్యటించారు. గ్రామంలో సమస్యలపై ఆరా తీశారు.

ముస్లిం సోదరులకు జగన్ రంజాన్ శుభాకాంక్షలు..

కడప : ముస్లిం సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం మాత్రమే కాదని, ప్రపంచ మానవాళికి అదొక స్ఫూర్తి అని, తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.

17:13 - July 6, 2016

విజయవాడ : వర్షాలు కురుస్తుండటంతో పుష్కరాల పనులకు ఆటంకంగా మారిందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని పుష్కరఘాట్లను మంత్రి పరిశీలించారు. పద్మావతిఘాట్‌,సీతమ్మవారిపాదాల ఘాట్‌ల పనులపై అధికారులకు సూచనలు చేశారు. కృష్ణా,గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 238 ఘాట్లను నిర్మిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామన్నారు. 

 

17:10 - July 6, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసు విచారణ మూడేళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ అటార్ని జనరల్ ముకుల్‌ రోహ్తగి ఈ విషయాన్ని వెల్లడించారు. సల్మాన్‌కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టులో విచారణ చేపట్టాల్సిన ఎన్నో ముఖ్యమైన కేసులున్నాయని, ఓ సామాన్యమైన యాక్సిడెంట్‌ కేసుకు అంత ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం లేదని జస్టిస్‌ జెఎస్‌ ఖెహర్, జస్టిస్‌ అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్‌ ప్రకారం సల్మాన్ కేసు బెంచ్‌పైకి వచ్చేందుకు మూడేళ్లు పట్టొచ్చు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2002లో బాంద్రాలోని ఓ బేకరీ ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులపై నుంచి సల్మాన్‌ ల్యాండ్‌ కూజర్ కారు తోలాడు. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

 

మల్లన్న సాగర్ ను కట్టితీరుతాం - ఎంపీ బాల్క సుమన్..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామని ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడగు వేసే ప్రసక్తే లేదని, ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

కస్టడీలో ఉన్న నిందితుడిని చితకబాదిన పోలీసులు..

తిరుమల : చోరీ కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు విజయ్ కుమార్ నాయక్ ను క్రైం పోలీసులు చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో తిరుపతి స్విమ్స్ కు తరలించారు. మూర్చ రావడంతో ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడు విజయ్ కుమార్ పై పలు కేసులు నమోదై ఉన్నాయి.

కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..

హైదరాబాద్ : రేపు రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాకారమయ్యేలా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకల్లో పాల్గొంటుందని తెలిపారు.

మెస్సీకి జైలు శిక్ష..

ఢిల్లీ : ఆదాయపు పన్ను ఎగవేత కేసులో స్టార్ ఫుట్ బాలర్ మెస్సీకి, ఆయన తండ్రికి జైలు శిక్ష విధించారు. 21 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మిలియన్ల యూరోలు జరిమాన విధించింది. ఇటీవలే మెస్సీ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

17:04 - July 6, 2016

శ్రీకాకుళం : కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంతో ఒడిశా నుంచి కాకినాడ వరకు వినాశనం కలుగుతుందని సీఐటీయూ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు తెలిపారు. కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సీఐటీయూ నిర్ణయించింది. ఈ కేంద్రంతో జరిగే నష్టాలు, దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తూ సీఐటీయూ నేతలు పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు నర్సింగరావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 
కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంతో ఒడిశాలోని చత్రపూర్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వరకు వినాశనం తప్పదని చెప్పారు. భారత్‌-అమెరికా అణు విద్యుత్‌ ఒప్పందంతో సౌర్వభౌమత్వానికి ప్రమాదన్నారు.  ఈ ఒప్పందంతో భారత్‌కు ఎంటువంటి మేలు జరగదని స్పష్టం చేశారు. అమెరికా వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని పేర్కొన్నారు. జపాన్‌, రష్యా అణు విద్యుత్‌  ప్రమాదాలను గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. 

అధికారులతో మంత్రి హరీష్ సమీక్ష..

ఆదిలాబాద్ : కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. మార్కెటింగ్, నీటి పారుదల, భూ సేకరణపై సమీక్ష చేస్తున్నారు.

 

16:21 - July 6, 2016

గత సంవత్సరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోవడంతో.. ఆ తర్వాత మరో సినిమాకు కమిట్ అవలేదు బబ్లీ బ్యూటీ ఛార్మీ. అయితే ముఖ్యంగా అమ్మడికి సరైన ఆఫర్లు రాలేదని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన దానంపై చర్చ నడుస్తోంది. క్యాన్సర్ పేషెంట్ కోసం దానం చేసిందంట. దీనికి సంబంధించిన విషయాలు ఛార్మీ వెల్లడించింది. అనంతరం తన ఫొటోలను కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
తన స్నేహితుడి నివాసం పక్కనే ఉండే ఇద్దరు యువతులకు క్యాన్సర్ సోకిందని..వారిద్దరూ తన అభిమానులని తెలిపింది. దీనితో వారిని కలిసి కొంత సమయం గడపడం జరిగిందని, తన జుట్టుకు వారు ముచ్చటపడ్డారని పేర్కొంది. అంతగా నచ్చిన జుట్టుతో విగ్గులు చేయించాలని భావించానని, తన హెయిర్ స్టైల్ ను పిలిచి 18 అంగుళాల జుట్టును కత్తిరించి వారికి విగ్గులు చేయించినట్లు తెలిపింది. త్వరలోనే వారికి విగ్గులు అందచేస్తానని ఛార్మీ పేర్కొంది.

నగరంలో వర్షం..

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, కోఠఙ, మలక్ పేట, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

 

చిక్కుల్లో టీఎంయూ..

హైదరాబాద్ : గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో టీఎంయూ చిక్కుల్లో చిక్కుకుంది. టీఎస్ ఆర్టీసీ కార్మిక నేత అశ్వథామరెడ్డి అక్రమాలపై సీఎం కేసీఆర్ కు మురళీధర్ అనే వ్యక్తి లేఖ రాశారు. మాములు మెకానిక్ గా ఆర్టీసీలో చేరిన అశ్వథామరెడ్డి దొడ్డిదారి అనతికాలంలో డ్రైవర్ గా మారడని, ఉద్యోగులను, అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదించాడని లేఖలో ఫిర్యాదు చేశారు. అశ్వథామరెడ్డిపై విచారణ జరిపించాలని రవాణాశాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

జగద్గిరిగుట్ట పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఏడాదిలోగా తాడిపూడి ఎత్తిపోతల పథకం -సీఎం చంద్రబాబు..

పశ్చిమగోదావరి : ఈ ఏడాదిలో తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 302 రోజుల్లోనే పట్టిసీమ ఎత్తిపోతల పూర్తి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని, 24 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలించడమే లక్ష్యంగా పెట్టకున్నామని సీఎం పేర్కొన్నారు.

 

రోహిత్ ఘటన వల్లే స్మృతి శాఖ మార్పు -కన్నయ్య..

ఢిల్లీ : యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన కారణంగానే స్మృతీ ఇరానీ శాఖ మార్పు జరిగిందని ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య పేర్కొన్నారు. రోహిత్‌కు న్యాయం జరగాలని కోరారు.

15:54 - July 6, 2016

అనంతపురం : పట్టణంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ఇద్దరు తీవ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసు బృందం అనంతపురంలోని ఓ లాడ్జీలో ఇద్దరు తీవ్రవాద అనుమానితులను అరెస్టు చేసింది. మరొక తీవ్రవాది పరారయ్యాడు. అతని వద్ద మారణాయుధాలు ఎకె 47 గన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే అరెస్టు చేసిన ఇద్దరిని రహస్య ప్రాంతంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏ ప్రాంతంలో కూడా హైఅలర్ట్ ప్రకటించలేదు. ఒక వేల హైఅలర్ట్ ప్రకటిస్తే.... ప్రజలు భయాందోళనలకు గురవుతారని భావిస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో దొరికిన ఉగ్రవాద సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసు బృందం ఇవాళ అనంతపురంకు వచ్చి ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతవారం రోజులుగా అనంతపురంలో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో తాడిపత్రిలో ఎన్ ఐఎ అధికారులు వచ్చి ఉగ్రవాదుల కదలికలపై ఆరా తీశారు. అనంతపురం కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు బెంగుళూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. 

15:42 - July 6, 2016

కంప్యూటర్ ఆధారితంగా చేసే నేరాలను సైబర్ నేరాలు అంటారని లాయర్ పార్వతి తెలిపారు. టెక్నాలజీ డెవలప్ మెంట్ అయినకొద్ది నేరాలు కూడా పెరిగాయన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. సైబర్ నేరాలకు మహిళలు 13 శాతం కంటే ఎక్కువగా బలవుతున్నట్లు చెప్పారు. టెక్నాలజీ వల్ల మంచి ఉంటుంది... చెడూ ఉందని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 2000 సం.లో ఇన్ ఫర్మేషన్ యాక్టు వచ్చిందని చెప్పారు. ఈ యాక్టులో చాలా రకాల సెక్షన్లు, శిక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ యాక్టులోని సెక్షన్ 66 ఆఫ్ టెక్నాలజీ యాక్టు ప్రకారం.. అసభ్యకరమైన మెసేజెస్, మెయిల్ ఐడీలు హ్యాక్ చేయడం, మార్పింగ్, తెలియికుండా ఆడపిల్లల భాగాలను క్యాప్చర్ చేయడం వంటి పలు అభ్యంతరకర, అసభ్యకరమైన చర్యలకు పాల్పడితే నిందితులు శిక్షలు పడుతాయని స్పష్టం చేశారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నిజామాబాద్ లో మహిళపై అత్యాచారయత్నం..

నిజామాబాద్ : ఎడవల్లి (మం) జానకిపేట గ్రామ శివారులో మహిళకు మద్యం తాగించి దుండగులు అత్యాచారయత్నం చేశారు. పోలీసులను చూసిన దుండగులు పారిపోయారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ గురుకులాల వేతనాల పెంపు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు..సిబ్బందికి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జూనియర్ లెక్చర్లకు రూ. 18 వేల నుండి రూ. 27వేలకు పెంచారు. పీజీటీలకు రూ. 16,100 నుండి రూ. 24వేలు..టీజీపీ రూ. 14,800 నుండి రూ. 22వేలు..పీఈటీలకు రూ. 10,900 నుండి రూ. 16,350 కు వేతనాలు పెంచారు. ఈ పెరిగిన వేతనాలు ఈ విద్యా సంవత్సరం నుండి అమలు కానున్నాయి.

15:31 - July 6, 2016

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లలో మికా సింగ్ ఒకరు. ఇతడు పలు భాంగ్రా, పాప్ మరియు సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. ప్రస్తుతం ఈ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ మోడల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పీఎస్ లో మికా సింగ్ పై కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు దిగాడని, బాలీవుడ్ లో అవకాశాలు ఇప్పిస్తానని మికా సింగ్ తిప్పి మొండి చేయి చూపించాడని ఆ మోడల్ పేర్కొంది. నిలదీస్తే తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మికా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మికా సింగ్ స్పందించారు. పీఎస్ కు వెళ్లారు. రూ. 5 కోట్లివ్వాలని ఆ మోడల్ డిమాండ్ చేయడం జరిగిందని, ఇవ్వకపోయేసరికి తనపై కేసు పెట్టిందని మికా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల్లో ఏది వాస్తవమో పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంటుంది.

15:28 - July 6, 2016

హైదరాబాద్ : ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. కాని ఇంతవరకు ప్రభుత్వం మేనేజ్‌మెంట్ కోటా సీట్లపై ఎటు తేల్చకుండా నాన్చుతోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీలన్ని బి కేటగిరి సీట్లను అమ్ముకున్నారు. అయినప్పటికి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడాన్ని పక్కన పెట్టి బి కేటగిరి ఫీజులను తేల్చలేదు. 
బీ- కేటగిరి ఆడ్మిషన్‌లో మాత్రం రాని స్పష్టత
తెలంగాణాలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి రావడంతో విద్యార్ధులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని బి-కేటగిరిలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్ధులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. ముందు నుంచి మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలనే చెబుతున్నప్పటికీ యాజమాన్యాలు ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టడమే కాకుండా...అడ్మిషన్లను కూడా పూర్తి చేశాయని సమాచారం. 
బీ కేటగిరిలో ఆడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తే కఠిన చర్యలు : కడియం
అయితే ఇటు అధికారులు అటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎక్కడ మాట్లాడినా.. బీ కేటగిరిలో అడ్మిషన్ల ప్రక్రియ ఎవ్వరు ప్రారంభించినా చర్యలు తప్పవంటున్నారు. అయితే ఇవేమీ పట్టని ఇంజినీరింగ్ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా సీట్లను అమ్మేసుకుంటున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఫీజు గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో... డిమాండ్ ను బట్టి వసూలు చేస్తున్నారు. ఈ అమ్మకాల ప్రక్రియ ప్రారంభించి కూడా దాదాపుగా రెండు నెలలు గడుస్తోంది. డిమాండ్ ఉన్న... సిఎస్‌ఈ, ఐటి వంటి కోర్సులకు దాదాపుగా పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్ గా మారినా... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైన తరువాత కూడా.. ప్రభుత్వం బీ కేటగిరి సీట్లపై ఇప్పటికీ నోరు మెదపడం లేదు. ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల దోపిడిపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావంతులు ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే బి కేటగిరి ఫీజుల వివరాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  

 

15:08 - July 6, 2016

నల్గొండ : ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన ఏకైక శిలగా రికార్డు కల్గిన భువనగిరి కోటకు మంచిరోజులు రానున్నాయి. సర్వాయిపాపన్న పాలనకు కేరాఫ్ అడ్రస్ అయినా..ఈ కోట గత వైభవాన్ని సంతరించుకోవడంపై దృష్టిపెట్టింది పర్యాటకశాఖ. త్వరలో టూరిస్ట్ స్పాట్ డిసైన్ చేయడంపై ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో భాగంగా రోప్ వే ఏర్పాటు చేయడంపై జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించారు.  
పర్యాటక ప్రాంతంగా భువనగిరి కోట
తెలంగాణ వారసత్వ సంపదను పర్యటన ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది. అందుకోసం జిల్లాలోని ప్రముఖ కట్టడాలు, సాంస్కృతిక కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓరుగల్లు కోట గోల్కొండ కోటల మధ్య ఉన్న భువనగిరి కోటకు చారిత్రక ప్రాశస్థ్యం ఉండడంతో.. లేజర్ షో.. సౌండ్ అండ్ లైటింగ్‌తో సరికొత్త టూరిస్ట్ స్పాట్ మారబోతోంది. 
రోప్ వే ఏర్పాటు 
40 ఎకరాల విస్తీర్ణంలో.. ఉన్న ఏకశిలా పర్వతం బలిష్టమైన రాతిగోడ ధృడమైన బురుజులు ..పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఏకశిలా కోట అగ్రభాగంపై సుందరంగా నిర్మించబడిన రాజప్రసాదం నాటి రాజుల కళా నైపుణ్యం శిల్పాలు పనితీరుపై నేటి తరాలు వీక్షించేందుకు రోప్ వేను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ప్లాన్‌లో పర్యాటక పురావస్తు శాఖలు సంయుక్తంగా పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నారు. 
అడ్వంచరీ స్పోర్ట్స్ క్లబ్ గా...
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే వారికి ఈ కోటపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అడ్వంచరీ స్పోర్ట్స్ క్లబ్ గా మార్చనున్నారు. కోట చుట్టుప్రక్కల మౌలిక సదుపాయాల కల్పనపై ఎంపీ నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చించారు. కోట అభివృద్ది పనులలో భాగంగా 50 కోట్లు వెచ్చించి రోప్ వే ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. ఎన్నో చారిత్రక విశేషాలకు కేంద్రమైన భువనగిరి కోటను ఇక నుండి రోప్‌వే కోటగా మారబోతోంది. దీంతో ఇకనుంచి భువనగిరి కోట సరికొత్తగా పర్యాటకులకు కనువిందు చేయనుంది. 
 

 

అనంతలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ కాప్స్...

అనంతపురం : ఓ లాడ్జిలో ఇద్దరు తీవ్రవాద అనుమానితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారు ఉగ్రవాదులని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

సంగారెడ్డి సర్కారీ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు..

మెదక్ : సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆస్పత్రిలో వసతులు, సేవలపై రోగులను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు.

గాయపడిన ఏనుగు మృతి..

చెన్నై : తమిళనాడు కృష్ణగిరి జిల్లా షూలాగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏనుగు మృతి చెందింది. మూడు రోజుల క్రితం జాతీయ రహదారి దాటుతున్న ఏనుగును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. గాయాలైన ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

14:55 - July 6, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్ర నిర్మాణంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా  స్థానికులు ఓ వైపు ఆందోళన చేస్తున్నా..మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు పనులను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేయగా,  ప్రాజెక్టు కోసం సిబ్బందిని నియమిస్తూ..తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 
భూసేకరణకు రూ.389 కోట్ల విడుదలకు సర్కారు ఆమోదం
కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళనలను ఉధృతం చేశారు. మేధావులు, ప్రజా సంఘాల నేతలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం స్థానికుల ఆందోళనలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి 2వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. భూసేకరణ కోసం 389 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 
భూసేకణ ప్రక్రియకు స్థానికులు ససేమిరా 
ప్రాజెక్టు ప్రాంత పరిధిలోని కొవ్వాడ, టెక్కలి, రామచంద్రాపురం  గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా భూసేకరణ జరపాల్సి ఉంది. ఇందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటూ తనపని తాను చేసుకుంటూ పోతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరితగతిన జరపడానికి సబ్బందిని కూడా నియమించేందుకు తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమవుతోంది. అయితే విపక్షాలు మాత్రం ప్రాజెక్టును చేపడితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని...లేకపోతే సర్కార్‌పై సమరానికి రెడీ అంటున్నారు. 

 

14:53 - July 6, 2016

యంగ్ హీరో శర్వానంద్ వరస విజయాలతో దూసుకు పోతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఈ హీరో మినుమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు. శర్వానంద్ నటించిన 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు' 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలు వరస విజయాలను సాధించడంతో చిన్న సినిమాల నిర్మాతలకు శర్వానంద్ చిరునామాగా మారిపోయాడు. అయితే వచ్చిన ఆఫర్లు అన్నీ ఒప్పుకోకుండా తనకు నచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే చేస్తున్నాడు శర్వానంద్. ఇది ఇలా ఉండగా శర్వానంద్ లేటెస్ట్ గా తన 25వ సినిమాగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ లో నూతన దర్శకుడు చంద్రమోహాన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో పోలీసు పాత్రలో నటిస్తూ తెగ నవ్వించబోతున్నాడు. ఇప్పటి వరకు శర్వానంద్ రకరకాల పాత్రలను చేసినా ఇలా నవ్వించే పోలీసు పాత్ర ఎప్పుడూ చేయలేదు దీనితో పాటు ఈసినిమా బాగా వస్తోంది అన్న కామెంట్స్ కూడ ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈసినిమాలో అడుగడుగునా నవ్వించే సన్నివేశాలు ఉంటాయని టాక్. ఈసినిమాలో శర్వానంద్ పక్కన లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమా కూడ అంచనాలకు అనుగుణంగా హిట్ అయితే హాస్య సినిమాల హీరోగా శర్వానంద్ మారిపోయే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అల్లరోడికి టెన్షన్...
ఇప్పటి వరకు కామెడీ సినిమాలకు చిరునామాగా ఉండే అల్లరి నరేష్ సినిమాలు వరస పరాజయాలు చెందుతూ ఉండటంతో ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న ఈ కామెడీ పోలీసు పాత్ర కూడ ప్రేక్షకులకు బాగా నచ్చితే రానున్న రోజులలో అల్లరి నరేశ్ స్థానాన్ని శర్వానంద్ భర్తీ చేసినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ సహజంగానే అల్లరోడికి టెన్షన్ కలిగిస్తాయి అన్నది వాస్తవం. మొత్తం మీద శర్వానంద్ వరసగా విజయాలు సాధిస్తూ టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా అవతరించడం ఎంతైనా గొప్ప విశేషం.

14:52 - July 6, 2016

వరంగల్‌ : జిల్లాలో దేవాదుల పైప్‌లైన్‌ మరోసారి లీకయింది. హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు సమీపంలో రెండు చోట్ల పైప్‌లైన్లనుంచి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగసిపడుతోంది. ఈ నీరంతా బయటకు ప్రవహించి రోడ్లు, పొలాలు చెరువుల్లా మారాయి. భారీ నీటిపారుదల శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ పైప్‌లైన్‌ లీకవుతోంది. మరమ్మత్తులు చేసే ప్రయత్నంచేసినా అవి సఫలం కావడంలేదు. పైప్‌లైన్‌ పగిలిన ప్రాంతాల్లో అధికారులు మరమ్మత్తులు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. 

 

14:50 - July 6, 2016

టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజని పిలుచుకొనేవారు. ఆ తర్వాత అల్లరినరేష్ ను కూడా అలాగే పిలిచేవారు. అయితే ఈ ఇద్దరు హీరోలను వరుస ప్లాపులు పలకరించడం వల్ల పరిస్థితి ఆ తరువాత ఏమాత్రం బాగుండకపోవడంతో... వీళ్ళ స్థానాన్ని మరికొంతమంది హీరోలు ఆక్రమించేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలా పిలిపించుకొనే యువ హీరోలు వచ్చేశారు. టాలీవుడ్ లో సాయిధర్మ్ తేజ ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోల్లో ఒకడు. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా, ఇంకా స్టార్ స్టాటస్ తెచ్చుకోకుండానే వరస హిట్స్ సాధిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు ఇలాగే పడితే.. మనోడు టాలీవుడ్ లో స్టార్ అయిపోవడం ఖాయం. నిన్న మొన్నటి దాకా మెగా ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలే ఉండే వారు. భారీ బడ్జెట్ చిత్రాలు, హై రెమ్యునరేషన్లు, అయితే సూపర్ హిట్లు లేకుంటే లాసులు ఇలా ఉండేది పరిస్థితి. చిన్నా చితకా నిర్మాతలెవరూ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టేవారు కాదు. మెగా ఫ్యామిలీతో సినిమా చేయాలని ఉన్నా చేతిలో అంత బడ్జెట్ లేక ఆగిపోయేవారు.

చేసేద్దాం అంటున్న తేజ్..
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న నిర్మాతల కోసం నేనున్నానంటూ మెగా హీరో 'సాయి థరమ్ తేజ్' ముందుకొస్తున్నాడు. ఫుల్ ఎనర్జీ, మంచి ప్రతిభ ఉన్న ఈ హీరో కథ నచ్చితే రెమ్యునరేషన్ కాస్త అటు ఇటుగా ఉన్నా పర్లేదు చేసేద్దాం అంటూ నిర్మాతలకు వరాలిస్తున్నాడు. మొదటి సినిమాగా చేసిన రేయ్ చిత్రాన్ని మినహాయించుకుంటే సాయిధరమ్ తేజ చేసిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలు ఓ మోస్తరు విజయాలు సాధించినా, తరువాత వచ్చిన సుప్రీమ్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ జనానికి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు ఈ హీరోతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ హీరోతో ఇప్పుడు 10కోట్లతో సినిమాతీస్తే ఎంత లేదన్నా ఓ ఇరవై, పాతికోట్ల వరకూ లాభాల్ని తెచ్చుకోవచ్చని నమ్మకం కలుగుతోంది నిర్మాతలకు. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాత సాయిధర్మ్ తేజను అసలు వదలడంలేదు. ఇతడితో కంటిన్యూస్ గా సినిమాలు తీస్తున్నాడు.

తిక్క సినిమాకు మంచి హైప్...
ప్రస్తుతం సాయిధర్మతేజ చేస్తున్న తిక్క, జవాన్ సినిమాలు అదే బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే తిక్క సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కూడా మెగాభిమానుల్ని బాగా అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఛాయాగ్రహకుడైన సునీల్ రెడ్డి సాయిధర్మతేజ తిక్కను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి మాస్ జానానికి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక గోపిచంద్ మలినేని చేయబోతున్న జవాన్ సినిమా కూడా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక తరువాత చేయబోయే సినిమాల్ని కూడా ఓ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు సాయి ధర్మతేజ.

14:49 - July 6, 2016

నెల్లూరు : మళ్లీ జిల్లాలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. వింజమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లె, చంద్రపడియ గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనాలు వచ్చాయి. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన విషయంపై టెన్ టివితో ప్రొ. బాలకృష్ణ మాట్లాడారు. ఇటీవలి కాలంలో గమనిస్తే దాదాపు 20 సార్లు భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు వంద భూకంపాలు వస్తూనే ఉంటాయని, ఇందులో చిన్నవి..పెద్దవి ఉంటాయన్నారు. 5.5-6.0 వరకు ప్రకంపనాలు చోటు చేసుకుంటే వాటిపై దృష్టి పెడుతారని తెలిపారు.

 

కేజ్రీ నివాసం వద్ద బీజేపీ నేతల ధర్నా..

ఢిల్లీ : ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆప్‌ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారిందని బీజేపీ ఆరోపించింది.

14:27 - July 6, 2016

విశాఖలో ఆగి ఉన్న కారులో డెడ్ బాడీ..ఇది ఎవరిది ? ఎలా వచ్చింది ? చంపేసి పడేశారా ? లేక కారులోనే చనిపోయాడా ? ఖమ్మంలో కూడా ఓ మృతదేహం బయటపడింది.

విశాఖలో ఆగి ఉన్న కారులో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓల్డ్ జైల్ రోడ్ లో ఉన్న కారులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇతను కేరళ వాసిగా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంసభ్యులు అని పేర్కొంటున్నారు. ఖమ్మంలో ఓ వాగులో శవం తేలింది. స్థానికంగా కలకలం రేపింది. గోధుమవాగులో డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

14:24 - July 6, 2016

కానిస్టేబుల్ మంజులది పక్కాప్లాన్ మర్డర్..హంతకుడు స్కెచ్ వేసింది ఖాకీ మొగుడే..తన పోలీసు అనుభవంతో ప్లాన్.. లేడీస్ కానిస్టేబుల్ ను పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. నిజాన్ని సమాధి చేయబోతే వాస్తవాలను ఏఏస్పీ వెలుగులోకి తెచ్చారు.

నిజాన్ని సమాధి చేయలని అనుకున్నాడు..తనకున్న పోలీసు అనుభవంతో వేసిన ప్లాన్ తో బయట పడాలని అనుకున్నాడు..అంతా పక్కా స్కెచ్ ప్రకారమే జరిగింది. కానీ పోలీసులను మించి పోలీసులు ఉంటారన్న సత్యాన్ని మరిచిపోయాడు. తాను తీసిన గోతిలోనే పడిపోయాడు. పది రోజుల క్రితం పెద్దేముల్ మండలంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దంపతుల ఆక్సిడెంట్ ప్రమాదం కాదు..ఇది ఎవరో చేసింది కాదు..గాయాలతో బయటపడిన కట్టుకున్నవాడే ఈ హత్య చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ ను హతం చేసిన ఖాకీ మొగుడు ప్రస్తుతం కటకటాలెక్కిస్తున్నాడు. దీని గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

వేల ఎకరాల్లో పంటలను కాపాడం -సీఎం చంద్రబాబు..

పశ్చిమగోదావరి : కృష్ణా డెల్టా ద్వారా వేల ఎకరాల్లో పంటలను కాపాడినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాల్వను ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

నెల్లూరులో మళ్లీ భూ ప్రకంపనాలు..

నెల్లూరు :జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. వింజమూరు మండలంలో పలు గ్రామాల్లో భూమి కంపించింది. దీనితో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.

 

 

టి.పోర్టల్ ను కాపీ కొట్టాల్సినవసరం లేదు - గాలి..

విజయవాడ : తెలంగాణ పోర్టల్ ను కాపి కొట్టాల్సినవసరం ఏపీకి లేదని, చంద్రబాబు వల్లే హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ సాంకేతిక రంగానికి పాఠాలు నేర్పిన తాము తెలంగాణ పోర్టల్ ను కాపీ కొట్టామనడం దారుణమన్నారు.

టి.టిడిపి ఎల్పీ గదుల స్వాధీనం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కేటాయింపుల మేరకు టి.టిడిపి ఎల్పీ గదులు స్వాధీనం చేసుకున్నారు. 110 నెంబర్ గదిని మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి కమిటీ ఛైర్మన్ షకీల్ స్వాధీనం చేసుకోగా, 107 నెంబర్ గదికి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్ బోర్డును అధికారులు అమర్చారు. తనకు గది కేటాయించడంతోనే వెళ్లానని ఎమ్మెల్యే షకీల్ వెల్లడించారు.

13:39 - July 6, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో టీ.టీడీఎల్పీకి కేటాయించిన రూములపై వివాదం నెలకొంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇతరులకు తమ కార్యాలయాన్ని కేటాయించటంపై టీ.టీడీఎల్పీ మండిపడుతోంది. దీనిపై ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర మాట్లాడుతూ.. తమకు కేటాయించిన కార్యాలయాన్ని నోటీసులు ఇవ్వకుండా వేరేవారికి కేటాయించటం సంప్రదాయం కాదన్నారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న  విషయం తెలిసిందే. ప్రతిపక్షమైన టీడీపీకి సచివాలయంలో టీ.టీడీఎల్పీ కార్యాలయం కేటాయించారు.  టీ.టీడీఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ కంపెనీలకు కేటాయించటంపై టీ.టీడీపీ మండిపడుతోంది. టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు టీఆర్ఎస్ లోకి చేరిన సంగతీ విదితమే.

జూన్ 30 తరువాత సమాచారం అప్ లోడ్ చేయలేదు - పరకాల..

విజయవాడ : జూన్ 30వ తరువాత ఏ సమాచారం అప్ లోడ్ చేయలేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. రెఫరెన్స్ నెంబర్ చేశామని, తెలంగాణ ప్రభుత్వం అభియోగం మోపడం సరికాదన్నారు. తెలంగాణ పోర్టల్ కు ఆధార్ నమోదు లేదని, ఏపీ పోర్టల్ కు ఫోన్ నెంబర్..ఆధార్ నెంబర్ నమోదు ఉందన్నారు.

కంటి చూపులు పోయిన ఘటనపై విచారణ..

హైదరాబాద్ : సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో 13 మంది చూపు కోల్పోయిన ఘటనపై ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిగా రవీందర్ గౌడ్ నియమితులయ్యారు.

'అమాయకమైన ముస్లింలపై తీవ్రవాద కేసులు'..

హైదరాబాద్ : అమాయకమైన ముస్లింలపై తీవ్రవాద కేసులు పెడుతున్నారని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తెలిపింది. ఎన్ఐఏ అరెస్టు చేసిన ముస్లిం యువకులకు ప్రాణహాని ఉందని, గతంలో ముస్లిం యువకులను అరెస్టు చేసి కాల్చి చంపిన సందర్భాలున్నాయని పేర్కొంది.

'అమాయకమైన ముస్లింలపై తీవ్రవాద కేసులు'..

హైదరాబాద్ : అమాయకమైన ముస్లింలపై తీవ్రవాద కేసులు పెడుతున్నారని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తెలిపింది. ఎన్ఐఏ అరెస్టు చేసిన ముస్లిం యువకులకు ప్రాణహాని ఉందని, గతంలో ముస్లిం యువకులను అరెస్టు చేసి కాల్చి చంపిన సందర్భాలున్నాయని పేర్కొంది.

కుక్కను విసిరేసిన ఘటనలో ఇద్దరు అరెస్టు..

చెన్నై : ఐదంతస్తుల భవనం నుండి కుక్కను కిందపడేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.

13:13 - July 6, 2016

హైదరాబాద్ : సరోజిని కంటి ఆసుపత్రిలో చూపు కోల్పోయిన ఘటనపై 10టీవీ ప్రసారానికి సర్కారు స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రవీందర్ గౌడ్ ను నియమించింది. వారం రోజుల క్రితం మెహిదీపట్నం సమీపంలోని సరోజిని కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి 13మంది చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంగా ప్రశ్నించిన బాధితుల బంధువుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించిన తీరుపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో తమ బంధువులకు అన్యాయం జరగటమేకాక వైద్యుల తీరుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనలో చూపు కోల్పోయినవారు సత్యనారాయణ, మండల్, కృష్ణయ్య, సరళారాణి, భీములు, మాణిక్యం, సత్తయ్య, అంజిరెడ్డి, ప్రభావతి, నాగలక్ష్మీ, కల్పనాభాయి నూకాల తల్లి, దొరబాబులుగా గుర్తించారు. 

12:47 - July 6, 2016

హైదరాబాద్ : భూసేకరణచట్టం 2013 ప్రకారమే పరిశ్రమలు, ప్రాజెక్టులకోసం ప్రభుత్వం భూమి సేకరించాలని...సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఎంబీ భవన్‌లో పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మల్లన్న సాగర్‌పై ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల్ని మోసగించేందుకే 123 జీవో తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. భూ సేకరణ ఆపివేయాలని దీనిపై సమగ్రంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర అనేక జిల్లాల్లో భూ సేకరణ జరుపుతోందని తెలిపారు. 4-5 లక్షల ఎకరాల భూమి సేకరిస్తామని సర్కార్ ప్రకటిస్తోందని తెలిపారు. చట్టాన్నీ నీరుగార్చే విధంగా ముందుకు జీవో 123ని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రాజెక్టులు..పరిశ్రమల నిర్మాణానికి శాస్త్రీయమైన పద్ధతులు అవలింబించాలని సూచించారు. ప్రాజెక్టులు..పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభాలు..నష్టాలపై కూలంకుశంగా నిపుణులతో చర్చించాలని సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావు పలు సూచనలు..సలహాలు ఇచ్చారని, ఆయన ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కంటి చూపు పోయిన వారు..

హైదరాబాద్ : సరోజిని దేవి ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు వికటించడంతో 13 మంది కంటి చూపు కోల్పోయారు. సత్యనారాయణ, మండల్, కృష్ణయ్య, సరలా రాణి, భీములు, మాణిక్యం, సత్తయ్య, అంజిరెడ్డి, ప్రభావతి, నాగలక్ష్మీ, కల్పనాభాయి నూకాల తల్లి, దొరబాబులున్నారు.

12:41 - July 6, 2016

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ విధానాలవల్లే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకివచ్చిన బీజేపీ కనీసం 20లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేదని, నిత్యావసరాల ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్యపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నిరుద్యోగంపై ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదన్నారు. హై కోర్టు అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలపై ఈ నెల 11నుంచి 17వరకూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని విమర్శించారు. 

12:40 - July 6, 2016

ముంబై : టీమిండియా వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కింది. కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా సభ్యులు బుధవారం ఉదయం వెస్టిండీస్ కు బయలుదేరారు. నూతన కోచ్ కుంబ్లేతో సహా 16 మంది సభ్యులు...ఇతరులు విండీస్ కు వెళ్లారు. ఈనెల 9,10వ తేదీల్లో విండీస్ క్రికేట్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తో సెయింట్ కీట్స్ లో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. జులై 14-16 వరకు మూడు రోజుల పాటు టీమిండియా వార్మప్ మ్యాచ్ జరగనుంది.
విండీస్ కు వెళ్లిన వారిలో కోహ్లీ, రహానే, విజయ్, ధావన్, రాహుల్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, భువనేశ్వర్, షార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బిన్నీలున్నారు.

మ్యాచ్ తేదీ వేదిక
మొదటి టెస్టు సెప్టెంబర్ 22-26 కాన్ పూర్
రెండో టెస్టు సెప్టెంబర్ 30-అక్టోబర్ 4 కోల్ కతా
మూడో టెస్టు అక్టోబర్ 8-12 ఇండోర్
మొదటి వన్డే అక్టోబర్ 16 ధర్మశాల
రెండో వన్డే అక్టోబర్ 19 ఢిల్లీ
మూడో వన్డే  అక్టోబర్ 23 మొహాలీ
నాలుగో వన్డే అక్టోబర్ 26 రాంచి
ఐదో వన్డే అక్టోబర్ 29 వైజాగ్

రైస్ మిల్లు కార్మికుడు ఆత్మహత్య...

వరంగల్ : దుగ్గొండి మండలం మధిరలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తునన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రైస్‌మిల్లు యజమాని వేధింపుల వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

నల్లగొండ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం ...

హైదరాబాద్: నగరంలోని నల్లగొండ ఎక్స్‌రోడ్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. మహ్మద్ ఇస్రాద్ అహ్మద్ అనే యువకుడు బైక్ డివైడర్‌కు గుద్దుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాస్తు చేస్తున్నారు. మృతుడు సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన రియాసత్ నగర్ వాసిగా గుర్తించారు.

ముగిసిన టి.బీజేపీ కోర్ కమిటీ..

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు హజరయ్యారు.

జగ్జీవన్ రాంకు జూపూడి నివాళి..

హైదరాబాద్ : బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్ నివాళులర్పించారు. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, మానవతా వాదని అన్నారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై స్థానికుల నిరసన...

శ్రీకాకుళం : పోలాకిలో థర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు కోసం సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన తెలియచేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

స్మృతిని కలిసిన ప్రకాష్ జవదేకర్..

ఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులైన ప్రకాష్ జవదేకర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతిని కలవడం జరిగిందని, చాల అంశాలపై చర్చించడం జరిగిందని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ కొనసాగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతికి చేనేత - జౌళి శాఖను కేటాయించారు.

కాశ్మీర్ టూరిజం ఆఫీసు వద్ద డైలీ వేజర్స్ ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ టూరిజం డిపార్ట్ మెంట్ వద్ద రోజు వారి వేతన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ జరిపి ఆందోళన కారులను చెదరగొట్టారు.

 

12:10 - July 6, 2016

బెంగళూరు : రోడ్లు బాగు చేయండి..గుంతలు బాగా పడ్డాయి..ప్రమాదాలు జరుగుతున్నాయి..అధికారులు స్పందించండి. అంటూ ఎన్నో సార్లు విన్నవించుకున్నారు. కానీ అక్కడి అధికారులు పెడచెవిన పెట్టారు. విసిగి విసిగి వేసారిపోయిన ఆ స్థానికులు ఏం చేశారో తెలుసా ? దీని కోసం చదవండి..

బెంగళూరులోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకపోయాయి. గుంతలమయంగా మారి నాణ్యత లోపాన్ని..అధికారుల అవినీతిని బహిర్గతం చేశాయి. రోడ్లు బాగు చేయాలని అధికారులకు స్థానికులు ఎన్నో సార్లు విజ్ఞాపనలు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతంలో పర్యవేక్షణ చేయడం కోసం కార్పొరేషన్ ఇంజినీర్ వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికుల కోపం నషాళానికి ఎక్కింది. ఇంజినీర్ వద్దకు చేరుకున్నారు. అధికారులకు..ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ ఇంజినీర్ ను అమాంతం మురుగు కాల్వలోకి నెట్టేశారు. మురుగుకాల్వలో పడితే ఎలా ఉంటుందో వారికి ప్రత్యక్షంగా రుచి చూపించాలని అనుకుని ఈ విపరీత చర్యకు పూనుకున్నామని స్థానికులు పేర్కొన్నారు. పదే పదే విజ్ఞాపనలు చేసినా అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

12:10 - July 6, 2016

.గోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి విడుదల చేశారు. 24 పంపుసెట్ల ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు అందించాలని ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పోలవరం కుడికాలువ పూర్తిగా సిద్ధం కానందున తొలిరోజు కొన్ని పంపులను మాత్రమే రన్ చేయనున్నారు. అనంతరం సీఎం పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు పాల్గొన్నారు. అనంతరం బాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. 

పట్టిసీమ నుండి నీరు విడుదల..

పశ్చిమగోదావరి : పట్టిసీమ నుండి నీటిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మంత్రులు దేవినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. 24 పంపుల ద్వారా వేయ్యి క్కూసెక్కుల నీరు విడుదలవుతోంది.

జగ్జీవన్ రాంకు సీఎం కేసీఆర్ నివాళి..

హైదరాబాద్ : బాబు జగ్జీవన్ రాం వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. అంటరానితనం రూపు మాపడానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల సంరక్షణ, సమానత్వ సాధనకు కృషి చేసిన జగ్జీవన్ రాం ఎందరికో స్పూర్తిగా నిలిచారని తెలిపారు.

బిల్డింగ్ పై పడేసిన కుక్కకు శస్త్ర చికిత్స...

మద్రాస్ : చెన్నైలో ఐదంతస్తుల భవనం నుండి ఓ శునకాన్ని కింద పడేసిన యువకుడి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన శునకాన్ని బుధవారం చెన్నైలోని ఓ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

11:56 - July 6, 2016

చైనా : దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
పునరావాల కేంద్రాలకు 11 లక్షల మంది తరలింపు...
వర్షాలతో 39 వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా. భారీ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహించి వరదలుగా మారడంతో అనేక ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. యాంగ్జే నదీతీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, గ్విజౌ, హుబే, ప్రాంతాలనుంచి సుమారు 11 లక్షలమందిని ఖాళీచేయించి పునరావాలసాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకథాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిదాకా 128 మంది చనిపోగా 42 మంది దాకా అదృశ్యమైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు

41 వేల ఇళ్ళు నేలమట్టం...
భారీ వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాల వరకూ పూర్తిగా నీటమునిగినట్లు చైనా పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41 వేల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటిదాకా సుమారు 39వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్న జౌహి నది...
బే రాష్ట్రంలోని జౌహే నది ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. జౌహే నది వరదలతో దాజౌ నగరం పూర్తిగా నీటమునిగిపోయింది. నగరంలోని దాదాపు 30 వేలమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది. ఆర్మీ, నౌకాదళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

నెలాఖరు నాటికి పుష్కర పనులు పూర్తి - నారాయణ..

విజయవాడ : పుష్కరఘాట్లను ఏపీ మంత్రి నారాయణ పరిశీలించారు. వర్షాలతో పనులకు ఆటంకం ఏర్పడిందని, నెలాఖరు నాటికి పుష్కర పనులు పూర్తవుతాయన్నారు. మూడు జిల్లాలో 225 ఘాట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఘాట్ల వద్ద అపరిశుభ్రతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యాత్రీకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని, గోదావరి నది పుష్కరాలను తలదన్నే రీతిలో కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.

11:49 - July 6, 2016

రాష్ట్రానికి ప్రథమ మహిళ ఎవరు అంటే గవర్నర్ సతీమణి అని ఎవరైనా చెబుతారు. గవర్నర్ కు ఎంత ప్రాధాన్యం..గౌరవం ఇస్తారో ఆయన సతీమణికి కూడా అంతే గౌరవం..ప్రాధాన్యం ఇస్తారు. దంపతులు ఉండటానికి ఇల్లు..ప్రయాణానికి వాహనాలు..ఇతరత్రా ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంటుంది. కానీ అమెరికాలో ఓ గవర్నర్ భార్య మాత్రం డబ్బులు సరిపోవడం లేదని హోటల్ లో పనిచేస్తోంది. ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదనే ఆదర్శ భావాలున్న వ్యక్తి. ఈమె గురించి తెలుసుకోవాలంటే చదవండి....

అమెరికాలో మైనె రాష్ట్ర గవర్నర్ గా పాల్ లెపేజ్ వ్యవహరిస్తున్నారు. ఈయన అత్యల్ప జీతం తీసుకుంటారు. ఆయన భార్య అన్ లేపెజ్ రాష్ట్ర ప్రథమ మహిళగా గుర్తింపు ఉంది. ఈమెకు ఓ కారు కొనుక్కోవాలని అనుకున్నది. ఏముంది గవర్నర్ భార్యే కదా..చిటికెలో వస్తుంది అని అనుకుంటున్నారా ? ఇక్కడే మీరు తప్పులో కాలేశారు. గవర్నర్ జీతం కారు కొనేందుకు ఏ మాత్రం సరిపోలేదు. కొంత డబ్బును జమ చేసేందుకు ఉద్యోగం చేయాలని లేపెజ్ నిర్ణయానికి వచ్చింది. వెంటనే స్థానిక హోటల్ లో వెయిటర్ గా పనిచేయడం ప్రారంభించింది. ఒక రాష్ట్రానికి ప్రథమ మహిళ అయి ఉండి హోటల్ లో వెయిటర్ గా పనిచేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కారు కొనడానికి కావాల్సిన డబ్బుల కోసమే తాను ఈ పని చేస్తున్నట్లు ఆమె పేర్కొంది.

11:47 - July 6, 2016

కేరళ కమ్యూనిస్టు కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సినిమాలో కనిపించబోతున్నారంట. 92 ఏళ్ల అచ్యుతానందన్‌కు మచ్చలేని రాజకీయనేతగా, రైతుబాంధవుడుగా మంచి పేరుంది. ఓ మలయాళి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సామాజిక సమస్యలపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమాల నేపథ్యంలో దర్శకుడు జీవన్ దాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 9న ప్రారంభం కానుంది. సినిమాలో అచ్యుతానందన్ కీలక పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమని దర్శకుడు జీవన్ దాస్ పేర్కొంటున్నారు. ఈ సినిమాలో ఆయన నటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్ పూర్తయిన అనంతరం సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

 

11:46 - July 6, 2016

శ్రీ‌న‌గ‌ర్‌ : మ‌రోసారి ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. కాశ్మీరి పండిట్ల‌కు, సైనికుల‌కు ప్ర‌త్యేక కాల‌నీ నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఈరోజు ఉద‌యం వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పాకిస్థాన్‌, ఐఎస్ఐఎస్‌ జెండాలు ఎగ‌ర‌వేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చారు. పాకిస్థాన్‌, ఇస్లామిక్ స్టేట్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. ఆందోళ‌న కారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. భాష్ప‌వాయువు ప్ర‌యోగించారు. వేర్పాటు భావాల‌ పార్టీల ముఖ్య‌నేత‌ల‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

11:36 - July 6, 2016

విజయవాడ : ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్న టీడీపీకి-బీజేపీ మధ్య దూరం పెరుగుతోందా. ఏపీకి స్పెషల్ స్టేటస్ , ప్రత్యేక ప్యాకేజీ రాజధాని నిర్మాణం ఇతర అవసరాలకు ఇచ్చిన హామీలపై స్పందన కరువవుతోందా అంటే..అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తమవంతుగా కృషి చేసిన టీడీపీకి 2014 నుండి బీజేపితో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేక హోదా ,పోలవరం ప్రాజెక్టు , విభజన అనంతర పరిణామాలు వంటి అంశాలు బీజేపీకి టీడీపీని దూరం చేసేలా చేస్తున్నాయి. దీంతో టీడీపీ కేంద్రంపై గురిపెట్టక తప్పడం లేదు.

బీజేపీపై స్వరం పెంచుతున్న టీడీపీ?!..
ఇప్పటి వరకు కేంద్ర సాయంపై సుతిమెత్తగా చెబుతూ వస్తున్న టీడీపీకి కేంద్రం నుండి సాయం రాకపోవడంతో... ఎదురు దాడికి సిద్దమవుతోంది. ప్రతిపక్షాలు పదే పదే పలు అంశాలపై నిలదీస్తుంటే.. అటు సమాధానం చెప్పలేక కేంద్రం వైఖరిని తప్పు బట్టలేక నలిగిన టీడీపీ..ఇక స్వరం పెంచాలని డిసైడ్ అయింది. విజయవాడలో తొలగించిన దేవాలయాలపైన నేరుగా టీడీపీని విమర్శించడంతో.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది పార్టీ. అప్పటికీ బీజేపీ నేతలు శాంతించకపోవడంతో.. స్వయంగా సీఎం బాబు రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

బీజేపీపై విరుచుకుపడ్డ కేశీనేని ..
రాజధాని నిర్మాణానికి 500 కోట్లు ఇచ్చామని కేంద్రం ప్రకటించినా..మరో 1500 కోట్లు సాయం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు సమాచారం. కాని టీడీపీ అనుకున్నట్లుగా నిధులు కేటాయించకపోవడం ..బీజేపీ నేతల విమర్శలు వంటివాటిపై బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతల ఆరోపణలపై పైచేయి సాధించేందుకు ఎంపీ కేశినేని నాని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

హైకోర్టు పై సదానందగౌడ చేసిన వ్యాఖ్యలు..టీడీపీ అభ్యంతరం..
అటు తెలంగాణలోని సైకిల్ కమలాల మధ్య సఖ్యత కుదరడం లేదు. హైకోర్టుపై సదానందగౌడ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ మిత్రపక్షాలు మధ్య దూరం.. గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింత పెరిగింది. దత్తాత్రేయ వంటి నేతలు .. కేసీఆర్ పాలనను పొగడడంతో... తెలంగాణ టీడీపీ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీంతో మిత్ర పక్షాల మధ్య దూరం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

విభేదాలపై కొట్టిపడేసిన నేతలు...
ఇన్నాళ్లు నేతలు, పార్టీల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తున్నా..వాటిని నేతలు కొట్టిపారేశారు. తాజా పరిణామాలతో..ఏపీలో బీజేపీ యాక్టీవ్ మూడ్ లోకి రావడం..తెలంగాణ లో ఇన్ యాక్టివ్ మూడ్ లోకి వెళ్లడం రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయి. 

11:35 - July 6, 2016

సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్‌లో రానున్న చిత్రం 'నూర్‌'. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సబా ఇంతియాజ్‌ రాసిన 'కరాచీ : యు ఆర్‌ కిల్లింగ్‌ మి' నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్ ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో సబా ఇంతియాజ్‌ 'కరాచీ' నవల రాశారు. కరాచీకి చెందిన ఓ యువ జర్నలిస్టు అత్యంత సాహసోపేతంగా వార్తల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ మంచి ప్రేమికుడిని సొంతం చేసుకుంటుంది. 'నూర్‌'గా రూపొందే ఈ చిత్రం ద్వారా సునీల్‌సిప్పి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. 'మహిళా జర్నలిస్ట్ గా నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం సబా రాసిన నవలను ఆద్యంతం చదివినట్లు..చాలా ఆసక్తికరంగా ఉందని ఇటీవలే సోనాక్షి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే సోనాక్షి ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు జాన్‌ అబ్రహం సరసన 'ఫోర్స్2' చిత్రంలోను, ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, హిందీ ద్విభాషా చిత్రం 'అకీరా'లోనూ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'అకీరా' చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

11:33 - July 6, 2016

'త్రిష' ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నాయకి' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమౌతున్న ఈ చిత్ర టీజర్..ఆడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'త్రిష' ఓ పాట కూడా పాడింది. గోవి దర్శకత్వంలో రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాతలు మీడియాకు తెలిపారు. తొలుత ఈ చిత్రాన్ని ఈనెల 8న విడుదల చేయాలని అనుకున్నట్లు, కానీ తమిళంలో ఎదురైన సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 15న రెండు భాషాల్లో చిత్రాన్ని విడుదల చేయడం జరుగుతుందన్నారు. విభిన్న కోణాలున్న త్రిష పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సినిమాలో 40 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయన్నారు. మరి త్రిష ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? లేదా ? అనేది 15న తెలుస్తుంది.

వైభవంగా కొనసాగుతున్న రథయాత్ర..

ఒడిస్సా : పూరీ క్షేత్రం భక్తులతో కిటకటలాడుతోంది. జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా జరుగుతోంది. ఈ రథయాత్ర చూడటానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

11:28 - July 6, 2016

హైదరాబాద్ : నగరంలోని మెహిదీపట్నం సమీపంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో దారుణం చోటు చేసకుంది. శస్త్ర చికిత్స వికటించి 13మంది చూపును కోల్పోయారు. దీనికంతటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. కంటిలో ఏర్పడిన శుక్లాలను తొలగించేందుకు స్థానిక సరోజినీదేవి ఆసుపత్రిలో ఆపరేషన్ నిమిత్తం కొంతమంది ఇటీవలే ఆపరేషన్ లు జరిగాయి. వీరిలో 13మందికి ఆపరేషన్ అనంతరం చూపు కోల్పోయారు. దీంతో ప్రశ్నించిన బాధితులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఆర్ ఎల్ అనే సెలైన్ బాటిల్ వల్లనే ఇలా జరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంగా ప్రశ్నించిన బాధిత బంధువులకు వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్పప్పుడు ఏ ప్రమాదం జరిగితే చనిపోవటంలేదా? ఈ మాత్రం విషయానికే ఎందుకు హైరానా చేస్తున్నారని వైద్యులు నిర్లక్ష్యధోరణితో మాట్లాడుతున్నారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి తమ బంధువులు చూపును కోల్పోయారనీ తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

శ్రీనగర్ లో పాక్..ఐసిస్ జెండాల ప్రదర్శన..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సైనిక కాలనీలను వ్యతిరేకిస్తూ వేర్పాటు వాదులు ఆందోళనకు దిగారు. పాక్..ఐసిస్ జెండాలను వేర్పాటు వాదులు ప్రదర్శించారు. మోహరించిన భద్రతాదళాలపై రాళ్ల దాడికి దిగారు.

11-17 వరకు ఏపీ సీపీఎం ప్రజా ఆందోళనలు..

విజయవాడ : ఈనెల 11 నుండి 17 వరకు సీపీఎం ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల నిరుద్యోగ సమస్యపై ప్రజలను చైతన్యం చేస్తామని, ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శిస్తున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నిరుద్యోగంపై ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదన్నారు. హై కోర్టు అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా వ్యవహరించాలని సూచించారు.

వికటించిన కంటి ఆపరేషన్లు..

హైదరాబాద్ : ప్రముఖ సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు వికటాయించాయి. 13 మంది బాధితులు చూపు కోల్పోయారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్లే కళ్లకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొంటున్నారు. వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యుత్ షాక్ తో రైతు మృతి...

గుంటూరు: పొలానికి వేసిన విద్యుత్‌ ఫెన్సింగ్‌ వైర్లు తగిలి రైతు దుర్మరణం చెందాడు. బొల్లపల్లి మండలం పేరూరిపాడులో జరిగింది. పేరూరిపాడుకు చెందిన నర్సింహారావు రోజువారి పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఫెన్సింగ్‌కు వేసిన విద్యుత్‌ వైర్లు కాలికి తగిలి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉగ్రదాడి..4గురు మృతి..

యెమెన్ : మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్ లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

11 నుండి 17 వరకూ సీపీఎం ప్రజా ఆందోళనలు...

విజయవాడ : ఈనెల 11 నుండి 17 వరకూ సీపీఎం ప్రజా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిత్యావస వస్తువులు పెరుగుదల, నిరుగ్చోగ సమస్యలపై ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగతూనే వున్నాయన్నారు. నిరుద్యోగంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకూ నెరవేర్చాలేదన్నారు. హైకోర్టు అంశంపై ఇరు రాష్ట్ర సీఎంలు సామరస్యంగా వ్యవహరించాలన్నారు. 

సిలిగిరిలో దలైలామా బర్త్ డే వేడుకలు..

పశ్చిమ బెంగాల్ : ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామా 81జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిలిగిరిలో దలైలామా చిత్ర పటం ముందు దీపాలు వెలిగించి కేక్ ను కట్ చేశారు.

10:47 - July 6, 2016

టాలీవుడ్ లో కొంతమంది హిట్ ఫెయిర్ గా ఉంటుంటారు. వారిలో వెంకటేష్..నయనతార ఒకరు. వీరి కాంబినేషన్ లో కొన్ని విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ హిట్ కాంబినేషన్ లో 'బాబు బంగారం' చిత్రం వస్తోంది. మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. టీజర్ కు ప్రేక్షకుల నుండి బాగా స్పందన వచ్చిందని..సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో నిలవడం చాలా హ్యాపీగా ఉందవన్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారని, ఈ పాటల్లోని సింగిల్ ట్రాక్ ను ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఆడియో తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు.

 

10:46 - July 6, 2016

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మితమౌతున్న 'అభినేత్రి' సినిమా షూటింగ్ పూర్తికావస్తోంది. ప్రభుదేవ..తమన్నా జంటగా ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభుదేవ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వచ్చే నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 15న విజయవాడలో ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా 'శ్రీదేవి' హాజరు కానున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. మూడు భాషల్లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం రూ. 70 కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ కు భారీ స్పందన వస్తోందని, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు విజయ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తానమి, తొలిసారి లీడ్ రీల్ లో నటిస్తున్న తమన్నాకు మంచి పేరు తెస్తుందన్నారు.

10:45 - July 6, 2016

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేదు. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జట్టు వచ్చేస్తోంది. మార్కెట్ లో దొరికే వాటితో తెల్లజుట్టును నల్లగా మార్చుకుంటున్నారు. మార్కెట్ లో దొరికే ప్రతి వాటిని వాడడం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది. ఇలా రాలిపోకుండా సహజ పద్ధతుల్లో జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు..
కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల టీ పౌడర్ వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత జుట్టుకు పట్టించాలి. టీ వాటర్ ను షాంపూతో కలిసి ఉపయోగించవద్దు. పంచదార..పాలు కూడా కలుపకూడదు.
6-8 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని అందులో మూడు టీ స్పూన్ల లెమన్ జ్యూస్ వేయాలి. ఈ విశ్రమానిన్ కురులకు పట్టించాలి. ఇలా ఓ గంట పాటు ఉంచి తరువాత షాంపూతో స్నానం చేయాలి.
గోరింటాకు ఆకులను తీసుకుని మెత్తగా నూరుకోవాలి. దీనికి మూడు టీ స్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం పెరుగు జత చేయాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టించి ఆరోపోయే వరకు ఉండనివ్వాలి. తరువాత మైల్డ్ షాంపుతో స్నానం చేయాలి.
పొట్టు తీసిన ఐదు బంగాళ దుంపలను తీసుకోవాలి. ఆ పొట్టును ఓ కప్పులో వేసుకుని రెండు కప్పుల నీళ్లు పోయాలి. తరువాత చిన్న మంటపై దీనిని ఉడికించాలి. చల్లారని అనంతరం నీటిని మరో పాత్రలోకి వంపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల శాండల్ వుడ్ ఆయిల్ ను చేర్చాలి. దీనిని ఓ బాక్స్ లో భద్రపరుచకుంటే తలస్నానం చేసిన తరువాత కురులకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రావడం తగ్గిపోతుంది.

10:43 - July 6, 2016

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించవచ్చు.
వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు పోవాలంటే ఓ గిన్నె నిండా నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది.
దుస్తులన్నీ ఒకే చోట పోగుపడి ఉండి..దుర్వాసన వెదజల్లుతుంటుంటే నిమ్..లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలను ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచండి.
ఒక అర బకెట్ నీళ్లు తీసుకుని అందులో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం కలిపి గదిలో కాస్త చల్లండి..గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది.
కిటికి అద్దాలు దుమ్ము పట్టి ఉంటే కప్పు వెనిగర్ కు చెంచా లావెండర్ ను జోడించాలి. ఓ బట్టను అందులో ముంచి కిటికిలను తుడిస్తే సరిపోతుంది.
కార్పెట్లు మురికిగా ఉంటే కప్పు బేకింగ్ సోడాకు చెంచాడు ఏదైనా సుగంధ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

10:39 - July 6, 2016

ఢిల్లీ : ప్రపంచంలోనే పెద్ద చరఖాను ఢిల్లో ఆవిష్కరించారు. 17అడుగుల ఎత్తైన ఈ రాట్నాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషా ఆవిష్కరించారు. 42మంది కళాకారులు 55రోజులపాటు పనిచేసి ఈ అద్భుత రాట్నాన్ని తయారు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఈభారీ చరఖాను ప్రదర్శనకు ఉంచారు. మన స్వాతంత్ర్య పోటార కీర్తిని ఈచరఖా ప్రపంచానికి చాటిందని అమిత్‌షా అన్నారు.

10:36 - July 6, 2016

లండన్‌ : లండన్ లో నిర్వహించిన వేలంలో పాప్‌సింగర్‌ ప్రిన్స్‌ దుస్తులు రికార్డు ధరను పలికాయి. 1984లో వచ్చిన 'పర్పుల్‌రైన్‌' మూవీలో ప్రిన్స్‌ ధరించి డ్రెస్‌లను వేలం వేశారు. ఒక్కొక్క డ్రెస్‌ 96వేల డాలర్ల ధరను పలికాయి. మొత్తం 1లక్షా92వేల డాలర్లు వచ్చినట్టు వేలం నిర్శాహకులు తెలిపారు. వైట్‌షర్ట్‌, లెదర్‌స్టీవ్స్‌, బ్లేజర్‌లను లక్షల డాలర్లుపోసి ఉత్సాహవంతులు సొంతం చేసుకున్నారు. డ్రెస్‌లతోపాటు ప్రిన్స్‌ ఉపయోగించిన గిటార్‌ కూడా వేలంలో ఏకంగా 1లక్షా 37వేల డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

ఎన్టీపీసీ 7వ యూనిట్ లో సాంకేతిక లోపం..

కరీంనగర్ : రామగుండం ఎ న్ టీపీసీ 7వ యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తకి ఆటంకం కలిగింది.

10:32 - July 6, 2016

నేపాల్ : భారీవర్షాలకు నేపాల్‌ పౌరులు విలవిల్లాడుతున్నారు. వరదలు పోటెత్తడంతో భారీస్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లపై మట్టిపెళ్లలు విరిగిపడటంతో జనం భయంగుప్పిట్లో బతుకుతున్నారు. ఇళ్లనుంచి పరుగులు తీస్తున్నారు. కొండచరియలు విరిగిపడి దేశవ్యాప్తంగా ఒక్కరోజే 11 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. స్థానిక పౌరులతో కలిసి నేపాల్‌సైన్యం సహాయకార్యక్రమాలు కొనసాగిస్తోంది. 

10:25 - July 6, 2016

నెల్లూరు : జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను వంచించాడో ప్రబుద్దుడు.. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.. మూలాపేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతున్న బాధితురాలు జిరాక్స్‌కోసం నిందితుడు పనిచేసే జిరాక్స్‌ సెంటర్‌కు వెళ్లేది.. ఆమెపై కన్నేసిన దుర్మార్గుడు ప్రేమపేరుతో వేధించాడు. ఈ విషయమై బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.. అయినా ఏమాత్రం భయపడని సురేశ్ బాలిక నగ్న చిత్రాలు తనదగ్గరున్నాయని బెదిరించాడు.. వాటిని బయటపెడతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు.. అతని ఆగడాలు మితిమీరిపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. సురేశ్‌కు పెళ్లయిందని... ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై సర్కార్ ది తొందర చర్య - తమ్మినేని..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తొందరపాటు పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ సేకరణ ఆపివేయాలని దీనిపై సమగ్రంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర అనేక జిల్లాల్లో భూ సేకరణ జరుపుతోందని తెలిపారు. 4-5 లక్షల ఎకరాల భూమి సేకరిస్తామని సర్కార్ ప్రకటిస్తోందని తెలిపారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, చట్టాన్నీ నీరుగార్చే విధంగా ముందుకు జీవో 123ని తీసుకొచ్చారని విమర్శించారు.

10:13 - July 6, 2016

విజవయాడ : ఏపీ సీఎం చంద్రబాబు... ఈ నెల 9న రష్యా వెళ్లబోతున్నారు.. ఐదురోజులపాటు అస్తానా, కజకిస్తాన్‌, సేయింట్‌ పీటర్స్‌బర్గ్, మాస్కోల్లో పర్యటిస్తారు.. అక్కడి ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో సమావేశమవుతారు..రష్యాలో జరగబోయే అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్‌లో పాల్గొంటారు.. ఈ టూర్‌లో మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఇతర అధికారులుకూడా పాల్గొనబోతున్నారు... ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..ముగ్గురు మృతి..

హర్యానా : రాష్ట్రంలోని సోనిపట్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రేపు బాధ్యతలు స్వీకరించనున్న ప్రకాష్ జవదేకర్..

ఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులైన ప్రకాష్ జవదేకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకూ ఈ శాఖను నిర్వహించిన స్మృతి ఇరానీకి చేనేత – జౌళి శాఖను అప్పగించిన సంగతి తెలిసిందే.

ప్రారంభమైన 10 వామపక్ష పార్టీల సమావేశం..

హైదరాబాద్ : నేడు ఉదయం 9గంటలకు సీపీఎం పార్టీ కార్యాలయంలో 10 వామపక్ష పార్టీలతో భేటీ ప్రారంభమయ్యింది. ప్రాజెక్టులు...భూనిర్వాశితుల సమస్యలు...పోడు భూములు..ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. 

సింగర్ మికా సింగ్ పై 'కేసు' నమోదు..

ముంబై : బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పై కేసు నమోదైంది. ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణాలో 54 మద్యం సీసాల స్వాధీనం..

కృష్ణా : జిల్లాలో ఎక్జైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 54 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దుక్కవానిపాలెంలో ప్రబలిన అతిసార..

విశాఖపట్టణం : ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో అతిసార ప్రబలింది. దుక్కవానిపాలెంలో అతిసార వ్యాధితో దుక్క ముసలయ్య (55), దుక్క బంగారయ్య (50) మృతి చెందారు.

బాబు..లోకేష్ తో కళా భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు, టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కళా వెంకట్రావు భేటీ అయ్యారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి ప్రతివ్యూహంపై కళా చర్చిస్తున్నట్లు సమాచారం.

జగ్జీవన్ రాం విగ్రహానికి మంత్రి రావెల నివాళులు..

విజయవాడ : రామవరప్పాడు దగ్గర జగ్జీవన్ రాం విగ్రహానికి మంత్రి రావెల కిషోర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రాం స్పూర్తితో పోరాటపటిమను అలవర్చుకోవాలని, జగ్జీవన్ రాం ఆశయసాధనకు దళితులు ముందుకు సాగాలని సూచించారు.

 

'బాబు'ను కలిసిన పరుచూరి బ్రదర్స్ ...

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

పుష్కర పనులను పరిశీలించిన మంత్రి నారాయణ..

కృష్ణా : మంత్రి నారాయణ పుష్కర పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లేకుంటే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

 

యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం..

నెల్లూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సురేష్ అనే యువకుడు ఓ బాలికను నగ్నంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సురేష్ వేధింపులు భరించలేని ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సురేష్ పై కేసు నమోదు చేశారు.

 

టీ.ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో నగరంలోని నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగింది. వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం రావటంతో ప్రజలపై రోగాలు దాడి చేస్తున్నాయి. నీటితో పాటు వస్తున్న వైరల్ తో పసిపిల్లలతో పాటు పెద్దవారు కూడా వైరల్ జ్వరాల బారీన పడుతున్నారు. మలేరియా, బైఫాయిడ్, కలరా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఆసుపత్రులలో రోగులు బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 డెంగ్యూ కేసులు నమోదయినట్లుగా గుర్తింపు.

09:17 - July 6, 2016

అనంతపురం : తాడిపత్రిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధ దంపతులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వీరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. బంగారు ఆభరణాల కోసం దంపతులపై దాడిచేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుఝూమున 3గంటలకు ఈ ఘటన జరిగింది. ఓ నాపరాయి పరిశ్రమలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న సదరు బాధితులు ఆరు బయట పడుకోవటం గమనించిన దొంగలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

పట్టిసీమ ప్రాజెక్టు నుండి నీటి విడుదల..

.గోదావరి : నేడు పట్టిసీమ ప్రాజెక్టు నుండి నీటి విడుదల కానుంది. సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేయనున్నారు. రాయలసీమ కరవు ప్రాంతాలకుసాగునీటిని అందించాలనే ఉద్ధేశ్యంతో ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. అతి త్వరగా పూర్తయిన ఈ ప్రాజెక్టు నుండి గోదారమ్మ పరుగులు పెట్టనుంది.

10 వామపక్ష పార్టీల సమావేశం..

హైదరాబాద్ : నేడు ఉదయం 9గంటలకు సీపీఎం పార్టీ కార్యాలయంలో 10 వామపక్ష పార్టీలతో భేటీ జరుగనుంది. ప్రాజెక్టులు...భూనిర్వాశితుల సమస్యలు..ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించనున్నారు. 

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఎంసెట్‌ ర్యాంకుల విడుదల ...

తూ.గోదావరి : ఆంధ్రా, తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డుల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఎంసెట్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించనున్నట్లు ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. ర్యాంకులను సంక్షిప్త సందేశం ద్వారా విద్యార్థుల ఫోన్‌ నెంబర్లకు పంపుతామని వెల్లడించారు. ర్యాంకు కార్డులను ఈనెల 7వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

మూల వాగు వంతెనకు శంకుస్థాపన..

కరీంనగర్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.2వేల కోట్లతో రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వేములవాడ మూల వాగుపై రూ.28 కోట్లతో నిర్మించే హైలెవల్ ఫోర్‌లేన్ వంతెన పనులకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సిహెచ్.రమేష్‌బాబుతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. 

తాడిపత్రిలో దోపిడీ దొంగల బీభత్సం ...

అనంతపురం : తాడిపత్రిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధ దంపతులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా వీరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. బంగారు ఆభరణాల కోసం దంపతులపై దాడిచేసినట్లు తెలుస్తోంది.  

08:27 - July 6, 2016

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం అంకుశపూర్‌లో ఉన్న ఎస్పీఆర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆనంద్‌ అనే విద్యార్థి కిటికికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం జగద్గరిగుట్టగా పోలీసులు గుర్తించారు. ఆనంద్ తండ్రి జగద్గిరి గుట్టలోని ఆత్మకూరులో తండ్రి ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆనంద్ హోమ్ సిక్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఆనంద్ కు చదువు పట్ల ఆసక్తి చూపేవాడు కాదనీ..ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు గతంలోనే సమాచారం అందించామని స్కూలు యాజమాన్యం పేర్కొంది. 

ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య...

రంగారెడ్డి : ఎస్పీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం చోటు చేసుకుంది. ఘట్ కేసర్ మండలం అంకుశపూర్ లో ఈ ఘటనన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కిటికీకి ఉరివేసుకుని 9వ తరగతి చదివే ఆనంద్ అనే విద్యార్థి ఉరి వేసుకున్నాడు.  

08:01 - July 6, 2016

నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు...19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. కాగా ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీకి చెందిన వారికి కేబినెట్ లో ప్రాముఖ్యత కల్పించానేది విపక్షాలు విమర్శిస్తున్నాయి...ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆచారి (బీజేపీ నేత ) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరిన్ని వివరాలు తెలుసుకోండి..

07:57 - July 6, 2016

ఇది సీజనల్ వ్యాధులు పొంచివున్న కాలం. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కలరా, అతిసారా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజ్రుంభించే అవకాశం వుంది. ఈ సీజన్ లో ఏయే వ్యాధులు ఎందుకు వ్యాప్తి చెందుతాయో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల చాలావరకు సీజనల్ వ్యాధులను నివారించే అవకాశం వుంది.

వైద్య ఆరోగ్యశాఖపై ప్రధాన బాధ్యత...
వానాకాలం వచ్చింది. వానల్లో తడవడం, ఎగరడం పిల్లలకు చాలా ఇష్టం. పిల్లలకు సరదాలతో పాటు కొన్ని కష్టాలకు తీసుకొస్తుందీ వర్షాకాలం. పిల్లలే కాదు పెద్దలూ జాగ్రత్తగా వుండాల్సిన సీజన్ వ్యాధి. ఇది కొత్త నీరు వచ్చే సమయం. నదులు, వాగులు, వంకలు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఆ వరద నీటిలో అనేక రకాల హానికర వ్యర్థాలు కొట్టుకువస్తుంటాయి. వాటిలో వుండే బ్యాక్టీరియా, వైరస్ లు ప్రమాదకర, ప్రాణాపాయకర వ్యాధులకు కారణమవుతాయి. బురద గుంటలు ఎక్కువగా ఏర్పడేది, వాటిలో దోమలు పెరిగేదీ ఈ కాలంలోనే. దోమలు అత్యంత వేగంగా వ్రుద్ధి చెందే కాలమిది. వాటితో పాటు ఈగలూ విజ్రుంభిస్తాయి. దోమలు, ఈగలు మోసుకొచ్చే జబ్బులు ఒక్కొక్కసారి మనుషుల ప్రాణాలనే తీస్తుంటాయి. దోమకాటుతో వ్యాప్తి మలేరియా వ్యాధి అత్యంత భయంకరమైనది. బోదకాలు వ్యాధి కూడా దోమల పుణ్యమే. కలరా వ్యాధిని వ్యాప్తి చెందించడంలో ఈగలదే ప్రధానపాత్ర. ఈగల, దోమల నివారణ సమష్టి బాధ్యత. వీటిని పారదోలడం, నిర్మూలించడం ఒకరిద్దరితో అయ్యే పనికాదు. ప్రభుత్వమూ, స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ అంకితభావంతో పనిచేస్తే తప్ప వీటిని నిర్మూలించలేం. వానాకాలం సీజన్ ఆరంభంలోనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక సంస్థలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పరిణామాలు అత్యంత విషాదకరంగా వుంటాయి. అతిసార ఇప్పటికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే వుంది. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే నివారించదగ్గ అతిసారను కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి. ఈ వ్యాధి బారినపడ్డ గ్రామాల్లో ఒక్కొక్కసారి పదుల సంఖ్యలో చనిపోతున్నారు. కామెర్లలాంటి వ్యాధులూ పగబడుతూనే వున్నాయి. డెంగీ, స్వైన్ ఫ్లూ లాంటి కేసులు ఏటేటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వాటర్ ట్యాంక్ లను శుభ్రంగా కడగడం, మంచినీటి, డ్రైనేజీ పైప్ లైన్లలో లీకేజీలను నివారించడం, దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 90శాతం వ్యాధులను, మరణాలను నివారించే అవకాశం వుంది. సీజన్ ఆరంభంలో విజ్రుంభించే వ్యాధులు, వాటికి కారణాలు, వాటి నివారణకు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ప్రజాబాహుళ్లంలో ప్రచారం చేయాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మీద వుంది.  

07:52 - July 6, 2016

వాతావరణం మారింది. ఎండల తీవ్రత తగ్గి, వానలు మొదలయ్యాయి. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన సమయమిది. ప్రాణాలు తీసే వ్యాధులు విజ్రుంభించే ప్రమాదమున్న కాలమిది. మరి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వ్యక్తులుగా పాటించాల్సిన నియమాలేమిటి? ప్రభుత్వమూ, స్థానిక సంస్థలూ, వైద్య ఆరోగ్య శాఖ చేపట్టాల్సిన చర్యలేమిటి? సీజన్ మారుతున్న వేళ అజాగ్రత్తగా వుంటే తలెత్తే పరిణామాలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు జన స్వాస్తా అభియాన్ నేత డాక్టర్ సురేష్ 10 టీవీ స్టూడియోకి వచ్చి పలు సూచనలు చేశారు. మరి అవేంటో తెలసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:48 - July 6, 2016

అమెరికా : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘన విజయం సాధించింది. నాసా పంపిన వ్యోమనౌక జునో బృహస్పతి గ్రహం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. జుపిటర్‌ చుట్టూ జునో ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. ఇది గురు గ్రహానికి చెందిన రహస్యాలను ఛేదించనుంది.

స్పేస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ జునో బృహస్పతి ...
అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా పంపించిన స్పేస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ జునో బృహస్పతి గ్రహం సోమవారం రాత్రి 11 గంటల 53 నిముషాలకు కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

2011లో మానవరహిత వ్యోమనౌక...
నాసా ఐదేళ్ల క్రితం అంటే 2011లో పంపిన ఈ మానవరహిత వ్యోమనౌక నేటికి లక్ష్యాన్ని చేరుకుంది. సోలార్‌ పవర్‌తో నడిచే జునో స్పేస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ బృహస్పతి గ్రహానికి చేరుకోవడం నాసా సాధించిన అత్యంత ఘనవిజయం. ఈ కీలక ఘట్టం కోసం ఎదురుచూస్తున్న నాసా శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

జునో కోసం నాసా 1.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు..
జునో కోసం నాసా 1.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టింది. ఐదేళ్ల క్రితం ఫ్లోరిడాలోని కేప్ కెన్‌వెరాల్ నుంచి బయలుదేరిన ఈ వ్యోమనౌక 2.7 బిలియన్‌ మైళ్లు ప్రయాణించి గురుగ్రహ కక్ష్యలో చేరింది. జునో పురోగతిని కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలోని డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెన్నాల ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

18 నెలల పాటు బృహస్పతి కక్షలో తిరగనుంన్న జూనో..
పొడవైన మూడు భారీ సౌరఫలకాలు కలిగిన జునో వ్యోమనౌక ఫ్యాన్‌ను పోలి ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా సౌరకుటుంబంలోని అతి పెద్ద గ్రహం జుపిటర్‌కు సంబంధించిన రహస్యాలను ఛేదించనుంది. జునో సుమారు 18 నెలల పాటు బృహస్పతి కక్షలో తిరగనుంది. భూమి మీద ఏర్పడినట్లే ఈ గ్రహం ధ్రువ ప్రాంతాల్లో రంగు రంగుల అరోరాలు ఏర్పడుతుంటాయి. వీటిని పరిశీలించడం ద్వారా గురుగ్రహం పుట్టుక, నిర్మాణం, వాతావరణం, అయస్కాంతక్షేత్రం వంటి అంశాలు నిగ్గు తేల్చాలని నాసా భావిస్తోంది.

07:42 - July 6, 2016

హైదరాబాద్ : అధికారం కోల్పోయి రెండేళ్ళయ్యింది. గెలిచిన పార్టీ నేతలు చాలా మంది పార్టీ వీడిపోయారు. క్షేత్ర స్థాయిలోనూ అదే పరిస్థితి. కనీసం ఉన్న వాళ్ళనైనా కాపాడుకునేందుక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలోని పార్టీ ప్రజా ప్రతినిధులకు శిక్షణా తరగతులు ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటున్న టీ. కాంగ్రెస్‌...
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి. పార్టీ నుంచి నేతలంతా వెళ్లిపోయిన రెండేళ్ళ తరువాత పార్టీ నేతలు తేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలే కాదు..ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సైతం చాలా మంది కాంగ్రెస్‌ను విడిచివెళ్ళారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వాళ్ళు ..ఎంత మంది పార్టీలో ఉన్నారో..ఎంత మంది పార్టీని వీడారో లెక్కే లేదు. పార్టీ.. క్రిందినుంచి రోజురోజుకు ఖాళీ అవుతున్నా ముఖ్యనేతలు సైతం క్షేత్ర స్థాయిలోని ప్రజా ప్రతినిధులపై దృష్టి సారించలేదు.

రోజు రోజుకు ఖాళీ అవుతున్న పార్టీ ..
కాంగ్రెస్ నుంచి ఆయా జిల్లాలకు చెందిన ముఖ్యనేతలే పార్టీ వీడుతుంటే వారి వెంట చాలా మంది స్థానిక నేతలు కండువాలు మార్చుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎంత మంది గెలిచారో, ఎంత మంది పార్టీ మారారో లెక్కనే లేదు. మరో పక్క కొంత మంది పార్టీలో ఉన్నారు కానీ..పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. కొందరు పార్టీలోనే ఉండి అధికార పార్టీలో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

గ్రామస్థాయిలో కాంగ్రెస్ శిక్షణ..

అయితే చాలా ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ నేతలు..గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులనుంచి జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధుల వరకు శిక్షణా తరగతులు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈ నెల 8న మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్, కార్పోరేటర్ లు, 25న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు, 26న సర్పంచులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వాహనకు మాజీ ఎంపీ పొన్నం ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసి ఎజెండాను ఖరారు చేస్తున్నారు.

'శిక్షణ'తో నేతల జంపింగ్ లు ఆగేనా?..
మొత్తానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలే టార్గెట్ గా కార్యక్రమాలు రూపొందిస్తున్న కాంగ్రెస్ నేతలు ..దీనికి క్షేత్రస్థాయి నేత‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. మ‌రి ఈ ప్రయ‌త్నం ఏమేర‌కు ఫలిస్తుందో చూడాలి.

07:34 - July 6, 2016

హైదారబాద్ : జీహెచ్ఎంసీలో లో ప్రక్షాళన షురూ అయ్యింది. అవినీతి అధికారుల పీఠాలు ఒక్కొక్కటిగా క‌దులుతున్నాయి. కార్పొరేష‌న్‌లో కరప్షన్‌పై బల్దియా బాస్‌ సీరియస్‌గా ఫోకస్‌ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్లు, సరెండర్లు కుదరకపోతే..సస్పెండ్‌ చేస్తూ.. తమ మార్క్‌ చూపిస్తున్నారు కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

జీహెచ్‌ఎంసీలో తారాస్థాయికి చేరిన అవినీతి...
గ్రేటర్ కార్యాల‌యంలో అవీనితి తారాస్థాయికి చేరింది. పబ్లిక్‌, ఉద్యోగుల‌ నుంచి లంచాలు తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతున్నారు కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు. హైదరాబాద్‌లో జ‌రుగుతున్న ఏసీబీ దాడుల్లో రెగ్యుల‌ర్‌గా ఉద్యోగులే అడ్డంగా బుక్కవుతున్నారు. వారు చేస్తున్న ఉద్యోగానికి, ఉన్న ఆస్తుల‌కు ఎలాంటి పొంతన కుదరడంలేదు. ఏసీబీ సోదాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు బయటపడుతుండడంతో అధికారులు ఏ స్థాయిలో లంచాలు తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. పై అధికారుల నుంచి మొదలుకొని చిరుద్యోగుల వ‌ర‌కూ ప‌ట్టుబ‌డ్డ వారి

అటెండర్ నుంచి అఫీసర్ వరకు అందరికీ లంచాలే..
జీహెచ్‌ఎంసీ ఆఫీసులో చిన్నఫైల్ కదలాలన్నా..లంచం ఇవ్వాల్సిందే..! అటెండర్ నుండి ఆఫీసర్ వరకు అందరూ ఇందులో ఎక్స్ ప‌ర్ట్సే. బ‌ల్దియాలో కాసుల కోసం కక్కుర్తి ప‌డుతున్న కొంద‌రు అధికారులు..త‌మ తోటి ఉద్యోగుల‌ను కూడా వదలడం లేదు. చిన్న చిన్న ప‌నులకు కూడా లంచం తీసుకుంటూ..అడ్డంగా దొరికిపోతున్నారు.

సస్పెండ్‌ చేస్తూ.. నిర్ణయం తీసుకుంటున్న బల్దియా బాస్‌...
ఇక గ్రేట‌ర్ కార్పొరేష‌న్ అవినీతి బాగోతంపై ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే చాలాసార్లు కామెంట్‌ చేశారు. ముడుపులు ఇచ్చుకోందే పనిచేయం అనే విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా.. అక్కడకక్కడ కొందరు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. దీంతో వారిపై కమిషనర్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తప్పుచేసిన వారిని సస్పెండ్‌ కూడా చేస్తున్నారు. ఇటీవ‌ల ఇంజ‌నీరింగ్‌, శానిటేష‌న్ విభాగాల నుంచి ఇద్దరు అధికారులను మదర్‌ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్‌ చేసిన కమిషనర్‌..మరో ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. అంతేకాదు..గతంలో జ‌రిగిన తప్పిదాలపై కూడా బల్దియా బాస్‌ చాలా సీరియస్‌గా ఉన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌ పథకాలపై ప్రత్యేక దృష్టి...
ఇక ఎల్ అర్ ఎస్, బిఆర్ ఎస్ స్కిమ్స్ లో అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఏసీబీ అధికారులు సీరియస్‌గా ఫోకస్‌ చేశారు. అందుకే ఇప్పటి వరకు లంచాలు తీసుకుంటూ.. ఆరుమందికి పైగా అధికారులు పట్టుబడ్డారు. ఈ మధ్య జ‌న‌న, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాలు జారీ చేసే హెల్త్ అసిస్టెంట్లపై జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అవినీతి పెరగడానికి ప్రధాన కారణం కార్పొరేష‌న్లలో సిటిజ‌న్ చార్టర్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయకపోవడమే అనే వాదనలు ఉన్నాయి. ఏ పనులు ఎన్ని రోజుల్లో చేయాలి..? ప‌నులు కాకుంటే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి..? అనే వివ‌రాలు సిటిజ‌న్స్‌కు తెలియ‌క‌పోవడం కూడా అవినీతి పెరగడానికి కార‌ణ‌మౌతుంది. నిర్ణీత ప‌నుల‌ను స‌కాలంలో చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే.. అవినీతి తగ్గించవచ్చని సిటిజన్స్‌ భావిస్తున్నారు. 

భారీ స్థాయిలో చ‌ర్యల‌కు సిద్ధమవుతున్న క‌మిష‌న‌ర్‌..
మొత్తంగా కార్పొరేష‌న్‌లో భారీ స్థాయిలో చ‌ర్యల‌కు క‌మిష‌న‌ర్‌ సిద్ధమవుతుండడంతో...ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందోనని అంతా చర్చించుకుంటున్నారు.

07:28 - July 6, 2016

హైదరాబాద్ : ఖరీఫ్‌ను అస్ర్తంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ సమరశంఖం పూరిస్తోంది. రుణమాఫీ చేయకుండా.. రైతులను దగా చేస్తోందంటూ మండిపడుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ వచ్చినా.. కళ్లు తెరవని సర్కార్‌ను మొద్దునిద్ర నుంచి లేపుతామంటున్నారు హస్తంపార్టీ నేతలు. నకిలీ విత్తనాలు, రుణమాఫీపై మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తక్షణమే మంత్రిని తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ పాలిటిక్స్‌తో ఉడికిపోతున్న హస్తం పార్టీ ..
కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌ పాలిటిక్స్‌తో ఉడికిపోతున్న హస్తం పార్టీ .. అందివచ్చిన ప్రతి అంశాన్నీ తనకు అవకాశంగా మలుచుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ తీరును తప్పుపడుతున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌పై సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును వేలిత్తి చూపుతోంది.

మంత్రి పోచారం కాంగ్రెస్‌ నేతలు ఫైర్ ..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, కమీషన్‌లే తప్పా.. రైతుల గోడు ఏ మాత్రం పట్టడం లేదని హస్తం పార్టీ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా ఇప్పటివరకు సర్కార్‌ ఎలాంటి రైతు సహాయక కార్యక్రమాలు చేపట్టడం లేదంటున్నారు. మరోవైపు రుణాల విషయంలో బ్యాంకులు తమను పట్టించుకోవడం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు తప్పుపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టలేకపోతే.. పోచారం మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని హస్తం నేతలు హెచ్చరిస్తున్నారు.

కేంద్రం కేటాయించిన నిధులు దారి మళ్లుతున్నాయి : కాంగ్రెస్ నేతలు
ఎఫ్‌ఆర్‌బిఎం పెంచితే రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న కేసీఆర్‌.. ఇప్పుడేందుకు ఆ హామీ విస్మరించారని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ మూడోవిడత అందకపోవడంతో.. 19 లక్షల మంది రైతులు బ్యాంక్‌ల చుట్టు తిరుగుతున్నారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు కూడా రాష్ర్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఆందోళనలు, ధర్నాలు చేయాలని కాంగీ వ్యూహం..
ఇప్పటికైనా ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌లో రైతు సహాయక కార్యక్రమాలు చేపట్టకపోతే.. రాష్ర్ట వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు, ధర్నాలు చేయాలని వ్యూహరచన చేస్తున్నారు హస్తం నేతలు. 

07:20 - July 6, 2016

హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి నిర్వహించతలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. దీనీపై అన్ని స్థాయిల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..వివిధ మత పెద్దల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలో వివిధ మతాలకు చెందిన గురువులు, పాస్టర్స్, పీఠాధితులతో సమావేశమయ్యారు.

హరితహారంపై మతపెద్దలతో సమావేశమైన సీఎస్..
రాష్ట్రంలో చెట్లను నాటేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు టీసర్కారు ప్రయత్నిస్తోంది. ఒక్కో మున్సిపాలిటీ నుంచి 50 వేల నుంచి 5లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వపరంగా కళారూపాలు, బ్యానర్లు, పోస్టర్లతో వివిధ మార్గాల్లో ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ వివిధ వర్గాలకు చెందిన మతపెద్దలతో విడివిడిగా భేటీ అయ్యారు. దేవాలయ భూముల్లో ప్రత్యేకంగా పూజ ఔషధ మొక్కలు నాటాలని, వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మరింత మంచి జరుగుతుందని మతగురువులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తమవంతు సహకారమందిస్తామన్నముస్లింమతపెద్దలు ..
హరితహారం కార్యక్రమాన్ని బీడు భూములు, ప్రభుత్వ హయాంలో ఉన్న ఖాళీ స్థలాలు, దేవాలయాలతోపాటు మసీదులు, చర్చిలు, గురుద్వారాలలోను, ఇతర మతాల కేంద్రాల దగ్గర విజయవంతమయ్యేలా చూడాలని సీఎస్ రాజీవ్‌శర్మ కోరారు. ఈ ప్రార్థనా మందిరాలకు మొక్కలు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజలకు ఆధ్యాత్మికతతోపాటు, ప్రార్థనా సమయంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్న సందేశం చేరేలా సహకరించాలని కోరారు.ఇందుకు ముస్లిం మతపెద్దలు సముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

హరితహారంలో ప్రజల భాగస్వామ్యం....
రెండు వారాలపాట నిర్వహించే హరితహారంలో ప్రజల భాగస్వామ్యాన్ని వీలైనంతగా పెంచాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇందుకు అవసరమైన కార్యప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.

07:06 - July 6, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్య ఇప్పటివరకు నీటివివాదం, విభజన అంశాలే అనుకుంటే.. కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. తమ అధికారులు కష్టపడి తయారు చేసిన వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్.

గత రెండేళ్లుగా ఏపీ..టీఎస్ ల మధ్య పలు  వివాదాలు...
గత రెండేళ్లుగా అనేక అంశాల్లో ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశాలు ఎప్పటికప్పుడు వివాదం అవుతూనే ఉన్నాయి. అటు హైకోర్టు అంశం ఉద్యోగుల విభజన , నీటిపంపకం , ప్రాజెక్టుల నిర్మాణం నిత్యం చర్చలో ఉంటున్నాయి. తాజాగా ఈవో డీఎస్ ను కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి తాము సీరియస్ గా ఉన్నామంటూ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు కేటీఆర్.

వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు..
తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్ పోర్టల్ అంశం తోడైంది. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన పరిశ్రమల శాఖ ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ కోసం ఏపీ అడ్డదారులు వెతుకుతున్నదని ఆరోపించింది తెలంగాణసర్కార్. కేటీఆర్ నేతృత్వంలో పరిశ్రమలశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. తెలంగాణ అధికారులు రూపొందించిన వెబ్ పోర్టల్ ను మక్కికి మక్కీ కాపీ చేసిందని..దాని తాలూకు ఆధారాలను మంత్రికి అధికారులు సమర్పించారు.

ఏపీ తీరుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ..
దీనిపై సీరియస్ అయిన మంత్రి కేటీఆర్‌..వెంటనే కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మాలాసీతారామన్‌కు లేఖ రాశారు. పరిశ్రమలకు అనుమతులు జారీలో పారదర్శకత పెంచేందుకు రెడ్ టేపిజం తగ్గించేందుకు ఈవోడీబీ ర్యాంకింగ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని..అలాంటివాటిని చోరీ చేసి ఏపీ వెబ్ సైట్ లో ఉంచడం దారుణమని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. 30వ తేదీ తర్వాత ఆయా రాష్ట్రాలు సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి కోరారు.

ఈవో డీఎస్ ను కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు ..
ఇదిలా ఉంటే..కేంద్రం దేశంలో పెట్టుబడుల ఆకర్షణ కొరకు కేంద్రం రాష్ట్రాలకు ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లను ప్రతి ఏడాది ఇస్తుందన్నారు మంత్రి నిర్మలాసీతారామన్‌. ఇందులో డీఐపీపీ సుమారు 340 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రాష్ట్రాలకు ఇచ్చింది. దానిని క్రోడీకరించి ఈస్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్ ను అగ్రస్థానంలో ఉంచింది రాష్ట్రం. తెలంగాణ వెబ్ పోర్టల్ ను కాపీ కొట్టడంతో.. ఏపీ ర్యాంక్ పెరగడంతో.. కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాపీ తీసుకోవాలని లేఖలో కోరారు.న్యాయపరంగా ముందుకొట్టిన ఏపీపై చర్యలు కు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన కేటీఆర్ ..
తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అన్ని అంశాలు చర్చించాకే ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఉల్లంఘన జరిగిందని..పోలీస్ శాఖ ప్రాథమికంగా తెలిపిందని అంటుంది తెలంగాణ సర్కార్.

06:56 - July 6, 2016

ఢిల్లీ : నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికి.. 19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలకు మంత్రివర్గంలో అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇటు ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నత కల్పించిన మోడీ.. తన టీమ్‌లో ఇద్దరు మహిళలకు కూడా అవకాశం కల్పించారు.

19 మంది కొత్త మంత్రుల ప్రమాణం...
కొంతకాలంగా ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ క్రతువు ముగిసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ .. కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేబినేట్‌ను విస్తరించింది. 19 మంది మంత్రులకు కొత్తగా పదవులను ఇచ్చిన ఎన్డీయే కూటమి, పలువురు మంత్రుల శాఖలలో కూడా మార్పులు చేసింది.

కొత్త మంత్రులు వీరే...
ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా ఉన్న జ‌వ‌దేక‌ర్‌కు కేబినెట్ మంత్రిగా ప్రమోష‌న్ ద‌క్కింది. దీంతో ప్రస్తుతం మంత్రివర్గం సంఖ్య 78కి చేరింది. మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీకి చేనేత, జౌళిశాఖను కేటాయించారు. వెంకయ్యనాయుడుకు సమాచార శాఖ, ప్రకాష్ జయదేవకర్‌కు మానవ వనరుల శాఖ, అనంతకుమార్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఎంజే అక్బర్‌కు విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా, రవిశంకర్ ప్రసాద్‌కు న్యాయశాఖ, సదానంద గౌడకు గణాంక శాఖ, బీరేంద్ర సింగ్‌కు గనుల శాఖ, రాందాస్ అథవలేకు సామాజిక న్యాయశాఖ, ఇంద్రజిత్ సింగ్‌కు పట్టణాభివృద్ధి శాఖ, అనిల్ మాధవ్ దవేకు స్వతంత్రహోదాలో అటవీ పర్యావరణ శాఖ, విజయ్ గోయల్‌కు క్రీడా శాఖ, జశ్వంత్ సిన్హా బాభోర్‌కు గిరిజన వ్యవహారాల శాఖ, జయంత్ సిన్హా కు పౌర విమానయాన సహాయమంత్రిగా, కృష్ణారాజ్‌కు మహిళా శిశు సంక్షేమశాఖ, అర్జున్ మేఘ్ వాల్‌కు ఆర్ధికశాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. ఇంతకుముందు కేబినెట్‌లో ఉన్న ఐదుగురు మంత్రులను తొలగించారు. వివిధ శాఖల సహాయ మంత్రులైన నిహాల్‌ చంద్‌, రాంశంకర్‌ కఠారియా, సన్వర్‌లాల్‌ జాట్‌, మనుసుఖ్‌భాయ్‌ వాస్వా, మోహన్‌భాయ్‌ కుందారియాను మంత్రివర్గం నుంచి తొలగించారు.

ఉత్తరప్రదేశ్‌కు మంత్రివర్గంలో అధిక ప్రాముఖ్యత ..
మోడీ మంత్రివర్గ విస్తరణలో పది రాష్ట్రాలకు మాత్రమే బెర్తులు దొరికాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు మంత్రివర్గంలో ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇక గుజరాత్ నుంచి కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. కులాల వారీగా తీసుకుంటే అత్యధికంగా ఓబీసీలకు స్థానం లభించగా.. తర్వాత ఐదుగురు దళితులకు మంత్రి పదవులు లభించాయి. రెండు బెర్తులు మైనార్టీలకు కేటాయించారు. ఈ సారి విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు.

19 మంది మంత్రులతో ప్రధాని మోడీ చాయ్ పే చర్చ...
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 19 మంది మంత్రులతో ప్రధాని మోడీ చాయ్ పే చర్చాకు పిలిచారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఉత్సాహంగా పనిచేయాలని మంత్రులకు ఉద్భోదించారు. అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. మొత్తంగా మోదీ అధికారాన్ని చేపట్టిన తరువాత మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2014, నవంబర్‌లో ఆయన క్యాబినెట్‌ను విస్తరించారు.

06:45 - July 6, 2016

.గోదావరి : పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం 10 గంటలకు లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటి విడుదల ప్రారంభిస్తారు. అయితే పోలవరం కుడికాలువ పూర్తిగా సిద్ధం కాదందున తొలిరోజు కొన్ని పంపులను మాత్రమే రన్ చేయనున్నారు. అనంతరం సీఎం పోలవరం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. 

రంజాన్ నేడు కాదు రేపు...

హైదరాబాద్‌ : రంజాన్ పండుగ సెలవు ఈ నెల 7వ తేదీన ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నెలవంక దర్శనం కాకపోవడంతో ఈద్‌ను గురువారం జరుపుకోవాలని మర్కజీ రుయాత్ హిలాల్‌ కమిటీ ప్రకటించింది. దీంతో సెలవును 6 నుంచి 7వ తేదీకి మార్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ జీవో ఇచ్చారు. పండుగ మరుసటి రోజు అయిన 8వ తేదీన కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

నిరుద్యోగులను మోసం చేస్తున్న దంపతులు అరెస్ట్..

హైదరాబాద్ : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.50లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న యుగంథర్, స్వాతి అనే దంపతులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

రంజాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు...

హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మిర్ అలాం ట్యాంక్ ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గా వద్ద జరిగే ప్రార్థనల సందర్భంగా జూలై 7వ తేదీన ఈ ప్రాంతాల్లో వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Don't Miss