Activities calendar

07 July 2016

వింబుల్డన్ ఓపెన్ లో వీనస్ విలియమ్స్ ఓటమి

ఢిల్లీ : వింబుల్డన్ ఓపెన్ లో వీనస్ విలియమ్స్ ఓటమిపాలయింది. ఏంజెలిక్ కెర్బర్ పై 6-4, 6-4 తేడాతో వీనస్ విలియమ్ ఓడిపోయింది. శనివారం సెరెనా-ఏంజెలిక్ కెర్బర్ మధ్య ఫనల్ మ్యాచ్ జరుగనుంది. 

 

21:41 - July 7, 2016

ఢిల్లీ : వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ తొమ్మిదోసారి చేరుకొంది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్ లో ముగిసిన తొలిసెమీఫైనల్లో...రష్యన్ డబుల్స్ స్టార్, అన్ సీడెడ్ ఎలీనా వెస్నినాను టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ ..వరుస సెట్లలో చిత్తు చేసింది. వెస్నినాను 6-2, 6-0తో సెరెనా ఊదిపారేసింది. ఇప్పటికే ఆరు వింబుల్డన్ టైటిల్స్ తో సహా 19 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరెనా...20వ టైటిల్ కు మరింత చేరువయ్యింది. వీనస్ విలియమ్స్- ఏంజెలికో కెర్బర్ ల రెండో సెమీఫైనల్లో నెగ్గిన ప్లేయర్ తో ఫైనల్లో సెరెనా తలపడాల్సి ఉంది.

 

21:39 - July 7, 2016

ఢిల్లీ : ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈరోజు ఉదయం మొజాంబిక్‌ రాజధాని మాపుతో చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి అధికారులు ఘనస్వాగతం పలికారు. మోదికి గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ లభించింది. మొజాంబిక్‌ జాతీయ చట్టసభ అధ్యక్షురాలు విరోనికా మకామోతోనూ మోదీ భేటీ కానున్నారు. మలౌనాలోని శాస్త్ర, సాంకేతిక పార్క్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఆఫ్రికాతో మైత్రి బలోపేతం లక్ష్యంగా మోదీ 4 ఆఫ్రికా దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొజాంబిక్‌తో పాటు దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాల్లో పర్యటించనున్నారు. హైడ్రోకార్బన్‌లు, తీరప్రాంత రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఆహార రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

 

 

21:36 - July 7, 2016

ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ 2012లో ఓ కార్యక్రమంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టిస్తోంది. ఆ వీడియోలో దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద ఇస్లామిక్ మత గురువు జకీర్ నాయక్‌ను శాంతి దూతగా అభివర్ణించడమే. జకీర్‌ను ఓ శాంతి దూతగా, దేశంలోని వివిధ వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చగల గొప్ప మహనీయుడిగా దిగ్విజయ్‌ అభివర్ణించారు. ఢాకా ఉగ్రవాదులను ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌ను దిగ్విజయ్ శాంతి దూతగా అభివర్ణించడంపై బీజేపీ తప్పుబడుతోంది. ఆరోజు చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికి తాను కట్టుబడి ఉన్నానని,  జకీర్ నాయక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే చర్యలు తీసుకోవచ్చని డిగ్గీ పేర్కొన్నారు.

21:16 - July 7, 2016

మహబూబ్ నగర్ : సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వాసితులు, భూసేకరణ సమస్యలను చర్చించేందుకు వెంటనే అఖిపక్షల సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం తెలంగాణ కమిటీ డిమాండ్‌ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మిస్తున్న ఉద్దండపూర్‌ జలశయ నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్న పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచారు. అపరిమిత సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మించొద్దని నిపుణులు చెబుతున్న  మాటలను ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. 
నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర 
మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో యాత్ర చేపట్టారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉద్దండపూర్‌ జలాశయ నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. విద్యావేత్త చుక్కా రామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని సీపీఎం నేతల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 
పాదయాత్రకు మంచి స్పందన 
ఉద్దండపూర్‌ నిర్వాసిత గ్రామాల్లో తమ్మినేని వీరభద్రం, భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్‌ బీ వెంకట్‌ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బలవంతంగా భూములు సేకరించేందుకు అధికారుల, పాలకులు ఒత్తిడి తెస్తున్నారని పలువురు నిర్వాసితులు వీరి దృష్టికి తెచ్చారు. గ్రామ సభలు నిర్వహించి, రైతులు, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఉన్నపలంగా ఊరొదిలి వెళ్లిపొమ్మంటున్నాని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనానికి  2013 భూసేరణ చట్టాన్ని అమలు చేయకుండా 123వ జీవో కింది పొలాలు తీసుకుంటున్నారని నిర్వాసితులు సీపీఎం నేతల దృష్టికి తెచ్చారు. 
ప్రాజెక్ట్‌ల పేరుతో ముంచొద్దు : నిర్వాసితులు 
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదు భారీ జలాశయాలు నిర్మిస్తున్నారు. వీటి కోసం 123 జీవో ప్రకారం  22 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఉద్దండపూర్‌ రిజర్వాయర్‌ కోసమే 10వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అయితే ప్రాజెక్ట్‌ల పేరుతో తమను ముంచొద్దని.. తాము ఇక్కడే ఉంటామని నిర్వాసితులు వేడుకున్నారు. 
ప్రభుత్వ మొండివైఖరిని తప్పుపట్టిన తమ్మినేని  
ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిని తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. నిర్వాసితుల సమస్యలు, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడ్డారు. 
పాదయాత్రలో పాల్గొన్న చుక్కా రామయ్య 
నిర్వాసితులను ప్రత్యామ్నాయం చూపకుండా, చట్ట ప్రకారం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములు సేకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను... పాదయాత్రలో పాల్గొన్న విద్యావేత్త చుక్కా రామయ్య తప్పుపట్టారు. మొదటిరోజు ఉద్దండపూర్‌, తీగలపల్లి, సిదూటం, కారుకొండ గ్రామాల్లో కొనసాగిన పాదయాత్ర.. మరో 2 రోజుల పాటు సాగనుంది. 

 

21:13 - July 7, 2016

హైదరాబాద్ : నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. 29 వేల సెలైన్ బాటిల్స్ ను అధికారులు సీజ్ చేశారు. సెలైన్ బాటిళ్లల్లో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. 29 వేల సెలైన్ బాటిళ్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. నిన్న సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో కూడా అధికారులు సెలైన్ బాటిళ్లలో ఫంగస్ ను గుర్తించారు. ఆ సెలైన్ బాటిళ్ల తయారీ కంపెనీలపై కేసులు నమోదు చేయాలని సూచించినట్లు సమాచారం. 

 

 

 

నీలోఫర్ ఆస్పత్రిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్ : నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. 29 వేల సెలైన్ బాటిల్స్ ను అధికారులు సీజ్ చేశారు. సెలైన్ బాటిళ్లల్లో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. 

ముగిసిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

కృష్ణా : విజయవాడలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

 

20:53 - July 7, 2016

అంబరాన్నంటిన రంజాన్ పండుగ... ఇద్దరు సీఎంలు చేసిందంత దండగ, మళ్లొక యాగం చేయబోతున్న సీఎం కేసీఆర్... ఫామ్ హౌజ్ లో కొలువుదీరవోతున్న కార్యం, కోడి జాడకోసం 50 కోట్ల ఖర్చు... కోడి లేదని కొట్లాటకు దిగిన కామ్రేడ్లు, ఇండ్లు కూల్చేటందుకు నిధులు మంజూరు... పేద జనం చావుదలకొచ్చిన పుష్కరాలు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:45 - July 7, 2016

ఢిల్లీ : ఐరోపాలోనే అతిచిన్నదేశం ఐస్‌లాండ్‌ జట్టు ....యూరో కప్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ దాటడమే గగనమనుకుంటే....ఏకంగా క్వార్టర్‌ఫైనల్స్ రౌండ్‌కు అర్హత సాధించి చరిత్రను తిరగరాసింది.యూరో కప్‌లో అంచనాలకు మించి రాణించిన జట్టు సభ్యులందరికీ...క్యాపిటల్‌ సిటీ రేకావిక్‌లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. 33వేల మంది అభిమానులు ఒకే చోట చేరి ....ఐస్‌లాండ్‌ ఆటగాళ్లతో కలిసి వికింగ్‌ క్లాప్స్‌తో  సంబరాలు జరపుకున్నారు.
యూరోప్‌లోనే అతి చిన్న దేశం....
ఐస్‌లాండ్‌, యూరోప్‌లోనే అతి చిన్న దేశం....మూడున్నర లక్షల జనాభా.... చిన్న దేశమే అయినా....యూరో కప్‌లో మాత్రం  ఐస్‌లాండ్ జట్టు పెద్ద సంచలనమే సృష్టించింది. తొలి సారిగా యూరో కప్‌కు క్వాలిఫై అయిన ఐస్‌లాండ్‌ జట్టు ....ఆడిన తొలి టోర్నీలోనే సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ దాటడమే కష్టమనుకుంటే....ఏకంగా క్వార్టర్‌ఫైనల్స్ రౌండ్‌కు అర్హత సాధించి చరిత్రను తిరగరాసింది.
టేబుల్‌లో రెండో స్థానంలో ఐస్ లాండ్
పోర్చుగల్‌, హంగరీ, ఆస్ట్రియా వంటి పటిష్టమైన జట్లతో కూడిన గ్రూప్‌లో.....ఆరోన్‌ గనర్సన్‌ నాయకత్వంలోని ఐస్‌లాండ్‌ జట్టు అంచనాలకు మించి రాణించి పాయింట్స్‌ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. తొలి సారిగా క్వార్టర్‌ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది.
ఫ్రాన్స్‌ చేతిలో ఐస్‌లాండ్‌ ఓటమి
క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం మాజీ చాంపియన్‌ ఫ్రాన్స్‌ జట్టు చేతిలో ఐస్‌లాండ్‌ జట్టుకు పరాభవం మాత్రం తప్పలేదు. 2 5 గోల్స్‌తో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆటతో సాకర్‌ అభిమానులను అలరించిన ఐస్‌లాండ్‌ జట్టు ఆటగాళ్లు.....మ్యాచ్‌ ముగిసిన అనంతరం తమదైన స్టైల్‌లోనే సంబరాలు జరుపుకోవడంలోనూ ఆకట్టుకున్నారు. క్వార్టర్‌ఫైనల్‌లో ఫ్రాన్స్‌ చేతిలో ఓడినా....అభిమానులతో కలిసి స్టేడియంలోనే సెలబ్రేట్‌ చేసుకుని తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
రేకావిక్‌లో అభిమానులు ఘనస్వాగతం
ఇక యూరో కప్‌లో అంచనాలకు మించి రాణించిన జట్టు సభ్యులందరికీ...క్యాపిటల్‌ సిటీ రేకావిక్‌లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. 33వేల మంది అభిమానులు ఒకే చోట చేరి ....ఐస్‌లాండ్‌ ఆటగాళ్లతో కలిసి వికింగ్‌ క్లాప్స్‌తో  సంబరాలు జరపుకున్నారు.
సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిపిన ఐస్ లాండ్
యూరో కప్‌లో ప్రదర్శనతో ఐస్‌లాండ్‌ జట్టు ఆటగాళ్లు ...తమ జట్టు సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ప్రధాన టోర్నీల్లో తమ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా తమ ప్రదర్శనతోనే సమాధానమిస్తాని చెప్పకనే చెప్పారు. 2018 ఫీఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లోనూ రాణించి తొలిసారిగా ప్రపంచకప్‌ పోటీలకు సైతం అర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.  

 

20:39 - July 7, 2016

హైదరాబాద్ : 2016 యూరోపియన్ కప్ ఫుట్ బాల్ టోర్నీకే అతిపెద్ద సమరానికి... మార్సెలీ సాకర్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఫైనల్లో చోటు కోసం జరిగే రెండో సెమీఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్ కు మూడుసార్లు చాంపియన్ జర్మనీ సవాల్ విసురుతోంది. భారత కాలమానప్రకారం రాత్రి 12 గంటల 30 నిముషాలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.....
పతాకస్థాయికి యూరోపియన్ ఫుట్ బాల్ సమరం
ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 2016 యూరోపియన్ ఫుట్ బాల్ సమరం పతాకస్థాయికి చేరుకొంది. తొలిసెమీఫైనల్లో వేల్స్ ను పోర్చుగల్ చిత్తు చేసి ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోడంతో.... ఇప్పుడు...రెండో సెమీఫైనల్స్ కు మార్సెలీ సాకర్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ డూ ఆర్ డై సమరంలో ఆతిథ్య ఫ్రాన్స్ తో మూడుసార్లు చాంపియన్ జర్మనీ ఢీ కొనబోతోంది.
కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూపు
67వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన మార్సెలీ స్టేడియంలో జరిగే ఈసూపర్ డూపర్ ఫైట్ కోసం...ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్లో చోటు కోసం...జరిగే ఈ పోటీని క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ గా అభిమానులు పరిగణిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఇటలీని పెనాల్టీ షూటౌట్ ద్వారా 6-5 గోల్స్ తో జర్మనీ అధిగమించింది.
మూడుసార్లు విజేత జర్మనీకి ఇది ఏడోసారి
యూరోకప్ సెమీఫైనల్స్ చేరడం మూడుసార్లు విజేత జర్మనీకి ఇది ఏడోసారి. అంతేకాదు...సెమీస్ లో ఆతిథ్య దేశాల జట్లను ఏడుసార్లు ఓడించిన అరుదైన రికార్డు సైతం జర్మనీజట్టుకే సొంతం. జర్మన్ జట్టులో థామస్ మ్యూలర్, బాస్టియన్ స్వాన్ స్టైగర్, మేసుట్ ఓజిల్ ప్రధాన ఆటగాళ్లుగా ఉన్నారు.
సెమీస్ కు ఫ్రాన్స్
మరోవైపు..ఆతిథ్య ఫ్రాన్స్ ఆఖరి క్వార్టర్ ఫైనల్లో ...ఐస్ లాండ్ ను 5..2 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా..సెమీస్ కు అర్హత సాధించింది. గ్రూప్ లీగ్ నుంచి..క్వార్టర్ ఫైనల్స్ వరకూ భారీవిజయాలు సాధించిన ఒకే ఒక్కజట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. ఫ్రెంచ్ జట్టులో ఆలీవర్ గిరౌడ్, ఆంటోనీ గ్రీజ్ మాన్ స్టార్ ప్లేయర్లుగా ఉన్నారు. అంతేకాదు...జర్మనీ ప్రత్యర్థిగా ఫ్రెంచ్ జట్టుకే మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకూ ...ఈ రెండుజట్లూ 27సార్లు తలపడగా...ఫ్రాన్స్ 12 విజయాలు, జర్మనీ 9 విజయాలు సాధించాయి.
ఈ రెండుజట్లూ పోటీపడటం ఇదే మొదటిసారి
అయితే...యూరోకప్ సెమీస్ లో ఈ రెండుజట్లూ పోటీపడటం ఇదే మొదటిసారి.
భారత కాలమాన ప్రకారం రాత్రి 12 గంటల 30 నిముషాలకు ప్రారంభమయ్యే ఈ పోటీలో...ఆతిథ్య ఫ్రాన్స్ స్థానబలంతో చెలరేగిపోతుందా?...లేక...పవర్ ఫుల్ జర్మన్ టీమ్ నేలవిడిచి సాము చేస్తుందా?..తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

 

20:21 - July 7, 2016

గుంటూరు : సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని కడతామన్నారు. భవనాల నిర్మాణాన్నీ చేపట్టారు. అమరావతికి భూములిచ్చిన 29 రైతు గ్రామాల్ని నందనవనాలుగా మారుస్తామన్నారు. ఏడాది తిరిగేలోపు అద్భుతాలు సృష్టిస్తామన్నారు. ఇన్ని మాటలూ చెప్పి రెండున్నరేళ్లయ్యాయి. ఇప్పటికీ ఈ గ్రామాల్లో మౌలిక వసతుల ఊసూ ఎత్తడం లేదు. ఆ గ్రామాలు బురద కూపంలో కూరుకు పోతున్నా.. అటువైపు చూసే నాథుడే లేడు. రాజధాని ప్రాంత గ్రామాల్లోని అస్తవ్యస్త పరిస్థితులపై 10టివి గ్రౌండ్‌ రిపోర్ట్‌..
భూములిచ్చిన గ్రామాల పరిస్థితి
భూములిస్తే గ్రామాలు అభివృద్ధి చేస్తామన్నారు.. ఏలికను నమ్మి అన్నం పెట్టే భూములు ఇచ్చేసిన రైతులు.. రెండేళ్లయినా మారని గ్రామాల పరిస్థితులు.. ఎక్కడ చూసినా.. మురుగు నీరు... బురద కూపంలో అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి... ఇదీ కొత్త రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన గ్రామాల పరిస్థితి. తల్లిలాంటి అన్నంపెట్టే భూముల్ని కోల్పోయినా గ్రామాల్లో.. కనీస వసతులు కూడా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాజధాని నిర్మాణానికి చేయూతనిచ్చిన రైతులు, ప్రజల కష్టాలను పాలకులు ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. 29 గ్రామాలను అద్భుతంగా నందనవనాలుగా అభివృద్ధి చేస్తామన్న నేతలు.. ఇంతవరకు  ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలూ లేవు.
అమరావతి ప్రాంతంలో జాడ లేని అభివృద్ధి
గ్రామాల్లో సకల సదుపాయాలు కల్పిస్తామన్న ఏలిక హామీలు నమ్మి.. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లోని 29 గ్రామాల ప్రజలు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చేశారు. దాదాపుగా 34,500  ఎకరాలు భూములు తీసుకున్న ప్రభుత్వం 29 గ్రామాల్లో అన్ని హంగులు కల్పించి నగరాలకు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పింది. కానీ, రెండేళ్లు కావస్తున్నా..  రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి జాడలు మచ్చుకైనా కనిపించవు. అనేక గ్రామాల్లో నీరు నిలిచిపోయి రోడ్లపై కనీసం అడుగువేసి తీసే పరిస్థితి కూడా లేదు. విజయవాడ, మంగళగిరి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న తాడేపల్లి, ఉండవల్లి లాంటి గ్రామాలు మినహా...మిగిలిన గ్రామాల పరిస్థితి దుర్భరంగా తయారైంది.
రోడ్లన్నీ బురదమయం
సిమెంట్ రోడ్డు నిర్మిస్తాం, మురుగు నీటిని పారదోలేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్న నేతలు ఇప్పుడీ గ్రామల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పాఠశాల, విద్యుత్‌, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి హామీలతో ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. రాజధాని గ్రామాల్లో ఐనవోలు, శాఖమూరు, రాయపూడి, నిడమర్రు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు , డ్రేనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. కనీసం వీధుల్లో నడిచే పరిస్థితి కూడా లేకుండా రోడ్లన్నీ బురదమయంగా మారాయి.
ఎస్సీ కాలనీల పరిస్థితి మరింత దారుణం
కొన్ని గ్రామాల్లో ఎస్సీ కాలనీల పరిస్థితి మరింత దారుణంగా  ఉంది. రోడ్లు, డ్రైనేజీ కూడా లేకుండా గ్రామస్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల ముందు మురుగునీటి నిల్వతో దోమలు, ఈగలు పెరిగిపోయాయి. అపరిశుభ్రత కారణంగా అంటురోగాలు వ్యాపించే ప్రమాదం పొంచివుంది. ఇతరత్రా సదుపాయాల సంగతి ఎలావున్నా.. కనీసం తాగునీటికీ జనం కటకటలాడుతున్నారు. ఇప్పటికీ ఊరి చివర గల చెరువు నుంచే నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
గ్రామాల పట్ల ప్రభుత్వ ఉదాసీనత
రాజధాని నిర్మాణానికి మొట్టమొదట భూములిచ్చిన నేలపాడు పరిస్థితిని పరిశీలిస్తే... ప్రభుత్వం ఈగ్రామాల పట్ల ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ల మీద నీరు నిలిచి రోడ్లపై నడిచే పరిస్థితి లేకుండా పోయింది. నేలపాడు గ్రామానికి ఎక్కడ లేని శోభ తెస్తామని చెప్పిన మంత్రి నారాయణ కూడా కనీసం గ్రామం వైపు కూడా చూసిన దాఖలాలు లేవు.  గ్రామంలో వృద్ధులు, పిల్లలైతే అసలు నడవలేని పరిస్థితి నెలకొంది.
స్థానికులు కలవరం
అమరావతి ప్రాంతంలో అద్భుత అభివృద్ధి జరుగుతోందని ఇతర ప్రాంతాల వారికి చూపేందుకు... కొన్ని ప్రాంతాల్లోనే పనులు చేస్తున్నారు. దాన్ని చూపి.. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా అభివృద్ధి సాగుతోందని భ్రమింప చేస్తున్నారు. రాజధానికి ఆనుకుని ఉన్న కురుగల్లు, నిడమర్రు, ఐనవోలు, శాఖమూరు, నేలపాడు, హరిశ్చంద్రపురం, బోరుపాలెం వంటి గ్రామాల ప్రజలను కదిలిస్తే..  పాలకులు, అధికారులు తమను ఎంతలా నిర్లక్ష్యం చేస్తున్నారో తేటతెల్లమవుతోంది. భూముల కోసం కల్లబొల్లి మాటలు చెప్పిన నాయకులు.. ఇప్పుడు ముఖం చాటేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన తమ పట్ల ప్రభుత్వం ఎందుకింతలా వివక్ష చూపుతోందో అర్థం కాక.. స్థానికులు కలవర పడుతున్నారు.
మొదట స్పందించిన గ్రామం నేలపాడు
అమరావతికి భూములు ఇవ్వండి అని చంద్రబాబు పిలుపునివ్వగానే మొదట స్పందించిన గ్రామం నేలపాడు. ఈ గ్రామస్థుల స్ఫూర్తితోనే మిగిలిన 28 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అంటే ప్రభుత్వ భూసమీకరణకు తొలి ఊతమిచ్చింది నేలపాడు గ్రామమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ గ్రామంలో.. ప్రస్తుతం మౌలిక వసతుల అభివృద్ధి తీరేంటో..వీడియోలో చూద్దాం...

 

20:09 - July 7, 2016

మహబూబ్ నగర్ : భూసేకరణకు 2013 చట్టం ఉండగా 123 జీవో కింద వేలాది ఎకరాలు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని సీపీఎం తమ్మినేని ఆరోపించారు. జిల్లాలోని ఉద్దండాపూర్‌లో సీపీఎం తరపున తమ్మినేని పాదయాత్ర నిర్వహించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుతో 40 గ్రామాల పరిధిలోని 30 వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని చెప్పారు. ముంపు గ్రామస్తుల అనుమతి లేకుండా భూములు ఎలా లాక్కుంటారని తమ్మినేని ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:58 - July 7, 2016

చిత్తూరు : తిరుమల 'గాలి' దుమారంలో ఏం జరిగింది..? ఆలయాధికారులు అత్యుత్సాహం చూపారా..? ఆలయ నిబంధనలనే పాటించారా..? ప్రోటోకాల్ ఏం చెబుతోంది...?, విశేష దర్శనం ఎవరికి ఇవ్వాలి..? తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన గాలి జనార్దన్‌రెడ్డికి టీటీడీ సిబ్బంది అధికారిక మర్యాదలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాలి జనార్దన్‌రెడ్డికి.. దర్శనం చేయించి స్వామివారి శేషవస్త్రం కప్పినట్లు సమాచారం. గనుల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌ రెడ్డికి అధికారిక మర్యాదలు ఎలా చేస్తారని.. భక్తులు మండిపడుతున్నారు. గనుల అక్రమాల కేసులో అరెస్టైన ఓ వ్యక్తికి ఇలా మర్యాదలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డికి టీటీడీ ఇచ్చిన మర్యాదలపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రోటోకాల్ ఉల్లంఘనే అని నేతలు అంటున్నారు. మరోవైపు దాతల కోటా పరిధిలోనే గౌరవించామని టీటీడీ చెబుతోంది. సినీ ప్రముఖులు వస్తే అత్యుత్సాహం చూపే ఆలయ అధికారులు.. గతంలో సోనియాగాంధీ సందర్శన సందర్భం గానూ వివాదం నెలకొంది. కార్పొరేట్ పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడల్లా టీటీడీ యంత్రాగం వారికి సాగిలపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

 

19:41 - July 7, 2016

స్పెయిన్‌ : బుల్ పండుగ ఆ దేశాన్ని ఊర్రూతలూగిస్తోంది. ఇప్పుడా దేశంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనబడుతోంది. వీధులన్నీ ఎరుపు రంగుతో కళకళలాడుతున్నాయి. ఎద్దుల వెంట పడుతూ వాటిని పట్టుకునేందుకు ప్రజలు ఉత్సాహపడుతున్నారు. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా.. తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ!
'శాన్‌ ఫెర్మిన్‌' ఫెస్టివల్
ఇది మన స్టాక్‌ మార్కెట్‌ బుల్‌ కాదు... స్పెయిన్‌లో ఓ పండగ పరుగు. ఓ వైపు వీధుల్లో బుల్‌ పరుగులు.. మరోవైపు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించే ఔత్సాహికుల పండుగ 'శాన్‌ ఫెర్మిన్‌' ఫెస్టివల్‌ నేటి నుంచి ప్రారంభమైంది. పాంపలోనాలో ప్రత్యేకంగా తయారుచేసిన బాణసంచా కాల్చి ఈ బుల్‌ రన్‌ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. వందలాది ఔత్సాహికులు ఏటా జరిగే ఈ బుల్‌ రన్‌లో పాల్గొంటారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బుల్‌ రన్‌ ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకట్టుకుంటోంది.
బుల్‌ రన్‌ను నిషేధించాలంటూ ఆందోళన
ఇదిలా ఉండగా మరోవైపు ఈ బుల్‌ రన్‌ను నిషేధించాలంటూ జంతు సంరక్షణ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఎద్దులను పట్టుకునే క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడుతుండగా... కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఇప్పటి దాకా 15 మంది మృతి చెందారని ఆందోళనకారులు పేర్కొంటున్నారు.

 

19:36 - July 7, 2016

నిజామాబాద్ : ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. దీంతో పార్కులకు వెళ్లి కాసేపు ఒత్తిడి నుంచి బయటపడదామంటే అక్కడ కూడా మనిషికి ప్రశాంతత దూరమవుతోంది. పాడుపడిన బెంచ్‌లు, పిచ్చి మొక్కలు దర్శనిమిస్తూ  వెక్కిరిస్తున్నాయి. నిజామాబాద్‌లో పార్కుల దుస్థితిపై ప్రత్యేక కథనం..
దారుణంగా తయారైన పార్కులు  
నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పార్కులు దారుణంగా తయారయ్యాయి. నగరంలో మొత్తం 111 మున్సిపల్ పార్కులు ఉన్నాయి. సాయంత్రంపూట కాస్త ఆహ్లాదంగా గడుపుదామంటే ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు వృద్ధాగా పడి తుప్పుపట్టిపోతున్నాయి. మరికొన్ని దొంగల బారిన పడుతున్నాయి. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలపాలకు నిలయంగా మారుతున్నాయి. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆట వస్తువులను అధికారులు గాలికి వదిలి పెట్టారు.
మొక్కల పరిస్థితి మరీ దారుణం
పార్కులో నాటిన మొక్కల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చెత్తకుప్పలతో, పిచ్చిమొక్కలతో పార్కులు నగరవాసులకు ఆహ్వానం పలుకుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. దీంతో  స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్క్‌లను శుభ్రపరచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించాలని నగరవాసులు కోరుతున్నారు.  

 

జాకీర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణ

ముంబై : జాకీర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం దేవంద్ర పడ్నవీస్ విచారణకు ఆదేశించారు. వ్యాఖ్యలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాల్సిందిగా ముంబై కమిషనర్ సీఎం పడ్నవీస్ ఆదేశించారు.

వింబుల్డర్ మహిళల డబుల్స్ లో సానియా, హింగిస్ జోడీ ఓటమి

హైదరాబాద్ : వింబుల్డర్ మహిళల డబుల్స్ లో సానియా, హింగిస్ జోడీ ఓటమిపాలయింది. క్వార్టర్స్ లో బాబోస్, స్వేదోవాపై
2..6, 4..6 తేడాతో ఓడిపోయారు.

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్

చిత్తూరు : గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

19:12 - July 7, 2016

హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని కోరానని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి అన్నారు. తనకు అక్రమాస్తులున్నట్టు ఎవరు నిరూపించినా వాటిని అనాధ ఆశ్రమానికి రాసిస్తానని చెప్పారు. కొన్ని యూనియన్లు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో ఆర్టీసీ టీఎంయూ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.

18:52 - July 7, 2016

వరంగల్ : సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. కూలిపోయేస్థితిలో ఉన్న ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులు ప్రాణాలు అరచేతపట్టుకుని  గడుపుతున్నారు. మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక విద్యార్థులు, టీచర్లు అవస్థలు పడుతున్నారు. వరంగల్‌జిల్లాలోని కాలంచెల్లిన స్కూల్‌,కాలేజీ బిల్డింగ్‌లపై టెన్‌టీవీ పోకస్‌...
కాలాపాని కాలేజీ బిల్డింగ్‌లు
ఈ పాతబిల్డింగ్‌లను చూస్తే... కాలాపానిజైలు గోడలు గుర్తుకొస్తున్నాయి కదూ...  ప్రభుత్వ నిర్లక్ష్యానికి  ఇవి అసలు సిసలు ప్రతిరూపాలు. చదువులపై సర్కార్‌కు ఎంతటి శ్రద్ధ ఉందో  పాడుపడిన బిల్డింగ్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
నిజాం కాలంనాటి కాలేజీ బిల్డింగ్‌లు
ఇది హన్మకొండలోని  కాకతీయ కళాశాల. నిజాం కాలంలో కట్టిన చదువుల కోవెల ఇది.  పాలకుల నిర్లక్ష్యంతో  సమస్యలతో కునారిల్లుతోంది.   ఒపుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు... ఇపుడు  ఇలా బూత్‌బంగళాలను తలపిస్తున్నాయి.  ప్రైవేట్‌ చదువులు కొనలేని  పేదవిద్యార్థులు ప్రభుత్వ చదువులపైనే కొండంత ఆశపెట్టుకుని తమ బంగారు భవిష్యత్తును ఊహించుకుంటున్నారీ  ఈపాడుబడిన బిల్డింగ్‌ల్లో. వందల మంది విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  పాఠాలు వింటున్నారిక్కడ.
74ఏళ్లనాటి భవనాల్లోనే నడుస్తున్న కాకతీయకాలేజీ
ఈ  భవనాలు దాదాపు 75ఏళ్ల కిందట నిర్మించినవి. మాజీ ప్రధాని పీవి నర్సింహారావు, ప్రస్తుత తెలంగాణ విద్యామంత్రి కడియం శ్రీహరి చదువుకున్న హన్మకొండలోని కాకతీయ కాలేజీ ఇది. కాని ఏఒక్కరు ఈ కాలేజీ బాగోగులు పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు.  పాతభవనాల్లో చదువులు కష్టంగా ఉన్నాయని.. కొత్త బిల్డింగ్‌లు నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటున్నారు కాలేజే ప్రిన్సిపల్‌. ఇక ఇది ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు నానాఅవస్థలు పడుతున్నారు. మంచినీరు ... మరుగుదొడ్లులేకపోవడం ఇబ్బందిగా ఉందని టీచర్లు అంటున్నారు.

వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరిన సెరెనా

హైదరాబాద్ : సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరింది. వెస్నినాపై 6...2, 6..0 తేడాతో వెస్నినాపై విజయం సాధించింది. సెరెనా 9వ సారి వింబుల్డన్ ఫైనల్ కు చేరింది.

18:38 - July 7, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో గాలి జనార్ధన్ రెడ్డికి అధికారిక మర్యాదలు చేశారు. దర్శనం చేయించి స్వామివారి శేషవస్త్రం కప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. వీఐపీ బ్రేక్ దర్శనంలో గాలి జనార్ధన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. గనుల స్కాంలో జనార్ధన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో గాలి జనార్తన్ రెడ్డికి అధికారిక మర్యాదలు చేయడంతో టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు.

 

సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో విచారణ పూర్తి

హైదరాబాద్ : సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో విచారణ పూర్తి అయింది. వైద్యుల నిర్లక్షక్యం వల్లే 13 మంది కంటి చూపు కోల్పోయినట్లు విచారణలో వెల్లడించారు. సెలైన్ లో తేడా లేదని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

కృష్ణా : విజయవాడలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు నివాసంలో సమావేశం జరుగుతోంది.

జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ లో భారీ ప్రక్షాళన

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ లో భారీ ప్రక్షాళన చేపట్టారు. 15 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ఇద్దరు సిటీ ప్లానర్లు బదిలీ అయ్యారు. కొత్తగా ఆరుగులు సిటీ ప్లానర్లను నియమించారు.  

 

17:49 - July 7, 2016

నల్గొండ : తొలకరి పలకరింతతో పచ్చని గట్ల మీదకు బుడి బుడి అడుగులతో గుంపులు గుంపులుగా వచ్చే మెత్తని ఎర్రని అందమైన ఆరుద్ర పురుగులు అన్నదాతకు ఎంతో మేలు చేస్తాయి. పంట భూముల్లో రోగకారక కీటకాలను తింటూ రైతన్నకు అందమైన నేస్తాలుగా ఉండే ఆరుద్ర పురుగులు ఇప్పుడు అంగడి సరకుగా మారిపోయాయి. డబ్బుకు ఆశపడి రైతులు ఆరుద్ర పురుగులను పొలాల్లోంచి ఏరి.. అమ్మేస్తున్నారు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.
ఆరుద్ర పురుగుల్ని అమ్ముకుంటున్న రైతులు
కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం అంటే ఇదేనేమో...! ఓ వైపు తెగుళ్లు వచ్చి పంటలు నాశనం అవుతున్నాయని ఆక్రోశిస్తున్న రైతన్నలు... ఇలా  పైరుకువచ్చే చీడపీడల్ని అడ్డుకునే మిత్రపురుగుల్ని దూరం చేసుకుంటున్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి.. ఆరుద్ర పురుగులను అమ్మేస్తున్నారు.  డబ్బులు ఎరజూపి  పొలాల్లోని మిత్రకీటకాలపై లక్షలు సంపాదిస్తున్నారు వ్యాపారులు.
ఆరుద్రకార్తెలో మాత్రమే కనిపించే ఆరుద్రపురుగులు
తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే ..చల్లచల్లగా పడుతున్న చిరుజల్లులకు చెలకల్లో ఎర్రగామెరుస్తాయి ఆరుద్రపురుగులు. ఇవి ఆరుద్రకార్తెలో మాత్రమే కనిపిస్తాయి కనుక  ఈ చిన్నిప్రాణులను ఆరుద్రలని పిలుస్తారు. ఇవి ఇలా చెలకల్లో పనిపాటాలేకుండా తిరగవు. రైతు వ్యవసాయానికి పొలాన్ని సిద్ధం చేస్తుంటే.. ఈ ఆరుద్రపురుగులు రోగకారక  కీటకాలను,గుడ్లను తినేస్తాయి. అలా  పైరు పెరిగిన తర్వాత వచ్చే చీడపీడలను ముందుగానే ఆరుద్రపురుగులు అడ్డుకుంటాయి.అందుకే వ్యవసాయ పొలంలో ఆరుద్రలు కనిపిస్తే రైతులు శుభసూచకంగా భావిస్తారు.
ఆరుద్రపురుగులపై వ్యాపారుల కన్ను
రైతులకు మేలుచేసే ఈ చిన్నిప్రాణులపై వ్యాపారుల కన్నుపడింది. పంటపొలాల్లో కలియదిరిగుతూ... వీటిని సేరించి వ్యాపారులకు అమ్ముకుంటున్నారు కొందరు గ్రామస్తులు.    తెల్లవారే ముందుగా చల్లని వాతావరణంలో ఈ ఆరుద్రలు చెలకల్లో తిరుగుతుంటాయి. అదే సమయంలో ఇలా మునుంపట్టి మరీ ఏరిసంచుల్లోకి వేస్తున్నారు. ఉదయం  11గంటల్లోపై ఒక్కొక్కరు రెండు కేజీలవరకు పురుగుల్ని ఏరుతున్నారు. కొద్ది గంట్లోనే వెయ్యిరూపాయలకు పైగా సంపాదిస్తున్నారు కూలీలు. నల్లగొండజిల్లా భువనగిరి,  ఆలేరు, రాజపేట, వలిగొండ, గుండాల ప్రాంతాల్లో ఆరుద్రపురుగుల వ్యాపారం జోరుగా సాగుతోంది.  ఇలా సేకరించిన ఆరుద్రపురుగులు కేజీకి 9వందల నుంచి వెయ్యిరూపాయలు ఇచ్చిమరీ వ్యాపారులు కొంటున్నారు.
హైదరాబాద్‌కు తరలింపు
ఇలా సేకరించిన ఆరుద్రపురుగుల్ని మొదట వేడినీటిలో ఉడికించి.. ఆరబెడుతున్నారు. అక్కడ నుంచి ఒకేసారి 5నుంచి 10కేజీల చొప్పున ప్లాస్టిక్‌  కవర్లలో పార్సిల్‌చేసి హైదరబాద్‌ పాతబస్తీలోని స్మగ్లర్లకు పంపిస్తున్నారు.  అక్కడ నుంచి ఈ ఆరుద్రపురుగుల్ని ... కొందరు ఏజెంట్లు ఖతార్‌, యెమెన్‌, మాల్దీవులు, దుబాయి్‌లకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ వీటిని కాస్మెటిక్స్‌, హెర్బల్‌నూనెల తయారీలోనూ.. ముఖ్యంగా దగ్గుమందుల తయారీలో  వాడుతున్నారట. అంతేకాదు అరబ్‌ దేశాల్లో వీటిని పాన్‌మసాలాల తయారీలో కూడా ఉపయోగిస్తుండటంతో ఆరుద్రలకు గిరాకీ పెరిగిపోయింది.  
ఆరుద్రపురుగులను ఏరివేస్తే పర్యావరణానికి చేటు
ఇంతపెద్దమొత్తంలో ఆరుద్రపురుగుల్ని ఏరివేస్తే పర్యావరణానికి చేటు చేసినట్టే అవుతుందంటున్నారు వ్యవసాయ అధికారులు. ఆరుద్రపురుగుల వ్యాపారాన్ని అడ్డుకోడానికి  చట్టాలు లేవని చెబుతున్నారు. దీనిపై రైతులే అవగాహన చేసుకుని.. ఆరుద్రపురుగల్ని కాపాడుకోవాలంటున్నారు. వ్యాపారులు ఇస్తున్న డబ్బులకు ఆశపడి... మిత్రపురగులను దూరం చేసుకోవద్దని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆరుద్రపురుగుల వ్యాపారాన్ని అడ్డుకుని  రైతులే తమ పంటపొలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

 

సల్మాన్ కు మహిళా కమిషన్ మళ్లీ సమన్లు..

ముంబై : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర మహిళా కమిషన్ మళ్లీ సమన్లు పంపింది. ఇలాంటి సమన్లు పంపడం మూడోసారి అని ఎంఎస్ డబ్ల్యూసి ఛైర్ పర్సన్ పేర్కొన్నారు. 

పీఎస్ లో మహిళ ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : మైలార్ దేవులపల్లి పీఎస్ లో స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మిగూడలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్ పెక్టర్ సురేందర్ ఇంట్లో కిరాయికి ఉన్న స్వప్నను ఖాళీ చేయాలని ఇద్దరు దాడికి పాల్పడ్డారు. పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీనితో పురుగుల మందు తాగి స్వప్న ఆత్మహత్యాయత్నం చేసింది. 

17:14 - July 7, 2016

గుంటూరు : ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గవర్నర్‌ నరసింహన్ సహకరించాలని ఎపి డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి కోరారు. వెలగపూడిలో సచివాలయ పనులను ఆయన పరిశీలించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులపై కేఈ సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లోగా పనులు పూర్తవుతాయన్నారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు అన్నీ వస్తే పనులన్నీ త్వరగా పూర్తవుతాయని చెప్పారు.

 

శ్రీవారి ఆలయంలో 'గాలి' దర్శనం..దుమారం..

చిత్తూరు : శ్రీవారి ఆలయంలో గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం దుమారం రేగింది. ఓబుళాపురం గనుల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డికి ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి స్వామివారి శేషవస్త్రం కప్పడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. 

17:08 - July 7, 2016

హైదరాబాద్‌ : ఇల్లు ఖాళీ చేయాలని దాడికి పాల్పడడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానాకి పాల్పడింది. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లోని జీహెచ్‌ఎంసీ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ ఇంట్లో స్వప్న అనే మహిళ కిరాయికి ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేయాలని దాడి చేశారు. దీనిపై మైలార్‌ దేవ్‌పల్లి పీఎస్‌ లో ఫిర్యాదు చేసేందుకు స్వప్న వెళ్లగా.. పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన స్వప్న... పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల తేదీల ఖరారు..

హైదరాబాద్ : కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల తేదీలను తెలంగాణ పోలీసు నియమాక సంస్థ ప్రకటించింది. ఈనెల 15-ఆగస్టు 6 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 29 నుండి ఆగస్టు 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. 

ఆరోపణలు ఖండించిన అశ్వత్థామరెడ్డి..

హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలను టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలేనని, కొన్ని యూనియన్లు టీఎంయూపై తనపై బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. అక్రమ ఆస్తులున్నట్లు నిరూపిస్తే అనాథశ్రమానికి రాసిస్తానని సవాల్ విసిరారు. తనపై విచారణ జరిపించాలని యాజమాన్యాన్ని కోరుతున్నట్లు వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోరారు. తన ఉద్యమ జీవితం..ఉద్యోగ జీవితం తెరిచిన పుస్తకమన్నారు. టీఎంయూ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, టీఎంయూతోనే ఆర్టీసీ కార్మికులకు మేలు జరుగుతుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

 

కందిపప్పు దిగుమతి వల్ల మొజాంబిక్ రైతులకు లాభం - మోడీ..

ఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొజాంబిక్ రాజధాని మొపుటో లో పర్యటిస్తున్నారు. మొజాంబిక్ తో కీలక ఒప్పందాలపై మోడీ సంతకం చేశారు. కందిపప్పు దిగుమతిపై ప్రధాని మాట్లాడారు. కందిపప్పు దిగుమతి చేసుకోవడం వల్ల మొజాంబిక్ రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. అంతేగాకుండా భారత ప్రజల అవసరాలు తీరుతాయని, తీవ్రవాదం వల్ల ప్రపంచానికి నష్టమన్నారు. 

17:00 - July 7, 2016

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర  ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతురాలు సింథియా బంధువులు  
పోలీసులతో  వాగ్వాదానికి దిగారు. నిందితుడు రూపేశ్‌ను  ఉరితీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  బాలిక సానియాను తమకు అప్పగించాలని  రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫ్‌క్‌ నిలిచిపోయింది.

16:58 - July 7, 2016

కృష్ణా : విజయవాడలో చంద్రబాబు ఇంట్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. పార్టీ బలోపేతం, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అక్రమాలు జరగలేదన్న.. విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చ జరుగుతోంది. సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో పాటు... నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.

 

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన షారూఖ్..

ముంబై : ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఉదయం ఆయన నివాసానికి వచ్చిన అభిమానులకు షారూఖ్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఎమ్మెల్యే కుమారుడు సిద్ధార్థ్ కు పోలీసు కస్టడీ..

జైపూర్ : స్వతంత్ర ఎమ్మెల్యే నంద కిషోర్ కుమారుడు సిద్దార్థ్ కు ఒక రోజు పోలీసు కస్టడీ విధించారు. జైపూర్ లో బీఎండబ్ల్యూ కారును నడిపిన సిద్దార్థ్ ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

16:37 - July 7, 2016

నగ్న ఫొటోలు ఉన్నాయని భయపెట్టాడు..పెళ్లై కొడుకున్నా ఆకతాయి వేషాలు మానలేదు..మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా..అయితే జర భద్రం..మీ కంట్లో వత్తులు వేసుకుని మీ కంటి పాపలను మీరే కాపాడుకోండి..ఏ మాత్రం ఆలస్యం చేసినా ఏ మానవ మృగమో మీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయొచ్చు..

గంటలు..రోజులు కాదు..అంతా నిమిషాల్లోనే..కలలో కూడా ఊహించని ఘటనలు నిత్య జీవితంలో జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్లు మారడం లేదు. నిర్భయ చట్టం నీరుగారిపోతోంది. ఉరిశిక్షలు దుర్మార్గులను బెదిరించలేకపోతున్నాయి. పశువాంఛలు తీర్చుకోవడానికి మానవత్వం మరిచిపోయి రాక్షసుల్లా ప్రవర్తిసున్నారు. నెల్లూరు జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఓ వివాహితుడు వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ మృగాడు మారలేదు. అమ్మాయి లొంగకపోవడంతో కొత్త ఎత్తుగడ వేశాడు. చివరకు బాధితురాలి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీని గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:36 - July 7, 2016

హైదరాబాద్ : సెంటిమెంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..మరో యాగానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో యాగం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి యాగాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై పౌరోహితులతో సీఎం కేసీఆర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
మరో యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం  
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా..వ్యక్తిగత సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్‌..మరోసారి అదే బాటను ఎంచుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం ఆయుత ఛంఢీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌..మరో యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఆయుత చండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌..త్వరలో నిర్ణయించే యాగాన్ని కూడా అదే స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సుదర్శన యాగం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత వ్యవసాయ క్షేత్రంలోనే సుదర్శన యాగం పేరుతో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో యాగాన్ని చేయబోతున్నట్లు నిర్ణయించినట్లు సమాచారం. ఈ యాగాన్ని ఒక రోజు నుంచి   మూడు లేదా ఐదు రోజులు కూడా యాగాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  కనీసం మూడు రోజుల పాటు సుదర్శన యాగాన్ని సీఎం నిర్వహించే అవకాశం ఉందని ఉందని పార్టీ నేతలు అంటున్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం
లోక కళ్యాణం కోసం ఆయుత చండీయాగం నిర్వహించానని చెప్పుకున్న కేసీఆర్‌..యాగం తర్వాత అన్ని అనుకూల ఫలితాలే అందాయని పార్టీ నేతలు అంటున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా పార్టీ  ఊహించని మెజార్టీని దక్కించుకుంది. మరో వైపు ప్రభుత్వానికి ఎక్కడా ఇబ్బందులు ఎదురు కాలేదన్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహించే యాగంతో కూడా తెలంగాణాతో పాటు..ముఖ్యమంత్రికి అన్ని రకాలుగా కలిసి వస్తుందన్న ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా పుష్కరాలు తర్వాత
యాగానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి తేదీలు ఖరారు కాలేదు. అయితే ఆగస్టు నెలలో కృష్ణా పుష్కరాలు ఉన్న నేపథ్యంలో పుష్కరాల తర్వాతే సుదర్శన యాగం తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

16:31 - July 7, 2016

కరీంనగర్ : అంతన్నారు... ఇంతన్నారు... ఏదేదో చేస్తామన్నారు.. తీరా అధికారంలోకివచ్చాక రూట్ మార్చారు..... ట్రెండ్‌ సెట్‌ చేస్తామన్నవాళ్లు ట్రెండ్‌ ఫాలో అయిపోతున్నారు.. నేదునూరు ప్రాజెక్టు విషయంలో టీఆర్‌ఎస్‌ తీరుపై వస్తున్న విమర్శలివి.. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు దాటినా ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలిలాగానే ఉంది.. ఆరేళ్లక్రితం ప్రారంభమైనా ఇంతవరకూ నిర్మాణానికి నోచుకోని నేదునూరు ప్లాంట్‌పై స్పెషల్ ఫోకస్..
గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రణాళికలు
కరెంటు కొరతను అధికమించేందుకు 2006లో అప్పటి ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నేదునూరులో ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకుసంబంధించిన పనులన్నీ పుర్తిచేసేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ప్లాంట్ నిర్మాణానికి 432 ఎకరాల భూమి కేటాయింపు
ఈ ప్లాంట్ నిర్మాణానికి సర్కారు 432 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. తమ పొలాలు, భూములు ఇవ్వమని రైతులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.. పచ్చని పొలాల్ని ప్రాజెక్టుకోసం లాగేసుకుంది. నిర్వాసితులకు ఎన్నో హామీలిచ్చింది. ఆ తర్వాత ప్రాజెక్టు మొదటి దశలో 700 మెగావాట్లు... మరో రెండుదశల్లో 2వేల 100 మెగావాట్ల సామర్థ్యంగల కరెంట్‌ ఉత్పత్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.. 700 మెగావాట్ల విద్యుత్ తయారీకోసం రోజుకు 3.24 మిలియన్‌ ఘనపు మీటర్లు... 2వేల 100 మెగావాట్లకు దాదాపు 9మిలియన్‌ ఘనపు మీటర్ల గ్యాస్ అవసరమవుతుందని అంచనావేశారు.. ఇక్కడి నీటి అవసరాలకోసం లోయర్‌ మానేరు డ్యాంనుంచి నీటిని తీసుకునేలా ప్రణాళికకూడా సిద్ధమైంది.. మొత్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 3 వేల 336 కోట్లు ఖర్చవుతుందని లెక్కలుకట్టారు.. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మూడేళ్లలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు ఆరేళ్లయినా అడుగుకూడా ముందుకు పడలేదు.

 

16:29 - July 7, 2016

భర్త చనిపోయిన దు:ఖంలో ఇల్లాలు..ఆస్తి తన పేరిట రాయాలని బెదిరింపులు..పోలీసులకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్..

ఓ వైపు పోలీసు బాస్ లు యాక్షన్ తీసుకుంటుండగానే నిద్రావస్థలో ఉన్నారా అంటూ మహిళా లోకం నినదిస్తోంది. అన్యాయం జరుగుతోందని..రక్షణ కల్పించాలంటూ ఓ అబల పోలీసుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనితో నాలుగు గోడల మధ్య బందీ అయిన ఆ ఇల్లాలు గడప దాటింది. పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ గళం విప్పింది. తన భర్త చనిపోయిన అనంతరం తన మరిది వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇందుకు తన అత్త..ఆడపడుచు కూడా వేధిస్తున్నారని బాధితురాలి పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈమెకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. మిగతా వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

16:28 - July 7, 2016

అవినీతి అక్రమార్కులపై సీరియస్..ప్రక్షాళన కొనసాగిస్తున్న కమిషనర్..యోగానంద్ యాక్షన్ తో కాప్స్ లో వణుకు..వస్తూనే అవినీతి జాబితా తయారు చేశారు. అన్యాయం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరాలు ఆరా తీసి ఇంటికి పంపేశారు.

ఇప్పటికే ఏసీపీ కూడా అక్రమార్కుల జాబితాతో పాటు ఆదాయం సమకూర్చుకునే వారిపై నిఘా పెట్టారు. ఉక్కు నగరం కాప్స్ కు పోలీసు బాస్ లు వణుకు తెప్పిస్తున్నారు. గడిచిన నెల రోజులుగా పోలీసులు పరేషాన్ లో పడిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుంది ? ఎవరిపై వేటు పడుతుంది ? ఆందోళనలో ఉండగానే 25 మంది ఇన్స్ పెక్టర్ లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే విశాఖ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ యోగానంద్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిననాటి నుండి ప్రక్షాణలో పడిపోయారు. అవినీతి..అక్రమార్కులపై వేటు వేస్తున్నారు. తాజాగా బదిలీలోని ఓ ఇన్స్ పెక్టర్ ధనుంజయ్ వీడీయో ఫుటేజ్ లతో బాధితులు కమిషనర్ కార్యాలయానికి క్యూ కట్టారు. దీని గురించి మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34.62 పాయింట్లు లాభపడి 27,20.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 8,342.95 వద్ద ముగిసింది. 

వెస్టిండీస్ కు చేరుకున్న టీమిండియా..

వెస్టిండీస్ : టీమిండియా వెస్టిండీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. వెస్టిండీస్‌లో విమానాశ్ర‌యంలో టీమిండియా ఆట‌గాళ్ల‌తో తాను దిగిన ఫోటోను ఆయ‌న పోస్ట్ చేశారు.

టి.సర్కార్ పై జైపాల్ ఆగ్రహం..

హైదరాబాద్ : 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు ప‌ర‌చ‌క‌పోతే ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారంగా కాకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తోందని పలు విమర్శలు గుప్పించారు.

16:16 - July 7, 2016

శ్రీకాకుళం : గతంలో సోంపేట, కాకరాపల్లి థరల్మ్‌ విద్యుత్‌ కేంద్రాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన తరహాలోనే ఇప్పుడు పోలాకిలో ఉద్యమం ఊపందుకుంది. తమ బతుకులను బుగ్గిపాలు చేసే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్దంటూ ప్రజలు నినదిస్తున్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కోసం భూసేకరణకు వస్తున్న పోలీసు, రెవిన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పోలాకి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా  నిరసనతెలుపుతున్న 60 మంది పోలీసులు ఇప్పటికే ఆరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

16:00 - July 7, 2016

విజయవాడ : అన్ని రంగాల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ విమర్శించారు. విజయవాడలో అయన మీడియాతో మాట్లాడారు. ఎన్ డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని అన్నారు. కేంద్ర మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని చెప్పారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించడంతో మోడీ విఫలం అయ్యారని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో 7.47 శాతం ఖాళీలు ఉన్నాయని... ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాగ్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ , డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలన్నారు. నిరుద్యోగం, ఆహార పధార్థాల ధరల పెరుగుదలపై పార్టీ ఆధ్వర్యంంలో దేశవ్యాప్తంగా జాతీయ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు తెలిపారు.

 

విభజన చట్టం హామీలు నెరవేర్చాలి - దిగ్విజయ్..

విశాఖపట్టణం: విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకు కాంగ్రెస్‌ పోరాడుతుందని, బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో ఘనులని ఎద్దేవా చేశారు.

లోకేష్ అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ..

విజయవాడ : టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకోష్ అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చ, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. 

15:49 - July 7, 2016

ఖమ్మం : ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా పాల్యంచలో ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇందిరాకాలనీ వద్ద ఉన్న ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు ప్రపంచ శాంతి వర్థిలాల్లి అంటూ ఫ్లకార్డులు పట్టుకుని స్థానిక సబ్‌కలెక్టర్ వరకు ర్యాలీగా బయలుదేరారు.

15:46 - July 7, 2016

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని కేఫ్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ఎన్‌ఎస్‌జి బృందం పరిశీలించనుంది. నలుగురు వ్యక్తులతో కూడిన ఎన్‌ఎస్‌జి బృందం రేపు ఢాకాకు వెళ్లనుంది. గుల్షన్‌లోని హోలి అర్టిసన్‌ బేకరీపై జరిపిన దాడిలో ఉగ్రవాదులు పేలుడుకు ఉపయోగించిన పదార్థాలను కనుగొంటారు. దాడి జరిగిన తీరును కూడా ఎన్‌ఎస్‌జి బృందం పరిశీలించనుంది. ఢాకాలోని గుల్షన్‌ కేఫ్‌లో గత శుక్రవారం ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను ఊచకోత కోశారు. మృతుల్లో భారతీయ యువతి తారిష్‌ జైన్‌ కూడా ఉన్నారు.

 

మొజాంబిక్ లో మోడీ..

ఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొజాంబిక్ రాజధాని మొపుటో లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకున్నారు. మొజాంబిక్‌ రాజధాని మొపుటోలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని... సాయంత్రం దక్షిణాఫ్రికా వెళుతారు. రెండు రోజుపాటు ప్రిటోరియా, జొహెన్నస్‌బర్గ్‌, డర్బన్‌, పీటర్‌మారిట్జ్‌ బర్గ్‌ల్లో పర్యటిస్తారు.

15:44 - July 7, 2016

అనంతపురం : హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్రపన్నిన ఉగ్రవాదులకు అనంతపురంతో లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నకిలీనోట్ల కేసులో పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో నిఘాసంస్థలు ఉగ్రవాదుల జాడలు పసిగట్టాయి.
అనంతపురంలో ఐసిస్‌ ఉగ్రవాదులు నివాసం
హైదరాబాద్‌లో దాడులకు ప్లాన్‌చేసిన ఐసిస్‌ ఉగ్రవాదులు అనంతపురం పట్టణానికి చెందిన ఈ లాడ్జ్‌లోనే బసచేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటిదాకా ఫ్యాక్షన్‌ కక్షలకే పరిమితం అనుకున్న అనంతజిల్లాలో తాజాగా ఉగ్రవాదుల జాడలు  బయపడటంతో జిల్లాప్రజలు ఉలిక్కిపడ్డారు.
మారుపేరుతో ఐడీప్రూఫ్ చూపించి లాడ్జ్‌లో బస
ఎన్‌ఐఏ దర్యాప్తులో భాగంగా కస్టడీలో ఉన్న ఇబ్రహీంను అనంతపురానికి రహస్యంగా తీసుకొచ్చి విచారణ చేసినట్టు తెలుస్తోంది. రిజ్వాన్‌గా మారుపేరుతో ఐడీప్రూఫ్ చూపించి ఈ లాడ్జ్‌లో బసచేసినట్టు అధికారులు గుర్తించారు. ఆయుధాలు, పేలుడుపదార్థాల  కోసమే అనంతలో తిష్టవేసినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. జిల్లాలో మైనింగ్‌ క్వారీలు ఎక్కువగా ఉండటంతో..  వాటి నుంచి జిలెటెన్‌స్టిక్స్‌ను సంపాదించడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇదంతా.. దొంగ నోట్ల కేసులో దొరికిపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే బయటపడినట్టు సమాచరాం. ఉగ్రవాదులు తమ లాడ్జ్‌లోనే ఉన్నారని తేలడంతో... లాడ్జ్‌సిబ్బంది ఒణికిపోతున్నారు. సమస్య ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు.
ఉగ్రవాదులకు సెల్టర్‌జోన్‌గా అనంతపురం జిల్లా ..?
మరోవైపు జిల్లాల్లో సిమీఉగ్రవాదుల జాడలుకూడా మూడునెలల కిందటనే బయటపడటం... తాజాగా ఐసిస్‌ ఉగ్రనీడలు కూడా  ఉన్నట్టు తేలడంతో అనంతపురం జిల్లాను ముష్కరులు సెల్టర్‌జోన్‌ గా వాడుకుంటున్నట్టు జాతీయనిఘా సంస్థలు  అనుమానిస్తున్నాయి.

 

15:37 - July 7, 2016

మెదక్ : రంజాన్‌ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలోని స్థానిక ఈద్గాదర్గాలో ముస్లింసోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే మైనార్టీల కోసం 121 రెసిడెన్సియల్‌ పాఠశాలలు ప్రారంభించామని ఆయన చెప్పారు.

 

15:34 - July 7, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని ఐష్‌బాగ్‌ ఈద్గాలోనికి మహిళలను అనుమతించడాన్ని భూమాత బ్రిగేడ్‌ ఉద్యమకర్త తృప్తి దేశాయ్‌ స్వాగతించారు. రంజాన్‌ పండగ వేళ మహిళలను అనుమతించడం చారిత్రకంగా గొప్ప మార్పని ఆమె అభివర్ణించారు. లక్నోలోని దర్గాల్లోకి మహిళలను అనుమతించడం ఇదే తొలిసారి. దర్గాలో మహిళలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆలయాలు, మసీదులు, దర్గాల్లోకి మహిళలను అనుమతించడం ద్వారా సమాన హక్కు కల్పించాలని తృప్తి డిమాండ్‌ చేశారు. మహిళల కోసం తాము చేస్తున్న ఉద్యమం త్వరలోనే విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

 

15 మంది వైసీపీ నేతలు టిడిపిలోకి - జలీల్..

విజయవాడ : త్వరలో మరో 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. జగన్ ఏ నాడు ముస్లింల గురించి ఆలోచించలేదని, మైనార్టీల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తోందన్నారు. 

షాహనాజ్ ఇంటికి వెళ్లిన అద్వానీ..రాజ్ నాథ్..

ఢిల్లీ : బీజేపీ కురువృద్ధ నేత అద్వానీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు షాహనాజ్ ఇంటికి వెళ్లారు. రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన వేడుకల్లో వీరు పాల్గొన్నారు.

రేపటి నుండే గడపగడపకు వైసీపీ - బోత్స..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌తీ ఇంటి గడపగడపకూ వెళ్లే కార్యక్రమం రేపటి నుండి శ్రీ‌కారం చుడ‌తామని ఆ పార్టీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డ‌తారని అన్నారు.

కట్టడాల కూల్చివేత..చెవిరెడ్డి అరెస్టు...

చిత్తూరు: తిరుపతి గ్రామీణ మండలం పేరూరులో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు కూల్చేందుకు ప్రయత్నించారు. కట్టడాల కూల్చివేతను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అనంతరం చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

14:51 - July 7, 2016

ఏ దర్శకుడైనా ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా ట్రాక్ ఎక్కించేస్తాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా ట్రాక్ మీదుండగానే.. రెండు మూడు సినిమాల్ని హోల్డ్ లో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు దర్శకులు. ఎక్కువగా పీనియర్ దర్శకులు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. అలా రెండు మూడు సినిమాల్ని లైన్ లో ఉంచుకొని జోరు మీదున్న టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులపై కథనం..రామ్‌గోపాల్ వర్మ డిక్షనరీలో ఖాళీ అనే పదానికి చోటు లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ పర్సనల్ థియేటర్‌లో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఆడుతుంటాయి. స్క్రిప్ట్ వర్క్‌లో ఒకటి, సెట్స్‌పై మరొకటి, రిలీజ్‌కి రెడీగా ఉన్నదొకటి, ప్రకటనలకు పరిమితమైన సినిమా ఇంకొకటి!

రాంగోపాల్ వర్మ..
వర్మ ఏం చేసినా సంచలనమే. వంగవీటి రంగా జీవితం ఆధారంగా 'వంగవీటి' తీస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు బాగా ఇష్టమైన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్‌లో తీసిన 'రాయ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, వర్మ దర్శకత్వంలో సచిన్ జోషీ, మీరా చోప్రా జంటగా నటించిన 'మొగలిపువ్వు' ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లు విడుదలై చాలా రోజులైంది. అలాగే రాజశేఖర్‌తో 'పట్టపగలు' అనే హారర్ సినిమా తీశారు. ఈ రెండు చిత్రాల విడుదల ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. సెట్స్ మీద ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయని టాక్.

కృష్ణవంశీ..
సినిమా హిట్టయితే దర్శకుణ్ణి భేష్ అంటారు. ఫట్టయితే వేస్ట్ అంటారు. కానీ, కృష్ణవంశీ విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరుగుతుంది. ఆయన సినిమా ఫట్టయినా.. అందులో మాట్లాడుకోవడానికి నాలుగు మంచి మాటలుంటాయ్. కృష్ణవంశీ క్రియేటివిటీ అలాంటిది. మాములుగా కృష్ణవంశీ సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. కానీ, ఈసారి గేర్ రివర్స్‌లో ఉంది. ఆయన కూడా జోరు మీద ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా 'నక్షత్రం' తీస్తున్నారు. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా 'రైతు' సినిమా చేస్తారు. ఇది బాలకృష్ణకు 101వ సినిమా అవుతుంది.

పూరి..
లోడ్ చేసిన గన్, పూరి జగన్నాథ్ బ్రెయిన్ ఒక్కటే. సినిమాలో మాటల తూటాలు పేల్చడమే కాదు, ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ప్రస్తుతం 'మహాత్మ' చిత్ర నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న 'రోగ్' చిత్రీకరణ పూర్తి చేశారు పూరి వెంటనే నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా 'ఇజం' మొదలుపెట్టేశారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభిస్తారు. ఇటీవలే కథ కూడా వినిపించారు. నందమూరి బ్రదర్స్ తర్వాత మహేష్‌బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నట్లు టాక్. దానికి 'జన గణ మణ' అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఎప్పటిలానే పూరి జోరు మీద ఉన్నారు.

గౌతమ్ మీనన్..
గౌతమ్ మీనన్‌ది కూడా వర్మ స్టైలే. ఓ సినిమా షూటింగ్‌కి ఎండ్ కార్డ్ వేయకముందే మరో సినిమాకి క్లాప్ బోర్డ్ రెడీ చేసేస్తారు. అజిత్‌తో తీసిన 'ఎన్నై అరిందాల్' విడుదలకు సిద్ధమైన సమయంలోనే నాగ చైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ప్రారంభించారు. ఈ కథనే తమిళంలో శింబు హీరోగా తీశారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మధ్యలో ఈ సినిమా షూటింగ్ లేట్ కావడంతో తమిళ చిత్రం 'ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా' కథ సిద్ధం చేశారు. ఇందులో ధనుష్ హీరో. రానా దగ్గుబాటి కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు హీరో సాయిధరమ్ తేజ్, తమిళ హీరో 'జయం' రవి, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, మలయాళ హీరో పృథ్వీరాజ్‌లతో ఈ మల్టీస్టారర్ మూవీ తీయాలనుకుంటున్నారట. అనుష్క, తమన్నాలను కథానాయికలుగా అనుకుంటున్నారని టాక్. సో... గౌతమ్ మీనన్ కూడా ఫుల్ బిజీ.

కొరటాల శివ..
కమర్షియల్ కథలకు సందేశాత్మక సొబగులు అద్ది సినిమా తీయడం దర్శకుడు కొరటాల శివ స్పెషాలిటీ. స్వతహాగా రచయిత కావడంతో ‘మిర్చి’, 'శ్రీమంతుడు’ సినిమాల్లో హీరోయిజం, సందేశం, వినోదం, భావోద్వేగాలు అన్నిటినీ మేళవించి ప్రేక్షకులకు విందు భోజనం పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తారు. ‘శ్రీమంతుడు’ కంటే ముందే చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో కొరటాల ఓ సినిమా చేయాల్సింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆ సినిమా ఆగింది. మళ్లీ ఈ కాంబినేషన్ కుదిరింది. మొత్తం మీద ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ, గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు కొరటాల శివ.

మురుగుదాస్..
విభిన్న కథాంశాలతో మంచి మాస్ మూవీస్ తీసే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్. ఆయన తీసే అన్ని చిత్రాల కథలూ డిఫరెంట్‌గా ఊంటాయి. మరి.. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో కానీ, ఒక సినిమా చేసేటప్పుడే మరో డిఫరెంట్ స్టోరీ రెడీ చేసేస్తాడు. హిందీలో సోనాక్షీ సిన్హా కథానాయికగా ‘అకిరా’ సినిమా చేశాడు మురుగదాస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. మహేశ్‌బాబు హీరోగా భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రం షూటింగ్
ఆరంభం కానుంది. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాకుండానే అంచనాల్ని విపరీతంగా పెంచేస్తోంది. డిఫరెంట్ మేకోవర్ లో మహేష్ బాబును ప్రెజెంట్ చేయబోతున్నాడు మురుగదాస్.

వీవీ వినాయక్..
చిరంజీవి 150వ చిత్రంతో వీవీ వినాయక్ ఫుల్ బిజీ. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తండ్రితో సినిమా పూర్తయ్యాక వినాయక్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ చిత్రం షూటింగ్‌లో సురేందర్‌రెడ్డి నిమగ్నమై ఉన్నారు. ఇటీవల నితిన్‌తో త్రివిక్రమ్ ‘అఆ’ వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి సినిమా పవన్ కల్యాణ్‌తో చేస్తారని వినికిడి. ‘సరైనోడు’ వంటి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నారు.
ఒక సినిమా విడుదల కాకుండానే ఆ దర్శకుడి కేలిబర్ ని , కేపబిలిటీని బట్టి ఇంకో రెండు మూడు సినిమాలు ఆటో మెటిగ్గా ట్రాక్ మీదకి వచ్చేస్తాయి. ప్రస్తుతం సీనియర్ దర్శకులు ఈ తరహాలో జోరుమీద దూసుకుపోతున్నారు. 

14:34 - July 7, 2016

ఇటీవలు పలు వుడ్ లో సినిమాలు సక్సెస్ కాగానే హీరో..హీరోయిన్ వాడిన వస్తువులు వేలం వేస్తుంటారు. ఇలా వచ్చిన డబ్బును కొంతమంది సమాజ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. బాలీవుడ్ లో కూడా వేలం వేస్తుండడం పరిపాటిగా మారింది. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు ధరించిన లంగోట్ ను వేలం వేయనున్నారంట. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్' రంజాన్ కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో సల్మాన్ కుస్తీ వీరుడిగా నటించాడు. గ్లామర్ క్వీన్ అనుష్క శర్మ కూడా రెజ్లర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకుంది. ఈ చిత్రంలో స‌ల్లూ ధ‌రించే లంగోటాని ఫ్యాష‌న్‌గా ఢిల్లీ నుంచి ప్ర‌త్యేకంగా కుట్టించిన‌ట్లు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జ‌ఫ‌ర్ స‌ల్మాన్ వెల్ల‌డించాడు. సల్మాన్ శ‌రీరాకృతిని పూర్తిగా ఈ చిత్రంలో చూపించాల‌నుకున్నామ‌ని అందుకు ఈ లంగోటా ఎంతో ఉప‌యోగ‌ప‌డింద‌ని పేర్కొన్నారు. ఈ లంగోటాని వేలం వేయాల్సి వస్తే 100 కోట్లకు తక్కువకు ఇవ్వమని అలీ అబ్బాస్ వెల్లడించారు. మరి ఈ లంగోటాను వేలం పెడితే అంత ధర పెట్టి కొంటారా ? అనేది చూడాలి. 

హత్యకు గురైన సింథియా బంధువుల ఆందోళన..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద హత్యకు గురైన కాంగో దేశస్థురాలు సింథియా బంధువులు ఆందోళన చేపట్టారు. సింథియాను హత్య చేసిన భర్తను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సింథియా కూతురు సానియాను తమకు అప్పగించాలని పోలీసులతో బంధువులు వాగ్వాదానికి దిగారు. 

దుర్గగుడి నూతన ఈవోగా...

విజయవాడ : దుర్గగుడి నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి కార్యక్రమాలను ఈవో పరిశీలించారు. 

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్..

విశాఖపట్టణం : జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. దిగ్విజయ్ సింగ్, పీసీసీ చీఫ్ రఘువీరా పాల్గొన్నారు. మత రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకిస్తామని, జాకీర్ నాయక్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు రుజువైతే కేంద్రం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. కొవ్వాడలో ఏర్పాటు చేస్తున్న అణు విద్యుత్ ప్లాంట్ ను భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. దేశానికి న్యూక్లియర్ ఎంతో అవసరమని, బాక్సైట్ కంపెనీలతో చంద్రబాబు ఎన్ని కోట్ల ముడుపులు తీసుకున్నారని ప్రశ్నించారు. 

గోల్కొండలో బోనాలు ప్రారంభం..

హైదరాబాద్ : ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గోల్కొండలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లమ్మకు ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ లు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. 

గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గా..

గుంటూరు : మార్కెట్ యార్డు ఛైర్మన్ గా టిడిపి నేత మన్నన సుబ్బారావు పేరు ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 19 మంది డైరెక్టర్ల ఖరారుపై కసరత్తు జరుగుతోంది. డైరెక్టర్ పదవుల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

13:37 - July 7, 2016

కృష్ణ : కృష్ణాజిల్లాలో పరువుహత్య కలకలరేపింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని కన్నకూతురిని హత్యచేసింది ఓతల్లి. నందిగామ మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన బీబీజాన్‌ తన కూతురు నజ్మాతో కలిసి విజయవాడలో ఉంటోంది. వాంబేకాలనీకి చెందిన ప్రదీప్‌తో నజ్మా ప్రేమలో పడింది. దీనిపై కూతురిని హెచ్చరించింది తల్లి బీబీజాన్‌. అయితే ఎంతచెప్పినా కూతురు వినిపించుకోలేదని దిండుతో ఊపిరాడకుండాచేసి హత్యచేసినట్టు గ్రామస్తులు చెప్పారు. కూతురిని చంపిన తర్వాతఅనారోగ్యంతో చనిపోయిందని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంతో ...అనుమానించిన గ్రామాస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపెట్టిందా తల్లి.

నజ్మా స్వగ్రామంలో నిరసనలు...
కన్నతల్లే కూతురిని హత్యచేయడంపై మృతురాలు నజ్మా స్వగ్రామంలో నిరసనలు వ్యతక్తం అవుతున్నాయి. కూతురు తప్పుచేస్తే కడుపులో పెట్టుకుని సమస్యను పరిష్యరించుకోవాల్సింది పోయి.. హత్యచేయడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నకూతురిని దారుణంగా హత్యచేసిన తల్లిని కఠినంగా శిక్షించాలని మహిళాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తమ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి అని గ్రామస్తులు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

 

రంజాన్ వేడుకల్లో నితీష్ కుమార్..

పాట్నా : బీహార్ సీఎం నితీష్ కుమార్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. జేడీయూ నేత అలీ అన్వర్ కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

13:03 - July 7, 2016

వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్యాలు వెంట వచ్చినట్టే. అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో దోమలు, పురుగులు వృద్ధి చెందుతాయి. దీనితో ఇంట్లో వారు అనారోగ్యాలకు గురవుతుంటారు. దోమలు, పురుగుల నివారణ కోసం ఏవో మందులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. వీటి నివారణకు ఓ ద్రవం వాడితే సరిపోతుంది.
నిమ్మ లేదా నారింజ‌ల‌లో ఏ పండైనా తీసుకుని దాని తొక్క‌ల‌ను కొన్ని తీయాలి. పుదీనా ఆకుల‌ను క‌లిపి ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని దాంట్లో ముందు చెప్పిన ప‌దార్థాల‌ను వేసి నీటిని బాగా మ‌రిగించాలి. నీరు బాగా మ‌రిగాక ఆ ద్ర‌వాన్ని చ‌ల్లార‌నివ్వాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని రాత్రంతా అలాగే వ‌దిలేయాలి. ఉదయాన్నే ఆ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి ద్ర‌వాన్ని సేక‌రించాలి. ఆ ద్ర‌వంలో ర‌బ్బింగ్ ఆల్క‌హాల్ (స‌ర్జిక‌ల్ స్పిరిట్)ను స‌మాన భాగంలో క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకుని కీట‌కాలు తిరిగే ప్రాంతంలో చల్లాలి. ట్రై చేసి చూడండి.

శాప్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి అచ్చెన్న నాయుడు..

విజయవాడ : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ కార్యాలయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు స్టేడియాలు నిర్మిస్తున్నట్లు, ప్రతి నియోజకవర్గంలో ఐదెకరాల స్థలమివ్వాలని ఎమ్మెల్యేలను కోరడం జరిగిందన్నారు. స్పోర్ట్స్ కోటాలో చేరిన పోలీసు అధికారులను డీఎస్ డీవోలుగా నియమించాలని డీజీపీకి గతంలోనే లేఖ రాసినట్లు తెలిపారు. 

అనంతలో క్రికెట్ బుకీ అరెస్టు..

అనంతపురం : క్రికెట్ బుకీ ప్రొద్దుటూరు నరసింహతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి రూ. 20 లక్షలు, పది సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తమిళనాడు, కర్నాటకలో జోరుగా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. దుబాయ్ నుండి ఫోన్లలో పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజశేఖర్ పేర్కొన్నారు.

 

12:49 - July 7, 2016

రామయణం జూశిండ్రా మీరు అప్పుడు దూరదర్శన్ల రాకపొయ్యేదా..? ఆ అండ్ల లక్ష్మణుడు మేఘనాథునితోని కొట్లాటుకు వోతె మేఘనాథుడు ఒక బాణమేస్తడు.. ఆ దెబ్బతోని లక్ష్మణుడు మూర్చపోతడుగదా..? అప్పుడు లక్ష్మణుని ప్రాణాలు గాపాడింది ఏంది..? సంజివిని అనే మూలిక.. అగో ఆ మూలికను దొర్కవట్టిండు పాలమూరు జిల్లాల ఒక సారు.. మరిన్ని చూడాలంటే వీడియో సూడుండ్రి..

12:47 - July 7, 2016

మేలు జేశినోని మెడలిరగొట్టినట్టు ముద్దగనే జేస్తున్నరు మూటకొండూరు ఊర్లె కొంతమంది.. అంతట జనం దున్ని ఇత్తునాలేస్తుంటే..? నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మూటకొండూర్ల మాత్రం దున్ని ఇత్తునాలు ఏరుతున్నరు. ఆరుద్ర పురుగుల కోసం వెతుకుతున్నరు. రైతుల కోసం ఉపయోగపడే ఈ పరుగులను ఏరుతున్నరు. ఇవి విక్రయిస్తున్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:41 - July 7, 2016

తూ.గోదావరి : కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత నెలకొంది. రమణక్క పేట పొల్లాలో సరుగుడు చెట్లను తొలగించేందుకు యాజమాన్యం యత్నించటంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సెజ్ యాజమాన్యానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..మరింత సమాచారం తెలుసుకోండి.

12:38 - July 7, 2016

హైదరాబాద్ : రంజాన్‌ పండుగ సందర్భంగా జంటనగరాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు.. కేంద్రబలగాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశామన్నారు. పదివేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. టెక్నాలజీ సహాయంతో ... భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు సీపీ చెప్పారు.

12:33 - July 7, 2016

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు.. మంత్రులు, ఇతర అధికారుల కార్యాలయాలు అత్యాధునికంగా నిర్మిస్తున్నారన్నారు. సచివాలయంలో తనకు కొంత స్పేస్ ఇవ్వమని సీఎం చంద్రబాబును కోరానని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధిపథంలో ముందుకెళ్తుందన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలను సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందని గవర్నర్ తెలిపారు.
పుష్కర ఘాట్లను పరిశీలించిన గవర్నర్ ...
 గవర్నర్‌ నరసింహన్ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ కు దుర్గగుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి పై జరుగుతున్న అభివృద్ధి, పుష్కర ఘాట్ల నమూనాను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గవర్నర్ నరసింహన్ కు వివరించారు.

మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాత్నా బై పాస్ రోడ్డు నీట మునిగిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

జీవో 123 రైతులకు నష్టదాయం - తమ్మినేని..

మహబూబ్ నగర్ : జీవో 123 రైతులకు నష్టదాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ పరిధిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రను ప్రారంభించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారమే భూ సేకరణ జరపాలని, బలవంతపు భూ సేకరణ చేపట్టవద్దని హైకోర్టు పేర్కొనడం జరిగిందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. 

గవర్నర్ కూడా తనవంతు పాత్ర పోషించాలి - కేఈ..

గుంటూరు : విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో గవర్నర్ కూడా తన పాత్ర పోషించాల్సినవసరం ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆగస్టు చివరికల్లా పూర్తిస్థాయిలో తాత్కాలిక సచివాలయ కార్యక్రమాలు ప్రారంభమౌతాయన్నారు. కేంద్రంతో గవర్నర్ మాట్లాడి నిధులను రాష్ట్రానికి తెప్పించాలన్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల సమస్యలను గవర్నర్ పరిష్కరించాలన్నారు.

 

12:06 - July 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్-2కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది మాత్రమే మెడికల్ ఎంసెట్ జరగనుండటంతో విద్యార్థులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు ఈ యేడాది ప్రత్యేకంగా నిర్వహించే ఎంసెట్ 2 పరీక్ష కీ సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 56వేల మంది విద్యార్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరి కోసం 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్ష రాసేవారిలో 37వేల 688 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఈనెల 9న నిర్వహించే పరీక్ష కోసం జేఎన్‌టీయూ హైదరాబాద్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
నీట్ ద్వారానే మెడికల్ ప్రవేశాలు జరపాలని సుప్రీం ఆదేశాలు..
ప్రభుత్వ కాలేజీల సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ పరీక్ష ద్వారానే భర్తీ చేయనున్నారు. అలాగే విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలోఎగ్జామ్ సెంటర్లోనే సేకరించేందుకు ఏర్పాట్లు చేసారు. 5వేల రూపాయలు, 10వేల రూపాయల అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించిన వారి వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులకు అందించారు. తెలంగాణలో మెదక్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.

పరీక్ష రాయనున్న 17వేల 934మంది ఏపీ విద్యార్ధులు ..
ఏపీ విద్యార్థుల కోసం ఏపీలోని నాలుగు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో ఎంసెట్-2 నిర్వహించనున్నారు. మొత్తం ఏపీలో 17వేల 934మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయాల్సిందే కాబట్టి విద్యార్ధులు ఎంసెట్‌-2 కు పూర్తిగా సిద్ధమవుతున్నారు.

11:59 - July 7, 2016

మహబూబ్‌నగర్‌ : పట్టాభూమికి ఇచ్చినట్లుగా అసైన్డ్ భూమికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో తెలంగాణ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాని, 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరగాలంటే..123 జీవోను రద్దు చేయడంతో పాటు 20 సంవత్సరాల వరకు ఆర్థిక సహాయము అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 80శాతం ప్రజలు ఒప్పుకుంటేనే భూసేకరణ జరపాలని డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద చిన్న,సన్నకారు రైతులు భూములు, ఇళ్లు కోల్పోయినవారికి అండగా నిర్వహించే పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు సీపీఎం ఇతర నాయకులు పాల్గొననున్నారు.

11:54 - July 7, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాల భనాలను గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చించేందుకు గవర్నర్ నరసింహన్ తో నిన్న చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారాలపై చర్చించారు.. దీనికి రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని కేంద్రానికి గవర్నర్ తెలిపాలని బాబు విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ నరసింహన్...
ఉద్యోగులు పని చేయటానికి అనువైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ప్రశంసించారు. నూతన రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు పాత్ర ప్రశంసనీయమన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిపథం ముందుకెళ్తుందన్నారు.

సీఎం చంద్రబాబు ...
సచివాలయం పనులపై, రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలను గవర్నర్‌కు వివరించామని తెలిపారు.గవర్నర్‌ నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. నూతన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలను అధిగమించేందుకు గవర్నర్‌ ఇస్తున్న సలహాలు స్వీకరిస్తున్నామని, ఆయన సూచనలతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

11:44 - July 7, 2016

బంగ్లాదేశ్‌ : పోలీసులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేల్చినట్టు తెలుస్తోంది. లో ముష్కర మూకలు మళ్లీ తెగబడ్డాయి. ముస్లింలు రంజాన్‌ను ఆనందోత్సాహల మధ్య జరుపుకుంటున్న తరుణంలో మళ్లీ దాడులు చేశాయి. బంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఈద్గా వద్ద ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ముష్కరులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులు మృతి చెందారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

కిషోర్‌ గంజ్‌లో రంజాన్ ప్రార్థనలు జరుగుతుండగా పేలుళ్లు..
బంగ్లాదేశ్‌లో కిషోర్ గంజ్ పట్టణ శివారులోని షోలాకియా ఈద్గా వద్ద బాంబు పేలుడు జరిగింది. పర్వదినంనాడు దాదాపు 4 లక్షల మంది ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. పెద్ద సంఖ్యలో జనం గుమ్మికూడటాన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న పేలుడులో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఒకరు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి తేరుకోకముందే పండుగనాడు పేలుడు జరగడం బాగ్లాదేశీల్లో విషాదం నింపింది.

తుంగభద్రకు డ్యామ్ కు చేరుతున్న వరదనీరు..

కర్నూలు : తుంగభద్ర డ్యామ్ కు వరదనీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 50వేల క్యూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 1599.21 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 18.67 టీఎంసీలు. 

కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమణయ్యపేట పొలాల్లో సరుగుడు చెట్లు తొలగించేందుకు సెజ్ యాజమాన్యం ప్రయత్నాలు చేసింది. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. 

శ్రీనగర్ కాలనీలో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన..

హైదరాబాద్ : శ్రీనగర్ కాలనీలో రోడ్లను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పరిశీలించారు. రోడ్డు మరమ్మత్తు పనుల జాప్యంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

ప్రారంభమైన తమ్మినేని పాదయాత్ర..

మహబూబ్ నగర్ : పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పాదయాత్ర చేపట్టింది. ఉద్దండపూర్ రిజర్వాయర్ పరిధిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారమే భూ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. పట్టా భూమికి ఇచ్చిన ధరనే అసైన్డ్ భూమికివ్వాలని సూచించారు. ఈ పాదయాత్ర నేటి నుండి మూడు రోజుల పాటు జరగనుంది. 

విభజన సమస్యలు పరిష్కరించాలని కోరాం - సీఎం బాబు..

గుంటూరు : విభజన సమస్యలు పరిష్కరించాలని గవర్నర్ నరసింహన్ ను కోరడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడారు. సచివాలయం పనులపై గవర్నర్ కు వివరించడం జరిగిందని, ఏయే బ్లాక్ లలో ఏయే శాఖలు ఉంటాయో గవర్నర్ కు తెలపడం జరిగిందన్నారు. సచివాలయానికి ఐదు కి.మీటర్ల దూరంలో 900 ఎకరాల్లో పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు గవర్నర్ కు వివరించి వారి సలహాలు తీసుకుంటామన్నారు. 

డిప్యూటి సీఎం ఇంటికి సీఎం కేసీఆర్..

హైదరాబాద్: డిప్యూటి సీఎం మహమూద్ అలీ ఇంటికి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన విందులో పాల్గొననున్నారు. అనంతరం ఫిలింనగర్‌లోని ఎమ్మెల్సీ సలీం ఇంటికి కూడా సీఎం కేసీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై గవర్నర్ ప్రశంసలు..

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. విజయవాడకు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం వెలగపూడికి చేరుకుని అక్కడ జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో నర్సింహన్ మాట్లాడారు. సచివాలయ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. మంత్రులు, ఇతర అధికారుల కార్యాలయాలు అత్యాధునికంగా నిర్మిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కెప్టెన్ గా ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళుతోందని, తెలుగు రాష్ట్రాల సమస్యలు సామరస్యక వాతావరణంలో పరిష్కారమౌతాయనే నమ్మకం ఉందన్నారు. 

ప్రశాంతంగా రంజాన్ - సీపీ..

హైదరాబాద్ : నగరంలో రంజాన్ పండుగ ప్రశాంతంగా జరుగుతోందని సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పది వేల మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 

10:50 - July 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా వాడవాడలా విషజ్వరాలు భయపెడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు...
తెంగాణలో మారిన వాతారణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్స్ స్వైర విహారం చేస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, కలరా, డయేరియాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉన్నపలంగా వాతావరణంలో మార్పులు రావడంతో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. విషజ్వరాలతో ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్‌ ఆసుపత్రులు అన్న తేడాలేకుండా రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డెంగ్యూకేసులు..
మరోవైపు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సర్కారు లెక్కల ప్రకారం 2011 సంవత్సరంలో ప్రభుత్వాసుపత్రుల్లో 175 కేసులు నమోదయ్యాయి. అవి కాస్తా 2015 నాటికి 275 కి పెరిగాయి. అయితే విషజ్వరాలతో రోగులలో అకస్మాత్తుగా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం వచ్చినపుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

వైద్యసదుపాయల లేమితో గిరిపుత్రుల ఇబ్బందులు..
ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వైద్యసదుపాయలు అందుబాటులో లేకపోవడంతో గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

10:45 - July 7, 2016

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. మొదట్లో ఐరన్ లెగ్ అనే విమర్శలు ఎదుర్కొన్నా అనతికాలంలోనే నటిగా ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. అంతేగాకుండా గాయని..సినీ దర్శకురాలిగా నిరూపించుకొంది. ఈ కొన్ని సంవత్సరాల కెరీర్ లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేశారు ? అనే ప్రశ్నకు...ఆరోగ్యంగా..ఆనందంగా..ఉల్లాసంగా ఉండటానికి కారణం పనేనంట..అవును క్షణం తీరిక లేకుండా పని ఉన్నప్పటికీ, ఆ పనిని ఇష్టంగా చేయడంతో ఎలాంటి కష్టం అనిపించలేదని అంటోంది ఈ అమ్మడు. తాజగా శ్రీమంతుడు చిత్రానికి ఉత్తమ నటిగా సైమా -2016 అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తనకు పని మంచి ఎనర్జీ ఇస్తోందని ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తూ దర్వకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రంతో పాటు 'యారా', 'ఎస్3', 'ప్రేమమ్' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది. 

10:44 - July 7, 2016

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. నెలరోజులపాటు నిష్ఠతో కొనసాగించిన కఠిన ఉపవాస దీక్షలను విరమించారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. చార్మినార్‌, మక్కామసీదు, మీర్‌ ఆలం ఈద్గా తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ట్రాఫిక్‌ దారి మళ్లించారు...

దేశప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్,తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రార్థనలకు సమస్యలు రాకుండా ఉండేందుకు హైదరాబాద్ లో ప్రధానమైన ఈద్గాలతో పాటు జిల్లా కేంద్రాల్లోని ఈద్గాల వద్ద తెలంగాణ వక్ఫ్‌బోర్డు, స్థానిక మసీదు కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు .

10:43 - July 7, 2016

బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపీక్ ఫీవర్ నెలకొంది. వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రజలను ప్రభావితం చేసిన ప్రముఖుల జీవితాల ఆధారంగా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. నటీనటులు సైతం ఇలాంటి చిత్రాల్లో నటించేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మరో బయోపిక్ కు రంగం సిద్ధమైంది. శివసేన అధినేత బాల్ థాకరే జీవితం ఆధారంగా ఓ బయోపిక్ ను నిర్మించేందుకు థాకరే కోడలు స్మితా థాకరే సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆమె కుమారుడు రాహుల్ థాకరే దర్శకత్వం వహించనున్నారు. ఇక బాల్ థాకరేగా ఎవరు నటించనున్నారనే చర్చ జరుగుతోంది. థాకరే గా బిగ్ బి ఒక్కరే ఈ పాత్రకు న్యాయం చేస్తారనే చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఈ పాత్రకు ఎవరైతే సరిపోతారనే దానిపై చిత్ర యూనిట్ ఓటింగ్ నిర్వహిచిందంట. అమితాబ్..షారూఖ్..అక్షయ్ కుమార్..మనోజ్ బాజ్ పాయి పేర్లలో అమితాబ్ కే ఎక్కువ శాతం మద్దతుపలికినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాల కోసం వేచి ఉండాల్సిందే. 

10:38 - July 7, 2016

గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు శ్రీ బాలాజీ సినీ మీడియా అధినేతలు జే.పుల్లారావు, జె.భగవన్ లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాతలు మీడియాకు తెలిపారు. దర్శకుడు సంపత్ నంది ఓ మంచి కథ చెప్పారని..ఈ కథకు గోపిచంద్ సరిగ్గా సరిపోతారనే ఉద్ధేశ్యంతో ఆయన్ను సంప్రదించడం జరిగిందన్నారు. కథ విన్న తరువాత గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. యజ్ఞం..ఆంధ్రుడు, లక్ష్యం..గోలీమార్, శౌర్యం, జిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన గోపిచంద్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారని, 'శంఖం' తరువాత తమ బ్యానర్ లో ఆయనతో మరో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. గోపిచంద్ లో ఉన్న మాస్ యాంగిల్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసే చిత్రమవుతుందని, హై టెక్నికల్ అంశాలతోనే కాకుండా హై బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేయడం జరిగిందన్నారు. 'ఏమైంది ఈ వేళ' యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో సక్సెస్ కొట్టి ఆ తరువాత 'రచ్చ'..'బెంగాల్ టైగర్' తో సంపత్ నంది దర్శకుడిగా అందరి మన్ననలు పొందారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఎంపిక చేయాల్సి ఉందని, వీరితో పాటు నటీనటుల వివరాలు కూడా త్వరలోనే తెలియచేయడం జరుగుతుందన్నారు. 

10:37 - July 7, 2016

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన సమంత..నిత్యామీనన్ లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర దర్శక..నిర్మాతలు విడుదల చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వారు దీనిని విడుదల చేశారు. ''బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్..ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది.. జనతా గ్యారేజ్..ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును'..అంటూ ప్రత్యర్థులతో ఫైట్ చేస్తూ ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ తో ఓ టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. 

10:35 - July 7, 2016

బంగ్లాదేశ్ : దేశంలోని ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. దేశంలోని గురువారం నాడు కిషోర్ గంజ్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందగా మరో 10మంది తీవ్రంగా సైనికులు గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. కాగా భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు సమాచారం. రంజాన్ సందర్బంగా ముస్లింలు ప్రార్థనల సంయంలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో ఉగ్రవాదులు ముస్లింలను టార్గెట్ చేశారనే కోణంలో  బంగ్లా ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఉగ్రవాదులు పేలుళ్ళకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.

వెలగపూడిలో గవర్నర్..బాబు..

గుంటూరు : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వెలగపూడికి చేరుకున్నారు. అక్కడ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆయన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు..అధికారులున్నారు. 

10:30 - July 7, 2016

సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్‌లో రూపొందిన 'కబాలి' చిత్రంపై అందర్నీ దృష్టి కేంద్రీకరించారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ విడుదల తేదీల్లో మార్పులు జరుగుతుండడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారంట. కానీ ఈసారి మాత్రం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విడుదల తేదీ ఖరారు అయినట్లు అధికారికంగా ప్రకటించకపోయినా జులై 22న మాత్రం విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జులై 21న మలేషియాలో కబాలి ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 21 రాత్రి 9.00గంటలకు 'కబాలి' షో ప్రదర్శించనున్నట్లు..టికెట్ ధర 100రింగిట్స్ అని ఉంది. దీనితో జులై 22న 'కబాలి' రిలీజ్ అవుతుందనే నమ్మకంతో అభిమానులున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్..టీజర్ లు విడుదలై సంచలనం సృష్టించాయి. మరి ఏ తేదీన విడుదలవుతుందో చిత్ర యూనిట్ చెప్పాలి.

10:29 - July 7, 2016

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్ మెంట్ అయి చాలా రోజులే గడుస్తోంది. కానీ ఆయనకు గాయాల బెడద వీడడం లేదు. గతంలో మ్యాచ్ లు ఆడుతూ గాయాలపాలైన సచిన్ కు పలు శస్త్రచికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ ను లండన్ లో చేయించుకున్నాడు. తన శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినట్లు సచిన్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఎడమకాలికి ఆపరేషన్ చేయించుకున్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. 'కొన్ని గాయాలు రిటైర్మెంట్ అయ్యాక కూడా వేధిస్తాయి..కానీ ఈ శస్త్రచికత్స నుండి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నా..ఈ ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటా' అని సచిన్ ట్వీట్స్ లో పేర్కొన్నాడు. 

10:16 - July 7, 2016

తూర్పుగోదావరి : యు.కొత్తపల్లి (మం) అమరవెల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పటేరులో దూకి ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంత కాలంగా ఇద్దరు పిల్లలకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు వైద్యం చేయించే స్థోమత లేక ఆ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా తను కూడా కాళ్ళకు తాళ్లు కట్టుకుని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మహిళ భర్త తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇద్దరు పిల్లలతో పాటు మూడ బిడ్డకు కూడా భవిష్యత్తు ఇదే ఆనారోగ్యం సంభవించే అవకాశముందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక సామాన్య రైతు కుటుంబంలో వున్న తాము ఏ రకంగా ప్రయత్నించినా బిడ్డలను బ్రతికించుకునే అవకాశం లేకపోవటంతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలన ఉప్పుటేరులోంచి బయటకు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

పుష్కరాలు రాష్ట్రానికే గర్వకారణం - నరసింహన్..

విజయవాడ : కృష్ణా పుష్కరాలు రాష్ట్రానికే గర్వకారణమని గవర్నర్ నరసింహన్ పేరుకున్నారు. అందరూ పాల్గొని పుష్కరాలను జయప్రదం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం కనకదుర్గ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. 

బంగ్లాలో పేలుడు..

బంగ్లాదేశ్ : కిషోర్ గంజ్ లో పేలుడు సంభవించింది. ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఓ పోలీసు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఘనంగా రంజాన్ వేడుకలు..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మక్కామసీద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఢిల్లీ జమామసీదులో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు తమ ఉపవాస దీక్షలను విరమించి పండగ చేసుకుంటున్నారు.

భిల్వారాలో రోడ్డు ప్రమాదం..13 మంది మృతి..

రాజస్థాన్ : భిల్వరాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వెళుతోన్న ట్రాక్టర్ ను ఓ లారీ ఢీకొట్టడంతో 13 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మొజాంబిక్ చేరుకున్న ప్రధాని మోదీ ..

మొజాంబిక్ : 5 రోజుల ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొజాంబిక్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆఫ్రికా దేశాలతో భారత మైత్రిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని 4 దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఆయన మొజాంబిక్ దేశాధ్యక్షుడు న్యూసీతో భేటీ కానున్నారు.

వి. కోటలో జంట ఏనుగులు బీభత్సం...

చిత్తూరు : గజరాజులు వనాలను వీడి గ్రామాలమీద దాడి చేస్తున్నాయి.  వి. కోట మండలంలో జంట ఏనుగులు బీభత్సం సృష్టించాయి. తుమ్మలమడుగు గ్రామంలో పంటపొలాలపై దాడి చేశాయి.

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య..

తూర్పుగోదావరి : యు.కొత్తపల్లి (మం) అమరవెల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పటేరులో దూకి ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

కనకదుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్..

విజయవాడ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువార ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశమైన గవర్నర్ ఈ రోజు కూడా మరోసారి బాబుతో భేటీ కానున్నారు.

ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..

కర్నూలు : ఆళ్లగడ్డ సమీపంలో లారీ - ఆటో ఢీ కొన్నాయి. ఈఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.

విజయవాడలో పరువు హత్య...

కృష్ణ : విజయవాడలో పరువుహత్య జరిగింది. కుమార్తె నజ్మాను కన్నతల్లే హత్య చేసింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో తల్లి బీబీజాన్ కుమార్తె జన్మాను హత్య చేసింది. అనారోగ్యంతోనే చనిపోయిందని కుమార్తె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ప్రియుడి ఫిర్యాదు మేరకు పోలీలసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బీబీజాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

07:50 - July 7, 2016

హైదరాబాద్‌లోని సరోజిని కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించడంతో 13 మంది రోగులు చూపు కోల్పోయారు. కంటిలో ఏర్పడి శుక్లాలను తొలగించేందుకు ఆసుపత్రిలో చేరిన 13మందికి గతనెల 30న ఆపరేషన్‌ నిర్వహించారు. అయితే ఇందులో ఏడుగురు కంటిచూపు కోల్పోయారు. కాగా ఈ విషయంలో తమ తప్పేమీ లేదనీ..ప్రభుత్వం సరఫరా చేసిన ఎల్ ఆర్ సెలైన్ బాటిల్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయంగా టెన్ టీవీ ప్రచారం చేసిన వార్తలకు కదిలిన ప్రభుత్వ యంత్రాంగం ఓ కమిటీని వేసింది...ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బెల్యా నాయక్ (తెలంగాణా కాంగ్రెస్ నేత) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత), శ్రావణ్ కుమార్ (టీడీపీ ఎమ్మెల్యే) పాల్గొన్నారు. వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి..

07:42 - July 7, 2016

నెలరోజులుగా ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులు ఇవాళ రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవాజ్ నాయకుడు అబ్బాస్ గారు టెన్ టీవీ స్టూడియోకు వచ్చారు. ప్రస్తుత సమాజంలో ముస్లింలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి అబ్బాస్ ఎటువంటి విషయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి...

07:37 - July 7, 2016

హైదరాబాద్ : నిన్నటి వరకూ కళకళలాడిన జిల్లా గృహ నిర్మాణశాఖ ఇకపై కనబడకపోవచ్చు. 37 సంవత్సరాలపాటు పేదల పాలిట వరంగా మారిన ఈశాఖను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయబోతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇప్పటికే ఇతర శాఖలకు వెళ్లాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఇంక మరిచిపోవలసిందే..దీంతో లబ్ధిదారులు తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు.

గృహనిర్మాణ శాఖ రద్దుకు టీసర్కార్‌ యోచన ...
ఒక పక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకేమో...దిక్కులేదు. మరోపక్క, ఉన్న కాస్త ఇళ్లనైనా నిర్మించే పరిస్థితి లేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రావాల్సిన పెండింగ్‌ 30 కోట్ల రూపాయలు హుష్ కాకేనా....? అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లా గృహనిర్మాణ శాఖను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతోందన్న కారణంగా ఏం చెయ్యాలో అర్థంకాక ఇందిరమ్మ గృహ పథకం లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.

బిల్లు అందక ఆవేదన చెందుతున్న లబ్దిదారులు..
ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డును 1979 జూలై 5న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఏర్పాటు చేశారు. పెను తుఫాను కారణంగా ఉభయగోదావరి జిల్లాల్లో కొట్టుకుపోయిన గుడిసెల స్థానంలో కొత్త గృహాలు కట్టారు. అది కాస్త అన్ని జిల్లాలలకు విస్తరించింది. అలా ఇందిరా ఆవాస్ పథకం కింద పేదలకు 400 రూపాయలతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. తరువాత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన సమయానికి 12,500 రూపాయలతో గృహాలు నిర్మించారు. అప్పుడు నిర్మించిన ఇళ్లయినా తమకు బిల్లు అందక, మధ్యలోనే గృహనిర్మాణం ఆగిపోయిందని లబ్దిదారులు విలపిస్తున్నారు.

2007లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన వైఎస్ఆర్..
2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో ఖమ్మం జిల్లాలోని 10 నియోజక వర్గాల్లో ఇందిరమ్మ మొదటివిడత ,రెండు, మూడు విడతలు కింద 2లక్షల 69వేల 610 ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్నింటి నిర్మాణం పూర్తవగా సుమారు 47 వేల ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అప్పుడు నిర్మించిన ఇళ్లయినా తమకు బిల్లు అందక, మధ్యలోనే గృహనిర్మాణం ఆగిపోయిందని లబ్దిదారులు విలపిస్తునన్నారు.

బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్న లబ్ధిదారులు..
రెండేళ్లుగా తమ ఇళ్లు నిర్మాణం పూర్తవ్వక, తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబ్ధిదారులు నానా బాధలు పడుతున్నారు. జిల్లాలో లబ్ధిదారుల గోడును పట్టించుకునే నాధుడే లేడు. అధిక వడ్డీలకు అప్పు చేసి గృహాలు నిర్మించుకున్న దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు బిల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పెండింగ్ డబ్బులు అందిస్తే ఇళ్లను పూర్తిగా నిర్మించుకుంటామని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

07:26 - July 7, 2016

హైదరాబాద్ : ప్రగతి చక్రంలో పట్టు కోసం పావులు కదులుతున్నాయి..గుర్తింపు కోసం ఆరాటం ఆరంభమైంది... సంఘాలు సమరానికి సై అంటున్నాయి. ఎలాగైనా తమ ఉనికి చాటుకోవాలని యూనియన్లు ప్రయత్నిస్తున్నాయి ... కార్మికుల గడపల్లోకెళ్లేందుకు సభలు.. సమావేశాలతో సందడి షురూ అయింది... ఏంటీ ఆరాటం? ఎందుకీ పోరాటం అనుకుంటున్నారా? ..... వాచ్‌దిస్‌ స్టోరీ.

టీఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నిక కావటం చేత కార్మిక సంఘాల నేతలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుంబంధ గుర్తింపు సంఘం టీఎంయూ జయకేతనం ఎగురవేసింది. సాధారణంగా గుర్తింపు సంఘం కాల పరిమితి రెండేళ్లు. ఆ గడువు పూర్తయినప్పటికీ వివిధ కారణాల రీత్యా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. రాష్ట్రంలోనూ, కార్మిక వర్గ రాజకీయాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల అంశం తెరపైకి రావడంతో ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు ఆసక్తి కరంగా మారాయి.

ఈనెల 19 జరగనున్న ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలు...
టీఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన అంశం తెరపైకి రావడంతో హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మిక యూనియన్‌లతో ఇప్పటికే కార్మిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. కార్మిక యూనియన్‌లకు గుర్తులు ఖరారు చేశారు. జూలై 19న ఎన్నికలు జరగనున్నాయి. గత గుర్తింపు సంఘం ఎన్నికలు 2012 డిసెంబర్ 12న ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. కాలపరిమితి ముగిసిన రెండేళ్లకు జరగాల్సిన ఎన్నికలు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన కావడం, ఏపీఎస్ ఆర్టీసీ విభజన సమస్య నెలకొనడం, ఉద్యోగులు, కార్మికుల విభజన వంటివి ఆటంకాలుగా మారాయి. ఆర్టీసీ విభజన స్పష్టం కావడంతో,.కాల పరిమితి ముగిసిన 20 నెలల తర్వాత కార్మికశాఖ తెలంగాణలో తొలిసారి టీఎస్‌ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం

రాష్ట్ర విభజనానంతరం రెండు సంఘాల మధ్య బేధాభిప్రాయాలు..
కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారం ఊపందుకోనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అంతకుముందు గుర్తింపు సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్‌ను ఓడించడానికి ఎంప్లాయూస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడిగా పోటీ చేశాయి. 2012లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ల కూటమి గుర్తింపు సంఘంగా విజయం సాధించాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రెండు సంఘాల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ బలాన్ని విస్తరించుకుంది. ఈ యూనియన్‌కు ప్రత్యమ్నాయంగా ఇటీవల వామపక్ష కార్మిక సంఘాలైన ఎంప్లాయూస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌తోపాటు నేషనల్ మజ్దూర్ యూనియన్ మరికొన్ని సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి.

ఉనికిని కాపాడుకోవాలని కార్మిక యత్నిస్తున్న సంఘాలు..
ఏది ఏమైనా రాష్ట ఆవిర్భావం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తమ ఉనికిని కాపాడుకోవాలని కార్మిక సంఘాలు చూస్తున్నాయి.

07:07 - July 7, 2016

మహబూబ్ నగర్ : ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులకు అండగా సీపీఎం పోరాడేందుకు సిద్ధమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉండేందుకు సీపీఎం పాదయాత్ర నిర్వహించబోతుంది. భూములు కోల్పోయిన వారికి 2013 భూ చట్టం ప్రకారము భూ పరిహారము ఇవ్వాలనే డిమాండ్‌తో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో సీపీఎం పాదయాత్ర నిర్వహించడానికి రెడీ అయింది.

2013 భూ చట్టం ప్రకారము భూ పరిహారము ఇవ్వాలనే డిమాండ్ తో ...
తె
లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా సీపీఎం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి 2013 భూ చట్టం ప్రకారము భూ పరిహారము ఇవ్వాలని,.అలాగే వారికి ఇళ్లు కట్టివ్వాలనే డిమాండ్లతో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు జడ్చర్ల మండలం ఉధండాపూర్ గ్రామం నుండి కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గామం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.

123 జీవోను ద్దు చేయాలి..20ఏళ్ల పాటు ఆర్థిక సహాయం ...
ఇక భూ నిర్వాసితులకు న్యాయం జరగాలంటే..123 జీవోను రద్దు చేయడంతో పాటు 20 సంవత్సరాల వరకు ఆర్థిక సహాయము అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 80శాతం ప్రజలు ఒప్పుకుంటేనే భూసేకరన జరపాలంటున్నారు. వెనుకబడిన పాలమూరు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రాజెక్టుల క్రింద భూములు కోల్పోయిన నిర్వాసితులు వ్యవసాయము మీదే ఆధారపడి జీవిస్తున్నందున భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం తక్కువగా ఇస్తోందని భూమిని కోల్పోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును పట్టించుకొని మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

రైతులకు అండగా సీపీఎం పార్టీ ...
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద చిన్న,సన్నకారు రైతులు భూములు, ఇళ్లు కోలుపోయిన వారికి అండగా నిర్వహించే పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు సీపీఎం ఇతర నాయకులు పాల్గొననున్నారు. ప్రభుత్వము గ్రామస్థాయి అధికారులతో భూములను తీసుకోవటం మంచిది కాదని..2013 చట్టం ప్రకారము భూ పరిహారము ఇవ్వాలని సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలా ఇవ్వని పక్షంలో ప్రభుత్వంపై పోరాడేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. 

07:03 - July 7, 2016

విజయవాడ : ఇచ్చిన హామీలను ఏపీ సర్కార్‌ నెరవేర్చడం లేదంటోంది వైసీపీ..ప్రభుత్వ తీరును ప్రజల్లోనే ఎండగడుతామంటూ హెచ్చరిస్తోంది. ఇందులో భాగంగానే 'గడప గడపకు వైసీపీ' పేరుతో వంద ప్రశ్నలను ప్రభుత్వానికి సంధిస్తూ..ముందుకెళ్తోంది. అయితే..వైసీపీ వేసే ప్రశ్నలకు బోల్తా పడకుండా.. కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చేందుకు టీడీపీ కూడా సిద్ధమవుతోంది.

హామీలను నెరవేర్చడం లేదని వైసీపీ విమర్శ...
టీడీపీ అధికారం చేపట్టి రెండు సంవ‌త్సరాలు దాటినా..మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెర‌వేర్చడంలో విఫ‌లం అయ్యింద‌ని వైసీపీ వాదిస్తోంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఆ పార్టీ ఇంటింటికి వైసీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 8న ప్రారంభం కానున్న 'గడప గడపకు వైసీపీ' కార్యక్రమం ద్వారా 100 ప్రశ్నల‌ను ప్రభుత్వానికి సంధించి.. వాటిలో ఏ మేరకు నెర‌వేర్చారో ప్రజ‌ల నుంచే స‌మాధానాలు రాబ‌ట్టేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. అయితే..వైసీపీకి దీటుగా తాము ఇప్పటి వ‌ర‌కూ నెర‌వేర్చిన హామీల‌తో ఓ జాబితాను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు తెలుగుదేశం నేతలు. దీనిలో భాగంగా ఇవాళ సాయంత్రం విజ‌య‌వాడ‌లోని ముఖ్యమంత్రి నివాసంలో క‌ళా వెంక‌ట్రావు, పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ లోకేష్‌లు సమావేశం కానున్నారు. ఈ భేటీలో వైసీపీ సంధించ‌నున్న వంద ప్రశ్నలు, వాటికి స‌మాధానం అంతే దీటుగా ఎలా ఇవ్వాల‌నే దానిపై చ‌ర్చిచనున్నారు.

70శాతం హామీలు నెరవేర్చామంటున్న తెలుగుదేశం..
ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే 70శాతం పైగా హామీల‌ను నెర‌వేర్చామ‌నే విష‌యాన్ని ప్రజ‌ల్లోకి తీసుకెళ్ళడానికి టీడీపీ స‌మాయ‌త్తమవుతోంది. ఇదే స‌మ‌యంలో అటు హామీలు ఇవ్వని అంశాలను కూడా త‌మ ప్రభుత్వం నెర‌వేర్చింద‌నే విష‌యాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ ఎక్కుపెట్టబోయే వంద ప్రశ్నల‌కు స‌మాధానాలు ఇస్తూనే వాటికి విరుగుడును సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశామో చెప్పడంతోపాటు.. వైసీపీ తీరును ప్రజల్లోనే ఎండగట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. అంతేకాదు.. అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. 

07:00 - July 7, 2016

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఎన్ఐఏ అధికారులకు పట్టుబడిన ఐసిస్‌ సానుభూతిపరులను విచారించే కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ముష్కరులు సమాచార వ్యవస్థ గురించి తెలుసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఐసిస్ అగ్రనాయకులు నుంచి సమాచారం తీసుకోవడం, ఇక్కడి వ్యూహాన్ని వారికి చేరవేసే హ్యాకింగ్‌ విధానాన్ని చూసి... సాఫ్ట్‌వేర్‌ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. నిఘా అవర్గాలకు అనుమానం రాకుండా భూగర్భ వెబ్‌ వాడినట్టు ఎన్ఐఏ విచారణలో బయటపడింది. మరోవైపు అనంతపురంలో ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాంకేతిక విప్లవాన్ని ఉపయోగిస్తున్న ఉగ్రవాదులు..

అందివచ్చిన సాంకేతిక విప్లవాన్ని ఐసిస్‌ సానుభూతిపరులు, ఉగ్రవాదులు అడ్డంగా వాడేసుకుంటున్నారని హైదరాబాద్‌ పాతబస్తీలో పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్న ఎన్‌ఐఏ అధికారులకు అర్ధమయ్యింది. మూడోకంటికి తెలియకుండా క్షణాల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఫేస్‌ బుక్‌లో చాటింగ్‌ చేసి, నేరుగా ఈ-మెయిల్స్‌ పంపితే నిఘా వర్గాలకు దొరికిపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో... వీడియో కాలింగ్‌, చాటింగ్‌ కోసం వేరేవారి ఐపీ అడ్రస్‌లను దొంగిలించి వాడుతున్నారని విచారణలో బయడపడినట్లు సమాచారం.

అండర్‌గ్రౌండ్‌ వెబ్‌ నెట్‌వర్క్‌లో సర్వర్‌ అడ్రస్‌ తెలుసుకోవడం కష్టం ..
హ్యాకింగ్ టూల్స్‌కు చిక్కకుండా ఉండేందుకు భూగర్భ వెబ్‌ వ్యవస్థ ద్వారా దాడులకు కుట్రపన్నినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. ఇందుకోసం టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్‌ సిస్టంను కంప్యూటర్లలో అమర్చుకున్నట్టు వెల్లడవుతోంది. సామాజిక మాధ్యమాలు పని చేయడానికి ఏదో ఒక సర్వర్‌ను వాడుకుంటే.. వివరాలు నిఘా వర్గాలకు తెలుస్తాయన్నుఉద్దేశంతో డార్క్‌ నెట్క్‌వర్క్‌ ఉపయోగించిన్టటు సమాచారం. భూగర్భ వెబ్‌ నెట్‌వర్క్‌లో సర్వర్లు, చిరునామాల వివరాలు తెలుసుకోవడం కష్టమని తెలుసుకున్న ఐసిస్‌ నానుభూతిపరులు, ఉగ్రవాదులు ఈ వ్యవస్థను వాడుతున్నట్టు విచారణలో బయటపడుతోంది.

సోషల్‌ నెట్‌వర్క్‌ వ్యూహానికి చెక్ పెట్టిన ఎన్ఐఏ..
జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ ద్వారా ఉగ్రవాదుల సోషల్‌ నెట్‌వర్క్‌ వ్యూహానికి జాతీయ దర్యాప్తు సంస్థ చెక్‌ పెట్టింది. అయితే ఇప్పుడు ఐసిస్‌ సానుభూతిపరులకు భూగర్భ వెబ్‌ నెట్‌వర్క్‌ను ఎవరు అందించారన్న అంశంపై ఎన్‌ఐఏ దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఎవరి సహకారం తీసుకున్నారో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వాటాప్స్‌లోని ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌ ద్వారా పెద్ద ఎత్తున సమాచార మార్పిడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. కోడ్‌ భాషలో సిరియాలోని ఐసిస్‌ కీలక నేత షఫీ ఆర్మర్‌ వీరితో తరచు చాటింట్‌ చేసినట్టు విచారణలో తేలిందని సమాచారం. ఈ చాటింగ్‌ సమాచారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు... ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులతో కలిసి విశ్లేషిస్తూ, దర్యాప్తు ముమ్మరం చేశారు.

గదులు కేటాయించినప్పుడు ఇచ్చిన గుర్తింపు కార్డులు స్వాధీనం ..
మరోవైపు పాతబస్తీలో పట్టుబడ్డ ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు అనంతపురంలో సోదాలు నిర్వహించారు. నంది రెసిడెన్సీ లాడ్జిలో తనిఖీలు చేశారు. ఐసిస్‌ సానుభూతిపరులు గతంలో ఈ లాడ్జిలో బస చేసినట్టు అందిన సమాచారం మేరకు... ముష్కరులు ఉన్న గదులను పరిశీలించారు. రూముల కేటాయింపు సమయంలో నిర్వాహకులకు అందజేసిన గుర్తింపుకార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు నెలరోజుల పాటు గదుల కేటాయింపులకు సంబంధించిన రికార్డులను ఎన్‌ఐఏ అధికారులు పరిశీలించారు. లాడ్జిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలపై ఆరాతీసి... లాడ్జిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. 

06:50 - July 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య కుంపట్లు రగులుతున్నాయి. ఇప్పటికే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీలో నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా పీసీసీ విడుదల చేసిన అధికార ప్రతినిధుల వ్యవహారం మరింతకాక పుట్టిస్తోంది. ఉత్తమ్‌ను టార్గెట్‌ చేస్తూ.. నాయకులు రగిలిపోతున్నారు. సీనియర్‌ నాయకుల మాటను పట్టించుకోరా..? అంటూ ఫైర్‌ అవుతున్నారు.

ఏడాదిన్నర తర్వాత కొత్త కమిటీ ఏర్పాటు..
కాంగ్రెస్‌లో పదవుల పంపకం చిచ్చురేపుతోంది. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న ఏడాదిన్నర తర్వాత కొత్త కమిటీని నియమించుకున్నారు. ఆయన బాధ్యత స్వీకరించిన రెండు నెలలకే కొత్త కమిటీని నియమించాలని ప్రయత్నం చేసినా..వరుస ఉపఎన్నికలతో కమిటీని వేయాలేకపోయారు. అయితే.. తాజాగా నియమించిన పీసీసీ అధికార ప్రతినిధుల కమిటీ కాంగ్రెస్‌లో హీట్ పుట్టిస్తోంది. పది మందితో పీసీసీ అధికార ప్రతినిధుల కమిటీ ఉంటుందని ముందు భావించినా.. జంభో కమిటీని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఇందులో చోటు దక్కనివాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన వాళ్ళకు అవకాశం ఇవ్వలేదని కొందరు నేతలు, తమకు చెప్పకుండానే తన నియోజకవర్గాల్లోని వారిని అధికార ప్రతినిధులుగా నియమించారని మ‌రికొంద‌రు నేతలు రగలిపోతున్నారు.

ఉత్తమ్‌ తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే సంపత్‌ అభ్యంతరం...
ఇదే విష‌యంపై అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ .. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా తన నియోజకర్గానికి చెందిన వ్యక్తికి అధికార ప్రతినిధి ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన నియోజక వర్గంలో తాను చెప్పిన వాళ్ళకు అధికార ప్రతినిధి ఇవ్వలేదని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ .. ఏకంగా ఉత్తమ్‌తో వాగ్వాదానికి దిగార‌ని స‌మాచారం. అంతేకాదు.. అధికార ప్రతినిధులుగా ప్రకటించిన వారిలో కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిలో సీనియ‌ర్స్‌, జూనియ‌ర్స్‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని త‌ప్పుప‌డుతున్నారు. నిన్నగాక మొన్న వ‌చ్చిన వారికి అదే ప‌ద‌వి ..ఏళ్ళ త‌ర‌బ‌డి పార్టీలో ప‌నిచేసిన వారికి అదే ప‌ద‌వేనా..? అంటూ ర‌గిలిపోతున్నారు. ఉత్తమ్‌ తీరుపై గండ్ర వెంకటరమణా రెడ్డి, సీనియర్ నేత జీ.నిరంజన్‌తో పాటు మ‌రికొంద‌రు నేతలు ఫైర్‌ అవుతున్నారు.

ఉత్తమ్ ను టార్గెట్ చేస్తున్న నేతలు ...
ఇప్పటికే పార్టీలో నేతల వల‌స‌లు, వ‌ర‌స‌ల ఓట‌మిలు, గ్రూపు పాలిటిక్స్‌ కిందా మీదా పడుతున్న హస్తం పార్టీకి ఇప్పుడు తెరపైకి వచ్చిన అసంతృప్తులు మరింత తలనొప్పిగా మారాయి. అయితే.. ఈ ఎపిసోడ్‌లో అంద‌రు పీసీసీ ఛీప్ ఉత్తమ్‌ను టార్గెట్ చేస్తుండ‌టం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరో పాదయాత్రకు సిద్ధమైన సీపీఎం ...

మహబూబ్ నగర్ : నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరో పాదయాత్ర చేపట్టనున్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్వాశితుల సమస్యలు పరిష్కరించారలని డిమాండ్ చేస్తూ పాదయాత్రను చేపట్టారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ భూ నిర్వాశితుల కోసం సీపీఎం పోరాటం..పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.. 

విశాఖలో కాంగ్రెస్ సమావేశం..

విశాఖ : నేడు కాంగ్రెస్ నేతల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేత దిగ్విజయ్ , పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హాజరుకానున్నారు.

జలమండలి ఏటీఎం వాటర్ ..

హైదరాబాద్ : జలమండలి ఏటిఏం తరహాలోనే తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కేంద్రాల ఏర్పాటుపై టెండర్లకు జలమండలి ఆహ్వానం పలికింది. సంస్థ ఆహ్వానం మేరకు 9 ఏజెన్సీలు ముందుకు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

రంజాన్ సందర్భంగా నగరంలో టేక్ డైవర్షన్..

హైదరాబాద్ : రంజాన్‌ సందర్భంగా మీరాలం ఈద్గా, సికింద్రాబాద్‌ ఈద్గా వద్ద ప్రార్థనల దృష్ట్యా గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్‌ నగర కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

నేడే రంజాన్ వేడుక...

హైదరాబాద్ : గురువారం ముస్లింల పరమ పవిత్ర పర్వదినం ‘ఈద్‌ ఉల్‌ ఫిత్ర’ జరగనుంది. రంజాన్‌ పండుగకు సూచికగా... బుధవారం సాయంత్రం మగ్రిబ్‌ నమాజు ముగిసిన తర్వాత హైదరాబాద్‌ పాతబస్తీ మసీదుల్లో సైరన్లు మోగాయి. ఈనేపథ్యంలో ముస్లిం సోదరులకు రాష్ట్రపతి, ప్రధానిసహా పలువురు ప్రముఖులు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సౌభ్రాత్రం, ప్రేమమార్గాన్ని అనుసరించేలా ఈ పవిత్ర పర్వదినం స్ఫూర్తినివ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆకాంక్షించారు.

నేటి నుండి గోల్కొండ బోనాలు ...

హైదరాబాద్‌ : గోల్కొండ కోటపైన కొలువుదీరిన జగదాంబికకు నేడు ఆషాఢ తొలి పూజ మొదలౌతుంది. . అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మకు భక్తితో భోజనం సమర్పించే సంబురం నగరంలో ప్రారంభం కానుంది. అంతా కలిసి జరుపుకునే ఈ బోనాల వేడుకకు ప్రతి గల్లీ ముస్తాబవుతోంది.

Don't Miss