Activities calendar

08 July 2016

ఐసిస్ అనుమానితుడు నిజాముద్దీన్ ను విడిచిపెట్టిన ఎన్ ఐఏ

హైదరాబాద్ : ఐసిస్ అనుమానితుడు నిజాముద్దీన్ ఎన్ ఐఏ అధికారులు విడిచిపెట్టారు. సంతోష్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఐసిస్‌ అనుమానితుడిగా నిజాముద్దీన్ ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

22:12 - July 8, 2016

ఢిల్లీ : ఆర్మీ దూకుడుకు సుప్రీంకోర్టు అడ్డుక‌ట్ట వేసింది. క‌ల్లోలిత ప్రాంతాల్లో అధికారాల‌ను దుర్వినియోగం చేయ‌రాద‌ని సూచించింది. మ‌ణిపూర్‌లో క్రూరంగా సాగిస్తున్న ఎన్‌కౌంట‌ర్ల ప‌ర్వాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టింది.
ప్రజలపై బ‌లప్రయోగం ప్రద‌ర్శించ‌రాదు... 
మణిపూర్‌లో సైన్యం జరుపుతున్న ఫేక్‌ ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రత్యేక అధికారాల చ‌ట్టం-ఆఫ్సాను అడ్డుపెట్టుకుని సరిహద్దు ప్రాంత ప్రజలపై బ‌లప్రయోగం ప్రద‌ర్శించ‌రాద‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొంది. 1528 ఎన్‌కౌంటర్లపై విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ ఎజెన్సీతో దర్యాప్తు జరపాలన్నది తర్వాత నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది.
1528 న‌కిలీ ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్లు పిటిషన్‌ 
2002 నుంచి 2012 వరకు మ‌ణిపూర్‌లో సుమారు 1528 న‌కిలీ ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్లు పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన జ‌స్టిస్ మ‌ద‌న్ లోకుర్‌, జ‌స్టిస్ ఆర్‌కే అగ‌ర్వాల్‌కు చెందిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. మ‌ణిపూర్‌లో ఆర్మీ పాత్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగ‌తించ ద‌గ్గ అంశ‌మ‌ని పిటిష‌న్‌దారుడు బ‌బ్లూ లోటంగ్బం పేర్కొన్నారు.
ఇరోమ్ ష‌ర్మిలా గ‌త 14 ఏళ్లుగా ఆమ‌ర‌ణ దీక్ష 
మ‌ణిపూర్‌లో సైన్యం సాగిస్తున్న దురాగ‌తాల‌ను ప్రశ్నిస్తూ మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్ ష‌ర్మిలా గ‌త 14 ఏళ్లుగా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్నారు.  సైనిక అకృత్యాల‌ను అడ్డుకోవాల‌ని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. సైన్యంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తీర్పు సందర్భంగా కేంద్రం వాదించింది. విదేశి శక్తులను అడ్డుకునేందుకే సైన్యానికి ఎన్‌కౌంటర్‌ జరపాల్సి వచ్చిందని పేర్కొంది.
జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే నేతృత్వంలో క‌మిటీ  
మ‌ణిపూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్లపై 2013లో సుప్రీంకోర్టు జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే నేతృత్వంలో ఓ క‌మిటీ ఏర్పాటైంది. 15 వందల ఎన్‌కౌంటర్లపై విచారణ జరపాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది. సుమారు 62 కేసుల్లో విచార‌ణ చేప‌ట్టారు. అయితే విచార‌ణ‌లో అన్ని ఎన్‌కౌంట‌ర్ కేసులు న‌కిలీవే అని తేలాయి. అయితే ఈ రిపోర్టును రద్దు చేయాలని కేంద్రం కోరింది. 8 కేసుల్లో విచారణ చేపట్టాలని ఆదేశించింది. క‌ల్లోలిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ స‌మ‌యంలో సైనికులు వారెంట్ లేకుండానే అరెస్టులు చేసే అధికారం ఉంటుంది. అయితే ఆ చ‌ట్టాన్ని ఆర్మీ దుర్వినియోగం చేస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.  

 

22:08 - July 8, 2016

ఢిల్లీ : బ్యాంకింగ్‌ వ్యవస్థ కేంద్రం ఆధీనంలోనే ఉన్నందున రుణాల రికవరిపై దృష్టి పెట్టాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బ్యాంకు రుణాల రికవరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏచూరి లేఖ రాశారు. కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు 8 లక్షల 50 వేల కోట్ల రుణాలు తిరిగి చెల్లించడం లేదని లేఖలో పేర్కొన్నారు. కార్పోరేట్‌ కంపెనీలు తీసుకున్న రుణాలపై కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని ఏచూరి కోరారు. ఎన్నికల సమయంలో విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదని గుర్తుచేశారు. దేశంలోని పది కార్పోరేట్‌ కంపెనీలు- ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలకు 7 లక్షల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది.

 

22:00 - July 8, 2016

కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాల బొమ్మల సత్రం వద్ద ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తి మొత్తం ఆటోడ్రైవర్‌ మెడలోకి దూసుకువెళ్లింది. ప్రస్తుతం ఆటో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

21:58 - July 8, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత ప్రాంతాల్లో తమ్మినేని పాదయాత్ర రెండురోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన జడ్చర్ల మండలం కిష్టారం, వల్లూరు గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. గ్రామాలు మునగకుండా ప్రాజెక్టులు కట్టవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నా.. సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మార్కెట్ ధర లేదా భూమికి భూమి ఇవ్వాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

 

21:54 - July 8, 2016

ఢిల్లీ : బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు ముగిశాయి. ఈ సమావేశంలో తెలంగాణ తరపున సుదీర్ఘంగా వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఎగువ రాష్ట్రాలను విడిచిపెట్టి ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులు జరిపితే న్యాయం జరగదని ఆయన తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కేటాయింపుల అంశం నాలుగు రాష్ట్రాలకు సంబంధించిందని వాదించారు. శనివారం కూడా ట్రిబ్యునల్‌లో వాదనలు జరగనున్నాయి. 

 

21:50 - July 8, 2016

విజయవాడ : ఏపీ సర్కారుకు భూదాహం తీరడం లేదు. మరో లక్ష ఎకరాలపై సర్కారు కన్నుపడింది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ-డీప్‌ వాటర్‌పోర్ట్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం లక్ష ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మరో లక్ష ఎకరాల భూ సమీకరణకు కసరత్తు 
ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో మరో లక్ష ఎకరాల భూమిని సమీకరించాలని డిసైడయ్యారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ-డీప్‌ వాటర్‌పోర్ట్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం లక్షా ఐదు ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 426 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 29 గ్రామాల్లో ఈ భూమిని సమీకరించనున్నారు. అమరావతిలో రైతుల నుంచి భూమిని సమీకరించి పరిహారం ఇస్తున్న విధంగానే మచిలీపట్నంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు భూ సమీకరణ అధికారాలు కట్టబెడుతున్నట్టు ప్రకటించించారు. ఈ భూ సమీకరణ 2017 జూలై 7 వరకు పూర్తి చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు.
పట్టిసీమను సకాలంలో పూర్తి చేస్తే ఇంక్రిమెంటుగా నెల జీతం  
పట్టిసీమ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన ఇంజనీర్లకు, అధికారులకు, నీటి పారుదల శాఖ సిబ్బందికి ఒక నెల జీతాన్ని ఇంక్రిమెంటుగా ఇవ్వాలని మంత్రిమండలి తీర్మానించింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు ప్రకారం రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎల్ఓటీ ఇచ్చేందుకు నిర్ణయించారు. అమిత్, ఎస్ఆర్ఎం, విట్, సెంచూరియన్, ఫిషరీస్ అండ్ ఓషన్ యూనివర్సిటీలకు ఎల్ఓటీలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2018 నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయంపై ఒత్తిడి తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా జీతాల పెంపుదల కోసం ఎదురుచూస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 6,700 రూపాయల నుంచి రూ.12 వేల వరకు, 11,500ల నుంచి 17,500ల వరకు పెంపుదల చేశారు. 
స్థానికత విషయంలో మార్గదర్శకాలు 
లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్-2లను జెడ్పీ హైస్కూల్స్‌లో పనిచేస్తున్న పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌గా అప్ గ్రేడ్ చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి తరలివచ్చే ప్రజల స్థానికత విషయంలో మార్గదర్శకాలను సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. 

 

21:44 - July 8, 2016

సూర్య, అమలాపాల్, బింధుమాదవి నటించిన చిత్రం 'మేము'. ఈ సినిమా ఇవాళ విదుదల అయింది. ఈ చిత్రానికి నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి.. మరి ఈ  సినిమా ఏ విధంగా ఉందో టెన్ టివి పర్ ఫెక్ట్ రివ్యూను వీడియోలో చూద్దాం...

 

21:25 - July 8, 2016

తెలంగాణలో హరితహారం షురూ, పని సురువైనట్టే పబ్లిక్కు వారం వారం, వైఎస్ చాన్సలర్ అయిన జగన్..చంద్రబాబు పాలనమీద పరీక్షల గన్, అన్ని దేవుళ్లకు అమరభక్తుడైన సారు...హైకోర్టు పంచాయితీ వెంకన్నకు అప్పగింత, రేపల్లే కాడ తోలు చెప్పు దెబ్బలు... పోకిరిగాళ్లతోని ఆడోళ్లకు తిప్పలు, పందిని సజీవ సమాధి జేసిన జనం... ఇంకా ఎప్పుడుమార్తమో ఏమో మనం, శివునికండ్లముంగిటనే లింగం మాయం.. కావలిపట్నం పక్కకు కావలిలేని గుడి, తల్లిపట్ల బిడ్డప్రేమ, దేవుళ్లకు జ్వరం... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

 

 

 

 

వరంగల్ జిల్లా ఎంజిఎంలో దారుణం

వరంగల్ : జిల్లాలోని ఎంజిఎంలో దారుణం జరిగింది. ప్రజల ప్రాణాలతో ఎంజిఎం ఆస్పత్రి వైద్యులు చెలగాటమాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ ఐడీసీ ఎండీ ఆదేశాలను బేఖాతరు చేశారు. నిలిపివేయాలన్న ఆర్ ఎల్ సెలైన్స్ బాటిళ్లను డాక్టర్లు వాడుతున్నారు. దీంతో రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణాకర్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ విచారణ కమిటీలో కరుణాకర్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు.  

 

21:15 - July 8, 2016

వరంగల్ : ఎంజీఎంలో దారుణం వెలుగుచూసింది. ప్రజల ప్రాణాలతో ఎంజిఎం ఆస్పత్రి వైద్యులు చెలగాటమాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ ఐడీసీ ఎండీ ఆదేశాలను బేఖాతరు చేశారు. ప్రభుత్వం నిలిపివేయమని ఆదేశించిన ఆర్‌ఎల్ సెలైన్స్ ను.. ఎంజిఎంలో ఇంకా వాడుతున్నారు. విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. రోగుల పట్ల సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణాకర్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ విచారణ కమిటీలో కరుణాకర్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలే సరోజని దేవి కంటి ఆస్పత్రిలో ఆర్‌ఎల్ సెలైన్స్ బాటిళ్లు వాడడం వల్లే 9 మంది చూపు కోల్పోయారు. 

 

సీపీఎం తిరువూరు డివిజన్ కొత్త భవనాన్ని ప్రారంభించిన బివి.రాఘవులు

విజయవాడ : సీపీఎం తిరువూరు డివిజన్ నూతన భవనాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు ఆర్.రఘు, నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. 

20:55 - July 8, 2016

కర్నూలు : ఓ వైపు దిగంతాలకు శాటిలైట్లను పంపుతున్న దేశం మనది.. అదేసమయంలో ఆదిమకాలపు అంధ విశ్వాసాలను వదులుకోలేని దేశమూ మనదే.  కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పందికోన గ్రామాన్ని సందర్శిస్తే.. పల్లెలు ఇంకా ఎంతటి అంధ విశ్వాసంలో కునారిల్లుతున్నాయో వెల్లడవుతుంది. గ్రామాన్ని వేధిస్తోన్న రోగాలకు మూల కారణాన్ని అన్వేషించకుండా.. దాన్ని పరిష్కరించకుండా.. అతి కిరాతకమైన కార్యక్రమానికి ఒడిగట్టారు. ఇంతకీ ఏంటా కిరాతకం..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
పొలికేకలు.... 
పొలికేకలు పెడుతూ..ఊరంతా తిరుగుతూ.. ధిన్‌ ధిన్‌ ధీన్... అంటూ  కేకలు పెడబొబ్బలు... దుష్టశక్తులున్నాయంటూ హడావుడి... ఈ దృశ్యం చూడగానే మీకీపాటికి విషయం అర్థమైపోయుంటుంది.. ఎస్‌.. వీరు కంటికి కనిపించని దెయ్యాలను పారదోలుతున్నారట.. కత్తులు,కటార్లు పట్టి ఊరేగింపు... గ్రామాన్ని ఏవో దుష్టశక్తులు ఆవహించాయట.. వాటిని పారదోలేందుకంటూ.. మూకుమ్మడిగా కత్తులు, కటార్లు  చేతబట్టి... నిమ్మకాయల దండలు వేసుకుని... ఊరి పొలిమేరల వరకూ ఊరేగారు...దుష్టశక్తులను తరిమేందుకు పందిపిల్లను పాతిపెట్టారు
పందిపిల్లను సజీవంగా పాతిపెట్టారు..
ఇంత తంతూ జరిపినా.. దుష్టశక్తులు తమ గ్రామాన్ని వదలలేదేమోనన్న అనుమానం వారిది. అందుకే.. ఓ జీవిని సజీవంగా పాతి పెట్టేస్తే అన్ని అరిష్టాలూ పోతాయని గ్రామపెద్దలంతా తీర్మానించారు. అనుకున్నదే తడవుగా.. ఓ పందిపిల్లను తెచ్చి సజీవంగా పాతిపెట్టారు.. ఆ తరుణంలో.. పాపం ఆ పందిపిల్ల బేల చూపులు.. పెనుగులాట.. అంధవిశ్వాసంతో ఊగిపోతున్న ఆ మనుషుల్లో ఏమాత్రం మార్పును తీసుకురాలేక పోయింది. 
రోగాలకు దెయ్యాలే కారణమనే అంధవిశ్వాసం
కర్నూలు జిల్లా  పత్తికొండ మండలంలోని పందికోన గ్రామంలో జరిగిన తంతు ఇది.  ఈఊళ్లో 15 రోజులుగా ప్రజలు వాంతులు, విరేచనాలతో సతమతమవుతున్నారు. దీనికి కారణం దెయ్యాలేనన్నది వీరి అంధ విశ్వాసం. దుష్టశక్తుల్ని పారదోలేందుకే ఈ తంతు జరుపుతున్నామని వారు చెబుతున్నారు. 
గ్రామంలో తిష్టవేసిన అపరిశుభ్రదత
పందిని పూడ్చేసిన పందికోన వాసులు.. అసలు గ్రామంలో రోగాలు ప్రబలడానికి కారణం ఏమిటన్నది మాత్రం ఆలోచించడం లేదు. గ్రామాన్ని సందర్శించిన వారెవరికైనా ఇక్కడి అపరిశుభ్ర వాతావరణమే ముందుగా స్వాగతం పలుకుతుంది.  వీధులన్నీ ఇలా బురద నీటితో నిండిపోయాయి. పేడదిబ్బలు.. మురుగు నీటి నిల్వలు.. ప్రతి ఇంటిముందూ కనిపిస్తాయి. గ్రామంలో ప్రబలుతున్న డయేరియాకి ఇదే కారణమన్నది వైద్యుల మాట. అందుకే వారు ఐదు రోజులుగా మెడికల్‌ క్యాంపులు పెట్టి మరీ వైద్యమందిస్తున్నారు. 
పారిశుద్ధ్యాన్ని పట్టించుకోని గ్రామపంచాయతి
అయితే... డాక్టర్ల వైద్యం.. గ్రామస్థుల అంధవిశ్వాసం ముందు పనిచేయలేదు. గ్రామంలో పరిశుభ్రతను నెలకొల్పాల్సిన పంచాయతీ సిబ్బంది విధులను విస్మరించింది. ఫలితం ఊరంతా మురుగు కూపంలా మారి ప్రజలను రోగాల బారిన పడేసింది. విచిత్రమేంటంటే.. గ్రామంలో చదువుకున్న వారు కూడా ఈ అంధవిశ్వాసంలోనే కొట్టుకు పోతున్నారు. ఇక అధికారులెవరూ ఈ గ్రామం గురించి పట్టించుకోక పోవడం లేదు. ఈ దశలో.. గ్రామస్థులు మరింతగా అంధవిశ్వాసంలో కూరుకు పోతున్నారు. 
గ్రామస్థుల మూఢ విశ్వాసాలు 
గ్రామస్థులు మూఢ విశ్వాసంతో ఇప్పటికీ రోగాలతో కునారిల్లుతూనే ఉన్నారు. ప్రాణభయంతో కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నా.. ఎక్కువమంది మూఢ నమ్మకాలతో ఇళ్ల వద్దే ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి.. గ్రామంలోని అనారోగ్యాన్ని.. దాంతోపాటే.. వారి అంధ విశ్వాసాన్నీ పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

20:49 - July 8, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ బిసి సంఘాల ఐక్య వేదిక నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు.  కాపులను బిసిల్లో చేర్చితే తమ రిజర్వేషన్లకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని పాలిక్లీనిక్ రోడ్డులోని బిసి కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మంజునాథ్ కమిషన్ కమిషన్ సభ్యులకు వినతిపత్రం అందచేశారు. కాపులను బీసీల్లో చేర్చితే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

20:36 - July 8, 2016

కడప : ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడప గడపకు వైసీపీ ముఖ్య ఉద్దేశమని వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ఇడుపుల గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై వంద ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను ప్రతి ఇంటిలో ఇస్తామని తెలిపారు. 

 

20:28 - July 8, 2016

హైదరాబాద్ : హరితహారంలో భాగంగా... మంత్రి కేటీఆర్... పలుచోట్ల మొక్కలు నాటారు. సైబరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. మొక్క నాటితేనే ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చే అంశం పరిశీలనలో ఉందని ఆయన అన్నారు.

 

20:22 - July 8, 2016

నెల్లూరు : జిల్లాలోని డీఎస్‌ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం ఓ యువకుడు ఆస్పత్రికి రాగా.. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి తీరును నిరసిస్తూ... ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. 

 

20:18 - July 8, 2016

ఖమ్మం : ఓ మహమ్మారి వికృతరూపం దాల్చుతోంది. జీవితాన్ని కాటు వేస్తుందని తెలిసినా ఆ మహమ్మారినే నోట వేసుకొని గుటుక్కున మింగుతున్నారు. కాసుల కోసం దాన్ని పెంచి పోషిస్తున్నారు అక్రమ వ్యాపారులు. యువత బలహీనతనే బలంగా మార్చుకొని  దందాను కొనసాగిస్తున్నారు.   
గుట్కా అక్రమ వ్యాపారం
ఎంత పడగొట్టినా అంతే వేగంతో పైకి బుస్సున లేచి బుసలు కొడుతోంది. గుట్కా మాఫియా! నెలకు రూ.6 కోట్ల విక్రయాలు పోలీసు శాఖ పట్టించుకోని వైనం.. తయారీ పార్శిల్‌ సర్వీసుల ద్వారా అక్రమ రవాణా జరుగుతోంది.. నామమాత్రపు పెట్టుబడి.. పదిరెట్లు లాభాలు.. ఏటా రూ.100 . కోట్ల టర్నోవరు.. రూ.లక్షల్లో ముడుపులు.. పార్శిల్‌ సర్వీసులే రవాణాకు మార్గం.. ఇదీ జిల్లాలో గుట్కా దందా! ఏబడ్డీ కొట్టు చూసినా.. టీ బంకు దగ్గరైనా.. కిరాణా దుకాణాల్లో అయినా సరే లభించని గుట్కా లేదు. రకరకాల పేర్లు.. ఆకర్షణీయ ప్యాకింగులు.. విడివిడిగా.. మిక్సింగుల రూపంలో లభ్యం. పేరుకే నిషేధం. అమ్మకాల్లో ఇష్టారాజ్యం. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా యధేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయి. అడపాదడపా దాడులు మినహా పోలీసు నిఘా కరవైంది.  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుట్కాల అమ్మకాలపై నిషేధం ఉంది. పొగాకు లేని పాన్‌మసాలపై నిషేధం లేదు. ఆ మాటున గుట్కాలు చెలామణి అవుతున్నాయి. 
నిషేధం తర్వాత గుట్కా వ్యాపారం రెట్టింపు
గుట్కా నిషేధానికి ముందు రెండు, మూడు రోజులకు ఒక లారీ చొప్పున ఖమ్మం నగరానికి వచ్చేది. నిషేధం తర్వాత గుట్కా వ్యాపారం రెట్టింపైంది. వ్యాపారులు అనుమానం రాకుండా ఆర్టీసీ బస్సుల్లో , పార్సిల్ సర్వీసుల్లో గుట్కా బస్తాలను తరలించడం ప్రారంభించారు. హైదరాబాద్‌, వరంగల్‌, నల్గొండ జిల్లా సూర్యాపేట, కోదాడ నుంచి వచ్చే బస్సుల్లో గుట్కాలను జిల్లాలోని వివిధ ప్రాంతాలను తరలిస్తున్నారు. 
గుట్కా వ్యసనంలో 4 లక్షల మంది
ఆశ్చర్యంగా  ఉన్నా ఆరా తీస్తే నిజమే అని నమ్మేవీలుంది. జిల్లాలో తక్కువలో తక్కువగా ఆరు కోట్ల రూపాయల అక్రమ గుట్కా వ్యాపారం నడుస్తుందంటే పరిస్థితి ఏంటో మీరే అంచనా వేయండి. జిల్లా జనాభా 26 లక్షలు. అందులో 4 లక్షల మంది గుట్కా తింటున్నట్లు అంచనా. మార్కెట్‌లో ఒక్కో ప్యాకెట్‌ విలువ రూ.2 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. ఈ ధర సరాసరి రూ.5గా తీసుకున్నా 4 లక్షల మంది రోజుకు ఒక్కో పొట్లం చొప్పున తింటే రూ.20 లక్షలు అవుతోంది. నెలకు 30 రోజులతో గణిస్తే ఆ వ్యాపారం విలువ రూ.6 కోట్లు అవుతుండటం గమనార్హం. నిత్యం రెండు పొట్లాలను తింటే నెలకు రూ.12 కోట్లు అవుతుంది.
గుట్కా వ్యాపారులకు అధికారుల అండదండలు
గుట్కా వ్యాపారం జిల్లాలో విజృంభించడానికి ప్రధాన కారణం అక్రమ దందాకు పాల్పడే వారికి అధికారుల అండదండలు...కొందరికి స్థాయిని అనుసరించి వేల నుంచి రూ.లక్షల్లో అమ్యామ్యాలు సమర్పిస్తున్నారు.  గుట్కా దొరుకుతున్న సమయంలో రూ.50 వేల విలువకు తక్కువ కాకుండా ఉంటుండటం గమనార్హం. గత ఏడాది డిసెంబరు 24న వైరా పాతసెంటర్‌లో రూ.4 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ వాహనంలో వీటిని స్వాధీనం చేసుకోవడం విశేషం. అలాగే ఏడాది జనవరి 9న పాల్వంచ పట్టణంలోని ములకలపల్లి క్రాస్‌రోడ్డులో రూ.2 లక్షల విలువగల సరకు పట్టుబడింది. అదే నెల జనవరి 11న ఏడూళ్లబయ్యారం వద్ద రూ.82 వేల విలువ గల సరకును స్వాధీనపర్చుకున్నారు. తాజాగా నేలకొండపల్లిలో రూ.70 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు దొరకడం గమనార్హం.
యధేచ్చగా అక్రమ రవాణా 
ఇలా ఖమ్మం జిల్లాలో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుంది...మాముళ్త మత్తులో అధికారులు గుట్కా మాపియా జోళికి వెళ్లకపోవడంతో యధేచ్చగా అక్రమరవాణా జరుగుతోంది...ఇకనైనా ప్రభుత్వం మేలుకోని గుట్కా వ్యాపారంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

20:11 - July 8, 2016

వరంగల్ : ఒకపూట తింటే మరోపూట గడవని పేదబతుకులు... కాయకష్టం చేసి ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నఆ పేదల జీవితాల్లో   వ్యాధి మహమ్మారిలా దాపురించింది. తాహతకు మించి ఖర్చుచేసినా ఆ పసివాళ్లకు స్వాంతన దక్కలేదు. వరంగల్‌జిల్లాలో భయంకర చర్మవ్యాధి భారిన పడిన చిన్నారుల బాధలపై టెన్‌టీవీ పోకస్..
'లామరిక్‌ లారిక్‌ టుటీస్‌ ' చర్మవ్యాధి 
'మమ్ముల్ని కాపాడుండ్రి బాంచెను.. మా పిల్లోల్లను  ఆదుకోండి రునపడిఉంటం'... ఇలా  కన్నీటితో వేడుకుంటున్నారా తల్లిదండ్రులు.. ఈ దంపతుల పేరు రవీందర్‌ -తిరుపతమ్మ ...వరంగల్‌జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం వీరిది.  కూలినాలి చేస్తూ.. ఇస్త్రీ పనులు చేస్తూ... కుంటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తిండికి తిప్పలైనా... గుట్టుగా సంసారాన్ని సాగిస్తున్నారు. వీరికి పండంటి ముగ్గురు మగపిల్లలు.. వీరిలో రెండోవాడికి అవినాష్‌, మూడోవాడికి   సంతోష్‌ అని పేరుపెట్టుకున్నారు. చిన్నారు కళ్లముందు కేరింతలు కొడుతూ లేగదూడల్లా గంతులు వేస్తుంటే... చూసి సంతోషపడ్డారు. సంతోషంగా గడుపుతున్న వీరి జీవితాల్లో 'లామరిక్‌ లారిక్‌ టుటీస్‌ ' అనే చర్మవ్యాధి మహమ్మారిలా దాపురించింది. ఇద్దరు చిన్నారులను పట్టుకున్న మొండి చర్మవ్యాధి ఎంతకీ తగ్గలేదు. తాహతకు మించి... 3లక్షలరూపాయలు ఖర్చుపెట్టారు. చిన్నాపెద్దా... అస్పత్రులన్నీ తిప్పారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. 
వొళ్లంతా దురదలు, మంటలు... 
మందులు వాడినప్పుడు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా... కొద్దిరోజుల్లోనే మళ్లీ తిరగబెడుతోంది. వొళ్లంతా దురదలతో ... మంటలతో ... రక్తం, చీముకారుతూ నిత్యం నరకం చవిచూస్తన్నారీ పసివాళ్లు. బయటికి వెళ్లితే.. బస్సుల్లో, ఆటోల్లోకూడా ఎక్కనీయడం లేదని ఆవేదచెందుతున్నారు. పిల్లల బాధను చూడలేక... వైద్యం చేయించే స్తోమత లేక.. కన్నీరు పెట్టుకుంటున్నారీ పేద తల్లిదండ్రులు.
తమ చిన్నారులకు వైద్యం చేయించాలని కోరుతున్న తల్లిదండ్రులు 
ఆస్పత్రులన్నీ తిప్పిన తర్వాత ఖమ్మంలోని మమత హాస్పిటల్లో వైద్యం చేయించారు. అక్కడ కొంత తగ్గినట్టు అనిపించినా... కొద్దిరోజుల్లో మళ్లీ తిరగబెట్టింది. చిన్నారులకు ఎండతగలకుండా... ఎసీ గదిలో మాత్రమే ఉంచాలని వైద్యులు సూచించారు. కుండలకారంతోనే నాలుగు ముద్దలు మింగే బతుకుల్లో ఏసీ గదులు ఎక్కడనుంచి వస్తాయి... అనుకుంటూ.. ఇంటికి చేరుకున్నారు. ప్రతి ఐదు పదినిముషాలకు ఓసారి ఇలా నీళ్లను ఒంటిపై పోసుకుంటూ... సేదతీరుతున్నారీ పసివాళ్లు. తాము వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నామని... తమ చిన్నారులకు వైద్యం చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
రెండో వాడు అవినాష్‌ కు గుండెజబ్బు 
దెబ్బతిన్న వాడినే మరో దెబ్బకొట్టి చూస్తున్నాయి భయంకర వ్యాధులు... ఇప్పటికే చర్మవ్యాధితో బాధపడుతున్న రెండో వాడు అవినాష్‌ కు గుండెజబ్బు తోడయ్యింది. పైన చర్మవ్యాధి మంటలు ... లోపల గుండెవ్యాధి బాధలతో... ఈ పసివాడు వైద్యంకోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు.  మంచి మనసున్న దాతలెవరైనా ఆదుకుని... చిన్నారులకు వైద్యం చేయించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

 

19:42 - July 8, 2016

విజయవాడ : ఎపి సర్కార్ కు భూదాహం తీరడం లేదు. మరో లక్ష ఎకరాలపై ప్రభుత్వ కన్నుపడింది. కృష్ణా జిల్లాలో లక్ష ఎకరాల భూ సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి భూ సమీకరణ బాధ్యతను అప్పగించింది. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బందరు పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో పోర్టు పరిధిలోని గ్రామాల ప్రజల్లో కలవరం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజధాని పేరిట 34 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. 
ఎపిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి...
'భూ సేకరణను వ్యతిరేకిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం భూములను సేకరించడం లేదని.. స్వార్థ ప్రయోజనాలకు భూములను లాక్కొంటున్నారు. వ్యక్తి గత ప్రయోజనాలు తప్ప.. ప్రజలు అభివృద్ధి లేదని' అన్నారు. 
సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు.. 
'ఎపి ప్రభుత్వం తీసుకున్న భూ సమీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. భూసమీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వ్యాపారం చేయడానికే టీడీపీ భూమలున సేకరిస్తుంఃది. టీడీపీ చేస్తున్న చర్యలను ప్రతిఘటిస్తాం. వామపక్షాల అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని' చెప్పారు.  
వైసీపీ నేత పేర్ని నాని..
'ఇది దుర్మార్గమైన చర్య. ఎపి ప్రభుత్వ భూసేకరణ నిర్ణయం దురదృష్టం. రైతులను సర్వ నాశనం చేసి.. వ్యక్తిగతంగా లాభం పొందాలని చూస్తున్నారు. అభివృద్ధి మాటున రైతులను నాశనం చేయాలని చూస్తున్నారని' పేర్కొన్నారు.  

 

మరో లక్ష ఎకారలపై ఎపి సర్కార్ కన్ను....

విజయవాడ : ఎపి సర్కార్ కు భూదాహం తీరడం లేదు. మరో లక్ష ఎకరాలపై ప్రభుత్వ కన్నుపడింది. కృష్ణా జిల్లాలో లక్ష ఎకరాల భూ సమీకరణకు కసరత్తు చేస్తున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి భూ సమీకరణ బాధ్యతను అప్పగించింది. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

డిక్కీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్ : డిక్కీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బలహీన వర్గాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం లక్ష్యమని చెప్పారు. బలహీన వర్గాలకు ఉపాధి, సంపద సృష్టించేంత వరకు పారిశ్రామిక విధానానికి సార్థకత లేదన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేసేలా త్వరలో అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. 

పరువు హత్య కేసు విచారణలో కొత్త మలుపు

విజయవాడ : పరువు హత్య కేసు విచారణలో కొత్త మలుపు తిరిగింది. నజ్మా ప్రియుడు దీపక్ ను పోలీసులు అరెస్టు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దీపక్ కు అండగా నిలిచారు. దీపక్ సెల్ ఫోన్ నుంచి కీలక సమాచారం సేకరించారు. దీపక్ గత జీవితపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. నజ్మా హత్యోదంతంలో మరో 14 మంది ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. నజ్మా తల్లి బీబీజాన్ ను  ముందుపెట్టే ప్రయత్నం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. 

19:27 - July 8, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్లక్ష్యం చేస్తోందని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడద్డి విమర్శించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్.... పాలన కంటే పక్క పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మీదనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలకు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక్క యూపీఏ పాలనకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంచార్జ్‌ దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

19:00 - July 8, 2016

హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఐసిస్‌ కలకలం రేపింది. సంతోష్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఐసిస్‌ అనుమానితుడిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పాతబస్తీలో ఐదుగురు ఐసిస్‌ ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. 

హైదరాబాద్‌లో ఐసిస్ అనుమానితుడి అరెస్టు

హైదరాబాద్ : నగరంలో మళ్లీ ఐసిస్‌ కలకలం రేపింది. సంతోష్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఐసిస్‌ అనుమానితుడిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పాతబస్తీలో ఐదుగురు ఐసిస్‌ ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. 

 

టీసర్కార్ పై లక్ష్మణ్ విమర్శలు

ఢిల్లీ : ప్రాజెక్టుల పేరుతో టీ.ప్రభుత్వం పేద ప్రజల ఆశలను సొమ్ముచేసుకుని... మోసం చేస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతుందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను రాజకీయంగా ఎదుర్కొవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు
ఎండగట్టాలని అన్నారు. టీఆర్ ఎస్ ఓట్ బ్యాంకింగ్ ను ఎదుర్కొవాలని పిలుపినిచ్చారు. 

18:45 - July 8, 2016

ఢిల్లీ : ప్రాజెక్టుల పేరుతో టీ.ప్రభుత్వం పేద ప్రజల ఆశలను సొమ్ముచేసుకుని... మోసం చేస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ప్రజలను ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతుందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను రాజకీయంగా ఎదుర్కొవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు
ఎండగట్టాలని అన్నారు. టీఆర్ ఎస్ ఓట్ బ్యాంకింగ్ ను ఎదుర్కొవాలని పిలుపినిచ్చారు. 

 

17:48 - July 8, 2016

విజయవాడ : రాష్ట్రంలోని 15745 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లైవ్ తెలిపారు. విజయవాడలో ఎపి కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. వచ్చే నెల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కనీస వేతనం రూ.6700 నుంచి 12000 వరకు పెంచుతున్నట్లు చెప్పారు. పట్టిసీమ సకాలంలో పూర్తి చేసిన అధికారులకు ఒక నెల ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లక్ష 75 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీరపనేనిగూడెంలో డిఫెన్స్ మిషనరీ మ్యాన్ ఫ్యాక్చరీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మచిటీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అధికారిటీకి అధికారాలను ఇచ్చినట్లు చెప్పారు. 420 స్క్వేర్ యార్డ్స్ స్థలం చొప్పున 29 గ్రామాల్లోని స్థలాన్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2017 జులై లోపు భూములు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సీఆర్ డీఏలో పొందుపరిచిన అంశాలు భూ సేకరణకు వర్తిస్తాయని చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఐదు యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎల్ వోయూ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఎస్ ఆర్ ఎం యూనిర్సిటీ, సెంచూరియర్ యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, మిషనరీస్ యూనివర్సిటీలకు ఎల్ వోయూ లు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. విజయనగరంలో సెంచూరియర్ యూనివ్సిటీ, భీమవరంలో మిషనరీస్ యూనిర్సిటీ ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పారు. ఇవే కాక.. వాటర్ యూనివర్సిటీ, ఎనర్జీ యూనివర్సిటీ, ఫంక్షన్ యూనివర్సిటీ, హాస్పిటాలిటీ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

 

17:19 - July 8, 2016

ఇటీవలే వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టింది. కొద్దిసేపటికి నిప్పులాంటి నిజం తెలుసుకుంది. ఏదో ఊహించుకోకండి. అసలు సంగతి తెలిస్తే కరెక్టే కదా అని అనుకుంటారు. దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి..

బీహార్ లోని కొత్తా గ్రామంలో నివాసం ఉండే బబ్లూ కుమార్ కు మే నెలలో ఓ మహిళతో వివాహం జరిగింది. అత్తవారింట మరుగుదొడ్డి లేకపోవడం గ్రహించింది. ఆరు బయటకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. టాయిలెట్ నిర్మించాలని భర్తకు చెప్పింది. బబ్లూ ఆమె మాటలను పెడచెవిన పెట్టాడు. ఇంట్లో వారిని కట్టివ్వాలని కోరాలని బబ్లూ చెప్పాడంట. దీనితో ఆగ్రహానికి గురైన మహిళ గ్రామ పంచాయతీకి వెళ్లి సమస్యను వెలువరించింది. చివరకు బబ్లూకు విడాకులిచ్చేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎంతో మందికి మరుగుదొడ్లు లేవని వార్తలు వస్తున్నాయి.

17:14 - July 8, 2016

ఢిల్లీ : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షడు అమిత్‌షా ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కంభంపాటి మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రైల్వే జోన్ అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో నాలుగు కీలక సమావేశాలు నిర్వహించానున్నామని కంభంపాటి చెప్పారు. 

17:09 - July 8, 2016

వరంగల్ : హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆపరేషన్ ఘటన నేపథ్యంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా నిల్వ ఉన్న హసీబ్ కంపెనీకి చెందిన 80వేల ఆర్ఎల్‌ సెలైన్‌ బాటిళ్లను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎంజిఎంతో సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఏపీలో ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంపు....

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమావేశానికి సంబంధించిన వివరాలను ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ వివరించారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచినట్లు తెలిపారు. లోటు బడ్జెట్ లో ఉన్నా వేతనాలు పెంచడం జరిగిందన్నారు. పట్టిసీమను పూర్తి చేసిన అధికారులకు ఒక నెల ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలు..సంస్థలకు వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 15,745 ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెరిగినట్లు, ఇది ఒక శుభవార్త అని తెలిపారు. మచిలీపట్నం డెవలప్ మెంట్ అథార్టీకి భూ సేకరణ అధికారం కల్పించినట్లు తెలిపారు.

16:59 - July 8, 2016

హైదరాబాద్‌ : నగరంలోని తార్నాకలో ఎస్‌కే గ్లోబల్‌ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది. 200 మంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 50 వేల రూపాయల నుంచి లక్ష వరకు వసూలు చేశారు. నిర్వాహకుడు పవన్‌ పరారీలో ఉన్నాడు. బాధితులు ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

 

షాతో టి. బిజేపీ కోర్ కమిటీ భేటీ..

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన తెలంగాణ బిజెపి కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు, లక్ష్మణ్, రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

16:54 - July 8, 2016

స్నానం చేస్తే ఎక్కడ చేస్తారు ? గిదేం ప్రశ్న. బాత్ రూంలో చేస్తారు. ఎక్కడికైనా వెళితే..బీచ్ లో..సముద్ర వద్ద స్నానం చేస్తారు..అంటారు కదా. కానీ ఓ అమ్ముడు చేస్తున్న బాత్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆమె సన్ బాత్ వ్యవహారాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఆమె ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయింది.
రష్యాలోని నోవోసీబ్రిర్క్స్ క్రోపోట్కిన్ వీధి ఒకటి ఉంది. ఈ వీధిలో ఓ అపార్ట్ మెంట్ లో రెండో అంతస్తు నుండి ఓ ఇంటి కిటికీ నుంచి ప్రతిరోజూ కనిపించే మహిళ సన్‌బాత్ దృశ్యం ఇరుగు పొరుగులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బికినీ ధరించి, తల మాత్రమే లోపల ఉంచి మిగిలిన శరీరభాగం కిటికీ నుంచి బయటకు కనిపించేలా సన్‌బాత్ చేస్తుందంట. ఇలా స్నానం చేయడం వల్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నారంట. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారంట. చివరకు ఆమె విండో సన్‌బాత్‌ను ఆపించాలంటూ ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్‌ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్‌కు, పోలీసులకు ఇచ్చారు. అయినా ఫలితం కనబడలేదు. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

దక్షిణాఫ్రికాలో మోడీ పర్యటన..

దక్షిణాఫ్రికా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఎన్ఎస్ జీలో భారత్ కు సభ్యత్వంపై మద్దనిచ్చినందుకు దక్షిణాఫ్రికా కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయన్నారు.

16:43 - July 8, 2016

బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ జంటపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వాళ్లే దీపికా పదుకొణే..రణవీర్ సింగ్...వీరికి నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో కూడై కోస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరూ కూడా పబ్లిక్ గా ఫంక్షన్ లలో కూడా దర్శనమివ్వడంతో ఈ వాదనలు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం అదే నిజమైందని తెలుస్తోంది. అంతేగాకుండా ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో కూడా దీపికా, రణ్‌వీర్ లు దర్శనమిచ్చారు. వీరిని చూసిన వీక్షకులు త్వరలోనే ఈ జంట ఒక్కటి కానుండడం ఖాయం అంటూ కన్‌ఫాం చేసేస్తున్నారు. ఇదంతా నిజం చేస్తూ దీపిక, రణవీర్‌లు ఉంగరాలు మార్చుకున్నారట. కాని ఈ విషయంపై బాజీరావ్ మస్థానీలు ఇంకా స్పందించలేదు. మరి నిశ్చితార్థం జరిగిందా ? లేదా ? అనేది వీరు చెబితేనేత తెలుస్తుంది.

హామీల అమలుకు కృషి - ఎంపీ హరిబాబు..

ఢిల్లీ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం నిర్మాణానికి రైల్వే జోన్ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ హరిబాబు తెలిపారు. పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అమిత్‌షాకు వివరించామని హరిబాబు చెప్పారు.

దొంగే దొంగ అన్నట్లుగా ఉంది - సోమిరెడ్డి..

హైదరాబాద్ : వైసీపీ చేపట్టిన గడపగడపకు వైసీపీపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాసేపటి క్రితం టిడిపి నేత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. టిడిపి 1.45 వేల కోట్ల అవినీతి చేసిందనడం సరికాదనని, టిడిపి అవినీతి చేసిందనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి పాలన చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని, రెండు సంవత్సర కాలంలో ఒక్క అవినీతిని చూపించారా ప్రశ్నించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి మీద మనీలాండరింగ్ కేసు..ఐపీసీ సెక్షన్లు నమోదయ్యాయన్నారు.

రాయల్ ప్లేస్ మెంట్ కన్సల్టెన్సీ మోసం..

హైదరాబాద్ : మరో కన్సల్టెన్సీ కుచ్చుటోపి పెట్టింది. రాయల్ ప్లేస్ మెంట్ కన్సల్టెన్సీ నిరుద్యోగులను మోసం చేసింది. మెట్రో రైలు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ. 30 నుండి రూ. 90 లక్షల వరకు ప్రతాప్ రెడ్డి వసూలు చేశారు. ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసి రూ. 5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

డీఎస్ఆర్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం..

నెల్లూరు : డీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. కానీ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో యువకుడు మృతి చెందాడు. ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన చేస్తున్నారు.

కంటి ఆపరేషన్ల ఘటనపై వరంగల్ వైద్యాధికారుల అప్రమత్తం..

వరంగల్ : సరోజిని దేవి కంటి ఆపరేషన్లు వికటించిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా నిల్వ ఉన్న హసీబ్ కంపెనీకి చెందిన 80 వేల ఆర్ఎల్ సెలైన్ లు నిలిపివేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎంజీఎంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

టిడిపి సమన్వయ కమిటీ భేటీ..

విజయవాడ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన టిడిపి సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం..గడపగడపకు వైసీపీ..నియోజకవర్గాల్లో వర్గ విబేధాలపై కమిటీ చర్చిస్తోంది. పది మంది సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

15:44 - July 8, 2016

వరంగల్ : జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అపృశృతి చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఓ కార్మికుడు మృతి చెందాడు. వరంగల్ మున్సిపాలిటీలో రాజు అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇవాళ వరంగల్ లో ఏర్పాటు చేసిన హరితహారంలో జెండా ఏర్పాటు చేశారు. రాజు...  కర్రకు జెండా కడుతుండగా కర్ర విద్యుత్ తీగలకు తగలింది. దీంతో కార్మికుడు రాజుకు విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజు మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అక్కడి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ విషాదం జరిగిందని పలువురు ఆరోపించారు. ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, రాజు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఇదిలావుంటే మంత్రి, మేయర్ ఎవరు కూడా మృతుని కుటుంబాన్ని పరామర్శించలేదు. దీంతో మృతుని కుటుంబసభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

15:32 - July 8, 2016

కృష్ణా : విజయవాడలో ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అధారిటీకి పలు అధికారులు కట్టబెట్టింది. పల్స్ సర్వే విజయానికి సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఉద్యోగుల తరలింపుపై కేబినెట్ లో చర్చించారు. స్థానికత విధివిధానాలపై మంత్రివర్గం చర్చించింది. ప్రైవేట్ యూనివర్సిటీలపై కూడా చర్చ చేపట్టారు. ఇన్నోవేషన్ సొసైటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

15:32 - July 8, 2016

ఏంటీ అల్లూ అరవింద్ విలనా ? ఈ మాటలు అన్నది రానా అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఈ వ్యాఖ్యలు చేసింది రానానే. కోపంగా కాదు లెండి...దేని గురించి రానా ఈ వ్యాఖ్యలు చేశారో చదవండి..

రానా..బాహుబలిలో భల్లాల దేవుడిగా అందర్నీ అలరించాడు. ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతని రూపం..అతని చేష్టలు..ప్రవర్తనతో భయపెట్టే రీతిలో ఆ చిత్రంలో రానా నటించాడు. బెస్ట్ విలన్ గా సైమాలో రానాకు అవార్డు లభించింది. ఈ అవార్డు అల్లూ అరవింద్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఆ సమయంలో రానా మాట్లాడారు. అరవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు చాలా సంతోషంగా ఉందన్నాడు. కానీ నాకు రియల్ లైఫ్ లో 'విలన్' అంటూ వ్యాఖ్యానించారు. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లే సమయంలో చరణ్, తాను క్లాస్ లు ఎగ్గొట్టి, సినిమాలకు వెళ్లావారమని పేర్కొన్నాడు. ఈ విషయం అల్లూ అరవింద్ కు తెలిసిపోయేదని, ఈ విషయాలన్నీ అల్లు అరవింద్ అందరికీ చెప్పేవాడని తెలిపాడు. ఇలా చేయడం వల్ల తాము అల్లూ అరవింద్ అంటేనే భయపడిపోయే వాళ్లమని చెప్పుకొచ్చాడు. ఇలా సరదాగా రానా వ్యాఖ్యలు చేశారు.

దక్షిణాఫ్రికాలో మోడీ పర్యటన..

ప్రిటోరియా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో భేటీ అయ్యారు. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక అంశాలపై జుమాతో చర్చిస్తున్నారు. అంతకుముందు రాజధాని ప్రిటోరియాలో మోడీకి ఘన స్వాగతం లభించింది.

బోర్డు తిప్పేసిన ఎస్ కే గ్లోబల్ కన్సల్టెన్సీ...

హైదరాబాద్ : తార్నాకాలో ఎస్ కే గ్లోబల్ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేసింది. 200 మంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 2 కోట్ల వరకు బోర్డు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుండి రూ. 50 నుండి రూ. లక్ష వరకు వసూలు చేసింది. నిర్వాహకుడు పవన్ పరారీలో ఉన్నాడు. ఓయూ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.

కేజ్రీవాల్ కు బెయిల్..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. బీజేపీ ఎంపీ రమేష్ క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనను గుండా అని సంబోధించడాన్ని కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు.

ఉమ్మడి హైకోర్టు పిల్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును విభజించాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణనను ఈనెల 12కు వాయిదా వేసింది.

14:58 - July 8, 2016

పేయింటింగ్ ను చాలా మంది ఇష్టపడుతుంటారు. పేయింటింగ్ ను నేర్చుకోవాలని అనుకున్నా వారికి అవకాశాలు దొరకవు. అంత ఆసక్తిగా..ఓపికగా ఎవరు నేరిపిస్తారు ? అనే సందేహం వస్తుంది. మానవి కార్యక్రమంలో 'సొగసు' లో పేయింటింగ్ ఎలా నేర్చుకోవాలో వివరించారు. పేయింటింగ్ ఎలా చేశారో వీడియో క్లిక్ చేయండి.

ముగిసిన ఏపీ కేబినెట్...

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథార్టీకి పలు అధికారాలు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పల్స్ సర్వే విజయవంతానికి సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు. ఉద్యోగుల తరలింపుపై కేబినెట్ లో చర్చ జరిగింది. స్థానికత విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది.

 

హార్దిక్ పటేల్ కు బెయిల్..

గుజరాత్ : పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కు బెయిల్ లభించింది. రాజద్రోహం కేసులో హార్ధిక్ అరెస్టయిన సంగతి తెలిసిందే. శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ ను విడిచి పెట్టవద్దని కోర్టు షరతు విధించింది.

మోడీకి ఏచూరి లేఖ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీకి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి లేఖ రాశారు. బ్యాంకుల నుండి కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న రుణాలు తీసుకున్న రికవరీపై దృష్టి పెట్టాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు రూ. 8.5 లక్షల కోట్ల రుణాలను తిరిగి చెల్లించడం లేదని పేర్కొన్నారు.

 

14:26 - July 8, 2016

రంగారెడ్డి : శంషాబాద్ లో నిర్వహించిన రెండో దశ హరిత హరం కార్యక్రమంలో సినీ హిరో అక్కినేని అఖిల్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మొక్కల పెంపకం ఎంతో అవసరమన్నారు.

14:24 - July 8, 2016

కర్నూలు : జిల్లాలో ఓ ఊరిలో రాత్రిళ్లు కొంతమంది కత్తులు..కర్రలతో హాహాకారాలు చేస్తూ ముందుకెళుతున్నారు. చోరీలు అధికమయ్యాయా ? అందుకే ఇలా తిరుగుతున్నారా అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ ఊరికి గాలి సోకిందనే మూఢనమ్మకంతో గ్రామస్తులు ఈ విధంగా చేస్తున్నారు. పత్తికొండ మండలం పందికోన గ్రామంలో విష జ్వరాలు అధికమయ్యాయి. డయేరియా తదితర వ్యాధులు అధికమౌవడంతో గాలి సోకిందని గ్రామస్తులు భావించారు. 15రోజులుగా గ్రామంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయంటూ ప్రజలు హడావుడి చేస్తున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నారు. పందికి పూజలు నిర్వహించి సమాధి చేస్తున్నారు. గ్రామంలో ప్రబలిన డయేరియాకి భూతాలే కారణమని పందికోన గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దెయ్యాలను తరుముతామంటూ.. గ్రామస్తులంతా అర్ధరాత్రి గస్తీలూ తిరుగుతున్నారు.

కత్తులు..కటార్లు...
ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపుగా ప్రతి ఇంటి నుంచీ ఒకరు చొప్పున పందికోన వాసులంతా కత్తులు, కటార్లు పట్టుకుని రాత్రిళ్లు ఊరంతా కలియ తిరుగుతున్నారు. దుష్టశక్తులు ఊళ్లోకి రాకుండా చేస్తున్నామంటూ పొలిమేరల్లో తెల్లవార్లూ జాగారం చేస్తున్నారు. విషజ్వరాలు, డయేరియాలకు భూతాలు, దెయ్యాలే కారణమంటూ నమ్ముతున్నారు. గ్రామదేవతలకు నైవేద్యాలు పెట్టి రోగాలు తగ్గాలని పూజలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మూగజీవిని సజీవంగా పాతిపెడితే రోగాలు నయమవుతాయని ఎవరో చెప్పారని ఓ పందిపిల్లను ఊరేగించి సజీవంగా పాతిపెట్టేశారు. ఆ సందర్భంగా పందిపిల్ల దైన్యపు చూపులు  పెనుగులాట గ్రామస్థుల్లో ఏమాత్రం మార్పును తీసుకురాలేదు. 

వైద్యులు స్పందించలేదు..
గ్రామంలో విషజ్వరాలు.. డయేరియా ప్రబలిందన్న సమాచారం అందినా వైద్యాధికారులు పెద్దగా స్పందించలేదన్నది గ్రామస్థుల వాదన. పైగా ఏఎన్‌ఎంలతో మందులు ఇప్పించి తూతూ మంత్రపు వైద్యమిచ్చారని ఆరోపిస్తున్నారు. ఇంతా చేస్తే.. గ్రామంలో డయేరియా ప్రబలడానికి కారణమైన అపరిశుభ్రత గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పందికోనలో పారశుద్ధ్యం పూర్తిగా లోపించింది. రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి. మంచినీరు కలుషితమైపోయింది. ఫలితంగా ఊరంతా రోగాలతో మూలుగుతోంది. అయితే.. దీనికి కారణం గ్రామదేవతలకు కోపం రావడమేనంటూ అంధవిశ్వాసాలను ఆచరిస్తున్నారు పందికోన వాసులు.

డయేరియా కేసులు..
ఈ ఘటనపై వైద్యులు పత్తికొండ శ్రీలేఖ స్పందించారు. పందికోన గ్రామంలో డయేరియా కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. రైతులు మందులు వాడిన తరువాత చేతులు కడుక్కోకుండా అలాగే ఆహారం తీసుకుంటున్నారని తెలిపారు. దీనితో వారికి డయేరియా వ్యాధి వ్యాపించిందన్నారు. కేసులు ప్రస్తుతం ఎక్కువగా లేవని కానీ ప్రజల్లో మాత్రం మూఢనమ్మకాలు నెలకొని ఉన్నాయన్నారు. మూఢనమ్మకాలను తగ్గించే ప్రయత్నం చేయడం జరిగిందని, ఇలా చేయడం వల్ల వ్యాధులు తగ్గవని వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు.

14:12 - July 8, 2016

నల్గొండ : సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న బస్సును విద్యార్థులు అడ్డుకున్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ నినాదాలు చేశారు. భారీ భద్రతను దాటుకుని వచ్చిన విద్యార్థులను పోలీసులు ఈడ్చిపారేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చాలని వారు గొంతెత్తి నినాదాలు చేశారు.
చిట్యాల మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు..ఇతరులు కోరుతున్నారు. కానీ అధికారులు స్పందించకపోయేసరికి విద్యార్థులు పలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. హరితహారం కార్యక్రమలో భాగంగా సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చారు. ఆయనకు తమ సమస్యను తెలియచేయాలని ఎస్ఎఫ్ ఐ విద్యార్థులు యోచించారు. గుండ్రాంపల్లిలో జరిగిన కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ తిరుగుపయనమయ్యారు. చౌటుప్పల్ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా బారికేడ్లు దూకిన విద్యార్థులు సీఎం కేసీఆర్ బస్సును అడ్డుకున్నారు. ఒక్కసారిగా జరిగిన హఠాత్ పరిణామంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని..కేజీ టూ పీజీ విద్య అమలు చేయాలని...పేదలకు ఉచితంగా విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జరిపిన లాఠీఛార్జీలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అరెస్టు చేసిన విద్యార్థులను పీఎస్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల నేతలు, ప్రజా సంఘాలు విద్యార్థులను పరామర్శించారు.

సీఎం పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం..

నల్గొండ : సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపెట్టారు. చిట్యాలలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. మండల కేంద్రంలో డిగ్రి కాలేజీ ఏర్పాటు చేయాలని, కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జీ చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

13:59 - July 8, 2016

హైదరాబాద్ : చిన్నారి సానియా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తమ పరిధిలోకి రాదని ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాలని రాజేంద్రనగర్ సూచించింది. దీంతో చిన్నారి సానియా ఎవరికి చెందుతుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇటీవల రూపేష్ వ్యక్తి భార్య సింథియాను హత్య చేసి ముక్కలుగా నరికి నగర శివారులో కాల్చివేసేందుకు యత్నిస్తూ స్థానికులకు పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితున్ని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. ఈమేరకు ఇవాళ సింథియా కూతురు సానియాను పోలీసులు రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఫ్యామిలీ కోర్టు వెళ్ళాలని సూచించింది. 

13:51 - July 8, 2016

గుంటూరు : ఏపీలో ప్రజా సాధికార సర్వేను శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రజా సాధికార సర్వే ద్వారా ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ నెంబర్ లను రికార్డు చేసి ప్రభుత్వ పథకాల అందుతున్న తీరుకు సంబంధించిన వివరాలను సేకరించినున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే పేదప్రజలకు మెరుగైన పథకాలు అందించి, ఆర్దిక అసమాతలు తగ్గించే విథంగా పనిచేస్తుందని ఆయన కాంతిలాల్ దండే అభిప్రాయపడ్డారు. పల్స్ సర్వే పై గుంటూరు జిల్లా కలెక్టరు కాంతి లాల్ దండే నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు.

విశాఖలో పల్స్‌ సర్వేను ప్రారంభించిన ఎంపీ శ్రీనివాస్‌...
విశాఖలో పల్స్‌ సర్వేను ఎంపీ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు తమ కుటుంబ సభ్యుల వివరాలు అందించారు. ఈ సర్వే కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా 70మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ చెప్పారు. మండలస్థాయిలో ఎంపిడీవోలు, తహశీల్దార్లు పల్స్‌ సర్వేను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 2వేల 630 మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నట్టు ఎంపీ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడానికి ఈ పల్స్‌ సర్వే ఉపయోగపడుతుందన్నారు.

13:49 - July 8, 2016

గుంటూరు : నరసరావు పేటలో భారీ ఎత్తున పర్యవరణాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటుతుంటే, ఉన్న చెట్లను నరకడం బాధాకరమని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. స్పీకర్ కోడెల గుంటూరు నుంచి నరసరావుపేట కి వచ్చే దారిలో ఫిరంగిపురం దగ్గర చింత చెట్లను నరికి వాటి మొద్దులను తరలించటం గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆరెస్ట్ చేయించారు. అక్రమంగా చెట్లను నరికివేసే కలప మాఫీగా కఠినంగా వ్యవహరిస్తామని కోడెల తెలిపారు. 

13:46 - July 8, 2016

గుంటూరు : బాలికను వేధిస్తున్న యువకుడికి స్ధానికులు దేహశుద్ది చేశారు. రేపల్లెలో పదవతగరతి చదువుతున్న విద్యార్థినిని యువకుడు వేధిస్తుండటంతో స్ధానికులు యువకుడి పట్టుకోని దేహశుద్ది చేశారు. అనంతరం ఆ యువకుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. బాలిక స్కూలుకు వెళ్లి వస్తుండగా సదరు యువకుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని తల్లికి సదరు బాలిక తల్లికి వివరించింది. బాలికను స్కూలు పంపించి తాను కూడా వెంబడించగా సదరు ప్రబుద్ధుడు బాలికను వేధిస్తూ ఆకతాయి వెంబడించాడు. వెంటనే ఆ యువకుడిని పట్టుకున్న బాలిక తల్లి చెప్పుతో దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసింది. కాగా ఇటువంటి ఘటనలు తరచూ దాదాపు అన్ని ప్రాంతాలలోనూ జరుగుతున్నాయని వీటిపట్ల పోలీసులు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అడ్వకేట్ మంజుల వివర్శించారు. ఇటువంటి ఆకతాయిల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే బాలికలు ధైర్యంగా స్కూలు వెళ్లే అవకాశం వుంటుందని ఆమె అన్నారు. 

13:34 - July 8, 2016

కర్నాటక : ఓ టీచర్ కోసం ప్రాథమికోన్నత విద్యార్థులు రోడ్డెక్కారు. రెండు గంటల పాటు రోడ్డును దిగ్భందించారు. వీరి ఆందోళనకు తల్లిదండ్రులు, గ్రామస్తులు మద్దతు పలికారు. ఈ ఘటన రామనగరంలో చోటు చేసుకుంది. విద్యార్థులు ఆందోళన చేయడంతో రామనగరం - మగది ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్ లో అనసూయమ్మ టీచర్ ను డిపార్ట్ మెంట్ బదిలీ చేసింది. దీనిపై స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ఈ స్కూల్ కు రప్పించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ ఆఫీసర్ కుమారస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ఆయన ఉన్నా ఇక్కడకు చేరుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీనివ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

13:26 - July 8, 2016

విజయవాడ : సీఎం క్యాంప్ కార్యాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఏపీలో ఆరు అటానమస్ యూనివర్శిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్శిటీల్లో వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వీఐఎస్టీ, ఎస్ఆర్ఎం సంస్థలకు కేపిటల్ ప్రాంతంలో భూమిని ప్రభుత్వం కేటాయించింది. మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి..

సదావర్తి సత్రం భూముల్లో భారీ అక్రమాలు - సీపీఐ..

తిరుపతి : సదావర్తి సత్రం భూముల్లో భారీగా అక్రమాలు జరిగాయని సీపీఐ నేత నారాయణ వెల్లడించారు. రూ. 400 కోట్ల విలువైన భూములు రూ. 23 కోట్లకే కట్టబెట్టారని విమర్శించారు. తమిళనాడులోని వామపక్ష పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.

గడపగడపకు వైసీపీ ప్రారంభం..

కడప : ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో వైసీపీ అధ్యక్షుడు జగన్ నివాళులర్పించారు. అనంతరం 'గడప గడపకూ వైసీపీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. మోసం చేసే నేతలను ప్రజలు నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.

13:09 - July 8, 2016

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం హరిత హారం కార్యక్రమంలో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు జిల్లాల్లో మంత్రులు మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో కదంబ మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల కరవులు వస్తున్నాయని, వనం ఎంత పెంచితే వర్షం అంతగా వస్తుందని వెల్లడించారు. తెలంగాణను పచ్చగా చేసేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రెండు వారాల పాటు 24 గంటలు మ‌న‌కు చెట్లు పంచ‌డ‌మే ప‌ని కావాల‌ని, అడ‌వుల శాతాన్ని పెంచితే కోతులు వెళ్లిపోతాయ‌న్నారు. చెట్టును పెంచడమంటే మనల్ని మనం బాగు చేసుకోవడమేన‌ని, వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అన్నారు. ప్రతీ పాఠశాల ఆకుప‌చ్చ ఒడి కావాలె అని, లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమని పేర్కొన్నారు. అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని, పది రోజులు కష్టపడినా మొక్కలు పెరగలేదనే అపవాదు రాకుండా వాటిని కాపాడాలని సూచించారు. హరితహారంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అనంతరం జాతీయ రహదారిపై మొక్కలు నాటుతున్న ప్రాంతాన్ని హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో విచారణ..

ఢిల్లీ : కృష్ణా నీటి పంపకాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో విచారణ ప్రారంభమైంది. నేడు తెలంగాణ తరపున వైద్య నాదన్ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నీటి కేటాయింపు వివరాలను ట్రిబ్యునల్ కు వైద్యనాదన్ అందచేశారు. మధ్యాహ్నం త్రీడీ మ్యాప్ ద్వారా నీటి కేటాయింపు వివరాలను ట్రిబ్యునల్ కు వివరించనున్నారు.

సానియాను ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లాలని కోర్టు సూచన.

హైదరాబాద్ : చిన్నారి సానియాను రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. సానియాను ఎవరి దగ్గర ఉంచాలన్నదానిపై కోర్టు విచారించింది. తమ పరిధిలోకి రాదని రాజేంద్రనగర్ కోర్టు పేర్కొంది. ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇటీవలే కాంబే దేశస్థురాలు సింథియాను భర్త దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

దుండగులను పోలీసులకు పట్టించిన కోడెల...

గుంటూరు: గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద 100 ఏళ్ల నాటి చెట్టు నరికివేస్తున్న దుండగులను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు స్వయంగా పట్టుకుని పోలీసులకు పట్టించారు. గుంటూరు నుంచి నరసరావుపేట వెళుతున్న స్పీకర్‌కు రోడ్డు పక్కన చింతచెట్లను నరికివేస్తూ కొంతమంది కంటపడ్డారు. వెంటనే స్పీకర్ కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. ఆయనను చూడగానే దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించగా సెక్యురిటీ సిబ్బంది పట్టుకున్నారు. స్పీకర్‌ కోడెల నిందితులను స్వయంగా తన కారులో ఎక్కించుకుని వెళ్లి పోలీసులకు పట్టించారు.

వైసీపీకి సుప్రీంలో చుక్కెదురు...

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో వైసీపీకి చుక్కెదురైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వేసిన ఫిటిషన్‌ను శుక్రవారం విచారించిన థర్మాసనం తిరస్కరించింది.

హనుమంతుడి రూపంలో యోగి ఆదిత్యనాథ్..

ఉత్తర్ ప్రదేశ్ : గోరఖ్ పూర్ లో పోస్టర్ వార్ కొనసాగుతోంది. బీజేపీ మైనార్టీ వింగ్ పోస్టర్ పై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి. హనుమాన్ రూపంలో యోగి ఆదిత్యనాథ్ ను చిత్రీకరిస్తూ పోస్టర్స్ వెలిశాయి. 'సారా యూపీ డోల్ రహా హై..యోగి యోగి బోల్ రహా హై..2017 మే యోగీజీ ఆయేంగే.. రామ్ మందిర్ బన్ వాయేంగే..ముస్లిం సమాజ్ నిర్మాణ్ మే అప్నీ మహత్ పూర్ణ్ భూమికా దర్జ్ కరాయింగే' అని పోస్టర్స్ లో పేర్కొన్నారు.

12:34 - July 8, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో టౌన్‌ప్లానింగ్‌ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. కార్పొరేషన్ అవినీతిపై దృష్టిపెట్టిన బల్దియా బాస్... ఒక్కొక్క విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టౌన్‌ప్లానింగ్‌ను క్లీన్‌ చెయ్యడం కోసం భారీగా బదిలీలు చేపట్టారు.

ఒకేసారి 17 మంది అధికారుల బదిలీ..
బల్దియాలోని టౌన్‌ప్లానింగ్‌ ప్రక్షాళనకు మంత్రి కేటీఆర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ముందడుగు వేస్తున్నారు. ఏకంగా 17 మంది అధికారులను ఒకేసారి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నగర నిర్మాణంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులదే కీలక పాత్ర. నగరంలో ఎలాంటి నిర్మాణానికైనా టౌన్‌ప్లానింగ్‌ విభాగం అనుమతులు తప్పనిసరి. చిన్న నిర్మాణం నుంచి బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులివ్వాల్సింది ఈ విభాగమే. ఇక గ్రేటర్ కార్పొరేషన్‌కు వస్తున్న ఆదాయంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగానిదే అగ్రస్థానం. ప్రతి ఏడాది సుమారు 650 కోట్ల రూపాయల నుంచి 700కోట్ల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది.

బల్దియాలో కీలక విభాగం టౌన్‌ప్లానింగ్...
బల్దియాలో ప్రధానమైన ఈ విభాగంలో అదే స్థాయిలోనే అవినీతి ఉంది. ఫైల్ కదలాలంటే పైసలు ముట్టచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని సక్రమంగా ఉన్నాకూడా సకాలంలో అనుమతులు రావడంలేదనే విమర్శలూ ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీకి అందుతున్న ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికే ఎక్కువ. ఈ విభాగంలో జరుగుతున్న అవినీతిపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ప్రస్తావించారు. ఇటీవల వచ్చిన ఎల్‌ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకం ధరఖాస్తుల స్వీకరణ, ఆ తరువాత వచ్చిన ఆరోపణలను పరిశీలించాక మంత్రి కేటీఆర్‌ ఏకంగా ఏసీబీకే ఆదేశించారు.

22 మంది అధికారుల్లో 15 మందికి స్థానచలనం..
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలోని అన్ని టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. గతంలోనే జీహెచ్‌ఎంసీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న 32 మంది టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు, సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేశారు. రెండేళ్లకు మించి పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారిని ఆయా సర్కిళ్ల నుంచి ఇతర సర్కిళ్లకు పంపించారు. ఇక టౌన్‌ప్లానర్లుగా ఉన్న పురుషోత్తం రావు, మహమ్మూద్‌లను కూడా బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్‌ శాఖలో ఉన్న 22 మంది అధికారుల్లో 15 మందికి స్థాన చలనం కలిగిందంటే ..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

కర్నాటకలో బీజేపీ నేతల ఆందోళన...

కర్నాటక : రాష్ట్రంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. డిప్యూటి ఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆందోళన వల్లే గణపతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

12:25 - July 8, 2016

హైదరాబాద్: సరోజనీదేవి కంటి ఆస్పత్రి ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన దాదాపు 13 మంది చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సరఫరా చేసిన ఎల్ ఆర్ అనే లిక్విడ్ వల్లనే ఈ దారుణం జరిగిందని వైద్యులు తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే దర్యాప్తుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఈ అంశంపై తాజాగా హెచ్‌ఆర్సీ సైతం ఘటనను సుమోటోగా స్వీకరించింది. వ్యవహారంపై జూలై 21లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీకి అదేవిధంగా సరోజనీదేవి ఆస్పత్రి సుపరెంటెండెంట్ లక్ష్మికి నోటీసులు జారిచేసింది.

12:19 - July 8, 2016

హైదరాబాద్ : రాజేంద్రనగర్ కోర్టుకు సానియా చేరుకుంది. సానియాను ఎవరికి అప్పగించాలనే అంశంపై కోర్టు నేడు తీర్పునివ్వనుంది. కాంగో ఎంబసీ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. చిన్నారి సానియాను ఎవరికి అప్పగిస్తారు అనే విషయంపై కాసేపట్లో తేలనుంది. ఇటీవల భర్త రూపేష్ తన భార్య సింథియాను హత్యచేసి నగర శివారులో కాల్చివేసేందుకు యత్నిస్తూ స్థానికులకు పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితున్ని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. ఈమేరకు ఇవాళ సింథియా కూతురు సానియాను పోలీసులు రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. చిన్నారిని ఎవరి సంరక్షణలో ఉంచాలన్న అంశంపై విచారణ జరుగనుంది. కోర్టుకు కాంగో రాయబార బృందం కూడా చేరుకుంది. సానియా సంరక్షణ విషయాన్ని కోర్టు పరిశీలించనుంది.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో విచారణ ప్రారంభం..

ఢిల్లీ : కృష్ణా నీటి పంపకాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో విచారణ ప్రారంభమైంది. నేడు తెలంగాణ తరపున వైద్యనాధన్ వాదనలు వినిపించనున్నారు. ప్రాజెక్టుల వారీగా మొదటి నుండి నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ పేర్కొంటోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్లుగానే ఏపీ, తెలంగాణ పంచుకోవాలని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు సూచిస్తున్నాయి.

కంటి చూపు కోల్పోయిన ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం..

హైదరాబాద్ : సరోజనీదేవి కంటి ఆస్పత్రి ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌ఆర్సీ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన పలువురు చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

12:06 - July 8, 2016

అమెరికా : ఇక్కడ మీరు చూస్తున్న ఈ కట్టడం ఒక ఓడ. అమెరికాలో కెటంకీలో నోవా ఆర్క్ ఎన్ కౌంటర్ థీమ్ పార్కు పేరుతో దీన్ని నిర్మించారు. దీనిని ఆస్ట్రేలియాకు చెందిన కెన్ హమ్ అనే వ్యక్తి నిర్మించారు. 2010 నుంచి 2016 వరకు అంటే ఆరు సంవత్సరాలు పాటు ఈ ఓడ నిర్మాణం జరిగింది.... దీని పొడవు 510 మీటర్లు, వెడల్లు 85 మీటర్లు, ఎత్తు 51 మీటర్లతో దీని నిర్మాణం జరిగింది... ఈ ఓడలో ఏర్పాటు చేసిన నోవా నోవా కుటుంబం ప్రతిమలతో పాటు, రకరకాల జంతువుల బొమ్మలను ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభానికి పెద్దఎత్తున సందర్శలు, అతిథులు తరలివచ్చారు.

ఓడకు చరిత్ర, ప్రచారంలో ఉన్న బైబిల్ లోని కథ..
ఈ ఓడకు ఓ చరిత్ర ఉంది...బైబిల్‌ ప్రకారం దేవుడు సృష్టించే ప్రళయం నుంచి నోవా కుటుంబాన్ని కాపాడుకోమని అతడికి ప్రభువు ఆజ్ఞను జారీ చేస్తాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం నోవా అనేక రోజుల పాటు శ్రమించి పెద్ద ఓడను తయారుచేస్తాడు. వర్షాలు కురిసిన అన్ని రోజుల పాటు ఈ పడవ వీడి రావద్దని దేవుడు ఆదేశిస్తాడు. ప్రళయం నుంచి రక్షించుకోవడం కోసం రకరకాల జంతువులు ఆ ఓడలోకి ప్రవేశిస్తాయి. కొన్ని నెలల పాటు నోవా కుటుంబం, ఆ జంతువులు అన్ని ఓడలోనే నివాసం ఉంటాయి. ప్రళయం ఆగిపోయాక ఒక పావురాన్ని నోవా బయటికి పంపిస్తాడు. పావురం తిరిగి ఓడను చేరుకుంటే నీటి ప్రవాహం తగ్గలేదని.. చేరుకోకపోతే నీటి ప్రవాహం తగ్గిందని గుర్తుగా భావిస్తాడు. అలా విడిచిపెట్టిన పావురం తిరిగి పడవను చేరుకోదు. దీంతో వరద తగ్గుముఖం పట్టిందని నోవా ఆ జంతువులన్నింటికీ బయటకు విడిచిపెడతాడు. ఇలా నోవా ఓడకు పురాతన చరిత్ర ఉంది.

కర్షణగా నిలుస్తున్న జంతువులు..పక్షుల బొమ్మలు..
ఈ ఓడలో ఏర్పాటు చేసిన జంతువుల, పక్షుల బోమ్మలను అందరిని అలరిస్తున్నాయి...ఈ భారీ ఓడను, వాటిలో అందాలను తిలకించడానికి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. 

మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు..

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ అరెస్టయ్యారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఢిల్లీలోని దియోలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశ్ జర్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

చౌటుప్పల్ లో సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చౌటుప్పల్ కు చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడ మొక్కను నాటారు.

డిప్యూటి ఎస్పీ ఘటనపై సీఐడీ విచారణ..

కర్నాటక : రాష్ట్రంలో డిప్యూటి ఎస్పీ గణపతి ఆత్మహత్యపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఉన్నతాధికారులు వేధింపుల వల్లే గణపతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

11:53 - July 8, 2016

ఇరాక్ : ఐసిస్‌ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది. ఆత్మాహుతి దాడులతో ఉత్తర బాగ్దాద్‌ మరోసారి రక్తసిక్తమైంది. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్దాద్ లో ని ప్రార్థనా మందిరం వద్ద ముష్కరులు వరుస పేలుళ్లు, కాల్పులలకు పాల్పడటంతో 30 మంది మృతిచెందారు. పేలుళ్లలో మరో 50మందికి పైగా గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌కి 70 కి.మీలు దూరంలో ఉన్న సయ్యిద్‌ మహ్మద్‌ మసీదు వద్ద సూసైడ్‌ బాంబర్‌ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను టార్గెట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. రెండో సూసైడ్‌ బాంబర్‌ మరో 9 మంది ముష్కరులతో మసీదు లోపలికి ప్రవేశించి భద్రతా బలగాలపై, నమాజ్‌కు వచ్చిన వారిపై కాల్పులకు దిగాడు. దాడికి పాల్పడిన మూడో సూసైడ్‌ బాంబర్‌ పేలుడులో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. తొలుత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, అనంతరం బెల్టుబాంబులతో పేల్చేసుకున్నారు.

ఆత్మాహుతి దాడులతో రక్తసిక్తమైన ఉత్తర బాగ్దాద్‌
బాగ్దాద్ లో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ నెల 3న షాపింగ్ మాల్ లో పేలుళ్లు జరిపారు.ఈ ఆత్మాహుతి పేలుళ్లలో మొత్తం 292మంది మరణించారు. 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల్లో 15 మంది, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పిల్లలే. ఐఎస్‌ వరుస దాడులను నివారించడంలో విఫలమైన ఇరాక్‌ సర్కారుపై బాగ్దాదు ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్‌ ఆన్‌లైన్లో ప్రకటించుకుంది. ఉద్దేశ పూర్వకంగానే షియా ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపింది

ఐపీఎస్ , ఐఏఎస్ లను టార్గెట్ గా ఆల్ ఖైదా పిలుపు....
ఐపీఎస్ , ఐఏఎస్ లను టార్గెట్ చేయాలని ఆల్ ఖైదా ఇచ్చిన పిలుపుతో ఐబీ అప్రమత్తమైంది.. దేశవ్యాప్తంగా పోలీసు ఆఫీసర్ల ఇళ్లు, కార్యాలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇరాక్‌లో గత ఏడాది కాలంగా ఐసిస్ ఆక్రమించుకున్న భూభాగాలు కోల్పోతోంది. ఇప్పటికే పలు పట్టణాలను కోల్పోయింది. తాజాగా నెల రోజుల క్రితం బాగ్దారు శివారులోని ఫలూజా నగరం నుంచీ ఐఎస్‌ ఉగ్రవాద బలగాలు పారిపోవాల్సి వచ్చింది. ఫలూజా పట్టణాన్ని పూర్తిగా చేజిక్కించుకున్నట్లు ఇరాక్‌ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. ఈ పరిస్థితుల్లో ఐఎస్‌ నుంచి వలసలు మొదలయ్యాయి. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న ఈ సంస్థ ఆత్మవిశ్వాసం క్రమంగా బీటలు వారుతోంది. ఈ నేపథ్యంలోనే తన ఉనికిని చాటుకొనేందుకు ప్రపంచ మంతటా, ముఖ్యంగా ఇరాక్‌లోని ప్రభుత్వ ఆధీనంలోని భూభాగాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. 

ఢిల్లీలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ ప్రారంభం..

ఢిల్లీ : బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నేతలు వెంకయ్య నాయుడు, మురళీధర్ రావు, రాం మాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, ఏపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు, సోము వీర్రాజు, పురంధేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రూపొందించిన సీడీని అమిత్ షాకు ఏపీ బీజేపీ అందించనుంది. ఏపీలో పార్టీ నిర్మాణం, పార్టీ బలోపేతం, ఏపీ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు.

11:41 - July 8, 2016

నెల్లూరు : జిల్లాలోని జలదంకిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కొండయ్య మఠం దగ్గరున్న శతాబ్దాల కాలం నాటి శివాలయంలో లింగాన్ని దుండగులు పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఇందులో జలదంకి నియోజకవర్గానికి చెందిన ఓ పార్టీ నేత హస్తం ఉన్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఈ తవ్వకాలలో 1830 సంవత్సరం నాటి 101 బంగారు నాణాలు దొరికాయని గ్రామంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అమ్మకాలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. 

11:37 - July 8, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాసాధికార సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఏపీలో ప్రజాసాధికార సర్వే ప్రారంభమైంది. సర్వేబృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటినుంచి సర్వేను ప్రారంభించారు. కుటుంభ్యులు, వారు చేస్తున్న పని... ఆదాయమార్గాలు వంటి వివరాలతోపాటు... వ్యాధులతో బాధపడుతున్న వారి వివారాలుకూడా ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నారు. భూమి, ఆధార్‌, కులధృవీకరణ పత్రాలతోపాటు మొత్తం 20 రకాల వివరాలు సేకరిస్తున్నారు. 3వందల మందిని ఒక గ్రూప్‌గా తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌ రోజుకు 15 నుంచి 20 కుటుంబాల వివరాలు నమోదు చేయనున్నారు. ఈసర్వేలో 30వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకు సర్వే నిర్వహించనున్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలద్వారా సాయం అందించడమే లక్ష్యంగా ఈ పల్స్‌ పర్వేను చేపట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది.  

ప్రారంభమైన ఏపీ కేబినెట్...

విజయవాడ : ఏపీ కేబినెట్ ప్రారంభమైంది. అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఐఐటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. 9,10వ షెడ్యూల్ లో ఉన్న ఆస్తులు, అప్పుల సమస్యలు, విభజన, సమస్యలు, స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు..ఏపీ విద్యుత్ కు సంబంధించిన తెలంగాణ బకాయిలపై చర్చించనున్నారు.

తెలంగాణ సచివాలయంలో హరితహారం..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎస్ రాజీవ్ శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

11:34 - July 8, 2016

అమెరికా : మళ్లీ కాల్పుల కలకలం రేగింది. నల్ల జాతీయుల నిరసన కార్యక్రమంలో ఆందోళనకారులు కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసు అదికారులు మృతి చెందారు. ఇటీవల మిన్నెసోటా, లూసియానాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నల్లజాతి యువకులు పోలీసుల కాల్పుల్లో మరణించిన నేపథ్యంలో అమెరికాలో పలుచోట్ల నల్లజాతీయులు ఆందోళనలు చేపట్టారు. డల్లాస్‌లోజరిగిన ఆందోళనలో ఇద్దరు వ్యక్తులు పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు.డల్లాస్‌లో నిన్న వందలాది మంది నల్లజాతీయులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు భవనంపైన మాటువేసి పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు 12రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

మంత్రి హన్సరాజ్ కు స్వల్పగాయాలు..

మహారాష్ట్ర : రాష్ట్ర మంత్రి హన్సరాజ్ కాన్వాయ్ కు ప్రమాదం సంభవించింది. చంద్రపూర్ ప్రాంతంలోని మోర్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి హన్సరాజ్ కు స్వల్పగాయాలయ్యాయి.

11:31 - July 8, 2016

గుంటూరు : అసలే కడు పేదరికం.. అందులోనూ పూరిళ్లలో తలదాచుకుంటున్న వృద్ధులు, మహిళలతో పాటు పిల్లలున్న కుటుంబాలు. రెక్కలు ముక్కలు చేసుకుని బతుకుతున్న వారి జీవితాల్లో.. కృష్ణా పుష్కరాలు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెట్టాయి. పుష్కరాల కోసం అభివృద్ధి పనులు చేపడుతున్న అధికారులు ఉన్న పళంగా నిరుపేదలు నివాసం ఉంటున్న గుడిసెలు పీకేసి రోడ్డున పడేశారు. దాంతో బాధితులు తమకు దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా పుష్కరాల కోసం తాడేపల్లిలో అభివృద్ధి పనులు...
రానున్న కృష్ణా పుష్కరాల కోసం గుంటూరు జిల్లా తాడేపల్లిలో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. పనుల్లో భాగంగా జంక్షన్‌లు, ఘాట్‌లు నిర్మించతలపెట్టిన అధికారులు కృష్ణా కరకట్టల మీద ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను తొలగించారు. కూలీనాలి చేసుకుని బతికే పేదల ఇళ్లను పీకేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. ఆఘమేఘాల మీద రాత్రికిరాత్రి ఇళ్లు ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రొక్లెయిన్లతో ఇళ్ల కూల్చివేత...
ఏళ్ల తరబడి ఇంటిపన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తూ.. నివాసం ఉంటున్న పేదల ఇళ్లను హఠాత్తుగా ప్రొక్లెయిన్లతో కూల్చివేయడంతో.. అనేక మంది రోడ్డున పడ్డారు. ఇదేమని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇళ్లు కూడా లేక అనేక మంది రోడ్డుపాలవడం అందరినీ కలిచివేస్తోంది.

వీధిన పడ్డ 180 కుటుంబాలు..ఖండించిన సీపీఎం..
ఎంకి పెళ్లి..సుబ్బి చావుకొచ్చినట్లు పుష్కరాల పేరిట కృష్ణా నది ఒడ్డున నివాసముంటున్న 180 కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని సీపీఎం విమర్శిస్తోంది. నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పిస్తామన్న అధికారులు ఎలాంటి ప్రత్యామ్యాయాలు చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్న మున్సిపల్‌ కమిషనర్‌...
మరోవైపు ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ చెప్పారు. ప్రభుత్వం వారికి ఇళ్లు ఇచ్చేంతవరకు తాత్కాళిక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వర్షాకాలంలో ఎలా ఉండాలని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

 

అమరవెల్లి ఆత్మహత్య ఘటనపై సీఎం బాబు విచారం..

విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా అమరవెల్లిలో తల్లి, ముగ్గురు కుమారుల ఆత్మహత్యలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు గల కారణాలపై తక్షణమే వివరాలు అందచేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు.

 

రాజేంద్రనగర్ కోర్టులో చిన్నారి సానియా..

హైదరాబాద్ : చిన్నారి సానియాను రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. సానియాను ఎవరి దగ్గర ఉంచాలన్నదానిపై కోర్టు తేల్చారు. ఇటీవలే కాంబే దేశస్థురాలు సింథియాను భర్త దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

 

సర్వేపై అపోహాలు వద్దు - మంత్రి ప్రత్తిపాటి..

గుంటూరు : ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స‌ర్వేపై ప్ర‌జ‌లు ఎటువంటి అపోహ‌లు, అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన‌ ప్ర‌జాధికార స‌ర్వే ప్రారంభ‌మైంది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో మంత్రి ప్రత్తిపాటి త‌న వ్య‌క్తిగ‌త‌ వివ‌రాల‌ను అధికారుల‌కు తెలిపారు.

 

అమరవెల్లి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు ఆరా...

విజయవాడ : తూర్పు గోదవరి జిల్లా అమరవెల్లి లో గురువారం నాడు తల్లి ముగ్గురు చిన్నారులతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను తక్షణమే తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

11:06 - July 8, 2016

అర్జున్, మౌర్యాని జంటగా భానుశంకర్ దర్వకత్వంలో భరత్ రాజ్ సమర్పణలో రవికుమార్ ఎం నిర్మించిన చిత్రం 'అర్ధనారి'. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ద్వారా కొత్తనటీనటులు పరిచయమయ్యారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, అన్ని రివ్యూస్ లో మంచి రేటింగ్ వచ్చిందన్నారు. మంచి సందేశమిచ్చే దేశభక్తి సినిమా ఇది అని, ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఈ చిత్రం ద్వారా తాము చెప్పడం జరిగిందన్నారు. చిన్న సినిమా అయినా ప్రేక్షకులు బాగానే ఆదరించారని, సినిమాను సక్సెస్ చేసిందుకు హీరో అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది హర్రర్ మూవీ కాదని, కుటుంబసమేతంగా చూడవచ్చని హీరోయిన్ మౌర్యాని పేర్కొంది. కొత్త వారిని ప్రోత్సాహించాలని కోరారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు..

నెల్లూరు : జలదంకి కొండయ్య మఠంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. 1835 కాలం నాటి 101 బంగారు నాణేలు దొరికినట్లు సమాచారం. తవ్వకాల వెనుక టిడిపి నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, విలేకరుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తవ్వకాలు జరిగిన స్థలానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం.

10:51 - July 8, 2016

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్' కూడా సునామీ సృష్టిస్తోంది. గతంలో ఆయన నటించిన చిత్రాలు వందల కోట్ల క్లబ్ లో సునాయసంగా చేరిన సంగతి తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన నటించిన 'సుల్తాన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మల్లయోధుడిగా సల్మాన్ నటనపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే బాక్సాపీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ హాట్ టాపిక్ గా నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్' చిత్రం తొలిరోజు వసూళ్లను అలవోకగా అధిగమించి మొదటి స్థానంలో ఉంది. ఈ యేడాది విలుడదలైన చిత్రాల తొలి రోజు కలెక్షన్లలో రికార్డు సృష్టించిందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సల్మాన్ సినిమా తొలి రోజు వసూళ్లలో సుల్తాన్ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది నవంబర్ లో విడుదలైన 'ప్రేమ రతన్ ధన్ పాయో' చిత్రం తొలి రోజు రూ. 40.35 కోట్లు వసూలు చేసి ప్రథమ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో 'సుల్తాన్' రూ. 36.54 కోట్లు, 'ఏక్ థా టైగర్' రూ. 32.93 కోట్లు, 'భజరంగి భాయ్ జాన్' 27.25 కోట్లు, 'కిక్' రూ. 26.40 కోట్లు వసూలు చేశాయని విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
 

సినిమా వసూళ్లు
సుల్తాన్ రూ. 36.54 కోట్లు
ఫ్యాన్ రూ. 19.20 కోట్లు
హౌస్ ఫుల్ రూ. 15.21 కోట్లు
ఎయిర్ లిఫ్ట్ రూ. 12.35 కోట్లు
బాఘీ రూ. 11.94 కోట్లు
ఉడ్తా పంజాబ్ రూ. 10.05 కోట్లు

 

రైల్వే స్టేషన్ వద్ద 2 మృతదేహాలు లభ్యం ...

నెల్లూరు : రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రైలు నుండి జారిపడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బ్రేక్ ఇన్ స్పెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు ...

నెల్లూరు : మాగుంటలో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. గుంటూరు బ్రేక్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి నివాసంలో సోదాలు చేశారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. 

10:43 - July 8, 2016

వైవిధ్యమైన కామెడీ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటుల్లో 'అల్లరి నరేష్' ఒకరు. మార్క్ కామెడీతో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. కొద్దికాలం గ్యాప్ తరువాత ఆయన 'సెల్ఫీ రాజా' చిత్రంలో నటిస్తున్నారు. సాక్షి చౌదరి, కామ్నా రానావాత్ జంటగా ఈశ్వర్ రెడ్డి దర్వకత్వంలో సుంకర రామబ్రహ్మం సమర్పణలో చిత్రం రూపొందుతోంది. చిత్ర సాంగ్ ను గురువారం విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ తెలియ చేశారు. సెల్ఫీ రాజాకు ఓ సమస్య ఎదురవుతుందని, దాని నుండి బయటపడేందుకు రకరకాల గెటప్ లు వేస్తుంటాడని పేర్కొన్నారు. అల్లరి నరేష్ తో నటించడం వల్ల ఎంతో ఆనందంగా ఉందని, ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని సాక్షి చౌదరి పేర్కొంది. సెల్ఫీ ద్వారా అల్లరి నరేష్ సమస్య సృష్టిస్తుంటాడని, ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు.

భోపాల్ ఎన్ఐటీటీటీఆర్ పై సీబీఐ దాడులు..

మధ్యప్రదేశ్ : భోపాల్ లోని నేషనల్ ఇన్సిట్యూట్ సాంకేతిక టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కేంద్రంపై సీబీఐ దాడులు చేసింది. దాడులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

10:31 - July 8, 2016

విజయవాడ : కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో బీజేపీ-టీడీపీ మధ్య కోల్డ్ వార్ ..గవర్నర్ సీఎం భేటీ...హైకోర్టు విభజన..కృష్ణా నీటి వివాదం..ఉమ్మడి ఆస్తుల పంపకాలు..సచివాలం తరలింపు..శుక్రవారం చంద్రబాబు రష్యా పర్యటన ..మచిలీపట్నం అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ..శ్రీకాకుళం,ప్రకాశం జిల్లాల్లో ఐఐటీల ఏర్పాటు..9,10 షెడ్యూల్ లో ఉమ్మడి ఆస్తులు,అప్పులు..స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు..ఏపీ విద్యుత్ కు సంబంధించి తెలంగాణ చెల్లించవలసిన బకాయిలు..రాజకీయ, పరిపాలనకు సంబంధించిన వంటి పలు కీలకమైన అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు ఒకరోజు ముందుగానే ఏపీ కేబినెట్ భేటీ కానుంది. 

10:28 - July 8, 2016

వర్షాకాలం వచ్చేసింది. వానలు దంచికొడుతున్నాయి. దీనితో పాటు అనారోగ్యాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డయేరియా, కలరా తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముందే మేల్కోంటే అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దామా..

  • రాత్రి వేళల్లో ఇంట్లోకి దోమలు రాకుండా మీ ఇంటి ద్వారాలు..కిటికీలు మూసివేయడం మేలు. దోమలు, క్రిములు రాకుండా ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి.
  • శరీరాన్ని పూర్తిగా కప్పేలా దస్తులను ధరించాలి. దోమ తెర ఉపయోగించడం వల్ల దోమకాటు నుండి రక్షించుకోవచ్చు.
  • వర్షాకాలంలో కేశాలపై శ్రద్ధ కనబర్చాలి. తలంటి స్నానం చేశాక టవల్ తో బాగా తుడుచుకోవాలి. చుండ్రు నివారించేలా కేశాలపై వర్షాకాలంలో ప్రత్యేక శద్ధ తీసుకోవాలి.
  • చర్మ సంరక్షణకు సన్ స్ర్కిన్ లోషన్, పాలు, ఆరెంజ్ ఇతర పండ్లతో కూడిన పేస్టును వాడాలి. అలాగే మొటిమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడి సలహా మేరకు మందులను వాడండి. తగ్గిపోతుందని అనుకుని ఏవో మందులు వాడితే ఇతర అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
  • సీజనల్ గా సోకే ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండాలంటే అశుభ్రంగా ఉన్న జ్యూస్ లు, ఇతరత్రా సేవించవద్దు.
  • చర్మం..పాదాల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పాదాల రక్షణకు రెయిన్ ఫ్రూఫ్ షూలు వినియోగించవచ్చు.
10:27 - July 8, 2016

ప్రతి సీజన్ లో ఆ సీజన్ కు మాత్రమే పరిమితమయ్యే పండ్లు..పూలు చూస్తుంటాం. అలా వర్షాకాలంలో ప్రకృతి మనకు గిప్ట్ గా ఇచ్చిన పండ్లలలో నేరేడు ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా కలర్ ఫుల్ గా నేరేండు పండ్లు దర్శనమిస్తున్నాయి. చూడటానికి నల్లగా నిగనిగలాడుతూ ఉండే ఈ ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు పిల్లలకు మాత్రమే కాదు..పెద్దలందరికీ మేలు చేస్తాయి. పండే కాకుండా నేరేడు చెట్టు..గింజలు..బెరడు ఇలా అన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ప్రతి వంద గ్రాముల నేరేడు పండ్లలో రెండు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. శరీరానికి రోజుకి కావల్సిన విటమిన్ సి ని ఈ పండు అందిస్తుంది.
నేరేడు గింజల నుండి అధిక సంఖ్యలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొద్ది మొత్తంలో క్యాల్షియం, విటమిన్ బి, సి, ఐరన్ లు కూడా లభిస్తాయి.
ఈ పండు తినడం వల్ల జలుబు, కోరింత దగ్గు, దీర్ఘకాలంగా వేధించే దగ్గు, ఆస్తమా..లాంటి సమస్యలను నుంచి విముక్తి పొందవచ్చు.
నేరేడు పండును రోజూ ఉదయం ఉప్పుతో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు నేరేడు పండును తేనెతో పాటు తీసుకుంటే మంచిది.
డయోరియాతో బాధపడేవారికి నేరేడు చక్కటి పరిష్కార మార్గం. నేరేడు పండ్ల గింజలను పొడిగా చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగితే నివారణ పొందవచ్చు.

ఏపీలో సర్వే ప్రారంభం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుండి ఈ సర్వేను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని నుండి వివరాలను అధికారులు సేకరించారు.

10:15 - July 8, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే మొదలైంది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్వే జరిపిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుండి ఈ సర్వేను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని నుండి వివరాలను అధికారులు సేకరించారు. ఇందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. అధికారులు అడిగిన పలు వివరాలను సీఎం బాబు తెలియచేశారు. తన ఆధార్ కార్డు నెంబర్ 300300688099 అని, తనకు కారు ఉందని, టెంపరరీ హౌస్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఇతరత్రా వివరాలను నమోదు చేసిన అనంతరం అధికారులు ఇంటి డోర్ కు డిజిటల్ స్టిక్కర్ ను అతికించారు.
సర్వే ద్వారా ఆధార్ లో అదనపు వివరాలు నమోదు..తప్పుల సవరణ.. కొత్త సభ్యుల చేరిక చేసే అవకాశం ఉంది. సర్వే ద్వారా జిప్పర్ కోడ్ పేరిట ప్రతి ఇంటికి డిజటల్ కోడ్ కేటాయించనున్నారు. ఎనిమిది అక్షరాల్లో సరికొత్త నెంబర్లు రానున్నాయి. రెవెన్యూ శాఖ నేతృత్వంలో ట్యాబ్ లు, యాప్ ల ద్వారా వివరాలు సేకరించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 30వేల మందితో వివరాలు సేకరించనున్నారు. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వారాలపాటు కొనసాగనుంది.

10:14 - July 8, 2016

ఢిల్లీ : ఐఏఎస్, ఐపీఎస్ లను టార్గెట్ చేసి దాడులు చేయాలని ఆల్ ఖైదా పిలుపునిచ్చింది. దీంతో ఐబీ అప్రమత్తమయ్యింది. దేశవ్యాప్తంగా పోలీస్ అధికారుల నివాసాలు, కార్యాలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఐబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తం అయ్యింది. ప్రభుత్వం సంస్థలు...ప్రజాప్రతినిధులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాలనే యోచనలో కేంద్రహోంశాఖ వున్నట్లు సమాచారం.

వరదలో చిక్కుకున్న ముగ్గురు..రక్షించిన ఆర్మీ రెస్క్యూటీం..

మధ్యప్రదేశ్ : తమస్ ప్రాంతంలోని రెవాలో ఒక్కసారిగా వరద ఉధృతం పెరిగింది. దీనితో సమీప ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. ముగ్గురు యువకులు చెట్లు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. వీరిని ఆర్మీ రెస్క్యూ టీం రక్షించింది.

 

మహిళతో ఆప్ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్ పై వేధింపుల కేసు నమోదైంది. గతంలో మహిళా అధికారిపై చెయ్యి చేసుకుని ఓసారి అరెస్టయిన ప్రకాశ్ పై ఈ దఫా ఓ మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ.. గ్రేటర్ కైలాశ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా బాధితురాలి వివరాలు వెల్లడించబోమని స్పష్టం చేసిన పోలీసులు, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఇటీవల మరో ఎమ్మెల్యే దినేశ్ మోహానియా సైతం మహిళల పట్ల వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

కుటుంబ కలహాలకు నిండు గర్భిణీ బలి..

నెల్లూరు: కుటుంబ కలహాలకు ఓ నిండు గర్భిణీ బలైంది. వేదాయపాలెం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ దారుణం జరిగింది. గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, భర్త వేదింపులతో కలతచెందడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బందువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీసులో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఐఐటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. 9,10వ షెడ్యూల్ లో ఉన్న ఆస్తులు, అప్పుల సమస్యలు, విభజన, సమస్యలు, స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు..ఏపీ విద్యుత్ కు సంబంధించిన తెలంగాణ బకాయిలపై చర్చించనున్నారు.

ఆర్ఎంపీని హత్య చేసిన దుండగులు...

కర్నూలు : కోస్గి సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఆర్ఎంపీ వీరన్నను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. మృతుడు పెద్దకడపూర (మం) గదిగట్టు వాసిగా గుర్తించారు.

అమెరికాలో నిరసనలు..ముగ్గురు పోలీసుల మృతి..

అమెరికా : నల్లజాతీయుడికి మృతికి నిరసనగా అమెరికాలో నిరసనలు మిన్నంటాయి. డల్లాస్ లో నిరసనకారులు ఆందోళన మిన్నంటాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మృతి చెందారు.

 

గాంధీ భవన్ లో నేడు..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో నేడు మున్సిపల్ సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమ జరగనుంది. ఈ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ తో పాటు టీకాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

ప్రొ.కబడ్డీలో నేడు..

హైదరాబాద్ : ప్రొ.కబడ్డీలో నేడు యు ముంబాతో బెంగళూరు బుల్స్ ఢీకొననుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ తో బెంగాల్ వారియర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు జరగనుంది.

 

మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ...

మహారాష్ట్ర : బీజేపీ పాలిత మహారాష్ట్ర లో శుక్రవారం కేబినెట్ విస్తరణ జరగనుంది. అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయిన తర్వాత జరగబోతున్న తొలి విస్తరణ కావడంతో ఇటు బీజేపీతోపాటు మిత్రపక్షాలైన శివసేన, ఇతర పార్టీ ఎమ్మెల్యేల్లో ఆశలు గుబాళిస్తున్నాయి. 10 మందిని కొత్తవారిని తీసుకుంటారని తెలుస్తోంది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఈ విస్తరణ మహోత్సవానికి గైర్హాజర్ అవుతారని వార్తలు వస్తున్నాయి.

09:35 - July 8, 2016

విజయవాడ : సర్కార్‌పై సమరానికి సై అంటున్న వైసీపీ.. ఇక నుంచి ప్రజల్లోనే తేల్చుకుంటామంటోంది. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చని ప్రభుత్వానికి గట్టి బుద్ధిచెబుతామని హెచ్చరిస్తోంది. 'గడప గడపకు వైసీపీ' కార్యక్రమం పేరుతో నేరుగా జనాల్లోకి వెళ్లాలని డిసైడ్‌ అయ్యింది. చంద్రబాబు పాలనపై వంద ప్రశ్నలతో కూడిన బ్యాలట్ పత్రాన్ని ప్రజలకు అందించనుంది. వైఎస్ జయంతి రోజైన జులై 8వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా పార్టీ బలోపేతంతో పాటు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండొచ్చని అధినాయకత్వం భావిస్తోంది.

జులై 8 నుంచి 'గడప గడపకూ వైఎస్సార్' ...
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'గడప గడపకూ వైఎస్సార్' కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభం కానున్నది. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు క్రియాశీకలంగా పాల్గొనేందుకు సమాయత్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న మొత్తం 13 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టానున్నారు. పార్టీ జనాదరణను పొందడానికి, ప్రజా మద్దతు పొందడానికి ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైందని జగన్ కార్యకర్తలకు సూచించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్లాలని సూచించారు. 'గడప గడపలో ఒకే నినాదం-వైఎస్సార్ కాంగ్రెస్, ఇది తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపం' అనే శీర్షికన ముద్రించిన నాలుగు పేజీల కరపత్రాన్ని కూడా ఈ సందర్భంగా ఇంటింటికీ పంపిణీ చేస్తారు. ఈ కరపత్రంలో ఎన్నికలపుడు చంద్రబాబు చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చలేకపోయిన వైనం వివరించారు. అంతే కాదు, చంద్రబాబు పాలన పాసా? ఫెయిలా? ప్రజలే నిర్ణయించాలని కోరుతూ ఇదే కరపత్రంలో వంద ప్రశ్నలతో ఒక బ్యాలట్‌ను కూడా పొందుపర్చారు.

డిసెంబర్ 31 తేదీ వరకూ ...
కార్యక్రమం డిసెంబర్ 31వ తేదీ వరకూ 5 నెలల పాటు జరపాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. తానిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో భూదందాను నిర్వహించడం వంటి అంశాలను పార్టీ నేతలు గడప గడపకూ వెళ్లి వివరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. రాజధాని నిర్మాణం మొదలు, సదావర్తి భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం వ్యవహారించిన తీరును ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ రెండేళ్లలో ఏదైనా మేలు జరిగిందా అనే విషయాలపై కూడా ప్రజల నుంచి ఆరా తీస్తారని వైసిపి భావిస్తోంది. 13 జిల్లాల్లో గడప గడపకూ..కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి రోజు వారీగా నివేదికలు తెప్పించుకునే ఏర్పాట్లను కూడా చేసుకుంది అధినాయకత్వం. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిల్లోనూ కార్యక్రమ పర్యవేక్షణకు యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటైంది. గడప గడపకూ పంపిణీ చేయాల్సిన కరపత్రాలు కూడా అన్ని జిల్లాలకూ పార్టీ ఇప్పటికే చేరవేసింది.

గడప గడపకు వైసీపీ ద్వారా బలం వస్తుందా?...
మొత్తంగా గడప గడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని అధినాయకత్వ భావిస్తోంది. నిరంతరం ప్రజలతో మమేకమై వారి ఆదరణ చూరగొనడం ఒక్కటే పరిష్కారమని పార్టీ దృఢంగా విశ్వసిస్తోంది.

శ్రీవారి ఆలయంలో గంటన్నరపాటు ఉన్న గవర్నర్..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. సుమారు గంటన్నరపాటు ఆలయంలో గవర్నర్ గడిపారు. గురువారం విజయవాడలో గవర్నర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఉభయ రాష్ట్రాల మద్య నెలకొన్న విబేధాలపై సీఎం చంద్రబాబు నాయుడితో గవర్నర్ చర్చించిన సంగతి తెలిసిందే.

సీఐడీలో ఉద్యోగుల విభజన..

హైదరాబాద్ : సీఐడీలో ఉద్యోగుల విభజన తొలి బాజితాను విడుదల చేశారు. టీఎస్ కు 109, ఏపీకి 95 మంది సీఐడీ ఉద్యోగులను కేటాయించారు. కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్న ఉద్యోగులందరికీ వర్తించదని డీవోపీటీ పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించని ఉద్యోగులు ప్రస్తుత రాష్ట్రంలో కొనసాగాలని సూచించారు.

ఏపీలో 30వేల మంది వివరాల సేకరణ..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వే మొదలు కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుండి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. సర్వే ద్వారా ఆధార్ లో అదనపు వివరాలు నమోదు..తప్పుల సవరణ.. కొత్త సభ్యుల చేరికకు అవకాశం ఉంది. సర్వే ద్వారా జిప్పర్ కోడ్ పేరిట ప్రతి ఇంటికి డిజటల్ కోడ్ కేటాయించనున్నారు. ఎనిమిది అక్షరాల్లో సరికొత్త నెంబర్లు రానున్నాయి. రెవెన్యూ శాఖ నేతృత్వంలో ట్యాబ్ లు, యాప్ ల ద్వారా వివరాలు సేకరించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 30వేల మందితో వివరాలు సేకరించనున్నారు.

09:18 - July 8, 2016

అమెరికా : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నల్లజాతీయులపై అమెరికాలో వరుసగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులకు నిరసనగా డల్లాస్ లో ర్యాలీని చేపట్టారు. ర్యాలీ జరుగుతున్న క్రమంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

08:56 - July 8, 2016

విశాఖ: పోయినచోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పనిచేస్తోంది. చేసిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రస్తుతం బలం పెంచుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతోంది. ఏపీలో పార్టీకి జవసత్వాలు నింపేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్వరలో జరగనున్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్నారు.

గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌...
ఏపీ, తెలంగాణతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడడంతో ఇప్పుడు ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపిస్తూ..ప్రజల్లోకి వెళ్తోంది. ముఖ్యంగా రాష్ర్ట విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్‌ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయింది. ఎన్నికల తర్వాత చాలామంది కాంగ్రెస్‌ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్నకొద్ది మంది నేతలు పార్టీకి పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.

జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ ప్లాన్‌..
రానున్న రోజుల్లో ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. గతంలో మేయర్‌ సీటు కాంగ్రెస్‌దే.. అందులోనూ ఇప్పటికీ కాంగ్రెస్‌కు గట్టి క్యాడర్‌ కూడా ఉంది. అందుకే వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ఆశపడుతోంది.

విశాఖలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న సీనియర్లు..
విశాఖలో మంచి పట్టున్న సీనియర్‌ నేతలు కొండ్రు మురళీ, బాలరాజు, ద్రోణం రాజు శ్రీనివాస్‌ వంటి నేతలు క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. తరచూ పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూనే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందాలని భావిస్తూ.. దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి నేతలను విశాఖకు రప్పిస్తున్నారు. విభజన ముందు కేంద్రం ఇచ్చిన ఏ ఒక్కహామీ కూడా నెరవేర్చడం లేదని ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ర్ట విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్సే విభజనకు కారణమైందని తప్పుడు ప్రచారం చేయడం కరెక్టు కాదని బీజేపీ, టీడీపీలకు చురకలంటిస్తోంది.

విభజన హామీల అమల కోసం కాంగ్రెస్‌ పోరు..
మరోవైపు ఏపీలో టీడీపీ, బీజేపీ అధికారంలో ఉండి కూడా విభజన చట్టం హామీలను పరిష్కరించడం లేదని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. ఎప్పటి నుంచో విశాఖకు ఇస్తానన్న రైల్వే జోన్‌ను కూడా ఇప్పటికీ ప్రకటించడం లేదని కాంగ్రెస్‌ నేతలు పబ్లిక్‌లో వాయిస్ పెంచుతున్నారు. అంతేకాదు.. ఇటీవల రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేక హోదాపై ఇచ్చిన ప్రైవేట్ బిల్లును చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుందని హస్తం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా విభజన హామీలను అస్ర్తాలుగా చేసుకుని.. మళ్లీ ఏపీలో కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

బాలికలపై అత్యాచారం..జీవితఖైదు..

తమిళనాడు : బాలికలపై అత్యాచారం కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి మద్రాస్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవిత ఖైదును ఆపాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు రీ హియరింగ్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా నిరాకరించింది. ఆరేళ్ల క్రితం ముగ్గురు బాలికలను నమ్మించి తనతోపాటు తీసుకెళ్లిన ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది. కేసును విచారించిన న్యాయ స్థానం వృద్ధుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఐఏఎస్,ఐపీఎస్ లను టార్గెట్ చేస్తూ ఆల్ ఖైదా పిలుపు...

ఢిల్లీ : ఐఏఎస్, ఐపీఎస్ లను టార్గెట్ చేసి దాడులు చేయాలని ఆల్ ఖైదా పిలుపునిచ్చింది. దీంతో ఐబీ అప్రమత్తమయ్యింది. దేశవ్యాప్తంగా పోలీస్ అధికారుల నివాసాలు, కార్యాలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఐబీ ఆదేశాలు జారీ చేసింది. 

సీఐడీ ఉద్యోగుల కేటాయింపులో తొలి జాబితా...

ఢిల్లీ : సీఐడీ ఉద్యోగుల విభజనలో భాగంగా తొలి జాబితా విడుదలయ్యింది. తెలంగాణకు 109, ఏపీకి 95 మంది ఉద్యోగులను కేటాయించారు. కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్న ఉద్యోగులకు ఈ కేటాయింపు వర్తంచదని డీవోపీటీ తెలిపింది. ఏ రాష్ట్రానికి కేటాయించని ఉద్యోగులు ప్రస్తుతానికి రాష్ట్రంలోనే కొనసాగాలని డీవోపీటీ సూచించింది. 

08:24 - July 8, 2016

ఇరాక్ : రాజధాని బాగ్దాద్ లో ఉగ్రవాదుల మరోసారి దాడులకు తెగబడ్డారు. ఉత్తర బాగ్దాద్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు దిగారు. ఓ ప్రార్థనా మందిరం వద్ద వరుస పేలుళ్లకు పాల్పడటంతో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి.. గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు.

వారంలో రెండో సారి పేలుళ్లు...
బాగ్దాద్ లో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ నెల 3న షాపింగ్ మాల్ లో పేలుళ్లు జరిపారు.ఈ ఆత్మాహుతి పేలుళ్లలో మొత్తం 131 మంది మరణించారు. 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల్లో 15 మంది, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పిల్లలే. ఐఎస్‌ వరుస దాడులను నివారించడంలో విఫలమైన ఇరాక్‌ సర్కారుపై బాగ్దాదు ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్‌ ఆన్‌లైన్లో ప్రకటించుకుంది. ఉద్దేశ పూర్వకంగానే షియా ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపింది

ప్రభుత్వ ఆధీనంలోని భూభాగాల్లో ఆత్మాహుతి దాడులు..
ఇరాక్‌లో గత ఏడాది కాలంగా ఐసిస్ ఆక్రమించుకున్న భూభాగాలు కోల్పోతోంది. ఇప్పటికే పలు పట్టణాలను కోల్పోయింది. తాజాగా నెల రోజుల క్రితం బాగ్దారు శివారులోని ఫలూజా నగరం నుంచీ ఐఎస్‌ ఉగ్రవాద బలగాలు పారిపోవాల్సి వచ్చింది. ఫలూజా పట్టణాన్ని పూర్తిగా చేజిక్కించుకున్నట్లు ఇరాక్‌ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. ఈ పరిస్థితుల్లో ఐఎస్‌ నుంచి వలసలు మొదలయ్యాయి. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న ఈ సంస్థ ఆత్మవిశ్వాసం క్రమంగా బీటలు వారుతోంది. ఈ నేపథ్యంలోనే తన ఉనికిని చాటుకొనేందుకు ప్రపంచ మంతటా, ముఖ్యంగా ఇరాక్‌లోని ప్రభుత్వ ఆధీనంలోని భూభాగాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. 

జేఎన్ టీయూలో 11 నుండి అంతర్జాతీయ సదస్సు..

హైదరాబాద్: జేఎన్‌టీయూ రసాయనశాస్త్ర, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్‌పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహి స్తున్నట్టు ప్రోగ్రాం కన్వీనర్ బి. రమాదేవి తెలిపారు. వర్సిటీలోని ఆడిటోరియంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఈ సదస్సు కొనసాగుతుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.

08:04 - July 8, 2016

తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనం చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ కంకణ బద్ధంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం...ఈసారి సాధారణ మొక్కలతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలను కూడా నాటాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలు నాటాలని పూనుకున్న సర్కార్‌.. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 25 లక్షల మొక్కలు నాటేందుకు రెండో విడత టీ.సర్కార్ సిద్ధమవుతోంది..మొదటిదశలో చేపట్టిన ఈ కార్యక్రమం ఘోరంగా విఫలమయ్యింది. రోండో దశలో చేపట్టిన ఈ హరిత ఉద్యమం ఎంతవరకూ సఫలమవుతుంది? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్), కైలాష్ (టీ.కాంగ్రెస్ అధికార ప్రతినిధి), రాకేశ్ ( టీఆర్ఎస్ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి..

08:01 - July 8, 2016

కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వివాదస్పదంగా మారిన 623, 624 జీవోల భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ జీవోల పై అప్పట్లో నిరుద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అప్పట్లో ప్రభుత్వం ఒక ఏడాది పాటు వాటిని నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ జీవోలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది.

నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు...
నిరుద్యోగం యువతకు శాపం. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం లక్షలాది యువత ఎదురుచూస్తోంది. ఇదిగో అదిగో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రభుత్వాలు ఊరిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల్లో ఎక్స్ పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగాయి. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు రేయింబవళ్లు పుస్తకాల కుస్తీ పడుతున్నారు. కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. లైబ్రరరీలు కిటకిటలాడుతున్నాయి. కానీ, నోటిఫికేషన్లు రావడం లేదు. తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి, మరికొన్ని పోస్టులు కలుపుతామంటూ దాన్ని వాయిదా వేశారు. కానీ, ఇంతవరకు ఆ ఊసు లేదు. చిన్నా చితకా , ప్రయివేట్ ఉద్యోగాలు మానేసి గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలుపెట్టినవారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోచింగ్ ల కోసం, పుస్తకాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. గ్రూప్ 2 పరీక్షలు మరింత ఆలస్యం చేస్తే చాలామంది నిరుద్యోగులు ఆర్థికంగా మరింత చితికిపోయే ప్రమాదం వుంది.

దశల వారీగా పదివేల పోస్టులు భర్తీ చేస్తామన్న కేబినెట్ ..
ఆంధ్రప్రదేశ్ లో అసలు నోటిఫికేషనే రాలేదు. దశల వారీగా పదివేల పోస్టులు భర్తీ చేస్తామంటూ కొద్ది రోజుల క్రితమే కేబినెట్ లో నిర్ణయించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. నిజానికి పదివేల పోస్టులు చాలా తక్కువ సంఖ్య. ఇంతకు పదింతల పోస్టులు ఖాళీగా వున్నట్టు నిరుద్యోగులు చెబుతున్నారు. కనీసం పది వేల ఉద్యోగాల భర్తీకైనా నోటిఫికేషన్ ఎప్పుడిస్తారో ఇంకా తేలలేదు. ఇంతకు పూర్వం గ్రూప్ 2 కేటగిరిలో వున్న కొన్ని పోస్టులు గ్రూప్ వన్ కేటగిరిలో చేరుతుండడం నిరుద్యోగులను కలవరపెడుతోంది. గ్రూప్ 2 పరీక్ష ఆబ్జక్టివ్ పద్ధతిలో వుంటుంది. గ్రూప్ వన్ లో వ్యాసరూప సమాధానాలు రాయాల్సి వుంటుంది. రెండింటికీ ప్రిపేరయ్యే పద్ధతి వేరు. ఇప్పటి దాకా గ్రూప్ 2 లక్ష్యంగా పెట్టుకుని, ప్రిపేరైనవారు గ్రూప్ వన్ తరహాలో పరీక్ష రాయాలంటే కాస్తంత ఇబ్బందికరమే.

గ్రూప్ 2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ వన్ లో విలీనం..
సమైక్యరాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లోనే వివాదం మొదలైంది. గ్రూప్ 2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ వన్ లో విలీనం చేస్తూ, గ్రూప్ 1 ను గ్రూప్ 1ఏ, గ్రూప్ 1 బిలుగా విభజిస్తూ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి రెండు జీవోలు జారీ చేసింది. అవే 623, 624 జీవోలు. వీటి ప్రకారం గ్రూప్ వన్ లోని పోస్టులన్నీంటిని గ్రూప్ వన్ ఏ సర్వీసులుగా పరిగణిస్తారు. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 బి సర్వీసులుగా పరిగణిస్తారు. గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్, సహాయ వాణిజ్య పన్నుల అధికారులు, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్, డిప్యూటీ తహసిల్దార్, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ , జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, కో ఆపరేటివ్ సబ్ సర్వీస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను గ్రూప్ వన్ బిలో చేర్చారు. మొత్తం పది రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ వన్ బిలో చేర్చారు.

గ్రూప్ 2 కింద నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ....
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే గ్రూప్ 2 కింద వుంచారు. అప్పట్లో ఈ జీవో వివాదస్పదమైంది. నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 623, 624 జీవోలను ఏడాది పాటు నిలిపివేస్తూ, 2013 జులైలో 556 జీవోను విడుదల చేసింది. అయితే, ఆ తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి, 623, 624 జీవోలు అమలుకాకుండా మరోసారి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు.  

07:55 - July 8, 2016

ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ, గ్రూప్ 2 లో వున్న కొన్ని పోస్టులను గ్రూప్ వన్ కలపాలన్న ఆలోచన వివాదస్పదమైంది. పాత పద్ధతిలోనే గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలంటూ నిరుద్యోగ, యువజన సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే విభిన్న రూపాల్లో తమ కోరికలను ఏపిపిఎస్సీ దృష్టికి తీసుకెళ్లాయి. గ్రూప్ 2 లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ వన్ లో కలపడాన్ని నిరుద్యోగ యువజన సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీనివల్ల నిరుద్యోగులకు కలిగే ఇబ్బందులేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై శ్రీనివాస్ ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారం తెలుసుకోండి..

07:50 - July 8, 2016

బంగ్లాదేశ్ : ఇస్లాం మత బోధకుడు..డాక్టర్‌ జకీర్ నాయక్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఢాకాలో దాడులకు పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులకు ప్రభావితం చేసిన ముగ్గురిలో ఈయన ఒకరు. పీస్ టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేసి, ఫిలాసఫీ సిద్ధాంతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం బోధనలు చేస్తున్నారు. జకీర్‌ నాయక్‌ ప్రసంగాలపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆదేశించారు. ఉగ్రదాడులకు యువతను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలను జకీర్‌ ఖండించారు.
చర్చనీయాంశంగా మారిన జకీర్ నాయక్...
ఢాకా ఉగ్రదాడి నేపథ్యంలో ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢాకా రెస్టారెంట్‌లో 20 మంది బందీలను హత్య చేసిన ఉగ్రవాదులు రోహన్ ఇంతియాజ్, నిబరస్‌ ఇస్లాంలను ప్రభావితం చేసిన బోధకుల్లో జకీర్‌ ఒకరు కావడం కలకలం రేపింది. జకీర్‌ ముంబైలోని డోంగ్రి మార్కెట్ సమీపంలో ఉండేవారు. ఈయన తండ్రి అబ్దుల్ కరీం నాయక్ కొంకణ్‌లోని రత్నగిరికి చెందినవారు, ముంబైలో స్థిరపడ్డారు. కరీం మానసిక వైద్యుడు, సామాజిక ఉద్యమకారుడు, మతపరంగా, సామాజికంగా మంచి పేరు ఉన్నవారు. జకీర్‌ను ఇస్లామిక్ బోధకుడిగా, మంచి వక్తగా ఎదగాలని ఆయన ప్రోత్సహించారు.

1980లో ముంబైలోని బివైఎల్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌..
1980లో ముంబైలోని బివైఎల్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌లో ఎంబిబిఎస్‌ ఆఖరు సంవత్సరం చదువుతున్న సమయంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఇస్లాం మత బోధకుడు అహ్మద్‌ దీదత్‌ ఉపన్యాసంతో జకీర్‌ ప్రభావితమయ్యాడు. మెడికల్‌ ప్రాక్టీస్‌ కన్నా దీదత్‌లా మత బోధకుడు కావాలని ఆయనలో బలంగా నాటుకుపోయిందని జకీర్‌ సన్నిహితులు చెబుతున్నారు.

1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను జకీర్‌ ఏర్పాటు..
1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను జకీర్‌ ఏర్పాటు చేశారు. ఆయన అనుచరులు ఈ-మెయిల్, ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. ఆయనకు కోటి 4 లక్షల మంది ఫేస్‌బుక్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నడిచే పీస్‌ టీవికి ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రేక్షకులున్నారు. భారత్‌లో పీస్‌ టివికి అనుమతి లేకున్నా కేబుల్‌ ఆపరేటర్‌ మద్దతుతో నడుపుతున్నారు.

జకీర్ నాయక్ ఉపన్యాసాల్లో మరో విశేషం..
జకీర్ నాయక్ ఉపన్యాసాల్లో మరో విశేషం ఉంది. ఆయన హిందూ, క్రైస్తవ మత గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశారు. కేనోపనిషత్తు, కఠోపనిషత్తు వంటి గ్రంథాలను ప్రస్తావిస్తూ ఉపన్యసిస్తూ ఉంటారు. పాశ్చాత్యులు ధరించే సూట్‌లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉపన్యాసాలిస్తారు.

జకీర్‌ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు భారీగా విరాళాలు..
జకీర్‌ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు భారీగా దేశవిదేశాల నుంచి విరాళాలు వస్తున్నట్లు సమాచారం. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ 2015లో జకీర్ నాయక్‌కు కింగ్ ఫైజల్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ను బహూకరించారు. ఇస్లాంకు గొప్ప సేవ చేసినందుకు 2 లక్షల డాలర్ల నగదు, బంగారు పతకం ప్రదానం చేశారు.

ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌ నడుపుతున్న జకీర్...
జకీర్‌ మాజెగావ్‌లో ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను కూడా ఆయన నడుపుతున్నారు. ఇతర మతాల కన్నా ఇస్లాం మతమే ప్రపంచంలో గొప్పదని విద్యార్థులకు నూరిపోస్తున్నారని కొందరు ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

తండ్రి బాటలోనే తనయుడు..
జకీర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ముంబైలో చదువుతున్నారు. కుమారుడు రియాద్‌లోని ఇస్లామిక్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఆయన తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ముంబైలో జకీర్ శాంతి సందేశాలతో కూడిన సభలకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఇక్కడ సభలు జరగలేదు. 2011 నుంచి ఆయన ప్రసంగాలను బ్రిటన్, కెనడా దేశాలు కూడా నిషేధించాయి.

ఢాకాలో ఉగ్రదాడి అనంతరం జకీర్‌ పేరు తెరపైకి...
ఢాకాలో ఉగ్రదాడి అనంతరం జకీర్‌ పేరు తెరపైకి వచ్చింది. జకీర్‌ నాయక్‌ ఉపన్యాసాల పట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజ్జూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబై డోంగ్రీలోని ఆయన ఇస్లామిక్‌ ఫౌండేషన్‌ ఆఫీస్‌ ముందు పోలీసులు పహారా కాస్తున్నారు. మతపరమైన యాత్రలో భాగంగా సౌదీ అరేబియాలో ఉన్న జకీర్‌ నాయక్‌ జులై 11 తర్వాత భారత్‌కు తిరిగి రానున్నారు. తనపై వచ్చిన ఆరోపణలనలపై ఆయన ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

07:36 - July 8, 2016

శ్రీకాకుళం : నగరంలో దౌర్జన్య రాజకీయాలు నడుస్తున్నాయి. 30ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు..వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. తన హయాంలో మంజూరు చేసిన పనులంటూ..అధికార పార్టీ నేతలను కాదని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దీంతో ధర్మాన వ్యవహరిస్తున్న తీరుపై అధికార టిడిపి నేతలు గుర్రుగా ఉన్నారు.

శ్రీకాకుళంలో పాలిటిక్స్ హై హీట్‌...
ఎన్నడూ లేనంతగా శ్రీకాకుళం నగరంలో ఈసారి పాలిటిక్స్ హై హీట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. శ్రీకాకుళం నగరానికి త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందే మేల్కొన్న అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు..నగర ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. టిడిపిని ఇరుకున పెట్టె విధంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎత్తులు వేస్తుంటే..ధర్మానవి అన్నీ అవినీతి ఆలోచనలే అంటూ టిడిపి వర్గం ఆరోపిస్తోంది.

టిడిపి, వైసీపిల పాలిటిక్స్‌కు కేంద్ర బిందువుగా వంతెనలు..
శ్రీకాకుళం నగరంలో కొత్తగా నిర్మించిన వంతెనలు టిడిపి, వైసీపిల పాలిటిక్స్‌కు కేంద్ర బిందువుగా మారాయి. గత కాంగ్రెస్ హయాంలో నగరానికి రెండు బ్రిడ్జిలు మంజూరయ్యాయి. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పొన్నాడకు ఓ వంతెనతో పాటు, శ్రీకాకుళం నగరం నడిబొడ్డులోని నాగావళి పాత వంతెనలను కూల్చి..దాని స్థానంలో కొత్తవి నిర్మించే పనులు కాంగ్రెస్ హయాంలో ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం అవి పూర్తయ్యాయి. అయితే మాజీ మంత్రి ధర్మాన మాత్రం రెండు వంతెనలు తాను శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టామని చెప్పారు. అంతేకాకుండా ఓ అడుగు ముందుకేసి ఏకంగా పొన్నాడ వంతెనను కొబ్బరికాయ కొట్టిమరీ ప్రారంభోత్సవం చేశారు. అంతటితో ఆగకుండా కొద్ది రోజుల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్న నాగావళి నదిపై కొత్తగా నిర్మించిన నూతన వంతెనను కూడా ఓ చిన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలా నిర్వహించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులనే..ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పూర్తి చేస్తోంది తప్ప..ఎలాంటి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో టిడిపి చేపట్టడం లేదని ఈ సందర్భంగా ధర్మాన ఆరోపించారు.

ధర్మాన జలక్‌తో షాక్ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి వర్గం..
ధర్మాన ఇచ్చిన జలక్‌తో షాక్ తిన్న జిల్లా ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి వర్గం..నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి ముందుచూపులేకుండా స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ వంతెనలను కూల్చిన ధర్మాన..ఇప్పుడు వాటిని టిడిసి ప్రభుత్వం నిర్మిస్తే..అవి అయన చేసిన కృషిగా చెప్పుకోవడం సిగ్గు చేటని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇరు పార్టీల మధ్య వంతెనల చిచ్చు ..
మొత్తానికి శ్రీకాకుళం నగరంలోని ఈ రెండు వంతెనలు ఇరు పార్టీల మధ్య చిచ్చు రేపాయి. కార్పొరేషన్ ఎన్నికలు ముందున్న నేపథ్యంలో ఈ రెండు వంతెనలు తమతమ పార్టీల ఖాతాల్లో జమ చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 

07:31 - July 8, 2016

తూ.గోదవరి : కాకినాడ సెజ్‌లో మళ్లీ కలకలం రేగుతోంది. కొన్నాళ్లుగా నిశ్శబ్ధంగా ఉన్న సెజ్ వ్యవహారంలో వివాదం మరింత రాజుకుంటోంది. ఇటు రైతాంగం, అటు జీఎంఆర్‌ యాజమాన్యం మధ్య వైరం ముదురుతోంది. దీంతో సెజ్ భూముల్లో రాజుకుంటున్న చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ మొదలైంది.

కాకినాడలో మళ్లీ సెజ్ కలకలం ...
కాకినాడ సెజ్ వ్యవహారం ...పదేళ్ల క్రితం తెరమీదకు వచ్చిన ఈ అంశం ఇప్పటికీ రగులుతూనే ఉంది. అప్పట్లో పెద్ద రణరంగాన్నే తలపించిన సెజ్ భూములు...ఇప్పుడు మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. కేఎస్ఈజెడ్ లో పరిశ్రమలు రాకపోయినప్పటికీ, పదేళ్లుగా రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములన్నీ అలాగే పడి ఉన్నాయి. ఒక్క చైనా కంపెనీకి చెందిన బొమ్మల ఫ్యాక్టరీ మినహా మిగతా ఏ పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటకీ భూముల స్వాధీనం పేరిట సెజ్ యాజమాన్యం అలజడి సృష్టిస్తోంది. నష్టపరిహారం ఇవ్వకుండానే రైతుల నుంచి భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. కొంతమంది సామాన్య రైతుల పొలాల్లోని చెట్లను జీఎంఆర్ సిబ్బంది ఇష్టారాజ్యంగా నరికేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

భూములను అన్యాయంగా లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ..
సెజ్ పరిధిలోని రమణక్కపేట గ్రామంలో నాగిరెడ్డి, సత్యనారాయణ అనే రైతుల పొలాలల్లో సెజ్ సిబ్బంది చెట్ల నరికివేత ప్రారంభించారు. దీంతో సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు రంగంలోకి దిగారు. నష్టపరిహారం కూడా చెల్లించని భూముల్లో దౌర్జన్యమేంటని నిలదీశారు. ఫలితంగా సెజ్ సిబ్బంది కొంత వెనక్కి తగ్గారు. అయితే సెజ్ పేరిట తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

దౌర్జన్యం చెయ్యడం సరికాదంటున్న రైతులు ...
తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా జీఎంఆర్ సిబ్బంది ఇలా దౌర్జన్యం చెయ్యడం సరికాదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమకు అన్యాయం జరకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఉత్తర బాగ్దాద్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు...

ఇరాక్ : ఉత్తర బాగ్దాద్ లో ఆత్మాహుతి దళం పంజా విసిరింది. ఈద్ ఉల్ ఫితర్వఏడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఓ పార్థనా మందిరంలో వద్ద వరుస పేలుళ్ళకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

07:24 - July 8, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. తెలంగాణలో పార్టీ నాయకత్వంపై సీనియర్లు ఫిర్యాదుల అస్త్రం సంధించారు. ప్రధాన ప్రతిపక్షంగా దూకుడుగా ఉండాల్సింది పోయి.. రోజురోజుకు నీరుగారిపోతోందని ఢిల్లీ పెద్దల ముందు ఏకరువు పెట్టారు.

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు ఎండగట్టడంలో విఫలం ..
టీపీసీసీ నాయకత్వ తీరుపై పార్టీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై స్పందించే విషయంలో నేతల వ్యవహార శైలిని వేలెత్తి చూపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విషయంలో దూకుడు ప్రదర్శించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. కార్యాచరణ ప్రణాళిక లేకుండా ముందుకు సాగుతుండటంతో ప్రజల్లో పలుచనైపోయే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్‌ సీనియర్లలో ఆవేదన కనిపిస్తోంది.

మల్లన్నసాగర్‌ విషయంలో గాంధీభవన్‌కే పరిమితమైన టీపీసీసీ ..
మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యను పార్టీకి అనుకూలంగా మలచుకోవడంలో టీపీసీసీ నాయకత్వం విఫలమమైందన్నది సీనియర్ల వాదన. సీపీఎం, టీడీపీలు మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, పాదయాత్రలు చేసిన విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్లు ప్రస్తావిస్తున్నారు. దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలతో ఈ పార్టీలు ప్రజలకు చేరువైన అంశాన్ని గుర్తు చేశారు. మల్లన్నసాగర్‌ విషయంలో టీపీసీసీ నాయకులు గాంధీభవన్‌కే పరిమితమై, విమర్శలతో సరిపెట్టడాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, వీ హనుమంతరావు, రాపోలు ఆనంద్‌ భాస్కర్‌, నంది ఎల్లయ్య వంటి నేతలు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌లోపాటు, అధిష్టానంలోని ఇతర పెద్దలకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు టీపీసీసీలో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యేలు, ఎంపీ సుఖేందర్‌రెడ్డి వలసలు ఆపడంలో విఫలం..
ఎన్నికల్లో వరుసగా ఓటములు ఎదురైనా సమీక్షించుకుని లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయని టీపీసీసీ నేతల వైఖరిని వీహెచ్‌ పలు సందర్భాల్లో బాహాటంగానే తప్పుపట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వలసలను కూడా ఆపడంలో కాంగ్రెస్ నేతలు విఫలమైన విషయాన్ని కూడా సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పోయినవారు పోగా....ఉన్నవారిని కూడా కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడంలేదన్న వాదనలు ఉన్నాయి. పార్టీ నాయకుల పట్ల కూడా టీపీసీసీ నేతలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ కార్యక్రమంలో గాయపడ్డ ఎమ్మెల్యే సంపత్‌ను... టీపీసీసీ నేతలు పరామర్శించకపోడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని కూడా కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.

లీడర్లు, క్యాడర్‌ కలసికట్టుగా పాల్గొనే కార్యక్రమాలు లేవు -సీనియర్లు
విషమ పరిస్థితుల్లో ఉన్న పార్టీని క్రియాశీలకంగా చేసేందుకు టీపీసీసీ తీసుకున్న చర్యలు శూన్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాయకులే నిద్రాంణంగా ఉంటే... కార్యకర్తలు చురుగ్గా ఎలా పనిచేస్తారని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. వెంటనే కాయకల్ప చికిత్స చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌ బలోపేతం కావడం కష్టమని హైకమాండ్ ముందు తమ వాదన వినిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పూర్తిగా మునిగిపోకముందే.... ఏదోఒక నిర్ణయం తీసుకోవాలన్న సీనియర్ల ఫిర్యాదులపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న అంశం ఆసక్తిగా మారింది.

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకుల ఆందోళన..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకుల ఆందోళన చేపట్టారు. ఢిల్లీ వెళ్లాల్సిన 25 మంది ప్రయాణీకలను ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వదిలివెళ్లింది.దీంతో ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు.

గగన్ పహాడ్ లో ఆర్టీఏ తనిఖీలు..

రంగారెడ్డి : గగన్ పహాడ్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో నిబంధనలకువిరుద్ధంగా నడుస్తున్న 18 బస్సులను అధికారులు సీజ్ చేశారు.

06:58 - July 8, 2016

నిజామాబాద్ : గాంధారి మండలం నేరెల్ తండాలో పోడు భూములను దున్నిన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం నేతలు అటవీశాఖ అధికారులకు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేతలను అడ్డుకున్న అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఎం నేతలు. 

06:54 - July 8, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు ఒకరోజు ముందుగానే ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రష్యా పర్యటన సహా పలు కీలక అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు.

విజయవాడ సీఎం కార్యాలయంలో సమావేశం..
విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నేడు కేబినెట్ సమావేశం కానుంది. ఈనెల 4వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని సీఎం అనుకోనీ కారణాల రీత్యా ఇవాల్టికి వాయిదా వేశారు. దీంతో నేడు కేబినెట్ భేటీ కానుండడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

అమరావతికి పెట్టుబడులే లక్ష్యంగా చర్చ ..
ఈ కేబినెట్ భేటీ ప్రధానంగా రష్యాలో జరగనున్న ఇండియా న్యూ ఇండస్టియలైజేషన్ పార్ట్ నర్ షిప్ అనే అంశంపై చర్చించనుంది. రష్యన్ ఇండియన్ బిజినెస్ ఫోరం నిర్వహించే సదస్సులో ..పాల్గొనే అంశంపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. చైనా పర్యటన విజయవంతం అయిన తరుణంలో ప్రభుత్వం రష్యాపర్యటనలో విదేశీపెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో పాటు సమన్వయ కమిటీలో చర్చించిన పలుఅంశాలు సహా నిపుణులసలహాలపై కేబినెట్‌లో చర్చించనున్నారని సమాచారం. అంతేకాక అమరావతి నిర్మాణంపై స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రష్యా పెట్టుబడులను ఆకర్షించేయత్నంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ క్యాబినెట్‌ పలు కీలకాంశాలపై చర్చించనుంది. ఇటీవలే చైనా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసిన చంద్రబాబు.. రేపు రష్యాకు వెళ్తుండడంపైనే క్యాబినెట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

06:48 - July 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనం చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ కంకణ బద్ధంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం...ఈసారి సాధారణ మొక్కలతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలను కూడా నాటాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలు నాటాలని పూనుకున్న సర్కార్‌.. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 25 లక్షల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుడుతోంది.

46 కోట్ల మొక్కలతో హరితహారం..
వంద కాదు.. వేయి కాదు.. ఏకంగా 46 కోట్ల మొక్కలు. తెలంగాణ ప్రభుత్వం రెండో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న మొక్కల సంఖ్య ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్గొండ జిల్లాలో శుక్రవారం అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండు వారాల పాటు యుద్ధప్రాతిపదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. అందుకనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ రాజీవ్‌ శర్మ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు సంస్థలతో పాటు ప్రార్థనా మందిరాల్లోనూ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు.

అన్ని వర్గాల వారూ పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశం..
ఈసారి ఏ కొందరికో పరిమితం చేయకుండా.. చిన్నా పెద్దా.. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క చెరువు గట్లపైనే 55 లక్షల ఈత చెట్లు నాటాలని, ప్రతిఒక్కరూ తలా 13 మొక్కలు నాటేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భూమికి పచ్చని రంగేసినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఎటు చూసినా ఉద్యానవనాన్ని తలపించేలా పచ్చని చెట్లు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూలచెట్లు, పండ్ల చెట్లతో పాటు ఈసారి హరితహారంలో భాగంగా ఔషధ మొక్కలు కూడా నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ సమతుల్యత ద్వారానే మానవ మనుగడ సాధ్యమన్న ధృక్పథంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

హైదరాబాద్‌లోనే ఒకే రోజు 25 లక్షల మొక్కలు ...
రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడం ఒకెత్తైతే.. ఒక్క హైదరాబాద్‌లోనే ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో 7 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కోట్ల మొక్కల నాటి వాటిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈనెల 11న మంత్రి కేటీఆర్‌ జవహార్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

రెండో విడత హరితహారంలో కేసీఆర్‌...
రెండో విడత హరితహారం కార్యాక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి నల్గొండకు బయలుదేరుతారు. జిల్లాలోని చౌటుప్పల్‌, గుండ్రంపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి సమీక్షించారు. 

హరితహారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్...

హైదరాబాద్ : నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవతుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హరితహారం రెండు వారాలపాటు కొనసాగనుంది.

ఏపీలో ప్రారంభంకానున్న స్మార్ట్ పల్స్ సర్వే..

గుంటూరు : నేడి నుండి ఏపీలో స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభంకానుంది. సీఎం చంద్రబాబు నివాసం నుండి ఈ సర్వే ఆరంభం కానుంది. 

ప్యాసింజర్ రైలులో మంటలు..

వరంగల్ : నెక్కెండలో ప్యాసింజర్ రైలులో మంటలు రేగాయి. కాజీపేట నుండి విజయవాడ వెళ్ళాల్సిన రైలులో ఇంజన్ లో తలెత్తిన సాంకేతిక లోపంతో మంటలు వ్యాపించాయి. నెక్కొండ స్టేషన్ లో రైలును అధికారులు నిలిపివేశారు. భయంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. రైలుకు అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. 

Don't Miss