Activities calendar

09 July 2016

యువతిపై సామూహిక అత్యాచారం

ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ శివారులో సామూహిక అత్యాచారం జరిగింది. ప్రేమ జంటను బెదిరించి గిరిజన యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. 
నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన సెరెనా..

ఢిల్లీ : వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌ విజయం సాధించింది. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన సెరెనా.. స్టెఫీగ్రాఫ్‌ రికార్డును సమం చేసింది.  ఫైనల్‌లో కెర్బర్‌పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించి తన ఖాతాలో ఏడో వింబుల్డన్‌ టైటిల్‌ను వేసుకుంది. 

22:03 - July 9, 2016

హైదరాబాద్ : పంజాగుట్ట కారు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రమ్య గత రెండు వారాలుగా కోమాలో ఉంది. రమ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. చిన్నారి రమ్య మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.  

 

22:00 - July 9, 2016

తూర్పుగోదావరి : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో ఆరో తరగతి విద్యార్థినిని వేధించడం మొదలుపెట్టాడు. కాకినాడలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఓ టీచర్‌ నిర్వాకం బయటపడింది. రోజురోజుకు ఉపాధ్యాయుడి వేధింపులు ఎక్కువ కావడంతో.. బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో టీచర్‌ను తల్లిదండ్రులు హెచ్చరించారు. అయినా ఉపాధ్యాయుడి తీరు మారకపోవడంతో తిమ్మాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయునిడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

21:58 - July 9, 2016

ఢిల్లీ : దక్షిణ ఆఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైలులో ప్రయాణించడం ద్వారా జాతిపిత మహాత్మా గాంధీని స్మరించారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణించిన రైలు మార్గంలోనే  మోడీ ప్రయాణించారు. పెంట్రిచ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ వరకు పలువురు ఆఫ్రికన్‌ అధికారులతో కలిసి 15 నిముషాల పాటు మోదీ రైల్లో వెళ్లారు. 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణించినప్పుడు జాతివివక్ష కారణంగా రైల్లో నుంచి దించేసిన చారిత్రక ఘటన జ్ఞాపకార్థం మోదీ అదే మార్గంలో రైలులో ప్రయాణం చేశారు. రైల్లో నుంచి దించేసిన ఘటనే గాంధీని జాతివివక్షపై పోరాటం దిశగా నడిపించిన విషయం తెలిసిందే.  ఆఫ్రికాలో నాలుగు దేశాల్లో పర్యటనలో భాగంగా మోదీ జొహన్నెస్‌బర్గ్‌ నుంచి డర్బన్‌ చేరుకున్నారు.  

21:56 - July 9, 2016

ఢిల్లీ : వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌ విజయం సాధించింది. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన సెరెనా.. స్టెఫీగ్రాఫ్‌ రికార్డును సమం చేసింది.  ఫైనల్‌లో కెర్బర్‌పై 7-5, 6-3 తేడాతో విజయం సాధించి తన ఖాతాలో ఏడో వింబుల్డన్‌ టైటిల్‌ను వేసుకుంది. 

 

21:54 - July 9, 2016

డబ్బు, ఆస్తి, అంతస్తు,.. ఇవేమీ శాశ్వతం కావు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. మరి శాశ్వతం ఏమిటీ...? స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.... అన్నారో మహాకవి. స్నేహానికి కన్న మిన్నా లోకాన లేదురా.. అన్నారు మరో కవి. ఇలా ఎవరికి వారు ఎంతో మంది స్నేహం యొక్క గొప్పదనం గురించి చెప్పారు. నీవు ఎలాంటి వాడివో నీ స్నేహితున్ని చూసి చెప్పొచ్చు అన్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. కడదాక నీడ లాగా నిను వీడిపోదు అన్నారు. స్నేహమనే మాటలో చెరో అక్షరం అన్నారు.. మరో ఇద్దరు మిత్రులు.. స్నేహం ఒక బలం, ఒక త్యాగం.. అలా స్నేహానికి నిర్వహచనంలా ఉండే ముగ్గురి కథనే ఇప్పుడు మనం చూడబోతున్నాం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:51 - July 9, 2016

జిల్లా పుట్టకముందుకె మండలాల లొల్లి... ఇప్పట్లేకనే ఉంటమని కదిలిన గల్లి, ఆధారకార్డు ఆడుండగ మళ్లో సర్వే...ఇట్ల చేసుకుంటబోతే జనానికి పెద్ద బరువే, ఢిల్లీలో చక్రం తిప్తుడంట చిట్టినాయుడు... ఇగ దిగిండయ్య తెలుగొల్ల పెదరాయుడు, నాల్కేతోటి నాట్యం చేస్తున్న నరేంద్రమోడీ.. పని తనం ఏ లేకున్నా మాటలల్ల అదే వాడి, సెక్యూరిటీ ఇడిసిపెట్టి డ్యాన్సు చేసిన పోలీసులు...లవ్ సాంగ్స్ తోటి లా ఆండ్ ఆర్డర్ కట్టడి, బాయిలకు దుంకిన గుడ్డిఎలుగు... బయటికి తీసినంక ఒకటే పరుగు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

 

21:46 - July 9, 2016

ఎపి సర్కార్ కృష్ణా జిల్లాలో భూములు సేకరించడం సరికాదని వక్తలు అన్నారు.  ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారధి, ఎపి టీడీపీ నేత దినకర్, సీపీఎం కృష్ణా జిల్లా కార్యదర్శి రఘు మాట్లాడారు. వ్యాపారం కోసమే భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:36 - July 9, 2016

తిరుపతి : ధనవంతుడని తెలిస్తే చాలు.. టీటీడీ సిబ్బంది ఠపీమని వారి ముందు మోకరిల్లుతారు. కావలసిన సదుపాయాలు కల్పించి.. వారిని స్వామి సేవలో.. వారు ధనికుల సేవలో తరించేస్తారు. వచ్చినవారి బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి..? వారి నేర చరిత్ర ఏంటి..? ఇట్లాంటివేవీ టీటీడీ సిబ్బంది పట్టించుకోరు. వారికి తెలిసిందల్లా డబ్బున్న వారి సేవలో తరించడమే. ఇటీవల ఈ సత్యం మరోసారి ప్రపంచానికి అవగతమైంది. ఎన్ని విమర్శలు వస్తున్నా.. టీటీడీ సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. 
తిరుమలలో యల్-1 దర్శనాలు దుర్వినియోగం
ఎన్ని విమర్శలు వచ్చినా.. భక్తులు ఎన్ని రీతుల తిట్టిపోస్తున్నా... టీటీడీ సిబ్బంది వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావడం లేదు. డబ్బున్న బడా బాబులకు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ తరించిపోతున్నారు. తాజాగా శ్రీవారి దర్శనానికి వచ్చిన గాలి జనార్దన్‌ రెడ్డికి.. టీటీడీ సిబ్బంది కల్పించిన అధికార మర్యాదలు.. మరోమారు వివాదానికి కారణమయ్యాయి. కుటుంబ సమేతంగా యల్-1 కేటగిరి దర్శనంలో వచ్చిన గాలి జనార్దన్‌ రెడ్డికి దర్శనం చేయించి స్వామి వారి శేషవస్త్రం కప్పినట్లు సమాచారం. అంతేనా ఆయనకు బస కల్పించటంలో అత్యుత్సహాం చూపించారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు బసచేసే శ్రీకృష్ణా అతిథిగృహన్ని కేటాయించడం వివాదస్పదం అయ్యింది.. గనుల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి అధికారిక మర్యాదలు ఎలా చేస్తారని భక్తులు మండిపడుతున్నారు. 
డబ్బున్న వారి సేవలో తరించిపోతున్న టీటీడీ 
టీటీడీ ఇలా డబ్బున్న వారి సేవలో తరించిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అంబానీలకు.. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా వంటి పారిశ్రామిక వేత్తలకు, సినీ ప్రముఖులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ వివాదాల్లో కూరుకుపోయారు. డబ్బున్నవాడిని ఓ రకంగా.. పేదలను మరో రకంగా చూస్తున్నారని భక్తులు చాలా కాలం నుంచే మండిపడుతున్నారు. భూరి దాతలకు ప్రత్యేక దర్శనం సబబేనంటున్న టీటీడి సిబ్బంది
పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనం 
అయితే.. ఈ వివాదంపై టీటీడీ సిబ్బంది తమదైన శైలిలో వివరణ ఇస్తున్నారు. పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనం చేయించవచ్చని టీటీడీ నిబంధనల్లోనే ఉందంటున్నారు. గాలి జనార్దనరెడ్డి గతంలో శ్రీవారికి భారీ స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. కోటికిపైగా విరాళాలు ఇచ్చిన దాత కాబట్టే ప్రత్యే దర్శనం కల్పించివుండొచ్చన్నది టీటీడీ బోర్డు సభ్యుడి వాదన. టీటీడీ సిబ్బంది తరచూ తమ విచిత్ర పోకడలతో వివాదాల్లో కూరుకు పోవడం.. శ్రీవారి భక్తుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. పాలకమండలి ప్రత్యేక దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలను నివారించాలని కోరుతున్నారు. 

21:34 - July 9, 2016

విశాఖ : జిల్లాలోని రాజాంపేటలో విషాదం నెలకొంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తాపడి అప్పల్రాజు అనే మత్స్యకారుడు మృతి చెందాడు. మరో నలుగురు మత్స్యకారులు క్షేమంగా తీరానికి చేరుకున్నారు. అలల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల బోటు తిరగబడిందని మత్స్యకారులు చెబుతున్నారు. 

 

21:33 - July 9, 2016

నెల్లూరు : రియల్‌ సీన్లు..రీల్‌ సీన్లను మించిపోతున్నాయి. జరుగుతున్న దారుణాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. దుండగులు సినీ ఫక్కీలో రక్తపాతం సృష్టిస్తున్నారు. పక్కా స్కెచ్‌లతో రంగంలోకి దిగుతున్నారు. ఇళ్లలోకి చొరబడి రక్తం చిందిస్తున్నారు. కాసుల కోసం మనషులమన్న సంగతే మరిచిపోతున్నారు. నెల్లూరులో పట్టపగలే జరిగిన ఘటన దడ పుట్టిస్తోంది.  
మహిళ హత్య
దోపిడి దొంగ పైశాచికంతో నెల్లూరులోని ఓ ఇల్లు రక్తంతో తడిసింది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కేకలతో హోరెత్తింది. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కు పరుగులు తీశారు. అయినా ఆ దుర్మార్గుడు ఆగలేదు. వెంటాడి వేటాడాడు. దొరికినవారిని దొరికినట్లుగా కత్తితో పొడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ ఇంటి ఇల్లాలు ప్రాణాలు విడిచింది. 
ఉలిక్కిపడిన నెల్లూరు  
దొంగ పైశాచిక దాడితో నెల్లూరు ఉలిక్కిపడింది. ఆడిటర్‌ నాగేశ్వరరావు ఇంట్లో జరిగిన రక్తపాతం స్థానికంగా సంచలనం రేపింది. చిల్డన్స్ పార్కు ఏరియాలో ఆడిటర్‌ నాగేశ్వరరావు, టీచర్‌ ప్రభావతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కొడుకుతో పాటు దత్తపుత్రిక ఉన్నారు. కోవూరుకు చెందిన వెంకటేశ్వర్లు దూరపు బంధువునంటూ ఇంట్లోకి వచ్చాడు. అతడు ఎవరో గుర్తించేలోపే కత్తితో వీరంగం సృష్టించాడు. మొదట ప్రభావతిపై క్రూరంగా దాడిచేసి ఆమెను చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచేశాడు. ఆ తర్వాత పరుగులు తీస్తున్న కూతురు మాధురి, కుమారుడు కృష్ణలను పట్టుకున్నాడు. వారి తలను గొడకు మోది, కత్తితో పొడిచేశాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆడిటర్‌ నాగేశ్వరరావునూ గాయపరిచాడు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.  
పక్కా ప్లాన్‌తో స్కెచ్‌ గీశారా? 
బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. తాళ్లతో నిర్బంధించి చితగొట్టారు. ఆ తర్వాత ఆరో పట్టణ పోలీసులకు అప్పగించారు. మృతురాలి నుంచి కాజేసిన నగలతో పాటు హత్యకు వాడిన ఆయుధాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనక సర్వేపల్లి సుధ అనే మహిళ హస్తం ఉన్నట్లు నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. హతురాలి భర్త పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలు ఇంట్లోకి చొరబడి దొంగ రక్తపాతం సృష్టించడం నెల్లూరు జిల్లాను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేసు వెనుక కుట్రను ఛేదించాలని..నిందితులని కఠినంగా శిక్షించాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

21:08 - July 9, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భూముల పిచ్చి పట్టుకుందని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. భూబ్యాంకు పేరుతో లక్షలాది ఎకరాలు సేకరిస్తూ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సదావర్తి భూములను తక్కువ రేటుకే అమ్మడం, సింగపూర్‌ కన్సార్షియంకు అమరావతి భూములను అప్పగించాడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు. ఈ వ్యవహారాలపై మిగిలిన వాపక్షాలను కలుపుకుని ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకే స్మార్ట్‌ పల్స్‌ సర్వే నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

 

21:03 - July 9, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బందరు పోర్టు విషయంలో తప్పుడు లెక్కలు చూపెడుతూ భారీ కుంభకోణానికి తెరలేపుతుందని వైసీపీ అధికార ప్రతినిధి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టుకు నాలుగువేల ఎకరాలు సరిపోతాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా లక్ష ఐదువందల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. బడా వ్యాపారులు, వీదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకే లక్ష ఎకరాలు సేకరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. 

 

20:59 - July 9, 2016

మాస్కో : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు రష్యా పర్యటన మొదలైంది. ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు... అక్కడి నుంచి కజికిస్థాన్ లోని అల్మాటీ నగరం చేరుకున్నారు. ప్రస్తుతం అల్మాటీలో ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో పరిశ్రమల ఏర్పాటుకున్న అపార అవకాశాలు, సహజవనరులు, వాతావరణం గురించి బాబు వివరిస్తున్నారు. 

చిత్తూరు జిల్లా జడ్పీ సమావేశం..ఎమ్మెల్యే రోజా నిరసన

చిత్తూరు : జిల్లా జడ్పీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. సమావేశంలో రైతు రుణమాఫీ ధన్యవాద తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సభలోనే నిరసన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ జరగలేదంటూ ధ్వజమెత్తారు. దమ్ముంటే తన నియోజకవర్గంలో వచ్చి సర్వే చేయాలని ఎమ్మెల్యే రోజా సవాల్‌ విసిరారు. జడ్పీటీసీలతో రోజా వాగ్వాదానికి దిగింది. ఇదిలా ఉంటే రోజా తీరుపై సభలోని జడ్పీటీసీలు మండిపడ్డారు. ఎమ్మెల్యే తమను పరుషపదజాలంతో దూషించారని ఘెరావ్‌ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో సమావేశంలో రసాభాసగా ముగిసింది. 

20:54 - July 9, 2016

చిత్తూరు : జిల్లా జడ్పీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. సమావేశంలో రైతు రుణమాఫీ ధన్యవాద తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సభలోనే నిరసన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ జరగలేదంటూ ధ్వజమెత్తారు. దమ్ముంటే తన నియోజకవర్గంలో వచ్చి సర్వే చేయాలని ఎమ్మెల్యే రోజా సవాల్‌ విసిరారు. జడ్పీటీసీలతో రోజా వాగ్వాదానికి దిగింది. ఇదిలా ఉంటే రోజా తీరుపై సభలోని జడ్పీటీసీలు మండిపడ్డారు. ఎమ్మెల్యే తమను పరుషపదజాలంతో దూషించారని ఘెరావ్‌ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో సమావేశంలో రసాభాసగా ముగిసింది. 

 

విష జ్వరాలతో భయపడొద్దు : మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : కలరా, డెంగ్యూ వంటి విష జ్వరాల గురించి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వ్యాధి తొలి దశలో ఆస్పత్రికి వస్తే నయమవుతుందని తెలిపారు. వీణా, వాణీ ఆపరేషన్ కు ప్రభుత్వ సాయముంటుందని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుల బృందం వీణా, వాణీలు ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. వాణీ, వాణీలు పెరుగుతున్నారు కాబట్టి ఆస్పత్రిలో కాకుండా స్టేట్ హోంలో ఉంచి వారికి వసతులు కల్పిస్తామని చెప్పారు. 

 

20:47 - July 9, 2016

హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. సరోజినీదేవి ఘటనలో 13 మందికి కాదు, ఇద్దరికే కంటిచూపు కోల్పోయిన సమస్య ఉందన్నారు. కంటి నిపుణుల ద్వారా ఆ సమస్యను అధిగమించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కలరా, డెంగ్యూ వంటి విష జ్వరాల గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యాధి తొలి దశలో ఆస్పత్రికి వస్తే నయమవుతుందని తెలిపారు. వీణా, వాణీ ఆపరేషన్ కు ప్రభుత్వ సాయముంటుందని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుల బృందం వీణా, వాణీలు ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు. వాణీ, వాణీలు పెరుగుతున్నారు కాబట్టి ఆస్పత్రిలో కాకుండా స్టేట్ హోంలో ఉంచి వారికి వసతులు కల్పిస్తామని చెప్పారు. 

 

20:29 - July 9, 2016

కరీంనగర్ : ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు అక్రమార్కులు .  కాసులొస్తే చాలు కాలకూట విషమైనా జనానికి అంటగడుతున్నారు. మాంసవ్యర్థాలతో   వ్యాపారం చేస్తూ లక్షలు    సంపాదిస్తున్నారు.  చికెన్‌ వేస్ట్‌తో ఆయిల్‌ తయారు చేసి.. వంటనూనెల పేరుతో  అమ్ముకుంటున్నారు. కరీంనగర్‌  జిల్లాలో జరగుతున్న చికెన్‌ వ్యర్థాల దందాపై టెన్‌టీవీ ఫోకస్..
నాన్‌వెజ్‌ వ్యర్థాలతో నూనెలు తయారు 
పోతే జనం ప్రాణాలేగా... మనకు పైసలొస్తేచాలు అనుకుంటున్నారు కరీంనగర్‌ జిల్లాలోని కొందరు వ్యాపారులు. నాన్‌వెజ్‌ వ్యర్థాలతో నూనెలు తయారు చేసి.. జేబులు నింపుకుంటున్నారు. పచ్చగా...ఆహ్లాదకరంగా ఉండే పల్లెలు మురుగు కూపాలుగా మార్చుతున్నారు. వివిధ జిల్లాల నుంచి తెస్తున్న చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేస్తూ అనారోగ్యాలను ప్రబలిస్తున్నారు... 
అక్రమార్కుల దందా
కరీంనగర్‌ జిల్లాలో యమజోరుగా సాగుతోన్న అక్రమార్కుల దందాకు సాక్ష్యాలీ దృశ్యాలు. ఇది కరీంనగర్‌జిల్లా హుస్నాబాద్‌ దగ్గరలోని పందిళ్ల గ్రామం. ఈగ్రామం ఇపుడు చికెన్‌ వ్యర్థాల డంప్‌గా మారింది. కరీంనగర్‌, వరంగల్‌,  నల్లగొండ జిల్లాల నుంచి రోజూ టన్నుల కొద్ది చికెన్‌ వ్యర్థాలను ఈగ్రామానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈ  వ్యర్థాలను ప్రాసెస్‌ చేసి... ఘన  పదార్ధంగా మార్చి.. మేడ్చెల్‌ శివారు ప్రాంతంలోని కానుకుంట గ్రామంలోని ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. నాన్‌వెజ్‌ వేస్టేజిని తరలించేందుకు.. గాలి, నీటీకాలుష్యానికి కారణం అవుతున్న చికెన్‌ వ్యర్థాలను ప్రాసెస్‌ చేయడానికి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల అనుమతి  ఉండాలి. కానీ అవేవి లేకుండానే కాంట్రాక్టర్‌ కల్తీ నూనెల తయారీకి కారణమవుతున్నాడు. పైగా అనుమతులేవీ అని ప్రశ్నిస్తే.. చికెన్‌ దుకాణాల యజమానులతో తాను కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను చూపిస్తున్నాడీ ప్రబుద్ధుడు. పైగా తన వల్ల మరో నలుగురు ఉపాధి పొందుతున్నారు కదా అంటూ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 
అంతా పర్సెంటేజిల దందాయేనా 
చికెన్‌ వ్యర్థాల కాంట్రాక్టర్‌ను మీడియా ప్రశ్నిస్తోందని తెలియగానే పోలీస్‌లు ఆగమేఘాలమీద రానే వచ్చారు. అంతా బాగానే ఉందనే కలరింగ్‌ ఇచ్చారు. తాము రెగ్యులర్‌గా కాంట్రాక్టర్‌తో టచ్‌లో ఉన్నామని చెబుతున్నారు. నిజానికి ఈ కాంట్రాక్టర్‌ కు పొల్యూషన్‌ డిపార్ట్‌ మెంట్‌నుంచి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతి లేని విషయాన్ని కాంట్రాక్టరే ఒప్పుకుంటున్నాడు. అయినా పోలీసులు హండ్రెడ్‌పర్సెంట్ ఓకే అంటున్నారంటే.. అంతా పర్సెంటేజిల దందాయేనా నడిచేది..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
కుక్కబిస్కెట్ల తయారీలో వాడకం 
ఇదే కానుకుంటలోని న్యూట్రీసైన్సెస్‌ కంపెనీ. పందిళ్లగ్రామంలో ప్రాసెస్‌ చేసిన చికెన్‌ వ్యర్థాలు ఇక్కడికే చేరవేస్తున్నాడు కాంట్రాక్టర్‌.  ఇక్కడ ఈ బాయిలర్లలో ఉడకబెట్టి... ఆయిల్‌ను తీస్తున్నారు. ఇలా తీసిన ఆయిల్‌ను తాము కుక్కబిస్కెట్ల తయారీలోనూ, చేపలదాణాగా అమ్ముతున్నట్టు  ఫ్యాక్టరీ వాళ్లు చెబుతున్నారు. కాని...చికెన్‌ వేస్ట్‌ నుంచి తీసిన ఆయిల్‌ను వంటనూనెల వ్యాపారులకు అమ్ముతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.  దీనిపై నిఘాపెట్టిన టెన్‌టీవీ... నిజాలు తెలుసుకోడానికి ప్రయత్నించింది. టెన్‌టీవీ నజర్‌ పడిందని తెలిసిన న్యూట్రీసైన్సెస్‌ యాజమాన్యం  పలాయనం చిత్తగించింది. మీడియా దృష్టి పడిందని తెలియడంతో ... అధికారులు ఎక్కడలేని హడావుడి చేశారు. 
ప్రమాదకర రోగాలు 
నాన్‌వెజ్‌ వ్యర్థాలతో తయారైన నూనెలు వాడితే.. ప్రమాదకర రోగాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె, కీడ్నీలపై కల్తీనూనెల  ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పైగా మాంసవ్యర్థాలను చేపలకు ఆహారంగా కూడా వినియోగించడం తప్పే అంటున్నారు. 
వ్యాపారులు- అధికారులు కుమ్మక్కు
వ్యాపారులు- అధికారులు కుమ్మక్కై సాగిస్తున్న చికెన్‌ వ్యర్థాల దందాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తూ... ప్రజల ఆరోగ్యాలతో బిజినెస్‌ చేస్తున్న వ్యాపారులపై చర్యాలు తీసుకోవాలని కోరుతున్నారు.  

20:19 - July 9, 2016

హైదరాబాద్ : సరళీకృత ఆర్థిక విధానాలతో పట్టణ సంస్కరణలు ఎక్కువ అయ్యాయని, ఇవి ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. 'పట్టణ సంస్కరణ'పై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా రాఘవులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. పట్టణ జనాభా పెరుగుతున్నా... మౌలిక సదుపాయాల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు సంస్కరణపైనే దష్టి పెడుతున్నారే కానీ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలేదని ఆయన విమర్శించారు. ప్రజలపై పన్నులు, చార్జీల భారం ఎక్కువయ్యిందన్నారు. ఈ సదస్సుకు రాఘవులుతో పాటు, పలువురు హాజరయ్యారు. 

 

20:11 - July 9, 2016

 మహబూబ్‌నగర్‌ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితులకు సీపీఎం అండగా నిలిచింది. 2013 చట్టం పట్ల భూనిర్వాసితులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలంలోని కుడికిళ్ల, నార్లాపూర్‌, సున్నపుతాండ గ్రామాలలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర కొనసాగుతోంది.  ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోకుండా.. నిర్వాసితులకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు. భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. 

 

రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఇంట్లో హోంగార్డుల గొడ్డు చాకిరీపై విచారణకు ఆదేశం

రంగారెడ్డి : జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ ఇంట్లో హోంగార్డుల గొడ్డు చాకిరీపై ఇంఛార్జ్ డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఇంట్లో హోంగార్డుల గొడ్డు చాకిరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉన్నతాధికారి 20మంది హోంగార్డులతో... అడ్డగోలుగా వాడుకుంటున్న విషయం చర్చనీయాంశమైంది. విధుల్లో ఉండాల్సిన హోంగార్డులను అంట్లు తోమడం, పశువులు మేపడం వంటి పనులకు వినియోగించుకుంటున్నారు. 

19:38 - July 9, 2016

రంగారెడ్డి : జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ ఇంట్లో హోంగార్డుల గొడ్డు చాకిరీపై ఇంఛార్జ్ డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఇంట్లో హోంగార్డుల గొడ్డు చాకిరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉన్నతాధికారి 20మంది హోంగార్డులతో... అడ్డగోలుగా వాడుకుంటున్న విషయం చర్చనీయాంశమైంది. విధుల్లో ఉండాల్సిన హోంగార్డులను అంట్లు తోమడం, పశువులు మేపడం వంటి పనులకు వినియోగించుకుంటున్నారు. 

 

19:34 - July 9, 2016

హైదరాబాద్ : అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయినా కాంగ్రెస్ నుంచి గుణపాఠం చెప్పించుకోవాల్సిన దుస్థితిలో టిఆర్ఎస్ లేదని మంత్రి హారీష్‌రావు అన్నారు. దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. 'ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ వరకు మీ పార్టీ ఎవరి చేతుల్లో ఉందో గుర్తుంచుకోవాలని' అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేస్తుంటే వాటిని దుబారా చేస్తున్నారని విమర్శించడం ఎంతవరకు సబబు అని హరీష్‌రావు ప్రశ్నించారు. 

 

19:30 - July 9, 2016

కరీంనగర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని రామగుండంలోని ఓసీపీ క్వారీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల దెబ్బకు క్వారీలోని యంత్రాలను అధికారులు బయటికి తీసుకువెళ్లారు. దీంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆగిపోగా... సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరోవైపు రామగుండం నగరంలో రోడ్లన్ని పూర్తిగా జలమయం అయ్యాయి. 

 

19:27 - July 9, 2016

ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేరడిగొండ మండలంలోని వాంకిడి వాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో నేరడిగొండ- నిర్మల్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

 

19:22 - July 9, 2016

అసోం : భారీ వర్షాలతో అసోం అతలాకుతలం అయింది. కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. చెరువులను తలపిస్తున్నాయి. నీటిలోంచే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకుంటున్నారు. వరదల కారణంగా ఎనిమిది జిల్లాల్లోని లక్షన్నర మంది నిరాశ్రయులయ్యారు. మొరిగాన్‌, గొలఘాట్‌ జిల్లాల్లో 16 వేల పశువులు, 12 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. భోగెర్‌పార్‌ గ్రామం నీటిలో మునిగిపోయింది.
నిరాశ్రయులైన ప్రజలు 
అసోంను వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్రతో పాటు దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని జిల్లాలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పశువుల.. కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

 

19:18 - July 9, 2016

విజయవాడ : పాలకులు భూబకాసురుల మాదిరిగా తయారయ్యారని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈమేరకు వియవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బందర్‌ పోర్ట్‌ను 5 వేల ఎకరాల్లో నిర్మిస్తామంటే.. ఆ రోజున ఉద్యమాలు చేసిన టీడీపీ నేతలు.. ఈరోజు లక్ష ఎకరాలు సేకరించేందుకు సిద్ధమవుతుందని ఆరోపించారు. టీడీపీ నేతల ఆగడాలను చూస్తూ ఊరుకోమని.. రైతులకు అండగా నిలుస్తామని రఘువీరా భరోసా ఇచ్చారు.

 

భద్రాచలం రామాలయంలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్

ఖమ్మం : భద్రాచలం రామాలయంలో ఉద్యోగుల తీరు... ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లేగా మారుతోంది. మద్యం సేవించి విధులకు హజరవుతున్నరని... ముగ్గురు ఉద్యోగులను ఈవో గోపీ సస్పెండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. 

19:10 - July 9, 2016

ఖమ్మం : భద్రాచలం రామాలయంలో ఉద్యోగుల తీరు... ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లేగా మారుతోంది. మద్యం సేవించి విధులకు హజరవుతున్నరని... ముగ్గురు ఉద్యోగులను ఈవో గోపీ సస్పెండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. 

నెల్లూరు దోపిడీ ఘటనలో అనేక అనుమానాలు

నెల్లూరు : జిల్లా కేంద్రంలోని చిల్ట్రన్స్‌ పార్క్‌ సమీపంలో జరిగిన దారుణ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడ్డ నిందితుడు సుధ అనే మహిళ పేరు చెప్పడంతో హత్యకు కారకులెవరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భర్తపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

హోంగార్డులు గొడ్డు చాకిరీ

రంగారెడ్డి : జిల్లా ఎస్పీ ఇంట్లో హోంగార్డులు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. 20మంది హోంగార్డులు ఎస్పీ తన ఇంట్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఎస్పీ హోంగార్డులను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. అంట్లు తోముతూ, పశువులు మేపుతూ సేవలు చేస్తున్నారు. ఎస్పీ తీరుపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్లీ వ్యవస్థ రద్దు ఉత్తర్వులు సీనియర్ అధికారులు పట్టించుకోవడం లేదు. 

19:00 - July 9, 2016

రంగారెడ్డి : జిల్లా ఎస్పీ ఇంట్లో హోంగార్డులు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. 20మంది హోంగార్డులు ఎస్పీ తన ఇంట్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఎస్పీ హోంగార్డులను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. అంట్లు తోముతూ, పశువులు మేపుతూ సేవలు చేస్తున్నారు. ఎస్పీ తీరుపై హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్లీ వ్యవస్థ రద్దు ఉత్తర్వులు సీనియర్ అధికారులు పట్టించుకోవడం లేదు. 

 

18:51 - July 9, 2016

నెల్లూరు : జిల్లా కేంద్రంలోని చిల్ట్రన్స్‌ పార్క్‌ సమీపంలో జరిగిన దారుణ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడ్డ నిందితుడు సుధ అనే మహిళ పేరు చెప్పడంతో హత్యకు కారకులెవరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భర్తపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:46 - July 9, 2016

హైదరాబాద్‌ : నగరంలో పేలుళ్లకు కుట్రపన్నిన ఐసిస్ నిందితుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే కస్టడీకి సమయం ఉండటంతో విచారణ వేగవంతం చేశారు. ఐదుగురు నిందితులను ఏడు రోజులుగా విచారించిన అధికారులు వారి నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఐసిస్ కుట్ర భగ్నం
హైదరాబాద్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాలన్న ఐసిస్ సానుభూతిపరుల కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు..వారినుంచి నిజాల్ని కక్కించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో వరుస బాంబులు పేల్చి ప్రపంచ దేశాలన్నింట్లో తన ఉనికిని చాటుకోవాలనుకున్న ఐసిస్‌ నుంచి ఎన్.ఐ.ఏ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టుతున్నారు. శామీర్‌పేటలోని హెడ్ క్వాటర్‌కు తీసుకెళ్లి విచారణ మొదలు పెట్టారు. నిందితులను  వేరు వేరుగా ప్రత్యేక సెల్‌లో ఉంచి విచారణ మొదలు పెట్టారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి నిందితులకు అందిన డబ్బుల పైనా కూడా కూపీ లాగుతున్నారు. 
ఆయా కోణాల్లో ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తు
నాందేడ్ విచారణతో హైదరాబాద్‌లోని ఇబ్రహీం, ఇలియాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 17 బుల్లెట్లు, 2 కంప్యూటర్లు, రెండు స్కానర్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడిన నెట్ వర్క్, అండర్ గ్రౌండ్ హాకింగ్ పై దృష్టి పెట్టారు. నిఘా వర్గాల కంట పడకుండా ఎలాంటి సమాచార మాధ్యమాలు వాడుకున్నారో అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్.ఐ.ఏ. టీం అనంతపూర్‌కు వెళ్లి,..అక్కడ నిందితులు ఎవరెవరిని కలిశారో విచారణలో రాబట్టారు. దీంతో విచారణలో ఏ.పి. ఇంటిలిజెన్స్ పోలీసుల సహాకారాన్ని తీసుకున్నారు. 
నిజామొద్దీన్‌ను విచారించిన పోలీసులు 
ఇక వారిచ్చిన సమాచారం మేరకు సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన నిజామొద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని సాక్షిగా విచారించి, పూర్తిగా దర్యాప్తు చేసాకే విడిచిపెట్టారు. అయితే ఇంకా నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు రాబట్టుకోవడంపై ఎన్‌ఐఏ అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో ఐసిస్ మూలాలను కూకటి వేళ్లతో సహా పెరికివేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.  దీంతో మరో నాలుగు రోజుల్లో జరగనున్న విచారణ ఎంతో కీలకం కానుంది. 

 

18:42 - July 9, 2016

గుంటూరు : చంద్రబాబు పాలనలో హామీలు ఎక్కువగా అమలయ్యాయా... వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో హామీలు ఎక్కువగా అమలయ్యాయా.. అనే విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాలు విసిరారు. పదకొండు కేసుల్లో ఏ1 నిందింతుడిగా ఉన్న జగన్‌ గడప గడపకు వైసీపీ అంటూ ఎలా ప్రజల్లోకి వెళతారంటూ ప్రశ్నించారు. ఈడీ 2500 కోట్ల రూపాయల ఆస్తులను ఎందుకు జప్తు చేసిందో ముందు ప్రజలకు వివరించాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. 

 

వీణావాణీలను పరామర్శించిన దత్తాత్రేయ

హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రిలో వీణావాణీలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. వీణావాణీల విషయాన్ని జెపీ నడ్డా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వీణావాణీలకు ప్రత్యేక సెక్యూరిటీ అవసరమన్నారు. 

జీహెచ్ ఎంసీలో హరితహారంపై సమావేశం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలో హరితహారంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ 11న 25 లక్షల మొక్కలు నాటేందుకు అందరూ సహకరించాలని కోరారు. 27 లక్షల మొక్కలు నాటేందుకు గుంతలు సిద్ధం చేశామని చెప్పారు. మొక్కలు నాటేందుకు 103 సంస్థలు కలిసి వస్తున్నాయని తెలిపారు. జీహెచ్ ఎంసీ నుంచి మొక్కల పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లు, హెచ్ వోడీలు పాల్గొన్నారు. 
 

15:49 - July 9, 2016

నెల్లూరు : జిల్లా కేంద్రలో దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. చోరీకి వెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. చోరీ కోసం ఓ ఇంట్లోకి చొరబడి మహిళ గొంతు కోసి హత మార్చాడు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్కు వద్ద నాగేశ్వర్ రావు, పద్మావతి అనే దంపతులు వారి కూతురు మా, మేనల్లుడు అనంతకృష్ణ మొత్తం నలుగురు నివాసముంటున్నారు. పద్మావతి టీచర్ గా పని చేస్తోంది. నాగేశ్వర్ రావు బయటికి వెళ్లారు. దోపిడీ దొంగ వారి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న పద్మావతి, కూతరు మాధురి, అనంతకృష్ణలపై కత్తితో దాడి చేశాడు. పద్మావతి గొంతు కోసి హత మార్చాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఇంటికి వచ్చిన నాగేశ్వర్ రావుపై కూడా దుండగుడు దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పథకం ప్రకారమే హత్య చేసిండని స్థానికులు అంటున్నారు. అయితే వరుస ఘటనలతో జిల్లా వాసులు 
భయాందోళనలో ఉన్నారు. 

15:24 - July 9, 2016

ఖమ్మం : ఏజెన్సీ ప్రాంతమైన టేకులపల్లి మండలంలొ బొగ్గు గనుల తవ్వకం కోసం గిరిజనుల భూములను సింగరేణి యాజమాన్యం.. ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది. 2003 సంవత్సరంలో ఈ ప్రాంతంలో.. 800 ఎకరాలు సాగు భూములు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా.. గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:09 - July 9, 2016

హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్‌ వికటించి చూపు కోల్పోయిన బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 'చూపు బాగుపడుతుందని ఆస్పత్రికి వస్తే ఉన్న చూపుకూడా పోయిందని'... సరోజినిదేవి ఆస్పత్రి బాధితులు  వాపోతున్నారు. చూపురాకపోయినా... డాక్టర్లు బెటర్‌గా ఉందంటూ ఇంటికెళ్లిపొమ్మంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెటర్‌ అంటే... కంట్లో వేసిన మందు బెటరా.. కన్ను పోయినందుకు బెటరా.. అని వారు ప్రశ్నిస్తున్నారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఆర్ ఎల్ సెటైన్ బాటిళ్లలో ఫంగస్ ఉండడంతో 13 మంది కంటిచూపు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

 

15:02 - July 9, 2016

హైదరాబాద్ : సరోజిని కంటి ఆస్పత్రిలో 13 రోగులు కంటి చూపు కోల్పోయిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ నేతలు అరోపించారు. ఆస్పత్రిలో బాధితులను కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు. ఈ ఘటనకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ దారుణం జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు.

 

14:57 - July 9, 2016

హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 13 మంది కంటిచూపు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం అయ్యింది.  సూమోటోగా కేసును స్వీకరించిన లోకాయుక్త  రెండోరోజు కూడా సరోజినీదేవి ఆస్పత్రిలో విచారణను కొనసాగించింది. లోకాయుక్త ప్రతినిధులు బాధితులతో మాట్లాడారు.  ఆర్‌ఎల్‌ ద్రావకం సరఫరా చేసిన సంస్థ బాధ్యత వహించాలని, కంటిచూపు పోవడంలో ఎవరి ప్రమేయం ఎంతుందో విచారణలో తేలుతుందంటున్నారు.  డాక్టర్లందరితో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని చెబుతున్నారు.

 

14:55 - July 9, 2016

చిత్తూరు : తిరుపతి ఆర్డీవో ఆఫీసర్ పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. చెవెరెడ్డిని పోలీసులు కడప సబ్ జైలుకు తరలించారు. అయితే తిరుపతి పోలీసులకు, చెవిరెడ్డి భాస్కర్ కి మధ్య గత కొద్ది కాలంగా వివాదం కొనసాగుతోంది. తిరుపతి ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టిన సందర్భంలో ఆఫీసర్ పై దాడి కేసులో కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. 

కడప సబ్ జైలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరలింపు

తిరుపతి : ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా కేసులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విదించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు కడప సబ్ జైలుకు తరలించారు. 

లోకేష్ తో ముగిసిన టీటీడీపీ నేతల భేటీ

హైదరాబాద్ : లోకేష్ తో టీటీడీపీ నేతల భేటీ ముగిసింది.  వారంలోగా మండల, జిల్లా అనుబంధ సంఘాలు కమిటీలు వేయాలని నారా లోకేష్ చెప్పారు. పార్టీ కార్యక్రమాలపై రోజువారీ సమీక్ష చేస్తామని తెలిపారు. ఇకపై నెలకొసారి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన దీక్షలో ఎన్ టీఆర్, చంద్రబాబు ఫోటోలు లేకపోవడంపై మోత్కుపల్లి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి కార్యక్రమంలో ఎన్ టీఆర్ ఫొటోతో ముందుకెళ్లాలని సూచించారు. 

నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం

నెల్లూరు : చిల్డ్రన్స్ పార్కు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఓ ఇంట్లోకి చొరబడి మహిళ గొంతు కోసి ముగ్గురిపై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.   

సరోజినిదేవి ఆస్పత్రి ఘటనపై విచారణ

హైదరాబాద్  : సరోజినిదేవి ఆస్పత్రి ఘటనపై వైద్యులు, సిబ్బందిని విచారణ కమిటీ విచారిస్తోంది. ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పిస్తామని విచారణ కమిటీ తెలిపింది. 

13:45 - July 9, 2016

ఢిల్లీ : తెలంగాణ భవన్ లో దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి... పోతురాజుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయ్... బోనాల ఉత్సవాల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి...

13:42 - July 9, 2016

కర్నూలు : భర్తకోసం ఓ భార్య ధర్నాకు దిగింది. ఆదోనిలోని క్రాంతినగర్‌లో భర్త ఇంటిముందు ముగ్గురు పిల్లలతో దీక్షకు కూర్చుంది. గుంతకల్లులో ఆర్‌ఫిఎఫ్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఈరేశ్‌ ...2008లో అరుణను ప్రేమవివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్న ఈరేశ్‌ మరో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు భార్య ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని గుంతకల్‌ టూటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా .. పట్టించుకోవడంలేదని అరుణ ఆరోపిస్తోంది. భర్త ఇంటిముందు దర్నాకు దిగడంతో ఈరేశ్‌ తల్లిదండ్రులు తాళం వేసుకుని పరార్‌ అయ్యారు.

13:41 - July 9, 2016

హైదరాబాద్ : ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులతో మంత్రులు, కేటీఆర్‌, హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన ఇసుకరీచ్‌లను గుర్తించాలని సూచించారు. కాళేశ్వరం, రంగనాయకీ, అనంతగిరి ప్రాజెక్టులకు అవసరమైన 7లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మిడ్‌మానేరు నుంచి తరలించాలని సూచించారు. 45రోజుల్లో ఇసుక తరలింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక తరలింపులో అక్రమాలు జరగకుండా చూడాలన్నారు.

 

ఇరిగేషన్ అధికారులతో మంత్రులు సమీక్ష..

హైదరాబాద్‌ : తెలంగాణ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, అవసరమైన ఇసుక రీచ్‌ల గుర్తింపుపై ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులతో శనివారం సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

13:06 - July 9, 2016

హైదరాబాదు : నాణ్యత లేని మందులకు సరఫరా చేసిన ఆర్ ఎల్ కంపెనీ వదిలేసి బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న తమపై కేసులెలా పెడతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్యం చేయటానికే డాక్టర్లగా మా విధులను నిర్వహిస్తున్నామన్నామన్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో లక్షల కొద్దీ ఆపరేషన్లు చేశామన్నారు. ప్రముఖ కంటి వైద్యశాల సరోజని కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు వికటించిన సంగతి తెలిసిందే. ఈ దారుణంపై ఓ కమిటీని వేసింది. ఆపరేషన్లు చేసిన వైద్యులపై కేసులు పెట్టింది. ముందూ వెనుకా చూసుకోకుండా ప్రభుత్వం పెట్టిన కేసులపై వైద్యులు ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వైద్యులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఆపరేషన్లు వికటించడానికి తమ నిర్లక్ష్యమేమీ కారణం కాదని ప్రభుత్వం సరఫరా చేసిన మందుల్లోని బ్యాక్టీరియా కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తాము ఆపరేషన్లు చేస్తే... నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్ఎంఐడీసీ సరఫరా చేసిన నాణ్యత లేని మందుల వల్ల బాధితుల చూపు పోయిందని ఆరోపించారు. అకారణంగా తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:50 - July 9, 2016

విజయవాడ : చట్టాలకు వ్యతిరేకంగా ఏపీలో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రైతుల నుండి బలవంతంగా భూమిని లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. దీనిపై ఆదివారం సాయంత్రం 5గంటలకు వామపక్షాల సమావేశం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.

12:47 - July 9, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ నిర్ణయాలపై సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి మధు నిప్పులు చెరిగారు. బందర్‌ పోర్టులో డీప్‌ వాటర్‌ ఎయిర్‌పోర్టు కోసం లక్షా 5 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణ చేస్తే సహించేది లేదని అన్నారు. మచిలీ పట్నంలో 22 వేల ఎకరాలు సేకరిస్తామనడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

12:45 - July 9, 2016

గుంటూరు : కృష్ణా పుష్కర పనులు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే....ముఖ్యమంత్రి మొట్టికాయలు వేసినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు...కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ఘాట్ల ఇంకా నిర్మాణ దశలో ఉంటే, రాజధాని ప్రాంతంలోని ఓ ఘాట్ మాత్రం అప్పుడే పుష్కారాలకు సిద్దం అయ్యింది..ఆఘాట్ ను ముఖ్యమంత్రి ఒక్కసారిగా కూడా పరిశీలన లేదు...మంత్రుల పర్యనలు లేవు...అధికారుల హడావిడి అంతకన్నా లేదు...కానీ ఘాట్ నిర్మాణం పూర్తి చేశారు...విజయవాడ, అమరావతి ప్రాంతాలతో పోలిస్తే ఏ మాత్రం తీసిపోని ఘాట్ ను నెలన్నరలోనే పూర్తిచేసి, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న తాళ్లాయపాలెం ఘాట్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:41 - July 9, 2016

ఉత్తరప్రదేశ్‌ : మేదర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని సదార్‌ బజార్‌లో అక్రమ కట్టడాలు తొలగిస్తుండగా ఓ భవనం కూలి ఐదుగురు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను అధికారులు హైకోర్టు ఆదేశాలతో తొలగిస్తుండగా ఈ ఘటన జరిగింది. భవనాలు ఖాళీ చేయాలని గతంలోనే నివాసితులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. భవనాలు కూలగొట్టే ముందు లోపల ఎవరైనా ఉన్నారా.. లేరా అని పరిశీలించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య...

మ్మం : కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామంలో దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన తాటి లోకేష్‌(35), భార్య అసోని(30) ఆర్థిక ఇబ్బందులతో గొడవపడ్డారు. దీంతో మనస్థాపానికి గురైన లోకేష్‌ సమీపంలోని బావిలోకి దూకాడు. గమనించిన భార్య కూడా బావిలో దూకడంతో ఇద్దరూ మృతి చెందారు.

11:52 - July 9, 2016

ఢిల్లీ : ఎంఐఎం పార్టీ ఎంపీ ఓవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓవైసీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు, ఆరెస్టైన ఉగ్రవాదులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ న్యాయ సహాయం చేస్తాననడంపై రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. త్వరలో హైదరాబాద్ సేవ్ క్యాపెంనింగ్ నిర్వహిస్తానంటున్న కిషన్ రెడ్డి మాటల తూటాలను ఈ వీడియోలో చూడండి...

11:45 - July 9, 2016

హైదరాబాద్ : ఎంసెట్ పరీక్ష అధికారు నిమిషం నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. చాలా చోట్ల ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించలేదు..దీంతో ఎడుస్తూ వెనుదిరిగారు... నిమిషం నిబంధనపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు... పలు చోట్ల అధికారులతో గొడవదిగారు. కాగా ప్రతీ ఏడాది కూడా ఈ నిబంధనతో ఎంతోమంది విద్యార్థు తమ విద్యాసంవత్సరాన్ని కోల్పోతున్నారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యామ్నాయంగా ఆలోచించాల్సిన అవసరముందని విద్యార్ధులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. .

11:35 - July 9, 2016

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని బాలనేరస్తుల గృహం(జువైనల్‌ హోం) నుంచి నలుగురు బాలురు పరారయ్యారు. బాలురు పరారైనట్లు హోమ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హైకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. నలుగురు బాలురు సిబ్బందిని తోసుకుని  పారిపోయినట్లుగా తెలుస్తోంది. గత ఆరునెలల వ్యవధిలో ఆరుగురు పిల్లలు బాలుర పరిశీలన గృహం నుంచి పరారయ్యారు.

జువైనల్ హోమ్ పారిపోయిన 4గురు బాలురు..

చిత్తూరు : జువైనల్ హోమ్ నుండి పారిపోయిన నలుగురు బాలురు పారిపోయారు. హోమ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు . అనంతరం హైకోర్టు జిడ్జికి పిర్యాదు చేసారు. హాస్టల్ వార్డెన్ తోసివేసి బాలురు పారిపోయినట్లుగా సమాచారం.

11:18 - July 9, 2016

వరంగల్ : వరంగల్ లోని ఎంజీఎంలో సెలైన్ బాటిళ్ల పై 10 టివీలో ప్రసారమయిన కథనంపై వైద్యఆరోగ్యశాఖ స్పందించింది. ఎంజీఎంలో అసీద్ కంపెనీకి చెందిన ఆర్ఎల్ సెలైన్ బాటిళ్ల వాడకాన్ని నిలిపివేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్ కరుణాకర్ రెడ్డి, వైద్యబృందం రంగంలోకి దిగి 12 వేల అసీదు కంపెనీ సెలైన్ బాటిళ్లను వాడవద్దని సూచించి స్టోర్ కు తరలించారు. పెంటగో కంపెనీకి చెందిన ఆర్ఎల్ బాటిళ్లు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 6 వేల ద్రావణం బాటిళ్లను ఎంజీఎం అధికారులు అందుబాటులో ఉంచారు. కాగా హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం సమీపంలో వున్న సరోజినీ కంటి ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం ఆర్ ఎల్ బాటిల్స్ వాడకంతో పలువురు కంటిచూపు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంగా టెన్ టీవీ ఈ విషయాన్ని పలుమార్లు ప్రసారం చేసింది. దీంతో కదిలిన యంత్రాంగా ఓ కమిటీని వేసింది. హెచ్ ఆర్సీ ఈ దారుణంపై సుమోటోగా కేసు నమోదు చేసి తెలంగాణ అధికారులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

11:02 - July 9, 2016

గుంటూరు : రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న అమారావతి ఇప్పుడు నయా మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. రాజధాని రాకతో అమరావతితో సహా పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.. కేంద్ర ప్రభుత్వం అమరావతి నగరాన్ని వారసత్వ నగరాల్లో ఒకటిగా గుర్తించి అభివ్రుద్దికి శ్రీకారం చుడుతుంటే, మరోవైపు అదే అమరావతిలో మోసగాళ్లు నయా దందాలకు పాల్పడుతున్నారు.

ఏళ్ల క్రితం దళితులకు ఉచితంగా భూములిచ్చిన వాసిరెడ్డి రాజులు..
ఎన్నో ఏళ్ల క్రితం అమరావతిలో దళితులకు వాసిరెడ్డి రాజులు ఉచితంగా ఇచ్చిన ల్యాండ్ పై కన్నేసి, అందిన కాడికి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అమరావతి పట్టణాన్ని ఆనుకుని ఉన్న సత్తెనపల్లి రోడ్డులో కోటిన్నర విలువైన భూమి ఉందని.. పుష్పవతి అనే మహిళ ఆరోపించింది. దానిని దక్కించుకునేందుకు పుష్పవతి అన్నయ్యతో సహజీవనం చేసిన కుమారి ప్రయత్నిస్తోందని వాపోతున్నారు.

తన తల్లిపేరిట ఉన్న భూమిని అన్నపేరు ఉన్నట్లుగా ప్రతాలు...
అధికారులకు లంచాలు ఇచ్చి..తన తల్లిపేరిట ఉన్న భూమిని..తన అన్న పేరుమీద ఉన్నట్లు పత్రాలు సృష్టించిందని బాధితులు అంటున్నారు. అగ్రకులం నుండి తనకులాన్ని దళితురాలిగా మార్చుకుందని..అందుకనుగుణంగా తనపేరు మీదకి భూమిని మార్చుకుని అప్పనంగా కొట్టేయాలని కుమారి చూస్తోందని..బాధితురాలు పుష్పవతి ఆవేదనవ్యక్తం చేస్తోంది.

రాజధాని పుణ్యమా నయా దందాలు..
మరోవైపు కులంలో పుట్టి మరోవ్యక్తితో సహజీవనం చేసినా.. పెళ్లి చేసుకున్నా.. యువతి లేక యువకుడి కులం మారదన్నారు అమరావతి ఎమ్మార్వో. పుట్టినప్పుడు ఏ కులం అయితే ఉంటుందో అదేకులం వర్తిస్తుందని అన్నారు. గతంలో పనిచేసిన అధికారులు ఇలా కులపత్రాలు ఎలాఇచ్చారో తనకు తెలియదని చెబుతున్నారు. మొత్తానికి రాజధాని పుణ్యమా అని ఇలా నయా దందాలకు తెరతీస్తున్నారు కొందరు మాయగాళ్లు. భూమి ధరలు పెరిగాయని సంతోషపడాలో ఇలాంటి దందాలు పెరిగిపోయాయని ఆందోళన చెందాలో అర్థం కావడంలేదని బాధితులు అంటున్నారు. ఏళ్లుగా పొలాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

10:57 - July 9, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో ఎంసెట్‌-2 పరీక్ష ప్రారంభమైంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోపలికి అనుమతించలేదు. 14 రీజనల్‌ సెంటర్ల పరిధిలో మొత్తం 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 56వేల 194 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సెట్‌-2 పరిక్షకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశాయి. జాతీయ, ప్రభుత్వ సంస్థల బిల్డింగ్‌ల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీశ్రీస్‌, బీడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ... కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీకోసం ఈ ఎంసెట్‌-2 నిర్వహిస్తున్నారు. పరీక్ష ముగిసిన కొద్ది గంటల్లోపే .. ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఈనెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తర్వాత ఈనెల 14న ఫలితాలు, ర్యాంకులు విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ విషయం మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి.

10:53 - July 9, 2016

వరంగల్ : నర్సంపేటలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రమాదం జరిగింది. రైస్ బాయిలర్ లీకై ఇద్దరు విద్యార్ధులకు, వంటమనిషికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్ధులపై వేడినీరు పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. 3 విద్యార్ధులకు తీవ్రంగా మరో ముగ్గురు విద్యార్ధులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వంటచేసే మహిళ అప్రమత్తంగా వుండటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో విషాదం...

ఉత్తరప్రదేశ్ : మీరట్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శిథిలాల కిందపడి ఐదుగురు మృతి చెందారు. మరింతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

10:47 - July 9, 2016

ఢిల్లీ : ఎంపీ ఓవైసీపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేయటంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను బీజేపీ నేత కిషన్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన ఉగ్రవాదులకు ఎంపీ ఓవైసీ న్యాయ సహాయం చేస్తాననటంపై ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు ఓపార్లమెంట్ సభ్యుడు న్యాయసహాయం చేస్తాననటం ఎంతవరకూ సమంజమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను పట్టుకుంటున్నారన్నారు. ఎన్ఐఏ ముందస్తు జాగ్రత్తతోనే హైదరాబాద్ నగరానికి పెనుముప్పు తప్పిందన్నారు. గతంలో లుంబినీపార్క్, గోకుల్ చాట్ లో జరిగిన మారణహోమంలో అమాయక ప్రజలు బలైపోయిన సంగతి  ఎంపీకి తెలియాదాని ప్రశ్నించారు. ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దానికి మూలాలు హైదరబాద్ నగరంలో కనిపిస్తున్నాయన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ పై తెలంగాణ సర్కార్ స్టాండ్ ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరముందన్నారు.

బాయిలర్ లీకై విద్యార్ధులకు గాయాలు..

వరంగల్ : నర్సంపేటలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రమాదం జరిగింది. రైస్ బాయిలర్ లీకై ఇద్దరు విద్యార్ధులకు, వంటమనిషికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

09:52 - July 9, 2016

హైదరాబాద్ : ఓ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఆ గొడవ ఖండంతరాలు దాటింది. ఇరువర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇది మా సొంతమంటే కాదు మా సొంతం అంటున్నాయి. ఇరువురి మధ్య అగ్గిరాజేసిన గొడవ ఇప్పుడు కోర్టుకు చేరింది. రెండు దేశాలకు చెందిన వారు ఎందుకు గొడవపడుతున్నారు. వారి దేని కోసం ఆరాటపడుతున్నారు.

ఎటూ తేలని సానియా భవితవ్యం..
కరువమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది చిన్నారి సానియా పరిస్థితి. భర్త చేతిలో దారుణహత్యకు గురైన సింథియా కూతురు సానియా ఎవరి వద్ద ఉండాలనే అంశం చర్చనీయాంశమైంది. తండ్రి తరఫు వారి నీడలో ఉండాలో.. లేక తల్లి బంధువుల చెంతన ఉండాలో తెలియక సతమతమవుతోంది. చిన్నారి సానియాను తమకే అప్పగించాలని సింథియా బంధువులైన కాంగో వాసులు పట్టుబడుతున్నారు. అటు హైదరాబాద్‌లో ఉంటున్న రూపేష్‌ బంధువులు ఇదే విషయంపై పట్టువీడటం లేదు. ఇరు కుటుంబాల బంధువులు మొండికేయడంతో ఆ లేత మనసు అల్లాడిపోతోంది. ఎలా స్పందించాలో తెలియక మౌనంగా రోదిస్తోంది.

సానియా భవితవ్యంపై సందిగ్థత...
మరోవైపు సానియా భవితవ్యంపై సందిగ్ధం వీడటం లేదు. ఉదయం సానియాను పోలీసులు రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. చిన్నారిని ఎవరి సంరక్షణలో ఉంచాలనే అంశంపై విచారణ చేపట్టారు. సానియాను తమకే ఇవ్వాలంటూ రూపేష్ కుటుంబ సభ్యులు కోరారు. లేదు తమకే ఇవ్వాలంటూ కాంగో వాసులు పట్టుపట్టారు. దీంతో న్యాయమూర్తి సానియాను రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టులో హాజరుపరచగా..తమ పరిధిలోకి రాదని తెలిపింది. తిరిగి రాజేంద్ర నగర్‌ కోర్టుకే వెళ్లాలని ఆదేశించింది. దీంతో రెండు కోర్టుల్లో సానియాను హాజరుపరిచినా స్పష్టత రాకపోవడంతో.. చిన్నారిని ఎవరికి అప్పగించాలన్న అంశంపై చిక్కుముడి వీడటం లేదు.

09:46 - July 9, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు బహదూర్ పురా, హసన్ నగర్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 బైక్ లు, 10 ఆటోలు, నాలుగు కార్లు, 280 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది అనుమానితులను, ఐదుగురు బంగ్లాదేశీయులను, తొమ్మిది మంది రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

09:44 - July 9, 2016

హైదరాబాద్ : మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఎమ్‌సెట్‌-2 పరీక్షకు సర్వసిద్ధమైంది. ప్రశ్నాపత్రం కోడ్‌ 'ఆర్‌' ను మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు పరీక్ష జరగనుంది. పరీక్షాకేంద్రానికి గంటముందుగానే అనుమతిస్తున్నందున .. పరీక్షమొదలైన తర్వాత

ఒక నిముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ...
ఎంసెట్‌-2 పరీక్షకు తెలుగురాష్ట్రాల్లో 14 రీజనల్‌ సెంటర్ల పరిధిలో మొత్తం 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రీజినల్‌ సెంటర్లపరిధిలో 28 ఎగ్జామ్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 56వేల 194 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 36వేల 525 మంది హాజరవుతుండగా... ఏయూ, ఎస్‌వీయూ పరిధి నుంచి 17వేల 980 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

ఎంసెట్‌-2 పరిక్షకు గట్టి భద్రతా ఏర్పాట్లు..
జాతీయ, ప్రభుత్వ సంస్థల బిల్డింగ్‌ల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీశ్రీస్‌, బీడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ... కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీకోసం ఈ ఎంసెట్‌-2 నిర్వహిస్తున్నారు. పరీక్ష ముగిసిన కొద్ది గంటల్లోపే .. ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఈనెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తర్వాత ఈనెల 14న ఫలితాలు, ర్యాంకులు విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

09:33 - July 9, 2016

ఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో మరోసారి వాదనలు జరిగాయి. కృష్ణానీటి కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్య మొదటి నుండి ప్రాజెక్టుల వారీగా జరపాలంటున్న తెలంగాణ రాష్ట్రం.. మొదటి రోజు సుధీర్ఘ వాదనలు వినిపించింది. నీటి కేటాయింపుల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం తరపు న్యాయవాదులు కోరారు .

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ సుధీర్ఘంగా వాదనలు ...
కృష్ణానదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ సుధీర్ఘంగా వాదనలు వినిపించింది. సాగు భూమి జనాభా ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరపాలని వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ . తెలంగాణ భౌగోళిక స్వరూపం వల్ల రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని వైద్యనాథన్ త్రీడి మ్యాప్ ద్వారా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు.

1940 నుండి నేటి వరకు ...
1940
నుండి నేటి వరకు నీటి కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో పెరిగిన సాగుభూమి గణాంకాలు చూస్తే విషయం స్పష్టమవుతుందని వైద్యనాథన్‌ తెలిపారు. ఎగువ రాష్ట్రాలు నీటిని నిల్వ ఉంచుకుని సర్ ప్లస్ జలాలను కిందికి విడుదల చేయడాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చింది తెలంగాణ. నీటి విడుదలకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్‌ను పంటసాగు ప్రారంభమయ్యే జూన్‌లోనే ప్రారంభించాలని వైద్యనాథన్ కోరారు.
811
టీఎంసీల్లో తెలంగాణ కు 298టీఎంసీలు కేటాయింపు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయించారని అన్నారు. కానీ వాస్తవరూపంలో తెలంగాణకు 260 టీఎంసీలే వస్తున్నాయని వాదించారు. దీనిపై ఏపీ, తెలంగాణ రెండురాష్ట్రాల నీటి కేటాయింపుల వివరాలను ట్రిబ్యునల్ కు అందజేశారు.
త్రీడీ
మ్యాప్ ద్వారా వివరించిన న్యాయవాది..
దీనికి సంబంధించిన తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఆయన త్రీడీ మ్యాప్ ద్వారా వివరించారు. ఆల్ మట్టి, శ్రీశైలం డ్యాం వరకు నీటి కేటాయింపులను వివరించారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు ప్రథమప్రాధాన్యం ఇచ్చి నీటి కేటాయింపులు జరపాలన్నారు. ఎగువ రాష్ట్రాలను విడిచిపెట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపడితే.. న్యాయం జరగదని న్యాయవాది వాదించారు. ఇవాళ కూడా తెలంగాణ తన వాదనలను కొనసాగించనుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

రంగారెడ్డి: బాచుపల్లిలో గడిచిన అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.  వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మృతుడు చందానగర్‌కు చెందిన పరుశురాములు(30)గా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర...

శ్రీ‌న‌గ‌ర్‌ : జ‌మ్మూ బేస్ క్యాంప్ నుంచి అమ‌ర్‌నాథ్‌కు బ‌య‌లుదేరే యాత్రను కూడా ఇవాళ ర‌ద్దు చేశారు. పుల్వామా, అనంత్‌నాగ్‌, సోఫియాన్ జిల్లాల్లోనూ క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ఆయా జిల్లాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను కూడా నిలిపివేశారు. ఉగ్ర‌వాది బుర్హ‌న్ వానిని శుక్ర‌వారం భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయి. హిజ్‌బుల్ క‌మాండ‌ర్ హ‌త‌మైన నేప‌థ్యంలో వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. దాంతో శ్రీ‌న‌గ‌ర్‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

నేర చరిత్ర వున్న మోదీ అమాత్యులు ...

ఢిల్లీ : ప్రధాని మోదీ ఇటీవలే తన కాబినెట్ విస్తరించిన విషయం తెలిసిందే. కేబినెట్ ఎన్నికైన అమాత్యులలో 31 శాతం మంది నేర చరిత్ర వున్నవారే. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం 14 మందిపై అత్యాచారం, హత్యాయత్నం, సామాజిక అల్లర్లు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయట.

శ్రీవారిసేవలో మహారాష్ట్ర గవర్నర్‌...

తిరుమల: తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్‌ సి.హెచ్‌.విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు తితిదేఅధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

08:51 - July 9, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రోడ్ నెంబర్ 40 వద్ద తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురు యువకులు, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో 4 కార్లు, 2 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి 12 గంటల తర్వాత కూడా ప్రమాదాలు జరుగుతుండటంతో 12 తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

08:48 - July 9, 2016

హైదారబాద్ : మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఎమ్‌సెట్‌-2 పరీక్షకు సర్వసిద్ధమైంది. ప్రశ్నాపత్రం కోడ్‌ 'ఆర్‌' ను మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు పరీక్ష జరగనుంది. పరీక్షాకేంద్రానికి గంటముందుగానే అనుమతిస్తున్నందున .. పరీక్షమొదలైన తర్వాత ఒకనిముషం ఆలస్యం అయినా అనుమతించరని అధికారులు చెప్పారు.

ఏపీ, తెలంగాణల్లో మొత్తం 95 పరీక్షా కేంద్రాల ఏర్పాటు..
ఎంసెట్‌-2 పరీక్షకు తెలుగురాష్ట్రాల్లో 14 రీజనల్‌ సెంటర్ల పరిధిలో మొత్తం 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రీజినల్‌ సెంటర్లపరిధిలో 28 ఎగ్జామ్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 56వేల 194 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 36వేల 525 మంది హాజరవుతుండగా... ఏయూ, ఎస్‌వీయూ పరిధి నుంచి 17వేల 980 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

ఈనెల 14న ఫలితాలు, ర్యాంకులు విడుదల ...
జాతీయ, ప్రభుత్వ సంస్థల బిల్డింగ్‌ల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీశ్రీస్‌, బీడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు ... కన్వీనర్‌ కోటాలో సీట్ల భర్తీకోసం ఈ ఎంసెట్‌-2 నిర్వహిస్తున్నారు. పరీక్ష ముగిసిన కొద్ది గంటల్లోపే .. ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఈనెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తర్వాత ఈనెల 14న ఫలితాలు, ర్యాంకులు విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు, కాలినడక భక్తులకు 8గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 87,641 మంది భక్తులు దర్శించుకున్నారు.

రష్యా పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు ...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు రష్యా పర్యటనకు బయలుదేరారు. అమరావతి పెట్టుబడులే లక్ష్యంగా బాబు టూర్ సాగనుంది.  ఈపర్యటనలో పారిశ్రామిక వేత్తలు ఆర్థిక నిపుణులతో బాబు భేటీ అవనున్నారు. ఇటీవలే చైనా పర్యటన ముగించుకున్న చంద్రబాబు కేవలం కొద్దిరోజుల గ్యాప్‌తోనే రష్యా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో చంద్రబాబు వెంట పలువురు మంత్రులు కూడా వెళ్ళనున్నారు.

నగరంలో కార్డ్ ఆన్ సెర్చ్ ..

హైదరాబాద్ : నగరలో పోలీసులు కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ సెర్చ్ లో 400మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హసన్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు వుంటున్న ఐదుగురు బంగ్లాదేశీయులను ఆరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన యువతి..

హైదరాబాద్ : నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలలో భాగంగా ఐదుగురు వ్యక్తులు పట్టుపడ్డారు. పట్టుబడ్డ వారిలో ఓ యువతి కూడా వున్నట్లు సమాచారం. నాలుగు కార్లు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

07:43 - July 9, 2016

మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ-డీప్‌ వాటర్‌పోర్ట్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం లక్ష ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ  మంత్రి పల్లె మాత్రం  22 వేల ఎకరాల భూమిని మాత్రమే సమీకరిస్తున్నామని తెలిపారు..ఏది నిజం? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ నేత) చందు సాంబశివరావు ( టీడీపీ నేత ) సీహెచ్. బాబురావు( సీపీఎం నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి...

07:31 - July 9, 2016

నెల్లూరు : ఓ వైపు పోలీసు స్టేషన్...మరోవైపు తహసీల్దార్ ఆఫీస్...ఇంకోవైపు రహదారి...వీటి మధ్యలో ఉన్న పురాతన ఆలయం నుంచి శివలింగం బయటకు వచ్చింది..పెకిలించిన దుండగులు భారీగా తవ్వకాలు జరిపారు..క్షుద్రపూజలు చేశారు...ఇవన్నీ జరగడం ఒక్కరోజులో అయ్యే పని కాదు...ఎన్ని రోజులు పట్టింది...ఇంతకాలం కనుచూపు మేరలోనే నిధుల కోసం తవ్వకాలు జరిపినా ఎవరూ పట్టించుకోలేదా..? లేక తిలాపాపం తలా పిడికెడా..?? నెల్లూరులో ఏం జరుగుతోంది..????

నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ఘోరం...
ఇది నెల్లూరు జిల్లాలోని జలదండి పోలీసు స్టేషన్...దీనికి కేవలం 250 మీటర్ల దూరం..అంటే కనుచూపుమేరలోనే భారీగా తవ్వకాలు జరిగాయి..అంటే ఇది తెలిసి జరిగిందా..? లేక పోలీసులు కళ్లు మూసుకున్నారా..? గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలు బయటపడ్డంతో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది...అదీ పోలీసు స్టేషన్‌ కూతవేటు దూరంలోనే జరగడం అనుమానాలకు తావిస్తోంది...

శతాబ్దాలనాటి శివాలయం...
ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు... పోలీసు స్టేషన్ దగ్గర్లోనే జరిగిన తవ్వకాలపై చర్చనీయాంశమైంది....కావలి జలదండిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి...కొండయ్య మఠం దగ్గరున్న శతాబ్దాల కాలం నాటి శివాలయంలో లింగాన్ని దుండగులు పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు...ఈ తవ్వకాలలో 1830 సంవత్సరం నాటి 101 బంగారు నాణాలు దొరికాయని గ్రామంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అమ్మకాలు కూడా జరిగినట్లు చెబుతున్నారు.

తవ్వకాల స్పాట్‌లో బయటపడ్డ పూజాసామాగ్రి..
నిత్యం రాకపోకలు సాగించే ఉదయగిరి రోడ్డు ఉంది...ఆ పక్కనే 50 అడుగుల దూరంలో తహసీల్దార్ కార్యాలయం...దగ్గర్లోనే పోలీసు స్టేషన్...ఇలా అన్నీ ఉన్న ఈ ప్రాంతంలో తవ్వకాలు ఎలా జరిగాయన్నదే ఇప్పుడు అనుమానం... దీని వెనక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నా నియోజకవర్గంలోని ఓ పార్టీ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు....ఇక తవ్వకాలు జరిగిన సమయంలో క్షుద్రపూజలు చేసినట్లు అక్కడ కన్పించిన పూజాసామాగ్రి ఆనవాళ్లున్నాయి....

పుకార్లు షికార్లు చేస్తున్నా పట్టించుకోని అధికారగణం..
ఇదిలా ఉంటే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగ్గా...శివలింగాన్ని పెకిలించి బయటపెట్టారు..నందీశ్వరుడికి అభిముఖంగా ఉన్న లింగం బయటకు ఎలా వచ్చింది..? ఇక ఈ తవ్వకాల్లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తి ప్రస్తుతం అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది..బంగారు నాణాలు దొరికినట్లు అతని ఇంట్లోనే ఉన్నాయన్న ప్రచారం నెల్లూరు జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి... మరి దీనిపై లోతుగా శోధించాల్సిన అధికారగణం తెలిసి ఊరుకుందా..? వారి సహకారం ఉందా..? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.

07:25 - July 9, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ కొందరికి మోదం..మరికొందరకి ఖేదం
మిగిల్చింది. రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది మెడికల్‌ సీట్లు భారీగా మిగిలిపోయాయి. కొందరు విద్యార్థులు సీట్లు రాక లబోదిబోమంటుంటే..మరికొందరేమో వచ్చిన సీట్లను అమ్మకున్నారు. ఇంతటి సందిగ్ధం కలిగిస్తున్న పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ లో ఇంతకీ ఏం జరిగింది...

మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు...
తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ పీజి కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోయాయి. తీవ్ర గందరగోళంగా సాగిన కౌన్సెలింగ్‌లో ఏపీ, తెలంగాణలో కలిపి 488 మెడికల్‌ పీజీ సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఏకంగా 200 సీట్లు మిగిలిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తే ఒక్క సీటు కూడా మిగలనివ్వమని వైద్య విద్యాశాఖలు హైకోర్టుకు గతంలో స్పష్టమైన హామీ ఇచ్చాయి. అయినప్పటికీ ఆ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. గతంలో ఎన్నోసార్లు జూడాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకున్న నాధుడే లేడు. ఏక కాలంలో రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్లే, కౌన్సెలింగ్‌లో గందరగోళానికి కారణమని జూనియర్‌ వైద్యులు ఆరోపిస్తున్నారు.

మాటలకే పరిమితమైన హామీలు ...

ప్రభుత్వాలు కేవలం ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడిందని వైద్యవిద్యార్థులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా కన్వీనర్‌ కోటా సీట్లు మిగిలి చివరకు కాలేజీలకు లాభాలు చేకూరుస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ ఏ ఒక్క కాలేజీలో మెడికల్‌ పీజీ సీటు మిగలనివ్వమని హామీ ఇచ్చాయి. అయినప్పటికీ తెలంగాణ, ఏపీలో పీజీ సీట్లు మిగిలిపోయాయి. ఇదంతా వైద్య విద్యాధికారులు, మెడికల్‌ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, అసమర్ధత వల్లే జరిగిందని జూనియర్‌ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.

వైద్య యూనివర్సిటీలు దృష్టిపెట్టలేదని జూనియర్‌ వైద్యులు ఆందోళన ...
మిగిలిన సీట్లను భర్తీచేసే అంశంపై రెండురాష్ట్రాల వైద్య యూనివర్సిటీలు దృష్టిపెట్టలేదని జూనియర్‌ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన సీట్ల భర్తీకి రెండు రాష్ట్రాల్లో కలిపి ఒకేసారి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే ఒక్క గంటలోనే భర్తీ అవుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

07:15 - July 9, 2016

విజయవాడ : ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి పెరుగుతున్న వాణిజ్య పన్నుల ఆదాయం ఊరటనిస్తోంది. గతంతో పోల్చితే ..గణనీయమైన ఆదాయం లభించడంతో, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన విధానాలు అవలంబించడం కారణంగానే ఆశించిన రీతిలో ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు.

గణనీయంగా పెరిగిన వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం....
రాష్ట్ర విభజన నాటి నుంచి ఆర్థికలోటులో కూరుకుపోయిన ఏపీకి పెరుగుతున్న ఆయా శాఖల ఆదాయం ఊరటిస్తోంది. మొన్నటికి మొన్న స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రాబట్టుకోవడంలో మెరుగుదల కనుబరిచింది. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో ఇంతవరకూ 8 వేల 250 కోట్ల రూపాయల మేర పన్నులు వసూలైనట‌్లు లెక్కవేశారు. దీంతో దేశంలోనే రికార్డుస్థాయిలో ఈ విధంగా ఆదాయం పెరిగిందని అధికారులు అంటున్నారు.

పెరిగిన ఆదాయంలో సిగరెట్లు, మద్యం అమ్మకాలదే అగ్రభాగం..
పెరిగిన ఆదాయంలో ప్రధానంగా సిగరెట్లు, మద్యం అమ్మకాలదే అగ్రభాగం. గతంలో నమోదైన రాబడి కన్నా సుమారు 24 శాతం వృద్ధిరేట సాధించామని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పెట్రోల్‌ ఉత్పత్తులపై మాత్రం ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. 2,700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే అది 2,200 కోట్లుగానే ఉంది. పెట్రోల్‌పై అదనపు వ్యాట్‌ ఉండటం వల్ల అమ్మకాలు పడిపోతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

పెరుగుతున్న ఆదాయంపై అధికారుల హర్షం....
ఏదేమైనా లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం...అత్యధిక వృద్ధిరేటు నమోదు చెయ్యడం గొప్ప విషయమని అధికారులు చెబుతున్నారు. ఆదాయ సముపార్జనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

07:04 - July 9, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వం సరికొత్త సర్వే ప్రారంభించింది. అట్టహాసంగా ప్రారంభమైన ప్రజాసాధికార సర్వేతో ప్రజలే అయోమయంలో పడ్డారు. సర్వేలో సేకరిస్తున్న అంశాలన్నీ ఇప్పటికే ఆధార్‌కు అనుసంధానమై ఉండగా..ఈ కొత్త కిరికిరి ఎంటో అర్థంకాక జనం తలలు బాదుకుంటున్నారు. సర్వే వెనుక అసలు ఉద్ధేశం ఎంటో ,ఎందుకోసం సర్వే చేస్తున్నారో.. అధికారులకే అంతు చిక్కని పరిస్ధితి నెలకొంది.

సర్వేపై సర్వత్రా విమర్శలు..
ఏపీలో ప్రజాసాధికార సర్వే... ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందరికి అందేలా చేసే ఉద్దేశంతో ప్రారంభించిన సర్వేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సీఎం ఇంటి నుండే ప్రారంభమైన సర్వే ఆదిలోనే అయోమయాన్ని సృష్టించింది.

సీఎం ఇంటి నుండే ప్రారంభించిన సర్వే ...
ఇల్లు, ఆస్తుల వివరాలు, ప్రభుత్వం నుండి అందుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, గృహోపకరణాలు, ఉపాధి, నిరుద్యోగం తదితర వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సమగ్ర సర్వేను ప్రభుత్వం ఆడంభరంగా చేపట్టింది. పేపర్లలో భారీగా ప్రకటనలు జారీచేసి ఉన్నఫలంగా సర్వే చేపట్టింది. ఈ సర్వేను ప్రప్రథమంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటినుండే అధికారులు ప్రారంభించారు. అయితే సీఎం చంద్రబాబు సైతం సర్వే వివరాలు తెలియజేయటంలో గందరగోళానికి గురయ్యారు.

విజయవాడలో ఎలాంటి డాక్యుమెంట్లులేని సీఎం ..

మీడియా ఎదుట ఆర్భాటంగా ప్రారంభించిన సర్వేలో అధికారులు ట్యాబ్ లో నమోదు చేయాల్సిన సర్వే కనీస వివరాలను సైతం వెల్లడించలేకపోయారు. గ్యాస్ కనెక్షన్, ఓటర్ ఐడి కార్డు సైతం సీఎంకు స్ధానికంగా లేకపోవటంతో అధికారులు చేసేదిలేక నామమాత్రపు వివరాలను నమోదు చేసి సర్వేను మమ అనిపించారు. చంద్రబాబుకు మాత్రం ఎలాంటి డాక్యుమెంట్ల వివరాలు లేకుండానే ఆయన చెప్పిన విషయాలను మాత్రమే పొందుపరిచారు. ఇక్కడే అనేక అనుమానాలు , అపోహలు, సర్వేలోని డొల్లతనం బట్టబయలైంది. అయితే సీఎం మాత్రం సర్వేను ఓపెద్ద మహాక్రతువుగా, భారత దేశంలోనే కనీవిని, ఎక్కడా జరగని, తిరుగులేని డిజిటలైజేషన్‌గా పేర్కొనటం అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది.

ఆధార్ అనుసంధానం ...
ఆధార్ అనుసంధానం ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్ధతోపాటు, పెన్షన్‌ల జారీలో సుమారు 46వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగామని సీఎం చంద్రబాబు చెప్తుండగా, ఆ పేరుతో నిజమైన అర్హులు సైతం సంక్షేమ కార్యక్రమాలకు దూరమైన వైనం కూడా రాష్ట్రంలో నెలకొంది. దీనిని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ప్రజాసాధికార సర్వే తో ప్రజలు అయోమయం...
ప్రజాసాధికార సర్వే పేరుతో చంద్రబాబు సర్కారు కొత్త తిప్పలు ఎందుకు పెడుతుందో..అర్ధంకాక జనం సతమతమౌతున్నారు. అటు ప్రజాస్వామ్యవాదులు సైతం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వేను తప్పుపడుతున్నారు. కనీస ప్రచారంలేకుండా.. సర్వేలపేరుతో.. ప్రజాధనం వృధా చేస్తున్నారని కొందరు.. ఏం చెబితే ఏది కట్ అవుతుందో అన్న అనుమానంతో కొందరు సర్వేలనే బహిష్కరిస్తున్నారు.

నేడు తెలంగాణ ఎంసెట్ 2 ...

హైదరాబాద్ : నేడు తెలంగాణ ఎంసెట్ 2పరీక్ష జరుగనుంది. ప్రశ్నాపత్రం కోడ్ 'ఆర్'ను మంత్రి లక్షారెడ్డి విడుదల చేశారు. ఉ.10 గంటల నండి4 మధ్యాహ్నాం ఒంటిగంటవలరకూ పరీక్ష కొనసాగనుంది. రెండు రాష్ట్రాలలో కలిపి 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 56,188 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం నిబంధన అమలులో వుంది.

06:44 - July 9, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబుతో పాటు.మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రష్యాలో పర్యటించనున్నారు. 75 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో..పారిశ్రామిక వేత్తలు ఆర్థిక నిపుణులతో బాబు భేటీ అవనున్నారు.

ఈ నెల 9 నుంచి రష్యాకు బాబు అండ్ టీం..
ఈనెల 9నుంచి ఏపీ సీఎం చంద్రబాబు రష్యాలో పర్యటించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వాణిజ్యసంస్థల పనితీరు పెట్టుబడుల ఆకర్షణకు బాబుతో పాటు రాజస్థాన్‌, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెట్టుబడుల విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న రష్యాలో ప్రదర్శన జరుగనుంది.

మధ్యాహ్నం 3 గంటలకు కజకిస్థాన్ చేరుకోనున్న బాబు ...
ఈనెల 9న ఢిల్లీ నుంచి బాబు అండ్ టీం రష్యాకు బయలుదేరనున్నారు. రష్యా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు కజకిస్థాన్ చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి ప్రధాననగరం అల్మాటిలో బాబు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం రాజధాని అస్తానా నగర నిర్మాణశైలిని పరిశీలిస్తారని..ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తెలిపారు. గతంలో మోడీ రష్యా పర్యటన జరిపిన అనంతరం బాబును అస్తానా నగరాన్ని తప్పకుండా సందర్శించాలని సూచించారని..దీంతో బాబు ఆ నగరాన్ని పర్యటించనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈనెల 10 నుండి 3 రోజుల పాటు విస్తృతస్థాయిలో సమావేశాలు..
ఈనెల 10 నుండి 3రోజుల పాటు విస్తృతస్థాయిలో సమావేశాలు జరుపుతారు చంద్రబాబు. రష్యా, కజకిస్థాన్ పారిశ్రామిక వేత్తలతోనే కాకుండా.. దేశ విదేశాల నుండి వచ్చే పారిశ్రామిక వేత్తలు, ఆర్థికనిపుణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీ ఎకనామికల్ డెవలప్ మెంట్ బోర్డు వివిధ దేశాల వాణిజ్యవేత్తలతో..ఏర్పాటు చేసే సమావేశంలో బాబు పాల్గొంటారు. ఈ నెల 11న రష్యా బర్గ్ లో జరిగే ఇండియా న్యూ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ పార్ట్‌నర్ షిప్ అనే అంశంపై బాబు ప్రసంగించనున్నారు.

అమరావతి పెట్టుబడులే లక్ష్యంగా బాబు టూర్..
ఇన్నో ప్రామ్ ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు అమరావతి పెట్టుబడులే లక్ష్యంగా బాబు టూర్ సాగనుంది. ఇటీవలే చైనా పర్యటన ముగించుకున్న చంద్రబాబు కేవలం కొద్దిరోజుల గ్యాప్‌తోనే రష్యా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

నేతన్నలకు జాతీయ అవార్డులు..

హైదరాబాద్ : తెంగాణ రాష్ర్టానికి చెందిన ముగ్గురు నేతన్నలు కేంద్ర జౌళిశాఖ నుంచి జాతీయ అవార్డుకు ఎంపికయ్యా రు. కేంద్రం ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2015కు సంబంధించి వరంగల్ నుంచి ఒకరు, నల్లగొండ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఆగస్టు 7న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకోనున్నారు.

డాక్టర్ జకీర్ ప్రసంగ ప్రసారాలు నిలిపివేత..

బంగ్లాదేశ్ : ఢాకా బేకరీపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను తన ప్రసంగాలతో ప్రేరేపించిన వివాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌ కు చెందిన 'పీస్ టీవీ' ఛానల్ ప్రసారాలను కేంద్రం నిలిపేసింది.

రెండు బైకులు ఢీ ..3గురు మృతి..

మెదక్ : సిద్దిపేటలో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఐదుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై వెళ్తుతుండగా ఎన్సాన్‌పల్లి నుండి ఎదురుగా వస్తున్న మరో ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిననట్లు సమాచారం.

Don't Miss