Activities calendar

10 July 2016

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఆండీ ముర్రే

హైదరాబాద్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్ లో ఆండీ ముర్రే విజేతగా నిలిచాడు. రోనిచ్ పై 6-4, 7-6 తేడాతో ముర్రే గెలుపొందాడు. కెరీర్ లో ముర్రే రెండో గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు.  

అమర్ నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు ఇక్కట్లు...

హైదరాబాద్ : అమర్ నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తెలుగు యాత్రికులు జమ్మూకాశ్మీర్ లో చిక్కుకున్నారు. వైజాగ్ నుంచి దాదాపు దాదాపు వెయ్యి మంది యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు. 

 

22:07 - July 10, 2016

బీజింగ్ : చైనా తూర్పు తీరాన్ని నెపర్‌తక్‌ టైఫూన్‌ అతలాకుతలం చేయడంతో నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు వందల కిలోమీటర్ల  వేగంతో గాలులు వీస్తుండటంతో పాటు భారీగా వర్షాలు కురుస్తుండటంతో రవాణావ్యవస్థ  తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఏడాదిలో తొలి రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఈ రుతువులోనే మొట్టమొదటి టైఫూన్‌ షిషి నగరంలోని పుజియన్‌ ప్రావిన్స్‌ను  తాకింది. వరదల్లో చిక్కుకుపోయిన 43 మందిని విమానాల ద్వారా కాపాడారు. ఐదు విమానాశ్రయాలను మూసివేసి 400 విమానాల రాకపోకలను రద్దు చేశారు. 341 హైస్పీడ్‌ రైళ్లను, 5000 బస్సులను రద్దు చేశారు. 

 

22:05 - July 10, 2016

మాస్కో : రష్యాకు చెందిన సైనిక హెలికాప్టర్‌ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గాల్లోనే పేల్చేశారు. దీంతో హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలెట్లు మృతిచెందారు. మృతిచెందిన వారిని ర్యఫగత్ ఖబీబులిన్, యవ్‌గెనీ డాల్గిన్‌గా గుర్తించారు. సిరియాలోని పల్మైరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సిరియా దళాలు.. సహాయం కోరడంతో ఎం-25 ఎయిర్‌క్రాఫ్ట్‌ టెస్ట్‌ ఫ్లయిట్ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించే క్రమంలో మిగ్-25 హెలికాప్టర్‌పై కింద నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, హెలికాప్టర్‌ తోక భాగంలో నిప్పంటుకొని కుప్పకూలిపోయిందని రష్యా వార్తా సంస్థ తెలిపింది.

22:03 - July 10, 2016

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఇవాళ తాజాగా జరిగిన అల్లర్లతో మృతుల సంఖ్య 17కు పెరిగింది. 96 మంది భద్రతా సిబ్బందితో సహా 126 మంది గాయపడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో ఆందోళన కారులు పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి తోసేయడంతో  డ్రైవర్ ఫిరోజ్ అహ్మద్ మృతి చెందారు. జమ్ముతో పాటు పాటు మరో నాలుగు జిల్లాల్లో రెండో రోజూ కర్ఫూ అమల్లో ఉంది. మెబైల్, ఇంటర్ నెట్ సేవలపైనా  నిషేధం కొనసాగుతోంది.  హిజ్బుల్ ఉగ్రవాది బర్మన్ ఎన్ కౌంటర్ తో శనివారం నుంచి కశ్మీర్ అట్టుడుకుతోంది. దుకాణాలు, పెట్రోల్ బంకులు మూసివేసి ఉంచడంతో.. సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

22:00 - July 10, 2016

రంగారెడ్డి : జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ ఇంట్లో 'హోమ్‌గార్డుల వెట్టిచాకిరి' కేసు కొత్త మలుపు తిరిగింది. హోమ్‌గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తుంటే...కానిస్టేబుల్ మహేశ్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు. అధికారిక సమాచారాన్ని లీక్ చేశారని సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలిపారు.  గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను ఉపయోగించుకున్నారు. ఈ విషయం మీడియాలో రావడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ కానిస్టేబుల్‌ మహేష్‌పై చర్యలు తీసుకున్నారు. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని జిల్లా ఎస్పీ హోంగార్డులను ఇంటి పనుల కోసం వినియోగించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 

21:58 - July 10, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ తప్పుపట్టడం దుర్మార్గమని టీపీసీసీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఆపడం, ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లింకచపోవడం సంక్షేమమా అని మంత్రి కేటీఆర్‌ను భట్టి ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం మంచి పనులు చేసిందని సర్కార్‌ను సమర్ధించాలని భట్టి ప్రశ్నించారు. 

 

21:55 - July 10, 2016

హైదరాబాద్ : ఓ ఇంటి దీపం ఆరిపోయింది. అప్పటివరకు ముసి ముసి నవ్వులు నవ్వుతూ అమ్మకు, నానమ్మకు, బాబాయికి, తాతకు టాటా చెప్పిన గొంతు మూగబోయింది. మద్యం కిక్కులో కారు నడిపిన నలుగురు బీటెక్‌ కుర్రాళ్లు..ఆ చిన్నారి పాలిట యమకింకరులుగా మారారు. స్కూల్లో చేరి తిరిగి ఇంటికి వెళ్తుండగా..ఎదురుగా యమదూతలా దూసుకొచ్చిన కారు చిన్నారి రమ్యను చిదిమేసింది. నిన్న రాత్రి మరణించిన ఈ చిన్నారి మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై విచారణ జరుగుతోందన్న పోలీసులు..నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
ఓ ఇంటి దీపం ఆరిపోయింది. చిన్నారి ముసి ముసి నవ్వులు మూగబోయాయి. స్కూల్లో గడిపిన మధురక్షణాలు క్షణాల్లోనే ఆవిరిపోయాయి. జూలై-1న హైదరాబాద్‌లోని నాగార్జున సర్కిల్‌లో జరిగిన ప్రమాదం నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జూలై 1న జరిగిన ప్రమాదంలో చిన్నారి రమ్య వారం రోజుల పాటు కేర్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు శనివారం కన్నుమూసింది. దీంతో చిన్నారి రమ్య కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. 
రమ్య బాబాయి రాజేశ్‌ ప్రమాదం జరిగిన రోజే మృతి
ఈ ప్రమాదంలో రమ్య బాబాయి రాజేశ్‌ ప్రమాదం జరిగిన రోజే అక్కడికక్కడే మృతిచెందాడు. దాంతో పాటు ఈ ప్రమాదంలో రమ్య మరో బాబాయి రమేష్‌, తాత సురేంధ్రనాధ్‌, నానామ్మలకు గాయాలయ్యాయి. వీరంతా కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చిన్నారి రమ్య ప్రమాదం జరిగిన రోజే కోమాలోకి వెళ్లిపోయింది. వారం రోజులుగా కేర్‌ ఆసుపత్రిలో వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో చివరకు కన్నుమూసింది. ఈ వార్త విన్న కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి రమ్యను తలచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. 
రమ్య తల్లి కన్నీరుమున్నీరు
యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లి రాధిక..కుమార్తె మరణ వార్త తెలియగానే కన్నీరుమున్నీరైంది. రమ్యను చూసేందుకు ఆదివారం ఉదయం రాధికను అంబులెన్స్ల్‌లో కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూసి తల్లి రాధిక స్పృహ తప్పిపోయింది. మా కంటిదీపం మా కళ్ళముందే ఆరిపోయిందంటూ తల్లిదండ్రులు రోదించారు. తమ కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రాధిక డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థులు నా కూతురిని మళ్లీ తీసుకొస్తారా అని ఆమె విలపించారు. ఇలాంటి రోదన ఏకుటుంబానికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి రాధికను బిజేపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పరామర్శించారు. 
ఉస్మానియాలో పోస్టుమార్టం...
పోస్టుమార్టం కోసం రమ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రమ్య మృతదేహాన్ని చూసేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆసుపత్రికి వచ్చారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న తలసాని..రమ్య మృతికి కారణమైన నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని బంధువులకు హామీ ఇచ్చారు. 
డెడ్‌బాడీని రమ్య అమ్మమ్మ ఇంటికి తరలింపు 
రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్‌బాడీని రమ్య అమ్మమ్మ ఉంటున్న డీడీకాలనీకి తరలించారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో... విషాద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత రమ్య మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి... గోల్నాక శ్మాసనవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత చిన్నారి రమ్య అంత్యక్రియల్ని ఖననం చేసి అంత్యక్రియల్ని పూర్తిచేశారు. తమ ముద్దుల చిన్నారి ఇక లేదన్న వార్తను జీర్ణించుకోలేని రమ్య తండ్రి, బంధువులు బోరున విలపించారు. రమ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి వెంకటరమణ, నానమ్మ, బంధువులు డిమాండ్ చేశారు. 
రమ్య మృతికి కారకులపై కఠిన చర్యలు : సీపీ మహేందర్ రెడ్డి 
జరిగిన ఘటనపై నగర పోలీస్‌కమిషనర్‌ మహేందర్‌రెడ్డి స్పందించి రమ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. దీనిపై నగర డిసిపి మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి జరిగిన ప్రమాదాన్ని వివరించారు. జూలై 1న సినిమ్యాక్స్‌లోని జీజీఐ ఫ్రైడే బార్‌లో కేశవ మెమోరియల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులు మద్యం తాగి అక్కడి నుంచి కేబీఆర్‌ పార్క్‌ మీదుగా పంజాగుట్ట వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపి చిన్నారి రమ్య మృతికి కారణమైన శ్రవిల్‌ అనే విద్యార్థిపై సెక్షన్‌ 304 పార్ట్‌-2 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు శ్రవిల్‌ అతిగా మద్యం సేవించి కారు నడిపి ప్రమాదానికి కారకుడు కావడంతో అతనికి 10ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టామన్నారు. అలాగే మైనర్ అయిన ఆరుగురు విద్యార్థులకు మద్యం సరఫరా చేసిన బార్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. శ్రవిల్‌ను పోలీసు కస్టడికి ఇవ్వాలని మంగళవారం కోర్టును కోరతామన్నారు. 
ఓ ప్రమాదం రెండు ప్రాణాలను బలిగొంది 
మొత్తానికి ఓ ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మరికొద్ది రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సిన రాజేష్‌ అక్కడికి వెళ్లకుండానే కన్నుమూశాడు. అంతేకాదు అందరికి ముద్దుల పాపగా..అందరి నోళ్లల్లో నానిన చిన్నారి రమ్య నిండు నూరేళ్లు నిండకుండానే చిన్నవయసులోనే కన్నుమూసింది. మద్యం కిక్కులో ప్రయాణిస్తూ అతివేగంగా కారునడిపిన శ్రవిల్‌ 10ఏళ్లు జైల్లో ఊచలు లెక్కపెట్టేలా ప్రమాదాన్ని ఏరికోరి కొనితెచ్చుకున్నాడు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం బార్ల వేళలను మార్చాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

 

21:47 - July 10, 2016

హైదరాబాద్ : నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలంటూ జలసాధన సమితి ఉద్యమానికి సిద్ధమైంది.. పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల సహకారంతో పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులోభాగంగా నారాయణపేట, కొడంగల్‌లో పాదయాత్ర చేపట్టాలని సభ్యులు నిర్ణయించారు.. 
జలసాధన సమితి... సమావేశం
జలసాధన సమితి ఆధ్వర్యంలో నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటైన కార్యక్రమానికి పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.  ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ మక్తల్‌, నారాయణపేటలో పాదయాత్ర చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.. 
ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి : తమ్మినేని
నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని... సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు.. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతోకలిసి ప్రజలముందుకు వెళితే మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు.. 
జలసాధన సమితికి జేఏసీ పూర్తి మద్దతు : ప్రొ.కోదండరాం
కొడంగల్‌, నారాయణపేటలో కరవు తీవ్రంగా ఉందన్నారు జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం. జలసాధన సమితికి జేఏసీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు..
అవినీతి కోసమే పాలమూరు రీడిజైన్‌ : జైపాల్ రెడ్డి  
నికర జలాలను వదిలేసి పాలమూరు పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి ఆరోపించారు.. అవినీతి కోసమే పాలమూరును రీడిజైన్‌ చేశారని మండిపడ్డారు. మక్తల్‌, నారాయణపేటలో పాదయాత్ర చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రజల్లో చైతన్యం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.. 

 

20:46 - July 10, 2016

కారణాలు ఎవైనా... జీవితాలు తారుమారయ్యేటప్పుడు.. ఏ సంఘటనైతే జరిగిందో.. అదే ప్రధాన కారణమనుకుంటాం. అలాగే సెల్ ఫోన్లు కూడా.., ఈ ఫోన్ల గొడవ వదిలేస్తే.. ఇప్పుడు ఈ ముగ్గురి జీవితాల్లో జరిగే విచిత్ర పరిణమాలు చూద్దాం.... పూర్తి వివరాలను వీడియోలో చూడండి. 

 

ఎంసెట్, బీ ఫార్మసీ, బయోటెక్ కౌన్సిలింగ్ తేదీలు రిలీజ్...

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్, బీ ఫార్మసీ, బయోటెక్ కౌన్సిలింగ్ తేదీలు విడుదల అయ్యాయి. బీ.ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 15 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఈనెల 18న ఆప్షన్లు మార్చకునే అవకాశం ఉంది. ఈనెల 20న బీఫార్మసీ, డీఫార్మసీ, బయోటెక్ సీట్ల కేటాయింపు జరుగనుంది. 

టీఎస్ పాలీసెట్ స్పాట్ అడ్మిషన్ల తేదీలు ప్రకటన

హైదరాబాద్ : టీఎస్ పాలీసెట్ స్పాట్ అడ్మిషన్ల తేదీలను ప్రకటించారు. ఈనెల 14 నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20న కళాశాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. 

కృష్ణా నదిలో ఇద్దరు చిన్నారులు గల్లంతు

గుంటూరు : తాడేపల్లి మండలం ఉండవల్లిలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ కృష్ణా నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు. అశీష్ (5), శ్రీ నిధి(7)లుగా గుర్తించారు. 

 

20:05 - July 10, 2016

కడప : శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయని జన విజ్ఞాన వేదిక మహాసభలో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో పేరుకుపోయిన మూడ నమ్మకాలను పారద్రోలేందుకు జేవీవీ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. సమాజంలో విద్య, వైద్యంలో మార్పులు తీసుకువచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని జేవీవీ మహాసభ తీర్మానించింది. 
రిమ్స్‌లో జెవివి 14వ రాష్ట్ర మహాసభలు 
కడప జిల్లా రిమ్స్‌లో జన విజ్ఞాన వేదిక 14వ రాష్ట్ర మహాసభలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, ఎమ్మెల్సీ గేయానంద్‌, కలెక్టర్‌ కేవీ సత్యనారాయణతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ మహాసభలో అనేక అంశాలపై చర్చిస్తున్నారు. 
హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్‌ మూయలేని పరిస్థితి : ప్రొ.నాగేశ్వర్  
శాస్త్ర సాంకేతిక రంగంలో వేగంగా పురోగతి సాధిస్తున్నా.. ఇంకా అనేక అంశాల్లో వెనకబడి ఉన్నామని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో సాంకేతిక పరికరాలు తయారు చేస్తున్నా.. మ్యాన్‌హోల్స్‌ మూయలేని పరిస్థితి ఉందన్నారు. బాలిస్టిక్‌ క్షిపణుల్లాంటివి ఐదేళ్లోలోపే తయారుచేస్తున్నప్పటికీ.. దేశంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి పదేళ్లకు పైగా పడుతోందన్నారు. 
మార్పులు వచ్చినప్పుడే అభివృద్ధి : గేయానంద్ 
వైద్య, విద్య విధానంలో ప్రభుత్వం పాత విధానాలనే కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ గేయానంద్‌ అన్నారు. విద్య, వైద్య రంగంలో మార్పులు వచ్చినప్పుడు అభివృద్ధి సాధ్యమన్నారు. 
మత ప్రభావం తక్కువగా ఉన్న దేశాల్లోనే అభివృద్ధి : కలెక్టర్ సత్యనారాయణ  
మత మౌఢ్యం ఉన్న దేశాల కంటే.. మత ప్రభావం తక్కువగా ఉన్న దేశాల్లోనే అభివృద్ధి త్వరగా జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సైన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. ఆ బాధ్యత జన విజ్ఞాన తీసుకోవాలని మహాసభలో వక్తలు అభిప్రాయపడ్డారు. 

20:00 - July 10, 2016

గుంటూరు : ప్రభుత్వ ఉద్యోగులు ఉండడానికి అధునాతన ఫర్నీచర్లు, కార్పొరేట్‌స్థాయి చాంబర్లు, మల్టీ నేషనల్ కంపెనీకి తీసిపోని వసతులు..ఇదీ ఏపీ తాత్కాలిక సచివాలయంలోని ఇంటీరియర్ వర్క్. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని చూసిన ప్రభుత్వ ఉద్యోగులు..అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నామనే అనే భావనను వ్యక్తం చేస్తున్నారు. 
కార్పొరేట్ ఆఫీసును తలపిస్తోన్న సచివాలయం 
వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయం ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసును తలపిస్తోంది. ఇంటీరియర్ వర్క్ మొత్తం పూర్తి చేసుకుని ఓ ఐటీ కంపెనీని తలదన్నెలా కనిపిస్తుంది. సచివాలయంలోని 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం పనులను నిర్మాణ సంస్థలు పూర్తిచేశాయి. దీంతో సచివాలయం లోపల వాతావరణం పూర్తిగా మారిపోయింది. 
అధునాతనంగా మారిన మంత్రుల చాంబర్స్ 
మంత్రులు ఉండే చాంబర్స్‌ను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రుల ఛాంబర్స్ లో మొత్తం రెండు గదులు ఉండేలా డిజైన్ చేశారు. చాంబర్స్ లోపలికి వెళ్లగానే పీఏతో పాటు పర్సనల్ సెక్రటరీ ఉండే విధంగా ఓ గదిని, దానిని ఆనుకుని మంత్రి ఛాంబర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చాంబర్లో ఎటాచ్ డ్ బాత్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఉద్యోగులకు, సచివాలయానికి వచ్చే వారికి విడివిడిగా బాత్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఎంట్రెన్స్‌లో పెద్ద గ్రాస్ సిస్టమ్‌ ఏర్పాటు 
ప్రతి బ్లాక్‌లో ఎక్కడి నుండి ఎక్కడికైనా చేరుకోవడానికి వీలుగా లోపల నిర్మాణాలు చేపట్టారు. ప్రతిబ్లాక్ వద్ద లోపలికి వెళ్లే ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.. ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద గ్లాస్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దీంతో బయట నుండి లోపలికి వెళ్లే ప్రాంతం ఎంతో అందంగా దర్శనిమిస్తుంది. ఇప్పటికే సచివాలయానికి కరెంట్ సరఫరాను విద్యుత్ శాఖ ప్రారంభించింది. అన్ని భవనాలకు సరిపోయే విధంగా తాడేపల్లి, తాడికొండ ప్రాంతాల నుండి విద్యుత్ వైర్లు లాగి సచివాలయం వద్ద ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. సచివాలయంలోని 60 అడుగుల అంతర రహదారులు పనులు కూడా దాదాపుగా పూర్తి అయ్యే స్టేజ్ లో ఉండడంతో, భవనాల బయట సుందరీకరణ పనులను కూడా అధికారులు ప్రారంభించారు.
మంత్రుల ఛాంబర్లు ప్రారంభం 
తాత్కాలిక సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు ప్రారంభం కావడంతో, అసలు సచివాలయం ఎలా ఉందో అనే ఆత్రుతతో అనేక ప్రాంతాల నుండి ప్రజలు వెలగపూడికి తరలివస్తున్నారు. నూతన రాజధానిలో నిర్మించిన భవనాలు, లోపల మంత్రుల ఛాంబర్లు ఎలా ఉన్నాయో చూద్దామని వస్తున్నారు. కానీ పనులు జరుగుతున్న కారణంగా పోలీసులు సందర్శకులను లోపలికి అనుమతించడం లేదు. దీంతో అనేక  ప్రాంతాల నుండి వచ్చే వారుసైతం బయట నుండి భవనాలు చూసి, ఫోటోలు తీసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొత్తానికి తాత్కాలిక సచివాలయంలో లోపల ఇంటీరియర్ తో పాటు వసతులు కార్పొరేట్ కంపెనీలకు మించిపోయే విధంగా ఉండడంతో , ఉద్యోగులు ఫుల్ ఖుషీగా పనిచేస్తారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

 

రంగారెడ్డి జిల్లా ఎస్పీ ఆర్డర్ల కేసులో కొత్త ట్విస్టు

రంగారెడ్డి : జిల్లా ఎస్పీ ఆర్డర్ల కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ మహేషన్ ను సస్పెండ్ చేశారు. అధికారిక సమాచారాన్ని లీక్ చేశాడని సస్పెన్షన్ వేటు వేశారు. మహేష్ ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.  

 

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు

ఖమ్మం : జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. లంకపల్లిలో గోదావరి వరద ఉధృతిలో ఐదుగురు గొర్రెల కాపరులు, రెండు వేల గొర్రెలు చిక్కుకున్నాయి. రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. 

 

19:06 - July 10, 2016

విజయవాడ : ప్రభుత్వాలు ఎన్ని మారినా.. పాలకులు ఎందరు మారినా... విజయవాడ కరకట్ట ముంపు ప్రాంత ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. వరద సమయాల్లో ఉరకలెత్తే కృష్ణమ్మను నియంత్రించేందుకు.. రక్షణ గోడ కట్టాలన్న డిమాండ్‌ ఏళ్లుగా నెరవేరడం లేదు. దీంతో.. వర్షాకాలంలో.. కరకట్ట ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి నెలకొంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో.. కరకట్ట రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలన్న స్థానికుల ఆకాంక్ష ఏళ్లుగా నెరవేరడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్థానికుల ఆరోపణ. 
వరదలొస్తే కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రాంతాలు జలమయం
వరదలొస్తే కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రాంతాలు జలమయమై పోవడం ఏటా ఆనవాయితీగా మారింది. ఫలితంగా ప్రతి వానాకాలంలోనూ.. ఇక్కడ నివసించే సుమారు రెండున్నర లక్షల మంది నానా అగచాట్లు పడుతున్నారు. ఈ దుస్థితిని అధిగమించేందుకు.. కరకట్ట వెంబడి రక్షణ గోడ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే.. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా.. రక్షణగోడ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. దీంతో కృష్ణానది ముంపు ప్రాంతాల వాసులు ప్రస్తుత వర్షాకాలంలోనూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 
కరకట్ట రక్షణ గోడ కోసం నిధులు విడుదలైనా..  
నిజానికి కరకట్ట రక్షణ గోడ కోసం నిధులు విడుదల కాలేదా అంటే.. అలాంటి సమస్యే లేదు. ప్రభుత్వం ఎప్పుడో నిధులనూ విడుదల చేసింది. అయినా.. ఇప్పటికీ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కాకపోవడంపై స్థానికులు విస్మయాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేస్తున్నారు. రక్షణ గోడ నిర్మాణ పనులు పూర్తయితే యనమలకుదురు రామలింగేశ్వరనగర్, భూపేష్ గుప్తా నగర్, రణదివె నగర్, తారకరామ నగర్, గాంధీ కాలనీ, కళానగర్, లేబర్ కాలనీల్లోని పల్లపు ప్రాంతాలకు వరద ముంపు సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది.  కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని 40 వేల మందికి వరద నుంచి విముక్తులవుతారు.
కొండవీటి వాగుకు వరదపోటు 
మరోవైపు కొండవీటి వాగుకు సైతం ప్రతి ఏడాది వరదపోటు తప్పడం లేదు. ఇది రాజధాని ప్రాంతానికీ ఇబ్బంది కలిగిస్తుందని తెలిసినా.. ప్రభుత్వం  పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదు. ఈ వాగు పొంగి పొర్లడం వల్ల.. ఏటా సుమారు 50వేల ఎకరాల్లో పంట నీటి ముంపునకు గురవుతోంది. ముంపు నివారణకు బ్లూ కన్సల్టెన్సీని నియమించినప్పటికీ నివేదికలో కదలిక లేకపోవడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన తయారైంది. కొండవీటి వాగు వరద నీటిని దిగువ ప్రాంతాలకు మళ్లించకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పశ్చిమ డెల్టా ప్రాంత రైతులు కోరుతున్నారు.  

 

19:00 - July 10, 2016

విశాఖ : గిరిజన సంఘం రాష్ట్ర 6వ మహాసభలు విశాఖ జిల్లా పాడేరులో కొనసాగుతున్నాయి. ఇందులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఐదో షెడ్యూల్‌లో 1500 గ్రామాలను చేర్చాలని.. వీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని.. ఐదో షెడ్యూల్‌ను, ఆరోషెడ్యూల్‌లో చేర్చి స్వయం పాలిత గిరిజన కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని... అలాగే ప్రత్యేక గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయాలని మహాసభలో తీర్మానించారు. ఈ ప్రతిపాదనలు అమలయితేనే గిరిజనుల స్వయం పాలన, అభివృద్ధి సాధ్యమని సీపీఎం నేత మిడియం బాబురావు అన్నారు.  

18:58 - July 10, 2016

హైదరాబాద్ : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి శ్రీనగర్‌ కర్ఫ్యూలో చిక్కుకున్న తెలుగు యాత్రికులకు సహాయం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఢిల్లీలోని ఏపీ భవన్‌ వర్గాలు గందర్భల్‌ ఎస్పీ ఇంతియాజ్‌ తో తెలుగువారికి సహాయం అందించాలని కోరారు. బల్తల్‌ సెక్టార్‌లో 80 మంది, పహల్గావ్‌లో 33 మంది, శ్రీనగర్‌లో 30 మంది చిక్కుకున్నారని ఏపీ భవన్‌ వర్గాలు తెలిపాయి. వీరి ఫోన్‌ నెంబర్లను స్థానిక పోలీసు అధికారులకు ఇచ్చి సహాయం చేయాలని కోరారు. శ్రీనగర్‌లో కర్ఫ్యూ ఎత్తివేయగానే తెలుగువారందని వారి స్వస్థలాలకు చేరవేస్తామని అధికారులు తెలిపారు. 

18:55 - July 10, 2016

విజయవాడ : గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్‌ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాలమధ్య చాలా సమస్యలున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంపై గవర్నర్‌ ఏమాత్రం దృష్టిపెట్టలేదని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు బాగా పనులు చేస్తున్నారని గవర్నర్‌ అంటున్నారని... అలాంటప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. 

 

18:52 - July 10, 2016

మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండో రోజు కజకిస్తాన్‌ రాజధాని ఆస్తానాలో విస్తృతంగా పర్యటించారు. అస్తానాలోని 97 మీటర్ల ఎత్తుగల ప్రసిద్ధ బేతెరెక్‌ టవర్‌ను పరిశీలించి... దాని పైనుంచి నగరాన్ని వీక్షించారు. అనంతరం నగరంలో పర్యటించారు. తరువాత బాబు బృందం రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌ బయలుదేరింది. అక్కడ విదేశీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు.

 

కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా సీపీఎం జీపుజాతా

విశాఖ : కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అణు విద్యుత్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో సీపీఎం నేతలు జీపుజాతా చేపట్టారు. జీపు జాతాను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు, నగర కార్యదర్శి గంగారామ్ తో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరు, అనుసరిస్తున్న విధానాలపై నర్సింగరావు మండిపడ్డారు. 
 

18:44 - July 10, 2016

విశాఖ : కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అణు విద్యుత్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో సీపీఎం నేతలు జీపుజాతా చేపట్టారు. జీపు జాతాను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు, నగర కార్యదర్శి గంగారామ్ తో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరు, అనుసరిస్తున్న విధానాలపై నర్సింగరావు మండిపడ్డారు. 
 

రమ్య మృతికి కారకున్ని రిమాండ్ కు తరలించాం : సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : చిన్నారి రమ్య మృతికి కారణమైన నిందితుడు ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిందితుడికి పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. 20 ఏళ్లు నిండని విద్యార్థికి మద్యం సరఫరా చేసిన బార్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. 

18:28 - July 10, 2016

హైదరాబాద్ : చిన్నారి రమ్య మృతిపై వెస్టు జోన్ డిసిపి వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. మద్యం సేవించి కారు నడపడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. చిన్నారి రమ్య మృతికి కారణమైన శ్రవిల్‌ అనే విద్యార్థిపై సెక్షన్‌ 304 పార్ట్‌-2 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. జూలై 1న నాగార్జున సర్కిల్‌ వద్ద జరిగిన ప్రమాద వివరాలను డీసీపీ మీడియాకు వివరించారు. నిందితుడు శ్రవిల్‌ మద్యం మత్తులో కారు నడిపినందున అతనికి 10ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టామన్నారు. అలాగే మైనర్ అయిన శ్రవిల్‌కు మద్యం సరఫరా చేసిన సినిమ్యాక్స్‌లోని జీజీఐ ఫ్రైడే బార్‌ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. బార్ యాజమాన్యంపై చర్యలకు ఎక్సైజ్ కమిషనర్ కు లేఖ రాశామని తెలిపారు. కారులో ఆరుగురు విద్యార్థులున్నారు. నేరస్థుడికి కఠిన శిక్ష పడటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శ్రవిల్‌ను పోలీసు కస్టడికి మంగళవారం కోరతామని పేర్కొన్నారు. విచారణలో అన్ని విషయాలు బయడపడతాయని డిసిపి తెలిపారు. 

'నారాయపేట-కొడంగల్ ఎత్తిపోతల' న్యాయమైనదే : తమ్మినేని

హైదరాబాద్ : నారాయపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం న్యాయమైనదే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం జరిగే పోరాటంలో సీపీఎం ఉటుందని చెప్పారు.

 

తెలంగాణలో నియంతృత్వ పాలన : డీకే.అరుణ

హైదరాబాద్ :  టీసర్కార్ పరిపాలనపై  కాంగ్రెస్ ఎమ్మెల్మే డీకే.అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని... నియతృత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. 

 

 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. నారాయపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం మక్తల్, నారాయణపేటలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు డీకే.అరుణ, జైపాల్ రెడ్డి, సీపీఎ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ.కోదండరామ్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.  

రంగారెడ్డి జిల్లాలో దారుణం...

రంగారెడ్డి : జిల్లాలోని జవహర్ నగర్ లో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు ఓ చిన్నారి బలి అయింది. సాకేత్ శ్రీసాయినగర్ లోని ప్రసాద్ కల్పన  అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి చిన్నారి కిందపడిపోయింది. అయితే చిన్నారిని ఆస్పత్రికి తరలించకుండా ఇంట్లోనే ఉంచుకుంది. బంధువులు చేతపడి చేయడం వల్లే చిన్నారి కిందపడిపోయిందని అమ్మమ్మ చెబుతోంది. చిన్నారి బతుకుతుందని అమ్మమ్మ అంటుంది.

17:39 - July 10, 2016

రంగారెడ్డి : జిల్లాలోని జవహర్ నగర్ లో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు ఓ చిన్నారి బలి అయింది. సాకేత్ శ్రీసాయినగర్ లోని ప్రసాద్ కల్పన  అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తు నుంచి చిన్నారి కిందపడిపోయింది. అయితే చిన్నారిని ఆస్పత్రికి తరలించకుండా ఇంట్లోనే ఉంచుకుంది. బంధువులు చేతపడి చేయడం వల్లే చిన్నారి కిందపడిపోయిందని అమ్మమ్మ చెబుతోంది. చిన్నారి బతుకుతుందని అమ్మమ్మ అంటుంది. పాపను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

చిన్నారి రమ్య మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం

హైదరాబాద్ : చిన్నారి రమ్య మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. రమ్య కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానూభూతి తెలిపారు. నిర్లక్ష్యం వల్లే ఈ అనర్థం జరిగిందన్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

రమ్య మృతితో అంబర్ పేట డీడీకాలనీలో విషాదచాయలు

హైదరాబాద్ : చిన్నారి రమ్య మృతితో అంబర్ పేట డీడీకాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. చివరిసారి తల్లి రమ్యను ముద్దాడి కన్నీరుమున్నీరైంది. రమ్య భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో గాయపడి.. 9 రోజులు మృత్యువుతో పోరాడి రమ్య ఇవాళ మృతి చెందింది. 
తాగుబోతుల వీరంగానికి రమ్య బలైంది. 

ఢిల్లీలోని టీ.భవన్ లో లాల్ దర్వాజ మహంకాళి బోనాలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో లాల్ దర్వాజ మహంకాళి బోనాలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో బోనాలు నిర్వహణ జరిగింది. ఢిల్లీ వీధుల్లో పోతురాజుల నృత్యాలు సందడి చేశాయి. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బోనాల ఉత్సవాలకు టీఎస్ రెసిడెంట్ కమిషనర్ హాజరుకాలేదు. అధికారిక కార్యక్రమాలకు కమిషనర్ డుమ్మా కొడుతున్నారు. 

 

16:35 - July 10, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చిన్నారి రమ్య అంత్యక్రియలు గోల్నాక స్మశాన వాటిలో పూర్తి అయ్యాయి. రమ్య అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. అందరూ కన్నీరుమున్నీరయ్యారు. రమ్య తల్లికి తీవ్ర అనారోగ్యం ఉన్నందున అంత్యక్రియల ప్రదేశానికి తీసుకరాలేదు. పంజాగుట్టలో రోడ్డు ప్రమాదంలో గాయపడి 9 రోజులు మృత్యువుతో పోరాడి పరిస్థితి విషమించడంతో ఇవాళ రమ్య చనిపోయింది. ఉస్మానియా ఆస్పత్రిలో రమ్య పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని అంబర్ పేటలోని డీడీకాలనీలో రమ్య నివాసానికి తీసుకెళ్లారు. రమ్య తల్లి బోరున విలిపించారు. తల్లి ఆఖరి సారి రమ్యను ముద్దాడింది. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అక్కడ పలువురు రమ్య భౌతికకాయానికి శ్రద్ధాంజిలి ఘటించి, సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం రమ్య నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం అయింది. గోల్నాక స్మశాన వాటికకు భౌతికాయాన్ని తీసుకొచ్చారు. రమ్య అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వందలాదిమంది పాల్గొన్నారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గోల్నాక స్మశాన వాటికలో రమ్య అంతిమక్రియలు పూర్తి అయ్యాయి. 
రమ్య మృతి పట్ల పలువురు సంతాపం..
రమ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. రమ్య కుటుంబ సభ్యులను పలువురు నేతలు పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి రమ్య కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. రమ్య మృతికి కారణమైన వారిని 
ఉరి తీయాలని రమ్య తండ్రి అంటున్నారు. బాధ్యులను కఠినంగా శక్షించాలని రమ్య బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 
తాగుబోతుల వీరంగానికి ఓ కుటుంబం చిన్నాభిన్నం...
తాగుబోతుల వీరంగానికి ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఏ పాపం ఎరుగుని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 9 రోజులు మృత్యువుతో పోరాడిన రమ్య తుది శ్వాస విడిచింది. ఇదే యాక్సిడెంట్ లో గాయపడి మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి..తన కూతురి మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.
రమ్య తాత... 
తాగి డ్రైవ్ చేసి ప్రమాదాలు జరపడం దారుణం. బాధ్యులను జైల్లో ఉంచి కఠినంగా శిక్షించాలి. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 
బంధువులు..
రమ్య మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి. ఇంకొకరికి ఇలాంటి ప్రమాదం జరుగకుండా చూడాలి.
రమ్య తండ్రి... 
ఇది ఒక రకంగా క్రూరమైన హత్య. నా తమ్ముడు, నా కూతురు అల్లారుముద్దుగా పెరిగారు. కొందరు మద్యం తాగి ర్యాష్ గా డ్రైవింగ్ చేసి... వీరి మృతికి కారకులయ్యారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. కన్నీరుమున్నీరయ్యారు. 
రమ్య మేనత్త
ప్రమాదంలో చిన్నారి, చిన్న అన్నయ్య మృతి చెందారు. నాన్న త్రీవ గాయాలై చావుబతుకల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
రమ్య నానమ్మ....
రమ్య మృతి పట్ల నానమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తమ మనుమరాలు ఇకలేదని గుండెలవిసేలా రోధించింది.  

 

రమ్య అంత్యక్రియలు

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చిన్నారి రమ్య అంత్యక్రియలు గోల్నాక స్మశాన వాటిలో పూర్తి అయ్యాయి. రమ్య అంతిమక్రియలకు కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. అందరూ  కన్నీరుమున్నీరవుతున్నారు. 

15:59 - July 10, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చిన్నారి రమ్య అంతిమయాత్ర ప్రారంభం అయింది.  
అంబర్ పేట డీడీ కాలనీలోని రమ్య నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం అయింది. గోల్నాక స్మశాన వాటికలో రమ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. రమ్య అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు వందలాదిమంది పాల్గొన్నారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. రమ్య తల్లి బోరున విలిపిస్తున్నారు. తల్లి ఆఖరి సారి రమ్యను ముద్దాడింది. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.  
రమ్య మృతి పట్ల పలువురు సంతాపం..
రమ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. రమ్య కుటుంబ సభ్యులను పలువురు నేతలు పరామర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి రమ్య కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. రమ్య మృతికి కారణమైన వారిని 
ఉరి తీయాలని రమ్య తండ్రి అంటున్నారు. బాధ్యులను కఠినంగా శక్షించాలని రమ్య బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 
మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన రమ్య  
తాగుబోతుల వీరంగానికి ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది..ఏ పాపం ఎరుగుని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 9 రోజులు మృత్యువుతో పోరాడిన రమ్య తుది శ్వాస విడిచింది. ఇదే యాక్సిడెంట్ లో గాయపడి మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి .. తన కూతురి మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.
కుటుంబంలో విషాదచాయలు 
చిన్నారి రమ్య మృతితో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈనెల నెల 1న పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందింది. ఆ ప్రమాదంలో గాయపడి యశోద ఆస్రత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లి రాధిక కుమార్తె మరణ వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరైంది. రమ్యను చూసేందుకు ఉదయం రాధికను అంబులెన్స్ల్‌లో కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. రమ్య మృతదేహాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి బోరున విలపించారు. మా కంటిదీపం మా కళ్ళముందే ఆరిపోయిందంటూ ఆయన రోదించారు. ఇదే రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమ్య తాత సురేంద్రనాథ్‌ పరిస్థితి విషమంగా ఉంది.
 స్వగృహనికి రమ్య మృతదేహం తరలింపు
పోస్టుమార్టం అనంతరం రమ్య మృతదేహాన్ని డీడీ కాలనీలో స్వగృహనికి తరలించారు.. చిన్నారి మృతదేహాన్ని చూసి బంధువులు గుండెల పగిలేలా రోదించారు.. రమ్య మృతికికారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రాధిక డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థులు నా కూతురిని మళ్లీ తీసుకొస్తారా అని ఆమె విలపించారు. ఇలాంటి రోదన ఏకుటుంబానికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
వరంగల్ జిల్లా హన్మకొండ కు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ మధుసూదనాచారికి ముగ్గురు  కొడుకులు వెంకటరమణ, రమేష్, రాజేశ్‌లు. పెద్దకొడుకు వెంకట రమణ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 9ఏళ్ల కూతురు రమ్య సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్‌ స్కూల్‌లో చదువుతోంది. స్కూల్‌ నుంచి తల్లి రాధిక, బాబాయిలు రమేష్‌, రాజేష్‌, తాత మధుసూదనాచారితో కలిసి ఇంటికి తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. 

 

15:36 - July 10, 2016

హైదరాబాద్ : తాగుబోతుల వీరంగానికి ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఏ పాపం ఎరుగుని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 9 రోజులు మృత్యువుతో పోరాడిన రమ్య తుది శ్వాస విడిచింది. ఇదే యాక్సిడెంట్ లో గాయపడి మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి..తన కూతురి మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.
రమ్య మృతితో కుటుంబంలో విషాదచాయలు 
చిన్నారి రమ్య మృతితో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈనెల నెల 1న పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందింది. ఆ ప్రమాదంలో గాయపడి యశోధ ఆస్రత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లి రాధిక కుమార్తె మరణ వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరైంది. రమ్యను చూసేందుకు ఉదయం రాధికను అంబులెన్స్ల్‌లో కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. రమ్య మృతదేహాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. తండ్రి బోరున విలపించారు. మా కంటిదీపం మా కళ్ళముందే ఆరిపోయిందంటూ ఆయన రోదించారు. ఇదే రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమ్య తాత సురేంద్రనాథ్‌ పరిస్థితి విషమంగా ఉంది.
రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
పోస్టుమార్టం అనంతరం రమ్య మృతదేహాన్ని డీడీ కాలనీలో స్వగృహనికి తరలించారు.. చిన్నారి మృతదేహాన్ని చూసి బంధువులు గుండెల పగిలేలా రోదించారు.. కాసేపట్లో రమ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రమ్య మృతికికారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రాధిక డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థులు నా కూతురిని మళ్లీ తీసుకొస్తారా అని ఆమె విలపించారు. ఇలాంటి రోదన ఏకుటుంబానికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు
స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదం...  
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ పమ్మి మధుసూదనాచారికి ముగ్గురు కొడుకులు వెంకటరమణ, రమేష్, రాజేశ్‌లు. పెద్దకొడుకు వెంకట రమణ క్యాప్ జెమిని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే తన 9ఏళ్ల కూతురు రమ్యను సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్‌ స్కూల్లో చేర్చించిన వెంకటరమణ..ఆ తర్వాత రమ్యను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. 
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందగా..చిన్నారి రమ్యకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇతర కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. అయితే చిన్నారి రమ్యకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. 9 రోజులుగా వెంటిలెటర్‌పై చికిత్స పొందిన చిన్నారి రమ్య చివరకు చనిపోయింది. 
పోలీసుల అదుపులో ప్రమాదానికి కారణమైన యువకుడు  
మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైన శ్రావిల్‌ అనే యువకుడిని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును నడిపాడరన్న అనుమానాల నేపథ్యంలో శ్రావిల్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపారు. 

చిన్నారి రమ్య అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్ : డీడీ కాలనీలో చిన్నారి రమ్య అంతిమ యాత్ర ప్రారంభం అయింది. గోల్నాక వద్ద రమ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. 

వ్యవస్థను దిగజార్చిన నరసింహన్ - సి.రామచంద్రయ్య..

విజయవాడ : గవర్నర్ నరసింహన్ వ్యవస్థను దిగజార్చారని, గవర్నర్ గా ఆయన విఫలమయ్యారని ఏపీ కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు జఠిలంగా ఉన్నా అన్నీ బాగానే ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు.

హరితహారంపై జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు..

హైదరాబాద్ : హరితహారం జరిగే రెండు వారాల పాటు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రతినిధులు, అన్ని స్థాయిల అధికారులను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా నడిపించాలని సూచించారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

శ్రీనగర్ అధికారులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు..

ఢిల్లీ : సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు శ్రీనగర్ అధికారులతో మాట్లాడారు. తెలుగు వారికి సహాయం అందించాలని గందర్బల్ ఎస్పీని ఏపీ భవన్ అధికారులు కోరారు. బల్తాల్ లో 80 మంది, పహల్గాన్ లో 33 మంది, శ్రీనగర్ లో 30 మంది చిక్కుకున్నారని ఏపీ భవన్ అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ లో కర్ఫ్యూ ఎత్తివేయగానే తెలుగు యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బల్తాల్ - శ్రీనగర్ మధ్య జాతీయ రహదారి నెంబర్ 1 తెరచుకోగానే యాత్రికులను తరలించే అవకాశం ఉందని ఏపీ భవన్ అధికారులు పేర్కొన్నారు.

 

13:37 - July 10, 2016

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో కమెడియన్ గా ధన్ రాజ్ నటించాడు. తాజాగా 'పనిలేని పులిరాజు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హస్య ప్రధానంగా ఈ చిత్రం సాగుతుందని, ఈ చిత్రంలో ధన్ రాజ్ 13 పాత్రలు పోషించనున్నాడు. జూన్ మూడో వారంలో 'పనిలేని పులిరాజు' చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రఘుబాబుతో పాటు ఇతర నటీనటులు నటించారు. త్వరలో విడుదల కాబోతున్న 'పనిలేని పులిరాజు' చిత్రం గురించి హీరో ధన్ రాజ్, హీరోయిన్ హరిణి టెన్ టివితో ముచ్చటించారు. టైటిల్ మాత్రమే పనిలేని పులిరాజు ఉంటుందని, కానీ చిత్రంలో చాలా పని ఉంటుందని ధన్ రాజ్ పేర్కొన్నారు. ధన్ రాజ్ 13 పాత్రలు చాలా బాగుంటాయని హరిణి పేర్కొన్నారు. పులిరాజు వంశస్థులతో కథ ఉంటుందని, తాత, తండ్రి, డాక్టర్, కాంపౌండర్, జాతకాలు చెప్పే పులిరాజు, రియల్ ఎస్టేట్ పులిరాజు, బిచ్చగాడు పులిరాజు, అడుక్కొనే పులిరాజు, దొంగరాజు పులిరాజు..ఇలా 13 పాత్రలు పోషించినట్లు ధన్ రాజ్ పేర్కొన్నారు. మరి ఈ చిత్రం గురించి ధన్ రాజ్..హరిణి ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి..

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఎత్తివేత..

రాజమండ్రి : ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఆదివారం ఎత్తివేశారు. ప్రస్తుతం రాజమండ్రి వద్ద గోదావరి నది నీటిమట్టం 9.10 అడుగులకు చేరింది. దీంతో గేట్లను ఎత్తివేశారు. కాగా... 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

చిన్నారి రమ్య పోస్టుమార్టం పూర్తి..

హైదరాబాద్ : పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతున్న చిన్నారి రమ్య మృతి చెందింది. ఉస్మానియాలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు అప్పగించారు. సాయంత్రం డీడీ కాలనీలో రమ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

అమరావతి అభివృద్ధికి సహకారం - అస్తానా మేయర్...

కజకిస్తాన్ : అమరావతి అభివృద్ధికి సహకారం అందిస్తామని అస్తానా మేయర్ వెల్లడించారు. ఏపీ నుండి వచ్చే పెట్టుబడిదారులకు ఇక్కడ అవకాశాలున్నాయని, అస్తానా నుండి అమరావతికి విమాన సర్వీసు నడిపేందుకు ప్రయత్నిస్తామని అస్తానా మేయర్ పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలోనే కాకుండా మరెన్నో రంగాల్లో కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు మేయర్ తో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పరస్పర అంగీకారానికి ఏపీ నుండి ఐదుగురు, అస్తానా నుండి ఐదుగురు సభ్యులుతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తానన్నారు. రెండు రోజుల్లో అస్తానా బృందాన్ని నామినెట్ చేస్తామని మేయర్ వెల్లడించారు.

నారాయణ పేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సమావేశం..

హైదరాబాద్ : నారాయణ పేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, జస్టిస్ చంద్రకుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తదితర నేతలు పాల్గొన్నారు.

 

టాంజానీయాలో మోడీ..

దక్షిణాఫ్రికా : భారత ప్రధాని నరేంద్రమోడీ టాంజానియాలో పర్యటిస్తున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా శనివారం ఆయన సౌత్‌ ఆఫ్రికా నుంచి రాత్రి టాంజానియా చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జాన్‌ మాగుఫులిని మోడీ కలిశారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.

12:24 - July 10, 2016

హైదరాబాద్ : చిన్నారి రమ్య ఇక లేదు. మృత్యును జయించి వస్తుందని అనుకున్న ఆ కుటుంబసభ్యులు కోరికలు నెరవేరలేదు. చిన్నారి మృతి చెందిందని తెలుసుకున్న పలువురు కంటతడిపెట్టారు. ఇటీవల పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి రమ్యకు బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. 9 రోజులు మృత్యువుతో పోరాడుతూ శనివారం సాయంత్రం రమ్య మృతి చెందింది. చిన్నారి మృతి వార్త తెలియగానే కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తల్లి రోదన వర్ణనాతీతంగా ఉంది. రమ్య నివాసం ఉంటున్న స్థానికులు విషాదం మునిగిపోయారు. ఆసుపత్రి వద్దకు చేరుకుని తమ సానుభూతిని తెలియచేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు టెన్ టివికి కాల్ చేసి తమ సానుభూతిని తెలియచేశారు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం షాపులపై నియంత్రణ పెట్టాలని సూచించారు.

చిన్నారి రమ్య మృతి కడుపు కోత తీర్చలేరు -తలసాని..
చిన్నారి రమ్య మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఇటీవల పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి రమ్యకు బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం రమ్య మృతి చెందిన విషయం తెలిసి మంత్రి తలసాని స్పందించారు. సినిమా టికెట్లు దొరకపోవడంతో బార్ లో తాగారని, ఆక్సిడెంట్ చేసిన అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని తేలిందని పేర్కొన్నారు. కారులో ఉన్న వాళ్లపై కేసు పెట్టాలని తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంటోందని, ఒకే కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడం బాధకరమని తలసాని తెలిపారు.

రిటైర్డ్ ఇంజనీర్..
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ పమ్మి మధుసూదనాచారికి ముగ్గురు కొడుకులు వెంకటరమణ, రమేష్, రాజేశ్‌లు. పెద్దకొడుకు వెంకట రమణ క్యాప్ జెమిని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే తన 9 ఏళ్ల కూతురు రమ్యను సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్లో చేర్చించిన వెంకటరమణ..ఆ తర్వాత రమ్యను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ప్రమాదానికి కారణమైన శ్రావిల్‌ అనే యువకుడిని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును నడిపాడరన్న అనుమానాల నేపథ్యంలో శ్రావిల్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపారు.

పాడేరులో ఆం.ప్ర.గిరిజన సంఘం ఆరో మహాసభలు..

విశాఖపట్టణం : పాడేరులో నేటి నుండి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ఆరో మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు ముఖ్యఅతిథులుగా ఎంపీ జితేంద్ర చౌదరి హాజరు కానున్నారు.

 

గవర్నర్ రోశయ్య పర్యటన రద్దు..

కరీంనగర్ : జిల్లాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పర్యటన రద్దైంది. ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది.

 

ఉస్మానియాకు చిన్నారి రమ్య మృతదేహం..

హైదరాబాద్ : పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి రమ్య మృతదేహం ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం స్వగృహానికి రమ్య భౌతికకాయం తరలించి సాయంత్రం డీడీ కాలనీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో గాయపడి 9 రోజులు మృత్యువుతో రమ్య పోరాడింది. తాగుబోతుల వీరంగానికి రమ్య బలైంది.

11:31 - July 10, 2016

రజనీకాంత్ తాజా సినిమా కబాలి కోసం పబ్లిసిటీ అవసరమా ? అని చెవులు కొరుక్కుంటున్నారంట. ఇటీవల పలు సినిమాల పబ్లిసిటీ కోసం హీరోలు అనేక ఫీట్లు చేశారు. కంటెంట్ లేకపోతే ఎంత పబ్లిసిటీ చేసినా వేస్ట్ అని ఎన్నో సినిమాలు నిరూపించాయి. పబ్లిసిటీ లేకపోయినా సినిమా హిట్ అవుతుందని టాలీవుడ్ లో బిచ్చగాడు అనే సినిమా నిరూపించింది. ఇది సినిమాలకే పరిమితం కాలేదు. రాజకీయాల్లో సైతం కనబడుతుంది. ఇక యూ ట్యూబ్ లో వైరల్ కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. పిచ్చ పిచ్చ చేష్టలు చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేసేయండి..

11:29 - July 10, 2016

ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. రూ. 28వేల కోట్ల నష్టంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరతే కాకుండా గొంతెమ్మ కోరికలు కూడా కారణమవుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రయాణించాల్సిన విమానం బయలుదేరలేదు. కారణం పైలట్ ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ఇక సినిమాలకు సైతం విమానాలు పబ్లిసిటీ చేస్తున్నాయి. కబాలి సినిమా కోసం ఓ విమాన సంస్థ పబ్లిసిటీ చేస్తోంది. ఆవు మూత్రంలో బంగారం..ఐఐటీ కోచింగ్ కోసం కోట్లు..ఐఐటీ కోసం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. మరోవైపు సినిమాల కోసం విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యూ ట్యూబ్ లో వైరల్ కోసం పిచ్చ పిచ్చ చేష్టలు చేస్తున్నారంట. ఆసక్తికరంగా ఉండే ఈ అంశాల కోసం వీడియోను క్లిక్ చేయండి.

వరదలో చిక్కుకున్న కారు..నలుగురు గల్లంతు...

మహారాష్ట్ర : కొతారి ప్రాంతంలోని చంద్రాపూర్ లో వరద ప్రవాహంలో కారు చిక్కుకపోయింది. కారులో ఉన్న నలుగురు గల్లంతయ్యారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

ఏఐడీఎంకే కౌన్సెలర్ దారుణ హత్య..

తమిళనాడు : ఏఐడీఎంకే కౌన్సెలర్ ఆర్ ముల్లాయి జ్ఞానశేఖర్ ను చెన్నైలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

శ్రీనగర్ లో మృతులు 14 మంది ?

శ్రీనగర్ : హిబ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో కాశ్మీర్ అంతటా తీవ్రత అలజడి నెలకొంది. నిరసనకారులకు..భద్రతాబలగాలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సుమారు 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

కరీంనగర్ లో కారు - ఆర్టీసీ బస్సు ఢీ..

కరీంనగర్ : మానకొండూరు (మం) ఖాదర్ గూడెం వద్ద కారు - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సిద్ధిపేటలో హరితహారం..

మెదక్ : సిద్ధిపేటలో (మం) ఇబ్రహీంపూర్ లో హరితహారం కార్యక్రమం జరిగింది. లక్షలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

వర్షాలు..వరదలపై సీఎం చౌహాన్ సమీక్ష..

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు..పోటెత్తుతున్న వరదల పరిస్థితిపై సమీక్షిస్తున్నారు.

రాజ్ నాథ్ ఉన్నత స్థాయి సమావేశం..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేవంలో కాశ్మీర్ డివిజన్ హోం సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఐ అండ్ బి చీఫ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇటీవల కాశ్మీర్ లో నెలకొన్న శాంతిభద్రతలపై చర్చించనున్నారు.

శ్రీవారి సేవలో క్రీడా ప్రముఖులు..

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో క్రికెటర్ దినేష్ కార్తీక్, క్రీడాకారిణి పీవీ సింధులు దర్శించుకున్నార.

ప్రేమ పేరిట వేధింపులు..యువతి ఆత్మహత్య..

గుంటూరు : ముప్పాళ్ల మండలం మాదాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరిట యువతిని ఆటో డ్రైవర్ మహేష్ వేధించాడు. వేధింపులు తాళలేక యువతి కళ్యాణి ఆత్మహత్య చేసుకుంది.

కాళేశ్వరం వద్ద పోటెత్తుతున్న వరదనీరు..

కరీంనగర్ : మహదేవ్ పూర్ (మం) కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం వద్ద పది మీటర్ల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది.

 

సీజనల్ వ్యాధులు వ్యాపించలేదు - మంత్రి లక్ష్మారెడ్డి..

కరీంనగర్ : ప్రభుత్వ ఆసుపత్రిలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటెల రాజేందర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. ఆసుపత్రిలో అసంక్రమిత వ్యాధుల చికిత్స విభాగాన్ని లక్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించలేదని, ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందన్నారు.

అస్తానా నగంరలో సీఎం బాబు..

కజకిస్తాన్ : అస్తానా నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం పర్యటిస్తోంది. ప్రసిద్ధ బేతెరెక్ టవర్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. టవర్ నుంచి ముఖ్య రాజధాని ప్రాంతాన్ని బృందం పరిశీలిస్తోంది.

10:44 - July 10, 2016

అంగవైకల్యం కళల్లో రాణించటానికి అడ్డురాదని ఎందరో రుజువు చేశారు. అలా తన అంగవైకల్యాన్ని అధిగమించి గాయకుడిగా రాణిస్తున్నాడు బాలకృష్ణ. వివిధ సామాజికాంశాలపై ఆయన రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. చక్కగా పాడుతూ జనం పాటల ప్రవాహమైపోతాడాయన. గేయరచయిత, గాయకులు బాలకృష్ణ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

10:43 - July 10, 2016

మన ఓటుతో మనం చెక్కిన కుర్చీమీద కూర్చుందాం. తాటాకుల మీద కాల జ్ఞానాన్ని రాసిన వీరబ్రంహంగారి వారసులం అంటూ బహుజన కవిత్వాన్ని రాసిన కవి దాసోజు కృష్ణమాచారి. ఆయన బహుజన కులాల అస్తిత్వాన్ని గురించి అద్బుతమైన కవితలు రాశాడు. 'వన్నె' అన్న కవితా సంపుటిని వెలువరించాడు. కవి దాసోజు కృష్ణమాచారి పరిచయకథనం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

10:39 - July 10, 2016

ఊయల ఊపగల చేతులు ప్రపంచాన్ని పాలించగలవంటారు. ఇవాళ ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నారు. అయితే అత్యంత సాహసోపేతమైన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో సాహసాలు చేస్తూ.. తన పరిశోధనలను ప్రపంచం ముందుంచింది రాణా అయూబ్. గుజరాత్ పైల్స్ అన్న సంచలనాత్మక పుస్తకం రాసిన జర్నలిస్ట్ రాణా అయూబ్ పై ప్రత్యేక కథనం. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

10:30 - July 10, 2016

లండన్ : వింబుల్డన్ టైటిల్ సమరానికి ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టులో రంగం సిద్ధమయ్యింది. ఈ సూపర్ సండే ఫైట్ లో రెండోసీడ్, రెండుసార్లు చాంపియన్ యాండీ ముర్రేతో...కెనేడియన్ థండర్, 7వ సీడ్ మిలోస్ రావ్ నిచ్ ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల 30నిముషాలకు ఈపోటీ ప్రారంభమవుతుంది. 2016 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి...లండన్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే బ్రిటీష్ నెంబర్ వన్, రెండోసీడ్ యాండీ ముర్రే ఫైనల్స్ చేరితే కెనేడియన్ థండర్ మిలోస్ రావ్ నిచ్ మాత్రం..అనూహ్యంగా ఫైనల్స్ చేరి సంచలనమే సృష్టించాడు.

ఫెదరర్ ఓటమి..
ఫైనల్లో చోటు కోసం జరిగిన తొలి సెమీఫైనల్లో...ఏడుసార్లు చాంపియన్, మూడోసీడ్ రోజర్ ఫెదరర్ తో...మూడున్నర గంటలపాటు పోరాడి మరి..7వ సీడ్ ప్లేయర్ మిలోస్ రావ్ నిచ్ విజేతగా నిలిచాడు. పవర్ ఫుల్ సెర్వ్ కు పదునైన గ్రౌండ్ స్ట్రోక్ లు జోడించి ఆడిన రావ్ నిచ్..చివరకు 6-3, 7-6, 4-6, 6-7, 6-3 తో నెగ్గడమే కాదు..తన కెరియర్ లో తొలిగ్రాండ్ స్లామ్ ఫైనల్స్ బెర్త్ సంపాదించాడు. ఫెదరర్ మాత్రం 11 వింబుల్డన్ సెమీస్ లో ఓటమి పొందడం ఇదే మొదటిసారి. తొలి సెమీఫైనల్స్ నువ్వానేనా అన్నట్లుగా సాగితే...రెండో సెమీఫైనల్స్ మాత్రం దానికి భిన్నంగా ముగిసింది. రెండో సీడ్ యాండీ ముర్రే వరుస సెట్లలో 6-3, 6-3, 6-3తో..9వ సీడ్ థామస్ బెర్డిచ్ ను చిత్తు చేశాడు. 2013 తర్వాత ..యాండీ ముర్రే వింబుల్డన్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. అంతేకాదు..జోకోవిచ్, ఫెదరర్ ప్రత్యర్థులుగా లేకుండా ఫైనల్లో వేరే ఆటగాడితో ముర్రే పోటీపడటం ఇదే తొలిసారి.

రావ్ నిచ్ చరిత్ర సృష్టిస్తాడా ?
29 ఏళ్ల యాండీ ముర్రే కెరియర్ లో ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరడం ఇది 11వసారి. ఫ్రెడ్ ఫెర్రీ పేరుతో ఉన్న 11 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ రికార్డును సైతం ముర్రే సమం చేయగలిగాడు. అయితే...సూపర్ సండే టైటిల్ సమరంలో మాత్రం..రెండోసీడ్ ముర్రేనే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు. మిలోస్ రావ్ నిచ్ ప్రత్యర్థిగా ముర్రేకి 6 విజయాలు, 3 పరాజయాల రికార్డు ఉంది. గంటకు 130 మైళ్ల వేగంతో రావ్ నిచ్ సంధించే సెర్వ్ ను ముర్రే ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటాడన్న అంశమే..ఫైనల్ తుదిఫలితాన్ని నిర్ణయించనుంది. గత వారం ముగిసిన క్వీన్స్ క్లబ్ ఫైనల్లో తనకు ముర్రే చేతిలో ఓటమి ఎదురైనా వింబుల్డన్ టైటిల్ సమరం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు మిలోస్ రావ్ నిచ్ చెప్పాడు. మొత్తం మీద 2016 వింబుల్డన్ టైటిల్ సమరం ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండోసీడ్ ముర్రే మూడో వింబుల్డన్ టైటిల్ తో పాటు 15 కోట్ల 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకొంటాడా?....లేక తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడుతున్న మిలోస్ రావ్ నిచ్..టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టిస్తాడా? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచి చూడక తప్పదు.

10:26 - July 10, 2016

పారిస్ : యూరోపియన్ ఫుట్ బాల్ ఫైనల్స్ కు సెయింట్ డెన్నిస్ సాకర్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఆతిథ్య ఫ్రాన్స్ కు...సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ సవాల్ విసురుతోంది. నెలరోజుల యూరోసాకర్ హంగామాకు ఆదివారం రాత్రి తెరపడనుంది. లయన్ సాకర్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్లో చిచ్చరపిడుగు వేల్స్ ను పోర్చుగల్ 2-0 గోల్స్ తో అధిగమిస్తే మార్సెలీ సాకర్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో మూడుసార్లు చాంపియన్ జర్మనీని ఆతిథ్య ఫ్రాన్స్ 2-0 గోల్స్ తో కంగుతినిపించి టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి. ప్రపంచ సాకర్ 8వ ర్యాంకర్ పోర్చుగల్ 22 ఏళ్ల విరామం తర్వాత యూరోకప్ ఫైనల్స్ చేరితే 21వ ర్యాంకర్ ఫ్రాన్స్ 16 ఏళ్ల తర్వాత టైటిల్ బెర్త్ ఖాయం చేసుకొంది.

2004లో పోర్చుగల్ రన్నరప్..
సూపర్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2004 యూరో సాకర్ టోర్నీలో అత్యుత్తమంగా రన్నరప్ స్థానం మాత్రమే సాధించింది. అదే ఫ్రెంచ్ టీమ్ కు మాత్రం 1984, 2000 యూరో టోర్నీల్లో చాంపియన్ గా నిలిచిన ఘనత ఉంది. పోర్చుగీసు జట్టులో రొనాల్డో, నానీ , శాంటోస్ కీలక ఆటగాళ్లుగా ఉంటే...ఫ్రెంచ్ జట్టులో మాత్రం సూపర్ స్ట్రయికర్ పోగ్బా, 2016 యూరోకప్ సంచలనం ఆంటోనియో గ్రీజ్ మన్, ఆలీవర్ గిరౌడ్‌ తురుపుముక్కలుగా ఉన్నారు. గ్రూప్ లీగ్ నుంచి సెమీస్ వరకూ ఆడిన మ్యాచ్ ల్లో పోర్చుగల్ సూపర్ స్టార్లు నానీ, క్రిస్టియానో రొనాల్డో చెరో మూడుగోల్స్ చొప్పున సాధిస్తే...ఫ్రెంచ్ స్ట్రయికర్ గ్రీజ్ మన్ ఒక్కడే ఆరుగోల్స్ సాధించడం విశేషం.

హోరాహోరీ...
రెండు జట్ల ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే...పోటీ హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయి. క్రిస్టియానో రొనాల్డో మ్యాజిక్ చేయగలిగితేనే పోర్చుగల్ విజేతగా నిలువగలుగుతుంది. ఐదుగురు స్ట్రయికర్ల పవర్ తో దూకుడుమీదున్న ఫ్రెంచ్ జట్టును నిలువరించాలంటే పోర్చుగల్ అత్యుత్తమంగా రాణించక తప్పదు. భారత కాలమానప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల 30 నిముషాలకు ఈ సూపర్ సండే టైటిల్ సమరం ప్రారంభమవుతుంది.

అమర్ నాథ్ యాత్ర..చిక్కుకున్న ప్రకాశం వాసులు ?

జమ్మూకశ్మీర్ : అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం. శ్రీనగర్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా వారు పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా వాసులు 150 మంది చిక్కుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

నల్గొండ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

10:18 - July 10, 2016

వరంగల్ : జిల్లాలో సెలైన్ల ముప్పు పొంచి ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో సెలైన్ల బ్యాటిళ్లలో బ్యాక్టీరియా సోకి పలువురు కంటి చూపు పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఘటనకు కారణమైన హసీబ్ సెలైన్లను సీజ్ చేశారు. వరంగల్ జిల్లా వైద్యాధికారులు కూడా అప్రమత్తమై పలు సెలైన్లను సీజ్ చేశారు. తాజాగా జిల్లాలో వైద్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.18 లక్షల సెలైన్ల బాటిళ్లను సీజ్ చేశారు. నిషేధిత జాబితాలో ఆర్ఎల్, ఎస్ఎన్ సెలైన్ బాటిళ్లు కూడా చేరాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎల్ 43 వేలు, ఎస్ఎన్ 75 వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేశారు. సీజ్ చేయడం వల్ల జిల్లాలో సెలైన్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గమనించారు. ఇతర కంపెనీల నుండి సెలైన్లను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు ఇండెంట్ పెట్టినా ఇంతవరకు సెల్లైను రాలేదని తెలుస్తోంది. దీనితో జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా సెలైన్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని అధికారులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

10:14 - July 10, 2016

రంగారెడ్డి : జిల్లా ఎస్పీ నవీన్ కుమార్ ఇంట్లో హోంగార్డుల వెట్టిచాకిరీ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఆయన ఇంట్లో వారు చేస్తున్న వెట్టిచాకిరి దృశ్యాలు మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే. సుమారు 20మంది హోంగార్డులు ఎస్పీ తన ఇంట్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంట్లు తోముతూ, పశువులు మేపుతూ సేవలు చేస్తున్న దృశ్యాలు చిక్కాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అసలీ దృశ్యాలు మీడియా కు ఎలా చిక్కాయి అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. మరోవైపు హోంగార్డులపై కూడా తీవ్ర వత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం గురించి మాట్లాడవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరి దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకొస్తాయి వేచి చూడాలి.

09:59 - July 10, 2016

వరంగల్ : జిల్లా భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అమ్మవారు ప్రతిరోజూ... రకరకాల కూరగాయలతో అలంకృతమై.. భక్తులకు దర్శనమిస్తున్నారు. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఓరుగల్లుకు తరలి వస్తున్నారు. సుమారు 38 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపాల వెనుక ఉన్న చరిత్ర, అలంకరణల విశిష్టత దేశంలోనే ప్రత్యేకమైనవని భద్రకాళి భక్తులు నమ్ముతారు. పదమూడో రోజు అమ్మవారిని మాత్ర రూపంలో అలంకరిస్తారు. సర్వమంగళ రూపంలో అమ్మవారిని తీర్చిదిద్దుతారు. వరంగల్‌ భద్రకాళి ఆలయంలో ఏటా నాలుగు నవరాత్రులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయజ మాసంలో శ్రీదేవీ శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, వైశాఖ మాసంలో శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు, ఆషాడ మాసంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాలు ప్రారంభమవడంతో వరంగల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తుల రాకపోకలతో ఈ ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

క్రీ.శ.625లో గుడి నిర్మాణం..
శాకంబరి ఉత్సవాలతో సందడిగా మారిన భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర ఎంతో విశిష్టమైనదని భక్తులు నమ్ముతారు. కొంగు బంగారంగా భక్తులు కొలిచే ఆదిశక్తి ఆలయం.. ఉత్తర తెలంగాణ ఇంద్రకిలాద్రిగా ప్రశస్తమైంది. కోల్‌కత్తాలో కాళీ మాత దేవాలయం తర్వాత.. ఓరుగల్లులోని భద్రకాళి ఆలయంలోనే నిత్యం కాళికా క్రమంలో పూజలు, హోమాలు జరపడం విశేషం. వరంగల్‌ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. క్రీ.శ. 625లోనే ఈ గుడి నిర్మితమైందని చరిత్రకారులు చెబుతున్నారు. అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిలపై చెక్కిన తీరును బట్టి దీన్ని పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండో పులకేశి నిర్మించినట్లు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. కాకతీయులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచినట్టు చరిత్ర చెబుతోంది. ఆలయంలోని అమ్మవారి విగ్రహం అందరినీ సమ్మోహితులను చేస్తోంది. మూల విరాట్టు విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఎనిమిది చేతుల్లో అష్టభూషణాలు, ఆయుధ సంపత్తితో సాక్షాత్కరిస్తుంది. శాంతమూర్తి అవతారంలో ధగధగ మెరుస్తోంది ఆ జగన్మాత. కుడివైపు ఉన్న చేతుల్లో ఖడ్గం, చూరిక, అక్షమాల, ఢమరుకం, ఎడమ వైపు ఉన్న చేతుల్లో ఘంటా, త్రిశూలం, కపాలం, పాన పాత్ర ఉంటాయి. ఆ దేవి ఆహార్యాన్ని దర్శించుకుంటే నూతన జవసత్వాలు సమకూరుతాయని భక్తులు నమ్ముతారు.

1948లో బి.ఎస్‌.గణేశశాస్త్రి కృషితో ఆలయ పునరుద్ధరణ..
వరంగల్‌ - హన్మకొండ ప్రాంతాల వారధిగా భద్రకాళీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ దేవాలయం మహా క్షేత్రంగా వర్ధిల్లుతోంది. భక్తకోటి విశ్వాసాన్ని ఆరాధనని అందుకుంటుంది. చారిత్రక నేపథ్యమున్న ఆ గుడి క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం ప్రాభవం కోల్పోయింది. 1948లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దివంగత బీఎస్‌.గణేశ్‌ శాస్త్రి కృషితో ఆలయం పునరుద్ధరణకు నోచుకుంది. ఆనాటి నుంచి నేటి వరకు భక్తులు, దాతల సహకారంతో దేవాలయం మహా క్షేత్రంగా మారింది. ఇక్కడ దక్షిణ భారత సంప్రదాయ పద్ధతిని అనుసరించి నిత్య పూజలు జరుగుతాయి. ఆలయ నిర్మాణంలోనూ గొప్ప ఔచిత్యం ఉంది. దేశంలో పశ్చిమ ముఖంలో దర్శనిమిచ్చే ఏకైక ఆలయం ఇదే. గర్భాలయానికి రెండు వైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. జగద్గురు ఆది శంకరాచార్యుల విగ్రహమూ ఉందిక్కడ. శ్రీవల్లభ గణపతి ఆలయం, శివపార్వతీ మందిరం, ఆంజనేయ స్వామి గుడి, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలున్నాయి. ఆలయం ముందు భాగంలో మహా మంటపం, ధ్వజస్తంభం, సింహ వాహనం, బలి పీఠం ఉన్నాయి.

సింగారెడ్డి పాలెం వద్ద ఆటో - ట్యాంకర్ ఢీ..

నల్గొండ : పెన్ పహాడ్ (మం) సింగారెడ్డి పాలెం వద్ద ఆటో - ట్యాంకర్ లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్లకు చెందిన బత్తాయి కూలీలుగా గుర్తించారు.

 

వరంగల్ లో 1.18 లక్షల సెలైన్ల బాటిళ్ల సీజ్..

వరంగల్ : జిల్లాలో వైద్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.18 లక్షల సెలైన్ల బాటిళ్లను సీజ్ చేశారు. నిషేధిత జాబితాలో ఆర్ఎల్, ఎస్ఎన్ సెలైన్ బాటిళ్లు కూడా చేరాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎల్ 43 వేలు, ఎస్ఎన్ 75 వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేశారు.

09:32 - July 10, 2016

ఢిల్లీ : ఉత్తరాన వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌, అస్సాం అతలాకుతలం అవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో వరదల కారణంగా 11 మంది మృతి చెందారు. వేలాదిమందిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేని వర్షాలతో అస్సాం లోతట్లు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని నర్మదా, పార్వతి, చంబల్, కెన్, తవా, తమస్, సునార్‌ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 8 మంది మృతి చెందారు. భోపాల్‌, సత్‌నా జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పలు చోట్ల రోడ్లు తెగిపోవడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాలు నీట మునిగడంతో జనజీవనం స్తంభించింది.

ఇళ్లలోకి చేరిన వరదనీరు...
భోపాల్‌, సత్‌నా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత ముడు రోజులుగా సత్‌నా జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో పలు కాలనీలు నీట మునిగాయి. నీటిలో చిక్కుకున్న ప్రజలను సహాయక సిబ్బంది పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు నాలుగు వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉండడంతో సైన్యం రంగంలోకి దిగింది. గత 24 గంటల్లో భోపాల్‌లో 175 మిల్లీమీటర్లు, సత్నాలో 244 మిల్లిమీటర్లు, హోశంగాబాద్‌లో 249 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్‌ స్థాయిలో నమోదైంది. వచ్చే 24 గంటల్లో సత్‌నా, జబల్‌పూర్, రాయ్‌సేన్, హోశంగాబాద్, విదిషా తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లఖింపూర్, నగోన్, గోలాఘట్, మోరిగాన్‌, బిశ్వనాథ్, బర్‌పేట, జోర్హాట్‌ జిల్లాల్లో 213 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దాదాపు లక్షకు పైగా ప్రజలపై వరదలు ప్రభావం చూపాయి. అధికారులు ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా 7 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. బ్రహ్మపుత్ర, డిక్‌హో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

09:29 - July 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో ముసురు కమ్ముకుంది. పంజాబ్‌ నుంచి మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగుతున్నాయని, దీని ప్రభావంతో ఆదివారం రాత్రి వరకు తెలంగాణలో ఒకట్రెండు చోట్ల భారీ, పలుచోట్ల ఒక మోస్తరుగా... కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. రుతుపవనాల ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఆదిలాబాద్ లో ..
అదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లోగల సింగరేణి బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని కొమురం భీం, కడెం, గెడ్డన్నవాగు రిజర్వాయర్లు నిండిపోయాయి.

ఆదిలాబాద్ లో విస్తారంగా వర్షాలు..

ఆదిలాబాద్ : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లోగల సింగరేణి బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

హరితహారం కార్యక్రమంలో రకుల్...రాశీ ఖన్నా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశీ ఖన్నా పాల్గొన్నారు. కేబీఆర్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ తోపాటు వీరు పాల్గొని మొక్కలు నాటారు.

మధ్యప్రదేశ్ లో 20 మంది మృతి..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే 8 మంది మృతి చెందారు.

09:16 - July 10, 2016

కోట శ్రీనివాసరావు..కోట అని ముద్దుగా పిలుస్తుంటారు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు 1945, జులై 10వ తేదీన జన్మించారు. సినిమాల్లో రాకముందు కోట స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. రంగస్థలంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన విలక్షణ నటులలో కోట శ్రీనివాసరావు పేరుని ముందు వరుసలో చెప్పుకోవచ్చు. దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కోటశ్రీనివాసరావుని పద్మ అవార్డులలో భాగంగా పద్మ శ్రీ తో భారత ప్రభుతం సత్కరించింది. ఆయన జన్మదినం సందర్భంగా కోట శ్రీనివాసరావుతో టెన్ టివి ముచ్చటించింది. ఇన్నేండ్ల సినీ జీవితంలో జరిగిన ఘటనలను ఆయన నెమరేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వాతావరణంపై కోట శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఇప్పటికీ బీజేపీ వాడేయేనని, వయస్సు రీత్యా మీటింగ్ లకు వెళ్లడం లేదని కోట తెలిపారు. ఈ సందర్భంగా సహ నటులు బాబు మోహన్, అల్లరి నరేష్, తాగుబోతు రమేష్ కోటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

09:00 - July 10, 2016

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న వాతావరణం పై ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రమణారెడ్డి..ఇతరులు ఎంతో మంది సినీ పరిశ్రమలో ఉన్నారని వాళ్లు ఎందుకు సినిమాలు తీయడం లేదని ప్రశ్నించారు. వాళ్లయొక్క పరువు పోతుందని, నిర్మాత అంటే వ్యాపారపరంగా తీసే వారు కానీ సినిమా తీసేవారని తెలిపారు. ప్రస్తుతం బిటెక్ లు చదివిన వారు కూడా డైరెక్షన్ అంటూ వస్తున్నారని, సబ్జెక్ట్ అంటే ఏం తెలుసని నిలదీశారు. రాఘవేంద్ర రావు గ్రేట్ డైరెక్షన్ మరి ఆయన రచయితను ఎందుకు పెట్టుకుంటున్నారన్నారు. ఏదైనా అంటే ల్యాప్ టాప్ కొడుతున్నారు..అడ్డమైన వాటికి సాంకేతికత వాడుకోవద్దని సూచించారు. ఇంత.అంత..బడ్జెట్ తో సినిమా తీశామని చెబుతున్నారు..భారీ బడ్జెట్ తో తీయాలని ఎవరైనా చెప్పారా అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఉన్న మిగతా వారు ఎందుకు చెప్పుకోలేదని, ఎక్స్ పోజర్స్ ఎక్కువయ్యారన్నారు. మంచి సినిమాలు ఎక్కడున్నాయని, ఒకటి..అరా ఉంటాయన్నారు. ఇటీవలే వచ్చిన తివిక్రమ్ సినిమా 'అ..ఆ' విడుదలైంది. ఆడలేదా ? అవగాహన శక్తి ఉండాలని సూచించారు. సిక్స్ ప్యాక్ లు ఎవరు చేయమన్నారు ? కృష్ణ..చిరంజీవి..శోభన్ బాబుకు ఉన్నాయా ? ముఖం పాడైపోయి..కథ ఉండదు..ఏమీ ఉండదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా తీయముందే ప్రజలు ఆదరించరని అనుకోవడం తప్పు అని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

08:59 - July 10, 2016

'సుల్తాన్'..బాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిర్మాత యశ్ రాజ్ ఫిలిమ్స్, అలీ అబ్బాస్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'సుల్తాన్' చిత్రం ఇటీవలే విడుదలైంది. తొలి రోజు నుండే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.కేవలం మొదటి మూడు రోజుల్లో 105 కోట్ల రూపాయలు వసూలు చేసి వందకోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అంతేకాదు...మొదటి మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే 1200 మంది చిన్నారుల కోసం 'సల్లూ' భాయ్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి ముంబైలో 'సుల్తాన్' సినిమాను సల్మాన్ చూశారు. సినిమా పూర్తయ్యాక ఆ చిన్నారులతో మాట్లాడుతూ, ఫొటోలు దిగుతూ వారిని సల్మాన్ అలరించారు. 'సుల్తాన్' సినిమా కోసం సల్మాన్ ఓ ప్రత్యేక గేమ్‌ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ గేమ్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా సల్మన్‌ని కలిసే అవకాశముందని చిత్ర బృందం ప్రచారం చేస్తోంది.

08:39 - July 10, 2016

తెలుగు భాషపై ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు భాషకు ప్రాతినిధ్యం తగ్గిపోతోందని, పరభాషకు తాను వ్యతిరేకం కాదని తెలిపారు. కోట జన్మదినం సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. తెలుగు సినిమా తీస్తే అవార్డు వస్తుందని, ఇతరులు డైలాగ్స్ పలుకుతుంటే డబ్బింగ్ చెబుతున్నట్లు ఉంటుందన్నారు. తెలుగు వారికి అవార్డు రాదు అంటే తెలుగు సినిమా తీస్తే కదా ? అని పేర్కొన్నారు. పరభాషకు వ్యతిరేకం కాదరని, మాతృభాష అభిమానిని తెలిపారు. ఇంట్లో కూడా తెలుగే మాట్లాడుతాం అని, జన్మనిచ్చిన తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గు పడుతోందన్నారు. ఎక్కడైనా తమిళులు కలిస్తే అరవంలోనే మాట్లాడుకుంటుంటారని, తెలుగు వారి కలిస్తే మాత్రం ఇతర భాషల్లో మాట్లాడుకుంటుంటారని కోట శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

శంషాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్...

రంగారెడ్డి : శంషాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మూడు లారీలు..మూడు కార్లు..నాలుగు బైక్ లు సీజ్ చేశారు. 11 మందిపై కేసు నమోదు చేశారు.

 

వరంగల్ లో రోగికి ఆర్ఎల్ సైలెన్ ఎక్కించిన సిబ్బంది..

వరంగల్ : జనగామ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్ అనే వ్యక్తికి నిషేధిత హసీబ్ కంపెనీకి చెందిన ఆర్ఎల్ సైలెన్ ను సిబ్బంది ఎక్కించారు. విషయం తెలిసిన బంధువులు ఆందోళన చెందుతున్నారు.

ఎస్పీ ఇంట్లో హోంగార్డుల వ్యవహారంపై అధికారుల ఆరా..

రంగారెడ్డి : ఎస్పీ ఇంట్లో పనిచేస్తున్న హోంగార్డుల వ్యవహారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీశారు. వీడియో దృశ్యాలు మీడియాకు ఎలా అందాయన్న కోణంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

దర్కస్ పల్లిలో విషాదం...

మెదక్ : రేగోడు (మం) దర్కస్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. మృతులుగా వీరయ్య, కిష్టయ్యలుగా గుర్తించారు.

 

08:18 - July 10, 2016

తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుల్లో కోట ఒకరు. ఆయన వేషాలు ఇవ్వాలని కోరుతున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రంగస్థల సినీ నటుడు కోట శ్రీనివాసరావు. రెండు దశాబ్దాలపాటు నాటకరంగానికి సేవలు అందించారు. నాలుగు దశాబ్దాలుగా 750 పైగా చిత్రాల్లో ప్రతి నాయకునిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలతో, తనదైన నటన, మాడ్యులేషన్‌తో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా టెన్ టివితో ముచ్చటించింది. ప్రస్తుతం ఖాళీగా ఎందుకు ఉన్నానని అనిపిస్తోందని, షూటింగ్ లో వందలాది మంది ఉంటారని తెలిపారు. ప్రస్తుతం అలాంటి వాతావరణం పోయిందని, ఇంట్లో ఒంటరిగా ఉండడం..టీవీ చూడడం..సతీమణితో నాలుగు తిట్లు తినడం. మనువళ్లతో ఆడడం చేస్తుంటానని తెలిపారు. ఏదైనా వేషం ఇవ్వండయ్యా అంటూ కోరుతుంటానని తెలిపారు. ఏదో కోల్పోయాననే బాధ ఉంటుందని కోట శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాటల్లోనే తెలుసుకోవాలని అనుకుంటే వీడియో చూడండి.

షాబాద్ కు రానున్న అల్లం నారాయణ..

రంగారెడ్డి : రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ షాబాద్‌ మండల కేంద్రానికి రానున్నారు. చేవెళ్ల డివిజన్‌ జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలోని పీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ సమావేశం జరగనుంది.

టాంజానీయాలో పర్యటించనున్న మోడీ..

దక్షిణాఫ్రికా : భారత ప్రధాని నరేంద్రమోడీ టాంజానియాలో పర్యటించనున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా శనివారం ఆయన సౌత్‌ ఆఫ్రికా నుంచి రాత్రి టాంజానియా చేరుకున్నారు. నేడు ఆ దేశ అధ్యక్షుడు జాన్‌ మాగుఫులితో మోడీ సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.

07:52 - July 10, 2016

వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో అనారోగ్యాలు విజృంభిస్తాయి. వర్షంలో తడిసిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలు అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. చర్మం మీద, వెంట్రుకల మొదట ప్రభావం చూపుతుంది. ఈ రెండింటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వెంట్రుకల గురించి శ్రద్ధ తీసుకోవాలి.
తలతడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూపడతాయి. చుండ్రు వల్ల మొటిమలూ తప్పవు. ఇతర ఇన్ ఫెక్షన్లు బాధిస్తాయి.
వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి.
తలస్నానానికి ముందు పెరుగు లేదా రీఫైయిన్డ్ ఆయిల్ ను తల మాడుకు బాగా మసాజ్ చేయాలి. అనంతరం అరగంట తర్వాత స్నానం చేయాలి. పలుచగా ఉండే బాదాం ఆయిల్, కొబ్బరినూనె వంటివి గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేసిన స్నానం చేయాలి.
తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు. తడిలె కురులు బలహీన బడి ఉండటం వల్ల కురులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
మాయిశ్చరైజర్ చర్మాన్ని రోజంతా మాయిశ్చరైజింగ్ గా ఉంచడం చాలా అవసరం. అయితే మాయిశ్చరైజర్ ని రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే.. చర్మం పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది.
వర్షాకాలంలో చాలామంది వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీళ్లు సరిగా తాగరు. కానీ.. వర్షాకాలంలో.. అయినా సరే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల… హైడ్రేట్ గా ఉంటారు.

07:32 - July 10, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు బృందం కజకిస్తాన్‌లో పర్యటిస్తోంది. అక్కడి అభివృద్ధి నమూనాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాజధాని నిర్మాణంలో ఆ దేశ సహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వండి అని సీఎం చంద్రబాబు కజకిస్థాన్‌ రక్షణ మంత్రి తస్మాగమ్‌ బెతోవ్‌ను కోరారు. కజకిస్థాన్‌, రష్యా పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం బృందం కజకిస్థాన్‌లో పర్యటించింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం బృందానికి కజకిస్థాన్‌లో సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. తొలుత కజకిస్థాన్‌ పాత రాజధాని అల్మాటిలో పర్యటించిన చంద్రబాబు బృందం అక్కడ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కోక్‌ టోబోను సందర్శించింది. ఇక్కడికి చేరుకొనేందుకు నగరం మధ్య నుంచి కేబుల్‌ కార్‌ ద్వారా సీఎం బృందం ప్రయాణించింది. నగరం నడి మధ్య నుంచి వెళుతున్న కేబుల్‌కారు సీఎంను ఆకట్టుకుంది. ఈ తరహా పర్యాటక కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా తన వెంట ఉన్న అధికారులను కోరారు. అనంతరం సీఎం చంద్రబాబు కజకిస్థాన్‌ నూతన రాజధాని ఆస్తానాకు చేరుకొంది. అక్కడ ఆస్తానా మాజీ మేయర్‌, కజకిస్థాన్‌ రక్షణ మంత్రి బెతోవ్‌ సీఎం బృందానికి స్వాగతం పలికారు. బెతోవ్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కజకిస్థాన్‌, ఏపీ నడుమ ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. సోవియెట్‌ రష్యా నుంచి విడిపోయిన కజకిస్థాన్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇటీవలే విభజనకు గురైన ఏపీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు.

రాజధాని నిర్మాణానికి మాకు పదేళ్లు పట్టింది: బెతోవ్‌...
జపాన్‌, దుబాయ్‌, సింగపూర్‌ ఆర్కిటెక్టులనే కాకుండా తమ దేశ ఆర్కిటెక్టులను కూడా పిలిపించుకోవాలని, వారి అనుభవాలు అమరావతి నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటాయని కజకిస్థాన్‌ మంత్రి బెతోవ్‌.. చంద్రబాబుకు సూచించారు. తమ రాజధాని నిర్మాణానికి పదేళ్లు పట్టిందని, అది 18 ఏళ్ల క్రితం నాటి మాటన్నారు. ఇప్పుడు సాంకేతికత పెరిగిందని అమరావతిని ఐదు నుంచి ఏడేళ్లలో నిర్మించుకోగలరనే నమ్మకం తనకుందన్నారు. నవీన నగరానికి సరైన ప్రణాళికతో కూడిన రవాణా వ్యవస్థ కీలకమని, అమరావతిలో ప్రజారవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నూతన రాజధాని నగర రూపకల్పనకు ప్రభుత్వ, విదేశీ, ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడులు సమీకరించామని కజకిస్థాన్‌ మంత్రి బెతోవ్‌ వివరించారు. పక్కా ప్రణాళిక ఉంటే నవీన నగరాలను నిర్మించడం సులభతరమేనన్న బెతోవ్‌, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 20 బిలియన డాలర్లకు తగ్గకుండా పెట్టుబడులను ఆకర్షిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
విభజన కష్టాల నుంచి నిర్మితమైన ఆస్తానా తరహాలోనే అమరావతి కూడా అద్భుతమైన నగరంగా ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కజకిస్థాన్‌ రక్షణ మంత్రి బెతోవ్‌. చంద్రబాబు దూరదృష్టితో ఆస్తానా కన్నా వేగంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తమ రాజధాని నిర్మాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.. రష్యా నుంచి విడిపోయిన తొలినాళ్లలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకూ డబ్బులేని పరిస్థితి ఉండేదన్నారు. కష్ట సమయంలో తమ దేశంలోని వైద్యులు, ఉద్యోగులు ఎంతో సహకారం అందించారని ఏడాదిపాటు జీతాలు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందించారని వివరించారు.

వేలాది మంది రైతుల భూములు...
నగర నిర్మాణానికి అనుసరించిన పద్ధతుల్ని తెలుసుకొనేందుకే కజకిస్థాన్‌ వచ్చామని చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణంలోను ఆయా పద్ధతులు, పరిజ్ఞానాన్ని వాడుకుంటామన్నారు. ఉమ్మడి రాష్ర్టానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు సైబరాబాద్‌ పేరిట కొత్త నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు మళ్లీ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని తెలిపారు. తనపై విశ్వాసంతో వేలాది మంది రైతులు రాజధాని కోసం భూములను ఇచ్చిన వైనాన్ని బెతోవ్‌కు వివరించారు.

ఈసెట్ ఆప్షన్లకు నేడే ఆఖరు..

హైదరాబాద్ : ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోరే విద్యార్థులు కాలేజీల ఎంపికకు ఆప్షన్లు ఇచ్చుకొనే ప్రక్రియ ఆదివారం ఉదయం 10గంటలతో ముగియనుంది.

 

కొమరం భీమ్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు..

ఆదిలాబాద్ : జిల్లాలోని కొమరం భీమ్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్ ఫ్లో 24,450 ఉండగా ఔట్ ఫ్లో 15వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం అధికారులు మూడు గేట్లు ఎత్తివేశారు.

 

యూరో కప్..పోర్చుగల్..ఫ్రాన్స్ మధ్య ఫైనల్..

పారిస్ : యూరో కప్ సాకర్ సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. యూరో టోర్నీలో అతిథ్య ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు ఫైనల్ ఫైట్ లో హోరాహోరీ తలపడనున్నాయి. రాత్రి 12.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

గురుకుల గెస్ట్ లెక్చరర్స్ కు రేపు రాత పరీక్ష..

హైదరాబాద్ : తెలంగాన సాంఘీక సంక్షేమ గురకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కొనసాగుతున్న ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో శనివారం నాటికి 63,067 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆప్షన్లు నమోదుకు సోమవారం వరకు గడువు విధించినట్లు అధికారులు వెల్లడించారు.

 

టిటిడి తిరునిలయంలో శ్రీవారి లడ్డూల విక్రయం..

హైదరాబాద్ : తిరుమల శ్రీవారి లడ్డూలను టిటిడి తిరునిలయంలో విక్రయించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లడ్డూలను విక్రయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

నేడు యూజీసీ సెట్ పరీక్ష..

హైదరాబాద్ : నేడు యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. అధికారులు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 పరీక్ష, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది.

నేడు సిద్ధిపేటకు మంత్రి హరీష్..

మెదక్ : సిద్దిపేట నియోజకవర్గంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలపై రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు.

06:39 - July 10, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి.. మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఎవరో చేసిన తప్పుకు 9 ఏళ్ల చిన్నారి బలియింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడి కారణంగా ఓ నిండు ప్రాణం మొగ్గలోనే తెగిపోయింది. ఇటీవల పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన 9ఏళ్ల చిన్నారి రమ్య మృతిచెందింది. మద్యం మత్తులో కారునడిపిన ఓ యువకుడి కారణంగా రమ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ పమ్మి మధుసూదనాచారికి ముగ్గురు కొడుకులు వెంకటరమణ, రమేష్, రాజేశ్‌లు. పెద్దకొడుకు వెంకట రమణ క్యాప్ జెమిని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే తన 9ఏళ్ల కూతురు రమ్యను సికింద్రాబాద్‌లోని సెయింట్‌ఆన్స్‌ స్కూల్లో చేర్చించిన వెంకటరమణ..ఆ తర్వాత రమ్యను స్కూలు నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన కారు అతివేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది.

వారం రోజులుగా కోమాలో..
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే వెంకటరమణ కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా..చిన్నారి రమ్యకు తీవ్రగాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇతర కుటుంబసభ్యులకు కూడా గాయాలయ్యాయి. అయితే చిన్నారి రమ్యకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులుగా వెంటిలెటర్‌పై చికిత్స పొందిన చిన్నారి రమ్య చివరకు చనిపోయింది. చిన్నారి మృతి వార్త తెలియగానే కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

బ్రీత్ అనలైజర్ పరీక్షలు..
మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైన శ్రావిల్‌ అనే యువకుడిని ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును నడిపాడరన్న అనుమానాల నేపథ్యంలో శ్రావిల్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపారు. శ్రావిల్‌పై 304 A పార్ట్ 2 కింద కేసులు నమోదు చేశారు. పెద్ద సంఘటనలు జరిగినపుడు మాత్రమే హడావిడి చేసే పోలీసులు..ఆ తర్వాత వాటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇటీవల పంజాగుట్ట స్మశాన వాటిక దగ్గర జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పోలీసులు పగటి వేళల్లో డ్రంకన్ డ్రైవ్ చేపడితే చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.

06:36 - July 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకరీచ్‌లను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో సెక్రటేరియట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లకు సంబంధించి రెండు రోజుల్లో మ్యాపింగ్ చేయాలని కోరారు. ప్రాజెక్టులకు సమీపంలోని ఇసుక వనరులను గుర్తించాలని ఆదేశించారు హరీష్. సాగునీటి ప్రాజెక్టులు, ప్యాకేజీల వారీగా ఇసుక అవసరాలను హరీష్ రావు , కేటీఆర్ సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లా పెన్ గంగ నుంచి కరీంనగర్ జిల్లా గౌరవల్లి, గండిపల్లి వరకు, వరంగల్ జిల్లా దేవాదుల, నల్లగొండ జిల్లా ఎఎంఆర్పి, పెండ్లిపాకల, ఉదయసముద్రం, డిండి తదితర ప్రాజెక్టుల ఇసుక రీచ్ ల వివరాలపై ఆరా తీశారు మంత్రి హరీష్.

మొత్తం కోటి 72 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం..
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు, రెవిన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని మైనింగ్, ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని కోరారు. రీ ఇంజనీరింగ్ కింద చేపట్టిన ప్రాజెక్టులను ప్యాకేజీల వారీగా మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఇటు ఆన్ గోయింగ్ మొదలుకొని కొత్తగా రీ ఇంజనీరింగ్ లో చేపట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం తదితర ప్రాజెక్టులకు మొత్తం కోటి 72 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరమని నిర్ధారించారు. నీటి పారుదల మంత్రిహరీష్ రావును ఐటీ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. హరీష్ సమర్ధనాయకత్వంలో మైనింగ్ శాఖ ఆదాయం 45 శాతం పెరిగిందన్నారు.

అనంతగిరి ప్రాజెక్టులకు మిడ్ మానేరు నుంచి..
ఈ ఏడాది రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిడ్ మానేరులో ఈ ఏడాది 3 టీఎంసిల నీటిని నిల్వ చేయాలనుకుంటున్నందున వీలైనంత త్వరగా ఇందులోని ఇసుకను ప్రాజెక్టులకు తరలించాలని ఇద్దరు మంత్రులు ఆదేశించారు. కాళేశ్వరం ప్యాకేజీ 9 కోట్లు, రంగనాయకిసాగర్, అనంతగిరి ప్రాజెక్టులకు మిడ్ మానేరు నుంచి 7 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని నిర్ణయించారు. ఇసుకతరలింపులో అక్రమాలను నిరోధించాలని, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు.

ప్రాజెక్టుల భూ సేకరణ..
ప్రధానంగా ప్రాజెక్టుల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు కోరారు. భూసేకరణ సమస్యలను అధిగమించడానికి రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనితీరు సరిగ్గా లేని కిందిస్థాయి సిబ్బందిని, ఇంజనీర్లను మార్చి తమ 'టీమ్' లోకి ఎవరు కావాలో తీసుకోవచ్చని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లను మంత్రి హరీష్ రావు సూచించారు. ఇకపై ఏ విషయానికైనా చీఫ్ ఇంజనీర్లే జవాబుదారులని మంత్రి అన్నారు.

06:32 - July 10, 2016

హైదరాబాద్ : సరోజినీ దేవికంటి ఆస్పత్రి ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ రాష్ర్ట ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు వీణా-వాణిలకు ఆపరేషన్‌ చేసేందుకు ఆస్ర్టేలియా డాక్టర్లు ముందుకొచ్చారని, అవిభక్త కవలల ఆపరేషన్‌కు ఎంత ఖర్చైనా రాష్ర్ట ప్రభుత్వం భరిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇటు హైదరాబాద్‌లో విష జ్వరాలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కలరా కేసులు, విష జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిని మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని..జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రాథమిక నివేదిక..
సరోజినిదేవి కంటి ఆపరేషన్ల ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ చేయించుకున్న 13 మందిలో ఆరుగురికి మళ్లీ ఆపరేషన్ చేయించి.. తిరిగి ఇంటికి పంపించామని తెలిపారు. మిగతా వారి విషయంలో నిపుణులైన డాక్టర్లతో తగిన వైద్యం అందిస్తామని చెప్పారు.మరోవైపు సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. ఆస్పత్రిలో ఉన్న 16385, 16387 బ్యాచ్‌కు చెందిన ఆర్‌ఎల్ బాటిల్స్‌లో క్లెబ్తిల్లా, న్యూమోనియా బ్యాక్టీరియా ఉందని నివేదిక పేర్కొంది. బ్యాక్టీరియా వల్లే 13 మంది రోగులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని పేర్కొంది. ఆపరేషన్ థియేటర్, వైద్యుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేసింది. పూర్తి స్థాయి నివేదికను ఆదివారం ప్రభుత్వానికి కమిటీ ఇవ్వనుంది.

వీణా - వాణి ఆపరేషన్...
వీణా-వాణిలకు ఆపరేషన్‌ చేయించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఖర్చు ఎంతైనా భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి. ఆస్ట్రేలియాకి చెందిన వైద్యులు సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారని, వీణా-వాణిల మెడికల్ రిపోర్టులను వారికి పంపామని చెప్పారు. ఆస్ర్టేలియా వైద్యులు తుది నిర్ణయం తీసుకుని..రిపోర్టును ప్రభుత్వానికి ఇస్తే..ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీణా-వాణిలను నీలోఫర్‌ నుంచి స్టేట్ హోంకి తరలించే యోచనలో ఉన్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఇక అంతకుముందు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. అనంతగిరి, హిమాయత్‌సాగర్‌లో లక్ష ఆయుర్వేద మొక్కల నర్సరీలు ఏర్పాటు చేస్తామన్నారు.

06:28 - July 10, 2016

ఢిల్లీ : రెండ్రోజుల పాటు కృష్ణానదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ చేపట్టిన విచారణ మరోసారి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాల వివాదం నాలుగు రాష్ట్రాలకు సంబంధించినదేనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తమతమ వాదనలను వినిపించాయి. పునర్వ్వవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణల మధ్యే నీటి పంపకాలు ఎందుకు చేపట్టకూడదని ట్రైబ్యునల్ ప్రశ్నించిగా.. చట్టంలో ఆ విధంగా పొందుపరచలేదని సెక్షన్ 85ను ప్రస్తావిస్తూ ఏపీ, తెలంగాణలు వాదనలు వినిపించాయి. కృష్ణానదీ జలాల వివాదంపై తదుపరి విచారణ ఆగష్టు 16కి వాయిదా పడింది.

సుదీర్ఘ వాదనలు..
కృష్ణానదీ జలాల వివాదం కేసులో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తెలుగు రాష్ట్రాలు రెండో రోజు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. తెలంగాణ తరుపున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. వెయ్యి ఐదు టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలు పంచుకోవాలని మహారాష్ట్ర, కర్ణాటక వాదిస్తున్నాయని, వాస్తవంగా ఇప్పుడు ఆ స్థాయిలో జలాలు లేవన్నారు. దిగువ రాష్ట్రాలకు నీరు విడుదల చేయకుండా వాడుకునే హక్కు తమకే ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక వాదించడం సమంజసం కాదన్నారు. నదీ జలాల పంపకానికి సంబంధించి ఇది ఒక్కసారి ఉద్భవించే సమస్యకాదని, ఏటా నీటి విడుదల సమయంలో ఉత్పన్నమయ్యే వివాదమన్నారు. నీటి కేటాయింపుల విషయంలో పార్లమెంటుకు ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని, కేవలం సూచనలు మాత్రమే చేస్తుందని, నీటి కేటాయింపుల అధికారం ట్రైబ్యునల్ కే ఉందని తెలంగాణ వాదించింది. నీటి కేటాయింపులు, విడుదల, నిర్వహణ కోసం పాలనా పరమైన యంత్రాంగం ఉండాలన్న వైద్యనాథన్.. ఆ యంత్రాగానికి అత్యున్నత అధికారాలు కూడా ఉండాలని సూచించారు. పునర్వ్వవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84 ప్రకారం రాష్ట్రాల మధ్య నీటి పంపకాల్లో వివాదాలు ఏర్పడితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో కేంద్రాన్ని సంప్రదించాలని పొందుపరిచారని గుర్తు చేశారు. పునర్వ్వవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణల మధ్యే నీటి పంపకాలు ఎందుకు జరపకూడదని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్యే నీటి కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుల వారీగా నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరపాలని పునర్వ్వవస్థీకరణ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది.

తెలంగాణ వాదన...
మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నీటి అవసరాలు పెరిగాయని ట్రైబ్యునల్‌కు తెలంగాణ తెలిపింది. ఏపీ, తెలంగాణల మధ్యే జరపాలని సెక్షన్ 89లో ఎక్కడా పేర్కొనలేదని, చట్టం స్పూర్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వాదించింది. కృష్ణా నదీ ఒక తీరంవైపు తెలంగాణ, మరో తీరంవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తితే పరిష్కరించుకునే విధానాన్ని సెక్షన్ 84 సెక్షన్ 85లో పొందుపరిచారని ట్రైబ్యునల్ కు విన్నవించారు. కర్ణాటకలోని ఆల్ మట్టి ప్రాజెక్టు కేవలం ఆ రాష్ట్రం కోసమేకాదని, దిగువన ఉన్న ఏపీ, తెలంగాణ ప్రయోజనాల కోసం సైతం ఉద్దేశించినదని వివరించారు. అపాయింట్‌మెంట్ తేదీ కంటే ముందు ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపులే తుది నిర్ణయమని, మిగిలిన వాటిని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలని తెలంగాణ వాదనలు ముగించింది. రెండు రోజుల పాటు ట్రైబ్యునల్‌లో జరిపిన వాదనలో ఇప్పటి వరకు నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని,
వాస్తవ పరిస్థితులను ఆలోచింపజేసేలా ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు విద్యాసాగర్‌రావు.

ఏపీ వాదనలు..
అనంతరం వాదనలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది ఏకే గంగూలీ.. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఈ వివాదం రెండు రాష్ట్రాలకే పరిమితమవుతుందనడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్వవస్థీకరణ చట్టం చేసే సమయంలో నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్యే చెయ్యాలన్నది పార్లమెంటు ఉద్దేశం కాదని..ఒకవేళ అదే అయితే చట్టంలో స్పష్టంగా పొందుపరిచేవారని ఏపీ వాదించింది. ఇది కేవలం ఏపీ, తెలంగాణల మధ్య నీటి సర్దుబాటుగా చూడకూడదన్నారు. నీటి కేటాయింపుల సమస్య అయినందునే ట్రైబ్యునల్ పరిధిలోకి వచ్చిందని, గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ మొదట్నుంచి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలనడంలో ఆంతర్యమేంటని ట్రైబ్యునల్ ప్రశ్నించింది.

ఆగస్టు 16కి వాయిదా..
పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు విడిపోయినప్పుడు నీటి కేటాయింపులు, విడుదల, నిర్వహణ కోసం పాలనాపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని, విభజన చట్టంలో ఆ విధంగా పొందుపరచలేదని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ఇది భిన్నమైన కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. పునర్వ్వవస్థీకరణ చట్టం వల్లే బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కొనసాగుతుందని, అందువల్ల ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపి..ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఏడాది మొదట్నుంచే ప్రారంభించాలని ఏకే గంగూలీ వాదించారు. రెండు రాష్ట్రాల మధ్య క్రిష్ణా నీటి కేటాయింపులు జరపాలా లేక నాలుగు రాష్ట్రాల మధ్యా అనేది తేలకపోవడంతో తదుపరి విచారణ ఆగష్టు 16కు వాయిదా పడింది.

06:24 - July 10, 2016

నెల్లూరు : అతివేగం ప్రమాదకరమని తెలిసినా డ్రైవర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని ఇన్నోవా ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. చెన్నైకి చెందిన సతీష్ అనే వ్యక్తి కుటుంబం ఖమ్మం జిల్లాలో ఉన్న బంధువులను కలవడానికి వెళ్లారు. వీరంతా ఇన్నోవా (ఏపీ 28 సిడి 2326) వాహనంలో తిరుగు పయనమయ్యారు. కావలి (మం) సర్వాయపాలెం వద్ద ముందు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ను ఇన్నోవా డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. కానీ ముందే వెళుతున్న లారీని అతివేగంగా ఢీకొంది. దీనితో సతీష్ అక్కడికక్కడనే మృతి చెందాడు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నట్లు సమాచారం. వీరిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించగా మరో ముగ్గురు పురుషులకు తీవ్రగాయాలు కావడంతో నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇన్నోవా వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కరీంనగర్ లో మంత్రులు లక్ష్మారెడ్డి..ఈటెల పర్యటన..

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటెల రాజేందర్ లు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు.

బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 35లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పలు కార్లను పోలీసులు సీజ్ చేశారు.

నెల్లూరులో రోడ్డు ప్రమాదం..

నెల్లూరు : కావాలి (మం) సర్వాయపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవాను లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

 

Don't Miss