Activities calendar

11 July 2016

కాంగ్రెస్ సన్యాసం తీసుకునే పరిస్థితులు : జగదీష్ రెడ్డి

హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి పథకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు స్వచ్ఛందంగా సన్యాసం తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ప్రజలే సన్యాసం ఇచ్చి పంపుతారని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులకు వచ్చే అసెంబ్లీలో ప్రాతినిధ్యం చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చని జగదీష్‌రెడ్డి ఎద్దేవాచేశారు..

21:41 - July 11, 2016

హైదరాబాద్‌ : పాతబస్తీలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ బిలాల్‌ను చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిలాల్‌ ఎలక్రిక్టల్‌ ఏఈ వెంకటేశ్‌ను కొట్టి దుర్భాషలాడాడు. 332, 506, 504, 290 సెక్షన్ల కింద బిలాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అనంతరం బిలాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతనికి 25 వరకు రిమాండ్‌ విధించింది. పోలీసులు బిలాల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

21:38 - July 11, 2016

విశాఖ : టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. గడప గడపకు వైసీపీ కార్యక్రమం పెద్ద బోగస్‌ అంటూ జగదాంబ కూడలి దగ్గర తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు... టీడీపీ అక్రమాల పార్టీ అంటూ నినాదాలు చేశారు.. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ గొడవతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు.. 

బుల్ రన్...

ముంబై : అంతర్జాతీయంగా అందిన పాజిటివ్ సెంటిమెంట్‌తో... దలాల్ స్ట్రీట్లో బుల్ రంకేసింది. ఇన్వెసర్లు భారీగా కొనుగోళ్లకు దిగడంతో.. సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడి.. 11నెలల గరిష్ఠానికి చేరింది. ఈ సూచి ఇవాళ 27వేల 627 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టి 145 పాయింట్ల లాభంతో.. 8వేల 468 వద్ద క్లోజైంది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఇన్‌ ఫ్రా కౌంటర్లలో కొనుగోళ్లు పెరిగాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్ అత్యధికంగా 5 శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం కంటే పైగా లాభపడ్డాయి.

ఇండిక్యాష్ లో చోరీ...

నల్లగొండ: ఇండిక్యాష్ ఏటీఎం లో డబ్బులు పట్టడానికి వెళ్తున్న వాహనంపై ముగ్గురు దుండగులు దాడి చేసి రూ.32లక్షలు ఎత్తుకెళ్లారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. చోరీ ఘటనపై సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో..సిబ్బందే ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

బిలాల్ కు 25వరకూ రిమాండ్...

హైదరాబాద్ : బిలాల్ కు ఈ నెల 25వరకూ రిమాండ్ విధించారు. ఈ క్రమంలో బిలాల్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. పాతబస్తీలో ట్రాన్స్కఓ ఏఈ వెంకేటేశ్ పై ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బిలాల్ దాడి చేసిన విషయం తెలిసిందే. 

సీబీఐ కస్టడీకి ఐఏఎస్ అధికారి...

ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్‌తోపాటు మరో ఆరుగురిని ఢిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి పంపించింది. అవినీతి ఆరోపణల కేసులో కేంద్రపాలిత ప్రాంత క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్‌తోపాటు ఆరుగురు అధికారులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

రాజపక్స తనయుడు అరెస్ట్...

శ్రీలంక : మాజీ అధ్యక్షుడు మహింద్ర రాజపక్స కుమారుడు నమల్ రాజపక్స ను ఆ దేశ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. కొలంబోలో 650 మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఆర్థికలావాదేవీలకు సంబంధించి అవకతవలకు పాల్పడినట్టు నమల్ రాజపక్సపై ఆరోపణలు ఉన్నాయి. ఆరోపనల నేపథ్యంలో పోలీసులు నమల్ రాజపక్సను అరెస్ట్ చేశారు.

20:59 - July 11, 2016

హత్యలు చేయటానికి దర్శకుడు రాంగోల్ వర్మ సినిమాలు చూసే హత్యలు చేస్తున్నానన్న సైకో కిల్లర్.. యాదాద్రి నరసింహుని కాడ నకిలీ హిజ్రాలను చితకబాదిన ఒరిజినల్ హిజ్రాలు.. సప్పట్లు కొట్టిన చేతులతోనే మన్నెత్తిపోత్తున్న జనాలు... వరదొచ్చినట్టే వచ్చి కదంతొక్కిండు ..దరువేసిన ప్రధాని...వర్మను స్ఫూర్తిగా తీసుకుని మర్డర్స్ చేస్తున్న కిల్లర్ సైకో...కొండనాలుక్కి మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లుగా...బ్యూటీ పార్లర్లకెల్లి జుట్టు కోయించుకున్న అమ్మాయి ..ఊరులోకొచ్చి ఉరుకులు పరుగులు పెట్టిన జింకను చీల్చి చెండాడిన కుక్కలు...యాదాద్రి .రెండు మూతులున్న పాముపిల్ల..గిటువంటి మస్తు ముచ్చట్లు మన మల్లన్న మోసుకొచ్చిండు..మరి ఈ వీడియోని క్లిక్ చేసి మస్తు ఖుషీ అవుండ్రి...

20:42 - July 11, 2016

కేరళ : పుట్టింగల్‌ దేవి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 43 మంది నిందితులకు బెయిల్‌ లభించింది. 90 రోజుల గడువు పూర్తయ్యేలోగా నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయనందున కేరళ హైకోర్టు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. ఏప్రిల్‌లో పుట్టింగల్‌ దేవి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా గోదాంలో మంటలు చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 108 మంది మరణించగా, సుమారు 3 వందల మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆలయ నిర్వహణ కమిటీకి చెందిన సభ్యులు, బాణాసంచా కాంట్రాక్టర్లు తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

20:39 - July 11, 2016

గుజరాత్ : ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ ట్రస్ట్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌ కాపీని గుజరాత్‌ ప్రభుత్వానికి అందజేయాలని తీస్తాను కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. తీస్తాకు చెందిన రెండు ఖాతాలతో పాటు సిటిజన్‌ ఫర్ జస్టిస్ అండ్‌ పీస్‌ సంస్థకు చెందిన ఖాతాలను గుజరాత్‌ ప్రభుత్వం స్తంభింపజేసింది. 

20:33 - July 11, 2016

ఢిల్లీ : నిరసనకారులపై భద్రతాదళాలు అనుసరిస్తున్న క్రూర వైఖరిని సీపీఎం ఖండించింది. కశ్మీర్‌లో విధ్వంసకర పరిస్థితులు నెలకొనడంపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనకారుల పేరిట అమాయకుల మరణాలకు కారకులైనవారిని గుర్తించి శిక్షించాలని సిపిఎం తెలిపింది. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న గ్రూపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అమాయకులైన సామాన్యులను చంపుతున్నందుకే శ్రీనగర్‌లో అల్లర్లు పెరుగుతున్నాయని పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దాలని సూచించింది. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

20:27 - July 11, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో ఉగ్రవాదిని హతమార్చినందుకు కొన్ని అసాంఘిక శక్తులు హింసకు ప్రేరేపిస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చామని తెలిపారు. తెలుగు యాత్రికుల ఇబ్బందులపై జమ్మూకశ్మీర్‌ సీఎంతో మాట్లాడామని, వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాటు చేయాలని సూచించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. 

20:13 - July 11, 2016

హైదరాబాద్ : తాగుబోతుల వీరంగానికి బలైన రమ్య మృతికి నివాళిగా చిన్నారి బంధువులు, నగరవాసులు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.. హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్‌ దగ్గర కొవ్వొత్తులతో నిరసనకు దిగారు. నిందితునికి కఠిన శిక్ష విధించాలంటూ నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు.. పాప మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..

20:01 - July 11, 2016

కృష్ణా : మచిలీపట్నం పోర్టుకు లక్ష ఎకరాల భూసమీకరణపై ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం సిద్ధపడుతోంది. దీంతో పోర్టు నిర్వాసిత ప్రాంతాల్లో మళ్లీ అగ్గిరాజుకుంది. పచ్చని సాగు భూములపై సర్కార్‌ కన్నేయడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. భూ సమీకరణ బాధ్యతలను 'మడ'కు అప్పగిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బలవంతపు భూసేకరణ చేయొద్దంటూ వామపక్ష, ప్రజా సంఘాలు పోరుబాట పట్టాయి.

అట్టుడుకుతున్న మచిలీపట్నం పోర్టు...
ధర్నాలు.. రాస్తారోకోలు, నిరహార దీక్షలు.. పేరు ఏదైనా ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు ప్రాంతం అట్టుడుకుతోంది... రైతులు, కూలీలు, వృత్తిదారుల నుంచి నిరసనలు పెల్లుబికుతున్నాయి..

రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు...
ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌కు ఇంకా భూ దాహం తీరడం లేదు. రాజధాని నిర్మాణం పేరుతో దాదాపు 34 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్న సర్కార్‌ మరో భూసేకరణకు ఎత్తుగడ వేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో భూ సమీకరణకు సిద్ధమైంది. రాజధాని మొత్తం 53 వేల ఎకరాల పరిధిలో ఉంటే 'మడ' పరిధి మాత్రం 1.05 లక్షల ఎకరాల పరిధిలో ఉంది. ఈ మొత్తం పూలింగ్ పరిధిలోకి వస్తుంది. భూ సమీకరణ బాధ్యతను మడకు అప్పగించారు. మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సమీకరణ చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన, అలజడి మొదలైంది. కారిడార్లోకి వెళ్లే ప్రాంతాల్లో గ్రామాలను మినహాయిస్తామని, కేవలం పొలాలను మాత్రమే తీసుకుంటామని చెబుతున్నారు మంత్రులు. గ్రామాలు మినహా మడ పరిధి మొత్తం పూలింగ్ కిందకు వస్తుందని చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

కనుమరుగుకానున్న 29 గ్రామాలు...
లక్ష ఎకరాలు భూ సమీకరణకు దిగితే బందరు పురపాలక సంఘంతోపాటు 28 గ్రామాలు, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామం కలిసి మొత్తం 29 గ్రామాలు కనుమరుగవుతాయని అధికారులే చెబుతున్నారు. సుమారు 2.50 లక్షల మంది ప్రజలు ఈ గ్రామాల్లో జీవిస్తున్నారు. వరి, చేపలు, రొయ్యల సాగు మీదనే ఆధారపడి బతుకుతున్నారు. పెద్దగా చదువుకున్న వారు కాదు.. చాలా వరకు నిరక్షరాస్యులే... వారికి తెలిసింది వ్యవసాయమే... ఇది ఇప్పటి నుంచి కాదు.. దశాబ్దాలుగా .. తరతరాలుగా చేస్తున్నది కూడా ఇదే... దీన్నే నమ్ముకున్న వారు ఇక్కడే...ఆ నేలతల్లినే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. దశాబ్ధాలుగా అన్నం పెట్టిన భూమిని బలవంతంగా లాక్కునేందుకు చంద్రబాబు సర్కార్‌ బలప్రయోగానికి దిగుతోందని తెలిసి.. వీరంతా గుండెలు బాదుకుంటున్నారు. ఆవేదనతో అచేతనమవుతోన్న మడ పరిధిలోని రైతుల్లో చైతన్యాన్ని నింపేందుకు.. వారికి భరోసా కల్పించేందుకు వామపక్ష, ప్రజాసంఘాలు ప్రయత్నిస్తున్నాయి.

క్యాబినెట్ నిర్ణయంతో లక్షమంది ప్రజల్లో అలజడి ..
ఏళ్ల తరబడి సాగు చేస్తున్న పచ్చని పంట పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు తేగేసి చెబుతున్నారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న తాము భూములిచ్చి.. ఎక్కడకు పోవాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో పోర్టు కోసం భూములు తీసుకున్నప్పుడు.. ఆ గ్రామాల ప్రజలను ఆయా కంపెనీలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పోర్టు ప్రకటించినప్పట్నుంచి ఇక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. క్యాబినెట్ నిర్ణయంతో లక్షమంది ప్రజల్లో అలజడి రేగుతోంది. తాము నమ్ముకున్న భూమిని అమ్ముకుంటున్నారంటే ఆగ్రహం రాదా...? కాళ్ల కింది భూమి కదిలిపోతుందంటే భయం పుట్టదా..? ఆ ప్రాణభయమే ఇప్పుడు పోరాటానికి ఊపిరులూదుతోంది. రాష్ర్ట సర్కార్‌ నిర్ణయాన్ని వామపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. రైతుల నోట్లో మట్టికొట్టొద్దంటూ సీపీఎం పోరుబాట పట్టింది. అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ చేపట్టవద్దంటూ వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

భూ సమీకరణపై పునఃసమీక్షించుకోవాలన్న డిమాండ్‌...
పాలకుల భూదాహం బందరు వాసుల బతుకును చిధ్రం చేస్తోంది. ఆత్మగౌరవంతో బతికిన వారిని నిలువ నీడ లేకుండా చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా బతుకులు మారతాయనుకున్నవారి జీవితాల్లో చీకట్లు నింపబోతుంది... అభివృద్ధి ప్రజలకు సకల సదుపాయాలు అందించాలి... నిర్వాసితులు, నిస్సహాయల కళల్లో వెలుగులు నింపాలి... అంతేగానీ అభివృద్ధి ముసుగుతో స్వప్రయోజనాలు నెరవేర్చుకోకూడదు. సామాన్యుడి బతుకును బుగ్గి చేసే విధ్వంసానికి తెరతీయకూడదు... ఇప్పటికైనా పాలకులు మచిలీపట్నం పోర్టుకు లక్ష ఎకరాలను సమీకరించాలన్న ఆలోచనను పునఃసమీక్షించుకోవాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

19:48 - July 11, 2016

విజయనగరం : కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జీపు జాతా ప్రారంభమైంది.. ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు జెండాఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అణువిద్యుత్‌ ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జీపు జాతా చేపట్టామని తెలిపారు.. విద్యుత్‌ ప్లాంట్‌ వ్యతిరేక నిరసనల్లో భాగంగా ఈ నెల 17న విశాఖలో జాతీయ సెమినార్‌ ఏర్పాటుచేశామని ప్రకటించారు. 

19:41 - July 11, 2016

తూ.గోదావరి : రాజమండ్రిలో గోదావరి ఉప్పొంగుతోంది.. వర్షాలతో భారీగా వరదనీరు నదిలో చేరుతోంది.. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర నది నీటిమట్టం దాదాపు ఐదున్నర అడుగులకు చేరింది...... దీంతో 17 క్రస్ట్‌ గేట్లను ఎత్తివేసి 12లక్షల 92వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహాన్ని అధికారులు అంచనావేస్తున్నారు.గోదారమ్మ గలగలలతో చేలో వరి చీనాంబరాల చీర కట్టుకుని బంగారు పంటలతో హొయలుపోతుంది.. గోదారమ్మ పరవళ్లు చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...ఆనందపరవశులు కండి...

19:25 - July 11, 2016

మెదక్‌ : నిమ్జ్‌ భూనిర్వాసితులకు భూసేకరణ చట్టంప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం డిమాండ్ చేసింది. న్యాల్‌కల్‌ మండలం గాంగ్వార్‌ చౌరస్తాలో భూనిర్వాసితుల రిలేదీక్షకు ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని మద్దతు ప్రకటించారు. రైతుల నుంచి కేసీఆర్‌ ప్రభుత్వం అన్యాయంగా భూముల్ని లాగేసుకుంటోందని తమ్మినేని మండిపడ్డారు.. తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు 12రోజులుగా భూనిర్వాసితులు నిరసన కొనసాగిస్తున్నారు..

మరో పాదయాత్రకు సిద్ధమయిన సీపీఎం...
వైఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన గౌరవెల్లి రిజర్వాయర్ డిజైన్ ను కెసిఆర్ ప్రభుత్వం మార్చేయడంతో నిర్వాసితుల సమస్య మరోసారి ఎజెండా మీదకు వచ్చింది. 2007లో భూములు కోల్పోయినవారికే ఇంతవరకు సరైన పరిహారం అందకపోవడం, రైతులు కూలీలుగా మారడంతో కొత్తగా నిర్వాసితులయ్యేవారు మరింత ఆందోళన చెందుతున్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు రోజుల పాదయాత్రకు సిద్ధమయ్యారు. జులై 12, 13 తేదీలలో ఈ పాదయాత్ర వుంటుంది. 

19:16 - July 11, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో ఎంఐఎం నేతల ఆగడాలు ఎలా వుంటాయో సోమవారంనాడు మరోసారి నిరూపితమయ్యింది. మితిమీరిన అహంకారానికి..ఫ్యూడలిజానికి పరాకాష్టగా ఎంఐఎం నేత వ్యవహరించారు. విద్యుత్ శాఖ లో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ ఎలక్ట్రిషియన్ పై అందరిముందు చేయిచేసుకున్నారు. పాతబస్తీలో ఓ ఎంఐఎం నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ కార్పొరేటర్ బిలాల్ ను అరెస్ట్ చేశారు. బిలాల్ ఎలక్ట్రికల్ ఏఈ వెంకటేశ్ ను కొట్టి దుర్భాషలాడారు. బిలాలపై 332,506,504,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి. 

ఎంఐఎం నేత బిలాల్ అరెస్ట్ ...

హైదరాబాద్ : పాతబస్తీలో ఎంఐఎం నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ కార్పొరేటర్ బిలాల్ ను అరెస్ట్ చేశారు. బిలాల్ ఎలక్ట్రికల్ ఏఈ వెంకటేశ్ ను కొట్టి దుర్భాషలాడారు. బిలాలపై 332,506,504,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

18:59 - July 11, 2016

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నిన్నటి వరకు వేస్ట్ ఫెల్లో అంటూ పరస్పరం విమర్శించుకున్నవారు ఇప్పుడు బెస్ట్ ఫెలోస్‌ ఎలా అయ్యారో చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతినడానికి ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకున్న నేతలే కారణమన్నారు. సంస్కారంగా మాట్లాడడం ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు నేర్చుకోవాలని గుత్తా హితవు పలికారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లే తాను ఎంపీగా గెలిచానని ఆయన చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని.. ఎవరికెంత మెజార్టీ వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని గుత్తా అన్నారు. 

18:04 - July 11, 2016

హైదరాబాద్‌: రమ్య మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షివెల్ తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అత్యంత హృదయవిదారకమైన చిన్నారి రమ్య కేసును పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వాదప్రతివాదనలను విన్న న్యాయమూర్తి షివెల్‌ను రెండు రోజుల కస్టడీకి అనుమతినిచ్చారు. ఈ నెల 1వ తేదీన మద్యం సేవించిన బీటెక్‌ విద్యార్థులు అతివేగంగా కారు నడిపి ఘోర ప్రమాదానికి కారణమయ్యారు.ఈ ఘటనలో చిన్నారి రమ్య బాబాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాజేష్‌ అక్కడికక్కడే మరణించి విషయం తెలిసిందే. 

అమరావతి సచివాలయ పనుల్లో అపశృతి..

గుంటూరు : తాత్కాలిక సచివాలయం అమరావతిలో నిర్మాణ పనులల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు బ్లాక్ మొదటి అంతస్తు పిట్టగోడ కూలి ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 

17:44 - July 11, 2016

లాహిరి లాహిరి లాహిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడే.  తాజాగా ఆదిత్య ఓం నటించిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్' సినిమా రిలీజ్ అయ్యింది. అతి తక్కువ ప్రాంతాలలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ 'ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్'  అన్నట్లుగా  మంచి టాక్ వచ్చిన ఈ సినిమా  రిలీజ్ మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యింది. దీనకి కారణమేంటి?  గతంలో చిన్న సినిమాలు తీసి రిలీజ్ కోసం అష్టకష్టాలు పడి నష్టాలపాలయిన నిర్మాతలకు వచ్చిన సమస్యే ఈ సినిమాకూ వచ్చింది. దీనికి కారణం ఎవరు. సినీ ఇండ్రస్ట్రీలో వుండే ప్రముఖ నిర్మాతలే కారణమా? చిన్న సినిమాలకు తెలుగు సినీ పరిశ్రమలో  భవిష్యత్తు వుండదా? అనే ప్రశ్నలు ప్రతీ 'చిన్న ' నిర్మాతలకూ తరచూ తలెత్తుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఆదిత్య ఓం నటించిన   'ఫ్రెండ్ రిక్వెస్ట్' సినిమా కూడా వచ్చిందా? అందుకే ఈ హీరో మూడురోజుల పాటు నిరాహార దీక్ష చేశాడా? దీక్ష చేపట్టిన ఆదిత్య ఈరోజు విరమించారు. ఈ సందర్భంగా టెన్ టీవీ ఫ్రెండ్ రిక్వెస్ట్  టీమ్ తో ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నగర మేయర్..సినీ ప్రముఖులు కొంతమంది తమకు మద్దతు తెలిపారన్నారు. దీనికి సంబంధించి వున్న సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని కలిగించారన్నారు. దీనిపై సంబంధించి ఓ కమిటీని వేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇటువంటి సమస్య మరే సినిమా టీమ్ కూ రాకుండావుండాలంటే ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి..

17:16 - July 11, 2016

నెల్లూరు : చూసేందుకు అమాయకుడిగా ఉంటాడు..చేతిలో ఓ సంచి అందులో సుత్తి, శానం, కటింగ్ బ్లేడ్ తో కష్టజీవిని తలపిస్తుంటాడు...పల్లెటూరు నుంచి వచ్చి ఉపాధి కోసం ఆరాటపడుతున్న వ్యక్తిలా కనిపిస్తాడు...ఇదంతా అతని నరరూప రాక్షసతత్వానికి ఓ వైపు మాత్రమే....మరో వైపు ఆ వస్తువులనే ఆయుధాలుగా చేసుకోని ఆధార్ కార్డును పరిశీలించడానికి వచ్చానని చెప్పి హతమార్చి అందినకాడికి దోచుకెళ్లాడు...ఏంటీ...ఎక్కడా అని ఆలోచిస్తున్నారా అయితే మీరే చూడండీ...

అమాయకుడిలా కనిపిస్తూ అరాచకాలు చేస్తున్న కుక్కపల్లి వెంకటేశ్వర్లు..
ఇక్కడ మీరు చూస్తున్న వీడి పేరు కుక్కపల్లి వెంకటేశ్వర్లు...చూస్తే అమయాకుడిలా కనిపిస్తాడు...కానీ వీడు నరరూప రాక్షసుడు..నెల్లూరు జిల్లాలో వీడి అరాచకాలతో అటు ప్రజలకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

వరుస హత్యలకు చేస్తూ పోలీసులకు సవాల్..
నెల్లూరు జిల్లాలో సైకో కిల్లర్ కుక్కపల్లి వెంకటేశ్వర్లు వరుస హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాడు...పోలీసులకు సవాల్ విసిరాడు. మారుమూల పల్లె అయిన యర్రబట్లపల్లిలోని రైతు కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ఆర్ధిక ఇబ్బందులతో హంతకుడిగా మారాడు. ఇంటికి పెద్ద కొడుకుగా కుటుంబ భారాన్ని మోయాల్సిన ఇతను సీరియల్‌ మర్డర్స్ చేస్తూ చాకచక్యంగా తప్పించుకోసాగాడు..వ్యవసాయంలో కలిసి రాకపోవడానికి తోడు జూదం, బెట్టింగులతో అప్పుల పాలయ్యాడు. వాటి నుంచి గట్టెక్కెందుకు సులభంగా డబ్బులు సంపాదించుకునే మార్గం కోసం అన్వేషించాడు...ఓ సినిమాలో హంతకుల నేర చరిత్రను, నేరాల తీరును ఈ దుర్మార్గుడు ఆదర్శంగా తీసుకున్నాడు...డబ్బు, నగలు కోసం నేరుగా హత్యలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో గత మార్చి 4న కావలిలో ఓ ఇంటిలో మహిళలే లక్ష్యంగా దాడి చేసి ఒకరిని హతమార్చాడు.

మహిళలే లక్ష్యంగా దాడులు, హత్యలు...
మహిళలే  లక్ష్యంగా దోపిడీలు, హత్యలు చేసే సైకో కిల్లర్ వెంకటేశ్వర్లు సుత్తి, కత్తినే ఆయుధంగా ఉపయోగిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నాడు. కావలిలో హత్యానంతరం కొన్నాళ్ల పాటు మారుమూల పల్లె అయిన తన స్వగ్రామం యర్రబొట్ల పల్లెలో ఉన్న ఈ నరహంతకుడు ఆపై భార్య గర్బవతి కావడంతో మకాం కోవూరుకు మార్చాడు. అక్కడ న్యూడిల్ బండి నడుపతూ జీవనాన్ని సాగించడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో తన బిడ్డకు నామకమం చేయాలని పెద చెరుకూరులోని శివాలయ పూజారిని కలిశాడు. ఒంటరిగా ఉంటున్న వారిపై వీడి కన్ను పడింది..పూజారిని, అతని భార్యను హతమార్చాలని ప్లాన్ వేశాడు..వారితో నాలుగు రోజులు నమ్మకంగా మెలిగి..ఐదో రోజు పూజారి చంద్రమౌళిశ్వరరావును, అతని భార్య పుష్పవేణిని అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు...

తాజాగా నెల్లూరులో నాగేశ్వరరావు ఇంటిపై కన్ను...
తాజాగా నెల్లూరులో నాగేశ్వరరావు ఇంటిపై సైకో కిల్లర్ కన్నుపడింది...పక్కగా ప్లాన్‌ వేసి ఓ గంట రెక్కీ నిర్వహించాడు. ఇక ఎవరూ రారని నిర్థారించుకున్న తర్వాత సెట్‌ టాప్ బాక్స్ రిపేరు చేస్తానని ఇంట్లోకి ఎంటరయ్యాడు..అందుకు ఆధార్ కార్డు కావాలన్నాడు..దాంతో అనుమానం వచ్చిన ఇంటి యాజమాని నాగేశ్వరరావు భార్య ప్రభావతి కేబుల్ ఆపరేటర్ ఫోన్ చేసింది...దీంతో వెంటనే ఆమెపై సైకో కిల్లర్ వెంకటేశ్వర్లు దాడి చేసి హతమార్చాడు. అడ్డువచ్చిన ఆమె కూతురు మాధురి, కుమారుడు అనంత కృష్ణపై సుత్తితో దాడి చేశాడు..వారి వద్దనుంచి అందినకాడికి నగలు దొచుకున్నాడు. ఇక పరారయ్యేందుకు సిద్దమయ్యే లోపే ఇంటి యాజమాని నాగేశ్వరరావు రావడంతో అతడిపై కూడా దాడి చేశాడు...ఈ సమయంలో ఆయన కేకలు వేయడంతో ఇరుగు పోరగు వారు వచ్చి ఈ సైకో కిల్లర్ ను బంధించారు..ఆపై దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు...ఆరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. వారి విచారణలో ఆసక్తికరమై విషయాలు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ విశాల్ వివరించారు.

వరుస హత్యలతో పోలీసులకు చుక్కలు చూపించిన సైకో...
వరుస హత్యలతో ఇటు జిల్లాప్రజలు, అటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సైకో కిల్లర్ వెంకటేశ్వర్లు పోలీసులు ఆరెస్ట చేయడంతో నెల్లూరు జిల్లా వాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు...ఇలాంటి నరరూప రాక్షసులను కఠిన శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.    

చిన్నారి రమ్య మృతి కేసులో నిందితుడికి కస్టడీ..

హైదరాబాద్ : చిన్నారి రమ్య మృతి కేసులో ఇంజనీరింగ్ విద్యార్థి షివెల్ ను నాంపల్లి కోర్టు రెండురోజుల కస్టడీకి అప్పగించింది. 14న కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. 

17:01 - July 11, 2016

కరీంనగర్‌ : జిల్లా హుస్నాబాద్‌ తహశీల్దార్‌ కార్యాలయం నిరసనలతో హోరెత్తిపోయింది.. కార్యాలయ ముందు సీపీఐ ఆధ్వర్యంలో గౌరవెల్లి భూనిర్వాసితులు వంటావార్పు చేపట్టారు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

16:56 - July 11, 2016

వరంగల్ : కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. అక్కడికి చేరుకున్న పోలీసులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి...

మహిళపై దాడిచేసి దోపిడీ...

కృష్ణా : ముసునూరు మండలం రంగంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై దుండగులు దాడి చేశారు. సదరు మహిళ చెవిదుద్దులు, రూ.,10వేల నగదు ఎత్తుకెళ్లారు. మహిళ పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు. 

16:47 - July 11, 2016

చిత్తూరు : పరిశ్రమల పేరిట రైతుల వద్ద నుండి సేకరిస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఎం సమరశంఖం పూరించింది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, సొట్టంబేడు మండలాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. పలువురు రైతులతో మధు మాట్లాడారు. రైతులు భూములను నమ్ముకుని తరతరాల నుండి జీవిస్తున్నారనీ ఇప్పుడు ప్రభుత్వం వారి వద్ద నుండి బలవంతంగా లాక్కోవటానికి సర్వేలు చేస్తుందన్నారు. రైతులకు ఎటువంటి జీవనాధారం కల్పిస్తుందో సమాచారం అందించకుండా భూములు సేకరించటం సరికాదన్నారు. కాకులను కొట్టి గ్రద్దలకు వేసినట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన  పేర్కొన్నారు. ఎకరానికి రూ.10లక్షలు ఇచ్చి రైతులను మోసం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంపై రైతులను కలుపుకుని మంగళవారం మచిలీపట్నంలో అన్ని వర్గాలను కలుపుకుని ఉదయం 10గంటలకు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.  

అశోక్‌నగర్ లో చైన్‌స్నాచింగ్..

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్లు మళ్లీ తెగబడ్డారు. న్యూ అశోక్‌నగర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును అపహరించుకు పోయారు. స్థానికులు అప్రమత్తమయ్యే లోపు స్నాచర్లు పారిపోయారు. షాక్ నుండి తేరుకున్న సదరు మహిళ సమీపంలోని పీఎస్ లోఫిర్యాదు చేసింది. దీంతో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వరంగల్ కలెక్టరేట్ ఉద్రిక్తత...

వరంగల్ : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కనీసవేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. నల్లచీరలతో నిరసన ప్రదర్శించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. పోలీసులకు, అంగన్ వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. 

15:55 - July 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో అవినీతిపై ఉత్నతాధికారులు నజర్‌పెట్టారు. కార్పొరేషన్ అవినీతిపై దృష్టిపెట్టిన బల్దియా బాస్‌.. ఒక్కొక్క విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. వందలకోట్ల ఆదాయం వస్తున్న టౌన్‌ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రక్షాళనకు తెరతీశారు. దీన్లో భాగంగానే భారీగా బదిలీలు చేపట్టారు.

బల్దియాలో ప్రక్షాళనా పర్వం..
బల్దియాలో ప్రక్షాళన పర్వం మొదలైంది. అవినీతికి నిలయాలుగా మారాయన్న ఆరోపణలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ భారీగా బదిలీలకు తెరతీశారు.

ఒకేసారి 17మంది టౌన్‌ప్లానింగ్‌అధికారుల బదిలీ...
ఇప్పటికే హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌, ఇంజీనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్‌, యూసీడీ విభాగాల్లో అవినీతి నీడలపై ఫోకస్‌ పెట్టిన బల్దీయా బాస్‌... ఒక్కోవిభాగంలో భారీగా ప్రక్షాళన మొదలు పెట్టారు. తాజాగా టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో మార్పులపై దృష్టిపెట్టిన కమిషనర్‌ ... కరప్షన్‌కి పాల్పడుతున్న కిందిస్థాయి అధికారుల లిస్టును తయారు చేసి... ముందుగా 17 మంది అధికారులను బదిలీ శారు. వీరితోపాటు మరికొందరు అధికారుల పేర్లను కూడా లిస్టౌట్‌ చేశారట. తర్వాత ఎవరెవరిని పంపాలో పిన్‌పాయింట్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఏటా రూ. 650 నుంచి రూ. 700కోట్ల ఆదాయం...
నగరంలో చేపట్టే నిర్మాణాలను శాస్త్రీయ పద్ధతిలో ఉండేలా చూస్తూ... భవిషత్త్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ డిపార్ట్‌ మెంట్‌పై ఉంటుంది. సిటీలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా టౌన్‌ప్లానింగ్‌ అనుమతి తప్పనిసరి. అంతటి కీలక విభాగం కావడంవల్లనే గ్రేటర్‌కార్పొరేషన్‌కు ఏటా 650 నుంచి 700 కోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది.దీంతో అదేస్థాయిలో పెద్దమొత్తంలో అవినీతికూడా జరగుతున్నట్టు బల్దియా పెద్దలు గుర్తించారు.ఈనేపథ్యంలో అవినీతిఆరోపణలున్న అధికారులపై జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

 

15:51 - July 11, 2016

హైదరాబాద్ : సామాన్యుడిపై ధరలు దరువేస్తున్నాయి. కిరాణా షాపు కెళ్తే పర్సులు ఖాళీ అవుతున్నాయి. వంటింట్లోకి వెళ్తే ఏడుపొస్తోంది. ఎవరిని పలకరించినా ఇదే బాధ. ఇదే ఆవేదన. రోజురోజుకీ ఇలా ధరలు పెరుగుతుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? ఇదే ప్రశ్న. అందరిలోనూ ఇదే ఆగ్రహం.

గడిచిన రెండేళ్లలో పెరిగిన ధరలు ....
పంచదార 45..శనగపప్పు 88..పెసరపప్పు 100..కందిపప్పు 150..పల్లీలు 150..మినపప్పు 180..ఇలా ఏది కొనాలన్నా ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి, హ్యాండ్ బ్యాగ్ లో సరుకులు తెచ్చుకోవాల్సిన దారుణమైన రోజులొచ్చాయి.

వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామన్న మోదీ...
2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామంటూ అప్పట్లో నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ధరలు తగ్గలేదు. పై పైకి ఎగబాగుతున్నాయి .

2014 మే నెలలో కిలో పెసరపప్పు ధర 87..ఇప్పుడు వంద దాటింది..
2014 మే నెలలో కిలో పెసరపప్పు ధర 87 రూపాయలు వుండేది. అదిప్పుడు వంద రూపాయలు దాటింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాక ముందు 39 రూపాయలున్న శనగపప్పు ధర 88 రూపాయలైంది. మోడీ అధికారంలోకి రాకముందు 72 రూపాయలు పెడితే కిలో కందిపప్పు వచ్చేది. ఇప్పుడు 150 రూపాయలు పెట్టందే కందిపప్పు దొరకడం లేదు. రెండేళ్ల క్రితం నెలకు రెండు కిలోల కంది పప్పు వాడిన కుటుంబాలు ఇప్పుడు కేవలం ఒకే ఒక్క కిలోతో సరిపెట్టుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రతి రోజూ ముద్దపప్పు , నెయ్యి ఆరగించిన ఇళ్లలో ఇప్పుడు వారానికోసారి హాలిడే అకేషన్ గా మాత్రమే వాటిని తిన్నామనిపిస్తున్నారు.

చుక్కలు చూపిస్తున్న బ్రేక్ ఫాస్ట్...
రెండేళ్ల క్రితం కిలో మినపప్పు ధర కేవలం 72 రూపాయలు. ఇప్పుడు 180 దాటింది. రెండొందలు దాటినా ఆశ్చర్యపోవద్దన్నది మార్కెట్ టాక్. గతంలో వారంలో కనీసం ఒక్కరోజైనా ఇడ్లీలు, దోసెలు ఆరగించిన కుటుంబాలు ఇప్పుడు నెలకోసారి కూడా వాటి జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే మినపప్పుతో పాటు పల్లీల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఇడ్లీకైనా, దోసెలకైనా పక్కన పల్లీ చెట్నీ వుంటేనే టేస్ట్. కానీ, మార్కెట్లో పల్లీల ధర వెక్కిరిస్తోంది. ఈ రెండేళ్లలో 50 రూపాయలున్న పల్లీల ధర మూడు రెట్లు పెరిగి 150 రూపాయలైంది. అందుకే హోటల్స్ లో కూడా ఇడ్లీ, దోసె, పూరీ, చపాతీ అన్నింటి ధరలూ పెరిగాయి. ఇద్దరు స్నేహితులో, భార్యాభర్తలో హోటల్ కెళ్లి టిఫిన్ చేస్తే మినమిమ్ వంద రూపాయల కాగితం ఎగిరిపోతోంది.

కాకపుట్టిస్తున్న 'ఛాయ్'...
టిఫిన్ తినగానే వేడివేడిగా ఘుఘుమలాడే చాయ్ తాగాలనిపిస్తుంది. కానీ, హోటల్లో కప్పు కాఫీ తాగాలన్నా భయమేస్తోంది. రెండేళ్ల క్రితం నాలుగైదు రూపాయలున్న కప్పు టీ ధర ఇప్పుడు పది రూపాయలైంది. చాలాకాలం నిలకడగా వున్న పంచదార, టీ పొడి ధరలకు రెక్కలు రావడమే ఇందుకు కారణం. నిన్న మొన్నటి దాకా 33 రూపాయలున్న పంచదార ఇప్పుడు 42 దాటింది. కనీసం రెండొందలు పెట్టందే పావు కిలో టీ పొడి రావడం లేదు.

మూడు రెట్లు పెరిగిన ధరలు...
ఈ రెండేళ్లలో వంటింట్లో వాడే నిత్యావసరాల ఖర్చు రెండు మూడు రెట్లు పెరిగింది. దీంతో టీలు, టిఫెన్ లు, పప్పన్నాలు మానేస్తున్నాయి చాలా కుటుంబాలు. పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్ కి అలవాటు పడ్డవారు కూడా ఇప్పుడు వట్టి పచ్చడి మెతుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 280 రూపాయలున్న కిలో నెయ్యి ధర ఇప్పుడు 480 దాటింది.

అధిక ధరలతో పెరుగుతున్న రక్తహీనత...
పప్పు, కూర, పచ్చడి,నెయ్యి, చారు, పెరుగు, అప్పడం ఇలా షడ్రషోపేత వంటకాలతో కళకళలాడిన డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు చాలా ఇళ్లలో బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషీ రోజుకి సగటున కనీసం 80 గ్రాముల పప్పు దినుసులు తినాలి. కానీ, మన దేశంలో తలసరి అందుబాటు 40 నుంచి 45 గ్రాములు మాత్రమే. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు ఈ మాత్రం భాగ్యానికి కూడా దూరం చేస్తున్నాయి. ఆహారంలో పప్పు ధాన్యాలు తగ్గించుకోవడం వల్ల దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతోంది. గర్భీణీలు సరైన మోతాదులో మాంసక్రుత్తులు తీసుకోకపోతే, పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. పిల్లల బాడీ ఫంక్షన్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఆడ, మగ, పిల్లలు, యువకులు, వ్రుద్ధులు అనే తేడా లేకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. చిన్న పుండు పడినా అది మానడానికి చాలాకాలం పడుతుంది. జుత్తు రాలిపోయే అవకాశం వుంది. శరీరం నిస్సత్తువగా మారుతుంది. పప్పుధరల పెరుగుదల కుటుంబ బడ్జెట్ నే కాదు కుటుంబ ఆరోగ్యాన్నీ ఘోరంగా దెబ్బతీస్తుంది. 

అమర్ నాథ్ యాత్రలో తెలుగువారిపై 'బాబు'ఆరా...

విజయవాడ : అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారి గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆరాతీశారు. తెలుగువారిని సురక్షితంగా ఏపీ భవన్ కు తరలించాలని అధికారులు, మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు

15:20 - July 11, 2016

హైదరాబాద్ : చిన్నారి సానియాను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తీర్పు వచ్చేంతవరకూ సానియాను వెల్ఫేర్ కమిటీలోనే వుంచాలని కోర్డు ఆదేశించింది. సానియా డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించమనీ కూడా కోర్టు ఆదేశించింది. నిందితుడు రూపేష్ ను కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు కోరారు. దీనికి సంబంధించిన విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సింథియా హత్య కేసులో చిన్నారి సానియా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అమ్మ ఒడినుండి జారిన ఈ పసికూనకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనే విషయంపై న్యాయస్థానం కూడా పలు రకాలుగా యోచించింది. సానియాను తమకు అప్పగించాలంటే తమకు అని సింధియా, రూపేష్ బంధువులు పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి సానియా రక్షణను దృష్టిలో పెట్టిన న్యాయస్థానం చైల్డ్ వెల్ఫేరు కమిటీకి అప్పగించింది.  

చిన్నారి సానియా ఛైల్డ్ వెల్ఫేర్ కు అప్పగింత..

హైదరాబాద్ : చిన్నారి సానియాను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తీర్పు వచ్చేంతవరకూ సానియాను వెల్ఫేర్ కమిటీలోనే వుంచాలని కోర్డు ఆదేశించింది. సానియా డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించమనీ కూడా కోర్టు సూచించింది. నిందితుడు రూపేష్ ను కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు కోరారు. దీనికిక సంబంధించిన విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

14:57 - July 11, 2016

హైదరబాద్ : తెలంగాణ విత్తనానికి ప్రపంచ దేశాలు క్యూ కట్టనున్నాయి. ఇప్పటికే 22 దేశాల్లో ఎగుమతి అవుతున్న తెలంగాణ విత్తనం...మరో 59 దేశాలకు త్వరలో ఎగుమతి కానుంది...విత్తనాల ఎగుమతికి ఓఈసీడీ అనుమతి రావడంతో తెలంగాణ విత్తనానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగే అవకాశాలు పెరగనున్నాయి...

తెలంగాణ విత్తనానికి ప్రపంచ దేశాల క్యూ..
రోజు రోజుకు తెలంగాణ విత్తనానికి ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి.. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మారుస్తామని చెప్పిన మాటలు ఆచరణలో కూడా కనిపిస్తున్నాయి.. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా తీర్చిదిద్దాలనుకున్న రాష్ట్ర సర్కార్ కల సాకారం అవుతోంది...విత్తనాల ఎగుమతులకు ఆర్థిక సహకార అభివృద్థి సంస్థ...ఓఈసీడీ ధృవీకరణకు కేంద్రం అనుమతిచ్చింది...ఇప్పటి వరకు దేశంలో పది రాష్ట్రాలకు ఓఈసీడీ గుర్తింపునిచ్చింది కేంద్ర సర్కార్... కానీ నాణ్యమైన విత్తనాల ఎగుమతి, అంతర్జాతీయ మార్కెటింగ్ విషయంలో ఆయా రాష్ట్రాలు అంతగా చొరవ తీసుకోవడం లేదని కేంద్రం నిరాశ వ్యక్తం చేస్తోంది...

తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం...
దీంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తిలో దూసుకెళ్లే అవకాశం ఉందని కేంద్ర సర్కార్ భావించి ఓఈసీడీ గుర్తింపు ఇచ్చిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంది..ఇప్పుడు ఓఈసీడీ గుర్తింపు రావడంతో తెలంగాణ విత్తనానికి అంతర్జాతీయంగా వీపరీతమైన డిమాండ్ ఏర్పడనుంది..దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా సాగు విస్తీర్ణం పెంచే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ లో 400 సీడ్ కంపెనీలు...
ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విత్తన కంపెనీలు తెలంగాణలోనే ఉన్నాయి. హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకోని 400 సీడ్ కెంపెనీలు విత్తనాలను ఎగుమతి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 60 శాతం విత్తనాలను ఇక్కడి కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి.. అంతేకాదు 22 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి..ఇందులో ప్రధానంగా యూరప్, ఫిలిపైన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, బర్మా, పాకిస్దాన్ దేశాలున్నాయి..ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఓఈసీడీ గుర్తింపు ఉన్న విత్తనాలనే కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఓఈసీడీ లో ఉన్న 59 దేశాల్లో విత్తనాలను ఎగుమతి చేసుకునే అవకాశం మన రాష్ట్రానికి దక్కుతుంది.

ఇటీవల ఓఈసీడీ ధృవీకరణపై అంతర్జాతీయ వర్క్ షాపు..
రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఓఈసీడీ ధృవీకరణ రావడంతో తెలంగాణ ప్రభుత్వం కళ కూడా నిజం కాబోతుంది...ఇటీవల ఓఈసీడీ ధృవీకరణపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ వర్క్ షాపును నిర్వహించింది. రాష్ట్రానికి ఓఈసీడీ ర్తింపురావడంతో మరో మూడు రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలోనే విత్తన ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది...తెలంగాణతో పాటు ఏపీ, చత్తీస్ గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని విత్తనాలను మన రాష్ట్రమే ధృవీకరించాల్సి ఉంటుంది. సీడ్ ఉత్పత్తి చేసే రైతులు కానీ, విత్తన కంపెనీలు గానీ ముందుగు సమాచారం ఇవ్వాలి. సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ పర్యవేక్షణలోనే విత్తన పంటలు సాగుచేయాల్సి ఉంటుంది.. ఇలా సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సాగైన పంటలేక ఓఈసీడీ గుర్తింపు వస్తుంది...

తెలంగాణ విత్తనానికి విశ్వవ్యాప్తంగా డిమాండ్...
మొత్తానికి రాష్ట్రానికి ఓఈసీడీ గుర్తింపు రావడంతో తెలంగాణ విత్తనానికి విశ్వవ్యాప్తంగా డిమాండ్ పెరగనుంది....అంతేకాదు రాష్ట్రంలో విత్తనోత్పతి పెరగడంతో పాటు నాణ్యమైన విత్తనానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.   

14:49 - July 11, 2016

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్‌ సంగీత చటర్జీ బెయిల్‌ను కోల్‌కతా ఆలీపూర్‌ కోర్టు రద్దు చేసింది. కాసేపట్లో ఆమెను చిత్తూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. దీంతో కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కలకత్తాలోని అలీపూర్ కోర్డులో ఇప్పటికే సుమారు ఐదుసార్లు గడువు కోరింది. కానీ కలకత్తా కోర్డు ఆమె బెయిలును రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె ఈరోజు కోర్టు హాజరుకావాల్సి వుండగా ఆమె ఇంతవరకూ రాకపోవటం విశేషం. ఒకవేళ ఆమె వస్తే ఆమెను ఆరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఆమె కోర్టుకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయే అవకాశాలు వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమె కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని పేలీసులు పొర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె కోర్టుకు హారజయ్యే సూచనలైతే ఏమాత్రం కనిపించటంలేదు.

కలుషిత నీరు తాగి 30మంది విద్యార్థులు అస్వస్థత...

మహబూబ్ నగర్ : పెద్ద మండది కస్తూర్భా గాంధీ పాఠశాలలో కలుషిత నీరు తాగి 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృతి...

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి కాల్పులకు తెలగబడ్డారు. తుమ్‌నార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కేరళ అగ్నిప్రమాదం..అందరికీ బెయిల్..

కేరళ‌ : పుట్టింగ‌ల్ దేవి ఆల‌యంలో మూడు నెల‌ల క్రితం జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాదం ఘ‌ట‌న‌లో నిందితులుగా కేసును ఎదుర్కొంటున్న అంద‌రికీ ఆ రాష్ట్ర హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మొక్కలు నాటిన నటులు..

హైదరాబాద్ : నగరంలో హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన సంగతి తెలిసింఏద. ఈ క్రమంలో హరితహారం కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, కాంగ్రెస్ నేత, హీరో చిరంజీవి, నటుడు అల్లు అర్జున్ పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున మొక్కలు నాటగా, అమల కూకట్‌పల్లిలో మొక్కలు నాటారు. చిరంజీవి జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.

రసాయనాల నిల్వపై హైకోర్టు సీరియస్...

హైదరాబాద్ : శివారు ప్రాంతాల్లో రసాయనాలు నిల్వ చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అనుమతులు లేకుండా నిల్వ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లుండి లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తర తెలంగాణకు ఎరువుల ముప్పు...

వరంగల్ : ఉత్తర తెలంగాణ రైతులకు ఎరువుల కొరత ఏర్పడింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వరంగల్ రైల్వే షెడ్ లో ఎరువుల నిల్వలు పేరుకపోతున్నాయి. రైల్వే వ్యాగన్ల నుండి దిగుమతి కాని 11,604 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలు ఖాళీ చేయకపోవడంపై రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 4 లక్షల జరిమాన విధించినా అధికారులు స్పందించలేదు.

13:26 - July 11, 2016

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నిమ్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కదంబ, వేప మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతో పాటు పలువురు పాల్గొన్నారు. భాగ్యనగరంలో హరిత హారం కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌ గచ్చిబౌలి, బీహెచ్ ఎల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. బీహెచ్ఎల్ లో లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ నరసింహన్‌, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ పాల్గొన్నారు. నరసింహన్‌తో పాటు.. హరీష్‌రావు, కేటీఆర్‌ మొక్కలు నాటారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని హరీష్‌రావు, కేటీఆర్‌ అన్నారు. మొక్కలు నాటడం ప్రజలందరి బాధ్యత అని.. ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచాలని గవర్నర్‌ నరసింహన్‌ పిలుపునిచ్చారు. పది మొక్కలు నాటితేనే కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులిస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

విజయవంతం చేయాలన్న మంత్రులు..
కేసీఆర్‌ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్‌ అయితే.. దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు కేటీఆర్‌. తెలంగాణ వాళ్లు తలచుకుంటే ఏదైనా సాధిస్తారని మంత్రి హరీష్‌రావు అన్నారు. కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మొక్కలు నాటిన నటులు..
బంజారాహిల్స్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో సినీ హీరో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు మొక్కలు నాటుతున్నారు. సినీనటులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. సినీ హీరో రానా నానక్‌రామ్‌గూడలో మొక్క నాటారు. ఈ పొటోలను రానా ఫేస్‌బుక్‌లో పెట్టారు.
హైదరాబాద్ హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. గోషామహల్‌ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్‌రెడ్డి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

13:24 - July 11, 2016

మహారాష్ట్రలో : రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి సూరత్‌లో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోవడంతో సూరత్‌ నందుర్బార్‌ మెమో ట్రైన్‌ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. నందుర్బార్‌ జిల్లాలో ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. రంగంలోకి దిగిన అధికారులు ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

 

13:22 - July 11, 2016

హైదరాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లా వర్షాలతో అతలాకుతలమవుతోంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. సరిహద్దులోని పెన్‌గంగ, ప్రాణహిత నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. అనేక మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జన జీవనం స్తంభించింది. కొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి.. రహదారులు కొట్టుకుపోయాయి.. పలు మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెజ్జూరులో అత్యధికంగా 250.6 మిమీల వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో బెజ్జూరు, రెబ్బెన, దహేగావ్‌, కాగజ్‌ నగర్‌ తదితర మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు సరిహద్దులోని ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా మండలాల్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.

గోదావరి..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి పరివాహకంలో ఎగువన భారీ వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం దగ్గర కాటన్‌ బ్యారేజీకి వరద పెరిగింది. తెలంగాణలో కాళేశ్వరం దగ్గర గోదావరి పొంగిపొర్లుతోంది. భద్రాచలానికి వరద పోటెత్తి.. నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

13:13 - July 11, 2016

హైదరాబాద్ : మళ్లీ గణేష్ విగ్రహాల ఎత్తు వార్తల్లోకి ఎక్కింది. గత కొంతకాలంగా గణేష్ విగ్రహాల ఎత్తుపై సందిగ్ధత నెలకొంటున్న సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టులో గణేష్ ఎత్తు..హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం పెరుగుతుండడంపై కోర్టులో విచారణ జరిగింది. గణేష్ విగ్రహాల ఎత్తు తగ్గించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి హైకోర్టు సూచించింది. 15 అడుగులకు మించకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని, మహారాష్ట్రలోలాగా తాత్కాలిక డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టులు జోక్యం చేసుకోవద్దని, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఉత్సవ కమిటీ పేర్కొంది. గణేష్ విగ్రహాలు ఒకే ఎత్తులో ఉండాలని, కాలుష్యం వల్ల నగరం అభివృద్ధి కుంటుపడిపోతుందని కోర్టు వ్యాఖ్యానించింది. 13 చెరువుల్లో నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివిధ శాఖలు సంయమనంతో నిమజ్జన కార్యక్రమం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. వచ్చే వారంలోగా పూర్తి సమాచారం సమర్పిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. దీనితో కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.

13:10 - July 11, 2016

హైదరాబాద్ : నగరంలో చెరువులను పరిరక్షించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత కొంతకాలంగా నగరంలో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డా.కె.ఎల్.వ్యాస్ రాసిన లేఖపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని, కాలుష్యం పెరిగిపోతోందని..దీనిపై చర్యలు తీసుకొనే విధంగా రెవెన్యూ..కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టుకు 2008లో లేఖ రాశారు. దీనితో హైకోర్టు 2008 – 2014 వరకు దాఖలైన పిటిషన్ లన్నింటిపై విచారణ జరిపింది. చెరువుల కబ్జాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నగరంలో ఉన్న చెరువులను పరిరక్షించాలని, అన్ని చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని..చెరువు పరివాహక ప్రాంతాలు నిర్ధేశించాలని హెచ్ఎండీఏకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా కోర్టుకు వెళితే ల్యాండ్ క్లియర్ టైటిల్ ఉంటే నష్టపరిహారం తీసుకుని అక్కడి నుండి అతను ఖాళీ చేసే విధంగా చూడాలని హైకోర్టు సూచనలు జారీ చేసింది. మరి హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

గణేష్ విగ్రహాల ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల ఎత్తు తగ్గించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి హైకోర్టు సూచించింది. 15 అడుగులకు మించకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని, మహారాష్ట్రలోలాగా తాత్కాలిక డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

కర్నాటక అసెంబ్లీలో గందరగోళం..

కర్నాటక : ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. కర్నాటక డిప్యూటి ఎస్పీ ఘటనపై సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల కిందట డిప్యూటి ఎస్పీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

'డిప్యూటి ఎస్పీ ఆత్మహత్యను సీబీఐ ఎంక్వయిరీ చేయించాలి'...

ఢిల్లీ : కర్నాటక డిప్యూటీ ఎస్పీ ఆత్మహత్య ఘటనపై సీబీఐ చేత ఎంక్వయిరీ జరిపించాలని జగదీష్ షెట్లర్ డిమాండ్ చేశారు. మృతి చెందిన అధికారి సతీమణి, కొడుకు స్టేట్ మెంట్ ను కూడా పోలీసులు తీసుకోవడం లేదని, ఫిర్యాదును కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు.

ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాలి - సోనియా..

కాశ్మీర్ : ఉగ్రవాదంపై ఉక్కు మోపాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. కాశ్రీమ్ రాష్ట్రంలో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశభద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రక్రియతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

 

12:24 - July 11, 2016

విజయవాడ : దుర్గామల్లేశ్వర దేవస్థానం రూపురేఖలు మారనున్నాయా... ఆలయంలో అక్రమాలకు చెక్‌ పడనుందా... అమ్మవారికి వస్తున్న ఆదాయం పక్కదారి పట్టకుండా ఈవోగా వచ్చిన మహిళా ఐఏఎస్‌ చర్యలు తీసుకుంటారా... తొలిసారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ ఈవోగా రావడంతో పరిస్థితో మార్పు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. రాష్ట్రంలో తిరుపతి, శ్రీశైలం తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయం విజయవాడ దుర్గామల్లేశ్వర టెంపుల్‌. లక్షలాది మంది భక్తుల సందర్శనతో ఆధ్యాత్మిక శోభవెల్లివిరుస్తుంది. వేలాది మంది కిటకిటలాడే దుర్గ గుడి దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. సిబ్బంది అక్రమాలను అడ్డుకోడానికి గతంలో ఈవోలుగా వచ్చినవారు ప్రయత్నించకపోవడంతో.. దుర్గమ్మ సన్నిధిలో సిబ్బంది ఆడిందే ఆట, పాడిండేగా మారింది. గ్రూపులుగా విడిపోయిన సిబ్బంది నీకెంత.. నాకెంత అని వాటాలు తెగక తగవులాడుకునే పరిస్థితి వచ్చింది. దీంతో అమ్మవారి ఆదాయం చాలా వరకు పక్కదారి పట్టింది. తాజాగా ఈవోగా వచ్చిన ఐఏఎస్ అధికారి సూర్యకుమారి మాత్రం పరిస్థితిని అదుపులో పెడతానంటున్నారు.

స్వయం ప్రతిపత్తి..
మరోవైపు తిరుపతి మాదిరిగా దుర్గగుడికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించడం ద్వారా మరికొన్ని కీలక ఆలయాలను కూడా అమ్మవారి టెంపుల్‌ పరిధిలోనికి తీసుకురావాలని సర్కార్ యోచిస్తోంది. మంగళగిరి లక్ష్మీనరసింహాస్వామి, అమరావతిలోని అమరా రామలిగేశ్వరస్వామి, పెదకాకాని భ్రమరాంబ ఆలయాలను ఇంద్రకీలాద్రి పరిధిలోనికి తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు టీడీపీ నేతలు. సిబ్బంది ఆగడాలతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వస్తున్న ఆదాయంలో భారీగా గండిపడుతోంది. ఇపుడు ఐఏఎస్‌ అధికారి ఈవోగారావడంతో పరిస్థితి బాగుపడుతుందని భక్తులు నమ్ముతున్నారు.

నగరంలో చెరువుల కబ్జాపై హైకోర్టు సీరియస్..

హైదరాబాద్ : నగరంలో చెరువులను పరిరక్షించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చెరువుల కబ్జాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నగరంలో ఉన్న చెరువులను పరిరక్షించాలని, అన్ని చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని..చెరువు పరివాహక ప్రాంతాలు నిర్ధేశించాలని హెచ్ఎండీఏకు ఆదేశాలు జారీ చేసింది.

బాపట్ల వికలాంగుల కాలనీలో ఫైర్ ఆక్సిడెంట్..

గుంటూరు : బాపట్ల వికలాంగుల కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 50 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

 

నిమ్స్ లో మొక్క నాటిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆసుపత్రి ఆవరణలో కదంబ, వేప మొక్కలను కేసీఆర్ నాటారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు.

 

మొక్కలను నాటిన అల్లు అర్జున్...

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో జరిగిన హరిత హారం కార్యక్రమంలో సినీ నటుడు అల్లు అర్జున్ పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి మొక్కలను నాటారు.

బీహెచ్ఎల్ లో హరితహారం..

హైదరాబాద్ : బీహెచ్ఈఎల్ లో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు పాల్గొని మొక్కలు నాటారు.

అమర్ నాథ్ యాత్రలో వరంగల్ వాసి అదృశ్యం..

వరంగల్ : అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన మహబూబాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ సతీమణి అరుణ ఆచూకి తెలియడం లేదు. దీనితో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. బంధువులతో కలిసి అమర్ నాథ్ యాత్రకు అరుణ వెళ్లింది.

 

తాత్కాలిక సచివాలయం ప్రారంభం వాయిదా..

విజయవాడ : తాత్కాలిక సచివాలయంలోని ఐదో బ్లాక్ మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. పనులు పూర్తికాకపోవడంతో 13కి వాయిదా వేసింది.

11:35 - July 11, 2016

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. 19న ఢిల్లీలో చేపట్టబోయే ఉద్యమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు జరిగాయని తమ్మినేని గుర్తు చేశారు. ఉద్యమాలకు సీపీఎం మద్దతినిస్తోందని, జనాభా ప్రాతిపదికన కల్పించడం తప్పులేదన్నారు. వాగ్ధానాలు ఇస్తూ మోసాలు చేస్తోందని, వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో చట్టం తేవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. అంతకుముందు మందకృష్ణ మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఆనాడు బీజేపీ పెద్దలు చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు. వర్షాకాలం పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 19వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు ఢిల్లీలో ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనుబంధ సంఘాలు, మద్దనిచ్చే సంఘాలతో దీర్ఘకాలిక పోరాటం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వర్గీకరణ సీపీఎం సమర్థిస్తోందని, భవిష్యత్ లో ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాలని తమ్మినేనిని కోరినట్లు తెలిపారు.

11:18 - July 11, 2016

హైదరాబాద్ : భాగ్యనగరంలో హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. 25 లక్షల మొక్కలు నాటేందుకు బల్దియా సమాయత్తమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖులు మొక్కలు నాటారు. ఈ హరితహారం కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు సినీ నటులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. హరితహారం అనేది మానవసహజమైనదని, మానవుడు తప్పనిసరిగా మొక్కలను నాటాలని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, కళాకారులుగా బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. మంచి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు హరితహారం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని హీరో శ్రీకాంత్ పిలుపునిచ్చారు. 150 స్టాళ్ల ద్వారా మొక్కల పంపిణీ జరుగుతోందని, మొక్కలు కావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. 25 లక్షల మొక్కలు నాటుతామనే ధీమా వ్యక్తం చేశారు.

బీహెచ్ఎల్ లో ..
బీహెచ్ఎల్ లో జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో జరిగే హరితహారం కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొననున్నారు. అంతకుముందే మంత్రి హరీష్ రావు ఇక్కడకు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించారు. మొత్తంగా 2100 మొక్కలు నాటేందుకు అధికారులు చ్యులు తీసుకున్నారు. 5100 మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొక్కలు నాటేందుకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు.

హైకోర్టులో..
హైకోర్టులో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ జస్టిస్ బోసలే, న్యాయమూర్తులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లు మొక్కలు నాటారు. 250 చెట్లను నాటడం జరిగిందని, 60 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

రష్యా వాణిజ్య మంత్రితో బాబు సమావేశం..

మాస్కో: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా వాణిజ్యమంత్రి డెనిస్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల అంశాల గురించి డెనిస్‌కు చంద్రబాబు వివరించారు.

బలవంతపు భూ సేకరణపై ఏపీ సీపీఎం సమరభేరి..

చిత్తూరు : బలవంతపు భూ సేకరణపై సీపీఎం సమరభేరి మోగించింది. శ్రీకాళహస్తి, పాత్తంబేడు మండలాల్లోని పలు గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. రైతులను బెదిరించి భూములు లాక్కోవాలని చూస్తున్నారని, బలవంతపు భూ సేకరణ జరిపితే ఊరుకోమని మధు హెచ్చరించారు. బాధిత నిర్వాసితులకు సీపీఎం అండగా ఉంటుందని తెలిపారు.

తవ డ్యామ్ గేట్ల ఎత్తివేత..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తవ డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. దీనితో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ ఈ సెన్సెక్స్ 400 పాయింట్లలో ట్రేడింగ్ ప్రారంభమవగా 27,590.99 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 8,400 పాయింట్ల మార్క్ దాటింది.

సూర్యాపేటలో విద్యాసంస్థల బంద్..

నల్గొండ : జిల్లా సూర్యాపేట పట్టణంలో విద్యార్థులు సోమవారం విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఎం కాన్వయ్ ను అడ్డుకున్న కేసులో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు బంద్ చేపడుతున్నారు.

అన్ని మున్సిపాల్టీలో హరితహారం - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో హరితహారం నిర్వహస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఉత్సాహంగా ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ టీసీఎస్‌లో మొక్కలు నాటి ఈ కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఒకేరోజు 25లక్షల మొక్కలు నాటుతున్నామని అన్నారు.

మొక్క నాటిన జీహెచ్ఎంసీ డిప్యూటి మేయర్..

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ లో జీహెచ్ఎంసీ డిప్యూటి మేయర్ ఫసియొద్దిన్ మొక్కలు నాటారు. క్రెడాయి ఆధ్వర్యంలో లక్ష మొక్కలను వాలంటీర్లు నాటారు.

కరీంనగర్ లో వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రామగుండం రీజియన్ సింగరేణి నాలుగు ఓసీలో బొగ్తు ఉత్పత్తి నిలిచిపోయింది.

 

10:38 - July 11, 2016

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో అమర్ నాథ్ యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా చిక్కుకపోయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కొంతమందిని జమ్మూకు తరలించేదుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 500 మంది యాత్రికులను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా శ్రీనగర్ లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. వేర్పాటు వాదులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 25మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనితో ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లి తిరుగుపయనమయ్యారు. కానీ వీరు కర్ఫ్యూ ఉండడంతో జమ్మూ టూరిజం సెంటర్ లో ఆశ్రయం పొందుతున్నారు. వీరిని జమ్మూకు తరలించాల్సి ఉంది. కానీ టూరిజం సెంటర్ ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించడంతో వీరిని తరలించడం కష్టసాధ్యంగా మారింది. తమను స్వగ్రామాలకు చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు చిక్కుకుని ఉండవచ్చునని తెలుస్తోంది.
ఇప్పటి వరకు లక్షన్నర మంది అమర్ నాథ్ యాత్ర చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లర్లు మొదలైన తరువాత పది వేల మంది యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. మరి ప్రభుత్వం స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

శ్రీనగర్ లో చిక్కుకున్న నిజామాబాద్ వాసులు..

ఢిల్లీ : అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 15 మంది శ్రీనగర్ లో చిక్కుకున్నారు. తమరిని స్వగ్రామాలకు చేర్చే విధంగా సహాయపడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరు కోరుతున్నారు.

రాజేంద్రనగర్ కోర్టుకు రానున్న చిన్నారి సానియా..

హైదరాబాద్ : సింథియా కూతురు సానియాను కాసేపట్లో రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. సానియాను ఎవరి దగ్గర ఉంచాలన్న దానిపై కోర్టు తేల్చనుంది.

10:25 - July 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షం కుండపోతగా కురుస్తోంది. దీనితో పలు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకపోయాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. దీనితో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉధృతం అంతకంతకు పెరుగుతుండడంతో కొద్దిసేపటి క్రితం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోకి వీరిని తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాజేడు మండలంలో 17 గ్రామాలు, చర్లలోని 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 120 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. రామాలయ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

ఉధృతంగా కడెం ప్రాజెక్టు...
ఆదిలాబాద్ : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కడెం ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు నీటిమట్టం 700 సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 688 సామర్థ్యానికి చేరుకుంది. కొమరం భీం, స్వర్ణప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. 30 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నా అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది.

కరీంనగర్ లో బొగ్గు ఉత్పత్తికి నష్టం..
కరీంనగర్ :
జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక ప్రధానంగా ఉన్న సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టులన్నీ జలమయ్యాయి. రామగుండం రీజియన్ నాలుగు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు రెండు కోట్ల రూపాయల నష్టం కలిగినట్లు తెలుస్తోంది.

వరంగల్ లో..
వరంగల్ : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పలు జలశాయల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. దేవాదుల నీటి పంపులు కూడా నీట మునిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మొరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మూడుడగులు ఎత్తులో వరద నీరు పారుతోంది. దీనితో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తమ్మినేనితో మందకృష్ణ భేటీ..

హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు చట్ట భధ్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 19 నుండి ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు మద్దతివ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.

కాశ్మీర్ ఘర్షణల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య..

జమ్మూ కాశ్మీర్ : హస్బుల్ ముజాహిద్దిన్ ఎన్‌కౌంటర్‌తో కాశ్మీర్‌లో చెలరేగిన హింసాకాండ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పుల్వామా, అనంత్‌నాగ్‌ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పోలీసులు, నిరసన కారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకూ 24 మంది చనిపోయారు.

వరంగల్ గోదావరి ఉధృతి..రెండో ప్రమాద హెచ్చరిక..

వరంగల్ : మూడు రోజులుగా ఎడతెరపిలేకుడా పడుతున్న వర్షాలకు వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. ఏటూరునాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహస్తోంది. రామన్నగూడెం దగ్గర గోదావరి నీటిమట్టం 9.8మీటర్లకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు.

09:28 - July 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. సోమవారం ఉదయం పలువురు మొక్కలు నాటుతున్నారు. కేబీఆర్ పార్కులో మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ నాటారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఏ మొక్కను నాటితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పేర్కొంటూ ఒక కరపత్రాన్ని కూడా ముద్రించడం జరిగిందన్నారు. నాటిన మొక్కను కాపాడే విధంగా ప్రయత్నించాలని సూచించారు. బయటి ప్రాంతాల్లో ఉండే మొక్కలు నాటే బాధ్యత పలువురు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ మొక్కను నాటుతారని, మంత్రులు ఆయా ప్రాంతాల్లో మొక్కలు పెడుతారని తెలిపారు. 4173 ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 28 లక్షల గుంతలు తవ్వడం జరిగిందని, అనుకున్నదానికంటే ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉందన్నారు.

 

మొక్కలు నాటిన మంత్రులు కేటీఆర్..మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : గచ్చిబౌలి టీసీఎస్ క్యాంపస్ లో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డిలు మొక్కలను నాటారు. మానవచరిత్రలో ఇది మూడో అతిపెద్ద కార్యక్రమమని, చెట్లు లేకపోవడం వల్ల సకాలంలో వర్షాలు కురవడం లేదన్నారు. ప్రతొక్కరూ మొక్కలను నాటాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

09:19 - July 11, 2016

ఖమ్మం : ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఖమ్మంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. పలు జిల్లాలోని వాగులు..వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీనితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద వరద ఉధృతం పెరుగుతోంది. ప్రస్తుతం 43 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరికి వరదపోటు పెరుగుతుండడంతో వాజేడు - గుమ్మడిదొడ్డి రహదారిపై వరద నీరు చేరింది. కొంగాలవాగు వంతెనపై చేరిన వరదనీటితో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదపోటుతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి.

ఆదిలాబాద్ లో...
వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. బెజ్జూరు మండలంలో కుకుడ, కుశ్నేపల్లి, తలాయి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తలాయి, భీమారం, తిక్కపల్లి, సోమిని గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. దహేగావ్ (మం) గిరివల్లి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 11,433 క్కూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుగా ఉంటే ప్రస్తుత నీటి మట్టం 685 అడుగులుగా ఉంది.

09:10 - July 11, 2016

ఢిల్లీ : శ్రీనగర్ లో తెలుగు యాత్రికులు అందరూ క్షేమంగా ఉన్నారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వారంతా శ్రీనగర్ లో చిక్కుకపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీనగర్ లో ఘర్షణ మూలంగా కర్ఫ్యూ విధించారు. దీనితో అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. శ్రీనగర్ బేస్ క్యాంపు వద్దనున్న బల్తాన్ ప్రాంతంలో వీరంతా చిక్కుకపోయారు. సమాచారం అందుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారులతో మాట్లాడారు. యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని కోరారు. సీఆర్పీఎఫ్ కమాండర్ తో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. దీనితో సోమవారం ఉదయం బల్తాన్ ప్రాంతం నుండి 79 బస్సుల్లో పూర్తిస్తాయి భద్రత మధ్య 500 మంది యాత్రీకులను తరలించారు. మధ్యాహ్ననికి వీరంతా జమ్మూకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. సొరంగమార్గం దగ్గర భారీ బందోబస్తు మధ్య వీరిని తరలిస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కడ చిక్కుకపోయిన యాత్రికుడు రాము టెన్ టివితో మాట్లాడారు. 8,9,10 మూడు రోజుల పాటు చిక్కుకపోవడం జరిగిందని, అక్కడి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ వాటర్ సప్లై తక్కువగా ఉందని, కొంతమందికి ఆహారం అందడం లేదన్నారు. ప్రస్తుతం తామంతా బయలుదేరామని, అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.

వరంగల్ లో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షం..

వరంగల్ : మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రామప్ప, పాకాల, లక్నవరం, గణపురం జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏటూరు నాగారం (మం) రామన్నగూడెం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. 8.50 మీటర్లు నీటిమట్టం దాటింది. వరద ఉధృతి కారణంగా గోదావరి నది ఒడ్డు కోతకు గురవుతోంది. సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దేవాదుల పంప్ హౌస్ వద్ద 84.10 మీటర్లకు నీటిమట్టం చేరింది. గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది.

కడెం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

ఆదిలాబాద్ : కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 11,433 క్కూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 685 అడుగులుగా ఉంది.

ఆదిలాబాద్ లో పొంగుతున్న వాగులు..

ఆదిలాబాద్ : బెజ్జూరు మండలంలో కుకుడ, కుశ్నేపల్లి, తలాయి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తలాయి, భీమారం, తిక్కపల్లి, సోమిని గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. దహేగావ్ (మం) గిరివల్లి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 

కర్నూలు ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన మంత్రి కామినేని..

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిలో వార్డులను మంత్రి కామినేని శ్రీనివాస్ తనిఖీలు చేశారు. సౌకర్యాలు, వైద్యంపై రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత సరిగ్గా లేదని మంత్రి కామినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రూ. 40 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కామినేని శంకుస్థాపన చేయనున్నారు.

08:45 - July 11, 2016

ఎన్నో విలక్షమైన పాత్రలతో మెప్పించి ఉత్తమ నటుడిగా మోహన్ లాల్ జాతీయస్థాయిలో అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో పోషిస్తున్న 'మనమంతా' చిత్రంలో 'గౌతమి' కూడా నటించనుంది. మధ్యతరగతి గృహణి పాత్రలో నటిస్తోంది. ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని, బాగా చదువుకున్నా తెలివైన వ్యక్తి అయినా పెళ్లయ్యాక కుటుంబమే లోకంగా బతికేస్తుంది. ఆమె కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అవుతుందని, మరో విలక్షణ నటి ఊర్వశి తో కలిసి ఆమె పండించిన వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి 'మనమంతా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

08:43 - July 11, 2016

'బాహుబలి' సినిమాలో భల్లాలదేవుడిగా నటించిన 'రానా' బాహుబలి పార్ట్ 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం రానా వైవిధ్యమైన సినిమానులను ఎంచుకుంటున్నారు. తాజాగా 'తేజ' చిత్రంలో నటించేందుకు రానా అంగీకరించారు. విభన్న ప్రేమ కథలు తీసే దర్శకుడిగా తేజకు పేరుంది. ఆయన రూపొందించే చిత్రంలో రానాతో పాటు కాజల్, కేథరిన్ త్రెస్సా నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ సబ్జెక్జ్ తో చిత్రాన్ని తెరకెక్కించడానికి తేజ ప్లాన్ చేయడం జరుగుతోందని, నాయకానాయికల పాత్రలు వేటికవే డిఫరెంటింగ్ ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుందని, అనూప్ రెబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

జమ్మూలో కొనసాగుతున్న కర్ఫ్యూ..

జమ్మూ కాశ్మీర్ : పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 24కి చేరింది. అల్లర్ల కారణంగా అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. జమ్మూ, శ్రీనగర్ లో 6వేల మంది చిక్కుకకపోయారు.

25 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు - మేయర్..

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో 4173 ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 28 లక్షల గుంతలు తవ్వడం జరిగిందని, అనుకున్నదానికంటే ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉందన్నారు.

08:24 - July 11, 2016

ఖమ్మం : గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఆదివారం నీటి మట్టం 13.55 మీటర్లకు చేరుకుంది. పేరూరు లో 5 సెం.మీ., వాజేడు లో 2.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాచలం వద్ద వరద ఉధృతం పెరుగుతోంది. ప్రస్తుతం 43 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరికి వరదపోటు పెరుగుతుండడంతో వాజేడు - గుమ్మడిదొడ్డి రహదారిపై వరద నీరు చేరింది. కొంగాలవాగు వంతెనపై చేరిన వరదనీటితో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదపోటుతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి.

07:58 - July 11, 2016

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి 1.05 లక్షల ఎకరాలను సమీకరించాలని మంత్రివర్గం చేసిన నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోర్టుకు రెండు వేల ఎకరాలే చాలన్న టిడిపి, 1.05 లక్షల ఎకరాల సమీకరణ ఎవరి కోసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకంకాదు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను సమీకరించిన ప్రభుత్వం, రైతుల వాటా భూముల్లో నేటికీ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నేడు హరితహారం కార్యక్రమం జరగనుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తాడూరి శ్రీనివాసరావు (టీఆర్ఎస్), వేణుగోపాల్ (వైసీపీ), చందు సాంబశివరావు (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు) అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

07:47 - July 11, 2016

పెరుగు..ఆహారంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగును వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. మరి పెరుగును వంటకాల్లో విరివిగా వాడుకోవచ్చు.
పెరుగు డైజిస్టివ్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీలైనంత ఎక్కువగా పెరుగును వివిధ రూపాల్లో మన ఆహారంలో చేర్చుకోవాలి.
పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలు కలపాలి. ఈ మిశ్రమంలో తేనె కలపాలి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో దీనిని తీసుకుంటే చల్లగా ఉంటుంది.
వేయించిన రవ్వలో పెరుగును కలిసి కాసేపు ఉంచి తగినంత నీళ్లు పోస్తే రవ్వదోశలు బాగా వస్తాయి.
చాలా కూరలలో పాలు పోసి వండుతుంటారు..కొన్ని గ్రేవీ కూరలలో పెరుగు వేస్తారు. దీనివల్ల కూరకి కొంచెం పులుపు రుచి వస్తుంది.
రొట్టెలు మెత్తగా రావాలని చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు పోస్తుంటారు. ఈసారి కొంచెం పెరుగు వేసి చూడండి.. రోటీలు మృదువుగా వస్తాయి, పైగా రుచి కూడా పెరుగుతుంది.

కేంద్ర మంత్రి రామ్ కృపాల్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి..

పాట్నా : కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. తన కారుతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కేంద్ర మంత్రి రామ్ కృపాల్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తిని ఆదుకుంటామని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తానని తెలిపారు.

 

పెద్దమ్మ తల్లి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి శాకంబరీ ఉత్సవాలు సోమవారం వేకువజామున ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు పెద్దమ్మతల్లికి అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పెద్దమ్మతల్లిని రకరకాలైన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

07:16 - July 11, 2016

లండన్ : అత్యంత రసవత్తరంగా జరిగిన వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను బ్రిటన్‌ స్టార్‌ ఆండీముర్రే గెలుచుకున్నాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినప్పటికీ వరుస సెట్లలో పైచేయి సాధించాడు. సొంతగడ్డపై టైటిల్‌ సాధించిన ఆనందంలో ముర్రే వెంటనే ఉద్వేగానికిలోనై కంటతడిపెట్టాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ గెలవాలనుకున్న కెనడా ఆటగాడు రోనిచ్ కల కలగానే మిగిలిపోయింది. సొంత అభిమానుల సమక్షంలో ముర్రే రెచ్చిపోయాడు. ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా 2012లో రికార్డు సృష్టించిన ముర్రే .. రెండోసారి వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు.

ముర్రే..దూకుడు..
వింబుల్డన్‌ ఫైనల్లో కెనడా ఆటగాడు ఏడోసీడ్ మిలోస్ రోనిచ్‌పై 6-4, 7-6, 7-6తో ముర్రే విజయం సాధించాడు. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ ఫైనల్‌కు చేరినా పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. దీంతో ఎలాగైనా వింబుల్డన్ ట్రోపీ నెగ్గాలన్న కసితో మొదటి నుంచి దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ తుది పోరుకు చేరుకున్న ముర్రే ఈ సారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. కెరీర్‌లో ముర్రేకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2012లో యూఎస్ ఓపెన్ నెగ్గిన ముర్రే.. 2013లో వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాత మళ్లీ మూడేళ్లకు మరోసారి వింబుల్డన్ ద్వారానే తన గ్రాండ్‌స్లామ్ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న రోనిచ్ చివరికి రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్ మృతి..

నెల్లూరు : కాకుటూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి డివైడర్ ను విజయవాడ పోలీసు జీపు ఢీకొంది. కానిస్టేబుల్ పవన్ మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఏటీఎం దొంగల కోసం బెంగళూరు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

భద్రాచలం పెరుగుతున్న వరద ఉధృతి..

ఖమ్మం : భద్రాచలం వద్ద వరద ఉధృతం పెరుగుతోంది. ప్రస్తుతం 43 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

మాజీ జడ్పీటీసీపై హత్యాయత్నం..

నెల్లూరు : పురాన్ పూర్ లో మాజీ జడ్పీటీసీ రవికుమార్ యాదవ్ పై హత్యాయత్నం జరిగింది. మారణాయుధాలతో ప్రత్యర్థులు దాడి జరిపారు. గాయాలపాలైన రవికుమార్ ను ఆసుపత్రికి తరలించారు. పాతకక్షలే కారణమని తెలుస్తోంది.

నల్గొండలో నేడు విద్యా సంస్థల బంద్..

నల్గొండ : నేడు జిల్లాలో విద్యా సంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. చౌటుప్పల్ లో విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ఈ బంద్ జరగనుంది. వామపక్ష విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

 

యూరో కప్ ను గెలుచుకున్న పోర్చుగల్...

ఫ్రాన్స్ : ప్రతిష్టాత్మకమైన యూరో కప్‌ పోర్చుగల్ వశమైంది. రోనాల్డో సేన మొట్టమొదటి సారిగా ఓ మెగా ఈవెంట్‌ను చేజిక్కించుకుంది. సొంత గడ్డపై ఫ్రాన్స్ అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది.

06:44 - July 11, 2016

అంగన్ వాడీ కార్యకర్తలు మరోసారి పోరుబాట పట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటించబోతున్నారు. ఢిల్లీలో సిఎం కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నారు. మధ్యప్రదేశ్ లో సమ్మె, చత్తీస్ గఢ్ లో రిలే నిరాహారదీక్షలు చేపట్టబోతున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో నల్లదుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు నిర్వహించబోతున్నారు. ఇంతకీ అంగన్ వాడీలు ఇవాళ దేశవ్యాప్తంగా బ్లాక్ డే గా పాటించడానికి కారణం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ముందు వీరు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? దేశంలో ఐసిడిఎస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? సవాళ్లేమిటి ? ఈ అంశాలపై టెన్ టివీ జనపథంలో అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేత జయలక్ష్మి విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

06:41 - July 11, 2016

ప్రైమరీ హెల్త్ కేర్ లో ఐసిడిఎస్ లది కీలకపాత్ర. అత్యంత ఉన్నతాశయాలతో ప్రవేశపెట్టిన ఐసిడిఎస్ వ్యవస్థ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఐసిడిఎస్ పరిరక్షణ, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల సాధనే ధ్యేయంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. మన దేశంలో అంగన్ వాడీ లేదా ఐసిడిఎస్ వ్యవస్థ 40 వసంతాలు పూర్తి చేసుకుంది. 1975లో ఏర్పాటైన ఈ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లోని, మురికివాడల్లోని చిన్నారుల జీవనజ్యోతిగా వెలుగొందుతోంది. పసిపిల్లలకు, గర్భిణీలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, పోషకాహారం, ప్రీ స్కూల్ విద్యను అందించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆరేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం అందించడం, మానసిక వికాసానికి సరైన పునాదులు వేయడం, పిల్లల మరణాల రేటును తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు. స్త్రీ శిశు సంక్షేమ పథకాల్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పథకంగా ఇది కీర్తనలందుకుంది.

లబ్ధి పొందిన 8కోట్ల మంది...
ఈ నలభై ఏళ్ల కాలంలో అంగన్ వాడీల ద్వారా దాదాపు ఎనిమిది కోట్ల మంది లబ్ధిపొందారు. వీరిలో ఆరున్నర కోట్ల మంది చిన్నారులుంటే, కోటిన్నర మంది గర్భిణీలున్నట్టు ప్రభుత్వమే పార్లమెంట్ లో సగర్వంగా ప్రకటించింది. ఇది అందిస్తున్న సేవలను వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించిన సందర్భాలూ వున్నాయి. ఈ పథకాన్ని మరింత విస్తరించాలంటూ సుప్రీంకోర్టు కూడా సూచించడం విశేషం. ఐసిడిఎస్ వ్యవస్థను బలోపేతం చేయడమంటే ఆరేళ్ల లోపు పసిపిల్లల యోగ క్షేమాలకు, మానసిక వికాసానికి అత్యంత ప్రాధాన్యత నివ్వడమే. గత లోక్ సభ ఎన్నికల సమయంలో బిజెపి విడుదల చేసిన మ్యానిఫెస్టోలో సైతం ఐసిడిఎస్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల సమస్యల విషయంలో సానుభూతిని వ్యక్తం చేశారు. కానీ, దురదృష్టవశాత్తు, గత రెండేళ్లలో ఐసిడిఎస్ పరిపుష్టతకు చర్యలు తీసుకోకపోగా, బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ వచ్చారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లోనూ కోతలేశారు. మరోవైపు ఐసిడిఎస్ ను ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ అంగన్ వాడీల భవిష్యత్ ను ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే అంగన్ వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ఉద్యోగ భద్రత లేదు. వీరికిచ్చే వేతనాలు చాలా స్వల్పం. మూడు నాలుగు నెలలకొకసారి వచ్చే జీతాలతో అవస్థపడుతున్నవారెందరో. పెన్షన్ సదుపాయాలు కానీ, సామాజిక భద్రతా పథకాలు కానీ వీరికి అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అంగన్ వాడీల విషయంలో మానవీయంగా ఆలోచించాల్సిన అవసరం వుంది. ఆరేళ్ల లోపు పిల్లలను హ్యాండిల్ చేయడం అత్యంత సహనంతోనూ, ఓర్పుతోనూ కూడుకున్న పని. అదొక కళ. చిన్నారుల్లో మానసిక శారీరక ఎదుగుదలకు అవసరమైన తర్ఫీదు ఇస్తున్న అంగన్ వాడీ వర్కర్ల, హెల్పర్ల యోగక్షేమాల గురించి ఆలోచించాల్సిన బాధ్యతా ప్రభుత్వాల మీద వుంది.

06:38 - July 11, 2016

ఫ్రాన్స్ : ప్రతిష్టాత్మకమైన యూరో కప్‌ పోర్చుగల్ వశమైంది. రోనాల్డో సేన మొట్టమొదటి సారిగా ఓ మెగా ఈవెంట్‌ను చేజిక్కించుకుంది. సొంత గడ్డపై ఫ్రాన్స్ అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. నిర్థిష్ట సమయానికి రెండు జట్లు గోల్స్ ఏమీ చేయకపోవడంతో ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. 109వ నిమిషంలో పోర్చుగల్ ఇడర్ అద్భుతంగా గోల్ చేసి పోర్చుగల్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పోర్చుగల్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలగా... ఫ్రాన్స్‌ ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు.

06:36 - July 11, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. గోదావరి నది వరద ఉధృతి పెరుగుతోంది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.. దీంతో పల్లెవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏకధాటిగా వర్షం పడుతుండటంతో సిర్పూర్‌ నియోజకవర్గంలో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వరద నీటిలోంచే ప్రయాణాలు సాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాగుదాటుతూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సిర్పూర్‌ మండలం వెంకట్‌రావు పేట వద్ద మహారాష్ర్ట-తెలంగాణ అంతరాష్ర్ట బ్రిడ్జ్‌ను ఆనుకుని పెనుగంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. 26 అడుగుల ఎత్తులో భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కరీంనగర్ లో..
ఇటు కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహదేశాపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మహరాష్ట్ర నుండి కాళేశ్వరం వైపు పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి. కొమురంభీమ్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు మూడు గేట్లను ఎత్తివేశారు.

ఖమ్మంలో..
ఖమ్మం జిల్లా లంకపల్లిలో గోదావరి వరద ఉధృతిలో చిక్కుకున్న ఐదుగురు గొర్రెల కాపరులను, 2వేల గొర్రెలను రెవెన్యూ అధికారులు కాపాడారు. ఇటు వాజేడు మండలం కొంగరలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు మోస్తారు నుంచి భారీగా కురుస్తుండడంతో గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మహిళలు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

06:33 - July 11, 2016

విజయవాడ : దేశవ్యాప్త పోరాటాలకు సీపీఎం సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించనుంది. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై పోటుబాట పట్టనుంది. కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అటు బీజేపీ.. ఇటు టీడీపీ ప్రభుత్వాల తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి రెడీ అయ్యింది రెడ్‌ఫ్లాగ్‌. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు ఇచ్చిన హామీలతో ... కొండంత ఆశలను పెంచుకున్న నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వివిధ శాఖలో రిక్రూట్‌మెట్ల పై బ్యాన్‌ పెట్టేశారు పాలకులు. దీనిపై దేశవ్యాప్త ఉద్యమానికి సీపీఎం కేంద్రకమిటి పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను ప్రధానంగా వినిపించనున్నారు. అటు ప్రభుత్వరంగంలో ఉద్యోగుల సంఖ్యనుకూడా తగ్గించేస్తున్నారు. 2016 జూన్, జులై నెలలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను లెక్కలోకి తీసుకుంటే ...ఈ రెండేళ్లనే లక్ష పోస్టులు ఖాళీ అయ్యాయి. కమలనాథన్ కమిటీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేలింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి ఒక్క ఏపీలోనే 2 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. దీనిపై నోరుమెదపని పాలకులు... విదేశాల యాత్రలతో కాలం గడిపేస్తున్నారని సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు.

పెట్టుబడిదారుల ముందు పాలకుల దేబిరింపు..
అటు పెంచిన నిత్యావసర సరుకుల ధరలపైకూడా ప్రజల్లోకి వెళ్లాలని సీపీఎం నిర్ణయించింది. దేశవ్యాప్త ఉద్యమంతో పాటు... ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని పార్టీ నాయకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా సరైన తిండిలేక రోజుకు 3 వేల మంది పిల్లలు చనిపోతున్నారు. 58 శాతం మంది పిల్లలకు పౌష్టికాహారంలేక ఎదుగుదల లోపించింది. 70 శాతం గ్రామీణ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దేశంలో మొత్తం 20 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఆలమటిస్తున్నారని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. బీజేపీ రెండేళ్ల పాలనలో ఇది మరింత దిగజారింది. మేకిన్ ఇండియా అంటున్న మోడీ నినాదం మాటలకే పరిమితమైంది. కంపెనీలు పెట్టి... ఉపాధి కల్పిస్తామంటూ మోడీ, చంద్రబాబులు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని సీపీఎం నేతలు మండిపడుతున్నారు.

ఈనెల 11 నుంచి 17వరకు దేశవ్యాప్త ఆందోళనలు..
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గతంలో ప్రభుత్వ కంట్రోల్ లో ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ కంట్రోల్ ఎత్తివేశారు. 2014లో బ్యారల్ 128 డాలర్ల ఉన్న ముడిచముర ధర... 2016లో 28 డాలర్లకు తగ్గినా.. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకపోగా పెంచారు. అటు మందులు, పుస్తకాల ధరలు, స్కూల్ ఫీజులు అన్ని పోటీపడి పెరిగిపోయాయి. బీజేపీ పాలన సామాన్య ప్రజలకు కంఠకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల ఆవేదనను పాలకులు వినిపించేలా సీపీఎం పార్టీ 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆందోళనలు, ఉద్యమాలకు రంగం సిద్ధం చేసింది. అధికారంలోకి వచ్చేవరకు హామీలతో ఊరించిన పాలకులు తర్వాత ధరలను పెంచి తాటతీస్తున్నారని ప్రజలు మండిపడతున్నారు. జనం గోసను గట్టిగా వినిపించేందుకు సీపీఎం రెడీ అవడంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇక కళ్లుతెరవడం ఖాయం అంటున్నారు ప్రజలు.

06:29 - July 11, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి స్మార్ట్ సిటీ జాబితాలో చేరనుందా ? ప్రభుత్వం ఇందుకోసం కసరత్తు ప్రారంభించిందా ? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపిందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసలు అమరావతి స్మార్ట్ సిటీగా ఎంపికవుతుందా ? ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి. తెలుసుకోవాలంటే ఇది చదవండి... స్మార్ట్ సిటీ రేస్‌ లో ఏపీ రాజధాని అమరావతి దూసుకుపోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను గతనెల 30న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీస్ మిషన్ కు సీఆర్డీఏ సమర్పించింది. ఈ ప్రతిష్టాత్మక పోటీలో రెండోదశలో పాల్గొనేందుకు 11 నూతన నగరాల పేర్లతో రూపొందించిన జాబితాలో అమరావతికి ఇటీవల స్థానం దక్కింది. సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనలు పోటీలో ఉన్న ఇతర నగరాల కంటే మెరుగ్గా ఉంటే అమరావతి స్మార్ట్ నగరంగా ఎంపికవుతోంది.

మోసం చేస్తోందన్న సీపీఎం..
స్మార్ట్ సిటీ చాలెంజ్ నియమ నిబంధనల ప్రకారం పోటీలో ఉన్న నగరాలు ప్రధానంగా 3 అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలి. ఈ అంశాలపై సీఆర్డీఏ 1,736 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి, స్మార్ట్ సిటీస్ మిషన్ కు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు మిషన్‌ అంగీకారం తెలిపి అమరావతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేస్తే 500 కోట్ల రూపాయలు మిషన్ ద్వారా అందనున్నాయి. మరో 500 కోట్లను ఏపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ఇస్తుంది. మిగిలిన రూ.736 కోట్లను వివిధ ప్రభుత్వ పథకాలు, ద్రవ్యనిధి సంస్థల నుంచి తీసుకుంటారు. ప్రతిపాదనలను తయారు చేయడానికి వివిధ వర్గాల ప్రజలతో సంప్రదింపులు, మొబైల్ ఫోన్ల, ఇతర సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయం సేకరించింది. మరోవైపు స్మార్ట్ సిటీస్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఎం విమర్శించింది. స్మార్ట్ సిటీ ఎంపిక విధానంలో షరుతులు పెట్టడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు స్మార్ట్‌ సిటీస్ మిషన్ అంగీకారం తెలుపుతుందో.... లేదో...స్మార్ట్ సిటీగా అమరావతిని కేంద్రం ఎంపిక చేస్తుందో లేదో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

06:26 - July 11, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మహ హరితహారం కారక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోంది. మొక్కలు నాటడమే కాదు వారి పరిరక్షణ బాధ్యత ప్రజాప్రతినిధులకు, అధికారులకే అప్పగిస్తుంది. నేడు 25 లక్షల మొక్కలు నాటేందుకు బల్దియా సమాయత్తువుతోంది. మెగా హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పంజగుట్ట నిమ్స్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు మొక్క నాటనున్నారు. గవర్నర్‌తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, న్యాయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని ఏరియాల్లో రేపు ఒక్కరోజే 25 లక్షల ఎకరాలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం మహాహరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం 21 ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల పర్యవేక్షణ కోసం 21 మంది నోడల్ అధికారులను నియమించారు. మహా హరితహారం సందర్భంగా సర్కిల్ పరిధిలో ఒక్కరోజే 7,188 మొక్కలు నాటేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మహాహరితహారంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారంతా సమీపంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు.

హరితహారం కార్యక్రంలో జిల్లాల కలెక్టర్లకు దిశానిర్ధేశం..
హరితహారం కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ సూచించారు.విద్యాలయాలు, ప్రభుత్వకార్యాలయాలు, మార్కెట్ యార్డులు, ఖాళీ ప్రదేశాలతోపాటూ రహదారుల వెంట వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

06:23 - July 11, 2016

రష్యా : రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమేలక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యాలో జరిగే ఇన్నోప్రోమ్‌ పారిశ్రామిక వాణిజ్య ప్రదర్శనలో పొల్గొంటారు. చంద్రబాబు రెండు రోజులు కజకిస్థాన్‌ పర్యటనలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆ దేశ సహకారం కోరారు. ఇందుకు కజకిస్థాన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రష్యాలోని ఎరిక్టన్‌బర్గ్‌లో జరుగుతున్న ఇన్నోప్రోమ్‌-2016 పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శనలో చంద్రబాబు పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ ప్రదర్శనకు మనదేశం తరపున హాజరవుతున్నారు. జార్ఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఇన్నోప్రోమ్‌ ప్రపచంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శన కావడంతో ప్రపంచ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్లు హాజరవుతున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో మనదేశానికి చెందిన 110 కంపెనీలు పాల్గొంటున్నాయి. భారత్‌ తరుపున ఇన్నోప్రోమ్‌ పారిశ్రామిక ప్రదర్శనకు హాజరవుతున్న సీఎంలు, మంత్రులు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు సాధన కోసం వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు.

అమరావతి నిర్మాణంపై ఏపీ, అస్తానా వచ్చే నెలలో ఒప్పందం..
రెండు రోజుల పాటు కజకిస్థాన్‌లో పర్యటించిన చంద్రబాబు బృందం... ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆ దేశ సహకారం కోరింది. కజకిస్థాన్‌లోని అస్తానా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య పరస్పర సహకారానికి కార్యాచరణ బృందం ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. అస్తానా మేయర్‌ అస్సెట్‌ లెస్కెష్కోవ్‌తో భేటీ అయిన చంద్రబాబు... పలు అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి ఉభయులు వచ్చే నెలలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఏపీ వర్కింగ్‌ గ్రూపుకు మున్సిపల్‌ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తారు. వర్కింగ్‌ గ్రూపులో తమ ప్రతినిధులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని అస్తానా మేయర్‌ చెప్పారు. వచ్చే ఏడాది అస్తానా జరిగే పారిశ్రామిక ప్రదర్శనకు హాజరుకావాలని అస్సెట్‌ లెస్కెష్కోవ్‌ కోరగా... చంద్రబాబు అంగీకరించారు. అస్తానా నుంచి నేరుగా అమరావతికి విమాన సర్వీసులు నడిపే అంశంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. భారత్‌ రాజకీయాల్లో చంద్రబాబు క్రియాశీలక పాత్ర, ఐటీ, సాంకేతిక రంగాల అభివృద్ధికి చూపిన చొరవను అస్తానా మేయర్‌ ప్రశంసించారు.

06:21 - July 11, 2016

హైదరాబాద్ : పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా..హెచ్చరికలు జారీ చేసినా హుక్కా సెంటర్ల యజమానుల తీరు మారడం లేదు. మత్తుపదార్థాలకు బానిస అయిన యువత పెడదారి పడుతున్నా చోద్యం చూస్తున్నారు. సంపన్నులు నివాసం ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పలు హుక్కా సెంటర్లపై పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా సెంటర్లు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు మైనర్లు పట్టుబడడం గమనార్హం. వీరిని అనుమతించిన పబ్ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఏసీపీ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదు బృందాలు ఈ తనిఖీలు నిర్వహించాయి. మైనర్ బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు. మైనర్ లను అనుమతించడం పట్ల నాలుగు పబ్ లపై కేసులు నమోదు చేశారు.

పబ్ లపై దాడులు..

హైదరాబాద్ : జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లో అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. మైనర్లను అనుమతించిన పలు హుక్కా సెంటర్లపై కేసులు నమోదు చేశారు.

మరో 24గంటలూ వర్షాలు..

హైదరాబాద్ : రాగల 24 గంటల్లో తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. ఒడిశా నుండి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్రా మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి వాయుగుండగా మారినట్టు తెలిపారు.

నేడే హరితహారం..

హైదరాబాద్ : ఒకే రోజు గ్రేటర్ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. 35లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్‌సహా ఎందరో ప్రముఖులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సహా మొత్తం 104సంస్థలు, సినీ, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటున్నారు.

 

నైరోబీలో ప్రధాని మోడీ ప్రసంగం..

నైరోబి : భారత్ -ఆఫ్రికా బంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా కెన్యాలోని నైరోబీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దశాబ్దాల కిందటే భారతీయులు ఇక్కడే కూలీలుగా వచ్చారని, వారంతా ఇక్కడే స్థిరపడిపోయారని తెలిపారు. చాలా మంది భారత్ కు తిరిగి రాలేదన్నారు.

Don't Miss