Activities calendar

13 July 2016

22:13 - July 13, 2016

ఢిల్లీ : సుప్రీంకోర్టులో మోది ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నబామ్‌ తుకి ప్రభుత్వాన్ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ...
అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో నాబామ్‌ తుకి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో 2015 డిసెంబరు 15కు ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. గవర్నర్‌ ఆదేశం మేరకు ముందుగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, స్పీకర్‌ను తొలగించే ప్రక్రియను కోర్టు తప్పుపట్టింది. డిసెంబర్‌ తర్వాత గవర్నర్‌ను అనుసరిస్తూ తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమ్మతం కావని తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మమైంది : నాబామ్ తుకీ
సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని నాబామ్ తుకీ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేసే ప్రయత్నం సరికాదని కేంద్రం, బిజెపి తెలుసుకోవాలని హితవు పలికారు.

ప్రజాస్వామ్యమంటే ఏంటో మోదీ అర్థమైవుంటుంది : రాహుల్
సుప్రీం తీర్పును కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వాగతించారు. ప్రజాస్వామ్యమంటే ఏంటో సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధాని మోదికి అర్థమై ఉంటుందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

నబమ్‌ తుకిపై తిరుగుబాటు...
అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 47 మంది ఎమ్మెల్యేలుండగా డిప్యూటి స్పీకర్‌ కలిఖో పుల్‌ నేతృత్వంలోని 21 మంది ఎమ్మెల్యేలు... అప్పుడు సీఎంగా ఉన్న నబమ్‌ తుకిపై తిరుగుబాటు చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. గవర్నర్ జెపి రాజ్‌ఖోవా డిసెంబర్‌ 16న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి నాబామ్‌ తుకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కేంద్రం జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించింది. ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత కలిఖో పుల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిజెపికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ రెబెల్స్‌ ఆయనకు మద్దతిచ్చారు.

కోర్టు ప్రభుత్వాన్ని నడపదన్న సీఎం కలిఖోపుల్ ...
కోర్టు తీర్పుపై స్పందించిన సిఎం కలిఖోపుల్‌-అసెంబ్లీలో మెజారిటీ ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, కోర్టు ప్రభుత్వాన్ని నడపదని అన్నారు.

కోర్టు తీర్పుతో కాంగ్రెస్ ఖుషీ....
న్యాయపోరాటంలో రెండు నెలల క్రితం ఉత్తరాఖండ్‌లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా తమకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ పార్టీలో ఆనందం వెల్లివిరుస్తోంది.

22:01 - July 13, 2016

హైదరాబాద్  : పార్టీ ఫిరాయింపులపై వైసీపీ రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. ఈనెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో... పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి...రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అందించిన బిల్లులో పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమై.. ఆగస్ట్ 13 వరకూ కొనసాగనున్నాయి.

21:55 - July 13, 2016

మెదక్ : ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మంత్రి హరీశ్ రావు భేటీపై ముంపు గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. తమను విడగొట్టి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందంటూ మరోసారి రోడ్డెక్కారు.. మెదక్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టారు. మెదక్‌ జిల్లా మల్లన్న సాగర్‌ నిర్వాసిత గ్రామాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. తాజాగా కొందరు గ్రామస్తులతో మంత్రి హరీశ్ రావు భేటీ కావడం సమస్యను మరింత పెంచింది. తమను విడగొట్టి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందంటూ నిర్వాసితులు పాదయాత్ర చేపట్టారు.

భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలంటూ ఆందోళనలు..
భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు కొద్దినెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు కొనసాగుతుండగానే మంగళవారం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో కొందరు గ్రామస్తులతో హరీశ్ రావు భేటీ అయ్యారు.. దీనిపై నిర్వాసితులు భగ్గుమన్నారు. ఈ చర్చలతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. మంత్రి అన్ని గ్రామాల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడాలని.. ఒక్క ఊర్లోనే చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నిస్తున్నారు..

కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర..
మంత్రి తీరుకు నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు మరోసారి రోడ్డెక్కారు.. సంగారెడ్డిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టారు.

21:49 - July 13, 2016

కరీంనగర్‌ : గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్‌ ముంపు ప్రాంతాల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర ముగిసింది. అంతకు ముందు గండిపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర రిజర్వాయర్‌ మీదుగా.. డోక్యానాయక్‌ తండా వరకు సాగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడం లేదని తమ్మినేని విమర్శించారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు అవసరం లేదని అన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకగా.. తమ్మినేని వీరభద్రం వారితో నృత్యాలు చేశారు. 

21:46 - July 13, 2016

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అమికస్‌ క్యూరీ కమిటీ పేర్కొన్న కొన్ని అంశాలతో సర్వోన్నత న్యాయస్థానం విభేదించింది. ఉపాధ్యాయులను ఎమ్మెల్యేలు, ఎంపీలకు సెక్రటరీలుగా డిప్యుటేషన్‌పై పంపడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం... వెంటనే ఆవిధానాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టులో విచారణ ...
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై అమికస్‌ క్యూరీ కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించింది. గవర్నమెంట్‌ స్కూళ్లలో వసతులు కల్పించాల్సిన గురుతర బాధ్యత రాష్ర్ట ప్రభుత్వాలదేనని సుప్రీం స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారని ప్రశ్నించింది. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది.

కమిటీ అంశాలతో విభేదించిన న్యాయస్థానం..
అమికస్‌ క్యూరీ కమిటీ పేర్కొన్న కొన్ని అంశాలతో న్యాయస్థానం విభేదించింది. గ్రామాల్లోనూ ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారని కమిటీ నివేదికలో పేర్కొంది. ఉపాధ్యాయులను ఎమ్మెల్యేలు, ఎంపీలకు సెక్రటరీలుగా డిప్యుటేషన్‌పై పంపడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం.. తక్షణమే ఆ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయంపై నాలుగు వారాల్లో అఫిడవిట్‌ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది.

విద్యాశాఖలో ఖాళీగా 90శాతం సూపర్‌వైజర్‌ క్యాడర్‌ పోస్టులు ..
తెలంగాణలోని విద్యాశాఖలో 90శాతం సూపర్‌వైజర్‌ క్యాడర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తల్లిదండ్రుల సమాఖ్య కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఉపాధ్యాయుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల గడువు కోరింది. రాష్ట్ర విజ్ఞప్తిని అంగీకరించిన జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం .. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

21:40 - July 13, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వైద్యవిద్య ప్రవేశాలకోసం నిర్వహించిన ఎంసెట్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టాప్ టెన్ ర్యాంకుల్లో అబ్బాయిలు హవా కొనసాగింది. మొదటి పది ర్యాంకుల్లో రెండు ఏపీకి దక్కాయి. సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటివారంలో ఆడ్మిషన్ల ప్రక్రియప్రారంభం కానుంది.

ఈనెల 21 నుంచి ర్యాంకుకార్డుల డౌన్‌లోడ్ ..
తెలంగాణలో వైద్యవిద్యా ప్రవేశాలకోసం ఎంసెట్- 2ను ఈనెల 9న నిర్వహించింది టీ సర్కార్. పరీక్ష నిర్వహించిన నాలుగు రోజుల్లోనే ఫలితాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షకు 56 వేల 188 మంది దరఖాస్తు చేసుకోగా.. 50 వేల 969 మంది హాజరయ్యారు. వీరిలో 47 వేల 6 వందల 44 మంది అర్హత సాధించారు. ఈనెల 21వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలో మొత్తం 17 వందల 80 ఎంబీబీఎస్ సీట్లు..
తెలంగాణలో మొత్తం 17 వందల 80 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 1060 సీట్లు ఉండగా, ప్రైవేట్ కళాశాలల్లో 720 సీట్లున్నాయి. బీడీఎస్ లో కన్వీనర్ కోటా కింద 640 సీట్లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 140 సీట్లుండగా, ప్రైవేట్ కళాశాలల్లో 500 సీట్లున్నాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 25 నుండి 29 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆగస్టు 1 నుంచి ఆడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారు.

బైట్ - లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ( eamcet 2 mi n byte )

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉజ్వల్‌కు ప్రథమర్యాంకు ..
కాగా ఎంబిబిఎస్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజుపాలెం ఉజ్వల్ ప్రథమ ర్యాంకును సాధించారు. రెండో ర్యాంకు మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన కాసం ఐశ్వర్య దక్కించుకోగా......కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన ఎం. సుశృత మూడవ ర్యాంకును సాధించింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన వేణుమాధవ్ నాలుగవ స్థానంలో నిలిచారు. హైద్రాబాద్ జిల్లాకు చెందిన ఎం. అంకిత్ రెడ్డి ఐదవ ర్యాంకులో నిలిచారు.

ఈనెల 24న నీట్ పరీక్ష..
నీట్ పరీక్ష ఈనెల 24న వుండటంతో ఎంసెట్ 2 కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించి.. క్లాసులు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయస్థాయిలో విద్యార్ధులకు క్లాసులు ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్రంలోను క్లాసులు ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్ . 

21:36 - July 13, 2016

రష్యా : ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో సముద్ర వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. రష్యాలోని స్టేట్‌ మెరైన్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ ఈ విశ్వవిద్యాలయానికి పూర్తి సహకారం అందించనుంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు, యూనివర్శిటీ ప్రముఖుల మధ్య ఒప్పందం కుదిరింది.

మెరైన్‌ యూనివర్శిటీ ప్రతినిధులతో భేటీ ..
రష్యాలో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. సేయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని స్టేట్‌ మెరైన్‌ యూనివర్శిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ యూనివర్శిటీ పనితీరును పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రతినిధులు సీఎం బృందానికి వివరించారు. తమ విశ్వవిద్యాలయంలో చదువుకున్న దాదాపు 60శాతం మందికి నౌక నిర్మాణం రంగంలో అవకాశాలొచ్చాయని చెప్పారు. ఈ విద్యాలయం యునైటెడ్‌షిప్‌ బిల్డింగ్, రోసన్‌ బెరొన్‌ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇందులో వివిధ దేశాలకుచెందిన 5వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదే ప్రమాణాలతో ఏపీలో మెరైన్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు సహకారం అందిస్తామని యూనివర్శిటీ ప్రతినిధులు చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

యూనివర్శిటీ ఒప్పందంపై రెండు బృందాల సంతకాలు ...
పవర్ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తర్వాత మెరైన్‌ యూనివర్శిటీ ప్రముఖులతో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ భారత్‌కు లాజిస్టిక్‌ హబ్‌గా మారబోతోందని వారికి చెప్పారు. ఏపీలో మెరైన్‌ యూనివర్శిటీ స్థాపనకు ముందుకు రావడం తమకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఆ తర్వాత యూనివర్శిటీకి సంబంధించిన అవగాహన ఒప్పందంపై రెండు బృందాల ప్రముఖులు సంతకాలు చేశారు.

గ్రెగొరేవ్‌తో చంద్రబాబు సమావేశం...
యూనివర్శిటీ ప్రతినిధులతో భేటీ ముగిశాక సేయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్ ఛైర్మన్‌ గ్రెగొరేవ్‌తో సీఎం సమావేశమయ్యారు. నగరం మధ్య నుంచి కాలువలు వెళుతున్న పీటర్స్‌ బర్గ్‌ నగరం చంద్రబాబును ఆకర్శించింది. అమరావతిలో ఇలాంటి నిర్మాణాలు, పట్టణప్రాంతాల నీటి నిర్వహణలో విధానాలను ఛైర్మన్‌తో చర్చించారు.

21:00 - July 13, 2016

దేశంలో కుబేరులు పెరుగుతున్నారు.. వందలు వేల కోట్లుగా సంపద పోగుపడుతోంది. మరో పక్క దాతలు పెరుగుతున్నారు.. వేల కోట్లు అలవోకగా సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో నిరుపేదలూ పెరుగుతున్నారు.. మూడు పూటలా తిండికి నోచుకోని వారి సంఖ్యా పెరుగుతోంది. ఇది మన దేశంలో కనిపిస్తున్న దృశ్యం. ఓ పక్క సంపద పెరుగుతోందని లేటెస్ట్ ఫోర్బ్స్ జాబితా చెప్తుంటే... దేశంలో సామాన్యుడి బతుకు అంతకంతకు దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. దేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. కుబేరుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం 7 కోట్లు ఆపైన సంపద ఉన్నవారు దాదాపు రెండున్నర లక్షల మంది మన దేశంలో ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగనుందని ఈ నివేదిక చెప్తోంది. ఓ పక్క కుబేరుల సంఖ్య పెరుగుతుంటే మరో వైపు దాతల సంఖ్య కూడా పెరుగుతోంది. దానగుణంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ కొందరు ధనవంతులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ సంపదలో సింహభాగం సమాజం కోసం వెచ్చిస్తూ, వితరణ చాటుకుంటున్నారు..సంపద పెరగటం మంచి విషయమే. సంపద సృష్టితో దేశం వెలిగిపోతే సంతోషించాల్సిందే. కానీ, చీకటి, వెలుగు పక్కపక్కనే ఉన్నట్టు... కొందరి ఖజానా అమాంతం పెరుగుతుంటే, మరికొందరు బతుకుబండి లాగటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితిలో పడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? కోటీశ్వరులు పెరిగారు సంతోషమే.. కానీ, దేశంలో ఎన్ని కోట్లమంది పేదరికంలో కూరుకుని ఉన్నారో తెలుసా? ఓపక్క మిలియనీర్లు వెలిగిపోతూనే ఉన్నారు. కోట్లు కోట్లుగా సంపద పోగుబడుతోంది. బ్లాక్ అండ్ వైట్ కరెన్సీ గుట్టలు గుట్టలుగా పోటీపడుతోంది. మరోపక్క మూడు పూటలా తిండిలేని జనాలు ఆకలితో మాడిపోతున్నారు. పేదరికం భారత ముఖచిత్రంగా మారుతోంది. దేశంలో లక్షలాది మల్టీ మిలియనీర్లు తయారయ్యారు. సంతోషం...!!కానీ ఇదే దేశంలో, ఇంతటి సంపన్న దేశంలోనే, అందరికీ తిండిపెట్టే రైతన్న రాలిపోతున్నాడు. ఉరికొయ్యకు, పురుగుమందుకు బలవుతున్నాడు.. వ్యవసాయ జూదంలో నిట్టనిలువునా మోసపోయి బతుకునుండి సెలవు తీసుకుంటున్నాడని తెలుసా...? ప్రపంచంలో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే.. పేదలు నిరుపేదలుగా మా రిపోతున్నారు. పాలక పక్షాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు, నోట్ల కోసం బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాల్లో ఎలాంటి మార్పుండదు. 

ఏసీబీకి చిక్కిన జూ.అసిస్టెంట్...

నిజామాబాద్ : మత్స్యశాఖ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 5 వేలు లంచం తీసుకుంటున్న జూ. అసిస్టెంట్ రూపేందర్ సింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

20:48 - July 13, 2016

మధ్య ప్రదేశ్ వదరల్లో కొట్టుకపోయిన గోమాతలు...చూడక చూడక లక్షల రూపాయల కంట బడితేఎట్లుంటదీ...ఏటీఎం పెట్టే డబ్బులను కొట్టేసిన మాయగాడు...సర్కారు ఉద్యోగిని బూతులు తిట్టి కొట్టిన కార్పొరేటర్..అడిగిన పోలీసాయనతో గొడవపడిన కార్పొరేటర్.. ఉండవెల్లిని కలిసిన వైసీపీ జగన్ ..మల్లన్న ప్రాజెక్టు ఏరియా వాసుల మధ్య చిచ్చు పెట్టిన హరీషన్న ..దీంట్లో మతలాబేంటంటున్నారు కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్ లో ఆగమవుతున్న దార్లు...ఇటువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న గీదినం గూడా తీసుకొచ్చిండు..మరి గీముచ్చట్లన్నీ ఇనాలన్నా..సూడాలన్నా ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి....

20:39 - July 13, 2016

రూ.3వేల కోట్లు రూపాయలు..ఇవి ప్రాజెక్టో లేక రిజర్వాయర్ నిర్మాణ బడ్జెటో కాదు. తెలుగు రాష్ర్టాల్లో ఉప్పెనై ఉరకలేస్తున్న ఐఐటి కోచింగ్‌ బిజినెస్‌ రేంజ్ బిజినెస్ . స్కూలు దశ నుంచే.. ఐఐటి ఓరియంటేషన్ పేరుతో మొదలవుతున్న కోచింగ్ ల వెంట తమ పిల్లల్ని పట్టుకుని పరుగు తీస్తున్న తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న మొత్తం. రెండు రాష్ట్రాలలో రూ. 3వేల కోట్ల ఐఐజీ బిజినెస్ జరగటం ఆశ్చర్యపోవాల్సిన అంశం. తెలుగు రాష్ట్రాల్లో ఇంతింతై పెరిగిపోతున్న ఐఐటి క్రేజ్ కు అద్దం పెడుతున్న హాట్ హాట్ కోచింగ్ బిజినెస్ పై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో చుక్కా రామయ్య (ప్రముఖ విద్యావేత్త ) మధుసూధన్ రెడ్డి (తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి) కృష్ణయ్య (ఐఐటీ అకాడమీ డైరెక్టర్ ) చర్చలో పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఐఐటీ స్టడీ బిజినెస్ పై ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరిన్ని వివరాలను తెలుసుకోండి....

'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' ఆవిష్కరించిన షారూఖ్...

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' విడుదలైంది. బుధవారం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

న్యూజిలాండ్‌లో భూకంపం...

న్యూజిలాండ్‌ : కెర్మడెక్‌ ఐలాండ్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

' పరువు' పేరుతో అరాచకాలు...

పాకిస్థాన్  : రువు పేరుతో హింస, హత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమించారనే నెపంతో సొంత బిడ్డలను సైతం హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే వెలుగుచూసింది పాకిస్థాన్ లోని పంజాబ్‌ రాష్ట్రంలో. ప్రేమించిన అమ్మాయితో పారిపోయినందుకు ఓ అబ్బాయి ముక్కు, చెవులు కోసేశారు అమ్మాయి కుటుంబసభ్యులు. 

ముగిసిన తమ్మినేని పాదయాత్ర...

కరీంనగర్ : జిల్లాలో సీపీఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చేపట్టిన పాదయాత్రం ముగిసింది. ప్రభుత్వ నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాజెక్టుల కింద సారవంతమైన భూములు ముంపుకు గురవుతున్నాయన్నారు. ప్రాజెక్టులు కట్టాలి కానీ ప్రజలకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని సూచించారు. మేటిగడ్డ దిగువలన నిర్మించే ప్రాజెక్టుల అవసరం లేదని హనుమంతరావువంటి ఇంజనీర్లు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని విమర్శించారు. 

14న యూటీఎఫ్ భారీ ర్యాలీ, ధర్నా..

విజయవాడ : పాఠశాలు, టీచర్ల సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ , ధర్నా నిర్వహించనున్నారు. సీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉ.11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మహాప్రదర్శన ప్రారంభమవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాబురెడ్డి తెలిపారు. అలంకార్ సెంటర్ లో ధర్నా, బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

రాశులవారీగా మొక్కలు నాటిన కేసీఆర్..

హైదరాబాద్: సీఎం క్యాంప్ ఆఫీస్ ఆవరణంలో హరితహారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు రాశుల వారీగా మొక్కలు నాటారు. కేసీఆర్ (కర్కాటకం) మోదుగ మొక్క, ఆయన సతీమణీ శోభ (ధనస్సు) రావి మొక్క నాటారు. కేటీఆర్ తన (మకర) రాశి ప్రకారం జిట్రేగి మొక్కను నాటారు.

టీవీ నటి రౌడీయిజం...

హైదరాబాద్ : టీవీ నటి శ్రీవాణి పై కేసు నమోదయ్యింది. శ్రీవాణి సోదరుడు బాబ్జీ కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పుట్టింట్లో తనకు వాటా ఉందని శ్రీవాణి వదినతో ఘర్షణకు దిగింది. ఈ క్రమంలో శ్రీవాణి తన భర్తతో కలిసి ఇంటి గోడ పడగొట్టించిందనీ..అడ్డుకున్న తనను కొట్టిందని ఆమె వదిన ఆరోపించారు. అనంతరం తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆమె తెలిపారు. దీనిపై ఆమె వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 428 ఏ, 452, 427 (34డి) సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

దుకాణాలపై దూసుకెళ్లిన లారీ..4గురు మృతి..

ఖమ్మం : వేంసూరులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి దుకాణాలపైకి దూసుకెళ్ళటంతో నలుగురు మృతి చెందారు. 

హోటల్‌లో మంటలు..

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

వైసీపీలో విభేదాలు...

నెల్లూరు: జిల్లా వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైసీపీ నేతలు శ్యాంప్రసాద్‌రెడ్డి, విజయ్‌కుమార్‌పై మరో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ డాన్‌లు, క్రైస్తవ ఆస్తులను అమ్ముకున్నారని ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే కాకాణి సమక్షంలోనే ఆరోపణలు చేసుకున్నారు. టీడీపీ నేతలు పాల్గొన్న కార్యక్రమంలోనే విమర్శలు చేసుకోవడం జిల్లాలో సంచలనం రేపింది.

బీజేపీ టీడీపీ మధ్య వాగ్వాదం..

తూ.గోదావరి : అల్లవరం మండలం బెండమూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని పర్యటిస్తున్నారు. ప్రాథమిక హెల్త్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ క్రమంలో బీజేపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణకు రానున్న 'జైరాజ్ స్టీల్'..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ కంపెనీ ఏర్పాటుకు జైరాజ్ స్టీల్ కంపెనీ ముందుకొచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా థారూర్ లో ఈ కంపెనీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. రూ.3వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు జైరాజ్ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం మంత్రి కేటీఆర్ ను కలిసి ప్లాంట్ వివరాలను కంపెనీ డైరెక్టర్ తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో 47 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచానా..

18:52 - July 13, 2016

విజయవాడ : నూతన రాజధాని నగరం నిద్రపోతున్న వేళలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి...అందులో ఒకటి బైక్ రేసింగ్... ప్రాణాలతో చెలగాటమాడే ఈ వికృత క్రీడలో మునిగి తేలుతున్నారు బెజవాడ కుర్రకారు. ఈ డేంజరస్‌ గేమ్‌లో ఇప్పటికే ఎందరో గాయాలపాలయ్యారు..మరెందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరి ఆగడాలపై దృష్టిపెట్టిన నగర పోలీసులు వారి స్పీడ్‌కు బ్రేకులు వేశారు.
హైస్పీడ్‌ బైకులతో రోడ్లపై హల్‌చల్..
ఇక్కడ ముసుగులతో కనిపిస్తున్న ఈ ఐదుగురు కుర్రాళ్లకి బైకులపై షికార్లు కొట్టాలంటే యమక్రేజు... బైకు చేతిలో ఉందంటే ఎవ్వరి మాట వినరు...రేసింగ్‌లు చేయడమంటే మహా సరదా... హైస్పీడ్‌ బైకులతో రోడ్లపై విన్యాసాలు చేస్తారు... ర్యాష్‌ డ్రైవింగ్‌తో వాహనదారులను హడలెత్తిస్తారు. డేంజరస్ ఫీట్లు చేస్తారు....వారి సరదా కోసం ఏం చేయడానికైనా వెనకాడరు....ఎవరైనా అడ్డుకుంటే వారిపై ప్రతాపం చూపిస్తారు.... పైశాచికంగా దాడి చేసి క్షణాల్లో మాయమవుతారు....ఇలానే ఓ హోంగార్డుపై రాళ్ల దాడి చేసి అడ్డంగా బుక్కయ్యారు....రేసింగ్‌ సరదా వీరిని జైలు ఊచలు లెక్కించేలా చేసింది.
అడ్డుకున్న హోంగార్డ్‌పై దాడి..
వించిపేటకు చెందిన షేక్‌ రసూల్‌, సలారుద్దిన్‌, షేక్‌ అధిల్‌, షేక్‌ ఆజారుద్దిన్‌, షేక్‌ అధిల్‌..ఈనెల 7 అర్ధరాత్రి బైకు రేసింగ్‌లతో హల్‌ చల్‌ చేశారు. బి.ఆర్‌.టి.ఎస్‌.రోడ్డులో అత్యంత వేగంగా దూసుకెళ్తూ డేంజరస్‌ ఫీట్లు చేశారు. ఈ విషయంపై పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను చూసి వారు పరారయ్యారు. అయినా వెంటాడటంతో గుణదల వైపు వెళ్లిపోయారు. ఆపేందుకు ప్రయత్నించిన హోంగార్డును రాయితో కొట్టి ఎస్కేప్‌ అయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు బైకు రేసర్ల కోసం వేట ప్రారంభించారు. నిందితులను వలపన్ని పట్టుకున్నారు. వారిని విచారించటంతో బైక్‌ రేసుల వ్యవహారం బయటపడింది.

గతేడాది 218 బైక్‌ రేస్, ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులు..
గతేడాది బెజవాడలో బైక్‌ రేసులు, రాష్‌ డ్రైవింగ్‌లపై 218 కేసులు నమోదయ్యాయి. 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 246 మంది క్షతగాత్రులయ్యారు. వీరంతా 30 ఏళ్ల లోపు వారు కావటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో బైక్‌రేసులు, రాష్‌డ్రైవింగ్‌లు చేసే వారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

18:47 - July 13, 2016

పశ్చిమగోదావరి : ఆటోలో పొగ జనాల్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది.... ఎమ్మెల్యేతోపాటు.. అధికారుల్నీ భయాందోళనకు గురిచేసింది.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మడపాడులో ఈ ఘటన జరిగింది.. ఎమ్మెల్యే రామానాయుడు, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ మడపాడులో పర్యటనకు వచ్చారు.. ఇదే సమయంలో ఆటోనుంచి భారీ స్థాయిలో పొగ బయటకొచ్చింది.. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు ఆటోను ఆపేశారు.. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.. 

18:45 - July 13, 2016

.గోదావరి : ఏలూరు నగరంలో ఇటీవల జరిగిన తూరపాటి నాగరాజుపై హత్యాయత్నం కేసులో నిందితులు లొంగిపోయారు. వారిని విచారించిన అధికారులకు.. నిందితులు తాము కాల్పులు జరిపిన పిస్టల్ ను ఏలూరు గూడ్స్ సమీపంలో పడేసామని తెలపడంతో... బాంబ్ స్వ్కాడ్ బృందాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో పిస్టల్ మాత్రం లభించలేదు.

18:42 - July 13, 2016

గుంటూరు : వీరపట్నం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రాధానోపాధ్యాయుడు శేషురెడ్డి మద్యం మత్తులో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ.. ఆందోళనకు దిగారు. నిత్యం స్కూళ్లోమద్యం సేవిస్తూ.. విద్యార్థులను హింసిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. చేతులు కోరుకుతూ.. కాళ్లు పట్టమంటున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు శేషురెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

18:39 - July 13, 2016

విశాఖపట్నం : ప్రపంచంలో చాలా దేశాలు నిషేధించిన అణు విద్యుత్ ప్లాంట్ ను కొవ్వాడలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్ననాటి నుండి నేటి వరకు ఉత్తరాంధ్రకు అన్యాయం జరుతోందన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని 25 మంది ఎంపీలకు, 8 మంది రాజ్యసభ సభ్యులకు లేఖలు రాశానని కొణతాల అన్నారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉన్న రామకృష్ణ సడెన్ గా మీడియాముందుకు రావడంతో... తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకే అని వార్తలు వినిపిస్తున్నాయి.  

18:35 - July 13, 2016

గుంటూరు : ఈ ఏడాది శీతాకాల సమావేశాలు రాజధాని ప్రాంతం నుండే జరుగుతాయని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. వెలగపూడిలో నిర్మిస్తున్న అసెంబ్లీ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయంలోనే అసెంబ్లీ భవన నిర్మాణాలను కూడా ప్రారంభించాలనుకున్నారు. అయితే ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ముందుగా 5 బ్లాక్ లను సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం చివరి దశకు చేరుకోవడంతో..అసెంబ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అసెంబ్లీ నిర్మాణ పనులపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి...

విజయవాడ : ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న అరుణకుమారి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బుధవారం అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. విజయవాడకు చెందిన మల్లికార్జునశర్మ అనే వ్యక్తి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసి... తమ కూతురిని చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 

18:15 - July 13, 2016

మెయింటెనెన్స్ అంటే ఏమిటి? అది ఏఏ సందర్భాలలో ఎవరికి ఎవరు ఇవ్వాలి? చట్టంలో దీనికి సంబంధించిన ఎటువంటి నిబంధనలున్నాయి? అసలు ఈ మెయింటెనెన్స్ అనేది ఎందుకివ్వాలి? అనే అంశంపై ఈరోజు మైరైట్ లో న్యాయ సలహాలు..సూచనలు తెలిపేందుకు అడ్వకేట్ పార్వతిగారు మన ముందుకు వచ్చారు? దీనికి సంబంధించి అనుమానాలను నివృతి చేసుకుని సమగ్రంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మర్ని వివరాలను తెలుసుకోండి..

18:13 - July 13, 2016

ఢిల్లీ : తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయటం మానుకోవాలని జలరంగ నిపుణులు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. తక్కువ ముంపు, ఎక్కువ నీటి లభ్యత కోసమే ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరముందన్నారు. సాగునీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్షాలు కావాలనే అడ్డుపడుతున్నాయని విమర్శించారు. నీటి స్టోర్ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంజనీరింగ్ నిపుణులు, ప్రతిపక్షాలు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అవసరం లేదనటం సరికాదన్నారు. ప్రాంతాలు ముంపు జరుగకుండా ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణాలు జరిగాయా అని ప్రశ్నించారు. 200ల గ్రామాలు ముంపుకు గురవుతాయని పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ ఇంజనీర్ హనుమంతరావు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం రాజశేఖర్ రెడ్డి ని కోరారనీ..గుర్తు చేశారు. 

18:05 - July 13, 2016

హైదరాబాద్ : సామాన్యుడు కొనలేని స్థితికి పప్పుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. కందిపప్పు, మినపప్పు, పల్లీలు ఇలా ప్రతిదీ ప్రియం కావడానికి కారణం ఏమిటి? ఇవి ఇంకా ఇంకా పెరుగుతాయా? ధరలు తగ్గించే మార్గమే లేదా? ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్న ప్రశ్నలివి.

మూడు కారణాలతో ధరల పెంపు...
పప్పుల ధరలు అడ్డగోలుగా పెరగడానికి సవాలక్ష కారణాలు లేవు. మూడు మూడు కారణాలున్నాయి. తొలి కారణం ప్రణాళికా లోపం. అపరాల సాగును నిర్లక్ష్యం చేయడమే. రెండవ కారణం మార్కెట్ శక్తుల ఇష్టారాజ్యానికి వదిలేయడం. మూడో కారణం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం.
కిలో బరువుకి 2 గ్రాముల చొప్పున మాంసక్రుత్తులు అవసరం...
మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే తన శరీర బరువుకు తగ్గట్టుగా మాంసక్రుత్తులు తీసుకోవాలి. ప్రతి కిలో బరువుకి 2 గ్రాముల చొప్పున మాంసక్రుత్తులు అవసరం. శాఖాహారులకు మాంసక్రుత్తులు లభించే ఏకైక మార్గం పప్పు ధాన్యాలు. మన దేశంలో పప్పు ధాన్యాల సాగువిస్తీర్ణం, ఉత్పత్తి తగ్గిపోతున్నాయి. మన దేశానికి 226 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అవసరం. కానీ, 171 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 55 లక్షల టన్నుల కొరత వుంది. రాబోయే 15 ఏళ్లలో 265 లక్షల టన్నులు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. పంటల దిగుబడి ఇప్పటి మాదిరిగానే వుంటే పప్పు ధాన్యాల కొరత 94 లక్షల టన్నులకు పెరుగుతుంది. ఈ క్షణం నుంచే అపరాల సాగును ప్రోత్సహించే చర్యలు తీసుకోకపోతే, పప్పుల ధరలు మరింత పెరుగుతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

2004 లో 13 లక్షల టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి..
మన ప్రభుత్వాలు అపరాల సాగును ప్రోత్సహించే చర్యలు తీసుకోకుండా, దిగుమతులకు ప్రాధాన్యతనిస్తున్నాయి. కెనడా, అమెరికా నుంచి పెసరపప్పు, మినపప్పు దిగుమతి చేసుకుంటున్నాం. కందిపప్పును మయన్మార్, టాంజానియా నుంచి, శెనగపప్పును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్లేమీ మనకు చీప్ గా ఇవ్వడం లేదు. 2004 లో 13 లక్షల టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకోగా, అదిప్పుడు 50 లక్షల టన్నులకు చేరింది. మన అవసరాలు గుర్తించిన ఎగమతిదారులు పప్పుధాన్యాల ధరలు భారీగా పెంచేస్తున్నారు. విదేశాలకు చెల్లిస్తున్నారు. విదేశీ దిగుమతులకు ధారపోస్తున్న నిధులను మన రైతులకు అందిస్తే, చక్కటి పంటలు పండించే అవకాశం వుంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో అపరాల సాగుకు అనువైన భూములున్నప్పటికీ రైతులకు తగిన ప్రోత్సాహం లభించడంలేదు. 1955లో మనదేశంలో 110 లక్షల టన్నుల అపరాలు పండితే, ఇప్పటికీ 171 లక్షల టన్నులకే పరిమితమైంది. అంటే అరవై ఏళ్ల కాలంలో మనం సాధించిన ప్రగతి కేవలం 60 లక్షల టన్నులే. పప్పుధాన్యాల సాగు పట్ల మన ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి ఇంత కంటే వేరే నిదర్శనం ఏం కావాలి?

కేంద్ర ప్రభుత్వం క్వింటా కందులకు రూ. 4625లు..
కేంద్ర ప్రభుత్వం క్వింటా కందులకు ప్రకటించిన మద్దతు ధర కేవలం 4625 రూపాయలు. ఒక్కొక్కసారి రైతులకు ఆ మాత్రం ధర కూడా దక్కడం లేదు. క్వింటా కందులకు 80 కిలోల పప్పు వస్తుంది. అంటే కిలో కందిపప్పు ధర 58 రూపాయలు. దానికి ఎగుమతి, దిగుమతి కూలీలు, ట్రాన్స్ పోర్ట్ లాంటి మరికొన్ని ఖర్చులు అదనంగా వేసుకున్నా కిలో కందిపప్పు ధర 70 రూపాయలకు మించదు. కానీ, వినియోగదారులు 150 నుంచి 200 రూపాయల దాకా పెట్టాల్సి వస్తోంది. ఈ సొమ్మంతా దళారీలే మెక్కుతున్నారన్నది బహిరంగ రహస్యం. దళారీ వ్యవస్థను కట్టడి చేయలేకపోవడం మన ప్రభుత్వాల అసమర్దత.

ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం...
ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, నాఫెడ్, మార్క్ ఫెడ్, ఎఫ్ సిఐ లాంటి సంస్థలను సకాలంలో రంగంలోకి దింపకపోవడం, బఫర్ స్టాక్ లను కుదించడం లాంటి చేష్టలు దళారీలకు, మార్కెట్ శక్తులకు వరంగా మారుతున్నాయి.

అందుకే ధరలు తగ్గించాలన్న చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి వుంటే తక్షణం కొన్ని చర్యలకు ఉపక్రమించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థను పట్టిష్టం చేసి, మార్కెట్ శక్తులకు కళ్లెం వేయాలి. ఇప్పటికే మార్కెట్ శక్తులు బ్లాక్ చేసిన పప్పుధాన్యాలను బయటకు తీయాలి. విదేశీ దిగుమతులకు వెచ్చిస్తున్న మొత్తాన్ని రైతులకు అందించి, అపరాల సాగును ప్రోత్సహించాలి.

17:56 - July 13, 2016

విశాఖ : కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం చేపట్టిన బస్సు జాతా గంగవరం పోర్ట్‌కు చేరింది.... ప్లాంట్‌ ఏర్పాటువల్ల కలిగే నష్టాలను పార్టీ నేతలు ప్రజలకు వివరించారు.. కరపత్రాలు పంచి ప్రజల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేశారు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు డబ్బు మూటలకోసం రాష్ట్రాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.. 

17:50 - July 13, 2016

హైదరాబాద్ : పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ... సీపీఐ తెలంగాణ రాష్ట్రకార్యదర్శి చాడవెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో ఆందోళన నిర్వహించారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలను టీఆర్ఎస్ ముసుగులో ఉన్నవారు కబ్జా చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. 

ఆగస్టు 16 నుండి సీపీఎం టీఎస్ ప్లీనం...

హైదరాబాద్ : ఆగస్టు 16,17,18 తేదీల్లో సీపీఎం తెలంగాణప్లీనరీ నిర్వహిస్తున్నట్లు కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తెలిపారు. ఈ ప్లీనరీకి జాతీయకార్యదర్శి సీతారాంఏచూరి, పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు హాజరవుతారని తెలిపారు. ఈ ప్లీనరీ ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ అభివృద్ది ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.

17:44 - July 13, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని.. రైతుల దగ్గరనుండి అభివృద్ది పేరిట భూములు లాక్కుంటున్నారని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆరోపించారు. భూ నిర్వాసితుల సమస్యలు, పోడుభూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ఆగస్టు 16,17,18 తేదీల్లో సీపీఎం తెలంగాణప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీకి జాతీయకార్యదర్శి సీతారాంఏచూరి, పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు హాజరవుతారని తెలిపారు. ఈ ప్లీనరీ ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ అభివృద్ది ప్రణాళిక రూపొందిస్తామన్నారు సీతారాములు. 

17:37 - July 13, 2016

మెదక్ : ఏటిగడ్డ కిష్టాపూర్‌లో మంత్రి హరీశ్ రావు భేటీపై ముంపు గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. తమను విడగొట్టి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందంటూ మరోసారి రోడ్డెక్కారు.. మెదక్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టారు.

నిరసనలతో హోరెత్తుతున్న మల్లన్న సాగర్‌ నిర్వాసిత గ్రామాలు ...
మెదక్‌ జిల్లా మల్లన్న సాగర్‌ నిర్వాసిత గ్రామాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. తాజాగా కొందరు గ్రామస్తులతో మంత్రి హరీశ్ రావు భేటీ కావడం సమస్యను మరింత పెంచింది. తమను విడగొట్టి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందంటూ నిర్వాసితులు పాదయాత్ర చేపట్టారు.

 

హరీశ్ రావు భేటీ అయిన కొందరు గ్రామస్థులు..
భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు కొద్దినెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు కొనసాగుతుండగానే మంగళవారం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో కొందరు గ్రామస్తులతో హరీశ్ రావు భేటీ అయ్యారు.. దీనిపై నిర్వాసితులు భగ్గుమన్నారు. ఈ చర్చలతో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. మంత్రి అన్ని గ్రామాల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడాలని.. ఒక్క ఊర్లోనే చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నిస్తున్నారు.. మంత్రి తీరుకు నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు మరోసారి రోడ్డెక్కారు.. సంగారెడ్డిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టారు.

 

17:30 - July 13, 2016

హైదరాబాద్ :

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించిన తెలంగాణ ఎంసెట్-2 ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 50,961 మంది హాజరయ్యారు. 47,644 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 21 నుంచి ఆన్ లైన్ లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభిస్తున్నట్లు సి.లక్ష్మారెడ్డి తెలిపారు. 30,31 తేదీల్లో వికలాంగుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఆగస్టు మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసెట్ కన్వీనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మొదటి 10 ర్యాంకుల వివరాలు ఈ విధంగా వున్నాయి :
మొదటి ర్యాంక్ ఉజ్వల్ 155, ఐశ్వర్య - (మెదక్ ) సుశ్రిత (నంద్యాల) వేణుమాధవ్-( హైదరాబాద్)అంకిత్ రెడ్డి -( హైదరాబాద్) ప్రణవి- (అచ్చంపేట)తేజస్వినీ ( అనంతపురం) సిద్దార్థ్ హైదరాబాద్ , వినీత్ రెడ్డి -( హైదరాబాద్)కృష్ణగీత్ - (ఖమ్మం) గా ర్యాంకులు సాధించినట్లు మంత్రి ప్రకటించారు. 

 

ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై విపక్షాలు రాద్ధాంతం : విద్యాసాగర రావు

ఢిల్లీ : తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని జలరంగ నిపుణులు విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. నీటిని నిల్వ చేసుకునేందుకు స్టోరేజీ చాలా అవసరమని చెప్పారు. ఎలాగైనా అవరోధం కల్పించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. 

మత్తుమందు జల్లి సొత్తు చోరీ...

నల్లగొండ : దేవరకొండ మండలం కొండమల్లెపల్లిలో ఆంధ్రా బ్యాంక్ వద్ద మహిళపై మత్తు మందు చల్లి రూ. 75 వేలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త...

హైదరాబాద్ : రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖలో 2,118 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ జరగనుంది. వైద్య విద్య సంచాలకులు, ప్రజారోగ్య విభాగంలో, వైద్య విధాన పరిషత్‌లో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.

16:36 - July 13, 2016

హైదరాబాద్ : ఒకటి కాదు రెండు కాదు 3 వేల కోట్లు. ఇది ఏ ప్రాజెక్టో లేక రిజర్వాయర్ బడ్జెటో కాదు. తెలుగు రాష్ర్టాల్లో ఉప్పెనై ఉరకలేస్తున్న ఐఐటి కోచింగ్‌ బిజినెస్‌ రేంజ్. స్కూలు దశ నుంచే.. ఐఐటి ఓరియంటేషన్ పేరుతో మొదలవుతున్న కోచింగ్ ల వెంట తమ పిల్లల్ని పట్టుకుని పరుగు తీస్తున్న తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో ఇంతింతై పెరిగిపోతున్న ఐఐటి క్రేజ్ కు అద్దం పెడుతున్న హాట్ హాట్ కోచింగ్ బిజినెస్ పై టెన్ టీవీ స్పెషల్ రిపోర్ట్.

రూ.3 వేల కోట్లు దాటిన బిజినెస్‌ ..
100 శాతం ఉత్తీర్ణతా బోర్డుల కాలం పోయింది. టెన్ బై టెన్ మార్కుల క్రేజ్ దాటిపోయింది. ఇప్పుడంతా ఐఐటీ ఫౌండేషన్ ఫీవర్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే ఫీవర్. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో జోరుగా సాగుతున్న స్టడీ బిజినెస్. ఆరో తరగతి నుంచే ఆరంభమై ఐఐటీ సీటు సాధించేంత వరకు ఫౌండేషన్, ఓరియంటేషన్, సీటు గ్యారంటీ పేర్లతో సాగుతున్న ఈ బిజినెస్ సైజ్ ఇప్పుడు 3,000 కోట్లు దాటిపోయిందని అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదో ఇండస్ట్రీ. ది మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ.

స్పెషల్‌ స్కూల్స్‌, కోచింగ్‌ సెంటర్లకు క్యూ కడుతున్న విద్యార్థులు..
ఈ బిజినెస్‌ సైలెంటుగానే మొదలైనా ప్రతి ఏటా జరుగుతున్న బిజినెస్‌ లెక్కలను చూస్తే ఐఐటి సీటు సాధించిన దానికన్నా ఎక్కువగా ఆశ్చర్య పోవాల్సిందే. ఏటా తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి కోచింగ్ పేరుతో మూడు వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఐఐటి ఆశలతో స్పెషల్ స్కూల్స్ కు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతుండడంతో ఈ బిజినెస్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతోంది.

కార్పొరేట్‌ కళాశాలల నుంచే 80 శాతం విద్యార్థులు ...
ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ రాస్తున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది కార్పొరేట్‌ కళాశాలల నుంచే వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటి అర్హత సాధిస్తున్నవారిలో 15 వేల నుంచి 20 వేల మంది విద్యార్థులు తెలుగువారే ఉంటున్నారు.

6వ తరగతి నుంచే అకాడమిక్‌ స్టాండర్డ్స్‌ ఉండాలంటూ ప్రచారం ..
ఇక ప్రతియేటా జేఈఈ మెయిన్స్‌ రాసేవారి సంఖ్య కూడా పెరుగుతుండడం కార్పొరేట్‌ కళశాలలకు వరంగా మారింది. ఇప్పటివరకు కార్పొరేట్‌ కాలేజీల్లోనే కొనసాగుతున్న ఈ బిజినెస్‌ పాఠశాలలకు కూడా పాకింది. ఐఐటీల్లో సీటు పొందాలంటే 6వ తరగతి నుంచే మంచి అకాడమిక్‌ స్టాండర్డ్‌ ఉండాలని ప్రచారం చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు తప్పనిసరి చేస్తూ.. తెలిసీ.. తెలియని వారి నుంచి కూడా లక్షలు గుంజుతున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు కడుతున్నారు.
కొత్తగా పుట్టుకొస్తున్న ఐఐటీ కాన్సెప్ట్‌ స్కూల్స్‌ ..
ఐఐటి సీటు రావాలంటే... ఇంటర్ లో మొదలు పెడితో సరిపోదు.. మొక్కగా ఉన్నప్పుడే విద్యార్థిని వంచాలి. ఆరో తరగతి నుంచే రుద్దాలి. అప్పుడేఐఐటి సీటు కల నెరవేరుతుందని.. మా స్కూల్లో చిన్నప్పటి నుంచే ఐఐటికి ఫౌండేషన్ వేసేస్తామని ప్రైవేటు.. కార్పొరేట్ స్కూల్స్ చెబుతున్న మాటలకు పిల్లల మీద గంపెడాశలు పెట్టుకునే పేరెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఫలితంగా.. ఐఐటి శిక్షణ పేరుతో వేల కోట్ల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. ఐఐటి కోచింగ్ లో లక్షల పీజుల సంగతి అలా ఉంచితే, విద్యార్థులను ఏళ్ళకేళ్ళు రాపిడి పొట్టి ఒత్తిడికి గురి చేయడం మరో కణం. నాలుగు గోడల మధ్య విద్యార్థులను నిర్బంధంగా చదివిస్తూ.. ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. పేరెంట్స్ లో పెరుగుతున్న ఐఐటి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఐఐటి స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి.

విద్యార్థుల్లో కొరవడుతున్న సృజనాత్మకత ..
వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా సాగే స్కూళ్ళు.. కోచింగ్‌ సెంటర్లు బట్టీ విధానాన్నే కొనసాగిస్తున్నారు తప్పిస్తే... విద్యార్థులను సృజనాత్మకంగా ఆలోచించేలా చేసే విధానాలను పాటించడం లేదు. ఈ ధోరణి విద్యార్థులను సృజనాత్మకంగా ఆలోచించకుండా చేస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్న 40 శాతం మంది తల్లిదండ్రులు..
ఐఐటిలో సీటు వస్తే పెద్ద కంపెనీల్లో జాబ్ గ్యారంటీ అనే నమ్మకంతో తల్లితండ్రులు తమ పిల్లలను ఎన్ని కష్టాలైనా భరించి ఐఐటిలో చేర్పించాలని తపన పడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణ కోసం మధ్యతరగతి తల్లితండ్రుల్లో 40 శాతం మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇంత ఖర్చు పెట్టినా సీటు రాకపోతే ఎలా అన్న టెన్షన్ ఎలాగూ తప్పదు. ఏమైనా, ఈ ధోరణి ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్, కోచింగ్ సెంటర్లకు కాసుల పంట పండిస్తోంది.

ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే ఐఐటి కోచింగ్ బిజినెస్ దందాగా మారే అవకాశం...
ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే ఐఐటి కోచింగ్ బిజినెస్ దందా ఇంకా జోరందుకుంటుంది. ఫీజుల నియంత్రణ వ్యవస్థల వైఫల్యం, విద్యా వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో విద్యా వ్యాపారం హద్దులు లేకుండా సాగిపోతోంది. మరో మార్గం లేని తల్లితండ్రులు ఈ వ్యాపారంలో సమిధలవుతున్నారు.

 

వెహికల్ ఇన్ స్పెక్టర్ నిర్వాకం..

గుంటూరు : మంగళగిరి వాహన తనిఖీ కార్యాలయంలో భారీ స్కామ్ జరిగింది. మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శివనాగేశ్వరావు నిర్వాకం బయటపడింది. ఒకే ఇంటి అడ్రస్ మీద 27 వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను చేసినట్లుగా గుర్తించారు. 

16:19 - July 13, 2016

గుంటూరు : మంగళగిరి వాహన తనిఖీ కార్యాలయంలో భారీ స్కామ్ జరిగింది. మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శివనాగేశ్వరావు నిర్వాకం బయటపడింది. ఒకే ఇంటి అడ్రస్ మీద 27 వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ను చేసినట్లుగా గుర్తించారు. షోరూం నుండి బయటకు రాని వాహనాలకు సైతం ఎంవీఐ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. విషయం బయటకు రావటంతో రెండు రోజులుగా శివనాగేశ్వరావు సెలవుపై వెళ్లిపోయినట్లుగా సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్ విషయం తమ దృష్టికి రాలేదని అధికారులు అనటం విశేషం ...ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి...

16:09 - July 13, 2016

హైదరాబాద్ : సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. సచివాలయం విబాగాధికారులు,సహాయ విభాగాధికారుల విభజనపై సమీక్షిస్తున్నారు. ఆయా శాఖలవారీగా ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలని సమావేశం జరుగుతున్న హాలు ముందు నిరసన చేపట్టారు. సెక్షన్ ఆఫీసర్ , అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల విభజనపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల కేటాయింపులు చేపట్టాలని టీఎస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనతో కమల్ నాథన్ కమిటీ సమావేశం అర్థాంతరంగా నిలిచిపోయింది.  

16:03 - July 13, 2016

నల్లగొండ : తుర్కపల్లి మండలం మాదాపూర్‌లో తుపాకులతో దుండగుల హల్‌చల్‌ చేశారు. ముగ్గురు దుండగులు తుపాకీతో బెదిరించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఓ లారీ డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో దుండగులను పోలీసులు వెంబడించారు. పోలీసులను చూసి ముగ్గురు దుండగులు స్కూటీపై పరారయ్యారు.

16:01 - July 13, 2016

కృష్ణా : కృష్ణా పుష్కరాల్లో జరుగుతున్న కోట్ల రూపాయల దోపిడీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కాంట్రాక్టర్లకు కొమ్ము కాసేందుకే ఉద్దేశపూర్వకంగా నామినేషన్ పద్ధతిలో పుష్కరాల పనులు కేటాయించారని ఆయన మండిపడ్డారు. పాలన వదిలి విదేశాలు తిరగడంలో చంద్రబాబు.. మోడీని మించిపోయారని అందుకే ఆయనకు 13 వ ర్యాంకు వచ్చిందని ఎద్దేవా చేశారు. 271 జీవో రద్దు చేయాలని.. ఈ నెల 22న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

15:56 - July 13, 2016

.గోదావరి : రైతులంతా రుణమాఫీ కోసం చంద్రబాబును నిలదియ్యాల్సిన అవసరముందని వైసీపీ నేత జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాట మరిచాడని జగన్‌ విమర్శించారు. చంద్రబాబుకు ప్రాజెక్టులను నిర్మించే ఆలోచనే లేదని జగన్‌ ఆరోపించారు. రైతులు ఉద్యమిస్తే, దాన్ని అడ్డుపెట్టుకొని ప్రాజెక్టులను జాప్యం చెయ్యడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆయన తెలిపారు. 

15:55 - July 13, 2016

ప.గోదావరి : ఒకరు అధికార పార్టీని విమర్శిస్తూ సభలో మాట్లాడుతున్నారు. మరికొందరు తమ చేతివాటం చూపించటానికి సభకు వచ్చారు. ఒకరు రాష్ట్ర సమస్యలపై సీఎంను నిలదీయమని ప్రజలకు చెబుతున్నారు. మరికొందరు వారి సహజగుణం అయిన చోర విద్యను ప్రదర్శిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభను నిర్వహించారు. అ సభలో దొంగలు హల్ చల్ చేశారు. ఈ సభకు వచ్చినవారి వద్ద దొంగలు పలువురి జేబుల నుండి పర్సులు కొట్టేశారు. ఒకరు ఇద్దరు కాకుండా పలువురి వద్ద నుండి పర్సులు కొట్టేయటంతో గమనించి ఇద్దరు దొంగలను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. కాగా వీరిలో ఒక దొంగ పరారయ్యాడు.

కమల్ నాథన్ కమిటీ భేటీ..టీఎస్ ఉద్యోగుల నిరసన...

హైదరాబాద్ : సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. సచివాలయం విబాగాధికారులు,సహాయ విభాగాధికారుల విభజనపై సమీక్షిస్తున్నారు. ఆయా శాఖలవారీగా ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలని సమావేశం జరుగుతున్న హాలు ముందు నిరసన చేపట్టారు. 

15:31 - July 13, 2016

నిజామాబాద్ : కరువుతీరా వర్షాలు పడుతుండటంతో నిజామాబాద్‌ జిల్లా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో.. పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. సోయా, మొక్కజొన్న, వరి పంటలతోపాటు.. అపరాలను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు ఇందూరు రైతన్నలు.

నిజామాబాద్‌జిల్లాలో కరువుతీరా వర్షాలు..
వరుసగా రెండు సంవత్సరాలు ముఖంచాటేసిన వర్షాలు.. ఈసారి మాత్రం రైతులను సంతోషపెడుతున్నాయి. కరువుతీరా వానలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు.

36మండలాల్లో విస్తారంగా వర్షాలు...
నిజామాబాద్‌జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తుండటంతో... ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి ఇప్పటికే సాధారణానికి మించిన వర్షపాతం నమోదైంది. జూన్‌ నుంచి ఇప్పటివరకు 25సెంటీ మీటర్ల వాన కురవాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 30సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 36 మండలాల్లో మంచివర్షాలు పడ్డాయి. దీంతో ఈసారి సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అటు వరినాట్లు సైతం మొదలు పెట్టారు కర్షకులు.

1.90వేల హెక్టార్లలో పంటలసాగు...
నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1లక్షా 90వేల హెక్టార్లలో పంటలు వేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటిలో 1లక్షా20వేల హెక్టార్లలో సోయాచిక్కుడు వేయగా.. మరో 34వేల హెక్టార్లలో మొక్కజొన్న పైరు సాగవుతోందంటున్నారు. అలాగే 7వేల హెక్టార్లలో కంది, 4వేల హెక్టార్లలో పెసర పంటలు సాగవుతుండగా మరో 3వేల హెక్టార్లో వరినాట్లు వేశారు. ఇప్పటిదాకా ఎండికరువుతో అల్లాడిన అన్నదాతలు... సకాలంలో వర్షాలు పడుతుండటంతో..పొలంపనుల్లో బిజీగా మారారు. విత్తనాలు, ఎరువులు కొరతలేకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. 

భారీగా గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం...

ఖమ్మం : దాన వాయిగూడెంలో విజిలెన్స్ అధికారులు రూ.70వేల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తిని ఇంట్లో ఇవి నిల్వ ఉంచిన సమాచారం తెలుసుకుని బుధవారం ఆ ఇంట్లో సోదాలు జరిపారు. ఇందుకు సంబంధించి మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కోర్టు ఆవరణలో పేలిన నాటు బాంబు...

బీహార్‌ : ససారామ్ కోర్టు ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఒకరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం గాయపడ్డ వ్యక్తికి చికిత్స అందించారు. బాంబ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించింది. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

 

ఎవరి పనిలో వారున్నారు...

ప.గోదావరి : ఒకరు అధికార పక్షాన్ని విమర్శించటానికే సభను నిర్వహిస్తుంటే మరికొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఇలా ఎవరి పనులో వారు బిజీ బిజీగా వున్నారు...అసలు విషయం ఏమిటంటే ... జంగారెడ్డి గూడెం జగన్ సభలో  దొంగలు హల్ చల్  చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభ చేపట్టారు. ఈ సభకు వచ్చినవారి వద్ద దొంగలు పలువురి జేబుల నుండి పర్సులు కొట్టేశారు. ఇద్దరు దొంగలను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. కాగా వీరిలో ఒక దొంగ పరారయ్యాడు. 

15:00 - July 13, 2016

గుంటూరు : నరసరావుపేట ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతోంది. రాజధాని అమరావతికి చేరువలో ఉన్న కాకానిగ్రామం వద్ద కొత్తగా జేఎన్‌టీయూ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదిలోపే యూనివర్సిటీ భవన నిర్వాణాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

కాకానిలో జేఎన్‌టీయూకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌...
గుంటూరుజిల్లా విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నరసరావుపేట మండలం కాకాని సమీపంలో జేఎన్‌టీయూ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం జీవో నంబరు 122ను జారీ చేసింది. 85ఎకరాల్లో కొలువుదీరనున్న యూనివర్సిటీకి 82కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయంటున్నారు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. ఏడాదిలోపుగానే యూనివర్సిటీని భవనాల నిర్మాణాన్ని పూర్తిచేస్తామంటున్నారు. మరోవైపు ఇప్పటికే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో బోధన ప్రారంభించారు. మొత్తం 5 బ్రాంచ్‌ల్లో 300 మంది విద్యార్థులతో ఈసంవత్సరం తరగతులు ప్రారంభమైయ్యాయి. ఇప్పటికే రాజధాని అమరావతినిర్మాణం వేగంగా జరుగుతుండగా... ఇపుడు జేఎన్‌టీయూ కూడా అందుబాటులోకి రావడంతో... రాజధాని ప్రాంతం ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతోందని ప్రజలు సంతోషపడుతున్నారు. 

14:56 - July 13, 2016

విజయవాడ : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో ఇక ప్రభుత్వాధికారుల వసతి సదుపాయాలపై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది.. అమరావతి పరిధిలో భారీగా ప్రభుత్వ క్వార్టర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్థం చేస్తోంది. ఉన్నతాధికారులు మొదలుకొని.. నాల్గవ తరగతి ఉద్యోగులకు సైతం ప్రభుత్వ గృహవసతి కల్పించేదుకు రెడీ అవుతోంది.

12 వేల ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించేందుకు సిద్ధం...
తాత్కాలిక సచివాలయం తరలింపు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పెద్దలు, పలువురు శాఖాధిపతులు, ఉద్యోగులు అమరావతికి మకాం మార్చగా.. మిగిలిన వారు కూడా దశల వారిగా విజయవాడకు చేరుకుంటున్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం రెయిన్ ట్రీలో వసతి సదుపాయం కల్పించింది. ప్రస్తుతం అమరావతి పరిధిలో అద్దెలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు అందోళన చెందుతున్నారు. దీంతో రాజధాని పన్నెండువేల ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. తొలి ఏడాది 5 వేల నిర్మాణాలు పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని సమాచారం.

న్యాయమూర్తులు, మంత్రులకు డూప్లెక్స్ ఇళ్లు...
క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు ఇప్పటికే విధి,విధానాలను ఖరారు చేశారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం న్యాయమూర్తులు, ఉన్నత న్యాయాధికారులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ లకు 3500 చదరపు అడుగుల విస్తీరణంలో విశాలమైన వ్యక్తిగత డూప్లెక్స్ బంగ్లాళు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం పది అంతస్తుల అపార్టుమెంట్లు నిర్మించనున్నారు. ఇక ఐఏఎస్,ఐపీఎస్ వంటి ఇతర ఉన్నతాధికారులకు, శాఖాధిపతులకు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు నిర్మిస్తారు. అలాగే గెజిటెడ్‌ అధికారులకు 1800 చదరపుటడుగులు, నాన్‌ గెజిటెడ్‌ అధికారులకు 1200 చదరపుటడుగులు, నాలుగోతరగతి ఉద్యోగులకు 800 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఫ్లాట్‌ ఉండేలా జీ+9 అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఆగస్టు చివరి నాటికి తాత్కాలిక సచివాలంయ పూర్తవుతుందని అంచనా..
ప్రస్తుత తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని సర్కార్ భావిస్తోంది. అనంతరం రాజధాని బృహత్ ప్రణాళికలో సూచించిన ప్రాంతంలో శాశ్వత గృహసముదాయం నిర్మించనుంది. అన్నీ అనుకూలిస్తే విజయదశమి నాటికీ ప్రభుత్వ క్వార్టర్లకు శంకుస్ధాపన చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 

సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ ...

హైదరాబాద్ : సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. సచివాలయం విబాగాధికారులు,సహాయ విభాగాధికారుల విభజనపై సమీక్షిస్తున్నారు. ఆయా శాఖలవారీగా ఉద్యోగుల విభజనపై చర్చిస్తున్నారు. 

తుపాకులతో దుండగులు హల్ చల్..

నల్లగొండ : తుర్కపల్లి మండలం మాదాపూర్ సమీపంలో తుపాకులతో దుండగులు హల్ చల్ చేశారు. వాహనదారులను తుపాకులతో బెదిరించి దోపిడీలకే పాల్పడుతున్న దుండగులు పోలీసులను చూసి స్కూటీపై దుండగులు పరారయ్యారు. 

13:53 - July 13, 2016

ఖమ్మం : ఎగువ నుంచి వచ్చిన ప్రవాహ ఉద్ధృతితో ప్రమాదకర స్థాయికి చేరి పరవళ్లు తొక్కిన గోదావరి  శాంతిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 4 అడుగుల మేర తగ్గింది. నిన్న 52.4 అడుగులకు చేరిన నీటిమట్టం.. రాత్రి నుంచి వరద ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48అడుగులకు చేరింది.భద్రాచలం వద్ద నీటిమట్టం ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో  రెండో ప్రమాద హెచ్చరికను కాసేపట్లో ఉపసంహరించుకోనున్నారు

 

13:51 - July 13, 2016

తూర్పుగోదావరి : గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర వరద నీరు తగ్గుముఖం పట్టినా, ధవళేశ్వరం బ్యారేజీకి గంటగంటకు వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.70 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 175 గేట్లను ఎత్తవేసి 14 లక్షల 61 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
కోనసమీ గ్రామాలు జలదిగ్బంధం 
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. చత్తీస్‌గడ్, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరిలో కొనసాగుతున్న వరద ఉధృతితో కోనసీమలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, అల్లవరం, గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దీంతో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎగువ రాష్ట్రాల్లో గోదావరి ఉపనదులు పొంగిపొర్లడంతో గోదావరిలో వరద పెరుగుతోంది. యానాం సమీపంలోని  గౌతమి గోదావరి ప్రాంతంలో గోదావరి సముద్రంలో కలిసే చోట ఉధృతంగా ప్రవహిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం

ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. 

13:46 - July 13, 2016

కరీంనగర్‌ : జిల్లాలో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్ట్‌ల భూ నిర్వాసితులకు సీపీఎం బాసటగా నిలిచింది. ఈరెండు  రిజర్వాయర్‌ల ఎత్తును పెంచాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించిది. దీంతో  నిర్వాసితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు పాదయాత్ర చేస్తున్నారు. ఐదు గిరిజన తండాల్లో తమ్మినేని పాదయాత్ర కొనసాగుతోంది.  

 

13:45 - July 13, 2016

ఖమ్మం : కోయగూడెం ఏరియాలో బొగ్గును వెలికితీసేందుకు సింగరేణి యాజమాన్యం సమాయత్తమైంది. ఇప్పటికే భూ సేకరణ కార్యక్రమం  చేపట్టింది. తమకు న్యాయమైన పరిహారం చెల్లించడం లేదంటూ పోరుబాటపట్టారు భూ నిర్వాసితులు. వీరికి మద్దతుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర కు సిద్ధమయ్యారు.
కోయగూడెంలో బొగ్గు నిక్షేపాలు
ఇది ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతం.  ఈ ఏరియాలో సింగరేణి విస్తరణ కార్యక్రమాలు చేపట్టింది.   కోయగూడెం ప్రాంతంలో  13 ఏళ్లకు సరిపడ బొగ్గు నిక్షేపాలున్నట్టు సింగరేణి యాజమాన్యం చెబుతోంది.    ప్రభుత్వ అనుమతులు లభించడంతో ఓ వైపు భూసేకరణ, మరోవైపు డ్రిల్లింగ్‌ పనులు ముమ్మరం చేస్తోంది సింగరేణి యాజమాన్యం.  
750 ఎకరాల భూసేకరణ 
ఎనిమిదేళ్ల క్రితం 2008లోనే 750 ఎకరాల భూమిని సేకరించారు. కోయగూడెం, దంతెలతండ, కొత్తతండ, జేత్యతండ గ్రామాల్లోని 105 గిరిజన కుటుంబాలు భూమిని కోల్పోయాయి. తమకు నష్టపరిహారం, పునరావాసం చెల్లించలేదంటూ అప్పట్లో గిరిజనులు పోరాడారు. గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సిపిఎం నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ న్యాయ పోరాటాల ఫలితంగా మూడు కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీ లభించింది.  పునరావాసంతో పాటు తాము కోల్పోతున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలంటూ గిరిజనులు పోరాటం కొనసాగిస్తున్నారు.  
సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం
సింగరేణి యాజమాన్యం తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కోయగూడెం ఓసి 2, ఫిట్ 1 పేరుతో ఇప్పటికే దారపాడు గ్రామాన్ని పూర్తిగా తొలగించారు. 2012లో కొంతమందికి కొంత మొత్తంలో డబ్బులు చెల్లించిన యాజమాన్యం, అందరికీ న్యాయం చేయలేదు. జీవో 34 ప్రకారం  నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామన్న హామీనీ నిలబెట్టుకోలేదు.    ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న వాగ్ధానమూ నెరవేరలేదు. 
8 గ్రామాల్లో 2200 ఎకరాల భూసేకరణ
కొయగూడెం ఓపెన్ కాస్ట్ కోసం చుట్టుపక్కల వున్న 8 గ్రామాల్లోని 2200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. కిష్టారం, దారపాడు, కొత్తూరు, లక్ష్మీపురం, కొప్పురాయి, పిఆర్ గుంపు, బోడు కొత్తగూడెం గ్రామాల్లోని భూమిని సేకరిస్తున్నారు.  గ్రామ సభల్లో చేసిన తీర్మానాలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలిచ్చారన్న విమర్శలున్నాయి. పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. భూ సేకరణకు ఒప్పుకోకపోతే, ఫారెస్టు అధికారులు భూములు స్వాధీనం చేసుకుంటారంటూ   ప్రభుత్వాధికారులు తమను బెదిరిస్తున్నారన్నది బాధితుల ఆవేదన. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి, 34 జీవో ప్రకారం ఉద్యోగం ఇవ్వాలని భూ నిర్వాసితుల డిమాండ్.  అయితే, 2013 భూ సేకరణ చట్టం కొయగూడెంకు వర్తించదంటున్నారు సింగరేణి అధికారులు. 
నష్టపరిహారం చెల్లింపు ప్రశ్నార్ధకం 
కొయగూడెం ఓపెన్ కాస్ట్ వల్ల కొన్ని భూములు సాగుకు పనికిరాకుండా పోతాయి. ఓసి 2, ఫిట్ 3, ఫిట్ 1 రోడ్డు విస్తరణ పనుల్లో మరికొందరు   సాగుభూములు కోల్పోతున్నారు .  15 గ్రామాల్లోని 4500 ఎకరాల భూమిని కొయగూడెం ఓపెన్ కాస్ట్ ముంగేస్తుందన్న అంచనాలున్నాయి. వీరందరికీ ఎలాంటి పరిహారం చెల్లిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 

 

13:43 - July 13, 2016

విజయవాడ : పాలకుల భూదాహం తీరడం లేదు. బెజవాడ నడిబొడ్డున ఉన్న రాజీవ్‌గాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌ను శివారు ప్రాంతంలోకి తరలిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. రేపో, మాపో 145 షాపులను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందట్లో సడేమియాలా రంగంలోకి దిగిన బడా, చోట నేతలు, అనుచరగణం.. కొత్త షాపులు కేటాయిస్తామంటూ వ్యాపారస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. 
రాజీవ్‌గాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌పై పాలకుల కన్ను 
పాలకుల కన్ను బెజవాడలోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌పై పడింది. నగర పాలక సంస్థకు ఆమడ దూరంలో.. ప్రజలకు ఎంతో కాలంగా అందుబాటులో ఉన్న పూలు, కూరగాయల మార్కెట్‌ను నగర శివారు ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
పచ్చదనం పేరుతో మార్కెట్‌ తరలింపు
ఈ మధ్యనే ఈ ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పచ్చదనం పేరుతో మార్కెట్‌ను తరలించాలని సూచించారు. దీంతో వెంటనే నగర మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండియన్‌ కౌన్సిల్‌లో తీర్మానం పెట్టారు. దీనికి ప్రత్యామ్నాయంగా సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ రోడ్డు మలుపు వద్ద రెండెకరాల స్థలం కేటాయించాలని తీర్మానించారు. 
నిధులు ఇవ్వాలని కౌన్సిల్‌ను కోరిన అధికారులు 
కొత్తగా 145 షాపులు నిర్మించేందుకు కోటి 95 లక్షలు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేశారు. అయితే.. కేవలం కోటి రూపాయలతో షెడ్లు నిర్మిస్తే సరిపోతుందని అధికారులు నిర్ణయించారు. నగర పాలక సంస్థ నుంచి ఆ నిధులు ఇవ్వాలని కౌన్సిల్‌ను కోరారు. వ్యాపారులకు అనువుగా ఉండేలా రెండింటిలో ఏదో పద్దతిలో నిర్మాణాలు చేపట్టాలని కౌన్సిల్‌ అనుమతిచ్చింది. దీంతో దుకాణాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
రంగంలోకి దిగిన అధికార పార్టీ అనుచరగణం
ఇదిలావుంటే దుకాణాల కేటాయింపులో అధికార పార్టీ అనుచర గణం రంగంలోకి దిగింది. దుకాణాలు ఇప్పిస్తామంటూ వ్యాపారస్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. లక్షన్నర ముట్టజెప్పిన వారికే షాపు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌ తరలింపుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు.. అధికార పార్టీ అనుచరగణం దోపిడీతో మరిన్ని కష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తగా ఏర్పాటు చేసే షాపులలో తమకు షాపు కేటాయించాలని బాధిత వ్యాపారులు కోరుతున్నారు. 

13:43 - July 13, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇక నుంచి ఐఏఎస్ అధికారుల పాలనలో కొనసాగనున్నాయి. ఆలయాలను  మరింత అభివృద్ధి చేసేందుకు  ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు కీలమైన దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఆలయాల ఆలనాపాలనపై సర్కార్ దృష్టి 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఆలనాపాలనపై ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి ఆలయం మినహా మిగిలిన అన్ని ప్రధాన ఆలయాలకు దేవాదాయ శాఖను చెందిన  జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులే ఈవోలుగా పనిచేస్తున్నారు.  కొందరు అధికారులు  అవినీతికి పాల్పడుతూ దేవాలయాల అభివృద్ధికి ఆటకంగా మారుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దీంతో అనుభవం ఉన్న ఐఏఎస్ లను ఆలయాలకు ఈవోలుగా నియమించే కొత్త విధానానికి  టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  
దేవాలయాలకు ఐఏఎస్ అధికారులు కేటాయింపు 
ఇటీవల కాలంలో ఆలయాల అధికారుల వ్యవహారాలపై  ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించి భూములు అన్యాక్రాంతం అవుతున్నట్టు గుర్తించారు. దీంతో  ఆలయాల్లో పాలనను గాడిన పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.  టీటీడీ తరహాలోనే ఏడు ప్రధాన ఆలయాలకు ఐఏఎస్ అధికారులను ఈవోలుగా నియమిస్తున్నారు.  తొలుత బెజవాడ  కనకదుర్గమ్మ  దేవాలయం ఈవోగా ఐఏఎస్ అధికారి సూర్యకుమారిని నియమించారు. ఈమె గతంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో టీటీడీలో సేవలందించారు. 
శ్రీశైలం మల్లన్న టెంపుల్ ఈవోగా డా. నారాయణ భరత్ గుప్తా
తాజాగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఈవోగా 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ ఈనెల 10న ఉత్తర్వులు వెలువరించారు. శ్రీకాళహస్తి ఆలయానికి కూడా త్వరలో ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించే యోచన చేస్తున్నారు. అలాగే సింహాచలం, అన్నవరంలోని దేవాలయాలకు కూడా ఐఏఎస్ అధికారులను నిమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేవాదాయ శాఖ అధికారుల పాలనతో అస్తవ్యస్తంగా మారిన ఆలయాల నిర్వహణ ఐఏఎస్‌ల ఏలుబడిలో మెరుగుపడే అవకాశం ఉందని భక్తులు ఆశిస్తున్నారు. 

 

13:38 - July 13, 2016

హైదరాబాద్ : రోడ్లపై ప్రయాణం అంటేనే..హైదరాబాద్‌ ప్రజలు వణికిపోతున్నారు. ఎపుడు ఏక్కడ జారిపడతామోనని హడలిపోతున్నారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. ఓవైపు మెట్రోపనులు.. మరోవైపు వివిధ అవసరాలకోసం  ఇష్టం వచ్చినట్టు రోడ్లను తవ్విపోస్తుండటంతో సిటీలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కూకట్‌పల్లి, శ్రీనగర్‌కాలనీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్.. ఇలా ఎక్కడ చూసినా రోడ్లన్నీ నరకానికి నకళ్లుగా మారాయి. 
రోడ్లుకావివి నరకానికి నకళ్లు..
రోడ్లుకావివి నరకానికి నకళ్లు.. డొంకదారులను తలపిస్తున్న రాజధాని రోడ్లు.. ప్రాణసంకటంగా సీటీలో ప్రయాణం.. అహో అభివృద్ధి...ఓహో డెవలప్‌మెంట్‌.. అంటూ గొప్పలు చెప్పుకునే సర్కార్‌ను  రాజధాని హైదరాబాద్‌ రోడ్లు వెక్కిరిస్తున్నాయి.  గుంతలయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. 
గ్రేటర్‌ సిటీలో 9,050 కి.మీ.విస్తరించిన రోడ్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 9వేల 50కిలోమీటర్లలో రోడ్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో 4వేల 173కిలోమీటర్లు బీటీరోడ్లు ఉండగా... 3వేల928 కిలోమీటర్ల సిమెంటురోడ్లు ఉన్నాయి. అలాగే  కంకర రోడ్లు 81కిలోమీటర్లు,  857 కిలోమీటర్ల మేర మట్టిరోడ్లుకూడా రాజధాని పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తోంది. 
కాంట్రాక్టర్ల అత్యాశ.. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం..
రాజధానిలో రోడ్లు ఇంత దుస్థితిలో ఉండడానికి కారణం... కాంట్రాక్టర్ల అత్యాశ... జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వమే  నని సీటీజనం ఆరోపిస్తున్నారు.  ఒకసారి బీటీ రోడ్డు వేస్తే 5సంవత్సరాలు దాని లైఫ్‌ టైం ఉంటుంది. అదే  సిమెంట్‌ రోడ్డు అయితే 30ఏళ్ల లైఫ్‌ టైం ఉంటుంది. ఒకవేళ రెండేళ్లలోపే రోడ్డు పాడైతే.. కాంట్రాక్టర్‌ దాన్ని సరిచేయాలి.  లేదా 'కార్పొరేషన్‌  డిఫెక్ట్‌ లయబిలిటీ' ఒప్పందంలో ఉన్న నిధుల నుంచి జీహెచ్‌ఎంసీనే రోడ్లను రిపేరు చేయాలి. సీటీలో రోడ్ల రిపేరు కోసం ఏటా 100 నుంచి 120 కోట్ల రూపాయలు ఖర్చుచోస్తోంది జీహెచ్‌ఎంసీ.  గుంతలను పూడ్చడం..ప్యాచ్‌ వర్క్‌లతోనే నిధులన్నీ ఖర్చై పెట్టేస్తోంది.  కానీ.. అటు కాంట్రాక్టర్లు కానీ.. ఇటు జీహెచ్‌ఎంసీ కానీ రోడ్లను పట్టించుకున్న పాపాన పోవడంలేదు. 
వర్షాలతో పాడైపోయిన సీటీ రోడ్లు
అసలే వర్షాలతో రోడ్లన్నీ గోతులు గొప్పులతో గజిబిజిగా తయారయ్యాయి. దీనికి తోడు  వివిధ డిపార్ట్‌మెంట్‌లు..ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఇలా రోడ్లన్నీ తోడిపోస్తున్నారు. సీటీలో ఈ ఏడాది 15వందల కిలోమీటర్ల మేర రోడ్లను తవ్విపోశారు. కూకట్‌పల్లి, శ్రీనగర్‌ కాలనీ ల్లో రోడ్లు నరకానికి నకళ్లుగా మారిపోయాయి. తవ్విన రోడ్లపై టూవీలర్స్‌ నడపాలంటే ప్రాణాలను జీహెచ్‌ఎంసీ వారి దయకే వదిలి వేస్తున్నారు ప్రయాణీకులు.  !
మెట్రపనులతో వాహనదారుల అవస్థలు
మరోవైపు సంవత్సరాలుగా  కొనసాగుతన్న మెట్రో పనులతో రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయి. అంగుళం  కదలాలంటే అరగంట సమయాన్ని  ఖర్చు పెట్టాల్సి వస్తోంది.  మెట్రోపనుల్లో భాగంగా రోడ్లను తవ్విపోసిన అధికారులు...ఆమట్టిపైనే తారు పోశారు. వర్షాలు, హెవీట్రాఫిక్‌తో తారు  కొట్టుకుపోయి... రోడ్లన్నీ గతుకుల మయంగా మారిపోయాయి. మెట్రోపనులు  2018 చివరి నాటికి గాని ఓకొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇదీలాగే కొనసాగితే 'హైదరాబాద్‌ అంటే అతుకులరోడ్లు' అని చెప్పుకోవల్సి వస్తుందంటున్నారు నగరప్రజలు. మంచిరోడ్లు... పురోగమిస్తున్న సమాజానికి గుర్తులు. మరి గతుకుల రోడ్లు, నోళ్లుతెరి జనాన్ని మింగుతున్న నాలాలు.. మన హైదరాబాద్‌ను ఎటువైపు తీసుకెళ్లుతున్నాయో పాలకులు ఆలోచించుకోవాల్సి ఉంది. 

13:32 - July 13, 2016

ఢిల్లీ : అమర్‌నాథ్‌యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సురక్షితంగా చేరుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 16 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు ఏపీ భవన్‌ నుంచి తమ సంస్థలాలకు బయల్దేరుతున్నారు. 

 

పొగాకు రైతలకు గిట్టుబాటు ధర కల్పించాలి : జగన్

పశ్చిమగోదావరి : పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని... గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం గత ఏడాది ఆందోళన చేసినా పట్టించుకోలేదన్నారు. రైతులు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.

 

వరంగల్ లో నకిలీ విత్తనాలు విక్రయం

వరంగల్ : స్టేషన్ రోడ్డులో నకిలీ విత్తనాల విక్రయం జరుగుతోంది. అరుంధతి విత్తనాల షాపులో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. యునైటెడ్ జెనెటిక్స్ కంపెనీకి చెందిన నకిలీ మిర్చీ విత్తనాలను అమ్ముతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

 

12:53 - July 13, 2016

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌..! ఈ జలాశయం గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హైదరాబాద్‌ తాగునీటి ప్రధాన వనరుగా ఉన్న హుస్సేన్‌సాగర్‌.. అనంతర కాలంలో కాలుష్య కాసారంగా మారిపోయింది. దీన్ని మళ్లీ మంచినీటి చెరువుగా మారుస్తామని కేసీఆర్‌ ప్రభుత్వంతో పాటు.. అంతకుముందరి ప్రభుత్వాలూ ప్రకటనలు గుప్పించాయి. ఈ దిశగా కొన్ని ప్రయత్నాలూ జరిగాయి. ఇప్పటికే వందల కోట్లు ఖర్చయ్యాయి. మరి సాగర్‌ ప్రక్షాళన ఏదశలో ఉంది..? హుస్సేన్‌సాగర్‌ మళ్లీ మంచినీటి చెరువుగా మారే వీలుందా..? వాచ్‌ 10టీవీ స్పెషల్‌ ఫోకస్‌... 
ఒకప్పుడు జంట నగరాలకు తాగు
ఒకప్పుడు జంట నగరాలకు తాగు, సాగు నీటిని అందించిన తటాకం.. పరిశ్రమల వ్యర్థాలు.. మురుగు చేరికతో నేడది కాలుష్య కాసారం.. ఈ ప్రస్తావన దేనిగురించో ఈపాటికే అర్థమైవుంటుంది. అవును.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలకు అనుసంధానమైన.. హుస్సేన్‌సాగర్‌ జలాశయం గురించే ఈ ప్రస్తావన. నగరం పెరుగుతున్న కొద్దీ సాగర్‌ కాలుష్యం కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పటి మంచినీటి చెరువు ఇంతలా మురికి కూపంలా మారడానికి కారణాలేంటి..? ఈ ప్రశ్నకు ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో సమాధానాలు వస్తాయి. 
హుసేన్‌సాగర్‌కు.. మురుగు నీరు     
హుసేన్‌సాగర్‌కు.. నగరంలోని నాలుగు ప్రధాన కాలువల నుంచి మురుగు నీరు వస్తోంది. బల్కాపూర్‌ నాలా, బంజారా నాలా, పికెట్‌ నాలా నుంచి సివరేజ్‌ నీటితో పాటు పారిశ్రామిక వ్యర్థ జలాలు, కెమికల్‌ మురుగు అంతా కూడా సాగర్‌లో చేరుతోంది.  పికెట్‌, బంజారా, బల్కాపూర్‌ నాలాలతో పాటు.. కూకట్‌పల్లి నుంచి వచ్చే మురుగు, రసాయనాలు హుస్సేన్‌సాగర్‌ జలాలను విషపూరితం చేశాయి. సగటున ప్రతిరోజూ 550 ఎంఎల్‌డీల సివరేజ్‌ వ్యర్థాలు సాగర్‌లో చేరుతున్నాయన్నది అధికారిక అంచనా. 
వినాయక విగ్రహాల నిమజ్జనంతో సాగర్‌ కలుషితం 
దీంతో పాటు చాలా ఏళ్లుగా వినాయక విగ్రహాలు ఇందులో నిమజ్జనం చేయడం వల్ల కూడా సాగర్‌ కలుషితమైపోతోంది. ఏటా మట్టి విగ్రహాలను కాకుండా..  ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, ఇతర రసాయనాలతో రూపొందిన గణపతి విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ విషపూరిత పదార్థాలు కలవడం వల్ల.. సాగర్‌ మరింత కలుషితమైపోయింది. 
దీనివల్ల జరిగిన నష్టం ఏంటి..? 
హుస్సేన్‌సాగర్‌ కలుషితమైపోయింది. నిజమే. కానీ దీనివల్ల జరిగిన నష్టం ఏంటి..? పర్యావరణానికి గానీ.. ప్రజలకు గానీ కలిగిన హాని ఏంటి..? కాలుష్య కాసారాన్ని మంచి నీటి తటాకంలా మార్చేందుకు జరిగిన ప్రయత్నాలు ఏంటి..?  అందుకైన ఖర్చెంత..? సాధించిన పురోగతి ఎంత..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే.. ప్రతిఒక్కరి గుండెలు గుభిల్లుమనక మానవు. 
ముక్కుపుటాలు అదిరించే దుర్వాసన.. 
ముక్కుపుటాలు అదిరించే దుర్వాసన.. కడుపులో దేవేసేంతటి వికారం.. పైన చెప్పిన లక్షణాలు మీలో కలుగుతున్నాయంటే.. కచ్చితంగా మీరు హుస్సేన్‌సాగర్‌ మీదుగా సాగుతున్నారన్నమాటే. జీడిమెట్ల, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థజలాలతో సాగర్‌ జలాశయం విషపూరితమైంది. ఫలితంగా నీటిలో జీవరాశుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మరింది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ను ఆశ్రయించివున్న అనేక జీవరాశులు అంతమయ్యాయి. ఎందుకిలా..? కారణం ఒకటే.. నీటిలో నామమాత్రపు ఆక్సిజన్‌ కూడా లేనంతటి చిక్కగా విషపదార్థాలు పేరుకు పోవడమే. 
ప్రాణవాయువును పెంచాలి : పర్యావరణ నిపుణులు 
హుస్సేన్‌సాగర్‌ నీటిలో ప్రాణవాయువును పెంచాల్సిన అవసరం ఉందని అప్పట్లోనే పర్యావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకోసం సాగర్‌ పరిసరాల్లో జీవ వైవిధ్యం పెంచాలని సూచించారు. రసాయన వ్యర్థాలను శుద్ధిచేసి సాగర్‌లోకి వదలడం, రీ-సైకిల్‌ చేసిన నీటిని వినియోగంలోకి తేవడం సాగర్‌ ముఖద్వారం వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం లాంటి చర్యల వల్ల సాగర్‌ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించవచ్చని సూచించారు. నిపుణులు.. ప్రజల ఒత్తిళ్లతో.. 2006లో అప్పటి ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు నడుం బిగించింది. 
హుస్సేన్‌సాగర్‌ జలాశయాన్ని శుద్ధి చేయాలన్నది చిరకాల వాంఛ 
హుస్సేన్‌సాగర్‌ జలాశయాన్ని శుద్ధి చేయాలన్నది జంటనగర వాసుల చిరకాల డిమాండ్‌. దీనికి తగ్గట్లే ప్రభుత్వాలు కూడా ఈ అంశంపై దృష్టిని సారించాయి. ఈ దిశగా ఎన్నెన్నో పథకాలను రూపొందించి కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. కానీ ప్రయోజనం శూన్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ దిశగా కొంత ముందడుగు వేశారు. 
హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు కృషి  
హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు గత ప్రభుత్వాలూ ఎంతో కొంత కృషి చేశాయి. ఇప్పటికే చేరిన మురుగును శుద్ధి చేయడంతో పాటు.. కొత్తగా వ్యర్థాలు సాగర్‌లోకి  రాకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాయి. ఇందులో ప్రధానమైనది.. హుస్సేన్‌సాగర్‌ లేక్‌ అండ్‌ క్యాచ్‌మెంట్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు. హెచ్‌ఎండీఏ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో -ఆపరేషన్‌ ఏజేన్సీ - జైకా నుంచి 310 కోట్ల రుణం తీసుకోవాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 60 కోట్ల రూపాయలు చేర్చి సాగర్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించారు. 
హుస్సేన్‌సాగర్‌ లేక్‌ అండ్‌ క్యాచ్‌మెంట్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు 
హుస్సేన్‌ సాగర్‌ పైభాగం నుంచి వచ్చే మురుగును శుద్ధి చేయడం, జలాశయం నీటిలో ప్రాణవాయువును పెంచడం, నాలా ముఖద్వారాల వద్ద భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించడం లక్ష్యాలుగా 2006లో హుస్సేన్‌సాగర్‌ లేక్‌ అండ్‌ క్యాచ్‌మెంట్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును పదేళ్లలోపు అంటే 2016లోగా పూర్తిచేయాలని నిర్దేశించుకున్నారు. అనుకున్న గడువు పూర్తయిపోయింది. మంజూరైన 370 కోట్ల నిధుల్లో మూడొంతులు అంటే 290 కోట్ల మేర ఖర్చయిపోయాయి. కానీ సాగర్‌ కాలుష్యం ఒకింతైనా తగ్గక పోవడం విశేషం. 
సాగర్‌ నీటిలో కొంత మార్పు 
అధికారులు మాత్రం.. ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాల వల్ల.. సాగర్‌ నీటిలో కొంత మార్పు వచ్చిందని అంటున్నారు. జలాశయంలో ఏర్పాటు చేసిన ఎరియేటర్స్‌ వల్ల సాగర్‌ జలాల్లో ఆక్సిజన్‌ కంటెంట్ పెరిగిందన్నది వారి వాదన. అధికారులు చెబుతున్న దాంట్లో ఎంత సత్యముందో కానీ.. సాగర్‌ పరిసరాలకు వెళితే.. ముక్కుపుటాలు అదిరే.. కడుపులో దేవేసే దుర్వాసన మాత్రం ఇప్పటికీ తగ్గ లేదంటే అతిశయోక్తి కాదు. 
అస్సలు అభివృద్ధే జరగలేదా..?
ఇంతకీ సాగర్‌ లేక్‌ అండ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ పథకం కింద అస్సలు అభివృద్ధే జరగలేదా..? గడచిన పదేళ్లలో ఖర్చయిన 290 కోట్లు సాగర్‌లో పోసిన పన్నీరేనా..? అసలు సాగర్‌ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఎదురవుతున్న అవరోధాలు ఏంటి..? ఈ ప్రశ్నలు జంటనగరాల ప్రజలను చాలాకాలంగా వేధిస్తున్నాయి. 
ఈ పథకం కింద కొంతమేర సాగిన పనులు  
సాగర్‌ లేక్‌ అండ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ పథకం కింద.. కొంతమేర పనులు సాగాయి. సాగర్‌కు మురుగును మోసుకొచ్చే ప్రధాన నాలాలను కొంతమేర అభివృద్ధి చేశారు. పికెట్‌ నాలాపై 30 మిలియన్‌ గ్యాలన్ల నీటి శుద్ధి ప్లాంటును, బల్కాపూర్‌ నాలా వద్ద 20 ఎంఎల్‌డీ సామర్ధ్యం గల సివరేజ్‌ ట్రీట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన 500 ఎంఎల్‌డీల మురుగును మూసీలోకి మళ్లించారు. ఇంకా పూర్తి స్థాయిలో నాలాలు అభివృద్ధి చేయకపోవడం వల్ల నిర్దేశించుకున్న బడ్జెట్‌లో.. ఇంకా 80 కోట్ల రూపాయలు మిగిలిపోయాయి. 
నాలుగు నాలాల ముఖ ద్వారాల వద్ద భారీగా పూడిక  
సాగర్‌ ప్రక్షాళన పూర్తిగా జరగక పోవడానికి ప్రధాన కారణం.. కూకట్‌పల్లి నాలాయే. సాగర్‌లోకి వచ్చే నాలుగు నాలాల ముఖ ద్వారాల వద్ద భారీగా పూడిక పేరుకుపోయింది. వాటిల్లో పికెట్‌, బంజారా, బల్కాపూర్‌ నాలాల్లో పూడిక తీశారు. దాదాపు 6 లక్షల 40 వేల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించి శాశ్వత డంప్‌యార్డ్‌కు తరలించారు. కానీ, కూకట్‌పల్లి నాలా ముఖద్వారం వద్ద ఉన్న పూడికలో ప్రమాదకరమైన రసాయనాలుండడంతో.. వాటిని తొలగిస్తే ఎక్కడ వేయాలన్న ప్రశ్న తలెత్తింది. దీనికి పరిష్కారం కనుక్కోక పోవడంతో.. కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే మురుగును యథాతథంగా సాగర్‌లోకి వదిలేస్తున్నారు. 
ఇప్పటివరకు సాగర్‌ ప్రక్షాళనకు రూ.290 కోట్లు ఖర్చు 
ఇప్పటి వరకు సాగర్‌ ప్రక్షాళన ప్రాజెక్టు కింద 290 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. సాగర్‌లోకి వచ్చే మురుగులో 50 ఎంఎల్‌డీల నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగతా నీటిని మూసిలోకి మళ్లించారు. ప్రమాదకర రసాయనాలను తీసుకొచ్చే కూకట్‌పల్లి నాలాను కూడా ఇటీవలే మూసీ నదిలోకి మళ్లించారు. నాలాల నుంచి వచ్చే నీటినంతా శుద్ధి చేయాల్సిన అధికారులు.. ఎలాంటి శుద్ధి చేయకుండానే... దానిని మూసీ లోకి మళ్లించారు. దీంతో సమస్య పరిష్కారం కాకపోగా.. అదే సమస్యను వేరే చోటుకు మార్చినట్లయింది. అయితే.. వర్షాలు వస్తే మళ్లీ ఈ మురుగంతా హుస్సేన్‌ సాగర్‌లోకి వచ్చే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు, నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
తీవ్ర దుర్గంధం
పర్యాటక ప్రదేశం కావడంతో నిత్యం వేలాది మంది పర్యాటకులు హుస్సేన్‌సాగర్‌ను సందర్శిస్తుంటారు. తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో పర్యాటకులు పరిసరాల నుంచి దూరం వెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా సాగర్‌ చుట్టూ ఆక్రమణలను తొలగించాలని సాగర్‌ రక్షణ కోసం సుప్రీంకోర్టు ఏర్పరచిన కమిటీ నివేదిక ఇచ్చినా.. అధికారులు ఆదిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 
హుస్సేన్‌సాగర్‌ను మళ్లీ మంచినీటి చెరువుగా మార్చే యత్నం 
ఏది ఏమైనా.. సాగర్‌ ప్రక్షాళన ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం పూర్తయినా.. 290 కోట్ల రూపాయలు ఖర్చయిపోయినా.. ఇప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కక పోవడం విచారకరం. హుస్సేన్‌సాగర్‌ను మళ్లీ మంచినీటి చెరువుగా మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని జంటనగరాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

12:41 - July 13, 2016

 విజయవాడ : పోర్టు భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఎపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు అన్నారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక లేకపోతున్నారని పేర్కొన్నారు. ఏదో విధంగా బురదజల్లాలని ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. పోర్టు నిర్మాణంతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. గత పాలకులు ఇష్టారాజ్యంగా జీవోలు ఇచ్చారని తెలిపారు. 

 

గత పాలకులు ఇష్టారాజ్యంగా జీవోలు : మంత్రి దేవినేని

విజయవాడ : గత పాలకులు ఇష్టారాజ్యంగా జీవోలు ఇచ్చారని ఎపి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని చూపి ఓర్వ లేకపోతున్నారని మండిపడ్డారు. ఏదో విధంగా బురదజల్లాలని ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయని పేర్కొన్నారు. పోర్టు నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

పొగాకు రైతులతో జగన్ ముఖాముఖి..

పశ్చిమగోదావరి : సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ప.గో జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. కేంద్రప్రభుత్వంలో ఏపి మంత్రులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగడం లేదని వాపోయారు. 

12:32 - July 13, 2016

పశ్చిమగోదావరి : సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ప.గో జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. కేంద్రప్రభుత్వంలో ఏపి మంత్రులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగడం లేదని వాపోయారు. రైతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను ఆదుకునే చర్యలను చంద్రబాబు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22 మిలియన్ కేజీల పంటను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. 

12:10 - July 13, 2016

ఇటానగర్ : కేంద్రప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగలింది. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్పు తీర్పు ఇచ్చింది. గవర్నర్ ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. సభామ్ తూకీ మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పదవి చేపట్టనున్నారు. ప్రజాస్వామ్య విజయమని కాంగ్రెస్ అభివర్ణించింది.

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న సుప్రీం

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్పు ఇచ్చింది. గవర్నర్ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సభామ్ తూకీ మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సీఎం పదవి చేపట్టనున్నారు.  

11:37 - July 13, 2016

నల్లగొండ : జిల్లాలోని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్‌ నేత ఉజ్జిని నారాయణరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న నారాయణరావు.. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నారాయణరావు కమ్యూనిస్టు పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈరోజు మధ్యాహ్నం మర్రిగూడెం మండలం గడియగౌరారంలో నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణరావు మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు మృతి

నల్లగొండ : జిల్లాలోని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్‌ నేత ఉజ్జిని నారాయణరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న నారాయణరావు.. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

11:31 - July 13, 2016

విశాఖ : టెర్రరిస్టుల తాజా టార్గెట్ విశాఖపట్నమా.? సాగరతీరంలో దాడులకు ఉగ్రమూకలు సన్నద్దమవుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంటలిజెన్స్‌ రిపోర్ట్స్‌. స్టీల్‌ సిటీపై ఉగ్రవాదుల కన్ను పడిందని తాజా ఇంటిలిజెన్స్ నివేదికలో వెల్లడైంది. స్టీల్ సిటీపై 26/11 తరహా దాడులు జరగొచ్చని ఇంటలిజెన్స్‌ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 
విశాఖపై ఉగ్ర కన్ను 
టెర్రరిస్టుల తాజా టార్గెట్ లిస్ట్‌లో విశాఖపట్నం. సాగరతీరంలో నరమేధం సృష్టించేందుకు ఉగ్రమూకలు సన్నద్దమవుతున్నాయి. స్టీల్ సిటీపై ముంబై 26/11 తరహా దాడుల జరగొచ్చని ఇంటిలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. ఒక వైపు ప్రకృతి రమణీయత...మరో వైపు సాగరతీరం..వెరసీ విశాఖపట్నం అంటేనే ఓ మధురానుభూతి. కానీ తాజాగా విశాఖపై ఉగ్రవాదుల కన్ను పడిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ముంబై 26/11 తరహా దాడులు చేసేందుకు విశాఖపై ఉగ్రవాదులు రంగం సిద్దం చేసుకున్నారన్న తాజా ఇంటిలిజెన్స్ రిపోర్టు గుబులురేపుతోంది. 
ఏపీ వాణిజ్య రాజధానిగా విశాఖ 
ఏపీ వాణిజ్య రాజధానిగా విశాఖకు పేరుంది. అలాగే భౌగోళికంగా దేశంలో చెప్పుకోదగ్గ టూరిస్ట్ స్పాట్‌గా సిటీ ఎదిగింది. అలాగే పలు జాతీయ సంస్థలు, స్టీల్ ప్లాంట్, బీహెచ్ఈఎల్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ భిన్న సంస్కృతులకు నెలవు..ఇలాంటి సిటీపై ఉగ్రవాదుల దృష్టి సారించారనేది ఇప్పుడు హాట్ న్యూస్. 
విశాఖపై ఉగ్ర సంస్థలు దృష్టి 
ఈస్ట్రన్ నావల్ కమాండెంట్ ప్రధాన కార్యాలయంతో పాటు పోర్టు విశాఖలో ఉన్నాయి. తాజాగా శ్రీలంకలో పట్టుబడ్డ ఐసిస్‌ ఉగ్రవాదుల విచారణలో విశాఖపై ఉగ్ర సంస్థలు దృష్టి పెట్టినట్లు బయటపడింది. ఇప్పటికే  సిటీకి సంబంధించిన మ్యాప్‌లు, రద్దీగా ఉండే ప్రాంతాలు, జాతీయ సంస్థలు, నావల్ కమాండెంట్, పోర్టుకు సంబంధించిన వివరాలు ఉగ్రవాదులు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇంటలిజెన్స్ వర్గాలు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి చెప్పారని సమాచారం. దీంతో సీఎం ఆదేశాల మేరకు డీజీపి రాముడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  
విశాఖపై ఉగ్రవాదుల రెక్కీ
లష్కర్ ఏ తోయిబా, జైషే ఏ మహ్మద్ సంస్థల సహాయాన్ని ఐసీస్ తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఏపీకి అందిన ఇంటిలిజెన్స్ నివేదికలో తేలింది. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు విజయవాడలో లా అండ్ ఆర్డర్ పై విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు..దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. సముద్ర జలాల ద్వారా ముష్కరులు శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి విశాఖలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేశారని..విశాఖలో ఇప్పటికే కొందరు స్లీపర్ సెల్స్ ప్రవేశించాయన్న అనుమానం ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో విశాఖతో పాటు తూర్పు తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖతో పాటు త్రిచి, తిరువనంతపురం, పూణే, చెన్నై, వారణాసిలపై కూడా ఉగ్రవాదులు దృష్టి పెట్టారంటున్నారు డిజిపి. 
విశాఖలోకి ప్రవేశించిన స్లీపర్‌సెల్స్‌ 
ఈ నెల 10న విశాఖ పర్యటనకు వచ్చిన భారత నౌకా దళాధిపతి సునీల్ లాంబ ప్రకటన విశాఖపై ఉగ్ర నీడ అన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఏ సమయంలోనైనా యుద్ధం లేదా దాడులు జరిగే అవకాశం ఉందని..అప్రమత్తంగా ఉండాలని లాంబ పిలుపునిచ్చారు. సెరిమోనియల్ పేరెడ్‌లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్ చేశారు. ఆయన కూడా అధికారులతో ఇంటిలిజెన్స్ నివేదిక, ఉగ్ర కదలికలు, విశాఖపై  గురి వంటి అంశాలు చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు..ఎవరి కదలికలపైన అనుమానం కల్గినా సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. 

11:18 - July 13, 2016

రవికుమార్‌.పి దర్శకత్వంలో తరుణ్‌తేజ్‌, శ్రీలేఖ జంటగా తేజ ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై లక్ష్మి దివ్య సమర్పణలో పద్మజ నిర్మిస్తున్న చిత్రం 'ఎలాగైనా సినిమా తియ్యాలి'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత పద్మజకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పాటలు, టీజర్‌, చాలా బాగున్నాయి. దర్శకుడు రవికుమార్‌ చిత్రాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. మంచి ప్రమోషన్‌తో సినిమాను విడుదల చేస్తే పెద్ద విజయం సాధిస్తుంది' అని అన్నారు. 'ఒక ఆశయంతో తీసిన సినిమా ఇది. ఒక యువకుడు చదువు కోసం సిటీకి వచ్చి సినిమాపై ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏం సాధించలేక చనిపోతాడు. ఆ టైమ్‌లో అతని తమ్ముడు అన్నయ్య ఆశయం కోసం చదువు మానేసి చిత్ర పరిశ్రమలో ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తంతో ఆద్యంతం వినోదాత్మకంగా, ఆలోచింప చేసేలా రూపొందించిన చిత్రమిది. నేను సమకూర్చిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని దర్శకుడు రవికుమార్‌ తెలిపారు.

 

పెరుగుతున్న గోదారి వరద ఉధృతి

తూర్పుగోదావరి : ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి  పెరుగుతోంది. ప్రస్తుతం 14.7 అడుగులు నీటి మట్టం ఉంది. 50 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం గోదారి వరద ఉధృతి దగ్గర తగ్గింది. లోతట్టు ప్రాంతాలకు ముప్పు తప్పింది. నీటి మట్టం 49.8 అడుగులకు తగ్గింది. అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. 

10:53 - July 13, 2016

తూర్పుగోదావరి : ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి  పెరుగుతోంది. ప్రస్తుతం 14.7 అడుగులు నీటి మట్టం ఉంది. 50 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం 
గోదారి వరద ఉధృతి దగ్గర తగ్గింది. లోతట్టు ప్రాంతాలకు ముప్పు తప్పింది. నీటి మట్టం 49.8 అడుగులకు తగ్గింది. అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. 

 

10:47 - July 13, 2016

ప్రకాశం : అసలే కడు పేదరికం. ఆ కన్న తల్లి రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ డొక్కలు నిండని పరిస్థితి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన కుమారుడికి అనారోగ్యం. కూలీ నాలీ చేసుకుని బతికే ఆమెది కుమారుడిని కాపాడుకోలేని దయనీయ పరిస్థితి. రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ తన కుమారున్ని ఆదుకోవాలని, దాతలు ఆర్థిక సాయం అందించాలని ఓ మాతృమూర్తి కోరుతోంది.
అవినాష్‌ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి..
ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు అవినాష్‌. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరుకు చెందిన ఆదిలక్ష్మి, రమణయ్య దంపతుల పెద్ద కుమారుడైన అవినాష్‌ తరగతిలో అందరు పిల్లల కంటే తెలివైన విద్యార్థి. పామూరులోని మదర్‌ కేర్‌ పాఠశాలలో చదువుతున్న అవినాష్‌కి హఠాత్తుగా అనుకోని అనారోగ్య సమస్య వచ్చి పడింది. మూడేళ్ల వయస్సులోనే రెండు కిడ్నీలు చెడిపోయాయి. కూలీ నాలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆదిలక్ష్మి.. కుమారునికి వైద్యం చేయించలేని హృదయవిదారకర పరిస్థితి. 
కూలీ పనులకు వెళ్తూ అవినాష్‌కు వైద్య ఖర్చులు
ఇంట్లో కనీసం గ్యాస్‌ సిలిండర్‌ కూడా లేకపోవడంతో కట్టెల పోయ్యిపైనే వంట చేస్తున్న ఆదిలక్ష్మి.. ఇద్దరు పిల్లల్ని చదివించడానికి స్థోమతకు మించిన పనే. భవన నిర్మాణ కూలీ పనులకు వెళ్తూ ఇటు అవినాష్‌కు వైద్య ఖర్చులు, అటు అనారోగ్యంతో ఉన్న తల్లిని పోషిస్తూ వస్తోంది. రెండు కిడ్నీలు పాడైన అవినాష్‌కు నెలకు నాలుగైదు వేలు ఖర్చవుతోంది.  
బాలున్ని ప్రభుత్వం ఆదుకోవాలి : స్థానికులు
ఎప్పుడూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే అవినాష్‌ ఈ మధ్య అనారోగ్యం కారణంగా వారంలో రెండు రోజులు స్కూల్‌ మానేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అతిపెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్నారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 
మా కుమారుడికి కొత్త జీవితాన్ని ఇవ్వండి : తల్లి ఆదిలక్ష్మి
పేదరికం కారణంగా బతుకుదెరువే కష్టంగా మారిందని, కుమారుడికి వేలల్లో ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్థోమత తనకు లేదని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది దాతలు కనికరం చూపించి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. విరాళాలు అందించి తన కుమారుడికి కొత్త జీవితాన్నివ్వాలని కోరుతోంది. 
ఆంధ్రాబ్యాంక్‌ అక్కౌంట్‌కు ఆర్థిక సాయం 
ఆర్థిక సాయం అందించాలనుకునే దాతలు 73306 40203కు కాల్‌ చేయాలని, లేదా 0443101 00061 840  ఆంధ్రాబ్యాంక్‌ అక్కౌంట్‌కు ఆర్థిక సాయం చేయాలని ఆదిలక్ష్మి కోరుతోంది. పరిమళించిన మానవత్వంతో దాతలు ముందుకు రావాలని, అభం శుభం తెలియని వయస్సులో అతిపెద్ద ఆనారోగ్య సమస్యతో బాధపడుతున్న అవినాష్‌ని ఆదుకోవాలని టెన్‌ టీవీ కోరుతోంది. 

 

10:26 - July 13, 2016

రవిబాబు దర్శకత్వంలో సురేష్‌బాబు సమర్పణలో పందిపిల్ల కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రానికి 'అదిగో' అనే టైటిల్‌ ఖరారు చేశారు. 'నచ్చావులే', 'అవును', 'లడ్డూబాబు' వంటి సినిమాలతో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాల దర్శకుడిగా దర్శక, నటుడు రవిబాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో సినిమాపై ఇండిస్ట్రీలో ఆసక్తి ఏర్పడింది. నిర్మాత సురేష్‌బాబు సహకారంతోనే ఇలాంటి విలక్షణ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రవిబాబు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడంలో ఎదురైన అనేక సవాళ్ళను దాటి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం వైవిధ్యభరితంగా ఉండే ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం. కొత్త నటీనటులు అభిషేక్‌, నాభ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలు ప్రకటిస్తాం' అని నిర్మాతలు అన్నారు.

 

09:49 - July 13, 2016

సినీనటి హన్సిక పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. మానవతా దృక్పథంతో కొంతమంది చిన్నారులను ఇప్పటికే దత్తత తీసుకుని, వారి ఆలనాపాలనా చూసుకోవడంతోపాటు చదివిస్తోంది. ఇందు కోసం తాను స్వయంగా వేసిన పెయింటింగ్‌లను అమ్మడం విశేషం. అంతేకాకుండా ఇళ్లు లేక ఫుట్‌పాత్‌లపై పడుకునే నిస్సహాయులకు బట్టలు, దుప్పట్లు పంచుతోంది. తనలాగే అందరూ ఎంతో కొంత సహాయం చేస్తే అభాగ్యులకు ఆసరాగా నిలుస్తుందంటూ రిక్వెస్ట్‌ చేసే ఓ వీడియోక్లిప్‌ను ట్వీట్‌ చేసింది హన్సిక. 'దయజేసి ఇతరులకు సహాయం చేయండి. ఇది వర్షాకాలం. నిరాశ్రయుల ప్రాథమిక అవసరాలు తీర్చడంలో మీ వంతు సాయం చేయండి. మనం చేయగలిగిన అతిచిన్న పని ఇదే' అని హన్సిక అందర్నీ రిక్వెస్ట్‌ చేస్తోంది. సేవా కార్యక్రమాలు చేస్తూనే 'బోగస్‌', 'వెట్టై మన్నన్‌' వంటి తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది హన్సిక. 

 

కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన తమ్మినేని పాదయాత్ర

కరీంనగర్ : జిల్లాలోని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ప్రారంభం అయింది. ఐదు గిరిజన గ్రామాల్లో తమ్మినేని పాదయాత్ర కొనసాగనుంది. 

 

నర్సంపేట డివిజన్ లో దొంగల సంచారం..

వరంగల్ : నర్సంపేట డివిజన్ లో దొంగలు సంచరిస్తున్నారు. దొంగల భయంతో నెక్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు కర్రలు పట్టుకుని రాత్రుళ్లు పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

 

పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరికి వరద ఉధృతి

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. కడెమ్మ, ఔట్ పాల్స్ స్లూయిస్ వద్ద నీటి మట్టం 17 అడుగులకు చేరింది. కొత్తూరు కాజ్ వే వద్ద వరద ప్రవాహం భారీగా పెరిగింది. 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. 

జలదిగ్బంధంలో కోనసీమ గ్రామాలు

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని పలు కోనసీమ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

08:35 - July 13, 2016

ప్రజలకు అన్యాయం చేయకుండా భూ సమీకరణ చేయాలని వక్తలు కోరారు. 'ప్రాజెక్టులు.. భూ సమీకరణ' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీడీపీ నేత మాల్యాద్రి పాల్గొని, మాట్లాడారు. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భూమి సేకరించాలని సూచించారు. 2013 భూ సమీకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు న్యాయం జరుగుతోందని చెప్పారు. కార్పొరేట్ సంస్థలను బతికించడం కోసం ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:23 - July 13, 2016

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సత్య డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. 'రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్ కు వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.  పిడిఎస్ యు, ఎస్ ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. విద్యార్థి సంఘాల బంద్ కు కారణం ఏమిటి?  తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం, ఏర్పడ్డ తర్వాత విద్యారంగం ఎలా వుంది? విద్యారంగంలో రావాల్సిన మార్పులేమిటి? ఇలాంటి అంశాలపై సత్య మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:17 - July 13, 2016

కొత్త విద్యా సంవత్సరంలోనూ పాత కష్టాలే వెన్నాడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో సౌకర్యాలు మెరుగుపడలేదు. టీచర్ల పోస్టులు భర్తీ చేయలేదు. ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అమలు కాలేదు. దీంతో విద్యార్థి సంఘాలు మరోసారి విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. 
విద్యార్థులకు తీరని కష్టాలు 
కొత్త విద్యా సంవత్సరం మొదలై, నెల రోజులైంది. పాత సంవత్సరంలో విద్యార్థులను ఏ సమస్యలు బాధించాయో ఇప్పుడూ అవే కష్టాలు వెన్నాడుతున్నాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల కష్టాలు తీరడం లేదు.  ప్రభుత్వ స్కూల్స్ లో ఒకరమైన కష్టాలు  వేధిస్తుంటే, ప్రయివేట్ స్కూళ్లల్లో మరో రకమైన బాధలు వెన్నాడుతున్నాయి.  ఒకచోట చదువు చెప్పేందుకు అవసరమైనంత మంది టీచర్లుండరు. మరోచోట ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ ఖర్చులు  మోయలేనంత భారంగా మారుతున్నాయి. ఒకరు చదువు అబ్బక అవస్థపడుతుంటే, మరొకరు ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా నలిగిపోతున్నారు. 
చాలా ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాలు అందలేదు
స్కూళ్లు తెరచి 30 రోజులైనా ఇప్పటికీ చాలా ప్రభుత్వ స్కూళ్లకు పుస్తకాలు అందలేదు. ఖాళీగా వున్న టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. కనీసం విద్యావాలంటీర్ల నియామకాలూ పూర్తి చేయలేదు.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజుల తర్వాత విద్యావాలంటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నియామకాలు పూర్తి చేయడానికి ఇంకెంత టైమ్ తీసుకుంటారో తెలియదు.  అప్పటి దాకా విద్యార్థులకు జరిగే నష్టానికి బాధ్యత వహించేదెవరు?  ఈ కాంపిటేటివ్ యుగంలో ప్రతి నిమిషమూ విలువైనదే. ఒకట్రెండు మార్కులతోనే ర్యాంక్ లు, సీట్లు కోల్పోతున్నవారెందరో? టీచర్ల నియామకాలలోనే ఇంత అలక్ష్యం ప్రదర్శిస్తే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ యుగంలో తట్టుకునేదెలా? 
ఫీజుల నియంత్రణకు తీసుకున్న నిర్ధిష్టమైన చర్యలేమిటి?  
ప్రయివేట్, కార్పొరేట్ కాలేజీలలో ఫీజులు నియంత్రించాలంటూ గత కొన్నేళ్లుగా పేరెంట్స్ ఆందోళనలు చేస్తూనే వున్నారు. సదస్సులు, సెమినార్ లు, ర్యాలీలు, చివరకు పాఠశాలల ముందు ధర్నాలు లాంటి ఉద్యమాలెన్నో చేశారు. కానీ,  ఫీజులు దిగిరావడం లేదు.  ఏటేటా పది , పదిహేను, ఇరవై శాతాల చొప్పున పెంచుకుంటూ పోతూనే వున్నారు. ఇంతింతై వటుడింతై అన్న రీతిలో సాగిపోతున్న ఫీజుల దందాకు కళ్లెం పడేదెప్పుడు? ఏవో కొన్ని స్కూళ్లకు నోటీసులివ్వడం తప్ప ఇప్పటి దాకా ఫీజుల నియంత్రణకు తీసుకున్న నిర్ధిష్టమైన చర్యలేమిటి?  ఎల్ కె జీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక మోస్తరు స్కూళ్లో చదివిస్తేనే ఒక్కొక్క విద్యార్థి మీద నాలుగైదు లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి  ఏర్పడితే,  అంతకు మించిన విద్యా దోపిడీ మరొకటి వుంటుందా? 
పిల్లల చదువుల కోసం అప్పులు
ఫీజుల భారం ఇంతగా పెరుగుతున్నా, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా, తమ బిడ్డలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. ఇందుకు ఏకైక కారణం వాటి నిర్వహణ పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యమే.  కెజీ టు పీజీ, మోడల్ స్కూల్స్, మోడల్ గురుకులాలు, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇంగ్లీషు మీడియం అంటూ ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా, ఆచరణలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుంటోంది.  కనీసం ఆడపిల్లలకు టాయ్ లెట్స్ కూడా నిర్మించలేని దీనావస్థ.  ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలంటూ, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రించాలంటూ ఉద్యమించేవారికి లాఠీ దెబ్బలు  తగులుతున్నాయి తప్ప పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. 

 

08:13 - July 13, 2016

హైదరాబాద్ : నగరంలోని పల ప్రాంతాల్లో అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ పర్యటించారు. కూకట్ పల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ పనులను పరిశీలించారు. పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో అధికారులపై కేటీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నారి రమ్య ప్రమాద ప్రాంతాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రోడ్డు ఇరుకుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని భావించారు. రోడ్డు వెడెల్పునకు ప్రాణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

08:11 - July 13, 2016

శ్రీనగర్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర్ల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 30కి చేరింది. దాదాపు 800 మంది గాయాలపాలయ్యారు. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రజలకు విజ్ఞప్తి చేశారు
శాంతి నెలకొల్పేందుకు సహకరించాలి : మోడీ
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్ల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని మోది సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌, జితేంద్రసింగ్‌, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు శాంతియుతంగా ఉండాలి : సీఎం మెహబూబా ముఫ్తి 
కశ్మీర్‌ అల్లర్లపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే ఎక్కువమంది గాయపడ్డారని తెలిపారు. దాడుల్లో చాలా మంది చూపును కోల్పోయారని పేర్కొన్నారు. అమరనాథ్‌ యాత్రికులకు సహకరిస్తున్న ప్రజలకు సిఎం సెల్యూట్‌ చేశారు.
పది జిల్లాల్లో నాలుగోరోజూ కర్ఫ్యూ 
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలోజమ్ముకశ్మీర్‌లోని పది జిల్లాల్లో నాలుగోరోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. అనంతనాగ్‌, షోపియాన్‌, కుల్గాం, పుల్వామా, బారాముల్లా, సోపోర్‌, కుప్వారా, గందేర్‌బల్‌, బందిపొరా, శ్రీనగర్‌, బద్గాంలో భద్రతాసిబ్బంది ఆంక్షలు విధించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కశ్మీర్‌ ఘర్షణల్లో 30 మంది మృతి 
2010 తర్వాత మరోసారి కశ్మీర్‌ తీవ్రస్థాయిలో అట్టుడుకుతోంది. కశ్మీర్‌ ఘర్షణల్లో ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు. 8 వందలమంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో వందమంది పోలీసులున్నారు. కశ్మీర్‌ ఉద్రిక్తతల కారణంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా పర్యటనను వాయిదా వేసుకున్నారు. జమ్ముకశ్మీర్‌కు అదనంగా కేంద్రం 8 వందల జవాన్లను పంపింది.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి : సిపిఐ
కశ్మీర్‌లో తిరిగి శాంతిని పునరుద్ధరించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. బుర్హాన్‌ వాని మృతిని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని, ఈ ఘటన వెనక ఏదో లోపం ఉందని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని పేర్కొంది.
మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర 
అల్లర్ల కారణంగా ఆగిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్తూ జమ్మూలో చిక్కుకుపోయిన వారిని యాత్రకు పంపించారు. సుమారు 300 వాహనాలు యాత్రికులతో జమ్మూ నుంచి కశ్మీర్‌కు వెళ్లాయి.

 

07:54 - July 13, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు రష్యా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నాలుగో రోజు ఆయన చెలబిన్స్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ బోరిస్‌, మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విధాన విభాగాధిపతి ఒలెగ్‌ బొచరోవ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరికను మన్నించిన బోరిస్‌, బొచరోవ్‌.. అమరావతిని ప్రపంచస్థాయిలో నిర్మించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. 
చెలబిన్స్‌, మాస్కోలో బాబు పర్యటన 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యాలోని చెలబిన్స్‌, మాస్కోలో పర్యటించారు. నాలుగో రోజు పర్యటనలో భాగంగా చెలబిన్స్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ బోరిస్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇరు ప్రాంతాల పక్షాన ఐదుగురు సభ్యులతో కూడిన వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణియించారు. ఏపీ ఐటీ పరిజ్ఞానాన్ని చెలబిన్స్‌ ప్రావిన్స్‌కు అందిస్తామని చంద్రబాబు బోరిస్‌కు హామీ ఇచ్చారు. 
ఒలెగ్‌ బొచరోవ్‌తో బాబు సమావేశం 
అనంతరం చంద్రబాబు మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విధాన విభాగాధిపతి ఒలెగ్‌ బొచరోవ్‌తో సమావేశమయ్యారు. రాజధాని భవనాల నిర్మాణంలో ఏపీకి సహకరించేందుకు బొచరోవ్‌ సంసిద్ధత తెలిపారు. నూతన రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించగల సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని బొచరోవ్‌ తెలిపారు. 
యాంట్‌సెంటర్‌తో సీఎం చంద్రబాబు భేటీ 

తర్వాత సీఎం చంద్రబాబు గాజ్‌ప్రోమ్‌ బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్ యాంట్‌సెంటర్‌తో భేటీ అయ్యారు. ఏపీలో భారీ పారిశ్రామిక యంత్ర సామాగ్రి అవసరం ఉందని, తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు కోరారు. పెట్టుబడులకు అనువైన స్నేహపూర్వక వాతావరణం ఏపీలో ఉందని వివరించారు. 
షరనోవ్‌ డిమిత్రితో సీఎం చంద్రబాబు చర్చలు
బష్కొరొస్తాన్‌ ప్రభుత్వ డిప్యూటీ ప్రధానమంత్రి షరనోవ్‌ డిమిత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. టెలివిజన్‌ పరికరాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్ల తయారీలో తాము ముందున్నామని ఈ సందర్భంగా డిమిత్రి తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్లు డిమిత్రి చెప్పారు. ఈ-పాలన విధానాలపై అధ్యయనానికి భారత్‌ వస్తామని, ఉభయులకు లాభదాయకమైన భాగస్వామ్యం కోసం ప్రయత్నిద్దామని ఈ సందర్భంగా డిమిత్రి తెలిపారు.

07:48 - July 13, 2016

హైదరాబాద్ : గ్రీన్‌ హైదరాబాద్‌ లక్ష్యంగా ముందుకెళుతోంది జీహెచ్‌ఎంసీ. హరితహారం కార్యక్రమాన్ని ఇక నిరంతర ప్రక్రియగా మార్చనున్నారు. ఇకపై గ్రేటర్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ..మొక్కలు నాటడం తప్పని సరిచేయాలని బల్దియా అధికారులు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. 
గ్రీనరీని పెంచడానికి కొత్తప్లాన్‌   
హైదరాబాద్‌లో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో... జీహెచ్‌ఎంసీ అధికారులు ఖుషీగా ఉన్నారు. గ్రేటర్‌పరిధిలో గ్రీనరీని పెంచే లక్ష్యంతో కొత్త ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారు. 
హరితహారానికి అన్నివర్గాల స్పందన
భాగ్యనగరానికి పచ్చలహారం.. ఇక నిరంతరంగా కొనసాగనుంది. ఈసారి వాతావరణం కూడా అనుకూలించడంతో... భారీ ఎత్తున మొక్కలు నాటారు. సామాన్యులు మొదలు, గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, సినీ ప్రముఖులు... ఇలా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడంతో మొక్కలు నాటే కార్యక్రమం సక్సెస్‌ అయిందని గ్రేటర్‌ అధికారులు భావిస్తున్నారు. ఇదే ఊపుతో  ముందుకెళ్లాలని ప్లాన్స్ రెడీ చేశారు. ఇక నుంచి గ్రేటర్‌పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ... మొక్కలు నాటడం, పెంచడం తప్పని సరి చేస్తున్నారు. గ్రీనరీనీ పెంచడానికి వాల్టాచట్టాన్ని  అమలు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. వ్యాపార, పారిశ్రామిక, రెసిడెన్సియల్‌ ప్రాంతాల్లో మొక్కలు పెంచకుంటే.. ఆక్యూఫైడ్‌ సర్టిఫికేట్లజారీని నిలిపివేస్తామంటున్నారు.  
వచ్చే ఏడాది నుంచి  గ్రీనరీప్లాన్‌ అమలు
ఇప్పటి నుంచి గ్రేటర్‌ ప్రజలకు అడిగినన్ని మొక్కలు పంపిణీ చేస్తామంటున్నారు  అధికారులు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతోపాటు అటవీశాఖల నుంచి అన్నిరకాల మొక్కలను అందుబాటులో ఉంచనున్నారు. వచ్చే ఏడాది నుంచి గ్రీనరీప్లాన్‌ను కఠినంగా అమలు చేస్తామంటున్నారు కమిషనర్‌. మొత్తానికి హరితహారం ఇచ్చిన ఊపుతో ఉన్న బల్దియా అధికారులు ... నగరంలో పచ్చదనాన్ని పెంచడం అనేది నిరంతర ప్రక్రియగా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 

07:43 - July 13, 2016

కరీంనగర్‌ : జిల్లాలో గౌరవెల్లి, గండుపెల్లి ప్రాజెక్ట్‌ల భూ నిర్వాసితులకు సీపీఎం బాసటగా నిలిచింది. ఈరెండు  రిజర్వాయర్‌ల ఎత్తును పెంచాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించిది. దీంతో  నిర్వాసితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేస్తున్నారు.  
నిర్వాసితుల ఉద్యమ బాట 
కరీంనగర్ జిల్లాలోని గౌరవెల్లి, గండుపెల్లి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిర్వాసితులు ఉద్యమ బాట పట్టారు. వీరికి మద్దతుగా సీపీఎం తెలంగాణ  కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముంపు గ్రామాల్లో రెండు రోజుల పర్యటన చేపట్టారు. గౌరవెల్లి పరిధిలోని గుడాటిపల్లి గ్రామం నుంచి తమ్మినేని పాదయాత్ర చేపట్టారు.  గౌరవెల్లి,గుడాటిపల్లి,తెనుగుపల్లి, చింతల్ తాండా,కొత్తపల్లి మీదుగా గండుపెల్లి గ్రామం వరకు మొదటిరోజు పాదయాత్ర కొనసాగింది.
ప్రభుత్వ తీరుపై తమ్మినేని ఆగ్రహం 
తెనుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకుపెద్ద ఎత్తున తరలివచ్చి ముంపు గ్రామాల ప్రజలు తమ గోడువెల్లబోసుకున్నారు. భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవెల్లి, గండిపెల్లి, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం అవసరం లేదని ఇంజనీర్లు చెబుతున్నా ముఖ్యమంత్రి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటు విమర్శించారు. 
భూములను ధనికులకు కట్టబెట్టడానికి సీఎం కేసీఆర్ యత్నం : బి.వెంకట్
పేద ప్రజల భూములను కొల్లగొట్టి దాదాపు 5లక్షల ఎకరాలను ధనవంతులకు కట్టబెట్టడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భూపోరాట కమిటీ కన్వీనర్ బీ వెంకట్ విమర్శించారు. రిజర్వాయర్‌ల ఎత్తు పెంచి తండాలను ముంచాలని ప్రభుత్వం చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్‌ల ఎత్తును పెంచనీయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

 

హైదరాబాద్ లో అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ పర్యటించారు. కూకట్ పల్లి, ఉషాముళ్లపూడి, పంజాగుట్ట ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోడ్లపై వర్షపు నీరు ఉండడంతో మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ్య మృతికి కారణమైన ప్రాంతాన్ని పరిశీలించారు. 

ఆదిలాబాద్ జిల్లాలో నేడు మంత్రి జోగు రామన్న పర్యటన

ఆదిలాబాద్ : జిల్లాలో నేడు అటవీశాఖ మంత్రి జోగు రామన్న పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  

 

నేడు తెలంగాణలో ఎంసెట్2 ఫలితాలు విడుదల

హైదరాబాద్ : నేడు తెలంగాణలో ఎంసెట్2 ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు కానున్నాయి. మంత్రి లక్ష్మారెడ్డి, కన్వీనర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

07:07 - July 13, 2016

నల్గొండ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. పీఏపల్లి మండలం చిలకమర్రిగేటు వద్ద బైక్‌ను ఇన్నోవా వాహనం ఢీకొనడంతో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. మృతులు నేనావత్‌తండా వాసులుగా గుర్తించారు. మృతదేహాలను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి ఎల్లారెడ్డిగూడెంలో లారీ ఇన్నోవా వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. 

https://youtu.be/oSX6HjclFJs

 

07:04 - July 13, 2016

హైదరాబాద్ : గోల్కొండ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్టు జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు అధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 4 రౌడీ షీటర్లు, ఇద్దరు చైన్ స్నాచర్లు, 25 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 21బైకులను స్వాధీనం చేసుకున్నారు.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నల్గొండ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పీఏ పల్లి మండలం చిలకమర్రిగేటు వద్ద బైక్ ను ఇన్నోవా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు మానవత్ తండా వాసులు భాస్కర్, లక్ పతి, నెహ్రూ, శివలు గుర్తించారు. 

 

గోల్కొండ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : గోల్కొండ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్టు జోన్ డిసిపి వెంకటేశ్వర్ రావు అధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 4 రౌడీ షీటర్లు, ఇద్దరు చైన్ స్నాచర్లు, 25 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 51బైకులను స్వాధీనం చేసుకున్నారు.

Don't Miss