Activities calendar

14 July 2016

22:18 - July 14, 2016

ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వాన్నికూల్చే ప్రయత్నం.. విపక్ష పార్టీలు అధికారంలో ఉండటాన్ని సహించలేని కుట్రలు.. అడ్డదారులను తొక్కే అధికార దాహం.. రాజ్యాంగం, నైతిక విలువలు అన్నిటినీ తుంగలో తొక్కే ప్రయత్నం.. అన్నిటికీ చెక్ పడింది. అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో బిజెపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం జోక్యం చేసుకుంటేగానీ సీన్ మారలేదు. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే ప్రయత్నం.. రాష్ట్రాల గొంతు నులిమేయత్నం.. ఫిరాయింపులతో అరుణాచల్ ప్రదేశ్ సర్కారును కూల్చే ప్రయత్నాలు చేశారు. సుప్రీం జోక్యంతో పరిస్థితి చక్కబడుతోంది. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన పరిణామాల తీరు.. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల్లో కొత్త చర్చను లేవనెత్తుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో అసలేం జరిగింది? కాంగ్రెస్ సుప్రీం మెట్లేక్కేంత వరకు ఎందుకొచ్చింది? రాష్ట్రాలపై కేంద్రం ఒత్తడి పెరుగుతోందా? ఫిరాయింపులను అడ్డు పెట్టుకుని బీజెపీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుందా? ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందా? రాజకీయ ఎత్తుగడలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయా? అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఉత్తరాఖండ్ లో కూడా ఇలాంటి పరిణామాలే జరిగాయి.. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సంక్షోభానికి దారితీసింది. రాజకీయ ఎత్తుగడలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి.. అప్పుడు కూడా సుప్రీంకోర్ట్ జోక్యం చేసుకోవలసిన అవసరం వచ్చింది.. అరుణాచల్ ప్రదేశ్..!! ఉత్తరాఖండ్..!! ఈ పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయా..? రాష్ట్రపతి పాలనతో ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారా..? విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై పగ సాధిస్తున్నారా..? అనే సందేహాలు రాకమానవు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో.. గవర్నర్ పంపిన నివేదిక ద్వారా లేదా మరో విధంగాగానీ, రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కానీ, రాజ్యాంగంలోని ఈ 356 అధికరణం వివాదాస్పదం గా ఎందుకు మారుతోంది? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఎస్ఆర్ బొమ్మై కేసు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి? ఫెడరల్ రాజ్యంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలి. అంతేకానీ, కక్ష సాధింపుతో రాష్ట్రాల గొంతు నులమటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజా తీర్పును గౌరవించే ముగింపే అంతిమం కావాలి. సుప్రీం తీర్పు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అంశాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కొత్త పాఠాలు నేర్చుకోవాలని చెప్తున్నాయి.

 

 

 

22:00 - July 14, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తన పాత సంప్రదాయాలకు స్వస్తి పలికింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే సిఎం అభ్యర్థిని తేల్చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, షీలాదీక్షిత్‌ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది.

యుపి కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్...
వ‌చ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెర లేపింది. యుపి సిఎం అభ్యర్థిగా 78 ఏళ్ల షీలా దీక్షిత్ పేరును ఖ‌రారు చేసింది. ఆమెకున్న మంచి పేరు, సుదీర్ఘ అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్‌కు షీలాదీక్షిత్‌ కృత‌జ్ఞత‌లు ..
త‌న‌కు ఈ బృహ‌త్తర బాధ్యత‌ను అప్పగించిన కాంగ్రెస్‌కు షీలాదీక్షిత్‌ కృత‌జ్ఞత‌లు తెలిపారు. యూపీలో ఎన్నిక‌లు పెద్ద స‌వాలేన‌ని, దానికి పూర్తి సంసిద్ధతతో వెళ్తామ‌ని ఆమె అన్నారు. ఈసారి విజ‌యం త‌మ‌దేన‌న్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ప్రియాంక ప్రచార బాధ్యత‌లు తీసుకోవాల‌ని తాను కూడా కోరుకుంటున్నట్లు షీలా పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌తో షీలా దీక్షిత్ కు విడదీయని సంబంధం...
షీలా దీక్షిత్‌కు ఉత్తరప్రదేశ్‌తో విడదీయని సంబంధముంది. కేంద్రమంత్రిగా, గ‌వ‌ర్నర్‌గా ప‌నిచేసిన‌ యూపీ కాంగ్రెస్ నేత ఉమాశంక‌ర్ దీక్షిత్‌కు షీలాదీక్షిత్ కోడ‌లు. ఆమె భర్త పేరు వినోద్‌ దీక్షిత్‌. షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు వరుసగా మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె హయాంలోనే ఢిల్లీలో మెట్రో, ఫ్లయిఓవర్‌ల అభివృద్ధి జరిగింది. 1984 నుంచి 1989 వరకు యుపి కన్నౌజ్‌ నుంచి ఎంపిగా ఎంపికయ్యారు. షీలాదీక్షిత్‌ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

షీలా హయాంలో కుంభకోణాలు...
ఢిల్లీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేరు తెచ్చుకున్న షీలా హయాంలోనే పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. కామన్‌వెల్త్, వాటర్‌ టాంకర్ల కొనుగోళ్లలో అక్రమాలు, మీటర్ల స్కాం లాంటి ఆరోపణలున్నాయి. వాటర్‌ టాంకర్ల స్కాంలో ఎసిబి సమన్లు కూడా పంపింది. ఆగస్టు 26న షీలా ఎసిబి ముందు హాజరు కానుంది. షీలాపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసం చేసినవేనని కాంగ్రెస్‌ కొట్టి పారేసింది.

బ్రాహ్మణ ఓటు బ్యాంకు కోసం షీలా...
ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని షీలా దీక్షిత్‌ను కాంగ్రెస్‌ ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

21:55 - July 14, 2016

హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రీవాణిపై గృహహింస కేసు నమోదైంది. తనపై దాడి చేసి ఇల్లు కూల్చేందుకు యత్నించారన్నది ఆమె వదిన అనూష చేస్తున్న ఆరోపణ. అయితే.. ఈగొడవతో తమకెలాంటి సంబంధం లేదని శ్రీవాణి చెబుతోంది. ఆస్తి కోసం వదినామరదళ్ళు రచ్చకెక్కడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అనూష భర్త చనిపోయాక పెరిగిన ఆస్తి తగదాలు..
బుల్లితెర నటి శ్రీవాణి వ్యవహారం పోలీసు మెట్లెక్కింది. శ్రీవాణి దంపతులపై.. ఆమె వదిన అనూష గృహహింస కేసు పెట్టారు. తనపై దాడి చేసి.. ఇంటిని కూల్చేందుకు శ్రీవాణి ప్రయత్నించిందని అనూష ఆరోపిస్తున్నారు. భర్త బాబ్జీ చనిపోవడం.. తనకు పిల్లలు లేకపోవడంతో.. ఆస్తి వదిలి పుట్టింటికి వెళ్లిపోవాలని శ్రీవాణి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారన్నది అనూష ఆరోపణ.

శ్రీవాణి దంపతులపై గృహహింస చట్టం కింద కేసు ..
రెండు రోజుల క్రితం అనూష ఉంటున్న ఇంటిని శ్రీవాణి మనుషులు.. జేసీబీతో కూల్చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో.. వికారాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి వెళ్లి.. కూలిన ఇంటి పరిసరాలను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. శ్రీవాణి దంపతులపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనూష ఆరోపణల్లో వాస్తవం లేదంటున్న శ్రీవాణి దంపతులు..
అయితే అనూష ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నారు శ్రీవాణి దంపతులు.. ఆమెను తాము ఏనాడు వేధించలేదని మీడియాకు వివరించారు. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామన్నారు.

ఆస్తిని సమానంగా పంచుతానంటున్న శ్రీవాణి తండ్రి..
వివాదానికి కారణమైన ఆస్తిని అందరికీ సమానంగా పంచుతానని శ్రీవాణి, బాబ్జీల తండ్రి చెబుతున్నారు. పరిగిలో ఉన్న ఒకటిన్నర ఎకరా భూమి, 500 గజాల ఇంటిని అందరికీ దక్కేలా చూస్తానని వెల్లడించారు.

వాస్తవాన్ని తేల్చేందుకు దర్యాప్తును వేగవంతం..
ఈ వ్యవహారంలో.. ఆస్తి కోసం కుట్ర కోణంతో పాటు.. ఇంటిని కూల్చే యత్నం.. క్రిమినల్‌ వ్యవహారం కిందికి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అనూష, శ్రీవాణి ఆరోపణల్లో వాస్తవాన్ని తేల్చేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.

21:47 - July 14, 2016

మిషన్ భగీరథ పథకం గురించి విన్నాం. కానీ తెలంగాణలో దేవదాసు పథకం గురించి విన్నారా? అంటే...పగలు కూడా డ్రంక్ అండ్ డైవ్ నిర్వహిస్తామన్న ఖాప్స్... ఆంధ్రా మంత్రి ఆరోగ్యమంత్రికి బీపీ పెరిగిందంట...పుష్కరం మొదలు కాకుండానే పుష్కరజలం అమ్మకం...జరాలొస్తే వేపచెట్టు కొట్టేయాలన్న పాస్టర్..గంగిరెడ్లవారికి కుచ్చుటోపీ పెట్టిన మతబోధకుడు...వికలాంగురాలికి ఫించన్ కట్ చేసిన టీ.సర్కారు..బడి పిల్లలను కొడుతున్న హెడ్ మాస్టారు..ఆత్మహత్యకు యత్నించిన ఆటో..ఎంత చక్కగా వున్నాదో నా చెత్త కుండీ..అంటూ పాటలు పాడిన గద్దరన్న..గోల్లో తేలినట్లున్న భాగ్యనగరంలా రోడ్లు.. గిసువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న మోసుకొచ్చిండు..కాదు కాదు ..తీసుకొచ్చిండు..మరిన్ని ముచ్చట్లు చూడాలంటే ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి మల్ల..ఆ..

గల్లంతయినవారు సురక్షితం..

గుంటూరు : కృష్ణానదిలో పడవ మునక ఘటనలో గల్లంతయినవారు సురక్షితంగా బయటపడ్డారు. నదీ ప్రవాహం తక్కువగా వుండటంతో భక్తులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్...

శ్రీకాకుళం : కోఠి వీధిలో ఇద్దరు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళను కిరణ్, రవికాంత్ లను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.30కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్ లు,రూ.1.88 లక్షల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.  

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను అధికారిక నివాసంలో టీయూడబ్ల్యూజే నేతలు పల్లెరవికుమార్, క్రాంతి కలిశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్‌కార్డులు, గృహ వసతితోపాటు ఇతర అంశాలను టీయూడబ్ల్యూజే నేతలు సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేదిశగా చర్యలు చేపట్టాలని సమాచార శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీకి మరో అరుదైన అవార్డు..

విజయవాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డిజిటలైజేషన్‌ రంగంలో ప్ర‌థ‌మ‌స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాల్లో వివిధ కేట‌గిరీల్లో కేంద్రం ఈరోజు అవార్డుల‌ను ఇచ్చింది. దీంట్లో డిజిటలైజేషన్‌ రంగంలో అవార్డుని సాధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. ఏపీ ఐటీశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న ఈరోజు ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.

16న 'అరుణ' బలనిరూపణ ..

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బలనిరూపణ తేదీ ఖరారైంది. ఈ నెల 16న నబంతుకీ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో పూర్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే ఢిల్లీలోని అరుణాచల్ భవన్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నబంతుకీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

 

రేపు ఢిల్లీకి కేసీఆర్..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగనున్న అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 

చెన్నై ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..

చెన్నై: ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థిని  ఆత్మహత్య కలకలం రేపింది. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేస్తున్న మహేశ్వరీ బుధవారం హాస్టల్ గదిలో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుదుచ్చేరికి చెందిన ఆమెకు వివాహం అయిన ఆరేళ్ళ కూమారుడు కూడా ఉన్నాడు

నయా జిల్లాలకు నోటిఫికేషన్..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఏర్పాటు అనంతరం అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటుచేసి చర్చలు జరుపుతామన్నారు. ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుతోపాటు పలువురు అధికార, అనధికార, టీఆర్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు.

20:54 - July 14, 2016

హైదరాబాద్ : మనం లీటర్ పెట్రోల్ కి 70 రూపాయలు చెల్లిస్తుంటే, మన పొరుగునే వున్న పాకిస్తాన్ లో 46 రూపాయల 50 పైసలకే అమ్ముతున్నారు. పాకిస్తాన్ లో అంత చీప్ గా దొరుకుతున్న పెట్రోల్ మన దేశంలో ఎందుకు మండిపోతోంది? రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్ లో 108 డాలర్లున్న క్రూడాయిల్ ధర ఇప్పుడు 42 రూపాయలకే పడిపోయినా, ఆ ప్రయోజనం వినియోగదారులకు దక్కకపోవడానికి కారణం ఏమిటి? పెట్రోల్; డీజిల్ ధరల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మతలబు ఏమిటి?

జంగానే పెట్రోల్ ధర తగ్గిందా? లేక భ్రమా?...
ఈ లెక్క చూస్తే రెండేళ్లలో పెట్రోల్ ధర తగ్గినట్టు కనిపిస్తుంది. నిజంగానే పెట్రోల్ ధర తగ్గిందా? మనం భ్రమపడుతున్నామా?
అంతర్జాతీయ మార్కెట్ రేట్లను పరిశీలించాలి. ...
గత రెండేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయో, పెరిగాయో అర్ధం చేసుకోవాలంటే అంతర్జాతీయ మార్కెట్ రేట్లను పరిశీలించాలి. 2014 జూన్ లో అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్త రోజుల్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 108. 37 డాలర్లు. అప్పట్లో డాలర్ ధర సుమారు 60 రూపాయలు. మన కరెన్సీలో 6500 రూపాయలు పెడితే ఒక బ్యారెల్ క్రూ డాయిల్ వచ్చేది. ఒక బ్యారెల్ క్రూడాయిల్ దాదాపు 159 లీటర్ల పెట్రోల్ కు సమానం. అంటే అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్ లో లీటరు పెట్రోల్ 54 రూపాయలకు దొరికింది. దానికి కేంద్ర, రాష్ట్ర పన్నులు, డీలర్ కమిషన్ లు కలిపి 62 రూపాయల చిల్లరకు అమ్మారు. 2014 జూన్ లో 108 డాలర్లున్న క్రూడాయిల్ ధర 2015 జూన్ నాటికి 61 డాలర్లకు పడిపోయింది. మన కరెన్సీలో అయితే కేవలం 3923 రూపాయలు మాత్రమే. అంటే కేంద్రంలో నరేంద్రమోడీ, తెలంగాణ లో కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర భారీగా పడిపోయింది. నిజానికి 2015లో లీటర్ పెట్రోల్ పాతిక రూపాయలకే దొరికి వుండాలి. కానీ మనం 75 రూపాయల పైనే పెట్టాల్సి వచ్చింది.

మరింతగా దిగిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధర..
2016లో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర మరింత దిగొచ్చింది. తాజా ధర 42 డాలర్లు మాత్రమే. ఇప్పుడు డాలర్ విలువ సుమారు 67 రూపాయలుంది. మన కరెన్సీలో బ్యారెల్ క్రూడాయిల్ ధర కేవలం 3100 రూపాయలే. అంటే లీటర్ ధర 19 రూపాయల 49 పైసలే. కానీ ఇవాళ మనం 69 రూపాయలకు పైగానే సమర్పించుకుంటున్నాం. 2014లో మాదిరిగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ లు వసూలు చేసి వుంటే 40 రూపాయల కంటే ఇంకా తక్కువ ధరకే పెట్రోల్ దొరికేది. అంటే ఒక్కొక్క లీటర్ కు దాదాపు 30 రూపాయలు మనం అదనంగా చెల్లించుకుంటున్నాం. ఈ సొమ్మంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు తమ జేబుల్లో వేసుకుంటున్నాయి.

పాక్ లో లీటర్ రూ.46.55లు...
మన పొరుగునే వున్న పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ 46. 55 పైసలకే దొరుకుతోంది. ఇంత తక్కువ ధరకు పాకిస్తాన్ ఇవ్వగలిగినప్పుడు మన ప్రభుత్వాలు ఎందుకివ్వలేకపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ను విక్రయించే వుంటే , సొంత వాహనాలున్నవారు ఈ రెండేళ్లలో కనీసం పాతిక వేల రూపాయలు సేవింగ్ చేసివుండేవారు. బైక్ వున్నవారు పెట్రోల్ కనీసం నెలకు వెయ్యి నుంచి 1500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్కూల్ పిల్లల ఆటోలకు అంతే మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి వుంటే ప్రతి కుటుంబానికి ఇందులో సగం మిగిలేది.

పెట్రోలు రేటుతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువులు ధరలు..
రవాణా ఖర్చులు తగ్గడం వల్ల కూరగాయలు, పండ్లు , పాలుతో పాటు అన్ని రకాల నిత్యావసరాల ధరలు కాస్త చౌకగా లభించేవి. ట్రాక్టర్లతోనూ, ఇంజన్లతోనూ వ్యవసాయం చేసే రైతులకు ఇంధన ఖర్చులు తగ్గి వుండేవి. కానీ, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పతనమైన ప్రతిసారీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్, వ్యాట్ పన్నులు బాదేయడం సామాన్యుల పాలిట శాపంగా మారింది. 

20:41 - July 14, 2016

గుంటూరు : గుంటూరు జిల్లా వెల్దుర్థి మండలం సరిహద్దు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. కృష్ణానదిలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 20 మంది గల్లంతయ్యారు. గల్లంతయినవారు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల వాసులుగా గుర్తించారు. గల్లంతయినవారికోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కాగా చీకటి పడుతున్న క్రమంలో గాలింపు చర్యలకు ఆటకంగా కలుగుతున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా అమరాబాద్ మండలం పాలంకలో వున్నటువంటి శివాలయంలో జరిగే తొలి ఏకాదశి పూజలో పాల్గొనేందుకు భక్తులు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు పడవల్లో భక్తులు బయల్దేరారు.ఈ నేపథ్యంలో మొత్తం ఎనిమిది పడవలు బయలుదేరగా దీంట్లో ఒక పడవ నీట మునిగింది. మిగిలిన ఆరు పడవలు క్షేమంగా ఒడ్డుకు చేరాయి. దీనిపై మర్ని వివరాలకు ఈ వీడియోను చూడండి..

20:38 - July 14, 2016

ఖమ్మం : భూనిర్వాసితుల సమస్యలపై సీపీఎం పోరాటం కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి, బోడు పరిసర గ్రామాల్లో పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టారు. సింగరేణి కంపెనీ కోసం ప్రభుత్వం ఇక్కడ దాదాపు 3వేల ఎకరాల సేకరణకు ప్రయత్నిస్తోంది.. గిరిజనుల్ని అమాయకుల్ని చేసి నామమాత్రపు రేటుకు ఈ భూమిని కొనాలని ప్రభుత్వం భావిస్తోందని తమ్మినేని ఆరోపించారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల నుండి లక్షల ఎకరాల భూమిని లాక్కోవటానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రభుత్వం భూ చట్టాలను అమలు చేయకుండా గిరిజనులకు నామమాత్రపు రేట్లను ఇచ్చి మోసం చేయటానికి యత్నిస్తోందన్నారు. ఏజెన్సీ ఏరియాలో భూమికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలున్నాయనీ.. గిరిజనులకు భూ చట్టాలపై అవగాహన కల్పించటానికి పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. భూసేకరణపై ప్రభుత్వం గిరిజనులకు తగిన న్యాయం చేయకుంటే  ఏజెన్సీ ఏరియాల నుండి ఆందోళన హైదరాబాద్ నగరంలోని సచివాలయానికి చేరుకుంటుందని హెచ్చరించారు.  భూ సేకరణ చేయాలంటే 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం చర్చలకు వస్తే తాము సిద్ధంగా వున్నామని తమ్మినేని పేర్కొన్నారు. కాగా మల్లన్న సాగర్ నిర్మాణ ప్రాంతంలో కొంతమంది ఆదివాసీలతో మంత్రి చేసిన చర్చలను వ్యతిరేకించిన మిగిలిన గ్రామస్థులు మంత్రిపై మండిపడని గ్రామస్థులంతా స్పందించి కలెక్టరేట్ కు పాదయాత్ర చేసిన కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారన్నారు. ఆదివాసీలు, గిరిజనులలో వచ్చిన చైతన్యానికి ఇదొక ప్రతీకగా చెప్పుకోవచ్చు.. 

కృష్ణానదిలో పడవ మునక..20మంది గల్లంతు..

గుంటూరు : జిల్లా వెల్దుర్థి మండలం సరిహద్దు ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. కృష్ణానదిలో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 20 మంది గల్లంతయ్యారు. గల్లంతయినవారు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల వాసులుగా గుర్తించారు.

శిశువు మాయం...పోలీసుల అదుపులో 10మంది ...

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ ఘటనలో పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. ఆసుపత్రిలో సుమారు 70మందిని విచారించారు. ఈ విచారణలో 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆసుపత్రి సిబ్బంది..సెక్యూరిటీ గార్డులు, నర్సులు వున్నారు. 

19:55 - July 14, 2016

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్విపోస్తున్న అక్రమార్కులపై.. తెలంగాణ సర్కార్‌ కొరడా ఝళిపించింది. పాలమూరు జిల్లాలోని గుడిబండ రీచ్‌ అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈవ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఏడీ, రాయల్టీ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై వస్తోన్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ఇసుకాసురులకు సహకరిస్తున్న అధికారులపైనా చర్యకు ఉపక్రమించింది. పాలమూరు జిల్లాలోని గుడిబండ రీచ్‌లో అక్రమాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇక్కడ పట్టా భూమిలో అనుమతి మేరకు 1950 క్యూబిక్‌ మీటర్లు కాకుండా.. దాదాపు 60 వేల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలు జరిగినట్లు అధికారులు విచారణలో తేలింది. అక్రమార్కులను నిలువరించలేదన్న ఆరోపణపై జిల్లా ఏడీ కృష్ణప్రతాప్‌తో పాటు రాయల్టీ ఇన్స్‌పెక్టర్‌ రవికుమార్‌ల సస్పెన్షన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిమితికి మించి తవ్వకాలు జరిపిన కాంట్రాక్టర్‌ అనుమతులు రద్దు చేసి, కేసు నమోదుకు ఆదేశించింది.

పాలమూరు గుడిబండ రీచ్‌లో అక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌..
కొంతకాలంగా ఇసుక రీచ్‌ల్లో అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్‌.. ఈ అంశంపై వాస్తవాల పరిశోధనకు టీఎస్‌ఎండీసీ ఎండీ, మైనింగ్‌ డైరెక్టర్‌ సుశీల్‌కుమార్‌లతో కూడిన బృందాన్ని నియమించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆ బృందం నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇసుక తవ్వకాల తీరును పరిశీలించింది. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లకు భారీ జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. చట్టవిరుద్ధంగా ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ చేపట్టే వారిపై అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకూ ప్రభుత్వం సిద్ధపడుతోంది.  

19:50 - July 14, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి మార్గదర్శకాలను ఎట్టకేలకు ఖరారు చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎలా ఉండాలి. నిర్మాణంలో ఎలాంటి మెటీరియల్ వాడాలి, దేనికెంత ఖర్చు చేయాలన్న వివరాలతో గైడ్ లైన్స్‌ను రూపొందించింది. మార్గదర్శకాలకు లోబడి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

మార్గదర్శకాలను ఖరారు..
డబుల్‌ బెడ్‌రూం పథకంపై ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలను ఖరారు చేసింది. రెండున్నర ఏళ్లుగా ఈ పథకంపై బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇళ్ల నిర్మాణంపై మరింత ఆలస్యమైతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉండటంతో మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఇంటి విస్తీర్ణం ఎంత, ఎలాంటి మెటీరియల్‌ వాడాలి, ఎన్ని నల్లాలు పెట్టాలి, గోడల మందం, ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ ఎలా ఉండాలి అన్న సమగ్ర వివరాలను మార్గదర్శకాల్లో పొందుపరిచింది ప్రభుత్వం.

125 గజాల్లో ప్రతి ఇంటిని 560 చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మాణం...
డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా..125 గజాల్లో ప్రతి ఇంటిని 560 చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మిస్తారు. గ్రామాల్లో యూనిట్‌ కాస్ట్..5లక్షల 4వేలు, పట్టణ ప్రాంతాల్లో 5లక్షల 30వేలుగా నిర్దారించారు. వీటితో పాటు మౌలిక వసతుల కల్పన కోసం గ్రామాల్లో లక్షా 25వేలు, పట్టణాల్లో 75వేల చొప్పున అదనంగా వెచ్చించనుంది ప్రభుత్వం. ఇక ఇళ్ల నిర్మాణాలకు ముందుకొచ్చే సంస్థలు..ఈ బడ్జెట్ పరిమితుల్లోనే డబుల్ బెడ్ రూంలను నిర్మించి ఇవ్వాలి. అటు లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇష్టారాజ్యంగా కాకుండా లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది.

రూముల విస్తీర్ణం మాత్రం తగ్గొద్దని స్పష్టం...
ఇళ్ల నిర్మాణ పనుల్లో సాధారణంగా కాంట్రాక్టర్‌కు 13.65 శాతం మార్జిన్ ఇస్తారు. అయితే డబుల్ బెడ్ రూము పథకంలో ఆ ప్రొవిజన్‌ను తీసేసిన ప్రభుత్వం,..పేపర్ వర్క్, వ్యాట్, కన్సల్టేషన్ వంటి ప్రాథమిక అవసరాల కోసం వెచ్చించాల్సిన మొత్తంపై పరిమితులు విధించింది. బడ్జెట్ అంచనాల్లో వ్యాట్ కోసం 5శాతం నిధులు, కన్సల్టేషన్ ఫీజు కింద 5 శాతం, డాంక్యుమెంటేషన్ చార్జెస్‌ కోసం మరో 5 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేయాలి. లేఅవుట్, డిజైన్ విషయాలకు వస్తే..చదునైన ప్రాంతాల్లోని గట్టి నేలలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని గైడ్ లైన్స్‌లో పొందుపరిచింది ప్రభుత్వం. లేఅవుట్, డిజైన్, డ్రాయింగ్స్ వంటి పనుల ఖర్చులు ప్రాజెక్టు వ్యయంలో అరశాతానికి మించరాదు. లే అవుట్ అప్రూ అయిన తర్వాతే ఇతర పనులు ప్రారంభించాలి. దీంతో పాటు ఏ రూము విస్తీర్ణం ఎంతుండాలో కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మాస్టర్ బెడ్ రూం 9 బై 9 ఫీట్లు, చిల్డ్రన్ బెడ్ రూం 10 బై 9 ఫీట్లు, హాలు 12 బై 9 ఫీట్లు, వంట గది 6 బై 6 ఫీట్లు, ఉండాలని సూచించింది. లే అవుట్‌ను బట్టి డిజైన్ మారొచ్చు కానీ..రూముల విస్తీర్ణం మాత్రం తగ్గొద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

వెస్ట్రన్ మోడల్ కమెడ్ కోసం ప్రతి ఇంటికి అదనంగా 12వేలు..
డబుల్ బెడ్ రూంల నిర్మాణం కోసం వినియోగించే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున..అంచనాల్లోంచి ఇసుక ఖర్చును మినహయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైకప్పు మందం 20 ఎంఎం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 6 ఇంచుల మందంతో వెలుపలి గోడలు, నాలుగు ఇంచుల మందంతో లోపలి గొడలు నిర్మించాలి. గోడల నిర్మాణానికి ఫ్లై యాష్‌తో తయారైన సిమెంట్ ఇటుకలనే వాడాలి. గోడలకు ఇరు వైపుల12 ఎంఎం మందం ప్లాస్టరింగ్ చేయాలి. కలప వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేదం విధించినందున..దర్వాజలు, కిటికీలకు సిమెంట్ ఫ్రేములు వాడాలని సూచించింది. అయితే తలుపుల కోసం సెకండరి వుడ్‌నే వాడాల్సి ఉంటుంది. ఇక వెస్ట్రన్ మోడల్ కమెడ్ కోసం ప్రతి ఇంటికి అదనంగా 12వేల రుపాయాలను వెచ్చించే యోచనలో ఉంది ప్రభుత్వం. స్వచ్చ భారత్ ఫండ్స్ నుంచి ఆ మొత్తాన్ని కేంద్రం నుంచి తెచ్చుకోవాలని భావిస్తుంది.

స్థలాలను గుర్తించే పనుల్లో పడ్డారు కలెక్టర్లు. ..
అక్రమాలకు తావు లేకుండా ఆదర్శనీయమైన డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు ఈ మార్గదర్శకాలు దోహద పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మార్గదర్శకాలకు లోబడి ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో స్థలాలను గుర్తించే పనుల్లో పడ్డారు కలెక్టర్లు. 

19:37 - July 14, 2016

విజయవాడ : పాత ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయం అవ్వటంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని విచారణకు ఆదేశించారు. కాగా పాత ప్రభుత్వాస్పత్రిలో ఆరు రోజుల శిశువు కిడ్నాప్‌ అయిన విషయం తెలిసిందే. కొత్తపేటకు చెందిన సుబ్రహ్మణ్యం, కల్యాణి దంపతులు వారం క్రితం జన్మించిన తమ కుమారుడికి కామెర్లు సోకటంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు చికిత్స కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శిశువును నాలుగు రోజులుగా ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అయితే.. ఇవాళ ఉదయం తల్లిదండ్రులు లేని సమయంలో శిశువును ఎవరో ఎత్తుకుపోయారు. శిశువు లేడని గమనించిన బాబు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాబు కిడ్నాప్‌ వ్యవహారంలో ఆస్పత్రి సిబ్బంది పాత్ర ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సీపీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం..
విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో గర్భిణిలు, బాలింతలు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తుంటారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిశువుల కిడ్నాప్‌లు జరిగాయి.. అయినా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాబు అపహరణ తర్వాత మేల్కొన్న వైద్యశాఖ అధికారులు హుటాహుటిన విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. బాబు కిడ్నాప్‌తో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లి హృదయ విదారకంగా విలపిస్తోంది. తన బిడ్డను తీసుకొచ్చి ఇవ్వాలని అక్కడున్న ప్రతిఒక్కర్నీ వేడుకుంటోంది. ఆస్పత్రి సిబ్బంది పాత్ర లేనిదే.. బాబు కిడ్నాప్‌ కాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పుడు కిడ్నాప్‌కు కేంద్రాలుగా మారుతున్నాయి.. వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు పోవడమో లేక.. చిన్నారుల మిస్సింగ్‌ కేసులు నమోదు కావడం ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. వైద్యాశాఖ అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. 

టీ.సీఎస్ తో రాఘవచంద్ర భేటీ..

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ రాఘవ చంద్ర సమావేశమయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి సీఎస్‌తో చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎస్ కోరారు. రహదారులకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని సీఎస్ తెలిపారు. యాదాద్రి - వరంగల్ జాతీయరహదారి 4 లైన్ల అభివృద్ధికి అటవీ అనుమతులు వెంటనే ఇస్తామని సీఎస్ చెప్పారు.

'బాబు' మాయంపై 'బాబు'..

విజయవాడ: పాతప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అదృశ్యంపై రష్యా నుంచి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. శిశువు అదృశ్యంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించాడు. ఏపీలో అక్కడైనా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు.

18:55 - July 14, 2016

ఇంటినంతా చక్కదిద్దే మహిళలు, ఊరును చక్కదిద్దలేరా? ఊరునంతా చక్కదిద్దే మహిళలు దేశాన్ని బాగుచేయలేరా? చేస్తారు. చేస్తున్నారు. చేసిచూపిస్తున్నారు. కలిసికట్టుగా ఉంటే, ఎలాంటి విజయాలైనా సాధిస్తామని రుజువు చేస్తున్నారు. అలాంటి విజయగాథతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి మానవి. మహిళల పొదుపు తెలుగు రాష్ట్రాల్లో అనేక సానుకూల ఫలితాలనిచ్చింది. అనేక ఉద్యమాలకు ఊతమిచ్చింది. ఇప్పుడు అదే పొదుపు సంఘం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో పేద విద్యార్థుల పాలిట వెలుగు రేఖగా మారింది. ఎందరి జీవితాల్లోనో విద్యా కుసుమాలు పూయిస్తోంది. ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం పై మానవి ప్రత్యేక కథనం. మహిళలంతా ఏకమంతా ఎలాంటి సాహసాలు చేయగలరో, సమాజాభివృద్ధికి ఎలాంటి చేయూత అందించగలరో మరోసారి రుజువు చేసి చూపించారు ఓర్వకల్లు మహిళలు. తమ కోసం తాము కాదు.. అందరికోసం తాము.. తమకోసం అందరు.. అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఓర్వకల్లు మహిళలకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. ఇతర పొదుపు సంఘాల కు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తోంది.

మహిళ మెడలో గొలుసు చోరీ..

రంగారెడ్డి: జిల్లాలోని కీసర మండలం చీర్యాలలో చైన్ స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న ఓ వృద్ధురాలి మెడలోంచి ఐదు తులాల బంగారు గొలుసు అపహరించుకు పోయారు.

ఏపీకి 95..టీఎస్ కు 109 సీఐడీలు ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సీఐడీ విభాగంలో ఉద్యోగుల విభజన పూర్తయింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీకి 95 మంది, తెలంగాణకు 109 మంది సీఐడీ అధికారులను కేటాయించారు. ఈ విభజనకు సంబంధించిన అంశాన్ని సిబ్బంది వ్యవహారాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.

18:44 - July 14, 2016

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ కార్మికుల వేతన బకాయిలు విడుదల అయ్యాయి. ఈ నిధుల్ని శుక్రవారం నాడు కార్మికుల ఖాతాల్లో యాజమాన్యం జమ చేయనుంది. ఖాతాల్లో జమ అయిన అనంతరం శనివారం నాడు డ్రా చేసుకునే అవకాశం వుందని ఆర్టీసీ టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి తెలిపారు. 

18:40 - July 14, 2016

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసుల అనుమానాస్సదంగా మృతి చెందారు. మొల్ బోర్న్ లో ఆరు నెలల బిడ్డతో సహా తల్లి సుప్రజ మృతి చెందింది. మెల్ బోర్న్ లో సుప్రజ భర్త శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ ది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు గా తెలుస్తోంది. ఈ కేసుపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన ఆస్ట్రేలియాలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. 2006లో శ్రీనివాస్ కు సుప్రజకు వాహం అయ్యింది. వివాహానంతరం ఆస్ట్రేలియా వెళ్లిన వారిద్దరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాలుగు నెలల క్రితమే వారికి ఓ బాబు పుట్టాడనీ..మనవడు పుట్టాడన్న ఆనందం ఇంతలోనే మాయం అయిపోయిందని సుప్రజ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కాగా గతంలో సుప్రజ అత్తగారు అదనపు కట్నం కోసం సుప్రజలను వేధించారని సుప్రజ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ కు మృతదేహాలను తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది.  

18:33 - July 14, 2016

విజయవాడ : ఉదయం 11 గంటలకు బాబు మాయం అయితే ఇంతవరకూ ఏ ప్రజాప్రతినిధులు వచ్చిన దాఖలు లేదని సీపీఎం నేత బాబూరావు విమర్శించారు. కనీసం విచారణ జరపాలని ఆదేశాలు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాకు సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులు కూడా రాలేదన్నారు. రాష్ట్ర రాజధాని నగరంలో ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు పనిచేయటంలేదనీ...దీనికి సంబంధించి ఆసుపత్రికి నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. బాబుకు సంబంధించిన తల్లిదండ్రుల ఆవేదన చూడలేకుండా వున్నామని వెంటనే దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి గాలింపు చర్యల్ని ముమ్మరం చేయాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో ఆరు రోజుల శిశువు మాయమైంది. ఆరు రోజుల క్రితం జన్మించిన బాబుకు కళ్లు పచ్చగా వున్నాయని ఆసుపత్రికి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో బాబు మాయం అయిన విషయం తెలిసిందే. 

టీఎస్ ఆర్టీసీ కార్మికుల వేతన బకాయిలు విడుదల..

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ కార్మికుల వేతన బకాయిలు విడుదల అయ్యాయి. ఈ నిధుల్ని శుక్రవారం నాడు కార్మికుల ఖాతాల్లో యాజమాన్యం జమ చేయనుంది. ఖాతాల్లో జమ అయిన అనంతరం శనివారం నాడు డ్రా చేసుకునే అవకాశం వుంది. 

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసుల అనుమానాస్సదంగా మృతి..

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసుల అనుమానాస్సదంగా మృతి చెందారు. మొల్ బోర్న్ లో ఆరు నెలల బిడ్డతో సహా తల్లి సుప్రజ మృతి చెందింది. మెల్ బోర్న్ లో సుప్రజ భర్త శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ ది నిజామాబాద్ జిల్లా ఆర్మూరు గా తెలుస్తోంది. 

పుష్కరాలపై టీ.సీఎస్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ నెలఖరు లోగా అన్ని పుష్కర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎస్ ప్రకటించారు.

తల్లి ..చెల్లిని అనుమానిస్తున్న జగన్...

హైదరాబాద్ : వైకాపా అధినేత వైఎస్ జగన్ కు 'పవర్ ఫోబియా' పట్టుకుందని, అధికారం దాహంతో జగన్ దిగజారిపోతున్నారని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. తల్లిని, చెల్లిని కూడా టీడీపీ సంబధించినవారిగానే జగన్ అనుమానిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదని ఆరోపించారు. ఈ కారణంతోనే అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని, మరింత మంది తెలుగుదేశంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

18:01 - July 14, 2016

ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం అల్లరి నరేష్ నటించిన 'సెల్ఫీ రాజా' సినిమా టీమ్ తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్ ...ఈ సినిమాలో కామ్నా సింగ్ రనౌత్ , సాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా..దర్శకుడు ఈశ్వర్ రెడ్డి..హీరోయిన్స్ తో చిట్ చాట్ ...ఈ చిత్రం గురించి టీమ్ ఎటువంటి విశేషాలను చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...చిత్ర విశేషాలను తెలుసుకోండి...

17:59 - July 14, 2016

హైదరాబాద్ : లేడిలా చెంగుచెంగున ఆటలాడుకునే పాప...అకస్మాత్తుగా నీరసించిపోయింది. స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులో మంచానికే పరిమితమైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న పాప...తమ కళ్లముందే అలా కూలబడిపోతే అది చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆర్థికంగా చతికిలబడిన తమ బతుకులకు విధి మరింత అన్యాయం చేసిందంటూ విలపిస్తున్నారు. తమను ఆదుకునే చేతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అభం శుభం తెలియని వయసులో...తనకిలా జరుగుతుందని కలలో కూడా ఊహించని పరిస్థితుల్లో ...ఓ చిన్నారి మంచానికి పరిమితమైంది...తన అల్లరితో ఇంటినంతా సందడిచేసిన ఆ చిన్నారి..కనీసం మాట్లాడలేని పరిస్థితి ....

హర్షిత వైద్యానికి రూ.20లక్షల ఖర్చు...
చిన్నారి హర్షితను బ్రతింకించుకోవాలంటే రూ.20లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. కానీ రోజుకూలీగా పనిచేస్తున్న తమకు అది అసాధ్యం..హర్షితను బ్రతికించుకోవాలని తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు..మొక్కని దేవుడు లేడు..తిరగని ఆసుపత్రి లేదు..అన్ని రకాలుగానూ చిన్నారి బ్రతికించుకోవాలని తాపత్రాయపడుతున్న తల్లిదండ్రులు ఆశను, మనస్సును చంపుకుని..కడుపుకోతను భరించటానికే సిద్ధమయ్యారు. బిడ్డను బ్రతికించుకోలేని తమ నిస్సహాయతపై వారి జాలిపడ్డారు..రోదించారు...విలపించారు...ఆక్రోసించారు...విధినేని పర్థితిలో తమ బిడ్డను మెర్సీ కిల్లింగ్ ద్వారా చంపుకునేందుకు అనుమతినివ్వమని హెచ్ ఆర్సీని సంప్రదించారు...తమ బిడ్డను బ్రతికించండీ..లేదంటే చంపుకునేందుకు అనుమతించండి అని వేడుకుంటున్నారు..ఇటువంటి పరిస్థితులలో టెన్ టీవీ స్టూడియో తన వంతుగా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా చిన్నారిని బ్రతికించటానికి దాతలు ముందుకు రావాలని హర్షితను ..తల్లి శ్యామలను లైవ్ ప్రోగామ్ తో ప్రసారం చేసింది..దీనిక స్పందించిన పలువురు దాతలు ముందుకొచ్చారు. ..ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ విషయాన్ని ప్రభుత్వం దృషికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటామని అధైర్య పడవద్దని శ్యామలకు తెలిపారు...ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి....

17:37 - July 14, 2016

హైదరాబాద్ : చిన్నారి హర్షిత ఆరోగ్యం క్షీణించడంపై బాధగా ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. నగరంలో జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న హర్షితకు కాలేయం పూర్తిగా చెడిపోయింది. ఆపరేషన్ కు సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొనడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. తమకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి హర్షితను ఆదుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. చిన్నారి హర్షిత, తల్లి తో టెన్ టివి మాట్లాడింది. ఈ సందర్భంగా పలువురు కాలర్స్ స్పందించి ఆర్థిక సహాయం చేస్తామని హామీనిచ్చారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా స్పందించారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతోందని, ఆరోగ్య శాఖ మంత్రి వద్దకు తాను ఎన్నో సమస్యలు తీసుకపోవడం జరిగిందన్నారు. ఆ సమస్యలపై మంత్రి వెంటనే స్పందించారని, ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, తన దృష్టికి ఈ సమ్సయ రాలేదని తెలిపారు. ప్రస్తుతం తాను నరసరావుపేటలో ఉన్నానని, శుక్రవారం ఉదయం నగరానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి వద్దకు వచ్చి తనకు ఫోన్ చేయాలని, వచ్చి పికప్ చేసుకుంటానని హామీనిచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరకు వెళ్లి ఏదో విధంగా సహాయం చేయడానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. వీలైతే సీఎం కేసీఆర్ దగ్గరకు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తానని హామీనిచ్చారు. 

17:19 - July 14, 2016

విశాఖ : స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలను భాగస్వాములను చేసేలా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను మొదలు పెట్టింది. విశాఖ స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో సలహాలు ఇవ్వాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. అటు ప్రజల నుంచి కూడా దీనికి మంచి స్పందన లబిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

స్మార్ట్ సిటీగా అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం...
విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటంలో ప్రజలను భాగస్వాముల్ని చేయటానికి విశాఖ మున్సిపల్‌ కార్పోరేషన్‌ వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతోంది. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. శ్రీకారం నుంచి చివరి దాకా ప్రతి అంశంలోనూ ప్రజలను కలుపుకు పోవడం వల్ల.. ప్రతి ఒక్కరికీ బాధ్యత కలుగుతుందని విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా.. నగరంలోని వుడా పార్కు, బీచ్ రోడ్డులను ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందో డిజైన్లు రూపొందించిన వారికి నాలుగు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించింది జీవీఎంసీ.

స్మార్ట్ సిటీ కార్పొరేటెడ్ పేరిట ఏర్పాటయిన సంస్థ...
స్మార్ట్ సిటీ కార్పొరేటెడ్ పేరిట ఏర్పాటయిన సంస్థ.. తొలిదశ అభివృద్ధి కోసం.. వన్‌టౌన్ ఏరియాను ఎంపిక చేసింది. ఈ ప్రక్రియలో కూడా ప్రజలను భాగస్వాములను చేశారు. తొలిదశ అభివృద్ధి కోసం ఎంపిక చేయాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేయాలంటూ ప్రజల అభిప్రాయాన్ని కోరారు. దీనికి నాలుగు లక్షల మంది విశాఖ పౌరులు స్పందించి.. తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్మార్ట్‌ సిటీ తొలి దశ ప్రాంతం ఎంపిక కోసం రుషికొండ, తెన్నేటిపార్కు ప్రాంతం, ఆర్‌కే బీచ్‌ ప్రాంతాలను జీవీఎంసీ ప్రతిపాదించగా ఆర్‌కే బీచ్‌ పరిసర ప్రాంతానికే ఎక్కువమంది ఓటేశారు.

ఉత్తమ డిజైన్లు, అభిప్రాయాలు వెల్లడించిన వారికి బహుమతి....
అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాన్ని ప్రజల ఓటు ద్వారా ఎంపిక చేసిన ఉడా.. ఇప్పుడు అక్కడ ఎలాంటి అభివృద్ధి సాధించాలో సూచించాలంటూ మళ్లీ ప్రజాభిప్రాయాన్ని కోరింది. తొలిదశలో ఎంపికైన ఆర్‌కే బీచ్‌, వుడా పార్కు అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు, డిజైన్లు ఇవ్వాలని గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ కోరింది. ఉత్తమ డిజైన్లు, అభిప్రాయాలు వెల్లడించిన వారికి నాలుగు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించింది.

స్మార్ట్ సిటి డిజైన్‌ రుపొందించే అవకాశం దక్కడంతో ప్రజల హర్షం..
ఇప్పటికే సముద్ర కోత, కాలుష్యం, పారిశుధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బీచ్‌రోడ్డును స్మార్ట్‌గా తీర్చిదిద్దడం సమస్యగా మారింది. ఇక్కడ కేవలం 5వేల గజాల స్థలం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ పరిధి ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం, అక్కడున్న సౌకర్యాలు, ప్రాంత స్వరూపం, తదితర వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషనర్ తెలిపారు. వాటిని పరిశీలించి, ప్రణాళికలు తయారు చేసి పంపాల్సి ఉంటుంది. విజేతలను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుంది. మెుత్తం మీద విశాఖ ప్రజలకు స్మార్ట్ సిటి డిజైన్‌ రుపొందించే అవకాశం దక్కడంతో నగర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. 

ఏపీలో 18 మంది డీఎస్పీ బదిలీలు..

విజయవాడ : రాష్ట్రంలో 18 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. కె.సుధాకర్ ఓఎస్డీ, గురజాల, ఎస్ కే బాబు ఓఎస్డీ విజయవాడ సిటీ, రమణ ఓఎస్డీ విజయవాడ సిటీ, రమణ ఓఎస్డీ విజయవాడ సిటీ, సుబ్బారావు డీఎస్పీ ఇంటెలిజెన్స్, ఎం.రాజారావు డీఎస్పీ ఎస్ బీ, విజయనగరం, కృష్ణ ప్రసన్న ఓఎస్డీ విజయనగరం, రాజగోపాల్ ఓఎస్డీ క్రైం, విజయవాడ సిటీ, విఠలేశ్వర్ ఓఎస్డీ క్రైం, నెల్లూరు బదిలీ అయ్యారు. 

అసదుద్దీన్ పై కేసు నమోదు చేయాలన్న కోర్టు..

హైదరాబాద్: ఉగ్రవాదులకు న్యాయసహాయం చేస్తామన్న అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఎల్బీనగర్ కోర్టు విచారణకు ఆదేశించింది. ఓవైసీపై 124(ఎ) కింద కేసు నమోదు చేయాలని, ఈనెల 30 లోగా నివేదిక సమర్పించాలని కోర్టు పేర్కొంది. 

హెచ్చార్సీలో మెర్సీ కిల్లింగ్..

హైదరాబాద్ : హెచ్ఆర్సీలో మెర్సీకిల్లింగ్ పిటిషన్ దాఖలైంది. లివర్ వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి హర్షితకు మెర్సీ కిల్లింగ్ కు అనుమతించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

టీ. సీఎస్ కలిసిన ఎన్ హెచ్ ఏఐ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎస్ ను ఎన్ హెచ్ఏఐ ఛైర్మన్ రాఘవ్ చంద్ర కలిశారు. తెలంగాణలో జాతీయ రహదారుల ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణలో సంగారెడ్డి - నాందెడ్, అకోల – జగిత్యాల, వరంగల్ - కరీంనగర్, కోదాడ – ఖమ్మం, సూర్యాపేట – ఖమ్మం, జడ్చర్ల – కల్వకుర్తి - మల్లేపల్లి, నిజామాబాద్ - జగదల్ పూర్, మంచిర్యాల – చంద్రాపూర్ జాతీయ రహదారుల అభివృధ్ధికి సవరించిన ప్రతిపాదనలు త్వరలో పంపుతామని సీఎస్ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట - వరంగల్ జాతీయ రహదారి ఫోర్ లైన్ సంజయ్ సిన్హాకు అధిష్టానం అప్పగించింది. జాతీయ రహదారుల వెంట మొక్కల పెంపకానికి నిధులు కేటాయించాలని ఎన్ హెచ్ఏఐ ఛైర్మన్ ను సీఎస్ కోరారు.

విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది - షీలా..

ఢిల్లీ : యూపీ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును కొద్దిసేపటి క్రితం అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తనపై నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆమె అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. 

16:25 - July 14, 2016

ఏటీఎం నగదు నుండి డబ్బులు డ్రా చేసుకోవడానికి కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. పిన్ నెంబర్ మరిచిపోవడం..లేదా మిషన్ ఎలా వినియోగించుకోవాలో తెలియకడం..ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుంటారు. కేవలం వేలి ముద్ర నమోదు చేయడం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు..ఇతరత్రా లావాదేవీలు జరుపుకోవచ్చు. పాస్‌వర్డ్‌ విషయంలో ఆందోళనను ఈ బయోమెట్రిక్‌ విధానం నివారిస్తుంది. దీనికి సంబంధించి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ కొద్ది వారాల క్రితమే చర్యలు చేపట్టింది. భారత్ లో ఐసీఐసీఐ, స్టాండర్డ్‌ చార్టర్డ్‌, డీసీబీ వంటి బ్యాంకులు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారరంభించాయి.
డీసీబీ ఏకంగా బెంగళూరులో బయోమెట్రిక్‌ ఆధారిత ఏటీఎం మెషిన్‌ను ప్రారంభించింది. ఈ మెషిన్‌ ద్వారా ఏటీఎం కార్డు, పిన్‌ నంబర్‌ లేకుండానే నగదును డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకు తమ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌కు ఇప్పటికే బయోమెట్రిక్‌ ప్రామాణీకరణను చేర్చింది. 

16:23 - July 14, 2016

వివాహం అయిన తరువాత చాలా మంది హనిమూన్ అంటూ ప్లాన్ చేసుకుంటుంటారు. డబ్బున్న మారాజులు పర్యాటక ప్రదేశాలు..లేదా ఇతర దేశాలకు వెళుతుంటారు. కానీ భర్త లేకుండానే భార్య హనిమూన్ వెళితే... ఒకరే వెళితే ఆ బాధ చెప్పతరం కాదు కదా..పాపం ఓ అమ్మడికి అలాంటి పరిస్థితి ఏదురైంది. తెలుసుకోవాలంటే చదవండి...
పాక్ లోని లాహోర్ లో హుమా, అర్సనాల్ లకు వివాహమైంది. వీరిద్దరూ కలిసి హనీమూన్ కు వెళ్లివచ్చారు. రెండో హనీమూన్ కు వెళ్లాలని అనుకున్నారు. తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాలని భావించారు. గ్రీస్ కు వెళ్లాలని అనుకుని అక్కడి ఎంబసీకి దరఖాస్తు చేసుకున్నారు. హుమాకు..ఆమె అత్త మామలకు మాత్రమే వీసా వచ్చింది. అర్సలాన్ కు మాత్రం వీసా రాలేదు. దీనితో అత్తలమామలతో కలిసి హుమా హనీమూన్ కు వెళ్లింది. భార్య ఒక్కతే హనీమూన్ కి వెళితే ఎలా ఉంటుందో… ప్రతి చోట ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

16:23 - July 14, 2016

ఢిల్లీ : నీట్‌ ఆర్డినెన్స్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జులై 24న నీట్‌ పరీక్ష ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ ఇచ్చి 8 వారాలు అయినందున.. నీట్‌ ఆర్డినెన్స్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రైవేటు కాలేజీలకు నీట్‌ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. ఇటు కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. నీట్‌ ఆర్డినెన్స్‌పై జోక్యం చేసుకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. చాలా రాష్ర్టాలు ఇప్పటికే వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాయని తెలిపారు. 

16:14 - July 14, 2016

విజయవాడ : పాత ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల శిశువు మాయమైంది. ఆరు రోజుల క్రితం జన్మించిన బాబుకు కళ్లు పచ్చగా వున్నాయని ఆసుపత్రికి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో బాబు మాయం అయ్యాడు. సమాచారం అందుకున్న డిప్యూటీ కలెక్టర్ సృజన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయంలో ఆమె మాట్లాడారు. ఆసుపత్రుల్లో ఇటువంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమనీ..ఈ విషయంలో వార్డ్ బాయ్ నుండి సూపరిండెంటెండ్ వరకూ ఎవ్వరు వున్నా ..వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో వున్న కొన్ని సీసీ కెమెరాలు పనిచేయటంలేదనీ..పనిచేస్తున్న వాటి పుటేజ్ గమనించి వెంటనే నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు.  

యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా షీలా..

ఢిల్లీ : యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను అధిష్టానం ప్రకటించింది. యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను సంజయ్ సిన్హాకు అధిష్టానం అప్పగించింది. 

నీట్ ఆర్డినెన్స్ రద్దుపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : నీట్ ఆర్డినెన్స్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ఆర్డినెన్స్ పై కేంద్రానికి నోటీసులు పంపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జులై 24వ తేదీన నీట్ పరీక్ష ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు కాలేజీలకు నీట్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. 

అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన..

ఖమ్మం : అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంఖుస్థాపన చేశారు. తిరుమలాయపాలెం మండలంలో పలు తండాలకు రూ. 8.32 కోట్లతో ఆరు రహదారులను నిర్మించనున్నారు.

 

సీఎం మెప్పు కోసం మంత్రి హరీష్ పాట్లు - జీవన్ రెడ్డి..

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు పొందేందుకు మంత్రి హరీష్ పడరాని పాట్లు పడుతున్నారని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే వారి నోళ్లల్లో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు మట్టి కొడుతున్నారని విమర్శించారు. 

మంత్రి హరీష్ దత్తత గ్రామంలో రేపు గవర్నర్ పర్యటన..

మెదక్ : తెలుగు రాష్ట్రాలగవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో గవర్నర్ పర్యటించనున్నారు. ఈ గ్రామాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. 

వర్ధమాన మోడల్ ఆత్మహత్య..

ఢిల్లీ : వర్ధమాన మోడల్ కరమ్ జీత్ కౌర్ (25) ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్ కి వేలాడుతున్న కరమ్ జీత్ మృతదేహం కనిపించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనగర్ లో తగ్గని ఆందోళనలు..37 మంది మృతి..

శ్రీనగర్ : హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత కారణంగా కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున చెల‌రేగుతోన్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. కాశ్మీర్ లోయలో వరుసగా ఆరో రోజూ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రెచ్చిపోతున్న‌ ఆందోళ‌న‌కారులపై పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 37 మంది మృతి చెందారు. 

15:56 - July 14, 2016

హైదారబాద్ : తన వదిన అనూషతో ఎలాంటి విభేదాలు లేవని... బుల్లితెర నటి శ్రీవాణి స్పష్టం చేశారు.. అనవసరంగా ఈ కేసులో తమను ఇరికించారన్నారు.. తన భర్తకుకూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు.. తాను నటిగా చాలా బిజీగా ఉన్నానని... కావాలనే ఈ వివాదంలో ఇరికించారని ఆరోపించారు. కాగా తన ఆడబ్డి అయిన టీవీ సీరియల్ లో ప్రముఖ నటి తన ఇంటిని కూలిగొట్టించిందని ఆమె వదిన అనూష రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంపై ఆమె వదిన అనూష శ్రీవాణిపై వికారాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ ఇంటిని శ్రీవాణి కూల్చివేయించిందని.. ఫిర్యాదులో పేర్కొంది. అనూషకు వికారాబాద్‌ గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఇల్లు కూల్చివేయించిన శ్రీవాణిపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే శ్రీవాణి సోదరుడు బాబ్జి అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త చనిపోయి బాధలో ఉన్న తనను శ్రీవాణి వేధింపులకు గురిచేస్తోందని అనూష కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. న్యాయం చేయాలని వేడుకుంటోంది. శ్రీవాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందంచిన శ్రీవాణి వదినతో తనకు ఎటువంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను వీక్షించండి..

15:48 - July 14, 2016

తూ.గోదావరి : గోదావరి పుష్కర విషాదానికి ఏడాది పూర్తైన సందర్భంగా రాజమండ్రిలో ప్రజాసంఘాలు, వామపక్షాలు, వైసీపీ ఆధ్వర్యంలో మృతులకు నివాళులు అర్పించారు. ఆనాటి తొక్కిసలాటలో మృతి చెందిన 28 మందికి నివాళులు అర్పించారు. ప్రభుత్వం తప్పిదం కారణంగానే గోదావరి పుష్కరాల తొలిరోజు ప్రమాదం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పిదాన్ని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

15:45 - July 14, 2016

వరంగల్‌ : విద్యార్థి సంఘాల నిరసనతో హోరెత్తిపోయింది... విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బంద్‌లో భాగంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల్ని నియంత్రించాలంటూ ధర్నా చేపట్టారు. సర్కారుతీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజీనుంచి పీజీవరకూ ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి సంఘం నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

15:43 - July 14, 2016

హైదరాబాద్ : వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధతకు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకు ఢిల్లీలో చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు మద్ధుతో కోరుతూ మందకృష్ణ మాదిగ తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని కలిశారు. అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి రావాలని ఆయన ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డిని కోరారు. అయితే ఎస్సీ వర్గకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టేలా టీడీపీ జాతీయ అధక్ష్యుడు చంద్రబాబుతో చర్చిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మాదిగలకు అనుకూలంగా ఉండి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. 

15:39 - July 14, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 21,22 తేదీల్లో మహబూబ్‌నగర్ లో ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. నాంపల్లి జేఏసీ ఆఫీసులో స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన... తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. 

15:35 - July 14, 2016

ముంబై : సుల్తాన్‌ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా తానిచ్చిన రేప్‌ స్టేట్‌మెంట్‌పై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు సమాధానం పంపారు. అంతకుముందు మహిళా కమిషన్ సల్మాన్‌కు రెండుసార్లు సమన్లు పంపినా స్పందించలేదు. మూడోసారి పంపిన నోటీసులో మాత్రం ఈ కేసులో తనను విచారించే అధికారం మహిళా కమిషన్‌కు లేదని సల్మాన్‌ పేర్కొన్నట్లు సమాచారం. సల్మాన్‌ వివరణపై మహారాష్ట్ర మహిళా కమిషన్ అధికారికంగా ఇంతవరకు స్పందించలేదు. సల్మాన్‌ జవాబు పంపినట్లు తెలిపింది. సుల్తాన్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా రెజ్లర్‌ అనుభవం గురించి చెబుతూ- రింగ్‌ నుంచి బయటకు రాగానే రేప్‌కు గురైన మహిళలా ఫీలయ్యానంటూ సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

15:33 - July 14, 2016

విజయవాడ : పాత ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల శిశువు మాయమైంది. ఆరు రోజుల క్రితం జన్మించిన బాబుకు కళ్లు పచ్చగా వున్నాయని ఆసుపత్రికి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. పచ్చకామెర్లు వచ్చాయనీ వైద్యులు ఐసీయూలో చికిత్సనందిస్తున్న తరుణంలో డాక్టర్స్ రౌండ్స్ కు వచ్చారని బంధువులందరినీ ఆసుపత్రి సిబ్బంది బైటికి పంపించేశారు. కొద్దిసేపటికే బాబు మాయం అయినట్లు గమనించిన తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారనీ..శిశువు మాయం వెనుక ఆసుపత్రి సిబ్బంది హస్తం వుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది..డిప్యూటీ కలెక్టర్ ఆసుపత్రికి చేరుకుని విచారణకు ఆదేశించారు. కాగా బాధితులను వైసీపీ నేత రాధ పరామర్శించారు.

15:32 - July 14, 2016

కృష్ణా : అనుమానం పేరిట మానవత్వాన్ని మంటగలుపుతున్న కుల పెద్దలు వారి ఆధిపత్యం కోసం దారుణమైన శిక్షలు వేస్తున్నారు. అమానుషంగా..అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి శిక్షలకు గురవుతన్నవారు మహిళే కావటం గమనించదగినది. ఇటువంటి దారుణమైన శిక్షలను వేసిన ఘటన జగ్గయ్యపేట మండలంలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కులపెద్దల ఆధ్వర్యంలో కులపంచాయితీ పెట్టాడు. తిరుపతమ్మ అనే తన భార్యను గత కొంతకాలంగా అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నాడు. కుల పెద్దలు కాల్చిన ఇనుపరాడ్డును పట్టుకోవాలని కులపెద్దలు ఆదేశించారు. ఆమె చేతులు కాలకుండా వుంటే ఆమె క్యారక్టర్ మంచిదనీ చేతులు కాలితే మాత్రం ఆమె తప్పు చేసినట్లుగా రుజువవుతుందని కుల పెద్దలు తీర్పునిచ్చారు. దీంతో ఆవేదన చెందిన ఆమె చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నేపథ్యంలో కులపెద్దలను అదుపులోకి తీసుకుని విచారించగా కుల కట్టుబాటుతోనే ఈ తీర్పునిచ్చామని సమాధానం చెప్పారు.

చిల్లకల్లులో దారుణం..

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త పంచాయతీ పెట్టించాడు. కాల్చిన ఇనుపరాడ్ ను పట్టుకోవాలని పంచాయతీ తీర్పు చెప్పింది. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

శిశువు మాయంపై స్పందించిన మంత్రి కామినేని..

విజయవాడ : పాత ప్రభుత్వాసుపత్రిలో శిశువు మాయం కావడంపై మంత్రి కామినేని స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని డీఎంఈకి ఆదేశాలు జారీ చేశారు. గైనిక్ వార్డు నుండి మహిళ అపహరించుకపోయిందని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందిని విచారిస్తున్నారు.

 

14:59 - July 14, 2016

ఢిల్లీ : ఢిల్లీ వాటర్‌ ట్యాంకర్ల స్కాం కేసులో మాజీ సిఎం షీలా దీక్షిత్‌కు ఏసిబి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 26న ఏసిబి షీలా దీక్షిత్‌ను ప్రశ్నించనుంది. ఏసిబి పంపిన నోటీసు తనకు అందిందని తాను జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని షీలా దీక్షిత్‌ చెప్పారు. ఈ కేసులో వాటర్‌బోర్డ్‌ మంత్రి కపిల్‌ మిశ్రాను ఏసిబి ఇదివరకే విచారణ జరిపింది. షీలాదీక్షిత్‌ సిఎంగా ఉన్న సమయంలో నీటిని సప్లయ్‌ చేసేందుకు టాంకర్లను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లలో 4 వందల కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు వచ్చే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో షీలాదీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.

14:58 - July 14, 2016

రోజురోజుకు సామాజిక మాధ్యమాలు విస్తరిస్తున్నాయి. కానీ ఇంటర్నెట్ లేకపోతే ఏం చూడలేమా ? వినలేమా ? తెలుసుకోలేమా ? అనే సందేహం వస్తుంటుంది. అందులో ప్రధానమైంది 'వాట్సప్'. వాట్సప్ లో పలు వీడియోలు వీక్షిస్తూ ఎంతో మందితో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇంటర్ నెట్ లేకపోతే వాట్సప్ యూజ్ చేయలేమా ? అంటే యూజ్ చేయవచ్చు అంటున్నరు. కానీ ఇంటర్నెట్ నెట్ లేకుండానే వాట్సప్ ఉపయోగించుకోవచ్చంట.
చాట్‌సిమ్.కామ్ వెబ్‌‌సైట్‌కి లాగాన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు. చాట్ సిమ్ ఖరీదు రూ.745. యూసేజ్ ఛార్జీలు 10 యూరోలు చెల్లించాలి. వ్యాలిడిటీ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాలి. చాట్ సిమ్‌ను ఇండియాకు తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలు భరించాలి. ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ యూజ్ చేయాలంటే కష్టపడక తప్పదు. 

14:57 - July 14, 2016

విజయవాడ : విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు వరుసగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆ దేశ ప్రధాని మంత్రులను కార్పొరేట్లను రాజధాని అమరావతికి ఆహ్వానిస్తున్నారు. అయితే వారు అమరావతిలో పర్యటించాలంటే ఓ చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు ఏంటీ? దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏంటీ..?

గన్నవరం ఎయిర్ పోర్ట్ పై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం...
రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం వరుసపెట్టి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆ దేశ ప్రతినిధులను అమరావతిలో పర్యటించాలని ఆహ్వానిస్తున్నారు. అయితే వారు పర్యటించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అంతర్జాతీయ విమానశ్రయం కూడా లేదు. దీంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. విజయవాడలోని గన్నవరం విమానశ్రయంకు అంతర్జాతీయ విమానశ్రయంగా గుర్తింపు తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.

అంతర్జాతీయ స్థాయి కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి...
రాజధాని ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు నేరుగా ఆ ప్రాంతానికి చేరుకోవాలనుకుంటారు. కానీ అమరావతికి రావాలనుకునే వారు ముందుగా హైదరాబాద్‌ వచ్చి ఇక్కడకి రావాల్సి ఉండటాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. పారిశ్రామికంగా ఎన్ని రాయితీలు ఇచ్చినా... అమరావతికి నేరుగా విమాన రాకపోకలు లేకపోవడం అభివృద్ధికి అవరోధంగా మారిందని చెబుతున్నారు. మరోవైపు జపాన్, సింగపూర్ ప్రతినిధులు ఈ విషయం పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించాల్సిందేనని ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.

600 ఎకరాల భూములను అప్పగిస్తామన్న జిల్లా యంత్రాంగం...
ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే బెజవాడ ఎయిర్‌పోర్టు ఇంకా విస్తరణకు నోచుకోలేదు. విస్తరణకు అవసరమైన 600 ఎకరాల భూములను ఈ నెలాఖరుకు అప్పగిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపింది. భూసేకరణ జరిగితేనే విమానాశ్రయ రన్‌వేను 7వేల అడుగుల మేర విస్తరించటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ బిల్డింగ్‌ 500 మంది ప్రయాణీకుల రాకపోకలకు మాత్రమే సరిపోతుంది. విమానాశ్రయానికి కస్టమ్స్‌,ఇమ్మిగ్రేషన్స్‌ హోదా వస్తేనే విదేశాలకు విమానాలు నడిపే అవకాశం ఉంటుంది.

గన్నవరం ఎయిర్ పోర్ట్ రూపురేఖలు మారనున్నాయా?..
ఆసియాకు చెందిన దేశాలే పెట్టుబడుల జాబితాలో ఉండటం వల్ల కనీసం కస్టమ్స్‌ హోదా అయినా సాధ్యమైనంత త్వరగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. మరికొన్ని రోజుల్లోనే విజయవాడ విమానశ్రయం రూపురేఖలు మారిపోతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని సీపీఐ డిమాండ్...
విమాశ్రయం విస్తరణలో భాగంగా భూసేకరణ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం కచ్చితంగా అమలుచేసి తక్షణమే కార్యాచరణను ప్రకటించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.

సఫలమేనా?..
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమైన అంతర్జాతీయ విమాశ్రయాన్ని పొందడంలో చంద్రబాబు సర్కార్‌ సఫలమవుతుందో లేదో త్వరలోనే తేలిపోనుంది. 

14:52 - July 14, 2016

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అనుష్క జంటగా నటించిన 'సుల్తాన్' సినిమా కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజులకే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాలో నటించిన అనుష్కపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సల్మాన్ తో ముద్దుకు అనుష్క నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్.. అనుష్కల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు మరింత పండేందుకు ముద్దులు ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు అనుష్క ససేమిరా అందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముద్దు సీన్లు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ.. అనుష్క శర్మ నో చెప్పటంతో అలాంటివేమీ లేకుండా చిత్రం తెరకెక్కించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రికెటర్ కోహ్లీతో ప్రేమాయణంలో ఉన్న అనుష్క ఈ సినిమాలో ఆచితూచి వ్యవహరించిందన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో అనేది అనుష్క చెబితేనే తెలుస్తుంది. 

14:50 - July 14, 2016

హైదరాబాద్ : లేడిలా చెంగుచెంగున ఆటలాడుకునే పాప...అకస్మాత్తుగా నీరసించిపోయింది. స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులో మంచానికే పరిమితమైంది. అల్లారుముద్దుగ పెంచుకున్న పాప...తమ కళ్లముందే అలా కూలబడిపోతే అది చూసిన తల్లిదండ్రులు కంటతడి పెట్టుకొని తల్లడిల్లిపోతున్నారు. ఆర్థికంగా చితకిలబడిన తమ బతుకులకు విధి మరింత అన్యాయం చేసిందంటూ విలపిస్తున్నారు. తమను ఆదుకునే చేతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆరేళ్ల హర్షితను చిదిమేస్తున్న అనారోగ్యం...
అభం శుభం తెలియని వయసులో...తనకిలా జరుగుతుందని కలలో కూడా ఊహించని పరిస్థితుల్లో ...ఓ చిన్నారి మంచానికి పరిమితమైంది...తన అల్లరితో ఇంటినంతా సందడిచేసిన ఆ చిన్నారి..కనీసం మాట్లాడలేని పరిస్థితి ....

చదువులో చురుగ్గాఉండే చిన్నారి మంచానికే పరిమితం...
ఇక్కడ కనిపిస్తున్న పాప పేరు హర్షిత...వయసు పదకొండేళ్లు. ఆరవ తరగతి చదువుతోంది.. హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్టలో ఈమె కుటుంబం నివాసముంటోంది.మొన్నటివరకూ అందరి పిల్లల్లాగానే బాగానే ఉండేది. చదువులో చురుగ్గా...ఇంట్లో చలాకీగా సందడి చేసేది. సరిగ్గా మూడు నెలల క్రితం ఉన్నట్టుండి..వాంతులు చేసుకుంది. నాలుగైదు ఇలాగే కావడంతో డాక్టర్‌కి చూపించారు తల్లిదండ్రులు. తరువాత ఇదే పరిస్థితి రోజూ జ్వరం, వాంతులు ఇలా హరిత ఆరోగ్యం క్షీణించడం ప్రాంభమైంది.

వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు..
చిన్నారి హర్షిత ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడంతో చికిత్సకోసం తల్లిదండ్రులు ఆసుపత్రులు తిరిగారు. కేర్‌, కిమ్స్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా పాపకు కాలేయం పూర్తిగా పాడై పోయిందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చెయ్యించకపోతే పాప ప్రాణానికే ప్రమాదమని అన్నారు . లివర్‌ ప్లాంటేషన్ చేయ్యాలంటే 20లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. దీంతో తమ కుమార్తెను ఎలాగైనా బతికించుకోవాలని ఆరాటపడుతున్న తల్లిదండ్రులు ఉన్న భూమిని తాకట్టు పెట్టారు. తెలిసివారిన దగ్గర అప్పులు చేశారు.అయినా డబ్బు సరిపోకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు

డబ్బులు సరిపోకపోవడంతో దాతలకై ఎదరుచూపులు..

ఎన్‌.శ్యామల,అకౌంట్‌ నెంబర్ 111910100139372, ఆంధ్రబ్యాంక్.. వివేకానంద కాలని బ్రాంచ్, ఫోన్‌..9848647365

బతుకు తెరువుకోసం నగరానికి వలస...
బతుకు తెరువుకోసం మహబూబ్‌ నగర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన తాము లక్షల్లో డబ్బు ఎక్కడి నుంచి తేవాలని కన్నీరుమున్నీరవుతున్నారు హర్షిత తండ్రి రామచంద్రారెడ్డి. ఇప్పటికే పాప వైద్యం కోసం ఊర్లో ఉన్న ఎకరా భూమిని తాకట్టుపెట్టారు. అవి చాలకపోవడంతో బంధువుల దగ్గర అప్పులు చేశారు. అయినా వైద్యానికి ఖర్చులు సరిపోకపోవడంతో దాతలెవరైనా తమ కుమార్తెను ఆదుకోవాలని ప్రాదేయపడుతున్నారు.

ఆదుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు..
తమ బిడ్డ కళ్లముందే రోజురోజుకు చావుకు దగ్గరవడాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ కుమార్తెను దక్కించుకోవడానికి ఉన్న డబ్బునంతా ధారపోశారు. అయినా సరిపోవకపోవడంతోదాతలెవరైనా తమ బిడ్డ ఆపరేషన్ కోసం సహాయం చెయ్యాలని చేతులెత్తి అర్థిస్తున్నారు.

14:42 - July 14, 2016

హైదరాబాద్ : మోదీ పాలనలో నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ నుంచి ఇందిరా పార్కు వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, కర్యకర్తలు పాల్గొన్నారు. మోదీ రెండేళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు, పప్పులు, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని సీపీఎం నేతలు విమర్శించారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈనెల 16న ఢిల్లీ పర్యటన నేపథ్యంలో గవర్నర్ తో భేటీ కానున్నారు. 

మొక్కలు నాటిన మంత్రి ఈటెల..

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి ఈటెల రాజేందర్‌ సూచించారు. ఈరోజు మహాముత్తారం మండలం మేడారం సంక్షేమ వసతి గృహం, కస్తూర్బా పాఠశాల, ప్రభుత్వాసుపత్రిలో మంత్రి మొక్కలు నాటారు. 

పాత ప్రభుత్వాసుపత్రిలో శిశువు మాయం..

విజయవాడ : పాత ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల శిశువు మాయమైంది. గైనిక్ వార్డు నుండి మహిళ అపహరించుకపోయిందని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందిని విచారిస్తున్నారు. 

14:13 - July 14, 2016

మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది వెండి తెరకు పరిచయమౌతున్నారు. మొన్నటి మొన్న నాగబాబు కూతురు నిహారిక ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడానికి ముహుర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఈ శ్రావణ మాసంలో టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడన్నది ఫిల్మ్ నగర్ లో టాక్. ఇటీవలే చిన్న కూతురు శ్రీజ వివాహమైన సంగతి తెలిసిందే. తన భర్త ఫిల్మ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తండ్రి చిరంజీవి ఎదుట శ్రీజ పేర్కొన్నట్లు, ఇందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ సూచన మేరకు కళ్యాణ్ యాక్టింగ్ క్లాసులకు హాజరవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి శ్రావణ మాసంలో మెగా అల్లుడు వెండితెర మీదకు వస్తారా ? రారా ? అనేది వేచి చూడాలి. 

మహారాష్ట్రలో ఐసిస్ సానుభూతి పరుడి అరెస్టు..

మహారాష్ట్ర : పర్బాని జిల్లాలో ఐసిస్ తో సంబంధాలున్న 31 సంవత్సరాల వ్యక్తిని ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వివిధ ఐడీల ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. మరో వ్యక్తిని కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

13:48 - July 14, 2016

హైదరాబాద్ : చట్ట బద్దంగా ప్రాజెక్టులు నిర్మించాలని ప్రొ.కోదండరాం అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు నిర్మించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు చట్టం ప్రకారం పని చేయాలని.... చట్టానికి వ్యతిరేకంగా పని చేసేందుకు వీల్లేదన్నారు. తక్కువ ముంపు ఉండే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం, నిపుణుల ఇష్ట ప్రకారం కాకుండా..  ప్రజల అభీష్టం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలని తెలిపారు. ప్రజల ఇష్టాఇష్టాలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈనెల 21, 22 న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి.. అక్కడ నిర్మించబోయే సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తామని.. స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.  రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని వాపోయారు. ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు..ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కానీ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేవని విమర్శించారు. ప్రభుత్వం నియామకాల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారం లోపు నిరుద్యోగంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. అలాగే విద్యుత్ రంగంలో ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పుస్తకం ప్రచురించామని.. త్వరలో ప్రజలకు ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. 

 

13:46 - July 14, 2016

రంగారెడ్డి : బుల్లితెర నటి శ్రీవాణి కేసు వివాదం ముదురుతోంది. విచారణలో భాగంగా సీఐ నిర్మల పరిగి వెళ్లి దర్యాప్తు చేశారు. శ్రీవాణి అన్న బాబ్జీ ఇల్లు కూల్చివేసి వదిన అనూషపై దాడి చేశారని విచారణలో స్థానికులు తెలిపారు. పోలీసులు  శ్రీవాణి, ఆమె భర్త విక్రమాధిత్యరెడ్డిపై గృహ హింస చట్టంతో పాటు దాడి కేసు నమోదు చేశారు.  శ్రీవాణి కాసేపట్లో వికారాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌కు  వచ్చే అవకాశాలున్నాయి.

13:45 - July 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అధిక ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, టివివి, ఎఐడిఎస్‌ఓ, పిడిఎస్‌యువి తదితర సంఘాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:43 - July 14, 2016

ట్వంటియత్‌ ఫాక్స్‌స్టార్‌ సంస్థ సూపర్‌ స్టార్‌ రజనీకి అంకితమిస్తూ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఐస్‌ ఏజ్‌ ఫైవ్‌ చిత్రంలోని పాత్రలతో నెరుప్పుడా.. పాట నేపథ్యంలో ఈ వీడియో సాగుతుంది. కబాలి హిందీ వర్షన్‌ పంపిణీ హక్కులను ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ ఇండియా దక్కించుకుంది. ఉత్తర భారత్‌లో సుమారు వెయ్యికి పైగా తెరల్లో కబాలి విడుదల కానుంది. 

 

ఆజాద్..ఆనంద్ శర్మతో వెంకయ్య..

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ లతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భేటీ అయ్యారు. జీఎస్టీ బిల్లుపై చర్చిస్తున్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది. 

13:42 - July 14, 2016

ఢిల్లీ : అన‌వ‌స‌రంగా క‌శ్మీర్ అంశంలో జోక్యం చేసుకుంటూ, ఉగ్రవాది బుర్హాన్  అంశంపై ఐక్యరాజ్య స‌మితికి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే  స‌మాధాన‌మిచ్చింది భార‌త్‌. ఉగ్రవాదాన్నే త‌మ విధానంగా పాకిస్థాన్  మ‌ల‌చుకుంద‌ని ఘాటుగా స్పందించింది. . క‌శ్మీర్ అంశం, బుర్హాన్ హ‌పై  పాకిస్థాన్ అంబాసిడ‌ర్ చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తి చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే  పాకిస్థాన్‌.. మాన‌వ‌హ‌క్కుల గురించి  మాట్లాడ‌టం వింత‌గా ఉందని మండిపడింది బుర్హాన్‌ను క‌శ్మీరీ లీడ‌ర్‌గా అభివ‌ర్ణించిన పాకిస్థాన్‌.. అత‌న్ని భార‌త ఆర్మీ అన్యాయంగా హ‌త‌మార్చింద‌ని యూఎన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై భారత్ మండిపడింది. ఉగ్రవాదులకు వంత‌పాడుతున్న పాకిస్థాన్‌కు దాని ట్రాక్  రికార్డును చూసి ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ మాన‌వ హ‌క్కుల సంఘంలో సభ్యత్వం కూడా ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేసింది. భారత్ ఎప్పటికీ  మాన‌వ హ‌క్కుల రక్షణకు క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. 

జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : నాంపల్లి జేఏసీ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై గ్రామాల్లో సెమినార్ నిర్వహించడం జరిగిందని, నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యపై ఆగస్టు మొదటి వారంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. 21-22 తేదీల్లో మహబూబ్ నగర్ ప్రాజెక్టులను సందర్శించడం జరుగుతుందన్నారు. మల్లన్న సాగర్ విషయంలో నిపుణులు, ప్రాజెక్టు డిజైన్ మార్చి ముంపు తగ్గించాలని, ఓపెన్ కాస్టు, జెన్ కో భూ సేకరణ సరిగ్గా జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాక్ కు అమెరికా అల్టిమేటం..

అమెరికా : పాక్ దేశానికి అమెరికా అల్టిమేటం జారీ చేసింది. ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని, ఉగ్ర సంస్థలపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని పేర్కొంది. సరిహద్దు దేశాలను టార్గెట్ చేస్తున్న ఉగ్ర సంస్థలపైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

13:36 - July 14, 2016

సినీ నటుడు తనికెళ్ల భరణి బర్త్ డే సందర్భంగా టెన్ టివి ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా భరణి పలు అసక్తి కరమైన విషయాలు తెలిపారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.... 
'నా అభిమాన కవి శ్రీనాథుడు. మాది మధ్య తరగతి కుటుంబం. పేదరికం అనుభవించాను. పేదరికం త్రీవస్థితి  దాటిపోతే విశృంఖలత్వానికి దారి తీస్తుంది. పేదరికంలోని యువకులు దొంగతనాల వైపు మొగ్గుచూపుతారు. మామూలు, ఆవరేజ్ టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో రాణించలేరని.. సూపర్ హిట్ లు కావాలి. బాగా కష్టపడాలి. చేస్తున్న పనిని ఇష్ట పడాలి. చిన్నప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉంటాం..అదే చిన్నప్పుడు సుఖ పడితే జీవితాంతం కష్టపడతాం. నేను పెట్రోల్ బంక్ లో పని చేశాను. 600 పైగా వేశాలు వేశాను. అందులో 50 బాగా నచ్చినవి ఉంటాయి. అంకురం స్క్రిప్టు బాగా నచ్చింది. సామాజిక స్పృహతోనే సినిమా తీస్తా. అమ్మ, నాన్న, గురువు తర్వాత... నాకు తెలుగు నేర్పిన పరబ్రహ్మ శాస్త్రి, నా అభివృద్ధికి దోహద పడిన దేవరకొండ నరసింహమూర్తి, రాళ్లపల్లి సుందరంమూర్తి నాకు అప్తులు'అని తెలిపారు. కవిత్వాలు చదివి వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.

 

డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల పట్టివేత..

హైదరాబాద్ : డ్రైవింగ్ లైసెన్స్ లేని 267 మంది మైనర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. మైనర్లు, తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 

గవర్నర్ తో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈనెల 16న ఢిల్లీ పర్యటన నేపథ్యంలో గవర్నర్ తో భేటీ కానున్నారు. 

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శ్రావెల్...

హైదరాబాద్ : చిన్నారి రమ్య ప్రమాదం కేసులో నిందితుడు శ్రావెల్ పోలీసు కస్టడీ పూర్తయ్యింది. నాంపల్లి కోర్టులో పోలీసులు శ్రావెల్ ను హాజరు పరిచారు. కోర్టులో శ్రావెల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఏపీ పుష్కరాల పేరిట కోట్ల అవినీతి - వైసీపీ..

విజయవాడ : ఏపీ పుష్కరాల పేరిట కోట్ల అవినీతి జరుగుతోందని వైసీపీ నేత పార్థసారధి పేర్కొన్నారు. పుష్కర పనులపై ఉన్నతస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చివరి నిమిషం వరకు పనులను ఎవరికీ అప్పగించలేదని, నామినేషన్ల పేరిట తమ వారికి పనులు కేటాయించారని పేర్కొన్నారు. చేతి ఖర్చులకు రూ. 50 కోట్లా అని ప్రశ్నించారు. పుష్కరాలకు ముందే 30 ఆలయాలను కూల్చివేశారని, పుష్కరాలు దోపిడికి ఆయుధంగా మారయని పేర్కొన్నారు. 

12:52 - July 14, 2016

గుంటూరు : ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం పేరుతో బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి మధు విమర్శించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నంలలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని. రైతుల నిరసనలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల మద్ధతుతో ఉద్యమిస్తామన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తామని చెప్పారు. గుంటూరులో ఆగస్టు 1,2 తారీఖుల్లో జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని చెప్పారు.  

12:45 - July 14, 2016

హర్యానా : తెలంగాణలో భారీ ప్రాజెక్టులు అవసరం లేదని...భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో భూమి నష్టపోతామని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. హర్యానాలోని నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిపుణులతో కలసి ఆయన సందర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. హర్యానాలో పరిశీలించిన అంశాలను అందరికీ వివరిస్తామన్నారు. ఎల్లుండి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను కలసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రయోజనాలను వివరిస్తామని చెప్పారు. తెలంగాణలో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిపోతాయని తెలిపారు.

కొనసాగుతున్న తమ్మినేని పాదయాత్ర..

ఖమ్మం : జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర కొనసాగుతోంది. టేకులపల్లి మండలం కోయగూడేం ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులకు ఎకరానికి 15 లక్షల పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ్మినేని పాదయాత్ర చేపట్టారు.

గవర్నర్ తో బీజేపీ లీగల్ సెల్ నేతల భేటీ..

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో బీజేపీ లీగల్‌ సెల్‌ నేతలు గురువారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన, లాయర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నేతలు వినతి చేశారు.

12:38 - July 14, 2016

ధర్మరక్ష ట్విన్స్‌ దర్శకత్వంలో నవీన్‌ చంద్ర, ప్రియల్‌గోర్‌ జంటగా ఐఈఎఫ్‌ కార్పొరేషన్‌, ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ పతాకాలపై కిరణ్‌ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చందమామ రావే'. 'అది రాదు.. వీడు మారడు' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలోని మొదటి పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 'ఇదొక ప్రేమకథా చిత్రం కావడంతో దానికోసం నవీన్‌ చంద్ర, ప్రియల్‌ గోర్‌ వంటి లవబుల్‌ పెయిర్‌ని సెలక్ట్‌ చేసుకున్నాం. వీళ్ళ పాత్రలు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. దర్శకులు ధర్మ రక్ష సినిమాను చాలా క్రియేటివ్‌గా ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగులో ఇప్పటి వరకు లేనట్టుగా చిత్రంలోని 'ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యంగానే హల్లో అంటారు.. అది గ్రహంబల్‌ ప్రస్టేషన్‌ పేరు, ఎవరు.. వాళ్ళావిడ గురూ.. అందమైన అబద్ధానికి ముద్దుపేరు అర్థం లేని నిజంకి కొత్త పేరు..వైన్‌ ప్లస్‌ ఉమెన్‌ హౌ ఈజ్‌ లైఫు ఫైను.. ఆడపిల్ల లుక్స్‌ డౌటే లేదు డ్రగ్స్‌..' అంటూ సాగే మొదటి పాటను సోషల్‌ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం హ్యాపీగా ఉంది. చక్కటి ప్రేమ కథకి గ్రాండియర్‌ విజువల్స్‌ తోడైన ఈ చిత్రం ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. అతి త్వరలోనే టీజర్‌ని, ఆడియోను విడుదల చేసి, ఆ వెంటనే సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

 

మైనింగ్ అక్రమాలపై మంత్రి కేటీఆర్ కొరడా..

హైదరాబాద్ : మైనింగ్ అక్రమాలపై మంత్రి కేటీఆర్ కొరడా జులిపించారు. అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకున్నారు. అక్రమాలు జరిగిన మహబూబ్ నగర్ లోని గుడిబండ రీచ్ అనుమతిని రద్దు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఎన్న ఏడీ, రాయల్టి ఇన్ స్పెక్టర్ల ను సస్పెన్షన్ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.

కాసేపట్లో పీఎస్ బుల్లితెర నటి శ్రీవాణి..

రంగారెడ్డి : కాసేపట్లో వికారాబాద్ మహిళా పీఎస్ కు బుల్లితెర నటి శ్రీవాణి వెళ్లనున్నారు. విచారణలో భాగంగా పరిగివెళ్లిన సీఐ నిర్మల దర్యాప్తు చేపట్టారు. తన అన్న బాబ్జీ ఇల్లు కూల్చి వేసి వదిన అనూషపై దాడి చేశారని పోలీసులకు స్థానికులు తెలిపారు.శ్రీవాణి, ఆమె భర్త విక్రమాదిత్య రెడ్డిపై గృహహింస చట్టంతో పాటు దాడి కేసు నమోదు చేశారు. 

12:21 - July 14, 2016

విశాఖ : సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖలోని బీహెచ్ ఈఎల్ కార్మికులు ఆందోళనకు దిగారు. సర్వీస్ వెయిటేజ్  గ్రేడుల ఒప్పందం వెంటనే అమలు చేయాలని, బీహెచ్ ఈఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించేది లేదని అంటున్నారు.

12:14 - July 14, 2016

హైదరాబాద్‌ : ఉప్పుగూడ మహంకాళి మందిరం సమీపంలో బాంబ్‌ ఉందంటూ కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తులు మందిరం సమీపంలో బ్యాగ్ విడిచి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు బ్యాగ్‌ను చూసి సందేహంతో పోలీసులకు సమాచారమందించారు. బ్యాగ్‌ ఉన్న ప్రదేశానికి చేరుకున్న ఫలక్‌నుమా ఎస్సై బాంబ్‌ స్క్వేడ్‌తో తనిఖీలు చేశారు. బ్యాగులో బుక్స్, ఆ వ్యక్తి ఐడికార్డు, లంచ్ బాక్స్ దొరికాయి.  బాంబ్‌ కాదని తెలియడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

 

నేటి సాయంత్రం గులామ్ నబీ ఆజాద్ ప్రెస్ మీట్..

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ నేడు సాయంత్రం నాలుగు గంటకుల ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. 

శ్రీనగర్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో జరిగిన పలు హింసాత్మక ఘటనలలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత దరిమిలా కాశ్మీర్ లోయలో హింసాత్మక నిరసనలు తలెత్తిన సంగతి తెలిసిందే.

12:06 - July 14, 2016

శ్రీనగర్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కశ్మీర్‌లో ఐదోరోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూ కారణంగా పెళ్లిళ్లు తదితర శుభకార్యాలను జనం వాయిదా వేసుకుంటున్నారు. వేర్పాటువాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌ కశ్మీర్‌ బంద్‌ను మరో రెండు రోజులు పొడిగించింది.
ఐదోరోజు కర్ఫ్యూ 
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లోయలో వేర్పాటువాదులు ఇచ్చిన బంద్‌ పిలుపుతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. జమ్ముకశ్మీర్‌లోని పది జిల్లాల్లో ఐదోరోజు కూడా కర్ఫ్యూ అమలవుతోంది.  
ఘర్షణ వాతావరణం 
మంగళవారంనాడు భద్రతాదళాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కుప్వారా జిల్లాలోని ఓ పోలిస్‌ స్టేషన్‌పై అల్లరిమూకలు దాడికి పాల్పడ్డాయి. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. కశ్మీర్‌లో అల్లర్ల కారణంగా 30 మంది మృతి చెందారు. 8 వందలమంది గాయపడ్డారు.
మృత వీరులకు సీఎం మొహబూబా ముఫ్తీ నివాళులు 
1931లో శ్రీనగర్‌లోని సెంట్రల్‌ జైల్‌ బయట జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన 22 మంది మృత వీరులకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ నివాళులు అర్పించారు. కశ్మీర్‌లో ప్రతి ఒక్కరూ శాంతిని కాపాడాలని ఈ సందర్భంగా సిఎం పిలుపునిచ్చారు. మరోవైపు విపక్ష నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కూడా అమరులకు నివాళులు అర్పించారు. కశ్మీర్లో పరిస్థితిని అంచనా వేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. పోలీస్ వ్యాన్లను చూస్తుంటేనే ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. కశ్మీర్‌లో గ్రౌండ్‌ లెవల్ పరిస్థితి ఓ రకంగా ఉంటే తప్పుడు నిర్ధారణతో సిఎం మెహబూబా ముఫ్తి కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ సిఎం ట్విట్టర్‌లో ఆరోపించారు. 
శుభకార్యాలు వాయిదా 
కశ్మీర్ అల్లర్ల కలకలంతో ప్రజలు ఈ రోజుల్లో జరగాల్సిన శుభకార్యాలను వాయిదా వేస్తున్నారు. ఆయా పత్రికల్లో  సాధారణంగా ఆహ్వానాల రూపంలో దర్శనమిచ్చే క్లాసిఫైడ్స్ ఇపుడు ఆహ్వానాలు రద్దు అని దర్శనమిచ్చాయి. దాదాపు అన్ని పత్రికల్లో ఇలాంటి వింత క్లాసిఫైడ్స్ కనిపించాయి. వేర్పాటువాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌ కశ్మీర్‌ బంద్‌ను మరో రెండు రోజులు పొడిగించడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

సీఎం అభ్యర్థి రేసులో షీలా దీక్షిత్ ?

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డుతోంది. 

12:00 - July 14, 2016

విజయవాడ : గోదావరి మహా పుష్కర విషాదానికి ఏడాది పూర్తయ్యింది. దక్షిణ గంగగా...సర్వపాప హారిణిగా భక్తకోటి చేత పూజలందుకుంటున్న గోదావరి నదీమ తల్లి తీరంలో గత ఏడాది చోటుచేసుకున్న మృత్యుఘోష ఇంకా కళ్లముందు కదలాడుతూనే  ఉంది. పుష్కర  స్నానం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పుష్కరాల ప్రారంభం రోజు  జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు  కోల్పోయారు.  ఆనాటి  విషాద ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా టెన్ టీవీ ప్రత్యేక కథనం...
తొక్కిసలాట, 27 మంది మృతి
2015 గోదావరి పుష్కరాలు...తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గోదావరి నదికి వచ్చిన పుష్కరాలలో మహాపుష్కరం కావడంతో రెండు ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం పుష్కర విశిష్టతను, దక్షిణ గంగ గోదావరిలో పుష్కర పుణ్య ఘడియల్లో మునకేస్తే సిద్ధించే మోక్షం కోసం దేశనలుమూలకు ప్రచారం చేయడంతో....అప్పటి పుష్కరాల ప్రారంభ తొలిరోజు జులై 14 న పుష్కర క్రతువుకు వేదికైన రాజమండ్రి నగరం భక్త కోటితో కిక్కిరిసిపోయింది. చారిత్రక రాజమహేందర్వర తీరప్రాంతంలో భక్తులు పుష్కర ఘడియల్లో మునకేసేందుకు తెల్లవారు జూమునుంచే ఘాట్లకు పోటెత్తారు. అనంతరం కొన్ని గంటల్లోనే పుష్కరాల రేవు సాక్షిగా జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు ఊపిరాడక మృత్యవాత పడ్డతీరు యావత్ దేశాన్నే ఆనాడు కలిచివేసింది...
పుష్కర విషాదంపై విపక్షాలు, ప్రజసంఘాల ఆందోళన 
అయితే ఆనాటి భయంకర తొక్కిసలాట ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దీంతో సర్కార్  గతేడాది సెప్టెంబర్ 15న జారీ చేసిన 29వ నంబర్‌  జీవో ద్వారా తొక్కిసలాట ఘటనపై జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ తొలిసారిగా ఈ ఏడాది జనవరి 18న రాజమండ్రిలో విచారణను ప్రారంభించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న రెండోసారి..మార్చి 21న మూడోసారి...చివరిగా  గతనెల  29 న కమిషన్ 
విచారణ జరిపింది.
మరోసారి కమిషన్ కాలపరిమితి పొడగింపు
ఈ క్రమంలో ఒకసారి కమిషన్ గడువు ముగిసిపోతే...మరోసారి కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది.  పుష్కర తొక్కిసలాటకు సంబంధించి కమిషన్ కు ఫిర్యాదులు చేసిన బాధితులు, ప్రజా సంఘాల నేతలు వాదనలను కమిషన్ నమోదు చేసుకుంది..ఈ నేపథ్యంలోనే గత నెల 29తో కమిషన్ కాలపరిమితి ముగిసిపోయింది. పుష్కర తొక్కిసలాట ఘటనకు  ఏడాది గడిచినా.. కమిషన్ ముందు ప్రభుత్వం తన వాదనలు వినిపించలేదు.  ఈక్రమంలో పుష్కర మహా  విషాదంపై ఇప్పటికైనా సర్కార్ వాస్తవాలను చెప్పాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పుష్కరా విషాద ఘటన విచారణపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ కమిషన్‌కు సహకరించి, నివేదిక అందించేలా చూడాలని కోరుతున్నారు.  

 

యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహా ధర్నా..

విజయవాడ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం..

విజయనగరం : మున్సిపల్ ఆఫీసులో కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. దేశంలో లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, సోలార్ విద్యుత్ తయారీకి స్థానిక సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొవ్వాడలో అణువిద్యుత్ కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదన ఈ నాటిది కాదని పేర్కొన్నారు. 

బీహెచ్ఈఎల్ ఎదుట కార్మికులు మహాధర్నా...

విశాఖపట్టణం : బీహెచ్ఈఎల్ ఎదుట కార్మికులు మహాధర్నా చేపట్టారు. సర్వీస్ వెయిటేజ్ గ్రేడుల ఒప్పందం అమలు చేయాలని 2014 నుండి సర్వీస్ వెయిటేజ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

11:52 - July 14, 2016

హైదరాబాద్ : ఓ వైపు ఉగ్రవాదుల కదలికలు..అదను చూసి పంజా విసిరే స్లిపర్‌ సెల్స్‌.. మరోవైపు మూష్కర మూకల అరెస్టులు..ఇంకోవైపు వరుస పండగలు..ఉగ్రకుట్రలను భగ్నం చేసిన భాగ్యనగర పోలీసులు...శాంతి భద్రతల పరీరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కార్డెన్‌ సెర్చ్‌లతో నగరాన్ని జల్లెడ పడుతూ ఉగ్రజాడలను పసిగడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. 
పాతబస్తీలో పోలీసుల పహారా..
ఉగ్రమూకల విధ్వంసర కుట్రను భగ్నం చేసిన హైదరాబాద్‌ పోలీసులు..సిటీ సెఫ్టీ విషయంలో రాజీపడటం లేదు. ఓ వైపు నగరాన్ని డేగకళ్లతో పాహార కాస్తూనే మరోవైపు కార్డెన్‌ సెర్చ్‌లతో నేరగాళ్ల పనిపడుతున్నారు. ఇటీవలే ఏడుగురు ఐసీస్‌ సానుభూతిపరులు ఎన్‌ఐఏకు పట్టుబడ్డారు. వీరితో పాటు మరికొందరు పాతబస్తీలో ఉన్నట్లు సమాచారం రావడంతో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 
కార్డెన్‌ సెర్చ్‌
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు తెల్లవారుజామున నగరంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.   సౌత్జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 588 పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.  మీర్ఆలం, ముస్తఫానగర్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, చందానగర్, శంషాబాద్, గుల్జర్నగర్ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. 101 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటు..26 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేనటువంటి 120 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. తనిఖీల సందర్భంగా గుర్తించిన 12 మంది బాలకార్మికలకు పోలీసులు విముక్తి కల్పించారు. 
ఇంటర్నెట్‌ సెంటర్లు, కేఫ్‌ల్లో తనిఖీలు.. 
ఉగ్రవాదుల కదలికల నేపథ్యంతో ఇంటర్నెట్‌ సెంటర్లు, కేఫ్‌లపై సోదాలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వారి వివరాలు వెంటనే పోలీసులకు అందించాలని ఇంటర్నెట్‌ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. కాలనీల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించిన తరువాత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. పక్కా ఆధారాలుంటేనే ఇళ్లు అద్దెకు ఇవ్వాలని..అనుమానం వస్తే వారి వివరాలను హాక్‌ ఐ యాప్‌కు పంపాలని సూచిస్తున్నారు. నగరంలో ఉగ్రవాదుల కదలికలు బయటపడిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వరుస కార్డన్ సెర్చ్ ఆపరేషన్లతో నేరగాళ్లకు వణుకుపుట్టిస్తున్నారు. 

పోలీసుల అదుపులో విద్యార్థులు..

హైదరాబాద్ : తెలంగాణలో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. బాగ్ లింగంపల్లి అంబేద్కర్ కాలేజీ నుండి ర్యాలీకి యత్నించిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ఇన్ కం ట్యాక్స్ అధికారుల దాడి..

హర్యానా : మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమితా సింగ్ ఇంటిపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నల్ లోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:23 - July 14, 2016

జామకాయ.. దీనిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వీటిలో పీచు, విటమిన్లు, ప్రొటీన్లు బాగా లభిస్తాయని, అనారోగ్యాలకు గురి కాకుండా కాపాడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్లు, బీటా కెరొటిన్, ల్యూటిన్లు కాన్సర్ కారకలు, కణతలు వ్యాప్తి చెందకుండా కాపాడుతాయి. నారింజ పండ్లలో దొరికే దానికన్నా అధిక విటమిన్ సి అత్యధికంగా ఈపండులో దొరుకుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆందోళనను దూరం చేస్తుంది. విటమిన్‌ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టిలోపాలు దూరమవుతాయి. శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపయోగపడుతుంది.

11:12 - July 14, 2016

వంట గది..ఆహారంకు సంబంధించి..ఇతరత్రా వస్తువులన్నీ ఈ గదిలో పెడుతుంటారు. దీనితో చిన్నగా ఉండే వంటగది ఇరుకుగా మారిపోతుంటుంది. పనికిరాని వస్తువులను తీసేయడం వల్ల ఖాళీ స్థలం దొరుకుతుంది. వంటగది ఇరుకు కాకుండా నచ్చినట్లు ఎలా ఉంచుకోవచ్చు.. చూద్దాం..
వంటగది సింక్ కింది భాగంలో షెల్ఫ్స్ లాంటివి అమర్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అవసరమయ్యే వస్తువులను అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అందంగా ఉండడంతో పాటు స్థలం కూడా ఉపయోగపడుతుంది. మార్కెట్ లలో సింక్ షెల్ఫ్స్ లు దొరుకుతున్నాయి. టూ టైర్, త్రీ టైర్ ఫుల్ అవుట్ బాస్కెట్లు అందుబాటు ధరల్లోనే లభ్యమౌతున్నాయి. డిటర్జెంట్లు, లిక్విడ్‌ సోప్‌ బాటిల్స్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ డబ్బాలు, బ్రష్‌లు, చివరకు హ్యాండ్‌ టవల్స్‌తో సహా చక్కగా సర్దుకోవచ్చు. చిన్న చిన్న బాటిల్స్‌ లాంటివి ఉంటే వాటన్నింటిని ఒకే ట్రేలో సర్దుకోవచ్చు. 

11:09 - July 14, 2016

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కజకిస్థాన్‌ నిపుణుల చేత డిజైన్లు తయారు చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటును ప్రతిపాదించింది. దీనికి ఆస్తానా మేయర్‌ కూడా అంగీకరించారు. జపాన్‌ రూపొందించిన డిజైన్లపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం.. ఆస్తానాకు డిజైన్ల పని అప్పగించేందుకు సిద్ధమవుతోంది. అయితే చంద్రబాబు విదేశీ ఫోబియాతో ఏ దేశం వెళితే.. ఆ దేశ నమూనా అంటున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
అమరావతి నిర్మాణంలో కజకిస్తాన్‌కు భాగస్వామ్యం 
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో కజకిస్తాన్‌కు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు ..ఆ దేశం పదేళ్ళ వ్యవధిలోనే అద్భుత రాజధానిని నిర్మించుకుందని ప్రశంసించారు. ఆస్తానా నిర్మాణశైలికి ముగ్ధులైన బాబు.. కజకిస్థాన్‌ నిపుణుల చేతే నిర్మాణ డిజైన్లు గీయించాలని నిశ్చయించారు. దీని కోసం ఓ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసుకుందామని కూడా ప్రతిపాదించారు. అయితే చంద్రబాబు నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
జపాన్ సంస్థ డిజైన్లు ఖరారు
అమరావతి నగరంలో నిర్మించబోయే భవనాలకి మొదట జపాన్ సంస్థ ఇచ్చిన డిజైన్లని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కానీ దానిపై విమర్శలు రావడంతో ఆ డిజైన్లలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఇప్పుడు ఆస్తానాకి ఆ పని అప్పగించేందుకు సిద్ధపడటంపై.. జపాన్ ఇచ్చిన డిజైన్లనే వీరు రూపొందిస్తారా లేక ప్రభుత్వం వీరి చేత వేరే డిజైన్లను రూపొందించే పనిలో ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భారీ ప్రాజెక్టు మొదలు పెట్టేముందు లోతైన అధ్యయనం చేసి, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే అయినా...ఏళ్లకు ఏళ్లు సమయం వృథా చేయడం తగదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
విదేశీయుల డిజైన్లు ఎందుకు : విశ్లేషకులు 
సింగపూర్ చేత అమరావతి మాస్టర్ ప్లాన్, భవనాలకి జపాన్ డిజైన్లు, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థల చేత రాజధాని నిర్మాణం చేపట్టాలనుకున్న ప్రభుత్వం... తాజాగా ఆస్తానాకు డిజైన్లను అప్పగించే పనిలో పడింది. మన దేశంలోనే అద్భుతమైన అర్కెటెక్ట్‌ నిపుణులుండగా విదేశీయుల నుంచి డిజైన్లు రూపొందించాల్సిన అవసరం ఏముందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆస్తానాకు కేవలం డిజైన్లు గీసే పని మాత్రమే అప్పగించ బోతుందా..? లేక దాని చేతే రాజధాని నిర్మాణం చేయించే అవకాశం ఉందా అన్నది  తేల్చాల్చి ఉంది. ఏదేమైనా అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రచారం, మరెంతో సందిగ్ధతతో ముందుకు సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.   

క్షమాపణలు చెప్పని సల్మాన్ ?

ఢిల్లీ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పలేదని తెలుస్తోంది. సుల్తాన్ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా సల్మాన్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా కమిషన్ సల్మాన్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై సల్మాన్ గురువారం సమాధానం ఇచ్చినట్లు, అందులో క్షమాపణలు చెప్పలేదని సమాచారం. 

11:02 - July 14, 2016

టీమిండియా బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవేల కోచ్ గా కుంబ్లే ఎంపికైన సంగతి తెలిసిందే. జహీర్ ను బౌలింగ్ కోచ్ గా నియమించే అవకాశాలున్నట్లు గంగూలీ వ్యాఖ్యానించారు. కోచ్ పదవిపై జహీర్ కు ఆసక్తి ఉందో లేదో తనకు తెలియదని, ఏడాది కాలం పాటు జట్టుకు అందుబాటులో ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కుంబ్లే స్వయాన బౌలర్‌ కావడంతో సహాయ బౌలింగ్‌ కోచ్‌ను నియమించలేదని, సలహా కమిటీ సభ్యులైన లక్ష్మణ్‌, సచిన్‌ల నుంచి తనకు ఈ విషయంలో ఏటువంటి ఒత్తిడి తీసుకురాలేదని పేర్కొన్నాడు. మరి జహీర్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తారా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

11:00 - July 14, 2016

శ్రీకాకుళం : జిల్లాలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ బాలిక మృతి చెందింది. పొందూరు మండలం దళ్లిపేటలో స్పందన(10) అనే బాలిక  ఐదో తరగతి చదువుతోంది. పొలంలో ఉన్న ఆమె నాన్నకు టీ ఇచ్చేందుకు వెళ్తున్న సందర్భంలో వీధి కుక్కలు స్పందనపై దాడి చేశాయి. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందింది. స్పందన మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 

మాజీ జేడీయూ ఎమ్మెల్యే అరెస్టు..

బీహార్ : మాజీ జేడీయూ ఎమ్మెల్యే లలన్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పాట్నాలోని ఆయన నివాసంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

26న ఏసీబీ ఎదుట షీలా దీక్షిత్..

ఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు సమన్లు జారీ చేసినట్లు ఏసీబీ అధికారి ఎంకే మీనా పేర్కొన్నారు. ఆగస్టు 26న ఏసీబీ ఎదుట షీలా హాజరు కానున్నట్లు, వాటర్ కుంభకోణంలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు. 

10:52 - July 14, 2016

చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కాలికి గాయమైంది. తన కార్యాలయంలోని మెట్లపై నుండి కిందకు దిగుతుండగా, కాలు స్లిప్ అయి పడిపోవడంతో కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. కమల్ ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో  శభాష్ నాయుడు చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశం ఉంది. 

 

10:49 - July 14, 2016

రంగారెడ్డి : టీవీ నటి శ్రీవాణి వివాదం ముదురుతోంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంపై ఆమె వదిన అనూష శ్రీవాణిపై వికారాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ ఇంటిని శ్రీవాణి కూల్చివేయించిందని..  ఫిర్యాదులో పేర్కొంది. అనూషకు వికారాబాద్‌ గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఇల్లు కూల్చివేయించిన శ్రీవాణిపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే శ్రీవాణి సోదరుడు బాబ్జి అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త చనిపోయి బాధలో ఉన్న తనను శ్రీవాణి వేధింపులకు గురిచేస్తోందని అనూష కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. న్యాయం చేయాలని వేడుకుంటోంది. శ్రీవాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
శ్రీవాణి వదిన అనూష.. 
'19 సం. క్రితం నాకు  బాబ్జితో పెళ్లైంది. అత్తమామలు నన్ను పని మనిషిలాగా చూశారు. నా భర్తకు రెండు కిడ్నీలు చెడిపోయి..ఇటీవలే చిపోయాడు. నా అత్తమాములు, ఆడపడచులు సహకరించలేదు. మా ఆడపడుచు, యాంకర్ శ్రీవాణి మిగతా ఆడపడుచుల సహకారంతో కలిసి ఇద్దరిని తీసుకొచ్చి మా ఇల్లును కూల్చివేసింది. మా అన్ననే చనిపోయిండు... ఇంట్లో నీవు ఎందుకుంటున్నవు.. వెళ్లిపో అంది' అని చెప్పింది. 
శ్రీవాణి భర్త విక్రమాధిత్యారెడ్డి.. 
'ఇల్లు కూల్చివేత విషయం మాకు తెలియదు..మాపై కేసు పెట్టారు అని పోలీసులు చెబితే నేను, మా భార్య శ్రీవాణి కలిసి పీఎస్ కు వెళ్లాము. ఆ ఇల్లు శ్రీవాణి నాన్నది.. ఆ ఇల్లు కూలగొట్టి రెండేండ్లు అయింది'. అని చెప్పారు. 
నటి శ్రీవాణి..  
'మా వదిన ఉంటున్న ఇల్లును మేము కూల్చడానికి వెళ్లలేదు. 11 న నా భర్త చిత్రపురి కాలనీలో జరిగిన ఆర్టిస్టుల సమావేశంకు వెళ్లారు. ఎలాంటి ఆస్తి వివాదాలు లేవు.షూటింగ్ లలో నేను బిజిగా ఉన్నాను. మా  అనూష చెబుతున్న ఇల్లు మా నాన్న గారిది. ఒక సంవత్సరం క్రింతం ఆ ఇల్లు కూలిపోయింది. నెల క్రితం మా అన్నయ్య చనిపోయిండు. ఆ ఇంటితో నాకు సంబంధం లేదు. నా పేరు మీద ఎలాంటి ఆస్తి ఉన్నా మా వదినకు రాసిస్తాను. 
ఆమెకు పబ్లిసిటీ కావాలని.. నేను సెలబ్రిటీని కాబట్టి నా పేరును ఉపయోగించుకుంటుందని' తెలిపారు. 

 

మొక్క నాటిన మంత్రి తుమ్మల..

ఖమ్మం : జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ కళాశాలలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు.

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ ఉన్నతస్థాయి సమావేశం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న శాంతిభద్రతల అంశంపై చర్చిస్తున్నారు. కేంద్ర హోం అధికారులు..ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

వేజెండ్ల టీడీపీ ఎంపీటీసీ మృతి..

గుంటూరు : జిల్లాలోని చేబ్రోలు మండలం వేజెండ్ల టీడీపీ ఎంపీటీసీ రేవతి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం తుదిశ్వాస విడించారు. ఎమ్మెల్యే నరేంద్ర, పలువురు నేతలు రేవతికి నివాళులర్పించారు.

కృష్ణా జిల్లాకు గోదవరి నీరు..

కృష్ణా : జిల్లాలోని పెదవేగి మండలం జానాంపేట దగ్గర కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని అధికారులు విడుదల చేశారు. గురువారం ఉదయం ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, ఎమ్మెల్యే జుజ్జి నీటిని విడుదల చేశారు. 

10:36 - July 14, 2016

టీమిండియా జట్టు విండీస్ ప్రెసిడెంట్ బోర్డు ఎలెవన్ తో రెండో వార్మప్ మ్యాచ్ కు సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కచ్చితంగా నెగ్గాలని టీమిండియా పట్టుదలతో ఉంది. నేటి నుండి ఆరంభమయ్యే మూడు రోజుల మ్యాచ్ లో కొన్ని మార్పులు..చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.
తొలి మ్యాచ్ లో ఆకట్టుకున్న భారత బౌలర్లు..బ్యాట్స్ మెన్స్ ఎలా రాణిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే భారత క్రికెట్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే వినూత్నమైన నిబంధనలు ప్రవేశ పెడుతున్నారు. టీమ్ బస్సు..సమావేశానికి ఆలస్యంగా క్రీడాకారులు చేరుకుంటే 50 డాలర్ల జరిమాన ఉంటుందని నిబంధన పెట్టాడు. జాన్ రైట్ హాయంలోని బడ్డీ సెషన్ లో గాయకులు వసుంధర దాస్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ సెషన్ ఉంటుందని, ఇచ్చే స్వేచ్ఛను క్రికెటర్లు దుర్వినియోగం కాకుండా మెలగాలని కుంబ్లే పేర్కొన్నాడు. మరి ఈ కొత్త నిబంధనలతో జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తాడో వేచి చూద్దాం. 

10:35 - July 14, 2016

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సినిమాల్లో నటించనుందా ? అది బాలీవుడ్ బాద్ షా తో అని అనుకుంటున్నారా ? అదేం కాదు. సానియా ఆత్మకత 'ఎస్ ఎగైనెస్ట్ ఆడ్స్' పుస్తకాన్ని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆవిష్కరించారు. నగరంలోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో షారుఖ్ పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సానియా కుటుంబసభ్యులు అందరూ పాల్గొన్నారు. సానియాతో అనుబంధం..టెన్నిస్ కోర్టులో ఆమె సాధించిన విజయాలపై షారుఖ్ ప్రశంసలు గుప్పించారు. జులై 17న ముంబాయిలో జరిగే మరో కార్యక్రమంలో బాలీవుడ్ కండలవీరుడు 'సల్మాన్ ఖాన్' సానియా ఆత్మకథను ఆవిష్కరించనున్నారు. 

10:33 - July 14, 2016

అల్లరి నరేషన్ నటించిన 'సెల్ఫీరాజా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. సాక్షి చౌదరి, కామ్నా రనవత్ హీరోయిన్లుగా జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం చౌదరి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ థియేటికల్ ట్రైలర్స్ ను విడుదలయ్యాయి. అల్లరి నరేష్ నుండి ఎలాంటి కామెడీ కావాలని ప్రేక్షకుల కొరుకుంటారో అలాంటి కామెడీతో నరేష్ నవ్వించడానికి వస్తున్నారని నిర్మాతలు తెలిపారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే తన చిత్రానికి హీరో శర్వానంద్ వాయిస్ ఓవర్ ఇచ్చారని అల్లరి నరేష్ పేర్కొన్నారు. 'సెల్ఫీరాజా'కు వాయిస్ ఓవర్ ఇస్తున్న ఎక్స్ ప్రెస్ రాజా అని ట్విట్టర్ లో పేర్కొంటూ శర్వానంద్ తో దిగిన సెల్ఫీని పోస్టు చేశారు. మరి చిత్రం ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

 

10:32 - July 14, 2016

అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'తలా 57' చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో అజిత్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించనున్నారు. 'తలా 57' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు, పక్కా స్ర్కిప్ట్ తో హిట్ కొట్టాలనే ముందుకు వెళుతున్నట్లు నిర్మాత టి.జి.త్యాగరాజన్ పేర్కొన్నారు. త్వరలోనే టైటిల్ ను..నటీనటుల వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే అజిత్ సరసన అనుష్క లేదా కాజల్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్. అజిత్..శివ కాంబినేషన్ లో గతంలో 'వీరమ్', వేదాలమ్' చిత్రాలు మంచి విజయాలు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

బుల్లితెర నటి శ్రీవాణిపై కేసు నమోదు..

హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రీవాణిపై వికారబాద్ పీఎస్ లో కేసు నమోదైంది. ఆస్తి తగాదా విషయంలో శ్రీవాణిపై వదిన అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇల్లును శ్రీవాణి కూల్చివేయించిందని అనూష ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని అనూష వేడుకొంటోంది. ఇటీవలే శ్రీవాణి సోదరుడు బాబ్జీ మృతి చెందాడు.

 

10:13 - July 14, 2016

బాబాయి వెంకటేష్‌, అబ్బాయి రానా కాంబినేషన్‌లో ఓ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం. 'క్షణం' చిత్ర దర్శకుడు రవికాంత్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. ఈ కాంబినేషన్‌కి సరిగ్గా సరిపోయే కథను రవికాంత్‌ తయారు చేసిన విధానం సురేష్‌బాబుకి బాగా నచ్చి, సురేష్‌ ప్రొడక్షన్‌లోనే నిర్మించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారని తెలుస్తోంది. బాబాయి వెంకటేష్‌ 'బాబు బంగారం' చిత్రంతో బిజీగా ఉంటే, అబ్బాయి రానా 'బాహుబలి 2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీతో రూపొందిన 'మనం' తర్వాత ఆ తరహా చిత్రంలో నటించేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ శతవిధాలా ప్రయత్నించింది. దీనికోసమై స్వర్గీయ రామానాయుడు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన కోరిక తీరలేదు. అయితే ఆ కోరికలో కొంత మేరకు తీరే ఛాన్స్‌ ఇప్పు డొచ్చింది.

 

శ్రావెల్ కు ముగిసిన కస్టడీ..

హైదరాబాద్ : ర్యాష్ డ్రైవింగ్ తో చిన్నారి రమ్య మరణానికి కారణమైన ప్రధాన నిందితుడు శ్రావెల్ కు పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. నేడు నాంపల్లి కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. 

10:05 - July 14, 2016

సినీనటి విజయశాంతి సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వనుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించనుంది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రంలో విజయశాంతి ఓ ముఖ్యపాత్రని పోషించనుందట. దీని కోసమై ఇటీవల చిత్రయూనిట్‌ ఆమెని సంప్రదించగా, పాత్ర ప్రాధాన్యత నచ్చి, నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారట. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌ తెరపై తళుక్కుమనేందుకు మార్గం సుగమనమైందని తెలుస్తోంది. విజయ్ కథానాయకుడిగా తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమేక్‌గా నిర్మిస్తున్న చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. చిరంజీవి, విజయశాంతి.. దాదాపు దశాబ్దానికిపైగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించిన జంట. క్రేజీ కాంబినేషన్‌గా డాన్స్‌లతో విశేషంగా ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్‌లో రూపొందిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'యముడికి మొగుడు', 'పసివాడి ప్రాణం', 'స్వయం కృషి', 'చాణక్యశపథం', 'కొండవీటి రాజా', 'దేవాంతకుడు', 'మహానగరంలో మాయగాడు', 'రుస్తుం', 'ఛాలెంజ్‌' వంటి తదితర చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌ మళ్లీ తెరపై మెరవనుందని సమాచారం. 

 

09:54 - July 14, 2016

మెదక్ : వరిగడ్డి మంటేకదా అనుకుంటే.. వొల్కనో అయిందిపుడు. సెగలు కక్కుతున్న మల్లన్నసాగర్‌ ఉద్యమంపై నీళ్లు చిలకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోంది. భూలివ్వడానికి ఒప్పుకున్నారంటూ ప్రచారం చేసుకోవడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మూకుమ్మడిగా కదిలారు. మెదక్‌ కలెక్టరేట్‌ ను ముట్టడించారు.  
ప్రభుత్వ తీరుపై నిరసనలు
నీళ్లు చిలకరించి పేలుతున్న అగ్నిపర్వతాన్ని ఆర్పాలనట్టు ఉంది.. తెలంగాణ సర్కార్‌తీరు. మల్లన్నసాగర్‌ ఉద్యమ సెగలను చల్లార్చడానికి సర్కారు చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోంది.
ఆగని ఉద్యమ సెగలు
మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలు మూకుమ్మడిగా రోడ్డెక్కాయి. ధర్నాలతో హోరెత్తిస్తున్నాయి. జీవో నంబర్‌ 123 ప్రకారం భూములివ్వడానికి ఒప్పుకున్నారంటూ తప్పడు ప్రచారం చేస్తున్నారని నిర్వాసితులు భగ్గుమంటున్నారు.
మంత్రి హరీశ్‌రావుపై నిర్వాసితుల ఫైర్‌
హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్‌ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్‌లో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు... హడావుడిగా ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి... 123జీవో ప్రకారం భూములివ్వడానికి ఒప్పుకున్నారంటూ.. తప్పుప్పడు ప్రచారం చేస్తున్నారని ముంపు గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని 14 గ్రామాల ప్రజలు జిల్లా  సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగారు.  నోటిఫికేషన్‌ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని కలెక్టర్‌ను నిలిదీశారు. మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులతో మాట్లాడినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని.. నిర్వాసితులెవరూ మంత్రితో మాట్లాడలేదని ఏటిగడ్డకిష్టాపూర్‌ యువకులు అంటున్నారు.
కాల్లోముల్లు తీస్తానన్న సీఎం... కంట్లో నలుసయ్యారు..
కాల్లోముల్లు తీస్తానన్న సీఎం... కంట్లో నలుసయ్యారు..ఎన్నికల టైంలో... కాల్లోముల్లుదీస్తా... కంట్లో నలుసు దీస్తా... అంటూ ప్రచారం చేసుకున్న సీఎం కేసీఆర్‌... అధికారంలోకి వచ్చాక అరిగోసపెడుతున్నరని ముంపుగ్రామాల మహిళలు మండిపడుతున్నారు. 
లోకాయుక్త ఆదేశాలనూ పట్టించుకోరా..?
2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందించాలని ...లోకాయుక్త ఆదేశించినా.. ప్రభుత్వంలోగాని.. అధికారుల్లోగాని చలనం లేదని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. డీపీఆర్‌లేకుండా భూసేకరణ చేయొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. 
బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరు
ఏదో రకంగా... 123జీవో ప్రకారమే ముందుకెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరిపై నిర్వాసితులు భగ్గుమంటున్నారు. పోలీసులతో బెదిరిస్తే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నా రు.   దీంతో ఖచ్చితంగా 2013 భూసేకరణచట్ట ప్రకారమే ప్రభుత్వం  ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  

09:42 - July 14, 2016

ప్రభుత్వ విద్యను రక్షించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత వకుళాభరణం కృష్ణా మోహన్, ఐద్వా నాయకురాలు రమాదేవి, బీజేపీ నేత ఆచారి పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం పడిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ఉపాధ్యాయులకు భోదనేతర విధులను రద్దు చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వైద్యం వికటించింది రెండు రోజుల చిన్నారి మృతి..

హైదరాబాద్ : మల్కాజ్ గిరి శ్రీ కృష్ణ ఆసుపత్రిలో వైద్యం వికటించి రెండు రోజుల చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి ఎదుట బంధువులు ధర్నా చేపట్టారు. 

కమల్ కు గాయం..

చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరారు. తన కార్యాలయంలో మెట్లు దిగిపోతూ కమల్ కిందపడిపోయారు. దీనితో ఆయన కాలికి గాయమైంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..

రాజమండ్రి : ధవళేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుత నీటి మట్టం 13.5 అడుగులుగా ఉంది. 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. 

09:30 - July 14, 2016

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులను విదేశీ సంస్థలకు అప్పగిస్తుందా? అదే జరిగితే స్థానిక నిర్మాణరంగ కార్మికుల ఉపాధికి గండి పడుతుందా?  అసలే ఉపాధి అవకాశాలు తగ్గిపోయి, అవస్థపడుతున్న నిర్మాణ రంగ కార్మికుల భవిష్యత్ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కన్ స్ట్రక్చన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  మరోవైపు నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన వెల్ఫేర్ బోర్డు నిధులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఉపాధి రంగాలలో ప్రధానమైనది నిర్మాణరంగం  
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్న రంగాలలో ప్రధానమైనది నిర్మాణరంగం.  మన దేశంలో దాదాపు మూడున్నర కోట్ల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు.  ఒక్క తెలంగాణలోనే 20 లక్ష ల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతుండడం విశేషం.  వీరిలో అత్యధికులు అసంఘటితరంగంలో పనిచేస్తున్నవారే. వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధి చూపిస్తున్న రంగమిది.  మన దేశ జిడిపిలో నిర్మాణరంగం వాటా 11శాతం.  సర్వీస్ రంగం తర్వాత ఎక్కువ శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నదీ నిర్మాణంరంగంలోకే కావడం మరో విశేషం.  భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది నిర్మాణరంగం.  అయితే, నిర్మాణరంగంలో కొంతకాలంగా ఉత్సాహం కొరవడింది.  నిరుత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది.  
నిర్మాణరంగంలో తగ్గిన ఊపు
వరుసగా రెండేళ్ల కరువు తో పాటు ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెరగడం, ఇందిరమ్మ ఇళ్లులాంటి గృహనిర్మాణ పథకాలకు ప్రభుత్వాలు చెల్లు చీటి చెప్పడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడం లాంటి కారణాలతో నిర్మాణరంగంలో ఊపు తగ్గింది. దీంతో నిర్మాణరంగంతో అనుసంధానమైన వివిధ వృత్తులవారు చేతినిండా పనిదొరక్క అవస్థపడుతున్నారు. ప్రతి రోజూ పొద్దున్నే అడ్డాల మీదకు వెళ్లడం, పనిదొరక్క ఇంటికి తిరిగి వెళ్లడం చాలామందికి నిత్య అనుభవంగా మారింది. ఒకవైపు నిర్మాణరంగంలో పనిచేస్తున్నవారు పని దొరక్క అవస్థ పడుతుంటే, మరోవైపు యాంత్రీకరణ పెరుగుతోంది. పెద్దపెద్ద కంపెనీల ఆధ్వర్యంలో జరిగే నిర్మాణ పనుల్లో యంత్రాల వాడకం పెరిగి, మ్యాన్ పవర్ ను తగ్గించడం మన కళ్లెదుటే కనిపిస్తున్న పరిణామం.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలైతే నిర్మాణరంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. ఇలాంటి పథకాల ద్వారా స్థానికులకు ఉపాధి చూపించడం కంటే విదేశీ సంస్థలకు కాంట్రాక్ట్ లు అప్పగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న ఇళ్లు కట్టించే పనులను కూడా విదేశీ  కనస్ట్రక్షన్ సంస్థలకో, బడా కార్పొరేట్ సంస్థలకో అప్పగించడం వల్ల స్థానికుల ఉపాధికి గండి పడే ప్రమాదం వుంది. 
సక్రమంగా అమలుకాని సంక్షేమ పథకాలు 
నిర్మాణరంగ కార్మికులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య తమకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకాకపోవడం. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటయ్యింది.  నిర్మాణ సంస్థలు ఒక శాతం చొప్పున ఈ వెల్ఫేర్ బోర్డు నిధికి జమ చేస్తుంటాయి. తెలంగాణ  వెల్ఫేర్ బోర్డుకి 840 కోట్ల రూపాయలు నిధులున్నాయి. మరో వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు కావాల్సిన పద్దులున్నాయి.  అయితే, ఈ బకాయిల వసూళ్లలో కార్మిక శాఖ అశ్రద్ధ చేస్తోందన్న విమర్శలున్నాయి. 110 రూపాయల రుసుముతో భవన నిర్మాణరంగంలో పనిచేస్తున్నవారికి సభ్యత్వం ఇవ్వాల్సి వుంటుంది. తెలంగాణలో ఈ కార్యక్రమం నత్తనడకనసాగుతోంది. 20 లక్షల మంది కార్మికులుంటే ఇప్పటికి 8 లక్షల మందికే సభ్యత్వం ఇచ్చినట్టు తెలుస్తోంది.   ఈ సంక్షేమ నిధి ద్వారా 12 రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి వుంది. కానీ, అవి అమలు కావడం లేదు. మరోవైపు వెల్ఫేర్ బోర్డు నిధులు అధికారుల జల్సాలకు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలున్నాయి. ఆఫీసుల్లో ఫర్నీచర్, వెహికిల్స్, సెల్ ఫోన్స్ కొనడానికి అధికారులు ఈ నిధిని దుబారా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  1996 కేంద్ర ప్రభుత్వ చట్టం, 2007 రాష్ట్ర ప్రభుత్వం చట్టాల ప్రకారం 60 ఏళ్లు నిండినవారికి పెన్షన్లు, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు, పనిముట్లు కొనుక్కోవడానికి లోన్లు, అడ్డాల్లో షెడ్డుల నిర్మాణం లాంటి చర్యలు అమలు చేయాల్సి వుంది. కానీ అవేవీ అమలుకావడం లేదు. 

 

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు..

పశ్చిమగోదావరి : ఆగస్టులో ప్రారంభం కానున్న పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ కూడా తన ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలు జరిగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలకు మొత్తం 202 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

09:26 - July 14, 2016

విజయవాడ : వచ్చే నెల 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరణాలకు యాత్రికులను చేరవేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎపి, తెలంగాణ నుంచి 202 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వీటికి ఈ రోజు నుంచే రిజర్వేషన్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించింది ఈ రైళ్లలో ప్రయాణించే వారి  నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తారు. కృష్ణా పుష్కరాలకు రైల్వే శాఖ విస్తృత ఏర్పాటు చేసింది. తెలుగు  రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 202 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 
సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ పోర్టుకు 14 రైళ్లు 
సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మీదుగా కాకినాడ పోర్టుకు 14 రైళ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి-కాకినాడ-తిరుపతి మధ్య 28 రైళ్లు నడుపుతారు. కాచిగూడ-కాకినాడ పోర్టు-కాచిగూడ మధ్య నాగులు రైళ్లను ఏర్పాటు చేశారు. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ మధ్య 16 రైళ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌-గద్వాల-హైదరాబాద్‌ మధ్య నాలుగు, మణుగూరు-తెనాలి-మణుగూరు మధ్య 24 రైళ్లను నడుపుతారు. అలాగే సికింద్రాబాద్‌-గద్వాల-సికింద్రాబాద్‌ మధ్య 24 రైళ్లను ఏర్పాటు చేశారు.  విజయవాడ-ఒంగోలు-విజయవాడ మధ్య 12, హైదరాబాద్‌-గుంటూరు-హైదరాబాద్‌ మధ్య 24 రైళ్లను ఏర్పాటు చేశారు. తిరుపతి-రాజమండ్రి-తిరుపతి మధ్య 10, గుంతకల్‌-విజయవాడ-గుంతకల్‌ మధ్య 12  రైళ్లు ఏర్పాటు చేశారు. 
రైళ్లలో అదనపు చార్జీలు 
మరోవైపు పుష్కర స్పెషల్‌  రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేయాలన్న రైల్వే శాఖ నిర్ణయంపై విమర్శలు వెల్లువెతున్నాయి.  

 

08:47 - July 14, 2016

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేత కె.రాములు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలోని బిల్డిండ్ అండ్ కన్ స్ట్రక్చన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు నల్లగొండలో జరగబోతున్నాయి. జులై 20 నుంచి ప్రారంభమయ్యే ఈ మహాసభల్లో ఏయే అంశాలు చర్చించబోతున్నారు? బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ జీవన స్థితిగతులు ఎలా వున్నాయి? వీరి సంక్షేమానికి ఉద్దేశించిన వెల్ఫేర్ ఫండ్ నిధులు సక్రమంగా సద్వినియోగం అవుతున్నాయా? పక్కదారి పడుతున్నాయా? బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి కార్మిక సంఘాలు చేస్తున్న సూచనలేమిటి? ఇలాంటి అంశాలపై  రాములు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నేడు 'హరితహారం'లో పాల్గొన్న మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి

నల్గొండ : నేడు నకిరేకల్, సూర్యపేట నియోజకవర్గాల్లో మంత్రులు మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. హరితహారం కార్యక్రమంలో మంత్రులు పాల్గొననున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా నేడు విద్యా సంస్థల బంద్

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా నేడు విద్యా సంస్థల బంద్ జరుగనుంది. వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపిచ్చాయి. 

08:26 - July 14, 2016

కృష్ణా  : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మణం చెందారు. కారులో ఐదు మంది గుడివాడ నుంచి పామర్రు వెళ్తున్నారు. మార్గంమధ్యలో పామర్రు మండలం కొత్త పెద్దమద్దాలి వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుడివాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

08:17 - July 14, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కెన్యా దంపతుల నుంచి కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారిని  అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. 

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కెన్యా దంపతుల నుంచి కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు.

08:02 - July 14, 2016

గుంటూరు : ఏపీ రాజ‌ధాని అమరావతికి త‌ర‌లివెళ్తున్న మ‌హిళా ఉద్యోగుల‌కు తాత్కాలికంగా ఉచిత వ‌స‌తి సౌకర్యం క‌ల్పించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల వసతి ఏర్పాట్లు కోసం ప్రత్యేకంగా రెండు క‌మిటీల‌ను కూడా నియ‌మించింది. 
అమరావతికి వెళ్లే మహిళా ఉద్యోగులకు..
హైద‌రాబాద్ నుంచి అమరావతికి త‌ర‌లివెళ్తున్న మహిళా ఉద్యోగులకు తాత్కాలికంగా ఆరు నెల‌ల పాటు ఉచిత వ‌స‌తి క‌ల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  హైద‌ర‌బాద్‌లో కుటుంబాలు ఉండి ఉద్యోగం కోసం రాజ‌ధానికి వ‌చ్చే మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. స‌చివాల‌య మ‌హిళా ఉద్యోగుల‌కు రెయిన్ ట్రీ పార్క్‌లో రూం షేరింగ్ ప్రాతిప‌దిక‌న వ‌స‌తి క‌ల్పించ‌నుంది. అదే విధంగా వివిధ హెచ్ఓడిల్లో ప‌నిచేస్తున్న మ‌హిళా ఉద్యోగుల కోసం విజ‌య‌వాడ, గుంటూరుల్లో వ‌స‌తి క‌ల్పించాల‌ని రెండు జిల్లాల అధికారుల‌ను ఆదేశించింది. 
స‌చివాల‌య ఉద్యోగుల కోసం కమిటీ
స‌చివాల‌య ఉద్యోగుల కోసం గుంటూరు జాయింగ్ క‌లెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓ క‌మిటీ ఏర్పాటు చేసింది. అలాగే కృష్ణా -గుంటూరు జిల్లాలలోని  హెచ్ఓడీల్లో ప‌నిచేస్తున్న వారి కోసం మరో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఆరునెల‌ల పాటు ఉచిత వ‌స‌తి కోరుకుంటున్న మ‌హిళా ఉద్యోగులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ నెల 20వ తేదీ లోగా న‌మోదు చేసుకోవాల‌ని ప్రభుత్వం సూచించింది.
నిర్ధారించిన ధ‌ర మేర‌కు వ‌స‌తి  
ఇక‌ ఐఏఎస్‌ అధికారుల‌తో పాటుగా డిప్యూటీ కార్యద‌ర్శుల స్థాయి అధికారులు ఈ రెండు జిల్లాల్లో వ‌స‌తి కోరుకుంటే వారికి ఇప్పటికే నిర్ధారించిన ధ‌ర మేర‌కు వ‌స‌తి క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. నిర్ణీత సమయంలోపు న‌మోదు చేసుకున్న వారికి రెండు జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్న అతిధి గృహాలు ప్రభుత్వ నివాస స‌ముదాయాల్లో మ‌హిళా ఉద్యోగులకు.. అదే విధంగా ఉన్నతాధికారులకు ప్రభుత్వం రెయిన్ ట్రీ పార్క్‌లోనూ వ‌స‌తి క‌ల్పించ‌నుంది.

 

07:57 - July 14, 2016

హైదరాబాద్ : అంతన్నాడు...ఇంతన్నాడే లింగరాజు అన్నట్లుగా మారింది మన తెలంగాణ సర్కార్ తీరు...స్వచ్ఛ హైదరాబాద్ తో సిటీ మొత్తం క్లీన్ చేస్తామన్నారు. చెత్త, డెబ్రిస్ పై సమర శంఖం పూరిస్తామన్నారు. యుద్థక్షేత్రంలో సైనికుల్లా రాష్ట్ర ప్రథమ పౌరుడు మొదలుకొని శానిటేషన్ వర్కర్ వరకు రంగంలోకి దిగారు. అయినా  హైదరాబాద్ లో చెత్త సమస్య రోజు రోజుకు పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు..ఇప్పుడు వర్షకాలం కావడంతో సమస్య మరింత ముదురుతుంది..
జఠిలంగా మారిన చెత్త సమస్య 
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో చెత్త ఒకటి. బల్డియాకు ఇది పెద్ద గుదిబండగా మారింది..జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు 3,800 నుంచి 4 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది.. ఇంటింటి నుంచి చెత్త సేకరించడం....దానిని ట్రాన్స్ ఫర్ కేంద్రాలకు తీసుకెళ్లి..అక్కడ నుంచి జవహార్ నగర్ డంపింగ్ యార్డు తరలించి శాస్త్రీయ పద్ధతిలో కాల్చివేయడం  లాంటి పనులను జీహెచ్ఎంసీ నిర్వహిస్తుంది.
గత ఏడాది స్వచ్ఛ హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ చెత్త సమస్యను పరిష్కరించేందుకు గత ఏడాది ప్రభుత్వం స్వచ్చ హైదరాబాద్ పేరుతో పెద్ద యజ్ఞమే చేసింది...రాష్ట్ర ప్రథమ పౌరుడి గవర్నర్‌  నుంచి సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సిటీలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన 60 వేల టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల శుభ్రమయ్యాయి.. ఇక జీహెచ్ఎంసీ స్వచ్ఛ కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. దీంతో గ్రేటర్ లో 2 వేల ఆటో టిప్పర్లు, ఇంటింటికి రెండు చెత్త బుట్టల చొప్పున 44 లక్షల బుట్టలు పంపిణీ చేశారు. 
చెత్తబుట్టలకు కోట్ల రూపాయల ఖర్చు
కోట్ల రూపాయల ఖర్చు చేసి కొనుగోలు చేసిన చెత్త బుట్టలు నిరుపయోగంగా మారాయి..గడిచిన ఏడు నెలల క్రితం వాటిని పంపిణీ చేసినప్పటికి తడి,పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం లేదు. కొన్ని ప్రాంతాల్లోని కుటుంబాలు చెత్తను వేరు వేరుగా ఇస్తున్నప్పటికి ఆటో టిప్పర్లు, చెత్త రిక్షా నిర్వాహకులు  కలిపేసి తీసుకెళ్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ట్రాన్స్ ఫర్ కేంద్రాల వద్ద తడి,పోడి చెత్తను వేరుగా తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడమే. క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు...ట్రాన్స్ ఫర్ కేంద్రాలు, డంపింగ్ యార్డుల్లో సరైన వసతలు కల్పించలేదు. జీహెచ్ఎంసీలోని శానిటేషన్ విభాగంలో  సుమారుగా 25 వేల మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ, బల్దియా ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నప్పటీకీ పరిస్ధితిలో మాత్రం మార్పు రావటం లేదు..ముఖ్యమైన రోడ్లతో పాటు వీధుల్లోనూ చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ఏ నగరమైనా సచ్ఛంగా ఉండాలంటే ప్రభుత్వాలు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయ్యాలి. మౌలిక సౌకర్యాలు కల్పించి...ప్రజలను చైతన్యవంతులను చేయాలి ...అప్పుడే ఏ ప్రణాళికైనా, ఏ కార్యక్రమైనా విజయవంతమవుతుంది. 

 

07:52 - July 14, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని గౌరవెల్లి, గండపల్లి రిజర్వాయర్‌ల ఎత్తు పెంపుకు వ్యతిరేకంగా నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. ముంపుగ్రామాల్లో ఆయన చేపట్టిన రెండురోజుల పాదయాత్ర బుధవారంతో ముగిసింది. పాదయాత్రకు నిర్వాసితుల నుంచి విశేష స్పందన లభించింది. 
ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాసితుల ఆందోళన
కరీంనగర్ జిల్లాలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్‌ల ఎత్తు పెంచాలన్నా ప్రభుత్వ నిర్ణయంపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1.4 టీఎంసీల కెపాసిటీతో ప్రతిపాదించిన  గౌరవెల్లి రిజర్వాయర్ ను 9 టీఎంసీలకు, 0.4 టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించ తలపెట్టిన  గండిపల్లి జలాశయాన్ని 1 టీఎంసీకి పెంచాలని నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన అనంతగిరి రిజర్వాయర్‌ను మూడున్నర టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల ఎత్తు పెంపు వల్ల అనేక గిరిజన తండాలు ముంపుకు గురవుతున్నాయి. 
9 గిరిజన తండాలు... 20 కిలోమీటర్లు.. పాదయాత్ర         
నిర్వాసితులకు మద్దతుగా ముంపు గ్రామాల్లో తమ్మినేని చేపట్టిన పాదయాత్ర బుధవారం రెండో రోజు గౌరవెల్లి నుంచి ప్రారంభమై 9 గిరిజన తండాల్లో 20 కిలోమీటర్లు కొనసాగింది. పాదయాత్రలో అడుగుఅడుగునా నిర్వాసితులు తమ్మినేని ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. గిరిజనుల పోరాటాలకు సీపీఎం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నిర్వాసితులకు ఆయన భరోసా ఇచ్చారు. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో గ్రామస్తులు నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని పాల్గొని వారితో కలిసి నృత్యాలు చేశారు.. 
2013 చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలి : తమ్మినేని 
దాదాపు 3000 ఎకరాల వ్యవసాయ భూములు రిజర్వాయర్‌ల పెంపు వల్ల ముంపుకు గురవుతున్నాయని తమ్మినేని తెలిపారు. నిర్వాసితులకు నష్టపరిహారాన్ని 2013 చట్టం ప్రకారమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దళారులు చెప్పే మాయమాటలు నమ్మవద్దని చెప్పిన తమ్మినేని, 123 జీఓపై సైతం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. నిర్వాసితులు చేసే పోరాటాలకు బాసటగా నిలుస్తామని భరోసా కల్పించారు.

 

07:44 - July 14, 2016

నిజామాబాద్ : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. మహారాష్ట్రలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీలోకి నాలుగు టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో  ఆయకట్టు ప్రాంత రైతాంగంలో ఆనందం వెల్లువెత్తుతోంది. నీళ్లు లేక ఎండిపోయిన గోదావరికి జలకళ వచ్చింది. వారం రోజులుగా మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది.
రైతాంగంలో ఆనందం 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో నాలుగు జిల్లాల రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రాజెక్టుపై ఆధారపడిన ఎల్‌ఎండీ, గుత్పఅలీసాగర్‌, ప్రాణహిత - చేవెళ్ల ప్రాంత ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. ఎస్సారెప్సీ ఇన్‌ఫ్లో పెరగడంతో.. ఇక సాగు, తాగు నీటికి కొదవ ఉండదన్న భరోసా ఆయకట్టు ప్రాంతాల ప్రజల్లో కలుగుతోంది.  
భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్టు నిండే అవకాశం  
మహరాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి.. గతంలో లాగా నీరు రావటం లేదు. మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప.. ఎస్సారెస్పీలోకి పూర్తి స్థాయిలో నీరొచ్చే పరిస్థితి లేదు. అయితే ఇప్పటివరకు వచ్చిన నీరు కొంతలో కొంతైనా ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ.. భారీ వర్షాలు పడితేనే పూర్థిస్థాయిలో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. 80 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టులో ప్రస్తుతం 12 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిపైనే ఆధారపడి రైతులు వరినాట్లు వేయొద్దని ఎస్సారెస్పీ ఈఈ సూచిస్తున్నారు. 
అన్నదాతల్లో కొత్త ఆశలు
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మున్ముందు భారీ స్థాయిలో వర్షాలు కురిస్తేనే.. ఎస్సారెస్పీలోకి భారీ ఎత్తున నీరు చేరుతుంది. అప్పుడే తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడటం అన్నదాతల్లో కొత్త ఆశలు నింపుతోంది. 

 

07:39 - July 14, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో వానాకాలం కష్టాలు మొదలయ్యాయి. వర్షాల ధాటికి వాగులు ఉప్పొంగుతుండడంతో..గిరిజగూడెంలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. పాము కాట్లు, విషజ్వరాలు ఇతరత్రా  అత్యవసర సేవలు సైతం అందని పరిస్దితి. దీంతో రోగులను మంచాలపై వాగులు దాటించకుంటూ తీసుకువెళ్తున్న దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ఈ వాగులో నుంచి  మంచంపైన తరలిస్తున్న వ్యక్తి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ గూడెంలో వైద్య సౌకర్యం  లేకపోవడంతో ఇలా మంచంపై వాగులో నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 
బిక్కు బిక్కుమంటున్న గిరిజన గూడేలు   
వర్షాకాలం కావడంతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు గిరిజన గూడేలు బిక్కు బిక్కుమంటున్నాయి.  ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో  రవాణా సౌకర్యం బంద్‌ అయ్యింది.  ఆదిలాబాద్ జిల్లాలోని  గిరిజన గూడెంలో గత మూడు రోజులుగా  జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని మంచంపై పడుకోబెట్టి వాగును దాటించి వైద్యం కోసం  వేరో ప్రాంతానికి  తరలిస్తున్నారు...ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు  ఆదిలాబాద్ జిల్లా లో ఇలాంటి  దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.  సరైన సమయంలో వైద్యం అందక గత ఏడాది ముగ్గురు చనిపోయారంటే పరిస్ధితి ఏ విధంగా ఉందో  అర్థం చేసుకోవచ్చు. వాగులు పొంగుతుంటే తమ గ్రామాలకు వైద్యులు రారు, అధికారులు పట్టించుకోరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణిల పరిస్ధితి మరీ దారుణం, వారిని తరలించే సమయంలో వరద ఎక్కవై ప్రాణాలు కొల్పోయిన  సందర్భాలు చాలా ఉన్నాయని  చెబుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మించి ఇలాంటి సమస్యలను పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
తాత్కాలిక వంతెనలు 
తాత్కాలిక వంతెనలతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.  ప్రతి సంవత్సరం  ముంపుకు గురయ్యే గ్రామాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టం లేదు. దీంతో జ్వరమెచ్చినా, పాము కుట్టినా, డెలివరీ కోసమైనా ప్రాణాలు అరచేతపెట్టుకుని ఏరుదాటి వెళ్లాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు గొర్లపల్లి వాగులోకి వరద పోటెత్తడంతో తాత్కాలిక వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ వాగు అవతల ఉన్న 25 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గిరవెల్లి సమీపంలోని ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది..దీంతో వాగు దాటలేని పరిస్దితి. ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్ధితులే ఉన్నాయి. 
అధికారుల నిర్లక్ష్యం 
ఆదిలాబాద్ గిరిజన గ్రామాలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వర్షాకాలం వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  సరైన వైద్యం అందక ఎందరో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు..ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.  

 

07:33 - July 14, 2016

కాకినాడ : వరద ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. వేల ఎకరాల్లో పంటలు నీటి 
పాలయ్యాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు పల్లపు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. 
జలదిగ్భందంలో లంక గ్రామాలు 
ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు గోదావరి ఉధృత ప్రవాహంతో లంక గ్రామాల జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. బుధవారం గోదావరి శాంతించినా.. లంక గ్రామాలకు వరదముప్పు మాత్రం తొలగలేదు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని  లంక గ్రామాలకు వెళ్లే దారులు.. వంతెనలు నీటమునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  నారాయణలంక వద్ద తొగర పాయపై ఉన్న కాజ్ వే నుంచి గోదావరి ప్రవహిస్తోంది.  కొత్తపేట నుంచి కేదార్లంకకు వెళ్లే వంతెన సైతం నీటిలో మునిగి పోయింది. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 
నీటి పాలయిన పంటలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని లంకగ్రామాల్లో పంటలన్నీ జలమయమయ్యాయి. అక్కడ ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీరు భారీగా రావడంతో రావులపాలెం మండలంలోని కొమరాజులంక, ఊబలంక గ్రామాల్లోని అరటి, కంద, వంగ పంటలు కొట్టుకుపోయాయి. వేసిన కంద, వంగ, బీర, అరటి పంటలు నీటమునిగిపోయాయని.. భారీ నష్టం ఏర్పడిందని ఎలా తేరుకోవాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు.
ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు
వరద ముంపునకు గురైన తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. ఆలమూరు మండలంలోని బడుగువాని లంక గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో గ్రామ ప్రజలను చెముడులంకకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆత్రేయపురం మండలంలోని పిచ్చుక లంక, తోకలంక, గోపాలపురం, లక్ష్మిపోలవరం, వాడపల్లి లంక, కట్టుంగ గ్రామాలను అధికారులు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని, తాము ఏర్పాటు చేసిన వసతి గృహాలకు రావాలని ప్రజలను కోరుతున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో నీట మునిగిన పలు గ్రామాలను అధికారులు మరిచారని అక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక్కడ పంటలు మునిగినా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రాలేదని.. తక్షణమే అధికారులు స్పందించి  తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

నేడు కల్వకుర్తి ప్రాజెక్టు కాల్వగట్లపై హరితహారం

మహబూబ్ నగర్ : నేడు కల్వకుర్తి ప్రాజెక్టు కాల్వగట్లపై హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. 

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

కృష్ణా : పామర్రు మండలం కొత్త పెద్దమద్దాలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 

నేడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా

విజయవాడ : పాఠశాలలు, టీచర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ నేడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మహాప్రదర్శన నిర్వహించనున్నారు. 

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

కరీంనగర్ : నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

తోటపల్లి రిజర్వాయర్ నుంచి నేడు లక్ష ఎకరాలకు నీరు విడుదల

విజయనగరం : తోటపల్లి రిజర్వాయర్ నుంచి నేడు లక్ష ఎకరాలకు నీరు విడుదల చేయనున్నారు. 

Don't Miss