Activities calendar

15 July 2016

22:21 - July 15, 2016

హైదరాబాద్ : వాహనాదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త అందించాయి. పెట్రోలు లీటరుకు రూ 2.25 పైసలు, డీజిల్ 45 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

22:13 - July 15, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, అనంత్ కుమార్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేతలు గులాంన‌బీ ఆజాద్‌, ఆనంద్ శ‌ర్మల‌ను క‌లిశారు. జీఎస్టీ బిల్లుపై ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు వారితో చ‌ర్చించారు. జీఎస్టీపై అన్ని అంశాల‌ను చ‌ర్చించామ‌ని, వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అయిన త‌ర్వాత మ‌ళ్లీ ఒక‌సారి ఇదే అంశంపై మాట్లాడుతామ‌ని జైట్లీ అన్నారు. ఈ నెల 18 సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న కారణంగా జీఎస్టీ బిల్లుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి.

22:10 - July 15, 2016

ఢిల్లీ : అరుణాచల్‌ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభంలో కేంద్రం పాత్ర లేదన్నారు సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. గతంలో కాంగ్రెస్‌ పార్టే ప్రభుత్వాలను కూల్చిందని విమర్శించారు. పీస్‌ చానల్‌కు ఎలాంటి అనుమతులు లేవని.. అందుకే దానిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే తగ్గించిన ఎరువుల ధరల ప్రకారమే డీలర్లు అమ్మాలని.. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. 

22:08 - July 15, 2016

ఫ్రాన్స్‌ : ఫ్రాన్స్ లో మళ్లీ ఉగ్రవాదం పడగవిప్పింది. విస్ఫోటనాలకు భిన్నంగా... ఓ ఉగ్రవాది భారీ ట్రక్కుతో జనాన్ని తొక్కించి చంపారు. నీస్‌ నగరంలో.. బాస్టిల్‌ డే సంబరాల్లో మునిగి తేలిన ప్రజలపై 50 కిలోమీటర్ల వేగంతో... రెండు కిలోమీటర్ల మేర ట్రక్కు నడిపిన ఉగ్రవాది.. 84 మంది ప్రాణాలను బలిగొన్నాడు. ట్రక్కు వేగంగా ఢీకొనడంతో రోడ్డుపై మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. అక్కడి వాతావరణమంతా భయానకంగా మారింది. దుండగుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. మరో మూడు నెలల పాటు ఎమర్జెన్సీని పొడిగించారు.

నీస్‌లో బాస్టిల్‌ డే ఉత్సవాల్లో మునిగితేలిన జనం...
బాణాసంచా వేడుకలను తిలకిస్తున్న వారిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ ట్రక్కు.చూస్తూ ఉండగానే భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సందర్శకులు..

50 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ట్రక్కు...
50 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొనడంతో సుమారు 80 మందికి పైగా మృతి చెందారు. 2 కి.మీ మేర ఇదే వేగంతో ట్రక్కు దూసుకెళ్లడంతో మృతదేహాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. గాయాలైనవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ట్రక్కు నుంచి ప్రజలపైకి కాల్పులు జరిపిన దుండగులు ..
మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ట్రక్కుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్‌ మృతి చెందాడు. అయితే.. ట్రక్కు జనంపైకి దూసుకొచ్చినప్పుడు అందులోని దుండగుడు కాల్పులు కూడా జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ట్రక్కులో భారీగా మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.

మరో మూడు నెలల ఎమర్జెన్సీ పొడిగింపు ...

ఈ ఘటనపై ఫ్రాన్స్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. దేశ భద్రతను సమీక్షించుకోవాల్సిన అవసరముందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఉన్న అత్యవసర పరిస్థితిని మరో మూడు నెలల పాటు పొడిగించారు.

ఘటనకు బాధ్యులు తామేనని ప్రకటించుకున్న ఐఎస్‌ఐఎస్‌..
ఈ ఘటనపై నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్టీరోస్‌ స్పందించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. మరోవైపు.. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్‌ ప్రకటించింది. దాడికి సాక్ష్యంగా.. ఘటన దృశ్యాలు ఇస్లామిక్‌ స్టేట్‌ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయి. స్పాట్‌..విజువల్స్‌..

8 నెలల వ్యవధిలోనే రెండుస్లార్లు ఉగ్రదాడులు..
8 నెలల వ్యవధిలోనే రెండు సార్లు ఉగ్రవాదుల దాడి జరగడంతో ఫ్రాన్స్‌ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత నవంబర్‌ నెలలోనూ ఉగ్రవాదుల దాడి చేసి 130 మందిని పొట్టన పెట్టుకున్నారు.

దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు ...
ఫ్రాన్స్‌ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. నీస్‌ మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సంతాపం ప్రకటించారు. అదేవిధంగా నీస్‌ ఘటనను భారత్‌ కూడా ఖండించింది. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. 

22:00 - July 15, 2016

పాకిస్థాన్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వాని ఎన్‌కౌంటర్‌ అంశాన్ని యుఎన్‌ఓలో లేవనెత్తిన పాకిస్తాన్ ఇపుడు కొత్త రాగాన్ని అందుకుంది. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మళ్లీ కశ్మీర్‌ రాగాన్ని ఆలపించారు. కశ్మీర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను నిరసిస్తూ జూలై 19న బ్లాక్‌ డేగా జరపనున్నట్లు నవాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. కశ్మీర్‌ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్‌ అండగా నిలుస్తుందన్నారు.

21:50 - July 15, 2016

విజయవాడ : టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావల్సిన నిధులు రాబట్టుకునే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్లమెంటులో ఏపీ సమస్యలపై నిలదీయాలని సమావేశంలో నిర్ణయించారు. వీటితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. 

21:47 - July 15, 2016

హైదరాబాద్‌ : రోడ్ల దుస్థితిపై.. కేటీఆర్‌ మరోమారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సామాన్యుడు మొదలు.. తన దాకా.. నగర రోడ్లపై ఎవరూ సంతృప్తిగా లేరంటూ చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆయనీ ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ఫుట్‌ పాత్‌ల అభివృద్ధి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

'మై జీహెచ్‌ఎంసీ' ఏప్ విడుదల చేసిన కేటీఆర్..
మెరుగైన పౌరసేవలు, త్వరితగతిన సమస్యల పరిష్కారం లక్ష్యంగా రూపొందించిన 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌ను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్‌ ద్వారా ప్రాపర్టీ టాక్స్, ఎల్‌ఆర్‌ఎస్‌, బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్స్‌, ట్రేడ్‌ లైసెన్స్ సర్వీసులను జీహెచ్‌ఎంసీ అందించనుంది. నగర సమస్యలపై తీసిన ఫొటోలను... పౌరులే నేరుగా అప్‌లోడ్‌ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఈ యాప్‌లో ఉండడం విశేషం.

రోడ్ల దుస్థితిపై కేటీఆర్ అసంతృప్తి..
మై జీహెచ్‌ఎంసీ యాప్‌ విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ నగరంలోని రోడ్ల నిర్వహణ, నిర్మాణం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రోడ్లకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సీఎం మొదలు సామాన్యుడి వరకూ నగర రోడ్లపై అసంతృప్తి ఉందని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

సమస్యల పరిష్కారానికి 3టీమ్ లు ..
నగరంలో ఏళ్లుగా కొలువైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి మూడు టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మూడు టీమ్‌లు ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, గ్రీనరీ పెంచేందుకు కృషి చేస్తాయని కేటీఆర్‌ చెప్పారు.

ఫిర్యాదులకు ఏప్..
హైదరాబాద్‌ రోడ్ల గుంతల గురించి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు.. మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను వినియోగించుకోవాలని నగర పౌరులకు కేటీఆర్‌ సూచించారు. పౌరుల ఫిర్యాదులపై స్పందించేలా మేయర్, కమిషనర్ తరచూ మానిటరింగ్ చేయాలని కేటీఆర్ సూచించారు. త్వరలోనే ఈ యాప్ నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్‌ వ్యక్తం చేశారు. 

21:42 - July 15, 2016

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు హస్తినటూర్ ప్రారంభమైంది. హస్తిన పర్యటనలో భాగంగా 11వ అంతరాష్ట్ర మండలి సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు అంశాలను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లనున్నారు కేసీఆర్ .

ఢిల్లీ చేరుకున్న కేసీఆర్...
సీఎం కేసీఆర్ హస్తిన పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రధాని అధ్యక్షతన జరిగే అంతరాష్ట్ర మండలి సదస్సులో పాల్గోనున్నారు. హైకోర్టు విభజన, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం.

సదస్సులో పాల్గొననున్న అన్నిరాష్ట్రాల సీఎంలు ..
శనివారం జరిగే అంతరాష్ట్ర మండలి సదస్సులో అన్నిరాష్ట్రాల సీఎంలతోపాటు ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నిశాఖల కార్యదర్శలతో చర్చించి ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చివరగా ఈ సమావేశం 2009 డిసెంబర్ 9 న జరిగింది.

హైకోర్టు విభజన న్యాయవాదుల సమస్యలపై చర్చించనున్న సీఎం
ఈ నెల 17,18 తేదీల్లో కేసీఆర్... పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ప్రధానంగా అరుణ్ జైట్లీ నీతిఆయోగ్ కింద రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. నీటి కేటాయింపులపై జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే లను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు నూతన న్యాయశాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ ప్రసాద్ తో పాటు రాజ్ నాథ్ సింగ్ ను కలిసి హైకోర్టు విభజన, న్యాయవాదుల అంశాలపై చర్చించనున్నారు.

పెండింగ్ లో ఉన్న అంశాలు ఓ కొలొక్కితేవాలని యత్నం..
ఈ పర్యటన ద్వారా పలు పెండింగ్ లో ఉన్న అంశాలను కొలొక్కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో.. ఎంతమంది కేంద్రమంత్రులు అందుబాటులో ఉంటారో వేచిచూడాలి.

21:24 - July 15, 2016

నిమిషానికోసారి వాట్సాప్ చూస్తారా..? ఫేస్ బుక్ ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నారా..? రోజంతా యాప్స్ తో బిజీగా గడుపుతున్నారా..? స్మార్ట్ ఫోనే లోకంగా మారిపోయిందా? అయితే మీకా ప్రాబ్లమ్ ఉన్నట్టే... చాలా సమస్యలో ఉన్నట్టే.. మరెన్నో ఇబ్బందులు తెచ్చుకోబోతున్నట్టే.. శరవేగంగా విస్తరించిన స్మార్ట్ ఫోన్ వాడకం..ఇప్పుడు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతోంది. ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం. అనగనగా ఓ స్మార్ట్ ఫోన్. అందులో పలురకాల అప్లికేషన్లు.. ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తూ, జీవితాన్ని మార్చేస్తూ.... పిల్లా పెద్దా అందర్నీ అలరిస్తూ... అందంగా కనిపిస్తోంది. అదే సమయంలో లైఫ్ స్టైల్ లో విపరీమైన మార్పులు తెస్తూ మానవసంబంధాలను ప్రభావితం చేస్తూ.. ఎన్నో కొత్త సమస్యలు క్రియేట్ చేస్తోంది.

కర్లో దునియా ముట్టీమే...
ఏ నిముషాన ఈ మాటన్నారో కానీ, నూటికి నూరుపాళ్లు మనవాళ్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కనెక్టింగ్ మంత్రను తూ..చ తప్పకుండా పాటిస్తున్నారు. స్టూడెంట్ నుంచి హౌజ్ వైఫ్ వరకు.. అనెంప్లాయీ నుంచి, అయిదంకెల జీతగాడి వరకు.. వాళ్లు వీళ్లు అని తేడా లేదు. కవచకుండలాల గురించి భారతంలో విన్నాం.. నవ భారతంలో నూటముప్పై కోట్లమంది ప్రజలకు కవచకుండలాలతో సమానంగా సెల్ ఫోన్ అతుక్కుపోయింది. ఇప్పుడది విడదీయలేని సమస్యగా మారుతోంది. స్మార్ట్ ఫోన్ ని పెళ్లి చేసుకునేంత పిచ్చి కూడా ఉంటుందా? ఎడిక్షన్.. స్మార్ట్ ఫోన్ వదల్లేనంతగా అతుక్కుపోతోంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కు కారణమౌతోంది. ఇది వ్యక్తిగత జీవితాలపైనా, కుటుంబాలపైనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఆఖరికి ఈ సమస్యకు ట్రీట్ మెంట్ తీసుకుంటే కానీ, బయటపడలేని పరిస్థితిలోకి పోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాను ఉపయోగించడం తప్పు కాదు. దాన్ని ఉపయోగించే తీరే యువతను ప్రభావితం చేస్తోంది. రోజు మొత్తంలో కాసేపైతే పర్వాలేదు... అదే జీవితమైతే మాత్రం అనర్థం పొంచి ఉన్నట్లే. ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిది. దీంతో సమ్యలను అరికట్టొచ్చు. సరదా కాస్తా వ్యవసనంగా మారిన తర్వాత ప్రమాదాలకు దారి తీస్తాయని గుర్తించాలి. యువతతోపాటు పెద్దలూ సరదా కోసమంటూ చాటింగ్‌ ఊబిలోకి దిగుతున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. ఆధునిక సాంకేతిక ఆవిష్కణలు ఈ ప్రపంచ రూపాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. ఒకనాడు కనీసం ఊహించని అనేక విషయాలు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనెక్టివిటీ లోకి ప్రపంచాన్ని లాక్కొచ్చి, అరచేతిలో అందర్నీ కట్టిపడేసిన మొబైల్ ఫోన్ విప్లవం క్రియేట్ చేసిందని చెప్పాలి. కానీ, ఇదే ఫోన్ ఇప్పుడు కొత్త సమస్యలకు కారణం అవుతోంది. ఈ సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోకపోతే … తీవ్ర పరిణామాలకు కారణం అవక తప్పదు. 

డాక్టర్ల సంఘంతో మంత్రి లక్ష్మారెడ్డి ...

హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డితో ప్రభుత్వ డాక్టర్ల సంఘం నేతలు భేటీ అయ్యారు. ఏపీలో స్థానికత ఉన్న 126 మంది వైద్యులకు తెలంగాణలో అక్రమంగా పోస్టులు ఇచ్చారని మంత్రి లక్ష్మారెడ్డికి డాక్టర్ల సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. వైద్య శాఖలోని పోస్టుల భర్తీ పాత పద్ధతిలోనే జరగాలని వైద్యులు అన్నారు. ఎన్నోఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేయాలి, కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని ప్రభుత్వ డాక్టర్ల సంఘం నేతలు మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్..

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సోమవారం వరకూ ఢిల్లీలో గడిపే సీఎం ఈ పర్యటనలో న్యాయ, ఆర్థిక, పర్యావరణ, నీటిపారుదలశాఖల మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. 

తగ్గిన పెట్రోలు డీజిల్ ధరలు..

హైదరాబాద్ : వాహనాదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త అందించాయి. పెట్రోలు లీటరుకు రూ 2.25 పైసలు, డీజిల్ 45 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

పీఎస్ పై గ్రనేడ్‌ దాడి..

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌పై ముష్కరులు గ్రనేడ్‌తో దాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందగా.. నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. యారిపొర పోలీసుస్టేషన్‌పై నిరసనకారులు రాళ్లతో దాడి చేస్తున్న సమయంలో ఈ గ్రనేడ్‌ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. 

20:46 - July 15, 2016

బిచ్చగాళ్ళ ఏసం కట్టిన వర్శిటీ ఉద్యోగులు ...బోనమెత్తిన వరంగల్ పట్నం..బీరన్న జాతర ..వైసీపీ జగన్ కు మానసిక వ్యాధి వచ్చిందన్న ఆనం..రావెల నడుస్తున్న దారిలో పూలు జల్లుతున్న ఆడబిడ్డలు ..చిల్లకల్లులో భార్యకు అగ్ని పరీక్ష పెట్టిన కలియుగ రామచంద్రుడు..టేకు మొక్కలు ఎలా నాటాలో చెప్పిన మంత్రి పోచారం..మద్యంలో కల్తీ చేస్తున్న పోరగాళ్లు....ఇసువంటి మస్తు మస్తు ముచ్చట్లతో ఈరోజు కూడా మన మల్లన్న  తీసుకొచ్చిండు మరి చూసి మస్తు ఖుషీ  అవుండ్రి..

20:19 - July 15, 2016

విజయవాడ : రష్యా, కజకిస్తాన్‌ పర్యటన విజయవంతమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏరోస్పోస్‌, డిఫెన్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, టెక్నాలజీలో రష్యా ముందుందని చెప్పారు. రష్యాతో రెండు ప్రధానమైన ఎంవోయూలు కుదుర్చుకున్నామని చంద్రబాబు తెలిపారు. కజకిస్థాన్‌ రాజధాని ఆస్తానాకు అమరావతికి దగ్గరి సంబందముందన్న చంద్రబాబు.. కజకిస్తాన్‌ రాజధాని నిర్మాణంలో అక్కడి ఉద్యోగులు ఏడాదిపాటు వేతనాలు తీసుకోకుండా పనిచేశారని తెలిపారు. అత్యుత్తమ రాజధాని నిర్మాణం కోసమే విదేశాల్లో పర్యటించినట్లు చంద్రబాబు చెప్పారు.

ముగిసిన వదినా మరదళ్ళ సీరియల్ ...

రంగారెడ్డి : టీవీ నటి శ్రీవాణి వివాదం ముగిసింది. రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో తన ఇంటిని కూల్చేశారంటూ శ్రీవాణి వదిన అనూష పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి పరిగి గ్రామస్థులంతా ఆమె వెంటనిలవడంతో శ్రీవాణి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు సహకరించకుండా షూటింగ్ అంటూ శ్రీవాణి తప్పించుకోవడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన శ్రీవాణి కుటుంబ సభ్యులు పరిగి పోలీస్ స్టేషన్ కు హాజరై వివాదాన్ని పరిష్కరించుకున్నారు. తన అన్న వైద్యానికి అప్పు చేసిన 40 లక్షల రూపాయలు చెల్లిస్తామని అంగీకరించారు.

19:39 - July 15, 2016

విజయవాడ : ప్రగతి రథచక్రాలు.. అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నాయి. ఆర్టీసీ బస్‌ అంటే.. ఇప్పుడు హైటెక్‌ హంగులతో, రంగులతో కళ కళలాడుతోంది. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు.. సరుకు రవాణాలోనూ దూసుకుపోతున్న ఏపీఎస్‌ ఆర్టీసీపై స్పెషల్‌ పోకస్‌...

బీజీ- ఆర్టీసీకి డిక్కీ ఆదాయం..
బుస్సు చక్రం.. ప్రగతికి మెట్టు అనే నినాదాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ రుజువుచేస్తోంది. బస్టాండ్‌లతోపాటు.. బస్సులు కూడా కొత్త కొత్త ఫీచర్లతో.. ప్రయాణీకులకు మరింత చేరువవుతున్నాయి.

ఆర్టీసీకి హైటెక్‌ హంగులు...
ఆర్టీసీ బస్సు అనగానే...ఓ డొక్కురూపం మనకు గుర్తుకు వస్తుంది... ఇది గతం.. ఇపుడు ఆర్టీసీ హైటెక్‌ సొగసులు అద్దుకుంది. సౌకర్యాలు, సౌందర్యంలోనూ కొత్తలుక్‌లోకి తీసుకొచ్చారు అధికారులు. అభివృద్ధి అంటే కేవలం ప్రయాణ సౌకర్యం కల్పించడమేకాదు... లాభాల్లోకూడా బస్సు ను దూసుకుపోయేలా చేస్తున్నామంటున్నారు ఆర్టీసీ అధికారులు.

ఆర్టీసీలో పెరిగిన సరుకు రవాణ..
ఇప్పటిదాకా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే పరిమితం అయిన ఆర్టీసీలో ఇపుడు సరుకు రవాణాకూడా చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 13, విజయవాడలోని 14 డిపోలకు ఒక్కోఏటీఎం కు సరుకు రవాణా బాధ్యతలు అప్పగించారు. దీనికోసం డిపోలస్థాయిలో లగేజీ బుకింగ్‌క్లర్క్స్‌ ను నియమించారు. వీరు రాత్రి చివరి బస్‌ గమ్యస్థానానికి బయలుదేరేవరకు డిపోల్లోనే ఉండి.. సరుకు రవాణాను పర్యవేక్షిస్తున్నారు. సరుకు వివరాలు, ఎక్కడ నుంచి ఎక్కడికి చేరవేస్తున్నారో.. అన్ని విరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటారు.

డిక్కీప్లేసుల లీజుపై విజయవాడ రీజియన్‌లో రూ.82లక్షలు ..
గుంటూరు, విజయవాడల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌, హయ్యర్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని డిక్కీ ప్లేసులను లీజుపద్ధతిన కేటాయిస్తున్నారు. ఇలా నెలలు, సంవత్సరాల ప్రాతిపదికన డిక్కీల్లో స్థలాలను ఒకేసారి లీజుకు తీసుకుని సరుకులు రవాణా చేసుకునే విధంగా ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో గుంటూరు రీజియన్‌లోనే 15లక్షలు, విజయవాడ రీజియన్‌లో 82లక్షలు రాబట్టినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఆర్టీసీ బస్సు కొత్త కొత్త సౌకర్యాలతో ప్రజలకు మరింత చేరువవుతోంది. 

18:46 - July 15, 2016

హైదరాబాద్ : జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం...ప్రజల ఆరోగ్య సంక్షేమమే మా ఎజెండా ..అంటూ నేతలు గొప్పగా ప్రకటనలు చేస్తారు. ఆచరణలో మాత్రం వాటిని మర్చిపోతాయి. అట్టడుగు వర్గాలు, పేద ప్రజలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యమంటే కలే. అలాంటి వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే పెద్దదిక్కు. కాని ప్రాథమిక కేంద్రాలే సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. సాక్షాత్తు భాగ్యనగరంలోనే సమస్యల అడ్డాగా మారిన ప్రాథమిక కేంద్రాలపై ప్రత్యేక కథనం.

పేదల ఆరోగ్య ఆలయాలు ప్రాథమిక వైద్య కేంద్రాలు...
అవి పేదల పాలిట కార్పొరేట్ ఆసుపత్రులు...ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య వచ్చినా వారికి అవే పెద్ద దిక్కు....చిన్నచిన్నబాధల నుంచి కాన్పుల వరకూ అనేక సేవలందించే పేదల ఆరోగ్య ఆలయాలు... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు టీకాలు వెయ్యడం, తల్లిబిడ్డల ఆరోగ్య రక్షణకు అవసరమైన సూచనలు సలహాలు ఈ కేంద్రాల్లోనే లభిస్తుంటాయి. పేద, మధ్యతరగతి ప్రజలంతా ఈ కేంద్రాలకే రెగ్యులర్‌గా వస్తుంటారు. ఇలాంటి కేంద్రాలు నిర్వహణ ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది.

ప్రాధమిక కేంద్రాల్లో వైద్యుల కొరత...

హైదరాబాద్‌లో ఉన్న పలు ప్రాథమిక కేంద్రాల్లో డాక్టర్స్ కొరత ఉంటుంది. వేరే ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్స్ ఇక్కడ ఇన్‌చార్జ్‌లుగా ఉంటారు. 24 గంటలు పనిచేస్తున్న హెల్త్‌ సెంటర్లలో డెలివరీ చెయ్యడానికి అవసరమైన గైనకాలజీ డాక్టర్లు లేరు. ఆరోగ్యకేంద్రం కరెంట్‌బిల్లు, నల్లా, టెలిఫోన్‌ బిల్లులు జీహెచ్‌ఎంసీనే చెల్లించాలి. అయితే అధికారులు మాత్రం వీటిని పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఎప్పడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి.

సిటీలో మాత్రం 40నుంచి 60 వేల మందికి ఒక హెల్త్‌సెంటర్...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే సీజనల్ వ్యాధుల నిర్మూలనలో కీలక పాత్ర వహిస్తాయి. వర్షాకాలం లో వ్యాధుల విజృంభన ప్రారంభమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడి వైద్యులదే. కానీ అలా జరగడం లేదు. ప్రతి పదివేలమందికి ఒక అర్బన్‌ హెల్త్‌ సెంటర్ ఉండాలి. సిటీలో మాత్రం 40వేల నుంచి 60 వేల జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉంది.ఇక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అంతంతమాత్రమే. రిపేర్ల పేరుతో నెలలతరబడి పనులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలంటున్న ప్రజలు..
ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. సౌకర్యాలు లేని హెల్త్‌ సెంటర్లలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 

18:40 - July 15, 2016

హైదరాబాద్ : మొజంజాహి మార్కెట్ చంద్రవిహార్ కాంప్లెక్స్ ఆవరణలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంశాఖ సెక్రటరీ ,విజులెన్స్ ఎండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాజీవ్ త్రివేది హాజరయ్యారు. చెట్లను పెంచడం వలన పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని త్రివేది అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు.  

టీడీపీ,బీజేపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ..

విజయవాడ : టీడీపీ బీజేపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా..రావాల్సిన నిధులు, ప్యాకేజీలపై చర్చించారు.  

18:32 - July 15, 2016

విజయవాడ : విజయవాడ ఆసుపత్రిలో శిశువు మాయం ఘటనలో కొత్తకోణం. పసికందు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బాబు ఆచూకి కోసం పోలీసులు నగరంలో దాదాపు 10 బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు నేపథ్యంలో బస్టాండ్ లో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు మహిళల పోస్టర్ ను పోలీసులు మీడియాలో చూపించారు. ఇక్కడే కేసు కొత్తమలుపు తిరిగింది. ఇది గమనించిన అనుమానిత మహిళ బంధువులు వారికి తెలపటంతో వారు మీడియాను ఆశ్రయించారు. పోస్టర్ లో వున్నది తామే కానీ కిడ్నాప్ చేసింది మాత్రం తాము కాదని ద్యానశబరి అనే అనుమానిత మహిళ వాదిస్తోంది. కాగా తమ బిడ్డ వయస్సు ఐదు నెలలు అని ఐదు రోజుల బిడ్డకూ ఐదు నెలల బిడ్డకూ తేడా తెలియటంలేదాని ప్రశ్నించారు. తమ అకారణంగా తమను అనుమానించి తమను అప్రత్రిష్టపాలు చేశారని దీనిపై పరువునష్టం ద్యానశబరి ఆగ్రహం వ్యక్త చేసింది. డిఎన్ ఏ టెస్ట్ లకు కూడా తాము సిద్ధంగా వున్నామని ద్యానశబరి పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోకుండా తమను ఇలా అల్లరిపాలు చేయటం ఎంతవరకూ సమంజయం అని ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకున్నామనీ..కిడ్నాప్ చేసింది వారు కాకపోతే మరి తమ బిడ్డ ఎమైపోయాడో చెప్పి తీరాలని తమ బిడ్డను తమకు అప్పగించేవరకూ ఆసుపత్రి నుండి కదలమని బంధువులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి ఎదుట బాబు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

శిశువు మాయం ఘటనలో కొత్తకోణం..

విజయవాడ : విజయవాడ ఆసుపత్రిలో శిశువు మాయం ఘటనలో కొత్తకోణం. పసికందు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆసుపత్రి ఎదుట బాబు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా బస్టాండ్ సీసీ కెమోరాల ఆధారంగా ఇద్దరు అనుమానిత మహిళలను పోలీసులు రిలీజ్ చేశారు. ఇక్కడే కేసు కొత్తమలుపు తిరిగింది. ఫోటో వున్న మహిళలు గుంటూరు మీడియాను సంప్రదించి కిడ్నాప్ చేసింది తాము కాదంటూ అనుమానిత అయిన ద్యానశబరి అనే మహిళ మీడియాకు తెలిపింది. వారు కాకపోతే మరి తమ బిడ్డ ఎమైపోయాడో చెప్పి తీరాలని తమ బిడ్డను తమకు అప్పగించేవరకూ ఆసుపత్రి నుండి కదలమని బంధువులు పేర్కొంటున్నారు. 

18:06 - July 15, 2016

హైదరాబాద్ : హోంగార్డులను వెంటనే క్రమబద్ధీకరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం. డీజీపీని కలిసిన ఆయన రంగారెడ్డి జిల్లా పోలీసు అధికారి ఇంట్లో హోంగార్డులు పనిచేయడంపై... కోదండరాం డీజీపీకి ఫిర్యాదు చేశారు. విధినిర్వహణలో పోలీసుతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా..వేతనాలు ఇవ్వడం లేదన్నారు కోదండరాం .

సూర్యాపేటలో చోరీ..

నల్లగొండ : సూర్యాపేటలోని చంద్రన్నకుంటలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో 14 తులాల బంగారం, 30 తులాల వెండిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17:47 - July 15, 2016

తూ.గోదావరి : ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై సీపీఎం సమరశంఖం పూరించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ప్రచార జాతను ప్రారంభించారు. ధరలు మూడు వందల శాతం పెరిగాయని.. వాటిని తగ్గించాలని.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. కాకినాడను స్మార్ట్‌సిటీగా ప్రకటించి.. కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమంటున్న సీపీఎం నేతలు పేర్కొన్నారు..ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ విజువల్ చూడండి...

17:44 - July 15, 2016

విజయవాడ : ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సమ్మిట్ ను మంత్రి రావెలకిషోర్ బాబు ప్రారంభించారు. రెసిడెన్షియల్ స్కూళ్లను మరింత అభివృద్ది చేస్తామని మంత్రి అన్నారు. ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు వారికి అవార్డులను కూడా ఇస్తామని తెలిపారు. కార్పోరేట్ స్థాయిలో విద్యార్థులందరికి భోదనా సదుపాయాలు అందిస్తామని మంత్రి అన్నారు. పోటీ పరీక్షల కోసం విద్యాసంస్థల్లోనే విద్యార్థులకు నేరుగా తర్ఫీదు నిస్తామని మంత్రి రావెల తెలిపారు. 

17:42 - July 15, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే తాము సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య. జూన్ 30న నలుగురు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ , రాజ్ నాథ్ సింగ్ , సురేష్ ప్రభు , మనోజ్ సింహాతో జరిగిన భేటీలో సుదీర్ఘంగా చర్చించామన్నారు రాఘవయ్య. అక్కడ సానుకూలంగా మంత్రులు అంగీకరించడంతోనే వాయిదా వేశామన్నారు రాఘవయ్య. తమ సమస్యలు పరిష్కరించకపోతే.. తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు మర్రి రాఘవయ్య. 

17:26 - July 15, 2016

నల్లగొండ : రోజురోజుకీ మానవత్వం మంటగలిసిపోతోంది. సమాజంలో జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండాపోతోంది. దీనికంతటికీ ప్రధాన కారణం డబ్బు. ధన పిశాచం పట్టుకున్న మనుషులు మృగాల్లా మారిపోతున్నారు. మానవత్వం మచ్చుకుకూడా కనిపించటం లేదు. ఈ ధనానికి ఏ వర్గం కూడా అతీతంగా లేదు. ఏ వృత్తి అతీతంగా వుండటంలేదు. మనుష్యులకు ప్రాణాలు పోసే డాక్టర్లు కూడా ఈ ధనపిశాచానికి బానిసలైపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రికి వస్తున్న జనాలకు వైద్యం చేయాలంటే వారి చేతిలో నోట్ల కట్టలు పడాల్సిందే. ఇక పేదలైతే ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. పేదలు వైద్యం చేయించుకోవటానికి ప్రభుత్వ ఆసుపత్రులు వున్నాయి. కానీ అవి పేరుకుమాత్రం ప్రభుత్వ ఆసుపత్రులుగా వుండిపోతున్నాయి..పైసలు చేతిలో పెడితేనే ప్రభుత్వ ఆసుపత్రులకు పనులు జరుగుతాయి. లేదండా ప్రభుత్వ డాక్టరు పెట్టుకున్న ఆసుపత్రులకు వెళితేనే వైద్యం చేస్తామంటారు సదరు ప్రభుత్వ వైదులు..ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు ప్రాణాలు తీస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే...

వివరాలలోకి వెళ్దాం...
ఆలేరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అనూష అనే గర్భిణికి వైద్యులు గురువారం డెలివరీ డేట్ ను ఇచ్చారు. దీంతో ఆసుపత్రికి వచ్చినా డాక్టర్ అనూరాధ పట్టించుకోలేదు. భువనగిరిలో వున్న తన ప్రయివేటు ఆసుపత్రికి వస్తేనే వైద్యం చేస్తానని చెప్పింది. ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేకపోవటంతో ప్రభుత్వాసుపత్రిలోనే నిన్నటి నుండి వుండిపోయింది. అనూష బంధువులు ఒత్తిడి చేయంటో ప్రభుత్వాసుపత్రిలోనే అనూషకు అనూరాధ ఆపరేషన్ చేసింది. కానీ అప్పటికే కడుపులో వున్న శిశువు మృతి చెందింది. డాక్టర్ నిర్లక్షమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. కానీ బంధువులు ఆందోళన చేసిన ఏం చేసినా చనిపోయిన పసిగుడ్డు మాత్రం ప్రాణం పోసుకోదుగా..ఇటువంటి ఘటనలు ప్రతీ ఆసుపత్రిలోనూ సర్వసాధారణమయిపోయాయి. దీనిపై ప్రభుత్వ యంత్రాంగ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. పైసలు కన్నా ప్రాణం మిన్న అని వైద్యులు తెలుసుకోవాల్సి అవసరం కూడా వుంది. డాక్టర్లంతా అలా వుండకపోయినా కొందరి చేస్తున్న ఇటువంటి పనులతో డాక్టర్ వృత్తులకే మాయనిమచ్చలా మిగిలిపోతున్నాయి..సర్కారు దవాఖానా అంటే అమ్మో అనుకునేలా సామాన్యులు భయపడే పరిస్థితులు కలుగుతున్నాయి.

17:10 - July 15, 2016

వరంగల్‌ : ఉర్సు గుట్టలో బీరన్న స్వామి ఉత్సవాలు మొదలయ్యాయి....... ఆలయంలో స్వామివారితో పాటు... కామరతి, గొల్లకురుమల ఆడపడుచు అక్క మహంకాళి దేవిలకు గొల్ల కురుమ పూజారులు మహాభిషేకం జరిపారు...ఉత్తర తెలంగాణలో అతి పెద్ద జాతరగా పేరున్న బీరన్న జాతర ప్రారంభమయ్యింది. తెలంగాణలో వందల ఏళ్ళ సంస్కృతి సంప్రదాయల చరిత్ర కలిగి..సాయుధ తెలంగా పోరాటానికి సంబంధించి స్ఫూర్తికి సంబంధించిన ఈ బీరన్న జాతర నిచ్చిన కు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ జాతరపై మర్ని వివరాలకు ఈ వీడియోను చూడండి...

17:08 - July 15, 2016

ప్రకాశం : పెరిగిన నిత్యవసరాల ధరలు, నిరుద్యోగ సమస్యకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కనిగిరి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా సీపీఎం ధర్నాలు నిర్వహిస్తుందని తెలిపారు.

17:02 - July 15, 2016

హైదరాబాద్ : చిన్నారి హర్షితకు వైద్యం చేయించేందుకు సర్కారు ముందుకు వచ్చింది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న హర్షిత వేదనను, ఆమెకు వైద్యం చేయించలేని తల్లిదండ్రుల దైన్యాన్ని 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. వీటికి స్పందించిన ప్రభుత్వం.. పాపను ఆదుకుంటామని, ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స చేయిస్తామని వెల్లడించింది. హర్షిత చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని.. తనను కలిసిన హర్షిత తల్లిదండ్రులకు వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. 

కాలేయ సంబంధిత వ్యాధితో హర్షిత...
కాలేయ సంబంధిత వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్న చిన్నారి హర్షిత కుటుంబంలో 10 టీవీ సంతోషం నింపింది.. 10 టీవీ కథనాలతో స్పందించిన అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు.. పాప తల్లిదండ్రుల్ని మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడించారు.. పాప దీనస్థితిని చూసి కదిలిపోయిన మంత్రి... పాపకు ప్రభుత్వమే ఆపరేషన్ చేయిస్తుందని హామీ ఇచ్చారు.. ఆరోగ్యశ్రీకింద ట్రీట్‌మెంట్ ఇప్పిస్తామని తల్లిదండ్రులకు చెప్పారు...

ఆపరేషన్‌కు రూ. 20లక్షలు ఖర్చు...
మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునూతలకు చెందిన హర్షిత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది.. వైద్య పరీక్షల్లో పాప కాలేయం పాడైపోయిందని తేలింది.. ఈ ఆపరేషన్‌కు దాదాపు 20లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు స్పష్టం చేశారు.. ఈ వార్త విన్న ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోయారు.... పాప వ్యాధి నిర్ధారణకోసం చేసిన పరీక్షలకే ఆ కుటుంబం అప్పులపాలైంది.. ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు సమకూర్చలేక.. బిడ్డ నరక యాతనను తట్టుకోలేక.. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలంటూ హెచ్చార్సీలో పిటిషన్ వేశారు.. అనారోగ్యంతో బాధపడుతున్న పాపను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు..

హర్షిత కుటుంబానికి 10 టీవీ అండ...
పాప అవస్థ తెలుసుకున్న 10 టీవీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది.. చిన్నారి అనారోగ్యాన్ని ప్రజల ముందుంచేందుకు నడుం బిగించింది. చిన్నారి కాలేయ వ్యాధిపైనా.... తల్లిదండ్రుల దీనస్థితిపైనా వరుస కథనాలు ప్రసారం చేసింది. గురువారం సాయంత్రం చిన్నారి హర్షిత తల్లితో.. వీక్షకుల ఇంటరాక్షన్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.. పాపను ఆదుకునేందుకు చాలామంది దాతలు ముందుకొచ్చారు.. అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజుకూడా తక్షణమే స్పందించారు. శుక్రవారం తనను కలవాలని సూచించిన ఎమ్మెల్యే బాలరాజు.. ఆమేరకు ఉదయాన్నే తన వద్దకు వచ్చిన హర్షిత తల్లిదండ్రులను వెంటపెట్టుకుని.. మంత్రి లక్ష్మారెడ్డి వద్దకు వెళ్లారు. వారి వేదనను వినిపించారు. విషయం తెలుసుకుని కదిలిపోయిన మంత్రి లక్ష్మారెడ్డి.. పాప వైద్యాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

ప్రభుత్వ స్పందనతో హర్షిత తల్లిదండ్రుల్లో హర్షం...
ప్రభుత్వ స్పందనతో.. హర్షిత తల్లిదండ్రుల్లో హర్షం వెల్లువెత్తింది. తమ కుమార్తె జీవితంలో వెలుగులు నిండుతాయన్న ఆశలు వారిలో చిగురించాయి.

10 టీవీకి హర్షిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు ..
సామాజిక బాధ్యతతో.. చిన్నారి సమస్యపై ప్రభుత్వాన్ని కదిలించిన 10 టీవీకి హర్షిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

16:59 - July 15, 2016

నిజామాబాద్ : పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతును అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముడుపులు చెల్లిస్తే చాలు ఎలాంటి పర్మిషన్‌ లేకుండానే ఎన్ని అంతస్తులైనా కట్టేయవచ్చు అనే భావనలో భవన నిర్మాణదారులు మునిగిపోయారు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిజామాబాద్‌ ప్రణాళికా విభాగం అధికారుల అలసత్వంపై స్పెషల్‌ రిపోర్ట్‌

నిజామబాద్‌ కు అక్రమ నిర్మాణాల బెడద ..
నగర పాలక సంస్థగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న నిజామబాద్‌ కు అక్రమ నిర్మాణాల బెడద తప్పడం లేదు. ఒక వైపు నగరపాలక సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే నగర ప్రణాళిక విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలతో పాలక సంస్థకు భారీగా ఆదాయానికి గండ పడుతోంది. అనేక మంది యజమానులు గ్రౌండ్‌, మొదటి అంతస్తులకు మాత్రమే అనుమతి తీసుకొని ఆపై రెండు, మూడు అంతస్తులు కట్టేస్తున్నారు.

చూసీచూడనట్లుగా అధికారులు...
ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారుతుండగా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ అక్రమకట్టడాలు పెరిగిపోతున్నాయి.

జమానులను బెదిరించి వసూళ్లు...
నిబంధనల ప్రకారం 200 గజాలకు పైబడి ఉన్న విస్తీర్ణంలో భవనానికి ప్లాను తీసుకోవాలంటే నిర్మాణం లో 10 శాతం నగరపాలక సంస్థకు తనాఖా ఉంచాలి. అయితే ఈ తనాఖా నుంచి తప్పించుకునేందుకు కొందరు యజమానులు ఈ అక్రమ కట్టడాలకు తెగబడుతున్నారు. ఇదే అదనుగా నాయకులు అక్రమకట్టడాల యజమానులను బెదిరించి వసూళ్లకు సైతం పాల్పడుతున్నారు.

రెవన్యూ విభాగం మధ్య సమన్వయ లోపం ..
మరోవైపు అటు ప్రణాళికా విభాగం, రెవన్యూ విభాగం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారే అనే రీతిలో రెండు విభాగాలు కొనసాగుతున్నాయి. అటు ప్రణాళికా విభాగంలో అవినీతి జలగలు అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసి కోట్లు దండుకుంటుండగా.. అటు రెవెన్యూ విభాగం కేవలం అక్రమనిర్మాణాలకు అదనపు రుసుం వసూలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

నగరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ..
అటు ప్రణాళిక విభాగం పడకేయడంతో నగరంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. రెండంతస్తులకు పర్మిషన్‌ తీసుకొని ఐదంతస్తుల నిర్మాణాలు వెలవడం పరిపాటిగా మారింది. మరోవైపు రెవెన్యూ విభాగం సైతం అలసత్వం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల నుంచి 10 శాతం అదనపు పన్ను వసూలు చేయాలి. అయితే పట్టణంలో వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉంటే కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అదనపు పన్ను వసూలు అవుతోంది.

నిబంధనల నిర్మాణాలకు మామూళ్లు...
ఇదిలా ఉంటే నిబంధనలకు లోబడి చేస్తున్న నిర్మాణాల నుంచి సైతం 75 వేల నుంచి లక్షకు పై చిలుకు మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోందని భవన నిర్మాణదారులు వాపోవడం కొసమెరుపు. 

ఆలేరు ఆసుపత్రిలో దారుణం..

నల్లగొండ : ఆలేరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అనూష అనే గర్భిణికి వైద్యులు గురువారం డెలివరీ డేట్ ను ఇచ్చారు. దీంతో ఆసుపత్రికి వచ్చినా డాక్టర్ అనూరాధ పట్టించుకోలేదు. భువనగిరిలో వున్న తన ప్రయివేటు ఆసుపత్రికి వస్తేనే వైద్యం చేస్తానని చెప్పింది. ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లే స్థోమత లేకపోవటంతో ప్రభుత్వాసుపత్రిలోనే నిన్నటి నుండి వుండిపోయింది. అనూష బంధువులు ఒత్తిడి చేయంటో ప్రభుత్వాసుపత్రిలోనే అనూషకు అనూరాధ ఆపరేషన్ చేసింది. కానీ అప్పటికే కడుపులో వున్న శిశువు మృతి చెందింది. డాక్టర్ నిర్లక్షమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. 

16:36 - July 15, 2016

విజయవాడ : నగరం నిద్రపోతున్న వేళలలో ఒక్క నేరగాళ్లే కాదు...బ్లేడ్ బ్యాచ్‌లే కాదు...మరికొన్ని గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయి.. వీరంతా దోచుకునేవారు కాదు...దోపిడీ ముఠాలతో సంబంధాలు లేవు..కాని వారిని చూస్తే మాత్రం బెజవాడ బెదురుతోంది..వారంతా నగరంలోని వీధుల్లోకి వస్తున్నారని తెలిస్తే చాలు పోలీసులు కూడా వారి వెనకాలే పరుగులు పెట్టాల్సిందే... చిక్కరు..దొరకరు..వారే బైక్ రేసర్లు..ఇప్పటివరకు పాశ్చాత్య దేశాలకు పరిమితమైన ఈ వికృత చేష్టలు క్రమంగా బెజవాడను తాకాయి...
బైక్ రేస్ లపై యూత్ క్రేజ్..
ఇప్పటివరకు విదేశాల్లోనే పాశ్చాత్య సంస్కృతి ఉండేదనుకున్నా క్రమంగా మనకూ చేరింది...మహానగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో ఈ సంస్కృతి కన్పిస్తూనే ఉంది... ప్రధానంగా యూత్‌లో పెరుగుతున్న రకరకాల క్రేజ్‌ ఇప్పుడు ప్రాణాలమీదకు తెస్తోంది..హైదరాబాద్ నగరంలో బైక్‌ రేసింగ్‌ల వల్ల ఎన్నో అనర్థాలు జరిగాయి..జరుగుతున్నాయి కూడా....ఇదే సంస్కృతిని ఒంటపట్టించుకున్న బెజవాడ యూత్‌ కూడా చెలరేగుతోంది.. నగరం నిద్రపోతున్న వేళలో కుర్రాకారు హుషారుగా రంకేలేస్తున్నారు...బెజవాడ నగరంలో పెరుగుతున్న బైక్ రేసింగ్‌లు భయాన్ని సృష్టిస్తున్నాయి...

వికృత చేష్టలతో భయపడుతున్న ప్రజలు...
పగలు లేదు..రాత్రి లేదు..ఇప్పుడు బెజవాడ నగరంలో రహదారి కాస్త ఖాళీగా కన్పించిందంటే చాలు అక్కడికి వాలిపోతున్నారు యువతరం...ఏ రోడ్ లో నుంచి దూసుకొస్తారో తెలీదు.. ఉన్నపాటున ఎటు నుంచి రయ్యామంటూ వస్తారో తెలీదు.. అయినా సరే కెమెరాకు సైతం చిక్కకుండా బెజవాడ బైక్ రైడర్స్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు...వీరి స్పీడ్‌ కెమెరాలకు దొరకడం లేదంటే ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది... వీరి వికృత చేష్టలతో సాధారణ జనం గుండెళ్లో భయాన్ని సృష్టిస్తోంది....

జూదంలా మారుతున్న బెట్టింగ్‌లు...
బెజవాడలో బైక్ రేస్ ల పేరుతో యూత్‌ రద్దీ ఉండే రోడ్లపైనే బలప్రదర్శనకు సిద్దమవుతున్నారు...ఇక ఖాళీగా ఉన్న రోడ్లంటే వారి స్పీడ్‌కు లెక్కలేదు...వారి సరదా ఆటకు అంతం లేదు....వీరి ఆకతాయి బెట్టింగ్ బైక్ లు ఇంకొకరి జీవితాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతున్నాయి. ఒకర్ని మించి మరొకరు బైక్ బెట్టింగ్ ల జూదానికి పోతూ లక్షలాది విలువైన బైక్ లు కొనుగోలు చేస్తూ చేష్టలుడిగే విధంగా పోకిరీల్లా మారుతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్లే ఉండడం దారుణమే...

రెండేళ్ల కాలంలో పెరిగిన వికృత క్రీడలు..
గత రెండేళ్ల కాలంలో ఈ సంస్కృతి విజయవాడ వ్యాప్తంగా పెచ్చుమీరిపోయింది. కుర్రాళ్లు ఎక్కడ పందాలు వేస్తున్నారో, బైక్ ల మీద వెళ్లే బ్యాచ్ లంతా ఎటుగా వెళ్తున్నారో ఎవరికీ తెలియకుండా పోతుంది. అలా సిటీలోకి వస్తున్నారు..? పోలీస్ నేత్రాలకు, నిఘా కెమెరాకు సైతం చిక్కకుండా రయ్యమంటూ సిగ్నల్స్ సైతం పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారంటే బెజవాడలో ఏ స్థాయిలో బైక్ రైడర్స్ రెచ్చిపోతున్నారో అర్థంచేసుకోవచ్చు.

పుత్రరత్నాల సరదా కోసం రేస్ బైక్ లు ..
పుత్రరత్నాల సరదా కోసం కొందరు...భారీగా వెచ్చించి బైక్ కొనిచ్చామని గొప్పలకు కొందరు...ఇలా కుర్రాళ్లకు రకరకాలుగా మార్కెట్లోకి వస్తున్న బైక్‌లను కొనిచ్చే కన్నవారు మాత్రం జరగబోయే పరిమాణం గురించి ఆలోచించడం లేదు...ఇక పేరెంట్స్‌ పర్యవేక్షణ లేకపోవడం కూడా యూత్‌ మరింత రెచ్చిపోతున్నారనేది పచ్చి నిజం...వారి సరదాలు ఎలా ఉన్నా నగరంలో మాత్రం జరుగుతున్న రేసింగ్‌ల వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయోనని భయంతో వణుకుతున్నారు సిటిజన్లు....

బెజవాడ నగరంలో యూత్‌ చేస్తున్న ఫీట్లు...
బెజవాడ నగరంలో యూత్‌ చేస్తున్న ఫీట్లు...బైక్‌లపై పిచ్చి విన్యాసాలతో నగరవాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదంతా పగటివేళ కనిపించే సన్నివేశాలు మాత్రమే...రాత్రి పూటయితే ఇక ఆ రేసర్లకు హద్దూ పొద్దు ఉండడం లేదు...విజయవాడ నగరానికే ప్రధాన కూడళ్లుగా ఉన్న ప్రాంతాల్లో ..ఆయా రహదారుల్లో బైక్‌ రేసర్ల వాయు వేగానికి ఏ క్షణంలో ఏ జరుగుతుందోననే భయం వెంటాడుతోంది...వారి ఇష్టారాజ్యంగా బైక్ రేసింగ్ చేస్తూ, అడ్డువచ్చిన వారిపై చెయ్యి చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదు..వారిని ఏమీ అనలేక..ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చూసీ చూడనట్లుగా వెళ్లాల్సిందే.

నిఘా బృందాలు రంగంలోకి...
బెజవాడలో పెరుగుతున్న రద్దీ...రాజధాని కేంద్రం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగించడమేకాకుండా బైక్‌ రేసింగ్‌ల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న కుర్రకారు విన్యాసాలపై పోలీసులు దృష్టి పెట్టారు...ఇకపై ఇలాంటివి జరగడానికి వీల్లేదని ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించారు...రెండ్రోజుల క్రితం బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఎన్నో కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయి...

ఏడాది కాలంలో 218 కేసులు...35 మందికిపైగా మృతి..
బెజవాడ నగరంలో ఈ బైక్ రేసింగ్ బ్యాచ్ ల స్వైరవిహారంపై 218 కేసులు నమోదయ్యాయి. 35 మందికిపైగా తమ విలువైన ప్రాణాలను అర్థంతరంగా కోల్పోయారు. మరో 246 మంది బైక్ రేసర్ల దాటికి తీవ్ర గాయాలపాలయ్యారు. చనిపోయిన, గాయపడిన వారిలో అంతా యువకులే.. 32 ఏళ్లలోపువారే...సోషల్ మీడియాలో తమ నెట్ వర్క్ ను స్థాపించుకునే స్థాయికి ఎదిగిపోయారు. ఇందుకోసం ఇంటర్నెట్ల ద్వారా ఫేస్ బుక్ లను సాధనంగా ఎంచుకుంటున్నారు. బైక్ రేసింగ్ ల్లోనే పాల్గొనే వారిని ఆహ్వానిస్తూ వారి సంఖ్యా బలాన్ని పెంచుకుంటున్నారు...ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సుపుత్రుడు బైక్ రేసింగ్ లు చేస్తూ ఓ యువకుని మరణానికి కారణమయ్యాడని అప్పట్లో బెజవాడ వాసులు గగ్గోలు పెట్టారు కూడా...మళ్లీ బెజవాడలో బైక్ రేసింగ్ లు తెరపైకి రావడం పోలీసులకు సవాల్ గా మారింది...ఇది మళ్లీ జరగకుండా నిఘా బృందాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

16:22 - July 15, 2016

హైదరాబాద్ : ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట వరకు పూర్తయిన ఔటర్‌రింగ్‌ రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కండ్లకోట దగ్గర 1.5 కిలోమీటర్ల మినహా మిగతా ఔటర్ రింగ్‌ రోడ్డంతా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ ఈ రోడ్డు నిర్మాణం కోసం 7వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. హైదరాబాద్ : ఘట్ కేసర నుండి శామీర్ పేట వరకూ ఓఆర్ ఆర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కు మణిహారం వంటిదనీ...ట్రాఫిక్ నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ రింగ్ రోడ్ దాదాపు 99 శాతం పూర్తయిందనీ..ఓఆర్ ఆర్ చుట్టూ రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. 

16:16 - July 15, 2016

హైరాబాద్ : కేంద్రప్రభుత్వం ఓబీసీలకు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ రోపించారు. ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తే ప్రధానిగా ఉన్నా ఓబీసీలకు ఏ మేలు జరగడం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రెండు డిజిట్లు మించి ఉద్యోగాలు పొందుకోలేకపోతున్నారని తెలిపారు. 

16:13 - July 15, 2016

విజయవాడ : ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇద్దరు అనుమానిత ఫోటోలను విడుదల చేశారు. గురువారం సాయంత్రం బస్టాండ్ లోని సీసీ కెమెరాలో వున్న పుటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా వుండటంతో వారిపైనే అనుమానాలు వ్యక్తం అవుతోంది. నగర వ్యాప్తంగా పోలీసులు నిఘా టీమ్ ను ఏర్పాటు చేశారు. ఒక మహిళచేతిలో వున్న శిశువును మరో మహిళ చేతికి అందించటం ఆ మహిళ గుంటూరు వెళ్ళే బస్ ఎక్కటం వంటి పలు కదలికలన్నీ సీసీ కెమెరాలో రిక్డార్డయ్యాయి. దీన్ని ఆధారం చేసుకున్న పోలీసులు వారి ఫోటోలను విడుదల చేశారు. ఈ ఫోటోలను పలు ప్రాంతాలలో అంటించి సమాచారాన్ని రాబట్టటానికి ప్రయత్నిస్తున్నారు. మొబైల్ నెట్ వర్క్ ద్వారా కూడా దర్యాప్తును పోలీసులు ముమ్మరించారు. దీంతో బాబు బంధువులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు మహిళా సంఘాలు వారికి మద్ధతు తెలిపాయి.

శిశువు కిడ్నాప్ ఘటనలో దర్యాప్తు ముమ్మరం..

విజయవాడ : ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇద్దరు అనుమానిత ఫోటోలను విడుదల చేశారు. గురువారం సాయంత్రం బస్టాండ్ లోని సీసీ కెమెరాలో వున్న పుటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా వుండటంతో వారిపైనే అనుమానాలు వ్యక్తం అవుతోంది. 

16:02 - July 15, 2016

హైదరాబాద్ : ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో హైదరాబాద్‌కు చెందిన సుప్రజ అనుమానాస్పదంగా మృతి చెందడం వెనక కుటుంబ సభ్యులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సుప్రజ ఎలా మృతి చెందిందో తమకు పూర్తి వివరాలు తెలియడం లేదంటున్నారు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని.. వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవంటున్నారు. 

16:00 - July 15, 2016

ఢిల్లీ : దక్షిణ సూడాన్ లోని బాధితులు ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. మొత్తం 156 మంది భారతీయులను తీసుకురాగా త్రివేండ్రం విమానాశ్రయంలో 85 మంది దిగిపోయారు. బాధితులను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో 54 మంది తెలంగాణకు చెందినవారు ఉండగా ఏపీకి చెందినవారు 10 మంది ఉన్నారు. అధికారులు బాధితులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ సుడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సంకట్ మోచన్‌ను చేపట్టింది. 

15:57 - July 15, 2016

నల్గగొండ : జిల్లాలో దారుణం జరిగింది. కత్తి, యాసిడ్ బాటిల్ తీసుకువచ్చి చంపుతామని బెదిరించి ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ చేశారు.గత మూడు నెలలుగా ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ఒక వ్యక్తి ఆమెను నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మరో ఆరుగురు స్నేహితులను తీసుకువచ్చి గత మూడు నెలలుగా ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు. కాగా గత కొద్దికాలంగా మౌనంగా వుంటున్న భార్యను అడగటంతో ఆమె భర్తతో అన్ని వివరాలను తెలిపింది. దీంతో భార్యతో కలిసి పీఎస్ ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

15:50 - July 15, 2016

మహబూబ్ నగర్ : అధికార పార్టీ నేతల దాష్టీకం ప్రదర్శించారు. హేమ సముద్రం రిజర్వాయర్ సమీపంలో ముంపునరకు గురవుతున్న ప్రాంతాలపై ప్రజలకు సీపీఎం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సీపీఎం నేతలను టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తుండగా చివరిగా ప్రతిపాదించినది ఈ హేమసముద్రం ప్రాజెక్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ముంపు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని గ్రామస్థులకు భూచట్టాలపై అవగాహన సదస్సును సీపీఎం నేతలు ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి సీపీఎం నేతలను అరెస్ట్ చేయించారు. గత కొన్ని వారాలుగా ప్రాజెక్టుల ముంపు ప్రాంతాలలో సీపీఎం నేతలు పాదయాత్రలు చేసిన గ్రామస్తులకు భూచట్టాలపై అవగాహనా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా హేమసముద్రం ప్రాంతంలో ఈ నెల 22న జాతీయస్థాయి నాయకులతో హేమసముద్రం ప్రాంతంలో పాదయాత్ర జరుగనున్న విషయం తెలిసిందే..ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి..

సీపీఎం నేతలపై టీఆర్ఎస్ నేతల దాష్టీకం ..

మహబూబ్ నగర్ : అధికార పార్టీ నేతల దాష్టీకం ప్రదర్శించారు. హేమ సముద్రం రిజర్వాయర్ సమీపంలో ముంపునరకు గురవుతున్న ప్రాంతాలపై ప్రజలకు సీపీఎం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సీపీఎం నేతలను టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్  చేశారు.

మూడు నెలలుగా మహిళపై గ్యాంగ్ రేప్..

నల్గగొండ : జిల్లాలో దారుణం జరిగింది. కత్తి, యాసిడ్ బాటిల్ తీసుకువచ్చి చంపుతామని బెదిరించి ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ చేశారు.గత మూడు నెలలుగా ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరి బారి నుండి తప్పించుకున్న సదరు యువతి గురువారం నాడు టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

15:19 - July 15, 2016

మెదక్ : జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లోరాష్ట్ర గవర్నర్ నరసింహన్ మొక్కలు నాటారు. ఇబ్రహీంపూర్‌లో లక్షా 5 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకుడు గుంతలను, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను గవర్నర్ పరిశీలించారు. ప్రజలంతా కలిసికట్టుగా పని చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఇబ్రహీంపూర్‌ గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయన్నారు నరసింహన్‌. గ్రామ అభివృద్ధి కోసం మంత్రి హరీష్‌రావు, కలెక్టర్‌ ఎంతో కృషి చేస్తున్నారని నరసింహన్‌ పొగిడారు.

 

కాల్వలో మగ శిశువు మృతదేహం లభ్యం..

కృష్ణా : విజయవాడ ఏలూరు కాల్వలో మగ శిశువు మృతదేహం లభ్యమయ్యింది. గురువారం ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమయిన శిశువుగా స్థానికులు అనుమానించి సమాచారం అందించటంతో సంఘటనా స్థలికి చేరుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డ కాదని స్పష్టం  చేశారు. 

ఎద్దుల జతను తోలుకెళ్లాడని ఆత్మహత్య..

మెదక్ : తిరుమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. అప్పు కట్టలేదని యాదగిరి అనే వ్యక్తికి చెందిన ఎద్దుల జతను బలవంతంగా కరుణాకర్ అనే వ్యక్తి తోలుకెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యాదగిరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరి మృతదేహంతో కరుణాకర్ ఇంటి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. 

పీఎస్ లో హాజరయిన శ్రీవాణి కుటుంబ సభ్యులు..

రంగారెడ్డి : వికారాబాద్ పోలీసులు ఎదుట బుల్లితెర నటి శ్రీవాణి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వదనను వేధించిందనే కారణంతో శ్రీవాణిపై కేసు నమోదయిన విషయం తెలిసిందే. 

ఓఆర్ ఆర్ ను ప్రారంభించిన కేటీఆర్..

హైదరాబాద్ : ఘట్ కేసర నుండి శామీర్ పేట వరకూ ఓఆర్ ఆర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కు మణిహారం వంటిదనీ...ట్రాఫిక్ నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ రింగ్ రోడ్ దాదాపు 99 శాతం పూర్తయిందనీ..ఓఆర్ ఆర్ చుట్టూ రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. 

14:47 - July 15, 2016

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా 'కాళహస్తి' చిత్రం తెరకెక్కనుంది. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శారద ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ సమర్పణలో అనిల్‌ కుమార్‌ కిషన్‌ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తొలి షాట్‌కు నిర్మాత డి.సురేష్‌బాబు క్లాప్‌నిచ్చారు. పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడారు. రియలిస్టిక్‌ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. రవిని చూడగానే తన కథకు సరైన హీరో అనిపించిందన్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలాఖరులో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రెండు, మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామని చెప్పారు. 

 

ఎస్పీ ఎదుట లొంగిపోయిన నయూమ్ అనుచరులు..

నల్లగొండ : జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి ఎదుట రౌడీ షీటర్ నయూమ్ అనుచరు లొంగిపోయారు. పీడీయాక్ట్ నమోదు కావటంతో పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్ లొంగిపోయినట్లుగా సమాచారం. వీరు కొంతకాలంగా అజ్ఞాతంలో వున్న విషయం తెలిసిందే.

మన్యం ప్రాంతంలో మావోయిస్టుల కలకలం..

తూ.గోదావరి : తూర్పు మన్యం ప్రాంతంలో మావోయిస్టుల కలకలం రేగింది. చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు రెండు మందుపాతరలను పేల్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందాల్సివుంది.

మందుబాబులకు కేసీఆర్ రోల్ మోడల్ : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉస్మానియాలో నెలకొన్న పరిస్థితులకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. పేకాట్ క్లబ్ లను మూసివేయించిన కేసీఆర్ కు పబ్ లు కనిపించటంలేదా అని ప్రశ్నించారు. మందుబాబులకు కేసీఆర్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ లేదని బీజేపీ అనటం మిత్రధర్మానికి విరుద్ధమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేని విపక్షాలు వున్నా ఒకటే లేకపోయినా ఒకటేనన్నారు.

విద్యుత్ పొదుపు చేస్తున్న దేవాదాయ శాఖ..

విజయవాడ : ఆలయాల్లో విద్యుత్  పొదుపు కార్యక్రమం చేపట్టామని దేవాదయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ వీ ప్రసాద్ తెలిపారు. కనకదుర్గ గుడి,శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, శ్రీకాళహస్తి, కాణిపాకం,ద్వారకాతిరుమల ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీంతో 60 నుండి 65 లక్షల యూనిట్లు పొదుపు చేయవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో దేవాదయ శాఖ సోలార్ విద్యుత్ అందించేలా జగ్గయ్యపేటలో సోలార్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ప్రసాద్ తెలిపారు. 

14:23 - July 15, 2016

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించనుంది. ఇటీవలే టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ.. బాహుబలిలో ప్రత్యేక పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున సరసన నటించింది. తన ఇమేజ్ ఏమాంత్ర తగ్గిపోలేదని మరోసారి నిరూపించుకుంది. తాజాగా రజినీకాంత్ హీరోగా వస్తున్న రోబో 2.0 చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ విలన్ గా నటిస్తున్నారు. 17 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ తో రమ్యకృష్ణ నటించనుంది. నరసింహ సినిమాలో వీరిద్దరూ పోటాపోటీగా నటించి మెప్పించారు. మరోసారి రజినీ, రమ్యకృష్ణ కలిసి నటిస్తున్న ఈ చిత్రం హిట్ అవుతుందో లేదో చూడాలి.. ఇంతకముందే రజనీకాంత్, ఐశ్వర్వరాయ్ కలిసి నటించిన రోబో చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే.

 

హోంగార్డ్ కు విద్యుత్ షాక్..

కరీంనగర్ : సిరిసిల్లలో సీఐ ఇంట్లో పనిచేస్తున్న హోంగార్డ్ రాజేశ్వరరావుకు విద్యుత్ షాక్ తగిలింది. సీఐ ఇంట్లో పంపు ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగినట్లుగా తెలుస్తోంది. పరిస్థితి మిషమించటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

14:11 - July 15, 2016

కరీంనగర్ : కుమారులకు గోరు ముద్దలు పెట్టి ప్రేమతో పెంచి పెద్ద చేశాడు ఆ తండ్రి... విద్యా బుద్ధులు చెప్పించి  కుమారులను ప్రయోజకులుగా చేస్తే వృద్ధాప్యంలో బుక్కెడు బువ్వ పెట్టి మంచిగ చూసుకుంటారని నమ్మాడు. కానీ అలా నమ్మిన ఆ తండ్రి ఇప్పుడు మోసపోయాడు. ఉన్న ఆస్తినంతా తీసుకున్న  తర్వాత...  తండ్రిని రోడ్డుపైకి గెంటివేసిన ఘటన కరీంనగర్ జిల్లా వేములవాడలో జరిగింది. 
బుక్కెడు బువ్వ పెట్టకుండా ఇంట్లోంచి గేంటివేత
ఇక్కడ మీరు చూస్తున్న ఈ వృద్ధుడి పేరు తోట కిష్టయ్య.. ఇతనిది వేములవాడ పట్టణం... వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో ఉద్యోగి. ఇతనికి నలుగురు కుమారులు...ఇంకేముంది నలుగురు కుమారులే కదా.. మంచిగా చూసుకుంటారని,  జీవితంలోని చివరి మజిలీ సాఫీగా సాగుతుందని అనుకున్నాడు.  కానీ ఇప్పుడు  ఆ నలుగురే ఇతని కష్టాలకు కారకులయ్యారు. ఉన్నదంతా తీసుకుని  రోడ్డుపైకి గెంటేశారు. 
తోట కిష్ణయ్య అనారోగ్యంతో ఉద్యోగానికి వీఆర్ఎస్ 
తోట కిష్ణయ్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఉద్యోగానికి వాలంటరీ రిటర్మైంట్  తీసుకొన్నాడు. కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా   చిన్న కుమారుడు  రవికి ఉద్యోగం ఇప్పించాడు.  ఆ సమయంలో తల్లిదండ్రులను మంచిగా చూసుకున్న చిన్న కుమారుడు  తల్లి లక్ష్మి చనిపోవడంతో తండ్రి కిష్టయ్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో మిగిలిన ముగ్గురు కుమారుల దగ్గరికి వెళ్లిన కిష్టయ్య పరిస్థితిలో మార్పులేదు. ఉద్యోగం ఇప్పించిన చిన్న కుమారుడి దగ్గరకు వెళ్లి  బతకమంటూ వెళ్లగొట్టారు. 
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన కిష్టయ్య 
దీంతో వృద్ధాప్యంలో పని చేసే సత్తా లేక, దిక్కుతోచక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు కిష్టయ్య. జీవితాంతం మంచిగా చూసుకుంటామని కుమారులు ఎన్నో కల్లబొల్లి కబుర్లు చెప్పి , సంపాదించిన ఆస్తులు లాక్కొని ఇప్పుడు ఇంటి నుంచి గెంటేశారని వృద్ధుడు కన్నీరు పెడుతున్నాడు. వృద్ధాప్యంలో తనకు బుక్కెడు బువ్వ పెట్టించి న్యాయం చేయాలని పోలీసులను ప్రాధేయపడుతున్నాడు. తల్లి ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేస్తుందని ఇద్దరినీ బాగానే చూసుకున్నారు. తల్లి చనిపోయిన తర్వాత వృద్ధుడికి తిండిపెట్టకుండా బయటకు గెంటేయడంతో  కూడు, గూడు కరువై అల్లాడుతున్నాడు. 

 

14:05 - July 15, 2016

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పక్ష పత్రిక 'జనసందేశ్‌'ను కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు. వ్యవసాయరంగానికి మోదీ సర్కార్‌ పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అన్నారు. దేశంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టినట్లు కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్‌ తెలిపారు. 

 

14:03 - July 15, 2016

ఢిల్లీ : తానెప్పడూ ఉగ్రవాదాన్ని సమర్థించలేదని ముస్లిమ్‌ మతగురువు జకీర్‌ నాయక్‌ అన్నారు. జకీర్‌ నాయక్‌ రహస్య ప్రదేశం నుంచి మీడియాలో మాట్లాడారు. కొంతమంది కావాలనే తన ప్రసంగాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తానెప్పుడూ శాంతినే కోరుకుంటున్నానని తెలిపారు. తీవ్రవాద దాడులను ఖండిస్తున్నానని చెప్పారు. కొన్ని సంఘటనలతో ముస్లిములంతా తీవ్రవాదులు కాదని స్పష్టం చేశారు. 

 

13:57 - July 15, 2016

విశాఖ : హాస్టల్స్ సమస్యలు పరిష్కారించలంటూ ఏయూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.హాస్టల్స్ లో కనీస వసతులు కల్సించకుండా మెస్ బిల్లు చార్జీలు దారుణంగా వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హాస్టల్స్ చుట్టూ చెత్త పేరుకుపోయిందని దీంతో వింత రకమైన పురుగులు , తేళ్లు వచ్చేస్తున్నాయని వార్డెన్‌ సాల్మన్‌ రాజుకు ఫిర్యాదు చేశామని అన్నారు. తేళ్లతో కరిపించుకోండి, తరువాత హెల్త్ సెంటర్‌లో చికిత్స చెయ్యుంచుకోండని వెటకారంగా సమాధానం చెప్పాడని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హాస్టల్‌ సమస్యలు పరిష్కరించకపోతే రిజిస్ట్రార్‌ ఆఫీస్ దగ్దగర ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

13:56 - July 15, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వవద్దని డిమాండ్‌ చేశారు. కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలు చింపివేసి.. దగ్ధం చేసేందుకు యత్నించారు. టీడీపీ, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న మాల మహానాడు కార్యకర్తలను.. టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు మాల మహానాడు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

 

13:50 - July 15, 2016

హైదరాబాద్ : కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ నేత భాస్కర్ డిమాండ్ చేశారు. వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ మున్సిపల్‌ కార్మికులు డిమాండ్ చేశారు. ఈమేరకు కార్మికులు హైదరాబాద్ లోని డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ దగ్గర ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు, ధనికులకు, అగ్రవర్ణాలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని విమర్శించారు.  దళితుల నోటికాడి కూడు లాక్కొంటుందని మండిపడ్డారు. కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు వేతనాలు పెంచారు.. కానీ మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచలేదని మండిపడ్డారు.  జీవో నెంబర్ 14 ప్రకారం.. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మరో సారి సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

 

 

 

13:47 - July 15, 2016

కరీంనగర్ : హరితహారం కార్యక్రమంలో అన్ని పార్టీలు భాగస్వామ్యమై మొక్కలు నాటాలని అటవీశాఖ మంత్రి జోగురామన్న కోరారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని కోదండ రామాలయంలో ఆయన మొక్కలు నాటారు. ఇప్పటివరకూ 7 కోట్ల 26 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. మొక్కల పెంపక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని అన్నారు. 

13:45 - July 15, 2016

హైదరాబాద్ : మానవ మనుగడకు చెట్లే ప్రధానమని అందరూ గుర్తించాల్సిన అవసరముందని మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ముషీరాబాద్‌లోని తూనికలు, కొలతల శాఖ కార్యాలయ ఆవరణలో మంత్రి ఈటెల రాజేందర్‌ మొక్కను నాటారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ హాజరయ్యారు. తరిగిపోతున్న చెట్లను కాపాడుకునేందుకు హరితహారం చేపట్టామని చెప్పారు. 

 

తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు

హైదరాబాద్ : సరోజిని కంటి ఆసుపత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటి ఆపరేషన్‌ వికటించి ఏడుగురు రోగులు కంటిచూపు కోల్పోయారు. మీడియా కథనాల ఆధారంగా ఎన్ హెచ్ ఆర్ సీ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాలలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

13:40 - July 15, 2016

హైదరాబాద్ : సరోజిని కంటి ఆసుపత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటి ఆపరేషన్‌ వికటించి ఏడుగురు రోగులు కంటిచూపు కోల్పోయారు. మీడియా కథనాల ఆధారంగా ఎన్ హెచ్ ఆర్ సీ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై రెండు వారాలలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

13:31 - July 15, 2016

వరంగల్‌ : రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు..పనిచేద్దామన్నా కాలురకదపలేని దైన్యం...కన్నీళ్లను తాగుతున్నా..గడవని కాలం. వస్తున్న ఆసరా ఆవిరైంది. బతుకుపై భరోసా కరవైంది. రోజురోజుకూ జీవితం భారమవుతోంది. ఎక్కని గడప లేదు, మొక్కని అధికారి లేడూ..అయినా ఎవరికీ కనికరం లేదు. దీంతో చేసేది ఏమీ లేక ఆ వృద్ధ  దంపతులు..తనువు చాలించానుకున్నారు. ఇందుకోసం సమాధులు సిద్ధం చేసుకున్నారు . ఇంతగా వృద్ధలను బాధపట్టేందుకు కారణమైన పరిస్థితులేంటి....తమ సమాధిని తామే కట్టుకునేంతగా కృంగదీసిన సమస్యలేంటి...వాచ్ దిస్‌ స్టోరి.
ఇద్దరూ వికలాంగులే
బతుకు భారమైనప్పడు...బాధపడటం..మానవ సహజం. ఆ బతుకును వృద్ధాప్యంలో మొయ్యాలంటే మరింత భారమవడం విచారించదగ్గ విషయం. అధికారుల నిర్లక్షంతో...బతుకుపైనే అసహ్యమేసింది ..ఆ వృద్ధ దంపతులకు..అందుకే బతికుండగానే సమాధి నిర్మించుకునేందుకు సిద్ధపడ్డారు.
కూలిపనులు చేసుకునే మల్లయ్య, ఉప్పలమ్మ
2010 నుంచి నిలిచిపోయిన ఫించన్
వరంగల్‌ జిల్లా మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన కొమ్ముమల్లయ్య, ఉప్పలమ్మ దంపతులు. అసలే పేద కుటుంబం. రెక్కాడితేగానీ, డొక్కాడని జీవితాలు వీళ్లవి. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ గ్రామంలో బతుకుతున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చిన్న ఇళ్లు వచ్చింది వీళ్లకి. అప్పటి నుంచే ఫించన్‌ వచ్చేది. ఇద్దరు దంపతులకు వైకల్యం ఉంది. తెంగాణప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యం, ఫించన్‌తో బతుకీడుస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం ఈ వృద్ధదంపతులకు శాపంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం 
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ వృద్ధదంపతులకు జీవనాధారమైన ఫించన్‌ నిలిచిపోయింది. ఉప్పలమ్మకు 2010 నుంచి ఫించన్‌ రావడం లేదు. అంగవైకల్యం ఉన్నా, ఈమె బాగానే ఉందని ఫించన్‌ కు అనర్హురాలుగా అధికారులు నిర్ణయించారు. ఇక మల్లయ్య 2014లో వచ్చిన తన సర్టిఫికేట్‌ను రీఅసైన్‌మెంట్‌ చెయ్యించుకోవాలి. కానీ ఇద్దరికీ ఆరోగ్యం బాగోకపోవడంతో రీఅసైన్‌మెంట్‌ చెయ్యించుకోలేని పరిస్థితి. దీంతో ఇద్దరికీ ఫించన్‌ ను నిలిపివేశారు అధికారులు. 
ఫించన్‌ ఆగిపోవడంతో అవస్థలు
జీవనాధారమైన ఫించన్‌ ఆగిపోవడంతో నానా అవస్థలు పడ్డారు వృద్ధ దంపతులు. అధికారుల చుట్టూ, ప్రభుత్వకార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎవ్వరినడిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జీవితంపై విరక్తి చెంది, బతికుండగానే చనిపోదామనుకున్నారు. గ్రామ శివారులోని పెద్దచెరువు కట్టపక్కన వారం రోజులుగా సమాధిని నిర్మించుకునే పనిలో పడ్డారు. ఏ ఆధారంలేని తమకు సమాధే దిక్కని ఇంత పనికి ఒడిగట్టారు. వృద్ధ దంపతుల దీనగాధను చూసి స్థానికులు చలించిపోయారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వృద్ధుల తరపున డిమాండ్‌ చేస్తున్నారు. 

 

13:19 - July 15, 2016

హైదరాబాద్ : 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌ ద్వారా నగర ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ లో మై జీహెచ్ ఎంసీ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశముందని కేటీఆర్‌ తెలిపారు. అవసరమైన సర్టిఫికెట్లన్నీ ఈ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. నగరంలోని సమస్యలపై ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు. 

 

13:13 - July 15, 2016

కృష్ణా : విజయవాడలో శిశువు మిస్సింగ్ కేసులో ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి కామినేని తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, శిశువు మాయం అవడం బాధాకరమని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 

సీఎం మమతాబెనర్జీకి తప్పిన పెను ప్రమాదం

కోల్ కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎస్కాట్ లోయలో పడింది. అయితే మమతా క్షేమంగా బయటపడ్డారు. 

12:58 - July 15, 2016

విజయవాడ : కృష్ణానదిపై మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. నదిపై నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసింది. రాజధాని ప్రాంతానికి మంచినీటిని అందించేందుకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ఏడాదిలోగా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 
వైకుంఠపురం వద్ద బ్యారేజీ 
విజయవాడ ఏపీ రాజధాని ప్రాంతం కావడంతో అందుకు తగ్గట్టు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతల ప్రాజెక్ట్ కు దిగువన వైకుంఠపురం వద్ద మరో బ్యారేజీ నిర్మాణానికి సన్నద్ధమైంది. మున్నేరు, పాలేరుల వరద నీటిని నిల్వ చేసి రాజధాని అమరావతికి తాగునీటి అవసరాలను తీర్చాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పన చేసే బాధ్యతను 'వ్యాప్కోస్'కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. 
10 టీఎంసీల సామర్థ్యం
రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే మార్గాలను అన్వేషించడానికి 2015లో నిపుణుల కమిటీని నియమించింది. కృష్ణానదిపై వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే రాజధాని తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చునని ఈ కమిటీ సూచించింది. వైకుంఠపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే గుంటూరు జిల్లాతోపాటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోనూ మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీంతో వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ అంగీకరింకపోవచ్చని.. దీనికి ఏపీ ప్రభుత్వం నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. మూడు టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తే ఎలాంటి కట్టల నిర్మాణం లేకుండా నదిలోనే మూడు టీఎంసీలను నిల్వ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. 
వ్యాప్కోస్‌కు నిర్మాణ బాధ్యత
నూతన బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ కు అప్పగించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకు వ్యాప్కోస్ కు రూ.8.50 కోట్లు మంజూరు చేయాలని ఈనెల 12న ప్రభుత్వం సీఆర్డీఏను ఆదేశించినట్టు సమాచారం. బ్యారేజీ నిర్మాణానికి 1,000 చదరపు కిలోమీటర్ల లిడార్ సర్వే చేస్తామని వ్యాప్కోస్ పేర్కొనట్లు సమాచారం. మరోవైపు కేవలం 100 చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేస్తే సరిపోతుందని, రూ.3.50 కోట్లతో డీపీఆర్ రూపొందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
ప్రాజెక్టు వ్యయం రూ. 2000 కోట్లుగా అంచనా
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంత ఖర్చుతో పని లేకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ విద్యార్థులు సుమారు 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు ఖర్చయ్యే విధంగా రోడ్ కమ్ రైల్ బ్యారేజ్ ప్రాజెక్టును తయారుచేసి ప్రభుత్వాధికారులకు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
ఇంజనీరింగ్ విద్యార్థులు పంపిన రోడ్ కమ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు 
బ్యారేజీ నిర్మాణంపై ఇంజనీరింగ్ విద్యార్థులు పంపిన రోడ్ కమ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపి మన విద్యార్థుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని మేధావులు కోరుతున్నారు. 

 

12:41 - July 15, 2016

కృష్ణా : విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన శిశువు కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. విజయవాడ బస్టాండ్‌లో పోలీసులు అనుమానితులను గుర్తించారు. వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. 

 

విచారణకు హాజరుకాని టీవీ నటి శ్రీవాణి

రంగారెడ్డి : పోలీసుల విచారణకు టీవి నటి, యాంకర్ శ్రీవాణి డుమ్మా కొట్టింది. వికారాబాద్ పోలీసుస్టేషన్ లో విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. కానీ శ్రీవాణి హాజరు కాలేదు. షూటింగ్ ఉండడం వల్లే హాజరు కాలేకపోతున్నానని పేర్కొంది. అయితే శ్రీవాణిని రేపు, ఎల్లుండి విచారణకు హాజరుకాకపోతే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. మరో వైపు శ్రీవాణి వదిన అనూష పోలీసుల విచారణకు హాజరయ్యారు. 

12:22 - July 15, 2016

రంగారెడ్డి : పోలీసుల విచారణకు టీవి నటి, యాంకర్ శ్రీవాణి డుమ్మా కొట్టింది. వికారాబాద్ పోలీసుస్టేషన్ లో విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. కానీ శ్రీవాణి హాజరు కాలేదు. షూటింగ్ ఉండడం వల్లే హాజరు కాలేకపోతున్నానని ఆమె పేర్కొంది. అయితే శ్రీవాణి రేపు, ఎల్లుండి విచారణకు హాజరు కాకపోతే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. మరో వైపు శ్రీవాణి వదిన అనూష పోలీసుల విచారణకు హాజరయ్యారు. 

 

12:08 - July 15, 2016

హైదరాబాద్ : హర్షితకు ఆపరేషన్ చేయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఈమేరకు హర్షిత తల్లిండ్రులు మంత్రిని కలిశారు. తమ కూతురుని కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున హర్షితకు ఆపరేషన్ చేయిస్తామన్నారు. ఆపరేషన్ కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీలో సర్జరీలను చేర్చామని పేర్కొన్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కూతురికి ఆపరేషన్ చేయించలేక తల్లిదండ్రులు మెర్సీ కిల్లింగ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చిన్నారికి ఆపరేషన్ చేయించేందుకు టీసర్కార్ ముందుకొచ్చింది. 

 

నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కృష్ణా : నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. విజయవాడలో సాయంత్రం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు

కృష్ణా : ఎపి సీఎం చంద్రబాబు వియవాడ చేరుకున్నారు. రష్యా పర్యటన ముగించుకుని ఈవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి బాబు విజయవాడ బయల్దేరి వెళ్లారు. 

మంత్రి లక్ష్మారెడ్డిని కలిసిన హర్షత పేరెంట్స్...

హైదరాబాద్ : కాలేయ సంబంధి వ్యాధితో బాధపుడుతున్న హర్షిత తల్లిండ్రులు మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు. తమ కూతురు కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్ లో హర్షితకు ఆపరేషన్ చేయిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆపరేషన్ కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని  చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో సర్జరీలను చేర్చామని తెలిపారు.

 

చిన్నారి రమ్య మృతి ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్  : చిన్నారి రమ్య మృతి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో నలుగురు చదువుతున్న కాలేజీలను నోటీసులు జారీ చేశారు. శ్రావిల్ స్నేహితులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పోలీసులు యాజమాన్యానికి సూచించారు.

 

10:46 - July 15, 2016

హైదరాబాద్ : ప్రపంచ క్రీడాకారుల ఉత్సవం ఒలింపిక్స్‌ సందడి మొదలయ్యేందుకు ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. బ్రెజిల్‌లోని రియోలో జరిగే ఈ సంబరాలకు సంబంధించిన కర్టన్‌ రైజర్‌గా ఒక ట్రైలర్‌ విడుదల చేశారు. వినూత్న రీతిలో సాగే ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో వ్యూయర్స్‌ని ఆకట్టుకుంటోంది. నిమిషానికి పైగా ఈ ట్రైలర్‌ పూర్తిగా యానిమేషన్‌ తరహాలో సాగుతుంది. 

10:33 - July 15, 2016

వరంగల్ : సనాతన సంప్రదాయానికి ప్రతీక...జానపదానికి ప్రాణపదమైన సంస్కృతికి అద్దం పట్టే పండుగ...రజాకార్లపై రణం చేసిన చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం...తొలి ఏకాదశిరోజు ప్రతీ యేటా పట్నం గుండెలపై బీరన్న బోనం ఎగురుతుంది.  రజాకార్లపై ఎదురొడ్డి నిలిచిన నాటి నుంచి నేటి వరకు అప్రతిహాతంగా కొనసాగుతున్న ఈ వేడుకపై టెన్ టీవీ స్పెషన్ స్టోరీ..
తొలి ఏకాదశి రోజు బీరన్నకు తొలి బోనం  
వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలతో తొలి ఏకాదశి రోజున వచ్చే తొలి పండుగకు వరగంల్ నగరంలోని కరీమాబాద్, ఉర్సులు ముస్తాబయ్యాయి. బోనాల పండుగను ప్రజలు పెద్ద వేడుకగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. . తొలి ఏకాదశి రోజు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి  వేలాది మంది భక్తులు వచ్చి ఉర్సు, కరీమాబాద్ లో కోలువైన బీరన్న సన్నిధిలో తొలి బోనమెత్తుతారు.  
బోనంతో బీరన్నకు నైవేద్యం
ఉర్సులోని కురుమలకు బీరన్నలు సంకు బియ్యం అందిస్తారు. సుంకు బియ్యం  అంటే పసుపు కలిపిన బియ్యాన్ని దంచుతారు. అలా దంచిన బియ్యాన్ని ప్రతీ ఒక్కరు బోనంతో కలిపి నైవేద్యం తయారు చేస్తారు. జానపద సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ వేడుకల్లో 25 మంది కామరాతి, బీరన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒళ్లంతా బండారి పూసుకొని తల్వార్ లాంటి కటారీలతో బలిరో భలి అంటు ఆశేష జనంలోకి పరుగులు పెడుతూ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తారు. డోలు విన్యాసాలు హైలెట్ గా నిలుస్తాయి. వందలాది బోనాలు, గండదీపాలతో నగరంలోని చౌరస్తాలోకి రాగానే బీరన్నల బృందం ఒక్కసారిగా బోనాల సమూహాన్ని చుట్టు ముడుతుంది. దారిపొడవునా గ్రహాలు శాంతించేందుకు గొర్రెపిలల్ను గావు పట్టడం నగరంలోని ప్రజల ఆచారం. అలా చేసిన తర్వాత గొర్రె పిల్లను దాటితే అష్టఐశ్వర్యాలు ఒనగూరుతాయనేది భక్తుల నమ్మకం. 
ప్రచారంలో ఉన్న బీరన్న కథ
పరమశివుడి వరంతో వీరభద్రుడు సూరమ్మ గర్భంలో బీరన్నగా జన్మించాడని కురుమల నమ్మకం. బీరన్న పుట్టుకతో మేనమామ అయిన నారదుడికి కీడు జరుగుతుందన్న కథ ప్రచారంలో ఉంది.. 
బీరన్న బోనాలపై రాజకార్ల దారుణాలు 
వందల ఏళ్ల చరిత్ర ఉన్న బీరన్న బోనాలను చెదరగొట్టాలని రజాకార్లు బోనాల మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. రజాకార్ల ఆగడాలు శ్రుతిమించడంతో  ప్రజలు రజాకార్లపై తిరగబడ్డారు.  ప్రజల ఆగ్రహాన్ని భరించలేని రజాకార్లు తోక ముడిచి పారిపోయారు. అప్పటి నుంచి వారిపై సాధించిన విజయానికి ప్రతీకగా  కరీమాబాద్ వాసులు జాతీయ జెండాను,  ఉర్సు వాసులు ఆర్యసమాజ్‌ జెండాను పురవీధుల్లో ఊరేగిస్తారు.

 

10:25 - July 15, 2016

హైదరాబాద్ : యశోధ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతున్న రెండేళ్ల మహసేన్‌ దత్తకు ఆపరేషన్ నిర్వహించారు. తన కొడుకుకు కాలేయాన్ని దానం చేసి మాతృత్వాన్ని చాటుకుంది కన్నతల్లి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మనోహర్, మానస దంపతుల కుమారుడు మహసేన్‌ దత్త. తమ కుమారుడు తరచూ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం సికింద్రబాద్‌లోని యశోధ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడుకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయంలో కాన్సర్‌ చివరి దశలో ఉన్నట్లు నిర్ధారించడంతో ఆపరేషన్ చేశారు. డాక్టర్‌ బాలచంద్రమీనన్ బృందం కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. 

 

10:15 - July 15, 2016

శ్రీకాకుళం : జిల్లాలో భారీ బెట్టింగ్ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంలోని కోటివీధిలో  నివాసం ఉంటున్న కిరణ్, రవికాంత్ లను పోలీసులు ప్లానింగ్‌ ప్రకారం పట్టుకున్నారు. పది రోజుల క్రితం ఇదే తరహాలో పట్టుబడ్డ క్రికెట్ బెట్టింగ్ ముఠా ద్వారా రాబట్టిన సమాచారం మేరకు వీరిద్దరిని అరెస్టు చేశారు. సుమారు 30 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్లు వీరి దగ్గర  బయటపడ్డాయి. వీరి వద్ద నుంచి లక్ష 88 వేల రూపాయల నగదు, ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది తులాల బంగారం తో పాటు మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి భార్గవనాయుడు తెలిపారు. 

 

ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి

కరీంనగర్ : ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయపట్నం వద్ద గోదావరిపై పురాతన వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. పోలీసులు భారీ వాహనాలను వంతెనపై నంచి అనుమతించడం లేదు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్నందున వంతెన ప్రమాదకరంగా మారింది. 

08:53 - July 15, 2016

ప్రస్తుత డిజైన్ లో 'మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం అవసరం లేదని... డిజైన్ ను మార్చాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో  టీడీపీ నేత విద్యాసాగర్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీఆర్ ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రస్తుత డిజైన్ ప్రకారం.. 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయని తెలిపారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా 123 జీవో ను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. 2013 చట్టాన్ని అమలు చేయాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:47 - July 15, 2016

ప్యారిస్ : ఫ్రాన్స్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. నైస్‌ నగరంలో జరుగుతున్న బాస్టిల్‌ డే సంబరాల్లో ప్రజల మధ్యలోకి ఓ ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 77 మంది మృతి చెందారు. మరో వందమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రాంతంలో ఎక్కడా చూసిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్‌ మృతి చెందినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. జనంపైకి దూసుకొచ్చిన ట్రక్కులో మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఇంతవరకు దాడికి పాల్పడినట్లు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మరోవైపు ఈ ఘటనపై నీస్‌ మేయర్‌ క్రిస్టయన్‌ ఎస్టీరోస్‌ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఖండించారు.  

 

 

08:41 - July 15, 2016

కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాంతో పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. ఉత్తరాంధ్రలోని కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. విద్యావంతులు, మేధావులు, నిర్వాసితులు, ప్రజలు అంతా ఏకమవుతున్నారు. వీరంతా ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?  కొవ్వాడలో నెలకొల్పబోయే అణు విద్యుత్ కేంద్రం వల్ల జరిగే నష్టాలేమిటి? అణు విద్యుత్ కు  ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రత్యామ్నాయాలేమిటి? ఇలాంటి అంశాలపై నర్సింగరావు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:33 - July 15, 2016

ఉత్తరాంధ్రలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం అభివృద్ధికి చిహ్నమా? శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రంలో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అవసరాలు తీర్చడం కాదా? ఇలాంటి అంశాల గురించి సీరియస్ గానే చర్చించాల్సిన  సందర్భమొచ్చింది. 
కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం
శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం పెడుతున్నారన్న వార్తతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సదస్సులు, సెమినార్ లు, ర్యాలీలు, నిరాహార దీక్షలు ఇలా విభిన్న రూపాల్లో ఈ ఉద్యమం సాగుతోంది.  వివిధ అభివ్రుద్ధి ప్రాజెక్ట్ ల కోసం ప్రభుత్వాలు భూ సేకరణకు శ్రీకారం చుట్టినప్పుడు భూములు కోల్పోతున్నవారు తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలంటూ ఆందోళనకు దిగడం, ప్రభుత్వాలు వాటిని బలప్రయోగంతో అణచివేయడమో, లేదంటో నిర్వాసితుల డిమాండ్స్ ను అంగీకరించడమో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ.  కొన్ని ఉద్యమాలు సంపూర్ణ విజయాలు, మరికొన్ని పాక్షిక విజయాలు సాధిస్తుంటే, ఇంకొన్ని విఫలమవుతున్నాయి.  ఒక ఉద్యమం విఫలమైనంత మాత్రాన ప్రజామద్దతు లేదని భావించలేం.
లాభాల కంటే నష్టాలే ఎక్కువ 
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కేవలం కొద్దిమంది నిర్వాసితుల సమస్య మాత్రమే కాదు. భూములు కోల్పోతున్నవారికి మెరుగైన ప్యాకేజీలతో చేతులు దులుపుకునే వ్యవహారమూ కాదు. వీటి ప్రభావాలు చాలా విస్తృతమైనవి. అణు విద్యుత్ కేంద్రాల వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ అన్నది ప్రపంచదేశాల అనుభవం. ఒకప్పుడు అణు విద్యుత్ కేంద్రాలను  స్థాపించిన అమెరికా, రష్యా, జపాన్ లాంటి సంపన్న దేశాలు కూడా ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు. అణు కుంపట్లను గుండెల మీద పెట్టుకోవడం కంటే, వాటిని మూసివేయడమే బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నాయి. రష్యాలోని చర్నోబిల్, జపాన్ లోని ఫుకుషిమా ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు అణు విద్యుత్ కేంద్రాల పట్ల విముఖతను పెంచుతున్నాయి. 
అణు విద్యుత్ కేంద్రాలపై ప్రభుత్వాలు మోజు
దురదృష్టవశాత్తు మన దేశంలోని ప్రభుత్వాలు అణు విద్యుత్ కేంద్రాల మీద మోజుపడుతున్నాయి. ఎన్టీఆర్ హయాంలో నాగార్జునసాగర్ సమీపంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.  మన్మోహన్ సింగ్ ప్రధానిగా, నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో మితివిర్దిలో అణు కేంద్రం ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని గుజరాత్ లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అదే అణు విద్యుత్ కేంద్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. 
ఎపికి విద్యుత్ సమస్య లేదు.. 
ఆంధ్రప్రదేశ్ కి విద్యుత్ సమస్యలేదు. పెరుగుతున్న డిమాండ్ ను తీర్చగలిగే స్థాయిలో వనరులున్నాయి.  నీరు, గాలి, సూర్యరశ్మి, గ్యాస్, చివరకు చెత్త ఇవన్నీ విద్యుత్ ఉత్పత్తికి ఉపకరించేవే. క్రిష్ణా గోదావరి బేసిన్ లో అపార గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఇన్ని సహజ వనరులున్న ఆంధ్రప్రదేశ్ అణు విద్యుత్ కేంద్రాల కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రశ్న.  కెజి బేసిన్ గ్యాస్ ను గుజరాత్ కు తరలించి, తమ నెత్తిన అణుకుంపట్లు ఎందుకు పెడుతున్నారంటూ ఉత్తరాంధ్ర వేస్తున్న ప్రశ్నకు ప్రభుత్వాలు నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి.  
న్యూక్లియర్ రియాక్టర్లు.. విద్యుత్ ఉత్పిత్తి..ఖర్చు 14 రూపాయలు  
న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికయ్యే ఖర్చు 14 రూపాయలు. ఏపిలో వున్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రెండు నుంచి అయిదు రూపాయలతోనే ఆపని పూర్తిచేయొచ్చు. ఇంత తక్కువ ఖర్చుతో ఉత్పత్తి మార్గాలుండగా, అంత కాస్ట్ పెట్టడం అభివృద్ధికి చిహ్నంగా భావిద్దామా? ఆ మాటకొస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఇప్పుడు ఏ దేశమూ అభివృద్ధికి చిహ్నంగా భావించడం లేదు. గుండెల మీద కుంపటిగా భయపడుతున్నాయి. ఎందుకే అణు విద్యుత్ కేంద్రం పెట్టాలన్న ప్రతిపాదన వచ్చినా, అక్కడ ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. తమ ప్రాంతంలో వద్దంటే వద్దంటూ తరిమి   తరిమి కొడుతున్నాయి.  ఇప్పుడు ఉత్తరాంధ్రలోనూ ఇలాంటి ఉద్యమమే సాగుతోంది.
విధ్వంసాలకు బాటలు వేయకూడదు... 
ఏ ప్రభుత్వమైనా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు విధ్వంసాలకు బాటలు వేయకూడదు. ప్రమాదాలను నెత్తి మీదకు తీసుకురాకూడదు. అణు విద్యుత్ కేంద్రం ప్రభావం ఇటు రాజమండ్రి దాకా, అటు పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ దాకా వుంటుందంటూ పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నరు. అణు రియాక్టర్ల ద్వారా విద్యుత్ తో పాటు రేడియేషన్, వ్యర్థాలు కూడా విడుదలవుతాయి. గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తే అంతదూరం వాటి విషమ ఫలితాలుంటాయి. ప్రజలు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, విషతుల్యం కాని ఆహారం కోరుకుంటున్నారు.  కొన్ని వందల జనావాసాలకు, కొన్ని లక్షల మంది ప్రజలకు వీటన్నింటినీ  దూరం చేసే అణు విద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చిహ్నాలుగా భావిద్దామా?

 

08:23 - July 15, 2016

కృష్ణా : జిల్లాలో భార్యకు శీలపరీక్ష పెట్టాడో దుర్మార్గపు భర్త... అతి దారుణమైన ఈ పరీక్షకు ఏమాత్రం మానవత్వంలేని గ్రామ పెద్దలూ అంగీకరించారు.. అగ్నిపరీక్షకు బాధితురాలు కూడా సిద్ధమైపోయింది.. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. భర్తతోపాటు గ్రామ పెద్దలనూ అదుపులోకి తీసుకున్నారు.. 
శీలపరీక్ష పెట్టాలని పెద్దలకు విజ్ఞప్తి
సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లులో శీలపరీక్ష ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ గ్రామంలో నివసించే బాలకృష్ణ తన భార్యను తరచూ అనుమానించేవాడు.... దీనికితోడు ఆటోలో ఆమె పక్కన మరో వ్యక్తి కూర్చోవడంతో అనుమానం మరింత పెరిగింది. ఇంత జరిగాక ఇక తన భార్యను ఏలుకోవడం కష్టమంటూ భర్త గ్రామ పెద్దలముందు పంచాయితీ పెట్టాడు.... శీలపరీక్ష పెట్టి అందులో నెగ్గితేనే ఆమెను అర్థాంగిగా స్వీకరిస్తానని తేల్చిచెప్పారు.. పెద్దలుకూడా బాలకృష్ణకే మద్దతు పలికారు.. 
నిప్పుల్లో కాల్చిన కడ్డీని భార్య తన చేతితో పట్టుకోవాలని తీర్పు
శీలపరీక్షకోసం గ్రామ పెద్దలు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. నిప్పుల్లో కాల్చిన కడ్డీని ఆ భార్య పట్టుకోవాలని తీర్పు చెప్పారు. కడ్డీ కాలకుండా.... చేతులపై బొబ్బలు రాకుండా ఉంటేనే ఆమె పవిత్రురాలని తేల్చారు.. అలాకాకుండా బాధితురాలి చేతి కాలినా... బొబ్బలు వచ్చినా ఆమె శీలవతి కాదన్నారు.. దీనికి ఆ భర్తకూడా అంగీకరించాడు. 
భర్త అనుమానం, పదే పదే వేధింపులు
ఓవైపు భర్త అనుమానం... పదే పదే వేధింపులు... ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం నమ్మని భర్త.... దీనికితోడు గ్రామ పెద్దల తీర్పు.... నాలుగు గోడలమధ్య జరిగిన గొడవకాస్తా నలుగురిలోకి వచ్చేసింది.. ఈ అవమానాలన్నీ పోవాలంటే ఈ పరీక్షను ఎదుర్కోవడమే పరిష్కారమని ఈ అభినవ సీతకూడా ఆలోచించింది.. తాను తప్పు చేయలేదని నిరూపించాలంటే కడ్డీ ముట్టుకోవడంతప్ప వేరే మార్గంలేదని భావించింది...... ఈ పరీక్షకు తాను సిద్ధమేనని అంగీకారం తెలిపింది.. ఇక వెంటనే పెద్దలు అన్నీ సిద్ధం చేశారు.... అయితే కాయకష్టం చేసుకొని బతికే ఆమె చేతికి అంతకుముందే కొన్ని గాయాలున్నాయి.. కడ్డీ ముట్టుకున్న తర్వాత ఇవి బొబ్బలుగా భావించే అవకాశముందని పెద్దలు ముందే అన్నింటినీ మార్క్ చేశారు.. కొత్తగా వచ్చే బొబ్బల్నే గుర్తించేలా ప్లాన్ చేశారు.. 
కడ్డీ ముట్టుకునేందుకు సిద్ధమైన బాధితురాలు
పెద్దల తీర్పు అమలుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.. అంతా ఒకే అనుకున్నాక బాధితురాలు కడ్డీ ముట్టుకునేందుకు అక్కడికి వచ్చేసింది.. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు...... మూఢనమ్మకంతో ఓ అమాయకురాలిని నరకయాతనకు గురిచేసే తీర్పు చెప్పినందుకు గ్రామ పెద్దల్ని... దీనికి సహకారం అందించిన.. భర్తనూ అదుపులోకి తీసుకున్నారు. కాల్చిన కడ్డీని ముట్టుకుంటే ఎవ్వరికైనా చేతి కాలుతుందని ఎవ్వరు చెప్పినా ఈ గ్రామస్తులు నమ్మడంలేదు. తర తరాలనుంచి ఈ శీల పరీక్ష కొనసాగుతోందని చెబుతున్నారు.. వీటిపై స్పందించిన పోలీసులు నిందితులకు కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

 

08:15 - July 15, 2016

గ్లామరస్ పాత్రతో సూపర్, టెండ్రీ మూవీ, లేడి ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి, రుద్రమదేవి లాంటి హిస్టారికల్ చిత్రంలో నటించిన అనుష్క తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'భాగమతి'లో నటించనుంది. ఈ చిత్రంలో అనుష్క పోలీసు గెటప్ లో కనిపించనుంది. పోలీసు పాత్రలో అనుష్క నటించడం ఇదే మొదటిసారి. అయితే 'కర్తవ్యం'లో విజయశాంతి పోషించిన పాత్ర లాగే.... 'భాగమతి' చిత్రంలో అనుష్క పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అనుష్క సూపర్ లో గ్లామరస్ డాల్ గా నటించి అందరిని ఆకట్టుకుంది. అరుంధతిలో తన నటనతో అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. ఈ సినిమాతో అనుష్కకు జేజమ్మ అనే పేరు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'రుద్రమదేవి'లో రాణి రుద్రమదేవిగా అనుష్క నటించి ధీరత్వాన్ని ప్రదర్శించింది. ఈ చిత్రం కూడా అందరీ మన్ననలు పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వస్తున్న భాగమతితో పోలీసు పాత్రలకు అనుష్క కేరాఫ్ అడ్రస్ గా మారనుందా..? పోలీసు పాత్రలో నటించి  మెప్పించనుందా..? కర్తవ్యంలో విజయశాంతి పోలీసు పాత్రలో నటించి అందరిని మెప్పించింన విషయం తెలిసిందే. పోలీసు  పాత్రలో నటించనున్న అనుష్క... విజయశాంతిని మరిపించనుందా...?.. అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే మరి. 

 

 

07:58 - July 15, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం కృష్ణ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది...భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు, భద్రతపూ ప్రత్యేక దృష్టి పెట్టింది. పుష్కర ఘాట్ల నిర్మాణం, రోడ్లు వంటి పనులను చేపట్టినా, వీటిలో పురోగతిలేదన్న విమర్శలు వినవస్తున్నాయి.   పుష్కరాల సమయానికి పనులు పూర్తవుతాయా లేదా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది...మహబూనగర్ జిల్లాలో నత్తనడకన సాగుతున్న పుష్కర ఏర్పాట్లపై టెన్ టీవీ ప్రత్యేక కథనం 
వచ్చె నెల 12 నుంచి కృష్ణ పుష్కరాలు
కృష్టా పుష్కరాలు వచ్చే నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి...ఇందు కోసం మహబూబ్ నగర్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లను మొదలు పెట్టారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా కృష్ణానది పరివాహాక ప్రాంతం ఉంది. పాలమూరు జిల్లాలోని దాదాపు 200 కిలో మీటర్లకు పైగా కృష్టా నది ప్రవహిస్తుంది..  12 రోజుల పాటు సాగే కృష్ణానది పుష్కరాలకు తెలంగాణలోని ఆరు జిల్లాలతో పాటు, ఆంధ్రపదేశ్ లో కర్నూలు , కడప, అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, రాయిచూర్, హుబ్లీ,దార్వాడ, ఉడిపి, మంగళూరు తదితర ప్రాంతాల నుంచి పాలమూరు జిల్లాకు పెద్ద ఎత్తున పుష్కర యాత్రికులు  తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
52 ఘాట్లు.. రూ. 270 కోట్లు మంజూరు   
2004 లో జరిగిన కృష్ణపుష్కరాలకు 16 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయగా దాదాపు 2 కోట్ల మంది  స్నానాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి దాదాపు ఆరు కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.  అధికారులు అందుకు తగ్గట్టుగా ఈ సారి 52 ఘాట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 32 ప్రధాన ఘాట్లు కాగా మిగిలిన 20 లోకల్ ఘాట్లుగా గుర్తించారు. దాదాపు 2 వేల 815 పనుల కోసం జిల్లాకు 270 కోట్ల నిధులు ముంజూయ్యాయి..పుష్కరాలకు కేవలం ఇంకా 26 రోజుల సమయం  మాత్రం మిగిలి ఉంది. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి...దీంతో కృష్ణా పుష్కర పనులపై జిల్లా కలెక్టరు శ్రీదేవి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. 
భద్రత కోసం పోలీస్ శాఖ ప్రణాళిక  
పాలమూరు జిల్లాలో ఇటిక్యాల మండలం బీచుపల్లి, అమ్రాబాద్ మండలం లింగాలఘాట్, పాతళగంగ, మక్తల్  మండలం పస్పుల, పంచదేవ్ పాడు, పెబ్బేరు మండలం రంగాపూర్, కొల్లాపూర్ మండలం సోమశిలతోపాటు జటప్రోలు, జూరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించారు...దీంతో అక్కడ అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా సౌకర్యాల కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు కూడా సమాయత్తమవుతున్నాయి..భద్రత ఏర్పాట్ల కోసం సుమరారు 9 వేల మంది సిబ్బందిని ఉపయోగించేందుకు పోలీసు శాఖ సిద్దమవుతుంది..ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్‌ కోసం  రైతుల నుంచి వ్యవసాయ వ్యవసాయ భూములను లీజుకు తీసుకొన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, చిన్న పిల్లల కోసం షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణాపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హుడావుడి పుష్కర పనులు చేస్తుండటంతో నాణ్యత పోలిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిన్నింటిపై ప్రభుత్వం దృష్టి సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

07:50 - July 15, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ఐదు రోజుల రష్యా పర్యటన ముగిసింది. అక్కడ కీలకమైన ఇన్నోపామ్‌ ప్రదర్శనలో ప్రసంగించడంతో పాటు.. రాష్ట్రానికి కీలక మెరైన్‌ యూనివర్శిటీ, అమరావతి నిర్మాణంలో రష్యా సహకారం తదితర ఒప్పందాలను చంద్రబాబు కుదుర్చుకున్నారు. 
వివిధ సంస్థలతో పలు ఎంఓయూలు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రష్యా పర్యటన ముగిసింది. అక్కడి వివిధ సంస్థలతో చంద్రబాబు బృందం.. పలు ఎంఓయూలు కుదుర్చుకుంది. సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో  మెరైన్‌ యూనిర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం.. చంద్రబాబు రష్యా పర్యటనలో కీలకమైనదిగా భావిస్తున్నారు. మారిటైమ్‌ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా.. నౌకా నిర్మాణ పరిశ్రమలో నిరంతర మార్పులకు అనుగుణంగా వివిధ కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంలో ఈ వర్సిటీ కీలక భూమిక పోషిస్తుంది. ప్రస్తుతం మారిటైమ్‌ వర్సిటీలోని విద్యార్థుల్లో 60 శాతం మంది నావికారంగంలోని ఉద్యోగాలు పొందుతున్నారు. 
ఇన్నోప్రామ్ 2016 లో ప్రసంగించిన బాబు 
పర్యటనలో భాగంగా చంద్రబాబు.. రష్యాలో కీలకమైన ఇన్నోపామ్‌-2016 వేదికపై చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు భారత్‌ నుంచి మరో ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరైనా.. చంద్రబాబు సెంటర్‌ పాయింట్‌గా నిలిచారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు రష్యాకు చెందిన పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. రష్యాలో పారిశ్రామిక రాజధానిగా భావించే చెలబిన్స్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ బోరిస్‌ను చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా.. అమరావతికి ఐటీ సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు ఒప్పందం కుదిరింది. దీని కార్యాచరణకు.. ఇరు ప్రాంతాలు కలిసి ఐదేసి మంది సభ్యులతో వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. 
ఒలెగ్‌ బోచరోవ్‌తో చంద్రబాబు భేటీ 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలకు సహకరించాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి మాస్కో నగరపాలక సంస్థ అంగీకారం తెలిపింది. నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విధాన విభాగాధిపతి ఒలెగ్‌ బోచరోవ్‌తో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈమేరకు అంగీకారం కుదిరింది. స్మార్ట్‌ నగరాల నిర్మాణాల్లో పెట్టుబడుల కోసం 25 బిలియన్‌ యూరోల బడ్జెట్‌ను కేటాయించుకున్నామన్న బోచరోవ్‌.. ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. 
యాంట్ సెంటర్‌తో బాబు భేటీ
చంద్రబాబు రష్యా పర్యటనలో గాజ్‌ ప్రోమ్ బ్యాంక్ ఫస్టు వైస్ ప్రెసిడెంట్  యాంట్ సెంటర్‌తోనూ భేటీ అయ్యారు. భారత్ మార్కెట్ లో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతోన్న గాజ్‌ప్రోమ్‌.. ఏపీలో తమకు భారీ పారిశ్రామిక యంత్ర సామగ్రి అవసరం ఉందని తెలిపింది. ఆ మేరకు అన్ని సదుపాయాలూ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీకి తరలి వచ్చే పెట్టుబడిదారులకు.. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలను చంద్రబాబు రష్యా పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మోడీ అధ్యక్షతన జరుగనున్న అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 

నేడు హైదరాబాద్ లో కేంద్రమంత్రి రాధామోషన్ సింగ్ పర్యటన

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ లో కేంద్రమంత్రి రాధామోషన్ సింగ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 69,197 మంది భక్తులు దర్శించుకున్నారు. 

రమ్య కేసులో నిందితుడు శ్రావెల్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

హైదరాబాద్ : చిన్నారి రమ్య ప్రమాదం కేసులో నిందితుడు శ్రావెల్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరుగనుంది.

 

 

ఫ్రాన్స్ లో విషాదం.. 80కి చేరిన మృతుల సంఖ్య

ప్యారిస్ : ఫ్రాన్స్ లో బాస్టిల్ డే సంబరాల్లో నెలకొన్న విషాదం ఘటనలో మృతులు సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 75 నుంచి 80 కి పెరిగింది. నైస్ నగరంలో ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్రక్కులో ఉన్న వ్యక్తులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల దాడిలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. 

07:27 - July 15, 2016

కృష్ణా : గోదావరమ్మ.. కృష్ణాలో కలిసేందుకు పరుగులు పెడుతోంది. ఈ రెండు నదులు అనుసంధానంలో భాగంగా పట్టిసీమ నుంచి విడుదల చేసిన నీరు కృష్ణాలో కలిసేందుకు చేరువ అవుతోంది. ఇవాళ విజయవాడ సమీపంలోని  ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా, గోదావరి సంగంలో కలిసే సయమంలో పెద్ద ఎత్తును పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  
పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి జలాలు 
గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదికి మళ్లించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పోలవరం కుడి కాల్వ ద్వారా ప్రథమంగా 1400 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ఈ నీరు పశ్చిమగోదావరి జిల్లా జానంపేట అక్విడక్టుకు చేరుకున్నప్పుడు ప్రజలు పూజులు నిర్వహించి గోదారమ్మకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, సాగు నీటిసంఘాల  ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు వేద మంత్రాల మధ్య గోదావరి జలాలకు పూజలు చేశారు. పట్టిసీమ ఎత్తపోతల గురించి విమర్శలు చేసిన వైసీపీ నేతలపై చింతమనేని మండిపడ్డారు. 
ఈసీజన్‌లో 8,500 క్యూసెక్కుల నీరు తరలింపు 
పట్టిసీమ ఎత్తపోతల పథకం నుంచి నాలుగు మోటార్లు ద్వారా పంపింగ్‌ చేస్తున్న నీరు శుక్రవాయం సాయంత్రానికి కృష్ణానదికి చేరుకునే అవకాశం ఉంది. పోలవరం కుడి కాల్వ పరిధిలో నిర్మించిన అక్విడక్ట్‌లు, మట్టికట్టలు ప్రస్తుత  నీటి ప్రవాహానికి ఏ విధంగా తట్టుకుంటాయో పరిశీలిస్తున్నారు. ఈ సీజన్‌లో పట్టిసీమ నుంచి 8,500 క్యూసెక్కులు నీరు విదుడల చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ దిశగా చర్యలు గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు చేపట్టారు. 
కృష్ణా జిల్లాలో 2.45 లక్షల హెక్టార్లకు సాగునీరు 
కృష్ణానదిలో తగినంత నీరు లేకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో నారుమళ్లు సైతం ఇంకా ప్రారంభం కాలేదు. పట్టిసీమ ద్వారా సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతనెలలోనే రైతులకు భరోసా ఇచ్చారు. దీంతో  అన్నదాతలు గోదావరి పరవళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే గోదావరి నీరు కృష్ణానదిలోకి చేరితో కృష్ణా జిల్లాలో 2.45 లక్షల హెక్టార్లకు సాగునీరు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రైతులు కూడా సాగుకు సమాయత్తమవుతున్నారు. 

 

07:21 - July 15, 2016

విజయవాడ : దాదాపు పదేళ్ల తర్వాత జరగనున్న అంతరాష్ట్ర మండలి సమావేశంలో తనదైన ముద్ర వేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సంస్కరణల అమలులో ముందుండే చంద్రబాబు సర్కార్‌..  ఈ నెల 16న ఢిల్లీలో జరగనున్న సమావేశం వేదికగా రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇవ్వనుంది. 
పదేళ్ల విరామం తర్వాత అంతరాష్ట్ర మండలి భేటీ
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 16న అంతరాష్ట్ర మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మార్క్‌ను చూపించడానికి కసరత్తు చేస్తున్నారు.  ఫైబర్ గ్రిడ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్, ఎల్ఈడీ బల్బులు, నదుల అనుసంధానం, ల్యాండ్ పూలింగ్ విధానాలను నీతి ఆయోగ్‌కు పంపారు. ఒక్కో రాష్ట్రం గరిష్టంగా మూడు విధానాల పైన మాత్రమే ప్రజంటేషన్ ఇవ్వాలి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని మూడు విధానాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయనుంది. 
భూసమీకరణ సమస్యలు 
దేశంలో అనేక చోట్ల భూసమీకరణ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా రైతుల దగ్గర నుంచి 33వేల ఎకరాలను సమీకరించడం అన్ని రాష్ట్రాలను ఆకర్షింపజేసింది. దీంతో ల్యాండ్‌ పూలింగ్‌పై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై  ప్రజంటేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

 

07:14 - July 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళా సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం హస్తినలో జరిగే అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్... పలువురు కేంద్ర మంత్రులో భేటీ అయ్యే అవకాశం ఉంది. 
ఈనెల 16న ఢిల్లీలో అంతరాష్ట్ర మండలి భేటీ 
రెండు నెలల విరామం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే 11వ అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, న్యాయవాదులు, న్యాయాధికారుల ఆందోళన, మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల ఉద్యమం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. 
అంతర్గత భద్రత, ఆధార్‌ ప్రగతి, నగదు బదిలీ 
అంతరాష్ట్ర మండలి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలతోపాటు అంతర్గత భద్రత, ఆధార్‌ ప్రగతి, నగదు బదిలీ తదితర అంశాలపై సమీక్షిస్తారు. అలాగే విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా చర్చిస్తారు. ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక  చట్టం అమలుపై సమీక్షిస్తారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్‌ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ 
మరోవైపు మంత్రి కేటీఆర్‌ కూడా ఈనెల 19న ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర జౌళి  శాఖ మంత్రి స్మృతీ ఇరానీలో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చిస్తారు. అలాగే హడ్కో, నీతి ఆయోగ్‌ అధికారులను కూడా కులసుకునే అవకాశం ఉంది. 

 

06:52 - July 15, 2016

ప్యారిస్ : ఫ్రాన్స్ లో బాస్టిల్ డే సంబరాల్లో విషాదం నెలకొంది. నైస్ నగరంలో ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 60 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్రక్కులో ఉన్న వ్యక్తులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల దాడిలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. 

 

06:49 - July 15, 2016

హైదరాబాద్ : బేగంపేట పీఎస్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 బైకులు, ఆటో ను సీజ్ చేశారు. 17 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నేడు జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటన

మెదక్ : నేడు జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. ఇబ్రహీంపూర్ లో జరిగే హరితహారంలో గవర్నర్ పాల్గొననున్నారు. 

 

సింథియా కూతురి కేసులో నేడు విచారణ

రంగారెడ్డి : సింథియా కూతురు కేసులో నేడు రాజేంద్రనగర్ కోర్టులో విచారణ జరుగనుంది. సింథియా కూతురిని తమకు  అప్పగించాలని చిన్నారి నానమ్మ, తాత కోరుతున్నారు. 

బేగంపేట పీఎస్ పరిధిలో కార్డెన్ సర్చ్

హైదరాబాద్ : బేగంపేట పీఎస్ పరిధిలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 30 బైకులు, ఆటో ను సీజ్ చేశారు. 17 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఫ్రాన్స్ లో బాస్టిల్ డే సంబరాల్లో విషాదం

ప్యారిస్ : ఫ్రాన్స్ లో బాస్టిల్ డే సంబరాల్లో విషాదం నెలకొంది.  నీస్ నగరంలో ప్రజలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 75 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. ట్రక్కులో ఉన్న వ్యక్తులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల దాడిలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. 

Don't Miss