Activities calendar

16 July 2016

22:02 - July 16, 2016

అరుణాచల్ ప్రదేశ్ : ఫ్లోర్‌ టెస్ట్‌ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్ తుకీ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరుకున్నారు. నిన్నటి వరకు అసమ్మతి నేతగా కొనసాగిన పెమ ఖండూ కొత్త సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కొత్తగా ఎన్నికైన పెమా ఖండూ నేతృత్వంలోని 44 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పెమా ఖండూ గవర్నర్‌కు తెలిపారు. పెమా ఖండూ మాజీ ముఖ్యమంత్రి డోర్గి ఖండు కుమారుడు. అసెంబ్లీలో ఇవాళ జరగాల్సిన బలపరీక్ష వాయిదా పడింది. 

22:00 - July 16, 2016

రంగారెడ్డి : ప్రాజెక్టులు, కంపెనీల రాకతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకోసం సీపీఎం ఉద్యమిస్తూనే ఉంది.... తాజాగా ముచ్చర్ల ఫార్మా నిర్వాసితులకోసం పాదయాత్ర చేపట్టింది.... ఈ యాత్రను కందుకూరు మండలం ముచ్చెర్లలో జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రారంభించారు.. యాత్రలోభాగంగా సాయిరెడ్డిగూడెం, ఊట్లపల్లి, మీర్‌ఖాన్‌పేట, బేగరి కంచె గ్రామాల్లో పార్టీ కార్యదర్శి తమ్మినేనితోపాటు.... బృందం సభ్యులు పర్యటించారు.. నిర్వాసితుల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేశారు..

చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి : తమ్మినేని
ముచ్చెర్ల ఫార్మా నిర్వాసితులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని డిమాండ్ చేశారు.. బలవంతంగా భూములు లాక్కోవద్దని... గ్రామస్తులను ఒప్పించి సేకరించాలని సూచించారు. ఫార్మాసిటీ నిర్వాసితులకు మద్దతుగా సీపీఎం రెండురోజుల పాదయాత్ర ప్రారంభమైంది. 
ఫార్మా సిటీ పేరుతో లాక్కుంటున్న భూములు: చంద్రకుమార్
ఫార్మా సిటీ పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు.. ఎవరి ప్రయోజనాలకోసం భూములు సేకరిస్తున్నారని... ప్రశ్నించారు.. ఇప్పటివరకూ ఎంత భూమి సేకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు..

సిటీ పరిధిలో 13వేల ఎకరాల సేకరణ..
ఫార్మా సిటీ పరిధిలో దాదాపు 13వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ రేటు ఎకరాకు ఏడు లక్షలుగా ఉంది.. భూసేకరణ చట్టం అమలుచేస్తే ఎకరాకు సుమారు 22లక్షల రూపాయలు పరిహారంగా వస్తుందని తమ్మినేని అన్నారు.. ముచ్చర్ల ఫార్మా నిర్వాసితులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు....

సీపీఎం పాదయాత్రకు భారీ స్పందన..
సీపీఎం పాదయాత్రకు గ్రామస్తులనుంచి భారీ స్పందన వచ్చింది.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.. ఆదివారం కూడా ఈ యాత్ర కొనసాగనుంది.. 

21:54 - July 16, 2016

శ్రీకాకుళం : అణువిద్యుత్‌ కేంద్రాలు ప్రజల ప్రాణాలకే ముప్పని తెలిసినా..మోదీ ప్రభుత్వం మాత్రం వాటిని ప్రోత్సహిస్తోందని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్ అన్నారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించే ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలో అణువిద్యుత్‌ కేంద్రాలకు వ్యతిరేకంగా సీపీఎం పోరాడుతుందన్నారు. గుజరాత్‌లో అణువిద్యుత్‌ కేంద్రాన్ని వద్దన్న మోదీ.. దాన్ని ఏపీలో పెట్టేందుకు ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఇవాళ ప్రపంచదేశాలన్నీ అణువిద్యుత్‌ కేంద్రాలను రద్దు చేస్తుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం అమెరికాకు మడుగులు ఒత్తుతోందని విమర్శించారు.

ప్రపంచదేశాలన్నీ అణువిద్యుత్‌ కేంద్రాలను వ్యతిరేకిస్తున్నాయి: కరత్
అణు విద్యుత్‌ కేంద్రాలు ప్రమాదకరమని తెలిసినా..ప్రభుత్వాలు మాత్రం వాటి నిర్మాణాల వైపే మొగ్గుచూపుతున్నాయి-ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. అణు విద్యుత్‌ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే..లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రపంచదేశాలన్నీ అణువిద్యుత్‌ కేంద్రాలను వ్యతిరేకిస్తుంటే..మోదీ మాత్రం అణు విద్యుత్‌ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అణు విద్యుత్‌ కేంద్రాలకు వ్యతిరేకమన్నారు.. కానీ...అధికారంలోకి వచ్చాకా అదే చంద్రబాబు అణు విద్యుత్ కేంద్రాలను ఒకే చెప్తున్నారన్నారు.

21:45 - July 16, 2016

ఢిల్లీ : ఆధార్‌ కార్డులను విస్తృత వినియోగంలోకి తీసుకురావాలని ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సాగిన మండలి సమావేశంలో అంతర్గత భద్రత, ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలపై చర్చించింది. సుమారు పదేళ్ల విరామం తర్వాత జరిగిన సమావేశం వాడివేడిగా సాగినట్లు సమాచారం. రాష్ట్రాల ప్రమేయం లేకుండా సమావేశపు అజెండా నిర్ణయించడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పదేళ్ల తర్వాత ప్రధాని అధ్యక్షతన అంతర్రాష్ట మండలి సమావేశం..
ఢిల్లీలో పదేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అంతర్రాష్ట మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభోపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది.

కేంద్రం, రాష్ట్రాల మధ్య సయోధ్యతోనే అభివృద్ధి :మోదీ
కేంద్రం, రాష్ట్రాల మధ్య సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్రాలకు ఇతోధికంగా ఇస్తున్నామన్నారు. రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్ర పన్నుల వాటాను పెంచామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

మమతా బెనర్జీ అసంతృప్తి..
ఇక ఈ సమావేశంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘం రద్దు చేసిన తర్వాత.. రాష్ట్రాల సమస్యలను చెప్పుకునేందుకు వేదిక లేకుండాపోయిందని ఆమె అన్నారు. నీతి ఆయోగ్‌లో కేవలం నాలుగైదు అంశాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారన్నారు. ఇక అంతర్రాష్ట మండలిసమావేశంలో చర్చించాల్సిన అంశాలను రాష్ట్రాలను సంప్రదించకుండా ఎలా చేర్చారని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది : చంద్రబాబు
రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాన్ని క్లిష్టతరం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన సర్కారియా కమిషన్‌, ఫూంచ్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గవర్నర్ల నియామకం.. రైతు సమస్యలు తదితర అంశాలపై కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు.

జ్వరంతో హాజరు కాని కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జ్వరం కారణంగా మధ్యాహ్నం సెషన్‌కు హాజరు కాలేదు. తొలి సెషన్‌ పూర్తి కాగానే, కేసీఆర్‌ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలంగాణ తరపున సీఎస్‌ రాజీవ్‌శర్మ... రాష్ట్ర ప్రతిపాదనలను సమావేశం ముందు ఉంచారు. మొత్తానికి పదేళ్ల తర్వాత నిర్వహించిన అంతర్రాష్ట్ర మండలి సమావేశం హాట్‌హాట్‌గా కొనసాగింది.

21:39 - July 16, 2016

కృష్ణా : అందరూ చూస్తున్నారు...అంతలోనే ఘోరం జరిగింది..కళ్ల ముందు జరుగుతున్నా ఎవరూ ముందుకు రాలేకపోయారు..ఏ ఒక్కరూ ధైర్యంతో అడుగు ముందుకు వేయలేకపోయారు...మానవత్వంతో ఆలోచించలేకపోయారు...ఫలితంగా కళ్ల ముందు ఓ అమాయకుడు దారుణహత్యకు గురయ్యాడు...కృష్ణా జిల్లాలో జరిగిన ఘోరం.

 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చీకటిపడుతున్న వేళలో జరిగిన పైశాచిక హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... శుక్రవారం రాత్రి పొల్లూరు సాంబశివరావు తన కొడుకుకు అస్వస్థత చేయడంతో ఆస్పత్రికి బైక్‌పై తీసుకువెళ్తున్నాడు..పునాదిపాడు సెంటర్‌ చేరుకున్న సాంబశివరావు బైక్‌ను ఎదురుగా సైకిల్‌పై మద్యం మత్తులో వస్తున్న కిరణ్ ఢీకొట్టాడు..దీంతో సాంబశివరావు ఏంటని అడిగేలోపే సైకిల్‌పై నుంచి దిగిన కిరణ్‌ మద్యం మత్తులో వాగ్వాదానికి దిగి పిడిగుద్దుల వర్షం కురిపించాడు...బైక్‌పై నుంచి కిందపడ్డ సాంబశివరావు పైకి లేవకుండానే కిరణ్‌ విపరీతంగా కొట్టడంతో కుప్పకూలిపోయాడు...కిరణ్ అక్కడి నుంచి పారిపోవడంతో అప్పటివరకు అక్కడే ఉంటూ చూస్తున్నవారంతా వచ్చి తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
దృశ్యాల ఆధారంగా నిందితుడు అరెస్ట్..
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పునాదిపాడు సెంటర్‌లోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

21:30 - July 16, 2016

హైదరాబాద్ : గొడవ..ఘర్షణ..కోపం..ఇటువంటి పదాలకు అర్థం కూడా తెలియని చిరుప్రాయం ఆ చిన్నారులది. చిన్న చిన్న తాయిలాల కోసం అలిగే వయసు వారిది..అంతలోనే కొట్టుకుని మరికొంత సమాయానికే కలిసిపోయి ఆటలాడుకునే ముద్దు ముద్దు ప్రాయం వారిది.. ఇద్దరు చిన్నారుల మధ్య చోటు చేసుకున్న చిన్న కారణంతో గలాటా జరిగింది. ఒకరినొకరు తిట్టుకున్నారు..కొట్టుకున్నారు. రక్త కారేలా కొట్టుకున్నారు. ఇవేవీ ఆ స్కూలు యాజమాన్యం పట్టించుకోలేదు..ఫీజుల విషయంలో అత్యం కఠినంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం విద్యార్థుల రక్షణలో గానీ..వారి చదువులలో గానీ పట్టించుకోవటం లేదు. మూడవ తరగతి..ఒకటవ తరగతి చదివే విద్యార్థుల వయస్సు ఎంతుంటుంది? ఎనిమిది సంవత్సరాల లోపే వుంటుంది కదా? మరి ఆ వయస్సు వారికి ఒకరిపై ఒకరికి కక్షలుంటాయా? రక్తం కారేలా కొట్టుకునేంత పగ వుంటుందా? వుండదు కదా? మరి వారి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ చిన్నారి మృతి చెందాడు..ఇది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో కదా? కానీ జరిగింది నమ్మాల్సిందే.. నగరంలోని టోలీచౌక్ ప్రాంతంలో వున్న 'ప్రామిసింగ్ స్కాలర్' స్కూల్లో ఈ దారుణం జరిగింది. మూడవ తరగతి విద్యార్ధి...ఒకటవ తరగతి విద్యార్థులు కొట్టుకున్నారు. రక్తం కారేలా కొట్టుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒకటవ తరగతి చదివే ఇబ్రహీం అనే విద్యార్తి గాయాలతో శనివారం మృతి చెందాడు.

మంగళవారం నాడు విద్యార్థుల మధ్య ఘర్షణ..
మంగళవారం నాడు స్కూలు వదిలిన తరువాత ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇబ్రహీం అనే విద్యార్థి కణతకు తీవ్రంగా గాయం అయ్యింది. గాయాలతో ఇంటికెళ్లిన ఇబ్రహీం ను చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు..కంగారుపడ్డారు.. ఆవేదన చెందారు..హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కానీ కణతకు గాయం కావటంతో గాయాలనుండి కోలుకోని ఇబ్రహీం శనివారం సాయంత్రం మృతి చెందాడు. తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. పిల్లల మధ్య ఇంత గలాటా జరుగుతున్నా పట్టించుకోని స్కూలు యాజమాన్యంపై ఇబ్రహీం తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో స్కూలు యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గాయాలయిన వెంటనే తమకు సమాచారం అందిస్తే తమ బిడ్డను బ్రతికించుకునే అవకాశం వుండేదనీ..వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫీజుల విషయంలో వున్న శ్రద్ధ విద్యార్థు సంరక్షణ లేని ఇటువంటి స్కూలు యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసంర ఎంతైనా వుంది..

20:59 - July 16, 2016


అబ్బాయిలతో విపరీతంగా వాట్సాప్ చాటింగ్ లు, ఫోన్ లో టాకింగ్ లు....కట్ చేస్తే  అతనో లలిత కలలున్న అబ్బాయి. 
అమ్మాయిల పేరుతో ఫేక్ ఫేస్ బుక్  అకౌంట్  క్రియేట్  చేసి డబ్బులు వాసులు చేసిన  మహా ఘనుడు.   అచ్చం అమ్మాయిలాగా వాయిస్ మార్చి 50 మందికి పైగా అబ్బాయిలను తప్పుదోవ పట్టించిన  ఫెకు గాడు..
ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. అతను చేసిన చాటింగ్,  అమ్మలా మాట్లాడిన మాటలు వింటే మీరు కచ్చితంగా విస్తుపోవాల్సిందే... కావాలంటే మీరే చూడండి వీడియో లో ....

ఆటోడ్రైవర్ హత్య!..

హైదరాబాద్ : ఉపర్పరపల్లి పొలాలసమీపంలో ఆటోడ్రైవర్ తమ్మిశెట్టి వెంకటరమణ (30) హత్యకు గురయ్యాడు. అదేగ్రామానికి చెందిన నరసింహులు, భార్య, కుమారుడు ముగ్గురూకలిసి పాతకక్షలు మనస్సులో ఉంచుకొని హత్యచేశారని మృతుని భార్య సంపూర్ణ ఫిర్యాదులో తెలిపింది.

20:41 - July 16, 2016

ఆషాడమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తులు నమ్ముతారు. తమ ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎంత ఆదరంగా.. గౌవరంగా చూస్తారో అమ్మవారి బోనాల పండుగను కూడా అలాగే చేసుకుంటారు భక్తులు..అసలు ఈ బోనాల ఉత్సవాల ప్రత్యేకతలేంటి? ఈ పండుగకు సంబంధించిన విశేషాలేంటి? ఈరోజు మన బోనాల ముచ్చట్ల కార్యక్రమంలో తెసుకుందాం..మరి ముచ్చట్లను...బోనాల విశేషాలను తెలపటానికి ప్రదీప్ కుమార్ ( ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ చైర్మన్ ), శ్యామలదేవి( శివశక్తి స్వరూపిణి), విజయ్ కుమార్ (పోతరాజు),మధుసూధన యాదవ్ (బంగారు మైసమ్మ ఆలయ అధ్యక్షులు) వచ్చారు మరి ఈ బోనాలు ఉత్సవాల విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరిన్ని బోనాల ముచ్చట్లను తెలుసుకోండి...

20:37 - July 16, 2016

వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన బసవన్న ...రాజస్థాన్ రాష్ట్రంల రతన్ ఘడ్ పట్నంల జరిగింది గీ ముచ్చట.. ఊరోల్లు..అగ్నిమాపక సిబ్బంది దాదాపు 8గంటలపాటు నానా యాతన పడ్డారాయే..మత్తుసూదిచ్చి..క్రేన్లు పెట్టి ..తాళ్లు కటి ఎలాగైయితేనే కిందికి దించిండ్రు.. సర్కారు బడుల పాయకానలు సాపు చేస్తున్న చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి..ఇరు చంద్రులను తిట్టిపోత్తన్న నిరుద్యోగులు..ఇబ్రహీం పూర్ లో మొక్కలు నాటిన నరసింహన్ సారు..అనంతపురం జల్లాల రాళ్లు తప్ప నీటిసుక్కే కానరాదాయే..పాలమూరు జిల్లాల జనాలు వలసబోయే అనంతపురం జిల్లాల ఎడ్లు వలసబోతున్నాయట..పోరి గంతుతో ఫేస్ బుక్ లో 50మందితాన డబ్బులు గుంజిన పోరగాడు..ఇటువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న తీసుకొచ్చేసిండు...చూస్తే మస్తు ఖుషీ అయిపోతరు..నిజ్జంగా నమ్ముండ్రి...కావాలంటే మీరే చూడుండ్రి మల్ల..

ముత్తూట్ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ కిడ్నాప్...

హైదరబాద్: అల్వాల్ పరిధిలోని ముత్తూట్ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ కిడ్నాప్ కు గురయ్యాడు. శనివారం సాయంత్రం ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసుకు కొందరు దుండగులు వచ్చి మేనేజర్ ను కారులో ఎక్కించుకుని పోయినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. 

19:47 - July 16, 2016

రంగారెడ్డి : కందుకూరు మవండలం ముచ్చర్ల ఫార్మాసిటీ నిర్వాశితులకు మద్ధతుగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టారు. ఫార్మా నిర్వాశితులకు న్యాయం చేయాలంటూ రెండు రోజులపాటు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర గ్రామస్థులంతా ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు, మహిళలు ఈ యాత్రలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పార్మా సిటీకోసం దాదాపు 13వేల ఎకరాలు సేకరించటానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దాదాపు 20మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ..ఫార్మాసిటీ పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు కేసీఆర్ 2013 చట్టాన్ని అమలు చేస్తామంటూనే మరోవైపు అతి తక్కువ ధరకు భూములను లాక్కోవటానికి యత్నిస్తోందన్నారు. భూములన్నవారిని కూడా లేనివారిగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈవిషయంలో రెవెన్యూ అధికారులు అనేక అక్రమాలకు పాల్పడతున్నారన్నారు. ఇటువంటి అధికారుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ..2013 చట్టాన్ని అమలు చేయాలని తమ్మినేని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి.. 

విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి మృతి..

హైదరాబాద్ : బంజారాహిల్స్ పరిధిలోని టోలీచౌకిలోని స్కూలు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మూడవ తరగతి ఒకటవ తరగతి విద్యార్థులు కొట్టుకోవటంతో ఒకటవ తరగతి విద్యార్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ఒకటవ తరగతికి చెందిన ఇబ్రహీం అనే విద్యార్థి మృతి చెందాడు. 

19:19 - July 16, 2016

తిరుమల : తిరుమలేశుని సన్నిధిలో వేయికాళ్ల మంటప నిర్మాణం ఎప్పుడు..? దీని నిర్మాణానికి అడ్డంకులు తొలగేనా..? కోర్టు విధించిన స్టేని ప్రభుత్వం ఎత్తివేయించేది ఎప్పుడు.. మంటపాన్ని నిర్మించేది ఎప్పుడు..? శ్రీనివాసుని భక్తులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కు సాగుతోన్న వేయికాళ్ల మంటపం పునర్నిర్మాణ తీరుతెన్నులపై 10tv స్పెషల్‌ ఫోకస్‌..

ఏడు శతాబ్దాల చారిత్రక మంటపం....
సువిశాల ప్రాంగణం..అద్భుత శిల్పకళకు నిలయం.. దాదాపు ఏడు శతాబ్దాల చారిత్రక మంటపం..ఇదీ.. తిరుమలేశుని సన్నిధిలో.. ఒకప్పుడు అద్భుతంగా అలరారి.. కాలగర్భంలో కలిసిపోయిన వేయికాళ్ల మంటపం. తొలి రోజుల్లో భక్తుల విశ్రాంతి మందిరంగానూ.. ఆ తర్వాత పవిత్రోత్సవాలకు వేదికగానూ ఉపయోగపడిన ఈ మంటపం.. తిరుమలకే శోభాయమానంగా నిలిచింది. భక్తుల మదిలో శాశ్వత స్థానాన్ని సముపార్జించుకుంది.

14వ శతాబ్దంలో నిర్మాణం...
తిరుమలలోని వేయి కాళ్ల మంటపాన్ని 14వ శతాబ్దంలో.. అప్పటి సాళువ రాజులు నిర్మించారు. అప్పట్లో ఆలయం చుట్టూ కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. క్రూరమృగాలు ఆలయ ప్రాంతంలో యథేచ్ఛగా సంచరించేవి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు క్రూర జంతువులకు భయపడి రాత్రివేళల్లో ఆలయంలోనే తలదాచుకునేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని.. భక్తుల విశ్రాంతి కోసం.. వేంకటేశుని ఆలయానికి ఎదురుగానే వేయి కాళ్ల మంటపాన్ని నిర్మించారు.

తూర్పు-పడమరగా 250 అడుగులు..180 అడుగుల వెడల్పు...
శ్రీవారి ఆలయ ముఖద్వారానికి ఎదురుగా.. తూర్పు, పడమరలుగా 250 అడుగులు, ఉత్తర-దక్షిణంగా 180 అడుగుల వెడల్పుతో.. సుమారు 20 అడుగుల ఎత్తుతో నిర్మించిన సువిశాల మండపం ఇది. వేయి మంటపాల మంటపంగా దీన్ని పిలుస్తున్నా.. కచ్చితంగా ఇన్ని స్తంభాలు ఉన్నట్లు ఆధారాలు లేవు. కాకపోతే.. మంటపం పొడవు, వెడల్పుల నేపథ్యం.. ఇక్కడి భారీ సంఖ్యలోని స్తంభాల కారణంగా దీనికి వేయి కాళ్ల మంటపమన్న పేరు స్థిరపడిపోయింది. మంటపంలోని ప్రతి స్తంభం.. అద్భుతమైన కళాకృతికి నిదర్శనం.

మహ్మదీయుల ఏలుబడిలో తిరుమల వదిలి వెళ్లిన అర్చకులు...
మహమ్మదీయుల పాలనకు ముందు ఈ మండపంలో పవిత్రోత్సవాలు నిర్వహించేవారు. శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగిన పూజ, కైంకర్యాల్లో ఏకారణం చేతనైనా.. లోపాలు జరిగే అవకాశం ఉంది. అలాంటివాటికి పరిహారంగా నిర్వహించేవే పవిత్రోత్సవాలు. మహ్మదీయుల ఏలుబడిలో అర్చకులు తిరుమల వదిలి వెళ్లడం వల్ల.. అర్చకుల కొరత ఏర్పడి పవిత్రోత్సవాలు ఆగాయని చెబుతారు. మళ్లీ పవిత్రోత్సవాలను ప్రారంభించాల్సి వచ్చినప్పుడు.. ఇక్కడి వెయ్యి కాళ్ల మంటపాన్నే ఎంచుకున్నారు.

స్తంభాల మధ్య గోడలు కట్టి గదులుగా మార్పు ..
పవిత్రోత్సవాలు ఆగిపోయిన తర్వాత వెయ్యి కాళ్ల మండపాన్ని ఇతర కార్యక్రమాలకు వినియోగించారు. స్తంభాల మధ్య గోడలు కట్టుకుని గదులుగా మార్చుకున్నారు. మంటపాన్ని కూల్చే నాటికి.. అంటే 2003లో ఈ మంటపంలో పోలీస్ స్టేషన్, కల్యాణ కట్ట, చెవి పోగులు కుట్టే గది, బ్యాంకు, లడ్డూ రసీదు కౌంటర్, ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ చేసుకునే గిడ్డంగి, పెద్ద సంఖ్యలో దుకాణాలు ఉండేవి.

మంటపం ఎప్పుడు నిర్మిస్తారని తిరుమలేశుని భక్తుల ప్రశ్న...
తిరుమలలోని వేయి కాళ్ల మంటపం.. కనుమరుగై పదేహేనేళ్లు కావస్తున్నాయి. ఇప్పటికీ ఈ మంటపం చర్చనీయాంశమే! ఇంతకీ.. ఈ వెయ్యి కాళ్ల మండపం ఎప్పటిది!? దీనిని ఎవరు నిర్మించారు!? ఎవరు కూల్చివేశారు!? మళ్లీ ఎందుకు కట్టాలను కుంటున్నారు? కడితే కొందరికి వచ్చే నష్టమేమిటి? ఈ ప్రశ్నలు ఇప్పటికీ ఆసక్తికరమే.

1920లోనే మంటపం తొలగించే ప్రయత్నం!..
తిరుమలలోని వేయి కాళ్ల మంటపం శ్రీనివాసుడి భక్తులను సేదతీర్చేది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మంటపాన్ని తొలగించే ప్రక్రియకు 1920లోనే శ్రీకారం పడింది. అప్పట్లోనే మంటపం రాతి స్తంభాలను తొలగించారు. కానీ భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో కూల్చివేతను నిలిపి వేశారు. కానీ, మంటపం కూల్చివేత జోరందుకున్నది మాత్రం 1980 దశకంలోనే.
1980 నాటికి బాగా పెరిగిన భక్తుల రద్దీ...
ఆలయ ముఖద్వారానికి ఎదురుగా సన్నిధి వీధి ఉండేది. ఉత్తర, దక్షిణంగా రెండు భాగాల్లో వెయ్యి కాళ్ల మండపం ఉండేది. 1980 నాటికే తిరుమలకు రద్దీ పెరగడంతో వీధిని వెడల్పు చేయడం అనివార్యమైంది. అప్పటి ఈవో పీవీఆర్‌కే ప్రసాద్ స్థానికులకు నచ్చజెప్పి సన్నిధి వీధిని వెడల్పు చేశారు. ఇందులో భాగంగానే వెయ్యి కాళ్ల మంటపాన్ని ఉత్తర, దక్షిణ దిశల్లో సగానికి తొలగించారు. దీంతో, సన్నిధి వీధికి అటు, ఇటు సగం మంటపం మాత్రమే మిగిలింది.

2003లో మంటపం పూర్తిగా తొలగింపు...
తర్వాతి రోజుల్లో భక్తుల రద్దీ మరింతగా పెరిగిపోవడం.. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం ముందున్న ఇరుకు రోడ్డులో తొక్కిసలాట జరుగుతుండడంతో.. 2003లో దీన్ని పూర్తిగా తొలగించే పని చేపట్టారు. అజయ్‌ కల్లం ఈవోగా ఉన్న కాలంలో వేయి కాళ్ల మంటపాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రస్తుతం తిరుమల ఆలయం ముందు ఉన్న ఖాళీ స్థలం వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించడం వల్ల ఏర్పడినదే.

మంటపం తొలగింపును వ్యతిరేకించిన చిన్నజీయర్‌ స్వామి...
మటపం కూల్చివేసిన తర్వాత విరిగినవి పోగా మిగిలిన స్తంభాలు ప్రస్తుతం నారాయణ గిరి గార్డెన్, మరియు గోగర్భం డ్యామ్‌ పరిసరాల్లో ఉంచారు. మంటపం తొలగింపును అప్పట్లో చిన్నజీయర్‌ స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా టిటిడి ఉన్నతాధికారులు పట్టుబట్టి మంటపాన్ని తొలగించారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. మంటపం తొలగించిన ప్రాంతంలో రెండువందల స్తంభాలతో మహా మణిమంటపాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే దీనిపై అభ్యంతరాలు వచ్చాయి. వైఎస్సార్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మహామణి మంటపాన్ని శ్రీవారి ఆలయం ఎదుట కాకుండా మరెక్కడైనా నిర్మించుకోవాలంటూ.. ఓ కేసులో కోర్టు సూచించింది. దాంతో పని అక్కడ ఆగింది.

కోర్టులో కేసు..నిలిచిపోయిన పనులు...
తిరుమలలో వేయి కాళ్ల మంటపం నిర్మాణ పనులకు మళ్లీ 2014లో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 2014లో అధికారంలోకి రాగానే.. వేయికాళ్ల మంటపాన్ని పునర్నిర్మించాలని భావించారు. కానీ మళ్లీ కోర్టులో కేసు పడ్డంతో పనులు నిలిచిపోయాయి.

2014లో వేయికాళ్ల మంటప పునర్నిర్మాణ యత్నాలు....
2003లో తన హయాంలోనే వేయికాళ్ల మంటపం కూల్చిన చంద్రబాబు.. అనంతర పరిణామాల్లో.. పదేల్లు అధికారానికి దూరమయ్యారు. అయితే 2014లో అధికారంలోకి రాగానే వేయికాళ్ల మంటపాన్ని పునర్నిర్మించాలని భావించారు. దీనికోసం టిటిడి పాలకమండలితో పలుదఫాలు చర్చలూ జరిపారు. దీంతో మంటపం నిర్మాణానికి సంబంధించి.. తిరుమల జేఈఓతో కలిపి పాలకమండలి సభ్యులతో హైపవర్ కమిటీని టీటీడీ ఏర్పాటు చేసింది.

మంటప నిర్మాణానికి రూ.18 కోట్ల కేటాయింపు...
టీటీడీ నియమించిన కమిటీ మంటప నిర్మాణానికి అనువైన స్థలం కోసం తిరుమలలోని పలు ప్రాంతాలతో పాటు అలిపిరినీ పరిశీలించింది. చివరకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మంటపాన్ని నిర్మించాలని కమిటీ సూచించింది. దీనిపై పాలకమండలిలో చర్చించి మంటపం నిర్మించేందుకు 18 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. ఆ తరువాత మంటపానికి సంబంధించిన పలు డిజైన్లను కూడా పరిశీలించారు.

మంటప నిర్మాణంపై స్టే విధించిన న్యాయస్థానం...
అయితే పనులు ప్రారంభం కావడమే తరువాయి అన్న తరుణంలో.. మంటపాన్ని నారాయణగిరి ఉద్యానవనంలో నిర్మించరాదని, శ్రీవారి ఆలయం ఎదుటే నిర్మించాలంటూ కిషోర్ స్వామి, లక్ష్మణనాథాచార్యులు అనేవ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మంటప నిర్మాణంపై స్టే విధించింది. దీంతో మండపం నిర్మాణానికి పిలవాల్సిన టెండర్లను టిటిడి వాయిదా వేసింది. దీంతో తిరుమల వేయికాళ్ల మండపం వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. టిటిడి ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు.. వేయికాళ్ల మంటపంపై ప్రత్యేకంగా దృష్టిసారించి పనులు ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. 

18:59 - July 16, 2016

శ్రీకాకుళం : అణు విద్యుత్‌ కేంద్రాలు ప్రమాదకరమని తెలిసినా..ప్రభుత్వాలు మాత్రం వాటి నిర్మాణం వైపే మొగ్గుచూపుతున్నాయని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించే అణు విద్యుత్‌ కేంద్రాలకు వ్యతిరేకంగా ప్రకాశ్‌ కరత్‌ ఆయా గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు వద్దని వారిస్తున్నా.. చంద్రబాబు, మోదీ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడంలేదన్న ప్రకాశ్‌ కరత్‌ తో కరత్ తెలిపారు..ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:55 - July 16, 2016

విశాఖ : జిల్లాలో వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది. సంప్రదాయానికి విరుద్ధంగా ఓ మహిళ..మరో యువతిని పెళ్లిచేసుకుంది. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన 30 ఏళ్ల తేజ అనే మహిళ..18ఏళ్లున్న వీరలక్ష్మి అనే మరో యువతిని తిరుపతిలో పెళ్లిచేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న వీరలక్ష్మి తల్లిదండ్రులు..30ఏళ్ల మహిళ తేజకు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు..పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

గుత్తాది ఐరన్ లెగ్ ...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పైన, ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిపైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు న‌ల్గొండ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..గుత్తాది ఐరెన్ లెగ్ అని, అలాంటి వ్య‌క్తిని టీఆర్ఎస్‌లో చేర్చుకొని ఆ పార్టీ అధినేత కేసీఆర్ త‌ప్పు చేశార‌ని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ గుత్తా రాజీనామా చేసి మ‌ళ్లీ పోటీ చేస్తే డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. స్వంత నియోజకవర్గంలో సర్పంచ్ ని గెపలింపించుకోలేని గుత్తా తనను విమర్శించే స్థాయిలో లేడని కోమటిరెడ్డి మండిపడ్డారు.

పోడుపై కేసీఆర్ స్టాండ్ ఏంటి?..

ఖమ్మం : భూములపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రం లో పోడు భూముల సమస్యను పరిష్కరించి,గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ వేణుగోపాల్‌రెడ్డికు వినతి పత్రాన్ని అందించారు.

మచిలీపట్నం రోడ్డుపై స్థానికుల రాస్తారోకో ..

కృష్ణా : నూజివీడు మొఘలిచెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపుకు రంగం సిద్ధమైంది. 40 ఏళ్ళుగా నివాసముంటున్న మమ్మల్ని వెళ్లిపోమంటే ఊరుకోమని స్థానికులు మచిలీపట్నం రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్థంభించిపోయింది. 

రేపు పదో తరగతి సప్లి ఫలితాలు...

హైదరాబాద్‌: తెలంగాణలో నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్య ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ అశోక్‌ ఈ ఫలితాలను విడుదల చేస్తారు.

డిప్యూటీ సీఎం ను పరామర్శించిన మంత్రి ...

హైదరాబాద్ : నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం మహ్మద్ అలీని మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. అలీ ఆరోగ్య విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం నిమ్స్ లో చికిత్స తీసుకోవటం అంటే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించటమే నని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

9మంది విద్యార్థులకు అస్వస్థత..

కర్నూలు : ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో మధ్యాహ్న భోజనం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు.

సీఎం కేసీఆర్ అస్వస్థత...

ఢిల్లీ : సీఎం కేసీఆర్ అస్వస్థతకు లోనయ్యారు. ఢిల్లీ టూర్ లోవున్న కేసీఆర్ తీవ్రంగా జ్వరంతో బాధపడుతున్నారు. ప్రధాని మోదీకి సమాచారం ఇచ్చి అంతరాష్ట్ర మండలి సమావేవం నుండి కేసీఆర్ వెళ్లిపోయారు. ఈ సమావేశంలో కేసీఆర్ పాఠాన్ని సీఎస్ రాజీవ్ శర్మ చదివి వినిపించారు. వైద్యులు కేసీఆర్ కు చికిత్స చేశారు.

తిరిగి ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర..

జమ్మూ కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది బుర్హన్ వని ఎన్‌కౌంటర్ కారణంగా కశ్మీర్ లోయలో చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. 

ఫేస్ బుక్ చాటింగ్ సింథియా ప్రాణాలు తీసిందా?..

హైదరాబాద్ : రూపేష్ కుమార్‌కు కోర్టు విధించిన మూడు రోజుల పోలీసు కస్టడీ నేటితో ముగిసింది. రూపేష్ కుమార్ కస్టడీ వివరాలను మాదాపూర్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టుకు సమర్పించారు. మూడు రోజుల విచారణలో రూపేష్ కీలక విషయాలు బయటపెట్టాడు. తన భార్య సింథియాను తానే హత్య చేశానని రూపేష్ అంగీకరించాడు. ఫేస్‌బుక్‌లో సింథియా ఫ్రాన్స్ యువకుడితో పరిచయం పెంచుకొని చాటింగ్ చేయడాన్ని సహించుకోలేకపోయానని తెలిపాడు. సింథియాను ప్లాన్‌తోనే చంపేశానని ఒప్పుకున్నాడు. ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో శవాన్ని ముక్కలు ముక్కలుగా చేశానని చెప్పాడు.

దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఆపశృతి..

విజయవాడ : విజయవాడ దుర్గగుడి పైవంతెన పనుల్లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం పిల్లర్‌ వేసేందుకు ఇనుప ఫ్రేమింగ్‌ విరిగిపోవటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ సిబ్బంది పక్కకు ఒరిగిన పిల్లర్‌ ఇనుప చువ్వలు సరిచేస్తున్నారు.

17:52 - July 16, 2016

విశాఖ : విశాఖను స్మార్ట్‌ సిటీ చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా అద్దాల మేడల వెనుక మురికివాడలు వెక్కిరించేలా కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ సిటీ హోదాతో కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయంటూ ఊదరగొడుతున్నారు. కనీసం ఈ నిధులతోనైనా మురికి వాడలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తారని విశాఖ వాసులు ఎదురుచూస్తున్నారు.

తొలి దశలోనే విశాఖకు దక్కిన చోటు...
విశాఖ నగరాన్ని కేంద్రం తొలి దశలో ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కింది. దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు. ఏపీలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ పట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, పెట్టుబడుల కోసం అతర్జాతీయ సదస్సు నిర్వహించారు. అంతే కాదు హుదూద్ తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖను ప్రపంచ బ్యాంక్ సైతం ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.

ఏడాదికి రూ.100 కోట్లు...
అంతేకాదు స్మార్ట్ సిటీ జాబితాలో విశాఖ నగరాన్ని చేర్చడం ద్వారా ఏటా 100 కోట్ల చొప్పున 5 సంవత్సరాల పాటు 500 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే నగరంలోని ప్రముఖ ప్రదేశాలను స్మార్ట్ సిటీ మొదటి దశలో ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు అధికారులు. దానిలో భాగంగా బీచ్ రోడ్డు, ఉడా పార్క్‌లను అభివృద్ధి చేయాలనేదీ జీవీఎంసీ అధికారుల ఆలోచనగా ఉంది.

అసలు సమస్య ఇక్కడే ప్రారంభం ...
ఇంత వరకూ బాగానే ఉంది కాని అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అవుతుంది. రానున్న రోజుల్లో విశాఖ కు మురికి వాడలు సమస్య పెద్ద సవాలు కానుంది. 2013 రాజీవ్ ఆవాస్ యోజన సర్వే ప్రకారం నగరంలో 790 మురికివాడలు ఉన్నాయి. విశాఖ నగర జనాభా సుమారు 20 లక్షలుంటే అందులో 8 లక్షలకు పైగానే మురికి వాడల్లో నివిసిస్తున్నారు.

జీవీఎంసీ లోకి అనకాపల్లి, భీమిలి...
మరోవైపు జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి, భీమిలి పురపాలక సంఘాలు గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థలో కలిపే ప్రతిపాదన చేస్తోంది రాష్ర్ట ప్రభుత్వం. దీని వల్ల మరిన్ని మురికి వాడలు పెరిగే అవకాశం ఉంది.

తొలిదశ లో 376 కోట్లు విడుదల..
నిబంధనల ప్రకారం జీవిఎంసీ బడ్జెట్ లో 40 శాతం నిధులు మురికివాడల అభివృద్ధికి కేటాయించాలి. దీనికి విరుద్ధంగా నిధులన్నిటిని ప్రాజెక్టులకే వెచ్చిస్తున్నారు. స్మార్ట్ సిటీ తొలిదశ క్రింద 376 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఈ నిధులకు సంబంధించి జీవీఎంసీ ఖాతాలో ఒక్కరూపాయి పడలేదు. మరోవైపు స్మార్ట్ సిటీ పేరుతో ఎంత వరకూ బీచ్ సుందరీకరణ, రోడ్లు అంటున్నారే తప్ప నగరంలో ఉన్న మురికి వాడలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వానికి లేదని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి.

స్మార్ట్‌ ప్రణాళికలో బడా బాబులు..
స్మార్ట్ సిటీ నిధులతో బీచ్ రోడ్లు, పార్క్‌లను అభివృద్ధి చేయడం కంటే నగరంలో ఉన్న మురికివాడలను అభివృద్ది చేస్తే బాగుంటుందనేనీ ప్రజా సంఘాల వాదిస్తున్నాయి. అధికారులు రూపొందించిన స్మార్ట్‌ ప్రణాళికలో బడా బాబులు ఉండే ప్రదేశాలను అభివృద్ది చేస్తామని చెప్పడం ఏమిటనీ విశాఖ వాసులు ప్రశ్నిస్తున్నారు. 

17:43 - July 16, 2016

హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి. లక్ష్మారెడ్డి " వి కనెక్ట్ " యాప్ ను హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రి నుంచి ప్రారంభించారు. భారతదేశంతోపాటు అమెరికా రోగులకు అందుబాటులో ఉండేలా ఈ యాప్ ఉంటుందని మంత్రి అన్నారు. మొబైల్ యాప్ తో వైద్యం మరింత సులువవుతుందని మంత్రి అన్నారు. ప్రపంచ వైద్యరంగం తెలంగాణ వైపు చూడడం గర్వకారణంగా ఉందన్నారు. అందరికి ఆరోగ్యం ప్రభుత్వం లక్ష్యమని.. ఆ విధంగా అడుగులు వేస్తున్న విరించి సేవలను ఆయన కొనియాడారు. ఈ యాప్ లో రోగుల వివరాలు వేరే డాక్టర్ కు అర్థమయ్యేలా అందుబాటులో ఉంటాయన్నారు నిర్వాహకులు. కీలక సమయంలో.. ఈ వీడియో యాప్ ద్వారా డైరెక్ట్ గా విరించి డాక్టర్లను సంప్రదించవచ్చన్నారు నిర్వాహకులు.

17:40 - July 16, 2016

ఖమ్మం : అటవీ భూమిని పోడు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న గిరిపుత్రులపై అటవీశాఖ అధికారులు కక్ష కట్టారు. అటవీ భూమినే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పోడు సాగుదారులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.

పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులు...
ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో గత 25 సంవత్సరాలుగా పోడు భూములలో గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పోడు చేసుకుంటున్న అయాయక గిరిజనులపై హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం వివాదాస్పందంగా మారుతోంది.

పోడు రైతులకు మద్దుతుగా నిలిచిన సీపీఎం పార్టీ...
అటవీ, పోలీసు అధికారుల చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనోద్యమం చేస్తున్న గిరిజనులకు సీపీఎం మద్దతు పలికింది...పోడు సాగుదారులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అశ్వారావు పేటలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవీశాఖ సిబ్బంది కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులు కూడా అత్యత్సాహం చూపుతూ గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు.

గిరిజనుపై దాడులను ఖండించిన సీపీఎం నేతలు...
1996 నుంచి వాగడ్డు గూడెం, మల్లాయి గూడెం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు పోడు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి..అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో మొక్కులు నాటేందుకు పోలీసులతో బెదిరిస్తూ పోడు రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని సీపీఎం నేత పొతినేని సుదర్శన్ విమర్శించారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఎం డిమాండ్ ..
పోడు భూమి సాగుదారుల సమస్య పరిష్కారం చేసి భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పోతినేని సుదర్శన్‌లతో కలిసి గిరిజనులు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. 

17:35 - July 16, 2016

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా రాంగ్‌రూట్‌, రాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న 267 మంది వాహనదారులను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్కరికి 1200 రూపాయల జరిమానా విధించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సిలింగ్‌తో సరిపెడతామని..రెండోసారి పట్టుబడితే మాత్రం జైలుకు పంపించేందుకు వెనకాడమని పోలీసులు అన్నారు. 

ఆర్ఎస్ఎస్ నేత సురేష్ కేట్కర్ మృతి..

ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ సురేష్ కేట్కర్ స్వల్ప అస్వస్థతతో శనివారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. లాతూరులోని స్థానిక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆదర్శాలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి కేట్కర్ అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన సందేశంలో పేర్కొన్నారు. కేట్కర్ మృతి పట్ల కేంద్ర మంత్రి మహేష్ శర్మ సంతాపం వ్యక్తం చేశారు.

గద్వాలలో పాదయాత్ర చేస్తా : డీకే అరుణ

హైదరాబాద్: గద్వాల జిల్లా సాధన కోసం ఈ నెల 19న పాదయాత్ర చేపడుతున్నట్లు డీకే అరుణ తెలిపారు. జమ్ములమ్మ ఆలయం నుంచి ఆలంపూర్ జోగులాంబ ఆలయం వరకు పాదయాత్ర చేస్తానని డీకే అరుణ ప్రకటించారు. జిల్లాకు కావాల్సిన అన్ని హంగులు గద్వాల్‌కు ఉన్నాయని డీకే అరుణ అన్నారు. 

కుక్కల దాడిలో చిన్నారి మృతి..

కరీంనగర్ : చందుర్తి మండలం రుద్రంగిలోదారుణం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో చిన్నారి శ్రావణి మృతి చెందింది. శ్రావణి స్కూలు కు వెళుతుండగా కుక్కలు దాడిచేశాయి. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. 

బాలిక మెడను కొరికిన కుక్కలు ...

హైదరాబాద్ : నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న శునకాల బెడదతో ప్రజలు పలు ఇబ్బందులకు లోనవుతున్నారు.  నగరంలోని ప్రగతి నగర్‌లో  ఐదు సంవత్సరాల బాలిక మెడను కుక్కలు విచక్షణారహితంగా కొరికాయి. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మద్యం మత్తు..దారుణ హత్య..

విజయవాడ : మద్యం మత్తులో నడిరోడ్డుపై ఓవ్యక్తి మరోవ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. సైకిల్‌ను ఢికొట్టాడని బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సైకిలిస్ట్‌ కొట్టి చంపాడు. కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తు సాంబశివరావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సీసీ కెమెరాలో సాంబశివరావు హత్య దృశ్యాలు వెలుగుచూశాయి. నిందితుడు దేవరపల్లి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

16:52 - July 16, 2016

బెంగళూరు : ప్రోకబడ్డీలీగ్ లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ కమ్ సూపర్ రైడర్ రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా పూణేరీ పల్టాన్ తో ముగిసిన 9వ రౌండ్ పోటీలో సూపర్ టెన్ స్టార్ గా నిలిచాడు. ప్రోకబడ్డీ నాలుగుసీజన్లలో కలిపి 403 రైడింగ్ పాయింట్లు సాధించిన తొలి రైడర్ గా రికార్డు నెలకొల్పాడు. పూణేరీ పల్టాన్ పై తెలుగు టైటాన్స్ 32-29 పాయింట్ల విజయంలో ప్రధానపాత్ర వహించాడు. తొమ్మిదిరౌండ్లలో తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలతో 29 పాయింట్లు సాధించి..లీగ్ టేబుల్ నాలుగోస్థానానికి చేరుకొంది.

16:48 - July 16, 2016

ఢిల్లీ : భారత్ వేదికగా అతిపెద్ద ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్ కు న్యూఢిల్లీ త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే డబ్ల్యూ బీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఫైట్ లో మేడిన్ ఇండియా బాక్సర్ విజేందర్ సింగ్ తో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తలపడబోతున్నాడు. ప్రో బాక్సర్ గా ఇప్పటికే ఆరు నాకౌట్ విజయాలు సాధించిన విజేందర్...ఏడో విజయానికి తహతహలాడుతున్నాడు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన విజేందర్..తొలిసారిగా స్వదేశీ అభిమానుల ముందు సమరానికి సిద్ధమవుతున్నాడు.

16:43 - July 16, 2016

ముంబై : లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్‌ బౌన్సింగ్‌ కేసులో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ ముంబై అంథేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెల్లించిన చెక్కు బౌన్స్‌ కావడంతో ఆ సంస్థ ముంబయి కోర్టును ఆశ్రయించింది. దీంతో మాల్యాపై నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. బ్యాంకులకు 9 వేల కోట్ల రుణం ఎగవేసిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనను భారత్‌కు రప్పించేందుకు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

16:39 - July 16, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీఎల్పీ నేత షబ్బీర్‌ఆలీ అన్నారు. వర్షా కాల సమావేశాలన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అలాగే మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులకు రెండు చట్టాల ప్రకారం ఏ విధంగా పరిహారం చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. సీఎం 2013 చట్టాన్ని.. మంత్రి హారిష్‌రావు 123 చట్టాన్ని అమలు చేయాలని అంటున్నారని..ఇది ఎలా సాధ్యమవుతుందని అన్నారు.

రుణ మాఫీ నిధులను విడుదలలో సర్కార్ నిర్లక్ష్యం: జీవన్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో రైతులకు విడుదల చేయాల్సిన రుణ మాఫీ నిధులను విడుదల చేయకుండా..ప్రభుత్వం తాత్సారం చేస్తుందని సీఎల్పీ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం వారిని ఆదుకోవడం లేదని ఆయన అన్నారు. రైతాంగం అంటే ప్రభుత్వం చాలా వివక్ష చూపుతుందని ఆయన అన్నారు.

16:35 - July 16, 2016

శ్రీకాకుళం : రణస్థలం మండలం కోస్తలో సీపీఎం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు సీపీఎం జాతీయ నాయకుడు ప్రకాష్ కరత్ హారజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రదేశం లో పర్యటించానని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కరత్ తెలిపారు. భారత్ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒకే చోట ఆరు రియాక్టర్లు పెట్టటం అనేది పెను ప్రమాదకరమని తెలిపారు.ఒకే ప్రదేశంలో ఆరు రియాక్టర్లు ఏర్పాటు చేస్తే.. ఒక్క కొవ్వాడ ప్రాంతానికే కాదు..ఉత్తరాంధ్రలో వున్నటువంటి మూడు జిల్లాలకు తీవ్రమైన పెను ప్రమాదం పొంచి వుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వ ఉన్నప్పటి నుండీ సీపీఎం పార్టీ పోరాడుతోందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అమెరికాకు చెందిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవటానికి యత్నిస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి పెట్టుబడి రూ.2లక్షల 80 వేల కోట్లు అవుతుందన్నారు. జపాన్ లో అణు రియాక్టర్లు పేలి ఎంత విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసనీ..అటువంటి ప్రమాదకర అణు రియాక్టర్లను ఈ ప్రదేశం ఏర్పాటు చేయటం పెను ప్రమాదానికి దారితీస్తాయన్నారు. ఈ ప్రదానికి గురయిన వారు ఇప్పటికింకా కోలుకోలేదని తెలిపారు. సాధిరణ విద్యుత్ కంటే అణు విద్యుత్ ఖరీతు చాలా ఎక్కువన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కావాల్సినన్ని బొగ్గు నిక్షేపాలు వున్నాయనీ వాటి ద్వారా ధర్మల్ విద్యుత్ ను తయారుచేసుకోవచ్చన్నారు. అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా కూడా విద్యుత్ తయారుచేసుకునే అవకాశాలు ఇక్కడ మెండుగా వున్నాయని తెలిపారు. ఇన్ని అవకాశాలను వదిలి అణు విద్యుత్ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదన్నారు. అమెరికా, ఫ్రాన్స్ , జర్మనీ దేశాలలో అణు విద్యుత్ కేంద్రాలను ఎత్తివేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కూడా తాము అణు విద్యుత్ ను తయారుచేయమని జర్మనీ దేశం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. గుజరాత్ లో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వద్దని అక్కడి ప్రజలు పోరాటం చేశారు. అందుకే మోదీ అ ప్లాంట్ ను ఆంధ్రాలో నెలకొల్పటానికి సిద్ధపడుతున్నారని తెలిపారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను ఈ వీడియోను చూడండి..

16:29 - July 16, 2016

మెదక్‌ : జిల్లా రైల్వేలైను పనులకు మంత్రి హరీష్‌రావు భూమిపూజ చేశారు. 17 కిలోమీటర్ల రైల్వేలైను కోసం 120 కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వేశాఖ పనులను చేపట్టిందన్నారు. అయితే రైల్వేలైను కోసం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణకయ్యే ఖర్చును భరించి రైల్వైశాఖకు భూమిని ఇచ్చిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మెదక్‌ జిల్లా ప్రజలు రైలు కూత వింటారని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. రైల్వేలైను భూమిపూజ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. 

16:22 - July 16, 2016

విజయవాడ : పునాదిపాడు జంక్షన్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నడిరోడ్డుపై ఓవ్యక్తి మరోవ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. సైకిల్‌ను ఢికొట్టాడని బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సైకిలిస్ట్‌ కొట్టి చంపాడు. కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తు సాంబశివరావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లాలో సాంబశివరావు హత్య సంచలనం సృష్టించింది. సీసీ కెమెరాలో సాంబశివరావు హత్య దృశ్యాలు వెలుగుచూశాయి. నిందితుడు దేవరపల్లి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

16:17 - July 16, 2016

నల్లగొండ : జిల్లా కేంద్ర వైద్యశాలలో దారుణం జరిగింది.. డాక్టర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలయిపోయింది. శుక్రవారం నాడు డాక్టర్ అనూరాధ నిర్లక్ష్యానికి భూమిమీద పడకముందే ఓ పసిగుడ్డు వసివాడిపోయిన ఘటన మరువక ముందే మరో దారుణం జరిగిపోయింది. అనారోగ్యంతో అర్ధరాత్రి ఆస్పత్రికివచ్చిన మానసిక వికలాంగుడిని డాక్టర్లు ఆస్పత్రిలో చేర్చుకోలేదు... వైద్యుల కాళ్లావేళ్లాపడి బంధువులు విజ్ఞప్తి చేయడంతో నేలమీదే పడుకోబెట్టి సెలైన్‌ ఎక్కించారు.. గ్లూకోజ్ బాటిల్‌ ఎక్కడంలేదంటూ ఎన్నిసార్లు చెప్పినా వైద్యులు అటువైపే రాలేదు.. అనారోగ్యంతో నరకయాతనపడ్డ రోగి చివరకు నేలపైనే ప్రాణాలు విడిచాడు..

16:12 - July 16, 2016

హైదరాబాద్ : నైజీరియాలో కిడ్నాప్ కు గురయిన తెలుగువారు శ్రీనివాస్, అనీష్ లు విడుదల అయ్యారు. వీరిద్దరు సురక్షితంగా వున్నారని నైజీరియాలోని భారత హైకమిషనర్ బీఎన్ రెడ్డి తెలిపారు. దాదాపు 18 రోజుల క్రితం కిడ్నాప్ అయిన శ్రీనివాస్, అనీష్ లను నైజీరియా ప్రభుత్వం కిడ్నాపర్ల చెర నుండి విడిపించింది. ఈ విషయాన్ని విశాఖ లో వుంటున్న శ్రీనివాస్ భార్యకు సమాచారం అందించారు. నైజీరియాలో ఓ సిమెంట్ కంపెనీలో శ్రీనివాస్..అనీష్ లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరి నివాసం ఉంటున్న ప్రదేశంలో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. నైజీరియన్ ప్రభుత్వంతో భారత్ ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో వీరిని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

మాల్యాకు ఎదురుదెబ్బ..

ముంబై : బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముంబై మెట్రోపాలిటన్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

15:31 - July 16, 2016

కడప : 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు కడప జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లాలోని జీఎన్ఎం పోస్టుల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన జిల్లాల కలెక్టర్ అక్రమాలపై విచారణ జరిపించారు. అక్రమాలు నిరూపణ అవ్వటంతో కోఆర్డినేటన్ పాండురంగయ్య క్లర్క్ మోహన సింగ్ లను సస్పెండ్ చేశారు.

స్పందించిన కలెక్టర్ ..విచారణకు ఆదేశం..
జిల్లాలోని జీఎన్ఎం పోస్టుల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు జిల్లాల కలెక్టర్ స్పందించారు. అక్రమాలపై కలెక్టర్ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులతో కలెక్టర్ కోఆర్డినేటన్ పాండురంగయ్యతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దీనిపై విచారణ జరిపించమని ఆదేశాలు జారీ చేశారు.

10 టీవీ ఆపరేషన్ లో బుక్ అయిన మోహన్ సింగ్...
టెన్ టివి నిర్వహించిన ఆపరేషన్ లో మోహన్ సింగ్ బుక్కయ్యాడు. జీఎన్ఎం పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగాలని, చేస్తూంటే పోతే జాబ్ పర్మినెంట్ అవుతుందని మోహన్ సింగ్ పేర్కొన్నాడు. నా ఇళ్లు చూపించా..వారంలో ఇంటర్వూ కార్డు వస్తుందని..మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశాడు. 

10టీవీ ఎఫెక్ట్..అక్రమార్కుల సస్పెన్షన్..

కడప : 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందన. జిల్లాలోని జీఎన్ఎం పోస్టుల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు జిల్లాల కలెక్టర్ స్పందించిన జిల్లా కలెక్టర్ అక్రమాలపై విచారణ జరిపించారు. అక్రమాలు నిరూపణ అవ్వటంతో కోఆర్డినేటన్ పాండురంగయ్య క్లర్క్ మోహన సింగ్ లను సస్పెండ్ చేశారు. 

నైజీరియాలో కిడ్నాప్ అయిన తెలుగువారు క్షేమం..

హైదరాబాద్ : నైజీరియాలో కిడ్నాప్ కు గురయిన తెలుగువారు శ్రీనివాస్, అనీష్ లు విడుదల అయ్యారు. వీరిద్దరు సురక్షితంగా వున్నారని నైజీరియాలోని భారత హైకమిషనర్ బీఎన్ రెడ్డి తెలిపారు. 

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృతి..

ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్ జిల్లా గల్గామ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

14:51 - July 16, 2016

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌ లోయలో వదంతులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కేబుల్‌ టీవీ ప్రసారాలను నిలిపేశారు. కశ్మీర్‌ లోయ ప్రాంతంలో ఇప్పటికే గత వారం రోజులుగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ చేశారు. ఇప్పుడు కేబుల్‌ టీవీ ప్రసారాలు కూడా ఆపేశారు. పోలీసులతో ఘర్షణ కారణంగా తీవ్రంగా గాయపడి కుప్వారాలో ఒకరు, కుల్గాంలో ఒకరు శుక్రవారం ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్‌లో అత్యధిక సర్కులేషన్‌ గల పత్రిక 'గ్రేటర్‌ కశ్మీర్‌'పై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి సీజ్‌ చేసి 50 వేల కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హిజ్బూల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 36 మంది మృతి చెందారు.15 వందల మంది గాయపడ్డారు. కశ్మీర్‌లోని పలు నగరాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. తాజాగా పూంచ్‌లో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 

14:48 - July 16, 2016

అంకర  : టర్కీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..సైనిక కుట్రతో అనిశ్చితి కొనసాగుతోంది.. అధికారాన్ని తామే స్వాధీనం చేసుకున్నామని సైన్యంలోని ఒక వర్గం ప్రకటించగా.. కాదు తామే సైనిక తిరుగుబాటును అణచివేసినట్లు అధ్యక్షుడు ఎర్డొగాన్‌ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో ఏం జరుగుతుందన్న అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది.

సైనిక కుట్రను భగ్నం చేశామని ప్రకటించిన ప్రధాని..
దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం చేసిన ప్రయత్నం విఫలమైందని.. టర్కీలో పరిస్థితి అదుపులోనే ఉందని టర్కీ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఎదురు తిరిగిన సైన్యం ప్రయత్నాన్ని టర్కీ ప్రజలు ఐకమత్యంతో ఎదుర్కొన్నారని ప్రకటనలో తెలిపింది.తిరుగుబాటు దారులను పోలీసులు, మిగతా సైన్యం అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంటు భవనం, పలు కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు సైన్య వరుస దాడులకు పాల్పడింది. టర్కీ అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 13 మంది సైనికులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. తిరుగుబాటుకు ప్రయత్నించిన సైనికుల్లో 336 మందిని పోలీసులు అదుపుపులోకి తీసుకున్నట్లు టర్కీ ప్రధానమంత్రి వెల్లడించారు. తిరుగుబాటు దారులు ఉపయోగిస్తున్న సైనిక విమానాలను కూల్చేయాలని ప్రధాని ఆదేశించారు. తిరుగుబాటుకు యత్నించిన సైనికుల్లో 50 మంది బోస్ఫెరస్‌ బ్రిడ్జ్‌పై లొంగిపోయారు. మరికొందరు టక్సిమ్‌ స్క్వేర్‌ వద్ద లొంగిపోయినట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడి పిలుపుకు వీధుల్లోకి వచ్చిన లక్షలాదిమంది ..
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా టర్కీ అధ్యక్షుడి పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తిరుగుబాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇస్తాంబుల్‌ చేరుకున్న అధ్యక్షుడు పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ విమానాశ్రయం ఆర్మీ ఆధీనంలోకి వచ్చింది. కొన్ని గంటల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. విమానాశ్రయంలో తిరిగి విమాన సేవలను పునరుద్ధరించారు. టర్కీలో అనిశ్చితి కొనసాగుతోందినాటోలో కీలక దేశమైన టర్కీలో సైనిక తిరుగుబాటు జరగడంపై అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి దృష్టి సారించింది.

14:00 - July 16, 2016

చింతకాయల రవి, బాడీగార్డ్, మసాలా లాంటి ఎన్నో వినోదాత్మక చిత్రాలు తీసిన వెంకటేష్ మరో వినోదాత్మక చిత్రం తీయబోతున్నారు. వెంకీ కథనాయకుడుగా 'బాబు బంగారం' చిత్రం తెరకెక్కనుంది. గోపాల గోపాల తర్వాత వెంకీ ఈ చిత్రం చేస్తున్నారు. వెంకటేష్ సరసన నయనతార మరోసారి నటించనుంది. లక్ష్మి, తులసి చిత్రాల్లో వెంకటేష్ తో కలిసి నయనతార స్టెప్పులేసింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆ రెండు సినిమాలు హిట్ అయిన విషయం విధితమే. తాజాగా 'బాబు బంగారం'తో మరోసారి ఈ జంట కనువిందు చేయనుంది. ఈ చిత్రం వెంకటేష్, నయనతారలకు మరో హిట్ చిత్రం అవుతుందో లేదో చూడాలి... అయితే ఇంతకముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈనేపథ్యంలో బాబు బంగారం చిత్రం కూడా వెంకీ, నయనతారలకు హిట్ ఇస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి.. ఇది నిజం కావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

13:50 - July 16, 2016

ఇస్లామాబాద్ : పాకిస్థాని సన్సేషనల్‌ మోడల్‌, పాప్‌ స్టార్‌ ఖండీల్‌ బలోచ్‌ హత్యకు గురైంది. సొంత సోదరుడి చేతుల్లోనే బలోచ్‌ పరువు హత్యకు గురైనట్లు సమాచారం. సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన ఖండీల్‌ బలోచ్‌ భారత్‌లో పాపులర్‌ అయిన బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలో పాల్గొనాల్సి ఉంది. 25 సంవత్సరాల ఖండీల్‌ బలోచ్‌ గతంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ టీంకు మద్దతు ఇస్తూ ట్విట్టర్‌ ద్వారా పలు సంచలన పోస్టులు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. 

13:47 - July 16, 2016

విజయవాడ : 36 గంటల ఉత్కంఠ తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆదృశ్యమైన శిశువు మిస్సింగ్ మిస్టరీ వీడింది..అయితే అసలు ఐసీయూ ఉన్న శిశువును బయటకు ఎవరు తీసుకెళ్లారు ? నాగమల్లీశ్వరీకి బాబును ఇచ్చింది ఎవరు ? ఇందులో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం నాగమల్లీశ్వరినీ విచారిస్తున్నారు. కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు

 

13:44 - July 16, 2016

దేశముదురు, కంత్రి, పవర్, దేనికైనా రెడీ, సింగం వంటి పలు తెలుగు సినిమాల్లో నటించిన హన్సిక.. తన నటనతో అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం మరో తెలుగు సినిమాలో నటించనుంది. హీరో గోపిచంద్ తో మొదటిసారి కలిసి నటించనుంది. సంపత్‌ నంది, గోపీచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఆక్సిజన్' చిత్రంలో హన్సిక నటించనుంది. గోపిచంద్ తో కలిసి అమ్మడు స్టెప్పులేయనుంది. రెండేండ్ల తర్వాత హన్సిక తెలుగులో నటించబోతుంది. మరి మునుపటి సినిమాల్లాగా ఈ చిత్రం కూడా హిట్ అవుతుందో, హన్సికకు మంచి పేరు తెస్తుందో లేదో చూడాలి మరి. గోపిచంద్ కు మరో హిట్ ఇస్తుందో వేచిచూడాల్సిందే. గోపిచంద్, హన్సిక కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. ఈ జంట ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో.. వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి సంపద్‌ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

 

 

13:23 - July 16, 2016

హైదరాబాద్ : క్లిఫ్‌ డైవింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌.....బ్రిటన్‌ డైవర్‌ గ్యారీ హంట్‌ అజోరెస్‌లో అదరగొట్టాడు. ఫైనల్‌ రౌండ్‌లో బ్యాక్‌ హీల్‌ రివర్స్‌ టోటల్‌ స్పిన్‌ జంప్‌తో వీక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ సొంతంచేసుకున్న గ్యారీ...మిగతా లెగ్‌ పోటీల్లోనూ నెగ్గి మరోసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ సైతం సొంతంచేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. 

కృష్ణను చేరిన గోదావరి జలాలు...

విజయవాడ : గోదావరి జలాలు కృష్ణాను తాకాయి. ఫ్రెర్రీ వద్ద కృష్ణాలో గోదావరి కలిసింది. గోదావరి జలాలకు స్థానిక రైతులకు పూజలు చేశారు. ఈ నెల 9న పట్టిసీమ నుంచి చంద్రబాబు నీరు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి 182 కిలో మీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు ఇవాళ కృష్ణకు చేరుకున్నాయి.

13:19 - July 16, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు మూడువేల మంది పోలీసులు, నూట ఐదు సీసీ కెమెరాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తర మండలం డీసీపీ బీ సుమతి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవాసంస్థలతో సమన్వయ భేటీ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీజే స్పీకర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ సుమతి తేల్చి చెప్పారు. 

 

13:17 - July 16, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ సహా దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాల్లో ఈ అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి యూపీ సీఎం అఖిలేష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆధార్ కార్డులు విస్తృత వినియోగం, అంతర్గత భద్రత, ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తదితర కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

 

13:14 - July 16, 2016

హైదరాబాద్ : నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. లోటస్ పాండ్ లో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్ లో చట్టసవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిరాయింపుదార్లపై 3 నెలల్లోనే చర్యలు తీసుకునేలా సవరణ చేయాలని సూచించారు. చట్టసవరణ చేయకపోతే ప్రజాస్వామ్య మనుగడకే నష్టం వస్తుందని అన్నారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు తొలగించి ఎన్నికల సంఘానికి అప్పగించాలని పార్లమెంట్ లో తమ వాదన వినిపిస్తామన్నారు. 

 

13:02 - July 16, 2016

విజయవాడ : గోదావరి జలాలు కృష్ణాను తాకాయి. ఫ్రెర్రీ వద్ద కృష్ణాలో గోదావరి కలిసింది. గోదావరి జలాలకు స్థానిక రైతులకు పూజలు చేశారు. ఈ నెల 9న పట్టిసీమ నుంచి చంద్రబాబు నీరు విడుదల చేశారు. పట్టిసీమ నుంచి 182 కిలో మీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు ఇవాళ కృష్ణకు చేరుకున్నాయి.

 

12:59 - July 16, 2016

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్‌ శిశువు సురక్షితంగా తల్లి ఒడికి చేరడంపై సీపీఎం నేత బాబురావు హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాస్పత్రిలో భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ సంఘటనతో తేటతెల్లమైందని అన్నారు. మంత్రులకు, అధికారులకు రక్షణ కల్పించడం కాదని, సాధారణ పౌరులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

 

12:57 - July 16, 2016

విజయవాడ : పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శిశువు కిడ్నాప్‌ కథ సుఖాంతం కావడంతో మంత్రి కామినేని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు. శిశువును కనుగొనడంలో పోలీసుల పాత్ర అభినందనీయమని మంత్రి అన్నారు. 36 గంటల్లో బిడ్డను తల్లిఒడికి చేర్చారని అన్నారు. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. మిగతా ఆస్పత్రిల్లో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. 

 

12:48 - July 16, 2016

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ లో బలపరీక్ష నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబం టుకీ తన పదవికి రాజీనామా చేశారు. నూతన సీఎల్పీ లీడర్ గా పెమా ఖండూను ఎంపిక చేశారు. 

12:43 - July 16, 2016

ఢిల్లీ : కేంద్ర, రాష్ట్రాల మధ్య సయోద్యతోటే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలో 11వ అంతరాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో మోడీ మాట్లాడారు. విధానాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రాల పాత్ర కీలకమన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలకు కేంద్రం నిధుల వాటా పెంచామని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ, పూంఛీ కమీషన్ సిఫార్సులపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సమావేశానికి ఢిల్లీ సీఎం హాజరుకాలేదు. 

 

ప్రారంభమైన తమ్మినేని పాదయాత్ర

రంగారెడ్డి : జిల్లాలోని ముచ్చెర్లలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ప్రారంభం అయింది. పాదయాత్రను రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించారు. రెండు రోజులపాటు పాదయాత్ర కొనసాగునుంది. 

అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబం టుకీ రాజీనామా..

ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్ లో బలపరీక్ష నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబం టుకీ తన పదవికి రాజీనామా చేశారు. నూతన సీఎల్పీ లీడర్ గా పెమా ఖండూను ఎంపిక చేశారు. 

 

12:14 - July 16, 2016

కృష్ణా : బందరు అట్టుడుకుతోంది. పోర్టు పేరిట లక్ష ఎకరాల భూములు లాక్కునేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రతో ప్రజలు ఊగిపోతున్నారు. పోర్టుకు రెండు వేల ఎకరాలు చాలవా అన్న నోటితోనే.. ఇప్పుడు లక్ష ఎకరాలు కావాలంటుండడం... రైతులోకాన్ని రగిలిస్తోంది. ఇంతకాలం భూ సేకరణ అన్న ప్రభుత్వం.. ఇప్పుడు రాజధాని అమరావతి మాడ్యూల్‌లో భూ సమీకరణ చేస్తామంటోంది. ఈ ప్రకటన ప్రజల కలవరాన్ని రోజురోజుకీ పెంచుతోంది. 
బందరు పోర్టు కోసం లక్షా ఐదువేల ఎకరాల భూ సేకరణ 
కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతం అట్టుడుకుతోంది. ప్రతి ఒక్కరిలోనూ తమ భూమి తమకు కాకుండా పోతుందేమోనన్న వేదన కుదిపేస్తోంది. బందరు పోర్టు కోసం లక్షా ఐదువేల ఎకరాల భూమిని సమీకరిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన స్థానికులకు పిడుగుపాటే అయింది. బందరు పోర్టు కోసం 5,324 ఎకరాలు, ఇండస్ట్రియల్ కారిడార్ కు 23,948 ఎకరాలు, ఇండస్ట్రియల్ పార్క్ కు 929 ఎకరాలు, మెగా సిటీల ఏర్పాటుకు 14 వేల ఎకరాలు కలిపి మొత్తం 43,969 ఎకరాలు సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. భూములు సేకరించేందుకు కొత్తగా మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ మడను తెరపైకి తెచ్చింది. ఇంతకీ ఈ మడ ఏం చేస్తుంది..?
జీవో నెంబర్ 15 జారీ 
మచిలీపట్నం మున్సిపాల్టీతో పాటు 28 రెవెన్యూ గ్రామాలను మడ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 15ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ప్రభుత్వం రైతుల ఆమోదంతో నిమిత్తం లేకుండానే వారి భూములను లాక్కునే వీలు కలుగుతుంది. లక్ష ఎకరాలను సమీకరించేందుకు గాను.. ప్రభుత్వం మడ పరిధిని.. 426.16 చదరపు కిలోమీటర్లకు ఫిక్స్‌ చేసింది. ఈ విస్తీర్ణంలో.. మొత్తం లక్షా 5 వేల ఎకరాలను రైతుల ఆమోదంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. బందరు పోర్టు, దాని పరిసరాల్లో నిర్మించే పోర్టు ఆధారిత పరిశ్రమల కోసమే ఈ భూసేకరణ అని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఆ ప్రాంతంలోని భూములన్నీ మెట్ట భూములేనని బుకాయిస్తోంది. 
గ్రౌండ్‌ రిపోర్ట్‌..
ప్రభుత్వం చెబుతున్నట్లుగా మడ పరిధిలోకి వచ్చే పొలాలు నిజంగానే మెట్ట భూములా..? అక్కడ పంటలే పండవా..? మడ పరిధిలోకి వచ్చే గ్రామాల పొలాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఎంత పచ్చిగా అబద్ధం చెబుతుందో అర్థమవుతుంది.  గ్రామపు భూముల గురించి.. అక్కడి రైతుల వేదన గురించి టెన్ టివి గ్రౌండ్‌ రిపోర్ట్‌ అందించింది. ఆ వివరాలు వీడియాలో చూద్దాం.. 
సర్కారు నిర్ణయం వెనుక కుట్ర ఏంటి..?
బంగారు పండే భూముల్ని.. మెట్ట భూములని ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?విపక్షంలో ఉండగా రెండు వేల ఎకరాలు చాలన్న టీడీపీ.. ఇప్పుడు ఏకంగా లక్ష ఎకరాలు లాక్కోవాలని ఎందుకు అనుకుంటోంది? నిజానికి బందరు పోర్టుకు ఎంత భూమి అయితే సరిపోతుంది..? సర్కారు నిర్ణయం వెనుక కుట్ర ఏంటి..?
టీడీపీ తడవకొక్క మాట 
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూ సేకరణపై తెలుగుదేశం పార్టీ తడవకొక్క మాట చెబుతోంది. వైఎస్‌ సర్కారు పోర్టు కోసం ఐదున్నర వేల ఎకరాలు సేకరిస్తామంటే.. అప్పటి విపక్ష హోదాలో.. కేవలం రెండువేల ఎకరాలు సరిపోతుందని టీడీపీ వాదించింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే.. మాట మార్చేసింది. వేలు కాదు.. లక్ష ఎకరాలే కావాలంటోంది. 
తెరపైకి పోర్టు అంశం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే.. పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చింది. పోర్టు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం అప్పట్లో పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి.. రైతుల నుంచి మరో 20వేల ఎకరాల భూముల్ని సమీకరిస్తామని ప్రకటించింది. దీనికోసం నిరుడు ఆగస్టు 31న.. చీకటి నోటిఫికేషన్‌ను వెలువరించింది. అప్పట్లోనే ప్రభుత్వ చర్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
ప్రభుత్వ నోటిఫికేషన్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం 
ప్రభుత్వ నోటిఫికేషన్‌పై బందరు పరిసరాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి సర్వేల పేరిట వచ్చే అధికారులను రైతులు అడ్డుకున్నారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.  ప్రభుత్వ భూముల్లోనే పోర్టు నిర్మించాలని స్పష్టం చేశారు. జీవనాధారం కోల్పోతే తమకు చావే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. 
నిరసన జ్వాలలతో..కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం 
ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన జ్వాలలతో.. ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది.  భూ సేకరణ ప్రక్రియను వాయిదా వేసింది. అయితే అది తాత్కాలికమేనని.. సర్కారు భూదాహం మరింత పెరిగిందని తాజా క్యాబినెట్‌ తీర్మానంతో వెల్లడైంది. పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసమంటూ.. కొత్తగా మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ మడను ఏర్పాటు చేసింది. అంతేనా భూసేకరణ కాకుండా.. అమరావతి తరహాలో లక్ష ఎకరాలూ భూ సమీకరణ ద్వారానే తీసుకుంటామని ప్రకటించింది. 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపిస్తోందన్న భావన
ప్రభుత్వ చర్య.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తలపిస్తోందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక్కడి పేదల పొట్ట కొట్టి.. విదేశీ పెద్దలకు కట్టబెట్టేందుకే ఈ సమీకరణ అన్న భావన ప్రజల్లో స్థిరపడుతోంది. పైగా దేశంలోని ఏ పోర్టు కూడా రెండు వేల ఎకరాలకు మించి లేదు. అలాంటప్పుడు.. ప్రభుత్వం ఇక్కడ లక్ష ఎకరాలకు పైగా ఎందుకు సేకరిస్తోందన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. 
దేశంలోని వివిధ పోర్టుల విస్తీర్ణం వివరాలు
దేశంలోని వివిధ పోర్టుల విస్తీర్ణం వివరాలివి. ఏ పోర్టు కూడా మూడు వేల ఎకరాలను మించి లేదు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం బందరు పోర్టు కోసం లక్షకు పైగా ఎకరాలను సేకరించాలని భావిస్తోంది.. దీని వెనుక కుట్ర తేటతెల్లం.     
ఏపీలోని ఇతర పోర్టుల లావాదేవీలు ఎలా ఉన్నాయి..?
దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనేక పోర్టులు ఉన్నాయి. ప్రధాన పోర్టులైన విశాఖ, కాకినాడల నుంచి తప్ప మిగతా చోట్ల ఆపరేషన్స్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. వైఎస్ హయాంలో ఐరన్ ఓర్ చైనా తదితర దేశాలకు రవాణా అయ్యేది. దీని వల్ల కొంత యాక్టివిటీ ఉండేది. ప్రస్తుతం కాకినాడ పోర్టు నుంచి ఎరువులు, కళింగపట్నం నుంచి గ్రానైట్ ఎగుమతి అవుతుండగా, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు  పోర్టుల్లో  పెద్దగా కార్యకలాపాలు లేవంటున్నారు. ఓ మోస్తరు పోర్టుల పరిస్థితే ఇలా ఉంటే.. కళింగపట్నం, భీమునిపట్నం, నర్సాపూర్, నిజాంపట్నం, వాడరేవు, ముత్యాలమ్మపాలెం, నక్కపల్లి, మేఘవరం పోర్టులు ఎలా మనుగడ సాగిస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాంటప్పుడు ప్రభుత్వం లక్ష ఎకరాలు సమీకరించి.. బందరు పోర్టు.. ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామనడం.. ఎంతవరకు వయబుల్‌ అన్న సందేహం వ్యక్తమవుతోంది.  
స్థానికులు మండిపాటు... 
లక్ష ఎకరాలు సమీకరిస్తామంటున్న ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో అన్నీ మెట్ట భూములే అంటూ చేస్తున్న ప్రచారంపై స్థానికులు మండిపడుతున్నారు. రైతు కుటుంబంలో పెద్దకొడుకును అవుతానన్న చంద్రబాబు.. పొట్ట కొట్టే చర్యలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుంచి 10టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ను వీడియోలో చూద్దాం..
బందరు రైతు రగిలి పోతున్నాడు... 
బందరు రైతు రగిలి పోతున్నాడు. లక్ష ఎకరాల భూమిని లాక్కునేందుకు సర్కారు చేస్తున్న కుట్రలపై మండిపడుతున్నాడు. ఇరుగు పొరుగును సమీకరించుకుంటూ సంఘటితమవుతున్నాడు. దూకుడు మీదున్న సర్కారుకు ముకుతాడు వేసేందుకు.. మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాడు. 
ఏడాదికి మూడు పంటలు సాగయ్యే భూములే 
బందరు పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో.. ఏడాదికి మూడు పంటలు సాగయ్యే భూములే ఉన్నాయి. కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు వంటివి ఎక్కువగా పండిస్తున్నారు. తమ దిగుబడులను రైతులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఏటా పుష్కలంగానే సంపాదించుకుంటున్నారు. అయితే వీటన్నింటినీ మెట్ట భూములని ప్రభుత్వం ప్రచారం చేయడాన్ని రైతులు, జిల్లా నేతలూ ఆక్షేపిస్తున్నారు. 
రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం :  భూ పరిరక్షణ పోరాట సమితి 
పోర్టు పేరిట బలవంతపు భూ సమీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వంపై.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మించేందుకు భూ పరిరక్షణ పోరాట సమితి సన్నద్ధమవుతోంది. దీనికి వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్‌లు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ భూముల్లోనే పోర్టులు నిర్మించాలని తెగేసి చెబుతోంది. పార్టీలకు అతీతంగా స్థానిక గ్రామస్థాయి నాయకులంతా రైతులను సమీకరిస్తూ.. భూ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమానికి.. మద్దతు ప్రకటిస్తున్నారు. 
ఉద్యమ సెగతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..?     
మొత్తానికి పోర్టు కోసం లక్ష ఎకరాలు సమీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బందరు అట్టుడుకుతోంది. పాలక పక్షం నాయకులను గ్రామాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతోన్న ఆందోళన.. ఉద్యమ సెగతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..? లేక మొండిగా ముందుకే వెళుతుందా..? వేచి చూడాలి.

ప్రజలు తిరగబడడంతో వెనక్కితగ్గిన సైన్యం

అంకర : ప్రజల పోరాటం ఫలించింది. టర్కీలో సైనిక కుట్ర భగ్నమైంది. ప్రజల తిరగబడడంతో సైన్యం వెనక్కి తగ్గింది. ఎక్కడికక్కడ సైనికులను ప్రజలు బంధిస్తున్నారు. ఇప్పటివరకు 336 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

 

11:49 - July 16, 2016

అంకర : ప్రజల పోరాటం ఫలించింది. టర్కీలో సైనిక కుట్ర భగ్నమైంది. ప్రజల తిరగబడడంతో సైన్యం వెనక్కి తగ్గింది. ఎక్కడికక్కడ సైనికులను ప్రజలు బంధిస్తున్నారు. ఇప్పటివరకు 336 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

 

11:46 - July 16, 2016

కృష్ణా : విజయవాడ బాబు కిడ్నాప్‌ కేసులో నిందితులు నాగమల్లీశ్వరి, రాజులను పోలీసులు విచారిస్తున్నారు. ఐసీయు దగ్గర సెక్యూరిటీగార్డు వీరికి సహకరించినట్టు తెలుస్తోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన శిశువును అవనిగడ్డలో గుర్తించిన పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
నాగమల్లేశ్వరి ఇంటికి వెళ్లిన అవనిగడ్డ సీఐ 
డీఎస్పీ ఖాదర్‌ బాషా నేతృత్వంలో అవనిగడ్డ సీఐ మూర్తి రాత్రి పదిన్నర సమయంలో నాగమల్లేశ్వరి ఇంటికి వెళ్లారు. మహిళను, శిశువును పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి ఫోటో తీసి విజయవాడ కమిషనరేట్‌కు ఫోన్‌లో పంపించారు. శిశువు తమ బిడ్డేనని తల్లిదండ్రులు సుబ్రమణ్యం, కళ్యాణి గుర్తించారు. దీంతో ఎస్పీకి సమాచారమందించిన పోలీసులు పసికందును విజయవాడకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం శిశువును తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను అపహరించిన నాగమల్లేశ్వరికి గతంలో వివాహమైంది. భర్తతో వివాదాల కారణంగా విడిగా ఉంటున్న ఆమె ఏడాది క్రితం రాజు అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ అవనిగడ్డ వెంకటేశ్వర ధియేటర్‌ రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేరు. అయితే ఇంటి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. 

 

11:36 - July 16, 2016

రంగారెడ్డి : ప్రతిపాదిత ఔషధనగరి వారి జీవితాల్లో చీకట్లు నింపుతోంది. సర్కారు భూదందా కారణంగా.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల వరకూ రైతులు నష్టపోయారు. ప్రతిపాదిత ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం..కౌరు చౌకగా రైతులను పంట పొలాలను కొల్లగొట్టింది. అటు ఉపాధి లేక.. ఇటు సర్కారు ఇచ్చిన నష్ట పరిహరం ఏ మూలకూ చాలక.. రైతులు రెంటికీ చెడ్డారు. అందుకే 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని..  న్యాయంగా తమకు అందాల్సిన మొత్తాన్ని ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
రైతుల జీవితాల్లో ప్రభుత్వం చిచ్చు 
విన్నారుగా ముచ్చర్ల రైతుల గోస. పచ్చటి పంట పొలాల్లో నిప్పులు పోసినట్లు ప్రభుత్వం వీరి జీవితాల్లో చిచ్చు పెట్టింది. తమ నోటికాడి కూడు లాక్కొంటోందని రైతులు ఎంతలా మొత్తుకున్నా... ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టింది. ఒకటి కాదు..రెండు కాదు..వందల ఎకరాలు రైతుల నుంచి లాక్కొంది. రైతులు వద్దని వారించినా..బలవంతంగా వారినుండి భూములను లాగేసుకుంది. రైతులకు ఏదో మొక్కుబడి పరిహారం చెల్లించి పచ్చటి భూములను లాక్కొంది. ఫలితం.. రైతులు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా నష్టపోయారు. 
అంతర్జాతీయ ప్రమాణాలతో ముచ్చర్ల ఫార్మాసిటి 
ముచ్చర్ల ఫార్మా సిటీ..రాజధాని హైదరాబాద్‌ శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం జాతీయ రహదారుల మధ్య ప్రాంతంలో ఫార్మా సిటీ నిర్మాణానికి భూ సేకరణను సైతం చేపట్టింది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లు మండలంలో 12 వేల ఎకరాల్లో భూములను ఫార్మా సిటీ కోసం సేకరిస్తోంది. ఇప్పటి వరకు కందుకూరు మండలం ముచ్చర్ల, మీర్ఖాన్ పేట్, సాయిరెడ్డి గూడ, పంజాగూడ గ్రామాల్లో, యాచారం మండలం కురుమద్దిలో 3వేల ఎకరాలకు పైగా సేకరించింది. జీవో 123 కింద నష్ట పరిహరం చెల్లించి భూములను టీఎస్ ఐఐసీ స్వాధీనం చేసుకొని సొంతంగా కంచె కూడా వేసింది సర్కారు. 12 వేల ఎకరాల భూమిని సేకరించిన తర్వాత..ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు ఆయా భూములను అప్పజెప్పనుంది ప్రభుత్వం. 
భూములను స్వాధీనం చేసుకున్న టీఎస్ ఐఐసీ 
అయితే మల్లన్న సాగర్ నిర్వాసితులు జీవో 123ని కాదని..2013 భూ సేకరణ చట్ట ప్రకారమే తమకు నష్ట పరిహరం చెల్లించాలని ఉద్యమిస్తున్న నేపథ్యంలో..ముచ్చర్ల ఫార్మా సిటీ పరిసర గ్రామాల్లో 10టీవీ పర్యటించింది. జీవో 123 భూ నిర్వాసితులకు ఎంత మేర నష్టపరిహరం చెల్లించిదో పరిశీలించింది. అక్కడి రైతాంగానికి జీవో 123 ప్రకారం అధిక నష్ట పరిహరం అందిందా? లేక భూ సేకరణ చట్టం అమలు చేస్తే ఇంకా ఎక్కువ నష్ట పరిహరం అందేదా? అన్న అంశాలపై భూ నిర్వాసితుల అభిప్రాయాలను సేకరించింది. ఈ ప్రక్రియలో రైతుల ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేసింది 10 టీవీ. 
123 ప్రకారం నష్టపరిహారం అందిందా.? 
అయితే జీవో 123 వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల ఉపాధి అంశాన్ని విస్మరించిన జీవో.. నష్ట పరిహరం విషయంలోనూ తమకు అన్యాయం చేసిందని విలపిస్తున్నారు. భూ సేకరణ చట్టం అమలు చేయకపోవడం వల్ల తాము వందల కోట్ల మేర నష్టపోయామని రైతులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని లేదంటే.. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు ముచ్చెర్ల రైతులు. 
2013 భూ సేకరణ చట్టం ఏం చెప్తోంది..? 
అసలింతకీ 2013 భూ సేకరణ చట్టం ఏం చెప్తోంది. ఈ చట్టం అమలు చేస్తే ముచ్చర్ల రైతులకు చేకూరే లబ్ది ఏంటి..? ఇంతకీ ముచ్చర్లలో ఎకరం భూమి విలువ ఎంత ఉంది? ప్రభుత్వం రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంత ? ముచ్చర్ల  రైతులను ప్రభుత్వం దగా చేసిందా లేదా ? వాచ్ దిస్‌ స్టోరీ. 
ఎకరాకు పన్నెండున్నర లక్షలు చెల్లింపు 
కందుకూరు, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ రికార్డుల ప్రకారం ముచ్చర్ల గ్రామంలో ఎకరం విలువ ఏడున్నర లక్షలుగా
 2015లోనే నిర్ణయించారు. దానికనుగుణంగా జీవో 123 ప్రకారం రైతు పట్టా భూములకు ఎకరాకు పన్నెండున్నర లక్షలు, అసైన్‌మెంట్‌ భూమికి 8 లక్షల నష్ట పరిహరం చెల్లించారు. జీవో 123 అమలు చేస్తున్నందునే రిజిస్ట్రేషన్ విలువ కన్నా 5 లక్షలు అధికంగా నష్ట పరిహరం చెల్లించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. 
జీవో ప్రకారం ఇచ్చిన పరిహారం చాలా తక్కువే 
జీవో ప్రకారం ఇచ్చిన పరిహారం చాలా తక్కువేనన్నది స్పష్టం. అసలు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు ఎంత నష్ట పరిహరం వచ్చేదో ఓసారి పరిశీలిద్దాం. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రిజిస్ట్రేషన్‌ విలువకు కనీసం మూడు రెట్లకి తగ్గకుండా నష్ట పరిహరం చెల్లించాలి. అంటే ఎకరాకు రిజిస్ట్రేషన్ విలువ ఏడున్నర లక్షలున్న ముచ్చర్లలో రైతుకు కనీసం ఇరవై రెండున్నర లక్షల నష్ట పరిహరం అందాలి. అంటే ప్రతి ఎకరానికి రైతులు సుమారు పద్నాలుగున్నర లక్షలు నష్టపోయారన్న మాట. ఈ ఒక్క ముచ్చర్ల గ్రామంలోనే ప్రభుత్వం 862 ఎకరాలను సేకరించింది. అంటే.. ఇక్కడి రైతులే.. దాదాపు 125 కోట్ల రూపాయలను నష్టపోయారు. భూ సేకరణ చట్టం గురించి తమకు తెలియకపోవడంతో సర్కారు తమను నిండా ముంచేసిందని రైతులు లబోదిబోమంటున్నారు. 
2015లో ఎకరం విలువ రూ.7.5 లక్షలు 
ఇక మరో గ్రామం మీర్ఖాన్ పేటను తీసుకుందాం. ఇక్కడ ఎకరాకు 6 లక్షల 5 వేలు రిజిస్ట్రేషన్ విలువ ఉంది. ఇక్కడ 611 ఎకరాల భూమిని ఎకరం ఏడు లక్షల 70 వేల రూపాయల చొప్పున సేకరించింది ప్రభుత్వం. అదే భూ సేకరణ చట్ట ప్రకారమైతే ఎకరాకు 18 లక్షలకు పైగా నష్ట పరిహారం దక్కేది. అంటే మీర్ఖాన్ పేట్ రైతులు ఎకరాకు సగటున 10 లక్షలు నష్ట పోయారు. దీని వల్ల తమ ఒక్క గ్రామమే 60 కోట్ల వరకు నష్టపోయింది. ఇదే రీతిలో పంజాగూడ గ్రామంలోనూన ప్రతి ఎకరాకు 10లక్షల చొప్పున రైతులు నష్టపోయారు. అక్కడ 515 ఎకరాల భూ సేకరణ జరిగినందున..51 కోట్ల మేర నష్టపోయారు రైతులు. 
611 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం 
భూసేకరణ చట్టం ప్రకారమైతే ఎకరాకు రూ.18లక్షలు 
అంటే 10టీవీ పరిశీలించిన ముచ్చర్ల, మీర్ఖాన్ పేట్, పంజాగూడ గ్రామాల్లోనే రైతులు జీవో 123 వల్ల సుమారు 250 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. ఇక మిగిలిన అన్ని గ్రామాలను కలుపుకుంటే అది వేయికోట్ల వరకు ఉండొచ్చనేది రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇక అసైన్డ్, నాన్ అసైన్డ్ అన్న తేడాలను తొలగిస్తే అది మరింత పెరుగుతుందంటున్నారు. అదే సందర్భంలో కేవలం నగదు రూపంలోనే కాకుండా..జీవో 123 వల్ల ఎన్నో రకాలుగా నష్ట పోతున్నారు ఇక్కడి ప్రజలు. భూ సేకరణ వల్ల ఉపాధి కోల్పోయిన కుంటుంబాలకు నెలకు 2వేల చొప్పున 20 సంవత్సరాలు లేదా ఒకేసారి 5లక్షల ఉపాధి పరిహరం చెల్లించాలని భూ సేకరణ చట్టం సెక్షన్ 31, 38, 105 షెడ్యుల్ 2 స్పష్టం చేస్తోంది. కానీ జీవో 123లో అలాంటి నిబంధనలు లేకపోవడంతో..వారిని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. ఫార్మాసిటీ నిర్మాణం పూర్తయితే కనీసం 70 వేల మందికి ఉద్యోగాలిస్తామని ఆశలు కల్పిస్తుంది తప్ప ..ప్రస్తుతం జీవనోపాధి చూపించడంలేదు. ఈ మూడు గ్రామాల్లో చేసిన భూ సేకరణ వల్ల 2వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అదే భూ సేకరణ చట్టం అమలు చేస్తే భూమికి భూమి పరిహారంగా దక్కేదని, ఉపాధి కూడా లభించేదంటున్నారు ఇక్కడి ప్రజలు. 
రోడ్డున పడ్డ 2వేల కుటుంబాలు 
అందుకే  రైతులకు వేలకోట్ల రూపాయల నష్టం చేస్తున్న 123 జీవోను రద్దు చేసి.. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని ముచ్చర్ల ఫార్మా నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి దాకా బలవంతపు భూ సేకరణ ఆపాలని కోరుతున్నారు. అయితే దీనిపై నిర్వాసిత గ్రామాల రైతులకు అండగా పోరాడేందుకు మేమున్నామంటూ సీపీఎం పాదయాత్ర చేపడుతోంది. శనివారం నాడు ఆయా గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రైతులకు అండగా పాదయాత్ర చేయబోతున్నారు. 

10:57 - July 16, 2016

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు. వనస్థలిపురం ప్రశాంతి నగర్ లో నివాసముంటున్న రాకేష్ అనే విద్యార్థి బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన ఉంటున్న ఇంట్లో   ఈరోజు తెల్లవారుజామున చార్జింగ్ పెట్టిన సెల్ ఫెన్ తో మాట్లాడుతున్నాడు. ఈక్రమంలో సెల్ ఫోన్ బాగా వేడిక్కి అతనికి షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో రాకేష్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.

అంతరాష్ట్ర మండలి సమావేశం ప్రారంభం

ఢిల్లీ : హస్తినలో అంతరాష్ట్ర మండలి సమావేశం ప్రారంభం అయింది. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. 

 

వనస్థలిపురంలో విషాదం...

హైదరాబాద్ : వనస్థలిపురంలోని ప్రశాంతి నగర్ లో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు. సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో అతను మృతి చెందాడు.

ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఎపి సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో అంతరాష్ట్ర మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించే అవకాశం ఉంది.

ప్రారంభమైన వైసీపీ పార్లమెంటరీ సమావేశం

హైదరాబాద్ : లోటస్ పాండులో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం అయింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

 

నేడు సంగారెడ్డిలో మంత్రి జోగు రామన్న పర్యటన

మెదక్ : నేడు సంగారెడ్డిలో మంత్రి జోగు రామన్న పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 

నేడు శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం

తిరుమల : నేడు శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం జరుగనుంది.  సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై స్వామివారిని తిరుమల పుర వీధుల్లో ఊరేగించనున్నారు.

 

09:42 - July 16, 2016

అంతరాష్ట్ర మండలి సమావేశం చాలా కీలకమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత సమ్మారావు, సీపీఎం నేత వెంకట్, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. గతంలో కూడా అనేక సార్లు అంతారష్ట్ర మండలి సమావేశాలు జరిగాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:28 - July 16, 2016

అంకర : టర్కీలో సైన్యం తిరుగుబాటు జరిగింది. సైనిక దళాలు దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసిప్ ఎర్డోగాన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు చేసింది. దేశంలో మార్షల్ లా ప్రకటించి, సైనికి చట్టాలను అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.  రాజధాని అంకార గగనతలంలో సైనిక విమానాలు. హెలికాప్టర్లు పహారా నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరిగాయి. ఇస్తాంబుల్ వీధుల్లో సైనిక ట్యాంకులు తిరుగుతున్నాయి. 
17 మంది పోలీసులు మృతి.. 
ఎర్డోగాన్ పాలనలో దేశంలో ఉగ్రవాదం , నిరంకుశపాలన పెరగడంతో తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నట్టు సైనికాధికారులు ప్రకటించారు. టర్కీ జాతీయ టీవీ, రెడియోలు పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లాయి.  టర్కీ సైన్యం వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 17మంది పోలీసులు మృతి చెందారు. ప్రస్తుతం టర్కీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక తిరుగుబాటు నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకోనే వరకు టర్కీలోని భారతీయులంతా ఇళ్లలోన్ ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు సైనిక తిరుగుబాటును అధ్యక్షుడుఎర్డోగాన్ ఖండించారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. 

 

08:47 - July 16, 2016

కృష్ణా : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు కథ సుఖాంతమైంది. శిశువు ఆచూకీ లభ్యం అయింది. పోలీసులు శిశువును క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారు. నిన్న రాత్రి 12 గంటలకు అవనిగడ్డలో నాగమల్లేశ్వరీ, రాజా అనే ఇద్దరు వ్యక్తుల వద్ద శిశువును పోలీసులు గుర్తించారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శిశువును ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. పోలీసులు శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. శిశువును అప్పగించినందుకు పోలీసులకు, మీడియాకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువు క్షేమంగా లభ్యం కావడంతో కుటుంభ సభ్యులు అనందం వ్యక్తం చేశారు. కామెర్లవ్యాధితో బాధపడుతున్న బాబుకు వైద్యులు చికిత్స చేశారు. శిశువు కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితులు నాగమల్లేశ్వరీ, రాజాను గవర్నర్ పేట పీఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్న బాబును ఎలా కిడ్నాప్ చేశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సహకరించిందా.. లేదా నాగమళ్లీశ్వరే శిశువును అపహరించిందా.... అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. 
 

నేడు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళం : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు. 

కొవ్వాడ అణుప్రాజెక్టు ప్రతిపాదన ప్రాంతంలో ప్రకాశ్ కరత్ పర్యటన

శ్రీకాకుళం : జిల్లాలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు పర్యటించనున్నారు.  కొవ్వాడ అణుప్రాజెక్టు ప్రతిపాదన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాని కార్యదర్శి ప్రకాష్ కరత్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రణస్థలం మండలం కోష్టలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

 

నేడు వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశం

హైదరాబాద్ : నేడు వైసీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.  

 

08:03 - July 16, 2016

విజయవాడ : ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. పీకల వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీనీ గట్టెక్కించేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల నడ్డి విరిచేసేందుకు  సిద్ధమవుతోంది. 
ఆర్టీసీ చార్జీలు పెంపుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సంస్థ  యాజమాన్యం కసరత్తును  ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ చార్జీలను పెంచమన్న చంద్రబాబు ఆ మాటలను తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలున్నాయి.  ఇప్పటికే ఓ సారి ఆర్టీసీ చార్జీలను పెంచగా.. మరోసారి ప్రయాణికులు నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారు. 
ఏడాదికి రూ. 18 కోట్ల మేర ప్రయాణికులపై భారం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో 2015 అక్టోబర్ 24న ఆర్టీసీ పెంచారు. దీనివలన  విజయవాడతోపాటు, కృష్ణా రీజియన్ పరిధిలోని ప్రయాణికులపై రోజుకు 5 లక్షల రూపాయలు.. నెలకు కోటిన్నర.. ఏడాదికి 18 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడింది. సర్వీస్, టోల్‌ టాక్స్‌లు, ఇన్సూరెన్స్ రూపాల్లో ప్రయాణికుల నుంచి అదనంగా రుసుం వసూలు చేస్తోంది. 
కృష్ణా రీజియన్‌లో రూ. 18 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ 
ప్రస్తుతం కృష్ణా రీజియన్ లో 18 కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో 14 డిపోల్లో విజయవాడ, ఆటోనగర్ డిపోలు లాభాల్లో నడుస్తుండగా.. మిగిలిన 12 డిపోల్లో నష్టాలు చవిచూస్తున్నాయి. సగటున ఏసీ బస్సులపై 10 శాతం, ఆర్డిననరీ సర్వీసులపై 5 శాతం చొప్పున అదనపు చార్జీల భారం మోపారు.
ఆర్టీసీని ప్రైవేటీకరణం చేయాలని ప్రభుత్వం యోచన : సీపీఎం
చార్జీల భారమే కాకుండా సర్వీస్ ట్యాక్స్, సేఫ్టీ సెస్, టోల్ గేట్ చార్జీలు అదనంగా ప్రయాణికుల నుంచే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్జీసీ యాజమాన్యం సంస్థనుగట్టెక్కించే చర్యలపై దృష్టిసారించకుండా క్రమక్రమంగా  ప్రైవేటీకరణ వైపు దిశగా తీసుకెళ్లే క్రమంలోనే  ప్రయాణికులపై భారాలు మోపుతున్నాయని  సీపీఎం విమర్శిస్తోంది. 
అక్రమ వాహనాల వల్ల ఆర్టీసీ ఖజానాకు గండి
అనేక రూపాల్లో ఆర్టీసీ సంస్థల నుంచి పన్నుల రూపంలో ఏడాదికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం తన ఖజానాను నింపుకుంటోంది. అక్రమ వాహనాల తాకిడికి ఏడాదికి వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీతో పాటు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రయాణికులపై భారాలు మోపే ఆలోచనలను విరమించుకోవాలని కోరుతున్నారు. చార్జీల పెంపుతో ఆర్టీసీపై ప్రయాణికులకు నమ్మకం సన్నగిల్లుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

07:52 - July 16, 2016

కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా అమరావతి-నా ఇటుక కార్యక్రమం చతికలపడుతోంది. ఎన్ని ప్రచారాలు, పర్యటనలు చేపట్టినప్పటికి ఇటుకల సంఖ్య మాత్రం పెరగడంలేదు.  రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎందుకు తగ్గిపోయింది.. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యామా? లేక మరేదైనా  ఉందా? తెలుసుకోవాలంటే వాచ్‌ దిస్ స్టోరీ... 
అమ్మో అమరావతి
ఏపీ రాజధాని అమరావతి పేరులోనే రాజసం ఉట్టిపడుతోంది. అమరావతి అనగానే ప్రజల రాజధాని అని గుర్తొచ్చేలా ప్రభుత్వం ప్రచారాన్ని హోరెత్తించింది. దానికి తగ్గట్టే  శంకుస్థాపనకు యావత్ ప్రజానీకం మొత్తం తరలివచ్చింది. తరువాత పలు కార్యక్రమాల్లో సైతం రాజధానికి ప్రజలే ఆయువు పట్టు అని నాయకులు ఊదరగొట్టారు. అయితే అహో...అమరావతి అన్న వాళ్లే ఇప్పుడు అమ్మో అమరావతి అంటున్నారు. దీనికి 'నా అమరావతి నా ఇటుక' కార్యక్రమమే ఓ ఉదాహరణ.
'నా అమరావతి నా ఇటుక' వైబ్ సైట్ ప్రారంభం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని గతేడాది అక్టోబర్‌ 15న  చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందుకు 'నా అమరావతి నాఇటుక' అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.  ప్రతి ఒక్కరూ ఓ ఇటుకను కొని రాజధానికి విరాళాలు ఇవ్వాలని కోరారు.  సీఎం పిలుపు మేరకు ఒక్కరోజులోనే 2 లక్షల 20 వేల ఇటుకలు అమ్ముడయ్యాయి. దేశం నలుమూలల నుంచి శంకుస్థాపన రోజు వరకూ మొత్తం 33 లక్షల 52 వేల ఇటుకలు కొని 50 వేలకు పైగా ప్రజలు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
భారీగా పడిపోయిన ఇటుకల కొనుగోలు
ఇంతలా ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రం, క్రమక్రమంగా ఆదరణ కోల్పోయింది. ఇటుకల కొనుగోలు భారీగా పడిపోయాయి.. మొదటి మూడు నెలలోనే జనవరి 15 వరకూ 53 లక్షలకు చేరుకున్న ఇటుకల సంఖ్య.... నేటికి 55 లక్షలకే పరిమితమైంది. . ప్రారంభమైన మూడు నెలల్లో రెండు లక్షల మందికి పైగా కొనుగోళ్లు జరిపితే ఆ తరువాత ఆరు నెలల్లో కేవలం రెండు వేల ఐదు వందల మంది మాత్రమే ఇటుకల కొనగోళ్లు జరిపారు. 
ఇటుకల కొనగోళ్లు తగ్గడానికి ఎన్నో కారణాలు
ఇటుకల కొనుగోళ్లు తగ్గడానికి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ప్రజా రాజధాని అని ప్రచారం సాగించిన మంత్రివర్గం, ప్రజల భాగస్వామ్యం కన్నా విదేశీ పెట్టుబడులపైనే మొగ్గుచూపడం. పెట్టుబడుల కోసం విదేశాలు పర్యటిస్తున్నారే తప్ప ప్రజలకు దగ్గర కాలేకపోతున్నారు. అంతే కాకుండా ఇది కేవలం రాజధాని అమరావతి కోసమే కావడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు రాజధాని మనది అనే భావన రాకపోవడం...అహో అమరావతి అన్న ప్రభుత్వం తాజా లెక్కలతో చతికలబడింది. 5 కోట్ల ఆంధ్రుల్లో కేవలం 50 వేల  మంది మాత్రమే అమరావతిలో భాగస్వామ్యం అయ్యారు. మరీ ఇది ప్రజా రాజధాని ఎలా అవుతుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

07:45 - July 16, 2016

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌లో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వైద్య సేవలపై చర్చించారు. తమ రాష్ట్రంలో కూడా  గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలను  ప్రారంభించాలని చంద్రబాబు కోరగా... ఇందుకు బిల్‌ గేట్స్‌ అంగీకరించారు. విజయవాడలోని ఎన్ టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గేట్స్‌ ఫౌండేషన్‌ వైద్య సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 20 నుంచి 23 వరకు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సు సందర్భంగా బిల్స్‌ గేట్స్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

 

07:41 - July 16, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు అధికార యంత్రాంగమంతా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అన్ని పనులు నిర్ణీత గడవులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పుష్కర నగరం విజయవాడ సుందరీకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. 
వచ్చే నెల 12 నుంచి పుష్కరాలు ప్రారంభం 
వచ్చే నెల 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలపై చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖ అధికారులు హాజరైన ఈ భేటీలో పలు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో జరిగే పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని  ప్రభుత్వ నిర్ణయించింది. 
పుష్కర పనుల పురోగతిపై నివేదికలు 
పుష్కరాల పనులల్లో జాప్యం జరిగిదితే సహించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారులను నిత్యం పనులను పర్వవేక్షిస్తూ, పురోగతిపై నివేదికలు అందించాలని ఆదేశించారు. రెవిన్యూ, పోలీసు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని కోరారు. భద్రతా చర్యలపై సూచనలు చేశారు. నిఘాను ముమ్మరం చేయాలని ఆదేశించారు. నగరంతోపాటు, కాల్వల సుందరీకణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకోవాలి  కోరారు. యాత్రికుల రద్దీకి తగ్గట్టుగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. 
రూ.378 కోట్లతో మూడు జిల్లాల్లో రోడ్లు 
మరోవైపు పుష్కరాల కోసం వివిధ జిల్లాల నుంచి భక్తులను చేరవేసేందుకు 300 కొత్త బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ ఆర్డర్‌ ఇచ్చింది. ఈనెలాఖరుకు ఇవి  ఆర్టీసీలో చేరతాయి. మూడు జిల్లాల్లో 378 కోట్లతో చేట్టిన రోడ్ల నిర్మాణం పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతోపాటు 400 బస్సులను రిజర్వు పూల్‌లో ఉంచి అవసరమైన ప్రాంతాలకు పంపిస్తారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జరుగుతున్న పుష్కర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 18న  ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. 

 

07:36 - July 16, 2016

ఢిల్లీ : పదేళ్ల విరామం తర్వాత అంతరాష్ట్ర మండలి ఇవాళ ఢిల్లీలో భేటీ అవుతోంది. ఈసమావేశంలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు హస్తినకు పయమన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలుతోపాటు, శాంతిభద్రతలు, పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
జస్టిస్‌ పూంచి కమిషన్‌ సిఫారసులపై చర్చ 
అంతరాష్ట్ర మండలి భేటీకి సర్వం సిద్ధమయ్యింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. కేంద-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్‌ పూంచి కమిషన్‌ సిఫారసులతోపాటు వివిధ అంశాలపై సమీక్షిస్తారు. అంతర్గత భద్రత, పాఠశాల్లలో విద్యాప్రమాణాల పెంపు, సబ్సిడీ పథకాలకు ఆధార్‌ అనుసంధానం, నగదు బదిలీ తదితర అంశాలపై చర్చిస్తారు. 
1999లో అంతరాష్ట్ర మండలి ఏర్పాటు
పదేళ్ల తర్వాత అంతరాష్ట్ర మండలి భేటీ అవుతోంది. రాజ్యాంగంలోని 263 ఆర్టికల్‌ ఆధారంగా రాష్ట్రపతి ఆదేశాలతో 1990 మే 28న  అంతరాష్ట్ర మండలి ఏర్పాటయ్యింది. కేంద-రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంపొందించుకునే లక్ష్యంతో ఏర్పాటైన అంతరాష్ట్ర మండలి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎక్కువగా ఉన్న కాలంలో తరచు సమావేశమయ్యింది. కానీ తర్వాత  పాంత్రీయ పార్టీల అధికార ప్రాబల్యం పెరడంతో బ్రేక్‌ పడింది. అంతరాష్ట్ర మండలి భేటీలో ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రాన్ని లక్ష్యాంగా చేసుకుని ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడటంతో  తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భేటీలను తగ్గించారు.  యూపీఏ హయాంలో 2006లో జరిగిన భేటీ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 
నేరుగా సీఎంలను కలసుకోనున్న మోడీ 
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వతా అంతరాష్ట్ర మండలిని పునరుద్ధరించారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు భేటీ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ముఖ్యమంత్రులందర్నీ ఒకే వేదికపై  నేరుగా కలుసుకోనుండటం ఇదే మొదటిసారి. పదిహేడు మంది కేంద్ర మంత్రులు కూడా నేరుగా సీఎంలతో మాట్లాడతారు. ముఖ్యమంత్రులు లేవనెత్తిన వివిధ అంశాలను చర్చిస్తారు. అంతరాష్ట్ర మండలి భేటీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారమే ఢిల్లీ  వెళ్లారు.  రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై నివేదికను వెంటతీసుకెళ్లారు. హైకోర్టు విభజనతోపాటు, రాష్ట్రానికి కేంద్ర సాయం, కేంద్ర పథకాలకు నిధుల కోత, రాష్ట్ర ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయింపు వంటి అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. అంతరాష్ట్ర మండలి భేటీ తర్వాత ఈనెల 17, 18 తేదీల్లో కేసీఆర్‌ పలువురు కేంద్ర మంత్రులును కలుసుకుంటారు. 
ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం 
అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళుతున్నారు. ఈ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చంద్రబాబు  వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. విభజన తర్వాత రాష్ట్ర ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులను ఈ వేదిక ద్వారా మరోసారి కేంద్రం దృష్ఠికి తీసుకెళ్లే అవకాశం ఉంది. రెవిన్యూ లోటు, అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై కూడా ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. అలాగే జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర కేటాయిస్తున్న అరకొర నిధులు అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. 
కేంద్ర విధానాలపై విరుచుకుపడనున్న విపక్ష సీఎంలు 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర విధానాలపై విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందన్న విమర్శలు వినవస్తున్న సమయంలో జరుగుతున్న అంతరాష్ట్ర మండలి భేటీ.... మొత్తంమీద వాడివేడిగా సాగే చాన్స్‌ ఉందంటున్నారు.

కిడ్నాపైన శిశువు క్షేమం.. తల్లిదండ్రులకు అప్పగింత

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన శిశువు క్షేమంగా ఉంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో శిశువును పోలీసులు గుర్తించారు. నిందితులు నాగమల్లీశ్వరి, రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. శిశువును ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు.
 

07:23 - July 16, 2016

అంకర : టర్కీలో సైన్యం తిరుగుబాటు జరిగింది. సైనిక దళాలు దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసిప్ ఎర్డోగాన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు చేసింది. దేశంలో మార్షల్ లా ప్రకటించి, సైనికి చట్టాలను అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. రాజధాని అంకార గగనతలంలో సైనిక విమానాలు. హెలికాప్టర్లు పహారా నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరిగాయి. ఇస్తాంబుల్ వీధుల్లో సైనిక ట్యాంకులు తిరుగుతున్నాయి. ఎర్డోగాన్ పాలనలో దేశంలో ఉగ్రవాదం , నిరంకుశపాలన పెరగడంతో తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నట్టు సైనికాధికారులు ప్రకటించారు. టర్కీ జాతీయ టీవీ, రెడియోలు పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లాయి. సైనికి తిరుగుబాటు నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకోనే వరకు టర్కీలోని భారతీయులంతా ఇళ్లలోనే ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు సైనిక తిరుగుబాటును అధ్యక్షుడు ఎర్డోగాన్ ఖండించారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. 

నేడు అంతరాష్ట్ర మండలి సమావేశం...

ఢిల్లీ : పదేళ్ల విరామం తర్వాత అంతరాష్ట్ర మండలి ఇవాళ ఢిల్లీలో భేటీ అవుతోంది. ఈసమావేశంలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు హస్తినకు పయమన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలుతోపాటు, శాంతిభద్రతలు, పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

 

నేటి నుంచి ముచ్చర్లలో తమ్మినేని పాదయాత్ర..

రంగారెడ్డి : నేటి నుంచి ముచ్చర్లలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేయనున్నారు. మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ పాల్గొననున్నారు. 

ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి మృతి

గుంటూరు : నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సతీ వియోగం కలిగింది. సాంబశివరావు సతమీమణి లీలాకుమారి(60) గుండెపోటుతో మృతి చెందారు. 

07:07 - July 16, 2016

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శిశువు కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. శిశువు ఆచూకీ లభ్యం అయింది. కిడ్నాపైన శిశువు క్షేమంగా ఉంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో శిశువును పోలీసులు గుర్తించారు. నిందితులు నాగమల్లీశ్వరి, రాజులను అరెస్ట్ చేశారు. శిశువును ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. కాసేపట్లో శిశువును తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. 

 

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన శిశువు క్షేమం

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన శిశువు క్షేమంగా ఉంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో శిశువును పోలీసులు గుర్తించారు. నిందితురాలు నాగమల్లీశ్వరినీ అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. కాసేపట్లో శిశువును తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. 

టర్కీలో సైనిక తిరుగుబాటు..

అంకర : టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశ వ్యాప్తంగా మార్షల్ చట్టం, సైన్యం కర్ఫ్యూ ప్రటించింది. నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రవాదానికి నిరసనగా తిరుగుబాటు చేశారు. దేశ రాజధానిలో సైనిక విమానాలు, హెలికాప్టర్లతో పహారా కాస్తున్నారు. సైన్యం వైమానిక దాడుల్లో 17 మంది పోలీసులు మృతి చెందారు. దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ సైనిక తిరుగుబాటును ఖండించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని అధ్యక్షుడు పిలుపునిచ్చారు. 

Don't Miss