Activities calendar

18 July 2016

22:02 - July 18, 2016

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బీజేపీకి షాక్ ఇచ్చాడు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరే ఉద్దేశంతోనే ఆయన ఈ రెండు పదవులకు రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధూను ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

బీజేపీ సభ్యత్వం, ఎంపీ పదవులకు సిద్ధూ రాజీనామా ..
మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీలో సిద్ధూ చేరే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ ఎన్నికల్లో సిద్ధూ కీలక పాత్ర పోషించబోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆప్‌ అధిష్టానంతో చర్చలు జరిపిన మీదటే ఈ రెండు పదవులకు సిద్ధూ రాజీనామా చేశారని సమాచారం. ఎంపీ పదవికి సిద్ధూ చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదించారు.

ఆప్‌లో చేరే అంశంపై రెండు రోజుల్లో అధికార ప్రకటన...
సిద్ధూను కలుసుకునేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండు రోజుల్లో పంజాబ్‌ వెళ్లొచ్చని భావిస్తున్నారు. అప్పుడు ఇద్దరు నేతలు చర్చలు జరిపిన మీదట ఆప్‌లో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ముందు సిద్ధూ ఒక జాతీయ టీవీ చానల్‌తో మాట్లాడుతూ పంజాబ్‌ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని చెప్పడాన్ని బట్టి పరిశీలిస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీలోనే చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.

2004, 2009 ఎన్నికల్లో అమృత్‌సర్‌ నుంచి సిద్ధూ గెలుపు..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ రెండు సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అమృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీకి సీటు ఇచ్చిన బీజేపీ... సిద్ధూను తప్పించింది. అప్పటి ఎన్నికల్లో అరుణ్‌ జైట్లీ ఓడిపోయారు. అప్పట్లో అమృత్‌సర్‌ లోక్‌సభ సీటు ఇవ్వకపోవడం వెన్నుపోటు అంటూ సిద్ధూ చేసిన విమర్శలు బీజేపీ నాయకత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి.

రాజీనామా ప్రకటించిన నవజ్యోత్‌ కౌర్‌ ...
సిద్ధూతోపాటు ఆయన భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ కూడా బీజేపీ ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ బీజేపీకి గుడ్‌ బై చెప్పడం ద్వారా పంజాబ్‌లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్‌, కమలనాథుల కూటమికి పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ ఈ ఏడాది ప్రారంభంలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నాట్టు ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించి, ఆ తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. మరోవైపు సిద్ధూ రాజీనామాను ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వాగతించింది. అయితే సిద్ధూ దంపతులిద్దరూ ఆప్‌లో చేరతారా... అన్నమీడియా ప్రశ్నకు ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ సమాధానం దాటవేశారు. మొత్తమీద తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే సిద్ధూ ద్వయం ఆప్‌లో చేరడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. 

21:57 - July 18, 2016

ఢిల్లీ : కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులపై తొలిరోజు రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. కశ్మీర్‌ కల్లోలానికి బిజెపి-పిడిపి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. కశ్మీర్‌ హింస వెనక పాకిస్తాన్‌ హస్తముందని కేంద్రం స్పష్టం చేసింది.

బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్‌..క‌శ్మీర్‌లో హింస...
ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్‌ త‌ర్వాత క‌శ్మీర్‌లో చెల‌రేగిన హింసాత్మక ఘటనలపై రాజ్యసభలో కాంగ్రెస్‌ చర్చను ప్రారంభించింది. క‌శ్మీర్‌లో మిలిటెంట్లను రూపుమాపాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగ‌తిస్తామ‌ని...అయితే సాధార‌ణ పౌరుల ప‌ట్ల భద్రతాదళాలు ప్రవ‌ర్తిస్తున్న తీరుపై ఆ పార్టీ మండిపడింది. క‌శ్మీర్‌లో శాంతి భద్రతలు కాపాడేందుకు భారీ ఎత్తున బలగాలను పంపడాన్ని తప్పుపట్టింది. బీజేపీ-పీడీపీ కూట‌మి వ‌ల్ల క‌శ్మీర్‌లో హింస ప్రజ్వరిల్లుతోంద‌ని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.

కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ..
కశ్మీర్‌ హింసపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను బిజెపి తిప్పికొట్టింది. కశ్మీర్ లో అల్లర్లకు వేర్పాటువాదులే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన బుర్హాన్‌ వానిని హీరో చేయడం వల్లే కశ్మీర్‌లో హింస చెలరేగిందన్నారు. కశ్మీర్ లో వేర్పాటువాదులను ఎదుర్కోవాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు.

కశ్మీరీ యువతకు ఎన్డీయే చూపే మార్గం ఏంటి ? : సీపీఎం
కశ్మీర్‌లో యువత అసంతృప్తితో రగిలిపోతోందని, కశ్మీరీ యువతకు మీరు చూపే మార్గం ఏంటని సిపిఎం కేంద్రాన్ని నిలదీసింది. కశ్మీర్‌పై చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో బిజెపి పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. కశ్మీర్‌ను శాంతి భద్రతల సమస్యగా భావిస్తే ఈ సమస్యను ఎన్నటికీ పరిష్కరించలేరని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

కశ్మీర్‌ హింస వెనక పాక్‌ హస్తం : రాజ్ నాథ్ సింగ్
కశ్మీర్‌ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది బుర్హాన్‌వానిపై 15 కేసులున్నాయన్నారు. కశ్మీర్‌లో ఇప్పటివరకు 566 హింసాత్మక ఘటనలు జరిగాయని, 1948 మంది ప్రజలు, 1671 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. అల్లరి మూకలు 25 చోట్ల ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాయన్నారు. కశ్మీర్‌ హింస వెనక పాక్‌ హస్తముందని హోంమంత్రి ఆరోపించారు.

కశ్మీర్ లో శాంతికి విపక్షాల సూచనలు..
దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన విపక్షాలు...కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు అన్నిపార్టీలు కలిసి పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి సూచించాయి. 

21:50 - July 18, 2016

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ బిజీ బిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కేసీఆర్‌ భేటీ అయ్యారు. హైకోర్టు విభజనతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించారు.
ప్రధానితో సీఎం కేసీఆర్..
రాష్ట్ర సమస్యల పరిష్కారమే అజెండాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్లమెంటు భవనంలో మొదట ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలను ఆయనకు వివరించారు. హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలు, కేంద్రం నుంచి రావల్సిన నిధుల గురించి మోదీతో ప్రస్తావించినట్లు సమాచారం.

అరుణ్‌జైట్లీతో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం భేటీ ..
అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర సమస్యలపై జైట్లీకి.. కేసీఆర్‌ వినతి పత్రం ఇచ్చారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది.

ఉమాభారతితో కేసీఆర్‌ భేటీ..
సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో కేసీఆర్‌ భేటీ అయ్యారు. నీటిపారుదల విషయంలో తెలంగాణ ప్రయత్నాలు బాగున్నాయని ఉమాభారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి పంపకాలు తదితర విషయాలపై ఇరువురు కీలకంగా చర్చించినట్లు సమాచారం. మిషన్‌ కాకతీయ ప్రయోగం దేశం మొత్తానికి మంచి ఉదాహరణ అని ఉమాభారతి అన్నారు. తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రిని కేంద్ర టాస్క్‌ ఫోర్స్‌లో పెట్టామని, రాష్ట్ర విధానాలు మిగతా రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నిస్తామన్నారు. మిషన్‌ కాకతీయ పనులు చూసేందుకు త్వరలో తెలంగాణకు వస్తానని ఉమాభారతి హామీ ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉమాభారతి తెలిపారు.

21:46 - July 18, 2016

హైదరాబాద్ : తాగుబోతుల ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా.. చిన్నారి రమ్య కుటుంబం.. 18 రోజుల్లోనే మూడో మరణాన్నిచూడాల్సి వచ్చింది. 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రమ్య తాత మధుసూదనాచారి ఈఉదయం కన్ను మూశారు. ఒకటో తేదీ యాక్సిడెంట్‌ జరిగిన స్థలంలోనే రమ్య బాబాయి.. ఆ తర్వాత చిన్నారి రమ్య.. ఇప్పుడు తాతయ్య మధుసూదనాచారి.. వరుసగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

రమ్య కుటుంబాన్ని వెంటాడిన విషాదం ...
గుండె తడి ఆరడం లేదు.. కన్నీటి వర్షం ఆగడం లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోతున్నాయి. అయినా వారి ఆవేదన తీరడం లేదు. చిన్నారి రమ్య కుటుంబంలో తాగుబోతులు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే రమ్యతో పాటు ఆమె బాబాయి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబంలో ఇవాళ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. పంజాగుట్ట కారు ప్రమాదంలో గాయపడి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి 18 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం ఉదయం తుది శ్వాస వదిలారు.

కుటుంబమంతా మానసికంగా చనిపోయిందన్న రమ్య తండ్రి ..
రమ్య తాత మధుసూదనాచారి చనిపోవడంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తమ కుటుంబం మానసికంగా చనిపోయిందని రమ్య తండ్రి వెంకటరమణ విలపిస్తున్నారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం తమను కలచి వేస్తుందన్నారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు నిందితులను ఉరి తీసినప్పుడే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని తరలించేది లేదని యశోద ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

ఆందోళనపై స్పందించిన మంత్రి తలసాని..
రమ్య కుటుంబ సభ్యులకయ్యే వైద్యఖర్చులను ప్రభుత్వమే భరించేలా సీఎంతో చర్చిస్తామని మంత్రి తలసాని ప్రకటించారు. త్వరలోనే రమ్య కుటుంబ సభ్యులను సీఎంతో కల్పిస్తామన్నారు. మంత్రి తలసాని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మధుసూదనాచారి భౌతికకాయానికి వరంగల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

టీజీఐ ప్రైడే బార్ లైసెన్స్‌ రద్దు..
పంజాగుట్ట రోడ్డు ప్రమాద ఘటనలో... ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. నిందితులైన మైనర్లకు మద్యం విక్రయించినందుకు టీజీఐ ప్రైడే బార్ లైసెన్స్‌ రద్దు చేసింది. ఈ బార్‌లనే శ్రావెల్ అతని స్నేహితులు మద్యం తాగి... పంజాగుట్ట వద్ద... రమ్య ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి ముగ్గురి మృతికి కారణమయ్యారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో మైనర్లకు మద్యం విక్రయిస్తున్న బార్లు, వైన్‌ షాపులతో చర్యలు కోరుతూ ఆందోళనలు జరిగాయి. దీంతో విచారణ జరిపిన ఎక్సైజ్‌ శాఖ.. ఇవాళ బార్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీచేసింది.

 

21:39 - July 18, 2016

గుంటూరు : జాస్మిన్‌ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది....ప్రేమ వ్యవహారమే యువతి ఆత్మహత్యకు కారణమని తేలింది. ప్రియుడితో మాట్లాడిన విషయం సోదరుడికి తెలిసిపోవడం..ఆపై అతడు మందలించడమే జాస్మిన్‌ ఆత్మహత్యకు దారితీసినట్లు తెలుస్తోంది...ఆ తర్వాత జరిగిన పరిణామాలు... సాయి మృతి చెందడం కలకలం రేపింది... ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు..

పెదవి విప్పిన ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్...
గుంటూరు జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన జాస్మిన్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడుతోంది. ప్రేమ వ్యవహారమే ఆమె సూసైడ్‌కు కారణమన్న విషయం బట్టబయలైంది..గ్రామస్తులు దేహశుద్ది చేయడంతో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ పెదవి విప్పాడు...తన స్నేహితుడు సాయి,జాస్మిన్‌ ల మధ్య ప్రేమవ్యవహారం ఉందంటూ కుండబద్దలు కొట్టాడు...నిన్నటి వరకు సాయి, పవన్‌లే జాస్మిన్ మృతికి కారణమని భావించినా.. ఆదివారంనాడు అసలు అక్కడేం జరిగిందన్న విషయాలను బయటపెట్టాడు పవన్...

రేపల్లే ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత..ముందుజాగ్రత్తగా 144 సెక్షన్‌ విధింపు
మరోవైపు రేపల్లె ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. సాయి మృతికి పోలీసులే కారణమంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆసుపత్రి వద్ద 144 సెక్షన్ విధించి శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు...

తన కొడుకును బలితీసుకున్నారంటూ ఆరోపణలు..
ఇదిలా ఉంటే జాస్మిన్‌ మరణం తర్వాత అనుమానంతో గ్రామస్థులు కొట్టిన దెబ్బలకు తాళలేక మృతి చెందిన సాయి తల్లి బోరుమంటోంది.. తన కొడుకు మరణానికి పోలీసులే కారణమంటూ ఆరోపిస్తోంది...పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మాత్రం సాయి బతికేవాడని ఆమె చెబుతోంది..

కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్న పోలీసులు..
గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు...మరోవైపు రెండు వైపులా కుటుంబాల్లోని ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే సాయి మృతికి కారణమైనవారిని గుర్తించి కేసులు పెట్టేందుకు సిద్దమయ్యారు... 

20:58 - July 18, 2016

రోజువారీ ఎలా ఉన్నా, ఫంక్షన్స్ ని వెళ్లేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా కనిపించాలనే కోరుకుంటాం.. నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలనే ఆశపడతాం. మరి అలాంటి పార్టీస్ కి నప్పే డ్రెసెస్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. 

20:58 - July 18, 2016

అసలే పేదరికం.. అమ్మానాన్న భారం. అంతలోనే పెను రోడ్డు ప్రమాదం. కోలుకోవడం కష్టం. అయినా వాటన్నింటి ముందు ఆమె సంకల్పం గెలిచింది. విధి ఓడిపోయింది. ఇప్పుడు ఎందరికో స్పూర్తి మంత్రంగా నిలుస్తోంది. సమస్యలను అధిగమించాలని వలస బాట పట్టింది.. ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ సభ్యుల కష్టాలు కొంతైనా తన భుజాలమీద వేసుకోవాలనుకుంది. కానీ, అంతలోనే, పెను ప్రమాదం. కోలుకుంది. నిలబడింది. అనుకున్నది సాధించింది. అన్నపూర్ణ ఆర్థిక సమస్యలతో, మానిన, మానుతున్న, మానాల్సిన గాయాలతో జీవితమనే పరీక్షలో నిలబడింది. ఇప్పటిదాకా విజేతగానే నిలిచింది. ఇకముందు కూడా ఆ జయకేతనాన్నే ఎగరేయాలని మానవి ఆకాంక్షిస్తోంది. మరిందరికో ఆమెకు బాసటగా నిలవాలని కోరుకుంటోంది.

20:53 - July 18, 2016

సుప్రీం వేసిన బౌన్సర్ కి బీసీసీఐ దారికొస్తుందా? భారత క్రికెట్ నిర్వహణ గాడిలో పడుతుందా? క్రికెట్ ని ఇష్టారాజ్యంగా నడిపే సంఘాలకు చెక్ పడుతుందా? లోధా సిఫారసులు ఏం చెప్తున్నాయి? ప్రజల సొమ్మును పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసే ఆటలో ఇప్పుడు జవాబుదారీ తనం వస్తుందా? లోధా సిఫార్సుల అమలుకు సుప్రీం ఆదేశంపై ఈ రోజు వైడాంగిల్ చూద్దాం.. మార్పులు చాలా ఉన్నాయి. సుప్రీం ఆదేశాలు పక్కాగా అమలైతే చాలా డిఫరెన్స్ రావచ్చు. ప్రపంచంలోనే బలమైన క్రికెట్ బోర్డుకు పట్టిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. రాజకీయాల నీడ లో నలుగుతున్న ఆటకు విముక్తి లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ జోక్యానికి అతీతంగా భారత క్రికెట్ ని చూడగలమా? పారదర్శకమైన నిర్వహణ సాధ్యపడుతుందా? అసలు లోథాకమిటీ సిఫార్సులు ఏం చెప్తున్నాయి. వాటివల్ల బీసీసీఐలో ఎలాంటి మార్పులొస్తాయి..

బీసీసీఐకి అంత క్రేజ్ ఎలా వచ్చింది?.. 
క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐకి అంత క్రేజ్ ఎలా వచ్చింది. ఆటగాళ్లకు చెల్లించటానికే నిధులు లేని పరిస్థితి నుంచి ప్రపంచంలోనే బలమైన సంస్థగా ఎలా ఎదిగింది? భారత్ క్రికెట్ హబ్ ఆఫ్ ది వాల్డ్ గా ఎలా ఎదిగింది?

క్రికెట్ బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ..
క్రికెట్ బెట్టింగ్ ని చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఇంత కాలం గుట్టుగా చేస్తున్న ఈ పనిని ఇప్పుడు దర్జాగా చేయగలిగితే ఎలా ఉంటుంది..? దీనివల్ల క్రికెట్ లో మాఫియా తగ్గుతుందా? అసలిది సాధ్యమేనా? సుప్రీం ఈ అంశాన్ని పార్లమెంట్ కి వదిలేసింది. పార్లమెంట్ ఆమోదిస్తే బెట్టింగ్ ఎలాంటి ఫలితాలిస్తుంది. చాటుమాటు వ్యవహారాలెందుకు చట్టబద్ధం చేస్తే పోలా.. అంటోంది జస్టిస్ లోథా కమిటీ. బెట్టింగ్ చట్టబద్ధం చేయమంటూ సిఫారసు చేసింది. కానీ, దీనిపై క్రికెట్ అభిమానుల్లో, విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆటను మరింత భ్రష్టు పట్టిస్తుందనే వారు కొందరైతే, ఆట సంగతి తర్వాత... క్రికెట్ మాయలో బికారులుగా మారే సామాన్యులు పెరుగుతారనే వాదనలూ ఉన్నాయి. సుప్రీం సూచనల్లో పార్లమెంటుకు వదిలిన బెట్టింగ్ లాంటి అంశాలు తప్ప మిగిలినవి క్రికెట్ మేలు చేస్తాయనే పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఏ సంస్థ అయినా, ప్రజల విశాల ప్రయోజనాలను, దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిందే. స్వయం ప్రతిపత్తి ఉన్నా లేకున్నా అవి సమాజం నుండి, ఈ దేశ ప్రజల సొమ్ము నుండి బతుకుతున్నవే. సో, వాటి నియంత్రణ అవసరమే. సో, భారత క్రికెట్ ఫ్యూచర్ ఎలా మారుతుందో త్వరలో తేలుతుంది.

20:34 - July 18, 2016

కేసీఆర్ అంటే మాకిష్టం అంటున్న హిజ్రాలు..ఎందుకో చూడుండ్రి...తప్పుచేసినోల్లకు చరవాణిని అదేనుల్ల సెల్లుఫోను దూరం చేస్తే సరి..అంటున్నాడు  మన మల్లన్న ..భూమిస్తానని మోసం చేసిన కేసీఆర్..కొలువుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ జనాలు..స్వర్ణ దేవాలయంలో బాసన్లు తోమిన కేజ్రీవాల్ ..ఉత్తమ గ్రామ పంచాయితీ లో నీటికోసం వీధిలోకొచ్చిన ఆడబిడ్డలు...మద్యం తాగి ఆడళ్లతోని డాన్సులు కట్టిన ఎమ్మెల్యే..ఇటువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న తీసుకొచ్చిండు..మరి ఈ ముచ్చట్లను చూడాలనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

20:18 - July 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల పర్వం తుది దశకు చేరుకుంది. గత 15 రోజులుగా కొనసాగుతున్న ప్రచారం పర్వానికి తెరపడింది. మంగళవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమవుతుంది. తెలంగాణ ఆర్టీసీగా రూపాంతరం చెందటానికి తొలి గుర్తింపు కావటంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో రాజిరెడ్డి (ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి), వీ.ఎస్ రావు (ఎస్ డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు. వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

విచారణకు హాజరైన శ్రీవాణి..

రంగారెడ్డి : వదిన ఇంటిని కూలగొట్టిన కేసులో టీవీ నటి శ్రీవాణి పోలీసుల విచారణకు హాజరయ్యారు. నగరంలోని వికారాబాద్‌లోని సీఐ కార్యాలయానికి ఆమె వచ్చారు.

సైనిక తిరుగుబాటులో '9వేలమంది సస్పెన్షన్?!!..

టర్కీ: సైనిక తిరుగుబాటును విజయవంతంగా ఎదుర్కొన్న టర్కీ దేశంలో దాదాపు 9వేల మంది అధికారులను సస్పెండ్‌ చేసింది. తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉన్నారనే అనుమానంతో టర్కీ దేశవ్యాప్తంగా అధికారులను పదవుల నుంచి తొలగిస్తోంది. తాజాగా సస్పెండ్‌ అయిన వారిలో పెద్ద సంఖ్యలో దాదాపు 7,900 మంది పోలీసులు ఉన్నారు. ఓ ప్రొవిజినల్‌ గవర్నర్‌ను, వివిధ పట్టణాలకు చెందిన 29 మంది గవర్నర్లను కూడా తొలగించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే సుమారు 6వేల మంది జ్యుడీషియరీ, మిలిటరీ అధికారులను సస్పెండ్‌ చేసింది.
టర్కీలో సైనికి వర్గం తిరుగుబాటు..

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..

ఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వెబ్ సైట్ల హ్యాంకింగ్ లతో అంతర్జాలయం అట్టుడికిపోతోంది. తాజాగా ఎయిరిండియా అంతర్గత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఈ ఘటనలో మాజీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జైపూర్‌కు చెందిన 23ఏళ్ల అనితేష్‌ గిరి గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మరాఠా అసెంబ్లీ దద్దరిల్లింది..

ముంబై : దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. కాంగ్రెస్‌-ఎన్సీపీ సభ్యుల నినాదాలతో అటు అసెంబ్లీ, శాసనమండలి అట్టుడికాయి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు ఇదే ఘటనపై శాసనమండలిలో సైతం విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ కాసేపు వాయిదా పడింది.

సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు..

హైదరాబాద్ : దిల్ సుక్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆలయ యాజమాన్యం బాంబ్ స్వ్కాడ్ కు సమాచారం అందించటంతో ఆలయానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసిన బాంబ్ లేదని తేల్చారు. ఎవరో ఆకతాయిలు ఈ కాల్ చేసి వుండవచ్చని భావిస్తున్నారు.

మంత్రి పదవికి కేజే జార్జ్‌ రాజీనామా!..

కర్ణాటక : రాజధాని అభివృద్ధి మంత్రి కేజే జార్జ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో ఆయనతోపాటు, ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మడికేరి కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని జార్జ్‌ నిర్ణయం తీసుకున్నారు. మంగళూరు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న గణపతి ఆత్మహత్యకు పాల్పడడటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది

ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏడీఈ..

గుంటూరు :  ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కింది. రూ.40వేలు లంచం తీసుకుంటూ లంచం తీసుకుంటూ వినుకొండ ఎలక్ట్రిసిటీ ఏడీఈ శ్రీనివాసరావు ఏసీబీకి దొరికిపోయాడు  . 

సునీల్ మిట్టల్ తో భేటీ కానున్న కేటీఆర్..

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం మలేషియా ఉపప్రధాని, జపాన్, తైవాన్, కొరియా రాయబారులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సునీల్ మిట్టల్‌ను కేటీఆర్ కలవనున్నారు. 

18:58 - July 18, 2016

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను గురించి వివరించారు. వీటిని పరిశీలించేందుకు రాష్ర్టానికి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటిపారుదల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మిషన్ కాకతీయ పనులను చూసేందుకు త్వరలో తాను తెలంగాణకు రానున్నట్టు వెల్లడించారు. మిషన్ కాకతీయ ప్రయోగం దేశం మొత్తానికే ఆదర్శమని అన్నారు. తమ శాఖకు కూడా సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు మిగతా రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని కేంద్ర టాస్క్‌ఫోర్స్‌లో పెట్టామని తెలిపారు.

18:48 - July 18, 2016

విజయవాడ : ప్రకాశం బ్యారేజీనుంచి కుడి కాలువకు నీరు విడుదలైంది.. కృష్ణా డెల్టా రైతాంగానికి దాదాపు 5వందల క్యూసెక్కుల నీటిని విడుదలచేశామని అధికారులు ప్రకటించారు.. బ్యారేజీలోకివచ్చే గోదావరినీటినికూడా కాల్వలకు మళ్లిస్తామని చెప్పారు.. తాగునీటి అవసరాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.. కైకలూరు, కలిదిండితోపాటు పలు గ్రామాల్లో నారుమళ్లు వేసుకునేందుకు ఈ నీరు ఉపయోగపడనుంది.... పోలవరం కుడికాల్వనుంచి పట్టిసీమ నీరు వస్తుందని... ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.. 

18:42 - July 18, 2016

గుంటూరు : రేపల్లెలో జాస్మిన్, సాయి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆదివారం మహ్మదీయపాలెంలో జాస్మిన్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. జాస్మిన్ మృతికి సాయి కారణమని బంధువులు..గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో సాయి మృతి చెందాడు. సాయి మృతికి కారకులైన వారిని అరెస్ట చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్తకు దారితీసింది. కాగా గుంటూరు జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన జాస్మిన్ అనుమానాస్పద మృతి చెందిన ఘటనలో పరిణామాలు రకరకాలుగా కోణంలో పరిభ్రమించిన విషయం తెలిసిందే.  

18:32 - July 18, 2016

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ విధానంలోనే అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెప్టెంబర్‌ 1 వరకు సీఆర్డీఏ బిడ్లను స్వీకరించనుంది..సీఆర్డీఏ సుమారు 6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణానికి బిడ్డింగ్‌ను వెల్లడించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మించాలని ఏపీ కేబినెట్ గతంలోనే ఆమోదముద్ర వేసింది. ఇతర సంస్థల నుంచి కౌంటర్ ఛాలెంజ్‌ను కోరాల్సి ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో భాగంగా సింగపూర్‌ సంస్థల కన్సార్టియం దాఖలుచేసిన ప్రతిపాదనలకు ఇతర సంస్థల నుంచి ఛాలెంజ్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్‌ 1 వరకు బిడ్లను స్వీకరించనున్న సీఆర్డీఏ ..
తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి సంస్థలు కీలక రాజధాని నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు జెపి కన్‌స్ట్రక్షన్స్‌, గంగవరం, మచిలీపట్నం వంటి కీలక పోర్టుల నిర్మాణంలో పాత్రధారులుగా ఉన్న ఇతర సంస్థలు కూడా ఛాలెంజ్‌ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ సంస్థలు ప్రతిపాదనను బహిర్గతం చేసిన తర్వాత మిగతా సంస్ధలకు దానిని ఛాలెంజ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 45 రోజుల గడువు ఇచ్చింది. ఈ క్రమంలో సింగపూర్ కంపెనీల కన్సార్షియం కన్నా తక్కువకు నిర్మాణం పూర్తిచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే, అదే మొత్తానికి సింగపూర్‌ అంగీకరిస్తే ఆ సంస్థకే టెండర్‌ ఖరారవుతుంది, లేకుంటే తక్కువ మొత్తానికి ప్రతిపాదించిన సంస్థకు టెండర్‌ లభిస్తుంది. ఈ విషయంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి అమరావతి నిర్మాణ అప్ డేట్స్ ను తెలుసుకోండి..

జాస్మిన్, సాయి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి..

గుంటూరు : రేపల్లెలో జాస్మిన్, సాయి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆదివారం మహ్మదీయపాలెంలో జాస్మిన్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. జాస్మిన్ మృతికి సాయి కారణమని బంధువులు..గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో సాయి మృతి చెందాడు. సాయి మృతికి కారకులైన వారిని అరెస్ట చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్తకు దారితీసింది.

నకిలీ ఐస్ క్రీమ్ కేంద్రాలపై దాడి..

హైదరాబాద్ : కుషాయిగూడలో నకిలీ ఐస్ క్రీంల తయారీ కేంద్రాలపై ఎస్ వోటా పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. 225 లీటర్ల నకిలీ ఐస్ క్రీం, 150 లీటర్ల డాల్డాను స్వాధీనం చేసుకున్నారు. 

17:56 - July 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న స్వీపర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. వేతనాలు పెరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అవి అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సెక్రటరీయేట్‌లో స్వీపర్లు పడుతున్న ఇబ్బందులపై 10 టీవీ ప్రత్యేక కథనం..

పెంచిన వేతనాలు అందక దయనీయస్థితిలో కార్మికులు ...
సచివాలయం నుంచి తీసుకునే పాలనపరమైన నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతాయి. కానీ అక్కడ పనిచేస్తున్న పారశుద్ధ్య కార్మికులకు మాత్రం అవి అమలు కావడంలేదు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికలకు వేతనాలు పెంచి నెలలు గడుస్తున్నా... నేటికీ ఆ ఫలాలు అందని పరిస్థితి..

చాలిచాలనీ జీవితాలతో కార్మికుల సతమతం..
జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వేరేచోట విధులు నిర్వహిస్తున్న కార్మికులకు మాత్రం పెరిగిన వేతనాలు అందుతుంటే సచివాలయం కార్మికులకు మాత్రం అవి అందటం లేదు. దీంతో స్పీపర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకుస్తున్నామని వాపోతున్నారు. తమలాగే పనిచేసే జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేసే కార్మికులకు 12 వేల జీతం ఇస్తూ.. తమకు మాత్రం ఏడు వేలే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమగోడు పట్టించుకుని వెంటనే పెంచిన వేతనాలను అమలు చేయాలని కోరుతున్నారు. 

17:45 - July 18, 2016

లార్డ్స్ : మక్కా లార్డ్స్‌ స్టేడియంలో మిస్బా ఉల్‌ హక్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. 20 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టుపై టెస్ట్‌ విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టును 75 పరుగుల తేడాతో చిత్తు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. బ్యాట్స్‌మెన్‌ అంతంత మాత్రంగానే రాణించినా...పాక్‌ బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో ఇంగ్లీష్‌ టీమ్‌కు ఓటమి తప్పలేదు.

ఉత్కంఠ మ్యాచ్..
ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు అనూహ్యంగా ఓడింది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ సెంచరీతో 339 పరుగులుచేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా స్పిన్‌ మ్యాజిక్‌ ముందు బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో 272 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్‌ బౌలర్ల ధాటికి 215 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్‌ జట్టు ఆతిధ్య జట్టు ముందు 283 పరుగుల లక్ష్యాన్నుంచింది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిధ్య జట్టు పాక్‌ బౌలర్ల జోరు ముందు మరోసారి తేలిపోయింది.

రాణించిన పేసర్లు..
పేసర్లు రాహత్‌ అలీ, మహమ్మద్‌ అమీర్‌, స్పిన్నర్‌ యాసిర్‌ షాలను ఎదుర్కోవడంలో ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో ఆతిధ్య జట్టు 207 పరుగులకే ఆలౌటైంది. 75 పరుగుల తేడాతో నెగ్గిన పాకిస్థాన్‌ జట్టు...నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి పాకిస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన యాసిర్‌ షాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. లార్డ్స్‌ స్టేడియంలో 20 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై పాకిస్థాన్‌ జట్టు టెస్ట్‌ విజయం సాధించడం విశేషం.పాకిస్థాన్‌ జట్టు ఇదే స్థాయిలో రాణిస్తే...టెస్ట్‌ సిరీస్‌లో ఆతిధ్య ఇంగ్లండ్‌ జట్టుకు కష్టాలు తప్పవనడంలో ఎటువంటి సందేహం లేదు.

17:41 - July 18, 2016

హైదరాబాద్ : ఈనెల 23 న కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను కట్టే విషయంలో అనాలోచితంగా, నియంత్రృత్వంగా వ్యవహరిస్తుందని ఉత్తమ్ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, సరైన డీపీఆర్ లేకుండా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులను తాము వ్యతిరేకిస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు.

కేసీఆర్ పౌరహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు : జీవన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 800 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడిని మళ్లించి సీఎం కేసీఆర్‌ పౌరహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇక రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌... ఇప్పటివరకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించలేదన్నారు. రైతుల రుణాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇప్పటికైనా రైతులకు రుణమాఫీ చేసి రైతుల కష్టాలను తీర్చాలన్నారు.

 

17:39 - July 18, 2016

ప్రో-కబడ్డీలీగ్ లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ కమ్ సూపర్ రైడర్ రాహుల్ చౌదరి రికార్డుల మోత మోగిస్తున్నాడు. సీజన్ కు వందపాయింట్ల చొప్పున సాధిస్తూ నాలుగో సీజన్ ముగియటానికి ముందే నాలుగు వందల మార్క్ ను అందుకొన్నాడు. కబడ్డీలీగ్ చరిత్రలో 400 రైడింగ్ పాయింట్లు సాధించిన ఒకే ఒక్కడిగా చరిత్ర సృష్టించాడు. రాహుల్ చౌదరి రైడింగ్ షో పై ప్రత్యేక కథనం..రాహుల్ చౌదరి...దేశ విదేశాలలోని కోట్లాది మంది ప్రోకబడ్డీ అభిమానులకు ఏమాత్రం పరిచయం అక్కరలేని పేరు. కేవలం రైడింగ్ ద్వారా అత్యధిక పాయింట్లు సాధించిన మొనగాడు. 2014 సీజన్లో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ తొలి సీజన్లోనే...తెలుగు టైటాన్స్ జట్టులో సభ్యుడిగా అరంగేట్రం చేసిన రాహుల్..సీజన్ సీజన్ కూ తన ప్రతిభను మెరుగుపరచుకొంటూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. తెలుగు టైటాన్స్ కెప్టెన్ గా జట్టును ముందుండి విజయపథంలో నడిపిస్తున్నాడు.

2014 ప్రారంభం..
2014 ప్రారంభ కబడ్డీలీగ్ సీజన్లో యూ-ముంబా జట్టుపైన రాహుల్ రైడింగ్ పాయింట్ల సెంచరీ పూర్తి చేశాడు. ప్రోకబడ్డీలో వందపాయింట్ల రికార్డు చేరిన తొలిరైడర్ గా నిలిచాడు. 2015 సీజన్లో బెంగాల్ వారియర్స్ పై రాహుల్ చౌదరి 200 పాయింట్ల మైలురాయిని చేరాడు. 2016లో జరిగిన మూడోసీజన్లో ...దబాంగ్ ఢిల్లీ పై రాహుల్ చౌదరి ..ట్రిపుల్ సెంచరీ పాయింట్ సాధించాడు. ఇక..ప్రస్తుత నాలుగో సీజన్లో...రాహుల్ నిలకడగా రాణించడం ద్వారా మొదటి తొమ్మిదిరౌండ్ల పోటీలు ముగిసే సమయానికే 400 రైడింగ్ పాయింట్ల రికార్డు నెలకొల్పాడు.

మురిసిపోతున్న రాహుల్..
బెంగళూరు శ్రీకంఠీరవ ఇండోర్ స్టేడియం వేదికగా పూణేరీ పల్టాన్ తో ముగిసిన 9వ రౌండ్ పోటీలో రాహుల్ చౌదరి పూర్తిస్థాయిలో చెలరేగిపోయాడు. పదిపాయింట్లతో తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. పూణేతో మ్యాచ్ ముగిసే సమయానికి రాహుల్ సాధించిన పాయింట్ల సంఖ్య 403కు చేరింది. ఇలాంటి ఘనత సాధించగలనని తాను ఎప్పుడూ ఊహించలేదని నాలుగు వందల రైడింగ్ పాయింట్లు సాధించడం తనకు గర్వకారణమంటూ రాహుల్ మురిసిపోతున్నాడు. ప్రస్తుత సీజన్లో మిగిలిన ఐదురౌండ్ల పోటీలతో పాటు నాకౌట్ రౌండ్లలోనూ రాణించగలిగితే ఐదు వందల పాయింట్ల మార్క్ అందుకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

17:38 - July 18, 2016

డేవిస్ కప్ ప్రపంచగ్రూప్ ప్లే ఆఫ్ రౌండ్ కు మాజీ రన్నరప్ భారత్ చేరుకొంది. చండీగఢ్ లాన్ టెన్నిస్ క్లబ్ లో ముగిసిన మూడురోజుల...ఆసియా- ఓషీనియా గ్రూప్ పోటీలో భారత్ 3-1తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. ప్రారంభ సింగిల్స్, డబుల్స్ లో భారత్ విజేతగా నిలవడం ద్వారా 3-0 ఆధిక్యం సంపాదించింది. పోటీల ఆఖరి రోజున జరిగిన తొలి రివర్స్ సింగిల్స్ లో కొరియాకు ఓదార్పు విజయం దక్కింది.

17:20 - July 18, 2016

ఢిల్లీ : షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని బీజేపీ ప్రభుత్వాన్ని మందకృష్ణ మాది డిమాండ్ చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించటమంటే మాదిగలకు అన్యాయం చేయటమేనన్నారు.  25 రోజులపాటు ఢిల్లీలో జరుగనున్న ఉద్యమానికి ఎమ్మార్పీఎస్, అనుబంధవిభాగాలు.. వర్గీకరణను సమర్థించే మాదిగేతర  వర్గాలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోది , కేంద్రమంత్రులను  కలిసి తమ డిమాండ్ ను వినిపిస్తామన్నారు. వర్గీకరణ బిల్లు విషయంలో మద్ధతునివ్వాలిని అన్ని రాజకీయ పక్షాల నేతలను కోరతామన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో షెడ్యూల్డ్ కులాల బిల్లును ప్రవేశపెట్టేలా గ్రామస్థాయి నుండి ఉద్యమాలు చేయాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. 

మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శం - ఉమా భారతి..

ఢిల్లీ : మిషన్ కాకతీయ దేశం మొత్తానికి ఆదర్శమని కేంద్ర మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉమాభారతితో జరిపిన సీఎం కేసీఆర్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఉమా భారతి మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయ విషయంలో తమ శాఖకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందని, అందుకోసమే తెలంగాణ మంత్రి హరీష్ రావు ను టాస్క్ ఫోర్స్ లో పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన విధానాలను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రవేవ పెట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.

డిప్యూటి ఎస్పీ సూసైడ్ కేసులో మంత్రిపై కేసు..

ఢిల్లీ : కర్నాటక డిప్యూటి ఎస్పీ ఆత్మహత్య కేసులో మంత్రి కేజే జార్జ్ తో పాటు ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేశారు. వేధింపుల వల్లే డిప్యూటి ఎస్పీ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే.

కుషాయిగూడలో నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రం..

హైదరాబాద్ : కుషాయిగూడలో నకిలీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఎస్ వోటీ పోలీసులు దాడి చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 225 లీటర్ల నికిలీ ఐస్ క్రీం, 150 లీటర్ల డాల్డాను స్వాధీనం చేసుకున్నారు.

 

16:56 - July 18, 2016

ప్రస్తుతం తమిళనాడులో అంతటా 'కబాలి' ఫీవర్ నెలకొంది. ఈనెల 22న చిత్రం రిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి హద్దు ఉండడం లేదు. కబాలి చిత్రానికి సంబంధించిన పిక్చర్స్ ను వాహనాలపై అతికించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని క్యాష్ చేసుకొనేందుకు పలు కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 'రజనీ కాంత్' సినిమా విడుదలయిదంటే ఆయన కటౌట్లకు అభిమానులు పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇలా కొన్ని వేల లీటర్ల పాలు నేలపాలవుతుండడం గమనిస్తుంటాం. ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని పాల ఉత్పత్తి దారుల సంఘం రజనీ ఫ్యాన్స్ ను కోరుతోంది. పాలను కొనడానికి డబ్బులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, 15 శాతం మంది కూడా పాలు కొనే పరిస్థితుల్లో లేరని సంఘం పేర్కొంటోంది. జులై 22వ తేదీన ఒక్క రోజే రూ. 20 లక్షల విలువైన 50 వేల లీటర్ల పాలు అభిషేకం పేరిట వృథా కాబోతున్నాయని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం. మరి అసోసియేషన్ విజ్ఞప్తిని రజనీ ఫ్యాన్స్ ఆలకిస్తారా ? లేదా ? అన్నది చూడాలి. అలాగే ఈ విషయంపై 'కబాలీ' ఎమైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి.

 

16:54 - July 18, 2016

ఢిల్లీ : బ్యాంకులు గ్రామీణులకు మరింత చేరువ కావాలని ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కోరారు. గ్రామీణాభివృద్ధి బ్యాంకుల విస్తరణపైనే ఆధారపడి ఉందన్నారు. ఆర్ధిక ప్రగతి అంశంపై హైదరాబాద్‌ ఎన్ఐఆర్డీలో పంచాయతీరాజ్‌ శాఖ ఏర్పాటు చేసిన సదస్సుకు రఘురాం రాజన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బ్యాంకు క్యార్యకలాపాల విస్తరణ , రైతుల ఆత్మహత్యలు, ఏకీకృత చెల్లింపుల విధానం తదితర అంశాలపై ఆయన ప్రసంగించారు. చైనా తరహాలో మన దేశంలో రూపాయి విలువ తగ్గించడం సాధ్యం రఘురాం రాజన్‌ చెప్పారు. 

16:52 - July 18, 2016

ఢిల్లీ : రాజ్యసభ సభ్యత్వానికి మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. బిజెపి ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానంతో సిద్ధూ చర్చలు జరిపినట్లు తెలిసింది. సిద్ధూ, ఆయన భార్య కూడా పంజాబ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. వీరిద్దరూ బిజెపికి గుడ్‌బై చెప్పడం ద్వారా కమలనాథులతో పాటు శిరోమణి అకాళీదళ్ నేతలకు కూడా షాక్ ఇచ్చినట్లైంది. సిద్ధూ కాసేపట్లో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌.. సిద్ధూను పంజాబ్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

తీర్పును గౌరవిస్తాం - రాజీవ్ శుక్లా..

ఢిల్లీ : బీసీసీఐలో సంస్క‌ర‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని ఐపీఎల్ చైర్మ‌న్ రాజీవ్‌శుక్లా అన్నారు. లోధా క‌మిటీ సిఫార‌సుల‌ను ఎలా అమ‌లు చేయాల‌న్న‌ దానిపై దృష్టి సారిస్తామ‌ని తెలిపారు.

16:50 - July 18, 2016

విజయవాడ : కృష్ణా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నా.. తెలుగు రాష్ట్రాలకు నీటిని వదలడం లేదన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ. ఎగువ ప్రాంతంలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండిన తర్వాతే కిందకి నీటిని వదులుతున్నారని..ఇది మంచి పద్దతి కాదన్నారు. దీనిపై కృష్ణా ట్రిబ్యునల్‌, కేంద్ర జలవనరుల సంఘం జోక్యం చేసుకోవాలని మంత్రి కోరారు. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం డ్యాంను పరిశీలించిన మంత్రి..ఆ తర్వాత కృష్ణా పుష్కరఘాట్లను పరిశీలించారు. ఘాట్ల నిర్మాణాల్లో ప్రమాణాలు పాటించకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని మంత్రి అన్నారు. 

16:48 - July 18, 2016

ఢిల్లీ : న్యాయాధికారుల కేటాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు, వివిధ సంఘాలు, జడ్జిల అసోషియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్లను విచారణపై చేపట్టిన ధర్మాసనం జడ్జిల ధర్నాలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ధర్నాలు చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. జడ్జిల ధర్నాలతో న్యాయ వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

టీఎస్ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్..

హైదరాబాద్ : టీఎస్‌ ఎంసెట్-2 కింద ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ కౌన్సెలింగ్ కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 25 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు 31నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.

16:45 - July 18, 2016

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరుగుతోంది. కశ్మీర్‌లో యువత అసంతృప్తితో రగులుతోందని, ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని సిపిఎం కేంద్రాన్ని నిలదీసింది. కశ్మీర్‌పై చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో బిజెపి విఫలమైందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. కశ్మీరీ యువతకు మీరు చూపే మార్గం ఏంటి? కశ్మీర్‌ను శాంతి భద్రతల సమస్యగా భావిస్తే ఈ సమస్యను ఎన్నటికీ పరిష్కరించలేరని ఏచూరి అన్నారు.

16:45 - July 18, 2016

టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. మొదట్లో విలన్ వేషాలు వేసిన వారు హీరోలయ్యారు..కామెడీ పాత్రలు వేసిన వారు కూడా హీరోలుగా ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. తాజాగా హీరో వేషాలు వేసిన వారు విలన్ వేషాలు వేయడానికి ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో 'జగపతి బాబు' స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడనే చెప్పవచ్చు. 'లెజండ్' సినిమా ద్వారా ఆయన విలన్ గా మారిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాలే నమోదు చేసుకున్నాడు. హీరో రాజశేఖర్ కూడా విలన్ గా నటించేందుకు సిద్ధమౌతున్నట్లు టాక్. తాజాగా హీరో శ్రీకాంత్ కూడా విలన్ గా నటించేందుకు మొగ్గు చూపుతున్నాడంట. తనను విలన్ పాత్రలో నటించాలని తనను ఎవరూ అడగలేదని, ఎవరైనా సంప్రదిస్తే మాత్రం కచ్చితంగా నటిస్తాను అని శ్రీకాంత్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన తనయుడు రోషన్ హీరోగా 'నిర్మల కాన్వెంట్' చిత్రం ద్వారా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

16:41 - July 18, 2016

ఢిల్లీ : హస్తినలో ఉదయం నుంచి వరుస భేటీలు జరుపుతున్న కేసీఆర్.. కాసేపటి క్రితం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. తెలంగాణలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు.. త్వరగా ఇప్పించేలా కోరారు. కృష్ణా జలాల పంపకంలో.. వివాదాల పరిష్కారానికి... కేంద్రం జోక్యం చేసుకోవాలని కేసీఆర్ ఉమాభారతిని కోరారు.

అరుణ్ జైట్లీతో కేసీఆర్ ..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జైట్లీని కలిసిన వారిలో సీఎం కేసీఆర్ తోపాటు పలువురు ఎంపీలు ఉన్నారు. అంతకు ముందు కేసీఆర్‌.. ప్రధాని మోదీతో భేటీ అయ్యి రాష్ట్ర సమస్యలను వివరించారు. 

భూ నిర్వాసితుల సమస్యలపై మహా ధర్నా - బి.వెంకట్..

హైదరాబాద్ : భూ నిర్వాసితుల సమస్యలపై ఈనెల 26న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టనున్నట్లు పది జిల్లాల నుండి భూ నిర్వాసితులు పాల్గొంటారని భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ బి.వెంకట్ పేర్కొన్నారు. తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బృందా కరత్ పాల్గొంటారని, 2013 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామని, నిర్వాసితులతో హైకోర్టులో పిల్ వేయడం జరుగుతుందన్నారు.

కేసీఆర్ కు పొంగులేటి లేఖ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి లేఖ రాశారు. సింగరేణి వీవీకే ఐదు టెండర్లను రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. గ్లోబల్ టెండర్ల ద్వారా వంద కోట్ల వరకు ఆదా చేయవచ్చని సూచించారు. ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పేర్లను కొనసాగించాలని, ఈనెల 20న ఖమ్మంలో ఒకరోజు దీక్ష చేస్తామన్నారు.

ఆగిరిపల్లిలో విషాదం..

కృష్ణా : ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. డ్వాక్రా రుణం చెల్లించలేదని ఒత్తిడి చేయడంతో లక్ష్మీ అనే వివాహిత పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో పొందుతూ లక్ష్మీ మృతి చెందింది.

 

అప్పిరెడ్డిగూడెంలో ఘర్షణ..

కృష్ణా : ముసునూరు (మం) అప్పిరెడ్డిగూడెంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతో దాడులు చేసుకోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

మోస్ట్ వాంటెండ్ గంజాయి స్మగ్లర్ అరెస్టు..

విజయవాడ : మోస్ట్ వాంటెండ్ గంజాయి స్మగ్లర్ నార్ల వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని కోర్టులో హాజరు పరిచారు. ఒక రోజు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రేపు మరోసారి కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. అనంతరం వంశీకృష్ణను పోలీసులు ఏలూరుకు జైలుకు తరలించారు.

ఏపీ డీజీపీ పదవీ కాలం పెంపు..

విజయవాడ : ఏపీ డీజీపీ రాముడు పదవీ కాలాన్ని ప్రభుత్వం పెంచింది. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మరో రెండు నెలలు పదవీ కాలాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కృష్ణా పుష్కరాలపై సీఎం బాబు రివ్యూ..

కర్నూలు : కృష్ణా పుష్కరాలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కాంట్రాక్టర్ గడవులోగా పనులు పూర్తి చేయకపోయినా నాణ్యత లేకపోయినా బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరించారు. ఈనెలాఖరు లోపు పుష్కరాల పనులు పూర్తి చేయాలని, అహోబిలం, యాగంటి ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంగమేశ్వరం -2, పాతాలగంగ -2, లింగాలగట్టు పుష్కరాల్లో మొబైల్ టీం, తాత్కాలిక ఆసుపత్రులు సంచార అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.

జీఎస్టీ బిల్లుకు మద్దతు - ఎంపీ రామ్మోహన్ నాయుడు..

ఢిల్లీ : జీఎస్టీ బిల్లుకు తమకు సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దేశా ఆర్థికాభివృద్ధికి జీఎస్టీ బిల్లు ఆమోదం చాలా అవసరమని, రాజ్యసభలో ప్రైవేటు బిల్లుకు మద్దతు అడిగే ముందు కాంగ్రెస్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు చేర్చలేదో కేవీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై తమకు అభ్యంతరం లేదని, నీటి పంపకాలు, షెడ్యూల్ 9,10లోని అంశాలతో సహా అనేక సంస్థల పంపకాల సమస్యలున్నాయన్నారు.

తప్పును సరిదిద్దుకోవడం కోసమే ప్రైవేటు బిల్లు - టీజీ..

ఢిల్లీ : కేవీపీ ప్రైవేటు బిల్లు తప్పు సరిదిద్దుకోవడం కోసమేనని ఆనాడు అన్యాయం చేసి ఇప్పుడు ప్రైవేటు బిల్లు పెట్టారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కోరే ఏ బిల్లుకైనా తమ మద్దతు ఉంటుందని, ఏపీకి బీజేపీ న్యాయం చేసినా..కాంగ్రెస్ న్యాయం చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని మోసం..

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన షకీల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 24 మంది నుండి రూ. లక్ష చొప్పున షకీల్ వసూలు చేశాడు. ఇతని వద్ద కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

అంగ ప్రదిక్షణలకు ఆధార్ తప్పనిసరి - టిటిడి జేఈవో..

చిత్తూరు : తిరుమలలో అంగప్రదిక్షణ టోకన్లకు బుధవారం నుండి ఆధార్ కార్డు తప్పనిసరి అని జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. బూంది పోటులో అగ్నిప్రమాదాలు జరగకుండా 15 రోజులకొకసారి శుభ్రం చేయడం జరుగుతుందన్నారు.

ఉస్మానియా ఆసుపత్రికి రమ్య తాత మృతదేహం..

హైదరాబాద్ : ఇటీవలే మృతి చెందిన చిన్నారి రమ్య తాత మధుసూధనాచారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పోలీసుల హామీతో ఆందోళనను బంధువులు విరమించారు.

 

ఉమాభారతితో కేసీఆర్ భేటీ ముగిసింది..

ఢిల్లీ : హస్తినలో ఉదయం నుండి వరుస భేటీలతో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలో  కేసీఆర్ మంత్రి ఉమాభారతితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 30 నిమిషాలపాటు సాగింది. తెలంగాణలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులతో పర్యావరణ అనుమతులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. అలాగే కృష్ణా నదీ జలాల పంపకంలో కేంద్రం జోక్యం చేసుకుని వివాదాన్ని సాధ్యమైనంత త్వరంగా సమస్యను పరిష్కరించాలని కోరారు. 

టీఎస్ ర్యాంక్ కు ఆధారాల్లేవ్ : బీజేపీ నేత

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఏం చేశారని ర్యాంక్ ఇవ్వాలి అని ప్రశ్నించారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణా సాగర్ రావు. కేంద్రం ఏ రాష్ట్రంపై సర్వే చేయలేదని, తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారనడానికి ఆధారం లేదని అన్నారాయన. తెలంగాణకు కేంద్రం ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిందన్న తప్పుడు వార్తలపై ప్రధానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. మొత్తం వ్యవహారంపై సమాచార శాఖ విచారణ చేస్తోందని అన్నారు కృష్ణా సాగర్.

వైసీపీ 'ఐస్ క్రీమ్'..

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్‌ స్థాపించిన వైకాపా ఐస్‌క్రీమ్‌ లాంటిదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. నేతలంగా ఆ పార్టీని వీడిపోతుండటంతో చివరకు ఆ పార్టీ కరిగిపోయి చిరవరకు మిగిలేది పుల్ల మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేటు బిల్లు ఈనెల 22న చర్చకు రానుందని... దీనికి అన్ని పార్టీల నుంచి మద్దతు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీలో గుంతలో ఇరికిన నేవీ బస్సు..

ఢిల్లీ : నేవల్ ఆఫీసర్స్ కు చెందిన ఓ బస్సు రోడ్డుపై పడిన గుంతలో ఇరుక్కపోయింది. కృష్ణ మెనన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేవీ ఆఫీసర్స్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

 

15:47 - July 18, 2016

విజయవాడ : చిల్లకల్లు బీసీ కాలనీలో 8 మంది చిన్నారులకు ఫిట్స్ తో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు చెందిన తల్లిదండ్రులు...విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. గతంలో ఐదుగురు పిల్లలు.. ఇలాగే ఫిట్స్ వచ్చి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే అపరిశుభ్ర వాతావరణం కారణంగానే... పిల్లలు రోగాలబారిన పడుతున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 

15:45 - July 18, 2016

విశాఖ : విశాఖ పట్నంలోని సింహాచల పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షణ ఘనంగా ప్రారంభమైంది. సింహాచలంలో ఉన్న అప్పన్న గిరిప్రదక్షిణనను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మొత్తం 32 కిలోమీటర్ల గిరిప్రదక్షణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతేడాది గిరిప్రదక్షణకు 3లక్షల మంది భక్తులు తరలివస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్య ఆరు లక్షలకు పెరిగింది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  అప్పన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు చేస్తున్న గిరిప్రదక్షిణ చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

విశాఖలో 

15:42 - July 18, 2016

ఢిల్లీ : లోధా కమిటీ సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. బీసీసీఐ కమిటీలో మంత్రులకు స్థానం ఉండరాదని కమిటీ పేర్కొంది. వీటితో పాటు.. బీసీసీఐలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులకు చోటులేదని సిఫార్సు చేసింది. బీసీసీఐ పదవులకు వయోపరిమితి 70ఏళ్లుగా నిర్ణయించింది. వీటితో పాటు.. గుజరాత్, మహారాష్ట్రకు 3 చొప్పున క్రికెట్ సంఘాలు ఉండొచ్చని... మిగతా రాష్ట్రాల్లో ఒక క్రికెట్ సంఘం ఉండాలని తెలిపింది. ఈ సిఫార్సుల అమలుకు బీసీసీఐకి 6నెలల గడువిస్తూ.. సుప్రీం ఆదేశాలు జారీచేసింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:39 - July 18, 2016

విజయవాడ : నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్విస్ ఛాలెంజ్ విధానంలోనే నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు సీఆర్డీఏ బిడ్లను స్వీకరించనుంది.

6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణానికి బిడ్డింగ్‌లు ..
సీఆర్డీఏ సుమారు 6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణానికి బిడ్డింగ్‌ను వెల్లడించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మించాలని ఏపీ కేబినెట్ గతంలోనే ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో స్విస్ ఛాలెంజ్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇతర సంస్థల నుంచి కౌంటర్ ఛాలెంజ్‌ను కోరాల్సి ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో భాగంగా సింగపూర్‌ సంస్థల కన్సార్టియం దాఖలు చేసిన ప్రతిపాదనలకు ఇతర సంస్థల నుంచి ఛాలెంజ్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.

సచివాలయ నిర్మాణంలో పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి?..
తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి సంస్థలు కీలక రాజధాని నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు జెపి కన్‌స్ట్రక్షన్స్‌, గంగవరం, మచిలీపట్నం వంటి కీలక పోర్టుల నిర్మాణంలో పాత్రధారులుగా ఉన్న ఇతర సంస్థలు కూడా ఛాలెంజ్‌ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ సంస్థలు ప్రతిపాదనను బహిర్గతం చేసిన తర్వాత మిగతా సంస్ధలకు దానిని ఛాలెంజ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 45 రోజుల గడువు ఇచ్చింది. ఈ క్రమంలో సింగపూర్ కంపెనీల కన్సార్షియం కన్నా తక్కువకు నిర్మాణం పూర్తిచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే, అదే మొత్తానికి సింగపూర్‌ అంగీకరిస్తే ఆ సంస్థకే టెండర్‌ ఖరారవుతుంది, లేకుంటే తక్కువ మొత్తానికి ప్రతిపాదించిన సంస్థకు టెండర్‌ లభిస్తుంది. మరోవైపు ఈ నోటిఫికేషన్‌కి సంబందించి వివిధ రాజకీయ పార్టీల వ్యతిరేకత మొదలయ్యింది. స్విస్ విధానంలో ఎన్నో లోపాలున్నాయని గతంలో కేల్కర్ కమిటీ, విజిలెన్స్ విభాగం ప్రకటించినప్పటకీ ప్రభుత్వం తమ దోరణి మార్చుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటిఫికేన్‌ను వెంటనే రద్దు చేసి ఓపెన్ టెండర్ విధానంలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

15:38 - July 18, 2016

గడ్డం గీసుకుంటావా..చచ్చిపోనా అంటూ తన భార్య బెదిరిస్తోందంటూ ఓ భర్త మెజిస్ట్రేట్ మెట్లు ఎక్కాడు. క్లీన్ గా షేవింగ్ చేసుకోవాలని లేనిపక్షంలో పిల్లలతో పాటు తాను చచ్చిపోతానని పేర్కొంటోందని వాపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్షద్ బద్రుద్దీన్ మీరట్ లోని ఓ మసీదులో ఇమామ్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఆ మత ఆచారం ప్రకారం అర్షద్ గడ్డం పెంచుతున్నాడు. దీనిపై దంపతుల మధ్య బేదాభిప్రాయాలు వచ్చేవంట. గడ్డం తీసుకోవాలని..షారుఖ్..సల్మాన్ తరహాలో ఉండాలని వాదించేదంట. గడ్డం తీసేయాలి..లేదంటే చచ్చిపోతానని భార్య బెదిరించేది. మొన్న రంజాన్ పండుగకు పిల్లలకు మోడ్రన్ డ్రెస్సులు కొంటానని భార్య పేర్కొనడం..దీనికి అర్షద్ నో చెప్పడం జరిగిపోయాయి. ఈద్ మరుసటి రోజు ఓ గదిలోకి వెళ్లిన ఆమె గడియపెట్టేసుకుంది. కంగారు పడిన అర్షద్ కిటీలోకి నుండి చూశాడు. ఫ్యాన్ కు తాడు వేసి ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గమనించి ఇతరుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టించాడు. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావ్ అంటే..మూగనోము పెట్టిదంట. అర్జెంట్‌గా మీరు గనుక గడ్డం తీసేయకపోతే పిల్లలకు విషం ఇచ్చి నేను కూడా చనిపోతా అని అల్టిమేటం ఇచ్చింది. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్‌తో ఓ వ్యక్తితో రాత్రనక, పగలనక చాటింగ్‌లో మునిగి పోతుందట. భార్య ప్రవర్తన చూస్తూ పెరుగుతున్న పిల్లలు కూడా ఇలాగే మారితే పరిస్థితి ఏమిటనే భయం అతడిలో మొదలైంది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించాడు. చివరకు మెజిస్ట్రేట్ కు లేఖ రాశాడు. తన గోడును అందులో వెళ్లబోసుకున్నాడు. ఇమామ్ లేఖకు మెజిస్ట్రేట్ స్పందించిందని తెలుస్తోంది. సీనియర్ ఎస్పీకి ఈ విషయం చూడాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. మరి అర్షద్ బద్రుద్దీన్ 'గడ్డం' కథ ముగుస్తుందా ? ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

ఆప్ లోకి సిద్ధూ ?

ఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆప్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. రెండు నెలల క్రితమే సిద్దూ రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే.

15:32 - July 18, 2016

గుంటూరు : ఆ గ్రామాల్లోకి దొంగలు రావాలంటే హాడలిపోతారు. వచ్చినా దొంగతనం చేసిన మరుసటిరోజే పోలీసులకు దొరికిపోతారు. ఏంటీ వింతగా ఉందే అనుకుంటున్నారా...అవునండీ ఓ పోలీసు అధికారి చేసిన వినూత్న ప్రయోగ ఫలితంగా ఆ గ్రామాల్లో ప్రజలకు దొంగల భయం పోయింది. ఇంతకీ ఆ పోలీసాఫీసర్ ఎవరు ? ఏం ప్రయోగం చేశారు?...అన్నది తెలుసుకునేందుకు వాచ్ దిస్ స్టోరీ...

గుంటూరు జిల్లా లో ఓ ఎస్సై వినూత్న ఆలోచన ..
గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు ఓ సాధారణ గ్రామం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రాతనిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. పత్రిపాడు అంటే ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఓ సాధారణ ఎస్సై వినూత్న ఆలోచనతో ప్రత్తిపాడు నియోజకవర్గం అనేక ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అనేక గ్రామాల ప్రజల మన్ననలు అందుకొంటోంది.

ప్రత్తిపాడు ప్రాంతంలోని 10 గ్రామల్లో నిత్యం దొంగతనాలు..
గుంటూరు, చెన్నై జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రత్తిపాడు ప్రాంతంలోని 10 గ్రామాల్లో నిత్యం దొపిడీ దొంగలు హల్ చల్ చేసేవారు. ప్రతిరోజు ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉండేంది..ఓ దాబాలో ఇద్దరిని హత్య చేసి డబ్బును ఎత్తుకెళ్లిన ఘటనతో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై వాసుకు సెక్యూరిటీ పెంచాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచనను జిల్లా ఎస్పీతోపాటు 10 గ్రామాల పెద్దలతో పంచుకున్నారు. అందరూ సహకరించడంతో వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. . దీంతో ఆ గ్రామాల్లో ఇప్పుడు చీమ చీటుక్కుమన్నా ఇట్టే తెలుస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత 6 నెలల కాలంలో దొంగతనాలు, గొడవలు చాలా వరకు తగ్గిపోయాయి.

నిఘా వ్యవస్థ బాగుందంటున్న గ్రామస్తులు..
ఎస్సై వాసు తీసుకొచ్చిన కొత్త నిఘా వ్యవస్థ ఎంతో బాగుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎస్సై సూచనతో గ్రామంలోని కొంతమంది కలిసి ఓ యూనిట్ గా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. మరో వైపు ఎస్సై నూతన ఆలోచన విధానంతో జాతీయ రహదారి వద్ద దాబాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఎక్కడాలేని సెక్యూరిటీ ఏర్పడింది. బార్లు, దాబాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో గొడవలు, దొంగ తనాలు జరగడంలేదని చెబుతున్నారు.

అన్ని గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు..
మొత్తానికి ఓ ఎస్సై నూతన ఆలోచన అక్కడి ప్రజలలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపింది..సీసీ కెమెరాలతో నిఘా పెరగడంతో దొంగలు సైతం ఆ గ్రామాల వైపు వెళ్లడానికి సాహసించడం లేదు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..

15:24 - July 18, 2016

గుంటూరు : గుంటూరు జిల్లా కంతేరు, నిడమర్రు మధ్య తాత్కాలిక సచివాలయంలో ట్రాక్టర్‌ బోల్తాపడింది.. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా... పదిమందికి గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. మృతిచెందిన కూలీ కుటుంబానికి 25లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 5లక్షలు పరిహారంగా చెల్లించాలంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి ముందు సీఐటీయూ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు..దీంతో వీరిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

15:05 - July 18, 2016

దేశంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట అబలలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒళ్లు గొగురుపొడిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. పొలంలోకి వచ్చిందన్న నెపంతో ఓ ఆవును కొడుతున్నందుకు..దానిని ఆపిన మహిళ చేతి వేళ్లను కోసేశారు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
మాల్డా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి సమయంలో ఆ కుటుంబానికి చెందిన ఓ ఆవు పక్కనే ఉన్న హరున్ షేక్ పొలంలోకి వెళ్లింది. దీనిని గమనించిన అతడు మరో కొంతమందితో కలిసి వచ్చి ఆవును చితకబాదడం ప్రారంభించాడు. మూగజీవిని కొడుతుండడం చూసిన మహిళ దానిని కొట్టవద్దంటూ వారించింది. తీవ్ర ఆగ్రహంలో ఉన్న వీరంతా ఆ మహిళపై దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పదునైన కత్తితో ఆమె చేతి వెళ్లను కోశారు. అడ్డుగా వచ్చిన ఆమె కొడుకును సైతం విచక్షణా రహితంగా కొట్టారు. వీరి కేకలు విన్న గ్రామస్తులు అక్కడకు రావడం..హరూన్ అతని మిత్రులు పరారయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెండు చేతి వేళ్లను కోల్పోయిన ఆమె..గాయాలపాలైన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని దుండగులు బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆవు పొలంలోకి వచ్చిన కారణంతో వారు నా భార్యను చంపాలని చూశారని, కేసు నమోదు చేస్తే అంతు చూస్తానని బెదిరిస్తున్నారని ఆమె భర్త పేర్కొంటున్నాడు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

లోధా కమిటీలకు సుప్రీం ఆమోదం..

ఢిల్లీ : లోధా కమిటీ సిఫార్సులకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. బీసీసీఐ కమిటీలో మంత్రులకు స్థానం ఉండరాదని, బీసీసీఐలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులకు చోటు లేదని..బీసీసీఐ అధికారుల రిటైర్మెంట్ గడవు 70 ఏళ్లు ఉండాలని..గుజరాత్, మహారాష్ట్రలో 3-3 క్రికెట్ సంఘాలు ఉండాలని..ఇతర రాష్ట్రాల్లో ఒక్కో క్రికెట్ సంఘం ఉండాలని సూచించింది. లోధా కమిటీ మార్గదర్శకాల అమలు కోసం బీసీసీఐకి 6 నెలల గడవును సుప్రీం విధించింది.

 

 

ఈనెల 23న విశాఖలో సీఎం బాబు పర్యటన..

కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 23న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఎంఎస్ఎంఈ పార్క్ కు బాబు శంకుస్థాపన చేయనున్నారు. పూడి గ్రామస్తులు, బ్రాండిక్స్ ఉద్యోగులతో సీఎం బాబు మాట్లాడనున్నారు.

 

పుష్కర పనుల్లో నిర్లక్ష్యం వహస్తే సహించం - సీఎం బాబు..

కర్నూలు : పుష్కర పనుల్లో నిర్లక్ష్యం వహస్తే సహించమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేయకుంటే బ్లాక్ లిస్టులో పెడుతామని, సీఎం స్థాయిలో ఏడుసార్లు రివ్యూ చేసినా ఫలితం లేకుంటే ఎలా అని నిలదీశారు. అధికారుల పనితీరు బాగుంటేనే అవార్డులు..లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

క్రికెటర్ కు తప్పిన పెను ప్రమాదం..

కర్ణాటక : క్రికెటర్ కరుణ్ నాయర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పంపానదిలో నిన్న స్నేక్ బోట్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ పడవ తిరగబడింది. కరుణ్ నాయర్ సహా ఆ పడవలో ప్రయాణిస్తున్న పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఇద్దరు గల్లంతైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయంలో జరిగే వాల్లా సద్యా ఉత్సవానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తిరిగి ప్రారంభమైన రాజ్యసభ..

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ కశ్మీర్ లో చెలరేగిన ఆందోళనలపై మాట్లాడుతున్నారు. కశ్మీర్‌లో ఆందోళలనపై చర్చ కోసం కాంగ్రెస్ ఇవాళ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై చర్చ కొనసాగుతోంది.

14:33 - July 18, 2016

అక్షర హాసన్..ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు. ఈమె పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అక్షర ప్రస్తుతం తన తండ్రి కమల్ హాసన్..అక్క శృతి హాసన్ లు కలిసి నటిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. తాజాగా 'అజిత్' హీరోగా నటిస్తున్న సినిమాలో 'అక్షర' హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. 'వేదాళం' వంటి హిట్ సినిమా అనంతరం
ఇటీవలే అజిత్ 57వ చిత్రానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అజిత్ సరసన తొలుత అనుష్క కథానాయకిగా నటించనుందని ప్రచారం జరిగింది. అనంతరం కాజల్ అగర్వాల్ హీరోయిన్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా 'అక్షర హాసన్' హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. మరి అజిత్ సరసన అక్షర నటించనుందా ? లేదా ? అన్నది చిత్ర యూనిటే చెప్పాలి.

రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ ప్రసంగం..

ఢిల్లీ : ఇటీవల జరిగిన ఘర్షణల్లో జమ్మూ కాశ్మీర్ లోని పది జిల్లాల్లో మృతులు ఉన్నారని, అలాగే దక్షిణ కాశ్మీర్ లోని నాలుగు జిల్లాలు దెబ్బతిన్నాయని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.

 

14:05 - July 18, 2016

ప్రస్తుతం మహనీయుల జీవిత గాథలు, సెలబ్రిటీల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తమ జీవిత విశేషాలు అందరికీ తెలపాలన్న ఆకాంక్ష సెలబ్రిటీల్లో ఉంది. పలువురు సెలబ్రిటీలు తమ జీవితాలను సినిమాలుగా తీసేందుకు అసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో దర్శక, నిర్మాతలు సల్మాన్ ఖాన్ జీవిత ఆధారంగా సినిమా తీసేందుకు ఆయన్ను కలిసిశారు. కానీ తన జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు సల్లూభాయ్ ఒప్పుకోలేదంట. జీవిత కథ ఆధారంగా సినిమా తీయడం తనకు ఇష్టం లేదని చెప్పారంట. అయితే చివరకు జీవిత కథ ఆధారంగా సినిమాకు సల్మాన్  అంగీకారిస్తాడో లేదో చూడాలి... 

 

గాంధీభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - ఉత్తమ్..

హైదరాబాద్ : ఈనెల 23న గాంధీ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ప్రాజెక్టుల వాస్తవాలపై జల దృశ్యాన్ని ప్రజలు ముందుంచుతామన్నారు. రూ. 2లక్షల కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్టులను నిర్మిస్తామనడం భవిష్యత్ లో తెలంగాణను అగాధంలో ముంచడమేనన్నారు. ప్రాజెక్టులకు డీపీఆర్ లు లేకుండా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తామంటే ఊరుకోమన్నారు.

మల్లన్ సాగర్ అవసరం లేదు - శశిధర్ రెడ్డి..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై టి.కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మల్లన్న సాగర్ అవసరం లేదని, పంపులు, ఇతర సంపుల ద్వారా కూడా లక్షల ఎకరాలకు నీరందించవచ్చన్నారు. భారీ బ్యారేజీలు పక్కన పెట్టి హర్యానా తరహాలో రిజర్వాయర్లు నిర్మించాలని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రజలను ముంచుతామంటే ఊరుకోమన్నారు.

మంత్రి కేటీఆర్ కు శ్రీలంక సర్కార్ ఆహ్వానం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం పలికింది. వచ్చే నెల 11, 12వ తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యుమన్ క్యాపిటల్ సమ్మిట్ లో పాల్గొనాలని ఆహ్వానం పంపింది.

కర్నూలు చేరుకున్న ఏపీ సీఎం బాబు..

కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో కృష్ణా పుష్కరాలపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేఈ, కొల్లు, శిద్ధా, మాణిక్యాలరావులు హాజరయ్యారు.

13:44 - July 18, 2016

గుంటూరు : జిల్లా నిజాంపట్నం మండలంలో మైనర్‌ బాలిక జాస్మీన్‌ మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జాస్మీన్‌పై అత్యాచారం చేసి.. హత్య చేశారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను గ్రామస్తులను చితకబాదారు. దీంతో సాయి అనే యువకుడు చనిపోయాడు. మరో యువకుడు పవన్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్‌ ఘటన జరిగిన వివరాలను వెల్లడించాడు. జాస్మిన్‌కు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్లమంటేనే సాయి.. తను జాస్మిన్‌ ఇంటికి వెళ్లామని పవన్‌ చెప్పాడు. ఇంట్లో జాస్మిన్‌తో సాయి మాట్లాడుతుండగా తను బయటే ఉన్నానని తెలిపాడు. ఇంతలోనే గౌస్‌ అనే వ్యక్తి తమను చూసి.. ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు.. అదేసమయంలో జాస్మిన్‌ను కూడా మందలించాడని పవన్‌ చెబుతున్నాడు. ఈ విషయాన్ని జాస్మిన్‌ కుటుంబ సభ్యులకు గౌస్‌ తెలపడంతో మనస్థాపంతో జాస్మిన్‌ ఇంట్లో ఊరేసుకుందని పవన్‌ చెబుతున్నాడు. విషయం తెలియగానే జాస్మిన్‌ ఇంటికి వెళ్లి.. ఊరేసుకున్న ఆమె మృతదేహాన్ని కిందకు దించామని చెప్పారు. ఈ లోపే జాస్మిన్‌ చావుకు తామే కారణమని గౌస్‌ స్థానికులను ఉసిగొల్పడంతో తమను స్థానికులు కొట్టారని పవన్‌ చెబుతున్నాడు. పోలీసులు సకాలంలో రాకుంటే.. సాయితో పాటే తను కూడా చనిపోయేవాడినని చెబుతున్నాడు. 

 

అమరవీరుల కుటుంబాలకు రూ. 20లక్షల మంజూరు..

నల్గొండ : జిల్లాకు చెందిన ఇద్దరు అమరవీరుల కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున పరిహారాన్ని టి. సర్కార్ మంజూరు చేసింది. అమరవీరుల పథకం కింద పరిహారం మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.

ప్రధాని మోడీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులివ్వాలని కేసీఆర్ కోరారు. హైకోర్టు విభజనపై త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధానిని కేసీఆర్ ఆహ్వానించారు.

జాస్మిన్ మృతి వివరాలను వెల్లడించిన పవన్..

గుంటూరు : జాస్మిన్ మృతికి సంబంధించిన వివరాలు మీడియాకు పవన్ వెల్లడించాడు. జాస్మిన్ పిలిస్తే తాను, సాయి కలిసి ఆమె ఇంటికి వెళ్లడం జరిగిందని, ఇంటికి ఎందుకొచ్చావని సాయిని గౌస్ హెచ్చరించాడని..జాస్మిన్ కూడా మందలించాడని పేర్కొన్నాడు. తాము బయటకు రాగానే జాస్మిన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగినట్లు ఈ విషయం తెలిసి తాను, సాయి ఆమె ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు. ఉరివేసుకున్న జాస్మిన్ ను స్థానికుల సహాయంతో కిందకు దించడం జరిగిందని, జాస్మిన్ ఆత్మహత్యకు మేమే కారణమని గౌస్ స్థానికులను తమపైకి ఉసిగొల్పాడని ఆరోపించాడు. పోలీసులు సకాలంలో రాకుండా ఉంటే తాను కూడా చనిపోయే వాడనని ఆవేదన వ్యక్తం చేశాడు.

13:39 - July 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులతో చర్చించారు. నెలలో ఒక శనివారం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు టీడీపీ నేతన రావుల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు. 

 

13:35 - July 18, 2016

హైదరాబాద్‌ : నగరంలో గణేష్‌ నిమజ్జనం ఏర్పాట్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మినీ ట్యాంకులు కట్టించి.. వాటిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. హుస్సేన్‌ సాగర్‌కు అనుకుని ఉన్న సంజీవయ్య పార్కులో మినీ ట్యాంక్‌ నిర్మిస్తామని హైకోర్టుకు తెలిపింది. 12 చెరువుల్లో ఆనుకుని ట్యాంకులు నిర్మిస్తున్నామని కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను న్యాయస్థానం మూడు వారాలకు వాయిదా వేసింది. 

 

13:32 - July 18, 2016

ఏదైనా పండు కొనాలంటే మార్కెట్ లోకి వెళ్లి ధర ఎంతో అడుగుతాం. బేరమాడి తీసుకుంటాం. మార్కెట్ ను బట్టి ఆ పండ్ల ధర ఉంటుంటుంది. కేజీ ద్రాక్ష పండ్లు ఎంత ధర ఉంటాయి ? అని అంటే ఆ..సుమారు రూ. 50 లేదా రూ. 100 ఉంటుంది అని అంటారు కదా..ఒక్క ద్రాక్ష పండు ఎంత ధర అని అడిగితే ? అలా ఎవరు అడుగుతారు ? అయినా ఒక్క ద్రాక్ష పండు తిని ఏం చేస్తారు ? దీని గురించి తెలుసుకోవాలంటే ఇది చదవండి...
జపాన్..అక్కడ 'రూబీ రోమన్' రకానికి చెందిన ద్రాక్ష పండు అత్యంత అరుదుగా లభిస్తుంటుంది. ఒక్క ద్రాక్ష పండు ఖరీదు అక్షరాల మన కరెన్సీలో రూ. 25వేలు ఉంటుంది. ఇంత ఖరీదైనా అరుదైన పండ్లను కొనుగోలు చేయడానికి జపాన్ వాసులు క్యూ కడుతున్నారంట. ఓ దుకాణ దారుడు అయితే 1.1 మిలియన్ యెన్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 7.35 లక్షలు కు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడంట. అసలు రూబీ రోమన్ ద్రాక్ష ప్రత్యేకత ఏంటీ అంటే..ప్రత్యేక పరిస్థితుల్లో, పలు నూతన పద్ధతుల్లో ఈ పంటను సాగుబడి చేస్తుంటారు. చక్కెర 18 శాతం వరకు ఉండే ఒక్కో ద్రాక్ష పండు 20 గ్రాముల వరకు బరువు తూగుతుంది. 1992 నుంచి జపాన్ తీరప్రాంతం ఇషికవలో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. అదండి సంగతి...

13:18 - July 18, 2016

ఢిల్లీ : కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ కోరారు. ఈమేరకు కేసీఆర్ ఢిల్లీలో మోడీతో భేటీ అయి.. వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు విభజనపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని కోరారు. 

 

13:05 - July 18, 2016

ఆదిలాబాద్ : రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి. అడవి తల్లిని నమ్ముకుని బతకడం తప్ప మరేమీ తెలియని అమాయకత్వం వారిది. కానీ పాలకులు వారిని అడవికి దూరం చేసే కుట్ర చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 42 గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు. నేరుగా పొమ్మంటే సమస్య వస్తుందని.. నెమ్మదిగా పొగపెడుతున్నారు. అక్కడ అభివృద్ధిని, ఉపాధి పనులను నిలిపివేశారు. తునికాకు సేకరణనూ బంద్‌ చేయించారు. చివరికి వెదురు బొంగులతో తడకలు, బుట్టలు అల్లుకునే పనులనూ అడ్డుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల దయనీయ స్థితిపై 10టివి ప్రత్యేక కథనం.  
కవ్వాల్‌ అటవీ ప్రాంతం టైగర్‌జోన్‌గా ప్రకటన 
ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ అటవీ ప్రాంతాన్ని మూడేళ్ల కిందటే టైగర్‌జోన్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న 42 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించే చర్యలు అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని జన్నారం, కడెం, ఖానాపూర్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ అటవీ బ్లాక్‌ల పరిధిలో 11,200 చదరపు కిలోమీటర్లను బఫర్‌ జోన్‌గా అంటే మనుషులు సంచరించే ప్రాంతంగా ప్రకటించారు. 892 కిలోమీటర్ల పరిధిలోని 11,200 చదరపు కిలోమీటర్ల పరిధిని కోర్‌జోన్‌గా అంటే.. పులులు సంచరించే ప్రాంతంగా ప్రకటించారు. దీంతో కోర్‌జోన్‌లో ఉన్న గ్రామాలను అంచెల వారీగా ఖాళీ చేయించడానికి అటవీశాఖ నిర్ణయించింది. వెదురు బొంగులు తదితర అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న  ఆదివాసీలను ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ హూంకరిస్తోంది. 
మొదటి విడతగా జన్నారం మండల గ్రామాలు ఖాళీ 
మొదటి విడతగా జన్నారం మండలంలోని అల్లీనగర్‌, దొంగపల్లి, మల్యాల, కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను ఖాళీ చేయించడానికి అటవీశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఆ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేశారు అధికారులు.   మైసంపేట, రాంపూర్‌, అల్లీనగర్‌, దొంగపల్లి, మల్యాల గ్రామాల్లో పోడు చేసుకుంటున్న రైతులకు భూముల పట్టాలు ఇవ్వకుండా ఆపేశారు. గ్రామాల్లో జేవీవీకే పాఠశాలలు ఎత్తివేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు మూసేశారు. గ్రామాలకు కొత్తగా మంజూరైన రోడ్లనూ వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. 
సర్కారు నియంతృత్వ నిర్బంధకాండ 
జిల్లాలోని దొంగపల్లి గ్రామంలో 58 కుటుంబాలున్నాయి. ఈ గ్రామంలో నాయక్‌పోడు, కొలాం తెగలకు చెందిన ఆదివాసీలున్నారు. వీరంతా కొద్దిపాటి వ్యవసాయ పనులతోపాటు, ప్రధానంగా అటవీలోని వెదురు బొంగులను నరికి బుట్టలు, తడకలు అల్లుకొని జీవిస్తున్నారు. దొంగపల్లితో పాటు, అల్లీనగర్‌, మల్యాల గ్రామాల ఆదివాసీలూ ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే అధికారుల ఆంక్షలతో ఇప్పుడు వారి బతుకు భారంగా మారే పరిస్థితి తలెత్తింది. ఎలాంటి పునరావాసం కల్పించకుండానే..అధికారులు టైగర్‌ జోన్‌ పరిధిలోని గ్రామాలను.. అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నాలు చేయడం గమనార్హం. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసేలా అటవీ శాఖ అధికారులు కేసులు పెడుతుండడం.. సర్కారు నియంతృత్వ నిర్బంధకాండకు నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
పునరావాస పనులకు నిధుల కేటాయింపులు లేవు... 
టైగర్‌ జోన్‌ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వం, అందులో పునరావాస పనులకూ నిధులు కేటాయించింది. అటవీశాఖ అధికారులు మాత్రం పొమ్మనలేక పొగబెడ్తున్నారు.  కుటుంబానికో  ఇల్లు, మూడెకరాల భూమి,  10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. తమను ఎస్టీలుగా పరిగణించి, తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శలు 
అడవి మీద హక్కులను కాలరాస్తూ.. ఉపాధిని దెబ్బతీస్తూ.. గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.. వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడం నిజంగా దారుణమే. టైగర్‌ ప్రాజెక్టు కోసం వెదురు బొంగులు, ఇతర అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు గల హక్కులను కాలరాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, గిరిజనులకు తగిన ప్యాకేజీ అమలు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

 

12:56 - July 18, 2016

అనంతపురం : అనంతపురం.. ఈ పేరు వినగానే కరవే కళ్ల ముందు కదలాడుతుంది. వరుస కరవుల ప్రభావం జిల్లాలో పశుసంపదపైనా పడుతోంది. ముఖ్యంగా సేద్యంలో రైతుకు తోడుగా సాగే కాడెద్దులపై.. కరవు ప్రభావం తీవ్రంగా పడింది. కుటుంబ సభ్యుల్లా చూసుకునే పశువులకు దాణా అందించలేక.. వాటిని ఆకలతో వుంచలేక.. సంతల్లో అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు పశువులతో కళకళలాడిన లోగిళ్ల ప్రస్తుత దుస్థితిపై 10 టీవీ స్పెషల్‌ రిపోర్ట్‌
కనుమరుగవుతున్న కాడెద్దులు
అనంతపురం జిల్లా కక్కలపల్లి గ్రామం.. కొన్నే ళ్ల క్రితం వంద జతల కాడెద్దులు కలిగిన గ్రామం..నేడు ఎంత లెక్కించినా ఎనిమిది ఎద్దులు కూడా లేక బోసిపోయింది. ప్రతి ఏటా కమ్ముకు వచ్చే కరవు దెబ్బకు జిల్లాలో వ్యవసాయం దండుగలా మారిపోయింది. పెద్దపెద్ద రైతులే కూలీలుగా మారిపోతున్నారు. స్థానికంగా కూలి పనులు దొరక్క.. దొరికినా పని బాగా బతికిన చోట చేయలేక సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాడెద్దులను అమ్ముకుని.. ఊరు దాటుతున్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని కక్కలపల్లి గ్రామానికి చెందిన కోనప్ప సోదరులే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నారు. వీరంతా ఒకేసారి కాడెద్దులను అమ్మేసుకుని.. సేద్యానికి దూరమై వేర్వేరు పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 
గత్యంతరం లేక అమ్ముకుంటున్న రైతులు
ఇది ఒక్క కక్కలపల్లికే పరిమితం కాదు. అనంతపురం జిల్లాలోని దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. పశువులు.. రైతు కుటుంబాలకు నేస్తాలు. ముఖ్యంగా కాడెద్దులు.. రైతులకు సేద్యంలో చేదోడు వాదోడు. పల్లెల్లో ప్రతి రైతు ఇల్లూ పశుసంపదతో కళకళలాడేది. ప్రత్యేకంగా పశువుల కోసమే పండుగలు జరుపుకోవడమూ.. రైతు కుటుంబాల్లో ఆనవాయితీగా ఉండేది. కానీ నేడా పరిస్థితి పూర్తిగా కనుమరుగవుతోంది. ప్రస్తుతం జిల్లాలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు గ్రామాల్లో వందలాదిగా ఉండే కాడెద్దులు.. ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టేస్థాయికి పడిపోయాయి.
పెను భారంగా మారుతున్న పశుపోషణ
కాడెద్దులను మేపడానికి  రోజుకు అథమ పక్షం రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మనిషి తిండి ఖర్చుకంటే, పశువుల మేత ఖర్చే ఎక్కువవుతోంది. దీంతో పశువులకు గ్రాసం సమకూర్చలేక రైతులు వాటిని వదిలించుకోవడమే మంచిదన్న భావనకు వస్తున్నారు. మరికొందరు రైతులు.. కాడెద్దులను అమ్ముకోలేక.. వాటిని అద్దెలకు ఇచ్చి గ్రాసాన్ని సమకూర్చుకుంటున్నారు. అయితే కాడెద్దులను అద్దెకు తీసుకునేవారూ బాగా తగ్గిపోయారు. ఆరునెలలకు ఒకసారి మాత్రమే కాడెద్దులను అద్దెకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, సంవత్సరం పొడవునా పశువులను పోషించుకోవడం రైతులకు తలకుమించిన భారమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారీ భూస్వాములు ఇటీవల సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. యాభై.. అరవై ఎకరాలున్న భూస్వాములు కొందరు మాత్రమే కాడెద్దులను కొంటున్నారు. సేద్యం పనులు అయిపోగానే వాటిని తిరిగి అమ్మేస్తున్నారు. 
యాంత్రీకరణతో తగ్గిన కాడెద్దుల వాడకం 
వ్యవసాయంలో కాడెద్దుల వాడకం తగ్గిపోవడానికి యాంత్రీకరణ ప్రధాన కారణమన్న వాదన ఉంది. పదేళ్లుగా జిల్లాలో అనేక మార్పులు వచ్చాయి.. ముఖ్యంగా పంటలు లేక అందరూ ఆర్థికంగా చితికిపోయారు. తమను తాము పోషించుకోవడమే గగనమైన పరిస్థితుల్లో కాడెద్దులను, పశుసంపదను ఎలా పోషించాలన్న వేదనలో రైతులున్నారు. 
వ్యవసాయదారులు ఆందోళన
గతంలో రైతుకు రైతుకూ మధ్యపోటీ వుండేది. తన కాడెద్దులు గొప్పవంటే తన కాడెద్దెలు గొప్పవంటూ పోటీలు పడేవారు. కానీ ఇప్పుడు రైతుల్లో మునుపటి ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. మరో ఐదు సంవత్సరాలు పరిస్థితి ఇలానేవుంటే, కనీసం ఇప్పుడు అక్కడక్కడా కనిపించే కాడెద్దులూ అడ్రస్ లేకుండాపోతాయని వ్యవసాయదారులు ఆందోళన చెందుతున్నారు. 
అధికారులపై విమర్శలు 
ఈ దుస్థితికి అసలు కారణమైన కరవును దాచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. కరువు అని చెబితే ప్రభుత్వం దానికి పరిష్కారం చూపాలి.. రైతులను ఆదుకోవాలి.. కానీ సర్కారు తరచూ తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికైనా జిల్లా రైతాంగం కష్టాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ఆదుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం గుర్తించాలి. ఆ దిశగా కార్యాచరణకు దిగాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. 

 

గణేష్ విగ్రహాల ఎత్తుపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : గణేష్ విగ్రహాల ఎత్తుపై హైకోర్టులో విచారణ జరిగింది. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి మినీ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. హుస్సేన్ సాగర్ కు ఆనుకుని సంజీవయ్య పార్కులో మినీ ట్యాంక్ తో పాటు 12 చెరువులకు ఆనుకుని మినీ ట్యాంకులు నిర్మించడం జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణనను మూడు వారాలకు వాయిదా వేసింది.

బీజేపీ, టీడీపీ అధికారం కోసం పుట్టాయి - రఘువీరా..

విజయవాడ : బీజేపీ, టీడీపీ అధికారం కోసం పుట్టాయని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మీడియా సమస్యలపై కాంగ్రెస్ సానుకూలంగా ఉందని, రాష్ట్ర విభజన నేరం తమపై మోపడం సరికాదన్నారు. కొందరు స్వార్థంతో పార్టీ మారడంతోనే కాంగ్రెస్ దెబ్బతిన్నదని, పోరాటాలతో ఇప్పుడు తమ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. వైఎస్ఆర్ సెంటిమెంట్ వైసీపీ వెంటే ఉందన్నారు.

12:45 - July 18, 2016

గుంటూరు : జిల్లాలోని నిజాంపట్నం మండలంలో మైనర్‌ బాలిక జాస్మీన్‌ మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జాస్మీన్‌పై అత్యాచారం చేసి.. హత్య చేశారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను గ్రామస్తులను చితకబాదారు. దీంతో సాయి అనే యువకుడు చనిపోయాడు. మరో యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిజామాపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
మహ్మదీయపాలెంలో జాస్మిన్ నివాసం...
నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలెంలో షేక్ మెహరున్నీసా కుటుంబం నివసిస్తోంది. నిన్న ఉదయం కుటుంబ సభ్యులు మట్లపూడిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుమార్తె జాస్మిన్ మాత్రం వారితో వెళ్లకుండా ఇంటివద్దే ఉంది. కాసేపటికి ఆ ఇంటి నుంచి అడవులదీవికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్‌కుమార్ అనే యువకులు బయటికి వచ్చి... పొరిగింటికి వెళ్లి అక్కడున్న వారితో జాస్మిన్ ఆత్మహత్య చేసుకుంటానంటోందని చెప్పారు. దీంతో స్థానికులు వెళ్లి చూసేసరికి ఆమె విగతజీవిగా పడి ఉంది. మంచంపై నెత్తుటి మరకలు, తెగిన బెల్టు ఉండడంతో ఆ యువకులే లైంగిక దాడికి యత్నించి చంపేశారని భావించిన స్థానికులు వారిని చెట్టుకు కట్టేసి.. గొడ్డును బాదినట్లు బాదారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న రేపల్లె టౌన్ సి.ఐ. మల్లికార్జునరావు, ఇతర సిబ్బంది యువకులను స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు వారికి నచ్చజెప్పి యువకులను స్టేషన్‌కు తరలించారు.
జాస్మిన్‌ బంధువుల దాడిలో సాయి మృతి
జాస్మిన్‌ బంధువుల దాడిలో గాయపడ్డ సాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో సాయి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జాస్మిన్‌ బంధువుల చేతిలో గాయపడ్డ తర్వాత పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తరలించకుండా.. నిర్లక్ష్యం చేయడం వల్లే తన కొడుకు చనిపోయాడని సాయి తల్లి ఆరోపిస్తోంది. అయితే.. జాస్మీన్‌ మృతికి ఇద్దరు యువకులు కారణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకు జాస్మిన్‌ చావుకు కారణం ఎవరూ...? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందర్నీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి..? ఇటు గ్రామస్తులు చేతిలో చావు దెబ్బలు తిన్న సాయి చనిపోవడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటు మరో యువకుడు కూడా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అసలు జాస్మిన్‌ మృతికి కారణం ఎవరు అనేదానిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. 

12:38 - July 18, 2016

హైదరాబాద్ : చిన్నారి రమ్య కుటుంబం మూడు తరాలను కోల్పోయింది. పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి చనిపోయారు. 18 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఇప్పటికే మధుసూదనాచారి కుటుంబం రమ్య, రాజేష్‌లను కోల్పోయింది. చిన్నారి రమ్య తాతయ్య చనిపోవడంతో ఆ కుటుంబం మరింత కుంగిపోయింది. దోషులను ఇంకా శిక్షించకపోవడంపై రమ్య కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యశోద ఆసుపత్రి ఎదుట రమ్య బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మధుసూదనచారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకుంటున్నారు.
రమ్య బంధువులు...
రమ్య, రమేష్, మధుసూదనాచారి మృతికి కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలి. తాగి కారు నడుపుతూ ప్రమాదం చేసి ముగ్గుర్ని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి. నిందితుల తల్లిదండ్రులు బాధిత కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శింకపోవడం దారుణం. ఆరుగురు నిందితుల్లో ఒకరిని మాత్రమే రిమాండ్ కు పంపారు. మిగిలిన ఐదుగురు బెయిల్ పై విడుదలయ్యారు. ఆ నిందితుల జాడ లేదు. 
 బంగారు తెలంగాణ అంటే ఇదేనా..? 
ప్రమాద ఘటనపై టీసర్కార్ ఎందుకు స్పందించడం లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం... మరొకరికి వేరొక న్యాయమా.? తప్పతాగి వాహనాలు నడిపితూ రోడ్డు ఉన్న వారిని చంపుకుంటే పోతే... రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందా.. స్మశాన  తెలంగాణ అవుతుంది. బంగారు తెలంగాణ అంటే ఇదేనా..? ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం. ఫుట్ పాత్ లపై ఉంటే కూడా ఎవరొచ్చి గుద్దుతారో అన్న భయం ఉంది. తాగి నడపకండి...ఎదుటివారి ప్రాణాలు తీయకండి. యమకింకరులు కావొద్దు. రూల్స్ మారాలి. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

12:30 - July 18, 2016

సీజన్ వారిగా దొరికే పండ్లు..అన్ని రకాల సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని పండ్లలో విత్తులు ఉంటాయనే విషయం తెలిసిందే కదా. కొంతమంది ఈ విత్తనాలను పారేస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దామా..
గుమ్మడి విత్తనాలు తినడం వల్ల డిప్రెషన్ తో పాటు శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి.
నిమ్మకాయ గింజలు, కివి సీడ్స్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
పుచ్చకాయ విత్తనాలు పారేయకుండా తినడం వల్ల జట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కడుపులో ఉండే నులిపురుగులు కూడా నశిస్తాయంట.
వైద్యుల సలహాతో చిన్నపిల్లలకు ఈ గింజలు ఇవ్వడం మంచిది.
బొప్పాయి పండులోని విత్తనాలను కూడా తినవచ్చని వారు సూచించారు. ఈ విత్తనాల్లో ఉండే పొట్రియోలిక్‌ ఎంజైమ్‌ ల వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

12:19 - July 18, 2016

మహబూబ్ నగర్ : పుష్కర ఘాట్ల పనులు కొందరికి వరంగా మారాయి. నాసిరకం పనులతో కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు అటువైపు చూడని పరిస్థితి. పుష్కర దొపిడిపై టెన్ టీవీ ప్రత్యేక కథనం
పుష్కర ఘాట్ల నిర్మాణంలో అక్రమాలు 
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి వచ్చిన కృష్ణా పుష్కరాలను  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు పుష్కర ఘాట్ల నిర్మాణం కోసం కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అయితే  ఘాట్ల నిర్మాణ పనులలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు ఉదాసీనంగా  వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు
నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 13 పుష్కర ఘాట్లు ఉన్నాయి. వీటికి 25 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కొల్లాపూర్ మండలంలో 4 ఘాట్లు, వీపనగండ్ల మండలంలో 9 ఘాట్లు ఉన్నాయి. పుష్కర ఘాట్ల నిర్మాణ చేసే కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు విస్మరిస్తున్నారు.వీపనగండ్ల మండంలోని వెల్గటూర్ ఘాట్ లో బండరాళ్లను గుట్టలుగా పేర్చి వాటిపైన సిమెంట్ తో  ప్లాస్టర్ చేస్తున్నారని అక్కడి గ్రామస్తులు మండిపడుతున్నారు. 
సిమెంట్ లో నల్లని పౌడర్ మిక్స్
వెల్గటూర్ ఘాట్ నుంచి పంచాయితీ రాజ్ రోడ్డు వరకు నిర్మించాల్సిన రహదారికి నేటికి అధికారులు అంచనాలు తయారుచేసేందుకు అటువైపు రాలేదు. పెద్దమారూర్ పరిస్ధితి మరి దారుణంగా ఉంది. పుష్కర ఘాట్లలో గోడలు నిర్మించి సిమెంట్ లో నల్లని పౌడర్ కలిపి నల్లమట్టిని ఇసుకగా వాడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కు
కొల్లాపూర్ నియోజకవర్గానికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న పుష్కర పనులలో ఇలాంటి పరిస్దితులు ఉంటే, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసుకోని ఘాట్ల నిర్మాణ పనులు తుతూ మంత్రంగా చేస్తూ గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు  కుమ్మకై దొచుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. నాసిరకంగా చేపడుతున్న పనులపై విజిలెన్స్ ఎంక్వెరీ వేయాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. 

 

12:13 - July 18, 2016

హైదరాబాద్ : పేదోడికి విద్య అందని ద్రాక్షే అయింది. ప్రమాణాలు లేక ప్రభుత్వ విద్య ఒంటికాలిమీద గెంతుతుంటే... జేబులు నింపుకోవడమే పనిగా  ప్రైవేట్‌ విద్య  పేదోడి రక్తాన్ని పీల్చేస్తోంది. తెలుగురాష్ట్రాల్లో  అడ్డగోలు ఫీజుల వసూళ్లపై అంతర్జాతీయ సంస్థ రిపోర్టును వెలువరించనుంది. రవీంద్రభారతి వేదికగా ఎడ్యుకేషన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తన రిపోర్టును బయటపెడుతోంది.
విద్యపై అంతర్జాతీయ సంస్థల సర్వే
అంతర్జాతీయ విద్యా వ్యాపారం... పేదల నుండి వసూళ్లు.. అనే అంశంపై ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ తెలుగురాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఇక్కడి ప్రైవేటు, కార్పొరేట్, ప్రభుత్వ పాఠశాలల్లో   విద్యావిధానం పై ఒక నివేదికను తయారుచేసింది.  ప్రపంచ వ్యాప్తంగా 171 దేశాల్లోని 396 సంఘాలు ఈ సంస్థతో  కలిసి పనిచేస్తున్నాయి.. దాదాపుగా 32మిలియన్ల మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంస్థల ఉద్యోగులతో ఈ సంస్ధ ఏర్పడింది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటయిన ఈ సంస్థ అనేక దేశాల్లో పరిశోదనలు చేసింది.  
పేదలను దోచుకుంటున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టం ద్వారా కేవలం 9శాతం మందికి  మాత్రమే వర్తిస్తోందని ఈసంస్థ చెబుతోంది.  ఇక్కడ విద్యను వ్యాపారీకరణ చేసి.. పేదల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని వారు అంటున్నారు.  ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి సమాజానికి తీరని నష్టాన్ని కల్పిస్తున్నారు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విద్యాహక్కు చట్టంలో చెప్పినట్టు పేదల పిల్లలకు నాణ్యతకలిగి విద్యను అందించాలని తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఎడ్యుకేషన్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు. తమ పరిశోదన రిపోర్టును ఆదివారం రవీంద్రభారతి వేదికగా బహిర్గతం చేయనున్నట్టు సంస్థ ప్రతిని తెలిపారు. అంతర్జాతీయ విద్యా వ్యాపారం ఏవిధంగా వుంది.. పేదల నుంచి  ప్రైవేటు విద్యాసంస్థలు ఏవిధంగా సొమ్ము చేసుకునే విషయంపై ఇప్పటివరకు చేసిన అధ్యయన నివేదికను బయటపెట్టనున్నట్టు వారు తెలిపారు. 

 

తెలంగాణను వదిలిపెట్టానని భావించొద్దు - సీఎం బాబు..

హైదరాబాద్ : తాను తెలంగాణనను వదిలిపెట్టానని భావించొద్దని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టి.టిడిపి నేతలతో సీఎం బాబు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమయం లేకపోవడం వల్లే కొంత గ్యాప్ వచ్చిందని, ఇకపై 15 రోజుల కొకసారి సమావేశం ఏర్పాటు చేసుకుందామని బాబు పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు ఏర్పాటు చేపట్టాలని, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, మండలస్థాయి కమిటీలను నేతలంతా చర్చించి ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. 25వ తేదీన మరోసారి భేటీ జరుగనుంది.

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ కొద్దిసేపటి క్రితం వాయిదా పడింది. సోమవారం నుండి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభను 12.13 నిమిషాలకు వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే సభా కార్యక్రమాల సలహా సంఘం మధ్యాహ్నాం ఒంటి గంటకు సమావేశం జరగనుంది.

రైతు ఆత్మహత్యలు బాధాకరం - ఆర్బీఐ గవర్నర్..

హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలు బాధాకరమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో ఎన్ఐఆర్డీ, పంచాయతీ రాజ్ సముదాయంలో జాతీయ సెమినార్ జరుగుతోంది. వాటా, అందరికీ ఆర్థిక సేవలతో గ్రామీణ భారతానికి కొత్తరూపు అంశంపై రాజన్ ప్రసంగిస్తున్నారు. చైనా మాదిరిగా రూపాయి విలువను తగ్గించడం కుదరదని, కో ఆపరేటివ్ బ్యాంకు ప్రగతి బాగానే ఉన్నా పరిపాలనా వ్యవస్థ తీరు బాగాలేదని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. పౌరులకు ఆర్థిక అక్షరాస్యత అవసరమని, బ్యాంకు అకౌంట్ ఓపెన్ కు శాశ్వత చిరునామా చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గ్యాంగ్ రేప్ పై అట్టుడికిన 'మహా' అసెంబ్లీ..

మహారాష్ట్ర : అహ్మద్ నగర్ లో ఇటీవలే చోటు చేసుకున్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై సీఎం స్పందించారు. ఈ కేసులో ముద్దాయిని అరెస్టు చేయడం జరిగిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుగుతుందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు సీఎం ఫడ్నవీస్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

11:54 - July 18, 2016

గుంటూరు : జిల్లాలో మైనర్‌ బాలిక జాస్మీన్‌ మృతి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జాస్మీన్‌పై అత్యాచారం చేసి.. హత్య చేశారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను గ్రామస్తులను చితకబాదారు. దీంతో సాయి అనే యువకుడు చనిపోయాడు. మరో యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నిజామాపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. జాస్మీన్‌ మృతికి ఇద్దరు యువకులు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకే జాస్మిన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. జాస్మిన్ ను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు వెళ్లగా అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉంది. విషయాన్ని పవన్, సాయి స్థానికుల సహాయంతో జాస్మిన్ కిందికి దించారు. జాస్మిన్ బంధువులు, పెద్ద ఎత్తును గుమిగూడిన ఇరుగుపొరుగు వారు అసలు విషయం తెలియక యువకులపై ఆగ్రహంతో దాడి చేశారు. ఇటు గ్రామస్తులు చేతిలో చావు దెబ్బలు తిన్న సాయి చనిపోవడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇటు మరో యువకుడు కూడా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రేపల్లి ఆస్పత్రిలో సాయి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అసలు జాస్మిన్‌ మృతికి కారణం ఎవరు అనేదానిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. నిజనిజాలు తేల్చాకే నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని పోలీసులు చెబుతున్నారు. జాస్మిన్ పై అత్యాచారం చేసి హత్య చేశారనే వాదనలు ఉన్నాయి. కానీ ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. కేవలం ఉరివేసుకున్న మెడ వద్ద మాత్రమే గాయం అయింది. ఘటనాస్థలంలో ఒక బెల్టు, బ్యాగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. పూర్తి వివరాలు తెలియకుండా జాస్మిన్ మృతితో ఇద్దరు యువకులకు ప్రమేయం ఉందని చెప్పడం కష్టంగా మారింది. మరోవైపు జాస్మిన్ కు ఎంగేజ్ మెంట్ అయిందని తెలుస్తోంది. అది ఇష్టం లేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా...? అనే సందిగ్థం నెలకొంది. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.  అయితే పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. ఇంతకు జాస్మిన్‌ చావుకు కారణం ఎవరూ...? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందర్నీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి..?
పవన్, సాయి... 
'జాస్మిన్ మాకు ఫోన్ చేసింది. మేము ఆమె ఇంటికి వెళ్లే సరికే జాస్మిన్ ఉరివేసుకుని మృతి చెందింది. స్థానికుల సహాయంతో ఆమెకు కిందికి దించాము. అనంతరం పెద్ద స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి ఈ ఘటనకు మేమే బాధ్యులమని మమ్మల్ని కొట్టారు. మేము ఆమెను కాపాడేందుకు వచ్చాము. మేము ఆమెను హత్య చేయలేదని ఇద్దరు యువకులు చెప్పినట్లు' తెలుస్తోంది.  
నా కుమారున్ని అన్యాయంగా చంపేశారు : సాయి తల్లిదండ్రులు.. 
నా కుమారున్ని అన్యాయంగా చంపేశారు.. జాస్మిన్ మృతి ఘటనలో నా కుమారుని పాత్ర లేదు. సాయిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా రెండు, మూడు పీఎస్ ల పోలీసులు తిప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆలస్యమై చనిపోయాడు. నా కొడుకు చావుకు పోలీసులే కారణమని ఆరోపిస్తున్నారు. మా కుంటుంబానికి, గౌస్ కుటుంబానికి గత కొంతకాలంగా ఘర్షణ జరుగుతోంది. ఈనేపథ్యంలో కావాలనే నా కుమారున్ని గౌస్.. కేసులో ఇరికించారని సాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
నా కూతురి మృతికి వారే కారణం : జాస్మిన్ తల్లి
నా కూతురి మృతికి సాయి, పవన్ లే కారణం. ఇద్దరు యువకులే నా కుమార్తెను హత్య చేశారని ఆరోపిస్తుంది. 

 

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త సభ్యులను సభకు ప్రధాని మోడీ పరిచయం చేశారు. అనంతరం ఎంపీ దల్పత్ సింగ్ పరాస్తే మృతి పట్ల లోక్ సభ సంతాపం వ్యక్తం చేసింది. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ వెల్లడించారు.

కర్నూలుకు బయలుదేరిన సీఎం బాబు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం టి.టిడిపి నేతల భేటీ ముగిసింది.

 

యశోదా ఆసుపత్రి వద్ద చిన్నారి రమ్య బంధువుల ఆందోళన..

హైదరాబాద్ : యశోద ఆసుపత్రి వద్ద ఇటీవలే మృతి చెందిన చిన్నారి రమ్య బంధువులు ఆందోళన చేపట్టారు. కొద్దిసేపటి క్రితం చిన్నారి రమ్య తాత మధుసూధనచారి కూడా మృతి చెందారు. దీనితో పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తారో స్పష్టం చేయాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని రమ్య బంధువులు పేర్కొంటున్నారు.

 

90 శాతం కీలక స్మగ్లర్ల అరెస్టు - డీజీపీ..

తిరుపతి : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు, అటవీ శాఖ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. స్మగ్లర్లను అణిచివేసేందుకు పోలీసు, అటవీ, టాస్క్ ఫోర్స్ సమన్వయంతో పనిచేస్తున్నాయని డీజీపీ రాముడు పేర్కొన్నారు. 90 శాతం కీలక స్మగ్లర్లందరినీ అరెస్టు చేయడం జరిగిందని, ఎర్రచందనం కేసులు త్వరితగతిన పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రభుత్వ పరిశీనలో ఉందని డీజీపీ పేర్కొన్నారు.

మథురలో కూలిన ఇళ్లు..ఒకరి మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : మథురలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు కూలిపోయింది. ఈఘటనలో ఒక కూలి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. కొత్త మంత్రులను ప్రధాన మంత్రి మోడీ సభకు పరిచయం చేశారు. రాజ్యసభ సభ్యులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, నిర్మాల సీతారామన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ సూచించారు.

పార్లమెంట్..సీపీఎం నోటీసులు..

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న అశాంతి..ధరల పెరుగుదలపై సీపీఎం నోటీసులు ఇచ్చింది.

బీసీ సంఘాల ర్యాలీ..అడ్డుకున్న పోలీసులు..

కర్నూలు : కాపులను బీసీల్లో చేర్చవద్దని కృష్ణదేవరాయుల విగ్రహం వద్ద బీసీ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు బీసీ సంఘం నేతలను అరెస్టు చేశారు.

పార్లమెంట్ కు చేరుకున్న మోడీ..

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ కు చేరుకున్నారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని మోడీ సూచించారు.

 

సీబీఆర్ మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్..

ఆదిలాబాద్ : సీబీఆర్ మోడల్ స్కూల్ హాస్టల్ లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

10:49 - July 18, 2016

హైదరాబాద్ : చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి చనిపోయారు. 18 రోజుల పాటు ఆయన మృత్యువుతో పోరాడి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఇప్పటికే మధుసూదనాచారి కుటుంబం రమ్య, రాజేష్‌లను కోల్పోయింది. ఈనెల 1న పంజాగుట్ట వద్ద జరిగిన కారు ప్రమాదంలో మధుసూదనాచారి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
తాగుబోతుల నిర్లక్ష్యానికి ముగ్గురు బలి  
ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచిన చిన్నారి రమ్య ఈ లోకాన్ని వీడిపోయింది. పెద్దయ్యాక శాస్త్రవేత్తనై దేశానికి సేవ చేస్తానని చెప్పిన ఆ చిన్నారి... తన ఆశయం  నెరవేరకముందే తనువు చాలించింది. తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్‌ చేయడం వల్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్‌, ఇప్పుడు తాత మధుసూదనాచారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి రమ్య మృతి అందర్నీ కలిచి వేసింది. మద్యం కిక్కులో కారు నడిపిన నలుగురు బీటెక్‌ కుర్రాళ్ల కారణంగా మధుసూదనాచారి కుటుంబం చిన్నాభిన్నమైంది. స్కూల్లో చేరి తిరిగి ఇంటికి వెళ్తుండగా..ఎదురుగా యమదూతలా దూసుకొచ్చిన కారు చిన్నారి రమ్యను చిదిమేసింది. ఒకే కుటుంబంలో 18 రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : రమ్య తండ్రి
తమ కుటుంబం చిన్నాభిన్నమవడానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని రమ్య తండ్రి వెంకటరమణ డిమాండ్‌ చేస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంతవరకూ స్పష్టం చేయలేదన్నారు. 

 

కంతేరు - నిడమర్రు మధ్య ట్రాక్టర్ బోల్తా..

గుంటూరు : కంతేరు - నిడమర్రు మధ్య ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఒకరు మృతి చెందగా మరో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. తాత్కాలిక సచివాలయంలో పనులకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కాణిపాక వినాయక ఆలయంలో సిబ్బంది చేతివాటం.

చిత్తూరు : కాణిపాక వినాయక ఆలయంలో ఉద్యోగుల దేవస్థానం స్టోర్ లో సరుకులు దొంగిలిస్తున్న ఉద్యోగులను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు.

కంతేరు - నిడమర్రు మధ్య ట్రాక్టర్ బోల్తా..

గుంటూరు : కంతేరు - నిడమర్రు మధ్య ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఒకరు మృతి చెందగా మరో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. తాత్కాలిక సచివాలయంలో పనులకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కాణిపాక వినాయక ఆలయంలో సిబ్బంది చేతివాటం..

చిత్తూరు : కాణిపాక వినాయక ఆలయంలో ఉద్యోగుల దేవస్థానం స్టోర్ లో సరుకులు దొంగిలిస్తున్న ఉద్యోగులను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు.

10:40 - July 18, 2016

రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు తీసుకోవాలి. వీటిని కలిపి నూరాలి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరి చేరదు.
చెవిపోటు వస్తే చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లి రసం వేస్తే కొంత రిలీఫ్ దొరుకుతుంది.
అల్లం తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి సేవిస్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
రోజుకు కనీసం అరవై గ్రాముల పెరుగు తింటే చిగుళ్ల వ్యాధులు రావు. పెరుగులో ఉండే లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్లపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. తద్వారా చిగుళ్లు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి.
నీళ్లు కాచి చల్లార్చి తాగే అలవాటున్న వారు ఆ నీళ్లల్లో కాస్త సోంపు వేసి కాచి, వడగట్టి తాగండి. దాహం తీరడంతో పాటు అజీర్తి సమస్యలూ తొలగిపోతాయి.
తులసి ఆకుల్ని నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది.
రోజూ గోధుమ జావ తాగితే రక్తపోటు(బీపీ) అదుపులో ఉంటుంది.
ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..కొలెస్ట్రాల్‌ని దరిచేరనివ్వవు.
జామపళ్లు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
తరచుగా జలుబు బారినపడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కంటిరెప్పలపై నొసలపై ఆల్మండ్ ఆయిల్ రాసి మసాజ్ చేస్తే వెంట్రుకలు రాలిపోకుండా నిగనిగ మెరుస్తాయి.

ధరల పెరుగుదలపై టీఎంసీ నోటీసులు..

ఢిల్లీ : కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ధరల పెరుగుదలపై టీఎంసీ సభ్యులు నోటీసులిచ్చారు. ఈ అంశంపై ఆ పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేపట్టనున్నారు.

10:25 - July 18, 2016

ముంబాయి : టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్‌ అగైనెస్ట్‌ ఆడ్స్‌'ను బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ముంబాయిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడారు. తనకు ఆత్మకథను రాసే ఆలోచనేమీ లేదన్నారు. తన కథ తనతో పాటే సమాధి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక వేళ తన ఆత్మకథను రాస్తే పాతగాయాలు తిరిగి రేగుతాయన్నారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన సానియాకు ఇప్పుడు లేకున్నా భవిష్యత్తులో ప్రయత్నించవచ్చని సూచించారు. తనకు వివాహం ఎప్పుడవుతుందో తెలియదని, అయితే తాను వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని సల్మాన్‌ చెప్పారు. నవంబరు 18న ఆయన వివాహం ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై అడగగా ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ, పెళ్లి మాత్రం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సానియా, సల్మాన్‌ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. 

 

వరదలో చిక్కుకున్న బస్సు..

రాజస్థాన్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శిఖర్ ప్రాంతంలో వరదలో ఓ బస్సు చిక్కుకపోయింది. వరద ప్రవాహం అంతకంతకు తీవ్రరూపం దాల్చింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు బస్సులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

జాస్మిన్ మృతిపై పలు అనుమానాలు..

గుంటూరు : రేపల్లేలో జాస్మిన్ మృతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జాస్మిన్ మృతికి కారకులు ఆరోపిస్తూ ఇద్దరు యువకులపై జాస్మిన్ బంధువులు దాడి చేశారు !. గ్రామస్తుల దాడిలో సాయి అనే యువకుడు మృతి చెందాడు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిజామపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

బాబుతో టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : లేక్ వ్యూ అతిథి గృహంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో టి.టిడిపి నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, గరికపాటి, రావుల పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తున్నారు.

 

 

ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి పరిటాల సునీత..

అనంతపురం : డ్వామా హాల్ లో పౌరసరఫరాల పంపిణీ విషయంలో ప్రజలతో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మంత్రి పరిటాల నిర్వహించారు. రేషన్ పంపిణీలో సమస్యలను మంత్రికి ప్రజలు విన్నవించారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించమని, ఈ పాస్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పరిటాల పేర్కొన్నారు.

10:00 - July 18, 2016

విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో మరోసారి భూసేకరణ సెగలు మొదలు కాబోతున్నాయి. రాజధానికి భూములివ్వని రైతులకు అక్టోబర్‌ను డెడ్‌లైన్‌గా ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించడంతో భూవివాదానికి ఆజ్యం పోసినట్టైంది. ఓవైపు ప్రాణాలు పోయినా భూములివ్వమని రైతుల మొండిపట్టుతో ఉండగా... ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదని మరోవైపు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇరువర్గాల మధ్య భూసేకరణపై మరింత దుమారం రేగుతోంది. 
భూసేకరణ ద్వారా భూములు 
రాజధానికి భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ బుజ్జగింపులు, ప్యాకేజీలంటూ చెప్పుకొచ్చిన సర్కారు ఇక నాన్చుడి ధోరణి లేదంటూ ప్రకటించేసింది. రాజధాని నిర్మాణం సకాలంలో జరగాలంటే, ఇక ఆలస్యం చేయడం మంచిదికాదంటూ అక్టోబర్‌ నెలను భూసేకరణకు ఆఖరి నెలగా ప్రకటించింది. భూసేకరణ కోసం అధికారులు సిద్ధం కావాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి రాజధాని గ్రామాల్లోని సీఆర్‌డీఏ అధికారులకు సమాచారం అందుతోంది. భూములు ఇవ్వని రైతులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించడంతో ఈ విషయం స్పష్టమైంది.
ప్రభుత్వ ప్రకటనతో రైతుల ఆగ్రహం
ప్రభుత్వం భూసేకరణకు డేట్‌ ప్రకటించడంతో రైతులు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. తాము భూములను ఇవ్వమని రెండేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వం తీరు మార్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించైనా పోరాడతాం గానీ, తమ భూములను మాత్రం అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్ట్, నేషన్ గ్రీన్‌ట్రిబ్యునల్ లను ఆశ్రయిస్తామని అంటున్నారు. ఇన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే జాతీయస్థాయిలో పోరాటాలు చేస్తామని  హెచ్చరిస్తున్నారు. 
పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో..? 
ఇన్ని సవాళ్లను అధిగమించి ప్రభుత్వం భూసేకరణ చేస్తుందా అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. మరోవైపు రాజధాని భూసేకరణలో రైతులకు అండగా నిలిచిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారోనన్న ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది. 

 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 120 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా 30 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతోంది.

గంజాయి స్వాధీనం కేసులో ముగ్గురు అరెస్టు..

హైదరాబాద్ : హయత్ నగర్ లో రెండు కోట్ల రూపాయల గంజాయి స్వాధీనం కేసులో కీసరకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ లో నిందితులను పట్టుకున్న పోలీసులు ఫార్చ్యూనర్ కారును సీజ్ చేశారు.

విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ అనుమానాస్పద మృతి..

విశాఖపట్టణం : సెంట్రల్ జైల్లో ఖైదీ కిరణ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాత్ రూంలో ఉరి వేసుకున్నాడని జైలు సిబ్బంది పేర్కొంటున్నారు. పీడీయాక్టు కింద రౌడీషీటర్ పొడుగు కిరణ్ అరెస్టయ్యాడు.

ప్రకాశం బ్యారేజీ నుండి నీరు విడుదల..

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ నుండి తూర్పు కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.

ఆ నిందితులను ఉరి తీయాలి : రమ్య తండ్రి

హైదరాబాద్ : 'నా కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్న నిందితులను నడరోడ్డుపై ఉరి తీయాలని' చిన్నారి రమ్య తండ్రి వెంకటరమణ అన్నారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో రమ్య, తాత మధుసూదనాచారి, బాబాయ్ రాజేష్ లు మృతి చెందారు. 

కౌంటర్ బిడ్స్ కు సీఆర్డీఏ ఆహ్వానం..

గుంటూరు : రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగుముందుకేసింది. స్విస్ ఛాలెంజ్ విధానానికి అంతర్జాతీయ ఏజెన్సీల నుండి సీఆర్డీఏ కౌంటర్ బిడ్స్ ఆహ్వానించింది. మౌలిక వసతుల అభివృద్ధి చట్టం నిబంధనల ప్రకారం ఆహ్వానం పలికింది. ఇప్పటికే సింగపూర్ కన్సార్టియమ్ స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. సంక్షిప్తంగా ఉన్న సీఆర్డీఏ నోటిఫికేషన్ స్విస్ ఛాలెంజ్ నిబంధనలపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుమలలో ఆక్టోపస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన...

చిత్తూరు : తిరుమలలో ఆక్టోపస్ భవన నిర్మాణానికి డీజీపీ రాముడు, ఈవో సాంబశివరావులు శంకుస్థాపన చేశారు. మొత్తం 1.6 ఎకరాల్లో ఈ భవనం నిర్మాణం కానుంది.

వారిని ఉరితీయాలి - చిన్నారి రమ్య తండ్రి...

హైదరాబాద్ : తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న నిందితులను రోడ్డుపై ఉరి తీయాలని ఇటీవలే మృతి చెందిన చిన్నారి రమ్య తండ్రి వెంకటరమణ డిమాండ్ చేశారు. పంజగుట్ట హిందూశ్మశాన వాటిక ముందు పమ్మి రాజేష్ (34) కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో అవతలి వైపు నుంచి పీకలదాకా మద్యం సేవించిన యువకులు వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రాజేష్ కారుపై పడింది. దీంతో రాజేష్, అక్కడికక్కడే చనిపోగా, పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి(65) వెన్నుపూస విరిగిపోయింది. కారులో ఉన్న చిన్నారి రమ్య(8) కోమాలోకి వెళ్లి 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.

నేడు చైనా వెళ్లనున్న మంత్రి కామినేని

హైదరాబాద్ : నేటి నుంచి 20 వరకు మంత్రి కామినేని శ్రీనివాస్ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. కామినేనితోపాటు వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చైనా వెళ్లనున్నారు. 

08:52 - July 18, 2016

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై టీసర్కార్ పునరాలోచన చేయాలని వక్తలు సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత బి.వెంకట్, టీడీపీ నేత దినకర్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత డిజైన్ మార్చాలన్నారు. 123 జీవో రద్దు చేయాలని తెలిపారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:44 - July 18, 2016

సెకండ్ ఏఎన్ఎమ్ లు సమ్మెబాట పట్టారు. ఇవాళ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో వీరి సేవలు నిలిచిపోతున్నాయి. వీరి సమస్యలను సానుభూతితో అర్ధం చేసుకుని, సమ్మెను విరమింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోతే,  వైద్య ఆరోగ్య సేవలు  అందక పేషెంట్లు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఇబ్బందిపడే ప్రమాదం వుంది. 
సెకండ్ ఏఎన్ఎంల మీద పనిభారం
తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలు మంచానపడుతున్నాయి. పట్టణాల్లోనూ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.   ఇలాంటి క్లిష్ట సమయాల్లో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, సబ్ సెంటర్లలోనూ ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో ఎఎన్ఎమ్ లు, సెకండ్ ఏఎన్ఎమ్ లు, హెల్త్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి 2500 మంది జనాభాకు ఒకరు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 5వేల మంది జనాభాకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి పదివేల మంది జనాభాకు ఒకరు చొప్పున ఏఎన్ఎమ్  లు వుండాలన్నది నియమం. కానీ, తెలుగు రాష్ట్రాల్లో సగటున పాతిక ముప్పై వేల మంది జనాభాకు ఒక్కరైనా లేని పరిస్థితి. 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ ఎంలదే కీలకపాత్ర
గర్భిణీలను ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ రిపోర్ట్స్ రూపొందించడం, భుజించాల్సిన ఆహారం గురించి మార్గదర్శనం చేయడం, పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నది ఎఎన్ ఎమ్ లు, సెకండ్ ఏఎన్ఎంలే. ఒక్కమాటలో చెప్పాలంటే, కుటుంబ సంక్షేమం, ప్రాథమిక ఆరోగ్య వైద్య సేవల్లో వీరిదే కీలకపాత్ర. ఇంత ప్రాధాన్యత పోస్టులను భర్తీ చేయడంలోనూ, వారి వ్రుత్తి నిర్వహణకు అవసరమైన సదుపాయాలు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదమైంది. ప్రాథమిక వైద్య ఆరోగ్య రంగంలోనూ కాంట్రాక్ట్ వ్యవస్థ ను ప్రవేశపెట్టారు. 2007 లో దాదాపు 4వేల మంది సెకండ్ ఏఎన్ఎమ్ లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలంటూ వీరు కొంతకాలంగా పోరాడుతున్నారు.  చాలాచోట్ల సీనియర్ ఏఎన్ఎంలు లేకపోవడంతో పనిభారం మొత్తం సెకండ్ ఏఎన్ ఎమ్ ల మీదే పడుతోంది. వీరికి సక్రమంగా జీతాలు అందడం లేదు.  యూనిఫామ్ అలవెన్స్ లు లేవు. పీహెచ్ సి మీటింగ్ లకు హాజరైనా టిఏలు, డిఏలు ఇవ్వడం లేదు. మెటర్నిటీ లీవ్ లు  లేవు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలన్నది సెకండ్ ఏఎన్ ఎమ్ ల డిమాండ్. 

 

08:41 - July 18, 2016

సెకండ్ ఏఎన్ ఎంలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేత యాదానాయక్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలో  సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ప్రాథమిక  స్థాయి వైద్య ఆరోగ్య సేవలు నిలిచిపోయే అవకాశం వుంది. సెకండ్ ఏఎన్ఎం ల సమ్మెకు కారణం ఏమిటి? వీరి ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ ఏమిటి? దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఏఎన్ఎంల సమ్మె ప్రభావం వైద్య ఆరోగ్య సేవల మీద ఎలా వుండబోతోంది? అసలే గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా విషజ్వరాలు విజ్రుంభిస్తున్న సమయంలో సెకండ్ ఏఎన్ ఎమ్ లు సమ్మె చేయడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఇలాంటి అంశాలపై యాదానాయక్ మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:27 - July 18, 2016

వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో మరో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నల్లజాతి పౌరుడు స్టెర్లింగ్‌ కాల్చివేత అనంతరం పలు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలాలు మిన్నంటుతూనే ఉన్నాయి..
పోలీస్ ఆఫీసర్లపై విచక్షణా రహితంగా కాల్పులు 
అమెరికా మళ్లీ రక్తసిక్తమైంది. లూసియానా బాటన్ రౌగ్‌లోని హమ్మాంద్ ఐరే ప్లాజా ఆదివారం ఉదయం కాల్పులతో దద్దరిల్లింది. సాయుధుడు ఎనిమిది మంది పోలీస్ ఆఫీసర్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులకు చికిత్స 
క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారైన సాయుధుడి గురించి వేట మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే అసాల్ట్‌ రైఫిల్‌తో ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకోగా.. వారిపై దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాగా కాల్పులు జరిపిన ఆగంతకుడిని పోలీసులు మట్టుబెట్టగా.. అతని వద్ద ఆత్మహుతి బాంబులు ఏమైన ఉన్నాయని పరిశీలించారు. 
కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన ఒబామా  
కాల్పుల ఘటనను అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులపై ఈ తరహా దాడులు సమంజసం కాదని తెలిపారు. ఇదిలాఉంటే  కొద్ది రోజుల క్రితం లూసియానాలోనే అల్టాన్‌ స్టెర్లింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు కాల్చిచంపడంతో దేశమంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సద్దుమణుగుతోందనుకున్న తరుణంలోనే మళ్లీ భగ్గుమంది. 

 

08:22 - July 18, 2016

హైదరాబాద్ : ఆపరేషన్‌ ఆకర్ష్‌తో జోష్‌ మీదున్న టీఆర్‌ఎస్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కాదనకుండా కారెక్కించుకున్నారు. కానీ.. ఎంపీల విషయంలోనే తకరారు మొదలైంది.  గులాబీతీర్ధం పుచ్చుకున్న ఎంపీలపై విపక్షాలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే.. ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోనన్న టెన్షన్‌ గులాబీ నేతలను సతమతం చేస్తోంది. 
ఫిరాయింపుల పరేషాన్‌ 
అధికార పార్టీలో కొత్త పరేషాన్‌ మొదలైంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను జోరుగా అమలు చేసిన గులాబీపార్టీలో ఇపుడు ఫిరాయింపుల గుబులు మొదలైంది. 
ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడాన్ని పెద్దగా పట్టించుకోని విపక్షాలు ..  పార్లమెంట్ సభ్యులు కూడా  కారెక్కడంతో సీరియస్‌ అవుతున్నాయి. తమ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీతీర్థం పుచ్చుకోవడంపై వైఎస్ ఆర్ పీ సీరియస్ గా ఉంది.  ఎపిలో జరుగుతున్న పరిణామాలతో పాటు టీఆఎస్ లో చేరిన ఎంపీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.  వైసీపీ దూకుడుతో అటు కాంగ్రెస్, టీడీపీలు కూడా  తమ ఎంపీలు ధోకా ఇవ్వడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే ఛాన్స్‌ ఉందని టీఆర్‌ఎస్‌లో గుసగుసలు నడుస్తున్నాయి.  ముగ్గురు ఎంపీలపై  ఈ సమావేశాల్లోనే   ఫిర్యాదులు అందితే  లోకసభ స్పీకర్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. 
స్పీకర్‌ నిర్ణయంపై ఆసక్తి 
అయితే..  కేంద్రంతో  అటు టీడీపీ..ఇటు టీఆర్‌ఎస్‌లు స్నేహాన్నే కొనసాగిస్తుండటంతో .. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడతుందో ఆసక్తిగా మారింది.  

 

08:17 - July 18, 2016

కర్నూలు : కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సున్నిపెంట, శ్రీశైలంలో పుష్కర పనులను స్వయంగా పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష 
ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు నగరానికి చేరుకుంటారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల నిర్మాణం, భక్తులకు ఏర్పాటు చేసే సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశం కొనసాగనుంది. అనంతరం హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకుని పుష్కర పనులను స్వయంగా పరిశీలిస్తారు. 
బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు 
అనంతరం అక్కడినుండి రోడ్డు మార్గాన శ్రీశైలం బయల్దేరుతారు. శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారిని దర్శించుకుని.. పుష్కర పనులను పరిశీలిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కర్నూలు, సున్నిపెంట, శ్రీశైలంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. సున్నిపెంట శ్రీశైలం మార్గంలో బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించాయి. మొత్తానికి పుష్కరాలకు సమయం దగ్గర పడుతుండడంతో చంద్రబాబు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 

 

08:11 - July 18, 2016

హైదరాబాద్ : చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పంజాగుట్ట ప్రమాద ఘటనలో చిన్నారి రమ్య తాత మధుసుదనాచారి మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. 18 రోజులుగా మృత్యువుతో పోరాడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ చనిపోయారు. ఇప్పటికే ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చిన్నారి రమ్య, బాబాయ్ రాజేష్ మృతి చెందారు. ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.  
ఇదిలావుంటే ప్రమాదంలో రమ్య తల్లి రాధిక కాలు విరిగిపోవడంతో చికిత్స పొందుతోంది. దీంతో రమ్య కుటుంబంలో పెను విషాదం నెలకొంది. ఈనెల 1న పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ప్రమాదం జరిగింది. 

 

08:00 - July 18, 2016

ఢిల్లీ : రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. హస్తినలో బిజీబిజీగా ఉన్న కేసీఆర్‌ ఈరోజు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవబోతున్నారు. హైకోర్టు విభజనతో పాటు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం కోరడంతో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులు, నిధుల అంశాలపై కూడా చర్చించనున్నారు. 
మోడీతో భేటీ కానున్న సీఎం కేసీఆర్ 
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి నేడు భేటీ కాబోతున్నారు. మూడు రోజుల నుంచి హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్‌ శనివారం అంతర్రాష్ట్ర సమావేశంలోనే మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. అయితే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లోనే ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలవాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 
మ.12 గం.లకు రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్‌ భేటీ 
మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్‌ భేటీ కానున్నారు. అనంతరం 12 గంటల 40 నిమిషాలకు మోదీతో, ఒంటిగంట 15 నిమిషాలకు అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి లభించాల్సిన సహకారంపై ప్రధానంగా మోదీతో సమావేశంలో కేసీఆర్‌ చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా హైకోర్టు విభజన, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు సాయంపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలపై అరుణ్‌జైట్లీతో చర్చించనున్నారు. 
మ.3 గం.లకు ఉమాభారతితో సమావేశం 
మధ్యాహ్నం 3 గంటలకు జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కేసీఆర్‌ కలవనున్నారు. రాష్ట్రం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన, రాష్ట్రానికి మంజూరు కావాల్సిన జాతీయ హోదా ప్రాజెక్టుపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం పరిధిలో ఉన్న 11 ఐఏబీపీ ప్రాజెక్టులకు రావాల్సిన గ్రాంట్లతో పాటు నాబార్డు నుంచి లభించాల్సిన రుణాల అంశాలను కేసీఆర్‌ ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
సా.5.30 గం.లకు ప్రకాష్‌జవదేకర్‌ను కలవనున్న కేసీఆర్‌
ఇక సాయంత్రం ఐదున్నర గంటలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఐఐఎం తదితర ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు.. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి నిధులు విడుదల చేయడం.. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కూడా చర్చించనున్నారు. మొత్తానికి హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల అంశాలను ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

 

చిన్నారి రమ్య తాత మధుసూదనాచారి మృతి..

హైదరాబాద్ : పంజాగుట్ట ప్రమాద ఘటనలో చిన్నారి రమ్య తాతా మధుసూదనాచారి మృతి చెందాడు. యశోధ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 18 రోజులగా మృత్యువుతో పోరాడి చనిపోయారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. 

నేడు ప్రధాని మోడీతో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఢిల్లీ : నేడు ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.15 ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు మానవవనరుల మంత్రి జవదేకర్ తో సమావేశం కానున్నారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సీఎం కలిసే అవకాశం ఉంది. 

 

నేడు ఎన్ డిఎ పక్షనేతల సమావేశం

ఢిల్లీ : రాత్రి 7 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఎన్ డిఎ పక్షనేతల సమావేశం జరుగనుంది. 
పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జీఎస్ టీ బిల్లుతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఉభయ సభల్లో చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

 

 

07:35 - July 18, 2016

ఢిల్లీ : నేటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే కాశ్మీర్‌లో హింస, రాష్ట్రాల్లో జోక్యం, అధిక ధరలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా.. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 
అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్న అధికార, విపక్షాలు  
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు అధికార.. విపక్షాలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. జీఎస్‌టీ సహా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని.. ఉభయ సభల్లో చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఏ ప్రభుత్వానికి లాభం చేకూరింద‌న్న అంశం క‌న్నా జాతి ప్రయోజ‌నాలు ముఖ్యమ‌ని మోడీ ఈ సంద‌ర్భంగా అన్నారు.  
జీఎస్‌టీ బిల్లు కాంగ్రెస్‌, బీజేపీలు నిర్ణయించేది కాదు : ఏచూరీ 
మరోవైపు జీఎస్‌టీ బిల్లు కాంగ్రెస్‌, బీజేపీలు నిర్ణయించేది కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఎలా ముందుకెళ్తారు : గులాంన‌బీ ఆజాద్ 
జీఎస్టీపై రాష్ట్రాలు, కేంద్రం మ‌ధ్య స‌యోధ్య లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎలా ముందుకెళ్తార‌ని కాంగ్రెస్ ఎంపీ గులాంన‌బీ ఆజాద్ ప్రశ్నించారు. జీఎస్ టీ బిల్లులోని మూడు వివాదాస్పద అంశాల‌ను కేంద్రం ఎలా ప‌రిష్కరిస్తుందో తెలపాలని మరో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కోరారు. జీఎస్టీపై పూర్తిస్థాయి ముసాయిదా ప్రతిపాద‌న కావాలని ఆయన డిమాడ్‌ చేశారు. ప‌న్ను రేటును 18 శాతానికి ప‌రిమితం చేయాల‌న‌డంతో పాటు ప‌లు కీల‌క స‌వ‌ర‌ణ‌లను కాంగ్రెస్‌ సూచిస్తోంది. అయితే భ‌విష్యత్‌లో మ‌ళ్లీ స‌వ‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం త‌లెత్తకుండా ప‌న్ను రేటును ప‌రిమితం చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని ప్రభుత్వం చెబుతోంది.
విభజన హామీలపైనే తెలుగు రాష్ట్రాల ఎంపీల ఫోకస్‌ 
అటు తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాత్రం విభజన హామీలపైనే ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్నారు. విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చించినట్లు టీడీపీ ఎంపీ తోటనరసింహం చెప్పారు. రాష్ట్రానికి సంబంధిచిన అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.     
విభజన హామీలపైనే టీఆర్‌ఎస్‌ దృష్టి 
టీఆర్‌ఎస్‌ సైతం విభజన హామీలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రత్యేక హైకోర్టు, 9, 10 వ షెడ్యూల్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రానికి రావల్సిన నిధులపై సభలో ప్రస్థావించనుంది. అఖిల పక్ష భేటీ అనంతంరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలంతా భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 
ఫిరాయింపుల సవరణ బిల్లుపై చర్చించాలి : వైసీపీ 
విభజన హామీలతో పాటు పార్టీ ఫిరాయింపుల సవరణ బిల్లును సభలో చర్చించాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు తాము ప్రైవేట్‌ బిల్లును సైతం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని మేకపాటి అన్నారు. మొత్తానికి అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో పార్లమెంట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా జరగనున్నాయి. 

 

07:26 - July 18, 2016

గుంటూరు : జిల్లాలో అత్యాచారం.. హత్య ఘటన కలకలం రేపింది. ఇద్దరి చావుకు కారణం అయ్యింది. మరో యువకుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రేపల్లె మండలం అడవిదీవి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 
బాలికపై మగమృగాలు దాడి..
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై మగమృగాలు కర్కశంగా దాడిచేశాయి. అత్యాచారం చేసి.. హత్యచేశాయి.. గుంటూరు జిల్లా అడవిదీవుల గ్రామంలో విషాదం నిండింది. రేపల్లె మండలం అడవిదేవుల గ్రామానికి చెందిన షేక్‌ జాస్మిన్‌.. చిన్నపుడే తండ్రి చనిపోవడంతో... తల్లి, కూతురులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తల్లి ఇంట్లో లేని సమయంలో ఇదే గ్రామానికి చెందిన సాయి, పవన్‌కుమార్‌లు బాలికపై దాడి చేశారు. ఒంటరిగా ఉన్న జాస్మిన్‌పై అత్యాచారానికి దిగారు. బాలిక కేకలు వేయడంతో... అక్కడే ఉన్న క్రికెట్‌ బ్యాట్‌తో బాలిక తలపై బలంగా కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. పవన్‌, సాయిలకు మరో ఇద్దరు యువకులు... మరో బాలిక సాయం చేసినట్టు మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఇంట్లో నుంచి బాలిక కేకలు విన్న బంధువులు..యువకులను పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. 
చికిత్సపొందుతూ వేములసాయి మృతి
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న వేముల సాయి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. పోలీసులే తమ వాడిని చంపేశారని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. 
నిందితులు, వారి సహాయకులను శిక్షించాలి : బాధితురాలి తల్లి 
అటు కన్నకూతురికోసం తల్లి విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. బాలికను చంపిన వారిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని జాస్మిన్‌  తల్లి సల్మా డిమాండ్‌ చేస్తోంది. అత్యాచారానికి గురైన బాలిక మృతిచెందడం... అటు ... గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని ఒక యువకుడు ఆస్పత్రిలో చనిపోవడంతో గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ...

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తుల దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 

నేడు చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం

హైదరాబాద్ : నేడు ఎపి సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. 

నేడు అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారం

హైదరాబాద్ : అటవీశాఖ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేడు అటవీశాఖ కోటి మొక్కలు నాటనుంది. 

Don't Miss