Activities calendar

19 July 2016

ఢిల్లీలోనే మంత్రి కేటీఆర్...

ఢిల్లీ : పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం కూడా ఢిల్లీలో ఆయన ఉండనున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, నిర్మల సీతారామన్ లను మంత్రి కేటీఆర్ కలవనున్నారు.

రేపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం..

హైదరాబాద్ : రేపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. కృష్ణా జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ మధ్య వర్కింగ్ అరేంజ్ మెంట్ పై ప్రధానంగా చర్చ జరగనుంది.

 

ఎన్ఆర్ఐ పాలసీపై 27న సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీపై 27న సమావేశం జరగనుంది. ఎన్ఆర్ఐ పాలసీ కోసం సంఘాలు, ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని, సమావేశానికి రాలేని వారు మెయిల్ పంపించాలని...040-23450455 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

టి.ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు డిపోల్లో టీఎంయూ విజయం, ఉట్నూరులో ఎన్ఎంయూ విజయం సాధించింది. కరీంనగర్ జిల్లాలో పది డిపోల్లో టీఎంయూ విజయం సాధించగా వేములవాడలో ఈయూ గెలుపొందింది. నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల్లోనూ టీఎంయూ ఘన విజయం సాధించింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఎనిమిది డిపోల్లో టీఎంయూ గెలుపొందింది. వరంగల్ జిల్లాలో 9 డిపోల్లో టీఎంయూ గెలుపొందింది. ఖమ్మం అన్ని డిపోల్లో ఎస్ డబ్ల్యూఎఫ్ - ఈయూ కూటమి ఘన విజయం సాధించింది.

21:33 - July 19, 2016

చెన్నై : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ మనవడు.. యాత్ర ధనుష్‌ తమిళనాడు సీఎం జయలలితను కలిసి ఆమె ఆశీస్సులు పొందాడు. చెన్నై సచివాలయం సెయింట్‌ జార్జ్‌ పోర్ట్‌ను తిలకించేందుకు వచ్చిన 90 మంది విద్యార్థుల బృందంలో రజనీకాంత్‌ మనవడు కూడా ఉన్నాడు. పాఠశాల టూర్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన విద్యార్థుల బృందాన్ని ముఖ్యమంత్రి జయలలిత వారిని లోపలికి రావాలని ఆహ్వానించారు. దాంతో పిల్లలందరూ జయలలిత ఛాంబర్‌లోకి వెళ్లారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన జయలలిత వారితో గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం పిల్లలందరికి చాక్లెట్లు పంచిపెట్టి ఆశీర్వదించారు. అందరూ బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని ఈ సందర్భంగా జయలలిత విద్యార్థులతో అన్నారు. సీఎం జయలలితను కలవడం ఆనందంగా ఉందని రజనీ మనవడు యాత్ర ధనుష్‌ తెలిపాడు.

21:31 - July 19, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహాత్మాగాంధీని ఆరెస్సెస్ హత్య చేసిందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై రాహుల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు క్షమాపణ చెప్పాలని, లేదా విచారణను ఎదుర్కోవాలని కోర్టు స్పష్టం చేసింది. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరెస్సెస్‌కు క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటారా?- అంటూ రాహుల్‌గాంధీని ప్రశ్నించింది. నేరుగా ఓ సంస్థపై అలాంటి నిందలు ఎలా వేస్తారని కోర్టు నిలదీసింది.

2014 మార్చి 6న వివాదాస్పద వ్యాఖ్యలు...
క్షమాపణలు చెప్పి కేసు సెటిల్‌ చేసుకోవాలని కోర్టు రాహుల్‌కు సూచించినప్పటికీ ఆయన అంగీకరించలేదు. పైగా తనపై కేసు కొట్టేయాలని రాహుల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు జులై 27న వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. సంజాయిషీ ఇచ్చేందుకు రెండు వారాల గడువు కావాలని రాహుల్ తరఫున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 2014, మార్చి 6న భివండిలో జరిగిన సభలో 'మహాత్మాగాంధీని హత్య చేసింది ఆరెస్సెస్‌' అని రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆరెస్సెస్‌ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌కు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, న్యాయపరంగానే ఆయన కేసును ఎదుర్కొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

21:29 - July 19, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజు అరుణాచల్‌ అంశంపై లోక్‌సభ దద్దరిల్లింది. అరుణాచల్‌ సంక్షోభానికి కేంద్రమే కారణమని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. పాపులర్‌ ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి కాంగ్రెస్‌దేనని కేంద్రం ఎదురు దాడి చేసింది. రెండో రోజు పార్లమెంట్ లో అరుణాచల్‌ప్రదేశ్‌ సంక్షోభంపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల‌ను కూల్చేందుకు కేంద్రం కుట్ర ప‌న్నుతోందని ఖ‌ర్గే ఆరోపించారు. ఉత్తరాఖండ్‌, అరుణాచ‌ల్ ప్రదేశ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల‌ను అస్థిరం చేసేందుకు కేంద్రం ప్రయ‌త్నించిందని ఆయన ధ్వజమెత్తారు. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌లో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఖర్గే తెలిపారు.

స్పందించిన రాజ్ నాథ్..
కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఎన్నికైన రాష్ట్రప్రభుత్వాలను పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీదేనని దుయ్యబట్టారు. రాజ్‌నాథ్‌ ప్రకటనను కాంగ్రెస్‌ నేతలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ కూల్చివేతలో బిజెపి పాత్ర లేదని, కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బోటుకు లీకేజీ కావ‌డం వ‌ల్లే ఆ పార్టీ నౌక స‌ముద్రంలో మునిగింద‌ని, దానికి నీటిని నిందించ‌డం సరికాద‌ని రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రక‌ట‌నకు నిర‌స‌న‌గా కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ నుంచి వాకౌట్ చేసింది.

21:27 - July 19, 2016

హైదరాబాద్ : వడ్డీరాయుళ్ల వేధింపులు తట్టుకోలేక కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కూకట్ పల్లి విజయ్ నగర్ కాలనీకి చెందిన వీరగంధం శ్రీనివాసరావు 2014 లో తన అవసరాల కోసం సునీల్ అనే వ్యక్తిని 5లక్షల రూపాయలు అప్పు అడిగాడు. తన దగ్గర లేకపోవడంతో భవానిదేవి, అనూష అనే వారి దగ్గర అతనికి సునీల్‌ అప్పు ఇప్పించాడు. అయితే రెండు సంవత్సరాలుగా వడ్డీ పేరుతో తనను వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే 30 లక్షలు కట్టానని ఇంకా డబ్బు కట్టాలని రౌడీలతో బెదిరిస్తున్నారని వాపోయాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

21:26 - July 19, 2016

హైదరాబాద్ : ఇద్దరూ తెలుగు వారే...చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థుల మధ్య వీకెండ్‌ పార్టీ చిచ్చు పెట్టింది. ఇద్దరి మధ్య రూంలోనే మాటా మాటా పెరిగింది. అంతే ఎల్లలు దాటి వెళ్లిన యువకులు కలిసి ఉండాల్సింది పోయి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరు హత్యకు గురయ్యారు. మరొకరు టెక్సాస్‌ పోలీసుల చేతికి చిక్కారు. అమెరికాలో తెలుగు విద్యార్థి సంకీర్త్ దారుణహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ చినికి చినికి గాలివానలా మారి హత్యకు దారి తీసింది.

ఎంఎస్ చదివేందుకు వెళ్లిన సంకీర్త్..
హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌ బడిచౌడికి చెందిన గుండం విజయ్‌ కుమార్‌ తెలంగాణ వైద్య శాఖలో పనిచేస్తున్నారు. ఆయన కొడుకు సంకీర్త్‌ రెండున్నరేళ్ల క్రితం ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌ నగరంలోని అస్టీన్‌లో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరాడు. సంకీర్త్‌ రూమ్‌లో 15 రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయిసందీప్‌ గౌడ్‌ చేరాడు. వీకెండ్‌ పార్టీ చేసుకుంటున్న సమయంలో సంకీర్త్‌, సాయి సందీప్‌ల మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన సందీప్‌.. సంకీర్త్‌పై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సంకీర్త్‌ స్నేహితుల సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు నిందితుడు సాయి సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు సంకీర్త్ చనిపోయాడన్న విషయం తెలియగానే కాచిగూడలోని అతని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వెంటనే బయల్దేరి అమెరికాకు వెళ్లారు. సంకీర్త్‌ మృతదేహాన్ని త్వరగా హైదరాద్‌కు తీసుకొచ్చేలా ప్రభుత్వం సహకరించాలని బంధువులు కోరుతున్నారు.

21:22 - July 19, 2016

హైదరాబాద్ : ఈ నెలాఖరులోపు అన్ని యూనివర్శిటీలకు వీసీలను నియమిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ విద్యాశాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. 42 మంది ప్రభుత్వ టీచర్లు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా పనిచేస్తున్నారని.. తక్షణమే వారు విధుల్లో చేరాలని హెచ్చరించారు. ఫీజుల పెంపుపై 12 ఇంటర్నేషనల్‌ స్కూళ్లతో పాటు 162 ప్రైవేటు స్కూళ్లకు జారీ చేసిన నోటీసులపై ఆయా సంస్థలు స్పందించాయని.. వాటిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని కడియం తెలిపారు. జీవో 42 పైన హైకోర్టు స్టే విధించిందని మంత్రి కడియం తెలిపారు. జీవోపై స్టే ఎత్తివేసినా లేదా ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నోటీసులపై వివరణ ఇచ్చాయని త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. కౌన్సెలింగ్ లో అవకాశం ఇవ్వాలని ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయని, ఆ కాలేజీలకు మూడు రోజుల్లో రీ వెరిఫికేషన్ నిర్వహించి అర్హత ఉన్న కాలేజీలకు కౌన్సెలింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. కౌన్సెలింగ్ విధానాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి కడియం స్పష్టం చేశారు.

21:20 - July 19, 2016

ఢిల్లీ : చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేయడానికి చిన్న, మధ్య తరహాల పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా అంగీకరించారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. కల్‌రాజ్‌ మిశ్రాతో భేటీ అయ్యారు. వివిధ సమస్యలపై చర్చించారు. ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారని, దీనికి హైదరాబద్ లో అతిథ్యం ఇస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని కోరినట్లు తెలిపారు.

21:17 - July 19, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాపై మళ్లీ రగడ మొదలైంది. స్పెషల్ స్టేటస్‌ కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. బిల్లుకు అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈనెల 22న చర్చకు రానున్న బిల్లుకు మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా, కేవీపీ, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు భేటీ అయ్యారు. బిల్లుకు పార్టీలన్నీ మద్దతు పలకాలని రఘువీరా కోరారు. హోదా విషయంలో బీజేపీ మాట తప్పుతోందని.. బిల్లుకు మద్దతిచ్చి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బిల్లుకు సంబంధించి పార్టీలన్నీ విప్‌ జారీ చేయాలని రఘువీరా కోరారు. బిల్లుకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కలను నెరవేర్చాలని ఎంపీ కేవీపీ అన్ని పార్టీలను కోరారు.

మద్దతు కూడగడుతున్నామన్న దిగ్విజయ్...
ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ప్రత్యేక హోదా బిల్లుకు సంబంధించి తమ ఎంపీలకు అధికారికంగా సోనియాగాంధీ విప్‌ జారీ చేసినట్లు దిగ్విజయ్‌ తెలిపారు. బిల్లుకు టీడీపీ మద్దతు ఇస్తుందా?..ఇవ్వదా అనేది స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఏపికి ప్రత్యేక హోదాపై మళ్లీ వేడి రాజుకుంది. ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని పార్టీల మనోభావాలు ఇప్పుడు బయపపడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇంతకీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు పాసవుతుందో లేదో చూడాలంటే మరో 3 రోజులు వేచిచూడాల్సిందే.

కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రాతో మంత్రి కేటీఆర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్‌మిశ్రాతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలపై కేంద్రమంత్రి తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

కోటి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలన్న బాబు..

విజయవాడ : కోటి మొక్కల పెంపకానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కోటి మొక్కల పెంపకం కార్యక్రమానికి ప్రజలను సంసిద్ధం చేయాలని సూచించారు.

20:35 - July 19, 2016

మీ పిల్లలూ స్కూల్‌కు వెళ్తున్నారా? చిన్నారులు ప్రయోజకులు కావాలనేది మీ తపనా? ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు బెటర్‌ అనుకుంటున్నారా? ఎల్‌కేజీ నుంచే ఐఐటీ ఫౌండేషనా? మెడిసిన్‌, ఇంజనీరింగ్‌పై ప్రత్యేక శ్రద్ధా? పిల్లల చదువుల కోసమే లక్షలు వెచ్చిస్తున్నారా? ప్రతీ వస్తువుకు ఎమ్మార్పీ రేటు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్‌ విషయంలో విద్యావ్యవస్థలు ఎందుకు పాటించడం లేదు? పేదలు సైతం చదువును కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది ? చట్టాలు ఏం చెబుతున్నాయి.. పాలకులు ఏం చేస్తున్నారు? కార్పొరేట్‌ ఫీజులుంపై ప్రత్యేక కథనం..

ప్రైవేటు విద్య పక్కా కమర్షియల్..
ప్రైవేటు విద్య పక్కా కమర్షియల్ గా మారింది. లాభార్జనే ధ్యేయంగా, ఫక్తు వ్యాపార ధోరణితో నడుస్తున్న విద్యా సంస్థలు భారీ వ్యాపారాలకే తెరలేపాయి. తల్లిదండ్రులకు తీరని నష్టాన్ని, ఒత్తిడిని మిగులుస్తున్నాయి. ప్రాధమిక విద్యపై చట్టాలు ఏం చెబుతున్నాయి. జీవోల్లో ఏం ఉంది. అధికారులు ఏం చేస్తున్నారు. కార్పొరేట్ యాజమాన్యాలు అడిగే వాళ్లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఫీజుల్ని వసూలు చేస్తూ విద్యాహక్కు చట్టానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నాయి. విద్య వ్యాపారంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎల్కేజీకి 7 లక్షల ఫీజులా అంటూ మండిపడింది. వన్ టైం ఫీజుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.

వన్‌ టైం ఫీ అంటే ఏమిటి.?..
వన్‌ టైం ఫీ అంటే ఏమిటి.? విద్యాసంస్థల దోపిడీకి అంతం లేదా.? సర్కారీ స్కూళ్లకు పూర్వ వైభవం వచ్చేది ఎలా.? కార్పొరేట్ మాయలోంచి సామ్యాన్యుడు బయటపడటం సాధ్యమేనా. ? ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? అధికారులు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకవడం లేదు..? నిబంధనలు పాటించాలని హుకుం జారీ చేయడం తప్ప ఆచరణలో ఎందుకు పెట్టడం లేదు..? కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా సర్కారులో ఎందుకు చలనం రావడం లేదు. 

రెండు విద్యా సంస్థలదే గుత్తాధిపత్యం...
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి, రెండు విద్యా సంస్థలదే గుత్తాధిపత్యం. ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ సంస్థలు ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాయంటే పాలకుల చిత్తశుద్ధి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తాము ఎన్ని కష్టాలు పడ్డా.. పిల్లలకు బంగారు భవిత ఇవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకునే కార్పొరేట్ స్కూళ్లకు సర్కారు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కారీ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచితే.. కొంతలో కొంతైనా పేదలకు మేలు జరుగుతుంది. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి..

20:27 - July 19, 2016

మల్లన్న ముచ్చట్లు జూస్తున్న జనంల ఎవ్వలికన్న కష్టాలున్నయా..? అనుకున్న పనులు అయితలేవా..? పోనీ ఇంట్ల సంసారం కాడ కీసులాటలైతున్నయా..? వ్యాపారం నడుస్తలేదా..? పాలోళ్లతోని పంచాదులైతున్నయా..? ఇవ్వన్ని సమస్యలు వోవాల్నంటే మీకు జీన్స్ పాయింట్ బాబకు మొక్కలే.. జీన్స్ పాయింట్ బాబానా..? అవును.. కావాల్నంటే వీడియోలో సూడుండ్రి.

20:25 - July 19, 2016

క్రిష్ణా గోదావరి నీళ్లను గల్సె ఫెర్రికాడ ఇయ్యాళ పూజలు జెయ్యవొయ్యి సీఎం చంద్రబాబు గమ్మతి గమ్మతి జేశిండట...మన తెల్గు రాష్ట్రాలను ఏలుతున్న ప్రభుత్వాలకు ఒక ప్రత్యేకత ఉన్నది..ప్రధాని కుర్చెక్కిన సంది నిన్నమొన్నటిదాక బైటిదేశాలు వట్టి తిర్గిండు గదా..? ఇగ ఇప్పటి సంది బైటిదేశాల పొంట తిర్గవోవొద్దు అనుకుంటున్నడట..మీ ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకునే సదా అవకాశాన్ని మీకు కల్పిస్తోంది వీటీ డైరీ.. వీటీ డైరీ పాలను తాగండి రోగాల పాలవ్వండి..ఉస్మానియా యూనివర్సిటీల పదకొండు రోజులు నుండి పంచాది నడుస్తోంది..కని ప్రభుత్వానికి మాత్రం సోయొస్తలేదు..పేరు పెద్ద ఊరుదిబ్బ అన్నట్టు తయ్యారైంది పెద్దపురం పట్నం మచ్చట గూడ..రాబోయే రెండేండ్లళ్ల తెలంగాణ పల్లెల పొంట ఏ ఒక్క ఆడిబిడ్డె గూడ.. బిందె వట్టుకోని రోడ్డు మీద గనిపియ్యొద్దు..అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ జెప్పిండు...సమస్యలు వోవాల్నంటే మీకు జీన్స్ పాయింట్ బాబకు మొక్కలే.. ఈ విషయాలపై టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న ముచ్చట్లు జెప్పిండు. మస్తు మస్తుగా ఉన్న ఈ ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ జేయుండి.

టి.ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. వికారాబాద్, దుబ్బాక, మంథని, కరీంనగర్ నాన్ ఆపరేషన్, ఎంజీబీఎస్, బీబీయూలో టీఎంయూ విజయం సాధించింది. సంగారెడ్డి, నారాయణఖేడ్ లో టీఎంయూ విజయం సాధించింది. ఉట్నూరులో ఎన్ఎంయూ విజయం సాధించింది.

కూకట్ పల్లిలో కాల్ మనీ వ్యవహారం కలకలం..

హైదరాబాద్ : కూకట్ పల్లిలో కాల్ మనీ వ్యవహారం కలకలం రేపింది. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక శ్రీనివాసరావు అనే వ్యక్తి పీఎస్ లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. ఇతడిని ఆసుపత్రికి తరలించారు. వడ్డీ వ్యాపారి రౌడీలతో బెదిరించి ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్నారని శ్రీనివాసరావు ఆరోపించాడు.

అటవీ, పర్యావరణ శాఖలపై బాబు సమీక్ష..

విజయవాడ : అటవీ, పర్యావరణ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కొల్లేరు మంచినీటి సరస్సులో కనీస నీటిమట్టం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాబు ఆదేశించారు. అవసరమైతే గోదావరి నీటిని తరలించాలని, పర్యాటకులను ఆకర్షించేలా కొల్లేరును అభివృద్ధి చేయాలన్నారు. ఏడాదిలోగా తిరుపతి, విశాఖ జూపార్కులను అభివృద్ధి చేయాలని, అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకొనేలా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే ప్రైవేటు సంస్థల సాయం తీసుకోవాలన్నారు.

బాబును కలిసిన అశోక్ బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు కలిశారు. పదో పీఆర్సీ అమలు కాని గురుకుల ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడానికి సీఎం అంగీకరించారని అశోక్ బాబు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయాలని కోరడం జరిగిందన్నారు.

 

రేపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం..

హైదరాబాద్ : రేపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. కృష్ణా జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ మధ్య వర్కింగ్ అరేంజ్ మెంట్ పై ప్రధానంగా చర్చ జరగనుంది.

 

19:40 - July 19, 2016

అబ్బా..ఎంత మంచి వార్త..కబాలీ ఫిల్మ్ కోసం హాలిడే ఇచ్చేశారా..ఇంకేముంది ఫ్యామిలీతో కబాలీ సినిమా చూసేయొచ్చు..అని అనుకుంటున్నారు కదా...కానీ సెలవు ఇచ్చింది ఇక్కడ కాదు..బెంగళూరు..చెన్నై నగరాల్లో. అది కూడా పలు కంపెనీలు సెలవు ప్రకటించాయి. తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటించిన 'కబాలీ' ఈనెల 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ నుండి రికార్డుల మోత మోగిస్తున్న 'కబాలి' చిత్రం గురించి ఎన్నో విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటించాయి కూడా. రజనీకాంత్ సినిమా విడుదలవుతుండడంపై పలు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టడం ఖాయమని భావించిన పలు కంపెనీలు ఆ రోజున సెలవు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అంతేగాకుండా కొన్ని సంస్థల్లో ఉద్యోగుల కుటుంబాలకు టికెట్లు కూడా ఇచ్చేశాయంట. దటీజ్ రజనీకాంత్ అంటున్నారు అభిమానులు. మరి 'కబాలి' ఎలా మురిపిస్తోందో వేచి చూడాలి.

19:15 - July 19, 2016

అమరావతి రాజధానిని స్విస్ ఛాలెంజ్ ద్వారా నిర్మాణం చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు, నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీవీసీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. కౌంటర్ ప్రతిపాదనలకు 45 రోజులు గడువు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విదేశీ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారని విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి చర్చ చేపట్టింది. విజయవాడలో జరిగిన చర్చా వేదికలో బాబురావు (సీపీఎం), రామకృష్ణ ప్రసాద్ (టీడీపీ), కొణిజేటి రమేష్, (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

వరంగల్ లో 9 ఆర్టీసీ డిపోల్లో ముగిసిన పోలింగ్..

వరంగల్ : జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లో పోలింగ్ ముగిసింది. 97.8 శాతం పోలింగ్ నమోదు కాగా కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.

ఫీజుల నియంత్రణకు కట్టుబడి ఉన్నాం- మంత్రి కడియం..

హైదరాబాద్ : విద్యాశాఖాధికారులతో మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జీవో 42 పైన హైకోర్టు స్టే విధించిందని మంత్రి కడియం తెలిపారు. జీవోపై స్టే ఎత్తివేసినా లేదా ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 12 ఇంటర్నేషనల్ స్కూళ్లతో పాటు 162 ప్రైవేటు స్కూళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నోటీసులపై వివరణ ఇచ్చాయని త్వరలో తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. 42 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా ఉన్నారని, వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.

అటవీ శాతాన్ని పెంచుతాం - జోగు రామన్న..

హైదరాబాద్ : రాష్ట్రంలో అటవీశాతాన్ని 33శాతానికి పెంచడమే హరితహారం లక్ష్యమని మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. అటవీశాఖ తరపున విరివిగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలతో వెంకయ్య భేటీ..

ఢిల్లీ : టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో పలు బిల్లులు చర్చకు రానున్న క్రమంలో ఆయన తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ఎంపీలతో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

18:55 - July 19, 2016

కండల వీరుడుగా పేరు పొందిన నటుడు 'సల్మాన్ ఖాన్' బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు. తాజా చిత్రం 'సుల్తాన్' ద్వారా సత్తా ఏంటో చూపిస్తున్నాడు. ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్, అనుష్క శర్మలు నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో సల్లూ భాయ్ మల్లయోధుడిగా నటించాడు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి రికార్డు సృష్టించింది. తాజాగా 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లను కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలో ఇంత కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా 'సుల్తాన్' రికార్డుకెక్కిందంట. కేవలం ఇండియాలోనే రూ.300 కోట్లను వసూలు చేసే దిశగా ఈ మూవీ పరుగులు తీస్తోందని టాక్.
యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించగా అలీ అబ్బాస్ తెరకెక్కించారు. ఈ సినిమాలో రెజ్లర్‌గా సల్మాన్ నటనకు అనుష్క శర్మ నటనకు ప్రశంసలు కూడా లభించాయి.

ముగిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్..

హైదరాబాద్ : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 98 శాతం పోలింగ్ నమోదైంది. కాసేపట్లో అన్ని డిపోల్లో కౌంటింగ్ ప్రారంభించనున్నారు.

పలువురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి..

విజయవాడ : 1985-86 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ లకు డీజీలుగా ఏపీ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆర్ పి ఠాకూర్, మాలకొండయ్య, గౌతమ్ సవాంగ్, విజన్ రంజన్ రే, వీఎస్ కే కౌముదిలకు డీజీలుగా పదోన్నతి కల్పించారు.

18:46 - July 19, 2016

ఏంటీ ఇల్లు శుభ్రంగా ఉంచుకొంటే ఉచితంగానే వైఫై అందిస్తారా ? అయితే రేపటి నుండే ఆ పనిలో ఉంటాం. ఎంచక్కా వైఫ్ తో ఎంజాయ్ చేయొచ్చు..అని ఏవోవో ఊహించేసుకుంటున్నారా ? మీరు విన్నది..చదువుతున్నది నిజమే కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కాదు. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఓ కండీషన్ కూడా పెట్టింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది చదవండి.

స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం కొన్ని రాష్ట్రాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ రాజ్ గడ్ జిల్లా అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఇంటిని..పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఉచితంగా వైఫై అందిస్తామని ప్రకటించింది. శుభ్రంగా ఉండటంతోపాటు ఆ ఇంట్లో మరుగుదొడ్డి సదుపాయం కూడా ఉండాలనే నిబంధన పెట్టారు. ఇప్పటికే ఈ జిల్లాలోని 15 గ్రామాల్లో ఈ తరహా సేవలు అందిస్తున్నారంట. అంతేగాకుండా కలెక్టరేట్ ప్రాంగణంలో రెండు గంటల పాటు శ్రమదానం ఎవరైనా చేస్తే ఉచితంగా వైఫై అందిస్తున్నారు. శ్రమదానం చేయని వారికి కొంత రుసుం జరిమాణ విధిస్తున్నారు.
నెల రోజులపాటు తమ ఫొన్ నుంచి ఉచితంగా వైఫై వాడుకునే వీలుంది. తర్వాత పాస్‌వర్డ్ మారుస్తారు. ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కదూ...

18:39 - July 19, 2016

ప్రొ.కబడ్డీ నాలుగో సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో నాలుగో టై నమోదయ్యింది. కోల్ కతా అంచె పోటీల్లో భాగంగా జరిగిన సమరాన్ని ఆతిథ్య బెంగాల్ వారియర్స్, తెలుగు టైటాన్స్ జట్లు చెరో 34 పాయింట్లు సాధించి..టై గా ముగించాయి. ఆట ముగిసే క్షణాలలో కెప్టెన్ కమ్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి సాధించిన పాయింట్ తో తెలుగు టైటాన్స్ ఓటమి అంచుల నుంచి బయటపడి పోటీని టైగా ముగించగలిగింది. ప్రొఫెషనల్ కబడ్డీ నాలుగోసీజన్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు అంచనాలకు అందనిరీతిలో ఆసక్తికరంగా సాగిపోతున్నాయి. ఎనిమిదిజట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు నువ్వానేనా అన్నట్లుగా సాగడంతో ఇప్పటికే నాలుగు సూపర్ టై ఫలితాలు నమోదయ్యాయి.

తెలుగు టైటాన్స్...
ప్రస్తుత సీజన్లో ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పూణేరీ పల్టాన్స్ జట్లు టై ఫలితాలను నమోదు చేస్తే తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్ జట్లు సైతం..టై జట్ల జాబితో చేరిపోయాయి. కోల్ కతా నేతాజీ ఇండోర్ స్టేడియంలో ముగిసిన 10వ రౌండ్ పోటీలో ఆతిథ్య బెంగాల్ వారియర్స్, తెలుగు టైటాన్స్ ఆట ఆఖరిక్షణం వరకూ పోరాడి పోటీని రక్తికట్టించాయి. ఆట మొదటిభాగానికే 19- 14 పాయింట్లతో తెలుగు టైటాన్స్ పైచేయి సాధిస్తే...రెండో భాగంలో బెంగాల్ వారియర్స్ పుంజుకొంది. బెంగాల్ వారియర్స్ జట్టు స్టార్ రైడర్.. జాంగ్ కున్ లీ చెలరేగిపోయాడు. తెలుగు టైటాన్స్ పై పదేపదే రెడింగ్ కు వెళ్ళి ఏకంగా 13 పాయింట్లు సంపాదించాడు. తెలుగు టైటాన్స్ రైడర్లలో రాహల్ చౌదరి 8 పాయింట్లు, నీలేశ్ సాలుంకే 10 పాయింట్లు సాధించినా టాక్లింగ్ వైఫల్యంతో తుదివరకూ పోరాడాల్సి వచ్చింది. ఆట మరో నిముషంలో ముగుస్తుందనగా బెంగాల్ వారియర్స్ 34-33 పాయింట్లతో విజయం అంచుల వరకూ వచ్చింది.

అత్యధిక టై మ్యాచ్ లు...
స్టేడియంలోని అభిమానులంతా బెంగాల్ జట్టునే విజయం వరించినట్లుగా భావించారు. అయితే ఆట ముగిసే క్షణాలలో ఆఖరి రైడింగ్ కు వెళ్ళిన టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి ఓ కీలక పాయింట్ తన్నుకు వచ్చి..34-34 స్కోరుతో మ్యాచ్ ను సూపర్ టై గా ముగించాడు. ప్రస్తుత సీజన్లో తెలుగు టైటాన్స్ కు ఇదే తొలి టై ఫలితం. ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో టైటాన్స్ ఐదు విజయాలు, నాలుగు పరాజయాలు, ఓ టై మ్యాచ్ ద్వారా 32 పాయింట్లు సాధించి..లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బెంగాల్ వారియర్స్ ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్ల మ్యాచ్ ల్లో రెండో విజయాలు సాధించి లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది. మొత్తం మీద..ఐపీఎల్ నాలుగు సీజన్లలో అత్యధికంగా ప్రస్తుత సీజన్లోనే అత్యధిక టై మ్యాచ్ లు నమోదు కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

18:34 - July 19, 2016

తూర్పుగోదావరి : ఎక్కడ చూసినా.. కల్తీ.. కల్తీ.. కల్తీ... తినే తిండి దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు అన్నీ కల్తీవే.. అన్నీ నకిలీవే.. కల్తీ ఫుడ్, నకిలీ వస్తువుల తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కల్తీ సాస్, కల్తీ నూనెలు.. కల్తి ఇంజన్ అయిల్స్, పెట్రోల్‌ , డిజీల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే... అంతా అంతా కల్తీయే. వీటిని కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో తూగుతుండటంతో నకిలీ ముఠాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ ఆయిల్‌ మాఫియా బయటపడింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ ఇందనం తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాఫ్తా అనే ఆయిల్‌ ద్వారా కల్తీ పెట్రోల్, డీజిల్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో.. 12 వేల లీటర్ల నాప్తా ఆయిల్‌ లోడ్‌ లారీని పోలీసులు సీజ్ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు సివిల్‌ సఫ్లై అధికారులు రంగంలోకి దిగారు.


నాఫ్తా ఆయిల్‌ ట్యాంకర్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు ఆరా తీయడంతో ఆయిల్ మాఫియా గుట్టురట్టయింది. కాకినాడ శివారులోని నిర్మాణంలో ఉన్న వెంచర్‌ పై దాడులు చేశారు. రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకరుతో పాటు మరో ట్యాంకర్, భారీ పైపులు కలిగిన మోటార్లను గుర్తించారు. వీటి ద్వారా భారీ మొత్తంలో కల్తీ పెట్రోల్‌, డిజీల్‌ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. కల్తీరాయుళ్లు బినామీలతో దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. తిమ్మాపురంలోని బంకు

యానాం చెందిన సూర్యనారాయణ రాజు నిర్వహిస్తుండగా..ఓ ప్రజాప్రతినిధి బంధువుకు చెందినదిగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ ఆయిల్‌ మాఫియా మూలాలను కనుగొనే పనిలో పడ్డారు.

18:31 - July 19, 2016

ప్రకాశం : జిల్లా పొగాకు రైతును ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు దళారీ వ్యవస్థ.. నిలువునా దగా చేస్తున్నాయి. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం.. మార్కెట్లలో మోసాల ద్వారా దళారీ వ్యవస్థ.. రైతును ముంచేస్తున్నాయి. ఏటికేడు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశించడం.. ప్రతిసారీ నిరాశ చెందడం పొగాకు రైతుకు ఆనవాయితీగా మారింది. గిట్టుబాటు ధర రాక లబోదిబోమంటున్న ప్రకాశం జిల్లా పొగాకు రైతుల వేదనపై టెన్‌ టీవీ స్పెషల్‌ ప్రత్యేక కథనం..

120 మిలియన్ల పొగాకు ఉత్పత్తి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 120 మిలియన్ల పొగాకు ఉత్పత్తి అందించేందుకు పొగాకు బోర్డు అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలో.. 74 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతినిచ్చింది. ఆమేరకు జిల్లాలో 42 వేల 618 హెక్టార్ లలో 26 వేల 468 మంది పొగాకు రైతులు పంటను పండించారు. కానీ జిల్లాలోని 12 వేలం కేంద్రాల ద్వారా ఇప్పటివరకు కేవలం 67 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 7 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో.. పొగాకు కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నా.. ప్రకాశం జిల్లాలో మాత్రం.. అడుగు ముందుకు పడడం లేదు. దీంతో అన్ని వేలం కేంద్రాలూ పొగాకు రైతులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు..
పొగాకు పంటను విక్రయించేందుకు వచ్చిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్న వాదనా ఉంది. జిల్లాలోని 12 వేలం కేంద్రాల్లో కేవలం నాలుగింటిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మరో ఏనిమిది కేంద్రాలలో నెల చివరకు పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తవుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి ధర వస్తే అమ్ముకోవచ్చని పొగాకు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది మాత్రం తమ పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో పోగాకు పంటను వెనక్కి తీసుకు వెళుతున్నారు.

వేలం కేంద్రాల వద్ద దళారీ వ్యవస్థ..
మరోవైపు వేలం కేంద్రాల వద్ద దళారీ వ్యవస్థ విచ్చలవిడితనంపై రైతులు మండిపడుతున్నారు. అటు ప్రోత్సాహం అందిస్తామన్న ప్రభుత్వం మాటలు మాటలకే పరిమితమవుతున్నాయని వాపోతున్నారు. బొర్డు అధికారులు, వ్యాపారులు వేలం కేంద్రాలలో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రారంభంలో... వారం రోజులు మాత్రమే పొగాకు కొనుగోళ్లు చురుగ్గా సాగాయని, ఆతర్వాత విక్రయాలు మందగించాయని రైతులు చెబుతున్నారు. గత ఏడాది పంట అధికంగా పండినప్పటికి గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంట ఉత్పత్తి తగ్గితే ధరలు అధికంగా ఉంటాయని చెప్పిన ప్రభుత్వాలు గత ఏడాది 173 మిలియన్లకు పంటకు అనుమతిస్తే ఈ ఏడాది 120 మిలినయన్లకు తగ్గించారు. అయితే ఈ ఏడాది కూడా రైతులు నష్టాల బారిన పడక తప్పడం లేదు. ఏది ఏమైనా పొగాకు పండించడం... దానికి మద్దతు ధర లభించక పోవడం.. క్వాలిటీ పేరు చెప్పి కొనుగోళ్లు జరపక పోవడం.. తద్వారా తీవ్రంగా నష్టపోవడం ప్రకాశం జిల్లా పొగాకు రైతుల జీవితాలను ఏటా ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

18:25 - July 19, 2016

శ్రీకాకుళం : అవును మీరు వింటున్నది నిజమే. తమ మాట వినలేదని ఏకంగా ఓ కుటుంబాన్ని సాంఘీక బహిష్కరణ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం దున్నవానిపేటకు చెందిన సుజాత తన ఇద్దరు పిల్లలను పలాస కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తోంది. అయితే గ్రామంలో ఉన్న పాఠశాలలోనే పిల్లలను చదివించాలని గ్రామస్తులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. సుజాత మాత్రం వీరి ఆదేశాలు పట్టించుకోకుండా ప్రైవేట్ పాఠశాలలోనే పిల్లలను చదివిస్తోంది.. దీంతో గ్రామపెద్దలు సుజాత కుటుంబాన్ని సాంఘికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఎవరూ మాట్లాడినా రూ. 500 జరిమాన కట్టి మాట్లాడాలని వారు ఆదేశించినట్లు ఆ మహిళ పేర్కొంది. వాటర్ కనెక్షన్ కూడా కట్ చేశారని పేర్కొన్నారు. ఆమె మాటల్లోనే తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:23 - July 19, 2016

కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన చేతబడితో ప్రియుడిని దగ్గర చేస్తానని ఓ వివాహితకు నమ్మబలికాడు. అనంతరం తల్లి, కూతురిని హత్య చేసి పరాయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గూడూరులో చోటు చేసుకుంది. గూడూరులో కూలి పని చేసుకుంటూ మద్దెమ్మ నివాసం ఉంటోంది. గత కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో మద్దెమ్మ...రంగడు అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తుండేది. ఈమెకు లక్ష్మీ (10) కూతురు కూడా ఉంది. కొద్ది రోజుల అనంతరం మద్దెమ్మను రంగడు దూరంగా పెట్టడం సాగించాడు. ఈ క్రమంలో గిడ్డయ్య అనే వ్యక్తితో మద్దెమ్మకు పరిచయమైంది. తన చేతబడి..క్షుద్ర పూజలతో రంగడును దగ్గరయ్యే విధంగా చేస్తానని మద్దెమ్మను నమ్మబలికాడు. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన లక్ష్మీ తల్లి మద్దెమ్మ మృతదేహం బయటపడింది. ఎర్రకత్వ పొలాల్లో కుళ్లిపోయిన వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పొలాల్లో లక్ష్మి (10) మృతదేహం లభ్యమైంది. బంగారు నగలను దొంగిలించి ఈ హత్యలు చేసినట్లు మద్దెమ్మ తల్లి పేర్కొంటున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గిడ్డయ్య కోసం గాలింపులు చేపట్టారు.

17:58 - July 19, 2016

దీక్షా పంత్...'గోపాల గోపాల'..'శంకరాభరణం' చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తాను కొద్దిరోజుల పాటు సరిగ్గా నడవలేనని దీక్షా పంత్ పేర్కొంది. సర్జరీ కారణంగా ఆమె విశ్రాంతి తీసుకొంటోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. ఐదేళ్ల క్రితం టూవీలర్ పై వెళుతున్న తనకు ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో ఎడమకాలికి గాయమైనట్లు తెలిపింది. దీనికి ఫిజియో థెరపీ క్రమం తప్పకుండా చేయించుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆనాడు సూచించడం జరిగిందన్నారు. కానీ అప్పుడే వచ్చిన సినీ అవకాశాలు..మోడలింగ్ తో బిజీ అయిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం మోకాలి బాధ తీవ్రంగా ఉండడం..నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. వైద్యులను సంప్రదిస్తే మోకాలికి సర్జరీ చేయాలని చెప్పడం జరిగిందన్నారు. 'బంతిపూల జానకి', 'చల్ చల్ గుర్రం' తదితర సినిమాల షూటింగ్ లు ముగించుకున్న అనంతరం గత నెలలో నా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు పేర్కొంది. రెండు నెలల పాటు సరిగ్గా నడవడం కూడా కష్టమేని, అందుకే కొన్నింటికి దూరంగా ఉంటున్నట్లు దీక్షా పంత్ పేర్కొంది.

విద్యాశాఖాధికారులతో మంత్రి కడియం సమీక్ష..

హైదరాబాద్ : విద్యాశాఖాధికారులతో మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. ఎంసెట్ కౌన్సెలింగ్, ఇంజినీరింగ్ అడ్మిషన్లు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల క్రమబద్దీకరణపై చర్చించారు.

పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పర్యటన..

ఢిల్లీ : తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ టూర్ కొనసాగుతోంది. విదేశీ రాయబారులు, ఐటీ సంస్థలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హార్డ్ వేర్ కంపెనీలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై జపాన్ అంబాసిడర్ లతో చర్చించడం జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని జపాన్ అంబాసిడర్ ను కోరినట్లు, పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో జపాన్ పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఎయిర్ టెల్ ప్రతినిధి సునీల్ మిట్టల్ తో చర్చించినట్లు తెలిపారు.

గద్వాలలో హోం మంత్రి నాయినీ సమీక్ష..

మహబూబ్ నగర్ : కృష్ణా పుష్కరాల ఏరియల్ సర్వేపై గద్వాలలో హోం మంత్రి నాయినీ, డీజీపీ అనురాగ్ శర్మలు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రాజేశ్వరీలు హాజరయ్యారు.

 

రేపు కూడా ఢిల్లీలోనే మంత్రి కేటీఆర్...

ఢిల్లీ : పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం కూడా ఢిల్లీలో ఆయన ఉండనున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, నిర్మల సీతారామన్ లను మంత్రి కేటీఆర్ కలవనున్నారు.

ఈ ఘనత బాబుకే దక్కుతుంది - బొజ్జల..

విజయవాడ : దేశంలోనే తొలిసారి నదుల అనుసంధానం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందని మంత్రి బొజ్జల వ్యాఖ్యానించారు. జగన్ పట్టిసీమ ప్రాజెక్టు, పల్స్ సర్వేపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

 

నగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతంలో కురిసిన ఈ వర్షానికి రోడ్లు జలమమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది.

బోనాలకు భారీ బందోబస్తు..

హైదరాబాద్ : నగరంలో బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మూడు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 24, 25న సికింద్రాబాద్, ఆగస్టు 31, 1న లాల్ దర్వాజా బోనాలు జరగనున్న విషయం తెలిసిందే.

ప్రాజెక్టుల భూ సేకరణపై మంత్రి హరీష్ సమీక్ష..

హైదరాబాద్ : ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. పనులు ఎలా చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చైనా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ..

విజయవాడ : చైనా జీఐఐసీ ప్రతినిధులతో ఏపీ మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజధానిలో మౌలిక సదుపాయాలకు ఆర్ధిక సహకారంపై చర్చించారు. పిపిపి మోడల్ లేదా యాన్యుటీ మోడల్స్‌లో పెట్టుబడులకు ప్రతిపాదనలతో రావాలని మంత్రి నారాయణ కోరినట్లు తెలుస్తోంది.

17:17 - July 19, 2016

హైదరాబాద్ : నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నిర్వాసితుల సమస్యలపై మంగళవారం, బుధవారం రోజుల్లో పాదయాత్ర నిర్వహించాలని సీపీఎం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాదయాత్రలో పాల్గొనున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రాజెక్టు దగ్గర గురువారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎనిమిది గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నా జెన్ కో అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని నేతలు పేర్కొంటున్నారు. చట్టూ వాటర్ వచ్చిన తరువాత ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారని, గ్రామాలను ఖాళీ చేస్తామని ప్రత్యామ్నాయం చూపెట్టాలని..ఉపాధి చూపించాలని డిమాండ్ చేస్తున్నారని జూలకంటి తెలిపారు.

17:12 - July 19, 2016

కరీంనగర్ : సింగరేణి గనిలో ఓ కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుడు మృతి చెందాడంటూ తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. గని కార్యాలయంపై దాడి చేశారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వివరాల్లోకి వెళితే...తండ్రి చనిపోవడంతో వారసత్వం రీత్యా అనీల్ కు ఉద్యోగం వచ్చింది. నెల రోజుల క్రితం ఈ ఉద్యోగం వచ్చింది. జీడీఏ 7 గనిలో అనీల్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఊపిరాడక వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. దీనిని గుర్తించిన తోటి కార్మికులు పై అధికారులకు తెలియచేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అతను మృతి చెందాడని తెలుస్తోంది. బదిలీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న అనీల్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అనీల్ పరిస్థితి బాగా లేదని చెప్పినా విధులు నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోలేదని, వెంటిలేషన్ బాగా లేదని చెబుతున్నా పట్టించుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.

జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ధర్నా..

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ధర్నా చేపట్టింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నాకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు.

 

కాసేపట్లో కాంగ్రెస్ నేతలతో జైట్లీ భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ కానున్నారు. జీఎస్టీ బిల్లుకు సహకరించాలని జైట్లీ కోరనున్నారు.

టి.పిసిసి పనితీరు భేష్ - కుంతియా..

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ పనితీరు బాగుందని కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియా పేర్కొన్నారు. 2018 వరకు మార్పు ఉండదని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాల్వాయి, కోమటిరెడ్డిలకు షోకాజ్ ల విషయం తనకు తెలియదని, ఎందుకిచ్చారో తెలుసుకుంటానన్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరి పదవైనా ఊడొచ్చన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్ హామీలపై ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.

కర్నూలులో దారుణం..

కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన తల్లీకూతుళ్లను హత్య చేసి మృతదేహాలను గిడ్డయ్య అనే వ్యక్తి పూడ్చిపెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రకత్వ పొలాల్లో లక్ష్మి (10) మృతదేహం లభ్యమైంది. ఈ నెల 10వ తేదీన లక్ష్మీ తల్లి మద్దెమ్మ మృతదేహం బయటపడింది. మద్దెమ్మ తన ప్రియుడితో కలుపుతానని చెప్పి పిలిపించి ఈ దారుణానికి గిడ్డయ్య ఒడిగట్టాడు.

16:52 - July 19, 2016

హైదరాబాద్ : శ్రీకాకుళంలోని శ్రీరామ్ నగర్ లో ఓ వ్యక్తికి ప్రజలు పూజలు చేయడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై రమేష్ (జన విజ్ఞాన వేదిక) స్పందించారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. ఓ వ్యక్తికి పూజలు చేయడం మూర్ఖత్వానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. భక్తికి..మూఢత్వానికి తేడా ఉంటుందని, ఈ భక్తి పీక్ స్థాయికి వెళ్లిందన్నారు. ఒక స్వామి అవతారం ఎత్తి కోట్లు ఎత్తుకపోయిన సంగతి తెలిసిందేనని, విక్తృత ప్రవర్తన ఉన్న వారికి పూజలు చేయడం..దీని చుట్టూ ఒక లాబీయింగ్ జరుగుతుందన్నారు. మహారాష్ట్ర తరహాలో ఓ చట్టాన్ని తీసుకరావాల్సినవసరం ఉందని, ప్రభుత్వమే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశారు.

16:47 - July 19, 2016

చిత్తూరు : కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి..అనే పాట విన్నారు కదా...ఓ వ్యక్తి అవధూత అంటూ ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. ధూపాలు..నైవేద్యం ఇస్తున్నారు. హరతులు ఇస్తున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ఏదైనా నచ్చిన దానిని మాత్రమే తీసుకుంటున్నాడంట. అది పెట్టిన వారు తమ కోర్కెలు తీరుతాయని నమ్ముతున్నారు. ఈ వింత సంఘటన శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ లో చోటు చేసుకుంది. గత రెండు, మూడు నెలల నుండి ఓ వ్యక్తి ఒక దగ్గరే కూర్చొనట్లు స్థానికులు గుర్తించారు. ఇతనికి మతిస్థిమితం లేదని తెలుస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఇతను అవదూత అంటూ నమ్ముతున్నారు. మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా అతనికి పూజలు నిర్వహించారు. సాయిబాబా ఫొటోతో పాటు అతని ఫొటో కూడా పెట్టి భజనలు చేశారు. ఒక్కసారిగా ఈ వార్త దావానంలా వ్యాపించడంతో భక్తులు పోటెత్తారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ కూడా ఆయనతో మాట్లాడారు. ఆహా..అంటే కోర్కెలు అవుతాయని..కాదంటే కోర్కెలు నెరవేరవని నమ్ముతున్నారు. ఎలా పూజలు నిర్వహిస్తున్నారో..ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో వీడియోలో చూడండి.

16:30 - July 19, 2016

విశాఖపట్టణం : రైల్వే స్టేషన్ లో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కలకలం రేగింది. రైలులో ఓ వర్గానికి చెందిన 60 మంది పిల్లలను ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు పట్టుకున్నారు. ఇంత మంది పిల్లలు ఎక్కడకు వెళుతున్నారనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి ట్రైన్ లో 60 మంది చిన్నారులు వెళుతున్నట్లు ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్టేషన్ కు చేరుకుని పిల్లలను..నిర్వాహకులను కిందకు దింపారు. వీరిని ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై ప్రశ్నించారు. ఈసందర్భంగా టెన్ టివితో అధికారులు మాట్లాడారు. ఎక్కడకు వెళుతున్నారని ప్రశ్నించడం జరిగిందని, చదువుకోవడానికి తాము వెళుతున్నట్లు చిన్నారులు పేర్కొన్నారని తెలిపారు. రిజర్వేషన్స్, ఆధార్ కార్డులు ఉన్నాయని, వెరు చెబుతున్న మదర్సా నిర్వాహకులతో తాము మాట్లాడడం జరిగిందన్నారు. ఏదైనా విషయం ఉంటే సమీప పీఎస్ లో ఫిర్యాదు చేసి తమకు సమాచారం అందివ్వాలని సూచించడం జరిగిందన్నారు. మదర్సాకు వెళుతున్నారా ? ఇంకా ఎక్కడైనికైనా వెళుతున్నారా ? అనే దానిపై అనుమానాలున్నాయన్నారు. పోలీసులు విచారించడం జరుగుతోందన్నారు. తల్లిదండ్రులు లేకుండా వెళుతుండడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
దీనిపై నిర్వాహకులు కూడా స్పందించారు. కర్నాటకకు వెళుతున్నామని, ఆధార్ కార్డులు, ఐడీ ప్రూఫ్ కూడా ఉన్నాయన్నారు. వారు అడుగుతున్న ఇతర వివరాలు తమ దగ్గర లేవన్నారు. పోలీసులు విచారించిన అనంతరం తాము వెళ్లడం జరుగుతుందన్నారు.

16:13 - July 19, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై ఈనెల 26న చేపట్టే మహాధర్నా కు సీపీఎం మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు నష్టం కలిగించే జీవో 123 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించతలపెట్టిన భూసేకరణ రైతులకు శాపంగా మారిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం మరుగుపరిచి 123 జీవోని తెరపైకి తెచ్చిందన్నారు. భూనిర్వాసిత ప్రాంతాల్లో తాను చేసిన పాదయాత్రలో రైతులు తమ ఘోడును వెల్లబోసుకున్నారని, భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమౌతున్నారని చెప్పారు. రైతులు చేసే పోరటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను పోలీసులు అణిచివేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఆగస్టు 16,17,18 వ నగర వేదికగా సీపీఎం ప్లీనరీ సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, రామచంద్రన్ పిళ్లై హాజరౌతారని తమ్మినేని తెలిపారు.

'మల్లన్న సాగర్ అవసరమా'..

హైదరాబాద్: 'మల్లన్న సాగర్ అవసరమా' అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నీటి పారుదల రంగ నిపుణుడు టి.హనుమంతరావు దృశ్య, శ్రవణ విధానం ద్వారా సాంకేతిక అంశాలను వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని వక్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

గుల్బర్గాలో రోడ్డు ప్రమాదం..

కర్నాటక : గుల్బర్గా నగరంలో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును లారీ ఢీకొనడంతో 8 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన మంత్రి ప్రత్తిపాటి..

ఢిల్లీ : పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను ఏపీ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కలిశారు. పొగాకు కనీస మద్దతు ధర, రైతుల సమస్యలను మంత్రి ప్రత్తిపాటి వివరించారు.

ఆర్థిక వేత్తల సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్..

ఢిల్లీ : దేశ రాజధానిలో ఆర్థిక వేత్తల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఏ 7 నిందితుడిని కస్టడీకి ఇవ్వాలన్న ఎన్ఐఏ..

హైదరాబాద్ : నలుగురు ఐసిస్ నిందితులను నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ హాజరు పరిచింది. ఏ 7 నిందితుడిగా ఉన్న రెహమాన్ ను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి కోరింది. రెహమాన్ ను ఢిల్లీకి తీసుకెళ్లి విచారించాలని, దేశ వ్యాప్తంగా ఐఎస్ఐఎస్ ను ప్రేరేపించే విధంగా రెహమాన్ ప్రవర్తించాడని తెలిపింది. రెహమాన్ ను విచారించాల్సి ఉందని, మరో ముగ్గురు నిందితులను చంచల్ గూడకు పోలీసులు తరలించారు.

కృష్ణా పుష్కర పనులను పరిశీలించిన మంత్రులు..

నల్గొండ : నాగార్జున సాగర్ లో కృష్ణా పుష్కరాల పనులను ఏరియల్ సర్వే ద్వారా మంత్రులు నాయినీ, జగదీష్ రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మలు పరిశీలించారు.

15:44 - July 19, 2016

ఢిల్లీ : ఏంటీ రాహుల్ గాంధీకి గట్టి దెబ్బ తగిలిందా అని అనుకుంటున్నారా ? ఏం జరిగింది ? అని అనుకుంటున్నారా ? ఆయనకే దెబ్బ తగిలింది..సుప్రీంకోర్టులో తగిలింది. మహాత్మాగాంధీని ఆరెస్సెస్ హత్య చేసిందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌కు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. నేరుగా ఒక సంస్థపై ఇంతపెద్ద దోషాన్ని ఎలా మోపుతారంటూ కోర్టు ప్రశ్నించింది. దీనిపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాహుల్ గాంధీకి ఈ నెల27వరకు కోర్టు గడువు ఇచ్చింది. బాపూజీ హత్య ఆరెస్సెస్ చేసిందంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆరెస్సెస్ రాహుల్‌పై సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేసింది. మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

15:40 - July 19, 2016

శ్రీకాళహస్తి : రోడ్డు..చెట్టు..ఇలా ఎక్కడైనా పసుపు..కుంకుమ..కనిపిస్తే చాలు పూజలు చేస్తుంటారు. ప్రజల నమ్మకాన్ని కొంతమమంది క్యాష్ కూడా చేసేసుకుంటుంటారు. ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఓ వ్యక్తి సాయిబాబా అంటూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వింత ఘటన శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ లో చోటు చేసుకుంది. గత రెండు, మూడు నెలల నుండి ఓ వ్యక్తి ఒక దగ్గరే కూర్చొనట్లు స్థానికులు గుర్తించారు. ఇతనికి మతిస్థిమితం లేదని తెలుస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఇతను అవదూత అంటూ నమ్ముతున్నారు. మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా అతనికి పూజలు నిర్వహించారు. సాయిబాబా ఫొటోతో పాటు అతని ఫొటో కూడా పెట్టి భజనలు చేశారు. హరతలు..ధూపాలు పట్టారు. పిచ్చివాడిగా పేర్కొంటున్న ఇతని కోసం భారీగా భక్తులు వస్తున్నారు. దీనిపై స్థానికులు స్పందించారు. 2013 నవంబర్ నెలలో ఇక్కడకు వచ్చాడని, ఎవరితోనూ మాట్లాడడని, ఆఆ..అంటే అవుతుందని, లేకపోతే కాదని పేర్కొంటున్నారు. మరి మీరు ఈ వింత చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

15:34 - July 19, 2016

వరంగల్ : ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వరంగల్‌లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితాహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఎంసెట్ 2 ప్రశ్నా ప్రత్నం లీకేజీ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లాలోని ఓకే గ్రామానికి చెందిన 8 మందికి 100 లోపు ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డితో టెన్ టివి మాట్లాడింది. ఎంసెట్ లీక్ విషయంలో ఒక పేపర్ లో వార్త వచ్చిందని, అధికారులు విచారణ జరుపుతున్నారని స్పష్టం చేశారు. నాలుగు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణకు హరిత హారం ఉద్యమంగా నడుస్తోందని, ఏజెన్సీలపై ఏటూరు నాగారంలో పర్యటించి పరిస్థితులపై రివ్యూ చేయడం జరుగుతుందన్నారు.

కలకలం..
తెలంగాణలో ఎంసెట్ 2 ప్రశ్నా ప్రత్నం లీకేజీ కలకలం రేపుతోంది..వరంగల్ జిల్లాలోని ఓకే గ్రామానికి చెందిన 8 మందికి 100 లోపు ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఏపీ ఎంసెట్ లో వేలల్లో ర్యాంకులు వస్తే , తెలంగాణ ఎంసెట్ లో మాత్రం వంద లోపు ర్యాంకులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. కోచింగ్ సెంటర్లలో సాధారణ ప్రతిభ చూపని విద్యార్థులకు అసాధారణంగా ర్యాంకులు రావడంపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి... ఎంసెట్ 2 లో ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులు ఎగ్జామ్ కు వారం రోజుల ముందు కోచింగ్ సెంటర్ల నుంచి అదృశ్యమయ్యారని సహచరులు చెబుతున్నారు.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

15:31 - July 19, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పై ఈ నెల 22 వ తేదీన రాజ్యసభలో ప్రైవేటు బిల్లు చర్చకు రానుందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. దీనికి బీజేపీ, టిడీపీ, వైసీపీలు మద్దతివ్వాలని ఆయన కోరారు. మద్దతు ప్రకటించి ఓటువేయాలని దిగ్విజయ్ కోరారు. ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చేందుకు ఎంపీలకు అధికారంగా సోనియాగాంధీ విప్ జారీ చేసినట్లు చెప్పారు. బిల్లుకు మద్దతివ్వాల్సిన బాధ్యత అందరికీ ఉందని అన్నిపార్టీలకు ఆయన గుర్తు చేశారు.

మద్దతు తెలపాలి - రఘువీరా...
ఈనెల 22న పార్లమెంటులో చర్చకు వచ్చే ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై అన్ని పార్టీలు మద్దతు తెలపాలని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. టిడిపి సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు టిడిపి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. దేశంలోని ఇతర పార్టీల మద్దతు కూడా కోరతామని రఘువీరా తెలిపారు.

15:27 - July 19, 2016

ఢిల్లీ : అరుణాచల్‌ సంక్షోభంపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సంఖ్యాబలం లేకున్నా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని ఖర్గే మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీదేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో దేశవ్యాప్తంగా 105 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందని కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర నిరసనల మధ్య పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో నెలకొన్న సంక్షోభంలో బిజెపి పాత్ర లేదని, కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ లో వింత..

చిత్తూరు : గురుపౌర్ణమి పురస్కరించుకుని పిచ్చివాడి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. సాయిబాబా అవతారంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వింత ఘటన శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ లో చోటు చేసుకుంది.

15:17 - July 19, 2016

విజయవాడ : గోదావరి నదుల తరహాలోనే రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు. ఇబ్రహింపట్నంలోని కృష్ణా - గోదావరి సంగం స్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కృష్ణా నదిని పెన్నాతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో కరవు నెలకొంటోందని, ఈ పరిస్థితి అధిగమించాలంటే నదుల అనుసంధానం తప్పనిసరి అని పేర్కొన్నారు. వర్షం పడని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటి సరఫరా చేస్తామని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు జలవనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

శ్రీశైలం నుండి నీళ్లు వస్తే రాయలసీమ రత్నాలసీమ – బాబు..

విజయవాడ : శ్రీశైలం నుండి నీళ్లు వస్తే రాయలసీమ రత్నాల సీమ అవుతుందన్నారు. పట్టిసీమ ద్వారా ముందుగా రెండు కాల్వలోకి నీటిని తీసుకొస్తామన్నారు. పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం జరిగిందని, రూ. 2,500 కోట్ల విలువైన పంటలను కాపాడడం జరిగిందన్నారు. పెన్నా నదికి గోదావరి అనుసంధానం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా నదుల అనుసంధానం చేసి తీరుతామన్నారు. వర్షం పడని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటి సరఫరా చేస్తామని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

 

కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలి - రఘువీరా...

ఢిల్లీ : కేవీపీ ప్రైవేటు బిల్లుకు పార్టీలన్నీ మద్దతు తెలపాలని, బిల్లుపై ఓటింగ్ లో ఎంపీలంతా పాల్గొనాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని, మద్దతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మద్దతుతో పాటు ఓటు వేయాలని, పార్టీలన్నీ విప్ జారీ చేయాలని కోరారు.

ఆగస్టు 12 నుండి టి.కృష్ణా పుష్కరాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 12వ తేదీ నుండి కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం దేవాదాయ శాఖ ప్రకటించింది.

 

నూజీవీడు ట్రిపుల్ ఐటీకి విద్యార్థుల ఎంపిక..

కృష్ణా : నూజీవీడు ట్రిపుల్ ఐటీకి 1151 మంది విద్యార్థులు ఎంపిక అయినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వి. వెంకటదాసు పేర్కొన్నారు. 20న 576 మంది, 21న 575 మందికి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. విద్యార్థులు ఏ కారణం చేతనైనా రాకపోతే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇవ్వని అభ్యర్థుల అడ్మిషన్ రద్దు చేస్తామన్నారు.

అరుణాచల్ లో సంక్షోభానికి కాంగ్రెస్సే కారణం - రాజ్ నాథ్..

ఢిల్లీ : అరుణాచల్ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణమని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. అవినీతి రహిత పాలన చూసి సహించలేకపోతున్నారని పేర్కొన్నారు.

నల్గొండలో రెండు రోజుల పాటు సీపీఎం పాదయాత్ర..

హైదరాబాద్ : సాగర్ టెయిల్ పాండ్ నిర్వాసితుల సమస్యలపై రేపు, ఎల్లుండి నల్గొండ జిల్లాలో సీపీఎం పాదయాత్ర నిర్వహించనుంది. పాదయాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, జూలకంటి రంగారెడ్డిలు పాల్గొనున్నారు. ఎల్లుండి ప్రాజెక్టు వద్ద ముగింపు సభ, ధర్నా కార్యక్రమం చేపట్టనుంది.

కాసేపట్లో ఉన్నతాధికారులతో మంత్రి కడియం సమీక్ష..

హైదరాబాద్ : మధ్యాహ్నం 03.30గంటలకు విద్యాశాఖాధికారులతో మంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ అడ్మిషన్లు, ఎంసెట్ కౌన్సెలింగ్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల క్రమబద్దీకరణపై చర్చించనున్నారు.

 

ఎర్రబెల్లిని అడ్డుకున్న గ్రామస్తులు..

వరంగల్‌ : హారితహారం కార్యక్రమానికి వెళ్లిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. కాంటాయపాలెం గ్రామస్తులు ఎర్రబెల్లి మాట్లాడుతుండగా అడ్డుకున్నారు.

14:32 - July 19, 2016

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రూమ్‌మేటే అతనిని కత్తితో పొడిచి చంపాడు. నగరంలోని సుల్తాన్ బజార్ కు చెందిన సంకీర్త్ అమెరికాలో ఎమ్మెస్ చదువుకోవడానికి రెండున్నర సంవత్సరాల క్రితం వెళ్లాడు. నార్త్ ఆస్టిన్ లో సంకీర్త్ ఉంటున్నాడు. ఇతను ఉంటున్న రూంలో మరొక వ్యక్తితో పాటు సందీప్ గౌడ్ ఉంటున్నాడు. రూమ్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఆవేశంలో సంకీర్త్‌ను కత్తితో సందీప్ పొడిచి చంపాడు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంకీర్త్ మృతి చెందిన విషయాన్ని అక్కడి బంధువులు ఇప్పటికే పోలీసులకు, తల్లిదండ్రులకు తెలియజేశారు. హత్య చేసిన సందీప్ గౌడ్ తెలుగు రాష్ట్రానికి చెందిన వాడా ? కాదా ? అనేది తెలియాల్సి ఉంది.
సంకీర్త్ అమెరికా వెళ్లి రెండేళ్లయిందని అతని కుటుంబసభ్యులు ఫోన్ లో తెలిపారు. సందీప్ గౌడ్ 15 రోజుల క్రితమే రూమ్ మేట్ గా వచ్చాడని తెలిపారు. ఓ వ్యక్తి నిద్ర వస్తుందని పక్క గదిలోకి వెళ్లడం..ఈ ఘటన జరిగిపోవడం జరిగిందన్నారు. ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదని వాపోయారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని, సంకీర్త్ ను ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు.

14:24 - July 19, 2016

విజయవాడ : కృష్ణమ్మ ప్రాణనాడి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా- గోదావరి పవిత్ర సంగమం వద్ద పుసుపు, కుంకుమతో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టిసీమ నుండి వచ్చిన గోదావరి జలాలను డెల్టాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశంలో రెండు నదులు కలవలేదని, 365 రోజుల్లో రెండు నదులను కలిపిన ఏకైక ప్రభుత్వం తమదేన్నారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన వద్ద పట్టుదల నేర్చుకున్నట్లు తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణాకు నీళ్లు తేవాలని ఎంతో గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించడం జరిగిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు గుప్పించాయని, మంచి చెబితే..అడ్డు తగిలితే దూసుకెళుతానని ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. మొత్తం రూ. 1425 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని, 1800 ఎకరాలకు రూ. 700 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. సంవత్సరంలోపునే పట్టిసీమను పూర్తి చేయడం జరిగిందన్నారు. పట్టిసీమ పూర్తి కావడానికి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చాలా కృషి చేశాడని, ఆయన వెనుక ఉన్నతాధికారులు కృషి చేశారని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా హాజరయ్యారు.

14:00 - July 19, 2016

అనంతపురం : అనంత వాసుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ జంక్‌ ఫుడ్స్‌పై మోజు చూపిన జనం.. ఇప్పుడు సంప్రదాయిక ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. సీమ వంటకాల్లో ప్రసిద్ధమైన రాగిముద్దతో పాటు.. ఇప్పుడు జొన్న రొట్టెలనూ అమితానందంతో తింటున్నారు. మొన్నటి వరకూ జంక్‌ఫుడ్‌ సెంటర్లతో నిండిన అనంత వీధులు.. ఇప్పుడు జొన్నరొట్టె కేంద్రాలతో కళకళలాడుతున్నాయి. ఆకలిని తీర్చడంతో పాటు.. ఆరోగ్యానికీ మేలు చేస్తుండడంతో.. ప్రజలిప్పుడు జొన్నరొట్టెలను ఆబగా ఆరగించేస్తున్నారు. మారుతున్న ఆహారపుటలవాట్లు.. సంప్రదాయిక రొట్టెలపై పెరుగుతున్న మోజు.. అవును అనంతపురం జిల్లా వాసులిప్పుడు సంప్రదాయిక వంటలను అమిత ప్రేమతో ఆరగించేస్తున్నారు. రాత్రయితే చాలు.. అనంతపురం జిల్లాలో జొన్నరొట్టెల షాపులు కళకళలాడిపోతున్నాయి.

జంక్‌ఫుడ్స్‌ తో పలు రోగాలు..
విదేశీ ఆహారానికి.. ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడ్డంతో.. ప్రజలు ఇటీవల షుగర్ ,బీపీ, కొలెస్టరాల్ పెరుగుదల వంటి రోగాలబారిన పడుతున్నారు. జంక్‌ ఫుడ్‌ వల్ల జేబుకు చిల్లు పడ్డమే కాకుండా.. ఆరోగ్యమూ చెడిపోతుండడంతో.. ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోంది. దీంతో మళ్లీ సంప్రదాయిక వంటలవైపు మొగ్గు చూపుతున్నారు.. అనంతవాసులు.

ఆరోగ్యానికి చాలా మంచివంటున్నారు స్థానికులు. ..
అనంతపురం రోడ్ల ప్రక్కన ఒకప్పుడు బజ్జీ సెంటర్లు.. స్వీట్ బండ్లు ఎక్కువగా ఉండేవి. వీటికి తోడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు.. చాట్ బండార్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఓదశలో చాట్‌ తినడం యూత్ లో ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మళ్లీ మారుతోంది. కొంతకాలంగా.. ప్రజలను జొన్నరొట్టెలు కట్టిపడేస్తున్నాయి. ఒక్కచుక్క నూనె కూడా కలపకుండా.. కేవలం వేడి నీళ్లతోనే తయారుచేసే జొన్నరొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివంటున్నారు స్థానికులు.

కొవ్వును కరిగించే జొన్నరొట్టె...
రోడ్లపై అందంగా ఆకర్షించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తయారయ్యే ఫుడ్.. శరీరంలో అధికకొవ్వును ఏర్పడేలా చేస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉద్యోగాలు చేసి రాత్రుళ్లు అలసివస్తున్న వారికి వండుకునే ఓపిక లేక ఫాస్ట్ ఫుడ్స్‌నే ఆశ్రయించేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని జొన్నరొట్టెలు ఆక్రమించేశాయి. ఫాస్ట్ ఫుడ్ కంటే తక్కువ ధరలో అంటే పది రూపాయలకే ఓ జొన్న రొట్టె లభిస్తుండడంతో.. అనంత వాసులు.. ఇప్పుడు ఈ ఆహారానికే ఓటేస్తున్నారు.

కరువు, పేదకరికంతో వలస పోతున్న అనంత వాసులు..
అనంతపురంలోని కరువు, పేదకరికం కారణంగా పలువురు పెద్ద నగరాలకు వలసపోతున్నారు. మిగిలిన వాళ్లు నగరంలో ఏదో ఒకపని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారికి జొన్నరెట్టెల బండ్లు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లవుతున్నాయి. కేవలం 20 రూపాయలు వెచ్చించి.. రెండు రొట్టెలు తిని కడుపు నింపుకుంటున్నారు. దీంతో ఇప్పుడు జొన్నరొట్టెల తయారీ కేంద్రాలు పెరిగిపోయాయి. తద్వారా మరికొందరికి ఉపాధీ లభిస్తోంది.

ఫాస్ట్ ఫుడ్ ప్రాణాలను హరించి వేస్తుందని వైద్యులు..
ఫాస్ట్ ఫుడ్ ప్రాణాలను హరించి వేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్‌ సెంటర్లలో .. చాట్ బండార్ లలో వాడే ఆయిల్ మళ్లీమళ్లీ వాడడంతో.. అవి విషతుల్యం అవుతున్నాయి. దీంతో చాలా మందికి బ్లడ్ షుగర్ , బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే నూనె లేకపోవడం.. షుగర్ ను కంట్రోల్ చేసే పోషకాలు ఉండడం.. బీపీనీ నియంత్రింస్తుండడం వల్ల.. జొన్నరొట్టెలు పరిపూర్ణ ఆరోగ్యాహారమని వైద్యులు చెబుతున్నారు. రాగిముద్దలు.. జొన్నరొట్టెలు.. తీసుకోవడం వల్ల సుదీర్ఘ కాలం పాటు ఆకలి కాదని, అదే సమయంలో ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుందనీ అంటున్నారు.

జొన్నరొట్టె తయారీ చేయడానికి కావాల్సింది నైపుణ్యం...
జొన్నరొట్టె తయారీ చేయడానికి చాలా నైపుణ్యం కావాలి. జొన్నపిండికి వేడినీటిని కలిపి ముద్దగా చేసుకుని.. చేతితో దాన్ని తట్టుతూ వెడల్పు చేయడం ఎంతో అలవాటున్న వారికే తప్ప నేటి తరం యువతీయువకులకు దాదాపు తెలియదు. దీంతో.. జొన్న రొట్టెల విక్రయ కేంద్రాల పుణ్యమా అని.. సంప్రదాయిక వంటకాలను మళ్లీ భుజించగలుగుతున్నామని.. నేటి యువత చెబుతున్నారు. మొత్తానికి అనంతలో వెలసిన జొన్నరొట్టెల కేంద్రాలు.. ప్రజలకు ఆరోగ్యకర ఆహారాన్నీ.. కొంతమందికి ఉపాధినీ అందిస్తున్నాయి. 

13:55 - July 19, 2016

విజయవాడ : ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా స్విస్ ఛాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్విస్ ఛాలెంజ్ పద్థతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..

13:52 - July 19, 2016

మద్యం మనుష్యుల మాన ప్రాణాల్ని హరించేస్తోంది. మద్యం త్రాగి వాహనాలకు నడుపుతూ..పలు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఎదురుగా వచ్చే వారి ప్రాణాలను హరిస్తున్నారు. ఇటువంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోని పంచాగుట్ట వద్ద జరిగింది. ఈప్రమాదంలో చిన్నారి రమ్మతో పాటు ఆమె బాబాయి..తాత ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అందిరినీ కలచివేసింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో ఘోరాలు ఈ మద్యం సేవించటంతోనే నేరాల సంఖ్య పెరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు..మద్యం ప్రభావం మహిళలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఝాన్సీ (పీవో డబ్ల్యూ) శ్రీకాంతాచారి (సైకాలజిస్ట్) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

13:50 - July 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల రిటర్నింగ్‌ ప్రధాన అధికారి గంగాధర్‌ చెప్పారు. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ ప్రధాన అధికారి గంగాధర్‌ పేర్కొన్నారు. పోలింగ్ విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని 44శాతం ఓటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. 23 వేల 692 ఓట్లు పోలియినట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ పూర్తవుతుందనీ..ఎక్కడ పోల్ అయిన ఓట్లు అక్కడే కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు.

13:37 - July 19, 2016

హైదరాబాద్ : నాంపల్లి కోర్టులో నలుగురు ఐసిస్ నిందితులను ఎన్ఐఏ అధికారులు హాజరుపరిచారు. దీంతో ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా కోర్డు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రెహమాన్ అనే నిందితుడ్ని మరో ఏడు రోజులపాటు కష్టడికి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. సమగ్ర సమాచారం రెహమాన్ వద్ద వున్నట్లుగా అధికారులు గుర్తించటంతో ప్రత్యేకించి రెహమాన్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఏఏ రాష్ట్రాలలో ఎవరెవరు వీరివైపు ఆకర్షింపబడ్డారు అనే విషయంపై రెహమాన్ వద్ద పూర్తి సమాచారం వుందని అధికారులు భావిస్తున్నారు. ఐసిస్ అగ్రనేతలకు అతి సన్నిహితుడుగా వున్న రెహమాన్ సోషల్ మీడియోను వాడుకుని ప్రజలను ఐసిస్ వైపు ఆకర్షించటంలో రెహమాన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాడని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. ఈ కారణంతోనే ప్రత్యేకించి రెహమాన్ ను తమకు అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు కోరుతున్నట్లు సమాచారం.

అమెరికాలో నగర విద్యార్థి దారుణ హత్య

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థి సంకీర్త్ మంగళవారం దారుణ హత్యకు గురైయ్యాడు. అతడిని రూమ్మేట్ సాయి సందీప్ కత్తిలో పొడిచి హత్య చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని సుత్తాన్ బజార్ కు చెందిన సంకీర్త్ మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

 

13:29 - July 19, 2016

రజనీకాంత్..ఆయన చిత్రం 'కబాలి' కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కబాలి చిత్ర రిలీజ్ డేట్ లో మార్పులకు రజనీ ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయన అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ అమెరికాలో రజనీ కనిపించారు. ఓ ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. తన కూతురు రజనీకాంత్ తో వర్జీనియా నగరంలోని సచ్చిదానంద్ లోటస్ టెంపుల్ కు వెళ్లారు. అక్కడ పూజలు చేసిన రజనీ ఆశ్రమంలోని అన్ని ప్రాంతాలను సందర్శించారంట. వీటికి సంబంధించిన ఫొటోలు ఐశ్వర్య తన ట్విట్టర్ లో పోస్టు చేసింది. జులై 20వ తేదీన రజనీ అమెరికా నుండి ఇండియాకు తిరిగి వస్తున్నారని తెలుస్తోంది. జులై 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 'కబాలి' రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కబాలి రిలీజ్ టైంకి తమ అభిమాన హీరో చెన్నైకి చేరుకుంటున్నందున వారి ఆనందానికి అవధులు లేవు. ఇదిలా ఉంటే అమెరికాలో తొలి షో జులై 21న ఉదయం 11గంటలకు వేయనున్నట్లు తెలుస్తోంది.

13:21 - July 19, 2016

సినీ పరిశ్రమలో ప్రస్తుతం 'కబాలీ' ఫీవర్ నెలకొంది. ఈ చిత్రానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంపై చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా క్లైమాక్స్ విషాదంగా ఉంటుందని..దీనిని మార్చాలని రజనీ కూతురు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు పా.రంజిత్ స్పందించారు. ఈ సినిమా చూసిన తరువాత విషాదభరింతగా ఉన్న క్లైమాక్స్ ని ఎడిట్ చేసి, హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని సౌందర్య రజనీకాంత్, థాను ఇద్దరూ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అభిమానులే కాకుండా ప్రేక్షకులకు కూడా ఈ క్లైమాక్స్ జీర్ణించుకోలేరని పేర్కొన్నారని, కానీ తాను రాసుకున్న కథ ప్రకారం ఈ క్లైమాక్స్ కరెక్టే అని భావించడం జరిగిందన్నారు. మూడు రోజుల అనంతరం రజనీ తనకు ఫోన్ చేసి ఏ క్లైమాక్స్ అనుకుంటున్నావో అదే కంటిన్యూ చేయాలని..ఎవరి అభిప్రాయాన్ని ఫాలో అవ్వాల్సినవసరం లేదని చెప్పడం జరిగిందని తెలిపారు. తాను ఆశించినట్లుగానే రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మరి క్లైమాక్స్ లో ఎలాంటి విషాదం దాగి ఉందో తెలుసుకోవాలంటే 22వరకు వేచి ఉండాల్సిందే.

కృష్ణా - గోదావరి సంగమం వద్ద చంద్రబాబు పూజలు

విజయవాడ : కృష్ణా - గోదావరి పవిత్ర సంగమం వద్ద సీఎం చంద్రబాబు పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కర ఘాటలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పయనమయ్యారు.

13:12 - July 19, 2016

అవును మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన ఆహారం తీసుకోవాలి. దానితో పాటు కొంత వ్యాయామాలు చేస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. అయితే కొంతమంది అధిక పని చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇలాంటి వారికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో విటమిన్ 'సి' ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీ, బొప్పాయి, జామ, ఉసిరి..విటమిన్ సి ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచింది.
మిటమిన్ బి 12 శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మాంసకృత్తులు, కూరగాయాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. రోజుకో గుడ్డు తీసుకున్నా సరిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రొటీన్స్ అనేవి ఒత్తిడిని తగ్గిస్తుంటాయి. గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉంటే మంచింది.
జింక్ ఎక్కువగా ఉండే పప్పులు, గింజలు, బీన్స్, చిరు ధాన్యాల్లో ఉంటుంది. ఇది పిల్లల్లో శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ పదార్థాలు ఆహారంలో ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోతుంది.

నాంపల్లి కోర్టులో ఐసిస్ నిందితులు

హైదరాబాద్ : నలుగురు ఐసిస్ నిందితులను ఎన్ఐఏ నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. రెహమాన్ ను మరో ఏడు రోజుల కస్టడీకి ఎన్ఐఏ కోరింది. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీకి 1151మంది ఎంపిక

కృష్ణా: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీకి 1151 మంది విద్యార్థులను ఎంపిక అయ్యారు. 20వ వ తేదీన 576 మంది, 21వ తేదీన 575 మంది విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఏ కారణం చేతనైనా రాకపోతే సమాచారం ఇవ్వాలని, లేని పక్షంలో అడ్మిషన్ రద్దు చేస్తామని డైరెక్టర్ వి. వెంకటదాసు తెలిపారు.

13:05 - July 19, 2016

ఉదయం నుండి మొదలుకొంటే రాత్రి పడుకొనే వరకు ఏదో ఒక పనిలో బిజీ బిజీగా గడుపుతూనే ఉంటుంటారు. రాత్రి పడుకొనే సమయంల కూడా ఏవో పనులు చేసుకుంటూ..తినుకుంటూ..టీవీ చూసుకుంటూ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలకు దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు మహిళలైతే అమాంతం బరువు పెరిగిపోతుంటారు. ఇలా బరువు పెరగడానికి నిద్రించే ముందు మొబైల్, లాప్ టాప్..ఇతరత్రా వాడుతుండమేనని సర్వేల్లో వెల్లడైందంట.
కృతిమ లైట్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, కృత్రిమ లైట్‌ వాడకం క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్‌ సెల్స్‌మీద ప్రభావం చూపి విపరీతంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు.
చాటింగ్ లు చేస్తూ, ఫేస్ బుక్ చూస్తూనో..యూ ట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటారు. ఈ వెలుగులోనే రాత్రి సమయంలో ఎక్కువగా పనిచేస్తుంటారు. అంతేగాకుండా పనిచేసుకుంటూ ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఈ సమయంలో తీసుకొనే ఆహారానికి పరిమితులుండవు. సో..నిద్రించే ముందు ఇలాంటి వస్తువులకు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు.

13:01 - July 19, 2016

విజయవాడ : ఆ రోడ్లపై వెళ్లాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి. రహదారుల విస్తరణ కోసం ఉన్న రోడ్లను తవ్వేయడంతో వాహనదారులు.. ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు. ఆధునీకరణ పేరుతో ఇష్టానుసారంగా రోడ్లను తవ్వేసిన కాంట్రాక్టర్లు.. రోడ్ల రూపురేఖలు మార్చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయడంలేదు. గతుకులుగా మారిన మారిన బెజవాడ రోడ్లను కాంట్రాక్టర్లు అలాగే వదిలేయడంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సుందరీకరణ పేరుతో రోడ్లు అస్తవ్యస్తం..
ఉన్న రోడ్లను తవ్వేశారు. నడిచే వీలు లేకుండా చేశారు. విజయవాడలోని పలు ప్రధాన రహదార్లపై ఇదే పరిస్థితి. రోడ్లను విస్తరించి సుందరీకరణ చేయాలని సీఎం ఆదేశించడంతో కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేపట్టారు. రహదారులను తవ్వి అలాగే వదిలేశారు. కొందరు కాంట్రాక్టర్లు పనులు కొనగిస్తుంటే.. మరికొందరు రోజుల తరబడి తవ్వేసిన రోడ్లను అలాగే వదిలేసి తాత్సారం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం రాజధానికి లింకప్‌ అయ్యేలా రోడ్లను ఏర్పాటు చేస్తామని చెబుతోంది.

అంబులెన్స్‌లు కూడా రాలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న రోగులు...
అసలే వర్షాకాలం కావడంతో.. గుంతల్లో నీరు నిలిచి వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తరచూ ప్రయాణికులు, వాహనదారులు రోడ్లపై ఏర్పడ్డ గోతుల్లో పడి గాయాల పాలవుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్లపై వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటీవల బీసెంట్‌ రోడ్డులో రహదారి విస్తరణ పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్‌ రోడ్డును తవ్వేసి నెల రోజులైనా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని విజయవాడలోని పలు రహదారులను కాంట్రాక్టర్లు అడ్డగోలుగా తవ్వినా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు. అస్తవ్యస్తంగా మారిన రోడ్లపై ప్రయాణం.. చాలా కష్టంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు కూడా రాలేక రోగుల ప్రాణాలకు సైతం గ్యారెంటీ లేకుండా పోతోంది.

విస్తరణ పేరుతో రోడ్లను మరింత అధ్వాన్నం...
సాధారణంగా అయితే రహదారులను విస్తరించేటప్పుడు..రోడ్లను తవ్వేస్తే వారం పది రోజుల్లో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్లు సమర్థవంతంగా పనులు నిర్వహించకపోవటంతో...నెలలు గడుస్తున్నా పలు చోట్ల తవ్విన రోడ్లే దర్శనమిస్తున్నాయి. మరమ్మతులు, విస్తరణ పేరుతో రోడ్లను మరింత అధ్వాన్నంగా మారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రోడ్లను సత్వరమే బాగు చేయాలని కోరుతున్న స్థానికులు..

పుష్కరాల నేపథ్యంలో బెజవాడ రోడ్లపై రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్ల విస్తరణ పనుల్లో ఆటంకం కలిగితే భక్తులు, ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకూ భంగం వాటిల్లే అవకాశం లేకపోలేదు. నగర వ్యాప్తంగా తవ్విన రోడ్లను సత్వరమే బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

తైవాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం:26 మంది మృతి

హైదరబాద్ : తైవాన్‌ రాజధాని తైపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తావోయువాన్‌ కౌంటీలోని రెండో నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న పర్యాటకుల బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న బారియర్లకు ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడినట్లు తావోయువాన్‌ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

12:54 - July 19, 2016

.గోదావరి : కాదేదీ కబ్జాకు అనర్హం..! పోలవరం ప్రాంతంలోని బడాబాబులు నమ్ముతున్న సూత్రమిది. కనిపించిన ఖాళీ జాగాను కబళించే ఈ పెద్దమనుషులు.. వందల ఎకరాల చెరువు భూమినీ ఉన్నపళంగా మాయం చేశారు. కబ్జాకోరులకు వంత పాడుతూ అధికారులు సైతం అక్కడ భూమే లేదన్నట్లు రికార్డులు సృష్టించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. పోలవరం చెరువు భూముల కబ్జాపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...! ఇదో కబ్జాకోరుల బాగోతం. ఖాళీ జాగా కనపడితే చాలు కబళించేసి రికార్డులను సైతం తారుమారు చేస్తున్న బడా బాబుల నిర్వాకం.

కబ్జా కోరల్లో 14.18 ఎకరాల భూమి...
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం కొత్తూరు చెరువు భూముల్ని ఆక్రమించిన భూ రాబందులు.. వాటికి నకిలీ పట్టాలు కూడా సృష్టించి రికార్డులనే తారుమారు చేశారు. కొత్తూరు శివారులో సర్వే నెంబర్‌ 2లో 210.18 ఎకరాల చెరువు ఉండేది. ఇదే విషయాన్ని 1988-89 సంవత్సరంలో సర్వే చేసిన రెవిన్యూ అధికారులు.. సదరు భూమికి సంబంధించిన అడంగల్‌ కూడా రాయించారు. దాదాపు ఐదు వేల ఎకరాలకు సాగునీరందించిన కొత్తూరు చెరువు.. ప్రస్తుతం చాలా వరకు ఆక్రమణలకు గురైంది. 114.18 ఎకరాల భూమి కబ్జాకోరుల్లో చిక్కి కనిపించకుండా పోయింది. అంతకు ముందు రికార్డుల్లో ఉన్న భూమి సైతం.. ప్రస్తుతం లేకుండా పోయింది. సుమారు 210 ఎకరాల భూమికి గానూ.. ప్రస్తుతం 96 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవిన్యూ రికార్డులు తయారు చేశారు.

ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు..
ఎన్నో ఏళ్ల నుంచి చెరువు కబ్జాకు గురవుతోందని పోలవరం రైతులు అధికారులకు మొర పెట్టుకున్నా.. ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు. చెరువు భూముల్ని కబ్జా చేసింది బడా బాబులు కావడంతో అధికారులు సైతం కబ్జారాయుళ్లకు బాసటగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మిన్నకుండిపోకుండా.. కబ్జాకు గురైన భూముల్ని కాపాడాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. చెరువు భూములు కబ్జాకు గురైనా పట్టించుకోని అధికారులు.. చెరువులో బోర్లు వేసుకునేందుకు అనుమతివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. చెరువు ఆక్రమణకు సంబంధించి సర్వే చేశామని, అనుమతి లేకుండా బోర్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు.

కొత్తూరు చెరువును కాపాడాలని స్థానికుల కోరిక...
పోలవరం చెరువు కబ్జాకు గురవుతున్నా..ప్రభుత్వం, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువును రక్షిస్తే ఎందరో రైతులకు మేలు చేసిన వారవుతారని, ఇప్పటికైనా కొత్తూరు చెరువును కబ్జాకోరుల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 

12:47 - July 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ 2 ప్రశ్నా ప్రత్నం లీకేజీ కలకలం రేపుతోంది..వరంగల్ జిల్లాలోని ఓకే గ్రామానికి చెందిన 8 మందికి 100 లోపు ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఏపీ ఎంసెట్ లో వేలల్లో ర్యాంకులు వస్తే , తెలంగాణ ఎంసెట్ లో మాత్రం వంద లోపు ర్యాంకులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. కోచింగ్ సెంటర్లలో సాధారణ ప్రతిభ చూపని విద్యార్థులకు అసాధారణంగా ర్యాంకులు రావడంపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి... ఎంసెట్ 2 లో ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులు ఎగ్జామ్ కు వారం రోజుల ముందు కోచింగ్ సెంటర్ల నుంచి అదృశ్యమయ్యారని సహచరులు చెబుతున్నారు.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

ఉన్నత స్థాయి కమిటీ నియమించాం : లక్ష్మారెడ్డి
ఎంసెట్-2 పేపర్ లీక్ ఉన్నత స్ధాయి కమిటీని నియమించామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఎంసెట్ -2 పేపర్ లీక్ వాస్తవమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. 

రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అనుచితి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పండి... లేదంటే విచారణ ఎదుర్కోండని రాహుల్‌కు సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. గాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తముందని గతంలో రాహుల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

దిగ్విజయ్ తో ముగిసిన ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ

ఢిల్లీ : ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని, ప్రైవేటు మెంబర్ బిల్ పాసయ్యేందుకు మా వంతు కృషి చేస్తామన్నారు. బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలను కోరున్నామని, విభజన చట్టంలోని అంశాలను ప్రధాని అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి ఆర్థిక లోటు ఏర్పడిందని దిగ్విజయ్ పేర్కొన్నారు.

వారం రోజుల పాటు తిరంగా ఉత్సవాలు : ప్రధాని..

ఢిల్లీ : ఆగస్టు 15 సందర్భంగా వారం రోజుల పాటు తిరంగా ఉత్సవాలు జరపాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ స్వయంగా పాల్గొనాలన్నారు. దశభక్తి, నాయకుల జీవిత గాధలను యువతకు చేర వేయాలని... దాని కోసం70 స్లైడ్స్ తయారు చేసి 70 ఏళ్ల స్వాతంత్ర్యంపై ప్రజకు వివరించాలన్నారు. గరీబ్ కళ్యాణ్ అంత్యోదయ పథకాలను ప్రచారం చేయాలి. కొత్తగా వచ్చిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయని ప్రధాని సూచించారు.

హరితహారంలో అందరూ పాల్గొనాలి: స్పీకర్

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని శాసన సభాపతి మధుసూదనాచారి అన్నారు. శాసనసభ, శాసనమండలి తో పాటు నగరంలోని ఓల్డ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నేడు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

12:19 - July 19, 2016

ఢిల్లీ : సిపిఎం డిమాండుకు ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు కశ్మీర్‌ ప్రభుత్వం దిగొచ్చింది. కశ్మీర్‌ అల్లర్లపై 21న అఖిలపక్ష సమావేశాన్ని మెహబూబా ముఫ్తి ఏర్పాటు చేసింది. కశ్మీర్‌లో అశాంతిపై అఖిలపక్షం నిర్వహించాలని నిన్న పార్లమెంట్‌లో సీతారాంఏచూరి డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మొదటి నుంచి ఆ రాష్ర్ట సీపీఎం కార్యదర్శి యూసఫ్‌ తరిగామి డిమాండ్‌ చేస్తున్నారు.

12:06 - July 19, 2016

హైదరాబాద్ : కాసేపట్లో నాంపపల్లి కోర్టులో నలుగురు ఐసిస్ నిందుతులను ప్రవేశపెట్టనున్నారు. ఎనిమిది రోజులపాటు ఐసిస్ నిందితులకు ఎన్ఐఏ విచారించిన విషయం తెలిసిందే. ఐసిస్ కు సహకరించిన మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో పేలుళ్ళకు ఐసిస్ సానుభూతిపరులు పేలుళ్ళకు పాల్పడటానికి వ్యూహాలు చేస్తున్న సమయంలో ఎన్ఐఏ అధికారులు చాకచక్యంగా ఉగ్రనిందితులకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

కశ్మీర్ అల్లర్ల పై 21న అఖిల పక్షం

ఢిల్లీ : కశ్మీర్ లో జరిగిన అల్ల్ల పై 21 అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు సీఎం మోహబూబాముఫ్తీ రెడీ అయ్యారు. నిన్ని పార్లమెంట్ లో సీపీఎం నేత సీతారాం ఏచూరి కశ్మీర్ ఓ అశాంతి పై అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సీపీఎం డిమాండ్ కు కేంద్ర, కశ్మీర్ ప్రభుత్వాలు దిగి వచ్చాయి.

11:57 - July 19, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో పార్టీ బలోపేతంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఒక ఎంపీ సహా, ముగ్గురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో డీలా పడిన వైసీపీ, మళ్లీ పుంజుకునేందుకు ఫ్యానుకు మరమ్మతులు చేస్తోంది. లోటస్‌పాండ్‌లో జిల్లాలవారీగా సమీక్షలను నిర్వహిస్తోంది. ప్రజావ్యతిరేక విధానాలు, పార్టీ విస్తరణపైనే నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారు.

తెలంగాణాలో పార్టీ విస్తరణపై వైసీపీ నేతలు దృష్టి...
తెలంగాణాలో పార్టీ విస్తరణపై వైసీపీ నేతలు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వైపే ప్రాధాన్యతనిస్తున్న ఆ పార్టీ అధినేత తెలంగాణాలోనూ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. అటు జిల్లాల వారీగా తెలంగాణా నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల సమీక్షలు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో తెలంగాణాలో గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా కమిటీల ఏర్పాటుతో పాటు అనుబంధ సంఘాల నియామాకాన్ని కూడా పూర్తి చేయాలని సమీక్షల్లో పార్టీ నేతలు నిర్ణయించారు. సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్సార్ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని నేతల అభిప్రాయం...
కార్యవర్గాల నియామకం అనంతరం పార్టీ నేతలతో ఓ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలనే అభిప్రాయంతో నేతలున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ విసిరిన ఆకర్ష వలతో నేతలు కరువైన వైసీపీ ఇప్పుడిప్పుడే మరోసారి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. అంతేకాదు పలు అంశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు తెలంగాణా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు.

11:53 - July 19, 2016

ఢిల్లీ : ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, కేవీపీ తదితర రాష్ట్ర నేతలు రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై చర్చించారు... బిల్లుకు ఇతర పార్టీల మద్దతు కూటగట్టడంపై సమాలోచనలు జరిపారు. పార్లమెంట్ లో కేవీపీ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లు, దాని పై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. గత బడ్జెట్ సమావేశాల్లో ప్రయివేటు బిల్లు చర్చ జరగకుండానే సమావేశాలు ముగిసిపోయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓటింగ్ కోసం కాంగ్రెస్ పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పెద్ద శిక్షను భరిస్తోంది. విభజన హామీలో ప్రధాన అంశమైన ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయేపై పోరాటానికి సిద్ధపడుతోంది. ఈ విధంగానైనా ఏపీలో తమ ఉనికిని చాటుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలకు చెందిన ఎంపీల మద్దతు కూడా కట్టాలని ఏపీ కాంగ్రెస్ నేతలు ద్విగ్విజయ్ సింగ్ ను కోరినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఏపీలో బాక్సైట్ తవ్వకాల ప్రాంత్లాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.

జపాన్ రాయబారితో మంత్రి కేటీఆర్...

ఢిల్లీ :మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఉదయం జపాన్ ‌రాయబారి యూపాక కికుటుతో సమావేశమై మేకిన్‌ తెలగాణ అంశంపై చర్చించారు. కాసేపట్లో మలేసియా ఉప ప్రధానితో కేటీఆర్‌ భేటీ కానున్నారు. ఉదయం 11గంటలకు సునిల్‌మిత్తల్‌తో బేటీ కానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. సాయంత్రం 4గంటలకు తైవాన్‌ రాయబారి తుంగ్‌కవాంగ్‌తో, 5గంటలకు దక్షిణ కొరియా రాయబారి హ్యున్‌చావ్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ కానున్నారు.

ఎంసెట్ -2 పేపర్ లీక్ పై మంత్రిలక్ష్మారెడ్డి స్పందన

వరంగల్ : ఎంసెట్ -2 పేపర్ లీక్ పై మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. విచారణ నిర్వహించి వాస్తవాలను కమిటీ తేలుస్తుందని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాంపల్లి కోర్టుకు ఐసిస్ నిందితులు

హైదరాబాద్ : కాసేపట్లో నలుగురు ఐసిస్ నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పరచనుంది. 8 రోజుల పాటు నలుగురు నిందితునలు విచారించిన ఎన్ఐఏ హాజరు పర్చనుంది. ఐసిస్ కు సహకరించిన మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రత్యేక హోదాపై చర్చకు టిడిపి నోటీసు

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా పై చర్చించేందుకు టిడిపి నోటీసు ఇచ్చింది. రూల్ నెం: 193 నిబంధన కింద లోక్ సభలో చర్చను చేపట్టాలని ఆ నోటీఉలో కోరింది. 

10:57 - July 19, 2016

విజయవాడ : వర్షం కురుస్తుందంటే..ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది కొంతమందికి...వానొచ్చిందంటే..తమ పంటలకు భరోసా దొరికినట్టనిపిస్తుంది రైతులకి...ఈ ప్రాంత ప్రజలకు మాత్రం వర్షమంటే భయమేస్తుంది..గుండెల్లో గుబులు మొదలవుతుంది...ఎక్కడ తమ బతుకులు చిధ్రమవుతాయోననే అలజడి వారిలో కలుగుతుంది... వర్షానికి ఇంతలా భయపడుతున్న ఈ ప్రజలెవరు.... వారికి భయం కలిగిస్తున్న ఈ పరిస్థితులేంటి....వాచ్‌ దిస్‌

వర్షం వల్ల క్షణం రాయి పైన పడుతుందోనని ఆందోళన..
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు..కొండప్రాంత వాసుల్లో భయం భయం... ఎటువైపు నుంచి కొండరాయి దొర్లినెత్తిన పడుతుందో తెలియని ఆందోళనమయం..ఎక్కడ రిటైనింగ్‌ వాల్‌ కూలుతుందోననే భీతితో దుర్భరమైన జీవితాన్ని నెట్టికొస్తున్న గ్రామజనం.. వర్షాకాలం వచ్చిందంటే చాలు కొండల మాటున తమ బతుకులు చిధ్రం కావాల్సిందేనంటూ ఆవేదన చెందుతున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు.

వేరే గతిలేక ఇక్కడే జీవనంసాగిస్తున్న స్థానికులు..
విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో సుమారు లక్షమందికి పైగా పేద,మధ్య తరగతి ప్రజలు వారి పరిస్థితులను బట్టి కొండప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువమంది పేదలు కావడంతో కొండలను ఆశ్రయించి నిర్మాణాలు చేసుకున్నారు. ప్రమాదమని తెలిసినా వేరే గతిలేక ఇక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. వర్షం పడిందంటే ఏరాయి వచ్చి ఇంటిమీద పడుతుందోననే భయంతోనే బతుకు సాగిస్తున్నారు. ఏ రిటైనంగ్‌ వాల్‌ కూలుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఇంతజరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం..
గతేడాది నాలుగు స్తంభాల సెంటర్‌ కొండ ప్రాంతంలో మంచంమీద నిద్రిస్తున్న వ్యక్తిపై కొండరాయి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొంతమంది కొండపై కొత్తగా ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతున్న సమయంలో రాళ్లు కిందపడి అనేక ప్రమాదాలు జరిగాయి. గతేడాది కురిసిన వర్షాలకు రిటైనింగ్‌ వాల్‌ కిందపడి ఇళ్లు తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమయ్యాయి. మెట్టు సరిగ్గాలేక వయస్సు మల్లిన వారు ఎక్కడ పడిపోతారేమోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇంతజరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, మైనింగ్‌ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

నివాసాలకు భద్రత కల్పించాలంటున్న స్థానికులు..
ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే మెట్లు కట్టిస్తాం, రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తామని హామీలిచ్చే రాజకీయ నాయకులు గెలిచిన తరువాత తమను మర్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొండపై నివాసాలకు భద్రత కల్పించి, నిర్మాణాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

 

10:50 - July 19, 2016

గుంటూరు : అక్కడి ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రే ఆ ఆలయాన్ని మరో తిరుమల చేస్తామన్నారు. సీఎం హామీ ఇచ్చి కూడా పది నెలలైంది. కానీ ఆలయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఏపీ రాజధాని ప్రాంతంలో తిరుమల క్షేత్రంగా పిలవబడుతున్న అనంతవరం దేవాలయంపై టెన్‌ టీవీ స్పెషల్ స్టోరీ

తిరుమల చేస్తామని సీఎం హామీ...
ఇది ఏపీ రాజధాని ప్రాంతం అమరావతికి సమీపంలోని అనంతవరం. ఇక్కడి నుంచే గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఇక్కడ స్వయంభువుగా వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయం ఉందని తెలుసుకున్న ఆయన... ఆలయాన్ని మరో తిరుమల చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు..అమరావతి నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లడానికి అనంతవరాన్ని టెంపుల్‌ సిటీగా మార్చే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కూడా అధికారులకు ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలు అమలుకు నోచుకున్న పాపాన పోలేదు.

అనంతవరాన్ని అధీనంలోకి తీసుకున్న టీటీడీ..
సరిగ్గా ఏపీ రాజధాని శంఖుస్థాపనకు ముందు అనంతవరాన్ని టీటీడీ తమ ఆధీనంలోకి తీసుకుంది. దేవాలయం టీటీడీ ఆధ్వర్యంలోకి వెళ్లి కూడా పది నెలలు కావస్తోంది. ఇప్పటివరకు అక్కడ కేవలం రంగులు, ముగ్గులు వేయడం తప్ప.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగలేదు.

ఆలయానికి సుదీర్ఘ చరిత్ర....
సమీప ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు సందర్శించే ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్రే ఉంది. ఐదు వేల ఏళ్ల క్రితం ఇక్కడ ఓ భక్తుడికి వెంకటేశ్వరస్వామి దర్శనమిచ్చి 12 అళ్వార్లతో కొండపై వెలిసారన్న కథ ప్రాచుర్యంలో ఉంది. దేవాలయానికి వచ్చే భక్తులు కూడా వెంకటేశ్వరస్వామిపై అపార నమ్మకం కలిగి ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

టీటీడీ ఆశించిన స్థాయిలో లేని అభివృద్ధి ...
ఇంతటి చరిత్ర గల దేవాలయాన్ని దత్తత తీసుకున్న టీటీడీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోవడం మాత్రం శోచనీయం. చిన్న పాటి వర్షానికే ఆలయంలో నీరు చేరి భక్తులకు అసౌకర్యం కలుగుతుందంటే ఇక్కడ ఏ పాటి అభివృద్ధి జరిగిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. చినుకుపండిందంటే కనీసం పూజారులు కూడా తలదాచుకోలేని దుస్థితి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఆలయ అధికారుల వాదన మాత్రం భిన్నంగా ఉంది.

ఆలయంలోకి చేరుతున్న వర్షం నీరు..
ఆలయంలోకి వర్షం నీరు వచ్చే విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. టెండర్లు పూర్తయితే తప్ప.. అక్కడ శ్లాబ్‌ పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. వర్షం వస్తే మాత్రం భక్తులంతా ఓ మూలన నిలబడి.. వర్షం తగ్గాకే దేవుడి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది.

టీటీడీ, ప్రభుత్వం చొరవ చూపాలంటున్న భక్తులు..
మరోవైపు ఆలయాన్ని చేరుకోవడానికి ఘాట్‌ రోడ్డు ఉన్నప్పటికీ.. చుట్టూ రక్షణ నిర్మాణం లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయంలో పార్కింగ్‌ సదుపాయం కూడా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అర్చకులు, సెక్యూరిటీ సిబ్బందికి కొంతకాలంగా జీతాలు కూడా చెల్లించడం లేదు. రాజధాని తిరుమలగా భావిస్తోన్న అనంతవరం ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో టీటీడీ, ప్రభుత్వం చొరవ చూపాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు. 

10:42 - July 19, 2016

తూ.గోదావరి : పేరుకే వందేళ్ల పట్టణం... కనీసం శుభ్రమైన తాగునీరు కరువైంది. కలుషిత నీరు తాగుతూ.. రోగాల బారిన పడుతున్నారు జనం. మున్సిపల్‌ అధికారుల నిరక్ష్యంతో పట్టణమంతా చెత్తకుప్పగా మారింది. మాటలకే పరిమితం అయిన నాయకులు.. జనం బాధలను గాలికొదిలేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఇపుడు రోగాలతో కునారిల్లుతోంది... తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం... విషజ్వరాలతో వణికి పోతోంది. పట్టణంలో పారిశుధ్యం లోపించడంతో దోమలబెడద ఎక్కువైంది. దీంతో పట్టణంలో ఏ వీధిలో చూసినా రోగపీడితులే కనిపిస్తున్నారు.

మురుగుకూపాలుగా వీధులు...-
వర్షాలు పడుతుండటంతో... తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంవల్ల వీధులన్నీ మురుగుకూపాలుగా మారిపోయాయి. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం పడకేసింది. విషజ్వరాలతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

ప్రభలుతున్న అంటు వ్యాధులు..
పట్టణంలో కనీసం పరిశుభ్రమైన మంచినీరు కూడా సరఫరా కావడంలేదు. మున్సిపాలిటీవాళ్లు సప్లైచేస్తున్న నీరు కలుషితమై పోతోంది. దీంతో ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ ఏర్పడి వందేళ్లయినా.. ఇంతవరకు స్వచ్ఛమైన తాగునీరుకు నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. బోరునీటినే తూగుతుండటంతో రోగాలు విజృభిస్తున్నాయంటున్నారు. నాయకులు మాటలకే పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాయకులు స్పందించాలంటున్న ప్రజలు..-
ఇప్పటికైనా నాయకులు స్పందించి.. తమకు మంచినీరు సరఫరా చేయాలని పెద్దాపురం ప్రజలు కోరుతున్నారు. 

లోక్ సభ, రాజ్యసభలో ఈ రోజు..

ఢిల్లీ : భారత వైద్య మండి చట్ట సవరణ బిల్లుపై,డెంటిస్ట్ అమెండ్ మెంట్ బిల్లు, నీట్ ఆర్డినెన్స్ ఈ రోజు లోక్ సభలోచర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో దేశంలో వరద పరిస్థితులపై చర్చను చేపట్టనున్నారు.

10:36 - July 19, 2016

రాజస్థాన్ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్ ను వరదలు ముంచెత్తాయి. భరత్పూర్, దోల్పూర్, కరాలీ తదితర ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా రహదార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే చెట్లతోపాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి... సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

40 శాతం పోలింగ్ నమోదు..

మహబూబ్ నగర్ : జిల్లాలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 10గంటల వరకు అందిన సమాచారం మేరకు 40 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

కాసేపట్లో దిగ్విజయ్ తో రఘువీరా, కేవీపీ,శీలం భేటీ

ఢిల్లీ : కాసేపట్లో దిగ్విజయ్ తో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, ఎంపి లు కేవీపీ, జేడీశీలం భేటీ కానున్నారు. కేవీపీ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లు, దాని పై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నట్లు సమాచారం.

10:27 - July 19, 2016

నల్లగొండ : కానిస్టేబుల్ పరుగుపందెంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండటం పరిపాటిగా మారిపోయింది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలనే లక్ష్యంతో వున్న యువత పరుగుపందెంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే నల్లగొండ జిల్లాలో జరిగింది. కానిస్టేబుల్ దేహధారుడ్య పరీక్షల్లో భాగంగా కానిస్టేబుల్ అభ్యర్థి రాజశేఖర్ మృతి చెందాడు. సోమవారం నాడు జరిగిన పరుగుపందెం పరీక్షలో అస్వస్థతకు గురైన రాజశేఖర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు. త్వరగానే కోలుకుని తల్లిదండ్రులతో కూడా మాట్లాడాడు. కానీ రాత్రి సమయంలో పరిస్థితి విషమించటంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. రాజశేఖర్ సొంత ఊరు పెన్ పహాడ్ మండలం ముకుందాపురంగా గుర్తించారు. కాగా రాజశేఖర్ కు ఆస్తమా వ్యాధి వుండటంతో పరుగు పందెంలో ఊరిపి ఆడక మృతి చెందినట్లుగా సమాచారం. రాజశేఖర్ కు ఆస్తమా వున్నట్లు తమకు తెలిస్తే తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముండేదని నిర్వాహకులు తెలిపారు. 

పరుగు పందెంలో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

హైదరాబాద్: నల్గొండలో ఈ రోజు ఉదయం నిర్వహించిన కానిస్టేబుల్‌ పరుగు పందెం పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. పరుగు పందెంలో కానిస్టేబుల్‌ అభ్యర్థి కిందపడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అభ్యర్థి మృతి చెందాడు. మృతుడు పెన్‌పహాడ్‌ మండలం ముకుందాపురం వాసి రాజశేఖర్‌గా గుర్తించారు.

రాజస్థాన్ లో వరదలు.. రంగంలోకి ఎన్డీఆర్ ఎఫ్, ఆర్మీ

హైదరాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్ ను వరదలు ముంచెత్తాయి. భరత్ పూర్, దోల్ పూర్, కరాలీ తదితర ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా రహదార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి... సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

10:10 - July 19, 2016

ఢిల్లీ : రెండో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక హోదా అంశంపై రూల్‌ నెం.193 నిబంధన కింద లోక్‌సభలో చర్చను చేపట్టాలని కోరుతూ టీడీపీ నోటీసు ఇచ్చింది. ఇటు కాసేపటి క్రితమే బీజేపీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది. మరో వైపు ఇవాళ లోక్‌సభ లో నీట్‌ ఆర్డినెన్స్‌పై ,రాజ్యసభలో దేశంలోని వరద పరిస్థితులపై చర్చసాగనుంది.

09:53 - July 19, 2016

సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విభజన హామీలను నెరవేర్ఛాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రమంద్రి ఉమాభారతిని సీఎం కేసీఆర్ కోరారు. న్యాయాధికారుల ధర్నాలపై దేశ ఉన్నత న్యాయస్థానం ఏపీ..తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో నగేష్ కుమార్ (ప్రముఖ విశ్లేషకులు) రాకేశ్ రెడ్డి (బీజేపీ నేత) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. అంశాలపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి..

09:43 - July 19, 2016

హైదరాబాద్‌ : గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిల్‌సుక్‌నగర్‌లోని సాయిబాబా టెంపుల్‌లో భక్తులు పొటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్ట వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయానికి వచ్చే అవకాశలు ఉన్నాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. 

09:38 - July 19, 2016

బీహార్ : ఔరంగాబాద్‌, గయా జిల్లాల సరిహద్దులోని దుమారినాలా అడవుల్లో సోమవారం రాత్రి మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 8 మంది సీఆర్పీఎఫ్‌ కోబ్రా కమెండోలు దుర్మరణం పాలయ్యారు. కాగా సీఆర్ఫీఎఫ్ కమెండోల మృతుల సంఖ్య 8 నుండి 10కి పెరిగింది. మావోయిస్టులకు భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 60మంది కమెండోలు పాల్గొన్నారు. ఈ ఘటనలో గాయపడిన కమెండోలంతా ఉన్నతస్థాయి శిక్షణ తీసుకున్నవారుకావటం గమనించదగిన విషయం. ఇప్పటివరకూ 10మంది మృతి చెందగా మరో 10మంది కమెండోలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కమెండోలను ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా కమెండోలు మావోల కోసం గాలిస్తున్న నేపథ్యంలో మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. దాదాపు 17 మందుపాతరలు ఒకేసారి పేల్చటంతో పరిస్థితి తీవ్రంగా వుంది. మందుపాతర పేల్చిన అనంతరం కమెండోలపై మావోలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. సీఆర్ఫీఎఫ్ ఈజీ సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించనునన్నట్టు సమాచారం. బీహార్ ప్రభుత్వం ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసింది. కాగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేసి సమగ్ర సమాచారం తెలుసుకోండి..

653 క్రూడ్ బాంబులు స్వాధీనం..

పశ్చిమబెంగాల్ : పోలీసులు భారీగా బాంబులు స్వాధీనం చేసుకున్నారు. బుర్ద్వాన్ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు 653 క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకుని 1,117మందిని అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ్‌పురా గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో భారీగా బాంబులు ఉన్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడిచేసి ఓ డ్రమ్ములో దాచి ఉంచిన 123 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 

08:39 - July 19, 2016

జర్మనీ : ఓ యువకుడు రైల్లో బీభత్సం సృష్టించాడు. ట్రైన్‌లో ప్రయాణికులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది ... ఆ యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడు 17 ఏళ్ల ఆఫ్ఘాన్ శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్‌ సంబంధాలు అనే కోణంలో భద్రత దళాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ దాడిలో గాయపడిన నలుగురు యువకుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిన్న అర్థరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

08:35 - July 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా 9 సంఘాలు పోటీ పడుతున్నాయి. తెల్లవారు జామున ఐదు గంటల నుంచే పోలింగ్ మొదలైంది..సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 52 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

52 వేల మంది కార్మికులకు ఓటు హక్కు..
ఒక్కో కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంది. ఒక ఓటు రాష్ట్రస్థాయి, మరొక ఓటు జిల్లా స్థాయికి వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో డిపోలో రెండేసి బ్యాలెట్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో పనిచేసే 21,081 మంది కార్మికులు ఆర్టీసీ యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. రంగారెడ్డి రీజియన్‌లో 2,640 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ పూర్తికాగానే సాయంత్రం 6.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి డిపోల వారీగా ఫలితాలను వెల్లడిస్తారు. ఈ విషయంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి...

కొనసాగుతున్న టీ.ఎస్ ఆర్టీసీలో ఎన్నికలు..

హైదరాబాద్ : ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుండి పోలింగ్ ప్రారంభమయ్యింది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికలకు 114 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. దాదాపు 52,848 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

08:06 - July 19, 2016

నల్గొండ : దోపిడి దొంగల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.  గత వారంరోజుల క్రితం ఖమ్మం జిల్లాలో రహదారిలో వాహనదారులను ఆపి కత్తులతో దాడి చేసి దోపిడీ చేసిన దొంగలు పలువురిని గాయపరిచారు. డీఎంసీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సంఘనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూపి దొంగలు పరారయ్యారు. దొంగతనాలకు పాల్పడటమే కాక అడ్డువచ్చినవారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆత్మకూరులో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై కత్తులతో దాడి చేశారు. రాములమ్మ మెడలో వున్న బంగారు గొలుసును లాక్కోవటానికి ప్రయత్నించారు. ప్రతిఘటించిన సోమయ్య, రాములమ్మ అనే దంపతులపై దొంగలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో స్థానికి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కానీ పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. కాగా దాడిలో తీవ్రంగా గాయపడి సోమయ్య పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

గొడ్డలితో యువకుడు బీభత్సం..

జర్మనీ : జర్మనీలో ఓ యువకుడు మంగళవారం బీభత్సం సృష్టించాడు. రైలులో ప్రయాణికులపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  దీంతో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. సమాచారం అంతుకున్న  జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడు 17 ఏళ్ల ఆఫ్ఘాన్ శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. 

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లేట్...

సికింద్రాబాద్‌: న్యూఢిల్లీకి వెళ్లవలసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఆలస్యంగా బయల్దేరుతుందని దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 6.25 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరవలసిన హైదరాబాద్‌-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 12723) ఉదయం 8.25 గంటలకు బయల్దేరుతుందని పేర్కొన్నారు.

హస్తినలో ఎమ్మార్పీఎస్‌ మహా ప్రదర్శన..

ఢిల్లీ: మాదిగ కళామండలి ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద భారీఎత్తున మంగళవారం మహా ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. మాదిగ న్యాయవాదుల విభాగంతో ప్రారంభించి 25 రోజులపాటు వివిధ విభాగాలకు చెందిన వారితో దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. 

07:43 - July 19, 2016

షెడ్యూల్ 9, 10 లోని ప్రభుత్వ, సహకార రంగ సంస్థల ఉద్యోగుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందా? రిటైర్మెంట్ వయస్సు, పిఆర్సీ అమలు విషయాల్లో అన్యాయం చేస్తోందా? ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఇలాంటి ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు.

70వేల మందికి పైగా ఉద్యోగులు...
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 9, 10 షెడ్యూళ్ల గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన వివిధ సంస్థలను వాటి స్వభావం, పని విధానం బట్టి 9, 10 షెడ్యూళ్లలో చేర్చారు. ప్రభుత్వరంగ సహకార సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు వీటి పరిధిలోనే వున్నాయి. వీటికి సంబంధించిన అప్పులు, ఆస్తులు, ఉద్యోగుల పంపకాల లాంటి ప్రక్రియలు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 70 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరంతా ఆందోళనబాట పట్టారు. విజయవాడలో జులై 3న ఆత్మగౌరవ సభతో పోరాటం ప్రారంభించిన ప్రభుత్వ సహకార సంస్థల ఉద్యోగులు జులై 17న మహాప్రదర్శన నిర్వహించారు.

రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటన....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే, షెడ్యూల్ 9, 10 సంస్థల్లోని ఉద్యోగులకు దీనిని వర్తింపచేయలేదు. తామూ ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నా తమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారన్నది వీరి ప్రశ్న. వీరికి పదవ పీఆర్సీ కూడా అమలు కావడం లేదు. అయితే 10వ షెడ్యూల్ లోని చాలా సంస్థలు 10వ పీఆర్సీ, 60 ఏళ్ల రిటైర్మెంట్ అమలు చేస్తున్నాయి. అయితే, షెడ్యూల్ 9, 10 లోని సంస్థలకు 60 ఏళ్ల రిటైర్మెంట్ వర్తించదంటూ ప్రభుత్వం 112 జీవో విడుదల చేసింది. ఆయా సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తయి, వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన తర్వాతనే 60 ఏళ్ల రిటైర్మెంట్ వర్తింప చేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. తమ పట్ల ఎందుకింత వివక్ష ప్రదర్శిస్తున్నారన్నది ఈ సంస్థ ఉద్యోగుల ఆగ్రహం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే షెడ్యూల్ 9, 10లోని ఉద్యోగులు సైతం ప్రభుత్వ పనులే చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలే అమలు చేస్తారు. అలాంటప్పుడు రాయితీలు, ప్రోత్సాహకాల విషయంలో తమకెందుకు అన్యాయం చేస్తున్నారన్నది వీరి ప్రశ్న.

07:36 - July 19, 2016

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ, సహకార రంగ సంస్థల ఉద్యోగులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. విజయవాడలో ఈ నెల 3న ఆత్మగౌరవ సభ, మొన్న 17వ తేదీన మహాప్రదర్శన నిర్వహించారు. నిరాహారదీక్షలకూ సిద్దమవుతున్నారు. ఇంతకీ ప్రభుత్వ సహకార సంస్థలు ఉద్యోగుల సమస్యలేమిటి? వీరి పోరాటాలకు కారణం ఏమిటి? షెడ్యూల్ 9, 10 సంస్థలంటే ఏమిటి? వీరికి టిడిపి ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలుతీరు ఎలా వుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ప్రభుత్వ, సహకార రంగ సంస్థల ఉద్యోగుల నేతలు జనార్ధన్ రెడ్డి 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశం మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

07:31 - July 19, 2016

విజయవాడ : నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్విస్ ఛాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ, వివాదాస్పదమైన స్విస్‌ చాలెంజ్‌ విధానంపైనే చంద్రబాబు సర్కార్‌ మొగ్గు చూపింది.

బిడ్డింగ్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి..
స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ ప్రకటన జారీ చేసింది. సెప్టెంబర్‌ 1 వరకు సీఆర్డీఏ బిడ్లను స్వీకరించనుంది. రాజధాని ప్రాంతమైన సుమారు 6.84 చదరపు కిలోమీటర్లలో అమరావతి నిర్మాణానికి బిడ్డింగ్‌ను వెల్లడించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ప్రతిపాదనపై అభ్యంతరాలకు ఆగష్టు 5 వరకు గడువు ..
స్విస్‌ చాలెంజ్‌లో భాగంగా సింగపూర్‌ కన్సార్టియం దాఖలు చేసిన ప్రతిపాదనను ముందుగా బహిరంగపరిచింది. సింగపూర్‌ కన్సార్టియం అందజేసిన ప్రతిపాదనపై అభ్యంతరాలకు ఆగష్టు 5 వరకు గడువు ఇచ్చారు. అదే విధంగా ఆగష్టు 8న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఆగష్టు 18న అభ్యంతరాలపై అధారిటీ స్పందించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 6న రాజధాని నిర్మాణ అభివృద్ధిదారును ప్రకటించనుండగా, అదే నెల 19న అభివృద్ధిదారును ఖరారుచేస్తూ ఒప్పంద పత్రం ఇచ్చే అవకాశం ఉంది. 2017 ఫిబ్రవరి 28 వరకు ఈ బిడ్‌కు కాల పరిమితి విధించారు.

ఛాలెంజ్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా..
స్విస్ ఛాలెంజ్ విధానంలో భాగంగా సింగపూర్‌ సంస్థల కన్సార్టియం దాఖలుచేసిన ప్రతిపాదనలకు ఇతర సంస్థల నుంచి ఛాలెంజ్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని సీఆర్డీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. పల్లోంజి, ఎల్‌ అండ్‌ టి, జెపి కన్‌స్ట్రక్షన్స్‌, గంగవరం, మచిలీపట్నం వంటి కీలక పోర్టుల నిర్మాణంలో పాత్రధారులుగా ఉన్న ఇతర సంస్థలు కూడా ఛాలెంజ్‌ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

విమర్శనాస్త్రాలకు సిద్ధంగా వున్న ప్రతిపక్షపార్టీలు ..
సింగపూర్‌ కన్నా తక్కువ మొత్తానికి నిర్మాణం పూర్తిచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే, అదే మొత్తానికి సింగపూర్‌ అంగీకరిస్తే ఆ సంస్థకే టెండర్‌ ఖరారవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు విమర్శల పాలైన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ప్రభుత్వం ఎంచుకోవడం పట్ల ప్రతిపక్షపార్టీలు విమర్శనాస్త్రాలను సిద్ధం చేసేకుంటున్నాయి.

పారదర్శకత లోపించే అవకాశం ఎక్కువగా ఉందనే హెచ్చరికలు..
కేల్కర్‌ కమిటీ హెచ్చరించిన ఈ స్విస్ చాలెంజ్‌ విధానం ఎంపిక వల్ల పారదర్శకత లోపించే అవకాశం ఎక్కువగా ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 

07:04 - July 19, 2016

కర్నూలు : కృష్ణా పుష్కరాల పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే మరోసాని పనులను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.

గడువులోగా పనులు పూర్తికాకపోతే చర్యలు తప్పవన్న బాబు ..
కృష్ణా పుష్కరాల పనులు నత్తనడక నడవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కర్నూలులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. గడువు లోగా పనులు పూర్తి కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ని రివ్యూలు నిర్వహించినా పనుల్లో పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత పాటించకపోతే కాంట్రాక్టర్ల కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.

సంచార అంబులెన్స్‌లు, మెడిసన్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి..
గోదావరి పుష్కరాల్లో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ మంచిగా పని చేసిందని.. కృష్ణాపుష్కరాల్లో కూడా మెరుగైన సేవలందించాలని బాబు సూచించారు. మొబైల్‌ టీమ్‌లు, టెంపరరీ హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయాలని.. సంచార అంబులెన్స్‌లు, మెడిసన్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక భద్రత కోసం విజయవాడ తరహాలో సీసీ కెమెరాలు, డ్రోన్‌లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

నదీమ తల్లికి ఇచ్చే హారతికి కృష్ణా పవిత్ర హారతి పేరు..
కృష్ణాపుష్కరాల సందర్భంగా నదీమ తల్లికి ఇచ్చే హారతికి కృష్ణా పవిత్ర హారతి అని పేరు పెట్టాలని చంద్రబాబు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు భోజన వసతి కల్పించేందుకు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు సూచించారు.

అధికారులను హెచ్చరించిన చంద్రబాబు..
శ్రీశైలంలో భ్రమరాంబమల్లికార్జునస్వామివారిని చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం పుష్కర పనులను పరిశీలించారు. సకాలంలో పుష్కర పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పనులను పరిశీలించేందుకు మళ్లీ వస్తానని హెచ్చరించారు. మొత్తానికి చంద్రబాబు పుష్కరాల పనులను స్వయంగా పరిశీలించడంతో అధికారుంలో గుబులు మొదలైంది. మరి చంద్రబాబు సూచనలను పాటించి.. ఏ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తారో చూడాలి.

06:59 - July 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా 9 సంఘాలు పోటీ పడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 52 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

06:57 - July 19, 2016

బీహార్‌ : ఔరంగాబాద్‌, గయా జిల్లాల సరిహద్దులోని దుమారినాలా అడవుల్లో సోమవారం రాత్రి మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 8 మంది సీఆర్పీఎఫ్‌ కోబ్రా కమెండోలు దుర్మరణం పాలయ్యారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. రెండు రోజులుగా అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ కూంబింగ్‌ జరిపి తిరిగివస్తుండగా మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీ మందుపాతర పేల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

దంపతులపై దోపిడి దొంగల దాడి..

నల్లగొండ : ఆత్మకూరు మండలం వినాయక నగర్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమయ్య, రాములమ్మ అనే దంపతులపై కత్తులతో దాడి చేసి నగలు, నగదు అపహరించుకుపోయారు. బాధితుల పరిస్థితి విషమంగా వుండటంతో కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతి...

యెమెన్‌ : యెమెన్ లోని రెండు ఆర్మీ చెక్‌పోస్టులపై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు సోమవారం దాడిచేయడంతో 11 మంది మృతి చెందారు. ముకల్లా నగరంలోని ఆర్మీ చెక్‌పోస్టుపై బాంబులు నిండిన లారీతో తొలి ఆత్మాహుతి సభ్యుడు దాడిచేశాడు. ముకల్లాకు పశ్చిమాన 15 కిలోమీటర్లదూరంలో ఆర్మీ చెక్‌పోస్టుపై పేలుడు పదార్థాలు నిండిన కారులో వచ్చిన రెండో బాంబర్ దాడిచేశారు. ఈ రెండు దాడులు ఏకకాలంలో జరిగాయి. ఈ దాడుల్లో 11 మంది చనిపోగా, మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడులను తామే చేశామని అల్‌కాయిదా ప్రకటించింది.

నేడు టీ.ఎస్ ఆర్టీసీలో ఎన్నికలు..

హైదరాబాద్ : ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికలకు 114 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. దాదాపు 52,848 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

భద్రతా సిబ్బందిని టార్గెట్ చేసిన దుండగులు..

కజకిస్థాన్ : భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు పోలీసుల అధికారులు, ఒక స్థానికుడు మృతి చెందారు. సోమరావం జరిగిన ఈ ఘటనలో ఒక దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో దుండగుడి కోసం గాలిస్తున్నారు. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ విధిస్తున్నట్లు ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రకటించింది.

8 మంది సీఆర్పీఎఫ్ కమెండోలు మృతి..

బీహార్ : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పేల్చిన మావోయిస్టులు. ఈ కాల్పుల్లో 8మంది సీఆర్పీఎఫ్ కోబ్రా కమెండోలు మృతి చెందాగా..నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

Don't Miss