Activities calendar

20 July 2016

పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని పోయింది - సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు స్పందనపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సూచనలను స్వాగతిస్తున్నట్లు, పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని పోయిందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తామని, ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువలేదని విమర్శించారు. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

స్టార్ హోటళ్లు నిర్మించేందుకు ఏపీ మంత్రుల నిర్ణయం..

విజయవాడ : టూరిజం శాఖ అధికారులతో మంత్రులు యనమల, ప్రత్తిపాటి, నారాయణలు జరిపిన సమీక్ష ముగిసింది. కొత్తగా ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులు చేపట్టనుంది. స్టార్ హోటళ్లు నిర్మించేందుకు మంత్రులు నిర్ణయించారు. స్టార్ హోటళ్ల పన్ను 14.5 నుండి 5 శాతం తగ్గించామని, ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని అమలు చేస్తోందని మంత్రి యనమల పేర్కొన్నారు.

అతవుల్లా రెహ్మాన్‌ను ఢిల్లీకి తరలించిన ఎన్‌ఐఏ...

హైదరాబాద్ : ఐసిస్‌ కుట్ర కేసు నిందితుడు అతవుల్లా రెహ్మాన్‌ను ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీ తీసుకెళ్లారు. అతవుల్లా రెహ్మాన్‌ సోషల్‌ మీడియా ద్వారా పలువురిని ఐసిస్‌ వైపు ఆకర్షించినట్లు ఎన్‌ఐఏ గుర్తించిన సంగతి తెలిసిందే.

 

21:34 - July 20, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభలో కునుకు తీశారు. గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి చర్చ జరుగుతుండగా రాహుల్‌ నిద్రలో జోగారు. ఆ సమయంలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కాంగ్రెస్‌ హయాంలో దళితులపై జరిగిన దాడులను సభలో ప్రస్తావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సభ్యులో ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటున్న సమయంలో రాహుల్‌ నిద్రపోయారు. రాహుల్‌ నిద్రపోలేదని సీరియస్‌గా ఫోన్‌ చూస్తున్నారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

21:33 - July 20, 2016

ఢిల్లీ : గుజరాత్‌లో దళితులపై దాడి అంశంపై పార్లమెంట్‌ అట్టుడికింది. ఈ అంశంపై రాజ్యసభ స్తంభించింది. దళితుల దాడి వెనక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై విచారణ చేపడతామని కేంద్రం లోక్‌సభకు హామీ ఇచ్చింది. గుజరాత్‌లోని ఊనాలో దళితులపై జరిగిన దాడి అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో విపక్షాలు హంగామా చేయడంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. జులై 11న గిర్-సోమనాథ్ జిల్లాలోని ఊనాలో నలుగురు దళిత యువకులపై దాడి జరిగింది. ఆవు చర్మం ఒలిచి స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలతో వారిపై క్రూరంగా దాడి చేశారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం నిందితులపై కేసు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. దర్యాప్తును సిఐడికి అప్పగించి ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులకు త్వరిత గతిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

కాంగ్రెస్ సభ్యుల ఆందోళన..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన అనేక దాడులను హోంమంత్రి గుర్తు చేశారు. తమ పాలనలో అలాంటిదేమి లేదని పేర్కొన్నారు. హోంమంత్రి వివరణపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పార్లమెంటరీ స్థాయి కమిటీ నియమించాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దళిత యువకులపై జరిగిన దాడిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ హస్తం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. గుజరాత్‌ దళిత యువకులపై జరిగిన దాడిపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. సభలో కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పలుమార్లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచి సభలో వాయిదాల పర్వం కొనసాగింది. సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది.

21:28 - July 20, 2016

విజయవాడ : రెండేళ్ల పాలనా కాలంలో టీడీపీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలదేనని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బాబు టీడీపీ సమీక్షా కమిటీతో భేటీ అయిన ఆయన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలదేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని తెలిపారు. ఇక నుంచి ప్రతిఒక్కరు ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. నేతలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు.

500 మందికి శిక్షణ..
ఇటీవల నిర్వహించిన సర్వేలో మంచి ర్యాంకులు సాధించిన తొలి 25 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు... గ్రామస్థాయి నాయకులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బాబు ఆదేశించారు. పార్టీకి చెందిన సుమారు 500 మందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన వారే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. దీని కోసం అవసరమైతే టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. క్రీయాశీలకంగా పనిచేసిన ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, మిగతావారు కూడా ఆ ఎమ్మెల్యేలను అనుసరించాలని చంద్రబాబు సూచించారు.
ఒక నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తిగా ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 శాతం మాత్రమే సంతృప్తిగా ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం సమీక్షా కమిటీని ఆదేశించారు. ఇక నుంచి పార్టీ.. ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లి మంచి పేరు తెచ్చుకునేలా ప్రయత్నించాలని బాబు పార్టీ నేతలకు ఆదేశించారు.

21:25 - July 20, 2016

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మున్సిపల్‌ పరిపాలనా శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పథకాలు, ప్రాజెక్ట్‌లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బ్రిక్స్‌ బ్యాంకు నుంచి 75 వేల కోట్ల రుణం మంజూరు కోసం పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలన్న కేటీఆర్.. విజ్ఞప్తిపై వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారు.

మూసీనది ప్రక్షాళనకు రూ. 900 కోట్ల నిధులు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్కైవేస్‌, ఫ్లై ఓవర్లకు సహాయం అందించాలని విన్నవించారు. ఫార్మా సిటీ భూసేకరణకు 785 కోట్లు హడ్కో రుణం కోసం విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రక్షాళనకు 900 కోట్ల మంజూరు చేయాలని కూడా కోరారు. బ్రిక్స్‌ బ్యాంకు నుంచి 75 వేల కోట్ల రుణం కోసం పంపించిన ప్రతిపాదలను పరిశీలించాలన్న కేటీఆర్‌ విన్నపానికి వెంకయ్యనాయుడు సానుకూలగా స్పందించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో భేటీ సందర్భాంగా రాష్ట్రంలోని చేనేత, జౌళి రంగ సమస్యలపై చర్చించారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల, నల్గొండ జిల్లా గుండపోచంపల్లి జౌళి పార్క్‌లపై చర్చించారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్‌కు నిధుల మంజూరు అంశాన్ని చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యేక భేటీల ఏర్పాటుకు ఇద్దరు కేంద్ర మంత్రులు అంగీకరించారు.

21:22 - July 20, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చకు రానున్న ప్రైవేటు బిల్లు టిడిపికి ఇరకాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు ఈ నెల 22న చర్చకు రానుంది. దీంతో ఈ బిల్లు విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై తెలుగుదేశం నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ప్రత్యేక హోదా బిల్లుపై జరిగే చర్చకు మద్దతు ఇచ్చి, ఓటింగ్‌కు వచ్చినప్పుడు... అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ రామంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చకు రానుంది. ఇప్పటీకే ఈ బిల్లుకు ప్రతిపక్ష వైసీపీ మద్దతు ప్రకటించింది. చర్చకు సహకరిస్తామని చెబుతున్న టీడీపీ... ఓటింగ్‌కు వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఎటూ తెల్చుకోలేకపోతోంది. చర్చ సమయంలో కూడా అప్పటి పరిస్థితులను బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలుగుదేశం భావిస్తోంది.

బిల్లుపై చర్చ..
ఈనెల 15న జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో కూడా కేవీపీ బిల్లుపై ఎలా వ్యవహరించాలన్న అంశం గురించి సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానికి హాజరైన ఎంపీల్లో ఎక్కువ మంది పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అన్న వాదానాన్ని లేవనెత్తారు. చర్చలో పాల్గొనడంతోపాటు, బిల్లు ఓటింగ్‌కు వస్తే... అనుకూలంగా ఓటేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై జోక్యం చేసుకున్న చంద్రబాబు ఆ రోజు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు సమాచారం. దీనిని బట్టి పరిశీలిస్తే కేవీపీ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

తర్జనభర్జనలు..
అయితే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ... కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తే.. కమలనాథులకు కోపం వస్తే ఎలా వ్యవహరించాలన్న అంశంపై కూడా తెలుగుదేశం నేతల తర్జన భర్జన పడుతున్నారు. బీజేపీకి కోపం వస్తుందని ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీకి నచ్చజెప్పి... కేవీపీ బిల్లుకు సహకరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై టీడీపీ నేతల పరిస్థితి పామునోట్లో కప్ప చందంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

21:18 - July 20, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో హీట్‌ పెరుగుతోంది. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. బిల్లు టీడీపీ- బీజేపీ మధ్య చిచ్చు పెడుతుందా.. లేక స్పెషల్‌ స్టేటస్‌ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా అనేది హాట్‌ టాఫిక్‌గా మారింది. ఈ నెల 22వ తేదీ.. మధ్యాహ్నం రెండున్నరకు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఓటింగ్‌కు రాబోతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై సహకరించాలంటూ కాంగ్రెస్‌ అన్నిపార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్సీపీ, జేడీయూ, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్‌లను సంప్రదించిన కాంగ్రెస్‌ బీజేపీని కూడా మద్దతివ్వాలని కోరింది. ఈ మేరకు కేవీపీ రామచంద్రరావు బీజేపీ రాజ్యసభా పక్ష నేత కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ఏపీ స్పెషల్‌ స్టేటస్‌కు సహకరించాలని అందులో కోరారు.

ఏచూరిని కలిసిన నేతలు..
ఢిల్లీలో సీపీఎం, సీపీఐ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు కాంగ్రెస్‌ నేతలు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో కేవీపీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యి.. ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు సీపీఎం సానుకూలంగా స్పందించింది. అటు సీపీఐ నేత డి.రాజాతోనూ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యి బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఐ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని తెలిపింది.

కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు..
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుకు మద్దతివ్వాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. మరోవైపు కేవీపీ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుకి మద్దతిస్తానని చెప్పలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైకోర్టు విభజనపై ఎవరైనా బిల్లు పెడితే మద్దతిస్తానని మాత్రమే చెప్పానని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుతో ఒరిగేదేమీ లేదన్న కేటీఆర్‌.. కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో సంప్రదించాలన్నారు.

కాంగ్రెస్ విప్..
మరోవైపు 22వ తేదీన రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపీలంతా హాజరుకావాలని మూడు లైన్ల విప్‌ జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలపాలని కాంగ్రెస్ ఎంపీలకు సూచించింది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 60 సభ్యులుగా ఉంది. ఇతర పార్టీ నాయకుల మద్దతు కూడగడుతున్న కాంగ్రెస్‌.. సభకు హాజరైన వారిలో సగానికి పైగా నేతల మద్దతు పొందితే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.

20:37 - July 20, 2016

ఈ శుక్రవారం ఏం జరగబోతోంది? ప్రైవేట్ బిల్లు గట్టెక్కుతుందా? రాజకీయ పార్టీలు ఏ పక్షాన ఉండబోతున్నాయి. హామీలతో కాలం గడుపుతూ విభజన తర్వాత మొండి చేయి చూపిన బిజెపీకి ఈ బిల్లు పరీక్ష కాబోతోంది. బీజెపీతో దోస్తీ చేస్తున్నందుకు టీడీపీకి కూడా ఇది ఇబ్బందికరంగా మారుతోందా ? ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా ఏపీ అభివృద్ధి కోసం, పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన సందర్భంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే అంశంపై ప్రత్యేక కథనం..అధికారంలోకి రాకముందు చాలా చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఎన్నో అడ్డంకులను సాకుగా చూపెట్టారు.. ఇప్పుడు అంతకంటే ఎక్కువే చేస్తున్నాం కదా.. అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. కానీ, విభజనతో అన్నిరకాలుగా సమస్యల్లో పడిన ఏపీని ఒడ్డెంక్కించటానికి ఓ అవకాశం బిల్లు రూపంలో కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు మాత్రం ఈ బిల్లు ఫీవర్ తెప్పిస్తోంది.
విభజన సమయంలో విపక్షంలో ఉన్న బిజెపీ చాలా కబుర్లు చెప్పింది. రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు అయిదడిగితే పది కావాలన్నట్టు వాదించారు. లేదంటే ఆంధ్రకు భవిష్యత్తు శూన్యమని తేల్చేశారు. పైగా అవన్నీ సాధించిన ఘనత తమదే అని క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. అదే సమయంలో కమలంతో పొత్తులో ఉన్నచంద్రబాబు కూడా ఇరకాటంలో పడ్డ పరిస్థితి కనిపిస్తోంది.

ఏ పార్టీ ఎటుంటుంది? ఎవరి బలమెంత?
ఏ పార్టీ ఎటుంది? ఎవరి బలమెంత? ప్రత్యేక హోదా పై బిల్లు ఏం కాబోతోంది? రాజ్యసభలో రానున్న కెవీపీ ప్రైవేట్ బిల్ ఆసక్తిగా మారిన నేపధ్యంలో రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలు ఆసక్తిగా మారాయి. ఏపీ స్పెషల్ స్టేటస్ అంశం ఓ కొలిక్కి వస్తుందా? లేక రాజకీయ ఎత్తుగడలకు బలవుతుందా? పార్టీలు స్పందించాల్సిన తరుణంలో ఎవరి ప్రయోజనాలకోసం వారు స్ట్రాటెజిక్ గా వ్యవహరిస్తున్న తరుణం. ఈ సందర్భంలో హోదాకంటే ఎక్కువే చేస్తున్నామంటూ కమలనాధులు చెప్పుకుంటూ ఆఖరికి బిల్లును పక్కదారి పట్టిస్తారా? ఏం జరగనుంది? ఇప్పుడు ఏపీలో సర్వత్రా ఇదే ఉత్కంఠ. విభజనతో కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం వస్తుందా? లేక రాజకీయ పార్టీల రంగు బయటపడుతుందా? రెండేళ్లుగా నానా సమస్యల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు బిల్లు గట్టెక్కి, ప్రత్యేక హోదా వచ్చి మంచి రోజులు వస్తాయా? మరో రెండు రోజుల్లో తేలే విషయం ఇది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

20:32 - July 20, 2016

పెద్దోన్ని గొట్టాలే.. పేదోనికి వెట్టాలే.. ఇది పాత సూత్రం.. ఇప్పుడు కాలం మారింది.. పార్టీలు మారినయ్ ప్రభుత్వలు మారినయ్ గావట్టి.. కథ ఉల్టా అయ్యింది.. పేదోళ్ల పొట్టగొట్టాలే పెద్దోళ్లకు దోశి పెట్టాలే ఇది అమలైతున్నది.. మల్లన్న సాగర్ కాడికెళ్లి కల్వకుర్తి ఎత్తిపోతల మీదికెళ్లి.. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ దాక ఏడ జూశ్నా ఇదే తతంగం అయితున్నది.. టెయిల్ పాండ్ బండ తండాల మీద వడి ఎట్ల గోసవెడ్తున్నదో 'మల్లన్న ముచ్చట్లు' గదే వీడియోలో చూడండి.

20:30 - July 20, 2016

ప్రాజెక్టుల మీద ప్రజెంటేషన్ ఎట్ల ఇయ్యాలే అనేది..? మాకు గూడ ఎర్కే అంటున్నరు తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్లు.. మల్లన్న సాగర్ కాడికెళ్లి కల్వకుర్తి ఎత్తిపోతల మీదికెళ్లి.. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ దాక ఏడ జూశ్నా ఇదే తతంగం అయితున్నది.. తెలంగాణ మజ్దూర్ యూనియన్కే పట్టంగట్టిండ్రు బస్సులళ్ల పనిజేశెటోళ్లు.. గద్వాల ప్రత్యేక జిల్లా గావాలె.. అప్పుడు నిమ్మలంగావాలె అన్నట్టు ఎంత జంగు తయ్యారయైంది...ఇంటి పట్టుకు పిలగాండ్లను జూస్కుంట ఉండే అమ్మలు అక్కలు జర్ర జాగ్రత్తగా ఉండండి...రష్యాదేశం పోరగాళ్లు ఈతలు గొట్టడానికి వినూత్నంగా ఆలోచించిండ్రు...ఓయమ్మో ఇదెక్కడి కథనే.. తుమ్మినా.. కబాలే.. దగ్గినా కబాలే.. గిసొంటి వార్తలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు'లో మల్లన్న ముచ్చట్లు చెప్పిండు. మరి ఆ ముచ్చట్లు ఎట్లున్నయో జూడాలంటే వీడియో క్లిక్ చేయుండ్రి.

మిషన్ భగీరథ పనులపై వైస్ ఛైర్మన్ అసంతృప్తి..

మెదక్ : గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికి నల్లా నీరందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులను మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సంప్ హౌజ్, పంపు హౌజ్ నిర్మాణాలను పరిశీలించి పనుల తీరుపై ప్రశాంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

చేనేత, జౌళి రంగ సమస్యలపై చర్చించా - కేటీఆర్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో మంత్రి కేటీఆర్ జరిపిన భేటీ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో చేనేత, జౌళి రంగ సమస్యలపై చర్చించడం జరిగిందని, వరంగల్ లో టెక్స్ టైల్స్ పార్కు ప్రారంభోత్సవానికి మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించడం జరిగిందన్నారు. సిరిసిల్ల, గద్వాల, చేనేత సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి తెలంగాణలో పర్యటిస్తానని మంత్రి స్మృతి ఇరానీ హామీనిచ్చారని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో మాట్లాడలేక కాంగ్రెస్ తోక ముడిచిందని, మీడియా కోసమే కాంగ్రెస్ నేతలు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.

ఫేస్ బుక్ లో మరో వీడియో హల్ చల్..

హైదరాబాద్ : ఫేస్ బుక్ లో మరో వీడియో హల్ చల్ చేస్తోంది. తుపాకితో కుక్కను ఓ యువకుడు కాల్చాడు. నాంపల్లి పీఎస్ లో కేసు నమోదైంది.

ఏచూరిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ : కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతివ్వాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరిని ఏపీ కాంగ్రెస్ కోరింది. పార్లమెంట్ లో వామపక్షాల తరపున పూర్తి మద్దతిస్తామని ఏచూరి వెల్లడించారు.

నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం ఆయన ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

వెబ్ ల్యాండ్ శుద్ధిపై మంత్రి కేఈ కృష్ణమూర్తి సమీక్ష..

విజయవాడ : వెబ్ ల్యాండ్ శుద్ధిపై మంత్రి కేఈ కృష్ణమూర్తి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెబ్ ల్యాండ్ లో లోపాలను సరిచేయడానికి జమాబంది తరహా విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం పర్యవేక్షణకు ఒక్కో రెవెన్యూ డివిజన్ కు ఒక్కో డిప్యూటి కలెక్టర్ ను నియమించాలని కేఈ సూచించారు. జమా బంది రికార్డులను సరిచేయాలని ఆదేశించారు. సర్వే వేగవంతానికి 28న విజయవాడలో అధికారులతో భేటీ ఉండనుంది.

ఎంసెట్ 2 పేపర్ లీక్ వార్తలను ఖండించిన మంత్రి కడియం..

వరంగల్ : ఎంసెట్-2 పేపర్ లీక్ కాలేదని, లీకేజీ వ్యవహారంపై వస్తున్న వార్తలను ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

హెల్తీ స్పాండ్ రిసార్ట్స్ భూమి స్వాధీనం - యనమల..

విశాఖపట్టణం : హెల్తీ స్పాండ్‌ రిసార్ట్స్‌కు సార్ట్స్‌కు కేటాయించిన 32 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి యనమల తెలిపారు. ఆ భూమిలో స్టార్‌ హోటళ్లు, భారీ కన్వెన్షన్ సెంటర్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలి - బాబు..

విజయవాడ : ఎర్రచందనం స్మగ్లర్ల పనిపట్టాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కొత్త సవరణ చట్టం కింద కేసులు పెట్టాలని పేర్కొన్నారు.

 

19:40 - July 20, 2016

ఢిల్లీ : బిజెపి నేతలకు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా బిఎస్పీ అధినేత్రి మాయావతిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బిజెపి నేత వేశ్యగా పేర్కొనడంపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. మాయావతిపై బిజెపి నేత చేసిన వ్యాఖ్యలను పార్టీల కతీతంగా సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండించారు. దీనిపై స్పందించిన బిజెపి ఉపాధ్యక్ష పదవి నుంచి దయాశంకర్‌ను తొలగించింది. ఓ వేశ్యలా ఎవరు ఎక్కువ బేరమాడితే వారికి మాయావతి టికెట్లు కేటాయిస్తున్నారని ఉత్తరప్రదేశ్‌ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. గుజరాత్‌లో దళితులపై దాడిపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుపడుతున్న నేపథ్యంలో బిజెపి నేత దయాశంకర్‌ చేసిన వ్యాఖ్యలతో సభ మరింత వేడెక్కింది. యుపికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దళిత మహిళా నేత మాయావతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు.

మండిపడిన మాయావతి..
యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు త‌న‌ను వేశ్య అని ఉచ్ఛరించ‌డంపై బీఎస్పీ అధినేత మాయావ‌తి తీవ్రంగా మండిప‌డ్డారు. త‌న‌నంటే ఆయ‌న త‌న కూతురు, సోద‌రిని అన్నట్లేనని ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌లో అంద‌రూ త‌న‌ను సోద‌రిగా భావిస్తార‌ని, ఈ విష‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ మాయావ‌తి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ద‌ళితుల ప‌ట్ల బీజేపీ దారుణంగా వ్యవ‌హరిస్తోంద‌ని, ఈ విష‌యంలో జాతి బీజేపీని క్షమించ‌ద‌ని, ద‌యాశంక‌ర్‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

విచారం వ్యక్తం చేసిన జైట్లీ..
మాయావతిపై దయాశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. మాయావ‌తిపై ద‌యాశంక‌ర్ చేసిన వ్యాఖ్యల‌ను స‌భ ముక్తకంఠంతో ఖండిస్తోందని రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ పీజే కురియ‌న్ అన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినా సభ్యులు శాంతించకపోవడంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దళితులపై జరుగుతున్న దాడులపై సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో కురియ‌న్ స‌భ‌ను గురువారానికి వాయిదా వేశారు.

19:36 - July 20, 2016

నిజామాబాద్ : ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని కార్పొరేట్‌ కాలేజీలు లీకేజికి పాల్పడ్డాయని వెంకట్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ వ్యవహారం నడిచిందని ఈ స్కామ్‌ వెనుక వెంకట్‌ అనే వ్యక్తి హస్తం ఉందన్నారు. ప్రభుత్వం కీ విడుదల చేసిన సమయంలో మార్కుల పర్సంజేటీ విషయం చూసిన తరువాత అగ్రిమెంట్ కుదరిందని పేర్కొన్నారు. రూ. 45 లక్షల రూపాయల బ్లాంక్ చెక్ ఇవ్వాలని, మూడు దఫాలుగా డబ్బులు అగ్రిమెంట్ చేసుకున్నారని పేర్కొన్నారు. అతని వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

19:31 - July 20, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా అంశం మళ్లీ హాట్ టాఫిక్ గా మారింది.. ఎల్లుండి రాజ్యసభ ముందుకు కేవీపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రాబోతోంది. దీనికి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ ప్రవేశపెడుతున్న ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ప్రశ్నలివి... కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు శుక్రవారం సభముందుకు రాబోతోంది.. ఈ బిల్లుకు వామపక్షాలతోపాటు జెడియు, టిఎంసి, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సిపిలు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయని ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించింది.. శుక్రవారం లోపు మిగతా పార్టీల మద్దతు కూడగడతామని స్పష్టం చేస్తోంది.. బిల్లును పాస్‌ చేయించుకునేందుకు తమ ఎంపీలకు విప్‌కూడా జారీచేసేందుకు సిద్ధమైంది.

బిల్లుకు మద్దతు ఇవ్వాలని భావిస్తున్న టీడీపీ?
బిల్లుకు మద్దతుకూడగట్టేందుకు పలు పార్టీల పెద్దల్ని హస్తం నేతలు కలిశారు.. టీడీపీ మద్దతుకోసం కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ చర్చలు కూడా జరిపారు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టిన టీడీపీ ఈ బిల్లుపై ఏం చేస్తుందనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. బిల్లుకు మద్దతు ఇచ్చి హోదా అవసరాన్ని మరోసారి చెప్పాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాహాటంగా ఈ విషయాన్ని ప్రకటించడంలేదు. ఈ బిల్లు సభలో విజయం సాధించే పరిస్థితులు ఉంటేనే మద్దతు ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది. సుజనా చౌదరి ఇదే విషయాన్ని జయరాం రమేష్‌కు స్పష్టం చేశారని సమాచారం. బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే కచ్చితంగా ఇబ్బందుల్లో పడతామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ భావిస్తోంది. ఇదే అంశాన్ని బాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని నేతలు చూస్తున్నారు. అలాగే బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని విభజించే క్రమంలో అనుసరించిన వైఖరిపై.. కాంగ్రెస్‌ను టార్గెట్‌చేయాలని భావిస్తున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టిఉంటే ఈ సమస్యే వచ్చేదా అని కాంగ్రెస్‌ నేతల్ని ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేక హోదా కుదరదంటున్న బీజేపీ..
టీడీపీ విమర్శలకు హస్తంనేతలుకూడా ఇదే స్థాయిలో సమాధానమిస్తున్నారు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు చట్టంలో హోదా అంశాన్ని పెట్టలేదని స్పష్టం చేస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయం ద్వారా అంతా పూర్తయిందని చెబుతున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకూడా బిల్లుపై క్లారిటీ ఇవ్వడంలేదు. అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. టీడీపీ, వైసీపీలతీరు ఇలా ఉంటే ఈ బిల్లుపై బీజేపీ ఏం చేస్తుందనేది కీలకంగా మారింది. ప్రత్యేక హోదా ఇవ్వబోమని మొదటినుంచీ బీజేపీ స్పష్టం చేస్తోంది. రాజ్యసభలోకూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పింది. విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేదని సాకుగా చూపుతోంది. ఇప్పుడు మళ్లీ కేవీపీ ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టినా లోక్‌సభలో ఓడిస్తామని కమలదళం చెబుతోంది. ఈ బిల్లువల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని బిజెపి సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ బిల్లుపై టీఆర్‌ఎస్‌ ఏం చేస్తుందనేదికూడా ఆసక్తికరంగా మారింది.. ఈ బిల్లు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రవేశపెట్టినట్లుగా ఉందని మంత్రి కేటీఆర్ ఢిల్లీలో విమర్శించారు. అయినా తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇదే జరిగితే రెండు రాష్ట్రాల సంబంధాలపై ఇది సానుకూల సంకేతాలను పంపే అవకాశముంది. ఇదే సమయంలో తెలంగాణకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న టీఆర్ఎస్ డిమాండ్‌కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్‌ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టిడిపి బిజెపి మధ్య కొత్త వివాదం..
బిల్లుకు మద్దతు విషయం ఇలా ఉంటే... ప్రత్యేక హోదా అంశం టిడీపీ - బిజెపిల మధ్య కొత్త వివాదానికి కారణమవుతోంది. అసలు ఓటింగు సాధ్యం కాని ప్రత్యేక హోదా బిల్లును అడ్డుపెట్టుకుని టిడీపీ రాజకీయం చేస్తోందని కమలనాథులు మండిపడుతున్నారు.. కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులుండగా. కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ఎలా సమర్థిస్తారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. ఓటింగు జరిగితే తమ మద్దతు ఉంటుందని టీడీపీ ఎంపిలు జెసి దివాకర్‌రెడ్డి, టిజి వెంకటేష్ బహిరంగంగా ప్రకటించడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. అటు రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాకపోయినా ఓటింగ్‌లో నెగ్గడంమాత్రం చాలా అరుదుగా జరిగింది. అరవై ఏళ్ల పార్లమెంటరీ చరిత్రలో కేవలం మూడు సార్లు మాత్రమే ప్రైవేట్ బిల్లులు ఓటింగ్‌లో విజయం సాధించాయి. మిగతా సందర్భాల్లో బిల్లుల్ని సభ్యులు ఉపసంహరించుకున్నారు.

శుక్రవారం తేలిపోనుంది..
మరోవైపు గత రాజ్యసభ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదాపై చర్చ నడిచింది. కేవీపీ ప్రత్యేక హోదా బిల్లును గతంలోనే ప్రతిపాదించారు. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగినా ఓటింగ్ మాత్రం జరగలేదు.. టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ కోరం లేదని చెప్పడంతో సభ వాయిదా పడింది. ఈసారిమాత్రం ఈ బిల్లుపై ఓటింగ్ జరగబోతోంది. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్లు, దీక్షలు చేస్తున్న పార్టీలు అసలు రంగును ఈ బిల్లు బయటపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లు వెనక రాజకీయ ప్రయోజనాలున్నా టీడీపీ, వైసీపీ మద్దతివ్వాల్సిన అవసరంఉంది. ఇప్పటివరకు చట్టంలో లేదని చెప్పుకుంటూ వస్తున్న బిజెపి నాటకం మరోసారి బయటపడే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే బిజెపిని టార్గెట్ చేయడానికి టీడీపీకీ ఓ అస్త్రం దొరికినట్టే. ఈ బిల్లుపై ఏ పార్టీ ఏం చేస్తుందనేది శుక్రవారం తెలిపోనుంది.

 

19:24 - July 20, 2016

ముంబై : టెస్ట్ క్రికెట్ ఎనిమిదోర్యాంకర్ వెస్టిండీస్ ప్రత్యర్థిగా టీమిండియాకు గత 15 టెస్టుల్లో తిరుగులేని రికార్డే ఉంది. ప్రస్తుత టెస్ట్ రెండో ర్యాంక్ నిలుపుకోవాలంటే ప్రస్తుత నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో విరాట్ ఆర్మీ నెగ్గి తీరాల్సి ఉంది. 2002 నుంచి టెస్ట్ క్రికెట్లో టీమిండియా, వెస్టిండీస్ ఫేస్ టు ఫేస్ రికార్డు....

కౌంట్ డౌన్..
టెస్ట్ క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా, ఎనిమిదోర్యాంకర్ వెస్టిండీస్ జట్ల నాలుగు మ్యాచ్ ల సిరీస్ కు ఆంటీగాలోని సర్ వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. 2002 సిరీస్ నుంచి వెస్టిండీస్ ప్రత్యర్థిగా టీమిండియాకు అన్ బీటెన్ రికార్డే ఉంది. 2002 నుంచి 2011 వరకూ విండీస్ తో టీమిండియా ఆడిన మొత్తం 15 టెస్టుల్లో ఎనిమిది విజయాలు, ఏడు డ్రాల రికార్డుతో అజేయంగా నిలిచింది. వెస్టిండీస్ కనీసం ఒక్క విజయమూ సాధించలేకపోయిందంటే రెండో ర్యాంకర్ టీమిండియా ఎంత పటిష్టమైన స్థితిలో ఉందీ పై గణాంకాలే చెబుతున్నాయి. ఇక ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్ట్ కు వేదికగా ఉన్న వివ్ రిచర్డ్స్ స్టేడియం పిచ్ పైన వికెట్ కు సగటున 42.70 పరుగులు నమోదయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది బ్యాట్స్ మన్ స్వర్గమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు స్పిన్ బౌలర్లకు ఆంటీగా పిచ్ పైన ప్రతి 69 బాల్స్ కు ఓ వికెట్ చొప్పున పడగొట్టిన రికార్డు సైతం ఉంది. 2011 సిరీస్ లో టీమిండియా ఓపెనింగ్ బౌలర్ ఇశాంత్ శర్మ 22 వికెట్లు పడగొట్టి బౌలర్ నెంబర్ వన్ గా నిలిచాడు.

పరుగుల విందు..
మరోవైపు భారత తురుపుముక్క, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు...ఆసియాఖండం వెలుపల జరిగిన సిరీస్ ల్లో అంతంత మాత్రం రికార్డే ఉంది. ఆసియా వెలుపల అశ్విన్ ఆడిన గత 9 టెస్టుల్లో సగట్టు 56.58గా ఉంది. ఇక..బ్యాటింగ్ లో ...భారత వెలుపల జరిగిన సిరీస్ ల్లో నిలకడగా రాణించిన ఆటగాడి ఘనత అజింక్యా రహానేకు మాత్రమే దక్కుతుంది. రహానే ఆడిన గత తొమ్మిది విదేశీ సిరీస్ ల్లో సిరీస్ కు ఓసారి 90కి పైగా పరుగులు సాధించిన రికార్డు ఉంది. మరి..ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో అశ్విన్ ఏవిధంగా రాణించగలడన్నదాని పైనే టీమిండియా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఏవిధంగా చూసినా..తొలిటెస్ట్ వేదిక వివ్ రిచర్డ్స్ స్టేడియంలో పరుగుల విందు ఖాయమనడంలో ఏమాత్రం సందేహం లేదు.

19:13 - July 20, 2016

గుంటూరు : జిల్లాలో అడవుల దీవిలో జాస్మిన్ మృతి అనంతరం జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే జాస్మిన్ మృతికి కారకులంటూ స్థానికులు ఇద్దరు యువకులు సాయి, పవన్ లను కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సాయి మృతి చెందడం జరిగింది. పవన్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతి అనంతరం తీవ్రగాయాలతో చెట్టుకు కట్టేసి ఉన్న సాయి, పవన్ లను పోలీసులు విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియోలో వచ్చిన కథనాలపై ఎన్ హెచ్చార్సీ సుమోటోలుగా స్వీకరించింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మూడు గంటల పాటు వారిని విచారించడంపై ఏపీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఏపీ, డీజీపీలకు ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు..

ఢిల్లీ : గుంటూరు జిల్లాలో జరిగిని జాస్మిన్ మృతి తరువాత జరిగిన ఘటనలపై ఎన్ హెచ్చార్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానికుల దాడిలో గాయపడిన సాయి, పవన్ లను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మూడు గంటల పాటు పోలీసులు ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వానికి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

18:58 - July 20, 2016

ప్రకాశం : పురుటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణీ శిశువుకు జన్మనిచ్చి చనిపోవడం కలకలం రేగింది. ఈ ఘటన చీరాలలో చోటు చేసుకుంది. భవానీకి ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా డాక్టర్లు కాన్పు చేయడంతో ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే కాన్పు కోసం ముందుగా పీహెచ్ సీలో చేర్పించి, అక్కడ నుంచి చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించడంలో జాప్యం జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు పీహెచ్ సీ సిబ్బంది మాత్రం.. బాధితురాలు తమ దగ్గరకు రాలేదంటున్నారు. పండంటి శిశువుకు జన్మనిచ్చిన తర్వాత భవానీ, ప్రాణాలు కోల్పోవడంతో ఆమె బిడ్డ ఇప్పుడు అనాథగా మారాడు. భవానీ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయలేనని ఆమె తండ్రి ఆస్పత్రిలోనే వదిలేశాడు. బిడ్డను సాకుతామని హామీ ఇచ్చిన వారికి అప్పగిస్తామని వైద్యులు పేర్కొంటున్నారు.

18:54 - July 20, 2016

హైదరాబాద్ : నూతన విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం విడుదల ముసాయిదా నివేదికలో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. పాఠశాల విద్యను పటిష్టపరచాలని ప్రముఖ సామాజిక వేత్త హరగోపాల్ సూచించారు. విద్య ప్రైవేటీకరణతో సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో మన దేశంలో మినహా, ఎక్కడా కూడా పాఠశాల విద్య ప్రైవేటు యాజమాన్యాల ఆధీనంలోకి వెళ్లలేదంటున్నారు.

18:35 - July 20, 2016

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ కన్సార్షియంతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం రాజధాని ప్రాంత గ్రామాల్లో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. స్టార్టప్‌ ఏరియా ఉన్న ప్రాంతంలో ఇళ్లు, ప్రార్థనా స్థలాలు, శ్మశానాలను తొలగించాలని ఒప్పందంలో చేర్చారు. అయితే ఈ వాస్తవం ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం మరుగు పరిచింది. మంత్రులు కూడా ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్విస్ ఛాలెంజ్‌ ఒప్పందంలోని షరతులు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:25 - July 20, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని కాంగ్రెస్ గట్టిప్రయత్నమే చేస్తోంది. ఇందుకు మద్దతు కూడగట్టేందుకు పలు పార్టీల నేతలను ఆ పార్టీ నేతలు కలుస్తున్నారు. బిల్లుకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరాతో పాటు పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు రఘువీరా బుధవారం సాయంత్రం లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా అందరూ ముందుకు రావాలని, పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
సత్సంసంబంధాలున్న పార్టీలతో చంద్రబాబు మాట్లాడాలని కాంగ్రెస్ పేర్కొంటోంది. కానీ టిడిపి నుండి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రత్యేక హోదా అంశం పార్లమెంట్ లో ప్రశ్నిస్తామని టిడిపి ఎంపీలు అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓటింగ్ లో పాల్గొనలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి వ్యతిరేకం ఏర్పడే అవకాశం ఉందని, బిల్లుకు మద్దతివ్వాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా పుష్కరాలకు టి.సర్కార్ ప్రత్యేక బస్సులు..

రంగారెడ్డి : కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల నుండి 400 ప్రత్యేక బస్సులను టి. సర్కార్ నడపనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, బీచుపల్లికి బస్సులు నడపనున్నట్లు, 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుందని ఆర్.ఎం.గంగాధర్ పేర్కొన్నారు. ఆగస్టు 12న ఉదయం నుండి బస్సులు తిరుగుతాయని, మందుస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. శ్రీశైలంకు 81 బస్సులు, బీచుపల్లికి 135, నాగార్జున సాగర్ కు 165, విజయవాడకు 30 బస్సులు తిరగనున్నాయన్నారు. 30 మంది యాత్రికులుంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు వస్తుందన్నారు.

ట్రిబ్యునల్ ఎదుట కాంగ్రెస్ వాదనలు వినిపించలేదు - దేవినేని...

విజయవాడ : కాంగ్రెస్ హాయాంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపించలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పట్టిసీమ వృధా అన్నారు..పూర్తి కాదన్నారని కానీ నేడు తాము పూర్తి చేయడం జరిగిందన్నారు.

 

మహంకాళి ఆలయంలో ఉన్నతాధికారుల సమీక్ష..

సికింద్రాబాద్ : మహంకాళి ఆలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించింది. బోనాలకు మూడు వేల మంది పోలీసులతో భద్రత నిర్వహించనున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. బోనాల కోసం అన్ని శాఖలను సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

18:12 - July 20, 2016

స్వయంప్రతిపత్తి మంత్రంతో దారితప్పిన భారత క్రికెట్ నియంత్రణ మండలిని గాడిలో పెట్టడానికి భారత సర్నోన్నత న్యాయస్థానం నడుం బిగించింది. భారత క్రికెట్ ప్రక్షాళననకు జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదించిన సూచనలు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. లోథా సూచనలను ఆరు మాసాల్లో ఆచరణలో పెట్టాలంటూ ఆదేశించింది. ఈ అంశంపై టెన్ టివి చర్చ చేపట్టింది. ఈ చర్చలో అంపైర్ చంద్రశేఖర్...స్పోర్ట్ ఎనలిస్టు కృష్ణారావులు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి.

బాబుకు రఘువీరా లేఖ..

హైదరాబాద్ : కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై కాంగ్రెస్ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా అందరూ ముందుకు రావాలని, పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

17:55 - July 20, 2016

రజనీకాంత్ నటించిన 'కబాలీ'పై ఫీవర్ నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా 22వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసేస్తోంది. కానీ తెలుగు మాత్రం రిలీజ్ అవుతుందా ? లేదా ? అనే డౌట్ వినిపిస్తోంది. కొంతమంది అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత కేపీ చౌదరి, అభిషేక్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా కేపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొచ్చాడియన్ సినిమాకు సంబంధించిన అప్పులు తాను ఎందుకు తీరుస్తానని ప్రశ్నించారు. కబాలి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తెలియదా అని ప్రశ్నించారు. ఇదే చివరిగా మాట్లాడుతున్నాని, ఏ స్టూడియోలో కనిపించనన్నారు. ఇంకో వ్యక్తి ఉంటే చచ్చిపోతారని, ఇందుకు మూడు పేజీల లెటర్ రాయడం జరిగిందన్నారు. కొత్తవాడు సినిమా తీయడని, తన కొడుకు బర్త్ డే ఉందని, వెళ్లి రాగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ కబాలి సినిమా రూ. 30 కోట్లకు కొనడం జరిగిందని, ఏం లాభం వచ్చిందో తనకు తెలియడం లేదన్నారు. దాసరి నారాయణ రావు అడ్డుకుంటున్నారని తెలిసి తాను ఆయన్ను సంప్రదించడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కబాలి సినిమా విడుదలవుతుంది - కేపీ చౌదరి..

హైదరాబాద్ : కబాలి సినిమా రిలీజ్ డేట్ రోజునే విడుదలవుతుందని సినీ నిర్మాత కేపీ చైదరి పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. కబాలి సినిమా 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగులో మాత్రం విడుదల కావడం లేదని, ఇందుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

17:16 - July 20, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి. బిల్లుకు మద్దతిస్తున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్లు బయటకు వచ్చాయి. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, హైకోర్టు విభజనకు ఎవరూ బిల్లు పెట్టినా మద్దతిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించారో ఒకసారి కాంగ్రెస్ నాయకులు గుర్చుకు తెచ్చుకోవాలని, కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించి..ఏకాభిప్రాయం సాధించి తెలంగాణ రాష్ట్రం సాధించారని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను సంప్రదించాలని సూచించారు. ప్రైవేటు మెంబర్ బిల్లులతో ఒరిగేదేమి లేదని, ఈ విషయం వారికి కూడా తెలుసన్నారు. కానీ ప్రజలను మభ్యపేట్టేందుకు, గిమ్మిక్కులు ఆడడం కరెక్టు కాదన్నారు. కేవీపీ తలకిందులు చేసినా కాంగ్రెస్ ను కాపాడలేరని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

మద్దతిస్తానని అనలేదు - కేటీఆర్...

ఢిల్లీ : కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతిస్తామని అనలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై ఎవరు బిల్లు పెట్టినా మద్దతిస్తామని, కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించి, ఏకాభిప్రాయం సాధించి తెలంగాణ రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను సంప్రదించాలని, ప్రైవేటు మెంబర్ బిల్లులతో ఒరిగేదేమి లేదని విమర్శించారు.

దయాశంకర్ సింగ్ పై వేటు..

ఢిల్లీ : బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసీన యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పై వేటు పడింది. దయాశంకర్ ను ఉపాధ్యక్ష పదవి నుండి బీజేపీ తప్పించింది.

కేంద్రం కక్ష సాధింపులు - సురవరం..

హైదరాబాద్ : బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం కక్ష సాధింపులకు దిగుతోందని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాల్సినవసరం ఉందని, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టని పేర్కొన్నారు. కాశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఫ్రీ లెఫ్ట్ జంక్షన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు..

హైదరాబాద్ : నగరంలో ఫ్రీ లెఫ్ట్ జంక్షన్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. మెహిదిపట్నం, గచ్చిబౌలి, కొత్తగూడ, కొండాపూర్ లో రోడ్లను మేయర్ రామ్మోహన్, కమిషనర్ పరిశీలించారు. ట్రాఫిక్ వేగంగా కదిలే విధగా ఉండేందుకు జంక్షన్ల అభివృద్ధి, పాదాచారులకు ఇబ్బందులు లేకుండా పుట్ పాత్ లు ఉంటాయని మేయర్ పేర్కొన్నారు.

 

రేవంత్ కు భద్రత పెంచాలన్న బాబు..

విజయవాడ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయనకు తక్షణమే భద్రత పెంచాలని లేఖలో కోరారు.

మాయావతికి బీజేపీ నేత క్షమాపణలు..

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయవతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ క్షమాపణలు కోరారు. నోరు జారానని అంగీకరించారు.

కాశ్మీర్ హింసపై కేంద్రం విఫలం - సింథియా..

ఢిల్లీ : కాశ్మీర్‌లో హింస‌ను నిలువ‌రించ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైన‌ట్లు కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా విమర్శించారు. కాశ్మీర్ స‌మ‌స్య‌పై లోక‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. 128 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,915 వద్ద ముగియగా 37 పాయింట్లు లాభపడిన నిఫ్టీ ,565 పాయింట్ల వద్ద ముగిసింది.

నల్గొండలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ - వెంకయ్య..

ఢిల్లీ: నల్లగొండ జిల్లా సూర్యపేటలో ఆలిండియా రేడియో స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రేడియో స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ వాయిదా..

ఢిల్లీ : తీవ్ర గందరగోళం నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. గుజరాత్ లో జరిగిన దళితుల దాడి పార్లమెంటును కుదిపేసింది. రాజ్యసభలో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీనితో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి స్పీకర్ వెల్లడించారు.

 

16:48 - July 20, 2016

హైదరాబాద్ : మొన్న ఒకడు ఐదంతస్తుల భవనంపై కుక్కను పడేసి పైశాచికన ఆనందం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. బతికున్న కుక్క పిల్లలను కొందరు మైనర్ లు మంటల్లో పడేశారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో చోటు చేసుకోలేదు. నగరం నడిబొడ్డున ఉన్న ముషిరాబాద్ లో చోటు చేసుకుంది. పటాన్ బస్తీలో ఉన్న కొందరు మైనర్లు మూడు కుక్క పిల్లలను మంటల్లో వేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టేసరికి వైరల్ గా పాకింది. ఈ విషయం తెలుసుకున్న ఇతరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్పందించిన పోలీసులు ఆ మైనర్ పిల్లలను పట్టుకున్నారు. మైనర్ లు కావడంతో వీరిని జువెనల్ హోంకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

16:36 - July 20, 2016

కాకినాడ : సంక్షేమ హాస్టళ్లు మూసివేయవద్దని...తమ సమస్యలు తీర్చాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కోరుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోయేసరికి బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు భారీగా విద్యార్థులు హాజరయ్యారు. స్పందన రాకపోవడంతో కలెక్టరేట్ లోకి దూసుకెళ్లే యత్నం చేశారు. ధర్నా చేస్తున్న సమయంలో ఓ పోలీసు వచ్చి లాఠీ తీసుకుని ఇష్టమొచ్చిటన్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఏమాత్రం బెదరని విద్యార్థులు అక్కడే బైఠాయించారు. అనంతరం ఇతర పోలీసులు తమ ప్రతాపం చూపెట్టారు. విద్యార్థులను లాక్కెళ్లారు. పిడ్డుగుద్దులు కొట్టే ప్రయత్నం చేశారు. రాని వారిని ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు తప్పుబడుతున్నారు.
సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం తత్సారం చేస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. మెస్‌ ఛార్జీలను పెంచాలని, మూసివేసిన హాస్టళ్లను తక్షణమే తెరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు.

మంటల్లో మూడు కుక్కపిల్లలు..

హైదరాబాద్ : ముషిరాబాద్ లో పటాన్ బస్తీలో దారుణమైన ఘటన జరిగింది. మూడు కుక్కపిల్లలు బతికి ఉండగానే మైనర్లు నిప్పు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టారు.

16:28 - July 20, 2016

ఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని ఉద్ధేశిస్తూ నోరు పారేసుకున్నారు. వేశ్య కన్నా హీనమంటూ దుర్భాషలాడారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఖండిస్తున్న – జైట్లీ..
బీజేపీ నేత చేఇన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇలాంటి పదప్రయోగం చేయడాన్ని ఖండిస్తున్నట్లు, ప్రతి సభ్యుడి విషయంలో ముఖ్యంగా మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి విషయంలో దృష్టి సారిస్తానని, మరొక్కసారి ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఘాటుగా స్పందించిన మాయావతి...
పార్ల‌మెంట్‌లో అంద‌రూ త‌న‌ను సోద‌రిగా భావిస్తార‌ని మాయావతి పేర్కొన్నారు. అలాంటి త‌న‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌తి సోద‌రిని అవ‌మానించిన‌ట్లేన‌ని అన్నారు. పెళ్లి చేసుకోవాలని సంసారం చేసుకోవాలని అనిపించలేదన్నారు. ప్రజల కోసం జీవిస్తుంటానని, అందుకే అందరూ బెహన్ జీ అంటారన్నారు. కాన్షీరాం సూచనల ప్రకారం పార్టీని నడిపిస్తున్నామని, తాము చేస్తున్న కార్యక్రమాలు ఇతరులకు నచ్చడం లేదన్నారు. తన జన్మదినమైన 15 జనవరి నాడు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆర్థిక దివస్ గా పరిగణిస్తారని పేర్కొన్నారు. తనకు బహుమతులు అవసరం లేదని పేర్కొనడం జరుగుతుందని, పార్టీకి సహాయం చేయాలని మాత్రమే కోరడం జరుగుతుందని మాయావతి పేర్కొన్నారు.
ఈ అంశంపై కృష్ణసాయి రామ్ (టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్) విశ్లేషణ చేశారు. విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

నోరు పారేసుకున్న బీజేపీ నేత..

ఢిల్లీ : మాయావతిపై బీజేపీ నేత దయాశంకర్ సింగ్ దుర్భాషలాడారు. వేశ్యకన్నా హీనమంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజ్యసభ దద్ధరిల్లింది. నష్టనివారణ చర్యలో భాగంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ క్షమాపణలు చెప్పారు. బీజేపీ నాయకుడి అనుచిత వ్యాఖ్యలు సభ తీవ్రంగా ఖండించింది.

బీజేపీకి కేవీపీ లేఖ..

ఢిల్లీ : ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేవీపీ రామచంద్రరావు బీజేపీని కోరారు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్నారు. అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు పరచాలని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక అధికారులు..

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల నిర్వాహణకు ప్రత్యేక అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది. కర్నూలు జిల్లా పుష్కరాల నిర్వాహణ ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ డి.అనంతరాము..కృష్ణా; గుంటూరు జిల్లాల ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ వి.రాజశేఖర్ లను నియమించారు.

స్పీకర్ ను కలిసిన సీపీఐ నేత చాడ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూధనాచారిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కలిశారు. టీఆర్ఎస్ లో చేరిన సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్లు చాడ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు.

రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ...

ఢిల్లీ : పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. శుక్రవారం వరకు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని విప్ లో పేర్కొంది.

హోదాపై సంవత్సరం నుండి పోరాటం - రామచంద్రయ్య...

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నుండి పోరాటం చేస్తోందని సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ చేయడం జరిగిందని, సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా అడగడం లేదని విమర్శించారు. కేవీపీ ప్రైవేటు బిల్లుపై చర్చకు రాష్ట్రపతి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉన్నవారంతా సహకరించాలని, టిడిపి నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని..టిడిపి కుంటి సాకులతో తప్పించుకొంటోందని పేర్కొన్నారు.

15:43 - July 20, 2016

నల్గొండ : యాదరిగుట్ట..ప్రవిత్య పుణ్యక్షేత్రం...అలాంటి పుణ్యక్షేత్రం వద్ద ఓ ఆర్టీసీ యూనియన్ కార్మికులు మందు కొట్టి జల్సా చేశారు. సందడి సందడి చేశారు. వీరు చేసిన భాగోతం పట్ల ప్రయాణీకులు చీదరించుకున్నారు. నిన్న ఆర్టీసీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సంబురాలు జరుపుకొనేందుకు ఓ యూనియన్ కు చెందిన నేతలు గుట్ట సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పార్కింగ్ లో మందు సేవించారు. మందు సేవిస్తూ కేకలతో సందడి..సందడి చేశారు. ఇదంతా చూసిన ప్రయాణీకులకు చిర్రెత్తుకొచ్చింది. మీడియాకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆ కార్మిక యూనియన్ నేతలు దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఓ సీనియర్ జర్నలిస్టు పై ఏకంగా దాడికి దిగారు. విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసులు పెడుతామని హెచ్చరించడంతో యూనియన్ కార్మిక నేతలు వెనక్కి తగ్గారు. దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.

15:36 - July 20, 2016

ఢిల్లీ : గుజరాత్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్ లో హాట్ హట్ చర్చ జరిగింది. అధికారపక్షంపై ప్రతిపక్షాల విమర్శలు..దీనిని తిప్పికొటే ప్రయత్నంలో అధికార పక్షం..వెరసి లోక్ సభ వేడెక్కింది. మూడో రోజు సమావేశంలో దళితులపై జరుగుతున్న దాడులపై లోక్ సభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ విమర్శలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. కాంగ్రెస్ పై పలు విమర్శలు గుప్పించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న 'రాహుల్ గాంధీ' మాత్రం కునుకు పాట్లు పడ్డారు. దళితులపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

15:31 - July 20, 2016

హైదరాబాద్ : మళ్లీ 'నీటి' పంచాయతీ తేలలేదు. ఈ రోజు భేటీ అయిన కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు వాదనలు వినిపించింది. తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు ఏడు టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ఏపీ కోరింది. తెలంగాణ ప్రభుత్వం కూడా మూడు టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కోరింది. ఈ రెండు ప్రతిపాదనలు కృష్ణా బోర్డు తోసిపుచ్చింది. సాగర్ లో నీళ్లు లేవు కనుక ఇవ్వలేమని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. దీనితో ప్రిన్స్ పల్ సెక్రటరీల స్థాయిలో తేల్చుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు సాగర్ పై యథాతథ స్థితి ఉండనుంది.

15:27 - July 20, 2016

హైదరాబాద్ : ఎంసెట్ పేపర్ 2 లీకేజ్ అయ్యిందా ? లేదా ? అనే దానిని సీఐడీ నిర్ణయించనుంది. ఈనెల 9న నిర్వహించిన ఎంసెట్‌ -2 పేపర్‌ లీకైందంటూ వస్తున్న వార్తలు ఇటు విద్యార్థులతో పాటు, అటు వీరి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. పేపర్‌ లీకేజీ వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం డీజీపీ అనురాగ్‌శర్మతో ఎంసెట్ కన్వీనర్‌ రమణారావు భేటీ అయ్యారు. అనంతరం సీఐడీ దర్యాప్తునకు డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని ఇంటిలెజిన్స్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక తప్పులున్నట్లు డీజీపీ గుర్తించినట్లు...ఇంటిలెజిన్స్ రిపోర్టు తో పాటు కన్వీనర్ నుండి తీసుకున్న సమాచారం మేరకు దర్యాప్తుకు డీజీపీ ఆదేశించినట్లు తెలుస్తోంది. అక్రమాలు చోటు చేసుకున్నట్లు అయితే కేసు నమోదు చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

9న పరీక్ష..
తెలంగాణలో మెడికల్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9న ఎంసెట్‌-2 పరీక్ష జరిగింది. ఈ ప్రవేశ పరీక్ష పేపర్‌ ముందుగానే వెల్లడైందంటూ వస్తున్న వార్తలతో విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ నిర్వహించిన ఎంసెట్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకు తెలంగాణ ఎంసెట్‌-2లో ఎక్కువ మార్కులు రావడమే ఈ గందరగోళానికి కారణమయ్యింది.

విజయవాడ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ర్యాంకులు...
విజయవాడలోని ఒక కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు వందలోపు ర్యాంకులు వచ్చాయి. దీంతో ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీకి బెజవాడ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పరీక్ష రాసిన విద్యార్ధులు తల్లిదండ్రుల నుంచి జేఎన్‌టీయూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ అధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఎంసెట్‌-1లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకు ఎంసెట్‌-2లో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. లీకేజీ అంశంపై ఉన్నత స్ధాయి కమిటీని నియమించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సీఐడీ విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి. 

దళితులపై దాడులపై సీపీఎం పొలిట్ బ్యూరో ఖండన..

ఢిల్లీ : గుజరాత్ లో దళితులపై జరిగిన దాడిని సీపీఎం పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై నిర్భంద చర్యలను ఆపాలని సీపీఎం పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.

విద్యావ్యవస్థలో మార్పు రావాలి - ప్రొ.హరగోపాల్..

హైదరాబాద్ : విద్యావ్యవస్థలో మార్పు రావాలని ప్రొ.హరగోపాల్ సూచించారు. ఎస్వీకేలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2016పై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ ప్రసంగించారు.

 

ముగిసిన కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం..

హైదరాబాద్ : కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసింది. నీటి కేటాయింపులపై పంచాయతీ ఎటూ తేలలేదు. తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు ఏడు టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ఏపీ కోరింది. సాగర్ లో నీళ్లు లేనందున ఇవ్వలేమని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. ప్రిన్స్ పల్ సెక్రటరీల స్థాయిలో తేల్చుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు సాగర్ పై యథాతథ స్థితి ఉండనుంది.

ముగిసిన టిడిపి సమీక్షా సమావేశం..

విజయవాడ : టిడిపి సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్ధేశం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజలతో మమైకమే ఉండాలని, ప్రభుత్వ పథకాల అమలు సొంత బాధ్యతగా తీసుకోవాలని బాబు సూచించారు. పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సాంకేతికతను వాడుకోవాలని, ప్రభుత్వ పథకాల అమలుపై సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు 500 మందితో త్వరలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు బాబు వెల్లడించారు.

 

క్యాట్ ను ఆశ్రయించిన ఏపీ ఐజీలు..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐజీలు క్యాట్ ను ఆశ్రయించారు. తెలంగాణకు కేటాయించాలని హరీష్ కుమార్ గుప్తా, అమిత్ గార్గ్ లు లు కోరారు. కేంద్రం, ఏపీ, తెలంగాణలకు నోటీసులు జారీ చేసింది. విచారణనను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.

14:40 - July 20, 2016

ఢిల్లీ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ చిక్కుల్లో పడ్డారు. డీఆర్‌డీవో స్థలంలోని తన స్నేహితుడి రిసార్ట్‌ను కాపాడేందుకు సచిన్‌ ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్రమంత్రి మనోహర్‌ పారికర్‌ను మాస్టర్‌ కలిశారన్న ప్రచారంపై క్రికెట్‌ గాడ్‌నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తన స్నేహితుడి రిసోర్ట్‌ అంశంపై కేంద్రమంత్రి మనోహర్‌ పారికర్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.. ఉత్తరాఖండ్ ముస్సోరిలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌కు సమీపంలో సచిన్‌ స్నేహితుడు సంజయ్‌ నారంగ్‌ హాలిడే రిసార్ట్‌ నిర్మించారు. డీఆర్‌డీవోకుచెందిన ఈ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్రమంత్రి పారికర్‌ను టెండుల్కర్‌ కలిశారంటూ వార్తలొచ్చాయి.

టెన్నిస్‌ కోర్టు నిర్మాణానికి నారంగ్‌ ముందు అనుమతి..
ఈ స్థలంలో టెన్నిస్‌ కోర్టు నిర్మాణానికి నారంగ్‌ ముందు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత సకల సౌకర్యాలతో వసతులు ఏర్పాటు చేసుకున్నారని డీఆర్‌డీవో స్పష్టం చేస్తోంది. రూల్స్‌కు విరుద్ధంగా ఈ నిర్మాణాలున్నాయంటూ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ రిసార్ట్‌ సమస్య పెద్దది కావడంతో తన స్నేహితున్ని కాపాడేందుకు క్రికెట్‌ గాడ్ రంగంలోకి దిగారనే ప్రచారం జరుగుతోంది. విమర్శలు పెద్దవి కాకముందే మాస్టర్ బ్లాస్టర్ స్పందిస్తారా ? లేదా ? అన్నది చూడాలి. 

14:37 - July 20, 2016

కరీంనగర్ : ఇంట్లో ఆడుకుంటుండగా ఓ బాలుడి పాదంలో గడ్డపార దిగబడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చోటు చేసుకుంది. పద్మనగర్ కు చెందిన నిఖిల్ ఇంట్లో తోటిపిల్లలతో ఆడుకుంటున్నాడు. అక్కడనే ఉన్న గడ్డపారను పాదంపై వేసుకున్నాడు. పాదంలో దిగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆ బాలుడిని తండ్రి లక్ష్మినారాయణ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు గడ్డపారను తొలగించారు. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వర్షాకాలం సమయంలో చెట్లు నాటుకుందామని గడ్డపారను బయట పెట్టడం జరిగిందన్నారు. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

14:33 - July 20, 2016

నల్గొండ : సీపీఎం పాదయాత్ర ప్రారంభమైంది. టెయిల్ పాండ్ నిర్వాసితులకు అండగా ఉన్నామంటూ..వారికి భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర జరుపుతోంది. బుధవారం పెదవూర మండలం జామనకోట తండాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున గ్రామస్తులు స్వాగతం పలికారు. టెయిల్ పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో సీపీఎం కార్యవర్గ సభ్యులు బి. వెంకట్, జూలకంటి రంగారెడ్డి పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని తమ్మినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులతో కలిసి ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు.
మంగళవారం, బుధవారం రోజుల్లో ఈ పాదయాత్ర జరగనుంది. ముగింపు సందర్భంగా ప్రాజెక్టు దగ్గర గురువారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎనిమిది గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నా జెన్ కో అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని నేతలు పేర్కొంటున్నారు.

ఎంసెట్ -2 పేపర్ లీకేజీ ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు

హైదరాబాద్ : ఎంసెట్ -2 పేపర్ లీకేజీ ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. ప్రాథమిక నివేదిక సమర్పించాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.

14:29 - July 20, 2016

కాకినాడ : ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు కన్నెర్ర చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తారా ? లేదా ? అని ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం తత్సారం చేస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మెస్‌ ఛార్జీలను పెంచాలని, మూసివేసిన హాస్టళ్లను తక్షణమే తెరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. వారు ఎలాంటి సమస్యలు ప్రస్తావించారు...ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:25 - July 20, 2016

కృష్ణా : రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజయవాడలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమకు ప్రత్యేక హోదా కావాలని..డిమాండ్ చేస్తున్నారు. విభజన సమయంలో చేసిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వారు ఎలాంటి డిమాండ్స్ వినిపిస్తున్నారో వీడియోలో చూడండి.

14:22 - July 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌ 2 పేపర్‌ లీకేజీ వ్యవహారం ముదురుతోంది. డీజీపీ అనురాగ్‌శర్మతో ఎంసెట్ కన్వీనర్‌ రమణారావు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది. పేపర్ లీకేజ్ అయ్యిందంటూ కావాలనే ఇదంతా చేస్తున్నారా ? పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా కూడా లీకేజ్ కు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. వరంగల్ లో ఒక చోట ఆరోపణలతో ఇలాంటి పుకార్లు వస్తున్నాయని, కేసులు పెడితే దర్యాప్తు చేస్తామని డీజీపీ హామీనిచ్చినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వాహణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందనే ప్రచారం చేయాలనే ఉద్ధేశ్యంతో కొంతమంది ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని డీజీపీ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఎంసెట్ కన్వీనర్ లేదా డీజీపీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

కలకలం..
ఈనెల 9న నిర్వహించిన ఎంసెట్‌ -2 పేపర్‌ లీకైందంటూ వస్తున్న వార్తలు ఇటు విద్యార్థులతో పాటు, అటు వీరి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఎంసెట్‌ పేపర్‌ లీకు అంశంపై ఉన్నత విద్యామండలి,జేఎన్ టీయూ అధికారులు విచారణ జరుపుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. పేపర్‌ లీకు అంశం వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొనసాగుతున్న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీకి కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల ఈఎస్ సీలు హాజరయ్యారు.

14:16 - July 20, 2016

గుంటూరు : ఉద్రిక్తతల నడుమ బ్రాడీపేట అర్బన్ బ్యాంకు నామినేషన్ ల ప్రక్రియ ముగిసింది. ఉదయం నుండి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం చిన్నబోయే విధంగా అధికార పార్టీ వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ నామినేషన్ వేయకుండా టిడిపి నేతలు వ్యవహరించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన బీజేపీ పార్టీకి చెందిన నేతలపై టిడిపి వర్గీయులు దాడి చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసమయం తరువాత ఇరువర్గాలు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక పార్టీ ఛైర్మన్ పదవి, మరొక పార్టీ వైస్ ఛైర్మన్ పదవి తీసుకోవడానికి ఆ రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ సభ్యుడు..
అదే సమయంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మస్తాఫాతో కలిసి మాల్యాద్రి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడనే మోహరించిన టిడిపి వర్గీయులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి, బిజెపి నేతల వ్యవహర తీరుపై వైసీపీ తప్పుబట్టింది. ప్రభుత్వం పునరాలోచించి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

టిడిపి గూండాలు అడ్డుకున్నారు - వైసిపి..
తాము నామినేషన్ వేయడానికి వస్తే టిడిపి గూండాలు అడ్డుకున్నారని వైసిపి నేతలు విమర్శించారు. నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడే మోహరించారని, వారితో పాటు టిడిపి గూండాలు తిష్ట వేశారని పేర్కొన్నారు. టిడిపి, బిజెపి వర్గీయులు ఒక డ్రామాను సృష్టించారని, వారందరూ కలిసి ఒక పెద్ద డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నామినేషన్ అయ్యే సమయంలో అడ్డుకున్నారని, మరొకసారి ప్రభుత్వం ఆలోచించి తిరిగి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మాట్లాడాను - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి..
ఛైర్మన్, డైరెక్టర్ పదవికి పోటీ జరుగుతోందని టిడిపి నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గతకొంతకాలంగా బీజేపీ నేత పదవిలో ఉండడం వల్ల తాము ఈసారి ఆ పదవి తీసుకుంటామని పేర్కొనడం జరిగిందన్నారు. దీనిపై తాను మాట్లాడడం జరిగిందన్నారు.

డీజీపీ అనురాగ్ శర్మతో ఎంసెట్ కన్వీనర్ భేటీ

హైదరాబాద్ : డీజీపీ అనురాగ్ శర్మతో ఎంసెట్ కన్వీనర్ రమణారావు భేటీ అయ్యారు. ఎంసెట్ -2 లీకేజీ వ్యవహారంపై వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

ముషీరాబాద్ లో ముగ్గురు మైనర్లు అరెస్ట్

హైదరాబాద్ : కుక్కను చంపి వీడియోను ఫేస్ బుక్ లో పెట్టిన ముగ్గురు మైనరలను ముషీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.

పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ : సుప్రీం....

ఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సెగ రాజేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంపై సుప్రీం కోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏపీ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి తెహర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించి పలు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది.

సీఎం కేసీఆర్ కు తమ్మినేని లేఖ

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. లేఖ లోని సారాంశం ఈ క్రింది విధంగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా బీమా మొదటి దశ నుండి నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టాలని, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1450.51 కోట్లు కాగా...రూ.133.86 కోట్లు మంజూరు చేశారు. లక్ష ఎకరాల సాగు, 6 లక్షల జనాభా తాగునీటి అవసరం కోసం ప్రాజెక్టు మంజూరు చేయబడింది. దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతానికి న్యాయం జరగాలంటే నారాయణపే, కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే నిర్మించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

అమరావతిలో పుష్కర ఘాట్ల ను పరిశీలించిన మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు : తాళ్లాయపాలెం,అమరావతిలో పుష్కర ఘాట్లను మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు పరిశీలించారు.

13:55 - July 20, 2016

ఢిల్లీ : పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రాజెక్టులతో తమకు నష్టం కలుగుతుందని ఏపీ రైతులు దేశ ఉన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులేనని తెలంగాణ తరపున్యాయవాది తమ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై సమస్యలను అపెక్స్ కౌన్సిల్ లో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో వీలైనంత త్వరంగా పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:48 - July 20, 2016

న్యాయ సలహాలు సూచనలు అందించే మైరైట్ ఈరోజుకూడా మన ముందుకు వచ్చేసింది. బాల్య వివాహాల గురించి ఈరోజు మైరైట్ కార్యక్రమంలో సలహాలు సూచనలు అందించేందుకు అడ్వకేట్ పార్వతి చెప్పే సలహాలను సూచలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి..

13:47 - July 20, 2016

నిజామాబాద్: సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే గేటు అది .....నిత్యం వేలాది మంది ప్రజలు , వందలాది వాహనాలు ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్న ప్రాంతమది.....ఇలాంటి ప్రదేశంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమైన రైల్వే గేటును అధికారులు మూసివేసారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటీ గేట్.... ఎవరీ.. ప్రజలు... రైల్వేగేట్... ప్రాముఖ్యతేంటి అనేగా మీ డౌట్...వాచ్‌ దిస్ స్టోరీ

నిజామాబాద్ గంజ్‌ చౌరస్తా రైల్వేగేట్ మూసివేత...
నిజామాబాద్‌ నగరంలోని గంజ్ చౌరస్తాలో ఉన్న రైల్వేగేట్‌...ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఈ దారి నుంచే ప్రయాణం సాగిస్తున్నారు. అలాంటి రైల్వేగేట్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు మూసివేయటంపై స్థానికులు, ప్రధానంగా కార్మిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రైల్వే గేట్ నుంచి వ్యాపారాలు చేసుకునే గాంధీ గంజ్‌, శ్రద్ధానంద్‌ గంజ్ కూరగాయలు మార్కెట్‌లో పనిచేసే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిక్షాకార్మికులు, తోపుడు బండి వ్యాపారులు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లైఓవర్‌ ఉంటుండగా రైల్వే గేట్‌ ఎందుకని అధికారుల ప్రశ్న..
రైల్వే డివిజన్ ఇంజనీర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఇంజనీర్ గంజి రైల్వే గేటును మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసారు. గంజ్ రైల్వే గేటు దగ్గర పనిచేస్తున్న నలుగురు రైల్వే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి సంవత్సరానికి 32 లక్షలు ఖర్చవుతోంది. సమీపంలో ఫ్లైఓవర్ ఉన్నప్పుడు రైల్వేగేట్‌ అవసరమేంటని అధికారులు భావించారు. వేతన భారాన్ని తగ్గించుకోవడం కోసం రైల్వేగేట్‌ ను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చారిత్రక నేపథ్యం కలిగి, అనేక మంది ప్రజల అవసరాలు తీర్చిన ఈ రైల్వేగేట్‌ను మూసివేయడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆలోచన..
ప్రజల ప్రయోజనాల కోసం అప్పట్లో ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాలని భావించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు భరించాలని నిర్ణయించారు. అయితే రైల్వేగేట్‌ లో పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడం వల్ల తమకు నిధులు భారమవుతున్నాయని రైల్వే అధికారులు భావించారు. రైల్వేగేట్‌ ను మూసివేసి ఆ నిధులతో ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు ఆలోచన చేశారు. దీనిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రైల్వేగేట్‌ను మూసివేస్తే తాము అనేక విధాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వేగేట్‌ ను మూసివేయండంపై స్థానికులు వ్యతిరేకత..
స్థానిక ప్రజలకు అన్ని విధాల ఉపయోగకరంగా ఉన్న రైల్వేగేట్‌ ను మూసివేయండంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర అధికారులు దీనిపై స్పందించి రైల్వేగేట్‌ను యధావిధిగా తెరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

13:40 - July 20, 2016

ఖమ్మం : ఖమ్మంజిల్లా టీఆర్‌ఎస్‌లో ఆదిపత్యపోరు మొదలైంది. గత ఎన్నికల్లో వివిధ పార్టీలనుంచి గెలిచిన, ఓడిపోయిన నాయకులందరూ... కారుగుర్తు పార్టీలో చేరారు. దీంతో జిల్లాలో ఆదిపత్యం కోసం నాయకుల మధ్య అంతర్గతంగా పోటీ నడుస్తోంది. శంకుస్థాపనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించడంలేదని నాయకులు ఒకరిపై మరొకరు గుర్రుగా ఉన్నారు. తాజాగా మార్కెట్‌ కమిటీ నామినేటెడ్‌ పదవులపై గులాబీగూటిలో కుంపటి రాజుకుంది.

మంత్రి తుమ్మలకు 'కొత్త' తలనొప్పులు...
ఖమ్మంజిల్లా రాజకీయాల్లో సింగిల్‌హ్యాండ్‌ తో చక్రం తిప్పుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు... కొత్తవారి నుంచి తలనొప్పులు మొదలైయ్యాయి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడిన పువ్వాడ అజయ్‌- తుమ్మల ఇపుడు ఒకే పార్టీలో సర్దుకు పోవాల్సి వస్తోంది. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేకున్నా... నామినేటెడ్‌ పదవులపై కిందిస్థాయి లీడర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మరోసారి ఇద్దరు నాయకుల మధ్య అంతర్గత పోరు మొదలైందంటున్నారు. అటు తాజాగా వైసీపీ నుంచి గులాబీతీర్థం పుచ్చుకున్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆదిపత్యం కోసం ఆరాట పడుతున్నారు. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే పొంగులేటి.. నామినేటెడ్ పదవులను తమ వర్గం వారికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. దీంతో ఖమ్మంజిల్లా గులాబీపార్టీలో ఆదిపత్యపోరు రసవత్తరంగా మారింది. పైకి అంతా బాగానే ఉన్నట్టు మాట్లాడుతున్నా.. నామినేటెడ్‌ పదవుల ఇష్యూ నాయకుల మధ్య చిచ్చురాజేసిందని గులాబీపార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మార్కెట్‌ కమిటీ పదవులపై తుమ్మల,ఎమ్మెల్యేల ఫైరవీలు..
మార్కెట్‌ కమిటీ పదవులపై మంత్రి తుమ్మల- ఎమ్మెల్యే పువ్వాడఅజయ్‌ వర్గాలు ముఖ్యమంత్రిలెవల్లో ఫైరవీలు మొదలు పెట్టాయి. ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా తుమ్మల వర్గానికి చెందిన ఆర్‌ జే కృష్ణ నియమకం కావడంతో పువ్వాడ వర్గం గుర్రుగా వుంది. చైర్మన్‌ పదవి పోతేపోయింది.. కనీసం డైరెక్టర్‌ పదవి అయినా తమ వర్గం వారికి దక్కాలని పువ్వాడ పేచీపెట్టారు. అయితే పదవులపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం అని తుమ్మల వర్గం అంటోంది.

చైర్మన్లు లేక గంథాలయ కమిటీలు వెలవెల...
అటు సంవత్సరాల పాటు గంథ్రాలయ కమిటీలకు చైర్మన్లు లేకపోవడంతో... ఇబ్బందిగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. నిధులు ఉన్నా.. ఉపయోగించుకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు.

17 దేవాలయ కమిటీల నియామకాలకు రంగం సిద్ధం..
ఇదిలావుంటే ప్రభుత్వం తాజాగా దేవాలయ కమిటీ పదవులను తెరపైకి తెచ్చింది. ఖమ్మంనియోజకవర్గంలోని స్థంబాద్రి దేవాలయంతోపాటు మొత్తం 17 ఆలయాలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. దీంతో కిందిస్థాయి గులాబీలీడర్లు.. అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ... ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే...ముందు నాదగ్గరకే ఎందుకు రాలేదు అని ... మంత్రి- ఎమ్మెల్యేలు చోటా నాయకులను తెగ ఇబ్బంది పెడుతున్నారట. అసలు అధికార పార్టీ అంటేనే నాయకులెక్కువ.. పదవులు తక్కువ అన్నట్టుంటుంది పరిస్థితి. ఇపుడు ఖమ్మంజిల్లా లీడర్ల మధ్య పదవులకోసం మొదలై కోల్డ్‌వార్‌ ఎటు దారితీస్తోందని టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

13:37 - July 20, 2016

హైదరాబాద్ : థియేటర్లు దొరకని పరిస్థితుల్లో ఇప్పటికి రెండుమూడు పర్యాయాలు వాయిదా పడ్డ ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్‌’ చిత్రం ఎట్టకేలకు ‘కబాలి’ విడుదలైన మరుసటి రోజు, అనగా జూలై 23న విడుదల కానుందని దర్శకనిర్మాతలు గోపీనాథ్‌, నరేందర్‌లు అన్నారు. ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్‌’ సినిమా చూసినవారెవరైనా తమకు నచ్చలేదని సహేతుకంగా వివరిస్తే.. లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని దర్శకనిర్మాతలు మీడియా సమావేశంలో ప్రకటించారు. ‘స్నేహమా... ప్రేమా... ఆకర్షణా..?’ అన్న ట్యాగ్‌లైన్‌తో బి.ఆర్‌.యస్‌.ఐ.మూవీస్‌ పతాకంపై పోల్కంపల్లి నరేందర్‌ నిర్మిస్తున్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్’. గోపీనాథ్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్‌ పృధ్వీ, నల్ల వేణు, సుమన్‌శెట్టి, సూర్య, చిత్రం శ్రీను, జూనియర్‌ రేలంగి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

'మమ్మల్ని తెలంగాణకు కేటాయించండి '

హైదరాబాద్: తమను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ ఏపీకి చెందిన ఇద్దరు సీనియర్ పోలీసులు క్యాట్‌ను ఆశ్రయించారు. సీనియర్ పోలీసు అధికారులు అమిత్‌గార్గ్, హరీష్‌కుమార్‌గుప్తాలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన క్యాట్ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

13:28 - July 20, 2016

ఢిల్లీ : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఢిల్లీలో ధర్నాకు దిగారు. బీజేపీ హయాంలో ధరలు భారీగా పెరిగాయని, సామాన్యుడి బతుకు దుర్భరంగా మారిందని విమర్శించారు.

13:19 - July 20, 2016

ఢిల్లీ : గుజరాత్‌లో దళితులపై దాడి ఘటన లోక్‌సభను కుదిపేసంది.. ఈ ఘటనపై లోక్‌సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.. దీనిపై గుజరాత్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు.. రాజ్‌నాథ్ ప్రకటనపై సంతృప్తిచెందని ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.. రాజ్‌నాథ్ ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలారు.

దొనకొండ కు ఉక్రెయిన్ పెట్టుబడులు: మంత్రి శిద్ధా

ప్రకాశం : దొనకొండలో పారిశ్రామిక వాడ అభివృద్ధి చేసేందుకు ఉక్రెయిన్ దేశస్తులు ముందుకొచ్చారని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఆయన కొద్ది సేపట్టి క్రితం మీడియాతో మాట్లాడుతూ...6వేల ఎకరాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరగనుందని తెలిపారు. దొనకొండలో రూ.3 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.

పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీంలో విచారణ...

ఢిల్లీ : పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై సుప్రీం కోర్టు విచారణ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవని, ఈ ప్రాజెక్టులతో తమకు నష్టం కలుగుతుందని ఏపీ రైతులు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

12:54 - July 20, 2016

ఢిల్లీ : గుజరాత్ లో దళితులపై జరిగిన దాడి ఘటన మీద రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. గుజరాత్ ఘటన సిగ్గుచేటంటూ ప్రతిపక్షాలు నినదించాయి. దళితులపై దాడుల మానవ హక్కుల ఉల్లంఘనే అని విమర్శించాయి. ప్రతిపక్షాలు సర్దిచెప్పినప్పటికీ వినకపోవడంతో కురియన్ సభను వాయిదా వేశారు.

12:51 - July 20, 2016

రంగారెడ్డి : బ్యాంకులో చోరీకి యత్నించారు దుండగులు. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని డెక్కన్ గ్రామీణ బ్యాంకు దోపిడీకి యత్నించారు. గడిచిన రాత్రి ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేశారు. గ్రామస్థులను గమనించిన దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయారు.

12:48 - July 20, 2016

హైదరాబాద్‌ : కలెక్టరేట్‌ నినాదాలతో హోరెత్తింది.. కలెక్టరేట్‌ముందు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.. కేజీ నుంచి పీజీవరకూ ఉచిత విద్య అందించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేశారు.. కార్పొరేట్‌ దోపిడీని అరికట్టాలంటూ నినాదాలు చేశారు.. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. 

గుజరాత్ ఘటనపై రాజ్ నాధ్ వివరణ

ఢిల్లీ : గుజరాత్ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ లోక్ సభలో వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశామన్నారు.. అరెస్టయిన వారిలో 7గురు జ్యుడీషియల్ కస్టడీకి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు.

బిజెపి, టిడిపి మధ్య కొనసాగుతున్న చర్చలు

గుంటూరు : బ్రాడీ పేట లోని అర్బన్ బ్యాంక్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ రెడ్డి, సత్యప్రసాద్, ఆలపాటి రాజాతో బిజెపి నేతలు ఆంజనేయులు, శ్రీనివాసరావు చర్చలు జరుపుతున్నారు. ఛైర్మన్ పదవి టీడీపీకి, వైఎస్ ఛైర్మన్ పదవి బిజెపికి ఇచ్చేలా అంగీకారానికి రావాలని ఇరు వర్గాలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.

టెయిల్ పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలి : తమ్మినేని

నల్లగోండ : పెద్దవూర మండలం జమనకోటతండాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదాయాత్ర చేపట్టారు. టెయిల్ పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూలకంటి, బి.వెంకట్, ఇతర ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. టెయిల్ పాండ్ నిర్వాసితులవి న్యాయమైన డిమాండ్లని, నిర్వాసితుల సమస్యలపై న్యాయపోరాటం చేస్తామని, సీపీఎం రాష్ట్ర కమిటీ తరపున వారి పోరాటానికి మద్దతిస్తామన్నారు. నిర్వాసితుల సమస్యలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రాజెక్టులకు సీపీఎం వ్యతిరేకం కాదన్నారు.

12:34 - July 20, 2016

నల్లగొండ : ఐదువందల ఎకరాలకు సాగునీరు...ముప్పైవేల జనాభాకు తాగు నీరు...అందిస్తూ ప్రజల జీవనంలో భాగమైన భువనగిరి పెద్దచెరువు..ఇప్పడు వెలవెలబోతోంది. ఒకప్పుడు నిండుకండులా తొణికిసలాడే చెరువు ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. దీనికితోడు ఎటుచూసినా చెత్త చెదారం, జంతు కళేబరాలు, వ్యర్థ రసాయనాల డంపింగ్‌తో కంపోస్ట్ యార్డులా తయరైంది.

కంపోస్ట్ యార్డ్ లా తయారైన పెద్ద చెరువు ..
చుట్టూ చెత్త చెదారం, వ్యర్థపదార్థాలతో ఇదేదో కంపోస్ట్‌ యార్డులా కనిపిస్తోంది..కదూ. అలా అనుకుంటే మీరు కంపోస్ట్‌లో కాలేసినట్టే..ఇది ఒకప్పుడు వందల ఎకరాల సాగుకు నీరందించిన నల్లగొండ జిల్లా భువనగిరి పెద్ద చెరువు. నిజాంరాజుల కాలం నుంచి ప్రజలకు మంచినీటినందిస్తూ...ఇప్పుడిలా ఎడారిలా మారింది.

డంపింగ్‌ యార్డును తలపిస్తోన్నభువనగిరి చెరువు..
భువనగిరి పెద్ద చెరువు కాలుష్యకోరల్లో చిక్కుకొని పాడవుతోంది. అనేక రకాల వ్యర్థాలు చెరువులో వేయడంతో చెరువు స్వరూపమే మారిపోయింది. జంతుకళేబారాలు, పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో, చెత్తచెదారాలతో డంపింగ్‌యార్డును తలపిస్తోంది. గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల పరిరక్షణకు కంకణం కట్టుకున్నామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ చెరువుపై మాత్రం దృష్టిపెట్టడం లేదని మండిపడుతున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువును త్వరితగతిన పూర్తిచేసి, ప్రజలకు ఉపయోగపడే మార్చాలని కోరుతున్నారు.

ఈ చెరువుతోనే నిజాం కాలంలో వందల ఎరకాల సాగు..
భువనగిరి పెద్ద చెరువు నిజాం కాలం నాటిది. జిల్లాలోని చెరువులలో రెండవ పెద్ద చెరువు. శామీర్‌ పేట నుంచి రాచ కాలువ ద్వారా ఈ చెరువు నిండేది. వర్షాలు కురవక, నీరులేక ఎండిపోయింది. ఇదే అదనుగా చెత్త చెదారంతో చెరువును నింపేస్తున్నారు. మట్టికోసం తీసిన గుంతల్లో జంతు కళేబరాలతో నింపుతున్నారు. పరిసర ప్రాంతాలు, జంటనగరాల నుంచి ట్యాంకర్ల ద్వారా రసాయన వ్యర్థాలు తెచ్చి చెరువులో పోస్తున్నారు. మరోవైపు కొంతమంది కబ్జాదారులు చెరువు చుట్టుపక్కల స్థలాన్ని ఆక్రమించేందకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు చెరువును పట్టించుకోకపోవడంతో రక్షణ లేకుండా పోయింది.

కబ్జా అరికట్టాలని కోరుతున్న స్థానికులు..
ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి చెరువును పునరిద్ధరించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ప్రకారం చెరువుకు హద్దులు నిర్మించి కబ్జాలు ఆగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

'రేపు తాత్కాలిక సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ప్రారంభం'

గుంటూరు : రేపు మధ్యాహ్నం తాత్కాలిక సచివాలయం లో ఐదో బ్లాక్ మొదటి అంతస్థులో ఆర్ అండ్ బీ శాఖను ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని, అయినా అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రేపు సీఎం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారని తెలిపారు.

స్విమ్స్ వద్ద వామపక్షాలు, ప్రజా సంఘాల ధర్నా

తిరుపతి: స్విమ్స్ వద్ద వామపక్షాలు, ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. వెంటిలేటర్ అవసరమైన రోగులను స్విమ్స్ కు పంపొద్దని ప్రైవేటు ఆస్పత్రులకు సర్క్యూలర్ జారీ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్విమ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా పేదలకు మెరుగైన వైద్యం అందించడం లేదని ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.

12:11 - July 20, 2016

చిత్తూరు : వెంటిలేటర్‌ అవసరమైన రోగులను తమ ఆస్పత్రికి పంపొద్దని స్విమ్స్‌ ఉత్తర్వులు ప్రైవేటు ఆస్పత్రులకు ఉత్తర్వులు జారీ చేసిన స్విమ్స్‌ అధికారులు జారీ చేశారు. సిమ్స్‌ వివాదాస్పద ఉత్తర్వులపై వామపక్షాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో స్విమ్స్ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టాయి. దీనిపై మరింత సమాచారానికి ఈ వీడియో క్లిక్ చేయండి..

రైలు ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

కర్నూలు : పాణ్యం మండలం నెరవాడలో విషాదం నెలకొంది. సెల్ ఫోన్ లో పాటు వింటూ రైల్వే ట్రాక్ పై వెళుతుండగా రైలు ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.

12:04 - July 20, 2016

విజయవాడ : యూకేకుచెందిన ఎడ్యుకేషన్‌ టీం ఏపీలో పర్యటిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్టుడెంట్స్ ఎక్సేంజ్‌, ఫ్యాకల్టీ ఎక్సేంజ్‌, టెక్నికల్‌ ఎక్సేంజ్‌ లాంటి అంశాలపై ఈ బృందంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.. యూకేతో ఒప్పందాలకోసంకూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు..  

మంత్రి శిద్ధాతో ఉక్రెయిన్ బృందం భేటీ

ప్రకాశం: ఒంగోలులో మంత్రి శిద్ధాతో ఉక్రెయిన్ బృందం భేటీ అయ్యారు. దొనకొండలో పెట్టుబడులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

బాబు సమక్షంలో టీడీపీ సమీక్షా కమిటీ భేటీ....

విజయవాడ : సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ సమీక్షా కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై, పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణా తరగతులపై చర్చించనున్నారు. ఈ భేటీకి కమిటీ సభ్యులు, టాప్ 25 ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు.

రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మొత్తం వివిధ శాఖలకు సంబంధించిన 25 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జీఎస్టీ బిల్లు కీలకం కానుంది. ఈ బిల్లు ఆమోదానికి విపక్షాల సహకారం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. లోక్ సభలో ఎన్ఎస్జీ సభ్వత్వం విషయం సభలో చర్చకు వచ్చింది. గుజరాత్ ఘటనపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. గుజరాత్‌ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభను బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 

11:52 - July 20, 2016

ఢిల్లీ : 2022 లోగా ప్రతి ఒక్కరికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. జీఎస్టీ బిల్లు, రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్‌ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందుతుందని భావిస్తున్నానన్నారు .రియల్ ఎస్టేట్ లో ఉన్న సమస్యలను ఈ బిల్లు ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని.. హౌసింగ్ సెక్టార్ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. 

11:46 - July 20, 2016

హైదరాబాద్ : టీఎంయూ నేతలు మంత్రి హరీష్ రావు ను కలిసి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం ఆర్టీసీలోని ప్రతి ఒక్కరి విజయమన్నారు మంత్రి హరీష్‌ రావు. గత ప్రభుత్వాల కంటే.. అద్భుతంగా ఆర్టీసీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.  

11:46 - July 20, 2016

హైదరాబాద్ : సినీ పరిశ్రమను నీడలో వెంటాడుతున్న పైరసీ భూతం కబాలి ని కూడా తాకిందని సమాచారం. మరో రెండు రోజుల్లో కబాలి సినిమా విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే కబాలి తమిళ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీకైందంట. ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్మాత పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ వెబ్‌సైట్ లింకులను తొలగించారు. కానీ ఇప్పటికే చాలామంది ఈ తమిళ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. మొన్న ఉడ్తా పంజాబ్, నిన్న సుల్తాన్, నేడు కబాలి. ఇలా దర్శక నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న పెద్ద చిత్రాలు పైరసీ ఉచ్చులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే...

11:41 - July 20, 2016

నువ్వుల సాధారాణంగా అందరికి తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కావున వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వులనూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు.

చర్మాన్ని సంరక్షించడంలో....

చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ఇ మరియు బి విటమిన్ లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖంను ఫ్రెష్ గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.

చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచడంలో....

చిన్నారుల అందం, ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనెది కీలక పాత్ర. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ బి36.. లాంటివి ఇందులో సమృద్ధిగా ఉంటాయి. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది. నిత్యం స్నానానికి, పడుకునేందుకు ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా రుద్దితో పిల్లల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది.

బీపీ నియంత్రణలో...

ఈ నూనెలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడంతో పాటు... బీపీ స్థాయి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో ఉన్న పెద్దవారికి బీపీని సమస్థాయికి తీసుకొస్తుంది. అంతేగాకుండా, వయసు పైబడ్డవారు ఈ నూనెతో చేసిన పదార్థాలను తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉంటారు.

కీళ్లనొప్పుల నివారణలో...

నువ్వులు కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే మెగ్నీషియం... పేగు క్యాన్సర్, మైగ్రేన్ లాంటి సమస్యలను అరికట్టే కాల్షియం.. ఎముకలు గట్టిపడేందుకు సాయపడే జింక్... తదితరాలన్నీ ఈ నువ్వుల నూనెలో ఉండటం ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.

మధుమేహ వ్యాధి నివారణకు..

నువ్వులలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయడతాయి. నువ్వు విత్తనాల నుండి తీసిన నూనెలు శక్తివంతమగా శరీర రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..

జుట్టు మృదువుగా ఉండాలన్న, చుండ్రు మాయం కావాలన్న నువ్వుల నూనే బెస్ట్‌ అంటున్నారు సౌంధర్య నిపుణులు. నువ్వుల నూనేతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే , హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌ గా ఉండే హెయిర్‌ గ్రోత్‌ ను ప్రోత్సహిస్తుంది. అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా నువ్వుల నూనే రక్షిస్తుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.

 

11:35 - July 20, 2016

ఆదిలాబాద్ : కుంతల జలపాతం... ప్రకృతి అందానికి నిదర్శనం.. పర్యావరణ ప్రేమికుల ఆహ్లాదానికి కేంద్రం.. అలాంటి జలపాతం ఇప్పడు మృత్యు నిలయంగా మారుతోంది. జలపాత యాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. ఇటీవల సంభవించిన ప్రమాదాలు..ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

కుంతల జలపాతంలో గల్లంతైన వినయ్ ..
ప్రకృతిని పులకింపుతో హాయిగా ఉండే వాతావరణం....పాలపుంతలాంటి జలపాతంలో మునక మరింత ఉత్సాహాన్ని నింపుతోంది..ఆ ఆనందంలో స్నేహితులు వద్దంటున్నా..వినయ్ వినిపించుకోలేదు...తన వేగాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ...లోతులోకి జారుకున్నాడు..చివరకు మృత్యువు కౌగిలిలో చిక్కుకున్నాడు.

వినయ్‌ మరణంతో స్నేహితుల ఆవేదన..
ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ మండలం కుంటాల జలపాతంలో ప్రమాదం జరిగింది. నిజామబాద్ జిల్లా ఎల్లమ్మకుంట గ్రామానికి చెందిన రుద్రవరపు వినయ్ జలపాతంలో గల్లంతయ్యాడు. ఐదుగురు స్నేహితులతో పాటుకలిసి వచ్చిన వినయ్ నీటిలో దిగి సరదాగా స్నానం చేస్తుంటే..ఊహించని రీతిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు...ఊహించని పరిణామంతో ఖంగుతిన్న స్నేహితులు .. తాము కాపాడటానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. గజ ఈతగాళ్ల కోసం ఎన్ని కేకలు వేసినా ఎవరూ రాలేదని మండిపడ్డారు. పర్యాటక శాఖ అధికారులు రక్షణ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల తమ స్నేహితున్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాలను పట్టించుకోని అటవీశాఖ అధికారులు..
అటవీ శాఖ అధీనం లో ఉన్న ఈ పర్యాటక ప్రాంతం లో ఎంతమంది మరణిస్తున్నా అధికారులకు మాత్రం కనువిప్పు కలగడం లేదని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కేవలం స్థానికంగా ఉన్న దుకాణ సముదాయాలు, వాహనాల నుంచి డబ్బులు వసూలు చేయడానికే అధికారులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. డబ్బుల వసూలలో చూపే శ్రద్ధ రక్షణ ఏర్పాట్ల విషయంలో చూపడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కుంతల జలపాతం ప్రాంతంలో రక్షణ ఏర్పాట్లు చెయ్యాలని పర్యాటకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

11:23 - July 20, 2016

మహబూబ్ నగర్ : ఖరీఫ్ సీజన్‌ వచ్చిందంటే చాలు నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వివిధ కంపెనీ బ్రాండ్లతో పాటు నకిలీ విత్తనాలు మార్కెట్‌లో దర్శనమిస్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. మరోవైపు నకిలీ విత్తనాలు అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం సైతం ఈ విషయంపై సీరియస్‌గానే ఆలోచిస్తోంది.

లక్షల ఏకరాలకు పైగా వ్యవసాయం....
పాలమూరు జిల్లా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి. ఇక్కడ ఖరీఫ్‌ సీజన్ లో ఐదు లక్షల ఏకరాలకు పైగా వ్యవసాయం సాగవుతుంది. ఒక వైపు కరువు ప్రభావిత ప్రాంతం కావడంతో వ్యవసాయం భారంగా మారుతుంటే, మరోవైపు నకిలీ విత్తనాలు రైతును నిలువనా ముంచేస్తున్నాయి. గతేడాది నాసిరకం పత్తి, సోయా విత్తనాలతో జిల్లాలోని వేలాది మంది రైతులు నిలువునా మునిగారు. అయితే ఈ యేడాది కూడా అధికారుల అలసత్వం కారణంగా అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నా యి. పాలమూరు జిల్లాలో ప్రధానంగా వరి,పత్తి మొక్కజొన్న పంటలు విరివిగా పండిస్తారు. వీటిలో కూడా అధిక శాతం విత్తనాలు కల్తీవని తేలడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని గద్వాల్, అలంపూర్, మఖ్తల్, జడ్చర్ల, నాగర్‌ కర్నూల్ ప్రాంతాలలో ఎక్కువగా పత్తి పండిస్తారు. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న విత్తన కంపెనీల్లో ఏవి నాణ్యమైనవో తేల్చే ప్రమాణాలు లేకపోవడం కూడా ఒక కారణంగా ఉంది.

వెలుగులోకి వచ్చిన నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు ...
పాలమూరు జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌ సీజన్లో నిర్వహించిన దాడుల్లో జడ్చర్ల, మిడ్జిల్, భూత్పుర్‌లలో నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ కేంద్రాలు కొనసాగుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గం రాణిపేటలో ఓ కంపెనీ 1.45లక్షల విలువ చేసే విత్తన ఉత్పత్తికి అనుమతి పొంది, ఏకంగా 22 లక్షలు విలువ చేసే విత్తనాలను నిలువ చేసింది. అధికారుల విజిలెన్స్‌ దాడుల్లో ఈ తతంగం బయటపడింది. సాధారణంగా విత్తనాలు విక్రయించే కంపెనీలు తమ కంపెనీ మూల విత్తనాన్ని సొంత పొలాల్లో పండిస్తారు. వాటి నుండి నాణ్యమైన విత్తనాలను వేరు చేస్తారు. అలా విత్తనాలను తయారు చేసి 500 గ్రామాల వరకు సంచుల్లో మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. సంచులపై కంపెనీ పేరు, విత్తన కంపెనీలు తమ చిహ్నాలనూ, హోలో గ్రాములను సంచుల పై వేస్తారు. దీంతో పాటు విత్తనాలు మొలక శాతం, దిగుబడి వంటి అంశాలనూ, విత్తనాభివృద్ధి సంస్థ ధృవీకరణ పత్రాన్ని విత్తన సంచీతో పాటు రైతులకు అందజేయాల్సి ఉంది. అయితే కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ విత్తనాలు సేకరించి రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.

కల్తీ విత్తన తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవలని రైతుల డిమాండ్..
ఇప్పటికైనా కల్తీ విత్తన తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ విత్తన వ్యాపారుల భరతం పడుతారో లేక అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది.

11:19 - July 20, 2016

గుంటూరు : బ్రాడీపేటలోని అర్బన్ బ్యాంక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ ఎన్నికల నామినేషన్ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ వర్గీయులను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. అర్బన్ బ్యాంకు లో డైరెక్టర్ పోస్టుల పదవీ కాలం ముగియటంతో ఎన్నికలు నిర్వహించే క్రమంలో బుధవారం నాడు నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరపునుండి శ్రీనివాసరావు నామినేషన్ వేయటానికి వచ్చారు. కాగా గతంలో కూడా ఆయనే చైర్మన్ గా వుంటంతో ఈసారి టీడీపీ తరపునుండి అవకాశం ఇవ్వాలని టీడీపీ వర్గీయులు ఈ తోపులాటకు దారితీసినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ అంశంపై టీడీపీ నేత మాట్లాడుతూ బీజేపీ టీడీపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నామనీ..మా మధ్య ఎటువంటి విబేధాలు లేవంటున్నారు. సాయంత్రం ఇరు వర్గాలు సమావేశమయ్యి దీనిపై సమన్వంతో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటున్నారు. 

రాజ్యసభ 10 నిమిషాలు వాయిదా..

ఢిల్లీ : కొద్ది సేపటి క్రితం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభమైన కొద్ది సేపట్టికే రాజ్యసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. గుజరాత్ లో దళితలుపై దాడులు అంశం పై చర్చను చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టి.. స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చాయి. దాంతో రాజ్యసభ వాయిదా పడింది.

నగరంలో డిప్లొమా విద్యార్థుల ఆందోళన...

హైదరాబాద్: కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌ వద్ద డిప్లొమా విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. డిప్లొమా విద్యార్థులను కానిస్టేబుల్‌ ఈవెంట్‌లకు అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు.

11:06 - July 20, 2016

హైదరాబాద్ : తొలి చిత్రం తోనే జాతీయ అవార్డును అందుకున్న విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమంతా. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో నాలుగు విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు వాళ్ల కథల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ తో పాటు సీనియర్ హీరోయిన్ గౌతమి, కేరింత ఫేం విశ్వాంత్, బేబి రైనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా మూస మాస్ మసాలా అంశాలేవి లేకుండా తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ ను అందించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన తొలి సినిమానే అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయటం కోసం తెలుగు నేర్చుకొని మరి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారట.

 

ఆప్ మహిళా కార్యకర్త ఆత్మహత్య...

ఢిల్లీ: ఆమ్‌ఆద్మీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. నరేలాలోని తన ఇంట్లో విషం తాగి చనిపోయింది. తనపై వేధింపులకు పాల్పడిన తోటి కార్యకర్త బెయిల్‌పై విడుదల కావడంతో మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

10:56 - July 20, 2016

విజయవాడ : రాజధాని పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పేరుతో అటవీ భూములను లాక్కునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పారిశ్రమిక కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతామంటూ అటవీ భూముల స్వాధీనానికి సిద్ధమవుతోంది.
కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిచ్చేందుకు ప్రయత్నం...
భూదాహం తీరని ఏపీ ప్రభుత్వం అటవీ భూములపై కన్నేసింది. అభివృద్ధి జపం వల్లిస్తూ అటవీ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాజధాని పేరిట బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. మరోవైపు మచిలీపట్నం పోర్టుకు సంబంధించి లక్షా 5వేల ఎకరాల భూములను చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోంది. ఇవి చాలవన్నట్టు అటవీ భూములను సైతం కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది.

అటవీభూములు అప్పగించాలని కేంద్ర అటవీబోర్డుకు విజ్ఞప్తి..
కృష్ణాజిల్లాలోని నూజివీడు, గుంటూరు జిల్లా తాడేపల్లి, కొండవీడు అటవీప్రాంతాలను డీరెగ్యులైజ్ చేసి తమకివ్వాలని ఏపీ సర్కార్ కేంద్ర అటవీ బోర్డును కోరింది. రాజధాని నిర్మాణానికి భూఅవసరాలు చాలానే ఉన్నాయని, ఇందుకు అటవీభూమిని నోటిఫై చేయాలని విజ్ఙప్తి చేసింది. అటవీప్రాంతాల్లో ఐటీ, పర్యాటక, ఇతర రంగాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. డీనోటిఫై చేసిన అటవీ భూమి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర మార్గంగా ఉండటంతో ఐటీ కంపెనీల అభివృద్ధికి వీలుగా ఉంటుందని తెలిపింది. దీనిపై ప్రజాసంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణ వినాశనానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వ ప్రతిపాదనలకు అటవీబోర్డు సూచనప్రాయ అంగీకారం..
తాము కోరిన విధంగా అటవీ ప్రాంతాలను డీనోటిఫై చేసేందుకు ప్రతిగా కడప, ప్రకాశం జిల్లాల్లో అడవుల పెంపకానికి ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనలను అటవీబోర్డు సూచనప్రాయంగా అంగీకరించింది. సాంకేతిక సలహాబోర్డు సిఫార్సుల చేస్తే, కేంద్ర అటవీ శాఖ వాటిని ఆమోదించి తుది నివేదిక ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలు ఏమాత్రం అనుమతించదగ్గవి కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు అడవులను సైతం వదలడంలేదని విమర్శిస్తున్నాయి.

మండిపడుతున్న విపక్షాలు, ప్రజాసంఘాలు ....
అటవీభూములను సైతం కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడంపై విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం సమగ్ర నివేదికతో అన్ని పార్టీల ఆమోదం పొందాకే అటవీభూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

10:51 - July 20, 2016

ఢిల్లీ : కేంద్రపట్టణాభివృద్దిశాఖమంత్రి వెంకయ్యనాయుడుతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు . హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీకి హడ్కో నుండి 785 కోట్ల రూపాయల రుణం ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరానని కేటీఆర్ చెప్పారు. మూసీప్రక్షాళనలో భాగంగా రెండో విడత పనులకుగాను 930 కోట్లరూపాయలు నేషనల్ రివర్స్ ప్లాన్ కింద కేటాయించాలని కోరానన్నారు. 

10:48 - July 20, 2016

హైదరాబాద్ : సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్ఫణలో శ్రీనాగ్‌ కార్పొరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆటాడుకుందాం రా..' (జస్ట్‌ చిల్‌). ఈచిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా ఆగస్ట్‌ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ పొంగులేటి దీక్ష

ఖమ్మం: ప్రాజెక్టుల పేరు మార్పును వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దీక్షకు దిగారు.

గుంటూరులో టిడిపి, బిజెపి వర్గీయుల మధ్య వాగ్యుద్ధం..

గుంటూరు : బ్రాడీపేటలోని అర్బన్ బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నేత కన్నా మద్దతుతో తిరిగి నామినేషన్ వేసేందుకు ప్రస్తుత ఛైర్మన్ కొత్తమాకు శ్రీనివాసరావు యత్నించారు. అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగాబోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయబోయనున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

10:32 - July 20, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు దీపికా నటించిన హాలీవుడ్ మూవీ ‘ట్రిపులెక్స్-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌కేజ్’ ట్రైలర్ వచ్చేసింది. దాదాపు నిమిషమున్నర వీడియోలో కేవలం మూడు లేదా నాలుగు సీన్స్‌కే పరిమితమైంది ఈ అమ్మడు. డీజే క్యారుసో డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌లో హాలీవుడ్‌ నటుడు విన్‌డీజిల్‌తో‌‌పాటు నీనా డోబ్రేవ్‌, రూబీ రోజ్‌లు నటించారు. ఇందులో నటీనటుల సాహసాలకు కొదవలేదు. నార్మల్‌గా మంచు ప్రాంతాల్లో సాహసవీరులు చేసే స్కీయింగ్‌ గేమ్‌ని ఇందులో డిఫరెంట్‌గా చూపించాడు. ఇక టెక్నాలజీని బాగానే వినియోగించుకున్నాడు. అంతా రైట్ టైమ్‌లో జరిగితే వచ్చే ఏడాది జనవరి 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన.

తెలంగాణాలో కృష్ణా పరవళ్లు.....

హైదరాబాద్: ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ రెండు రిజర్వాయర్లూ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు కిందకు వదులుతుండగా, కొద్దిసేపటి క్రితం నీరు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాను తాకింది. అప్పటివరకూ నీలి రంగులో ఉన్న నీళ్లు, ఎరుపు రంగులోకి మారింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటూ, కృష్ణమ్మకు పూజలు జరిపారు. ఈ సాయంత్రానికి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతుందని అధికారులు వివరించారు.

దళితులపై దాడులు..కాంగ్రెస్, ఆప్ చర్చకు నోటీసులు

ఢిల్లీ : గుజరాత్ లో దళితులపై దాడులను నిరసిస్తూ లోక్ సభలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు చర్చకు నోటీసులిచ్చాయి.

అమర్ నాథ్ యాత్రలో విషాదం..

తూర్పు గోదావరి : గండేపల్లి మండలంలోని కె.గోపాలపురానికి చెందిన బుదిరెడ్డి రాజు(49) అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి మృతి చెందారు. రాజు తన భార్య నర్సయ్యమ్మతో కలిసి మరో 50 మందితో కలిసి ఈ నెల 15న రాజమహేంద్ర వరం నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. జమ్మూకశ్మీర్‌ కాట్రా గ్రామంలో గది అద్దెకు తీసుకుని అక్కడ ఉన్న వైష్ణవీ దేవిని దర్శించుకునేందుకు సోమవారం సాయంత్రం బయలు దేరారు. ప్రయాణంలో రాజు గుండె పోటుకు గురయ్యారు.

 

ఫార్మాసిటీపై ప్రజలు ఆందోళన చెందవద్దు: కేటీఆర్

ఢిల్లీ : ఫార్మా సిటీపై ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృధ్ధికి సహకరించాలని వెంకయ్యను కోరినట్లు తెలిపారు. ఫార్మాసిటీకి హడ్కో ద్వారా రూ.785 కోట్ల రుణం ఇప్పించాలని కోరానని., అత్యున్నత ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మిస్తామన్నారు. ఫార్మాసిటీ భూసేకరణపై రైతులతో చర్చిస్తామన్నారు.

రుణభారంతో రైతు ఆత్మహత్య...

వరంగల్ : విత్తిన పంట చేతికి రాదేమోనన్న భయంతో అప్పుల బాధ తట్టుకోలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొంటి మండలంలోని నాచినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొమ్మినేని శ్రీనివాసరెడ్డి(38) అనే రైతు మంగళవారం రాత్రి 11:30 గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

10:08 - July 20, 2016

కడప : కడప జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. టీడీపీ ఆఫర్‌కు వైసీపీ నేతలు క్యూ కడుతుంటే...వైసీపీలో రోజురోజుకు కలవరం పెరుగుతోంది. నిన్న చంద్రబాబు సమక్షంలో వైసీపీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం వైసీపీ నేతలకు మింగుడుపడటంలేదు. మరికొందరు కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న గుసగుసలు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.

వైసీపీ కంచుకోటపై చంద్రబాబు దృష్టి..
డప జిల్లా వైసీపీకి కంచుకోట. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వైసీపీదే హవా. గత ఎన్నికల్లో కూడ వైసీపీ తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోగా.. టీడీపీ ఒక్క ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకుంది. వైసీపీకి కీలకమైన కడప జిల్లా మీద తెలుగు దేశం అధినేత దృష్టిపడింది. జగన్‌ను సొంత జిల్లాలోనే దెబ్బతీయాలన్న లక్ష్యంతో ముందు నుంచి పావులు కదుపుతున్నారు చంద్రబాబు. ఈ వ్యూహంలో భాగంగానే.. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీను టీడీపీలో చేర్చుకున్నారు. ఇంతటితో ఊరుకోకుండా, కడప కార్పొరేషన్ మీద టీడీపీ కన్నేసింది. ఇటీవల లోకేష్ పర్యటన సందర్భంగా కొందరు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. కార్పొరేటర్లు టీడీపీలో చేరినంత మాత్రానా కడప నగరపాలక సంస్థలో వైసీపీ బలం తగ్గదని.. మేయర్ పీఠానికి వచ్చిన సమస్యలేదని అంటున్నారు.

వైసీపీ కార్పొరేటర్ల చేరికతో 20కి చేరిన టీడీపీస్థానాలు...
కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు 44 గెలుచుకుంది. అయితే.. ఇప్పడు వైసీపీ బలం 30 కి పడిపోయింది. కేవలం ఆరుగురు మాత్రమే టీడీపీ తరపున కార్పొరేటర్లు గెలిచారు. అయితే.. ఇటీవల వైసీపీ కార్పొరేటర్ల చేరికతో .. టీడీపీ బలం 20కి చేరింది. మరో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఇలాగే కొనసాగితే.. మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీకి ఢోకా లేదని చెబుతున్నారుర. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

మేయర్ పీఠంపై వైసీపీ భయం...
వైసీపీ నేతలు పైకి బాగానే మాట్లాడుతున్నా.. లోలోపల మాత్రం మేయర్ పీఠం ఎక్కడ చేజారిపోతుందోనన్న భయం వెంటాడుతోంది. మరి కొందరు కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్తారన్న సమాచారంతో.. మిగిలిన వైసీపీ కార్పొరేటర్లను చేజారకుండా జాగ్రత్త చర్యలు చేపడుతోంది వైసీపీ పార్టీ.

10:06 - July 20, 2016

హైదరాబాద్ : మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’ చిత్రం రీమేక్‌లో నాగచైతన్య నటిస్తున్నారు. అది ‘ప్రేమమ్‌’ పేరుతోనే తెరకెక్కుతోంది. చైతూ కెరీర్‌లో ఓ మంచి విజయంగా నిలిచిపోయిన ‘తడాఖా’ రీమేక్‌గానే తెరకెక్కింది. ఇప్పుడు ముచ్చటగా మూడో రీమేక్‌కి ఆయన పచ్చజెండా వూపినట్టు సమాచారం. తమిళంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకొంది... ‘మెట్రో’. గొలుసు దొంగతనాల నేపథ్యంలో సాగే ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ సినిమా నాగచైతన్యకి బాగా నచ్చిందట. అందుకే ఆ సినిమాని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘ప్రేమమ్‌’ చిత్రాల్లో నటిస్తున్న నాగచైతన్య తదుపరి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. దాని తర్వాతే ‘మెట్రో’ రీమేక్‌ పట్టాలెక్కనుందని సమాచారం. 

09:58 - July 20, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు... అధికార టీడీపీ మద్దతిస్తుందా..? హోదా వేదికగా కాంగ్రెస్‌ వేసిన స్కెచ్‌లో.. తెలుగు దేశం ఇరుక్కుంటుందా..? బిల్లు చర్చా సమయంలో టీడీపీ ఎలాంటి స్టాండ్‌ తీసుకోనుంది. ఓటింగ్‌ సమయంలో తెలుగుదేశం ఎలా వ్యవహరించబోతోంది. జస్ట్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...!

ఈ నెల 22న రాజ్యసభలో చర్చకు రానున్న బిల్లు...
విభజన హామీలు అమలు చేయాలని.. పార్లమెంటులో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు.. అధికార టీడీపీకి ముందు నుయ్యి.. వెనుకు గొయ్యిలా మారింది. ఈ నెల 22న రాజ్యసభలో బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా బిల్లుపై పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు మద్దతిస్తుందా...? లేక వ్యతిరేకిస్తుందా..? కాంగ్రెస్‌ వ్యూహానికి టీడీపీ ఎలా సమాధానం ఇవ్వనుందన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆచి తూచి అడుగులేస్తోన్న టీడీపీ...
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పరిశ్రమలకు రాయితీ వంటి హామీలిచ్చింది అప్పటి యూపీఏ సర్కార్. కానీ ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆ హామీలపై నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంతో వివాదాలకు పోకుండా టీడీపీ ఆచితూచి ముందుకు సాగుతోంది.

ప్రైవేటు బిల్లుకు మద్దతిస్తే బీజేపీతో చెడనున్న స్నేహం...
కేంద్రంలో బీజేపీ సర్కార్‌కు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తే బీజేపీతో మిత్రధర్మం వీడినట్లవుతుంది. ఒకవేళ వ్యతిరేకంగా ఓటేస్తే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుపై ఎలా వ్యవహరించాలన్నదానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. బిల్లుకు మద్దతు తెలుపుతూనే.. నాడు ఏకపక్షంగా సాగిన రాష్ట్ర విభజనపై.. కాంగ్రెస్‌ వైఫల్యాలను తూర్పార బట్టాలని టీడీపీ నిర్ణయించినట్లు సమాచారం.

ప్రత్యేక హోదాపై రూల్‌ నెంబర్‌ 193 నిబంధన కింద లోక్‌సభలో చర్చ..
నవ్యాంధ్ర ఏర్పడి టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక.. దాదాపు 35 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిశారు. ఎక్కేగడపా దిగే గడపా అన్నట్లు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు. ఇటీవల అంతరాష్ట్ర మండలి సమావేశంలో తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ ప్రధాని ముందే చంద్రబాబు కుండ బద్దలు కొట్టారు. బిల్లు చర్చ సందర్భంలోనూ ఇవే డిమాండ్లను వినిపించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హామీల విషయంలో కేంద్రంపై టీడీపీ పట్టుపడుతూనే ఉందన్నది ఆ పార్టీ వాదన. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై రూల్‌ నెంబర్‌ 193 నిబంధన కింద లోక్‌సభలో చర్చను చేపట్టాలని ఇప్పటికే స్పీకర్‌కు టీడీపీ నోటీసులిచ్చింది.

మద్ధతు కూడగట్టే యత్నంలో కాంగ్రెస్...
బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో సభలో ఎదురయ్యే సవాళ్లను టీడీపీ ఎలా తిప్పికొడుతుందో చూడాలి. 

బ్యాంకు దోపిడీకి యత్నం... గ్రామస్థులపై కాల్పులు

రంగారెడ్డి : మొయానాబాద్ అజీజ్ నగర్ లోని దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపీడీ దొంగలు చోరీకి యత్నించారు. దుండగులను అడ్డుకునేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా వారి కాల్పులు జరిపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

09:53 - July 20, 2016

విజయవాడ : ఏపీ సర్కార్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. 'వనం-మనం' పేరుతో చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలనిచంద్రబాబు సూచించారు. కార్యక్రమం విజయవంతం కోసం త్వరలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఒకేరోజు కోటి మొక్కలు నాటేందుకు ఏపీ సర్కార్‌ కసరత్తు..
ఒకేరోజు కోటి మొక్కలు నాటే మహాకార్యానికి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ముహూర్తం ఖరారు చేసింది. అటవీ, పర్యావరణశాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు 'వనం-మనం' కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

నూజివీడు సమీపంలోని సుంకొల్లులో ప్రారంభించనున్న చంద్రబాబు..
కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని సుంకొల్లు గ్రామంలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా మంత్రులందరూ జిల్లాలవారీగా మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని.. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. 'వనం-మనం' కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు త్వరలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

2029 నాటికి అటవీ విస్తీర్ణం 50 శాతానికి విస్తరించేలా..
2029 నాటికి అటవీ విస్తీర్ణం 50 శాతానికి విస్తరించేలా చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం కోసం అధికారులు ఉద్యమస్పూర్తితో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థల సాయం కూడా తీసుకోవాలన్నారు. హరితాంధ్రప్రదేశ్‌ సాకారానికి అవసరమైన నిధులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు పెద్ద సంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేపట్టకుండా.. ఏడాది పొడవునా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

ఎకో టూరిజంపై చంద్రబాబు పలు సూచనలు ...
ఇక ఎకో టూరిజంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. కొల్లేరు మంచినీటి సరస్సులో కనీస నీటిమట్టం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఇందుకు గోదావరినీటిని తరలించాలన్నారు. రాష్ట్రంలో ఐదు బర్డ్‌ శాంక్చురీలను అభివృద్ధి చేయాలని.. మడ అడవులను కాపాడాలని అధికారులను ఆదేశించారు. టైగర్‌ ఫారెస్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని.. ఏడాదిలోగా తిరుపతి, విశాఖ జూపార్క్‌లను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్‌ సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. 

లాభాలాతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌‌‌ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. నిన్న ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు చివర్లో కాస్త పుంజుకుని చివరకు స్వల్ప లాభంతో ముగిశాయి.

09:45 - July 20, 2016

ఢిల్లీ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఇవాళ భేటీ కానుంది. రెండు రాష్ట్రాలకు నీటి అవసరాలు, సెన్సర్ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనుంది. నాగార్జునసాగర్‌ కుడి కాలువకు 8 టీఎంసీలు, ఎడమ కాలువకు 4 టీఎంసీలు తాగునీటి అవసరాలకు అవసరమని ఏపీ కోరుతోంది. పుష్కరాలతోపాటు కృష్ణా డెల్టాలో తాగునీటికోసం మరో 4 టీఎంసీలు కావాలని బోర్డు ముందు ఏపీ తన డిమాండ్‌ వినిపించనుంది... గత ఏడాది సాగర్‌ ఎడమ కాలువ నుంచి నీటిని ఇచ్చేందుకు బోర్డు అంగీకరించినా, ఆ నీరు అందని విషయాన్ని ప్రస్తావించనుంది.
నీటి లభ్యత, వినియోగ లెక్కలు తేల్చనున్న కమిటీ..
తెలంగాణ ప్రభుత్వంకూడా హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు అవసరమని ఇప్పటికే కృష్ణా బోర్డు దృష్టికి తీసుకువెళ్లింది. రెండు రాష్ట్రాల అవసరాలు, ఎక్కడ ఎంత నీరు వాడారో స్పష్టంగా లెక్కించేలా 14 చోట్ల సెన్సర్ల ఏర్పాటుపైనా ఇవాళ్టిభేటీలో చర్చ జరగనుంది.. ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 788 అడుగులు ఉండగా... నాగార్జునసాగర్‌లో 503 అడుగులకు చేరింది. ఆలమట్టి నుంచి నారాయణపూర్‌కు జలాలు చేరుతున్నాయి. అవి ఈ వారంలోనే శ్రీశైలం జలాశయంలోకి చేరతాయని అంచనా వేస్తున్నారు. నీటి చేరికపై ఉన్న అవకాశాలనూ దృష్టిలో ఉంచుకుని బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

09:38 - July 20, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా పైవేటు బిల్లు మద్ధతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందుకోసం జాతీయ పార్టీల నేతలతో రఘువీరా బృందం ఈ రోజు భేటీ కానుంది..ఇప్పటికీ వీరితో ఇంతకుముందే ఒకసారి సమావేశమై.. బిల్లుపై మద్దతు కోరింది..ఇవాళ మరోసారి భేటీ కానుంది..మరోవైపు టీఆర్ఎస్ మద్దతు కూడా కోరాలని కాంగ్రెస్ నిర్ణయించింది..ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ఎంపీ కేకేను కలవనున్నారు..అవసరమైతే దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ నేతలతో మాట్లాడే అవకాశం ఉంది..

ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్న కాంగ్రెస్..
ఇప్పటివరకూ విభజన జరిగిన రాష్ట్రాలకు చట్టంలో లేకపోయిన కేబినెట్ నిర్ణయం మేరకు ప్రత్యేక హోదాను ఇచ్చారు. గతంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే ఆరు పార్టీలకు సంబంధించిన నేతలు తమకు మద్ధతుగా వున్నాయని కాంగ్రెస్ పేర్కొంటోంది. ముఖ్యంగా వామపక్షాలు, ఆర్ఎస్పీ, జేడీయూ వంటి పలు పార్టీల నేతలు తమకు మద్ధతిచ్చేందుకు సిద్ధంగా వున్నాయన్నారు. దీనికి సంబంధించి మూడు లైన్ల విప్ ను కూడా కాంగ్రెస్ జారీ చేయనుంది. ఏపీ సంబందించిన వైసీపీ, బీజేపీ, టీడీపీ నేతల్ని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మద్ధతునివ్వమని కోరాయి. దీనికి సంబంధించి బీజేపీ, టీడీపీ ఎంపీలు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల్ని కోరుకుంటే మద్ధతునివ్వాలని కాంగ్రెస్ కోరింది. ఏది ఏమైనా బిల్లు మద్దతునివ్వాలని కాంగ్రెస్ తన ప్రత్నాల్ని ముమ్మరం చేస్తోంది. దీనిపై స్పష్టతకు వేచిచూడాల్సిందే.

09:35 - July 20, 2016

విశాఖ : జిల్లాలోని కశీంకోట మండలం బయ్యారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాండిక్స్ కంపెనీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 40మంది మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనలో గాయపడి వారంతా బ్రాండిక్స్ కంపెనీకి చెందిన మహిళా కార్మికులు. కాగా ఈ ఘటనలో లారీ అతి వేగంమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా బ్రాండిక్స్ కంపెనీకి సంబంధించిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బస్సులు కండిషన్లో లేకపోవటం ఒక కారణమైతే..కార్మికులను త్వరగా ఫ్యాక్టరీకి తరలించాలనే ఆతృత మరో కారణంగా కనిపిస్తోంది. ఈ ఘనటపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స నందించాలని ఆదేశాలు జారీ చేశారు. 

బస్సును ఢీకొన్న లారీ..40మంది గాయాలు..

విశాఖ : జిల్లాలోని కశీంకోట మండలం బయ్యారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాండిక్స్ కంపెనీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 40మంది మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

ప్రత్యేక బిల్లుకు కాంగ్రెస్ యత్నాలు..

ఢిల్లీ : ప్రత్యేక హోదా పైవేటు బిల్లు మద్ధతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. నేడు జాతీయ పార్టీల నేతలతో రఘువీరా బృందం భేటీ అవుతున్నారు.ఈ బిల్లుపై టీఆర్ఎస్ మద్ధతును కాంగ్రెస్ కోరనుంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ ఎంపీ కేకేను కలవాలని నిర్ణయించుకుంది. టీఆర్ఎస్ నేతలకు దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.

షట్టర్ పగలగొట్టి షాపులో చోరీ..

హైదరాబాద్: దిల్ సుక్ నగర్ లోని ఓ షాపులో తాళం వేసి ఉన్న షాపు షట్టర్ పగలగొట్టిన దొంగలు దుకాణంలోని నగదుతో ఉడాయించారు. బుధవారం షట్టర్ లేపి ఉండటాన్ని గమనించిన గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రూ. 50 వేల నగదుతో పాటు కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

ప్రేమ విఫలం..యువకుడు ఆత్మహత్య?!..

నల్లగొండ : పానగల్‌కు చెందిన మహేష్ రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమడంతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బస్సులో మంటలు..26 మంది సజీవదహనం ..

తైవాన్ : ఫసిపిక్ ద్వీప దేశం తైవాన్ లో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైవే మీదుగా తాయుయాన్ విమానాశ్రయానికి వెళుతున్న టూరిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులను సజీవ దహనమైపోయారు. కనీసం డోర్లు తెరిచేంత అవకాశం లేకుండా అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి.

08:54 - July 20, 2016

గుంటూరు : ఇద్దరి మరణంతో అట్టుడికిన గుంటూరు జిల్లాలోని అడవులదీవిలో ఇంకా ఉద్రిక్తత వాతావరణమే ఉంది...ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..మరోవైపు కట్టుదిట్టమైన భద్రత మధ్య సాయి అంత్యక్రియలు జరిగాయి...ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులపై కేసులు పెట్టిన పోలీసులు విచారణ వేగం చేశారు...

బందోబస్తు మధ్య సాయి అంత్యక్రియలు..ప్లకార్డులతో స్టూడెంట్స్..
జాస్మిన్,శ్రీసాయి డెత్‌తో అట్టుడికిన గుంటూరు జిల్లాలోని అడవులదీవిప్రాంతంలో ఇంకా ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతోంది...అడవుల దీవి గ్రామంలో ఇంకా 144 సెక్షన్ కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు..భారీ బందోబస్తు మధ్య సాయి అంత్యక్రియలు ముగిశాయి...

దాడిచేసిన గ్రామస్తులపై కేసులు ..
శ్రీసాయిపై అడవుల దీవి గ్రామస్తుల దాష్టీకాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చర్యలకు రంగం సిద్దం చేశారు..ఇప్పటికే జాస్మిన్‌ సోదరుడు, బంధువు గౌస్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..సాయి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో సాయిపై చేయి చేసుకుని చనిపోయేలా కొట్టినవారిపై నిఘా ఉంచారు...వీడియో టేపుల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు..

జాస్మిన్ కుటుంబీకుల ఫిర్యాదుపై విచారణ..
మరోవైపు జాస్మిన్‌ ను హత్య చేశారంటూ ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదికపై ఆధారపడ్డారు...అప్పటివరకు సెల్‌ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసే పనిలోపడ్డారు...ఇక ఇందులో ప్రత్యక్షసాక్షిగా...చనిపోయిన సాయి వెంట ఉన్న పవన్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారిస్తామంటున్నారు పోలీసులు.

08:48 - July 20, 2016

తూ.గోదావరి : తూర్పు తీరంపై ఫార్మా పడగ విప్పుతోంది. పచ్చని కోనలో ప్రశాంత జీవనం మీద కాలుష్యం కోరలు చాచబోతోంది. తమ జీవితాలు బాగుచేస్తామని చెప్పి కాలుష్యానికి బలిచేస్తారా అంటూ స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజాభిప్రాయసేకరణ కూడా జరపకుండా ఫార్మా నిర్మాణం కోసం సాగుతున్న వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్‌ ఫార్మా కంపెనీ ఏర్పాటుతో మొదలైన కలకలంపై ప్రత్యేక కథనం....

తూర్పుగోదావరి జిల్లా పై దివీస్‌ ఫార్మా కంపెనీ కన్ను...
దివీస్‌ ఫార్మా కంపెనీ...ఇప్పటికే విశాఖ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఫార్మాపరిశ్రమలు నడుపుతోంది. విశాఖ జిల్లా భీమిలి ప్రాంతంలో కాలుష్యాన్ని వెదజల్లుతూ, కంపెనీ స్థానికుల సమస్యలను పట్టించుకోవడం లేదనే వివాదం నడుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలోని ఒంటిమామిడి, కొత్తపాకలు సహా పలు గ్రామాల భూములను సెజ్ పేరుతో కంపెనీ కాజేసింది. కాని పదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన దాఖలాలు లేవు. తాను అధికారంలోకి వస్తే సెజ్ రైతాంగానికి తిరిగి భూములు అప్పగిస్తానని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ మాట మరిచారు. ఈ ప్రాంతంలో 5వందల ఎకరాల భూమిని దివీస్ కి కేటాయించారు. ఇప్పుడీ భూముల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం దివీస్ పావులు కదుపుతోంది.

తమ బతుకుల్లో కాలుష్యం నింపొద్దని స్థానికుల విన్నపం...
దివీస్ కంపెనీ కన్ను తూర్పుగోదావరి జిల్లా తొండంగి ప్రాంతంపై పడింది. వాస్తవానికి ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. పరుగుడు, యూకలిప్టస్, జీడిమామిడి పంటలతో స్థానికులు హాయిగా జీవనం సాగిస్తున్నారు. ప్రశాంతంగా బతుకుతున్న తమ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమలకు అనుమతినివ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయసేకరణ కూడా జరపకుండా తమకు నచ్చినట్టు వ్యవహరించడం పై మండిపడుతున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పడు కేసులు పెట్టి స్టేషన్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

స్థానికులను మభ్యపెట్టేందుకు దివీస్ ప్రయత్నం..
స్థానికుల వ్యతిరేకతను గ్రహించిన దివీస్‌ యాజమాన్యం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేట్ పద్ధతిలో జనాన్ని పక్కదారి పట్టించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంతో మంచినీటి సరఫరా కోసం చిన్నచిన్న బిల్డింగులు నిర్మిస్తోంది. దీంతో మంచినీరు కాలుష్యం అయినప్పటికీ జనానికి తాగునీరు ఇబ్బంది ఉండదన్న సంకేతాలు పంపుతోంది. అయితే ఇదంతా ఫ్యాక్టరీ పెట్టేంతవరకు మాత్రమేనని ఆ తరువాత ఏం పట్టించుకోరనే విషయం తమకు తెలియనిది కాదని స్థానికులు చెబుతున్నారు.

ఫార్మా కంపెనీ తో స్థానికుల ఆందోళన...
ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తమ ప్రాంతంలో ఫార్మా కంపెనీ నిర్మాణం కానుందనే ఆందోళనతో స్థానికులు ఏ స్థాయిలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

08:43 - July 20, 2016

విశాఖ : రైల్వేస్టేషన్‌లో కలకలం చెలరేగింది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో చైల్డ్‌లైన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును నిలిపివేసి పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలందర్నీ చదివించేందుకు కర్నాటకలోని మదర్సాలకు తరలిస్తున్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది...
అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నారన్న చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారమందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రైల్వే పోలీసుల సహకారంతో రైళ్లలో తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నంలో రైలును నిలిపివేసి 60 మంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లల తరలింపు వ్యవహారంలో పెద్దలను విచారించగా.. కర్నాటక రాష్ట్రంలో పలు మదర్సాలలో పిల్లలను చదవించేందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి సరైన ఆధారాలు లభించకపోవడంతో అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. కర్నాటక మదర్సాలకు ఫోన్లు చేసి ఆరా తీశారు. పిల్లలను విచారించగా వారు కూడా చదువుకునేందుకు వెళ్తున్నామని తెలిపారు.

పిల్లలతో ప్రయాణిస్తే గుర్తింపు పత్రాలు తప్పనిసరి...
పూర్తిస్థాయిలో విషయాలు తెలుసుకున్న అధికారులు, పోలీసులు.. అన్ని వివరాలు తీసుకుని పిల్లలను పంపించారు. ఎవరైనా పెద్దసంఖ్యలో పిల్లలతో ప్రయాణిస్తే తప్పనిసరిగా అన్ని పత్రాలను తీసుకొని వెళ్లాలని అధికారులంటున్నారు. మొత్తానికి పిల్లలందరినీ మదర్సాలకు తీసుకువెళ్తున్నారని ఖరారు కావడంతో ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

'సేఫ్ ఎడ్యుకేషన్' రౌండ్ టేబుల్ సమావేశం ...

హైదరాబాద్ : సేఫ్‌ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మధ్యాహ్నం 2గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం జరుగనుంది.

గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం..

రంగారెడ్డి: డెక్కన్ గ్రామీణ బ్యాంకులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. గడిచిన రాత్రి ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు బ్యాంకులో చోరీకి యత్నించారు. కాగా గ్రామస్థుల సంచారాన్ని గమనించిన దుండగులు అప్రమత్తమై అక్కడినుంచి పారిపోయారు.

నకిలీ డాక్యుమెంట్ల ముఠా అరెస్ట్..

హైదరాబాద్ : ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమాయకులకు ప్లాట్లు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను నగరంలోని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

నగరంలో డెంగీ?!..

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలంలో డెంగీ కేసు నమోదైంది. నెహ్రూనగర్‌కు చెందిన రెహాన్‌ వారం రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండంతో కుటుంబ సభ్యులు నగరంలోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు రెహాన్‌ను పరీక్షించి డెంగీ సోకినట్టు నిర్ధారించారు. ఈ విష యాన్ని శేరిలింగంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సమాచారం అందించారు. 

08:23 - July 20, 2016

హైదరాబాద్:ఉత్కంఠభరితంగా సాగిన టీఎస్‌ ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 11 రీజియన్లలో 10 రీజియన్లను తన ఖాతాలో వేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘంగా టీఎంయూ నిలిచింది.

15,675 ఓట్ల ఆధిక్యంతో విజయం ..
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తొలిసారి జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ హవా చాటింది. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా 15,675 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. మొత్తం 11 రీజియన్లకు గాను 10 రీజియన్లలో విజయం సాధించి మొదటిస్థానంలో టీఎంయూ నిలిచింది.

పలు జిల్లాలో టీఎంయూ హవా..
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాలో టీఎంయూ హవా కొనసాగింది. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు డిపోల్లో విజయం సాధించింది. అలాగే ఆదిలాబాద్‌లో జిల్లాలోని ఐదు డిపోల్లో,.. కరీంనగర్‌ జిల్లాలోని 10 డిపోల్లో,.. నల్లగొండ జిల్లాలోని 7 డిపోల్లో టీఎంయూ గెలుపొందింది. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 9 డిపోల్లో, వరంగల్‌ జిల్లాలోని 10 డిపోల్లో, మెదక్‌ జిల్లాలోని 7 డిపోల్లోనూ టీఎంయూ తన హవాను చాటింది.

తమపై లేనిపోని ఆరోపణలు చేశారన్న టీఎంయూ నేతలు ..
టీఎంయూ గెలుపుతో యూనియన్‌ నేతలు, కార్యకర్తలు డిపోల ఎదుట సంబరాలు చేసుకున్నారు. గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని యూనియన్‌ నేతలంటున్నారు. ఎన్నికలకు ముందు తమపై గిట్టనివారు దుష్ప్రచారం చేశారని.. వాటన్నింటిని తిప్పికొడుతూ కార్మికులు టీఎంయూకు భారీ మెజారిటీ కట్టబెట్టారని నేతలంటున్నారు.

ఖమ్మం జిల్లాలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ -ఈయూ కూటమి ఘన విజయం..
ఇక ఖమ్మం జిల్లాలోని అన్ని డిపోల్లో ఎస్ డబ్ల్యూ ఎఫ్ -ఈయూ కూటమి ఘన విజయం సాధించి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. టీఎంయూ హవా ఇక్కడ ఏ మాత్రం పని చేయకుండాపోయింది.ఎస్ డబ్ల్యూ ఎఫ్ -ఈయూ కూటమి ఘన విజయం సాధించడంతో అన్ని డిపోల ఎదుట కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలో మూడు డిపోల్లో టీఎంయూ...
ఇక రంగారెడ్డి జిల్లాలో మూడు డిపోల్లో టీఎంయూ,.. ఒక డిపోలో ఎన్‌ఎంయూ గెలుపొందింది. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా సాగిన ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు అధికార పార్టీ అనుబంధ సంఘమైన టీఎంయూ గుర్తింపు సంఘంగా నిలిచింది. 

07:57 - July 20, 2016

పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా కోసం కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టబోయే ప్యత్యేక బిల్లుకు టీడీపీ మద్ధతు ఇస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత అనేది లేదు. కారణం రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ అలంభించిన విధానాలను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ రాజకీయ స్వార్థం కోసం చేసిన బలవంతపు విభజన అంశంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా అంశాన్ని చట్టం చేయకుండా కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం చేసిందనేది టీడీపీ వాదన. రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంట్ లో జరిగిన పరిణామాలు తెలిసింది. ఇప్పుడు తాజాగా 2016 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేత కేవీపీ ప్రవేశపెట్టే ప్రత్యేక బిల్లుకు టీడీపీ మద్ధతునివ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ నేతల టీడీపీ నేతలకు లేఖను వ్రావామని కాంగ్రెస్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఈ బిల్లుకు టీడీపీ మద్ధతునిస్తుందా? లేదా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. ఈ చర్చలో నడింపల్లి సీతారామరాజు (ప్రముఖ విశ్లేషకులు), సూర్యప్రకాశ్ ( టీడీపీ నేత), గౌతమ్ (ఏపీసీసీ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు.

07:41 - July 20, 2016

ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ సిటీలు, అమ్రుత నగరాలు నిర్మిస్తామంటున్నాయి. కానీ మరోవైపు దళితులు స్మశానవాటికల కోసం పోరాడుతున్నారు. చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు, విజయనగరం ఇలా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దళితులు స్మశానవాటికల కోసం ఆందోళనలు

మరణం అనివార్యం. పుట్టిన ప్రతి మనిషీ ఏదో ఒకరోజు చనిపోకతప్పదు. మ్రుత్యుదేవత ఎప్పుడు ఏ రూపంలో కబళిస్తుందో ఊహించలేం. మన తోటివారు ఎవరు, ఎప్పుడు, ఏ కారణంతో చనిపోయినా బాధపడతాం. దు:ఖిస్తాం. అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలుకుతాం. స్మశానం దాకా వెళ్లి, అంత్యక్రియల్లో పాల్గొని బరువెక్కిన హ్రుదయాలతో తిరిగొస్తాం. తోటి మనుషుల పట్ల మనం నిర్వర్తించే కనీస ధర్మమిది.

అంత్యక్రియలు కనీస స్థలం లేకపోతే పరిస్థితేమిటి? ..
కానీ, చనిపోయిన ఆత్మీయుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కనీస స్థలం లేకపోతే పరిస్థితేమిటి? స్మశాన వాటికకు వెళ్లేందుకు, మ్రుతదేహాన్ని తీసుకెళ్లేందుకు దారికూడా లేకపోతే అంత్యక్రియలు చేసెదెట్లా? ఇదే సమస్య ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా వుంది.

పలు ప్రాంతాల్లో కానరాని స్మశానవాటికలు ...
చాలాచోట్ల స్మశానవాటికలు లేవు. కొన్ని చోట్ల వెళ్లేందుకు దారిలేదు. మరికొన్ని చోట్ల కబ్జా కోరులు ఆక్రమిస్తున్నారు. అనేక స్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేవు. అంత్యక్రియలకు హాజరైన బంధువులు కనీసం కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు కూడా లేని దుస్థితి. షెడ్డులు వున్న స్మశానవాటికల సంఖ్య చాలా స్వల్పం. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాల్లోనూ స్మశానవాటికల సమస్య చాలా తీవ్రంగా వుంది. గత పదిపదిహేనేళ్ల కాలంలో దాదాపు అన్ని పట్టణాలు విస్తరించాయి. కొత్తకొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. కానీ, ఏ ఒక్క చోటా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించలేదు.

దళితుల పరిస్థితి మరీ దుర్భరం. ...
ఇక దళితుల పరిస్థితి మరీ దుర్భరం. స్మశానవాటికలు లేక, దారులు లేక దళితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి వివాదాలూ తలెత్తి, ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 650 దళితకాలనీలకు, ప్రకాశం జిల్లాలో 450 కాలనీలకు, గుంటూరు జిల్లాలో 300 ఆవాసాలకు, చిత్తూరు జిల్లాలో 550, కర్నూలు జిల్లాలో 400 గ్రామాల్లోని దళితులు స్మశానవాటికలు లేక అవస్థపడుతున్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో 1235 జీవో..
తమకు స్మశానవాటికలు నిర్మించాలంటూ చాలా ఏళ్లుగా దళితులు పోరాడుతున్నారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1235 జీవోను జారీ చేశారు. దళితులకు స్మశాన వాటికలు నిర్మించాలనీ, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రయివేట్ స్థలాలు కొనైనా వాటిని నిర్మించాలంటూ ఆ జీవో పేర్కొన్నారు. స్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా వాటి చుట్టూ ప్రహరిగోడ నిర్మించాలనీ , దహన సంస్కారాలకు వీలుగా షెడ్డులు నిర్మించి, బోర్ లు ఏర్పాటు చేయాలన్నది ఆ జీవోలోని మరో ముఖ్యమైన పాయింట్. కానీ, ఆ జీవో సక్రమంగా అమలు కావడం లేదు. ఇప్పటికీ స్మశానవాటికల కోసం పోరాడాల్సిన దయనీయ స్థితి దళితులది. 

07:37 - July 20, 2016

స్మశానవాటికలు ఇప్పుడో పెద్ద సమస్యగా మారాయి. స్మశానవాటికలకు స్థలం, దారి కేటాయించాలంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం నడుస్తోంది. ఈ సమస్య మీద నిరంతర పోరాటాలు సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ కెవిపిఎస్ నేత మాల్యాద్రి  10టీవీ స్టూడియోకి వచ్చారు. మరి ఆయన చెప్పిన సంగతులేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..స్మశానవాటికల సమస్యలేంటో తెలుసుకోండి..

07:33 - July 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ స్థానికతో ఏపీ సచివాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు రెండేళ్లుగా చేస్తున్న ఆందోళనకు తెపరడింది. 68 మంది ఏఎస్ వో లను ఏపీ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. దీంతో వీరంతా తెలంగాణ సచివాయలంలోని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేశారు. రెండేళ్లుగా ఏపీ సచివాలయంలో పని చేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లను విధుల నుంచి విముక్తి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండేళ్లుగా ఆందోళన ...

ప్రాంత స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. దీంతో వీరంతా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పనిచేయాల్సి వచ్చింది. తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చిన తమను ఏపీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్లుగా ఆందోళన చేస్తూ వచ్చారు. సొంతరాష్ట్రంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వీరంతా ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతోపాటు, పాలకులకు విజ్ఞప్తి చేశారు. రెండేళ్లు చేస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించడంతో వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను వెనక్కి పంపాలి ...
మరోవైపు తెలంగాణ సచివాలయంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను వెనక్కి పంపించాలని సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది. అలాగే తెలంగాణ స్థానికతతో ఏపీ సచివాలయంలో పని చేస్తున్న మూడు, నాల్గవ తరగతి ఉద్యోగులను కూడా సొంత రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అవకాశం కల్పించాలి కోరుతున్నారు. ఏఎస్‌వోల సమస్య పరిష్కారమైన నేపథ్యంలో పదోన్నతుల అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. 

07:27 - July 20, 2016

హైదరాబాద్ : ఈనెల 9న నిర్వహించిన ఎంసెట్‌ -2 పేపర్‌ లీకైందంటూ వస్తున్న వార్తలు ఇటు విద్యార్థులతో పాటు, అటు వీరి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఎంసెట్‌ పేపర్‌ లీకు అంశంపై ఉన్నత విద్యామండలి,జేఎన్ టీయూ అధికారులు విచారణ జరుపుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. పేపర్‌ లీకు అంశం వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎంసెట్‌1లో మార్కులు..ఎంసెట్‌2లో ఎక్కువ మార్కులు ..
తెలంగాణలో మెడికల్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 9న ఎంసెట్‌-2 పరీక్ష జరిగింది. ఈ ప్రవేశ పరీక్ష పేపర్‌ ముందుగానే వెల్లడైందంటూ వస్తున్న వార్తలతో విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ నిర్వహించిన ఎంసెట్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకు తెలంగాణ ఎంసెట్‌-2లో ఎక్కువ మార్కులు రావడమే ఈ గందరగోళానికి కారణమయ్యింది.

లీకేజీ వ్యవహారంలో బెజవాడ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు ?
విజయవాడలోని ఒక కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు వందలోపు ర్యాంకులు వచ్చాయి. దీంతో ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీకి బెజవాడ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పరీక్ష రాసిన విద్యార్ధులు తల్లిదండ్రుల నుంచి జేఎన్‌టీయూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ అధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఎంసెట్‌-1లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధులకు ఎంసెట్‌-2లో ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. లీకేజీ అంశంపై ఉన్నత స్ధాయి కమిటీని నియమించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

రంగంలోకి దిగిన నిఘా వర్గాలు..
లీకేజీ వ్యవహారంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులతోపాటు, నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న ముగ్గురు విద్యార్థులను అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈనెల 25 నుంచి ఎంసెట్‌-2 ర్యాంకర్ల విద్యార్హత ప్రతాల పరిశీలన ఉన్న నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు.

 

07:19 - July 20, 2016

హైదరాబాద్ : నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై సీరియస్‌గా దృష్టిపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. నిర్మాణపనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరిశ్‌రావు అధికారులకు సూచించారు. ఏడాదిలోపుగానే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాడానికి నీటిపారుదలశాఖ ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. అటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కోసం భూసేకరణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

కాళేశ్వరం పనులను త్వరగా పూర్తిచేయాలి : హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ద ప్రతిపాదికగా పూర్తిచేయడానికి పనులు ప్రారంభించాలని మంత్రి హరిశ్‌రావు అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెఢి చేయాలన్నారు. ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్యాలయంలో అధికారులతో హరిష్ రావు సుధీర్ఘంగా చర్చించారు. 18 నెలల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నీటిపారుదల మంత్రి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. వర్క్ షెడ్యూల్ ఖరారు చేశారు. మూడు బ్యారేజీలకు సంబంధించి ఆయా ఏజన్సీలు ఐ.డి.సి. కాన్ఫరెన్సు హాలులో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి.

ప్రాజెక్టులపై నిరంతరం సమీక్షించాలని మంత్రి ఆదేశాలు...
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకోసం భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి. బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం వెంటనే చేపట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల కోసం భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హరీశ్‌రావు సూచించారు. క్యాంప్ లను ఏర్పాటు చేసి బారేజీలు , పంపు హవుజ్ ల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఇంజనీర్లను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

కృష్ణానీటి వాడకంలో టెక్నాలజీ వినియోగంపై సర్కార్‌ దృష్టి..
మరోవైపు కృష్ణా నీటి వాడ‌కం విష‌యంలోనూ గంద‌ర‌గోళం ఏర్పడిన నేప‌థ్యంలో... ఇరు రాష్ట్రాల నీటి వాడ‌కంపై స‌రైన గ‌ణాంకాలు తెలుసుకునేందుకు టెక్నాల‌జీ వినియోగంపై కూడా సర్కార్‌ దృష్టిపెట్టింది. ఈరోజు జరగనున్న కృష్ణానది వాటర్‌ బోర్టు త్రిసభ్యకమిటీ సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఏ రాష్ట్రం ఎంత మేర నీటి వినియోగం చేస్తున్నారో తెలుసుకునేందుకు అత్యాధునిక‌మైన సెన్సర్లు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంద‌నే ప్రతిపాద‌న కూడా క‌మిటీ ముందు ఉన్నట్టు సమాచారం.

బ్రజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఇంక కొనసాగుతున్న వాదనలు...
ఇదిలావుంటే కృష్ణా న‌దీ జ‌లాలా కేటాయింపుల‌పై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ ముందు వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు జరగనున్న త్రిస‌భ్య క‌మిటీ భేటీలో కృష్ణా రివ‌ర్‌మేనేజ్‌మెంట్ బోర్డు వ‌ర్కింగ్ అరెంజ్‌మెంట్స్ పై ప్రధానంగా చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటారని నీటిపారుదలశాఖా అధికారులు చెబుతున్నారు.

07:05 - July 20, 2016

విజయవాడ : రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు కట్టబెట్టేందుకు విడుదలైన టెండర్‌ నోటిఫికేషన్‌తో ప్రభుత్వ కుట్ర బయటపడిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సింగపూర్‌ ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన రహస్య ఒప్పందాలు మరింత తేటతెల్లమయ్యేలా నోటిఫికేషన్‌ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జులై 18న టెండర్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. సింగపూర్ ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఒప్పందాలు మాత్రం బయట పెట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

45 రోజులకే గడువు పరిమితం..

అమరావతి రాజధాని నిర్మాణానికి.. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు కలసి టెండర్ నోటీఫికేషన్ జారీ చేశాయి. ప్రాజెక్ట్‌లో ఎపీ ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ ఇస్తారనేది గోప్యంగా ఉంచారు. దీంతో కౌంటర్ దాఖలు చేసే సంస్థలను అయోమయానికి గురిచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌంటర్ల దాఖలుకు 60 రోజుల గడువు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 45 రోజులకే పరిమితం చేశారు.

సంస్థలు పెట్టే పెట్టుబడి రూ.306.4 కోట్లు ..
ప్రభుత్వానికి ఎంత వాటా అనేది సీల్డ్ కవర్‌లో ఉంచినట్లు టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనడంతో.. ప్రభుత్వం, సింగపూర్‌ సంస్థలతో కుమ్మక్కైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగపూర్ సంస్థలు చేపట్టే ప్రాజెక్ట్ వ్యయం 3,137 కోట్లు అని చెబుతున్నా.. ఇందులో ఆ సంస్థలు పెట్టే పెట్టుబడి 306.4 కోట్లు మాత్రమే. మిగతా నిధులను ప్లాట్లు విక్రయం, భూములను తనఖా పెట్టడం, అప్పులు చేయడం ద్వారా సమీకరిస్తారు.

స్విస్ ఛాలెంజ్ విధానంలో కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించిన సీఆర్‌డీఏ ..
రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేసేందుకు స్విస్ ఛాలెంజ్ విధానంలో కౌంటర్ ప్రతిపాదనలను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ-సీఆర్‌డీఏ ఆహ్వానించింది. సింగపూర్ సంస్థలు అసెండాస్-సిమ్ బ్రిడ్జ్, సెమ్బ్ కార్స్ కన్సార్టియం ప్రతిపాదనలను బహిర్గతం చేసింది. స్టార్టప్ ఏరియాలో సింగపూర్ సంస్థలు ప్రతిపాదించిన ప్రాజెక్ట్ వ్యయం 3,137 కోట్లు. అయితే 25 ఏళ్లపాటు అమల్లో ఉండే ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామనేది పేర్కొనలేదు. స్టార్టప్ ఏరియా వరద నియంత్రణ వ్యవస్థ, 1,691 ఎకరాల భూమి అభివృద్ధి, మురుగునీటి కాలువల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, నీటి సరఫరా వ్యవస్థ, అగ్నిమాపక వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలను 5,500 కోట్ల రూపాయలతో సీఆర్డీఏ కల్పించాలి. సింగపూర్ సంస్థలు, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీలో 221.9 కోట్లను ప్రభుత్వం పెట్టుబడిగా పెడుతుంది. మొత్తం 5,721.9 కోట్లను సీఆర్డీఏ తరపున ఏపీ ప్రభుత్వం ఖర్చుచేస్తే సింగపూర్ సంస్థలు కేవలం 306.4 కోట్లు మాత్రమే వెచ్చిస్తాయి.

ఒప్పందం రద్దు చేస్తే ప్రాజెక్ట్ 100 శాతం నష్టపరిహారం..
ఏవేని కారణాల వల్ల ఒప్పందం రద్దు చేస్తే ప్రాజెక్ట్ వాస్తవ మార్కెట్ విలువలో 100 శాతం నష్టపరిహారం చెల్లించాలి. రాజకీయ కారణాలతో రద్దు చేస్తే ప్రాజెక్ట్ వాస్తవ మార్కెట్ విలువలో ఏటా 150 శాతం చొప్పున పరిహారం చెల్లించాలి. ఈ వ్యవహారంలో ఏవైనా వివాదాలు ఉత్పన్నమైతే వాటిని లండన్ కోర్టులోనే పరిష్కరించుకోవాలంటూ సింగపూర్ సంస్థలు తిరకాసు పెట్టాయి. సింగపూర్ సంస్థలకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం అన్ని షరతులకు అంగీకరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

18 నెలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి..
భవిష్యత్ అవసరాల కోసం ఒక్కో దశలో గరిష్టంగా 100 ఎకరాల చొప్పున.. రెండు దశల్లో 200 ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ పద్ధతిలో రిజర్వు ధరలకు ఇవ్వాలని సింగపూర్ సంస్థలు కోరాయి. 18 నెలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జాప్యం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మెలిక పెట్టాయి. ఎకరానికి 4 కోట్ల రూపాయలను రిజర్వు ధరగా సింగపూర్ సంస్థలు నిర్ణయించాయి. రిజర్వు ధరను ప్రతి దశలోనూ సమీక్షించి, ఏడీపీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. సింగపూర్ సంస్థలు నిర్ధేశించిన రిజర్వు ధర కన్నా తక్కువకు ఎవరికైనా ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఆ మొత్తాన్ని సర్కారే చెల్లించాలి. స్టార్టప్ ఏరియాలో వచ్చే ఆదాయంలో సీసీడీఎంసీ వాటా ఎంత..? సింగపూర్ సంస్థల వాటా ఎంత..? అన్నది బహిర్గతం చేయలేదు. 

వైసీపీ ఎంపీలతో వెంకయ్య..

ఢిల్లీ : రాజ్యసభలో జీఎస్టీ బిల్లు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం విషయమై వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈ రెండు అంశాలకు సంబంధించి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారని, అందుకు తాము ఆమోదం తెలిపామన్నారు. చెప్పామని ఆ ఇద్దరు ఎంపీలు పేర్కొన్నారు.

ప్రధానితో మలేషియా ఉప ప్రధాని భేటీ..

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో మలేషియా ఉప ప్రధాని అహ్మద్‌ జహిద్‌ హమీది భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ద్వైపాక్షిక, ప్రాంతీయ ప్రాముఖ్యత అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా మోదీ గతేడాది మలేషియా పర్యటనను గుర్తుచేసుకున్నారని పీఎంవో విడుదల చేసిన ఓ ప్రకటన పేర్కొంది.

 

ఫ్రాన్స్‌లో మరోసారి ఉగ్ర కలకలం..

పారిస్‌ : వరుస ఉగ్రదాడులతో వణికిపోతున్న ఫ్రాన్స్‌లో మరోసారి కలకలం రేగింది. ఫ్రాన్స్‌ దక్షిణ ప్రాంతంలోని బోలెన్నీ నగరంలో ఓ హోటల్‌లోకి సాయుధుడు చొరబడినట్లు స్థానిక పోలీసుల సమాచారం. అతడి వద్ద కత్తి, పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో ఓ ఉగ్రవాది భారీ ట్రక్కుతో ప్రజలపై దాడి చేసి ఎంతో మందిని ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే.

Don't Miss