Activities calendar

21 July 2016

21:52 - July 21, 2016

చెన్నై : కబాలికి కోర్టు కష్టాలు తీరాయి. గతంలో రజనీకాంత్‌ నటించిన లింగ సినిమాతో నష్టపోయామని.. తమకు పరిహారం చెల్లించే వరకు కబాలి సినిమా విడుదల కాకుండా చూడాలంటూ పంపిణీదారులు మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లారు. అయితే లింగా సినిమాతో కబాలిని ముడిపెట్టడం సాధ్యం కాదంటూ కోర్టు కొట్టివేసింది. దీంతో కబాలి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. రేపు ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్లలో కబాలి మేనియా సృష్టించనుంది. కబాలి మేనియా ఊరు వాడా అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈ సినిమా కోసం వేలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

తీరిపోయిన కష్టాలు..
అటు కబాలికి కోర్టు కష్టాలు కూడా తీరిపోయాయి. కబాలి సినిమా శుక్రవారం విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని శుక్ర ఫిలిమ్స్‌ భాగస్వామి ఆర్‌.మహాప్రభు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టేసింది. గతంలో రజనీకాంత్‌ నటించిన లింగ సినిమాను పంపిణీ చేసిన తమకు తీవ్రనష్టం వాటిల్లిందని.. ఆ సమయంలో నష్టపరిహారం చెల్లిస్తానని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, హీరో రజనీకాంత్‌లు హామీ ఇచ్చారని మహాప్రభు పిటిషన్‌లో తెలిపారు. ఇప్పటికీ తనకు ఇంకా 89లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. ఆ డబ్బులు చెల్లించిన తర్వాతే కబాలి విడుదల అయ్యేలా ఆదేశాలు జారీచేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. పిటిషనర్‌ కోరిన విధంగా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. లింగ సినిమా అంశాన్ని కబాలితో ముడిపెట్టి చూడలేమని స్పష్టం చేసింది. మూవీ రిలీజ్‌కు ఒకరోజు ముందు విడుదల నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో సందడి చేయనుంది. జపాన్‌తో పాటు చైనీస్‌, మలై, థాయ్‌ భాషల్లోకి కబాలిని అనువదిస్తున్నారు. 100 కోట్ల వ్యయంతో నిర్మించిన కబాలి భారీ వసూళ్లు రాబట్టుతుందని అంచనాలు వేస్తున్నారు.

రాజకీయ నాయకులకు..
కబాలి ఫీవర్ సామాన్యులకే కాదు సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కూడా తాకింది. తమకు టికెట్స్ కావాలంటూ థియేటర్ యాజమాన్యాలకు రికమండేషన్ లెటర్స్ వెళుతున్నాయి. ఒక వైపు ఫ్యాన్స్ ఒత్తిడి, మరో వైపు రికమండేషన్ లెటర్స్ థియేటర్ యాజమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమిళనాడుకి చెందిన సమాచార-ప్రచార శాఖ మంత్రి తనకు పది టిక్కెట్లు కావాలని అభిరామి థియేటర్ మేనేజర్‌కి ఓ రికమండేషన్ లెటర్ రాశారు. విడుదల రోజు మొదటిషోకు 10 టికెట్స్ కావాలని తన లెటర్‌లో కోరారు. మరోవైపు తమిళనాడులోని కొన్ని స్టార్టప్‌ సంస్థలు, స్థానిక కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం కబాలి టికెట్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు చిత్రం విడుదల రోజు సెలవును కూడా ప్రకటించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రజినీకాంత్ చిత్రంపై అభిమానులు ఇంతటి ఆదరణ చూపిస్తుండడంతో చిత్ర యూనిట్‌తో పాటు తలైవా కూడా ఫుల్ ఖుషీగా ఉన్నట్లు సమాచారం. చిన్న పిల్లలకు కూడా కబాలి వైరల్‌లా సోకడంతో, ఆయన స్టైల్‌లో ఆడిపాడుతున్నారు.

21:49 - July 21, 2016

ఢిల్లీ : దళితులపై జరుగుతున్న దాడులను పార్లమెంట్‌ఖండించింది. గోసంరక్షణ పేరిట బిజెపి హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దళితులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందాయి. దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. వదంతులు, ఆరోపణల ఆధారంగా దళితులపై దాడులు జరగడం పట్ల సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక లెక్కల ప్రకారం 2015లో 19 శాతం దాడులు పెరిగాయని ఏచూరి అన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే అందులో రోహిత్‌ వేములతో పాటు 23 మంది విద్యార్థులు దళితులేనని పేర్కొన్నారు. దళితులపై పెరుగుతున్న దాడులకు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమే కారణమన్నారు. గుజరాత్‌ ఉనా ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. వృత్తిపరంగా తోలు వ్యాపారం చేసుకునే దళితులపై గోరక్షణ పేరిట దాడులు జరపడం అమానుషమన్నారు.

వేధింపులు అధికమయ్యాయన్న మాయావతి..
బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోవుల సంర‌క్షణ పేరుతో వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని బీఎస్పీ నేత మాయావ‌తి ఆరోపించారు. మొద‌ట ముస్లింలు, ఇప్పుడు ద‌ళితుల‌ను గోవుల సంర‌క్షణ పేరుతో హింసిస్తున్నార‌ని ఆమె విమర్శించారు. ద‌ళితుల హ‌క్కులు కాగితాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని, వాటిని అమ‌లు చేయాల్సిన స్థానాల్లో ఉన్న మ‌నువాదీల వ‌ల్లే ఈ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని మాయావతి అన్నారు. దళితులపై దాడులకు సంబంధించి వారికి సరైన న్యాయం జరగడం లేదని మాయావతి పేర్కొన్నారు. గోవధ నిషేధంపై ఆర్డినెన్స్‌ సందర్భంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మనుస్మృతిని ప్రస్తావించడం చూస్తుంటే దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్తున్నారని సీపీఐ నేత డీ రాజా ధ్వజమెత్తారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా ద‌ళితులు ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జులై 11న గుజరాత్‌ గిర్-సోమనాథ్ జిల్లాలోని ఊనాలో ఆవు చర్మం ఒలిచి స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలతో గోసంరక్షణ కార్యకర్తలు నలుగురు దళితులపై క్రూరంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ దళిత సంఘాలు గుజరాత్‌లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.

21:47 - July 21, 2016

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ మాజీ సిఎం మాయావతిపై బిజెపి నేత దయాశంకర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఎస్పీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆయనను అరెస్ట్‌ చేయాలని పట్టుబట్టింది. దయాశంకర్‌ను అరెస్ట్‌ చేస్తామని యుపి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బిఎస్పీ ఆందోళన విరమించింది. మరోవైపు దయాశంకర్‌ను బిజెపి పార్టీ నుంచి బహిష్కరించింది. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బిజెపి నేత దయాశంకర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై లక్నోలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. బిఎస్పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డప్పులు, ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేపట్టారు. పలు చోట్ల దయాశంకర్‌ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. దయాశంకర్‌ను అరెస్ట్‌ చేయాలని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. దయాశంకర్‌ సింగ్‌పై ఎస్‌సి-ఎస్టీ అట్రాసిటీ కింద హజ్రత్‌జంగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు లక్నో, ఆజమ్‌ఘడ్, బలియాలో ప్రాంతాలకు వెళ్లారు. దయాశంకర్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. 36 గంటల్లో దయాశంకర్‌ను అరెస్ట్‌ చేస్కామని యుపి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బిఎస్‌పీ ఆందోళన విరమించింది.

జన్నత్ జహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు..
మాయావతిపై దయాశంకర్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దయాశంకర్ నాలుక కోసి తెచ్చిన వారికి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఆమె ప్రకటించారు. దయాశంకర్‌ మాయావతిపై చేసిన వ్యాఖ్యలపై బిజెపి విచారం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. ఓ వేశ్యలా ఎవరు ఎక్కువ బేరమాడితే వారికి మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని దయాశంకర్‌ సింగ్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించి కష్టాలు కొనితెచ్చుకున్నారు. 

21:43 - July 21, 2016

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న మల్లన్నసాగర్ ముంపు బాధితుడు నర్సయ్య మృతదేహానికి జస్టిస్ చంద్ర కుమార్ నివాళులర్పించారు. ప్రాజెక్ట్ వలన ఎంతో మంది రైతులు మానసిక క్షోభను అనుభవిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్... ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన బాధితుని కుటుంబానికి 20లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

21:41 - July 21, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబును.. సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఏ గపూర్ లు కలిశారు. ఏపీలో అంగన్ వాడీలకు పెరిగిన వేతనాలను, వీఆర్ఏ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.. ఏపీలో సుమారు 40 లక్షల మంది కార్మికుల కోసం కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేతనాలు వెంటనే చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హమీ ఇచ్చినట్లు మధు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:37 - July 21, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాలకు నీరిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్‌రావు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇవాళ సుడిగాలి పర్యటన చేసిన మంత్రి హరీష్‌రావు,..పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు రిజర్వాయర్వా ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్‌రావు..తెలంగాణాకు అన్యాయం చేసిన గత ప్రభుత్వాల తీరును తూర్పారబట్టారు. పాలమూరు జిల్లాలో మంత్రి హరీష్‌రావు సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాకు చేరుకున్న మంత్రి హరీష్‌రావుకు జిల్లా వాసులు, పార్టీనేతలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆత్మకూరు మండలం నందిమళ్ల దగ్గర బీమా సమాంతర కాలువ ద్వారా నీటి విడుదలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలమూరు బీడు పొలాలకు నీటిని ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని మంత్రి హరీష్‌రావు అన్నారు. కృష్ణా జలాలపై తొలిహక్కు పాలమూరు జిల్లాకే ఉందన్న హరీశ్‌రావు..ప్రస్తత ఖరీఫ్‌లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఉద్యమంలో కలిసిరాని నాయకులు..అభివృద్ధి చెందుతుంటే దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారని హరీశ్‌ మండిపడ్డారు.

ధరూర్ మండలంలో పర్యటన..
ఆ తర్వాత ధరూర్ మండలం రేలంపాడు వద్ద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్‌కు మంత్రి హరీష్‌రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ లిఫ్టు ద్వారా నెట్టెంపాడు, ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫ్లడ్ లైట్లు పెట్టించి అక్రమ కాల్వలు తవ్వి అనంతపురానికి నీళ్లు తీసుకెళ్తుంటే ఎమ్మెల్యే డీకే ఆరుణ మంగళహారతులు పట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాత కొత్తకోట మండలం కేంద్రంలోని రాజీవ్‌ బీమా లిఫ్ట్‌ నుంచి నీటిని విడుదల చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు నీళ్లందిస్తుంటే ప్రతిపక్షాలకు కన్నీళ్లు వస్తున్నాయని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ చేస్తోన్న ప్రజోప్రయోగ పనులను చూసి వారికి దిమ్మ తిరిగిపోతుందని ఎద్దేవా చేశారు. జిల్లాలో బీమా ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం తర్వాత మంత్రి హరీష్‌రావు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. హరీష్‌రావు పర్యటనతో జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. ఆరునూరైనా పాలమూరు జిల్లాకు రాబోయే రోజుల్లో 20లక్షల ఎకరాలకు సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి హరీష్‌రావు అన్నారు. 

21:34 - July 21, 2016

విజయవాడ : ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ ఇష్యూ ఢిల్లీలో హీట్‌ పెంచుతోంది. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ అన్ని రాజకీయ పక్షాలను సంప్రదిస్తుంటే.. హస్తం నేతల తీరుపై టీడీపీ మండిపడింది. రాజకీయ లబ్ది కోసమే ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్లు ఎవరు పెట్టినా మద్దతిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు.. శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో ఓటింగ్‌కు రానుంది. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడింది కాంగ్రెస్‌. ఇప్పటికే సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్‌ఎస్‌, టీడీపీలను సంప్రదించిన హస్తం నేతలు జేడీయూ అధినేత శరత్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

కనిమొళితో భేటీ..
అంతకుముందు డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళితో కేవీపీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల బృందం భేటీఅయ్యింది. రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్‌ బిల్లుకు మద్దుతు ఇవ్వాలని కోరారు. అందుకు డీఎంకే సానుకూలంగా స్పందించింది. ప్రత్యేక హోదాకు టిడిపి, బిజేపి మద్దతివ్వకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాయని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న ఆయన.. శుక్రవారం జరిగే ఓటింగ్‌లో అన్ని పార్టీలు పాల్గొని మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 8 పార్టీల మద్దతు కూడగట్టామన్న ఆయన.. ప్రత్యేక హోదాపై ఇప్పటివరకు టిడిపి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని రఘువీరారెడ్డి అన్నారు.

టీడీపీ ఎంపీల ఆగ్రహం..
మరోవైపు కాంగ్రెస్‌ తీరుపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన పాపం కాంగ్రెస్‌దేనన్న టీడీపీ ఎంపీ తోటనర్సింహం ప్రైవేటు మెంబర్‌ బిల్లు రాజకీయ లబ్ది కోసమేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ముందుకొచ్చినా తమ మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ తీరు చంపేసి.. సంతాన సభ పెట్టినట్లుందని మరో ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. గతంలో బిల్లు చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ సభ్యులు లేకపోవడం వల్లే అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభ, రాజ్యసభలో మరే బిల్లూ ఆమోదం పొందకుండా చూడాలని సీఎం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

మద్దతిస్తామన్న వైసీపీ..
రాజ్యసభ ముందుకు రాబోతున్న ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తామని వైసీపీ మరోసారి స్పష్టం చేసింది. మెజారిటీ సభ్యులు మద్దతు ఇస్తేనే ఈ బిల్లు నెగ్గుతుందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బిల్లుకు మెజారిటీ రాకపోతే ఈ వంకతో టీడీపీ తప్పుకునే అవకాశముందని ఆరోపించారు.  ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ అంశం మరికొన్ని గంటల్లో తేలనుంది. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు ఎన్నిపార్టీలు మద్దతిస్తాయో.. ఎంత మంది దూరంగా ఉంటారో చూడాలి.

20:40 - July 21, 2016

ఆ యువకులపై అమానవీయ దాడి ఎందుకు జరిగింది? ఏ శక్తుల ప్రోద్బలంతో ఈ అరాచకాలు జరుగుతున్నాయి. బతుకుదెరువు కోసం చిన్నా చితకా పనులు చేసుకునే వీరినెందుకు బలిచేస్తున్నారు? మాసం ఎక్స్ పోర్ట్ చేసే బడా వ్యాపారుల దగ్గర చందాలు తీసుకుంటారు.. గ్రామాల్లో బడుగు జీవులను బలి తీసుకుంటారు. ఇదేం న్యాయం. ఇదెక్కడ నీతి.. ఇదే ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న అంశం..ఈ అంశంపై వైడాంగిల్ ప్రత్యేక కథనం..

అట్టుడికిన సభలు..
గుజరాత్ ఘటనపై అటు పలు రాష్ట్రాలతో పాటు చట్ట సభలు కూడా అట్టుడికాయి. సోషల్ సైట్స్ లో వైరల్ గా వ్యాపించిన వీడియో, దేశంలో దళితుల దీనస్థితిని కళ్లకు కట్టింది. మరీ ముఖ్యంగా మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ దేశంలో దళితులపై నిత్యం ఎన్నో దాడులు. ఇక్కడ శవాలు కాల్వల్లో తేలుతాయి. బరిసెలు రక్త తర్పణాన్ని కోరుతాయి, కత్తులు సున్నిత దేహాలపై నాట్యం చేస్తాయి. అమాయకులను చీల్చి చెండాడుతాయి. వెంటాడి, వేటాడి బలి తీసుకుంటాయి. చివరికి అక్కడ బాధితులు మాత్రమే ఉంటారు. కానీ, హంతకులుండరు. ఇప్పుడు గుజరాత్ లో ఆ యువకులపై ఎందుకు దాడి జరిగింది? గుజరాత్ ఎందుకు రగిలిపోతోంది? ఈ ఘటన వెనుక కారణాలేంటి?

కఠిన చర్యలు..కఠిన చట్టాలు రావాలి..
గో కళేబరాల నుంచి చర్మాలను వేరు చేస్తున్న వారిపై జరుగుతున్న దాడులను చూస్తే, ఈ దేశంలో అసలు పశువధ జరగడం లేదా? అని అనుమానం వస్తుంది. పశుమాంసం ఎగుమతిలో ప్రపంచంలో మన దేశం ప్రథమ స్థానంలో ఎలా ఉంది? దళితులైతే చాలు.. ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ చులకనే. బీఎస్పీ అధినేత్రి రాజ్యసభ సభ్యురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై బీజేపీ యూపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాశంకర్ సింగ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. దళితులు దేశంలో ఎలాంటి అభద్రతా వాతావరణంలో ఉన్నారో ఈ అంశం స్పష్టం చేస్తుంది.
స్వతంత్ర భారతంలో నిత్యం దళితులకు జరుగుతున్న అవమానాలెన్నో, కులం, పేరుతో మతం పేరుతో జరుగుతున్న దాడులెన్నో. అమానవీయంగా, అన్యాయంగా ఎందరినో కుల దురహంకారం బలిగొంటోంది. ఏళ్లకేళ్లు న్యాయం జరగక, దళితులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సాక్ష్యాలు చూపటంలో సర్కార్లు విఫలమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు కూడా ఇలాంటివే. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కఠిన చర్యలు, కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో చూడండి. 

20:31 - July 21, 2016

మాయావతిపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు..సర్కారు దావఖాండ్ల సక్కగ జూసుడు గాదు.. అస్సలు సూశెటోళ్లే లేకుంటైండ్రు ఇప్పుడు..ఒక దగ్గర ఇళ్లను కూల్చేసిన అధికారులు...అండ్లకెళ్లి పైసలు పోతుంటయ్ వస్తుంటయ్.. ఏమన్న ఎక్వతక్వైతె మీ ఇంటికి నోటీసులొస్తయ్.. అప్పుడు ఎట్లుంటది మీకు..? అగో సేమ్ ఈ పోరగాళ్లకు గూడ అట్లనే ఉన్నది..బోనాల పండుగ స్పెషల్..దానిమ్మ పండ్లను అమ్ముకుంటున్న ఒకామె దగ్గర చోరీ చేయబోయిన దొంగోడు..మీడియా అంటె ఏంది..? అన్యాయం గనిపిచ్చినా..? గాంధీగారి కోతుల లెక్క కండ్లు మూస్కోని చెవ్వులు మూస్కోని.. నోరు మూస్కోని కూసోవాలెగదా..? గిట్ల జేస్తరా..? ఈ ముచ్చట్లపై టెన్ టివి లో 'మలన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' ముచ్చట్లు ఎలా చెప్పిండో తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి..

ప్రభుత్వాసుపత్రిలో బాబు మిస్సింగ్ పై వివరాలు వెల్లడించిన సీపీ..

విజయవాడ : ప్రభుత్వాసుపత్రిలో బాబు మిస్సింగ్ కేసుపై వివరాలను సీపీ గౌతం సవాంగ్ మీడియాకు వివరాలు అందించారు. దంపతులు నాగమల్లీశ్వరీ, రాజు, రికార్డు అసిస్టెంట్ శ్రీను, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నాగమల్లీశ్వరీకి ఆఫీసు అసిస్టెంట్ శ్రీను సహకరించారని, బిడ్డను పెంచుకోవడం కోసమే ఎత్తుకెళ్లారని సీపీ పేర్కొన్నారు. కేసుపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందచేయడం జరుగుతుందన్నారు. 

20:17 - July 21, 2016

బహుష ఈ ముచ్చట ఇంటే కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారు గూడ నోరు దెరుస్తడో ఏమో.. ఎందుకంటె ఆయిన దివ్వదృష్టికి దొర్కని ముచ్చట ఇది.. ఏదంటే.. మనం అన్నం వండుకుంటె అన్నం ఏ కలర్ల ఉంటది.. తెల్లగ మల్లెపువ్వుల లెక్క అయితదిగదా..? ఓడిబియ్యం వండుకుంటె పస్పుపచ్చగుంటది.. అంతేనా..? కని ఒక తాన పొద్దుగాళ్ల తెల్లగుంటుంది అన్నం.. సల్లగైతె ఎర్రగైతుంది.. గమ్మతిలేదు.. ఏంటా ముచ్చట అనేది తెల్సుకోవాలంటే వీడియో సూడుండ్రి..

సీఐడీ కార్యాలయానికి వచ్చిన ఎంసెట్ 2 కన్వీనర్..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్-2 కన్వీనర్ రమణారావు గురువారం సాయంత్రం సీఐడీ కార్యాలయానికి విచ్చేశారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంపై సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 

19:30 - July 21, 2016

హైదరాబాద్ : ఎవరు ప్రారంభించారో ఎలా ప్రారంభించారో తెలియదు కానీ, ప్రతి ఏటా జులై 21న జంక్ ఫుడ్ డేగా పాటిస్తున్నారు. జంక్ ఫుడ్ డే మంచి చెడులు లాభ నష్టాల గురించి మనకో సందర్భం దొరికింది. వీటినే తిని, వీటినే త్రేన్చేవారి సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వాటిలో జంక్ ఫుడ్ మార్కెట్ దే ఫస్ట్ ప్లేస్. ఏటా 20 శాతం చొప్పున అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే లక్ష కోట్ల బిజినెస్ జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో రెట్టింపు అవుతుందున్న అంచనాలున్నాయి. ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. మెక్ డొనాల్డ్, డొమినాస్, కెఎఫ్ సి, పిజ్జా హట్, సబ్ వే లాంటి సంస్థలు పది నుంచి 20 ఏళ్ల ఏజ్ గ్రూపును టార్గెట్ చేసుకుంటూ బిజినెస్ వ్యూహాలు రూపొందిస్తున్నాయి. 2014 నాటికి డొమినోస్ 772, మెక్ డొనాల్డ్ 350, కెఎఫ్ సి 307 స్టోరులు ఏర్పాటు చేశాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా జంక్ ఫుడ్స్ వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కోకాకోలా కంపెనీ 500 కోట్ల డాలర్లు అంటే 30 నుంచి 35 వేల కోట్ల రూపాయల దాకా గుమ్మరించేందుకు సిద్ధమైంది.

శుభ పరిణామం కాదు..
జంక్ ఫుడ్ మార్కెట్ విస్తరించడం శుభపరిణామేమీ కాదు. అదో రాబోయే అనారోగ్యానికి హెచ్చరిక. జంక్ ఫుండ్ ఆరోగ్యానికి హానికరం. మత్తు మాదకద్రవ్యాలు, సిగరెట్లు, పాన్ పరాగ్ లు ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్టే, జంక్ ఫుడ్ కూడా హెల్త్ ని దెబ్బతీస్తుంది. షుగర్, గుండె, రక్తనాళాలకు సబంధించిన వ్యాధులకు అది కారణమవుతుంది. ఫాస్ట్ ఫుడ్ కారణంగా తలెత్తే ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయించుకోవడానికి భారతదేశం జాతీయాదాయంలో ఏటా దాదాపు రెండు వేల కోట్లకు పైగా నష్టపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. రోజురోజుకీ విస్తరిస్తున్న జంక్ ఫుడ్ కల్చర్ ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతిస్తోందన్న మాట.

ఎన్నో సమస్యలు...
ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ల ప్రచారానికి ప్రధానంగా స్కూల్, కాలేజీ పిల్లలే. వీటికి అలవాటుపడ్డ పిల్లల్లో ఊబకాయం, బిపి, షుగర్, మతిమరుపులాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల ఆరోగ్యం మీద వీటి దుష్ర్పభావాన్ని గుర్తించిన కొన్ని దేశాలు స్కూళ్లలో వీటి అమ్మకాలను, టీవీలలో అడ్వర్టయిజ్ మెంట్లను నిషేధించాయి. చిప్స్, కుకీస్, క్యాండీ, కార్బొనేటెడ్సోడాలను స్కూల్స్ లో విక్రయించకూడదని కోస్టారికా ఆంక్షలు విధించింది. స్కూల్ పిల్లలకు సుగరీ సోడాలు, ప్రాసెస్డ్స్నాక్స్మొదలైనవి విక్రయించకూడదని మెక్సికో ఆదేశించింది. టాకోస్, బర్కిటోస్, సలాడ్స్లో కొవ్వు తక్కువగా ఉండాలని నిబంధనలు విధించింది. పాఠశాల కేఫ్టీరియాలలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని పెరూ చట్టం చేసింది.

అమ్మకూడదనే నిబంధనలు..
మనదేశంలోనూ స్కూళ్ల క్యాంటీన్లలో జంక్ ఫుడ్స్ అమ్మకూడదన్న నిబంధనలున్నప్పటికీ, అవి అమలుకావడం లేదు. కొన్ని స్కూల్స్ నిర్వహించే కార్యక్రమాలకు బడా సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తూ, తమ అమ్మకాలు పెంచుకుంటున్నాయి. పిల్లలకు ఆరోగ్య స్ర్పుహ వుండదు. నోటికి రుచికరమైనవి తినడానికి ఇష్టపడతారు. ఈ బలహీనతనే సొమ్ము చేసుకుంటున్నాయి జంక్ ఫుడ్ వ్యాపార సంస్థలు. మన దేశంలో ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తి, అమ్మకాలు, ప్రచారాన్ని నియంత్రించే చట్టాలు చేయాల్సిన అవసరం వుంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం జంక్ ఫుడ్స్ వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టడం సంతోషకర పరిణామం. జంక్ ఫుడ్ పై ఫ్యాట్ పన్ను విధంచడం వల్ల కేరళ ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయిన్నప్పటికీ, కనీసం అల్పాదాయ వర్గాలవారైనా జంక్ ఫుడ్ జోలికి వెళ్లరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు సిఫార్సులు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ఫాస్ట్ ఫుడ్స్ వాడకం నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయల ధరలు తగ్గేలా, ఫాస్ట్ ఫుడ్స్ ధరలు పెరిగేలా పన్నులుండాలన్నది వీటిలో ఒకటి. పండ్లు, కూరగాయల సాగుకు సబ్సిడిలిచ్చి, వాటిని ప్రోత్సహించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుల్లో మొదటిది. ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలన్నది రెండో అతి ముఖ్య సిఫార్సు. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లు, డబ్బాలపై మరింత స్పష్టమైన సమగ్రమైన సమాచారంతో కూడిన లేబుల్స్ వుండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే స్లోగన్ సిగరెట్ ప్యాకెట్ల మీద ముద్రించినట్టే, ఫాస్ట్ ఫుడ్ ప్యాకెట్ల మీద కూడా ఇలాంటి హెచ్చరిక ముద్రించాల్సిన అవసరం వుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

19:25 - July 21, 2016

హైదరాబాద్‌ : హైదర్‌గూడలో మాయమైన బాలికల మిస్సింగ్‌ వ్యవహారానికి తెరపడింది. వెష్ణవి వెంట వెళ్లిన మాధవి...తూర్పు గోదావరి జిల్లాలోని తన నాన్నమ్మ ఇంటికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని చిన్నారి నాన్నమ్మ ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదర్ గూడకు చెందిన శరణప్ప, వసంతల కూతురు వైష్ణవి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. స్కూలుకు వెళ్లిన వైష్ణవి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారి పేరెంట్స్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి 5 బృందాలుగా ఏర్పడి పాప ఆచూకీ కోసం గాలించారు. స్కూల్‌కు వెళ్లే మార్గంలో సీసీటీవీ పుటేజీ పరిశీలించడంతో.. వైష్ణవిని అదే స్కూల్‌కు చెందిన ఫిప్త్‌ క్లాస్‌ స్టూడెంట్ మాధవి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. సిసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌లో వెళ్లినట్లుగా గుర్తించారు.

సమాచారమిచ్చిన మాధవి నాన్నమ్మ..
ఇద్దరు బాలికల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగించారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరంలో ఉంటున్న మాధవి నాన్నమ్మ చిన్నారులిద్దరు తన దగ్గరే క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్‌ నుంచి బయటికెళ్లిన చిన్నారులు బంధువుల ఇంటికి చేరినందుకు కథా సుఖాంతమైంది. అదే ఏ కిడ్నాపర్ల చేతిలోనే పడితే పరిస్థితి ఏంటీ? సో మీ చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుపైనే ఉందని తెలుసుకోవాలి. తస్మాత్‌ జాగ్రత్త. 

కేసీఆర్ ను కలిసిన ఎల్ అండి టి ప్రతినిధులు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎల్ అండ్ టి ప్రతినిధులు కలిశారు. ఎల్ అండ్ టి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని, బ్యారేజీ నిర్మాణానికి ముందే పంప్ హౌస్ ల నిర్మాణం చేపట్టి నీటిని లిఫ్ట్ చేయాలని ఎల్ అండ్ టి ప్రతినిధులు పేర్కొన్నారు. బ్యారేజ్ తో పాటు నదికి ఇరువైపులా బండ్ ప్రాంతాలను ఖరారు చేయాలని పేర్కొన్నారు. 

నీళ్లు సముద్రం పాలు కావద్దనే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ -సీఎం కేసీఆర్..

కృష్ణా : గోదావరి నీళ్లు సముద్రం పాలు కాకూడదనే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టడం జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నుండి ప్రతి ఏటా 4,500 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయినా కేవలం వేయి టీఎంసీల నీటినే వాడుకోగలుగుతామన్నారు. మిగతా నీటినంతా ఏపీ సరైన ప్రణాళిక చేపట్టి వాడుకోవచ్చని, ఖమ్మంలోని సీతారామ ఎత్తిపోతల పథకంను బహుళార్ధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.  

కృష్ణా పుష్కర పనులను అడ్డుకున్న ఫారెస్టు అధికారులు..

నల్గొండ : మఠంపల్లి (మం) సుల్తాన్ పూర్ లో తండాలో కృష్ణా పుష్కరాల పనులను ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టడంతో పనులను అడ్డుకున్నారు. దీనితో పనులు నిలిచిపోయాయి. 

ఎమ్మార్వో, వీఆర్వోలను విచారిస్తున్న ఏసీబీ..

కరీంనగర్ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో జమ్మికుంట ఎమ్మార్వో రజిని, వీఆర్వో శ్రీనివాస్ లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 

కోర్టు ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం - మేయర్..

హైదరాబాద్ : కోర్టు ఆదేశాల మేరకే గణేష్ నిమజ్జనం ఉంటుందని, వ్యర్థాలు సాగర్ లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. రోడ్ల నిర్వాహణ సక్రమంగా లేదని, 10, 15 ఏళ్లు చెడిపోకుండా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఫుట్ పాత్ లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

 

సుప్రీం తీర్పును కేసీఆర్ వక్రీకరిస్తున్నారు -గాలి..

హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పును కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఏపీకి భంగపాటు అంటూ అసత్యప్రచారం చేస్తున్నారని ఏపీ టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ అభూత కల్పనలు కల్పించిందని, తెలంగాణ ఇచ్చాక నామం పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్ విభజన చట్టాన్ని కేసీఆర్ ఉల్లంఘించారని, టీఆర్ఎస్ పార్టీ టిడిపి బ్రాంచ్ ఆపీసులా మారిందని విమర్శించారు. 

19:01 - July 21, 2016

కృష్ణా : అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త సైకోలా మారాడు. అత్తారింటికి వెళ్లి రక్తపాతం సృష్టించాడు. భార్య, మామను కత్తితో అత్యంత కిరాతకంగా నరికాడు..అడ్డుకోబోయిన అత్త, బావ మరిదిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య, మామ అక్కడికక్కడే మృతిచెందారు. పారిపోతున్న నిందితుడికి పోలీసులు సంకెళ్లు వేశారు.
అర్ధరాత్రి అలజడి జరిగింది. అరుపులు, కేకలతో కాలనీ అంతా మార్మోగిపోయింది. భార్యపై అనుమానంతో అత్తారింటికి వచ్చిన అల్లుడు..క్షణాల్లో ఆ ప్రాంతాన్ని రక్తసిక్తం చేశాడు. ఇద్దరిని చంపి మరో ఇద్దరిని ఆస్పత్రిపాలు చేశాడు. అరుపులతో ఆ ఇంటికి చేరిన స్థానికులు భయానక దృశ్యాలను చూసి ఉలిక్కిపడ్డారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో జరిగిన దారుణం భయానికే భయం పుట్టించింది. తండ్రి కూతుళ్ల దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నాలుగేళ్ల క్రితం వివాహం..
బాపులపాడు మండలం లేలేరు గ్రామానికి చెందిన కొనకళ్ల సుబ్రమణ్యం..కోటపాడుకు చెందిన విజయను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కూతురు లక్ష్మి ఉంది. కొంతకాలం హాయిగా సాగిన కాపురంలో భర్త అనుమానం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. లేని సంబంధాలు అంటగడుతూ అతడు భార్యను చిత్రహింసలు పెట్టాడు. సుబ్రమణ్యం తీరు శృతిమించడంతో..విజయ తల్లిదండ్రులు చాట్రాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అతనికి కౌన్సిలింగ్‌ చేశారు. ఇక అప్పటి నుంచి విజయ.. ఆమె పుట్టింట్లోనే ఉంటుంది.

ఏలూరు ఆస్పత్రిలో బాధితులకు చికిత్స..
భార్య కాపురానికి రావడం లేదని ఆవేశంతో ఊగిపోయిన సుబ్రమణ్యం.. అర్ధరాత్రి కోటపాడులోని అత్తారింటికి వెళ్లాడు. గాఢనిద్రలో ఉన్న భార్య విజయ, మామ వేముల వెంకటేశ్వరరావుపై కత్తితో పాశవికంగా దాడి చేసి చంపాడు. అడ్డుకోబోయిన బావ మరిది వేముల శివ, అత్త సరోజినిపై కత్తితో విరుచుకుపడ్డాడు. బాధితుల ఆర్తనాదాలు, హాహాకారాలతో గ్రామం అట్టుడికింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

పర్వతాపురంలో సుబ్రమణ్యం అరెస్ట్‌..
సీన్‌లోకి ఎంటరైన పోలీసులు తండ్రి కూతుళ్ల మృతదేహాలను తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సుబ్రమణ్యం కోసం వేట సాగించి.. పర్వతాపురం వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

18:57 - July 21, 2016

పశ్చిమగోదావరి : కోనసీమ కన్నీరు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారంగా.. అన్నపూర్ణగా భాసిల్లిన ప్రాంతం.. కరవు కోరలకు చిక్కుకుంటోంది. బంధాలు.. అనుబంధాలను వీడి.. కోనసీమ రైతు కూడా కడుపు చేతబట్టి.. బతుకు తెరువు కోసం వలసెల్లి పోతున్నాడు. కన్నతల్లి లాంటి ఊరును.. అయిన వారినీ వదిలి.. పొట్ట నింపుకునేందుకు వలస బాట పడుతున్నారు. పిల్లకాలువలు, కొబ్బరి చెట్ల మధ్య.. పచ్చని ప్రకృతి సోయగాలను చూస్తేనే కడుపునిండిపోయే.. కోనసీమ.. ఇప్పుడు వలసలతో విలవిలలాడుతోంది. ఎందుకిలా..? రాష్ట్ర ధాన్యాగారానికి ఈ దుస్థితి ఎందుకొచ్చింది..? గోదావరి జిల్లా వలసలపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం..

ఆకలి బాధ..
ఒకప్పుడది ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారం..జల సిరులతో.. కళకళలాడే పైర్లతో అలరారిన ప్రాంతం..కానీ నేడు పరిస్థితి పూర్తిగా భిన్నం.. కోనసీమ ఆకలిబాధతో అలమటిస్తోంది. రైతుల వలసలతో తల్లడిల్లుతోంది. పచ్చని పైర్లకు నెలవైన గోదావరి జిల్లాల్లో నెలకొన్న దుస్థితి. పిల్ల తెమ్మరల హోరుతో.. పచ్చని పైరుల సోయగాలతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న గోదావరి జిల్లాల్లోనూ జనం వలసబాట పట్టడం అత్యంత దయనీయం. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, జలసిరులతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు పనులు లేక కుదేలవుతున్నాయి. వ్యవసాయ రంగం కునారిల్లి.. దాని స్థానంలో ఆక్వారంగం విస్తరించడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు, కూలీలు ఊళ్లను విడిచిపెట్టి.. ఉపాధి వేటలో వలస బాట పడుతున్నారు.

వలసలు..
ఏటా రెండు పంటలు పండించే అన్నదాతలు, వ్యవసాయాన్నే నమ్ముకున్న కూలీలు పొట్ట చేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లడం పల్లెల దుర్భర పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. వ్యవసాయం తప్ప వేరే తెలియని సెంట్రల్‌ డెల్టాలోనూ పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచకీరణ పరిణామాలతో భూ యజమానులు పల్లె విడిచి పట్నం బాట పట్టడం, ఉన్న భూముల్ని కౌలుకిచ్చి వలస బాట పట్టడం సాధారణమైంది. కౌలు రైతులు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొనడం నిజంగా దారుణం. పంటలు వేసే సమయంలో సాగు వ్యయం పెరిగడం, పంట చేతికొచ్చాక కనీస గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రుణభారం పెరిగి వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

పొలాలన్నీ చేపల చెరువులు..
వ్యవసాయం సన్నగిల్లి పోయింది. పంట పొలాలన్నీ చేపల చెరువులుగా మారుతున్నాయి. ఆక్వారంగం విస్తరించడంతో పాటు విస్తృతమైన యాంత్రీకరణతో కూలీలకు సైతం ఉపాధి కరువై వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత భూస్వాములు పట్టణాల బాట పడితే.. తర్వాత కౌలుదారులు అదే బాటలో ఉపాధి కోసం పయనమవడం గోదావరి జిల్లాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితికి నిదర్శనం. అత్యధికులు వలస బాట పట్టడంతో.. గ్రామాల్లో ఎక్కడ చూసినా చిన్న పిల్లలు, వృద్ధులే కనిపిస్తున్నారు. 

మూత పడుతున్న పాఠశాలలు..
ఉపాధి కోసం వలస బాట పడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రమాల్లోనే వదిలి వెళ్తున్నారు. ఊళ్లో ఉన్న అమ్మమ్మ, నానమ్మల దగ్గరే పిల్లల్ని ఉంచి, సర్కారీ బడుల్లో చదువుకునేలా చేస్తున్నారు. తల్లిదండ్రులు వలసలు పోవడంతో పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. బంధాలు, బంధుత్వాలను వదిలిపెట్టి.. వలస బాట పట్టిన కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు దూర ప్రాంతాల్లో ఉండటంతో పిల్లలు.. మానసిక వేదనకు గురై బేలగా తయారవుతున్నారు. తల్లిదండ్రుల వలసలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు పిల్లలు ఊరొదిలి తల్లిదండ్రులతో పాటు వెళ్లడంతో పాఠశాలలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అయితపూడిలో రెండు స్కూళ్లను మూసేశారు.

పాలకులు చర్యలు తీసుకోవాలి..
పాలమూరు, అనంతపురం జిల్లాల్లో వలసల గురించి విన్నాం గానీ గోదావరి జిల్లాల్లో వలస పోవడం ఇబ్బందుల తీవ్రతకు నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు, సబ్సిడీ ఎరువులు ఇవ్వడం ద్వారా వలసల్ని నివారించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశానికి పట్టు కొమ్మలైన పల్లెల దుస్థితిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లెల్లో వలసల్ని అరికట్టేందుకు పాలకులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

18:53 - July 21, 2016

పశ్చిమగోదావరి : జిల్లా చినకాపవరంలోని జెడ్ పీ హైస్కూల్ విద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారు. గతవారం రోజులుగా విద్యార్థులు కళ్లుతిరిగి పడిపోతున్నారు. నేడు నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆకివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలలో సరైన భోజన, తాగునీటి వసతులు లేకపోవడం.. నిత్యం మద్యాహ్న భోజనంలో పురుగులు ఉంటున్నాయని విద్యార్థులకు వాపోతున్నారు. చికిత్స అందించిన వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్యులు. ఏలూరు నుంచి వైద్యబృందం చినకాపవరంలో పర్యటిస్తోంది. 

18:51 - July 21, 2016

విజయవాడ : పుష్కర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి అరెస్ట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంకల్లా పుష్కర ఏర్పాట్లు పూర్తి చేయకపోతే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్లను పరిశీలించిన సీఎం..నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ తెలిపారు. 

18:51 - July 21, 2016

అనంత : పాతకక్షలు భగ్గుమన్నాయి. అనంతపురం నగరంలోని రుద్రంపేటకు చెందిన గొపినాయక్, వెంకటేష్ నాయక్ లను ప్రత్యర్థులు దారుణంగా నరికిచంపారు. కాలనీలో గతకొంతకాలంగా రెండువర్గాల మధ్య గొడవ నడుస్తోంది. పోలీసులు గతంలో ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కొద్దికాలం ఆ గొడవలు సద్దుమణిగాయి. అయితే ఈరోజు ప్రత్యర్థులు కాపు కాచి ఇద్దరిని హతమార్చారు. హత్యకు గురైన ఇరువురు గతంలో పలుహత్యలకు పాల్పడినట్లు సమాచారం. ఇరువురు టిడీపీలో గత కొంతకాలంగా క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. 

18:49 - July 21, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జీ డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ జీవీ రాముడు ఈనెల 23న పదవీవిరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో 1984 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సాంబశివరావును ఇంఛార్జ్ డీజీపీ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సాంబశివరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాంబశివరావు ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పూర్తి చేశారు.  

18:45 - July 21, 2016

ఢిల్లీ : 'ఏపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు ఎలా ఉందంటే..చంపేసి..సంతాప సభ పెట్టినట్లుగా ఉంది' అంటూ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడారు. చేసినదంతా చేసి ఇప్పుడు ప్రైవేటు బిల్లు ప్రవేశ పెడుతున్నారని, ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు ఓటింగ్ వచ్చే సమయంలో ఆ పార్టీ సభ్యుడు జైరాం రమేష్ సభలో లేకుండా వెళ్లిపోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సభ్యులు సభలో ఉంటే ప్రైవేటు బిల్లు పాస్ అయి ఉండేదన్నారు. తెలుగు ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉంటే ప్రైవేటు బిల్లు పెట్టడం కాదని, సభలలో ఏ బిల్లు కూడా పాస్ కాకుండా చూడాలని సూచించారు. వెల్ లోకి వచ్చి కూర్చొవాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కించుకోలేని రఘువీరా మాట్లాడుతాడా అని ప్రశ్నించారు. 

18:28 - July 21, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు కొద్దిగంటల్లో రాజ్యసభకు రానుంది. ఈ నేపథ్యంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చు రేగుతోంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం టిడిపి ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. విభజించిన పాపం కాంగ్రెస్సేదనని, అయినా వారు ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతిస్తున్నట్లు ఎంపీ తోట నర్సింహం పేర్కొన్నారు. విభజన అనంతరం వారికి ఒక్క డిపాజిట్ రాలేదని, ఈ పాపం ఎవరిదో తెలుసుకోవాలని సూచించారు. విభజన అడ్డుకొనేందుకు పోరాటం చేయడం జరిగిందని, ఎన్నో అవమానాలు..ఆరోపణలు ఎదుర్కొవడం జరిగిందన్నారు. విభజన వద్దు అని చెబుతున్నా ఏ విధంగా బిల్ పాస్ చేయించుకున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. అప్పటి నుండి కష్టాలు వస్తున్నాయని, అప్పులు ఏపీకి..లాభాలు తెలంగాణకు ఇచ్చి విభజించారని తెలిపారు. ప్రస్తుతం మొసలి కన్నీరు కాస్తున్నారని, అయినా కూడా 13జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. రాజకీయంగా బిల్లు పెట్టారే కానీ అధికారికంగా పెట్టింది కాదని, ఉనికిని కాపాడుకొనే ఉద్ధేశ్యంతో పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ రూల్ నెంబర్ 193 కింద నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. చట్టసభలో చర్చకు రావాలనే ఉద్ధేశ్యంతో చిత్తశుద్ధితో తాము ప్రయత్నించడం జరుగుతుందని ఎంపీ తోట నర్సింహం పేర్కొన్నారు. 

18:25 - July 21, 2016

విజయవాడ : ఆయనో మాజీ ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధి..ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి విపక్ష వైసీపీ పార్టీలో చేరారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఈ ప్రజాప్రతినిధి కట్నం కోసం వేధించాడు. ఆయనే కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్ మురళీ కృష్ణ. తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఇటీవలే ఆమె సతీమణి పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు. ఐదు మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లి వారంతా ముందస్తు బెయిల్ పొందరు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పీఎస్ కు కుటుంబసభ్యులు హాజరైనా మురళీకృష్ణ హాజరు కాకుండా అజ్ఞాతంలో గడిపారు. దీనితో పోలీసులు గురువారం మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
గవర్నమెంట్ యునానీ ఆసుపత్రిలో పని చేస్తున్న నాలుగు నెలల క్రితమే యుగలక్ష్మీని మురళీకృష్ణ వివాహం చేసుకున్నారు. మంచిగా చూసుకోవాల్సిన ఆ ప్రజాప్రతినిధి కట్నం తేవాలంటూ భార్యపై వేధింపులకు గురి చేశారనే ఆరోపణలున్నాయి. కాల్‌మనీ కేసులో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

వైసీపీ ఇన్ ఛార్జీ అరెస్టు..

విజయవాడ : కోడుమూరు వైసీపీ ఇన్ ఛార్జీ మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నం కేసులో భార్యను వేధింపులకు గురి చేసిన కేసులో ఆయన అరెస్టయ్యారు.

ఏపీ ఇన్ ఛార్జీ డీజీపీగా..

విజయవాడ : ఏపీ ఇన్ ఛార్జీ డీజీపీగా ఎన్.సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్.సాంబశివరావు ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 23వ తేదీన డీజీపీగా జేవీ రాముడు పదవీ విరమణ చేయనున్నారు. 

జాస్మిన్, సాయి మృతి కేసులో నలుగురి అరెస్టు..

గుంటూరు : జాస్మిన్, సాయి మృతికి కారకులైన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే జాస్మిన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతికి కారకులంటూ ఇద్దరు యువకులను స్థానికులు కొట్టారు. దీనితో ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

17:52 - July 21, 2016

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్ఉట విభజనపై తీర్పును సమీక్షించాలన్న పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉదయం నుండి జరిగిన ఈ వాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ఇరు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఉమ్మడి హైకోర్టునే కొనసాగించాలని ఏపీ న్యాయవాది వాదనలు వినిపించారు. గచ్చిబౌలిలో హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాయడం జరిగిందని కేంద్ర న్యాయవాది వాదించారు. ఏపీ ప్రత్యేకత హైకోర్టును ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. 

17:48 - July 21, 2016

నిజామాబాద్ : జిల్లా మాచిరెడ్డి మండలం చుక్కాపూర్‌లో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ విద్యార్థినికి.. కొందరు దుండగులు పురుగుల మందు తాగించారు. అత్యాచారం చేసేందుకు దుండగులు ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అరుపులు, కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

17:45 - July 21, 2016

వరంగల్ : భద్రకాళీ దేవాలయం సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయ్యప్ప స్వామి ఆలయంలోని పూజారులు గణపతిశాస్త్రీ, సుబ్రమణ్యం గురుస్వామి వరంగల్ దేవాదాయ ఉపకమిషనర్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇరువురు పెట్రోల్ పోసుకొని నిప్పుపెట్టేకునేందుకు యత్నించగా...పక్కనే ఉన్న భక్తులు వారిపై నీళ్లు పోసి సర్దిచెప్పారు. దేవాదాయశాఖ అధికారులు కావాలనే దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల ఒత్తిడితోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారంటున్నారు పూజారులు. 

17:41 - July 21, 2016

మహబూబ్ నగర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తిచేయకుండా రాయలసీమలో పూర్తి చేసుకున్నారని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించిన మంత్రి...ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌...పట్టుదలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తున్నారన్నారు. పాలమూరు జిల్లాకు 20 లక్షల ఎకరాల నీరిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. 
అంతకు ముందు హరీష్ రావు.. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూరు మండలం భీమా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. పార్లర్ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. జూరాల జలాశయంలో పూలు వేసి పూజలు చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి లక్షా 40వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నుంచి నీరు అందనుంది.  

విద్యార్థినికి పురుగుల మందు తాగించిన దుండగులు..

నిజామాబాద్ : మాచారెడ్డి (మం) చుక్కాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినికి దుండగులు పురుగుల మందు తాగించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. 

మదనపల్లి మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య..

చిత్తూరు : మదనపల్లి మున్సిపల్ కార్యాలయ ఉద్యోగి శ్రీనాథ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ వేధింపులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. 

హైకోర్టు విభజనపై వాదనలు పూర్తి..

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై తీర్పును సమీక్షించాలన్న పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. గత తీర్పును సమీక్షించాలన్న పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

 

16:57 - July 21, 2016

రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది.
చేపలు తినే అలవాటు ఉందా ? చేపల్లో ఉండే మెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మీ ఆరోగ్యానికి, మీచర్మ సంరక్షణకు చాలా మంచిది.
బయటి నుండి వచ్చిన వెంటనే సోప్ తో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ప్రమాదకర‌ బ్యాక్టీరీయా నుండి రక్షణ ఉంటుంది.
మనసిక ఒత్తిడి నుండి వీలైనంతగా దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కోపాన్ని అధిగమించే పద్దతులని అలవాటు చేసుకోండి.
పుస్తకాలు చదవడం, నాటకాలు, సినిమాలు చూడడం, క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయ్యడం అలవాటు చేసుకోండి. దాని వల్ల ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీజ్ఞాపక శక్తి మెరుగవుతుంది.
ఎర్ర ద్రాక్షలు, డార్క్ చాక్లెట్లు, ఉల్లిపాయలు, వాల్ నట్స్ తినడానికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచివి.

తెలుగు విద్యార్థి పరిస్థితి విషమం..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగు విద్యార్థి జి.వి.చైతన్య పరిస్థితి విషమంగా ఉంది. లేహ్ కలెక్టర్ తో తెలంగాణ భవన్ అధికారులు మాట్లాడారు. ఆర్మీ విమానంలో ఢిల్లీకి చైతన్యను తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలికి చైతన్య చెందిన వాడు. శ్రీనగర్ ఐఐటిలో చైతన్య చదువుతున్నాడు. 

కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి కామినేని..

ఢిల్లీ : కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనంత్ కుమార్, అనీల్ దవేలను మంత్రి కామినేని శ్రీనివాస్ కలిశారు. ఎయిమ్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జేపీ నడ్డాను కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ మెడిటెక్ పార్కుకు రూ. 75 కోట్లు విడుదల చేస్తామని అనంత్ కుమార్ చెప్పారని తెలిపారు. కొల్లేరు సరస్సును కాంటూర్ ఐదు నుండి మూడుకు కుదింపుపై కేంద్ర మంత్రి అనీల్ దవేకు వివరాలు అందించడం జరిగిందన్నారు. 

16:37 - July 21, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో మరో విషాదం నెలకొంది. తమ భూమి పోతుందనే కారణంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ లో బత్తుల నర్సయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ కుటుంబాన్ని బీజేపీ నేత రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మొండిగా పోతోందని, రైతు మృతి చెందడం బాధాకరమన్నారు. భూ సేకరణను నిరసిస్తూ ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ హత్య కేసులుగా నమోదు చేసి ప్రభుత్వాన్ని హజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎదుట ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
జాగ పోతుందని ఫికర్ పెట్టుకుండు. ఏం పోదని చెప్పడం జరిగిందని, కానీ అతను మానసిక క్షోభకు గురై ఫ్యాన్ కు ఉరివేసుకుండని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చిన్నం. గాంధీకి తీసుకపోవాలని సూచించడంతో ఇక్కడకు వచ్చామని, ఉదయం మృతి చెందాడని ఆవేదనతో తెలిపారు. 

16:26 - July 21, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు సీఎం చంద్రబాబు నాయుడు అడ్డు పడుతున్నారని, అదే విధంగా బీజేపీ కూడా అడ్డు పడుతోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు శుక్రవారం రాజ్యసభలో రానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వివిధ పార్టీల మద్దతు కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా మీడియాతో మాట్లాడారు. బిల్లుకు సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, జేడీయూ, సమాజ్ వాది పార్టీ, ఎన్ సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, మద్దతు పూర్తిగా ఉంటామని, అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పాయన్నారు. పార్టీ నేతలను కలవడమే కాకుండా ఈ రోజు ప్రత్యేకించి తమ బృందం వ్యక్తిగతంగా కలిసి ఓటింగ్ కు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఓటింగ్ లో పాల్గొని కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లును గట్టెక్కించాలని కోరడం జరిగిందన్నారు. దీనికి వారంతా ఒప్పుకున్నారని తెలిపారు.

బాబు శకుని..
టిడిపి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నుండి ఎలాంటి ప్రకటన రాలేదని, ఆ పార్టీకి చెందిన వారంతా రకరకాలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మద్దతు ప్రకటించకపోగా ప్రైవేటు బిల్లు ఆమోదం పొందిందా ? అని బాధ్యతారహితంగా మాట్లాడం బాధేస్తుందన్నారు. 14 ప్రైవేటు బిల్లులు ఆమోదం పొందమే కాకుండ చట్టాలయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం 15వ బిల్లు ఎందుకు పాస్ చేసుకోకూడదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సన్నాయినొక్కులు నొక్కడం సబబు కాదని, బాబు ఒక శకుని మాదిరిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన చేయరు..ఇతరులు చేస్తే సహించలేని జబ్బు సీఎం చంద్రబాబు నాయుడికి ఉందన్నారు. చట్టంలో లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారే కనుక కేవీపీ ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

బాబు ఎంత బిజియో...
సీఎం చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉన్నారని, ఎంత బిజీ అంటే రేవంత్ రెడ్డికి అదనంగా భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు లేఖ రాయడం అవసరమా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల సొమ్ముతో వివిధ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవాలకు..ఇతరత్రా కార్యాక్రమాలకు వెళ్లలేదా అని నిలదీశారు. అలాంటప్పుడు ఇక్కడకు వచ్చి ఆ పార్టీల నేతలను కలవొచ్చు కదా అని ప్రశ్నించారు. రేపు బిల్లు పాస్ కాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, ఓటింగ్ కు రాకుండా చేయాలని టిడిపి, బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. చర్చలు అవసరం లేదని..రేపు ఓటింగ్ కు పట్టుబడుతామని రఘువీరా తెలిపారు. 

ప్రత్యేక హోదాకు పలు పార్టీలు మద్దతు - రఘువీరా..

ఢిల్లీ : రేపు ప్రవేశ పెట్టబోయే ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు పలు పార్టీలు మద్దతు ప్రకటించాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. రేపు జరిగే ఓటింగ్ లో పాల్గొనాలని అని పార్టీలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నుండి ఎలాంటి ప్రకటన రాలేదని, ఆ పార్టీకి చెందిన వారంతా రకరకాలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 

రోడ్లను బాగు చేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో చెడిపోయిన రోడ్లను వారం రోజుల్లో బాగు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులు, మెట్రో రైల్ వర్క్ జరుగుతున్న రోడ్లలోని గుంతలను వెంటనే పూడ్చాలన్నారు. 

దళితులపై దాడులు అధికమయ్యాయి - ఏచూరి..

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో సీపీఎం సభ్యుడు ఏచూరి ప్రసంగించారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2015 లో దళితులపై 19 శాతం దాడులు పెరిగాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఏచూరి తెలిపారు. 

అన్న మరణం తట్టుకోలేక..

కరీంనగర్ : సిరిసిల్ల (మం) పెద్దూరులో విషాదం చోటు చేసుకుంది. అన్న మరణం తట్టుకోలేక గుండెపోటుతో తమ్ముడు మృతి చెందాడు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న హుస్సేన్ మృతి చెందాడు. 

ఆర్టీసీ ఎండీని కలిసిన ఎస్ డబ్ల్యూఎఫ్ నేతలు..

హైదరాబాద్ : ఆర్టీసీ ఎండీని ఎస్ డబ్ల్యూఎఫ్ నేతలు కలిశారు. సీపీఎస్ కు సెప్టెంబర్ లో జరిగే ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మె ఉన్నందున ఎన్నికల ప్రచారానికి సమయం ఉండదని, మూడో వారంలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.  

కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ ధర్నా..

ఢిల్లీ : ఎమ్మార్పీఎస్ ధర్నా మూడో రోజు కొనసాగుతోంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా ఉన్నాయని, బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఈ వర్గీకరణకు మాలలు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. 

మాదాపూర్ లో రూ. 10 కోట్ల స్థలం కబ్జా..

హైదరాబాద్ : మాదాపూర్ లో రూ. 10 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైంది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమపై దాడి చేసి స్థలం ఖాళీ చేయించారని స్థానికులు పేర్కొంటున్నారు. 

15:44 - July 21, 2016

ఢిల్లీ : టెస్ట్ రెండోర్యాంకర్ టీమిండియాతో నేటి నుంచి ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఆతిథ్య వెస్టిండీస్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలో కరీబియన్ ఆర్మీ విరాట్ సేనకు సవాలు విసురుతోంది. టీమిండియా-వెస్టిండీస్ జట్ల నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఓసారి పరిశీలిద్దాం..

నాలుగు టెస్టు మ్యాచ్ లు..
టెస్ట్ క్రికెట్ రెండోర్యాంకర్ టీమిండియా, 8వ ర్యాంకర్ వెస్టిండీస్ జట్ల...నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఆంటీగా లోని సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. జూన్ 21 నుంచి ఆగస్టు 22 వరకూ జరిగే ఈ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే ఆతిథ్య కరీబియన్ జట్టుకు జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వం వహిస్తున్నాడు. హోల్డర్ కెప్టెన్సీలోని విండీస్ జట్టులో క్రెగ్ బ్రాత్ వెయిట్, దేవేంద్ర బిషూ, జెర్మీన్ బ్లాక్ వుడ్, కార్లోస్ బ్రాత్ వెయిట్, డారెన్ బ్రావో, రాజేంద్ర చంద్రిక, రోస్టన్ చేజ్, షేన్ డార్విచ్, షేనన్ గాబ్రియెల్, లియోన్ జాన్సన్, మర్లోన్ శామ్యూల్స్ కు చోటు కల్పించారు.

జులై 21 నుండి 25 వరకు ..
సిరీస్ లోని తొలిటెస్ట్ మ్యాచ్ యాంటీగాలో జులై 21 నుంచి 25 వరకూ జరుగుతుంది. రెండోటెస్ట్ మ్యాచ్ ను జులై 30 నుంచి ఆగస్టు 3 వరకూ జమైకాలోని సబీనాపార్క్ వేదికగా నిర్వహిస్తారు. సిరీస్ లోని మూడోటెస్ట్ మ్యాచ్ కు సెయింట్ లూషియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ గ్రౌండ్స్ ఆతిథ్యమిస్తుంది. ఆగస్టు 9 నుంచి 13 వరకూ ఈ మ్యాచ్ జరుగుతుంది. సిరీస్ లోని ఆఖరిటెస్ట్ మ్యాచ్ ఆగస్టు 18 నుంచి 22 వరకూ ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా నిర్వహిస్తారు. విరాట్ కొహ్లీ కెప్టెన్ గా, అనీల్ కుంబ్లే చీఫ్ కోచ్ గా టీమిండియా జట్టు సభ్యులు ఇప్పటికే కరీబియన్ ద్వీపాలు చేరుకొని..టెస్ట్ సిరీస్ కు సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే.

15:40 - July 21, 2016

నల్గొండ : టెయిల్ పాండ్ నిర్వాసితులకు అండగా సీపీఎం చేపట్టిన పాదయాత్ర టెయిల్ పాండ్ వద్దకు చేరుకుంది. వర్షంలోనే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు సీపీఎం వారికి అండగా పోరాడుతుందని తమ్మినేని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

15:37 - July 21, 2016

ఢిల్లీ : కాశ్మీర్‌ కల్లోలంపై పార్లమెంట్‌లో వాడి వేడి చర్చ జరుగుతోంది. కాశ్మీర్‌ పరిస్థితులపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లోక్‌సభలో వివరణ ఇచ్చారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు పాకిస్తానే కారణమని ఆయన ఆరోపించారు. సొంతిళ్లు చక్కదిద్దుకోలేని పాకిస్తాన్‌ భారత్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోందని హోంమంత్రి దుయ్యబట్టారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత్‌లో ఏదైనా పెద్ద సమస్య తలెత్తినపుడు మాత్రం దేశంలోని ప్రజలంతా ఒక్కటవుతారని, ఇది మన దేశ గొప్పదనమని రాజ్‌నాథ్‌ కీర్తించారు.

15:36 - July 21, 2016

హైదరాబాద్ : రాజ్యసభ ముందుకు రాబోతున్న ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తామని వైసీపీ మరోసారి స్పష్టం చేసింది. మెజారిటీ సభ్యులు మద్దతు ఇస్తేనే ఈ బిల్లు నెగ్గుతుందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బిల్లుకు మెజారిటీ రాకపోతే ఈ వంకతో టీడీపీ తప్పుకునే అవకాశముందని ఆరోపించారు. కుంటిసాకులు చెప్పడం టీడీపీకి అలవాటేనని విమర్శించారు. 

మద్దతు ప్రకటించిన సీపీఐ..
రేపు రాజ్యసభలో చర్చకు రానున్న ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. హోదాపై ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులదే బాధ్యత అని నారాయణ తెలిపారు. రాజ్యసభలో సపోర్టు చేస్తామని, బయట ఉద్యమాలను ఉధృతం చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటామన్నారు. బాధ్యత వహించాల్సింది బాబు..వెంకయ్య నాయుడు, మోడీ అన్నారని తెలిపారు. విద్యార్థులు ఒకవైపు ఉద్యమిస్తున్నారని, జాగ్రత్త పడి రేపు జరిగే ఓటింగ్ లో తీర్మానాన్ని పాస్ చేయడం ద్వారా ఏపీకి న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. 

15:33 - July 21, 2016

ఢిల్లీ : దేశరాజధానిలో ఏపీ ప్రత్యేక హోదా రాజకీయం హీటెక్కింది. ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై మద్దతుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బిల్లుకు డీఎంకే మద్దతు తెలిపింది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ నేతలకు డీఎంకే నేత కనిమొళి హామీ ఇచ్చారు. మరోవైపు బీజేపీ వ్యూహంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై ఓటింగ్ జరగనిస్తుందా లేదా అన్నదానిపై కాంగ్రెస్ నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రేపు రాజ్య సభలో కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు మద్దుతు ఇవ్వాలని డీఎంకే నేత కనిమొళిని కోరారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన అంశాల అమలుకు సహకరించాలని వారు కేవీపీ, రఘవీరా, జేడీశీలం, పల్లంరాజు కోరారు. 

15:29 - July 21, 2016

అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే, ఒకవేళ అనారోగ్యానికి గురైనా కోలుకోవడానికి పోషకాలతో కూడిన ఆహారం అవసరమవుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో వీడియోలో చూడండి. 

15:28 - July 21, 2016

పరుగుల జీవితంలో, పర్యావరణాన్ని చేతులారా పాడుచేసుకుంటున్న వాతావరణంలో, ఒత్తిడులు తప్పని వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక అనారోగ్యం అమాంతం మనని కాటేయడానికి సిద్ధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్న స్థితి. మహిళలకిది మహమ్మారిలా మారనుంది. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ సంఖ్యపై మానవి ప్రత్యేక కథనం. నివారంచలేని వ్యాధి క్యాన్సర్. కానీ, ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, జీవితా కాలాన్ని పొడిగించుకోవడమో, లేదా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించే అవకాశముంది. అపోహలు తొలగించుకుని, జాగరూకతతో ఎలా ఉండాలో తెలుసుకోవాల్సిన అసరముంది. హిందువులతో పోల్చితే ముస్లిం మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. కారణం ముస్లిం పురుషుల్లో ఎక్కువమంది తమ పురషాంగం పై పూర్వ చర్మం తొలగించుకోవడం.. ఇలా చేయడం వల్ల వారి జీవిత సహచరులకు ఈ వైరసి వ్యాప్తి తగ్గుతుంది. జీవన విధానంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే, పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, సానుకూల ఆలోచనా ధోరణితో ఉంటే క్యాన్సర్ ను జయించే అవకాశాలు చాలావరకూ ఉన్నాయి. ఆ దిశగా మహిళలు ఆలోచిస్తారని, జీవన విధానాన్ని అలవర్చుకుంటారని మానవి ఆశిస్తోంది. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

15:06 - July 21, 2016

హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిష్కారాలను ఉపయోగించి హైదరాబాద్‌లో మెరుగైన సేవలు అందించేందుకు కీలక ఒప్పందం కుదిరింది. స్మార్ట్‌ సిటీస్‌ ప్రణాళిక, నమూనా, అమలులో ప్రపంచస్థాయి సంస్థ అయిన సిస్కోతో టీఎస్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సిస్కో సంస్థ ప్రతినిధులు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులోభాగంగా హైటెక్‌సిటీ ప్రాంతంలో పైలెట్‌ ప్రాజెక్టు చేపడతారు. స్మార్ట్‌ వైఫై, స్మార్ట్‌ పార్కింగ్‌, స్మార్ట్‌ లైటింగ్‌, స్మార్ట్‌ ట్రాన్స్‌పోర్టు, స్మార్ట్‌ కియోస్క్‌, యాప్‌ ద్వారా పౌరసేవలులాంటి అంశాలను చేపడతారు.

మోసం చేసి భూములు లాక్కొన్నారు. - తమ్మినేని..

నల్గొండ : టెయిల్ పాండ్ నిర్వాసితులను మోసం చేసి భూములు లాక్కొన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం పాదయాత్ర టెయిల్ పాండ్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. నిర్వాసితులకు నెల రోజుల్లో పరిష్కారం చూపకపోతే డ్యామ్ గేట్లను తొలగించడానికైనా సిద్ధమని వెల్లడించారు. ప్రజల తిరుగుబాటును పోలీసులతో అడ్డుకోలేరని పేర్కొన్నారు. 

చంద్రబాబు కొట్టాలో భగ్గుమన్న పాతకక్షలు..

అనంతపురం : చంద్రబాబు కొట్టాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. గోపీనాయక్, వెంకటేష్ నాయక్ లను ప్రత్యర్థులు నరికి చంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

టెయిల్ పాండ్ వద్ద పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..

నల్గొండ : నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు వద్దకు తమ్మినేని వీరభద్రం, జూలకంటి పాదయాత్ర చేరుకుంది. టెయిల్ పాండ్ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు గేటు వద్ద పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. 

హుస్సేన్ సాగర్, హరితహారంపై కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : నగర మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు కేటీఆర్‌. ఇంజనీర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రోడ్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

 

మరో 13 మంది విద్యార్థులకు అస్వస్థత..

పశ్చిమగోదావరి : ఆకివీడు (మం) కాపవరం జెడ్పీ హై స్కూల్ లో మరో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 

పుష్కర పనులపై సీఎం బాబు అసంతృప్తి..

గుంటూరు : సీతానగరంలో పుష్కర పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పనుల ఆలస్యంపై కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు మందలించారు. ఎన్నిసార్లు మందలించినా పద్దతి మార్చుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

14:34 - July 21, 2016

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా నరమేధం సృష్టిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ కొత్త కొత్త పుంతలు తొక్కుతోందా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను తమ కార్యాలపాలకు పావులుగా వాడుకుంటుందా? ఇటీవలే జాతీయ దర్యాప్తు అధికారులు ఐఎస్ అనుమానితులుగా అరెస్టు చేసిన వారి లిస్టు చూస్తే ఇది నిజమనే అర్థమవుతోంది. ఐసిస్ వలలో పడుతున్న ఇంజనీర్లపై ప్రత్యేక కథనం. ప్రపంచాన్ని గడగడ వణికిస్తోన్న కరుగుగట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ కార్యాలాపాలకు ఉన్నత విద్యావంతులను ఎంచుకుంటుంది. సాఫ్ట్ ఇంజనీర్ల తో ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాల్లో విధ్వంసం సృష్టించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసిందనే సమాచారం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.

8 నెలల్లో 92 మంది అరెస్టు..
హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయిల్లో కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల కదలికలపై నిఘా ఉంచాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐసిస్‌ సానుభూతిపరులన్న ఆధారాలతో జాతీయ దర్యాప్తు సంస్థ 8 నెలల్లో 92మందిని అరెస్ట్‌ చేసింది. ఇందులో 48 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, కంప్యూటర్‌పరిజ్ఞానం తెలిసినవారే ఉన్నారంటూ మెట్రోనగరాల పోలీసులకు సమాచారం అందింది.

పార్టీలతో వల.. తర్వాత వీడియోలతో ఆకర్షణ..
మెట్రో నగరాల్లో విధ్వంసాలకు ఐసిస్‌ కొత్త కొత్త మాడ్యూల్స్‌ను సిద్ధం చేస్తోందని కేంద్ర నిఘా సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వచ్చేవారు, ఇంజినీరింగ్‌, ఎంఎస్‌ చదువుకునేందుకు లండన్‌, న్యూయార్క్‌, ప్యారిస్‌, న్యూజెర్సీలకు వచ్చేవారిలో ఒక వర్గం వారిని గుర్తించి మాట్లేందుకు అక్కడున్న ఐసిస్‌ సానుభూతిపరులను వినియోగిస్తోంది. వీరిని పార్టీలకు పిలిచి ఆ తర్వాత పరిచయాలు పెంచుకుని ఐసిస్‌ సానుభూతిపరులుగా మార్చేందుకు వీడియోలను ప్రదర్శిస్తున్నారు. ఐసిస్‌ ఛీఫ్‌ అల్‌ బగ్దాది నేరుగా వారితో మాట్లాడిన ఆడియోలనూ కేంద్ర నిఘా అధికారులు సేకరించారు.

బృందాలుగా మారిన సానుభూతిపరులు..
హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో పదుల సంఖ్యలో సానుభూతిపరులను తయారుచేసి వారిని బృందాలుగా మార్చారు. వీరిలో కొందర్ని ఆత్మాహుతి దళంగా, ఒంటరిగా దాడులకు, బాంబులతో విధ్వంసం వంటి పనులకూ వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అబూ అనాజ్‌, మొహియుద్దీన్‌, మునావద్‌లతో పాటు ఇబ్రహీం యజ్దానీ సోదరులు కూడా ఇలాగే విధ్వంస ప్రణాళికల అమలుకు ప్రయత్నించి పట్టుబడ్డారు.

డబ్బులతో యువకులకు ఎర...
ఐసిస్ ఇండియా చీఫ్ షఫీ ఆర్మర్‌, అల్‌బదీ వంటి నేతలు దిల్లీ, ముంబయిల్లో ఓ వర్గానికి చెందిన యువకులను ఆకర్షించి ఐసిస్‌ను విస్తరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. వీరికి 8నెలల్లో రూ.1.35 కోట్లను హవాలా రూపంలో పంపించారు. దిల్లీ, ముంబయి నగరాల్లో కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఐసిస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడంతో వారి ప్రణాళిక బయటకు పొక్కింది. 

14:30 - July 21, 2016

హైదరాబాద్ : నగర మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు కేటీఆర్‌. ఇంజనీర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రోడ్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమీక్షలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు పాల్గొన్నారు.
గత కొన్ని రోజులుగా మంత్రి కేటీఆర్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం కారణంగా రోడ్లు పూర్తిగా పాడవడం ఇటీవల పర్యటనల్లో మంత్రి కేటీఆర్ గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు సూచనలు, సలహాలు అందించారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని గమనించిన మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. రోడ్లు ఎలా పాడవుతున్నాయి ? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. అలాగే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, రాబోయే గణేష్ నిమజ్జనంపై చర్చించారు. డబుల్ బెడ్ రూం స్థలాల అన్వేషణ ఎలా చేయాలనే దానిపై ప్రస్తుతం చర్చిస్తున్నారు. స్థలాల సేకరణ ఎలా ఉంది ? వస్తున్న సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆరా తీస్తున్నారు. అలాగే ఇటీవలే ప్రారంభించిన హరితహారం కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. 

14:21 - July 21, 2016

హైదరాబాద్ : నగరంలో అదృశ్యమైన చిన్నారి వైష్ణవి ఆచూకి లభ్యమైంది. ఆమెతో పాటు బాలిక మాధవి క్షేమంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హైదర్ గూడలో ఉంటున్న వైష్ణవి స్కూల్ కెళ్లి బుధవారం సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఐదు బృందాలుగా గాలింపులు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో వైష్ణవి తమ దగ్గర ఉందని మాధవి నానమ్మ సమాచారం అందించారు. కాకినాడ ఐపోలవరంకు వైష్ణవిని మాధవి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని వైష్ణవి తల్లిదండ్రులకు తెలియచేశారు. దీనితో వారు ఊపిరి పీల్చుకున్నారు. వైష్ణవిని ఎందుకు తీసుకెళ్లిందో ? తదితర సమాచారం తెలియాల్సి ఉంది. 

14:14 - July 21, 2016

హైదరాబాద్ : 'బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ ఖబడ్దార్..ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి..అతని జైల్లో పెట్టాలి..అంత వరకు పోరాడుతూనే ఉంటాం' అంటూ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై దయాశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేతలే కాకుండా పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో బీఏస్పీ నేతలు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. దయాశంకర్ ను అరెస్టు చేయాలని, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆందోళన చేపట్టిన బీఎస్పీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

లక్నోలో..
ఇటు లక్నోలో బీఎస్పీ కార్యకర్తలు భారీ ఆందోళన నిర్వహించారు.మాయవతిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత దయాశంకర్‌సింగ్‌ను అరెస్టు చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. యూపీలోని హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వందలాది కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. బీఎస్పీ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టారు.

బీఎస్పీ టిక్కెట్లు అమ్ముకుంటోంది: దయాశంకర్..
యూపీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ టిక్కెట్లును అమ్ముకొంటోందని దయాశంకర్ ఆరోపణలు చేశారు. ఆమె ఉదయం ఒకే టిక్కెట్ ను ఒకరికి కోటికి అమ్మి..అదే టిక్కెట్ ను సాయంత్రానికల్లా 2కోట్లకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ సిద్ధాంతాలు మాయావతి పక్కనబెట్టారని దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

బి.పోలవరంలో చిన్నారి వైష్ణవి..మాధవి..

హైదరాబాద్ : హైదర్ గూడలో నిన్న అదృశ్యమైన చిన్నారి వైష్ణవి, బాలిక మాధవి ఆచూకి లభ్యమైంది. తూర్పుగోదావరి జిల్లా బి.పోలవరంలో ఆచూకి గుర్తించారు. వైష్ణవిని మాధవి స్కూల్ నుండి నుండి నానమ్మ ఇంటికి తీసుకెళ్లింది. గతంలో ఓసారి ఇంటి నుండి పారిపోయి ఐ.పోలవరం మాధవి వెళ్లినట్లు తెలుస్తోంది. 

సచివాలయంలో వసతులు బాగానే ఉన్నాయి - జేఎస్వీ ప్రసాద్..

గుంటూరు : తమ శాఖకు చెందిన 40 మంది ఉద్యోగులు వారం రోజుల్లో అమరావతి నుండి విధులు నిర్వహిస్తారని విజిలెన్స్ కమిషనర్ జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. సచివాలయంలో వసతులు బాగానే ఉన్నాయని, కొత్త ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలుంటాయన్నారు. 

సచివాలయంలో మరో రెండు కార్యాలయాలు ప్రారంభం..

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఆర్ అండ్ బి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యలయాలు ప్రారంభమయ్యాయి. ఆర్ అండ్ బి కార్యాలయాన్ని మంత్రి శిద్ధా, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయాన్ని విజిలెన్స్ కమిషనర్ జేఎస్వీ ప్రసాద్ లు ప్రారంభించారు. 

13:43 - July 21, 2016

.గోదావరి : పశ్చిమగోదావరిజిల్లా చినకాపవరంలోని జెడ్ పీహెచ్ ఎస్ స్కూల్ విద్యార్థులకు ఆస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆకివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో సరైన భోజన, తాగునీటి వసతులు లేకపోవడం.. నిత్యం మద్యాహ్న భోజనంలో పురుగులు ఉంటున్నాయని విద్యార్థులకు వాపోతున్నారు. చికిత్స అందించిన వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్యులు. ఏలూరు నుంచి వైద్యబృందం చినకాపవరంలో పర్యటిస్తోంది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

13:28 - July 21, 2016

మహబూబ్‌నగర్: మంత్రి హరీష్‌రావు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్‌కు హరీష్‌రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ లిఫ్టు ద్వారా నెట్టెంపాడు, ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... తమ రెండేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలోని నాలుగు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు మూడు వేల ఎకరాలకే నీరందించిన విషయాన్ని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేయకపోవడం వల్లే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే క్రమంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

13:11 - July 21, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్, కాకినాడ, నల్లగొండ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇన్ ఫ్రా, మైనింగ్ కంపెనీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 25 టీంలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పన్నులు ఎగవేత విషయంలో లోపాలున్నాయనే ఆరోపణతో అధికారులు దాడులు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ తనిఖీలు సాయంత్రం 4గంటల వరకూ కొనసాగే అవకాశాలున్నట్లుగా సమాచారం.

12:47 - July 21, 2016

ఉత్తరప్రదేశ్ : బీజేపీ నేత దయాశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం కొనసాగుతోంది. మాయవతిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత దయాశంకర్‌సింగ్‌ను అరెస్టు చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. యూపీలోని హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వందలాది కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. బీఎస్పీ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టారు. మరోవైపు దయాకర్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. 

బీఎస్పీ టిక్కెట్లు అమ్ముకుంటోంది: దయాశంకర్
యూపీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ టిక్కెట్లును అమ్ముకుంటుందని దయాశంకర్ ఆరోపణలు చేశారు. ఆమె ఉదయం ఒకే టిక్కెట్ ను ఒకరికి కోటికి అమ్మి..అదే టిక్కెట్ ను సాయంత్రానికల్లా 2కోట్లకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ సిద్ధాంతాలు మాయావతి పక్కనబెట్టారని దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దయాశంకర వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్ ...
దయశంకర్ మాయావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్లమెంటు దద్దరిల్లింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే బీజేపీ ఇలాంటి అవమానకరమైన ప్రకటనలు చేస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు,. మొత్తంగా దయాశంకర్ వ్యాఖ్యలు రానున్న యూపీ ఎన్నికల్లో బీజేపీ కి పెద్ద ఇబ్బందిగా మారాయి..2014 ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన బీజేపీ తాజా పరిణామాలు తలనొప్పిగా మారాయి.

కబాలికి లైన్ క్లియర్...

హైదరాబాద్ : కబాలి రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమాకు స్టే విధించాలని లింగా సినిమా డిస్ట్రిబ్యూటర్లు చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో కబాలి సినిమా విడుదలకు వున్న అడ్డంకులు తొలగిపోయాయి.

12:35 - July 21, 2016

హైదరాబాద్ : వీటీ డెయిరీ పాలు నాణ్యమైనవి కావంటూ రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు నిరాధారమైనవని సంస్థ జనరల్‌ మేనేజర్‌ కృష్ణకుమార్‌ చెప్పారు. ముప్పై ఏళ్లగా తమ డెయిరీ పాల వ్యాపారం చేస్తోందని చెప్పారు. నాణ్యత దృష్ట్యానే వీట డెయిరీ పాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తమ డెయిరీకి అంతర్జాతీయ ప్రమాణల సంస్థ...ఐఎస్ వో ధృవీకరణ కూడా ఉందని కృష్ణకుమార్‌ తెలిపారు. 

12:22 - July 21, 2016

ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 25 రోజులపాటు ఢిల్లీలోని ప్రముఖ నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి ఎటువంటి వాతావరణం వుంది? తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరి ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టటానికి ఎటువంటి అవకాశముంది అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మందకృష్ణ మాదిగ (ఎమ్మార్పీఎస్ నేత) వకుళాభరణం కృష్ణ మోహన్ (టీఆర్ఎస్ నేత) ప్రకాశ్ రెడ్డి (బీజేపీ నేత) పాల్గొన్నారు. వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేవారో తెలసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరింత సమాచారాన్ని తెలుసుకోండి..

11:43 - July 21, 2016

నల్లగొండ : టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు ముంపువాసులకు న్యాయం చేయాలంటూ  సీపీఎం చేపట్టిన పాదయాత్ర రోండోరోజుకు చేరింది. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు ముంపువాసులకు న్యాయం చేయాలంటూ చేస్తున్న పాదయాత్రంలో భాగంగా  సీపీఎం జిల్లా కార్యదర్శి  జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..భూనిర్వాశితులకు న్యాయం జరిగేవరకూ పాదయాత్ర కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను చూడండి..

11:39 - July 21, 2016

ఢిల్లీ : హస్తినలో ప్రత్యేక హోదా వేడి రోజురోజుకూ సెరుగుతోంది. శుక్రవారం ప్రవేశ పెట్టే ఈ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు శతవిధాల ప్రయత్నాలు జరుపుతున్నారు. అందుకోసం వివిధ పార్టీల నేతలను కలుస్తూ మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం డీఎంకే నేత కనిమొళిని ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. బిల్లుకు మద్దతు తెలయచేయాల్సిందిగా కోరారు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని కనిమొళి ప్రకటించారు.
ఇదిలా ఉంటే బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందోన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 'హోదా' బిల్లుకు మద్దతు విషయంలో టీడీపీ నేతల వ్యూహం ఏమిటి అనేది తెలియడం లేదు. బిల్లుకు మద్దతునిస్తామంటూ ఇప్పటికే సీపీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ .. ఏపీకి లబ్ది చేకూర్చే ఈ బిల్లుకు మద్ధతు పలకటానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే వుంటామన్నారు. ప్రత్యేక బిల్లును ఏపార్టీ ప్రవేశపెట్టినా..ఆఖరికి తమకు బద్ధశత్రువైన బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినా బిల్లుకు మద్దతునిస్తామని స్పష్టం చేశారు.

11:24 - July 21, 2016

హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడలో కిడ్నాప్ గురయిన చిన్నారి వైష్ణవి విశాఖలో ప్రత్యక్షమైనట్లు పుకార్లు షికారు చేశాయి. బుధవారం చిన్నారి వైష్ణవి కిడ్నాప్ కు గురయైన సంగతి తెలిసిందే. వైష్ణవిని గాలించేందుకు ఇప్పటికే మూడు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కానీ ఇంతవరకూ ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో విశాఖలోని అరట్లకోటలోని ఓ దేవాలయం ముందు వైష్ణవి ఆచూకీ లభ్యమైందంటూ వదంతులు వ్యాపించాయి. మరి విశాఖలో దొరికిన పాప వైష్ణవేనా? కాదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పాపను చూసేందుకు హైదరాబాద్ పోలీసులు విశాఖకు బయలుదేరారు.

10:58 - July 21, 2016

చిత్తూరు : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుట్టగడ్డ వద్ద పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడారు. దీంతో స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లదాడి చేశారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:54 - July 21, 2016

నల్లగొండ : సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరింది. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు ముంపువాసులకు న్యాయం చేయాలంటూ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ..టెయిల్ పాండ్ ప్రాజెక్టు కోసం భూసేకరణ యత్నిస్తున్న ప్రభుత్వం ముంపు నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేయటం లేదని విమర్శించారు. భూనిర్వాసితులకు ప్రత్యేకమైన హక్కులున్నాయనీ..వాటిని అనుసరించి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. దాదాపు 1000మంది రైతులకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని, పాదయాత్ర అనంతరం ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈనెల 26న రాష్ట్ర వ్యాపితంగా భూనిర్వాసితుల పరిష్కారం కోసం మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఈ సందర్బంగా తమ్మినేని పేర్కొన్నారు. 2009 చెల్లించిన ప్రకారమే ఇప్పుడు కూడా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

10:49 - July 21, 2016

హైదరాబాద్ : నగరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేగింది. వైష్ణవి అనే ఐదేళ్ళ చిన్నారి కిడ్నాప్ కు గురయ్యింది. ఈ ఘటన హైదర్ గూడలో చోటు చేసుకుంది.
బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ గురయిన చిన్నారిని మాధవి అనే పదమూడేళ్ళ బాలిక తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా గతంలో మాధవి అనే బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయి పది రోజుల తరువాత వచ్చిందని ఆమె తల్లి తెలిపింది. మాయమైన వైష్ణవి ఎలాంటి పరిస్థితిలో ఉందోనని ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

10:47 - July 21, 2016

చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా దేశవ్యాప్తంగా ఫీవర్ ని సృష్టిస్తోంది. ఇది గతకొద్ది వారాలుగా కొనసాగుతోంది. కబాలి టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని క్యాష్ చేసుకునేందు పెద్ద పెద్ద సంస్థలు కూడా కాచుకుని కూర్చున్నాయి. రిక్డార్టులే కాకుండా కబాలి వివాదంగా కూడా మారింది. ఈ క్రమంలో కబాలి చిత్రం విడుదలపై ఉత్కంఠ నెలకొంది. చిత్రం విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో డిస్ట్రిబ్యూటర్లు వేసిన పిటిషన్‌ మరికాసేపట్లో విచారణకు రానుంది. లింగ చిత్రం నష్టాలను పూడ్చాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా ఇంతకాలం బయటకురాని లింగ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల సమీపంలో పిటీషన్ వేయటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఇదోరకంగా క్యాష్ టెక్నిక్ గా మారిపోతోంది. గతంలో కూడా పలు చిత్రాలు విడుదలకు ముందుగా వివాదం రేగిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో రెండు నిమిషాల పాటు కబాలి మూవీ..
మరో వైపు సోషల్ మీడియాలో రెండు నిమిషాల పాటు కబాలి మూవీ లీకైంది. సినిమాలో రజనీ పరిచయ సన్నివేశం ఫేస్‌బుక్‌లో హల్‌చల్‌ చేస్తోంది. నిమిషాల వ్యవధిలోనే అనేకమంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. సినిమాలో రజనీ జైలు నుంచి విడుదలయ్యే సన్నివేశం ఇంటర్నెట్‌లో విడుదలైంది. 

అదృశ్యమైన వైష్ణవి ఆచూకీ లభ్యం..

హైదరాబాద్ : నారాయణగూడలో అదృశ్యమైన చిన్నారి వైష్ణవి ఆచూకీ లభ్యమయ్యింది. విశాఖపట్నంలో వైష్ణవిని పోలీసులు గుర్తించారు.

నారాయణగూడలో కిడ్నాప్ కలకలం..

హైదరాబాద్ : నారాయణగూడలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. వైష్ణవి అనే ఐదేళ్ళ చిన్నారి కిడ్నాప్ కు గురయ్యింది. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేపీహెచ్‌బీస్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో వసతిగృహం నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

09:51 - July 21, 2016

రంగారెడ్డి : పెద్దఅంబర్ పేట పంచాయితీలోని కుంట్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ సిబ్బంది అక్రమ కట్టడాలను తొలగింటానికి ప్రయత్నించటంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో 70మంది గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూదాన్ పోచంపల్లికి చెందిన సుమారు 40 ఎకరాల్లో స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పూర్తిగా అక్రమ నిర్మాణాలు కాబట్టి కూల్చివేస్తామని రెవెన్యూ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో గురువారం నాడు తెల్లవారుఝామున జేసీబీలతో తరలివెళ్లిన రెవెన్యూ సిబ్బంది కట్టడాల కూల్చివేతకు పూనుకున్నారు. భూములకు పట్టాలు కూడా పొందామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

09:48 - July 21, 2016

మెదక్ : 'మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్దు మహాప్రభో.. ఊరి నుండి కదలం..తమ బతుకులను ఛిద్రం చేసే ఈ ప్రాజెక్టు తమకు వద్దు'..ఇక్కడే ఉంటం..ఇక్కడే ఛస్తం' అని ముంపు బాధితులు కన్నీరీ పెట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ పద్ధతులున్నాయంటూ..ప్రాజెక్టు అవసరం లేదని పలువురు పేర్కొంటున్నా ప్రాజెక్టు కట్టితీరుతామని సర్కార్ తేగేసి చెబుతోంది. దీనితో బాధితుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా తమను ఇక్కడి నుండి తరిమేస్తారని మానసిక క్షోభకు గురవుతున్న పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మొదటినుండి వివాదాస్పద కట్టడంగా కొనసాగుతున్న ప్రాజెక్టు ముంపు గ్రామాలలోని ప్రజలు తమ స్వంత ఊరిని కోల్పోతున్నామనే మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ లో బత్తుల నర్సయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యలు పేర్కొంటున్నారు. దీంతో ఆప్రాంతం విషాదంలో మునిగిపోయింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంటుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

09:40 - July 21, 2016

కృష్ణా : చాట్రాయి మండలం కోటపాడులో అత్యంత పాశవికమైన దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అల్లుడు కొనకళ్ళ సుబ్రమణ్యం భార్య, అత్త, బావమరిదిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, మామ అక్కడిక్కడే మృతి చెందగా బావమరిదికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమించటంతో అతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో వున్న నిందితుడు సుబ్రమణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సుబ్రమణ్యం దంపతుల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దమనుష్యులతో సయోధ్య కుదిర్చినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. భర్త వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని వుందని నిందితుడి భార్య గతంలో పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఫలితంతా ఈ దారుణం జరిగిందని బంధువులు విమర్శిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి వుంటే ఈ దారుణం జరిగి వుండేది కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

కబాలి విడుదలపై ఉత్కంఠ...

హైదరాబాద్ : రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం విడుదలపై ఉత్కంఠ నెలకొంది. చిత్రం విడుదల నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో డిస్ట్రిబ్యూటర్లు పిటీషన్ దాఖలు చేశారు. ఈకేసు నేడు విచారణకు రానుంది. లింగ సినిమా విషయంలో తమకు వచ్చిన నష్టాన్ని పూడ్చాలని పిటీషన్ వేసినట్లుగా తెలుస్తోంది.

మల్లన్న సాగర్ బాధితుడి ఆత్మహత్య..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ లో విషాదం చోటుచేసుకుంది. బత్తుల నర్సయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యలు పేర్కొంటున్నారు. దీంతో ఆప్రాంతంలో విషాదంలో మునిగిపోయింది.

కుంట్లూరులో ఉద్రిక్తత..60మంది అరెస్ట్..

రంగారెడ్డి : కుంట్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ సిబ్బంది అక్రమ కట్టడాలను తొలగింటానికి ప్రయత్నించటంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో 60మంది గ్రామస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

08:55 - July 21, 2016

తూర్పుగోదావరి : తూర్పు మన్యం మళ్లీ ఉలిక్కిపడుతోంది. దోమల విజృంభణతో మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాన్ని మలేరియా వణికిస్తోంది. రోజురోజుకీ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఏడాది మలేరియా జ్వరాలు సంభవిస్తున్నా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము జ్వరాల బారిన

వారం వ్యవధిలో 500 మంది జ్వరపీడితులు...
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని మలేరియా వణికిస్తోంది. రంపచోడవరం మన్యం గూడాళ్లో ప్రజలు మలేరియా జ్వరాలతో సతమతమవుతున్నారు. అందుబాటులో రవాణా సౌకర్యాలు లేక రోగులను మంచాలపై మోసుకెళ్తున్నారు. రంపచోడవరం ఆసుపత్రి జ్వరపీడితులతో కిక్కిరిసింది. వారం వ్యవధిలో దాదాపు 500మంది జ్వరపీడితులు చికిత్సకోసం వచ్చారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. 2009 తరువాత మలేరియా తీవ్రత ఇప్పడే మళ్లీ కనిపిస్తోందని అన్నారు. మారేడుపల్లి, దేవిపట్నం, రాజవొమ్మంగి మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం...
నాలుగేళ్ల క్రితం ఏజెన్సీలో మలేరియా నుంచి రక్షించడానికి వియాత్నాం నుంచి లాంగ్‌ లాస్టింగ్ ఇన్‌సెక్టిసైడల్ దోమతెరలను పంపిణీ చేశారు. ఆ తరువాత మరి దోమతెరల పంపిణీ జరగలేదు. మరోవైపు జ్వరాలను అదుపుచేసేందుకు ఏర్పాటు చేసిన వైద్యబృందాలు పూర్తిగా పారామెడికల్‌ సిబ్బందితోనే నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే గ్రామాలతో పాటు, పాఠశాలల్లో కూడా జ్వరాల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ఇంతవరకూ అధికారుల ఎలాంటి నివారణ చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైద్యశాఖ తీరుపై మండిపడుతున్న ఏజెన్సీ ప్రజలు..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరుగానే వైద్యశాఖ వ్యవహరిస్తోందని ఏజెన్సీ ప్రజలు మండిపడుతున్నారు. మలేరియా జ్వరం వల్ల అనేక మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

08:51 - July 21, 2016

హైదరాబాద్ : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఇవాళ రోడ్లు భవనాలు, విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలు తరలివెళ్లనున్నాయి. ఈ శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రత్యేక బస్సులో వెలగపూడికి వెళ్లనున్నారు. ఇప్పటికే పంచాయితీరాజ్‌, వైద్యశాఖ, గృహనిర్మాణ, కార్మికశాఖలు సచివాలయం నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక మిగిలిన అన్ని శాఖలను ఈ నెల 29లోగా తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

08:49 - July 21, 2016

మహబూబ్‌నగర్‌ : ప్రజల తరపున తాము పనిచేస్తున్నామని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు, ప్రాజెక్టులపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ జేఏసీ మరోయాత్రకు సిద్ధమైంది. పాలమూరు ఎత్తిపోతల పథకాల వివరాలు తెలుసుకొనేందుకు జేఏసీ బృందం పర్యటిస్తోంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై రెండు రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది. జూరాల, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల వివరాలు తెలుసుకోనుంది. పర్యటనకు బయలుదేరేముందు గన్‌పార్క్‌ దగ్గర టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతో పాటు... సభ్యులు అమరవీరులకు నివాళులు అర్పించారు.

ప్రజల కోసమే టీజాక్ : కోదండరాం..
ప్రజల తరపున తాము పని చేస్తున్నామని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. తమ వెనక ఎవరో ఉన్నారన్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సమాధానాలు చెప్పలేనప్పుడు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తారని, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించి ప్రాజెక్టులపై వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి.

పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు టీజాక్..

హైదరాబాద్ : పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు టీజేఏసీ బృందం బయలుదేరింది. ముంపు బాధిత రైతులతో టీజాక్ బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది. పాలమూరుకు బయలుదేరే ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు టీజేఏసీ నివాళుల్పించింది. 

08:42 - July 21, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహాంకాళి బోనాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బోనాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌, సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులు అభిప్రాయపడ్డారు.

ముస్తాబవుతోన్న ఉజ్జాయిని మహంకాళి ఆలయం..
ఈ ఆదివారం బోనాల సంబరాలకు సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి ఆలయం ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా, సీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

బోనాలు తీసుకువచ్చే వారికి బాటా షోరూమ్‌ నుంచి ప్రత్యేక క్యూలైన్‌..
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బోనాలు తీసుకొని వచ్చేవారికి కోసం బాటా షోరూమ్‌ నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 3 లక్షల వాటర్‌ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రత్యేక టాయిలెట్స్‌, శానిటేషన్‌ పనులను పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. భక్తుల కోసం 70 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. విద్యుత్‌ సమస్య తలెత్తకుండా జనరేటర్లు ఏర్పాటు చేశారు.

ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు : కలెక్టర్ రాహుల్ బొజ్జా..
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌బొజ్జా తెలిపారు. గతేడాది తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 

08:36 - July 21, 2016

విశాఖ : విశాఖ పట్నంలో మూడురోజుల పాటు సాగిన ప్రజాపద్దుల కమిటీ పర్యటన ముగిసింది. ఈ బృందం సభ్యులు పరవాడ సెజ్‌లోనూ, నగరంలోని పలు ఆసుపత్రులను సందర్శించారు. ఆయా బిల్డింగుల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో నిర్మాణాలకు, విధి నిర్వహణలకు సంబంధించి సూచనలు చేశారు.

విశాఖజిల్లా పరవాడ ఇండస్ర్టియల్‌ సెజ్‌ సందర్శన...
బుగ్గన రాజేంధ్రనాధ్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పద్దుల కమిటీ బృందం విశాఖ జిల్లాలో మూడు రోజుల పర్యటన పూర్తి అయింది. మొదటిరోజు ఈ కమిటీ పరవాడలోని ఇండస్ర్టీయల్ సెజ్ ను సందర్శించి.. అక్కడ పారిశ్రామిక వర్గాలతో సమావేశమైంది. ప‌రిశ్రమ‌ల‌కోసం తీసుకున్న భూముల‌కు ప‌రిహారంతోపాటు నిర్వాసితులకు ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. తరువాత సింహాద్రి ఎన్టీపీసీని సంద‌ర్శించింది. రాంకీ ఫార్మాసిటీలో ప‌రిశ్రమ‌ల నుంచి వెలువ‌డే కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేప‌డుతున్న చ‌ర్యలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి కార్యద‌ర్శని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేజీహెచ్, విక్టోరియా ఆసుపత్రుల సందర్శన...
ప్రజాపద్దుల కమిటీ సభ్యులు రెండో రోజు కెజిహెచ్‌, విక్టోరియా ఆసుప‌త్రులను సంద‌ర్శించారు. ఆసుపత్రుల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెన్నై లాంటి ప్రాంతాలలో రోజు దాదాపు 2 వేల అవుట్ పేషంట్ నడుస్తుంటే మనకు మాత్రం చాలా తక్కువ నడుస్తుందని మేరుగైన సేవలు ఏవిదంగా చేయ్యాలో ప్రణాళిక వెయ్యాలని వైద్యా శాఖ అధికారులకు సూచించారు. మూడో రోజు నగరంలోని సీతమ్మధార దగ్గర నిర్మాణంలో ఉన్న భారీ భవన సముధాయాన్ని పరిశీలించారు. ఇంత భారీ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు. దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరాలు అడిగి తెలుసకుంటామని కమిటీ సభ్యులు అన్నారు.

నగరప్రణాళికను మార్చుకోవాలని కమిటీ అభిప్రాయం..
ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నగరప్రణాళికను కూడా మార్చు కోవాల్సిన అవసరముందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

08:18 - July 21, 2016

సొంత రాష్ట్రం ఏర్పడ్డా తెలంగాణలో మత్స్యకారుల కష్టాలు తీరలేదు. మత్స్యవిత్తన కేంద్రాలు పడకేశాయి. చేప పిల్లల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. మత్స్యపరిశ్రమ అభివ్రుద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ వ్రుత్తినే నమ్ముకున్న 20 లక్షల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రభుత్వ మార్కెట్ లు లేకపోవడం వినియోగదారులకీ శాపంగా మారింది.

20 లక్షల మందికి జీవనాధారం..
ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణలో సముద్రతీరం లేకపోవచ్చు. కానీ మత్స్య సంపద పెంపకానికి అపారమైన అవకాశాలున్నాయి. 20 లక్షల మందికి ఇదే జీవనాధారం. హైదరాబాద్ లాంటి మహానగరంలో విస్తారమైన మార్కెట్ వుంది. విదేశాల్లో సైతం మన మత్స్యసంపదకు మంచి గిరాకీ వుంది. కానీ ఏం లాభం?

తెలంగాణలో 46వేల చెరువులు..
తెలంగాణలో 46వేల చెరువులున్నాయి. క్రిష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. మొత్తం 64 రిజర్వాయర్ లున్నాయి. ఇన్ని జలవనరులున్నా తెలంగాణలో మత్స్యసంపద వార్షిక ఉత్పత్తి 10 వేల టన్నులు మించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటే ఇంతకు పదింతల ఉత్పత్తి సాధించే వీలుంది. దీనివల్ల ప్రజలకు చక్కటి పోషకాహారం లభించడమే కాకుండా, విదేశీ మారకద్రవ్యాన్నీ ఆర్జించే వీలుంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం వుంది.

పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో విస్తీర్ణంలో 5 టన్నుల మత్స్య సంపద..
పశ్చిమబెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక హెక్టార్ విస్తీర్ణంలో కనీసం 5 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంటే, తెలంగాణలో ఒక టన్ను కూడా లేదు. ఇందుకు ఏకైక కారణం ఇంతకాలమూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే. కనీసం నిజాం నవాబులు ప్రదర్శించిన చొరవ కూడా ఇవాళ కొరవడింది.

చేప పిల్ల విత్తనాల కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారం..
ఇబ్రహీంపట్నం, రాజేందర్ నగర్, సింగూరు, డిండి లాంటి ప్రాంతాల్లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా వెక్కిరిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు చేప పిల్ల విత్తనాల కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తోంది. మూడు అంగుళాల చేప పిల్లల విత్తనాలు పుష్టికరంగా వుండి, చక్కగా పెరుగుతాయంటూ మత్స్యకారులు చెబుతుంటారు. ప్రభుత్వ యంత్రాంగం పడకేయడంతో దళారీలు నాశిరకం చేపవిత్తనాలను అంటగడుతున్నారు. మత్స్యపరిశ్రమలో దళారీల ఇష్టారాజ్యం నడుస్తోంది. గ్రామాల్లో చేపలు పట్టేవారికి కిలోకి ఇరవై పాతిక రూపాయలు కూడా చెల్లించడం లేదు. కానీ అదే చేపలను హైదరాబాద్ ముషీరాబాద్ మార్కెట్ లో వంద నుంచి నూటా యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు. తెలంగాణ మత్స్యకారుల శ్రమంతా దళారీల భోజ్యంగా మారుతోందనడానికి ఇంతకంటే వేరే నిదర్శం ఏం కావాలి?

ఏపీ మత్స్యసంపద కు హైదరాబాద్ లో గిరాకీ ...
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మత్స్యసంపద కు హైదరాబాద్ లో గిరాకీ ఎక్కువ. కోటి మంది జనాభా వున్న మహానగరమిది. కానీ, ప్రభుత్వం ఒక్క మార్కెట్ కూడా ఏర్పాటు చేయలేదు. ఎక్కడా శీతల గిడ్డంగులు నిర్మించలేదు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. చేపల వేట ప్రమాదకరమైన వ్రుత్తి. రెండు మూడు కేజీల బరువున్న చేపలు, 120 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఎగిరెగిరి పడుతుంటాయి. ఎగిరెగిరి పడుతూ ఎదురు రొమ్ములపై చేపలు కొట్టే దెబ్బలకు మత్స్యకారులు గాయపడుతుంటారు. ఒక్కొక్కసారి చనిపోతుంటారు. చెరువుల్లో చేపల వేటకు వెళ్లినవారు రాత్రిపూట వలలు వేసి, చెరువు గట్ల వెంటనే నిద్రిస్తారు. ఇలాంటి వారిని పాములు కాటేస్తుంటాయి. తెలంగాణలో ప్రతి ఏటా ఇలాంటి ప్రమాదాల్లో 30 నుంచి 40 మంది చనిపోతున్నారు. ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో చేసిన వాగ్ధానం ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు.

మత్స్యపరిశ్రమ అభివ్రుద్ధికి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు తక్కువ..
మత్స్యపరిశ్రమ అభివ్రుద్ధికి తెలంగాణ బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధులు చాలా స్వల్పం. గత రెండు బడ్జెట్ లలో కేవలం వంద కోట్ల రూపాయల చొప్పున మాత్రమే కేటాయించారు. మత్స్యపరిశ్రమ అవసరాలు తీరాలంటే కనీసం మూడు వేల కోట్ల రూపాయలైనా కేటాయించాలన్నది మత్స్యకార్మిక సంఘాల సూచన. చేప పిల్ల విత్తన కేంద్రాల అభివ్రుద్ధి, పరిశోధన, ఐస్ ప్లాంట్ లు, శీతలీకరణ గిడ్డంగుల నిర్మాణం, ఫిష్ ఫుడ్ కోర్టులు, అధునాతన మార్కెట్ల ఏర్పాటుకు నిధులు వెచ్చిస్తే మత్స్యపరిశ్రమకు చాలా మేలు జరుగుతుంది. 

08:02 - July 21, 2016

వర్షాకాలం వచ్చి నెల రోజులైంది. ఇది మత్స్యకారులకు అత్యంత కీలకమైన సమయం. అయితే తెలంగాణలో ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా మత్స్యకారులకు బాలారిష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో మత్స్యసంపద పెంపకానికి వున్న అవకాశాలేమిటి? వనరులేమిటి? ప్రస్తుత సీజన్ లో ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేమిటి? మత్స్య పరిశ్రమపై దళారీ వ్యవస్థ ప్రభావం ఎలా వుంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ మత్స్యకారుల సంఘం నేత బాలక్రిష్ణ , హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఫిషరీస్ కో ఆపరేటివ్ అధ్యక్షురాలు కొప్పు పద్మ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియో క్లిక్ చేయండి సమగ్ర సమాచారాన్ని తెలసుకోండి..

07:59 - July 21, 2016

విజయవాడ : ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు ఈ నెల 22న చర్చకు రానుంది. దీంతో ఈ బిల్లు విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై తెలుగుదేశం నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ప్రత్యేక హోదా బిల్లుపై జరిగే చర్చకు మద్దతు ఇచ్చి, ఓటింగ్‌కు వచ్చినప్పుడు... అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

బిల్లుకు మద్దతు పలికిన వైసీపీ ..
ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ రామంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చకు రానుంది. ఇప్పటీకే ఈ బిల్లుకు ప్రతిపక్ష వైసీపీ మద్దతు ప్రకటించింఐసీ ది. చర్చకు సహకరిస్తామని చెబుతున్న టీడీపీ... ఓటింగ్‌కు వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఎటూ తెల్చుకోలేకపోతోంది. చర్చ సమయంలో కూడా అప్పటి పరిస్థితులను బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలుగుదేశం భావిస్తోంది.

ఓటింగ్‌కు వస్తే అనుకూలంగా టీడీపీ ఎంపీలు ..
ఈనెల 15న జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో కూడా కేవీపీ బిల్లుపై ఎలా వ్యవహరించాలన్న అంశం గురించి సుదీర్ఘంగా చర్చించారు. సమావేశానికి హాజరైన ఎంపీల్లో ఎక్కువ మంది పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్న అన్న వాదానాన్ని లేవనెత్తారు. చర్చలో పాల్గొనడంతోపాటు, బిల్లు ఓటింగ్‌కు వస్తే... అనుకూలంగా ఓటేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై జోక్యం చేసుకున్న చంద్రబాబు ఆ రోజు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచించినట్టు సమాచారం. దీనిని బట్టి పరిశీలిస్తే కేవీపీ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

బీజీపీకి కోపం వస్తే ఎలా అన్న అంశంపై టీడీపీలో తర్జనభర్జన
అయితే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ... కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తే.. కమలనాథులకు కోపం వస్తే ఎలా వ్యవహరించాలన్న అంశంపై కూడా తెలుగుదేశం నేతల తర్జన భర్జన పడుతున్నారు. బీజేపీకి కోపం వస్తుందని ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బీజేపీకి నచ్చజెప్పి... కేవీపీ బిల్లుకు సహకరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై టీడీపీ నేతల పరిస్థితి పామునోట్లో కప్ప చందంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

07:50 - July 21, 2016

హైదరాబాద్ : దేశమంతా రజనీ కబాలీ ఫీవర్ తో హీటెక్కింది. మరో ఇరవై నాలుగు గంటల్లో కబాలీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రజినీ అభిమానులతో పాటు యావత్‌ తమిళనాట పండగ వాతావరణం నెలకొంది. కబాలి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసేందుకు ప్రతీ ఒక్కరూ పోటీ పడుతున్నారు. అటు వ్యాపారస్తులు సైతం వివిధ ఆఫర్లతో రజినీ మానియాను క్యాష్‌ చేసుకుంటున్నారు.

500 రూపాయిల నుండి 3000 వేల వరకు కబాలి టికెట్ ధర..
రజినీ సినిమా అంటే చాలు అభిమానులకు కిక్కెక్కుతుంది. కబాలీ సినిమా టికెట్ల విక్రయాలు ఓపెన్ అయిన పది నిమిషాలకే మూడు రోజులు ఫుల్ అయ్యాయి. ఇక టికెట్టు ధర కూడా ఆకాశాన్ని అంటింది. ఏకంగా 500 రూపాయిల నుండి 3000 వేల వరకు కబాలి టికెట్ ధర పలకుతున్నా అభిమానులు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మొదటి మూడు రోజులపాటు తమిళనాడులోని ఏ థియేటర్ లోనూ ఒక్క టికెట్టు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

కబాలీ విడుదలకు ఐటీ కార్పోరేట్‌ కార్యాలయాలు సెలవు...
ఇక దాదాపు నగరంలోని సగం ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం మూడు రోజులపాటు సగానికిపైగా థియేటర్లు బుక్ చేసేశాయి. ఇక మరికొన్ని ఐటీ కార్పోరేట్‌ కార్యాలయాలు ఏకంగా సెలవు ప్రకటించాయి. ఇక కబాలి విడుదలను పెద్ద పండుగలా జరిపేందుకు ఇప్పటికే పలు సంఘాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కపాలీ మానియాలో అభిమానులు తమ వాహనాలను కపాలీ సినిమా పోస్టర్లతో నింపేస్తున్నారు.

కబాలిని క్యాష్ చేసుకునేందుకు ఫైప్‌ స్టార్‌ హోటళ్లు..
ఇక చెన్నైలో కబాలి మానియాను క్యాష్ చేసుకునేందుకు ఫైప్‌ స్టార్‌ హోటళ్లు కబాలి ఫుడ్‌ ఫెస్టివల్స్‌ను నడుపుతున్నాయి. కబాలీ సినిమాతోపాటు రజనీకాంత్ నటించిన పలు చిత్రాల పేరుతో వంటకాలను తయారు చేసి వచ్చిన వారికి వడ్డిస్తున్నారు. కపాలీ డిష్, బాషా బిర్యానీ, శివాజీ వడాపావ్, రోబో పరోటా, ముత్తు నాన్ వెజ్ డిష్ ఇలా పలు చిత్రాలలోని రజనీ పాత్రల పేరుతో కపాలీ ఫుడ్ పెస్టివల్‌ ను నిర్వహిస్తున్నారు.

రాత్రి 10 గంటలకు అభిమానుల కోసం కబాలీ ప్రత్యేక షో..
ఇక నేడు రాత్రి 10 గంటలకు అభిమానుల కోసం కబాలీ ప్రత్యేక షోను చెన్నైలోని ఉదయం థియేటర్ లో విడుదల చేయనున్నారు. దీంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు థియేటర్ ముందు పండుగ వాతావరణం సృష్టించేందుకు అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

07:42 - July 21, 2016

హైదరాబాద్ : నూతన విద్యా విధానం పేరుతో కాషాయీకరణను ప్రోత్సహిస్తున్నారంటూ మోదీ సర్కార్‌పై మేధావులు, విద్యావేత్తలు నిప్పులు చెరిగారు. వేదిక్‌ విద్య పేరుతో ఇంకా సనాతన సాంప్రదాయాలను తెరపైకి తెస్తూ.. బడుగు, బలహీనవర్గాలను మళ్లీ విద్యకు దూరం చేసేందుకు పావులు కదుపుతున్నారని విరుచుకుపడ్డారు. విద్య వ్యతిరేక విధానాలు చొప్పిస్తే దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడుతామంటూ హెచ్చరించారు.

2016 ముసాయిదాను విడుదల ...
విద్యా విధానంలో మార్పులు పేరుతో కొత్త నినాదాన్ని ఎత్తుకున్న మోదీ సర్కార్‌.. నూతన విద్యా విధానం-2016 ముసాయిదాను గత నెలలో విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని.. ఇంకా కొన్ని ఇన్‌పుట్స్‌ అందించాలని పేర్కొంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలు తమ గళాన్ని వినిపించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్వీకేలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నేతలు, విద్యారంగ నిపుణులు హాజరయ్యారు.

సుబ్రమణియన్‌ కమిటీ నివేదికను బహిర్గతం చేయాని డిమాండ్‌..
అయితే ఈ కొత్త విధానంలో కాషాయ ఎజెండానే ప్రధానంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. నూతన విద్యా విధానం పూర్తిగా కార్పొరేట్‌ శక్తులను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నట్లు ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. దేశీయ విద్యావిధానంలో మార్పుల కోసం సుబ్రమణియన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. 

విద్యను సామాజిక అంశంగా చూడాలి : చుక్కా రామయ్య
విద్యాను సామాజిక అంశంగా చూడాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. విధానంలో మార్పు తీసుకువస్తే అది సమాజాభివృద్ధికి తొడ్పడాలని కానీ సమాజాన్ని మరింత వెనక్కి నెట్టేసేలా ఉండొద్దన్నారు.

ఉద్యమాలకు సిద్ధంకావాలంటున్న విద్యావేత్తలు,మేధావులు..
నూతన విద్యా విధానంలో తనదైన ముద్ర వేసేందుకు యత్నిస్తున్న బీజేపీ, అనుబంధ సంఘాల ఆగడాలను అడ్డుకునేందుకు మేధావులు, విద్యావేత్తలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన తరుణమం ఆసన్నమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

07:35 - July 21, 2016

హైదరాబాద్ : తలొకరిది తలోదారి అన్నట్లుగా తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి. సాగునీటి ప్రాజెక్టుల‌పై సీఎం కేసీఆర్ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ పై కౌంట‌ర్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు సర్వం సిద్ధం అయ్యింది. అయితే నేతలు మాత్రం ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. జల దృశ్యంపై ఒక్కో నేత ఒక్కో మాట వినిపిస్తున్నారు. దీంతో అసలు జల దృశ్యంపై పార్టీ విధానం ఏంటి అనే దానిపై స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో కౌంటర్‌ ప్రజంటేషన్‌ ఎలా ఉంటుంది అనే అంశంపై కార్యకర్తల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.


ప్రజంటేషన్ పై పూర్తికాని కసరత్తులు..
అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ కు కౌంటర్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని ప్రకటించిన టీ కాంగ్రెస్‌ నేతలు ఎట్టకేలకు ఆ మేరకు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌వి అన్ని అబ‌ద్ధాలు అని కౌంట‌ర్ ప్రజెంటేష‌న్ ఇస్తామన్న హ‌స్తం నేత‌లు మూడునెలల త‌ర్వాత కౌంట‌ర్ ప్రజెంటేష‌న్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 23న గాంధీభ‌వ‌న్ వేదిక‌గా ప్రజెంటేష‌న్ ఇవ్వబోతుంది కాంగ్రెస్. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నప్పటికీ నేతల్లో మాత్రం అయోమయం వీడటం లేదు.

ఒక్కోనేతది ఒక్కో మాట...
కేసీఆర్ చేప‌ట్టిన ప్రాజెక్టుల రీడిజైన్‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు మాత్రం తలొకరు తలో మాట అంటున్నారు. రంగారెడ్డి - పాలమూరు, మల్లన్నసాగర్‌ ఇలా అన్ని ప్రాజెక్టులపైనా ఒక్కోనేతది ఒక్కో మాట. ముఖ్యంగా మ‌ల్లన్న సాగ‌ర్ పై జివో నంబర్ 123 తో కాకుండా 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్రకారం ప్రాజెక్ట్‌లు నిర్మించాలనేది పీసీసీ వాదన. దీనిపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మతో క‌మిటీని వేసింది. ఇదిలా వుంటే.. అస‌లు మ‌ల్లన్నసాగ‌ర్ అవ‌స‌ర‌మే లేదు అని మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కొత్త వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. హ‌ర్యానాలో నిర్మించిన విధంగా రిజ‌ర్వాయ‌ర్లు వ‌ద్దు.. కాల్వలే ముద్దంటూ ఆయ‌న ఏకంగా.. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ కూడా ఇచ్చారు. అంతే కాదు పార్టీ కూడా ఇదే అంశాన్ని చెప్పాలని పట్టుబట్టారు.

ప్రాజెక్టుల విషయంలోనూ తలోమాటగా కాంగ్రెస్ నేతలు..
ఇక సీఎల్పీ నేత జానారెడ్డిది మ‌రోమాట‌. ఆయ‌న మొద‌టి నుంచి రిజ‌ర్వాయ‌ర్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. చిన్న రిజ‌ర్వాయ‌ర్లతో తెలంగాణ‌కు మేలు జ‌రుగుతుంది అనేది జానా వాద‌న‌. డిజైన్ మార్పును ఆయ‌న వ్యతిరేకించకుండా కేవలం అవినీతి అంశంపై మాత్రమే మాట్లాడుతున్నారు.ఇక మరోనేత ష‌బ్బీర్ ఆలీ 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని అమ‌లుచేయాల్సిందే అంటు పట్టుబడుతున్నారు.

హర్యానాలో పర్యటించిన జానా బృందం..
ఇదిలా వుండ‌గా జానా నేతృత్వంలో ఒక బృందం హ‌ర్యానాలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును సంద‌ర్శించారు. ఈ ప్రాజెక్టును అద‌ర్శంగా చేసుకుని తెలంగాణ‌ ప్రభుత్వం కూడా ముందు కెళ్ళాల‌ని అంటున్నారు జానా, ష‌బ్బీర్ ఆలీలు.

2013 చ‌ట్టంతో భూసేక‌ర‌ణపై భిన్నాభిప్రాయాలు..
అటు కౌంటర్‌ ప్రజెంటేష‌న్‌కు రెడీ అయినప్పటికీ.. అస‌లు ఒక‌ పార్టీలైన్ అంటూ ఒకటి తేల్చకపోవడం పార్టీలో చ‌ర్చనీయాంశంగా మారింది. 2013 చ‌ట్టంతో భూసేక‌ర‌ణ కావాల‌ని కొంద‌రు.. అస‌లు మొత్తంగా డిజైన్ మార్పులనే వ్యతిరేకిస్తూ కొందరు.. క్యాడర్‌ను లీడర్లను అయోమయంలోకి నెట్టేస్తున్నారు.

 

07:22 - July 21, 2016

ఢిల్లీ : సుప్రీం కోర్టు తీర్పుతో పాలమూరు జిల్లా ప్రాజెక్టులను అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్ధానం కొట్టి పారేయడంతో తెలంగాణ ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు బీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ ఖరీఫ్‌ పాలమూరు రైతులకు శుభవార్తను అందించనుంది.

ప్రాజెక్టులతో మహబూబ్ నగర్ రైతుల కష్టాలు తీరనున్నాయా?..
కాగితాలకే పరిమితమైన పాలమూరు ప్రాజెక్టులకు ప్రాణం వచ్చింది. సాగునీరు లేక భూములు బీళ్లుగా మారి కూలి పనుల కోసం వలస బాట పట్టిన మహబూబ్ నగర్ రైతుల కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. సుప్రీం కోర్టు తీర్పుతో పాలమూరు ఎత్తిపోతల పథకాలైన బీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులు ఈ ఖరీఫ్ నుంచే మహబూబ్ నగర్ జిల్లాలోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నాయి.

ప్రారంభం కానున్న ప్రాజెక్టు నిర్మాణాలు ..
ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామంలో బీమా ఎత్తిపోతల ప్రారంభోత్సవం. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తకోటలో రెండవ దశ ప్రారంభోత్సవం. నేడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించనున్నారు. మొదటగా ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామంలో ఉదయం 9 గంటలకు బీమా ఎత్తిపోతల పథకంలోని సమాంతర కాలువను, మధ్యాహ్నం 12 గంటలకు కొత్తకోటలో రెండవ దశను మంత్రి హరీష్‌ రావు ప్రారంభిస్తారు.
బీమా ఎత్తిపోతల పథకం కింద 1.4 లక్షల ఎకరాలకు సాగునీరు..
బీమా ఎత్తిపోతల పథకం కింద ప్రతిపాదిత ఆయకట్టు 2 లక్షల ఎకరాలకు కాగా నేటి నుంచి 1.4 లక్షల ఎకరాలకు నీరందతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండవ లిఫ్ట్‌ను ధరూర్‌ మండలంలోని రేలంపాడులో ఆయన ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ప్రతిపాదించిన ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు కాగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో 1.4 లక్షల ఎకరాలకు నీరందతుందని నీటిపారుదల శాఖ తెలిపింది.

నాగిరెడ్డి పల్లి కోయిల్‌ సాగర్‌ ఒకటవ లిఫ్ట్‌ ప్రారంభోత్సవం..
ఇక సర్వ మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో సాయంత్రం 3 గంటలకు కోయిల్‌ సాగర్‌ ఒకటవ లిఫ్ట్‌ను మంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకంలో ప్రతిపాదిత ఆయకట్టు 50 వేల ఎకరాలకు కాగా ప్రస్తుత ఖరీఫ్‌ కాలంలో 1.5 లక్షల ఎకరాలకు నీరిందిస్తామని వారు తెలిపారు. 2017 ఖరీఫ్‌ నాటికి జిల్లాలోని నాలుగు ఎత్తిపోతల పథకాల కింద నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందిస్తామని నీటి పారుదల శాఖ స్పష్టం చేసింది. 

విద్యుత్ తీగ తెగిపడి ఓ మహిళ మృతి...

గుంటూరు : క్రోసూరులో విద్యుత్ తీగ తెగిపడి ఓ మహిళ మృతి చెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. 

టర్కీలో ఎమర్జెన్సీ..

టర్కీ : టర్కీలో ఎమర్జెన్సి విధించారు. టర్కీ అధ్యక్షుడు మూడు నెలలపాటు ఎమర్జెన్సీని విధించారు. కాగా టర్కీలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సైన్యంలోని ఓ వర్గం ప్రయత్నించిన నేపథ్యంలో అధ్యక్షుడు ఎర్డోగన్ ఎమర్జెన్సీ విధించినట్లుగా సమాచారం.

భారీ అగ్నిప్రమాదం...

దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కీలక నగరం దుబాయ్‌లోని మరినా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 75 అంతస్థుల సులఫా టవర్‌లోని స్కై స్క్రాపర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 35వ అంతస్థులో ప్రారంభమైన మంటలు క్రమంగా మిగతా అంతస్థులకు వ్యాపించాయి. దీంతో వందలాది మంది బయటకు పరుగులు తీశారు. 

కోటపాడులో దారుణం ...

కృష్ణా : చాట్రాయి మండలం కోటపాడులో దారుణం చోటు చేసుకుంది. భార్య,అత్త, బావమరిదిపై బావ కత్తితో దాడి చేశాడు. భార్య మృతి చెందగా అత్త, బావమరిదికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమించటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పుల కలకలం..

అమెరికా : డాలస్‌, బ్యాటెన్‌ రోజ్‌ ఘటనలు మరవకముందే అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఇద్దరు పోలీస్‌ అధికారులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అయితే అదృష్టవశాత్తు పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Don't Miss