Activities calendar

22 July 2016

గాంధీఆస్పత్రిలో కరెంట్ కట్

హైదరాబాద్ : గాంధీఆస్పత్రిలో కరెంట్ కట్ అయింది. రెండు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయంది. కరెంట్ లేక వైద్య సేవలు ఆగిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

నీటిపారుదల రంగంలో టీసర్కార్ మరో ముందడుగు

హైదరాబాద్ : నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జలాశయాల్లో నీటి నిల్వలపై ఉప గ్రహం ద్వారా విశ్లేషణ చేయనుంది. నేషనల్ రిమోట్ పెన్సింగ్ ద్వారా సరికొత్త విప్లవం రానుంది. ఇస్రోతో ఆగస్టు 6న ఎంఓయూ ప్రభుత్వం కుదుర్చుకోనుంది. మంత్రి హరీశ్ రావు చొరవతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఈనిర్ణయం తీసుకుంది. 
 

21:55 - July 22, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలోని నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం కోసం సీపీఎం... పోరుబాట పట్టింది. ప్రాజెక్ట్‌ నిర్మించి తాగునీరు.. సాగునీరు.. అందించాలని డిమాండ్‌ చేస్తూ.. సీపీఎం మహా పాదయాత్రను చేపట్టింది. ఈ ఉద్యమంలో.. ప్రజా సంఘాలు.. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. 
ఎత్తిపోతల పథకం కోసం పోరుబాట 
నారాయణపేట్‌-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం కోసం, జలసాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన మహాపాదయాత్ర శుక్రవారం మక్తల్‌ మండలం.. భూత్పూర్ రిజర్వాయర్‌ దగ్గర ప్రారంభమైంది. దీనికి విపక్ష పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం..కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి.. దామోదర్ రెడ్డి, ఒబెదుల్లా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.. నాగం జనార్దన్‌రెడ్డి ..ఎంఎల్సీ రాంచందర్ రావు, నాగురావు నామాజీ కొండయ్య.. టీడీపీ నుంచి కె.దయాకరరెడ్డి.. చంద్రశేఖర్ రెడ్డి ఈ యాత్ర సభలో పాల్గొన్నారు.
ప్రాజెక్ట్‌తో లక్ష ఎకరాలకు సాగునీరు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఎట్టి  పరిస్థితిలోనూ నారాయణ్‌పేట్‌-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకుంటామని విపక్ష నేతలు స్పష్టం చేశారు.  ఈ ఎత్తిపోతల పథకం ద్వారా  లక్ష ఎకరాలకు సాగునీరు.. ఐదున్నర లక్షల మందికి తాగు నీరు అందుతుందని తెలిపారు. కొడంగల్  ప్రాజెక్ట్‌ను కాదని, 180 కిలోమీటర్ల దూరంలోని వరద జలాల ఆధారంగా ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రభుత్వ యోచనను విపక్ష నేతలు దుయ్యబట్టారు. 
13 రోజులపాటు.. 221 కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం జల సాధన సమితి చేపట్టిన మహా పాదయాత్ర 13 రోజులు పాటు కొనసాగనుంది. ఆగస్టు మూడోతేదీన పాలమూరు బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది. ఉట్కూర్, నారాయణపేట, మద్దూర్, దామరగిద్ద, దౌల్తాబాద్, కోడంగల్, కోస్గి మండలాల మీదుగా దాదాపు 221 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. 

 

21:52 - July 22, 2016

విజయవాడ : ఏపీకి మళ్లీ నిరాశే ఎదురైంది. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా కల ఈసారీ నెరవేరలేదు. ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ జరగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. బిల్లును అడ్డుకున్నది మీరంటే మీరంటూ పాలక ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దీంతో ప్రత్యేక సెగలు..ఏపీ రాజకీయాల్లో మరింత కాకను పెంచుతున్నాయి. 
అదే టెన్షన్‌...
ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా లేదా ? ఈ ప్రశ్నకు రాజ్యసభలో సమాధానం దొరుకుతుందని ఏపీ ప్రజలే కాదు.. దేశంలోని వివిధ పార్టీల నేతలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ..మళ్లీ పాత సీనే రిపీట్‌ అయింది. శుక్రవారం ఉదయం వాయిదా అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ ప్రారంభమైంది. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలంటూ అధికార, ప్రతిపక్షాల సభ్యులు పట్టుబట్టారు. పార్లమెంట్‌ భద్రతను ప్రశ్నార్థకం చేసిన ఆప్‌ ఎంపీని అరెస్టు చేయాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌ ఎంపీలు తమ స్థానంలో నిలబడే బిల్లు కోసం పట్టుపట్టగా బీజేపీ సభ్యులు పొడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. 
సభ సోమవారానికి వాయిదా 
సభ రూల్స్‌ ప్రకారం వెళదామని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. దాంతో కేవీపీ ప్రైవేటు బిల్లు ఓటింగ్‌కు రాకుండా పోయింది. మళ్లీ శుక్రవారం వరకూ ఈ బిల్లు రాజ్యసభలో ఓటింగ్‌కు వచ్చే అవకాశం లేదు. 
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు : సుజనా చౌదరి 
రాజ్యసభ వాయిదా అనంతరం.. సభలో గందరగోళంపై అధికార, విపక్ష నేతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి విమర్శించారు. కేవీపీ ప్రైవేట్ మెంబర్‌ బిల్లు ఓటింగ్‌కు రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఇక టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ..ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సోమవారం నుంచి సభ జరగకుండా అడ్డుకొని కాంగ్రెస్‌ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సవాల్‌ విసిరారు. 
ఎపి సమస్యలు మోడీకి పట్టడం లేదు : దిగ్విజయ్ 
ఆంధ్రప్రదేశ్‌ సమస్యలు ప్రధాని మోదీకి పట్టడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌  దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపికి చిత్తశుద్ధి లేదన్నారు. తమ సభ్యుడు కేవీపీ రూపొందించిన ప్రైవేటు బిల్లుకు అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నా... బీజేపి డబుల్‌ గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. 
'హోదా బిల్లు' కచ్చితంగా పాస్‌ అవుతుంది : ఎంపీ కేవీపీ 
వచ్చే శుక్రవారం ప్రత్యేక హోదా బిల్లు కచ్చితంగా పాస్‌ అవుతుందన్న నమ్మకం తనకుందని ఎంపీ కేవీపీ అన్నారు. పార్లమెంట్‌ చట్టాల ప్రకారం తన బిల్లును వాయిదా వేసే అధికారం ఉందే తప్ప..బిల్లును రద్దు చేసే అధికారం ఎవరికి లేదన్నారు. వచ్చే వారం ఏపీ ప్రజల సాకారం నెరవేరుతుందన్న విశ్వాసం తనకుందన్నారు.  
హోదా బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకుంటున్న బీజేపీ : ఏచూరీ 
రాజకీయ ప్రయోజనాల కోసమే హోదా బిల్లు ఓటింగ్‌కు రాకుండా బీజేపి అడ్డుకుంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆప్‌ ఎంపీపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రం చేతిలోనే ఉన్నా.. సభను తప్పుదోవ పట్టించేందుకు ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు.  
ఏపీలో ఆందోళనలు 
మొత్తానికి ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు అంశం వచ్చే వారానికి వాయిదా పడడంతో ఏపీలో ఆందోళనలు మొదలయ్యాయి. హోదా బిల్లును అధికార పార్టీయే అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాదు కాదు కాంగ్రెస్ పార్టీయే అడ్డుకుంటోందని బీజేపి ఆరోపిస్తోంది. అయితే ఇలాంటి ప్రైవేటు మెంబర్‌ బిల్లులకు.. కేవలం శుక్రవారంనాడు మాత్రమే అనుమతి ఉండడంతో వచ్చే శుక్రవారం ఈ అంశంపై ఏ నిర్ణయం వెలువడుతుందోనన్న ఉత్కంఠ ఏపీలో నెలకొంది. 

21:45 - July 22, 2016

విజయవాడ : పట్టిసీమ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా డెల్టాలో మూడు వేల మందితో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సముద్రంలో వృథాగా పోయే నీటిని కృష్ణా ఆయకట్టుకు మళ్లించి దేశంలోనే చరిత్ర సృష్టించామని బాబు తెలిపారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పట్టిసీమపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాలను ప్రజల గుర్తిచేయాలన్నారు. 

21:42 - July 22, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌లో రికార్డ్‌ చేసిన వీడియో వ్యవహారంపై ఆప్‌ ఎంపి భగవంత్‌ మాన్‌ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఈ అంశంపై పార్టీల కతీతంగా పార్లమెంట్‌ సభ్యులందరూ భగవంత్‌ మాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాను వీడియో తీయడం పార్లమెంట్‌ రూల్స్‌కు వ్యతిరేకమనే విషయం తెలియదని స్పీకర్‌ మహాజన్‌కుకు ఇచ్చిన లేఖలో మాన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. తాను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోను తొలగించారు. భగవంత్‌ మాన్‌ పార్లమెంట్‌లోకి వెళ్లడం మొదలుకొని మొత్తం ప్రక్రియను రికార్డ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

 

మస్టిరీగా మారిన వైమానిక విమానం అదృశ్యం

ఢిల్లీ : చెన్నై నుంచి పోర్టు బ్లెయర్‌ వెళ్తూ గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఆచూకీ ఇంకా దొరకలేదు. విమానంలో 8 మంది విశాఖ వాసులతో సహా 29 మంది ఉద్యోగులు ఉన్నారు. విశాఖకు చెందిన సాంబమూర్తి, భూపేంద్ర సింగ్‌, నాగేంద్రరావు, ప్రసాద్‌ బాబు, పూర్ణచంద్ర సేనాపతి,  చరణ్‌ మహారాణా, చిన్నారావు, శ్రీనివాసరావు ఉన్నారు. విమానం ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

 

21:39 - July 22, 2016

ఢిల్లీ : చెన్నై నుంచి పోర్టు బ్లెయర్‌ వెళ్తూ గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఆచూకీ ఇంకా దొరకలేదు. విమానంలో 8 మంది విశాఖ వాసులతో సహా 29 మంది ఉద్యోగులు ఉన్నారు. విశాఖకు చెందిన సాంబమూర్తి, భూపేంద్ర సింగ్‌, నాగేంద్రరావు, ప్రసాద్‌ బాబు, పూర్ణచంద్ర సేనాపతి,  చరణ్‌ మహారాణా, చిన్నారావు, శ్రీనివాసరావు ఉన్నారు. విమానం ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

 

21:20 - July 22, 2016

పాలమూరు మీద సర్కారు గావురం.... మార్చుకోవాలంట మాటల ఇగురం, చెప్పలేని బూతులు తిట్టుకున్న లీడర్లు.. వీళ్లను జూసినంక నేర్చుకోరా... వాళ్ల క్యాడర్లు, మళ్లీ జూసేవరకళ్ల మాయమైన సీరలు...  ఆదిలాబాద్ జిల్లాల అబలల గారడీలు, గాంధీ తాతను చూసి సిగమూగిన భక్తురాలు....శ్రీకాకుళం జిల్లాల ఏండ్లసందొస్తున్న ఆచారాలు, దుబైలో పిల్లలు హైద్రబాద్ లో అమ్మ... విడిపోయినొళ్లను కలిపిన పోలీసొళ్లు, రెండు తలకాయలతోటి పుట్టిన ఆవుదూడ.. పుట్టిన పదినిమిషాలకు సచ్చింది ఆడ్దాడ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

20:55 - July 22, 2016

విజయవాడ : ఎపిలో పోలీసు వ్యవస్థను ఫ్రెండ్లీ పోలీసుగా తీర్చిదిద్దుతానని కొత్త డీజీపీగా నియమితులైన నండూరు సాంబశివరావు చెబుతున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కృష్ణా పుష్కరాలను సమర్ధవంతంగా నిర్వహించడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. పోలీసు స్టేషన్ల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. శాంతిభద్రతల పరిక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. 

 

20:48 - July 22, 2016

విజయవాడ : ఎపిలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఆర్‌ ముత్యాలరాజును నియమించింది. విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఎం. హరినారాయణ్‌, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా టీ గిరీష్‌ షా, పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా శివశంకర్‌ నియమితులయ్యారు.

 

20:45 - July 22, 2016

ఢిల్లీ : భారత పార్లమెంట్‌ వ్యవస్థలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును రద్దు చేసే అధికారం ఎవరికి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు. బిల్లును వాయిదా వేసే అధికారం మాత్రమే ఉంటుంది తప్ప ఒకసారి చర్చకు వచ్చిన బిల్లును రద్దు చేసే అధికారం లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే శుక్రవారం బిల్లు చర్చకు వస్తుందన్న నమ్మకం ఉందని రామచంద్రయ్య అన్నారు. 

 

20:40 - July 22, 2016

హైదరాబాద్ : తెలంగాణలో సాంకేతిక విద్య విభాగంలో రోజుకో బాగోతం బయటపడుతోంది. సాంకేతిక విద్యా విభాగం అవకతవకలు.. అక్రమాలకు నిలయంగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారం... నిన్నటికి నిన్న నీట్‌-2 పేపర్‌ లీకేజీ బండారం సాంకేతిక విద్య విభాగపు రెండో కోణాన్ని ఆవిష్కరించాయి. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దందా కూడా ఈ అక్రమాల జాబితాలో చేరింది.  
అక్రమాలకు నిలయంగా ఉన్నతవిద్యా విభాగం?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రైవేటు కాలేజీలు ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడుతున్నాయి. దీనికి సంబంధించి గతంలోనూ ఎన్నో ఆరోపణలు వెలువడ్డాయి. తాజాగా.. రంగారెడ్డి జిల్లాలోని హస్విత ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం అక్రమ మార్గాల్లో ఫీ రియింబర్స్‌మెంట్ పొందినట్లు నిర్థారణ అయింది..  ఇలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందడమే లక్ష్యంగా హస్విత ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిందన్నది స్పష్టమవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే ఇంజినీరింగ్‌ కాలేజీలు పుట్టుకొస్తున్నాయన్న దానికి ఈ ఉదంతమే తాజా నిదర్శనం. గుగులోత్‌ అనిత ఆరా తీయడంతో ఈ కాలేజీ అంశం వెలుగులోకి వచ్చింది. 
ఫీజు రియంబర్స్ మెంట్ దరఖాస్తు చేస్తేనే సర్టిఫికేట్‌ ఇస్తామన్న యాజమాన్యం 
నల్గొండ జిల్లాకు చెందిన గుగులోత్ అనిత అనే విద్యార్ధిని హస్విత ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎంటెక్‌ కోర్సులో చేరింది. అయితే ఆర్ధిక ఇబ్బందులతో వున్న ఈ విద్యార్ధిని కాలేజీ డెవలప్‌మెంట్ ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో.. మొదటి సంవత్సరంలోనే ఇంటి బాట పట్టింది. అయితే.. ఫీజు రియంబర్స్ మెంట్ దరఖాస్తు చేస్తేనే సర్టిఫికేట్‌ ఇస్తామంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగింది. అంతటితో ఆగకుండా ఆమె వేలిముద్ర, సంతకం బలవంతంగా తీసుకున్నారు. అనంతరం, తాము అనుకున్న పని పూర్తికాగానే.. గుగులోత్‌ అనిత సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేసింది హస్విత ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం. అప్పటి నుంచి అనిత కాలేజీ ముఖం చూసింది లేదు. 

ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ నేతలు స్పందించాలి : యనమల

విశాఖ : ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ నేతలు స్పందించాలని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రత్యేక హోదాకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. విశాఖలోనే శాశ్వత సీఐఐ సమ్మిట్ కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. త్వరలోనే సింహాచలం భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సింహాచలం భూముల కేసుపై ఎలా వ్యవహరించాలనే దానిపై ఆటార్నీ జనరల్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

 

మార్కెటింగ్ శాఖపై హరీశ్ రావు సమీక్ష

హైదరాబాద్ : మార్కెటింగ్ శాఖపై హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. శాఖల పనితీరు, మన కూరగాయల పథకం అమలుపై చర్చించారు. 

20:23 - July 22, 2016

కృష్ణా : గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపనులు శరవేగంగా సాగుతోంది. సమస్యలన్ని ఒక్కొక్కొటిగా తొలగిపోతుండడంతో.. తాజాగా విమానాశ్రయానికి 698 ఎకరాల భూసేకరణకు లైన్ క్లియర్ అయింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు తొలివారంలో.. భూములను ఎయిర్ పోర్ట్ అధికారులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
జోరందుకున్న ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు 
విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపనులు జోరందుకున్నాయి. 698 ఎకరాలకు సంబంధించిన భూ సేకరణకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ప్రభుత్వం భూములను విమానాశ్రయానికి అప్పగించిన వెంటనే 11 కిలోమీటర్ల పొడవైన ప్రహారీగోడను నిర్మించనుంది ఎయిర్ పోర్ట్ అథారిటీ.  145 కోట్లరూపాయలతో తొలిదశ రన్ వే విస్తరణపనులు చేపట్టనున్నారు అధికారులు.
అందుబాటులోకి నూతన రన్ వే       
ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రన్ వే 2 వేల 286 మీటర్ల పొడవు ఉండగా దానిని 3025 మీటర్లకు పెంచుతారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తే..నూతన రన్ వే అందుబాటులోకి రానుంది. విమానాశ్రయం త్వరితగతిన అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ఇందుకు 2017ను డెడ్ లైన్ గా విధించుకుంది సర్కార్.  ప్రస్తుతం ఎయిర్ పోర్టులో 6 పార్కింగ్ బేస్ లుండగా మరో 10 నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో 5 పుష్కరాల నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు రానుండడంతో.. సర్వీసులసంఖ్య పెరగనుంది. 
2019 లో ప్రారంభం కానున్న నిర్మాణ పనులు
ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో 137 కోట్లతో ఇన్ టర్మ్ టెర్మినల్ భవనం నిర్మిస్తున్నారు. దేశీయ ప్రయాణికులకు తగ్గట్టుగా సర్వీసులు నడిపేందుకు మాత్రమే వీలుంటుంది. ఇది కాకుండా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు  వీలుగా  535 కోట్లరూపాయలతో న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మాణం జరుగనుంది. నిర్మాణ పనులు 2019 లో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ నాటికి కార్గో సర్వీసులను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
4నెలల క్రితం 22 సర్వీసుల రాకపోకలు
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి నాలుగునెలల క్రితం 22 సర్వీసులే రాకపోకలు సాగించగా..  ప్రస్తుతం వాటి సంఖ్య 36 కు పెంచారు. 18 సర్వీసులు ఇతర నగరాల నుండి వచ్చేవి. దేశంలోని 12 నగరాలకు సర్వీసుల సంఖ్య పెరిగింది. 201 5 16 ఏప్రిల్ , మే, జూన్ లో 1621 సర్వీసులు రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం వీటిసంఖ్య గణనీయంగా పెరిగింది. 

 

20:18 - July 22, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపి కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేట్‌ బిల్లును బిజెపి అడ్డుకుంటోందని దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు. ఈ బిల్లుకు బిజెపి మినహా అన్ని పక్షాలు మద్దతు ప్రకటించాయన్నారు. ఆప్‌ ఎంపి భగవంత్‌ మాన్‌ అంశాన్ని సాకుగా తీసుకుని బిజెపి బిల్లును అడ్డుకుందని దిగ్విజయ్‌సింగ్‌ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న బిజెపి భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోకుండా ప్రయివేట్‌ బిల్లును అడ్డుకునేందుకే పార్లమెంట్‌లో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. ఏపికి ప్రత్యేక హోదాపై ప్రధాని మోది, జైట్లీ, వెంకయ్యనాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వచ్చే శుక్రవారం హోదా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది : కేవీపీ 
వచ్చే శుక్రవారం ప్రత్యేక హోదా బిల్లు ఖచ్చితంగా పాస్‌ అవుతుందని హోదా బిల్లును ప్రవేశపెట్టిన కేవీపీ అన్నారు. పార్లమెంట్‌ చట్టాల ప్రకారం తన బిల్లును వాయిదా వేసే అధికారం ఉందే తప్ప..బిల్లును రద్దు చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల సాకారం నెరవేరుతుందని కేవీపీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

20:14 - July 22, 2016

విజయవాడ : రాష్ట్ర విభజన కారణంగా పోలీస్‌ శాఖలో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయని ఏపీ డీజీపీ రాముడు అన్నారు.  అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేయడం అవ్వదని.. తొలి విడతగా ఆరు వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని డీజీపీ చెప్పారు. ఇందులో భాగంగా 4548 ఎస్‌ఐ..కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సారి అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే పరీక్షలలో  మార్పులు చేశామని తెలిపారు. ఐదు టెస్ట్‌లకు.. మూడు టెస్ట్‌లు మాత్రమే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 

రాహుల్ గాంధీతో ముగిసిన ఎపి కాంగ్ నేతల సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో ఎపి కాంగ్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. 

20:00 - July 22, 2016

యాంకర్ రవి ఆండ్ శ్రీముఖిలతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. రవి, శ్రీముఖిలు కలిసి 'థ్యాంక్ యూ మిత్రమా'.. షార్ట్ ఫిలిం తీశారు. ఈ చిత్రం విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా రవి, శ్రీముఖి పలు ఆసక్తికరమైన అంశాలు తెలిపారు. బాల కిషన్ నటి ధనియా, రేడియోసిటీ ఆర్ జె.పోటుగాడు ప్రాంక్ కాల్ చేసి ఆటపట్టించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

18:59 - July 22, 2016

'రజనీ కాంత్' సినిమా అంటే తెలుగు బాక్సాఫీసు దగ్గర హంగామా మామూలుగా ఉండదు. వందలాది థియేటర్లలో ఆయన చిత్రాలు విడుదలవుతుంటాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'కబాలి'...రిలీజ్ అవుతుందా ? లేదా ? అనే డౌట్స్ ఉన్నాయి. కానీ ఎట్టకేలకు శుక్రవారం విడుదలైంది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హల్ చేసింది. రజనీకాంత్ కు జంటగా రాధికా ఆప్టే నటించింది. హిందీలో కూడా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ? అభిమానులు షో కు ముందు..షో తరువాత ఏం చెప్పారు ? మైనస్..ప్లస్ పాయింట్స్ ఏంటీ ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కార్మికుల ఆందోళన.. నిలిచిన 'పోలవరం' స్పిల్ వే నిర్మాణం పనులు

హైదరాబాద్ : డ్రైవర్లు, ఆపరేటర్ల ఆందోళనతో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణం పనులు నిలిచిపోయాయియి. స్పిల్ వే నిర్మాణం పనుల్లో పని చేస్తున్న కార్మికులకు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 4 నెలలుగా జీతాలు చెల్లించలేదు. స్పిల్ వే నిర్మాణం పనుల్లో పని చేస్తున్న డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. దీంతో స్పిల్ వే నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 

18:48 - July 22, 2016

హైదరాబాద్ : డ్రైవర్లు, ఆపరేటర్ల ఆందోళనతో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణం పనులు నిలిచిపోయాయియి. స్పిల్ వే నిర్మాణం పనుల్లో పని చేస్తున్న కార్మికులకు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 4 నెలలుగా జీతాలు చెల్లించలేదు. స్పిల్ వే నిర్మాణం పనుల్లో పని చేస్తున్న డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. దీంతో స్పిల్ వే నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 

 

18:37 - July 22, 2016

హైదరాబాద్ : తెలంగాణా ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడం రాజకీయ నేతల్లో మరిన్ని ఆశలు పెంచుతోంది. అధికార పార్టీ నేతలు సహా ప్రతిపక్ష నేతలు కూడా జిల్లాల ఏర్పాటుపై ఉత్సాహంగా ఉన్నారు. కొత్త జిల్లాలకు నాయకత్వం వహించేందుకు ఇప్పటి నుంచే  పావులు కదుపుతున్నారు.
దసరా నాటికి కొత్త జిల్లాలపై స్పష్టత
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాలనా సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలు నేతల్లో  కొత్త ఆశలు రేపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రం మరికొన్ని రోజుల్లో దాదాపు 24 జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు  పూర్తయింది. దసరా నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
పది జిల్లాల నుంచి కేబినేట్‌లో బెర్తులు 
ప్రస్తుతం పది జిల్లాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రి వర్గంలో నేతలకు చోటు దక్కింది. ఆ జిల్లాల ఆధారంగానే ఇప్పటి వరకు అన్ని  పనులను  ప్రభుత్వ పరంగా  నిర్వహణ జరుగుతోంది. అయితే భవిష్యత్ లో ఏర్పడే జిల్లాల ద్వారా రాజకీయ పార్టీల నేతలు  తమ దశ, దిశ మారుతుందన్న  ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పదవుల్లో చోటు దక్కుతుందని అంచనా
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడున్న నేతలతో  పాటు మరికొంత మందికి కేబినేట్‌లో అవకాశం దక్కనుంది. పార్టీ పరంగా కొత్త జిల్లాల్లో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసే బాధ్యతలు తమకు దక్కుతాయని అధికార పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. విపక్ష పార్టీల నేతలు కూడా కొత్త జిల్లాలో పట్టు సాధించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడుతున్నారు. నాలుగైదు నియోజకవర్గాలకు ఓ జిల్లా ఏర్పాటు కానుండడంతో  స్థానికంగా మరింత పట్టు బిగించే యత్నాలను నేతలు మొదలు పెట్టారు.

18:28 - July 22, 2016

రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిన్న చిత్రాల ప్రణాళికల్ని కాసింత తారు మారు చేసింది. రజనీ సినిమా అంటే తెలుగు బాక్సాఫీసు దగ్గర హంగామా మామూలుగా ఉండదు. వందలాది థియేటర్లలో ఆయన చిత్రాలు విడుదలవుతుంటాయి. అందుకే 'కబాలి' వచ్చి వెళ్లాకే తమ సినిమాల్ని విడుదల చేద్దామనుకొని ఎదురు చూస్తుండిపోయారు నిర్మాతలు. ఎట్టకేలకు 'కబాలి' శుక్రవారం విడుదలైంది. దీనితో తమ చిత్రాలను విడుదల చేసేందుకు వివిధ దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారంట..
నిర్మాణానంతర పనుల్ని త్వరత్వరగా పూర్తి చేస్తూ చిత్ర బృందాలు పరుగులు పెడుతున్నాయి. అల్లు శిరీష్‌ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని తొలుత సెప్టెంబరులో విడుదల చేయాలనుకొన్నారు. కానీ 'జనతా గ్యారేజ్‌' వాయిదా పడటంతో ఆగస్టు 5నే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మోహన్‌లాల్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన 'మనమంతా', ధన్‌రాజ్‌ నటించిన 'బంతిపూల జానకి' చిత్రాలు కూడా ఆగస్టు 5నే విడుదల తేదీల్ని ఖరారు చేసుకొన్నాయి. ఆగస్టు 12న అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ నటించిన 'బాబు బంగారం' విడుదలవుతున్నప్పటికీ అదే రోజున శ్రీకాంత్‌ 'మెంటల్‌', 13న సాయిధరమ్‌ తేజ్‌ 'తిక్క' ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' చిత్రాలు కూడా సెప్టెంబరులోపు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

18:25 - July 22, 2016

కరీంనగర్ : మంత్రి కేటీఆర్‌ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో.. అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో మంత్రి కోట్లాది రూపాయలను నియోజకవర్గానికి కుమ్మరిస్తుంటే.. అధికారులు మాత్రం పనుల్లో నాణ్యతను గాలికి వదులుతున్నారు. ముస్తాబాద్‌ మండలంలోని పనులను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. 
అభివృద్ధి పనులలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు
సిరిసిల్ల..! మంత్రి కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఇక్కడి అభివృద్ధి పనుల కోసం.. కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో విపరీతంగా నిధులను మంజూరు చేయిస్తున్నారు. దానికి తగ్గట్లే వివిధ పనులూ శరవేగంగా సాగుతున్నాయి. కానీ.. నాణ్యత విషయంలో మాత్రం అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలోని పనులను పరిశీలిస్తే ఈ అనుమానాలు సహేతుకమేనన్న భావన కలుగుతుంది. 
కోట్లాది రూపాయల నిధులు మంజూరు 
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో 4 మండలాల్లోని 192 గ్రామాల అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారు. గ్రామాలలో సిమెంట్ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి సుమారు 12 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధుల్లో కొంత మొత్తాన్ని ముస్తాబాద్‌ మండలంలో కల్వర్టులు, మురికి కాల్వల నిర్మాణానికి ఖర్చు చేశారు. ఈ పనులను పరిశీలిస్తే ఎంత నాసిరకంగా ఉన్నాయో అనుభవం లేని వారికీ ఇట్టే తెలిసిపోతుంది. అక్కడ కల్వర్టును మట్టితో నిర్మించి ఆపై సిమెంట్ ప్లాస్టరింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది. 
అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కు 
నిపుణులైన వారితో పనులు చేయించాల్సిన అధికారులు.. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై అనుభవం లేని కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా.. అభివృద్ధి పనులు.. ప్రారంభానికి ముందే దెబ్బతింటున్నాయన్నది స్థానికుల ఆరోపణ. 
కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలి : ప్రజలు 
మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని పనులే నాసిరకంగా ఉంటే.. మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటన్నది స్థానికుల ప్రశ్న. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లేకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపైన, మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 

 

18:20 - July 22, 2016

ఇండియాలో మాస్ అనే పదానికి అసలైన అర్థం ఏంటో చెప్పిన హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకడు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రజినీ సినిమా అంటే మాస్ థియేటర్లకు పోటెత్తుతారు. 'కబాలి' ఇండియాలో అత్యధిక ప్రి రిలీజ్ చేసిన సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. ఏ ఏరియాలో ఎవరు ఎంతకు కొన్నారన్న వివరాలు బయటికి వచ్చాయి. ఆ లెక్కలేంటో చూడాలంటే చదవండి..
జాజ్ సినిమాస్ అనే సంస్థ 'కబాలి' తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను రూ.68 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు 'కబాలి'ని షణ్ముగ ఫిలిమ్స్ రూ.32 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. అంటే తమిళనాడు-ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లోనే ఈ సినిమా రూ.100 కోట్లు సంపాదించేసిందన్న మాట. 'కబాలి' కర్ణాటక హక్కుల్ని 'లింగా' ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ తీసుకోవడం విశేషం. అతను ఇందుకోసం రూ.10 కోట్లు చెల్లించాడు. కేరళ హక్కులు రూ.7.5 కోట్లకు అమ్ముడయ్యాయి. నార్త్ ఇండియా మొత్తం కబాలి సినిమాను ఫాక్స్ స్టార్ సంస్థ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైట్స్ రూ.15 కోట్లు పలికాయి. అమెరికా-కెనడా రైట్స్ రూ.8.5 కోట్లకు.. మిగతా ఓవర్సీస్ హక్కులన్నీ కలిపి రూ.16.5 కోట్లకు అమ్మినట్లు సమాచారం. శాటిలైట్.. మ్యూజిక్ హక్కుల్ని రూ.40 కోట్లకు అమ్మారట. ఇతర మార్గాల్లో రూ.15 కోట్ల దాకా వచ్చాయి. మొత్తంగా కబాలి ప్రి రిలీజ్ బిజినెస్ రూ.220 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

18:17 - July 22, 2016

హైదరాబాద్ : నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. హరితహారం కార్యక్రమంపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మొక్కలు ఎండిపోకుండా నీరు పోసేందుకు అవసరమైతే ఫైర్‌ ఇంజిన్లను, మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకులను వాడుకోవాలని కోరారు. ఈ సీజన్‌లో 46 కోట్ల మొక్కలు నాటాలన్నారు. హరితహారం కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు ఈనెల 25 నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. హరితహారంలో ప్రజాప్రతినిధుల, అధికారులు పాల్గొంటున్న తీరుతెన్నులను అంచనా వేసేందుకు కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.
 

విజయవాడలో బీసీ సంఘాల ధర్నా..

విజయవాడ : బీసీ జాబితాలో కొత్తగా ఎవరినీ చేర్చవద్దంటూ బీసీ సంఘాలు ఆందోళన చేపట్టారు. బీసీ కమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

18:10 - July 22, 2016

మాంచెస్టర్ : ఇంగ్లండ్‌ -పాకిస్థాన్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ ఆరంభమైంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రా ఫోర్డ్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ 10 పరుగులకే ఔటైనా....కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. రూట్‌తో కలిసి హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన కుక్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ జట్టు సంచలన విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

 

18:08 - July 22, 2016

హైదరాబాద్ : ప్రస్తుత సమాజంలో ప్రభుత్వాలు, అధికారులలో సేవాదృక్పథం తగ్గిపోయిందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 'మీసేవ' కేంద్రాల్లో రూ.7 కోట్ల లావాదేవీలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ హరితాప్లాజలో జరిగిన 'మీసేవ' వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 'మీ సేవ' కేంద్రాల్లో మరో 24 కొత్త సేవలను కేటీఆర్‌ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సేవకులమని రాజకీయ నాయకులు, అధికారులు మర్చిపోతున్నారని తెలిపారు. 

 

18:08 - July 22, 2016

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మొదటి రోజే విరాట్‌ కొహ్లీ స్ట్రోక్‌ఫుల్‌ సెంచరీతో అలరించాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆకట్టుకున్నాడు. 74 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్నాడు. టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు చేసిన కొహ్లీ....ఈ ఇన్నింగ్స్‌తో మరో మైలురాయిని సైతం అధిగమించాడు. ఫార్మాట్‌ మారినా విరాట్ ఫామ్‌ మాత్రం మారలేదు. ఇన్‌స్టంట్‌ ఫార్మాట్లలో తిరుగులేని కొహ్లీ...టెస్టుల్లోనూ తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు.

1000 పరుగుల మార్క్..
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మొదటి రోజే విరాట్‌ కొహ్లీ స్ట్రోక్‌ఫుల్‌ సెంచరీతో అలరించాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆకట్టుకున్నాడు. కరీబియన్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడు.తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించిన కొహ్లీ....133 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. 12వ సెంచరీ నమోదు చేసిన కొహ్లీ....టెస్టుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు.అంతే కాదు ఈ ఇన్నింగ్స్‌లోనే కెప్టెన్‌గా 1000 పరుగుల మార్క్‌ సైతం విరాట్‌ అధిగమించాడు.
తొలి రోజు ఆట ముగిసే సరికి 197 బంతుల్లో 16 ఫోర్లతో 143 పరుగులతో విరాట్‌ నాటౌట్‌గా నిలిచాడు.ప్రస్తుతం కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న కొహ్లీ.... రెండో రోజు ఆటలో టెస్టుల్లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

17:53 - July 22, 2016

ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో జెరుసలేం మత్తయ్యకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది... నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.. సాక్ష్యాలు లేవంటూ మత్తయ్యను ఈ కేసునుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ టీఎస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది... ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మత్తయ్యకు నోటీసులిచ్చింది.. 

శ్రీనగర్ లో పెరిగిన మృతుల సంఖ్య...

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో ఇంకా ఘర్షణలు చల్లారలేదు. తాజగా అవంతిపురాలో పోలీసు కాల్పుల్లో ఓ నిరసనకారుడు మృతి చెందాడు. దీనితో మృతుల సంఖ్య 46కి పెరిగింది.

ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ బిసిలకు ఎందుకు : ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ : బీసీలకు క్రిమిలేయర్ ను తొలిగించాలని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య  డిమాండ్ చేశారు. ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ బిసిలకు ఎందుకని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియోతో మాట్లాడారు. క్రిమిలేయర్ కు, రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సామాజిక వివక్ష, కుల వివక్ష తొలగిపోవడానికి రిజర్వేషన్లను కల్పించారని తెలిపారు. క్రిమిలేయర్ ను ప్రతి ఒక్క ఆఫీసర్ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 

 

17:41 - July 22, 2016

హైదరాబాద్ : బీసీలకు క్రిమిలేయర్ ను తొలగించాలని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏ వర్గానికి లేని క్రిమిలేయర్ బిసిలకు ఎందుకని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో మీడియోతో మాట్లాడారు. క్రిమిలేయర్ కు, రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సామాజిక వివక్ష, కుల వివక్ష తొలగిపోవడానికి రిజర్వేషన్లను కల్పించారని తెలిపారు. క్రిమిలేయర్ ను ప్రతి ఒక్క ఆఫీసర్ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 

17:30 - July 22, 2016

ఢిల్లీ : రాజకీయ ప్రయోజనాల కోసమే హోదా బిల్లు చర్చకు రాకుండా బీజేపి అడ్డుకుంటుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఏచూరి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆప్‌ ఎంపీపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రం చేతిలోనే ఉన్నా..సభను తప్పుదోవ పట్టించేందుకు ఆ అంశాన్ని వాడుకోవడం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆప్‌ ఎంపీ అంశాన్ని సాకుగా చూపి హోదా బిల్లు చర్చకు రాకుండా అడ్డుకుందన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకే బిజేపి ఆప్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఆనాడు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వెంకయ్యనాయుడు ఇవాళ సభలో లేరని...వెంకయ్యనాయుడు సభలో ఎందుకు లేరో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాన్ని మోడీ ప్రభుత్వం మర్చిపోతుందన్నారు. కేంద్రప్రభుత్వం 'ఎపి ప్రజలకు చేసిన వాగ్ధానాలు నెరవేర్చాలని ఏచూరి డిమాండ్ చేశారు. సీపీఎం మొదటి నుంచి హోదా బిల్లుకు మద్దతిస్తుందని స్పష్టంగా చెప్పామని తెలిపారు. ప్రత్యేక హోదా బిల్లుకు పూర్తి మద్దతిచ్చి ఓటింగ్‌లో పాల్గొంటుందని స్పష్టం చేశారు. 

 

 

17:24 - July 22, 2016

తమలపాకు..తాంబూళం..పూజలకు మాత్రమే ఉపయోగించరు. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
తమలపాకు రసాన్ని 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కొన్ని తమల పాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు జ్యూస్ ను తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకోవడమే కాకుండా కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది.
జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతి మీద వేసి కడితే ఫలితం ఉంటుంది.
తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. ఓ గంట సేపు అనంతరం తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.

17:04 - July 22, 2016

ఢిల్లీ : ప్రత్యేక హైకోర్టు కోరుతూ జంతర్‌ మంతర్‌ దగ్గర తెలంగాణ న్యాయ విద్యార్థులు ధర్నా చేపట్టారు.. ఆప్షన్ల పేరుతో ఏపీ న్యాయవాదుల్ని తెలంగాణ హైకోర్టులో నియమించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. విద్యార్థుల ఆందోళనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతు ప్రకటించారు.. కేంద్రం స్పందించకపోతే మరోసారి పార్లమెంట్‌లో మరోసారి నిరసన చేపడతామని ఎంపీలు హెచ్చరించారు.. 

2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి - కోదండరాం..

మహబూబ్ నగర్ : 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం బండరావిపాకులలో పాలమూరు - రంగారెడ్డి లిప్ట్ నిర్వాసితులతో ఆయన ముచ్చటించారు.

ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు..

విజయవాడ : ఏపీలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. విశాఖ కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్, నెల్లూరు కలెక్టర్ గా ఆర్. ముత్యాలరాజు, విశాఖ మున్సిపల్ కమిషనర్ గా ఎం.హరినారాయణ, చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా టి.గిరీష, పాడేరు ఐటీడీఏ పీవోగా శివశంకర్ లు నియమితులయ్యారు.

16:35 - July 22, 2016

ఢిల్లీ : అంతకు ముందు ఆప్ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఎంపీ భగవంత్ కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 
మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవు : నిర్మలా సీతారామన్ 
భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని బీజేపీ ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని, పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన చర్యను భగవంత్ సమర్థించుకున్నారని, మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. 
భగవంత్‌ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం:  మల్లికార్జున ఖర్గే 
భగవంత్‌ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. భగవంత్‌ మాన్‌ చర్య చాలా తీవ్రమైనది.. ఆయనపై సరైన చర్య తీసుకుంటామని స్పీకర్‌ ప్రకటించినా సభ్యులు శాంతించలేదు. దీంతో గందరగోళం మధ్య సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు
స్పీకర్ ఎదుట భగవంత్ వివరణ 
మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై భగవంత్ వివరణయిచ్చారు. జీవో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతకు భంగం కలిగించలేదన్నారు.

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. 93 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,803 వద్ద ముగియగా 31 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,541 వద్ద ముగిసింది.

హరితహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంపై సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి కేసీఆర్ ఆకస్మిక పర్యటన చేయనున్నట్లు సమాచారం.

 

గుజరాత్ కు వెళ్లిన ఢిల్లీ సీఎం..

ఉనా : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుజరాత్ కు వెళ్లారు. ఉనాలో దాడి జ‌రిగిన ద‌ళిత బాధిత కుటుంబ‌స‌భ్యుల‌ను సీఎం కేజ్రీవాల్ ప‌రామ‌ర్శించారు. ఆవు చ‌ర్మం స్మిగ్లింగ్ చేస్తున్న‌రాన్న ఆరోప‌ణ‌ల‌పై వారం రోజుల క్రితం న‌లుగురు ద‌ళితుల‌ను కారుకు క‌ట్టేసి తీవ్రంగా కొట్టిన విష‌యం తెలిసిందే.

16:21 - July 22, 2016

తమన్నా..టాలీవుడ్ మిల్క్ బ్యూటీ ప్రత్యేక పాటలో స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో బెల్లకొండ శ్రీనివాస్ నటించిన చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇదే హీరోతో చిందులేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముచ్చటగా మూడోసారి స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి పచ్చజెండా ఊపినట్లు టాక్. గోపిచంద్ హీరోగా సంపత్ నంది ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హన్సిక, కేథరిన్ లు నటించనున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి చంద్‌తో తమన్నా ప్రత్యేక పాటలో ఆకట్టుకోనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బాహుబలి ది కంక్లూజన్, అభినేత్రి వంటి చిత్రాలతో పాటు తమిళంలో విజయ్‌సేతుపతితో ధర్మాదొరై, విశాల్ నటిస్తున్న కత్తి సండై చిత్రాల్లో నటిస్తోంది.

తెలంగాణ విజయ డెయిరీ ప్రారంభం..

హైదరాబాద్ : తెలంగాణ విజయ డెయిరీని మంత్రి తలసాని ప్రారంభించారు. ఇకపై విజయ పాలను విజయ తెలంగాణ పాలుగా విక్రయాలు జరగనున్నాయి.

పోలవరం స్పిల్ వే పనులను నిలిపివేసిన డ్రైవర్లు..ఆపరేటర్లు..

పశ్చిమగోదావరి : పోలవరం స్పిల్ వే నిర్మాణంలో పనులు నిలిపివేసి డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. అర్ధాంతరంగా పనులను వర్కర్లు నిలిపివేశారు.

ఎయిమ్స్ కు ప్రధాని శంకుస్థాపన..

ఉత్తరప్రదేశ్‌ : గోరక్‌పూర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకంటే ముందు గోరక్‌నాథ్‌ ఆలయాన్ని మోడీ సందర్శించారు.

15:53 - July 22, 2016

ఢిల్లీ : ఉనికి కాపాడుకోవడానికే కాంగ్రెస్... ఎపికి ప్రత్యేకహోదా బిల్లు ప్రవేశపెట్టిందని టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనాచౌదరి విమర్శించారు. రాజ్యసభ వాయిదా పడిన అనంతరం సుజనా, సీఎం రమేష్ లు మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని సుజాన అన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీలు సహకరించడంలేదని ఆయన అన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయ కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ శైలి... చంపి సానుభూతి సభ పెడ్తామన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎపి ప్రజలకు కాంగ్రెస్ కు అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ తన ఉనికిని కాపాడుకునేందుకే ఇవాళ హోదా బిల్లుపై నాటకమాడుతోందని అన్నారు. సోమవారం నాడు ఎలాంటి సభా కార్యక్రమాలు జరగకుండా కాంగ్రెస్‌ సభ్యులందరూ అడ్డుకుంటే అప్పుడే వాళ్ల చిత్తశుద్ధి బయటపడుతుందని ఎంపీ రమేష్‌ అన్నారు. 

 

 

రేపు జమ్మూకు వెళ్లనున్న కేంద్ర హోం మంత్రి..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం జమ్మూ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. గత కొంతకాలంగా అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

బీకే బన్సాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు..

ఢిల్లీ : కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ బీకే బన్సాల్ కు పాటియాల కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆమె భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు మూడో తేదీ వరకు ఈ బెయిల్ కొనసాగనుంది.

గుల్బర్గాలో కానిస్టేబుల్ సూసైడ్..

కర్నాటక : గుల్బర్గాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు హెడ్ క్వార్టర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనాస్థలంలో సూసూడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.

15:43 - July 22, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు రాజ్యసభలో చర్చకు రాకుండానే సభ వాయిదా పడింది. బిల్లుపై ఓటింగ్‌కు కాంగ్రెస్‌ ఎంపీలు పట్టుబట్టారు. అయితే అదే సమయంలో బీజేపి సభ్యులు ఆప్‌ ఎంపీ వ్యవహారంపై చర్చించాలని పట్టుబట్టారు. బీజేపి సభ్యులు స్పీకర్‌ పోడియం దగ్గర నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సభ్యుని హక్కును బీజేపి కాలరాస్తోందని ఈ సందర్భంగా సీపీఎం రాజ్యసభ పక్షనేత సీతారాం ఏచూరి అన్నారు. హోదా బిల్లు చర్చకు రాకుండా బీజేపి అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. అయితే సభ్యుల ఆందోళనల మధ్య సభను డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ సోమవారానికి వాయిదా వేశారు. అయితే సోమవారం కూడా కేవీపీ ప్రైవేటు చర్చకు వచ్చే అవకాశం లేదు. ప్రైవేటు బిల్లులు కేవలం శుక్రవారం మాత్రమే చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో వచ్చే శుక్రవారం కేవీపీ బిల్లుకు చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 

15:41 - July 22, 2016

తల్లి కావడం మహిళ జీవితంలో మరచిపోలేని ఓ మధురానుభూతి.. అమ్మగా మారడం ఓ గొప్ప బాధ్యత..కానీ సమాజంలో మృగాళ్ల కారణంగా పలువురు మహిళలు మోస పోతుంటారు. పెళ్లి చేసుకుంటానన నమ్మిస్తుంటారు..తీరా ఆమె గర్భవతి అని తెలుసుకున్న తరువాత మోసం చేస్తుంటారు.. ఇలాంటి ఎన్నో ఘటనలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటాయి..వినిపిస్తూనే ఉంటాయి. కానీ మహిళ తనకు అబార్షన్ కు అనుమతి మంజూరు చేయాలంటూ ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది. ఎందుకు ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి...

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళతో ఓ వ్యక్తి సంబంధం పెట్టుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా ఆమె గర్భం దాల్చింది. కానీ ఆ మృగాడు మాత్రం ఆమెను కాదని మరోకరిని వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం 24వారాల గర్భిణీ. అబార్షన్ చేయాలని వైద్యులను సంప్రదించింది. వైద్యులు అందుకు నిరాకరించారు. పిండంలో సమస్యలున్నాయంటూ పేర్కొన్నారు. అంతేగాక నిబంధనల ప్రకారం 20 వారాలలోపే అబార్షన్ చేసుకోవడం వీలవుతుందని, 24 వారాల గర్భిణీ కావడం వల్ల వీలు కాదని వైద్యులు తేల్చిచెప్పారంట. పెళ్లి కాకుండానే గర్భవతి కావడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నానని, తనకు న్యాయం చేయాలని ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిండంలో పలు సమస్యలు ఉన్నాయని, ప్రసవం అయ్యే దాకా బతికే అవకాశాలు లేవని.. ఈ విషయం గర్భం దాల్చిన 20 వారాల తర్వాతే తెలిసిందని కోర్టుకు విన్నవించుకుంది. ఆమె వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, అటు మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేసిందంట.

15:38 - July 22, 2016

చిత్తూరు : ఆమె సంగీత అధ్యాపకురాలు. అధ్యాపకురాలు అంటే ఎలా ఉండాలి. సంగీతంలో నైపుణ్యం ప్రదర్శించే విధంగా విద్యార్థులను తీరిద్దిద్దాలి. తెలుగు రాష్ట్రం..కళాశాల ప్రభావాన్ని నలు దిశల వ్యాపించే విధంగా వ్యవహరించాలి. కానీ ఈ అధ్యాపకురాలు మాత్రం భిన్నంగా వ్యవహరించింది. తనపై ఆరోపణలు చేసిన వారిపై వీరంగం సృష్టించింది. తిరుపతి ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు భ్యాగరేఖపై పలు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కళాశాల ప్రిన్స్ పాల్ కు పలువురు ఫిర్యాదు చేశారు. దీనిని ఏ మాత్రం సహించలేని ఆ అధ్యాపకురాలు అక్కడకు చేరుకుని హల్ చల్ చేసింది. విద్యార్థులను దుర్భాషలాడింది. ఈ తతంగం అంతా వీడియో చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై చిందేసింది. కెమెరాలను సైతం లాక్కొనే ప్రయత్నం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయిన అధ్యాపకురాలు భాగ్యరేఖ వినలేదు. చివరకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెత్త మాటలు తప్ప వేరే మాట్లాడదని విద్యార్థులు పేర్కొన్నారు. టిటిడి ఆమెపై దృష్టి పెట్టాలని, విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ప్రజానాట్య మండలి కళాకారులు పేర్కొన్నారు.

ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు వీరంగం..

చిత్తూరు : తిరుపతి ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు భాగ్యరేఖ వీరంగం సృష్టించింది. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను దుర్భాషలాడారు. కవరేజ్ చేస్తున్న పత్రికా వీడియో కెమెరాలు లాక్కొనే ప్రయత్నం చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి భాగ్యరేఖను అదుపులోకి తీసుకున్నారు.

రాజ్యసభ వాయిదా పడడంపై టిడిపి ఎంపీల స్పందన.

ఢిల్లీ : ఆప్ ఎంపీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసిందని, దీనికి కాంగ్రెస్ సభ్యులు ఒప్పుకుంటే బాగుండేదని టిడిపి ఎంపీలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడానికి బిల్లు పెట్టిందని సుజన పేర్కొన్నారు. కాంగ్రెస్ చంపి సంతాప సభ పెడుతున్నట్లుగా ఉందని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.

ఆప్ ఎంపీ క్షమాపణలు..

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భ‌గ‌వంత్ మాన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. పార్ల‌మెంట్‌లో ఉన్న సెక్యూర్టీని ఫేస్‌బుక్‌లో లైవ్ ప్ర‌సారం చేసిన ఎంపీపై లోక్ సభ, రాజ్యసభ లో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో లోక‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఎంపీ భ‌గ‌వంత్‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఆ స‌మ‌న్ల‌పై ఎంపీ క్షమాపణలు చెప్పారు.

కృష్ణా పుష్కరాలపై బాబు సమీక్ష..

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఘాట్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో సీతానగరం ఘాట్ కాంట్రాక్టర్ ను పిలిచి మందలించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

సభ్యుని హక్కును బీజేపీ కాలరాస్తోంది - ఏచూరి..

ఢిల్లీ : సభ్యుని హక్కును బీజేపీ కాలరాస్తోందని, హోదా బిల్లుకు చర్చకు రాకుండా బీజేపీ అడ్డుకొంటోందని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.  రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆప్ సభ్యుడిపై చర్యలకు బిజెపి పట్టుబట్టింది. ఇరు పక్షాల ఆందోళనలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. 

 

14:38 - July 22, 2016

నల్గొండ : ప్రియురాలి మైకంలో పడ్డ మొగుడు ఇల్లాలికి నరకం చూపించాడు...రెండ్రోజులుగా యువతితో కలిసి చిత్రహింసలు పెట్టాడు..కర్రతో కొట్టాడు..బ్లేడ్‌తో గాట్లు పెట్టాడు...రక్తం వస్తే ..ఆ ఇల్లాలు అరిస్తే వికటాట్టహాసం చేశాడు...ఉన్మాదిలా మారిన దుర్మార్గుడు పెట్టిన బాధలు భరించలేకపోయింది.. చనిపోయిందనుకుని ఇంటికి తాళం వేసి వెళ్లగా మర్నాడు చుట్టూ ఉన్నవారు విముక్తురాలిని చేశారు...
ఒంటినిండా గాయాలు... కమిలిపోయిన దేహం...కన్ను కన్పించకుండా కొట్టిన కిరాతకం..కన్నీరు కార్చేందుకు కూడా వీల్లేకుండా రాక్షసం.. మొగుడు కాదు...మృగాడు... కన్పించే దృశ్యాలు వర్ణించలేనివి. ఆమె బాధ వర్ణణాతీతం...తన గుండెలోతుల్లోంచి వస్తున్న వేదనను చెప్పుకోలేని పరిస్థితి. ఆ ఇల్లాలి ఒంటిపై గాయాలే చెబుతున్నాయి ...మొగుడి రాక్షసాన్ని...ఆ ఇల్లాలు కన్నీరు కూడా పెట్టకుండా చేసిన కిరాతకం కన్పిస్తూనే ఉంది. మగోన్మాదంతో దుర్మార్గుడు చెలరేగిపోయాడు. ఉన్మాదిలా మారాడు.

మగపిల్లాడు కావాలని చేశానంటాడు..
నల్లగొండ జిల్లా దాచారం గ్రామానికి చెందిన గొలుసుల శ్రీనివాస్‌కు శాలిగౌరారం చిత్తలూరు లక్ష్మితో 12 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత చెడు వ్యసనాలకు బానిసగా మారిన శ్రీనివాస్ అరాచకం మొదలయింది. డబ్బు కోసం ఓ కూతురిని అమ్మేసిన శ్రీనివాస్ ఆ తర్వాత భార్య గొడవపడ్డంతో ఓ బాబును దత్తత తెచ్చి కొడుకు లేడు కదా అంటూ సర్ధి చెప్పాడు.

మరో యువతితో సంబంధాలు..
ఆర్థిక ఇబ్బందులతో మకాం మార్చిన శ్రీనివాస్ వ్యవహారం మరోలా మారింది. మరో యువతితో సంబంధం పెట్టుకున్న దుర్మార్గుడు ఆ మైకంలో పడి భార్యకు నిత్యం నరకం చూపిండం మొదలుపెట్టాడు. చివరగా భార్యను వదిలించుకోవాలని ప్రయత్నం చేసిన శ్రీనివాస్‌ రెండ్రోజులుగా ఇంట్లో బంధించి ప్రియురాలితో కలిసి చిత్రహింసలు పెట్టాడు. స్పృహ కోల్పోయిన ఇల్లాలిని బ్లేడ్‌తో..చాకుతో గాట్లు పెట్టి పైశాచికంగా ప్రవర్తించాడు...ఇక లక్ష్మి చనిపోయిందనుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మర్నాడు స్పృహలోకి వచ్చిన ఆ ఇల్లాలు అరవడంతో చుట్టూ ఉన్నవారు విడిపించారు.

మొగుడి రాక్షసంపై ఇల్లాలి పోరాటం..
జరిగిన ఘోరం చెప్పిన ఇల్లాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె పరిస్థితి చూసి కూడా పోలీసులు స్పందించకపోవడంతో మీడియా ముందుకు వచ్చింది. ఆ..సంబంధంతో కట్టుకున్న భార్యను చితకబాది చంపాలని ప్రయత్నించిన శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. మరి ఈ మృగాడికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.

 

14:33 - July 22, 2016

విజయవాడ : ఏపీలోని రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేవలం టీడీపీ పార్టీ కార్యాలయం కోసమే కేటాయింపులు జరిగినట్లుగా ఉందని ఆరోపించారు. టీడీపీ పార్టీ ఆఫీస్ లకు విలువైన భూములను తీసుకుంటున్నారన్నారు. ప్రజల సోమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే భూములను ఇలా ఇష్టారాజ్యంగా కేటాయించుకొని దోపిడీ చేస్తోందని అన్నారు. 

14:29 - July 22, 2016

విజయవాడ : శాసనమండలి సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి రాజమండ్రి నుంచి విజయవాడకు ర్యాలీగా బయల్దేరారు. సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆదిరెడ్డి టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. మూడేళ్ల నుంచి వైసీపీ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నా జగన్‌ పరిగణనలోకి తీసుకోవడం లేదని, అందుకే టీడీపీలో చేరుతున్నానని ఆదిరెడ్డి అప్పారావు చెప్పారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

14:27 - July 22, 2016

ఢిల్లీ : ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇటీవల 150వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు శుక్రవారం సభ ఎదుట రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. దీనితో సభకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసందర్భంగా చిరు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టనున్న బిల్లుకు బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తే ఏపీలో మనుగడ ఉండదని అన్నారు. బిల్లుపై టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉందని వ్యాఖ్యానించారు. కేవీపీ బిల్లు ఎప్పటికైనా ఓటింగ్‌కు రావాల్సిందే అని చిరు అన్నారు. ప్రస్తుతం బిల్లు ఓటింగ్ కు అడ్డుకోవచ్చని, నెక్ట్స్ సెషన్ లో నైనా బిల్లు వస్తుందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజు ఓటింగ్ విషయంలో బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సినవసరం ఉంటుందన్నారు. టిడికి అనుకూలంగా ఓటు వేయాల్సిన ఆగత్యం ఏర్పడిందని చిరు పేర్కొన్నారు. 

14:22 - July 22, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగ్ కు వస్తుందా ? ఎవరైనా అడ్డుకుంటారా ? అనేది కాసేపట్లో తెలియనుంది. ఏపీకి ప్రత్యేక హోదా..ఇతరత్రా అంశాలు కోరుతూ కేవీపీ ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగకుండానే ఓటింగ్ జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కానీ సభ పార్రంభం కాగానే ఆప్ సభ్యుడి ప్రవర్తనపై దుమారం రేగుతోంది. దీనితో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 02.30గంటలకు బిల్లు సభ ముందుకు రానుంది. మరో వైపు రాజ్యసభ సభ్యులకు టీడీపీ, బీజేపీలు విప్‌ జారీ చేశాయి. ఈరోజంతా సభలోనే ఉండాలని అధిష్ఠానాలు సభ్యులకు సూచించాయి. కాంగ్రెస్‌ సభ్యులకు ఆపార్టీ ఇటీవలే విప్‌ జారీ చేసింది. కేవీపీ ప్రైవేటు బిల్లుతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి దిల్లీలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభలో మొత్తం 19 ప్రైవేటు బిల్లులు చర్చకు రానున్నాయి. అందులో ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు 14వది. రాజ్యసభలో కాంగ్రెస్ కు 60, బీజేపీకి 53, టీడీపీకి 6, వైఎస్సార్ సీపీకి ఒక సభ్యుడు ఉన్నారు.

14:14 - July 22, 2016

చెన్నై : భారత వైమానిక దళంలో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. విమానం అదృశ్యం కావడం పట్ల తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ప్రమాదానికి గురైందా ? లేదా ఎవరైనా హైజాక్ చేశారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ కు ఎయిర్ ఫోర్స్ విమానం (ఏఎన్32) బయలుదేరింది. ఉదయం 8.12గంటలకు బయలుదేరిన ఈ విమానం ఎంతసేపటికి పోర్ట్ బ్లెయిర్ చేరుకోలేదు. దీనితో అందరిలో కంగారు మొదలైంది. అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా విమానం అదృశ్యమైన విషయం వెలుగు చూసింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. విమాన ఆచూకి కనుగొనే పనిలో పడ్డారు. 8.12 గంటలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. విమానంలో 29 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 

Kabali Public Talk

 తీవ్ర ఉత్కంఠ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా రిలీజ్ అయింది.  ప్రపంచవ్యాప్తంగా రజనీ అభిమానులు ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కబాలి సినిమా రిలీజ్ అయింది.  బారి అంచనాలతో తెరకెక్కిన కబాలి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉంది .. మూవీ చూసిన   ప్రేక్షకుడు ఏమంటున్నాడు ..  Just Watch The Public Opinion in the Video 

మత్తయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు..

ఢిల్లీ: న్యూఢిల్లీ : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు నుంచి మత్తయ్యను తొలగించడంపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. తెలంగాణ తరపున శేఖర్ నఫ్తే, హరీన్ రావల్ వాదనలు వినిపించారు. మత్తయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని తెలంగాణ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

సీఎస్ టక్కర్ తో వైసీపీ బృందం భేటీ ..

హైదరాబాద్ : సీఎస్ టక్కర్ తో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. రాయలసీమలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని సీఎస్ ను వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కోరారు. కృష్ణా రివర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు.

 

13:52 - July 22, 2016

హైదరాబాద్ : శారీస్ ఎవర్ గ్రీన్ కాస్టూమ్. అందుకే రోజువారీ అయినా, పార్టీవేర్ గానైనా మహిళలు ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటారు. ఎప్పుడూ తమ వార్డ్ రోబ్స్ లో కొత్త కొత్త కలెక్షన్స్ చేర్చుకుంటారు. అతివలు అలా ఇష్టపడే అమీర్ పేటలో ఉన్న ఇష్ట సఖిలో ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు..

ఢిల్లీ : చెన్నె: తంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో 29 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం మధ్యాహ్నం గగనతలంలో అదృశ్యమైంది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సివుంది.

13:44 - July 22, 2016

హైదరాబాద్ : అందమైన ఆభరణాలే కాదు, ఆత్మరక్షణా మార్గాలు కూడా ఆభరణంగా మారాలి. అప్పుడే కొన్ని సందర్భాల్లోనైనా మహిళలు ఇబ్బందులను అధిగమిస్తారు. దాడులను తిప్పి కొట్టగలరు. తమను తామే కాపాడుకోగలరు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:37 - July 22, 2016

హైదరాబాద్ : 50 ఏళ్ల‌లోపు వ‌య‌స్సున్న మ‌హిళ‌లు కేన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కేన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రీసెర్చ్ (NICPR) చేసిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మారుతున్న జీవ‌న ప్ర‌మాణాలే మ‌హిళల్లో కేన్స‌ర్‌కు దారితీస్తున్నాయ‌ని స్ట‌డీ తెలిపింది.

ఈ యాప్ తో సేఫ్ గా...

ఒక డ్రైవ‌ర్‌తో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తున్న అమ్మాయిలు ఇంటికి తిరిగి వ‌చ్చేవ‌ర‌కూ త‌ల్లిదండ్రుల‌కు టెన్ష‌నే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ‌రినీ న‌మ్మ‌డానికి వీలులేదు. ఇంటి నుంచి సొంత‌కారులో ఒక డ్రైవ‌ర్‌తో బ‌య‌ట‌కు అమ్మాయిలు వెళితే ఇక‌పై వారు ఎక్క‌డున్నారో ఇట్టే తెలిసిపోతుంది.

ఆరేళ్ల వయసులో చెస్ లో అరుదైన రికార్డు...

ముంబైకి చెందిన చిన్నారి సుహాని లోహియా చెస్ లో అరుదైన రికార్డు సృష్టించింది. ఆరేళ్ల వయసులోనే మహిళా క్యాండిడేట్ మాస్టర్ గా అవతరించింది.

కీలక హోదాల్లో మహిళలకు నిరాదరణ...

మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తారని ఎన్ని మాటలు చెప్పినా, వారికి అవకాశాలిచ్చే చోట మాత్రం వివక్ష చూపడమే నేటికీ కొనసాగుతోంది. కంపెనీల్లో కీలక హోదాల్లో వారి నియామకంలోనూ అదే నిరాదరణ కనిపిస్తోంది.

తదిశ్వాస విడిచిన ముబారక్ బేగమ్ షేక్...

బాలీవుడ్ లో మరో సుమధుర గొంతు మూగబోయింది. 50, 60 దశాబ్దాల్లో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముబారక్ బేగమ్ షేక్ తుదిశ్వాస విడిచారు.

స్త్రీ నిధి వారోత్సవాల్లో...

అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు దాదాపు 15 వేల గ్రామ మహిళా పొదుపు సంఘాలకు ట్యాబ్ లు, వేలిముద్రల యంత్రాలు, ప్రింటర్లు అందచేయాలని తెలంగాణా స్త్రీ నిధి పాలక మండలి నిర్ణయించింది . డ్వాక్రా సభ్యులకు అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా స్త్రీ నిధి వారోత్సవాలను నిర్వహించనుంది .

పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

 

13:33 - July 22, 2016

థైరాయిడ్.. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఈ సమస్య ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానంగా జుట్టు రాలడం ఒకటి. థైరాయిడ్ గ్రంధిలో ఏర్పడే సమస్యల వలన హార్మోన్ లో ఏర్పడే అసమతుల్యతల ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు కలుగుతాయి. వీటి వలన కలిగే సమస్యలలో వెంట్రుకలు రాలటం కూడా ఒకటని వైద్యులు పేర్కొంటున్నారు. థైరాయిడ్ హార్మోన్ లో ఏర్పడే సమస్యలను తగ్గిస్తే, జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది. ఈ సహజ చికిత్సల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
వ్యాయామాలు చేయడం వల్ల థైరాయిడ్ సంబంధిత వ్యాధి గ్రస్తులకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా వ్యాయామాలు జుట్టు రాలటాన్ని దాదాపుగా తగ్గించి వేస్తాయి.
జుట్టు రాలటాన్ని ప్రేరేపించే ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడే సామర్థ్యాన్ని విటమిన్ 'సి కలిగి ఉంటుంది. బెల్ మిరియాలు, పచ్చని ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ జాతికి చెందిన పండ్లు మరియు పచ్చి బటానీలలో విటమిన్ 'సి' అధికంగా ఉంటుంది.
అమైనో ఆసిడ్ సంబంధిత ఎల్ -లైసిన్ మరియు ఎల్-అర్జినైన్ సమ్మేళనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది. గుడ్డు, చేప, లేగ్యూమ్ ల నుండి అమైనో ఆసిడ్ లను పొందవచ్చు.

పైనుండి పడటంతో క్వారీ కార్మికుడు మృతి..

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో విషాదం చోటుచేసుకుంది. క్వారీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు సుమారు 100 అడుగుల ఎత్తునుండి ఇద్దరు కార్మికులు కింద పడ్డారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో కార్మికుడికి కార్మికుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.  

13:19 - July 22, 2016

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన తాజా చిత్రం 'సుల్తాన్' రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సల్లూ భాయ్ కు జోడిగా 'అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క మల్లయోధురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంటోంది. కానీ సల్లూ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారంట.
'సుల్తాన్' హిట్ సందర్భంగా ఆ చిత్ర హీరోలు..హీరోయిన్లను పలువురు ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఈ కోవలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు తెలియచేసింది. సల్మాన్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదని పేర్కొన్నదంట. సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం వరకే పరిచయమని, షూటింగ్ మధ్యలో సైతం సెట్‌లో సినిమా గురించే మాట్లాడుకున్నాం తప్ప ఎక్కువుగా మాట్లాడుకునే వాళ్లం కాదంటూ చెప్పేసిందంట. ఈ విషయం తెలుసుకున్న సల్లూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఒక చిత్రంలో పనిచేసి ఆయన గురించి తెల్వకపోవడం ఏ మాత్రం బాగా లేదని మండిపడుతున్నారని సమాచారం.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త...

గుంటూరు: రాబోయే రెండేళ్లలో వివిధ నోటిఫికేషన్ల ద్వారా 4 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్ అన్నారు. నోటిఫికన్లు రాబోతున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి వన్ టైం పాస్‌వర్డ్ ఇస్తామన్నారు. విద్యావంతుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని, నిరుద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఉద్యోగ సమాచారం అందిస్తామని ఆయన తెలిపారు.

టీటీడీ నమూనా ఆలయాలు ప్రారంభం...

విజయవాడ : టీటీడీ నమూనా ఆలయాలను మంత్రి దేవినేని ఉమ, డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ ప్రారంభించారు. రూ.3కోట్లతో టీటీడీ నమూనా ఆలయాలను చేపట్టామని మంత్రి దేవినేని తెలిపారు. ఆగస్టు 5న నాటికి ఆలయాల నిర్మాణం పూర్తవుతుందన్నారు. పుష్కర ఘాట్ల పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయనీ.. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులు జరుగుతున్నాయన్నారు. యాత్రీకుల సౌకర్యాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

అగ్రరాజ్యంలో మళ్లీ జాతి వివక్ష...

అమెరికా : పోలీసులు మ‌ళ్లీ ఓ న‌ల్ల‌జాతీయుడిపై కాల్పులు జ‌రిపారు. మియామీలో చార్లెస్ కిన్సే అనే నల్లజాతీయుడిపై అమెరికా పోలీసులు కాల్పులు జరిపారు. సుమారు నాలుగు బుల్లెట్లు దిగిన అత‌ను ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరుగుతుండగా వీడియోలో చిత్రీక‌రించినవారు సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడా వీడియో అమెరికాలో దుమారం రేపుతోంది. 

అవగాహన లేకే విమర్శలు: తుమ్మల

ఖమ్మం : సీతారామ ప్రాజెక్టుపై ప్రతిపక్షాల విమర్శలు సరికావని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్ నిర్మాణం చేపట్టిందని విమర్శించారు. ప్రాజెక్టులపై అవగాహన లేనివారు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.  

12:47 - July 22, 2016

కడప : నగరంలోని ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజి విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మెడికల్ కౌన్సిల్ ఇఫ్ ఇండియా నుండి అనుమతి లేకుండా.. గత ఏడాది సీట్లు భర్తీ చేయడంతో.. ఇప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎంసీఐ నిబంధనల మేరకు....

ఎంసీఐ నిబంధనల మేరకు కడపలోని ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నడవని కారణంగా సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వలేదు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం వంద సీట్ల భర్తీకి అనుమతి ఇస్తే.. వచ్చే సంవత్సరంలోపు ఎంసీఐని సంతృప్తిపరిచి అనుమతి పొందగలమని.. కోర్టు నుండి అనుమతి తెచ్చుకుంది.కాని

ఇటీవల జరిపిన మలివిడత తనిఖీల్లో సంతృప్త పరచలేకపోయింది. దీంతో 2015 -16 విద్యార్థుల ఎకాడమిక్ ఇయర్ ను పరిగణలోకి తీసుకోలేదు ఎంసీఐ.

2015- 16 సంవత్సర సీట్లభర్తీకి ఎంసీఐ అనుమతి నిరాకరణ....

ఇది ఇలా ఉంటే 2015- 16 సంవత్సర సీట్లభర్తీకి ఎంసీఐ అనుమతివ్వకపోవడంతో.. దాదాపు 100 మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. ఇప్పటికే 7 నెలల విద్యాసంవత్సరం పూర్తయిందని ప్రాక్టికల్స్ కూడా అయిపోయాయని విద్యార్థులు వాపోతున్నారు. వచ్చే నెల 9న మొదటి సంవత్సరం విద్యార్థులకు శాపంగా మారింది.100 మంది విద్యార్థులు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి మెడికల్ సీటు సంపాదించారు. ఇన్నిరోజుల శ్రమ తమ భవిష్యత్ అంధకారంలో అవుతోందన్న ఆవేదన ప్రతివిద్యార్థిలో కన్పిస్తోంది.

ఆందోళనలో తల్లిదండ్రులు..

ఎన్నో కష్టాలకోర్చి తమ పిల్లలను వైద్యా విద్యను చదివిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇలాంటి తరుణంలో యాజమాన్యం చేసిన తప్పుకు తమ పిల్లలు ఎందుకు బలవ్వాలని మండిపడుతున్నారు. ఫాతిమా కాలేజి చేసిన తప్పుకు 100 మంది విద్యార్థుల భవితవ్యం కోర్టులో ఉంది. ఫాతిమా కాలేజీపై కోర్టు తీర్పును బట్టి విద్యార్థులు వైద్య విద్యను కొనసాగించడమా లేదా అన్ని ఆధారపడి ఉంది.

హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించట్లేదు : టీ.ఎస్ ఎంపీలు

ఢిల్లీ : హైకోర్టు విభజనపై సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని టీఆర్ఎస్ ఎంపీలు గుర్తుచేశారు. పార్లమెంట్‌లోనూ ప్రస్తావించామని తెలిపారు. హైకోర్టు విభజనపై కేంద్రం హామీలతోనే సరిపెట్టిందని కోపోద్రిక్తులయ్యారు.

12:43 - July 22, 2016

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ స్టింగ్ ఆపరేషన్ పై పార్లమెంట్‌లో దుమారం రేగుతోంది. వీడియో దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవంత్‌పై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. భగవంత్‌పై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. అయినప్పటికీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు. ఇటు ఆప్ ఎంపీ వీడియో చిత్రీకరణపై లోక్‌సభలో గందరగోళం నెలకొంది.. భగవంత్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని సభ్యులు పట్టుపట్టారు..

 

12:31 - July 22, 2016

ఆంటీగ్వా : వెస్టిండీస్ - భారత్ మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ తమ సత్తా ఏంటో చూపెట్టారు. మూడు టెస్టు మ్యాచ్ లో భాగంగా ఆంటీగ్వాలో మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ముందుగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 302 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ అద్భుత శతకం సాధించాడు. ఇతనికి తోడుగా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా విజృంభించి ఆడాడు. 84 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఓపెనర్ విజయ్ (7), పూజారా (16), రహానే (22) తొందరగానే అవుటయ్యారు. ఆట ముగిసే సమయానికి కోహ్లీ(143) తో పాటు, అశ్విన్ 22 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో దేవేంద్ర బిషూ 3, గాబ్రియెల్ ఒక్క వికెట్ పడగొట్టారు.

12:23 - July 22, 2016

మెగాస్టార్ చిరంజీవి ప్లారమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. ఇటీవలే 150వ చిత్ర షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించిన పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ కు స్వల్ప విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారు. శుక్రవారం నాడు రాజ్యసభ ఎదుట ఈ బిల్లు రానుంది. దీనితో కాంగ్రెస్ పార్టీ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. నేటి సమావేశాలకు తన సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో తన 150 చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉదయం ఓ బ్యాగు వేసుకున్న చిరు పార్లమెంట్ లోనికి వెళ్లారు. మరి ఈ బిల్లు పాస్ అవుతుందా ? లేదా ? అనేది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

ప్రారంభమైన లాలాదర్వాజ బోనాలు..

హైదరాబాద్ : లాలాదర్వాజ బోనా ఉత్సవాలను సీపీ మహేందర్ రెడ్డి , జీహెచ్ఎంసీ కమిషన్ జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. ధ్వజారోహణ, శిఖర పూజ చేసి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. మూడు వేలమంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

జంతర్ మంతర్ వద్ద 'లా' స్టూడెంట్స్ ధర్నా...

ఢిల్లీ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద న్యాయ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ధర్నాకు టీఆర్‌ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. హైకోర్టు విభజన కోసం గత కొంత కాలం నుంచి తెలంగాణ న్యాయవాదులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

స్పీకర్ ఎదుట హాజరైన ఆప్ ఎంపీ భగవంత్ మాన్..

ఢిల్లీ : లోక్ సభ స్పీకర్ ఎదుట ఆప్ ఎంపీ భగవంత్ హాజరయ్యారు. వీడియో చిత్రీకరణపై స్పీకర్ కు వివరణ ఇచ్చారు. భగవంత్ వివరణపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో మళ్లీ గందరగోళం నెలకొనటంతో లోక్ సభను అరగంట వాయిదా వేశారు. 

సైన్యం చేసిన దాడిలో 60మంది మృతి..

సిరియా : తిరుగుబాటుదారుల అధీనంలోని పలు ప్రాంతాల్లో గురువారం అమెరికా సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో 15 మంది చిన్నారులుసహా 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని డమాస్కస్‌కు తూర్పున ఉన్న గౌట ప్రాంతంలో దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారని ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ తెలిపింది. 

పార్లమెంట్ ఉభయసభలు వాయిదా ..

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు మధ్నహ్నాం 12గంటలకు వాయిదా పడ్డాయి. ఆప్ ఎంపీ భగవంత్ మాన్ వీడియో చిత్రీకరణపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో నెలకొన్న గందరగోళంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. 

ఆప్ ఎంపీ భగవంత్ మాన్ కు లోక్ సభ నోటీసులు...

ఢిల్లీ : ఆప్ ఎంపీ మాన్ వీడియో చిత్రీకరణపై లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకుంది. వీడియో చిత్రీకరించిన భగవంత్ మాన్ కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. భగవంత్ ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ లోపలికి వెళ్లే దాకా అన్ని పరిణామాలను వీడియో తీసిన ఆయన సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... భగవత్ కు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయంపై అటు రాజ్యసభ కూడా అట్టుడికింది. పార్లమెంటు ఆవరణలో వీడియో చిత్రీకరణ నిషిద్ధం అనే విషయం తెలిసిందే. 

11:44 - July 22, 2016

రంగారెడ్డి : శంకర్ పల్లి మండలం ఫతేపూర్ వద్ద మూసీవాగు పొంగిపొర్లింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో.. నవాబ్ పేట్ వైపు నుంచి భారీ ఎత్తున నీళ్లు రావడంతో వాగు పొంగింది. బ్రిడ్జి నిర్మాణం నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. 

11:42 - July 22, 2016

విశాఖ : కపరాడ ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థి మృతి వివాదాస్పదమౌతోంది. విద్యార్థి మృతికి హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యమే కారణమంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ...విద్యార్థులు20లక్షలు ఇవ్వాలని, మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎస్సీ హాస్టల్ లో కనీస వసతులు కల్పించి, మెస్ ఛార్జీలు పెంచాలని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించి మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

11:36 - July 22, 2016

అమరావతి : కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీని బాద్నాం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. టీడీపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు మంత్రులు, రాజ్యసభ సభ్యులుగా ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించక ఇప్పుడు మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  

భారీ చోరికి యత్నించిన దోపిడి దొంగలు ..

మెదక్ : అందోల్ మండలం కుమ్మరిగూడెంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. 8 ఇళ్లల్లో చోరీ చేసేందుకు దొంగలు యత్నించినప్పటికీ వారి ప్రయత్నించారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటంతో ఒక ఇంట్లో బైక్, నగదు, బంగారంను దొంగలు దోచుకెళ్లారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దోపిడీ దొంగల అరాచకాలతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

11:34 - July 22, 2016

హైదరాబాద్ : ఢిల్లీలో ఏపీ ప్రత్యేక హోదా సెగలు రేపుతోంది. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలో మధ్యాహ్నం 2.30గంటలకు ప్రైవేటు సభ్యుల బిల్లుల బిజినెస్‌ ప్రారంభం కానుంది. ఏపీకి తగినంత సాయం చేస్తామని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమని గతంలోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి స్పష్టం చేశారు. దీంతో బిల్లును ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కాంగ్రెస్ ను కోరే అవకాశముంది. కేవీపీ మాత్రం ఓటింగ్‌ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ జరిగితే ఏయే పార్టీలు అనుకూలమో, వ్యతిరేకమో తేలుతుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేయనున్నారు. 

భారీ స్కోర్ దిశగా టీమిండియా..

హైదరాబాద్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ కోహ్లి పరుగుల వర్షం కురిపించి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. శతకంతో చెలరేగిన కోహ్లి(143 నాటౌట్), ఓపెనర్ ధావన్(84) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కోహ్లి 16 ఫోర్లతో విజృంభించాడు. విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ధవాన్ తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌తో చెలరేగిపోయాడు. విజయ్ 7, పుజారా 16, రహానే 22 పరుగులు చేశారు. ఆశ్విన్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

విప్‌ జారీ చేసిన తెదేపా, భాజపా...

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులకు తెదేపా, భాజపా విప్‌ జారీ చేసాయి. ఈరోజంతా సభలోనే ఉండాలని అధిష్ఠానాలు సభ్యులకు సూచించాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. దీనిపై ఇవాళ రాజ్యసభలో ఓటింగ్‌ జరిగే అవకాశముండటంతో తెదేపా, భాజపా ఆ పార్టీ సభ్యులకు విప్‌ జారీ చేశాయి. కాంగ్రెస్‌ సభ్యులకు ఆపార్టీ ఇటీవలే విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కేవీపీ ప్రైవేటు బిల్లుతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి దిల్లీలో చర్చనీయాంశంగా మారింది.

11:10 - July 22, 2016

ఢిల్లీ :రాజ్యసభ సభ్యులకు టిడిపి, బిజెపి విప్ జారీ చేసింది. కేవీపీ ప్రైవేటు బిల్లుపై చర్చ నేపథ్యంలో విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజంతా సభలోనే ఉండాలని సభ్యులకు తెలిపినట్లు సమాచారం. మరో వైపు కేవీపీ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా పాసవుతుందని ఆశాభావంతో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు బిల్లు పై చర్చ సందర్భంగా టిడిపి కాంగ్రెస్ పై ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. ఇదే సందర్భంగా బిజెపి కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఆందోళ దిగేఅవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో రాజ్యసభ వాయిదా పడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : జాయింట్ ప్రాజెక్టు వెంచర్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల, మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

అక్రమ హోర్డింగ్ లపై కేటీఆర్ ఆదేశాలు ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ హోర్డింగ్ లను తొలగించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పండుగలు, పుట్టినరోజుల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లు, ఫెక్సీలతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని మంత్రి ఆదేశించారు. నాతో సహా ఎవరి పుట్టినరోజులకూ బ్యానర్లకు, ఫెక్సీలకు మినహాయింపు లేదని ఆయన పేర్కొన్నారు. 

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం : జూపల్లి

మహబూబ్ నగర్ : గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా వుందని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ విషయంలో నాగం జనార్థన్ రెడ్డి చర్చకు రాగలరా అని సవాల్ చేశారు.

10:38 - July 22, 2016

ఢిల్లీ : కాంగ్రెస్ కు చిత్త శుద్ధి ఉంటే జిఎస్ టీ బిల్లు కు హోదా బిల్లుకు తో లింకు పెడితే ఒక్క నిమిషంలో బిల్లు పాసవుతుందని టిడిపి ఎంపి టిజీ వెంకటేశ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...నేడు కాంగ్రెస్ ఎంపి కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు 'ప్రత్యేక హోదా' బిల్లు పై రాజ్యసభలో నేడు చర్చ జరగనుంది. 14వ అంశంగా ప్రత్యేక హోదా బిల్లు చర్చకు రానుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానికి చిత్త శుద్ధి ఉంటే ప్రత్యేక హోదా బిల్లు పాసవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బిజెపిలు కారణమని మండిపడ్డారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకుంటామని టీజీ స్పష్టం చేశారు. కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతివ్వాలని మా అధినేత చంద్రబాబు ఆదేశించారన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం ఏ బిల్లుకైనా మద్దతిస్తామని టీజీ స్పష్టం చేసారు. 

ఇన్ని వేధింపులా? : దయానంద్ భార్య

ఉత్తరప్రదేశ్ : మాయవతి మద్దతుదారులు తనను, తన కుమార్తెను వేధిస్తున్నారని బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ నుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆరోపించారు. ‘‘వారు నన్ను, నా 12 ఏళ్ల కుమార్తెను బీఎస్పీ నేతలు, కార్యకర్తలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. నా కూతుర్ని అన్యాయంగా ఇందులోకి లాగుతున్నారని స్వాతి పేర్కొన్నారు. నా భర్త తెలియక ఒక తప్పు చేస్తే దానికి ఇన్ని రకాల వేధింపులా’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకేమైనా జరిగితే మాయావతి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

10:08 - July 22, 2016

తిరుపతి : రజనీ కాంత్ అంత రేంజ్ లో సినిమా లేదని తిరుపతిలో అభిమానులు అభిప్రాయపడ్డారు. గతంలో సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అంటూ చెప్పారు.. కానీ సీన్ రివర్స్ అయింది. ‘కబాలి’విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యిందని... కొంత మంది అభిమానులు వాపోయారు. కేవలం అదిరిపోయే సింగపూర్ లొకేషన్స్ ను చూపించారు తప్ప స్టోరీలో అనుకుంత పసలేదంటున్నారు. ఒకటిన్నర సంవత్సరం పాటు డైరెక్టర్ చాలా కష్టపడి సినిమా తీశారని... ఒక్క ట్రైలర్ కే కోటీ వ్యూస్ తో అదరి కొట్టిన కబాలి... వివిధ గెటప్స్ లో రజనీ తన స్టయిల్ తో సినిమాని నెట్టుకు వచ్చాడని అభిమానులు అభిప్రాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారులు మృతి...

హైదరాబాద్: రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం అబ్బెండ వద్ద ఆటో ఢీకొని 18 నెలల బాలుడు వినయ్ మృతిచెందాడు. అదేవిధంగా నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో జరిగిన ప్రమాదంలో ఆటో ఢీకొని మూడేళ్ల చిన్నారి కావ్య మృతిచెందింది.

పొంగిపొర్లుతున్న మూసీనది...

రంగారెడ్డి : వరుసగా కురుస్తున్న వర్షాలతో మూసీనది పొంగిపొర్లుతోంది. దీంతో  పలు ప్రాంతాలు నీటమునిగాయి. శంకరపల్లి -చేవెళ్ల మధ్య రోడ్డుపై వరదు నీరు ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. అలాగే తాండూరు-వికారాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి.  

భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్...

గుంటూరు : నేలపాడులో భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.48 మంది రైతులకు చెందిన 27ఎకరాల భూమి సేకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిషికేషన్ జారీ చేసింది. రైతుల అభ్యంతరాలను 60 రోజుల్లో తెలిపాలని ప్రభుత్వం ఉత్తర్వులలలో పేర్కొంది.

 

09:00 - July 22, 2016

హైదరాబాద్ : తీవ్ర ఉత్కంఠ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా రిలీజ్ అయింది.  ప్రపంచవ్యాప్తంగా రజనీ అభిమానులు ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కబాలి సినిమా రిలీజ్ అయింది. దీంతో తమిళనాడులో పండుగవాతావరణం నెలకొంది. ఒక్క చెన్నైలోనే 125 థియేటర్లలో విడుదల అయ్యింది. అర్థరాత్రి నుండే బెనిఫిట్ షోలను ప్రదర్శిస్తున్నారు. పలు ప్రాంతాలలో టిక్కెట్లు దొరకలేదని అభిమానులు గొడవ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలకు ఈ వీడియోను చూడండి..

టీచర్ కోసం 300మంది విద్యార్థుల పోరాటం ...

చెన్నై: అనారోగ్యంతో బాధపడుతున్న మా టీచర్‌ను ఆదుకోవాలంటూ విద్యార్థులు ముఖ్యమంత్రి జయలలితకు లేఖలు రాశారు. పుదుకోట జిల్లా కొత్తమంగళం గ్రామంలోని ప్రభుత్వ హైయర్‌ సెకండరీ పాఠశాలలో సి.రవిచంద్రన్(53) జువాలజి టీచర్‌గా పనిచేస్తున్నారు. కిడ్నీ పాడైందని, మార్పిడి చేయాలని డాక్టర్స్ తెలిపారు. ఆపరేషన్ చేయించుకునే ఆర్ధికస్థోమత లేకపోవటంతో విద్యార్థులు టీచర్‌ను చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ టీచర్‌ను ఆదుకోవాలంటూ ఆ పాఠశాలకు చెందిన 300 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యమంత్రి జయలలిత లేఖలు రాశారు.

వైసీపీకి తూర్పు జలక్?!..

తూ.గోదావరి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తూర్పు గోదావరి జిల్లాలో నేడు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. వైసీపీ నుండి తొలి ఎమ్మెల్సీగా పదవి దక్కిన ఆదిరెడ్డి అప్పారావు నేడు టీడీపీ గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడతల వారీగా జరిగిన చర్చల్లో భాగంగా ఆదిరెడ్డి చేరికకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.

విద్యార్థులతో పనులు చేయిస్తున్న మిషనరీ స్కూల్ ...

గుంటూరు : రామకృష్ణా మిషనరీ స్కూలు యాజమాన్యం నిర్వాకం బైటపడింది. తాడేపల్లి మండలం సీతానగరంలో వున్న రామకృష్ణా మిషనరీ స్కూలు విద్యార్ధులతో యాజమాన్యం సిమెంట్ పనులు చేయిస్తోంది. దీంతో స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇద్దరు టీటీడీ ఉద్యోగులు సస్పెండ్...

తిరుమల : టీటీడీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. దర్శనం టిక్కెట్లును కలర్ జిరాక్స్ తీసి విక్రయించిన ఇద్దరు ఉద్యోగులను టీటీడీ సస్పెండ్ చేసింది.

గోరఖ్ పూర్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ..

ఉత్తరప్రదేశ్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.‘గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారం’తో పాటు ‘ఎయిమ్స్‌’కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు.

ప్రాణం తీసిన 'కబాలి'?!..

హైదరాబాద్ : కబాలి మూవీ టిక్కెట్స్ దొరకలేదని ఓ అభిమాని మనస్థాపంతో 10 అంతస్థులు భవనంపై నుండి దూకాడని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన మలేషియాలో జరగిందని తెలుస్తోంది.ఈ రోజు తొలిషో టిక్కెట్స్ కోసం ఎంతగానో ప్రయత్నించిన ఆ అభిమానికి చివరికి నిరాశే మిగిలిందట. దీంతో ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడట. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు, కాలినడక భక్తులకు 4గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,872 మంది భక్తులు దర్శించుకున్నారు.

వ్యక్తి దారుణ హత్య....

నెల్లూరు : చిల్లకూరు మండలం పార్లపల్లిలో కోటేశ్వరరావు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

మాజీ ప్రధాని కుమారుడికి జైలుశిక్ష...

బంగ్లాదేశ్‌ : ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కుమారుడికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జియా కుమారుడు 48ఏళ్ల తారిఖ్‌ రెహమాన్‌కు 2.5మిలియన్‌ అమెరికా డాలర్ల మనీలాండరింగ్‌ కేసులో ఇద్దరు సభ్యులున్న హైకోర్టు ధర్మాసనం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కింది కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

మెదక్ : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కోహిర్ మండలం కవేలి క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కబాలి..

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కబాలి సినిమా రిలీజ్ అయింది. దీంతో తమిళనాడులో పండుగవాతావరణం నెలకొంది. ఒక్క చెన్నైలోనే 125 థియేటర్లలో విడుదల అయ్యింది. అర్థరాత్రి నుండే బెనిఫిట్ షోలను ప్రదర్శిస్తున్నారు. పలు ప్రాంతాలలో టిక్కెట్లు దొరకలేదని అభిమానులు గొడవ చేస్తున్నారు. 

08:10 - July 22, 2016

ఉమ్మడి రాష్ట్రంగా వున్న ఆంధ్రపదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు ప్యాకేజీలు,పలు హామీలను అప్పటి అధికారంలో వున్న యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ప్రధానమైనది ఏపీకి 'ప్రత్యేక హోదా'. విభజన జరిగి రెండు సంవత్సరాలు దాటింది. కానీ ప్రత్యేక హోదా అంశం అనేది హామీ ఇంతవరకూ నెరవేరలేదు. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య పలు వివాదాలు రేగుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రత్యేక హోదా బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది...పార్టీల మధ్య కాక పుట్టిస్తోంది. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా 22వ తేదీ శుక్రవారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. సభలో ప్రవేశపెట్టబోయే ప్రయివేటు బిల్లులు దాదాపుగా 13 వుండగా... 14వ అంశంగా ప్రత్యేక హోదా బిల్లు రాబోతోంది. ఈ నేపథ్యంలో సభలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వీరయ్య (నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్),శ్రీరాములు (ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి),శీధర్ (బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి..

08:01 - July 22, 2016

హైదరాబాద్ : లౌకిక, ప్రజాతంత్ర రాజ్యాన్ని నిర్మించుకుంటాం... అని..భారత ప్రజలు తమకు తామే ఇచ్చుకున్న రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుతున్నాయి. జాతికి జవజీవాలను అందించే విద్యలో కాషాయం ఘాటు పెరిగిపోతోంది. సంప్రదాయ విద్యపేరుతో... మధ్యయుగాల నాటి మూఢత్వాన్ని భవిష్యత్‌ తరాల మెదళ్లలో చొప్పించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. సుబ్రమణియన్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ష్టార్ట్‌లిస్ట్‌ చేసి.. తన సొంతభావజాలంతో ఎడ్యుకేషన్‌ పాలసీని వండివార్చడానికి కమలం దళం సకల ఏర్పాట్లు చేస్తోంది.

బయటపడుతున్న కాషాయంపార్టీ అసలు ఎజెండా...
తెరలు తొలగిపోతున్నాయి...చీకటి మాటున ఉన్న మసక రూపాలు క్రమంగా తేటపడుతున్నాయి..గోముఖవ్యాఘ్రాల అసలు బుద్ధి బయటపడుతోంది..జాతీయ సమైక్యత, దేశభక్తి...పేరుతోమహా ఆవేశంగా లెక్చర్లిచ్చే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల అసలు స్వరూపం క్రమంగా బయటపడుతోంది. తమ భావజాల విషాన్ని కొద్దికొద్దిగా విద్యార్థుల మెదళ్లలోకి ఎక్కించడానికి కొత్త విద్యా విధానాన్ని అమల్లోకి తెస్తున్నాయి.

విద్యకాషాయీకరణకు బీజేపీ స్కెచ్‌...
మోదీ ప్రభుత్వం తమ అసలు ఎజెండాను అమల్లోకి తెస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పేరుతో విద్యను కాషాయీకరించేందుకు స్కెచ్ వేస్తోంది. దీనిలో భాగంగా నూతన విద్యావిధానం 2016 పేరుతో ఒక డ్రాఫ్ట్ ని విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్‌ను తయారు చేసింది...సంఘ్‌పరివార్‌ భక్తులైన ఐఏఎస్‌ ఆఫీర్లే అనే విమర్శలు వస్తున్నాయి. మాజీ కేబినెట్ సెక్రటరీ టిఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో 2015 అక్టోబర్ లో ఒక కమిటి ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటిలో నలుగురు ఐఏఎస్‌ అధికారులనే పెట్టిన కేంద్రం..ఒకరిని మాత్రమే విద్యావేత్తను నియమించి తన ఉద్దేశాన్ని ఆనాడే చెప్పింది.

డ్రాఫ్ట్‌ రిపోర్ట్‌లో కాషాయ అజెండా ..
సుబ్రమణియన్‌ కమిటీ సిఫార్స్‌లను అనుసరించి తయారు చేశామంటున్న డ్రాఫ్ట్‌నిరిపోర్ట్‌లో తమ సొంత అజెండాను ఉంచింది బీజేపీ. దీనిలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 'చర్య కోసం నూతన విద్యా విషయాలు' అనే ప్రశ్నావళిని పంపింది. కాని.. విద్యారంగంలో మౌళిక అంశాలపై, విద్యావ్యాపారం పై వస్తున్న భయాలను తొలగించడానికి ఎటువంటి ప్రశ్నలను అడగలేదు. విదేశీ కంపెనీలకు నాలెడ్జి కూలీలను తయారు చేయడానికే ఈ కొత్త విద్యా విధానం ఉద్దేశించారనే విమర్శలు వస్తున్నాయి.

మే 27 హెచ్‌ఆర్డీ కి సుబ్రమణియన్‌ కమిటీ రిపోర్ట్‌..
మే 27న కేంద్ర మానవవనరులశాఖకు నివేదికను అందించిన సుబ్రమణియన్‌ కమిటీ... ప్రాథమిక స్థాయి నుంచి ప్రొఫెషనల్ విద్య వరకు పలు సిఫార్సులు చేసింది. 230 పేజిల్లో విస్తృతంగా అభిప్రాయాలను , సూచనలు చేశారు కమిటీసభ్యులు. సిఫార్సుల రూపంలో నివేదిక బాగానే కన్పిస్తున్నా.. విద్యలో అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే రాజ్యాంగ స్పూర్తిని మాత్రం కమిటి ఎక్కడా గుర్తించలేదంటున్నారు విద్యావేత్తలు.

డ్రాఫ్ట్‌లో విదేశీ కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం వంత..
విదేశీ కార్పోరేట్ల సహకారం లేకుంటే మన విద్యావ్యవస్థ బాగుపడదన్నట్టు ఈ డ్రాఫ్ట్ లో చెప్పే ప్రయత్నం చేసింది మోదీ ప్రభుత్వం. ఉన్నత విద్యావ్యవస్థల స్వయం ప్రతిపత్తిని నీరుగార్చే విధంగా ప్రతిపాదనలు చేసింది. మరోవైపు ప్రమాణాలు సరిగ్గా లేవని చెబుతూనే లెక్చరర్స్ పోస్టుకు పిహెచ్‌డి అవసరం లేదని సూచించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ... విద్యారంగంపై రాష్ట్రాలకు అసలు భాగస్వామ్యమే లేకుండా ప్రతి అంశంలో ఆదిపత్యాన్ని చొప్పించింది కేంద్ర . దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

07:53 - July 22, 2016

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలో నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జలసాధన సమితి ఉద్యమానికి సిద్ధమైంది. పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాలతో కలిసి పోరాటానికి కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా నారాయణపేట, కొడంగల్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేపట్టనున్నారు. పదిరోజుల పాటు సాగే ఈ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. 

పాలమూరులో సీపీఎం పాదయాత్ర..
పాలమూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన మఖ్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరు, ఐదున్నర లక్షల ప్రజలకు తాగునీరు అందించే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ప్రాజెక్ట్‌ సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. పదిరోజుల పాటు సాగే ఈ పాదయాత్రతో సంబంధిత గ్రామాల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

10 మండలాలకు సాగు, తాగునీరు..
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాల్లోని 10 మండలాలకు సాగు, తాగునీరు అందనుంది. ముంపు బాధితుల పరిహారం కోసం 133 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి ఇవ్వకపోవడంతో పథకం వెనక్కి వెళ్లిపోయింది. నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంతాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారానే నీళ్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 40 కిమీల దూరంలో గల కృష్ణా నది నుంచి నీరందే అవకాశం ఉన్నప్పటికీ.. డిజైన్ మార్చి 200 కిలోమీటర్ల దూరం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి నీరందిస్తామనడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నాయి.

కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 12 టీఎంసీల నికర జలాలు..
పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు లేవని, కానీ నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 12 టీఎంసీల నికర జలాలున్నాయని వాటిని తమ హక్కుగా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వం శ్రీశైలం నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకానికి నీటిని తీసుకుంటే.. నారాయణపేట-కొడంగల్‌, మక్తల్‌, పరిగి, చేవేళ్ల ప్రాంతాలకు నీరు వచ్చే అవకాశమే లేదు. ప్రభుత్వం జూరాల నుంచి నీటిని తీసుకొని నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

2013 భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం : కోదండరాం
శ్రీశైలం నుంచి వచ్చే నీరు రానియ్యండి. కానీ ఒరిజినల్‌ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మాత్రం కొనసాగించాలని గతంలోనే ప్రొ. కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాల్సిందేనని నారాయణపేటలో జరిగిన అవగాహన సదస్సులోనూ తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉపాధి కరువై వలస బాట పడుతున్న ప్రజలు...
నారాయణపేట, మక్తల్‌, ఊట్కూర్‌, కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, దామరగిద్ద, దౌల్తాబాద్‌ తదితర మండలాల ప్రజలు ఉపాధి కరువై వలస బాట పడుతున్న పరిస్థితి నెలకొంది. అభివృద్ధికి నోచుకోక, కడు పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు ఈ ప్రాజెక్ట్‌ ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

శాశ్వత కరవు నివారణ చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు..
జిల్లాలో శాశ్వత కరవు నివారణ చర్యలు చేపట్టి వలసల్ని అరికట్టాలని, పెండింగ్‌ ప్రాజెక్టును పూర్తి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.  

07:45 - July 22, 2016

తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ హోదాను టిఎంయు ఖాయం చేసుకుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో టిఎంయుకి 17వేలకు పైగా మెజార్టీ రావడం విశేషం. ఒక్క ఖమ్మం రీజియన్ మినహా మిగిలిన పది రీజియన్ లలో టిఎంయు సత్తా చాటింది. ఈ నెల 24, 25 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ వుంటుంది. కార్మికశాఖ ఆగస్టు 6న అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి జనపథంలో పాల్గొనేందుకు టిఎంయు నేత అశ్వథ్థామరెడ్డి వచ్చారు. ఆయన తెలిపే విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:32 - July 22, 2016

విశాఖ : ఆంధ్రా యూనివర్సిటీ చరిత్రలో మరో ఘనత చేరింది. ప్రతిష్టాత్మక క్యూయస్ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లోనూ, క్యూయస్‌ ఏషియన్ ర్యాంకింగ్స్‌లోనూ ఏయూకి చోటు దక్కింది. దీనిపై యూనివర్సిటీ పాలకమండలి హర్షం వ్యక్తం చేసింది.

బ్రిక్స్ ర్యాంకింగ్‌ లో ఏయూకు చోటు..
ఆంధ్రాయూనివర్సిటీ అకడమిక్‌ పరంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. గతంలో దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీగా నాక్ అక్రిడేషన్ సంపాదించిన ఏయూ అంతర్జాతీయంగాను తన ఖ్యాతిని తెలియజేసింది. బ్రిక్‌ దేశాలలో ఉన్న యూనివర్సిటీలకు ఇచ్చే ర్యాంకింగ్స్ లో 250 యూనివర్సిటీలు పోటీ పడగా ఇందులో ఏయూకు చోటు దక్కింది.

దేశంలో 44 యూనివర్సిటీల్లో ఏయూకు 23వస్థానం..
దేశంలో 44 యూనివర్సిటీలు అప్లై చెయ్యగా ఆంధ్రా యూనివర్సిటీ 23వ స్థానంలో నిలిచింది. క్యూయస్ ఏషియన్ యూనివర్సిటీల ర్యాంకింగ్ లో ఆంధ్రా యూనివర్సిటీకి స్థానం లభించింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలపారు.

బ్రిక్స్ ర్యాంకింగ్‌ లో ఏయూకు చోటు..
బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో దేశంలోని ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ అలహాబాద్, నిట్ కాలికట్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలు ఆంధ్రా యూనివర్సిటీ క్రిందనే ఉన్నాయి. ఇంతే కాకుండా తెలుగు రాష్ర్టాలలోనూ కేవలం ఆంధ్రా యూనివర్సీటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి మాత్రమే బ్రిక్స్ దేశాల ర్యాకింగ్ స్థానం లభించింది.

07:06 - July 22, 2016

మహబూబ్ నగర్ : నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని టీజేఏసి చైర్మన్ కోదండరాం అన్నారు. జీవో 69ను అమలు చేయకుండా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. టీజేఏసి ఆధ్వర్యంలో పాలమూరులో రెండు రోజుల పర్యటనలో భాగంగా టీజేఏసి బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటించింది.

పాలమూరు ప్రాజెక్ట్‌ డిజైన్ మార్చాలి-: కోదండరాం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ డిజైన్ మార్చాలని జిల్లా వాసులు కోరుతున్నారని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ అన్నారు. భూసేకరణ పై జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకంను చేపట్టాలని కోరుతూ మహబుబ్ నగర్ జిల్లాలో టీజేఏసి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టీజేఏసీ బృందం పర్యటిస్తోంది. మొదటి రోజు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. బొంరాస్ పేట్ పెద్ద చెరువు, నారాయణపేట నిజయోజవర్గంలో చెరువులను టీజేఏసీ బృంద సభ్యులు సందర్శించారు.

నారాయణపేట ప్రాజెక్టుతోనే ప్రాంతం సశ్యశ్యామలం..
నారయణపేట -కొడంగల్ ఎత్తపోతల పథకం పూర్తి అయితే స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందని కోదండరాం అన్నారు. మక్తల్‌ మండలంలో పంచదేవ్‌పహాడ్‌, గోకులపూర్‌ దగ్గర ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సాగునీరులేకనే ఇక్కడి ప్రజల వలసబాట : హరగోపాల్
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పథకాన్ని పూర్తిచేస్తే 10మండలాలు తాగు, సాగునీటితో సస్యశ్యామలం అవుతాయని ప్రొఫెసర్ హరగోపాల్‌ అన్నారు. మక్తల్,కొడంగల్,నారాయణపేట నియోజకవర్గాల్లో పేదరికం పోవాలంటే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఒకటే మార్గమని, దీని కోసం ఉద్యమం చేస్తామని టీజేఏసి బృదం,జలసాధన సమితి నేతలు ప్రకటించారు.

ప్రజాభిప్రాయానికే ప్రాధన్యతనివ్వాలి : టీజాక్
ప్రాజెక్టుల విషయంలో ప్రజల అభిప్రాయానికే ప్రాముఖ్యత నివ్వాలని టీజేఏసీ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని అంటున్నారు.

07:00 - July 22, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. నాలుగు రోజుల తన ఢిల్లీ యాత్ర వివరాలను గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరించేందుకే ఈ భేటీ అని సీఎంవో కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ భేటీలో ఇటీవల హైకోర్టు విభజన అంశంపై ఉమ్మడి గవర్నర్ గా జోక్యం చేసుకోని సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరినట్లు తెలిసింది. ఇక వీటితో పాటు వచ్చే నెలలో మిషన్ భగీరథ ప్రారంభించేందుకు ప్రధానిని ఆహ్వనించిన విషయం కూడా చర్చించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ నిర్వహించే యాగానికి గవర్నర్ ను ఆహ్వనించినట్లు తెలుస్తోంది. 

06:57 - July 22, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చెయ్యడమే కాక వీటి నిర్వహణ వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నాలుగురోజుల పాటు ఢిల్లీ పర్యటన తరువాత సాగునీటి ప్రాజెక్టుల పనితీరుపై అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత రాకుండా చూడాలని ఆర్ధికశాఖ అధికారులకు ఆదేశించారు.

ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్..
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని ఇక పనులను త్వరితగతిన పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి జిల్లాల్లో ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.

బహుళార్థక ప్రాజెక్ట్‌గా సీతారామ ఎత్తిపోతల పథకం..
ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. గతంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు దగ్గర నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసి సీతారామ ప్రాజెక్టుకు నీరందించాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో కృష్ణా నదిలో నీరు లేకపోయినా ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా అంతటికీ నీరు అందుతుందని కేసీఆర్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచెయ్యాలని ఆదేశం..
ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలని కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను చేస్తున్న ఎల్‌అండ్‌ టీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రీడైనింగ్‌ ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినా కేవలం వెయ్యి టీఎంసీలు మాత్రమే వినియోగించుకోగలుగుతామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

06:53 - July 22, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌ కాంక్రీట్‌ పనులు 2018 నాటికి పూర్తవుతాయని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుల వివరాలను తెలిపారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన పనుల వివరాలను సీఎంకు నివేదించారు.

60శాతం పూర్తయిన వంశధార ప్రాజెక్ట్‌ ఫేజ్-2 పనులు ...
రాష్ట్రంలో జరగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం కుడికాలువ ఎర్త్‌వర్క్‌ పనులు నూరుశాతం, కాంక్రీట్‌ పనులు 88 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ఎర్త్‌వర్క్‌ పనులు 82 శాతం పూర్తికాగా, 28శాతం కాంక్రీట్‌ పనులు జరిగాయని పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్ట్‌ ఫేజ్-2 పనులు 60శాతం పూర్తయ్యాయని, వెలిగొండ ప్రాజెక్ట్‌ ఎర్త్‌వర్క్‌ పనులు 65 శాతం పూర్తయ్యాయని వివరించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరద జలాలు చేరుకోగానే సాగునీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని నివేదించారు.

గోదావరి జలాలను పెన్నాతో అనుసంధానం : -బాబు
గోదావరి జలాలను గ్రావిటీ లేదా చిన్నతరహా ప్రాజెక్టులతో పెన్నానదితో అనుసంధానం చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీటి నిల్వల ఆడిటింగ్‌ శాస్త్రీయ పద్ధతిలో జరపాలని సూచించారు. ఏ పంటకు ఎంతనీరు అవసరమవుతుందో లెక్కలు కట్టాలన్నారు.

చంద్రబాబు సూచనలు...
సూక్ష్మ సేద్యంతో ఎంత నీరు ఆదా అవుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. వివిధ అవసరాలకు మినహాంచగా ఎంత నీరు అదనంగా ఉందో ఎప్పటికప్పుడు గణించి డ్యాష్ బోర్డులో ఉంచాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

06:50 - July 22, 2016

హైదరాబాద్ : హైకోర్టు విభజన రివ్యూ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గతంలో జస్టిస్‌ జ్యోతిసేన్‌ గుప్తా ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు వాదించగా, పునఃసమీక్ష అవసరం లేదని ఏపీ తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ధనగోపాల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు..
హైకోర్టు విభజనపై ధనగోపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గతేడాది జ్యోతిసేన్‌ గుప్తా వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలన్న అంశంపై ఏపీ అడ్వకేట్‌ జనరల్‌, తెలంగాణ ఏజీ, కేంద్రం తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాదులు ప్రకాష్‌రెడ్డి, విద్యాసాగర్‌లు వాదనలు వినిపించారు. జస్టిస్‌ గుప్తా తీర్పుపై ఏపీ, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆ తీర్పును సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.

కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు ..
కేంద్రం హైకోర్టు కోసం ఎలాంటి నోటిఫికేషన్‌, నిధులు మంజూరు చేయలేదని, గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. ఏపీలోనే ఉన్నత న్యాయస్థానం నిర్మించుకోవాల్సి ఉందని, హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటు చేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని ఏపీ ఏజీ తెలిపారు. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ వాదనలు వినిపిస్తూ... ఏపీ ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించలేదని, నిధులు ఎలా మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు నిర్మాణంపై ధర్మాసనం తీర్పు ఇస్తే ఆలోచిస్తామని కేంద్రం తరపున నటరాజన్‌ తెలిపారు.

సెక్షన్‌ 5, 8 ప్రకారం ఏపీని హైదరాబాద్‌ నుంచి..
సెక్షన్‌ 5, 8 ప్రకారం ఏపీని హైదరాబాద్‌ నుంచి దూరం చేయలేమని సీనియర్‌ న్యాయవాది ప్రకాష్‌రెడ్డి వాదించారు. అవసరమైతే పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని, తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అమికస్‌ క్యూరి విద్యాసాగర్‌ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి తెలిపారు.  

Don't Miss