Activities calendar

23 July 2016

22:10 - July 23, 2016

ఢిల్లీ : టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆంటీగా లోని సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ రెండోరోజుఆటలో...డబుల్ సెంచరీతో విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియా 566 పరుగుల భారీస్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు. తన కెరియర్ లో తొలి అంతర్జాతీయ డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన విరాట్ కొహ్లీ పై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్.....
అసాధారణ నవతరం క్రికెటర్
విరాట్ కొహ్లీ...అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ నవతరం క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా సరే..అలవోకగా పరుగులు సాధించడంలో తనకుతానే సాటి. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్...క్లాసికల్ టెస్ట్ క్రికెట్...రూపం ఏదైనా సరే...కొహ్లీ బ్యాట్ పట్టి క్రీజులో అడుగుపెట్టాడంటే చాలు.. పరుగులు జాలువారాల్సిందే... సెంచరీలు మోకరిల్లాల్సిందే...రికార్డులు దాసోహమని తీరాల్సిందే.
మొట్టమొదటి డబుల్ సెంచరీ 
నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...ఆంటీగా వేదికగా వెస్టిండీస్ తో ప్రారంభమైన తొలిటెస్ట్ రెండోరోజుఆటలోనే విరాట్ కొహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. తన అంతర్జాతీయ కెరియర్ లోనే మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించాడు. ఆరవ నెంబర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తో కలసి 5వ వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేశాడు.283 బాల్స్ లో 24 బౌండ్రీలతో విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 
విదేశీగడ్డపై డబుల్ సెంచరీ 
విదేశీగడ్డపై డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్ గా కొహ్లీ చరిత్ర సృష్టించాడు. గతంలో అజార్  సాధించిన 192 పరుగుల రికార్డును కొహ్లీ అధిగమించాడు. కొహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ లో ఇదే తొలి ద్విశతకం కావడం మరో విశేషం.2006 తర్వాత విదేశీ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన భారత తొలిక్రికెటర్ గౌరవాన్ని విరాట్ సొంతం చేసుకొన్నాడు. అంతేకాదు..కరీబియన్‌ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన ఐదో విదేశీ కెప్టెన్ గా విరాట్ నిలిచాడు.
169 పరుగుల రికార్డును కొహ్లీ తెరమరుగు 
ఆస్ట్రేలియా గడ్డపై కంగారూటీమ్ తో జరిగిన 2014 సిరీస్ లో నమోదు చేసిన అత్యధిక స్కోరు 169 పరుగుల రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు. ఈ క్రమంలో 12వేల అంతర్జాతీయ పరుగుల క్లబ్ లో విరాట్ కొహ్లీ చోటు సంపాదించాడు. ఈ ఘనత దక్కించుకొన్న8వ భారత క్రికెటర్ గా విరాట్ కొహ్లీ రికార్డుల్లో చేరాడు. విరాట్ కొహ్లీ డబుల్ సెంచరీ స్కోరుతో...విండీస్ పై టీమిండియా 8 వికెట్లకు 566 స్కోరుతో డిక్లేర్ చేయగలిగింది. కరీబియన్ టీమ్ పై భారత్ కు ఇది రెండో అత్యుత్తమ టెస్ట్ స్కోరు కావడం మరో విశేషం. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 41 టెస్టులు ఆడిన కొహ్లీకి 72 ఇన్నింగ్స్ లో 11 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ, 12 హాఫ్ సెంచరీల రికార్డు ఉన్నాయి.
విరాట్ కొహ్లీ ఐదు సెంచరీలు సాధించడం 
విదేశీ సిరీస్ ల్లోనే విరాట్ కొహ్లీ ఐదు సెంచరీలు సాధించడం విశేషం.
తన అభిమాన క్రికెటర్ సర్ వీవ్ రిచర్డ్స్ స్టేడియంలో...రిచర్డ్స్ కామెంట్రీ చెబుతుండగా...టీమిండియా చీఫ్ కోచ్ అనీల్ కుంబ్లే స్టిల్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తిన సమయంలో...కొహ్లీ డబుల్ సెంచరీ పూర్తి చేయడం..ఆధునిక క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టంగా మిగిలిపోతుంది.

 

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారు

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారు అయింది. ఆగస్టు 7న రాష్ట్రంలో పర్యటించనున్నారు. మెదక్ లో మిషన్ భగీరథను ప్రధాని ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో పవర్ ప్లాంటును ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో ఎన్ టిపిసి ఎఫ్ సీఐ కొత్తప్లాంటుకు శంకుస్థాపన చేయనున్నారు. 

21:55 - July 23, 2016

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం అన్నారు. మరి ఆ రెప్పపాటు జీవితాన్ని కాలం తన చేతిలోకి తీసుకుంటే.. తీసుకుంటే కాదు...తీసుకుంది. అందుకే అందరి రక్తం ఎరుపే అయినా.. మనుషల మధ్య తేడాలు ఎన్నో..? అవి హెచ్చు తగ్గుల గురించి కాదు.. అందచందాల గురించి కాదు... మరి దేని గురించి..? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:50 - July 23, 2016

కూల్ఫాబెట్స్ టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. మాతృభాషకు దూరమవుతున్న తరానికి ఆన్ లైన్ లో అ..ఆ..లు దిద్దిస్తున్న యువ ఇంజనీర్లు. విదేశాల్లోని తెలుగు చిన్నారులకు హైటెక్ అక్షరమాలను అందించారు. తెలుగు అక్షరాలను జీవితంలో భాగం చేసే ప్రయత్నం చేశారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:44 - July 23, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధించేవరకు ఉద్యమిస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎత్తిపోతల పథకం సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర జిల్లాలోని పలు గ్రామాల గుండా సాగింది. ఈ మహాపాదయాత్రలో తమ్మినేని వీరభద్రంతో పాటు అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. రెండో రోజు పాదయాత్ర..మక్తల్ మండలంలోని భూత్పూర్ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ నుండి ప్రారంభమై పులిమామిడి చిన్నపొర్ల, పెద్ద పొర్ల మీదుగా ఉట్కూర్‌ మండల కేంద్రానికి చేరుకుంది. 

 

21:40 - July 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఎంతోకాలంగా ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 593 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వెంటనే స్పందించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి 593 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీచేశారు. గతంలో గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌లో 434 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయగా..తాజాగా 593 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో మొత్తం గ్రూప్‌ 2 పోస్టుల సంఖ్య 1027కు చేరింది. అయితే తాజాగా జారీచేసిన 593 గ్రూప్‌ 2 పోస్టుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పెట్టింది. సహాకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 62, జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్90, ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్స్ 28, న్యాయశాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 10, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ 20, దేవాదాయశాఖ ఈవో 11, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ 46, డిప్యూటీ తహసీల్దార్ 259, ఎక్సైజ్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ 64.

 

మచిలీపట్నం పోర్టుకు మంచిరోజులు : మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ : మచిలీపట్నం పోర్టుకు మంచిరోజులొచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం అభివృద్ధి కోసమే డెవలప్ మెంట్ అథారిటీ అని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 22 వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పారు. 4,800 ఎకరాలు పోర్టుకు కేటాయించామని పేర్కొన్నారు. 
మిగిలిన భూమి ఇండస్త్రీ కారిడార్ కు కేటాయించనున్నట్లు చెప్పారు. 

21:28 - July 23, 2016

శ్రీనగర్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శ్రీనగర్‌ చేరుకున్నారు. అక్కడ స్థానిక వ్యాపారుల నుంచి ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రితో భేటి కావడానికి స్థానిక వ్యాపారులు నిరాకరించారు. రెండు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్‌సింగ్ పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పారమిలిటరీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కశ్మీర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 45కు చేరింది. రెండు వారాలుగా కొనసాగుతున్న కర్ఫ్యూలో కొంత సడలింపునిచ్చారు. నాలుగుచోట్ల కర్ఫ్యూ ఎత్తివేశారు.  

 

21:08 - July 23, 2016

జానపదాలు, ఒగ్గు కథలను గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరిస్తారు. ఒగ్గు కథలు గ్రామీణ ప్రజలను ఆకర్షిస్తాయి. మల్లన్న ముచ్చట్లలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మల్లన్న ఒగ్గుకథ ప్రసారం అయింది. ఆ కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

20:57 - July 23, 2016

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 61 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. కాబూల్లోని దహ్మజంగ్‌  సర్కిల్ సమీపంలో షియాలు ర్యాలీ నిర్వహిస్తుండగా  ఈ ఘటన సంభవించింది. మైనారిటీలైన వేలాది మంది షియాలు నిర్వహిస్తున్న ర్యాలీ టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడి జరిపారు. దాడిలో మొత్తం ముగ్గురు సుసైడ్‌ బాంబర్స్‌ పాల్గొన్నారు. వీరిలో ఒకరు బురఖా ధరించి గుంపులోకి పోయి తనని తాను పేల్చుకున్నారు. రెండో వ్యక్తి బాంబును పేల్చుకోవడంలో విఫలం కావడంతో... ప్రమాదం తప్పింది. మూడో ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. బాంబు పేలుడు అనంతరం.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. సుమారు 200 మందికి పైగా గాయపడ్డారు. 

20:52 - July 23, 2016

హైదరాబాద్ : నగరంలోని కేపీహెచ్‌బీలో మరో కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేసి సస్పెండైన నాగులు అధిక వడ్డీల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రామకృష్ణ అనే వ్యక్తి  నాగులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడ్డాడు. చివరకు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగులును అరెస్టు చేశారు.  

20:51 - July 23, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు, 40 వేల టీచర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్‌ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీ -భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణా నిరుద్యోగుల జెఎసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిరుద్యోగుల ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని మల్లు రవి అన్నారు. 

20:47 - July 23, 2016

హన్మకొండ : పిల్లలను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 6 మంది సభ్యులతో కూడిన ముఠా ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్ లో కోల్ కతా నుంచి సికింద్రాబాద్ కు పిల్లలను తరలిస్తున్నారు. మార్గంమధ్యలో వరంగల్ రైల్వే స్టేషన్ లో పిల్లలు పెద్దమొత్తంగా ఉండడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 73 మంది చిన్నపిల్లలను జీఆర్ పీ పోలీసులు రక్షించారు. ముఠాను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నారు. 

20:40 - July 23, 2016

మెదక్ : తెలంగాణలో కొత్త జిల్లాలు, కొత్త మండలాల ఏర్పాటుపై ఆందోళన ఊపందుకుంటున్నాయి. నర్సాపూర్‌, శివ్వంపేట, హత్నూర్‌ మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలపాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో 48 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో నర్సాపూర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మెదక్ వద్దు సంగారెడ్డి ముద్దు అంటూ అఖిలపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఆ మూడు మండలాలను సంగారెడ్డిలో కలిపేవరకు ఉద్యమం చేస్తామని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. 

20:32 - July 23, 2016

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నిరసిస్తూ..టీఎన్ ఎస్ ఎఫ్ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అధిక ఫీజు వసూలుకు నిరసనగా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్  కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్ది సంఘాల నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు కొంతమంది విద్యార్దులపై లాఠీచార్జీ చేశారు. ఈ దాడిలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆందోళన చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి సమీప పీఎస్‌కు తరలించారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని, నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల్ని మూసివేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. 

 

బ్యాంకర్లు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ : బ్యాంకర్లు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ రుణాలు, ఇతర అంశాలపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ ఏడాది వ్యవసాయ పంటల ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా లక్ష్యాన్ని నిర్ధేశిస్తున్నామని చెప్పారు. విద్యుత్, ఎరువులు, సాగునీరు విషయంలో రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. 

 

చంద్రబాబును కలిసిన ఇంచార్జీ డీజీపీ సాంబశివరావు

విజయవాడ : సీఎం చంద్రబాబును సీఎంఓలో ఎపి ఇంచార్జీ డీజీపీ సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు.  

 

593 గ్రూప్3 పోస్టుల భర్తీకి టీసర్కార్ ఆమోదం

హైదరాబాద్ : 593 గ్రూప్2 పోస్టుల భర్తీకి టీసర్కార్ ఆమోదం తెలిపింది. టీఎస్ పీఎస్సీ ద్వారా నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 439 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో 1032 గ్రూప్2 పోస్టులకు పరీక్ష నిర్వహించనుంది. 

సీఐటీయూ నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

విశాఖ : సీఐటీయూ నేతలపై ఎపి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాండిక్స్ తోపాటు మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు సీఐటీయూ నేతలు యత్నించారు. ఈనేపథ్యంలో 'మీ వల్లే ఉద్యమాలు జరుగుతున్నాయి.. మూసేసిన పరిశ్రమలు మీరే తెలిపించండని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

19:41 - July 23, 2016

రంగారెడ్డి : మన్నెగూడలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుక్క పిల్లను తుపాకీతో కాల్చి అనంతరం ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాంహౌస్‌ను చేవెళ్ల డీఎస్పీ కీర్తి పరిశీలించారు. 
 

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో దారుణం

రంగారెడ్డి : జిల్లాలోని మన్నెగూడలో దారుణం జరిగింది. కుక్కపిల్లను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఘటనపై చేవెళ్ల డీఎస్పీ కీర్తి దర్యాప్తు చేస్తున్నారు. 

19:12 - July 23, 2016

విజయవాడ : పట్టాదారు పాస్‌ పుస్తకాలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 271ని వెనక్కి తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. జీవోను వ్యతిరేకిస్తూ విజయవాడలో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని రైతు సంఘాలు నిర్వహించాయి. ఈ సమావేశానికి రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణతో పాటు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. పేద రైతులకు న్యాయం జరగాలంటే తక్షణమే జీవోను వెనక్కి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. జీవోను వెనక్కి తీసుకోకపోతే రైతు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

విషవాయువులు వెలువడి ముగ్గురు మృతి....

తమిళనాడు : చెన్నైలో ముగ్గురు విజయనగరం జిల్లా కార్మికులు మృతి చెందారు. పెరంబదూర్‌లోని ఓ హోటల్‌లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. విషవాయువులు వెలువడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరిని విజయనగరం జిల్లా సీతానగరం మండలం లక్ష్మీపురంకు చెందిన సతీష్, రామకృష్ణ, వినయ్ గా గుర్తించారు.

 

19:01 - July 23, 2016

తమిళనాడు : చెన్నైలో ముగ్గురు విజయనగరం జిల్లా కార్మికులు మృతి చెందారు. పెరంబదూర్‌లోని ఓ హోటల్‌లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. విషవాయువులు వెలువడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరిని విజయనగరం జిల్లా సీతానగరం మండలం లక్ష్మీపురంకు చెందిన సతీష్, రామకృష్ణ, వినయ్ గా గుర్తించారు.

18:43 - July 23, 2016

ఆదిలాబాద్ : ప్రకృతితో మమేకమై బతికే గిరిజనులు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. ప్రభుత్వం కల్పించే అరకొర వసతులతోనే పెద్ద చదువులు చదువుతూ ఉన్నత స్థానాలు పొందాలనుకుంటున్నారు. అయితే ఆ చదువులు ఉన్నత స్థానాలు వరకూ వెళ్లడం లేదు. పోటీ ప్రపంచంతో తట్టుకోలేక వారు అడవికే పరిమితమవుతున్నారు. అలా ఇంజనీరింగ్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై కూడా పోడు వ్యవసాయం చేసుకుంటున్న కిష్టూ దీనగాథపై ప్రత్యేక కథనం....
యువకుని ప్రతిభ
అది ఆదిలాబాద్ జిల్లా అటవీప్రాంతంలోని తలమల అనే గ్రామం. ఈ ఊరికి చేరుకోవడానికి నడకదారి కూడా సరిగాలేని పరిస్థితి. ఇలాంటి గ్రామంలో కిష్టూ అనే యువకుడు ఉన్నత చదువుల చదవాలనున్నాడు..అన్ని అవరోధాలను ఎదుర్కొని బాగా చదివాడు. చదువులో ప్రతిభ కనబరచడంతో..ప్రభుత్వం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ స్కూల్లో చదివించింది. తరువాత శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసి, ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివి ఇంజనీరింగ్‌ పాసయ్యాడు. ఇంతటితో బాగానే ఉన్నా, ఇక్కడి నుంచే మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి.
ఇంజనీరింగ్‌ చేసినా ఉపాధి కలగని పరిస్థితి
ఉద్యోగ అవకాశాలు లభించక కిష్టూ అనేక చోట్ల తిరిగాడు. చివరికి ఐటీడీఏని ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఏమాత్రం సాయమందించలేదు. అలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తనకు తండ్రి మరణం మరింత కృంగదీసింది. దీంతో ఇప్పుడు పట్టణాల్లో ఉపాధికై వెదకలేని పరిస్థితి.... తల్లిని పోషించడం కోసం వేరే దారిలేక ఊర్లోనే పోడు వ్యవసాయం చేసుకుంటున్నాడు.
తల్లిని పోషించడం కోసం పోడు వ్యవసాయం 
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ఇలాంటి యువకులకు ఉద్యోగ సమాచారమందించేందుకగానీ, ఆసరాగా ఉండేందుకు గానీ గిరిజన సంక్షేమ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎంత చదివినా అడవిలోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఇంత చదువుకొని కూడా తన కొడుకు వ్యవసాయం చేసుకోవడంపై కిష్టూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన బిడ్డల్లాంటి వారికి ప్రభుత్వం ఏదైనా సాయమందిస్తే వారే కుటుంబాన్ని ఆదుకుంటారని కిష్టూ తల్లి చెబుతోంది.
గిరిజన యువకులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి : కిష్టూ 
ఇప్పటికైనా తనలాంటి మారుమూల గిరిజన యువకులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కిష్టూ అంటున్నాడు. పోటీపరీక్షలకి సిద్ధమవ్వాలనుకున్నా, నగరాల్లో అద్దె చెల్లించే స్తోమతలేని పరిస్థితి తమదని చెబుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ప్రోత్సహిస్తే గిరిజన యువకులు సైతం అద్భుతాలు సృష్టించగలరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

 

ఏపీ ప్రజలను మోసగించిన బీజేపీ : రఘువీరా

విజయవాడ : బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని ఎపిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఎపి నిధుల కేటాయింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు. హామీల అమలు కోసం పోరాడుతుంటే రాజకీయం చేస్తున్నామని అనడం సరికదన్నారు. 

ఆఫ్గనిస్తాన్ లో ఆత్మాహుతి దాడి..

ఆఫ్గనిస్తాన్ : కాబూల్ దే మజాంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో 50 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి

విశాఖ : యారాడలో ఆర్టీసీ, బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న తల్లీకూతుళ్లు మృతి చెందారు. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

ఎంఎస్ ఎం ఈ టెక్నాలజీకి భూమిపూజ

విశాఖ : రాంబల్లి మండలంలో ఎంఎస్ ఎం ఈ టెక్నాలజీకి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కల్ రాజ్ మిశ్రా, వెంకయ్యనాయుడు 
పాల్గొన్నారు. 

 

17:57 - July 23, 2016

విజయనగరం : చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయర్‌ వెళ్తూ.. కనిపించకుండా పోయిన విమానంలో విజయనగరం జిల్లాకు చెందిన బోడసింగి సాంబమూర్తి ఉన్నారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సాంబమూర్తి నేవీలో ఛార్జ్ మెన్‌గా పని చేస్తున్నారు. నాలుగేళ్లుగా నేవీలో ఉద్యోగం చేస్తున్న సాంబమూర్తి అంతకుముందు పోస్టల్, ఆర్టీసీ, రైల్వేలో విధులు నిర్వర్తించారు. ఆయన స్వగ్రామం విజయనగరం జిల్లా గరిడివి మండలం కుమరాం గ్రామం. సాంబమూర్తి భార్యా పిల్లలు విశాఖలో ఉంటున్నారు. విమానం కనిపించకుండా పోయిన సమాచారం తెలియడంతో సాంబమూర్తి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబానికి సాంబమూర్తే పెద్ద దిక్కుగా ఉండేవారని ఆయన సోదరుడు చెబుతున్నారు.

 

17:52 - July 23, 2016

అనంతపురం : ఎపి రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, దాని అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయేందుకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురుని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

 

17:44 - July 23, 2016

సిడ్ని : ఆస్ట్రేలియన్‌ ప్రొఫెషనల్‌ స్టంట్‌ బైక్‌ రైడర్‌ రాబీ మ్యాడిసన్‌ ....అమెరికాలో ఇప్పటివరకూ ఎవరూ చేయనటువంటి అరుదైన స్టంట్‌ చేశాడు. ఉటాహ్‌లోని ఒలింపిక్‌ స్కీ జంప్‌ పార్క్‌లో బైక్‌తో జంప్‌ చేసి ఔరా అనిపించాడు. స్కీయర్లు జంప్‌ చేసే రేస్‌ ట్రాక్‌లో ..... ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా బైక్‌తో డేర్‌డెవిల్‌ జంప్‌ చేసి వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. 
సూపర్‌ టైమింగ్‌...
ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌లో బైక్‌ స్టంట్స్‌కు  ప్రత్యేక స్థానముంటే.....డేర్‌ డెవిల్‌  బైక్‌ స్టంట్స్‌కు ఆస్ట్రేలియన్‌ రైడర్‌ రాబీ మ్యాడిసన్‌  కేరాఫ్ అడ్రెస్‌. ఇప్పటికే 12 సార్లు ఎక్స్‌ట్రీమ్‌ బైక్‌ స్టంట్స్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన రాబీ మ్యాడిసన్‌ ....అమెరికాలో ఇప్పటివరకూ ఎవరూ చేయనటువంటి అరుదైన స్టంట్‌ చేశాడు.ఉటాహ్‌లోని ఒలింపిక్‌ స్కీ జంప్‌ పార్క్‌లో బైక్‌తో జంప్‌ చేసి ఔరా అనిపించాడు. స్కీయర్లు జంప్‌ చేసే రేస్‌ ట్రాక్‌లో ..... ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా బైక్‌తో డేర్‌డెవిల్‌ జంప్‌ చేసి అదరగొట్టాడు.స్టీప్‌ ర్యాంప్‌ మీద నుంచి లాంగ్‌ జంప్‌ చేయడం మాత్రమే కాదు...పర్‌ఫెక్ట్‌గా ల్యాండ్‌ అయ్యి వీక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. 
సరికొత్త ప్రపంచ రికార్డ్‌ 
ఏకంగా  374 అడుగుల దూరం జంప్‌ చేసి......సరికొత్త ప్రపంచ రికార్డ్‌ నమోదు చేశాడు. స్కీయర్లకు సైతం సాధ్యం కాని దూరాన్ని నమోదు చేసి తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. మ్యాడిసన్‌ చేసిన ఈ  స్టంట్‌ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లోనే  హాట్‌టాపిక్‌గా మారింది. బైక్‌ రైడింగ్‌తో పాటు రిస్కీ ఫీట్స్‌ చేయాలన్నా... డేర్‌డెవిల్ స్టంట్స్‌ ప్రదర్శించాలన్నా తన తర్వాతే ఎవరైనా అని రాబీ మరోసారి నిరూపించాడు. 

 

17:40 - July 23, 2016

నిజాంసాగర్ : ఒకప్పడు నీటితో కళకళలాడిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు వెలవెలబోతోంది. చుక్కనీరు లేక ఆ జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న ప్రాజెక్టుకు నీటిజాడ లేక కళతప్పింది. వర్షాలు కురుస్తున్నా చుక్కనీరు రాని పరిస్థితి. ఎలాగూ నీరివ్వని ఆ ప్రాజెక్టును రైతన్నలు మరోలా ఉపయోగించుకుంటున్నారు. ప్రాజెక్టు భూభాగంలో పంటలు వేసి కాస్తయినా ప్రాయోజనం పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు పంటపొలాన్ని తలపిస్తోంది.
జలకళతప్పిన నిజాంసాగర్ ప్రాజెక్ట్
నిజాంసాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయిని. జలకళతో 2 లక్షల ఎకరాల వ్యవసాయానికి సాగు నీరందించేది. దీంతో జిల్లా వ్యవసాయం సస్యశ్యామలంగా ఉండేది. కానీ గత రెండేళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన సింగూరు జలాశయంలో నీటిమట్టం దయనీయ స్థితికి చేరింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు మడుగును తలపిస్తోంది. మున్ముందు నీరు చేరుతుందన్న నమ్మకమూలేదు. 
ప్రాజెక్టులో చుక్కనీరులేని పరిస్థితి
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు....అయితే  ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీలోనే ఉంది. సింగూరు నిండి, దాని తర్వాత పోచారం ప్రాజెక్టు నిండితేనే  నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగే పని కాదని రైతులు భావిస్తున్నారు. వారంరోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసినా మంజీరా పరివాహక ప్రాంతంలో పెద్దగా వర్షాలు కురవలేదు. నిజాంసాగర్ ప్రాజెక్టులో చుక్కనీరు చేరలేదు. దీంతో నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు ప్రాజెక్టు గర్భంలో పంటలను సాగు చేసుకుంటున్నారు.
తక్కువ నీరవసరమయ్యే పంటలే పండిస్తున్న వైనం
గతేడాది రబీలోనూ ప్రాజెక్టు గర్భంలో రైతులు 20 వేల ఎకరాల్లో పంటలు సాగుచేసుకున్నారు. ప్రస్తుతం  అరకొరగా కురుస్తున్న వర్షాలతో  సోయా, జోన్న పంటలను సాగు చేసుకుంటూ తమ ఆహారం, ఆలాగే పసుగ్రాసం పొందుతున్నారు. ఇలాగైనా ఉపయోగించుకోకపోతే తమకు ఆహారమే కరవవుతోందని, అందుకే  ప్రాజెక్టులో ఉండే కొంచెం నీటితోనైనా పంటలు పండించుకుంటున్నామని చెబుతున్నారు. ప్రాజెక్టుల్లో నీరులేక పంటపొలాలు ఎడారిని తలపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

 

17:37 - July 23, 2016

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇవ్వని రైతులపై భూ సేకరణ చట్టం ప్రయోగించాలని భావిస్తోంది. దీని కోసం భూ సమీకరణ ప్రారంభించిన నేలపాడు గ్రామం నుంచే  సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 
భూములు ఇవ్వని గ్రామాల్లో భూసేకరణ 
ఏపీ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలె, నిడమర్రు, భేతపూడి ఈ ఐదు గ్రామాలు మినహాయించి, మిగతా గ్రామాల్లో దాదాపు చాలా మంది రైతులు భూ సమీకరణలో భూములు రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే ఇచ్చేశారు. గ్రామాల్లో అక్కడక్కడ భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములను తీసుకుంటామని గత నెలలో సీఎం స్వయంగా ప్రకటించారు. అక్టోబర్ నెలలోపు భూ సేకరణ ద్వారా మొత్తం భూమిని సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. 
నేలపాడు నుంచి సేకరణ కార్యక్రమం ప్రారంభం
దీంతో తుళ్లూరు మండలం నేలపాడు నుంచి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేలపాడులోని 40 మంది రైతులకు చెందిన 27.86 ఎకరాల భూమిని 2013 భూసేకరణ చట్టం ద్వారా తీసుకోడానికి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే నోటిఫికేషన్ జారీ చేశారు. రైతులకు అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ ప్రకటించిన 60 రోజుల్లో తమ అభ్యంతరాలను తెలుపవచ్చని పేర్కోన్నారు. 40 మందికి చెందిన ఈ 27.86 ఎకరాల్లో ఎలాంటి లావాదేవీలు జరపరాదంటూ నోటిఫికేషన్ లో చెప్పారు. రాజధాని నిర్మాణానికి అందరూ భూములిచ్చి, అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా భూమి ఇవ్వకపోతే, రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయనే కారణంతో సేకరణ చేస్తున్నట్లు కలెక్టర్ నోటిఫికేషన్ లో పేర్కోన్నారు. 
భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత?
తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో భూ సమీకరణ ద్వారా ఇవ్వని భూములు చాలా తక్కువ మొత్తంలోనే ఉన్నాయి. సుమారుగా 300 నుంచి 500 ఎకరాల భూమి మాత్రమే ఇవ్వలేదు. ఈ భూములను సేకరణ ద్వారా ప్రభుత్వం తీసుకోడానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. కానీ మంగళగిరి మండలంలో ఉన్న ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, నిడమర్రు, భేతపూడి గ్రామాల్లో సుమారుగా రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని రైతులు ఇవ్వలేదు. దీంతో ఇక్కడ భూ సేకరణకు కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
మంగళగిరి మండలంలో రైతుల నుంచి ఇబ్బందులు
మొత్తం మీద భూసేకరణ చట్టం 2013 ద్వారా భూ సేకరణ చేయాలనుకున్న ప్రభుత్వానికి తూళ్లురులో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికి, మంగళగిరి మండలాల్లోని గ్రామాల రైతుల నుంచి భూ సేకరణకు ఇబ్బందుల ఏర్పడే అవకాశం ఉంది. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే అక్కడి రైతుల నుంచి మళ్లీ పెద్దఎత్తున ఆందోళనలు, పోరాటాలు మొదలయ్యే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాలి.  

 

వరంగల్ రైల్వే స్టేషన్ లో పిల్లలను రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్ లో పిల్లలను రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్ లో పిల్లలను ముఠా  తరలిస్తోంది. ఈనేపథ్యంలో 73 మంది చిన్నపిల్లలను జీఆర్ పీ పోలీసులు రక్షించారు.
 

17:21 - July 23, 2016

నెల్లూరు : జిల్లాలోని కావలిలో అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. అణు విద్యుత్‌ కేంద్రం కోసం దాదాపు 1700 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మధు తెలిపారు. చంద్రబాబు రష్యా పర్యటన సందర్భంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అణు విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకున్నారన్నారు. అణు విద్యుత్‌ కేంద్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే 175 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని మధు అన్నారు. 

 

17:05 - July 23, 2016

విజయవాడ : టెక్నాలజీని ఉపయోగించుకుని ఏపీ పోలీస్ వ్యవస్థలో మార్పులు తెస్తానని ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ డీజీపీ సాంబశివరావు అన్నారు. విజయవాడ డీజీపీ కార్యాలయంలో ఇంచార్జ్‌ డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు త్వరతగతిన న్యాయం చేసేలా చర్యలు చేపడతామన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ పోలీస్ వ్యవస్థ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు. 

 

16:59 - July 23, 2016

 హైదరాబాద్ : హైదరాబాద్‌ జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటికి చార్జీలు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అవసరమైతే చార్జీలు పెంచక తప్పదని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ సంకేతాలిచ్చారు. జలమండలి కార్యకలాపాలపై కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జంటనగరాలకు మంచినీటి  సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, గోదావరి జలాల తరలింపు, పైపు లైన్ల విస్తరణ తదితర అంశాలపై జలమండలి అధికారులతో చర్చించారు. జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో 60 శాతానికి మాత్రమే బిల్లులు వసూలు అవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 

 

ఎపి నూతన డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన సాంబశివరావు

విజయవాడ : ఎపి రాష్ట్ర నూతన డిజిపిగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ జెవి.రాముడు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్....

జమ్మూకాశ్మీర్ : కుప్వాడాలో ఎన్ కౌంటర్ జరిగింది. భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఉగ్రవాదులపై జవాన్లు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జవాన్లుపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాను మృతి చెందారు. 

15:03 - July 23, 2016

విజయవాడ : మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌కు ల్యాండ్‌పూలింగ్‌ విధివిధానాలు ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. పోర్ట్, ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు అవసరమైన భూమిని సమీకరించాలని సర్కారు నిర్ణయించింది.. ప్రాజెక్టు పరిధిలోని 28 గ్రామాలకుచెందిన 426 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భూమిని సమీకరించనున్నారు.. భూమిని కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇచ్చినవిధంగానే ప్యాకేజీ ఇవ్వనున్నారు.. 28 రెవెన్యూ గ్రామాల్లో భూసమీకరణ చేస్తామని సర్కారు ఈ జీవో తెలిపింది.. మెట్టభూమి అయితే ఈ భూమి ఇచ్చిన రైతులకు ఎకరాకు వెయ్యి చదరపు గజాల చొప్పున నివాస స్థలాన్ని ఇవ్వనున్నారు.. అలాగే 250 గజాల కమర్షియల్‌ స్థలాన్నికూడా ఇస్తామని సర్కారు ఉత్తర్వుల్లో తెలిపింది. 
జరీబు భూములిచ్చిన రైతులకు నివాసం కోసం వెయ్యి గజాలు
జరీబు భూములిచ్చిన రైతులకు కూడా నివాసం కోసం వెయ్యి గజాల్ని సర్కారు ఇవ్వనుంది. 450 చదరపు గజాల కమర్షియల్‌ స్థలాన్ని కేటాయించనుంది.. అలాగే ఎకరంకంటే తక్కువ భూమి ఇచ్చినవారికి పదేళ్లవరకూ పరిహారం చెల్లించనుంది.. ఏడాదికి 30నుంచి 50వేలవరకూ పరిహారం ఇవ్వనుంది.. ఈ పరిహారాన్ని ఏడాదికి 3నుంచి 5వేల రూపాయల్ని పెంచనుంది.. ఇక వ్యవసాయ కూలీలు, భూమిలేని పేదలకు పెన్షన్ చెల్లించనుంది.. పదేళ్లపాటు నెలకు 2వేల 500 రూపాయల్ని పెన్షన్‌గా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.. అయితే ఎన్ని ఎకరాలు సేకరించాలో ఈ ఉత్వర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేయలేదు.. 
సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు.. 
'మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌కు ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా భూముల సేకరించడంతో రైతులకు ఒరిగిదేమీ లేదు. మొత్తం 22వేల ఎకరాల్లో 14 వేల ఎకరాలు మాత్రమే పట్టా భూములు మిగిలినవి పేదలు సాగుచేసుకుంటున్న భూములు. ల్యాండ్ పూలింగ్ విధానంతో రైతుల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు. రాజధాని ప్రాంతంలోగా బందర్ లో ల్యాండ్ పూలింగ్ విధానం అమలు పరచడం సాధ్యం కాదు. ల్యాండ్ పూలింగ్ విధానానికి స్వస్తి పలికాలి. బలవంతపు సేకరణకు వ్యతిరేకంగా బాధితులను సమీకరించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని' మధు హెచ్చరించారు.
రామకృష్ణ.. సీపీఐ 
'ల్యాండ్ పూలింగ్ కింద రైతుల భూముల లాక్కొంటున్నారు. వేల ఎకరాలు సేకరిస్తున్నారు. 14 వేల ఎకరాలు సేకరించాల్సి వుండగా అంతకుమించి భూములను సేకరిస్తున్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం.. భూములుకోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి' అన్నారు.
సీపీఎం కృష్ణా జిల్లా కార్యదర్శి రఘు..
'జీవో ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకొచ్చారు. మడా అవసరం లేదు. 22 రెవెన్యూ గ్రామాలను మడాలో కలిపారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్నారు' అని పేర్కొన్నారు. 
కొనకళ్ల నారాయణ.. ఎంపీ మచిలీపట్నం
'రైతులు ఇష్టపూర్తిగానే భూములు ఇస్తున్నారు. ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవడం లేదు' అని తెలిపారు. 

 

టీటీడీపీ నేతలతో ముగిసిన లోకేష్ భేటీ

హైదరాబాద్ : టీటీడీపీ నేతలతో లోకేష్ భేటీ ముగిసింది. రుణమాఫీపై ఆందోళనలు ఉధృతం చేయాలని సూచించారు. ఆగస్టులో జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని పిలుపిచ్చారు. హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేయాలని చెప్పారు. మండల కమిటీలను వీలైనంత త్వరగా వేయాలని పేర్కొన్నారు. 

 

ఎపి మాజీ డిజిపి జేవీ రాముడుకు వీడ్కోలు

విజయవాడ : ఎపి రాష్ట్ర మాజీ డిజిపి జేవీ రాముడుకు వీడ్కోలు పలికారు. అధికారిక లాంఛనాలతో పోలీసు అధికారులు ఆయనకు వీడ్కోలు చెప్పారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అరెస్టు

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని సీఐఎస్ ఎఫ్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. 

 

13:52 - July 23, 2016

విజయవాడ : మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌కు ల్యాండ్‌పూలింగ్‌ విధివిధానాలు ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. మెట్టభూమి రైతులైతే ఎకరాకు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని నివాసానికి ఇవ్వాలని ఇందులో తెలిపింది.... అంతకంటే తక్కువ భూమిఇస్తే ఏడాదికి 30నుంచి 50వేల రూపాయల్ని పరిహారంగా చెల్లించనున్నారు.. ఇలా పదేళ్లపాటు పరిహారం ఇస్తారు..

13:47 - July 23, 2016

హైదరాబాద్‌ : మరో ఘరానా మోసం బయటపడింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తామంటూ ఓ ముఠా 110 మంది దగ్గర నుంచి 30 లక్షలు వసూలు చేసింది. ఈ విషయం బయటకు తెలియడంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలో దిగి.. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి దగ్గర నుంచి ఒక లక్ష 40 వేల రూపాయలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

13:44 - July 23, 2016

హైదరాబాద్‌ : చైతన్యపురిలోని శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది విద్యార్థులపై చేసిన దాడికి నిరసనగా విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ.. ఆందోళన చేపట్టాయి. హోంసిక్‌ సెలవులు అడిగినందుకు కాలేజీ సిబ్బంది తమపై దాడి చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తీరకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి వచ్చి.. విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజీ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సెలవులు అడిగిన విద్యార్థుల పట్ల కాలేజీ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..

వరదల్లో 78మంది మృతి..

హైదరాబాద్ : పలు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికి 78మంది మృతి చెందగా మరో 91మంది ఆచూకీ తెలియడం లేదు. వరద ప్రవాహాల వల్ల వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి, ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి పౌర వ్యవహారాల శాఖ తెలిపింది.

13:23 - July 23, 2016

తెలుగు సినిమాలలో గ్రాఫిక్స్ కు తెరలేపిన తొలి దర్శకుడు కోడి రామకృష్ణ. అమ్మోరు, దేవుళ్లు, అరుంధతివంటి పలు హిట్ సినిమాలు ఆయన సృష్టించిన మాయాజాలాలే.. అరుంధతి సినిమాతో సూపర్ డూప్ హిట్ కొట్టి అనుష్కను రాత్రికి రాత్రే నంబర్ వన్ హీరోయిన్ గా నిలిపారు కోడి రామకృష్ణ.. అప్పటివరకూ పెద్దగా గుర్తింపులేని అనుష్కను 'అరుంధతి' సినిమాతో నంబర్ వన్ హీరోయిన్ గా..హీరోయిన్ ఓరియంటెడ్ హీరోయిన్ గా నిలిపటం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జులై 23 ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన చెప్పే విశేషాలను తెలుసుకుందాం..అసలే భక్తి భావం జాస్తిగా వున్న దర్శకుడు కోడి రామకృష్ణ ఏ దేవుడైనా ఎప్పుడూ కాళీగా వుండని నవ్వుతూ అన్నారు. మనం ఎంతో గొప్ప సినిమా తీససాం అనుకుంటాం గానీ ప్రేక్షకుడుకి నచ్చితేనే అది గొప్ప సినిమా అవుతుందన్నారు. ఇండ్రస్ట్రీలో తాను కృతజ్ఞతలు చెప్పుకునే ఒకే ఒక్కవ్యక్తి దాసరి నారాయణ రావుగారని తెలిపారు. ఆయన చెప్పే మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..కోడి రామకృష్ణ సక్సెస్ ఫుల్ టిప్స్ ఏమిటో తెలుసుకోండి..

నాంపల్లి కోర్టులో ఐసిస్ నిందితుడు...

హైదరాబాద్ : ఐసిస్ ఉగ్రవాది నిందితుడు రెహమాన్ ను నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరుపరిచారు. 25వరకూ రెహమాన్ కు రిమాండ్ విధించారు. దీంతో రెహమాన్ ను రిమాండ్ కు తరలించారు.

మచిలీపట్నంలో ల్యాండ్ పూలింగ్ షురూ..

కృష్ణా : మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ కు ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వ విధివిధానాలకు ఖరారు చేసింది. డీప్ వాటర్ పోర్టు నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ చేపట్టింది. వ్యవసాయ కూలీలకు, భూమిలేని పేదలకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటును చేసింది. ఎకరం భూమికంటే తక్కువ భూమి ఇచ్చిన రైతులకు ఏడాదికి రూ.30నుండి 50వేల వరకూ నష్టపరిహారం ఇవ్వనుంది

12:43 - July 23, 2016

విజయవాడ : ఆర్టీసీ ఎండీగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి ఏపీఎస్ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత నండూరి సాంబశివరావుకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా సాంబశిరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా నండూరి సాంబశివరావుని టెన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. పోలీస్ శాఖలో వున్న సమస్యలను ఎలా ఎదుర్కోబోతున్నారు? నేరాల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? అసలే పోలీస్ కొరతతో వున్న ఏపీ సమస్యలను ఎలా డీల్ చేయనున్నారు? వంటి పలు అంశాలపై సాంబశివరావు ఎటువంటి సమాధానాలు తెలిపారో ఆయన మాటల్లోనే విందాం...తనకు అప్పగించిన ప్రతీ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చటానికి కృషి చేస్తానన్నారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కున్న నేపథ్యంలో టెక్నాలజీ సహాయంతో నేరాలకు చెక్ పెడతామంటున్నారు డీజీపీ సాంబశివరావు...మరి ఏపీ సమస్యలను పరిష్కరించటానికి ఆయన ఎటువంటి నిర్ణయాలను తీసుకోనున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం..ముఠా అరెస్ట్ ..

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని ఆరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.1040లక్షలు, నాలుగు ఆటోలు, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు

11:50 - July 23, 2016

విశాఖ : విశాఖలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు విమానం గల్లంతు బాధిత కుటుంబాలను పరామర్శించారు. విమానం ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

కొనసాగుతున్న ఎయిర్ ఫోర్స్ విమాన గాలింపు..
అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం ఆచూకీకోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు.. భారత వాయుసేన, నౌకాదళం సిబ్బంది ఐదు హెలికాప్టర్లు, రెండు విమానాల ద్వారా విమానంకోసం వెతుకుతున్నారు. నాలుగు యుద్ధ నౌకలతో పాటు సబ్ మెరైన్ను రంగంలోకి దించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా గాలింపు జరుపుతున్నాయి. చెన్నైకు తూర్పు దిశగా 200 నాటికల్ మైళ్ల దూరంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

విమాన జాడ కోసం పలు దేశాల సహాయం..
అటు విమానం జాడకోసం భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కూడా సహాయం కోరింది.... శుక్రవారం తమిళనాడులోని తాంబరం నుంచి బయలుదేరిన ఈ విమానం పోర్ట్ బ్లెయిర్ వెళుతుండగా కనిపించకుండా పోయింది.. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. 

11:44 - July 23, 2016

హైదరాబాద్ : ఇరిగేషన్‌ రంగంలో సరికొత్త విప్లవానికి తెలంగాణ సర్కార్‌ నాంది పలుకుతోంది. అరచేతిలో జలవనరుల సమాచారం తెలుసుకునేందుకు సాంకేతికతను ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపగ్రహం సాయంతో తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతుంది. ఇందుకోసం ఆగస్టు 6న ఇస్రోతో ఒప్పందం చేసుకోబోతుంది.

జలవనరులను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ..
ఉపగ్రహం ద్వారా జలవనరులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని విశ్లేషించే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను తెలంగాణ సర్కార్‌ ఏర్పాటు చేస్తోంది. దీని కోసం ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీతో రాష్ట్ర నీటిపారుదల శాఖ అవగాహన కుదుర్చుకుంది. తెలంగాణ జలవనరుల సమాచార వ్యస్థను ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు 6న ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇస్రో, నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. సచివాలయంలో మంత్రి హరీష్‌రావును కలిసిన ఇస్రో అధికారులు.. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పలు సాంకేతిక అంశాలను వివరించారు.

ప్రతి 15 రోజులకొకసారి అప్‌డేట్‌..
జలవనరుల సమాచారాన్ని ఉపగ్రహం ద్వారా నమోదు .. వాటిని విశ్లేషించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుందని అధికారులు తెలిపారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఇతర జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపగ్రహం సాయంతో తెలుసుకుంటామని,.. ప్రతి 15 రోజులకొకసారి సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తామని అధికారులంటున్నారు. టీడబ్ల్యూఆర్‌ఐఎస్‌ను ఇరిగేషన్‌ శాఖలోని ఇంజనీర్లు.. ముఖ్యంగా యువ ఇంజనీర్లు పూర్తిగా వినియోగించుకోవాలని హరీష్‌రావు సూచించారు. దీనికోసం నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని ఇస్రో అధికారులను మంత్రి కోరారు. అలాగే భారీ వర్షాల వల్ల ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నందున ఉపగ్రహ చిత్రాల ద్వారా మిషన్‌ కాకతీయకు ముందున్న పరిస్థితిని.. ఇప్పటి పరిస్థితితో విశ్లేషించి నివేదిక ఇవ్వాలని కోరారు. బ్యారేజీలు, డ్యామ్‌లు, కాల‌్వలను ఉపగ్రహ చిత్రాలతో గుర్తించాలని హరీష్‌రావు ఆదేశించారు. ఈ వ్యవస్థతో రాష్ట్రంలోని జలవనరులు ఎక్కడెక్కడ ఎంతెంత నిల్వ ఉన్నాయో పక్కా సమాచారం తెలియనుంది.

11:32 - July 23, 2016

కరీంనగర్‌ : ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు హడలిపోయే పరిస్థితులు దాపురించాయి. ఆసుపత్రులో చిన్నారులు మాయం అయిపోతుంటారు. ఒకో ఆసుపత్రిలో షార్ట్ సర్య్కూట్ తో గాయపడుతుంటారు. మరో ఆసుపత్రిలో ఎలుకల బారిన పడి గాయాలపాలవుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ఆసుపత్రుల తీరు భయానకంగా మారిపోతోంది. కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం డాంబికాలు  పోతుంటుంది. గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో మాత్రం అవి ఆదిలోనే హంసపాదు అన్న చందంగా వుంటుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ముక్కుపచ్చలారని చిన్నారులు గాయాలపాలయ్యారు. జిల్లాలోని  ప్రభుత్వాస్పత్రి రోగులను ఉరుకులు పరుగులు పెట్టించింది.. పిల్లలవార్డులో భవనం పెచ్చులూడి పడి ఐదుగురికి గాయాలయ్యాయి.. గాయపడ్డవారిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులతోపాటు.. ముగ్గురు పెద్దలున్నారు.. బాధితులకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

పంజాగుట్ట వద్ద తప్పిన ప్రమాదం...

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట వద్ద ఘోర ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ వంతెన దిగుతుండగా అదుపుతప్పిన టిప్పర్ రెయిలింగ్‌తో పాటు ఓ బైక్‌ను ఢీకొట్టి కిందపడింది. అదృష్టవశాత్తు వంతెన కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టిప్పర్ బోల్తా ఘటన కూడా చిన్నారి రమ్య కారు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే చోటుచేసుకోవటం గమనించదగిన విషయం.

11:07 - July 23, 2016

చిత్తూరు : వందల ఏళ్లనాటి వకుళమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పట్టించుకునే వారు లేకపోవడంతో.. ఈ ప్రాంతంలో మైనింగ్‌ మాఫియా చెలరేగి పోతోంది. వకుళ మాత ఆలయమున్న కొండను తవ్విపోస్తున్నారు. కోర్టుకేసులున్నాయంటూ టీటీడీ పట్టించుకోవడం లేదు. దీంతో వకుళమాత ఆలయ పునర్నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాదేవి ఆలయ దుస్థితిపై టెన్‌టీవీ పోకస్‌...

ఏమిటీ తల్లి దుస్థితి..?
శిథిల దశలో కోనేటి రాయడి కన్నతల్లి ఆలయం.. మైనింగ్‌ మాఫియా అక్రమాలతో కుంచించుకు పోయిన కొండ..ఇదీ తిరుమల శ్రీవేంకటేశుని తల్లి వకుళమాత ఆలయం నెలకొన్న ప్రాంతపు దుస్థితి. తిరుపతికి సమీపంలోని పేరూరు గ్రామంలోని వకుళ మాత ఆలయం ఒకప్పుడు నిత్య ధూప దీపాలతో అలరారింది. కానీ, ఇప్పుడిలా ఎవరికీ పట్టక.. శిథిలావస్థకు చేరుకుంది.

500 ఏళ్లనాటి ఆలయం ...
ఉత్సవాలు, వేడుకలతో విరాజిల్లిన వకుళ మాత ఆలయం.వకుళాదేవి గుడిలో గంటానాదం విన్నాకే శ్రీనివాసునికి నైవేద్యం.  సుమారు 5వందల ఏళ్లనాటి వకుళ మాత ఆలయం.. ఒకపుడు ఉత్సవాలు, వేడుకలతో విరాజిల్లింది. అప్పట్లో ఈ గుడిలో ఓ పెద్ద గంట ఉండేదని ప్రతీతి. నిత్యం ఇక్కడి ఘంటానాదం విన్నాకనే తిరుమలలో వెలసిన శ్రీనివాసునికి నైవేద్యం పెట్టేవారన్నది భక్తుల విశ్వాసం. పేరూరు సమీప గ్రామాల ప్రజలు కూడా వకుళమాత ఆలయం నుంచి ఘంటారావం విన్నాకే భోజనాలు చేసేవారని ప్రతీతి.

ఆలయాన్ని ధ్వంసం చేసిన హైదర్ వలీ..
అనంతరం కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో టిప్పుసుల్తాన్‌ తండ్రి హైదర్‌అలీ వకుళమాత ఆలయాన్ని ధ్వసం చేయించినట్టు చరిత్రకారులు చెబుతారు. ఆలయంతో పాటు.. అందులోని వకుళమాత విగ్రహాన్ని ధ్వంసం చేసేశారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో వకుళ మాత విగ్రహం ఏర్పాటు చేయలేదు. దీంతో దేవత లేని గుడిగా... ఇలా శిథిలావస్థకు చేరుకుంది.

వకుళమాత ఆలయంపై పడ్డ వేటగాళ్ల కన్నూ..
అసలే చారిత్రక ఆలయం.. ఆపై శిథిల దశకు చేరుకుంది. ఇంకేముంది.. గుప్తనిధుల వేటగాళ్ల కన్నూ.. వకుళమాత ఆలయంపై పడింది. రాజుల కాలంలో ఇక్కడ భారీగా నిధులు ఉంచి వుంటారన్న నమ్మకంతో.. వకుళమాత ఆలయాన్ని మరింతగా నాశనం చేసేశారు.
మైనింగ్ మాఫియా తో ఆలయం శిథిలావస్థ..
వకుళ మాత ఆలయం శిథిలావస్థకు చేరుకోడానికి మరోకారణం.. ఇక్కడి మైనింగ్‌ మాఫియా అంటూ అతిశయోక్తి కాదు. ఆలయ పరిసరాలపై కన్నేసిన మైనింగ్‌ వ్యాపారులు... గ్రానైట్‌ను పెద్ద ఎత్తున తవ్వేశారు. కిలోమీటరు వరకు విస్తరించి ఉన్న ఈ రాతికొండను పిండిగొట్టి కోట్లరూపాయలు కొల్లగొట్టారు. రాతిని పగులకొట్టడానికి శక్తిమంతమైన బాంబులను వినియోగించడంతో... వకుళామాత ఆలయమూ ప్రమాదంలో పడింది. మహమ్మదీయుల పాలన నుంచి మొదలైన వకుళమాత ఆలయ విధ్వంసం.. నేటికీ కొనసాగుతునే ఉంది. శ్రీనివాసుని భక్తులను వకుళమాత ఆలయ దుస్థితి అమితంగా బాధిస్తోంది. 

విదేశాల్లో గుళ్లు కడతారు..అమ్మ గుడి పట్టించుకోరు..
దేశ విదేశాల్లో వెంకన్న గుళ్లు కడతామంటారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తామంటారు. కోట్లకు కోట్ల నిధులు ఖర్చు చేస్తామంటారు. ఇన్నేసి మాటలు చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం.. సిరిపతి.. శ్రీనివాసుడి తల్లి ఆలయాన్ని బాగు చేయడానికి మాత్రం మనసు రాదు. ఎందుకో..? ఇదీ సగటు శ్రీనివాసుడి భక్తుల మనసుల్లోని మాట.

వకుళా మాత ఆలయాన్ని ఇంతటి దీనస్థితిలోనే ఎందుకు ఉంచారు..?
కూలడానికి సిద్ధంగా ఉన్న వకుళ మాత ఆలయాన్ని తిరిగి కడతామని పునర్‌నిర్మాణం చేయడానికి టీటీడీ పాలకమండలికి చేతులు రావడంలేదా... ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలను కట్టిస్తున్నా.. సాక్షాత్తు దేవదేవుణ్ని కన్నతల్లిగా భక్తులు చెప్పుకునే వకుళా మాత ఆలయాన్ని ఇంతటి దీనస్థితిలోనే ఎందుకు ఉంచారు..?

మైనింగ్‌ మాఫియాపై కోర్టుకెక్కిన స్వామీజీలు..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు నిర్మిస్తున్న టీటీడీ. వకుళామాత ఆలయాన్ని పట్టించుకోవడంలేదు. ఎందుకిలా అన్న ప్రశ్నకు కోర్టు కేసులున్నాయిగా అన్న సమాధానం వినిపిస్తుంది. గతంలో వకుళామాత ఆలయపరిసరాల్లో మైనింగ్‌ను అడ్డుకోవాలంటూ కొందరు స్వామీజీలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలు జరపొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మైనింగ్‌ ఆగిపోయింది. కాని.. తమకు జీవనభృతి కల్పిస్తున్న క్వారీ త్వకాలను మళ్లీ కొనసాగించాలని స్థానికులు కోర్టుకెక్కారు. అసలిక్కడ ఆలయమే లేదని కొత్తగా వాదిస్తున్నారు

పేరూరమ్మ పేరుతో మొదట్లోనే ఇక్కడ ఆలయం
క్వారీకూలీల, మైనింగ్‌ వ్యాపారుల వాదనను భక్తులు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం పేరూరమ్మ పేరుతో ఈ ఊరిలోనే ఓ ఆలయం ఉండేదని... ఆమె 7గురు సంతానంలో వేంకటేశ్వరుడు చిన్నవాడని చెబుతారు. ఆ పేరూరమ్మనే తర్వాత వకుళామాతగా పిలిచారని పూజారులు అంటున్నారు.

కేసులు తేలేవరకు ఆలయనిర్మాణం లేదు..
దీంతో కేసులు తేలేవరకు ఆలయ పునర్‌నిర్మాణం జరపలేమని టీటీడీ చెబుతుతోంది. అయితే.. కోర్టులో టీటీడీ గట్టిగా వాదనలు వినిపించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవతీసుకుని పనిచేయాలని భక్తులు కోరుతున్నారు. ఇక్కడ ఆలయం నిర్మిస్తే ..ఏడుకొండలవాడిని దర్శించుకోడానికి వచ్చిన వారు వకుళామాతను కూడా దర్శించుకునే అవకాశం ఉంది. ఇదొక యాత్రస్థలంగా మారుతుందని భక్తుల అంటున్నారు. 

10:56 - July 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కళాకారుల కడుపులు ఎండుతున్నాయి. సకాలంలో జీతాలు రాక కళాకారులు సతమతమవుతున్నారు. ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడుతుందన్న భయంతో బాధను దిగమింగుకుని పాటలు పాడుతున్నారు. లోలోన కుములిపోతూనే..ప్రభుత్వ పథకాలను ఆకాశానికెత్తే గీతాలను ఆలపిస్తున్నారు.

జీతాల్లేక తెలంగాణ కళాకారుల జీవితాలు దుర్భరంగా మారాయి...
విన్నారుగా కళాకారుల ఆవేదన. తెలంగాణలో సర్కార్ చేపట్టిన కార్యక్రమాలను తమ ఆటా పాటా ద్వారా ప్రజలకు అందేలా చూస్తున్న ఈ కళాకారుల బ్రతుకులు మాత్రం రోడ్డున పడుతున్నాయి. జీతాలెప్పుడని ఒకవేళ ప్రశ్నిస్తే..సర్కారీ ఉద్యోగం ఊడిపోతుందేమోనన్న భయంతో..జీతాల్లేకున్నా అప్పులు చేసుకొని మరీ బ్రతుకుతున్నారు.

2015 ఏప్రిల్‌లో 550 మంది కళాకారుల నియామకం..
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా..వారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చేసేందుకు ఏర్పాటైందే తెలంగాణ సాంస్కృతిక సారధి. దీనికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా..మామిడి హరిక్రిష్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే 2015 ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది కళాకారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఉద్యోగ్యం అంటూ కాల్ లెటర్, ఇంటర్వ్యూ , అపాయిట్ మెంట్ లెటర్లను అందచేసి..వీరికి వేతనంగా 24,514 రూపాయలు ఇస్తామంది. దీంతో అటు కళాకారుల కుంటుంబాలు, ఇటు తెలంగాణ సమాజం ప్రభుత్వ ప్రయత్నాన్ని హర్షించింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ కళాకారులకు ప్రస్తుతం జీతాలు సక్రమంగా అందటం లేదు. రిక్రూట్ మెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటికి ఏ నెలకు ఆ నెలకు జీతం ఇవ్వక పోవడంతో కళాకారులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.

జీతాల్లేక ఆర్ధిక ఇబ్బందుల్లో కళాకారులు..
అయితే సాంస్కృతిక సారధి కింద పనిచేస్తున్న కళాకారులు ఆశామాషి వ్యక్తులేం కాదు. వాల్లంతా పాటను పరుగులెత్తించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వాల్లే. ఓ పూట తిన్నా తినకున్నా ప్రత్యేక రాష్టం కోసం..తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వాల్లే. ఇంతటి గొప్ప కార్యాన్ని తలకెత్తుకొని రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన వీరికి 3నెలలుగా వేతనాలు అందడంలేదు. ఇదే విషయాన్ని పై అధికారుల దృష్టికి తెచ్చి ప్రశ్నిద్దామంటే తాము టార్గెట్ అయి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని భయపడుతున్నారు. 

ఇప్పటికైనా వేతనాలు చెల్లించాలని కళాకారులు కోరుతున్నారు..

కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాంస్కృతిక సారధిలో పనిచేసే కళాకారులందరికి నెలనెలా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సామాజిక తెలంగాణ గుండెచప్పుడు వేదిక సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు అందాల్సిన సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

10:51 - July 23, 2016

హైదరాబాద్ : సెలవులు అడిగినందుకు విద్యార్ధులపై కళాశాల యాజమాన్యం కర్రలతో దాడిచేసిన ఘనట కలకలం సృష్టించింది. ఈ ఘనట హైదరాబాద్ నగరంలోని శ్రీచైతన్య కళాశాలలో జరిగింది . హోమ్ సిక్ తో బాధపడుతున్న విద్యార్థులు సెలవులు ఇవ్వమని కళాశాల యాజమాన్యాని కోరారు. యాజమాన్యం అంగీకరించలేదు. విద్యార్దులు పదే పదే అడగటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం సిబ్బంది విద్యార్ధులను ఓ రూమ్ లో బంధించిన సుమారు మూడు గంటలపాటు కర్రలతో కొట్టి దారుణంగా హింసించింది. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు అందించిన సమాచారంతో తల్లిదండ్రులు కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్థితిలో చూసి తల్లడిల్లిపోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు దిల్ సుక్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళాశాల యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. యాజమాన్యం వైఖరిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు తెలిసీ తెలియక తప్పుచేస్తే తమకు సమాచారం అందించకుండా విద్యార్తులను దారుణంగా హింసించటంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టి పిల్లలను వారికి అప్పగిస్తే గొడ్డును బాదినట్లుగా బాదారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పరీక్షలు అయిన తరువాత కూడా సెలవులు ఇవ్వకుండా క్లాసులను కంటిన్యూ చేశారని విద్యార్థులు పేర్కొంటున్నారు. 

శ్రీచైతన్య కాలేజ్ నిర్వాకం ...

హైదరాబాద్ : శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం నిర్వాకం బైటపడింది. హోమ్ సిక్ సెలవులు అడిగిన విద్యార్థులపై యాజమాన్యం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు అందించిన సమాచారంతో తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని యాజమాన్యం వైఖరిపై ఆందోళన చేపట్టారు. అనంతరం పీఎస్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

10:23 - July 23, 2016

చెన్నై : నుంచి పోర్టు బ్లెయర్‌ వెళ్తూ గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఆచూకీ ఇంకా దొరకలేదు. విమానంలో 8 మంది విశాఖ వాసులతో సహా 29 మంది ఉద్యోగులు ఉన్నారు. విశాఖకు చెందినసాంబమూర్తి, భూపేంద్ర సింగ్‌, నాగేంద్రరావు, ప్రసాద్‌ బాబు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్‌ మహారాణా, చిన్నారావు, శ్రీనివాసరావు ఉన్నారు. విమానం ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఎయిర్‌ఫోర్స్ విమానంకోసం కొనసాగుతున్న గాలింపు..
అటు విమానం జాడకోసం భారత ప్రభుత్వం శ్రీలంక, సింగపూర్, మలేసియాలను కూడా సహాయం కోరింది.... శుక్రవారం తమిళనాడులోని తాంబరం నుంచి బయలుదేరిన ఈ విమానం పోర్ట్ బ్లెయిర్ వెళుతుండగా కనిపించకుండా పోయింది.. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. 

10:19 - July 23, 2016

హైదరాబాద్ : ఎం సెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై సీఐడీ విచారణ స్పీడప్‌ అయ్యింది. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలు నిరంతరంగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్ , విజయవాడల్లోని అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్ డేటా , ఎంసెట్ వన్, 2 లో వచ్చిన మార్కులను బేరిజు వేస్తు.. అభ్యర్థుల ఆర్ధిక స్తోమత పై దృష్టి పెట్టిన సీఐడీ కూపీలాగుతోంది.

ఎంసెట్‌-2 పై దూకుడు పెంచిన సీఐడి...
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ 2 పరీక్ష పేపరు లీకేజీ ఆరోపణలపై సి.ఐ.డి. దూకుడు పెంచింది. వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్ధుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎక్కడెక్కడ కోచింగ్ లు తీసుకున్నారన్న విషయంపై ఆరాతీస్తున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఆరోపణలు చేస్తున్న వారిని విచారించడానికి రాష్ట్ర దర్యాప్తు సంస్థ రెడీ అయ్యింది. ఒక బృందం వరంగల్ చేరుకొని ఎంసెట్-1లో వచ్చిన ర్యాంకులు, ఎంసెట్-2లో వచ్చిన ర్యాంకులను బేరీజు వేస్తోంది.

కోచింగ్‌ సెంటర్ల పాత్రపై అనుమానాలు..
హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్లపై సీఐడీ ప్రధానంగా దృష్టిపెట్టింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి, పరీక్షకు ఒకరోజు ముందు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను హైదరాబాద్‌కు రప్పించుకుని పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఈ కోచింగ్ సెంటర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కోచింగ్‌ సెంటర్‌నుంచి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా సేకరణ..
చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న విద్యార్థులకు ఎంసెట్-2 ఫలితాల్లో వెయ్యి లోపు ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెడికల్ సీటు కావాలంటే తమను సంప్రదించండి అంటూ సదరు కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌కాల్స్‌ వెళ్లినట్ట తెలుస్తోంది. దీనిపై దృష్టిపెట్టిన సీఐడీ నిర్వాహకుల ఫోన్ నెంబర్లు, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. లీకేజీలో మధ్యవర్తులు నిజంగా పేపర్‌లోని ప్రశ్నలను బయటకు తేగలిగారా ? లేదా డమ్మీ పేపర్‌ను రూపొందించి అదే అసలుగా నమ్మించి డబ్బు దండుకున్నారా ? అన్న అంశాల పై ఆరా తీస్తున్నారు అధికారులు.

ముద్రణా సంస్థ యజమానులపై అనుమానాలు..
అటు ప్రింటింగ్ ప్రెస్‌లో ఎమైనా లీకేజీ పై జరిగిందా అనే దానిపై కూడా దృష్టి పెట్టారు సీఐడీ అధికారులు. అయితే ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నలు మాత్రమే ముద్రిస్తారు... అవి ఏ పరీక్షకు సంబంధించినవో ఎవరికీ తెలియదు. ఒక్క ముద్రణ సంస్థ యజమానికి మాత్రం కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ముద్రణ సంస్థ నుంచి ప్రశ్నలు లీక్ అయితే అది యజమానికి తెలియకుండా జరిగిందా అన్న కోణంలో అధికారులు విశ్లేషణ జరుపుతున్నారు.

కోచింగ్‌ సెంటర్లలో సీఐడీ దర్యాప్తు...
విజయవాడలో కూడా సీఐడీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. టాప్‌ ర్యాంక్‌లు వచ్చిన కోచింగ్ సెంటర్లను పరిశీలించారు. అక్కడ నిర్వహించని మాక్ టెస్టు పేపర్లను స్వాదీనం చేసుకున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రుల కాల్‌డేటాతో పాటు మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ఫోన్‌కాల్స్‌ను విశ్లేషిస్తున్నారు.

15ఏళ్ల క్రితం ఎంసెట్‌ పేపర్‌ లీకేజీలో ప్రింటింగ్‌ ప్రెస్‌ పాత్ర ..
15ఏళ్ల క్రితం ఎంసెట్‌ పేపర్‌ లీకేజీలో ప్రింటింగ్‌ ప్రెస్‌ పాత్ర బయటపడింది. ఇపుడు కూడా అలాగే ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం ఏమైనా లీక్‌ అయ్యిందా అనే కోణంలో దర్యాప్తు ను సాగిస్తోంది సీఐడీ.

10:13 - July 23, 2016

విజయవాడ : ఏపీలో రెండు రోడ్డు ప్రమాదాలు ఐదుగురి ప్రాణాలు తీశాయి.. 8మంది పోలీసుల్ని గాయాలపాలు చేశాయి.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద టవేరా-కారు ఢీ కొట్టింది... ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులంతా కర్ణాటకవాసులుగా గుర్తించారు. తిరుపతి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నెల్లూరు
  :  జిల్లా మనుబోలు మండలం జట్లకొండూరు దగ్గర.... పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు వ్యాన్‌ను స్కార్పియో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఘోర రోడ్డుప్రమదం..5గురు మృతి..
అనంతపురం
: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద టవీఏరా వాహనం ఓ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులంతా కర్ణాటకవాసులుగా గుర్తింపు.

శ్రీవారి సేవలో ప్రముఖులు..

తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌, తెలంగాణ మంత్రి చందూలాల్‌ తదితరులు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆసుపత్రిలో ప్రమాదం..చిన్నారులకు గాయాలు..

కరీంనగర్‌ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పిల్లలవార్డులో శనివారం తెల్లవారుజామున భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ ప్రమాదంలో పిల్లలకు సంరక్షణగా ఉన్న ముగ్గురికి, చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. బాధితులకు ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. భవనం పైకప్పు పెచ్చులూడి పడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనకు గురౌతున్నారు.

భవనం కూలి 4గురి మృతి..

పశ్చిమ్‌బంగాల్ : డార్జిలింగ్‌లో భవనం కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది భవనం శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..

నల్లగొండ: ఆర్టీసీ బస్ లారీ ఢీకొనటంతో ఓ మహిళ మృతి చెందింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురం వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హాజిపేట వెళ్తున్న క్రమంలో... సాయిధామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

హార్ట్ ఎటాక్ తో తహశ్దీర్ మృతి..

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్ పల్లి తహశీల్దార్ నరేందర్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్థరాత్రి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే నరేందర్ మార్గమధ్యంలోనే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. నరేందర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

09:21 - July 23, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్‌ టాపిక్.... రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.

కోటి ఎకరాలకు సాగునీరందిస్తామంటున్న టీసర్కార్..
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను దాదాపు అన్నింటికీ రీడిజైన్ చేస్తూ కొత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు కొత్త డిజైన్లను ఖరారు చేస్తూ పనులను చేపడుతోంది. ఇందుకు సంబంధించి డీపీఆర్ విడుదల చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా....అధికార పక్షం నుంచి మౌనమే సమాధానం అవుతోంది.

జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం-హరీష్‌రావు
ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్న హామీని నెరవేర్చే దిశగానే అడుగులు వేస్తున్న ప్రభుత్వం పాలమూరు జిల్లాపై దృష్టిపెట్టింది.ఈ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భీమా, నెట్టేంపాడు, కల్వకుర్తి తదిర ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత తమకే దక్కుతుందని అధికార పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని చెబుతున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని అంటున్నారు.

ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న విపక్షాలు, ప్రజాసంఘాలు..
ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా... విపక్ష పార్టీలు ,ప్రజా సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. పాలమూరు జిల్లా వాసులు ప్రాజెక్టు డిజైన్లను మార్చాలని కోరుతున్నట్లు టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. జిల్లాలో కొత్తగా చేపట్టాల్సిన పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు పాలమూరు జిల్లాలో టీజేఏసీ కమిటీ పర్యటించి, ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని చెబుతున్నారు.
 

సీపీఎం 13రోజుల పాదయాత్ర..
మరోవైపు ప్రాజెక్టులపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు సిద్ధమవుతన్నాయి. 13 రోజుల పాటు జరిగే యాత్రతో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే యత్నాన్ని మొదలు పెట్టాయి. సీపీఎం చేపట్టిన మహాపాదయాత్రకు ప్రధాన పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. 

నేడు భాగ్యనగరంలో ఆటోలు బంద్..

హైదరాబాద్ : డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఆటోబంద్‌ నిర్వహి స్తున్నామని బీఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రవిశంకర్‌ తెలిపారు. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినేలా ఓలా-ఉబర్‌ క్యాబ్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ప్రైవేట్‌ రవాణా వాహనాలపై పెంచిన 50శాతం ఇన్సూరెన్స్‌ రేట్లను తగ్గించాలనే పలు డిమాండ్లతో ఆటో బంద్‌కు పిలుపు నిచ్చామని పేర్కొన్నారు. శనివారం నిర్వహించే ఆటో బంద్‌కు తమ మద్దతు లేదని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఆఫ్ఘన్ లో కిడ్నాప్ అయిన మహిళ క్షేమం..

ఢిల్లీ : గత నెల 9న ఆఫ్గనిస్థాన్‌లో కిడ్నాపైన భారత మహిళ జుడిత్ డిసౌజ్(40) కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడినట్టు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

దోపిడి దొంగల బీభత్సం..

మెదక్: పలు గ్రామాలలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా  అందోల్ మండలం కుమ్మరిగూడెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఎనిమిది ఇళ్లలో చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. ఇది గుర్తించిన స్థానికులు దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. గురువారం రాత్రి గ్రామంలోని ఓ ఇంట్లో బైక్, నగదు, బంగారం దొంగలించిన దుండగులు మరో ఏడు ఇళ్లలో చోరీకి యత్నించారు.

టిప్పర్ ఢీకొట్టటంతో ఇద్దరు మృతి...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు - టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

08:41 - July 23, 2016

విజయవాడ : చంద్రబాబు రూట్‌ మార్చారా ? నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం విదేశాలన్నీ తిరుగుతూ పెట్టుబడులను సమీకరిస్తున్న చంద్రబాబులో మార్పు వచ్చిందా ? అధికారంలో ఉన్నా పార్టీ కేడర్‌ నిరూత్సాహంగా ఉండడంతో ఇకపై కార్యకర్తలకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారా ? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

రెండేళ్లుగా నిధుల సమీకరణ, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టిన చంద్రబాబు ..
ఉమ్మడి రాష్ట్రంలో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత క్రమక్రమంగా దూరమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. బిజీగా మారిపోయారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని కూడా లేకపోవడంతో ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకోవడంతో.. కార్యకర్తలకు టైమిచ్చే సమయం కూడా బాబుకు లేకుండాపోయింది. ఈ రెండేళ్లు రాష్ట్రానికి నిధుల సమీకరణ,.. రాష్ట్ర అభివృద్ధిపైనే చంద్రబాబు పూర్తి దృష్టి కేంద్రీకరించారు.

బాబును కలవడం కార్యకర్తలకు కష్టంగా మారింది..
అయితే.. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. సీఎంగా చంద్రబాబు బిజీగా ఉండడంతో ఆయన్ను కలవడం కార్యకర్తలకు కష్టంగా మారింది. బెజవాడ క్యాంప్‌ ఆఫీసులో ఉన్నా.. ఇతర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినా.. తమకు సరైన సమయం దొరకడం లేదన్న అసంతృప్తి కేడర్‌లో కనిపిస్తోంది. ఇటీవలే రెండేళ్ల పాలనపై టీడీపీ సమన్వయకమిటీతో భేటీ అయిన బాబు.. పార్టీ కేడర్‌లోని అసంతృప్తిని సీరియస్‌గా తీసుకున్నారు. ఇకపై అధికార కార్యకలాపాల్లో ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొంత సమయం కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా ఈరోజు వైజాగ్‌లో పార్టీ కేడర్‌తో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.

తెలంగాణలో పార్టీని పట్టాలెక్కించే పనిలో పడ్డ లోకేష్..
మరోవైపు తెలంగాణలోనూ పార్టీని పట్టాలెక్కించే పనిలో పడ్డారు నారా లోకేష్‌. ఇప్పటికే పార్టీ ఖాళీ కావడంతో.. ఉన్న సీనియర్లను సమన్వయం చేసుకుంటూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని లోకేష్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్‌భవన్‌లో కూడా కొన్ని మార్పులు చేపట్టారు. ఇకపై అన్ని విభాగాల అధ్యక్షులు విధిగా పార్టీ కార్యాలయానికి వచ్చేలాగా.. అందరికీ గదుల కేటాయింపు చేయబోతున్నారు. దీని ద్వారా అనుబంధ విభాగాలను బలోపేతం చేయడంతో పాటు.. తిరిగి పార్టీ కేడర్‌ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు.

ప్రతినెలా తమ్ముళ్లతో భేటీ కావాలని నిర్ణయం..
ప్రతి నెలా తెలంగాణ తమ్ముళ్లతోనూ చంద్రబాబు భేటీ కావాలని నిర్ణయించడంతో వారిలో సంతోషం వ్యక్తమవుతోంది. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ కేడర్‌కు అధినాయకత్వం అందుబాటులోకి రానుండడం కొత్త ఉత్సాహాన్నిచ్చే పరిణామమని నేతలంటున్నారు. 

08:27 - July 23, 2016

చెన్నై : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం మిస్సింగ్‌ కేసులో ఉత్కంఠత పెరిగిపోతోంది. చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ చేరాల్సిన విమానం గమ్య స్థానం చేరలేదు. దీంతో విమానంలో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పోర్టుబ్లెయిర్‌ వెళ్తూ గల్లంతు...
తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్‌ రాజధాని పోర్టుబ్లెయిర్‌ వెళ్తూ గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌-32 విమానం కోసం గాలింపుఇంకా కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో 13 యుద్ధనౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ జలాంతర్గామి పాల్గొంటున్నాయి.

తెగిపోయిన రాడార్‌తో సంబంధాలు..
శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తాంబరం ఎయిర్‌బేస్‌ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం 9.12 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చెన్నైకి 200 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉండగా విమానం ఆచూకీ గల్లంతైనట్లు నేవీ అధికారులు చెబుతున్నారు.విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు.
విమానంలో 8 మంది విశాఖ వాసులు...
ఇదిలా ఉంటే గల్లంతైన ఏఎన్‌-32 విమానంలో 8 మంది విశాఖ వాసులు ఉన్నట్లు సమాచారం. విమానంలో ఎన్‌ఏడీలో ఛార్జ్‌మెన్‌ సాంబమూర్తి, ఆర్మమెంట్‌ ఫిట్టర్స్‌ ప్రసాద్‌బాబు, నాగేంద్రరావు, సేనాపతి, మహారాణా, చిన్నారావు, మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది శ్రీనివాసరావు ఉన్నారు. గల్లంతైన వారి కుటుంబాలకు నౌకాదళ అధికారులు సమాచారమిచ్చారు. వీరంతా మర్రిపాలెం, సింహాచలం, బుచ్చిరాజుపాలెం, కెజిహెచ్‌, సింహాచలం ప్రాంతానికి చెందిన వారు. తమ వారు గల్లంతయ్యారన్న సమాచారంతో కుటుంబీకులంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

రీఫ్యుయెలింగ్‌ చేయకపోయినా 4 గంటల వరకు ప్రయాణించే సామర్థ్యం..
ఇదిలా ఉంటే రష్యాకు చెందిన ఏఎన్‌-32 రకం విమానాలను భారతీయ వాయుసేన 1984 నుంచి ఉపయోగిస్తోంది. ఈ రకానికి చెందిన 125 విమానాలు వాయుసేన వద్ద ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ మార్పులు తలెత్తినా, రీఫ్యుయెలింగ్‌ చేయకపోయినా నాలుగు గంటల వరకు ప్రయాణిస్తాయి. 

మిర్చి యార్డ్ లో సీబీఐ సోదాలు..

గుంటూరు : గతంలో వెలుగుచూసిన పత్తి కొనుగోళ్లకు సంబంధించిన కుంభకోణాలపై దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు నగరంలోకి ప్రవేశించారు. విశాఖ నుంచి నిన్న మధ్యాహ్నానికి గుంటూరు చేరుకున్న సీబీఐ అధికారులు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కార్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలించారు. 

ఆచూకీ లభ్యంకాని ఎయిర్ ఫోర్స్ విమానం..

చెన్నై : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం మిస్సింగ్‌ కేసులో ఉత్కంఠత పెరిగిపోతోంది. గురువారం ఉదయం 9.12 గంటలకు రాడార్ తో లింక్ తెగిపోయింది. చెన్నై నుంచి పోర్ట్‌ బ్లెయిర్‌ చేరాల్సిన విమానం గమ్య స్థానం చేరలేదు. దీంతో విమానంలో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా మర్రిపాలెం, సింహాచలం, బుచ్చిరాజుపాలెం, కెజిహెచ్‌, సింహాచలం ప్రాంతానికి చెందిన వారు. తమ వారు గల్లంతయ్యారన్న సమాచారంతో కుటుంబీకులంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.  

ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ..

విజయవాడ : రాష్ట్రంలో 4,548 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. విభజన తర్వాత మొదటి సారిగా కొత్త రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి శుక్రవారం విజయవాడలో ఆయన నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఏపీలో నేడు, రేపు వర్షాలు..

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్ గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రధాని సంతకం ఫోర్జరీ..ఇద్దరి అరెస్ట్ ..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను జార్ఖండ్ లో సీబీఐ అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. మే 2015లో పశ్చిమబెంగాల్ కు చెందిన పండిట్ స్వరాజ్ కుమార్ రాయ్, సువెందు కుమార్ బర్మన్ తో కలిసి ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆగస్టు 15 వేడుకల్లో సంగీత కచేరి నిర్వహించాలని మోదీ తనకు లేఖ రాశారంటూ సంబంధిత అధికారులకు చూపిన లేఖలో మోదీ సంతకం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. బెంగాల్ లో ఫోర్జరీకి పాల్పడిన మరికొన్ని పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

07:43 - July 23, 2016

ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన ప్రత్యేక బిల్లుకు మోక్షం లభించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ప్రధానమైన ప్రత్యేక హోదా కల ఈసారీ కూడా నెరవేరలేదు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ జరగకుండానే రాజ్యసభ శుక్రవారం నుండి సోమవారానికి వాయిదా పడింది. బిల్లును అడ్డుకున్నది మీరంటే మీరంటూ పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దీంతో ప్రత్యేక సెగలు..ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కాగా వచ్చే శుక్రవారంనాడు ఈ బిల్లు మళ్ళీ సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా దక్కించుకుని తీరతామని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రత్యేక బిల్లుకు మోక్షం లభిస్తుందా? లేదా? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో గఫూర్ (సీపీఎం నేత) శ్రీనివాస్ ( బీజేపీ నేత) రామశర్మ (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోని క్లిక్ చేయండి..మరింత సమాచారం తెలుసుకోండి. 

07:32 - July 23, 2016

విజవయవాడ : పోలీస్‌శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాలుగువేలకుపైగా పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే పరీక్షల్లోనూ మార్పులు చేసింది. పోలీస్‌ ఉద్యోగం పట్ల యువతలో ఉన్న భయాలను పోగొట్టడానికి ఈ సారి కొత్త పద్ధతులను అవలంబించనుంది.

రాష్ట్ర విభజన తర్వాత పోలీస్‌శాఖలో 14వేల ఖాళీలు...
రాష్ట్ర విభజన తర్వాత.. పోలీస్‌శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 14 వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఫలితంగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో అదనంగా పోలీసులు అవసరమని పోలీస్‌శాఖ ప్రభుత్వాన్ని కోరింది.

తొలివిడతగా 4,548 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..
దశల వారీగా పోలీస్‌శాఖలో పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. తొలి విడతగా వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దాదాపు నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీ డీజీపీ రాముడు విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. హాల్ టిక్కెట్లను కూడా వెబ్ సైట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

5 కిలోమీటర్ల పరుగుకు స్వస్తి..3 టెస్టు‌లు మాత్రమే నిర్వహణ..
అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే పరీక్షల్లోనూ మార్పులు చేశారు. ఐదు కిలోమీటర్లు పరుగుపై చాలామంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. ఈ మేరకు దానికి స్వస్తి చెప్పామని డీజీపీ తెలిపారు. ఆ స్థానంలో కేవలం ఒక మైలు పరుగు మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఐదు ఫిజికల్ టెస్టులకు బదులు మూడు టెస్ట్‌లు మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలు కారణంగా పోలీసు ఉద్యోగాలకు రావడానికి అనేక మంది భయపడుతున్నారని.. దీనిని దూరం చేయడానికి ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నామని డీజీపీ చెప్పారు.

అన్ని పోస్టులూ ఒకేసారి భర్తీకి అవకాశం లేదు : డీజీపీ రాముడు
అన్ని పోస్టులనూ ఒకేసారి భర్తీ చేయడానికి అవకాశం లేదని డీజీపీ తెలిపారు. ఏపీలో పోలీస్‌ అకాడమీ లేనందున..ట్రైనింగ్‌ ఇచ్చే పరిస్థితి లేదని అందుకే విడతల వారీగా పోస్టుల భర్తీ చేయడం జరుగుతుందన్నారు. 

కాంగ్రెస్ నేత బీవీ శేషు మృతి..

ప్రకాశం : ప్రకాశం : మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు (71) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఒంగోలులోని స్వగృహంలో ఆయనకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన తుది శ్వాస విడిచారు.పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. శేషు మృతిపై పలువురు నేతలు సంతాపం తెలిపారు. కొండపి నియోజక వర్గం నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా... ఓ సారి ఎమ్మెల్సీగా ఎన్నియక్యారు. 

07:10 - July 23, 2016

హైదరాబాద్ : హరితహారం మంత్రుల పనితీరుకు గీటురాయి కానుంది. ప్రజాప్రతినిధులు, అధికారుల పనీతీరును అంచనా వేసేందుకు సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్నే కొలమానంగా తీసుకుంటున్నారు. ఈ సీజన్‌లో 46 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సూచించిన సీఎం.. కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు.

హరితాహారం పనులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..
మంత్రులు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధుల పనితీరును హరితహారం ద్వారానే బేరీజు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రెండు వారాలుగా సాగుతున్న హరిత హారం కార్యక్రమం పై సీఎం కేసీఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సీజన్లోనే 46 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ప్రతీ ఒక్కరు విడిగా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడతాననీ ఈ సందర్భంగా సీఎం చెప్పారు. మొక్కలు ఎండిపోకుండా నీరు పోసేందుకు అవసరమైతే ఫైర్‌ ఇంజిన్లను, మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకులను వాడుకోవాలని సూచించారు.

హరితహారంలకు అందుబాటులో రూ.1500 కోట్ల కాంపా నిధులు
హరిత
హారం పథకానికి నిధుల కొరత లేదని సీఎం అన్నారు. 1500 కోట్ల రూపాయల కాంపా నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇతరత్రా నిధులు కూడా ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉందని అధికారులతో అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు అంతా చివరి మొక్క నాటే వరకు ఇదే పనిలో ఉండాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీ పరిధిలో సర్పంచ్, విఆర్ఓ, విఎఓ, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా మొక్కలు నాటే పనిలోనే నిమగ్నం కావాలని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణకు తీసుకున్న చర్యలను సైతం ఎప్పటికప్పుడు సీఎస్ రాజీవ్ శర్మ కు నివేదికలు అందించాలన్నారు.

సీఎం నిర్ణయంతో ఉరుకులు పరుగులు..
ప్రజాప్రతినిధులు, అధికారులు హరితహారంలో పాల్గొన్న తీరు ఆధారంగా భవిష్యత్ అవకాశాలుంటాయని సీఎం తెలిపారు. కేసీఆర్‌ నిర్ణయంతో.. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. ఉరుకులు, పరుగులతో సచివాలయం నుంచి జిల్లాలకు బయలుదేరారు. 

07:03 - July 23, 2016

జర్మని : మ్యూనిచ్‌లో సామాన్య ప్రజలపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. స్థానిక ఒలింపియా షాపింగ్‌మాల్‌లోకి చొరబడి దుండుగుడు తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో సుమారు 6 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది జర్మనీ అధికార యంత్రాంగం

రైలులో ఉగ్రవాది గొడ్డలితో దాడి...
కదులుతున్న కదులుతున్న రైలులో ఉగ్రవాది గొడ్డలితో దాడి చేసిన ఘటన మరువకముందే జర్మనీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దేశంలో మూడో అతిపెద్ద నగరం మ్యూనిచ్ లోని ఓ ఒలంపియా షాపింగ్ సెంటర్ లోకి చొరబడ్డ దుండగులు ఒక్కసారిగా కొనుగోలుదార్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 6 మంది కాల్పుల్లో మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది.

షాపింగ్ సెంటర్ ను చుట్టుముట్టి దుండగులు..
ఘటన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా సిబ్బంది షాపింగ్ సెంటర్ ను చుట్టుముట్టి దుండగులను మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం ముగ్గురు దుండగులు ఈ ఘాతుకంలో పాలుపంచుకున్నట్లు సమాచారం.

పలు ప్రాంతాలలో దుండగుల కాల్పులు..
మ్యూనిచ్‌ లోనిషాపింగ్‌మాల్‌తో పాటు నగరంలోని పలుచోట్ల కూడా దుండగులు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షాపింగ్‌ మాల్‌తో పాటు మెక్‌డోనాల్డ్‌ రెస్టారెంట్‌లో కూడా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
 

మూసాచ్ డిస్ట్రిక్ లో తాత్కాలిక ఎమర్జెన్సీ ..
మరోవైపు షాపింగ్ మాల్ ఉన్న మూసాచ్ డిస్ట్రిక్ లో తాత్కాలిక ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాల్పుల శబ్ధం వినబడగానే జనం బయటికి పరుగులు తీసిన దృశ్యాలతోపాటు వ్యక్తి చనిపోయిన ఫొటో ఒకటి సోషల్ మీడియా ద్వారా షేర్ అయింది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

06:53 - July 23, 2016

నెల్లూరు : మనుబోలు మండలం జట్లకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వ్యాన్ ను స్కార్పియో వాహనం ఢీకొంది. కాగా హైవే అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపై చనిపోయిన ఓ బర్రె పడివుండటంతో గుర్తించని వాహనదారులు దాన్ని తప్పించబోయి పోలీసు వాహనాన్ని ఢీకొన్నారు. దీంతో ప్రమాదం జరిగినట్లుగా తెలస్తోంది. గాయపడినవారిలో ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

06:45 - July 23, 2016

అనంతపురం : ముదిగుబ్బ మండలం సంకేపల్లి సమీపంలో శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన టవేరా వాహనం ఓ కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై జయానాయక్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులంతా కర్ణాటకవాసులుగా పోలీసులు గుర్తించారు. 

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు..

ప్రకాశం : పామూరు మండలంలో భూప్రకంపనలు సంభవించాయి. బలిజపాలె, బొల్లగూడూరు, మోపాడులలో మూడు సెకలన్ల పాటు భూమి కంపించింది. భయాందోళనలకు గురయిన ప్రజలు ఇళ్లల్లో నుండి పరుగులు తీసారు.

రోడ్డు ప్రమాదంలో 8మందికి గాయాలు..

నెల్లూరు : మనుబోలు మండలం జట్లకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. హైవేపై పోలీసు వ్యాన్ ను స్కార్పియో వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

ఘోర రోడ్డుప్రమాదం..5గురు మృతి..

అనంతపురం : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద టవేరా వాహనం ఓ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.  గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులంతా కర్ణాటకవాసులుగా గుర్తింపు.

Don't Miss