Activities calendar

24 July 2016

22:30 - July 24, 2016

పుట్టిన ప్రతివ్యక్తి  జీవితంపై ఎన్నో ఎన్నెన్నో కలల కంటాడు. ఏదో సాధించాలని ఆడపడతాడు. ఆశలు నెరవేరేది కొందరికే. ఆశలు నెరవేర్చుకునేది చాలా కొద్దిమంది మాత్రమే. కారాణాలు ఎవైనా.. జీవితం అనేది అల్లకల్లోలంగా సాగిపోతావుంటే. ... అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని... నిలకడగా జీవితం సాగిస్తున్న వారు. ఏనాటికైనా జీవితంలో స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరు : జానారెడ్డి

హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు జరిగే వరకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

22:22 - July 24, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు జరిగే వరకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. నిర్వాసితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు లారీఛార్జ్‌ చేసి గాల్లోకి కాల్పులు జరపడం దారుణమని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రేపటి మెదక్‌ జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. నిర్వాసితులకు అండగా.. ఈ నెల 26న చలో మల్లన్నసాగర్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు భట్టి తెలిపారు.

22:10 - July 24, 2016

ఖాట్మాండు : నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనడానికి ముందే ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్ ప్రభుత్వం నుంచి రెండు ప్రధాన పార్టీలైన సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ , నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. బలనిరూపణకు సరైన సంఖ్య లేకపోవడంతో.. ముందుగానే ప్రధాని రిజైన్ చేశారు. భారత్‌, చైనాతో సత్సంబంధాలు మెరుగుపరిచేలా కృషి చేసినందుకే తన ప్రభుత్వంపై కుట్ర చేశారని ఓలీ ఆరోపించారు.

 

22:08 - July 24, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్ కేసులో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ సాంబశివరావు, సీఐడీ చీఫ్ తిరుమల రావు రివ్యూకు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ కేసు విచారణలో సీఐడీపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చూడాలన్నారు. మరోవైపు తుని ఘటనపై పూర్తిస్థాయి విచారణకు కూడా సీఎం ఆదేశించారు. 

 

22:04 - July 24, 2016

మహబూబ్ నగర్ : అభివృద్ధి చెందుతున్న దేశాలతో భారత్‌ పోటీపడుతోందని, విద్యార్థులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకెళుతున్నారని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూర్‌ మండలంలోని మామిడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సింబయాసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఉద్యోగవకాశాల విషయంలో దిశానిర్దేశం చేసేలా సూచనలు ఇవ్వాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. హైదరాబాద్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

 

22:01 - July 24, 2016

చిత్తూరు : రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టాలు ఇచ్చిన రేణిగుంట వాసులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ఆగస్ట్15న ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇందు కోసం జైలుకు వెళ్లాడానికయినా సిద్ధమన్నారు.

21:58 - July 24, 2016

హైదరాబాద్ : ఫిలింనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 12 మంది గాయపడ్డారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా... కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ మేనేజింగ్‌ కమిటీ ప్రకటించింది. 
కూలిన నిర్మాణంలో ఉన్న భవనం   
హైదరాబాద్‌ఫిలింనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. కల్చరల్‌ క్లబ్‌ వద్ద రెండంతస్తుల భవనం పొర్టికో ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వీరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆనంద్‌, అన్సూర్‌ షేక్‌గా గుర్తించారు. గాయపడిన మరో 12 మందిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. 
నాసిరకమైన మెటిరీయల్‌ తోనే ప్రమాదం : మేయర్  
నాసిరకమైన మెటిరీయల్‌తో స్లాబ్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని..నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని.. జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ ప్రమాదానికి ఫిల్మ్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. మొదటి ఫ్లోర్ వేసిన 24 గంటల్లోనే రెండో ఫ్లోర్ వేయడం ఈ ప్రమాదానికి కారణమైనట్లు ఆయన తెలిపారు.
పరారీలో బిల్డింగ్ కాంట్రాక్టర్..?  
బిల్డింగ్ కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,  అంబర్‌ పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పరిశీలించారు. 
కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన 
మరోవైపు బాధితులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘటనాస్థలంలో ధర్నా చేపట్టారు. అంతటితో ఆగకుండా ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లి.. భవనం అద్దాలు, ఫర్నిచన్‌ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు విష్ణువర్థన్‌ సహా యువజన కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌ ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా... కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. గాయపడ్డవారికి వైద్యం ఖర్చులు భరిస్తామని తెలిపింది.  

21:48 - July 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం ఎర్రవెల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు జిల్లా అంతటా మళ్లీ ఆంక్షలు విధించారు. సోమవారం మెదక్‌ జిల్లా బంద్‌ పిలుపు నేపథ్యంలో.. జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. పోలీసుల కవ్వింపు చర్యలను విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. 

21:45 - July 24, 2016

మెదక్ : హక్కులు అడిగితే తుపాకులు ఎక్కుపెడుతున్నారు. రైతులు, నిర్వాసితులకు పోలీసు రాజ్యం లాఠిన్యాన్ని రుచి చూపిస్తున్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులపై ప్రభుత్వం కఠినాతికఠిన వైఖరిని అవలంబిస్తోంది. రెండుసార్లు లాఠీలతో చితకబాది.. రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి.. ప్రజలను భయభ్రాంతులను చేశారు. నిర్వాసితుల్లో పలువురిని తీవ్ర గాయాలపాల్జేశారు. సర్కారు నిర్బంధ చర్యలకు నిరసనగా.. విపక్షాలు రేపు మెదక్‌ జిల్లా బంద్‌కు పిలుపునిస్తే.. పోలీసులు 144 సెక్షన్‌ ద్వారా మరింత నిర్బంధాన్ని ఇంపోజ్‌ చేస్తున్నారు.
నిర్వాసితుల పట్ల కేసీఆర్‌ సర్కారు కఠినాతికఠినం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల కేసీఆర్‌ సర్కారు కఠినాతికఠినంగా వ్యవహరిస్తోంది. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించమన్న పాపానికి పోలీసు రాజ్యం పవర్‌ చూపారు. తరిమితరిమి లాఠిన్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం జారీచేసిన 123 జీవో వద్దని, కేంద్ర చట్టం ప్రకారమే పరిహారం కావాలని కోరుతూ.. ముంపు గ్రామాల నిర్వాసితులు..  ఆదివారం జాతీయ రహదారి దిగ్బంధానికి సమాయత్తమయ్యారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనూహ్యంగా పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలు ఝళిపించారు. పిల్లలు, స్త్రీలు అన్న విచక్షణ కూడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లే చితకబాదారు. 
పలువురు నిర్వాసితులకు గాయాలు 
పోలీసుల దాడిలో పలువురు నిర్వాసితులు తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది స్పృహకోల్పోయారు. పోలీసుల లాఠీఛార్జీలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినా లాఠీలకు వెరవబోమంటూ నిర్వాసితులు ఆందోళనను కొనసాగించడంతో.. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గాల్లోకి కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల కాల్పులతో నిర్వాసితులను భయోత్పాతానికి గురి చేశారు. 
ఆందోళనకారులపై రెండోసారీ లాఠీచార్జీ 
పోలీసులు ఎన్నిరకాలుగా కవ్విస్తున్నా దీక్షకే కట్టుబడ్డ ఆందోళనకారులపై పోలీసులు రెండోసారీ లాఠీలు ఝళిపించారు. అదేసమయంలో అక్కడ కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపైనా విరుచుకుపడ్డారు. పోలీసుల చర్యలను విపక్షాలు ముక్తకంఠంతో విమర్శించాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా సోమవారం మెదక్‌ జిల్లా బంద్‌ పాటించాలని విపక్షాలు నిర్ణయించాయి.  అటు ఎర్రవెల్లి ఘటనను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రజ్ఞాపూర్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులు దామోదర రాజానరసింహ, జగ్గారెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 
పోలీసుల దౌర్జన్యకాండకు పలువురు ఖండన
మల్లన్నసాగర్‌ రైతులపై పోలీసులు దౌర్జన్యకాండను పలువురు తీవ్రంగా ఖండించారు. రైతులు ఎప్పటినుంచో చట్టాన్ని అమలు పరిచి న్యాయం చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం జీవో అమలు పరిచేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. రైతులు, గ్రామస్తులపై దాడికి పాల్పడటం హేయనీయమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఖండించారు. సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జస్టిస్‌ చంద్రకుమార్‌, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తదితరులు  పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఐ పిలుపునిచ్చింది. 
పోలీసుల లాఠీచార్జిని ఖండించిన మంత్రి హరీశ్‌రావు  
మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని మంత్రి హరీశ్‌రావు ఖండించారు. పోలీసుల వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. అయినా పోలీసులు జిల్లా అంతటా మళ్లీ ఆంక్షలు విధించారు. సోమవారం మెదక్‌ జిల్లా బంద్‌ పిలుపు నేపథ్యంలో.. జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. పోలీసుల కవ్వింపు చర్యలను విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. 

 

టీ.ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వారం పాటు వాయిదా

హైదరాబాద్ : రేపట్నుంచి జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ 2 లీకేజీ ఉదంతంపై సీఐడీ దర్యాప్తు పూర్తికానందున కౌన్సెలింగ్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

20:57 - July 24, 2016

హైదరాబాద్ : రేపట్నుంచి జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ 2 లీకేజీ ఉదంతంపై సీఐడీ దర్యాప్తు పూర్తికానందున కౌన్సెలింగ్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

పోలీసుల లాఠీచార్జ్... యువకుడి ఆత్మహత్యాయత్నం

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్‌ కి నిరసనగా ఎర్రవల్లిలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని...స్వామి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానానికి పాల్పడ్డాడు. పోలీసుల అమానుష చర్యలు, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ...ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు చెప్పాడు. 

20:52 - July 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులపైకి కేసీఆర్‌ సర్కారు తుపాకులు ఎక్కుపెట్టింది. జాతీయ రహదారి దిగ్బంధం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసేందుకు రైతులు చేసిన ప్రయత్నాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు కేసీఆర్‌ సర్కారు ప్రయత్నించింది. తమ గోసను వినిపించేందుకు.. రైతులు ఆందోళన పథంలో సాగడంతో.. పోలీసులతో దౌర్జన్యానికి తెగబడింది. ముంపు గ్రామం ఎర్రవల్లిలో ఆందోళనకారులపై తొలుత విచక్షణ రహితంగా పోలీసులు లాఠీలను ఝళిపించారు. ఈ ఘటనలో మహిళలు సహా పలువురు గాయపడ్డారు. అయినా వెనుదిరగని ఆందోళనకారులు.. శాంతియుతంగానే దీక్షను కొనసాగించే ప్రయత్నం చేశారు. వారిపై పోలీసులు.. తుపాకులు ఎక్కుపెట్టారు. గాలిలో కాల్పులు జరిపారు. పోలీసుల దౌర్జన్యంలో మహిళలు, పిల్లలు సహా.. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. 
పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం
మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ తీరును ఖండించాయి. బలవంతంగా.. పోలీసుల అండతో...నిర్వాసితులను అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ... విపక్షాలు రేపు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. జిల్లా ప్రజలందరూ బంద్‌ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించారు. మంత్రి హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఎం డిమాండ్
చేసింది.

 

20:44 - July 24, 2016

విజయవాడ : పాలమూరు...రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కాంగ్రెస్‌ ఏపి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడలో డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం గోదావరి, క్రిష్ణా నదుల మీద తెలంగాణా రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించాలంటే ఆయా నదీ యాజమాన్యాల బోర్డుల సిఫారసు, కేంద్ర జలవనరుల కమీషన్ సిఫారసు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని అన్నారు. 

అగ్రిగోల్డ్ కేసుపై సీఎం చంద్రబాబు సమీక్ష

విజయవాడ : అగ్రిగోల్డ్ కేసుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ సాంబశివరావు, సీఐడీ చీఫ్ తిరుమల రావు రివ్యూకు హాజరయ్యారు. అగ్రిగోల్డ్ కేసు పురోగతిపై సీఐడీపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చూడాలన్నారు. మరోవైపు తుని ఘటనపై పూర్తిస్థాయి విచారణకు సీఎం ఆదేశించారు. 

20:38 - July 24, 2016

హైదరాబాద్ : ఫిలింనగర్‌ కల్చరల్ క్లబ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. వీరు పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆనంద్‌, అన్సూర్‌ షేక్‌గా గుర్తించారు. గాయపడిన మరో 12 మందిని అపోలో ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. నాసిరకమైన మెటిరీయల్‌తో స్లాబ్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

 

20:36 - July 24, 2016

హైదరాబాద్ : ఫిలింనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఘటనాస్థలంలో ధర్నా చేపట్టారు. అంతటితో ఆగకుండా ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లి.. భవనం అద్దాలు, ఫర్నిచన్‌ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విష్ణువర్థన్‌ సహా యువజన కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

 

20:34 - July 24, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి... సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పుష్కరాల్లో యాత్రికులకు అందించే సేవా కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అక్షయపాత్ర, టీటీడీ సహకారంతో... పుష్కర యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని బాబు సూచించారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచిత ఆహారం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించాలని... సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని విజయవాడ పౌరులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 

20:29 - July 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్‌ కి నిరసనగా ఎర్రవల్లిలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని...స్వామి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానానికి పాల్పడ్డాడు. పోలీసుల అమానుష చర్యలు, ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ...ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు చెప్పాడు. మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ తీరును ఖండించాయి. ప్రభుత్వం అనుచిత కార్యక్రమాలకు పాల్పడితే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయని విపక్ష నేతలు హెచ్చరించారు. 

 

20:12 - July 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులపైకి కేసీఆర్‌ సర్కారు తుపాకులు ఎక్కుపెట్టింది. జాతీయ రహదారి దిగ్బంధం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసేందుకు రైతులు చేసిన ప్రయత్నాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు కేసీఆర్‌ సర్కారు ప్రయత్నించింది. తమ గోసను వినిపించేందుకు.. రైతులు ఆందోళన పథంలో సాగడంతో.. పోలీసులతో దౌర్జన్యానికి తెగబడింది. ముంపు గ్రామం ఎర్రవల్లిలో ఆందోళనకారులపై తొలుత విచక్షణ రహితంగా పోలీసులు లాఠీలను ఝళిపించారు. ఈ ఘటనలో మహిళలు సహా పలువురు గాయపడ్డారు. అయినా వెనుదిరగని ఆందోళనకారులు.. శాంతియుతంగానే దీక్షను కొనసాగించే ప్రయత్నం చేశారు. వారిపై పోలీసులు.. తుపాకులు ఎక్కుపెట్టారు. గాలిలో కాల్పులు జరిపారు. పోలీసుల దౌర్జన్యంలో మహిళలు, పిల్లలు సహా.. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. 
పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం 
మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వ తీరును ఖండించాయి. బలవంతంగా.. పోలీసుల అండతో...నిర్వాసితులను అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ప్రభుత్వం అనుచిత కార్యక్రమాలకు పాల్పడితే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయని విపక్ష నేతలు హెచ్చరించారు. 

 

ఫిల్మ్ చాంబర్ లో ఫర్నిచర్ ధ్వంసం

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ ఫిల్మ్ చాంబర్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. భవనం కూలి ఇద్దరు చనిపోయినా కూడా క్లబ్ నిర్వహిస్తున్నారని విష్ణువర్ధన్, అనిల్ ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫిలింనగర్ ప్రమాద ఘటనాస్థలి వద్ద కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్ : ఫిలింనగర్ లో భవనం కూలిన ఘటనాస్థలి వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నకిలీ సర్టిఫికెట్లు, పేపర్ లీకేజీలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 

పోలీసుల లాఠీచార్జీని ఖండిస్తున్నాం : మల్లు భట్టి విక్రమార్క...

హైదరాబాద్ : పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఘటన చాలా బాధాకరమన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు కూడా తెలంగాణ ప్రజలే..కదా అన్నారు. లాఠీచార్జీ, కాల్పుల ఘటనకు పాల్పడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతలా వ్యవహరిస్తుందని చెప్పారు. 

 

పోలీసుల లాఠీచార్జ్ దుర్మార్గం : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : ఎర్రవెల్లి గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసుల దుశ్చర్యకు పాల్పడడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. మహిళలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కాకుండా..

పోలీసుల లాఠీచార్జ్ ను త్రీవంగా ఖండిస్తున్నా : జస్టిస్ చంద్రకుమార్

హైదరాబాద్ : భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ ను త్రీవంగా ఖండిస్తున్నట్లు జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. ప్రజల కోపం, ఊరేగింపుకు కారణం ఏంటని ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఎర్రవల్లిలో 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే తలంపుతో ఉందని తెలిపారు. ఈ ఘటన... ప్రభుత్వ దమననీతిని తెలియచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలానే వ్యహరిస్తే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. 

 

ఎర్రవెల్లి గ్రామస్తులపై లాఠీచార్జీ దుర్మార్గం : బి.వెంకట్

హైదరాబాద్ : ఎర్రవెల్లి గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జీ చాలా దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ అన్నారు. వేములఘాట్ లో జరిగిన ఘటన కూడా దారుణమని తెలిపారు. హరీష్ రావు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. టీసర్కార్ అహంభావంతో వ్యవరిస్తుందని...  ఘటనకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, సర్కార్ భాద్యత వహించాలన్నారు. ప్రజల శవాలపై ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వ భావిస్తుందని మండిపడ్డారు. ప్రజలకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మహా ధర్నా నిర్వహిస్తున్నామని ఈ కార్యాక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పాల్గొననున్నట్లు తెలిపారు.

భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ దుర్మార్గం : తమ్మినేని

హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. లాఠీచార్జ్ ను ఖండిస్తున్నాం. సమస్యలను శాంతియుతంగా విన్నవించుకుంటుంటే లాఠీచార్జీ చేయడం దారుణం. టీసర్కార్ చెప్పేదొకటి చేసేది మరోటిగా ఉంది. ఒకవేల భూములు తీసుకోవడం అనివార్యమైతే 2013 చట్టం అమలు చేయాలని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు అడుగుతున్నారు. వారి సమస్యలు చెబుతుంటే.... రైతులపై కాల్పులు జరపడం ఏంటీ..? ప్రభుత్వం 123 జీవోను అమలు చేయాలనే తలంపుతో ఉంది. లాఠీచార్జీ ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి.

కంటైనర్, బస్సు ఢీ.. 8 మంది మృతి

తమిళనాడు : కృష్ణగిరి...హోసూరు మధ్య కంటైనర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఫిలింనగర్ ప్రమాద ఘటన దురదృష్టకరం : మంత్రి తలసాని

హైదరాబాద్ : ఫిలింనగర్ ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫిలింనగర్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని మరో ఏడుగురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ను ఖండిస్తున్నాం : ప్రతాపరెడ్డి

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతాపరెడ్డి అన్నారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకే లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. రిజర్వాయర్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటో మంత్రి హరీష్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు నిర్వాసితులకు వివరించలేదన్నారు. దొంగచాటుగా భూముల రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని విమర్శించారు. 

 

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...

మెదక్ : మల్లన్నసాగర్ ముంపు గ్రామాలపై కేసీఆర్ సర్కార్ తుపాకులు ఎక్కుపెట్టింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు నిర్బంధకాండ ప్రదర్శించారు. గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఎర్రవెల్లి గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మహిళలు, పిల్లలకు గాయాలు అయ్యాయి.

16:45 - July 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్ ముంపు గ్రామాలపై కేసీఆర్ సర్కార్ తుపాకులు ఎక్కుపెట్టింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు నిర్బంధకాండ ప్రదర్శించారు. గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఎర్రవెల్లి గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మహిళలు, పిల్లలకు గాయాలు అయ్యాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వబోమని ముంపుగ్రామం ఎర్రవల్లి ప్రజలు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి దిగ్బంధానికి యత్నించారు. ఈనేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల లాఠీచార్జ్ లో మహిళలు, పిల్లలకు గాయాలు అయ్యాయి. రైతు సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్ కు త్రీవ గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం 20 మందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..
'మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం దుర్మార్గం. లాఠీచార్జ్ ను ఖండిస్తున్నాం. సమస్యలను శాంతియుతంగా విన్నవించుకుంటుంటే లాఠీచార్జీ చేయడం దారుణం. టీసర్కార్ చెప్పేదొకటి చేసేది మరోటిగా ఉంది. ఒకవేల భూములు తీసుకోవడం అనివార్యమైతే 2013 చట్టం అమలు చేయాలని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు అడుగుతున్నారు. వారి సమస్యలు చెబుతుంటే.... రైతులపై కాల్పులు జరపడం ఏంటీ..? ప్రభుత్వం 123 జీవోను అమలు చేయాలనే తలంపుతో ఉంది. లాఠీచార్జీ ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి. కేసీఆర్ 2013 చట్టం అమలు చేయడంతో అభ్యంతరం లేదంటాడు... మంత్రి హరీష్ రావు జీవో 123 అమలు చేస్తామంటాడు.. మామా అల్లుళ్ల మధ్య ఏమైనా వారి ఇంట్లో చూసుకోవాలి. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదు' అని పేర్కొన్నారు. 
సీపీఎం నేత బి.వెంకట్...
'ఎర్రవెల్లి గ్రామాస్తులపై పోలీసుల లాఠీచార్జీ  చాలా దుర్మార్గం. వేములఘాట్ లో జరిగిన ఘటన కూడా దుర్మార్గం. హరీష్ రావు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడు. టీసర్కార్ అహంభావంతో వ్యవరిస్తుంది. ఈ ఘటనకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, సర్కార్ భాద్యత వహించాలి. ప్రజల శవాలపై ప్రాజెక్టు కట్టాలని ప్రభుత్వ భావిస్తుంది. ప్రజలకు మద్దతుగా నిలుస్తాం. మహా ధర్నా నిర్వహిస్తున్నాం. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పాల్గొననున్నారు. మల్లన్నసాగర్ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడతాం' అని చెప్పారు. 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి..
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీ, కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే... కాల్చి చంపుతారా...? ఘటనకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఏదిఏమైన 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాంచాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ప్రభుత్వం అప్రజాస్వామిక, అహంకారపూరితంగా వ్యవహరిస్తుంది. మొండివైఖరితో వెలితే అది అసాధ్యం. ప్రజల అభిమతం మేరకు నడుచుకోవాలి.   
జస్టిస్ చంద్రకుమార్.. 
'పోలీసుల లాఠీచార్జ్ ను త్రీవంగా ఖండిస్తున్నాను. ప్రజల కోపం, ఊరేగింపుకు కారణం ఏంటని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎర్రవల్లిలో 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే తలంపుతో ఉంది. ఘటన ప్రభుత్వ దమననీతిని తెలియచేస్తుంది. ప్రభుత్వం ఇలానే వ్యహరిస్తే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని' అన్నారు. 
టీడీపీ నేత రేవంత్ రెడ్డి..
'పోలీసుల లాఠీచార్జ్ దుర్మార్గం. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. పోలీసుల దుశ్చర్యకు పాల్పడడం దారుణం. 
మహిళలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కాకుండా.. పోలీసులు, తుపాకీ తూటాల చేత పరిపాలన చేయాలనుకుంటున్నారు. కేసీఆర్, హరీశ్ రావు తన ఉక్కుపాదంలో పాలన ఉండాలని భావిస్తున్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ప్రాజెక్టులకు ఎవరు అడ్డుకాదు.....ఒకవేల భూములు ఖాళీ చేయిస్తే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రైతాంగంపై తుపాకీ ఎక్కుపెట్టిన వారు బతికి బట్టకట్టలేదు. కేసీఆర్ అడ్డమైన స్లోగన్లు ఇస్తున్నారు. పోలీసుల లాఠీచార్జీలు, కాల్పులతో రైతులు భూములు తీసుకోలేరు. రైతులకు అండగా ఉంటామని' చెప్పారు. 
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క...
'పోలీసుల లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఘటన చాలా బాధాకరం. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు కూడా తెలంగాణ ప్రజలే..కదా అన్నారు. లాఠీచార్జీ, కాల్పులు ఘటనకు పాల్పడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నియంతలా వ్యవహరిస్తుందని' చెప్పారు. 

ఫిలింనగర్ ప్రమాదస్థలాన్ని పరిశీలించిన మేయర్ రామ్మోహన్

హైదరాబాద్ : ఫిలింనగర్ ప్రమాద స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.2లక్ష ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

తిరుపతి రైల్వే స్టేషన్ లో హైస్పీడ్ వైఫై సదుపాయం

చిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్ లో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. 

నెల్లూరులో కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్య పర్యటన

నెల్లూరు : జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు పర్యటించారు. సౌత్ రైల్వే స్టేషన్ లో పాదచారుల వంతెనకు శంకుస్థాపన చేశారు. రిమోట్ ద్వారా గూడూరు రైల్వే స్టేషన్ యార్డు ఆధునీకరణ చేశారు. 

 

కృష్ణా పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి : కృష్ణా పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పుష్కరాల్లో యాత్రికులకు అందించే సేవా కార్యక్రమాలపై చర్చించారు. అక్షయ పాత్ర, టీటీడీ సహకారంతో పుష్కర యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు ఉచిత ఆహారం అందించేందుకు ముందుకు రావాలని అన్నారు.

15:58 - July 24, 2016

మెదక్ : మల్లన్నసాగర్ గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారి దిగ్బంధానికి ముంపు గ్రామాల ప్రజలు ప్రయత్నించారు. గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వేములఘాట్ లో యాభై రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు రిలే దీక్షలు చేస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

మహిళలపై లాఠీచార్జీని ఖండించిన సీపీఎం నేత ఏ.మల్లేష్

మెదక్ : వేములఘాట్ లో మహిళలపై లాఠీచార్జీని మెదక్ జిల్లా సీపీఎం కార్యదర్శి ఏ.మల్లేష్ ఖండించారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం దారుణమన్నారు.

15:23 - July 24, 2016

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. 14 ఫిల్లర్లు నేలమట్టమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన 10 కూలీలను అపోలో ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో 20 మంది ఉంటారని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
మృతులు... ఆనంద్, అంచూర్ సింగ్ 
ఫిల్మ్‌నగర్‌లో జరిగిన భవనం కూలిన ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పేర్లు ఆనంద్‌ (24), అంచూర్ సింగ్‌(30)గా అధికారులు గుర్తించారు. 12 మంది కార్మికులకు అపోలో ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు. భవన నిర్మాణ స్థలం కోర్టు వివాదంలో ఉందని సమాచారం. పోలీసులు, అధికారులు, ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. బాధితుల్లో కొందరు పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా తెలుస్తోంది. 

 

వేములఘాట్ లో ఉద్రిక్తత

మెదక్ : మల్లన్నసాగర్ ముంపుగ్రామం వేములఘాట్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని 50 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహంతో రాజీవ్ రహదారి ముట్టడికి గ్రామస్తులు బయల్దేరారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీలో 20 మందికి గాయాలయ్యాయి. 

ఫిల్మ్ నగర్ లో కూలిన నిర్మాణ భవనం.... ఇద్దరి మృతి

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. భవనం కూలిన ఘటనలో ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆనంద్, ఆంచూర్ సింగ్ లుగా గుర్తించారు. 10 పైగా ఫిల్లర్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలాన్ని జీహెచ్ ఎంసీ మేయర్ రామ్మోహన్, కిషన్ రెడ్డి పరిశీలించారు.  

 

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై లాఠీచార్జీని ఖండించిన సీపీఎం

హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఇది అప్రజాస్వామిక చర్య అని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ అభివర్ణించారు. న్యాయం అడిగిన రైతులపై లాఠీచార్జీ చేయడం దారుణమన్నారు. 

ఫిల్మ్ నగర్..శిథిలాల కింద పది మంది ?

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లోని కల్చరల్ సెంటర్ కు సమీపంలో కూలిన భవంతి శిథిలాల కింద పది మంది వరకు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముగ్గురిని స్థానికులు కాపాడినట్లు తెలుస్తోంది. 

13:14 - July 24, 2016

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. నిర్మాణంలో ఉన్న భవంతి కుప్పకూలింది. కల్చరల్ సెంటర్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద పలువురు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 20 మంది కూలీలకు గాయాలయ్యాయని..ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరో పది మంది వరకు ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు నిర్దిష్టంగా ప్రకటన రావడం లేదు. భవన యజమాని సైతం ఘటనాస్థలికి రాలేదు. దీనితో భవన యజమాని ఎవరు ? ఇతరత్రా వివరాలు తెలియరాలేదు. 

కల్చరల్ సెంటర్ కు ఆనుకుని..
కల్చరల్ సెంటర్ కు దగ్గర ఓ భవనం నిర్మాణం అవుతోంది. శనివారం రాత్రి శ్లాబ్ నిర్మాణం వేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కొంతమంది కూలీలు పని చేసేందుకు వచ్చారు. 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. 14 ఫిల్లర్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. పని చేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై కూలీలను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది కూలీలకు గాయాలు కావడంతో వీరిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిర్మాణం విషయంలో నాణ్యత లోపించడం వల్లే భవనం కుప్పకూలిందని తెలుస్తోంది. భవనానికి సంబంధించిన వారు అందుబాటులోకి లేకపోవడంతో ఎలాంటి సమాచారం తెలియడం లేదు.
ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు ? కూలిన సమయంలో ఎంత మంది కూలీలు ఉన్నారు ? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు ? అనే వివరాలు తెలియరావడం లేదు. కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

ఫిల్మ్ నగర్ లో కుప్పకూలిన నిర్మాణ భవంతి..

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. శిథిలాల కింద పలువురు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రెండు మృత దేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

12:44 - July 24, 2016

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మళ్లీ డబ్బింగ్ సినిమాల జోరు మొదలైంది. కంటెంట్స్ బాగుండడంతో కనెక్ట్ అయ్యే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఆసక్తి కరమైన కథాకథనాలతో డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం రిలీజైన కొన్ని డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ లో మంచి లాభాలు గడించాయి.
ఈ సంవత్సరం రిలీజైన డబ్బింగ్ సినిమాల్లో ప్రత్యేకమైన చిత్రం 24. టై ట్రావెల్ కథతో విక్రమ్ కుమార్ అద్భుతంగా మలిచిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. తమిళ్ లో కన్నా తెలుగు లోనే ఎక్కువగా ఈ సినిమాకి పట్టం గట్టారు ప్రేక్షకులు.

'24'...
'24'లాంటి ఊహజనిత కథతో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేశాడు దర్శకుడు. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత కన్విన్సింగ్ గా చెప్పారన్నది ఇక్కడ కీలకమైన విషయం. ఇందులో విక్రమ్ డిస్టింక్షన్ లో పాసయ్యాడు. ఆడియన్స్ వివిధ రకాల ఎమోషన్లను ఫీలయ్యేలా చేయడంలో అతను విజయవంతమయ్యాడు. '24'లో కీలకమైన మూడు పాత్రలు మనకు మూడు రకాల భావోద్వేగాల్ని కలిగిస్తాయి. సూర్య లాంటి గొప్ప నటుడు విక్రమ్ చేతికి చిక్కడంతో అతడి పని తేలికైంది. సృజనాత్మకతకు హద్దులేమీ పెట్టుకోకుండా తన కలల ప్రపంచంలో ప్రేక్షకుల్ని విహరింపజేశాడతను. డాక్టర్ శివకుమార్ ఓ శాస్త్రవేత్త. తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. కాలంలో ప్రయాణం చేసే గడియారాన్ని తయారు చేస్తాడు. ఐతే దీని గురించి ముందే తెలుసుకున్న అతడి కవల సోదరుడు ఆత్రేయ తన సోదరుడి మీద దాడి చేస్తాడు. వాచ్ కోసం తన శివకుమార్ తో పాటు అతడి భార్య ప్రియ ను కూడా చంపేస్తాడు. ఐతే శివకుమార్ తాను చనిపోతూ పసివాడైన తన కొడుకు మణిని ఆ వాచ్ ను ఓ అమ్మాయికి అప్పగిస్తాడు. తనను కాపాడిన అమ్మాయినే అమ్మగా భావించి తన దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. అతడికి ఆత్రేయకు మణి దగ్గర వాచ్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆ వాచ్ కోసం ఆత్రేయ-మణి మధ్య పోరు మొదలవుతుంది. చివరికి ఎవరు గెలిచారన్నది మిగతా కథ. సూర్య ఎంతటి అరుదైన.. గొప్ప నటుడో చెప్పడానికి '24' మరో రుజువు. మూడు పాత్రల్లోనూ అద్భుతంగా నటించాడతను. అతను పడ్డ కష్టమంతా తెరమీద కనిపిస్తుంది. శివకుమార్ పాత్రతో అమాయకత్వాన్ని.. ఆత్రేయ పాత్రతో క్రూరత్వాన్ని.. మణి పాత్రతో చిలిపితనాన్ని చక్కగా పండించాడతను. సూర్య నటనా కౌశలాన్ని తెలిపే చాలా సన్నివేశాలు '24'లో ఉన్నాయి. సమంత ఎంత క్యూట్ గా కనిపించిందో అంత క్యూట్ గా నటించింది. కీలకమైన పాత్రలో అజయ్ కూడా రాణించాడు. నిత్యా మీనన్ కనిపించేది కొద్దిసేపే అయినా తన ప్రత్యేకతను చాటుకుంది. అందుకే ఈ సినిమాని డబ్బింగ్ సినిమాఅని చూడకుండా జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ఫీల్ ను బాగా అనుభవించారు.

విశాల్ రాయుడు...
తమిళ్ మాస్ హీరో విశాల్ , ఊరమాస్ అవతారంలో నటించిన యాక్షన్, సెటిమెంట్ కలగలిసిన చిత్రం రాయుడు. ఈ సినిమా మాస్ జానానికి బాగా నచ్చడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇక్కడ కూడా మంచి మార్కులేయించుకుంది. తమిళ స్టార్ హీరో విశాల్ రాయుడు తో అందరికీ షాకిచ్చాడు. అంత‌కు ముందు వారం భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో విశాల్ త‌న రాయుడును భారీగా థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చాడు. పూర్తిగా మాస్ ప్రేక్షకులనే టార్గెట్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా, తెలుగులోనూ మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటూ దూసుకుపోయింది. తెలుగులో విశాల్‌కు పందెంకోడి సినిమా త‌ర్వాత ఆ స్థాయిలో వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రాయుడు నిలిచింది. రాయుడు తొలి వారం రోజుల్లో ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో కలుపుకొని 5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. రెండో వారం కూడా బీ, సీ సెంటర్లలో దుమ్మురేపేసింది. 200 థియేటర్స్ లో నిలకడగా కలెక్షన్స్ తెచ్చుకుని మాస్ చిత్రాల సత్తా ఏంటో మరోసారి తెలియచెప్పింది. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు. విశాల్ సరసన శ్రీ దివ్య హీరోయిన్‌గా నటించారు. రాయుడు తెలుగు వెర్ష‌న్స్‌లో కూడా విశాల్‌, శ్రీదివ్య చ‌క్క‌గా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. టోట‌ల్‌గా రూ.5 కోట్ల షేర్ సాధించిన విశాల్ టాలీవుడ్ హీరోల‌కు పెద్ద షాకే ఇచ్చాడ‌న్న టాక్ వినిపిస్తోంది.  తెలుగు అగ్ర‌హీరోలు న‌టించిన సినిమాలు త‌మిళంలో రెండు మూడు రోజులు కూడా థియేట‌ర్ల‌లో నిల‌బ‌డేందుకు క‌ష్ట‌ప‌డుతుంటూ విశాల్ మాత్రం త‌న సినిమాను ఇక్క‌డ చ‌క్క‌గా ప్ర‌మోట్ చేసుకుని, ఇక్క‌డ కూడా మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకుంటున్నాడు. నాయనమ్మ , మనవడు సెంటిమెంట్ తో ఈ సినిమా అందరినీ భలే ఆకట్టుకుంది. తమిళ్ వాసన కొట్టినా మాస్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు వారు ఈ సినిమాకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇంత ఊరమాస్ గెటప్ లో విశాల్ ఎప్పుడూ కనిపించలేదు. అందుకే ఈ సినిమాలో విశాల్ జనానికి కొంచెం కొత్తదనాన్ని అందించాడు.

బిచ్చగాడు..
ప్ర‌స్తుత ట్రెండ్‌లో ఏ సినిమా అయినా కొద్ది పాటి వ‌సూళ్లు సాధిస్తేనే హిట్ అనే ప‌రిస్థితి వ‌చ్చింది. అదే డ‌బ్బింగ్ సినిమా అయితే.. కొన్న మేర‌కు డ‌బ్బులు వస్తే చాల‌నుకుంటున్నారు. అయితే, ఇటీవ‌ల వ‌చ్చిన త‌మిళ డ‌బ్బింగ్ సినిమా బిచ్చ‌గాడు, పేరుకు రోత‌గా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌సూళ్ల‌లో ఇరగదీసేసింది. టైటిల్ ను చూస్తే తెలుగు జనాలు ఈ సినిమా ఆడే థియేటర్ల వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరని అనుకున్న దశ నుంచి బిచ్చగాడి ఫీట్లను చూసి ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. మూడు వందలకు పైగా థియేటర్ల కు విస్తరించింది బిచ్చగాడి సామ్రాజ్యం. సింగిల్ డిజిట్ తో మొదలుపెట్టిన బిచ్చ‌గాడు సినిమా వందల థియేటర్ల లో హల్ చల్ చేసాడు. ఇప్పటికీ కొన్నిచోట్ల బిచ్చగాడు ఇంకా నిలకడగా ఉన్నాడు. ఇప్పటికే నిర్మాత పెట్టుబడికి పది రెట్ల లాభాలను సంపాదించి పెట్టింది ఈ సినిమా. దాదాపు ఇరవై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని భోగట్టా. అయితే ఇంతటితో బిచ్చగాడి కథ అయిపోలేదు.. పెద్ద హీరోల సినిమాలేవీ ఫీల్డ్ లో లేని తరుణంలో, ఈ మధ్య విడుదల అయిన చిన్న సినిమాలు కూడా ఏవీ పాజిటివ్ టాక్ ను పొందని నేపథ్యంలో బిచ్చగాడు బాక్సాఫీసును సోలోగా ఏలేసాడు. రాను రాను బిచ్చగాడు మరిన్ని థియేటర్లకు విస్తరించి మూడువందలపై మార్కును రీచ్ అయ్యాడు. విజయ్ ఆంటోని తెలుగులో నకిలి, డాక్టర్ సలీం చిత్రాలతో మాత్రమే తెలుగు వారికి పరిచయం. అంతకు ముందు శంభోశివశంభో, మహాత్మ లాంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగువారికి పరిచయం మాత్రమే ఉంది. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని టాలీవుడ్ కి క్రేజీ హీరో అయిపోయాడు. అతడి తర్వాత సినిమా సైతాన్ తెలుగు లో కూడా అదే పేరుతో విడుదలవడం చూస్తుంటే అతడి ప్రభావం టాలీవుడ్ పై ఎంతబలంగా పడిందో అర్ధమవుతుంది. ఇంకా అతడు నటించిన మరో సినిమా ఇండియా పాకిస్తాన్ ను కూడా తెలుగు లోకి అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో.. కంటెంట్ ముఖ్యంగానీ ఆ సినిమా డబ్బింగ్ అయితే ఏంటి? స్ట్రైట్ సినిమా అయితే ఏంటి?

మేము..
'మేము' కథ, కథనాలు దాదాపుగా తారే జమీన్ పర్ తరహాలోనే సాగుతాయి. ఐతే పోలికలు ఉన్నా.. అమీర్ సినిమాలాగే ఇది కూడా చాలా మంచి ప్రయత్నం. చూస్తున్నంతసేపూ ఇది మన కథ లాగే అనిపిస్తుంది. ఇందులోని పాత్రలతో కనెక్టవుతాం. కొన్ని చోట్ల అసహనానికి గురవుతాం.. కొన్నిచోట్ల భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటాం.. కొన్ని చోట్ల సంతోషంతో నవ్వుకుంటాం.. ఇందులోని సూర్య-పాండిరాజ్ కలిసి చెప్పాలనుకున్న విషయాలు యూనివర్శల్. ఇది బేసిగ్గా తమిళ సినిమా అయినా.. తమిళ నటులున్నా.. కొన్ని చోట్ల తమిళ వాసనలు కొట్టినా.. ఇందులో చెప్పాలనుకున్న అంశాలతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.. మార్కులే ప్రామాణికంగా చదువులు ఎలా సాగుతున్నాయో.. పిల్లల మనస్తత్వాల్ని.. వారి అభిరుచుల్ని అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు తమ ఆలోచనల్ని వారిపై రుద్డడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో.. ఈ క్రమంలో పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో.. పిల్లల విషయంలో తల్లిదండ్రుల సంఘర్షణ ఎలా ఉంటోందో.. అర్థవంతంగా చెప్పారు ‘మేము’లో. అలాగని ఇదేమీ డాక్యుమెంటరీ తరహాలో ఉండదు. చాలా విషయాల్ని లెక్చర్ లాగా కాకుండా.. వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం జరిగింది. అందులో సక్సెస్ సాధించింది మేము. ఇందులో సూర్య పాత్ర సగం సినిమా వరకే ఉన్నా పూర్తిగా ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్లుగా అద్భుతంగా నటించాడతను. అమలా పాల్ కూడా చక్కగా నటించింది. ఐతే సినిమాకు ప్రధాన ఆకర్షణ మాత్రం ప్రధాన పాత్రలు పోషించిన పిల్లలు నిశేష్-వైష్ణవిలే. ఆ పిల్లలిద్దరూ నవ్విస్తారు. ఏడిపిస్తారు. థియేటర్ నుంచి వచ్చాక కూడా గుర్తుండిపోతారు. తల్లిదండ్రుల పాత్రల్లో కార్తీక్ - బిందుమాధవి.. రాందాస్-విద్య కూడా బాగా చేశారు. టోటల్ గా మేము డబ్బింగ్ సినిమా అయినా ఎక్కడా కూడా జనానికి బోర్ కొట్టించదు. నిజానికి ఇది తల్లిదండ్రలకు ఒక ఎడ్యుకేషన్ లాంటి సినిమా. ఈ సినిమా నిలకడగా కలెక్షన్స్ తెచ్చుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది.

కబాలి..
సూపర్ స్టార్ రజినీ కాంత్ మాఫియా డాన్ గా నటించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ కబాలి. రిలీజ్ కు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మరి లాంగ్ స్టాండ్ లో ఎలా నిలబడుతుందో ఇంకెంత కలెక్షన్స్ కురిపిస్తుందో. ఇండియాలో మాస్ అనే పదానికి అసలైన అర్థం ఏంటో చెప్పిన హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకడు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రజినీ సినిమా అంటే మాస్ థియేటర్లకు పోటెత్తుతారు. కబాలి నిజంగా మాస్ జనాన్ని మాత్రం నిరుత్సాహపరచదు. ఈ సినిమాలో రజినీకి, పాత రజినీకి చాలా తేడా కనిపించింది. ఆయన నటన భిన్నంగా ఉండడమే కాకుండా మాస్ జనాన్ని ఆకట్టుకనేలా కనిపిస్తోంది. ఆయన సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే మేనరిజమ్స్ కబాలి లో ఉండవు. కానీ సూపర్ స్టార్ అద్భుత అభినయం చూపించడానికి అవసరమైన అద్భుతమైన సందర్భాలు ఈ కథలో వున్నాయి. కోపం.. సంతోషం.. బాధ... ఇలా అన్ని రకాల భావోద్వేగాలను ఆయన పండించాడు. వాటితో ప్రేక్షకులకు ఈజీగా కనెక్టవుతారు. దాదాపు 220 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన కబాలి, బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ వారం కలెక్షన్స్ రిపోర్ట్ వస్తే కబాలి ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. సో.. మొత్తానికి కబాలి మూవీ డబ్బింగ్ సినిమాగా కాకుండా స్ట్రైట్ మూవీగానే జనాన్ని ఆకట్టుకుంటోంది. సో... కంటెంట్ బాగుంటే ఏ భాషలో చిత్రాన్నైనా బ్రహ్మాండంగా ఆదరిస్తారని ఈ డబ్బింగ్ సినిమాలన్నీ మరోసారి తెలియచెప్పాయి. 

విమానం కోసం కొనసాగుతున్న గాలింపు..

చెన్నై : అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కోసం మూడో రోజు అదివారం గాలింపు కొనసాగుతోంది. జలాంతర్గాములు రంగంలోకి దిగిన ఫలితం కనిపించలేదు.

12:36 - July 24, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సుమతి టెన్ టివితో మాట్లాడారు. కంట్రోల్ రూం లో చూసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, ట్రేస్ చేయడం జరిగిందన్నారు. తమ పనితీరు తెలుసుకొనేందుకు ప్రజల నుండి సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరింత మెరుగైన సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:33 - July 24, 2016

హైదరాబాద్ : రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జాయిని మహాంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి.అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. . తెల్లవారుజామున 2గంటల నుంచే బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. సీంఎ కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు తలసాని, పద్మారావుతో పాటు హరీష్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, నాయినిలు అమ్మవారిని దర్శించుకున్నారు.మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెల్లవారుజామున 4గంటలకు తొలి బోనం సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు టెన్ టివితో మాట్లాడారు. వీఐపీలకు పెద్దపీఠ వేస్తున్నారని ధ్వజమెత్తారు. గంటల గంట పాటు క్యూలో నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

12:24 - July 24, 2016

విశాఖపట్టణం : వేపగుంట సమీపంలోని కృష్ణరాయపురంలో తనూజ అనే బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. బాలికది ఆత్మహత్య కాదని..హత్యేనని పలువురు పేర్కొంటున్నారు. ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారని మహిళా సంఘ నేతలు పేర్కొంటున్నారు. శనివారం రాత్రి ఇంట్లో నుండి తనూజ అలిగి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో విగత జీవిగా కనిపించింది. దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై ఐద్వా నేతలు టెన్ టివితో మాట్లాడారు. తనూజను ముమ్మాటికి హత్యేనని స్పష్టం చేశారు. అత్యాచారం చేసి చంపేశారని పేర్కొన్నారు. అపార్ట్ మెంట్ నుండి కిందపడితే రక్తపు మడుగుల్లో పడి ఉండేదని, కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. తనూజను చూడటానికి భయకరంగా ఉందని, అబ్బాయి ఏడిపిస్తున్నాడని తెలిపినా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ఇలాంటి క్రూరమైన మృగాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు.
తనూజ కనిపించడం లేదని తల్లిదండ్రులు శనివారం సాయంత్రం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

  • ఆదివారం ఉదయం ఇంటి పక్కనే కాల్వలో తనూజ విగతజీవిగా కనిపించింది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
  • రెండు టీంలు రంగంలోకి దిగి వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
  • ఎవరో ఏడిపిస్తున్నారని తెలుస్తోందని, వాడిని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని మహిళా సంఘం నేతలు పేర్కొంటున్నారు. 
12:15 - July 24, 2016

ఢిల్లీ : ఒలింపిక్ క్రీడలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 121 క్రీడాకారులతో భారత బృందం రెడీ అయ్యింది. ఇప్పటికే పలువురు క్రీడాకారులు రియోకు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే భారత్ కు ఆరంభంలోనే తొలి షాక్ తగిలింది. కుస్తీ పోటీలో నర్సింగ్ యాదవ్ వైఫల్యాన్ని నాడా ఖరారు చేసింది. డోప్ టెస్టులో నర్సింగ్ యాదవ్ విఫలం కావడంతో ఎంపికను నిలిపివేశారు. 2015 ప్రపంచ కుస్తీ పోటీల్లో నర్సింగ్ యాదవ్ క్యాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈసారి పతకం తీసుకొస్తారని అందరూ ఆశించారు. సుశీల్ కుమార్ ను కాదని ఇతడిని భారత ఒలింపిక్ సంఘం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
భారత క్రీడాప్రాధికార సంస్థ సాయ్ ఆధ్వర్యంలో ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లందరికీ నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలు వెల్లడయ్యాయి. నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. రెండోసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించగా, అప్పుడు కూడా అవే ఫలితాలు వచ్చాయి. ఒలింపిక్స్ కుస్తీ క్రీడాంశంలో 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ పోటీ పడాల్సివుంది. నర్సింగ్ యాదవ్ రియో ప్రయాణం దాదాపు నిలిచినట్లేనని పరిశీలకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

మోడీని కలిసిన అరుణాచల్ సీఎం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అరుణచాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ కలిశారు. ఈ సందర్భంగా మోడీని ఆయన సత్కరించారు. 

ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అనుచరుల ఆందోళన..

మహబూబ్ నగర్ : సింబయాసిస్ వర్సిటీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అనుచరులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేను వేదికపైకి పిలవకుండా అవమానించరంటూ వారు ఆందోళన చేశారు. కార్యక్రమం నుండి ఎమ్మెల్యే, అతని అనచరులు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేను బుజ్జగించేప్రయత్నం చేస్తున్నారు. 

వేముల ఘాట్ లో ఉద్రిక్తత..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేముల ఘాట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2013 చట్ట ప్రకారమే భూ నిర్వాసితులకు పరిహారం అందచేయాలంటూ గత 50 రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహంతో రాజీవ్ రహదారి ముట్టడికి గ్రామస్తులు బయలుదేరారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. 

వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాస..

వరంగల్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. కోరం లేదని సమావేశాన్ని జెడ్పీ ఛైర్మన్ పద్మ ప్రారంభించలేదు. అందుబాటులో ఉండి ఎవరూ సమావేశానికి రాలేదని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సమావేశం నుండి మధ్యలోనే జెడ్పీ ఛైర్మన్ వెళ్లిపోయారు. 

రియో ఒలింపిక్స్..భారత్ కు షాక్..

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ మందు భారత్ కు షాక్ తగిలింది. డోప్ టెస్టులో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ విఫలమయ్యారు. సుశీల్ కుమార్ స్థానంలో రియోకు నర్సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే. 

మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్న జైట్లీ..

మహబూబ్ నగర్ : జిల్లాలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పర్యటిస్తున్నారు. కొత్తూరు (మం) మామిడిపల్లిలో సింబయాసిస్ యూనివర్సిటీని జైట్లీ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్, ఎంపీ జితేందర్ లు పాల్గొన్నారు. 

ఊట్కూరులో పాదయాత్ర..

మహబూబ్ నగర్ : ఊట్కూరు నుండి మూడో రోజు జలసాధన సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. నారాయణపేట్ - కొడంగల్ ఎత్తిపోతలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. 

11:33 - July 24, 2016

రాశుల ప్రకారం మొక్కలు...
తెలంగాణ రాష్ట్రంలో హరితహారం జోరుగా కొనసాగుతోంది. రాశుల ప్రకారం మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజస్తాన్ లో రత్నాఘర్ లో ఉన్న ఓ 60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కింది. ఎనిమిది గంటల పాటు కష్టపడి ఎద్దును కిందకు దించారు. ఓ ఐఐటీ స్నాతకోత్సవంలో ఖద్దర్ అంగవస్త్రం వేసుకోవాలని చెప్పారంట. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద సమోసా తయారు చేశారు. గోరఖ్ పూర్ లో 90 కిలోల నూనె, 200 కిలోల ఆలుగడ్డలు ఉపయోగించి 330 కిలోల సమోసాను తయారు చేశారు. 

వివాదంలో చిక్కుకుంటున్న సల్లూ భాయ్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తరచూ ఏదో ఒక వివాదం చిక్కుకుంటున్నాడు. సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రణవీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఆపాలని సల్మాన్ ఖాన్ హల్ చల్ చేశాడు.

సీఎం కేసీఆర్ నెంబర్ వన్...
రాష్ట్రాల్లో సీఎంలు ఎలా పని చేస్తున్నారు ? తెలుసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుకుని ఓ సీక్రెట్ సర్వే నిర్వహించారంట. అంతేగాకుండా ర్యాంకులు ఇవ్వాలని ప్రధాని మోడీ చెప్పారంట. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1, ఏపీ సీఎం బాబు 13వ స్థానంలో నిలిచారంట. సీక్రెట్ సర్వే అనుకుంటే ఎందుకు లీక్ చేశారు ? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు ఊరికే దీనని అలా క్రియేట్ చేశారని చివరకు తేలిదంట.

నూతన జంట ఆదర్శం..
ఇటీవలే వివాహాన్ని ఓ జంట వినూత్నంగా నిర్వహించారు. ఎలాంటి ఖర్చులు..ఆడంబరాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కయ్యే ఖర్చును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందించారు. అంతేగాక ల్రైబరీలకు పలు పుస్తకాలు అందించారు. ఈ విషయాల కోసం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

11:17 - July 24, 2016

హరితహారం జాతకాలు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. అందరికీ ఉపాయం చెప్పాడంట. రాశి వరకు చెట్లు నాటితే వారికి మంచి జరుగుతుందన్నారు. ఏ రాశి వారు ఏ చెట్లు నాటాలో తెలుసుకొనే విధంగా 4200 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన సర్వేల్లో ఏపీ ముఖ్యమంత్రి 13వ స్థానంలో ఉంటే కేసీఆర్ నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా వచ్చేశారు.

మిద్దెనెక్కిన ఎద్దు...
రాజస్తాన్ లో రత్నాఘర్ లో ఉన్న ఓ 60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కింది. పోలీసులు కూడా నమ్మ లేదంట. ఫొటోలు, వీడియోలు చూసిన తరువాత పోలీసులు అక్కడకు చేరుకుని ఎద్దును దింపేందుకు ప్రయత్నం చేశారు. ఎలా ఎక్కిందో ఎవరూ చూడలేదు కాని ఎక్కిన దానిని చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. ఎనిమిది గంటల పాటు కష్టపడి ఎద్దును కిందకు దించారు.

ఐఐటి లో ఖద్దర్..
ఓ ఐఐటీ స్నాతకోత్సవంలో ఖద్దర్ అంగవస్త్రం వేసుకోవాలని చెప్పారంట. ఇలా వేసుకుంటే దేశభక్తి పెరిగిపోతుందంట. వెస్ట్రన్ గౌన్స్ వేసుకోవడం సరికాదని
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఒకటి పేర్కొన్నదంట.

అతిపెద్ద సమోస..
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద సమోసా తయారు చేశారు. గోరఖ్ పూర్ లో 90 కిలోల నూనె, 200 కిలోల ఆలుగడ్డలు ఉపయోగించి 330 కిలోల సమోసాను తయారు చేశారు. పది మంది కుర్రాళ్లు దీనిని తయారు చేశారంట. పత్రికల్లో తమ పేరు వస్తుందని, గోరఖ్ పూర్ లో ఎలాంటి వసతులు లేవని తెలుస్తుందని ఇలా చేశారంట. 

10:59 - July 24, 2016

థూ.. కథ తో అంతులేని చర్చను రేకెత్తించిన కథకులు పివి సునీల్ కుమార్. నీలవేణి పేరుతో ఆయన ఇటీవల తన కథా సంకలనాన్ని విజయవాడలో విడుదల చేశారు. ఆ సమావేశ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

10:57 - July 24, 2016

సాహిత్యం సమాజానికి దర్ఫణం పడుతుంది. ప్రజలను చైతన్య వంతం చేస్తుంది. విజ్ఞాన వినోదాలను పంచి పెడుతుంది. ప్రజాపోరాటాలకు ప్రేరణనిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన ఎందరో కవులు రచయితలు మనమధ్యనే ఉన్నారు. అలాంటి వారిలో ప్రగతిశీల భావాలతో కవిత్వం రాసిన శిలాలోలిత ఒకరు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్బుతమైన కవయిత్రిగా పేరుపొందిన విధుషీమణి శిలాలోలిత. ఆమె కవిత్వం, సాహితీ విమర్శ, పరిశోధనా రంగాల్లో విశేష కృషి చేశారు. ప్రగతిశీల భావాలతో కవిత్వం రాశారు. అనేక సాహిత్య గ్రంధాలు వెలువరించారు. వివిధ సాహితీ వేదికల నుండి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు శిలాలోలిత గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన బీజేపీ..

బీహార్ : ఎమ్మెల్సీ తున్నాజీ పాండేను బీజేపీ సస్పెండ్ చేసింది. వేధింపుల కేసులో తున్నాజీ పాండేను హాజిపూర్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్లో మహిళను వేధించినట్లు పాండేపై ఆరోపణలున్నాయి.

ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..

న్యూజిలాండ్ : క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తనిఖీల అనంతరం బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. 

10:38 - July 24, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు మొదలయ్యాయి. తెల్లవారుజామునుండే బోనాలు ఎత్తుకొని మహిళలు ఆలయానికి తరలివస్తున్నారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు. మంత్రులు..ఇతర ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని వెళుతున్నారు. ఇదిలా ఉంటే క్యూ లైన్లపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టెన్ టివితో వారు మాట్లాడారు. బోనాలు అంటే అందరికీ అని, కేవలం 'వీఐపీ'ల కోసమే కాదని పేర్కొన్నారు. ''బోనాలు పడిపోతున్నాయి..చక్కర్లు వచ్చి పడిపోతున్నరు..వాళ్లను బోనం తెమ్మనండి..నాలుగు గంటల నుండి నిలబడినం..సీఎం అలా వచ్చి ఇలా వెళ్లిపోయిండ్రు..వీళ్లేంది ఎంత సేపు ఉంటరు' అంటూ పలువురు మహిళలు ఆక్రోషం వెళ్లగక్కారు. 

10:26 - July 24, 2016

విశాఖపట్టణం : వేపగుంట సమీపంలోని కృష్ణరాయపురంలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక తనూజ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి ఇంట్లో గొడవపడి వెళ్లి పోయిన తనూజ ఇంటిపక్కనే ఉన్న డ్రైనేజీలో మృతదేహం లభ్యమైంది. ఎవరైనా చంపారా ? లేక ఆత్మహత్య చేసుకుందా ? అనేది తెలియరావడం లేదు. తనూజ కనిపించడం లేదని తల్లిదండ్రులు శనివారం సాయంత్రం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఇంటి పక్కనే కాల్వలో తనూజ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గత రాత్రి బాలిక అదృశ్యమైందని ఫిర్యాదు నమోదైందని, క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసు అధికారి పేర్కొన్నారు. రెండు టీంలు రంగంలోకి దిగి వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

శిక్షించాలి - ఐద్వా..
తనూజ అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంపై ఐద్వా నేత స్పందించారు. ఆమె టెన్ టివితో మాట్లాడారు. తనూజను చూడటానికి భయకరంగా ఉందని, అబ్బాయి ఏడిపిస్తున్నాడని తెలిపినా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ఇలాంటి క్రూరమైన మృగాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సంఘటనపై తనూజ తల్లి స్పందించారు. దిలీప్ అనే అబ్బాయి ఏడిపిస్తుండేవాడని, దీనిపై తాను నిలదీయడం జరిగిందన్నారు. దిలీప్ హత్య చేసి ఉంటాడని అనుకోవడం లేదని పేర్కొన్నారు. 

10:17 - July 24, 2016

హైదరాబాద్ : నీట్ -2 పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పరీక్షా కేంద్రం వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పలువురు పరుగులు పెడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. భారతీయ విద్యాభవన్ వద్ద విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తరలివచ్చారు. అరగంట ముందే సెంటర్ కు కొంతమంది చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిందండ్రులు టెన్ టివితో మాట్లాడారు. విద్యార్థులను ప్రభుత్వం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. రూ. 40 నుండి రూ. 60వేలు కోచింగ్ ఇవ్వడం జరిగిందని, కానీ పేపర్ లీకేజ్ అయ్యిందని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామన్నారు. లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం బయటకు చెప్పడం లేదన్నారు.
నీట్‌-2కు తెలుగు రాష్ట్రాల నుంచి 17వేల మంది విద్యార్ధులు పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఏపిలో విశాఖపట్నం, విజయవాడలో ఏర్పాటు చేసారు. ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు ఉదయం ఏడున్నర గంటల నుంచి 9.30 వరకు మాత్రమే అనుమతిస్తారు.

కృష్ణరాయపురంలో బాలిక అనుమానస్పద మృతి..

విశాఖపట్టణం : వేపగుంట సమీపంలోని కృష్ణరాయపురంలో బాలిక తనూజ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. శనివారం రాత్రి ఇంట్లో గొడవపడి వెళ్లి పోయిన తనూజ ఇంటిపక్కనే ఉన్న డ్రైనేజీలో మృతదేహం లభ్యమైంది. 

జమ్మూలో కొనసాగుతున్న రాజ్ నాథ్ పర్యటన..

జమ్మూ కాశ్మీర్ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. బారాముల్ల సరిహద్దులో పౌర సమాజానికి చెందిన వారితో రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. 

బీజేపీ ఎమ్మెల్సీ అరెస్టు..

బీహార్ : బీజేపీ ఎమ్మెల్సీ తున్నా పాండేను గవర్నమెంట్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతితో ఆయన లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. ఓ యువతితో ఆయన లైంగికంగా వేధించినట్లు, ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేసినట్లు పోలీసు అధికారి సంజయ్ సింగ్ ఓ జాతీయ ఛానెల్ తో తెలిపారు.

 

అంజనాపురంగుట్టల వద్ద వెలిసిన మావోయిస్టు పోస్టర్లు..

ఖమ్మం : చర్ల (మం) అంజనాపురంగుట్టల వద్ద మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. భద్రాచలంలో అర్ధరాత్రి నుండి వాహనాల రాకపోకలను మావోయిస్టులు నిలిపివేశారు. రామచంద్రాపురం వద్ద రెండు బకెట్లలో మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు. 

09:21 - July 24, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు తొలి బోనం సమర్పించారు. కుటుంబసమేతంగా వచ్చిన మంత్రి తలసాని పట్టువస్త్రాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పండుగగా గుర్తించిన తరువాత అత్యంత వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. మంత్రులు పద్మారావు, హరీష్ రావులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే బోనాల సందడి మొదలైంది. పలువురు మహిళలు బోనాలు ఎత్తుకొని ఆలయానికి బారులు తీరారు. కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయానికి రానున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మహంకాళి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. మంత్రులు, ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. 

09:13 - July 24, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరి నిలుచున్నారు. బోనాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని, పుకార్లు నమ్మవద్దని సూచించారు. మధ్య రాత్రి రెండు గంటల నుండే దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బోనాలు తీసుకొచ్చే వారికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు. 

నిజామాబాద్ లో ముగ్గురు వీఆర్ ఓల సస్పెన్షన్..

నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు వీఆర్ఓలు సస్పెన్షన్ కు గురయ్యారు. పంటనష్టం జాబితాలో అవినీతికి పాల్పడినందుకు వేటు వేశారు. వెల్మల్ వీఆర్ఓ రవి, కుద్వాన్ పూర్ వీఆర్ ఓ బూమన్న, బాద్గున వీఆర్ఓ పద్మను అధికారులు సస్పెండ్ చేశారు. 

భైంసాలో విషాదం..

ఆదిలాబాద్ : భైంసాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఇమ్రాన్ (12), మజామిల్ (9) గా గుర్తించారు. 

కాసేపట్లో నీట్ 2 పరీక్ష..

హైదరాబాద్ : కాసేపట్లో నీట్-2 ప్రవేశ పరీక్ష జరగనుంది. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని మెడిసిన్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం నీట్-2 పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉదయం 7:30 ఉంచి ఉదయం 9:30 వరకు కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరిస్తారు. 

08:33 - July 24, 2016

వేప పుల్ల..దీనితో పళ్లు తోముకొంటే ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. రోజు కాకపోయినా నెలలో కొన్నిసార్లైనా పళ్లు తోముకుంటే బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వెనుకటి కాలంలో పెద్దవారంతా వేప పుల్లతోనే పళ్లు తోముకునే వాళ్లు. పల్లె సీమలో ఇప్పటికీ వేప పుల్లనే వాడుతుండటం అందరికీ తెలిసిందే. పట్టణాల్లో వేప చెట్లు ఉన్నా..వాటి వద్దకు వెళ్లి తెచ్చుకుని పళ్లు తోముకునేంత ఓపిక ఇప్పటి జనాలకు లేదు.
వేపలో సూక్ష్మ జీవులను నివారించే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
నోటిలో బాక్టీరియా ఎక్కువగా ఉంటే దుర్వాసన వస్తుంది. దీన్ని నివారించడంలోనూ వేప అద్భుతంగా పనిచేస్తుంది.
వేప పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల నోట్లో ఉన్న క్రిములు హరించబడుతాయి. అంతేగాకుండా దంతాలు దృఢంగా మారుతాయి.
చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. దంత క్షయం తగ్గుతుంది.
వేప పుల్లతో పళ్లు తోముకునే క్రమంలో ఆ పుల్లను నమిలినప్పుడు దాంట్లోంచి నోట్లోకి వచ్చే ద్రవాలు దంత క్షయాన్ని నివారిస్తాయి.
తరచూ వేప పుల్లతో పళ్లు తోముకుంటే నోటి దుర్వాసన అసలు రాదు.

వేప ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి.
షుగర్ వ్యాధితో బాధపడేవాళ్ళు పరగడుపునే లేత వేప ఆకుల్ని నమిలినా లేదా వాటి రసం తాగినా చక్కటి ఫలితం లబిస్తుంది. ఇది రక్తప్రసరణ సరిగా జరిగేలా చూడటమే కాదు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది.
గొంతు ఇంన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేప ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి ఆ నీటితో గొంతు పుక్కలించుకుంటే రెండు రోజుల్లోనే మంచి గుణం కనిపిస్తుంది.

08:22 - July 24, 2016

హైదరాబాద్ : నగరంలో మరో ఘరానా మోసం బయటపడింది. ఇరవై వేలకే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఆర్డర్‌ కాపీ ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌కి పోలీసులు చెక్‌ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను..ఇప్పిస్తామని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న దొంగల ముఠాను నార్త్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు.ఈ ముఠా సభ్యులు ప్రజల నుంచి లక్షల్లో వసూలుకు పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

అధికారులతో పరిచయాలు ఉన్నాయంటూ డబ్బులు వసూలు..
ప్రకాశం జిల్లాకు చెందిన బొమ్మాని మహబుని.. అల్మాస్‌ గూడలో ఉంటూ మరో ముగ్గురుతో కలిసి దందా మొదలుపెట్టింది. సచివాలయంలో పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి వీరు జనం నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే బాధితులు ఇళ్ల కోసం అడిగిన ప్రతిసారి ఏవో సాకులు చెబుతూ ఉండేవారు. దీంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

110 మంది నుంచి డబ్బులు వసూలు..
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ నార్త్‌జోన్‌ పోలీసులు వలపన్ని ప్రధాన నిందితురాలు బొమ్మాని మహబూనితో పాటు.. సతీష్‌కుమార్‌..మాడిశెట్టి అమరావతి, మహమ్మద్‌ తాజుద్దిన్‌ను అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి పది లక్షల నలభై వేల రూపాయలను..మూడు లక్షల 84 వేల రూపాయల విలువ చేసే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు ఆటోలను.. నాలుగు సెల్‌ ఫోన్లను తీసుకున్నారు. 110 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో తేలినట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ తెలిపారు. ప్రభుత్వ పథకాల విషయంలో మధ్యవర్తులను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అధికారులు చెప్పిన విధానంలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.

08:19 - July 24, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ బోనాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ బోనాల సందడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే బోనాల సందడి మొదలైంది. పలువురు మహిళలు బోనాలు ఎత్తుకొని ఆలయానికి బారులు తీరారు. ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. ఏర్పాట్లను మంత్రి పద్మారావు పర్యవేక్షించారు. మంత్రి హరీష్ రావు కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయానికి రానున్నారు. మరి బోనాలు ఎలా ఉన్నాయి ? అక్కడ ఎలాంటి సందడి నెలకొందో వీడియోలో చూడండి. 

08:08 - July 24, 2016

హైదరాబాద్ : నిబంధనలు అతిక్రమించిన వారిపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బల్దియా అధికారులు.. ఒక్కరోజే 40 లక్షలు ఫైన్‌ రూపంలో వసూలు చేశారు. మూడు సంస్థలపై కేసులు నమోదు చేశారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశంతో జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. నగరంలో ఒక్కరోజే 4 వేల ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు తొలగించారు.

మూడు సంస్థలపై కేసులు నమోదు..

కోర్టు ఆదేశాలతో గత కొంతకాలంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇప్పటివరకు 8,304 కటౌట్లు.. 19,146 ఫ్లెక్సీలు, 38 వేల బ్యానర్లు, 64 వేల పోస్టర్లు, 122 హోర్డింగులను తొలగించింది. ఇవి ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యక్తుల నుంచి 4 లక్షల 9 వేల రూపాయలు జరిమానా వసూలు చేసింది. ఇందులో మూడు సంస్థలపై కేసు నమోదు చేసింది. ఇది ప్రారంభమేనని.. ఇకపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులంటున్నారు.

రూ.10.84 లక్షలు జరిమానా..
ఇక నగరంలో ఇష్టమొచ్చినట్లు చెత్తను వేస్తున్నవారిపై బల్దియా కఠినంగా వ్యవహరిస్తోంది. నిషేదాజ్ఞలను అతిక్రమిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసిన వారిపై 10 లక్షల 84 వేల రూపాయలు జరిమానా విధించింది. దీంతోపాటు చెత్తను తగలబెట్టిన వారినుంచి 20 వేల 600 రూపాయలు వసూలు చేశారు. బహిరంగ మూత్ర విసర్జన చేసినవారి నుంచి 2900 రూపాయలు ఫైన్‌ రూపంలో వసూలు చేశారు. మరోవైపు 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్న వారిపై కొరఢా ఝుళిపించారు అధికారులు. వీరి నుంచి 7 లక్షల 49 వేల రూపాయలు ఫైన్‌ వసూలు చేశారు. మొత్తానికి మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఒక్కరోజే 40 లక్షల రూపాయలు ఫైన్‌ రూపంలో వసూలు చేశారు. అయితే ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయా ? మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతాయా ? చూడాలి. 

గజియాబాద్ లో కాల్పులు..

గజియాబాద్ : మసూరీ పీఎస్ పరిధిలో పోలిసులు, క్రిమినల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు క్రిమినల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిలిచిన ఎయిరిండియా విమానం..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. 

అస్పాంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు..

అస్సాం : రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. పలు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్రతో పాటు పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

07:56 - July 24, 2016

ఆంటిగ్వా : విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. జీవం లేని పిచ్‌పై అతిథ్య జట్టు బౌలర్లు విఫలం కాగా.. భారత్‌ పేసర్లు మహ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌ విజృంభించారు. దీంతో వెస్టిండీస్‌ 243 పరుగులకే ఆలౌట్‌ అయ్యి.. ఫాలో ఆన్‌ ఆడుతోంది. 323 పరుగులు చేయాల్సిన వెస్టిండీస్‌.. రెండో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే బ్రాత్‌వైట్‌ను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 21 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 566 పరుగులు చేసి డిక్లెర్డ్‌ చేసింది. బ్రావో 10, చంద్రిక 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

భారత్ : 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్..
వెస్టిండీస్ : 243 పరుగులకు ఆలౌట్...

07:54 - July 24, 2016

నాలుగు దశాబ్దాలుగా ఓ కుటుంబం విధి ఆడుకొంటోంది. కష్టాలు వెంటాడుతున్నాయి. నిండు కుటుంబంలో జరుగుతున్న ఒక్కో ఘోరం కన్న పేగును పిండేస్తున్నాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ దంపతులు ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకున్నారు. అయినా వారి రెక్కాడితేగాని డొక్కాడేది. సమస్యల సుడిగుండంలో సంసార నావను నడుపుకుంటూ వచ్చిన ఆ దంపతులను మాత్ర విధి పగబట్టింది. కన్న కొడుకు, కూతురు కళ్ల ముందే చనిపోయారు. కృంగిపోతున్న ఆ ముసలి గుండెకు మరో గాయమైంది. ఎప్పుడే ఏమవుతుందో తెలియదు. శ్వాస పీల్చేందుకు భయంతో వణుకుతున్న ఆ దంపతుల పరిస్థితి తెలుసుకొని కలుసుకుంది టెన్ టివి. ఆకలితో అల్లాడుతూ ఒకే ఒక ఆశతో బతికి ఉన్న వారిలో టెన్ టివి ధైర్యాన్ని నింపింది. టెన్ టివి 'ఇది కథ కాదు'లో మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:37 - July 24, 2016

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' చాలా రోజుల తరువాత మళ్లీ పాట పాడాడు. 'సీతారామరాజు'లో సిగరెట్ పాటని సరదగా పాడిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు మళ్లీ నాగ్ గొంతు నుండి పాట వినిపించింది. 'నిర్మల కాన్వెంట్' చిత్రం నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు 'రోషన్' కథా నాయకుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'కొత్త కొత్త భాష..కొత్త ప్రేమ భాష' అంటూ నాగార్జున పాట పాడారు. రోషన్ సాలూరి స్వరపరిచిన ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించారు. శనివారం సాయంత్రం ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు. 

07:34 - July 24, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ బోనాలు ప్రారంభమయ్యాయి. బోనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇది మూడో బోనాలు. అమ్మవారితో పాటు మాణిక్యాల అమ్మవారిని పూజిస్తుంటారు. రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఆలయ పరిసరాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుండే బోనాలు సమర్పించేందుకు మహిళలు ఆలయానికి బారులు తీరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయమే అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. మరో మంత్రి పద్మారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే పాస్ లు ఉన్న వారికే లోనికి అనుమతినిస్తున్నారు. బోనాలు తీసుకొచ్చే వారికి ఒక క్యూ లైన్, అమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చే వారికి ఒక క్యూ లైన్, వీఐపీల కోసం మరొక క్యూ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు టెన్ టివితో ముచ్చటించారు.

ఆంక్షలు..
ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరం నుంచే ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. ట్యాంక్ బండ్ నుంచి ప్యారడైజ్‌ వైపుగా వెళ్లే వాహనాలను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో 184 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయిన ఉజ్జయిని బోనాలు.. రెండు రోజుల పాటు సందడిగా సాగనున్నాయి. 

ముంబైలో బోల్తా కొట్టిన కారు..

ముంబై : ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. 

07:10 - July 24, 2016

మచిలీపట్నం : పోర్టు అభివృద్ధికి భూములు ఇచ్చేందుకు రైతులందరూ సిద్ధంగా ఉన్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బందర్‌పోర్టు అభివృద్ధికి జీవో 185 ద్వారా మడాను ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పోర్టు అభివృద్ధికి లక్ష ఎకరాలు తీసుకుంటామని ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. 22 ఎకరాలకు మించి ఒక్క సెంటు కూడా రైతుల నుంచి తీసుకోమని ఆయన స్పష్టం చేశారు.

 

రెండో రోజు జమ్మూలో రాజ్ నాథ్ పర్యటన..

జమ్మూ కాశ్మీర్ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లో రెండో రోజు పర్యటించనున్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌ తర్వాత కాశ్మీర్‌లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం పర్యటించిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రితో భేటి కావడానికి స్థానిక వ్యాపారులు నిరాకరించారు. 

నేడు తొలి గ్రీన్ రైల్ కారిడార్ ప్రారంభం..

ఢిల్లీ : తమిళనాడులోని 114 కిమీల పొడవైన రామేశ్వరం - మన్మధురై మార్గంలో పూర్తిస్థాయిలో బయో మరుగుదొడ్లతో కూడిన రైళ్లను నడిపే ప్రాజెక్టు 'గ్రీన్ రైల్ కారిడార్'ను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో 286 పెట్టెలతో కూడిన పది ప్రయాణీకుల రైళ్లు త్వరలోనే పరుగులు తీయనున్నాయి.

06:44 - July 24, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ మెట్రో వాటర్స్‌ వర్క్స్ కార్యక్రమాల మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలికి చెందిన వివిధ స్థాయిల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కేటీఆర్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే జంట నగరాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, పైపులైన్ల విస్తరణ, కొత్త రిజర్వాయర్ల నిర్మాణంపై సమీక్షించిన కేటీఆర్... వాటర్‌ వర్క్స్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతినెలా రూ. 29 కోట్ల లోటు..
జలమండలి ఆదాయ, వ్యయాలపై కేటీఆర్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. జంటనగరాల ప్రజల రోజువారీ అవసరాలకు 625 మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం 355 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీనిలో కూడా 60 శాతానికి మాత్రమే ఆదాయం వస్తోంది. నలభై శాతానికి బిల్లులు రాకపోవడంతో జలమండలి నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. వాటర్‌ బోర్డు కార్యకలాపాలకు నెలకు 114 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే, ఆదాయం మాత్రం 85 కోట్ల రూపాయలు మాత్రమే వస్తోంది. దీంతో ప్రతినెలా 29 కోట్ల లోటు వస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షల సంఖ్యలో వాణిజ్య సముదాయాలు ఉంటే, వీటిలో ఉన్న నీటి కనెక్షలన్లు 32 వేలు మాత్రమేనని లెక్క తేలింది. దీంతో ఈ అంశంపై దృష్టి పెట్టాలని కేటీఆర్‌ అధికారులు ఆదేశించారు. అలాగే ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి రావాల్సి 300 కోట్ల రూపాయల బకాయిలు, ప్రైవేటు సంస్థలు చెల్లించాల్సి ఉన్న 200 కోట్ల బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలమండలి ఆదాయ, వ్యయాలను దృష్ఠిలో పెట్టుకొని పౌరులకు మెరుగ్గా మంచినీరు సరఫరా చేసేందుకు అవసరమైతే చార్జీల అంశాన్ని పరిశీలిస్తామని సంకేతాలిచ్చారు. మరోవైపు జంట నగరాల్లోని అన్ని మ్యాన్‌హోల్స్‌ జియోటాగింగ్‌తో అనుసంధానం చేయాలని సమీక్షలో నిర్ణయించారు. 

06:41 - July 24, 2016

ఢిల్లీ : ఆచూకీ కనిపించకుండా పోయిన వైమానిక దళ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధ విమానాలు, నౌకలు, జలాంతర్గాములతో రక్షణశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. గంటగంటకు గల్లంతైన వారిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక బృందాలకు సాయం చేసేందుకు ఇస్రో రంగంలోకి దిగింది. మరోవైపు సహాయక చర్యలను రక్షణమంత్రి పారికర్ సమీక్షించగా... బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి బయలుదేరి గల్లంతైన వాయుసేన విమానం AN-32 ఆచూకీ ఇంకా లభించలేదు. శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరిన 16 నిమిషాల్లోనే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. 24 గంటల నుంచి విమానం కోసం వెతుకుతున్నా చిన్న సమాచారం కూడా లభించకపోవడంతో గల్లంతైన వారిపై క్షణక్షణం ఆశలు సన్నగిల్లుతున్నాయి.

రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఏరియల్‌ సర్వే..
ఢిల్లీ నుంచి చెన్నైతాంబరంలోని వైమానికదళ స్థావరానికి చేరుకున్న రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌... విమానం అదృశ్యంపైన ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం నౌకా, విమానదళాలు, తీరప్రాంత గస్తీదళం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం గాలింపు మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. గాలింపు చర్యల్లో 13 యుద్ధ నౌకలు, 5 యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయి. అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని నౌకదళ అధికారులు చెబుతున్నారు.

8 మంది విశాఖ వాసులు...
గల్లంతైన విమానంలో ఉన్న 29 మందిలో 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. విమానం అదృశ్యమైన సమాచారం తెలుసుకున్నప్పటి నుంచి తమవారు ఏమయ్యారోనని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. బాజీ జంక్షన్‌, బుచ్చిరాజుపాలెంలో నివసిస్తున్న ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి, బాధితులను ఓదార్చారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. విమానం కండిషన్‌ సరిగా లేకపోయినా తీసుకెళ్లారని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
గల్లంతైన విమానంలో విజయనగరం జిల్లాకు చెందిన బోడంగి సాంబమూర్తి కూడా ఉన్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు మున్నీరు అవుతున్నారు. రక్షణ మంత్రి ఆదేశాలతో త్రివిధ దళాలు, కోస్ట్‌గార్డ్.. గాలింపును ముమ్మరం చేశాయి. తమ వారు క్షేమంగా ఉండాలని త్వరగా తిరిగిరావాలని బాధిత కుటుంబాలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి.

06:38 - July 24, 2016

విశాఖపట్టణం : జిల్లాలో శనివారం సీఎం చంద్రబాబు టూర్ బిజీ బిజీగా సాగింది. ఉదయం10 గంటలకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు మెుదటి షీలానగర్ లో బాలజీ ఓపెన్ థియేటర్‌ను ప్రారంభించారు. సీతమ్మధారలో వుడా క్లాంప్లెక్స్ మీ సేవ సెంటర్లను ప్రారంభించారు..అనంతరం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరితో ఏలేరు జలాశయాన్ని అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాల్వ పూర్తి చేసి విశాఖలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు. అనంతరం నోవాటెల్ లో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూడిమడకలో నిర్మించిన 200 ఇళ్ల సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మూసివేసిన పరిశ్రమలను తిరిగి తెరిపించాలని వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన సీఐటీయు నేతలపై సీఎం చంద్రబాబు అసహనానికి గురయ్యారు..మీ వల్లనే ఉద్యమాలు జరుగుతున్నాయంటూ రుసరుసలాడారు.

బ్రాండిక్స్ ఉద్యోగులు..
ఆ తర్వాత బ్రాండిక్స్‌ ఉద్యోగులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల తో మాట్లాడుతూ ఉద్యమాలతో పరిశ్రమలు వెనక్కి తరలి వెళ్లిపోతాయని అన్నారు. అక్కడే 1000 రూపాయలు వేతనం పెంచాలని బ్రాండెక్స్ కంపనీ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆగస్ట్ నుంచి పెంచుతామని కంపెనీ ప్రతినిధులు చెప్పగా ఈ నెల నుంచే పెంచాలని చంద్రబాబు సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ ఫ్రైజస్ ట్రైనింగ్ సెంటర్ ను కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, కమల్‌నాధ్ మిశ్రాల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. మొత్తానికి విశాఖ పర్యటనలో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు.. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు త్వరలోనే గోదావరి జలాలు తీసుకొస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. 

06:34 - July 24, 2016

హైదరాబాద్ : రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జాయిని మహాంకాళి అమ్మవారి బోనాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మూడు వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. భక్తుల కోలాహాలం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరం నుంచే ఈ ఆంక్షలను అమలు చేయనున్నారు. ట్యాంక్ బండ్ నుంచి ప్యారడైజ్‌ వైపుగా వెళ్లే వాహనాలను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు.

ప్రత్యేకంగా మహిళా పోలీసుల రక్షణ..
బోనాలు తీసుకుని వచ్చే మహిళా భక్తుల కోసం బాటా షోరూం నుంచి ప్రత్యేక క్యూ లైన్‌లను ఏర్పాటు చేశారు. అలాగే బారికేడ్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్ల దగ్గర ప్రత్యేకంగా మహిళా పోలీసులు రక్షణగా నిలవనున్నారు. అలాగే భక్తుల కోసం ..వైద్య బృందంతో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సివిల్, ట్రాఫిక్, సీఆర్పీఎఫ్‌ బలగాలు బోనాలు జరిగే రెండు రోజులు పాటు విధులు నిర్వహిస్తారని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో 184 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని శాఖలను సంప్రదించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఉజ్జయిని బోనాలు.. రెండురోజుల పాటు సందడిగా సాగనున్నాయి. 

06:25 - July 24, 2016

హైదరాబాద్ : పలు రాష్ట్రాల్లో, విదేశాల్లో పర్యటించన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు పర్యటించలేదు. దీనిపై అధికారి పార్టీ పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 7న గజ్వేల్‌లో మిషన్‌ భగీరథను ప్రారంభించనున్నారు. అనంతరం రామగుండంలో ఎన్టీపీసీ ప్లాంట్‌, ఎరువుల కర్మాగారాన్ని.. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ తొలి పర్యటన ఖరారైంది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కార్‌ చేపట్టిన 'మిషన్‌ భగీరథ పథకాన్ని' ప్రారంభించేందుకు మోడీ రాబోతున్నారు. సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్‌లో ఆగస్టు 7న ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ఈ పథకాన్ని ప్రారంభించాలని స్వయంగా మోడీని ఆహ్వానించారు. దీంతో పీఎంవో కార్యాలయం పూర్తి వివరాలు తెలుసుకుని మోడీ పర్యటనను ఖరారు చేసింది.

పనులను పరిశీలించిన వేముల ప్రశాంత్‌రెడ్డి..
గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లాతో నీటిని సరఫరా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులను పరిశీలించిన మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి.. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ వస్తున్నందన కోమటిబండ హెడ్‌వర్క్స్‌ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అదేవిధంగా హెలిప్యాడ్‌, బహిరంగ సభకు అవసరమైన స్థలాలను పరిశీలించారు.

వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన..
ఇక అదేరోజు రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌, ఎరువుల కర్మాగారానికి మోడీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. తొలిసారి మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయబోతుంది.

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని..

హైదరాబాద్ : సికింద్రాబాద్ మహాంకాళీ బోనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. 

నేడు మహాంకాళి బోనాలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

నేడు కోస్తా, తెలంగాణకు వర్ష సూచన..

హైదరాబాద్ : హిమాలయాల వరకు వెళ్లిన నైరుతి రుతు పవనాల ద్రోణి మళ్లీ యథాస్థితికి రావడంతో విదర్భ, ఛత్తీస్ గఢ్, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వీటి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

వెస్టిండీస్ 243 ఆలౌట్..

అంటిగ్వా : భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో వెస్టిండీస్ 243 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో వెస్టిండీస్ ఫాలో ఆన్ తప్పలేదు. ఓవర్ నైట్ స్కోరు 31/1 తో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కు భారత బౌలర్ షమీ, ఉమేశ్ యాదవ్ చుక్కలు చూపించారు.

భారత్ : 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్..
వెస్టిండీస్ : 243 పరుగులకు ఆలౌట్...

నగరంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..

హైదరాబాద్ : ఒక రోజు పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి పార్క్ హయత్ హోటల్ లో బస చేసిన ఆయన ఆదివారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మామిడి మండలం సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభిస్తారు. సాయంత్రం జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జైట్లీని మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. 

నేడు ఇందూరులో ఊర పండుగ..

నిజామాబాద్ : పాడి పంటలు బాగుండాలని, వర్షాలు కురవాలని కోరుతూ ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఊరపండుగకు జిల్లా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 

వెస్టిండీస్ 157/7..

అంటిగ్వా : వెస్టిండీస్ తో తొలి టెస్టు లో పర్యాటక భారత్ మరింత పట్టు బిగిస్తోంది. ఏడాదిన్నర తరువాత జట్టులోకి వచ్చిన పేసర్ మహమ్మద్ షమీ (4/41) నాలుగు వికెట్లతో విండీస్ ను ఘోరంగా దెబ్బతీశారు. దీనితో 31/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ టీమ్ 157 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. డౌరిచ్ 6, హోల్డర్ 9 నాటౌట్ తో క్రీజులో ఉన్నారు.

భారత్ : 161.5 ఓవర్లలో 566/8 డిక్లేర్డ్..
వెస్టిండీస్ : 72 ఓవర్లలో 157/4

నేటి నుండి పీజీ ఈసెట్..

హైదరాబాద్ : ఎంటెక్, ఎం ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఆదివారం నుండి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి రోజు గేట్ / జి ప్యాట్ లో ర్యాంకులు సాధించిన వారికి వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తిరిగి ఈనెల 25వ తేదీ నుండి 31 వరకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 

నేటి నుండి ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్..

హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఎంసెట్ 2016 తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఈనెల 27న సీట్ల కేటాయింపు చేస్తారు. తుది విడత వెబ్ కౌన్సెలింగ్ లో 26,106 (ఇంజినీరింగ్, బి ఫార్మసి, ఫార్మా డి కలిపి) సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

నేడు నీట్ -2 పరీక్షలు..

హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షలకు జాతీయ స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1.00వరకు నిర్వహించనున్నారు. ఉదయం 7.30గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతినిస్తారు. ఈ పరీక్షలకు జాతీయస్థాయిలో 4.7 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 

Don't Miss