Activities calendar

25 July 2016

22:24 - July 25, 2016

హైదరాబాద్ : మల్లన్న సాగర్‌ నిర్వాసితుల సమస్యపై హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆల్‌పార్టీ మీటింగ్‌ జరిగింది.. నిర్వాసితులపై లాఠీఛార్జ్‌ను ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి.. నిపుణుల సూచనల్ని పట్టించుకోకుండా... రైతుల ఆందోళనల్ని అణచివేస్తూ టీఎస్‌ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆరోపించాయి.. లాఠీఛార్జ్‌పై నిజనిర్ధారణ కమిటీతో దర్యాప్తు చేయించి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు..

22:17 - July 25, 2016

ఒకప్పుడు చీరకు తగిన బ్లౌజ్ వేసుకోవడం ఫ్యాషన్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫ్యాషన్ మారింది. రిచ్ బ్లౌజ్ వేసుకోవడం ట్రెండ్ గా ఉంది. అలాంటి డిజైనర్ బ్లౌజెస్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

22:15 - July 25, 2016

ఆకలి, పేదరికం, తీరని కనీస అవసరాలు. ఒక మనిషి ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదు. అవి తీరగలిగే మార్గాలెక్కడున్నా, వెతకాల్సిన బాధ్యత అందరిదీ. అలాంటి ఆ బాధ్యతను తమ భుజాల మీదకెత్తుకున్న గుడ్ విల్ స్టోర్ స్టోరీ పై కథనం.. ఆర్థిక లావాదేవీలతోనే మానవ సంబంధాలను ముడిపడిపోతున్నాయి. అందుకే అయినవాళ్లు కూడా పరాయి వాళ్లుగా మారిపోతున్నారు. పరాయి వాళ్లు కూడా మనవాళ్లయిపోతున్నారు. ఈ స్థితిలో నీ చుట్టూ, నా చుట్టూ ఉన్నవారి గురించి పట్టించుకోకుండా తిరుగుతున్న స్థితిలో గుడ్ విల్ స్టోర్ కొత్త బంధానికి తెరతీసింది.
ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల ఓట్లతో అధికార పీఠంలో ఉన్న ప్రజాప్రతినిధులది . కానీ, ఇక్కడ అలాంటి అవసరాలు తీర్చేందుకు గుడ్ స్టోర్ మొదలవడం.. విజయవంతంగా కొనసాగడం .. హర్షించాల్సిన విషయం. ఈ సంస్థ నిర్వాహకులకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

22:11 - July 25, 2016

25 సంవత్సరాలు గడిచాయ్..ఏం జరిగింది? ఏం లాభాన్ని ఒరగబెట్టింది? తలుపులు బార్లా తెరిస్తే పక్కదేశాల దుమ్మంతా మనదేశంలోనే నిండిపోయింది...మన వ్యవస్థను అతలాకుతలం చేసింది..దేశ సంపదను కొల్లగొట్టేలా..లాభాలను పోగుచేసుకునేలా ఉపయోగపడింది. సరళీకృతమంటూ దేశాన్ని చిక్కుల్లో పడేసింది. ఇప్పటికీ కళ్లు తెరవకుండా అదే స్థితిలో వుండిపోయారు. పాతికేళ్ళ సరళీకృత విధానాలపై ఈరోజు వైడాంగిల్ మనముందుకొచ్చింది. మరి సరళీకరణ విధానాలతో దేశం ఎటువంటి స్థితిలో వుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి..

22:02 - July 25, 2016

విజయవాడ : సంక్షేమ హాస్టళ్లను మూసివేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్‌సెంటర్ వరకూ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ధర్నాచౌక్ దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు,విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అరెస్ట్‌చేసి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

21:59 - July 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ పరిధిలోని యూనివర్సిటీల్లో వీసీల నియామకంపై హైడ్రామా నెలకొంది. ఒక వైపు ప్రభుత్వం హడావిడిగా తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను ప్రకటించగా, దీనిపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కోర్టులో విచారణ జరుగుతుండగా వీసీలను ఎలా నియమిస్తారంటూ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

వర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
తెలంగాణలోని వర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఇన్‌చార్జి వీసీలతో కాలం గడిపిన సర్కారు ఎట్టకేలకు కొత్త వీసీలను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రామచంద్రం. జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్.వీ. సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబశివరావు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు, కాకతీయ వర్సిటీ వీసీగా సాయన్న, ఆర్ జేయూకేటీ వీసీగా సత్యనారాయణ, పాలమూరు వర్సిటీ వీసీగా రాజారత్నం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసిగా ప్రవీణ్ రావులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది.

వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్‌..
ఇదిలా ఉంటే వీసీల నియామకంపై ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై సీరియస్ అయింది. కేసు పెండింగ్‌లో ఉండగా వీసీలను ఎలా నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లు ఆగిన ప్రభుత్వం 2, 3 రోజులు ఆగలేదా అని ధర్మాసనం నిలదీసింది.

వివాదాలకు కేంద్రమైన జీవో నెం. 38..
వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో అటు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇదిలా ఉంటే వీసీల నియామకంపై గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 38పైనే వివాదం నెలకొంది. స్వయం ప్రతిపత్తి కల్గిన యూనివర్సీటీలకు ప్రభుత్వం జోక్యం చేసుకునేలా యూజీసీ నిబంధనలకు అడ్డుతగులుతూ జీవో నెంబర్‌ 38 ఉందని ఓయూ ప్రొపెసర్ మనోహార్ రావు పిల్ దాఖలు చేశారు.

నోటిఫికేషన్‌ విడుదల అనంతరం జీవో జారీ విరుద్ధమని పిటిషనర్‌ వాదన
దీనిపై పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత మళ్లీ జీవో జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. అటు అడ్వకేట్‌ జనరల్‌ వాదిస్తూ చట్టాన్ని సవరణ చేయకుండా జీవోల జారీ చేసుకునే హక్కు పునర్ విభజన చట్టంలో ఉందని వాదించారు.

తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయని ప్రభుత్వం వివరణ..
ఇరుపక్షాల తరపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం..తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉండాలని ఆదేశించి.. తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది.

 

21:47 - July 25, 2016

ఢిల్లీ : పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి ప్రాధాన్యం లేదని గవర్నర్‌ తెలిపారు. హైకోర్టు విభజనపై ప్రధానితో చర్చించలేదన్న ఆయన.. న్యాయశాఖ మంత్రితో భేటీ కానున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ... జల వివాదాలపై జోక్యం చేసుకోబోనని గవర్నర్‌ చెప్పారు.

21:38 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులపై లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన అఖిలపక్ష నేతలు బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిర్వాసితులకు మద్దతిచ్చేందుకు వెళ్తున్న పలువురు నేతలను పోలీసులు అడ్డుకుని.. అరె‌స్టులు చేశారు. నిర్వాసితులకు 2013 భూచట్టం ప్రకారం న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు.

మెదక్ జిల్లా బంద్ చేపట్టిన అఖిలపక్షం..
మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా అఖిలపక్షం మెదక్‌ జిల్లా బంద్‌ చేపట్టింది. ఉదయాన్నే సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలకు చెందిన నేతలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మెదక్‌లో కాలేజీలు, పాఠశాలలను మూసివేయించారు. నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి షాపులను మూసివేయించారు. అనంతరం రాస్తోరోకో నిర్వహించారు. పలు చోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సంగారెడ్డి బస్సు డిపో వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళన..
సంగారెడ్డి బస్సు డిపో వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ముంపు గ్రామాల ప్రజలకు రేవంత్‌రెడ్డి, రాజనర్సింహ, శ్రవణ్‌ మద్దతు..
బంద్‌లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు దామోదర్‌ రాజనర్సింహ, దాసోజు శ్రవణ్‌ పాల్గొని ముంపు గ్రామాల ప్రజలకు మద్దతు ప్రకటించారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాజనర్సింహ సహా కాంగ్రెస్‌ నాయకులను గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌కు, రేవంత్‌రెడ్డిని దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లన్నసాగర్‌ భూసేకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నదొకటి, చేస్తున్నది మరొకటని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

టీజాక్ నేతలను అడ్డుకున్న పోలీసులు..
మల్లన్నసాగర్ లాఠీఛార్జ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీ-జేఏసీ నేతలను ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోదండరామ్‌తో సహా పలువురు రోడ్డుపై నిరసనకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఐడీఏ బొల్లారం పీఎస్‌కు తరలించారు. నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం దారుణమని కోదండరామ్‌ అన్నారు.

రెండు బృందాలుగా తమ్మినేని,చంద్రకుమార్..
మల్లన్నసాగర్‌ బాధితులను కలిసేందుకు వెళ్తున్నవారిని అరెస్ట్‌ చేయడంతో తమ్మినేని వీరభద్రం, జస్టిస్‌ చంద్రకుమార్‌ రెండు బృందాలుగా ఏర్పడి రహస్యంగా వేములగట్టుకు చేరుకున్నారు. రిలే నిరాహారదీక్షలు జరుపుతున్న బాధితులకు మద్దతు తెలిపారు. ప్రజల ప్రాణాలను హరించి ప్రాజెక్టులు కట్టడం అవసరం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని తమ్మినేని అన్నారు. రైతులు కన్నీళ్లు కార్చిన ఏ దేశం బాగుపడలేదని... రైతులపై తుపాకులు ఎక్కుపెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఆయన అన్నారు.

మానవ హక్కులను ఉల్లంఘించే అధికారం లేదు: చంద్రకుమార్
మానవ హక్కులను ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ప్రజలు స్వచ్చందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేస్తే.. విఫలమైందని మంత్రి హరీష్‌రావు అనడం ఉద్యమాన్ని కించపరచడమే అన్నారు. ప్రజలపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసులను వెనక్కి రప్పించాలి: అఖిలపక్ష నేతలు
ఇప్పటికైనా ప్రభుత్వం మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాల్లో మోహరించిన పోలీసులను వెనక్కి పిలిపించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. మంత్రి హరీష్‌రావు ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలని సూచించారు.

ఫిలింనగర్ ఘటనాస్థలికి జేఎన్ యూ బృందం..

హైదరాబాద్: ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన స్థలాన్ని జేఎన్‌టీయూ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్బంగా నిపుణుల కమిటీ సభ్యులు మాట్లాడుతూ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించలేదని వెల్లడించారు. భవనం నిర్మాణంలో ఇనుము తక్కువగా వాడినట్లు చెప్పారు. రేపు తాము అధ్యయనం చేసి ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని నిపుణుల బృందం సభ్యులు తెలిపారు.

20:31 - July 25, 2016

దిష్టిబొమ్మను అరెస్ట్ చేశ్న పోలీసులు..పాణం లేకున్నా పంచిది పెట్టిన శవం..పోలీసుల్ని పొర్కపొర్క కొట్టిన జనం..పాలమూరు కాడ దొక్కిన లంకెబిందెలు..మల్లా ముదిరిన మల్లన్న సాగర్ లొల్లి..మట్టితవ్వకాల్లో బయటపడ్డ కాకతీయుల నాటి విగ్రహాలు...ఫుట్ బాల్ అడిన బాబా రాందేవ్..చైనా జూలో యువతిపై దాడి చేసిన పులిరాజు .. గిసువంటి మస్తు ముచ్చట్లను గీరోజుకూడా మన మల్లన్న తీసుకొచ్చింది. మరి జాగెందుకు ఈ వీడియోని క్లిక్ చేసి చూడుండ్రి... 

విద్యార్థులపై లెక్చరర్ల పైశాచికత్వం..

అనంతపురం : స్వామి వివేకానంద్ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ల పైశాచికత్వం బైటపడింది. క్రమశిక్షణ పేరుతో నలుగురు విద్యార్థులను ఐదుగురు లెక్చరర్లు కలిసి చితకబాదారు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆకుతోటపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

టీ.ఎస్ డీజీపీని కలిసిన ఏపీ డీజీపీ ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ చార్జ్ డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు. నూతనంగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు మర్యాద పూర్వకంగా డీజీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు డీజీపీలు పాలసీ అంశాలపై కాసేపు చర్చించుకున్నట్లు సమాచారం.

మెట్రోరైలు పనులపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్: మెట్రో రైలు పనుల ప్రగతిపై సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెట్రోకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎస్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ వారంలో కొంత నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎస్ రాజీవ్ శర్మ నిర్దేశించారు.

19:49 - July 25, 2016

బందరు పోర్టు అభివృద్ధి ..మచిలీపట్నం డెవలప్ మెంట్ అధారిటీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షా 5వేల ఎకరాల భూమిని సేకరిస్తామని పేర్కొంది. ఈనేపథ్యంలో బందర్ పోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్స్ ను సోమవారం సాయంత్రం విడుదల చేయనుంది. దీనిపై వివిధ పార్టీలు..ప్రజాసంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో రఘు (సీపీఎం కృష్ణా జిల్లా కార్యదర్శి),గౌతంరెడ్డి (వైసీపీ రాష్ట్ర నాయకులు) రామకృష్ణ ప్రసాద్ ( టీడీపీ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు తెలిపిన అభిప్రాయాలను తెలుసుకోవటానికి ఈ వీడియోను క్లిక్ చేయండి..మరింత సమాచారం తెలుసుకోండి.

త్వరలో హైకోర్టు విభజన?!..

ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతిలోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమౌతున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన అంశం ఈ ఏడాది చివరినాటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. 

ఎంసెట్- 2 ప్రశ్నాపత్రం లీక్..కీలక ఆధారాలు..

హైదరాబాద్: ఎంసెట్- 2 ప్రశ్నాపత్రం లీకేజీపై కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఎంసెట్- 2 ప్రశ్నాపత్రం లీకేజీపై కొత్తకోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బయోమెట్రిక్‌లో టెక్నికల్ సమస్యల వల్ల పలువురు విద్యార్థులు ఫింగర్ ప్రింట్ నమోదు చేయలేదు. ఓఎంఆర్ షీట్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ర్యాంకుల ప్రకటన కోసం రూ.కోట్లలో వసూలు చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. 

19:39 - July 25, 2016

విజ‌య‌న‌గ‌రం : జిల్లా గాజులరేగ‌లో ఈరోజు దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న‌ను ప్రేమించ‌ట్లేద‌నే కార‌ణంతో ఓ యువ‌తి గొంతు కోశాడు ప్రేమోన్మాది. యువ‌తిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. శృంగవరపుకోటకు చెందిన ఎంబీఏ విద్యార్థి కుసుమంచి విక్రమ్ యువ‌తిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను అంగీకరించాలనీ..పెళ్లి చేసుకుంటానంటూ 15 రోజుల క్రితం త‌న బంధువుల‌తో క‌లిసి యువ‌తి ఇంటికి వ‌చ్చాడు. అయితే విక్ర‌మ్‌తో పెళ్లికి ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సోమవారం నాడు మ‌ధ్యాహ్నం ఒక్కసారిగా యువతి ఇంట్లోకి ప్ర‌వేశించిన విక్ర‌మ్ యువ‌తిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతో వాదించాడు. దీనికి బాధిత యువ‌తి ఒప్పుకోకపోవటంతో వెర్రెత్తిపోయిన విక్ర‌మ్ కత్తితో యువతి గొంతు కోశాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

సీఎస్ తో కేటీఆర్ భేటీ..

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి పలువురు అధికారులు హాజరయ్యారు.

ఐఐటీల బిల్లులకు లోక్‌సభ ఆమోదం..

ఢిల్లీ: సోమవారం లోక్‌సభ ఆరు కొత్త ఐఐటీల బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ మాట్లాడుతూ.. కొత్త ఐఐటీల డీపీఆర్‌లకు అనుగుణంగా నిధుల విడుదల ఉంటుందని తెలిపారు. ఐఐటీలకు నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.

19:26 - July 25, 2016

హైదరాబాద్ : ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్-ఐసీయూ .. డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు డిసెంబర్ 3,4 తేదీల్లో జరగనున్నాయి. తమ యూనియన్ అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఐసీయూ ప్రతినిధులు తెలిపారు. బీమా రంగంలో ఉద్యోగులకు, ప్రజలకు ఉత్తమ సంఘంగా సేవలు అందించినట్లు తెలిపారు. సామాజిక బాధ్యతతో సామాన్య ప్రజల్లో గుర్తింపు పొందే స్థాయిలో సేవలు అందించగలిగామని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. 

19:20 - July 25, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై ప్రభుత్వతీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీకాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా హరీష్‌రావు మల్లన్న సాగర్ మహిళలపై లాఠీచార్జీ చేయించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను అణిచివేస్తుందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. 

19:17 - July 25, 2016

హైదరాబాద్  : ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.

హైదరాబాద్‌ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన..
మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై లాఠీచార్జ్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌ ఐఎస్‌ సదన్‌ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఎంబీ భవన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వరకు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిర్వాసితులపై పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన ..
ఖమ్మం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా కొనసాగిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేశారు. ప్రజలపై దాడుల చేయడం సరైంది కాదని కాంగ్రెస్‌ నాయకులన్నారు.

నిజామాబాదు జిల్లాలో వామపక్షాల ఆందోళన..
నిజామాబాదు జిల్లా.. బోధన్‌లో ఆర్డీవో కార్యాలయం ముందు వామపక్షాలు.. ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై లాఠీచార్జ్‌ చేయించడం సిగ్గుచేటన్నారు.

ఆదిలాబాద్ లో సీపీఎం ఆందోళన..
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదిలాబాద్‌ జిల్లాలో సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి... ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆదిలాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇదే తీరుగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజల్లో బుద్ది చెబుతారని కాంగ్రెస్‌ నేతలన్నారు.

నల్లగొండ జిల్లాలో ప్రతిపక్షాల ఆందోళన..
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల ధమనకాండకు నిరసనగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సీపీఎం సహా ఇతర వామపక్షాలు.. కాంగ్రెస్, టీడీపీ వేర్వేరుగా.. పలు ప్రాంతాలలో ఉమ్మడిగా నిరసనకు దిగాయి. ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిర్వాశితులపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
మొత్తానికి మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. 

ప్రణబ్ కు దీదీ శుభాకాంక్షలు..

పశ్చిమబెంగాల్ : భారత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ ప్రథమ పౌరుడిగా విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న ప్రణబ్‌గారికి దీదీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఆప్ ఎమ్మెల్యేకు పోలీస్ కస్టడీ ..

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఒక రోజు పోలీస్ కస్టడీని విధించింది. విద్యుత్ కోతలపై అడిగేందుకు ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ నివాసానికి వెళ్లగా..ఎమ్మెల్యే తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఓ మహిళ కోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టు స్పందిస్తూ అమానతుల్లా ఖాన్ ను ఒక రోజు కస్టడీకి తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

18:18 - July 25, 2016

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఉద్యోగాల భరోసా ఏది? ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జాడ ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిర్వేదంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రొ.హరగోపాల్ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు)సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ)అద్దంకి దయాకర్ (కాంగ్రెస్ నేత) నారాయణ (యూటీఎఫ్ ) పాల్గొన్నారు. ఈ మెగా డిబేట్ లో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను వెలిబుచ్చారో ...నిరుద్యోగులకు ఎటువంటి సూచనలిచ్చారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారం తెలుసుకోండి..

బ్లేడుతో ప్రేమోన్మాది దాడి..

విజ‌య‌న‌గ‌రం : గాజులరేగ‌లో ఈరోజు దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న‌ను ప్రేమించ‌ట్లేద‌నే కార‌ణంతో ఓ యువ‌తి గొంతు కోశాడు ప్రేమోన్మాది. యువ‌తిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. సోమవారం  మ‌ధ్యాహ్నం ఒక్కసారిగా యువతి ఇంట్లోకి ప్ర‌వేశించిన విక్ర‌మ్ యువ‌తిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతో వాదించాడు. దీనికి స‌ద‌రు యువ‌తి ససేమిరా అనడంతో విక్ర‌మ్ ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

 

రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి...

బిహార్‌: బిహార్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది దుర్మరణం పాలయ్యారు. ముజఫర్‌పూర్‌ సమీపంలోని ఆషియాపూర్‌ వద్ద బస్సు-ఆటో ఒకదానినొకటి ఢీకొంది. దీంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వీసీల నియామకం..కోర్టు ఆగ్రహం..

హైదరాబాద్ : ప్రభుత్వం వీసీల నియమాకంపై హైకోర్టు ఆసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో విచారణ కోనసాగుతుండగా నియమాకాలు చేపట్టారని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 ఏళ్లుగా ఆగిన వారు రెండు, మూడు రోజుల ఆగలేరా అని కోర్టు ప్రశ్నించింది. తర్వాత ఏం చేయాలో తనకు తెలుసని వాఖ్యానించింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. వాదనలు ప్రారంభమైన కొద్ది సేపటికే వీసీల నియమాకంపై ఉత్తర్వులు వచ్చాయి. వీసీల నియామకం జీ.వో. చట్టానికి విరుద్దంగా ఉంది. అనుభవాన్ని తగ్గించి... సంబంధం లేని శాఖలవారిని నియమిస్తామని భావించడం సరికాదని ఓ.యూ.

17:53 - July 25, 2016

ఢిల్లీ : ఇది సంస్కరణల యుగం. 1991 జులైలో మొదలైన సంస్కరణలకు పాతికేళ్లొచ్చాయి. అయితే, ఎకనామికల్ రిఫార్మ్స్ ఎవరికేమిచ్చాయి? సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? సీరియస్‌ గా చర్చించుకోవాల్సిన సందర్భమిది.

సంస్కరణలకు పాతికేళ్లు...
పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు పాతికేళ్లు నిండాయి. వాటిని మరింత వేగవంతం చేసే పనిలో నరేంద్రమోడీ ప్రభుత్వం వుంది. పాతికేళ్లు తక్కువ సమయం కాదు. సంస్కరణల పర్వం మొదలైన క్షణాల్లో మన నట్టిళ్లలో అంబాడినవారు, ఎలిమెంటరీ స్కూళ్లలో చదువుకున్నవారు ఇప్పుడు పీజీలు, పిహెచ్ డిలు పూర్తి చేశారు. నాడు ఉద్యోగాల్లో చేరినవారు ఇప్పుడు రిటైరవుతున్నారు. నాడు పెళ్లిళ్లు చేసుకుని సంసారాలు ప్రారంభించినవారు ఇప్పుడు తమ పిల్లల పెళ్లిళ్లు చేసే సన్నాహాల్లో వున్నారు. వీరిలో భవిష్యత్ పట్ల నిశ్చితంగానూ, ధీమాగానూ, సంతోషంగానూ వున్నవారెందరు? ఈ ప్రశ్నకు మనం చెప్పుకునే సమాధానమే పాతికేళ్ల సంస్కరణలు ఎవరికేమిచ్చాయో రూఢీ చేస్తాయి.

1990లో రూ. 100లతో స్కూల్ చదువు..
1990లో వంద రూపాయల ఖర్చుతో స్కూల్ చదువు ముగిసేది. నాలుగైదు వందల ఖర్చుతో కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తయ్యేది. అప్పుడు అందరూ ఒకే పాకల కింద, ఒకే బెంచీల మీద కూర్చొని చదువుకునేవారు. జిల్లా కలెక్టర్ పిల్లలైనా, దినసరి కూలీల పిల్లలైనా అందరికీ ఒకే చోట ఒకే రకమైన అవకాశాలుండేవి. మరిప్పుడేం జరుగుతోంతో మనకు తెలుసు. నర్సరీలో అడ్మిషన్ కోసమే లక్ష రూపాయలు వసూలు చేసే స్కూళ్లొచ్చాయి. కోటి రూపాయల కట్టలు విసిరేయగలిగేవారిదే మెడికల్ సీటు. నాడు ఏ చదువైనా ప్రభుత్వ స్కూళ్లల్లో ఫ్రీగా చదువుకున్నవారు ఇప్పుడు తమ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుంటున్నారు. ఇవి తిరిగి చెల్లించనివారు బ్యాంక్ జాబ్స్ కి అప్లయ్ చేయడానికి అనర్హులంటూ కొద్దిరోజుల క్రితమే పెట్టిన ఆంక్షలు పెద్ద దుమారమే స్రుష్టించాయి. సంస్కరణల యుగంలో పరిశ్రమలు పెడతామంటూ, ఫ్యాక్టరీలు స్థాపిస్తామంటూ లక్షల, కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నవారు, మన బ్యాంక్ లను ముంచేసి, విదేశాలకు ఎగిరిపోతున్నా, ఏమీ చేయలేని దుస్థితి. సంస్కరణల వల్ల ఎవరి డొక్కలు ఎండిపోతున్నాయో, ఎవరి బొజ్జలు నిండుతున్నాయో అర్ధమవుతూనే వుంది కదా.

వైద్య రంగంలోకి భారీగా ప్రయివేట్ పెట్టుబడులు..
ఈ పాతికేళ్లలో వైద్య రంగంలోకి భారీగా ప్రయివేట్ పెట్టుబడులొచ్చాయి. మన కళ్లెదుటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ శాఖోపశాఖలుగా విస్తరించాయి. కానీ, ఏం లాభం? వైద్య ఖర్చులు భరించలేక ప్రతి ఏటా ఆరు లక్షల మందికిపైగా పేదరికంలోకి దిగజారుతున్న భయంకర వాస్తవాన్ని ప్రభుత్వ సర్వేలు చెబుతున్నాయి. ప్రయివేట్ నర్సింగ్ హోమ్ లు కార్పొరేట్ హాస్పిటల్స్ గా మారుతుంటే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరిన ఎలుకలు పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. పాతికేళ్ల సంస్కరణలు సర్కారీ దవాఖానాలకు ఏమిచ్చాయి? ఏగతి పట్టించాయి? రిఫార్మ్స్ లో హ్యూమన్ ఫేస్ వట్టి భ్రమ.
మానవ సమూహానికి కల్పిస్తున్న సామాజిక భద్రత ఏమిటి?..
అందరికీ సామాజిక భద్రత పాతికేళ్ల ఒక ఆదర్శం. 30 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో శ్రమించినవారికి, రిటైర్మెంట్ తర్వాత జీవితం నిశ్చితంగా సాగేలా పెన్షన్ స్కీమ్ లుండేవి. మరిప్పుడు కంట్రిబ్యూటరీ స్కీమ్ లు వద్దంటూ, పాత పెన్షన్ విధానమే కావాలంటూ పోరాటాలు. సంస్కరణల యుగం చివరకు మిగిల్చిందేమిటి? మానవ సమూహానికి కల్పిస్తున్న సామాజిక భద్రత ఏమిటి?

ఆత్మహత్యలు పాపం సంస్కరణల యుగానిది కాదా?
అవును. నిజమే పివి, మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించడానికి ముందు విదేశీ మారకద్రవ్య నిల్వలు హరించుకుపోయి, బంగారాన్ని కుదవపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు దారితీసిన కారణాలు ఏమైనా కావొచ్చు. అదొక వాస్తవం. ఇవాళ బంగారం నిల్వలు సమృద్ధిగానే వున్నాయి. కానీ, సగటు వేతన జీవి, తన చిట్టితల్లి పుట్టిన రోజున తులం బంగారంతో ఓ చిన్న గొలుసు బహుకరించగలడా? పిల్లల ఫీజుల కోసమో, ఎరువుల కోసమో, అత్యవసర వైద్యం కోసమో బ్యాంక్ లో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించుకోలేక, చేసిన అప్పు తీరే దారిలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ పాపం సంస్కరణల యుగానిది కాదా? ఒకటి నిజం. సంస్కరణల యుగం మొదలైన తర్వాత మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చాయి. కానీ, వాటిలో వస్తూత్పత్తి రంగంలోకి వచ్చినవెన్ని? సేవారంగంలోకి వచ్చినవెన్ని? కొత్త ఉద్యోగాలు సృష్టించినవెన్ని? గ్రామీణ ఉపాధిని, కుటీర, చిన్న పరిశ్రమలను ధ్వంసం చేసినవెన్ని? సంస్కరణలను ప్రేమించేవారు ఇప్పటికైనా నిజాయితీగా లెక్కలు తీస్తే మంచిది. 

17:31 - July 25, 2016

వరంగల్‌ : వరంగల్ పేరు చెప్పగానే..చటుక్కున గుర్తొచ్చేది కాకతీయుల పాలన. దేవాలయాలపై కాకతీయులు అద్భుతంగా మలచిన కళలు, సాహిత్యాన్ని తెలిపే అలనాటి శిల్పకళా నైపుణ్యాన్ని చూస్తే ఎవరైనా అబ్బురపడాల్సిందే. చూడగానే ఆకట్టుకునే అనేక శిల్పాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరి కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. పాలకులు మారినా.. ప్రభుత్వాలు ఎన్నొచ్చినా.. వాటిని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. వరంగల్‌ జిల్లాలో కాకతీయులు నిర్మించిన దేవాలయాల స్థితిగతులపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...!

కళల కాణాచిగా పేరుగాంచిన ఓరుగల్లు..
కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతిబింబాలైన గుళ్లు, గోపురాలు..దేవాలయాలపై జీవకళ ఉట్టిపడే శిల్పకళా నైపుణ్యం..శిథిలమవుతున్న శిల్పాలను పట్టించుకున్నవారు మాత్రం శూన్యం. ప్రఖ్యాత కాకతీయుల కాలం నాటి శిల్పాలకు ప్రసిద్ధి గాంచిన ఓరుగల్లు ఆలయాలు.. కళా విహీనంగా మారి ప్రమాదం అంచునకు చేరాయి. జిల్లాలోని ప్రఖ్యాత దేవాలయాలపై మలచిన శిల్పాలన్నీ శిథిలావస్థకు చేరి దుర్భర స్థితికి చేరుకున్నాయి. దేవాలయాలను పరిరక్షించే నాథుడే లేక వేల ఏళ్ల చరిత్రకు ప్రతిబింబాలుగా నిలిచిన గుళ్లు, గోపురాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

జిల్లావ్యాప్తంగా దాదాపు 300 దేవాలయాలు ..
కాకతీయులు నిర్మించిన దేవాలయాలంటే.. ముఖ్యంగా వేయిస్థంభాల గుడి, ఓరుగల్లు కోట, రామప్పగుడితో పాటు జిల్లావ్యాప్తంగా దాదాపు 3 వందల దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలపై అత్యద్భుతంగా మలచిన శిల్పాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ శిల్పకళా వైభవానికి ప్రతిబింబాలుగా ఉన్న దేవాలయాలు ఒకప్పుడు నిత్యపూజలు అందుకుని ఎంతో ప్రసిద్ధి చెందాయి.

గుప్తనిధుల వేటతో పూర్తిగా ధ్వంసమైన పలు శివాలయాలు ..
కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన పలు శివాలయాలు గుప్తనిధుల వేటతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. పూర్తిగా ఇసుకతో నిర్మించిన అనేక ఆలయాలు పిచ్చి మొక్కలు, గబ్బిలాలకు ఆవాసాలై నిర్జీవంగా మారాయి. కొన్ని ఆలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ వాటిపై నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. వరంగల్ రూరల్‌ ప్రాంతాలైన ఘనపురం, ముప్పారం, ఎల్కుర్తి తదితర మండల కేంద్రాల్లోని దేవాలయాలను గుప్త నిధుల కోసం కొల్లగొట్టారు. కొన్ని దేవాలయాలు కూలిపోగా, మరికొన్ని నేలమట్టం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. పంచలోహాల కోసం ముప్పారం ముఖ్యనాథ ఆలయంలోని రాళ్లను డ్రిల్‌ చేయడంతో..ఆలయం శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడంతో.. శివ లింగాలు, నంది విగ్రహాలు, ఇతర విగ్రహాలన్నీ ధ్వంసమయ్యాయి. చారిత్రక నేపథ్యం గల ఆలయాలను గ్రామస్తులు, అధికారులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికైనా అధికారులు ఆలయాలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

150 కాకతీయుల ఆలయాలపై అధ్యయనం...
వరంగల్‌ జిల్లాలోని పలు దేవాలయాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇన్‌టెక్‌ ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ సంస్థ ఇప్పటికే ఓ నివేదకను తయారు చేస్తోంది. దేవాలయాల్లోని శిల్పకళలను కాపాడేందుకు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ను కూడా ఇన్‌టెక్‌ నిర్వహిస్తోంది. అయితే వరంగల్‌ జిల్లాలోని మరో 150 కాకతీయుల ఆలయాలపై అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రభుత్వం పురావస్తుశాఖ ద్వారా వీటికి ప్రత్యేక రక్షణ కల్పించాలని హెరిటేజ్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు కోరుతున్నారు.

ఆలయాలను పరిరక్షించాలని కోరుతున్న స్థానికులు...
ప్రభుత్వం వెంటనే పురాతన ఆలయాల రక్షణ చర్యలు తీసుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక దేవాలయాలకు పునర్‌ వైభవాన్ని తీసుకురావచ్చన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. ఇప్పటికైనా కాకతీయుల నాటి ఆలయాలను... కాలగర్భంలో కలిసి పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

17:21 - July 25, 2016

ఢిల్లీ :  కేవీపీ ప్రైవేటు బిల్లుపై తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ ఏపీని విభజించి మరణ శాసనం రాసిందని, ఇప్పుడు సంతాప సభ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని సీఎం రమేష్‌ అన్నారు. 

17:18 - July 25, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లు మరోసారి రాజ్యసభలో దుమారాన్ని లేపింది. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ ముందుగా సభలో బిల్లు అంశాన్ని సభలో ప్రస్తావించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా బిల్లు రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. సభ్యుడి హక్కులను కాలరాసిందని ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. వచ్చే శుక్రవారం రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అయితే బిల్లును వచ్చే శుక్రవారం చర్చించడం వీలుకాదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. అంతేకాదు ఆగస్టు 5న కేవీపీ ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తావించారు. పోడియంను సభ్యులు ముట్టడించడంతో సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్‌ కురియన్‌ నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ కావాలనే బిల్లును అడ్డుకుంటోంది : జైరాం రమేష్
అంతకు మునుపు కేవీపీ ప్రైవేటు బిల్లుపై ఎంపీ జైరాం రమేష్ స్పందించారు. బీజేపీ కావాలనే కేవీపీ ప్రైవేట్ బిల్లును అడ్డుకుంటోందని జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. స‌భ‌లో బిల్లుల‌పై త‌క్షణం ఓటింగ్ నిర్వహించాల‌ని డిమాండ్ చేశారు. 

16:48 - July 25, 2016

విజయనగరం : జిల్లా మోదవలసలోని క్రిస్టియన్ బైబిల్‌ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం సృష్టించింది. విద్యార్థినులను యూనివర్సిటీ జాయింట్‌ డైరక్టర్ ప్రసన్నబాబు వేధిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఆయనపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

16:43 - July 25, 2016

మెదక్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతులు కన్నీళ్లు కార్చిన ఏ దేశం బాగుపడలేదని... రైతులపై తుపాకులు ఎక్కుపెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. వేములగట్టులో మల్లన్నసాగర్‌ బాధితుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన తమ్మినేని.. కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

16:41 - July 25, 2016

వరంగల్ : హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆసుపత్రి ఘటన మరకముందే.. వరంగల్ జిల్లా ఎంజిఎం ఆసుపత్రిలో మరోదారుణం వెలుగులోకి వచ్చింది. ఎంజీఎం ఆసుపత్రిలో నకిలీ మందుల బాగోతం కలకలం రేపింది. ఆసుపత్రికి సరఫరా చేసిన సూదిమందులో ఫంగస్ ను గుర్తించారు. అయితే పేషెంట్లకు ఇంజెక్షన్ చేయకముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. బాలాజీ ఫార్మాసిటీ నుంచి ఈ మందుల కొనుగోలు జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు రహస్యంగా ఉంచాయి. 

16:39 - July 25, 2016

హైదరాబాద్ : కుషాయిగూడంలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. కుషాయిగూడలోని రాఘవేంద్ర ఆసుపత్రిలో డెలీవరి కోసం ఓ మహిళ చేరింది. మహిళ ప్రసవించిన అనంతరం శిశువుకు డాక్టర్లు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది వికటించి శిశువు మృతిచెందింది. శిశువు మరణానికి డాక్టరే కారణమంటూ హస్పటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు.

16:36 - July 25, 2016

హైదరాబాద్ : వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. కేసు పెండింగ్‌లో ఉండగా వీసీలను ఎలా నియమిస్తారని కోర్టు ప్రశ్నించింది. రెండేళ్లుగా ఆగిన వారు రెండు, మూడు రోజులు ఆగలేరా అని హైకోర్టు ప్రశ్నించింది. నియామకాలపై వాదనలు పూర్తికాగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. 

16:23 - July 25, 2016

హైదారబాద్ : ఫిలింనగర్‌లో భవనం కూలిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్న కేటీఆర్...సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారి సస్పెన్షన్‌కు ఆదేశించారు. అంతేకాకుండా... ఫిలింనగర్ కల్చరల్ క్లబ్, ఇంజినీర్, కాంట్రాక్టర్లపై... క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు.

జేఎన్ టీయూ నివేదిక కోరాం : గౌరవ ఉప్పల్
ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద భవనం కూలిన ఘటనపై జేఎన్ టీయూ ఇంజనీర్లను నివేదిక కోరామని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. నిర్మాణ నాణ్యతలో లోపాలున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. జేఎన్ టీయూ ఇంజనీర్ల నుంచి నివేదిక రాగానే ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

భవనం కూలిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం..

హైదరాబాద్ : నగరంలోని ఫిల్మ్ నగర్ భవనం కూలిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ కు ఫోన్ చేసిన వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిల్మ్ నగర్ కల్చరల్, క్లబ్, ఇంజనీర్, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

15:51 - July 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం వీసీలను నియమించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ... తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబయ్య... అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా కే. సీతారామరావు... జేఎన్టీయూ వీసీగా ఆచార్య వేణుగోపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వీరిని ఉపకులపతులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

15:49 - July 25, 2016

విశాఖ : నాలుగు రోజుల క్రితం ఐఏఎస్ విమానంలో గల్లంతైన భూపేంద్రసింగ్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. విశాఖపట్నం మర్రిపాలెంలో భూపేంద్రసింగ్‌ కుమారుడితో మాట్లాడి దైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. అధైర్యపడవద్దని జగన్‌ సూచించారు. అయితే విమానం జాడ తెలియక నాలుగు రోజులు అవుతుండడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

15:47 - July 25, 2016

హైదరాబాద్ : ఎంసెట్-2 పరీక్ష పేపర్ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందుకోసం నాలుగు టీమ్‌లతో సీఐడీ దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంలో ఐదుగురు విద్యార్థులు కాపీ కొట్టినట్లు అనుమానిస్తున్నారు. జేఎన్టీయూ, రెండు కోచింగ్‌ సెంటర్లతోపాటు ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులను సీఐడీ విచారించనుంది. మిగతా వివరాలకు ఈ వీడియోను చూడండి..

15:41 - July 25, 2016

ఢిల్లీ : రాజ్యసభ ఎంపీ పదవితోపాటు, బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మౌనం వీడారు. పంజాబ్‌ రాజకీయాలను దూరంగా ఉండాలని పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. చాలా కాలంపాటు బీజేపీ నేతల అడుగులకు మడుగులు ఎత్తానని, పంజాబ్‌ రాజకీయాలకు దూరంగా ఉండాలి కమలనాథులు ఆదేశించిన తర్వాతే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. అయితే ఒత్తిడి తెచ్చిన నేతలు ఎవరన్న విషయాన్ని ఆయన బయపెట్టలేదు. రాజీనామా తర్వాత ఆప్‌లో చేరతారని జరుగుతున్న ప్రచారంపై కూడా సిద్ధు నోరు విప్పలేదు. 

15:37 - July 25, 2016

హైదారబాద్ : మల్లన్నసాగర్‌ భూసేకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నదొకటి, చేస్తున్నది మరొకటని తెలంగాణ టీడీపీ విమర్శించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకుంటామని చెబుతూ... 123 జీవోను అమలు చేస్తున్నారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండ్డిపడ్డారు.

కుషాయిగూడలో విషాదం...

హైదరాబాద్ : కుషాయిగూడంలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. కుషాయిగూడలోని రాఘవేంద్ర ఆసుపత్రిలో డెలీవరి కోసం ఓ మహిళ చేరింది. మహిళ ప్రసవించిన అనంతరం శిశువుకు డాక్టర్లు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది వికటించి శిశువు మృతిచెందింది. శిశువు మరణానికి డాక్టరే కారణమంటూ హస్పటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు.

14:20 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జ్‌ని నిరిసిస్తూ మెదక్‌ జిల్లాలో బంద్‌ జరుగుతోంది. విపక్షాలు ఇచ్చిన పిలుపుతోప్రజలు బంద్‌ పాటిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి బస్సు డిపో వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది
టీ జాక్ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు  
మల్లన్నసాగర్ లాఠీఛార్జ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీ జాక్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముంపు గ్రామాల్లో వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థిత్రి ఉద్రిక్తంగా మారింది.
లాఠీచార్జిని ఖండించిన జేఏసీ నేతలు  
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నేడు జేఏసీ నేతలు పర్యటించనున్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై లాఠీచార్జి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. కోదండరాం నేతృత్వంలోని బృందం ఈరోజు ముంపు గ్రామాల్లో పర్యటించి, నిర్వాసితులను పరామర్శించనుంది.

14:17 - July 25, 2016

హైదరాబాద్ : ప్రజల సమ్మతితోనే భూసేకరణ జరుగుతోందని ఎవరిపైనా ఒత్తిడి తీసుకురావడం లేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. 8 గ్రామాలలో ఆరు గ్రామాలు భూసేకరణకు అంగీకరించాయన్నారు. ముంపు గ్రామస్తులతో చర్చిస్తున్నామని చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఏ టెంట్ల కింద నిరసనలు తెలిపారో ఆ టెంట్ల కిందే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్... నాడు వారి హయాంలో పులిచింతల ప్రాజెక్టును ఎలా కట్టారని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల తెలంగాణలో మూడో పంట పండుతుందని... రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. మల్లన్నసాగర్ ను ఇతర రాష్ట్రాలోని ప్రాజెక్టులతో ముడిపెడుతున్నారని.. హర్యానా ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు పొంతన లేదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై రాద్దాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రాజెక్టులు కావాలా... పంచాయతీలు కావాలా.. అని ప్రశ్నించారు. 

 

14:13 - July 25, 2016

హైదరాబాద్ : తెలంగాణను రాక్షస రాజ్యంగా, పోలీసు రాజ్యంగా మారుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. లాఠీచార్జ్ లో ప్రజలతోపాటు ఉద్యమకారులకూ గాయాలయ్యాయని తెలిపారు. దాదాపు 200 మంది ప్రజలకు గాయాలయ్యాయని తెలిపారు. పదుల సంఖ్యల్లో మందికి చేతులు, కాళ్లు విరిగాయన్నారు. నిరసన తెలిపే కనీస ప్రజాస్వామ్య హక్కు...లేదా అని ప్రశ్నించారు. 4 నెలలుగా మల్లన్నసాగర్ నిర్వాసితులు పోరాడుతున్నారని చెప్పారు. గ్రామాలను పోలీసు క్యాంప్ లుగా మార్చుతున్నారని మండిపడ్డారు. డీఎస్పీ చాలా అతిగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు నెంబర్ వన్ అబద్దాల కోరు అని ఎద్దేవా చేశారు. రిజర్వాయర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నా... నిపుణుల సూచనలు పాటించడం లేదన్నారు. రైతులపై కాల్పులు జరిపిన ఏ ప్రభుత్వం మనుగుడ సాధించలేదని చెప్పారు. 'మీకు పోయే కాలం దాపురించే.. ఈ చర్యలకు పూనుకుంటున్నారని ప్రభుత్వంను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు చేయలేదనడం సిగ్గుమాలినచర్యగా ఆయన అభివర్ణించారు. హరీశ్ రావు తీరు బాధాకరమన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని... నష్టపరిహారం చెల్లించాలన్నారు. కానీ పోలీసుల రాజ్యం చేయాలనుకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 

13:50 - July 25, 2016

ఢిల్లీ : నిబందలకు విరుద్ధంగా లోక్‌సభ కార్యకలాలను చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన ఆప్‌ ఎంపి భగవత్‌ సింగ్‌ మాన్‌ వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ విచారణకు ఆదేశించారు. బీజేపీ ఎంపీ కిటీట్‌ సోమయ్య అధ్యక్షతన ఏర్పాటైన  విచాణ కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. మంగళవారం విచాణ కమిటీ ముందు హాజరుకావాలని మాన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఆదేశించారు. వచ్చే నెల 3వ తేదీలోగా నివేదిక అందచేయాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌... విచారణ కమిటీని ఆదేశించారు. కమిటీ నివేదికను పరిశీలించి తదుపరి చర్యలు ప్రకటించే వరకు లోక్‌సభ సమావేశాలకు హాజరుకావొద్దని భగవంత్‌ సింగ్‌ మాన్‌ను సుమిత్రా మహాజన్‌ ఆదేశించారు. 

 

13:35 - July 25, 2016

శ్రీకాకుళం : చుట్టూ అందమైన కొండలు..పచ్చని చెట్లు..కొండలపై నుండి జాలువారే జలపాతం చూపురులను ఇట్టే కట్టిపడేస్తోంది. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు  ప్రాంతంలో ప్రకృతి సిద్ధమైన ఆ సోయగాలను వీక్షిస్తూ.. పర్యాటకులు మంత్రముగ్థులవుతున్నారు. 
ప్రకృతి సిద్ధమైన గండహతిజలపాతం 
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం గొప్పిలికి సమీపంలో ప్రకృతి సిద్ధమైన గండహతిజలపాతం అందరిని ఆకర్షిస్తోంది. పాలనురగలను ఆకాశం నుండి పడేస్తోందా.. అన్నట్లు ఉండే.. గండాహతి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, పలాస, మెలియపుట్టి ,కొత్తూరు ప్రాంత వాసులతో పాటు ఒడిస్సా రాష్ట్రంలోని గజపతి ప్రాంత వాసులకు గండహతి జలపాతం ఓ పిక్నిక్ స్పాట్ . ఎత్తైన కొండల నుండి జాలువారే జలపాతం అందాలను ఆస్వాదిస్తూ.. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలవారు ఆనందంగా గడుపుతున్నారు.
పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య 
సాధారణంగా చల్లనైన వాతావరణంతో పాటు ఒక రోజంతా ఇక్కడ ఆనందంగా గడిపేందుకు వీలుండడంతో.. పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. విందులు వినోదాలతో గండహతి పిక్నిక్ లకు నెలవుగా మారడంతో.. ఆదివారాలు పిల్లా పెద్దలతో జలపాతం కళకళలాడుతోంది. కొండ అందాలు..పరవశింపజేసే ప్రకృతి అందాలు.. పర్యాటకులను మరింత మంత్రమగ్థులను చేస్తున్నాయి. 
పర్యాటకులు సంతృప్తి 
గండహతి జలపాతం వద్ద చెక్క వంతెనలు స్నానాలు చేసేందుకు అనువుగా ఉండడంతో.. పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా..ఒడిస్సా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రవాణాకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే.. పర్యాటకుల సంఖ్య  పెరుగుతుందని... అంటున్నారు గండహతిని సందర్శిస్తున్నవారు. 

 

భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి - తమ్మినేని..

హైదరాబాద్ : భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై లాఠీఛార్జీకి నిరసనగా విపక్షాలు మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తమ్మినేని మీడియాతో మాట్లాడారు. లాఠీఛార్జీలో ప్రజలతో పాటు ఉద్యమకారులకూ గాయాలయ్యాయని, మంత్రి హరీష్ రావు తీరు చాలా దారుణంగా ఉందన్నారు. 2013 చట్టం కోరుకున్న వారికి అమలు జరుపుతామంటున్నారని, తెలంగాణను రాక్షస రాజ్యంగా మార్చివేశారని విమర్శించారు. రైతులపై కాల్పులు జరిపిన ఏ ప్రభుత్వం మనగడ సాగించలేదన్నారు.

ప్రజల సమ్మతితోనే భూ సేకరణ - హరీష్ రావు..

హైదరాబాద్ : ప్రజల సమ్మతితోనే భూ సేకరణ జరుగుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల లాఠీఛార్జ్ కు నిరసనగా విపక్షాలు మెదక్ జిల్లా బంద్ కు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టప్రకారమే పరిహారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదని, ముంపు గ్రామాల రైతులతో తాము చర్చించడం జరుగుతోందన్నారు. ఏ టెంటు కింద నిరసనలు చేశారో అదే టెంటు కింద రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయన్నారు. మెదక్ జిల్లాలో ప్రతిపక్షం ఇచ్చిన బంద్ విఫలమైందని చెప్పుకొచ్చారు.

13:03 - July 25, 2016

తమిళనాడు : చెన్నైలో కనిపించకుండాపోయిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఆచూకీ ఇంకా దొరకలేదు.. నాలుగోరోజుకూడా అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.. ఈ విమానం మిస్‌అయిన ప్రదేశం బంగాళాఖాతానికి 4కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.. ఇక్కడే విమానం పడిపోయిఉంటే విమానం శకలాలు కనుక్కోవడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. జలాంతర్గాములైనా 200మీటర్ల లోతులోని వస్తువుల్ని మాత్రమే గుర్తిస్తాయని నావికాదళ అధికారులు చెబుతున్నారు.. అంతుకుమించి లోతులోపడితే అత్యాధునిక సాంకేతిక పరికరాలున్న జలాంతర్గాములు అవసరమని... అవి దేశంలో అందుబాటులో లేవని స్పష్టం చేస్తున్నారు..
కొనసాగుతున్న గాలింపు
మరోవైపు విమానంకోసం మూడు జలాంతర్గాములు సహా 20 నౌకలు, 10 విమానాలు బంగాళాఖాతంలో గాలింపు చేస్తున్నాయి.. విమానం జాడను కనిపెట్టేందుకు అధికారులు ఉపగ్రహం సాయం కూడా తీసుకుంటున్నారు.. వాతావరణం అనుకూలించక హైదరాబాద్‌లోని శాటిలైట్‌ పరిశోధన కేంద్రం గాలింపు విఫలమైంది. విమానం మాయమైన ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉండటం, వర్షాలు కురవడంతో శాటిలైట్‌ అన్వేషణ ఫలించలేదు.. ఈ విమానంకోసం చేపట్టిన ఈ ఆపరేషన్ దేశంలోనే రక్షణ శాఖ చేపట్టిన అతిపెద్దదని అధికారులు చెబుతున్నారు. 
ప్రతికూల వాతావరణంతో ప్రమాదం ..?: అధికారులు  
అటు అదృశ్యమైన విమానం ప్రతికూల వాతావరణంతో ప్రమాదానికి గురై ఉండొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.. విమానం బంగాళాఖాతం మీదుగా వెళుతుండగా దట్టమైన మేఘాలు, పెనుగాలుల మధ్య చిక్కుకుందంటూ పైలట్‌నుంచి కంట్రోల్‌రూంకు సమాచారం వచ్చింది.. మరో మార్గంలో విమానాన్ని నడిపేందుకు పైలట్‌ అనుమతి కోరారని అధికారులు చెబుతున్నారు.. ఈలోగానే కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలు తెగి విమానం గల్లంతైందని స్పష్టం చేస్తున్నారు.. అప్పటినుంచి ఇంతవరకూ విమానంలోని బ్లాక్‌బాక్స్‌ సిగ్నల్‌ అందలేదు.. భూభాగం అయితే బ్లాక్‌బాక్స్‌ సిగ్నల్స్‌ 30 రోజుల వరకు వస్తాయి... అదే సముద్రంలో పడితే 96 గంటల వరకే సిగ్నల్స్‌ అందుతాయి.. సముద్రంలో కూలిన తర్వాత 96 గంటలలోపు బ్లాక్‌బాక్స్‌ సిగ్నల్స్‌ అందకపోతే ఆ విమానం జాడ తెలుసుకోవడం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు
విమానం జాడ తెలియక బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. ఉద్యోగుల్లో కొందరు గజ ఈతగాళ్లున్నారని.. వారు ప్రమాదంనుంచి బయటపడి ఉంటారని కొన్ని కుటుంబాలు ఆశిస్తున్నాయి.. ఏ క్షణంలో ఎవరు వస్తారో? ఏ సమాచారం తెస్తారో అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు.. అటు విమానం అదృశ్యమైనవారి బంధువులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్‌ ఇవాళ విశాఖ వెళ్లబోతున్నారు.

 

బద్రాస్ సెక్టార్ లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు..

జమ్మూ కాశ్మీర్ : 17వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ పాల్గొన్నారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

12:55 - July 25, 2016

టాలీవుడ్..ఏ వుడ్ అయినా వారసుల ఎంట్రీ జరుగుతూనే ఉంటుంది. అంటు తండ్రి..ఇటు తనయులు నటిస్తూ అభిమానులను రంజింప చేస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో వెంకటేష్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తన తనయుడు 'అర్జున్' వచ్చేదాక నటిస్తూనే ఉంటానని స్వయంగా వెంకీ పేర్కొన్నాడు. మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా అని వెల్లడించాడు.
వెంకటేష్ తాజా చిత్రం 'బాబు బంగారం' ఆడియో కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడారు. 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియలేదని, ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నట్లు పేర్కొన్నారు. కానీ బాబు బంగారం ట్రైలర్ చూసిన తర్వాత 'మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్ పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా' అని మారుతిని అడిగినట్లు తెలిపారు. మారుతి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

 

12:53 - July 25, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రాజెక్టులు, నిర్వాసితుల సమస్యలపై హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారులు, మహిళలు అని కూడా చూడకుండా లాఠీలతో కోట్టారని పేర్కొన్నారు. అమనుషంగా ప్రవర్తించారని వాపోయారు. లాఠీచార్జ్ చేసిన డీఎస్పీ, కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. 
ముంపుగ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు : చాడా   
మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలన్నారు. 123 జీవోను బలవంతంగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. 

పోలీసుల అదుపులో టి.టిడిపి నేత రేవంత్..

మెదక్ : తెలంగాణ‌ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న‌ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన వారిపై పోలీసుల లాఠీఛార్జిని ఖండిస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని ప‌లు చోట్ల కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. గ‌జ్వేల్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన‌ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ ను పోలీసులు దౌల్తాబాద్ పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

12:42 - July 25, 2016

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ అంశంపై రాజ్యసభలో రగడ జరిగింది. గత శుక్రవారం ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగాల్సి ఉండగా, అధికార బీజేపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో ఆ రోజు ఓటింగ్‌ జరపకుండా సభను వాయిదా వేశారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే  దీనిని ప్రస్తావించారు. అజెండాలో చేర్చిన బిల్లుపై ఓటింగ్‌ పెట్టకపోవడం సభ్యుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్‌ సభ్యులు అనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌ సభాధ్యక్ష స్థానంలోఉన్న డిప్యూటీ చైర్మన్‌ దృష్టికి తెచ్చారు.  వచ్చే శుక్రవారం ఓటింగ్‌ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనిపై తర్వాత నిర్ణయం  తీసుకుంటానని కురియన్‌ చెప్పారు. 

 

యూనివర్సిటీలకు వీసీలు..

హైదరాబాద్ : ఐదు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ వీసీగా వేణుగోపాల్ రెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీగా సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబశివరావు, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా సీతారామరావు, ఓయూ యూనివర్సిటీ వీసీగా రామచంద్రయ్యలు నియమితులయ్యారు.

12:38 - July 25, 2016

ముఖానికి అందం కళ్లు..అందం అంతా కళ్లలోనే ఉంటుంది. ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు. అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చే మహిళలు కనుబొమ్మల విషయంలో అంతగా పట్టించుకోరు. ఏదో ఒక షేప్ చేయించుకుంటుంటారు. కాని ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో అలోచించరు. మీ ముఖాకృతి ఏ తీరు కనుబోమ్మలని షేప్ చేయించుకుంటే బావుంటుందో చూద్దాం...
నుదురు చిన్నగా ఉన్నవారు కనుబోమ్మలు కొంచం వంపు తిరిగి ఉంటే బావుంటుంది.
నుదురు విశాలంగా ఉన్నవారికి కనుబొమ్మలు బాగా వంపు తిరిగి ఉండాలి.
గుండ్రటి ముఖం ఉన్న వారు కొద్దిపాటి కోణంతో వంపు తిరిగిన కనుబొమ్మలు నప్పుతాయి.
చతుర్రసాకారపు ముఖం గలవారు మాంగ్యులర్ ఐబ్రోస్ ఉంటే బాగుంటుంది.
కోల ముఖం ఉన్న వారు కనుబొమ్మలు స్ట్రెయిట్ గా ఉండాలి.
త్రికోణాకారపు ముఖం కలిగితే కనుబొమ్మలు వంపుతిరిగి ఉంటే బావుంటుంది.

12:31 - July 25, 2016

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. విదేశాల్లో సైతం ఈ చిత్రం షూటింగ్ జరిగింది. జార్జియా షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో.. వందల సంఖ్యలో గుర్రాలతో భారీ స్థాయిలో ఈ సన్నివేశాలు తీశారు. ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని తెలుస్తోంది. శాతకర్ణి డైరెక్టర్ జాగర్లమూడి రాధాకృష్ణ పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 8న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రమ్యను క్రిష్ పెళ్లాడబోతున్నాడు. గత నెలలోనే నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్టు 8వ తేదీ సమీపిస్తుండడంతో షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాలని బాలయ్యే స్వయంగా సూచించాడంట. క్రిష్ పెళ్లయ్యాక కొన్ని రోజులు మాత్రమే విరామం తీసుకుని.. ఆ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని బాలయ్య నిర్ణయించుకున్నారంట. బాలయ్య సరసన శ్రియ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సినిమాలో కబీర్ బేడి అలనాటి అందాల తార హేమమాలిని కూడా కీలక పాత్రలు పోషించనున్నారు.

భార్య..అత్త, మామ వేధింపులు భరించలేక..

కరీంనగర్ : జిల్లా పెద్దపల్లిలోని తెనుగువాడకు చెందిన సాదా సమ్మయ్య(28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, అత్తా మామ వేధింపులు భరించలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మరియు అత్తింటి వారి వేధింపుల వల్లనే చనిపోతునట్టు సూసైడ్ నోట్ పేర్కొన్నాడు.

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం..

కరీంనగర్ : జిల్లా జమ్మికుంట మండలం ఆబడిజమ్మికుంట గ్రామం వద్ద బైక్ ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రాంతి (25), శ్రీనివాస్ (23) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఢిల్లీకి చేరుకున్న గవర్నర్..

ఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోడీతో గవర్నర్‌ భేటీ అవుతారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో విభజన సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రణబ్‌ ఇవ్వనున్న విందులో గవర్నర్ పాల్గొంటారు.

అందుకే రాజీనామా చేశా - సిద్ధూ..

పంజాబ్ : ప్రముఖ కిక్రేటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తన రాజీనామాపై ఆయన వివరణ ఇచ్చారు. పంజాబ్ వైపు చూడవద్దని పేర్కొన్నారని, పంజాబ్ కంటే ఏ పార్టీ ఎక్కువ కాదని చెప్పారు.

12:12 - July 25, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. సంప్రదాయం ప్రకారం ఆలయం దగ్గర రంగం నిర్వహించారు. రంగంలోభాగంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని స్వర్ణలత రంగంలో చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బోనాలు సమర్పించి... అమ్మవారిని దర్శించుకున్నారు.

 

12:04 - July 25, 2016

మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం అప్రజాస్వామికమని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ నేత తాళ్లూరి శ్రీనివాస్, వైసీపీ నేత గౌతంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీడీపీ నేత సాంభశివరావు పాల్గొని, మాట్లాడారు. టీసర్కార్ నిరంకుశంగా పరిపాలన చేస్తుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రొ.కోదండరాం అరెస్టు అమానుషం - చుక్కారాములు..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ నిర్వాసితలపై లాఠీఛార్జీకి నిరసనగా అఖిలపక్షం ఇచ్చిన బంద్ కు మద్దతు తెలుపుతూ వెళ్లిన ప్రొ.కోదండరాం అరెస్టు అయ్యారు. ఈ అరెస్టును ప్రముఖ విద్యావేత్త చుక్కారాములు ఖండించారు. అరెస్టు అమానుషమని, భూ నిర్వాసితులపై అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ప్రొ.కొదండరాంను విడుదల చేయాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖాధికారులతో మంత్రి కామినేని భేటీ..

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి కామినేని భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాల్లో వైద్యఆరోగ్య సేవల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

 

ఆప్ ఎంపీపై స్పీకర్ చర్యలు..

ఢిల్లీ : పార్లమెంట్ లో వీడియో చిత్రీకరణపై ఆప్ ఎంపీ భగవంత్ మాన్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ చర్యలు తీసుకున్నారు. రేపటిలోగా వివరణనివ్వాలని మాన్ కు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. 9మంది సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి స్పీకర్ ఆదేశించారు. నివేదిక వచ్చేంత వరకు సభకు రావొద్దని ఎంపీ భగవత్ మాన్ కు స్పీకర్ సూచించారు.

మచిలీపట్నం భూసేకరణకు నేడు నోటిఫికేషన్..

విజయవాడ : మచిలీపట్నం పోర్టు భూ సేకరణకు నేడు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

11:52 - July 25, 2016

జైపూర్ : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్తాన్‌ కోర్టు తీర్పు చెప్పింది. 

 

11:48 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జ్‌ని నిరిసిస్తూ మెదక్‌ జిల్లాలో బంద్‌ జరుగుతోంది. విపక్షాలు ఇచ్చిన పిలుపుతో ప్రజలు బంద్‌ పాటిస్తున్నారు. మరోవైపు సంగారెడ్డి బస్సు డిపో వద్ద అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సిద్దిపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కోనసాగుతోంది. అఖిలపక్షం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 
 

11:44 - July 25, 2016

నల్లగొండ : జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ బస్సు బాలుడి ప్రాణం తీసింది. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడి మృతి చెందాడు. తుర్కపల్లి మండంలం నాగాయిపల్లిలో రోడ్డు పక్కన ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిని స్కూల్‌ బస్సు ఢీకొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 

 

11:38 - July 25, 2016

జర్మనీ : ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. జర్మనీలో మరోసారి ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. బెర్లిన్ లో సిరియా శరణార్థి బాంబు పేల్చాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. మరో 12 మందికి గాయాలయ్యాయి. బార్ లో పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. వారం వ్యవధిలో జర్మనీలో మూడుసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. 

 

లాఠీఛార్జ్ దారుణం - జస్టిస్ చంద్రకుమార్..

హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ జరపడం దారుణమని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రాజెక్టులు, నిర్వాసితుల సమస్యలపై ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్నారులు, మహిళల కూడా లాఠీళతో కొట్టారని, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

ప్రైవేటు బిల్లు అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్..

ఢిల్లీ : రాజ్యసభలో ప్రైవేటు బిల్లు అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. వచ్చే శుక్రవారం ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విజ్ఞప్తిని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ తిరస్కరించారు. నిబంధనల ప్రకారం ఆగస్టు 5వ తేదీన చేపడుతామని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. కేవీపీ ప్రైవేటు బిల్లు ఓటింగ్ కు రాకపోవడంపై ఆనంద్ శర్మ ప్రశ్నించారు. బిల్లుపై చర్చ జరగకుండా బీజేపీ అడ్డుకుందని, బీజేపీ ఉద్ధేశ్యపూర్వకంగా వాయిదా వేసిందని పేర్కొంది.

లష్కర్ బోనాల్లో భవిష్య వాణి..

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భవిష్యవాణి కార్యక్రమం ప్రారంభమైంది. వ్యాధులు రాకుండా చూస్తానని, చండీయాగాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అందరి సుఖ సంతోషాల బాధ్యత తనదేనని, కోరినన్ని వర్షాలు కురిపిస్తానని పేర్కొన్నారు.

11:16 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్ లాఠీచార్జ్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీజేఏసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిన్న మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవెల్లిలో నిర్వాసితులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్ తోపాటు పలువురు మహిళలు, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మల్లన్నసాగర్ లాఠీచార్జ్ బాధితులను పరామర్శించేందుకు జేఏసీ బృందం వెళ్తుంది. ఈక్రమంలో ఒంటిమామిడి వద్ద జేఏసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముంపుగ్రామాలకు వెళ్లడానికి అనుమతి లేదని నిరాకరించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా సుజనా చౌదరి ప్రమాణం చేశారు.

 

చిన్నమల్కాపురం వద్ద పోలీసుల తనిఖీలు..

కర్నూలు : డోన్ (మం) చిన్నమల్కాపురం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముగ్గురిని అరెస్టు చేసి మూడు నాటుబాంబులు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - రేవంత్..

హైదరాబాద్ : మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లాఠీఛార్జీలో గాయపడిన వారికి టిడిపి తరపున వైద్యం చేయిస్తామని, 123 జీవో ప్రకారం భూములు తీసుకొనేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఆగస్టు 13, 14వ తేదీన రైతులకు సంఘీభావంగా దీక్షలు చేపడుతామన్నారు.

కొనసాగుతున్న మెదక్ జిల్లా బంద్..

మెదక్ : జిల్లా బంద్ కొనసాగుతోంది. మల్లన్న సాగర్ నిర్వాసితులపై ఆదివారం జరిగిన పోలీసులా లాఠీఛార్జీకి నిరసనగా అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

జర్మనీలో మరో ఉగ్రదాడి..

జర్మనీ : మరో ఉగ్రదాడి జరిగింది. బెర్లిన్‌లో సిరియా శరణార్ధి బాంబు దాడికి పాల్పడ్డాడు. శరణార్ధితో సహా మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

10:41 - July 25, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. భరోహిలో స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది విద్యార్థులు ఉన్నారు. 

సల్మాన్ నిర్దోషి..

రాజస్థాన్ : అరుదైన బ్లాక్‌ బక్‌ జాతి జింకలను అక్రమంగా వేటాడి హతమార్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ పై రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇతను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.

అన్వేషణ కొనసాగుతోంది - నేవీ చీఫ్..

ఢిల్లీ : ఐఏఎఫ్ ఏఎన్ 32 విమాన ఆచూకి కనిపెట్టేందుకు అన్వేషణ కొనసాగుతోందని నేవీ చీఫ్ సునీల్ పేర్కొన్నారు. ఐఏఎఫ్, కోస్ట్ గార్డ్, నేవీ సహకారంతో గాలింపులు చేపడుతున్నట్లు, మొత్తం 17 షిప్స్ సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 17 నేవీకి చెందగా, 4 కోస్ట్ గార్డ్ కు చెందిన షిప్స్ ఉన్నాయన్నారు.

స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి..

నల్గొండ : తుర్కపల్లిలోని నాగాయిపల్లిలో స్కూల్ బస్సు ఢీకొనడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఆగ్రహానికి గురైన గ్రామస్తులు స్కూల్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

పోలీసు వాహనంలో మంటలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద పోలీసు వాహనంలో మంటలు చెలరేగాయి. ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన బుల్లెట్ ఫ్రూప్ స్కార్పియోలో మంటలు చెలరేగాయి. సిబ్బంది మంటలు ఆర్పారు.
 

హైకోర్టుకు చేరుకున్న సల్మాన్ సోదరి..

రాజస్థాన్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అల్విరా తన లాయర్ తో హైకోర్టుకు చేరుకున్నారు. అరుదైన బ్లాక్‌ బక్‌ జాతి జింకలను అక్రమంగా వేటాడి హతమార్చినట్లుగా సల్మాన్ పై ఆరోపణలున్న సంగతి తెలిసిందే.

అత్యాచారం చేశారని ఇజ్రాయిల్ మహిళ ఆరోపణ..

హిమాచల్ ప్రదేశ్ : తనపై కొంతమంది అత్యాచారానికి పాల్పడ్డారని ఇజ్రాయల్ కు చెందిన మహిళ ఆరోపిస్తోంది. ఆదివారం మనాలిలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొంటోంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.

10:21 - July 25, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇక సినిమా విడుదలైనా 'రజనీకాంత్' మాత్రం అమెరికాలోనే ఉండిపోయారు. గత రెండు నెలలుగా ఆయన అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స తీసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. మూడో తేదీన అమెరికా నుండి చెన్నైకి రజనీ వస్తున్నట్లు, అనంతరం సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల రజనీ రాలేకపోయారు. దీనితో సినిమా విడుదల వాయిదా పడింది. చివరకు రజనీ కోరిక మేరకు శుక్రవారం ఈ చిత్రాన్ని విడుదల చేశారంట. పూర్తిగా విశ్రాంతి తీసుకున్న 'రజనీ' ఆదివారం చెన్నైకి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రజనీ అభిమానులు విమానశ్రాయానికి భారీగా పోటెత్తారు. రజనీకి ఘన స్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేసిన రజనీ అక్కడి నుండి వెళ్లిపోయారు.

10:20 - July 25, 2016

రజనీకాంత్..నటించిన 'కబాలి' రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పా.రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' అన్ని చోట్ల అద్భుతమైన వసూళ్లతో దూసుకపోతోంది. 'కబాలి' (తెలుగు, తమిళం) యుఎస్ఏ - కెనడా ప్రివ్యూ షోలో 12.93 కోట్ల రూపాయలు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మలేషియా బాక్సాఫీస్‌ వద్ద నెంబర్‌ 1 స్థానంలో, యుఎస్‌ఏ-కెనడాలో 3వ స్థానం, యూకేలో 10వ స్థానంలో నిలిచినట్లు తరణ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమెక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అక్కడి దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారంట. ఒకవేళ రీమెక్ చేస్తే బిగ్ బి నటించనున్నానరని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన అమితాబ్ బచ్చన్ 'కబాలి'గా నటించేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ 'పింక్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

10:17 - July 25, 2016

విశాఖ : నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తనూజ మృతదేహానికి ఇవాళ పోస్ట్‌మార్టం నిర్వహించబోతున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత ఇది హత్యా, ఆత్మహత్యా అన్న విషయం తేలనుంది. మరోవైపు ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. తనూజ మృతికి కారణమని భావిస్తున్న దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురినికూడా ప్రశ్నిస్తున్నారు. కృష్ణరాయపురంలో ఆదివారం తనూజ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.  

 

10:13 - July 25, 2016

హైదరాబాద్ : టెక్సాస్‌లో హత్యకు గురైన సంకీర్త్‌ మృతదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఉదయం సంకీర్త్ మృతదేహం హైదరాబాద్‌ చేరుకుంది. కాచిగూడలో సంకీర్త్‌ మృతదేహాన్నిచూడగానే సంకీర్త్‌ తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. అంబర్‌పేట్‌ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లిన సంకీర్త్‌ను అతని రూమ్మేట్‌ హత్య చేశాడు. 

 

కోదండరాం అరెస్టు..

మెదక్ : తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జీ జరపడంపై విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న కోదంరాంను వంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. అడ్డుకోవడంపై కోదండరాం నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీనితో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:09 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జ్‌ని నిరిసిస్తూ మెదక్‌ జిల్లాలో బంద్‌ జరుగుతోంది. విపక్షాలు ఇచ్చిన పిలుపుతోప్రజలు బంద్‌ పాటిస్తున్నారు. సంగారెడ్డి బస్‌ డిపో దగ్గర వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంద్‌కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్ష నేతలు, సీఐటీయూ కార్యకర్తలు డిపోలముందు బైఠాయించారు.. బస్సులు బయటకురాకుండా అడ్డుకున్నారు.. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని.... లాఠీఛార్జ్‌ చేసిన పోలీసుల్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నేడు జేఏసీ నేతలు పర్యటన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నేడు జేఏసీ నేతలు పర్యటించనున్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై లాఠీచార్జి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. కోదండరాం నేతృత్వంలోని బృందం ఈరోజు ముంపు గ్రామాల్లో పర్యటించి నిర్వాసితులను పరామర్శించనుంది.

 

టీజేఏసీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు..

మెదక్ : టీజేఏసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జీ జరిపిన సంగతి తెలిసిందే. గాయపడిన వారిని పరామర్శించేందుకు టీజేఏసీ బృందం బయలుదేరింది. ఒంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కాసేపట్లో సిద్ధూ ప్రెస్ మీట్..

పంజాబ్ : ప్రముఖ కికేటర్, రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. ఉదయం 11.30గంటలకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆప్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

09:37 - July 25, 2016

పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన జనపథంలో చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి వ్యతిరేకంగా ఉద్యోగాలు పోరాడుతున్నారు. పాత పెన్షన్ విధానమే కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇంతకీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమలవుతోంది? ఉద్యోగులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత పెన్షన్ విధానానికి, కొత్త కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి వున్న తేడాలేమిటి? అసలు ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ లు ఎందుకు అమలు చేయాలి? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:36 - July 25, 2016

ఉదయం లేచింది మొదలు...రాత్రి పడుకొనే వరకు మహిళలు ఉరుకులు పరుగులతో పని చేయాల్సి ఉంటుంది. చాలా మటుకు ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. దీనితో అనారోగ్యాల పాలవుతుంటారు. ఏదో ఒక మందు వేసుకుంటూ సమస్యను మరింత జఠిలం చేస్తుంటారు. ఆరోగ్యంపై మహిళలు తప్పకుండా దృష్టి పెట్టాల్సినవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం పూట తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది కూడా నిద్ర లేచిన గంట లోపే అల్పాహారం తీసుకోవాలి. గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరం పునరుత్తేజమవుతుంది.
ఉదయం పూట టీ బదులు గ్రీన్ టీ తాగం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. గ్రీన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పండ రసాలు కూడా తీసుకోవచ్చు.
నిద్ర లేవగానే కనీసం ఐదారు గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కణాలు ఉత్తేజితమయి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
అంతేగాకుండా ఉదయం వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి. వ్యాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలై పలు సమస్యలతో పోరాడుతాయి.
వర్కింగ్‌ ఉమెన్‌ ఈ పాటి అలవాట్లను తప్పక పాటిస్తే.. రోజంతా ప్రశాంతంగా, ఏకాగ్రతతో పనులు చేసుకోవడానికి తోడ్పడుతుంది.

09:34 - July 25, 2016

యాలకులు..కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తీపిపదార్థాలకు రుచి, మంచి వాసన ఇచ్చే ఈ యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
దీనిని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేగాక జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుముఖం పడుతాయి.
నోట్లో అల్సర్లు, ఇన్ ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకులని నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి.
వికారం, కడుపు ఉబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే అవి దూరమవుతాయి.
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో యాలకులు మించిన సుగంధ దినుసు లేదని పేర్కొంటున్నారు. చూశారా.. యాలకులు ఎంత మేలు చేస్తాయో...

09:34 - July 25, 2016

ప్రిన్స్ మహేశ్ బాబు - మురుగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందుకు మహూర్తం కూడా నిర్ణయించారని టాక్. ఈనెల 29వ తేదీ నుండి షూటింగ్ మొదలు కాబోతుందని ప్రచారం జరుగుతోంది. మహేశ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం ఉంటుందని అంచనా. ఈ సినిమాలో మహేశ్ కు తల్లిగా ప్రముఖ నటి దీపా రామానుజం నటించనున్నారని టాక్. 'బిచ్చగాడు' సినిమాలో తల్లిగా దీపా నటించిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌ గా నటించనున్నారంట. హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలయితే కానీ ఇవన్నీ నిజమా ? కాదా ? అనేది తెలుస్తుంది.

09:27 - July 25, 2016

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పై ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానమే అమలు చేయాలంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. 
ప్రతి ఉద్యోగీ 58 ఏళ్ళకు రిటైర్ 
ప్రతి ఉద్యోగీ 58 ఏళ్ళకు రిటైరవ్వక తప్పదు. కొంతమందికి 60 ఏళ్ళ దాకా చాన్స్ వుంది. కానీ, ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ తప్పనిసరి. పాతిక ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగిగా సేవలందించినవారు రిటైరైన తర్వాత ఎలా బతకాలి? ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా, నిశ్చింతగా సాగేందుకు ప్రవేశపెట్టిందే పెన్షన్ విధానం. ఆరు పదుల వయస్సులో రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించినా, కుటుంబ బాధ్యతలు మిగిలే వుంటాయి. వృద్ధాప్యంలో జీవితం ఆషామాషీ కాదు. రిటైర్మెంట్ తర్వాత ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను తట్టుకోవాలంటే  అందుకు తగ్గ ధనం అవసరం. 30 ఏళ్ల పాటు సేవలు ఉపయోగించుకుని, వ్రుద్ధాప్యంలో నీ దారి నువ్వు చూసుకో అనడం ఏ మాత్రం న్యాయం కాదు. అది మానవీయతాకాదు. కానీ, దురదృష్టవశాత్తు  ఉద్యోగుల రిటైర్మెంట్ విషయంలో ప్రభుత్వాలు మానవీయతను కోల్పోతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది. ఇందుకు కారణం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్.
పన్నెండేళ్ల క్రితం సిపిఎస్ ప్రారంభం 
సిపిఎస్ గా ప్రసిద్ధి చెందిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మన దేశంలో పన్నెండేళ్ల క్రితం ప్రారంభమైంది. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారందరికీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నే అమలు చేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2004 సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది.  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ దీనిని అమలు చేస్తుండగా, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ రికార్డుల నిర్వహణ చూస్తోంది. 
దీంతో ఉద్యోగుల పెన్షన్ విధానంలో చాలా మార్పులొచ్చాయి.  రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితానికి హామీ పడే పాత పెన్షన్ విధానం మరుగున పడింది.  పాత పెన్షన్ విధానంలో రిటైరయ్యే సమయంలో వున్న జీతాన్ని ఆధారం చేసుకుని పెన్షన్ నిర్ణయించేవారు. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణం పెన్షన్ కూడా పెరుగుతుండేది.  ఒకవేళ పెన్షన్ దారుడు చనిపోతే, అతని మీద ఆధారపడ్డ భార్య, పెళ్లి కాని ఆడపిల్ల, 25 ఏళ్ళు నిండని నిరుద్యోగ కుమారుడికి పెన్షన్ ఇచ్చేవారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో అలాంటి సౌకర్యం లేదు.  పెన్షన్ దారుడు చనిపోతే, ఇక ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా వుండదు. 
రిటైరైన తర్వాత ఉద్యోగికి పెన్షన్ 
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి ప్రతి ఉద్యోగి, తన బేసిక్ పే, డిఏలలో పది శాతం చొప్పున ప్రతి నెలా జమ చేయాల్సి వుంటుంది. దీనికి ప్రభుత్వం మరో పది శాతం జమ చేస్తుంది. ఈ సొమ్ము మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా  పెడతారు. స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభనష్టాల మీద ఆధారపడి, రిటైరైన తర్వాత ఆ ఉద్యోగికి పెన్షన్ చెల్లిస్తారు. పాత పెన్షన్ విధానంలో మాదిరిగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో  నిర్ణీత మొత్తంలో  పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ లేదు.  స్టాక్ మార్కెట్ లు దెబ్బతింటే, వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది.  ఒక్కొక్కసారి అసలేమీ రాకపోవచ్చు. ఇలాంటి ప్రమాదం వుండబట్టే, కంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పెన్షన్ అనేది దయతోనో, జాలితోనో ఇచ్చేది కాదు. 30 ఏళ్ల పాటు చేసిన సేవలకు అందించే ప్రతిఫలం. దాన్ని వక్రబుద్ధితో చూడడం మంచిది కాదు. 

 

వ్యాన్ ను ఢీకొట్టిన రైలు..7గురు చిన్నారుల మృతి..

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలోని బదోహి ప్రాంతంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రైల్వే లైన్ దాటుతున్న ఓ వ్యాన్ ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మహారాష్ట్రలో పేలిన సిలిండర్..

మహారాష్ట్ర : థానే జిల్లాలోని ఓ ప్రాంతంలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 9మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బకెట్ బాంబులు పెట్టిన మావోయిస్టులు..

ఖమ్మం : వెంకటాపురం - రామచంద్రాపురం రహదారిపై మావోయిస్టులు బకెట్ బాంబులు పెట్టారు. సమాచారం అందుకున్న స్వ్కాడ్, రెస్క్యూ టీమ్ లు బాంబులను తొలగించే పనిలో పడ్డారు.

టీఆర్ఎస్, ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణ..

మెదక్ : టీఆర్ఎస్, ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు భారీగా మోహరించారు. సీపీఎం నేత రేవంత్ ను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పీఎస్ కు తరలించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి నిరసనగా విపక్షాలు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

మహరాష్ట్రలో ఇద్దరు దళితులపై దాడి..

మహారాష్ట్ర : దళితులపై దాడులు ఆగడం లేదు. పలు రాష్ట్రాల్లో దళితులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 మంది దాడి చేయడంతో ఇద్దరు దళితులకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

08:55 - July 25, 2016

అంటిగ్వా : అన్ని విభాగాల్లో తిరుగులేని అధిపత్యం..బౌలింగ్..బ్యాటింగ్ విభాగంలో చెలరేగిన ఇండియన్స్..బౌలర్ల అసమాన పోరాటం..కోహ్లీ బ్యాటింగ్ మ్యాజిక్..బాల్ తో రెచ్చిపోయిన అశ్విన్...వెరసి టీమిండియా ఘనవిజయం సాధించింది. విదేశీ గడ్డపై తొలి పరీక్షలోనే కొత్త కోచ్‌ కుంబ్లే సక్సెస్ అయ్యాడు. భారత్‌ ఆహ్వానం మేరకు ఫాలో ఆన్‌కు దిగిన వెస్టిండీస్‌.. కేవలం 231 పరుగులకే కుప్పకూలింది. 92 పరుగుల తొలి ఇన్నింగ్స్ తేడాతో భారత్‌ అపూర్వ విజయం అందుకున్నది.

వెస్టిండీస్ ఫాలో ఆన్..
టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. కరేబియన్ టీం 243 పరుగులకు ఆలౌట్ కావడంతో కోహ్లీ ఫాల్ ఆన్ కు ఆహ్వానించాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఐదో బంతికే ఇషాంత్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ (2) అవుట్ అయ్యాడు. బ్రావోతో కలిసిన చంద్రిక మరో వికెట్ పడకుండా మూడో రోజును ఆట ముగించారు. నాలుగో రోజు కూడా ఆదిలోనే బ్రావో వికెట్ ను కోల్పోయింది. ఇక విండీస్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసింది శామ్యుల్స్, బ్రాత్ వైట్ లు మాత్రమే. షమి, ఉమేష్ బౌలింగ్ ను వీరు సునాయసంగా ఎదుర్కొనిన పరుగులు రాబట్టారు. వీరి సమన్వయం కారణంగా బ్యాటింగ్ తో మూడో వికెట్ కు 98 బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అశ్విన్ మంత్రాన్ని అర్థం చేసుకోలేకపోయిన చంద్రిక అవుట్ అయ్యాడు. కాసేపటికే శామ్యుల్స్ (50, 11 ఫోర్లు) చేసి అశ్విన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్ మెన్స్ ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. దీనితో 132 పరుగులకే విండీస్ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. బిషు, బ్రాత్ వైట్ లు భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తొమ్మిదో వికెట్ కు 97 బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరకు అశ్విన్ బౌలింగ్ లో బిషు (45) అవుట్ అయ్యాడు. బ్రాత్ వైట్ 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
కోహ్లీ డబుల్ సెంచరీ..
ఈ భారీ ఇన్నింగ్స్ లో కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి తన సత్తా ఏంటో విండీస్ కు చూపించాడు. మరో వైపు తాను కూడా తక్కువేమి కాదంటూ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 243 పరుగులు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఎలాంటి పోరాట పటిమ కనబరచలేకపోయింది. 231 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్ : 566/8 డిక్లేర్డ్
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్ : 243.
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్ : బ్రాత్‌వైట్‌ (ఎల్బీ) ఇషాంత్‌ 2, చంద్రిక (సి) సాహా (బి) అశ్విన్‌ 31, బ్రావో (సి) రహానె (బి) ఉమేష్‌ 10, శ్యాముల్స్‌ (బి) అశ్విన్‌ 50, బ్లాక్‌వుడ్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 0, చేస్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 8, దోవ్రిచ్‌ (ఎల్బీ) మిశ్రా 9, హోల్డర్‌ (బి) అశ్విన్‌ 16, బ్రాత్‌వైట్‌ నాటౌట్‌ 51, బిషు (సి) పుజారా (బి) అశ్విన్‌ 45, గాబ్రియల్‌ (బి) అశ్విన్‌ 4, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం : (78 ఓవర్లలో ఆలౌట్‌) 231.
బౌలింగ్‌ : ఇషాంత్‌ 11-2-27-1, షమి 10-3-26-0, ఉమేష్‌ 13-4-34-1, అశ్విన్‌ 25-8-83-7, మిశ్రా 19-3-61-1.

నేడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు నేడు భేటీ కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.

 

నగరానికి చేరిన సంకీర్త్ మృతదేహం..

హైదరాబాద్ : అమెరికాలో రూమ్ మెట్ చేసిన దాడిలో మృతి చెందిన సంకీర్త్ మృతదేహం నగరానికి చేరుకుంది. ఆదివారం రాత్రి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారు.

08:38 - July 25, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ మహంకాళి ఆలయం వద్ద  ఉద్రిక్తత  నెలకొంది. బోనాల సంధర్భంగా రద్దీ పెరగడంతో  పోలీసులకు భక్తులకు మద్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భక్తులను కాళ్లతో తన్నుతూ.. పిడిగుద్దులు కురిపించారు.

 

మెదక్ జిల్లాలో కొనసాగుతున్న బంద్....

మెదక్ : జిల్లాలో విపక్షాలు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ కు నిరసనగా బంద్ జరుగుతోంది. సంగారెడ్డి బసు డిపో ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టాయి. నిర్వాసితులకు అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. 

 

08:30 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ని నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన మెదక్ జిల్లా బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, ఆందోళన మిన్నంటాయి. సంగారెడ్డి బస్ డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి బస్ డిపో ముందు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో డిపో నుంచి బస్సులు బయటికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. జిల్లాలోని ఏడు బస్సు డిపోల నుంచి బస్సులు ఆగిపోయాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి, నేతలు మాట్లాడుతూ పోలీసుల లాఠీచార్జ్ దుర్మార్గం అన్నారు. కేసీఆర్ కోర్టుకు చెప్పిందొకటి..  చేసేదే వేరొకటన్నారు. ప్రభుత్వం, పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడుతన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్లన్నసాగర్ ను కట్టనివ్వమని చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నిర్వాసితులకు అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. నిన్న ఎర్రవెల్లిలో మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసులు అమనాషంగా లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో మహిళలు, పిల్లలు గాయాపడ్డారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ విపక్షాలు నేడు మెదక్ జిల్లా బంద్ కు పిలపునిచ్చిన సంగతి తెలిసిందే.  

 

08:18 - July 25, 2016

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ని నిరసిస్తూ విపక్షాలు ఇవాళ మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి. ఈమేరకు సంగారెడ్డి బస్ డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టాయి. సంగారెడ్డి బస్ డిపో ముందు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో డిపో నుంచి బస్సులు బయటికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. నిన్న ఎర్రవెల్లిలో మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసులు అమనాషంగా లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో మహిళలు, పిల్లలు గాయాపడ్డారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, సీపీఎం నేత భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ విపక్షాలు నేడు మెదక్ జిల్లా బంద్ కు పిలపునిచ్చిని సంగతి తెలిసిందే.  

08:01 - July 25, 2016

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక అనేక మంది మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. గాంధీలో కొంత సాంకేతిక సమస్య తలెత్తిన మాటే వాస్తవమేనని ఒప్పుకుంది ప్రభుత్వం. అయితే ఈ ప్రచారంలో వైద్యులు, సిబ్బందిని లాగొద్దని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. కొందరు కావాలనే దుష్పచారం చేస్తున్నారని తెలిపారు.  
రోగుల మరణాలపై వస్తున్న కథనాలను ఖండించిన లక్ష్మారెడ్డి 
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం నేపథ్యంలో రోగుల మరణాలపై వస్తున్న కథనాలను మంత్రి లక్ష్మారెడ్డి ఖండించారు. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో కొంత ఆలస్యం కావడం దురదృష్టకరమన్నారు మంత్రి. అయితే ఆసుపత్రిలో రోగులు విద్యుత్‌ సరఫరాలేక ఇబ్బంది పడినమాట వాస్తవమేనన్నారు మంత్రి. అయితే ఇలాంటి చిన్న చిన్న ఘటనలను అసాధారణంగా చిత్రీకరిస్తూ..21 మంది రోగులు విద్యుత్ ప్రసారం ఆగిపోవడంతో చనిపోయారని వస్తున్న వార్తలపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధులు నయంకాక చివరి దశలో ఆసుపత్రికి రావడంవల్లే రోగులు చనిపోతున్నారని మంత్రి తెలిపారు.    
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా  ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధిక నిధులు, ఆధునిక పరికరాలు ఇచ్చి, వసతులు కల్పిస్తున్నామని అన్నారు. జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ క్యాన్సర్‌ వంటి అన్ని వ్యాధులకు నిర్థారణ పరీక్షలు ఒకే చోట జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబ్ల్యుహెచ్ వో గైడ్ లైన్ ప్రకారంగానే రాష్ట్రం అంతటా ఒకే విధమైన లేబర్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
టెక్నికల్  సమస్యవల్లే జనరేటర్‌ ఆన్ కాలేదన్న వైద్యులు
ఇది ఇలా ఉంటే.. ప్రతిరోజు గాంధీలో 20 నుంచి 30 మంది మరణాలు సర్వసాధారణం అని గాంధీ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ రమేష్,అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు. గాంధీలో కరెంట్ లేకపోయినా టార్చ్ లైట్ తో ఆపరేషన్ చేసి పేషెంట్లను బతికించామని అన్నారు. పవర్ కట్ పొరపాటేనని.. టెక్నికల్ సమస్యవల్లే జనరేటర్‌లు ఆన్ కాలేదన్నారు... పవర్ పోవడం వలన ఎవరు మరణించలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆభాసుపాలు చేసేందుకు ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందకుండా ప్రచారం చేయడం మంచిది కాదన్నారు మంత్రి.ప్రజలు మెలకువతో, విజ్ఞతతో 
వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

 

07:54 - July 25, 2016

వరంగల్ : హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆసుపత్రి ఘటన మరకముందే.. వరంగల్ జిల్లా ఎంజిఎం ఆసుపత్రిలో మరోదారుణం వెలుగులోకి వచ్చింది. పురుగు మందు సేవించిన రోగులకు విరుగుడుగా ఇచ్చే పాలిడ్రాక్సిన్ అనే సూదిమందులో ఫంగస్ ఉన్న ట్లు గుర్తించారు ఔషద నియంత్రణ మండలి అధికారులు.
నిన్న సరోజిని దేవి ఆసుపత్రి.. నేడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి.. 
నిన్న సరోజిని దేవి ఆసుపత్రి.. నేడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి.. ఆసుపత్రి ఏదైతేనేం యధేచ్ఛగా ఫంగస్‌తో నిండిన సూదిమందులను వాడేస్తూ..రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో.. పురుగుమందు తాగిన రోగులకు విరుగుడుగా ఇచ్చే పాలిడ్రాక్సిన్ మందులు కాలంచెల్లినవిగా గుర్తించారు ఔషద నియంత్రణమండలి అధికారులు.
కంటి శస్త్రచికిత్సలు వికటించి 13 మందికి ఇన్ ఫెక్షన్ 
హైదరాబాద్‌లోని సరోజినిదేవి హాస్పిటల్ లో గతంలో కంటి శస్త్రచికిత్సలు వికటించి 13 మందికి ఇన్ ఫెక్షన్ సోకిన ఘటన మరవకముందే.. వరంగల్ ఎంజీఎంలోను మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో సరోజిని హాస్పత్రిలో  కళ్లను శుభ్రం చేసేందుకు వాడే ఆర్‌ఎల్‌ అనే సెలైన్‌ బాటిల్లో బ్యాక్టీరియా చేరడంవల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకి 13 మంది చూపును కోల్పోయారు. సరిగ్గా అలాంటి ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ 
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో..  హెచ్ ఎల్ 1540 ఎల్ బ్యాచ్ కల పాలిడ్రాక్సిన్ అనే ఆమ్ ఫుల్ సూదిమందులో ఫంగస్‌ను గుర్తించారు అధికారులు. పురుగుమందు తాగి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి విరుగుడుగా ఈ మెడిసిన్ వాడుతారు. ఈ మందులలో ఫంగస్ రావడంపై డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాని ఆసుపత్రి సిబ్బంది, నిర్వహణఅధికారులు తనిఖీలకు సహకరించకపోవడంతో.. అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాలిడ్రాక్సిన్‌ను హిమాలయ మెడొజెన్ అనే పారాకంపెనీ నుంచి అనధికారికంగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు అధికారులు. స్టాక్ వివరాలు పాలిడ్రాక్సిన్ వివరాలు తెలపకపోవడంతో..అధికారులు ఔషద నిల్వలను సీజ్ చేశారు.   

07:48 - July 25, 2016

మహబూబ్ నగర్ : నారాయణపేట్‌... కొడంగల్‌ ఎత్తిపోతల పథకం విజయవంతం అయితేనే పాలమూరు వలసలు అరికట్టవచ్చని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో ఆయన పాల్గొని రైతులను కలుసుకున్నారు. ప్రతి చోటా రైతులు తమ వెతలను తమ్మినేనికి వినిపించారు. 
పాదయ్రాతలో పాల్గొన్న తమ్మినేని 
పాలమూరు జిల్లా నారాయణపేట..కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధన కోసం జల సాధన సమితి మహా పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలు పార్టీలకు చెందిన అఖిలపక్ష నాయకులు, జల సాధన సమితి సభ్యులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు 221 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర ఆగస్టు1 న ముగియనుంది.     
నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతలతో వలసల అరికట్టవచ్చన్న తమ్మినేని 
మహా పాదయాత్ర భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శ తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం విజయవంతమైతే వలసలను అరికట్టవచ్చన్నారు తమ్మినేని. అతి సమీపంలోనే జూరాల నికర జలాలను వినియోగించుకొనే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదన్నారు. జూరాల నికర జలాలను వినియోగించుకోవడం పాలమూరు వాసుల హక్కు అని తమ్మినేని స్పష్టం చేశారు.
మూడో రోజు పాదయాత్ర
మూడో రోజు మహా పాదయాత్ర బిజ్వార్ పాతపల్లి , అవుసులోనిపల్లీ, పెద్దజట్రం మీదుగా సాగింది. భోజన విరామ సమయానికి నిడుగుర్తి చేరుకున్న పాదయాత్ర..సాయంత్రానికి అప్పకపల్లి, జాజాపూర్ శేర్నపల్లీ గ్రామాల మీదుగా కొనసాగింది. అనంతరం శాసన పల్లికి చేరుకోవడంతో మూడో రోజు పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రలో ప్రజలు, జానపద కళాకారులు ఉత్సాహంగా పాల్గొనగా, వివిధ గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. 

 

సంగారెడ్డి బస్ డిపో నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

 మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ని నిరసిస్తూ సంగారెడ్డి బస్ డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సంగారెడ్డి బస్ డిపో ముందు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో డిపో నుంచి బస్సులు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. 

 

సంగారెడ్డి బస్ డిపో ఎదుట విపక్షాల ఆందోళన...

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ని నిరసిస్తూ సంగారెడ్డి బస్ డిపో ఎదుట సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 

07:31 - July 25, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా చేరుతుండడంతో అధికారుల అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఎస్‌ఈ, సీఈ స్థాయి అధికారి వరకు ప్రాజెక్టుల వద్దే ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాటర్ ఇన్ ఫ్లో, అవుట్‌ ఫ్లో పరిస్థితిని గమనించి..అప్రమత్తం చేయాలని కోరారు. రెవెన్యూ, పోలీస్‌శాఖల సహకారంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి.. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 
ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు 
వర్షాలు భారీగా కురుస్తుండడంతో..ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో..నీటిపారుద‌ల‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు అధికారులను అలర్ట్‌ చేశారు. అధికారులందరూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. సీఈలు, ఎస్ఈలంతా ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాల‌ని సూచించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో వ‌ర‌ద ఉధృతి, ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లోను అంచ‌నా వేయాల‌ని తెలిపారు. నీటి ప్రవాహ ఉధృతిని ఎప్పటిక‌ప్పుడు వాట్సప్ గ్రూపుల్లో అప్‌డేట్ చేయాల‌ని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్స్‌ను సమన్వయం చేసుకుంటూ..ముందుకెళ్లాలని సూచించారు. 
అధికారులపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం
చాలా మంది సీఈలు, ఎస్ఈలు, ఫీల్డ్ ఇంజ‌నీర్లు ప్రాజెక్టుల ద‌గ్గర ఉండ‌టం లేద‌ని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ప‌దేప‌దే హెచ్చరిస్తున్నా.. అధికారుల్లో మార్పు రావ‌డం లేదన్నారు. కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలో, అటు గోదావ‌రి పరివాహ‌క ప్రాంతంలోనూ చాలా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుతున్నాయని..ప‌రిస్థితి ప్రమాద‌క‌ర స్థాయిలో ఉన్నప్పటికీ అధికారులు అందుబాటులో ఉండడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్లంప‌ల్లి, జూరాల ప్రాజెక్టుల్లో వ‌ర‌ద ఉధృతి ప్రమాదక‌ర స్థాయిలో ఉంద‌ని, సీనియ‌ర్ అధికారులంతా అందుబాటులో ఉండి..ప‌రిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాల‌ని ఆదేశించారు. తప్పకుండా హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాల‌ని, ఏదైనా అత్యవ‌స‌ర ప‌నిమీద వెళ్లాల్సివ‌స్తే..ప్రభుత్వ అనుమ‌తి తీసుకొని వెళ్లాల‌ని చెప్పారు. హెడ్‌క్వార్టర్స్‌, ప్రాజెక్టు సైట్స్ దగ్గర అందుబాటులో ఉండ‌ని అధికారుల‌పై, తన ఆదేశాలు పాటించ‌ని వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై సీరియ‌స్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. 

07:27 - July 25, 2016

విజయవాడ : ఏపీ రాష్ర్ట తూర్పుతీరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృష్టపట్నం పోర్టులో మరో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు శ్రీకారం చుట్టారు. ఆసియాలోనే అతిపెద్ద తీర ప్రాంత గోల్ఫ్ కోర్టును ప్రారంభించారు. పోర్టు పరిధిలో కాంకర్ పోర్ట్ సైడ్ కంటైనర్ సేవలను ప్రారంభించింది. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు రైలు రవాణాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
పోర్టులన్నింటికీ అనుసంధానం చేస్తూ రైలు మార్గాలు 
దేశంలోని పోర్టులన్నింటికీ అనుసంధానం చేస్తూ రైలు మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ ప్రభు తెలిపారు. 2017 నాటికి కృష్ణపట్నం-ఓబులాపురం రైల్వే లైన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సుమారు 600 కోట్లతో చేపట్టిన 95 కిలోమీటర్ల  రైల్వే మార్గం ఇప్పటికే 35శాతం పూర్తయ్యిందని వివరించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం నెల్లూరు జిల్లాకు వచ్చిన సురేష్‌ ప్రభు కృష్ణపట్నం పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కృష్ణపట్నంపోర్టు ప్రపంచ ప్రఖ్యాతిగాంచడం హర్షనీయం : సురేష్‌ ప్రభు
కృష్ణపట్నం పోర్టు ప్రపంచ ప్రఖ్యాతిగాంచడం హర్షనీయమన్నారు సురేష్‌ ప్రభు. ఉత్పాదక రంగంలో దేశం మరింత పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో 3.3 లక్షల కోట్లతో రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజి వినియోగంతో అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. 
కృష్ణపట్నం పోర్టులో కాంకరస్ పోర్టు సైడ్ కంటైనర్ సౌలభ్యం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆర్ధిక ఫలాలు అందరికీ అందుబాటు కావాలన్నదే దేశ ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా భారీ కంటైనర్‌లను కృష్ణపట్నం పోర్టులో కాంకరస్ పోర్టు సైడ్ కంటైనర్ సౌలభ్యాన్ని ప్రారంభించారు. అనంతరం పోర్టు సమీపంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద తీరప్రాంత గోల్ఫ్‌ కోర్టును మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి నారాయణ, తిరుపతి ఎంపీ వరప్రసాద్, జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

 

07:22 - July 25, 2016

మెదక్ : న్యాయంకావాలంటే తుపాకులు ఎక్కుపెడుతున్నారు. రైతులు, గ్రామస్తులపై  పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. లాఠీలో చితకబాది... గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతుల గురిచేస్తున్నారు. సర్కారు నిర్బంధ చర్యలకు నిరసనగా.. విపక్షాలు ఇవాళ మెదక్‌ జిల్లా బంద్‌కు పిలుపునిస్తే.. పోలీసులు 144 సెక్షన్‌ ద్వారా మరింత నిర్బంధాన్ని ఇంపోజ్‌ చేస్తున్నారు. 
నమ్మి ఓట్లేస్తే..లాఠీలు, తూటాలా బహుమతి..! 
నమ్మి ఓట్లేస్తే..లాఠీలు, తూటాల బహుమతి..! నమ్మి అధికారం అప్పగిస్తే...రైతులకు లాఠీలు, తూటాలు బహుమతిగా ఇచ్చారు. శాంతియుతంగా నిరసన ప్రకటిస్తే లాఠీచార్జీలా..! శాంతియుతంగా నిరసన ప్రకటిస్తే... లాఠీలతో విరుచుకుపడ్డారు.
రైతుల నిరసనపై పోలీసుల దౌర్జన్యం
గత 50రోజులుగా జరుగుతున్న మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పోరాటం..హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఒక్కసారిగా పోలీసులు విరుచుకుపడ్డారు.. వృద్ధుల, పిల్లలు, మహిళలు అనే విచక్షణలేకుండా..లాఠీలతో చితకబాదారు. నమ్మి ఓట్లేస్తే   లాఠీలు తూటాలను బహుమతిగా ఇస్తారా.. అని మండిపడుతున్నారు బాధితులు. న్యాయం చేయాలంటే... తూటాలు పేల్చారు.. మాకు మల్లన్నసాగర్‌ వొద్దు.. మాభూములు మాకే కావాలంటూన్నారు బాధితులు. కేసీఆర్‌ సర్కార్‌ దిగివచ్చేవరకు... తమ ఉద్యమం ఆగదిని మల్లన్నసాగర్‌ నిర్వాసితులు తేల్చి చెబుతున్నారు. అయితే జరిగిన ఘటనపై మంత్రి హరీష్‌రావు సీరియస్‌గా స్పందించారు. మల్లన్నసాగర్‌పై విపక్షాలు కావాలనే రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. 
పోలీసుల దౌర్జన్యంపై విపక్షాల మండిపాటు 
అటు పోలీసుల దౌర్జన్యంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 2013చట్టప్రకారం  న్యాయం చేయాలని రైతులు కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం 123 జీవో అమలు పరిచేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. గ్రామస్తులపై దాడికి పాల్పడటం హేయమని  సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జస్టిస్‌ చంద్రకుమార్‌, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తదితరులు  పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా  మెదక్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బాధితుల తరపును న్యాయం జరిగేవరకు పోరాడుతామని నాయకులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించడానికి జేఏసీ చైర్మన్‌ కోదండరాం నిర్వాసిత గ్రామాల్లో పర్యాటిస్తారు. ఇదిలావుంటే..అటు పోలీసులు కూడా 144సెక్షన్‌  విధించడంతో మెదక్‌జిల్లాలో పరిస్ధితి ఆందోళనగా మారింది. 

 

నేడు మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో తమ్మినేని పర్యటన

మెదక్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేడు మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో పర్యటించనున్నారు. పోలీసుల దాడిలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. 

నేడు జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో విపక్షాల ప్రెస్ మీట్

హైదరాబాద్ : ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, లోక్ సత్తా, ప్రజాసంఘాల మీడియా సమావేశం జరుగనుంది. మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై చర్చ చేపట్టనున్నారు. 

నిర్వాసితులపై లాఠీచార్జ్ కు నిరసనగా నేడు మెదక్ జిల్లా బంద్

మెదక్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్ ను నిరసిస్తూ నేడు మెదక్ జిల్లా బంద్ కు సీపీఎం, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ పిలుపు ఇచ్చాయి. బంద్ ను పాటించనున్నారు.

నిర్వాసితులపై లాఠీచార్జ్, కాల్పులను నిరసిస్తూ నేడు సీపీఎం ఆందోళన

హైదరాబాద్ : మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీచార్జ్, కాల్పులను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. 

Don't Miss