Activities calendar

26 July 2016

21:52 - July 26, 2016

ఢిల్లీ : తమిళనాడులో వివాదాస్పద జల్లికట్టు క్రీడను అనుమతి ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టులో విచారణ సందర్భంగా బాల్యవివాహాలను ప్రస్తావించింది. 18 వ శతాబ్దంలో 12 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లిల్లు జరిగేవి. సాంప్రదాయం పేరిట బాల్య వివాహాలకు ఇపుడు అనుమతివ్వాలా అంటూ కోర్టు ప్రశ్నించింది. జల్లికట్టు క్రీడ 5 వేల సంవత్సరాల నాటిదని అనుమతించాలనడం కోర్టు పరిధిలో లేని అంశమని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. జల్లికట్టు నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా జల్లికట్టు క్రీడపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసి షరతులతో కూడిన అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

21:48 - July 26, 2016

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి సడలింపు మరో ఏడాది కాలం పాటు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

21:46 - July 26, 2016

విజయవాడ : పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనితీరు, నాణ్యత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం వివిధ అంశాలపై చర్చించింది.

ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు : బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్‌ మంగళవారం విజయవాడలో సమావేశమైంది. ఇందులో ప్రజారోగ్యంపై కీలకంగా చర్చించారు. పేదల ఆరోగ్య పరిరక్షణలో తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో.. క్లినికల్‌ స్పెషలిస్టులు పార్ట్‌ టైమ్‌ లేదా ఫుల్‌ టైమ్‌ పనిచేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఆసక్తి వుంటే సేవలందించవచ్చు : చంద్రబాబు
ప్రవాస భారతీయులు, ఐక్యరాజ్యసమితి కోసం పనిచేసే వైద్య నిపుణులు ఎవరైనా ఆసక్తి గలవారు రాష్ట్రానికి వచ్చి సేవలందించవచ్చని సూచించారు. వనం-మనం కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆరోగ్యంగా బతకాలనుకునే ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. పాఠశాలలు, కళాశాలలు, ఇళ్లు, కార్యాలయాల్లో అన్నిచోట్ల మొక్కలు నాటాలన్నారు.

కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు సౌకర్యాలు..ఏర్పాట్లు
కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు పుష్కర స్నానం చేసి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రేషన్‌ దుకాణాల్లో అవకతవకలు జరగకుండా చర్యలు..
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం, నరువ, చిట్టివలస, బోయపాలెం తదితర గ్రామాల్లోని 3.55 ఎకరాల భూమిని ఆంధ్రా ఆర్గానిక్స్‌ కంపెనీకి మార్కెట్‌ విలువలో పదిశాతం అద్దెతో మరో ఐదేళ్ల లీజు పొడగింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రేషన్‌ దుకాణాల్లో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆధార్‌ అనుసంధానం ద్వారా నేరుగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చేలా విధానాలు రూపొందించామన్నారు. చౌకదుకాణాల వద్ద క్యూలైన్‌లో అవస్థలు పడకుండా చేస్తామని ఆయన చెప్పారు.  

21:39 - July 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన 'చలో మల్లన్నసాగర్‌' యాత్ర ఉద్రిక్తంగా మారింది. గాంధీభవన్‌ నుంచి మల్లన్నసాగర్‌కు బయల్దేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు బొల్లారం, గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు.

కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు..
మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులను పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన 'చలో మల్లన్నసాగర్‌' యాత్ర ఉద్రిక్తంగా మారింది. జైపాల్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌ నుంచి మల్లన్నసాగర్‌ బయల్దేరేందుకు ప్రయత్నించారు. అయితే గాంధీభవన్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోపులాట జరిగింది. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి గోషామహల్‌, బొల్లారం పీఎస్‌కు తరలించారు.

కేసీఆర్‌ సర్కారు తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ నాయకులు ..
కేసీఆర్‌ సర్కారు తీరుపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజాహక్కులను కాలరాస్తోందన్నారు. గాంధేయ మార్గంలో మల్లన్నసాగర్‌ వెళ్తున్న తమను అరెస్ట్‌ చేయడం దారుణమని ఆక్షేపించారు. ఇలాంటి ప్రభుత్వాలకు గతంలోనూ ప్రజలు చాలాసార్లు బుద్ధి చెప్పారని.. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

రైతుల పొట్టకొడుతున్నారు : జైపాల్ రెడ్డి
తెలంగాణలో రైతుల పొట్టకొడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. 2013 చట్టం ప్రకారమే మల్లన్నసాగర్ ముంపుగ్రామాల రైతులకు నష్టపరిహారమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

డిఫెన్స్‌లో పడ్డ కేసీఆర్ సర్కార్ ?!..
మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పక్షాన విపక్షాల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. దీంతో కేసీఆర్‌ సర్కారు డిఫెన్స్‌లో పడింది. 

21:34 - July 26, 2016

ఢిల్లీ : ఏడాది క్రితమే ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును సుదీర్ఘకాలం గడిచిన తర్వాత మనీ బిల్లు అంటూ బుట్టదాఖలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ మండిపడ్డారు. బిల్లు నోటీసును పంపే ముందే దీన్ని మనీ బిల్లు అని చెప్పి ఉంటే వ్యవహారం ఇంతదాకా వచ్చేది కాదని కేవీపీ అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ను తిరుగులేని మోసం చేసిందని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

21:30 - July 26, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించి కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో రగడ కొనసాగుతోంది. సభలో ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ...అలాగే ఓటింగ్‌కు కాంగ్రెస్ పట్టుబట్టగా... డిప్యూటీ చైర్మన్ కురియన్ అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యులు పోడియంను చుట్టుముట్టడంతో సభలో మరోమారు గందరగోళం చెలరేగింది. రాజ్యసభలో మంటరేపుతున్న కేవీపీ ప్రైవేటు బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీకి సరికొత్త ఆయుధంగా మారింది.

రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు రగడ ..
ప్రత్యేక హోదా ప్రైవేటు మెంబర్ బిల్లును బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటుందని.. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ సభా హక్కుల నోటీసు ఇచ్చారు. దీంతో రాజ్యసభలో మరోసారి ఏపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు రగడ రాజుకుంది. బీజేపీ సభ్యులు తన హక్కులను కాలరాశారని ఆరోపిస్తూ సభా హక్కుల నోటీసులో పేర్కొన్నారు.

సభ ప్రారంభమయ్యాక గందరగోళం..
మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభమయ్యాక మరోసారి గందరగోళం చెలరేగింది. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పైన చర్చ కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. నోటీస్ ఇచ్చాకే చర్చకు అనుమతిస్తామని, ఇప్పుడు చర్చకు తీసుకోమని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పారు.

ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పట్టు..
మరోవైపు వెంటనే బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పట్టుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ జరగాల్సిందేనని, ఓటింగ్ నిర్వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మనీ బిల్లు అంటూ ప్రయివేటు బిల్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

చర్చకు అవకాశం ఇస్తామనన్న డిప్యూటీ చైర్మన్ కురియన్..
అయితే నోటిస్ ఇస్తే మళ్లీ చర్చకు అవకాశం ఇస్తామని డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. నోటీస్ ఏ రూపంలో ఇచ్చినా తాము చర్చకు సిద్ధమే అని కేంద్ర మంత్రి నఖ్వీ చెప్పారు. ఇప్పటికిప్పుడు చర్చ అంటే కుదరదని అన్నారు. దీంతో చైర్మన్ పోడియంను కాంగ్రెస్ ఎంపీలు ముట్టడించారు. ఓటింగ్ వెంటనే చేపట్టాలి అంటూ కాంగ్రెస్ ఎంపీలు పోడియం చుట్టుముట్టారు. అనంతరం వైసీపీ సభ్యుడు విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ.. విభజనకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అన్నారు. ప్రత్యేక హోదా అంశం ఏపీకి చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఇదే అంశంపై టీడీపీ సభ్యుడు సీఎం రమేష్‌ స్పందించారు.

స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు..
వాయిదా అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బిల్లు పైన చర్చ, ఓటింగ్ జరపాలని పట్టుబడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకు వెళ్లారు. ఓటింగ్ జరపాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓటింగ్ కోసం పట్టుబడుతున్నందున హోదా అంశాన్ని ప్రత్యేక అంశంగా తీసుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.

ఆగస్ట్ 5న బిల్లును పరిగణలోకి తీసుకుంటాం : కురియన్
మరోవైపు ఆగస్ట్ 5న బిల్లును పరిగణలోకి తీసుకుంటామని కురియన్ తెలిపారు. అయితే ఈ శుక్రవారమే చర్చ చేపట్టాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితేఈ శుక్రవారమే బిల్లును చేపట్టేలా తాను చైర్మన్‌ను కోరుతానని కురియన్ తెలిపారు. అయినప్పటికీ సభ గందరగోళంగా మారడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

21:23 - July 26, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని శివాజీ నగర్ లో సంతోష్ ఎలక్ట్రానిక్స్ షాపు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో షాపు యజమాని  గోపాల్ (50) మృతి చెందారు. శిథిలాల కింద మరో ఇద్దరు వున్నట్లుగా అనుమానం.. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి పాతభవనం కావటంతో భవనం పైకప్పు కూలినట్లుగా తెలుస్తోంది. సమాచారాం అందుకున్న జీహెచ్ ఎంసీ అధికారులు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

షాపు పైకప్పు కూలి వ్యక్తి మృతి..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని శివాజీ నగర్ లో సంతోష్ ఎలక్ట్రానిక్స్ షాపు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో షాపులో వున్న గోపాల్ (50) అనే వ్యక్తి మృతి చెందారు. 

21:10 - July 26, 2016

కడప : పీఎఫ్ కార్యాలయంపై సీబీఐ దాడులు చేపట్టింది. పీఎఫ్ రుణ మంజూరు చేయమని వచ్చిన వ్యక్తి నుండి రూ.9వేలు లంచం తీసుకుంటుండగా ఏబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎల్ డీసీ ఉద్యోగి దానం అనే అధికారిని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

20:30 - July 26, 2016

గోదావరి నదిలో రాకాసి చేపలు దడ పుట్టిస్తున్నాయి. పట్టిసీమలో గోదాట్లో  రాకాసి చేపల కలకలం..జాలర్ల వలలో పడుతున్న రాకాసి చేపలు.. హడలిపోతున్న జాలర్లు..రాష్ట్రంల రేగుతున్న మల్లన్న లొల్లి..రక్త పరీక్షలను సిద్ధమంటున్న నాగం జనార్థన రెడ్డి...వేమలవాడ రాజన్న సన్నిథిలో సచ్చిపోతున్నన కోడెలు..తిరుపతి గెస్ట్ హౌస్ ల కెల్లి మాయం అయిన పులి..ఇమానం ఎక్కకుండనే పోతున్న ఇండియా ఇజ్జత్తు..ఇటువంటి మస్తు మస్తు ముచ్చట్లన్నీ తీసుకొచ్చేసిండు మన మల్లన్న మరి జాగెందుకు ఈ వీడియోను క్లిక్ చేయండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

నిరుద్యోగులకు శుభవార్త..

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. 2007 జులై 28 వరకూ వయోపరిమితిని పొడిగించింది. గతంలోని పదేళ్ళ సడలింపు నేటితో ముగియటంతో మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.టీఎస్ పీఎస్సీతో పాటు అన్ని ఉద్యోగాలకు ఇది వర్తిస్తుంది.

ఆసుపత్రిలో డ్రగ్స్ అధికారుల తనిఖీలు..

వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎంజీఎంలో మందల కొనుగోళ్ళలో గోల్ మాల్ జరిగింది. దీంతో తనిఖీల్లో భాగంగా ఎంజీఎంలో  డ్రగ్స్ రూమ్ లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 

ఆర్టీఏ అధికారులు ఓవర్ యాక్షన్ ..

హైదరాబాద్ : ఆర్టీఏ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తుండగా ఆపకుండా వెళ్లిపోయిన ఓ ఆటోను వెంబడించారు. అనంతరం ఆటోను చేజ్ చేసి డ్రైవర్ ను బయటకు లాగారు. దీంతో అదుపు తప్పిన ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఆగస్టు 1న విద్యాసంస్థల బంద్..

విజయవాడ : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జేఏసీ ఆధ్వర్యాన బంద్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ప్రముఖ దౌత్యవేత్త అరుంధతీ ఘోష్‌ మృతి..

ఢిల్లీ : ప్రముఖ దౌత్యవేత్త, ఐక్యరాజ్యసమితిలో భారత తరఫున రాయబారిగా బాధ్యతలు నిర్వహించిన అరుంధతీ ఘోష్‌(76) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె సోమవారం అర్ధరాత్రి దిల్లీలోని ఆమె నివాసంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

బాలికపై ఇంటి యజమాని అత్యాచారం..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీజేనగర్ లో దారుణం జరిగింది. ఇంట్లో అద్దెకుంటున్న 10ఏళ్ళ బాలికపై ఆశీర్వాదం అనే ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమానిని అరెస్ట్ చేశారు. 

ముగిసిన మహాధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన భూనిర్వాశితుల ధర్నా ముగిసింది. ఇప్పటివరకూ చేపట్టని భూ నిర్వాశిత గ్రామాలలోని సిర్వాశితుల సమస్యలపై జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని ఈ ధర్నాలో పాల్గొన్న నేతలు, మేధావులు నిర్ణయించారు. 

మహిళా కమిషన్ అధ్యక్షురాలిపై కేసు నమోదు..

ఢిల్లీ: మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బురారీ ప్రాంతంలో ఓ దళిత బాలికపై జరిగిన రేపు కేసు విషయంలో విచారణాధికారుల చర్యలు దారుణంగా ఉన్నాయని పేర్కొంటూ ఆ రాష్ట్ర పోలీసులపై స్వాతి మాలివల్ నిన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అంటే మంగళవారం నాడు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రేప్ బాధితురాలి వివరాలను కమిషన్ అధ్యక్షురాలు వెల్లడించడాన్ని సూమోటగా స్వీకరిస్తూ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

చంద్రగిరి మండలంలో విషాదం..

చిత్తూరు : చంద్రగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు శకుంతల (21) సోనీగా గురించారు.

పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం ..

హైదరాబాద్: పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా రహదారి కనిపించక 3 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. వర్ష దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

18:53 - July 26, 2016

తూ.గోదావరి : డబ్బు కోసం ఓ ఇల్లాలి ప్రాణాలు బలిగొన్నారు రాజకీయ నాయకులు..రాజకీయ రంగు వేసుకున్న ఇద్దరు వేర్వేరు పార్టీల్లో చెలామణి అవుతూ ఓ అమాయకురాలిని పొట్టనపెట్టుకున్నారు..అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న ఆమె పసుపుకుంకుమ కింద వచ్చిన ఆస్తిని తనఖా పెట్టించి మోసం చేశారు.. చివరకు డబ్బు విషయంలో గొడవలు పడి ఆత్మహత్య చేసుకునేలా చేశారు..వీరి ఘరానా మోసానికి బలయింది కాకినాడ మేఘన...

రాజకీయుల కక్కుర్తికి బలయిన మేఘన...
నిర్జీవంగా ఉన్న ఈమె మేఘన...తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకుని జరిగిన పొరపాట్లు..జరిగిన నష్టాలను పూడ్చుకోవాలనుకున్న ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు రాజకీయ రంగు వేసుకున్న దుర్మార్గులు...ఆస్తులను కొల్లగొట్టి అమాయకురాలి జీవితంతో ఆడుకున్నారు..చివరకు ఆమె ప్రాణాలు పోయేలా చేశారు....కాకినాడలో జరిగిన ఘోరం ఇప్పుడు కలకలం రేపుతోంది...

భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో మేఘన..
పదేళ్ల వైవాహిక బంధంలో ఎన్నో కష్టాలు..ఉంటున్న ఇల్లాలు.. కాకినాడ వెంకటనగరి ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ లో ఉంటున్న తుమ్మలపల్లి మేఘనకు రమేష్‌తో పదేళ్ల క్రితం పెళ్లయింది..వీరికి ఇద్దరు పిల్లలున్నారు..భార్యాభర్తల మధ్య గొడవలతో కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు...

అత్తమామ,భర్త వేధింపులు..
మెట్టినింటి వేధింపులపై కేసులు పెట్టిన మేఘన వెంకటనగరి ప్రాంతంలోని అపార్ట్ మెంట్లో ఉంటోంది... ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ పెళ్లి సమయంలో పుట్టింటి నుంచి వచ్చిన పసుపుకుంకుమ కానుకల ఆస్తులతో ఉన్న మేఘనపై కన్నేశారు రాజకీయులు.. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉంటున్నవారు మేఘనకు దగ్గరయి ఆమె ఆస్తిని తనఖా పెట్టించి డబ్బులిప్పిస్తామన్నారు..కష్టాల్లో ఉన్న మేఘన వారిని నమ్మింది.. అయితే పూర్తిగా నమ్మించినవారు ఆస్తి తనఖా పెట్టించారు కాని డబ్బు మాత్రం ఇవ్వలేదు..

ఆత్మహత్యకు ప్రేరేపించేలా వేధింపులు..
మేఘన ఆస్తి తనఖాపై డబ్బు విషయంలో గొడవలు జరుగుతుండగా ఆమె డబ్బును నొక్కేసిన వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది...కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు... టీడీపీ నాయకురాలు రాయవరపు సత్యభామ, బీజేపీ నాయకుడు సాయిబాబాలు మేఘనను మానసికంగా కృంగిపోయేలా చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపణలు వస్తున్నాయి..వారిపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.

జర్మనీలో కాల్పుల కలకలం..

జర్మనీ : రాజధాని బెర్లిన్ లో సాయుధ దుండగుడు కలకలం సృష్టించాడు. స్టెగ్లిట్జ్ ప్రాంతంలోని బెంజ్ మన్ ఫ్రాంక్లిన్ ఛారిటీ ఆసుపత్రిలోకి సాయుధుడైన దుండగుడు ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. ఒక వైద్యుడిపై దాడి చేయడంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని దుండుగుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడ్డ వైద్యుడికి చికిత్స అందిస్తున్నామని, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

18:27 - July 26, 2016

గుంటూరు : గుంటూరు మార్కెట్‌ యార్డులో ఏడాది క్రితం జరిగిన అవినీతి బట్టబయలైంది. ఏడాది క్రితం లైసెన్సుల జారీలో అక్రమాలపై అప్పటి మార్కెట్‌ యార్డ్‌ సెక్రటరీ నరహరి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఎలాంటి విచారణ చేయకుండానే నరహరిని విజయవాడ మార్కెట్ యార్డు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు. అప్పట్లో అసోసియేషన్‌ నేతలతో సాగించిన బేరసారాలకు సంబంధించిని ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. దీనిపై యార్డులోని మిర్చి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైసెన్సులు ఇవ్వకుండా తమ వద్ద నరహరి డబ్బులు తీసుకున్నాడని, ఇప్పుడు ఆ డబ్బులను తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

విమానాశ్రయంలో భారీ చోరీ...

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం కార్గో సర్వీస్ లో భారీ చోరీ జరిగింది. కొందరు దుండగులు కార్గో సర్వీస్‌లో నుంచి రూ.7లక్షల విలువైన 10ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. విదేశాల నుంచి వచ్చే పార్సిల్‌లో ల్యాప్‌టాప్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న..మేంజిస్ కార్గో సర్వీస్‌లో పనిచేస్తున్న మేనేజర్‌తోపాటు మరో ఇద్దరు ఉద్యోగులను ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

విజయ్‌కాంత్‌ దంపతులకు అరెస్టు వారెంట్‌..

తమిళనాడు : పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానందుకు విజయ్‌కాంత్‌, ఆయన సతీమణి ప్రేమలతకు న్యాయమూర్తి అలమేలు నటరాజన్‌ వారెంట్‌ జారీ చేశారు. గత మూడు విచారణలకు హాజరుకాని విజయ్‌కాంత్‌ మంగళవారం కూడా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నవంబర్‌ 6న పల్లడంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ కేఎన్‌ సుబ్రహ్మణియం విజయ్‌కాంత్‌ దంపతులపై ఫిర్యాదు చేశారు.

18:18 - July 26, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ను శత్రుదేశపు సరిహద్దు ప్రాంతంగా మార్చేసింది ప్రభుత్వం. ఇక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. ఎప్పుడు ఎవరిని విచారణ పేరిట తీసుకు వెళతారో అర్థంకాని ఆందోళనలో ఈ ప్రాంత రైతులున్నారు. పోలీసుల అత్యుత్సాహ స్వామిభక్తి కారణంగా.. ఈ ప్రాంత ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎక్కడ చూసినా ఒక్కటే టెన్షన్‌...పచ్చని పల్లెల్లో ఖాకీల అలజడి..ప్రశాంత పల్లెల్లో తుపాకుల పహారా.. ఏ క్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన

గ్రామాలలో పోలీసుల పహారా..
ఇదీ.. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజల్లో నెలకొన్న టెన్షన్‌ వాతావరణం. రాత్రి, పగలూ అన్న తేడా లేకుండా ముంపు గ్రామాల్లో పోలీసులు వచ్చివెళుతున్నారు. ఏదో శాంతిభద్రతలను కాపాడడానికి అయితే పరవాలేదు.. కానీ వారు భూములు ఇవ్వబోమన్న రైతులు, ముఖ్యంగా యువకులను టార్గెట్‌గా చేసుకుని పల్లెల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. యువకులను తీసుకు వెళ్లి.. నానా చిత్రహింసలకు గురి చేసి.. మళ్లీ ఇళ్లవద్ద పడేసి వెళ్లిపోతున్నారు పోలీసులు.

అమాయక రైతులపై పోలీసులు పాశవికంగా దాడి ...
ఎన్నో ఏళ్లుగా నేల తల్లినే నమ్ముకున్న అమాయక రైతులపై పోలీసులు పాశవికంగా దాడి చేయడమే కాకుండా.. వారి హక్కుల్ని కాలరాస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహంతో ముంపు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రేయింబవళ్లూ గ్రామాల్లో సంచరిస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. జాతీయ రహదారిని దిగ్బంధనానికి వెళుతున్న అనేక మంది గ్రామస్తులపై లాఠీచార్జ్‌కి పాల్పడ్డ పోలీసులు.. తాజాగా గ్రామాల్లోనే పాగా వేసి ప్రశాంత పల్లె జీవనంలో బందూకులతో సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలే భూములు, ఇళ్లను కోల్పోతున్నామన్న బాధలో ఉన్న ప్రజల పట్ల పోలీసులు మరింత అమానుషంగా ప్రవర్తించి ఆవేదనకు గురి చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలకు దిగుతున్నా... పోలీసులు మాత్రం కనికరం లేకుండా లాఠీలు ఝళిపించడం శోచనీయమని బాధితులు వాపోతున్నారు.

పోలీసులపై చర్చలు తీసుకోవాలి : భాస్కర్
మరోవైపు ముంపు గ్రామాల్లో సంచరిస్తున్న దళారులు అమాయక రైతుల నుంచి భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయించే పనిలో పడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యంగా వారి నోళ్లు మూయిస్తున్నారు. అమాయక ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్‌ భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

యువకులకు ప్రత్యక్ష నరకం..
గ్రామాల్లోని యువకులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న పోలీసులు.. శాంతి, ప్రజాస్వామ్యాల గురించి లెక్చర్లిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే తమకేమీ అభ్యంతరం లేదని ప్రకటిస్తున్నారు.

దినదిన గండంలా గ్రామ ప్రజలు..
ఏదేమైనా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో ప్రజలు దినదిన గండంలా.. అనుక్షణం టెన్షన్‌ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడం, పోలీసులు అతిగా వ్యవహరిస్తుండటంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

17:44 - July 26, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై కాంగ్రెస్‌, టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తమ హయాంలో రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలు.. ఈ రోజు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అరెస్ట్‌ చేస్తే కాంగ్రెస్‌ నేతలు గగ్గోలుపెడుతున్నారన్నారన్నారు. ప్రస్తుతానికి అరెస్టులు చేసి వదిలేస్తున్నామని.. భవిష్యత్‌లో కేసులు కూడా పెట్టి జైలుకు కూడా పంపిస్తామని తలసాని హెచ్చరించారు. 

17:41 - July 26, 2016

హైదరాబాద్ : చలోమల్లన్న సాగర్‌ను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నేతలను అడ్డుకోవడం టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని సీఎల్పీనేత జానారెడ్డి అన్నారు. ఇలాంటి పార్టీలను 5 సంవత్సరాలు పూర్తికాకముందే గద్దె దించిన ఘనత ప్రజాస్వామ్యంలో ఉందని ఆయన గుర్తు చేశారు. అదే గతి ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు పడుతుందని జానారెడ్డి అన్నారు.

17:35 - July 26, 2016

మణిపూర్ : ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఇరోమ్‌ షర్మిలా తన దీక్షను విరమించనున్నారు. మణిపూర్‌లో ఆర్మీ జవాన్ల అత్యాచారాలకు నిరసనగా గత 16 ఏళ్లుగా ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆగస్టు 9 నుంచి తన దీక్షను విరమించి పెళ్లి చేసుకోనున్నట్లు జిల్లా కోర్టులో 42 ఏళ్ల షర్మిలా తెలిపారు. వచ్చే మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. గత 14 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గదిని కేటాయించారు. షర్మిలా ముక్కులో పైపు పెట్టి బలవంతంగా ఆహారాన్ని ద్రవ రూపంలో అందిస్తున్నారు. మణిపూర్‌లో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌-ఏఎఫ్ఎస్ఎస్పీఏకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు.

17:31 - July 26, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీలవి రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందన్నారు. సూర్యుడికి మబ్బులు తొలగినట్లుగా మల్లన్న సాగర్ ప్రాంత ప్రజలు అపోహలు తొలగించుకుంటున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు..ఏది ఏమైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. రైతులను ఒప్పించే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు అపోహలు వదలించుకుని ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిపారు. గతపాలకులు చేసిన అన్యాయాన్ని ప్రశ్నించే సత్తాలేని పార్టీ నాయకులంతా ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించటానికి కేసీఆర్ అహర్నిశలూ పాటు పడుతున్నారని తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం సృస్టిస్తున్నారని విమర్శించారు. 

17:26 - July 26, 2016

హైదరాబాద్ : ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ కేసులో విచారణ పురోగతి సాధించింది. ఈ కేసులో బ్రోకర్లు వెంకట్రావ్ , రమేష్ లను సీఐడీ అధికారులు ఆదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లుగా సమాచారం. బ్రోకర్ రమేష్ పై అనుమానాలు బలపడుతున్నాయి. 60మంది విద్యార్థులను సీఐడీ విచారించనుంది. ఢిల్లీలో ఎంసెట్ 2 పేపర్ ను ప్రింట్ చేయించామని జేఎన్టీయూ అధికారుల తెలిపారు. పోలీసులకు జేఎన్టీయూ పూర్తిగా సహకరిస్తోంది. దీంతో సీఐడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. కాగా ఈ కేసులో జేఎన్టీయూకు సంబంధించిన ప్రొఫెసర్ల హస్తం కూడా దీంట్లో వున్నట్లుగా అనుమానిస్తున్నారు.

17:23 - July 26, 2016

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ కావడంతో మహేష్ ఆచితూచి అడుగేస్తున్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడంట. ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందడానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారంట. ఆ రోజున మహేష్ పుట్టిన రోజు కాకపోవడంతో అభిమానులకు కానుకగా ఈ ప్రీ లుక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు పై నిర్వహించిన లుక్ టెస్ట్ లోని ఫోటోలనే ప్రీ లుక్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఎలాంటి ప్రకటన అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఆ రోజున లుక్ విడుదలవుతుందా ? లేదా ? అన్నది చూడాలి.

17:17 - July 26, 2016

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'సరైనోడు' తో ఏకంగా 2016వ సంవత్సరానికి అతిపెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో నటించిన వారు బిజినెస్ రంగంలోకి రావడం పరిపాటిగా మారింది. పలువురు స్టార్స్ రెండు చేతులా వారు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 'బన్నీ' కూడా చేరిపోయాడు. త్వరలోనే బిజినెస్ మెన్ కాబోతున్నాడు. నగరాన్ని అంతర్జాతీయ స్థాయి అతిథ్యాన్ని రుచి చూపేందుకు 'ఎమ్ కిచెన్, కేదార్ శెలగం శెట్టి' వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో కలిసి నైట్ క్లబ్ లను ప్రారంభించనున్నాడంట. జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో రానున్న ఈ క్ల‌బ్‌లో జ‌ప‌నీస్ రెస్టారెంట్‌, కేఫ్‌తో పాటు బార్బి క్యూ రెస్టారెంట్ వ‌గైరా ఉంటాయని తెలుస్తోంది. ఇప్ప‌టికే క్ల‌బ్ ప్రారంభోత్స‌వ ఏర్పాట్లు కూడా పూర్త‌యిన‌ట్టు, ఈ నెల 29న క్లబ్ ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమాలో సక్సెస్ అయిన అల్లు అర్జున్ బిజినెస్ లో కూడా సక్సెస్ అవుతారా ? లేదా ? అన్నది చూడాలి.

రైతులు కోరుకున్న విధంగానే పరిహారం - హరీష్..

హైదరాబాద్ : రైతులు కోరుకున్న విధగా పరిహారం చెల్లిస్తామని, రైతులకు మెరుగైన నష్టపరిహారం అందచేయడం జరుగుతోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రైతుల అనుమతితోనే భూ సేకరణ చేస్తామన్నారు. ప్రజల మధ్య అపోహాలు సృష్టిస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని, కాంగ్రెస్, టిడిపిలది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు.

రాజ్యసభ బుధవారానికి వాయిదా..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్ కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పట్టుబట్టింది. దీనికి డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ నేతలు పోడియంను చుట్టుముట్టి, ప్లకార్డులు చేతబట్టి, నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీనితో డిప్యూటి ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.

టి.న్యాయవాదుల ఉద్యమానికి తాత్కాలిక విరామం..

ఢిల్లీ : ఉద్యమానికి తాతాల్కిక విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలంగాణ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈనెల 29 నుండి విధుల్లో చేరాలని న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా ప్రధాని..సీఎం హామీనిచ్చినందున కొంత సమయం వేచి చూడాలని భావిస్తున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు, భారత ప్రధాన న్యాయమూర్తి హామీపై నమ్మకం ఉందన్నారు. హైకోర్టు విభజన జరగకపోతే మళ్లీ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

17:00 - July 26, 2016

ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ, టీడీపీలు ప్రజలను దారుణంగా మోసం చేశాయని వివిధ రాజకీయపార్టీ నేతలు విమర్శించారు. విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వైసీపీ నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లుకు వచ్చేనెల 5వ తేదీన జరిగే చర్చలో మద్దతు తెలపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

ఎంసెట్ 2 పేపర్ లీక్ లో సీఐడీ దర్యాప్తు వేగవంతం..

హైదరాబాద్ : ఎంసెట్ 2 పేపర్ లీక్ కేసులో బ్రోకర్లు వెంకట్రావ్, రమేష్ లను సీఐడీ అదుపులోకి తీసుకుంది. వీరిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తోంది. బ్రోకర్ రమేష్ పై అనుమానాలు బలపడుతున్నాయి. 60 మంది విద్యార్థులను సీఐడీ విచారించనుంది. మొత్తం 8 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే సీఐడీ నలుగురు విద్యార్థులను విచారించింది. ఢిల్లీలో ఎంసెట్ 2 పేపర్ ప్రింట్ చేయించామని జేఎన్టీయూ పేర్కొంది. జేఎన్టీయూ పోలీసులకు సహకరిస్తోంది. సెర్చ్ వారెంట్ కావాలని సీఐడీ కోర్టు కోరింది.

భూ నిర్వాసితులను ఆదుకుంటాం - మంత్రి తలసాని..

హైదరాబాద్ : భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తలసాని ప్రకటించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించడంతో పాటు జీవో 123 ప్రకారం ఇస్తామని చెబుతున్నట్లు తెలిపారు. ఆరునూరైనా ప్రాజెక్టులను కట్టి తీరుతామని, బందరు పోర్టుకు రెండు వేల ఎకరాలు సరిపోతుందని, మరి టిడిపి ఐదు వేల ఎకరాలు ఎందుకు తీసుకొంటోందని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు డ్రామా కంపెనీలుగా తయారయ్యాయని, ఇప్పుడు అరెస్టులే..రేపు జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు.

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బెయిల్...

ఢిల్లీ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ కు బెయిల్ మంజూరైంది. సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూర చేసింది. ఢిల్లీని విడిచి వెళ్లవద్దని సూచించింది. అవినీతి ఆరోపణలపై రాజేంద్రకుమార్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

16:57 - July 26, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వం భూములు లాక్కోవడం ద్వారా బంగారు తెలంగాణ సాధించలేదని సీపీఎం జాతీయ నేత బృందా కారత్‌ విమర్శించారు. భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన మహా ధర్నా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా కారత్‌ మాట్లాడుతూ వన్‌ టూ త్రీ జీవో చీకటి జీవో అని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తన కళ్ల జోడును మార్చుకొని వాస్తవాలను చూడాలని విమర్శించారు. 

16:55 - July 26, 2016

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కృష్టా పుష్కరాల నిర్వహణ, వనం-మనంపై సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది. పుష్కరాల పనుల నిర్వహణపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు క్వింటాకు 70శాతం కమీషన్ పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అవసరాలు తీరాకే కేజీ బేసిన్ గ్యాస్ ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని భేటీలో నిర్ణయించారు. 

16:43 - July 26, 2016

ఢిల్లీ : కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు ప్రత్యేక బిల్లుపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ పట్టుబట్టింది. పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు నినాదాలతో రాజ్యసభను హోరెత్తించారు. రాజ్యసభ రూల్స్ కు విరుద్ధమని చెప్పిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్, ఈ శుక్రవారం చర్చకు తీసుకువద్దామని అన్నారు. దానికి అంగీకరించని కాంగ్రెస్ నేతలు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కురియన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి మధ్య ఆసక్తికర వాదన చోటుచేసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి ఆందోళన చేయటం సరికాదని ఏచూరి అన్నారు. సమస్యను పరిష్కరించాలని అనుకుంటే ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని కోరారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తున్నట్టు గతంలో ప్రధాని ప్రకటించారని, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని, అధికార పార్టీని అందుకు ఆదేశించాలని ఆయన సూచించారు.

ఇది రాజ్యాంగంలో ఉందని...ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్యబిల్లు అని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. దీంతో ద్రవ్య బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభకు అధికారం లేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. దీనిపై సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సభను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ఆయన చెబుతున్నట్టు ద్రవ్యబిల్లు అయితే డిప్యూటీ ఛైర్మన్ బిల్లును ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కురియన్ చర్చను విన్న తరువాత అది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది స్పీకర్ నిర్ణయిస్తారని ..ఈ రోజు ఈ బిల్లుపై చర్చకు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సభలో గందరగోళ పరిస్థితుల్లో మార్పు రాకపోవటంతో డిప్యూటీ చైర్మన్ బుధవారానికి వాయిదా వేశారు. 

16:17 - July 26, 2016

తూ.గోదావరి : కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. ఉరేసుకుని ఓ మేఘన అనే వివాహిత వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మేఘన ఆత్మహత్యకు ఇద్దరురాజకీయ నేతలు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులిద్దరూ టీడీపీకి చెందిన రాయవరపు సత్యభామ, బీజేపీకి చెందిన నాయకుడు సాయిపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘన కొంతకాలంగా భర్తకు దూరంగా వుంటున్న సంగతి గమనించిన ఈ నేతలు ఆమెఆస్తుల విషయంలో జోక్యం చేసుకున్నారు. మేఘనకు వివాహం సందర్భంగా పుట్టింటివారు ఇచ్చిన స్త్రీ ధనం ఆస్తిని సదరు రాజకీయ నాయకులు విక్రయించి డబ్బులు ఇవ్వకుండా మేఘనను ఇబ్బందులకు గురిచేసినందువల్లనే ఆత్మహత్య చేసుకుందని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. భర్తకూ తనకూ మధ్య వున్న కేసు కోర్టులో కొనసాగుతుండటంతో గత కొంతకాలంగా మేఘన భర్తకు దూరంగా వుంటోంది. కాగా సత్యభామ విశాఖలో వున్నట్లుగా సమాచారం. కేసుకు సంబంధించి ఎవరైతే వున్నారో అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తామనీ పోలీసులు పేర్కొంటున్నారు. 

ప్రైవేటు బిల్లు ప్రత్యేక అంశంగా తీసుకోవాలి - ఏచూరి..

ఢిల్లీ : కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. ప్రైవేటు బిల్లుపై ప్రత్యేకంగా పట్టుబడుతున్నందున దానిని ప్రత్యేక అంశంగా తీసుకోవాలని సీపీఎం సభ్యుడు సీతారం ఏచూరి పేర్కొన్నారు.

రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన..

ఢిల్లీ : కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. ప్రైవేటు బిల్లుపై ప్రత్యేకంగా పట్టుబడుతున్నందున దానిని ప్రత్యేక అంశంగా తీసుకోవాలని సీపీఎం సభ్యుడు సీతారం ఏచూరి పేర్కొన్నారు. ప్రైవేటు బిల్లును మనీ బిల్లుగా ఎలా అంగీకరించాని ఏచూరి నిలదీశారు. మనీ బిల్లుపై రాజ్యాంగంలో ప్రత్యేకమైన నిర్వచనాలు ఉన్నాయి..రూల్ ప్రకారమే బిల్లు ప్రవేశ పెట్టాలని సూచించారు. ప్రవేశ పెట్టిన బిల్లును మనీబిల్లుగా స్వీకరించడంపై తుదినిర్ణయం స్పీకర్ దేనని డిప్యూటి ఛైర్మన్ స్పష్టం చేశారు. ప్రైవేటు బిల్లుపై శుక్రవారం చర్చిద్దామని పేర్కొన్నారు.

మంత్రులు..అధికారులతో సీఎం బాబు భేటీ..

విజయవాడ : మంత్రులు..అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పుష్కరాలు, పరిపాలనలో సాంకేతిక అనుసంధానంపై చర్చిస్తున్నారు.

ముంబైలో అత్యవసరంగా ల్యాండైన విమానం..

ముంబై : ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దుబాయి నుండి మాల్దీవులకు విమానం వెళ్లాల్సి ఉంది. విమానంలో ఉన్న 309 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

కాకినాడలో వివాహిత ఆత్మహత్య..

కాకినాడ : వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేగింది. మేఘన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేఘన ఆత్మహత్యకు ఇద్దరు రాజకీయ నేతలు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. టిడిపి నాయకురాలు రాయవరపు సత్యభామ, బీజేపీ నాయకుడు సాయిపై బంధువులు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా భర్తకు మేఘన దూరంగా ఉంటోంది. ఆస్తుల విషయంలో నేతలు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్తులు అమ్మేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

15:44 - July 26, 2016

హైదరాబాద్ : లాఠీలు తూటాలు సీపీఎం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. తుపాకి తూటాలకు ఎదురెల్లి ఉద్యమాలు చేసిన ఘటన సీపీఎం పార్టీదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద భూనిర్వాశిత కమిటీ చేపట్టిన మహాధర్నాలో మాట్లాడుతున్న సందర్భంగా అన్నారు. ఇది రాజకీయ పార్టీల ధర్నా కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల నేపథ్యంలో చేస్తున్న అన్యాయంగా చేస్తున్న  భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురవుతున్న బాధితులను పరామర్శించటానికి కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ఎంపీగా విధులు నిర్వహించినా తాను..జడ్జిగా న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన న్యాయసేవలు అందించి చంద్రకుమార్ గారు కూడా బాధిత ప్రాంతానికి చేరుకోవటానికి దొంగల్లాగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ముచ్చర్లలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. అభివృద్ధికి మేం వ్యతిరేకంగా కాదనీ ఆయన మరోసారి స్పష్టం చేశారు. చట్టప్రకారం భూ నిర్వాశితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ భూ నిర్వాశితులపై సోమవారం నాడు లాఠీ చార్జ్ చేసిన సంగతి తెలిసిందే.

రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లు రగడ..

ఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రగడ నెలకొంది. చర్చకు కాంగ్రెస్ పట్టుబడడంతో గందరగోళం నెలకొంది. ఉద్ధేశ్యపూర్వకంగానే బిల్లును అడ్డుకుంటున్నారని, ఓటింగ్ కు అవకాశం ఇవ్వాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధంగా ఉందని, కావాలనే కాంగ్రెస్ గేమ్ ఆడుతోందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే రూలింగ్ ఇచ్చినందున బిల్లుపై ఓటింగ్ కు డిప్యూటి ఛైర్మన్ కురియన్ అనుమతినిచ్చారు. నిరసనగా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు కురియన్ వెల్లడించారు.

ఫిల్మ్ క్లబ్ సభ్యులకు పోలీసుల నోటీసులు..

హైదరాబాద్ : ఫిల్మ్ క్లబ్ సభ్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 24గంటల్లో తమ ఎదుట హాజరై వివరణనివ్వాలని క్లబ్ ప్రతినిధులు రామారావు, రాజశేఖర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. కాంట్రాక్టు కొండల్ రావు, ఇంజినీర్ సుధాకర్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

15:34 - July 26, 2016

కర్నూలు : పాణ్యం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులను వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపారు. నాలుగు నెలల నుండి విజయవాడలో అజ్ఞాతంగా వుండి  మంగళవారం  నాడు బనగానపల్లి కోర్టులో హాజరయ్యి తిరగి వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు కాపు కాచి  వెంటాడి సినీ ఫక్కీలో వేట కొడవళ్ళతో  దాడి చేసి హత్య చేశారు. బాధిత కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు   పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తులను పాలిమిగుండ్ల (మం) ఉప్పలూరుకు ఓబులేసు, సాంబయ్యలుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు పాతకక్షలే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. 

2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి - తమ్మినేని..

హైదరాబాద్ : 2013 చట్ట ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. ఇందిరాపార్కు వద్ద భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. ఇది రాజకీయ సభ కాదని, భూ నిర్వాసితుల సంఘం నుండి జరుగుతున్న సభ అని తెలిపారు. చట్టాన్ని ఎక్కడైతే ఉల్లంఘిస్తున్నారో..చట్టాన్ని చుట్టం చేస్తుండడంపైనే తాము విమర్శలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, చట్టవిరుద్ధమైన పనులపైనే తాము మాట్లాడడం జరుగుతుందన్నారు.

15:14 - July 26, 2016

హైదరాబాద్ : అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని సీపీఎం జాతీయ నాయకురాలు బృందాకరత్ పేర్కొన్నారు. భూనిర్వాశితుల పోరాట సమితి ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఎం జాతీయ నాయకురాలు బృందాకరత్ పాల్గొన్నారు. భూపోరాట సమితి నాయకులు చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,10 వామపక్ష నాయకులు,మేధావులు పాల్గొన్నారు. ఈ ధర్నా సందర్భంగా జాతీయనాయకురాలు బృందాకరత్ మాట్లాడుతూ..హక్కుల కోసం పోరాడుతున్న ఈ మహాధర్నాలో పాల్గొని ..మీతో పాలుపంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా వుందన్నారు. భూమికోసం,భుక్తికోసం పోరాడుతున్న హక్కుదాలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించారు. వాటి గురించి నేను మాట్లాడదలచుకోలేదు కానీ.. ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టిన అమాయక ప్రజలపై లాఠీ చార్జ్ చేయించిన ఘతన మాత్రం కేసీఆర్ రికార్డు సృష్టించిన రికార్డు మాత్రం కేసీఆర్ కు మాత్రమే దక్కిందని విమర్శించారు. అమాయకులపై లాఠీ చార్జ్ చేసిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలని కూడా చూడకుండా అమానుషంగా లాఠీ చార్జ్ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ తన నివాసం చుట్టూ పోలీసు పఠాలాన్ని కాపలాపెట్టుకుని కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. అమాయక ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా దాడులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు..ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి కష్టాలను తొలగించటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా..ప్రశ్నించినవారిపై దాడులకు దిగుతోందన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న భూ హక్కులకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలపై లాఠీ చార్జ్ చేయటం అమానుషమన్నారు. నరేంద్ర మోడీ ఏజెంట్ లాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు 25ఏళ్ళు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటున్నాయనీ..దీని వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం జరిగిందో ప్రశ్నించుకోవాల్సిన అవసరముందన్నారు. పోలీసులను ఉసిగొలిపి దాడులు చేయించి ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. భూసేకరణ చేయటానికి దొడ్డిదారిన వెళ్ళటానికి 123 చట్టాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని ఆమె తెలిపారు. మేం అభివృద్ధికి వ్యతిరేకంగా కాదనీ..బాధితులకు సరైన న్యాయం చేసేంతవరకూ ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు.

బాధితురాలి ఆవేదన..
బంగారు తెలంగాణ కావాలని ఉద్యమాలలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని ..ఉద్యమాలలో పాల్గొని నానా హింసలు అనుభవించిన మాకు కేసీఆర్ మానోటోంల మన్ను పోస్తున్నాడని భూనిర్వాశిత బాధితురాలు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను బంగారు కంచంలో బంగారాన్ని తినే కేసీఆర్ మానోట్లో మట్టికొడుతున్నాడని పేర్కొంది. మాకు ఏ ప్రాజెక్టులూ అవసరం లేదనీ..మా ఊర్లో మమ్మల్ని వుండినిచ్చి..మా బ్రతులు మమ్మల్ని బ్రతనిస్తే మాకు అంతకంటే ఏమీ అవరసరం లేదని ఆమె ఈ సందర్భంగా కోరుకుంది. 

యువతి గొంతుకోసిన వ్యక్తి అరెస్టు..

విజయనగరం : ప్రేమించలేదనే అక్కసుతో బ్లేడుతో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లికి అంగీకరించలేదని యువతి గొంతు కోసిన విక్రమ్‌పై హత్యాయత్నం, నిర్భయ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

నర్సీపట్నంలో గంజాయి స్వాధీనం..

విశాఖపట్టణం : జిల్లాలోని నర్సీపట్నంలో రూ.10 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వారు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది.

హెచ్ఎండీఏ ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు..ప్రతిపాదిత ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సుందరీకరణ తీసుకోవాల్సిన వాటిపై కూడా చర్చించారు.

14:51 - July 26, 2016

తప్పటడుగులు వేసి బలయ్యిందా ? భర్తే కర్కోటకుడయ్యాడా ?

భర్తతో విబేధాలు రావడంతో విడిగా ఉంటోంది. బతుకు దెరువు కోసం పనిచేసుకొంటోంది. బయటకు వెళ్లిన ఆమె మృగాళ్ల చేతికి చిక్కిందా ? లేక కుటుంబ కలహాలతో అంతమయ్యిందా ? కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సిరిసిల్లలోని అగ్రహారంలో వివాహిత దారుణ హత్య సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలే హత్యకు దారి తీశాయా ? తప్పటడుగులు వేసిన ఇళ్లాలు అంతమయ్యిందా ? మృగాళ్ల చేతికి చిక్కి బలయ్యిందా ? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. కల్పనకు ఏడేళ్ల క్రితం శ్రీనివాస్ తో వివాహం జరిగింది. భర్తతో విబేధాల కారణంగా ఏడాదికాలంగా దూరంగా ఉంటోంది. ఓ హోటల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

14:38 - July 26, 2016

కలహాల్లో కాపురాలు కొట్టుకపోతున్నాయి. ఆలుమగల మధ్య తగాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వారి మధ్య చెలరేగుతున్న మనస్పర్థలు పచ్చటి కాపురాలు బుగ్గిపాలు చేస్తున్నాయి. అత్తింటి వేధింపులు తట్టుకోలేక కడప ఆడబిడ్డ బలైపోతే అత్తారింటి వేధింపులు భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప జిల్లాలో మరో కిరాతకం చోటు చేసుకుంది. మండపంపల్లికి చెందిన మస్తాన్ కు ఆలీషాకు వివాహం జరిగింది. ఆరేళ్ర క్రితం వీరి వివాహం జరిగింది. భర్త మస్తాన్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఆలీషా కన్నవారు కూడా కువైట్ వెళ్లారు. పిల్లలు పట్టలేదని అత్తింటి వారు వేధించడం మొదలు పెట్టారు. భర్త కూడా వేధింపులు కూడా గురి చేశాడు. ఈ విషయమంతా తన పిన్నితో చెప్పుకుంది....
కర్నూలు జిల్లాలో అత్తింటి వేధింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అత్త..మామ..బావమరిదిల వేధింపులకు గురి చేశారు. భార్య..అత్తమామలే కారణమంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:35 - July 26, 2016

గోరింటాకు...మహిళలు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. ఆషాడం వచ్చిందంటే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉండడమే కాకుండా ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని వేడి, బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి గుణం పుష్కలంగా ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లు, పాదాలవరకు రుద్దితే మంటలు తగ్గుతాయి.
గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటిని గోరింటాకు నయం చేస్తుంది.
గోరింటాకుని రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో పెట్టుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

లాఠీఛార్జీ జరగడం అన్యాయం - బృందాకరత్..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఆధీనంలోనే మహిళలు, రైతులపై లాఠీఛార్జీ జరగడం అన్యాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పేర్కొన్నారు. ఇందిరాపార్కు వద్ద భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడారు. ప్రతిపక్షం నిలదీసేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం అన్యాయమన్నారు. అమానుషమైన చర్యకు పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో తమ ఉద్యమాలను అడ్డుకోలేరని, పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందన్నారు.

పాణ్యంలో దారుణం..

కర్నూలు : పాణ్యం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులను వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపారు. పాతకక్షలే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. పాలిమిగుండ్ల (మం) ఉప్పలూరుకు చెందిన ఓబులేషు, సాంబయ్యలుగా గుర్తించారు.

 

ఇందిరాపార్కు వద్ద భూ నిర్వాసితుల మహధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద భూ నిర్వాసితులు మహధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పాల్గొని ప్రసంగిస్తున్నారు.

శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం..

కర్నూలు : శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 32వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 802 అడుగులకు చేరింది.

14:00 - July 26, 2016

హెపటైటిస్ అంటే ఏమిటీ...? అనే అంశంపై మానవి నిర్వహించన వేదిక చర్చా కార్యక్రమంలో హోమియో ఎండీ ప్రభాకర్, హోమియో ఎండీ శ్రీవిద్య పాల్గొని, మాట్లాడారు. హెపటైటిస్ వ్యాధిలో రకాలు తెలిపారు. హెపటైటిస్ రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలను వక్తలు వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....
 

ముగిసిన ఏపీ కేబినెట్..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కృష్ణా పుష్కరాల పనులకు కేబినెట్ ఆమోదించింది. జిల్లాలో ఐఐపీఎం కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రైవేటు డాక్టర్లకు శిక్షణ ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇన్ సర్వీస్ డాక్టర్లుగా నియమించాలని, రేషన్ డీలర్ల కమీషన్ క్వింటాకు రూ.20 నుంచి 70కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇజ్రాయల్ మహిళపై అత్యాచారం ఘటనలో మరొకరి అరెస్టు..

హిమాచల్ ప్రదేశ్ : ఇజ్రాయల్ మహిళపై అత్యాచారం ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. మనాలిలో తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఇజ్రాయిల్ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఐసిస్ సానుభూతి పరులకు రిమాండ్ పొడిగింపు..

హైదరాబాద్ : ఏడుగురు సానుభూతి పరులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు విచారించింది. వచ్చే నెల 24వరకు రిమాండ్ పొడిగించింది. ప్రస్తుతం ఐసిస్ సానుభూతి పరులు చంచల్ గూడ జైలులో ఉన్నారు.

భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా..

హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్, తమ్మినేని వీరభద్రం, చాడ, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జస్టిస్ చంద్రకుమార్, పలు ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు.

13:53 - July 26, 2016

మెదక్ : ఎటుచూసినా పచ్చదనం...రెండు పంటలు పండే చక్కని నేలలు...కొద్దిపాటి వర్షాలకే నిండే గొలుసుకట్టు చెరువులు. బాదర బందీ లేని జీవితాలు...ఇప్పడు మల్లన్నసాగర్ చిచ్చు ఆగ్రామాన్ని అతలాకుతలం చేస్తోంది. గ్రామాలను వదిలి వెళ్లం అన్నందుకు పోలీసులతో కొట్టిస్తారా అని సింగారం గ్రామస్తులు అంటున్నారు. ప్రాణాలు పోయినా సరే... భూములు వదులుకోమన్నారు. బంగారు తెలంగాణ తెస్తాడని అనుకున్నాము..కానీ మల్లన్నసాగర్ లో ముంచుతాడనుకోలేదు అని వాపోయారు. భూములు వదులుకొని పోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. ప్రాణాలు అడ్డుపెట్టైనా గ్రామాలను కాపాడుకుంటామని చెప్పారు. పోలీసులు దుర్మార్గంగా లాఠీచార్జ్ చేశారని పేర్కొన్నారు. 'లాఠీచార్జ్ లో పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారని ఓ యువకుడు వాపోయారు. నా ఫోన్, డబ్బులు గుంజకున్నారు. ఎస్ ఐతో నాకు ప్రాణం భయంతో ఉందని అన్నారు. మల్లన్నసాగర్ వద్దని కర్నాకర్ రెడ్డి అనే యువకుడు చెప్పాడు. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని... భయంతో ఎప్పుడు గుండెపోటు వస్తుందో.. ఎప్పుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామో తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

పీఎఫ్ కార్యాలయంపై సీబీఐ దాడి..

కడప : పీఎఫ్ కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 9వేలు లంచం తీసుకుంటున్న ఉద్యోగి దానంను అదుపులోకి తీసుకున్నారు.

13:43 - July 26, 2016

గుంటూరు : మార్కెట్‌ యార్డులో ఏడాది క్రితం జరిగిన అవినీతి బట్టబయలైంది. ఏడాది క్రితం లైసెన్సుల జారీలో అక్రమాలపై అప్పటి మార్కెట్‌ యార్డ్‌ సెక్రటరీ నరహరి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఎలాంటి విచారణ చేయకుండానే నరహరిని విజయవాడ మార్కెట్ యార్డు కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు.  అసోసియేషన్‌ నేతలతో సాగించిన బేరసారాలకు సంబంధించిని ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. దీనిపై యార్డులోని మిర్చి  వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైసెన్సులు ఇవ్వకుండా తమ వద్ద నరహరి డబ్బులు తీసుకున్నాడని, ఇప్పుడు ఆ డబ్బులను తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

13:38 - July 26, 2016

ఢిల్లీ : తెలంగాణలో రైతులపై జరుగుతున్నలాఠీ చార్జ్‌ల అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై చర్చ చేట్టాలని మహ్మద్‌ అలీ ఖాన్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై జీరో అవర్‌లో చర్చకు నోటీసు ఇచ్చానని అలీ ఖాన్‌ చెప్పారు. అయితే అటువంటి నోటీసేదీ తనకు అందలేదని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ సభ దృష్టికి తెచ్చారు.  దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. 

ఆసుపత్రిలో చేరిన దయాశంకర్ సతీమణి..

లక్నో : బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సతీమణి లక్నో ఆసుపత్రిలో చేరారు. ఇటీవల మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కారు బోల్తా..ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి..

ముంబై : ముంబై - పుణె జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.

13:23 - July 26, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బీజేపీ ఎంపీలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఎపికి ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఈనెల 22న  జరగాల్సిన ఓటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అంశాన్ని రాజ్యసభ చైర్మన్‌ పరిశీలిస్తారని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌...   కేవీపీ దృష్టికి తీసుకొచ్చారు. 
 

సొమాలియాలో ఆత్మాహుతి దాడి..

సొమాలియా : మొగాదిషు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు కారు బాంబుతో ఆత్మాహతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 8మంది పౌరులు మృతి చెందారు.

 

స్నానఘట్టాలను పరిశీలించిన సోము వీర్రాజు..

తూర్పుగోదావరి : గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేస్తున్న స్నానఘట్టాలను బీజేపీ నేత సోము వీర్రాజు పరిశీలించారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే గోదావరి పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

13:08 - July 26, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై టీప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరమా.. అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు మల్లన్నసాగర్ అవరముందేమో కానీ.. మెజారిటీ ప్రజలకు అవసరం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం సాంకేతికంగా అవసరమా అని అన్నారు. 50 టీఎంసీల నీటిని కూడగట్టడం.. సాధ్యమా అన్న అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ కు ఓటు చేసిన వారికి కూడా ప్రాజెక్టుపై అనుమనాలున్నాయన్నారు.  43 శాతం ప్రజలు టీఆర్ ఎస్ కు ఓటేశారని.. ఒకవేల వారు ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకున్నా...  57 శాతం ప్రజలకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో టీసర్కార్ ప్రతిష్టకు పోకుండా అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒకవేల భూసేకరణ తప్పనిసరైతే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని... ఈ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే 2013 భూసేకరణ చట్టం కింద కేవలం భూములు కోల్పోయిన రైతులకు మాత్రమే నష్టపరిహారం లభిస్తుందన్నారు.  కానీ 40 శాతం ప్రజలకు భూములులేవన్నారు. వారు వ్యవసాయ వృత్తిపై ఆధారపడి ఉన్నారని..  పట్టాల్లేని కూలీలు, పని ముట్లు చేసుకునే వారున్నారని, పట్టాలేనివారికి, కూలీ పోగొట్టుకున్న వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. 

 

12:52 - July 26, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ 'చలో మల్లన్నసాగర్' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మలన్నసాగర్ వెళ్లడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గాంధీభవన్ కు చేరుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు గాంధీభవన్ చుట్టూ మోహరించారు. పార్టీ ముఖ్యనేతలతో డీసీపీ కమలాసన్ రెడ్డి మంతనాలు జరిపారు. అరెస్టులకు సహకరించాలని డీసీపీ కోరారు. కానీ అందుకు నేతలు నిరాకరించారు. 'చలో మల్లన్నసాగర్' కు బయల్దేరారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చారు. 'చలో మల్లన్నసాగర్' కు బయల్దేరారు. గాంధీభవన్ వద్ద నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, మల్లుభట్టి విక్రమార్కకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి, భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీతోపాటు మరికొంతమంది ముఖ్యనేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జానారెడ్డితోపాటు కొంతమంది నేతలను నాంపల్లి పీఎస్ కు తరలించారు. భట్టి విక్రమార్కతోపాలు మరికొందమందిని నారాయణగూడ పీఎస్ కు తరలించారు. అంతకముందు భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీసర్కార్ దుర్మార్గం వ్యవహరిస్తుందన్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా... ప్రశ్నించారు. జానారెడ్డి మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా 'చలో మల్లన్నసాగర్' వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేస్తున్నారని... దీన్ని ప్రజలు ఖండించాలన్నారు. పోలీసుల అరెస్టును బ్లాక్ డే గా భావిస్తున్నానని షబ్బీర్ అలీ అన్నారు. పోలీసుల అరెస్టులతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 

జల్లికట్టు నిషేధం ఎత్తివేతకు సుప్రీం నో...

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని సాంప్రదాయక క్రీడ 'జల్లికట్టు'పై నిషేధం ఎత్తివేతకు సుప్రీం నిరాకరించింది. 'జల్లికట్టు' నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

లాఠీఛార్జిని ఖండించిన జైపాల్ రెడ్డి...

హైదరాబాద్ : మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు బాధితుల‌పై పోలీసులు జరిపిన లాఠీఛార్జిని తాము ఖండిస్తున్న‌ట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం త‌న తీరుని మార్చుకోవాల‌ని, రైతు వ్య‌తిరేక విధానాల‌ను అనుస‌రిస్తోంద‌ని అన్నారు.

12:43 - July 26, 2016

తనూజ డెత్ బాడీకి పోస్టుమార్టం పూర్తి...అంత్యక్రియలకు స్వస్థలానికి తరలింపు...ఫోరెన్సిక్ నివేదికతోనే నిజనిజాలు బయటకు రానున్నాయి...

విశాఖ బాలిక తనూజ డెత్ మిస్టరీ కొనసాగుతోంది. బాలికపై లైంగిక దాడి జరిగిందా ?లేక తల్లి మందలించడంతోనే అఘాయిత్యానికి పాల్పడిందా ? ఇంట్లో నుండి వెళ్లిన ఆ ఐదు గంటలకు తనూజ ఎక్కడుంది ? ఎవరితో కలిసి ఉంది ? గడప దాటి మృగాళ్ల చేతికి చిక్కిందా ? లేక మరేదైనా జరిగిందా ? పోస్టుమార్టం పూర్తి చేసి డెడ్ బాడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే గాని వాస్తవాలు బయటపడనున్నాయి. పోస్టుమార్టంలో సేకరించిన ఆనవాళ్లను హైదరాబాద్ ల్యాబ్ కు తరలించారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక రానుంది.

నర్సింగ్ యాదవ్ కు అండ – సీఎం ఫడ్నవీస్..

మహారాష్ట్ర : మల్లయోధుడు నర్సింగ్ యాదవ్ కు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. స్పోర్ట్స్ మినిస్టర్ కు లెటర్ వ్రాస్తానని పేర్కొన్నారు. డోపింగ్ టెస్టులో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే.

12:16 - July 26, 2016

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ అత్యాచార ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. ఢిల్లీ అత్యాచార ఘటనపై చర్చించాలని ఎంపీలు జయాబచ్చన్, కనిమొళి పట్టుబట్టారు. దేశంలో మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని జయబచ్చన్ వాపోయారు. ఇది మొదటి ఘటన కాదని అన్నారు. నోటీసులు ఇవ్వాలని రాజ్యసభ ఛైర్మన్ కురియన్ సూచించారు. ఈనెల 22న ప్రైవేట్ బిల్లును ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సభ్యులు అడ్డుకున్నారని ఛైర్మన్ కు కెవిపి నోటీసులు ఇచ్చారు. బీజేపీ సభ్యులపై ఛైర్మన్ కు కేవీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రాజ్యసభలో గందరగళం నెలకొంది.

12:14 - July 26, 2016

విజయవాడ : రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి కృష్ణా పుష్కరాలను.. ఒక మంచి సందర్బంగా వాడుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  పుష్కరాలు జరిగే 12 రోజులు పుష్కర ప్రాముఖ్యతను తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కృష్ణా పుష్కరాల కమిటీని ఆదేశించారు సీఎం చంద్రబాబు .    
పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణపై చర్చ
కృష్ణా పుష్కరాలను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని కృష్ణా పుష్కర కమిటీ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిటీతో చర్చించిన ఆయన పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణ పై చర్చించారు.  
ఏపీ సంస్కృతి గొప్పదనం దశదిశలా వ్యాపించేలా ఉత్సవ వాతావరణం కనిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు పుష్కరాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. 
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కృష్ణా పుష్కరాలు 
ఆంధ్రప్రదేశ్‌ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా పుష్కరాలను నిర్వహించాలని...12 రోజులు 12 అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చాగోష్ఠులు సాగించాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఏఏ అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహించాలన్న దానిపై  పండితులతో  మరోసారి చర్చించి నిర్ణయిద్దామన్నారు. ప్రధానమైన చర్చాగోష్ఠి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.  
ఘాట్లసంఖ్య, సామర్థ్యం పై ప్రజెంటేషన్ ఇవ్వాలన్న చంద్రబాబు 
72 గంటల ముందే.. పుష్కరవిధులకు హాజరయ్యే అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు రిపోర్టు చేసేలా చూడాలని  సీఎం అన్నారు. వారం ముందే పుష్కరాలకు రిహార్సల్స్ వేసుకోవాలని సీఎం సూచించారు. ఒక్కోరోజు ఒక్కో గురువును పిలిపించి ఆయా రోజులకు మరింత పవిత్రత, వన్నెతేవాలని సీఎం చెప్పారు. ఏ కార్యక్రమాల్ని ఎవరు నిర్వహించాలో ముందే రోల్ క్లారిటీ వుండేలా ప్రాసెస్ చార్ట్ రూపొందించాలన్నారు. ఎన్ని ఘాట్లు వున్నాయో, ఘాట్ల పరిమాణం , సామర్థ్యం ఎంతో అందరికి అర్థమయ్యేలా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. 
డ్వాక్రా ఉత్పత్తుల స్టాళ్ల ఏర్పాటు 
అలాగే పుష్కరాల సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్  స్టేడియంలో, స్వరాజ్ మైదాన్ లోను డ్వాక్రా ఉత్పత్తుల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్  సీఎంకు తెలిపారు.  గోదావరి పుష్కరాలలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రణాళికను రూపొందించుకోవాలని సీఎం అధికారులకు  సూచించారు. 

 

సహాయక చర్యల్లో 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

ఢిల్లీ : సహాయక చర్యల్లో 30 ఎన్టీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని ఎన్డీఆర్ఎఫ్ డీజీ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని డీజీ ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు.

టి.సర్కార్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై టి.కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ లో పర్యటించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ అరెస్టులతో అణిచివేతకు గురి చేస్తున్నారని జానారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నట్లు, ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. పోలీసుల దౌర్జన్యం నశించాలని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఈ రోజు బ్లాక్ డే అని, సేవ్ డెమోక్రసీ అని షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు.

11:46 - July 26, 2016

మనం లాఠీ ఛార్జీలు జేశేతప్పుడు సూస్తుంటంగదా..? ఒక్క ఆందోళన కారుడు దొర్కితె పోలీసోళ్లు ఎట్ల గొడ్తరు.. పదిమంది వాని సుట్టు జేరి.. లాఠీలతోని ఈపంత వలగొడ్తరు అవునా..? అదే వందమంది ఆందోళన కారుల నడ్మ ఒక్క పోలీసుంటె ఏమైతది..? సీన్ రివర్స్ అయితది..అగో అదే అయ్యింది సూరత్ కాడ. వీడియోలో సూడుండ్రి.

నాంపల్లి చౌరస్తాలో ఉద్రిక్తత...

హైదరాబాద్ : నాంపల్లి చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్లన్న సాగర్ లో పర్యటించేందుకు గాంధీ భవన్ నుండి వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.

11:29 - July 26, 2016

కృష్ణా : విజయవాడలో ఓ విద్యార్ధిని అదృశ్యం అయ్యింది. కొత్తపేటలో నివాసముంటున్న విజయశాంతి అనే విద్యార్థిని వన్ టౌన్ లోని ప్రియదర్శిని స్కూల్ లో ఆరోతరగతి చదువుతోంది. రోజులాగే నిన్న కూడా విజయశాంతి స్కూల్ కు వెళ్లింది. కానీ ఎంతకూ తిరిగిరాలేదు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు బాలిక అదృశ్యంపై కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 15 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా 7 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

11:23 - July 26, 2016

కబాలి..ఎప్పుడు విడదలువుతందా ? రజనీ ఎలా నటిస్తాడు ? అనే అనేక ప్రశ్నలకు సమాధానం దొరికింది. కబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. కానీ ఓ విషయంలో మాత్రాం దుమ్మురేపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 22న విడుదలైన ఈ చిత్రం తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 180కోట్ల వసూళ్లను సాధించి ఆల్ టైమ్ రికార్డును కొల్లగొట్టింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 109కోట్ల కలెక్షన్లతో అగ్రభాగాన నిలిచింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రానికి తొలి వారంలో రూ. 165కోట్ల కలెక్షన్స్ లభించాయని, ఆ రికార్డును 'కబాలి' తిరగరాసిందని సినీ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారంట. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' చిత్రం కూడా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదని టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సినిమాలో ఇదొక అరుదైన రికార్డని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిత్ర విషయంలో నిరాశపరిచినా రజనీకున్న ఇమేజ్ వల్లే ఈస్థాయి కలెక్షన్లు వస్తోందని సినీ పండితులు పేర్కొంటున్నారంట. అమెరికా, యూకే, సింగపూర్, గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో 87.5కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం.

11:22 - July 26, 2016

నాని..టాలీవుడ్ లో యువ హీరోల్లో ఒకరు. ఇతను వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకంటూ సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. 'అష్టా చమ్మా' చిత్రంతో పరిచయం అయిన నాని పలు సక్సెస్ లో దూసుకపోతున్నాడు. ఇదిలా ఉంటే నానికి ఓ సెంటిమెంట్ ఉందంట. సెప్టెంబర్ లో తన చిత్రాలు విడుదల కావాలని అనుకుంటున్నాడంట. ఎందుకంటే ఆ మాసంలో విడుదలయిన చిత్రాలు విజయవంతమయ్యాయంట. 'భలే భలే మగాడివోయ్' 2015 సెప్టెంబర్ 4న, నాని హీరోగా నటించిన మొదటి సినిమా 'అష్టచమ్మా' 2008 సెప్టెంబర్ 5న విడుదలై ఘన విజయాలు సాధించాయి. అలా సెప్టెంబర్‌లో రిలీజైన సినిమాలన్నీ సక్సెస్ సాధించడంతో నానికి సెప్టెంబర్ నెల సెంటిమెంట్‌గా మారింది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరొందిన విరించి వర్మ రూపొందిస్తున్న చిత్రంలో నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'మజ్ను' అనే టైటిల్ ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'జెమిని' కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటిస్తోంది. మరి నాని సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి.

11:17 - July 26, 2016

విజయవాడ : బందరుపోర్టు భూసమీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసమీకరణకు రెవెన్యూ అధికారులు విధివిధానాలు ఖరారుచేశారు. సమీకరణపై ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సమీకరణకు 898 కోట్ల రూపాయలు ఖర్చువుతుందని అంచనావేశారు. బందరు మండలంలోని 6 గ్రామాల్లో భూసమీకరణ చేయనున్నారు. పోర్టుతోపాటు ఇండస్ట్రీయల్ కారిడార్‌కు కూడా భూసమీకరణ చేయాలని నిర్ణయించారు. 

 

అత్యాచార ఘటనపై చర్చకు పట్టు..

ఢిల్లీ : రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ అత్యాచార ఘటనపై చర్చ చేపట్టాలని కనిమొళి, జయా బచ్చన్ పట్టుబట్టారు. సభ్యుల ఆవేదనను అర్థం చేసుకుంటానని, నోటీసులు ఇవ్వాలని డిప్యూటి ఛైర్మన్ కురియన్ సూచించారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. విచారణ చేపడుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనికి జయాబచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ చేపడుతామని ప్రతి సందర్భంలో పేర్కొంటున్నారని, ఎలాంటి చర్యలు చేపడుతున్నారని ప్రశ్నించారు. దీనితో సభలో కొద్దిగా గందరగోళం నెలకొంది.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేయనున్నారు. బీజేపీ సభ్యులపై కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఈనెల 22వ తేదీన ప్రైవేటు బిల్లును ఉద్ధేశ్యపూర్వకంగానే అడ్డుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ కు నోటీసులు ఇచ్చారు.

గాంధీభవన్ వద్ద హై టెన్షన్..

హైదరాబాద్ : గాంధీభవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ నుండి మల్లన్న సాగర్ కు నేతలు బయలుదేరి వెళ్లనున్నారు. దీనితో గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడనే కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పర్యటించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సిద్ధిపేట నుండి మల్లన్న సాగర్ కు వెళుతున్న శ్రీనివాస్ గౌడ్ తో పాటు 32 మంది కార్యకర్తలను అరెస్టు చేసి టౌన్ పీఎస్ కు తరలించారు. ఏటిగడ్డ కిష్టాపూర్ లో మల్లన్న సాగర్ పోరాట కమిటీ కన్వీనర్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

మంత్రి కేటీఆర్ విరాళం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విరాళం ప్రకటించారు. హరితహారం కార్యక్రమానికి నెల రోజుల వేతనాన్ని మంత్రి జోగుకు మంత్రి కేటీఆర్ అందచేశారు.

శ్రీనగర్ లో కర్ఫ్యూ ఎత్తివేత..

జమ్మూ కాశ్మీర్ : గత కొన్ని రోజులుగా శ్రీనగర్ లో ఉన్న కర్ఫ్యూను అధికారులు ఎత్తివేశారు. హింసాత్మక ఘటనలు తలెత్తడంతో గత 17 రోజులుగా కర్ఫ్యూ కొనసాగిన సంగతి తెలిసిందే.

కృష్ణ సముద్రం రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి లక్ష్మారెడ్డి..

మహబూబ్ నగర్ : కొత్తకోట (మం) సంకిరెడ్డిపల్లిలో కృష్ణ సముద్రం రిజర్వాయర్ ను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు మంత్రి వెంట ఉన్నారు.

నలుగురు మిలిటెంట్లు హతం..

జమ్మూ కాశ్మీర్ : నౌగామ్ సెక్టార్ లో నలుగురు మిలిటెంట్లను భారత దళాలు హతమార్చాయి. ఒకరిని సజీవంగా పట్టుకున్నట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి.

10:25 - July 26, 2016

వర్షాకాలం..భారీ వర్షాలు కురుస్తాయి..వరదలు పోటెత్తుతుంటాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతుంటాయి. ఈ పరిస్థితుల్లో పలువురు కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటుంటారు. పరిస్థితులను సమీక్షిస్తుండడమే కాకుండా ఆయా ప్రాంతాలను సందర్శించి బాధితులకు పునరావస ఏర్పాట్లు చేస్తుంటారు. ఇలాగే ఓ కలెక్టర్ కూడా చేశారు. ఆమె చేసిన పనితీరుకు అందరూ మెచ్చుకున్నారు. కొద్దిసేపటి అనంతరం విమర్శించడం మొదలు పెట్టారు. ఎందుకో అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి...
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాకు షమ్మీ అబీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. దీనితో ఆమె మూరుమూల ప్రాంతాల్లో పర్యటించారు. బురద ఎక్కువగా ఉన్నా అందులోనే చెప్పులు లేకుండా నడిచి పరిస్థితి తీవ్రతను తెలుసుకొన్నారు. ఆమె పనితీరు, ధైర్యానికి అందరూ శభాష్ అని ప్రశంసించారు. కానీ ఒక సీన్ తో ఇదంతా రివర్స్ అయ్యింది. ఆమె తన చెప్పులను ఓ బాడీగార్డు చేత మోయించడం విమర్శలకు కారణమైంది. సోషల్ మీడియాలో కలెక్టర్ సాహిబాపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

బందరు పోర్టు భూ సమీకరణకు సీఎం బాబు గ్రీన్ సిగ్నల్..

విజయవాడ : బందరు పోర్టు భూ సమీకరణకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఇవాళ నోటిషికేషన్ జారీ చేయనున్నారు. భూ సమీకరణకు రూ. 898 కోట్లు ఖర్చవతుందని అంచనా వేస్తున్నారు. బందరు మండలంలోని ఆరు గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కూ భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

కొత్తపేటలో ఆరో తరగతి విద్యార్థిని మిస్సింగ్..

విజయవాడ : కొత్తపేటలో ఆరో తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. సోమవారం స్కూల్ కు వెళ్లిన విజయశాంతి విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. కొత్తపేట పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు.

మినీ వ్యాను - లారీ ఢీ..

పశ్చిమగోదావరి : దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మినీ వ్యాను - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తాగుబోతుల మధ్య ఘర్షణ, వైద్యుడి మృతి..

కర్నూలు : నంద్యాలలో తాగుబోతుల మధ్య ఘర్షణ చెలరేగింది. అడ్డుకొనేందుకు వెళ్లిన ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రనాథ్ రెడ్డిని తాగుబోతులు రాళ్లతో కొట్టి చంపారు.

10:10 - July 26, 2016

హైదరాబాద్ : " తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది " అనే  పేరుతో రెండేళ్ల పరిణామాలపై విద్యుత్ విశ్లేషకులు రఘు రాసిన పుస్తకావిస్కరణ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. టీజాక్ చైర్మన్ కోదండరాం, పాత్రికేయులు రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హజరై పుస్తకావిష్కరణ చేశారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో వెలువడిన తొలి పుస్తకం ఇది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి విద్యుత్ రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి కూలంకషంగా రచయిత రఘు ఈ పుస్తకంలో పొందుపరిచారు. 

 

09:57 - July 26, 2016

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు మళ్లీ కలకలం సృష్టించారు. రాజధాని ఢాకాలోని ఓ భవనాన్ని ఉగ్రవాదులు ముట్టడించి కాల్పులు జరిపారు. ఐసిస్ అనుమానితులుగా భావిస్తున్న 9 మంది ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. దీంతో దేశమంతా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవలే ఓ కేఫ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. 

 

09:56 - July 26, 2016

కల్తీ...ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తే. తినే ఆహారం..తాగే ప్రతి పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు. డబ్బులు అధికంగా సంపాదించవచ్చని పలువురు కల్తీ పదార్థాలను తయారు చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు. కల్తీ తెలియని వారు ఈ పదార్థాలను తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో తేనె కూడా ఒకటి. తేనె నకిలీ..అసలు ఏంటో తెలియక చాలా మంది దీనిని కొనరు. ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలకు తేనె నిలయం. శరీరానికి శక్తినివ్వడంలో అధిక ప్రాధాన్యత పోషిస్తుంది. మరి తేనె అసలా..నకిలీయా ? గుర్తించలేమా ?
ఓ తేనె చుక్కను గోరుపై వేసుకోండి. గోరుపై అటు ఇటు కదిలితే అది నకిలీ. ఆ చుక్క కదలకుండా స్థిరంగా ఉంటే ఆ తేనె అసలైంది.
కాటన్ బాల్ తీసుకుని దానిని తేనెలో ముంచాలి. అనంతరం దానికి అగ్గిపుల్లతో నిప్పు పెట్టాలి. అసలు తేనె అయితే కాటన్ బాల్ మండుతుంది. నకిలీ తేనె అయితే కాటన్ బాల్ మండదు.
ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తేనె తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. నకిలీ తేనె అయితే వెంటనే నీటిలో కరుగుతుంది. అసలు తేనె అయితే గ్లాస్ అడుగు భాగంలోకి చేరుతుంది.
నకిలీ తేనెను ఇలా గుర్తించవచ్చు. తేనె కొనే సమయంలో పైనే పేర్కొన్న విధంగా ప్రయత్నించి చూడండి.

09:55 - July 26, 2016

మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో దిహిందూ రిసెడెంట్ ఎడిటర్, విశ్లేషకుడు నగేష్, రైతు సంఘం నేత మల్లారెడ్డి, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బలవంతంగా భూములు సేకరించిడం సరికాదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:55 - July 26, 2016

బొప్పాయి పండు అనగానే చాలా మంది వేడెక్కువ అంటారు. ఈ కారణంగా చాలా మంది ఈ పండును దూరంగా పెడుతుంటారు. కానీ అదంతా అపోహ, అనుమానాలు మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు. బొప్పాయిలో అనేక పోషక విలువలున్నాయని చెబుతున్నారు. బొప్పాయిలో మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ ఏ, సి, ఇ, బిలు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
బొప్పాయి పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది. పీచు పదార్థం కూడా ఉంటుంది. దీనిని తినడం వల్ల పెద్దపేగు పని తీరును నియంత్రిస్తుంది. జీర్ణాశయ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది.
శరీరంలో ఇన్సులిన్ సంశ్లేషణను పెంచుతుంది. బీటా కణాలను ఉత్పత్తి చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
పెపైన్, క్రొయోపెపైన్ అనే రెండు సమర్థవంతమైన ఎంజైమ్ లు బొప్పాయిలో ఉన్నాయి. ప్రొటీన్ లు, కార్బొహైడ్రేట్లు విచ్చిన్నమై పోవడానికి సహాయం చేస్తాయి.
ఇక మహిళలకు పీరియడ్ సమయంలో శరీరానికి అవసరమైన ఆక్సిటోసిన్, ప్రొస్టగ్లండిన్ స్థాయిలను పెంచుతుంది. పీరియడ్ సమయంలో తినడం వల్ల పొత్తి కడుపు నొప్పిని తగ్గిస్తుంది. 

09:48 - July 26, 2016

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో దారుణ జరిగింది. తాగుబోతుల రెచ్చిపోయారు. మానవత్వం మరిచిపోయారు.  తాగిన మైకంలో మానవ మృగాల్లా మారారు. ప్రాణం పోసే డాక్టరునే దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా శైలేంద్రరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస సెంటర్‌లో ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ చెలరేగింది. విడిపించేందుకు వెళ్లిన ప్రభుత్వ వైద్యుడు డా. శైలేంద్రనాథ్‌రెడ్డిని తాగుబోతులు బండరాయితో మోది చంపారు. అనంతరం రోడ్డుపై పడేసి పరారయ్యారు. రాత్రి పెట్రోలింగ్‌లో నిర్వహిస్తున్న పోలీసులు..వైద్యుడు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్ శైలేంద్రరెడ్డి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

 

09:40 - July 26, 2016

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బేగంపేట, పంజాగుట్ట, తార్నాక, ప్యాట్నీ, ప్యారడైజ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీగా ట్రాఫిక్ జాం అయింది.  

 

డోప్ పరీక్షలో ఇంద్రజీత్ సింగ్ విఫలం..

ఢిల్లీ : భారత్ కు మరో షాక్ తగిలింది. షాట్ పుట్ క్రీడాకారుడు ఇంద్రజిత్ సింగ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. జూన్ 22వ తేదీన నిర్వహించిన డోప్ పరీక్షలో ఇంద్రజీత్ సింగ్ విఫలం చెందినట్లు తెలుస్తోంది. రియో ఒలంపిక్స్ లో షాట్ పుట్ విభాగంలో ఇంద్రజీత్ సింగ్ పాల్గొనాల్సి ఉంది.

09:29 - July 26, 2016

సంస్కరణలతో వ్యవసాయరంగం దివాళ తీసిందని అఖిల భారత రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సంస్కరణల యుగంలో వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టబడిందని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పాతికేళ్ల సంస్కరణలతో వ్యవసాయరంగం దెబ్బతిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. 'దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి పాతికేళ్లయ్యింది. ఈ పాతికేళ్లలో అనేక మార్పులొచ్చాయి. అయితే, ఈ సంస్కరణలు వ్యవసాయరంగం మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? దేశ వ్యవసాయ రంగానికి మేలు చేశాయా? కీడు చేశాయా? సంస్కరణల యుగంలో ఆహార భద్రత, పోషకాహార విలువలు, జీవన ప్రమాణాలు పెరిగాయా? నిరుద్యోగం, వలసలు లాంటి సమస్యలను తగ్గించాయా? ఇలాంటి అంశాలపై మల్లారెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ముగ్గురు పౌరులను హతమార్చిన మావోలు..

ఛత్తీస్ గఢ్ : సర్గుజా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. దీనితో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

అమర్ జవాన్ జ్యోతి వద్ద పారికర్, త్రివిధ దళాల నివాళి

ఢిల్లీ : నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద కేంద్రమంత్రి పారికర్, త్రివిధ దళాల ప్రతినిధులు నివాళులర్పించారు.  

 

నేడు కార్గిల్ దివస్..

ఢిల్లీ : నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర్ జవాన్ వద్ద కేంద్ర మంత్రి పారికర్ నివాళులర్పించారు. ఆయనతో పాటు త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు.

భారీ వర్షం..రోడ్లు జలమయం...

హైదరాబాద్ : మంగళవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనితో రోడ్లు జలమయమయ్యాయి. బేగంపేట, పంజాగుట్ట, తార్నాక, ప్యాట్నీ, ప్యారడైజ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

 

09:12 - July 26, 2016

పాతికేళ్ల క్రితం పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్  ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు వ్యవసాయరంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. వ్యవసాయం దండగ అనగలిగే నాయకత్వాన్ని సృష్టించిపెట్టాయి. 
గ్రామీణాభివృద్ధికి తగ్గిన నిధులు
పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991 జులై 24న ఆర్థిక సంస్కరణలే ఎజెండాగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థలో దీన్నో చారిత్రిక సంఘటనగా చెబుతుంటారు. ఈ సంస్కరణల ప్రభావం వ్యవసాయరంగం మీద తీవ్రంగానే వుంది. సంస్కరణలు ప్రారంభం కావడానికి ముందు 1990 -91 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జిడిపిలో వ్యవసాయరంగం వాటా 24.9శాతం వుండేది. అదిప్పుడు  15శాతానికి పడిపోయింది. 1990లో వ్యవసాయ రంగం వ్రుద్ధి రేటు 4.3 శాతం వుంటే,  ఇప్పుడు 1శాతం కంటే తక్కువగా వుంది.  ఈ లెక్కలు చాలు ఆర్థిక సంస్కరణలు భారతదేశ వ్యవసాయరంగాన్ని ఏ గతి పట్టించాయో అర్ధం చేసుకోవడానికి.
అన్నదాతల కుటుంబాల్లో అంతులేని విషాదం 
ఆర్థిక సంస్కరణలు అన్నదాతల కుటుంబాల్లో భయంకర నిశ్శబ్దాన్ని, అంతులేని విషాదాన్ని నింపాయి.  సంస్కరణలు ప్రారంభించిన తొలి సంవత్సరమే దేశంలో వెయ్యి, సమైక్య రాష్ట్రంలో 221 ఆత్మహత్యలు నమోదయ్యాయి.  2013లో దేశవ్యాప్తంగా లక్ష మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం సంస్కరణల యుగంలో ఓ భయంకర విషాదం.
మారిపోయిన ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు 
సంస్కరణల యుగంలో ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు మారిపోయాయి. అంతకు ముందు వ్యవసాయానికి బ్యాంక్ లు విరివిరిగా లోన్లు ఇచ్చేవి.  ప్రభుత్వ పరిశోధనా కేంద్రాల్లో స్రుష్టించి, అభివ్రుద్ధి చేసిన విత్తనాలను ప్రభుత్వమే సబ్సిడీ ధరపై రైతులకు సరఫరా చేసేది. ఎరువులు, క్రిమి సంహారక మందులు అత్యంత చౌకగా లభించేవి. సంస్కరణలు ప్రారంభమైన తర్వాత పరిశోధనలకు ప్రభుత్వం చెల్లుచీటి చెప్పింది. విత్తన మార్కెట్ ను విదేశీ ప్రయివేట్ సంస్థలకు రాసిచ్చింది. విత్తనాలు ధరలు పెరిగాయి. నాశిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తాయి. వాటిని కొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులపాలయ్యారు.
రైతులకిచ్చే రుణాలు తగ్గించిన ప్రభుత్వ బ్యాంక్ లు 
ప్రభుత్వ బ్యాంక్ లు రైతులకిచ్చే రుణాలు తగ్గించాయి. దీంతో రైతులు అధిక వడ్డీలకు ప్రయివేట్ అప్పులు చేయాల్సి వచ్చింది.  వ్యవసాయం భారమై, అదొక జూదమై, వెక్కరిస్తుంటే తట్టుకోలేక చాలామంది రైతులు వ్యవసాయం  మానేసి, పొలాలు కౌళ్లకిచ్చి, గ్రామాలు వదిలేసి పట్టణాలకు వెళ్లిపోయారు.  సంస్కరణల యుగంలో ప్రతి గ్రామంలోనూ కనిపించిన ద్రుశ్యమిది. 
వాణిజ్య పంటలకు పెద్ద పీట 
సంస్కరణలు ఆహార పంటల కంటే వాణిజ్య పంటలకు పెద్ద పీట వేశాయి. దీంతో 1981లో 70.34 శాతంగా వున్న ఫుడ్ క్రాప్ విస్తీర్ణం 2000 నాటికి 65.44శాతానికి పడిపోయింది. దీంతో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇటీవల కాలంలో పప్పుల ధరలు విపరీతంగా  పెరగడం, సామాన్యులకు వంటింటి బడ్జెట్ భారంగా మారడమూ, తలసరి పప్పుధాన్యాల వాడకం తగ్గిపోవడం సంస్కరణల పుణ్యమే.  
గ్రామీణాభివృద్ధికి తగ్గిన నిధులు 
వ్యవసాయాన్ని దండుగంటూ ప్రచారం చేసిన ప్రబుద్ధులు గ్రామీణాభివృద్ధికి వెచ్చించే నిధులు తగ్గించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారు. చెరువుల నిర్వహణను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే వ్యూహాలు రచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రాధాన్యతను తగ్గించి, మార్కెట్ శక్తుల ఇష్టారాజ్యానికి వదిలేశారు. దీంతో పంటలకు సరియైన ధర లభించక రైతులు, అడ్డగోలుగా పెరుగుతున్న ధరలకు తట్టుకోలేక వినియోగదారులు అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు సంస్కరణలు మన ఆహారపు అలవాట్లనే మార్చేశాయి. చివరకు మన పిల్లలు మనింటి ఘుమఘుమలకు, అలనాటి చిరుతిళ్లకు దూరమై రోగాలు, జబ్బులు అంటగట్టే జంక్ ఫుడ్స్  కి బానిసలయ్యే దుస్థితిని స్రుష్టించిన పాపం సంస్కరణలది కాకపోతే మరెవరిది? 

 

నేడు హెచ్ ఎండీఏ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్ : నేడు హెచ్ ఎండీఏ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు ఇతర నూతన ప్రాజెక్టులు, ఎల్ ఆర్ ఎస్, హరితహారంపై చర్చించనున్నారు. 

 

08:38 - July 26, 2016

విజయనగరం : మరోసారి ప్రేమోన్మాదం బుసకొట్టింది...తనను ప్రేమించడం లేదని..పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ఎంబీఏ స్టూడెంట్‌ యువతిపై అటాక్ చేశాడు. ఆమె ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగిన దుర్మార్గుడు గొంతు కోశాడు. ప్రాణాపాయ స్థితిలో ఆ యువతి ఆస్పత్రిలో చేరింది.
ఇంట్లో ఉన్న యువతిపై అటాక్
విజయనగరం జిల్లాలో మరో ప్రేమోన్మాది రక్తం చిందించాడు. ఇంట్లో ఉన్న యువతిపై అటాక్ చేశాడు. ఆమె గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అమ్మాయిని కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అమ్మాయికి వైద్యం డాక్టర్లు అందించారు.
ప్రేమను నిరాకరించడంతో 
జిల్లాలోని గాజులరేగలో ప్రేమించడం లేదని ఓ యువతిపై తెగబడ్డాడు ఎంబీఏ స్టూడెంట్.. కొంతకాలంగా అమ్మాయి వెంటపడుతున్న విక్రమ్‌ శృంగవరపుకోటలో నివాసముంటున్నాడు. అతని ప్రేమను అమ్మాయి నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని కొద్ది రోజుల క్రితం ఆమె ఇంటికి బంధువులను పంపాడు. అందుకు అమ్మాయి కన్నవారు కూడా ఇష్టం లేదని చెప్పారు. దీంతో తనను ప్రేమిస్తుందా లేదా..? పెళ్లి చేసుకుంటుందా లేదా తెలుసుకునేందుకు విక్రమ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అదే విషయంపై వాగ్వాదానికి దిగి చివరకు అమ్మాయి గొంతు కోశాడు. దీంతో కుటుంబీకులు ఆమె అరుపులు విని విక్రమ్‌ను పట్టుకుని పోలీసులకు పట్టించారు. ప్రేమోన్మాది దారుణంతో వణికిపోయిన కుటుంబీకులు తేరుకోలేకపోతున్నారు. జరిగిన ఘటన కలకలం రేపింది.

08:28 - July 26, 2016

చిత్తూరు : తిరుమల కొండపై ఎప్పడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భక్తులు ఆందోళన పడాల్సి వస్తోంది. చిరుతపులుల సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ భక్తుల్లో తీవ్రంగా నెలకొంది. తాజాగా నర్సింగ్ సదన్‌ అతిథి గృహంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 
తిరుమలకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్న భక్తులు 
కలియుగ దైవం వెంకటేశ్వరుడి దివ్యక్షేత్రంగా భక్తులు చెప్పుకునే స్థలం తిరుమల. అందుకే ఏపీ నుంచే కాక పక్కరాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. కాని ఇప్పుడు తిరుమలకు వెళ్లాలంటే భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టివెళ్లలేక వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది.  
నడకదారిలో కరువైన రక్షణ
నడకదారిలో కరువైన రక్షణ, అడపాదడపా దాడులు చేసే వన్యమృగాలు ఇలాంటి ఎన్నో కారణాలతో భక్తులు తిరుమలకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మొన్న శారదాపీఠం సమీపంలో సంచరించిన చిరుతలు.. తాజాగా పద్మావతినగర్‌లోని నర్సింగ్ సదన్‌ అతిథిగృహంలోకి ప్రవేశించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.  
లభించని చిరుత ఆచూకీ 
తిరుమల కొండపై చిరుతల సంచారం విషయం తెలియగానే అధికారులు.. చిరుతపులిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. అధికారులు తీవ్రంగా శ్రమించినా.. చిరుత ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అది తప్పించుకుని పారిపోయినట్లుగా తెలుస్తోంది. చిరుత సంచారంతో భక్తులంతా తమ గదుల్లోనే ఉండాలని, బయటికి రాకూడదని జేఈవో సూచించారు.  
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి : భక్తులు  
మొత్తంగా తిరుమలలో చిరుత సంచారం వల్ల భక్తులు దేవుడి దర్శనానికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు సెలవిస్తున్నారు. 

08:20 - July 26, 2016

విజయవాడ : హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు శాఖల తరలింపు గందగోళంగా మారింది. రాబోయే కృష్ణా పుష్కరాల నేపథ్యంలో తరలింపునకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. మంత్రుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు తరలింపు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటిదాకా తరలించిన శాఖలు కూడా తిరిగి హైదరాబాద్‌కే చేరుకోవడం చర్చనీయాశమవుతోంది.
శాఖల తలింపులో ఆటంకం
ఏపీకి ప్రభుత్వశాఖల తరలింపునకు ఆటంకం ఎదురవుతోంది. రాబోయే కృష్ణా పుష్కరాలు, శ్రావణమాసం సందర్భంగా.. తరలింపును తాత్కాలికంగా వాయిదా వేయాలని మంత్రులు కోరుతున్నారు. జూలై నెల చివరికల్లా తాత్కాలిక సచివాలయం నుంచే పాలన సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినదానికి విరుద్దంగా పరిస్థితి మారుతోంది. ఈ నెల చివరి తేదీనాటికి ఒక్కటంటే ఒక్కశాఖ కూడా కొత్త రాజధానికి తరలివెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు కొన్ని హెచ్‌వోడీలు మాత్రమే తరలివెళ్లాయి. ఈనెల 21న  మరో రెండు శాఖలను వెలగపూడికి తరలించారు. కానీ... వెళ్లిన ఒక్కరోజులోనే మళ్లీ తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు అధికారులు. అటు జూన్‌ 29న తరలివెళ్లిన నాలుగు శాఖలు తిరిగి మళ్లీ వచ్చేశాయి. దీంతో శాఖల తరలింపులో గందరగోళం ఏర్పడింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం పూర్తిస్థాయిలో నిర్మాణం కాకపోవడం... పుష్కరాలు, శ్రావణమాసం తదితర కారణాలతో తరలింపు కార్యక్రమం వాయిదా పడింది. 
తాత్కాలిక సచివాలయం నుంచి పాలన కష్టమంటున్న మంత్రులు
వచ్చేనెల 12నుంచి కృష్ణాపుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే 3వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రులు తాత్కాలిక సచివాలయం నుంచి పాలన సాగించడం కష్టంగా ఉంటోందని అంటున్నారట. దీంతో శాఖల తరలింపు వచ్చేనెల మొదటివారానికి వాయిదా పడింది.  
వచ్చేనెల 10నుంచి వెలగపూడిలో హెచ్‌ఆర్డీశాఖ విధులు 
మరోవైపు వచ్చేనెల 10 నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే  మానవవనరుల అభివృద్ధిశాఖ  విధులు నిర్వహిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పుష్కరాల టైంలో అన్నిశాఖలు కాకపోయినా... కొందరైనా వెలగపూడి నుంచి పనిచేస్తే.. ప్రజల్లోకి మంచి సంకేతాలు పంపినట్టవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. దీని కోసం సీఎం ఇవాళ అన్నిశాఖల  ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు.    

 

08:12 - July 26, 2016

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణం పనులు రోజురోజుకు వివాదాస్పదమవుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విపక్షాలన్నీ ఏకమవుతుండడంతో... అధికార పార్టీ నేతల్లో అలజడి రేగుతోంది. అటు పాలమూరు ఇటు మెదక్ జిల్లాల్లో ప్రాజెక్టుల వ్యవహారం గులాబి నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
రీ-డిజైనింగ్ పేరుతో భారీగా మార్పులు 
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ప్రకటనలు చేసిన ప్రభుత్వం అందుకానుగుణంగా తమ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటోంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ పేరుతో భారీగా మార్పులు చేస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూపురేఖలనే సర్కార్‌ పూర్తిగా మార్చివేసింది.
మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదన 
రీ-డిజైనింగ్‌లో భాగంగా మెదక్ జిల్లాలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది ప్రభుత్వం. మల్లన్నసాగర్ పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందని అధికార పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భూసేకరణ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు గులాబీ పార్టీ కీలక నేతలకు మింగుడు పడడం లేదు.
పోలీసుల లాఠీఛార్జ్‌ పై విపక్షాలు, ప్రజా సంఘాలు మండిపాటు 
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌తో విపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీ-జాక్ నేతల అరెస్టుల పర్వం, మెదక్ జిల్లా బంద్ తదితర విషయాలు అధికార పార్టీని ఇరుకునపెడుతున్నాయి. దీంతో మంత్రి హరీష్‌రావు జపాన్ పర్యటనను రద్దు చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. విపక్షాల కుట్రల కారణంగానే మల్లన్నసాగర్  భూసేకరణ వివాదాస్పదంగా మారుతోందంటున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కుట్రలు చేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించిందని, త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 
అధికార పార్టీ నేతల్లో ఆందోళన 
ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అనైక్యతను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న గులాబీ నేతలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు రుచించడం లేదు. విపక్షాలు, ప్రజా సంఘాలన్నీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తుండడంతో  అధికార పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది.

 

07:52 - July 26, 2016

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఆకృతులను... భవనాల మాస్టర్‌ప్లాన్‌ను.. ప్రభుత్వానికి సమర్పించింది మలేషియా కంపెనీ . పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నమూనా ఆకృతులను సీఎం చంద్రబాబు సమక్షంలో  సమర్పించారు కంపెనీ ప్రతినిధులు. 
మాస్టర్ ప్లాన్ సమర్పించిన హారీస్ ఇంటర్నేషనల్ కంపెనీ 
అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, భవనాల ఆకృతుల మాస్టర్ ప్లాన్ ను మలేషియాకు చెందిన ఆర్టీఏ హారీస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీసర్కార్ కు సమర్పించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నమూనా ఆకృతులను సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రభుత్వ భవనాలను బౌద్ధ, తెలుగు సంస్కృతులను ప్రతిబింబించేలా..రూపకల్పన చేయడం మరో విశేషం. 
900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు
అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వభవన సముదాయంలోని ప్రతి భవనాన్ని ప్రత్యేక కాన్సెప్ట్ తో రూపొందించారు మలేషియాకు చెందిన ఆర్టీఏ హారీస్ ఇంటర్నేషనల్ కంపెనీ కంపెనీ ప్రతినిధులు. భవనాలన్ని ఏపీ సంస్కృతి , చరిత్ర, కళలు, బౌద్ధ మతాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. 
వాటర్ లిల్లీ ఆకృతిలో అసెంబ్లీ నిర్మాణం
అసెంబ్లీ భవనానికి పవిత్రసభ అన్న అర్థం వచ్చేలా ది సేక్రెడ్ అసెంబ్లీ అని పేరు పెట్టారు. సెక్రటేరియట్ కు పీపుల్స్ సెక్రటేరియట్ అని.. హైకోర్టుకు టెంపుల్ ఆఫ్ జస్టిస్ అనే పేరును అని సూచించింది కంపెనీ.  ఇక హైకోర్టు భవన నమూనా బౌద్ధ స్థూపాన్ని పోలి ఉండగా .. అసెంబ్లీని బిల్డింగ్స్‌ను వాటర్ లిల్లీ ఆకృతిలో రూపొందించారు మలేషియా కంపెనీ ప్రతినిధులు.   
అనుభవంతో అమరావతి భవనాల డిజైన్ : కంపెనీ చైర్మన్  
విదేశాల్లో అనేక ప్రాజెక్టులను రూపొందించామని.. తమకు ఉన్న అనుభవంతో అమరావతి భవనాలను డిజైన్ చేశామని కంపెనీ చైర్మన్ హారీస్ తెలిపారు. ఇంటర్నేషనల్ సేవలకు తగిన విధంగా.. తగిన సమయంలో ఉపయోగించుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానిలో నిర్మించే జంటశిఖరాలు ఎలా ఉండాలన్న అంశంపై పలు నమూనాలు ప్రదర్శించారు.  కౌలాలంపూర్ లోని పెట్రోనాస్  సహా వివిధ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ట్విన్ టవర్స్ నమూనాలను  సూచించింది కంపెనీ. అమరావతిలోని భవన సముదాయాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించామని.. కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటి ప్రాముఖ్యత కనబడుతుందన్నారు. 

 

07:37 - July 26, 2016

హైదరాబాద్ : మ‌ల్లన్న సాగ‌ర్ అస్త్రంగా విప‌క్షాలు మ‌రింత స్పీడ్ పెంచుతున్నాయి. ఇప్పటికే ముంపు గ్రామాల రైతుల‌పై లాఠీచార్జీకి నిర‌స‌న‌గా మెద‌క్ బంద్‌తో హోరెత్తించిన విప‌క్షాలు.. అదే స్పీడ్ కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఛ‌లో మ‌ల్లన్న సాగ‌ర్ కు పిలుపునిస్తే వామపక్షాలు మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. ఇక టీడీపీ ఏకంగా 48 గంట‌ల దీక్ష చేప‌ట్టాల‌ని డిసైడ్ అయ్యింది. 
రాజ‌కీయాల్లో సెగ‌పుట్టిస్తున్న మల్లన్నసాగర్ 
మ‌ల్లన్నసాగ‌ర్ ఇప్పుడు రాష్ట్రం రాజ‌కీయాల్లో సెగ‌పుట్టిస్తున్న అంశం. ఆందోళ‌న‌ చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేయ‌డంతో రాష్ట్రంలోని విప‌క్షాల‌న్నీ అగ్గిమీద‌ గుగ్గిలం అయ్యాయి. ప్రభుత్వ  చ‌ర్యను నిర‌సిస్తూ అఖిల‌ప‌క్షం చేపట్టిన జిల్లా బంద్‌ విజయవంతం అవడంతో ప్రతిపక్షాలు వేడి చల్లారకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. 
వామపక్షాల మ‌హాధర్నా 
ఇప్పటికే మ‌ల్లన్నసాగ‌ర్ భూ నిర్వాసిత గ్రామాల‌లో పాద‌యాత్రలు చేసి .. ఉద్యమానికి ఊతమిచ్చిన వామ‌ప‌క్షాలు.. పోరును మ‌రింత ఉధృతం చేయాల‌ని నిర్ణయానికి వచ్చాయి. సీపిఎం ఆధ్వర్యంలో మ‌ల్లన్న సాగ‌ర్ భూనిర్వాసితుల పోరాట క‌మిటీ మ‌హాధర్నాకు దిగ‌నుంది. ఇందిరాపార్క్ , ధ‌ర్నాచౌక్ లో త‌ల‌పెట్టిన ఈమ‌హ‌ధ‌ర్నాకు సీపీఎం జాతీయ నేత బృందాకార‌త్ హాజ‌ర‌ు కానున్నారు. 
చ‌లో మ‌ల్లన్నసాగ‌ర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్  
మెద‌క్ జిల్లా బంద్‌లో హల్‌చల్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలు మ‌ల్ల్లన్నసాగ‌ర్ ముంపు బాధితుల‌కు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చ‌లో మ‌ల్లన్నసాగ‌ర్ కు పిలుపునిచ్చారు. వేలాది మంది కార్యకర్తల‌తో వేముల‌ఘాట్  వ‌ర‌కు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.  
నిరసనలు తెలపనున్న బీజేపీ 
ఇక బీజేపీ సైతం మెదక్‌ జిల్లాలోని అన్నిమండ‌ల కేంద్రాల‌లో కేసీఆర్, హ‌రీష్‌రావు దిష్టి బొమ్మల‌ను దహనం చేసి నిర‌స‌న‌లు తెల‌ప‌నుంది. ఇక మెద‌క్ బంద్‌లో చురుగ్గా పాల్గొన్న టీడీపీ శాసనసభాపక్షనేత రేవంత్ రెడ్డి .. వ‌చ్చే నెల 13, 14 తేదిల‌లో 48 గంట‌ల దీక్షకు దిగ‌నున్నారు. మొత్తానికి మ‌ల్లన్న సాగ‌ర్ అంశంలో మెద‌క్ బంద్ లో రేగిన సెగ‌కు.. విప‌క్షాలు త‌మ‌ నిర‌స‌న‌ల‌తో మరింత ఆజ్యం పోయ‌నున్నాయి. 

 

నేడు అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడ : నేడు అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కృష్ణా పుష్కరాలు, హరితాంధ్రప్రదేశ్, ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు.  

07:23 - July 26, 2016

టోక్యో : జపాన్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. టోక్యోలో వికలాంగుల సౌకర్యార్ధం కేటాయించబడిన ఏరియాలోకి 20 ఏళ్ల యువకుడు చొరబడి కత్తితో అతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తాను పోలీసునంటూ చెప్పుకుంటూ నల్ల దుస్తులు ధరించి విచక్షణ లేకుండా కనిపించిన వారిపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ సైకో దాడిలో 19 మంది మృతిచెందగా, 20 మందికి తీవ్రగాయాలయినట్టు తెలిసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. 50 మందికి పైగా యువకుడి దాడిలో గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది. గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో ఇంటి బయట కనిపించినట్టు అక్కడి మీడియా నివేదించింది. విషయం తెలియగానే అక్కడి పోలీసులు యువకుడిని అరెస్ట్‌ చేశారు. దాడికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

 

07:14 - July 26, 2016

కడప : జిల్లాలో విషాదం నెలకొంది. మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మైదుకూరు మండలం ఉచ్చలవరంలో చిన్నపుల్లయ్య కుటుంబం నివాసముంటుంది. కుటుంబ సభ్యులు అందరూ నిద్రమత్తులో ఉండగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత మిద్దె కూలింది.  దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

నేడు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా...

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉదయం 10 గంటలకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. 

 

భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని నేడు చలో హైదరాబాద్

హైదరాబాద్ : భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని నేడు చలో హైదరాబాద్ నిర్వహించనున్నారు. ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్, జస్టిస్ చంద్రకుమార్, విద్యావేత్త చుక్కారామయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, తమ్మినేని వీరభద్రం, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. 

నేడు హైటెక్స్ లో కృష్ణాపుష్కరాలపై సమీక్ష

హైదరాబాద్ : నేడు హైటెక్స్ లో కృష్ణాపుష్కరాలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష చేయనున్నారు. 

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు పర్యటన

మహబూబ్ నగర్ : నేడు జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సోమశిల, జల్ ప్రోల్, రంగాపూర్, బీచ్ పల్లి, అలంపూర్ లలో కృష్ణా పుష్కరాల స్నానపు ఘట్టాలు, ఆలయాలను పరిశీలన చేయనున్నారు. 

టోక్యోలో వికలాంగులపై వ్యక్తి కత్తితో దాడి

జపాన్ : టోక్యోలో వికలాంగులపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దివ్యాంగుల ఆశ్రమంలోని వికలాంగులపై దాడికి చేశాడు. ఈ దాడిలో 15 మంది మృతి చెందారు. మరో 45 మందికి గాయాలు అయ్యాయి. 

కడప జిల్లాలో విషాదం...

కడప : మైదుకూరు మండలం ఉచ్చలవరంలో విషాదం నెలకొంది. మిద్దెకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత మిద్దె కూలింది. 

Don't Miss