Activities calendar

27 July 2016

22:06 - July 27, 2016

మధ్యప్రదేశ్‌ : వ్యాపం స్కాంపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఎంబిబిఎస్‌ సీట్ల భర్తీలో జరిగిన అవకతవకలపై ఎందుకు స్పందించ లేదని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యాపం తరహా రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో వివరణ ఇవ్వాలని ఎంపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

2008-12 మధ్య ఎందుకు విచారణ జరపలేదని సిబిఐని ప్రశ్నించిన కోర్టు..
మధ్యప్రదేశ్‌లో వ్యాపం ద్వారా ఎంబిబియస్‌ చదువుతున్న 634 మంది విద్యార్థులకు సంబంధించిన అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2008-12 మధ్య జరిగిన స్కాంకు సంబంధించి ఒక్క విద్యార్థినైనా విచారించారా అంటూ సిబిఐని ప్రశ్నించింది. వ్యాపం కుంభకోణంకు సంబంధించి అన్ని అంశాలతో పాటు ఎంబిబిఎస్‌ సీట్ల భర్తీలో జరిగిన అవకతవకలు అందులో భాగమేనని స్పష్టం చేసింది.

కుంభకోణాలపై సుప్రీంకోర్టు ఆందోళన..
వ్యాపం స్కాం జాతీయ స్థాయి అంశమని, ఏటేటా కుంభకోణాలు వెలుగు చూడడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కోర్టు కళ్లు మూసుకుని చూస్తూ ఊరుకోదని తెలిపింది.

రోల్‌ నంబర్లను మార్చడంతో సామూహిక స్కాంకు పాల్పడుతున్నారన్న కోర్టు
దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. స్కాం ద్వారా వారు ఎంబిబియస్‌లో సీట్లు కూడా పొందుతారు. కానీ ఏడాదంతా రేయింబవళ్లు కష్టపడి చదువుకున్నవారికి స్కాం కారణంగా సీటు రాకపోవడం ఆందోళనకరమని తెలిపింది. ఇది మాస్‌ కాపీయింగ్‌ కాదని, రోల్‌ నంబర్లను మార్చడం ద్వారా సామూహిక స్కాంకు పాల్పడుతున్నారని కోర్టు పేర్కొంది.

స్కామ్ లపై వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశం..
వ్యాపం తరహా రాష్ట్రంలో ఇంకెన్ని స్కాంలు జరిగాయో వివరించాలని సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పట్వారి ఉద్యోగం మొదలుకుని పిసిఎస్‌ వరకు పూర్తి వివరాలు అందించాలని తెలిపింది. ఒకవేళ ఏదైనా స్కాం జరిగితే దానికి సంబంధించిన సమాచారాన్ని తమికివ్వాలని కోర్టు స్పష్టం చేసింది. వ్యాపం స్కాంపై విచారణ ఎంతవరకు వచ్చింది? ఎపుడు పూర్తవుతుందని సిబిఐని కోర్టు ప్రశ్నించింది.

634 మంది విద్యార్థుల అడ్మిషన్లను రద్దు..
2008-12 వ్యాపం నిర్వహించే పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ ద్వారా ఎంబిబియస్‌లో సీట్లు పొందిన 634 మంది విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేశారు. దీంతో విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.

21:55 - July 27, 2016

తమిళనాడు : మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తొలి వర్ధంతి కార్యక్రమాన్ని తమిళనాడులోని రామేశ్వరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం పేయ్‌ కరుంబులో ఏర్పాటు చేసిన ఏడడుగుల అబ్దుల్‌ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్‌, పొన్‌ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు. అబ్దుల్‌ కలాం భౌతికకాయాన్ని ఖననం చేసిన ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్మారక మందిరం, మ్యూజియానికి కేంద్రమంత్రులు శంకుస్థాపన చేశారు. అబ్దుల్‌ కలాం కలలను సాకారం చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

21:52 - July 27, 2016

ఢిల్లీ : తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల స్థానాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో తెలంగాణ, ఏపీల శాసనసభ సీట్ల పెంపుపై దేవేందర్‌గౌడ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ సమాధానమిచ్చారు. ఈ విషయంలో అటార్నీ జనరల్‌ అభిప్రాయాలను న్యాయశాఖ తీసుకుందని తెలిపారు. విభజన చట్టం సెక్షన్‌ 26కు సవరణ చేసినా.. ఆర్టికల్‌ 170 ప్రకారం ఇప్పటికిప్పుడు సీట్ల పెంపు సాధ్యం కాదన్నారు. సీట్ల పెంపు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని హన్స్‌రాజ్ తెలిపారు.

21:46 - July 27, 2016

హైదరాబాద్ : ప్రభుత్వం ఎన్ని నిర్బంధనలు విధించినా మల్లన్న సాగర్ రైతులను పరామర్శించి తీరుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. దీనిపై రేపు డీజీపీని కలుస్తామని తెలిపారు. అయినా న్యాయం జరగకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. చలో మల్లన్న సాగర్‌ చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులతో భగ్నం చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముంపు బాధితులను పరామర్శించడం ప్రతిపక్షపార్టీగా తమ బాధ్యతన్నారు భట్టి విక్రమార్క.

21:44 - July 27, 2016

విజయవాడ : ముస్లింల రిజర్వేషన్‌ అంశంపై పూర్తిస్థాయిలో చట్టబద్దత కల్పించేందుకు ఏపీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. పేదవాళ్లు అత్యధికంగా ఉండేది ముస్లిం వర్గంలోనే అని ఆయన తెలిపారు. సోషల్‌ ఎంపవర్‌మెంట్ మిషన్ ద్వారా ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ పాతబస్తీలో పదికోట్ల 50లక్షల రూపాయలతో నిర్మించనున్న షాదీఖానాకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, కొల్లురవీంద్ర పలువురు ఎమ్మెల్యేలు పాల్గన్నారు.

21:42 - July 27, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో గురువారం చర్చ జరగనుంది. ఈమేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. రాజ్యసభలో గందరగోళానికి తెర వేయాలన్నదే కేంద్రం యోచన అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై గురువారం రాజ్యసభలో చర్చ..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై గురువారం రాజ్యసభలో రెండు గంటలపాటు చర్చించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని బీఏసీలో నిర్ణయించారు.

కేవీపీ బిల్లు వెనక్కి తీసుకోవాలని కురియన్‌ షరతు

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు ముందే.. కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు పెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ షరతు విధించినట్లు తెలుస్తోంది. బీఏసీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ సభ్యులు దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. అధికారంలో ఉన్నప్పుడే కేవీపీ తమ మాట వినలేదని.. ఇప్పుడు పెట్టిన బిల్లు పార్టీదీ కాదని.. ఆయన వ్యక్తిగతంగా బిల్లు వేయడంతో వెనక్కి తీసుకుంటారో.. లేదోనని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. కేవీపీతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇదిలావుంటే కేవీపీ మాత్రం తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా ప్రైవేట్‌ బిల్లును ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.

చర్చ అనంతరం ప్రకటన చేయనున్న అరుణ్‌జైట్లీ ..
మంగళవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపీకి గత రెండేళ్లుగా ఏన్డీయే ఏం చేసింది.. ఏ మేరకు నిధులు ఇచ్చిందో చర్చ జరగాల్సిందేనని టీడీపీ నేత సుజనాచౌదరి డిమాండ్‌ చేయడంతో చర్చ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలావుంటే సభలో చర్చ అనంతరం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి జైట్లీ ప్రకనటపై కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు సంతృప్తి చెందుతారా ? లేదా అన్నది వేచి చూడాలి.

21:37 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-1 పేపర్‌ కూడా లీక్‌ చేసినట్లు.. కీలక నిందితుడు రాజగోపాల్‌రెడ్డి సీఐడీ విచారణలో వెల్లడించాడు. ఇప్పటికే ఎంసెట్‌-2పై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండగా.. ఎంసెట్‌-1 పేపర్‌ లీకేజీ అంశం సంచలనంగా మారింది. మరోవైపు పూర్తి నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అయితే ఎంసెట్‌-2 రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రేపు సీఐడీ సమర్పించే నివేదిక ఆదారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఎంసెట్‌-2 తీగ లాగితే .. కదులుతున్న డొంక..
ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారం తీగ లాగితే .. డొంక కదులుతోంది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్న సీఐడీ కీలక సమాచారం రాబట్టింది. లీకేజీని నేషనల్‌ స్కాంగా భావిస్తున్న సీఐడీ.. ఇందులో 72 మంది విద్యార్థులు లబ్ది పొందినట్లు అనుమానిస్తోంది. మరోవైపు ఎంసెట్‌ లీకేజీ స్టేటస్‌ రిపోర్టును సీఎం కేసీఆర్‌కు డీజీపీ అందించారు. ఎంసెట్‌ రద్దుపై రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ..
తెలంగాణ ఎంసెట్‌-2 లీకేజీపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లీకేజీని నేషనల్‌ స్కాంగా భావిస్తున్న సీఐడీ కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తోంది. లీకేజీతో 30 మంది విద్యార్థులు లబ్ది పొందారని నిర్థారించుకున్న అధికారులు .. 72 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం లీకేజీ అయినట్లు అనుమానిస్తున్నారు.

పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన సీఐడీ..
బెంగళూరు, ముంబై, విజయవాడ, ప్రకాశం, హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలలో తనిఖీలు నిర్వహించిన సీఐడీ బృందాలు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి, తిరుమల్‌, విష్ణు, రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. మరోవైపు షేక్‌ నిషాద్‌, ముంబైకి చెందిన గుడ్డూ మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

నిందితుడు రాజగోపాల్ రెడ్డిపై క్రిమినల్ కేసులు..
నిందితులు కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో బడాబాబుల పిల్లలకు ఎర వేసి 50 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి నుంచి 40 నుంచి 70 లక్షల రూపాయలు అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌-2 పేపర్‌ లీకు కేసులో రాజగోపాల్‌రెడ్డి కీలక నిందితుడుగా భావిస్తున్నారు. ప్రశ్నపత్రాలు కొనే విద్యార్థులను రాజగోపాల్‌రెడ్డి సమకూర్చినట్లు సమాచారం. బెంగళూరులో ఉషా ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న రాజగోపాల్‌రెడ్డి.. పీజీ మేనేజిమెంట్‌ సీట్లను అక్రమ మార్గాల్లో అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజగోపాల్‌రెడ్డిపై గతంలోనే బెంగళూరులో నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

సీఎం కేసీఆర్‌కు స్టేటస్‌ రిపోర్టు అందించిన డీజీపీ..
మరోవైపు ఎంసెట్‌ లీకేజీ స్టేటస్‌ రిపోర్టును డీజీపీ అనురాగ్‌శర్మ.. సీఎం కేసీఆర్‌కు అందించారు. అటు పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే ఎంసెట్‌-2పై నిర్ణయం తీసుకుంటామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు..

రేపు ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక..
సీఐడీ అధికారులు గురువారం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించనున్నారు. ఆ తరువాతే ఎంసెట్‌-2 రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఎంసెట్ 1 కూడా లీక్?!..

హైదరాబాద్ : ఎంసెట్1 పేపర్ లీక్ అయినట్లుగా సంచలన విషయాలను వెల్లడవుతున్నాయి. ఇరు సంచలనం కలిగించిన ఎంసెట్ 2 పేపర్ లీక్ అంశంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో సంచలన అంశాలు బైటపడుతున్నాయి. ఎంసెట్ 1 పేపర్ ను కూడా లీక్ చేశామని నిందితుడు రాజగోపాల్ రెడ్డి వెల్లడించాడు. దీంతో ఖంగుతిన్న అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

20:59 - July 27, 2016

16ఏళ్ల దీక్ష . మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సాగించిన నిశ్శబ్ద పోరు.. అహింసా మార్గంలో ఆయుధానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం. కత్తుల వంతెనపై కవాతు చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల తరపున బరిగీసి కొట్లాడుతున్న అసమాన యోధురాలామె. కానీ, కడుపు మాడ్చుకుని మరో మూడు దశాబ్దాలు దీక్ష చేసినా ఫలితం కనిపించే అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడా ఉక్కు మహిళ తన పోరాట పంథా మారుస్తోంది. చట్టసభల్లో అడుగుపెట్టి పోరుసల్పుతానంటోంది. ఎన్నికల్లో పోటీ చేస్తానంటోంది. ఈ కొత్త మార్గం ఎలాంటి ఫలితాలనిస్తుంది? ఈ రోజు ఎపిసోడ్ లో ఇదే అంశంపై స్టోరీ చూద్దాం.. ఇంత కాలం గాంధీ మార్గంలో అహింసా పద్ధతిలో ఎన్నేళ్లు దీక్ష చేసినా ఫలితం రాలేదు. 16ఏళ్ల తర్వాత ఆమె అనూహ్యంగా దీక్షను ఆపుతున్నట్టు ప్రకటించారు. అంతే కాదు.. ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. ఇది అందరిలో ఆశ్చర్యాన్ని, హక్కుల పోరాటంలో కొత్త మలుపుని సూచిస్తోందని చెప్పాలి. సాయంత్రం బయటికెళ్లిన ఇంటిపెద్ద వెనక్కిరాడు... ఆటో సవారీకి వెళ్లిన బడుగు జీవి హఠాత్తుగా మాయమవుతాడు... కుటుంబానికి ఆధారంగా నిలిచిన చేతులు అదృశ్యమవుతాయి.. ఓ మహిళ బయటికెళ్లిందంటే మాన ప్రాణాలతో క్షేమంగా తిరిగొస్తుందనే నమ్మకం లేదు.. ఎదురు చూపులతో కళ్లు అలసిపోతాయి.. తిరిగిరాని లోకాలనుంచి ఏ సమాధానం రాదు.. వాళ్లేమై పోయారో చెప్పేవాళ్లూ ఉండరు..? ఎందరో యువకులు, మరెందరో మహిళలు.... క్షణాల్లో అస్తికలుగా మారుతున్న అభాగ్యపు బతుకులు.. అది భూమ్యాకాశాలను ఏకం చేస్తున్న కన్నీటి ప్రవాహం.. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్.. ఏం చేస్తుందీ చట్టం.. హక్కుల్లో, అధికారాల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది.. అసలీ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరమేమొచ్చింది? అది సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? దీన్ని ఎత్తేయాలని పోరాటాలెందుకు జరుగుతున్నాయి? నల్ల చట్టాన్ని తొలగించాలి.. ఈశాన్య భారతం కళకళలాడాలి.. ఇదే లక్ష్యం.. ఇదే స్వప్నం అంటోంది ఇరోమ్ షర్మిల.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత.. పట్టపగలు ప్రాణాలు గాల్లో కలిసిన పదిమంది అమాయకుల మీద ఆన...చీకటి రాత్రి దుర్మార్గానికి బలైన మనోరమకు కన్నీటి తర్పణాలు...నా జాతి, నా ప్రజలు ఈ కడగండ్లనుంచి బైటపడాలి... దానికోసం ఏమైనా చేయాలనే తపన.. తన కోసం.., తనలాంటి కోట్లాది అమాయకుల కోసం.. మరెన్నడూ ఇలాంటి దారుణాలు జరగకూడదు..వాటికీరోజే ముగింపు రావాలి.. చివరికి తన ప్రాణం పోయినా ఫర్వాలేదు.. నల్ల చట్టాన్ని మాత్రం తొలగించాలి.. ఈశాన్య భారతం కళకళలాడాలి.. ఇదే లక్ష్యం.. ఇదే స్వప్నం. 16 ఏళ్ల దీక్ష తర్వాత...ఇన్నేళ్లూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు.. పాలిపోయిన చర్మం.. ఎముకల గూడులా మారిన దేహం..కానీ ఆ కళ్లలో మాత్రం అపూర్వ తేజస్సు..చెరగని ఆత్మవిశ్వాసం.., అకుంఠిత దీక్ష.. లక్ష్యంపైనే దృష్టి.. మహాత్ముడు బతికి ఉంటే, ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా కచ్చితంగా ఉద్యమించేవాడు అంటోంది షర్మిల..2017లో జరగబోయే ఎన్నికల్లో ఇరోమ్ పోటీ చేయటం తర్వాత సరికొత్త పోరాట మార్గంలోకి అడుగుపెడుతున్నట్టే.. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో, వర్తమానంలో ఇరోమ్ విడదీయలేని భాగం.. తన పోరాటంతో, సుదీర్ఘ దీక్షతో ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ గా మారిందా యోధురాలు... భారత దేశంలో జరుగుతున్న హక్కుల పోరాటాల్లో ఇరోమ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.. ఇరోమ్ దీక్షఫలించి ఈశాన్య రాష్ట్రాలు తుపాకీ నీడనుంచి బయటపడి, శాంతి నెలకొనాలని ఆశిద్దాం..

20:40 - July 27, 2016

హైదరాబాద్ : విద్యార్థుల్లో పఠానాసక్తి పెంపొందితేనే దేశానికి భవిష్యత్‌ నాయకులు తయారవుతారని ట్రిపుల్‌ ఐటీ రిజిస్ట్రార్‌ ప్రదీప్‌కుమార్‌ అన్నారు. రోజురోజుకు తగ్గిపోతున్న పుస్తక పఠనాన్ని పెంచేందుకు 'రీడ్‌ ఇండియా' ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని.. ఇందుకోసం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఈనెల 30న హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కాలేజీలో గ్రాండ్‌ ఫినాలే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. రెండు రాష్ట్రాల కాలేజీల నుంచి 12 మందిని.. పాఠశాలల నుంచి 12 మందిని ఎంపిక చేసి బహుమతులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమానికి 10టీవీ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

20:35 - July 27, 2016

ఇబ్రహీంపట్నం సర్కారు దవాఖానాలో కొత్తగా ఓబార్ షాపును ఓపెన్ చేసిండు టీ.సర్కార్.. రెండు చినుకులు పడితే లబలబలాడుతున్న తెలుగు డల్లాస్ నగరం..పుష్కరాలను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు..నర్స్ లను అసభ్య పదాలతో తిడుతూ.. వేధిస్తున్న డాక్టర్..శ్రీవారి హుండీపై మనసు పారేసుకున్న గోదావరి పోరగాడు..పుంగనూరు ఆవులేగలకు పాలు పట్టించిన పోలీసాయన.. గిసువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న ఈరోజుకూడా తెచ్చేసిండు..జాగు సేయక చూసేయాలంటే ఈ వీడియోను క్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి...

20:30 - July 27, 2016

ఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి... టీడీపీలో ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేస్తోంది.. ఎవరికి వారు పట్టింపులకు పోవడం.. పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెస్తోంది. ఈ తగవులో ఒకరు కేంద్ర మంత్రి కూడా కావడం విశేషం..

ఇద్దరు సీనియర్ల మధ్య రగడ..
తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్ల మధ్య రగడపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, కేంద్ర మంత్రి సుజనాచౌదరిల మధ్య తగవు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఈ గొడవ చంద్రబాబు ముంగిటికి చేరినట్లు సమాచారం. ఇంతకీ వీరిద్దరి మధ్య అంత తీవ్రస్థాయి గొడవకు కారణమేంటి..?

నువ్వా నేనా అంటున్న కంభంపాటి..సుజనా..
ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్న కంభంపాటి రామ్మోహన్‌రావు రెండేళ్ల పదవీకాలం ముగిసింది. తనను మరోసారి కొనసాగిస్తారని కంభంపాటి భావించారు. అయితే.. చంద్రబాబు.. ఆయనకు మరో గౌరవప్రదమైన బాధ్యతను ఇస్తానని చెప్పారని భోగట్టా. దీంతో కంభంపాటి.. సుజనాచౌదరి లాంటి వారికన్నా తానేమీ తక్కువ కష్టపడలేదని.. సుజనాకు రెండోసారి రాజ్యసభ.. మంత్రిపదవి ఇచ్చినప్పుడు తనకు ఎందుకు అవకాశం ఇవ్వరు అని అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కంభంపాటి వ్యాఖ్యలు తెలుసుకున్న సుజనాచౌదరి.. వివాదంలోకి తనను ఎందుకు లాగుతారంటూ కంభంపాటిని నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇద్దరూ నువ్వా నేనా అన్న స్థాయిలో పంతాలకు పోవడంతో వ్యవహారం.. చంద్రబాబు సమక్షానికి చేరిందని చెబుతున్నారు.

కంభంపాటి.. సుజన మధ్య కోల్డ్ వార్..
నిజానికి ఇద్దరి మధ్యా కోల్డ్‌వార్‌ ఎప్పటినుంచో నడుస్తోందని పార్టీ వర్గాల కథనం. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటి ఉన్నా.. సుజనాచౌదరి ఆయనతో ముందునుంచీ అంటీ ముట్టినట్లుగా వ్యవహరించారని సమాచారం. పైగా ఏపీకి రావాల్సిన నిధులు, రెవిన్యూలోటు, విభజన హామీల అంశాలపై కంభంపాటిని పక్కకు పెట్టి.. సుజనాచౌదరియే అరుణ్‌జైట్లీలాంటి నేతలతో మాట్లాడేవారు. ఇలాంటి సమావేశాలకు సంబంధించి నామమాత్రపు సమాచారం కూడా ఇచ్చేవారు కాదని కంభంపాటి చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు తన పదవి పొడిగింపునకూ సుజనా అడ్డుపడుతున్నారన్న బలమైన భావనలో కంభంపాటి ఉన్నారు.
ఇరు నేతల మధ్య తారాస్థాయికి చేరిన తగవులు..
కంభంపాటి, సుజనా చౌదరిల మధ్య తారాస్థాయికి చేరిన తగవు.. ఇప్పుడు చంద్రబాబు సమక్షానికి చేరినట్లు భోగట్టా. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి లోకేశ్‌ పేరు తెరపైకి వచ్చింది. దీన్ని లోకేశ్‌ సన్నిహితులూ ధ్రువీకరిస్తున్నారు. లోకేశ్‌కు జాతీయ నేతలతో పరిచయాలు పెంచడం, ఢిల్లీ వ్యవహారాలు, రాజకీయాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరింత బలమైన పునాది వేయాలన్నదే బాబు భావనగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాష్ట్ర రాజకీయాల్లో మరింత పట్టు సాధించేందుకు.. లోకేశ్‌ను ఇక్కడే ఉంచుతారనే ప్రచారమూ పార్టీలో జరుగుతోంది.

వివాదాన్ని బాబు ఎలా ముగిస్తారో వేచి చూడాలి...
నారా లోకేశ్‌.. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించుకుంటే.. కంభంపాటి పదవి కొనసాగింపునకు లైన్ క్లియర్ అయినట్లే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఎటూ తేల్చక ఎల్లో సిగ్నల్ చూపితే.. సుజనా అండ్ టీం ఏకంగా రెడ్ సిగ్నల్ వేసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒకరిద్దరు ఎంపీలతో పాటు మరికొందరి పేర్లను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సుజనా సూచించారని టాక్... ఏదేమైనా... కోర్ టీంలోని ఇద్దరు సీనియర్‌ సభ్యుల మధ్య రేగిన ప్రత్యేక పోస్టు రగడ బాబుకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో వేచి చూడాలి.

20:15 - July 27, 2016

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ నెల 22న కరెంట్ కోత వల్ల 21మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసింది. పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్ హెచ్ ఆర్సీ కేసును సుమోటాగా స్వీకరించింది. దీంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య, స్త్రీ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.

20:12 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీపై సీఎం కేసీఆర్‌కు స్టేటస్‌ రిపోర్ట్‌ను డీజీపీ సమర్పించారు. ఈ లీకేజీ వ్యవహారాన్ని సీఐడీ నేషనల్‌ స్కాంగా భావిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో బడాబాబుల పిల్లలకు ఎర వేసి 50 కోట్ల రూపాయలు వసూలు చేయాలని నిందితులు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. దేశంలోనే మొదటిసారి 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీకేజీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చంఢీగఢ్‌లో కూడా 24 మంది విద్యార్థులకు పేపర్ లీక్ అందించారు. నలుగురు నిందితులు రాజగోపాల్‌రెడ్డి, తిరుమల్‌, విష్ణు, రమేష్‌లను సీఐడీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. పరారీలో వున్న మరో నలుగురు నిందితులు పరారీలో షేక్‌ నిషాద్‌, ముంబైకి చెందిన గుడ్డూ మరో ఇద్దరు పరారీలో వున్నారు. పరారీలో వున్నవారికోసం గాలింపును ముమ్మరం చేశారు. ఎంసెట్‌-2 ప్రశ్నపత్రాలు కొనే విద్యార్థులను రాజగోపాల్‌రెడ్డి కోఆర్డినేట్ చేసినట్లుగా విచారణలో తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి బెంగళూరులో ఉషా ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అధికమొత్తంలో డబ్బును సంసాదించటాడానికి ప్రశ్నాపత్రాల లీక్ ను ఎన్నుకున్నాడు. రాజగోపాల్‌రెడ్డిపై బెంగళూరులో నాలుగు క్రిమినల్‌ కేసులు వున్నాయి. ఎంసెట్‌-2 లీకేజీపై సీఎం కేసీఆర్‌కు సీఐడీ అధికారులు స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించారు. ఎంసెట్‌-2పై రేపు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

20:01 - July 27, 2016

కరీంనగర్ : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సిరిసిల్ల మండలం జిల్లెల్ల క్రాసింగ్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఇసుక మాఫియాను అడ్డుకున్నారు. దీంత రెచ్చిపోయిన ఇసుక అక్రమరవాణాదారులు అధికారులు వెళుతున్న వాహనంపై మరోవాహనంతో దాడిచేశారు. ఈ ఘటనలో రిజ్వాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అధికారుల వాహనంపై ఇసుక మాఫియా దాడి..

కరీంనగర్ : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సిరిసిల్ల మండలం జిల్లెల్ల క్రాసింగ్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఇసుక మాఫియాను అడ్డుకున్నారు. దీంత రెచ్చిపోయిన ఇసుక అక్రమరవాణాదారులు అధికారులు వెళుతున్న వాహనంపై మరోవాహనంతో దాడిచేశారు. ఈ ఘటనలో రిజ్వాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

భారీ వర్షాలకు 26మంది మృతి..

నేపాల్‌ : నేపాల్ పై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గత రెండు రోజుల్లో 54 మంది మృత్యువాత పడ్డారు. అలాగే పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు, వంతెనలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. వరదలు, విరిగిన కొండ చరియల ధాటికి ఒక్క ప్యూథాన్ జిల్లాలోనే కనీసం 26 మంది దుర్మరణం చెందారు.

ఎన్నారైల కోసం కాల్ సెంటర్లు..

హైదరాబాద్: ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలతోపాటు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. విదేశాలకు వెళ్లే వారి డేటా బేస్ తో పాటు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ను రూపొందిస్తున్నామని అన్నారు. ఎన్నారైల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ను ఏర్పాటుచేస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ నాన్ రెసిడెంట్ వారికోసం సెంటర్ ఫర్ నాన్ తెలంగాణ అఫైర్స్ కమిటీని, జిల్లాలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు.

టీ.సర్కార్ కు నోటీసులిచ్చిన ఎన్ హెచ్ ఆర్సీ..

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ నెల 22న కరెంట్ కోత వల్ల 21మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసింది. పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్ హెచ్ ఆర్సీ కేసును సుమోటాగా స్వీకరించింది. దీంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య, స్త్రీ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.

యువకుడికి దేహశుద్ధి చేసిన తృప్తీ దేశాయ్..

మహారాష్ట్ర : భూమాతా బ్రిగేడ్‌కు చెందిన తృప్తీ దేశాయ్ ఓ యువ‌కుడికి దేహాశుద్ధి చేసింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసిన యువకుడిని చెప్పుతో కొట్టింది. తృప్తీ దేశాయ్ తో పాటు మరో ఇద్దరు కూడా ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సామాజిక కార్య‌క‌ర్త తృప్తీ దేశాయ్ ఇటీవ‌ల శ‌నిశింగ‌నాపూర్ ఆల‌యంలో మ‌హిళల‌కు ప్ర‌వేశాన్ని క‌ల్పించాల‌ని కోరుతూ భారీ ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

19:03 - July 27, 2016

విజయవాడ : చేపలంటేనే చటుక్కున గుర్తొచ్చేది పులస. ఆ తర్వాత కొర్రమీను, బొమ్మిడాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంటుంది. వీటిన్నింటి గురించి మనకు బాగానే తెలిసినా కొత్తగా వచ్చిన మరో చేప.. ఇప్పుడు కృష్ణా తీరాన్ని వణికిస్తోంది. చేపల వేటే జీవనాధారంగా సాగుతున్న మత్స్యకారులు.. ఇప్పుడా చేప పేరు చెబితేనే వామ్మో అంటున్నారు. ఇంతకీ ఆ చేప పేరేంటి..? దాన్ని చూసి బెస్తలు సైతం ఎందుకు భయపడుతున్నారు..? వాచ్‌ దిస్ స్టోరీ.

ముళ్ళకంపల్లా వున్న ముళ్లు..
చేపంటే.. అలాంటిలాంటి చేప కాదు. ముట్టుకుంటే ముళ్ల కంపలా ఉన్న వింత చేప అది. ఇప్పుడీ చేపే అనేక మంది మత్స్యకారుల వేటకు అవరోధంగా మారుతోంది. చూడగానే ఒళ్లు జలదరించేలా... పట్టుకుంటే చాలు..ఇట్టే కోసుకుపోయేలా ఉన్న ఈ చేపలు గతంలో ఎక్కడా కనిపించలేదు. ఈమధ్యే కృష్ణానదిలో దర్శనమిస్తున్నాయి. కరకరలాడే పళ్లు, ఒంటినిండా ముళ్లతో కూడిన ఈ చేపలను డెవిల్‌ ఫిష్‌, లేదా రాక్షస చేపలని పిలుచుకుంటున్నారు స్థానికులు.

డెవిల్‌ చేపలు..కలకలం..
కొద్దిరోజులుగా గుంటూరు, కృష్ణా తీరంలో డెవిల్‌ చేపలు..కలకలం రేపుతున్నాయి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు చిక్కి వలలన్నింటినీ నాశనం చేస్తున్నాయి. చేపల వేటే వృత్తిగా జీవిస్తున్న అనేక మంది మత్స్యకారుల ఉపాధి పట్ల.. ఇప్పుడీ రాక్షస చేపలు శాపంగా మారుతున్నాయి. విలువైన వలల్లో చిక్కినట్టే చిక్కి.. ఆ వలలను పదునైన ముళ్లు, పళ్లతో తెంపేస్తున్నాయి. దీంతో చేపల వేటే వృత్తిగా బతకుతున్న మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతోంది. డెవిల్‌ ఫిష్‌ కారణంగా పాడవుతున్న ప్రతి వలకూ.. సుమారు 15 వేల రూపాయల నుంచి 50 వేల మేర నష్టపోతున్నారు.

తల మొదలు.. తోక వరకు ముళ్లు ఈ చేపల స్పెషల్..
కొత్తగా చిక్కిన డెవిల్‌ఫిష్‌కు తల మొదలు.. తోక వరకు ముళ్లు ఉన్నాయి. వీటితో వలలను తెగ నాశనం చేసేస్తున్నాయీ మత్స్యాలు. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అదో వింత జీవిలా ఉందని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు.

ఇతర చేపల్ని కూడా హాంఫట్ చేస్తున్న డెవిల్ ఫిష్..
బురదలో ఫంగస్‌ తిని సంతానోత్పత్తి చేసే డెవిల్‌ ఫిష్..ఇతర చేపల్ని కూడా తినేస్తున్నాయి. దీంతో వేరే చేపలు దీనివంక రావాలంటే కూడా భయపడిపోతున్నాయి. ఫలితంగా డెవిల్‌ఫిష్‌ ఉన్న ప్రాంతంలో చేపల వేట గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం డెవిల్‌ఫిష్‌ను అరికట్టాలని లేకపోతే తమ బతుకులు రోడ్డున పడే అవకాశం ఉందని మత్స్యకారులు అంటున్నారు. మత్స్యకారుల సమస్యను కాస్తంత పక్కన పెడితే.. త్వరలో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో ఈ రాకాసి చేపలు.. భక్తులకు ఎలాంటి ముప్పు తెచ్చిపెడతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ డెవిల్‌ ఫిష్‌పై దృష్టి సారించి.. విరుగుడు కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

18:56 - July 27, 2016

విశాఖ : భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయిపోతోంది. పాత భవనాలు కూలిపోతున్నాయి..విశాఖ నగరంలో ఓ పాత భవనం కూలిపోయింది. అదృష్టంకొద్దీ తృటిలో పెను ప్రమాదం తప్పింది..వందేళ్ల క్రితం నాటి ఈ బిల్డింగ్‌ రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నాని కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బిల్డింగ్ పై కప్పు కూలిపోవడం గమణించిన స్థానికులు క్రింద పోర్షన్ లో నివాసం ఉండే వారికి సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటకు వచ్చారు..దీంతో ప్రాణ నష్టం తప్పింది..ఇప్పటికే జీవీఎంసీ అధికారులు బిల్డింగ్ ను కూల్చేయ్యమని భవన యజమానులకు అదేశాలు జారీ చేశారు.

18:51 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2పై రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎంసెట్‌-2 లీకేజీపై దర్యాప్తు ముమ్మరమైంది. లీకేజీ డీల్‌ విలువ 50 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి 40 నుంచి 70 లక్షల రూపాయలు అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఐడీ అదుపులో నలుగురు నిందితులు రాజగోపాల్‌రెడ్డి, తిరుమల్‌, విష్ణు, రమేష్‌ ఉన్నారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టుతున్నారు. మరోవైపు షేక్‌ నిషాద్‌, ముంబైకి చెందిన గుడ్డూ మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఎంసెట్‌-2 పేపర్‌ లీకు కేసులో రాజగోపాల్‌రెడ్డి కీలక నిందితుడుగా భావిస్తున్నారు. ప్రశ్నపత్రాలు కొనే విద్యార్థులను రాజగోపాల్‌రెడ్డి సమకూర్చినట్లు సమాచారం. బెంగళూరులో ఉషా ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీని రాజగోపాల్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. పీజీ మేనేజిమెంట్‌ సీట్లను అక్రమ మార్గాల్లో అమ్ముకుంటున్నట్లు రాజగోపాల్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. రాజగోపాల్‌రెడ్డిపై గతంలోనే బెంగళూరులో నాలుగు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రేపు సీఐడీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ ఐ
ఎంసెట్ 2 పేపర్ లీక్ స్కామ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కష్టపడి చదువుకుని ర్యాంక్ లు సంపాదించుకున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

18:43 - July 27, 2016

ఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై రాజ్యసభలో సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండేళ్లలో పప్పుల ధరలు వందశాతం పెరిగాయని సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి అన్నారు. ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 106 డాలర్లుంటే 2016 జనవరి నాటికి 26 డాలర్లకు పడిపోయినా భారత్‌ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గించలేదన్నారు. మోది సర్కార్‌ అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌ డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని 9 సార్లు విధించడం ద్వారా వినియోగదారులపై భారం మోపిందని ఏచూరి పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు ప్రభుత్వం పరోక్షంగా పన్నులు విధించడమే కారణమన్నారు.

ఎంపీటీసీపై దాడి..

.గోదావరి : నిడదవోలు మండలంలోని తాడిమల్లలో చంద్రమౌళి అనే ఎంపీటీసీపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రమౌళి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్రం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి ఆయన్ని తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా పొలం విషయంలో తలెత్తిన తగాదాతో ఈ దాడికి జరిగినట్లుగా సమాచారం.

నలుగురు ఐఏఎస్ లను బదిలీ..

విజయవాడ : ఏపీలో నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్న చెరుకూరు శ్రీధర్ ను సీఆర్డీఏ కమిషనర్ గా నియమించింది. సీఆర్డీఏ కమిషనర్ గా ఇప్పటి వరకు కొనసాగిన శ్రీకాంత్ ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా నియమించింది. విజయనగరం జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎంఎం నాయక్ ను ఏపీడీసీఎల్ చైర్మన్ గా, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ గా ఉన్న వివేక్ యాదవ్ ను విజయనగరం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బాంబు దాడి...50 మంది మృతి..

సిరియా : జ‌రిగిన రెండు బాంబు దాడి ఘ‌ట‌న‌ల్లో 50 మంది మృతిచెందారు. కుర్దులు ఎక్కువ‌గా ఉండే ఖ‌మిష్లి న‌గ‌రంలో ఈ బాంబు దాడులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 170 మంది గాయ‌ప‌డ్డారు. ఇటీవ‌ల ఖ‌మిష్లి న‌గ‌రాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు తురుచూ టార్గెట్ చేస్తున్నారు. ట్ర‌క్కు బాంబుల‌తో కుర్దు ద‌ళాల‌ను సుసైడ్ బాంబ‌ర్లు టార్గెట్ చేసిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఖ‌మిష్లి న‌గ‌రంలో ఇటీవ‌ల జ‌రిగిన అతిపెద్ద పేలుడు ఇదే అని సాక్షులు అంటున్నారు. మ‌రోవైపు అలెప్పొలోనూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల‌తో భీక‌రంగా పోరు సాగుతోంది.

17:57 - July 27, 2016

హైదరాబాద్ : సిటీ సెంట్రల్ లైబ్రరీలో పారిశుధ్యం కొరవడింది. జిహెచ్ఎంసి అధికారులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దుర్గంధ వాసనలు తట్టుకోలేక విద్యార్థులు ఆందోళన చేపట్టారు. లైబ్రరీ భవనం పైకి ఎక్కి నిరసన చేపట్టారు. లైబ్రరీ అధికారుల దృష్టి ఎన్ని సార్లు తీసుకెళ్లినాకాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. 2000 మంది విద్యార్ధులకు కేవలం 2 టాయిలెట్స్ మాత్రమే ఉండటంతో విద్యార్థుల అసౌర్యానికి లోనవుతున్నారు. లైబ్రెరీ సమస్యలపై మా ప్రతినిధి నవీన్ మరిన్ని వివరాలు అందిస్తారు.

డోపింగ్ ఊబిలో భారత్ అథ్లెట్లు..

హైదరాబాద్ : డోపింగ్ ఊబిలో భారత్ అథ్లెట్లు కూరుకుపోతున్నారు. రియో ఒలింపిక్ ప్రారంభానికి ముందే భారత్ అథ్లెట్లపై దెబ్బమీద దెబ్బ పడింది. నర్శింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రధాని ఆదేశంతో నిర్సింగ్ యాదవ్ కురెండో డోపింగ్ టెస్ట్ చేశారు. దీంతో రెండోసారి కూడా నర్సింగ్ యాదవ్ విఫలమయ్యాడు. నర్సింగ్ స్థానంలో మరోక్రీడాకారుడు ప్రవీణ్ రాణాకు ఛాన్స్ దక్కే అవకాశమున్నట్లు సమాచారం.

17:42 - July 27, 2016

నిజామాబాద్ : వందకోట్లతో చేపట్టిన ఫుడ్ పార్క్ పునాదులకే పరిమితమైంది. శంకుస్థాపన చేసి ఏడాది దగ్గరపడుతున్నా.. ఫుడ్ పార్క్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న ఫుడ్ పార్క్ పనులను వేగవంతం చేసి.. త్వరిత గతిన పూర్తిచేయాలని డిమాండ్లు వినిపిస్తున్నా.. అధికారులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఫుడ్‌పార్క్‌ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.

నత్తనడకన పనులు..
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో సెజ్ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా..పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. కేంద్ర మంత్రి హర్‌సిమ్రాత్‌కౌర్‌ 2015 లోనే శంకుస్థాపనచేసినా..నేటికి పునాదిదశలోనే పనులు సాగుతున్నాయి.

109 కోట్లతో చేపట్టిన స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ..
109 కోట్లతో చేపట్టిన స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ పనులను 24 నెలల్లో పూర్తిచేస్తామని.. ప్రకటించి 50 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది కేంద్రప్రభుత్వం. అయితే.. పార్క్ ఏర్పాటు చేసే స్థలంలో భూమిని చదును చేస్తూనే కాలం వెల్లదీశారు కాంట్రాక్టర్లు. దీంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ సహాయమంత్రి నిరంజన్ జ్యోతి చొరవచూపి ఫైలును ముందుకు కదపడంతో..మరల ఆశలు పుంజుకున్నాయి.

లక్కంపల్లి గ్రామంలోని 697 ఎకరాల్లో సర్వేచేసిన కలెక్టర్ ..
కరెంట్ భూమి, నీటివసతి సమృద్దిగా ఉన్నచోట ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని 2009లో ప్రభుత్వానికి లేఖలు రాశాయి ప్రవాస భారతీయ సంస్థలు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. మెస్సర్, అపెక్స్ ఫార్మాస్యూటికల్స్ మెస్సర్ ఇన్నోవేటీవ్ టెక్నాలజీ కంపెనీలను పరిశీలించాలని కలెక్టర్‌కు లేఖ రాసింది ప్రభుత్వం. దీంతో ప్రాజెక్టు కోసం లక్కంపల్లి గ్రామంలోని 697 ఎకరాల్లో సర్వే చేశారు రెవెన్యూ అధికారులు.

319లో 23 ఎకరాలు అసైన్డ్ భూముల ఐపీఐఐసీ స్వాధీనం..
188,189,432 సర్వేనెంబర్లు గల భూములతో పాటు 319లో 23 ఎకరాలు అసైన్డ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించారు. 2009 ఫిబ్రవరి 20న రాష్ట్రమంత్రి వర్గం ఫుడ్ పార్క్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ఫుడ్ పార్క్ నిర్మాణంతో ఉద్యోగాలు వస్తాయని భావించిన రైతులు.. తమ భూములను ఇచ్చారు. కానీ నేటికీ పనులు నత్తనడకన సాగుతుండడంపై స్థానికులు నిరాశ చెందుతున్నారు .

ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలంటున్న స్థానికులు..
ఎన్ డీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం అవుతాయనుకున్న లక్కంపల్లి ప్రాంతవాసులు ఆశలు నిరాశలవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.

17:36 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీ లో దర్యాప్తును సీఐడీ అధికారుల ముమ్మరం చేశారు. ఈ భారీ స్కామ్ లో నలుగురు నిందితులను సీఐడీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో నలుగురు నిందితులున్నారు. వారి కోసం అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. నిందితుల్లో రాజగోపాల్ , తిరుమల్, విష్ణు, రమేష్ లను సీఐడీ అధికారుల విచారణ చేస్తున్నారు. పరారీలో వున్ వ్యక్తుల్లో ముంబైకి చెందిన 'గుడ్డు' అనే వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఈ పేపర్ లీకేజీ రూ.15 కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లుగా విచారణలో వెల్లడయ్యింది. ఢిల్లీ నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. దాదాపు 30మంది విద్యార్థులకు లీక్ అయిన పేపర్లు అందాయి. ఈ స్కామ్ కు చెందిన మూలాలన్నీ ఏపీకి ముడిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారులు విజయవాడలోకూడా దర్యాప్తు చేపట్టారు. అనుమానితులపై నిఘా వేసినట్లుగా సమాచారం. బుధవారం సాయంత్రానికి నిందితులను హైదరాబాద్ కు తీసుకురానట్లుగా ముందు తెలిసింది. కానీ నిందితులకు తరలించటానికి మరికొంత సమయం పట్టే అవకాశమున్నట్లుగా సమాచారం. కాగా గతంలో పేపర్ లీకేజ్ లో నిందితులుగా వున్నవారే ఈ స్కామ్ లో కూడా వున్నట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

17:32 - July 27, 2016

హైదరాబాద్‌ : నగరంలో భారీవర్షం కురుస్తోంది.. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ నీటమునిగాయి.. రోడ్లన్నీ చెరువుల్లా మారడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం కొనసాగుతోంది.. ఉప్పల్‌, పంజాగుట్ట, బాల నగర్‌, జీడిమెట్ల, చింతల్‌, శంషాబాద్‌లో వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది..

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు..
మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకె రెడ్డి వెల్లడించారు. విదర్భ నుంచి తమిళనాడు మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందని తెలిపారు.

వరవరరావు అరెస్ట్..

మెదక్ : పోలీసులతో లాఠీ దెబ్బ‌లు తిన్న రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరుతోన్న నేత‌ల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈరోజు అక్క‌డికి బ‌య‌లుదేరిన‌ విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా కొండపాక మండలం కోనాయిపల్లి వద్ద ఆయ‌న‌ను పోలీసులు మల్లన్నసాగర్ ప్రాంతానికి వెళ్ల‌కుండా అడ్డుకుని, పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు. ఆయ‌నతో పాటు ప్రజాఫ్రంట్ నాయకులు డా.కాశీం, రవిచంద్ర, దేవేంద్ర, గీతాంజలి, నలమాస కృష్ణ, రమణాచారి త‌దిత‌రుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

16:52 - July 27, 2016

ఖమ్మం : రేగళ్ల గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సీపీఎం ఆధ్వర్యంలో పోడుభూముల్లో మొక్కలు నాటుతున్న మహిళలను అటవీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షనలో కొంతమంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు.. పోడుభూముల్లో మహిళలను అడ్డుకోవడంతో ఉధృత వాతావరణం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా భూములను సాగుచేసుకుంటున్న తమను అటవీసిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ధర్నా చేపట్టారు.

16:45 - July 27, 2016

గుంటూరు : దాచేపల్లిలోని అలంకార్‌ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని అలంకార్ థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సినిమా ప్రదర్శిస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. దీంతో థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘనటలో థియేటర్ పూర్తిగా మంటలకు ఆహుతి అయిపోయింది. సుమారు రూ.3కోట్లు ఆస్థి నష్టం జరిగిందని యాజమాన్యం పేర్కొంది. షార్ట్ సర్యూట్ తోనే మంటలు వ్యాపించినట్లుగా అనుమానం.

16:36 - July 27, 2016

హైదరాబాద్ : జంటనగరాల్లో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. అసలే వర్షాకాలం.. బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో 2500 బస్టాప్‌లు అవసరం అని అధికారులు అంచనా వేయగా.. కనీసం వెయ్యి కూడా లేని పరిస్థితి ఉంది. ఉన్న బస్టాప్‌లలోనూ వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు వర్షంలోనే ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసుల ఇబ్బందులపై ఈ వీడియోను చూడండి..

16:32 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్-2 పరీక్షను రద్దు చేసి, మరలా పరీక్ష నిర్వహించే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని విధాలా పరీక్షకు ప్రిపేర్ అయ్యి, తమకు సీటు వస్తుందని ఎదురుచూస్తున్న మెరింట్‌ర్యాంక్ స్టూడెంట్స్ తీవ్రంగా ఆందోళన చెందే అవకాశముందని తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ... ఏ స్టూడెంట్స్‌పై కేసు నమోదు చేశారో వాళ్లను శిక్షించి, మిగిలిన విద్యార్థులకు న్యాయం చెయ్యాలని కోరారు.

నీతూ అగర్వాల్ భర్త అరెస్ట్...

కడప: సినీనటి నీతూ అగర్వాల్‌ భర్త, కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడుకు చెందిన మస్తాన్‌వలిని కడప జిల్లా మైదుకూరు పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి మారుతీ కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా.. మస్తాన్‌వలితో పాటు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం నాగినేని చెరువు గ్రామానికి చెందిన ప్రధాన స్మగ్లర్‌ భాస్కర్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. వీరి నుంచి మారుతీ కారు, 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఎంసెట్ లీక్ లో సంచలనాలు...

హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్‌తో 30 మంది విద్యార్థులకు సంబంధమున్నట్లుగా తెలుస్తోంది. పరీక్షకు 2 రోజుల ముందు నిందితులు విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చారు. విద్యార్థులను ముంబయి, బెంగళూరు తీసుకెళ్లి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లుగా అధికారులు నిర్థారించారు. ఢిల్లీ లోని ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్ లీక్ అయినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్‌లో అగ్నిప్రమాదం..

గుంటూరు : దాచేపల్లిలోని అలంకార్‌ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను వెంటనే అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

16:09 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్‌తో 30 మంది విద్యార్థులకు సంబంధమున్నట్లుగా తెలుస్తోంది. గతంలో పీజీసెట్ 2012 పేపర్ లీక్ చేసిన వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షకు 2 రోజుల ముందు నిందితులు విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చారు. విద్యార్థులను ముంబయి, బెంగళూరు తీసుకెళ్లి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లుగా అధికారులు నిర్థారించారు. ఢిల్లీ లోని ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్ లీక్ అయినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తుల కోసం సీఐడీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి అడ్వాన్స్ గా రూ.10 లక్షలు మొత్తంగా రూ. 50 లక్షల వరకు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు గతంలోనూ పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. ఈ కేసులో నిందితులకు సాయంత్రం హైదరాబాద్ తరలించే అవకాశముంది. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

బస్ ను ఢీకొన్న లారీ..32మందికి గాయాలు..

నెల్లూరు : నాయుడుపేట బస్టాండ్‌ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి చిత్తూరు జిల్లా శ్రీసిటీలోని సెల్‌ఫోన్‌ కంపెనీలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 32 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 12 మందిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి, 19 మందిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

15:52 - July 27, 2016

విజయవాడ : రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కాని... డిజైనర్స్ మాత్రం తమ డిజైన్లతో హడావుడి చేసేస్తున్నారు. తాజాగా మలేషియా ప్రతిపాదించిన డిజైన్లు.. చంద్రబాబు మనసు దోచుకున్నాయట.. మరి సింగపూర్ తోపాటు బాబు ప్రస్తావించిన మిగతా దేశాల డిజైన్ల సంగతేంటీ... ఓ లుక్కేద్దాం...

ఏ దేశం వెళితే..ఆ దేశ డిజైన్‌ కావాలంటున్న బాబు..
ఆసియా ఖండంలో నీలాంటి బామ లేదే... అంటూ ఓ సినీ కవి రాసినట్లు.. ఏపీ సీఎం చంద్రబాబు మదిలో ప్రపంచంలోని ఏడు ఖండాల్లోనూ ఆకట్టుకోలేని డిజైన్ లేదు. అమరావతి రాజధాని నిర్మాణం నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు పర్యటించిన ముఖ్యమంత్రి ... ఏ దేశం వెళ్లినా... మనకు ఇలాంటి రాజధాని రావాలనడం, ఈతరహా డిజైన్ కావాలనడం.. నిర్మాణంలో మీ సహాకారం తీసుకుంటామంటూ ఆ దేశ నేతలకు హామీ ఇవ్వడం షరా మామూలై పోయింది.

కీలక భవనాల నమూనాలను రెడీ చేసిన హారిస్ సంస్థ..
ఇప్పటికే స్విస్ ఛాలెంజింగ్ విధానంలో సింగపూర్‌కు.. రాజధానిలో మెజార్టీ నిర్మాణ కాంట్రాక్టులు అప్పగించిన ఏపీ సర్కార్... ఇప్పుడు మళ్లీ బౌద్ధ జపం అందుకొంది. తెలుగు సంస్కృతికి బౌద్ద హంగులంటూ అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలకు మలేషియా సంస్థ హారిస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను సీఎం అండ్ టీం తిలకించింది. అమరావతిలో శాసనసభ, సచివాలయంతో పాటు మరికొన్ని కీలక భవనాల నమూనాలను హారిస్ సంస్థ రెడీ చేసింది. అవసరమైనపుడు మీ సేవలను ఉపయోగించుకుంటామంటూ బాబు.. సంస్థ ప్రతినిధులకు హామీ కూడా ఇచ్చేశారు. మలేషియాలో ఫేమస్ అయిన... పెట్రోనాస్ తరహా ట్విన్ టవర్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని బాబు చెప్పారట.

శాసనసభ, సచివాలయంతో పాటు కీలక భవనాలకు హారిస్ సంస్థ నమూనాలు
900 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి చెందిన మాస్టర్‌ప్లాన్‌తో పాటు, కొత్త కార్యాలయ ఆకృతులను హారిస్ సంస్థ తయారు చేసింది. తెలుగు, బౌద్ధ సంస్కృతులకు అద్దం పట్టేలా ఈ నమూనాలు ఉన్నాయి. హైకోర్టు బౌద్ధ స్థూపాన్ని పోలినట్లు ఉంటూనే ఆధునికంగా కనిపిస్తోంది. న్యాయానికి సమతూకంగా రెండు బౌల్స్‌ తీర్చిదిద్దారు. శాసనసభను వాటర్‌ లిల్లీ ఆకృతిలో రూపొందించారు. కంపెనీ ప్రతినిధులు సోమవారం సీఎం చంద్రబాబుకు ఈ డిజైన్లను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రదర్శించి చూపారు. విదేశాల్లో హారిస్ సంస్థ నిర్మించిన ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్స్ ను చూపించారు.

ఏ సంస్థ వచ్చినా మీలాంటి రాజధాని అంటున్న బాబు
ఇలా ఏ సంస్థ వచ్చినా మీ లాంటి రాజధాని కట్టి తీరుతాం.. మీ సహాకారం తీసుకుంటామంటూ చెప్పడం ఏపీ సీఎం కు అలవాటుగా మారిందంటున్నారు. ఆయన ఏ నగరం చూస్తే అదే మన రాజధాని అంటున్నారు. ఈ మధ్య కజకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడ రాజధాని అస్తానాపై మనసు పారేసుకున్నారు. అలాంటి రాజధాని కడతామని ప్రకటన చేశారు. అంతకు ముందు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. అసలు అమరావతి ఏ నగరంలా ఉండబోతోంది. ఇప్పడు ఇదే ప్రశ్న అటు తెలుగు తమ్ముళ్లలో ఇటు అధికారుల్లో తీవ్ర ఆసక్తి రేకిస్తోంది.

సింగపూర్ లా నిర్మిందామన్న బాబు
గతంలో సింగపూర్ లా నిర్మించుకుందామన్న బాబు... సింగపూర్ బృందం చేతే సీడ్ క్యాపిటల్ ప్లాన్ రెడీ చేపించుకున్నారు. సింగపూర్ టూర్ తర్వాత గతంలో బాబు అండ్ టీం జపాన్, చైనా దేశాల్లో పర్యటించింది. జపాన్ లోని టోక్యో, చైనాలో షాంఘై నగరాలకు తీసిపోని విధంగా అమరావతిని నిర్మిస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు వారం రోజుల ముందు బాబు రెండో సారి జపాన్ వెళ్లి వచ్చారు.

ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు
ఇలా అమరావతి నిర్మాణం విషయంలో రోజుకో డిజైన్, నగరం, దేశం ప్రస్తావన తెస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. కొత్త రాజధాని, భవనాల నిర్మాణం పేరుతో తిరిగే దేశాల జాబితా కూడా పెరిగిపోతోంది. గతంలో మోడీ చెప్పారని బాబు ఆదేశాల మేరకు తజకిస్తాన్, తుర్కుమినిస్తాన్ దేశాలను అధికారుల బృందం పర్యటించింది. ఇప్పుడు తాజాగా మలేషియా సంస్థ హారిస్ వంతు వచ్చింది. కొత్త రాజధాని నిర్మాణం కోసం పలు ప్రాంతాలు సందర్శించడం తప్పుకాదు.. పలువురితో మాట్లాడ్డం మంచిదే... కానీ ఎక్కువ నగరాలు, డిజైన్లు చూసి గందరగోళానికి గురవడం, ఆ నగరంలా.. ఈ సిటీలా నిర్మించేస్తామంటూ ప్రకటనలు చేయడంపై కొందరిలో పెదవి విరుపు కనిపిస్తోంది. విదేశీ పర్యటనల్లో కనిపిస్తున్న స్పీడ్... కొత్త రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం కనబర్చడం లేదనేది సుస్పష్టం. ఇలా అయితే అసలు రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనేది అమరావతి టాక్. ఔ

15:44 - July 27, 2016

తిరుమల : శ్రీవారి మొబైల్ హుండీలో చోరీ జరిగింది. అర్జున్ అనే వ్యక్తి రూ. 50000 దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో నిందింతుడిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందింతుడిది రాజమండ్రిగా గుర్తించారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

కాసేపట్లో పల్లేపహాడ్ గ్రామస్తులతో మంత్రి హరీష్ చర్చలు...

మెదక్ : కాసేపట్లో పల్లెపహాడ్ గ్రామస్తులతో మంత్రి హరీష్ రావు చర్చలు చేపట్టనున్నారు. నిర్వాసితులకు పరిహారంపై చర్చించనున్నారు. గజ్వేల్ లోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ కు గ్రామస్తులు చేరుకున్నారు.

 

స్కాలర్ షిప్ అప్లికేషన్ పై సంతకం పెట్టలేదని విద్యార్థి ఆందోళన..

నెల్లూరు : విక్రమసింహపురి వర్సిటీలో భవనంపైకి ఎక్కిన సుధీర్ అనే విద్యార్థి ఆందోళన చేశాడు. స్కాలర్ షిప్ అప్లికేషన్ పై రిజిష్ట్రార్ సంతకం పెట్టడం లేదని, సంతకం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సుధీర్ బెదిరిస్తున్నాడు.

 

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. విదర్భ నుండి మరత్ వాడ నుండి కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

 

14:00 - July 27, 2016

5 సార్లు ఎంటీబీ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన రిక్కీ న్యూ జెర్సీలో మౌంటెయిన్‌ క్రీక్‌ బైక్‌ పార్క్‌లో నిర్వహించిన స్పీడ్‌ ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నాడు. ఎక్కడా తడబడకుండా, ఏ మాత్రం జోరు తగ్గించకుండా రాళ్లు, గుట్టలతో కూడిన దారిలో రయ్‌ రయ్‌ మంటూ దూసుకెళ్లాడు. మలుపుల వద్ద స్పీడ్‌ బ్యాలెన్స్‌ చేస్తూ మెరుపు వేగంతో జంప్స్‌ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం ఒక గంటా 14 నిమిషాల్లోనే 49 కిలోమీటర్ల దూరం రైడ్‌ చేసి ట్రయల్ రన్‌ సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు

13:57 - July 27, 2016

వృధ్యాప్యంలో నడవడమే కష్టం. అలాంటిది తొంభైఏళ్ల వయసులో ఓ బామ్మ సర్ఫింగ్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమెరికాకు చెందిన మిల్లీ సులెన్స్‌కు యాభై ఏళ్ల క్రితం ఆమె భర్త సర్ఫింగ్ నేర్పాడు. అప్పటినుంచి సముద్రపు అలలపై ప్రయాణిస్తూ మిల్లీ సర్ఫింగ్‌లో ప్రావీణ్యం పొందింది. వయసు మీద పడుతున్నా కూడా కుర్రకారుకు ధీటుగా సర్ఫింగ్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. తన మనవళ్లు, మనవరాళ్లకు ఇందులో శిక్షణ కూడా ఇస్తోంది. ఒక్లామా సరస్సులో ఈ బామ్మగారి సర్ఫింగ్‌ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

13:53 - July 27, 2016

హైదరాబాద్ : నగరంలోని అతిపెద్ద బస్టాండ్‌ నుంచి మీకు తెలిసినవారు ఎవరైనా మాయమయ్యారా..? అయితే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి...గాలించండి.. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు పోతాయి. కిడ్నాప్ చేస్తున్న ముఠాలు జేబు ఖర్చు కోసం చంపేస్తున్నారు. సెల్‌ఫోన్ల కోసం ప్రాణం తీస్తున్నారు. బీహార్, ముంబాయి ఆవారా గ్యాంగ్‌లు నగరంలో సంచరిస్తున్నాయి. ప్రయాణికులే లక్ష్యంగా కిల్లర్ గ్యాంగ్స్‌ సంచరిస్తున్నాయి. అతి పెద్ద బస్టాండ్‌ మహాత్మాగాంధీ స్టేషన్‌లో మాటువేసిన గ్యాంగ్‌ దొరికింది. వారిని విచారిస్తే ఎన్నో ఘోరాలు బయటపడ్డాయి. పోలీసులు అప్రమత్తత ఇద్దరి ప్రాణాలు కాపాడాయి.

కూలీపనులు చేస్తూనే ఈజీమనీ వేట..
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌ బస్టాండ్లలో ప్రయాణికులను దోచుకుంటున్న ముఠాకు టాస్క్‌పోర్స్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇక్బాల్‌ ఖాన్, బీహార్‌కు చెందిన మహ్మద్‌ రెహాన్‌ అన్సారీ, టోలిచౌకికి చెందిన అలీ ఖాన్‌, కర్ణాటక బీదర్‌కు చెందిన షేక్‌ జావీద్‌..కొన్నాళ్లు కూలీ పనులు చేసి ఆ తర్వాత ఈజీ మనీ వేటలో పడ్డారు. ఈనెల 15న పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌ చోరీ చేసి ల్యాప్‌టాప్, హార్డ్‌ డిస్క్‌ నొక్కేశారు. 19 రాత్రి రాజేంద్ర నగర్‌, హసన్‌ నగర్‌కు చెందిన బట్టల వ్యాపారి షేక్‌ అబ్దుల్‌ ఖదీర్‌ ఎత్తుకెళ్లి మూసీ నాలాలో పైశాచికంగా దాడి చేసి హతమార్చారు. అతని వద్ద సెల్‌ఫోన్, 200 రూపాయలు మాత్రమే దొరికాయి.

20న ఎంజీబీఎస్‌లో మరో అటాక్..
బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వీరి కదలికలపై నిఘా పెంచారు. ఎంజీబీఎస్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తే డొంకంతా కదిలింది. వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. పట్టుబడ్డ వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

13:49 - July 27, 2016

ఢిల్లీ : కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి అని యువతకు గొప్ప సందేశం ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం మనల్ని వదిలివెళ్లి సంవత్సరం గడిచిపోయింది. కానీ ఆయన దేశానికి చేసిని సేవలు, సందేశాలు నాటికి, నేటికి చిరస్మరణీయమే. నేడు కలాం ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని మైలురాళ్లు మీ కోసం. మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం ఈ లోకాన్ని విడిచిపెట్టి అప్పుడే సంవత్సరం అయింది. చెన్నై రామేశ్వరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి.. పేపర్ బాయ్‌ నుంచి భారతదేశాధ్యక్షుడి దాకా సాగిన ఆయన జీవిత ప్రయాణం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అరుదైన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, భారత యువతకు మార్గ దర్శకులయ్యారు.

ఆయన బిరుదు మిషైల్ మెన్ ఆఫ్‌ ఇండియా..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టా పొందిన కలాం ఆ తర్వాత వడివడిగా స్పేస్ శాస్త్రవేత్తగా తనదైన ముద్రవేశారు. కొత్త కొత్త ఆలోచనలతో అగ్రదేశాలకు ధీటుగా భారతదేశాన్ని స్పేస్ రంగంలో నిలిపారు. అందుకే ఆయనని ది మిషైల్ మెన్ ఆఫ్‌ ఇండియా అని పిలిచేవారు.

ఇగ్నై టెడ్ మైండ్స్, యూఆర్ బోర్న్ టు బ్లోసమ్ రచనలు..
అబ్దుల్ కలాం జీవితంలో స్ఫూర్తిదాయకమైన ఉదంతాలెన్నో ఉన్నాయి. ఆయన రచించిన ది వింగ్స్ ఆఫ్ ఫైర్, మై జర్నీ, ఇగ్నై టెడ్ మైండ్స్, యూఆర్ బోర్న్ టు బ్లోసమ్ వంటి రచనలు భారత యువతరంపై పెద్ద ప్రభావం చూపాయి. ఆయన ఆఖరి రచన ట్రాన్సండెన్స్ కలాం మరణానంతరం విడుదల అయింది.. యువతే జాతి సంపదగా, భారత భవిష్యత్‌ను నిర్మించగలరని ఆయన కలలు కన్నారు.

షిల్లాంగ్ విద్యార్థుల ముందు ప్రసంగిస్తూ కన్నుమూత..
ఉద్యోగాన్వేషణలో తొలి ప్రయత్నంలో విఫలమైన ఏ మాత్రం పట్టు సదలకుండా పోరాటం కొనసాగించారు.. టీచింగ్ అంటే ఎంతో ఇష్టపడే మిషైల్ మెన్ చివరకు 2020 టెక్నాలజీ విజన్ విజయవంతం కావాలని 2015 జూలై 27న మేఘాలయలోని షిల్లాంగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కన్నుమూశారు. నేడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు టెన్‌ టీవీ ఘనంగా నివాళులర్పిస్తుంది.

13:39 - July 27, 2016

ఢిల్లీ : కర్ణాటకు చెందిన మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్‌, చెన్నైకు చెందిన క్లాసికల్ మ్యూజిషియన్ టీఎమ్ క్రిష్ణా అనే ఇద్దరు భారతీయులను 2016 రామన్ మెగసేసే అవార్డ్ వరించింది. వీరితో పాటూ మరో నలుగురు విదేశీయులను అవార్డు వరించింది. బెజ్వాడా విల్సన్ కర్ణాటకలోని ఒక దళిత కుటుంబంలో పుట్టి పెరిగారు. దళితుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడారు. సఫాయి కర్మచారి ఆందోళన్ సంస్థకు జాతీయ కన్వీనర్ గా ఉన్నారు. ఇక టీఎమ్ కృష్ణ చెన్నైకు చెందిన వ్యక్తి. ప్రముఖ సంగీత కళాకారుడు. వందల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చిన అతని తల్లి నుంచి వారసత్వంగా శాస్త్రీయ సంగీతాన్ని అందిపుచ్చుకున్నారు. ఫిలిపిన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసేసే పేరుతో ఆసియాలో ప్రజలకు అత్యుత్తమ సేవచేసే వారికి ఈ అవార్డును ప్రతి సంవత్సరం అందజేస్తారు.

13:31 - July 27, 2016

కర్నూలు : క్షణికావేశంలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయుడు తిట్టాడని..మందలించాడని..స్నేహితుడు అవమానించాడని..ఇలా రకరకాల కారణాలతో సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలులో ఇంటర్‌ విద్యార్థి సందీప్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సందీప్‌ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ బిడ్డ ఆత్మహత్యకు ఉపాధ్యాయుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సందీప్‌కు కళ్లు సరిగా కనిపించవంటూ టీచర్లు వేధించేవారని పేర్కొన్నారు.

13:28 - July 27, 2016

ఢిల్లీ : మల్లన్న సాగర్‌ నిర్వాసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.. ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.. ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.. పులిచింత ప్రాజెక్ట్‌కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు 28 గ్రామాల్ని ముంచారని ఆరోపించారు. పులిచింతల ద్వారా తెలంగాణకు చుక్క నీరు రాదని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరూ సహకరించాలని, మల్లన్న సాగర్ అవసరం లేదని చెప్పడం అజ్ఞానమే అవుతుందన్నారు. అమరావతికోసం టీడీపీ ప్రభుత్వం 50వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తోందని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ ను ఏపీ నేతలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపీలో పోలవరం నిర్మాణం కింద ఏడు మండలాలు మునిగిపోతున్నాయని, లక్షా 20 వేల మందికిపైగా నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు.

 

13:25 - July 27, 2016

ఢిల్లీ : గోసంరక్షణ పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం రాజ్యసభలో రగడ జరిగింది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానాల్లో జరిగిన దాడుల అంశాన్ని బీఎస్పీ సభ్యురాలు మాయావతి ప్రస్తావించారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు కూడా ఇదే అంశంపై చర్చకు పట్టుపట్టడంతో కొద్దిసేపు సభా కార్యక్రమాలు స్తంభించాయి. నోటీసు ఇస్తే చర్చ అంశాన్ని పరిశీలిస్తానని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ప్రకటించి జీరో అవర్‌ చేపట్టడంతో బీఎస్‌పీ, కాంగ్రెస్‌ సభ్యుల శాంతించారు.

 

13:20 - July 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌-2 లీకేజీ మూలాలు ఏపీలో ఉన్నాయని సీఐడీ అనుమానిస్తోంది. కృష్ణా, ప్రకాశం జిల్లాలో పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. మధ్యవర్తి రమేష్‌ విచారణలో నిజాలు రాబడుతున్న సీఐడీ పోలీసులు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఖాసింను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఖాసింకు ఎంసెట్‌-2 లీకేజీతో సంబంధంముందని అంటున్నారు. ఖాసిం రమేష్‌కు దగ్గరి బంధువుగాను తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు తెలంగాణ సీఐడీ అధికారులు బుధవారం ఉదయం చేరుకున్నారు. కనిగిరిలో ఖాసీంను విచారించారు. మూడు గంటల పాటు విచారించిన అనంతరం ఖాసీంను స్వగ్రామంలో వదిలేశారు. తమపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు విచారించారని టెన్ టివితో ఖాసీం పేర్కొన్నారు. లీకేజీ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ యోచిస్తోంది. కందుకూరుకు చెందిన రమేష్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

రేపు అరెస్టు..
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2 లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. దయాకర్ తో పాటు కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంసెట్ -2 లీకేజ్ లో కీ రోల్ పోషించిన రమేష్ ఎవరెవరిని కలిశాడు ? అనే దానిపై సీఐడీ దృష్టి సారించింది. కాల్ డేటా, జేఎన్టీయూ ఇచ్చిన వివరాలపై దర్యాప్తు ముమ్మరం అధికారులు చేపట్టారు. రేపటికి అందర్నీ అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టాలని సీఐడీ భావిస్తోంది. ఎంసెట్ రద్దు చేయాలా ? ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ర్యాంకులను రద్దు చేయాలా ? అనే దానిపై సీఐడీ యోచిస్తోంది. గురువారం సాయంత్రంలోగా ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తారని తెలుస్తోంది.

ఎన్ఎస్ యుఐ చలో క్యాంపస్ బస్సు యాత్ర..

హైదరాబాద్ : ఎన్ఎస్ యు ఐ చేపట్టిన చలో క్యాంపస్ బస్సు యాత్రను కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. పది జిల్లాలోని క్యాంపస్ లను ఎన్ఎస్ యుఐ సందర్శించనుంది.

పశ్చిమలో వంద కిలోల గంజాయి స్వాధీనం..

పశ్చిమగోదావరి : ఏలూరు మండలం కలపర్రు వద్ద టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. విశాఖ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు.

ప్రకాశంలో కర్మాగారం నుండి గ్యాస్ లీక్..

ప్రకాశం : జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో సీ ఫుడ్స్ కర్మాగారం నుండి అమ్మోనియం గ్యాస్ లీకైంది. దీనితో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీక్ ఘటనపై పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

 

దేవుడిచ్చిన వరం - కలాం డూప్..

ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాగా ఉండడం తనకు దేవుడిచ్చిన వరమని అచ్చు కలాంలాగా ఉండే షేక్ పేర్కొన్నారు. నేడు మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం తొలి వర్ధంతి సందర్భంగా ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు.

12:55 - July 27, 2016

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇటీవల అశ్విన్ వెనుకబడిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనలో అశ్విన్ అద్భుత ఆటతీరు కనబరుస్తూ వస్తున్నాడు. తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో వికెట్లు తీయడంలో అశ్విన్ వెనుకబడ్డాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో విశేషంగా రాణించాడు. ఏడు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు. ఈ నేపథ్యంలో పాయింట్లు మెరుగుపరచుకొని అశ్విన్ మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబడ్డాడు. ఇదిలా ఉండగా టెస్ట్ బౌలర్ల విభాగంలో మరో భారత స్పిన్నర్ జడేజా 6వ స్థానంలో నిలవగా.. ఇషాంత్ శర్మ 20 వ స్థానంలో ఉన్నాడు.

12:47 - July 27, 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. విదేశాల్లో సైతం ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజం పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'కబాలి' అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్ర విజయం..ఇతరత్రా విషయాలపై రజనీ స్పందించలేదు. గత రెండు నెలలుగా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన సంగతి తెలిసిందే. దీనితో రజనీపై అనేక రూమర్స్ వినిపించాయి. ఆయనకు ఆరోగ్యం బాగా లేదని..అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని..ఇలా అనేక వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు రజనీ చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా రజనీ తన అభిమానుల కోసం సందేశం పంపారు.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో 2.0' షూటింగ్..మరోవైపు 'కబాలి' షూటింగ్ తో తాను శారీరకంగా..మానసికంగా అలసిపోయినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడానికి కూతురు ఐశ్వర్యంతో కలిసి అమెరికా వెళ్లడం జరిగిందన్నారు. అక్కడే ఆరోగ్యానికి సంబంధించిన చెకప్స్ చేయించుకోవడం జరిగిందని, ప్రస్తుతం తాను ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించారు. కబాలి గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని, నిర్మాత థానుకి, దర్శకుడు రంజిత్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇంతటి ఘనవిజయం అందించినందుకు అభిమానులకు, మీడియాకు, డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు రజనీ సందేశంలో పేర్కొన్నారు.

వారు తిన్నది గేదె మాంసం - మంత్రి భూపేందర్ సింగ్..

మధ్యప్రదేశ్ : ఓ రైల్వే స్టేషన్ లో బీఫ్ తింటున్నారనే నెపంతో ఇద్దరు మహిళలపై హిందూ దళ్ నేతలు జరిపిన దాడి కలకలం రేపుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి భూపేందర్ సింగ్ స్పందించారు. వారు తిన్నది ఆవు మాంసం కాదని గేదె మాంసమన్నారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు.

విద్యాశాఖాధికారులతో మంత్రి గంటా సమావేశం..

విజయవాడ : విద్యాశాఖ అధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్షించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. పుష్కరాలకు విద్యాశాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన సమీక్ష జరిపారు

వైసీపీలో గుర్తింపు లేదు - ఎమ్మెల్సీ ఆదిరెడ్డి..

రాజమండ్రి : వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మనోవేదనతోనే టీడీపీలో చేరానని, చంద్రబాబుతోనే రాష్ట్రం పురోగతి చెందుతుందని ఆయన అన్నారు.

 

మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం - బూర

ఢిల్లీ : మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరూ సహకరించాలని, మల్లన్న సాగర్ ను ఏపీ నేతలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ నేతలు 28 గ్రామాలను ముంచారని గుర్తు చేశారు. పులిచింతల ద్వారా తెలంగాణకు చుక్క నీరు రాదని తెలిపారు. మల్లన్న సాగర్ అవసరం లేదని చెప్పడం అజ్ఞానమే అవుతుందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణం కింద ఏడు మండలాలు మునిగిపోతున్నాయని, లక్షా 20 వేల మందికిపైగా నిర్వాసితులయ్యారని పేర్కొన్నారు.

12:17 - July 27, 2016

డైరెక్టర్ క్రిష్ కు వివాహ గడియలు సమీపిస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ని ఆయన తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వివాహానికి సమయం దగ్గర పడుతుండడంతో చిత్రానికి బ్రేక్ ఇచ్చారు. ఆగస్టు 8 వ తేదీ తెల్లవారుఝామున 2. 28 నిముషాల సుముహార్తాన క్రిష్, డాక్టర్ రమ్యలు ఒకటి కానున్నారు. ఈ వివాహం పెద్దల అనుమతితో నిశ్చయింపబడింది. ఈ వివాహాన్ని హైదరాబాద్ గండిపేట దగ్గరలో గల గోల్కొండ రిసార్ట్ లో జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయినట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు విచ్చేస్తారని తెలుస్తోంది.
ఇటీవలే క్రిష్‌, డాక్టర్‌ వెలగ రమ్యతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ట్రిడెంట్‌ హోటల్‌లో నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి సతీసమేతంగా బాలకృష్ణ, అల్లుఅర్జున్‌, రానాతోపాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ముజఫరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత..

ముజఫరాబాద్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముజఫరాబాద్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలో 21వ తేదీన ఎన్నికలు జరుగగా, ఐఎస్ఐ, తాము ఓట్లేయకుండా చేసి, రిగ్గింగ్ చేసి విజయం సాధించిందని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు.

విపక్షాలవి కుట్రపూరిత రాజకీయాలు - నిరంజన్ రెడ్డి..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పనితీరును దేశమంతా ప్రశంసిస్తుంటే ఇక్కడి విపక్షాలు మాత్రం కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడమే విపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు.

 

అసంతృప్తితో ఉన్నాం - సుజనా..

ఢిల్లీ : రాజ్యసభలో ప్రధాని హామీని కేంద్రం అమలు చేయాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి డిమాండ్ చేశారు. బిల్లుకు టిడిపి మద్దతు ప్రకటిస్తుందని, అనుకూలంగా ఓటేస్తామన్నారు. ఏపీకి ఇచ్చిన విషయాలపై బ్యాలెన్స్ షీట్ బయటపెడుతామని, ఆర్థిక, హోం శాఖలు సమాధానం చెప్పాలన్నారు. రెండేళ్లలో కొన్ని విషయాలపై అసంతృప్తితో ఉన్నామని, మిత్రధర్మం పాటిస్తుందో లేదో బీజేపీ యే చెప్పాలన్నారు.

రాజ్యసభలో గందరగోళం..

ఢిల్లీ : బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే దళితుల అంశంపై చర్చించాలంటూ బీఎస్పీ డిమాండ్ చేసింది. దీనికి డిప్యూటి ఛైర్మన్ కురియన్ అంగీకరించలేదు. దీనితో విపక్షాలు ఆందోళన చేశాయి.

11:36 - July 27, 2016

ఢిల్లీ : 'మోడీది దళిత వ్యతిరేక సర్కార్...దళితుల అంశంపై చర్చించాలి' అనే నినాదాలు రాజ్యసభలో మిన్నంటాయి. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే దళితుల అంశంపై చర్చించాలంటూ బీఎస్పీ డిమాండ్ చేసింది. దీనికి డిప్యూటి ఛైర్మన్ కురియన్ అంగీకరించలేదు. జీరో అవర్ ఉంటుందని, సభ్యులు చాలా మంది అనేక అంశాలు లేవనెత్తారని తెలిపారు. బీఎస్పీ సభ్యులకు తోడుగా కాంగ్రెస్ సభ్యులు నిలిచారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. దళిత వ్యతిరేక సర్కార్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీనితో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెనక్కి వెళ్లాలని డిప్యూటి ఛైర్మన్ పలుమార్లు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ జోక్యం చేసుకున్నారు. తాము గో సంరక్షణకు వ్యతిరేకం కాదని, గో సంరక్షణ పేరిట దళితులపై దాడులు సరికాదని పేర్కొన్నారు. ఆజాద్ ఆరోపణలపై కేంద్ర మంత్రి నఖ్వీ స్పందించారు. హింస, అరాచకం జరిగితే ఖండించాల్సిందేనని, దీనిని సమర్థించే అవకాశం లేదన్నారు. విపక్షాలు పేర్కొంటున్న ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరుపుతోందని, దోషులను శిక్షిస్తుందని పేర్కొన్నారు. దళితులు..వెనుకబడిన వారి అభ్యున్నతికి తాము కృషి చేయడం జరుగుతుందన్నారు. కానీ ప్రతిపక్షాలు ఇలా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ప్రకటన పట్ల ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. మన్ కీ బాత్ నిర్వహించడం కాదని, రాజ్యసభ కు వచ్చి మన్ కీ బాత్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంసెట్ 2 లీక్..ప్రకాశంలో ఒకరి అరెస్టు..

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజ్ పై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఖాసింను తెలంగాణ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ కు ఖాసీం దగ్గరి బంధువని, ఖాసింకు ఎంసెట్ 2 లీకేజ్ తో సంబంధం ఉందని సీఐడీ పేర్కొంది.

చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కనీస సౌకర్యాలు లేక, పారిశుధ్యం లోపంతో ఇబ్బందిగా ఉందని 40 మంది యువకులు బిల్డింగ్ పైకి నిరసన తెలిపారు.

 

11:15 - July 27, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా, ఇతర హామీలపై కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకు బుధవారం ఏపీ భవన్ లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. భేటీ అనంతరం మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది ? ఏం చేయాలనే దానిపై చెబుతామని పేర్కొన్నారు. ఎప్పుడు చేస్తారని ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై సభలో ప్రస్తావిస్తే కాంగ్రెస్ అడ్డు తగిలిందన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరుస్తామని ఆనాడు చెప్పారని, అందులో కొన్ని మాత్రమే చేశారని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.

 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో కేపీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై మళ్లీ రగడ నెలకొనే అవకాశ ఉంది.

ఆప్ ఎమ్మెల్యేకు జ్యుడిషియల్ కస్టడి..

ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఆగస్టు 1వ తేదీ వరకు కస్టడీ విధించింది. మహిళ పట్ల అసభ్యంగా ... ఖురాన్‌-ను కించపరిచారనే ఆరోపణపై ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

విచారణకు హాజరు కానున్న ఫిలిం క్లబ్ ప్రతినిధులు..

హైదరాబాద్ : పోలీసుల ఎదుట విచారణకు ఫిలిం క్లబ్ ప్రతినిదులు రామారావు, రాజశేఖరరెడ్డిలు హాజరు కానున్నారు. భవనం కూలిన ఘటనలో రామారావు, రాజశేఖరరెడ్డిలను పోలీసులు విచారించనున్నారు.

ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశం..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. వివిధ రంగాల్లో తీసుకరావాల్సిన నూతన విధానాలు, పథకాల్లో మార్పులు..చేర్పులు తదితరాలపై చర్చించేందుకు నీతి అయోగ్ బుధవారం ఒక రోజు సదస్సును నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రణాళిక శాఖ కార్యదర్శులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది.

బాలానగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : బాలానగర్ లోని రాజ్ కాలనీ లో హరిణి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపించారు. బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

10:48 - July 27, 2016

అమెరికా : అమెరికన్‌ స్కై డైవింగ్‌ స్పెషలిస్ట్‌ సీన్‌ మ్యాకర్‌మేక్‌ ఆకాశంలో పెద్ద సాహసమే చేశాడు. ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ మేయర్స్‌ సముద్రతీరానికి రెండు మైళ్ల దూరంలో, ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్దరిల్లే సమయంలో...డైవింగ్‌ చేయడమే కష్టం, అలాంటిది మ్యాకర్‌మేక్‌ సర్ఫింగ్‌ చేసి వారెవ్వా అనిపించాడు. అలలపై చేసే సర్ఫింగ్‌....ఆకాశంలో చేస్తే ఎలా ఉంటుంది. ఇటువంటి వింత ఆలోచన అలా వచ్చిందో లేదో అమెరికన్‌ స్కై డైవింగ్‌ స్పెషలిస్ట్‌ సీన్‌ మ్యాకర్‌మేక్‌ ఏకంగా మేఘాలపై సర్ఫింగ్‌ చేసేశాడు.

పెద్ద సాహసం..
ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ మేయర్స్‌ సముద్రతీరానికి రెండు మైళ్ల దూరంలో సీన్‌ మ్యాకర్‌మేక్‌ ఆకాశంలో పెద్ద సాహసమే చేశాడు. ప్రతికూల వాతావరణంలోనూ సర్ఫింగ్‌ బోర్డ్‌పై గంటకు 130 మైళ్ల వేగంతో మేఘాలపై దూసుకుపోయాడు. ఏ మాత్రం తడబడకుండా....ఎక్కడా భయపడకుండా అనుకున్నది చేసి చూపించాడు.సముద్ర మట్టానికి రెండు వేల మీటర్ల ఎత్తులో మ్యాకర్‌మేక్‌ చేసిన ఈ స్టంట్‌ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. చూస్తేనే ఇలా ఉందంటే మరి రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా ఈ డేర్‌డెవిల్‌ ఫీట్‌ ప్రదర్శించిన సీన్‌ మ్యాకర్‌మేక్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆకాశంలో సర్ఫింగ్‌ చేసిన తొలి డైవర్‌గా మ్యాకర్‌మేక్‌ ప్రపంచరికార్డ్‌ నమోదు చేశాడు.

10:45 - July 27, 2016

అమెరికా : అధ్యక్ష ఎన్నికకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి.. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌... రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో పోటీపడబోతున్నారు. ఇప్పటికే పార్టీనుంచి అధికారికంగా నామినేషన్‌ను స్వీకరించిన హిల్లరీ... అమెరికా అధ్యక్ష ఎన్నికకు పోటీపడనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శాండర్స్‌ను అధిగమించి 2వేల 383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు.

పలువురు మద్దతు...
డెమోక్రటిక్‌ నేతలంతా హిల్లరీ క్లింటన్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. నాలుగు రోజుల పార్టీ సదస్సులో డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలపై మండిపడ్డారు. అధ్యక్ష నామినేషన్‌కు హిల్లరీతో పోటీపడిన బెన్నై శాండర్స్‌కూడా హిల్లరీ వైపే నిలిచారు. విద్వేషాలు నింపుతున్న ట్రంప్‌ మాయలో అమెరికన్లు పడరని చెప్పారు. ఉపాధి... వాణిజ్య రంగాలను ట్రంప్‌ నాశనం చేస్తారని విమర్శించారు.

మిషెల్ ఒబామా ప్రసంగం..
డెమోక్రాట్ల సదస్సులో మిషెల్‌ ఒబామా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అమెరికా గొప్పదేశం కాదని ఎవరు చెప్పినా అంగీకరించొద్దని మిషెల్‌ సూచించారు. బానిసలు నిర్మించిన శ్వేతసౌధంలో తాను నిద్రిస్తున్నానంటూ ఉద్విగ్నంగా మాట్లాడారు. అమెరికాలోని వైవిధ్యాన్ని చాటుతూ ఉదాహరణలు వివరిస్తూ మిషెల్‌ ప్రసంగించారు. హిల్లరీ మాత్రమే తదుపరి అమెరికా అధ్యక్షురాలు కావడానికి అర్హురాలని చెప్పారు. మిషెల్‌ ఉపన్యాసాన్ని ఒక గొప్ప మహిళ చేసిన అద్భుత ప్రసంగమని బరాక్‌ ఒబామా ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగబోతున్నాయి.

10:42 - July 27, 2016

నల్గొండ : స్కూల్ బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. ఫిట్ మెంట్ లేని బస్సులను నడిపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలే ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. నల్లగొండ జిల్లా పెద్దాపూర మండలం లింగంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. హలియాలోని కృష్ణావేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

10:40 - July 27, 2016

నల్గొండ : భారీ వర్షాలు రైతులు, మత్స్యకారులను నట్టేటముంచాయి. నల్లగొండ జిల్లా పోచంపల్లిలో మండలం రేవనపల్లి చెరువుకు గండిపడి చేపలన్నీ కొట్టుకుపోయాయి. మత్స్యకారులకు దాదాపు 30లక్షల రూపాయలవరకూ నష్టం జరిగింది. వరదలకు మూడువందల ఎకరాల్లోని పంటపొలాలుకూడా నీటమునిగాయి. దీనితో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కలాం చిరంజీవి - వెంకయ్య...

తమిళనాడు : అబ్దుల్ కలాం ఆలోచనలు, కలలను సాకారం చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. దేశ ప్రజల హృదయాల్లో అబ్దుల్ కలాం ఎప్పుడూ చిరంజీవిగా ఉంటారని పేర్కొన్నారు. కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని ఆయన స్వస్థలమైన పేయ్ కరుంబు ప్రాంతంలో జరిగాయి. ఈ సందర్భంగా ఏడడగుల ఆయన కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు.

10:21 - July 27, 2016

ఆదిలాబాద్ : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అడవుల జిల్లాగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు వరదనీరు పోటెత్తుతుండడంతో..ముంపు గ్రామాల్లోని స్థానికులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. రోడ్డున పడ్డ తమను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదంటూ ముంపు గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను 144.7 మీటర్లకు వరద నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో రెండువేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

భయంతో వణికిపోతున్న ముంపు గ్రామస్తులు..
ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో గంట గంటకు నీటి ఉధృతి పెరుగుతోంది. అయితే..ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామాల్లోకి వరదనీరు వస్తుండడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ముంపుగ్రామాల ప్రజలకు ఇంటి స్థలాలను కేటాయించకపోవడంతో..వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వరదనీరు గ్రామాల్లోకి వస్తుండడంతో విషప్రాణుల భయంతో వణికిపోతున్నారు. ఆపదలో ఉన్న తమను స్థానిక ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తమ సమస్యలను పరిష్కరించాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. వరద ముంపు నుంచి తక్షణమే రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

బెజ్వాడ విల్సన్ కు రామన్ మెగాససే అవార్డు..

ఢిల్లీ : 2016 సంవత్సరానికి గాను రామన్ మెగాససే అవార్డు ఇద్దరికి వరించింది. బెజ్వాడ విల్సన్, టిఎం కృష్ణలకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండచరియలు..

ఉత్తరాఖండ్ : గన్సాలీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీనితో పోలీసులు పలు నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు. కొండచరియలు విరిగిపడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

10:07 - July 27, 2016

విజయవాడ : కొత్త రాజధానిలో పాలన మొదలుపెట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. ఉద్యోగుల తరలింపుతో పాటు..వివిధ శాఖలకు సంబంధించిన చాంబర్స్‌ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. అమరావతిలో సౌర్యాలు ఇంకా అరకొరగానే ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌ 27 నుంచి పాలన మొత్తం కొత్తరాజధాని అమరావతి నుంచే జరగాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయం..ఆచరణలో మాత్రం వెనుకడుగేస్తోంది. కొత్తరాజధానిలో సౌకర్యాల కొరత..ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

సౌకర్యాలలేమి.. తిరిగొస్తున్న శాఖలు..
ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన ప్రత్యేక ఫ్లోర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌ నెల 29 నాటికి అన్ని బ్లాకుల నిర్మాణం పూర్తిఅయి భవనం అందుబాటులోకి వస్తుందనుకున్నారు. కాని... ప్రస్తుతం నిర్మాణపనులు చూస్తే మాత్రం ఇప్పట్లో పనులు కంప్లీట్‌ అయ్యే సూచనలు ఏమాత్రం కనిపంచడంలేదు. మరోవైపు ప్రభుత్వశాఖల తరలింపు కూడా అసంబద్ధంగా మారింది. సరైన సౌకర్యాలు లేక... తరలించిన డిపార్ట్‌మెంట్లుకూడా మళ్లీ తిరిగి హైదరాబాద్‌ ముఖం పట్టాయి. దీంతో అమరావతిలో శాసనసభావర్షాకాల సమావేశాల నిర్వహణ అనుమానంగా మారింది.

వర్షాకాల సమావేశాలు ఇక హైదరాబాద్‌లోనే..!
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే..ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుని పనిచేయాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, ఇతరసిబ్బంది ప్రతిక్షణం అందుబాటులో ఉండాలి. వీరితోపాటు ప్రభుత్వ ప్రింటింగ్‌ప్రెస్‌ అవసరం చాలా ఉంటుంది. అసెంబ్లీ అవసరాలకోసం వివిధ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన లేఖలు, బిల్లులు ఎప్పటికపుడు ముద్రించాల్సి ఉంటుంది. కాని..ప్రస్తుతం అమరావతిలో ఇలాంటి సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో వర్షాకాల సమావేశాలను ఇక హైదరాబాద్‌లోనే నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

నేడు ఆలేరు బంద్ కు అఖిలపక్షం పిలుపు..

నల్గొండ : ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆలేరును రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ నేడు పట్టణ బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.

విరిగిన స్కూల్ బస్సు స్టీరింగ్ రాడ్..

నల్గొండ : పెద్దవూర (మం) లింగపల్లి వద్ద ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరగడంతో అదుపుతప్పి పొలాల్లోకి కృష్ణవేణి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

రేవన్ పల్లిలో చెరువుకు గండి...

నల్గొండ : పోచంపల్లి (మం) రేవన్ పల్లిలో చెరువుకు గండి పడింది. 600 ఎకరాల పంట నీట మునిగింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..

ఆదిలాబాద్ : గడ్డెన్నవాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 5వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 7,220 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 358.6 అడుగులుగా ఉంది.

09:34 - July 27, 2016

చెన్నై : తమిళనాడులోని ఓ షుగర్‌ ఫ్యాక్టరీలో దాదాపు వెయ్యి పాములు జనాల్ని బెంబేలెత్తించాయి.. చెన్నై సమీపంలోని పట్టాలంలో సహకార చక్కెర కర్మాగారం కొన్నేళ్లుగా మూతబడింది. ఆ తర్వాత ప్రారంభమైనా చుట్టూ చెట్లు ఉండటంతో పాముల సంఖ్య పెరిగింది. వీటిని చూసిన కార్మికులు కంపెనీలోకి వెళ్లాలంటేనే భయపడిపోయారు. ఈ సమస్యపై స్పందించిన యాజమాన్యంపాముల్ని బయటకు పంపేందుకు అటవీశాఖ సహాయం కోరింది. పాముల్ని పట్టుకునేందుకు కంపెనీలోకి వచ్చిన అటవీ అధికారులు గిరిజనుల సహకారంకూడా తీసుకున్నారు. రెండు రోజుల పాటు కర్మాగారం అంతా గాలించి వెయ్యికిపైగా పాముల్ని పట్టుకున్నారు.

 

09:32 - July 27, 2016

హైదరాబాద్ : దాదాపు 6 రోజుల అవుతోంది.. అసలు ఉన్నారో లేదో తెలియదు..గాలింపు చర్యలు వేగంగా సాగుతున్నాయి. కానీ, ఫలితం మాత్రం కనిపించడం లేదు. తమ వాళ్లు వస్తారో రారో అన్న అందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. నేతలు ఓదార్పులు సాగుతున్నా బాధితుల కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. కనిపించకుండా పోయిన ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌-32 విమానంలో గల్లంతైన ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆవేదన ఇది.

విశాఖకు చెందిన 7మంది ఎన్ఏడీ ఉద్యోగులు..
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 మోడల్ విమానం ఆరు రోజుల క్రితం చెన్నై నుంచి పోర్ట్ బ్లేయిర్ వెళ్తుండగా..కనిపించకుండా పోయింది. ఆ విమానంలో 29 మంది ఎన్ఏడీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో విశాఖకు చెందిన 7 మంది ఎన్ఏడీలో పని చేస్తున్నారు. విమానం ఆచూకీ గల్లంతైనప్పటి నుంచీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అన్నపానీయాలుమాని తమవారి రాకకోసం ఎదురుచూస్తున్నారు.

1984లో రష్యా నుంచి విమానం కొనుగోలు..
ఏఎన్-32 మోడల్ విమానాన్ని 1984లో రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఇలాంటివి మన ఏయిర్ వేస్‌లో దాదాపు 120కి పైగా ఉన్నాయి. అయితే కొద్దికాలంగా పోర్ట్ బ్లేయిర్‌లో ఉన్న నేవల్‌బేస్‌లో ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి విశాఖ నెవల్ అర్బన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగులు వెళ్తుంటారు. విమానంలో బయలు దేరిన వారిలో విశాఖకు చెందిన నమ్మి చిన్నారావు, వరప్రసాద్, నాగేంద్ర, గంటా శ్రీనివాస్, సాంబమూర్తి, చరణ్‌ మహారాణా, భూపేంద్ర సింగ్ ఉన్నారు. ఆరు రోజులగా వీరి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు...
విమానం ఆచూకీ కోసం భారత్‌తో సహా శ్రీలంక, మలేషియాకు చెందిన నేవీ విభాగాలు సంయుక్తంగా గాలింపు చేపడుతున్నాయి. దాదాపు 20 విమానాలు, ఇతర నౌకలు సబ్‌మెరిన్ లాంటి వాటితో విస్త్రతంగా గాలింపు జరుపుతున్నా..విమానం జాడ మాత్రం కనిపించడం లేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. అసలు వాళ్లు బతికి ఉన్నారా..? లేక చనిపోయారా..? అనే విషయం తెలియక కుమిలిపోతున్నారు. తమ వారికి ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోతున్నారు.

విచారణ చేపట్టాలన్న సీపీఎం...
ఈ ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. టెక్నికల్‌ సమస్య వల్ల జరిగిందా..? లేక ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. విమానం గల్లంతుపై రక్షణశాఖ మంత్రి మనోహార్‌ పారికర్‌ రాజ్యసభలో వివరణ ఇచ్చారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగంగా చేపడుతున్నామని చెప్పారు. మొత్తంగా విమానం గల్లంతుతో బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్నారు. మరోవైపు విమానం గల్లంతుపై దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది.

09:28 - July 27, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు కాక రేపుతోంది. ప్రైవేటు బిల్లు ద్రవ్య వినిమయ బిల్లు అని కేంద్ర మంత్రి జైట్లీ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జులై 22వ తేదీన శుక్రవారం తరువాత జరుగుతున్న పరిణామాలతో రాజ్యసభ వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఆందోళన చేపడుతోంది. ఓటింగ్ కు పట్టుబడుతోంది. విభజన విషయంలో పేర్కొన్న అంశాలపై అమలు చేయడంలో బీజేపీ వెనుకంజ వేస్తోందని విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో ఎలా వ్యవహరించాలనే దానిపై టీడీపీ ఎంపీలు తర్జనభర్జనలు పడుతున్నారు. బుధవారం ఏపీ భవన్ లో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా సాధనపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లులో ఆర్థిక అంశాలు ఉన్నాయని చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీలు..ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు. మరి వారు ఎమి నిర్ణయించారో కొద్దిసేపట్లో తెలుస్తుంది.

09:23 - July 27, 2016

హైదరాబాద్ : ఎంసెట్ -2 రద్దు చేస్తారా ? అసలు ఏం జరుగుతోంది ? లీకు వీరులు ఎవరు ? ఇలా అనేక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.. లీకేజీపై ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం సేకరించిన అధికారులు ,మధ్యవర్తుల అరె్‌స్టకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఇవాళ్టి నుంచి విద్యార్థులను విచారణ చేయాలని నిర్ణయించారు. పేపర్‌ లీకేజీ అటు తల్లిదండ్రులను మోసం చేసిన అభియోగాలపై కూడా కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు. పరీక్షలో ర్యాంకు, కాలేజీలో సీటు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్ద మొత్తంలో డీల్‌ కుదుర్చుకుని కొందరి నుంచి అడ్వాన్సు తీసుకోవడాన్ని చీటింగ్‌గా పరిగణిస్తున్న అధికారులు.. వారిపై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రశ్నించే సమయంలో ఎవరూ అడ్డు చెప్పకుండా ఉండేందుకు తమకు సెర్చ్ వారెంట్ ఇవ్వాలని కోర్టును సీఐడీ అభ్యర్థించింది. ఉదయం సమయంలో దీనిపై కోర్టు అభిప్రాయం తెలియచేయనుంది.

పలువురికి నోటీసులు..
ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో కొంతమంది మధ్యవర్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసి తదుపరి సమాచారం రాబట్టేందుకు సిద్ధమవుతోంది సీఐడి. మధ్యవర్తులకు కొంత మొ త్తాన్ని అడ్వాన్సుగా చెల్లించినట్లు తేలడంతో బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించింది. దర్యాప్తులో కొత్త పేర్లు వెలుగులోకి రావడంతో వారిని విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లీకేజీ ఆరోపణలతో కౌన్సెలింగ్‌ వాయిదా పడడంతో దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్న అధికారులు మరో రెండు మూడు రోజుల్లో నిజాలు నిగ్గు తేల్చాలని నిర్ణయించారు.

09:15 - July 27, 2016

మమ్ముట్టి..మలయాళ సూపర్ స్టార్. త్రిపాత్రాభినయం ఆయనకు కొత్తేమీ కాదు. ఎన్నో చిత్రాల్లో ఆయన ఈ పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'పాలెరి మణిక్యమ్' సినిమాలో మమ్ముట్టి మూడు పాత్రలు పోషించారు. తాజాగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో కూడా త్రిపాత్రాభినయం చేయనున్నారు. గతంలో అన్వర్ తో కలిసి 'రాజమాణిక్యమ్', 'అన్నన్ తంబి' చిత్రాల్లో మమ్ముట్టి హీరోగా నటించారు. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. బెన్నీ పి నాయరం బాలమ్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం మమ్ముట్టి 'వైట్', 'తప్పిల్ జొప్పన్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల అనంతరం ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. మూడు పాత్రల్లో మమ్ముట్టి ఎలా మెరిపించారో తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాలి.

కలాం విగ్రహావిష్కరణ..

చెన్నై : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా రామేశ్వరంలో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పారికర్, రాధాకృష్ణన్ లు హాజరయ్యారు.

నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం..

ముంబై : లండన్ - ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల వల్లే విమానం నిలిచిపోయిందని తెలుస్తోంది.

08:53 - July 27, 2016

అల్లు శిరీష్..లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు క్రిష్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈనెల 31న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించాలని, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మెగస్టార్ చిరంజీవి రానున్నారు. దర్శకుడు పరుశురాంలో మంచి దర్శకుడే కాకుండా మంచి రైటర్ ఉన్నాడని క్రిష్ పేర్కొన్నారు. పరుశురాం అద్భుతంగా తెరకెక్కించారని, ప్రేక్షకులు ఏ మాత్రం నిరాశ చెందరని తెలిపారు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్క అబ్బాయి లావణ్య లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని, ప్రతి ఒక్క అమ్మాయి శిరీష్ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అనుకుంటారని దర్శకుడు పరుశురాం పేర్కొన్నారు. మంచి కథత్ో పాటు మంచి వినోదం ఉన్న చిత్రమిదమని, అందరి కష్టం తెరపై కనిపిస్తుందని హీరో శిరీష్ పేర్కొన్నారు.

సీఎం నివాసం వద్ద ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి..

ఛత్తీస్ గడ్ : సీఎం నివాసం ఎదుట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి చెందాడు. గత నెలలో రాయ్ పూర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

08:43 - July 27, 2016

ఉరుకుల పరుగుల జీవితాలు..ఇంట్లో దంపతులు ఇద్దరు ఉద్యోగులయితే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందులో ప్రధానంగా భోజన సమస్య. వంట వండుకోవడమే కొందరు మానేస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా మాత్రమే వండుతుంటారు. బయట దొరికే ఆహారాన్ని తీసుకొంటుంటారు. ఇంట్లో వండుకునే సమయమే ఉండటం లేదు చాలా మందికి. ఒకవేళ సమయమున్నా బద్దకిస్తున్నారు కూడా. హోటల్స్ లో భోజనం..కర్రీ పాయింట్ నుండి కర్రీలు తెచ్చుకోవడం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు ఇంటి ఆహారాన్ని తీసుకునేవారిలో మధుమేహం బారిన పడే ముప్పు 15శాతం వరకు తగ్గుతుందని తేలింది. ఆమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు... సంవత్సరాల తరబడి ఎంతోమంది ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని పరిశీలించి, అధ్యయనం చేసి వారు ఈ ఫలితాలను వెల్లడించారు. పెరుగుతున్న పని వత్తిడి..నిస్సహాయత..ఇవన్నీ బయట ఆహారపు అలవాట్లను మరింత పెరగడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. జేబుకు చిల్లు..శరీరానికి అనారోగ్యాలు. శుచి..శుభ్రత పరగా ఇంట్లోనే హాయిగా వండుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హానీ చేసే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండొచ్చు..

08:42 - July 27, 2016

ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటారు. ఎంతో బిజీగా ఉండడం వల్ల కొంతమంది త్వరగానే అలసిపోతుంటారు. మరికొందరు మాత్రం చలాకీగా ఉంటారు. ఎక్కువ పని చేయలేకపోయినా అలసినట్లు కనిపిస్తారు. వీరికి అధికశక్తి లేకపోవడమేనని కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. మరి అలసటకు దూరంగా ఉండేందుకు చిట్కాలు...
నిద్రించే ముందు ఓ గ్లాసు పాలు, ఓ అరటి పండు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు.
ఆకుకూరలను సూప్ విధానంలో తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా ఉంటుంది.
కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తినడం మానేయాలి.
జీర్ణక్రియను మెరుగుపరుచుకొనేందుకు కావాల్సినంత నీటిని సేవించండి.
ఆకుకూరలు ప్రతి రోజు ఒక పూట వాడాలి.

ఢిల్లీకి చేరుకున్న క్రీడాకారుడు నీరజ్ చోప్రా..

ఢిల్లీ : జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఢిల్లీలో అడుగు పెట్టారు. విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వరల్డ్ చాంపియన్ షిప్ లో నీరజ్ బంగారు పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

నేడు అబ్దుల్ కలాం ప్రథమ వర్థంతి..

చెన్నై : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు రామనాథపురం జిల్లా రామేశ్వరంలోని ఆయన స్వస్థలమైన పేయ్ కరుంబు ప్రాంతంలో బుధవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏడడగుల ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ప్రైవేటు బస్సులో మంటలు..ముగ్గురి మృతి..

ఢిల్లీ : పూణె : బెంగళూరు - పూణె జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీనితో ముగ్గురు చనిపోగా 8మందికి గాయాలయ్యాయి.

08:09 - July 27, 2016

ప్రకాశం : ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి చెన్నైకి బస్సు వెళుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. తెల్లవారాముజామున కావడంతో ప్రయాణీకులు నిద్ర మత్తులో ఉన్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీనితో మేల్కొన్న ప్రయాణీకులు ప్రాణాలు రక్షించుకొనేందుకు బస్సులో నుండి దిగిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షణాల్లో బస్సు మొత్తం అగ్నికి ఆహుతై పోయింది. బస్సులో నుండి ప్రయాణీకులు అందరూ దిగిపోగా వారికి సంబంధించిన లగేజీలు పూర్తిగా కాలిపోయాయి.
అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. బస్సు వేగానికి లారీ బోల్తా పడిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

07:32 - July 27, 2016

తెలంగాణలో హాట్‌హాట్‌గా మారిన మల్లన్నసాగర్‌ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరుబాట పట్టాయి. ప్రాజెక్టు విషయంలో అధికార పార్టీ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఉద్యమాలు చేస్తున్న విపక్షాలను హెచ్చరికలు చేస్తూనే... క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరం చేసే యోచనలో ఉంది. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా గులాబీబాస్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఇంద్ర (టి.కాంగ్రెస్), సాగర్ (టీఎస్ రైతు సంఘం నేత), వకుళాభరణం కృష్ణ మోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

నేడు విద్యార్థులతో జేపీ ముఖాముఖి...

హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం తొలి వర్ధంతి (బుధవారం) సందర్భంగా మాసాబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులతో బుధవారం ఉదయం పది గంటలకు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని లోక్ సత్తా వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

భారీ వర్షాలకు అసోంలో ఇద్దరు మృతి...

ఢిల్లీ : పలు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అసోంలో వీటి ధాటికి మంగళవారం ఇద్దరు మృత్యువాత పడగా, పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా 200 నుండి 300 మి.మీ.వర్షాపాతం నమోదైంది.

 

శ్రీవారి పుష్కరిణి నెల రోజులు మూసివేత..

చిత్తూరు : తిరుమలలో అక్టోబర్ 3 నుండి 11వ తేదీ వరకు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవావలను పురస్కరించుకుని ఆగస్టు 1 నుండి 30 వరకు శ్రీవారి పుష్కరిణిని మూసివేసి టిటిడి పనులు చేపట్టనుంది.

హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారు..

అమెరికా : అధ్యక్ష ఎన్నికకు హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. డెమోక్రటిక్ పార్టీ నుండి అధికారికంగా నామినేషన్ స్వీకరించారు.

07:08 - July 27, 2016

పాతికేళ్ల సంస్కరణలు యువతకు చివరకు నిరాశే మిగిల్చాయి. ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ పాతికేళ్లలో ఉద్యోగుల సంఖ్యను కుదించి, వాటాలు విక్రయించిన ప్రభుత్వాలు ఇప్పుడు రిజర్వ్ నిధులను కూడా ఊడ్చేయబోతున్నారు. మన దేశ ఆర్థికాభివృద్ధిలో, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వరంగ సంస్థలది ప్రధాన పాత్ర. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి సమర్పించిన తాజా పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సర్వే ప్రకారం మన దేశంలో మొత్తం 298 ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. వీటిలో 235 సంస్థలు పనిచేస్తున్నాయి. 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో 157 సంస్థలు లక్షా 30 వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించగా, 77 సంస్థలు 27, 360 కోట్ల రూపాయల నష్టాలు నమోదు చేశాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ కలిపి సంపాదించిన లాభం అక్షరాల లక్షా మూడు వేల కోట్లు. ఇదంతా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో చెప్పిన లెక్క.

1991కి పూర్వం..
ఎక్సయిజ్, కస్టమ్స్; కార్పొరేట్ టాక్స్ తో పాటు వివిధ రకాల పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్రానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు అందించాయి. వీటిలో డివిడెండ్ల రూపంలో ఇచ్చిందే 56, 527 కోట్లు. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలోనూ మన ప్రభుత్వరంగ సంస్థలది పెద్ద చెయ్యే. ఏటా లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించిపెడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల దగ్గర ఏడున్నర లక్షల కోట్ల రూపాయల రిజర్వ్ నిధులున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రభుత్వరంగ సంస్థలు బంగారుబాతు గుడ్లు. ఇప్పుడు ఇంత చక్కటి ప్రతిఫలాలు అందిస్తున్న ఈ ప్రభుత్వరంగ సంస్థలన్నీ 1991కి పూర్వం ఏర్పాటైనవి. సంస్కరణల పర్వం మొదలైన తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పకపోగా, 63 సంస్థల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేశారు. వీటిలో కొన్నింటిని మూసేశారు. కొన్నింటిలో ఉత్పత్తి నిలిపివేశారు.

ప్రధాన మార్పు...
ఈ పాతికేళ్ల కాలంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వచ్చిన మరో ప్రధాన మార్పు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం. 1991లో ప్రభుత్వరంగ సంస్థల్లో 19 లక్షల మంది ఉద్యోగులుండేవారు. ఇప్పడది 13 లక్షలకు పడిపోయింది. 1991కి పూర్వం మాదిరిగానే ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధి, విస్తరణ, పరిశోధనలకు ప్రాధాన్యతనిచ్చి అదే ఊపు కొనసాగించి వుంటే ఇప్పుడు వాటిలో కనీసం 40 లక్షల మందికి ఉద్యోగాలు దొరికేవి. కానీ, సంస్కరణలు ప్రారంభమైన తర్వాత పబ్లిక్ సెక్టార్ లో జాబ్ రిక్రూట్ మెంట్స్ నిలిపివేశారు. రిటైరైన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. అత్యవసరమైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తున్నారు. ఈ పాతికేళ్ల కాలంలో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడానికి ఇదే కారణం. రైల్వేస్, డిఫెన్స్, హోం, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్ లాంటి కీలకరంగాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1991లో 38 లక్షల మంది ఉండగా, అదిప్పుడు 30 లక్షలకు కంటే దిగువకు పడిపోయింది.

ఉపసంహరణ పేరిట వాటాల విక్రయం..
ఓ వైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం మరోవైపు పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో వాటాలు విక్రయిస్తోంది. గడిచిన పాతికేళ్ల కాలంలో 2 లక్షల 15 వేల కోట్ల రూపాయల విలువైన వాటాలు అమ్మేశారు. బై బ్యాక్ పాలసీ పేరుతో ఏడున్నర లక్షల కోట్ల రూపాయల రిజర్వ్ నిధులను హారతి కర్పూరం చేయబోతున్నారు. ప్రభుత్వరంగ సంస్థల ద్వారా వచ్చే లాభాలను జుర్రుకోవడం, వాటాలు అమ్మేయడం, యువతకు గవర్నమెంట్ జాబ్స్ నిరాకరించడమే గత పాతికేళ్ల సంస్కరణల సారాంశం. యువతకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత కల్పించలేని సంస్కరణలు ఎవరి కోసం? సంస్కరణలకు పూర్వం మన దేశంలో ప్రతి లక్ష మంది జనాభాలో 190 మంది ప్రభుత్వ ఉద్యోగులుండేవారు. 2011 నాటికి అది 172కి పడిపోయింది. ఈ అయిదేళ్లలో ఇంకా తగ్గింది. అమెరికాలో ప్రతి లక్ష మంది జనాభాలో 768 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే , మన దేశంలో 162 మంది మాత్రమే వున్నారంటే ఆశ్చర్యపోకండి. అన్నింటికీ అమెరికా వైపు చూసే ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో ఎందుకా ఉత్సాహం చూపించడం లేదు.

07:07 - July 27, 2016

పాతికేళ్ల సంస్కరణల మంచి చెడుల మీద చాలా చర్చే నడుస్తోంది. ఈ పాతికేళ్లలో సాధించిన ఆర్థికాభివ్రుద్ధిని, జీవన ప్రమాణాలు, ఉద్యోగావకాశాల కల్పనతో పోల్చిచూసుకుంటే చివరకు నిరాశే మిగులుతోంది. రంగాలవారీగా లెక్కలు తీస్తే ఆవేదనే మిగులుతోంది. పాతికేళ్ల సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థలకు ఏమిచ్చాయి? ఈ పాతికేళ్ల కాలంలో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ లో వచ్చిన మార్పులేమిటి? ఈ సంస్కరణల వల్ల ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు పెరిగాయా? తగ్గాయా? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ యూనియన్ నేత నర్సింహారెడ్డి విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

06:40 - July 27, 2016

హైదరాబాద్ : నగర అభివృద్ధిపై మంత్రి కేటిఆర్ దృష్టి సారించారు. ఒక్కొక్క విభాగాన్ని స‌మీక్షిస్తున్నారు. నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు రూపొందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. జీహెచ్ఎంసి, వాట‌ర్ బోర్డుల‌ను స‌మీక్షించిన మంత్రి హెచ్ఎండిఏ కార్యక్రమాలు ప్రాజెక్టుల‌పై పూర్తిస్థాయిలో స‌మీక్ష చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ల‌క్ష్యానికి అనుగుణంగా అన్ని సంస్థలు ప‌నిచేయాల‌న్నారు మంత్రి కేటీఆర్. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో హెచ్ఎండీఏ చేప‌డుతున్న కార్యక్రమాలు, ప్రాజెక్టులు పలు అంశాల‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు.

12 లాజిస్టిక్ హబ్స్ నిర్మాణాలు..
హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా ప్రాజెక్టులు, నిధుల సేకరణలో వినూత్నమైన పద్ధతులు అనుసరించాలని మంత్రి సూచించారు. హెచ్ఎండీఏ ప్రకారం మొత్తం 12 లాజిస్టిక్స్ హబ్స్ నిర్మాణాలను ప్రాతిపాదిస్తున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. అలాగే ఇంటర్‌సిటీ బస్ రెయిల్ టెర్మినళ్ల నిర్మాణం మెట్రో రైలుతో సమన్వయం చేసుకుని పని చేయాలని మంత్రి సూచించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అండర్ గ్రౌండ్ పవర్, ఫైబర్, కేబులింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.

నగర విస్తరణకు అనుగుణంగా ప్రాజెక్టులు..
ఇక కొత్వాల్ గుడాలోని 65 ఎకరాల్లో ఎకో పార్కుపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. అలాగే ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌నులు చివ‌రిద‌శ‌ పనులను సమీక్షించారు. ఈ నేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలపై మంత్రి ఆరా తీశారు. సూత్రాప్రాయంగా 283 కిలోమీటర్ల మేర రిజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాద‌న‌లు సిద్ధం చేశారు. ఇక అప్పుల్లో కూరుకుపోయిన హెచ్ఎండిఏ...స్వయంగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు చేశారు మంత్రి కేటీఆర్.

06:37 - July 27, 2016

హైదరాబాద్ : ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఆమోదం పొందనున్న జీఎస్టీ బిల్లుపై నెలకొన్న అభ్యంతరాలు, సూచనలను కేంద్రం ముందు లేవనెత్తామన్నారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల. జీఎస్టీ బిల్లుకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కేంద్రానికి సూచించామని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా జీఎస్టీని అమలు చేయాలని కోరామని చెప్పారు.

జీఎస్టీకి షరతులతో మద్దతు తెలిపిన తెలంగాణ..
ఎన్టీయే సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్నుకు షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నామని తెలంగాణ రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లు చర్చకు రానున్న సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ర్టాల ఆర్థికశాఖ మంత్రులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడారు. జీఎస్టీ వల్ల రాష్ర్టాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరామన్నారు. ప్రతిదానికి కేంద్రముందు చేతులు చాచే పరిస్థితిని రాష్ర్టాలకు రానీయొద్దని సూచించామన్నారు. జీఎస్టీలో రాష్ర్టాల పన్నుల వాటా, అధికారాలు ఎక్కువగా ఉండాలని కోరినట్లు చెప్పారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ర్టాలకు కలిగే నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం మూడు నుంచి ఆరు నెలల్లోనే పరిహారం చెల్లించాలని, ఈ మేరకు చట్టంలో నిబంధనలు పొందుపర్చాలని కోరామన్నారు ఈటెల.

సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ బకాయిలు 10వేల 440 కోట్ల పరిహారం
తెలంగాణకు కేంద్రం నుంచి సెంట్రల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ బకాయిలు 10వేల 440 కోట్ల పరిహారం రావాల్సి ఉందని, జీఎస్టీ అమలుకు ముందే ఈ బకాయిలు చెల్లిస్తే.. కేంద్ర, రాష్ర్టాల మధ్య పరస్పర విశ్వాసం ఉంటుందని ఆర్థికశాఖ మంత్రుల సమావేశంలో ఈటెల తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వస్తే కేంద్ర, రాష్ర్ట పన్నుల్లో ఇరువురికి సమాన హక్కులు కల్పించాలని కోరారు. జీఎస్టీ అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ర్టం ఆదాయం కోల్పోతుందని, అందువల్ల రాష్ర్టాలకు పరిహారం చెల్లించేలా ప్రత్యేకంగా నిబంధనలు అమలు చేయాలని ఈటెల సూచించారు. ఇక నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టం అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు ఈశాన్య రాష్ర్టాలకు కల్పించినట్టుగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. రాష్ర్టాలు కోల్పోనున్న ఆదాయానికి పరిహారం చెల్లించేలా స్వయంప్రతిపత్తి కలిగిన స్వతంత్ర జీఎస్టీ పరిహార నిధిని ఏర్పాటు చేయాలని ఈటెల సూచించారు. జీఎస్టీ బిల్లుపై అన్ని రాష్ర్టాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే.. పార్లమెంటులో జీఎస్టీ బిల్లు ప్రవేశపెడుతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు.

06:34 - July 27, 2016

విజయవాడ : చంద్రబాబు పాలనలో అవినీతి అట్టడుగు స్థాయికి తగ్గిపోయింది..పోలీస్‌శాఖతో సహా కరెప్షన్‌ తుడిచిపెట్టుకుపోతోంది.... ప్రభుత్వంపై ప్రజలు కొండత విశ్వాసంతో ఉన్నారు... వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై దాదాపు సగం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు..ఇదంతా మేమంటున్నది కాదు.. రెండేళ్ల పాలనపై ప్రభుత్వం జరిపిన పల్స్‌ సర్వేలో తేలిందని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. పల్స్‌ సర్వేలో జనం నాడి దొరికిపోయిందంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన అవినీతివల్ల బాధపడుతున్న ప్రజలు కేవలం 24శాతమేనని తేల్చేశారు ముఖ్యమంత్రి . అందుకే దాదాపు 90శాతం ప్రజలు తమ రెండేళ్లపాలనపై సంతృప్తిగా ఉన్నారని సర్వే వివరాలను వెల్లడించారు సీఎం చంద్రబాబు.

బాబు పాలన బాగుందన్నవారు 87.14%..
తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పరంగా జరిపిన పల్స్‌ సర్వే వివరాలను సీఎం ముందు ఉంచారు అధికారులు. ఈ సర్వే ప్రకారం చంద్రబాబు పాలన చాలా బాగుందని 87.14 శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వంలో ఈ-పాస్‌విధానం సౌకర్యంగా ఉందని దాదాపుగా 48శాతం మంది అభిప్రాయపడ్డారు. సచివాలయం విజయవాడకు తరలించాలని ఏకంగా 76శాతం మంది కోరుకున్నారు.

అవినీతి పెరిగిందన్నవారు 24%..
మరో ముఖ్యవిషయం ఏంటంటే..రెండేళ్ల బాబు పాలనలో అవినీతి పెరిగిందా అని అడిగితే..కేవలం 24శాతం మంది మాత్రమే అవునన్నారని సర్వే లెక్కలను చూపిస్తున్నారు అధికారులు. అంటే బాబు పాలన దాదాపుగా కడిగిన ముత్యంలా మెరుస్తుందని ప్రభుత్వం నిర్వహించిన సర్వే తేల్చిందన్నమాట. కానీ..రెవెన్యూశాఖలో మాత్రం కరెప్షన్‌ పెరిగిందని 45శాతం మంది అంటున్నట్టు..లెక్కలు చూపించారు అధికారులు. అలాగే పోలీస్‌శాఖలో అవినీతి పెరిగిందని 13.7శాతం మంది, వైద్యారోగ్యశాఖలో కరెప్షన్‌ పెరిగిందని కేవలం 7.5 మంది ప్రజలు అనుకుంటున్నారని సర్వే తేల్చింది. ఇక చంద్రన్న బీమా పథకం చాలా బాగుందని 73శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే లెక్కలు చూపిస్తూనే..ఈ పథకంలో తక్కువమంది మాత్రమే చేరుతున్నారని ముఖ్యమంత్రి..అధికారులపై కస్సుబుస్సులాడటం కొసమెరుపు.

06:31 - July 27, 2016

హైదరాబాద్ : తెలంగాణలో హాట్‌హాట్‌గా మారిన మల్లన్నసాగర్‌ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరుబాట పట్టాయి. ప్రాజెక్టు విషయంలో అధికార పార్టీ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఉద్యమాలు చేస్తున్న విపక్షాలను హెచ్చరికలు చేస్తూనే... క్షేత్రస్థాయిలో పనులను ముమ్మరం చేసే యోచనలో ఉంది. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా గులాబీబాస్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. మెదక్‌ జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. నిర్వాసితులకు బాసటగా ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నాయి. ఆందోళనలు ముమ్మరం చేస్తున్నాయి. ముంపు గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై సర్కార్‌ తీరును ఎండగడుతుంటే..ఈ విషయాన్ని గులాబీ బాస్‌ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లాలో నిర్మిస్తుండడం,.మంత్రి హరీష్‌రావు అదే జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భూ సేకరణపై రగడ ఎంత తీవ్ర స్థాయిలో జరిగినా వెనక్కి తగ్గేది లేదనే సంకేతాలను ప్రభుత్వ పెద్దలు. ముంపునకు గురయ్యే 8 గ్రామాల్లోని ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని అధికార పార్టీలు చెప్పుకొస్తున్నారు.

సర్కార్ పై విమర్శలు..
విపక్షాలు రెచ్చగొట్టడం కారణంగానే భూసేకరణపై ఆందోళనలు తీవ్రమయ్యాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భూ నిర్వాసితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మరో రెండునెలల్లో భూ సేకరణ పూర్తవుతుందన్న ధీమా అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. భూ సేకరణ అనంతరం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తే..ఉత్తర తెలంగాణలో రాజకీయంగా తమకు తిరుగుండదన్న ధీమాను టీఆర్‌ఎస్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా మల్లన్నసాగర్‌ అంశం తెలంగాణలో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. నిర్వాసితుల విషయంలో సర్కార్‌ అనుసరిస్తున్న ధోరణిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

06:28 - July 27, 2016

హైదరాబాద్ : బంగారు తెలంగాణ అంటే పేదల భూములు లాక్కోవడం కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆక్షేపించారు. మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని అన్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పట్ల ప్రభుత్వ తీరుపై.. ఇతర పార్టీల నేతలూ తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టులన్నా.. జైళ్లన్నా బెదిరేదిలేదని స్పష్టం చేశారు. అక్రమంగా భూములు లాక్కొంటే ఊరుకునేది లేదని...న్యాయం జరిగే వరకూ ఐక్య ఉద్యమం కొనసాగుతుందని నేతలు వెల్లడించారు. సొంత నియోజకవర్గ రైతులపై లాఠీచార్జీ చేసి... కేసీఆర్ ఘనతకెక్కారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ విమర్శించారు. కేంద్రంలో మోదీ కార్పొరేటర్లకు సేవకుడిగా, ఇక్కడ కేసీఆర్ రైతుల వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

లాఠీలతో ఉద్యమాలను అణచలేరన్న తమ్మినేని..
కేసులు లాఠీలతో ఉద్యమాలను అణచలేరని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ సర్కార్‌ను హెచ్చరించారు. భూ నిర్వాసితుల పోరాటాలు రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ పార్టీలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, బాధితులకు అండగా ఉండటం కోసమే ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బతుకునిచ్చే పాలన కావాలిగానీ తమ బతుకులను భయాందోళనకు గురిచేసే పాలన కాదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. లాఠీ చార్జీ ఘటనకు కేసీఆర్, హరీష్‌రావు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ కవర్‌ కాని అన్ని నిర్వాసిత గ్రామాల్లోనూ తమ్మినేని పాదయాత్ర చెయ్యాలని, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేపట్టాలని మహాధర్నాలో నిర్ణయించారు.

రేపటి నుండి మావోయిస్టుల వారోత్సవాలు..

హైదరాబాద్ : కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉత్తర తెలంగాణ - ఆంధ్రా ఒడిశా సరిహద్దులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. గురువారం నుంచి వారం రోజుల పాటు అమరవీరుల వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారు. దీనితో తెలంగాణ, ఏపీ పరిధిలోని ఈ ప్రాంతాల్లో యుద్ధవాతావరణం అలుముకొంది.

ఏకీకృత సర్వీస్ రూల్స్ పై నేడు ఢిల్లీలో సమావేశం..

ఢిల్లీ : ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ పై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుండి విద్యాశాఖాధికారులు హాజరవుతున్నారు.

రేపు నీతి ఆయోగ్ సభ్యులతో ప్రధాని భేటీ..

ఢిల్లీ : ప్రధాని మోడీ గురువారం నీతి ఆయోగ్ బృందంతో సమావేశం కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఆ వివరాలు వెల్లడించారు. 15 ఏండ్ల ప్రణాళికపై అధికారులతో చర్చించనున్నారు. బుధవారం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రణాళిక ముఖ్య కార్యదర్శులు సమావేశంలో వచ్చే సలహాలు..సూచనలను పరిగణలోకి తీసుకుని గురువారం నాటి సమావేశం కొనసాగనుంది.

భవనం కూలి దుకాణదారుడి మృతి..

హైదరాబాద్ : నగరంలో మరో పురాతన భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి తీవ్రగాయాలతో మృతి చెందాడు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లోని శివాజీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

నేడు నీతి ఆయోగ్ సమావేశం..

ఢిల్లీ : వివిధ రంగాల్లో తీసుకరావాల్సిన నూతన విధానాలు, పథకాల్లో మార్పులు..చేర్పులు తదితరాలపై చర్చించేందుకు నీతి అయోగ్ బుధవారం ఒక రోజు సదస్సును నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రణాళిక శాఖ కార్యదర్శులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది.

ఎంసెట్ 2 లో సీఐడీ దర్యాప్తు ముమ్మరం..

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీక్ లో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. స్కాంలో 16 మంది పాత్రధారులు ఉన్నట్లు, 69 మంది విద్యార్థులపై సీఐడీ నజర్ పెట్టిందని తెలుస్తోంది. పేపర్ లీక్ వ్యవహారంలో జేఎన్టీయూ అధికారి పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణకు దర్యాప్తు బృందాలు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఖమ్మం, వరంగల్ విద్యార్థులను విచారించిన సీఐడీ నేడు మరో 10 మంది విద్యార్థులను విచారించనుంది.

Don't Miss