Activities calendar

28 July 2016

21:35 - July 28, 2016

విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా లేదు. తల్లిదండ్రుల ఆందోళన పట్టించుకునేవారు లేరు. లక్షలు ఖర్చు పెట్టి.. ఏళ్లకేళ్లు కష్టపడి చదివిన శ్రమకు గుర్తింపు లేదు. చిన్న లీకేజీతో అన్నిటినీ గంగపాలు చేస్తున్నారు. ఇప్పటికే చదువుని అమ్ముకోవటానికి..కొనటానికి అలవాటు పడ్డ వ్యవస్థగా మారింది. ఇప్పుడు లీకేజీలు కూడా వరుసకడుతున్నాయి. ఓ వ్యక్తి పదేళ్లలో అనేక పేపర్లు లీక్ చేసి దర్జాగా తిరుగుతున్నాడంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎలా ఉందో అర్ధమవుతుంది. తెలంగాణ ఎంసెట్ లీకేజ్ సందర్భంలో ఎంట్రన్స్ ల చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక కథనం.. ఇప్పటికే అతగాడిపై బెంగుళూరులో అనేక కేసులున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ పీజీ మెడికల్ లీకేజ్ కేసు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మళ్లీ దర్జాగా మరో ఎంట్రన్స్ ని గంగలో కలిపాడు. ఎవరి అండదండలతో రాజగోపాల్ రెడ్డి చెలరేగిపోతున్నాడు? ఏ పెద్ద తలకాయలు ఈ లీకేజ్ వెనకున్నారు? లీకేజ్ అయిందనే అంశం స్పష్టం.

మళ్లీ పరీక్ష ?
ఇప్పుడు దీనికి పరిష్కారమేంటి? మళ్లీ పరీక్ష నిర్వహించటమే మార్గమా? లేక లీక్ చేసిన కొందరిని ఎలిమినేట్ చేసి ఈ ఫలితాలనే కొనసాగించటమా? సొల్యూషన్ ఏమిటి? విద్యార్ధులు మేధావులు ఏమంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ మొదటి నుంచి పలు మలుపులు తిరుగుతోంది. తేదీలు మారుతూ వచ్చాయి. మొదట ఎంసెట్‌ను మే 2వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేసి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మే 15న ఎంసెట్‌ను నిర్వహించారు. ఆఖరికి లీకేజీతో కథ మలుపు తిరిగింది. ఇంతకీ ఎవరీ రాజగోపాల్? ఎలా లీకేజీ జరిగింది?

అనుమానం ఎలా నిజమైంది...
అతని అనుమానం ఎలా నిజమైంది... అతని ఆలోచన డొంకను కదిలించింది. అడ్డదారుల్లో మెడికల్ ర్యాంకులు సాధించిన లీకు వ్యవహరాన్ని ముందే ఎలా పసిగట్టాడా వ్యక్తి? గడప గడప తిరిగి కుంభకోణాన్ని వెలుగులోకే తేవాలనే తపన నేడు నిజమైంది? అదే ఇప్పుడు ఎంసెట్ టూ లీకేజిని సంచలనాత్మకంగా రాష్ట్రం ముందుంచింది. తెలంగాణ ఎంసెట్ ఒక్కటేనా.. దేశ వ్యాప్తంగా అనేక స్కాములు, లీకులు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఎందరో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తెలంగాణ, ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా.. ఈ వరుసలో బయటికొచ్చినవి కొన్ని.. వెలుగు చూడనివెన్నో. లీకేజీ జరిగిందనే అంశం క్లియర్.. ఒక్కొక్కరుగా సూత్రధారులు, పాత్రధారులు బయటపడుతున్నారు. సీఐడీ అరెస్టులు చేస్తోంది. కానీ, విద్యార్ధుల సంగతేంటి? మళ్లీ పరీక్ష నిర్వహించాలనటం సబబేనా? వేలాది కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

21:30 - July 28, 2016

ఢిల్లీ : ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీల విషయంలో సాధ్యమైన అన్నింటినీ చేస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. విభజన సమయంలో అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబించాయని, రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని పేర్కొన్నారు. కలిసి కలహించుకోవడమకన్నా విడిపోయి కలిసుందామనే మొదటి నుండి విభజనకు మద్దతివ్వడం జరిగిందన్నారు. కొన్ని అంశాలను విభజన చట్టంలో చేర్చలేదని కేవలం ప్రకటనకు మాత్రమే చేశారని సభకు తెలిపారు. ఏపీ ప్రజలకు కష్టాలు రాకుండా చూశానని, ఏపీ హోదాను మరే రాష్ట్రంతో పోల్చలేమన్నారు. ఏపీలో ఇళ్లు లేకుండానే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, విభజన సమయంలో మెంటల్ టార్చర్ అనుభవించానని సభకు వెంకయ్య తెలిపారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పేమి లేదని, ఏపీ, తెలంగాణతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. విభజన వల్ల ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతారని జోక్యం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావించింది మొదట తానేనని సభకు గుర్తు చేశారు. ఏడు మండలాలను విలీనం చేయకపోతే పోలవరం సాధ్యం కాదని ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందన్నారు. ఏపీలో ఎన్నో జాతీయ సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.

హామీలు అమలు నెరవేస్తున్నాం..
ఏపీకి ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ సహా విద్యా సంస్థలను మంజూరు చేయడం జరిగిందన్నారు. తిరుపతి, విశాఖ విమానాశ్రయాలను విస్తరించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రెండేళ్లు నిధులు ఇవ్వడం జరిగిందని, అనంతపురం, కర్నూలు జిల్లాకు సోలార్ పవర్ పార్కులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం జరిగిందని, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఏపీకి 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో సాధ్యమైన వాటిని నెరవేరుస్తున్నామన్నారు.

బీజేపీని ఇరుకున పెడుతున్న విపక్షాలు..

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.

 

ఏపీకి ఆదాయం కరువైంది - ఆజాద్...

ఢిల్లీ : ప్రైవేటు బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించరాదని, హామీలను అమలు చేస్తారని రెండేళ్లుగా చూస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ పేర్కొన్నారు. ప్రధాన ఆదాయ వనరైన హైదరాబాద్ ను ఏపీ కోల్పోవడంతో ఆ రాష్ట్రానికి ఆదాయం కరువైందని తెలిపారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. హామీల అమలుపై కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై చాలా మంచి చర్చ జరిగిందని, ప్రత్యేక హోదా విషయంలో ఏపీ, తెలంగాణతో ఇతర రాష్ట్రాలను పోల్చవద్దని సూచించారు. హామీలు అమలు చేస్తారని రెండేళ్లుగా చూస్తున్నారని ఆజాద్ తెలిపారు.

రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాయి - వెంకయ్య...

ఢిల్లీ : రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కలిసి కలహించుకోవడమకన్నా విడిపోయి కలిసుందామనే మొదటి నుండి విభజనకు మద్దతివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించారయని తెలిపారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పేమి లేదని, కొన్ని అంశాలను విభజన చట్టంలో చేర్చలేదని కేవలం ప్రకటనకు మాత్రమే చేశారని సభకు తెలిపారు. ఏపీ ప్రజలకు కష్టాలు రాకుండా చూశానని, ఏపీ హోదాను మరే రాష్ట్రంతో పోల్చలేమన్నారు. ఏపీ, తెలంగాణతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు.

కారు బీభత్సం..

ప్రకాశం : గిద్దలూరు (మం) కృష్ణంరాజుపల్లె వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి కారు నడిపినట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఇచ్చిన హామీలు అమలు చేయాలి - గరికపాటి..

ఢిల్లీ : ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎంపీ గరికపాటి డిమాండ్ చేశారు. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వచ్చి ఏపీ సమస్యలను తీర్చాలని మొర పెట్టుకున్నారని పేర్కొన్నారు.

20:18 - July 28, 2016

ఢిల్లీ : సిద్ధాంతపరంగా ఆనాడు విభజనను వ్యతిరేకించడం జరిగిందని సీపీఎం సభ్యుడు సీతారం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీల అమలుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడారు. విభజనకు తొందర పడుతున్నారని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే విభజన హామీలు అమలు చేయరని తేలిపోయిందన్నారు. విద్యుత్,నీటి పంపకాలపై లోతుగా ఆలోచించకుండా విభజన చేయవద్దని చెప్పడం జరిగిందని, రెండు బడ్జెట్ లు పూర్తయినా హామీలు అమలు కాలేదని గుర్తు చేశారు. రెండు ప్రాంతాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా ? లేదా ? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో పార్లమెంట్ లో ప్రకటన చేయాలని సూచించారు. రెవెన్యూ లోటును బడ్జెట్ లో భర్తీ చేస్తామని హామీనిచ్చారని, వెనుకబడిన యూపీ, బీహార్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సినవసరం ఉందన్నారు. మనీ బిల్లంటూ ప్రైవేట్‌ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదు ఆయన అన్నారు.

హోదాకు అందరూ మద్దతినివ్వాలి - కేకే...

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాకు అందరూ మద్దతినివ్వాలని ఎంపీ కేకే పేర్కొన్నారు. సీపీఐ తప్ప ఎవరూ తెలంగాణ పేరెత్తలేదని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని బిల్లులో ఉందని తెలిపారు. తెలంగాణ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదని తెలిపారు.

ప్రత్యేక హోదా ఇస్తే మేలు - టీజీ..

ఢిల్లీ : ఆర్ధిక లోటు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని, ప్రత్యేకహోదా ఇస్తే...రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ప్రత్యేకహోదా ఐదేళ్లు ఇస్తామని ప్రధాని ప్రకటించారని గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా ఏమైంది - దిగ్విజయ్..

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఏమైందని కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ ప్రశ్నించారు. హోదాకంటే ఎక్కువే ఇస్తామని మోడీ ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టవద్దని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

హోదా ఎప్పుడిస్తారో చెప్పాలి - డి.రాజా..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారో జైట్లీ చెప్పాలని సీపీఐ సభ్యుడు డి.రాజా డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని సూచించారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.

ఆగస్టు 9వ తేదీలోగా బిల్లుపై నిర్ణయం - డిప్యూటి ఛైర్మన్..

ఢిల్లీ : ఆగస్టు 9వ తేదీలోగా ప్రైవేటు బిల్లుపై నిర్ణయం ఉంటుందని డిప్యూటి ఛైర్మన్ వెల్లడించారు. నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందన్నారు.

19:44 - July 28, 2016

ఢిల్లీ : ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించడం సరికాదని, ఆర్టికల్ 3,4 నిబంధనల ప్రకారం ఇది ద్రవ్య బిల్లు కాదని...న్యాయ నిపుణులు ఇదే విషయం చెబుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీల అమలుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రత్యేక హోదాకు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ మద్దతు తెలిపింది. హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ సవరణ లేకుండా ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ఆమోదించారని తెలిపారు. ఏపీలో తాము 49.4 శాతం ఓట్లతో విజయం సాధించడం జరిగిందని, ప్రతిపక్షంలో ఉన్న తమ గొంతు వినిపించడం ముఖ్యమన్నారు. ఏపీకి అన్యాయం చేశారన్నది వాస్తవమని దీనిని అందరూ అంగీకరించేదేనన్నారు. రాజ్యాంగంలోని 3,4 సెక్షన్లపై రాష్ట్ర విభజన జరిగిందని, బడ్జెట్ బిల్లు అయినప్పుడు దీనిని ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును ఇక్కడే ఆమోదించారు కనుక ఇది బడ్జెట్ బిల్లు కాదన్న విషయం అందరూ అంగీకరించాల్సినదేనని సభకు తెలిపారు. సవరణ కోరితే ప్రైవేటు బిల్లు మనీ బిల్లు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు. ద్రవ్య బిల్లు అనడానికి చట్టంలో ఎక్కడా ఆస్కారం లేదని తెలిపారు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. విభజనతో అన్యాయమైన ఏపీ ప్రజలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిచ్చారని, ఆరు అంశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఒకటిని పేర్కొన్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

విత్ డ్రా చేసుకోను - కేవీపీ..

ఢిల్లీ : రాజ్యసభలో తాను ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును ఎట్లాంటి పరిస్థితుల్లో తాను విత్ డ్రా చేసుకోనని కేవీపీ స్పష్టం చేశారు. తన బిల్లు వల్లే సభళో చర్చ జరుగుతుందని, ఓటింగ్ ఎప్పుడు పెడుతారని ప్రశ్నించారు.

బీజేపీని ఇరుకున పెడుతున్న విపక్షాలు..

ఢిల్లీ : రాజ్యసభలో బీజేపీని విపక్షాలు ఇరుకున పెడుతున్నాయి. ఏపీ విభజన సమయంలో వెంకయ్య నాయుడు ఇచ్చిన హామీలపై విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి.

న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు - విజయసాయిరెడ్డి..

ఢిల్లీ : ఏపీ ప్రజలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రైవేటు మెంబర్ బిల్లును ఓటింగ్ కు అనుమతినించాలని డిమాండ్ చేశారు.

19:18 - July 28, 2016

ఢిల్లీ : మోడీ అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశించడం జరిగిందని, అందరం ఎదురు చూడడం జరిగిందన్నారు. కానీ తమ ఆశలు అడియాశాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీల అమలుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రత్యేక హోదాకు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ మద్దతు తెలిపింది. హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది. చర్చలో సీఎం రమేష్ మాట్లాడారు. పార్లమెంట్ తలుపు మూసి రాష్ట్రాన్ని విభజించారని, రాజకీయ కోణంలో విభజన జరిగిందన్నారు. బిల్లులో తప్పులున్నాయని ఆనాడు చెబితే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు విభజన చేశారని తెలిపారు. ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలు చెప్పిన వెంకయ్య నాయుడు ఎక్కడ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కానీ ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చింది వెంకయ్య..జైట్లీ అని తెలిపారు. అలా మాట్లాడకపోతే ఇప్పుడు ఈ అంశాన్ని మాట్లాడలేమన్నారు. ఎన్నికల సమయంలో మోడీ ఒక్కరే ప్రధాని అవుతారని గుర్తించడం జరిగిందని అందుకే మద్దతు తెలియ చేయడం జరిగిందన్నారు. ఏపీకి రాజధాని లేదని, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని

తిరుపతిలో మోడీ పేర్కొన్నారని గుర్తు చేశారరు. వాగ్ధానాలను అమలు చేసి తీరుతామని చెప్పడం జరిగిందని, అనంతరం ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం గెలుపొందడం జరిగిందన్నారు. అర్బన్ పాపులేషన్ ఉంటుందో అక్కడే ఆదాయ వనరులుంటాయని, కానీ ఏపీలో 21 శాతం మాత్రమే ఉందన్నారు. విభజన తీరు ఎలా జరిగిందో అందరూ చూశారని, సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని అనేక మంది విమర్శలు చేశారని తెలిపారు. కానీ ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఏపీని ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరడం జరుగుతోందన్నారు. ఏపీని ఇబ్బందుల్లో ఉందని, ఆదుకోవాలని కోరుతున్నట్లు సీఎం రమేష్ వెల్లడించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలి - ఏచూరి..

ఢిల్లీ : సిద్ధాంతపరంగా ఆనాడు విభజనను వ్యతిరేకించడం జరిగిందని సీపీఎం సభ్యుడు సీతారం ఏచూరి పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీల అమలుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడారు. విభజనకు తొందర పడుతున్నారని అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే విభజన హామీలు అమలు చేయరని తేలిపోయిందన్నారు. విద్యుత్,నీటి పంపకాలపై లోతుగా ఆలోచించకుండా విభజన చేయవద్దని చెప్పడం జరిగిందని, రెండు బడ్జెట్ లు పూర్తయినా హామీలు అమలు కాలేదని గుర్తు చేశారు. రెండు ప్రాంతాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా ? లేదా ? అని ప్రశ్నించారు.

ఏపీ డిమాండ్లకు మద్దతు - ఎంపీ సుఖేందు శేఖర్...

హైదరాబాద్ : ఏపీ డిమాండ్లకు మద్దతినిస్తున్నట్లు ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ వెల్లడించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో హామీలిచ్చారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో దుర్భర పరిస్థితి ఉందన్నారు.

ఏపీ ప్రత్యేక హోదాకు జేడీయూ మద్దతు - ఎంపీ..

ఢిల్లీ : ప్రత్యేక హోదాకు జేడీయూ మద్దతు తెలియచేస్తున్నట్లు జేడీయూ ఎంపీ ఆలీ అన్వర్ అన్సారీ వెల్లడించారు. అప్పటి ప్రధాని హామీలు అమలు చేయాలని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు మరిచిపోకూడదన్నారు. ప్రత్యేక హోదా కోసం బీహార్ లో చాలాకాలం పాటు పోరాటం కొనసాగిందని గుర్తు చేశారు. బీహార్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

 

హామీలను కేంద్రం అమలు చేయాలి - ఎంపీ నరేష్..

ఢిల్లీ : ప్రధాని స్థానంలో సభలో ఎవరు హామీనిచ్చినా కేంద్రం అమలు చేయాలని ఎంపీ నరేష్ అగర్వాల్ పేర్కొన్నారు. రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చ ప్రారంభమైంది. కేంద్రంలో మిత్రపక్షమైనా..తమ డిమాండ్ల కోసం తెలుగుదేశం కష్టపడాల్సి వస్తోందన్నారు.

18:39 - July 28, 2016

డబ్బింగ్ సీరియల్స్ పై మళ్లీ ఉద్యమం రానుంది. తెలుగు ఆర్టిస్టుల‌కు, టెక్నీషియ‌న్ల జీవితాల‌ను రోడ్డున ప‌డేసేలా డబ్బింగ్ సీరియ‌ల్స్ దండ‌యాత్ర చేస్తున్నాయ‌ని తెలుగు టెలివిజ‌న్ యూనియ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. గత కొన్ని రోజులుగా దీనిపై అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆందోళన కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో టెన్ టివి ఈ అంశంపై చర్చను చేపట్టింది. ఈ చర్చలో అసోసియేషన్ సభ్యులు విజయ్ యాదవ్, మధుమణి (ఆర్టిస్టు) కాంచనబాబు (డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ మాజీ అధ్యక్షులు), ఆర్ సీఎం రాజు (సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

సెక్షన్ 94 అమలు ఏమైంది - జైరాం రమేష్..

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చ మొదలైంది. చర్చను జైరాం రమేష్ ప్రారంభించారు. సెక్షన్ 94 అమలు ఏమైందని ప్రశ్నించారు. హైకోర్టు ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి చర్య తీసుకుందని, విభజన చట్టంలో ఇచ్చిన ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఏం చర్యలు తీసుకున్నారని, రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయి చేయాలని చట్టంలో ఉందని సభకు తెలిపారు. సెక్షన్ 94 ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదేనని, అలాగే సెక్షన్ 94 ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచించారు.

ఏపీ విభజన హామీలపై మొదలైన చర్చ..

ఢిల్లీ : రాజ్యసభలో ఏపీ విభజన హామీలపై చర్చ మొదలైంది. చర్చను జైరాం రమేష్ ప్రారంభించారు. విభజన చట్టం సెక్షన్ 93 ప్రకారం 13వ షెడ్యూల్ లోని అభివృద్ధి పనులకు కేంద్రానిదే బాధ్యత అని తెలిపారు. అభివృద్ధి పనులకు కేంద్రానిదే బాధ్యత అని, కేంద్రం దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో వివరణనివ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి, మంత్రి హరీష్ లకు ఎమ్మెల్సీ షబ్బీర్ లేఖ..

హైదరాబాద్ : కేంద్ర మంత్రి ఉమాభారతి, హరీష్ రావులకు వేర్వేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ లేఖ రాశారు. వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులిచ్చారని, ఎన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం డీపీఆర్ ఇచ్చిందో తెలపాలని విన్నవించారు. మల్లన్న సాగర్ లో 123 జీవో రైతుల పొట్టగొడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులకు డీపీఆర్ లు ఉన్నాయో హరీష్ రావు ప్రజల ముందు పెట్టాలని కోరారు. 123 జీవోలో బాధితులకు పునరావాసంపై వివరణనివ్వలేదని, డీపీఆర్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడుతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

రెండో పంటకు నీరందిస్తాం - ప్రత్తిపాటి..

గుంటూరు : శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీరు లేనందున సాగర్ కుడికాల్వ పరిధిలో మొదటి పంటకు సాగునీరు అందించలేమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

భూ సేకరణపై పీసీసీ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో ప్రాజెక్టుల భూ సేకరణపై పీసీసీ సబ్ కమిటీ భేటీ అయ్యింది. కుంతియా, భట్టి, దామోదర, పొన్నాల, పొన్నం లు సమావేశానికి హాజరయ్యారు.

కాగజ్ నగర్ లో సీఐడీ సోదాలు..

ఆదిలాబాద్ : కాగజ్ నగర్ లో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఎంసెట్ -2 లీకేజీ కేసులో ఓ విద్యార్థిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థి ఆచూకీ లభించలేదు.

తామిచ్చిన సమాచారంతో లీకేజ్ బయటపడింది - రవి..

వరంగల్ : తామిచ్చిన సమాచారంతోనే ఎంసెట్ -2 లీకేజీని సీఐడీ బయటపెట్టిందని గుండెబోయిన రవి పేర్కొన్నారు. లీకేజీని బయటపెట్టేందుకు తనతో సహా 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేశారని తెలిపారు. ఐదుగురు ఒక టీం చొప్పున టీం వర్క్ చేయడం జరిగిందని ఎంసెట్ లీకేజీ క్లూ అందించిందిన ఓ విద్యార్థి తండ్రి పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న మోడీ..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 15 ఏండ్ల ప్రణాళికపై అధికారులతో చర్చించనున్నారు. బుధవారం రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రణాళిక ముఖ్య కార్యదర్శుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే సలహాలు..సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ సమావేశం కొనసాగనుంది.

కాంపా బిల్లు పాస్ కావడం సంతోషం - ప్రకాష్ జవదేకర్..

ఢిల్లీ : కాంపా బిల్లు పాస్ కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం చొరవతో ఇది సాధ్యమైందన్నారు.

17:35 - July 28, 2016

వరంగల్ : అతని అనుమానం నిజమైంది...అతని ఆలోచన డొంకను కదిలించింది. అడ్డదారుల్లో మెడికల్ ర్యాంకులు సాధించిన లీకు వ్యవహరాన్ని ముందే పసి గట్టాడు ఆ వ్యక్తి... గడప గడప తిరిగి కుంభకోణాన్ని వెలుగులోకే తేవాలనే తపన నేడు నిజమైంది? ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. సంచలనం సృష్టిస్తున్న టీఎస్ ఎంసెట్ 2 లీకేజీ వ్యవహరంలో ఓ సామాన్య వ్యక్తికి కలిగిన అనుమానం నిజమయ్యింది. అతనికి లభించిన చిన్న క్లూ పెద్ద కుంభకోణం ఛేదించడానికి కారణమైంది. గత పరీక్షల్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన పిల్లలకు ఎంసెట్‌ టూ పరీక్షలో వందలోపు ర్యాంకులు రావడంపై వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన గుండెబోయిన రవికి అనుమానం వచ్చింది. అసాధారణ రీతిలో ర్యాంకులు రావడంతో ప్రశ్నపత్రం లీకై ఉండవచ్చనే అనుమానం మొదలైంది. మొదలు అతని అనుమానాలను కొట్టి పారేశారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా కుంభకోణం బయటకు తెచ్చే కృషి చేశాడు.
రవి అనుమానం నిజమైంది..
పత్రికల్లో వరుస కథనాలు, ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడం, విచారణ చేపట్టిన రోజే సీఐడీ లీకేజీ వాస్తవమేనని తేలడంతో రవి వెల్లిబుచ్చిన అనుమానం నిజమయ్యింది. రవి అనుమానానికి బీజం పడిన సందర్భానికి వస్తే.. విజయవాడకు చెందిన ఓ షార్ట్‌టర్మ్‌ కోచింగ్‌ సెంటర్‌కు రవి కుమార్తె ప్రజ్ఞ కోచింగ్‌ తీసుకుంది. అయితే పరీక్షకు సరిగ్గా వారం ముందు బ్యాచ్‌ నుంచి అయిదుగురు విద్యార్థినులు బయటకు వెళ్లిపోయారు. అయితే విచిత్రంగా పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన ఆ పిల్లలే ఎంసెట్‌-2లో వందల్లో ర్యాంకులు సాధించారు. అయితే ఏపీ ఎంసెట్‌, టీఎస్‌ ఎంసెట్‌ వన్‌ పరీక్షల్లో వెనుకబడిన పిల్లలు ఒక్కసారిగా మెరుగైన ఫలితాలు సాధించారు.
ఏం జరగనుందో ?
ఇదే సమయంలో పరకాలకు చెందిన రవికి ప్రశ్నపత్రం లీకేజీ కావచ్చనే అనుమానం వచ్చింది. రవి కూతురు ప్రజ్ఞ ప్రతి పరీక్షలో మొదటి స్థానంలో ఉండగా ఎంసెట్‌-2 పరీక్షలో మాత్రం వెనుకబడింది. ఏదో తేడా జరిగిందని, ప్రశ్నపత్రం లీకు కావడం వల్లనే ర్యాంకుల్లో అన్యాయం జరిగిందని రవి గ్రహించి పలువురు తల్లిదండ్రులతో కలిసి మీడియాకు ఎక్కడంతో తీగ బయటపడింది. ఇప్పుడు సీఐడీ సైతం ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఏం జరుగుతందనేది సస్పెన్స్ గా మారింది.

17:32 - July 28, 2016

హైదరాబాద్ : నేరం ఎవరిది..? శిక్ష ఎవరికి..? ఎంసెట్‌ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ఇప్పుడీ ప్రశ్నలే ప్రతిఒక్కరిలో మెదులుతున్నాయి. లీకు వీరుల బాగోతం బయటపడటంతో వైఫల్యానికి కారణం ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో సర్కార్‌లోని అమాత్యులను బాధ్యులను చేస్తారా.. ? లేక నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వారిని తప్పుబడతారా..? లేక విద్యామండలే బాధ్యత వహిస్తుందా అన్నది సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ఏదేమైనా సర్కార్‌ తీసుకునే నిర్ణయంపై వేల మంది విద్యార్థులు భవితవ్యం ఆధారపడి ఉందన్నది వాస్తవం.

ఎంసెట్‌ 1, 2 రద్దు చేస్తారా..? ఎంసెట్‌ 3 నిర్వహిస్తారా ?
ఎంసెట్‌ 1, 2 రద్దు చేస్తారా..? ఎంసెట్‌ 3 నిర్వహిస్తారా... ? ఒకవేళ ఎంసెట్‌ 3 నిర్వహిస్తే... ఇప్పుడు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు.. తిరిగి ర్యాంకులు సాధిస్తారా..? అసలు ఎంసెట్‌ లీక్‌ వ్యవహారంలో నేరం ఎవరిది..? శిక్ష అనుభవించాల్సింది ఎవరు..? ఇప్పుడిదే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 56 వేల మంది విద్యార్థులు ఎంసెట్‌ 2 పరీక్ష రాశారు. ఇందులో 200 మంది విద్యార్థులకు సంబంధించి లీకేజీ వ్యవహారం.. ఇప్పుడు యావత్ విద్యార్థులను బెంబేలెత్తిస్తోంది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్‌ ఏమవుతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద ఎంసెట్ లీకు వీరుల అరెస్ట్‌లు, సీఐడీ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ఎవరిని బాద్యుల్ని చేస్తుందన్న విషయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎంసెట్‌ నిర్వహించింది జెఎన్‌టీయూ కాగా, నిర్వహణ అంశం మాత్రం కడియం శ్రీహరి శాఖకు సంబంధించింది. ఇక ఎంసెట్‌ 2 అంతా వైద్యవిద్యకు సంబంధించింది కావడంతో.. దీన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి సంబంధించిన అంశం. మంత్రి మాత్రం నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఇప్పటికే సీఎంవో అధికారులతో సంబంధిత మంత్రి భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని విద్యాశాఖ మంత్రి చెప్పారు. మొత్తం వ్యవహారం చూస్తే ఇద్దరు మంత్రులకు సంబంధం లేకుండా సీఎం కేసీఆర్‌ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో నేరం ఎవరిది..? శిక్ష ఎవరికి...? అన్నది కాలమే నిర్ణయించాలి.

ఎంసెట్ -2 లీకేజ్ పై సీఐడీ ప్రకటన..

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకేజ్ పై సీఐడీ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు సెట్ల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, ఐదు నగరాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందచేశారని తెలిపారు. 320 ప్రశ్నలు, సమాధానాలు విద్యార్థులకు ఇచ్చారని, పరీక్ష రెండు రోజుల ముందు విద్యార్థుల చేతికి ప్రశ్నపత్రాలు అందాయన్నారు. హైదరాబాద్, ఏపీ, బెంగళూరులో బ్రోకర్లను గుర్తించినట్లు వెల్లడించారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి విద్యార్థులకు క్వశ్చన్ పేపర్లు అందచేసినట్లు, విష్ణుధర్ అలియాస్ విష్ణువర్దన్, తిరుమల్ అలియాస్ తిరుమలరావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

17:23 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్-2 పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించే అవసరం లేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కొంతమంది విద్యార్థులను శిక్షించి, మిగిలిన వారందరికీ న్యాయం చెయ్యాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షభ కలిగించొద్దని అన్నారు. దీనిపై సీఎం, మంత్రులు సానుకూలంగా స్పందిస్తారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

17:21 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కాసేపట్లో తిరుమల్‌, విష్ణును సీఐడీ అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రేపు రాజగోపాల్‌రెడ్డి, రమేశ్‌, వెంకట్రావు, నౌషద్‌, గుడ్డూలను అరెస్ట్‌ చేసి చూపించే అవకాశం ఉంది. మరికొందరిని అదుపులోకి సీఐడీ విచారిస్తోంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీజీపీ అనురాగ్ శర్మకు అందచేసింది. కాసేపట్లో నివేదికను సీఎం కేసీఆర్ కు డీజీపీ అందచేయనున్నారు. నివేదికను ఇవ్వడానికి కేసీఆర్ ఫాం హౌస్ కు డీజీపీ వెళ్లినట్లు సమాచారం. నివేదిక అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొననుంది. విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా చేయమని మంత్రి కడియం పేర్కొంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎంసెట్ -2 లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై దర్యాప్తు చేసిన సీఐడీ లీకేజీ వాస్తవమేనని నిర్ధారించింది. పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టి పలువురిని అరెస్టు చేసింది. దీనితో ఎంసెట్ 2 రద్దు చేస్తారన్న వదంతులు వ్యాపించాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ధర్నాలు..నిరసనలు కొనసాగాయి. మరి ఎంసెట్ -2 పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కొద్దిగంటల్లో తేలనుంది.

ఎంసెట్ విద్యార్థులు, తల్లిదండ్రులతో నాయినీ సమావేశం..

హైదరాబాద్ : ఎంసెట్ విద్యార్థులు, తల్లిదండ్రులతో హోం మంత్రి నాయినీ సమావేశం నిర్వహించారు. పేపర్ లీక్ జరిగినట్లు తల్లిదండ్రులకు నాయినీ వివరించారు. ఆందోళన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళుతానని, న్యాయం జరిగేలా చూస్తానని నాయినీ హామీనిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయమని వెల్లడించారు.

ఎంసెట్ లీక్ అధికారికంగా ఇద్దరు అరెస్టు ?

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకేజ్ వ్యవహారంలో అధికారికంగా ఇద్దరి అరెస్టును సీఐడీ చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మధ్యవర్తులు తిరుమల్, విష్ణును అరెస్టు చూపినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరికొందరిని అదుపులోకి సీఐడీ విచారిస్తోంది. మరికొందరిని అదుపులోకి తీసుకుని సీఐడీ విచారిస్తోంది. రేపు మిగతావారి అరెస్టును చూపించే అవకాశం ఉంది.

16:57 - July 28, 2016

జాతీయ అవార్డు కోసమే సినిమా తీసినట్లు దర్శకుడు ప్రభాకర్ జైనీ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'క్యాంపస్ అంపశయ్య' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో టెన్ టివి ముచ్చటించింది. 1969-70 ప్రాంతంలో ఒక యువకుడు ఉదయం నుండి సాయంత్రం వరకు రాసుకున్న కథ అని తెలిపారు. సాహిత్యంలో ఒక విప్లవం చోటు చేసుకుందని, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందన్నారు. యువతరానికి పరిచయం చేయాలనే ఉద్ధేశ్యంతో తాను చిత్రం రూపొందించడం జరిగిందన్నారు. రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పావని తెలిపారు. ఇది తనకు మొదటి సినిమా అని మౌనిక పేర్కొంది.
ఈ చిత్రంలో శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

మహాశ్వేతదేవి మృతికి సీఎంల సంతాపం..

హైదరాబాద్ : ప్రఖ్యాత రచయిత్రి మహాశ్వేతదేవి మృతికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు సంతాపం వ్యక్తం చేశారు.

సంచార జాతికి చెందిన వర్గాల మధ్య ఘర్షణ..

అనంతపురం : కదిరి (మం) కొక్కంటి క్రాస్ వద్ద సంచార జాతికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తండ్రికొడుకులు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

ప్రశ్నాపత్రం లీక్ కావడం దురదృష్టకరం - మల్లు..

హైదరాబాద్ : ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ కావడం దురదృష్టకరమని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనికి కారకులైన కఠినంగా శిక్షించాలని, ఎంసెట్ పేపర్ లీకైతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉందన్నారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని, ఎంసెట్ కుంభకోణంలో మంత్రుల ప్రమేయముందన్నారు. నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరిపించాలని సూచించారు.

16:38 - July 28, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం సంచలనం సృష్టించింది. డీఎడ్ కాలేజీల నుంచి వెరిఫికేషన్ కు సంబంధించి ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడని సమాచారం అందుకున్న డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ప్రసన్న కుమార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఎడ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున ఆయన వసూలు చేస్తున్నట్టు సమాచారం అందిందని డీఎస్పీ రమాదేవి మీడియాకు తెలిపారు. దీనితో పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రసన్నకుమార్ పై నిఘా వేయడం జరిగిందన్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు.

16:33 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకేజ్ వ్యవహారంలో మంత్రుల పాత్ర ఉందని, వారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హాయాంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎంసెట్ పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వార్తలు వస్తున్నాయని, ఈ స్కాంకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరి వెనుక ఉన్న పెద్ద వ్యక్తుల వివరాలను కూడా బయటకు చెప్పాలని సూచించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని, కేవలం ఫాం హౌస్ లకు మాత్రమే పరిమితమౌతారా అని ప్రశ్నించారు. విద్యా వ్యాపారుల జోక్యం ఉంటే వారి పాత్రను బయటపెట్టాలని మల్లు డిమాండ్ చేశారు.

16:26 - July 28, 2016

అమ్మల మార్కెట్. అతి ప్రాచీన మార్కెట్. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్.  నిత్య ఘర్షణలతో కునారిల్లే మణిపూర్ మహిళలే నిర్వహిస్తున్న మార్కెట్. ఇన్ని ప్రత్యేకతలున్న ఇమా మార్కెట్ పై ప్రత్యేక కథనం. ఆకాశంలో సగమనే మహిళల విజయానికి సాక్ష్యం మణిపూర్ లోని మదర్ మార్కెట్. 5శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ ను 5 వేలమంది మహిళలు నిర్వహిస్తున్నారు. అమ్మకాలు, వ్యాపార లావాదేవీలన్నింటినీ కేవలం మహిళలే చూసుకుంటారు. తల్లి లాంటి ఈ మార్కెట్ మహిళా చైతన్యానికి కేంద్రం. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన ఈ మార్కెట్ చారిత్రక ప్రదేశంగా మిగలాలని మానవి కోరుకుంటోంది. మహిళా శక్తికి నిదర్శనంగా నిలవాలని ఆశిస్తోంది.

ఎంసెట్ -2 లీకేజ్ లో కోట్ల రూపాయల స్కాం - మల్లు..

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకేజ్ లో కోట్ల రూపాయల స్కాం జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ స్కాంకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరి వెనుక ఉన్న పెద్ద వ్యక్తుల వివరాలను కూడా బయటకు చెప్పాలని సూచించారు.

16:12 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్ -2 రద్దు అవుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. ఈ లీకేజ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను డీజీపీ అనురాగ్ శర్మకు అందచేసింది. కాసేపట్లో నివేదికను సీఎం కేసీఆర్ కు డీజీపీ అందచేయనున్నారు. అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొననుంది. ఇదిలా ఉంటే సీఐడీ చీఫ్ ను ఎంసెట్ కన్వీనర్ రమణారావు కలిశారు. విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా చేయమని మంత్రి కడియం పేర్కొంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎంసెట్ -2 లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై దర్యాప్తు చేసిన సీఐడీ లీకేజీ వాస్తవమేనని నిర్ధారించింది. పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టి పలువురిని అరెస్టు చేసింది. దీనితో ఎంసెట్ 2 రద్దు చేస్తారన్న వదంతులు వ్యాపించాయి. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ధర్నాలు..నిరసనలు కొనసాగాయి. ఈ లీకేజ్ వ్యవహారంపై డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అధికారికంగా ఇద్దరిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఇందుకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియాకు తెలియ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఎంసెట్ -2 పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

నీటిని విడుదల చేసిన మంత్రి పోచారం..

నిజామాబాద్ : కొండూరు వద్ద గుప్పా ఎత్తిపోతల నుండి నీటిని మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు విడుదల చేశారు.

బీటెక్ కౌన్సెలింగ్ వాయిదా..

హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో రేపు జరిగే బీటెక్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. బీటెక్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీలో కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది.

 

అమరావతి సైన్స్ సిటీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు...

విజయవాడ : అమరావతి సైన్స్ సిటీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు కానుంది. సైన్స్ సిటీ వైస్ ఛైర్మన్, సీఈవోగా కృష్ణారావు అప్పసాని నియమితులయ్యారు.

 

ఆందోళన చేపట్టిన అజిత్ జోగి..

ఛత్తీస్ గడ్ : తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై అజిత్ జోగి ఆందోళన చేపట్టారు. రాయ్ పూర్ లో ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

యూపీలో దళిత దంపతుల హత్య..

ఉత్తర్ ప్రదేశ్ : దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ. 15 ఇవ్వలేదని దళిత దంపతులను హత్య చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యాంటీ డోపింగ్ ఏజెన్సీకి చేరుకున్న నర్సింగ్ కోచ్..

ఢిల్లీ : కుస్తీ క్రీడాకారుడు నర్సింగ్ యాదవ్ కోచ్ జగ్మల్ సింగ్ జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. డోపింగ్ టెస్టులో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే.

15:35 - July 28, 2016

ఢిల్లీ : బీజేపీ హాయాంలో నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. లోక్ సభలో గురువారం ధరల పెరుగుదలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తనదైన శైలిలో ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధరలను నియంత్రిస్తామని చెప్పి 2014 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఆలూ, టమాట..ఇతరత్రా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. దేశానికి ప్రధాన మంత్రి చేయవద్దని, దేశానికి కాపలా ఉంటానని ఆనాడు మోడీ పేర్కొన్నారని, ధరలపై మోడీ ఇచ్చిన మాటను తప్పారని తెలిపారు. ప్రస్తుతం పప్పు ధాన్యాలు బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సభకు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా..స్టార్టప్ ఇండియా..అంటూ ఏవో మాట్లాడుతున్నారని, రోజు రోజుకు పెరుగుతున్న ధరలపై మాత్రం మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో యూపీఏ ఎన్నో హామీలిచ్చి నెరవేర్చిందని, రుణమాఫీ చేయడం కూడా జరిగిందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించలేదని, ఎలాంటి హామీలిచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని సూచించారు. ధరలు ఎప్పుడు తగ్గిస్తారో ఒక తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళలు, రైతులను మరిచిపోవద్దని రాహుల్ గాంధీ సూచించారు.

లోక్ సభలో ప్రసంగిస్తున్న రాహుల్..

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ధరల పెరుగుదల అంశంపై సభ్యులు చర్చిస్తున్నారు. ఈ చర్చలో రాహుల్ ప్రసంగిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

15:09 - July 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ 2 లీకేజ్ ప్రకంపనలు ఏపీకి పాకాయి. అక్కడ కూడా ఎంసెట్ లీక్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీనితో విద్యార్థులు..తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి కామినేని మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ఎంసెట్ అంతా సవ్యంగా జరిగిందని, వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. ఏపీ ఎంసెట్ లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని, కొందరు కావాలనే ఇలాంటి కథనాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులందరినీ సంప్రదించడం జరిగిందన్నారు. ఏపీ ఎంసెట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని, ఆగస్టు 6,7 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించకపోవడానికి కొన్ని కారణాలున్నాయన్నారు. ర్యాంకుల్లో తేడాలను విద్యార్థులే కనిపెడుతారని, తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్ నుండే కంప్లయిట్ రావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో డిప్యూటి డీఎంహెచ్ వోల విధానాన్ని రద్దు చేయడం జరిగిందని, వారి స్థానంలో డివిజన్ కు ఒక అడిషనల్ డీఎంహెచ్ వోను నియమిస్తామన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని పేర్కొంది. వీటి ప్ర‌భావంతోనే తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా, కోస్తాంధ్ర‌లో ఓ మోస్త‌రు వ‌ర్షాలు ప‌డతాయ‌ని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీ ఎంసెట్ లీక్ వార్తలు నిరాధారం - మంత్రి కామినేని..

హైదరాబాద్ : ఏపీ ఎంసెట్ లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని మంత్రి కామినేని పేర్కొన్నారు. కొందరు కావాలనే ఇలాంటి కథనాలు సృష్టిస్తున్నారని, ఉన్నతాధికారులందరినీ సంప్రదించడం జరిగిందన్నారు. ఏపీ ఎంసెట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని, ఆగస్టు 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో డిప్యూటి డీఎంహెచ్ వోల విధానాన్ని రద్దు చేయడం జరిగిందని, వారి స్థానంలో డివిజన్ కు ఒక అడిషనల్ డీఎంహెచ్ వోను నియమిస్తామన్నారు.

దుబాయి - కాలికట్ ఇండిగో విమానం దారి మళ్లింపు..

ఢిల్లీ : దుబాయి - కాలికట్ ఇండిగో విమానం దారి మళ్లించారు. విమానంలో ఐసీస్ కు9 అనుకూలంగా నినాదాలు చేశారు. నినాదాలు చేసిన వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

ఎంసెట్ 2 లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి - రేవంత్..

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి కడియం, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డిని బర్తరఫ్ చేయాలన్నారు.

 

14:39 - July 28, 2016

హైదరాబాద్ : చేసేది ప్రభుత్వ ఉద్యోగం..అయినా డబ్బుపై ఆశ..రెండు చేతులా సంపాదించాలని పక్కదారులు తొక్కుతున్నారు. ఇలా చేయడం తప్పు అని తెలిసినా పలువురు అధికారులు లంచాలకు చేతులు జాపుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఏసీబీకి చిక్కడం కలకలం సృష్టించింది. డీఎడ్ కాలేజీల నుండి వెరిఫికేషన్ కు సంబంధించి ప్రతి విద్యార్థి నుండి డబ్బులు వసూలు చేశాడు. పక్కా సమాచారం అందుకున్న డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. మొత్తం పది లక్షలు తీసుకుంటుండగా ప్రసన్నకుమార్ ను ఏసీబీ పట్టుకుంది. పలు కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో సర్టిఫికేట్ కోసం ఒక్కో ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ప్రసన్నకుమార్ ఛాంబర్ లో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు కొద్దిసేపట్లో తెలువనున్నాయి.

ఏసీబీ అదుపులో ఏపీ ఎస్ఎస్ సీ బోర్డు డైరెక్టర్

హైదరాబాద్ : డీఎడ్ సర్టిఫికేట్ల పరిశీలన కోసం విద్యార్థుల నుండి రూ. పది లక్షలు లంచం తీసుకుంటున్న ఏపీ ఎస్ ఎస్ సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

14:32 - July 28, 2016

ఢిల్లీ : ప్రభుత్వ పథకాలకు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయడంపై రాజ్యసభ దద్దరిల్లింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. రేషన్‌ కార్డ్‌, గ్యాస్‌, పెన్షన్‌ తదితర పథకాలకు ఆధార్‌కార్డ్‌ను తప్పనిసరి చేయాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌పి సభ్యులు రాంగోపాల్‌ యాదవ్‌ సభలో ప్రస్తావించారు. దీని కారణంగా పేదలు నష్టపోతున్నారని తెలిపారు. 40 శాతం ప్రజల వద్ద ఆధార్‌కార్డులు లేవని, అవి పూర్తికాకుండానే ప్రభుత్వ పథకాలకు వాటి ఆపాదించడం సరికాదని విపక్షాలు కేంద్రంపై ధ్వజమెత్తాయి. ఆధార్‌ కార్డ్‌ను కంపల్సరీ చేయలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన వివరణకు నిరసగా విపక్షాలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో ఛైర్మన్‌ అన్సారీ సభను రెండుగంటల వరకు వాయిదా వేశారు.

14:26 - July 28, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్‌ లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తోంది.. రాష్ట్రం నిరసనలతో హోరెత్తిపోతోంది. ఓవైపు సీఐడీ విచారణలో అరెస్టులు కొనసాగుతుండగానే.. ఎంసెట్‌ 2 ర్యాంకర్లు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కారు.. తమకు పరీక్షలో మంచి ర్యాంకులు వచ్చాయని మళ్లీ పరీక్ష నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. వీరికి రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. సచివాలయంముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వీరికి ఆప్‌ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక మిగతా జిల్లాల్లోకూడా విద్యార్థిసంఘాలు ఆందోళనబాటపట్టాయి.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.. అటు మంత్రి కడియంను వరంగల్‌లో విద్యార్థులు కలిశారు. మళ్లీ పరీక్ష నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు.. ఈ నిరసనల మధ్య ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది..

సచివాలయం వద్ద ధర్నా...
ఎంసెట్‌ 2లో మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాత్రింబవళ్లు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న స్టుడెంట్స్‌ మళ్లీ పరీక్ష అన్న వార్తలతో టెన్షన్ పడుతున్నారు. ఒక్క మార్కుతో భారీ తేడా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ టెన్షన్‌తో మళ్లీ పరీక్షరాసి ర్యాంక్ తెచ్చుకోవడమంటే చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు. తమ ర్యాంకుల్ని చూసుకొని ఎంతో సంతోషపడ్డామని... తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి సచివాలయం ముందు ధర్నాకు దిగారు.

ఎంసెట్ 2 లీకేజ్ లో ప్రభుత్వమే ముద్దాయి - రేవంత్...

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వమే ముద్దాయి అని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని, సీబీసీఐడీ విచారణ పేరిట చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఎంసెట్ -2 లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

డీజీపీని కలిసిన టి. కాంగ్రెస్ నేతలు...

హైదరాబాద్ : డీజీపీ అనురాగ్ శర్మను కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. చలో మల్లన్న సాగర్ కార్యక్రమం సందర్భంగా తమ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. మల్లన్న సాగర్ లో 144 సెక్షన్ ఉన్నందు వల్లే అడ్డుకోవాల్సి వచ్చిందని డీజీపీ పేర్కొన్నారు. అక్కడ 144 సెక్షన్ ఉంటే ఇక్కడ ఎందుకు అరెస్టు చేశారని నేతలు ప్రశ్నించారు.

రేపు అన్ని శాఖాధికారులతో టి. సీఎం సమీక్ష..

హైదరాబాద్ : ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

భూ సర్వే అధికారులతో మంత్రి కేఈ సమీక్ష..

విజయవాడ : భూ సర్వే అధికారులతో మంత్రి కేఈ సమావేశం నిర్వహించారు. ప్రగతి పథంలో రెవెన్యూ శాఖ కీలకమని, సర్వే అధికారులు, ప్రజలు, రైతులతో మమేకమై పనిచేయాలని కేఈ సూచించారు. సర్వే అధికారులు రైతులు, ప్రజలను తిప్పించుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి సర్వేయర్లు వేగం పెంచాలని, సర్వేయర్లకు కావాల్పిసన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.

భారత హై కమిషన్ కార్యాలయంలో టీమిండియా..

వెస్టిండీస్ : భారత క్రికెట్ ఆటగాళ్లు కింగ్ స్టన్ లో ఉన్న హై కమిషన్ ఇండియా కార్యాలయాన్ని సందర్శించారు. హై కమిషన్ ఇండియా అధికారుల ఆహ్వానం మేరకు ఆటగాళ్లు కార్యాలయానికి వెళ్లారని బీసీసీఐ పేర్కొంది. కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీతో పాటు భాతర ఆటగాళ్లు అందరూ కార్యాలయాన్ని సందర్శించారు.

 

శ్రీరామ్ సాగర్ కు వరద ఉధృతి..

నిజామాబాద్: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. నీటిమట్టం 1070.60 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 44,830 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

ఫిల్మ్ నగర్ భవంతి కూలిన ఘటనలో ముగ్గురి అరెస్టు..

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ ఎఫ్‌ఎన్‌సీసీ భవనం కూలిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంజినీర్ సుధాకర్‌రావు, కాంట్రాక్టర్‌లు కొండల్‌రావు, బాలరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆగస్టు 7న ప్రధాని తెలంగాణకు రాక..

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 7వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన పర్యటన ఖరారైంది. ఆగస్టు 7న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం గజ్వేల్ కు ప్రయాణం. అక్కడ మిషన్ భగీరథ పైలాన్ ను ప్రారంభిస్తారు. అనంతరం 4:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. 5 గంటలకు స్థానిక బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో న్యూఢిల్లీకి బయలుదేరుతారు. 

ఎంసెట్ పై రేపు నిర్ణయం..

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకైన వ్యవహారంలో నివేదికను పూర్తిగా పరిశీలించి, కేసీఆర్, విద్యాశాఖ అధికారులతో మధ్యాహ్నం తరువాత చర్చిస్తామని మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని అన్నారు. 70 వేల మంది విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలన్నదే తమ అభిమతమని తెలిపారు.

 

 

13:52 - July 28, 2016

వర్షాకాలం వచ్చింది...వర్షాకాలం వర్షంతోపాటు వ్యాధుల్ని కూడా తీసుకొస్తుంది. మరి వ్యాధుల నుండి తప్పించుకోవటానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఎటువంటి జాగ్రర్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే నిపుణులు చెప్పే సలహాలను..సూచనలు ఈ వీడియోను చూడండి ..

13:29 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజీపై ఆప్‌ కూడా నిరసన చేపట్టింది.. విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతు తెలిపేందుకు ఆప్‌ కార్యకర్తలు సచివాలయానికి వచ్చారు.. ఈ ఘటను బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖామంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు... వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

13:29 - July 28, 2016

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రగడ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ప్రకటించాలని ఆనాడు చెప్పి ఈనాడు అధికారంలోకి వచ్చిన బీజేపీ మాట మారుస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఒకసారి ఈ ఆర్థిక ప్యాకేజీ వివరాలు తెలుసుకోవాలంటే చదవండి..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రకటించిన ఆర్థికాభివృద్ధి ప్యాకేజీ రూ. 4,49,505 కోట్లు. ఆర్థికాభివృద్ధి ప్యాకేజీలో ఇందులో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. దాని మొత్తం రూ. 24,305 కోట్లు. జాతీయ రహదారులు, విమానాశ్రయాల విస్తరణ, మెట్రో రైలు వ్యవస్థ వంటి రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలు ఆర్థికంగా సహకరించాల్సి ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. గ్యాస్ గ్రిడ్ ప్రతిపాదన పునర్ వ్యవస్థీకరణ చట్టంలో లేదు. పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. విశాఖపట్టణం - చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనను ఆధారంగా చేసుకుని ఆర్థిక ప్యాకేజీలో చేర్చారు. దీని విలువ రూ. 1,00,000 కోట్లు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్యాకేజీ సూచిక వివరాలు..

మౌలిక వసతులు  పెట్టుబడులు భరింపు సామర్థ్యం ( రూ. కోట్లు) ఆధారం
కేంద్రీయ విద్యా సంస్థలు 7,000 కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
రైల్వేలు 7,305 కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
భారీ ఓడరేవులు (దుగరాజ పట్నం)  10,000  కేంద్ర ప్రభుత్వం  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
కేంద్ర వాటా మొత్తం  24,305    
రోడ్లు  22,000  ఎన్ హెచ్ ఏఐ, పీపీపీ  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
విమానాశ్రయాలు  10,200  ఏఏఐ, పీపీపీ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
మెట్రో రైలు రవాణా వ్యవస్థ  30,000 ఎంఓయూడీ, పీపీపీ  ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
జలమార్గాలు 1,500 ఐడబ్ల్యూడబ్ల్యూఏఊ, రాష్ట్ర ప్రభుత్వం, పీపీపీ  మౌలికంపై సీఎంఓ ఇచ్చిన ప్రజంటేషన్
కేంద్ర అథారిటీపీపీపీలు  63,700    
సమీకృత ఉక్కు కేంద్రం  25,000   కేంద్ర పీఎస్ యూలు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93
గ్రీన్ ఫీల్డ్ ముడిచమురు శుద్ధి కేంద్రం 15,000  కేంద్ర పీఎస్ యూలు

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం - షెడ్యూల్ 13, సెక్షన్ 93, హెచ్ పీసీఎల్, ఐఓసీల పరిశీలన అవకాశాలు.

కేంద్ర పీఎస్ యూల వాటా  40,000    
గ్యాస్ గ్రిడ్  5,000  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

పునర్ వ్యవస్థీకరణ చట్టంలో గ్యాస్ గ్రిడ్ ప్రతిపాదన లేదు.
వెనుకబడిన ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్ల లభ్యత ద్వారా పారిశ్రామికరణ పెంపు. రాష్ట్ర గ్యాస్ గ్రిడ్ పూర్తికి గుజరాత్ రూ. 6,230 కోట్ల పెట్టుబడి

ఈ రెండు ప్రభుత్వాల వాటా  5,000    
గంగవరం ఎల్ఎన్ జీ టెర్మినల్  4,500 పీపీపీ  మౌలికంపై సీఎంఓ ఇచ్చిన ప్రజంటేషన్
ఇతర భారీ, చిన్న తరహా ఓడరేవులు 12,000 పీపీపీ  మౌలికంపై సీఎంఓ ఇచ్చిన ప్రజంటేషన్
విశాఖ - చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ 1,00,000 పీపీపీ  మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటన
ఐటీ పెట్టుబడుల ప్రాంతం, ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు  2,00,000 పీపీపీ  హైదరాబాద్ ఐటీఐఆర్ పెట్టుబడుల సామర్థ్యం రూ. 2.21 కోట్లు
పీపీపీల వాటా  3,16,500    
మొత్తం ఆర్థిక ప్యాకేజీ  4,49,505    

ఆయుధాల అక్రమ రవాణా కేసులో 12మంది దోషులు..

మహారాష్ట్ర : ఔరంగాబాద్‌ ఆయుధాల అక్రమ రవాణా కేసులో స్పెషల్‌ మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ యాక్ట్‌(ఎంసీఓసీఏ) కోర్టు నేడు తీర్పు వెలువరించింది. 2006లో జరిగిన ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించి ఎంసీఓసీఏ 12 మందిని దోషులుగా, 10 మందిని నిర్దోషులుగా నిర్ధారించింది. దోషుల్లో ముంబయి 26/11 దాడుల కీలక నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అబు జుందల్‌ కూడా ఉన్నాడు. దోషులకు శిక్ష ఖరారు కావాల్సి ఉంది.

సచివాలయం ఎదుట ఎంసెట్ విద్యార్థుల ధర్నా ..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఎంసెట్‌-2 ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్‌ను రద్దు చేయెద్దంటూ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

13:16 - July 28, 2016

హైదరాబాద్‌: సంచలనం సృష్టిస్తున్న ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ అంశం ఇరు రాష్ట్రాలను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే 7గురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం వున్నట్లుగా పలు ఊహాగానాలు రేగుతున్నాయి..దీనిపై  ఆగ్రహం..ఆవేదన వ్యక్తం చేసిన ర్యాంకర్లు..వారి తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంసెట్‌ 2లో మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. రాత్రింబవళ్లు కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్న స్టుడెంట్స్‌ మళ్లీ పరీక్ష అన్న వార్తలతో టెన్షన్ పడుతున్నారు.. ఒక్క మార్కుతో భారీ తేడా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ టెన్షన్‌తో మళ్లీ పరీక్షరాసి ర్యాంక్ తెచ్చుకోవడమంటే చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు.. తమ ర్యాంకుల్ని చూసుకొని ఎంతో సంతోషపడ్డామని... తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

13:02 - July 28, 2016

ఢిల్లీ : ఆధార్‌ కార్డ్‌ అంశంపై రాజ్యసభ అట్టుడికింది. ప్రతిపక్షాల ఆందోళనతో దద్దరిల్లింది. ఆధార్ కార్డులు లేని పేదల జీవితాలతో కేంద్రం ఆటలాడుతుందని విపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఆధార్‌ కార్డులు లేవన్న వంకతో రేషన్‌ కార్డులు, పెన్షన్లు, గ్యాస్‌ కనెక్షన్లు రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. పేదలకు అందాల్సిన సబ్సిడీపై కోత విధించవద్దన్నారు. వెంటనే కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. 100 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు ఇచ్చేందుకు పనులు యుద్ధప్రాతిపదిన జరుగుతున్నాయని వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. డైరెక్ట్ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానం ద్వారా ప్రజలకు మరింత మేలు కలుగనుందని స్పష్టం చేశారు. అయినా విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

13:00 - July 28, 2016

ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి సక్సెస్ దర్శకుడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించని సంగతి తెలిసిందే. కోదండరామిరెడ్డి..చిరంజీవి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిరంజీవిపై కోదండరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను కనుక చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే కామెడీ - లవ్ - యాక్షన్ - డ్యాన్స్ లు ఉండే సినిమా చేస్తానని..చిరంజీవి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే జనాలు చూడరని ఆయన వ్యాఖ్యలు చేయడం చిరు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీనిపై కోదంరామిరెడ్డి స్పందించారు. ఆ రోజు అలా మాట్లాడనన్న విషయం సోషల్ మీడియాలో..పలు ఛానెళ్లలో చూసే వరకు నాకు తెలియదని పేర్కొన్నారు. ఈ విషయంలో చాలా బాధ పడ్డానని, నాకు తెలియకుండానే ఆ రెండు మాటలు అన్నానని..ఏదో యథాలాపంగా మాట్లాడడం జరిగిందని చెప్పుకొచ్చారు. చిరంజీవితో నేటికి మంచి అనుబంధం ఉందని, పొరపాటుగా మాట్లాడాను కాబట్టి చిరంజీవి గారికి..చిత్ర నిర్మాత చరణ్ కి..వి.వి.వినాయక్ కి..మెగా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్లు కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. 

12:56 - July 28, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఎవరెవరు చర్చించాలో పార్లమెంట్ అధికారులు షార్ట్ లిస్ట్‌ను ఖరారుచేశారు. ఈ లిస్ట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు జైరామ్‌ రమేష్‌, టి. సుబ్బరామిరెడ్డి, దిగ్విజయ్ సింగ్‌... అలాగే టీడీపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్, తోట సీతారామాలక్ష్మీ, గరికపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు.

12:54 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజీపై మంత్రి కడియం స్పందించారు.. ఈ కేసులో సీఐడీ విచారణ జరుగుతోందని.. ప్రభుత్వానికి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు..

మంత్రులను కలిసేందుకు సెక్రటేరియట్‌వచ్చిన ర్యాంకర్లు..
ఎంసెట్ లీకేజ్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. సచివాలయంలో మంత్రులను కలిసేందుకు క్యూ కడుతున్నారు.. ఇవాళకూడా మంత్రి కడియంనుకలిసేందుకు ఎంసెట్‌ ర్యాంకర్లు, తల్లిదండ్రులు సెక్రటేరియట్‌కువచ్చారు.. అయితే వీరికి అపాయింట్‌మెంట్ లేదని సిబ్బంది అడ్డుకున్నారు..

ఎంసెట్ రద్దు చేస్తే ఊరుకోం : విద్యార్థులు
తప్పు చేసిన వారిని శిక్షించండి కానీ కష్టపడి చదివి..పరీక్ష రాసి మెంటల్ గా...ఫిజికల్ గా అలిసిపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ 2 రద్దు చేసినా..తమకు ఎటువంటి అన్యాయం చేస్తే ఊరుకోమని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని అన్యాయం చేయవద్దని విద్యార్థులు వాపోతున్నారు.

అపాయింట్‌మెంట్‌లేదని అడ్డుకున్న సిబ్బంది..
ఎంసెట్‌ లీకేజీలో కోచింగ్‌ సెంటర్ల హస్తంకూడా బయటపడుతోంది.. హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ రాక్‌టౌన్‌ కాలనీలో రెసోనెన్స్ వీ మెడికల్‌ అకాడమీకి ఈ లీకేజీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.. అకాడమీలో విద్యార్థినిలకు శిక్షణ ఇచ్చారని సమాచారం.. వారంరోజులనుంచి ఈ సెంటర్‌ నిర్వాహకులు పరారీలోఉన్నారు..

12:47 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ పేపర్‌ లీకేజీపై సీఐడీ అధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం కొనసాగుతోంది. మరో రెండు గంటల్లో సీఎం కేసీఆర్‌కు డీజీపీ నివేదిక ఇవ్వనున్నారు. మరో వైపు ఎంసెట్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప్రింటింగ్‌ ప్రెస్‌నుంచి లీక్‌ చేసినట్లు నిందితుడు షేక్‌ నిషాద్ విచారణలో వెల్లడించాడు. అయితే ఏపీ ఎంసెట్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ, ఏపీ ఎంసెట్‌ పత్రాలు ఒకే దగ్గర ప్రింట్ కావడంతో ఏపీ ఎంసెట్‌పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12:44 - July 28, 2016

హైదరాబాద్ : ప్రో-కబడ్డీలీగ్ నాలుగోసీజన్లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ కమ్ సూపర్ రైడర్ రాహుల్ చౌదరి...రైడింగ్ పాయింట్ల సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. సీజన్ కు వందపాయింట్ల చొప్పున సాధిస్తూ..నాలుగోసీజన్ డబుల్‌ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ముగిసే సమయానికే ..450 పాయింట్ల మార్క్ కు చేరువయ్యాడు. తనజట్టును ఒంటిచేత్తో సెమీస్ చేర్చిన రైడింగ్ వండర్ రాహుల్ చౌదరి పై..10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్.....

 

అత్యధిక పాయింట్లు సాధించిన ఒకేఒక్కడు రాహుల్

 

రాహుల్ చౌదరి...దేశవిదేశాలలోని కోట్లాదిమంది ప్రోకబడ్డీ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరంలేని పేరు.గత నాలుగుసీజన్ల ప్రోకబడ్డీలీగ్ చరిత్రలోనే .. కేవలం రైడింగ్ ద్వారానే అత్యధిక పాయింట్లు సాధించిన ఒకేఒక్కడు.

తెలుగు టైటాన్స్ జట్టులో సభ్యుడిగా రాహుల్ అరంగేట్రం..
2014 సీజన్లో ప్రారంభమైన ప్రోకబడ్డీలీగ్ తొలిసీజన్లోనే...తెలుగు టైటాన్స్ జట్టులో సభ్యుడిగా అరంగేట్రం చేసిన రాహుల్..సీజన్ సీజన్ కూ తన ప్రతిభను మెరుగుపరచుకొంటూ...రైడర్ నెంబర్ వన్ గా దూసుకుపోతున్నాడు. తెలుగు టైటాన్స్ కెప్టెన్ గా.. జట్టును ముందుండి విజయపథంలో నడిపిస్తున్నాడు.

ప్రోకబడ్డీలో వందపాయింట్ల రికార్డు..
ప్రారంభ కబడ్డీలీగ్ సీజన్లో యూ-ముంబా జట్టుపైన రాహుల్.. రైడింగ్ లో పాయింట్ల సెంచరీ పూర్తి చేశాడు. ప్రోకబడ్డీలో వందపాయింట్ల రికార్డు చేరిన తొలిరైడర్ గా రికార్డుల్లో చేరాడు.2015 సీజన్లో బెంగాల్ వారియర్స్ పై రాహుల్ చౌదరి 200 పాయింట్ల మైలురాయిని అందుకొన్నాడు.

ఢిల్లీ పై రాహుల్ చౌదరి ..ట్రిపుల్ సెంచరీ పాయింట్ ..
2016లో జరిగిన మూడోసీజన్లో ...దబాంగ్ ఢిల్లీ పై రాహుల్ చౌదరి ..ట్రిపుల్ సెంచరీ పాయింట్ సాధించాడు. ఇక..ప్రస్తుత నాలుగోసీజన్లో...రాహుల్ అత్యుత్తమంగా రాణిస్తూ తనజట్టును ..కేవలం తన రైడింగ్ ప్రతిభతోనే సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు.న్యూఢిల్లీ త్యాగరాజ ఇండోర్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ తోముగిసిన 13వ రౌండ్ పోటీలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ కమ్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి చెలరేగిపోయాడు.

రాహుల్ ఒక్కడే సాధించిన 11 పాయింట్లు..
రాహుల్ చౌదరి ఒక్కడే 11 పాయింట్లు సాధించి..తనజట్టుకు 35-23 పాయింట్ల విజయం అందించాడు. ప్రస్తుత నాలుగోసీజన్లోనే తన రైడింగ్ పాయింట్ల సంఖ్యను రాహుల్ 108కు పెంచుకొని ..వారేవ్వా అనిపించుకొన్నాడు. అంతేకాదు...డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తో ముగిసిన ఆఖరి రౌండ్ పోటీలో సైతం రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆట మొదటిభాగానికే ఆరు పాయింట్లు సాధించి..తనజట్టుకు భారీ ఆధిక్యం అందించిన రాహుల్...రెండోభాగంలో మరో ఏడుపాయింట్లు సంపాదించాడు.

13 పాయింట్లతో రాహుల్ చౌదరి టాప్ స్కోరర్ గా..
మొత్తం 13 పాయింట్లతో రాహుల్ చౌదరి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో ఓవరాల్ గా 121 పాయింట్లు సాధించి..14 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశను విజయవంతంగా ముగించాడు. నాలుగుసీజన్లలో రాహుల్ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల ద్వారా 440కి పైగా పాయింట్లతో చరిత్ర సృష్టించాడు. 450 పాయింట్ల రికార్డుకు మరింత చేరువయ్యాడు.

450 పాయింట్ల రికార్డుకు చేరువగా రాహుల్..
హోంగ్రౌండ్ హైదరాబాద్ వేదికగా జరిగే సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ పోటీలోనూ రాహుల్ ఇదేజోరు కొనసాగిస్తే...450 పాయింట్ల మార్క్ చేరడం ఏమంత కష్టంకాబోదు.

12:32 - July 28, 2016

వరంగల్‌ : ఎంజీఎం ఆస్పత్రి కుంభకోణాలకు నిలయంగా మారింది. మొన్న ఆక్సిజన్‌ సిలిండర్ల కుంభకోణం.. నిన్న ఆర్ఎల్ సెలైన్ల కుంభకోణం... తాజాగా మందుల కొనుగోల్లో గోల్‌మాల్‌ వ్యవహారం పెద్దాస్పత్రి ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. కాలం చెల్లిన మందులు, నాసిరకం ఇంజెక్షన్లతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిపై 10 టీవీ ప్రత్యేక కథనం.

తెలంగాణకు గుండెకాయ ఎంజీఎం ఆసుపత్రి..
ఇది వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి. తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ ఆస్పత్రి నిర్వహణా లోపంతో సమస్యల వలయంగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడకు రోగులు వస్తున్నారు. కానీ వరుస కుంభకోణాలతో ఎంజీఎం ఆస్పత్రి ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది.

ఆక్సిజన్‌ సిలిండర్ల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు..
ఎంజీఎం ఆస్పత్రిలో వెలుగు చూసిన కుంభకోణాలు ఒక్కటి కాదు.. రెండు.. కాదు. మందులు, ఇంజెక్షన్లు, ఆహారం, ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా నుంచి నిర్మాణాల వరకు అన్నింటా అక్రమాలే చోటు చేసుకుంటున్నాయి. ఆక్సిన్‌ సిలిండర్ల కుంభకోణంపై సీబీసీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగా... తాజాగా కాలం చెల్లిన మందులు, నాసిరకం ఇంజెక్షన్లను సరఫరా చేస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీల్లో తేలింది. దీంతో ఎంజీఎం ఆస్పత్రి డాక్టర్ల నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టు అయ్యింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు... నాసిరకం ఇంజెక్షన్ల సరఫరా అంశంపై ఏమి చేయాలో పాలుపోక తలలు బాదుకుంటున్నారు.

నాసిరకం ఆర్‌ ఎల్‌ ద్రావణంపై 10 టీవీ వరుస కథనాలు..
తెలంగాణ ఔషద మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా హసీబ్‌ ఫార్మా స్యూటికల్స్‌ నుంచి సరఫరా చేసిన ఆర్‌ఎల్‌ ద్రావణాన్ని వాడొద్దన్ని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా... డాక్టర్లు ముందుగా చెవికి ఎక్కించుకోలేదు. దీంతో ఆర్‌ ఎల్‌ ద్రావణం సరఫరా వ్యవహారంపై టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనాలతో స్పందించిన ఎంజీఎం ఆస్పత్రి దిద్దుబాటు చర్యలు చేట్టాయి. అయితే ఈ వ్యవహారం జరిగి వారం గడవక ముందే ఇప్పుడు మరో కుంభకోణం వెలుగు చూసింది. అనస్తీషియా విభాగంలో థయోపెంటోన్‌ సోడియం నాసిరకం ఇంజక్షన్ల సరఫరా అంశం బయటపడింది. ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇస్తున్నార్న విషయం వెలుగు చూడటంతో రోగులు ఒక్కసారిగా కలవరాన్ని గురయ్యారు.

ప్రాలీడాక్సైన్‌ ఐడెడ్‌ యాంపిల్స్‌ బయట నుంచి కొనుగోలు ?
ఈ ఘటన తర్వాత స్థానికంగా మందులు కొనుగోలు చేస్తున్న వ్యవహారం బయటపడింది. తెలంగాణ ఔషద మౌలికసదుపాయల సంస్థ ఆధీనంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి మాత్రమే మందుతు కొనుగోలు చేయాలి. కానీ బయట నుంచి కొనుగోలు చేసిన హెచ్‌ఎల్‌ఐ 540 ఎల్‌ బ్యాచ్‌కి చెందిన ప్రాలీడాక్సైన్‌ ఐడెడ్‌ యాంపిల్స్‌లో పార్టికులేట్‌ మాటర్స్‌... అంటే చిన్నచిన్న గడ్డలు ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ అధికారుల తనిఖీల్లో తేలింది. ప్రాలీడాక్సైన్‌ ఐడెడ్‌ యాంపిల్స్‌ బయట కొన్న వ్యవహారం బయటపడిన తర్వాత నేరం మీదకు రాకుండా చేసుకునే క్రమంలో నెపాన్ని తెలంగాణ ఔషధ మౌలిక సదుపాయల సంస్థకు చెందిన సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా చేసేందుకు డాక్టర్లు శతవిధాల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ప్రాలీడాక్సైన్‌ ఐడెడ్‌ యాంపిల్స్‌ నాసిరకం ఇంజక్షన్లను స్వాధీనం చేసుకుని తదుపరి పరీక్షలకు పంపారు. ఈ ఇంజక్షన్‌ వాడితే రోగుల ప్రాణాలకు ముప్పు అని చెబుతున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు...
చిన్న చిన్న గడ్డలు ఉన్న ప్రాలీడాక్సైస్‌ ఐడెడ్‌ యాంపిల్‌ ఇంజెక్షన్లతో ప్రాణహాని ఉందని ఔషధ నియంత్ర విభాగం అధికారులు హెచ్చరిస్తున్నా... దేమీలేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు.

ఎనిమిది రకాల మందులునాసిరకమైనవిగా గుర్తింపు..
ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీల్లో ప్రాలిడాక్సైన్‌ ఐడెడ్‌ యాంపిల్స్‌తోపాటు మరో ఎనిమిది రకాల మందులు కూడా నాసిరకమైనవిగా గుర్తించారు. ప్రాలిడాక్సైన్‌ క్లోరైడ్‌ , హిమాక్సిలిన్‌ అండ్‌ పోటాషియం క్లావ్యులనేట్‌ ఇంజెక్షన్లతో నాణ్యతలేదని ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో వీటిని కూడా స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపారు. లక్షల రూపాయల వ్యయంచేసి కొనుగోలు చేసిన నాణ్యతలేని మందుల వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తే మినహా.. పాపాల భైరవులు బయటపడే అవకాశం లేదు. నాసిరకం మందులతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోక ముందే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

12:24 - July 28, 2016

చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లర్ సంగీతా చటర్జీ అరెస్టుకు లైన్‌క్లియర్‌ అయింది. కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతోందని చిత్తూరు పోలీసులు కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల 31 లోపు చిత్తూరు కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు చటర్జీని ఆదేశించింది.

నిమ్స్ అక్రమాలపై చార్జ్ షీట్ ..

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుపై ఏసీబీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులు ధర్మరక్షక్, శ్రీధర్, ముకుంద్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి , వికాస్ లపై చార్జ్ షీటు దాఖలు చేసింది. రూ.3కోట్లు అక్రమాలు జరిగాయనే అభియోగంతో చార్జ్ షీట్ లో పేర్కొంది. 120బీ, రెడ్ విత్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. నిందితులు గుడ్డూ, షేక్ నిషాద్ వెంకట్రావుగా అధికారులు పేర్కొన్నారు. రూ.10కోట్లకు బిడ్డింగ్ పిలిచిన మాజా డైరెక్టర్ ధర్మరక్షక్ పై అభియోగం నమోదయ్యింది.

11:53 - July 28, 2016

అమెరికా : నడక ఆరోగ్యానికి మంచిదేగానీ.. అది ఏమాత్రం మితిమీరినా నీరసం ఖాయం! విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో ఒక్కోసారి ఒక చివరి నుంచి మరో చివరకు చేరేసరికి కాళ్లు లాగేస్తూంటాయి. బోర్డింగ్ టైమ్ దగ్గరపడిందంటే.. చేతిలో లగేజీతో నానా అవస్థలు పడుతుంటారు. ఈ ప్రాబ్లమ్స్‌ అన్నింటికీ చెక్‌పెట్టే సరికొత్త బ్యాగ్‌ చికాగోలో తయారైంది.. మోడోబ్యాగ్‌ పేరుతో పిలిచే ఈ బ్యాగ్‌ చిన్నపాటి స్కూటర్‌లా పనిచేస్తుంది.. దాదాపు 90 కిలోల బరువున్న వారిని కూడా మోసుకెళ్లగల ఈ మోడోబ్యాగ్ ఒకసారి చార్జ్ చేస్తే గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తొమ్మిదిన్నర కిలోమీటర్లవరకూ ప్రయాణించవచ్చు.. చికాగోలో తయారైన ఈ బ్యాగ్ కోసం 200 వాట్ల విద్యుత్ మోటార్‌ను ఉపయోగించారు. విమాన ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని సిద్దం చేసినప్పటికీ రైల్వేస్టేషన్లలో, భారీస్థాయి షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ కార్ట్‌గా ఈ బ్యాగ్‌ చాలా ఉపయోగపడుతుం

11:49 - July 28, 2016

యూరప్‌ : యూరప్ లోనే అత్యంత ఎత్తైన పర్వతమైన మాంట్‌ బ్లాంక్‌పై ప్రపంచంలోనే టాప్‌ క్లాస్‌ పారా గ్లైడర్లుగా పేరున్న...టిమ్‌ అలోంగీ, ఫ్రాంకోయిస్‌ రగోల్‌స్కీ, మార్టిన్‌ ష్రికే .... పెద్ద సాహసమే చేశారు.4800 మీటర్ల ఎత్తులో ఈ ముగ్గురు ప్రదర్శించిన డేర్‌డెవిల్‌ ఫీట్స్‌ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌లోనే అత్యంత క్లిష్టమైన స్టంట్‌..
పారా గ్లైడింగ్‌......ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌లోనే అత్యంత క్లిష్టమైన స్టంట్‌. సముద్రమట్టానికి కొన్ని వేల మీటర్ల ఎత్తులో పారాచ్యూట్‌తో గాల్లో ఎగరడం...గాలికి అనుగుణంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ....ఫీట్స్‌ ప్రదర్శించడమంటే మాటలు కాదు.

అత్యంత ఎత్తైన పర్వతమైన మాంట్‌ బ్లాంక్‌..
యూరప్‌లోనే అత్యంత ఎత్తైన పర్వతమైన మాంట్‌ బ్లాంక్‌పై ప్రపంచంలోనే టాప్‌ క్లాస్‌ పారా గ్లైడర్లుగా పేరున్న...టిమ్‌ అలోంగీ, ఫ్రాంకోయిస్‌ రగోల్‌స్కీ, మార్టిన్‌ ష్రికే .... పెద్ద సాహసమే చేశారు.

4809 మీటర్ల ఎత్తులో డేర్‌డెవిల్‌ స్టంట్స్‌ ..
ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని డేర్‌డెవిల్‌ స్టంట్స్‌ ప్రదర్శించారు.మాంట్‌ బ్లాంక్‌ పర్వతంపై రిస్క్‌ను సైతం లెక్క చేయకుండా.....పారా గ్లైడింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరచారు. రికార్డ్‌ లెవల్లో 4809 మీటర్ల ఎత్తులో పారాగ్లైడింగ్‌ ఫీట్స్‌ చేసి ఔరా అనిపించారు.

పారాగ్లైడింగ్ లో సరికొత్త ప్రపంచ రికార్డ్ ..
గాల్లో పక్షుల్లా ఎగరడం మాత్రమే కాదు..... గిరికీలు కొట్టి మరీ చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు.గంటసేపు పారాగ్లైడింగ్‌ చేయడం మాత్రమే కాదు....గాల్లో ఏకంగా 50 సార్లుపారాచ్యూట్‌తో గాల్లో గిరికీలు కొట్టి రికార్డ్ నమోదు చేశారు.

4800 మీటర్ల ఎత్తులో తొలిసారి ఫీట్స్..
4800 మీటర్ల ఎత్తులో పారాగ్లైడింగ్‌ చేయడం ఇదే తొలి సారి కావడం విశేషం. అసలే మాత్రం తడబడకుండా అలోంగీ, రగోల్‌స్కీ, ష్రికే ప్రదర్శించిన ఫీట్స్‌ ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా నిలిచాయి.ఒక్కసారి తలచుకుంటే...అసాధ్యమంటూ ఏదీ ఉండదని ఈ ముగ్గురు పారాగ్లైడర్లు మరోసారి నిరూపించారు.

11:31 - July 28, 2016

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టిస్తున్న ఎంసెట్ 2 స్కామ్ లో మరో ముగ్గురు వ్యక్తులను సీఐడీ అధికారలు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో గుడ్డూ, షేక్ ఇప్పటికే నలుగురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెడికల్ బీ భవన్ యజమాని వెంకట్రావును కూడా అధికారలు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుండి లీక్ చేసినట్లు షేక్ నిషాద్, వెంకట్రావులుగా తెలిపారు. వీరితో పాటు ఇప్పటివరకూ అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. వీరిని మసాబ్ ట్యాంక్ జేఎన్టీయూ వర్శిటీలో విచారిస్తున్నారు. ఈ స్కామ్ లో మొత్తం ఎనిమిదిమంది నిందితులుగా అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో నిందితుడికోసం గాలిస్తున్నారు. నిందితుల నుండి పలు ఆసక్తికర విషయాలను అధికారులు రాబడుతున్నారు. సమగ్ర విచారణ అనంతరం సాయంత్రానికి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు పరీక్షలు రాసి మానసికంగా..శారీరకంగా అలసిపోయిన విద్యార్థులు మరోసారి పరీక్ష అంటే హడలిపోతున్నారు. ఇప్పుడు వచ్చిన ర్యాంక్ మళ్ళీ వస్తుందోరాదోనని భయపడుతున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని..తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సరైననిర్ణయం తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్నారు. ఈ విషయంపై మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి ఎంసెట్‌ 2లో నిజాయితీగా చదివిన తమకు అన్యాయం చేయొద్దని మెడికల్‌ ర్యాంకర్స్‌ ప్రభుత్వాన్ని కోరారు.. పేపర్ల లీక్‌వల్ల తాము మానసికంగా ఎంతో టెన్షన్‌తోఉన్నామని... ఇప్పుడు మళ్లీ పరీక్ష అంటే కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజ్‌లో దోషులను శిక్షించాలని... తమ ర్యాంకులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు..

ఎంసెట్ 2 లో మరో ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టిస్తున్న ఎంసెట్ 2 స్కామ్ లో మరో ముగ్గురు వ్యక్తులను సీఐడీ అధికారలు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో గుడ్డూ, షేక్ ఇప్పటికే నలుగురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెడికల్ బీ భవన్ యజమాని వెంకట్రావును కూడా అధికారలు అరెస్ట్ చేశారు.

11:12 - July 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తొమ్మిది వర్శిటీలకు వీసీలను నియామకం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవోను నిలుపుదల చేస్తూ రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయంస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో కేసు కొనసాగుతున్నప్పుడు నియామకం ఎలా చేస్తారంటూ ప్రభుత్వానికి ఇప్పటికే  కోర్టు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇన్ని సంవత్సరాలు ఆగినవారు  కొద్దిరోజులు ఆగలేరా?అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో వీసీల నియామకాన్ని నిలుపుదల చేస్తూ న్యాయస్థానం ప్రకటించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

వీసీలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు?..

హైదరాబాద్ : వర్శిటీలలో వీసీలను నియామకం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం స్పందించింది. కోర్టులో కేసు కొనసాగుతున్నప్పుడు నియామకం ఎలా చేస్తారని ఇప్పటికే ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీసీల నియామకాన్ని రద్తు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

10:45 - July 28, 2016

కరీంనగర్ : ఇసుక మాఫియా చెలరేగుతుంది...అక్రమంగా తరలించడంతో పాటు అడ్డొచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు..కరీంనగర్ జిల్లాలో మాఫియాను అడ్డుకున్న అధికారులపై దాడులు చేస్తూ వెంబడించారు...ఈ క్రమంలో మాఫియా కారు బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు...ఈ దాడులకు పాల్పడిందెవరు..? వారికి ధైర్యం ఇచ్చిందెవరు..? వెనకాల ఉండి నడిపిస్తున్నదెవరు..???

అధికారులను వెంబడించే క్రమంలో ఒకరి మృతి..

కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఇసుక మాఫియా ఆగడాలను నియంత్రించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది...ఈ క్రమంలోనే సిరిసిల్లలోని జిల్లెల్ల క్రాసింగ్‌ వద్ద చెక్‌పోస్టు అధికారులు తనిఖీలు చేస్తుండగా లోడ్‌తో ఉన్న ఇసుక లారీలు కన్పించాయి..దీన్ని విచారిస్తున్న సమయంలో లారీ యజమానులు..కొందరు స్థానికులు వెనకాలే వచ్చి అధికారులపై దాడికి యత్నించారు..

స్మగ్లర్ల వాహనం ప్రమాదంలో ఒకరు మృతి..
ఇసుక దాడులకు యత్నించడంతో వాహనాల నంబర్లు నోట్ చేసుకున్న ఆర్టీఏ అధికారులు అక్కడి నుంచి బయల్దేరారు..అయినా లారీ యజమానులు..కొందరు స్థానికులు వెంబడిస్తూ మెదక్ జిల్లా చిన్న కొడూరు ప్రాంతంలో ఇన్నోవా వాహనం బోల్తా కొట్టింది..జిల్లెల్లలో కారు చెట్టుకు ఢీకొంది..అందులో ఉన్న సుస్తులాపూర్ చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి చనిపోగా మరొకరు గాయపడ్డారు... జరిగిన ఘటనపై ఆర్టీఏ అధికారులు సిరిసిల్ల పోలీసు స్టేషన్‌లో సమాచారం అందించారు...దాడికి పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు..

ఇసుక మాఫియా వెనుక ఎవరి హస్తముంది?
ఇసుక మాఫియా చెలరేగుతుందనడానికి ఈ దాడులే తాజా నిదర్శనం..వీరి వెనకాల ఎవరున్నారు..? వారికి సహకరిస్తున్నవారెవరు..? అధికారులపైనే హత్యాయత్నాలకు పాల్పడుతున్నారంటే లోతుగా శోధించాల్సిన అవసరం ఉంది...

10:39 - July 28, 2016

మెదక్ : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో మెదక్ జిల్లాకు రానున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పనుల్లో నిమగ్నవయ్యింది. మల్లన్నసాగర్ భూసేకరణ పనుల్లో పురోగతి ఉందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మెదక్ జిల్లాలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామనీ..సభావేదిక విషయంలో కోమటి బండ, ములుగు ప్రాంతాలు పరిశీలనలో వున్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కోటి 36 లక్షల మొక్కలు జిల్లాలో నాటామని తెలిపారు.మల్లన్నసాగర్ భూసేకరణ అనేది ప్రజాభిప్రాయసేకరణతోనే జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఎంసెట్ 2 లీక్ లో జేఎన్టీయూ ప్రొఫెసర్?..

హైదరాబాద్ : తెలంగాణలో లీకైన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం కేసులో జేఎన్టీయూ ప్రొఫెసర్ హస్తమున్నట్టు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్ ను లీక్ చేసిన నిందితులను విచారిస్తున్న క్రమంలో కాల్ లిస్టును పరిశీలించిన అధికారులకు జేఎన్టీయూ ప్రొఫెసర్ నంబర్ వున్నట్లుగా సమాచారం. దీంతో పాటు మరో ముగ్గురు వర్శిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నంబర్లు కూడా ఉన్నాయి. వీరితో నిందితులు పలుమార్లు మాట్లాడినట్టు తేలడంతో వారిని కూడా విచారించాలని భావిస్తున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు ఈ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 111 పాయింట్లకు పైగా లాభపడి 28,135 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 29 పాయింట్లకు పైగా లాభపడి 8,645 సూచీ వద్ద ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 67.02 గా ఉంది.

09:42 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్ 12 పరీక్షా పేపర్ లీక్ అనేది పెను సంచలనంగా మారింది. ఈ స్కామ్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పలువురు నిందితులు విచారణలో బయటపడ్డారు. విచారణలో భాగంగా సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మసాబ్ ట్యాంక్ జేఎన్టీయూ వర్శిటీలో నిందితులను విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందించనున్నారు. రద్దుపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. లీకేజ్ నిర్ధారణ అయితే పరీక్షను మరోసారి నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ స్కామ్ లో దాఆపు 72మంది విద్యార్ధులు లాభపడినట్లుగా విచారణ లో తేలింది. ఒక్కో విద్యార్థి వద్ద నుండి నిందితులు రూ.50 లక్షలకు బేరం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ గా రూ.10 నుండి 20 లక్షలు తీసుకున్నారు. ఈ స్కామ్ లో ప్రధాన సూత్రధాని గోపాల్ రెడ్డిగా నిరూపణ అయ్యింది. ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీఐడీ అధికారులు పరారీలో వున్న మరో నలుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అధికారులు కేసులు నమోదు చేయనున్నారు. వారి కాల్ డేటా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎసెంట్ 2 విచారణలో భాగంగా ప్రధాన నిందితుడైన గోపాల్ రెడ్డి ఎసెంట్ 1 పేపర్ ప్రశ్నాపత్రం కూడా లీక్ చేసినట్లుగా తెలిపాడు. దీంతో పరీక్ష రద్దు చేస్తారా? లేదా? అనే విషయంలో నేడు ప్రభుత్వం ప్రకటించనుంది. లీక్ కు సంబంధించిన మూలాలు ఏపీకి కూడా విస్తరించటంతో విజయవాడలో కూడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వ్యక్తులపై నిఘా వేసినట్లుగా సమాచారం. ఇదిలా వుంటే ఈ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి గానీ ..కొంతమంది చేసిన మోసానికి వేలాదిమంది విద్యార్థులకు అన్యాయం చేయటం సరికాదని..విద్యార్ధులు ..వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం విద్యార్థులు..తల్లిదండ్రులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది తేలాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే..దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

09:36 - July 28, 2016

తూ.గోదావరి : విద్యార్థులు ఆత్మహత్యలు ఈ విషయం సర్వసాధారణంగా మారిపోతోంది. మార్కులు రాలేదని కొందరూ..ఉపాధ్యాయులు మందలించారని కొందరూ..చదువులో వెనుకబడుతున్నామనీ కొందరూ.. ఇలా రకరకాల కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకు చదవాలతో చెబుతున్న విద్యావిధానం ఎలా బ్రతకాలో..వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొవాలో తెలపటంలేదు. తమకు వచ్చిన సమస్య నుండి ఎలా బయటపడాలతో తెలీక టీనేజ్ వయస్సులోనే అయోమయావస్థలో పడి తమ జీవితాలను కడతేర్చుకుంటున్నారు.కారణాలు ఏమైనా దేశ భవిష్యత్తును శాసించే యువత ఇలా అకాల మృత్యువుకు బలికావటం దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు దేశానికి కూడా నష్టంగా పరిణమించవచ్చు..తమకు వచ్చిన కష్టాన్ని తోటివారితో పంచుకుంటే కొంతవరకూ ఉపశమనం దొరకవచ్చు..కానీ ఒంటరితనం కంటే పెద్దశిక్ష మనిషి మరొకటి వుండదు..ఈ ఒంటరితనాన్ని భరించలేక ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వున్న నారాయణ కాలేజ్ లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది.. ఈ నేపథ్యంలోనే కాకినాడ నారాయణ కళాశాలకు చెందిన హాస్టల్లో ఇంటర్ రెండవ సంవత్సరం గెడ్డం భారతి అనే విద్యార్థిని ఫ్యాన్ కు  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు అందించిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సదరు విద్యార్థి రాసిన ఆత్మహత్య నోటు ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆత్మహత్య చేసుకున్న భారతి అనే విద్యార్థిని ఒంటిరితనాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. భారతి తల్లి ఉపాధి కోసం గల్ఫ్ కంటీ వెళ్లిన నేపథ్యంలో ఆమె హాస్టల్ లోనే వుంటోంది. ఆమె హాస్టల్లో జాయిన్ అయినప్పటి నుండి ఎవరితోనూ సరిగ్గా కలిసేది కాదనీ..సాటి విద్యార్థినిలు తెలిపారు. కాగా భారతి పశ్చిమగోదావరి జిల్లా అంతర్వేది వాసిగా పోలీసులు తెలిపారు. పోస్టు మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.

అగ్నిప్రమాదం..600 సీసీ కెమోరాలు ఆహుతి..

హైదరాబాద్: కోఠిలోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో అగ్రిప్రమాదం సంభవించింది. దీంతో  సుమారు రూ. కోటి మేర ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. అగ్నిప్రమాదంలో 600 సీసీ కెమెరాలు కాలిబూడిదయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో పరిటాల పర్యటన..

శ్రీకాకుళం : జిల్లాలో మంత్రి పరిటాల సునీత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

నర్సింగ్ యాదవ్ ఇన్? అవుట్?..

హైదరాబాద్ : నేడు రెజ్లర్ నిర్సింగ్ యాదవ్ భవితవ్యం నేడు తేలనుంది. డోపింగ్ వివాదంపై నేడు వాడా తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా నర్శింగ యాదవ్ పై డోపింగ్ పరీక్షకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటులకు సీబీఎఫ్సీ నోటీసులు..

ముంబై : బాలీవుడ్ నటులు, ప్రొడక్షన్ హౌస్ లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఎఫ్సీ) నోటీసులు జారీ చేసింది. అమీర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ లాంటి నటులకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అంటూ యశ్ రాజ్ ఫిల్మ్స్, సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలకు సీబీఎఫ్సీ నోటీసులు పంపించింది. అలాగే ఆయా సంస్థల నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో వెల్లడించాలని పలువురు నటులకు కూడా సీబీఎఫ్సీ నోటీసులు జారీ చేసింది.

ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..

తూ.గోదావరి : కాకినాడ నారాయణ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ రూమ్ లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో హాస్టల్ లో విషాదం నెలకొంది.

 

ఎంసెట్-3 కి నోటిఫికేషన్?..

హైదరాబాద్ : ఎంసెట్-2ను రద్దు చేసి తాజాగా ఎంసెట్-3ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ లీకైనట్టు సీఐడీ అధికారులు నిర్ధారించడంతో ఎంసెట్-2ను రద్దు చేయాలని, ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఐడీ అధికారుల దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అదే కనుక జరిగితే దాదాపు 70 వేలమంది విద్యార్థులు ఎంసెట్-3కి హాజరుకాక తప్పదు.

దత్తత గ్రామాల్లో కేటీఆర్ పర్యటన..

కరీంనగర్: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు నేడు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మంత్రి తాను దత్తత తీసుకున్న గ్రామం దేశాయిపేటను సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

దంపతుల ఆత్మహత్య..

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం గోండుగూడలో విషాదం. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కిరణ్(25), అంజలి(23)గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని గ్రామస్థులు పేర్కొన్నారు.

కలాం వర్థంతి..ఆటో ఫ్రీ..

చెన్నై: అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవరు ప్రయాణికులకు ఉచిత సేవలందించాడు. ఇదే తాను అబ్దుల్‌ కలాంకు తానిచ్చే నివాళిగా పేర్కొన్నాడు. నగరంలోని తేనాంపేటకు చెందిన కలయరసన్‌ బుధవారం ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు అడయారు, కోడంబాక్కం, కెకె.నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉచితంగా విద్యార్థులను పాఠశాలలకు చేరవేయడం, మహిళలను గమ్య స్థానాలకు చేర్చడం లాంటివి చేశాడు.

అమర్‌నాథ్‌ యాత్రకు అంతరాయం..

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను బుధవారం నిలిపివేశారు. వివిధ ప్రదేశాలకు చేరుకున్న యాత్రికులను నిర్దేశిత క్యాంపుల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అయితే ఆలయం దగ్గర్లోకి వెళ్లిన 800 మంది దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు.

07:54 - July 28, 2016

ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాల లీక్ పై తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం రేపుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం విచారణలో పలు సంచలనాత్మక అంశాలు బయటపడ్డాయి. సుమారు రూ.50కోట్ల స్కామ్ బయటపడింది. ఈ నేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. కాగా సీఐడీ విచారణలో ఎంసెట్ 1 ప్రశ్నాపత్రాన్ని కూడా లీక్ చేసినట్లుగా తేలింది. విచారణ పూర్తి అయిన అనంతరం గురువారం నాడు సీఐడీ తెలంగాణ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? నిజాయితీగా పరీక్షలు రాసిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టంది. ఈ చర్చలో నరేందర్ గౌడ్ (టీఆర్ఎస్ నేత), లక్ష్మణరావు (సీఐటీయే నేత) మదన్ మోహన రెడ్డి (వైసీపీ నేత) పాల్గొన్నారు.ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమచారం తెలుసుకోండి..

07:39 - July 28, 2016

అయిదు స్టేట్ బ్యాంక్ లను ఎస్ బిఐలో విలీనం చేయాలన్న నిర్ణయం తీవ్ర ప్రకంపనలు స్రుష్టిస్తోంది. విలీనానికి వ్యతిరేకంగా జులై 29న దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె చేయబోతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు, చేతివ్రుత్తులవారికి బ్యాంక్‌ ల విలీనం శాపంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు

1969లో బ్యాంక్ ల జాతీయీకరణ..
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకున్నాయి. వీటి పట్ల వ్యతిరేకతా పెరుగుతోంది. 1969కి పూర్వం మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రయివేట్ సంస్థల చేతుల్లో వుండేది. ఇందిరాగాంధీ హయాంలో చేపట్టిన 14 బ్యాంక్ ల జాతీయకరణ ఈ రంగాన్ని సామాన్యులకు చేరువ చేసిందనడంలో సందేహం లేదు. అప్పటి జన సంఘ్ నేత, మాజీ ప్రధాని వాజ్ పేయి బ్యాంక్ జాతీయకరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

67 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా పంపిణీ ..
బ్యాంక్ ల జాతీయకరణతో ఏర్పాటైన ప్రభుత్వరంగ బ్యాంక్ లు దేశాభివ్రుద్దిలో కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లు ప్రజల నుంచి దాదాపు 90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించాయి. ఇందులో 67 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా పంపిణీ చేశాయి. వెనకాముందు ఆలోచించకుండా బడా పారిశ్రామికవేత్తలకు ఇబ్బడిముబ్బడిగా రుణాలిచ్చిన మాట వాస్తవమే అయినా, సామాన్య ప్రజలకు, రైతులకు, చిన్న చిన్న పరిశ్రమలవారికి, చేతి వ్రుత్తులవారికి తక్కువ వడ్డీలకే రుణాలిచ్చిన విషయాన్నీ కాదనలేం. బడాబాబులు లక్ష కోట్ల రూపాయల రుణాలు మొండిబాకీలుగా మారి, ప్రభుత్వరంగ బ్యాంక్ ల ఉనికికే సవాలు విసురుతున్నాయి. ఎస్ బిఐ రూ. 72, 792 కోట్లు , బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 38, 934 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 34,338 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 36, 519 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్ రూ. 19, 615 కోట్లు, ఇండియన్ ఓవరీస్ బ్యాంక్ రూ. 22, 672 కోట్లు చొప్పున మొండిబకాయిలున్నాయి.

67 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా పంపిణీ..
వీ
టిని వసూలు చేసుకోవడానికి, ఆయా యాజమాన్యాల ముందు బ్యాంక్ సిబ్బంది ధర్నాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, పారిశ్రామికవేత్తల దగ్గర పేరుకుపోయిన మొండిబాకాయిలను వసూలు చేసే విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. సంస్కరణల యుగంలోనే మొండిబకాయిలు విపరీతంగా పెరగడం మరో విశేషం.

బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న కేరళ ప్రభుత్వం..
ఓ వైపు మొండిబకాయిలు కలవరపెడుతున్న సమయంలోనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. అదే బ్యాంక్ ల విలీనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్ బ్యాంక్ లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలంటూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదస్పదమైంది. ఈ నిర్ణయాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలూ వ్యతిరేకిస్తున్నాయి.

స్టేట్ బ్యాంక్ లో 5 బ్యాంకుల విలీనం..
అయిదు బ్యాంక్ లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం వల్ల ప్రపంచంలోని టాప్ టెన్ బ్యాంక్ ల్లో ఒకటిగా అది అవతరిస్తుంది. అంతకు మించి మరే ప్రయోజనం వుండదు. బ్యాంక్ శాఖలను కుదించి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రమాదం వుంది. దీనివల్ల నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు కోల్పోతే, ఖాతాదారులు అందుబాటులో వున్న సౌకర్యాలు కోల్పోతారు. తొలివేటు గ్రామీణ శాఖల మీద పడుతుందన్న అంచనాలున్నాయి. కాబట్టి, వ్యవసాయదారులకీ, చేతివ్రుత్తులవారికి, కుటీర పరిశ్రమలవారికి రుణ లభ్యత తగ్గిపోతోంది. గ్రామీణులు మరింత ఎక్కువగా ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే శాపంగా మారవచ్చు.

1941లో నిజాం కాలంలో ఏర్పాటైన బ్యాంక్..
ఎస్ బిహెచ్ ను తెలంగాణ రాష్ట్రానికి లీడ్ బ్యాంక్ గా పనిచేస్తోంది. 1941లో నిజాం కాలంలో ఏర్పాటైన ఈ బ్యాంక్ ఆ తర్వాత ప్రభుత్వరంగ బ్యాంక్ గా రూపాంతరం చెందింది. ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ, వెయ్యి కోట్ల రూపాయలకు పైగా లాభం సంపాదిస్తోంది. దీనిని ఎస్ బిఐలో విలీనం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రం సెంట్రల్ కార్యాలయాన్ని కోల్పోతుంది. బ్యాంక్ ల ద్వారా లబ్దిదారులకు అందే సబ్సిడీలు, రాయితీలు జాప్యమయ్యే ప్రమాదం వుంది.

07:29 - July 28, 2016

రేపు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి? పలు స్టేట్ బ్యాంక్ లను ఎస్ బిఐ లో విలీనం చేయడాన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? బ్యాంక్ ల విలీనం వల్ల ఖాతాదారులకు కలిగే లాభనష్టాలేమిటి? గత పాతికేళ్ళుగా అమలైన సంస్కరణలు బ్యాంకింగ్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నేత వెంకట్రామయ్య 10 టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి..

07:25 - July 28, 2016

నిజామాబాద్ : కంప్యూటర్ యుగంలోనూ నేటికి కొన్ని గ్రామల్లో సాంఘీక బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ది కమిటీల ఆగడాలు శృతిమించుతున్నాయి. కమిటీలఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా..డోండ్ కేర్ అంటున్నాయి గ్రామాభివృద్థి కమిటీలు.

నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న గ్రామాభివృద్ధి కమిటీలు ..
నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద మండలం నందిపేట మండలాలలో వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. గ్రామాభివృద్ది కమిటీలు చెప్పిన మాట విననిప్రజలు వారి ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. వారంరోజుల క్రితం నందిపేట మండలం బాద్గుణ గ్రామంలో సాంఘీకబహిష్కరణకు గురైన ఘటన మరవకముందే..బిచ్కుంద మండలం వాజీద్ నగర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది.

లక్ష రూపాయలు ఇవ్వాలని గ్రామ కమిటీ డిమాండ్..-
వాజీద్ నగర్ గ్రామానికి చెందిన సంకూరి గంగాగౌడ్ కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఊరిపండుగకు లక్షరూపాయలు ఇవ్వాలని గ్రామాభివృద్ధి కమిటీవారు డిమాండ్ చేశారు. అయితే 50వేల రూపాయలు ఇస్తానని చెప్పినా..వినకుండా లక్షరూపాయలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వలేకపోయిన గంగాగౌడ్‌ను సాంఘీక బహిష్కరణ చేశారు గ్రామపెద్దలు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కమిటీలు..
గంగాగౌడ్ దుకాణం వద్దకు ఎవరు వెళ్లకూడదని..వారి ఇంటికి ఎవరు వెళ్లినా.వారిని శుభకార్యాలకు పిలిచినా శిక్షార్హులవుతారని హుకుం జారీచేశారు గ్రామ పెద్దలు. దీంతో బాధితులు తమకు జరిగిన అన్యాయంపై బిచ్కుంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు కొనసాగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారని అయినా వారిలో మార్పురాలేదని.. అంటున్నారు బాధితులు.

07:12 - July 28, 2016

విజయవాడ : స్థానికత అంశం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం నాన్చుడు ధోరణితో సీట్ల భర్తీపై గందరగోళం నెలకొంది. రాష్ట్రానికి వచ్చే వారందరికీ స్థానికత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంకా ఉత్తర్వులు వెలువడకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికతపై స్పష్టత లేకపోవడంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేసింది.

విద్యార్థుల పాలిట శాపంగా మారిన స్థానికత..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానికత అంశం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. స్థానికతపై ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి మార్కులు సాధించినా.. స్థానికత సమస్యతో విద్యార్థులు పలు కోర్సుల్లో సీట్లు పొందలేని పరిస్థితి నెలకొంది.

371డిలో సవరణలు పూర్తైనా వెలువడని ప్రభుత్వ ఉత్తర్వులు
అయితే.. ఇప్పటికే విభజన తర్వాత రాష్ట్రానికి వచ్చే వారికి స్థానికత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 2, 2017 నాటికి ఏపీకి తరలివచ్చే వారికి...వారు కోరుకున్న చోటు స్థానికత కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆర్టికల్‌ 371డిలో సవరణలు పూర్తయినప్పటికీ.. ప్రభుత్వం నుంచి విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు రాకపోవడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.

29 నుండి జరగాల్సిన మెడికల్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ వాయిదా..
మరోవైపు స్థానిక, స్థానికేతర కోటాపై స్పష్టత లేకపోవడంతో ఈనెల 29 నుండి జరగాల్సిన మెడికల్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వాయిదా వేసింది. స్థానికతపై స్పష్టత వచ్చిన తర్వాత ఆగస్టు మొదటివారంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.

కోర్సుల్లో సీట్లు దక్కడం లేదంటున్న తల్లిదండ్రులు..
ఇదిలావుంటే స్థానికత కారణంగా తెలంగాణ నుంచి వస్తున్న విద్యార్థులకు పలు కోర్సుల్లో సీట్లు దక్కడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు. ముఖ్యమంత్రి వెంటనే దీనిపై దృష్టి సారించి.. విద్యార్థులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

07:07 - July 28, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ అనుబంధ సంస్థల పాలనలో ప్రజలకు కీలక సేవలను అందిస్తున్న కార్పొరేషన్ల విభజనపై రెండు రాష్ట్రాలు కీలక ముందడుగు వేశాయి. సమస్యను జఠిలం చేయకుండా..సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశాయి. ఇరు రాష్ర్ట ప్రభుత్వాల వాదనలు, సంస్థల విభజన సమస్యల సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత విభజన నివేదికను కేంద్రానికి అందించనుంది.

9వ షెడ్యూల్ సంస్థల విభజనపై అంగీకారం..
రాష్ట్ర విభజన అనంతరం కూడా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు దారి తీసిన 9వ షెడ్యూల్ సంస్థల విభజనపై ఎట్టకేలకు రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. 9వ షెడ్యూల్లో ప్రభుత్వ అనుబంధ సంస్థలుగా చెలామణి అవుతున్న కార్పొరేషన్లు ఉండటంతో..పాలనపరమైన నియామకాలు-నిర్ణయాలు తీసుకోవడం రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది. గతంలో ఈ సంస్థల విభజనపై కేంద్రం షీలాబేడీ కమిటీ వేసినా,..అది మొత్తం 89 సంస్థల్లో కేవలం 61 సంస్థల విభజనను మాత్రమే చేయగలిగింది. అందులోనూ కొన్నింటిలో ఆస్తులు-అప్పుల ప్రక్రియను ఇంకా చేపట్టలేదు. ఇంతలోనే కమిటీ కాలపరిమితి పూర్తవడంతో..ఈ సంస్థల విభజన ప్రక్రియ ఆగిపోయింది.

ఎట్టకేలకు అంగీకారానికి వచ్చిన ఇరు రాష్ర్ట ప్రభుత్వాలు ..
షీలాబేడి కమిటీ కాలపరిమితి ముగిసిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వీటి ప్రధాన కార్యాలయాల హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండడంతో ఈ సంస్థల ఆస్తులు-అప్పుల విభజనపై రెండు రాష్ట్రాలు తమకు అనుకూలమైన వాదనలకు కట్టుబడి ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినా కార్పొరేషన్ల అభివృద్ధికి, కొత్త ఉద్యోగాల భర్తీకి, పాలనపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి రెండు రాష్ట్రాలకు వీలు లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ఆదేశం మేరకు ఈ సంస్థల విభజనకు ఇరు ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దీంతో ఈ సంస్థల విభజన ప్రక్రియ ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

మరింత ఆలస్యం కానున్న 10వ షెడ్యూల్‌ సంస్థలోని విభాగాలు..
9వ షెడ్యూల్‌ సంస్థల విభజనపై వేసిన కమిటీ..అధ్యయనం చేసిన తర్వాత నివేదకను కేంద్రానికి అందించనుంది. ఆ తర్వాతే 9వ షెడ్యూల్‌ సంస్థల విభజన ప్రక్రియ స్పీడ్‌ పెంచనున్నారు. ఇదిలా ఉంటే, 10వ షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యా మండలిపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌కు వెళ్లడంతో.. ఈ సంస్థల విభజన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి.

07:02 - July 28, 2016

గుంటూరు : రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వ మాటలు నీటిమీద రాతలలాగే మిగులుతున్నాయి. లాటరీ పద్ధతిలో రైతులకు భూములు అందజేసిన సీఆర్‌డీఏ అధికారులు నెలలు గడుస్తున్నా మార్కింగ్ మాత్రం చేయడం లేదు. దీంతో ప్లాట్లు ఇస్తారని ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది.

పేపర్ల మీదనే కేటాయింపు?..
గతనెల 25న ఏపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన నేలపాడు గ్రామం నుండే..ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. అయితే రైతుల నుండి తీవ్ర అభ్యంతరాలు రావడంతో.. ప్లాట్ల పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టారు. దీంతో తమ వాటా ప్లాట్లు తమకు వచ్చేశాయని సంతోషపడిన రైతులకు చివరకు నిరాశే మిగులుతోంది. కేవలం పేపరు మీదనే ప్లాట్లు ఇచ్చారన్న విషయం తెలుసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు.

రైతులకు లాటరీ పద్ధతిలో భూములను కేటాయించిన సీఆర్డీఏ..
ప్లాట్లు కేటాయించి నెలలు గడుస్తున్నా.. నేలపాడులో కనీసం మార్కింగ్ కూడా పూర్తి చేయలేదు అధికారులు. నేలపాడు రెవెన్యూ పరిధిలోని 30 ఎకరాల్లో మాత్రం రాళ్లు పాతి వదిలేశారు సీఆర్డీఏ అధికారులు. నేలపాడులో మొత్తం 1244 ఎకరాల భూమి ఉంది. వాటిలో రైతులకు ప్లాట్ల కింద మొత్తం భూమి 349 ఎకరాలు కేటాయించింది. ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించిన సీఆర్డీఏ అధికారులు కచ్చా రోడ్లను వేసి రెండు నెలల్లో ప్లాట్లు ఇస్తామని చెప్పారు కాని నేటికి అమలులోకి రాలేదు.

28 గ్రామాల్లో ప్లాట్ల పంపిణీ చేపట్టని అధికారులు..
నేలపాడులో ప్లాట్లపంపిణీ నాటినుండి నెలరోజుల్లో 28 గ్రామాలకు ప్లాట్లపంపిణీ చేస్తామని సర్కార్ ప్రకటించింది. కాని నేలపాడు కాకుండా మిగిలిన 28 గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా ప్లాట్ల పంపిణీ చేయలేదు. నేలపాడులో లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తే..మిగతా 28 గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగకుండా.. ఆగుతారనే ఆలోచనతోనే రైతులకు లాటరీ పద్ధతిలో కేటాయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు నాసిరకం ప్లాట్లు కేటాయించారనే వాదనలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు రైతులు. రాజధాని రైతులకు భూములిచ్చి వ్యాపార వేత్తలుగా మారుస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మేలా లేవని రైతులు వాపోతున్నారు.

ప్లాట్ల కేటాయింపులో వ్యూహాత్మకం..
ప్లాట్ల కేటాయింపుల విషయంలో ప్ర భుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న గ్రామాల్లో ప్లాట్లపంపిణీ చేసి అక్కడి ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని పెద్ద గ్రామాల్లో అవలంభింవచాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాట్లు ఇచ్చేటప్పుడు అభివృద్దిచేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పేపరు ప్లాట్లను ఇస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మొత్తం గ్రామాలలో ప్లాట్ల పంపిణీ చేయాలంటే మరో 6 నెలలు పడుతుంది ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏం చేస్తుందో వేచిచూడాలి.

06:55 - July 28, 2016

ఢిల్లీ : తెలంగాణ రాష్ర్టంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన దాదాపు ఖాయమైంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా..మోడీ పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై నిమగ్నమైంది. వచ్చే నెల7వ తేదీన సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోని కోమటిబండలో 'ఇంటింటికీ నల్లా'ను ప్రారంభించేందుకు భగీరథ వైస్‌ ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మిషన్‌ భగీరథకు గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ ఎంపిక..
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి పర్యటన దాదాపు ఖరారు అయినట్లేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాని ఎక్కడెక్కడ పర్యటించాలో..ఏ ఏ పథకాలు ప్రారంభించాలనే దానిపై పంపిన ప్రతిపాదనలకు పీఎంఓ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మోడీ పర్యటన నేపథ్యంలో అంతర్గతంగా ఏర్పాట్లపై అధికారులు నిమగ్నమయ్యారు. అయితే. ప్రధాని పర్యటనలో అత్యంత కీలకమైన మిషన్ భగీరథను మోడీచేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలని సర్కార్‌ భావిస్తోంది. దీనికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండను ఎంపిక చేశారు.

మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చలు..
మోడీ పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో మిషన్ భగీరథ వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్పాట్ల నిర్వాహణపై అధికారులతో చర్చించారు. మిషన్ భగీరథను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మోడీ రాక సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులకు ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. ఆగస్టు 7న మోడీ కోమటిబండలో మిషన్ భగీరథ ఫైలాన్‌ను ఆవిష్కరిస్తారని ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. మోడీ టూర్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రశాంత్ రెడ్డి అధికారులతో పాటు ఈవెంట్ మెనేజర్లకు కూడా కొన్ని సూచనలు చేశారు. భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టాలని ఆదేశించారు.  మొత్తంగా రాష్ర్టానికి మోడీ రాక సందర్భంగా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం సీరియస్‌గా ఫోకస్‌ చేసింది.

06:52 - July 28, 2016

హైదరాబాద్ : ముల్లును ముల్లుతోనే తీయాలనేది ఓ నానుడి. దీన్నే ఆచరణలో చేసి చూపించేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతోంది. తెలంగాణలో ప్రాజెక్టులపై రేగుతున్న దూమారంతో అధికార పార్టీ నేతలు అప్రమత్తమవుతున్నారు. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు..త్వరలోనే ప్రాజెక్టుల బాట పట్టనున్నారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పై విపక్షాల విమర్శలు..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అధికార పార్టీ దూకుడుగా వెళ్తుండడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో సర్కార్‌ మొండిగా ముందుకెళ్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది. నిన్న, మొన్నటి వరకు మంత్రి హరీష్‌రావు ఒక్కరే విపక్షాల ఆరోపణలకు సమాధానం చెబుతూ వచ్చారు. అయితే.. ప్రతిపక్షాలు మరింత దూకుడు పెంచడంతో ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయ్యింది. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు జిల్లాల్లోని అగ్రనేతలను అప్రమత్తం చేస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎండగట్టేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధం కావాలనే ఆదేశాలు అందాయి.

విపక్షాల తీరుపై అప్రమత్తమయిన అమాత్యులు..
ప్రాజెక్టుల విషయంలో విపక్షాలన్నీ ఏకం కావడంతో మంత్రులు కూడా తమ గళం పెంచుతున్నారు. విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను ప్రజాక్షేత్రంలోనే సమాధానాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది. ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అనుమానాలను నివృత్తి చేస్తామంటున్నారు అధికార పార్టీనేతలు. విపక్ష పార్టీలకు అనుమానాలు ఉంటే ప్రాజెక్టుల దగ్గరకు రావాలని సవాల్ విసురుతున్నారు.

ప్రతిపక్ష నేతల ఆరోపణలను తిప్పికొట్టాలని నిర్ణయం..
మొత్తంగా సాగునీటిపై అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తే..విపక్ష పార్టీల దూకుడుకు కళ్లెం వేయోచ్చని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు.

06:46 - July 28, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా అంశంపై.. రాజ్యసభలో చర్చకు టీడీపీయే పట్టుబట్టింది. మిత్రపక్షం డిమాండ్‌ మేరకు ప్రభుత్వమూ చర్చకు సిద్ధమంటూ టైమ్‌ కూడా ఫిక్స్‌ చేసింది. ఈ చర్య వెనుక ఉభయ పక్షాల వ్యూహమేంటి..? ఇన్నాళ్లూ మిత్ర ధర్మం పాటిస్తున్న టీడీపీ రూటు మార్చి కమల దళాన్ని ఇరుకున పెట్టాలనుకుంటోందా..? లేక కాంగ్రెస్‌ వ్యూహాన్ని చిత్తు చేసేందుకు ఈ ఎత్తుగడ వేసిందా..? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

హాట్‌ టాపిక్‌గా మారిన ప్రత్యేక హోదా అంశం ..
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం గందరగోళం సృష్టిస్తోంది. విభజన హామీలపై కేంద్రం దాటవేత ధోరణి అవలంబిస్తోందంటూ కేవీపీ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టడంతో దీనిపై అన్ని పార్టీలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లుకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

స్నేహపూర్వకంగానే సాధించుకోవాలని ఓర్పువహించిన బాబు
రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు 35 సార్లు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి విభజన బిల్లులో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కేంద్ర మంత్రులకు నివేదికలు అందించారు. అయితే కేంద్రం మాత్రం దాటవేత ధోరణితోనే ఉంది. అయినప్పటికీ విభేదించి నష్టపోవడం కంటే.. స్నేహపూర్వకంగా ఉంటూనే సాధించుకోవాలని పార్టీ వర్గాలకు ఇప్పటివరకు నచ్చచెబుతూ.. ఓర్పు వహిస్తున్నారు చంద్రబాబు.

బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ
అయితే.. కొన్ని రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరుగుతుండడంతో పరిణామాలన్నీ మారిపోయాయి. కాంగ్రెస్‌, వైసీపీ నేతలు ప్రత్యేక హోదాపై పట్టుబడుతుండడంతో చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, కాంగ్రెస్‌ మోసగించిన తీరు.. బీజేపీ దాటవేత ధోరణిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్నా వ్యవహారంపై నేతలు చర్చించినట్లు సమాచారం. రాజకీయ పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ‌్యమనే అభిప్రాయానికి టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యే హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. హక్కుల సాధన కోసం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌, బీజేపీని కార్నర్‌ చేయాలని టీడీపీ వ్యూహం..
రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని.. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందనే అంశాలపై అవసరమైతే నివేదిక తయారుచేసి సభకు సమర్పించాలని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏం చేయలేదనే వాదనను వినిపించాలని భావిస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ చేసిన పొరపాట్లను ఎత్తిచూపుతూనే.. ప్రైవేట్‌ బిల్లును అస్త్రంగా మలచుకుని బీజేపీని కూడా ఇరుకునపెట్టాలని టీడీపీ భావిస్తోంది.

బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్న టీడీపీ వైఖరిలో మార్పు ..
ఇదిలావుంటే.. గురువారం ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకుని.. కాంగ్రెస్‌, బీజేపీ లను కార్నర్‌ చేయాలని టీడీపీ భావిస్తోంది. మొత్తానికి పరిస్థితులు ఇలాగే ఉంటే.. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకునేందుకు ఎంతో సమయం పట్టదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి స్వరం పెంచుతున్న టీడీపీని బీజేపీ బుజ్జగిస్తుందా ? లేక ఢీకొడుతుందా ? చూడాలి.

సూసైడ్ 'బాంబర్'గా ఎంపీ..

సోమాలియా : సోమాలియాలో ఓ మాజీ ఎంపీ సలాహ్ బాద్‌బాదో సుసైడ్ బాంబర్‌గా మారాడు. మొగదీషులోని శాంతిపరిరక్షక దళాల హెడ్ క్వార్టర్‌పై దాడి చేసి 13 మందిని పొట్టనపెట్టుకున్నాడు. 53 సంవత్సరాల బద్‌బాదో 2004 నుంచి 2010 వరకూ ఎంపీగా విధులు నిర్వర్తించాడు. అనంతరం అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్‌లో చేరి ఉగ్రవాదిగా మారాడు. చివరకు సుసైడ్ బాంబర్‌గా మారి తనను తాను పేల్చివేసుకుని 13మందిని పొట్టనపెట్టుకున్నాడు.

ధరల పెరుగుదలపై నేడు రాహుల్ ప్రసంగం..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రేపు లోక్‌ సభలో ప్రసంగించనున్నారు. రేపు పార్లమెంటులో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరగనుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దీంతో పెరుగుతున్న నిత్యావసర ధరలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కీలకమైన ఈ అంశంపై లోక్ సభలో రాహుల్ ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్తరాఖండ్‌పై చైనా సైన్యం దాడి..

ఢిల్లీ : చైనా దళాలు జులై 19న ఉత్తరాఖండ్‌పై దాడికి పాల్పడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ దృవీకరించారు. చమోలీ జిల్లాలో చైనా సైన్యం చొరబాటుకు ప్రయత్నించిందని తెలిపారు.దాదాపు గంటసేపు భారత సైన్యానికి, చైనా దళాలకు పోరాటం జరిగిందని రావత్‌ వెల్లడించారు. చమోలీ సరిహద్దులో 80 కిలోమీటర్ల ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య పోరాటం జరిగినట్లు తెలుస్తోంది.

నేడు పెద్దలసభలో ప్రత్యేక చర్చ?..

ఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలు తీరుపై గురువారం రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

మరోసారి భూకంపం..

జపాన్‌ : భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదైంది. హోంషు సమీపంలో భూమికి 47 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.

Don't Miss