Activities calendar

29 July 2016

విభజన బిల్లును యుద్ధవిమానంలో పంపారు : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : విభజన బిల్లును యుద్ధవిమానంలో పంపారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్, వైసీపీ డ్రామాలు అడడం మానుకోవాలని హితవు పలికారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రానికి అన్యాయం చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. 

ఎపికి ప్రత్యేక నిధులేమీ ఇవ్వలేదన్న సీఎం చంద్రబాబు

ఢిల్లీ : కేంద్రం ఎపికి ప్రత్యేక నిధులేమీ ఇవ్వలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును ఆరోజే తప్పుబట్టానని తెలిపారు. సోనియా పుట్టినరోజున రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఇటలీ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.

ఎపికి అన్యాయం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం బాధాకరమని ఎపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాజ్యసభలో ఎపికి అన్యాయం జరిగిందని వాపోయారు. బీజేపీ కాంగ్రెస్ ను తిడుతోందని.. మరీ బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. 

21:59 - July 29, 2016

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం బాధాకరమని ఎపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మంచింది కాదన్నారు. ఇవాళ రాజ్యసభలో ఎపికి అన్యాయం జరిగిందని వాపోయారు. బీజేపీ కాంగ్రెస్ ను తిడుతోందని.. మరీ బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రం ఎపికి ప్రత్యేక నిధులేమీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పోలవరానికి కేవలం రూ.850 కోట్లు ఇచ్చారని.. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 వందల కోట్లు ఖర్చు చేసిందన్నారు. 14 వ ఆర్థిక సంఘం చివరి నాటికి ఎపిలో లోటు ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. 14 వ ఆర్థిక సంఘం మేరకు రాష్ట్రాలు, కేంద్రాల మధ్య ఐదేళ్లకోసారి ఆర్థిక వనరులు సమకూరుస్తుందని చెప్పారు. విభజన జరిగిన తీరును ఆరోజే తప్పుబట్టానని తెలిపారు. సోనియా పుట్టినరోజున రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఇటలీ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన బిల్లును యుద్ధవిమానంలో పంపారని పేర్కొన్నారు. విభజన సమయంలో తనను దెబ్బతీయాని ప్రయత్నించారని తెలిపారుప్రత్యేకహోదాపై తొలి రెండు రోజులు హడావుడి చేసిన కాంగ్రెస్ ఇవాళ వాకౌట్ చేసిందన్నారు. విభజన చట్టంలో కీలక అంశాలను కాంగ్రెస్ ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రానికి అన్యాయం చేసి రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, వైసీపీ డ్రామాలు అడడం మానుకోవాలని హితవు పలికారు. 

 

 

 

 

21:52 - July 29, 2016

ఎపి కష్టాల్లో ఉందని ఒప్పుకుంటారు... సహాయం చేయవలసిందే అని నొక్కి వక్కాణిస్తారు..  హామీల అమలుకు సై అనీ అంటారు... ప్రత్యేకహోదా మాత్రం కుదరదంటారు.... ఇదెక్కడి న్యాయం..?! ఈ అంశంపై ఇవాళ్టి వైండాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:45 - July 29, 2016

తెర్లు తెర్లైతున్న తెలంగాణ ఎంసెట్... సర్కారు దిక్కు బుసకొడుతున్న పాములు, ఉగాది పంచాంగంలనే బయటపడ్డ కథ... తెలిసినా పట్టించుకోలే సర్కార్ సుతా, అడివిల ఆడిపాడుతున్న అన్నలు.. ఎంకులాట సురువుజేసిన పోలీసులు, దుష్టిబొమ్మను పూడ్సిపెట్టిరు.. ఇది కారు కార్యకర్తలు తలపెట్టిండ్రు, భూమ్మీద మనసుపారేసుకున్న ఎమ్మెల్యే కొడుకు... ఇబ్రహీంపట్నం నేతకు సరైన సుపుత్రుడు, 11మందిని కన్న తల్లి.. ఒకటే కాన్పుల క్రికెట్ టీం... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను మీడియోలో చూద్దాం...

21:34 - July 29, 2016

మెదక్ : ప్రశాంత పల్లెజనంపై ఖాకీల నిర్బంధం. భూములివ్వబోమని కరాఖండిగా చెబుతున్న రైతులపై పోలీసుల దమనకాండ. ఎదిరించే గొంతుల్ని ఎక్కుపెట్టిన తుపాకీతో అణిచి వేస్తోన్న అరాచకం. ఇది ప్రజాస్వామ్యమా.. లేక నిరంకుశత్వమా..? అని ప్రశ్నించేవాళ్లకు కనీస సమాధానం కూడా చెప్పని సర్కార్‌.. పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతోంది. మనిషికి మనిషికి మధ్య పొరపొచ్చాలొచ్చేలా కుట్ర చేస్తోంది. ఖాకీల కాపలాతో గ్రామాలకు గ్రామాలనే నిర్బంధించింది. మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో పోలీసులు నిర్బంధకాండపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...!
బిక్కుబిక్కు మంటున్న గ్రామస్థులు
ఇదీ.. మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఇక్కడిప్పుడు ఎటు చూసినా.. బిక్కుబిక్కు మంటున్న గ్రామస్థులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దినదిన గండంలా బతుకులు వెళ్లదీస్తున్న పల్లె వాసులు. ఇంతకాలం ఉన్నది తింటూ.. బతికే పల్లెజనంలో.. సర్కారు ప్రాజెక్టు పేరుతో చిచ్చు పెట్టి.. అణచివేత రుచేంటో చూపించింది. ఇదేం అన్యాయం అన్నందుకు ఎన్నో మేనులపై లాఠీలు ఝళిపించి పైశాచికంగా వికటట్టహాసం చేసింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే.. మా భూములివ్వం అన్నందుకు శతృదేశంపై విరుచుకుపడ్డట్లు.. ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్‌ నిర్మాణం వల్ల కలిగే నష్టాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన మహిళలు, పిల్లలు, వృద్ధులపై పోలీసులు నిర్బంధకాండను కొనసాగించారు. 
వేములఘాట్‌లో పరిస్థితి మరీ దారుణం
ముంపు గ్రామాల్లో ఒక్కటైన వేములఘాట్‌లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎక్కడ చూసినా పోలీసులు తుపాకులు, లాఠీలతో పహారా కాస్తున్నారు. గ్రామస్థులను బయటకు వెళ్లనీయకుండా.. అడుగడుగునా నిర్బంధాన్ని కొనసాగించడం గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 
గొడ్డును బాదినట్లు బాదిన పోలీసులు.. 
గ్రామంలో చిన్నా పెద్దా అందరినీ గొడ్డును బాదినట్లు బాదిన పోలీసులు.. మహిళలని కూడా చూడకుండా దుర్బాషలాడారని బాధితులు వాపోతున్నారు. వేములఘాట్‌లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. విద్యా సంవత్సరం ప్రారంభమైనా... ఊరు, ఇళ్లు పోతున్నాయన్న బెంగతో విద్యార్థులు స్కూల్‌కు కూడా వెళ్లలేని దైన్య స్థితి నెలకొంది. తల్లిదండ్రులు తిండితిప్పలు మానేశారని విద్యార్థులు కూడా తిండితినని పరిస్థితి కనబడుతోంది. మహిళపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. 
పోలీసులు అష్టదిగ్బంధం 
లాఠీచార్జ్‌లో గాయపడ్డ వాళ్లని పరామర్శించేందుకు బంధువులను కూడా రానీయకుండా పోలీసులు అష్టదిగ్బంధం చేయడం దారుణమని వేములఘాట్‌ యువకులు వాపోతున్నారు. పోరాటానికి మద్దతిస్తున్న రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలను కూడా గ్రామంలోకి రానీయకుండా అరెస్ట్‌లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 
ఐక్యమవుతున్న భూ నిర్వాసితులు 
పోలీసుల హింసతో భూ నిర్వాసితులు ఐక్యమవుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిరసనగా... ఇక భూములిచ్చే ప్రసక్తే లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. 

 

21:29 - July 29, 2016

ఢిల్లీ : గల్ఫ్‌ బాధితుల సమస్యలను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఢిల్లీలో ఆమెను కలిసిన కేటీఆర్‌.. గల్ఫ్‌ దౌత్య కార్యాలయంలో తెలుగు అధికారిని నియమించాలని.. వివిధ కారణాల చేత గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం అందించాలని కోరారు. 

21:26 - July 29, 2016

హైదరాబాద్ : ఏపీ ఎస్ ఎస్ సీ బోర్డు డైరెక్టర్‌ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగాయి. అధికారుల సోదాలో డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌కు మధ్యవర్తిగా వ్యవహరించిన రఫీని అధికారులు విచారిస్తున్నారు. లక్డీకపూల్‌లోని ఓ లాడ్జ్‌లో ప్రసన్నకుమార్‌కు చెందిన 36 లక్షల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  సోదాల్లో భాగంగా మొత్తం 45 లక్షల రూపాయలను సీజ్‌ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆమె చెప్పారు. 

 

ఎంసెట్2 పేపర్ లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్

హైదరాబాద్ : ఎంసెట్2 పేపర్ లీకేజీ కేసులో మరో అరెస్ట్ జరిగింది. బోడుప్పల్‌లో ఉంటున్న షేక్‌ రమేష్‌ అలియాస్‌ రహీమ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎంసెట్ రాస్తున్న 14 మంది విద్యార్థుల నుంచి కోటి 73 లక్షల రూపాయలను రమేష్ వసూలు చేశాడు. అనంతరం వీరిని పూణే క్యాంపునకు తరలించాడు. వసూలు చేసిన కోటి 73 లక్షల రూపాయల్లో కోటి 20 లక్షలు మధ్య దళారులకు అప్పగించాడు. మిగిలిన 37లక్షలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో 15 లక్షలను స్నేహితుడి బ్యాంక్‌ ఖాతాలో ఉంచాడు.

21:21 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌2 లీకేజీపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో అరెస్ట్ జరిగింది. లీకేజీలో మధ్యవర్తిగా ఉన్న షేక్‌ రమేష్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. బోడుప్పల్‌లో ఉంటున్న షేక్‌ రమేష్‌ అలియాస్‌ రహీమ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎంసెట్ రాస్తున్న 14 మంది విద్యార్థుల నుంచి కోటి 73 లక్షల రూపాయలను రమేష్ వసూలు చేశాడు. అనంతరం వీరిని పూణే క్యాంపునకు తరలించాడు. వసూలు చేసిన కోటి 73 లక్షల రూపాయల్లో కోటి 20 లక్షలు మధ్య దళారులకు అప్పగించాడు. మిగిలిన 37లక్షలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో 15 లక్షలను స్నేహితుడి బ్యాంక్‌ ఖాతాలో ఉంచాడు. ఈ కేసులో మిగతా దళారులు, ప్రధాన సూత్రధారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు బళ్లారిలో వెంకటరమణ, తరుణ్‌రాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి డీజీపీ నివేదిక సమర్పించడంతో.. సీఎం క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌.. డీజీపీ, సీఐడీ చీఫ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 

 

20:57 - July 29, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య వార్‌ నడుస్తోంది. మల్లన్నసాగర్‌ వెళ్లేందుకు యత్నించిన తమను అడ్డుకునేందుకు యత్నించడాన్ని కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై దామోదర రాజనర్సింహ, సునీతాలక్ష్మారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. మల్లన్నసాగర్‌కు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఒక్కొక్కరితో నలుగురిని తీసుకువెళ్లేందుకు అనుమతిచ్చింది. మరోవైపు ఉదయం మల్లన్నసాగర్‌ వెళ్లేందుకు యత్నించిన జానారెడ్డి, షబ్బీర్‌అలీలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ... కాంగ్రెస్ నేతలు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. 

 

20:55 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈకేసులో కీలకంగా భావిస్తున్న రమేష్ షేక్ అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకముందు బళ్లారిలో వెంకటరమణ, తరుణ్‌రాజ్‌లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బళ్లారి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు అరెస్టయ్యారు. 

 

20:44 - July 29, 2016

హాస్య నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక ఆయన హీరో కెరీర్‌ను అయోమయంలో పడేశాయి. దీంతో మళ్ళీ ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలని సునీల్ ప్రస్తుతం ‘జక్కన్న’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుదర్శన్ రెడ్డి నిర్మించారు. సునీల్ సరసన మన్నారా చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.
కథ...
ఈ సినిమా కథ విషయానికొస్తే...వైజాగ్ సిటిలో డేగ అనే పేరు మోసిన రౌడిని మెకానిక్ అయిన బైరాగి చంపుతాడు. బైరాగి వైజాగ్ లో పేరు మోసిన రౌడి గా ఎదుగుతాడు. తన ముఖం జనాలకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. గణేష్ అనే వ్యక్తి బైరాగి ని చంపడానికి వైజాగ్ వచ్చి అతనిని వెతుకుతూ ఉంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలని బైరాగి శత్రువులు కూడా అతన్ని హతమార్చడానికి వెతుకుతూ ఉంటారు. ఇలా ఉంటాడు అని  ముఖం కూడా తెలియని బైరాగి, తీరా ఇతనే భైరాగి అని తెలిసే సమయానికి, అతని  శత్రువులు, భైరాగిని చంపడానికి ప్రయత్నిస్తారు. బైరాగిని చంపడానికి వచ్చిన గణేష్ ఆ టైంలోఆ శత్రువుల నుండి భైరాగిని  కాపాడుతాడు. అసలు భైరాగిని చంపాలని వచ్చిన గణేష్ భైరాగిని ఎందుకు కాపాడాడు. భైరాగికి గణేష్ కి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెరపైన చూడాలి. 
విశ్లేషణ... 
నటీనటుల పర్ఫామెన్ కి వస్తే... సునిల్ తనదైన మార్క్ కామెడీ తో, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. హీరోయిన్ మన్నారా చోప్రా ఎక్స్ పోజింగ్ కే పరిమితం అయ్యింది తప్ప, పర్ఫామెన్ పై దృష్టి పెట్టలేదనే చెప్పాలి. కొన్ని కొన్ని సన్నివేశాలలో బాగా చేసి ఉండాలి అనిపించింది. కమెడియన్  పృధ్వీ కామెడీ సినిమాకే హైలెట్. అలాగే సప్తగిరి చేసిన కామెడీ అలరిస్తుంది.   ఇక మిగితా నటీనటులు కబీర్ సింగ్, పోసాని, నాగినీడు మొదలగు నటులు తమ పాత్రలు పరిది మేరకు బాగానే చేసారు. 

టెక్నీషియన్స్ విషయానికొస్తే.... దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది కాని కథ, కధనాలను జనరంజకంగా తీయలేకపోయాడు.. మారుతున్న కాలానికి అనుగూణంగా మార్పులేని తన ఆలోచనలతో.... సినిమాను ప్రేక్షకులు అనుకున్న స్థాయిలోతీయలేక పోయాడు. ఈసినిమాకు దినేష్ మంచి  మ్యూజిక్ అందించాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. డిఓపి రాంప్రసాద్ కెమెరా పనితనం సూపర్. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా చూపించాడు. భవాణీ ప్రసాద్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి...  ఎడిటర్ ఎమ్.ఆర్ వర్మ పనితనం బావుంది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. మొత్తనికి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా... సెకండ్ ఆఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. హిట్ కోసం తపిస్తున్న సునిల్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్
సునిల్ 
కెమెరా పనితనం
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్
కథ, కథనం
డైరక్టర్
హీరోయిన్

టెన్ టి రేటింగ్.. 1.75/5

20:38 - July 29, 2016

నేటి యువతరం ఆలోచనలు, కెరీర్ మీద వాళ్లకున్న శ్రద్ధ, పెళ్లిగురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు లాంటి అంశాల్ని పూసగుచ్చినట్టు విప్పి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా పెళ్ళిచూపులు . ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నేడే విడుదలైంది. మరి ఈ సినిమా నేటి యువతను ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో చూద్దాం. 
విశ్లేషణ
ఈ మధ్యకాలంలో పెళ్లిచూపులు అనే అచ్చ తెలుగు టైటిల్ తో సినిమా రావడం గొప్ప విశేషంగానే చెప్పుకోవాలి. పెళ్ళిగురించి నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి, తల్లి దండ్రులు  పిల్లల కెరీర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు లాంటి అంశాలతో చక్కటి సందేశాత్మకంగా పెళ్లిచూపులు సినిమా సాగుతుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా అసలు ఆ ఫీలింగ్ ఏ మాత్రం కలగకుండా సినిమాను  సాధ్యమైనంత వరుకూ చాలా రిచ్ గానే తెరకెక్కించారు. కొత్త డైరెక్టర్ తరుణ్ భాస్కర్  తొలి సినిమాతోనే అందరినీ కట్టిపడేసాడు. ముఖ్యంగా నేటి యంగ్ జనరేషన్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ప్రేమ , కెరీర్ ను సమంగా బాలెన్స్ చేసుకుంటే  పెళ్లి  అనే అంశాన్ని చాలా సున్నితంగా చెప్పాడు దర్శకుడు. చక్కటి సంభాషణలతో బోర్ కొట్టని కథనంతో ఫన్నీ సన్నివేశాలతో సినిమాను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు.  
కథ... 
ఈ జనరేషన్ కి తగిన ప్రశాంత్ ఇంజినీరింగ్ చదువుకుంటున్నా, తన ఆలోచనలకు తగ్గట్టు ఓ చెఫ్‌గా పనిచేయాలని అనుకుంటాడు. ప్రశాంత్ చదువుకు తగినట్టు మంచి ఉద్యోగం లో స్థిరపడాలని తండ్రి కోరిక. కానీ ప్రశాంత్ కి ఇష్టం ఉండదు. ఇక జీవితం పట్ల ఎటువంటి స్పష్టత లేనట్లు కనిపించే అతడికి పెళ్ళి చేస్తే అయినా అన్నీ కుదురుతాయని చిత్ర  అనే అమ్మాయితో అతడి తండ్రి పెళ్ళి నిశ్చయిస్తాడు. అయితే చిత్ర తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అతనితో పెళ్ళిని నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండగా, వాళ్ళ దగ్గర్నుంచి కూడా ప్రశాంత్‌కి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కునేందుకే చిత్రతో కలిసి ప్రశాంత్ ఫుడ్ బిజినెస్ మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? చివరకు వీరి కథ ఎక్కడివరకు వచ్చిందీ? అన్నదే మిగతా సినిమా. పెళ్లిచూపులకని ఒకరింటికి వెళ్లబోయి మరొకరింటికి వెళ్ళి అమ్మాయిని చూడడం ఈ సినిమాకి సరికొత్త పాయింట్. అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో లాక్ అవడంతో ఒకరి లవ్ స్టోరీని మరొకరు చెప్పుకోవడం మరింత కొత్తగా అనిపిస్తుంది. 
విశ్లేషణ... 
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా మొదటి సినిమా అయినా, జనానికి బాగా దగ్గరయ్యే పాత్ర పోషించాడు విజయ్ దేవర కొండ. సరిగ్గా రెండో సినిమా పెళ్లిచూపులు సినిమాలో కూడా తనదైన శైలిలో మంచి నటనతో చెలరేగాడు. ఇక హీరోయిన్ రీతూ వర్మ కూడా  అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ అమ్మాయి సినిమాని తన భుజాలమీదే వేసేసుకుంది. ఇక హీో తండ్రిగా నటించిన నటుడు కూడా చాలా సహజం గా నటించి మంచి మార్కులు కొట్టేస్తాడు.  ఇక ఇందులో చెప్పుకోదగ్గ మరో పాత్ర హీరో ఫ్రెండ్ . ఈ సినిమాలో ఈ పాత్ర ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. కామెడీ పంచులతో సినిమా మొత్తం అదరగొట్టేసాడు.  ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ కి ఇది మొదటి సినిమా అయినా,  రొమాంటిక్ కామెడీకి ఎంత వరకు స్క్రిప్ట్ అవసరమో అంతే వాడుకున్నాడు. ఏయే సన్నివేశాలు ఎలా తీస్తే ఎలాంటి ఫలితాలు చూపిస్తాయో తరుణ్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే రుజువు చేసుకున్నాడు. ఈతరం ఆలోచనలను సరిగ్గా బంధిస్తూ, వాళ్ళ భావోద్వేగాల చుట్టూ ఓ సరికొత్త కథ చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. ఇక టోటల్ గా చెప్పాలంటే మన జీవితం లో ‘పెళ్ళిచూపులు’ ఎలాంటి మంచి అనుభూతినిస్తాయో? ఈ చిత్రం చూసి అలాంటి ఫీల్ ని అనుభవించవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి ఈ తరహా సినిమా అంతగా నచ్చకపోవచ్చు. అయినా నేటి జనరేషన్ కి ఈ సినిమా బాగానే నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు. 

ప్లస్ పాయింట్స్ :
చక్కటి కథ, కథనాలు
ఆహ్లాదకరమైన సన్నివేశాలు
హీరో, హీరోయిన్స్ నటన 
ఆలోచింపచేసే సంభాషణలు
కామెడీ 
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ స్లోగా సాగడం

టెన్ టివి రేటింగ్ : 2.75/5

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

అనంతపురం : జిల్లాలోని డి.హీరేహళ్ లో ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

మల్లన్నసాగర్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్ : మల్లన్నసాగర్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు అనుమతి లభించింది. మల్లన్నసాగర్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు హైకోర్టు అనుమతిచ్చింది. మల్లన్నసాగర్ కు వెళ్లకుండా అడ్డుకోవడంపై దామోదర రాజనర్సింహ్మ, సునీతాలక్ష్మారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సునీత లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ సహా మరో 8 మందికి అనుమతిచ్చారు. 

 

ఎంసెట్ లీకేజీలో కొనసాగుతున్న అరెస్టులు

హైదరాబాద్ : ఎంసెట్2లీకేజీలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎంసెట్ లీకేజీలో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

20:09 - July 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్2 రద్దు అయింది. ఎంసెట్ 2 ను టీసర్కార్ రద్దు చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ నివేదిక అనంతరం ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సోమవారం అధికారిక ప్రకటన చేయనున్నారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధ్యులపై పీడీయాక్టు కింద కేసు నమోదు చేయాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఎంసెట్2 రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. తిరిగి పరీక్ష నిర్వహించకుండా ఉండే వెసులుబాటుపై కేసీఆర్ ఆరా తీశారు. పరీక్ష నిర్వహించాల్సి వస్తే చేపట్టాల్సిన కార్యాచరణపై సీఎం చర్చ చేపట్టారు. 

 

ఎంసెట్ 2 ను రద్దు చేసిన టీసర్కార్

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్2రద్దు అయింది. ఎంసెట్ 2 ను టీసర్కార్ రద్దు చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

19:39 - July 29, 2016

హైదరాబాద్ : రాజ్యసభలో ఎపికి చుక్కెదురైంది. ప్రత్యేకహోదా విషయంలో ఎపికి మళ్లీ నిరాశ కలిగింది. ప్రత్యేకహోదా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఎపికి కేంద్రం మరోసారి మొండిచేయిచూపింది. ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెప్పకనే చేప్పేసింది. ఏపీకి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ ముగిసింది. ప్రత్యేక హోదాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ముగిసింది. ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ నిబంధనలను జైట్లీ సాకుగా చూపారు. మరోవైపు కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రత్యేక హోదా ఇస్తారా.. లేదా..అని స్పష్టం చేయాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 
రాష్ట్రాన్ని ముక్కలు చేశారు : సుజనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరితో చర్చలు జరపకుండా చట్టసభల్లో సంఖ్యాబలం ఉండడంతో ముక్కలు చేశారని అన్నారు. రాష్ట్ర విభజనకు జాతీయ పార్టీలే కారణమని ఆయన చెప్పారు. రాష్ట్రానికి వివిధ విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం, ఇతర విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. రైల్వే జోన్, ప్రత్యేకహోదా తక్షణం ప్రకటించాలని ఆయన కోరారు.
హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలి : సీఎం రమేష్  
సభలో నిన్న వెంకయ్య నాయుడు చెప్పిన సమాధానంపై సంతృప్తిగా లేమని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌. హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలిపిన పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. 
భద్రాచలం నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ
రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం ఇస్తుండగా విభజనకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. జైట్లీ ప్రసంగం మధ్యలో సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి భద్రాచలం నియోజక వర్గం పరిస్థితిని సభలో లేవనెత్తారు. భద్రాచలం నియోజకవర్గం విభజన అనంతరం ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోగా, సభ్యుడు మాత్రం తెలంగాణ అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సభ్యుడిని రెండు రాష్ట్రాల సమావేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారమని ఏచూరి సూచించడంతో సభలో నవ్వులు విరిశాయి. 
ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు వస్తాయి : సీతారామలక్ష్మి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగువారంతా కోరుకుంటున్నారని టీడీపీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. రాజ్యసభలో హోదాపై చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం హర్షనీయమని, అయితే విద్యాసంస్థల వల్ల ఏపీకి ఆదాయం రాదని...ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు వస్తాయని తెలిపారు. 
కాంగ్రెస్ వాకౌట్ 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ వాకౌట్‌ చేస్తున్నామని కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జైట్లీ ఇచ్చిన సమాధానంపై దిగ్విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. జైట్లీ ప్రసంగంలో అసలు ప్రత్యేక హోదా అంశమే లేదని దిగ్విజయ్‌ మండిపడ్డారు. 

 

కాసేపట్లో సీఎం కేసీఆర్ తో డీజీపీ, సీఐడీ డీజీ భేటీ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో కాసేపట్లో డీజీపీ, సీఐడీ డీజీ భేటీ కానున్నారు. ఎంసెట్2 లీకేజీపై చర్చించనున్నారు. 

 

18:37 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. కోర్టు ఆధ్వర్యంలోనే దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఓ న్యాయవాది పిల్‌ దాఖలు చేశారు. ఎంసెట్‌-2ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిల్‌లో ప్రతివాదులుగా సీఎస్‌, ఎంసెట్‌ కన్వీనర్‌, డీజీపీ, ఉన్నతవిద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలను చేర్చారు. పిల్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. 

 

18:34 - July 29, 2016

ఢిల్లీ : ఎపికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఎపికి ప్రత్యేకహోదా అశలు ఆవిరయ్యాయి. ప్రత్యేకహోదా అంశంపై కేంద్రప్రభుత్వం చేతులేత్తేసింది. ఎపికి ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రం హామీ ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ప్రత్యేకహోదా అంశం కేవలం ఎన్ డీఏ సర్కార్ ప్రచారం చేసుకోవడానికే పరిమితం అని తేలిపోయింది. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పకనే చేప్పేసింది. ఎపికి ప్రత్యేకహాదాపై అరుణ్ జైట్లీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ ముగిసింది. ప్రత్యేక హోదాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ముగిసింది. ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ నిబంధనలను జైట్లీ సాకుగా చూపారు. మరోవైపు కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రత్యేక హోదా ఇస్తారా.. లేదా..స్పష్టం చేయాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 
భద్రాచలం నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ
రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం ఇస్తుండగా విభజనకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. జైట్లీ ప్రసంగం మధ్యలో సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి భద్రాచలం నియోజక వర్గం పరిస్థితిని సభలో లేవనెత్తారు. భద్రాచలం నియోజకవర్గం విభజన అనంతరం ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోగా, సభ్యుడు మాత్రం తెలంగాణ అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సభ్యుడిని రెండు రాష్ట్రాల సమావేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారమని ఏచూరి సూచించడంతో సభలో నవ్వులు విరిశాయి. 
రాజకీయాల ప్రయోజనాల కోసం ఏపీని విభజించిన కాంగ్రెస్ : సుజనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజించిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరితో చర్చలు జరపకుండా చట్టసభల్లో సంఖ్యాబలం ఉండడంతో ముక్కలు చేశారని అన్నారు. రాష్ట్ర విభజనకు జాతీయ పార్టీలే కారణమని ఆయన చెప్పారు. రాష్ట్రానికి వివిధ విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం, ఇతర విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. రైల్వే జోన్, ప్రత్యేకహోదా తక్షణం ప్రకటించాలని ఆయన కోరారు.

 

ఎంసెట్ 2 లీకేజీపై సీబీఐ విచారణ జరపాలి : ప్రొ.కోదండరాం

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీపై సీబీఐతో విచారణ జరపాలని ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వం యూజీసీ గైడ్ లైన్స్ పాటించలేదని ప్రొ.కోదండరాం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు. 

 

మరింత గందరగోళంగా జైట్లీ సమాధానం : ఏచూరి

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం మరింత గందరగోళంగా ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి అన్నారు. ఎపికి ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడారు. ఎపికి ప్రత్యేకహోదా ఇస్తారా... లేదా..? అని ప్రశ్నించారు. 

 

ఎపికి ప్రత్యేకహోదాపై ముగిసిన చర్చ

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ ముగిసింది. ప్రత్యేకహోదాపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఎపికి ప్రత్యేకహోదా అంశంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రత్యేకహోదాకు ఫైనాన్స్ కమిషన్ నిబంధనలను సాకూగా చూపారు. ఎపికి ప్రత్యేకహోదా ఇస్తారా... లేదా అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. 

17:26 - July 29, 2016

ఢిల్లీ : ఎపి కష్టాల్లో ఉందని ఎంపీలు తన దృష్టికి తెచ్చారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందే వరకు ఎపికి అండగా ఉంటామని చెప్పారు. ఎపికి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో అరుణ్ జైట్లీ సమాధానం చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ఉందన్నారు. విభజన భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని చెప్పారు. కేంద్రం ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇస్తున్నామని చెప్పారు. మిత్రపక్షం అధికారంలో ఉందని అధిక నిధులు కేటాయించలేమన్నారు. రాజ్యాంగానికి లోబడే నిధులు కేటాయింపు ఉంటుందన్నారు. 
చిన్నరాష్ట్రాలకు మేం అనుకూలం..
చిన్నరాష్ట్రాలకు మొదటి నుంచి తాము అనుకూలమని అన్నారు. బీజేపీ మూడు రాష్ట్రాలను విభజించిందన్నారు. నాడు వాజ్ పేయి ప్రభుత్వంలో ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలను పద్ధతి ప్రకారం విభజించామని చెప్పారు. కాబట్టి ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. 
హామీలకు కట్టుబడి ఉన్నాం.. 
హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విభజన వల్ల ఎపి రెవెన్యూ లోటులో ఉందన్నారు. ఎపి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఎపికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. హైకోర్టు విభజనకు నిధులు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. 

17:01 - July 29, 2016

ఢిల్లీ : ఉమ్మడి ఎపి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. ఎపికి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుజనా మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ చేయొద్దని సూచించారు. 

 

16:53 - July 29, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపుగ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చర్చల పేరుతో గ్రామస్థుల మధ్య చీలిక తీసుకువచ్చి, అమాయకులైన ప్రజలపై దమనకాండ కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ శవాలపై ప్రాజెక్టు కట్టుకోవాలని వేములఘాట్‌ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు బాధితులు టెన్ టివితో మాట్లాడారు. తమ గోడు వెల్లబోసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:45 - July 29, 2016

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ విధానానికి ప్రపంచ దేశాల నుంచి సానుకూల స్పందన వస్తుందని సీఆర్డీఏ కొత్త కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సీఆర్డీఏ కొత్త కమిషనర్ గా చెరుకూరి శ్రీధర్ పదవీ బాధ్యతలు స్వీకరించించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్జాతీయ బిడ్లను ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిని నిర్మించే దిశగా స్విస్ ఛాలెంజ్ విధానం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. 

 

హామీలకు కట్టుబడి ఉన్నాం : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : హామీలకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి అరుణజైట్లీ చెప్పారు. విభజన వల్ల ఎపి రెవెన్యూ లోటులో ఉందన్నారు. ఎపి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. ఎపికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. హైకోర్టు విభజనకు నిధులు కేటాయించాలని చట్టంలో ఉందన్నారు. 

చిన్నరాష్ట్రాలకు మొదటి నుంచి మేం అనుకూలం : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : చిన్నరాష్ట్రాలకు మొదటి నుంచి తాము అనుకూలమని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీజేపీ మూడు రాష్ట్రాలను విభజించిందన్నారు. నాడు వాజ్ పేయి ప్రభుత్వంలో ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్ జార్ఖండ్ రాష్ట్రాలను పద్ధతి ప్రకారం విభజించామని చెప్పారు. కాబట్టి ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. 

 

విభజన భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : రాజ్యసభలో ఎపికి ప్రత్యేకహోదాపై అరుణ్ జైట్లీ సమాధానం చెప్పారు. ఎపి కష్టాల్లో ఉందని ఎంపీలు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ఉందన్నారు. విభజన భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని చెప్పారు. 

16:17 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజీ స్కాంపై ప్రభుత్వానికి డీజీపీ అనురాగ్‌ శర్మ నివేదిక సమర్పించారు. ఈ కేసు దర్యాప్తులో పదిమంది ప్రభుత్వ టీచర్లకు పేపర్లు అమ్మినట్లు సీఐడీ నిర్ధారించింది. నిందితుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బంధువు తిరుమలేశ్‌ ఉన్నారని తెలిపింది. కాసేపట్లో నిందితులు రమేశ్, రాజగోపాల్‌ అరెస్ట్‌ను సీఐడీ నిర్ధారించనున్నారు. మధ్యాహ్నం 3గం.లకు సీఎం కేసీఆర్‌కు డీజీపీ నివేదిక అందజేయనున్నారు. 

 

యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు కడియ శ్రీహరి, లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ హాజరయ్యారు.  యూనివర్సిటీలపై చర్చిస్తున్నారు. 

 

యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం కొనసాగుతోంది. మంత్రులు కడియ శ్రీహరి, లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ హాజరయ్యారు.

ఎపికి అండగా ఉంటాం : అరుణ్ జైట్లీ

ఢిల్లీ : అభివృద్ధి చెందే వరకు ఎపికి అండగా ఉంటామని కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భరోసా ఇచ్చారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇస్తున్నామని చెప్పారు. మిత్రపక్షం అధికారంలో ఉందని అధిక నిధులు కేటాయించలేమని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి లోబడే నిధులు కేటాయింపు ఉంటుందన్నారు.

కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ చేయొద్దు : సుజనా చౌదరి

ఢిల్లీ  : ఉమ్మడి ఎపి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. రాజ్యసభలో ఎపికి ప్రత్యేకహోదాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుజనా మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన తప్పులను బీజేపీ చేయొద్దని సూచించారు. 

ఎంసెట్2 స్కామ్ పై సీఐడీ ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్ : ఎంసెట్2 స్కామ్ పై సీఐడీ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. పది మంది ప్రభుత్వ టీచర్లకు పేపర్లు అమ్మినట్లు నిర్ధారించారు. నిందితుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బంధువు తిరుమలేశు కాసేపట్లో మరో ఇద్దరు నిందితులు రమేష్, రాజగోపాల్ అరెస్టును సీఐడీ నిర్ధారించింది.

 

నూజివీడులో 'వనం మనం' కార్యక్రమం

కృష్ణా : నూజివీడులో 'వనం మనం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షింంచాలన్నారు.

కాసేపట్లో టీపీసీసీ అత్యవసర సమావేశం

హైదరాబాద్ : కాసేపట్లో టీపీసీసీ అత్యవసర సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్టు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ చేపట్టనున్నారు.

ఎంసెట్2 ప్రశ్నాపత్రం లీకేజీతో నల్గొండ జిల్లాకు లింకులు

నల్గొండ : ఎంసెట్2 ప్రశ్నాపత్రం లీకేజీతో జిల్లాకు లింకులున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ బంధువు సూత్రధారి, పది మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలకు ఎంసెట్2 ప్రశ్నాపత్రాలు తిరుమల్ అమ్మినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాత్రపైనా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీని సీఐడీ విచారించే అవకాశం ఉంది.

 

14:05 - July 29, 2016

కృష్ణా : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వనం-మనం’ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని సుంకొల్లులో ఏపీ సీఎం చంద్రబాబు ఔషధ మొక్కలైన రావి, వేప నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీలో ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హార్టీ కల్చర్ హబ్ గా తీర్చిదిద్దటానికి కమిట్ అయ్యామన్నారు. మన రాష్ట్రంలో లక్షల హెక్టార్ల అడవులు వున్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు సక్రమంగా పనిచేస్తే రాష్ట్రంలో వర్షాలకు లోటువండదన్నారు.పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే కరవు సంభవించే ప్రమాదముంటుదని తెలిపారు. విదేశాలలో మొక్కల్ని ఒక క్రమపద్ధతిలో రంగుల ప్రకారం నాటి చూడటానికీ..ఆహ్లాదంగా వుండేలా మొక్కల్ని నాటుతున్నారని తెలిపారు. ప్రకృతిని మనం సంరక్షిస్తే ప్రకృతి మానవుడ్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి ఒకో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ లా మార్చటానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటనివారు మనిషే కాదని ఆయన పేర్కొన్నారు. 'వనం మనం' కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలంతా మొక్కలు నాటేందుకు తమవంతుగా కృషి చేయాలన్నారు.

14:01 - July 29, 2016

హైదరాబాద్ : బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ డిమాండ్ల సాధన పరిష్కారానికై దేశ వ్యాప్త సమ్మె చేపట్టారు. గన్ ఫౌండ్రిలోని ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలిపింది. ప్రజల ప్రయోజనాకలు భిన్నంగా ఐదు బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు విమర్శించారు.

13:57 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజగోపాల్‌ను డీజీపీ ఆఫీసుకు తరలించారు.. రాజగోపాల్‌నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.. రాజగోపాల్ బ్యాచ్‌తో పాటు..మరో నాలుగు బ్యాచ్‌లకు పేపర్ లీకైనట్టు సమాచారం... మూడు కార్పొరేట్ కాలేజీలకు ఈ లీకేజ్‌తో సంబంధంఉందని తెలుస్తోంది.. కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

13:08 - July 29, 2016

ముంబై : పుణె సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు శిథిలాలను తొలగిస్తున్నారు.

12:53 - July 29, 2016

హైదరాబాద్ : రెండేళ్లు కరవుతో అల్లాడిన రైతన్న.. ఖరీఫ్ కలిసొస్తుందని గంపెడాశతో ఉన్నాడు. ఆశించిన మేరవర్షాలు కురుస్తుండడంతో..ఖరీఫ్‌కు ఇక డోకాలేదనుకున్నాడు. అయితే దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్లుగా ప్రభుత్వం నుండి సహకారం కరువైంది. విత్తనాల నుండి అప్పుల దాకా అన్ని రైతన్నను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

సర్కారు నుండి సహకారం అందని రైతన్నలు..
తీవ్ర కరవుతో అల్లాడిన రైతన్నకు ఇటీవల కురుస్తున్న వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. కాని ప్రభుత్వం నుండి రైతన్నకు ఎలాంటి సహకారం అందడం లేదు. ప్రత్యామ్నాయ పంటలువేయాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం అందుకు తగినవిధంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం లేదు. దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

విత్తనాలు ఎరువులను సరఫరాలో సర్కారు విఫలం..
తొలకరి ప్రారంభం కావడంతో అన్నదాత పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. అయితే వ్యవసాయశాఖ మాత్రం యాక్షన్ ప్లాన్ రూపొందించి..విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైంది. ఈ ఏడాది పత్తి వేయకూడదని.. పత్తికి బదులుగా సోయా, మొక్కజొన్న వేయాలని చెప్పిన సర్కార్..విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీటితో పాటు ముతక పంటలైన సోయా, మిర్చి వంటి విత్తనాల రేట్లు బహిరంగ మార్కెట్లో మండిపోతున్నాయి. దళారులతో కృత్రిమ కొరతను సృష్టించి..అందిన కాడికి దండుకుంటున్నారు. నిజంగా ప్రభుత్వం రాయితీ ఇస్తే విత్తన రేట్లు ఎందుకు పెరుగుతాయని ప్రశ్నిస్తున్నారు రైతులు.

రైతుల నడ్డివిరుస్తున్న ప్రైవేట్ అప్పులు ..
విత్తన కష్టాలు ఈ విధంగా ఉంటే.. ప్రైవేట్ అప్పులు రైతుల నడ్డివిరుస్తున్నాయి. బ్యాంకుల నుండి రుణాలు అందకపోవడంతో.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. సర్కార్ మరో విడత కింద రెండు వేల కోట్ల రుణమాఫీ నిధులు విడుదలచేసినా..అవి అందకపోవడంతో బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదు. ఎరువుల విత్తనాలను మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నా.. వ్యవసాయ శాఖ పట్టినట్లు వ్యవహరిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.

2015 లో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు..
తెలంగాణలో రెండేళ్లతో పోల్చుకుంటే..ఈ ఏడు సాధారణ వర్షపాతం నమోదవుతోంది. 2014లో 46 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండి కరవు ఛాయలు అలుముకున్నాయి. ఇక 2015 లో సైతం సాధారణం కంటే 17 శాతం వర్షపాత నమోదైంది. కాని ఈ ఏడు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రిపోర్టు ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే .. 15 శాతం అధికంగానే నమోదైంది.

పట్టనట్లు వ్యవహరిస్తున్న వ్యవసాయశాఖ..
ఈ ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ..ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోంది. రైతులకు ప్రత్యామ్నయం చూపించినా ప్రభుత్వం.. విత్తనాలకు, ఎరువులు అందుబాటులో ఉంచితేనే.. కురిసిన వర్షాలకు అనుగుణంగా పంటలు పండుతాయి.

12:48 - July 29, 2016

హైదరాబాద్‌ : ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అసలే వర్షాకాలం... ఆపై గుంతలు... దీంతో గంటల తరబడి రోడ్డుపై ప్రయాణం చేయాల్సివస్తోంది. ఇక సిటీ బస్సుల్లో ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ప్రాంతాల్లో అయితే బస్టాపులు లేక రోడ్ల మీదే వానలో తడుస్తూ నగరవాసులు నానాఇబ్బందులు పడుతున్నారు.

బస్ షెల్టర్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ..
హైద‌రాబాద్ లో ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు ప్రజ‌లు. ఎప్పుడు ఆఫీస్‌కు చేరుకుంటామో... ఎప్పుడు ఇంటికి చేరుకుంటామో దేవుడికే తెలియాలి. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారీ బాధలైతే వర్ణనాతీతం.. నగరంలో ప్రతిరోజు 15ల‌క్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బ‌స్సుల‌ను ఆశ్రయిస్తున్నారు. దాదాపు 3వేల ఆర్టీసీ బ‌స్సులు త‌మ సేవ‌లను అందిస్తున్నాయి. అయితే బ‌స్సుల్లో ప్రయాణించే వారు బ‌స్టాపుల్లో షెల్టర్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

1832 షెల్టర్లు అవసరమని గుర్తించిన ఆర్టీసీ అధికారులు..
సిటీలో బస్‌ షెల్టర్ల నిర్మాణ బాధ్యతల నుంచి ఆర్టీసీ తప్పుకుంది. ఈ బాధ్యతలను 2008లో జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది. జీహెచ్‌ఎంసీ కూడా దీనిని అంతగా పట్టించుకోలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1832 బస్‌ షెల్టర్లు అవసరమని ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు ప్రతిపాదనలు పంపారు. అయితే అవి ప్రస్తుతం 2500 వ‌ర‌కు అవ‌స‌రమవుతాయిని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇక మెట్రోరైల్ నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతాల్లో అయితే బ‌స్ షెల్టర్‌లను పూర్తిగా తొల‌గించారు.

నేటికీ కార్యరూపం దాల్చని షెల్టర్ల నిర్మాణం..
బ‌ల్దియా ఎన్నిక‌ల ముందు సిటీలో కనీసం బ‌స్టాపులు లేవ‌ని తమకు అధికారం అప్పజెప్పితే.. కొద్ది కాలంలోనే వాటిని నిర్మిస్తామ‌ని అధికార పార్టీ నేతలు చెప్పారు. ఇప్పడు వాటి ఊసే ఎత్తడడం లేదు. గ్రేటర్ వంద‌రోజుల ప్రణాళిక‌లో భాగంగా 50 బ‌స్ షెల్టర్‌లను ఆధునిక‌రిస్తామ‌ని.. ఆధునిక బ‌స్ బేల‌ను నిర్మిస్తామని చెప్పిన‌ప్పటికి అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు.
చెట్ల చాటునా.. షాపుల మాటునా తలదాచుకుంటున్న ప్రయాణికులు
బ‌స్ షెల్టర్లు కూడా వాణిజ్య ప్రకటనల ద్వారా ఎక్కడైతే ఎక్కువ ఆదాయం వస్తుందో , అక్కడే నిర్మించారు. ప్రయాణికులు రద్దీగా ఉండే చోట బస్టాప్ షెల్టర్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు.. దీంతో ప్రయాణికులు వ‌ర్షానికి ఇలా చెట్ల చాటునా.. షాపుల మాటునా తలదాచుకుంటున్నారు.

బ‌స్ షెల్టర్లపై అధ్యయనం..
ఇటీవ‌ల జీహెచ్‌ఎంసీ మేయ‌ర్, క‌మిష‌నర్ ఢిల్లీలోని బ‌స్ షెల్టర్‌లను అధ్యయనం చేశారు. వీటిపై డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును త‌యారు చేసే బాధ్యత‌ను జీహెచ్‌ఎంసీ హస్కీ సంస్థకు అప్పజెప్పింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో.. ఎప్పుడు బస్సు ప్రయాణికులకు ఊరట లభిస్తుందో వేచి చూడాలి..

12:42 - July 29, 2016

విజయవాడ : మేం ఇప్పటికే భూములిచ్చాం. మళ్లీ భూ సేకరణ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసి ఉన్న భూములను లాక్కోవలని చూడటం సరికాదని రాజధాని ప్రాంత రైతులు ఏపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నాటి వ్యవసాయాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఉన్న కొన్ని భూముల్ని కాపాడుకుంటామని నేలపాడు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే ఎకరాల భూముల్ని వదులుకున్నామని..నోటిఫికేషన్‌ ద్వారా మరిన్ని భూముల్ని తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమైతే పోరు తప్పదని హెచ్చరిస్తున్నారు. Look.

భూ సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఎపీ రాజధాని ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి భూ సేకరణ అస్త్రం ద్వారా తీసుకోవాలని భావిస్తోంది. భూ సమీకరణ ప్రారంభించిన నేలపాడు గ్రామం నుంచే భూములు తీసుకునే కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. ఉండవల్లి, పెనమాక, ఎర్రబాలెం, నిడమర్రు, భేతపూడి గ్రామాలు మినహాయించి, మిగతా గ్రామాల్లో చాలా మంది రైతులు భూములు ఇచ్చారు. అప్పుడెవరైతే భూములివ్వలేదో వారి నుంచి అక్టోబర్‌ లోగా భూ సేకరణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తుళ్లూరు మండలం నేలపాడు నుంచి భూ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేలపాడులో 40 మంది రైతులకు చెందిన 27.86 ఎకరాల భూమిని 2013 భూ సేకరణ చట్టం ద్వారా తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనిపై రైతులకు ఏవైనా అభ్యంతరాలుంటే నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల్లోగా తెలపవచ్చని పేర్కొన్నారు. అలాగే నోటిఫికేషన్‌ జారీ చేసిన 27.86 ఎకరాల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరపరాదంటూ నోటిఫికేషన్‌లో తెలిపారు.

భూసేకరణ నోటిఫికేషన్‌..
మరోవైపు నేలపాడులో భూములివ్వని రైతులు మాత్రం.. తమ జీవనాధారమైన వ్యవసాయ భూముల్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చామని, ఉన్న భూమిలో సాగు చేసుకుని బతుకుతామని చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ.. చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కోరన్న ధీమాతో ఉన్నారు రైతులు.

సాగు భూముల్ని ఇచ్చేది లేదంటున్న రైతులు..
రాజధాని నిర్మాణంలో వ్యవసాయ భూమలు ఉండకూడదన్న నిబంధన ఎక్కడా లేదని, ఎంత పెద్ద రాజధాని అయినా చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే వెసలుబాటు ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న సింగపూర్‌తో పాటు హైదరాబాద్‌లో కూడా నగర శివారుల్లో వ్యవసాయం చేస్తున్నారని ఉదహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి తమ భూములు అడ్డుగా ఉంటే.. వాటిని తీసుకుని గ్రామ రెవిన్యూ పరిధిలో మరో చోటైనా ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని రైతులు అంటున్నారు. ఏదేమైనా తమ భూములు మాత్రం ఇచ్చేది లేదని రాజధాని ప్రాంత రైతులు ఖరాకండిగా చెబుతున్నారు. నేలపాడుకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు కావాలనే మంత్రులు, అధికారులను ఉసిగొల్పి భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చాలా చేశారని, ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవాలని చూస్తే, రైతుల అంగీకారంతోనే తీసుకోవాలని, నేలపాడు రైతులు స్పష్టం చేస్తున్నారు. మా భవిష్యత్‌ తరాల కోసం.. ఉన్న భూముల్ని కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు.

భవనం కూలి 9మంది మృతి..

ముంబై : పుణె సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు శిథిలాలను తొలగిస్తున్నారు.

మంత్రి హరీష్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై సమీక్ష నిర్వహించారు. 

బాధ్యతలు స్వీకరించిన సీఆర్డీఏ కమిషనర్..

విజయవాడ : సీఆర్డీఏ కమిషనర్ గా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి ప్రపంచ దేశాల నుండి మంచి స్పందన వస్తోందని శ్రీధర్ టెన్ టివికి తెలియచేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మించడమే ధ్యేయమని, రాజధానికి భూములిచ్చిన రైతుల హామీలను నెరవేరుస్తామన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల హామీలను నెరవేరుస్తామని, భూ సమీకరణ చేయని ప్రాంతాల్లో వచ్చే నెలల్లో చేపడుతామన్నారు. రాజధాని ప్రాంతంలో గ్రామాలను తొలగిస్తారనేది అపోహే అని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రాజధాని ప్రాంతంలో కుటుంబాలకు ఫించన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

12:36 - July 29, 2016

నిజామాబాద్ : రెండేళ్ల క్రితం డెడ్‌ స్టోరేజీకి చేరిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఇప్పుడు జలకళతో మురిసిపోతోంది. రైతన్నలను ఆదుకోవచ్చని సంబరపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో రైతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి..సాగునీటికి ఇబ్బందులు తప్పినట్లేనని అంతా సంబరపడుతున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు..
తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో అంతకంతకూ పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1071.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రస్తుతం 32.61 టీఎంసీల నీరు ఉంది.

జలకళను సంతరించుకున్న అందూరా ప్రాజెక్టు..
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల బాబ్లీ ప్రాజెక్టుపైన ఉన్న అందూరా ప్రాజెక్టు నిండిపోయింది. ఈ ప్రాజెక్టు నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. మంజీరా, హరిద్రా నదుల ద్వారా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతోంది. ప్రాజెక్టులకు ప్రస్తుతం నీటి మట్టం పెరుగుతుండడంతో అన్ని కాలువల తూములను పరిశీలిస్తున్నారు అధికారులు. వాటి షెట్టర్లను పరిశీలించి ఆయిలింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అంచనా వేస్తూ..నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ఖరీఫ్‌లో రైతులకు నీటిని అందించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతుండడంతో కరీంనగర్‌, వరంగల్ జిల్లా ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

9.68 లక్షల ఎకరాలకు సాగు నీరు
శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 9.68 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. గత రెండు సంవత్సరాల నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌, రబీ ఆయకట్టు రైతులకు సాగు నీరు అందలేదు. దీంతో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

12:29 - July 29, 2016

ఆదిలాబాద్‌ : జిల్లాలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఎగువన, స్థానికంగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది. కడెం జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జులై వరకు అడుగంటి కనిపించిన జలాశయాలు ఇప్పుడు నిండుకుండలను తలపిస్తున్నాయి..!

ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద భారీగా పోటెత్తుతోంది. జిల్లాలోని 42 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 10 మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది.

జిల్లాలో సగటు వర్షపాతం 451 మిల్లీమీటర్లు నమోదు..
జిల్లాలో గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటు వర్షపాతం 451 మిల్లీమీటర్లు నమోదుకాగా, 6 శాతం తక్కువగా కురిసింది. గత ఏడాది కంటే ఈ సారి 239.4మి.మీ వర్షపాతం అధికంగా పడింది. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వరద పోటెత్తుండడంతో.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి..వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా నీల్వాయి జలాశయం ..
గడ్డెన్న ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.70 అడుగులుకాగా, 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుత నీటిమట్టం 358.6 అడుగులకు చేరింది. అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 7,220 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా ఎస్సారెస్పీకి చేరుతోంది. దీంతో నీల్వాయి జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం మత్తడి నుంచి ఉధృతంగా వరద నీరు వాగులోకి వస్తుండటంతో గొర్లపల్లి వాగులో నీటి ప్రవాహ ఉధృతి కొనసాగుతోంది. వాగు దాటడానికి ప్రజలకు పడవ ప్రయాణం తప్పడం లేదు. గడ్డెన్న వాగు జలాశయం నిండటంతో నాలుగు గేట్ల ద్వారా అధికారులు నీటిని సుద్ద వాగులోకి వదులుతున్నారు.

స్వర్ణ ప్రాజెక్టు నుంచి 284 క్యూసెక్కుల నీరు విడుదల
స్వర్ణ ప్రాజెక్టు నిండుగా ఉండడంతో.. ఒక గేటు ఎత్తి 284క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్- కరీంనగర్‌ జిల్లాల మధ్య ఉన్న గూడెం-రాయపట్నం వంతెన ఐదు రోజులుగా నీటిలోనే తేలియాడుతోంది. దీంతో ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు ముంపు బెడద ఉంది. ఇప్పటికే రాపల్లి, కర్ణమామిడి గ్రామాలు తక్షణం ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ..
మొత్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనా తాము రెండు పంటలు పండించుకోవచ్చని సంబరపడుతున్నారు.

12:27 - July 29, 2016

వర్షాకాలం..సులువుగా వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీసుకొనే ఆహారంలో మెలుకవలు అవసరం. గాలిలో పెరిగిన తేమ శరీరంలో వేడిని పెంచుతుంది. వాతావరణ ప్రభావం వల్ల ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతుంటారు. జీర్ణశక్తి బలహీనమవుతుంటుంది. సో..కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది.
వానాకాలంలో చల్లగా ఉంటుంది కనుక వేడి వేడి పదార్థాలను తినాలని అనిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా పానీ పూరి చెప్పుకోవచ్చు. నీటి కలుషితం ఎక్కువగా ఉంటుందని గమనంలో ఉంచుకోవాలి. శుభ్రంగా లేని పానీపూరి తినడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. పానీ కలిపే సమయంలో శుభ్రత లోపించే అవకాశం ఉంది.
వానాకాలంలో సూక్ష్మ జీవులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. కొన్ని గంటల క్రితం కోసిన పండ్లు..కూరగాయలు ముక్కలకు తేమ వల్ల క్రిములు పాకొచ్చు.
వానాకాలంలో అక్కడకక్కడ మామిడి పండ్లు దొరుకుతుంటాయి. ఈ సీజన్ వాటిని తినడం అంత మంచిది కాదు. ఎక్కువ నూనెతో తయారయ్యే వంటలు తినడం మంచది కాదు. నిల్వపదార్థాలు, అధిక శ్రమతో కూడిన వ్యాయాయం కూడా మంచిది కాదు.

వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహారం..
వారానికొకసారి ఆలీవ్ ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి.
కార్న్, ఆలీవ్ ఆయిలతో చేసిన వంటలు బాగుంటాయి.
మెంతికూరతో పాటు గింజలు కూడా వంటల్లో వాడుతుండాలి.
రాజ్మ, జొన్న, తెల్ల సజ్జలు, ఓట్స్ బాగుంటాయి.
నిమ్మకాయ రసం చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెదడుని చురుకుగా ఉంచుతుంది.
పసుపుని వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల అంటు వ్యాధులు అంటుకోకుండా ఉంటాయి.
తాజా కూరగాయాలు, తాజా పళ్ల రసాలు, పుల్కాలు వంటివి మంచిది.
బయట దొరికే ఫుడ్స్ కు గుడ్ బై చెప్పాలి. రోజు కాచి చల్లార్చిన నీళ్లు తాగుతుండాలి.
ఫ్రిజ్ లో దాచిపెట్టిన ఆహార పదార్థాలను వేడి చేసి తినకూడదు. తినే పదార్థాలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి. 

రెండు గంటలకు 'హోదా'పై చర్చ..

ఢిల్లీ : మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగనుంది. ఎంపీలు సుజనా, సీతారామలక్ష్మిలు చర్చలో పాల్గొననున్నారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చర్చల అనంతరం కేంద్ర మంత్రి జైట్లీ ప్రసంగించనున్నారు. 

12:24 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్ 2 స్కామ్ లో విచారణ లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. తీగలాగేకొద్ది అధికారులు నివ్వెరపోయే వాస్తవాలు బయటపడున్నాయి. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డి బ్యాచ్ తో పాటు మరో నలుగురు పేపర్ లీక్ చేసినట్లుగా సమచారం. మూడు కార్పొరేట్ కాలేజీల సంబంధాలపై సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యాలు..విద్యార్థుల తల్లిదండ్రులను విచారిస్తున్నారు. ఖమ్మంలోని కృష్ణవేణి, రోజోనెన్స్ కాలేజీలలో సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

ఎంసెట్ 2 స్కామ్ లో భారీ అక్రమాలు..

హైదరాబాద్ : ఎంసెట్ 2 స్కామ్ లో విచారణ లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. తీగలాగేకొద్ది భారీ అక్రమాలు బయటపడున్నాయి. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డి బ్యాచ్ తో పాటు మరో నలుగురు పేపర్ లీక్ చేసినట్లుగా సమచారం.

12:08 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ను రద్దు చేయొద్దంటూ తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి... మళ్లీ పరీక్ష నిర్వహించొద్దంటూ విద్యార్థిసంఘాలు మినిస్టర్‌ క్వార్టర్స్‌ను ముట్టడికి ప్రయత్నించాయి.. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.. నిరసన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు..దీనిపై మరిం సమాచారానికి ఈ వీడియోను చూడండి..

12:02 - July 29, 2016

అమెరికా : అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌ను ఒబామా ప్రశంసలతో ముంచెత్తారు. హిల్లరీ పోరాట యోధురాలని, గొప్ప దేశ భక్తురాలని కొనియాడారు. హిల్లరీ కన్నా అర్హులైన పురుషుడు కానీ, మహిళ కానీ లేరని...ఆమెను వైట్‌హౌజ్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్‌పై విమర్శలు కురిపించారు.

డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీని ప్రశంసలతో ముంచెత్తిన ఒబామా
ఫిల‌డెల్ఫియాలో జ‌రిగిన డెమొక్రటిక్ జాతీయ పార్టీ స‌మావేశంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రసంగిస్తూ.. ఆశావాద దృక్పథమే అమెరికా ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతోందన్నారు. హిల్లరీ ఓ ప్రజాసేవకురాలు, దేశభక్తురాలంటూ ఒబామా కీర్తించారు. అధ్యక్ష రేసులో సరైన ప్రణాళికతో ఉన్న ఏకైక వ్యక్తి హిల్లరీనేనని పేర్కొన్నారు. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో, క్లిష్ట సయమాల్లో ఎలా స్పందించాలో, సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసని అన్నారు. ఈ ఎన్నికల్లో హిల్లరీ ఒకవేళ విజయం సాధిస్తే తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డ్‌ సృష్టించనున్నారని ఒబామా చెప్పారు.

ట్రంప్‌పై ఒబామా విమ‌ర్శలు..
తన ప్రసంగంలో రిప‌బ్లిక‌న్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఒబామా విమ‌ర్శలు గుప్పించారు. అమెరికా ఎప్పటి నుంచో గొప్ప దేశమని, చాలా బ‌ల‌మైనదని పేర్కొన్నారు.. మ‌న శ‌క్తి, మ‌న గొప్పతనం ట్రంప్ మీద ఆధార‌ప‌డి లేద‌న్నారు. ట్రంప్‌ ప్రజా కంటకుడని, ద్వేష స్వభావం ఉన్న వ్యక్తిగా చిత్రీక‌రించారు. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ద్వేషాన్ని ఓడించాలి, భ‌యాన్ని వ‌దిలేయాలి, ఏది ఉత్తమ‌మో దాన్ని ఎన్నుకోవాల‌ని, హిల్లరీని దేశ అధ్యక్షురాలిగా చేయాలని ఒబామా పిలుపునిచ్చారు.

న‌న్ను ఆదరించిన‌ట్లుగానే హిల్లరీని ఆదరించాలన్న ఒబామా..
ఒబామా మాట్లాడుతూ ఉండగానే హిల్లరీ స్టేజిపైకి వచ్చారు. ఒబామా ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.దేశాన్ని సుర‌క్షిత‌మైన చేతుల్లో పెడుతున్నానని... అవ‌స‌ర‌మైన‌ప్పుడు న‌న్ను ఎన్నుకున్నారు... ఇప్పుడు హిల్లరీని కూడా ఎన్నుకోవాల‌ని స‌మావేశాన్ని ఉద్దేశించి ఒబామా పేర్కొన్నారు. న‌న్ను ఆదరించిన‌ట్లుగానే హిల్లరీని కూడా చూడాల‌ని కోరారు.

షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

మహబూబ్ నగర్ : కోస్గి (మం) తోగాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. పొలంలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పొలం వద్ద కరెంటు కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

డీజీపీ ఆఫీసు ఎదుట ఏబీవీపీ ఆందోళన..

హైదరాబాద్ : డీజీపీ ఆఫీసు ఎదుట ఏవీబీపీ ఆందోళన నిర్వహించింది. హెచ్ సీయూలో ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

11:52 - July 29, 2016

కరీంనగర్ : పోరాడితే పోయేదేముంది తెగిపడే సంకెళ్లు, సాకారమయ్యే హక్కులు తప్ప. అదే స్ఫూర్తితో ముందుకుసాగిన ఓ గ్రామస్తుల సుధీర్ఘ పోరాటం ఫలించింది. హైకోర్టు తీర్పుతో వారి ఆశలు చిగురించాయి. ప్రస్తుతం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని విజయగర్వంతో చెబుతున్నారు. ఇంతకు వారు సాధించిన విజయమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ..!

నిధులు వస్తాయన్న ఆశతో బాధల్ని భరించిన గ్రామస్థులు..
కరీంనగర్ జిల్లా గంగధర మండలం గట్టుభూత్కుర్ గ్రామమిది. ఈ గ్రామానికి ఆధారమైన గుట్టలు రోజురోజుకు కనుమరుగవుతున్నా..ఊరిజనమంతా సహించారు. గ్రానైట్ పేళుళ్లతో ఇళ్లపై పెద్ద పెద్ద బండలు పడినా భరించారు. ఎందుకంటే గ్రామానికి రావాల్సిన నిధులు వస్తాయనే ఆశతో..

ఆరేళ్లుగా గుట్టలను లీజుకు ఇస్తున్న రాష్ర్ట ప్రభుత్వం..
ఆరేళ్లుగా గట్టుభూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టలను ప్రభుత్వం లీజుకు ఇస్తుండడంతో 21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నిబంధనల ప్రకారం ఇందులో 25 శాతం వాటా గ్రామ పంచాయతీకి చెల్లించాలి. అయితే..ప్రభుత్వం న్యాయమైన వాటా చెల్లించకుండా 41 లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసి, చేతులు దులుపుకుంది. దీంతో ప్రభుత్వ తీరుపై విసుగుచెందిన వార్డు సభ్యులు చంద్రయ్యతో పాటు మరికొంతమంది గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం..పంచాయతీకి దక్కాల్సిన సీనరేజీ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే..ఏడాది గడిచినా సర్కార్‌ నిధులను విడుదల చేయకపోవడంతో ఫిర్యాదుదారుడు మల్లయ్య మరోసారి గతనెలలో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. తక్షణమే డబ్బులు మంజూరు చేయాలని రెండోసారి ఆదేశాలు జారీ చేసింది. దీంతో గట్టు భూత్కుర్ గ్రామ పంచాయతీకి సీనరేజి కింద రావాల్సిన 4 కోట్ల 75 లక్షల 9వేల రూపాయల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆరేళ్లుగా గుట్టలను లీజుకు ఇస్తున్న రాష్ర్ట ప్రభుత్వం..

ఆరేళ్లుగా గట్టుభూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టలను ప్రభుత్వం లీజుకు ఇస్తుండడంతో 21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. నిబంధనల ప్రకారం ఇందులో 25 శాతం వాటా గ్రామ పంచాయతీకి చెల్లించాలి. అయితే..ప్రభుత్వం న్యాయమైన వాటా చెల్లించకుండా 41 లక్షల రూపాయలు మాత్రమే విడుదల చేసి, చేతులు దులుపుకుంది. దీంతో ప్రభుత్వ తీరుపై విసుగుచెందిన వార్డు సభ్యులు చంద్రయ్యతో పాటు మరికొంతమంది గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం..పంచాయతీకి దక్కాల్సిన సీనరేజీ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే..ఏడాది గడిచినా సర్కార్‌ నిధులను విడుదల చేయకపోవడంతో ఫిర్యాదుదారుడు మల్లయ్య మరోసారి గతనెలలో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. తక్షణమే డబ్బులు మంజూరు చేయాలని రెండోసారి ఆదేశాలు జారీ చేసింది. దీంతో గట్టు భూత్కుర్ గ్రామ పంచాయతీకి సీనరేజి కింద రావాల్సిన 4 కోట్ల 75 లక్షల 9వేల రూపాయల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిధుల విడుదలతో సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..
గ్రామానికి రావాల్సిన న్యాయమైన నిధులను సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులతో గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, శ్మాశనవాటిక, తాగునీటి ట్యాంకులు, మురుగుకాల్వలను నిర్మించుకుంటామని చెబుతున్నారు. అతి త్వరలోనే గ్రామాన్ని సర్వంగా సుందరంగా తీర్చి దిద్దుతామని చెబుతున్నారు.

గ్రామస్థులకు 10 టీవీ హ్యాట్సాప్‌..
గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. చిన్నచూపుచూడడంతో న్యాయంగా దక్కాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వ మెడలు వంచిన గ్రామస్తులు కోర్టు ఆదేశాల ద్వారా నిధులు తెచ్చుకుని.. అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్నారు. అతి త్వరలోనే గట్టుభూత్కుర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సగర్వంగా చెబుతున్న గ్రామస్తులకు 10 టీవీ హ్యాట్సాప్‌ చెబుతోంది.

 

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. డీజీపీ, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, ఐదు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. 

పోలీసుల అదుపులో జానా..షబ్బీర్..

మెదక్ : వంటిమామిడి వద్ద షబ్బీర్, జానారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులను పరామర్శించేందుకు జానా, షబ్బీర్ లు వెళుతున్నారు. 

కృష్ణవేణి రెజోనెన్స్ కాలేజీలో సీఐడీ సోదాలు...

ఖమ్మం : కృష్ణవేణి రెజోనెన్స్ కళాశాలలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఎంసెట్ 2 లీకేజ్ పై కృష్ణవేణి కళాశాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

11:36 - July 29, 2016

హైదరాబాద్ : ఆత్మహత్య ఈ మాట తరచూ వినిపిస్తోంది. బ్రతికి సమస్యలను ఎదిరించలేని నిస్సహాయస్థితిలో ప్రతిఒక్కరూ ఆశ్రయించే ప్రధానమైన మార్గం ఆత్మహత్య. ఆకలికి పేద గొప్పా తేడా లేనట్లే..ఆత్మహత్యకు కూడా ఆ తేడాలేమి వుండదు..ఒత్తిడితో కొందరూ..అప్పుల బాధతో కొందరూ..ఇలా పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలీదు కానీ కాచిగూడ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 7గంటలకు ముక్కుపచ్చలారని రెండేళ్ళ కుమారుడితో సహా 14 అంతస్థుల భవనం నుండి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. పాతబస్తీ సమీపంలోని ఉప్పుగూడలో కాపురముంటున్న ఈ మహిళ ఇంటి నుండి బయలుదేరి మార్గ మధ్యలో కనిపించిన బహుళ అంతస్థుల భవనం పైనుండి బిడ్డతో సహా దూకి మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు.

రాజ్యసభలో విపక్షాల ఆందోళన..

ఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపింది. విపక్షాలు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఆన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేసినట్లయితే రికార్డుల నుండి తొలగిస్తానని, ఆందోళన విరమించాలని డిప్యూటి స్పీకర్ విపక్షాలకు సూచించారు. అంతకుముందు రచయిత మహాశ్వేతాదేవి మృతికి రాజ్యసభ సంతాపం తెలియచేసింది.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో గత కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రచయిత మహాశ్వేతాదేవి మృతికి రాజ్యసభ సంతాపం తెలియచేసింది. గురువారం ఏపీ హోదాపై స్వల్పకాలిక చర్చ జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం సభలో మంత్రి జైట్లీ సమాధానం చెప్పనున్నారు. 

11:28 - July 29, 2016

హర్యానా  : అవును మీరు వింటున్నది నిజమే. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిని ఓ రైతు వివాహం చేసుకున్నాడు. అంతేగాక ఆమెకు న్యాయం కలిగించేందుకు పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...జింద్ జిల్లాలో ఛాతర్ అనే గ్రామం ఉంది. అక్కడ నివాసం ఉండే జితేందర్ అనే యువ రైతు సామూహిక అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు అండగా ఉండాలని న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యక్తి అరెస్టు కోసం సీఎం మనోహర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడు. న్యాయవిద్యపై ఆసక్తి ఉన్న భార్య కోరికను కూడా నెరవేరుస్తున్నాడు. లాయర్ కావాలన్నది తన లక్ష్యమని..అత్యాచార బాధితులకు అండగా నిలవాలని అనుకొంటోందని జితేందర్ పేర్కొన్నాడు. బాధితుల తరపున పోరాడేందుకు యూత్ ఎగనెస్ట్ రేప్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నాడు. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు సైతం తోడ్పాటు అందిస్తున్న జితేందర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

11:18 - July 29, 2016

ఖమ్మం : జిల్లా ఖానాపురం హావేలి పరిధిలోని టేకులపల్లిలో అపరిశుభ్రత చిన్నారులను తీవ్ర అనారోగ్య పాల్జేస్తుంది. పలువురు మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. గత నెల రోజుల్లో స్ధానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే నలుగురు విద్యార్థులు మూర్చ, వాంతులతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. దాదాపు ఆరునెలల పాటు మందులు వాడితేనే ప్రయోజనం ఉంటుంది వైద్యులు తెలిపారు. అపరిశుభ్రత కారణంగానే చిన్నారులు రోగాల బారినపడినట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధులతో బాధపడుతున్న విద్యార్ధులు అనారోగ్యం పాలవుతున్నారు. పలకా బలపం పట్టుకుని స్కూలుకు పరుగులు తీయాల్సిన చిన్నారులు ఆసుపత్రుల పాలవ్వటానికి కారణాలేంటి? చెంగు చెంగున లేడిపిల్లల్లా గంతులు వేయాల్సిన పిల్లలు కళ్లు తిరిగిపడిపోవటానికి కారణమేంటి? అమ్మచేతి కమ్మనైన గోరుముద్దలు తినే చిన్నారు నెలల తరబడి మాత్రలు మింగాల్సిన అవసరమేంటి? దీనికంతటికీ అపరిశుభ్రతేనని తెలుస్తోంది..పరిశుభ్రత పాటించి చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది..

హర్యానా చీఫ్ సెక్రటరీ అత్యవసర సమావేశం..

హర్యానా : గురుగావ్ లో వరద పోటెత్తుతోంది. దీనితో పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గురుగావ్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిది. ఆరు గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 

నీట మునిగిన నారాయణపురం కాలనీ..

చిత్తూరు : తిరుపతిలోని నారాయణపురం కాలనీ నీట మునిగిపోయింది. దీనితో కాణిపాకం వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్ మెంట్ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

చిన్నారితో అపార్ట్ మెంట్ పైనుండి దూకిన తల్లి..

హైదరాబాద్ : కాచిగూడ మీరానికేతన్ అపార్ట్ మెంట్ 14వ అంతస్తు పై నుండి రెండేళ్ల బాలుడితో తల్లి దూకింది. దీనితో తల్లి, బాలుడు మృతి చెందారు. 

తెలంగాణ సచివాలయం వద్ద విద్యార్థులు..తల్లిదండ్రుల ఆందోళన..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం వద్ద ఎంసెట్ -2 విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ ఆందోళన చేయవద్దని, ఎన్టీఆర్ పార్కు వద్దకు వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. 

మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : మిన్టిసర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వార్టర్స్ ను ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ యత్నం చేసింది. ఎంసెట్ -2 ను రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీశైలం జలశయానికి వరద ఉధృతి...

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 809.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 12 వేల క్కూసెక్కులుగా ఉంది. ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 

10:25 - July 29, 2016

గుంటూరు : గుంటూరు మార్కెట్‌ యార్డు మాజీ కార్యదర్శి ఆడియోటేపుల వ్యవహారం... జిల్లాలో పెను దుమారం రేపుతోంది. టెన్‌టీవీ బయటపెట్టిన ఆడియో టేపులపై రాష్ట్రప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రస్తుతం విజయవాడ మార్కెట్‌యార్డులో ఉన్న సదరు అధికారిపై చర్యలకు రంగం సిద్ధం అవుతోంది.

అధికారపార్టీ నేతల అండతో రెచ్చిపోయిన నరహరి..
ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌ యార్డుకు దొడ్డిదారిలో సెక్రెటరీగా వచ్చినట్టు నరహరిపై అప్పట్లోనే పలు ఆరోపణొలొచ్చాయి. కార్యదర్శిగా కనీస విద్యార్హతకూడా లేకుండానే నరహరి కార్యదర్శిపోస్టును పట్టేసినట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీనికి స్థానిక అధికారపార్టీ నేతలు సహకరించినట్టు తెలుస్తోంది. కుర్చీలో కూర్చుంది మొదలు నిబంధనలపేరుతో వ్యాపారులను బెదిరిస్తూ..కోట్లరూపాయలు దండుకున్నట్టు నరహరిమీద ఆరోపణలున్నాయి. 2013 సంవత్సరానికి సంబంధించి లైసెన్సులు రెన్యువల్‌ విషయంలో ... వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి ఒక్కో లైసెన్స్‌ రెన్యువల్‌కు లక్షల రూపాయలు మింగేసినట్టు ఆరోపణలు రావడంతో.. నరహరిపై బదిలీ వేటుపడింది. కాని... తనకున్న రాజకీయపలుకుబడితో... తిరిగి విజయవాడ మార్కెట్‌యార్డులో సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టాడు.

10టీవీ బయటపెట్టిన ఆడియోటేపులు..
అయితే... అప్పట్లో గుంటూరు మార్కెట్‌ యార్డులో చేసిన నిర్వాకంపై స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. తమ వద్ద వసూలు చేసిన తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు... ఇదే టైంలో నరహరి గుంటూరు మార్కట్‌ యార్డు కార్యదర్శిగా సాగించిన భాగోతాన్ని టెన్‌టీవీ బయటపడెట్టడంతో కలకలం రేగింది. వసూళ్లకు సంబంధించిన ఆడియోటీపులు వెలుగుచూడ్డంతో అవినీతి గుట్టు రట్టైంది.

అవినీతి అధికారికి రాజకీయనేతల సహకారం..
నరహరి అవినీతి... రాజకీయ నాయకుల సహకారం... తదితర అంశాలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్యకమిటీ కీలక విషయాలు రాబట్టింది. కనీస విద్యార్హతలు లేని నరహరి ప్రమోషన్లకు అనర్హుడని తేల్చింది. అయినా... ఉన్నతాధికారుల్లో ఎటువంటి కదలికా లేదు. నరహరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ నాయకుల ఒత్తిడివల్లే... నరహరిమీద ఈగవాలడంలేదని స్థానిక వ్యాపారులు అంటున్నారు.

నరహరిపై మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు..
టే
పులు బయటపడటంతో... వ్యాపారులు తమ విమర్శలకు పదును పెట్టారు. లైసెన్సుల రెన్యూవల్‌కోసం తాము నరహరికి వసూలు చేసిన డబ్బును తమకు ఇప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు తక్షణమే నరహరిపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే..నరహరికి సహకరించిన నాయకుడిని ముఖ్యమంత్రే స్వయంగా మందలించినట్టు తెలుస్తోంది.

ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొన్న బస్..

వరంగల్ : వరంగల్ నగరంలోని ఆర్టీఏ జంక్షన్ లో బస్సు... ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సులోని విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులకు  ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు.

09:58 - July 29, 2016

హైదరాబాద్ : ప్రోకబడ్డీ నాలుగో సీజన్ లీగ్ సెమీస్ లైనప్ పూర్తయ్యింది.న్యూఢిల్లీ త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ పోటీలు ముగియడంతో...హైదరాబాద్ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే నాకౌట్ రౌండ్ పోటీలకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. తొలిసెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తో పూణేరీ పల్టాన్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండో సెమీఫైనల్లో ఆతిథ్య తెలుగుటైటాన్స్ తో జైపూర్ పింక్ పాంథర్స్ ఢీ కొంటుంది..

నాలుగుజట్ల సెమీస్ సమరానికి కౌంట్ డౌన్..
ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ నాలుగోసీజన్లో....56 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశ పోటీలకు న్యూఢిల్లీ త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో తెరపడింది.

దబాంగ్ ఢిల్లీ, యూ-ముంబా జట్ల ఆఖరి లీగ్ మ్యాచ్ ముగియడంతో నాలుగుజట్ల సెమీస్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

సెమీఫైనల్స్ సిద్ధమైన నాకౌట్ ఫైట్ ..

మొత్తం 14 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో...డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పూణేరీ పల్టాన్ మొదటి నాలుగు స్థానాల్లో నిలవడం ద్వారా...సెమీఫైనల్స్ నాకౌట్ ఫైట్ కు సిద్ధమయ్యాయి.

అత్యధిక విజయంతో పట్నా పైరేట్స్..
ప్రస్తుత చాంపియన్ పట్నా పైరేట్స్ మొత్తం 14 రౌండ్లలో అత్యధిక విజయాలతో 52 పాయింట్లు సాధించడం ద్వారా...లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. మరోవైపు...తెలుగు టైటాన్స్ 14 రౌండ్లలో 8 విజయాలతో 50 పాయింట్లు సాధించి..రెండోస్థానంలో నిలవడం ద్వారా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది. ఇక..మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 14 రౌండ్లలో 47 పాయింట్లు సాధించి మూడోస్థానంలో నిలిచింది. సెమీఫైనల్స్ నాలుగో బెర్త్ కోసం జరిగిన ఆఖరిరౌండ్ లీగ్ పోటీలో....పూణేరీ పల్టాన్ మూడుపాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ ను అధిగమించింది.

14 రౌండ్లలో 42 పాయింట్లు సంపాదించిన పూణేరీ..
పూణేరీ పల్టాన్ మొత్తం 14 రౌండ్లలో 42 పాయింట్లు సంపాదించి...లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్ లో అడుగు పెట్టింది.

5,6 స్థానాలతో సరిపెట్టుకున్న ముంబా..బెంగళూరు..
మాజీ చాంపియన్ యూ-ముంబా, బెంగళూరు బుల్స్ ..ఐదు,ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నాకౌట్ కు రంగం సిద్ధమయ్యింది...
దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ జట్లు లీగ్ టేబుల్ ఆఖరి రెండుస్థానాలకు పడిపోయాయి. లీగ్ టేబుల్ ఆఖరి నాలుగుస్థానాల్లో నిలిచిన జట్లు ..తొలిదశ పోటీల్లోనే నిష్క్రమించడంతో...మొదటి నాలుగుస్థానాల్లో నిలిచిన జట్ల సెమీస్ నాకౌట్ కు రంగం సిద్ధమయ్యింది.

పట్నా టూ పూణేరీ..
శుక్రవారం రాత్రి 8 గంటలకు జరిగే తొలిసెమీఫైనల్లో ప్రస్తుత చాంపియన్ పట్నా పైరేట్స్ తో పూణేరీ పల్టాన్ తలపడుతుంది.

జైపూర్ పింక్ పాంథర్స్ సవాల్..
రా
త్రి 9 గంటలకు ప్రారంభమయ్యే రెండోసెమీఫైనల్లో తెలుగు టైటాన్స్ కు మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ సవాల్ విసురుతోంది. సెమీఫైనల్స్, ఫైనల్స్ కు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.

09:47 - July 29, 2016

గుంటూరు : జిల్లాలో పుష్కర పనులు నత్తనడకన సాగుతున్నాయి. 12రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా ఘాట్ల నిర్మాణం ఇంకా చివరిదశకు చేరలేదు.. నిన్నటిదాకా సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ ల పేరుతో కాలం వెళ్లదీసిన అధికారులు ఇప్పుడు యుద్ధప్రాతిపదికంటూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అయినా పనులు సకాలంలో అవ్వటంలేదు. పనుల ఆటంకానికి వర్షాలు కొంత కారణమైతే..అధికారుల నిర్లక్ష్యం కూడా మరింత కారణంగా కనిపిస్తోంది. పనుల అలసత్వంపై సాక్షాత్తు సీఎం చంద్రబాబు పరిశీలించి చీవాట్లు పెట్టినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వున్నాయి..పుష్కర సమయం దగ్గర పడుతుండటంతో వర్కర్స్ పై ఒత్తిడి పెంచి పనులను కొనసాగిస్తున్నారు.

 

09:40 - July 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతం అయిపోతున్నాయి. జనజీవనం అస్తవ్యంగా మారిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా..త్రాగునీటి సరఫరాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు..
తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. దీంతో కొండపైన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులోని 8వ కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అలాగే కపిలతీర్థం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

కడపలో వర్షాలు జోరు..
కడప జిల్లాలో వర్షాలు హోరెత్తిపోతున్నాయి.... ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు గ్రామాలు నీటమునిగాయి.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి.. నగరంలోని ఆర్టీసీ గ్యారేజ్ వరదనీటితో నిండిపోయింది.. ఆర్టీసీ వర్క్‌షాప్‌ సమీపంలోని మృత్యుంజయ కుంట, చిన్నచౌక్‌, రామకృష్ణ నగర్‌, అప్సరా సర్కిల్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి.. వరదనీటి ఉధృతితో మురుగునీరంతా కాలనీల్లోకి చేరింది.. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..

09:33 - July 29, 2016

చెన్నై : ఈ నెల 22న చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన ఏఎన్-32 విమానం అదృశ్యమై వారం రోజులు గడుస్తున్నా నేటికీ ఆచూకీ దొరకలేదు. దీని కోసం సముద్రమంతా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ విమానాన్ని గాలించేందుకు ప్రత్యేకంగా తరలిస్తున్న సాగర్‌నిధి నౌక ఘటనాస్థలానికి చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మారిషస్‌ సముద్ర జలాల్లో ఉన్న ఈ నౌక.. చెన్నై సముద్ర జలాలకు చేరుకునేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని నౌకాదళవర్గాలు తెలిపాయి. ఏఎన్‌-32 విమానానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించలేదని కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారిరీకర్‌ లోక్‌సభలో తెలిపారు.

09:31 - July 29, 2016

'కబాలి' ఓపెనింగ్ సీన్ లో రజినీకాంత్ జైల్లో ఒక బుక్ చదువుతుంటాడు. సూపర్ స్టార్ సీన్ లో ఉన్నప్పుడు సహజంగానే కెమెరా ఫోకస్ రజినీ మీదే ఉంటుంది. కానీ ఆ సీన్ లో ఒక 2 సెకన్ల పాటు ఫోకస్ 'బుక్ కవర్ ఫొటో'పై పెట్టాడు దర్శకుడు రంజిత్ పా. ఇంతకూ ఏంటా బుక్ ఎందుకు డైరెక్టర్ ఆ బుక్ నే ఎంచుకున్నాడు? పైగా ఎందుకు ఫోకస్ పెట్టాడు? కబాలి కథకు ఆ బుక్ కు ఏమైనా సంబంధం ఉందా? లాంటి ఊహాగానాలు ఇండస్ట్రీలో తిరుగాడుతున్న సమయంలో స్వయంగా మూవీ దర్శకుడు, బుక్ రైటర్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు. 
- కబాలి సినిమాలో రజినీకాంత్ చదివే బుక్ పేరు 'మై ఫాదర్ బాలయ్య'. చాలా పుస్తకాలు శోధించిన తర్వాత ఈ సినిమాకు ఈ పుస్తకం అయితేనే సెట్ అవుతుందని రజినీ చేత చదివించామని డైరెక్టర్  వెల్లడించాడు. 
- మరో విచిత్ర విషయమేమింటంటే ఈ సినిమాలో 'మై ఫాదర్ బాలయ్య' పుస్తకాన్ని ఉపయోగించినట్లు సినిమా చూసిన ఓ వ్యక్తి చెప్పే వరకు రైటర్ సత్యనారాయణకు తెలియదు. ఫోన్ చేసిన వ్యక్తి రచయితకు సదరు వీడియో కూడా పంపించాడు. వీడియో చూసిన రైటర్ సత్యనారాయణ ఆనందం పట్టలేక నేరుగా  డైరక్టర్ రంజిత్ పా కు ఫోన్ చేసి మాట్లాడాడు.
- ఎందుకు తన పుస్తకాన్నే ఎంచుకున్నారని రచయిత అడిగిన ప్రశ్నకు చిత్ర యూనిట్ సమాధానమిస్తూ 'కబాలి సినిమా కథకు ఈ పుస్తకానికి సారూప్యత ఉందని తెలిపారు.  తరతరాలుగా కొందరు అణచివేయ బడుతున్నారు. అణచబడ్డబడ్డ వారిలో తిరుగుబాటు భావజాలాన్ని పుస్తకంలో రచయిత చెప్పాడు.. సినిమాలో హీరో పాత్ర ఊడా ఇదే కాన్సెప్ట్ తో ఉంటుంది. అందుకే ఈ పుస్తకాన్ని సినిమాలో తీసుకోవడం జరిగిందని చిత్ర యూనిట్ వెల్లడించింది'. 
- సదరు రచయిత సత్యనారాయణ కరీంనగర్ వాసి. అతని బుక్ కబాలీలో వాడటంతో పత్రికలు 'కబాలీలో కరీంనగర్' అనే శీర్షికతో వార్తల్ని ప్రచురించాయి. టీవీ ఛానెళ్లు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇంకేముంది అంతకుముందు వరకూ కొంత మందికే తెలిసిన 'మా నాన్న బాలయ్య' బుక్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 
- ఈ పుస్తకం సంబంధించిన మరిన్ని విశేషాలేంటంటే.. ఇది ఇప్పటికే తెలుగు, కన్నడలో అనువాదించబడింది. అంతేకాకుండా హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లోనూ 'మై ఫాదర్ బాలయ్య' బుక్ కొలువు తీరింది.
- 'అణచబడ్డ దళితులు ఆత్మ గౌరవంతో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలనే' అంశాన్ని రచయిత ఈ పుస్తకంలో చెప్పాడు. తాను రాసిన పుస్తకం 'కబాలి' ద్వారా ప్రాచూర్యం పొందడంతో పాటూ తనకు కూడా ప్రత్యేక గుర్తింపు రావడంతో రచయిత ఆనందంతో ఉబ్బితబ్బిబై పోతున్నాడు. 

09:28 - July 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్న మంత్రి హరీష్‌ రావుకే ట్రబుల్స్ తప్పడం లేదు. సాగునీటి ప్రాజెక్టులపై రేగుతున్న దుమారంలో హరీష్ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. పార్టీ పరంగా కీలక నేతల మద్దతు లేకపోవడం..ఇతర నేతలు పెద్దగా స్పందించకపోవడం గులాబి పార్టీలో చర్చనీయంశంగా మారింది.

నేతల మద్దతు దక్కకపోవడం హరీష్‌ వర్గాల్లో అనుమానాలు ..
అధికార పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రోజులుగా భూనిర్వాసితుల ఆందోళనలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రిగా ఈ వ్యవహారం చక్కదిద్దుకునే బాధ్యత ఆయనదే అన్న తీరుగా పార్టీ నేతలు వ్యవహరిస్తుండడం చర్చనీయంశంగా మారుతోంది.

హాట్ హాట్ గా మల్లన్న సాగర్ అంశం..
మెదక్ జిల్లాలో చేపడుతున్న మల్లన్న సాగర్ వ్యవహారం రాజకీయంగా హాట్ హాట్ గా మారింది. ప్రభుత్వంపై, పార్టీపై చిన్న విమర్శ వచ్చినా.. ఎదురుదాడి చేసే గులాబి దళాలు ఈ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించుకుంటారన్న ధీమా హరీష్ రావ్ పై ఉన్నా..పార్టీకి చెందిన ఇతర మంత్రులు, నేతల మద్దతు ఆయనకు దక్కకపోవడం హరీష్‌ వర్గంలో కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. మంత్రికి మద్దతుగా నిలబడితే..పార్టీలో కీలక నేతల దృష్టిలో తమ వర్గం కాదనే ముద్రను ఎందుకు వేయించుకోవాలన్న ఆలోచన ఇతర మంత్రుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్..
భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకుంటున్న దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో యువనేతకు లైన్ క్లియర్ చేసేందుకు ముఖ్యమంత్రే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా హరీష్ ఈ విషయంలో విఫలమయ్యారనే ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.

హరీష్ రావు కూడా అసంతృప్తిగా వున్నారా...
తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మంత్రి హరీష్ రావుకు మరో పరీక్షలా మారాయి. పార్టీ నుంచి సహకారం లేకపోవడంతో హరీష్ రావు కూడా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మల్లన్న సాగర్ విషయం ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీలో కూడా కొత్త సమీకరణలకు దారితీసేందుకు బాటలు వేస్తోందన్న అనుమానాలు రేపుతోంది.

09:19 - July 29, 2016

హైదరాబాద్ : సంచలనం కలిగించిన ఎంసెట్ 2 లీకేజీ పై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ అదుపులో ఐదురుగు నిందుతులు వుండగా..మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శుక్రవారం నాడు మరో నలుగురు నిందితులకు సీఐడీ అరెస్ట్ చేయనుంది. ఎంసెట్ రద్దు చేస్తారా? లేదా అనే విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కాగా పరీక్షను రద్దు చేయటానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. పరీక్ష రద్దు చేస్తేనే న్యాపరమైన ఇబ్బందులు రాకుండా వుంటాయని సీఐడీ కూడా అభిప్రాయపడుతోంది. పేపర్ లీకేజ్ విషయంలో జేఎన్టీయూకు సంబంధించి ఎవరు ఇన్ వాల్వ్ అయ్యారు అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. కాగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరీక్ష రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు గురువారం సచవాలయం వద్ద ధర్నా సందర్భంగా డిమాండ్ చేశారు. ఏది ఏమైనా సర్కారు తీసుకునే కీలక నిర్ణయంపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడివుంది.

చంచల్ గూడ జైలుకు ఎంసెట్ లీకేజీ నిందితులు...

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకేజ్ లో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో విష్ణువర్దన్, తిరుమల్ రావ్ లను చంచల్ గూడ జైలుకు తరలించారరు. 

ఏపీ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం...

కరీంనగర్ : ఏపీ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. జమ్మికుంట రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేశారు. ఢిల్లీ నుండి విశాఖకు ఎక్స్ ప్రెస్ వెళుతోంది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో ఇంజిన్ ను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

డెమెక్రటిక్ కన్వెన్షన్ లో హిల్లరీ ప్రసంగం..

అమెరికా : డెమోక్రటిక్ కన్వెన్షన్ లో హిల్లరీ క్లింటన్ ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, ఉగ్రవాదానికి తలవంచే ప్రసక్తే లేదని హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ట్రంప్ ను అమెరికన్లు నమ్మవద్దని, ట్రంప్ వ్యవహార శైలి దేశానికే నష్టమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటి ఆర్థిక సంక్షోభం ఇప్పటికీ అమెరికాను వెంటాడుతోందని, సామాజికి దేశాభివృద్ధి కోసం పని చేస్తానని పేర్కొన్నారు. దేశానికి వచ్చిన వలసవాదులకు అండగా ఉంటానని హామీనిచ్చారు. 

08:46 - July 29, 2016

హైదరాబాద్ : సీజన్ ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా..నీరు లేక బోసిపోయిన కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండడంతో.. రైతన్నల్లో ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి.

129 టీఎంసీలకు చేరుకున్న ఆల్మట్టి సామర్థ్యం..
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తున్నాయి. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు నుంచి కిందకి 25వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 30వేల క్యూసెక్కుల నీరు విడుదల..
కర్ణాటకలోని మరో ప్రధాన ప్రాజెక్టు నారాయణపూర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. 30వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు నిండడంతో 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు రెండు, మూడు రోజుల్లో శ్రీశైలం చేరే అవకాశం ఉంది. మరో రెండ్రోజుల పాటు తెలుగు రాష్ర్టాల్లో, ఇటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం వెలవెలబోతోంది. దీంతో సాగర్‌ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీరాం సాగర్‌కి 44వేల క్యూసెక్కుల నీరు విడుదల..
మరోవైపు సీజన్ ప్రారంభం నుంచే గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల శ్రీరాంసాగర్‌లో పెద్దగా నీటి నిల్వలు పెరగలేదు. ఇటీవల మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జైక్వాడీ ప్రాజెక్టు నుంచి బాబ్లీకి నీటి విడుదల చేయడంతో అక్కడ నుండి శ్రీరాం సాగర్‌కి 44 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇటు కాళేశ్వరం నుంచి ప్రాణహిత, ఇంద్రావతి, పెద్దవాగులు పొంగి పొర్లడంతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. రెండు రోజుల్లోనే దాదాపు 250 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రం పాలైంది. వర్షాలు ఆలస్యం కావడంతో జులై నెలాఖరుకు వివిధ ప్రాజెక్టుల్లోకి రావాల్సిన నీటికంటే తక్కువగానే చేరింది. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.

08:41 - July 29, 2016

గుంటూరు : నవ్యాంధ్రరాజధానిలో తాత్కాలిక సచివాలయం పనులు వేగంగా జరగుతున్నాయి. భవన నిర్మాణపనులు పూర్తిచేసిన అధికారులు.. ప్రస్తుతం ఇంటీరియర్‌ పనునుల్ని పూర్తిచేస్తున్నారు. వచ్చేనెలాఖరుకు సచివాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

తాత్కాలిక సచివాలయం పనుల్లో పెరిగిన స్పీడ్‌..

ఇంటీరియర్‌ పనులతో తుదిమెరుగులు..వేగంగా సాగుతున్న మౌలిక వసతుల పనులు..ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. బిల్డింగ్‌ అంతర్గత పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌నుంచి మంత్రిత్వశాఖల తరలింపు స్పీడందుకోవడంతో... పనుల్ని మరింత త్వరగా పూర్తిచేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే 5బ్లాకులు పూర్తిచేసిన అధికారులు ...ఒక బ్లాకులో 5మంత్రిత్వశాఖలను కూడా ప్రారంభించారు.

వేగంగా వాటర్‌, డ్రైనేజి, ఇంటర్‌నెట్‌ కేబుల్స్‌ పనులు..
తాత్కాలిక సచివాలయంలోని ప్రతిబ్లాక్‌లో వాటర్‌, డ్రైనేజీతోపాటు ఇంటర్‌నెట్‌కేబుల్స్‌ కు సంబంధించిన పైప్‌లైన్ల పనుల్ని కంప్లీట్‌ చేస్తున్నారు. అలాగే సచివాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. అలాగే అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. దీనికోసం ప్రతిబ్లాక్‌కు ఫైర్‌సేఫ్టీ పైప్‌లైన్లను అనుసంధానిస్తున్నారు. వీటితోపాటు సచివాలయం నాలుగువైపులా పోలీస్‌ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు.

మరోనెలలో వెలగపూడి నుంచే పూర్తిస్థాయిలో పాలన..!
మొత్తానికి వచ్చేనెలాఖరుకు వెలగపూడి నుంచి పూర్తిస్థాయిలో పాలన మొదలు పెట్టాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. దీనికోసమే మంత్రులు దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు. మరో 20రోజుల్లో అన్ని నిర్మాణ పనుల్ని పూర్తిచేయడనాకి వందలాది మంది కార్మికులు కష్టపడుతున్నారు.

08:34 - July 29, 2016

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చే వారం పాకిస్తాన్‌ పర్యటించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో జరిగే సార్క్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన పాక్‌ వెళ్తున్నారు. ఇటీవ‌ల క‌శ్మీర్‌లో చోటుచేసుకున్న హింస‌పై పాకిస్థాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో హోంమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సార్క్‌ సమావేశంలో ఉగ్రవాదం అంశాన్ని ప్రస్తావించడం ద్వారా పాక్‌పై భారత్‌ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాది బుర్హాన్ హ‌త్య త‌ర్వాత క‌శ్మీర్‌లో అల్లర్లు చెల‌రేగాయి. క‌శ్మీర్ హింసాత్మక ఘటనల్లో 45 మంది మృతిచెందారు. మ‌రో మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. కశ్మీర్‌ కల్లోలానికి పాకిస్థానే కారణమని భార‌త్ ఆరోప‌ణ‌లు కూడా చేసింది.

పార్లమెంట్ హల్ చల్ చేసిన వానరం..

ఢిల్లీ : చట్టసభ్యులందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. చర్చలతో సభ దద్దరిల్లుతోంది. ఈ సమయంలో పార్లమెంటులోకి ప్రవేశించిన ఓ వానరం అరగంట పాటు హడావుడి చేసింది. పార్లమెంటు హౌస్‌లోని లైబ్రరీ, సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. బయటపడే మార్గం కనిపించక దాదాపు 30 నిమిషాలపాటు పార్లమెంట్ లో చక్కర్లు కొట్టింది. చివరికి మెయిన్ డోర్ ద్వారా బయటకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే తలుపులు మూసేశారు.

కేసీఆర్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్  ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుంటే ఫలితాలిలాగే ఉంటాయని లోకేష్ వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఫాంహౌస్ పాలనతోనే మిగులు బడ్జెట్ లో వున్న తెలంగాణ లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు.

08:08 - July 29, 2016

          మెగాస్టార్ చిరంజీవిని యాక్టింగ్ లో కింగ్, డ్యాన్స్ లో మైకేల్ జాక్సన్ లాంటి బిరుదులతో పొగుడుతుంటారు. అలాగే తాజాగా చిరు ముందు ఒక కొత్త ట్యాగ్ చేర్చాల్సి వస్తుంది. అదే 'ద బెస్ట్ ఎకానమిస్ట్'.. అవునండి బాబూ.. కావాలంటే ఈ వార్త చదవండి..
          ఇండస్ట్రీలో చిరంజీవి 150వ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. ఈ అంచనాల్ని అందుకోవాలంటే సహజంగానే బారీ బడ్జెట్ తో, భారీ ఆర్టిస్టులతో సినిమాను కాస్ట్లీగా తెరకెక్కిస్తారని అందరూ భావించారు. మీరు కూడా అలాగే అనుకుంటే 'తప్పులో కాలేసినట్లే'. ఇదిగో ఇదే విషయంలో చిరులోని 'ఎకానమిస్ట్' క్వాలిటీ బయటికి తెచ్చాడు. 
       సూపర్ స్టార్ రజినీ లింగా, కబాలి, తమిళంలో 'ఐ' లాంటి భారీ డిజాస్టర్స్ చూసిన తర్వాత భారీ బడ్జెట్ కు వెళ్లి చేతులు కాల్చుకోవద్దనుకున్నాడో ఏమో.. లేక తన సినిమాను తెరకెక్కించేది స్వయాన తనయుడు 'రాం చరణ్' కావడంతో అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. 
ముందుగా చిరంజీవి 150వ మూవీ అనగానే పెద్ద హీరోయిన్ ఉంటుందని అందరం భావిస్తాము. 'కత్తి' స్టోరీలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో లైమ్ లైన్లో ఉన్న సమంత లాంటి స్టార్లకు బదులు లైమ్ లైన్ లో లేని  త్రిష లాంటి హీరోయిన్ ను సెలక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే విధంగా చిరు రేంజ్ ను తట్టుకుని నిలబడాలంటే విలన్ స్ట్రాంగ్ గా ఉండాలి. దీనికి ప్రస్తుతం ట్రెండింగ్ లో టాప్ పొజీషన్ లో ఉన్న విలన్స్ ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి 75 లక్షల నుంచి కోటికి పైగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి బిన్నంగా ఎప్పుడో బాలీవుడ్ లో 'జబ్ వి మెట్' సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన 'తరుణ్ అరోరా'ను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇతను స్వయానా హీరోయిన్ అంజలా జావేరి భర్త. ఇతనికి 15 లక్షలలోపే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.
      ఇక చివరగా చిరుకు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ విలువలు కోల్పోకుండా.. సాధ్యమైనన్ని అంశాల్లో బడ్జెట్ ను తగ్గించుకుని తక్కువలో తక్కువ 25 కోట్లలోపు సినిమాను లాగించి తనయుడిని సక్సెస్ ఫుల్ 'ప్రొడ్యూసర్'గా నిలబెట్టేందుకు మెగాస్టార్ ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. ఇప్పటికే చిరు 150వ మూవీకి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచే 12 కోట్ల ఆఫర్ వచ్చింది. నిజంగా ఇంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తే మాత్రం 'చెర్రీ'కి భారీ లాభాలు రావడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 

సీఎం సెక్యూరిటీ గన్ మిస్ ఫైర్..ఇద్దరికి గాయాలు..

హైదరాబాదు : సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి చేతిలోని గన్ మిస్ ఫైరైంది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మిస్ ఫైర్ లో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వెల్లడించటానికి ఇంటిలిజెన్స్ వర్గాలు నిరాకరిస్తున్నాయి.

తిరుమలలో భారీ వర్షం..

తిరుమల: తిరుమలలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రెండో కనుమదారిలో 9వ కిలోమీటరు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా తిరుమలకు వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు.

అతిసారంతో 4గురు మృతి..

విశాఖ : హుకుంపేట మండలం అడ్డుమండలో అతిసారం ప్రబలింది. పాడేరు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. రెండ్రోజుల క్రితం అడ్డుమండలో అతిసారంతో మహిళ మృతి చెందింది. ఇటీవల నిమ్మలపాడులో అతిసారంతో నలుగురు మృతి చెందారు. అడ్డుమండలో అతిసారంతో మరో 9మంది గిరిజనులు బాధపడుతున్నారు.

07:56 - July 29, 2016

ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ తెలుగు రాష్ట్రాలలో వేడిని పుట్టిస్తోంది. పరీక్షలు రాసిన విద్యార్థులు..వారి తల్లిదండ్రులకు గుబులు పుట్టిస్తోంది. ఈ విషయంగా లీక్ జరగటం అనేది జరగలేదు..దాంట్లో వాస్తవం లేదని తెలంగాణ మంత్రువర్యులు సమర్థించుకున్నారు. విమర్శలు వెల్లువెత్తటంతో సీఐడీ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎంసెట్‌-2 లీక్ అయినట్లుగా నిర్థారించింది. నిందితులు రెండు సెట్ల పరీక్ష పేపర్లను లీక్‌ చేశారని..ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 40 లక్షలు వసూలు చేసినట్లు సీఐడీ స్పష్టంచేసింది. ఎంసెట్‌ లీకేజీకి పాల్పడ్డ నిందితులను సీఐడి అధికారులు..నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితులకు 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ విధించారు. మరోవైపు డీజీపీ అనురాగ్‌శర్మ లీకేజీ నివేదికను సీఎంకు సమర్పించారు. ఈనేపథ్యంలో ఎంసెట్ 2ను రద్దు చేసే యోచనలో టీ.సర్కార్ వున్నట్లుగా పలు ఊహాగానాలు రేగుతున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? పరిణామాలేంటి? అనే అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టంది. ఈ చర్చలో వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్),శ్రీధర్ (బీజేపీ అధికార ప్రతినిధి), మన్నె గోవర్థన్ రెడ్డి (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..సమగ్ర సమాచారం తెలుసుకోండి..

07:49 - July 29, 2016

40 రూపాయలతో బట్టలు కుట్టించుకోవడం, 12 రూపాయలతో క్షౌరం చేయించుకోవడం, ముప్పై రూపాయలతో కడుపు నింపుకోవడం సాధ్యమవుతుందా? కానీ, సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తున్నది ఇంతే. 2012 నాటి మెస్ చార్జీలే అమలు చేస్తుండడంతో నాణ్యమైన భోజనానికి దూరమవుతున్నారు. మరోవైపు హాస్టల్స్ మూసివేత భయం వారిని

పోరుబాటలో హాస్టల్స్ విద్యార్థులు..
కొంతకాలంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు ఒక్కొక్కసారి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. లాఠీచార్జీలు జరుగుతున్నాయి. హాస్టల్ విద్యార్థులు ఇంత తీవ్రస్థాయిలో ఉద్యమించడానికి కారణం వారు ఎదుర్కొంటున్న సమస్యలే.

తెలంగాణలో 2939 హాస్టల్స్ ..
సాంఘిక సంక్షేమ హాస్టల్స్ చదువుకున్న అనేకమంది ఉన్నతాధికారులుగానూ, ఎమ్మెల్యేలు, మంత్రులుగానూ ఎదిగారు. కానీ, హాస్టల్ విద్యార్థులను నిత్యం సమస్యలు వెన్నంటి వేధిస్తూనే వున్నాయి. తమ హాస్టల్ ను ఎక్కడ మూసివేస్తారో నన్న భయం గత రెండేళ్లుగా విద్యార్థులను వెన్నాడుతోంది. తెలంగాణలో 2939 హాస్టల్స్ వున్నాయి. 1150 ఎస్సీ హాస్టల్స్, 780 బీసీ హాస్టల్స్, 645 ఎస్టీ హాస్టల్స్ కాగా 398 కస్తూర్బా హాస్టల్స్. తెలంగాణలోని అన్ని హాస్టల్స్ లో కలిపి దాదాపు 4 లక్షల 26వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి సన్నబియ్యంతో వండిన భోజనం పెడుతున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా వున్నాయి.

ఒక్కొక్క విద్యార్థి మీద రోజుకి కేవలం 25 నుంచి 33 రూపాయలు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం బడిపిల్లలకు రోజుకి కనీసం 2300 కిలో కేలరీల ఆహారం తీసుకోవాల్సి వుంటుంది. కానీ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అందులో సగం కూడా అందడం లేదు. వెయ్యి నుంచి 1200 కిలో కెలరీల ఆహారం మాత్రమే లభిస్తోంది. ఇందుకు కారణం మెస్ చార్జీలు తక్కువగా వుండడం. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకిచ్చే మెస్ చార్జీలు పెంచాలంటూ ప్రతి ఏటా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తూనే వున్నాయి. 2012 తర్వాత మళ్లీ మెస్ చార్జీలు సవరించలేదు. మూడు నుంచి ఏడు తరగతుల విద్యార్థులకు 750 రూపాయలు, ఎనిమిది నుంచి పది తరగతుల విద్యార్థులకు 850 రూపాయలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 1050 రూపాయల చొప్పున మెస్ చార్జీల చొప్పున చెల్లిస్తున్నారు. అంటే ఒక్కొక్క విద్యార్థి మీద రోజుకి పాతిక నుంచి 33 రూపాయలు మాత్రమే వెచ్చిస్తున్నారు. పప్పుల ధరలు మండిపోతూ, కూరగాయల ధరలు వేగిపోతూ, నూనెల ధరలు సలసలకాగిపోతున్న ఈ రోజుల్లో ఇంత తక్కువ మొత్తంతో హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టడం సాధ్యం కాదు.

పోషకాహార లోపం బాధపడుతున్న విద్యార్థులు..
పోషకాహార లోపం విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తోంది. హాస్టల్ విద్యార్థులను రక్తహీనత లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. తరచూ జ్వరాల బారినపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులకు సరైన సమయంలో సరైన వైద్యం లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, విజయనగరం లాంటి జిల్లాల్లో ఏటా పది పన్నెండు మంది విద్యార్థులు విషజ్వరాలతో చనిపోతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనూ ఇలాంటి విషాద సంఘటనలున్నాయి. దీంతో కొంతమంది విద్యార్థులు హాస్టల్స్ లో చేరాలంటే వెనకడుగువేస్తున్నారు.

5ఏళ్ళలో సంక్షేమ హాస్టల్స్ కనుమరుగుకానున్నాయా?..
హాస్టల్స్ లో వసతులు మెరుగుపరిస్తే, విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధిస్తారన్న విషయం అనేకసార్లు రుజువైంది. మంచి సదుపాయాలున్న హాస్టల్స్ లో చదివే విద్యార్థులు ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడుతూ అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నట్టు పదో తరగతి పరీక్షా ఫలితాల సరళి నిరూపిస్తోంది. దురద్రుష్టవశాత్తు విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించకపోగా, విద్యార్థుల సంఖ్య తక్కువ వుందన్న పేరుతో అసలు హాస్టల్స్ నే మూసివేస్తున్నాయి ప్రభుత్వాలు. జీవో నెంబర్ 89 ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 272 సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మూసివేశారు. మరో 223 హాస్టళ్లు ఇదే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలా హాస్టల్స్ మూసివేసుకుంటూ పోతే, మరో అయిదారేళ్లలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ మిగలకపోవచ్చు.

07:40 - July 29, 2016

హాస్టల్ విద్యార్థులు మరోసారి పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ లో నిరాహార దీక్షలు, ధర్నాలు సాగుతుంటే, తెలంగాణలో సైకిల్ యాత్రలు చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నదేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఎస్ఎఫ్ఐ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్  10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

07:35 - July 29, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ పోరును తారాస్థాయికి చేర్చేలా కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సర్కార్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న హస్తం పార్టీ అదే టెంపోను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. దానికోసం ఏకంగా యువనేత రాహుల్‌గాంధీనే రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. అంతా కుదిరితే ఆగస్టు మొదటి వారంలోనే రాహుల్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల టాక్‌...

మల్లన్నసాగర్‌ పై కాంగ్రెస్‌ మరింత దూకుడు...
మల్లన్నసాగర్‌ పోరాటంలో కాంగ్రెస్‌ మరింత దూకుడు పెంచుతోంది. ఇప్పటికే మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల పక్షాన పోరును ఉదృతం చేసిన హస్తం పార్టీ నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తోంది. ముంపు గ్రామాల రైతులపై లాఠీచార్జ్‌ని ఆయుధంగా చేసుకుని మెదక్‌ జిల్లా బంద్‌తో సక్సెస్‌ అయినా కాంగ్రెస్‌ ఛలో మల్లన్నసాగర్‌ కార్యక్రమం చేపట్టి సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

డిఫెన్స్‌లో పడ్డ అధికార పార్టీ..
హస్తం స్పీడుతో కాస్తా డిఫెన్స్‌లో పడ్డ అధికార పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాలని కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఏకంగా పార్టీ యువనేత రాహుల్‌గాంధీని రంగంలోకి దింపేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్లన్నసాగర్‌కు రాహుల్‌ను రప్పించి.. టీఆర్‌ఎస్‌ పై ఇప్పుడిప్పుడే పెరుగుతున్న వ్యతిరేకతను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీనికి రాహుల్‌ కార్యాలయం కూడా టీపీసీసీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

రాహుల్‌.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేయనున్నాడా?..
ఇప్పటికే గాంధీభవన్‌లో దామోదర నేతృత్వంలోని పీసీసీ సబ్‌-కమిటీ భేటీ అయి రాహుల్‌ టూర్‌, 2013 భూసేకరణ చట్టం అమలుపై చర్చించారు. రాహుల్‌ ముంపు గ్రామాలతో మమేకమయ్యేలా పాదయాత్ర చేస్తే బాగుంటుందన్న యోచన ఉన్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాహుల్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేసేలా కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రాజెక్టుల కోసం భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, డిజైన్ల మార్పు, అంచనాలు భారీగా పెరగడం, గుత్తేదార్ల అడ్వాన్సులు తదితర అంశాలపై రాహుల్‌.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేయనున్నట్లు సమాచారం.

07:31 - July 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో యూనివర్సిటీల్లో వీసీల నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. రెండేళ్లుగా భర్తీచేయని వీసీ పదవులను ఇప్పటికిప్పుడే హడావిడిగా భర్తీ చెయ్యాల్సిన అవరసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో విచారణ కొనసాగుతుండగా నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది.

వీసీల నియామకాన్ని రద్దు చేసిన హైకోర్ట్
తెలంగాణలో వీసీల నియామకంపై హైకోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీసీల నియామకానికి సంబంధించిన అర్హతలు, నియమ నిబంధనలను ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవో నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఛాన్స్‌లర్లు, వీసీల నియామకాలకు సంబంధించిన చట్టాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తుండగా... నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. విచారణ పూర్తయ్యే దాకా నియామకాలు జరపబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చారని.. దాన్ని పక్కనబెట్టి ఎందుకు నియామకాలు చేపట్టారని న్యాయస్థానం ప్రశ్నించింది.

వివాదాలకు కేంద్రమైన జీవోనెం.38..
గతేడాది డిసెంబర్‌లో జారీ అయిన జీవో-38 లో చాన్స్‌లర్లు, వైస్‌చాన్స్‌లర్లు నియామకాలపై సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జీవో-38తో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్‌ను నియమించే విధంగా నిబంధనలు సడలించారు. ఇదికాక పదిసంవత్సరాల అనుభవాన్ని 5 సంవత్సరాలకు కుదించారు. దీంతో సెర్చ్‌కమిటీ లేకుండానే నిబంధనలను ప్రభుత్వం తనకిష్టమొచ్చినట్లు సడలిస్తోందని ఉస్మానియ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మనోహర్‌రావు పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు వీసీల నియామకాన్ని రద్దు చేసింది. నాలుగు వారాలపాటు స్టేవిధించాలని కోరిన అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిని తిరస్కరించింది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 15 సార్లు మొట్టికాయలు : పొన్నం
మరోవైపు వీసీల నియామకాల రద్దు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని విపక్షాలు ఆక్షేపించాయి. హైకోర్టు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి 15 సార్లు మొట్టికాయలు వేసిందని.. అయినా ప్రభుత్వం తీరు మారడం లేదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

మళ్లీ మొదలు..
హైకోర్టు నిర్ణయంతో వీసీల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.

07:23 - July 29, 2016

ఢిల్లీ : ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై రాజ్యసభలో వాడీ వేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సహా సభలోని పలు రాజకీయ పార్టీలు ఏపీ బిల్లుకు మద్దతు పలికాయి. మద్దతు పలికిన వారిలో సమాజ్‌ వాదీ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, బీజేడీ, టీఎంసీ సహా దాదాపు అన్ని పక్షాలు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సభలో అధికార బీజేపీ ఇరుకున పడినట్లయ్యింది.

మన్మోహన్‌సింగ్‌ హామీలు అమలు కాలేదు :జైరాం రమేష్
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై రాజ్యసభలో చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్. విభజన సందర్బంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి సంబంధించిన ఆరు హామిలకు ఒప్పుకున్నారని తెలిపారు. ఆర్థిక సహాయం కింద ఏపికి ఎన్ని నిధులు ఇచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు.

మద్దతునిచ్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్
ప్రత్యేక హోదా విషయమై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కూడా ఏపీకి మద్దతు పలికారు. ఇక బెంగాల్ తో సహా ఆ పది రాష్ట్రాలతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుఖేందురాయ్ అన్నారు. జేడీయూ ఎంపీ అన్సారీ కూడా ఏపీ ప్రత్యేక హోదా హామిలను నెరవేర్చాలని కేంద్రానికి విన్నవించారు.

రెండు బడ్జెట్లు పూర్తయినా రెవెన్యూలోటు భర్తీ కాలేదు : ఏచూరి
సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి ప్రత్యేక హోదాపై చర్చలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. హామీలు అమలు చేయకుంటే రెండు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందని ఏచూరి హెచ్చరించారు.

ప్రత్యేక హోదాతోనే సమస్యల పరిష్కారం: సీఎం రమేష్
అనంతరం బిల్లుపై చర్చలో పాల్గొన్న సీఎం రమేష్‌ ఏపీ ప్రత్యేక హోదాను ప్రకటిస్తేనే రాష్ట్రంలో ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందని విన్నవించారు.

మనీ బిల్లుగా చూడొద్దు : విజయసాయి
చర్చలో భాగంగా మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రైవేటు బిల్లును మనీ బిల్లుగా చూడవద్దని విన్నవించారు.

ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టొద్దు : దిగ్విజయ్
అనంతరం మాట్లాడిన దిగ్విజయ్‌ సింగ్‌ ప్రత్యేకహోదా అంశాన్ని ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టొద్దని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధానమంత్రిపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకు రావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారో తనకు తెలియదన్నారు. పార్టీలు అధికారంలో ఉంటాయి, అధికారం కోల్పోతాయి... కానీ ప్రభుత్వం మాత్రం ఉంటుందని వామపక్ష నేత సభ్యుడు డీ రాజా తెలిపారు. ప్రధాని ఇచ్చిన హమీని నెరవేర్చాలని అన్నారు.

బిల్లుపై వెనక్కి తగ్గేది లేదు : కేవీపీ
ఈ చర్చలో భాగంగా పాల్గొన్న కేవీపీ ఏపీ ప్రత్యేక బిల్లుపై వెనక్కు తగ్గేది లేదని తెలిపారు. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది కాబట్టి అప్పటి ప్రధాని ఇచ్చిన హమీలను అమలు చేయాలన్నారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లును ద్రవ్యబిల్లుగా పరిగణించడం అన్యాయం అన్నారు. ఏడాది కాలాన్ని వృధాచేసి ద్రవ్యబిల్లుగా పరిగణించడం కుట్ర పూరితమన్నారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో హామీలన్నీ అమలు చేయాలి.

టీఆర్ఎస్ మద్దతు :కేకే
ఇదిలా ఉంటే విభజన చట్టంపై సభలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు అన్నారు. ఏపీ కోరుతున్న దానికి టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు కేకే తెలిపారు.

ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావు : వెంకయ్య
అనంతరం చర్చలో భాగంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా కూడా ప్రధానమైనదేనన్నారు. మరి ఆ అంశాన్ని చట్టంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావని వెంకయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని పనులన్నీ చేస్తున్నామని. విభజన చట్టంలోని హామీలన్నీ అమలుచేస్తాం అని అన్నారు.

సభ వాయిదా...
ఇదిలా ఉంటే బిల్లుపై ఆగస్టు 5న నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్‌ తెలిపారు. సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

07:03 - July 29, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీక్‌ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఎంసెట్‌-2ను రద్దు చేసి ఎంసెట్‌-3ని నిర్వహిస్తుందా ? ఒకవేళ ఎంసెట్‌ను రద్దు చేస్తే..మెరిట్‌ ర్యాంకర్ల పరిస్థితి ఏంటి ? ఇప్పుడిదే అటు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలు. ఎంసెట్‌ లీక్‌ అయినట్లు సీఐడి నిగ్గు తేల్చడంతో ప్రభుత్వం ఇవాళ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎంసెట్‌ లీక్‌ వ్యవహారంపై నేడే ప్రభుత్వం నిర్ణయం ..
ఇప్పుడిదే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న.


9న జరిగిన ఎంసెట్‌-2 పరీక్ష రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీక్..

తెలంగాణలోని ఈనెల 9న జరిగిన ఎంసెట్‌-2 పరీక్ష రెండు సెట్ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సీఐడి నిన్న అధికారికంగా ప్రకటించింది. లీక్‌పై డిజిపి అనురాగ్‌శర్మ కూడా దర్యాప్తు నివేదికను సీఎంకు అందచేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్‌ దీనిపై కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

సీఎంకు దర్యాప్తు నివేదిక అందించిన డిజిపి....
మరోవైపు ఎంసెట్‌ను రద్దు చేయోద్దని నిన్న సచివాలయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముట్టడించిన నేపథ్యంలో దీనిపై ఎంసెట్‌పై సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు లీక్‌ వీరులకు శిక్ష గురించి, బ్రోకర్లను ఆశ్రయించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై చర్యలు, ఇటు ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారనే దానిపై అందరి చూపు ప్రభుత్వంపై పడింది. అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రకటించే నిర్ణయం..భవిష్యత్‌ తరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. వేలాది కుటుంబాలకు భరోసా కల్పించే నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు?
అయితే ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో ఎంసెట్‌-3 నిర్వహణవైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎంసెట్‌-2ను రద్దు చేసి మళ్లీ మెడికల్‌ ప్రవేశ పరీక్సను నిర్వహించే దిశగా ప్రభుత్వం నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఎంసెట్‌-2ను రద్దు చేయకుండా విద్యార్థులకు న్యాయం చేయడానికి గల అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇలా అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసి..కోర్టులు తప్పపట్టకుండా ఉండేలా నిర్ణయాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఎంసెట్‌పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

06:55 - July 29, 2016

హైదారబాద్ : ఎంసెట్‌ టూ లీకు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తుండడంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

లీకేజ్ పై భగ్గుమన్న విద్యార్థి లోకం..
తెలంగాణలో ఎంసెట్‌ టూ లీకేజ్‌ వ్యవహారంపై విద్యార్ధి లోకం భగ్గుమంది. ఇప్పటికే బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల బాట పట్టాయి.

సచివాలయం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన ..
తమకు న్యాయం జరగాలంటూ తెలంగాణ సచివాలయం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ ర్యాంకుల్ని చూసుకొని ఎంతో సంతోషపడ్డామని... తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హోం మంత్రి నాయిని భేటీ ..
లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హోం మంత్రి నాయిని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే తాము మరోసారి పరీక్ష రాయలేమని... తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు.

విద్యార్థులుదోళనలకు రాజకీయ పక్షాలు మద్దతు..

మరోవైపు విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధిత శాఖలకు చెందిన మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పార్టీలు డిమాండ్ చేశాయి.

విద్యార్థుల ఆందోళనకు జస్టిస్‌ చంద్రకుమార్‌ మద్దతు..
తెలంగాణ అంతటా విద్యార్థి సంఘాలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాయి. సచివాలయంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థుల ఆందోళనకు జస్టిస్‌ చంద్రకుమార్‌ మద్దతు తెలిపారు. పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించే అవసరం లేదన్నారు.

ఆందోళన బాట పట్టిన విద్యార్థులు..
అటు జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తాయి. ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్‌లలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. నల్గొండలో వామపక్ష విద్యార్థి సంఘాలు కలెక్టరేట్‌లో చొచ్చుకేళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎంసెట్ లీకు వ్యవహారాన్ని సీఐడీతో కాకుండా సీబీఐతో జరిపించాలని నిజామాబాద్‌లో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

ఆందోళన వద్దంటున్న అమాత్యులు..
ఎంసెట్‌ లీకేజీపై మంత్రి కడియం స్పందించారు.. ఈ కేసులో సీఐడీ విచారణ జరుగుతోందని.. ప్రభుత్వానికి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.. కడియం ప్రకటన ఎలా ఉన్నా... విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన తగ్గడం లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

పాక్ పర్యటనకు రాజ్ నాథ్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చే వారం పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో పాక్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్‌ సమావేశాలకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు. ఇటీవల కశ్మీర్‌ అల్లర్ల నేపథ్యంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌నాథ్‌ పాక్‌ పర్యటన ఉత్కంఠను రెకెత్తిస్తోంది.

నేడు బ్యాంక్స్ బంద్..

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ బ్యాంకుల కార్యకలాపాలు నేడు స్తంభించనున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలైనా ఈ ప్రభావం పడనుంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ నేడు ‘ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ (యూఎప్ బీయూ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎస్బీఐ సహా దాని అనుబంధ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది కూడా విధులు బహిష్కరించనున్నారు.

Don't Miss