Activities calendar

30 July 2016

22:22 - July 30, 2016

ఢిల్లీ : దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అస్సాం బీహార్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో 53 మంది మృతి చెందారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అస్సాంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు.
వరదలతో అస్సాం  అతలాకుతలం
గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో అస్సాం వరదలతో అతలాకుతలమవుతోంది. బ్రహ్మపుత్ర తదితర నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 22 జిల్లాల్లోని 3 వేల 300 గ్రామాలు, 18 లక్షల మందిపై వర్షాలు తీవ్రంగా  ప్రభావం చూపాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. వర్షాల వల్ల ప్రజలే కాదు..పశువులు, జంతువులకు ఇబ్బంది ఏర్పడింది. 25 జంతువులు మృత్యువాత పడ్డాయి. కజిరంగా పార్కులోని 132 ఫారెస్ట్‌ క్యాంపులు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సైనికులు సహాయకచర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాజ్‌నాథ్‌సింగ్‌ ఏరియల్‌ సర్వే
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఏరియల్‌ సర్వే ద్వారా అస్సాంలోని వరద ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రానికి కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
బీహార్‌లోనూ వరదలు బీభత్సం 
బీహార్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. కోసి, మహానందా, జావా నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలకు 26 మంది బలయ్యారు. కిషన్‌గంజ్‌ జిల్లాలో 8 మంది, కటిహార్‌, మధేపురా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. పది జిల్లాల్లోని 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 8 వేల 850 పడవలు ఉపయోగించారు. సుమారు 2 లక్షల హెక్టార్ల పంట భూమి నీట మునిగడంతో రైతులు నష్టపోయారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. 4639 గుడిసెలు నీట మునిగాయి. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, త్రిపుర తదితర ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 

 

22:16 - July 30, 2016

ఢిల్లీ : సీపీఎం పొలిట్‌ బ్యూరో సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశం దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించనుంది. కశ్మీర్‌ కల్లోలం, దళితులపై పెరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. జిఎస్‌టి బిల్లు రాష్ట్రాల ఆర్థిక హక్కులను హరించేలా ఉందని సిపిఎం దుయ్యబట్టింది. 
ఏచూరి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం 
ఢిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర అంశాలపై సమావేశం చర్చిస్తోంది.
జమ్ముకశ్మీర్‌లో కల్లోల పరిస్థితులపై చర్చ 
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఏర్పడిన కల్లోల పరిస్థితులపై సిపిఎం చర్చించింది. కశ్మీర్‌ అంశాన్ని కేంద్రం శాంతి భద్రతల అంశంగా చూడడం వల్లే పరిస్థితి విషమించిందని అభిప్రాయపడింది. తుపాకులు, ఫోర్స్‌ లేకుండా కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం కృషి చేయాలని లేదా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు తలెత్తుతాయని సిపిఎం హెచ్చరించింది. 
దళితులపై దాడుల పట్ల సిపిఎం ఆందోళన 
వదంతులు, ఆరోపణల ఆధారంగా దళితులపై దాడులు జరగడం పట్ల సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది.  దళితులపై పెరుగుతున్న దాడులకు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమే కారణమని తెలిపింది. గుజరాత్‌ ఉనా ఘటన ఇందుకు నిదర్శనమని తెలిపింది. వృత్తిపరంగా తోలు వ్యాపారం చేసుకునే దళితులపై గోరక్షణ పేరిట దాడులు జరపడం అమానుషమని సిపిఎం ఖండించింది. దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలతో కలిసి పోరాడాలని సిపిఎం నిర్ణయించింది.
రాష్ట్రాల ఆర్థిక హక్కులను హరించేలా జిఎస్‌టి బిల్లు 
జిఎస్‌టి బిల్లు రాష్ట్రాల ఆర్థిక హక్కులను హరించేలా ఉందని, దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సిపిఎం భావిస్తోంది. పశ్చిమ బెంగాల్‌ పరిస్థితి రోజు రోజుకు విషమిస్తోందని, హత్యలు, లూటీలు సర్వసాధారణంగా మారాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది. 
నిర్వాసితులకు పొలిట్‌బ్యూరో మద్దతు 
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై టిఆర్‌ఎస్‌ దుందుడుకుగా వ్యవహరిస్తోందని, ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న రైతాంగానికి పొలిట్‌బ్యూరో మద్దతు తెలిపింది. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపి అసలు రంగు బయటపడిందని పేర్కొంది. భవిష్యత్తులో ప్రత్యేక హోదా అంశంపై పోరాటాలకు సిపిఎం పూర్తి మద్దతు ప్రకటించింది.

 

22:12 - July 30, 2016

మెదక్‌ : జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎఎన్ఎంలు ధర్నాకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఎన్‌ఎంలు డిమాండ్‌ చేశారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ తమను క్రమబద్దీకరించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. జోరుగా వర్షంలో తడుస్తూ ఏఎన్‌ఎంలు తమ ఆందోళనను కొనసాగించారు.   

22:10 - July 30, 2016

కరీంనగర్ : జిల్లాలోని జగిత్యాల మున్సిపల్‌ సాధారణ సమావేశం రసాభాసాగా మారింది. పట్టణంలోని పలు అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు  టీఆర్‌ఎస్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. లేబర్ కాంట్రాక్ట్‌ పనుల్లో అవినీతి జరగిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అధికారి పార్టీ వాళ్లు తమ వారికే మళ్లీ మళ్లీ టెండర్లు అప్పగిస్తున్నాయని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య గొడవ జరిగింది. 

 

21:55 - July 30, 2016

విజయవాడ : ఏపీకి హోదా కుదరదన్న కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్ర వైఖరికి నిరసనగా.. ఆగస్టు రెండున రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి ఇతర పక్షాలూ మద్దతు ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలంటూ విపక్షాలు టీడీపీని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇంకా కేంద్ర కేబినెట్‌లోనే కొనసాగాలని టీడీపీ నిర్ణయిస్తే అది ఏపీ ప్రజల హక్కును.. కేంద్రానికి తాకట్టు పెట్టినట్లేనని విపక్షాలు మండిపడుతున్నాయి. 
ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌
ఏపీకి ప్రత్యేక హోదా కుదరదన్న కేంద్ర ప్రభుత్వంపై.. రాష్ట్ర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం నిర్ణయానికి నిరసనగా.. ఆగస్టు రెండో తేదీన రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నిర్ణయించింది. దీనికి వామపక్ష, ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. బీజేపీ, టీడీపీలు ఐదుకోట్ల మంది ఏపీ ప్రజలను మోసగిస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 
కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు మద్దతు కోసం రాష్ట్ర బంద్‌
ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని పీసీసీ విమర్శించింది. టీడీపీ ఎంపీలకు అసెంబ్లీ సీట్లు పెంపుపై ఉన్న శ్రద్ధ.. ప్రత్యేక హోదాపై లేదని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆగస్టు ఐదున కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు మద్దతును సమీకరించేందుకు ఆగస్టు రెండున రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 
వాటి చీకటి ఒప్పందాల వల్లే ప్రత్యేక హోదా రాలేదు : వామపక్షాలు
టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని వామపక్షాలు ఆరోపించాయి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. 
బంద్‌కు మద్దతు ప్రత్యేకహోదా సాధన సమితి 
ప్రత్యేక హోదాయే ఇవ్వలేని కేంద్రం.. రాష్ట్రానికి ఎంతో చేస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని ప్రత్యేక హోదా సాధన సమితి వ్యాఖ్యానించింది. ఆగస్టు రెండున వైసీపీ, కాంగ్రెస్‌ తలపెట్టిన బంద్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తానికి ప్రత్యేక హోదా కుదరదన్న కేంద్ర నిర్ణయంతో.. ఏపీలోని విపక్షాలన్నీ పోరుబాట పట్టాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్ర స్థాయిలో పెంచుతోంది. 

 

21:49 - July 30, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై... రేపు ఉదయం 10.30 గంటలకు పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలు సూచనలు, సలహాలతో సిద్ధమై రావాలని ఇప్పటికే ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ముందుకెళ్దామని... సోమవారం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పలు సూచనలు చేయనున్నారు. దీంతో పాటు బీజేపీతో మిత్రబంధం కొనసాగించాలా.. వద్దా అనే అంశంపై ఎంపీల అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. 

 

21:44 - July 30, 2016

కొన్ని సంఘటనలు షాక్ కు గురిచేస్తాయి... మరికొన్ని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక సంఘటన, ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. జీవితం మొత్తం మీద అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే డిటెక్టివ్ కు ఎదురయ్యేవి అన్ని షాక్ కు గురయ్యేవే. 
మరి డిటెక్టివ్ షాడో షాక్ తిన్న సంఘటన ఏమై ఉంటుంది..? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఎంసెట్ 2 పేపర్ లీకేజ్.. ఆరుగురు అరెస్టు...

హైదరాబాద్ : ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజగోపాల్ రెడ్డితోపాటు ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని సీఐడీ అరెస్టు చేసింది. రాజగోపాల్ పై కర్ణాటక, ఎపిలో కేసులు ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. రాజగోపాల్ రెడ్డి గతంలో ఐదుసార్లు పేపర్ లీక్ కు పాల్పడ్డాడు. బెంగళూరులో 20 మంది విద్యార్థులకు పేపర్ లీక్, హైదరాబాద్ లో 40 మంది విద్యార్థులను విష్ణుధర్ సమకూర్చారు. 6 మంది విద్యార్థులను విజయవాడకు చెందిన జ్యోతిబాబు సమకూర్చారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35లక్షలు బ్రోకర్లు వసూలు చేశారు. 

 

21:17 - July 30, 2016

యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిఖల్ మాట్లాడారు. తన సినీ కెరీర్ గురించి వివరించారు. సినిమాల అనుభవాలను తెలిపారు. డైరెక్టర్ చందు ముండేటి, నిఖిల్ బావ అమర్ ఫ్రాంక్ కాల్ చేసి ఆటపట్టించారు. నిఖిల్ తెలిపిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...'సినిమాలతో బాల్యం ఎంజాయ్ గా ఉండేది. నేను చాలా లక్కీ. నేను ఫస్టు క్లాసులో ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా చూశాను. ప్రతి ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యేవాన్ని..కానీ సినిమా ఆగిపోయేది. అప్పుడు నాకు చాలా బాధేసేది. హ్యాపీ డేస్ తర్వాత నుంచి నా సినిమాలకు ఏ అడ్డంకి రాలేదు. హీరో అవ్వాలనే వచ్చా. సినిమా అంటే ఎంటో తెలుసుకోవాలి. అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా నేను సినిమాలకు వచ్చాను. సినిమాకి టచ్ లో ఉండాలి. హ్యాపీడేస్ ఆడిషన్స్ నాకు చాలా నచ్చాయి. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. బ్రహ్మానందాన్ని తలచుకుంటే నవ్వు వస్తుంది. నేను ఫుడ్ ఎక్కువగా తినను. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫుడ్ ఎక్కువగా తినను. స్వాతి యాక్టింగ్ బాగుంటుంది. నాకు నచ్చిన హీరోయిన్ నిత్యామీనన్. నాకు రవితేజ అంటే ఇష్టం. ప్లాప్స్ వచ్చినప్పుడు లోపాలను తెలుసుకోవాలి. డైరెక్టర్ లేకపోతే సినిమా ఇండస్ట్రి లేదు. చిన్నప్పుడు లైబ్రరీలో బుక్, చర్మాస్ లో ఒక వస్తువును దొంగతనం చేశాను. లివ్ ఆండ్ లెట్ లివ్. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నాకు భార్యగా రావాలి అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

20:54 - July 30, 2016

జానపదాలు, ఒగ్గు కథలను గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరిస్తారు. ఒగ్గు కథలు గ్రామీణ ప్రజలను ఆకర్షిస్తాయి. మల్లన్న ముచ్చట్లలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మల్లన్న ఒగ్గుకథ ప్రసారం అయింది. ఆ కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

ఐటీ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : ఐటీ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష చేశారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్, సాఫ్ట్ మిట్ కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. ఆగస్టు 2న మిషన్ భగీరథ వర్కింగ్ ఏజెన్సీలతో సమావేశం జరుగనుంది. మిషన్ భగీరథతోపాటు ఫైబర్ గ్రిడ్ పనులను సమాంతరంగా చేయాలన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తైతే అందరికీ డిజిటల్ ప్రయోజనాలు ఉంటాయన్నారు. 

ఆగస్టు 7న ప్రధాని మోడీ తొలిసారి తెలంగాణ పర్యటన

హైదరాబాద్ : ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి తెలంగాణ పర్యటన చేయనున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మనోహరాబాద్...కొత్తపల్లి రైల్వే లైన్, రామగుండం, వరంగల్ హెల్త్ వర్సిటీలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. రామగుండం ఎన్ టిపిసి పవర్ ప్లాంట్ మూడేళ్లలో పూర్తవుతుందని చెప్పారు. 

ఆగస్టు 2న ఎపి బంద్ కు వామపక్షాలు పిలుపు

విజయవాడ : ఆగస్టు 2న ఎపి బంద్ కు వామపక్షాలు పిలుపిచ్చాయి. విభజన హామీల అమలుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. బంద్ కు విచ్చిన్నం చేయాలని చూస్తే తిప్పికొడతామని చెప్పారు. ప్రత్యేకహోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వారి వైఖరిని సోమవారం రాజ్యసభలో స్పష్టం చేయాలన్నారు. 

ప్రత్యేకహోదా కోసమే మా పోరాటం : కెవిపి

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా కోసమే తమ పోరాటమని కాంగ్రెస్ నేత కెవిపి అన్నారు. రాజ్యసభలో జైట్లీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినా విభజన హామీల అమలుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. 

కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ మృతి

బెంగళూరు : కర్నాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రసెల్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

అక్రమ నల్లా కనెక్షన్లు రెగ్యులరైజ్ చేసుకోవాలి : దాన కిశోర్

హైదరాబాద్ : గ్రేటర్ అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న వారు ఆగస్టు, సెప్టెంబర్ లో రూ.1 చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. సెప్టెంబర్ తర్వాత పెనాల్టీతోపాటు కనెక్షన్ చార్జీలు కూడా వసూలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 1 నుంచి బీపీఎల్ వారికి రూ.1 కే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. నగరంలో అందరూ నల్లాలకు మీటర్లు బిగించుకోవాలన్నారు. మీటర్లు బిగించుకుంటే వినియోగదారులకు బిల్లులో 5 శాతం రాయితీ కల్పిస్తామని చెప్పారు. 

ఢిల్లీకి వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి : మధు

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్రప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పిమధు అన్నారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చంద్రబాబు అనడంతోనే రాష్ట్ర ప్రయోజనాలు సంగం దెబ్బతిన్నాయన్నారు. ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో సోమవారం టీడీపీ సభ్యులు పోరాటం చేయకపోతే, పట్టుబట్టకపోతే.. బిజెపితో టీడీపీ కుమ్మక్కు అయిందని, అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుందని ప్రజలు అనుకుంటారని చెప్పారు.

19:26 - July 30, 2016

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదాపై కేంద్రప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పిమధు అన్నారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చంద్రబాబు అనడంతోనే రాష్ట్ర ప్రయోజనాలు సంగం దెబ్బతిన్నాయన్నారు. ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో సోమవారం టీడీపీ సభ్యులు పోరాటం చేయకపోతే, పట్టుబట్టకపోతే.. బిజెపితో టీడీపీ కుమ్మక్కు అయిందని, అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతుందని ప్రజలు అనుకుంటారని చెప్పారు. ప్రత్యేకహోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా ఆగస్టు 2న తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

 

18:56 - July 30, 2016

నిజామాబాద్ : మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం న్యాయం చేయాలని నిజామాబాద్‌ సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ అంశం ప్రభుత్వాన్ని పాతాళగంగలోకి తొక్కేస్తుందన్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు అండగా నిలిచిన నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు. దీనికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

 

18:54 - July 30, 2016

హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో 123 జీవో ప్రతులను దగ్ధం చేశారు. 123 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దొంగదారిలో జీవో తీసుకువచ్చి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ వెంకట్ మండిపడ్డారు. నిర్వాసిత గ్రామాల్లో పోలీస్ పహారా ఏర్పాటుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం నేతలు మల్లేష్, భాస్కర్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..

 

18:51 - July 30, 2016

హైదరాబాద్ : గనుల శాఖలో ఈ-ఆఫీస్ విధానాన్ని పాటించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గనుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. పెండింగ్‌ అప్లికేషన్లు రద్దు చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. నిర్ణీతగడువు దాటిన లైసెన్సులు రద్దు చెయ్యాలని ఆదేశించారు. ప్రతి ఫైల్‌పై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గనుల్లో ఒప్పందం ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో చూడాలని అధికారులకు సూచించారు.

 

హైదరాబాద్ లో వర్షం... ట్రాఫిక్ జాం..

హైదరాబాద్ : నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన కమిషనర్‌...  సమస్యలు పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ టీమ్‌ను ఆదేశించారు. 

18:46 - July 30, 2016

హైదరాబాద్ : నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన కమిషనర్‌...  సమస్యలు పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ టీమ్‌ను ఆదేశించారు. 

 

18:43 - July 30, 2016

ఏలూరు : ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ మురళీమోహన్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీలలాగా వ్యాపారాల కోసం పదవులను అడ్డుపెట్టకోమని ఆయన అన్నారు. హోదా విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకే నడుచుకుంటామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరం అన్నారు. 

 

18:41 - July 30, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా అంశం నుంచి బీజేపీ తప్పించుకోలేదని మంత్రి పీతల సుజాత అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వారే ఇప్పుడు పార్లమెంట్ లో సుదీర్ఘ ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసమే కొంతమంది ప్రయత్నిస్తారని ఆమె అన్నారు. 

 

18:33 - July 30, 2016

విజయవాడ : బీజేపీ, టీడీపీలు లాలూచీ పడి తన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు చర్చకు రాకుండా కుట్రపన్నాయని కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రారావు అన్నారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, హామీలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని చంద్రబాబు.. కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. చంద్రబాబు తన బుద్ధిని మార్చుకోవాలన్నారు. చంద్రబాబును ప్రపంచంలో ఎవరూ మోసం చేయలేరని..ఎందుకంటే చంద్రబాబు ఎవరిని నమ్మరని ఎద్దేవా చేశారు. టీడీపీ స్థాపించిన ఎన్ టీఆర్ నే టీడీపీ ఆఫీస్ లోకి అడుగుపెట్టకుండా చేశారని... అలాంటి బాబు ఆంధ్రా  ప్రజలను మోసం చేయడంలో ఆశ్చర్యపోవలిసిన పని లేదన్నారు. 

 

18:25 - July 30, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై కేంద్రం.. రాష్ట్ర ప్రజలను దగా చేస్తుందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు తలోమాట మాట్లాడుతున్నారని.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. చంద్రబాబు వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చూడాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. హోదా విషయంలో తమ భవిష్యత్‌ కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తామని రామకృష్ణ తెలిపారు.

 

జీఎస్ టీ బిల్లులో రాష్ట్రాల హక్కులను హరించే అంశం : బివి.రాఘవులు

ఢిల్లీ : రాష్ట్రాల హక్కులను హరించే అంశం జీఎస్ టీ బిల్లులో ఉందని సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యులు బివి.రాఘవులు తెలిపారు. బెంగాల్ లో రోజురోజుకూ పరిస్థితి తీవ్రంగా మారిందని వాపోయారు. దాడులు జరుగుతున్నాయని....ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీసర్కార్ మల్లన్నసాగర్ పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ ఎస్... రైతులపై లాఠీచార్జీ చేయిస్తుందని ఆరోపించారు. దేశంలో గో సంరక్షక్ పేరుతో గుండాగిరి సాగుతుందన్నారు. ఎపికి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెసుల అసలు రంగు బయటపడిందని చెప్పారు.

రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నాం : బివి.రాఘవులు

ఢిల్లీ : సమావేశాల్లో దేశ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఎపికి సంబంధించిన సంబంధించిన అనేక సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో తలెత్తిన రాజకీయ సమస్యను రాజకీయంగానే పరిష్కారం చేయాలన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి... రాజకీయ పరిష్కారం కోసం అన్వేషించాలని సూచించారు. సాధారణ పరిస్థితులను తీసుకురావాలన్నారు. 

17:53 - July 30, 2016

ఢిల్లీ : సమావేశాల్లో దేశ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఎపికి సంబంధించిన అనేక సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో తలెత్తిన రాజకీయ సమస్యను రాజకీయంగానే పరిష్కారం చేయాలన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి... రాజకీయ పరిష్కారం కోసం అన్వేషించాలని సూచించారు. ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను తీసుకురావాలన్నారు. రాష్ట్రాల హక్కులను హరించే అంశం జీఎస్ టీ బిల్లులో ఉందని తెలిపారు. బెంగాల్ లో రోజురోజుకూ పరిస్థితి తీవ్రంగా మారిందని వాపోయారు. దాడులు జరుగుతున్నాయని....ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మల్లన్నసాగర్ పేరుతో టీసర్కార్ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న టీఆర్ ఎస్... రైతులపై లాఠీచార్జీ చేయిస్తుందని ఆరోపించారు. దేశంలో గో సంరక్షక్ పేరుతో గుండాగిరి సాగుతుందన్నారు. ఎపికి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెసుల అసలు రంగు బయటపడిందని చెప్పారు. ఆగస్టు 2న తలపెట్టిన అఖిపక్ష బంద్ కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. 

 

17:38 - July 30, 2016

రాజమండ్రి : ప్రత్యేక హోదా అన్నది భిక్ష కాదని, అది రాష్ట్ర ప్రజల హక్కని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 
ఈమేరకు ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు కేంద్రంపై విరుచుపడాలని ఆయన అన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలు బాబు వెంటే ఉంటాయని, దీనికి చంద్రబాబు నాయకత్వం వహించాలని కోరారు. ప్రత్యేక హోదాపై నాన్చుడు ధోరణి అవలంబిస్తే సీమాంధ్రులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన తప్పిదాన్ని గుర్తించాలన్నారు.

 

మెగాస్టార్ 150వ సినిమా హీరోయిన్ కాజల్

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. సినిమా నిర్మాత రామ్ చరణ్ కాజల్ పేరును అధికారికంగా ప్రకటించారు. 
 

17:22 - July 30, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చెయ్యడానికైనా సిద్ధమని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపజేయడానికైనా వెనుకాడమన్నారు. పార్టీ ఎంపీలతో రేపు చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వెంకయ్యనాయుడు, మోడీ, జైట్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.

రాజీనామాలకైనా సిద్ధం : కేశినేని

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామాలకైనా సిద్ధమని చెప్పారు. 

16:53 - July 30, 2016

హైదరాబాద్ : మోడీ సర్కారుతో చంద్రబాబు అమీతుమీకి సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ రాకపోవడంతో.. కేంద్రం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇవాళ టీడీపీ ఎంపీలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రేపు జగరగబోయే ఎంపీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపచేసే అంశంపై చర్చిస్తామన్నారు. కేంద్రవైఖరికి నిరసనగా ఎల్లుండి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర  టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు.

 

16:43 - July 30, 2016

ఢిల్లీ : టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మించి ఏం చేశారో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం మతితప్పి గతి తప్పి వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశాన్ని ఆర్థిక సంఘం పాలిస్తోందా? అని నిలదీశారు. ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఎలా చెబుతుంది? అని అన్నారు. ఆర్థికసంఘం తన పరిధిదాటి ప్రవర్తిస్తోందన్నారు. ముఖ్యమైన నిర్ణయాలు ప్రభుత్వం, పార్లమెంట్‌ తీసుకోవాలని... కానీ రిటైరైన అధికారుల బృందం ఎలా తీసుకుంటుంది? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదంటున్నారు.... మరి స్థానిక సంస్థలకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదని నిలదీశారు. రాజ్యాంగబద్దంగా స్థానిక సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు... ఆర్థికసంఘం పాలిస్తోందా? అని అడిగారు. ప్రత్యేకహోదాను మించి అదనంగా ఏపీకి ఏం చేశారని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలకన్నా ఎక్కువగా ఏం ఇచ్చారని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాలు హోదా అడుగుతాయంటున్నారు.... తమిళనాడును విడగొట్టారా?, ఒడిషాను విడగొట్టారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకాలం మంచిగా చెప్పి చూశామని.. ఇప్పుడు పోరాడే టైం వచ్చిందన్నారు.
-

 

టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రప్రభుత్వం నుంచి బయటకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చెప్పారు. రేపు ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే సభలను స్తంభింపచేసే అంశంపై చర్చిస్తామని తెలిపారు. 

 

16:18 - July 30, 2016

క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని తనను చూడాలని కోరుకుంటున్నాడని తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే అతన్ని కలుసుకున్నాడు. గుండెలకు అత్తుకున్నాడు. అభిమాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చాడు.
వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ వీరాభిమాని నాగార్జున క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన అభిమాన హీరోని చూడటమే తన చివరి కోరిక అని నాగార్జున చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా బెంగళూరు వెళ్లి అభిమానిని కలుసుకున్నాడు. వారి కుటుంబంతో ముచ్చటించాడు. ధైర్యం చెప్పి వచ్చాడు. నిజమైన హీరో అనిపించుకున్నాడు.
ప్రతీ ఆడియో ఫంక్షన్ లోనూ ఎన్టీఆర్ చెబుతుంటాడు 'జాగ్రత్తగా ఇళ్లకి వెళ్లండి.. ఇంటి దగ్గర మీకోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు' అని. సాధారణంగా హీరోలు స్టేజీల మీద డైలాగ్స్ కొట్టి బయట మరోలా ప్రవర్తిస్తుంటారనేది చాలా సందర్భాల్లో వెల్లడయ్యింది. కానీ తాను మాత్రం అభిమానులు ఆపదలో ఉంటే తోడుంటానని ఎన్టీఆర్ రుజువు చేసుకున్నాడు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని ఆస్పిటల్ లో పరామర్శించిన విషయం తెలిసిందే. 

ఎంసెట్ లీకేజీపై కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు

హైదరాబాద్ : ఎంసెట్ లీకేజీపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. . నిందితుడు రాజేష్ ను సీఐడీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి ఇక్బాల్ సహచరుడు రాజేష్. సాయంత్రం రాజగోపాల్ అరెస్టును సీఐడీ నిర్దారించనుంది. 

 

టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రప్రభుత్వం నుంచి బయటకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రేపు ఎంపీల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే సభలను స్తంభింపచేసే అంశంపై చర్చిస్తామని తెలిపారు. 

ఎంసెట్ పై సీఎం కేసీఆర్ తో డీజీపీ సమావేశం

హైదరాబాద్ : ఎంసెట్ పై సీఎం కేసీఆర్ తో డీజీపీ సమావేశం అయ్యారు. నిందితుడు రాజేష్ ను సీఐడీ ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రధారి ఇక్బాల్ సహచరుడు రాజేష్. సాయంత్రం రాజగోపాల్ అరెస్టును సీఐడీ నిర్దారించనుంది. 

 

ఎపికి ప్రత్యేకహోదా చాలా అవసరం : మురళీమోహన్

పశ్చిమగోదావరి : ఎపికి ప్రత్యేకహోదా చాలా అవసరమని టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ప్రత్యేకహోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయడానికి సిద్ధం కానీ దానివల్ల ఎలాంటి ప్రయోచనం లేదన్నారు. హోదా విషయంలో సీఎం నిర్ణయం మేరకే నడుచుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలలా వ్యాపారాల కోసం పదవులను ఉద్యమాల ద్వారా ప్రత్యేకహోదా వస్తుందంటే ఉద్యమం చేయడానికి టీడీపీ సిద్ధమన్నారు. 

 

14:49 - July 30, 2016

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదాపై.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయవాడలో సీపీఐ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను..  ఊరేగించి.. న్యూ ఇండియా హోటల్ సెంటర్ వద్ద దహనం చేశారు. నరేంద్ర మోదీ.. వెంకయ్యనాయుడు ఏపీ ప్రజలను నమ్మించి మోసారని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ ఆరోపించారు. మాట తప్పిన వెంకయ్యనాయుడు ఏపీలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతారని హెచ్చరించారు. 

14:47 - July 30, 2016

విజయవాడ : ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్‌ నేతలు కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ.. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేశారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు.  ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. టీడీపీ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తక్షణమే వారు మిత్రపక్షం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. 

 

డ్రంక్ ఆండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ పై అవగాహన సదస్సు

హైదరాబాద్ : డ్రంక్ ఆండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ పై సైబరాబాద్ కమిషనరేట్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన 350 మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ హెచ్చరించారు.  హెడ్ లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్ లైట్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తామని డీసీపీ చెప్పారు.

ప్రత్యేకహోదా రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం : జగన్

హైదరాబాద్ : ప్రత్యేకహోదా రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. హోదా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్టు 2న బంద్ కు పిలుపిచ్చామని తెలిపారు. బంద్ కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. 

సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంపై ఎసిబి దాడులు

మెదక్ : సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంపై ఎసిబి దాడులు నిర్వహించింది. ఏడుగురు ఏజెంట్లను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.90 వేలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. 

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ఇన్ చార్జీ డీజీపీ సమీక్ష

విజయవాడ : కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ఇన్ చార్జీ డీజీపీ సమీక్ష చేపట్టారు. పోలీసులు, ట్రాన్స్ పోర్టు, ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్నారు. 1300 కెమెరాలతో  ఏఆర్ గ్రౌండ్స్ లో కమాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ఘాట్లలో రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై ప్రైవేట్ వాహనాలు నిలిపితే జరిమానాలు విధిస్తామని చెప్పారు. 

13:56 - July 30, 2016

శ్రీకాకుళం : కోట్లు మింగేశారు...రాజకీయ పలుకుబడితో ప్యాకేజీలను నొక్కేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలు, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించే తీరుతో వంశధార నిర్వాసితుల ప్యాకేజీలలో భారీ అవినీతికి తెరలేచింది. వంశధార నిర్వాసితుల పరిహారం పేరుతో జరుగుతున్న దోపిడిపై 10 టివీ ప్రత్యేక కథనం...

బినామీ పేర్లతో ప్యాకేజీ కొట్టేస్తున్న అక్రమార్కులు..
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారం అక్రమార్కులకు ఫలహారంగా మారింది. నిర్వాసితులకు దక్కాల్సిన ప్యాకేజీలను.. బినామీ పేర్లతో అక్రమార్కులు అడ్డంగా దోచేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు.. సుమారు ఎనిమిది కోట్ల రూపాయల మేర మొత్తాన్ని కాకిలెక్కలతో అక్రమార్కులు స్వాహా చేసేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో వంశధార పరిహారంపై అవినీతి జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

దుగ్గుపురంలో బరితెగించిన బినామీలు...
ఇక్కడ మనం చూస్తున్న గ్రామం హిర మండలం దుగ్గుపురం. వంశధార నిర్వాసిత గ్రామమైన దుగ్గుపురంలో బినామీలు బరితెగించారు. ఇక్కడ ముందుగానే స్థలం కొనుగోలు చేసి తమ పలుకుబడితో ఇల్లు ఉన్నట్లు రికార్డు చేయించారు. వాస్తవానికి నిర్వాసితుల ఇళ్లు, పశువుల పాకలు, ఇతర స్థలాలకు ప్రభుత్వం కొంత ధర నిర్ణయించింది. ఇక్కడే అక్రమార్కులు తమదైన అక్రమాలకు తెరలేపారు. బినామీల పేరిట ఇక్కడ హడావుడిగా రేకుల షెడ్ల వంటి నిర్మాణాలు చేపట్టారు. వాటినే పటిష్టమైన.. పక్కా ఇళ్లుగా చూపి.. ఎక్కువ ధర వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు.

అధికారులకు లక్షల్లో అమ్యామ్యాలు? ..
కేవలం పరిహారం కోసం అక్రమార్కులు నిర్మించిన రేకుల షెడ్లకూ 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకూ ధరను నిర్ణయించారు అధికారులు. అయితే అసలైన నిర్వాసితుల ఇళ్లకు మాత్రం 20 వేల నుంచి రెండు లక్షల వరకు మాత్రమే ధర నిర్ణయించారు. దీన్ని బట్టి అక్రమార్కులు ఏ రేంజిలో అధికారులను లోబరచుకున్నారో అర్థమవుతుందంటున్నారు. వీరి ఉదాసీన వైఖరి కారణంగా అసలైన నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది...ఈ తతంగంపై గ్రామస్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.

నిర్వాశితులకు న్యాయం చేయాలని డిమాండ్..
వంశధార పరిహారం చెల్లింపుల్లో జరిగిన భారీ మోసం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోని ఈ అవినీతి బాగోతం పై విచారణ జరిపి...నిజమైన నిర్వాసితులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి...

13:47 - July 30, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ వార్‌ మొదలైంది.. స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఘోరంగా అవమానించారంటూ ఉద్యమానికి సిద్ధమైంది.. యాభైమంది స్థానిక ప్రజాప్రతినిధులు, పదిమంది ఎంపీలు వారంరోజులనుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధాని మోదీ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు.. ప్రధాని పీఠాధిపతులను, కార్పొరేటర్లనే కలుస్తారా? తమను పట్టించుకోరా? అని ప్రశ్నించారు.. ఏపీ, తెలంగాణలోని ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎంపీపీలు... మిగతా రాష్ట్రాల్లోని స్థానిక ప్రజాప్రతిధులనుకూడా కలుపుకొని నవంబర్‌లో చలో పార్లమెంట్‌ చేపడతామని హెచ్చరించారు.

13:43 - July 30, 2016

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ లోని నౌగామ్ సెక్టార్ లో శనివారం ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద అక్రమంగా భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు.. పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చొరబాటుదారులు కూడా మృతి చెందారు. ఉగ్రవాదుల చొరబాటుని సమర్థవంతంగా తిప్పికొట్టామని భద్రతాబలగాలు ప్రకటించాయి. భద్రతాదళాలకు ఉగ్రవాదలకు మధ్య ఆపరేషన్ కొనసాగుతోంది.

13:32 - July 30, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవటంపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆగస్టు  2న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు పార్టీలకతీంగా అందరూ పాల్గొనాలని ఆయన పేర్కొన్నాడు. చంద్రబాబునాయుడు ...బీజేపీ సర్కారు వైఖరిపై జగన్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓటుకు నోటుకు భయపడే  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి భయపడుతున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన మాట ఈరోజు ఏమైందని ప్రశ్నించారు.

ఏసీబీ వలలో ఆడిటర్..

నెల్లూరు : పెన్షన్ బిల్లులు మంజూరు చేయడానికి ఓ వ్యక్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఆడిటర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం వెలుగుచూసింది. జిల్లాకు చెందిన బూడిద శ్రీనివాసులు అనే వ్యక్తి పెన్షన్ బిల్లుల కోసం జిల్లా ఆడిట్ అధికారి షణ్ముఖరెడ్డిని ఆశ్రయించాడు. బిల్లు మంజూరు చేయాలంటే రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు.

ఏసీబీ చిక్కిన వీఆర్వో..

కరీంనగర్ : పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో... ఏసీబీ అధికారులకు చిక్కాడు. జూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన మంద సదయ్య అనే రైతు పట్టాదార్ పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతును పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే రూ. 4 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... లంచం తీసుకుంటున్న వీఆర్వో ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

13:10 - July 30, 2016

హైదరాబాద్ : మహానగర వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చుక్కచుక్కకు లెక్కకట్టాలని నిర్ణయించింది. ఇక నుంచి చుక్కచుక్కకు లెక్కకట్టి మరీ వినియోగదారుల‌కు సరఫరా చెయ్యడానికి సిద్దమవుతుంది. అందుకోసం నీటిమీటర్లు బిగించడాన్ని వేగవంతం చెయ్యాలని నిర్ణయించింది. మీటర్లులేని వినియోగదారులకు ఇకపై రెట్టింపు చార్జీలను వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది జలమండలి.

సామాన్యులపై వాటర్ దెబ్బ షురూ..
సామాన్య మానవునిపై మరో రకమైన బాదుడుకు జలమండలి సిద్దమవుతోంది. ప్రతి కనెక్షన్‌కు నీటిమీటరు తప్పనిసరిగా అమర్చుకోవాలనేది వాటర్ బోర్డు నిబంధన పెట్టింది. గ‌త కొన్నేళ్లుగా తీసుకున్న ప్రతి క‌నెక్షన్‌కు మీట‌ర్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది జ‌ల‌మండ‌లి. దానిని ఖచ్చితంగా అమలు చెయ్యడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల మున్సిప‌ల్ శాఖ‌మంత్రి కేటీఆర్ జ‌ల‌మండ‌లి స‌మీక్షలో భాగంగా ప్రతి న‌ల్లాకు మీట‌ర్ త‌ప్పకుండా బిగించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దాంతో మీట‌ర్ల చ‌ర్చ మ‌రోసారి మొద‌లైంది.

జ‌ల‌మండ‌లి పరిధిలో 74 ప్రాంతాల్లో లేని నీటిమీట‌ర్లు..
గ్రేట‌ర్‌లో ప‌రిధిలో ప్రస్తుతం ప్రతిరోజు 356 మిలియ‌న్ గ్యాల‌న్ల నీటిని స‌ర‌ఫ‌రా చేస్తుంది జ‌ల‌మండ‌లి. ప్రతి రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద మీట‌ర్లను ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి నుండి ఏయే ప్రాంతాలకు ఎంతనీరు వెళ్తుందో ఈజీగా తెలుసుకోవ‌చ్చు. అయితే రిజర్వాయర్ల దగ్గర ఉన్న మీటర్లు పనిచెయ్యడం లేదు. చాలా వాటిల్లో నీటిమీటర్లు అందుబాటులో లేవు. గ‌త కొద్దిరోజులక్రితం వాట‌ర్ బోర్డు అధికారులు స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్రకారం ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. 31 చోట్ల రిజర్వాయర్ల వ‌ద్ద నీటిమీట‌ర్లు పాడైపోగా 74 ప్రాంతాల్లో అసలు నీటిమీట‌ర్లే లేవు. అధికారులు ఏర్పాటు చేసిన రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్దే నీటిమీట‌ర్లు ప‌నిచెయ్యకుంటే ఇక వినియోగ‌దారుల వ‌ద్ద ఎలా ప‌నిచేస్తాయ‌ని ఇది ప్రజ‌ల‌కు భారంగా మారుతుందనే విమ‌ర్శలు ఉన్నాయి.

ఒకమీటర్‌కు రూ.1500 నుండి 2వేల వరకు ఖర్చు
ఒక మీటర్‌కు అయ్యే ఖర్చు వినియోగదారుడే భరించాలి. ఒక మీటర్‌కు 1500ల నుండి 2వేల వరకు ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వాటి జీవితకాలం 7 సంవత్సరాలు. కాని రెండు సంవత్సరాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఇది త‌ప్పని స‌రిచేస్తే 7లక్షల మంది నీటి మీటర్లు బిగించుకోవాల్సి వస్తుంది. దాంతో 140 కోట్లు భారం పడుతుంది. ఇదంతా బోర్డు గుర్తించిన 5 మీటర్ కంపెనీలకే వెళ్లుంది. ఇంత‌టి భారం గ్రేట‌ర్ వాసుల‌పై వెయ్యాల్సిన అవ‌సరం ఏముంద‌ని ప్రశ్నిస్తున్నారు సిటిజ‌న్స్. ఢిల్లీ లాంటి న‌గ‌రాల్లో ఉచితంగా నీటి స‌ర‌ఫ‌రా చేస్తుంటే ఇక్కడ మాత్రం చుక్కచుక్కకు రేటు క‌ట్టడం ఏంట‌నీ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సంస్కర‌ణ‌ల్లో భాగంగానే ఇలాంటి చ‌ర్యలు తీసుకుంటుంద‌ని సిటిలోని ప్రతి న‌ల్లాకు మీట‌ర్ బిగించి ప్రజ‌ల‌పై భారం వేయాలనుకుంటోంది సర్కార్.

మీటర్ పేరుతో గ్రేటర్ వాసులకు భారం..
అయితే గ‌తంలో ఎన్నోసార్లు న‌ల్లా మీట‌ర్ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. కాని అవి స‌క్రమంగా ప‌నిచెయ్యక‌పోవ‌డంతో దానిపై ఎవరూ అస‌క్తి చూప‌డంలేదు. అయినా కేవ‌లం గంట‌పాటు వ‌దిలే నీటికి మీట‌ర్ ఎందుక‌ని ప్రశ్నించారు. మీట‌ర్ల పేరుతో గ్రేట‌ర్ వాసుల‌పై మ‌రోభారం ఎందుక‌నే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు హైద‌రాబాదీలు.

12:38 - July 30, 2016

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ కేంద్రం మేజర్‌ గ్రామపంచాయితీ కుప్పం పట్టణంలో వార్డుసభ్యులుగా ఉన్న 16 మంది పదవులకు రాజీనామాలు చేసి పత్రాలను స్థానికమండల పరిషత్‌ కార్యాలయానికి పంపించారు. దీంతో ఈ ఘటన సీఎంకు తలనొప్పిగా మారింది.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్ల విభేదాలు..
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని వార్డుమెంబర్ల మధ్య విభేధాలు రచ్చకెక్కాయి. తమ వార్డులో అభివృద్ది జరగలేదంటూ..ఏకంగా 14 మంది టీడీపీ వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను కలెక్టర్‌కు అందజేశారు.

మేజర్‌ గ్రామపంచాయితీ లో 16 మంది వార్డు మెంబర్ల రాజీనామా..
చిత్తూరు జిల్లాలో మేజర్‌ గ్రామపంచాయతీ అయిన కుప్పంలో 20 మంది వార్డు సభ్యులతో పాలకవర్గం ఉంది. ప్రస్తుతం 16 మంది వార్డు సభ్యులు మూడేళ్లుగా అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడేళ్లుగా కుప్పం పట్టణాభివృద్ధి కోసం విడుదలైన నిధులపై ఎలాంటి లెక్కలూ లేవంటూ ఆరోపించారు. డంపింగ్‌ యార్డు శుభ్రం చేయడం కోసం 25 లక్షల రూపాయలు, ఎస్‌టీఎఫ్‌ నిధుల ద్వారా 4.5 కోట్ల రూపాయల ఖర్చుపై ఇంత వరకు లెక్కలు చూపిన దాఖలాలు లేవని మండిపడుతున్నారు.

రాజీనామాలను కలెక్టర్‌కు అందజేసిన తెలుగు తమ్ముళ్లు..
దీంతో పాటు పంచాయతీ ఆదాయ వ్యయాలు, ఆస్తులవివరాలపై ఎలాంటి అఫిడవిట్‌లు వెల్లడించలేదని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కుప్పం మండల పరిషత్‌ అధికారులు అందుబాటులో లేకపోవడంతో రాజీనామా పత్రాలను కలెక్టర్‌కు పంపిస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

12:27 - July 30, 2016

ఢిల్లీ : సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. దేశంలో నెలకొన్న సామాజిక,ఆర్థిక ,రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించనున్నారు. కేరళలో సీపీఎం ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు రెండు నెలలు కావొస్తున్న సంద్భంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశంపై నేతలు చర్చించనున్నారు. అలాగే గుజరాత్ లో దళితులపై దాడులు,కశ్మీర్ అంశం, ఏపీ ప్రత్యేక హోదా బిల్లు, పార్లమెంట్ ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ బిల్లు పాస్ చేయించుకోవాలని చూస్తోంది. దీనిపై కూడా నేతలు సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాలలో జరుగనున్న ఎన్నికలు, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై నేతలు చర్చించనున్నారు.ఈ సమావేశానికి కేరళ సీఎం విజయన్, ఏపీ నుండి, బీవీ రాఘవులు వంటి పలువురు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

12:15 - July 30, 2016

కృష్ణా : చల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడూరు మండలం హంసలదీవి సాగరసంగమంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న యడ్లపల్లి రమేష్‌(32) తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం చూస్తే..ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్ళిన భర్త ఎంతకూ ఇంటికి రాకపోవటంతో రమేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులకు సాగరసంగమం వద్ద ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. రమేష్ మృతదేహం మాత్రం ఆచూకీ లేకుండా పోయింది. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మినహా ఎటువంటి ఇబ్బందులూ లేవని తెలుసుకున్నవారు ఇద్దరి పిల్లలతో రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా రమేష్ మృతదేహం కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

11:56 - July 30, 2016

మహబూబ్ నగర్ : పాలమూరుజిల్లాలో భూములధరలు చుక్కలనంటుతున్నాయి. కొత్తజిల్లాల ప్రతిపాదనలతో పలు పట్టణాల్లో రియల్‌బిజినెస్‌ ఊపందుకుంది. అమ్మకాలు కొనుగొళ్లతో రిజస్ట్రార్‌ ఆఫీసులు సందడిగా మారాయి.

వ్యవసాయ భూముల్లోనూ వెంచర్లు..
కరవుజిల్లా పాలమూరులో భూములధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఎగబడడంతో వ్యవసాయ భూముల్లో వెంచర్లు వెలుస్తున్నాయి..డబ్బున్న పెద్దోళ్లు భూముల్ని ఎగబడికొంటున్నారు.

2నెలల్లో రిజిస్ట్రేషన్‌ ఆదాయం రూ. 3కోట్లు...
జిల్లాల పునర్విభజన కారణంగా నాగర్‌ కర్నూలు, వనపర్తి పట్టణాల్లో ఎపుడూలేని విధంగా ల్యాండ్‌రేట్లు ఆకాశాన్నంటాయి. గజం భూమి వేలల్లో పలుకుతోంది. గతంలో గజం 4నుంచి 5వేల రూపాయలు ఉండగా... కొత్త జిల్లాప్రతిపాదనతో నాగర్‌కర్నూలు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం గజం ధర ఏకంగా 20 నుంచి 40వేల రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. రెండు నెలల్లో భూవిక్రయాల ద్వారా సబ్‌రిజిస్ట్రార్‌ క్యార్యాలయాలకు ఏకంగా 3కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వచ్చిందంటే ..జిల్లాలో ల్యాండ్‌ బూమ్‌ ఎంతలా ఉందో అర్థమవుతోంది.

రియల్‌మాయపై రెవెన్యూ అధికారులు సైలెంట్‌..!
అటు వనపర్తికూడా జిల్లాకేంద్రంగా మారుతుందన్న ప్రచారంతో రియల్‌వ్యాపారులు జోరుపెంచారు. వనపర్తితోపాటు పెబ్బేరు, కొత్తకోట, గోపాల్‌పేట వరకు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈప్రాంతాల్లో ఎకరం పొలం 10లక్షల రూపాలకు పైమాటే అంటున్నారు స్థానికులు. సందట్లో సడేమియలా..కొందరు ప్రభుత్వభూములను కూడా ప్లాట్స్‌ మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు సైలెంట్‌ అయ్యారనే ఆరోపణలొస్తున్నాయి.

షాద్‌నగర్‌కు 10కి.మీ. పర్యంతం వెంచర్లు..
అటు రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న షాద్‌నగర్‌లో అయితే వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. పట్టణం చుట్టుపక్కల కిలోమీటర్ల పర్యంతం వెంచర్లు వెలిశాయి. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, దళారులు..కోట్లరూపాయలు జేబుల్లో నింపుకుంటున్నారు..

11:52 - July 30, 2016

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల ముగింపుతో తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు చివరివారంలో కూల్చివేత పనులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్లాక్‌లను కూల్చివేసి కొత్తబ్లాక్‌లను నిర్మించనుంది సర్కార్.

7నుండి 9 అంతస్థులతో కొత్త సెక్రటేరియట్ ..
సెక్రటేరియట్‌కు వాస్తుదోషాలు ఉన్నాయని గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఎర్రగడ్డలో కొత్త సెక్రటేరియట్‌ను కట్టాలనుకున్నారు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ స్థానంలోనే కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొత్త సెక్రటేరియట్ సుమారు 7 నుండి 9 అంతస్థులలో ఉండేలా ప్లాన్ చేస్తోంది సర్కార్ .

J, K, L, H బ్లాక్‌లు ఏపీకి కేటాయింపు ..
రెండు టవర్ల రూపంలో నూతన సెక్రటేరియట్‌ను నిర్మించి మంత్రుల కార్యాలయంలోనే సమావేశ మందిరాలు నిర్మించనున్నారు. నయా రాయ్‌పూర్, ఢిల్లీ కంటే..అధునాతన పద్ధతుల్లో భవనాన్ని నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంపకాలు చేశారు. తెలంగాణకు A,B,C,D బ్లాక్‌లు రాగా...ఏపీకి J, K, L, H బ్లాక్‌లను కేటాయించారు. అయితే ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ బ్లాక్‌లన్నీ ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. అయితే ఎల్ బ్లాక్‌ను తమ అవసరాలకు వాడుకొని మిగతా వాటిని తెలంగాణకు ఇచ్చేస్తున్నట్లు ఏపీ ఇప్పటికే ప్రకటించింది.

మిగతా బ్లాక్ లు దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని ప్లాన్
ప్రస్తుతం ప్రధానవిధులు నిర్వర్తించే అధికారులను హెచ్ , సౌత్ నార్త్ బ్లాక్‌ల్లోకి మార్చాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. మిగిలిన శాఖలను దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయాలకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్ని ఒకే సారి కాకపోయిన ఒక్కో బ్లాక్‌ను విడతలుగా మార్చేందుకు అవకాశాలున్నాయంటున్నారు. ఉద్యోగులు విజిటర్స్‌కు ఎలాంటి అసౌకర్యం లేకుండా..పార్కింగ్ తో పాటు అన్ని వసతులతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరగనుంది.

ఏపీకి కేటాయించిన బ్లాక్‌లు కలిపితే 10లక్షల స్వ్కేర్ ఫ్లీట్లు
ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనం సుమారు 5 నుండి 6 లక్షల స్క్వేర్ ఫీట్లలో ఉంది. ఏపీకి కేటాయించిన స్థలాన్ని కూడా కలుపుకుంటే..మొత్తం10 లక్షల స్వ్కేర్ ఫీట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఏ,బీ,సీ బ్లాక్‌లను కూల్చివేయాలని భావిస్తున్న సర్కార్ త్వరలోనే సీఎం ఉండే డీ బ్లాక్‌కి సైతం ముహూర్తం ఖరారు చేయనుంది.

11:45 - July 30, 2016

హైదరాబాద్ : శానిటేషన్‌ సమస్యలపై స్వయంగా రంగంలోకిదిగారు జీహెచ్ ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి.. వివిధ ప్రాంతాల్లో పాడైపోయిన రోడ్లకు వేగంగా మరమ్మత్తులు పూర్తిచేయాలని ఆదేశించారు.. నాలాలపై కప్పు తొలగిపోయినా ఎందుకు పట్టించుకోవడంలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. జీహెచ్‌ఎంసీ నార్త్‌జోన్‌ కార్యాలయం సమీపంలోని మోడ్రన్‌ టాయ్‌లెట్ల దుస్థితిపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు..

11:40 - July 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ బోర్డులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. డైరెక్టరే స్వయంగా అక్రమాలకు పాల్పడి లక్షలాది రూపాయలు ముడుపులుగా స్వీకరిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి అధికారులకు చిక్కారు. గురువారం నుంచి జరుగుతున్న సోదాల్లో తవ్వుతున్న కొద్దీ నోట్లకట్టలు బయటపడుతున్నాయి. ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌..అవినీతి, అక్రమాలను చూసిన ఏసీబీ అధికారులకు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.

ఏసీబీ వలకు చిక్కిన డైరెక్టర్..
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సెస్సీ బోర్డులో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఎస్సెస్సీ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్న ప్రసన్నకుమార్‌ అవినీతిని చూసి ఏసీబీ అధికారులే షాక్‌ అయ్యారు. తవ్వేకొద్ది నోట్లకట్టలు బయటపడుతుండడంతో..ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గురువారం మొదటిరోజు డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ కారులోనుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోగా,..రెండొవ రోజు శుక్రవారం ఒక లాడ్జీ నుంచి ఏకంగా 35 లక్షల రూపాయలు లభించాయి.

డైరెక్టర్‌ కారులో రూ. 6లక్షలు ..లాడ్జీలో రూ. 35 లక్షలు స్వాధీనం ..
డీఎడ్ కౌన్సెలింగ్‌ కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఏపీఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ అవినీతికి తెరలేపారు. సఫీ అనే దళారిని నియమించుకుని ప్రైవేటు కళాశాలలతో లావాదేవీలు నిర్వహించారు. ఒక్కొక్క సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు వెయ్యి రూపాయల చొప్పున ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు 230 కళాశాలలకు చెందిన 4వేల సర్టిఫికెట్లను పరిశీలించి క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే డబ్బు పంపకాలు మొత్తం డైరెక్టర్‌ కార్యాలయం వద్దే కొనసాగగా,.ఎప్పటికప్పుడు డబ్బును లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర లాడ్జికి తరలించడం జరిగింది. ఈ వ్యవహారంపై స్పష్టమైన సమాచారాన్ని అందుకు ఏసీబీ అధికారులు ఒక్కసారిగా సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి పర్యవేక్షణలో మొత్తం మూడు బృందాలు రంగంలోకి దిగాయి.

ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన డైరెక్టర్‌ ప్రసన్నకుమార్‌..ఏసీబీ అదుపులో దళారీ రఫీ..
డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రసన్నకుమార్‌ను అదుపులో తీసుకున్న ఏసీబీ అధికారులు అతని నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు 4వేల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయినట్లు గుర్తించారు. ఇంకా 298 కళాశాలల సర్టిఫికెట్లు వెరిఫై చేయాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారంలో కోటి రూపాయలకు పైగా చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో దళారిగా వ్యవహరించిన రఫిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఆయా కళాశాలల యాజమన్యాలను కూడా ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.

11:34 - July 30, 2016

కరీంనగర్‌ : ఓ జలాశయంలో  జలదృశ్యం కనువిందు చేసింది.  జలం అంటేనే అద్భుతం ఆ జలం అద్భుత విన్యాసాలు చేస్తే చూడటానికి రెండు కళ్లూ చాలవు కదూ..అటువంటి దృశ్యం మానేరు జలాశయంలో జరిగింది. జలం  సుడులు తిరుగుతూ పైకి లేచి వీక్షకులకు కనువిందు చేసింది. ఈ అద్భుతాన్ని  స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అయితే సుడి తీవ్రత పెరగడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. డ్యామ్‌లో అప్పుడే చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు భయంతో ఒడ్డుకు చేరుకోగా.. ఈ ఘటనలో వారి తెప్పలు మాత్రం కొట్టుకుపోయాయి. దాదాపు 300 మీటర్ల ఎత్తు వరకు నీరు సుడులు తిరుగుతూ నీరు పైకి లేచింది.

యువకుడి దారుణ హత్య..

రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఖాప్స్ కార్డ్ ఆన్ సెర్చ్..8మంది అరెస్ట్..

నిజామాబాద్ : కామారెడ్డిలోని బతుకమ్మకుంట కాలనీలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 35 బైక్‌లు, 6 ఆటోలను సీజ్ చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

ఇద్దరు పిల్లలతో హోంగార్డ్ ఆత్మహత్య..

కృష్ణా : కోడూరు మండలం హంసలదీవి సాగరసంగమంలో ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోం గార్డుగా పనిచేస్తున్న యడ్లపల్లి రమేష్‌(32) శుక్రవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి సాగరసంగమంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగరసంగమం వద్ద ఓ ద్విచక్రవాహనం నిలిపి ఉంచడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆరాతీయగా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోం గార్డు రమేష్‌ గా గుర్తించారు.

ఎయిర్ ఇండియా అత్యవసర ల్యాండింగ్..

హైదరాబాద్‌: శంషాబాద్‌ నుంచి ముంబయి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం బయలుదేరిన 20 నిమిషాలకు సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయంలోనే విమానాన్ని అత్యవసరంగా దించేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎంపీ కుమార్తెపై కేసు నమోదు..

కర్నూలు : నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కుమార్తె సుజలపై హత్య కేసు నమోదైంది. నంద్యాల పరిధిలో ఎస్పీవై రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘నంది అకాడమీ స్కూల్’ లో పీఆర్వోగా పనిచేస్తున్న సుమంత్ (25) అనే యువకుడి దారుణ హత్యపై బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.

కారును ఢీకొన్న బస్సు..ఇద్దరు మృతి..

ప్రకాశం : మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం వద్ద కారును ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.

100 కేజీల గంజాయి స్వాధీనం..

తూర్పుగోదావరి : గోకవరం మండలం రామరాజుపేటలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంసెట్2 లీక్ కేసులో మరో నిందితుడి అరెస్ట్ ..

హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీక్ కేసులో మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రామకృష్ణను పుణెలో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిని పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పాస్టర్ ను కాల్చి చంపిన మావోలు..

ఖమ్మం : జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. చింతూరు మండలం లచ్చగూడెంలో ఇన్ ఫార్మర్ అనే అనుమానంతో పాస్టర్ ను మావోలు కాల్చి చంపారు.

కాలేజ్ లో విద్యార్థి ఆనుమానాస్పద మృతి..

ఖమ్మం : శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆనుమానాస్పదంగా మృతి చెందాడు. బైపీసీ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి వీరన్న అనుమానాస్పద మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

10:00 - July 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రసిద్దిచెందిన పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగాసాగే ఈ బోనాల ప్రధాన ఘట్టం ఆదివారం జరగనుంది.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. నిజాంకాలం నాటి నుంచి నిర్వహిస్తున్న ఈ బోనాల జాతరపై స్పెషల్ స్టోరీ..

3వేల మంది పోలీసులతో భద్రత..350 సిసి కెమెరాలు, 30 లైవ్‌ కెమెరాలు..
పాతబస్తీలోని లాల్‌దర్వాజాలో 108వ బోనాల మహోత్సవం ఆదివారం జరగనుంది. సింహవాహిని అమ్మ వారికి మహిళలు బోనాలు సమర్పిస్తారు...

బోనాలవెనక ఒక కథ ప్రచారంలో ఉంది..
1908లో మూసీనది పొంగి చార్మినార్‌ దగ్గరకు వరదనీరు చేరింది.. అక్కడి నుంచి లాల్‌దర్వాజ దిశగా నీటి ప్రవాహం సాగింది.. నదీ ప్రవాహం మరింత పెరగడంతో అప్పటి నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ఆందోళన చెందారు.. ఈ సమస్యపై ప్రధాని కిషన్‌ప్రసాద్‌ సలహా కోరారు అలీఖాన్‌.. లాల్‌ దర్వాజాలో అమ్మవారు కొలువై ఉన్నారని, పూజలు నిర్వహిస్తే ఈ ఉపద్రవం బయటపడొచ్చని ప్రధాని సూచించారు. వెంటనే నిజాం ప్రభువు అమ్మవారిని దర్శించుకున్నారు.. మేలిమి ముత్యాలు, చీర రవికతో పూజలు చేశారు.. ఆ తర్వాత ఒక్కసారిగా వరదలు తగ్గిపోయాయని చెప్పుకుంటారు.. అప్పటినుంచి ఈ పండుగ కొనసాగుతోంది..

అమ్మవారిని దర్శించుకున్న పీఠాధిపతులు..
1968లో అమ్మవారి ఆలయాన్ని కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర సరస్వతి సందర్శించారు.. లాల్‌దర్వాజ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి పండుగను మరింత ఘనంగా నిర్వహించడం మొదలైంది.. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక బోనాలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇచ్చింది.. కొత్త రాష్ట్రం వచ్చాక బంగారు బోనం సమర్పిస్తున్నారు..

ఉగ్రవాదుల కదలికలతో భద్రత పెంపు..
ప్రతిసారి బోనాల పండుగకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తారు.. ఈసారి పాతబస్తీలో ఉగ్రవాదుల కదలికలతో భద్రత పెంచారు.. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో 3 వేల మంది పోలీసుల్ని మోహరించనున్నారు.. అలాగే లాల్‌దర్వాజ నుంచి మూసీ నది వరకు 350 సిసి కెమెరాలు... 30 మొబైల్‌ లైవ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎస్‌ఐ స్థాయి అధికారుల్ని ఇన్‌ఛార్జులుగా నియమించారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, యాంటీ చైన్‌ స్నాచింగ్‌ స్వ్కాడ్స్‌, షీ టీమ్స్‌వంటి ప్రత్యేక పోలీసు బలగాలను బందోబస్తులో వినియోగిస్తున్నారు.

బోనాలతో భాగ్యనగరంలో పండుగ వాతావరణం..
బోనాలతో నెల రోజుల పాటు హైదరాబాద్‌లో పండుగవాతావరణం నెలకొంది.. ఈ ఆదివారం లాల్ దర్వాజ బోనాలతో జాతర ముగుస్తుంది.

09:55 - July 30, 2016

మెదక్ : ప్రశాంత పల్లెజనంపై ఖాకీల నిర్బంధం. భూములివ్వబోమని కరాఖండిగా చెబుతున్న రైతులపై పోలీసుల దమనకాండ. ఎదిరించే గొంతుల్ని ఎక్కుపెట్టిన తుపాకీతో అణిచి వేస్తోన్న అరాచకం. ఇది ప్రజాస్వామ్యమా.. లేక నిరంకుశత్వమా..? అని ప్రశ్నించేవాళ్లకు కనీస సమాధానం కూడా చెప్పని సర్కార్‌.. పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతోంది. మనిషికి మనిషికి మధ్య పొరపొచ్చాలొచ్చేలా కుట్ర చేస్తోంది. ఖాకీల కాపలాతో గ్రామాలకు గ్రామాలనే నిర్బంధించింది. మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌లో పోలీసులు నిర్బంధకాండపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...!

భూములివ్వబోమన్న ప్రజలపై ఖాకీల దౌర్జన్యం..
పోలీసుల కబంధ హస్తాల్లో వేములఘాట్‌ అత్యంత నిరంకుశంగా గ్రామాలపై పోలీసుల నిర్భందకాండ..ఇదీ.. మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఇక్కడిప్పుడు ఎటు చూసినా.. బిక్కుబిక్కు మంటున్న గ్రామస్థులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దినదిన గండంలా బతుకులు వెళ్లదీస్తున్న పల్లె వాసులు. ఇంతకాలం ఉన్నది తింటూ.. బతికే పల్లెజనంలో.. సర్కారు ప్రాజెక్టు పేరుతో చిచ్చు పెట్టి.. అణచివేత రుచేంటో చూపించింది. ఇదేం అన్యాయం అన్నందుకు ఎన్నో మేనులపై లాఠీలు ఝళిపించి పైశాచికంగా వికటట్టహాసం చేసింది.

ప్రజలపై పోలీసుల దౌర్జన్యం..
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే.. మా భూములివ్వం అన్నందుకు శత్రుదేశంపై విరుచుకుపడ్డట్లు.. ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్‌ నిర్మాణం వల్ల కలిగే నష్టాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన మహిళలు, పిల్లలు, వృద్ధులపై పోలీసులు నిర్బంధకాండను కొనసాగించారు.

వేములఘాట్‌లో ప్రజలు బయటకు రాని పరిస్థితులు ..
ముంపు గ్రామాల్లో ఒక్కటైన వేములఘాట్‌లో పరిస్థితి మరీ దారుణం. ఇక్కడి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎక్కడ చూసినా పోలీసులు తుపాకులు, లాఠీలతో పహారా కాస్తున్నారు. గ్రామస్థులను బయటకు వెళ్లనీయకుండా.. అడుగడుగునా నిర్బంధాన్ని కొనసాగించడం గ్రామస్తుల్లో తీవ్ర

గొడ్డును బాదినట్లు బాదిన పోలీసులు..
గ్రామంలో చిన్నా పెద్దా అందరినీ గొడ్డును బాదినట్లు బాదిన పోలీసులు.. మహిళలని కూడా చూడకుండా దుర్బాషలాడారని బాధితులు వాపోతున్నారు. వేములఘాట్‌లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. విద్యా సంవత్సరం ప్రారంభమైనా... ఊరు, ఇళ్లు పోతున్నాయన్న బెంగతో విద్యార్థులు స్కూల్‌కు కూడా వెళ్లలేని దైన్య స్థితి నెలకొంది. తల్లిదండ్రులు తిండితిప్పలు మానేశారని విద్యార్థులు కూడా తిండితినని పరిస్థితి కనబడుతోంది. మహిళపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

బంధువులను కూడా ఊళ్లో అడుగుపెట్టకుండా పోలీసుల అష్టదిగ్బంధం
లా
ఠీచార్జ్‌లో గాయపడ్డ వాళ్లని పరామర్శించేందుకు బంధువులను కూడా రానీయకుండా పోలీసులు అష్టదిగ్బంధం చేయడం దారుణమని వేములఘాట్‌ యువకులు వాపోతున్నారు. పోరాటానికి మద్దతిస్తున్న రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలను కూడా గ్రామంలోకి రానీయకుండా అరెస్ట్‌లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఖాప్స్ హింసతో మరింతగా ఐక్య అవుతున్న ప్రజలు..
పోలీసుల హింసతో భూ నిర్వాసితులు ఐక్యమవుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిరసనగా... ఇక భూములిచ్చే ప్రసక్తే లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.

09:48 - July 30, 2016

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజ్ లో రోజురోజుకీ సంచల వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ స్కామ్ లో ఇప్పటికే ఏడుగురు నిందితుల్ని సీఐడీ అధికారుల అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. శనివారం మరో నిందితుడ్ని అధికారులు అరెస్ట్ చేశారు. రామకృష్ణ అనే నిందితుడు పూణెలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు పంజాబ్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

09:41 - July 30, 2016

మహబూబ్ నగర్ : గోపాల్ పేట మండలం తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 13 సంవత్సరాల బాలికపై గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శరీరం పూర్తిగా కాలిపోవటంతో బాలిక మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా బాలికను చంపిన తరువాతనే పెట్రోలు పోసి నిప్పు అంటించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేస్తుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. బాలికకు సంబంధి ఎటువంటి వివరాలు తెలియరాలేదు.

09:39 - July 30, 2016

రంగారెడ్డి : పరిగిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందంపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఈ కాల్పుల నుంచి ఎస్సై ఓబుల్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఊహించని పరిణామానికి షాక్ తిన్న పోలీసులు తేరుకుని ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మరో దొంగ పరారీలో వున్నాడు. మరో దుండగుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అదుపులోకి తీసుకున్న దుండగుడిని పీఎస్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నవీన్ కుమార్ పరిగిపోలీస్ స్టేషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి ఆయుధానలు  స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బ్యాంకు చోరీకి వచ్చారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బోల్తా పడిన లారీ..

హైదరాబాద్ : పంజాగుట్టలో నేటి తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అక్కడ తెల్లవారుజామున భారీ లోడుతో వెళుతున్న ఓ లారీ పంజాగుట్ట సమీపంలో ముందుగా వెళుతున్న ఓ బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహన రద్దీ అధికంగా ఉండే పంజాగుట్టలో రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

బాలికపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన దుండగులు..

మహబూబ నగర్ : గోపాల్ పేట మండలం తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

08:57 - July 30, 2016

విజయవాడ : విజయవాడలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్ల విస్తరణలో భాగంగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ విగ్రహాన్ని పోలీసులు తొలగించేందుకు ప్రయత్నించారు... వీరిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. ఈ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

08:55 - July 30, 2016

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలలో ప్రధానమైనది ఏపీకి 'ప్రత్యేక హోదా' అంశం. గత రెండు సంవత్సరాల నుండి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా ఆశలపై ఎన్డీయే ప్రభుత్వం దాదాపు నీళ్లు చల్లినట్లుగా భావించే పరిస్థితులు శుక్రవారం రాజ్యసభ సభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చల్లో తేలిపోయింది. విభజన చట్టంలో వున్న హామీలన్నీ నెరవేరుస్తామని చెపుతూనే..ప్రత్యేక హోదా బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంతో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్తామనీగానీ..ఇవ్వమని గానీ..క్లియర్ చేయకుండా కుంటిసాకులు చెబుతోంది ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా వస్తుందనీ..సమస్యలు పరిష్కారం అవుతుందనీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల ఆశల్ని ఆవిరి చేసింది..ఈ అంశంపై మిత్రపక్షమైన బీజేపీతో గత రెండు ఏళ్ల నుండి ఎంతో ఓపికతో వున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాజ్యసభలో జైట్లీ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమన్వయంతోనే పరిస్థితుల్ని చక్కబెట్టుకుందామన్న చంద్రబాబు ఓపికకు పరీక్ష పెట్టింది బీజేపీ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న ప్రత్యేక బిల్లుపై మళ్లీ చర్చ వుంటుందని...డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు..దీంతో ఈ చర్చతోనైనా ఏపీ 'ప్రత్యేక'ఆశలు నెరవేరతాయో లేదో వేచిచూడాల్సిందే..ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సాంబమూర్తి (బీజేపీ నేత ), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) సీహెచ్ బాబూరావు (సీపీఎం నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయిండి..సమగ్ర సమాచారాన్ని తెలుసుకోండి..

 

08:36 - July 30, 2016

రంగారెడ్డి : ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు..బాబుతో కలసి భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.. భర్త గుండెపోటుతో మృతి చెందడంతో మనస్తాపం చెంది..కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాక్‌ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న.. ఇండిగో కారులో ఈ కుటుంబపెద్ద మృతదేహం లభ్యమైంది. ఇతను ఆదిలాబాద్‌ గృహనిర్మాణశాఖ డీఈగా విధులు నిర్వహిస్తున్న డీఈ సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు... మృతులు సత్యనారాయణ (55)గా భార్య వీరా (50),స్వాతి(33),నీలిమ (25),శివరామకృష్ణ (22)గా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయిన వైనం అక్కడి వారిని కలచివేసింది. సత్యనారాయణ పిల్లలు ముగ్గురు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తిచేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రాంజీ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. సత్యనారాయణ గతకొంతకాలంగా అనారోగ్యంగా వుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆరోగ్యం విషమించటంతో మృతి చెందారు. దీంతో మనస్థాపం చెందిన కుటుంబ సభ్యులు సత్యనారాయణ మృతదేహాన్ని తీసుకుని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని ముగ్గురు పిల్లలతో సహా భార్య మీరా ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు.

08:14 - July 30, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మొన్న ఇద్దరిని అరెస్టు చేసిన అధికారులు.. నిన్న మరొకరిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు.. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లీక్‌ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ బంధువు హస్తం ఉండడంతో ఇప్పుడు ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

కేసీఆర్‌కు నివేదిక అందజేసిన డీజీపీ అనురాగ్‌శర్మ ..
ఎంసెట్‌ లీకేజీ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్యాంప్‌ ఆఫీస్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ నివేదిక సమర్పించారు. దాదాపు 130 మంది విద్యార్థులు లీకేజీ ద్వారా లబ్ధి పొందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు డీజీపీ.. సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మతో భేటీ అయి.. సీఐడీ దర్యాప్తుపై చర్చించారు.

రిమాండ్ లో ఇద్దరు నిందితులు..
ఈ కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించిన సీఐడీ అధికారులు.. తాజాగా... బ్రోకర్‌ షేక్‌ రమేష్‌ అలియాస్‌ రహీమ్‌ను హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో అరెస్ట్‌ చేశారు. రమేష్‌ 14 మంది విద్యార్థుల నుంచి కోటి 73 లక్షలు వసూలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రమేష్‌ దగ్గర నుంచి 37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో 15 లక్షలను స్నేహితుడి బ్యాంక్‌ ఖాతాలో ఉంచినట్లు సీఐడీ గుర్తించింది.
రాజగోపాల్‌పై పీడీ యాక్ట్‌ ?..
మరోవైపు ఈ కేసుతో సంబంధముందని భావిస్తున్న మరో ఇద్దరిని బళ్లారిలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పటికే అరెస్ట్‌ చేసిన రాజగోపాల్‌పై పీడీ యాక్ట్‌ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరులో నాలుగు లీకేజీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజగోపాల్‌కు శిక్షపడేంత వరకు జైలులోనే ఉండేలా అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితుడైన నల్లగొండ జిల్లాకు చెందిన తిరుమల్‌కు ఓ ఎమ్మెల్సీతో బంధుత్వం ఉండడంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఎంసెట్‌ లీకేజీపై హైకోర్టులో పిల్‌ దాఖలు..
లీకేజ్‌ వ్యవహారంపై సీఎంకు నివేదిక ఇచ్చిన సీఐడీ అధికారులు.. మరో మూడు రోజులు దర్యాప్తు చేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఎంసెట్‌ లీకేజీపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశముంది.

07:52 - July 30, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం నీళ్లు చల్లింది. సభలో అన్ని పక్షాలు మద్దతిచ్చినా.. పాలక బీజేపీ ఏపీకి హోదాపై ససేమిరా అంది. పైగా దీనికి ఆర్థిక సంఘం నిబంధనలను సాకుగా చూపింది. రెండు రోజుల పాటు సాగిన చర్చకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలే లేవని కుండబద్దలు కొట్టారు. దీనిపై కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అటు టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వ వాదనపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘానికీ, హోదా అంశానికి ముడిపెట్టడం ఏంటని సాక్షాత్తూ ఏపీ సీఎం కూడా ప్రశ్నించారు. ఎవరెన్ని రకాల వాదనలు వినిపించినా.. ఏపీకి ఇక ప్రత్యేక హోదా రాదన్న విషయం స్పష్టమైంది.

బైటపడిన బీజేపీ రంగు..
ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా అన్న నోళ్లు.. కుంటి సాకులు వల్లించాయి.. ఆదుకుంటాం.. మీరు మాకెంతో ప్రత్యేకం అన్న పెద్దలు.. పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే అన్న సామెతను గుర్తుచేశారు. అవును. అనుకున్నంతా అయింది. రెండేళ్ల పాటు ఏపీ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ప్రత్యేక హోదా... రాజ్యసభ సాక్షిగా హుళక్కి అయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గంటన్నర పాటు సుదీర్ఘంగా చేసిన ప్రసంగంలో హోదా మాటను దాటవేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులే మాకు శిరోధార్యం అంటూ ప్రత్యేక హోదాపై తేల్చి చెప్పేశారు.

ఆగస్టు 5 బిల్లుపై చర్చ??..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుతో మొదలైన ప్రత్యేక హోదా అంశం.. అటు తిరిగి ఇటు తిరిగి.. రాజ్యసభలో చర్చకు దారి తీసింది. రెండు రోజుల పాటు సుమారు ఐదున్నర గంటల పాటు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తొలుత బిల్లులో ఆర్థిక పరమైన అంశాలున్నాయని దీనిని ద్రవ్య బిల్లుగా పరిగణించి కేంద్రం దాటవేయాలని చూసింది. చివరకు డిప్యూటీ చైర్మన్‌ ఆగస్టు 5న బిల్లుపై ఓటింగ్‌ చేపడతామని హామీనివ్వడంతో చర్చకు దారితీసింది.

చర్చను ప్రారంభించిన ఎంపీ జైరాం రమేష్‌..
గురువారం స్వల్పకాలిక చర్చను కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ప్రారంభించగా... ఏపీ తరపున పలు ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో చేసిన హామీని అమలు చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు డిమాండ్‌ చేశారు. అలాగే విభజన చట్టంలోని హామీలపై వివరణ కోరారు.

బిల్లును సమర్థించి అన్ని పార్టీలు..
చర్చ సందర్భంగా సభలోని పలు రాజకీయ పక్షాలు ఏపీ ప్రత్యేక హోదాను సమర్థిస్తూ ప్రసంగించాయి. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన పార్టీల్లో సమాజ్‌ వాదీ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, అకాలీదళ్, బీజేడీ సమర్థించాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే సైతం ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఏపీకి చేసిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఉద్యమిస్తారని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చర్చ సందర్భోచితంగా ఉంటుందని ఎంపీ ఏచూరి తెలుగులో ప్రసంగించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.

సభ వాకౌట్‌ చేసిన కాంగ్రెస్...
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావన్నారు. రెండో రోజు సైతం మధ్యాహ్నం ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగింది. కాంగ్రెస్‌, టీడీపీ, శిరోమణి అకాలీదళ్‌ తదితర పక్షాల సభ్యులు మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం ఈచర్చకు బదులిచ్చిన అరుణ్‌జైట్లీ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని తేల్చేశారు. మిత్రపక్షం అధికారంలో ఉందని ఎక్కువ నిధులు కేటాయించలేమని తేల్చిచెప్పారు. కేవలం నిరసనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. దీంతో అటు కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

కేంద్ర వైఖరిని ఎండగట్టిన సీపీఎం..
మరోవైపు కేంద్ర వైఖరిని సభలో వామపక్షాలు ఎండగట్టాయి. సీపీఎం తరపున ఎంపీ సీతారాం ఏచూరి కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. అసలు కేంద్రం హోదా ఇచ్చే విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు ఆర్థిక మంత్రి చెబుతున్న అంశాలు పూర్తి సంక్లిష్టతలను బైట పెట్టేలా మాత్రమే ఉన్నాయని, అసలు హోదా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా అని నిలదీశారు.

ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చేయడం మండిపడ్డ విపక్షాలు..
మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చేయడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా జైట్లీ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పీకి ప్రత్యేక హోదా హుళక్కేనా?..
మొత్తమ్మీద ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కి కావడంతో.. దీని ప్రభావం.. కేంద్రంతో తెలుగుదేశం మిత్ర బంధంపైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరిగిలో కాల్పులు కలకలం..

రంగారెడ్డి : పరిగిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందంపై దొంగల ములీ కాల్పులకు పాల్పడ్డారు. కాల్పుల నుండి ఎస్ఐ తృటిలో తప్పించుకున్నారు. దొంగలను వెంబడించిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎస్ కు తరలించి విచారణ చేపట్టారు.

07:39 - July 30, 2016

విజయవాడ : దోస్త్‌మేరా దోస్త్‌ అని పాడుకున్న పాటలు విషాద గీతాలయ్యాయి. మిత్రుడు హ్యాండివ్వడంతో..స్నేహస్వరం మారింది. ప్రత్యేకహోదా ఇవ్వడం అసాధ్యం అని చెప్పడంతో బీజేపీపై టీడీపీ మండిపడుతోంది. రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటనపై ముఖ్యంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో అరుణ్‌జైట్లీ కామెంట్స్‌ బాబు అసంతృప్తి..
మిత్రుడైనంత మాత్రనా చట్టం మారదుగాకదా..ఇది ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కామెంట్‌. దీంతో తాము ఇన్నాళ్లు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయని మిత్రపక్షం టీడీపీ కోపగించుకుంటోంది. కేంద్రం వైఖరిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

జైట్లీ వ్యాఖ్యలు బాధ కలిగించాయి : చంద్రబాబు -
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన తనకెంతో బాధ కల్గించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీలో ప్రత్యేక హోదా కూడా భాగమైనప్పుడు ఆర్థిక సంఘంతో సంబంధమేమిటని బాబు ప్రశ్నించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిన నిధులేమి లేవని..అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే తమకూ ఇచ్చారని చంద్రబాబు అన్నారు.

సమస్యల పరిష్కారం కోసమే రెండేళ్లు ఓపికపట్టాం..
రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే రెండేళ్లు ఓపికపట్టామన్నారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని,.ప్రజలనుంచి ఎవరూ తప్పించుకోలేరని బాబు అ న్నారు. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టం తీసుకువచ్చి ఎన్నో హామీలిచ్చి ఇపుడు సాధ్యంకాదనండపై బాబు మండిపాడ్డారు.

సాయం చేస్తారని చెలిమి చేస్తే ..బీజేపీ హ్యాండిచ్చింది..
రాష్ట్రానికి సహాయం చేస్తారన్న ఆలోచనతోనే గత ఎన్నికల్లో బీజేపీతో చెలిమిచేశామని..కాని చివరికి బీజేపీ హ్యాండివ్వడంపై బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా 11 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా..కేంద్రం కరగడంలేదన్నారు. రెండేళ్ల పసిబిడ్డ ఏపీపై అందరికీ కనికరం వుండాలన్నారు చంద్రబాబు.

కాంగ్రెస్‌వల్లే రాష్ట్రానికి అన్యాయం..!
రాష్ట్ర విభజన జరిగిన విధానాన్ని తాను ఆరోజే వ్యతిరేకించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. కాంగ్రెస్‌పార్టీ కుట్రతోనే రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. రాజకీయ లబ్దికోసం రాష్ట్రవిభజన హడావుడిగా చేశారని విమర్శించారు.

రాజ్యసభలో సీపీఎం వైఖరి బాగుంది..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయొద్దని.. విభజనచట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని సీపీఎం సభ్యుడు సీతారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని బాబు సమర్ధించారు. ఏచూరి పెద్దమనిషిలా మాట్లాడారని బాబు అన్నారు.

బీజేపీ తీరుతో బాబు అసంతృప్తి ..
మొత్తానికి తమ బీజేపీ వైఖరిని  చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదపై విపక్షాలు మొదలు పెట్టిన మంటలు ఇపుడు టీడీపీ బీజేపీ దోస్తీకి చేటు తెచ్చేలా మారడంతో.. ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

 

07:24 - July 30, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఆశలు శాశ్వతంగా నీరుగారిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా ఇచ్చే వీల్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభ సాక్షిగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసింది. ఆర్థిక సంఘం సిఫారసులను సాకుగా చూపి.. ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించేసింది.

ప్రత్యేక హోదాపై ఎలాంటి స్పష్టత ఇవ్వని అరుణ్ జైట్లీ
ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజల ఆకాంక్ష ఇక నెరవేరే వీల్లేదని తేలిపోయింది. ఈ అంశంపై రెండురోజుల పాటు జరిగిన చర్చకు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం మధ్యాహ్నం సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. విభజన చట్టంలో పొందు పరిచిన ప్రతి అంశాన్నీ నెరవేరుస్తామని చెప్పిన జైట్లీ.. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డుగా ఉన్నాయని పునరుద్ఘాటించారు.

ఏపీ ప్రత్యేక హోదాకు అన్ని పార్టీల మద్దతు..
రెండు రోజుల పాటు రాజ్యసభలో సాగిన స్వల్పకాలిక చర్చలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఏపీ ప్రత్యేక హోదాను సమర్థించాయి. రెండో రోజు చర్చను కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ ప్రారంభించారు. కాంగ్రెస్‌ చేసిన విభజన సహేతుకమైనదేనని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం రమేష్ కృతజ్ఞతలు...
అనంతరం ఏపీకి ప్రత్యేక హోదాపై అన్ని పక్షాలు మద్దతు తెలిపినందుకు ఎంపీ సీఎం రమేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. అయితే వెంకయ్యనాయుడు గురువారం నాడు చెప్పిన సమాధానంపై తాము సంతృప్తిగా లేమని చెప్పారు.

విభజనకు జాతీయ పార్టీలే కారణం : సుజనా
ఈ అంశంపై మాట్లాడిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర విభజనకు జాతీయ పార్టీలే కారణమని ఆరోపించారు. చర్చ సందర్భంగా ఏపీని ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నారని, కానీ, ఆంధ్రప్రదేశ్‌తో ఇతర రాష్ట్రాలను పోల్చరాదని అన్నారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చర్చకు సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280లో వెల్లడించిన విధంగా మాత్రమే తాము పాలన సాగిస్తామని అన్నారు. వాజపేయి హయాంలో ఏర్పడిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌కు మాత్రమే ప్రత్యేక హోదాను కల్పించామని, అది కూడా ఎన్డీసీ సూచన మేరకే ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం పట్టుబడతాయని తెలిపారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కేనని స్పష్టం చేశారు.

ఏపీకి కేంద్రం అండగా వుంటుంది : జైట్లీ
ఎంతగానో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, విభజన తరువాత తెలంగాణలో ఉండిపోయిందని, హైదరాబాద్ నగర ఆదాయం తెలంగాణకు రావడంతోనే ఏపీ ఆర్థిక లోటును ఎదుర్కొందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఎన్నెన్ని నెరవేర్చిందీ వివరించిన జైట్లీ.. విశాఖ రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టుల అంశాలనూ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిలదొక్కుకునేంత వరకూ కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయమై ఎన్నో అంశాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. కేవలం నిరసనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు.

జైట్లీ సమాధానంతో సభలో గందరగోళం..
జైట్లీ సమాధానంతో రాజ్యసభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. జైట్లీ సమాధానంపై రాజ్యసభలోని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి చెందారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

జైట్లీ సమాధానంతో ఏచూరి అసంతృప్తి..
జైట్లీ సమాధానం పట్ల సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. జైట్లీ సమాధానంతో ప్రజల్లో గందరగోళం మరింతగా పెరిగిందని, ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు. లేకుంటే ఈ అంశం నిరంతరం రగులుతుంటుందన్నారు. హోదా పైన స్పష్టత ఇవ్వకుంటే ఏపీ ప్రజలు తిరగబడే అవకాశముందని సూచించారు.

అన్నింటికి జైట్లీ సమాధానం ఇచ్చారు: వెంకయ్య
విపక్షాల నిరసనల నేపథ్యంలో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రభుత్వం పారిపోతోందనడం భావ్యం కాదన్నారు. ఏచూరి అడిగిన ప్రతి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నుంచి స‌మాధానం వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.

బిల్లుపై ఆగస్టు 5 చర్చ?..
అనంతరం డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ చర్చను ముగించారు. అయితే.. ఇదే అంశంపై కేవీపీ ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు మళ్లీ ఆగస్టు 5న చర్చకు రానుంది. ఆరోజు బిల్లుపై కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్‌కు పట్టుబట్టే అవకాశం ఉంది.

06:46 - July 30, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్‌-2 రద్దైంది. సీఐడీ నివేదిక అనంతరం ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష రద్దు చేయకుండా ఎలా వ్యవహరించాలనే అంశంపై ఉన్నతాధికారులు, న్యాయ కోవిదులతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్‌.. పేపర్‌ లీక్‌ అయిన ప్రతి సందర్భంలోనూ పరీక్షలు రద్దు చేశారని అధికారులు చెప్పడంతో ఎంసెట్‌-2ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించనుంది.

ఎంసెట్‌-2 రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..
ఎంసెట్‌-2ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఐడీ నివేదికపై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ చర్చించారు. పేపర్‌ లీక్‌ అయినప్పుడు దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలపై చర్చించారు. అయితే అన్ని అంశాలను పరిశీలించిన కేసీఆర్‌.. ఎంసెట్‌-2 రద్దు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80 సార్లు పేపర్లు లీక్‌..
ప్రశ్నాపత్రం లీకైన తీరు.. అందుకు బాధ్యులైన నేరస్తుల వివరాలపై కేసీఆర్‌ ఆరా తీశారు. మరోవైపు పోలీసు నివేదిక ఆధారంగా లీక్‌ ద్వారా ర్యాంకులు పొందిన విద్యార్థులను అనర్హులుగా ప్రకటించి.. అడ్మిషన్లు చేపడితే ఎలా వుంటుందనే అంశంపై సమావేశంలో చర్చించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించాల్సి వస్తే.. చేపట్టాల్సిన కార్యాచరణను కూడా పరిశీలించారు. నాలుగు గంటల పాటు ఉన్నతాధికారులు, న్యాయకోవిదులతో కేసీఆర్‌ చర్చించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80 సార్లు పేపర్లు లీక్‌ అయ్యాయని.. కాగా అన్నిసార్లు పరీక్షను రద్దు చేశారని సీఎం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దీంతో సీఎం ఎంసెట్‌-2ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థులపై భారం పడకుండా చూసే యత్నం..
వరుస ఎంట్రన్స్‌లతో వైద్య విద్యార్థులు ఇప్పటికే అలసిపోయి.. విసిగిపోయారని.. ఇలాంటి పరిస్థితుల్లో లీక్‌ జరగడం బాధాకరమని కేసీఆర్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థులపై ఎలాంటి భారం పడకుండా.. పరీక్ష ఫీజు లేకుండా పాత రిజిస్ట్రేషన్‌ ప్రకారం పరీక్షకు అనుమతించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో విద్యార్ధులకు ఉచిత ప్రయాణం కల్పించే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
వేలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేసే విధంగా ఎంసెట్‌ లీకేజీకి కారణమైన వారు ఎంతటివారయినా అత్యంత కఠినంగా శిక్షించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు పిల్లలను అక్రమ మార్గంలో చదివించేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేయాలని సమావేశానికి హాజరైన అధికారులు అభిప్రాయపడ్డారు.

సోమవారం అధికారిక ప్రకటన..
చివరకు సీఐడీ నివేదికపై సమగ్ర చర్చ జరిపిన అనంతరం ఎంసెట్‌-2 రద్దు వైపు మొగ్గు కేసీఆర్‌ చూపారు. దీనిని ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించనుంది. 

రైలు కింద పడి కుటుంబ ఆత్మహత్య..

రంగారెడ్డి : ఘట్ కేసర్ మండలం ఔషాపూర్ రైల్వే ట్రాక్ పై నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.అనంతం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Don't Miss