Activities calendar

31 July 2016

దళితులను చావబాదిన అగ్రవర్ణాలు

తిరుపతి : వెదురుకుప్పం మండలం పచ్చికాపలంలో ఉద్రిక్తత నెలకొంది. దళితులను అగ్రవర్ణాలు చితకాబాదారు. పది మంది దళితులకు గాయాలయ్యాయి. 

 

మోడీకి ఎపి కేంద్రమంత్రులు, ఎంపీలు లేఖ

విజయవాడ : ప్రధాని మోడీకి ఎపి కేంద్రమంత్రులు, ఎంపీలు లేఖ రాశారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాశారు. 

సింగారం గ్రామస్తులతో మంత్రి హరీశ్ రావు చర్చలు

మెదక్ : జిల్లాలోని సింగారం గ్రామస్తులతో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. మల్లన్నసాగర్‌కు భూములివ్వాలని విజ్ఞప్తి చేశారు మల్లన్న సాగర్‌కు భూములిచ్చేందుకు ముంపు గ్రామాల ప్రజలు అంగీకరిస్తున్నారని తెలిపారు. 

 

22:13 - July 31, 2016

విజయవాడ : అప్పటి వరకూ ఎంతో హుషారుగా స్నేహితులతో ఆడిపాడిన యువకులు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. సరదాగా ఈత కొడుదామని వెళ్లిన వాళ్లని నీళ్లు మింగేశాయి. తెలుగు రాష్ర్టాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతిచెందారు. వారి మృతితో కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది.  
బీచ్‌లో విషాదం 
కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందారు. మృతులను అక్షిత, ప్రవీణ్‌గా గుర్తించారు. విజయవాడకు చెందిన వీరు మిత్రులతో కలిసి గుట్లవల్లేరు మండలం కొండలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి బీచ్‌కి వెళ్లారు. స్నానం చేద్దామని బీచ్‌లోకి దిగారు. వీరిలో అక్షిత, ప్రవీణ్‌లు సముద్రం లోతుగా ఉన్నచోటకి వెళ్లారు.. ఒక్కసారిగా అలలు ఉధృతి పెరగడంతో ఇద్దరూ అందులో మునిగి చనిపోయారు. దీంతో బీచ్ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. 
ఈతకెళ్లి ముగ్గురు మృతి
కడప జిల్లా సిద్ధవటం మండలం మాచుపల్లె వద్ద పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు సోహైల్‌, కిరణ్‌కుమార్‌, ఆకాష్‌ చనిపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సరదాగా ఐదుగురు స్నేహితులు ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ఈ దశలో వీరి అరుపులు విన్న సమీప పొలాల్లోని రైతులు ఇద్దర్నీ కాపాడగలిగారు. ముగ్గురు మాత్రం నీటిలో మునిగి చనిపోయారు. మృతులు కడప నగరానికి చెందిన వారు. 
ధర్మసాగర్ రిజర్వాయర్ లో ఇద్దరు గల్లంతు
వరంగల్‌ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పొలుమూరి సృజన్, ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తోన్న మాచర్ల సునీల్ లు గల్లంతైన వారిగా గుర్తించారు. వీకెండ్‌లో సరదాగా ఈత కొడుదామని వెళ్లిన వాళ్లను వరద ఉధృతి ముంచేయడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 

 

22:08 - July 31, 2016

హైదరాబాద్ : దేశంలో మోడీక్రసీ నడుస్తోందని జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌ విమర్శించారు. భిన్న సంస్కృతులు గల ప్రజాస్వామ్య దేశంలో.. ఒకరి ఆలోచనలు అందరిపై రుద్దకూడదని కన్హయ్య అభిప్రాయపడ్డారు. దేశంలో మహిళలు, రైతులు, దళితుల హక్కుల గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.  స్వాభిమానం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 
అఖిల భారత థీమాటిక్ సోషల్ ఫోరం 
మరో ప్రపంచం కావాలి.. అందరూ కలిస్తే అది సాధ్యమే అనే నినాదంతో అఖిల భారత థీమాటిక్ సోషల్ ఫోరం సమావేశాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభ వేడుకల్లో విద్యార్థి ఉద్యమాలు-ప్రజాస్వామ్య హక్కులు అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌, అలాహాబాద్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేత రిచాసింగ్‌, ఉస్మానియా విద్యార్థి నేత శరత్‌ నలిగంటి, ఇఫ్లూ విద్యార్థి నేత మోహన్‌దరావత్‌ పాల్గొన్నారు. మోదీ సర్కార్‌ విధానాలు పేదలను మరింత నిరుపేదలుగా, సంపన్న వర్గాలు మరింత ఉన్నతంగా ఎదిగేలా  ఉన్నాయని కన్హయ్య విమర్శించారు. 
దళితులు, మైనార్టీలపై హిందూత్వ శక్తులు దాడులు
హిందూత్వ శక్తులు బీఫ్ అంశాన్ని తెరపైకి తెచ్చి దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడు తున్నాయని, భిన్న సంస్కృతులు కలిగిన దేశంలో ఆచారాలు సంప్రదాయాలు వేర్వేరుగా ఎందుకున్నాయని ప్రశ్నించారు. దేశంలో పెరిగిపోయిన మనువాదం, మతోన్మాదం, పెట్టుబడి దారులు, పేదరికంపై  ఉద్యమ సంస్థలు పోరాటం చేయాలని కన్హయ్య కుమార్ పిలుపునిచ్చారు. నియంతృత్వ ధోరణులు అవలంభిస్తున్న మోడీ సర్కార్‌ పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ ఎఫ్‌డీఐలు తెస్తుందన్నారు. దీంతో కోట్లాది మంది రోడ్డున పడుతున్నారని, వారి హక్కుల కోసం అందరూ ఏకం కావాలన్నారు. 
మనువాద జాతీయవాదాన్ని పారదోలాలి..
దేశంలోని మనువాద జాతీయవాదాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని కన్హయ్యకుమార్‌ అన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ప్రతిఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

22:03 - July 31, 2016

జీవితం మొత్తంలో అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి... అయితే డిటెక్టివ్ కి ఎదురయ్యేవి.. అన్ని షాక్ గురయ్యే సంఘటనలే. మరి డిటెక్టివ్ షాడో షాక్ గురయ్యే సంఘటన ఏమై ఉంటుంది...? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

21:57 - July 31, 2016

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులు, స్పీకర్‌ పాత్ర అనే అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జీవన్‌ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని ఎలక్షన్‌ కమిషన్‌కు అప్పగించాలని జైపాల్‌రెడ్డి సూచించారు. 

 

21:52 - July 31, 2016

పాప్ సింగర్ స్మితతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా స్మిత పలు పాటలు పాడి వినిపించారు. కిలికి భాష పాట పాడారు. తన కెరీర్ గురించి వివరించింది. తన అనుభవాలను తెలిపింది. సింగర్ నోయెల్, మళ్లీశ్వరీ సినిమా డైరెక్టర్ విజయభాస్కర్ ఫ్రాంక్ కాల్ చేసి.. ఆటపట్టించారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే.. 'ఫస్ట్ ఆల్బమ్ హిందీలో చేశాము. అప్పట్లో మార్కెట్ లేదు. నాది సినిమా బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కాదు.. మా పేరెంట్స్ కు బిజెనెస్ బ్యాగ్ గ్రౌండ్ ఉంది. మా మధర్ ది మంచి గొంతు. ఏన్నేండ్లయినా... నాకు లిరిక్స్ గుర్తుండిపోతాయి. హీరోయిన్ గా ట్రై చేయలేదు. భయపడి సినిమాలు చేయలేదు. రంగంలోకి దిగాకే అన్నీ నేర్చుకున్నాను' అని తెలిపింది. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

   

21:47 - July 31, 2016

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 1.42 పైసలు, లీటర్ డీజీల్ పై 2.01 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఈ ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

21:17 - July 31, 2016

విశాఖ : దేవుడి మాన్యానికి రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లు లేని హక్కుదారులు పుట్టుకొచ్చారు. దేవుడి పేరుతో ఉన్న భూములపై కూడా నష్టపరిహారం నొక్కేయాలని పావులు కదుపుతున్నారు  కొందరు నేతలు.  అక్రమార్కులకు వంత పాడేలా అధికారులు సైతం అలాగే వ్యవహరిస్తూ.. దేవుడి భూమికి ఎసరు పెడుతున్నారు. దీంతో దేవుడి మాన్యాన్ని కాపాడాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 
దేవుడి మాన్యానికి శఠగోపం
విశాఖపట్నం జిల్లాలో దేవుడి మాన్యాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కొన్ని చోట్ల దేవుని మాన్యాలకు సైతం నష్టపరిహారం కొట్టేయాలని కొందరు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 
రాజయ్యపేటలో భూ సేకరణ 
వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం రాజయ్యపేటలో భూ సేకరణ చేస్తోంది. నిర్వాసితులకు ఎకరానికి 18 లక్షలు చెల్లించాలని నిర్ణియంచింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎలాగైనా నష్టపరిహారాన్ని కొట్టేయాలన్న దురుద్దేశంతో కొందరు అక్రమార్కులు దేవుడి మాన్యాలకు హక్కు పత్రాలు సృష్టించి పరిహారం దక్కించుకునే ప్రయత్నం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రోద్బలంతో... సరోజనమ్మ మనవడినంటూ నెల్లూరు నుంచి ఓ వ్యక్తి కూడా ఊడిపడ్డాడు. జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిధిలో సముద్రతీరానికి ఆనుకుని సర్వేనెం 288/1లో 19 ఎకరాల జిరాయితీ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం చెరువు సరోజనమ్మ పేరుతో నమోదై ఉంది. 80 ఏళ్ల క్రితమే ఆ భూమిని సరోజనమ్మ గ్రామంలోని రామాలయానికి దానంగా ఇచ్చేశారు. 1990లో గ్రామానికి చెందిన పూజారి పిక్కి అప్పన్నను ఆలయ ధర్మకర్తగా నియమించి..అప్పటి నుంచి  లీజు వసూలు చేస్తూ పండగలు నిర్వహిస్తూ వస్తున్నారు. 
భూములను దేవుడి మాన్యంగా చూపిస్తూ 
2000 నుంచి 2015 వరకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పిక్కి రాంబాబు, దైలపల్లి ముత్యాలు, పిక్కి కాశీరావు తదితరులు ఈ భూములను సాగుచేసి ఏడాదికి  1.40 లక్షల రూపాయలు కౌలుగా ఇచ్చేవారు. 30 ఏళ్ల క్రితమే అధికారులు ఆ భూములను దేవుడి మాన్యంగా చూపిస్తూ రాములవారి పేరిట పాసు పుస్తకాలు జారీ చేశారు. ధర్మకర్త పిక్కి అప్పన్న రాముల వారి పేరిట  ప్రభుత్వానికి భూమి పన్ను కూడా చెల్లించారు. ఈ ఆధారాలన్నీ  గ్రామస్తుల వద్ద ఉన్నాయి. భూములు లీజుకు తీసుకున్న వారి వద్ద ఆ లీజు ఒప్పంద పత్రాలు కూడా ఉన్నాయి. రికార్డుల్లో సరోజనమ్మ పేరున ఉన్న ఈ భూములకు సంబంధించిన వారసులెవరూ ఇన్నేళ్లుగా గ్రామానికి రాలేదు. అటువంటి వారెవరూ లేరని కూడా స్థానికులు చెబుతున్నారు.
రికార్డులు తారుమారు..?
అన్ని ఆధారాలూ ఉన్నా ఇందులో జోక్యం చేసుకుంటున్న రాజకీయ నాయకుడు మాత్రం...ఆ భూములకు అవసరమైతే రికార్డులు కూడా తారుమారు చేయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సరోజనమ్మ వారసుడిగా చెప్పుకుంటున్న వ్యక్తికి  భూములను కట్టబెట్టి.. పరిహారం కొట్టేయాలన్నదే సదరు నేత వ్యూహంగా చెబుతున్నారు.   
దేవుడి మాన్యాలను కాపాడాలి : స్థానికులు 
పరిహారం కోసం దేవుడి భూములను కొట్టేసే కుట్రను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేవుడి భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలంటూ అందోలనకు దిగారు. కాగా, దేవుని  మాన్యాలను కాపాడతామని స్థానిక ఎమ్మెల్యే వంగలపుడి అనిత గ్రామస్థులకు హామీ ఇచ్చారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని స్థానిక ఎమ్మార్వో తెలిపారు. దేవుడి మాన్యాలను కొట్టేయాలని చూడటం దారుణమని, దేవుడి మాన్యాలను కాపాడాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని గ్రామస్థులు డియాండ్‌ చేస్తున్నారు. 

21:00 - July 31, 2016

గుంటూరు : ఆర్ధిక సంస్కరణల అమలు ఫలితంగా అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ఎమ్మెల్సీ శర్మ, ప్రోఫెసర్ చలం అన్నారు. గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, కేవీఆర్‌ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 ఏళ్ళ ఆర్ధిక సంస్కరణల అమలు, ప్రభావాలు, అమలుపై సెమినార్ నిర్వహించారు. ఆర్ధిక సంస్కరణల 25 ఏళ్ళ అమలు సాంస్కృతిక, రాజకీయ, తాత్విక, ఆర్ధిక రంగాలను అత్యంత వేగంగా దిగజార్చాయని వారు అభిప్రాయపడ్డారు. పలువురు మేధావులు సెమినార్‌లో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

 

20:52 - July 31, 2016

గుంటూరు : విప్లవోద్యమ చరిత్రలో గుంటూరు జిల్లాది క్రియాశీలక పాత్ర అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గుంటూరు సిపిఎం కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సమావేశమందిరాన్ని ఆ రాష్ట్ర ఆహ్వాన కమిటీ సభ్యులు సింహాద్రి శివారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యదర్శి మధు మాట్లాడుతూ..  ఎంతో మంది ఈ గడ్డపై త్యాగాలకు పాల్పడ్డారని అన్నారు. 25 ఏళ్ళుగా భారతదేశంలో అమలవుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటలపై దృష్టి పెట్టడం కారణంగానే కమ్యూనిస్టులు ఓట్లు, సీట్లపై దృష్టి పెట్టలేకపోయారన్నారు. 

 

20:43 - July 31, 2016

చిత్తూరు : పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి దగ్గర నుంచి 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 3 వాహనాలను సీజ్‌ చేశారు. కొంతమంది యువకులు ఉన్నత చదువులు చదివి.. అధిక ఆదాయం కోసం అంతరాష్ర్ట దొంగలుగా తయారవుతున్నారని జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ తెలిపారు. తిరుమల శేషాచల అడవుల్లో ఉన్న సంపదను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 

20:36 - July 31, 2016

కృష్ణా : జిల్లాలోని మంగినపూడి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందారు. మృతులను అక్షిత, ప్రవీణ్‌లుగా గుర్తించారు. విజయవాడకు చెందిన వీరు మిత్రులతో కలిసి గుట్లవల్లేరు మండలం కొండలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి బీచ్‌కి వెళ్లారు. స్నానం చేద్దామని మిత్రులంతా బీచ్‌లోకి దిగారు. వారిలో అక్షిత, ప్రవీణ్‌లు సముద్రం లోతుగా ఉన్నచోటకి వెళ్లారు.. ఒక్కసారిగా అలలు ఉదృతిగా రావడంతో ఇద్దరూ అందులో మునిగి చనిపోయారు. దీంతో బీచ్ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారి మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. 

 

20:32 - July 31, 2016

విజయవాడ : ఏపీకీ ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయడం లేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం, చంద్రబాబు ఇద్దరూ ఒక్కటేనని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా రాకుండా ప్రజలను మోసం చేసిన పాపంలో చంద్రబాబు కూడా భాగస్వామే అని అంబటి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సాధనకు వచ్చే నెల 2న నిర్వహించనున్న బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని అంబటి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైసీపీ అధినేత జగన్ ప్రజలకు వివరించారని, ప్రత్యేక హోదా డిమాండ్‌కు ఉద్యమరూపు ఇచ్చారని అంబటి చెప్పారు.  

 

పోలీస్ అధికారుల శైలిపై డీజీపీ అనురాగ్ శర్మ సమీక్ష

హైదరాబాద్ : పోలీస్ అధికారుల శైలిపై డీజీపీ అనురాగ్ శర్మ సమీక్ష చేశారు. అన్ని శాఖల ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. 

19:10 - July 31, 2016

ఢిల్లీ : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడిఉన్నామని.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఢిల్లీలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ధర్నాకు ఏచూరి మద్దతు ప్రకటించారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు అమలుకావడంలేదని ఆరోపించారు. 2014 ఎన్నికలకుముందు ఇచ్చిన హామీల్ని బీజేపీ అమలు చేయడంలేదని విమర్శించారు. 

19:00 - July 31, 2016

కరీంనగర్ : ఎంసెట్-2 లీకేజీ నిందుతులు ఏ స్థాయిలో ఉన్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని... కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంసెట్-2 రద్దు చేయాలనే ఆలోచనలో సర్కారు ఉందని ప్రకటించారు. హన్మకొండ వడ్డేపల్లిలో హరితహారంలో ఎంపీ వినోద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి మొక్కలు నాటారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఎంపీ వినోద్ మండిపడ్డారు. ప్రతిభ ఉన్న విద్యార్ధులు పరీక్షలు ఎప్పుడు పెట్టినా పాసవుతారని చెప్పారు. లీకేజీ దురదృష్టకర సంఘటనగా చెప్పుకొచ్చారు.

 

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 1.42 పైసలు, లీటర్ డీజీల్ పై 2.01 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు ఈ ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

 

ధర్మసాగర్ రిజర్వాయర్ లో యువకులు గల్లంతు

వరంగల్ : ధర్మసాగర్ రిజర్వాయర్ లో యువకులు గల్లంతు అయ్యారు. ఈతకు వెళ్లి సునీల్ (24), సుజన్(25) అనే యువకులు గల్లంతైనట్లు గుర్తించారు. యువకుల కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. 

సింగారం గ్రామ ప్రజలతో మంత్రి హరీశ్ రావు చర్చలు

మెదక్ : గజ్వేల్ లో మల్లన్నసాగర్ ముంపు గ్రామం సింగారం ప్రజలతో మంత్రి హరీశ్ రావు చర్చలు జరిపారు. 

 

18:11 - July 31, 2016

కృష్ణా : విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ విలేకరిపై ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ప్రజాశక్తి విలేకరి సురేష్‌ సెల్‌ఫోన్‌ లాక్కొని డేటా డిలీట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఫోటోలు తీశాడంటూ సెల్‌ఫోన్‌ లాక్కుని దౌర్జాన్యానికి దిగారు.  దీంతో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. 

 

18:06 - July 31, 2016

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో ప్రవేశపెడుతున్న బిల్లులతో పాటు పలు ప్రజాసమస్యలపై చర్చించారు. ఎన్నో ఏళ్లుగా భారతో నివాసం ఉంటున్నవారి విషయంలో మత పరంగా కాకుండా లౌకిక విధానంలో పౌరసత్వం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూర్‌ సమావేశంలో నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాందోళనలపై చర్చించారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్‌ 2న కార్మిక సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని చెప్పారు. పలు విషయాలపై మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:50 - July 31, 2016

విజయవాడ : ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన దర్శకత్వ సేవలందించనున్నారు. గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలపై ఓ షాట్ ఫిలిం రూపొందించిన ఆయన మరోమారు కృష్ణా పుష్కరాలకు కూడా తన సహాయం అందించనున్నారు. తొలిసారిగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వేడుకలు కావడంతో చరిత్రలో మిగిలిపోయేలా డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
ఏర్పాట్లు ముమ్మరం 
కృష్ణా పుష్కారాలకు సమయం దగ్గరపడుతుండటంతో..ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది ఏపీ సర్కార్. అయితే నవ్యాంధ్ర ఏర్పడిన అనంతరం..రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా.. జరుగుతున్న వేడుకలు కావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా కృష్ణాపుష్కరాలు..భవిష్యత్తులో గుర్తుండిపోయేలా..డాక్యుమెంటరీ రూపొందించేందుకు సర్కార్ రెడి అయ్యింది. ఆ బాధ్యతలను ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించింది.  
పుష్కర వేడుకలు
పుష్కరవేడుకలలో హారతి, హారతి వేదిక, దుర్గా ఘాట్ అలంకరణ, ప్రకాశం బ్యారేజ్ అలంకరణ, అక్కడ కాల్చాల్సిన బాణాసంచా తదితర అంశాలపై ఇప్పటికే..బొయపాటి ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. కాగా గతేడాది గోదావరి పుష్కరాల్లో బోయపాటి దర్శకత్వంలో తీసిన షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకర్షించింది. అయితే అదే రీతిలో ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు కూడా షార్ట్‌ఫిలింను సిద్ధం చేసేందుకు రెడి అవుతున్నారు బోయపాటి.
కృష్ణమ్మ హారతికి దృశ్యరూపం 
ఇదిలా ఉంటే..గతేడాది గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు బోయపాటి దర్శకత్వ ఏర్పాట్లు కూడా కారణమేననే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయినప్పటకీ వాటన్నింటినీ పక్కన పెట్టిన..చంద్రబాబు..కృష్ణమ్మ హారతికి దృశ్యరూపం ఇచ్చే బాధ్యతలను బోయపాటికే అప్పగించారు. మరి బోయపాటి డైరెక్షన్లో బాబు యాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

 

17:43 - July 31, 2016

విశాఖ : మన్యంలో మరోసారి అలజడి మొదలైంది. మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలతో.. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల జాడలు ఒక్కసారిగా పెరిగాయి. మరోవైపు ఏవోబీలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఏక్షణంలో ఏంజరుగుతుందోననే ఆందోళన విశాఖమన్యంలో నెలకొంది.
మావోయిస్టుల సంస్మరణ సభలు
మన్యంలో వాతావరణం వేడెక్కింది.  మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలతో... ఏజెన్సీలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకోవాలనే బ్యానర్లు.. మన్యం అంతటా కనిపిస్తున్నాయి.  విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల,  పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని పలు గ్రామాల్లో స్థూపాలకు కొత్తగా రంగులు వేశారు. ఈనెల 28 నుంచి మొదలైన వారోత్సవాలు ఆగష్టు3 వరకు జరగనున్నాయి.ఈ సంస్మసరణ వారోత్సవాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని మావోయిస్టులు అంటున్నారు. 
వర్షాలతో మావోయిస్టులకు అనుకూల పరిస్థితులు
వర్షాలు జోరుగా పడుతుండంతో... ఏవోబీలో పరిస్థితులు మావోయిస్టులకు
అనుకూలంగా మారాయి. మన్యంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పోలీసుల కూంబింగ్‌కు ఆటంకంగా మారింది. ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం, బుంగాపుట్టు, గర్రాం తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. 
మావోయిస్టుల వారోత్సవాలపై పోలీసుల నిఘా
అటు పోలీసులు కూడా మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘావేశారు. వారోత్సవాల సందర్భంగా అగ్రనేతలు వస్తారన్న ప్రచారంతో... పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టారు.  కొయ్యూరు మండలంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.  ఇటీవల మర్రిపాకల, పాలసముద్రం గ్రామాల మధ్య జరిగిన  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు  మావోయిస్టులు మృతి చెందడంతో...  ప్రతీకార దాడులు జరుగుతాయేమోననే ఆందోళన నెలకొంది.  
రివార్డుల పోస్టర్లతో పోలీసుల ప్రచారం 
వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులకు దీటుగా పోలీసులు కూడా ప్రచారం మొదలు పెట్టారు. మావోయిస్టు నేతల ఫొటోలతో వారిపై ఉన్న రివార్డుల వివరాలతో పోస్టర్లను గ్రామాల్లో అంటించారు. మన్యంలోని శివారు ప్రాంతాలకు బస్సులను కూడా నిలిపేశారు ఆర్టీసీ అధికారులు. ఏజెన్సీలో పరిస్థితిపై ఏపీ డీజీపీ సాంబశివరావు సమీక్షించారు. ఓవైపు మావోయిస్టుల హల్‌చల్‌..మరోవైపు పోలీసుల కూంబింగ్‌ హడావుడితో విశాఖ మన్యంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. 

17:34 - July 31, 2016

హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్ రూల్స్ ను కఠినతరం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. రూల్స్ అతిక్రమిస్తే జైలుకి పంపించేందుకు ఏ మాత్రం వెనకాడబోమని  హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ట్రాఫిక్ రూల్స్ విషయంలో కాస్త చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు ఇక నుండి ఉపేక్షించబోమని చెబుతున్నారు.
రూల్స్ అతిక్రమణ.. ప్రమాదాలు 
నగరంలో వాహనదారులు రూల్స్ ను అతిక్రమిస్తుండడం తరచూ ప్రమాదాల బారిన పడుతుండడంతో.. రూల్స్ ను మరింత కఠినంగా మారుస్తామంటున్నారు పోలీసులు. ఇటీవల మైనర్లు ఎక్కువగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడటంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. దీంతో ఇకపై ఆధార్ నెంబర్ ను వాహన రిజస్ట్రేషన్ నెంబరుకు ఎటాచ్ చేసి చలాన్ పంపించేందుకు సిద్ధమవుతున్నారు. 
వాహనదారుడు.. ఆధార్ నెంబర్ ఎన్ రోల్ 
ఇకపై ప్రతివాహనదారుడు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ను ఎన్ రోల్ చేయాలన్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు హైదరబాద్‌ ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు తప్పుడు ఆధార్ వివరాలు ఇస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఖాకీలు అంటున్నారు  
మైనర్లపైనా కఠిన చర్యలు 
మైనర్ల విషయంలో కూడా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మైనర్లు వాహనం నడిపితే.. మొదటిసారి మందలించి వదిలేస్తామని రెండోసారి పట్టుబడితే.. జైలుకు పంపించేందుకు వెనకాడబోమని ట్రాఫిక్ పోలీసులు తేల్చి చెబుతున్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన ఓనర్లను కూడా వదిలిపెట్టమని స్పష్టం చేస్తున్నారు.   
డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా నడిపితే జైలుకే 
వాహనాలకు సంబంధించిన హెడ్ లైట్లు, ఇండికేటర్స్, డేంజర్ లైట్, హారన్ వంటివి లేకపోయినా..చర్యలు తప్పవంటున్నారు. రూల్స్ పాటించని వారిపట్ల కూడా స్పెషల్ డ్రైవ్ లు చేపట్టామని 350 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా నడిపితే జైళ్లకి పంపిస్తామంటున్నారు. 

సమానత్వపు హక్కును కాలరాస్తున్న ప్రభుత్వాలు : ఏచూరీ

ఢిల్లీ : రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కును ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. 2014 లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు పరచడం లేదని ఆరోపించారు. ఎంఆర్ పీఎస్ తో కలిసి ఎస్సీ వర్గీకరణకు సీపీఎం పోరాడుతుందన్నారు. 

పెన్నానదిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

కడప : సిద్ధపటం మండలం ఖాతర్ బంగ్లాలో విషాదం నెలకొంది. పెన్నానదిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతులు కడప నగరానికి చెందిన వారుగా గుర్తించారు. 

ముగిసిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిసాయి. ఢిల్లీలో రెండు రోజులపాటు సమావేశాలు జరిగాయి. తెలంగాణలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వ దుందుడుకు చర్యలను పొలిట్ బ్యూర్ ఖండించింది. సెప్టెంబర్ 2న కార్మిక సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. 

ముగిసిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు

ఢిల్లీ : సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిసాయి. ఢిల్లీలో రెండు రోజులపాటు సమావేశాలు జరిగాయి. తెలంగాణలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వ దుందుడుకు చర్యలను పొలిట్ బ్యూర్ ఖండించింది. సెప్టెంబర్ 2న కార్మిక సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. 

హోదాపై టీడీపీ కేంద్రాన్ని ఒప్పించాలన్న బివి.రాఘవులు

ఢిల్లీ : ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని టీడీపీ ఒప్పించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. బీజేపీ, టీడీపీలు ఏపీకి అన్యాయం చేస్తున్నాయి. త్వరలో నిర్ధిష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వలసదారుల నేపథ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్లమెంట్ లో సిటిజన్ షిప్ బిల్లుపై తమ వైఖరిని తెలియచేస్తామని తెలిపారు. కార్మికవర్గం పట్ల కేంద్రం చిన్న చూపు మానుకోవాలన్నారు. 

16:47 - July 31, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీక్‌ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎంసెట్‌-2 వ్యవహారంపై ప్రభుత్వంపై పత్రిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలపై పల్లా  విరుచుకుపడ్డారు. 

 

16:43 - July 31, 2016

హైదరాబాద్ : తెలంగాణను ఎండబెట్టాలన్న కుట్రతోనే ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై రాద్ధాం తాలు చేస్తున్నాయని టీఆర్ ఎస్ నేత కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. మల్లన్నసాగర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ నిర్మాణానికి సహకరించకుంటే.. ప్రజలు తగిన బుద్ధిచెబుతారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌కింద ఇప్పటికీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేని నాయకులు .. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్టున్నారని మండిపడ్డారు. 

 

టాస్క్ ఫోర్స్ పోలీసుల ఓవర్ యాక్షన్

విజయవాడ : టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రజాశక్తి విలేకరి సురేష్  సెల్ ఫోన్ లాక్కొని డేటా డిలీట్ చేశారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఫొటోలు తీయొద్దంటూ పోలీసులు విలేకరి ఫోన్ లాక్కొన్నారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. 

ప్రత్యేకహోదా సాధించి తీరుతాం : మురళీమోహన్

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేకహోదా సాధించి తీరుతామని టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెలిపారు. ఈమేరకు మురళీమోహన్  మీడియాతో మాట్లాడారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన లేదన్నారు. మరోసారి మోడీని కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని అడుగుతామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరతామని చెప్పారు. 

 

'హోదా'పై కేంద్రం వైఖరిని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం..తదితర విషయాలపై పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని, ఏపీ రెండు సంవత్సరాలుగా కష్టాలతో ఉందన్నారు. విభజన వల్ల అన్యాయమే కాక అవమానం జరిగిందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరడం జరుగుతోందన్నారు. 

అరుణ్ జైట్లీ సమాధానం అసంతృప్తిగా ఉంది : సీఎం చంద్రబాబు

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం అసంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం..తదితర విషయాలపై పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ అపాయింట్ మెంట్ అడగడం జరిగిందన్నారు. 

14:28 - July 31, 2016

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని తేలిపోయిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏం చేయబోతున్నారు? ఆయన బిజెపితో స్నేహం కొనసాగిస్తారా? తెగదెంపులు చేసుకుంటారా? ఒకవేళ టిడిపి, బిజెపి చెలిమి చెదిరితే, లాభపడేదెవరు? ఇదే అంశంపై రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు.? ఈ నేపథ్యంలో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివి చర్చా వేదిక చేపట్టింది. ఈ చర్చలో తులసీరెడ్డి (ఏపీ కాంగ్రెస్), విజయ్ కుమార్ (టిడిపి), చలసాని శ్రీనివాస్ (ప్రత్యేక హోదా సాధన కమిటీ), అద్దెపల్లి శ్రీనివాస్ (బీజేపీ), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

 

14:04 - July 31, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం అసంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడీ అపాయింట్ మెంట్ అడగడం జరిగిందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానంపై టిడిపి తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం..తదితర విషయాలపై పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కేంద్ర మంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని విమర్శించారు.
హేతుబద్ధత లేకుండా విభజించారు..
హేతుబద్ధత లేకుండా విభజించారని, రెండు సంవత్సరాలుగా కష్టాలతో ఏపీ ఉందన్నారు. విభజన వల్ల అన్యాయమే కాక అవమానం జరిగిందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరడం జరుగుతోందన్నారు. విభజన జరిగిన అనంతరం ఏపీ కష్టాల్లో ఉందని, తమను ఆదుకోవాలని కోరడం జరుగుతోందని, పొత్తులో భాగంగా తాము కోరడం లేదన్నారు. కానీ జైట్లీ అలా మాట్లాడడం కరెక్టు కాదన్నారు. ఆర్థిక సంఘం ఉందని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తెలుసని, ఐదేళ్లు ఇస్తామని ఆనాటి ప్రధాని చెబితే పది సంవత్సరాలు కావాలని బీజేపీ కోరడం జరిగిందని గుర్తు చేశారు. ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘానికి..ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు. ప్రతి ఐదేళ్లకొకసారి 14వ ఆర్థిక సంఘం అవార్డ్ ఇస్తుందని, తమకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తున్నామని ఆర్థిక సంఘం పేర్కొందన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, అధికారంలో ఉండే బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాల్సినవసరం ఉందన్నారు. రాజ్యసభలో ఒక స్వల్పకాలిక చర్చకు తీసుకోవడం..ప్రత్యేక హోదాతో పాటు ఇతర అన్ని విషయాలపై పట్టుబట్టకుండా కాంగ్రెస్ వదిలిపెట్టడం జరిగిందని విమర్శించారు.

సీరియస్ గా తీసుకున్నాం..
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సీరియస్ గా తీసుకోవాల్సినవసరం ఉందని బాబు పేర్కొన్నారు. ఏపీకి ఇది జీవన్మరణ సమస్యే అన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భరించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. వనరులు లేవని కారణంగా చేయలేమని చెబుతున్నారని, అలాంటప్పుడు రాష్ట్ర విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని సూటిగా ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య చిన్న చిన్న సమస్యలున్నాయని, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అపాయిట్ మెంట్ అడిగినట్లు తెలిపారు. విభజన సమయంలో జరిగిన అన్యాయం..పార్లమెంట్ లో చెప్పిన విషయాలు ఇతరత్రా వాటిపై ప్రధాన మంత్రితో చర్చిస్తామన్నారు. అనంతరం ఆయన నిర్ణయంపై కూలంకశంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంట్ లో జైట్లీ సమాధాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునివ్వడం కరెక్టు కాదని, అందరం కలిసి పోరాటం చేద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 

ముగిసిన బాబు, ఎంపీల భేటీ..

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో టిడిపి ఎంపీలు, సీఎం చంద్రబాబు భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. భేటీకి సంబంధించని వివరాలను సీఎం చంద్రబాబు మీడియాకు తెలియచేస్తున్నారు. 

ప్రత్యేక హోదాపై ఒత్తిడి తెస్తాం - మంత్రి పల్లె..

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యే హోదా తప్పకుండా సాధించుకుంటామని అన్నారు. 

హోదాపై కేంద్ర వైఖరి నిరాశ కలుగ చేసింది - యనమల..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం ఉందన్నారు. 

బంద్ కు అందరూ కలిసి రావాలి - మధు..

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఆగస్టు 2న బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు కలిసి రావాలని సీపీఎం నేత మధు పిలుపునిచ్చారు. విప్లవోద్యమ చరిత్రలో గుంటూరు జిల్లాది క్రియాశీలక పాత్ర అని, దేశంలో సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం వల్లే కమ్యూనిస్టులు, ఓట్లు సీట్లు సాధించలేకపోయారన్నారు. 

ప్రతిపక్షాలు అయోమయానికి గురి చేస్తున్నాయి - ఎమ్మెల్యే పల్లా..

హైదరాబాద్ : విద్యార్థులను ప్రతిపక్షాలు అయోమయానికి గురి చేస్తున్నాయని, ప్రభుత్వం దోషులను కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ లో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఐదారేళ్లుగా అదే సంస్థ పేపర్లను సిద్ధం చేస్తోందన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంపై నిర్ణయం తీసుకుంటుందని పల్లా పేర్కొన్నారు.

బీజేపీ తెగదెంపులే మంచిది - ఎమ్మెల్సీ బుద్ధా..

విజయవాడ : బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. దేశంలో చంద్రబాబు కన్నా తెలివిగల నాయకుడు లేరని, గోద్రా అల్లర్ల విషయంలో మోడీని తప్పుబట్టినందుకే చంద్రబాబుపై బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేవాలయానలు కూల్చినప్పుడు హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. 

12:55 - July 31, 2016

మనం ఏం తినాలి ? ఎలాంటివి తినాలి ? ఏం తినద్దు ? ఏది రుచికరం ? ఏది కాదో మార్కెట్ చెబుతోంది. దీనితో సహజమైన ఆహారం అన్న భావనలకు కాలం చెల్లింది. బహుళజాతి కంపెనీల గారడిలో సహజమైన ఆహారపు అలవాట్లు కొట్టుకపోయాయి. మీ మెదడు చురుకుగా ఉండాలంటే తమ కంపెనీలకు చెందిన శీతలపానియాలు తాగాలని పలు కంపెనీలు పేర్కొంటుంటాయి. కానీ అందులో క్రిమిసంహారక మందులు కలుపుతున్నామని, విష రసాయనాల మిశ్రమాన్ని అందిస్తున్నామని చెప్పరు. అంతేగాకుండా రెండు నిమిషాలో ఆహారం సిద్ధం అంటూ చెబుతున్న వాటిని తీసుకుని ఆరోగ్యాలని బలి తీసుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది. గత కొంతకాలంగా ఇంట్లో వంట కన్నా బయటి ఫుడ్స్ కే ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ అవి అంత ఆరోగ్యకరం కాదని తాజా పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. అందుకే సహజమైన ఆహారం వైపు మళ్లాల్సినవసరం ఏంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రకృతి సహజంగా ఉండే రుచల్ని అలాగే ఉంచేలా వండుకోవాలే తప్ప నానారకాల మాసాలతో, రసాయనాలతో ఆహారాన్ని కల్తీమయం చేస్తే రుచి పోవడమే గాక శరీరాలు రోగగ్రస్తమవుతాయి. తాజా పండ్లు, కూరగాయాలు తీసుకోవాలని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. 

హెచ్ సీయూలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు - కన్హయ్య..

హైదరాబాద్ : హెచ్ సీయూలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పేర్కొన్నారు. రోహిత్ వేముల మృతికి కారణమైన వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కేంద్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, భారతదేశంలో డెమోక్రసీకి బదులుగా మోడీక్రసీ నడుస్తోందని విమర్శించారు. ఎంసెట్ 2 లీకేజీని ఖండిస్తున్నామని, బడ్జెట్ లో విద్యకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

సూర్యాపేటలో నకిలీ డీజిల్ తయారీ ముఠా అరెస్టు..

నల్గొండ : సూర్యాపేటలో నకిలీ డీజిల్ తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 8వేల లీటర్ల నకిలీ డీజిల్, 5వేల నకిలీ కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డీజిల్ ట్యాంకర్, మూడు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. 

టిడిపి - బిజెపి కలిసే ఉండాలి - మంత్రి కామినేని..

నెల్లూరు : టిడిపి, బిజెపి ఎప్పటికీ కలిసే ఉండాలని, బీజేపీ నుండి టిడిపి విడిపోతుందని అనుకోవడం లేదని మంత్రి కామినేని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవన్నీ కేంద్రం చేస్తుందని తెలిపారు. 

లారీ - ఆటో ఢీ..ఐదుగురి మృతి..

గుంటూరు : ఫిరంగిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - ఆటో ఢీ కొన్నాయి. ఇద్దరు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. వైద్యులు సకాలంలో చికిత్స చేయకపోవడం వల్లే మృతి చెందారని బంధువులు ఆందోళన చేపట్టారు. 

12:18 - July 31, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని టిడిపి భావిస్తోంది. రాజ్యసభ సాక్షిగా జైట్లీ ఈ విషయాన్ని ప్రత్యేక హోదా లేదని కుండబద్దలు కొట్టేశారు. దీనితో టిడిపి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమలనాథులతో ఇంకా అంటకాగడమా..? లేక కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడమా..? తేల్చుకోలేక టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలతో చంద్రబాబు ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. గంటసేపటి నుండి ఈ భేటీ కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వంపై వత్తిడి తేవడం..హోదా..నిధులు ఎలా రాబట్టుకోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవాలని ఎంపీలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. బయటకు వస్తేనే టిడిపికి మనుగడ సాధ్యమని పేర్కొంటున్నా బాబు మాత్రం మనసులోని మాటను చెప్పడం లేదని తెలుస్తోంది. కేంద్రం నుండి బయటకు వస్తే బద్ధశత్రువులుగా మారే అవకాశం ఉందని, నూతన రాజధాని నిర్మాణం విషయంలో చాలా ఆటంకాలు ఎదురవుతాయని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోదా..ఇతరత్రా విషయాలపై శాంతియుత మార్గంలో నిరసన తెలియచేయాలని బాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కాసేపట్లో తెలియనుంది. 

12:12 - July 31, 2016

ముంబై : థానేలో ఐదంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద 15-20 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఆదివారం ఉదయం భివండిలో పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ భవనంలో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడనే ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా శిథిలాల కింద 15-20 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. కూలిపోయే సమయంలో అక్కడున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదకర భవనాల జాబితాలో ఈ భవంతిని కూడా అధికారులు చేర్చారు. కానీ నివాస గృహాలు లభించక కొంతమంది అందులోనే ఉంటున్నారు. వారం రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి భవంతి నానిపోవడం వల్లే కూలిపోయిందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆత్మహత్య పరిష్కారం కాదు - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్: ప్రతీ సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. 'సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు' అనే అంశంపై అవగాహన కల్పిస్తూ కేబీఆర్ పార్కు వద్ద బ్రేక్ అడ్వెంచర్ సంస్థ బైక్‌ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. 

భీవండిలో కుప్పకూలిన భవనం..

ముంబై : భీవండిలో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 10మంది భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. 

11:46 - July 31, 2016

ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ నాలుగోసీజన్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్, మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాత్రి 8గంటలకు జరిగే 3, 4 స్థానాల పోటీలో ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో పూణేరీ పల్టాన్ అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగోసీజన్ ఆఖరిరోజున జరిగే తొలిమ్యాచ్ ను ..పురుషుల విభాగంలో మూడు, నాలుగుస్థానాల కోసం నిర్వహిస్తారు. లూసింగ్ సెమీఫైనలిస్ట్ లు తెలుగు టైటాన్స్, పూణేరీ పల్టాన్ ఈ పోటీలో తలపడతాయి. రాత్రి 8 గంటలకు ఈ సమరం ప్రారంభమవుతుంది.

నెంబన్ వన్ గా రాహుల్..
ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 137 రైడింగ్ పాయింట్లతో నెంబర్ వన్ రైడర్ గా నిలిచిన రాహుల్ చౌదరి...ఈ ఆఖరాటలో సైతం చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక...రాత్రి 9 గంటలకు జరిగే టైటిల్ సమరంలో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్, ప్రస్తుత చాంపియన్ పట్నా పైరేట్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరితే....జైపూర్ పింక్ పాంథర్స్ తొలిసీజన్ తర్వాత టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది. పటిష్టమైన బ్లాకింగ్, పవర్ ఫుల్ రైడింగ్ పవర్ తో ...పట్నా పైరేట్స్ మరోసారి హాట్ ఫేవరెట్ గా టైటిల్ నిలుపుకోడానికి బరిలోకి దిగుతోంది.

జైపూర్ జట్లులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు..
మరోవైపు...తొలిసీజన్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు పలువురు ఉన్నారు.అయితే పట్నా పైరేట్స్ దూకుడుకు ఏమాత్రం పగ్గాలు వేయగలరన్నది అనుమానమే. గత మూడుసీజన్ల కబడ్డీలీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, పట్నా పైరేట్స్ జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఈ మూడింటిలో రెండుజట్లు తిరిగి ఫైనల్స్ చేరడంతో....నాలుగోసీజన్ ఫైనల్లో విజేతగా ఏజట్టు నిలిచినా అదిసరికొత్త రికార్డే అవుతుంది. మరి...ప్రోకబడ్డీ టైటిల్ రెండుసార్లు నెగ్గినజట్టు ఘనతను పట్నా పైరేట్స్ సాధిస్తుందా? లేక జైపూర్ పింక్ పాంథర్స్ సొంతం చేసుకొంటుందా? తెలుసుకోవాలంటే మాత్రం...మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

11:42 - July 31, 2016

శ్రీకాకుళం : కనిపించని కొడుకుకోసం..ఏడాదిగా ఎదురుచూస్తున్నారా తల్లిదండ్రులు. సరిగ్గా సంవత్సరం కిందట ఐసిస్‌ ముష్కరుల చెరలో చిక్కిన తమ కొడుకును విడిపించాలని..కనిపించిన ప్రతి రాజకీయనాయకుడిని కాళ్లావేళ్లా పడుతున్నారు. అదిగో మాట్లాడుతున్నాం..ఇదిగో విడిపిస్తున్నాం...అంటున్నారే కాని ఏడాది గడిచి పోయినా కొడుకు బందీగానే ఉండిపోయాడని ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పరాయిదేశంలో కనబడకుడా పోయిన కొడుకు కోసం..ఎదురుచూసిన ఈ తల్లిదండ్రుల గుండెలు బండబారిపోయాయి. ఇదిగో వస్తాడు..అదిగో వస్తాడని నాయకులు ధైర్యవచనాలు చెబుతున్నా..ముష్కరుల చెరలో చిక్కిన కొడుకు ఏమయ్యాడోననే ఆందోళన ఈ మాతృమూర్తి గుండెల్లో మంటలు రేపుతోంది.

లిబియాలో ఐసిస్‌ చెరలో చిక్కిన గోపీకృష్ణ..
శ్రీకాకుళంజిల్లా టెక్కలికి చెందిన గోపికృష్ణ లిబియా దేశంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ..ఉగ్రవాదుల చెరలో చిక్కాడు. 2015 జూలై 29న గోపికృష్ణతోపాటు మరో ముగ్గురిని కూడా కిడ్నాప్‌చేశారు ఐసిస్‌ ముష్కరులు. దీనిపై అప్పట్లో ఇటు రాష్ట్రప్రభుత్వం..అటు కేంద్ర ప్రభుత్వం కూడా హడావుడి చేశాయి. లిబియాలోని భారత విదేశాంగ కార్యాలయంతో నిరంతర సంప్రదింపులు జరిపి ఇద్దరిని విడిపించగలిగారు. కాని..గోపికృష్ణతోపాటు మరొకరిని ఇంకా తమవద్దనే బందీలుగా ఉంచుకున్నారు ఐసిస్‌ ముష్కరులు. కన్నకొడకును కన్నులారా చూడాలని పరితపిస్తున్నారు.

నాయకుల మాటలు నీటిమీదిరాతలు..!
కొడుకు ఉగ్రవాదుల చేతిలో బందీ అయ్యాడని తెలిసిన ఈ తల్లిదండ్రులు కనిపించిన నాయకుడిని వేడుకున్నారు. కాళ్లావేళ్లా పడ్డారు. తమ కొడుకును విడిపించాలని కన్నీరుపెట్టుకున్నారు. కాని.. నాయకుల మాటలు నీటిమీద రాతలుగానే మారాయి. భారత విదేశాంగ శాఖతో పాటు..రాష్ట్ర నాయకులు చేసిన హడావిడితో తమ కుమారుడు తొందరలోనే తిరిగోస్తాడని గోపీకృష్ణ కుటుంబీకులు ఆశపడ్డారు. కానీ..ఏడాది గడిచినా తిరిగిరాని కొడుకుకోసం ఈ తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

లిబియా ఎంబసితో మాట్లాడుతున్నాం అంటున్న కేంద్రం..
గోపికృష్ణ విడుదల విషయంపై ఏడాది కాలంగా ..కేంద్రప్రభుత్వం నుంచి ఒకటే మాట వస్తోంది. లిబియా ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని..గోపీకృష్ణను త్వరలోనే విడిపిస్తామంటున్నారు. గోపీకృష్ణను రక్షించడంపై అటు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ నిరంతరం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని ఎంపి రామ్మోహన్‌ నాయుడు అంటున్నారు. భారత విదేశాంగశాఖ చెబుతున్నట్టు ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపికృష్ణ నిజంగా బతికేఉంటే.. కనీసం ఫోన్‌లోఅయినా మాట్లాడించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

11:39 - July 31, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని తేలిపోయిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏం చేయబోతున్నారు? ఆయన బిజెపితో స్నేహం కొనసాగిస్తారా? తెగదెంపులు చేసుకుంటారా? ఒకవేళ టిడిపి, బిజెపి చెలిమి చెదిరితే, లాభపడేదెవరు? ఇదే అంశంపై రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు.? చంద్రబాబు తెలివైనవారు. రాజకీయ వ్యూహ రచనా సమర్ధుడు. అవసరానికి అనుగుణంగా పావులు కదపడంలో దిట్ట. ఎప్పుడు ఎవరితో చేతులు కలపాలో, ఎప్పుడు ఎవరితో తెగతెంపులు చేసుకోవాలో రాజకీయ లెక్కలేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మరిప్పుడేం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేనట్టేనంటూ దాదాపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో సహజంగానే ఈ ప్రశ్న ఉదయిస్తోంది.

అంతా మంచి జరుగుతుందని ఆశించారు...
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ ఇది. దీనిని నెరవేర్చాల్సిన బాధ్యత బిజెపి మీద పడింది. మన్మోహన్ సింగ్ తో ప్రత్యేక హోదా ప్రకటన చేయించడంలో తెర వెనక మంత్రాంగం సాగించిన వెంకయ్యనాయుడే కేంద్ర మంత్రివర్గంలో కీలక స్థానం సంపాదించడంతో ఇక అంతా మంచే జరుగుతుందని ఏపి ప్రజలు భావించారు. కానీ, రెండేళ్ల కథ మరోలా సాగింది. నాడు ఆప్తుడిగా కనిపించిన వెంకయ్యనాయుడి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అసంత్రుప్తితో వున్నారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ సమాధానంతో బిజెపి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ లో కోపం మరింత పెరిగింది. ఈ విషయం చంద్రబాబుకి తెలుసు. కాబట్టే, ఆయన మునుపెన్నడూ లేని రీతిలో కేంద్రంతో నిష్ఠూరాలాడుతున్నారు.

కఠినంగా మాట్లాడిన బాబు..
బిజెపి విషయంలో ఈ రెండేళ్లలో ఆయన ఎప్పుడూ ఇంత కఠినంగా మాట్లాడలేదు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ సమాధానం ముగిసిన తర్వాత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చూస్తుంటే, బిజెపి టిడిపి హానీమూన్ ముగిసినట్టేనన్న అభిప్రాయం కలుగుతోంది. బిజెపితో స్నేహం కొనసాగించడం వల్ల టిడిపికి ఇప్పుడు కలిగే ప్రయోజనాలు కూడా ఏమీ లేవు. 2014తో పోల్చుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. అగ్రనాయకుడు వెంకయ్యనాయుడి మీద జనం అసంతృప్తితో వున్నారు. రెండేళ్లు స్నేహంగా వున్నా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా దక్కిన ప్రయోజనాలేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. వైసిపి అధినేత జగన్ పార్టీ ముఖ్యనేతలను కాపాడుకోలేకపోతున్నారు. జనసేన పేరుతో హడావిడి చేసిన హీరో పవన్ కళ్యాణ్ ఇంతవరకూ కార్యాచరణకు దిగలేదు. ఆయన శిబిరంలో అంతా అయోమయమే.

పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ? 
బిజెపి, కాంగ్రెస్, వైసిపి, పవన్ కళ్యాణ్ బలహీనతలు చంద్రబాబు స్థానాన్ని పదిలం చేస్తున్నాయి. ఇలాంటి స్థితిలో చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే, ఇప్పటికిప్పుడే ఆయన అలాంటి కఠిన నిర్ణయం తీసుకోకపోవచ్చు. కానీ, అందుకు ఆయన మానసికంగా సిద్ధమవుతున్నట్టు సంకేతాలొస్తున్నాయి. ఒకవేళ తాను బిజెపికి దూరమైతే, జగన్ దగ్గరవుతారేమోనన్న భయం చంద్రబాబుకి వుండేది. కానీ, ఇప్పుడాయనలో ఆ భయం కూడా పోయింది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా నిరాకరించిన బిజెపితో వైసిపి చేతులు కలపలేదు. ఒక వేళ కలిపితే, వైసిపి దెబ్బతింటుందన్నది టిడిపి నేతల అంచనా. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే రాజకీయ పార్టీ స్థాపించినా ఆయన కూడా ఈ సమస్యనే ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపితో పొత్తు పెట్టుకుంటే, దెబ్బతింటారు. తాను దూరమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజెపి ఏకాకిగా మిగులుతుందే తప్ప రాజకీయంగా తననేమీ చేయలేదు. పైగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రి పదవులను త్యాగం చేసిన క్రెడిట్ టిడిపికి దక్కుతుంది. 

11:37 - July 31, 2016

హైదరాబాద్ : లాల్‌ దర్వాజ బోనాలను పురస్కరించుకొని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. లాల్ దర్వాజ బోనాలకు 300 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఏసీపీ మహమ్మద్ భారి తెలిపారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు,10 మంది ఏసీపీలు, ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఏసీపీ. శాలిబండలో 50 సీసీకెమెరాలు , ఛత్రినాకలో 50 సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు ఏసీపీ. బోనాల సమర్పణ ప్రశాంతంగా జరుగుతుందని మహిళా కానిస్టేబుళ్లను క్యూ లైన్ల లో ఉంచామన్నారు.

11:34 - July 31, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో అమ్మవారికి ప్రతీ ఏటా బంగారు బోనం సమర్పిస్తున్నామని ఆలయ అధికారి మహేష్‌ తెలిపారు. వరుసగా మూడో ఏడు బంగారు బోనం సమర్పిస్తున్న మహేష్‌ టెన్ టివితో మాట్లాడారు. గతంలో చాలా చీకటి రోజులు ఉన్నాయని, వెలుతురు వచ్చినట్లు తెలంగాణ వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో బంగారంతో బోనం చేయించాలని తాను అనుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో సీఎం కేసీఆర్ బంగారం బోనం ఎత్తుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఎలాంటి కోరికలు లేవని, రాష్ట్రాభివృద్ధే తన కోరిక అని చెప్పారు. 

మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు..

ఢిల్లీ : మరో ఆప్ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే చౌహాన్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం చౌహాన్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. 

11:20 - July 31, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా జైట్లీ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు బంతి టీడీపీ ముంగిట్లో పడింది. కమలనాథులతో ఇంకా అంటకాగడమా..? లేక కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడమా..? తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు టీడీపీ అధినేత. ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు పార్టీ ఎంపీలతో విజయవాడలోని సీఎం నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ఈ భేటీ ప్రారంభమైంది. మరి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటారా..? అనేది ఉత్కంఠ నెలకొంది. భేటీకంటే ముందు ఆ పార్టీకి చెందిన ఎంపీ జేసీ పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఎంపీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు...

విజయవాడ : క్యాంపు ఆఫీసులో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపైన ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించనున్నారు.

 

ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన..

హైదరాబాద్ : రామంతాపూర్ అరోరా కాలేజీలో ఎక్సైజ్, ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష జరుగుతోంది. ఉదయం 10.30గంటలకు పరీక్ష అయితే 9.30గంటలకే గేట్లకు తాళాలు వేసి అభ్యర్థులను సిబ్బంది అనుమతించలేదు. దీనితో 50 మందికిపైగా అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

11:11 - July 31, 2016

విజయవాడ : టిడిపి - బిజెపి కొనసాగే కాపురం కాదని..ఎప్పుడో ఒక రోజు విడాకులు తప్పవని టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయం..సోమవారం నాడు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం బాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే ముందు ఎంపీ జేసీ మీడియాతో పలు సంచలనాత్మక విషయాలు పేర్కొన్నారు. టిడిపి, బిజెపి బంధం కొనసాగదని తాను సంవత్సరన్నరం క్రితమే చెప్పడం జరిగిందన్నారు. అడుగుతున్నా ఏమీ రావడం లేదని, భవిష్యత్ లో కూడా ఏమీ రావని పేర్కొన్నారు. ఎంపీల రాజీనామా విషయంలో తుది నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడిదేనని తెలిపారు. బ్రిటీష్ కాలం ప్రస్తుతం లేదని, బంద్ లను విరమించుకోవాలని..నిరసన కార్యక్రమాలు వేరే విధంగా నిర్వహించుకోవాలని సూచించారు. బంద్ లో సామాన్య మానవులు ఇబ్బందులు పడుతారని తెలిపారు. 

మేఘాలయలో భారీ వర్షాలు..

మేఘాలయ : భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. జనజీవనం స్తంభించింది. వెస్ట్ గరో హిల్ జిల్లాలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

10:55 - July 31, 2016

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి 119 మంది క్రీడాకారులను పంపిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఢిల్లీలోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మైదానంలో ప్రధాని మోడీ రన్‌ ఫర్‌ రియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ వచ్చే ఒలింపిక్స్‌లో మరింత పెద్ద బృందాన్ని పంపుదామని పిలుపునిచ్చారు. 2020 నాటికి భారత్‌ ఒక బలమైన శక్తిగా ఒలింపిక్స్‌ బరిలో నిలుస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

బీజేపీ - టీడీపీ బంధం నిలవదని చెప్పా - ఎంపీ జేసీ..

విజయవాడ : టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అంటే ప్రధాని మోడీకి భయమన్నారు. బీజేపీ - టీడీపీ బృందం ఎక్కువకాలం నిలవదని ఎప్పుడో తాను చెప్పడం జరిగిందని, ఇప్పటికైనా బీజేపీ నుండి బయటకొస్తే మంచిదన్నారు. ప్రాంతీయ పార్టీలను సమీకరించే పనిలో ఉన్నారని బాబును ప్రధాని శతృవుగా చూస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో బాబు కీలక పాత్ర పోషించనున్నారని జోస్యం చెప్పారు.  

10:48 - July 31, 2016

వరంగల్ : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉడిన చందంగా ఉంది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారుల పనీతీరు. భద్రకాళీ చెరువు కట్టను పటిష్టం చేయబోతే.. కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. అక్టోబర్‌లో చెరువు కట్ట పటిష్టత పనులు చేశారు. అయితే.. వారం రోజులుగా కురిసిన వర్షాలతో పటిష్టం చేశామంటున్న చెరువు కట్టకు.. బుంగలు పడి.. పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భద్రకాళి చెరువు కట్ట ప్రమాదంలో పడిపోయింది. ఆందోళన కలిగిస్తోన్న భద్రకాళి చెరువు కట్టపై టెన్ టివి ప్రత్యేక కథనం.. అధికారుల అంతులేని అలసత్వం.. పనుల్లో అడుగడుగునా నాసిరకం..అర్థం పర్థం లేని పనులతో కోట్లాది నిధుల దుర్వినియోగం..మట్టికొట్టుకుపోతున్న 14 కోట్ల రూపాయల హృదయ్ నిధులు...

14.50 కోట్ల రూపాయలు..
ఓరుగల్లు వాసుల తాగునీటి వరదప్రదాయిని భద్రకాళి చెరువు. ఈ తటాకం సుందరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం హృదయ్ పథకం ద్వారా 14.50 కోట్ల రూపాయలను కేటాయించింది. గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాకతీయ పట్టణాభివృద్థి సంస్థ పర్యవేక్షణలో భద్రకాళీ బండ్ నిర్మాణ పనులతో పాటు చెరువు కట్ట విస్తరణ పనులను చేపట్టారు. హంటర్ రోడ్డులోని ద్వారక కాలనీ నుంచి గాయత్రీ దేవాలయం వరకు నాలుగైదు నెలలుగా విస్తరణ పనులు సాగుతున్నాయి. 40 అడుగుల నుంచి కట్టను దాదాపుగా 100 అడుగుల మేర విస్తరించారు. మిషన్ కాకతీయ పనుల ద్వారా భద్రకాళీ చెరువు నుంచి పూడిక తోడి విస్తరణ పనులను శరవేగంగా పూర్తి చేశారు.

తాజాగా నిర్మించిన కట్టకు పగుళ్లు...
నిధులు వచ్చాయి.. పనులు చకచకా సాగుతున్నాయి. ఇక భద్రకాళి తటాకం సుందరంగా మారిపోతుందని భావించిన ఓరుగల్లు ప్రజలు.. పనుల తీరు చూసి విస్తుపోతున్నారు. కొత్తగా చేపట్టిన పనుల వల్ల.. ప్రస్తుతం చెరువు కట్టకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్డులోని ఆర్టీసీ టైర్ల కంపెనీ నుంచి కాపువాడ మీదుగా ఉన్న కట్టకు అక్కడక్కడ బుంగలు ఏర్పడ్డాయి. బొందివాగు నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం పెరిగితే చెరువు కట్టకు పెనుముప్పు తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాసిరకం మట్టిని కట్ట నిర్మాణానికి వాడటం వల్లే చెరువు కట్ట దెబ్బతిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టి పూర్తి స్ధాయిలో అణగక పోవడం వల్ల.. కట్టపై బుంగలూ ఏర్పడ్డాయి.

లోపించిన నాణ్యత..
భద్రకాళి చెరువు కట్ట పనులలో నాణ్యత లోపించింది... ఇటీవలి స్వల్పకాలిక వర్షానికి కొత్తగా పోసిన మట్టి కొట్టుకుపోయి పగుళ్లు చూపింది. దీన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కానీ వారు ఎప్పట్లాగానే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కుడా అధికారుల తప్పుడు ఆలోచనలతో చెరువు కట్ట బలహీనంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ద్వారక కాలనీ, సంతోషిమాత నగర్, ఎన్టీఆర్ కాలనీ వాసులు కట్ట ఎప్పుడు కొట్టుకుపోతుందోనని భయభ్రాంతులకు గురువుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వదిలి భద్రకాళి కట్టను బలోపేతం చేయాలని... నాసికరం మట్టిని వినియోగించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు.  

10:43 - July 31, 2016

హైదరాబాద్ : ఒకప్పుడు ఎందరో దాహార్తిని తీర్చాయి. తాగుకు..సాగుకు ఉపయోగపడుతూ అందరి అవసరాలను తీర్చాయి. నిండు కుండల్లా.. తరగని జలవనరులుగా కళకళలాడాయి. అవన్నీ ఆ తర్వాత కాలంలో పాడుబడ్డ బావులుగా నిలిచిపోయాయి. వారసత్వపు సంపదగా మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఆ పురాతన బావులకు కొత్త కళ రానుంది. రైల్వే శాఖ చేపట్టిన న్‌ టీవీ ప్రత్యేక కథనం.. దక్షిణ మధ్య రైల్వే ఓ వినూత్నమైన ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తుంది. కోట్లు విలువ చేసే నీటి వనరుల పరిరక్షణకు నడుం బిగించింది. కోట్ల రూపాయల మిగులుకు.. వారసత్వ సంపద రక్షణకు ఏకకాలంలో చర్యలు తీసుకుంటుంది. పురాతన బావులను పునరుద్ధరించి నీటి వనరులను సమకూర్చుకోవాలని రైల్వే శాఖ యోచిస్తుంది. వారసత్వ సంపదను కాపాడటంతో పాటు కోట్లాది రూపాయలను ఆదా చేసేందుకు ఉపయోగపడే బృహత్తర ప్రణాళికలను రైల్వే అధికారులు సిద్ధం చేశారు.

రైల్వే శాఖ భూముల్లో ఉన్న పురాతన బావులు..
రైల్వే శాఖా ఆధీనంలోని భూముల్లో ఉన్న సాలార్‌ జంగ్ ఓపెన్ వెల్, ఆర్పీఎఫ్‌ ట్రైనింగ్ స్కూల్ వెల్, మౌలాలి వెల్, ఆలుగడ్డ బావులు 150 ఏళ్ల క్రితం నిర్మించినవి. సాలార్‌ జంగ్‌ ఓపెన్‌ వెల్‌ను 1829 నుంచి 1883 సంవత్సరంలో నిర్మించినట్టు తెలుస్తోంది. గతంలో ఈ బావిని నిజాం నవాబులు స్నానాలకు, వాటర్ స్పోర్ట్స్‌ కోసం వినియోగించేవారు. కొద్దిరోజులు వ్యవసాయానికి వాడుకున్నారు. 2003 వరకు కూడా స్టీమ్ లోకోషెడ్ కోసం వినియోగించారు. ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలతో ఈ బావులన్నింటిని వాడడం మానేశారు. రైల్వే శాఖ ఈ బావులను తిరిగి బాగుచేయించడానికి పూనుకుంది. నీటి అవసరాల కోసం అందుబాటులో ఉన్న ఈ వనరులను ఉపయోగించుకోవాలని భావిస్తుంది. దీంతో జీహెచ్‌ఎంసీ నుంచి కొనుగోలు బాధ తప్పుతుందని...కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని రైల్వే జి.ఎం రవీంద్ర గుప్తా భావిస్తున్నారు.

పాడుబడ్డ బావుల్లో పూడికతీత పనులు...
ఇందులో భాగంగా పాడుబడ్డ బావుల్లో పూడిక తీయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సాలర్ జంగ్ ఓపెన్ వెల్‌లో పూడిక తీసేశారు. ఆ బావిని తిరిగి వినియోగంలోకి తెచ్చారు. ఇప్పుడు మిగిలిన మూడు బావుల్లో పూడిక తీసేపనిలో ఉన్నారు. ఒక్కో బావి నుంచి రోజుకు రెండు నుంచి నాలుగు లక్షల లీటర్ల నీళ్ల వరకు వాడుకునే అవకాశముంటుందంటున్నారు. వీటితో పాటు మరిన్ని బావులను కూడా రిపేర్ చేసి రోజుకు 30 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటామని రైల్వే అధికారులు చెబుతున్నారు. వీటితో సంవత్సరానికి ఐదు కోట్ల వరకు రైల్వే శాఖకు మిగులుతోందంటున్నారు. బావుల పునరుద్ధరణతో పరిసర ప్రాంతాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

10:39 - July 31, 2016

హైదరాబాద్ : లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మేళతాళాలతో, తప్పెట్ల మోతలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటున్నారు. దర్శనం కోసం ఉదయం నుండి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. తూర్పు మండలం పరిధిలో రేపు రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక బందోబస్తు విషయానికి వస్తే భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మూడు వేల మంది పోలీసులు భద్రతలో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

నదిలో పడిపోయిన బాలుడిని రక్షించిన ఆర్మీ..

జమ్మూ కాశ్మీర్ : ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన 12 సంవత్సరాల బాలుడిని ఆర్మీ రెస్క్యూటీం రక్షించింది. ఆదివారం నదిలో పడిపోయాడు. 

10:24 - July 31, 2016

ఇప్పుడు తెలుగులో ఒక యువ తరంగం హీరోగా మెప్పించాలని ఆశపడుతున్నాడు. అతడే దేవి శ్రీ ప్రసాద్. దేవి ప్రస్తుతం తెలుగు లో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్. ఇతడు పాటల కంపోజరే కాదు. సింగర్, పాటల రచయిత కూడా. అంతే కాదు స్టేజ్ పెర్ఫార్మర్ కూడా. స్టేజ్ మీద పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తూ యూత్ లో ఒక విధమైన క్రేజ్ సంపాదించాడు. అలాంటి దేవిని తెలుగు తెరమీద హీరోగా ప్రెజెంట్ చేయాలని క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. అతి త్వరలో దేవిశ్రీ ప్రసాద్ తెలుగు తెరమీద హీరోగా మెరవడం ఖాయం. సో... ఈ రాక్ స్టార్ మొత్తం మీద కిరాక్ స్టార్ అవ్వబోతున్నాడన్నమాట.

కుమారి 21 ఎఫ్..
'కుమారి 21ఎఫ్' సమయంలో దేవిశ్రీ హీరోగా ఓ సినిమా చేస్తానని సుకుమార్ ఓ ప్రకటన కూడా చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. డీఎస్పీని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన తర్వాత… అయన తండ్రి సత్యమూర్తి మరణించాడు. దీంతో కొన్నాళ్లపాటు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆతర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజైంది. అనంతరం సుకుమార్ బిజీగా ఉండడంతో దేవీ తెరంగ్రేటం వాయిదా పడిందని ప్రచారం జరిగింది. మ్యూజిక్ కొడితే ట్యూన్ బాగుంటే వింటారు. దానికి సంగీతం ఎవరిచ్చారో కూడా జనానికి అనవసరం. అదే తెరమీద కనిపిస్తే, వాళ్ళ ను ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఒక రంగంలో ఫేమస్ అయినవాళ్లు జనానికి మరింత దగ్గరగా ఉండాలని తెరమీదకు రావాలనుకుంటారు. తెరమీద కనిపించాలని ఎవరికి ఉండదు. ఆ కిక్ అలాంటిది మరి.

10:10 - July 31, 2016

ఆమె వెండితెరపై వీచిన అందాల మలయమారుతం..ఆ చిన్నది చిలిపి కళ్లతో చూసి చిరునవ్వు నవ్వితే చాలు కుర్రాళ్ళ హార్ట్ బీట్ లయ తప్పుతుంది..ఏ మాయ చేసిందో కానీ, హీరోలందరికీ ఆమే కావాలి..దర్శక,నిర్మాతలకు ఆమే ఉండాలి..దాదాపు 7 దశాబ్దాల కాలం పాటు దక్షిణాది తెరపై అందాల విందు చేసిన ఆమె మరెవరో కాదు..టాలీవుడ్ జెస్సీ ... సమంత..మరికొద్ది రోజుల్లో ఆమె వెండితెరను వదిలేసి వంట చేస్తానంటోంది..అదేనండీ.. పెళ్లి చేసుకుంటానంటోంది. ఇప్పటివరకూ కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసి, త్వరలోనే పెళ్లి పీటలెక్కేస్తానంటున్న సమంత సినీ జెర్నీపై ప్రత్యేక కథనం..

ఏం మాయ చేసావే..
ఆడియన్స్ ను ఏం మాయ చేసిందో కానీ ఇప్పుడు యూత్ అంతా సమంతా నామ స్మరణమే చేస్తున్నారు. సినిమా ఫీల్డ్ కొచ్చి ఏడేళ్లే అయినా... టాప్ పొజిషన్ కి ఎప్పుడో వచ్చేసింది సమంత. ఆమె యాక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఒక్క తెలుగులోనే కాక, తమిళం, హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది సామ్స్...ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఫస్ట్ సినిమాతోనే హోల్ ఇండస్ట్రీని తన మాయలో పడేసుకుంది. ఆ సినిమా విక్టరీతో ఈ కుందనపు బొమ్మ రన్నింగ్ కి బ్రేకులు లేకుండా పోయాయి. ఒకదాని వెంట ఒకటి వరుసగా అవకాశాలు అమ్మడి ఒళ్లో వచ్చిపడ్డాయి. టాప్ హీరోలు అమ్మడి కాల్షిట్ల కోసం క్యూ కట్టారు. ఫలితంగా బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, అల్లుడు శీను, మనం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్ బ్లాస్టర్లు అమ్మడి ఖాతాలో పడ్డాయి. మొదటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కుర్రకారు మదిని దోస్తోంది సామ్...అదే సమంత సక్సెస్ ఫార్మూలా కూడా. యంగ్ హీరోల్లో దాదాపుగా అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.. మహేష్‌, ఎన్టీఆర్‌, నాగచైతన్య, నాని, ఇలా యంగ్‌ హీరోలందరి సరసన నటించి పర్ ఫెక్ట్ జోడిగా పేరు తెచ్చుకుంది..

సమంతకు పేరు ఎలా వచ్చింది ? 
సమంతకు అసలు హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా? చాలామందికి తెలియని విషయం ఇది. తనకు కేవలం అదృష్టం ఉండడం వల్లనే హీరోయిన్ అయ్యానని చెబుతోంది సమంత. కానీ అసలు విషయం వేరే ఉంది.. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఓ చిన్న ఈవెంట్ సమంత కెరీర్ ను మార్చేసింది. అప్పటివరకు అందర్లానే ఆడుతూపాడుతూ సరదాగా లైఫ్ గడిపేసింది సమంత. అయితే ఓ బర్త్ డే పార్టీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఓ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సమంత ఫొటోలు చూసిన ఓ వ్యాపారవేత్త, ఆమెను మోడల్ గా పెట్టి తన కంపెనీకి సంబంధించిన యాడ్ షూట్ చేశాడట. మొదట ఒప్పుకోకపోయినా… పాకెట్ మనీకి డబ్బులు వస్తాయని ఒప్పుకుందట. ఆ వెంటనే సినిమాటోగ్రాఫర్ రవివర్మ పరిచయం అవ్వడం సమంతను అందంగా చూపిస్తూ ఫొటోలు తీయడం.. ఆ ఫొటోలు గౌతమ్ మీనన్ చూడ్డం చకచకా జరిగిపోయాయి. ఏ మాయచేశావె సినిమా కోసం ఓ ఫ్రెష్ ఫేస్ ను వెదుకుకున్న గౌతమ్ మీనన్ కు సమంత నచ్చింది. వెంటనే అవకాశమిచ్చాడు. అలా వెండితెరపైకి వచ్చిన సమంత ఇప్పటివరుకూ కుర్రకారుకి ఆరాధ్య దేవత. సమంత అంటే దేవుడు విన్నాడు అని అర్ధం. ఇద్దరు అబ్బాయిల తర్వాత అమ్మాయి కావాలని దేవున్ని ప్రార్థించారట తల్లిదండ్రులు. అనుకున్నట్లుగానే అమ్మాయి పుట్టింది. అందుకే దేవుడు విన్నారు అని అర్ధం వచ్చేటట్టుగా సమంత అని పేరు పెట్టారు. సమంత తల్లి మళయాలి. తండ్రి తెలుగు. అయిన ఇంట్లో ఎక్కువగా ఇంగ్లీష్‌ నే మాట్లాడేవారట. పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. సమంత స్కూల్‌ హోలీ ఏంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్. కాలేజ్‌ స్టెల్లా మేరీ కాలేజ్‌.. మిడిల్‌ క్లాస్‌ ప్యామిలీ కావడం వల్ల కాలేజీలో ఉండగానే పాకెట్ మనీ కోసం మోడలింగ్‌ స్టార్ట్‌ చేసింది సమంతా. ఇంట్లో ఎక్కువగా ఇంగ్లీష్‌ మాట్లాడడంతో ఎక్కువగా ఇంగ్లీష్‌ సినిమాలు చూసేవారు సమంత. సమంత చూసిన మొదటి తమిళ్ సినిమా సూర్య నటించిన కాక్క కాక్క . అప్పటినుంచి సమంత సూర్యకి వీరాభిమాని అయిపోయింది. ఆమె హీరోయిన్ అయిన తర్వాత చాలా రోజులకి అంజాన్ లో సూర్య సరసన నటించగలిగింది.
టాప్ పొజిషన్ లో ఉన్న ఏ హీరోయిన్ అయినా ఏం చేస్తుంది? ఆ స్థానాన్ని కాపాడు కోవాలనుకుంటుంది, పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే మరిన్ని అవకాశాలని అందుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ సమంతా మాత్రం వింత నిర్ణయం తీసుకుందని. ఇప్పుడు చేస్తున్న జనతా గ్యారేజ్ తప్ప సమంతా ఇప్పటి దాకా ఇంకో సినిమా కి సైన్ చేయదని. ఇకముందు కూడా చేయదనే గ్యాసిప్స్ వినిపించాయి.

సమంత పెళ్లిపై గాసిప్స్..
సమంత కెరీర్ గురించి, ఆమె పెళ్లి గురించి గత కొద్దికాలంగా కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ విన్పిస్తున్నాయి 'త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నా.. ఆ వ్యక్తి ఎవరో కాదు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే..' అంటూ సమంత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అటూ ఇటూగా ఇచ్చిన క్లారిటీతో, ఒక్కసారిగా పెద్ద దుమారమే చెలరేగింది. అంతకు ముందే సమంత - నాగచైతన్య చెట్టాపట్టాలేసుకు తిరుగుతన్నారంటూ గాసిప్స్‌ తెరపైకి వచ్చాయి. సమంత క్లారిటీతో, ఆమెకి నాగచైతన్యతో పెళ్ళి ఖాయమనే ప్రచారం జరిగింది. ఇంకోపక్క, నాగార్జున కూడా నాగచైతన్య పెళ్ళి విషయమై సానుకూలంగా వున్నాడనీ, ఈ విషయం సన్నిహితుల ద్వారా బయటకు పొక్కిందన్న వార్తలు తెరపైకొచ్చాయి. ఇంతకీ, ఇదంతా నిజమేనా.? మళ్ళీ సస్పెన్స్‌. ఈలోగా సమంత - నాగచైతన్య చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఫొటోలు ఎడా పెడా మీడియాలో దర్శనమిచ్చేశాయి. 'జనతా గ్యారేజ్‌' నా చివరి సినిమా కాదు, ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను.. అని సమంత స్పష్టం చేసింది. కానీ, పెళ్ళి విషయంలో మాత్రం సమంత ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోవడం విచిత్రమే. నాగచైతన్య, సమంత రుతుప్రభు ల ఎంగేజ్ మెంట్ ఎప్పుడన్నదే ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ మధ్య కాలంలో ఇంత హైప్రొఫైల్ జంట ఒక్కటైన స్టోరీ టాలీవుడ్ లో లేదు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండింటికీ మనవడైన నాగచైతన్య తమిళ అమ్మాయి అయిన సమంతను సెలెక్ట్ చేసుకోవడం ఇండస్ట్రీని ఆహ్లాదపర్చిందనే చెప్పాలి.

సమంత..చైతూల డేటింగ్..?
సమంత ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉన్న హీరోయిన్. నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఆమె తో పోలిస్తే చైతూ కాస్త వెనకబడే ఉన్నాడు. అతనికి ఫుల్ లెంగ్త్ హిట్ ఇంకా లభించలేదు. కానీ సమంత చాలా హిట్స్ కొట్టింది. అంతేకాక పెర్ఫార్మెన్స్ ఓరియెంటెండ్ పాత్రలూ చేసింది. దాదాపు ప్రతీ హీరో ఆమెను హీరోయిన్ గా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏ మాయ చేసావె తరువాత ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సమంతను ఎంపిక చేసుకోవడంపై నాగార్జున కూడా హ్యాపీ గానే ఉన్నట్లు సమాచారం. ఆయన, అమల ఇప్పటికే వారి పెళ్ళికి క్లియరెన్స్ ఇచ్చేశారు. అటు చెన్నై లో ఉన్న తన కన్నతల్లి అనుమతిని కూడా చైతూ తీసుకున్నట్లు తెలుస్తోంది. నాగ్ కూడా చైతూ సమంత ప్రేమ నిజమేనని అధికారికంగా ధ్రువీకరించారు. బహుశా చైతూ ప్రస్తుతం చేస్తున్న ప్రేమమ్ సినిమా షూటింగు ఆగస్టులో ముగియగానే ఎంగేజ్ మెంట్ విషయాన్ని అనౌన్స్ చేయవచ్చని తెలుస్తోంది. పెళ్ళయ్యాక సమంత నటిస్తుందా, లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. నాగర్జున ను పెళ్లిచేసుకున్న తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అందుకే సమంత కూడా ఆమె బాటలోనే నడుస్తుందని అనుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని సమంత కూడా ధృవీకరించలేదు కాబట్టి.. దీన్ని గ్యాసిప్పే అనుకోవాలి. అమల రూల్ ను సమంత ఫాలో అవుతుందన్న గ్యారంటీ లేదు. కారణం.. సమంత ప్రస్తుతం హై డిమాండ్ ఉన్న నటి. ఒక్కో సినిమాకు దాదాపు 3 కోట్ల దాకా వసూలు చేస్తున్నది. పెళ్ళి తర్వాత ఈ క్రేజ్ ఎంతవరకూ కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకమే అయినా ప్రస్తుతం ఎవరెస్ట్ మీద ఉంది. దాన్ని ఆమె వదులుకోదు అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ యాక్ట్ చేస్తుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఈ వాదనతో విభేదించే వారూ ఉన్నారు. ఆమె మనస్తత్వం చాలా భిన్నమైనదని, ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆమెకే తెలియదని, అంచేత ఏం చేసినా చెయ్యొచ్చని వారంటున్నారు.

వెనక్కి వెళుతున్న సినిమాలు...
సమంత పెళ్లిచేసుకోవడం సంగతి అలా ఉంచితే, దీన్ని ఎఫెక్ట్ తో సమంతకు వస్తున్న సినిమాలు వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలుస్తోంది. అసలు ఆమె పెళ్లయినా హీరోయిన్ గా కొనసాగాలని అనుకుంటోందా? లేక మానేయాలనే నిర్ణయం తీసుకుందా? ఈ విషయం తెలియకే దర్శక, నిర్మాతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారం సమంత కెరీర్‌పై ప్రభావం చూపిస్తున్నట్టే ఉంది. ఆమెని ఇటీవల తమిళ చిత్రం 'వడ చెన్నై' నుంచి తప్పించినట్టు ప్రచారం సాగుతోంది. సమంత పెళ్లి పీటలెక్కితే తమ సినిమాకి ఇబ్బందులొస్తాయని దర్శకనిర్మాతలే తప్పించారా? లేక పెళ్లి చేసుకోవాలని ఆమే సినిమాని వద్దనుకొందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధనుష్‌ కథానాయకుడిగా స్వీయ నిర్మాణంలో వెట్రిమారన్‌ దర్శకుడిగా రూపొందుతున్న చిత్రమే 'వడ చెన్నై'. అందులో కథానాయికగా సమంతని ఎంపిక చేసుకొన్నారు. ఆ సినిమా గురించి సమంత కూడా చాలా చెప్పేది. కానీ ఇటీవల ఆ చిత్రబృందం మరో కథానాయికని ఎంపిక చేసుకోవడంపై దృష్టిపెట్టడంతో అసలు విషయం బయటికొచ్చింది. 'వడ చెన్నై' మాటేమో కానీ.. ఇటీవల సమంత కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు. తెలుగులోనూ క్రేజీ కాంబినేషన్లలో భాగమయ్యే అవకాశమొస్తున్నా సమంత మాత్రం నో చెప్పేస్తోంది. ప్రస్తుతం 'జనతా గ్యారేజ్‌'లో మాత్రమే నటిస్తోంది. ఆమె పెళ్లి కోసమే అవకాశాల్ని కాదనుకొంటోందని టాలీవుడ్‌ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. కానీ సమంత మాత్రం మంచి కథలొస్తేనే నటిస్తానని చెబుతోంది.

పెళ్లి పీటలెక్కుతుందా ? 
సమంత నిజంగా పెళ్లిపీటలెక్కేస్తోందా? లేక పెళ్లిచేసుకోడానికి ఇంకొంత టైమ్ తీసుకుంటుందా అనే విషయాలు తెలియవు కానీ, ఆమె పెళ్లిచేసుకొని వెళ్లిపోతే మాత్రం బాధపడిపోయే అభిమానులు చాలా మందే ఉన్నారు. టాప్ హీరోయిన్ గా ఇంకొంత కాలం టాలీవుడ్, కోలీవుడ్డుల్ని ఏలిన తరువాత చేసుకుంటే బాగుంటుందేమోనని, అప్పటికి నాగచైతన్య హీరోగా ఓ రేంజ్ కి చేరుకోవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి సామ్ ఏమనుకుంటోందో 

కాసేపట్లో ఎంపీలతో బాబు భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఎంపీలతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ తీసుకున్న నిర్ణయం..సోమవారం పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

 

09:54 - July 31, 2016

గురిచూసి వదిలితే బాణం గూడులో ఉన్న పక్షి గుండెలోగుచ్చుకుంటుంది. పాట కూడా అంతే పదునైన భావజాలం ఉన్న పాట శ్రోత గుండెను కుదిపేస్తుంది. అయితే వేటగాని బాణం పక్షిప్రాణం తీస్తే.... పాటగాని గేయం ప్రజకు ప్రాణం పోస్తుంది. పాట...బాధితుల గుండెగాయాలకు లేపనమవుతుంది. వారి జీవన పోరాటంలో వెలుగు బాటను చూపే కాగడా అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యమ పతాకగా కూడా ఎగసి పడుతుంది. అలాంటి పాటలను రాసిన గేయకవే నల్లి ధర్మారావ్. వామపక్ష ఉద్యమాల నేపథ్యంలో ఆయన గేయ ప్రస్థానమే సాగింది. గుండెలను పిండేసే నల్లి ధర్మారావ్ పాటల కోసం తెలుసుకోవాలని అనుకుంటే వీడియో క్లిక్ చేయండి. 

ఖమ్మంలో గోదావరి అంత్యపుష్కరాలు.

ఖమ్మం : గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం, పర్నశాల, మోతె పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంత్రులు తుమ్మల, ఎమ్మెల్యే రాజయ్య పుష్కర స్నానాలు చేశారు. కలెక్టర్ లోకేష్, హైకోర్టు జడ్జీ దుర్గా ప్రసాద్ లు కూడా స్నానమాచరించారు. అంత్యపుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

09:24 - July 31, 2016

గుంటూరు : కృష్ణా నదిలో గోదావరి జలాలు కలుస్తున్నాయి. దీనితో కృష్ణా, గోదావరి నది జలాలు కలుస్తుండడం వల్ల ఈ సంగమంలో పుష్కర స్నానాలు చేయవద్దని ప్రచారం జరుగుతోంది. కృష్ణా-గోదావరి నదీజలాలు కలిసే చోట పుష్కరస్నాలు చేయకూడదా..! ఇపుడు కోస్తాజిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో సాగుతున్న ప్రచారం ఇది. కాని.. ఈ వాదననను పురోహితులు కొట్టిపారేస్తున్నారు. ఆగష్టు 12నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో భక్తులకు సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పురోహితులు చెబుతున్నారు. మరోవైపు కృష్ణాపుష్కరాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయంటున్నారు. ఈ సందర్భంగా కొంతమంది పురోహితులు టెన్ టివితో మాట్లాడారు. వారు ఇంకా ఎలాంటి వివరాలు చెప్పారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

09:19 - July 31, 2016

తూర్పుగోదావరి : కోనసీమతోపాటు యానం గోదావరి తీరంలో గోదావరి అంత్య పుష్కరాల సందడి నెలకొంది. గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 11వతేదీ వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో హోం మంత్రి చిన రాజప్ప, ఎంపీ మురళీ మోహన్ తదితరులు పుష్కర స్నానం చేశారు. ఈసందర్భంగా మంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ..తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో పుష్కర ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భక్తులు స్నానం చేసేందుకు ఘాట్లన్నీ సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశా, ఇతర రాష్ట్రాల భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

అంత్యపుష్కరాల సందడి..

తూర్పుగోదావరి : కోనసీమతోపాటు యానం గోదావరి తీరంలో గోదావరి అంత్య పుష్కరాల సందడి నెలకొంది. గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 11వతేదీ వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. 

09:08 - July 31, 2016

ఆధునిక మార్కెట్ యుగంలో అంతా వ్యాపార మైనట్టే రచయితలు అమ్ముడు బోతున్నారు. విలువలకు తిలోదకాలిస్తున్నారు. వారు రాసే రాతలకు చేతలకు పొంతన ఉండదు. కాని కమిట్ మెంట్ ఉన్న కొందరు రచయితలు మాత్రం అణగారిన ప్రజలకోసం రచనలు చేస్తున్నారు. వారిని చైతన్య బాటలో నడిపిస్తున్నారు. అలాంటి వారిలో ఇటీవల కన్ను మూసిన బెంగాల్ రచయిత్రి మహాశ్వేతాదేవి ఒకరు. ఆమె భౌతికంగా మనకు దూరమయ్యారు. మహాశ్వేతాదేవి....ఈ పేరు వింటేనే... బెంగాల్ కు చెందిన గిరిజనుల జీవితాల కథలు మనకళ్లముందు కనిపిస్తాయి. దేశంలో ఎక్కడ ఏ ప్రజాఉద్యమం జరిగినా ఆమె కలం నిప్పులు చెరిగింది. దళిత గిరిజన బడుగు బలహీనవర్గాల వాస్తవ జీవన రేఖలను ఆమె కథలుగా నవలలుగా పత్రికా కథనాలుగా ప్రచురించారు. సుమారు60 ఏళ్లపాటు రచయిత్రిగా, ఉద్యమకారిణిగా అలుపెరుగక పరిశ్రమించిన మహాశ్వేతాదేవి ఇటీవల కన్నుమూశారు. ఆ మహారచయిత్రికి 10 టి.వి.అక్షరం నివాళులర్పిస్తోంది.

08:38 - July 31, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్నట్లు తెలుస్తోంది. సరైన సబ్జెక్ట్ కుదరకపోవడ వల్ల సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ మరో సినిమా ప్రాజెక్టుకు కూడా రెడీ అవుతున్నారంట. తమిళనాడులో సూపర్ హిట్ అయిన అజిత్ 'వేదాళం' సినిమా కథ పట్ల పవన్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం..పవర్ స్టార్ తో సినిమాను రీమెక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రీమెక్ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్.టి.నేసన్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇక నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 'గబ్బర్ సింగ్' తరువాత మరోమారు పవన్ తో శృతి హాసన్ జత కట్టనుంది. ఎం

బాసరలో గోదావరి అంత్యపుష్కరాలు..

ఆదిలాబాద్: బాసరలో గోదావరి అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ అమ్మవారి విగ్రహాలకు ఆలయం నుంచి గోదావరి వరకు పల్లకి యాత్ర ను ప్రారంభించారు.

అంత్యపుష్కరాలను ప్రారంభించిన కొప్పుల ఈశ్వర్..

కరీంనగర్ :ధర్మపురి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్ అంత్యపుష్కరాలను ప్రారంభించారు.

 

08:26 - July 31, 2016

నెల్లూరు : జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇద్దరు ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన బోగోలు మండలం బిట్రగుంటలో చోటు చేసుకుంది. ప్రమీణ, నిర్మల అనే ఇద్దరు సోదరీమణులు టీ దుకాణం నడుపుతున్నారు. ఎప్పలిటాగానే ఆదివారం ఉదయం టీ దుకాణం తెరిచి పనులు చేసుకుంటున్నారు. నెల్లూరు కు వెళుతున్న కర్నాటకకు చెందిన లారీ టీ దుకాణంలోకి అతివేగంగా దూసుకొచ్చింది. నిర్మల, ప్రమీల మీద నుండి వెళ్లడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమీల అక్కడికక్కడనే మృతి చెందగా నిర్మల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసింది.
సమాచారం తెలుసుకున్న కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిందని తెలుసుకున్న డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బిట్రగుంటలో లారీ బీభత్సం..

నెల్లూరు : బిట్రగుంటలో కర్నాటకు చెందిన లారీ బీభత్సం సృష్టించింది. టీ దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది.

08:14 - July 31, 2016

హైదరాబాద్ : లాల్ దర్వాజలో బోనాల సందడి నెలకొంది. భక్తులు బోనాలతో తరలివస్తున్నారు. నాలుగు క్యూ లైన్ల ద్వారా భక్తులను ఆలయంలోనికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుండే బోనాలు సమర్పించేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు వేల మంది తో భద్రత ఏర్పాటు చేశారు. అదనపు సీపీ స్వాతిలక్రా పర్యవేక్షణలో బందోబస్తు జరుగుతోంది. ఛైన్ స్నాచ్ లు జరగకుండా ఉండేందుకు 20 షీ టీమ్ లు ఏర్పాటు చేశారు. 30 లైవ్ కెమెరాలతో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు టెన్ టివితో మాట్లాడారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిసిన తర్వాత పాతబస్తీ బోనాలు జరుగుతాయి. ఈ వేడుక కోసం ఇప్పటికే పలు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలంకరణలతో ఆయా ఆలయాలు ధగధగలాడుతున్నాయి. ప్రధాన ఆలయాల వద్ద జానపద కళారూపాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికలు ఏర్పాటుచేశారు. భక్తులు అధికంగా తరలొచ్చే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, అక్కన్న మాదన్న, మీరాలం మండిలోని మహంకాళి ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల వద్ద బోనాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

రన్ ఫర్ రియో ను ప్రారంభించనున్న మోడీ..

ఢిల్లీ : రన్ ఫర్ రియో పరుగును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మేజర్ దయాచంద్ నేషనల్ స్టేడియం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.

ఘనంగా లాల్ దర్వాజ బోనాలు..

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిక్కిరిసిపోయారు.

07:45 - July 31, 2016

మెగస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. గత కొద్ది రోజులుగా ఏ హీరోయిన్ నటిస్తుందో అనే దానిపై రకరకాల వార్తలు వెలువడ్డాయి. చిరు సరసన కాజల్ నటిస్తుందని నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ 'కత్తి' రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. చిరు పక్కన నటించే శ్రియ..అనుష్క..నయనతార..ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. చివరకు కాజల్ ను ఫైనల్ గా నిర్ణయించేశారు.
సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో పవన్‌కళ్యాణ్‌కి జోడీగా, 'మగధీర','నాయక్‌', 'గోవిందుడు అందరివాడేలే' చిత్రాల్లో రామ్‌చరణ్‌ సరసన, బన్నీకి జంటగా 'ఆర్య2', 'ఎవడు' చిత్రాల్లో కాజల్‌ నటించిన విషయం విదితమే. కాజల్ ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కాజల్ నటించనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' రీమెక్ గా చిరంజీవి 150వ సినిమా రూపొందుతోంది. ఇన్నాళ్లు 'కత్తిలాంటోడు' టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ టైటిల్ సెట్ కావడం లేదని చెర్రీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఖైదీ నెం.150' అనే టైటిల్ ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక విలన్ గా హిందీ నటుడు నీల్ నీతిన్ మఖేష్ ఎంపిక చేసినట్లు, తెలుగు రీమేక్‌కి విలన్‌గా తరుణ్ అరోరాను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ తరుణ్ అరోరా ఎవరో కాదు.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న అంజలా జవేరి భర్త. చిరంజీవి పక్కన కాజల్ మెరుస్తుందా ? చిరు - కాజల్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

సెల్ఫీ తీసుకుంటూ మృతి చెందిన అథ్లెట్..

భోపాల్ : జాతీయ అథ్లెట్ పుజా కుమారి మృతి చెందారు. ఎస్ఏఐ అకాడమీలో సెల్ఫీ తీసుకుంటుడగా ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. సెల్ఫీ తీసుకుంటూ చెరువులో పడిపోయిన పుజా కుమారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని, కానీ ఆమె మృతి చెందిందని ఏఎస్ఐ సునీల్ దూబే ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు.

07:26 - July 31, 2016

హైదరాబాద్ : ఆషాడ జాతరలో మరో ముఖ్యమైన వేడుకకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీలోని చారిత్రక ఆలయాలతోపాటు మిగతా ఆలయాల్లో ఒకే రోజున బోనాల వేడుక జరిపే సంప్రదాయం కొనసాగుతున్నది. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిసిన తర్వాత  పాతబస్తీ బోనాలు జరుగుతాయి. ఈ వేడుక కోసం ఇప్పటికే పలు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలంకరణలతో ఆయా ఆలయాలు ధగధగలాడుతున్నాయి. ప్రధాన ఆలయాల వద్ద జానపద కళారూపాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికలు ఏర్పాటుచేశారు. భక్తులు అధికంగా తరలొచ్చే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, అక్కన్న మాదన్న, మీరాలం మండిలోని మహంకాళి ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల వద్ద బోనాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ బోనాల విశిష్టత గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

నేడు సూపర్ స్పెషాల్టీ కోర్సుల ప్రవేశ పరీక్ష..

హైదరాబాద్ : నేడు సూపర్ స్పెషాల్టీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 11గంటలకు మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుంది. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 752 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆగస్టు 10వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

ఆరు గ్రామాలకు భూ సమీకరణ లే అవుట్ ముసాయిదా..

విజయవాడ : రాజధాని ప్రాంతంలోని ఆరు గ్రామాలకు సీఆర్డీఏ భూ సమీకరణ లే అవుట్ ముసాయిదా జారీ చేసింది. బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, పిచ్చుకపాలెం, ఐనవోలు శాఖమూరుకు భూ సమీకరణ లే అవుట్ లు జారీ అయ్యాయి. అభ్యంతరాలకు ఆగస్టు 30వ తేదీ వరకు గడవు విధించారు.

రాజమహేంద్రవరంలో గోదావరి అంత్యపుష్కరాలు..

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలను ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

నేడు ప్రొ.కబడ్డీ టైటిల్ పోరు..

హైదరాబాద్ : నేడు ప్రొ.కబడ్డీ టైటిల్ పోరులో పాట్నాతో జైపూర్ జట్లు తలపడనుంది. సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

06:41 - July 31, 2016

మెదక్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తొలిసారిగా మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రధాని వచ్చే నెల 7న తొలిసారిగా పర్యటిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మిషన్ భగీరథ తొలి ఫలాలను ప్రజలకు అందించేందుకు అధికారులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కోమటిబండగుట్ట సమీపంలోనే 5 హెలీప్యాడులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే హెలీప్యాడ్‌ల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను మంత్రి హరీష్‌రావు, అధికారులు కలిసి పరిశీలించారు. మరోవైపు ప్రధాని పాల్గొనే బహిరంగ సభకోసం 70ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నారు.

విస్తృత ఏర్పాట్లు..
మిషన్ భగీరథ పనుల వివరాలను మెదక్ జిల్లా కలెక్టర్‌ రోనాల్డో రోస్‌ వివరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి నీరందించేందుకు జిల్లా అధికార యంత్రాగం పూర్తిగా నిమగ్నమై పనిచేస్తోందన్నారు. 450కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి మోదీ పర్యటిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విస్త్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా పటిష్ట బందోబస్త్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లా యంత్రాంగం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.

06:37 - July 31, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీలో సీఐడీ మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. కీలక నిందితుడిగా భావిస్తున్న రాజగోపాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. దీంతో లీకేజీ వ్యవహారంలో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. 16 మంది నిందితులుగా భావిస్తున్న సీఐడీ.. ప్రధాన సూత్రదారి ఇక్బాల్‌ అనుచరుడు రాజేష్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన సీఐడీ.. శనివారం కీలక నిందితుడు రాజగోపాల్‌తో పాటు వెంకటరమణ, బండారు రవీంద్రలను అరెస్ట్‌ చేసింది. మరోవైపు ఢిల్లీలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఇక్బాల్‌ అనుచరుడు రాజేష్‌ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. రాజగోపాల్‌ ఐదు పేపర్ల లీకేజీ స్కామ్‌లో నిందితుడిగా ఉన్నాడని.. కర్నాటక, ఏపీలో కూడా కేసులు ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 20 మంది విద్యార్థులను బెంగళూరుకు పిలిపించుకుని రాజగోపాల్‌ క్యాంప్‌ నిర్వహించారు. వీరిలో 14 మందిని హైదరాబాద్‌ నుంచి విష్ణు,.. విజయవాడ నుంచి జ్యోతిబాబు... ఆరుగురు విద్యార్థులను అరెంజ్‌ చేశారు. వీరి వద్ద నుంచి రాజగోపాల్‌ కోటి 25 లక్షలు తీసుకున్నట్లు సీఐడీ తెలిపింది.

వంద కోట్లకు ప్లాన్...
ఇక దిల్‌సుఖ్‌నగర్‌లో రిసోనెన్స్‌ మెడికల్‌ అకాడమీ నిర్వహిస్తున్న వెంకటరమణ, బండారు రవీంద్రలు... నలుగురు విద్యార్థులను పుణెకు పంపించినట్లు సీఐడీ తెలిపింది. ముగ్గురు విద్యార్థుల నుంచి బ్రోకర్లు 35 లక్షలు వసూలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. మరోవైపు నిందితుల కోసం సీఐడీ.. 11 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. ఖలీల్‌, ఇక్బాల్‌లు కూడా బ్రోకర్లు అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఇక్బాల్‌ కోసం వేట మొదలుపెట్టారు. ఇక ముంబైని అడ్డాగా చేసుకుని స్కామ్‌ చేసిన గుడ్డు, షేక్‌ నౌషద్‌, రామకృష్ణ పాత్రపై కూడా సీఐడీ ఆరా తీస్తోంది. కర్నూలులో అదుపులోకి తీసుకున్న తరుణ్‌రాజ్‌, వెంకట్రావులను విచారణ సాగుతోంది. పేపర్‌ లీక్‌ ద్వారా 130 మంది విద్యార్థులు లబ్ధి పొందగా... 80 కోట్ల డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితుడిని విచారిస్తే తప్ప.. ఎన్ని మాడ్యుల్స్‌కి పేపర్‌ లీక్‌ చేశారనే విషయం తెలియదని సీఐడీ అధికారులంటున్నారు. 100 కోట్లు సంపాదించేందుకు పాత్రదారులు, సూత్రదారులు లీకేజీకి ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం కేసీఆర్‌ను కలిసి దర్యాప్తు వివరాలను తెలిపారు. లీకేజీ ద్వారా లబ్ధిపొందిన విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్ట్‌ చేస్తే ఎలా వుంటుంది ? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. లీకేజీలో పాలుపంచుకున్న ఎవరినీ వదిలిపెట్టవద్దని కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. దీంతో త్వరలో తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

06:34 - July 31, 2016

హైదరాబాద్ : అదే నిర్లక్ష్యం..అదే అల‌స‌త్వం..నిద్రమ‌త్తు వీడ‌టం లేదు బ‌ల్దియా అధికారులు. వేర‌సి గ్రేట‌ర్ ప్రజ‌ల‌కు ఇబ్బందులు త‌ప్పడంలేదు. వీరి నిర్లక్ష్యం కొంతమంది ప్రాణాలపై తెస్తోంది. ప్రజా సమ‌స్యల‌పైనే కాదు..త‌మ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంక్షేమం కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రమోష‌న్ల కోసం ఆశ‌తో ఎదురుచూస్తున్న ఉద్యోగుల‌కు అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. లిస్ట్‌లో ఉన్న వారిని కాద‌ని..రిటైర్ అయినవారికి, ఎప్పుడో చనిపోయిన వారికి ప్రమోష‌న్లు క‌ట్టబెట్టడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది. బ‌ల్దియా అనగానే నిర్లక్ష్యానికి నిలువుట‌ద్దంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారుల చర్యలతో ఇది నిజమేననిపిస్తుంది. ప‌నుల్లో నిర్లక్ష్యం, పౌర సేవ‌ల్లో నిర్లక్ష్యం, అడుగ‌డుగునా అవినీతిమ‌యం. అన్నింటిలో ఆరితేరిన కొందరు బల్దియా అధికారులు..త‌మ తోటి ఉద్యోగుల‌ను కూడా నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డ్రైవ‌ర్లకు ప్రమోష‌న్లు ఇచ్చారు. అయితే ఈసారి అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఏకంగా చ‌నిపోయిన వారికే ప్రమోష‌న్లు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

19 మంది సీనియర్లను పక్కన పెట్టిన అధికారులు..
ఇటీవల జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో ప్రమోష‌న్ల కోసం ఫైల్‌ మూవ్‌ అయ్యింది. సీనియార్టీ లిస్ట్ ప్రకారం ప్రమోష‌న్లు ఇవ్వాలి. కానీ, త‌మ ఇష్టానుసారంగా 78మందికి ప్రమోష‌న్లు ఇచ్చేశారు అధికారులు. సీనియార్టీ లిస్ట్ ప్రకారం ప్రమోష‌న్లు పొందాల్సిన 19మందిని ప‌క్కన పెట్టారు. ప్రమోషన్ల విషయంలో కనీస పద్ధతులు కూడా పాటించలేదు. నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఎండీ రషీద్‌కు, రెండేళ్ల క్రితం పదవి విరమణ చేసిన జంగయ్యకు ప్రమోషన్లు కట్టబెట్టడంపై బల్దియాలో బాధ్యతా రహిత్యానికి అద్దం పడుతోంది. జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఆందోళన చేస్తామంటున్న నేతలు..
ఇదిలా ఉంటే.. రాములమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు 2019లో రిటైర్డ్‌ కావాల్సి ఉండగా..ఆమెను రిటైర్డ్‌ చేసి..వేతనం ఆపేశారు. దీంతో ఖంగుతిన్న ఆమె కమిషన్‌కు తన గోడును వెళ్లబోసుకోవడంతో తిరిగి పనిలోకి చేర్చుకున్నారు. ఈ ఒక్క విషయమే జీహెచ్‌ఎంసీ అధికారులు..విధుల పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారో అర్థమవుతోంది. జీహెచ్‌ఎంసీలో సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు పొందాల్సిన వారికి తక్షణమే న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.

06:32 - July 31, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో గనుల శాఖ పనితీరు, కేటాయింపులపై మంత్రి కేటీఆర్ పరిశ్రమల భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయన్న దానిపై గనుల కేటాయింపుల్లో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో గనుల శాఖముఖ్యకార్యదర్శితో పాటు టీఎస్ఎండీసిఎండి ఇలమ్ భర్తి పలువురు అధికారులు పాల్గొన్నారు. గనుల లైసెన్సులు , లీజుదారుల మైనింగ్ తీరుపై మంత్రి సంబంధిత శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మేజర్ మినరల్స్ లో 84 వర్కింగ్, 51 నాన్ వర్కింగ్ గనులు కలిపి మొత్తం 135 గనులన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మైనర్ మినరల్స్ లో వర్కింగ్ లో 1867, నాన్ వర్కింగ్ 909 , మొత్తం 2 వేల 776 గనులున్నట్లు మంత్రికి వివరించారు అధికారులు. అయితే కార్యకలాపాలు లేకుండా లైసెన్సులు పొందిన వారందరికి నోటీసులివ్వాలని మంత్రి ఆదేశించారు. నోటీసులతో పాటు నిర్ణీతగడువు దాటిన వారిలైసెన్సులను రద్దు చేయాలన్నారు.

ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉన్న లైసెన్సుల రద్దుకు ప్లాన్..
రాష్ట్రంలో మైనింగ్ అనేది ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలని అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉన్న లైసెన్సులను ఉపేక్షించేది లేదన్నారు. మొత్తం గనుల శాఖలో ఈ -ఆఫీస్ సాఫ్ట్‌ వేర్ ను ఉపయోగించాలన్నారు. ఈ సర్వీస్ లో నిబంధనలకు విరుద్దంగా ఉండేవారికి ఆటోమేటిగ్గా నోటీసులు వెళ్లేలా, వారి లైసెన్సులు రద్దయ్యేలా సాఫ్ట్ వేర్ రూపకల్పన ఉండాలన్నారు మంత్రి. 16 ఏళ్లుగా వివిధ ప్రాంతాలలో గనుల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ తిరస్కరించాలన్నారు మంత్రి కేటీఆర్ . నూతనంగా ప్రారదర్శక విధానంలో మరోసారి దరఖాస్తులను ఆహ్వానించాలన్నారు మంత్రి. మారుమూల ప్రాంతాలలో గనుల ఆధారిత పరిశ్రమలు పెట్టే వారికి పారిశ్రామిక విధానంలో లేని ప్రత్యేక అనుమతులు రాయితీలను ఇస్తామని మంత్రి అన్నారు. గనులశాఖలో ప్రభుత్వ ఆదాయం పెంచేలా పనిచేస్తున్న నిబద్ధత కలిగిన అధికారులను ప్రోత్సహించాలని నిర్ణయించారు మంత్రి కేటీఆర్. 

06:28 - July 31, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్, సబితా ఇంద్రారెడ్డిలపై సీబీఐ అదనపు చార్జ్ షీట్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్‌ వ్యవహారంలో ధర్మాన, సబితను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ అదనపు చార్జ్‌షీట్‌‌లో పేర్కొంది. అనంతపురం జిల్లాలో 230 ఎకరాలు, కర్నూల్‌లో 304 హెక్టార్లు, రంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాల గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ తాజా చార్జ్‌షీటులో పేర్కొంది. ఈ గనుల కేటాయింపు వల్ల పెన్నా సిమెంట్స్‌కు భారీగా లాభాలొచ్చాయని అందులో పేర్కొంది. వైస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ధర్మాన, సబితా ఈ భూకేటాయింపుల వెనుక చక్రం తిప్పినట్లు ఆరోపణలొస్తున్నాయి.

2013లోనే ఉన్నతాధికారులపై సీబీఐ చార్జ్‌షీట్‌..
ఇదిలావుంటే..2013లోనే పలువురు ఉన్నతాధికారులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్‌, డీఆర్వో సుదర్శనరెడ్డి, తహసీల్దార్‌ ఎల్లమ్మపై కూడా చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీనిపైకూడా విచారణ జరుగుతోంది.

06:26 - July 31, 2016

విజయవాడ : రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ రాష్ర్ట రాజకీయాల్లో హీట్ పెంచింది. రెండేళ్లుగా నానుతున్న ఈ వ్యవహారం ఈ విడత పార్లమెంట్ సమావేశాల్లోనూ చర్చకే పరిమితమైంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ ప్రైవేటు బిల్లు పెట్టడంతో రాజ్యసభలో ఈ అంశంపై అన్ని పార్టీలు వ్యవహరించిన తీర్చ చర్చనీయంశంగా మారింది. ఏపీలో అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా ఓ ప్రధాన అంశం. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ కూడా ప్రత్యేక హోదాకు మద్దతు పలికారు. కానీ, ఇప్పుడు ప్రత్యేక హోదాపై ఒక్కోరకంగా మాట్లాడుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పావులు కదుపుతున్న వైపీపీ..
రాజ్యసభలో జరిగిన చర్చలో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని చెప్పకనే చెప్పింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న విషయాన్ని తెలియజేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశాన్ని ఇరాకాటంలో పెట్టేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. బిల్లుకు ముందే తాము ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటన చేసిన వైసీపీ రాజ్యసభలో తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తెలుగుదేశాన్ని కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం దక్కినా... కట్టె విరగదు... పాము చావదు అన్న చందంగా వ్యవహరించి చేతులు దులుపుకుంది. ఇదే అదనగా ఏపీలో కొన్ని రోజులుగా టీడీపీ నుంచి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ పోలిటికల్ వ్యూహాలకు పదనుపెట్టింది. కేంద్రంపై విమర్శలు చేస్తూనే... టీడీపీని వైసీపీ అధినేత జగన్‌ టార్గెట్ చేశారు. చంద్రబాబు వైఖరి కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ పై కేంద్రం స్పందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసగా ఆగస్టు 2వ తేదీన ఇచ్చిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. మరి వైసీపీ ఇచ్చిన బంద్‌ ఏ మేరకు సక్సెస్‌ అవుతోందో చూడాలి.

06:23 - July 31, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా జైట్లీ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు బంతి టీడీపీ ముంగిట్లో పడింది. కమలనాథులతో ఇంకా అంటకాగడమా..? లేక కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడమా..? తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు టీడీపీ అధినేత. ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు పార్టీ ఎంపీలతో ఇవాళ ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని సీఎం నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటారా..? ఇప్పుడీ అంశం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లడంతో.. ఏపీలో ఆందోళనలు పెరుగుతున్నాయి. అదే సమయంలో.. కేంద్ర కేబినెట్‌లో భాగస్వామిగా ఉన్న టీడీపీపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. ముఖ్యంగా విపక్షాలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించాయి. దీంతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌ వ్యూహ రచన చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. ఆదివారం నాటి సమావేశానికి సంబంధించిన అజెండాలో.. కేంద్రం నుంచి వైదొలగడం లేదా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచడం అన్న అంశాలే ప్రధానంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కేంద్ర వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ప్రకటనలకు భిన్నంగా మాటల ఘాటును పెంచారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేముందని లెక్కలు చూపి మరీ నిలదీశారు.

రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన టీడీపీ ఎంపీలు..
చంద్రబాబు ప్రదర్శించిన ఊపులోనే టీడీపీ సీనియర్‌ నేతలు కూడా కమలనాథులపై ముఖ్యంగా కేంద్రంపై విమర్శల ఝడిని పెంచారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. కమలనాథులకు కటీఫ్‌ చెప్పేందుకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీలు కూడా ఇప్పటికే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించడం కూడా రాజకీయ కాకను పెంచుతోంది. బీజేపీ వైఖరి.. పొమ్మనకుండానే పొగపెట్టినట్లుగా ఉందని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు.

టీడీపీ ఎంపీల భేటీకి అత్యధిక ప్రాధాన్యత..
కమలనాథులపై టీడీపీ నాయకుల విమర్శల జోరు నేపథ్యంలో.. ఆదివారం నాటి పార్టీ ఎంపీల సమావేశానికి అత్యధిక ప్రాధాన్యత చేకూరింది. కమలంతో దోస్తీకి కటీఫ్‌ చెబుతారా..? లేక రాష్ట్రాభివృద్ధి పేరిట బీజేపీతో మైత్రికే కట్టుబడతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం నాటి సమావేశంలో.. పార్టీ భవిష్యత్తు వ్యూహంపై కచ్చితమైన వైఖరి వెలువడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాజకీయ కాకను పెంచిన ప్రత్యేక హోదా అంశం..
విభజన చట్టం అమలుపై ఇప్పటికే టీడీపీ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం బీఏసీ మీటింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎంపీల భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ప్రత్యేక హోదా అంశం.. ఏపీలో రాజకీయ కాకను ఓ రేంజిలో పెంచింది. ఇప్పుడు టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై హాట్‌హాట్‌ చర్చ సాగుతోంది.

విండీస్ ఆలౌట్..

కింగ్ స్టన్ : వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబీయన్లను తొలి రోజే 196 పరుగులకు ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా, అశ్విన్ లు మూడేసి వికెట్లు తీశారు. ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు.

నేడు పాతబస్తీ బోనాలు..

హైదరాబాద్ : నేడు పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ బోనాల జాతరలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 17 ఆలయాల్లో మంత్రులు నాయినీ నర్సింహరెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు లు మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించనున్నారు.

నర్సింగ్ భవిత్యవంపై తీర్పు రేపు..

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. శనివారం జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నర్సింగ్ డోపింగ్ వ్యవహారంలో తమ తుదితీర్పును సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

నేడు బ్రేక్ త్రూ అడ్వెంచర్ ఆధ్వర్యంలో ర్యాలీ..

హైదరాబాద్ : ఆత్మహత్యల నివారణ కోసం బ్రేక్ త్రూ అడ్వెంచర్ ఆధ్వర్యంలో సనా ఇక్బాల్ నేతృత్వంలో హైదరాబాద్ లో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి లు హాజరు కానున్నారు. ఉదయం ఏడు గంటలకు కేబీ ఆర్ పార్కు వద్ద జనార్ధన్ రెడ్డి ర్యాలీని ప్రారంభించనున్నారు. ర్యాలీ అనంతరం డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడనున్నారు.

రేపటి నుండి పెరగనున్న భూముల ధరలు..

విజయవాడ : ఏపీలో ఆగస్టు 1వ తేదీ నుండి భూముల ధరలు పెరగనున్నాయి. అర్బన్ లో భూముల ధరలు 10 నుండి 25 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

గోదావరికి నేటి నుండి అంత్యపుష్కరాలు..

హైదరాబాద్ : పవిత్ర గోదావరి నదికి ఆదివారం ఉదయం 6.37 నిమిషాలకు అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అంత్యపుష్కరాల సందర్భంలో ధర్మపురిలో సీఎం కేసీఆర్ స్నానం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

 

గ్రీన్ చానల్ లోకి ఎస్సీ కాలేజీ హాస్టళ్లు..

హైదరాబాద్ : ఎస్సీ సంక్షేమ కాలేజీ హాస్టళ్లను గ్రీన్ చానెల్ పరిధిలోకి తెచ్చేందుకు టి.సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఎస్సీల అభివృద్ధి శాఖ నిర్శహిస్తున్న కాలేజీ హాస్టళ్ల మెస్ బిల్లులను గ్రీన్ చానెల్ లోకి తెస్తూ నేడు, రేపో అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు 16 వరకు గడువు...

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లకు ఆగస్టు 16 వరకు గడవు పొడిగించారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

నేడు చెన్నైకి రాజన్న ధర్మ ప్రచార రథం..

కరీంనగర్ : హిందూ ఆధ్మాత్మిక సేవల ఉత్సవానికి ఆదివారం చెన్నైకి వేములవాడ రాజన్న ధర్మప్రచార రథం తరలివెళ్లనుంది. ఆగస్టు 2 నుండి 8వ తేదీ వరకు తమిళనాడులోని చెన్నైలో నిర్వహించే ఆధ్మాత్మిక సేవల ఉత్సవాల్లో శ్రీ పార్వతి రాజరాజేశ్వరస్వామి వారి ప్రచార రథం అందుబాటులో ఉండనుంది.

Don't Miss