Activities calendar

02 August 2016

21:58 - August 2, 2016

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న కమాన్‌ కూలడంతో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఘటనపై జీహెచ్‌ఎంసీ విచారణకు ఆదేశించింది. 
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం
కూకట్‌పల్లి వసంత్‌నగర్‌  పరిధి సీబీసీఐడీ కాలనీలో.. నిర్మాణంలో ఉన్న కమాన్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడే పని చేస్తున్న కూలీలు జనార్దన్‌, నాగభూషణ్‌.. ధర్మారావు మృతి చెందారు. తిరుపతిరావు..యాదవ్‌..అంజి..రమణ తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరంతా వలస కూలీలుగా తెలుస్తోంది.
మృతుల కుటుంబాల్లో పెను విషాదం
ఈ సంఘటనతో మృతుల కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఇక మాకు దిక్కేదంటూ బాధితులు దుఃఖిస్తున్నారు. రోజు కూలీతో బతికే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు రాకముందే అధికారులు మృతదేహాలను  తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారులు
కాలనీలో ఈ ప్రమాద స్థలాన్ని అధికారులు సందర్శించారు. ఎమ్మెల్యే కృష్ణారావు.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌.. వెస్ట్‌జోన్‌ సీపీ నవీన్‌చంద్‌..వెస్ట్‌జోన్‌ డీసీపీ కార్తికేయ పరిశీలించారు. ప్రొక్లైయినర్‌ సాయంతో శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. అయితే బిల్డర్‌లపై..అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్మికులు.. బంధువులు సంఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. బిల్డర్‌.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.దీంతో ప్రమాదంపై విచారణ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. సరైన ఇంజనీర్‌ ప్లాన్‌ లేకుండా బిల్డర్‌లు నాసిరకంగా పనులు చేపడుతున్నారని..అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

 

21:54 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎంసెట్‌-2ను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. రెండు రోజుల్లో షెడ్యూల్‌ విడుదల చేసి, పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తులో ఏవైనా అనుమానాలు ఉంటే.. కోర్టుకు రావొచ్చని పిటిషనర్‌కు సూచించింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంసెట్‌-3ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ఎంసెట్‌-2 ప్రశ్న పత్రం లీకేజీ అయిన నేపథ్యంలో ఎంసెట్‌-3 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీకేజీ వ్యవహారంపై హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి.. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా మరోపరీక్ష నిర్వహించాలన్న పిల్‌పై ప్రభుత్వం సానుకూలంగా కోర్టుకు నివేదికలు సమర్పించింది. ఎంసెట్‌-2 రద్దే ఉత్తమమని ఉన్నత న్యాయస్థానం సూచించింది. 
ఎంసెట్‌-2 ప్రశ్న పత్రాల లీకేజీపై కేసీఆర్‌ సమీక్ష
ఎంసెట్‌-2 ప్రశ్న పత్రాల లీకేజీపై సీఎం కేసీఆర్‌.. మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ కేంద్రంగా పేపర్ల లీకేజీ జరిగిందని దర్యాప్తు వివరాలను అధికారులు వివరించారు. ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్ఫాన్‌లు ప్రధాన సూత్రధారులుగా, 34 మంది బ్రోకర్లు ఈ లీకేజీ వ్యవహారంలో కుట్రదారులు అని వివరించారు. 200 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఇదే విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి కూడా నివేదిక సమర్పించారు. 
70 సందర్భాల్లో పరీక్ష పేపర్లు లీకైనట్లు నిర్ధారణ
దేశ వ్యాప్తంగా ఇప్పటి దాకా 70 సందర్భాల్లో ప్రధాన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, అన్ని సందర్భాల్లోనూ తిరిగి పరీక్షలు నిర్వహించారని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. పేపర్ల లీకేజీ జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమి చేయాలనే విషయంలో గతంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ముఖ్యమంత్రి తెప్పించుకుని పరిశీలించారు. తప్పని పరిస్థితుల్లో మళ్లీ పరీక్ష పెట్టవలసి వస్తోందని కేసీఆర్‌ ప్రకటించారు. ఎంసెట్‌-3 పరీక్షను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
ఎంసెట్ -3 పరీక్ష నిర్వహణ బాధ్యత జెఎన్‌టియుకే
ఎంసెట్-2 రాసిన విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత హాల్ టిక్కెట్లతోనే ఎగ్జామ్‌కు అనుమతించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆన్‌లైన్లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని ఆదేశించారు. ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు.. జెఎన్‌టీయూ వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ విత్ ఆన్సర్స్, ఇతర సమాచారం అందుబాటులో ఉంచాలని కోరారు. ఎంసెట్ -3ని నిర్వహించే బాధ్యతను మరోసారి జెఎన్‌టియుకే అప్పగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జెన్‌టీయూ వీసీని కేసీఆర్‌ ఆదేశించారు. 
సెప్టెంబర్‌ 11న ఎంసెట్‌-3 నిర్వహణ
ఎంసెట్‌-2 పేపర్ల లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని, దర్యాప్తు పకడ్బందీగా జరగాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. బ్రోకర్లతో చేతులు కలిపిన విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు  సెప్టెంబర్‌ 11న ఎంసెట్‌-3 నిర్వహణకు జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంసెట్‌-3 కన్వీనర్‌గా యాదయ్యను నియమించారు. మొత్తంగా ఎంసెట్‌-3 పరీక్ష నిర్వహణను పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

 

21:48 - August 2, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం నిర్వహించిన బంద్‌ విజయవంతం అయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ బంద్‌ కొనసాగింది. పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలో పాల్గొన్నారు. పలు చోట్ల విపక్షాలు ర్యాలీలు, బైఠాయింపులతో నిరసన తెలిపాయి. పలు జిల్లాల్లో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.  
వామపక్షాలు బంద్‌ విజయవంతం 
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నాలతో నిరసన తెలిపాయి.  ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల పిలుపు మేరకు బంద్‌ జరిగింది. వామపక్ష పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 
బంద్‌ ప్రశాంతం
రాష్ట్రవ్యాప్తంగా బంద్‌  ప్రశాంతంగా సాగింది. ఆర్టీసీ డిపోల ముందు వైసీపీ, సీపీఎం నేతలు బైఠాయించడంతో బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి.  దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌ మూతపడ్డాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళనకారులు నినదించారు. స్కూళ్లు, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. 
విజయవాడలో    
విజయవాడలో జరిగిన బంద్‌లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. టీడీపీ సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు, ఆందోళనలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఎం నేత మధు విమర్శించారు.  
రాయలసీమ జిల్లాల్లో
రాయలసీమ జిల్లాల్లోనూ బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. అనంతపురంలో.. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్ల సర్కిల్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. బంద్‌ సందర్భంగా అనంతపురం జిల్లాలోని అన్ని డిపోల్లోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఆందోళన చేస్తున్న వైసీపీ, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆథోనిలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయంటూ సీపీఎం, సీపీఐ, వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాలు ఆందోళనలో పాల్గొన్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు, సి. బెళగళ్‌ మండలంలో పాఠశాలలు, దుకాణాలు స్వచ్ఛంధంగా మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మిగనూర్‌ మండలంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో నిరసనకారులు రోడ్లపైకి చేరుకుని రాకపోకలను స్తంభింపజేశారు. 
కడపలోనూ 
వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా కడపలోనూ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. వామపక్షాలు, వైసీపీ నేతలు రోడ్లపై బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆత్మకూరు, కావలి తదితర ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. వేంపల్లిలో కదిరి డిపో ఆర్టీసీ బస్సుపై వైసీపీ నేతలు దాడికి యత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. 
నెల్లూరులోనూ 
ప్రత్యేక హోదా బంద్‌ కారణంగా నెల్లూరు జిల్లాలోనూ జనజీవనం స్తంభించింది. వామపక్ష పార్టీలు, వైసీపీ నేతల ఆందోళనలు, రాస్తారోకోలతో అట్టుడికింది. నెల్లూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేస్తున్న సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. సూళ్లూరుపేటలో వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు ఆత్మకూరులో ఎమ్మెల్యే గౌతంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
పశ్చిమ గోదావరి జిల్లాలో
పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్‌ సంపూర్ణం అయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులు లేక వెలవెలపోయింది. ఉండి నియోజకవర్గంలో బంద్‌ విజయవంతమైంది. ఆకివీడు, పాలకోడేరులో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆకివీడులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. తణుకు, మార్టేరు, భీమవరం ప్రాంతాల్లో వైసీపీతో పాటు వామపక్షాల నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీమవరంలో ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. 
ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్న జగన్‌ 
ఏపీ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. బంద్‌ విజయవంతం కావడానికి రాష్ర్ట ప్రభుత్వంపైనా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. బంద్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం శయశక్తులా ప్రయత్నించిందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా సాగించిన బంద్‌కు.. ప్రభుత్వం ఒత్తిళ్లు పెట్టినా వెరవకుండా.. సహకరించిన ప్రజలకు విపక్షాలు ధన్యవాదాలు తెలిపాయి. 

21:38 - August 2, 2016

ఆంధ్రాల అగ్గిరాసుకున్న ప్రత్యేకహోదా.. అయినా నాటకమే చేస్తున్న నాయుళ్లు, ఎంసెట్ లీక్ దొంగలను ఇడిసిపెట్టం.. ముందుగాలవట్టుకో తర్వాత ఇడుద్దువుగాని, 
షార్ట్ కట్ సదువులుచెప్పిన విద్యామంత్రి...అసలు కథ అదీగాదంటున్న బడిపంతులు, కేసీఆర్ జూస్తే ఎమ్మెల్యేలకు లాగుదడుస్తది.. ఆ నలుగురిదే హవా అంటున్న తమ్మినేని, గాంధీ తాత బొమ్మను తీసి ఎన్ టీఆర్ బొమ్మ.. అమరావతికాడా దేశభక్తిని గిల్లిన అల్లుడు.... తీస్ పండుగలో తీన్ మారేసిన షబ్బీర్ అలీ...ఇసొంటిఎన్నినున్నయోచూడాలి మరి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:24 - August 2, 2016

విజయవాడ : విభజన చట్టంలోని హామీలతోపాటు గత ప్రధాని ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని మళ్లీ కోరుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము మిత్రపక్షంగా ఉన్నా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. టీడీపీ పార్లమెంట్ లో ఆందోళన చేస్తే కాంగ్రెస్ సహకరించలేదని విమర్శించారు. ఢిల్లీలో పోరాడకుండా.. ఇక్కడ బంద్ లు చేస్తూ కాంగ్రెస్, వైసీపీలు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఆ రెండు పార్టీలను గమనించాలన్నారు. జగన్.. కేంద్రాన్ని నిలదీయడం లేదని పేర్కొన్నారు. ప్రధానిని చూపి తాను భయపడుతున్నానడం హాస్యాస్పదమన్నారు. ఎపి ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుతామని చెప్పారు. 'పక్క రాష్ట్రాలతో గొడవ పెట్టుకుంటే మనకే నష్టమని' అన్నారు. కేంద్రం నుంచి ఉదారంగా డబ్బులు వచ్చి ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు ప్రధాని, రాష్ట్రపతితోపాటు పలువురు ప్రముఖులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. 

 

అవగాహన లేమితోనే విమర్శలు: చంద్రబాబు

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్‌.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయన అవగాహనాలేమికి నిదర్శనమని దుయ్యబట్టారు. బంద్‌ పేరుతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. కేంద్రంతో పంతం పెట్టుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనీ..అందుకే అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. బంద్‌ వల్ల ఆర్టీసీకి ఒక్కరోజే రూ.4కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.

20:56 - August 2, 2016

దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి... ఏదో ఒక పేరుతో దళితులపై దాడులు చేయాలన్న ఉద్దేశ్యపూర్వక వ్యామోహం బయలుదేరుతోంది.. ఈ మధ్య కాలంలో బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో జరిగిన ఘటనలు దళితులంటే జాతి వ్యతిరేకులనే ముద్ర వేసేందుకు బిజెపి అనుబంధ విభాగాల కార్యకర్తల ప్రయత్నాల తీవ్రతను తెలియజేస్తున్నాయి.. దళితులంటే ద్వేషం ఎందుకు... దీని వెనుక ఏముంది..
మాటలు కాదు.... కావాల్సింది చేతలు 
దళిత వర్గానికి చెందిన వారిని క్యాబినెట్ లో మంత్రులుగా నియమిస్తే సరిపోతుందా...  అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపామని చెబితే సరిపోతుందా ... దళితలపై ప్రేమ ఉన్నట్లు మాటలు చెబితే సరిపోతుందా.. కాదు.. కావాల్సింది చేతలు.. వారికి అండగా ఉన్నామనే ధైర్యం... కానీ ప్రస్తుత ఎన్డీఏ పాలనలో ఏం జరుగుతోంది.. దేశంలో ఏదో ఒక మూల దళితులపై దాడులకు సంబంధించిన వార్తలు విస్తుగొలుపుతున్నాయి... దళితులను ఎందుకీ సర్కార్ అంత తీవ్ర వ్యతిరేక భావంతో చూస్తుందనే ప్రశ్నలు మేధావి, ప్రజాస్వామ్య  వాదుల నుంచి వస్తున్నాయి. తాజాగా బీహార్, యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో జరిగిన ఘటనలు .. దళితులపై మోడీ హయాంలో దాడుల తీవ్రత పెరిగిందని చెప్పకనే చెబుతున్నాయి.
మాయావతిని వేశ్యతో పోల్చిన బీజేపీ యూపీ ఉపాధ్యక్షుడు 
ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, నేటికీ ఆ రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతిని సాక్షాత్తూ యూపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఒక వేశ్యతో పోల్చుతూ వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ప్రతిపక్షాల ఆందోళన తర్వాత బేజేపీ ఆ సభ్యుణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు గాక.. కానీ ఓ మాజీ సీఎం, ఓ ప్రధాన పార్టీ అధినేత పై  బీజేపీ నేత చేసిన విమర్శలపై ప్రధాని స్పందన రాకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.! ఒక మహిళ గూర్చి మాట్లాడకూడని భాషలో ఓ బీజేపీ నాయకుడు మాట్లాడటం.. నాగరికత అనిపించుకుంటుందా..? మాది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పే కమలనాథులు దీన్ని సమర్థించుకుంటారా.... ఇదేనా సంస్కారం? ఇదేనా బీజేపీ అంతరాత్మ అంటూ దేశంలో విపక్షాలు, ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు.
దళితలను హింసించిన గో పరిరక్షణ సమితి సభ్యులు 
అలాగే, గుజరాత్‌లో ఆవు చర్మం వొలిచారన్న సాకుతో బీజేపీ అనుబంధ గో పరిరక్షణ సమితి సభ్యులు దళిత యువకులను ఘోరాతి ఘోరంగా హింసించటాన్ని ఏమనాలి... గోరక్షణ పేరుతో నలుగురు దళిత యువకుల చేతులు విరిచి, జీపులకు కట్టి వంతుల వారీగా కొడుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు పోస్టు చేసిన వీరి పైశాచికత్వాన్ని ఏమని పిలవాలి.... ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా విపక్షాలు ఆందోళన చేయడం బీజేపీ ఖండించడం షరా మామూలైపోయింది.. కానీ ఈ తరహా భావజాలం వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయకపోవడాన్ని ఉద్దేశ్యపూర్వక అలసత్వం అనవచ్చా అనే విమర్శలు వినిపిస్తున్నాయి... గోవులు, బర్రెల తరలింపునకు అనుమతులున్నా... గోరక్షకుల మంటూ దాడులు చేస్తున్న కొందరు బీజేపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని ఎన్డీటీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది కూడా...  
అంబేద్కర్‌ కార్యక్షేత్ర భవనం కూల్చివేత
మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‌ కార్యక్షేత్రమైన భవనాన్ని కూల్చివేయటాన్ని ఎలా అంచనా వేయాలి. అంబేద్కర్ పుట్టిన ఊరు సందర్శించామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు.. ఇలాంటి సంఘటనలపై నోరు మెదపరెందుకు.. అంబేద్కర్‌ కలలుగన్న దళితులు, వెనుకబడిన వర్గాల స్వావలంభనకు తూట్లు పొడవటంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి....  ఆవులను రక్షించాలి అనే పేరుతో దేశ వ్యాప్తంగా దళితులను హింసించటం, ముస్లింలను చంపటంవంటి పనులను చేసేవారు... రాజ్యం అండ చూసే చేస్తున్నారనేది వాస్తవం కాదా...దీనిపై సమాధానం చెప్పడానికి ఎన్డీఏ పెద్దలు సాహసించడం లేదు.... బేజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో దళితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు సిద్దమయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు... కొందరు రచయితలపై దాడులు, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన నేపథ్యంలో దేశంలో రేగిన అసంతృప్తి పాలకులకు గుర్తుకు రావడం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు... 
దళితులు మన దేశం పౌరులు కాదా.. 
దళితులు మన దేశం పౌరులు కాదా.. వాళ్లు ఓట్లు వేయడం లేదా.. దేశ అభివృద్ధిలో వారికి భాగస్వామ్యం లేదా... మరి ఎందుకీ ఆక్రోషం.. మతోన్మాదం ముసుగులో ఎందుకీ దౌర్జన్య కాండ... ఎన్టీఏ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.... దేశంలో అత్యంత చైతన్యవంతమైన శ్రేణిగా దళితులకు గుర్తింపు ఉంది... త్వరలో జరుగబోయే ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనవి. రాజ్యసభలో మైనారిటీలో ఉన్న బీజేపీ తననుకున్నట్టు పాలన సాగించాలంటే ఈ రాష్ట్రాలలో అధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని, తద్వారా రాజ్యసభలో మెజారిటీ సాధించుకోకతప్పదు. కానీ పెరిగిపోతున్న దళిత, మైనార్టీ వ్యతిరేకత ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపగలిగే అంశం... మరి పాలకులకు కనువిప్పు కలుగుతుందో లేదో చూడాలి...!

 

20:35 - August 2, 2016

దళితులపై దాడులు ఆపాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. దళితుల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:24 - August 2, 2016

నిజామాబాద్ : పులితో ఫోటో...దూకేస్తూ వీడియో...పాముతో సయ్యాట...ఇలాంటివి చూడ్డానికి సరదాగా ఉంటాయేమో...కాని ప్రాణాల మీదకు తెస్తాయని ఆ క్షణం ఊహించలేరు...ఇప్పటికే ఎందరో ఇలాంటి ఫీట్లు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చూశాం..చూస్తూనే ఉన్నాం...సరదాగా చేస్తూ..వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడానికి ఉత్సాహం చూపిస్తూ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు యువతీయువకులు...ఓ కానిస్టేబుల్‌ అభ్యర్థి కూడా అదే చేశాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

సోషల్ మీడియాలో తన సత్తా చూపించుకునేందుకు కొందరు... తన టాలెంట్ చూపించుకునేందుకు మరికొందరు..ఇలా రకరకాలుగా చేస్తున్న ఫీట్లు ఒక్కోసారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి...ఇప్పటికే ఎన్నో ఘోరాలు కూడా జరిగాయి..తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన దారుణం ప్రతీ ఒక్కరి కంటతడిపెట్టించింది. నిజామాబాద్‌ జిల్లా బాన్స్‌వాడ కోనాపూర్‌కు చెందిన పాతికేళ్ల శ్రీనివాస్‌ ఎక్సైజ్ కానిస్టేబుల్‌ పరీక్ష రాసి 85 మార్కులు సాధించాడు...తండా నుంచి తానొక్కడే సెలక్టయ్యానన్న సంతోషం కూడా తీరలేదు...మిత్రుడితో కలిసి పార్టీ చేసుకుందామని వెళ్లాడు...మార్గమధ్యలోని చెరువు వద్ద ఆగి తాను దూకుతానని...విజువల్స్‌ రికార్డ్ చేయమని చెప్పాడు..సరదాగా దూకిన శ్రీనివాస్‌ ఈతరాకపోవడంతో అందులో మునిగిపోయాడు...

చెరువులో మునిగిన శ్రీనివాస్‌ ఈతరాకపోవడంతో మునిగిపోయాడు..అప్పటికే పైన ఉన్న మిత్రుడు భయంతో అతని అన్న సంతోష్‌కు ఫోన్ చేసి చెప్పడంతో అక్కడికి చేరాడు.. ఈతగాళ్లు చెరువులో దూకి శ్రీనివాస్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  సరదా కోసం చేసి చావును వెతుక్కుంటూ వెళ్లాడు శ్రీనివాస్... వాట్సాప్‌లో..ఫేస్‌బుక్‌లలో ఫోటోలు పెట్టేందుకో..లేక వీడియో అప్‌లోడ్ చేసేందుకు కొందరు చేస్తున్న ఫీట్లు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ.

మంత్రి కుమారుడిపై హత్యకేసు..

రాజస్థాన్ : ఓ హత్య కేసులో రాజస్థాన్ మంత్రి రామ్ ప్రతాప్ కుమారుడు అమిత్ సాహుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో హత్య కేసులో సాక్షిగా ఉన్న హరీష్ సింధి అనే వ్యక్తి సోమవారం హనుమాన్ నగర్ కోర్టుకు రాగా, కోర్టు ఆవరణంలో ఇద్దరు దుండగులు ఆయన్ను కాల్చిచంపారు. నిందితులు సుఖ్ బీర్, ధర్మేంద్రలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మీర్ పేట పీఎస్ పరిధిలోని హస్తినాపురంలో ఓ మహిళ మెడలో నుండి బంగారు గొలుసు దొంగలు లాక్కెళ్లారు. ఎల్‌బీనగర్ సమీపంలోని మాధవ నగర్ కాలనీలో కూడా లక్ష్మమ్మ అనే వృద్ధురాలి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేకాటరాయుళ్లు అరెస్ట్ ..

హైదరాబాద్ : పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై మేడిపల్లి పోలీసు లు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.వారి వద్ద నుంచి రూ 1,00,720 నగదు, ఏడు సెల్‌ఫోన్‌లు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

హస్తినకు వెళ్ళనున్న చంద్రబాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు హస్తినకు పయనమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై రగడ రాజుకుంటున్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోదీని కలవనున్నారు. కృష్ణా పుష్కరాలకు వారినిక ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సుప్రీంకోర్టు సీజే, పలువురు కేంద్రమంత్రులను ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై సెంటిమెంట్‌ రాజుకున్న సమయంలో ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు ప్రధానిని కలిసిన సమయంలో ప్రత్యేక హోదాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

19:56 - August 2, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని టిడిపి ఎంపీ శివప్రసాద్‌ తెలిపారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌ ముందు వివేకానంద వేషధారణలో నిరసన తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అన్నారు. తమ అధినేత చంద్రబాబు తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. 

 

కేసీఆర్ రాజీనామా చేయాలి : డీకే అరుణ

హైదరాబాద్‌: పరిపాలనను పోలీసుల చేతుల్లో పెట్టి.. కేసీఆర్‌ పాంహౌస్‌కే పరిమితమయ్యారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే అరుణ విమర్శించారు. ఎంసెట్‌-2  పేపర్‌ లీకేజీ విషయంలో ముఖ్యమంత్రి కుటుంబపైనే ఆరోపణలు వస్తుంటే కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎంసెట్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.

19:48 - August 2, 2016

హైదరాబాద్ : బంద్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బంద్‌ విజయవంతం కావడానికి రాష్ర్ట ప్రభుత్వంపైనా పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఏపీ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. బంద్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు జగన్‌ తెలిపారు. 

 

పంద్రాగస్టు వేడుకలపై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : ఆగస్టు 15 స్వాతంత్ర్యదినం సందర్భంగా జరగాల్సిన వేడుకలపై ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. చారిత్రాత్మక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరణ, గోల్కొండ కోటకు ప్రత్యేక బస్సులు..తెలంగాణ సాంస్కృతిక, కళా ప్రదర్శనల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

19:43 - August 2, 2016

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు కేంద్ర మంత్రి, టిడిపి ఎంపీ సుజనాచౌదరి. ప్రధాని అన్ని విభాగాల నుండి సమాచారం తెప్పించుకొని ఏపీ అంశాలను పరిశీలిస్తున్నారని మంత్రి అన్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారని..ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని సుజనాచౌదరి తెలిపారు. 

 

రేపు బీజేపీ పార్లమెంటరీ సమావేశం..

ఢిల్లీ: భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు జరగనుంది. గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిపై ఈ సమావేశంలో బీజేపీ నేతలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తప్పుకుంటున్నట్లు ఆనందీబెన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ  అధిష్ఠానం గుజరాత్ కు కొత్త సీఎం ను ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 

19:36 - August 2, 2016

హైదరాబాద్ : జక్కన్న సినిమాలో హీరో బాలకృష్ణను అనుకరించారంటూ.. కొందరు ఫ్యాన్స్ హర్టయ్యారని నటుడు పృథ్వి అన్నారు. కటకటాల కట్టప్ప క్యారెక్టర్ లో తాను  బాలకృష్ణను తప్పుగా అనుకరించలేదన్నారు. దీనికి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైనా బాధపడి ఉంటే.. వారికి క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. బాలయ్యను కించపరిచేలా తాను ఎప్పుడు పాత్రలు చేయబోనని స్పష్టం చేశారు. 

 

సర్వేయర్ పోస్టులు భర్తీ : మహమూద్ అలీ

కరీంనగర్ : రెవెన్యూశాఖపై మంగళవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష పూర్తయిన అనంతరం ఆయన మాట్లాడుతూ...రెవెన్యూ శాఖలో త్వరలో 277 సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

19:28 - August 2, 2016

ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జీఎస్ టీ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు మోడీ సర్కార్‌ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. బుధవారం రాజ్యసభలో జీఎస్ టీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే లోక్‌సభలో గతేడాది మే నెలలో ఈ బిల్లును ఆమోదించారు. పెద్దల సభలో ఎన్ డిఎకి బలం లేకపోవడంతో రెండేళ్లుగా జీఎస్ టీ బిల్లు ఆమోదం పొందడం లేదు. ఈ నేపథ్యంలో ఈ బిల్లు బుధవారం రాజ్యసభలో చర్చకు వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
జీఎస్‌టీ బిల్లును ఆమోదింపచేసుకునే దిశగా అడుగులు  
దేశంలో పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లును ఆమోదింప చేసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులేస్తోంది. ఈ నెల 3వ తేదీన అంటే బుధవారం పెద్దల సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. గతేడాది మే నెలలో లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదింప చేసుకునేందుకు బీజేపీ... ఆ పార్టీ ఎంపీలకందరికీ విప్‌ జారీ చేసింది. దీంతో బీజేపీ ఎంపీలంతా పార్లమెంటులో అందుబాటులో ఉండనున్నారు. 
జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలతో సమావేశమైన అరుణ్‌జైట్లీ
జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్, ఎఐడిఎంకే, కమ్యూనిస్టు పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే చర్చలు జరిపారు. ఇటు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలతో జీఎస్టీ బిల్లుపై జులై మూడో వారంలోనే అభిప్రాయాలు సేకరించారు. ఆ తర్వాత జులై 27న జరిగిన కేబినెట్‌లో కొన్ని రాష్ట్రాలు, పలు రాజకీయ పార్టీలు తెలిపిన అభ్యంతరాలతో రాష్ట్రాలకు పరిహారంపైనా అంగీకరించారు. తయారీ పన్ను1 శాతాన్ని తొలగించడంతోపాటు పరోక్ష పన్నుల విధానంలో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వస్తు సేవల పన్ను విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే జీఎస్టీ కౌన్సిల్ మధ్య వర్తిత్వం వహించేలా ప్రతిపాదించడంతో బిల్లుకు మద్దతు పెరిగింది. 
ఎన్‌డీఏకు అనుకూలంగా మారిన వర్షాకాల సమావేశాలు
రెండేళ్ల నుంచి జీఎస్టీ బిల్లును ఆమోదింపజేయాలని కసరత్తు చేసిన మోడీ సర్కార్‌కు... ఈసారి పార్లమెంటు సమావేశాలు కొంత అనుకూలంగా మారాయి. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష సభ్యుల పదవీకాలం ముగియడం, వ్యతిరేక పార్టీల సంఖ్యను సర్కారు చర్చలతో తగ్గించడం బీజేపీ సర్కారుకు అనుకూలంగా మారింది. దీనికి తోడు ఇటీవల రాజ్యసభలో బీజేపీ బలం స్వల్పంగా పెరిగింది. వీటన్నింటి నేపథ్యంలో జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కే అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. బిల్లును ఆమోదం పొందేందుకు రాజ్యసభలో మూడింట రెండు వంతలు సభ్యులు అనుకూలంగా ఉండాలి. ఆమేరకు సంఖ్యాబలాన్ని సాధించగలమనే నమ్మకం నరేంద్రమోడీ సర్కారుకు రావడం వల్లే.. బుధవారం బిల్లును సభ ముందుకు తీసుకురాబోతున్నారు.
245 సభ్యుల్లో ఎన్డీఏ కూటమికి 65 మంది సభ్యులు
రాజ్యసభలో ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే మొత్తం 245 సభ్యుల్లో ఎన్డీఏ కూటమికి 65 మంది సభ్యుల బలముంది. అందులో బీజేపీకి 54 మంది, టీడీపీకి 6 మంది, అకాళీదల్‌ పార్టీకి ముగ్గురు, శివసేనకు ముగ్గురు సభ్యులున్నారు. ఇక ప్రతిపక్ష సభ్యుల బలం చూస్తే.. కాంగ్రెస్‌కు 60 మంది, సీపీఎంకు 8 మంది, సీపీఐకి ఒక్కరు, డిఎంకేకు నలుగురు సభ్యులన్నారు. రాజ్యసభలో మెజార్టీ పరంగా కాంగ్రెస్‌కు 60మంది సభ్యులు ఉండడంతో.. బిల్లుకు ఫ్లోర్‌లోనే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లు ఓటింగుకు వచ్చినపుడు ఎంతమంది సభ్యులు హాజరవుతారో... ఎంతమంది గైర్హాజరవుతారనే అంశం ఆసక్తిగా మారింది. 
లోక్‌సభలో మరోసారి జీఎస్టీ బిల్లు
ఏప్రిల్1 ,2017 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా శ్రమిస్తోంది. రాజ్యాంగ సవరణలను పార్లమెంటు ఆమోదించాక... అన్ని రాష్ట్రాలు ఈ చట్టానికి అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. అంతేకాదు...  రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ సవరణ బిల్లును మరోసారి లోక్‌సభలో ఆమోదించాలి. కాంగ్రెస్ మాత్రం చట్టంలో జీఎస్టీ రేటు పరిమితి నిర్ధారణ, వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు జడ్జీ నేతృత్వంలో ఓ వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేసినప్పటికీ మోడీ సర్కార్‌ అంగీకరించలేదు. మొత్తానికి జీఎస్‌టీ బిల్లు ఈసారైనా గట్టెక్కుతుందా..? లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

 

19:16 - August 2, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్‌లో నలుగురు ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారన్న విషయం కేంద్రం ఇంతవరకు తేల్చలేదని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రేపు పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో దిగ్విజయ్‌ ఈ విషయాన్ని లేవనెత్తారు. దీనిపై మాట్లాడడానికి నోటీస్‌ ఇవ్వాలని డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ దిగ్విజయ్‌కు సూచించగా...ఈ విషయంలో కేంద్రం స్పందించాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్రమోది పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరైన తర్వాత పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి జరగడాన్ని దిగ్విజయ్‌సింగ్‌ ప్రస్తావించారు.

 

3వేల గ్రీన్ తాబేళ్లు స్వాధీనం..

తమిళనాడు : కస్టమ్స్ అధికారులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి 3వేల గ్రీన్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. హబీబ్ అనే వ్యక్తి తాబేళ్లను సూట్‌కేస్‌లో పెట్టి మలేషియా నుంచి చెన్నైకి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తాబేళ్ల విలువ రూ.30లక్షలుంటుందని తెలిపారు. కస్టమ్స్ అధికారులు హబీబ్ ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

సోనియా రోడ్ షో రద్దు..

ఉత్తరప్రదేశ్ : యూపీలో ఎన్నికల ప్రచార వేడి తారస్థాయికి చేరింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ రోడ్‌ షో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కానీ రోడ్ షో రద్దయ్యింది. కారణం ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సందర్భంగా రోడ్ షోను కాంగ్రెస్ నేతలు రద్దు చేశారు. 

మియాపూర్ లో దారుణం..

హైదరాబాద్ : మియాపూర్ మైహోం జువెల్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో వున్న భర్తను  భార్య రోకలిబండతో మోదింది. దీంతో అతని పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. భర్తపై దాడి చేసిన అనంతరం భార్య 13వ అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

6న ఎంసెట్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : ఈ నెల 6న ఎంసెట్ కమిటీ సమావేశం కానుంది. ఎంసెట్ 3 పరీక్ష ఫలితాలను, కౌన్సెలింగ్ తేదీలను సమావేశంలో ప్రకటించనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ 2 రద్దు చేసి ఎంసెట్-3 పరీక్షను ఈ నెల 11న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

18:58 - August 2, 2016

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో భవనం కూలిన ఘటన మరువకముదే మరో విషాదం నెలకొంది. తాజాగా కూకట్‌పల్లిలో మరో ప్రమాదం జరిగింది. హైదర్‌నగర్‌లోని సీబీసీఐడీ కాలనిలో నిర్మాణంలో ఉన్న కమాన్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాలకింద పడి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. శిథిలాలకింద మరికొందరు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు. 

 

తెలుగు రాష్ట్రాలకు వరద హెచ్చరిక..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ వరద హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నీటిమట్టం గరిష్ఠంగా చేరుకున్నాయి. మరో 4,5 రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ అధికారులను అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టులన్నీ కూడా గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవటంతో అధికారులు అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు జరీ చేసింది.

18:49 - August 2, 2016

ఢిల్లీ : జిఎస్‌టి సవరణకు సంబంధించిన బిల్లు ప్రతులు తమకు అందలేదని రాజ్యసభలో విపక్షాలు సభాపతి దృష్టికి తెచ్చాయి. బిల్లుకు ప్రతులు ఇదివరకే అందజేయడం జరిగిందని డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ పేర్కొన్నారు. బిల్లు ప్రతులకు సంబంధించిన మరో కాపి ఇస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సభకు తెలిపారు. కాపీ ఇచ్చేందుకు ఎందుకింత రాద్ధాంతమని ఏచూరి అన్నారు. జిఎస్‌టి బిల్లును కేంద్రం రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.

ప్రయాణీకుడి గొంతు కోసిన డ్రైవర్..

విజయవాడ : ప్రయాణీకుడి ఘర్షణ పడిన లారీ డ్రైవర్ ప్రయాణీకుడి గొంతుకోశాడు. ఈ ఘటన విజయవాడ సమీపంలోని గన్నవరంలో చోటు చేసుకుంది.

ఒలింపిక్స్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు..

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహిళా ఫైర్ ఫైటర్ పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ లైంగిక వేధింపులకు యత్నించాడు. ఒలింపిక్ పార్క్ లోని వెలోడ్రోమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఓ మహిళా క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

18:23 - August 2, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి జైట్లీ తెలిపారు. ఈ అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని, దీనిపై తాను ఏపి సిఎం చంద్రబాబుతో మాట్లాడనని పేర్కొన్నారు. ఏపి అంశంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చినందుకు ఆంధ్రా ఎంపీలు ఆందోళన విరమించి సభకు సహకరించాలని కేంద్రమంత్రి అనంతకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

ఘనంగా ముగిసిన బోనాలు..

హైదరాబాద్ : నగరంలో బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి ఆట్టహాసంగా జరిగిన బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటేలా జరిగాయి. సోమవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆనంతరం పూరవీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపులు నిర్వహించారు. అంతే కాకుండా అమ్మవారికి ప్రత్యేక నైవేధ్యాన్ని సమర్పించేందుకు మేకపోటేళ్ల బండ్లపై ఫలహారపు బండి ఊరేగింపుతో విచ్చేసి సమర్పించారు.

4న నెల్లూరులో వైసీపీ యువభేరీ..

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ ఈ నెల 4వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.కస్తూరిదేవి గార్డెన్స్ లో యువభేరి సదస్సుకు ఆయన హాజరు కానున్నారు.

 

18:10 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీ బాధ్యులైన మంత్రులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై గవర్నర్‌ నరసింహన్‌ కాసేపటి క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంలో బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అలాగే మల్లన్నసాగర్‌ కాంగ్రెస్ నేతల అక్రమల అరెస్టులపై గవర్నర్‌కు కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌ కుమార్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. 

 

ప్రమాదస్థలిని పరిశీలించిన డిప్యూటీ మేయర్..

హైదరాబాద్ : కూకట్ పల్లి హైదర్ నగర్ లో కమాన్ కూలిన సంఘటాస్థలాన్ని డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ పరిశీలించారు. కాగా ఈ ఘటనలో మృతి చెందినవారంతా శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగభూషణ, జనార్థన్ రావు, ధర్మారావులుగా గుర్తించారు.

హోదాతో పాటు అన్ని హామీలు సాధిస్తాం : సుజనా

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా సాధించటానికి అనేక విధాలుగా మా నిరసనలను తెలియజేస్తున్నామని సుజనా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పాటు అన్ని హామీలనూ సాధించేవరకూ తాము  ఆందోళన విరమించబోమని సుజనా పేర్కొన్నారు.

18:02 - August 2, 2016

హైదరాబాద్‌ : నగరంలో డెంగ్యూ ఫీవర్‌ మళ్లీ కలకలం రేపుతోంది. లంగర్‌హౌస్‌లో ఉండే రాములు అనే 40 ఏళ్ల వ్యక్తి డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మృతిచెందాడు. లంగర్‌హౌస్‌లో నివాసం ఉండే రాములు నెలరోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ అమీర్‌పేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఫీవర్‌ తగ్గకపోవడంతో ఇవాళ ఆసుపత్రిలో మృతిచెందాడు. రాములు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

 

17:58 - August 2, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని వైసిపి ఎంపీ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన పాపంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని...ఇప్పుడు హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపైన కూడా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 5కోట్ల ఆంధ్రులు క్షమించరని మేకపాటి అన్నారు. 

 

భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం..

విశాఖ : జి.మాడుగుల మండలం వీజేపురంలో భారీగా పేలుడు పదార్ధాలను స్పెషల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ క్వారీలో అక్రమంగా నిల్వ వుంచిన 89 జిలెటిన్ స్టిక్స్,100 మీటర్ల ప్యూజ్ వైర్, 101 ఎలక్ట్రిసిటీ డివైజులను స్పెషల్ పార్టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సామాగ్రిని మావోయిస్టులకు సరఫరా చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

17:54 - August 2, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావొద్దనేదే కాంగ్రెస్‌, వైఎస్సార్‌సిపిల ఉద్దేశ్యం టిడిపి ఎంపీ టీజీ వెంకటేశ్‌ విమర్శించారు. బీజేపి ప్రవేశపెట్టే ప్రతిబిల్లుకు కాంగ్రెస్‌, వైసిపిలు మద్దతిచ్చి పాస్‌ చేపిస్తున్నాయని..కానీ త్యేక హోదా బిల్లును ఎందుకు పాస్ చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. హోదా బిల్లును సాధించే అవకాశం కాంగ్రెస్‌, వైసిపిలకు ఉందన్నారు. 

 

17:48 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీక్‌పై హైకోర్టులో కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. ఎంసెట్‌-2 రద్దు చేశామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎంసెట్‌ రద్దుపై అటు హైకోర్టు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ రద్దు ఉత్తమమైన నిర్ణయమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎంసెట్‌-2 లీక్‌పై ఏమైనా అనుమానాలుంటే మళ్లీ కోర్టుకు రావాలని పిటీషనర్‌కు హైకోర్టు సూచించింది. 

 

బోల్తా పడిన ట్రాక్టర్..ఇద్దరు మృతి..

విశాఖ: అనంతగిరి మండలం బీసుపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 20మంది కూలీలకు గాయాలయ్యాయి.  గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

17:42 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్‌ 11న ఎంసెట్‌-3ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కూడా ఎంసెట్‌-3 నిర్వహణను జేఎన్టీయూకే ప్రభుత్వం అప్పచెప్పింది. ఎంసెట్‌-3 సెప్టెంబర్‌ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. ఎంసెట్‌-3 కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ యాదయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ సారి ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పకడ్భంధీగా ఎంసెట్‌-3ని నిర్వహించాలని జేఎన్టీయూని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్‌లో ఎంసెట్‌-3 అనేది ఓ మోడల్‌గా ఉండేలా పటిష్ట చర్యల మధ్య పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని జేఎన్టీయూని ఆదేశించింది. 

 

 

టీడీపీ-బీజేపీ ఒకే కుటుంబం : సుజనా

ఢిల్లీ : టీడీపీ-బీజేపీ ఒకు కుటంబం అని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై  సీఎం చంద్రబాబు రెండేళ్లు ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారనీ ..ఏపీకి న్యాయం జరిగేలా ఆయన  కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఏపీ ఆధారపడలేదనీ..చట్టంలో వున్నవాటినే డిమాండ్ చేస్తున్నామన్నారు. అన్ని హామీలను సాధిస్తామనే నమ్మకం వుందని ఆయన పేర్కొన్నారు. 

అమరావతికి తరలనున్న మరిన్ని శాఖలు..

హైదరాబాద్ : ఏపీ రాజధానికి ఇప్పటికే కొన్ని ప్రధానమైన శాఖలు తరలివెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా మరిన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు..దస్త్రాలు తరలనున్నాయి. దీంట్లో హోం, మున్సిపల్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు గురువారం నాడు తరలనున్నారు. బుధవారం మ,3గంటలకు హోం, మున్సిపల్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అమరావతికి బయలుదేరటానికి సిద్ధంగా వున్నారు. 

సెప్టెంబర్ 11న ఎంసెట్ -3..

హైదరాబాద్ : హైదరాబాద్: ఎంసెట్-3 ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఈమేరకు ఇవాళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తేదీలను ప్రకటించింది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఎంసెట్-3 కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ యాదయ్య వ్యవహరించనున్నారు. కాగా, ఎంసెట్-3 నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం మళ్లీ జేఎన్‌టీయూకే అప్పగించిన విషయం తెలిసిందే.

ట్యాంకర్-ఆటో ఢీ..ఇద్దరు మృతి..

గుంటూరు : రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరగిపోతున్నాయి. బైటకు వెళితే క్షేమంగా తిరిగి వస్తామో రామో నమ్మకం వుండటంలేదు. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల అతివేగం ఒక కారణమైతే..మద్యం తాగి వాహనాలను నడపటం మరో కారణంగా చెప్పుకోవచ్చు...ఇటువంటి ప్రమాదమే గుంటూరు జిల్లాలో బొల్లాపల్లి మండలం మేళ్ళవాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ -ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

పుష్కర పనుల అలసత్వంపై బాబు ఆగ్రహం..

విజయవాడ : పుష్కరాలపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష ముగిసింది. పుష్కర ఏర్పాట్ల గురించి చంద్రబాబుకు అధికారులు వివరించారు. పనుల్లో జరుగుతున్న అలసత్వంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టు లో పెట్టటంతోపాటు చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. రేపటి నుండి పుష్కర ఏర్పాట్లను పరిశీలిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. కాగా ఇప్పటికే అధికారులను...కాంట్రాక్టర్లను పలుమార్లు సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే.

కుప్పకూలిన మరో నిర్మాణం..

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నిర్మాణాలు కుప్పకూలటం రివాజుగా మారిపోయింది. పాతభవనాలు కూలిపోవటం ఒకవంతుగా వుంటే..నిర్మాణదశలో వున్న భవనాలు..కమాన్ లు  కూలిపోవటం పట్ల అధికారులు..కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..అవినీతి ప్రధానంగా కనిపిస్తోంది. వీరి నిర్లక్ష్యానికి..అవినీతి దాహానికి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి సంఘటనే భాగ్యనగరంలో  నిర్మాణం కుప్పకూలిపోయింది. ఈ ఘనటలో ముగ్గురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

ఫోర్త్ క్లాస్ విద్యార్థిపై టీచర్ల అరాచకం..

చండీగఢ్: విద్యార్థుల పట్ల స్కూలు యాజమాన్యాలు అమానుష చర్యలకు పాల్పడుతున్నాయి. పలు సంఘటనలు దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఫీజులు కట్టలేదని..అల్లరి చేస్తున్నారనీ..హోం వర్క్ చేయలేదని విద్యార్ధులపై హింసకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనే హర్యానాలో జరిగింది. హోం వర్క్ చేయలేదని నాలుగో తరగతి విద్యార్థి పట్ల టీచర్లు అమానుషంగా ప్రవర్తించారు. సదరు విద్యార్థిని చైన్లతో కట్టేసి హింసించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో బాలుడ్ని కాపాడారు. దీనిపై శిశు సంక్షేమ శాఖ విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  

హోదాపై జైట్లీకి స్పష్టం చేసిన చంద్రబాబు..

విజయవాడ: ఏపీ ప్రత్యేక హోదా విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫోన్‌ చేశారు. సుమారు అరగంటపాటు చంద్రబాబుతో ఫోన్‌‌లో జైట్లీ మంతనాలు జరిపారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీపై ప్రకటన ఇవ్వాల్సిందే అని బాబు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్లపాటు ఎదురు చూశాం.. ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని..రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని చంద్రబాబు మంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవుసరముందని పేర్కొన్నారు. అందుకే ఎంపీలు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎంసెట్2 లీక్...కన్వీనర్ తొలగింపు..

హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ అంశంపై తెలంగాణ సర్కార్ అధికారులపై చర్యలు తీసుకోవటానికి పూనుకుంది. దీంతో కన్వీనర్‌ పదవి నుంచి రమణారావును తొలగించింది. మరికొంతమంది అధికారులపై కూడా వేటు పడే అవకాశమున్నట్లు సమాచారం.

ఇరువర్గాల మధ్య దాడి..5గురికి గాయాలు..

అనంతపురం : ఉరవకొండ మండలం పెద్ద ముస్తూరులో ఉద్రిక్తత నెలకొంది. వేరు శెనగ పంటను ధ్వంసం చేశారని ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇనుపరాడ్లతో ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురుకి తీవ్రంగా గాయాలవ్వగా..వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

పుష్కరాల ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష..

విజయవాడ : కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు చినరాజప్ప, నారాయణ, మాణిక్యాల రావు హాజరయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

మెదక్ : సిద్ధిపేట మండలం తడకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సెర్ఫ్..నరేగా ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు ..

హైదరాబాద్: సెర్ప్, ఉపాధి హామీ పథకం ఉద్యోగుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రి జూపల్లి సెర్ప్ సీఈవో సంబంధిత అధికారులతో కేసీఆర్ సమీక్షించారు. సెర్ప్, నరేగాలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలపై చర్చించారు. ఈ క్లస్టర్ కో-ఆర్డినేటర్ల వేతనం ప్రస్తుతం రూ.6,150 ఉంది. దీన్ని రూ.12,000కు..మిగతా సెర్ప్ ఉద్యోగులకు 30 శాతం...ఫీల్డ్ అసిస్టెంట్లకు 6,982 నుండి రూ.10,000కు పెంచారు. నరేగాలోని మిగతా ఉద్యోగులకు 20శాతం పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని ఆదేశించారు.

వరదల ధాటికి 20 ఖడ్గమృగాలు మృతి..

అస్సోం  : అస్సోంను వదరలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల ధాటికి ప్రజలేకాదు..జంతువులు కూడా మృత్యువాతపడ్డాయి. రాష్ట్రంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్‌ పార్కులో 20 ఖడ్గమృగాలు ప్రాణాలు కోల్పోయాయి. ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన ఈ నేషనల్‌ పార్కులో దాదాపు 250 జంతువులు మృత్యువాతపడ్డాయి. ఇందులో 20 రైనోలు ఉన్నాయి. చనిపోయిన రైనోల్లో ఎక్కువగా పిల్లలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు నేషనల్‌ పార్కు నుంచి 9 ఖడ్గమృగం పిల్లలు సహా 200 జంతువులను కాపాడారు.

బాబుతో మాట్లాడా : జైట్లీ

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. లోక్ సభలో ఏపీ ఎంపీలంతా కలిసికట్టుగా ఆందోళన నిర్వహిస్తుండడంతో జీరో అవర్ తరువాత సభ రెండుసార్లు వాయిదా పడింది. దీనిపై స్పందించిన మంత్రి జైట్లీ లోక్ సభలో మాట్లాడుతూ..ఏపీ సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని అన్నారు. సమస్యల పరిష్కారానికి కట్బుబడ్డామన్నారు.

హోదా తక్క వేరేది వద్దు : వైసీపీ ఎంపీలు

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయని...ప్రత్యేక హోదా తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై స్పీకర్ చర్చకు అవకాశమిస్తామన్నారని తెలిపారు. సభ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హోదా హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

గవర్నర్ తో టీ.కాంగ్రెస్ నేతల భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు.  ఎంసెట్ 2 లీక్ పై బాభులైన మంత్రులను వెంటనే బర్త్ రఫ్ చేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలల్లో కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటంపై నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో భేటీ అయినవారిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కమార్ రెడ్డి, భట్టి విక్రమార్క,డీకే అరుణ, సంపత్, పొన్నం, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు. 

15:45 - August 2, 2016

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో మమత సర్కార్‌ ఫాసిస్ట్‌ దాడులకు నిరసనగా వామపక్షాల ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్‌ ఆవరణలో నిరసన తెలిపారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వీటిని నిరసిస్తూ వామపక్షాలు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.

15:41 - August 2, 2016

ఏలూరు : ఏపీ బంద్ లో భాగంగా నిరసన తెలుపుతున్న వైసీపీ నేతలను, వామపక్షనేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. వైసీపీ, వామపక్ష నేతలను విడుదల వెంటనే విడుదలచేయాలంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ ఆందోళనకు దిగింది. 
'హోదా' ఆందోళనలతో అట్టుడుకుతున్న నెల్లూరు 
ప్రత్యేక హోదా బంద్‌తో నెల్లూరు జిల్లా దద్దరిల్లింది. వామపక్ష పార్టీలు, వైసీపీ నేతల ఆందోళనలు, రాస్తారోకోలతో అట్టుడుకుతోంది. మరోవైపు ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నెల్లూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్విహిస్తున్న సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. సూళ్లూరుపేటలో వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు ఆత్మకూరులో ఎమ్మెల్యే గౌతంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

 

పెట్రోల్ బాంబులతో మంత్రి ఇంటిపై దాడి..

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నయీం అక్తర్‌ ఇంటిపై ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు. ఘటన జరిగిన సమయంలో మంత్రి నయీం ఇంట్లో ఉన్నారు. కాగా ఈ ఘటనలో మంత్రి నయీం అక్తర్‌తో పాటు కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి ..నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

15:37 - August 2, 2016

ఢిల్లీ : ఏపికి తక్షణమే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఏపి, తెలంగాణ మధ్య రగులుతున్న హైకోర్టు విభజన అంశాన్ని త్వరగా తేల్చాలని రాజ్యసభలో కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హైకోర్టు విషయంలో ఏపి ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. హైకోర్టును విభజించకపోవడం వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికే తెలంగాణ న్యాయవాదుల బృందం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. గత 3 నెలలుగా తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగడం వల్ల న్యాయవ్యవస్థ స్తంభించిందన్నారు.

 

కేంద్రం ఇచ్చిన నిధులు ప్రహరీలకు సరిపోవు : గంటా

హైదరాబాద్ : కేంద్రం విద్యాసంస్థలకు ఇచ్చిన నిధులు ప్రహరీ గోడలకు కూడా సరిపోవని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. ఏపికి ఇస్తాన్న ప్రత్యేక హోదా అంశాన్ని తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన మాటను గంటా విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఉద్యమించకముందే కేంద్రం స్పందిస్తే మంచిదన్నారు.విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వాలని మంత్రి గంటా కోరారు.

భాగ్యనగరంలో డెంగ్యూ కలకలం..

హైదరాబాద్ : నగరంలో మళ్లీ డెంగ్యూ కలకలం సృష్టిస్తోంది. డెంగ్యూతో బాథపడుతూ రాములు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఓ లాడ్రీషాపుక పనిచేసే రాములు గత నెలరోజులుగా డెంగ్యూతో బాధపడుతున్నాడు. అమీర్ పేటలోని ఓ ప్రయవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాములు మంగళవారం నాడు మృతి చెందాడు. 

ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి వుంది : జైట్లీ

ఢిల్లీ : ఏపీ సమస్యలపై చర్చలు జరుపుతున్నామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. లోక్ సభలో మంత్రి మాట్లాడుతూ..ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనను అర్థం చేసుకున్నామన్నారు. ఏపీ సమస్యలను పరిష్కరించటనికి కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఏపీకి సహకారం అందించేందుకు కేంద్రం కట్టుబడి వుందని తెలిపారు. ఏపీ ఎంపీల డిమాండ్లు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాకపోతే డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. సభ సజావుగా సాగేందుకు ఎంపీలంతా సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

కృష్ణమ్మ పుష్కరాలకు టీటీడీ సేవలు..

తిరుమల: కృష్ణా పుష్కరాలకు తితిదే తరపున విస్తృత ఏర్పాట్లు చేయాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. తిరుమల లో తితిదే పాలక మండలి ఈరోజు సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, మండలి సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీటీపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్వారకా తిరుమల వీఐఆర్‌ఆర్‌డీ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి ఇస్తున్న రూ.2లక్షల నిధులను రూ.8లక్షలకు పెంచింది.

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు..

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో నాలుగు రోజుల క్రితం జరిగిన అర్చన అనే మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. బంగారం, డబ్బు కోసమే అర్చనను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులుగా చంద్రాయణగుట్ట, బండ్లగూడకు చెందిన రాజ్‌కుమార్, రాములు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎంసెట్ 2 రద్దే ఉత్తమం : హైకోర్టు

హైదరాబాద్ : ఎంసెట్ 2 ను లీకేజీపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎంసెట్ 2ను రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తేనే ఉత్తవం అని కోర్టు పేర్కొంది. దీంతో 2,3 రోజుల్లో షెడ్యూల్ ప్రకటిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 

విద్యా డైరెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : లక్డీకపూల్ లోని విద్యా డైరెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు గంటలుగా మధ్యహ్నాం భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. మధ్యహ్నా భోజన పథకాన్ని ప్రయివేటు కాంట్రాక్టులకు అప్పగించటాపికప వ్యతిరేకిస్తూ  వారు అందోళన చేపట్టారు.

14:51 - August 2, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం వివక్ష చూపడమంటే..నాడు 5 కోట్ల మంది ప్రజలకిచ్చిన వాగ్ధానాలు తప్పడమే అని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ధ్వజమెత్తారు. బీజేపీ నేతలకు రెండు నాలుకల ధోరణి తగదని హితవు పలికారు. మోడీ పెద్దన్న పాత్ర వహించి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పెట్టిన అన్నీ హామీలను నెరవేర్చాలన్నారు. హోదాపై ఏపీ ఎంపీలు పార్టీలకతీతంగా మాట్లాడాలన్నారు.

14:48 - August 2, 2016

హైదరాబాద్ : ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మోడీ సర్కార్‌పై స్వరం పెంచారు. నాడు పార్లమెంట్‌ సాక్షిగా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న జైట్లీ, వెంకయ్యనాయుడు.. ఇప్పుడు సాంకేతిక కారణాలతో ఇవ్వలేమని చెప్పడం శోచనీయమన్నారు. విభజన సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తిస్తుందన్నారు. ఏపీకి గోరంత సాయం చేసి కొండంతగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. 

14:45 - August 2, 2016

ఢిల్లీ : పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనిచెప్పి బీజేపీ మోసం చేసిందని మండిపడుతున్నారు. ఏపీకి హోదా దక్కేవరకు తాము నిరసన తెలుపుతూనే ఉంటామని వైసీపీ ఎంపీలు ప్రకటించారు. 

ఉగ్రవాది అబు జిందాల్‌ కు జీవిత ఖైదు..

మహారాష్ట్ర : లష్కరే ఉగ్రవాది అబు జిందాల్‌కు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం జీవిత ఖైదు విధించింది. 2006 ఆయుధాల తరలింపు కేసులో శిక్ష ఖరారు చేసింది. అతనితోపాటు మరో ఆరుగురికి కూడా యావజ్జీవశిక్ష విధించింది. మరో ముగ్గురికి 8 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అబు జిందాల్‌ 2011 ముంబై దాడుల కేసులో కూడా నిందితుడు.

14:42 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారం... హైకోర్టు వద్దకు చేరడంతో.. తాజా పరిస్థితులపై.. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో క్యాంప్‌ ఆఫీస్‌లో భేటీఅయ్యారు. ఈ భేటీకి ఉన్నతవిద్యామండలి, హెల్త్‌యూనివర్సిటీతోపాటు జేఎన్టీయు అధికారులు కూడా హాజరైయ్యారు. ఎంసెట్‌ వ్యవహారంలో మధ్యాహ్నం కోర్టుకు ఇవ్వనున్న నివేదికపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  ఢిల్లీ కేంద్రంగానే ఎంసెట్‌-2 లీకేజీ జరిగిందని సీఎం అన్నారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు సీఎం. ఈసాయంత్రానికి ఎంసెట్‌ పరీక్షకు  సంబంధించి తాజా షెడ్యూల్‌ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ విద్యాశాఖను ఆదేశించారు. 
ఎంసెట్‌-2 లీకేజీ బాధాకరం : సీఎం కేసీఆర్‌ 
ఎంసెట్ -2 ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం బాధాకరం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఎంసెట్‌-3 నిర్వహిస్తున్నామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిస్థితిని అర్ధం చేసుకుని సహకరించాలని సీఎం కోరారు. పాత హాల్‌టిక్కెట్ల తోనే ఎంసెట్‌-3కి హాజరుకావొచ్చన్నారు. ఎంసెట్‌--2 రాసిన అభ్యర్థులు ఎంసెట్‌-3కి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దన్న ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసున్నామని.. అయినా మరోసారి విద్యార్థుల చేత పరీక్షరాయించడం బాధాకరమే అన్నారు సీఎం. ఈ సాయంత్రానికి ఎంసెట్‌ పరీక్షకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. 
ఎంసెట్‌-2 లీకేజీ నిందితులు గుర్తించాం : సీఎం 
మరోవైపు ఎంసెట్‌-2 లీకేజీ నిందితులను గుర్తించినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ముకుల్‌జైన్‌, మయాంకర్‌ శర్మ, సునీల్‌సింగ్‌లతో పాటు ఇర్ఫాన్‌లను ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారని సీఎం చెప్పారు. ఈ కుట్రలో మొత్తం 34 బ్రోకర్లు ఉన్నట్టు తేలిందన్నారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్టుచేసిన పోలీసులు.. మరో ఆరుగురి ఆచూకీని కూడా కనిపెట్టారని సీఎం తెలిపారు. లీకేసీ స్కాంలో మొత్తం 2వందల మంది విద్యార్థులు  బ్రోకర్లతో సంప్రదింపులు జరిపినట్టు తేలిందన్నారు. తాజాగా ఎంసెట్‌-3 నిర్వహణకోసం కొత్తగా కోకన్వీనర్‌ను సభ్యులను నియమించాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించామని కేసీఆర్‌ అన్నారు. 

 

గత్యంతరం లేకనే ఎంసెట్ 3 : కేసీఆర్

హైదరాబాద్ : ఎంసెట్ 2ను రద్దు చేస్లున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ అవ్వటం బాధకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత్యంతరం లేకనే ఎంసెట్ 3 పరీక్షను నిర్వహింస్తున్నామనీ ..విద్యార్థులు తల్లిదండ్రులు అర్థం చేసుకుని సహరించాలని కేసీఆర్ కోరారు. ఈరోజు సాయంత్రానికి ఎంసెట్ 3 షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. స్టడీ మెటీరియల్ ను ఆన్ లైన్ లో పొందుపరుస్తామని తెలిపారు. పాత హాల టికెట్లతోనే విద్యార్థులకు పరీక్షకు అనుమతిని కల్పిస్తున్నామన్నారు. జేఎన్టీయూకే ఎంసెట్ 3 నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తున్నామన్నారు.

వికలాంగుల స్కూల్లో ఫుడ్ పాయిజన్..

పంజాబ్: రాష్ట్రంలోని కపుర్తాలలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మానసిక వికలాంగుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

14:12 - August 2, 2016

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీలో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వైసీపీ నేడు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు మద్దతునిచ్చాయి.
నగేష్ (సీనియర్ విశ్లేషకులు), శ్రీరాములు (టిడిపి), కరణం ధర్మశ్రీ (వైసీపీ) పాల్గొనిఅ భిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

13:42 - August 2, 2016

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధిస్తున్నారు. కానీ ఆనాది నుండి మహిళలపై వివక్షత కొనసాగుతూనే ఉంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇస్తున్నారా ? అన్ని రంగాల్లో ఇది జరుగుతుందా ? ఈ అంశంపై టెన్ టివి మానవి 'వేదిక' చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఈశ్వర్ (సీఐటీయూ), పవన్ (ఇన్నో మైన్స్, హెచ్ఆర్ మేనేజర్), శ్రీనివాస్ (ఎసెంజర్, హెచ్ఆర్ మేనేజర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

13:35 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారం హైకోర్టు వద్దకు చేరడంతో తాజా పరిస్థితులపై మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో క్యాంప్‌ ఆఫీస్‌లో భేటీ అయ్యారు. ఎంసెట్‌ వ్యవహారంలో మధ్యాహ్నం కోర్టుకు ఇవ్వనున్న నివేదికపై చర్చ జరిపారు. మధ్యాహ్నం 3గంటలకు కోర్టుకు నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం బాధాకరమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయంలో విద్యార్థులు..తల్లిదండ్రులు అర్థం చేసుకుని వ్యవహరించాలని కోరారు. మొత్తం 34 మంది బ్రోకర్లు ఉన్నారని, ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్పాన్ లు ప్రధాన సూత్రధారులని తెలిపారు. జేఎన్టీయూకే ఎంసెట్ -3 నిర్వాహణ బాధ్యతలు అప్పచెబుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు పరీక్ష ఫీజు మాఫీ..ఉచిత ప్రయాణం..ఆన్ లైన్ లో స్టడీ మెటిరీయల్ ఉంచనున్నట్లు తెలిపారు. పాత హాల్ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షకు అనుమతినించనున్నట్లు వెల్లడించారు. 

13:27 - August 2, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఉద్యమాలు ఉధృతమౌతున్నాయి. ఏపీలో బుధవారం బంద్ కొనసాగుతుండగా పార్లమెంట్ లో టిడిపి, వైసిపి ఎంపీలు ఆందోళన కొనసాగించారు. కేంద్రం స్పష్టమైన వైఖరి తెలపకపోడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వేర్వేరుగా వైసిపి, టిడిపి ఎంపీలు ప్లకార్డుల ద్వారా నిరసన చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి లోక్ సభలో ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే టిడిపి ఎంపీలు నినాదాలు చేస్తూ సభ కార్యక్రమాలకు అడ్డు తగిలారు. ఈ ఆందోళనలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ సుమిత్రా మహజన్ కొనసాగించారు. ఆందోళనలు..ప్లకార్డులు ప్రదర్శించకూడదని స్పీకర్ పలుమార్లు సూచించినా తెలుగు ఎంపీలు పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. లోక్ సభలో జరుగుతున్న పరిణామాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి స్పీకర్ తీసుకెళ్లారు. అనంతరం ఏపీ ఎంపీల ఆందోళనపై లోక్ సభ స్పీకర్ స్పందించారు. ఏపీ ఎంపీలను లోక్ సభ స్పీకర్ తన ఛాంబర్ కు పిలిపించి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తో జరిగిన మీటింగ్ కు టీడీపీ, వైసీపీ ఎంపీలు హాజరయ్యారు. 

సాయంత్రానికి ఎంసెట్ 3 షెడ్యూల్ - సీఎం..

హైదరాబాద్ : గత్యంతరం లేకనే ఎంసెట్ 3 పరీక్ష ను నిర్వహించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సాయంత్రానికి ఎంసెట్ 3 పరీక్ష షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. కాసేపటి క్రితం మంత్రులు లక్ష్మారెడ్డి, కడియంలు భేటీ అయ్యారు. 

న్యాయవాదులపై కోర్టు ధిక్కరణ కేసు..

హైదరాబాద్ : న్యాయవాదులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. జడ్జీల విధులకు ఆటంకం కలిగించారంటూ హైకోర్టు కేసు నమోదు చేసింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉద్యమ అంశంలో కేసు నమోదు చేసింది. ఉద్యమంలో పాల్గొన్న 13 మంది లాయర్లపై విచారణకు ఆదేశించింది. 

ఔరంగాబాద్ అక్రమాయుధ కేసులో ఏడుగురికి జీవిత ఖైదు..

ముంబై : 2006లో ఔరంగాబాద్ అక్రమాయుధాల కేసులో అబు జిందాల్ తో సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరికీ 14 ఏళ్లు, ముగ్గురికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 

తెలుగు ఎంపీల ఆందోళనపై స్పందించిన లోక్ సభ స్పీకర్..

ఢిల్లీ : తెలుగు ఎంపీలు చేస్తున్న ఆందోళనపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ స్పందించారు. తన ఛాంబర్ కు రావాలని ఎంపీలకు సూచించారు. టిడిపి, వైసిపి ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ సూచించారు. 

గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఉత్తమ్, భట్టి, షభ్బీర్, ఇతర నేతలు హాజరయ్యారు. కొత్త కమిటీల ఏర్పాట్లు, మల్లన్న సాగర్ అంశం.. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. 

ఎంసెట్ విచారణ మధ్యాహ్నానికి వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీపై విచారణను హైకోర్టు విచారణ చేపట్టింది. లీకేజీపై విచారణలో భాగంగా లీకేజీపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు సూచించింది. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. 

చెవిరెడ్డి అరెస్టు..

చిత్తూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడుతామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రేణిగుంట స్టేషన్‌‌కు తరలించారు.

లోక్ సభ మరో మారు వాయిదా..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసిపి, టిడిప ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సభ ప్రారంభం కాగానే ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేపట్టారు. ప్లకార్డుల ప్రదర్శన సరికాదని స్పీకర్ వారించినా తెలుగు ఎంపీలు వినిపించుకోలేదు. ఈ క్రమంలో తొలుత 15 నిమిషాల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఏపీ ఎంపీల నిరసనల్లో మార్పు లేకపోవడంతో తిరిగి సభను స్పీకర్ వాయిదా వేశారు. 

ఎంసెట్ 2 లీకేజ్ పై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంసెట్ రద్దు, కొత్త పరీక్ష నిర్వహణ అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

12:56 - August 2, 2016

అమెరికా : భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు మేరీలాండ్‌ నగరం నీటమునిగింది. నీటి ఉధృతికి కార్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముంపు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ఒక వ్యక్తి తన కారును పట్టుకొని తీవ్రంగా ప్రయత్నించాడు. వరదల కారణంగా ఇద్దరు మృతి చెందగా, సిటీలో 25 భవనాలు దెబ్బతిన్నాయి. మిడ్ వెస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. మేరీలాండ్ గవర్నర్ లారీ హోగన్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు.

12:55 - August 2, 2016

హైదరాబాద్ : ఆగస్టు భయం టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఆగస్టు అంటేనే సంక్షోభాల నెలగా తెలుగుదేశం నేతలు భావిస్తారు. గతంలో ఆగస్టులో కీలక సంక్షోభాలను చవిచూసిన టీడీపీకి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా భయం పట్టుకుంది. బీజేపీ, ఎన్డీయేలతో పార్టీ తెగతెంపులు చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న చర్చ తెలుగు తమ్ముళ్లను వేధిస్తోంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చదవండి..

నేతల్లో వణుకు...
ఆగస్టు నెల తెలుగుదేశం నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆగస్టులో ఏదో ఒక సంక్షోభం ఎదురవుతూనే ఉంది. భారీ స్థాయి కుదుపు నుంచి చిన్న చితక ఎదురు దెబ్బలను ఈనెలలోనే చవిచూసింది. 1983లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1984 ఆగస్టు 15న నాదెండ్ల భాస్కరరావు రూపంలో మొదటిసారి ఆగస్టులోనే షాక్‌ తగిలింది. టీడీపీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు....కాంగ్రెస్‌ మద్దతుతో ఎన్టీఆర్‌ సర్కార్‌ను కూల్చివేసి 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు 31 రోజులు పాటు ఏపీని పాలించారు. అప్పట్లో ఈ రాజకీయ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి దేశంలో రాజకీయ సమీకరణల మార్పుకు దారితీసింది. 1984 నుంచే ఆగస్టు అంటేనే టీడీపీ నేతలకు భయం పుట్టుకొస్తుంది.

1995 ఆగస్టు లో రెండోసారి సంక్షోభం..
1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1995 ఆగస్టులోనే రెండో సంక్షోభం ఎదురయ్యింది. ఆ సంవత్సరం ఆగస్టు 23న చంద్రబాబునాయుడు... ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆగస్టు అంటేనే టీడీపీ నేతలు హడలిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కూడా ఆగస్టులో సంక్షోభ చాయల కనిపిస్తున్నాయన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి.

రాజకీయాల్లో అలజడి..
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన రాష్ట్రంలో తీవ్ర రాజకీయ అలజడికి దారితీసింది. హోదా సాధన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయంటూ ప్రతిపక్షాలు ఇవాళ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. పార్లమెంటు లోపల, వెలుపల టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ బంధం తెగిపోతుందేమోనన్న భయం తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. ఆగస్టు సంక్షోభం ఎప్పుడు... ఎలా .. ముంచుకొస్తుందో చెప్పలేమంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

12:51 - August 2, 2016

విజయవాడ : ఏపీలో ప్రత్యేకహోదా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కృష్ణాజిల్లా మచీలీపట్నంలో బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఆర్టీసీ బస్సు డిపోముందు వైసీపీ నేతలు బైఠాయించడంతో బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. దుకాణాలు, షాపింగ్‌మాల్స్ మూతపడ్డాయి. పట్టణంలో వందలాదిగా వైసీపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

కర్నూలులో..
కర్నూలు జిల్లాలో ప్రత్యేక హోదా బంద్‌ కొనసాగుతోంది. అఖిలపక్ష నాయకుల ఆందోళనలు, నిరసనలతో హోరెత్తుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సహా సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా లో ప్రత్యేకహోదా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏలూరులో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వామపక్షాలు, వైసీపీ ఆధ్వర్యంలో బంద్‌ పూర్తిస్థాయిలో జరుగుతోంది. ద్వారకా తిరుమలలో షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసనలను దిగుతున్నారు.

ప్రకాశం జిల్లాలో..
ఏపీలో ప్రత్యేకహోదా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలు బంద్‌పాటిస్తున్నారు. ప్రకాశంజిల్లాలో లెఫ్ట్‌పార్టీలు, వైసీపీ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. ప్రైవేట్‌స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన యాజమాన్యాలు బంద్‌కు మద్దతిచ్చాయి. ఆర్టీసీ డిపోల ముందు పెద్ద ఎత్తున పోలీసుబలగాలు మోహరించాయి. బీజేపీ సర్కార్‌ దిగివచ్చేవరకు నిరసనలు కొనసాగుతాయని ఆందోళనకారులు తేల్చిచెబుతున్నారు.

చలసాని డిమాండ్స్..
జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన రాయితీలు రాకుండా పోతాయని మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లుకు ఏ పార్టీ ఆమోదం తెలిపినా.. ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ ఎంపీలంతా జీఎస్టీ బిల్లును వ్యతిరేకించాలన్నారు. 

12:45 - August 2, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలు నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. మరోవైపు వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఏపీ ఎంపీల ఆందోళన మధ్యే సభ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎదుట ఏపీ టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మాటమార్చడాన్ని ఎంపీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏపీకి హోదా దక్కేవరకు తాము నిరసన తెలుపుతూనే ఉంటామని ప్రకటించారు. 

లోక్ సభ స్పీకర్ అసంతృప్తి..
టిడిపి, వైసిపి ఎంపీల తీరుపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో నినాదాలు చేయడం సరికాదని, సభా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపీలు నడుచుకోవాలని సూచించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగలడం సమంజసం కాదని, సభలో ప్రతి రోజు నినాదాలు చేయడం మంచిది కాదన్నారు. పదే పదే సభను అడ్డుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. 

12:43 - August 2, 2016

ఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అసోం, బీహార్‌, ఒడిశా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రల్లో వరదలు తీవ్రరూపం దాల్చాయి. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజు కోజుకు పెరుగుతోంది. బీహార్‌, అసోంలోనే వంద మందికి పైగా మరణించారని అధికారులు లెక్కలు తేల్చారు. అనధికార గణాంకాల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అంచనావేస్తున్నారు. బీహార్‌లోని 12 జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. 28 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. బీహార్‌లో యాభై మందికి మృత్యువాతపడితే, కతీహార్‌ జిల్లాలోనే 12 మందికిపైగా మరణించారు. వేలాది ఇళ్లు నేలకూలిపోయాయి. వేలాది హెక్టార్లలలో పంటలు దెబ్బతిన్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌ జిల్లా కహల్‌గావ్‌ దగ్గర గంగానది ప్రమాదస్థాయిని దాటి పొంగి ప్రవహిస్తోంది. దీంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరదల్లో మునిగిపోయిన రైనోలు, జింకలు..
అసోంలోని 21 జిల్లాలు వరదలతో నష్టపోయాయి. పదకొండు లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. వర్షాలు, వరదలకు వేలాది ఇళ్లు నేలకూలాయి. లక్షకుపైగా హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. పశుసంపదకు కూడా నష్టం వాటిల్లింది. లక్షలాది మంది వరద బాధితులు సహాయ శిబిరాలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బ్రహ్మపుత్ర నది పొంగి ప్రవహిస్తుండటంతో కజిరంగ జాతీయ ఉద్యానవనంలో 85 శాతం నీట మునిగింది. పార్కు లోని 13 రైనోలు, 15 జింకలు, అరుదైన పక్షలు వరదల్లో మునిగిపోయాయి. మరో వంద జంతువులను రక్షించారు.

ఒడిశాలో పిడుగులు పడి మూడు రోజుల్లో 52 మంది మృతి..
ఒడిశాలో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగుపాటుకు మూడు రోజుల్లో 52 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రల్లో కూడా వరద పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌-బద్రీనాథ్‌, రిషికేష్‌-గంగోత్రి జాతీయ రహదారులను మూసివేశారు.దీంతో చార్‌ధామ్‌ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వరదలు సంభవించాయి. పరిస్థితిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. 

12:39 - August 2, 2016

వరంగల్ : అతనో చీకటి రాజు... అవినీతి సామ్రాట్... ఎవరైనా ఎదురు తిరిగితే దౌర్జన్యమే... తాను చెప్పిందే వేదం... పవర్ ఎక్కడుంటే సార్ అక్కడే.. ప్రభుత్వాలేవైనా ఈ దాదాకు కొమ్ముకాయాల్సిందే... పాపమేదైనా వెనకేసుకు రావాల్సిందే... ఇంతకీ ఎవరాయన..? తెలుసుకోవాలంటే చదవండి..అతని కన్ను పడితే ఖతమే.. ఆరా తీసినా.. అడ్డు చెప్పినా ఇక అంతే సంగతులు... ఇదిగో ఇతనే అతను... టీఆర్‌ఎస్ నేతగా వరంగల్ జిల్లాలో చక్రం తిప్పతున్నాడు. గిరిపుత్రుల అమాయకపు రాజ్యంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన అవినీతి సామ్రాట్. బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులతో గూడూరు అడవులను ఏలుతున్న రారాజు. అప్పటి కాంగ్రెస్ నేత.. ఇప్పటి టీఆర్‌ఎస్ నేత ఖాసీం నాటి కాంగ్రెస్ నేతల అండతో పచ్చని వనాన్ని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేశాడు. నర్సంపేట, మహబూబాబాద్ ప్రాంతాల్లోని పాకాల అడవులకు దట్టమైన అరణ్యమంగా పేరుంది. పాకాల, గూడూరు ప్రాంతాల్లో సహజసంపద నిక్షిప్తమైన అటవీ ప్రాంతం. అప్పటి కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అండను ఆసరా చేసుకుని గూడూరు అడవుల్లోని భూమిని కొల్లగొట్టారు ఖాసిం. కిరాయి పోడు దారులను, అమాయకపు గిరిజనులు ఉసిగొల్పి వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని నేల మట్టం చేసి మైదానంగా మార్చేశారు.

ఖాసీం పేరు చెబితే వణికిపోతున్న గ్రామాలు..
ఖాసీం.. ఈ పేరు చెబితే గూడూరు, కొంగరగిద్ద, మట్టెవాడ, ఊట్ల గ్రామాలు ఉలిక్కి పడుతాయి. ఖాసీం కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. దాదాపు 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నాడు. అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ఆశీస్సులు పుష్కలం. ఖాసీం అప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రియ శిష్యుడు. బాహ్య ప్రపంచానికి చెబుతామంటే రాజకీయ పలుకుబడి నోరు నొక్కేస్తుంది. ప్రభుత్వ అండ గొంతు నులిమేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాల అండతో ఖాసీంకు అటవీ గ్రామాల్లో పట్టా పగ్గాల్లేకుండా పోయాయి. అటవీ గ్రామాల్లో ఖాసీం ఆడిందే ఆట.. పాడిందే పాట.. కనుసైగ చేస్తే చాలు అనుచరులు క్షణాల్లో యాక్షన్ చేస్తారు. తన దందాకు అడ్డొస్తే ఎవరైనా సరే దౌర్జన్యాలకు పాల్పడేవాడు. మాట వింటే లంచం ఇచ్చేవాడు. లేదంటే బెదిరింపులకు పాల్పడేవాడు.

గిరిజనుల పోడుభూముల్లో బోర్లువేసి మరీ సాగు..
ఖాసీంకు వివాదాలు కొత్తేమి కాదు. అప్పటీ సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేయడాన్ని అవకాశంగా తీసుకుని మచ్చర్ల శివారు వూట్ల సమీపంలో 20 ఎకరాల అటవీ భూమిని అక్రమించాడు. గిరిజనులు అక్రమించిన పోడుభూమిని కొనుగోలు చేసి మొత్తం 20ఎకరాల భూమిని సాగులోకి తీసుకువచ్చాడు. మూడేళ్లక్రితం 20 ఎకరాల భూమి కోసం రెండు బావులను నిర్మించి విద్యుత్‌ సౌకర్యం కూడా కల్పించుకున్నాడు. గతేడాది ఖాసీం పోడుభూమిలోని వ్యవసాయబావిలో అడవిదున్న మృతిచెందింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను ఆరాతీశారు. ఈ క్రమంలో ఖాసీం అక్రమించిన భూమి, అటవీ రాజ్యంలో ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బాగోతాన్ని అటవీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివేదిక అందజేశారు.

ఖాసింకు టీఆర్‌ఎస్ నేతలో లింకులు..
కాంగ్రెస్ హయాంలో గూడూరు ఎస్‌.ఐతో గొడవపడి ఖాసీం అతనిపై దాడిచేశాడు. అప్పుడు టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఖాసీంను దగ్గరుండి అర్థరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లాడు. ఈ విషయం వివాదాస్పదమైంది. గత స్థానికసంస్థల ఎన్నికల్లో ఖాసీం కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వెంటనే ఆ పార్టీకి చెందిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నేత్రుత్వంలో గులాబీ కండువా కప్పుకున్నాడు.

అధికారులు, ప్రజలకు బెదిరింపులు..
ఖాసీం అధికారులు, అటవీ గ్రామాల ప్రజలపై బెదిరింపులకు దిగడంతో ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే కలెక్టర్ కరుణ రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. ఏజెసీ తిరుపతిరావు సుదీర్ఘ విచారణను నిర్వహించిన తర్వాత ఖాసీం ఆగడాలు, దౌర్జ్యన్యాలు, అటవీ భూముల ఆక్రమణపై సమగ్ర నివేదికను సమర్పించారు. వెంటనే కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి ఆరోపణలను నిర్ధారించుకున్న తర్వాత జెడ్పీటీసీ సభ్యుడు ఖాసీంపై చర్యలు తీసుకోవాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ కరుణ ప్రభుత్వానికి నివేదికను పంపారు. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో ఖాసీంపై మంత్రి జూపల్లి వేటు వేశారు. మొత్తంగా ఈ సస్పెన్షన్ వ్యవహారం సంచలనానికి తెరలేపింది. ఒక ప్రజా ప్రతినిధి, అదీ అధికారి పార్టీ సభ్యుడిపైనా పార్టీ సస్పెన్షన్ వేటు వేసిందంటే ప్రభుత్వ సీరియస్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

12:33 - August 2, 2016

హైదరాబాద్ : సెల్ ఫోన్ తీసుకరావడమే విద్యార్థిని చేసిన నేరం. ఆగ్రహంతో ఊగిపోయిన లెక్చరర్ విద్యార్థినిని చితకబాదింది. ఈ ఘటన సైదాబాద్‌లోని లక్ష్మీభాయి కాలేజీలో చోటు చేసుకుంది. క్లాసులోకి సెల్‌ఫోన్‌ తెచ్చినందుకు కోపంతో ఊగిపోయిన లెక్చరర్‌... విద్యార్థిని మంజులను చితకబాదినట్టు స్టూడెంట్స్ చెబుతున్నారు. తీవ్రగాయాలపాలైన మంజుల అపస్మారకంలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజ్ కు వచ్చి లెక్చరర్‌ను నిలదీశారు.

ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసమే పోరాటం - కేవీపీ..

ఢిల్లీ : బుధవారం పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నేత కేవీపీ నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీ పెట్టుకుని ప్ల కార్డు ప్రదర్శిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేయడం లేదని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రం యొక్క సౌభాగ్యం కోసం...యువతకు ఉద్యోగ అవకాశాల కోసం..ప్రత్యేకమైన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం..ఇతరత్రా అంశాల కోసం తాను ఈ బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

12:22 - August 2, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలో ఎంపీల నిరసన చేపడుతున్నారు. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై తీవ్ర విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. బుధవారం పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నేత కేవీపీ నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీ పెట్టుకుని ప్ల కార్డు ప్రదర్శిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేయడం లేదని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రం యొక్క సౌభాగ్యం కోసం...యువతకు ఉద్యోగ అవకాశాల కోసం..ప్రత్యేకమైన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం..ఇతరత్రా అంశాల కోసం తాను ఈ బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోలేదన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటి సంతకాలు..ప్రతి జిల్లాలో ప్రదర్శనలు..మట్టి..మంచినీరు సేకరించడం జరిగిందని తెలిపారు. తద్వారా ఏపీ రాష్ట్రంపై దృష్టి పడే విధంగా ఇవన్నీ చేయడం జరిగిందని, కొద్ది రోజుల్లో ప్రభజనంగా మారుతుందన్నారు. దీనివల్ల ఏపీకి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నట్లు కేవీపీ పేర్కొన్నారు. 

12:16 - August 2, 2016

 

ఆదిలాబాద్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు వ్యవహారంలో ముంపు బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరిగింది. దీనితో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. గుల్లకోట గ్రామాన్ని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచెత్తింది. దీనితో పదికి పైగా గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
20 టీంఎసీల గల ప్రాజెక్టు 143 మీటర్ల ప్రాజెక్టు ఎత్తులో ఉంది. వరద నీరు ఉధృతి అధికంగా ఉంది. కానీ ముంపు బాధితులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. పపునారావసం అందక..నష్టపరిహారం అందక సొంత గ్రామాల్లోనే ఉంటున్నారు
పరిహారం అందక 100కు పైగా కుటుంబాలు ఖాళీ చేయడం లేదు. పరిహారం అందే వరకు ఇళ్లు ఖాళీ చేయమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కానీ ఖాళీ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

గ్రామాన్ని ముంచెత్తిన ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్...

ఆదిలాబాద్ : జిల్లా గుల్లకోట గ్రామాన్ని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంచెత్తింది. పరిహారం అందక 100కు పైగా కుటుంబాలు ఖాళీ చేయడం లేదు. పరిహారం అందే వరకు ఇళ్లు ఖాళీ చేయమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కానీ ఖాళీ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

శిశు విక్రయానికి యత్నిస్తున్న మహిళ అరెస్టు..

రంగారెడ్డి : యాచారం (మం) మాల్ లో శిశు విక్రయానికి ఓ మహిళ యత్నం చేసింది. అప్పుడే పుట్టిన శిశువును రూ. 50 వేలకు విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 

11:58 - August 2, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య అభిప్రాయబేధాలు తారాస్థాయికి చేరాయి. మల్లన్నసాగర్‌ సందర్శించి తీరతామని నిన్న, మొన్నటి వరకు భీష్మ ప్రతిజ్ఞ చేసిన నాయకులు... ఇప్పుడు భేషజాలతో దూరంగా ఉంటున్నారు. నేతల మధ్య నెలకొన్న అనైక్యత, వర్గ విభేదాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. మల్లన్నసాగర్‌ అంశం తెలంగాణ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మధ్య మంటలు రేపింది. ప్రాజెక్టును కట్టితీరతామని ప్రభుత్వం, అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు పరస్పరం చేసుకున్న వాడివేడి ఆరోపణలు, విమర్శలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మల్లన్నసాగర్‌ను అస్త్రంగా ఎంచుకుని కాంగ్రెస్‌ దూకుడు పెంచితే.... సర్కార్‌ కూడా అదేవిధంగా ప్రతిస్పందించడంతో రెండు పార్టీల మధ్య కొద్ది రోజులు యుద్ధ వాతావరణం నెలకొంది.

లాఠీఛార్జ్...
మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీ చార్జ్ తర్వాత కాంగ్రెస్‌ నాయకులు... కేసీఆర్‌ సర్కార్‌ను మరింత టార్గెట్‌ చేశారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే విధంగా తలపెట్టిన చలో మల్లన్నసాగర్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సర్కార్‌తో అమీతుమీ తేల్చుకోవాలన్నంతగా హడావుడి చేశారు. గాంధీభవన్‌ నుంచి మల్లన్నసాగర్‌ బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌ అలీతోపాటు ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఎంత నిర్బంధ కాండ విధించినా మల్లన్నసాగర్‌ వెళ్లితీరతామని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మల్లన్నసాగర్‌ వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చినా... కాంగ్రెస్‌ నేతలు దూరంగా ఉండిపోవడం ఇప్పుడు ఈ అంశంపై పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

హైకోర్టు అనుమతి..
పదిమంది కాంగ్రెస్‌ నాయకులు మల్లన్నసాగర్‌ సందర్శనకు హైకోర్టు అనుమతి ఇచ్చినా... అటువైపు వెళ్లలేపోయారు. బొల్లారం పోలీసు స్టేషన్‌ నుంచే ఇంటిముఖం పట్టారు. దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి హైకోర్టుకు వెళ్లి మల్లన్నసాగర్‌ వెళ్లేందుకు అనుమతి తీసుకురావడం పార్టీ నేతల మధ్య వివాదానికి కారణమయ్యింది. తమతో చర్చించకుండా, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కోర్టుకు ఎలా వెళ్లారని కొందరు నేతలు తమ సహచరుల దగ్గర అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాడుతున్నది తామేనన్న వాదాన్ని దామోదర రాజానర్సింహ వినిపిస్తున్నారు. మల్లన్నసాగర్‌ ఘనత అంతా ముఖ్యనేతలే కొట్టేసుకుపోతున్న అభిప్రాయంతో ఉన్న రాజానర్సింహ... ఆందోళన కార్యక్రమానికి ముఖ్యనేతలను ఆహ్వానించలేదని తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
జానారెడ్డి, షబ్బీర్‌ అలీతో కలిసి మల్లన్నసాగర్‌ గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించిన టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... కూడా దామోదర రాజానర్సింహ వైఖరితో చలో మల్లన్నసాగర్‌ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారని పార్టీ నేతలు చర్చించుకొంటున్నారు. మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టే విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. 

11:33 - August 2, 2016

విజయవాడ : టిడిపి పార్టీది అవకాశవాద రాజకీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్ర బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. వామపక్షాలు, ప్రజా సంఘాలు ఈ బంద్ కు మద్దతు పలికాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో వైసీపీ, వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా మధు టెన్ టివితో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ఎటువంటి హామీలు అమలు కాలేదని, ప్రతిపక్షాలు నిరసనలు..బంద్ లు చేపట్టవద్దని, జపాన్ తరహాలో చేపట్టాలని ప్రభుత్వం పేర్కొనడం జరుగుతోందని విమర్శించారు. దీనిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రదర్శనలు చేయవచ్చు కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలు నిరసనలు..ఆందోళనలు చేయవద్దా అని ప్రశ్నించారు. అవకాశ వాద రాజకీయాల మీద బతుకుతోందని తెలిపారు. విభజన చట్టంలో ఉన్నటువంటి ఎక్కువ భాగం అమలు చేశామని సభలో జైట్లీ పేర్కొనలేదని, నాయకులు మాత్రం అమలు చేశారంటూ బయట చెబుతున్నారని దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హోదా కోసం కేంద్రంపై వత్తిడి తేవడంలో టిడిపి విఫలం చెందిందని, ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న వామపక్షాలను ప్రతిపక్షాలు అణిచివేయాలని చూస్తున్నాయని విమర్శించారు. హోదాపై టిడిపికి చిత్తశుద్ధి ఉంటే విపక్షాలకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. హోదాపై ప్రతిపక్షాలతో కలిసి భవిష్యత్ లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

11:30 - August 2, 2016

గుంటూరు : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్రోహి అని వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టిడిపి, బిజెపి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతినిచ్చాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో సీపీఎం, సీపీఐ, వైసీపీ, ఇతర ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. శాంతియుతంగా నిరసన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేపడుతున్న వారిని అరెస్టు చేసి పీఎస్ లకు తరలించారు. అరండాల్ పీఎస్ వద్ద టెన్ టివితో నేతలు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలని, బంద్ న్యాయమైందన్నారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తేనే జీఎస్టీ బిల్లు ఆమోదిస్తామని పార్టీలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ బిల్లుపై వెంటనే చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలని సూచించారు. ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని, బంద్ విజయం ప్రజల విజయమని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలని చాలా మంది కోరుకుంటున్నారని తెలిపారు. అంతిమ విజయం సాధించేదాక ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

11:13 - August 2, 2016

ఢిల్లీ : ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో బంద్ కొనసాగుతుండగా వైసీపీ, టిడిపి ఎంపీలు వేర్వేరుగా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో ప్రత్యేక హోదాపై వైసిపి, టిడిపి వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాయి. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై కేంద్ర మంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానంపై టిడిపి, వైసిపి, ఇతర నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. విపక్షాలు టిడిపి తీరుపై విమర్శలు గుప్పించాయి. దీనితో ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. సోమవారం లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్టారు.
బుధవారం ఏపీ బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది. దీనికి వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతినిచ్చాయి. ఏపీలో ఆందోళనలు, ఢిల్లీలో ఎంపీల నిరసనలు చేపడుతున్నా కేంద్రం నుండి స్పష్టత రావడం లేదు. ఇప్పటి వరకు కూడా ప్రధాన మంత్రి నుండి అపాయింట్ మెంట్ రాలేదు. టిడిపి నాటకీయంగా వ్యవహరిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది.
మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగి సుజనా చౌదరి ఇతరులతో చర్చించారు. నేడు ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరుకుతుందని, సీఎం చంద్రబాబు నాయుడితో వెంకయ్య..జైట్లీ మాట్లాడుతారని టిడిపి నేతలు ఆశిస్తున్నారు. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదాపై టిడిపి, వైసిపి నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గాంధీ విగ్రహం వద్ద వేర్వేరుగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టారు. 

పోరాటం కొనసాగిస్తాం - ఎంపీ తోట నర్సింహం..

ఢిల్లీ : హోదా కోసం పార్లమెంట్ లో పోరాటం కొనసాగిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరచాలని ఎంపీ తోట నర్సింహం డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కేంద్రం అబద్దమాడుతోందని ఆరోపించారు. ఏపీని పట్టించుకోకపోతే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. కేంద్రం నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బంద్ లతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరుగుతుందన్నారు. 

విద్యార్థినిని చితకబాదిన లెక్చరర్..

హైదరాబాద్ : సైదాబాద్ లక్ష్మీభాయి కాలేజీలో లెక్చరర్ దాష్టీకం బయటపడింది. సెల్ ఫోన్ తీసుకొచ్చిందని మంజుల అనే విద్యార్థినిని లెక్చరర్ చితకబాదింది. దీనితో విద్యార్థిని తీవ్రగాయాలతో నడవలేని పరిస్థితిలో ఉంది. 

పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ, టీడీపీ వేర్వేరుగా ధర్నా..

ఢిల్లీ : పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ ధర్నా చేపట్టింది. ధర్నాలో మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బుట్టా రేణుక, అవినాష్ రె డ్డి, వరప్రసాద్ లు పాల్గొన్నారు. టిడిపి ఎంపీలు కూడా ధర్నా చేపట్టారు. 

జీఎస్టీ బిల్లును వ్యతిరేకించాలి - చలసాని..

గుంటూరు :ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు రాష్ట్ర ఎంపీలంతా జీఎస్టీ బిల్లును వ్యతిరేకించాలని మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపితే ద్రొహులుగా మిగిలిపోతారని విమర్శించారు. 

హామీల అమలులో మోసం - మధు..

విజయవాడ : హామీలు అమలు చేయకుండా ఏపీని మోసం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. హోదా కోసం కేంద్రంపై వత్తిడి తేవడంలో టిడిపి విఫలం చెందిందని, ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న వామపక్షాలను ప్రతిపక్షాలు అణిచివేయాలని చూస్తున్నాయని విమర్శించారు. హోదాపై టిడిపికి చిత్తశుద్ధి ఉంటే విపక్షాలకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. హోదాపై ప్రతిపక్షాలతో కలిసి భవిష్యత్ లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

10:47 - August 2, 2016

కడుపునొప్పి...సాధారణంగా ప్రతొక్కరికి కడుపునొప్పి వస్తుంటుంది. అజీర్ణం..అతిసార వంటి సమస్యలతో ఇది వస్తుంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి తీవ్రంగా బాధిస్తుంటుంది. ఈ సమస్య నుండి తక్షణమే ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో చదవండి..
లెమన్ జ్యూస్ లో కాస్త గోరువెచ్చని నీటిని కలుపుకోవాలి. ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం పిండి, కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
బేకింగ్ సోడా అజీర్తిని నివారంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. వెంటనే తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
పుదీనా ఆకులని శుభ్రంగా కడుక్కోవాలి. నేరుగా నోట్లో వేసుకుని నమలవచ్చు. లేదా ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే ఫలితం పొందవచ్చు.
అల్లం అజీర్తిని తగిస్తుంది. ఎండిన అల్లం కంటే తాజాగా ఉన్నది చాలా బాగుంటుంది. తాజాగా ఉండే అల్లం టీ చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి నివాసంపై దాడి..

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీం అక్తర్ పై ఇంటిపై దాడి జరిగింది. శ్రీనగర్ లో ఉన్న ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు వేశారు. దాడి జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. 

జీఎస్టీ బిల్లు నేపథ్యంలో కాంగ్రెస్ భేటీ..

ఢిల్లీ : రేపు రాజ్యసభకు జీఎస్టీ బిల్లు రానుంది. దీనిపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

రేపే జీఎస్టీ బిల్లు - అనంత కుమార్..

ఢిల్లీ : రాజ్యసభలో బుధవారం జీఎస్టీ బిల్లును తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. ఈ అంశంపై పార్టీలతో ఇప్పటికే మాట్లాడడం జరిగిపోయిందన్నారు. 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 111 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 32 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

10:27 - August 2, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ పిలుపునిచ్చిన బంద్ కు వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దీనితో మంగళవారం ఉదయం నుండి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి నేతలను అరెస్టు చేస్తున్నారు. తాము శాంతియుతంగా నిరసన చేపడుతున్నా అరెస్టులు చేస్తుండడం దారుణమని నేతలు పేర్కొన్నారు. విజయనగరంలో జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపోల ఎదుట నేతలు బైఠాయించడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆందోళన నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.

నెల్లూరులో...
నెల్లూరు జిల్లాలో కూడా బంద్ కొనసాగుతోంది. వైసీపీ, సీపీఎం నేతలు ఆందోళన నిర్వహించారు. బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. ఉద్యమాన్ని అణగదొక్కాలని చేస్తున్నారని, హోదాపై కేంద్రం నుండి బాబుకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయని విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్..

ఢిల్లీ : పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. బుధవారం జీఎస్టీ బిల్లుపై చర్చకు రానున్న నేపథ్యంలో విప్ జారీ చేసింది. 

10:20 - August 2, 2016

గుంటూరు : ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ తీరును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు వామపక్షాలతో సహా కాంగ్రెస్‌, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచే కార్యకర్తలు బస్సు డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న నేతలను, కార్యకరతలను అరెస్టు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని విపక్ష నేతలు హెచ్చరికలు జారీ చేశాయి.
గుంటూరు జిల్లాలో సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. లాడ్జ్ సెంటర్ వద్ద వీరు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టెన్ టివితో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలను మోసం చేశాయని, విభజన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు టిడిపి మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎన్డీయే నుండి బయటకు రావాలని పేర్కొన్నారు. రాజధానికి డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. ఇందులో బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని, అత్యంత నమ్మక ద్రోహం చేశారని సీపీఐ నేత విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఐదో తేదీలోగా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి, బిజెపి నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక హోదా ఆందోళనలో టిడిపి నేతలను చంద్రబాబు పాల్గొనకుండా చేయడం దారుణమని సీపీఎం నేత కృష్ణయ్య విమర్శించారు. రాజకీయాలు ముఖ్యం కాదని ప్రత్యేక హోదా ముఖ్యమన్నారు. రాజధాని నిర్మాణ..పారిశ్రామికాభివృద్ది..ఉద్యోగాలు రావాలంటే హోదా రావాల్సిందేనని స్పష్టం చేశారు. టిడిపి, బిజెపి తీరుపై చలసాని తీవ్రంగా విమర్శించారు. 

గుంటూరు లాడ్జ్ సెంటర్ లో నేతల ఆందోళన..

గుంటూరు : లాడ్జ్ సెంటర్ లో సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాలు, మేధావులు శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నారు. టిడిపి, బిజెపి తీరును తీవ్రంగా విమర్శించారు. 

లారీని ఢీకొన్న లిక్కర్ లారీ..డ్రైవర్ సజీవ దహనం..

కృష్ణా : కంచికచర్ల మార్కెట్ యార్డు సమీపంలో ఆగి ఉన్న లారీని లిక్కర్ లారీ ఢీకొంది. మంటలు చెలరేగడంతో లారీ దగ్ఢమైంది. లారీలో ఉన్న డ్రైవర్ సజీవదహనమయ్యారు. 

పురాతన భవనాలపై మంత్రి కేటీఆర్ హెచ్చరికలు..

హైదరాబాద్ : శిథిలావస్థకు చేరిన భవనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై పురాతన భవనాలు కూలితే టౌన్ ప్లానింగ్ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

 

నెల్లూరు పాలెం జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు..

నెల్లూరు : ఆత్మకూరు (మం) నెల్లూరుపాలెం జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కలువాయిలో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రబ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండు ఎదుట సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. 

హోదాపై టిడిపి ఎంపీల వాయిదా తీర్మానం...

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై లోక్ సభలో టిడిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలో హోదాపై చర్చ చేపట్టాలని టిడిపి ఎంపీలు పట్టుబట్టనున్నారు. నిన్నటిలాగానే ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నారు. 

భారత్ 500/9 డిక్లేర్డ్..

కింగ్ స్టన్ : వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 500 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. విండీస్ 196 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై 304 పరుగుల ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. 

తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వందల సంఖ్యలో కలరా, డయేరియా, మలేరియా, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఫీవర్ ఆసుపత్రిలో వందల సంఖ్యలో జ్వర పీడితులు చేరుతున్నారు. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. మారిన వాతావరణంతో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. గాంధీ, మహబూబ్ నగర్ లో ఒక్కో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 

09:35 - August 2, 2016

హైదరాబాద్ : నగరంలో పురాతన భవనాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. కొద్ది రోజులగా కిందట ఫిల్మ్ నగర్ లో భవనం కూలిపోక ముందే మరో భవనం కూలిపోయింది. చిలకలగూడలో పురాతన భవనం కూలిపోవడంతో ఇద్దరు నిండు ప్రాణాలు బలయ్యాయి. గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. వాజీద్‌, అక్బర్‌ లు ఈ భవనంలో షాపులను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి ట్రాన్స్ ఫార్మర్ పేలడం..అదే సమయంలో భవనం కుప్పకూలిపోవడం జరిగిపోయాయి. ఆ సమయంలో అక్బర్ షాపును మూసివేస్తున్నాడు. దీనితో అక్బర్, వాయిద్ లు భవనం శిథిలాల కింద పడి మృతి చెందారు. వీరి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

09:30 - August 2, 2016

చిత్తూరు : తిరుపతిలో పోలీసులు అనుసరిస్తున్న తీరు అమానుషంగా ఉందని వైసీపీ నేత భూమన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రైవేటు కళాశాలలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రజలు స్వచ్చందంగా బంద్ పాల్గొంటుండడంతో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం నుండే నేతలు బస్టాండ్ ల ఎదుట బైఠాయించారు. దీనితో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిరసన చేపడుతున్న వైసీపీ నేత భూమనను, వామపక్ష నేతలను అరెస్టు చేశారు. అరెస్టు చేయడాన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు. ఈసందర్భంగా టెన్ టివితో భూమన మాట్లాడారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు..పోలీసులను వాడుకొంటున్నారని పేర్కొన్నారు. నిరసన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. జాకెట్లను..చీరలను చింపుతూ పాశవికంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

ఏపీలో కొనసాగుతున్న అరెస్టులు..

విజయవాడ : ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. తిరుపతిలో నిరసన చేపడుతున్న వైసీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, నారాయణస్వామి సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో బంద్‌కు మద్దతుగా విద్య, వ్యాపార సంస్థలను మూసివేశారు. ఆందోళన చేస్తున్న సీపీఎం, సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల ఆందోళన చేశారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

09:18 - August 2, 2016

విశాఖపట్టణం : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విపక్షాలు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 5గంటల నుండే బస్టాండుల ఎదుట విపక్ష నేతలు బైఠాయించారు. దీనితో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేపడుతున్న నేతలను అరెస్టు చేశారు. సీపీఎం నేత నర్సింగరావు ను అరెస్టు చేసి తరలించారు. ఆయనతో పాటు సీపీఐ, వైసీపీ నేతలను అరెస్టు చేశారు. ప్రత్యేక సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు.

విజయవాడలో ప్రశాంతంగా బంద్...
విజయవాడ :
జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్షాలు, ప్రజా సంఘాలు, వైసీపీ నేతలు బంద్ లో పాల్గొన్నాయి. అన్ని ఆర్టీసీ బస్ డిపోలఎదుట బైఠాయించారు. దీనితో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ ను విఫలం చేయడానికి పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కానీ ఈ ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పిందని, వత్తిడి తేవాల్సిన టిడిపి విఫలం చెందాయని నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు టెన్ ఠివితో మాట్లాడారు. బంద్ లెఓ స్వచ్చందంగా ప్రజలు పాల్గొంటున్నారని, కేంద్రం మెడలను టిడిపి వంచలేకపోయిందని విమర్శించారు. దీనితో విపక్షాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ బంద్ నేపథ్యంలో కేంద్రం స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీయేలో ఇద్దరు మంత్రులున్నారని, ఎలాంటి వత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం నేత వైవీ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాన్చుతున్నా మంత్రులు బయటకు రావడం లేదని, వెంటనే ఎన్డీయే నుండి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి నేతలు పైకి మాత్రం నటిస్తున్నారని, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న వారికి మంత్రి పదవులు కావాలో తేల్చుకోవాలని సీపీఎం నేత బాబురావు సూచించారు. చిత్తశుద్ధి ఉంటే బంద్ కు మద్దతు ప్రకటించాలని, అలా కాకుండా అరెస్టులు చేసి జైల్లో పెడుతుండడం ఖండిస్తున్నట్లు తెలిపారు. 

భారత్ - పాక్ సరిహద్దు వద్ద హెరాయిన్ స్వాధీనం..

పంజాబ్ : భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 15 ప్యాకెట్ల హెరాయిన్‌ను బీఎస్‌ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మియన్‌వలి జిల్లాలోని ఖేమ్‌కరన్ సెక్టార్ వద్ద చోటు చేసుకుంది. 

09:01 - August 2, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 లీకేజీ నిందితులు విదేశాలకు పారిపోయినట్లు సీఐడీ గుర్తించింది. వారం క్రితమే నిందితులు దుబాయ్‌కి చెక్కేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితులు ఎలాంటి ఆధారాలు బయటపడకుండా పక్కా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ కేసును తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. నిందితుల ఆచూకీ కోసం 300 మంది పోలీసులను రంగంలోకి దింపి వేట కొనసాగిస్తున్నారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో కీలక కుట్రదారుల కోసం సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బ్రోకర్ల సమాచారంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. కీలక నిందితులుగా భావిస్తున్న షేక్‌ నౌషద్‌అలీ, గుడ్డూలు వారం క్రితమే దుబాయ్‌కి చెక్కేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చింది ? 
నౌషద్‌, గుడ్డూలు పట్టుబడితేనే ప్రశ్నాపత్రం ఎలా బయటకు వచ్చింది ? ఎవరెవరికి చేరింది ? ఎంత మొత్తం చేతులు మారాయనే అంశాలు కొలిక్కి వచ్చే అవకాశముందని సీఐడీ భావిస్తోంది. వీరిద్దరూ దేశం విడిచి పారిపోవడమే కాకుండా.. సెల్‌ఫోన్‌ నెంబర్లు మార్చేసి కోర్టులో కేసు బలపడకుండా సాక్ష్యాధారాలను కిల్‌ చేసినట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ఎంసెట్‌-2 పేపర్‌ను తస్కరించిన రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల రాజేష్‌ కుటుంబసభ్యులు మృతి చెందడం.. ఆ దుఃఖంలో రాజేష్‌ ఉండడంతో గట్టిగా విచారించలేకపోతున్నట్లు సీఐడీ అధికారులంటున్నారు. ఇప్పటివరకు రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నౌషద్‌ ఆదేశాలతోనే పేపర్‌ తస్కరించినట్లు తెలిసింది. అయితే తనకు ఆ పేపర్‌లో ఏముంది ? దేని కోసమో తెలియదని రాజేష్‌ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

స్వయంగా సమీక్షిస్తున్న డీజీపీ...
ఇదిలావుంటే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ స్వయంగా ఈ కేసును సమీక్షిస్తున్నారు. దీంతో ఎన్నడూలేని విధంగా ఇతర విభాగాల నుంచి సిబ్బందిని అటాచ్‌ చేసి 300 మంది సిబ్బందితో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆధారాలు లభిస్తే ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు పాత్రపై విచారణ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదిలావుంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి రమణారావు పోలీసులకు అందుబాటులో లేకుండాపోయినట్లు సమాచారం. మొదట విచారణకు సహకరించని రమణారావు.. నోటీసులు ఇవ్వడంతో ర్యాంకర్ల వివరాలు తెలిపారని.. ఇప్పుడు ఎంసెట్‌ నిర్వాహకులు పాత్రపై దర్యాప్తు చేయడానికి రమణారావు సహకరించడం లేదని సీఐడీ వర్గాలంటున్నాయి. దీంతో అన్ని ఆధారాలు సేకరించి రమణారావును విచారించాలని సీఐడీ యోచిస్తోంది. 

08:58 - August 2, 2016

కరీంనగర్ : నిరసనలు... ఆకస్మిక తనిఖీలు ...సమీక్షలతో మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన కొనసాగింది. రాష్ట్ర మున్సిపాలిటీల పై మంత్రి కేటిఆర్ జిల్లాలో మొదటి సారిగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 72 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట్రవ్యాప్త మున్సిపాలిటీల సమీక్ష సమావేశం జరిగింది. చెత్త సేకరణకు నూతన వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూపాయికి నల్లా కలెక్షన్ పథకం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్‌ ఫ్రీ, ప్లెక్సీ ఫ్రీ టౌన్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు.

2017 జూన్‌ 2 నాటికి తీర్చుదిద్దుతాం-కేటీఆర్..
చాలా కాలం తర్వాత జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్.. ప్రతిమ మల్టిప్లెక్స్ లో 8 గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు 300 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 15 ఏళ్లకు పైబడిన చెత్తసేకరణ వాహనాలను తొలగించి నూతన వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. పట్టణాల్లో మహిళల కోసం షీ టాయిలెట్స్‌, 2017 నాటికి బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా దశలవారీగా తీర్చిదిద్దుతామన్నారు.

అడ్డుకున్న పోలీసులు..
ఓ వైపు మంత్రి కేటీఆర్ సమావేశం జరుగుతుండగా మరోవైపు ఏబీవీపీ కార్యకర్తలు ఎంసెట్‌ లీకేజీపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిచాలంటూ... సమావేశ మందిరంలోకి చోచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ జిల్లాపై పట్టుసాధించాలనే ఉద్దేశంతోనే రాజధానిలో నిర్వహించాల్సిన సమీక్షను కరీంనగర్‌లో నిర్వహించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

08:52 - August 2, 2016

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులు, ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. చాలామంది బాగానే పని చేస్తున్నారని ప్రశంసించిన ముఖ్యమంత్రి... కొద్దిమంది మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. హరితహరంలో ఎవరెవరు పాల్గొంటున్నారో.. ఎవరెవరు దూరంగా ఉంటున్నారో తన దగ్గర సమాచారం ఉందని చెప్పిన కేసీఆర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని ఆదేశించారు.

ముందుకు సాగాలన్న కేసీఆర్...
హరితహారం కార్యక్రమం అమలు తర్వాత మొక్కలు నాటడంపై ప్రజల్లో మక్కువ పెరిగిన విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. వర్షాలు హరితహారం అమలుకు అనుకూలంగా మారాయని... వాతావరణ పరిస్థితులను సానుకూలంగా మలచుకుని ముందుకు సాగాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో పాల్గొనని అధికారులు, ప్రజా ప్రతినిధుల సమాచారం తన దగ్గర ఉందని, ఇలాంటి వారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని ఆదేశించారు. అధికారులు పనితీరు అంచనావేయడానికి, ప్రజా ప్రతినిధులకు అవకాశాలు కల్పించేందుకు హరితహారం కొలమానం అవుతుందని సమీక్షలో కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు.

ఆగస్టు 15న హరితమిత్ర అవార్డులు ప్రదానం ..
వాతావరణ సమతూకాన్ని కాపాడేందుకు 33 శాతం అడవులు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. శాశ్వత కరవు నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న దీనికి అందరూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా, సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలను వచ్చే ఏడాది జూన్‌ వరకు కాపడగలితే బతికినట్టేనని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు వార్షాకాలం తర్వాత అవసరమైతే అగ్నిమాపక శకటాలు, వాటర్‌ ట్యాంకర్లను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాగా పనిచేసిన వారికి ఆగస్టు 15న హరితమిత్ర అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించారు. హరితహారం పర్యవేక్షణ, సమీక్ష బాధ్యతలను అధికారులు అప్పగిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. డివిజన్‌ స్థాయిలో అటవీశాఖ సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. 

08:46 - August 2, 2016

విజయవాడ : ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ తీరును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు వామపక్షాలతో సహా కాంగ్రెస్‌, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచే కార్యకర్తలు బస్సు డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులు బస్టాండ్ ల వద్ద నిరసన చేపడుతున్న వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ముందస్తు అరెస్టులు కూడా చేపట్టారు.
వైసీపీ దూకుడు...

ప్రత్యేక హోదా కోసం వైసీపీ కూడా దూకుడు పెంచింది. తప్పకుండా ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రజల్లో టీడీపీ తీరును ఎండగట్టేందుకు ఇవాళ రాష్ర్ట బంద్‌ చేపడుతోంది. బంద్‌కు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐతో సహా ప్రజాసంఘాలు మద్దతిచ్చాయి. ఏపీకి ఎన్నికల ముందు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తోంది వైసీపీ. ప్రత్యేక హోదా తక్షణమే ఇవ్వాలని పోరుబాట పట్టింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ ఎంపీ మేకపాటి లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపైనే ఉందన్నారు.
పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

08:41 - August 2, 2016

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో భవనం కూలిపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ చిలకలగూడలో పాత భవనం కుప్పకూలింది. వాజీద్‌, అక్బర్‌ అనే ఇద్దరు వ్యక్తులు శిథిలాల చిక్కుకుని మృతి చెందారు. వీరిద్దరూ ఈ భవనంలో షాపులను నిర్వహిస్తున్నారు. వీరి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే.. పాత భవనం కావడంతో ఖాళీ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. నగరంలో పురాతన భవనాలపై దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ప్రకాశంలో వైసీపీ, వామపక్ష నేతల మందస్తు అరెస్టు..

ప్రకాశం : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఒంగోలు బస్ డిపో ఎదుట వామపక్షాలు బైఠాయించాయి. గిద్దలూరులో వైసీపీ, వామపక్ష నేతలను ముందస్తు అరెస్టు చేశారు. 

గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్..

గుంటూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రోడ్లపై సీపీఎం, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండు వద్ద సీపీఎం, సీపీఐ నేతలు బస్సులను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండు వద్ద వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చిలకూలూరిపేట బస్టాండులో బస్సులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. మంగళగిరిగిలో ఉదయం 5గంటల నుండి బంద్ కొనసాగుతోంది. బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యర్తలు పాల్గొన్నారు. 

తిరుపతిలో సీపీఎం, సీపీఐ నేతల అరెస్టు..

తిరుపతి : ఆర్టీసీ బస్టాండు వద్ద వామపక్షాలు ఆందోళన నిర్వహించారు. సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతిలో భూమన అరెస్టు..

చిత్తూరు : తిరుపతి బస్టాండు కూడలి వద్ద వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పోలీసులు భూమనతో సహా పలువురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.

వైసీపీ నేత వంగవీటి అరెస్టు..

విజయవాడ : బస్టాండ్ వద్ద బస్సులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ నేత వంగవీటి రాధతో సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

విజయవాడలో సీపీఎం, సీపీఐ నేతల అరెస్టు...

విజయవాడ : జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ నేతలు బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు నేతలను అరెస్టు చేశారు. 

అనంతపురం జిల్లా వ్యాప్తంగా బంద్..

అనంతపురం : ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్ లో వైసీపీ, సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అనంతపురం డిపో ఎదుట బస్సులను అడ్డుకున్న సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

పశ్చిమలో కొనసాగుతున్న బంద్..

పశ్చిమగోదావరి : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఏలూరు బస్టాండు వద్ద వామపక్షాలు బైఠాయించాయి. జిల్లాలో 8 బస్టాండులో 850 బస్సులు నిలిచిపోయాయి.  

విజయనగరంలో వైసీపీ, సీపీఎం నేతల అరెస్టు...

విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వదద వైసీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

నేడు ఏపీ బంద్..

విజయవాడ : నేడు రాష్ట్ర బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఉదయం నుండే బస్సు డిపోల ఎదుట విపక్షాలు బైఠాయించాయి.

కరీంనగర్ లో నేడు డిప్యూటి సీఎం పర్యటన..

కరీంనగర్ : నేడు డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ పర్యటించనున్నారు. హరితహారం, రెవెన్యూ సమీక్ష సమావేశంలో మహమూద్ ఆలీ పాల్గొనున్నారు. 

జేఎన్టీయూ వద్ద ఎస్ఎఫ్ఐ రిలే నిరహార దీక్షలు..

హైదరాబాద్ : ఎంసెట్ -2 రద్దును నిరసిస్తూ నేటి నుండి జేఎన్టీయూ వద్ద ఎస్ఎఫ్ఐ రిలే నిరహార దీక్షలు చేపట్టనుంది. ఎంసెట్ -2 లీకేజ్ వ్యవహారంలో మంత్రులను బర్తరఫ్ చేసి కేసును సీబీఐకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. 

Don't Miss