Activities calendar

03 August 2016

22:19 - August 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రభుత్వం తెచ్చిన 123 జీవోను హైకోర్టు రద్దుచేసింది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారమే భూములు సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎక్కడ భూ సేకరణ చేసినా ఇదే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. భూ సేకరణకు 2013 చట్టం ఉండగా..123 జీవోను ఎందుకు తెచ్చారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీ.సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణలో 2013 చట్టాన్ని తుంగలో తొక్కుతూ..అంతకంటే మెరుగైన నష్టపరిహారం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్న జీవో నెంబర్ 123ని హైకోర్టు రద్దు చేసింది. 2013 చట్టప్రకారమే భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని జస్టిస్ సురేష్ కుమార్ కైతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు, పరిశ్రమలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది హైకోర్టు. మెదక్‌లో నేషనల్ ఇన్వెస్టిమెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్షర్ జోన్ కోసం ప్రభుత్వం 12వేల ఎకరాల స్థలం కోసం భూ సేకరణకు సిద్దమయింది. జిల్లాలోని బర్డిపూర్, షీలపల్లి, ఎల్గోయికి చెందిన రైతుల భూములను జీవో నెంబర్ 123 ప్రకారం 3వేల ఎకరాలను ఎమ్మార్వో పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అయిదే దీన్ని వ్యతిరేకిస్తూ..ఈ మూడు గ్రామాలకు చెందిన 23మంది దళిత రైతు కూలీలు కోర్టును ఆశ్రయించారు. ఖరీఫ్‌లో తాము పని చేసేందుకు పని దొరకడం లేదని రైతు కూలీలు కోర్టు ముందు వాపోయారు. 123 జీవోతో తమకు నష్టం వాటిళ్లుతోందని పిటిషనర్ అలిగి తుక్కమ్మ తరపు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. 123 జీవో ప్రకారం ఎలా సేకరిస్తారు ?- హైకోర్టు పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధంగా తయారు చేసిన 2013 భూసేకరణ చట్టం ద్వారా సేకరించకుండా..జీవో 123 ద్వారా ఎలా సేకరిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 123 జీవోలో రైతు కూలీల జీవనోపాధికి చెందిన అంశాలను జీవో 214లో ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో సర్కార్ అయితే హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం అప్పిల్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 214 జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున..రైతు కూలీలకు న్యాయం జరగనుంది. జీవో నెంబర్ 123 ద్వారా కేవలం మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తామని మాత్రమే ప్రభుత్వం చెప్పనుంది. గతంలో కొన్ని కేసుల్లో 123 జీవో భూసేకరణకు ఉపయోగించడం లేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది. 123 ద్వారా అభ్యంతరం ఉంటే భూ సేకరణ చట్టం 2013 ద్వారానే భూమి సేకరిస్తామని తెలిపింది. ఇదే విషయాన్ని డివిజన్ బెంచ్‌కి అప్పీలుకు వెళ్లి చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

22:11 - August 3, 2016

ముదురుతున్న ఎంసెట్ లీకేజీ పంచాది... నాగం పట్టుకున్నడంటే ఇప్పట్లో ఒడవది, జీహెచ్ ఎంసీ కార్పొరేటరుకు చీపుర్ల చివాట్లు... ఓట్లు వడి గెలిచినంక ఫిరాయించిండంట ప్లేట్లు, ఫ్యాన్ గుర్తు జగనాలకు ఆనం ఆఫర్... ఈతీరుగనే మాట్లాడితే అంటరట లోఫర్, ఏడు కొండలవెంకన్నకు భక్తుని వినతి.. ఆనవాయితీ ప్రకారం అరెస్టు హారతి, మరో బోలక్ పూర్ అయితున్న చొల్లేరు.... కోళ్ల పరిశ్రమతోటి గ్రామమంతా కొల్లేరు, యమునినోట్ల తలకాయపెట్టిన పోరడు...సచ్చిపోయిన ఇదానం లైవ్ కవరేజీ... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

22:00 - August 3, 2016

ఢిల్లీ : జీఎస్ టీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకముందు జీఎస్ టీ సవరణ బిల్లుపై ఓటింగ్ చేపట్టారు. మెజారిటీ సభ్యులు బిల్లుకు మద్దతు తెలిపారు. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ సవరణలు ప్రతిపాదించింది. బిల్లును బిల్లుకు నిరసనగా ఎఐడిఎంకె వాకౌట్ చేసింది.

21:55 - August 3, 2016
హైదరాబాద్ : కోర్టు ఆదేశాల తర్వాతైనా భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ్మ డిమాండ్ చేశారు. ఈమేరకు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. భూసేకరణ చట్టాన్ని పక్కనబెట్టిన ప్రభుత్వం... రైతులు, నిర్వాసితులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. 123 జీవో తెచ్చి దళారుల వ్యవస్థను పెంచిందన్నారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జీవోతో ప్రభుత్వం నిర్వాసితుల్ని మోసం చేసిందన్నారు. కోర్టు ఆదేశాల తర్వాతైనా టీప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.
20:57 - August 3, 2016
విజయవాడ : ఎపీ సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆందోళనలు చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రోడ్లు ఊడ్చి నిరసన తెలపాలనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రత్యేకహోదాకోసం మరింత పోరాడాలని సూచించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చే కుట్ర జరుగుతోందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ బంద్‌ విజయవంతమైందని...ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు

హైదరాబాద్ నగర రోడ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : నగర రోడ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ తో కలిసి నగర రోడ్ల అభివృద్ధిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పుడు వేసే రోడ్లు మరో వందేళ్ల పాటు మనగలగాలన్నారు.

హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తాం : మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ : హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. జీవో 123 ని ఏ ప్రాతిపదికన రద్దు చేసిందో తీర్పు కాపీ చదివాక స్పందిస్తామని చెప్పారు. భూసేకరణ చట్టం 2013 కు లోబడే సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకే జీవో తెచ్చామని తెలిపారు.

రేపు నల్లబ్యాడ్జీటతో కోర్టుకు టీలాయర్లు

హైదరాబాద్ : 13 మంది టీలాయర్లకు హైకోర్టు నోటీసులకు నిరసనగా రేపు నల్లబ్యాడ్జీటతో కోర్టుకు రావాలని టీలాయర్లు నిర్ణయించారు. ఎల్లుండి కోర్టులు బహిష్కరించాలని టీలాయర్లు తీర్మానించారు.

20:43 - August 3, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా మంటలు రగులుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఏపీ ఎంపీలు పోరుబాట పట్టారు. అరుణ్‌ జైట్లీ ఇచ్చిన హామీ మేరకు వారం పాటు ఆందోళను విరమించారు టీడీపీ ఎంపీలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు. ఇటు వైసీపీ ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ ఎంపీల పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ ఎంపీలు పోరాటాన్ని తాత్కాలికంగా విరమించారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, అనంత్‌కుమార్‌ హామీ మేరకు వారంపాటు ఆందోళనలు విరమించినట్లు ఎంపీలు తెలిపారు. పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమన్న ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమని చెప్పారు టీడీపీ ఎంపీలు. వారంరోజుల పాటు వేచి చూసిన తర్వాత ఫలితం రాకపోతే.... లోక్‌సభలో ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడతామన్నారు. సభలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని, హోదాపై ఎలా ముందుకెళ్ళాలో చంద్రబాబు సూచనలు ఇస్తున్నారని ఎంపీలు తెలిపారు. ఇటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు కూడా లోక్‌సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. ఎంపీల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ ఆందోళన చేపట్టవద్దని స్పీకర్‌ కోరినా.. వైసీపీ ఎంపీలు వినిపించుకోకపోవడంతో సుమిత్రా మహాజన్‌ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేశారని గుర్తు చేశారు. హామీలపై ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. అంతవరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. దీంతో ఎంపీల నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. గాంధీ విగ్రహం ఎదుట వైసీపీ ఎంపీలు నిరసన అంతకుముందు వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ టీడీపీలు నాటకాలు అడుతున్నాయని మండిపడ్డారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా సెగలు రగులుతూనే ఉన్నాయి.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి.

20:22 - August 3, 2016
మెదక్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు జీవో నెంబర్‌ 123ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో భూ నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. జీవో 123ను సవాల్‌ చేస్తూ... రైతు అలిగి తుక్కమ్మ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు... 123ని రద్దు చేసింది.
20:20 - August 3, 2016
హైదరాబాద్ : 123 జీవోను హైకోర్టు కొట్టివేయడంపై కాంగ్రెస్‌ హర్షం వ్యక్తంచేసింది. మల్లన్న సాగర్‌పై మొండిగా ముందుకువెళుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ తీర్పు ఎదురుదెబ్బ అన్నారు. మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి. కోర్టు తీర్పుపై నర్సాపూర్‌లో మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
20:18 - August 3, 2016
హైదరాబాద్ : 123జీవోపై హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చిందని..ఈ తీర్పుపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని రైతు సంఘం నేత వెంకటేశ్వర్లు అన్నారు. 123 జీవో రైతులకు, రైతు కూలీలకు శాపంగా ఉందని..అలాంటి దాన్ని హైకోర్టు రద్దు చేయడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. జహీరాబాద్‌కు చెందిన 20 మంది రైతు కూలీలతో కోర్టులో పిటీషన్ వేయించామని తెలిపారు. రైతుల సంక్షేమం గురించి కోర్టు ఆలోచించి తీర్పు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
20:13 - August 3, 2016
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భూ సేకరణ కోసం తీసిన జీవో నెంబర్‌ 123ను హైకోర్టు రద్దుచేసింది. జీవో 123ను సవాల్‌ చేస్తూ నిమ్జ్‌ నిర్వాసితురాలు అలిగి తుక్కమ్మ పిటిషన్‌ వేయగా.. పిటిషనర్‌ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారని ప్రశ్నించింది. మరోవైపు 123 జీవోను నిర్వాసితులు ముందునుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో హైకోర్టు కొట్టివేయడం నిర్వాసితులకు ఊరటనిచ్చినట్లైంది. హైకోర్టు తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నాం : వెంకట్ జీవో నెంబర్‌ 123పై హైకోర్టు తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామని భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ సీపీఎం నేత వెంకట్‌ అన్నారు. భూ సేకరణ చట్టం 2013 ఉండగా..జీవో నెంబర్‌ 123ను ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిందని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని..ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ప్రజల విజయం : జస్టిస్ చంద్రకుమార్ 'మల్లన్న సాగర్‌ భూసేకరణపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. ఇది ప్రజల విజయం. ఎంతమంది చెప్పినా.. ప్రజలు ఎంతగా నిరసన వ్యక్తం చేసినా భూసేకరణపై ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని' ఆయన మండిపడ్డారు.
20:09 - August 3, 2016
హైదరాబాద్ : భవనాల నిర్మాణాలలోను ప్రమాణాలు పాటించడం లేదని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాతభవనాలను కూల్చడంలోను యజమానులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. భవనాల యజమానులు, బిల్డింగ్ ప్లానర్స్, మేస్త్రీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
19:56 - August 3, 2016
హైదరాబాద్ : హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం వక్రబుద్ధిని మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు రైతులకు కొండంత బలమిస్తుందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం భేషరుతుగా రద్దు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా 2013 భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలని తెలిపారు.
19:52 - August 3, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజక్టు నిర్మాణంలో నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయనమీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భూసేకరణ విషయంలో గ్రామసభలు నిర్ణయాన్ని పట్టించుకోలేదన్నారు.

హైకోర్టు తీర్పు రైతులకు కొండంత బలం : తమ్మినేని

హైదరాబాద్ : హైకోర్టు తీర్పు రైతులకు కొండంత బలమిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం వక్రబుద్ధిని మానుకోవాలని హితవుపలికారు. రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం భేషరుతుగా రద్దు చేయాలన్నారు. ఇప్పటికైనా 2013 భూసేకరణ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

ప్రాజెక్టుల మేం వ్యతిరేకం కాదు : దామోదర

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజక్టు నిర్మాణంలో నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భూసేకరణ విషయంలో గ్రామసభలు నిర్ణయాన్ని పట్టించుకోలేదన్నారు.

19:36 - August 3, 2016
దుబాయ్ : తిరువనంతపురం నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానం దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగింది. తిరువనంతపురం నుంచి దుబాయ్‌ వెళ్తుండగా గాల్లో ఉండగానే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్ని గమనించిన పైలెట్‌..విమానాన్ని అత్యవసరంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో దించాడు. అయితే మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో విమానం దిగేటప్పుడు నేలను బలంగా ఢీకొట్టడడంతో మంటలు మరింతగా చెలరేగాయి. అయినప్పటికీ ప్రయాణికులందరిని క్షేమంగా విమానంలోనుంచి దింపేశారు. ఆ తర్వాత ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేశారు. పైలెట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
19:26 - August 3, 2016
హైదరాబాద్ : ఆలేరు, భువనగిరి మండలాలను విడదీయకుండా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లక్ష సంతకాలతో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపడుతున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. యాదగిరి నరసింహ స్వామి దయతోనే యాదాద్రి జిల్లా ఏర్పడుతోందని ఈ సందర్భంగా మోత్కుపల్లి పేర్కొన్నారు.
18:34 - August 3, 2016

మెదక్ : మల్లన్నసాగర్ భూనిర్వాసితులు, రైతుల పోరాటం ఫలించింది. టీసర్కార్ తీసుకొచ్చిన జీవో 123 ని వెనక్కి కొట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో 123ని కోర్టు కొట్టివేసింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. 123 జీవోను ముందునుంచి భూనిర్వాసితులు వ్యతిరేకిస్తున్నారు. జీవో నెంబర్ 123ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా మహిళ రైతు అలిగి తుక్కమ్మ హైకోర్టులో పిటిషన్ వేసింది. మెదక్ జిల్లాలో నిర్మించ తెలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా టీసర్కార్ జీవో 123 ప్రకారం భూసేకరణ చేస్తామని చెప్పింది. అయితే జీవో 123 ని మల్లన్నసాగర్ భూనిర్వాసితులు వ్యతిరేరించారు. అదేవిధంగా విపక్షాలు సైతం వ్యతిరేకించాయి. ఆందోళను, ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. జీవో నెంబర్ 123కి వ్యతిరేకంగా ఎర్రవెల్లిలో భూ నిర్వాసితులు ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని అమానుషంగా లాఠీచార్జీ చేశారు. ఈఘటనలో పలువురు గాయపడ్డారు. 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. కానీ వీరి మాటలను ప్రభుత్వం పెడచెవినపెట్టింది. ఈనేపథ్యంలో జీవో నెంబర్ 123ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా మహిళ రైతు అలిగి తుక్కమ్మ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. హైకోర్టు తీర్పుతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు, భూ నిర్వాసితులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో విపక్షాలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

17:47 - August 3, 2016
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో 123ని కోర్టు కొట్టివేసింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం ప్రభుత్వం జీవో 123 ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై మల్లన్నసాగర్ భూనిర్వాసితులు, రైతులు, పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. జీవో 123 కొట్టివేత హర్షనీయం : బి.వెంకట్ 'జీవో నెంబర్ 123ను హైకోర్టు కొట్టివేయడాన్ని భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ వెంకట్ హర్షించారు. హైకోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇచ్చిందని, నిర్వాసితుల విజయం. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రభుత్వం మాట వినిపించుకోలేదు. 2013 చట్టం ఉన్న తరువాత జీవోలు ఎలా తీసుకొస్తారని కోర్టు ప్రశ్నించింది. జీవోలు తెచ్చే రైట్ లేదని, మెరుగైన చట్టం తేవాలి. కానీ ఇలా చేయకూడదని ప్రభుత్వానికి కోర్టు మొట్టి కాయలు వేసింది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, కోర్టు సూచనల ప్రకారం 2013 భూ సేకరణ జరిపించాలని' వెంకట్ డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి : టిడిపి నేత మోత్కుపల్లి 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉంది. 123 జీవోను కొట్టివేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కట్టాల్సిందేనని, నిర్వాసితుల గురించి ఆలోచించాలని మేము కోరడం జరుగుతోంది. కానీ విపక్షాలు విమర్శించడం తగదు. 12 గ్రామాలను మెప్పించలేకపోతున్నారని, ఆయా గ్రామాల్లో మోహరించిన పోలీసులను ఉపసంహరించుకోవాలి. ఎపిలో 35వేల ఎకరాల భూమి సేకరించారని, అక్కడ రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ఇక్కడ అలా ఎందుకు వ్యవహరించడం లేదని' ఆయన ప్రశ్నించారు. హైకోర్టు మంచి తీర్పు : సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి చట్టాలు అమలు చేయాలని కోర్పు మంచి తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వానికి ఒక గుణపాఠం. చట్టంలో పేర్కొన్న పునారావాస ప్యాకేజీ ప్రకారం అమలు చేయాలి. వాస్తవికంగా మొదటి నుండి తాము చెప్పడం జరుగుతోందని, కానీ రాద్ధాంతం..రాజకీయం చేస్తున్నాయంటూ విపక్షాలపై ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 దొడ్డిదారిన తెచ్చారు. విభజించు..పాలించు అనే దానిని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు పద్ధతులను అనుసరించిందని' చాడ విమర్శించారు. ప్రొ. కోదండరామ్‌ 'బలవంతపు భూసేకరణకు సాధనంగా ప్రభుత్వం 123 జీవోను ఉపయోగించుకుంది. ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించాం. 2013 భూసేకరణ చట్టం హక్కులను.. ప్రభుత్వం కాలరాసింది. 123 జీవోతో అన్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని' ఆయన సూచించారు. హైకోర్టు తీర్పు హర్షణీయం : ఒంటేరు ప్రతాప్ రెడ్డి...టీడీపీ హైకోర్టు తీర్పు హర్షణీయం. గత ఆరు మాసాలు మాట్లాడుతున్నాం... రైతుల పక్షాన మాట్లాడాము. ప్రభుత్వం దళారుల చేత భూములను కొనుగోలు చేసింది. టీఆర్ ఎస్ పార్టీ నాయకులను ఏజెంట్లగా పెట్టకున్నారు. రైతులతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. దళారీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజలు గొప్పవారు... ప్రభుత్వం గొప్పది కాదు. హరీష్ రావు కల్లు తెరవాలి. ప్రభుత్వం బేషరుతుగా కేసులను ఉపసంహరించుకోవాలి. కాంగ్రెస్... పొన్నాల లక్ష్మయ్య హైకోర్టు తీర్పు సంతోషదాయకం. జీవో 123 ను కొట్టివేత శుభపరిణామం. కాంగ్రెస్ హయాంలో కేంద్రం 2013లో మెరుగ్గా భూసేకరణ చట్టం తీసుకొచ్చింది. దాన్ని కాదని టీసర్కార్ జీవో 123 ను తెచ్చిందని' పేర్కొన్నారు.
17:35 - August 3, 2016
హైదరాబాద్ : టీసర్కార్ తీసుకొచ్చిన జీవో నం. 123 ను కొట్టివేస్తూ ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కారదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇది ప్రజా విజయం అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. హైకోర్టు తీర్పు భూనిర్వాసితుల విజయమన్నారు. భూసేకరణ చట్టం-2013 ఉండగా జీవో నంబర్ 123ని దొడ్డిదారిన తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులపై పోలీసులు నిర్బంధం ఆపాలన్నారు.

ప్రభుత్వం బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించాలి - కోదండరాం..

హైదరాబాద్ : 2013 భూ సేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని, ప్రభుత్వం తన బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించాలని టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. భూ సేకరణ జీవో 123 ని హైకోర్టు కొట్టివేయడంపై టెన్ టివితో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వుండే జీవోలను తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పే వస్తుందని ఊహించానని అన్నారు.

ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి - తమ్మినేని..

హైదరాబాద్ : హైకోర్టు 123 జీవోను రద్దు చేసింది. 2013 చట్టం ప్రకారమే రైతుల నుంచి భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 2013 చట్టం ఉండగా దొడ్డిదారిన 123 జీవో తీసుకొచ్చారని, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని తమ్మినేని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిర్వాసితులపై పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని, లేని పక్షంలో ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని తమ్మినేని హెచ్చరించారు.

చట్టం..జీవోలపై చెప్పడంలో ప్రభుత్వం విఫలం - ప్రకాష్..

హైదరాబాద్ : చట్టం..జీవోలపై చెప్పడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆహ్వానించలేం..తిరస్కరించలేమన్నారు. జీవో నెంబర్ ని 123ని హైకోర్టు కొట్టివేయడంపై టెన్ టివితో ఆయన మాట్లాడారు. చట్టం కావాలంటే అలాగే చేయడం జరుగుతుందని, జీవో ప్రకారం చేయమంటే అలాగే చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. జీవో కొట్టిన తరువాత నిర్వాసితులు బేరం కొల్పోయారని..ఇలాంటివి కొన్ని ప్రయోజనాలు కోల్పోయరని తెలిపారు. చట్టం ప్రకారం తప్పనిసరిగా భూమి ఇవ్వాల్సిందేనన్నారు. చట్టం ప్రకారం బెనిఫిట్స్ ఎవైనా జీవో ద్వారా సాధించుకోవాలని తాను సూచించడం జరిగిందన్నారు.

ప్రజల విజయం - జస్టిస్ చంద్రకుమార్..

హైదరాబాద్ : జీవో నెంబర్ 123ని హైకోర్టు కొట్టివేయడం ప్రజల విజయమని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. హైకోర్టుకు వెళ్లిన వారిని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. భూ నిర్వాసితులకు ఎన్నో ప్రయోజనాలు కలుగతాయని, దీనికి సంబంధించిన వివరాలు 2013చట్టంలో ఉన్నాయన్నారు. చట్టం ప్రకారం మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం అందించవచ్చని, దీనిని సాకుగా తీసుకొని జీవో నెంబర్ 123 తీసుకొచ్చిందన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిందని, కోర్టు తీర్పు హర్షణీయమన్నారు. భూమి తీసుకోవడం అసరమా ? లేదా ? అనేది శాస్త్రీయ పరిశోధన జరపడానికి 2013 చట్టం చెబుతోందన్నారు.

హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బ కాదు - సుధాకర్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బ కాదని టీఆర్ఎస్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల చేకూర్చే విధంగా జీవో తీసుకరావడం జరిగిందన్నారు. 2013 చట్టం ప్రకారం కావాలంటే అలాగే చేస్తామని, 123 జీవో ప్రకారం చేయమంటే అలా చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. చట్టం సవరణ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని, ఎంసెట్ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందన్నారు. 

2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలి - మోత్కుపల్లి..

హైదరాబాద్ : 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉందని టిడిపి నేత మోత్కుపల్లి తెలిపారు. 123 జీవోను కొట్టివేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కట్టాల్సిందేనని, నిర్వాసితుల గురించి ఆలోచించాలని తాము కోరడం జరుగుతోందని తెలిపారు. కానీ విపక్షాలు విమర్శించడం తగదన్నారు. 12 గ్రామాలను మెప్పించలేకపోతున్నారని, ఆయా గ్రామాల్లో మోహరించిన పోలీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 35వేల ఎకరాల భూమి సేకరించారని, అక్కడ రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ఇక్కడ అలా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. 

కోర్టు మంచి తీర్పు ఇచ్చింది - చాడ..

హైదరాబాద్ : చట్టాలు అమలు చేయాలని కోర్పు మంచి తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వానికి ఒక గుణపాఠం అని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. చట్టంలో పేర్కొన్న పునారావాస ప్యాకేజీ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవికంగా మొదటి నుండి తాము చెప్పడం జరుగుతోందని, కానీ రాద్ధాంతం..రాజకీయం చేస్తున్నాయంటూ విపక్షాలపై ప్రభుత్వం విమర్శలు గుప్పించిందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 దొడ్డిదారిన తెచ్చారని, విభజించు..పాలించు అనే దానిని అమలు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరించిందని చాడ విమర్శించారు. 

కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు - తమ్మినేని..

హైదరాబాద్ : కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని, ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నిర్వాసితుల పోలీసుల నిర్భందాన్ని ఆపాలని, భూ సేకరణ చట్టం 2013 ఉండగా జీవో నెంబర్ 123 ను దొడ్డి దారిన తెచ్చారని విమర్శించారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

123 జీవో కొట్టివేయడం హర్షణీయం - పొన్నాల..

హైదరాబాద్ : 123 జీవో కొట్టివేయడం హర్షణీయమని, నిర్వాసితుల విజయమని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఏకపక్షంగా..నియంతృత్వ ధోరణితో ప్రభుత్వం వెళ్లిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. 17 సార్లు ప్రభుత్వాన్ని మందలించడం జరిగిందన్నారు. 2013చట్టం చారిత్రాత్మక చట్టమని, ఈ చట్టానికి భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మే 14వ తేదీన దౌర్జన్యం..లాఠీఛార్జీ జరగడంతో తాను ఏటిగట్ట కిష్టాపూర్ కు వెళ్లడం జరిగిందన్నారు. 

16:29 - August 3, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూనిర్వాసితులు, రైతుల పోరాటం ఫలించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవో 123ని కోర్టు కొట్టివేసింది. 2013 భూసేకరణ చట్టం ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. జీవో నెంబర్ 123ని సవాల్ చేస్తూ మెదక్ జిల్లా మహిళ రైతు అలిగి తుక్కమ్మ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ తో పాటు పలు పిటిషన్ లను బుధవారం హైకోర్టు విచారించింది. పిటిషనర్ల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. గతంలో 123 జీవో భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రమేనని, వారధిలాగానే ఉంటుందని గతంలో పేర్కొన్నారు. జీవోలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. పార్లమెంట్ చట్ట ప్రకారం చేసిన దానికి విలువ ఇవ్వరా ? అని కోర్టు సూటిగా ప్రశ్నించింది. జాబ్ కార్డ్స్ ఉన్న వారిని ఏం చేస్తారు ? అని ప్రశ్నించింది. ప్రస్తుతం 123 జీవో కొట్టివేయడంతో నిర్వాసితులకు ఊరట లభించినట్లైంది. 

వ్యతిరేకిస్తున్న నిర్వాసితులు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులతో నిర్వాసితులవుతున్న వారందరూ జీవో నెంబర్ 123ని వ్యతిరేకిస్తూ వచ్చారు. మెదక్ జిల్లాలో నిర్మించ తెలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేయాలని టి.సర్కార్ యోచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా జీవో 123 ప్రకారం భూసేకరణ చేస్తామని చెప్పింది. దీనిని మల్లన్నసాగర్ భూనిర్వాసితులు వ్యతిరేరించారు. విపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీపీఎం ముందుండి పోరాటం చేసింది. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆపార్టీ కార్యదర్శి తమ్మినేని పాదయాత్ర కూడా చేపట్టారు. ఇతర విపక్ష పార్టీలు సైతం గళం విప్పాయి. ఆందోళనలు..ధర్నాలు..నిరసనలతో హోరెత్తించారు. ఆందోళన చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేయడం సంచలనం సృష్టించింది. ఈఘటనలో పలువురు గాయపడ్డారు. ఉద్యమం మరింత ఉధృతమైంది. 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. కానీ వీరి మాటలను ప్రభుత్వం పెడచెవినపెట్టింది. ఈనేపథ్యంలో  హైకోర్టు తీర్పుతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు, భూ నిర్వాసితులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో విపక్షాలు, ప్రజా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి.

పాక్ పర్యటనకు వెళ్లిన రాజ్ నాథ్ సింగ్..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సార్క్ హెచ్ఎం కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొననున్నారు. 

నిర్వాసితుల విజయం - బి. వెంకట్..

హైదరాబాద్ : జీవో నెంబర్ 123ను హైకోర్టు కొట్టివేయడాన్ని భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ వెంకట్ హర్షించారు. హైకోర్టు న్యాయబద్ధమైన తీర్పు ఇచ్చిందని, నిర్వాసితుల విజయమన్నారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రభుత్వం మాట వినిపించుకోలేదన్నారు. 2013 చట్టం ఉన్న తరువాత జీవోలు ఎలా తీసుకొస్తారని కోర్టు ప్రశ్నించింది. జీవోలు తెచ్చే రైట్ లేదని, మెరుగైన చట్టం తేవాలి కానీ ఇలా చేయకూడదని ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిందన్నారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, కోర్టు సూచనల ప్రకారం 2013 భూ సేకరణ జరిపించాలని వెంకట్ డిమాండ్ చేశారు.

నేపాల్ ప్రధానిగా ప్రచండ ఎన్నిక..

నేపాల్ : ప్రధానిగా కమ్యూనిస్టు నేత ప్రచండ ఎన్నికయ్యారు. బుధవారం నేపాల్ ప్రధాని పదవికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు పోటీలో ఉన్న సీపీఎన్-యూఎంఎల్ చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రచండ ఎన్నిక ఏకగ్రీవమైంది. 

జీవో 123 కొట్టివేత..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవో నెంబర్ 123 ని హైకోర్టు కొట్టివేసింది. భూ సేకరణ 2013 చట్టం అమల్లో ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా భూ సేకరణపై రగడ నెలకొంటున్న విసయం తెలిసిందే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ సేకరణ విషయంలో జీవో నెంబర్ 123 ప్రకారం భూ సేకరిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై గ్రామస్తులు, విపక్షాలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. 

15:40 - August 3, 2016

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాల్లో హల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నీత్యామీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ప్రస్తుతం కేరళలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో స్పెషల్ పాటలో ఎన్టీఆర్ సరసన కాజల్ స్టెప్పులు వేస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్ గా..మాఫియ డాన్ తరహాలో మాస్ గెటప్ లో కనువిందు చేయనున్నాడని టాక్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత రికార్డ్ లు తిరగరాయటం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 

ఢీకొన్న రెండు విమానాలు..

గౌహతి : ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొన్నాయి. గౌహతి విమానశ్రయంలో గౌహతి నుండి చెన్నై వెళుతున్న 6ఇ 136 విమానం, ముంబై నుండి గౌహతికి వస్తున్న 6ఇ 813 విమానాలు ఒకదాన్నొకటి స్వల్పగా ఢీకొన్నాయి. దీనితో ఆరుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 

టీపీపీఎస్సీ ద్వారా మరో నోటిఫికేషన్..

హైదరాబాద్ : టీపీపీఎస్సీ ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం... తాజాగా మరిన్ని ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లో 1794 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులు భర్తీ చేయనున్నారు. గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టులు భర్తీ చేయనున్నారు. 

ఎమిరేట్స్ ఈకే 521 విమాన ప్రయాణీకులు సురక్షితం..

దుబాయి : ఎమిరేట్స్ ఈకే 521 విమాన ప్రమాదంలో ప్రయాణీకులందరూ సురక్షితంగానే ఉన్నారని దుబాయి మీడియా పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో దుబాయి ఎయిర్ పోర్టులో ఒక్కసారి భూమిని ఢీకొనడంతో విమానంలో మంటలు చెలరేగాయి. త్రివేండ్రం నుండి దుబాయి వెళుతోంది. 

ఎమిరేట్స్ ఈకే 521 విమానానికి ప్రమాదం..

దుబాయి : ఎమిరేట్స్ ఈకే 521 విమానానికి ప్రమాదం సంభవించింది. గాల్లో ఉండగానే విమానంలో మంటలు చెలరేగాయి. దీనితో దుబాయి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది. తిరువనంతపురం నుండి దుబాయి వెళుతోంది. ప్రయాణీకులు సురక్షితమని తెలుస్తోంది. 

15:05 - August 3, 2016

బాలీవుడ్..టాలీవుడ్..ఇలా ఏ వుడ్ లో సక్సెస్ జోడి అంటూ ఉంటుంది. వారు నటించిన చిత్రాలు విజయవంతంగా అవుతుండడంతో వారికి సక్సెస్ జోడి అంటుంటారు. బాలీవుడ్ లో కూడా షారుఖ్..దీపికా పదుకొనే జోడీ అలాంటిదే. వీరు నటించిన పలు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. సక్సెస్‌ఫుల్ ఆన్‌స్క్రీన్ జోడీగా పేరున్న ఈ జంట మరోసారి కలిసి నటించనుంది. దీపికాతో షారుఖ్ 'ఓం శాంతి ఓం' చిత్రంలో నటించారు. ఇదే వారి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం.
అనంతరం'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' వంటి సినిమాల్లో కూడా వీరు నటించారు. తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో షారుఖ్, దీపికా జోడీ కడుతున్నట్టు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ చిత్రం గురించి దీపికాతో చిత్ర డైరెక్టర్ మాట్లాడినట్లు, ఇందుకు దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ మరో హిట్ సాధిస్తుందా ? లేదా ? ఇతరత్రా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

14:38 - August 3, 2016
ఢిల్లీ : కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో జీఎస్ టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై మంత్రి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఒకే దేశం.. ఒకే పన్ను విధానం ఉండాలన్నారు. దేశంలో అతిపెద్ద సంస్కరణల బిల్లు జీఎస్ టీ బిల్లు అన్నారు. జీఎస్ టీ బిల్లు ఆమోదం వల్ల రాష్ట్రాలకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతివ్వాలని కోరారు. జీఎస్ టీ బిల్లు ఆమోదం రాష్ట్రాలకు ఎంతో మేలు అన్నారు. ఈ బిల్లుకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని తెలిపారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

కరీంనగర్ : రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరిగింది. ప్రస్రుత నీటి మట్టం 17 టీఎంసీలుగా ఉండగా వరద పెరుగుతుండడంతో చెగ్గాం గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయించారు. కోటిలింగాల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. 

జీఎస్టీ బిల్లును వ్యతిరేకించలేదు - చిదంబరం..

ఢిల్లీ : జీఎస్టీ బిల్లును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం పేర్కొన్నారు. జీఎస్టీ సవరణ బిల్లుపై రాజ్యసభ లో చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం ఆమోదంతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశించినట్లు తెలిపారు. గడిచిన 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షం ఆమోదం లేకుండా జీఎస్టీ బిల్లు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. 2011లో ప్రణబ్ ప్రవేశ పెట్టిన బిల్లును బీజేపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. బిల్లులో చిన్న చిన్న లోపాలు ఉండడం వల్లే తాము వ్యతిరేకించడం జరిగిందని, ప్రస్తుతం ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం తెలపాలని సూచించారు.

ఒకే దేశం ఒకే పన్ను - జైట్లీ..

ఢిల్లీ : ఒకే దేశం..ఒకే పన్ను విధంగా ఉండాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించారు. వస్తు సేవల పన్ను సవరణల బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతివ్వాలని కోరారు. బిల్లుపై ఏకాభిప్రాయం విస్తృతంగా కృషి చేయడం జరిగిందని, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అమల్లోకి వస్తుందని, ఈ బిల్లు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరమన్నారు. బిల్లుపై ఎంపిక కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.

 

ప్రాజెక్టుల పూర్తే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత - హరీష్..

హైదరాబాద్ : దేవాదుల ప్రాజెక్టుపై అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు. ఇంజినీర్లు నిర్లక్ష్యం వీడి బాధ్యతాయుతంగా పనిచేయాలని, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఇంజినీర్లు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. వారిని మిగతా ఇంజినీర్లు స్పూర్తిగా తీసుకోవాలన్నారు.

 

కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి..

ఆదిలాబాద్ : కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఇన్ ఫ్లో 11600 క్యూసెక్కులు ఉంది. 2 గేట్లు ఎత్తివేశారు. 21,700 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల చేశారు. 

14:12 - August 3, 2016

హైదరాబాద్ : రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న తరుణంలో మరో భారత ఆటగాడు డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయాడు. ఒలింపిక్స్ కు భారత్ తరఫున ఎంపికైన స్ప్రింటర్ ధర్మవీర్ సింగ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. ధర్మవీర్ సింగ్ కు రెండుసార్లు జరిపిన పరీక్షల్లోనూ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినట్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ధర్మవీర్‌ సింగ్‌ ఒలింపిక్స్‌ పోటీలకు వెళ్లడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు డోపీలుగా తేలగా, రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు మాత్రమే అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు.

రాజ్యసభలో జీఎస్టీ బిల్లు..

ఢిల్లీ : జీఎస్టీ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టారు. దేశంలోనే అతి పెద్ద పన్ను సంస్కరణ బిల్లుగా ఆయన అభివర్ణించారు. 

14:08 - August 3, 2016

హైదరాబాద్ : గ్రామాల్లోని పాఠశాలలను మొత్తం మోడల్ స్కూల్స్ గా మారస్తామంది.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి అన్ని వసతులు కల్పిస్తామంది. కానీ ఇప్పటికీ ఆ గ్రామాల్లో పాఠశాలల రూపురేఖలు మారలేదు. రాజధాని రాకతో రాత మారుతుందని భావించిన 29 గ్రామాల్లో పాఠశాలల పరిస్ధితిపై 10 టీవీ ప్రత్యేక కథనం.....

రాజధాని గ్రామాల్లో పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్న సర్కార్..
రాజధానిగా ప్రకటించిన 29 గ్రామాల్లో ఈ ఏడాది జూన్ నుంచి అన్ని పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు కోతలు కోశారు. అన్ని స్కూల్స్ లో వసతులు కల్పించి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పిల్లలకు స్ధానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ స్ధాయి విద్య, వసతులు కల్పిస్తామని ప్రకటించారు.

దీంతో నిరాశచెందిన 29 గ్రామాల ప్రజలు..
అయితే అధికారుల ప్రకటనతో సంతోషపడిన రైతులకు నిరాశే ఎదురయ్యింది. ప్రభుత్వం అధికారులు చెప్పినట్లుగా ఏ గ్రామంలో కూడా మోడల్ స్కూల్స్ ను ప్రారంభించలేదు. ఎక్కడా ఇంగ్లీఘ మీడియం క్లాస్ లను బోధించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించలేదు. దీంతో 29 గ్రామాల్లో అనేక మంది తమ పిల్లలను విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూల్స్ కు పంపిస్తున్నారు.

అసాంఘిక కార్యకాలపాలకు అడ్డాగా మారుతున్న పాఠశాలలు..
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో మోడల్ స్కూల్స్ మాట అటుంచితే...సాధారణ పాఠశాలల పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడం,.. పురాతన భవనాల్లో ఉన్న పాఠశాలలు శిధిలాస్థకు చేరుకోవడంతో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

మండిపడుతున్న విద్యార్థి సంఘాలు..
రాజధాని ప్రాంతంలో పాఠశాలలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పుడు కనీసం అటువైపు కూడా చూడటం లేదని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి.

కనీస వసతలు కల్పిస్తే చాలంటున్నారు అక్కడి ప్రజలు...
రాజధాని ప్రాంతంలోని పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా మార్చకపోయినా పర్వాలేదు కానీ, కనీస వసతలు కల్పిస్తే చాలంటున్నారు అక్కడి ప్రజలు. మరీ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హమీలను వచ్చే విద్యా అకాడమికైనా నెరవేర్చుతుందో లేదో వేచి చూడాలి.  

సీపీఎం వాణిని చూసి టీఆర్ఎస్ భయపడుతోంది - రాఘవులు..

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో సీపీఎం బలాన్ని చూసి భయపడవద్దని, ప్రజా సమస్యలపై సీపీఎం మాట్లాడుతుంది..పోరాడుతుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. సీపీఎం వాణిని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలింబిస్తోందని, ప్రజా ఉద్యమాల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని..ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

బాబు దేనికి భయపడడం లేదు - ఎంపీ అవంతి..

ఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు దేనికి భయపడడం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో రాజీపడమని ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విభజన హామీలపై బీజేపీకి ఎంత బాధ్యత ఉందో కాంగ్రెస్ కూ అంతే బాధ్యత ఉందని, కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తామంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు ఆపారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఒకలా..రాష్ట్రంలో మరొకలా కాంగ్రెస్ వైఖరి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే జీఎస్టీ బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు పోరాడాలని సూచించారు. 

14:00 - August 3, 2016

కరీంనగర్‌ : మంత్రి ఈటెల కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు మంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు ఢీ కొట్టుకోవడంతో..కొన్ని కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ కారును ఓ ఇంటిముందు ఆపేందుకు సడెన్‌ బ్రేక్‌ వేయగా.. వెనకనుంచి వచ్చిన కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. 

జైట్లీ విజ్ఞప్తి మేరకు నిరసనలకు విరామం - ఎంపీ రామ్మోహన్ నాయుడు..

ఢిల్లీ : జైట్లీ విజ్ఞప్తి మేరకు నిరసనలను విరమిస్తున్నట్లు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విభజన తరువాత రెండేళ్లలో ఏపీకి అందిన సహాయం విభజన హామీల అమలుపై లోక్ సభలో చర్చ జరగలేదన్నారు. విభజన హామీలపై చర్చకు లోక్ సభలో పట్టుబడుతున్నామన్నారు. 

శిథిల భవనాలను కూల్చడానికి అన్ని ప్రయత్నాలు - కమిషనర్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. పలు చోట్ల శిథిలావస్థకు చేరినా కోర్టు కేసుల కారణంగా కొందరు భవనాలను ఖాళీ చేయడం లేదన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. 

వర్షం కారణంగా రోడ్లు పాడవుతున్నాయి - మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : వర్షం కారణంగా రోడ్లు పాడవుతున్నాయని, రోడ్లపై మట్టి పేరుకపోతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లను వెంటనే శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 

13:58 - August 3, 2016

కృష్ణా : నందిగామ మండలంలోని పొన్నవరంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న తరహాలో నిరసన తెలిపింది. యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ నేతృత్వంలోని కార్యకర్తలు సుజనా ఇంటి ముందు చీపుర్లతో రోడ్లు ఊడ్చి ప్రత్యేక హోదా కోసం సుజనా చౌదరి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రానికి హోదాను సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పొన్నవరం గ్రామానికి తరలిరాగా, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొంది.

తాలిపేరు ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..

ఖమ్మం :తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 5గేట్లను ఎత్తివేశారు. 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

 

అమరావతిలో ఫుడ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలు..

గుంటూరు : అమరావతిలో ఫుడ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. 14 బృందాలు తనిఖీలు చేపట్టాయి. రూ. లక్ష విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాలం చెల్లింన 500 కాఫీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

పుష్కరాల పనులు నాసిరకం - వీహెచ్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత వీహెచ్ ఆరోపించారు. పుష్కరాల పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. చల్లో మల్లన్న సాగర్ కార్యక్రమానికి తనను పిలవలేదని, తాను అక్కడకు వెళితే ఎవరిని అడిగి వచ్చారని జిల్లా అధ్యక్షురాలు సునీత అనడం దారుణమన్నారు.

 

13:55 - August 3, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ఆందోళనను టీడీపీ ఎంపీలు విరమించారు. అరుణ్‌జైట్లీపై ఉన్న గౌరవంతోనే వారం రోజులు సమయం ఇస్తూ ఆందోళనను విరమిస్తున్నట్లు మురళీ మోహన్‌ తెలిపారు. హోదా కోసం అవసరమైతే పదవులు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎంపీ మురళీమోహన్‌.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీకి రాజీపడాల్సిన అవసరం లేదని..ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు అవంతి శ్రీనివాస్‌. ఏపీకి న్యాయం చేయాలని కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే జీఎస్టీ బిల్లును అడ్డుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూస్తున్నందునే హోదా కోసం గట్టిగా పోరాడుతున్నట్లు మరో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

13:47 - August 3, 2016

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని రాయ్ గఢ్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎన్టీఆర్ ఎఫ్‌ సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారని అన్నారు. రెండు నేవీ హెలికాఫ్టర్లతో సిబ్బంది సహాయకచర్యలు కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్ర బలగాలను మహారాష్ట్రకు పంపామని.. గల్లంతయిన వారికోసం బృందాలు గాలిస్తున్నాయన్నారు. సీఎం ఫడ్నవీస్ గంటగంటకు వివరాలు సేకరిస్తున్నారని రాజ్ నాథ్ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 

వరద తాకిడికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్..
భారీ వర్షాల కారణంగా ఉప్పొంగుతున్న సావిత్రి నది ప్రవాహానికి మహారాష్ట్రలోని ముంబై-గోవా హైవేపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. వరద ఉధృతికి రాయగఢ్‌ సమీపంలోని బ్రిటీష్‌ కాలం నాటి బ్రిడ్జి తెగిపోవడంతో దీనిపై వెళ్తున్న 2 బస్సులు, మరో 4 వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 22 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇందులో ఇద్దరు బస్సు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లున్నారు. ఎన్డీఆర్‌ ఎఫ్‌ బృందాలు, సైన్యం సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైనవారి ఆచూకి కోసం వాయుసేనకు చెందిన హెలిక్యాప్టర్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సావిత్రి నదిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. తాను రాయగఢ్‌ అధికారులతో మాట్లాడనని, వారు సహాయక చర్యలు చేపట్టారని మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌ తెలిపారు. 

13:42 - August 3, 2016

న్యాయసలహాలు..సూచనలు తెలిపే మైరైట్ కార్యక్రమం ఈరోజుకూడా మన మందుకు వచ్చేసింది. మరి ఈరోజు మైట్ లో మహిళలు-మెటర్నటీ లీవ్స్ అనే అంశంపై సలహాలు సూచలను తెలిపేందుకు అడ్వకేట్ పార్వతి గారు మనముందుకు వచ్చారు.. ఉద్యోగం చేసే మహిళలకు మెటర్నటీ లీవ్స్ అనేవి చాలా అవసరం. వర్కింగ్ ఉమెన్స్  డెలీవరీ కోసం తీసుకునే సెలవులు మాతృత్వ సంక్షేమ యాక్ట్ కిందికి వస్తాయి. దీనిపై కేంద్రప్రభుత్వం కూడా ఇటీవల స్పందించింది. ఈ అంశంపై అడ్వకేట్ పార్వతి గారి ఎటువంటి విషయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమచారం తెలుసుకోండి..

ఎమ్మెల్యే గొట్టిపాటి..కరణం మధ్య వివాదం..

ప్రకాశం: జిల్లాలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. పెన్షన్ల పంపిణీ వీరి మధ్య వివాదానికి కారణంగా నిలిచింది.

సావిత్రి నదిలో రెండు మృతదేహాలు లభ్యం..

ముంబై : ముంబై - గోవా జాతీయ రహదారి వద్ద సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టాయి. 

సావిత్రి నది ఘటనపై రాజ్ నాథ్ వివరణ..

ఢిల్లీ : సావిత్రి నది వంతెన కొట్టుకుపోయిన ఘటనపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. ముంబయి - గోవా రహదారిపై నిర్మించిన వంతెన కూలడంతో సావిత్రి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయాయని, గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు కేంద్ర మంత్రులను ఆయన ఆహ్వానించనున్నారు. 

13:28 - August 3, 2016

హైదరాబాద్ : బంద్ లు చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టటం వైసీపీ ఆలోచన కాదనీ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటమే వైసీపీ లక్ష్యమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ మాటలు వింటుంటే ఆవేదన కలుగుతోందన్న చంద్రబాబు నాయుడు జైట్లీ తో ఫోన్ లో మాట్లాడిన తరువాత ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాల్సిన అవసరముందన్నారు. 

తార్నాక ఆసుపత్రిలో ఆర్టీసీ ఛైర్మన్..

హైదరాబాద్ : తార్నాక ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రిలో ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయన తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయంపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, వైద్యుల పనితీరుపై ఛైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హెచ్చరించారు. 

12:58 - August 3, 2016

విశాఖపట్నం : ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రజలకు మౌలిక వసతులు కల్పించే పనిలో పడింది విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఇప్పటికే ఉత్తరాంధ్ర తో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ పలు కార్యక్రమాలు చేపడుతున్న ఉడా సామాన్యులకు సైతం సొంత ఇంటి కలను నిజం చేసేందుకు సమాయత్తమవుతోంది.

1978లో విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీగా ఏర్పాటు..
విశాఖ అవసరాల కోసం 1962లో ఏర్పాటైన టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ 1978లో విశాఖ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది. ప్రారంభంలో 1721 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంతో అనకాపల్లి, భీమిలి, గాజువాక, విజయనగరం, మున్సిపాలిటీలతో పాటుగా 287 గ్రామాలు దీని పరిధిలో ఉండేవి. ఆ తర్వాత ఉడా ను మరితంగా విస్తరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా తునిని కూడా ఉడా పరిధిలోకి చేర్చారు.

మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ఉడా రంగంసిద్దం..
అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి ఉడా రంగం సిద్థం చేసుకుంది. దానికి అనుగుణంగానే ఉడా ఆధ్వర్యంలో 48 లే అవుట్లను, 88 హౌసింగ్ బిల్డింగ్ సొసైటిలను, 6 జాయింట్ వెంచర్స్ ను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఇతర సంస్ధలతో కలిసి 66 ప్రాజెక్టులను ఇప్పటి వరకు పూర్తిచేసింది. ఇంతే కాకుండా ఉడా పరిధిలో ఉన్న జిల్లాల్లో పలు టూరిజం డెవలప్ మెంట్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్త్తోంది.

వ్యాపార సంస్థగా మారిన ఉడా ..
మొదట్లో కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యమిచ్చిన VUDA క్రమంగా వ్యాపార సంస్థగా మారుతోంది. వాణిజ్య భవన సముదాయాలను నిర్మించి వాటి ద్వారానే ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది.

మల్టీ షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి ఉడా ప్లాన్..
విశాఖ నగరంలోని సీతమ్మధార, ఎంవీపీ కాలనీ వంటి ప్రాంతాలలో వాణిజ్య సముదాయాలను నిర్మించి వాటిని అద్దెలకు ఇవ్వడం ద్వారా ఉడా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇవేకాక పిఠాపురం కాలనీ, రాంనగర్ లలో కూడా ఇలాంటి మల్టీ షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించాలని ఉడా ఇప్పటికే నిర్ణయించింది.

టూరిజం డెవలప్ మెంట్ కు ఉడా ఏర్పాట్లు..
టూరిజం పరంగా కూడా డెవలప్ చేయ్యడానికి విశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత హుద్ హుద్ తుఫాన్ వల్ల దెబ్బతిని కైలాసగిరిలో ఉన్న శంఘచక్రాలను, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. గండి గుండంలో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్ కాంప్లెక్స్ పనులు కూడా ఉడా నే చేస్తోంది.   

12:25 - August 3, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగారు. వైసీపీ పార్లమెంటరీ సభా పక్ష నేత మేకపాటి నేతృత్వంలో ఎంపీలు వైవీ. సుబ్బారెడ్డి, బుట్టారేణుక, విజయసాయి రెడ్డి తదితరులు నిరసనలు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ టీడీపీలు నాటకాలు అడుతున్నాయని మండిపడ్డారు. 

12:22 - August 3, 2016

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌రేప్‌లపై రాజ్యసభ దద్దరిల్లింది. సభ ప్రారంభంలోనే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై చర్చ చేపట్టాలని మహిళా ఎంపీలు పట్టుబట్టారు. యుపితో పాటు దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై చర్చ చేపట్టాలని తాము ఇదివరకే సూచించామని దీన్ని రాజకీయం చేయొద్దని ఎస్పీ సభ్యురాలు జయాబచ్చన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రమంత్రి నక్వి తెలిపారు. మహిళలపై లైంగిక దాడులు సీరియస్‌ అంశమని, నోటీసు ఇవ్వనందున ప్రస్తుతం చర్చకు అనుమతించేది లేదని, జీరో అవర్‌లో చర్చకు అనుమతిస్తామని డిప్యూటి స్పీకర్‌ కురియన్‌ స్పష్టం చేశారు. 

చీరలు చించుతారా - భూమన..

చిత్తూరు : మహిళలపై టిడిపి ప్రభుత్వం అమానుషంగా ప్రదర్శిస్తోందని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం బుధవారం బంద్ లో పాల్గొన్న మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం తిరుపతిలో నిన్నటి ఆందోళనలో భాగంగా చిరిగిన చీరలను ప్రదర్శించారు. 

కర్నూలులో 50 మంది విద్యార్థులకు అస్వస్థత..

కర్నూలు : చాగలమర్రి కస్తూర్బా హాస్టల్ లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రిన్స్ పాల్ అందుబాటు లేరు. 

ఖమ్మంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం..

ఖమ్మం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనులలోకి భారీగా వరద నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మోటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆందోళన విరమించిన ఏపీ టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఆందోళన విరమించారు. హామీలు అమలు చేస్తామని చంద్రబాబుకు జైట్లీ పేర్కొన్నారని, జైట్లీపై ఉన్న గౌరవంతో వారం పాటు నిరసనలు విరమిస్తున్నట్లు చెప్పారు. తమ పోరాటం రెండు రోజులకు పరిమితం కాదని, విభజన హామీలు సాధించే వరకు నిద్రపోమని మురళీ మోహన్ పేర్కొన్నారు. అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామన్నారు. 

హోదా ఇవ్వాల్సిందే - ఉండవల్లి..

తూర్పుగోదావరి : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ రెవెన్యూ లోటును కేంద్రం ఇప్పటికీ భర్తీ చేయలేదని, చంద్రబాబుతో జైట్లీ ఏం మాట్లాడారు ? ఏ హామీ ఇచ్చారో ? అర్థం కావడం లేదన్నారు. 

ప్రారంభమైన సీపీఎం తెలంగాణ కమిటీ సమావేశాలు..

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు, రేపు ఈ సమావేశాలు కొనసాగుతాయి. పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు హాజరయ్యారు. 

రాజ్యసభను కుదిపేసిన అత్యాచార ఘటన..

ఢిల్లీ : రాజ్యసభను యూపీ అత్యాచార ఘటన కుదిపేసింది. మహిళల భద్రతపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. జీర్ అవర్ లో చర్చిద్దామని స్పీకర్ సూచించారు. వరుస అత్యాచారాలపై చర్చించాల్సిందేనని విపక్షాలు స్పష్టం చేశాయి. దేశంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. 

మంత్రి ఈటెల కాన్వాయ్ లో ప్రమాదం..

కరీంనగర్ : మెట్టుపల్లిలో మంత్రి ఈటెల కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లో ఒకదానికొకటి నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం..

కరీంనగర్ : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. రామగుండం రీజియన్ లోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

సోనియాను పరామర్శించిన కేంద్ర మంత్రి పారికర్..

ఢిల్లీ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కేంద్ర మంత్రి పారికర్ పరామర్శించారు. ఆర్మీ ఆర్ఆర్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. సోనియా గాంధీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 

డీఆర్డీవో ఇండియా ఎగ్జిబీషన్ ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ లో డీఆర్డీవో ఇండియా ఎగ్జిబీషన్ ను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మనోహర్ పారికర్, ఇతరులు హాజరయ్యారు. 

ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ హైవే పై రోడ్డు ప్రమాదం...

ముంబై : ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ హైవే పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్వాలి దేవలి బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. 

రేపు గుజరాత్ కు వెళ్లనున్న మాయావతి..

ఢిల్లీ : గుజరాత్ రాష్ట్రానికి తాను గురువారం వెళ్లనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఇటీవలే అత్యాచారానికి గురైన బాధితులను పరామర్శిస్తానని తెలిపారు. 

సానియా బాగానే ఉన్నారు - రణ్ దీప్..

ఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారని ఆ పార్టీ నేత రణ్ దీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. 

11:27 - August 3, 2016

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో మూడవరోజుకూడా ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదో కోసం డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ సుమిత్రామహాజన్ సూచించారు. ఇప్పటికే మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయంపై విరవరణ ఇచ్చారు కాబట్టి నిరసన తెలపటం ఆమని స్పీకర్ ఆందోళన ప్రదర్శిస్తున్న  ఎంపీలకు  సూచించారు. 

వరద వల్లే కూలిన వంతెన - ఫడ్నవీస్..

ముంబై : ముంబై - గోవా జాతీయ రహదారి వద్ద సావిత్రి నదిపై నిర్మించిన వంతెన భారీ వరద ప్రవాహం వల్లే కూలిపోయిందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. వంతెన కూలి పోవడం దురదృష్టకరమని, వరద ప్రవాహంలో రెండు బస్సులు, రెండు కార్లు కొట్టుకుపోయాయని తెలిపారు. మొత్తం 20 మంది గల్లంతయ్యారని, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

నష్టాల్లో స్లాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 141 పాయింట్లు కోల్పోయి 27,840 వద్ద కొనసాగుతుండగా నిప్టీ 31 పాయింట్లు కోల్పోయి 8,591 వద్ద కొనసాగుతోంది. 

మధ్యాహ్నం లోక్ సభ బీఏసీ సమావేశం..

ఢిల్లీ : మధ్యాహ్నం ఒంటి గంటకు లోక్ సభ బీఏసీ సమావేశం జరగనుంది. ప్రత్యేక హోదా, విభజన అంశాలపై టిడిపి ఇచ్చిన నాలుగు నోటీసులపై బీఏసీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. 

సుజనా ఇంటి ఎదుట కాంగ్రెస్ వినూత్న నిరసన..

కృష్ణా : జిల్లా నందిగామ మండలంలోని పొన్నవరంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న తరహాలో నిరసన తెలిపింది. యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ నేతృత్వంలోని కార్యకర్తలు సుజనా ఇంటి ముందు చీపుర్లతో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సుజనా చౌదరి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. 

తిరుమలలో కృష్ణా పుష్కర యాత్ర ప్రారంభం..

చిత్తూరు : టీటీడీ చేపట్టిన కృష్ణా పుష్కరయాత్ర తిరుమల నుంచి ప్రారంభమైంది. తిరుమల నుంచి విజయవాడకు కల్యాణరథంలో పుష్కరయాత్ర సాగనుంది. 

ఆనందీబెన్ రాజీనామా ఆమోదం - వెంకయ్య..

ఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోడీ నివాసంలో బేజీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఆనందీబెన్‌ రాజీనామా లేఖ ప్రధానికి అందిందని, ఆనందీబెన్‌ ఈ రోజు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ అందిస్తారని వెంకయ్యనాయుడు తెలిపారు.

 

11:12 - August 3, 2016

పోకెమన్ గో ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తోంది. పోకెమన్ గో... కొన్ని రోజులుగా మొబైల్ క్రీడా ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఈ గేమ్ ఆడడం వల్ల పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ పోకేమెన్ లో 142 క్యారెక్టర్స్ ఉంటాయి. మొబైల్ ఆన్ చేసి లోకేష్ క్లిక్ చేస్తే క్యారెక్టక్ అక్కడకక్కడ కనిపిస్తుంటాయి. మొత్తం 142 క్యారెక్టర్స్ తీసుకుంటే విన్ అవుతారు. ఈ క్యారెక్టర్ లను పట్టుకోవడం కోసం హింసలు పడుతున్నారంట. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:11 - August 3, 2016

ఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు  బుధవారం రాజ్యసభకు రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు భేటీ అయ్యారు. బిల్లు విషయంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. ఈ బిల్లుకు మద్దతు పలకాలని ప్రధాని మోదీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. సభలోని సభ్యులందరికీ బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి.

11:11 - August 3, 2016

కబాలి సినిమా రిలీజ్ అయ్యింది. రజనీ నటించిన ఈ సినిమా భారీ అంచనాలను అందుకోలేకపోయింది. కొంతమంది సినిమా చూసి అసంతృప్తి వ్యక్తం చేశారంట. సినిమా మొత్తం చూడలేక కొంతమంది బయటకొచ్చారంట. రెగ్యులర్ పంచ్ డైలాగ్ లు లేవు. స్టైల్..మాస్..ఫైట్స్ అంతగా లేవు. ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారంట. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:07 - August 3, 2016

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. సమావేశానంతరం మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..గుజరాత్ ముఖ్యమంత్రి అంశంపై సమావేశంలో చర్చించామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ ఇచ్చిన రాజీనామా ప్రధానికి అందిందని ఆయన తెలిపారు. బెన్ ఇచ్చిన రాజీనామాను పార్లమెంటరీ బోర్డు ఆమోదించిందన్నారు. నేడు రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్రపతికి  గవర్నర్ రాజీనామాను సమర్పిస్తారన్నారు. యువ నాయకత్వం కోసమే ఆనందీ రాజీనామా చేశారనీ..అందుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని.. రాజీనామాను అభినందిస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. సీఎంను ఎంపిక చేసే ముందు పార్టీ ఎమ్మెల్యేలతో కమిటీ భేటీ అయి వారి అభిప్రాయాలను తెలుసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. గుజరాత్ నూతన సీఎం పదవి  బీజేపీ గుజరాత్  రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ రూపానీకి దక్కే ఛాన్స్ వున్నట్లుగా సమాచారం..

10:47 - August 3, 2016

పెళ్లిళ్లు చూడాలని చాలా మంది తహతహలాడుతుంటారు. సంప్రదాయం ప్రకారం ఐదు రోజుల పాటు వివాహ కార్యక్రమాలు జరుగుతుంటాయి. భారతదేశ వివాహ వ్యవస్థపై విదేశీయులు ముచ్చట పడుతుంటారు. ఇక్కడి వివాహాలు చూడాలని ఉత్సాహం చూపుతుంటారు. కానీ ఆహ్వానం లేకపోవడం వల్ల చాలా మంది ఇతర వివాహాలకు వెళ్లకపోతుంటారు. అందుకోసమే 'జాయిన్ మై వెడ్డింగ్' అనే వెబ్ సైట్ వచ్చింది. విదేశీయుల కోసం దీనిని రూపొందించారు. వివాహానికి టికెట్లు విక్రయించుకోవచ్చు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఓ వివాహానికి ఒక్కో టికెట్ ధర రూ. 20వేలు నిర్ణయించారంట. ఐదు రోజుల పాటు భోజనం..ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తారు.

చావుకు అడ్వాన్స్ బుకింగ్..
అంతిమ సంస్కారం కోసం అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. అవును ముంబైలో సుఖాంత్ కంపెనీ దీనిని నిర్వహిస్తోంది. పిల్లలు పెద్దగా అయిపోయి విదేశాలు..ఇతరత్రా పనులపై వెళ్లిపోయిన తరువాత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరు చనిపోయిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారనే దానిపై పలువురు ఆందోళన చెందుతుంటారు. అందుకోసమే 'సుఖాంత్' అనే కంపెనీ ముందుకొచ్చింది. అంత్యక్రియలు తామే నిర్వహిస్తామని పేర్కొంది. రూ. 15 వేల నుండి ప్యాకేజీలు మొదలవుతాయి. అంతిమ సంస్కారం ఎలా నిర్వహించాలో అందులో పొందుపర్చుకోవచ్చు.

గాంధీ ఆసుపత్రిలో కరెంటు కోత..
గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే కరెంటు ట్రిప్ అయ్యింది. దీనితో 21 మంది చనిపోయారు. కంటిన్యూస్ గా కరెంటు ట్రిప్ కావడంతో పాటు నాలుగు జనరేటర్లు పనిచేయలేదు. గాంధీ ఆసుపత్రిలో రోజుకు పది మంది దాక చనిపోతుంటారు. సెల్ ఫోన్ టార్చర్ ఉపయోగించి ఓ డాక్టర్ ఆపరేషన్ నిర్వహించాడు.

పార్లమెంటల్ పడుకున్నారు..
పార్లమెంట్ లో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ నిద్రపోయారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2014లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఆయనసలు నిద్రపోలేదని పేర్కొన్నారు. 
ఈ అంశాలపై 

10:41 - August 3, 2016

ఒలింపిక్స్ లో భారత్ ఖచ్చితంగా ఏదో ఒకపతకం సాధించగల క్రీడలు ఏవంటే కుస్తీ, షూటింగ్ అన్నసమాధానమే వస్తుంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్ లో సైతం పతకాలు సాధించగలమన్న ధీమాతో భారత షూటర్లు, వస్తాదులు బరిలోకి దిగుతున్నారు. 2016 ఒలింపిక్స్ షూటింగ్, రెజ్లింగ్ అంశాలలో భారత్ పతకాల అవకాశాల పై స్పెషల్ స్టోరీ........

పతకాల పంటకు సాధన చేస్తున్న భారత్ క్రీడాకారులు..
అమెజాన్ గడ్డ రియో వేదికగా జరిగే 2016 ఒలింపిక్స్ ప్రారంభానికి ఓవైపు సమయం దగ్గర పడుతుంటే....మరోవైపు..భారత వస్తాదులు, షూటర్లు మాత్రం..పతకాల పంట పండించాలన్న పట్టుదలతో సాధన చేస్తున్నారు.

కుస్తీ,షూటింగ్ పై భారత్ ఆశలు..
ఒలింపిక్స్ లో భారత్ ఖచ్చితంగా ఏదో ఒక పతకం సాధించగల క్రీడల జాబితాలో కుస్తీ,షూటింగ్ మాత్రమే ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి 2012 లండన్ ఒలింపిక్స్ వరకూ భారత షూటర్లు, మల్లయోధులు ఏదో ఒక పతకం సాధిస్తూనే వచ్చారు.

2008 బీజింగ్ ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన అభినవ్ బింద్రా..
2008 బీజింగ్ ఒలింపిక్స్ ఏర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా బంగారు పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. 12 దశాబ్దాల ఒలింపిక్స్ చరిత్రలో...వ్యక్తిగత విభాగంలో భారత్ సాధించిన ఒకే ఒక్క స్వర్ణ పతకం అభినవ్ బింద్రా సాధించినదే కావడం విశేషం.

గగన్ నారంగ్, విజయ్ కుమార్ షూటింగ్..
అంతేకాదు..2012 లండన్ ఒలింపిక్స్ లో పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ రజతపతకం సాధిస్తే...ఏర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య పతకం అందించాడు. అంతేకాదు ..లండన్ ఒలింపిక్స్ లో భారత్ సాధించిన మొత్తం ఆరు పతకాలలో షూటర్లు అందించినవే రెండు పతకాలు ఉన్నాయి.

భారత్ బృందానికి పతాకధారిగా ఏస్ షూటర్ అభినవ్ బింద్రా..
ఇక...ప్రస్తుత రియో ఒలింపిక్స్ లో పాల్గొనే 120 మంది సభ్యుల భారత బృందానికి ఏస్ షూటర్ అభినవ్ బింద్రా పతాకధారిగా వ్యవహరించబోతున్నాడు.అంతేకాదు..భారత్ కు మరోసారి బంగారు పతకం అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఏర్ రైఫిల్, పిస్టల్ విభాగాల వ్యక్తిగత, టీమ్ విభాగాలలో భారత షూటర్లు పోటీకి దిగుతున్నారు.

కుస్తీమే సవాల్ అంటున్న కుస్తీదారులు..
మహిళల విభాగంలో అపూర్వి చండీలా, అయోనికా పాల్, హీనా సిద్ధూ సమరానికి సిద్ధమయ్యారు. మొత్తం 11 విభాగాలలో భారత షూటర్లు పోటీకి దిగుతున్నారు.కుస్తీ పురుషుల, మహిళల విభాగాలలో సైతం భారత వస్తాదులు పతకాలకు గురిపెట్టారు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లో బ్యాక్ టు బ్యాక్ పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్...రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలంకావడంతో...ప్రస్తుత గేమ్స్ లో పతకాలు సాధించిపెట్టే బాధ్యత యోగేశ్వర్ దత్, నర్సింగ్ యాదవ్ ల పైన పడింది.2016 ఒలింపిక్స్ లో భారత్ మొత్తం ఎనిమిదిమంది సభ్యుల జట్టుతో ఫ్రీస్టయిల్, గ్రీకోరోమన్ విభాగాలలో పోటీకి దిగుతోంది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కిలోలవిభాగంలో సందీప్ తోమర్, 65 కిలోల విభాగంలో యోగేశ్వర్ దత్, 74 కిలోల విభాగంలో నర్సింగ్ యాదవ్ ..కుస్తీమే సవాల్ అంటున్నారు.

రియో ఒలింపిక్స్ లో భారత్ ఎన్ని పతకాలు సాధించగలదన్నదే పాయింట్..
గ్రీకోరోమన్ విభాగంలో రవీందర్ , హర్దీప్ సింగ్ పోటీకి దిగుతున్నారు.మహిళల విభాగంలో ముగ్గురు భారత వస్తాదులు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. 48 కిలోల విభాగంలో వినీష్ పోగట్, 53కిలోల విభాగంలో బబితా కుమారి, 58 కిలోల బరిలో సాక్షి మాలిక్ సమరానికి సిద్ధమయ్యారు. 2012 లండన్ ఒలింపిక్స్ షూటింగ్ , కుస్తీ అంశాలలో రెండు పతకాలు చొప్పున సాధించిన భారత షూటర్లు, రెజ్లర్లు...రియో ఒలింపిక్స్ లో ఎన్ని పతకాలు సాధించగలరన్నదే ఇక్కడి అసలు పాయింట్...

మహారాష్ట్రలో గల్లంతైన వారి కోసం గాలింపు..

మహారాష్ట్ర : ముంబై - హైవై బ్రిడ్జి కూలిపోవడంతో గల్లంతైన వారి కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ సహాయంతో గాలింపులు చేపట్టారు. సావిత్రి నది ఉగ్రరూపం దాల్చడంతో బ్రిడ్జి కూలిపోయింది. నదిలో రెండు బస్సులు, రెండు కార్లు కొట్టుకపోయినట్లు సమాచారం. 22 మంది ప్రయాణీకులు గల్లంతైనట్లు తెలుస్తోంది. 

10:28 - August 3, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తరువాత ఆచితూచి అడుగేస్తున్నాడు. సినిమాలు..షూటింగ్..ఇతరత్రా విషయాల్లో జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. పవన్ నటించే చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఎస్‌జే సూర్య ఎగ్జిట్ అయ్యి.. డాలీ ఎంట్రీ ఇవ్వడం సినిమా ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఎట్టకేలకు ఆగస్ట్ 6న షూటింగ్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ను కేవలం వార్మప్ కోసం నిర్ణయించారని టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లో కంప్లీట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో షెడ్యూల్ మాత్రం నెల్లాళ్లుకు పైగా సాగనుందని, గ్రామీణ నేపథ్యంలో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. కొన్ని పాటలను విదేశాల్లో తీయడానికి దర్శకుడు డాలీ యోచిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ కంప్లీట్ విషయంపైనే డాలీ దృష్టి పెట్టాడని, రిలీజ్ విషయంలో ఇంకా నిర్ణయించుకోలేదని సమాచారం. మరి పవన్ సినిమా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో ? షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారో వేచి చూడాలి. 

10:26 - August 3, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చాలామంది జ్వరాల బారినపడుతున్నారు. దీంతో ఆస్పత్రుల్లో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుంది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

1284 మలేరియా కేసులు..118 డెంగ్యూ..15 చికెన్‌ గున్యా కేసులు..
రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి..మారుమూల ప్రాంతాల వరకు పెద్దసంఖ్యలో ప్రజలు వీటి బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ..ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఓపి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 వందల 84 మలేరియా కేసులు.. 118 డెంగ్యూ..15 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి.

హైదరాబాద్‌లో లక్ష మందికి జ్వరాలు..
హైదరాబాద్‌లోనే ఈ ఏడాది లక్షమందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వస్తున్నారు. ఉస్మానియా..గాంధీ..ఫీవర్‌ రోజూ ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య వందల సంఖ్యలో ఉంటుంది. వందలాది మంది పిల్లలు జ్వరాలతో నీలోఫర్‌ ఆస్పత్రికి వస్తున్నారు. పారిశుధ్య లోపం.. దోమలు వ్యాప్తి చెందడం వల్ల విషజ్వరాలు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలందరూ పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను తరిమేయ వచ్చని సూచిస్తున్నారు.

బిల్లులు రూపంలో రోగులను దోచుకుంటున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ బాధలు తట్టుకోలేక పలువురు నగరంలోని ప్రైవేట్‌ ఆస్పతులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అవసరం ఉన్నా..లేకపోయినా అన్ని పరీక్షలు చేయిస్తూ.. బిల్లుల రూపంలో భారీగా దోచుకుంటున్నారు. అలాగే ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్‌లెట్‌లు ఎక్కిస్తున్నారు. చివరికి వేలకు వేలు గుంజేస్తున్నారు. వీరి ధనాశకు పేద..మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు.

ముందస్తు చర్యలు చేపట్టాలంటున్న ప్రజాసంఘాలు..
మారే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు కల్పించడంతో పాటు.. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని ప్రజాసంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.

10:20 - August 3, 2016

వంట చేయడం అంటేనే కొంతమందికి చిరాకుగా అనిపిస్తుంటుంది. ఎంత సేపు వంటగదిలోనేనా ? అంటూ ఆగ్రహం చేస్తుంటారు. వంట చేయడం వరకు సులువే అనిపిస్తుంది..వంట చేయక ముందు...చేసిన తరువాత ఉండే పనులు చూస్తుంటే మనిషిని అలసిపోయేలా చేస్తుంటాయి. ఇలా అలసి పోకుండా ఉండేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూడండి.
వంట పని గృహణి మాత్రమే చేయాలా ? అని ఆలోచించండి. వంట చేయడానికి సహాయ పడమని జీవిత భాగస్వామి..లేదా పిల్లలకు చెప్పండి.
డైనింగ్ టేబుల్ తుడవడం..గిన్నెలు కడగడం..కూరగాయాలు కట్ చేయడం తదితర పనుల్లో హెల్ప్ చేయండి అని అడగండి.
ఇలా ఒకరినొకరు సహాయం చేసుకోవడం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా అలసిపోకుండా ఉంటారు.
ప్రెజర్ కుక్కర్, డిష్ వాషర్..ఇతరత్రా వస్తువులు బాగానే ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత క్వాలిటీ అయితే పని అంత సులువు అవుతుంది.
ఖాళీ సమయంలో కూరగాయలను కట్ చేసుకోని పెట్టుకోండి. చెడిపోయే కూరగాయలైతే వాటిని ఫ్రిజ్ లో పెట్టుకోండి.
ఒక్కో పనికి ఒక్కో సమయాన్ని కేటాయించుకోండి. కూరగాయలు కోయడం..ఇతరత్రా పనులు పూర్తయిన తరువాత వంట గది నుండి బయటకు వచ్చి ఇతర పనులు చేయండి. 

బలపడనున్న అల్పపీడనం..

విశాఖపట్టణం : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

10:17 - August 3, 2016

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం పేర్కొన్నారు. కాంగ్రెస్ పై అభాండాలు వేయ్యొద్దనీ..ఈ పోరాటం అంతకాదు ఆరంభం అని ఆయన తెలిపారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మేమే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ ..అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం చెప్పలేదని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఎటువంటి సిఫారసులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వుందని ఆయన తెలిపారు. ఏపీకి ఇవ్వవలసన హోదా విషయంలో బీజేపీ డ్రామాలాడుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలేనని జైరాం రమేష్ తెలిపారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ ప్రత్యేక హోదాను ఇవ్వటంలేదన్నారు. ప్రత్యేక హోదా సాధించాలని టీడీపీ నిజంగా చిత్తశుద్ధి వుంటే ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చి పోరాటం చేయాలన్నారు. 

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాజ్యసభలో జీఎస్టీ బిల్లు రానున్న నేపథ్యం..ఇతరత్రా అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది.  

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుల భేటీ..

ఢిల్లీ : రాజ్యసభ ఎదుట నేడు జీఎస్టీ బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. 

కాంగ్రెస్ పై అభాండాలు వేయవద్దు - జేడీ శీలం

ఢిల్లీ : రాజ్యసభలో హోదా విషయంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ పై అభాండాలు వేయవద్దని కాంగ్రెస్ నేత జేడీ శీలం పేర్కొన్నారు. ఇది అంతం కాదని..ఆరంభమని తెలిపారు.

జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు - జైరాం రమేష్..

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరా రమేష్ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం ఎవ్వరికీ చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు హోదా ఉందని, ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ డ్రామాలాడుతోందని తెలిపారు. 

09:56 - August 3, 2016

దేశంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి... ఏదో ఒక పేరుతో దళితులపై దాడులు చేయాలన్న ఉద్దేశ్యపూర్వక వ్యామోహం బయలుదేరుతోంది.. ఈ మధ్య కాలంలో బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో జరిగిన ఘటనలు దళితులంటే జాతి వ్యతిరేకులనే ముద్ర వేసేందుకు బిజెపి అనుబంధ విభాగాల కార్యకర్తల ప్రయత్నాల తీవ్రతను తెలియజేస్తున్నాయి.. దళితులంటే ద్వేషం ఎందుకు... దీని వెనుక ఏముంది..

బీహార్, యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో దళితులపై దాడులు..
దళిత వర్గానికి చెందిన వారిని క్యాబినెట్ లో మంత్రులుగా నియమిస్తే సరిపోతుందా... అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపామని చెబితే సరిపోతుందా ... దళితలపై ప్రేమ ఉన్నట్లు మాటలు చెబితే సరిపోతుందా.. కాదు.. కావాల్సింది చేతలు.. వారికి అండగా ఉన్నామనే ధైర్యం... కానీ ప్రస్తుత ఎన్డీఏ పాలనలో ఏం జరుగుతోంది.. దేశంలో ఏదో ఒక మూల దళితులపై దాడులకు సంబంధించిన వార్తలు విస్తుగొలుపుతున్నాయి... దళితులను ఎందుకీ సర్కార్ అంత తీవ్ర వ్యతిరేక భావంతో చూస్తుందనే ప్రశ్నలు మేధావి, ప్రజాస్వామ్య వాదుల నుంచి వస్తున్నాయి. తాజాగా బీహార్, యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో జరిగిన ఘటనలు .. దళితులపై మోడీ హయాంలో దాడుల తీవ్రత పెరిగిందని చెప్పకనే చెబుతున్నాయి.

మాయావతిని వేశ్యతో పోల్చీన బీజేపీ నేత..
ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, నేటికీ ఆ రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతిని సాక్షాత్తూ యూపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఒక వేశ్యతో పోల్చుతూ వ్యాఖ్యానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ప్రతిపక్షాల ఆందోళన తర్వాత బేజేపీ ఆ సభ్యుణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు గాక.. కానీ ఓ మాజీ సీఎం, ఓ ప్రధాన పార్టీ అధినేత పై బీజేపీ నేత చేసిన విమర్శలపై ప్రధాని స్పందన రాకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.! ఒక మహిళ గూర్చి మాట్లాడకూడని భాషలో ఓ బీజేపీ నాయకుడు మాట్లాడటం.. నాగరికత అనిపించుకుంటుందా..? మాది క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పే కమలనాథులు దీన్ని సమర్థించుకుంటారా.... ఇదేనా సంస్కారం? ఇదేనా బీజేపీ అంతరాత్మ అంటూ దేశంలో విపక్షాలు, ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు.

నలుగురు దళిత యువకులపై దారణ హింస..
అలాగే, గుజరాత్‌లో ఆవు చర్మం వొలిచారన్న సాకుతో బీజేపీ అనుబంధ గో పరిరక్షణ సమితి సభ్యులు దళిత యువకులను ఘోరాతి ఘోరంగా హింసించటాన్ని ఏమనాలి... గోరక్షణ పేరుతో నలుగురు దళిత యువకుల చేతులు విరిచి, జీపులకు కట్టి వంతుల వారీగా కొడుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు పోస్టు చేసిన వీరి పైశాచికత్వాన్ని ఏమని పిలవాలి.... ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా విపక్షాలు ఆందోళన చేయడం బీజేపీ ఖండించడం షరా మామూలైపోయింది.. కానీ ఈ తరహా భావజాలం వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయకపోవడాన్ని ఉద్దేశ్యపూర్వక అలసత్వం అనవచ్చా అనే విమర్శలు వినిపిస్తున్నాయి... గోవులు, బర్రెల తరలింపునకు అనుమతులున్నా... గోరక్షకుల మంటూ దాడులు చేస్తున్న కొందరు బీజేపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని ఎన్డీటీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది కూడా...

అంబేద్కర్‌ కార్యక్షేత్రమైన భవనాన్ని కూల్చివేత...
మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‌ కార్యక్షేత్రమైన భవనాన్ని కూల్చివేయటాన్ని ఎలా అంచనా వేయాలి. అంబేద్కర్ పుట్టిన ఊరు సందర్శించామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు.. ఇలాంటి సంఘటనలపై నోరు మెదపరెందుకు.. అంబేద్కర్‌ కలలుగన్న దళితులు, వెనుకబడిన వర్గాల స్వావలంభనకు తూట్లు పొడవటంపై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.... ఆవులను రక్షించాలి అనే పేరుతో దేశ వ్యాప్తంగా దళితులను హింసించటం, ముస్లింలను చంపటంవంటి పనులను చేసేవారు... రాజ్యం అండ చూసే చేస్తున్నారనేది వాస్తవం కాదా...దీనిపై సమాధానం చెప్పడానికి ఎన్డీఏ పెద్దలు సాహసించడం లేదు.... బేజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో దళితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు సిద్దమయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు... కొందరు రచయితలపై దాడులు, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన నేపథ్యంలో దేశంలో రేగిన అసంతృప్తి పాలకులకు గుర్తుకు రావడం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు...

మతోన్మాదం ముసుగులో దౌర్జన్య కాండ...
దళితులు మన దేశం పౌరులు కాదా.. వాళ్లు ఓట్లు వేయడం లేదా.. దేశ అభివృద్ధిలో వారికి భాగస్వామ్యం లేదా... మరి ఎందుకీ ఆక్రోషం.. మతోన్మాదం ముసుగులో ఎందుకీ దౌర్జన్య కాండ... ఎన్టీఏ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.... దేశంలో అత్యంత చైతన్యవంతమైన శ్రేణిగా దళితులకు గుర్తింపు ఉంది... త్వరలో జరుగబోయే ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమైనవి. రాజ్యసభలో మైనారిటీలో ఉన్న బీజేపీ తననుకున్నట్టు పాలన సాగించాలంటే ఈ రాష్ట్రాలలో అధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని, తద్వారా రాజ్యసభలో మెజారిటీ సాధించుకోకతప్పదు. కానీ పెరిగిపోతున్న దళిత, మైనార్టీ వ్యతిరేకత ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపగలిగే అంశం... మరి పాలకులకు కనువిప్పు కలుగుతుందో లేదో చూడాలి...!

కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 

యూపీలో టీచర్ పై గ్యాంగ్ రేప్...

ఉత్తర్ ప్రదేశ్ : బారెల్లి ప్రాంతంలో ఓ టీచర్ పై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ టీం, డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేపట్టారు.  

నేడు గుజరాత్ సీఎం అభ్యర్థిపై బీజేపీ నిర్ణయం..

ఢిల్లీ : గుజరాత్ సీఎం అభ్యర్థి విషయంలో నేడు బీజేపీ ఓ నిర్ణయం తీసుకోనుంది. బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్ ఈ రోజు బేటీ కానుంది. విజయ్ రూపాని, నితిన్ పటేల్ లో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. 

డోప్ టెస్టులో మరో క్రీడాకారుడు విఫలం..

ఢిల్లీ : డోప్ టెస్టులో మరో భారత క్రీడాకారుడు విఫలం చెందాడు. డోప్ టెస్టులో స్ప్రింటర్ ధర్మవీర్ సింగ్ విఫలం చెందాడు. 

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..

నెల్లూరు : కావలిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మైనర్ పై పెదనాన్న కొడుకు, స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. పీఎస్ లో బాధితురాలి తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. 

నేడు, రేపు. టి.సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఎంబీ భవన్ లో జరిగే ఈ సమావేశాలకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు హాజరు కానున్నారు. 

సావిత్రి నది బీభత్సం..

మహారాష్ట్ర : రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మహద్ వద్ద సావిత్రి నది ఉధృతి ముంబై - గోవాపై వంతెన కూలిపోయింది. నదిలో రెండు బస్సులు, రెండు కార్లు కొట్టుకపోయాయి. 22 మంది ప్రయాణీకులు గల్లంతైనట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ముంబై - గోవా జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. 

అమరావతిలో యదేచ్చగా ఇసుక తవ్వకాలు..

గుంటూరు : అమరావతిలో యదేచ్చగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కృష్ణా పుష్కరాల సాకుతో కాంట్రాక్టుల పేరిట దళారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

09:22 - August 3, 2016

నిజామాబాద్‌ : జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తింది. జిల్లాలోని వాగులు.. వంకలను నిండు కుండలా మారాయి. జిల్లాలో 49.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రెండేళ్ల తర్వాత రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

జిల్లావ్యాప్తంగా 49.8 మి.మీ వర్షపాతం నమోదు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 49.8 ల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మోర్తాడ్ మండలంలో వర్షం కురిసింది. 36 మండలాలకు గాను 17 మండలాల్లో సగటుకు మించి వాన పడింది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది.

లక్షా 50వేల హెక్టార్లలో వరి సాగుకు అంచనా...
వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ ఖరీఫ్ లో లక్షా 50 వేల హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 38 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు వేశారు.. ఇప్పుడు వర్షాలు ఊపందుకోవడంతో రైతులు వరినాట్లు వేస్తున్నారు.. ముఖ్యంగా బోదన్,నిజామాబాద్ మండలాల్లో 1.20 లక్షల హెక్టార్లలో వరిసాగవుతుందని అధికారులు చెబుతున్నారు..

రెండు సంవత్సరాలుగా ముఖం చాటేసిన వర్షాలు..

రెండు సంవత్సరాలుగా ఈ రెండు రెవెన్యూ డివిజన్లలో వరినాట్లు చాలా తక్కువగా పడ్డాయి.. జిల్లా అంతటా 50 వేల హెక్టార్లు కూడ సాగు కాలేదు.. అయితే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురియటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలోను భారీ వర్షాలు కురుస్తాయని శాస్ర్తవేత్తలు చెప్పడంతో రైతన్నాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

09:13 - August 3, 2016

మహారాష్ట్ర : రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో  సావిత్రి నదికి వరద తాకిడి పెరిగి  ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముంబై-గోవా హైవేపై వున్న ఓ వంతెన కుప్పకూలిపోయి వరద నీటిలో కొట్టుకుపోయింది. 2కార్లు, 4 బస్సులు గల్లంతయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 30మంది గల్లంతయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

08:59 - August 3, 2016

ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లు బుధవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. జీఎస్టీ బిల్లు చర్చకు వచ్చే సందర్భంగా ఎంపీలంతా సభకు హాజరుకావాలని ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లు బుధవారం నాడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈనేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఈ మేరకు విపక్షాలతో జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్న తరుణంలో ఈ బిల్లు బుధవారం నాడు రాజ్యసభలో చర్చకు రానుంది. గతకొంతకాలంగా ఈ బిల్లుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ బిల్లు చట్టమైతే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. ఏప్రిల్1, 2017నుంచి అమలులోకి తేవాలని పట్టుదలగా ఉంది. జీఎస్టీ బిల్లు ఆమోదం, ప్రభావంపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ సర్వీసులు, ఆటోమొబైల్స్, ఎఫ్.ఎం.సి.జి, రియల్ ఎస్టేట్, టూరిజం, ఆన్ లైన్ మార్కెటింగ్ తదితర రంగాలు ప్రభావితం కానున్నాయి. దీని మూలంగా ప్రస్తుత అమ్మకపు పన్ను భారీగా క్షీణించేందుకు వీలుంటుందని, దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభ కార్యకలాపాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లు పాస్ అవుతందా? ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత)సీతారామరాజు (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు) ( రాకేశ్ (బీజేపీ అధికార ప్రతినిధి) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..మరింత సమాచారాన్ని తెలసుకోండి..

 

08:52 - August 3, 2016

ఉత్తర‌ప్రదేశ్‌: రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది అడ్డాలో బలప్రదర్శనకు దిగారు. వారణాసిలో ఆమె భారీ రోడ్‌ షో నిర్వహించారు. హై ఫీవర్‌ రావడంతో రోడ్‌షో మధ్యలోనే సోనియా ఢిల్లీకి వెనుదిరిగారు.

ఎన్నికల శంఖాన్ని పూరించి సోనియా..
ఉత్తరప్రదేశ్‌లో వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ స‌మ‌ర‌శంఖాన్ని పూరించారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి సోనియా శ్రద్ధాంజలి ఘటించి రోడ్‌షోను ప్రారంభించారు.

సోనియా రోడ్ షో కు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు..
సోనియా రోడ్ షో కోసం కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. కార్యకర్తలు ప‌ది వేల బైకుల మీద ర్యాలీగా వెళ్లి త‌మ అధినేత్రికి ఘ‌న‌స్వాగ‌తం చెప్పారు. వారణాసి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అభివాదం తెలుపుతూ సోనియా రోడ్‌ షో సాగింది.

రోడ్ షోలో పలువురు ప్రముఖులు..
కాంగ్రెస్ యూపీ చీఫ్ రాజ్‌బ‌బ్బర్‌, ముఖ్యమంత్రి అభ్యర్థి షీలాదీక్షిత్‌, యూపీ కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ ఆజాద్‌..తదితర సీనియర్‌ నేతలు సోనియా వెంట రోడ్‌షోలో పాల్గొన్నారు.

'దర్ద్‌--బనారస్‌' నినాదంతో బీజేపీ టార్గెల్ చేస్తున్న కాంగ్రెస్..
మోదీ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తూ 'దర్ద్‌-ఎ-బనారస్‌' నినాదంతో కాంగ్రెస్ బిజెపిని టార్గెట్‌ చేస్తోంది.

వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ మద్దతుతో ముందుకు వెళ్తున్న కాంగీ..
కాంగ్రెస్‌ గత 27 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో అధికారానికి దూరంగా ఉంది. 'సత్తావీస్‌ సాల్‌.. యూపీ బెహాల్ 'అనే నినాదంతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి దూసుకెళ్తోంది. యూపీలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన గత 27 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని పార్టీలు అథోగతి పాలు చేశాయని ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్- ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ మద్దతుతో ముందుకు వెళ్తోంది.

కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తి మేరకు బుధవారానికి వాయిదా పడిన జీఎస్టీ బిల్లు..
వారణాసిలో కాంగ్రెస్‌ రోడ్‌ షో నేపథ్యంలో జిఎస్‌టి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ఒకరోజు ఆలస్యం జరిగింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ఆజాద్ వార‌ణాసి ప‌ర్యట‌న నేపథ్యంలో జీఎస్టీ బిల్లును ఒక‌రోజు ఆల‌స్యంగా ప్రవేశ‌పెట్టాల‌ని కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తి మేరకు బుధవారానికి వాయిదా పడింది. 

08:45 - August 3, 2016

నెల్లూరు : జిల్లాలోని కావలిలో  దారుణం జరిగింది. మృగాళ్లు రెచ్చిపోయారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై..బాలికలపై లైంగిక దాడులు ఆగటం లేదు. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే మనుష్యులలో నానాటికీ మానవత్వపు లక్షణాలు కరవుతున్నాయనే అనిపిస్తోంది. మనుష్యులలో ఆలోచనా శక్తి నిర్వీర్యమయిపోతోంది. లైంగిక దాడులకు పాల్పడుతున్నవారు పశువులకు..మనుష్యులకూ తేడా తెలీకుండా ప్రవర్తిస్తున్నారు.  వావివరుసలు మరచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తండ్రి,అన్న, స్నేహితుడు ఇలా అన్ని బంధాలను కూడా మరిచిపోయి మృగాలుగా మారిపోయి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చెల్లిని అన్న వరుస అయిన కామాంధుడు మరో స్నేహితుడితో కలిసి ముక్కుపచ్చలారని చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు  చిన్నాన్న కుమారుడైన కోటేశు అతని స్నేహితుడు కలిసి బాలికకు మాయమాటలు చెప్పి బాలికను  ఊరు శివారు ప్రాంతానికి  తీసుకువెళ్ళి అత్యాచారం చేశారు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. అతికష్టంమీద ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు కావలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. బాలికను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

08:26 - August 3, 2016

దేశంలో దళితుల మీద దాడులు పెరుగుతున్నాయి. తమ మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ వేలాదిమంది ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. గత రెండేళ్లలో దళితుల మీద దాడులు ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏమిటి? దళితుల మీద జరుగుతున్న దాడుల వెనక వున్న రాజకీయాలేమిటి? ఈ దాడుల వల్ల సమాజానికి జరుగుతున్న కీడేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు కెవిపిఎస్ నేత భాస్కర్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. అంశంపై మరింత సమాచారానికి ఈ వీడియోను క్లిక్ చేయండి ..

సావిత్రి నదిలో 22మంది గల్లంతు..

రాజస్థాన్ : సావిత్రి నదిలో 2 బస్సులు, 2 కార్లు కొట్టుకుపోయాయి. వరదకు కొట్టుకుపోయిన బస్ లో దాదాపు 22మంది ప్రయాణీకులు గల్లంతయినట్లుగా సమాచారం. 

08:09 - August 3, 2016

ఆదిలాబాద్‌ : అడవులు, ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్‌లో వర్షాకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలతో వందలాది మంది మంచంపట్టారు. వైద్యం చేయడానికి ప్రభుత్వ డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు..
తెలంగాణలో వెనకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. మొన్నటి దాకా ఎండకాల వ్యాధులతో బాధపడిన ప్రజలు ఇప్పుడు వర్షాకాల విషజ్వరాలతో సతమతమవుతున్నారు. ఆడుకోవాల్సిన వయస్సులో వ్యాధుల బారిన పడుతున్న చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. వాంతులు, విరేచనాలు, మలేరియా,డెంగీ, మెదడు వాపు, పచ్చకామెర్లు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

మూలనపడ్డ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం..
పాఠశాల పిల్లల కోసం ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ప్రారంభించింది. వైద్య బృందం ప్రతి వారం ఆయా పాఠశాలలను సందర్శించి బాలల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తోంది. అనారోగ్యం సమస్యలను గుర్తిస్తే అక్కడిక్కడే చికిత్సలను అందించాలి లేదా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలి. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కారణం ఈ పథకంలో వైద్యుల నియామకమే జరగలేదు. వైద్యుల నియామకం కోసం ప్రకటన జారీ చేసి కౌన్సిలింగ్‌ నిర్వహించినా ఆశించిన స్థాయిలో వైద్యులు చేరడం లేదు. గ్రామాల్లో పనిచేయడానికి ఆసక్తి లేకపోవడంతో ఈ పథకంలో పనిచేసేందుకు ముందుకు రావడం లేదు.

పథకంలో పనిచేయడానికి మోహం చాటేస్తున్న వైద్యులు..
వ్యాధులు రాకుండా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దీంతో తండాల్లోని పిల్లలు మృత్యువాతపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాలంటున్న గిరిజనులు..
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో వైద్యులను నియమించి, వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

08:04 - August 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో తెచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ సమీక్ష అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. కొత్తగా రెండువేల బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. 

08:00 - August 3, 2016

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో ఆర్చి కూలిన ఘటనకు బాధ్యులనైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఆర్చి నిర్మాణదారునితోపాటు, ఆర్కిటెక్ట్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు.

బిల్డర్‌, ఆర్కిటెక్ట్‌, స్ట్రక్చలర్‌ ఇంజినీర్‌పై చర్యలు తీసుకోవాలి -జనార్దన్‌రెడ్డి
కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో ఆర్చికూలి ముగ్గురు కార్మికులు మరణించిన ఘటనను జీహెచ్‌ఎంసీ సీరియన్‌గా తీసుకుంది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులతోపాటు, జోనల్‌ కమిషనర్లతో గ్రేటర్‌ కమిషన్‌ జనార్దన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతి తీసుకున్న బిల్డర్‌... పర్మిషన్‌ లేకుండా ఆర్చ్‌ నిర్మాణం చేపట్టడంపై బాధ్యులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశద్వారం కూలిన ఘటనలో భవన నిర్మాతతోపాటు ఆర్కిటెక్ట్‌, స్ట్రక్చలర్‌ ఇంజినీర్‌ను బాధ్యులుగా చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. వీరి లైసెన్స్‌ల రద్దుకు సంజాయిషీ నోటీసలు జారీ చేయాలని ఆదేశించారు.

కుటుంబ సభ్యులు రాకుండానే మృతదేహాల తరలింపుపై ఆగ్రహం..
మరోవైపు ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మరణించారు. మృతులను జనార్దన్‌, నాగభూషణ్‌.. ధర్మారావుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన తిరుపతిరావు, యాదవ్‌, అంజి, రమణలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కుటంబ సభ్యులు రాకముందే మృత దేహాలను తరలించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ కట్టడాలు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి..

వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

నెల్లూరు జిల్లాలో దారుణం..

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై అన్న వరస అయిన వ్యక్తి అతని స్నేహితుడు కలిసి సామూహిక లైంగిదాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

07:53 - August 3, 2016

శ్రీకాకుళం : ప్రజా ఆందోళనలకు పక్కనపెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రంపై వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సర్వేలు పూర్తిచేసి భూసేకరణ ప్యాకేజీ నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు తమ గోడును పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

కొవ్వాడ ప్రాజెక్టుతో ఇబ్బందుల్లో 1500 కుటుంబాలు..
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం పట్ల నిర్వాసిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా సర్వేలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 1500 కుటుంబాలు నివాసముంటున్నట్టు ప్రభుత్వ అంచనా. వీరందరికీ మత్స్యలేశం గ్రామ సమీపంలో 153 ఎకరాల భూమిలో పునరావాసం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. న్యూక్లియర్ ప్రాజెక్టు కోసం 2074 ఎకరాల భూమి అవసరమని లెక్కలు తేల్చారు. అయితే తమ అనుమానాలను నివృత్తి చెయ్యకుండానే నివేదికులు సిద్ధం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్వే చేసిన ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్..
కొవ్వాడ అణువిద్యుత్ నిర్మాణం పై ఎన్విరాన్ మెంటల్‌ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వే చేపట్టింది. నిర్వాసితులయ్యే 1500 కుటుంబాల పునరావాసానికి 530 ఎకరాల భూమిని సేకరించాలని నివేదించారు. వీరికి పరిహారంతోపాటు, మత్స్యకారులకు జెట్టీల నిర్మించేందుకు 950 కోట్లు వ్యయమవుతుందని నివేదికలో తెలిపింది. జిల్లా కలెక్టర్ ఈ నివేదిక ను సర్కారుకు పంపగా ఇప్పటికే 389 కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాకు జమ అయ్యాయి. దీంతో భూసేకరణ, నిర్వాసిత కాలనీ తదితర పనులకు అనుమతులు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. అయితే ఎన్ని రకాలుగా ఆందోళన చేస్తున్నా తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కొవ్వాడ బాధితులు మండిపడుతున్నారు. తమ అనుమానాలను నివృతి చేయకుండా ప్రభుత్వం కొవ్వాడ ప్రాజెక్ట్ నిర్మిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 

07:45 - August 3, 2016

హైదరాబాద్ : విభజన జరిగి రెండేళ్లు దాటినా ప్రభుత్వ రంగ సంస్థలను విభజనలో జరుగుతున్న జాప్యం పట్ల టీజాక్ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోని కారణంగా పేదలు, కులవృత్తిదారులు, చిరు వ్యాపారులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని సంస్థలను మూసేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉండటాన్ని వ్యతిరేకించాలని కోదండరామ్‌ కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మేధావులు ...
''ప్రమాదంలో ప్రభుత్వ రంగ సంస్థలు'' అనే అంశంపై హైదరాబాద్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భేటీకి ఉద్యోగులు, మేధావులు హాజరయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, నాగేశ్వర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం : కోదండరాం
ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. సంస్థల విభజనలో సంఘాలే కీలక పాత్ర వహిస్తున్నాయి.. కానీ, రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్థలపై సవతి తల్లి ప్రేమ : జస్టిస్ చంద్రకుమార్
ప్రభుత్వ రంగ సంస్థలపై కొందరు పాలకులు సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారని జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల శ్రేయస్సు కోసమే ఏర్పాటైనవని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 

ప్రత్యామ్నాయ విధానాలను పాటించాలి : ప్రొ.నాగేశ్వర్
తన ఖర్చులను తాను సంపాదించుకొలేని పరిస్థితుల్లో ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలను పాటించి... ప్రైవేటు రంగ సంస్థలతో పోటీ పడేలా చూడాలన్నారు. 

మహద్ వద్ద కుప్పకూలిన బ్రిడ్జ్..

మహారాష్ట్ర : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహద్ వద్ద ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. దీంతో గోవా-ముంబై హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 

07:13 - August 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి పల్లెకు విజ్ఞానం అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తాము అశించిన స్ధాయిలో పనులు సాగకపోవడం విచారకరమన్నారు. పైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థలు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసి, ఇంటింటికి ఫైబర్ నెట్ అందించాలని అధికారులను ఆదేశించారు..

ఆలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మిషన్ భగీరథ ప్రాజెక్టు అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భగీరథ పనులు జరుగుతున్నంత వేగంగా ఫైబర్ గ్రిడ్ పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను వర్కింగ్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి, పల్లెకి విజ్ఞాన వెలుగులు వస్తాయన్న నమ్మకంతోనే ఫైబర్ గ్రిడ్ ను మొదలుపెట్టామని, ఈ కలను సాకారం చేసే క్రమంలో అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరిస్తామని ఏజెన్సీలను హెచ్చరించారు.

పనుల పర్యవేక్షణ మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్ రెడ్డికి అప్పగింత..
ఫైబర్ గ్రిడ్ పనులపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారుల నుంచి కొంత స్పష్టత కావాలని ఏజెన్సీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా జిల్లా ఎస్.ఈలతో మరింత సమన్వయం ఉండాలన్నారు. వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు కావాల్సిన అన్ని అనుమతులను నిబంధనల ప్రకారం ఇవ్వాలని కేటీఆర్ అదేశించారు. ఫైబర్ గ్రిడ్ పనులను ప్రత్యేకంగా సమీక్షించాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డిని కోరారు. భగీరథతో ప్రాజెక్టుతో తాగునీటితోపాటు, ఇంటింటికి ఇంటర్ నెట్ అందించి దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు. 

07:09 - August 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేసిన గులాబి నేతలు... ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణలో తమకు సాటి లేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలో మోదీ టూర్‌..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న మొదటిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోదీ పాల్గోనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోనే ప్రధాని పర్యటన ఉండటంతో అధికార పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. మోదీ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమమే అయినా......మొదటి సారి తెలంగాణకు రానున్న నేపథ్యంలో ప్రధానికి తమ సత్తాను చూపించేందుకు గులాబి బాస్ దృష్టి సారించారు.

తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వని కేంద్రం ..
మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలతో పాటు అధికార యంత్రాగాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం అదనంగా నిధులు కేటాయించలేదని విమర్శలు చేసిన అధికార పార్టీ నేతలు ప్రధాని పర్యటనతో భారీగా నిధులు పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ప్రధాని సభలో రెండు లక్షల జన సమీకరణ
మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు... టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.....జనసమీకరణపై దృష్టి పెట్టారు. మోదీ సభకు రెండు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లాతోపాటు పొరుగున ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి ప్రజలను తరలించాలని అధికార పార్టీ నిర్ణయించింది. భారీ జనసమీకరణ ద్వారా బీజేపీ  అ్రగనాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు గులాబి పార్టీ పావులుకదుపుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కాక తప్పదని అధికార పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు.

నయా స్నేహానికి నాంది జరుగుతోందా?..
ప్రధాని పర్యటనతో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల వైఖరిలో మార్పువచ్చి కొత్త స్నేహం చిగురించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 

07:02 - August 3, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎంసెట్‌-2ను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. షెడ్యూల్‌ విడుదల చేసి, పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తులో ఏవైనా అనుమానాలు ఉంటే.. కోర్టుకు రావొచ్చని పిటిషనర్‌కు సూచించింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంసెట్‌-3ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు.

ఎంసెట్‌-3 నిర్వహించాలని సర్కార్‌ నిర్ణయం..
ఎంసెట్‌-2 ప్రశ్న పత్రం లీకేజీ అయిన నేపథ్యంలో ఎంసెట్‌-3 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీకేజీ వ్యవహారంపై హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి.. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా మరోపరీక్ష నిర్వహించాలన్న పిల్‌పై ప్రభుత్వం సానుకూలంగా కోర్టుకు నివేదికలు సమర్పించింది. ఎంసెట్‌-2 రద్దే ఉత్తమమని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

లీకేజీ వ్యవహారంలో 34 మంది బ్రోకర్లు..
ఎంసెట్‌-2 ప్రశ్న పత్రాల లీకేజీపై సీఎం కేసీఆర్‌.. మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ కేంద్రంగా పేపర్ల లీకేజీ జరిగిందని దర్యాప్తు వివరాలను అధికారులు వివరించారు. ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునీల్ సింగ్, ఇర్ఫాన్‌లు ప్రధాన సూత్రధారులుగా, 34 మంది బ్రోకర్లు ఈ లీకేజీ వ్యవహారంలో కుట్రదారులు అని వివరించారు. 200 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఇదే విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి కూడా నివేదిక సమర్పించారు.

70 సందర్భాల్లో పరీక్ష పేపర్లు లీకైనట్లు నిర్ధారణ..
దేశ వ్యాప్తంగా ఇప్పటి దాకా 70 సందర్భాల్లో ప్రధాన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, అన్ని సందర్భాల్లోనూ తిరిగి పరీక్షలు నిర్వహించారని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. పేపర్ల లీకేజీ జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమి చేయాలనే విషయంలో గతంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ముఖ్యమంత్రి తెప్పించుకుని పరిశీలించారు. తప్పని పరిస్థితుల్లో మళ్లీ పరీక్ష పెట్టవలసి వస్తోందని కేసీఆర్‌ ప్రకటించారు. ఎంసెట్‌-3 పరీక్షను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఎంసెట్ -3 పరీక్ష నిర్వహణ బాధ్యత జెఎన్‌టియుకే..
ఎంసెట్-2 రాసిన విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత హాల్ టిక్కెట్లతోనే ఎగ్జామ్‌కు అనుమతించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆన్‌లైన్లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని ఆదేశించారు. ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు.. జెఎన్‌టీయూ వెబ్‌సైట్‌లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ విత్ ఆన్సర్స్, ఇతర సమాచారం అందుబాటులో ఉంచాలని కోరారు. ఎంసెట్ -3ని నిర్వహించే బాధ్యతను మరోసారి జెఎన్‌టియుకే అప్పగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జెన్‌టీయూ వీసీని కేసీఆర్‌ ఆదేశించారు.

సెప్టెంబర్‌ 11 ఎంసెట్‌-3 నిర్వహణ..
ఎంసెట్‌-2 పేపర్ల లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని, దర్యాప్తు పకడ్బందీగా జరగాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. బ్రోకర్లతో చేతులు కలిపిన విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు సెప్టెంబర్‌ 11న ఎంసెట్‌-3 నిర్వహణకు జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంసెట్‌-3 కన్వీనర్‌గా యాదయ్యను నియమించారు. మొత్తంగా ఎంసెట్‌-3 పరీక్ష నిర్వహణను పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

06:56 - August 3, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఇవాల్సిందే అంటూ రాష్ట్ర ఎంపీలంతా ఢిల్లీలో ఒక్కటై నినదించారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైసిపి ఎంపీల నినాదాలతో రెండో రోజు కూడా పార్లమెంట్‌ స్థంభించింది. అయితే ఎంపీల ఆందోళనలపై దిగొచ్చిన కేంద్రం..ఎట్టకేలకు స్పందించింది. ఏపీ సమస్యలపై అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రకటన చేశారు.

పార్లమెంటులో టిడిపి ఎంపీల నిరసన ..
ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనంటూ పార్లమెంటులో టిడిపి ఎంపీల నిరసన రెండో రోజు కొనసాగింది. ఉదయం గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగిన ఎంపీలు.. అనంతరం పార్లమెంట్‌ గేట్ నెంబర్ ఒకటి ముందు నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేకే హోదా సాధించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.

టిడిపి, వైసిపీ ఎంపీలు నినాదాలతో సభ వాయిదా..
లోక్‌సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీకి న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఎంపీల నినాదాలతో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది. అదే సమయంలో స్పీకర్ అందుబాటులో ఉన్న పార్టీల లోక్‌సభ పక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు తమ నిరసనను విరమించబోమని టిడిపి, వైసిపి సభాపక్ష నేతలు స్పష్టం చేశారు. సభ ప్రారంభమైన తర్వాత కూడా టిడిపి, వైసిపీ ఎంపీలు నినాదాలు కొనసాగించారు. దీంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు.

ప్లకార్డుతో ఎంపీ కేవీపీ...
అటు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ముందు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్లకార్డును ప్రదర్శించారు. తాము చేస్తున్న పోరాటం సత్ఫలితాలనిస్తుందని అన్నారు కేవీపీ. ఏపీ అభివృద్ధికి, విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామన్నారు.

పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ఆందోళన..
పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు కూడా ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనిచెప్పి బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఏపీకి హోదా దక్కేవరకు తాము నిరసన తెలుపుతూనే ఉంటామని వైసీపీ ఎంపీలు ప్రకటించారు.

స్పందించిన మంత్రి జైట్లీ..
లంచ్‌ విరామం తర్వాత కూడా సభలో నిరసనలు కొనసాగడంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు స్పందిస్తూ..ఏపీ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రితో చర్చించామని తెలిపారు. దీంతో టిడిపి ఎంపీలు కొంత శాంతించారు.

ప్రత్యేక హోదా సాధిస్తాం-సుజనా
ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్న నమ్మకం ఉందన్నారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. ప్రధాని అన్ని విభాగాలనుండి ఏపీకి సంబంధించిన సమాచారం తెప్పించుకుని ఏపి అంశాలను పరిశీలిస్తున్నారన్నారు. ఏపీ ప్రయోజనాలను సాధించే వరకు పోరాడుతామన్నారు. జీఎస్టీకి మద్దతిస్తూనే ప్రత్యేక హోదా సాధన కోసం తమ పొరాటన్ని కొనసాగిస్తామని సుజనాచౌదరి తెలిపారు.

ఏపీ ఎంపీల ప్రత్యేక హోదా నినాదాలతో వేడెక్కిన పార్లమెంట్‌..
మొత్తానికి ఏపీ ఎంపీల ప్రత్యేక హోదా నినాదాలతో పార్లమెంట్‌ రెండో రోజూ స్థంభించింది. ఎంపీల ఆందోళనలపై స్పందించిన కేంద్రం..ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపింది. 

Don't Miss