Activities calendar

04 August 2016

22:10 - August 4, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు అబద్దాలు చెబుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.. హోదా ఇవ్వొద్దని తాము ఎక్కడా సూచించలేదంటూ 14వ ఆర్థిక సంఘం సంఘం సభ్యుడు అభిజిత్‌ సేన్‌ స్పష్టం చేశారన్నారు.. సీఎం చంద్రబాబు ప్యాకేజీలకోసం తహతహ లాడుతున్నారని మండిపడ్డారు.. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌లో మెజారిటీ సాధిస్తామని... ఓడిపోతే మూడేళ్లు తమ పార్టీ నేతలు ఇంటినుంచి బయటకే రారని ప్రకటించారు.. 

 

ఢిల్లీలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పుష్కరాలకు రావాలంటూ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌తోపాటు.. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ను చంద్రబాబు కలిశారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ఆహ్వానించారు.. కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. 

22:03 - August 4, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ 2 లీకేజీ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసింది సీఐడీ. ఇప్పటికే  ఎనిమిది మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ.. వారిలో ఆరుగురి రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మే నెలలోనే ప్రశ్న పత్రం లీకు వీరుల చేతికి చేరినట్లు  నిర్ధారించింది. మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్న సీఐడీ.. విద్యార్థులను తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చింది. కీలక నిందితుడైలన ఇక్బాల్‌ను పోలీసులు ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లీకేజీతో సంబంధం ఉన్న గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, షేక్‌ షకీరా తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  
ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ.. ప్రధాన నిందితుడు గుర్తింపు 
ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీలో అసలు సూత్రధారి ఇక్బాల్‌ అలియస్ ఇర్ఫాన్ ప్రధాన నిందితుడని సీఐడీ గుర్తించింది. ఇక్బాల్‌ను పట్టుకుంటేనే ఈ కేసులో ఎవరి పాత్ర ఎంతన్నది బయటపడే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ.. అందులో ఆరుగురు నిందితులకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించింది. 
లీకేజీలో మొత్తం 13 మందికి ప్రమేయం 
లీకేజీలో మొత్తం 13 మందికి ప్రమేయం ఉన్నట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ1గా ఇక్బాల్..@ ఖలీల్, ఏ2గా రాజగోపాల్, ఏ3గా విష్ణువర్ధన్, ఏ4- తిరుమల్ రావు, ఏ5- పాండు, ఏ6-రమేష్, ఏ7- గుడ్డు, ఏ8గా- షేక్‌ను నిందితులుగా  చేర్చింది. వీరితో పాటు ఏ9గా- రాజేశ్, ఏ10గా- రామకృష్ణ, ఏ11గా- వెంకటరమణ, ఏ12గా- జెన్టీయూ పీఆర్వో వెంకట్రావ్, ఏ13గా - బండారు రవీంద్రలు ఉన్నారు. నిందితులపై 406, 408, 420, రెడ్ విత్ 120బి, ఐపీసీ సెక్షన్స్‌తో పాటు  మాస్ కాపీయింగ్‌ యాక్ట్ సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేసింది. ఎంసెట్‌-2 ప్రశ్నపత్రాలు మే లోనే ఇక్బాల్‌ చేతికి అందినట్లు సీఐడీ విచారణలో తేల్చింది. కేసులో కీలక నిందితులుగా ఉన్న రాజగోపాల్‌   హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్‌, ఢిల్లీకి చెందిన రాజేష్‌, విజయవాడకు చెందిన జ్యోతిబాబులతో ఈ వ్యవహారం నడిపించినట్లు సీఐడీ విచారణలో నిర్ధారించింది. ఈ ముగ్గురితో బెంగళూరు నుంచి రాజగోపాల్‌ ఫోన్‌లో సంప్రదింపులు జరిపేవాడని, కర్ణాటకకు చెందిన ఎస్‌ఆర్‌ పాండు, రాజేష్‌తో కలిసి రాజగోపాల్‌ తరచూ మెడికల్‌ సీట్ల విషయంపై చర్చించేవాడని విచారణలో వెల్లడైంది. ఇక్బాల్‌ను రాజగోపాల్‌కు రాజేష్‌ పరిచయం చేశాడని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.  
శంకర్‌ పేరిట ఓ లాకర్‌ ఓపెన్.. 
ఈ స్కాం ద్వారా పెద్ద మొత్తం సంపాదించవచ్చని శంకర్‌ పేరిట ఓ లాకర్‌ను తెరిచారు. 25 లక్షలు చెల్లించే స్థోమత ఉన్నవారినే ఎంపిక చేసి పేపర్‌ లీక్‌ చేయాల్సిందిగా వీరి మధ్య సంభాషణ జరిగింది. రాజగోపాల్‌ తనకు పరిచయం ఉన్న మధ్యవర్తులు విష్ణువర్ధన్‌, జ్యోతిబాబులను సంప్రదించాడు. ఒక్కో విద్యార్థి నుంచి 40 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసి..25 లక్షలు తనకిచ్చి మిగతా సొమ్ము ఉంచువోవచ్చని రాజగోపాల్ మధ్యవర్తులకు చెప్పాడు. దీంతో పాటు  విద్యార్థుల నుంచి ఎస్ ఎస్ సి, ఇంటర్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు తీసుకోవాల్సిందిగా సూచించాడు. ఫలితాలు వెల్లడైన తర్వాత మిగతా మొత్తం చెల్లించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పందం చేసుకోవాలని కోరాడు. 
రాజగోపాల్‌కు ఇక్బాల్ సూచన
ఇక పరీక్షకు ఒక రోజు ముందే తాను బెంగళూరుకు చేరుకుంటానని..విద్యార్థులను అక్కడికి తీసుకురావాలని రాజగోపాల్‌కు ఇక్బాల్ సూచించాడు. జూలై 8న ఉదయానికల్లా ఇక్బాల్‌ ఎంసెట్‌2 ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలను తీసుకొని బెంగళూరుకు చేరుకొన్నాడు. బెంగళూరు బనసవాడి బస్టాండు దగ్గరలో ఉన్న ఉపహార్‌ రెస్టారెంట్‌కు విద్యార్థులను విష్ణువర్ధన్‌, తిరుమల్‌, జ్యోతిబాబు ఆటోల్లో తీసుకెళ్లారు. ఒక్కొక్క ప్రశ్న పత్రాల్లో 160 ప్రశ్నలు ఉన్న రెండు ప్రశ్నపత్రాలను విద్యార్థులకు ఇచ్చి వారితో ప్రిపేర్‌ చేయించారు. రాజగోపాల్‌తోపాటు మధ్యవర్తులు విష్ణువర్ధన్‌, తిరుమల్‌ రావు, షేక్‌ రమేష్‌, వెంకటరామయ్య, బండారు రవీంద్రలు అరెస్టయ్యారని, ఇక్బాల్‌తోపాటు మధ్యవర్తులు పాండు, గుడ్డు, షేక్‌ నిషాద్‌, రాజేశ్, హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ, వెంకట్రావు పరారీలో ఉన్నారని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇక్బాల్ పట్టుపడితే గానీ జేఎన్టీయూ నిర్వాహకుల పాత్ర బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.  

21:56 - August 4, 2016

ఢిల్లీ : కశ్మీరు అంశం భారతదేశ అంతరంగిక వ్యవహారమని ఐక్యరాజ్యసమితి  స్పష్టం చేసింది. కశ్మీరులో పరిస్థితులను పర్యవేక్షించేది లేదని పేర్కొంది. కశ్మీర్‌ అంశాన్ని భారత, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజర్రిక్ దీనిపై వివరణ ఇచ్చారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై నివేదిక ఇవ్వడం మాత్రమే ఐరాస సైనిక బృందం కర్తవ్యమని తెలిపారు. పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లాలని బుధవారం ప్రకటించిన నేపథ్యంలో యుఎన్‌ఓ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు పాకిస్తాన్‌కు అందించాల్సిన 30 కోట్ల డాలర్ల సైనిక సహాయాన్ని అమెరికా నిలిపివేసింది.

21:54 - August 4, 2016

గుజరాత్ : పటేల్‌ ఆందోళన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు  కొట్టివేసింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మే నెలలో గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఈబీసీ కోటాను న్యాయస్థానం రద్దు చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమించనుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో ఆ సామాజికవర్గం భారీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

 

21:51 - August 4, 2016

ఢిల్లీ : సౌదీ అరేబియాలో ఆకలితో అలమటిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ రాజ్యసభలో తెలిపారు. అక్కడ ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు ఇండియాకు పంపడానికి సొంత ఖర్చుతో సౌదీ రాజు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మూతపడ్డ కంపెనీలోని వర్కర్స్‌కు ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు కూడా సౌదీ అనుమతించిందన్నారు. క్యాంపుల్లో ఉంటున్న భారతీయులకు ఉచితంగా ఆహారం, వైద్యం తదితర సౌకర్యాలన్నీ కల్పించేందుకు ముందుకు వచ్చిన సౌదీ రాజుకు సుష్మస్వరాజ్‌, గులాంనబీ ఆజాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి జనరల్‌ వికెసింగ్‌ సౌదీలోనే ఉండి వారి బాగోగులు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

 

21:49 - August 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు  సై అంటున్నారు విద్యార్ధులు. గవర్నమెంట్ కాలేజీల్లో ఇటీవల అడ్మిషన్లు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే.. ఇది నిజమేననిపిస్తోంది. ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఈ ఏడాది గణనీయంగా విద్యార్ధులు చేరుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 
విద్యార్ధులతో కళకళలాడుతున్న సర్కార్ కాలేజీలు 
తెలంగాణలోని సర్కార్ కాలేజీలు విద్యార్ధులతో కళకళలాడుతున్నాయి. అవును మీరు విన్నది అక్షరాల నిజమే...గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతానికి పైగా విద్యార్ధులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారని గణాంకాలు చెబతున్నాయి. ఇందుకు పలురకాల కారణాలు ఉన్నాయంటున్నారు విద్యాశాఖ అధికారులు. తెలంగాణరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అకడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్నభోజనం కూడా అమలు చేస్తామన్న  ప్రకటనతో ఈ సంఖ్య మరింత పెరిగిందని తెలుస్తోంది. 
మొత్తం 404 ప్రభుత్వ జూ.కాలేజీలు
రాష్ట్రంలోని 10 జిల్లాల పరిధిలో మొత్తం 404 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో జనరల్ కోర్సులతోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా వున్నాయి. గత ఏడాది గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది విద్యార్ధులుండేవారు. అయితే ఈసారి ఫస్టియర్ లో 80 వేల మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో వీరి సంఖ్య పెరిగింది. మరో 75 వేల మంది ఒకేషనల్ కోర్సుల్లో చేరారు.
మహబూబ్ నగర్ జిల్లాలో 13 వేల మంది విద్యార్థుల చేరిక
రాష్ట్రవ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లాలో 13 వేలకు పైగా విద్యార్ధులు ప్రభుత్వ కాలేజీల్లో చేరడంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో 12 వేల మంది విద్యార్ధులు చేరారు. ఈ రెండు జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం అధికంగా విద్యార్ధులు జాయిన్ అయ్యారు. 
సమయం పొడిగించాలని విద్యార్ధిసంఘాల వినతి 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అతితక్కువగా ఒక వెయ్యి 277 మంది చేరారు. అడ్మిషన్ల ప్రకియ గడువుముగియటంతో.. సమయం పొడిగించాలని విద్యార్ధిసంఘాల నుంచి వినతులు వచ్చాయి. దీంతో జూలై 31 కే ముగిసిన అడ్మిషన్ల గడువును ఈనెల 16 వరకు పొడిగించారు. దీంతో మరికొందరు విద్యార్ధులు చేరే అవకాశం కనిపిస్తోంది. సర్కారు చర్యలతో మళ్లీ ప్రభుత్వ కళాశాలలకు  మంచిరోజులు రాబోతున్నాయని విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

21:42 - August 4, 2016

కేజీ బేసిన్ లో భారీ దోపిడీ..., వేల కోట్ల ప్రజాధనం లూటీ, నిద్రమత్తులో కేంద్రం, బట్టబయలు చేసిన కాగ్ రిపోర్ట్... కేజీ బేసిన్ లో రిలయన్స్ దోపిడీపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ కు

హైదరాబాద్ : 123జీవో పట్ల హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రేపు హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లనుంది. సీఎం కేసీఆర్ తో హరీశ్ రావు సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. 

రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ త్రీలైన్ విప్ జారీ

ఢిల్లీ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు త్రీలైన్ విప్ జారీ చేశారు. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్ కు రానున్న నేపథ్యంలో ఎంపీలంతా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. 

21:23 - August 4, 2016

మహారాష్ట్ర : ముంబై గోవా హైవేలో సావిత్రి నదిపై వంతెన కూలిన ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. బ్రిటీష్‌ కాలం నాటి ఈ బ్రిడ్జిని 1928లో నిర్మించారు. సావిత్రి నదిలో గల్లంతైన వారికోసం ఎన్ డీఆర్ ఎఫ్ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభించాయి. ఘటనా స్థలికి 100 కిలోమీటర్ల దూరంలో ఓ  మహిళ మృతదేహం, మహద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి వద్ద బస్సు డ్రైవర్‌ మృతదేహాన్ని గుర్తించారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవటంతో నాలుగు బస్సులు, రెండు కార్లు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 26 మంది ఆచూకి తెలియడం లేదు. 

 

21:19 - August 4, 2016

ఢిల్లీ : హస్తిన ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి హైకోర్టులో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్నర్ అధికారాల‌ను ప్రశ్నిస్తూ ఆప్ స‌ర్కారు హైకోర్టులో వేసిన పిటిష‌న్ బెడిసికొట్టింది. ఢిల్లీలో పరిపాలన అధికారి లెఫ్ట్‌నెంట్‌ గవర్నరేనని, కార్యనిర్వాహ‌క అధికారాలు ఆయనకే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత‌ంగానే ఉంటుందని, ఎల్జీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారని కోర్టు తెలిపింది. ఇక్కడి శాంతిభ‌ద్రత‌లు, ఢిల్లీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ లాంటి కీల‌క ఏజెన్సీల‌పై ఢిల్లీ ప్రభుత్వానికి ఏ నియంత్రణ ఉండ‌ద‌ని కోర్టు తెలిపింది.  లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్నర్ అనుమ‌తి లేకుండా ఢిల్లీ కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేద‌ని స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయనుంది. 

 

21:18 - August 4, 2016

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో జరుగుతున్న సార్క్‌ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉగ్రవాదంపై ధీటైన జవాబిచ్చారు. పాకిస్తాన్‌ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోందని తెలిపారు. బుర్హాన్‌వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మంచి చెడ్డ ఉగ్రవాదులు ఎవరూ ఉండరని ఉగ్రవాదం ఉగ్రవాదమేనని హోంమంత్రి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌ స్పీచ్‌ను మీడియాలో రాకుండా పాకిస్తాన్ బ్లాక్‌ చేసింది. కవరేజి కోసం వెళ్లిన భారత మీడియాను పాకిస్తాన్‌ అనుమతించలేదు. 

 

21:14 - August 4, 2016

ఢిల్లీ : అమెరికన్ మహిళపై అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శక, రచయిత మహమూద్ ఫారూఖీకి కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఫారూఖీకి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల జరిమానా విధించింది. రేప్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో జూలై 30న కోర్టు ఫారూఖీని దోషిగా నిర్ధారించింది. ఈ కేసుపై ఏడాదిపాటు విచారణ జరిగింది. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన 30 ఏళ్ల రిసెర్చ్‌ స్కాలర్‌ పరిశోధన కోసం 2015లో ఇండియా వచ్చారు. ఈ నేపథ్యంలో ఫారూఖి ఓరోజు తన ఇంట్లో పార్టీకి వచ్చిన ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమెరికాకు వెళ్లిపోయాక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2015, జూన్ 21న దర్శకుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  బాలీవుడ్ సినిమాల గతిని మార్చిన 'పీప్లీ లైవ్' చిత్రానికి కో-డైరెక్టర్ గా ఫారూఖీ పనిచేశారు.

 

21:11 - August 4, 2016

హైదరాబాద్‌ : బషీర్‌బాగ్‌లోని ఏపీ సర్వశిక్ష అభియాన్‌లో సీమాంధ్ర ఉద్యోగులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారని, అదే విభాగానికి చెందిన తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి సీమాంధ్ర ఉద్యోగులు ఏపీ సర్వశిక్ష అభియాన్‌లోని సామాగ్రిని అమరావతికి తరలించారు. ఇదిలా ఉంటే.. కార్యాలయంలోని తలుపులు, బాత్‌రూమ్‌లోని టైల్స్‌, పాల్‌ సిలింగ్‌తో పాటు సామాగ్రిని  సీమాంధ్ర ఉద్యోగులు ధ్వంసం చేశారని సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేవలం కక్ష్యపూరితంగా ఇలా చేశారని విమర్శిస్తున్నారు. సర్వశిక్ష అభియాన్‌లో ఉన్న ఏపీ సామాగ్రిని తీసుకెళ్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ, కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేయడాన్ని తాము తప్పుపడుతున్నామని అంటున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని సర్వశిక్ష అభియాన్‌ అధికారులు తెలిపారు. మరోవైపు ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని సర్వశిక్ష అభియాన్‌ అదనపు డైరెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. 

 

21:04 - August 4, 2016

విజయవాడ : పోలవరం కుడి కాల్వకు గండి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.. ఏపీ మంత్రి దేవినేని.. గండి పడిన కుడి కాల్వ పనులకు మరమ్మత్తులు జరుగుతున్నాయని ప్రకటించారు.. నదీజలాల్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని సస్యస్యామలంగా మారుస్తాని తెలిపారు..

21:00 - August 4, 2016

విజయవాడ : ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని అన్నారు. హోదా లేకుండానే.. ఏపీని అభివృద్ధి చేయాలని.. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. కేంద్రం ఏపీని అన్ని విధాల ఆదుకుంటుందని మాణిక్యాలరావు అన్నారు. 

 

జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరిగింది. జూరాల ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 317.870 మీటర్లుగా ఉంది. 

కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదా విభజన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులులు హాజరయ్యారు. 

19:50 - August 4, 2016

హైదరాబాద్ : మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చెప్పులతో జబ్బులను పోగొట్టచ్చా? నిజమే అంటున్నారు వాళ్లంతా..  డెంగ్యూ, కలరా , డయేరియా వంటి  అంటువ్యాధులు  రాకుండా గత పది రోజులుగా వీధి, వీధికి  చెప్పులు, చీపుర్లు, వేలాడదీశారు. అలా చేయడం వల్ల అంటురోగాలు వ్యాపించవంటున్నారు.. వింతగా ఉంది కదా అయితే వాచ్ దిస్ స్టోరీ..
మోడ్రన్ యుగంలోనూ మూఢనమ్మకాలు
మోడ్రన్ యుగంలోనూ కూడా ఇంకా మూఢనమ్మకాలను ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. రోజు రోజుకీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సైతం జనాల్ని మూఢనమ్మకాలు వెంటాడుతూనే ఉన్నాయి..  అందుకు నిదర్శనమే భీమిలీలోని  అప్పికొండ వీధి ప్రాంతం..  గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు విజృంబిస్తూనే ఉన్నాయి.. 
భీమిలిలో శృతిమించిన మూఢవిశ్వాసాలు
ఇంత వరకూబాగానే ఉంది.. వ్యాధులు వస్తే ఎవ్వరైనా ఆస్పత్రికి వెళతారు. కానీ భీమిలి గ్రామస్తులు మాత్రం వీధి,వీధికి చెప్పులు, చీపుర్లు, చాటలు తదితర పనికిరాని వస్తువులను వేలాడదీస్తూ ధీమాగా ఉంటున్నారు. ఇటీవలే భీమిలి పక్కనే అంటు వ్యాధులు ప్రబలి ఇద్దరు మృతి చెందారు.. అయినా ఈ వింత అచారాన్ని పాటిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాన్ని తాము పాటిస్తామని చెబుతున్నారు.. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం కనీసం ఇటువైపు చూడని పరిస్థితి కనిపిస్తుంది.
జ్వరాలు రాకుండా పూజలు 
ఈ కంప్యూటర్ యుగంలో కూడ జ్వరాలు రాకుండా పూజలు చేయించడం, తాయత్తులు కట్టించడం మనిషి మూఢ విశ్వాసానికి నిదర్శనం. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలు మామూలే అయినా! పట్టణ ప్రాంతాలలో కూడా మూఢనమ్మకాలతో తమ ప్రాణాలను బలిచేసుకుంటున్నారు. అధికారులు స్పందించి వీరిలో చైతన్యం తీసుకురావాల్సి అవసరం ఎంతైనా ఉంది.

 

19:45 - August 4, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా...కృష్ణా పుష్కరాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. అలాగే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. మరికాసేపట్లో ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్మన్‌ హెచ్‌.ఎల్‌.దత్తుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కానున్నారు. 8 గంటల 30 నిమిషాలకు జస్టిస్‌ ఖేర్‌తో భేటీ కానున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశం కానున్నారు. ఇక రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ కానున్నారు. 10 గంటల 30 నిమిషాలకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థికలోటు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు, మౌలిక సదుపాయాలకు సాయం, ఏపీకి పారిశ్రామిక రాయితీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం, విభజన చట్టంలోని 9, 10, 13 షెడ్యూల్‌లోని అంశాలు, విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌, కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు ప్రత్యేక బోర్డులు, రాష్ట్రంలో శాసనసభ స్థానాల పెంపు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ తదితర సమస్యలపై చంద్రబాబు.. ప్రధానికి ప్రత్యేకంగా నివేదిక సమర్పించనున్నారు. 

 

19:42 - August 4, 2016

పశ్చిమగోదావరి : కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా ఏపీసీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ దీక్ష చేస్తారా? అని అడిగారు. ఒకవేళ వారు ఆమరణదీక్షకు దిగితే వారితోకలిసి వాళ్లింట్లోనే తానుకూడా దీక్షలో కూర్చుంటానని ప్రకటించారు. ముద్రగడ అప్పుడే మన పట్టుదల, శరీరాల పటుత్వం, చిత్తశుద్ధి ప్రజలకు తెలుస్తుందని లేఖలో రాశారు. ఈ దీక్షను సవాల్‌గా తీసుకుందామని చెప్పారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలన్నందుకు తమను ఎన్నో అవమానాలకు గురిచేశారని ఆరోపించారు. ఆమరణ దీక్షలు చేయడం దండగని టీడీపీ పాలనద్వారా అర్థమైందన్నారు. తన దీక్ష సమయంలో కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని హామీలిచ్చారని గుర్తు చేశారు. 7 మాసాల్లో బీసీ కమిషన్‌ నివేదిక తెప్పించుకుంటామన్నారు. సెప్టెంబర్‌ 7తో ఆ గడువు పూర్తవుతుందన్నారు. తమ జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ విషయం సున్నితమైందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇది తెలియదా..? అని ప్రశ్నించారు. కాపు జాతికి రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. 

 

ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ మరో లేఖ

పశ్చిమగోదావరి : కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి నిరసనగా ఏపీసీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ దీక్ష చేస్తారా? అని అడిగారు. ఒకవేళ వారు ఆమరణదీక్షకు దిగితే వారితోకలిసి వాళ్లింట్లోనే తానుకూడా దీక్షలో కూర్చుంటానని ప్రకటించారు. అప్పుడే మన పట్టుదల, శరీరాల పటుత్వం, చిత్తశుద్ది ప్రజలకు  తెలుస్తుందని లేఖలో రాశారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలన్నందుకు తమను ఎన్నో అవమానాలకు గురిచేశారని ఆరోపించారు.

 

19:15 - August 4, 2016

హైదరాబాద్ : నామాటే శాసనం.. ఇది ఓ ఫేమస్‌ సినిమా డైలాగ్‌... కచ్చితంగా ఇదేకాకున్నా.. తన మాటే ఫైనల్‌ అన్నట్టుగా ఉంది నిన్నటిదాకా గులాబీదళపతి తీరు. సీఎం కుర్చీలో కూర్చున్నాక.. మొత్తం పరిసాలనా వ్యవస్థలను దాదాపుగా మౌఖిక ఆదేశాలతోనే శాసించారు. కాని.. ప్రస్తుతం వాతావరణం మారింది. వీసీల నియామకం, మల్లన్నసాగర్‌ ఇష్యూలతో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అనుకోని షాక్‌ ఇచ్చింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.
అధికారపార్టీకి హైకోర్టులో షాక్‌..
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టు  మరో షాకిచ్చింది. నిన్న మొన్నటి వరకు  కలిసి వచ్చిన అన్ని అంశాలు ప్రస్తుతం ప్రతికూలంగా మారుతున్నాయి. రెండేళ్లుగా తన రాజకీయ చతురతతో ప్రతిపక్ష పార్టీలకు పగ్గాలు వేసిన గులాబి దళపతికి... సొంతజిల్లా మెదక్‌ నుంచే  ఎర్త్ పెట్టాయి విపక్షాలు.. 
2013చట్ట ప్రకారమే భూసేకరణ చేయాలన్న విపక్షాలు 
మల్లన్న సాగర్ భూ సేకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహారాన్ని  విపక్ష పార్టీలు ముందునుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం  ఆమోదించిన 2013 చట్ట ప్రకారం భూ సమీకరణ చేయాలని రాజకీయ పార్టీలతో పాటు  ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం 123 జీఓను అమలు చేస్తామంటూ మొండిపట్టుదలకు పోయారు. సర్కారుతీరుతో  తాము నష్ట పోతున్నామని  మంది  రైతులు కోర్టుకు వెళ్లడంతో... ప్రభుత్వ నిర్ణయాన్ని   కోర్టు తప్పబట్టడంతో పాటు 123 జీఓ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీనిపై సీపీఎం హర్షం వ్యక్తం చేసింది. హైకోర్టుతీర్పు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టుఅని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 
వీసీల నియామకంలోనూ ప్రభుత్వానికి మొట్టికాయలు
అటు యూనివర్సిటీల వీసీల నియామకం విషయంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కోర్టునుంచి మొట్టికాయలు తప్పలేదు.   కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా..... వైస్ చాన్సలర్ల నియామకం  చేపట్టడాన్ని  హైకోర్టు తప్పుబట్టింది. 
ఆత్మరక్షణలో గులాబీపార్టీ
హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలతో ... తెలంగాణప్రభుత్వ  నిర్ణయాలు అయోమయంగా మారుతున్నాయి. గులాబీ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.  తనమాటే చెల్లాబాటుకావాలన్న మొండిపట్టుదలకు పోయిన అధికారపార్టీకి న్యాయస్థానం ముందు భంగపాటు తప్పలేదు. 

 

19:05 - August 4, 2016

హైదరాబాద్‌ : ఎల్‌బీ నగర్‌ చింతల్‌కుంటలో సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ సందడి చేసింది. ఓ టెక్స్‌టైల్‌ మార్కెట్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్‌ నిమ్మల శంకర్‌ కూడా పాల్గొన్నారు. వీరిద్దరినీ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

19:02 - August 4, 2016

ఢిల్లీ : జంతర్‌ మంతర్‌ వద్ద వరుసగా 17వ రోజు కూడా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ధర్నా కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలంటూ.. డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ ధర్నాలో మాదిగ పారిశుధ్య కార్మికుల విభాగం నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ మద్దతు తెలిపారు. తాను సామాజిక న్యాయమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్‌ ఉందన్నారు. సమస్య పరిష్కారం కోసం తాను ఉషా మొహ్రా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఎంసెట్‌ 2 పేపర్‌ లీకేజీలో మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీఐడీ

హైదరాబాద్ : ఎంసెట్‌ 2 పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, షేక్‌ షకీరాలను అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాలోని ఓ హోటల్‌లో ఆరుగురు విద్యార్థులకు ఎంసెట్‌ 2 ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

18:57 - August 4, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌ 2 పేపర్‌ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, షేక్‌ షకీరాలను అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాలోని ఓ హోటల్‌లో ఆరుగురు విద్యార్థులకు ఎంసెట్‌ 2 ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంసెట్‌ 2 పేపర్‌ లీకేజీ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అరెస్ట్‌ అయిన చంద్రశేఖర్‌రెడ్డిది మెదక్‌ జిల్లా, షేక్‌ షకీరా హైదరాబాద్‌ వాసి. 

 

18:54 - August 4, 2016

హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి అభినందించారు. వెంకటయ్యకు ఒక లక్ష 11 వేల నూట పదకొండు రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్‌ అందించారు. జీహెచ్‌ఎంసీ నుంచి కూడా మరో లక్ష రూపాయల చెక్కు అందించారు. ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు వెంకటయ్య. జాతీయ స్థాయి ఉత్తమ పారిశుధ్య కార్మికులుగా కేంద్రం ఇద్దరిని ఎంపిక చేసింది. అందులో జీహెచ్‌ఎంసీ కార్మికుడు వెంకటయ్య ఉన్నారు. నీతి, నిజాయితీ, కష్టపడేతత్వం, సెలవులు పెట్టకుండా.. సక్రమంగా విధులు నిర్వర్తించడం తదితర అంశాలే వెంకటయ్యకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బాబుల్‌రెడ్డి నగర్‌, రాఘవేంద్రకాలనీలో వెంకటయ్య పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆయన నిబద్దత, సమయపాలన, పని విధానాన్ని పరిగణలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి. జనార్థన్‌ రెడ్డి ఉత్తమ కార్మికుడిగా గుర్తించాలని కేంద్ర, పట్టణాభివృద్ధి శాఖకు ప్రతిపాదించారు. ఇలాంటి ప్రతిపాదనలు దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి కూడా అందాయి.. వీటన్నింటిని పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇద్దరిని ఉత్తమ కార్మికులుగా గుర్తించింది. ఇందులో జీహెచ్‌ఎంసీ కార్మికుడు వెంకటయ్య, కోయంబత్తూర్‌కు చెందని మరో కార్మికుడు ఉన్నారు. 

 

ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీ : ఎపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో ఆయన బాబు భేటీ కానున్నారు.  పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. 
  

18:44 - August 4, 2016

హైదరాబాద్ : తాము అమలు చేసిన పథకాన్ని పేరుమార్చి టీఎస్‌ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సుజల స్రవంతి స్కీం కింద ఎల్లంపల్లినుంచి హైదరాబాద్‌కు నీరు తెచ్చామని గుర్తుచేశారు.. ఈ పథకాన్ని మిషన్‌ భగీరథగా మార్చి సీఎం కేసీఆర్‌ తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు.. ప్రధాని మోదీకి ఈ వివరాలతో బహిరంగలేఖ రాశామని ఉత్తమ్ ప్రకటించారు.

 

18:40 - August 4, 2016

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం వెలగపూడి ప్రభుత్వ శాఖల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం రెండో బ్లాక్‌లో హోంశాఖ కార్యాలయాన్ని మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
రవాణా కార్యాలయం ప్రారంభం 
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక రాజధాని ఐదో బ్లాక్‌లో రవాణా శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా 
రాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రవాణాశాఖ ఆఫీసు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, మరో రెండు, మూడు రోజుల్లో ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. అలాగే కృష్ణా పుష్కరాల కోసం మూడు జిల్లాల్లో 400 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. పుష్కరాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతామని, ప్రతి బస్టాండ్‌లో పుష్కర కౌంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
మున్సిపల్ శాఖ కార్యాలయం ప్రారంభం 
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో మున్సిపల్ శాఖ కార్యాలయం ప్రారంభమైంది. సచివాలయంలోని 
రెండో బ్లాక్‌లో ఏర్పాటుచేసిన మున్సిపల్ శాఖ చాంబర్‌ను ఆ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖలన్నీ అమరావతికి తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శ్రవణ్‌కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

18:27 - August 4, 2016

హైదరాబాద్ : మీకు రేషన్ కార్డు ఉందా.. 3 నెలల నుండి రేషన్ సరుకులు తీసుకోవడం లేదా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. బోగస్ కార్డులను గుర్తించడంలో బయోమెట్రిక్ విధానాలు అమలుచేస్తున్న సర్కార్ భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా బోగస్ కార్డుల ఏరివేతకు  సిద్ధమయింది.
3 నెలలపాటు సరుకులు తీసుకోని కార్డులు రద్దు 
బోగస్ రేషన్ కార్డుల ఏరివేతే లక్ష్యంగా కొత్తమార్గాన్ని ఎంచుకుంది తెలంగాణ సర్కార్. అందులో భాగంగా రేషన్ షాపు నుండి వరుసగా 3 నెలలపాటు సరుకులు తీసుకోని కార్డులను రద్దు చేయనుంది సర్కార్. సరుకులు తీసుకోని వారిని బోగస్ కార్డుకింద పరిగణించాల్సి వస్తుందంటోంది సర్కార్. 
రేషన్ షాపు....కేవలం బియ్యం ఇచ్చే కేంద్రం 
ప్రస్తుతం తెలంగాణలో రేషన్ షాపు అంటే కేవలం బియ్యం ఇచ్చే కేంద్రంగానే మారింది. దీంతో చాలామంది రేషన్ షాపులకు వెళ్లడమే లేదు. ఇలాంటి కార్డులు రద్దుచేసే ఆలోచనలో ఉంది సర్కార్. దీంతో పాటు ఒక్కరే సభ్యుడు ఉన్న కార్డులను తొలగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తున్నా..ఆశించిన స్థాయిలో సరుకుల పంపిణీజరగడంలేదని భావిస్తోంది సర్కార్.   
గ్రేటర్ లో లక్షా 20 వేల బోగస్ కార్డులు 
గ్రేటర్ పరిధిలో లక్షా 20 వేల కార్డులను బోగస్ కార్డులుగా గుర్తించి తొలగించినట్టు సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మరో 50 వేల వరకు కార్డులను తొలగించినట్లు, ఓకే ఒక సభ్యుడు ఉన్న  25 వేల కార్డులను తొలగించినట్టు తెలుస్తోంది. బయోమెట్రిక్ అమలు చేశాక పెద్ద మొత్తంలో బియ్యం మిగులుతున్నాయని ఫలితంగా దాదాపు 150 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ ను అమలు చేస్తే మరింత ఆదాఅవనుంది. 
కోటికిపైగా రేషన్ కార్డులకు దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు కోటికి పైగా ఉన్నారు. వారిలో బోగస్ కార్డులపేరుతో 10లక్షల కార్డులను తొలగించింది సర్కార్. ప్రస్తుతం 91 లక్షల కార్డుదారులకు రేషన్ బియ్యాన్ని సరుకులను అందజేస్తున్నారు. మొదటిదశలో జీహెచ్ఎంసీ పరిధిలో బయోమెట్రిక్ అమలుచేస్తున్నా.. 3 నెలలుగా సరుకులు తీసుకోని వారిని బోగస్ పరిగణించి తొలగించేందుకు సిద్దమైంది సర్కార్. అయితే ఈ ప్రక్రియలో అర్హులైనవారి కార్డులను సైతం తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

 

18:21 - August 4, 2016

కడప : న్యాయం చేయాలంటూ అధికారులచుట్టూ చెప్పులరిగేలా తిరిగిన రామయ్య అనే రైతు చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప కలెక్టర్‌ కార్యాలయంముందు పురుగులమందు తాగాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బీ కోడూరు మండలం రెడ్డివారిపల్లికిచెందిన రామయ్య... తన పొలాన్ని సుబ్బారెడ్డి అనే రైతు ఆక్రమించుకున్నాడంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎవ్వరూ స్పందించకపోవడంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగాడు. ఇప్పటికైనా అధికారులు తన పొలాన్ని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

 

విద్యార్థుల దీక్ష భగ్నం...

హైదరాబాద్ : తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద విద్యార్థుల అమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్ కు తరలించారు. 

18:18 - August 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ స్టడీ సర్కిల్ వద్ద విద్యార్థుల అమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలని చూడకుండా ఈడ్చుకెళ్లారు. పోలీసు స్టేషన్ కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత మూడు రోజులుగా ఆమరణనిరాహార దీక్ష చేస్తున్నారు. 
అయితే కొంతమంది విద్యార్థులు హౌజ్ అరెస్టు చేసుకున్నారు.  !
విద్యార్థులు... 
'మా స్టడీ సర్కిల్ కు వచ్చి...కొట్టి తీసుకెళ్తున్నారు. వీరికి కొట్టే అధికారం ఎవరిచ్చారు. సంవత్సరానికి స్కడీ సర్కిల్ కు రూ. 7 కోట్ల నిధులు వస్తున్నాయి. మేము దీక్ష ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండా.. ప్రభుత్వం మాపై దాడులు చేయిస్తుంది. జీరో ఫ్యాకల్టీతో రన్ చేస్తున్నారని' పేర్కొన్నారు. 
  

17:40 - August 4, 2016

పశ్చిమగోదావరి : గిరిజన భూములను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈమేరకు మధు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎల్ టీఆర్ భూముల్ని గిరిజనుల నుంచి లాక్కోవడం సరికాదన్నారు. ఈ భూముల్ని గిరిజనేతరులకు అప్పగించారని మండిపడ్డారు. ప్రాజెక్టు పేరుతో దళారులు హడావుడి చేస్తున్నారని.. పునరావాసం పేరుతో నష్టపరిహారం కాజేసే కుట్ర జరుగుతోందన్నారు. గిరిజనుల భూమిని గిరిజనేతరులకు ఇస్తున్నారని.. బలవంతంగా భూముల్ని లాక్కుంటున్నారని పేర్కొన్నారు. దళారుల కుట్రకు వ్యతిరేకంగా గిరిజనసంఘం తలపెట్టిన ఆందోళనకు మద్దతు ఇస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల లేకపోతే ఉద్యమం తప్పదని అన్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాడ్ చేశారు. లేకపోతే వామపక్షాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 

 

 

17:33 - August 4, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలు కవిత సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. పసుపు పంటకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మోడీని కవిత కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ప్రధాని తొలిసారిగా తెలంగాణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రధాని కృషి చేస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు.

17:30 - August 4, 2016

ఢిల్లీ : ప్రత్యేకహోదా సాధించేవరకు ఆందోళన కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై స్పష్టత వచ్చే వరకు నిరసనలు తెలుపుతామని అన్నారు. అరుణ్ జైట్లతో చంద్రబాబు మద్య ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వాలని అన్నారు.   

 

ప్రధానికి ఉత్తమ్ బహిరంగ లేఖ..

హైదరాబాద్ : తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రధాని మోడీకి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ రాశారు. గతంలో మౌలానా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పేరిట కాంగ్రెస్ ప్రాంభించిన పథకానికి మిషన్ భగీరథగా పేరుమార్చి సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది భారతరత్న అబ్దుల్ కలాంను అవమానించడం కాదా అని, అబ్దుల్ కలాం పేరును తొలగించిన పథకాన్ని ప్రధానిగా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.

17:16 - August 4, 2016

హైదరాబాద్ : యూకే బిజినెస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్కిల్స్‌ శాఖ ప్రతినిధి బృందం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యింది. వీరితో పాటు బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ కూడా మంత్రితో సమావేశమయ్యారు. భారతదేశంలోనే ఈజ్‌ అప్‌ డూయిండ్‌ బిజినెస్‌ అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం దేశంలోని పలు రాష్ర్టాలతో భేటీ అవుతూ వస్తోంది. ఇప్పటి వరకు తాము కలిసిన రాష్ర్టాల్లోకెళ్లా తెలంగాణ రాష్ర్టంలోనే పరిశ్రమలు, పెట్టుబడులకు ఉత్తమ వాతావరణం నెలకొని ఉందని యూకే బిజినెస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్కిల్స్‌ శాఖ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. తమ దేశంలోని పెట్టుబడులను తెలంగాణకు తరలించేందుకు సహకరిస్తామని తెలిపారు. యూకేలోని పలు పారిశ్రామిక విధానాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రిస్క్‌ అసెస్‌మెంట్‌, ఎగ్జిట్‌ పాలసీ, రిఫార్మ్స్‌ సెన్సిటైజేషన్‌ వంటి అంశాల్లో ఈ బృందం సలహాలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

 

17:08 - August 4, 2016

కాజల్..ఓ వెలుగు వెలిగిన కాజల్ కు కష్టాలు వచ్చిపడ్డాయి. ఇటీవల చేసిన సినిమాలు పరాజయం చవి చూడడంతో ఆఫర్స్ రావడం తగ్గిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' సినిమాలో 'కాజల్' ఓ స్పెషల్ పాటలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అంతే ఇంకేముంది కాజల్ పని అవుట్..అవకాశాలు లేక స్పెషల్ సాంగ్ లో నటిస్తోందంటూ గుసగుసలు వినిపించాయి. వీటన్నింటినీ పటా పంచలు చేస్తూ ఏకంగా మెగస్టార్ 'చిరంజీవి' సరసన ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి పక్కన నటించాలంటూ హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుండడం తెలిసిందే. ఈ ఛాన్స్ ను కాజల్ ముద్దుగుమ్మ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాలో నటిస్తుందని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ బ్యూటికి అవకాశాలు వచ్చి పడుతున్నాయంట. తమిళంలో నాలుగు చిత్రాలతో బిజీ అయిపోయిందని, డేట్స్ ఖాళీలేక విక్రమ్ సినిమా కూడా వదులుకుందని టాక్. ప్రస్తుతం జీవాకు జంటగా కవలైవేండామ్ మూవీలో కాజల్ నటిస్తోంది. అలాగే అజిత్ 57వ సినిమాలోనూ.. రానాకు జంటగా మరో తెలుగు మూవీలోనూ కాజల్ నటించబోతోందని తెలుస్తోంది. ఇలా వరుసగా టాప్ హీరోలతో జతకడుతున్న కాజల్ ఫొటో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. కాజల్ హర్రర్ మూవీలో కూడా నటిస్తుందా అంటూ డౌట్లు మొదలైపోయాయి. ఎందుకంటే భయపెట్టే విధంగా కాజల్ ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఫోన్ లను ప్రమోట్ చేయడంలో భాగంగానే కాజల్ ఆ కంపెనీ ఫోన్ తో కొత్త లుక్ లో కనిపించిదంట. 
 

బాంబు కాదంట..మాక్ డ్రిల్ అంట..

ముంబై : ముకుంద్ నగర్ లో ఓ బ్యాగు కలకలం సృష్టించింది. బ్యాగులో బాంబు ఉన్నదని వదంతులు వ్యాపించాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇదంతా మాక్ డ్రిల్ నిర్వహించారు. బాంబుల గురించి అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. 

బ్రిడ్జి కూలిన ఘటనలో మహా ప్రభుత్వం పరిహారం..

మహారాష్ట్ర : మహద్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలను ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

ముంబైలో బ్యాగు కలకలం..

ముంబై : ముకుంద్ నగర్ లో ఓ బ్యాగు కలకలం సృష్టించింది. బ్యాగులో బాంబులు..పేలుడు పదార్థాలు ఉన్నాయా అని పోలీసులు దృష్టి సారించారు. బాంబు స్వ్కాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

రాజ్ నాథ్ ప్రసంగాన్ని బహిష్కరించిన పాక్ మీడియా..

పాకిస్తాన్ : ఇస్లామాబాద్ సార్క్ సమావేశంలో భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగాన్ని పాక్ మీడియా బహిష్కరించింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకవడమే కాకుండా వారికి మద్దతు తెలిపే వ్యక్తులు..సంస్థలు..దేశాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను అమరవీరులగా కీర్తించడం మానుకోవాలని పేర్కొన్నారు. సార్క్ సదస్సు జరుగుతున్న సమావేశ మందిరంలో రాజ్ నాథ్ తో పాక్ హోం మంత్రి కరచాలనం చేయలేదు. 

16:44 - August 4, 2016

హైదరాబాద్ : జీవో 123 పై హైకోర్టు తీర్పు తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలనుకోవటం అవివేకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. హరితహారం పేరుతో గిరిజనులపై దౌర్జన్యాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని... తక్షణ వైద్య సేవలు అందించాలని కోరారు. సెప్టెంబర్ 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

16:40 - August 4, 2016

సెల్ఫీ..సందర్భం ఏదైనా సెల్ఫీల సందడే! క్లిక్‌ మనిపించడం షేర్‌ చేయడం. అంతా సెల్ఫీల కాలంగా మారిపోయింది. సెల్ఫీలకు ఎవరూ అతీతులు కారని నిరూపితమవుతోంది. రాజకీయ నాయకులు, సినిమా తారలు..క్రీడా ఇలా ప్రతి రంగంలో ఉన్న వారు సెల్ఫీలు తీసుకుంటూ ముచ్చటపడుతున్నారు. సినిమా రంగానికి సంబంధించిన వారి గురించి చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ గా డ్రెస్సింగ్ వేసుకుంటూ..మేకప్ వేసుకుంటూ..ఇలా సెల్ఫీలు తీసుకుంటూ హంగామా చేసేస్తున్నారు. కానీ ఇదంతా వారు ఎందుకు చేస్తున్నారు ? అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఇదంతా కమర్షియల్ కాన్సెప్ట్ కోసం ఇలా తారలు సెల్ఫీలు దిగుతున్నారంట అనే ప్రచారం జరుగుతోంది. మిల్క్ బ్యూటి తమన్నా...కాజల్..నేహాశర్మ..బిపాస బసు..సెల్ఫీలు తీసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. వీరంతా మొబైల్ పట్టుకున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలతో ట్వీట్ కి ఇంత రేటు అని మాట్లాడుకుని ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారంట. క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఒక్కో ట్వీట్ కి రూ. 50 వేల నుండి రూ. 75 వేల వరకూ వసూలు చేస్తున్నారని టాక్. ఇలా కూడా హీరోయిన్స్ సంపాదిస్తున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

123 జీవో రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లనున్న సర్కార్..

హైదరాబాద్ : 123 జీవో రద్దుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లనుంది. 123 జీవో రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయనుంది. 

ఉపాధి హామీ పథకం ఉద్యోగుల జీతాలు పెంపు..

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం ఉద్యోగుల జీతాల పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రూ. 10 వేలు, ఇతర ఉద్యోగుల జీతాలు 20 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. నరేగాలలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు మినహా అందరికీ 30 శాతం పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

రాజ్ నాథ్ తిరుగు ప్రయాణం..

పాకిస్తాన్ : భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇస్లామాబాద్ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఇస్లామాబాద్ సార్క్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 

15:18 - August 4, 2016

మెదక్ : 123 జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేములఘాట్‌ ప్రజలు కోర్టు తీర్పు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవో రద్దు చేయడాన్ని స్వాగతిస్తామంటున్న వేములఘాట్‌ గ్రామస్తులతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలను వారి మాటల్లోనే... 
వేములఘాట్ గ్రామస్తులు...
'హైకోర్టు తీర్పు హర్షణీయం. 123 జీవో రద్దు సంతోషకరం. కోర్టుకు వందనాలు. 2013 చట్టం అమలు చేయాలి. ఈ చట్టం ప్రకారం రెండు పంటలు పండే భూములు తీసుకోవద్దు. మాపై అన్యాయంగా లాఠీచార్జ్ చేశారు. 162 మందిని అమానుషంగా ప్రభుత్వం కొట్టించ్చింది. ప్రాజెక్టు మాకు అసవరం లేదు. అందరికీ న్యాయం చేయాలి. ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి. ప్రజలకు లాభం చేకూరే సంస్కరణలు తీసుకురావాలి. మిగిలిన ముంపు గ్రామాల్లో కూడా 2013 చట్టం అమలు చేసేవిధంగా చూడాలని' గ్రామస్తులు కోరారు.

 

ఢిల్లీకి సీఎం బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిని కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు లోక్ సభ స్పీకర్ ను బాబు కలవనున్నారు. అనంతరం 11గంటలకు ప్రధాన మంత్రి మోడీని బాబు కలవనున్నారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రధానితో బాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వానికి సిగ్గు రాలేదు - మల్లు..

హైదరాబాద్ : 123 జీవోపై హైకోర్టు తీర్పు ప్రభుత్వ పరిపాలనా లోపానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కోర్టు 15 సార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా సిగ్గురాలేదని ఘాటుగా విమర్శించారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్తామనడం సిగ్గు చేటన్నారు. 123 జీవో ప్రకారం తీసుకున్న భూములను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. భూ సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో మధు, వామపక్ష నేతల పర్యటన..

పశ్చిమగోదావరి : జిల్లాలోని పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వామపక్ష నేతలు పర్యటించారు. ఎల్ టీఆర్ భూములను గిరిజనేతరులకు కట్టబెట్టి ప్రభుత్వం గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వారంలోగా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడుతామని మధు హెచ్చరించారు. 

చంద్రబాబు ఢిల్లీ టూర్ షెడ్యూల్..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిని కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు లోక్ సభ స్పీకర్ ను బాబు కలవనున్నారు. అనంతరం 11గంటలకు ప్రధాన మంత్రి మోడీని బాబు కలవనున్నారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రధానితో బాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ముచ్చుమర్రి గ్రామంలో 144 సెక్షన్ పై బైరెడ్డి ఆగ్రహం..

కర్నూలు : ముచ్చుమర్రి గ్రామ పంచాయతీ అనుమతితోనే పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. కుంటిసాకులు చూపి ముచ్చుమర్రిలో 144 సెక్షన్ విధించారని, దీనిపై తాను కోర్టుకు వెళుతానని తెలిపారు. ఘాట్లే వద్దే స్నానాలు చేయాలనే రూల్ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్మించకపోవడంతోనే తాము ఘాట్లు నిర్మించినట్లు చెప్పుకొచ్చారు.

 

భ్రూణ హత్యలపై వైద్యశాఖాధికారుల స్పందన...

నల్గొండ : మిర్యాలగూడలో మూడు భ్రూణ హత్యల కథనాలపై జిల్లా వైద్య శాఖాధికారులు స్పందించారు. మిర్యాలగూడలోని ఆసుపత్రుల్లో రికార్డులను తనిఖీలు చేపట్టారు. 

కేటీఆర్ తో యూకే ప్రతినిధుల భేటీ..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ తో యూకే బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ శాఖ ప్రతినిధులు భేటీ అయ్యారు. సమావేశంలో బ్రిటీష్ డిప్యూటి హై కమిషనర్ పాల్గొన్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాన్ని ప్రతినిధులు పరిశీలించారు. పెట్టుబడులకు, పరిశ్రమలు పెట్టేందుకు తెలంగాణలో ఉత్తమ వాతావరణం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.

 

గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి - తమ్మినేని..

హైదరాబాద్ : హరితహారం పేరిట గిరిజనులపై దౌర్జన్యం ఆపాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై కేసులు ఎత్తివేయాలని, ఎంసెట్ లీకేజ్ లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

15:00 - August 4, 2016

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ పేరుతో ఎపి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని వక్తలు దుయ్యబట్టారు. 'రాజధాని నిర్మాణం.. స్విస్ ఛాలెంజ్ పర్యవసానాలు' అనే అంశంపై విజయవాడలో సెమినార్ నిర్వహించారు. రాజధాని మొత్తాన్ని చైనా కంపెనీకి ఏపీ ప్రభుత్వం ధారాదత్తం చేయడం ఖాయమని రిటైర్డ్ ఐఏఎస్ దేవసహాయం అన్నారు. ఏపీ రాజధాని లోతట్టు ప్రాంతమని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోకుండా మొండివైఖరి అవలంబిస్తోందని రామచంద్రయ్య అన్నారు. 

14:55 - August 4, 2016

నెల్లూరు : సీఎం చంద్రబాబు పాలన కుంభకోణాలమయంగా మారిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. జిల్లాలో నిర్వహించిన యువభేరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రాజధాని భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని అమ్మేసే కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో అన్నీ స్కాంలే చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. లక్షా 45 వేల కుంభకోణాలు జరిగాయని పేర్కొన్నారు. 
గ్రామాల్లో మద్యాన్ని ఇష్టమొచ్చినట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికల తర్వాత జాబులు అడిగితే లేవని చెప్తున్నారని చెప్పారు. జాబు ఇవ్వకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారని... కానీ అది కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పటివరకు గ్రూప్స్ ను నిర్వహించలేదని విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకుంటే ఓటుకు నోటు కేసును ప్రధాని నరేంద్ర మోడీ సిబిఐకి అప్పజెప్పుతారని చంద్రబాబు భయపడుతున్నారని తెలిపారు. అందుకే  కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడం లేదని ఆరోపించారు. 

 

14:10 - August 4, 2016

హైదరాబాద్ : జీవో 123ని హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే ఆలోచన మానుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. జీవో 123ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఎంబీ భవన్ తమ్మినేని మీడియాతో మాట్లాడారు. 123 జీవో రద్దు విషయంలో అప్పీల్ అనే ఆలోచనకు పోవద్దని, వెంటనే 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమండ్ చేశారు. ఏఎన్ఎం వాళ్లు సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్నారని, రెగ్యులరైజ్ చేయాలని..తదితర వాటి కోసం వారు సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. వీరి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని..సంక్షేమ హాస్టళ్ల మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని, చాలా మంది మృతి చెందడం జరుగుతోందన్నారు. అడవీ ప్రాంతంలో మలేరియా జ్వరం వచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం తెలంగాణ కమిటీ మద్దతు తెలియచేస్తున్నట్లు, ఈ బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్టీ బిల్లు వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం...మరికొన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతోందన్నారు. నష్టం కలిగే రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని తమ్మినేని విమర్శించారు. 

14:04 - August 4, 2016

విశాఖ : కార్మికులకు కనీసవేతనాలను పెంచాలనే డిమాండ్‌తో విశాఖలో సీఐటీయూ నిరసనకు దిగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో కార్మికులు ధర్నాకు దిగారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని కార్మికనేతలు విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలి - తమ్మినేని..

హైదరాబాద్ : 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని సీపీఎం తెలంగాణ- తమ్మినేని డిమాండ్ చేశారు. ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 123 జీవో హైకోర్టు కొట్టివేసిందని, దీనిపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లే ఆలోచనను మానుకోవాలని సూచించారు. జీఎస్టీ బిల్లు కొన్ని రాష్ట్రాలకు లాభం..మరికొన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతోందన్నారు. నష్టం కలిగే రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

14:00 - August 4, 2016

ఢిల్లీ : విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న అసహన పరిస్థితులపై రాజ్యసభలో సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. పుదుచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీలో స్డూడెంట్‌ కౌన్సిల్‌ రూపొందించిన సామాజిక మ్యాగజైన్‌ను బ్యాన్‌ చేయడంపై డి.రాజా అభ్యంతరం తెలిపారు. ఆ పత్రికలో రోహిత్‌ వేముల, సామాజిక కార్యకర్తలు దబోల్కర్, పన్సారే, కల్బుర్గి ఫొటోలు ప్రచురించడమే ఇందుకు కారణమన్నారు. దీనిపై స్థానిక ఏబివిపి ఆందోళన చేపట్టడం వల్లే మ్యాగజైన్‌ను బ్యాన్‌ చేయడంతో పుదుచ్చేరి యూనివర్సిటీలో అశాంతి నెలకొందని రాజా విమర్శించారు. హెచ్‌సియు, జెఎన్‌యులో జరిగినట్లే ఇక్కడ కూడా ఏబివిపి జోక్యంతోనే అసహన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఎలా సమర్థిస్తారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. 

ఆప్ తొలి జాబితా..

ఢిల్లీ : వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీపార్టీ తన అభ్యర్థుల తొలిజాబితా ప్రకటన విడుదల చేసింది. 19 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది.

13:55 - August 4, 2016

ఢిల్లీ : జిఎస్‌టి బిల్లు అమల్లోకి రావడం వల్ల అన్ని వర్గాల వారికి లాభం చేకూరుతుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. భారత్‌లో వ్యాపారం చేయడం ఇక సులభమవుతుందని, దీంతో వ్యాపారులు, ప్రజలు లాభ పడతారన్నారు. జిఎస్‌టిపై జరుగుతున్న ప్రక్రియను త్వరలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాజ్యసభలో ఆమోదించిన సవరణ బిల్లును లోక్‌సభకు పంపుతామని, ఆ తర్వాత 29 రాష్ట్రాల అసెంబ్లీల బిల్లును ఆమోదించాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. 

13:53 - August 4, 2016

హైదరాబాద్ : బొల్లారం బాలాజీ నగర్‌లో ఒక ఇంటిపై కొందరు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇంట్లోని కుటుంబసభ్యులు ఐదుగురు గాయాల పాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 

13:49 - August 4, 2016

హైదరాబాద్ : మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుందనేది పెద్దలు చెప్పే సత్యం...అలా తన పని తాను చేసుకుపోతూ, తాను చేస్తున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో... అతనికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఎవరా వ్యక్తి.. ఏంటా పురస్కారమని తెలుసుకోవాలనుందా....వాచ్‌దిస్‌ స్టోరీ..

జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మిడుకి జాతీయస్థాయి అవార్డ్..
విధి నిర్వహణలో చిత్తశుద్ధి.... క్రమం తప్పకుండా తన పనికి హాజరవ్వడం...సెలవులని సైతం వినియోగించుకోకుండా పనినే ఆనందంగా భావించే.. ఓ కార్మికుడికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది.

తూముకుంట వెంకటయ్య...
ఈయనే ఆ కార్మికుడు. పేరు తూముకుంట వెంకటయ్య. జీహెచ్ఎంసీ పరిధిలోని బాబుల్‌ రెడ్డినగర్, రాఘవేంద్ర కాలనీల్లో 16 ఏళ్లుగా శానిటేషన్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. సెలవుల్లో సైతం పనిని చేస్తూ స్థానికుల ప్రశంసలతో పాటు జాతీయ స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఇద్దరిని మాత్రమే ఎంపిక చెయ్యగా కోయంబత్తూరు నుంచి నాగరాజు మొదటి వ్యక్తిగా ఎంపికయ్యారు. రెండో వ్యక్తిగా జీహెచ్‌ఎంసీకి చెందిన వెంకటయ్య ఎంపికయ్యారు. ఈనెల 6వ తేదీన ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జాతీయస్థాయి అవార్డు రావడంపై వెంకటయ్య హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీకి గర్వకారణం-బొంతు రామ్మోహన్..
వెంకటయ్యపై అధికారులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా శానిటేషన్ కార్మికులకు చెడువ్యసనాలు ఉంటాయని కాని వెంకటయ్య వాటన్నింటికీ దూరంగా ఉంటారని చెబుతున్నారు. ఇటీవలే జీహెచ్ంసీ ప్రవేశపెట్టిన తడిచెత్త, పొడి చెత్త కార్యక్రమాన్ని వెంకటయ్య సక్సెస్ చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. జాతీయ అవార్డుకు ఎంపికైన వెంకటయ్యను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్థన్ రెడ్డి సన్మానించారు.

పారిశుధ్య కార్మికుల హర్షం..
పారిశుధ్య పనులు చేసే తమకు ఇలాంటి గుర్తింపు రావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రోత్సహిస్తే ఇంకామెరుగైన సేవలు అందిస్తామని చెబుతున్నారు.

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ స్పీకర్ వాయిదా వేశారు. ఈ రోజు కూడా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశంపై ఆందోళన చేశారు. 

13:44 - August 4, 2016

హైదరాబాద్ : పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చివరి దశలో అపురూపంగా చూసుకోవడం పిల్లల బాధ్యత. ఉన్నదాంట్లోనే అందరూ పంచుకొని తింటే ఆ ఆనందం వేరు. కానీ.. కష్టపడి పెంచి పెద్దచేసి.. చివరకు పిల్లల చేత అవమానాలు ఎదుర్కొంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా. ఆస్తులు ఉండి కూడా పిల్లల చేత ఇంటి నుండి బయటకు గెంటివేయబడ్డ ఓ వృద్దురాలి దీనగాధ చూడండి.

నలుగురు కొడుకులు, కూతుళ్లు వున్నా అనాధగా మారిన అమ్మ..
మానవత్వం మంటకలిసింది. ప్రస్తుత కాలంలో చాలామంది అనుబంధం కంటే డబ్బుకే అందరూ ప్రాధాన్యమిస్తున్నారు. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆస్తుల కోసం తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారు. అలా కన్న కొడుకుల చేత ఇంటి నుంచి బయటకు గెంటివేయబడ్డ వృద్ధురాలే ఈమె.

నెలకు అద్దె రూపంలో రూ.3 లక్షలు ఆదాయం
ఈమె పేరు కిమ్ముబాయి. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. సికింద్రాబాద్‌ మెట్టుగూడలో శ్రీతుల్జాభవాని పేరిట పెద్ద అపార్ట్‌మెంట్‌ ఉంది. నెలకు దాదాపు 3 లక్షల రూపాయలు అద్దెల రూపంలో వస్తాయి. ఇవే కాక సికింద్రాబాద్‌ సంగీత్‌ సినిమా హాల్‌ వద్ద ఒక ఇల్లు, మోండా మార్కెట్‌లో రెండు దుకాణాలున్నాయి. వీటి అన్నింటిపై అద్దెలు వస్తాయి. అయితే.. ఇవేమీ కొడుకులు ఆమె చేతికి ఇవ్వరు. పైగా కన్నతల్లి నానా ఇబ్బందులు పెట్టేవారట.

17 ఏళ్ల క్రితం భర్త మృతి ..
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఎంతో కష్టపడి ఈ ఆస్తులన్నీ సంపాదించామని.. 17 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయినప్పటి నుంచి కొడుకులు సరిగా చూడడం లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన ఆస్తి తనకు ఎలాగైనా కావాలని ఆమె అపార్ట్‌మెంట్‌ ఎదుట దీక్షకు దిగింది.

చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన కిమ్మూబాయి..
కొడుకుల వ్యవహారంపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఆస్తులన్నీ తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. నా ఇష్టమున్నవారికి ఆస్తిని ఇచ్చుకుంటానని కిమ్ముబాయి చెబుతోంది.

ఎవరో కావాలని చేయిస్తున్నారంటున్న కుమారుడు తిలక్
ఇదిలావుంటే తాము తమ తల్లిని మంచిగా చూసుకుంటున్నామని.. ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నారని కిమ్ముబాయి పెద్ద కొడుకు తిలక్‌ అంటున్నాడు.

కిమ్ముబాయి ఇబ్బందులు పెట్టడం సరికాదంటున్న స్థానికులు..
జీవితమంతా పిల్లల కోసం కష్టపడి కాటికి కాళ్లు చాచిన ఈ రోజుల్లో.. అదే పిల్లలు తల్లి కిమ్ముబాయి ఇబ్బందులు పెట్టడం సరికాదని స్థానికులంటున్నారు. మరి కిమ్ముబాయికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో చూడాలి.

13:44 - August 4, 2016

వర్షాకాలం మొదలై పోయింది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు..ఇతరత్రా పనులపై వెళ్లే మహిళలు వర్షం తడవడం సాధారణంగా మారిపోతుంటుంది. వర్షంలో తడవడం వల్ల చర్మం..వెంట్రుకలపై ప్రభావం పడుతుంది. కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసన వస్తుంది. దీనితో చుండ్రు ఏర్పడి వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
చుండ్రు ఉన్న వారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు. తలస్నానం చేసే ముందు పెరుగు, రీఫైయిన్డ్ ఆయిల్ మాడుకు పట్టించాలి. అనంతరం బాగా మసాజ్ చేసి అరగంట అనంతరం స్నానం చేయాలి.
తడి ఉన్న సమయంలో జుట్టును దువ్వకూడదు. బలహీనంగా ఉండడం వల్ల కురులు రాలిపోతుంటాయి.
తల మాడు చాలా చల్లగా, తడిగా దురద ఉన్న సమయంలో వేప నూనెను ఉపయోగించాలి. వేపలో ఉన్న ఆయుర్వేద గుణాలు కురులు బాగా పెరిగేందుకు సహాయపడతాయి.
ఈ సీజన్ లో హెయిర్ కలరింగ్..స్ట్రేయిట్ హెయిర్ చేయించుకోవడం అంత మంచిది కాదు. తలస్నానం చేయడానికి..జుట్టు ఆరడానికి చాలా సమయం పడుతుంటుంది.
తలస్నానం తర్వాత హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకుండా పొడి టవల్, మెత్తని టవల్ తో తలను తుడుచుకోవడం వల్ల మసాజ్ లా ఉపయోగపడుతుంది.
పొడి జుట్టు ఉన్నవారు తలస్నానానికి ముందు తప్పనిసరిగా కండిషనర్ ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

యువభేరిలో జగన్ ప్రసంగం..

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాకు చేరుకున్నారు. యువభేరి సదస్సులో ఆయన ప్రసంగించారు. టిడిపి ప్రభుత్వ వ్యవహర తీరుపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. 

పోలీసుల అదుపులో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం..

మెదక్ : నర్సాపూర్ (మం) ఆవంచ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో హెచ్ఎం అసభ్యంగా ప్రవర్తిసున్నాడంటూ గ్రామస్తులు ఆందోళననిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

13:34 - August 4, 2016

ఢిల్లీ : సౌదీ అరేబియాలో ఆకలితో అలమటిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ రాజ్యసభలో తెలిపారు. అక్కడ ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు ఇండియాకు పంపడానికి సొంత ఖర్చుతో సౌదీ రాజు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మూతపడ్డ కంపెనీలోని వర్కర్స్ ను ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు కూడా సౌదీ అనుమతించిందన్నారు. క్యాంపుల్లో ఉంటున్న భారతీయులకు ఉచితంగా ఆహారం, వైద్యం తదితర సౌకర్యాలన్నీ కల్పించేందుకు ముందుకు వచ్చిన సౌదీ రాజుకు సుష్మస్వరాజ్‌, గులాంనబీ ఆజాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రి జనరల్‌ వికెసింగ్‌ సౌదీలోనే ఉండి వారి బాగోగులు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

తల్లిని శ్మశానంలో వదిలేసిన కొడుకు..

తూర్పుగోదావరి : అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలైన తల్లిని ఓ కొడుకు శ్మశానంలో వదిలిపెట్టివెళ్లాడు. పోలీసుల సాయంతో ఆ తల్లిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

కడప కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం..

కడప : కలెక్టరేట్ వద్ద ఓ రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. భూ కబ్జాపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతు రామయ్య ఆరోపించాడు. 

ప్రభుత్వ జిల్లా పరిషత్ టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ కేసును విచారించిన హైకోర్టు..

హైదరాబాద్ : ప్రభుత్వ జిల్లా పరిషత్ టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ కేసును హైకోర్టు విచారించింది. సెప్టెంబర్ 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

జీఎస్టీ వల్ల వాణిజ్యం సులభతరం - జైట్లీ..

ఢిల్లీ : జీఎస్టీ వల్ల వాణిజ్యం సులభతరం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల దేశ ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని, పన్నులు..ధరలు తగ్గుతాయని తెలిపారు.

 

12:57 - August 4, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యబాబు స్పందించారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేకహోదా వాగ్ధానాన్ని నెరవేర్చితీరాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్ర తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు. నాన్నగారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పటానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన గుర్తుచేశారు. రాజకీయాల్లో కొత్తఒరవడికి ఆనాడే తెలుగువారు శ్రీకారం చుట్టారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. యాచన అంటేనే తెలియని ఆంధ్రరాష్ట్రం కేంద్రాన్ని యాచించాల్సిన అవసరంలేదని డిమాండ్ చేసి సాధించుకుంటామని ఆయన తెలిపారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్రందో మాట్లాడి సమస్యల్ని సామరస్యంగానే పరిష్కరిస్తారనే నమ్మకం తనకుందన్నారు.

అశ్వరావుపేటలో భారీ వర్షం..

ఖమ్మం : అశ్వరావుపేటలో భారీ వర్షం కురుస్తోంది. తహశీల్దార్ కార్యాలయలోనికి వర్షపు నీరు వచ్చి చేరింది. శిథిలావస్థలో కార్యాలయం ఉండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

లెనిన్ సెంటర్ లో సీఐటీయూ ధర్నా...

విజయవాడ : లెనిన్ సెంటర్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్మికులకు కనీస వేతనం రూ. 18 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

లక్ష్మీగూడలో చిట్టీల పేరిట మోసం..

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లి లక్ష్మీగూడలో చిట్టీల పేరిట మోసం బయటపడింది. రూ. 70 లక్షలతో అరవింద్..నితిన్ చంద్ ఉడాయించాడు. పీఎస్ లో 50 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. 

మోడీని కలిసిన ఎంపీ కవిత..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత కలిశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధానిని కోరారు. 

గవర్నర్ ను కలిసిన కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను బీజేపీ నేత కిషన్ రెడ్డి కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో హోంగార్డుల జీతాలు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కు కిషన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. 

12:35 - August 4, 2016

హైదరాబాద్ : ఇక నుంచి తాగివాహనాలు నడిపితే భారీ జరిమానా కట్టాల్సిందే .. హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్సుకు  ఎసరు ఖాయం.. బండికి బీమా లేకున్నా.. జైలు తప్పదు. పిల్లలు వాహనాలు నడిపితే పెద్దలు జైలుకెళ్లాల్సిందే అంటోంది నూతన మోటారువాహనాల సవరణబిల్లు.

మోటారు వాహనాల సవరణ బిల్లు - 2016 కు కేంద్ర కేబినెట్ ఆమోదం
మోటారు వాహనాల సవరణ బిల్లు - 2016 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ట్రాఫిక్‌ ఉల్లంఘించిన వారిజేబుకు చిల్లుతోపాటు.. కఠినశిక్షలు అమలు కానున్నాయి. మద్యం తాగి ఎవరు వాహనాలు నడిపినా..ప్రమాదాలకు కారణమైనవారికి భారీ జరిమానాలతో పాటు జైలుశిక్ష అమలుచేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది మోటారు వాహనాల సవరణ బిల్లు- 2016.

వేగంగా వాహనాలు నడిపితే రూ. 1000 -4000 వరకు జరిమానా
18 రాష్ట్రాల రవాణామంత్రుల కమిటీ సిఫార్సుల ఆధారంగా మోటారు వాహనాల సవరణ బిల్లు వచ్చేవారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా..బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఎన్ డీఏ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఈ బిల్లు ప్రకారం పరిమితవేగానికి మించిన వాహనాలు నడిపితే 1000 రూపాయల నుంచి 4 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇన్సూరెన్సు లేకుండా వాహనాలు నడిపితే.. 2 వేల రూపాయల జరిమానాతో పాటు.. 3 నెలల జైలు శిక్ష తప్పదు.

హెల్మెట్ లేకుండా నడిపితే 2 వేల జరిమానా, 3 నెలల జైలుశిక్ష
హెల్మెట్ లేకుండా నడిపితే 2 వేల జరిమానాతో పాటు 3 నెలల జైలుశిక్ష పడనుంది. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు దోషులవనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే..500 వరకు జరిమానా పడనుంది. డ్రైవింగ్ లైసెన్సు లేకుంటే 5 వేల రూపాయల జరిమానా పడనుంది. దీంతో పాటు ప్రమాదకరంగా వాహనాలు నడిపితే 5 వేల రూపాయల ఫైన్ తప్పదు. రోడ్డుప్రమాదాలకు కారణమైతే..10 లక్షల పరిహారం చెల్లించాల్నది ఇందులో అతి ముఖ్యమైన నిబంధన. ఇలా వాహనాల చట్టంలోని 223 నిబంధనల్లో 68 నిబంధనలను సవరిస్తూ..కొత్తగా 28 కొత్త నిబంధనలను ఈ చట్టం పరిధిలోకి తేవాలని యోచిస్తోంది బీజేపీ సర్కార్.

వాహన పటిష్ఠత పరీక్షలు నిర్వహించాలంటున్న బిల్లు..
2018 అక్టోబర్ 1 నుంచి అన్ని వాహనాలకు ఆటోమేటెడ్ కేంద్రాల వద్ద వాహన పటిష్ఠత పరీక్షలు నిర్వహించాలని బిల్లు నిర్థేశిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశ వ్యాప్తంగా వాహనాలు లైసెన్సులు, వ్యక్తుల లైసెన్సుల సమాచారాన్ని ఏకీకృత డేటాబేస్ లో ఉంటే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

12:28 - August 4, 2016

విజయవాడ : భూముల మార్కెట్ విలువను పెంచే ప్రక్రియలో ఏపీ సర్కారు ముందస్తు జాగ్రత్తలకు దిగిందా.. భవిష్యత్తు భూసేకరణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూమి ధరలను ఖరారు చేసిందా...పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరలు, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగానే ఉన్న ధరలను చూస్తుంటే ...అనుమానాలు నిజమేననిపిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న భూమాయాజాలం ప్రత్యేక కథనం......

భూమి రేటును పెంచుతూ సర్కారు ఉత్వర్వులు
రాష్ట్ర్లంలో నానాటికి పెరుగుతున్న రియల్‌బూమ్‌, గ్రోత్‌రేట్ నేపథ్యంలో భూమి రేటును పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. అయితే భూసేకరణ జరిగే ప్రాంతాల్లో మాత్రం రేటును పెంచకుండా ప్రభుత్వం పక్కావ్యూహం అనుసరిస్తోంది.

ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి భూమి రేట్ల పెరుగుదల
పెరిగిన ధరలు ఆగస్ట్1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా-నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 35 శాతం ధరలు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో 25 నుంచి 30శాతం వరకూ పెరిగాయి. పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

రేటును కావాలనే ప్రభుత్వం తగ్గించిందన్న ఆరోపణలు
రాష్ట్రంలో పలు భారీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం పోర్ట్, భోగాపురం విమానాశ్రయం, విజయవాడ మెట్రోరైలు నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపడుతోంది. వీటి కారణంగా రైతుల నుంచి భూమిని సమీకరించనుంది. అయితే ఈప్రాంతాల్లో కేవలం 10 శాతం ధరలే పెరగడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తు భూసేకరణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కావాలనే భూమి విలువలను పెంచకుండా పక్కావ్యూహం అనుసరిస్తోందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు.

పార్లమెంట్ లో కొనసాగుతున్న వైసీపీ ఎంపీల ఆందోళన..

ఢిల్లీ : లోక్ సభలో వైసీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. 

కేంద్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది - బాలకృష్ణ..

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. హోదా విషయంలో ఎవరినీ బతిమాలాల్సిన పనిలేదని, ఏపీ ఇలా దిగజారిపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం తెలుగువారు తల దించుకొనే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హోదాపై స్పష్టత ఇచ్చిందని, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాలని ఆనాడు బీజేపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.

రేణిగుంట ఎయిర్ పోర్టులో జగన్..

నెల్లూరు : రేణిగుంట ఎయర్ పోర్టుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చేరుకున్నారు. రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ యువభేరి సదస్సులో జగన్ పాల్గొననున్నారు. 

మహాడ్ లో మరో మృతదేహం లభ్యం..

ముంబై : రాయ్ గఢ్ జిల్లా మహాడ్ లో వంతెన కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. వంతెనకు దిగువ ప్రాంతంలోని 100 కి.మీ దూరంలో బస్సు డ్రైవర్ మృతదేహం లభ్యం కాగా గల్లంతైన రెండు బస్సుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు..

కరీంనగర్ : రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నీటి మట్టం 185 టీంఎసీలు ఉండగా ఇన్ ఫ్లో 62,881 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 93,322 క్యూసెక్కులుగా ఉంది. ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. 

నగరానికి చేరుకున్న ప్రధాని భద్రతా వ్యవహారాల అధికారులు...

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఆగస్టు ఏడో తేదీన పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు హైదరాబాదుకు చేరుకున్నారు. 

భారతీయ కార్మికుల సంక్షరణకు చర్యలు - సుష్మా...

ఢిల్లీ : సౌదీ అరేబియాలోని భారతీయ కార్మికుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దాల్లా స్వయంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలో దిగారని తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో భారతీయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారని ఆమె చెప్పారు. 

మోడీని కలవనున్న ఎంపీ కవిత..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని కాసేపట్లో తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత కలవనున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధానిని ఆమె కోరనున్నారు. 

గుజరాత్ లో 10 శాతం ఓబీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు తీర్పు..

గుజరాత్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన 10 శాతం ఓబీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే 1న ఆనందీ బెన్ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ పేరెంట్స్ అసోసియేషన్ సహా పలువురు వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.

11:57 - August 4, 2016

చిత్తూరు : కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశాయని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన జోలె పట్టి నిధుల సేకరణ మొదలు పెట్టారు. 6వేలకోట్ల రూపాయల నిధులిచ్చిన కేంద్రపాలకులు.. లక్షకోట్లు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. 

11:54 - August 4, 2016

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. మున్సిపల్‌ ఉద్యోగులంతా తాత్కాలిక సచివాలయానికి తరలివచ్చిన నేపథ్యంలో మంత్రి నారాయణ నూతన కార్యాలయంలో కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు సైతం తమ చాంబర్‌ను ప్రారంభించనున్నారు. 

11:50 - August 4, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా బిల్లు కోల్డ్ స్టోరేజ్ కు వెళ్ళనుందా? అంటే నిజమే అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రేపు తీజ్‌ పండగ సందర్భంగా పార్లమెంట్‌కు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఆగస్టు 5న ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్‌ చేపడతామని ఇప్పటికే డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు సెలవు ప్రకటిస్తే ప్రత్యేక హోదా బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల వరకూ వాయిదా పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కాగా దీనిపై సభ ఛైర్మన్ ఇంకా ఎటువం నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరుగుతుందో ? లేదో? అనేది సందిగ్ధంలో పడింది. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వం కావాలనే ఈ విషయంలో వాయిదాలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సమావేశాల నుండి ఈ బిల్లుపై మోదీ సర్కార్ రకరకాల కారణాలతో వాయిదా వేస్తోందనీ..ఎటువంటి స్పష్టతా లేకుండా గందరగోళంలోకి నెట్టివేస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

11:38 - August 4, 2016

కర్నూలు : ఏదో ఒక వార్తలతో నిత్యం వార్తల్లో నిలిచే వక్తి రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏపీలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామమైన ముచ్చుమర్రులో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. దీనిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దీనికంతటికీ కారణం ఏమంటే..ముచ్చుమర్రులో ప్రభుత్వం అనుమతి లేకుండా పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారనే కారణంతో 144సెక్షన్ విధించినట్లుగా తెలుస్తోంది. కృష్ణానదికి పుష్కరాలు రానున్న నేపథ్యంలో ముచ్చుమర్రులో గ్రామస్థులతో కలిసి బైరెడ్డి పుష్కరఘాట్ల నిర్మాణం చేపట్టారు. ఘాట్ల నిర్మాణానికి కేటాయించిన నిధులతో సచ్చచొక్కాల రాయుళ్లు తమ జేబులు నింపుకుని నాణ్యతలేని పనులు జరిపిస్తుంటే ప్రశ్నించలేదని ప్రభుత్వం తమ స్వంత డబ్బులతో ఘాట్లను నిర్మించుకుంటుంటే అడ్డుకోవటంపై ఆయన మండిపడ్డారు. తామేమన్నా సంఘవిద్రోహానికి పాల్పడతున్నామా? లేక సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నామా? ఎందుకు మా గ్రామంలో 144 సెక్షన్ విధించాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. గవర్నమెంట్లు కట్టిన ఘాట్లలోనే న్నానాలు చేయాలని రూలేమీలేదు కాబట్టి కృష్ణానది ఎక్కడ వున్నా అక్కడ స్నానం చేయ్యొచ్చు కాబట్టి తాము స్వయంగా ఘాట్లను నిర్మించుకుని ఇక్కడే పుష్కరస్నానాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏమైనాసరే పుష్కరాలను ఇక్కడి ఘాట్లలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.12న అమ్మవారి ఊరేగింపు చేసి సహస్ర హారతులిస్తామని తెలిపారు. 

11:17 - August 4, 2016

మహబూబ్ నగర్ : కృష్ణా పుష్కరాలు ముంచుకొస్తున్నా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వేగం పెంచలేదు. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న సోమశిల వీఐపీ ఘాట్ పనులు పూర్తవుతాయో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి... అధికారు సమనవ్వయ లోపంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ లో వున్న సోమశిల పుష్కర ఘాట్ వివరాలకు ఈ వీడియోను చూడండి..

11:15 - August 4, 2016

దేశంలో దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సునాయసంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్ధేశ్యంతో దుండగులు దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళలు..యువతులపై వీరు కన్నేస్తున్నారు. రహస్యంగా వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు కలిసున్నప్పటి దృశ్యాలను చిత్రీకరించడం..బెదిరించడం..డబ్బులు వసూలు చేయడం...లాంటి పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ వీడియోల్లో ఉన్న అమ్మాయిలను లైంగికంగా వేధించడం, లొంగకపోతే తల్లిదండ్రులతో పాటు బయట ప్రపంచానికి తమ వీడియోలు చూపెడ్తామని బెదిరించడం దుండగులకు పనిగా మారింది. ఇదంతా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నాయి. దొంగచాటుగా తీసిన ఇలాంటి వీడియోలను మార్కెట్ లో సైతం విక్రయించేస్తున్నారు. అగ్రాలోని కస్ గంజ్ మార్కెట్ లో ఇలాంటి వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. రూ. 50 నుండి రూ. 100 వరకు వీటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వీడియోలను ఫేస్‌బుక్, ట్విట్టర్లకు అప్‌లోడ్ చేసి వాటిని అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి అమ్ముతున్నారు. పరవు పొతుందనే ఉద్ధేశ్యంతో చాలా మంది వారికి డబ్బులు ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. తమదాక విషయం తీసుకరావడం లేదని పోలీసులు పేర్కొంటున్నట్లు సమాచారం. అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేయడం నేరమని, గతంలో తాము దాడులు చేసి అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న ఈ వ్యవహారంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

11:11 - August 4, 2016

హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టుకు కావాల్సిన భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుపై మంత్రి... ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష చేపట్టారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని, అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

జూన్‌ వరకు దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశం
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రధాన ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నత్తనడకగా సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణాల పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. వర్కింగ్ ఏజెన్సీలు సరిగా పనిచేయకుంటే.. వాటిని తొలగించి... ఇతర ఏజెన్సీలకు పనులు అప్పగించాలని సూచించారు. దేవాదుల ప్రాజక్టును త్వరగా పూర్తి చేయడానికి సర్కిల్, డివిజనల్ వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పథకానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు మంత్రి.

ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండోదశ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న హరీష్‌
త్వరలోనే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండోదశ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని అధికారులకు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, శిథిలాలను తొలగించాలని కోరారు. ఇటు వరంగల్, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో దేవాదుల ప్రాజెక్టు కోసం మిగతా భూముల సేకరణను పూర్తిచేయాలని ఆదేశించారు. సెప్టెంబర్‌లోపు ధర్మసాగర్‌ ప్రాజెక్టులో 1.03 టీఎంసీల నీటిని నింపడానికి చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులు పూర్తి కాకుంటే ఇ.ఇ. రవీందర్ బాధ్యత వహించాలని చెప్పారు. ఇటు కాళేశ్వరం, మిడ్‌మానేరు, వరద కాలువ ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు, భూ సేకరణపై సమీక్ష చేపట్టారు. నష్కల్, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు పరుగులు పెట్టిస్తున్నారు. 

11:05 - August 4, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ భూసేకరణ విషయంలో తమ ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరించిందని తెలంగాణ నీటిపారుదలశాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిర్వాసితులకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలనే జీవో 123 తెచ్చామని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ... సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు హరీశ్‌రావు. 

రేపు పార్లమెంట్ కు సెలవు ?

ఢిల్లీ : తీజ్ పండుగ నేపథ్యంలో రేపు పార్లమెంట్ కు సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఛైర్మన్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరుగుతందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ఒకవేళ జరగకపోతే శీతాకాల సమావేశాల వరకు వచ్చే అవకాశం లేదని సమాచారం. 

11:03 - August 4, 2016

ఖమ్మం భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటేత్తింది. ప్రస్తుతం నది నీటిమట్టం 32 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్ట్‌ వరద ఉధృతి పెరగడంతో మొత్తం 15 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం.

జూరాలకు వరద ఉధృతి..
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. నారాయణపూర్‌ నుంచి జూరాలకు వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ ఫ్లో 30వేల 19 క్యూసెక్కులకు చేరడంతో... జలవిద్యుత్ కేంద్రంలోని 5 యూనిట్ల ద్వారా ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఒకవేయి 45 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం ఒకవేయి 44 అడుగులు.

నిండుకుండలా కడెం జలాశయం..
ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వరద ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో నాలుగు గేట్లను ఎత్తివేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి వరకు జరిగిన సమావేశంలో జీఎస్టీ బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. 

10:55 - August 4, 2016

బ్రిటన్ : లండన్‌లో కత్తితో దాడిచేసిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. సెంట్రల్‌లండన్‌లోని రసెల్‌స్క్వేర్‌లో కత్తిచేతబట్టిన ఓ అగంతకుడు ఒక్కసారిగా పాదచారులపై దాడికి దిగాడు. దుండగుడి దాడిలో ఒకవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దాడివెనుక టెర్రరిస్టుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

10:52 - August 4, 2016

గుంటూరు : కృష్ణా పుష్కరాల్లో ముఖ్యమైన ఘాట్లకు మాత్రమే ప్రభుత్వం ప్రచారం కల్పిస్తోంది. గోదావరి పుష్కర అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఘాట్లను నిర్మించినా వాటికి పెద్దగా ప్రచారం కల్పించడం లేదు. రాజధాని ప్రాంతంలో విశాలవంతమైన ఘాట్‌ నిర్మాణం చేపట్టి అన్ని వసతులు కల్పించినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. దీనిపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

10:50 - August 4, 2016

బ్రెజిల్ : ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం....2016 ఒలింపిక్స్ కు బ్రెజిల్ వాణిజ్యరాజధాని రియో డి జెనీరోలో రంగం సిద్ధమైంది.1896లో గ్రీస్ లోని ఏథెన్స్ ప్రారంభమైన ఆధునిక ఒలింపిక్స్ గత 120 సంవత్సరాల కాలంలో అంతైఇంతై అంతింతైఅన్నట్లుగా ఎదిగిపోయాయి. రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు...దశబ్దాల చరిత్ర కలిగిన ఒలింపిక్స్ ప్రస్థానం ఓసారి చూద్దాం......

ప్రతి క్రీడాకారుడి స్వప్నం ఒలింపిక్స్..
ఒలింపిక్ గేమ్స్‌.....ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం....ప్రతి క్రీడాకారుడి స్వప్నం..ప్రతిభకు కొలమానం..విశ్వవేదికపై విన్యాసం..అలుపెరగని పోరాటం.విజయం కోసం ఆరాటం.అంచనాలకు అందని అద్భుతం..అంతకు మించి ఆశ్చర్యం..ఒక్క మాటలో చెప్పాలంటే...క్రీడా ప్రపంచంలో ఒలింపిక్‌ గేమ్స్‌కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.ఏ క్రీడ అయినా,ఎంతటి క్రీడాకారుడైనా....ఒలింపిక్ మెడల్‌ను మించిన ఘనత మరోకటి లేదని భావిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే క్రీడాకారులకు ఒలింపిక్స్‌లో విజయం అంటే పతకం మాత్రమే కాదు కలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం.

ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తేనే గొప్ప క్రీడాకారుల భావన..
ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తేనే గొప్ప అనుకునే క్రీడాకారులు, అథ్లెట్లు ఎంతో మంది ఉన్నారు...ఇక మెడల్‌ సాధిస్తే జన్మ ధన్యమే అని ఉప్పొంగిపోయె వారూ ఉన్నారు.

కొంతమంది ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తపన..
ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తహతహలాడుతుంటారు....కానీ కొంతమంది ఇదే వేదికపై రికార్డ్‌ల మోత మోగిస్తుంటారు. కొందరు చరిత్ర సృష్టిస్తే.....మరికొందరు చరిత్రను తిరగరాస్తుంటారు.ఇంకొంతమంది ఎప్పటికైనా చరిత్ర సృష్టించాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఒలింపిక్‌ గేమ్స్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. క్రీస్తు పూర్వం 776లో తొలిసారిగా ఒలింపిక్స్‌ గేమ్స్‌ జరిగినట్లు చరిత్ర చెబుతోంది. గ్రీసు దేవుడుగా పిలువబడే జియూస్‌ గౌరవార్ధం పురాతన ఒలింపిక్స్‌ పోటీలను నిర్వహించేవారు. కుస్తీ, పరుగు, జావెలిన్‌ త్రో, హార్స్‌ రేస్‌, డిస్కస్‌ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించి ...విజేతలుగా నిలిచిన వారిని పతకాలు,ఆలివ్‌ ఆకులతో చేసిన కిరీటంతో సత్కరించేవారు.

19 శతాబ్దంలో ప్రారంభమైన ఒలింపిక్స్..
ఇక 19వ శతాబ్దంలో ఆధునిక ఒలింపిక్స్ ఆరంభమయ్యాయి.ఒలింపిక్స్ పోటీలకు జన్మస్థలమైన గ్రీస్‌లోనే ఈ మోడ్రన్‌ ఒలింపిక్స్‌ పోటీలు నిర్వహించడం విశేషం. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లో తొలి ఆధునిక ఒలింపిక్స్‌ పోటీలకు ఆతిధ్యమిచ్చింది. క్రీడలు, క్రీడాంశాల సంఖ్య సైతం పెరిగింది. అప్పటినుంచి ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతూనే ఉన్నాయి.

గ్రీస్‌లోనే ఒలింపిక్స్‌ జ్యోతి వెలిగించడం ఆనవాయితీ
ఒలింపిక్స్‌ పోటీలు ఏ దేశంలో జరిగినా....గ్రీస్‌లోనే ఒలింపిక్స్‌ జ్యోతి వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ఒలింపిక్ జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని ఏథెన్స్‌లో పురాతన గ్రీస్‌ సంస్కృతి,సంప్రదాయ పద్దతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. 1928 ఆమ్‌స్టర్‌డామ్‌ ఒలింపిక్స్‌ నుంచి గ్రీస్‌ నుంచే ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే ప్రారంభమవ్వడం కొనసాగుతూ ఉంది.

ఒలింపిక్‌ అంటే గుర్తొచ్చేవి ఒలింపిక్‌ రింగ్స్ , టార్చ్
ఒలింపిక్‌ పోటీలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి రింగ్స్ , ఒలింపిక్‌ టార్చ్ . అంతే కాదు ఈ క్రీడా సంబరానికి నేపధ్య గీతంతో పాటు ప్రత్యేక శ్లోకం కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.

ఒలింపిక్ గేమ్స్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకూ అంతా స్పెషలే..
ఇక ఒలింపిక్ గేమ్స్ ఆరంభ వేడుకల నుంచి ముగింపు వేడుకల వరకూ అన్నీ ప్రత్యేకమే.ప్రతీది ప్రతిష్టాత్మకమే. ఆరంభ వేడుకలను ఎంతలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో ....ముగింపు వేడుకలను సైతం అంతకంటే ఘనంగా నిర్వహిస్తారు. ఒలింపిక్స్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారంటే...కేవలం ఈ వేడుకల కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తారు.

పతకాల వేటే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న క్రీడాకారులు..
31వ మోడ్రన్‌ ఒలింపిక్‌గేమ్స్‌కు ఆతిధ్యమిచ్చే అదృష్టం బ్రెజిల్‌ వాణిజ్య రాజధానా రియో డి జెనీరో నగరానికి దక్కింది.207 దేశాలు పాల్గొంటున్న ఈ గేమ్స్‌లో .....28 క్రీడల్లో 306 క్రీడాంశాల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు. క్రీడా చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకోవడం కోసం ప్రతిభనే నమ్ముకుని పతకాల వేటలో బరిలోకి దిగబోతున్నారు. ఇలా ఒలింపిక్‌ గేమ్స్‌ అంటేనే ప్రతీది ప్రత్యేకమే. ఎప్పటికప్పుడూ నిత్యనూతనంగా, చెక్కుచెదరని చరిత్రే.

రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు..

హైదరాబాద్ : రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశానికి హాజరయ్యారు. 

మూడు జిల్లాల మంత్రులు..కలెక్టర్లతో బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, సుందరీకరణ, పారిశుధ్య పనులను మెరుగుపరచాలని సూచించారు. ఘాట్ల వద్ద మందులు, అంబులెన్స్ లను నిరంతరం అందుబాటులో ఉంచాలని, పుష్కరాల్లో ఏ శాఖపైనా విమర్శలు రాకూడదని పేర్కొన్నారు. 

10:39 - August 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని యూనివర్శిటిలకు వైస్ ఛాన్స్‌లర్ల నియమాకంలో ఖచ్చితమైనా నిబంధనలు పాటించామని చెప్పారు మంత్రి కడియం శ్రీహరి. అయినా.. వీసీల నియమాకాన్ని హైకోర్టు రద్దు చేసిందని, దీనిపై త్వరలోనే సుప్రీంకు వెళ్తామని చెప్పారు.

ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు : కడియం
ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కడియం. ఎంసెట్‌-2 పశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా సమాధానమిచ్చారు.

అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ సిస్టమ్‌ : కడియం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా, ఇతర వేల్ఫేర్ రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించామన్నారు. ఇందుకోసం నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉపాధ్యాయుల స్కిల్స్‌ను పెంచడానికి, విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు.

విద్యార్థు వసతులపై కమిటీలు...
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, దీనికోసం ప్రత్యేక మెస్‌ కమిటీలు, పేరెంట్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు కడియం చెప్పారు. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆగస్టు నెల నుంచే స్పెషల్‌ క్లాసులు నిర్వహించాలని ఆదేశించామన్నారు.

ప్రజల నమ్మకాన్ని పొందేందుకు సర్కార్ చర్యలు..
మొత్తంగా ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం కోసం ప్రణాళికలు రచిస్తోంది. విద్యార్థుల హాజరుశాతంతో పాటు, మెరుగైన ఫలితాలు రాబట్టడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. 

10:34 - August 4, 2016

హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. నారాయణపూర్‌ నుంచి జూరాలకు వరద ఉధృతి పెరగడంతో.. జలవిద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మరోవైపు ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు నుంచి 15గేట్లను అధికారులు ఎత్తి... 50, 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి.. నీటిని వదులుతున్నారు. 

అమరావతిలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రారంభం..

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. 

తిరుమలలో ఈదురుగాలలు..

చిత్తూరు : తిరుమలలో ఈదురుగాలులు వీస్తున్నాయి. పీఏసీ -3 యాత్రికుల వసతి సముదాయం వద్ద చెట్టుకొమ్మ విరిగిపడింది. దీనితో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
 

గగన్ పహాడ్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ : గగన్ పహాడ్ లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. 15 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 

నేడు మధ్యాహ్నం జైట్లీ ప్రెస్ మీట్...

ఢిల్లీ : మధ్యాహ్నం అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జీఎస్టీ అమలు విధానంపై రోడ్ మ్యాప్ ను జైట్లీ ప్రకటించనున్నారు. 

10:12 - August 4, 2016

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగు, మలయాళ భాషాల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత..నిత్యా మీనన్ లు నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రెండు భాషలలో నిర్మింప బడుతున్న ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల కోసం ఒక తరహా క్లైమాక్స్...మలయాళ ప్రేక్షకుల కోసం మరో క్లైమాక్స్ ను కొరటాల డిజైన్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
టాప్ హీరోలకు సంబంధించిన చిత్రాలకు రెండు క్లైమాక్స్ లు నిర్మించిన సందర్భాలు లేవని గుసగుసలాడుకుంటున్నారంట. 'జనతా గ్యారేజ్' తెలుగు వెర్షన్ లో జూనియర్ పాత్రను హైలెట్ చేసినట్లు...మలయాళ వెర్షన్ లో మాత్రం మోహన్ లాల్ పాత్రను ప్రధానంగా చూపించారని వార్తలు వెలువడుతున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆగస్టు 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ లో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారంట. మరి ఈ జూనియర్ ప్రేక్షకులను అలరిస్తాడా ? లేదా ? అన్నది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. 

బస్సును ఢీకొన్న లారీ..

ప్రకాశం : సంతమాగలూరు వద్ద ఆర్టీసీ బస్సు, సిమెంట్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు వినుకొండ నుంచి నరసరావుపేట వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

బొల్లారంలో దారుణం..

హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సుంకయ్య అనే వ్యక్తిపై రాజు అనే అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఘటనలో సుంకయ్యకు, రాజుకు ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

13మంది భారతీయులకు ఉరిశిక్ష...

కువైట్‌ : వివిధ నేరాలకు పాల్పడిన 17 మంది భారతీయులు అక్కడి పలు జైళ్లలో ఉన్నారని, వారిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. వైసీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుక అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఉరిశిక్ష పడిన వారు మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్ ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు.

షామీర్ పేటలో రోడ్డు ప్రమాదం..

రంగారెడ్డి : షామీర్ పేట (మం) దొంగల మైసమ్మ వద్ద లారీ - డీసీఎంలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు తిరుపతయ్య, కుమార్ లుగా గుర్తించారు. 

09:09 - August 4, 2016

విజయవాడ : నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. అదేవిధంగా ప్రధాని మోదీతో సమావేశానికి అపాయింట్‌మెంట్‌ కోరారు. అనుమతి లభిస్తే పుష్కరాలకు ఆహ్వానించడంతో పాటు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై మోదీకి వినతిపత్రం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఔరంగాబాద్ లో హై అలర్ట్...

మహారాష్ట్ర : భారీ వర్షాలకు జయక్వాడి రిజర్వాయర్ కు వరద ఉధృతి పెరిగింది. మరత్వాడ నియోజకవర్గంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నాసిక్, అహ్మద్ నగర్ డ్యాంలకు నీటిమట్టం పెరుగుతోంది. 

ఆదిలాబాద్ జిల్లాలో దారి దోపిడి..

ఆదిలాబాద్ : జిల్లా బెల్లంపల్లి కన్నాల సమీపంలో దారి దోపిడి జరిగింది. పెట్రోల్ బంక్ మేనేజర్ సయ్యద్ ఆసీఫ్ బాషాను చితకబాది రూ. 3.4 లక్షలతో దోపిడి దొంగలు ఉడాయించారు. పెట్రోల్ బంక్ నుండి డబ్బులు తీసుకుని వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

09:06 - August 4, 2016

గుంటూరు : అమరావతిలోని తాత్కాలిక సచివాలయానికి శాఖల తరలింపు కొనసాగుతోంది. నేడు వెలగపూడికి ప్రత్యేక బస్సులో పరిశ్రమలు, మౌలిక, ఇంధన, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖలు ఉద్యోగులు తరలివెళ్లారు. బుధవారం సచివాలయ హోంశాఖ సిబ్బంది వెలగపూడి చేరుకున్నారు. నేడు హోం మంత్రి మంత్రి చినరాజప్ప వెలగపూడిలో తమ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మున్సిపల్‌ మంత్రి నారాయణ పేషీ కూడా నేడే ప్రారంభం కానుంది. 

విరిగిపడిన కొండచరియలు..

విశాఖపట్టణం : కొత్తవలస - కిరండోల్ రైలు మార్గంలో శివలింగాపురం - టైడ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో గూడ్సు రైలు నిలిచిపోయింది. శృంగవరపు కోటలో పలు ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. 

09:02 - August 4, 2016

అనంతపురం : రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో విషాదం చోటుచేసకుంది. రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు మంత్రి పరిటాల సునీతకు సమీప బంధువు గిరినాయుడుగా తెలుస్తోంది. ప్రసన్నాయపల్లి సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు. మంత్రి సునీత మేనమామ గొరిదిండ్ల కృష్ణమూర్తి నాయుడు కుమారుడు గిరీష్‌ నాయుడు (31), గుంటూరు జిల్లాకు చెందిన అరవిందకుమార్‌ (30) పోలీసులు గుర్తించారు. రిలయన్స్‌ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరు ప్రసన్నాయుని పల్లిలో రిలయన్స్‌ టవర్‌ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. విధుల నిర్వహణలో వున్న వీరు రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవటంతో ఎటూ తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. క్షణాల్లోనే రైలు వారిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

లండన్ లో ఉగ్రదాడి..

లండన్ : ఉగ్రదాడి కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులపై కత్తితో దాడి చేశాడు. ఓ మహిళ మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. 

08:59 - August 4, 2016

విజయవాడ : కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సైకిలెక్కనున్నారు. టీడీపీలో చేరేందుకు దేవినేనికి ఇప్పటికే మార్గం సుగమం అయ్యింది. జిల్లాకు సంబంధించిన ముఖ్యనేతలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు మాట్లాడారు. సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోవటంతో నేతలు తమకు కూడా ఆమోదమేనంటున్నారు. కాగా ఈవారంలోనే ముఖ్యమత్రి చంద్రబాబు చేతులమీదుగా పసుపు జెండా కప్పుకోబోతున్నారు. విజయవాడలో రాజకీయ పరిణామాలను ఇదొక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. నెహ్రూతోపాటు ఆయన బలగం మొత్తం టీడీపీలో చేరేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. కాగా 1984లో నెహ్రూ టీడీపీ తరపున పోటీచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విజయవాడ నగరంలో సంచలనంగామారింది. నెహ్రూ కుమారుడు కాంగ్రెస్ లో యువకాంగ్రెస్ అధ్యక్షుడి వున్న విషయం కూడా తెలిసిందే. ఏపీ నీటిపాదరుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు నెహ్రూకు సమీపం బంధువుకూడా. 

టిడిపిలో చేరికకు దేవినేనికి గ్రీన్ సిగ్నల్...

విజయవాడ : టిడిపిలో చేరికకు దేవినేని నెహ్రూకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కృష్ణా జిల్లా ముఖ్యనేతలతో కళా వెంకట్రావ్ మాట్లాడారు. అధినేత సుముఖంగా ఉన్నందున దేవినేని నెహ్రూ చేరిక తమకు ఆమోదయోగ్యమని నేతలు పేర్కొన్నారు. 

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను సీఎం బాబు ఆహ్వానించనున్నారు. 

నేడు నెల్లూరు జిల్లాకు జగన్..

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. యువభేరి సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రత్యేక హోదాపై విద్యార్థులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న మధు...

పశ్చిమగోదావరి : నేడు జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించనున్నారు. పోలవరం, బుట్టాయిగూడెంలలో పర్యటించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్న మధు...

పశ్చిమగోదావరి : నేడు జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించనున్నారు. పోలవరం, బుట్టాయిగూడెంలలో పర్యటించనున్నారు.

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను సీఎం బాబు ఆహ్వానించనున్నారు. 

నేడు అమరావతిలో పలు కార్యాలయాల ప్రారంభం..

గుంటూరు : వెలగపూడిలో నేడు ఉదయం 11గంటలకు తాత్కాలిక సచివాలయంలో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కార్యాలయం ప్రారంభం కానుంది.
అమరావతిలో నేడు తాత్కాలిక సచివాలయంలో మధ్యాహ్నం 12.10గంటలకు హోం శాఖ కార్యాలయం ప్రారంభం కానుంది. 

నల్గొండ, కరీంనగర్ లో పర్యటించనున్న మంత్రులు..

నల్గొండ : నేడు జిల్లాలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు పర్యటించనున్నారు. కరీంనగర్ లో స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు తుమ్మల, ఈటెలలు పర్యటించనున్నారు. ముత్తారం (మం) ఓడేరులో రూ. 44 కోట్లతో నిర్మించనున్న నూతన బ్రిడ్జీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

జగదాంబ అమ్మవారికి చివరి పూజ..

హైదరాబాద్ : గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి చివరి పూజ నిర్వహించనున్నారు. చివరి పూజతో ఆషాడమాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. 

ఆదిలాబాద్ లో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన..

ఆదిలాబాద్ : నేడు జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్మారెడ్డి పాల్గొనున్నారు. 

నేడు 'హోదా'పై జైట్లీ ప్రకటన ?

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో 'ఏపీ ప్రత్యేక హోదా'పై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టిడిపి, వైసీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం టిడిపి ఎంపీలు నిరసనకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 

నేడు కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం..

ఢిల్లీ : నేడు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రాజ్యాంగ నిపుణులు హాజరు కానున్నారు. 

08:30 - August 4, 2016

నల్లగొండ : నాగరిక సమాజంలో అనాగరిక లక్షణాల ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. జంతువులు కూడా తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. కానీ మానవత్వం మరచిపోతున్న మనుష్యులు మాత్రం కనీసం తాము మనుష్యులమన్న సంగతే మరచిపోతున్నారు. ఎన్నడూ కనీ వినీ ఎరుగనంటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా భూణహత్యల విషయంలో స్వయానా తల్లిదండ్రులే కడుపులో ఇంకా ఊపిరి కూడా పోసుకోని పిండాలను కడిగేసుకుంటున్నారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని వదిలించుకోవటానికి ఏదో చెత్తను విసిరేస్తున్నట్లుగా నడిరోడ్డుపైనా..చెత్తకుప్పల్లోకి విసిరేస్తున్నారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో తెలీదు గానీ తల్లి గర్భంలోంచి బయటపడి రక్తపు మరకలు ఆరకముందే మూడు పసిగుడ్డులు రోడ్డుపై పడివున్నాయి. ఈదారుణం నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో చోటుచేసుకుంది. తలచుకుంటేనే కడుపు తరుక్కుపోయేలా వున్న ఈ దారుణాన్ని చూడటమే కాదు తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒంటిమీద రక్తపు మరకలు ఆరని పిండాలను కవర్లలో పెట్టి గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై పడేసారు. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ సమీపంలో మూడు పిండాలు పడి వుండటాన్ని గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. కాగా పిండాలను పెట్టి పడేసిన కవర్లు వరంగల్ జిల్లాకు చెందిన ఓ బట్టల దుకాణానికి చెందినవిగా తెలుస్తున్నాయి. కాలేజీ విద్యార్థినులు అక్రమంగా తొలగించుకున్న గర్భం తాలూకు పిండాలు అన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తేనేగానీ వాస్తవాలను చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సభ్యసమాజం తలదించుకునే అతి దారుణమైన సంఘటనకు బాధ్యులెవరైనా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నల్లగొండ జిల్లాలో దారుణం..

నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు,తల్లిదండ్రులు కలిసి భూణ హత్యలకు ప్పాలడ్డారు. గర్భం నుండి తొలగించిన నాలుగు పిండాలను దుండగులు టూటౌన్ పీఎస్ ముందు వదిలివెళ్లారు. 

07:55 - August 4, 2016

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రభుత్వం తెచ్చిన 123 జీవోను హైకోర్టు రద్దుచేసింది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారమే భూములు సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఎక్కడ భూ సేకరణ చేసినా ఇదే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. భూ సేకరణకు 2013 చట్టం ఉండగా..123 జీవోను ఎందుకు తెచ్చారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..హైకోర్టు తీర్పుతో విపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. భూములు కోల్పోతామనే నిర్వేదంతో ఆత్మహత్యలు చేసుకున్న పలువురు కుటుంబాలలో మాత్రం శోక ఛాయలు ఇంకా మాసిపోనేలేదు..దీనికంతటికీ కారణమైన తెలంగాణ సర్కార్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో దిమ్మతిరిగిపోయింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో భూనిర్వాశితులు సంబురాలలో మునిగి తేలుతున్నారు... ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. ఈ చర్చలో వెంకట్ (సీపీఎం నేత) బెల్లయ్య నాయక్ (టీ.కాంగ్రెస్ నేత) వకుళాభరణ కృష్ణమోహన్(టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారం తెలుసుకోండి..

07:45 - August 4, 2016

తెలంగాణలో బిసి సంక్షేమం ఎండమావిగా మారుతోంది. బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం, వాటిని విడుదల చేయకపోవడం, వివిధ వ్రుత్తులవారికి తగిన మొత్తంలో లోన్లు మంజూరు చేయకపోవడం లాంటి సమస్యలు షరా మామూలే.

2015- 16 బడ్జెట్ లో రూ. 2172 కోట్లు..
తెలంగాణలో బిసిల జనాభా ఎక్కువ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్త రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కోటి 56 లక్షల మందికి పైగా బిసిలున్నారు. తాజా అంచనాల ప్రకారం బిసీల జనాభా కోటీ 86 లక్షలు. జనాభాకు తగ్గట్టుగా బిసిలకు సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులుండడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2015 -16 ఆర్థిక సంవత్సరంలో లక్షా 15 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే అందులో బిసిలకు కేటాయించింది కేవలం 2172 కోట్లు. లక్షా ముప్పే వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన 2016 17 బడ్జెట్ లో బిసిలకు కేటాయించింది 2538 కోట్లు మాత్రమే. కనీసం రెండు శాతం నిధులు కేటాయించలేదన్నది వాస్తవం.

25వేల కోట్లు కేటాయిస్తామన్న టీ.సర్కార్..
అయితే, బిసిల సమగ్రాభివ్రుద్ధికి ఐదేళ్లలో పాతిక వేల కోట్లు కేటాయిస్తామంటూ టిఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అంటే ఏడాదికి అయిదువేల కోట్ల రూపాయల చొప్పున వెచ్చించాల్సి వుంటుంది. రెండేళ్లలో కలిపి కూడా అంత మొత్తం కేటాయించలేదు. అరకొర కేటాయింపులు కూడా సక్రమంగా ఖర్చు చేయడం లేదు. రాష్ట్రంలో 11 బిసి ఫెడరేషన్ లున్నాయి. సంచారజాతుల కోసం 12వ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు గత బడ్జెట్ లో ప్రకటించినా, ఇంత వరకు జీవో విడుదల కాలేదు. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, క్రిష్ణ బలిజ, సగర, వాల్మీకి, భట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, గీత కార్మికులకు ఫెడరేషన్లున్నాయి. ఆయా వ్రుత్తుల నిర్వహణకు, ఆధునికీకరణకు తోడ్పడడం, రుణ సదుపాయం కల్పించడం ఈ ఫెడరేషన్ ల బాధ్యత. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్షా పాతికవేలమంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 17500 మందికి లోన్లు మంజూరయ్యాయి. దీనినిబట్టే బిసి సంక్షేమం ఎలా అమోఘంగా వున్నదో అర్ధం చేసుకోవచ్చు ..

 

07:41 - August 4, 2016

ఐదేళ్లలో పాతికవేల కోట్లతో బిసిల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామంటూ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ వాగ్థానం చేసింది. అయితే, బిసి సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంత్రుప్తికరంగా వున్నాయా? బిసి ఫెడరేషన్ల పనితీరు, వాటికి కేటాయిస్తున్న నిధులు ఎలా వున్నాయి? అవి సక్రమంగా ఖర్చవుతున్నాయా? దారితప్పుతున్నాయా? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు బిసి సబ్ ప్లాన్ సాధన సమితి నేత కిల్లె గోపాల్ 10టీవీ స్టూడియోకి వచ్చారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:36 - August 4, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి చెప్పేది ఏముంది. ఇంటి నుంచి బయలుదేరితే ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటామో తెలియని పరిస్థితి. నగరంలో రోడ్ల దుస్థితి అయితే మరీ అద్వానం.. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. పెరుగుతున్న జనాభా, వాహనాలకనుగుణంగా రహదారుల విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌ రోడ్లపై దృష్టి సారించిన సీఎం
హైదరాబాద్‌లోని రోడ్ల దుస్థితిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. నగరవాసులకు ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మిస్తామన్నారు సీఎం.. అంతర్జాతీయ ప్రమాణాలతో నగర రోడ్లను అభివృద్ది చేయాలని, ఇప్పుడు వేసే రోడ్లు మరో వందేళ్ల పాటు ప్రజలు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇందు కోసం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ తో కలిసి నగర రోడ్ల అభివృద్ధిపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వాల హయాంలో రోడ్ల అభివృద్ధి జరగలేదన్న సీఎం
నగర రహదారుల పరిస్థితి- తీసుకోవాల్సిన చర్యలు- అభివృద్ధి అంశాలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ జిహెచ్ఎంసీ..అధికారులతో పాటు మహా సిమెంట్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత పాలకులు నగర రోడ్లపై వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, పెరుగుతున్న జనాభా, వాహనాలు, రవాణా అవసరాలకు తగినట్లు రహదారుల అభివృద్ధి జరగలేదని సీఎం అభిప్రాయపడ్డారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా తవ్వకాలు జరపాలన్న కేసీఆర్‌..
నగరంలో కరెంటు లైన్ల కోసం, టెలిఫోన్ల లైన్ల కోసం, డ్రైనేజీ మరమ్మతుల కోసం, మంచినీటి పైపుల కోసం నిత్యం రోడ్లను తవ్వేస్తున్నారని, ఇది కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రధాన కారణంగా మారుతున్నదన్నారు. ఈ సమస్యలన్నిపోయే విధంగా రోడ్ల పునర్నిర్మాణం ఉండాలని సూచించారు. దీనికోసం సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు. మొదటి దశలో చేపట్టే వంద కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం సిమెంట్ కంపనీల యాజమాన్యం కూడా ముందుకు వచ్చినట్లుగా చెప్పారు.

మరికొన్ని బస్‌ టర్మినల్స్ నిర్మించాలి- సీఎం
మూసీ నదికి రెండు వైపులా రహదారి నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్ల మాదిరిగానే నగరం చుట్టూ మరికొన్ని బస్ టర్మినల్స్ కూడా నిర్మించాలని చెప్పారు. పార్కింగ్ కష్టాలను తొలగించేందుకు చేపట్టిన బహుళ అంతస్థుల పార్కింగ్ వ్యవస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. మెట్రో రైలు పనులు జరిగే రహదారులను పట్టించుకోవడం లేదని, అక్కడ కూడా రహదారులను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దాలని, అవసరమైన మరమ్మతులు చేయాలని సిఎం చెప్పారు. మెట్రో రైలు మార్గం నిర్మాణ ప్రణాళిక కూడా అస్తవ్యస్తంగా రూపొందించారని, కనీసం విమానాశ్రయానికి కూడా మెట్రో రైలు వెళ్లదని సిఎం అన్నారు. రెండో దశ మెట్రో రైలు నిర్మాణం ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉండాలని చెప్పారు.

భవిష్యత్ అవసరాలకు అవసరమయ్యేలా రహదారులు మెరుగు పరచాలి : కేసీఆర్

హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర విస్తరిస్తున్న నగరాల్లో కూడా భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా రహదారుల వ్యవస్థను మెరుగు పరచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

07:31 - August 4, 2016

మెదక్ : 123 హైకోర్టు తీర్పుతో మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన 123 జీవోలను కొట్టివేయడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాణా సంచా కాల్చి... సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా హైకోర్టు తీర్పును ప్రభుత్వంపై రైతులు సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు.

సంబరాల్లో మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు..
ప్రభుత్వంపై నిర్వాసితుల అపూర్వ విజయం...రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ 123, 214 జీవోలను కొట్టివేస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 123 జీవోను హైకోర్టు రద్దు చేయడంతో కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో సంబరాలు చేసుకున్నారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

సంబురాలు జరుపుకున్న నేతలు..
123 జీవోను రద్దు చేసిన సందర్భంగా మెదక్‌ జిల్లాలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కార్యకర్తలకు స్వీట్లు పంచారు. అటు జిల్లాలో సీపీఎం నేతలు, భూనిర్వాసితులు హైకోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదంటున్నారు నిర్వాసితులు. మొత్తానికి హైకోర్టు తీర్పు.. విపక్షాలు, భూ నిర్వాసితుల్లో ఆనందాన్ని నింపింది. తమ పోరాటం ఫలించినందుకు సంబారాలు జరుపుకుంటున్నారు. 

07:22 - August 4, 2016

హైదరాబాద్:123 జీవోను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సేకరణపై ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన 123 జీవోను హైకోర్టు రద్దు చేయడం..భూ నిర్వాసితుల విజయంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే..కోర్టులు ఇలాగే స్పందించాల్సి వస్తుందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

ప్రభుత్వానికి చెంపపెట్టు : తమ్మినేని
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు కావడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. జీవో నెంబర్‌ 123పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూ సేకరణ చట్టం 2013 ఉండగా..జీవో నెంబర్‌ 123ను ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిందని తమ్మినేని విమర్శించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. నిర్వాసితులపై పోలీసుల నిర్భంధాన్ని వెంటనే ఆపాలని తమ్మినేని డిమాండ్ చేశారు.

నిర్వాసితుల విజయం : నిర్వాశితుల కమిటీ కన్వీనర్..
జీవో నెంబర్‌ 123పై హైకోర్టు తీర్పు..భూ నిర్వాసితుల విజయం అని మల్లన్నసాగర్‌ పోరాట కమిటీ కన్వీనర్ వెంకట్‌ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది ప్రజల విజయం : జస్టిస్ చంద్రకుమార్..
మల్లన్న సాగర్‌ భూసేకరణపై హైకోర్టు తీర్పును జస్టిస్‌ చంద్రకుమార్‌ స్వాగతించారు. ఇది ప్రజల విజయమని అన్నారు. ఎంతమంది చెప్పినా.. ప్రజలు ఎంతగా నిరసన వ్యక్తం చేసినా భూసేకరణపై ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలి : ప్రొ.కోదండరాం
బలవంతపు భూసేకరణకు సాధనంగా ప్రభుత్వం 123 జీవోను ఉపయోగించుకుందని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించామని ఆయన అన్నారు. 2013 భూసేకరణ చట్టం హక్కులను.. ప్రభుత్వం కాలరాసిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.123 జీవోతో అన్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారని కోదండరామ్‌ అన్నారు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు.

కోర్టు ఆదేశాల తర్వాతైనా భూసేకరణ : మోత్కుపల్లి, రాజనర్శింహ..
కోర్టు ఆదేశాల తర్వాతైనా భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని..కాంగ్రెస్‌ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని పక్కనబెట్టిన ప్రభుత్వం.. రైతులు, నిర్వాసితులకు అన్యాయం చేసిందని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.

ప్రత్నామ్నాయాలకోసం యత్నిస్తున్న టీ. సర్కార్..
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం 123 జీవో ద్వారా భూ సేకరణ ప్రక్రియ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తోంది. 

07:01 - August 4, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వస్తు సేవల పన్ను బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ఏడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించగా సభ సంపూర్ణ మద్దతు తెలిపింది. జీఎస్టీ బిల్లుతో తమ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వాదించిన తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీలు ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్‌ చేశారు.

యూపీఏ హయాంలో 2011లోనే జీఎస్‌టీ బిల్లు ..
మన దేశ పన్నుల విధానంలో విప్మవాత్మక మార్పులకు దారితీసే వస్తు, సేవల పన్ను బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. యూపీఏ హయాంలో 2011లోనే ఈ బిల్లు తీసుకొచ్చారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఈ బిల్లులోని చాలా అంశాలతో విభేదించింది. దీంతో ఆమోదానికి నోచుకోలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ జీఎస్‌టీ బిల్లును ముందుకు తెచ్చింది. అయితే ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన జీఎస్‌టీ బిల్లు... అధికారలోకి వచ్చిన తర్వాత బీజేపీకి ముద్దు కావడంతో.. ఈసారి కాంగ్రెస్‌ ఎదురు తిరిగింది. దీంతో ఈ బిల్లుపై ఏకాభిప్రాయం మృగ్యంకావడంతో రెండేళ్లుగా అమాదానికి నోచుకోలేదు. 2016-17 ఆర్ధిక సంవత్సరం నుంచే జీఎస్‌టీ అమలు చేయాలనున్న ఎన్డీయేకి భంగపాటు ఎదురయ్యింది. జీఎస్‌టీ బిల్లుపై వివిధ పార్టీలతో చర్చోప చర్చలు, భేటీపై భేటీల తర్వాత ఎట్టకేలకు ఇప్పటికి ఆమోదం లభించడంతో ప్రధాని మోదీ సర్కార్‌ ఊపిరి పీల్చుకుంది. బిల్లులో ఎక్కడా కూడా పన్ను శాతం ప్రస్తావన లేదు. ఇది 18 శాతం మించరాదని కాంగ్రెస్‌ వాదించింది. అయితే 17 నుంచి 19 శాతం జీఎస్‌టీ ఉండొచ్చిని ఆర్థిక నిపుణులు సూచించిన విషయాన్ని అరుణ్‌ జైట్లీ ప్రస్తావించారు.

నగదు బిల్లుపై ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ అభ్యతరం..
ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన జీఎస్‌టీ బిల్లుపై చర్చ సందర్భంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిని ఆర్థిక బిల్లు రూపంలో కాకుండా నగదు బిల్లుగా ప్రవేశ పెట్టడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మనీ బిల్లుపై రాజ్యసభ చేసే సిఫారసులకు లోక్‌సభ కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. అదే ద్రవ్య బిల్లైతే రాజ్యసభ చేసే సిఫారసులకు లోక్‌సభ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం తెలివిగా వ్యవహరించిందని కాంగ్రెస్‌ సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మండిపడ్డారు. దీంతో చిదంబరం,జైట్టీ మధ్య స్వల్పవాగ్వాదం జరిగింది.

మూజువాణి ఓటుతో తిరస్కరించిన రాజ్యసభ..
సుదర్ఘ చర్చ తర్వాత కాంగ్రెస్‌ సభ్యుడు సుబ్బరామిరెడ్డి జీఎస్‌టీ బిల్లుకు ప్రవేశపెట్టిన సవరణను రాజ్యసభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. ఆతర్వాత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన సవరణపై ఓటింగ్‌ నిర్వహించారు. అన్ని సవరణలను సభ ఆమోదించింది. చివరిలో బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించగా సభ ఆమోదం తెలిపింది.

జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం అనంతరం సభ వాయిదా..
జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదా వేశారు. ఈ బిల్లు ఆమోదానికి కృషి చేసిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలరే ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జైట్లీకి మిఠాయిలు తినిపించారు. 

జీఎస్టీ ఆమోదం తమ ఘనతేనంటున్న ఆధికార,ప్రతిపక్షాలు..

జీఎస్టీటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడం పట్ల అన్ని పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ పన్నుల సంస్కరణల్లో ఇది చారిత్రాత్మక అధ్యాయమని భావిస్తున్నారు. ఇది తమ ఘనతేనని అధికార, ప్రతిపక్షాలు.
 

సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ ఉదాహరణ : మోదీ
జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్లర్‌లో స్పందించారు. సహకార సమాఖ్య విధానానికి ఇదో ఉదాహరణ అన్నారు. అంతా కలిసి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు.

జీఎస్టీ బిల్లు మార్పులు తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ : రేణుకాచౌదరి
జీఎస్‌టీ బిల్లు ఆమోదం తమ ఘనతేనని అధికార, ప్రతిపక్షాలు ప్రకటించుకుంటున్నాయి. రెండేళ్లుగా తాము తీసుకొచ్చిన ఒత్తిడితోనే ఎన్టీయే సర్కార్‌ ఈ బిల్లు మార్పులు తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి చెబుతున్నారు.

అన్ని పార్టీలు మద్దతు :వెంకయ్యనాయుడు
మరోవైపు జీఎస్‌టీ విషయంలో అన్ని పార్టీలు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. జీఎస్‌టీలోని లాభనష్టాలను బేరీజు వేసుకుని బిల్లుకు మద్దతు ఇచ్చినట్టు టీడీపీ, వైసీపీ ఎంపీలు చెప్పారు.

దేశ పన్నుల సంస్కరణల్లో జీఎస్టీ మైలురాయి..
చారిత్రాత్మక జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానం అమల్లోకి రానుంది. స్వాతంత్ర్యానంతరం మన దేశ పన్నుల సంస్కరణల్లో ఈ బిల్లు ఓ మైలురాయిగా భావిస్తున్నారు. జీఎస్టీ బిల్లు చట్ట రూపం దాల్చిన తర్వాత ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, వేటి రేట్లు తగ్గుతాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పెయింట్లు, సిమెంటు ధరలు తగ్గి, సెల్‌ ఫోన్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకే మార్కెట్‌గా మారనున్న 29 రాష్ట్రాలు..
జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో వన్‌ నేషన్‌... వన్‌ టాక్స్‌ విధానం అమల్లోకి రానుంది. లోక్‌సభ ఈ బిల్లుకు ఇంతకు ముందే ఆమోదం తెలిపింది. అయితే రాజ్యసభలో ఆమోదించిన సవరణలతో ఈ బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లాల్సి ఉంది. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత దేశంలోని 29 రాష్ట్రాలు సింగిల్‌ మార్కెట్‌గా మారతాయి. ఈ బిల్లుకు రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సి ఉంది. పదిహేను రాష్ట్రాలు జీఎస్‌టీ బిల్లును ఆమోదిస్తే చట్ట రూపం దాల్చుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్‌టీ చట్టం అమల్లోకి వస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మనదేశ స్థూల జాతీయోత్పత్తి 2 శాతం పెరిగే అవకాశం ఉందని ఆర్ధికవేత్తలు అంచనావేస్తున్నారు. అమ్మకం పన్ను రద్దుతో ప్రతి రాష్ట్రంలో పన్ను చెల్లించాల్సిన బాధ తప్పుతుంది. జీఎస్‌టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుపై పన్ను ఉండదు.

జీఎస్‌టీతో ద్రవ్యోల్బణం దిగొస్తుందని అంచనా..
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం దిగొస్తుందని అంచనా వేస్తున్నారు. పన్ను ఎగవేతలు తగ్గుతాయని భావిస్తున్నారు. రవాణా వ్యయాలు తగ్గుతాయి. పేపర్‌ పని తగ్గి, వర్తక, వ్యాణిజ్యాలు సమర్ధవంతంగా జరుగుతాయని భావిస్తున్నారు. వ్యాపార అనుకూల విధానాలకు జీఎస్‌టీ దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.ఉత్పత్తి రంగానికి ఊతం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే జీఎస్‌టీలో సేవల రంగం భారంగా మారే చాన్స్‌ ఉంది. ఆటోమొబైల్‌ రంగంలో అన్ని రకాల కార్ల ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. మోటార్‌ సైకిళ్లు కూడా చౌక అవుతాయి. కార్ల బ్యాటరీలు రేట్లు కూడా తగ్గే చాన్స్‌ ఉంది. గృహ నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైన సిమెంట్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే పెయింట్ల రేట్టు కూడా చౌక అవుతాయని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఫ్యాన్లు, వాటర్‌ హీటర్లు, ఎయిర్‌ కూలర్ల రేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. అలాగే విద్యుత్‌ రంగంలో బల్పులు, వైర్లు చౌక ధరలకు లభించే చాన్స్‌ ఉంది. అంతిమంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

సర్వీస్‌ టాక్స్‌తో సెల్‌ ఫోన్ల రేట్లు పెరిగే అవకాశం..
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధూమపాన ప్రియుల జేబులు చిల్లులు పడే అవకాశం ఉంది. అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న పన్నుల రేట్లు పెరుగుతాయి. దీంతో పాన్‌ మసాలాలు ప్రియమవుతాయి. సేవల పన్ను భారంతో సెల్‌ ఫోన్ల ధరలు పెరుతుగాయని అంచనా వేస్తున్నారు. అలాగే దుస్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. బ్రాండెడ్‌ ఆభరణాల రేట్లు కూడా పెరిగే చాన్స్‌ ఉంది. మొత్తంమీద జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో మన పన్నుల విధానంలో సమూల సంస్కరణలకు నాంది పలికినట్టు అవుతుంది. 

Don't Miss