Activities calendar

05 August 2016

22:13 - August 5, 2016

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునే ముహూర్తం ఖరారయ్యింది. ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్‌ ఎవైటింగ్‌ మూవీగా నిలిచిన బాహుబలి రెండో భాగాన్ని 2017 ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌ వెల్లడించారు. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ అద్భుత దృశ్యకావ్యానికి సంబంధించి ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 

 

22:12 - August 5, 2016

గాంధీనగర్ : గుజరాత్‌ నూతన సీఎంగా విజయ్‌ రూపానీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ రాజీనామా నేపథ్యంలో బీజేపీ గుజరాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌ రూపానీని సీఎంగా ఎంపిక చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.  అలాగే ఉపముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ పేరును ఖరారు చేశారు. త్వరలోనే వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

 

22:10 - August 5, 2016

దేస్ పూర్ : అస్సాంలోని కోక్రాజార్‌ లో ఉ్రగవాదులు రెచ్చిపోయారు. పట్టణంలోని ఓ మార్కెట్‌ ప్రదేశంలో ఉగ్రవాదులు ఏకే 47 తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కకే మరణించగా 15 మంది తీవ్రగాయాలపాలయ్యారు. అనంతరం భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఎదురు కాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది మరణించాడు. ఇదిలా ఉంటే బోడో ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడిన్లు తెలుస్తోంది. ఘటనపై ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్‌ను అడిగి తెలుసుకున్నారు. 

21:24 - August 5, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి 123 జీవో రద్దు అప్పీల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. నిర్వాసిత గ్రామాల్లో కూలీల ఉపాధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని ఆదేశించింది. అటు సర్కారు పిటిషన్‌పై భూనిర్వాసితుల పోరాట కమిటీ మండిపడింది. ఈ నెల 7, 8 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చింది..  
హైకోర్టులో కొనసాగిన వాదనలు 
తెలంగాణలో భూసేకరణకు సంబంధించిన 123 జీవో రద్దు అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగాయి.. జీవో రద్దుపై స్టే విధించాలంటూ తెలంగాణసర్కార్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది... ప్రభుత్వ పిటిషన్‌పై దాదాపు గంటసేపు వాదనలు విన్న డివిజన్‌బెంచ్‌ ... రైతు కూలీలకు ఎలాంటి పాలసీ తయారు చేస్తున్నారని ప్రశ్నించింది.. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. భూసేకరణచట్ట పరిధిలోకి 123జీవో రాదని... రాజకీయ ప్రోద్బలంతోనే కొందరు  పిటిషన్‌ వేశారని అడ్వకేట్‌ జనరల్‌  వాదించారు.... దీనిపై బాధితుల తరపు లాయర్‌ విభేదించారు.. రైతుల నుంచి భూములను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. వ్యవసాయ కూలీలు, ఇతర చేతివృత్తుల వారిని విస్మరించిందని వాదించారు... ఈ వాదనలు విన్న కోర్టు... ఉపాధికోల్పోతున్న వ్యవసాయ కూలీల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టారో స్పష్టం చేయాలని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 
ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌పై మండిపడ్డ భూనిర్వాసితుల పోరాట సమితి 
అటు 123 జీవో రద్దుపై రివ్యూ పిటిషన్‌ ద్వారా ప్రభుత్వ దురుద్దేశం బయటపడిందని భూనిర్వాసితుల పోరాట సమితి మండిపడింది.... ఎవరిని సంతృప్తి పరచడానికి... స్టే ఇవ్వమంటూ కోర్టును కోరారని ప్రశ్నించింది.. ప్రభుత్వ దుర్మార్గాలను ఖండిస్తూ ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. 
మహిళలతో ముఖాముఖి 
మరోవైపు హైదరాబాద్‌ ఎస్‌వీకేలో 123 జీవో రద్దుకోరుతూ పిటిషన్‌ వేసిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది.. వీరిని జస్టిస్‌ చంద్రకుమార్‌ అభినందించారు.. 2013 భూసేకరణచట్టంప్రకారం భూములు సేకరిస్తే అందరం సహకరిస్తామని చెప్పారు.. మల్లన్న సాగర్‌ గ్రామాల్లో ఎమర్జెన్సీ విధించినట్లుగా పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. మొత్తానికి సర్కారు రివ్యూ పిటిషన్‌పై కోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.. కోర్టు తీర్పు ఏమిటో సోమవారం తేలే అవకాశముంది.

21:00 - August 5, 2016

మైనింగ్ ఆఫీస్ ల చీకటి కార్మికులు.. టెన్ టివి కెమెరాలను చూడంగనే పరుగులు, ఆంధ్రా సర్కారు అంతుచూస్తా అంటున్న బైరెడ్డి... లోతు శానున్నది కష్టమన్న క్యాడర్, మొన్న దండాలు ఇయ్యాల ఏడ్పులు.. హయత్ నగర్ కార్పొరేటర్ విచిత్రాలు, నేతన్నల చినిగిపోయిన బతుకు.. ఎవల్జేయాలే దీనికి అతుకు, తల్లిని స్మశానంల ఇడిపిపెట్టిన కొడుకు... కొడుకు ప్రేమ కోరుకుంటున్న తల్లి, రుణమాఫీ జేసి రుణం తీర్చుకోర్రీ.. లాగోడీ ఖర్చుల కోసం రైతన్న రందీ...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

 

20:53 - August 5, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా బిల్లును బీజేపీ కోల్డ్‌ స్టోరేజీలో పడేసింది. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును మనీ బిల్లు అంటూ  ఆర్థికమంత్రి జైట్లీ అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ  నేపథ్యంలో బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ ఏపీని మోసం చేసిందంటూ ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.
మరోసారి సభ ముందుకు కెవిపి ప్రైవేట్ బిల్లు  
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మరోసారి బీజేపీ హ్యాండిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ తప్పించుకుంది. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు మరోసారి సభ ముందుకు వచ్చింది. చర్చలో  విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి సభా గౌరవాన్ని కాపాడాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కోరారు. ప్రైవేటు బిల్లు సభ్యుడి హక్కు అని...బిల్లుపై చర్చ పూర్తైనప్పటికీ కోరం లేకపోవడంతో ఓటింగ్ వాయిదా పడిందని కేవీపీ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదని కేవీపీ అన్నారు.
ఈ బిల్లుపై రాజ్యాసభలో ఓటింగ్ చేపట్టలేం : అరుణ్ జైట్లీ
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ బిల్లుపై రాజ్యాంగ ప్రకారం రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమని అన్నారు. మనీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లోక్‌సభలోనే ఉందని, మనీ బిల్లు అవునా కాదా అని తేల్చే అధికారం స్పీకర్‌కే ఉందని జైట్లీ పేర్కొన్నారు.
జైట్లీ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం 
జైట్లీ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నాటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లోదో చెప్పాలని.. సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అవాస్తవమని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్‌ పేర్కొన్నారు. తాను ఇది నిరూపిస్తానని, అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు బిల్లును జైట్లీ మనీ బిల్లు అనడాన్ని ఎంపీ కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ప్రతి బిల్లు ఏదో ఒక రకంగా డబ్బుతో ముడిపడి ఉంటుందని, ఆ విధంగా చూస్తే ఏ బిల్లును రాజ్యసభలో పెట్టలేమన్నారు. ఆర్థికలోటు పూడ్చాలని తీసుకున్న బిల్లు మనీ బిల్లు కాదని స్పష్టం చేశారు.
ఈ అంశం లోక్‌సభ స్పీకరే తేలుస్తారన్న కురియన్  
కేవీపీ ప్రైవేటు బిల్లు.. మనీ బిల్లు అని అభ్యంతరాలు రావడంతో ఇక ముందుకు వెళ్లలేమని డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ ప్రకటించారు. ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, అయితే మనీ బిల్లు అవునా కాదా నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదన్నారు. ఈ అంశం లోక్‌సభ స్పీకరే తేలుస్తారని చెప్పారు.
కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన 
దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
బీజేపీ సభ్యులతో జతకట్టిన సుజనా చౌదరి..?
ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్‌కు వెళ్లకుండా యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో విపక్ష సభ్యులంతా నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కానీ బీజేపీ సభ్యులు మాత్రం బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారితో పాటు తాళం కలుపుతూ టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం కంటపడ్డారు. ఏపీకి శరాఘాతం లాంటి ఈ నిర్ణయంపై సుజనా బల్ల చరచడం వివాదంగా మారింది. 

20:50 - August 5, 2016

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మనమంతా'... ఓ సున్నితమైన ఎమోషనల్ చిత్రంగా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇవాళ రీలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను వీడియోలో చూద్దాం....
 

20:45 - August 5, 2016

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. గీతార్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి పరషురాం దర్శకత్వం వహించాడు. ఈ రొమాంటిక్ చిత్రం ఈరోజు విడులయింది. మరి ఈ చిత్రం రివ్యూను వీడియోలో చూద్దాం..

20:31 - August 5, 2016

బందర్ పోర్టు నిర్మిస్తామని..అయితే రైతులకు అన్యాయం జరుగకుండా చూస్తామని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈమేరకు టెన్ టివి రవీంద్రతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...'మచిలీపట్నం పోర్టు చరిత్ర కలిగిన పోర్టు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పోర్టును నిర్లక్ష్యం చేశారు. బందరు పోర్టు ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పని చేసాను.. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు నన్ను గుర్తించి.. నాకు మంత్రి పదవి ఇచ్చారు. భూసేకరణపై విపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయి. రైతులకు అన్యాయం జరగదు. లాభం కలుగుతుంది' అని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యం

హైదరాబాద్ : నేరేడ్ మెట్ ఆర్ కే పురం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులు మౌనిక (19), సౌమ్య (21) గుర్తించారు. మృతదేహాల వద్ద సూసైడ్ నోట్ లభ్యం అయింది. ప్రేమ విఫలమైనందుకు సౌమ్య, కుటుంబకలహాలతో మౌనిక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో ఉంది. 

జీఎస్ టీ బిల్లు వల్ల ఎపికి రూ.4700 కోట్ల నష్టం : యమనల

విశాఖ : జీఎస్ టీ బిల్లు వల్ల ఎపికి రూ.4700 కోట్ల నష్టం వస్తుందని... ఆ నష్టాన్ని కేంద్రమే భరించాలని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్లుకు ఒకేసారి ఎన్నికలు ఉంటాయని తెలిపారు. 

19:56 - August 5, 2016

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా సాధిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించామని చెప్పారు. గతేడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం నుంచి కరువును తరిమికొడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువగా లేవన్నారు. వ్యవసాయరంగంలో ఆదాయం తక్కువగా వస్తోందని తెలిపారు. 
సర్వీస్ సెక్టార్ వస్తేనే ఆదాయం పెరుగుతుందన్నారు. 

ఆ నదులను అనుసంధానం చేస్తాం : చంద్రబాబు

విజయవాడ : గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం నుంచి కరువును తరిమికొడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువగా లేవన్నారు.వ్యవసాయరంగంలో ఆదాయం తక్కువగా వస్తోందని తెలిపారు. సర్వీస్ సెక్టార్ వస్తేనే ఆదాయం పెరుగుతుందన్నారు. 

19:47 - August 5, 2016

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేకహోదాను ఇస్తామని, ఇవ్వమని చెప్పే ధైర్యం లేక టీడీపీ, బీజేపీలు నపుంసక పాత్ర పోషించాయని ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకహోదా అమలు చేస్తారా.. లేదా స్పష్టం చేయాలన్నారు. ఆట ఇంకా పూర్తి కాలేదు.. బంతి మీకోర్టులోనే ఉంది అన్నారు. 

ఎపికి ప్రత్యేకహోదా సాధిస్తాం : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఎపికి ప్రత్యేకహోదా సాధిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించామని చెప్పారు. 

19:39 - August 5, 2016

హైదరాబాద్ : 2013 చట్టం ప్రకారం భూములు సేకరించాలని భూనిర్వాసితుల పోరాట సమితి అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్‌ సూచించారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 123 జీవోకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌వేసిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రకుమార్‌ పాల్గొన్నారు. మార్కెట్‌ ధరకు 4రెట్లు ఎక్కువగా పరిహారం ఇవ్వాలన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం ఎంత భూమి సేకరించింది? అందులో ఎన్ని పరిశ్రమలు పెట్టారు? ప్రైవేటు కంపెనీల చేతిలో ఉన్న భూముల వివరాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. 2013 చట్టం ప్రకారం భూమి సేకరిస్తే ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు. 

ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు : రఘువీరారెడ్డి

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేకహోదాను ఇస్తామని, ఇవ్వమని చెప్పే ధైర్యం లేక టీడీపీ, బీజేపీలు నపుంసక పాత్ర పోషించాయని ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకహోదా అమలు చేస్తారా.. లేదా స్పష్టం చేయాలన్నారు.

 

జైట్లీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్న కేవీపీ

ఢిల్లీ : సోమవారం అరుణ్ జైట్లీపై కేవీపీ రామచంద్రరావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు.
 

19:18 - August 5, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మరోసారి బీజేపీ హ్యాండిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ తప్పించుకుంది. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ అభ్యంతరాలు లేవనెత్తారు.. మనీబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌ చేపట్టలేమని లోక్‌సభలో తేల్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు తెలిపారు. దీంతో బిల్లుపై ఇప్పుడు ఓటింగ్ పెట్టాలని కోరుతున్న సభ్యులను వారిస్తూ, బిల్లుపై చర్చ ముగిసిందని, ఆర్థిక మంత్రి లేవనెత్తిన అభ్యంతరాలను తీర్చిన తరువాతే ముందుకు వెళ్లగలుగుతానని కురియన్ వ్యాఖ్యానించారు. ఒక బిల్లు మనీ బిల్లా? కాదా? అన్న విషయాన్ని తేల్చే హక్కు తనకు లేదని.. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ దే తుది నిర్ణయమని రాజ్యాంగ నిబంధనలను ఉటంకించారు. సభ్యులకు అనుమానాలు ఉన్నాయని, తనకూ అనుమానం ఉందని స్పష్టం చేసిన ఆయన బిల్లును లోక్ సభకు పంపుతున్నట్టు తెలిపారు. తుది నిర్ణయాధికారం లోక్‌సభ స్పీకర్ దేనని స్పష్టం చేశారు.
ప్రధాని హోదాలో సభలో ఆరు హామీలు : మన్మోహన్‌
ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సభలో ప్రస్తావించారు. తాను ప్రధాని హోదాలో రాజ్యసభలో చేసిన ఆరు హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తాను చేసిన హామీలను నాటి కేబినేట్‌ సైతం ఆమోదించిందని మన్మోహన్‌ తెలిపారు. అలాగే నాటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ సైతం సభలోనే ఉన్నారని గుర్తు చేశారు. 
బిల్లుపై వెంటనే చర్చ ప్రారంభించాలి : కేవీపీ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై బీజేపీ అనవసరంగా వివాదం సృష్టిస్తోందని ఎంపీ కేవీపీ పేర్కొన్నారు. బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ చైర్మన్‌ను కోరారు. ప్రైవేటు మెంబర్ బిల్లు సభ్యుడి హక్కు అని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రైవేటు బిల్లు ఆర్థిక బిల్లు కాదని ప్రస్తావించారు. 
బిల్లును లోక్ సభకు నివేదించిన కురియన్ 
ఏపీ ప్రత్యేక హోదా బిల్లులో ఆర్థిక అంశాలు ఉన్నందున దీన్ని లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో గందరగోళం మొదలైంది. ప్రైవేటు బిల్లులో అంశాలను పరిశీలించిన మీదట బిల్లు ఏ దశలోనైనా తిరస్కరించే అధికారం చైర్మన్‌ కు ఉందని ఈ సందర్భంగా కురియన్‌ తెలిపారు.  దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కసారిగా పోడియంను చుట్టుముట్టారు. మనీబిల్లు అంశం లోక్‌ సభ స్పీకర్‌ పరిధిలోదేనని కురియన్‌ తేల్చారు. 
హామీలను అమలు చేస్తారా...లేదా..? ఏచూరి  
ఏపీ విభజన సందర్భంగా చేసిన హామీలను అమలు చేస్తారా లేదా అనేది అసలు ప్రశ్న అని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా బిల్లు మనీ బిల్లా కాదా అనే చర్చ కన్నా చేసిన హామీలను అమలు చేస్తారా లేదా అనేదే ప్రధానమని అన్నారు. 

 

18:47 - August 5, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించామని టిడిపి ఎంపీలు తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ ఎంపీలందరూ ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదా ఆవక్యకతను వివరించామన్నారు. దానిపై మోడీ స్పందిస్తూ...రాష్ట్రానికి తప్పకుండా న్యాయం చేస్తామని తమకు హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందన్న నమ్మకం తమకుందని ఎంపీలు తెలిపారు. 

 

18:46 - August 5, 2016

 హైదరాబాద్ : హరితహారం పేరుతో భూములు లాక్కుంటున్నారని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి  మండిపడ్డారు. పోడు సాగుదారుల సమస్యలు పరిష్కరించాలంటూ ఇందిరాపార్క్‌ దగ్గర సీపీఐ చేపట్టిన ధర్నాలో చాడ పాల్గొని, మాట్లాడారు. అమాయకులైన గిరిజనులపై పీడీ యాక్టులుపెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

18:22 - August 5, 2016

హైదరాబాద్ : మిషన్‌ భగీరథకు దేశవ్యాప్తంగా ప్రశంసలొచ్చాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి మంచి కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల పిచ్చి పనులకు ప్రధాని మోడీ నొచ్చుకోవద్దని కోరారు. అద్భుతమైన పథకాన్ని అభినందించాల్సిందిపోయి ఓర్వలేక హస్తం నేతలు పిచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

18:16 - August 5, 2016

కృష్ణా : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో సీపీఎం, సీపీఐ నేతలు రిలే దీక్షలు చేపట్టారు.. హోదా ఇచ్చి ఏపీని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలోతీరుగా చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నాయని నేతలు మండిపడ్డారు..

18:06 - August 5, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ముందు ఉన్న గాంధీవిగ్రహం దగ్గర ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ఏపీలో 6కోట్ల ఆంధ్రులంతా ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని...ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

17:58 - August 5, 2016

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభం అయింది. ఎపికి ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టిన నేపపథ్యంలో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సభలో ప్రస్తావించారు. తాను ప్రధాని హోదాలో రాజ్యసభలో చేసిన ఆరు హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తాను చేసిన హామీలను నాటి కేబినేట్‌ సైతం ఆమోదించిందని మన్మోహన్‌ తెలిపారు. అలాగే నాటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ సైతం సభలోనే ఉన్నారని గుర్తు చేశారు. 
హోదాపై బీజేపీ అనవసర రాద్ధాంతం : కేవీపీ 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై బీజేపీ అనవసరంగా వివాదం సృష్టిస్తోందని ఎంపీ కేవీపీ పేర్కొన్నారు. బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ చైర్మన్‌ను కోరారు. ప్రైవేటు మెంబర్ బిల్లు సభ్యుడి హక్కు అని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రైవేటు బిల్లు ఆర్థిక బిల్లు కాదని ప్రస్తావించారు.
బిల్లును లోక్ సభకు నివేదిస్తున్నాం : కురియన్ 
ఏపీ ప్రత్యేక హోదా బిల్లులో ఆర్థిక అంశాలు ఉన్నందున దీన్ని లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో గందరగోళం మొదలైంది. ప్రైవేటు బిల్లులో అంశాలను పరిశీలించిన మీదట బిల్లు ఏ దశలోనైనా తిరస్కరించే అధికారం చైర్మన్‌ కు ఉందని ఈ సందర్భంగా కురియన్‌ తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కసారిగా పోడియంను చుట్టుముట్టారు. మనీ బిల్లు అంశం లోక్‌ సభ స్పీకర్‌ పరిధిలోదేనని కురియన్‌ తేల్చారు. రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

17:45 - August 5, 2016

ఢిల్లీ : 'ఎపికి ప్రత్యేకహోదా బిల్లు'పై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సంరద్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ మాట్లాడుతూ ప్రైవేట్ బిల్లు సభ్యుడి హక్కు అని అన్నారు. ప్రైవేట్ బిల్లు ఆర్థిక బిల్లు కాదని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అంశాన్ని బీజేపీ వివాదం చేస్తోందని వమర్శించారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి చట్టం అవసరం లేదన్నారు. తన బిల్లుకు మద్దతు ఇచ్చిన 11 పార్టీలకు కేవీపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ రాజ్యసభలో మనీ బిల్లుపై చర్చ జరగదన్నారు. ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ ఉండదని చెప్పారు. కేవీపీ ప్రస్తావించిన బిల్లులో ఆర్థిక అంశాలు ఉన్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలతో కూడిన బిల్లులను లోక్ సభలోనే చర్చిస్తామని తెలిపారు. మనీ బిల్లుపై చర్చ, ఓటింగ్ లోక్ సభలోనే జరుగుతాయని వివరించారు. ఇది మనీ బిల్లా.. కాదా అనేది లోక్ సభలో స్పీకర్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఏపీకి పూర్తి న్యాయం చేస్తామని జైట్లీ అన్నారు. ఎపికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఏపికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రధాని ఈరోజు కూడా ఎపి సీఎం, ఎంపీలతో మాట్లాడారని పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంపై చిత్తశుద్ధి ఉందా.. లేదా తెలపాలని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరీ అన్నారు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా ప్రతి బిల్లులోను ఆర్థిక అంశాలు ఉండడం సహజమని కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబాల్ అన్నారు. ప్రత్యేకహోదా కల్పించడం అనేది మనీ బిల్లు కిందకు రాదని సిబాల్ స్పష్టం చేశారు. చర్చ ముగిసిన తర్వాత మనీ బిల్లు అనడం తగదని గోపాల్ యాదవ్ అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా బిల్లుపై చర్చ ఇప్పటికే ముగిసిందని డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. ప్రస్తుతం బిల్లు మనీ బిల్లా... కాదా అనేది తేలాల్సి ఉందన్నారు. 

 

హోటల్ వెయిటర్ గా ఒబామా కుమార్తె..

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా చిన్న కూతురు వేసవి సెలవుల సందర్భంగా పార్ట్ టైం జాబ్ లో చేరింది. పదిహనేళ్ళ వయసులో సగభాగం వైట్ హౌస్ లోనే లగ్జరీగా గడిపిన సాషా ఒబామా..ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా జాయిన్ అయింది. అదే ఇండియాలో అయితే కార్పొరేటర్ గా పనిచేసిన వారి కుమార్తెలు కూడా కారుల్లో తప్ప నేలపై నడివటానికి కూడా ఇష్టపడరు. చెప్పుకోవటానికి కాస్త చిన్నతనంగా వున్నా ఇది చాలావరకూ వాస్తవమే.

రాద్ధాంతం కాదు అమలు చేస్తారా?లేదా?: ఏచూరి

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు విషయంలో సీపీఎం సభ్యులు సీతారాం ఏచూరి మాట్లాడారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా లేదా..అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై రాద్ధాంతం చేయడటం అనవసమని ఆయన పేర్కొన్నారు. 

రేప్‌ కేసు నిందితుడిపై దాడి..హత్య

ఛత్తీస్ ఘడ్ : అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన నిందితుడిపై తోటి ఖైదీలు దాడి చేసి చంపేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో జరిగింది. తోటి ఖైదీలు అతడిపై దాడిచేసి తీవ్రంగా కొట్టి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

బిల్లుపై ఓటింగ్ వుంటుందని భావించాం : సీఎం రమేష్

ఢిల్లీ : కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఈరోజు ఓటింగ్ ఉంటుంద‌ని తాము భావించినట్లు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం ర‌మేశ్ అన్నారు.రాజ్య‌స‌భ‌లో బిల్లుపై ద్రవ్య బిల్లా.. ఆర్థిక బిల్లా అనే విష‌యాన్ని మాత్ర‌మే చ‌ర్చించార‌ని చెప్పారు. ప్రైవేటు బిల్లుని ద్ర‌వ్య బిల్లు అని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు పంపారని తెలిపారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికోసం తాము చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

చీపురు పట్టిన బోండా..

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమ వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రాన్ని ఒప్పించాలని భాజపా నాయకులను కోరారు. శుక్రవారం ఉదయం సూర్యారావుపేటలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద రోడ్లను వూడ్చి భాజపా నాయకుల కార్లతో పాటు ఇతరుల వాహనాలను తుడిచి గులాబీలు పంచారు.

ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదు : ఆజాద్

ఢిల్లీ : కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఇంతకముందే చర్చించామని...కేవలం అమలు చేయడమే మిగిలిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ సమయంలో ద్రవ్య బిల్లు అంటూ ఆపడం సరికాదన్నారు. విభజన సమయంలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

సెండ్ టూ లోక్ సభకు ప్రయివేట్ బిల్..

ఢిల్లీ : కేవీపీ ప్రైవేటు బిల్లుపై అభ్యంతరాలు రావడంతో ఈ బిల్లుపై ముందుకు వెళ్లలేమని...ఈ బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, ఇప్పుడు మళ్లీ చర్చించలేమని చెప్పారు. బిల్లు ఏ దశలో ఉన్నా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. మనీ బిల్లు అవునా కాదా నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదనీ.. ప్రైవేటు బిల్లు మనీ బిల్లా? కాదా? అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు.

ఉగ్రదాడిని ఖండించిన సీఎం సర్బానంద..

అసోం : కోక్రాఝార్ వారాంతపు సంతలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మృతులకు వారు సంతాపం ప్రకటించారని చెప్పారు. 

15:46 - August 5, 2016

కరీంనగర్‌ : జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గాన్ని వైరల్‌ ఫీవర్స్‌ పట్టిపీడిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో రోగులు సతమతమవుతున్నారు. దీంతో ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసాయమందక జనం అల్లాడిపోతున్నారు.     
ప్రబలుతున్న అతిసార వ్యాధులు 
అసలే వర్షాకాలం.. ఆపై అపరిశుభ్ర వాతావరణం..దోమల విజృంభన..వెరసి కరీంనగర్‌ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మరోవైపు తాగునీటి కాలుష్యంతో అతిసార వ్యాధులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌తో పాటు పలు గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ఏ గడప చూసినా జ్వరపీడుతులే దర్శనమిస్తున్నారు. జ్వరాలు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ కనిపిస్తున్నారు. 
గిరిజన తండాల్లో మలేరియా, టైఫాయిడ్‌ బాధితులు
ఇక గిరిజన తండాలను మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో సమయానికి వైద్య సేవలు అందక రోగులు అల్లాడిపోతున్నారు. మరికొంత మంది నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్క సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ 150 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుండగా.. 100 మంది వరకు ఇన్‌పేషెంట్లు చికిత్సపొందుతున్నారు. అటు ప్రైవేట్‌ ఆస్పత్రులు జ్వర బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. 
గ్రామీణ ప్రాంతాల్లో పడకేసిన పారిశుధ్యం
వాతావరణ మార్పులకు తోడు గ్రామాల్లో క్లోరినైజేషన్‌ లేకపోవడం..పారిశుధ్య పనులు పడకేయడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఖరీదైన ప్రైవేట్‌ వైద్యం చేయించుకోని సామాన్య జనం ప్రభుత్వ ఆస్పత్రులపైనే ఆధారపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రతతో పాటు నీటి నిలువలు లేకుండా చేయడంతో దోమలు పెరగకుండా చూడొచ్చని వైద్యులంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కాచి వడపోసిన నీటిని సేవించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి విష జ్వరాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సిరిసిల్లవాసులు కోరుతున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటున్నారు.  

 

గోదావరిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం ..

ఆదిలాబాద్ : బాసర వద్ద గోదావరిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడు నిజామాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు. గజ ఈతగాళ్లు యువకుడిని పోలీసులకు అప్పగించారు.

15:43 - August 5, 2016

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై ఉన్నత విద్యావంతుల స్థాయిలో జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది. మాల, మాదిగలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సభను నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌పై సైతం దాడి జరిగింది. తలకు గాయం తగలడంతో ఆయన సభలో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రొఫెసర్‌ కోదండరాం, గద్దర్‌ తదితరులు సమావేశంలో ఉండగానే రభస చోటుచేసుకుంది. 

 

ద్రవ్యబిల్లుకు రాజ్యసభలో ఓటింగ్‌ వుండదు : జైట్లీ

ఢిల్లీ : కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేసినట్లు జైట్లీ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లుకు రాజ్యసభలో ఓటింగ్‌ నిర్వహించే సంప్రదాయం లేదని.. అందువల్ల ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతామని జైట్లీ స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 100 ద్రవ్య బిల్లు గురించి స్పష్టంగా చెబుతోందన్నారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేయలేమని జైట్లీ తెలిపారు.

15:38 - August 5, 2016

నిజామాబాద్ : అంతన్నారు..ఇంతన్నారు...వర్షం రావడమే ఆలస్యం రైతుల కష్టాలు తీరినట్టే అన్నారు. తీరా వచ్చాక పంటలకు నిర్లక్ష్యం నీళ్లు పోస్తున్నారు.  ఇటు ప్రభుత్వం...అటు బ్యాంకులు పంటరుణాలపై వహిస్తున్న నిర్లక్ష్యం రైతులను మళ్లీ కష్టాల్లోకి నెడుతోంది.
రైతుల జీవితాలతో బ్యాంకులు చెలగాటం 
రెండేళ్ల తర్వాత జోరువానలతో అన్నదాతల్లో చిగురించిన ఉత్సాహం... సర్కారు తీరుతో నీరుగారి పోతోంది. రుణమాఫీ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం... రుణాల రెన్యూవల్‌ చేయకుండా బ్యాంకులు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. 
అస్తవ్యస్తంగా పంటరుణమాఫీ 
తెలంగాణ రాష్ట్రంలో  పంటరుణాలమాఫీ పథకం అస్తవ్యస్తంగా తయారైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షరూపాయల వరకే మాఫీచేస్తామన్న సర్కారు.. అదికూడా విడతలవారీగా ఏడాదికి 25శాతం  రుణమాఫీతో  4గేళ్లలో మొత్తం రుణాలను మాఫీచేస్తామని ప్రకటించింది.  మొదట రెండు సంవత్సరాల రుణమాఫీ పైకం బ్యాంకుల్లో జమఅయినా.. ఈసారి మాత్రం.. గతనెలలోనే జమకావాల్సిన డబ్బులు ఇంతవరకు  రైతుల ఖాతాల్లోకి రానేలేదు. దీంతో బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని అన్నదాతలు ఆవేదనచెందుతున్నారు. 
విడతలవారీగా రుణమాఫీ..బ్యాంకుల అసహనం
నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 3లక్షల 79వేల 520 మంది రైతులు  రుణమాఫీకి అర్హత పొందారు. కాని.. విడదలవారీగా రుణమాఫీ అమలు చేస్తుండటంతో బ్యాంకులు రైతులపై అసహనం ప్రదర్శిస్తున్నాయి. జిల్లాలో  ఈసారి ఖరీఫ్‌ లక్ష్యం 1950కోట్ల రూపాయలు కాగా... అందులో ఇంతవరకు సగంకూడా అందించలేదు బ్యాంకర్లు.   కేవలం 712కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జూన్‌ 25న నిర్వహించిన సమావేశంలో 3లక్షల 75వేల మంది రైతులకు పంటరుణాలు రెన్యూవల్‌ చేయాలని కలెక్టర్‌ బ్యాంకర్లను సూచించారు. కాని.. బ్యాంకులు మాత్రం 1లక్షా 85వేల మంది రైతులకు మాత్రమే రుణాలు రెన్యూవల్‌ చేశారు. 
అక్కరకు రాని పంటలబీమా పథకం
మరోవైపు ..సకాలంలో క్రాప్‌లోన్స్‌ రెన్యూవల్‌ కాకపోవడంతో..ఈసారి రైతులకు పంటలబీమా పథకంకూడా అక్కరకు రాకుండా పోయింది. ప్రతిఏడాది  పంటలబీమా గడువు  జూలై31కి ముగుస్తుంది. ఈసారి రుణమాఫీ నిధులు రావడంలో ఆలస్యంకారణంగా... పంటలబీమా గడువును ఆగష్టు2 వరకు పెంచింది ప్రభుత్వం. అయినా... బ్యాంకులు రెన్యూవల్‌కు సహకరంచకపోవడంతో అన్నదాతలకు పంటలబీమా వర్తించకుండాపోతోంది. మరోవైపు  కేంద్రం ప్రభుత్వం ఈసారిపంటల బీమా పథకంలో మార్పులు చేసి.. ఫసల్‌బీమాయోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా పంటనష్టంతోపాటు రైతుకు వ్యక్తిగత బీమానూ అమలు చేయాలి కాని... ఇంతవరకు బ్యాంకులు సహకరించకపోవడంతో... తాము రెండురకాలుగా నష్టపోతున్నామని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంటరుణాలు సకాలంలో అందించడానికి సర్కార్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

 

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..

 

ముంబై : ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షంతో దక్షిణ ముంబయి, తూర్పు, పశ్చిమ ముంబయిలో వర్షం కారణంగా ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై ప్రభావం పడింది. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు సియాన్ రైల్వేస్టేషను నీటి మునిగింది.

25 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం..

ఖమ్మం : బూర్గంపాడు మండలంలో ఎక్సైజ్ దాడులు నిర్వహించిన అధికారులు 25 క్వింటాళ్ల నల్లబెల్లం, 5 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుక్నురు. ఆటోలో తరలిస్తున్న నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలోని ప్లాస్టిక్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసి పడుతున్న మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు.

15:27 - August 5, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. కొన్నాళ్లుగా వర్షాలు లేక వెలవెలబోయిన నదులు ఎగువన కురిసిన భారీ వర్షాలతో మళ్లీ పొంగిపోర్లుతున్నాయి. కృష్ణా పుష్కరాల వేళ కృష్ణమ్మ పోటెత్తుతుండటంతో భక్త జనం పరవశించిపోతున్నారు.  వరద తాకిడితో జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి.   
మళ్లీ జలకళ 
మొన్నటి వరకు ఎడారులను తలపించిన కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలకు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఆల్మట్టి జలాశయం నిండింది. ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి 25 గేట్లను ఎత్తి... దిగువకు రెండు లక్షల 54 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద తాకింది. ఎత్తిపోతల పథకాలకు నీటిని వదులుతున్నారు. 13 గేట్ల నుంచి 1.34 లక్షల క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు.
శ్రీశైలంలోకి 40వేలకు పైగా క్యూసెక్కుల నీరు 
ఇప్పటివరకు శ్రీశైలంలోకి 40వేలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 24 గంటల్లో 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ క్రస్ట్‌గేట్లను తాకింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 89.3 మోగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడం లేదు. ఆల్‌ మట్టి నుంచి 2.64 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఒకరోజంతా కొనసాగితే శ్రీశైలానికి దాదాపు 23 టీఎంసీలు వస్తుంది. అదే ప్రవాహం వారంపాటు కొనసాగితే రిజర్వాయర్ నిండుతుంది. 
గోదావరి నీటి మట్టం 9 అడుగులు
మరోవైపు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరివాహక ప్రాంతంలో వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కాటన్‌ బ్యారేజ్‌ నుంచి నీటిని విడుదల చేస్తూ ధవళేశ్వరం వద్ద గోదావరి బేసిన్‌ను ఖాళీ చేస్తున్నారు. కాటన్‌ బ్యారేజ్‌ మొత్తం గేట్లను ఒక మీటర్‌ మేర పైకి ఎత్తి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరి నీటి మట్టం 9 అడుగులుగా నమోదైంది. ఎగువన భద్రాచలం వద్ద 48 గంటల్లో 12 అడుగుల మేర పెరిగిన నీటి మట్టం 33 అడుగుల వరకు చేరుకుని నిలకడగా కొనసాగుతోంది. వ్యవసాయ అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు, మధ్య డెల్టాకు, పశ్చిమ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులకు వరద తాకిడి పెరుగుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

15:22 - August 5, 2016

విజయవాడ : వామపక్ష నేతల నిరసన దీక్షలతో విజయవాడ హోరెత్తుతోంది. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాని వామపక్ష నేతలు మధు, రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని.. లేనిపక్షంలో పర్యవసానాలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీ, బీజేపీ నాటకాలు ఆపి ప్రత్యేక హోదా సాధించాలని డిమాండ్ చేశారు. 

 

15:19 - August 5, 2016

హైదరాబాద్ : వీసీల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీగా ప్రవీణ్‌ రావ్‌ను ఎంపిక చేయడంలో గుడుపుఠాణి జరిగిందన్నారు. నేటాఫిమ్‌ కంపెనీలో గతంలో పనిచేసిన ప్రవీణ్‌ రావ్‌కే ఎందుకు కట్టబెట్టాలనుకున్నారో వివరించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో డ్రిప్ ఇరిగేషన్‌ చేసిన నేటాఫిమ్‌ కంపెనీకి..ఎర్రవెల్లి, నరసన్నపేటలో 3500 ఎకరాలకు 100 శాతం సబ్సిడీతో 49 కోట్ల 89 లక్షల కాంట్రాక్ట్ అప్పగించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు నేటాఫిమ్‌ కంపెనీపై ఎందుకంతా ప్రేమ ఉందో బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. 

 

హోదా ఇవ్వటానికి చట్టం ఎందుకు : కేవీపీ

ఢిల్లీ : ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని బీజేపీ పదేపదే చెబుతుండటాన్ని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా తప్పుబట్టారు. హోదా ఇవ్వడానికి చట్టం ఎంతమాత్రమూ అవసరం లేదని..కుంటిసాకులు చెబుతూ బీజేపీ తప్పించుకోవాలని భావిస్తే తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. ప్రయివేటు బిల్లుకు మద్దతిచ్చిన 11 పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రైవేటు బిల్లు పెట్టే హక్కు తనకుందని ఆయన పేర్కొన్నారు.

ప్రధానిగా నేనిచ్చిన హామీలను నెరవేర్చండి : మన్మోహన్ సింగ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ, ఆనాడు ప్రధాని హోదాలో విభజన నేపథ్యంలో ప్రధానికిగా ఆరు హామీలను ఇచ్చామని...ఆ హామీలను నేటి ప్రభుత్వం విమర్శించడం తగదని, దీనివల్ల పార్లమెంటుపై ప్రజలకున్న నమ్మకం పోతుందని అన్నారు. ఏపీకి హోదాను ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సభలో ఉన్నారని తెలిపారు. సభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి, సభ గౌరవాన్ని ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ అన్నారు.

ఆంధ్రోళ్లకు ఆత్మీయ వీడ్కోలు ..

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఇరురాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయసమ్మేళనం జరిగింది. ఏపీ ఉద్యోగులకు సహచర తెలంగాణ ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసా

హైదరాబాద్ : నిజాం కాళాశాలలో ఎస్సీ వర్గీకరణ రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసాగా మారింది. ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్, ప్రొ. కోదండరాం, గద్దర్ సమక్షంలో మాలమాదిగ నేతలు బాహాబాహికి దిగారు. ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ తలకు గాయం అయింది. 

కోక్రాఝర్ లో ఉగ్రవాదుల కాల్పులు

అసోం : కోక్రాఝర్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది పౌరులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. 

 

13:55 - August 5, 2016

కాలేజీ అమ్మాయిల నుండి కార్పొరేట్ కంపెనీల ఎంప్లాయిస్ దాకా అందరూ ఇష్టంగా, కంఫర్ట్ గా ఫీల్ అయ్యే డ్రెస్ చుడీదార్. అలాంటి చుడీదార్స్ ఎన్నున్నా రోజువారీ వాడకానికి సరిపోవు. అలాంటి వెరైటీ చుడీదార్స్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:51 - August 5, 2016

ఇంటా...బయట మహిళలకు అభద్రత ఏర్పడుతోంది. తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులు మారాలంటే వ్యవస్థల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగానైనా మనకు మనం ఆత్మరక్షణా మార్గాలు ఎంచుకోవడం ఎంతో కొంత అవసరం. ఈజీ మని కోసం చాలా మంది టార్గెట్ పెట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను దుండగులు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. మెడపై కత్తి పెట్టి బెదిరిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎలా తప్పించుకోవాలో కరాటే లక్ష్మీ వివరించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:32 - August 5, 2016

హైదరాబాద్ : భాగ్యనగరంలో హరితహారం కార్యక్రమం విజయవంతమయ్యింది. మొక్కలు నాటడంతో జీహెచ్ఎంసీ లక్ష్యాన్ని సాధించింది. ఉద్యమంలా చేపట్టిన హరితహరంలో ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా మొక్కలు నాటడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగింది. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటడం పట్ల అధికారులతో పాటు, పాలకవర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఒక్కరోజే 29 లక్షల మొక్కలు నాటారు..
జంటనగరాల్లో గత నెల 11న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నగర ప్రథమ పౌరుడు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్దు ఎత్తున పాల్గొన్నారు. జులై 11న ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందరి సహకారంతో లక్ష్యాన్ని అధిగమించి మరో నాలుగు లక్షల మొక్కలు అదనంగా నాటారు. అంటే ఒక్కరోజే 29 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. నెల రోజుల పాటు కొనసాగేలా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మరో రెండు, మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.
నాటిన ప్రతి మొక్కకు లెక్కా పత్రం ఉండేలా జియో ట్యాగింగ్‌ చేయాలని నిర్ణయించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జీహెచ్‌ఎంసీ కృతజ్ఞతలు తెలిపింది. అయితే నాటిన మొక్కలకు రక్షణవకచాలు ఏర్పాటు చేయలేదు. దీంతో 80 లక్షలకుపైగా మొక్కల్లో ఎన్నింటిని సంరక్షిస్తారో చూడాలి.  

13:17 - August 5, 2016

హైదరాబాద్ : 123 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం చేసిన అప్పీల్ పై హైకోర్టులో దాదాపు గంటసేపు వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరింది. స్టే ఇవ్వడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది..పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 123 జీవో ద్వారా భూములను కొనుగోలు చేయడం జరుగుతోందని, దీనిపై రైతులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కులవృత్తులు..జీవనపాధి ఏంటనీ కోర్టు ప్రశ్నించింది. వీరందరికీ మొత్తంగా డబ్బులు చెల్లించే ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొంది. కావాలనే జాప్యం చేస్తున్నారని, చట్టం ప్రకారం అమలు కావడం లేదని..దీనివల్ల రైతు కూలీలు అన్యాయానికి గురవుతారని..ఐదు లక్షల రూపాయలు..కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని..అంతేగాకుండా 20 ఏళ్ల పాటు రెండు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.

జీవో నెంబర్ 123..
సాగునీటి ప్రాజెక్టులు..పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. 123 జీవో ప్రకారం చేపడుతుండడంతో ఆందోళన నెలకొంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వహించాలని నిర్వాసితులు, విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ఇటీవలే హైకోర్టు విచారించింది. జీవో నెంబర్ 123 రద్దు చేస్తున్నట్లు, భూసేకరణను నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 

మంత్రి కేశినేని సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ : కాంట్రవర్శీ సందర్భాలలో ఇరుక్కుంటూ.. తనదైన శైలితో ప్రవర్తిస్తూ..తనపని తాను చేసుకుపోయే మంత్రి కామినేని మరోసారి వార్తల్లోకెక్కారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అన్న విషయమై మాట్లాడే స్థాయి తనకు లేదని, అసలు హోదాతో తనకు సంబంధం ఏంటని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టిని సారిస్తానని, మిగతా విషయాలు, వివాదాల గురించి పట్టించుకోనని అన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యలు చూసుకుంటారని అన్నారు.

13:12 - August 5, 2016

ఢిల్లీ : కష్టాల్లో ఉన్నామని ఆదుకోవాలని కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..విభజన హామీలు అమలు చేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్రంపై వత్తిడి పెంచేందుకు టిడిపి సిద్ధమైంది. హామీలు అమలు చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఎలాంటి స్పష్టమైన హామీనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని బాబు కోరినట్లు సమాచారం. ప్రత్యేక హోదా..విభజన హామీలు అమలు చేసే విధంగా చూడాలని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని బాబు కోరినట్లు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది.
టిడిపి ఎంపీలతో...
అనంతరం టిడిపి ఎంపీలతో ప్రధాన మంత్రి మోడీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కూడా ప్రధాన మంత్రి మోడీ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. మీ సమస్యే..తమ సమస్య అని పేర్కొనట్లు తెలుస్తోంది. సమస్యను ఎలా పరిష్కరిస్తానే దానిపై క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.  దీనితో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలు..కేంద్రం ఎలా స్పందించిందనే దానిపై కాసేపట్లో క్లారిటీ రానుంది. 

ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం..

మెదక్ : ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. మోడీ రాష్ర్టానికి రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రధానికి అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. మిషన్ భగీరథను ప్రధాని చేతులమీదుగా ప్రారంభం చేసుకుంటామని పేర్కొన్నారు. 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను మోడీ జాతికి అంకితం చేస్తారని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రధాని, సీఎం కేసీఆర్ పునఃప్రారంభం చేస్తారు అని వెల్లడించారు. కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వేలైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

ఎస్సీవర్గీకరణ సమావేశంలో పిన్సిపల్ కు గాయాలు..

హైదరాబాద్ : నిజాం కళాశాలలో ఎస్సీ వర్గీకరణ రౌండ్ టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ ప్రొ.కోదండరామ్, గద్దర్ తో మాలమాదిగ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో ప్రిన్సిపల్ గాలి వినోద్ కుమార్ తలకు గాయమయ్యింది.

టీ.సర్కార్ కు హైకోర్టులో 'జీవో' దెబ్బ..

హైదరాబాద్ : 123 జీవోను రద్దు చేస్తూ హైకోర్టులో దాదాపు గంటసేపు వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరింది. స్టే ఇవ్వటానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
123 జీవో రగడ..

12:41 - August 5, 2016

హైదరాబాద్ : 123 జీవో చట్టానికి విరుద్ధమని గతంలో రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగిందని సీపీఎం నేత  బి.వెంకట్‌ పేర్కొన్నారు. సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రంలో భూ నిర్వాసితుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా వెంకట్ మాట్లాడారు.  పరిశ్రమలు..ప్రాజెక్టులు వస్తున్నాయనే నెపంతో భూములు సేకరించారని తెలిపారు. ఝరా మండలంలోని మూడు గ్రామాల్లో భూ సేకరణ చేశారని తెలిపారు. 3,100 ఎకరాల భూ సేకరణ చేయించుకుందని తెలిపారు. కానీ తాము చెప్పినదానికంటే ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కనబర్చారని, అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం బెదిరింపు ధోరణికి దిగిందన్నారు. దీనితో తాము ముందుగానే నేలకల్లులో ప్రజల ముందుకు వెళ్లడం జరిగిందని, 14గ్రామాల నుండి పెద్ద ఆందోళన ప్రారంభమైందని తెలిపారు. మల్లన్న సాగర్, ముచ్చర్ల గ్రామాల్లో ప్రారంభమైన ఆందోళన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాకిందన్నారు. ఒక ఎకరం భూమికి కూడా నోటిఫికేషన్ జారీ చేయలేదని పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టానికి నష్టం అని పేర్కొనడం జరిగిందని, వ్యవసాయ కార్మిక సంఘం చొరవతో ఎమ్మార్వోతో కూలీలతో దరఖాస్తు పెట్టించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 27న కేసును ఫైల్ చేయించడం జరిగిందని, ఐదు లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క పైసా ఇవ్వడం లేదని పేర్కొనడం జరిగిందన్నారు. కనాఈ ఏడు.ఎనిమిదిసార్లు వాయిదా వేస్తోందని విమర్శించారు. 20 మంది మహిళలు ధైర్యంగా హైకోర్టుకు పోవడం అభినందిస్తున్నట్లు తెలిపారు. 

12:38 - August 5, 2016

చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ.. ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అవసరం. నిజానికి మనకు దొరికే తాజా పండ్లు, కూరగాయాల్లోనే మనకు అవసరమైన సమతుల ఆహారానికి సంబంధించి అన్ని ప్రొటీన్స్ , విటమిన్స్ లభిస్తాయి. అయితే.. వీటిని ఫుడ్ సప్లిమెంట్స్ కాంపెన్సేట్ చేస్తాయి అనుకోవడం అపోహ. సో.. ఎటువంటి సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా సహజసిధ్దమైన ఆహారం తోనే పోషకాలను పొందడం మంచి పద్దతి.

12:36 - August 5, 2016

పుస్తకాలు, బట్టీ చదువులు, ర్యాంకుల కోసం పరుగులు ఇలాంటి పోటీ ప్రపంచంలో.. అందుకు భిన్నంగా రంగుల ప్రపంచంలో మునగాలని ఎవరికుంటుంది? మనసులోని భావాలను చిత్రాలుగా గీసే అవకాశం ఎందరికుంటుంది? ఆ దిశగా ప్రోత్సహించే వారు ఎందరుంటారు? ఇలాంటి సమయంలోనే ఆర్ట్ టీచర్లంతా ఓ వేదిక మీదకొచ్చారు. పిల్లలకోసం మేమున్నామంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కేవలం ఒకరిది కాదు. ఒక సమూహంలో టీచర్లది. రేపటి తరాన్ని తీర్చిదిద్దే వారిది. పేద పిల్లలకోసం, ఆర్థిక లేమి కారణంగా చదువుకి ఇతర సృజనాత్మక శక్తులకు దూరమైన చిన్నారుల కోసం .. ఇలా టీచర్లంతా ఒక్కచోట చేరడాన్ని స్వాగతిద్దాం. అందరికన్నా భిన్నంగా ఇలా ముందుకొచ్చిన ఈ టీచర్లను అభినందిందాం. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిద్దాం.

12:32 - August 5, 2016

విశాఖపట్టణం : ప్రత్యేక హోదా కోసం విశాఖలో వామపక్షాలు పోరుబాట పట్టాయి. సీపీఎం, సీపీఐ నేతలు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు రాజీనామా చేసి హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నినదించారు. హోదాపై బీజేపీ, టీడీపీలు నాటకమాడుతున్నాయని..చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ పోరాటాలు ఉధృతమౌతున్నాయి. తొలి నుండి ఆందోళన నిర్వహిస్తున్న వామపక్షాలు పోరాటాలను మరింత ఉధృతం చేశాయి. శుక్రవారం జీవీఎంసీ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా టెన్ టివితో నేతలు మాట్లాడారు. సీఎ చంద్రబాబు ఈ సమయంలో వెళ్లాల్సినవసరం లేదని, అసలు ఆహ్వానించాల్సినవసరం లేదన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే కేంద్రంతో పోరాడాల్సిన సమయంలో దేహీ అంటూ బాబు వెళుతున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల ఊసే లేదని, గిరిజన యూనివర్సిటీ తదితర వర్సిటీలకు నిధులు కేటాయించలేదన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:30 - August 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. రాష్ర్టంలోని భూ నిర్వాసితులకు 2013 జీవో ప్రకారం ఆర్థిక ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని, ఎంసెట్‌-2 లీకేజీకి మంత్రులను బాధ్యులను చేస్తూ బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను కోరారు. 123 జీవోను హైకోర్టు కొట్టేసినా ప్రభుత్వం మొండిగా మళ్లీ అప్పీల్‌కు వెళ్లిందని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి, పేదలకు అండగా ఉండాలని కోరారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అన్ని కుల వృత్తుల వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు. 

'హోదా' పై మోదీ..

ఢిల్లీ: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై ప్రజల్లో సెంటిమెంట్ బాగా పెరిగిందని...సాంకేతిక కారణాలతో హోదాను పక్కన పెట్టొద్దని ప్రధాని మోదీతో చంద్రబాబుకోరినట్లు సమాచారం.
భేటీ అనంతరం..మీడియాతో బాబు..

రేపు మల్లన్న నిర్వాశితులతో ముఖాముఖి..

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులతో శనివారం ముఖాముఖి జరుగనుంది. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, టి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వామపక్షాల నేతలు పాల్గొనున్నారు.

లాకప్ డెత్ అయిన దళితుడు..

ఉత్తరప్రదేశ్ : యూపీలో దళితులపై దాడులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ దళితుడు పీఎస్ లో లాకప్ డెత్ అవ్వటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ దొంగతనం కేసులో విచారణ నిమిత్తం గురువారం నాడు కమల్ వాల్మీకి(25) అనే యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈక్రమంలో యువకుడు అనుమానాస్పదంగా లాకప్‌లో మృతి చెందాడు.
అనుమానాస్పద మృతిగా అనుమానాలు..

12:12 - August 5, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా కృష్ణా పుష్కరాలకు బాబు ఆహ్వానించారు. అనంతరం జరిగిన భేటీలో ప్రత్యేక హోదా...విభజన హామీల గురించి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి పార్టీలు హోదాపై ఇచ్చిన హామీ..విభజన అనంతరం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రధానిని బాబు కోరినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన అనంతరం నేరుగా బాబు పార్లమెంట్ లో ఉన్న టిడిపి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీకి చెందిన ఎంపీలతో భేటీ అయ్యారు. ప్రధానితో జరిగే భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి ? అనే దానిపై బాబు దిశా నిర్ధేశం చేశారు. నియోజకవర్గాల సమస్యలు..విభజన అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి వివరించాలని బాబు ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది.

హోదా..హీట్..
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఇవాళ మరోసారి రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీంతో కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. సభ్యులందరూ సభకు హాజరై బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని కోరింది. గత నెల్లోనే ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌ కోసం కాంగ్రెస్‌ సభ్యులు పట్టుపడ్డిన సమయంలో... బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో ఆ రోజుకు సభను వాయిదా వేయడంతో ఓటింగ్‌ జరగలేదు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌ సభ్యులు ఈ బిల్లుపై ఓటింగ్‌కు పట్టుపట్టారు. అయితే రాజ్యసభలో ప్రతి శుక్రవారం మాత్రమే ప్రైవేటు మెంబర్‌ బిల్లులను చర్చిస్తారు. వామపక్షాలతోపాటు, మరికొన్ని పార్టీల సభ్యులు బిల్లుకు మద్దతు పలుకుతున్నాయి అయితే అధికార బీజేపీ సభ్యులు...కేవీపీ ప్రవేశ పెట్టిన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఓవైపు ప్రశ్నలు..మరోవైపు నినాదాలు..

ఢిల్లీ : లోక్‌స‌భ‌లో ఓవైపు ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్ర‌త్యేక హోదాపై, ఇచ్చిన హామీల‌పై కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఎంపీలు ఆందోళ‌న చేశారు. కొంద‌రు ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఎంపీలు ఆందోళ‌న విర‌మించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీ స‌మ‌స్య‌ల‌ని కేంద్రం ప‌రిశీలనలో వుందన్నారు.

ఉగ్రవాది సుఫియాన్ జాఫర్‌ను ఆరెస్ట్ చేసిన పాక్?!..

పాకిస్థాన్ : 2008లో జరిగిన ముంబై దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుఫియాన్ జాఫర్‌ను పాకిస్థాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేసినట్టు గురువారం రాత్రి పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడిలో విదేశీయులు సహా 160 మంది మృతి చెందగా ..దాదాపు 308 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల కీలక సూత్రధారిగా భావిస్తున్న సుఫియాన్ జాఫర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు యాంటీ టెర్రరిజం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది. డైరెక్టర్ మజ్హర్ కాకాఖేల్ ఆధ్వర్యంలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) బృందం నిందితుడిని విచారించనుంది.

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కృష్ణానది పుష్కరాలకు రావాలని చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించారు. కాగా ఈ భేటీలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై కూడా ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం.

'రియో' లో భారత్ క్రీడాకారుడికి అవమానం..

హైదరాబాద్ : భారత టెన్నిస్ దిగ్గజం, ఆరుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న లియాండర్ పేస్ కు రియోలో తీవ్ర అవమానం ఎదురైంది. ఒలింపిక్ లో పాల్గొనటానికి వెళ్ళిన ఆయనకు రూమ్ ను కేటాయించలేదు. దీంతో తన లగేజ్ ను చెఫ్ రాకేష్ గుప్తా రూములో ఆయన పెట్టుకోవాల్సి అగత్యం ఏర్పడింది. దీనిపై పేస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన టెన్నిస్ భాగస్వామి రోహన్ బొప్పనతో కలసి ఒకే రూములో ఉండేందుకు లియాండర్ నిరాకరించినట్టు తెలుస్తోంది. బొప్పన, అలీ, టెన్నిస్ ఫిజియోలు మూడు రూములను తీసుకున్నారని పేస్ ఆరోపించాడు. బొప్పన, పేస్ జోడీ తమ తొలి మ్యాచ్ ని పోలాండ్ పై 6వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఆడాల్సి వుంది.

11:56 - August 5, 2016

జమైకన్ సుడిగాలి రన్నర్, మానవచిరుత ఉసేన్ బోల్ట్...రియో ఒలింపిక్స్ కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు. మరోసారి ట్రిపుల్ గోల్డ్ కు గురిపెట్టాడు.100 మీటర్లు, 200 మీటర్ల పరుగు అంశాలతో పాటు...100 మీటర్ల రిలే అంశాలలో బంగారు మోతతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యాడు. 2008 బీజింగ్ నుంచి 2012 లండన్ ఒలింపిక్స్ వరకూ ఉసేన్ బోల్ట్ డబుల్ హ్యాట్రిక్ గోల్డ్ పై ప్రత్యేక కథనం..
నాలుగుకాళ్ల జంతువుల్లో అత్యంత వేగంగా పరుగెత్తే ప్రాణి చిరుతపులి. రెండు కాళ్ల మానవజాతిలో అత్యంత వేగంగా పరుగెత్తిన ఒకే ఒక్కడు ఉసేన్ బోల్ట్. ట్రాక్ అండ్ ఫీల్డ్ 100, 200 మీటర్ల పరుగు కోసం ట్రాక్ లోకి దిగాడంటే మెరుపువేగంతో చిరుతలా పరుగెత్తే జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్...వరుసగా మూడో ఒలింపిక్స్ మూడు విభాగాలలో బంగారు పతకాలు కొల్లగొట్టడానికి సిద్ధమయ్యాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ద్వారా అరంగేట్రం చేసిన ఉసేన్ బోల్ట్ కు...100 మీటర్ల పరుగులో 9.58 సెకన్ల వేగంతో పరుగెత్తిన ప్రపంచ రికార్డు మాత్రమే కాదు 200 మీటర్ల పరుగులో సైతం..19.19 సెకన్ల మరో ప్రపంచ రికార్డు సైతం ఉంది.

బీజింగ్ ఒలింపిక్స్...
బీజింగ్ ఒలింపిక్స్ 100 మీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్స్ అంశాలలో డబుల్ గోల్డ్ సాధించిన బోల్ట్...100 మీటర్ల రిలే పరుగులో సైతం స్వర్ణపతకం సాధించి..తొలి ఒలింపిక్స్ లోనే గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత...నాలుగు సంవత్సరాలకు లండన్ వేదికగా ముగిసిన 2012 ఒలింపిక్స్ లో సైతం బోల్ట్ అదే దూకుడు కొనసాగించాడు. మూడుకు మూడు విభాగాల్లోనూ బంగారు మోత మోగించి...గ్రేటెస్ట్ స్ప్రింటర్ గా నిలిచాడు. ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇప్పటికే 11 బంగారు పతకాలతో పాటు..జంట ప్రపంచ రికార్డుల హోల్డర్ గా ఉన్న బోల్ట్...ఆగస్టు 5న ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్ లో సైతం ట్రిపుల్ గోల్డ్ సాధించగలనన్న ధీమాతో ఉన్నాడు. రియో ట్రాక్ లోనూ బోల్ట్ బుల్లెట్ దూసుకెళితే...మూడుకు మూడు విభాగాలలోనూ బంగారు పతకాలు సాధించగలిగితే..120 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో అది సరికొత్త చరిత్రే అవుతుంది. మరి...వరుసగా మూడో ఒలింపిక్స్ లో బోల్ట్ ఏరేంజ్ లో రాణించగలడన్నదే ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

పాక్ పర్యటనపై మంత్రి రాజ్ నాథ్ ప్రకటన..

ఢిల్లీ : పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో నిన్న జ‌రిగిన సార్క్ హోంమంత్రుల స‌దస్సును గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివ‌రించారు. స‌దస్సులో ఉగ్ర‌వాదం, సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ పై ప్రధానంగా చ‌ర్చ జ‌రిగిందని ఆయ‌న పేర్కొన్నారు. తాను ఉగ్ర‌వాదంపై ప్ర‌సంగం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం ప‌ట్ల ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం మాన‌వ‌హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు శ‌త్రువు లాంటిద‌ని తాను వ్యాఖ్యానించిన‌ట్లు చెప్పారు.

11:54 - August 5, 2016

హైదరాబాద్ : గల్ఫ్ లో తెలంగాణ బిడ్డల అవస్థలు రోజురోజుకు ఎక్కవవుతున్నాయి. ఉపాధి కోసం వెళ్లిన వారికి పనులు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు చాలీచాలని జీతాలతో బతుకులు వెళ్లదీస్తున్నవారిని.. స్థానిక సంక్షోభం వెంటాడుతోంది. దీంతో గత ఆరు నెలలుగా జీతాలు లేక.. కష్టాలను అనుభవిస్తున్నారు. తాము కష్టపడినా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలన్న తమ కోరికలు తీరక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలతో అప్పులు చేసి దుబాయ్‌కి వెళ్తే అక్కడ ఏర్పడిన సంక్షోభంతో జీతాలు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల, రాయికల్‌, కోరుట్ల, కొడిమ్యాల, మల్యాల, పెగడపెల్లి, గొల్లపల్లి మండలాల నుంచి అనేకమంది దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ కష్ట పడితే నాలుగు పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చని అప్పులు చేసి ఫ్లైట్‌ ఎక్కారు. కానీ సీన్‌ రివర్స్ అయ్యింది. అక్కడ స్థానికంగా ఏర్పడిన సంక్షోభాలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక.. గత ఆరు నెలలుగా జీతాలు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఆదుకునే నాదుడు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు చేసిన అప్పుల తీర్చమని ఊర్లో అప్పులవాళ్ల వేధింపులతో కుటుంబసభ్యులు నరకం అనుభవిస్తున్నారు.

గల్ఫ్ లో కొత్త నిబంధనలతో వలస వెళ్లిన కార్మికులకు పనులు దొరకడం లేదు. మరోవైపు ఆయిల్‌ సంక్షోభం కూడా తలెత్తడంతో కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒకవైపు పనులు లేక.. మరోవైపు చేసిన పనులకు జీతాలు రాక అవస్థలు పడుతున్న కార్మికులు.. కనీసం కుటుంబ సభ్యులకు ఫోన్లు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో తమ వాళ్ల గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చి.. ఉపాధి కల్పించాలని గల్ఫ్‌ బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించి కార్మికులు..

విశాఖ : పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. జీవో నెం: 279 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

11:49 - August 5, 2016

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి జయలలితను ఇరకాటంలో పెట్టేందుకు విపక్షనేత స్ఠాలిన్‌ ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా జయలలితకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురువుతున్న ముఖ్యమంత్రి జయ... దూషణల పర్వానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో ఈసారి గతంలో కంటే భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నువ్వా... నేనా..అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. గత అసెంబ్లీలో డీఎంకేకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో... జయలలితకు ఎదురులేకుండా పోయింది. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే బాగా బలపడంతో అటు అసెంబ్లీలో, ఇటు బయటా కూడా జయలలితకు ఇబ్బందులు తప్పడంలేదు.

పచ్చగడ్డి వేస్తే భగ్గు..
ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ప్రయత్నిస్తుండటంతో... అసెంబ్లీ వేదికగా జయలలిత తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ప్రతిపక్ష లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేకోపోవడమో.. లేక మరో కారణమో కానీ... ముఖ్యమంత్రి జయలలిత డీఎంకే అధినేత కరుణానిధిని ఉద్దేశించి పరోక్షంగా చేస్తున్న విమర్శలు ఆమె మెడకే చుట్టుకుంటున్నాయి. రాజకీయమంటే వృద్ధాప్యంలో ఇంట్లో కూర్చుని ప్రకటనలు చేయడం కాదంటూ కరుణానిధిని దెప్పిపొడిచేలా జయలలిత చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలు ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.

కావేరి ఆయకట్టుకు నీరు విడుదలలో జాప్యం..
తమిళనాడు-కర్నాటక, తమిళనాడు-కేరళ మధ్య ప్రాజెక్టులు, సాగునీటి సమస్యల, కావేరి ఆయకట్టుకు సాగునీరు విడుదలతో జాప్యం. రాష్ట్రానికి చెందిన జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేయడం వంటి అంశాలపై ప్రతిపక్ష డీఎంకే సభ్యులు నిలదీస్తున్నారు. దీంతో సమాధానం చెప్పలేక అధికార అన్నాడీఎంకే నీళ్లు నమిలే పరిస్థితులు ఎదురవుతున్నారు. ఇది అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి.

అన్నా డీఎంకేని ఇరకాటంలోకి నెడుతున్న డీఎంకే ప్రశ్నలు..
దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై తమినాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రతిపక్ష డీఎంకే నుంచి ఎదురవుతున్న ఈటెలు, బల్లాలాంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో అధికార పక్షాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. దీంతోనే ప్రత్యక్ష ప్రసారాలపై ఆంక్షలు విధించారన్నది డీఎంకే నేతల వాదన. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పలేకపోతే... ప్రజల్లో పలుచనవుతామన్న భయంతో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలపై ఆంక్షలు విధించారని డీఎంకే నేతలు చేస్తున్న విరమర్శలను తిప్పికొట్టలేక అధికార అన్నా డీఎంకే ఆత్మరక్షణలో పడిందని విశ్లేషకులంటున్నారు. మొత్తంమీద ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం ఇప్పడు రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

మచిలీపట్నంలో ఉద్రిక్తత..

కృష్ణా : మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

11:45 - August 5, 2016

ఆదిలాబాద్ : గిరిజన ప్రాంతాల్లో పుట్టడమే వారి పాపమా ? నిరక్ష్యరాస్యతే వాళ్ల పాలిట శాపమా ? ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత వల్ల మరణిస్తున్న గర్భిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తమకు తెలియకుండానే తమ బిడ్డలకూ రక్తహీనతను వారసత్వంగా అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళల హృదయ విదారక ఘటనపై ప్రత్యేక కథనం....ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత గిరిజన మహిళలను కబళిస్తోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 78 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. ప్రధానంగా గర్భిణీ స్త్రీలలో 90 శాతం మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. దీంతో వారికి జన్మించిన బిడ్డలకు సరైన పోషకాలు అందక వారు తమకు తెలియకుండానే రక్తహీనతను పొందుకుంటున్నారు.

రక్తంలో ఉండాల్సిన హెమోగ్లోబిన్ 14 మిల్లీగ్రాములు..
సాధారణంగా ప్రతి మనిషి రక్తంలో 14 మిల్లీ గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. కాని ఏజెన్సీ ప్రాంత గర్భిణులను పరీక్షిస్తే వాళ్లలో 3 లేదా 4 మిల్లీగ్రాములకు మించి హిమోగ్లోబిన్ ఉండటం లేదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడమే దీనిక ప్రధానం కారణంగా వైద్యులు చెబుతున్నారు.

ప్రభుత్వమే చర్యలు చేపట్టాలని డిమాండ్..
తమకు పౌష్టికాహారం లభించకపోవడం వల్లనే రక్తహీనత బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పెట్టే పథకాల్లో ఏమీ తమను ఆదుకోవడం లేదని ఆగ్రహిస్తున్నారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో తమ పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించి, భవిష్యత్తు తరాలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాలలో పోషకాహార లేమి లేకుండా చర్యలు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో దీక్షలు..

తూ.గోదావరి : రాజమండ్రిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక దీక్షలు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో నిరసన దీక్షలో సీపీఎం,సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వామపక్షాలు చేపట్టిన దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఈరోజు రాజ్యసభ ముందుకు కేవీపీ ప్రయివేటు బిల్లు రానున్న సంగతి తెలిసిందే.

11:41 - August 5, 2016

మెదక్ : మిషన్ భగీరరథ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల ఏడవ తేదీన తొలిసారిగా మెదక్‌ జిల్లా గజ్వేల్‌కు రానున్నారు. ఇక్కడ కోమటిబండ వద్ద మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. వంద శాతం పనులు పూర్తయ్యాయని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కార్యక్రమం సాయంత్రం 3గంటలకు జరుగుతుందన్నారు. పైలాన్ ఆవిష్కరణ, పంప్ హౌజ్ ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. మిషన్ భగీరథకు సంబంధించిన వివరాలను ఫొటోల ద్వారా ప్రధానికి వివరించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎస్పీజీ, పోలీసులు భద్రతను చేపట్టడం జరిగిందన్నారు. రెండు లక్షల మంది వస్తారని అంచనా వేయడం జరిగిందని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెయిన్ ఫ్రూప్ తో వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధాని కోసం మూడు హెలి ప్యాడ్ లు, సీఎం కేసీఆర్ కోసం ఒక హెలిప్యాడ్..కేంద్ర మంత్రుల కోసం ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

11:36 - August 5, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ) సంతోష్ వేణు ఇంట్లో రూ. 3లక్షల క్యాష్, 30 తులాల బంగారం దొరికిందని ఏసీబీ అధికారి రవికుమార్ టెన్ టివికి తెలిపారు. సంతోష్ వేణు ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా అధికారి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. అవినీతి..అక్రమాలకు సంతోష్ పాల్పడినట్లు తమకు సమాచారం అందిందని, వార్తలు కూడా వచ్చాయని ఈ నేపథ్యంలో దాడులు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ..మిగతా 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఏడు ప్లాట్లు, డీడీ కాలనీలో ఓ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బ్యాంక్ పాస్ పుస్తకాలు దొరికాయని, సోదాలు కొనసాగుతున్నాయని విచారిస్తున్నట్లు చెప్పారు. 
నారాయణగూడ, గుడిమల్కాపూర్, డీడీ కాలనీ, అల్వాల్‌లో గల నివాసాలపై ఏకకాలంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోటి పైన అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. సంతోష్ ఖైరతాబాద్ సర్కిల్‌లో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఏసీపీ సంతోష్ వేణుకు భారీగా ఆస్తులు..

హైదరాబాద్ : ఏసీబీ అధికారులు శుక్రవారం మెరుపు దాడులకు దిగారు. జీహెచ్ఎంసీ ఏసీపీ సంతోష్ వేణు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో 30 తులాల బంగారం, రూ.3లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ గూడలో విలాసవంతమైన భవనం, హిమాయత్ నగర్..ఎర్రగడ్డలలో భవనాలు ..డీడీ కాలనీలో నిర్మాణంలో వున్న భవనంతో పాటు ఏడు ప్లాట్లను అధికారులు గుర్తించారు. ఖైరతాబాద్ లో సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా వున్న సంతోష్ వేణు ఆదాయానికి మించి ఆస్తులు వున్నట్లుగా గుర్తించి ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.

11:30 - August 5, 2016

హైదరాబాద్ : జీవో 123 రద్దు కావడంపై సంతోషంగా ఉన్న రైతులపై సర్కార్ నీళ్లు చల్లడానికే సిద్ధమైంది. జీవో రద్దుపై సర్కార్ అప్పీల్ కు వెళ్లింది. గత కొంత కాలంగా 2013 భూ సేకరణ చట్టం..జీవో నెంబర్ 123పై రగడ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీనిపై వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించింది. జీవో 123ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై అప్పీల్ కు వెళ్లాలని టి.సర్కార్ నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగా శుక్రవారం సింగిల్ బెంచ్ తీర్పునుఆ పేయాలని డివిజన్ బెంచ్ ను కోరింది. దీనిపై మధ్యాహ్నం 12గంటల తరువాత వాదనలు వినిపించనున్నారు. 2013 నష్టపరిహారం కంటే ఎక్కువ పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. 13 రాష్ట్రాల్లో ఇలాంటి జీవోలు జారీ చేసి భూ సేకరణ చేస్తోందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. 

వంతెన కూలిన ఘటనలో 14 మృతదేహాలు లభ్యం..

ముంబై : మహద్ వద్ద ముంబై - గోవా జాతీయ రహదారిపై వంతెన కూలడంతో.... బస్సులు,కార్లు వరదనీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికితీసినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం మంబైలో వెల్లడించారు. గల్లంతైన మరో 42 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం జరిగిన ఘటన..

మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు మృతి..

ఖమ్మం : మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు మృతి చెందారు. నాగేశ్వరరావు కొత్తగూడెం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగతనేత ఎన్టీఆర్, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్విహించారు. కోనేరు నాగేశ్వరరావు మృతికి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శనరావు సంతాపం తెలిపారు.

11:14 - August 5, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో ఏపీ ప్రత్యేక హోదా వేడెక్కుతోంది. ప్రత్యేక హోదా..విభజన హామీలు నెరవేర్చాలంటూ గత కొన్ని రోజులుగా ఏపీలో ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై నేడు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు కేంద్ర పెద్దలను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకోవడం హీట్ పెంచింది. శుక్రవారం ఉదయం పార్టీకి చెందిన ఎంపీలతో బాబు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఎంపీలు ప్రధాన మంత్రితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. నియోజకవర్గాల సమస్యలు..విభజన అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానికి వివరించాలని బాబు ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, స్పీకర్ సుమిత్రా మహజన్ లతో బాబు భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలకు రావాలని ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

హోదా ? ప్యాకేజీ ? 
కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై కేంద్ర మంత్రి జైట్లీ సమాధానంపై టిడిపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాయి. ప్రభుత్వంపై వత్తిడి రావడం..విమర్శలు ఎక్కువ అవుతుండడంతో కేంద్రంపై పోరాడాలని టిడిపి నిర్ణయించింది. అందులో భాగంగా ఎంపీలు కొన్ని రోజులు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. అనంతరం జైట్లీ హామీ మేరకు ఆందోళనకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ? ప్యాకేజీలలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకొననుందని ప్రచారం జరుగుతోంది. 

హస్తినలో వేడెక్కిన ఏపీ హోదా పాలిటిక్స్..

ఢిల్లీ : రాజధాని హస్తినలో ఏపీ ప్రత్యేక హోదా రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. నేడు రాజ్యసభ ముందుకు కేవీపీ ప్రయివేటు బిల్లు రానుంది. ఈ విషయంగా గత కొన్ని రోజులుగా కేంద్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వని విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లుపై కేంద్రం స్పష్టం ఇచ్చే అవకాశమున్నట్లుగా సమాచారం. ఈరోజు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యి సభలో పాటించాల్సిన వ్యూహాత్మకత గురించి చర్చించినట్లు సమాచారం. అనంతరం చంద్రబాబు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, స్పీకర్ సుమిత్రామహాజన్ లతో బాబు భేటీ అయ్యారు. కాసేపట్లో అంటే మ.12గంటలకు ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు.

123 జీవోను రద్దును సవాల్ చేసిన టీ.సర్కార్..

హైదరాబాద్ : 123 జీవోను రద్దును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసింది. 123 జీవో భూసేకరణ చెల్లదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ధర్మాసాన్ని టీ.సర్కార్ కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం మ.12గంటలకు కోర్టు విచారించనుంది. తెలంగాణ సర్కార్ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో 2013 చట్టాన్ని ఖాతరు చేయకుండా 123 జీవోప్రకారం భూసేకరణకు పూనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

10:55 - August 5, 2016

విక్టరీ వెంకటేష్..టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇమేజ్‌ని పక్కన పెట్టి, కథా నేపథ్యం ఉన్న చిత్రాల్ని చేయడానికి వెంకీ నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 'బాబు బంగారం' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన మరోసారి నయనతార నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ బాక్సింగ్ నేర్చుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలో చేయబోయే ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉండనుంది. బాలీవుడ్ లో విడుదలైన 'సాలా ఖదూస్' చిత్రాన్ని తెలుగులో రీమెక్ చేయాలని వెంకటేష్ భావించి రైట్స్ కొనుగోలు చేశారని టాక్. ఈ సినిమాలో 'మాధవన్' బాక్సింగ్ కోచ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ నేర్చుకునే యువతిగా ఆ చిత్రంలో రితికా సింగ్‌ నటించింది. భావోద్వేగాలతో కూడిన చిత్రం కావడం..మంచి యాక్షన్‌ సీక్వెన్సెస్‌తో రూపొందడంతో ప్రేక్షకులు ఆదరించారు.
బాబు బంగారం సినిమా పూర్తయిన అనంతరం ఈ సినిమా చేయాలని వెంకీ మొదట్లోనే అనుకున్నారంట. ప్రస్తుతం ఆ సినిమా పూర్తి కావడంతో బాక్సింగ్ పై వెంకీ శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. శారీరకంగా బలంగా మారాల్సి ఉండడంతో వెంకీ భారీ కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. బాలీవుడ్ లో దర్శకత్వం వహించిన సుధా కె.ప్రసాద్ తెలుగులో డైరెక్ట్ చేయనున్నట్లు వినికిడి. 

8న లోక్ సభ ముందుకు జీఎస్టీ బిల్లు..

ఢిల్లీ : ఈనెల 8న లోక్ సభ ముందుకు జీఎస్టీ బిల్లు రానుంది. 8న ఎంపీలంతా సభలో వుండాలని బీజేపీ విప్ జారీ చేసింది. ఇప్పటికే రాజ్యసభలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లు అమలుతో దేశమంతా ఒకే పన్ను విధానం అమలుకానుంది. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బిల్లు మేధావులు..కొంతరు నేతల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ..

తూర్పుగోదావరి : ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 10.90 అడుగులకు చేరింది. వరద ఉధృతి అధికంగా వుండటంతో అధికారులు 4,47,138 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ఈ క్రమంలో గోదావరి అంత్య పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

10:41 - August 5, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్ లో అడుగు పెట్టనున్నారు. ఏపీ రాష్ట్రంలో నెలకొన్న కష్టాలు తీర్చాలంటూ ఆయన కేంద్రాన్ని కోరనున్నారు. గురువారం సాయంత్రం బాబు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు లోక్ సభ స్పీకర్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. 
పార్లమెంట్ లోనే ఈ భేటీలన్నీ కొనసాగనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని దృష్టికి బాబు తీసుకెళ్లనున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి జైట్లీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఇస్తున్న నిధులు..రాష్ట్రానికి వస్తున్న నిధుల విషయంలో పొంతన లేదని ఏపీ పేర్కొంటోంది. హోదా కాకుండా ప్యాకేజీ ఇచ్చే విధంగా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రధాన మంత్రి సేకరించినట్లు తెలుస్తోంది. మరి బాబు టూర్ లో హోదానా ? ప్యాకేజీనా ? అనే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

స్పీకర్ సుమిత్రా మహాజన్ తో చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తో చంద్రబాబు భేటీ ఆయ్యారు. కృష్ణానది పుష్కరాలకు రమ్మని సుమిత్రామహాజన్ ను బాబు ఆహ్వానించారు. ఈనెల 14 నుండి కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్విహిస్తున్న సంగతి తెలిసిందే.

జూరాల జలాశయానికి భారీగా వరదనీరు..

మహబూబ్ నగర్ : జూరాల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు 1.80లక్షల క్యూసెక్కులనీటిని వదిలిపెట్టారు. జౌట్ ఫ్లో 1083 క్యూసెక్కులుగా వున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్ కౌంటర్ లో 3మావోలు మృతి..

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోలు మళ్ళీ రెచ్చిపోయారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు..

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటి 831.70 అడుగులు గా నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ఇన్ ఫ్లో 1,79,283 క్యూసెక్టులు, ఔట్ ఫ్లో 21,958 క్యూసెక్కులు నీరు వదిలేశారు. కుడి, ఎడవ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ను అధికారులు ఉత్పత్తి చేస్తున్నారు.

కాన్పూర్ లో ఆందోళనలు..

ఉత్తర్ ప్రదేశ్ : కాన్పూర్ లో స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారున. వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని, స్టేషన్ ఇన్ ఛార్జ్..ఇతర పోలీసులను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ ఎస్ఎస్ పి మీడియాకు తెలిపారు. 

రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ...

తిరుమల : తిరుమలేశుని ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 97.20 కోట్లని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. రికార్డు స్ధాయిలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ద్వారా శ్రీవారిని 6.27 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆయన తెలిపారు.

ఏబీసీ కాలువకు గండి..

ప్రకాశం : అద్దంకి మండలం పల్లాపల్లి వద్ద ఏబీసీ కాలువకు గండి పడింది. కాలువలోని నీరు వృధా పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు, స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.

10:19 - August 5, 2016

హైదరాబాద్ : తన వద్ద ఎలాంటి అక్రమాస్తులు లేవని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ ఏసీపీ అధికారి సంతోష్ వేణు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఏసీపీ సంతోష్ బాబు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. నారాయణగూడ, గుడి మల్కాపూర్, డీడీ కాలనీ, అల్వాల్ లో ఉన్న నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. కోటి వరకు ఆస్తులున్నట్లు గుర్తించారు. ఖైరతాబాద్ సర్కిల్ లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ సంతోష్ వేణు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు మీడియాతో మాట్లాడారు.

అన్నింటికీ లెక్కలు చూపిస్తున్నాం - సంతోష్..
తన నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారని, అధికారులకు సహకారం అందించడం జరుగుతోందని ఏసీపీ సంతోష్ వేణు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారని, బినామీ అంటూ ఏమీ లేవని పేర్కొన్నారు. ఇంట్లో దొరికిన బంగారం విషయంలో లెక్కలు చూపిస్తామని, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆస్తులు ఉండవా అంటూ ప్రశ్నించారు. తనకు ముగ్గురు అన్నదమ్ములు..ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని, తన తండ్రి గెజిటెడ్ ఆఫీసర్ అని ఆయనకు రూ. 50 వేల ఫించన్ వస్తోందని తెలిపారు. శేరిలింగంపల్లిలో గతంలో పనిచేయడం జరిగిందని, ఖైరతాబాద్ కు ప్రస్తుతం వచ్చినట్లు, పాత బిల్డింగ్ కు మరమ్మత్తులు చేసుకోవడం జరిగిందన్నారు. హౌజింగ్..తదితర లోన్లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులకు తెలియచేయడం జరుగుతోందని తెలిపారు.
మరి ఈ అధికారి అక్రమంగా సంపాదించారా ? లేక సక్రమంగానే సంపాదించారా ? విచారణలో తేలనుంది. 

కేంద్రమంత్రి జవదేకర్ తో సీఎం చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : కేంద్రమంత్రి జవదేకర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కృష్ణానది పుష్కరాలకు రమ్మని జవదేర్ ను బాబు ఆహ్వానించారు. ఈనెల 14 నుండి కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.

తూ.గోదావరి జిల్లాలో ప్రబలుతున్న డయేరియా ..

తూ.గోదావరి : జిల్లాలోని పెద్దాపురం, ఆనూరు, గండేపల్లి మండలాల్లోని గ్రామాలలో డయేరియా ప్రబలుతోంది. పెద్దాపురం ప్రభుత్వాస్పత్రిలో 20మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో డయేరియా వ్యాధి ప్రబలుతోందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

జీహెచ్ఎంసీ ఏసీపీ ఇంట్లో ఏసీబీ దాడులు..

హైదరాబాద్ : ఏసీబీ అధికారులు శుక్రవారం మెరుపు దాడులకు దిగారు. జీహెచ్ఎంసీ ఏసీపీ సంతోష్ వేణు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే నారాయణగూడ, గుడిమల్కాపూర్, డీడీ కాలనీ, ఆల్వాల్ లోని ఆయన బంధువుల నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేసి... తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ. కోటికిపైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. సంతోష్ వేణు ప్రస్తుతం ఖైరతాబాద్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

09:59 - August 5, 2016

పలువురు కథా నాయికలు చిత్ర నిర్మాణ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రియాంక చోప్రా..దియా మీర్జా..అనుష్క శర్మలు ప్రొడక్షన్ హౌస్ లు నిర్మించి పలు చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీరి జాబితాలో మరో ఇద్దరు కథానాయికలు వచ్చి చేరారు. 'నిన్నే ఇష్టపడ్డాను', 'పరమ వీర చక్ర' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నేహా ధూపియా, 'ధైర్యం' చిత్రంతో తెలుగు వారిని పలకరించిన రీమాసేన్‌ లు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. రెగ్యులర్ సినిమాలతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాలను కూడా నిర్మించాలని వీరిద్దరూ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిల జీవితాలపై నేహా ఓ సినిమా నిర్మిస్తోంది. తమ జీవితాలను కనుక్కొనేందుకు జర్నీ చేస్తున్న అమ్మాయిల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక రీమా సేన్ 'మి అమర్' అనే బెంగాలి చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. యూఎస్ కు చెందిన సుమాన్ గోష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మరి వీరు నిర్మించే చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయా ? లేదా ? అనేది చూడాలి. 

భోపాల్ లో విద్యార్థినిల భారీ నిరసన ప్రదర్శన..

మధ్యప్రదేశ్ : మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థినిలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. డ్రెస్ కోడ్..హాస్టల్ టైమింగ్ విధానాన్ని నిరసిస్తూ భోపాల్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. 

09:38 - August 5, 2016

పాకిస్తాన్ : ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల హోం మంత్రుల సదస్సులో భారత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు బహిరంగ మద్దతిస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వ్యక్తులు, సంస్థలు, దేశాలపై కూడా కఠినచర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను అమర వీరులుగా కీర్తించడం తగదని పరోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడా మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం ఉండదని, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు అవసరమని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

ప్రసంగాన్ని అడ్డుకున్న పాక్..
సార్క్ సమావేశంలో ఉగ్రవాదంపై విరుచుకుపడుతూ రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని పాక్ అడ్డుకుంది. పాకిస్థాన్ టీవీని మాత్రమే అనుమతించిన అధికారులు కేవలం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగాన్ని మాత్రమే చూపారు. ఇందుకు నిరసనగా రాజ్‌నాథ్‌సింగ్‌ లంచ్‌ చేయకుండానే భారత్‌కు వెనుదిరిగారు. సార్క్ స‌ద‌స్సు కోసం రాజ్‌నాథ్ ఇస్లామాబాద్ వెళ్లడం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్తల‌ను మ‌రింత పెంచింది. ఆయ‌న ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టగానే నవాజ్‌ షరీఫ్‌ క‌శ్మీర్‌ రాగాన్ని ఆలపించారు. ఉగ్రవాది బుర్హాన్ వానిని కీర్తిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సార్క్ స‌ద‌స్సులో భాగంగా రాజ్‌నాథ్‌, పాక్ హోంమంత్రి నిసార్ అలీఖాన్ క‌నీసం క‌ర‌చాలనం కూడా చేసుకోలేదంటే రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. పాక్‌ నిర్వాకంపై హోంమంత్రి ప్రధాని మోదికి వివరించనున్నారు. అనంతరం సార్క్ సదస్సులో ఏం జరిగిందో రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని సమాచారం.

09:34 - August 5, 2016

హైదరాబాద్ : కోర్టు కేసులకు జీహెచ్ఎంసీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందా..బల్దియా స్థలాల లీజు కేసులు ఎంత వరకూ పరిష్కారమయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు వేసిన కేసుల్లో ఎన్ని గెలిచారు...పెండింగ్ లో ఉన్న కేసులు ఓ కొలిక్కి వచ్చాయా...బల్దియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసుల పై ప్రత్యేక కథనం. ఆయా పనుల విషయంలో నగర పౌరులు బల్దియాపై వేసిన వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బల్దియా స్థలాలు లీజుకు తీసుకొని ఏళ్ల తరబడి అనుభవించి అవి తమవేనంటూ కొందరు కోర్టులకెళుతున్నారు. తమ ఆస్తులు పరాధీనం అవుతున్నా వాటిని కాపాడుకోవడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 3,679..
జీహెచ్ఎంసీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 3,679. ఇందులో కౌంటర్ ఫైల్ చేసినవి 2 వేల 49 కేసులు. వీటిలో అధికారులు, స్టాండింగ్ కౌన్సిల్ అలసత్వం వల్ల 1630 కేసుల్లో ఇప్పటివరకూ కౌంటర్‌ దాఖలు చెయ్యకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. బల్దియా పరిధిలోని మరికొన్ని సర్కిళ్లలో వందలకొద్దీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విలువైన కార్పొరేషన్ భూముల వ్యవహారం ఎటూ తేలక, జీహెచ్‌ఎంసీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.

కేసుల విచారణకు న్యాయవాదుల గైర్హాజరు..
హెచ్‌ఎంసీకి సంబంధించిన కేసులను వాదించడానికి ప్రతి సర్కిల్‌కు ప్రత్యేక న్యాయవాదులు ఉన్నారు. ఈ న్యాయవాదులకు ఒక్కరికి 15వేల రూపాయల వేతనం చెల్లిస్తుంది జీహెచ్‌ఎంసీ.అయినా కేసుల పరిష్కారం అంతంతమాత్రంగానే ఉంది. కేసు విచారణ సమయంలో న్యాయవాదులు గైర్హాజరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.దీనిపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం శూన్యంగానే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.

09:31 - August 5, 2016

హైదరాబాద్ : ప్రమాదాల నివారణ కోసం డ్రంకన్ డ్రైవ్‌ను పోలీసులు కఠినతరం చేశారు. అర్థరాత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తూ మందుబాబుల మత్తు దించుతున్నారు. బ్రీత్ ఎనలైజర్స్‌తో పరీక్షిస్తూ జైలుకు పంపుతున్నారు. మరోసారి తాగి నడపకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఇటీవలే మద్యం మత్తు డ్రైవింగ్‌కు ఓ నిండు కుటుంబం బలై రాష్ట్ర వ్యాప్తంగా కంట తడి పెట్టించింది. దీంతో ప్రభుత్వం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపిస్తోంది.

1884 మందికి శిక్ష..
డ్రంక్‌అన్ డ్రైవ్‌ కేసులో ఒక్క జూలై నెలలో 1884 మందికి శిక్షపడింది. వీరిలో 528 మందిని సామాజిక సేవలో పాల్గొనాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు మందుబాబులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, కోర్టులు తీసుకొంటున్న చర్యలతో ఇప్పడిప్పుడే మందు బాబుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ఇకనుంచి డే టైమ్‌ లో కూడా డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రమాదాలను అరికడతామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జంక్షన్ల దగ్గర ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ వాహనాదారుల్లో ఎవేర్‌నెస్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

09:28 - August 5, 2016

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక కమిటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది జూన్‌లో ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమెను సభ్యురాలిగా నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన 129వ ఐఓసీ ప్రపంచ సభ్య సమావేశంలో 52 ఏళ్ల నీతా ఎన్నిక లాంఛనంగా జరిగింది. ఈ పదవిలో ఆమె 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది. ప్రస్తుతం భారత నుంచి ఆమె ఏకైక ఐఓసీ సభ్యురాలిగా ఉంది. 

సాగర్ కాల్వకు గండి...

ప్రకాశం : బల్లికురవ మండలం కొమ్మినేని వారిపాలెం దగ్గర సాగర్ కాల్వకు రెండు చోట్ల గండి పడింది. దీనితో నీరంతా వృదాగా పోతోంది. రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 

నందిగామలో రోడ్డు ప్రమాదం..

కృష్ణా : జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను యాత్రజని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. 15 మంది గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

 

తణుకులో ఆర్టీఏ అధికారుల తనిఖీలు...

పశ్చిమగోదావరి : తణుకులో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్యాక్స్ కట్టలేదని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణీకులను ఆర్టీసీ బస్సుల్లో తరలించారు.

జీహెచ్ఎంసీ ఏసీపీ నివాసంపై ఏసీబీ దాడి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఏసీపీ సంతోష్ బాబు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. నారాయణగూడ, గుడి మల్కాపూర్, డీడీ కాలనీ, అల్వాల్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. కోటి వరకు ఆస్తులున్నట్లు గుర్తించారు. ఖైరతాబాద్ సర్కిల్ లో ఏసీపీగా సంతోష్ వేణు పనిచేస్తున్నారు. 

09:14 - August 5, 2016

కరీంనగర్ : జిల్లా గనుల శాఖ కార్యాలయం అర్ధరాత్రి వరకు తెరిచి ఉండడం..అధికారులు పని చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇసుక రీచ్ ల్లోకి స్వయంగా వెళ్లిన మంత్రి కేటీఆర్ అక్కడ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని భావించిన ప్రభుత్వం గనుల శాఖలో పనిచేస్తున్న వారిని బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా గనుల శాఖ కార్యాలయం గురువారం అర్ధరాత్రి వరకు తెరిచే ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న టెన్ టివి అక్కడకు వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న వారిని చిత్రీకరించే యత్నం చేసింది. టెన్ టివి కెమెరాను చూసిన వారు అక్కడి నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. జిల్లాలో జరిగిన అవీనితి భాగోతం ఎక్కడ బయట పడుతుందోనని ముందు ఆలోచనతో తమ తప్పులను సరిదిద్దే కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ కార్యాలయంలో కనిపించని అధికారులు.. రాత్రి పని చేశారని తెలుస్తోంది.
గనుల శాఖను ప్రక్షాళన చేయాలనే మంత్రి కేటీఆర్ నిర్ణయంతో ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులను బదీలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో మంత్రి కేటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అడ్డాగా అక్రమ ఇసుక రవాణా, మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలతో కేటీఆర్ అధికారులపై మండిపడ్డారు. 

08:59 - August 5, 2016

తాను నటిస్తున్న 'లక్ష్మీ బాంబ్' చిత్రంలో సాంగ్స్ చాలా బాగా వచ్చాయని, తాను చేయలేనని చెప్పినా డ్యాన్స్ మాస్టర్ తనతో అన్ని చేయించారని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ రైల్ పోషిస్తున్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్ బ్యానర్ పై వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ...ఇందులో ఒక ఛాలెంజింగ్‌ పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని, ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఫైట్స్, సాంగ్స్ బాగా రావడం జరిగిందని, డైరెక్టర్‌ కార్తికేయ గోపాలకృష్ణ సినిమాను బాగా తెరకెక్కిస్తున్నారన్నారు. హిందీలో ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు వస్తున్నట్లు, 'లక్ష్మీ బాంబ్‌' కూడా అలాంటి చిత్రమే అవుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీతో సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 

జమ్మూలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత..

జమ్మూ కాశ్మీర్ : జమ్మూలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దోడా, కిష్ త్వార్ తదితర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

సోనియా కోలుకోవాలంటూ నేతల పూజలు..

ఉత్తర్ ప్రదేశ్ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలంటూ కాన్పూర్ లో నేతలు పూజలు నిర్వమించారు. గత కొద్ది రోజుల కిందట సోనియా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 

08:35 - August 5, 2016

కాఫీ అంటే ఎంతో మంది ఇష్ట పడుతుంటారు. వేడి వేడిగా ఘుమఘుమలాడే కాఫీ వాసన తగలగానే తాగేయాలనిపిస్తుంటుంది. అలసట..తలనొప్పి...నిద్ర వచ్చినట్లుగా ఉన్న సమయంలో కాఫీ తీసుకుంటుంటారు. మరి కాఫీ తాగడానికి మాత్రమే పనికొస్తుందా ? లేక దేనికైనా వాడుకోవచ్చా ? అనే సందేహాలు రావచ్చు. కాఫీ అందానికి కూడా వాడుకోవచ్చు.
ఒక కప్పులో కొద్దిగా కాఫీ పౌడర్..కొబ్బరి నూనె కలపాలి. దీనిని పేస్టులా తయారు చేసుకుని కళ్ల కిందటి నల్లటి వలయాలపై రాయాలి. చేతిలో వేళ్లతో రాసిన తరువాత పది నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం తడిబట్ట లేదా వెట్ టిష్యూతో తుడిచేయాలి. ఇలా వారానికి మూడు..నాలుగు సార్లు చేయాలి. దీనితో కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు మాయమవుతాయి.
కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు..యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలాంగా లభిస్తాయి. అందువల్ల చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అంతేగాకుండా కేఫీన్ చర్మాన్ని కాంతివంతంగా ఉండేందుకు దోహదపడుతుంది. కంటి చుట్టూ ఉండే నలుపుదనాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. సో...మరి కాఫీని వాడి చూసి ఫలితం చూడండి. 

సౌదీలో వీకే సింగ్...

సౌదీ అరేబియా : కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి విజయ్‌కుమార్ సింగ్ బుధవారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆహారం కోసం, స్వదేశానికి వచ్చేందుకు విమాన టిక్కెట్లు కొనుగోలుచేసేందుకు అవసరమైన డబ్బులేక సౌదీలో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించేందుకు ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు. 

దంతెవాడలో ముగ్గురు మావోయిస్టుల మృతి..

ఛత్తీస్ గడ్ : దంతెవాడ జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 631.70 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇన్ ఫ్లో 1,79,283 క్యూసెక్కులు ఉంటే ఔట్ ఫ్లో 21,958 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. 

08:04 - August 5, 2016

123 జీవో రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తీర్పును సవాల్‌ చేస్తూ పుల్‌ బెంచ్‌కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఇవాళ మరోసారి రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీంతో కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. సభ్యులందరూ సభకు హాజరై బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని కోరింది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్), రాకేష్ (టీఆర్ఎస్), మాల్యాద్రి (టిడిపి), శైలజనాథ్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సరయు నదిలో చిన్నారుల గల్లంతు...

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలోని బగేశ్వర్ జిల్లాలోని సరయు నిదిలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిని గాలించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

 

సిక్కోలులో కేంద్ర బృందం పర్యటన..

శ్రీకాకుళం : ఉపాధి హామీ పథకం పనుల పరిశీలనకు జిల్లాకు నేడు కేంద్ర బృందం రానుంది. పలు ప్రాంతాల్లో పనులు, విధుల వినియోగాన్ని పది రాష్ట్రాల కేంద్ర ప్రతినిధులు పరిశీలించనున్నారు. 

శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద వామపక్ష నేతల దీక్షలు..

కర్నూలు : నేడు శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరగనున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు జరగనున్నాయి. 

కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..

కర్నూలు : నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. 

గవర్నర్ ను కలువనున్న టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను నేడు టి.టిడిపి నేతలు కలవనున్నారు. మల్లన్న సాగర్, ఎంసెట్ లీకేజ్ లో ప్రభుత్వ వైఫల్యాలలపై ఫిర్యాదు చేయనున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో కోర్టుల బహిష్కరణకు న్యాయవాదుల పిలుపు...

హైదరాబాద్ : నేడు తెలంగాణ, ఏపీలో కోర్టుల బహిష్కరణకు ఇరు రాష్ట్రాల న్యాయవాదులు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం హైకోర్టు విధులు బహిష్కరించాలని ఏపీ అడ్వకేట్స్ ఫెడరేషన్, బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. తెలంగాణలో లాయర్లకు హైకోర్టులు నోటీసుల జారీపై అన్ని కోర్టుల బహిష్కరణకు టి. న్యాయవాదులు పిలుపునిచ్చారు. 

సీపీఐ ఆధ్వర్యంలో నేడు ధర్నా..

హైదరాబాద్ : నేడు సీపీఐ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర ధర్నా జరగనుంది. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ ఈ ధర్నా చేపట్టనున్నారు. 

07:13 - August 5, 2016

బ్రెజిల్ : ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం. 2016 ఒలింపిక్స్ కు బ్రెజిల్ వాణిజ్యరాజధాని రియో డి జెనీరోలో రంగం సిద్ధమైంది. 1896లో గ్రీస్ లోని ఏథెన్స్ ప్రారంభమైన ఆధునిక ఒలింపిక్స్ గత 120 సంవత్సరాల కాలంలో అంతైఇంతై అంతింతైఅన్నట్లుగా ఎదిగిపోయాయి. రియో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు...దశబ్దాల చరిత్ర కలిగిన ఒలింపిక్స్ ప్రస్థానంపై కథనం. ఒలింపిక్ గేమ్స్.....ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం.ప్రతి క్రీడాకారుడి స్వప్నం.. ప్రతిభకు కొలమానం.. విశ్వవేదికపై విన్యాసం..అలుపెరగని పోరాటం..విజయం కోసం ఆరాటం..అంచనాలకు అందని అద్భుతం..అంతకు మించి ఆశ్చర్యం..ఒక్క మాటలో చెప్పాలంటే...క్రీడా ప్రపంచంలో ఒలింపిక్‌ గేమ్స్ కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఏ క్రీడ అయినా, ఎంతటి క్రీడాకారుడైనా....ఒలింపిక్ మెడల్‌ను మించిన ఘనత మరోకటి లేదని భావిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే క్రీడాకారులకు ఒలింపిక్స్‌లో విజయం అంటే పతకం మాత్రమే కాదు కలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం.

ఒలింపిక్‌ గేమ్స్ వెనుక పెద్ద చరిత్ర.. 
ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తేనే గొప్ప అనుకునే క్రీడాకారులు, అథ్లెట్లు ఎంతో మంది ఉన్నారు...ఇక మెడల్‌ సాధిస్తే జన్మ ధన్యమే అని ఉప్పొంగిపోయె వారూ ఉన్నారు. కొంతమంది ఒక్కసారైనా ఒలింపిక్స్ లో పాల్గొనాలని తహతహలాడుతుంటారు. కానీ కొంతమంది ఇదే వేదికపై రికార్డ్ ల మోత మోగిస్తుంటారు. కొందరు చరిత్ర సృష్టిస్తే. మరికొందరు చరిత్రను తిరగరాస్తుంటారు.ఇంకొంతమంది ఎప్పటికైనా చరిత్ర సృష్టించాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఒలింపిక్‌ గేమ్స్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. క్రీస్తు పూర్వం 776లో తొలిసారిగా ఒలింపిక్స్‌ గేమ్స్‌ జరిగినట్లు చరిత్ర చెబుతోంది. గ్రీసు దేవుడుగా పిలువబడే జియూస్‌ గౌరవార్ధం పురాతన ఒలింపిక్స్ పోటీలను నిర్వహించేవారు. కుస్తీ, పరుగు, జావెలిన్‌ త్రో, హార్స్ రేస్‌, డిస్కస్‌ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించి ...విజేతలుగా నిలిచిన వారిని పతకాలు, ఆలివ్‌ ఆకులతో చేసిన కిరీటంతో సత్కరించేవారు.

19వ శతాబ్దంలో ఆధునిక ఒలింపిక్స్‌ ఆరంభం..
ఇక 19వ శతాబ్దంలో ఆధునిక ఒలింపిక్స్‌ ఆరంభమయ్యాయి.ఒలింపిక్స్ పోటీలకు జన్మస్థలమైన గ్రీస్‌లోనే ఈ మోడ్రన్‌ ఒలింపిక్స్‌ పోటీలు నిర్వహించడం విశేషం. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లో తొలి ఆధునిక ఒలింపిక్స్‌ పోటీలకు ఆతిధ్యమిచ్చింది. క్రీడలు, క్రీడాంశాల సంఖ్య సైతం పెరిగింది. అప్పటినుంచి ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఒలింపిక్స్ పోటీలు ఏ దేశంలో జరిగినా....గ్రీస్‌లోనే ఒలింపిక్స్ జ్యోతి వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ఒలింపిక్ జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని ఏథెన్స్‌లో పురాతన గ్రీస్‌ సంస్కృతి,సంప్రదాయ పద్దతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. 1928 ఆమ్‌స్టర్‌డామ్‌ ఒలింపిక్స్‌ నుంచి గ్రీస్‌ నుంచే ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలే ప్రారంభమవ్వడం కొనసాగుతూ ఉంది. ఒలింపిక్‌ పోటీలు అనగానే ముందుగా గుర్తొచ్చేవి రింగ్స్, ఒలింపిక్‌ టార్చ్. అంతే కాదు ఈ క్రీడా సంబరానికి నేపధ్య గీతంతో పాటు ప్రత్యేక శ్లోకం కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రతిభనే నమ్ముకున్న క్రీడాకారులు....
ఇక ఒలింపిక్ గేమ్స్ ఆరంభ వేడుకల నుంచి ముగింపు వేడుకల వరకూ అన్నీ ప్రత్యేకమే. ప్రతీది ప్రతిష్టాత్మకమే. ఆరంభ వేడుకలను ఎంతలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో ....ముగింపు వేడుకలను సైతం అంతకంటే ఘనంగా నిర్వహిస్తారు. ఒలింపిక్స్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారంటే...కేవలం ఈ వేడుకల కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తారు. 31వ మోడ్రన్‌ ఒలింపిక్‌గేమ్స్‌కు ఆతిధ్యమిచ్చే అదృష్టం బ్రెజిల్‌ వాణిజ్య రాజధానా రియో డి జెనీరో నగరానికి దక్కింది.207 దేశాలు పాల్గొంటున్న ఈ గేమ్స్ లో 28 క్రీడల్లో 306 క్రీడాంశాల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు. క్రీడా చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకోవడం కోసం ప్రతిభనే నమ్ముకుని పతకాల వేటలో బరిలోకి దిగబోతున్నారు. ఇలా ఒలింపిక్‌ గేమ్స్ అంటేనే ప్రతీది ప్రత్యేకమే. 

06:59 - August 5, 2016

మన దేశ చేతి వృత్తుల నైపుణ్యానికి చేనేత చక్కటి ఉదాహరణ. కానీ, చేనేతకు చేయూతనిచ్చేవారు కరువయ్యారు. దీంతో ఈ రంగం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మరికొన్నేళ్లలో చేనేతరంగం అంతరించి పోతుందేమోనన్న సందేహాలూ నిద్రపోనివ్వడం లేదు. గత మెంతో ఘనకీర్తి అన్న మాట అక్షరాల మన చేనేత రంగానికి వర్తిస్తుంది. వర్తమానమే అత్యంత ఆందోళనకరంగా వుంది. భవిష్యత్ ఊహించుకుంటేనే భయమేస్తోంది. పత్తి ఉత్పత్తిలో మన దేశానిది 3వ స్థానం. వస్త్రాల ఉత్పత్తిలో రెండో స్థానం. కానీ, ఏం లాభం? దినదినగండం నూరేళ్ల ఆయుష్షులాగా తయారైంది చేనేత కార్మికుల పరిస్థితి. మన దేశంలో రెండున్నర కోట్ల మందికి చేనేత జీవనాధారం. వీరికి బతుకుదెరువునిచ్చే దారపు పోగు తెగిపోతోంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చేనేత రంగం నుంచి ఏటా ఏడు శాతం మంది తప్పుకుంటున్నారు. అంతే సంఖ్యలో చేనేత మగ్గాలు తగ్గిపోతున్నాయి. వలసలు పెరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి సూరత్, షోలాపూర్, ముంబై లాంటి ప్రాంతాలకు వలసపోయినా, జీవితాలు మారడం లేదు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొద్ది సంవత్సరాలలో చేనేత అంతరించి పోయిన వృత్తుల జాబితాలో చేరే ప్రమాదం వుంది. చేనేతరంగం మరింత దెబ్బతింటే దానికి అనుబంధంగా పనిచేస్తున్న 27 వృత్తుల వారిని కష్టాలు, కన్నీళ్లూ వెంటాడుతున్నాయి.

రోజంతా శ్రమ..
చేనేత కార్మికులు రోజంతా శ్రమిస్తున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు శ్రమించకతప్పదు. రోజుకి 18 గంటలు కష్టపడ్డా దక్కే ప్రతిఫలం చాలా స్వల్పం. మన దేశంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల సగటు వేతనం 4500 రూపాయలైతే, చేనేత రంగంలో అది 3400 రూపాయలు మాత్రమే వున్నట్టు గతంలో జరిగిన ఓ అధ్యయం బయటపెట్టింది. నెలకు వెయ్యి రూపాయల కంటే తక్కువ ఆదాయం వున్నవారు చేనేతరంగంలో చాలామంది వున్నారు. అందుకే కుటుంబాల్లో పోషకాహారలోపం, రక్తహీనత లాంటి సమస్యలు ఎక్కువ. చేనేత కుటుంబాల్లోని 97శాతం మంది మహిళలు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుండడం వీరు ఎదుర్కొంటున్న దుస్థితికి నిదర్శనం. చేనేతరంగం ఇంతటి సంక్షోభంలో చిక్కుకోవడానికి ఏకైక కారణం ప్రభుత్వ విధానాలే. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యం చేనేతకు పెద్ద శాపం. పారిశ్రామికరంగానికి ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలు చేనేత రంగాన్ని చావు దెబ్బ తీశాయి. చేనేతరంగానికి కల్పించిన రక్షణలను అమలు చేసే విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం మరో లోపం. పత్తి, నూలు, ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం చేనేతకు భారంగా మారింది. క్రుత్రిమ దారాలు చేనేతకు ఉరితాళ్లై వెక్కిరిస్తున్నాయి.

ఆర్థిక సహకారం ఎక్కడ ..?
చేనేత కార్మికులకు ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహకారం లభించకపోవడతో, ప్రయివేట్ ఫైనాన్స్ వ్యాపారుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అప్పులు చేసి, వాటికి వడ్డీల మీద వడ్డీలు కడుతూ నేసిన బట్టలకు మార్కెటింగ్ లేకపోవడం మరో శాపం. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. సహకార సంఘాలను బలహీనపర్చడంతో చేనేతకు పెద్ద దిక్కన్నదే లేకుండా పోతోంది. తక్కువ సమయంలో, తక్కువ ధరతో, మరింత ఆకర్షణీయంగా వస్త్రాలు నేసే నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా ఏవిధమైన పరిశోధనలూ జరగడం లేదు.

మరిచిపోతున్న పాలకులు..
చేనేత రంగం సమస్యలను పరిష్కరిస్తామంటూ మ్యానిఫెస్టోలలో ప్రకటిస్తున్న పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే మరచిపోతున్నారు. చేనేత కార్మికుల సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద సర్వే నిర్విస్తామంటూ, చేనేతను జౌళి శాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామంటూ, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామంటూ టిఆర్ఎస్ చేసిన ఎన్నికల వాగ్ధానం ఇంకా ఆచరణరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకు చేనేత పాలసీని ప్రకటించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధినే ప్రశ్నిస్తోంది.

06:45 - August 5, 2016

ఆగస్టు 7 ఆదివారం చేనేత దినోత్సవం. దీంతో చేనేత రంగం సమస్యలు, సవాళ్లు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. చేనేతరంగం ప్రస్తుత పరిస్థితి ఏమిటి? చూడముచ్చటైన వస్త్రాలు నేసే ఈ రంగం బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి? చేనేత విధానంలో తీసుకురావాల్సిన మార్పులేమిటి? ఈ రంగానికి అందించాల్సిన ప్రోత్సాహకాలేమిటి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో చేనేత సంఘం నేతలు కూరపాటి రమేష్, వనం దుష్యంతలు విశ్లేషించారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

06:41 - August 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడనుందా...కొద్ది రోజుల క్రితం హడావిడిగా మొదలైన కొత్తజిల్లాల వ్యవహారాన్ని సీఎం వాయిదా వేయనున్నారా...అంటే అవుననే అంటున్నాయి టీఆర్‌ఎస్ సన్నిహిత వర్గాలు.. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జిల్లాల విభజనను ఇప్పుడే తెరపైకి ఎందుకు తీసుకురావడమని గులాబీ అధినేత భావిస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల సంఖ్యను దాదాపు 24 జిల్లాలుగా పెంచాలని గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది. దశల వారిగా జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా... కొత్త జిల్లాల ప్రక్రియ మొత్తం ఒకే సారి నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చింది. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలను సమకూర్చుకుంది. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగానే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే కచ్చితమైన అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు.

తాజా పరిస్థితులతో కొత్తజిల్లాలకు బ్రేక్..
దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేయాలని గులాబి బాస్ చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీని అయోమయానికి గురిచేస్తున్నాయి. వరుస ఘటనలతో ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్షాల ఆందోళనలతో నిత్యం విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయ స్థానాలు కూడా తప్పుపట్టడతో ఏం చేయాలో అర్థంకాక గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆందోళనలు..
ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెస్తే ప్రతపక్షాలు మరింత విరుచుకుపడే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధిపతి భావిస్తున్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై దాదాపు అన్ని జిల్లాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రతిపాదనలు వెల్లడించకపోవడంతో స్థానిక నేతలు తమ ఆందోళనలను తీవ్రంతరం చేయడం లేదు. ప్రభుత్వ పరంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడితే ఆందోళనలు జిల్లాల్లో కూడా ఉధృతం అయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని భావిస్తే తప్ప జిల్లాల పునర్విభజన పై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసే అవకాశం కనిపించడం లేదు. 

06:38 - August 5, 2016

హైదరాబాద్ : బీజేపీ అధిష్టానం తీరుతో తెలంగాణ బీజేపీ నేతలు అసహనానికి గురవుతున్నారా ? రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రుల ప్రశంసలు టీబీజేపీ నేతలకు మింగుడు పడడం లేదా ? ఇప్పుడు ఏకంగా ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకం ప్రారంభించడాన్ని కాషాయం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న బీజేపీ నేతలు ఆ పార్టీ అధిష్టానం తీరుతో ఇబ్బందిపడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు మొద‌లు, మిష‌న్ కాకాతీయ‌, హ‌రిత హారం, మిష‌న్ భ‌గీర‌థ ఇలా ప్రభుత్వ ప‌థ‌కాల‌న్నింటినీ రాష్ట్ర నేతలు విమర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర నేత‌లు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే..రాష్ట్రానికి వ‌స్తున్న కేంద్ర మంత్రులు ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పిస్తుండటాన్ని కాషాయ నేత‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే కేంద్రమంత్రి అరుణ్ జెట్లీ నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లడం.. ఆయ‌న పాల‌న‌పై శ‌భాష్ అన‌డం రాష్ట్ర నేత‌లు మ‌రిచిపోలేకపోతున్నారు. ఆ భేటీలో జైట్లీ కేసీఆర్‌కు ఇచ్చిన ప్రాధాన్యత‌లో స‌గం కూడా రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఇవ్వలేదని బీజేపీ నేతలు వాపోతున్నట్టు సమాచారం.

ఏం చేయాలో తెలియక సతమతం..
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు రానుండడంతో ఖుషీఖుషీగా ఉండాల్సిన‌ నేత‌లు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎక్కడా లేని హ‌డావిడి కొన‌సాగుతుంటే .. రాష్ట్ర కాషాయ నేత‌ల్లో మాత్రం ఎక్కడా లేని నిరుత్సాహం క‌నిపిస్తుంది. దీనికి కార‌ణం కేసీఆర్ మాన‌స పుత్రికైన మిష‌న్ భ‌గీర‌థకు .. మోడీ రిబ్బన్ క‌టింగ్ చేస్తుండ‌డమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథ‌కాన్ని పైపుల కంప‌నీల‌ కోస‌మే కేసీఆర్ తెర‌పైకి తెచ్చార‌ని మండిప‌డ్డ రాష్ట్ర నేత‌ల‌కు.. అదే పథకాన్ని త‌మ ప్రధాని ప్రారంభిస్తుండ‌టం నేత‌లకు మింగుడుపడడం లేదని స‌మాచారం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పార్టీ అధిష్టానం తీరుతో ఏం చేయాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

06:36 - August 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రధాని మోదీ టూర్‌కుముందే టీ టీడీపీ నిరసనలకు సిద్ధమైంది. ఆందోళనలతోపాటు.. మల్లన్న సాగర్‌ ముంపువాసుల కష్టాలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా డైరెక్టుగా పీఎంకు తెలియజేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.. అటు కాంగ్రెస్‌కూడా టీ ప్రభుత్వతీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది.. పీఎంకు బహిరంగ లేఖ రాసింది. మల్లన్న సాగర్‌ నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి తెలియజేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేశారు.. నిరసనలతో తమ గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు.. నిర్వాసితులకు మద్దతుగా ఈ నెల 5న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు నిర్ణయించారు.. ఈ నెల 7న ప్రధాని తెలంగాణలో పర్యటించబోతున్నారు.

ట్విట్టర్..ఫేస్ బుక్...
ఈలోపే బాధితుల సమస్యలు మోదీకి తెలియజేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లను వాడుకుంటున్నారు. వీటిద్వారా ప్రధానికి బాధితులు తమ ఇబ్బందులు చెప్పుకునేలా నేతలు సహాయం చేస్తున్నారు. అవసరమైతే తమ ఎంపీల ద్వారా తెలంగాణలోని సమస్యల్ని పీఎంకు వివరించేలా టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. ప్రధాని టూర్‌ తర్వాత ఢిల్లీలో ఆయన్ని కలవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, ఎంపీలు మోదీని కలిసి బలవంతపు భూసేకరణ వివరాల్ని చెప్పాలని చూస్తున్నారు. అటు టీ కాంగ్రెస్‌కూడా ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసింది... వైఎస్‌ హయాంలో తాము రూపొందించిన పథకాన్ని పేరుమార్చి తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని... టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మొత్తానికి పీఎం టూర్‌కు ముందే టీడీపీ, కాంగ్రెస్‌లు విమర్శలు ఎక్కుపెట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిపెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.

06:33 - August 5, 2016

హైదరాబాద్ : 123 జీవో రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తీర్పును సవాల్‌ చేస్తూ పుల్‌ బెంచ్‌కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తీర్పు కాపీలోని సారాంశాన్ని న్యాయనిపుణుల ద్వారా తెలుసుకున్న సర్కార్‌ అప్పీలుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కోర్టులో వాదనలు..
ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని, 2013 భూసేకరణ చట్టంతో పాటు 123 జీవో సైతం అమలు చేశామన్న యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నిర్వాసితులు మనస్ఫూర్తిగా ప్రాజెక్టు కోసం భూములిచ్చారని, వారి అనుమతి పత్రాలతోనే భూ సేకరణ చేశామని పై కోర్టులో వాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిర్వాసితులు ఎవరు ఏది కోరితే దాని ప్రకారమే పరిహారం, పునరావాసం కల్పించినట్లు, ఇంకా కోర్టు తీర్పులో చెప్పిన అంశాలు కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదేమైనా నిర్వాసితులపై సర్కార్‌ ఒత్తిడి లేదని, రైతులు స్వచ్చంధంగా భూములిచ్చారని చెప్పే ప్రయత్నంలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 123 జీవోపై హైకోర్టు తీర్పు తర్వాత కూడా రాష్ర్ట ప్రభుత్వం అప్పీలుకు వెళ్లాలనుకోవటం అవివేకమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వం ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లాగా వ్యవహరించడం సరైంది కాదని ఆక్షేపించందని, దీనికి ప్రభుత్వం ఏ సమాధానం చెబుతోందని తమ్మినేని ప్రశ్నించారు. ప్రజల తరపున తాము కూడా న్యాయస్థానంలో పోరాడతామని ఆయన చెప్పారు. 

06:31 - August 5, 2016

హైదరాబాద్ : గనుల శాఖలో ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఒకేసారి 93మంది ఉద్యోగులను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇద్దరు ఉపసంచాలకులు, 13మంది సహాయ ఉపసంచాలకులు... 14మంది అసిస్టెంట్‌ జియాలజిస్టులు... 30మంది రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు, 34మంది టెక్నికల్‌ అసిస్టెంట్లను బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చింది టీ సర్కారు.

కరీంనగర్..
కరీంనగర్ జిల్లా గనుల శాఖ కార్యాలయంలో ఇంటి దొంగలు పడ్డారు. గనుల శాఖను ప్రక్షాళన చేయాలనే మంత్రి కేటీఆర్ నిర్ణయంతో ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులను బదీలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో మంత్రి కేటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అడ్డాగా అక్రమ ఇసుక రవాణా, మైనింగ్‌పై వస్తున్న ఆరోపణలతో కేటీఆర్ అధికారులపై మండిపడ్డారు. దీంతో ఇంతకాలం జిల్లాలో జరిగిన అవీనితి బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని ముందు ఆలోచనతో తమ తప్పులను సరిదిద్దే కార్యక్రమం మొదలు పెట్టారు అధికారులు. ఎప్పుడూ కార్యాలయంలో కనిపించని అధికారులు.. రాత్రిళ్లు కూడా పని చేస్తున్నారని తెలియడంతో 10టీవీ అక్కడకు వెళ్లింది. 10టీవీ కెమెరాను చూసి అధికారులు పరుగు పెట్టారు.   

06:28 - August 5, 2016

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణానది పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించిన చంద్రబాబు.. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాతోపాటు వివిధ అంశాపై చర్చించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమవుతారు. పుష్కరాలకు మోదీని ఆహ్వానించడంతో, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించే అవకాశం ఉంది. రెండురోజులు పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోపాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌లను కలిసి, కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు అందజేశారు.

ప్రజల్లో అలజడికి కారణమైన జైట్లీ ప్రకటన..
ఆ తర్వాత చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. ముందుగా జైట్లీని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన చంద్రబాబు... ఆ తర్వాత రాష్ట్ర అంశాలపై చర్చించారు. అర్థ గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు. ప్రత్యేక హోదా అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యంకాదని, 14వ ఆర్థిక సంఘం ఇందుకు సిఫారసు చేయలేదని రాజ్యసభలో అరుణ్‌ జైట్లీ ప్రకటించిన తర్వాత ఉత్పన్నమైన పరిణామాలపై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర విభజన ప్రజలను ఎంతగా బాధించిందో... ఆర్థిక మంత్రిగా మీరు చేసిన ప్రకటన కూడా అంతే బాధించి, అలజడికి కారణమైన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్టు వినిపిస్తోంది. నిబంధనల మేరకు ఆరోజు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందని జైట్లీ వివరణ ఇచ్చారని సమాచారం. ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో టీడీపీ ఎంపీల ఆందోళన తర్వాత ఏపీని అన్ని విధాల ఆదుకుంటామని అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

రెవిన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు..
విభజన చట్టంలోని హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని అరుణ్‌ జైట్లీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రెవిన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధుల మంజూరు తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అన్నింటికి సానుకూలంగా స్పందించిన అరుణ్‌ జైట్లీ.. ఏపీని అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజ్యసభ ఆమోదించిన జీఎస్‌టీ బిల్లుపై కూడా ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఈ బిల్లుతో రాష్ట్రం ఏటా 4,700 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోయే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఐదేళ్లపాటు ఈ లోటును భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల భేటీలో కుదిరిన అవగాహన మేరకు ఆదుకుంటామని అరుణ్‌ జైట్లీ హామీ ఇచ్చారు.

ఈ ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ..
చంద్రబాబు ఇవాళ ఉదయం హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో భేటీ అవుతారు. తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎం నిర్మాణానికి నిధుల మంజూరుతోపాటు వివిధ అంశాలు చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. మోదీని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన తర్వాత రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు, మౌలికసదుపాయాల కల్పనకు సాయం, రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు తదితర అంశాలపై నివేదిక అందజేస్తారు. అలాగే వెనుబకడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి ప్రత్యేక సాయం, విభజన చట్టంలోని 9,10,13 షెడ్యూళ్లలో ఉన్న అంశాలను కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌, కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు ప్రత్యేక బోర్డులు, రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ తదితర అంశాలను కూడా మోదీకి అందించే నివేదికలో పొందుపరిచారు.

06:25 - August 5, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు ఇవాళ మరోసారి రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీంతో కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. సభ్యులందరూ సభకు హాజరై బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని కోరింది. గత నెల్లోనే ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌ కోసం కాంగ్రెస్‌ సభ్యులు పట్టుపడ్డిన సమయంలో... బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో ఆ రోజుకు సభను వాయిదా వేయడంతో ఓటింగ్‌ జరగలేదు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌ సభ్యులు ఈ బిల్లుపై ఓటింగ్‌కు పట్టుపట్టారు. అయితే రాజ్యసభలో ప్రతి శుక్రవారం మాత్రమే ప్రైవేటు మెంబర్‌ బిల్లులను చర్చిస్తారు. వామపక్షాలతోపాటు, మరికొన్ని పార్టీల సభ్యులు బిల్లుకు మద్దతు పలుకుతున్నాయి అయితే అధికార బీజేపీ సభ్యులు...కేవీపీ ప్రవేశ పెట్టిన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి

మోడీని కలువనున్న టీడీపీ ఎంపీలు..

ఢిల్లీ : టీడీపీ ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నేడు కలువనున్నారు. మధ్యాహ్నం 12.20 కి ఈ భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఎంపీలు ప్రధానితో చర్చించనున్నారు.

ప్రధానిని కలువనున్న ఏపీ సీఎం చంద్రబాబు..

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను ఆహ్వానించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు లోక్ సభ స్పీకర్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ప్రత్యేక హోదా..విభజన హామీలపై ప్రధానితో బాబు చర్చించనున్నారని తెలుస్తోంది. 

నేడు రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లు..

ఢిల్లీ : రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు బిల్లు రానుంది. దీనిపై కొద్ది రోజుల కిందట స్వల్పకాలిక చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రం ద్రవ్య బిల్లుగా తేవాలని చూస్తోందని, ఈ విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఇప్పటికే కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

గుజరాత్ ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం..

గుజరాత్ : రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎవరిని నియమించాలనే దానిపై బీజేపీ తర్జనభర్జనలు పడుతోంది. ఈ విషయంలో నేడు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఇద్దరు అబ్జర్వర్లు భేటీ అయి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 

నగరంలో ఆంక్షలు..

హైదరాబాద్ : ప్రధాని మోడీ ఆగస్టు 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. ఎల్‌బీ స్టేడియం చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

రేపు జయశంకర్ కాంస్య విగ్రహావిష్కరణ..

రంగారెడ్డి : ఈనెల 6న జయశంకర్ జయంతి సందర్శంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. 

నేడు మున్సిపాల్టీల్లో రెండో విడత హరితహారం..

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో నేడు రెండో విడత హరితహారం కార్యక్రమం జరగనుంది. 30 లక్షలకు పైగా మొక్కలను నాటాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

జీవో 123 రద్దుపై నేడు అప్పీల్..

హైదరాబాద్ : జీవో 123 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేయనుంది. విచారణ జరపాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్కుఏ రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం కోరనున్నారు. 

నేటి నుండి రియో ఒలింపిక్స్...

ఢిల్లీ : నేటి నుండి రియో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయి. 42 క్రీడాంశాల్లో జరిగే పోటీల్లో 205 దేశాలు పాల్గొంటున్నాయి. భారత్ నుండి 118 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. 

Don't Miss