Activities calendar

06 August 2016

22:38 - August 6, 2016

వరంగల్ : తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాల వలలోపడి కోదండరాం టీఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాలకు కడియం హాజరయ్యారు. ఏకశిలాపార్కు దగ్గర ఎంపీ సీతారాం నాయక్‌తోకలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని.. ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని కోదండరాంకు సూచించారు.

 

22:34 - August 6, 2016

విజయవాడ : ఏపీ డిఎడ్‌ కాలేజీల అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం నజర్‌ పెట్టింది. సీట్ల పేరుతో దోచుకుంటున్న తీరుకు చెక్‌పెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ముడుపులు తీసుకుంటూ విద్యాశాఖాధికారి ఏసీబీకి చిక్కడంతో.. అక్రమాల నిగ్గు తేల్చేందుకు సమాయత్తమవుతోంది. కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి వారి బండారాన్ని బయటపెట్టేందుకు రెడీ అవుతోంది.     
నిబంధనలు బేఖాతర్‌ ...సర్కార్‌ సీరియస్‌ 
ఆంధ్రప్రదేశ్‌లో డిఎడ్‌ కాలేజీల అక్రమాల డొంక కదులుతోంది. నిబంధనలకు నీళ్లొదిలేసి దండుకుంటున్న తీరును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. డీఎడ్‌ కాలేజీ యాజమాన్యాల నుంచి లంచం తీసుకుంటూ ఎసెస్సీ బోర్డ్‌ డెరెక్టర్‌ ప్రసన్నకుమార్‌ ఏసీబీకి చిక్కడంతో అక్రమ దందా బట్టబయలైంది. డైట్‌సెట్‌ రాయకపోయినా, అర్హతా మార్కులు సాధించకపోయినా కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అనర్హుల అడ్మిషన్లను కన్వీనర్‌ కోటాలోకి మార్చి ఫీజ్‌ రియింబర్స్‌మెంట్‌ కాజేస్తున్నారన్నది మరో ఆరోపణ. అక్రమాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు సర్కార్‌.. నిజాల నిగ్గు తేల్చేందుకు డిఎడ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. 
డిఎడ్‌ కాలేజీల అక్రమాలు కలకలం 
రాష్ట్రంలో డిఎడ్‌ కాలేజీల అక్రమాలు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సీట్ల పేరుతో డిఎడ్‌ కాలేజీలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్నతాధికారి ఏసీబీకి చిక్కడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అధికారుల అండదండలతో ఇన్నాళ్లు కాలేజీ యజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. దీంతో డిఎడ్‌ కాలేజీల అక్రమ భాగోతంపై స్పందించిన సర్కార్‌ చర్యలకు సిద్ధమైంది. త్వరలోనే కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. కాలేజీలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది తేల్చనున్నారు అధికారులు. లెక్చరర్లు, సిబ్బందితో పాటు విద్యార్థుల సదుపాయాలను పరిశీలించనున్నారు. రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టవచ్చన్న ప్రచారం జరుగుతోంది. డిఎడ్‌ కౌన్సెలింగ్‌ పూర్తి కాకముందే ఫేక్‌ కాలేజీల గుట్టు రట్టు చేస్తామని అధికారులు అంటున్నారు. 

 

22:25 - August 6, 2016

కడప : పల్లెలంటే..పచ్చనిపొలాలు..పిల్లగాలులు..సెలయేళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతుంటారు మనలో కొందరు. కాని ఆ ఊరిలో  మాత్రం... పూరిళ్లు , మట్టిరోడ్లు.. మచ్చుకైనా కానరాని వైద్యం, రోగమొస్తే ఆకుపసర్లు. కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లె దీనావస్థపై టెన్‌టీవీ స్పెషల్‌ ఫోకస్‌ ...
ఏకిరిపల్లి..
ఇది ఏకిరిపల్లి.. కడపజిల్లా రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామపంచాయతి పరిధిలోని  ఓ కుగ్రామం.  మండలకేంద్రం రాజంపేటకు 33కిలోమీటర్లదూరంలో.. బహ్యప్రపంచానికి తొందరగా కనిపించని గ్రామం ఇది. ఊళ్లోకి రావాలంటే ..ఈ మట్టిరోడ్డే దిక్కు. బస్సు  ఎపుడూ రానేరాదు. ఈ ఊరి వాళ్లు బస్సు ఎక్కాలంటే. 5కిలోమీటర్లు నడవాల్సిందే.
సీజనల్‌ రోగాలోతో మూలుగుతున్న ఏకిరిపల్లి
ఇపుడు సీజనల్‌ రోగాలతో మూలుగుతోంది. ఇంటింటికీ ఒకరో ఇద్దరో మంచానపడ్డారు. అటవీ ప్రాంతం కావడంతో తేలో,పామో కరిస్తే.. ఇక ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు గ్రామస్తులు. ఇక ఈ ఊళ్లో చదువులు సట్టుబండలయ్యాయి. ఇదిగో ఈ బోర్డును  చూడండి... సర్వశిక్షా అభియాన్‌ ..'అందరూ చదవాలి-అందూ ఎదగాలి' .. అనేది ఉపశీర్షిక. చిన్నారులు బడికి దూరంగా ఉండకూడదన్న లక్ష్యంతో నడుస్తున్న కేంద్ర పథకం ఇది. కాని ఈ ఏకిరిపల్లిలో ఏ పసివాణ్నిచూసినా.. ఇలా గొర్రెలో, బర్రెలో కాస్తూ..  పవుల అడుగుల్లో అడుగులేస్తున్నారు.  ఊహకందని  భవిష్యత్తుకు సాగుతున్నారీ రేపటిపౌరులు.  6నుంచి 14ఏళ్ల లోపు బాలలను బడికి పంపాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు ఇలా దులపరించుకుంటున్నాయి. 
ఎన్నికలపుడే నాయకులొస్తారు
ఈ ఏకిరిపల్లికి ఓట్లడగడానికి మాత్రమే వస్తారు నాయకులు. ఇక అధికారుల సంగతి సరేసరి. రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖలు మాత్రం అంతా బాగుందని రికార్డులు రాసుకుంటారు. మాబాధలను  ఎవరూ పట్టించుకోవడంలేదని  ఆవేదన చెందుతున్నారీ గ్రామస్తులు.  
అచ్చేదిన్‌కాదు..సచ్చేదినాలొచ్చినాయ్‌..
మట్టిరోడ్లు, పూరిళ్లు.. బస్సుముఖం చూడాలంటే కిలోమీటర్ల నడక.. రోగమొస్తే ఆకుపసరులే దిక్కు.. కుర్చీలమీద కూర్చున్నోళ్లు... అచ్చేదిన్‌  ఆరహాహై అంటుంటే... ఈ ఏకిరిపల్లి వాసులు మాత్రం  మాకు సచ్చేదినాలొచ్చినాయి అంటూ సాయంకోసం ఎదురుచూస్తున్నారు. 

22:15 - August 6, 2016

ఢిల్లీ : కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2012కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టుకు హాజరు కాకుంటే మాల్యాపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఇప్పటికే పలు కోర్టులు మాల్యాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆయన ఏ కోర్టులోనూ హాజరుకాలేదు. మాల్యా వివిధ బ్యాంకుల్లో తీసుకున్న 9 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్నాడు. 

 

22:09 - August 6, 2016

దేస్ పూర్ : పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అసోంలోని కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 21న కోర్టు ముందు హాజరుకావాలని కామ్‌రూప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఆదేశించింది. 2015 డిసెంబరులో రాహుల్‌ గాంధీ అసోంలో ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ బార్‌పేట ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లగా..అక్కడ మహిళలుండడంతో వెనుదిరిగారు. మహిళలను ఉంచడం ద్వారా తనను బార్‌పేట సత్రలోకి వెళ్లకుండా ఆర్‌ఎస్‌ఎస్‌  అడ్డుకుందని రాహుల్‌ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆ సంస్థ కార్యకర్త అంజాన్ బోరా పరువునష్టం కేసు దాఖలు చేశాడు. 

 

22:06 - August 6, 2016

ఢిల్లీ : పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే పీఎంవో యాప్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోది ఆవిష్కరించారు. ఈ యాప్‌ ద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. 'మై-గవ్‌' పోర్టల్‌ ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా  ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో టౌన్‌హాల్‌ తరహా కార్యక్రమం చేపట్డడం ద్వారా మోదీ కొత్త ఒరవడి సృష్టించారు. గుడ్‌ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత నివ్వకుంటే సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని ప్రధాని అన్నారు. ప్రతి సంస్థకి బాధ్యతతో పాటు జవాబుదారితనం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి మైగవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో నిర్వహించిన వేర్వేరు పోటీల్లో విజేతలకు ప్రధాని మోదీ బహుమతులు ప్రదానం చేశారు. టౌన్‌హాల్‌ కార్యక్రమంలో భాగంగా మోది ప్రజలతో ముఖా ముఖిగా సమావేశమయ్యారు.

 

22:03 - August 6, 2016

ఢిల్లీ : కేంత్రం తన పంతాన్ని నెగ్గించుకుంది. 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బిల్లును సక్సెస్‌ఫుల్‌గా గట్టెక్కించింది. బిల్లుకు మెజార్టీ పార్టీలు మద్దతు ప్రకటించడంతో జీఎస్టీ బిల్లు విజయవంతంగా గట్టెక్కింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏపీ ప్రత్యేక హోదా బిల్లు విషయంలో కేంద్రం ఎందుకు డ్రామాలాడుతోంది.? హోదా బిల్లుకు 11 పార్టీలు మద్దతు ప్రకటించినా..బిల్లు ఎందుకు పాస్‌ కావడంలేదు? దీని వెనక దాగున్న రాజకీయ కుతంత్రం ఏముంది? కావాలనే బీజేపి, టీడీపీలు హోదాపై డ్రామాలాడుతున్నాయా ? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
జీఎస్టీ బిల్లుకు 197 మంది సభ్యులు మద్దతు 
రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లుకు 197 మంది సభ్యులు మద్దతు తెలిపి బిల్లును సక్సెస్‌ఫుల్‌గా గట్టెక్కించారు. దేశ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుంది. జీఎస్టీ బిల్లును కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి అన్ని పార్టీలను బుజ్జగించి, మద్దతు కూడగట్టి చివరకు బిల్లును గట్టెక్కించుకుంది. 
హోదా విషయంలో కేంద్రం డబుల్‌ గేమ్‌ 
ఇంతవరకు బాగానే ఉన్నా..ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కేంద్రం డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. ఏపీ సమస్యను పరిష్కరిస్తామంటూ ..హోదా అంశాన్ని పాతళంలోకి తొక్కేస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంటు నిండుసభలో హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది కూడా ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగే. తాను ఇచ్చిన హామీని అమలు చేయాలని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. అయినా..బీజేపి ప్రభుత్వంలో ఉలుకు పలుకులేదు. 
లోక్‌సభకు హోదా బంతి.. 
ఏపీకి పత్యేక హోదా ఇవ్వాలని దాదాపు 11 పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపినా..కేంద్రం స్పందించలేదు. చివరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లును ద్రవ్య బిల్లని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ సభలో ప్రకటించి పెద్ద బాంబే పేల్చారు. ఇదే అంశంపై డిప్యూటీ చైర్మన్ కురియన్ స్పందిస్తూ ఇది అసలు ద్రవ్య బిల్లా కాదాఅనేది లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారని..హోదా బంతిని లోక్‌సభలోకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. 
కేంద్రం తీరుపై విపక్షాల విమర్శలు
ప్రత్యేక హోదా బిల్లుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలోని విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీకి న్యాయం చేస్తామంటూనే హోదా బిల్లును అటకెక్కించే ప్రయత్నం చేస్తోందని..ఈ కుట్రలో టిడిపి పాత్ర కూడా ఉందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ గట్టిగా డిమాండ్‌ చేయడం లేదనే వాదనా వినిపిస్తోంది.   
బీజేపి, టిడిపిల దొంగాట : వైసీపీ 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై కేంద్రంలో ఉన్న బీజేపి, రాష్ట్రంలో ఉన్న టిడిపి కలిసి దొంగాట ఆడుతున్నాయని వైసీపి విమర్శిస్తోంది. హోదా కావాలని టిడిపి పట్టుబడితే ఎందుకు రాదని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే రాష్ట్ర ప్రజల్ని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. 
హోదా విషయంలో బీజేపీ, టీడీపీ దాటవేత  
ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. ఇప్పుడు కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శిస్తున్నారు. అటు కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి సైతం హోదాను మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ, టీడీపీ హోదా విషయంలో దాటవేత ధోరణిని అవలంబిస్తున్నాయని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.   

 

21:53 - August 6, 2016

విజయవాడ : ప్రత్యేక హోదా బిల్లు చర్చ నేపథ్యంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి..మనకు వ్యతిరేకంగా బల్లపై చప్పట్లు కొట్టడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ముందు నుంచి కేంద్ర మంత్రి సుజనా కమలనాథులతో బాగా టచ్‌లో  ఉంటారనే ప్రచారం నిజమైందని కొందరంటున్నారు..ఈ వాదనలో వాస్తవమెంత. ఓ పక్క రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ..ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. దీంతో సభలో ఉన్న ఏపీకి చెందిన అధికార పార్టీ, ప్రతిపక్ష సభ్యులతో పాటు చర్చను చూస్తున్న కోట్లాది మంది ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 
కేవీపీ ప్రైవేటు బిల్లుపై వాడీవేడి చర్చ 
ఆ బిల్లు ఆర్థిక బిల్లని..దానిపై లోక్‌సభలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే..కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్‌సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు. అది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. ఇలా కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. సుజనాచౌదరి తీరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తప్పుబట్టారు. అలా చేయాల్సింది కాదంటూ వ్యాఖ్యానించారు. 
సుజనా తీరును తప్పుపట్టిన చంద్రబాబు 
సుజనాచౌదరి ఇలా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదని..సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. 2014లో టీడీపీ కేంద్రమంత్రి వర్గంలో చేరినప్పుడు విజయనగరం నుంచి ఎంపీగా గెలుపొందిన అశోక్ గజపతి రాజు, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కేంద్ర మంత్రి వర్గంలో మంత్రులయ్యారు. అశోక్ గజపతి రాజు క్యాబినెట్ మంత్రిగా, సుజనా సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మొన్నీమధ్యనే ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేళ..సుజనాకు మళ్లీ సీటు వస్తుందా అనే చర్చ కూడా బలంగా టీడీపీలో జరిగింది. అయితే రెండోసారి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆర్థిక వ్యవహారాలు, ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో సుజనాచౌదరి..పార్టీ అధినేతకు చేదోడు వాదోడుగా ఉన్నా..ఢిల్లీలో ఆయన వ్యవహరించే తీరుపై పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు కూడా చర్చ జరుగుతోంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన హామీల విషయంలో ప్రారంభంలో చంద్రబాబు సీరియస్‌గానే స్పందించేవారు. బడ్జెట్లలో కేంద్రం కేటాయింపులపై మా రెక్కలు విరిచేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానీ ఆ సమయంలో సుజనా కేంద్రం తీరును కొంత వెనుకేసుకురావడం అప్పట్లోనే సంచలనమైంది. 
సుజనా వ్యవహారంపై సొంతపార్టీలోనే చర్చ 
అలాగే అరుణ్ జైట్లీ రాష్ట్ర సమస్యలపై భేటీ అవ్వడం..సీనియర్ నేత, క్యాబినెట్ మంత్రైన అశోక్ గజపతి రాజుకు ఇలాంటి సమయాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అశోక్ కూడా చాలా సందర్బాల్లో అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంట. ఆ మధ్యన గోదావరి పుష్కరాల సమయంలోనూ రాజమండ్రిలో చంద్రబాబు పార్టీ ఎంపీలతో సమావేశంలో అశోక్ , సుజనా మధ్య గొడవ చోటు చేసుకోవడానికి ఇదే కారణమనే ప్రచారమూ జరిగింది. హామీల విషయంలో పక్కన పెడితే సుజనా బిజెపికి దగ్గరవుతున్నారనే టాక్ ఢిల్లీలో ఉండనే ఉంది. వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలతో సన్నిహితంగా మెలగడం వెనుక రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన సొంత ప్రయోజనాలున్నాయనే వారూ పార్టీలో ఉన్నారు. అయితే వీటిని సుజనా అనుచరులు కొట్టి పారేస్తున్నారు.
అశోక్‌గజపతి రాజుకు ప్రాధాన్యత ఇవ్వని సుజనాచౌదరి 
రైల్వే జోన్ , ప్రత్యేక హోదా విషయంలోనూ చాలా సందర్బాల్లో సుజనా చౌదరి అదిగో వచ్చేస్తోంది. ఇదిగో వచ్చేస్తోందంటూ ప్రకటనలూ గుప్పించారు. రైల్వే మంత్రి విజయవాడకో విశాఖకో వస్తుంటే.. తీపి కబురందిస్తారంటూ మాట్లాడిన సందర్బాలూ ఉన్నాయి. ఈ సంవత్సరపు రైల్వే బడ్జెట్‌కు సరిగ్గా ఐదు రోజుల క్రితం కూడా రైల్వే జోన్‌పై ఈ బడ్జెట్‌లోనే సురేష్ ప్రభు ప్రకటన చేస్తారంటూ సుజనా ప్రకటించేశారు. దాంతో తెలుగు మీడియా ఛానెళ్లన్ని అటెన్షన్ అయిపోయాయి. అయితే అది గాలి ప్రకటనేనని ఆ తర్వాత తేలిపోయింది. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీపై రెండు నెలల్లో స్పష్టత వస్తుందంటూ రెండేళ్లుగా సుజనా చెబుతూనే ఉన్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. 
ప్రత్యేక హోదా వస్తుందంటూ రెండేళ్లుగా చెప్తున్న సుజనా 
కంభంపాటి రామ్మోహనరావు..ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రెండో టెర్మ్ కొనసాగించాలనే కోరుతున్నారట. దీనికి కూడా సుజనా మోకాలడ్డారనే ప్రచారం టీడీపీలో ఉంది. ఏది ఏమైనా..సుజనా చౌదరి వ్యాపారవేత్త కాబట్టి ఆయనకు వివిధ రకాల సమీకరణాలకు ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం..కేంద్రం మెడలువంచి విభజన హామీలు నేరవేరేలా చూడాలని పలువురు కోరుతున్నారు. కంభంపాటి రెండో టర్మ్‌ కొనసాగకుండా సుజనా అడ్డుపడ్డారనే ప్రచారం.

 

21:46 - August 6, 2016

విజయవాడ : రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు..  కేంద్ర మంత్రి సుజనా చౌదరి.. ప్రత్యేక హోదాపై చిత్తశుద్దితో కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించడంలేదని విమర్శించారు.. రాజకీయాలు ఆపి ఏపీ ప్రయోజనాలకోసం కృషి చేయాలని సూచించారు.. రాజ్యసభలో ఛైర్మన్‌ ప్రకటన తర్వాత తాను బల్ల చరిచి అభినందించాల్సిన అవసరం ఏదీలేదని స్పష్టం చేశారు.. ఇలా చేయడంవల్ల ఎవరు గెలిచారు? ఎవరు ఓడారని సుజన ప్రశ్నించారు.

 

21:41 - August 6, 2016

కడప : ప్రత్యేక హోదా రాద‌ని తెలిసినా చంద్రబాబు నాట‌కాలాడుతున్నార‌ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌ఫూర్ విమర్శించారు. క‌డ‌ప‌లో జ‌రిగిన సీపీఎం జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి హాజ‌రైన గఫూర్‌..ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు..రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్రమను నిర్మించి..రాయ‌లసీమ‌లోని నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌న్నారు. క‌డ‌ప ఉక్కు-రాయ‌ల‌సీమ హ‌క్కు పేరుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ‌న్నారు. 

 

21:38 - August 6, 2016

ప్రకాశం : జిల్లా మార్కాపురం మార్కెట్‌ యార్డు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కరెంటు స్తంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మర్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. టైర్‌ పంక్చర్‌ కావడంవల్లే బస్సు అదుపుతప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు.

టీ.సచివాలయంలో కానిస్టేబుల్ అభ్యర్థులు అందోళన

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో కానిస్టేబుల్ అభ్యర్థులు అందోళన చేపట్టారు. హోంమంత్రిని కలిసేందుకు 15 మంది అభ్యర్థులు వచ్చారు. అనారోగ్య కారణాల వల్ల కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేక పోయామని, మరో అవకాశం ఇప్పించాలని తమ వద్ద మెడికల్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. 

రియో ఒలింపిక్స్ లో అమెరికాకు తొలి స్వర్ణం

బ్రెజిల్ : రియో ఒలింపిక్స్ లో అమెరికాకు తొలి స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో విర్జినియా త్రాషర్ కు స్వర్ణం లభించింది. 

21:20 - August 6, 2016

జీవితమొత్తంలో అన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే డిటెక్టివ్ కు ఎదురయ్యేవి అన్ని షాక్ కు గురయ్యే సంఘటనలే.. మరి డిటెక్టివ్ షాడో షాక్ తిన్న ఏమై ఉంటుంది.? లెట్స్ వాచ్.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

21:12 - August 6, 2016

క్యాడర్ తోటి రోడెక్కిన కరీంనగర్ కాంగ్రెస్...పోలీసోళ్లు రాకముందుకే పొన్నం అరెస్టు, బోనాలమీదికెళ్లి శిగాల దాకొచ్చి పంచాది.... ముఖ్యమంత్రి తలసుకుంటేనే ఇది ఒడిసేది, మేమే తాగిపిస్తం మేమే అరెస్టు చేస్తం.. మిషన్ దేవదాసు పత్కంల సర్కార్ పంథం, సీఎంకు పోస్టుకారట్లు పంపిన మోత్కుపల్లి... మళ్ల ఇదొకటి మోపుజేసినావు కొత్త లొల్లి, జనాన్ని నమ్మి మోససోయిన దేవుడు.. పాలమూరు జిల్లాల గజగజ గణపతి, సర్కార్ ఆస్పత్రిల డెలివరైనా పాము.. మొరుగైన వైద్యసేవలకోసం ఈడికొచ్చాము.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:59 - August 6, 2016

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సినీ నటులు రాజీవ్ కనకాల, శివ బాలాజీలతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు పలు విషయాలను తెలిపారు. తమ సినిమా అనుభావాలను పంచుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:57 - August 6, 2016

మెదక్ : ఎవరో వస్తారని... ఏదో చేస్తారని... ఆ మహిళలు ఎదురుచూడలేదు.. ఎదురైన సమస్యను చూసి భయపడలేదు... మన ఖర్మ అని సరిపెట్టుకోలేదు.. పోరాడితే పోయేదేముంది అంటూ ముందడుగు వేశారు.. వేలాదిమందిలో స్ఫూర్తి నింపిన బద్రిపూర్‌ మహిళల ధైర్యంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి. ఈ వీర వనితల విజయగాథపై 10టీవీ స్పెషల్ స్టోరీ.. 
నిమ్జ్‌ నిర్వాసిత గ్రామాల్లో ఆందోళన
ఏ దేశంలోనైనా రైతు భూమినే నమ్ముకొని బతుకుతాడు.. ఆ అన్నదాతపై ఆధారపడి వ్యవసాయ కూలీల కుటుంబాలు బతుకుబండి లాగిస్తాయి. ఇంతమంది కడుపునింపే ఆ భూమిని అమ్ముకుంటే రైతన్నకు పరిహారం దొరుకుతుంది.. కూలీలుమాత్రం రోడ్డునపడతారు.. సరిగ్గా ఇదే పరిస్థితి నిమ్జ్‌ నిర్వాసిత గ్రామాల్లో ఏర్పడింది.... ఈ సమస్యచూసి అందరిలా ఆ గ్రామ మహిళలు భయపడలేదు.. ఇది మన ఖర్మ అంటూ సరిపెట్టుకోలేదు.. తమకు న్యాయం చేయాలంటూ పోరాటం సాగించారు.. హైకోర్టులో విజయం సాధించారు.
జీవోతో భూసేకరణపై గ్రామాల్లో వ్యతిరేకత
నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌.. నిమ్జ్‌ను మెదక్‌ జిల్లాన్యాల్‌కల్‌, జరాసంగం మండలాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ మండలాల్లో 21వేల ఎకరాల భూసేకరణకు 123 జీవో జారీచేసింది.. భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా జీవోతో భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నించడం వివాదాస్పదమైంది.. చట్టంప్రకారం భూమి తీసుకోవాలంటూ పలు గ్రామాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.. 
న్యాయపోరాటానికి సిద్ధం.. 
భూమిని అమ్మేస్తే రైతులకు డబ్బు వస్తుంది.. మరి ఈ భూములపై ఆధారపడ్డ తామెలా బతకాలని జరాసంగం మండలం బర్దిపూర్‌ గ్రామంలోని వ్యవసాయ కూలీలు ఆలోచించారు. ఈ భూములుపోతే జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందారు. వ్యవసాయ కార్మికసంఘం సహకారంతో 20మంది మహిళలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.. 
123 జీవో రద్దు 
123 జీవోపై వ్యవసాయ కూలీల తరపున తుక్కమ్మ హైకోర్టులో పిటిషన్ వేసింది.. వీరివాదన విన్న కోర్టు ప్రభుత్వతీరును తప్పుబట్టింది.. భూసేకరణచట్టం ఉండగా జీవో ఎందుకు జారీచేశారని ప్రశ్నించింది.. 123 జీవోను రద్దు చేసింది... కోర్టు తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.. ఈ తీర్పు మిగతా గ్రామాల్లోనూ స్ఫూర్తి నింపింది. బర్దీపూర్‌ మహిళల పోరాటాన్ని జిల్లా వ్యవసాయ కార్మికసంఘం ప్రశంసించింది.. వీరికి అండగా నిలవడం గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. నమ్ముకున్న వృత్తి రేపటినుంచి ఉండదన్న ఆవేదన ఈ మహిళలు తెగించి పోరాడేలా చేసింది. జీవో రద్దు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ వేసినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వీరంతా ముందడుగు వేస్తున్నారు. కోర్టుముందు తమ వాదన వినిపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఉద్యమం ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ వీర వనితలకు లాల్‌ సలామ్‌ చేస్తోంది 10 టీవీ.

మైగన్ పోర్టులను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : మైగన్ పోర్టులను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. దేశంలో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రధానినే అడుగుతారని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బాధ్యతాయుత పాలన సాగినపుడే సుపరిపాలన సాధ్యమన్నారు. 

 

నల్సార్ లా యూనివర్సిటీ 14 వ స్నాతకోత్సవం

రంగారెడ్డి : నల్సార్ లా యూనివర్సిటీ 14 వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఉమ్మడి హైకోర్టు చీఫ్ రంగనాథన్ హాజరయ్యారు. 

 

19:58 - August 6, 2016

హైదరాబాద్ : శుభ్రంగా ఉండటం నాకలవాటు... రోడ్లన్నీ కడిగినట్టు ఉండాలనుకుంటా... అంటున్నాడు జీహెచ్‌ఎంసీ  పారిశుద్యకార్మికుడు వెంకటయ్య. నిబద్ధతగా విధులు నిర్వహించినందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతులు మీదుగా ఉత్తమ పారిశుద్య అవార్డు అందుకున్నారు వెంకటయ్య. చెత్తా చెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని ప్రజలను కోరుతున్నాడు. 

19:09 - August 6, 2016

మెదక్ : ప్రొఫెసర్‌ జయశంకర్‌ క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత గల గొప్ప మహనీయుడని స్పీకర్ మధుసూధనచారి అన్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో జయశంకర్‌ 82వ జయంతి సందర్భంగా స్పీకర్ మధుసూధనాచారి, మంత్రి హరీష్‌రావు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ...ప్రొఫెసర్‌ జయశంకర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని..తన జీవితంలో మర్చిపోలేని వ్యక్తి జయశంకర్ అన్నారు. తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు వివరించిన గొప్ప నేత ప్రొఫెసర్‌ జయశంకర్ అని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన కన్న కలలను సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నెరవేరుస్తామన్నారు. ప్రాజెక్టులు ఆగిపోతే కాంగ్రెస్‌ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

19:07 - August 6, 2016

మెదక్ : ఈ నెల 7వ తేదీన మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ  మెదక్‌ జిల్లా కోమటిబండకు రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. ఈమేరకు మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని ప్రశాంత్‌రెడ్డి చెబుతున్నారు. ఈ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని పేర్కొన్నారు. 

మోడీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

మెదక్ : రేపు ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు సమీక్ష చేపట్టారు. మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రధాని వేదికపై 18 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీ పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రధాని పర్యటనకు వచ్చే వారికోసం పాస్ లు జారీ చేశామని చెప్పారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో రేపు ప్రధాని మోడీ పర్యటనపై చర్చస్తున్నట్లు తెలుస్తోంది. 

18:46 - August 6, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని టీకాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. టీప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. మల్లన్న సాగర్‌ ముంపువాసుల గోడు వినకుండా 144 సెక్షన్ విధించడం దారుణమన్నారు. ఆ గ్రామాల్లో పర్యటనకు వెళుతున్న ప్రజాప్రతినిధుల అరెస్టును ఆయన ఖండించారు. ఈ అన్యాయాలపై ప్రధాని మోడీ దృష్టిపెట్టాలని కోరారు. భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారని పేర్కొన్నారు. 

18:40 - August 6, 2016

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారు. గవర్నర్‌తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌ను కూడా రాజ్‌భవన్‌లోనే సీఎం కేసీఆర్ కలిశారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా ఉన్నారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఠాకూర్‌ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో నిర్వాసితులకు సౌకర్యాలు కల్పించేందుకు ఉద్దేశింపబడిన 123 జీవోపై కోర్టు తీర్పు అంశంపై గవర్నర్‌తో చర్చించారు. దాంతో పాటు ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో వేసిన అప్పీలుపై కూడా చర్చించారు. ఆదివారం ప్రధాని మెదక్ జిల్లా పర్యటనపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర హైకోర్టు విభజన సమస్య..దాని కోసం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. 

 

18:27 - August 6, 2016

హైదరాబాద్ : రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిచారు. రేపు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకుంటారని దత్తాత్రేయ వివరించారు మోడీ రాక సందర్భంగా.. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని దత్తాత్రేయ సూచించారు. 

18:09 - August 6, 2016

విజయవాడ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. విజయవాడ డివిజన్‌ ట్రెజరీ ఆఫీసులో సబ్‌ ట్రెజరరీ అధికారిగా పనిచేస్తున్న మోహన్‌రావు నాలుగు నెలల క్రితం ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేసి.. ఉద్యోగ విరమణ చేసిన జగన్నాథరావు అనే వ్యక్తికి తనకు కావాల్సిన పిఎఫ్‌ ఇతర అలవెన్స్‌లను శాంక్షన్ చేసేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారు. దీంతో జగన్నాథరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మోహనరావుకు తన కార్యాలయంలోనే 3 వేల 500 రూపాయలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ ముద్రణాలయంలో పనిచేసే అధికారి ఆనందరావుతో కలిసి మోహన్‌రావు ఉద్యోగులను వేధిస్తుండడంతో.. చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు జగన్నాథరావు తెలిపారు. 

 

17:58 - August 6, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిందని టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శించారు. గ్రేటర్‌లో అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఇందిరాపార్క్‌ వద్ద పార్టీ నగర కమిటీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అవగానే కేసీఆర్‌ నిజస్వరూపం బయటపడిందన్నారు. హైదరాబాద్‌లో 100రోజుల ప్రణాళిక ఏమైందిని ఆయన ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదని, గుంతల రోడ్లు, ఆసుపత్రుల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. 'రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మనకెందుకని' పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వం మెడలు వంచి పోరాడతామన్నారు. ప్రజలకు దూరంగా ఉంటూ సీఎం పాలన కొనసాగిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఆందోళన చేస్తున్న టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. 

 

17:50 - August 6, 2016

హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కమలం పార్టీ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించబోయే సమ్మేళన్‌ సభకు ఆహ్వానం పంపలేదు. ఈ వేదికపై 22మంది ప్రజాప్రతినిధులకు చోటు దక్కింది. రాజాసింగ్‌కు ఆహ్వానం అందకపోవడానికి కారణాలు ఇంకా బయటకు రాలేదు. 

ప్రధాని పర్యటనకు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అందని ఆహ్వానం

హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కమలం పార్టీ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించబోయే సమ్మేళన్‌ సభకు ఆహ్వానం పంపలేదు. ఈ వేదికపై 22మంది ప్రజాప్రతినిధులకు చోటు దక్కింది. రాజాసింగ్‌కు ఆహ్వానం అందకపోవడానికి కారణాలు ఇంకా బయటకు రాలేదు. 

రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ రాద్దాంతం : సుజనా

విజయవాడ : రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని కేంద్రమంత్రి సుజనా చౌదరి విమర్శించారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు రాష్ట్రంలో కాదు..  ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. సమిష్టిగా కృషి చేస్తేనే రాష్ట్రానికి  లాభం కలుగుతుందన్నారు. 

 

ఆర్టీసీ బస్సు బోల్తా

ప్రకాశం : మార్కాపురం వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు మార్కాపురం నుంచి ప్రొద్దుటూరు వెళ్తోంది. 

 

మోడీ తెలంగాణ పర్యటనపై దత్తాత్రేయ సమావేశం..

హైదరాబాద్ : మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై కేంద్రమంత్రి దత్తాత్రేయ ఉన్నస్థాయి సమావేశం నిర్వహించారు. మోడీ పర్యటన వివరాలను వివరించారు.

 

17:24 - August 6, 2016

శ్రీనగర్ : భారీ వర్షాల కారణంగా జమ్ము నుంచి వైష్ణవిదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. భక్తులు ఓ షెల్టర్‌లో తలదాచుకోగా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సిఈఓ అజిత్‌ సాహూ తెలిపారు. మృతుల్లో బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల శశిధర్‌ కుమార్, 30 ఏళ్ల బిందూ సాహ్ని, ఆమె ఐదేళ్ల కుమారుడు విశాల్‌, ఛత్తీస్‌గడ్‌కు చెందిన 32 ఏళ్ల సాధిక్‌ ఉన్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్చారు.  

 

17:17 - August 6, 2016

హైదరాబాద్ : ఆచార్య జయశంకర్‌ 86వ జయంతి వేడుకలు తెలంగాణ సచివాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎస్‌ రాజీవ్‌ శర్మ, జీఏడి ఆధార్‌ సిన్హ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, అసెంబ్లీ సెక్రటరీ సదారాం, సచివాలయం ఉద్యోగ సంఘం నేతలు పాల్గొన్నారు. జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. 

 

17:11 - August 6, 2016

అనంతపురం : రాష్ట్రానికి ఆర్థిక లోటు ఉన్నా.. చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. ఏపీలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్షమే నేతన్నల దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు. ఈ ఏడాది నుంచే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. చేనేత పరిశ్రమ నిలదొక్కుకునేందుకు సబ్సిడీగా 50 కోట్లు కేటాయిస్తామన్నారు. 

 

16:58 - August 6, 2016

ఢిల్లీ : అతిపెద్ద విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్‌కు తెరలేచింది. రియో డిజెనీరోలోని మరకానా స్టేడియం శోభాయమానమైంది. బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడున్నర గంటలపాటు సాగిన ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యుత్ దీపాలు, బాణాసంచా వెలుగులతో స్టేడియం దేదీప్యమానమైంది. మైదానంలో ఆరువేల మంది కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. కల్చరల్ ఈవెంట్స్ అదుర్స్ అనిపించాయి.  మైదానంలో 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 
భారత పతాకధారిగా ముందుకు నడిచిన అభినవ్‌ బింద్రా
భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రా వేడుకల్లో జాతీయ జెండాతో భారత బృందాన్ని ముందుకు నడిపించారు. ఈ సారి ఒలింపిక్స్‌ బరిలో భారత్ నుంచి 118 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. వందమందికిపైగా భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.

 

గవర్నర్, సీజేను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : గవర్నర్, సీజేను సీఎం కేసీఆర్ కలిశారు. 123 జీవో అప్పీల్ పై గవర్నర్ తో సీఎం చర్చించారు. హైకోర్టు విభజన చేపట్టాలని సీఎం సీజేను కోరారు. 

కమాన్ కూలిన ఘటనలో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్ : కేపీహెచ్ బీ వసంత్ నగర్ లో కమాన్ కూలిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బిల్డర్ రంగబాబు, సూపర్ వైజర్ కృష్ణ, సెంట్రింగ్ మేస్త్రీ మోహన్ రావులను అరెస్టు చేశారు. 

15:45 - August 6, 2016

జైపూర్ : గోసంరక్షణకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే బిజెపి ప్రభుత్వాలు వాటిని కాపాడడంలో మాత్రం విఫలమవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో రెండు రోజుల్లో 90 ఆవులు మృతి చెందడం కలకలం రేపింది. గత రెండు వారాల్లో 5 వందలకు పైగా గోవులు మరణించడంపై హైకోర్టు సీరియస్‌ అయింది. దీనిపై రిపోర్టు ఇవ్వాలని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్వంలో నిర్వహించే హింగోనియా గోశాలలో 8 వేలకు పైగా ఆవులున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతియేటా 20 కోట్లు బడ్జెట్‌ కేటాయిస్తోంది. గత రెండు వారాలుగా కార్మికులు సమ్మెకు దిగడంతో ఆవులను చూసే దిక్కులేక ఆకలితో అలమటిస్తూ మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని వైద్యులు చెబుతున్నారు. 

 

15:40 - August 6, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. సభలో మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యులు చట్టంలో.. హామీలను ఎందుకు పొందపరచలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

 

15:38 - August 6, 2016

హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఎంసెట్ త్రీ నిర్వహణ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఎంసెట్-3 నిర్వహణ విధివిధానాలు, షెడ్యూల్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న ఎంసెట్‌ త్రీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కన్వీనర్‌ యాదయ్య తెలిపారు. అలాగే ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్‌ టూ పరీక్షకు రాసినవారే ఎంసెట్‌ త్రీకి అర్హులని పేర్కొన్నారు.. అలాగే కొత్త హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.  ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఎంసెట్ త్రీ పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 

 

బాబు, జైట్లీ కుట్రతో లోక్ సభకు ప్రయివేట్ బిల్లు : సి.రామచంద్రయ్య

హైదరాబాద్ : చంద్రబాబు, జైట్లీ కుట్రపన్ని ప్రయివేట్ బిల్లును లోక్ సభకు పంపించారని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు వైఖరికి అనుగుణంగానే బిల్లును లోక్ సభకు పంపడంపై సుజనా హర్షాతిరేకాలు చేశారన్నారు. కాంగ్రెస్ కు క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతోనే చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. 

 

బీజేపీ అధ్యక్ష పదవికి విజయ్ రూపాని రాజీనామా

గాంధీనగర్ : బీజేపీ అధ్యక్ష పదవికి విజయ్ రూపాని రాజీనామా చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గుజరాత్ సీఎంగా విజయ్ రూపాననీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.  

జెఎన్ టీయూలో ముగిసిన ఎంసెట్3నిర్వహణ కమిటీ సమావేశం

హైదరాబాద్ : కూకట్ పల్లి జెఎన్ టీయూలో నిర్వహించిన ఎంసెట్3నిర్వహణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎంసెట్ 3 నిర్వహణ విధి విధానాలు, షెడ్యూల్ పై చర్చించారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, జెఎన్ టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి, కన్వీనర్ యాదయ్య హాజరయ్యారు. 
 

14:06 - August 6, 2016

హైదరాబాద్ : నగరంలోని చందానగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సెంట్రో చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

14:04 - August 6, 2016

విశాఖ : ఎన్నో ప్రమాదాలు జరగకుండా కాపు కాసింది...నడి సంద్రంలో నావలకు మార్గం చూపింది...మత్స్యకారులకు పెద్ద దిక్కుగా నిలిచింది. మొత్తానికి విశాఖ నగరానికి వెన్నుముకగా ఉంది..అంతటి విశిష్టత కలిగిన నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ నేడు అవసాన దశలో ఉంది.

బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటు చేసి నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ..
బ్రిటీష్‌ వారి హయాంలో నావిగేషన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను విశాఖపట్నం భీమిలీలో ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో ఇది మత్స్యకారులకు వరప్రదాయినిగా మారింది. అయితే మన పాలకుల అధికారంలో ఆ సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది.

బ్రిటీష్‌ వారి వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడిన సిగ్నల్‌ వ్యవస్థ..
ఎప్పటికప్పుడు తుఫాన్‌ హెచ్చరికలు జారీ ..నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యాపారులు..బ్రిటీష్‌వారు ఓడల ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేసేవారు. దీంతో ఇక్కడ లైట్ హౌస్, పోర్టు షిప్పింగ్ కార్యాలయంతో పాటు తుఫాన్‌లు వచ్చే సమయాల్లో హెచ్చరికలు జారీ చేసేందుకు 1840లో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. తుఫాను వచ్చే ముందు ఇక్కడ ఉన్న ఫ్లాగ్ పోస్టుకి దాని తీవ్రతను తెలియపరిచే నెంబరు బుట్టను, జెండాను ఎగురవేసేవారు. దీంతో ఇది మత్స్యకారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేది.

భారత స్వతంత్ర్యం అనంతరం మూతబడిన పోర్టు..
అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పోర్టు మూతబడిపోయింది. తర్వాత ఇక్కడి పోర్టు కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అక్కడ బుట్టలు, జెండాలతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా శిథిలమయ్యాయి. అయితే ఇది లేకపోవడం వల్ల తిమ్మాపురం నుంచి అన్నవరం వరకూ సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్యకారులకు సమస్యగా మారింది. ఎప్పటికప్పుడు తుఫాను హెచ్చరికలు జారీ అవ్వడంతో వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండేవారు. ప్రస్తుతం తుఫాన్‌ పరిస్థితి తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

తుఫానుకు ధ్వంసం అయిన సామగ్రి..
అలాగే విశాఖలో సంభవించిన హుద్‌హుద్‌ తుఫాన్‌కు ఇక్కడ సామాగ్రి మొత్తం ధ్వంసమయ్యాయి. దీంతో సిగ్నలింగ్‌ వ్యవస్థ పూర్తిగా మూలన పడింది. దీనిని పట్టించుకునేవారే కరువయ్యారని..ఈ సిగ్నలింగ్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని పాలకులను కోరుతున్నామని స్థానికులు చెబుతున్నారు.

చరిత్ర ఆనవాళ్ళను కాపాడుకోవాల్సి అవసరం వుంది..
ఏది ఏమైనా చరిత్రకు ఆనవాలుగా నిలిచిన ఇటువంటి వ్వవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

13:56 - August 6, 2016

శ్రీకాకుళం : వర్షాకాలం వస్తే చాలు శ్రీకాకుళం జిల్లాలోని వరినాట్ల కూలీలు ఎక్కడ లేని హుషారుతో కలసి కట్టుగా పని చేస్తారు.. కష్టాన్ని మర్చిపోతారు.. అలుపు సలుపు లేకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తారు.. పంటలు బాగా పండాలని, మంచి లాభాలు రావాలని తమ పాటల ద్వారా కోరుకుంటారు. ఇది జిల్లాలో వరినాట్లు వేస్తూ కూలీలు కనిపించే తీరు.

లక్ష్మీదేవిని కొలుస్తూ పాటలు..
శ్రీకాకుళం జిల్లాలో వరినాట్లు వేసే సమయంలో మహిళా కూలీలంతా పాటలు పాడుతూ.. ఉల్లాసంగా పనిచేయడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ. ఇదంతా చూసేవారికీ చాలా సరదాగా కనిపిస్తుంది. మహిళలు అందరూ నోటితో ఈళలు వేస్తూ అందరూ ఒకేసారి లక్ష్మీదేవిని కొలుస్తూ పాటలు పాడుతుంటారు. వరినాట్ల సీజన్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది.. వర్షాలు విరివిగా కురుస్తుండటంతో పదిహేను రోజుల నుంచి ఊబలు వేయడం జరుగుతోంది. అయితే వరినాట్లు వేసేందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ నిరంతరాయంగా పనిచేయాల్సిఉంటుంది..

పొలంలోకి దిగేటప్పుడు చెప్పులు కూడా వేసుకోని కూలీలు..
ఖరీఫ్, రబీ సీజన్లలోని వరినాట్ల సమయంలో ఈ తరహా స్వరాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలోని పంట పొలాలలో పాతకాలం నాటి కూలీలు ఈ విధమైన పాటలు పాడుతుంటారు. వరి పైరును లక్షీదేవిగా కొలిచే కూలీలంతా కనీసం పొలాలలో దిగేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా పూజలు, పాటలతో పనులు చేసుకోవడం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతోంది. 

13:51 - August 6, 2016

అనంతపురం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మవరంలోని రైల్వే వంతెనను సీఎం ప్రారంభించారు. అనంతరం వనం మనం కార్యక్రమంలో భాగంగా సీఎం మొక్కను నాటారు. అలాగే చేనేత కార్మికుల రుణమాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్క అనంతపురం ధర్మవరం, వెంటకటగిరి,ఉప్పాడలలో చేనేతలు ప్రసిద్ధిగాంచాయన్నారు.చేనేత కార్మికులు చేయూతనిచ్చిన ఏకైక పార్టీ టీడీయేనని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోనే చేనేత కార్మికులకు రూ.38 కోట్ల రుణాలు మాఫీ చేశామని ఆయన తెలిపారు. 

13:41 - August 6, 2016

మహబూబ్‌నగర్‌ : పెబ్బేరు మండలం..గుమ్మడం సమీపంలో 40 జింకలు మృతి చెందాయి. పొలంలో పురుగుల మందు కొట్టిన మొక్కజొన్నలు తినడం వల్లే జింకలు చనిపోయాయి. ఒకేసారి ఇన్ని మూగజీవాలు.. విగతజీవులుగా కనిపించడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  

13:39 - August 6, 2016

నిజామాబాద్ : ఉన్న ఊరిలో ఉపాధి కరువై.... కన్నవారిని, కట్టుకున్న వారిని కాదని ....బతుకు దెరువు కోసం .... మెతుకు వేటలో గల్ఫ్ బాట పట్టిన వారి జీవితాలు .... ఎడారిలో ఎండమావులుగా మారుతున్నాయి. కుటుంబాన్ని పోషిద్దామని...కష్టపడి పనిచేద్దామని గల్ఫ్‌ వెళ్లి కనుమరుగవుతున్న మరెందరో .... తమ కుటంబ దిక్కు ఎప్పడొస్తాడో అని ఎదురుచూస్తు కాలం గడపుతున్న నిజామాబాద్ జిల్లా కుటుంబాల దీనగాధలపై ప్రత్యేక కథనం.....

సొంత ఊరులో ఉపాధిలేక గల్ఫ్ బాట..
కరవు కోత...కుటుంబ పోషణ భారం. ఉపాధి లేక ఏం చేయాలో దిక్కు తోచక .... . బతుకు బండిని నడిపేందుకు గల్ఫ్ బాట పడుతున్నా వారెందరో. ..అక్కడికెళ్లి ఏదో పనిచేసుకుని నాలుగు రాళ్లు సంపాదించి తమ కుటుంబాలను పోషించుకోవాలనుకుంటున్న వారు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. గల్ఫ్ కి వెళ్లిన వారు పదిసంవత్సరాలైనా జాడ లేకపోవడంతో ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో తెలియక ఎన్నో కుటుంబాల రోదన..అరణ్య రోదనగానే మిగులుతోంది.

దిక్కుతోచని స్థితిలో యాదగిరి కుటుంబం..
నిజామాబాద్ జిల్లా పెద్ద మల్లారెడ్డికి చెందిన మంగలి యాదగిరికి భార్య భాగ్యలక్ష్మి, కొడుకు యశ్వంతే అతనికి ప్రపంచం. కుటుంబ పోషణ భారంగా మారి అప్పులయ్యాయ్. చేసేది లేక గతేడాది జూలైలో దుబాయ్ కి కంపెనీ వీసా మీద వెళ్లాడు యాదగిరి. జూలై 19న యాదగిరి దుబాయ్ లో దిగినట్లు మెట్ పల్లి వెల్లుట్ల గ్రామానికి చెందిన ఏజెంట్ యాదగిరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇలా వారం రోజుల పాటు ఏజెంట్ తో మాట్లాడిందే తప్ప యాదగిరితో ఆ కుటుంబ సభ్యులు మాట్లాడింది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ లో యాదగిరి ఆచూకి ఏమైందో తెలియక భార్య భాగ్య లక్ష్మి, కొడుకు యశ్వంత్ కన్నీళ్లు దిగమింగుతూ....బతుకుతున్నారు...

గల్ఫ్‌లో పనిచేస్తూ ప్రమాదానికి గురైన సిద్ధిరాములు
కన్నవారికి... భార్యా బిడ్డలకు అందమైన జీవితాన్నివ్వొచ్చని ఊహించుకుంటూ.... గల్ఫ్ విమానమెక్కిన సిద్ధి రాములు అనుకోని ప్రమాదంలో చిక్కి అచేతనంగా మారాడు. ఉపాధి వెతుకుతూ దువాఖతర్ కు గతేడాది జూన్ లో వెళ్లాడు. జూలై2న పనిచేస్తుండగా.....ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు దేశం కాని దేశంలో ఆస్పత్రి పాలైన భర్తను చూసేందుకు కూడా వెళ్లలేని స్థితిలో ఆ భార్య పడుతున్న వేధన వర్ణానాతీతం. నాన్న గుర్తొచ్చి పిల్లలు పడిపడి ఏడుస్తుంటారు.

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధితులు
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిట్టూర్పు గాధలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

సెంట్రా బిల్డింగ్ అగ్ని ప్రమాదం...

హైదరాబాదు : నగరపరిధిలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని చందానగర్ పరిధిలోని సెంట్రా బిల్డింగ్ లో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నపళంగా ఎగసిన అగ్ని కీలలు క్షణాల్లో భవనాన్ని చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. భారీ ఎత్తున ఎగసిపడుతున్న అగ్ని కీలల కారణంగా చందానగర్ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

13:22 - August 6, 2016

బ్రెజిల్ : ఒలింపిక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆరంభ వేడుకలే.ఒలింపిక్స్‌కు ఆతిధ్యమివ్వడమే అదృష్టంలా భావించే దేశాలు...ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగలా వేడుకలు నిర్వహిస్తుంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంరంభం ఆరంభవేడుకలు అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు. తరతరాల చరిత్ర కలిగిన ఒలింపిక్ గేమ్స్ ఆరంభ వేడుకలపై టెన్‌స్పోర్ట్స్ స్పెషల్‌ ఫోకస్‌...

ఆరంభమే సంబరం..
ఒలింపిక్స్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంరంభం మాత్రమే కాదు సంబరం కూడా.ఒలింపిక్‌ గేమ్స్‌ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది....ఆరంభ వేడుకలు మాత్రమే...ప్రపంచ దేశాలకు చెందిన వేలాది అథ్లెట్లు, క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ స్పెషాలిటీనే వేరు. కోట్లాది మంది క్రీడాభిమానులు వీక్షించే ఈ వేడుకల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఒలింపిక్స్‌ గేమ్స్‌కు ఆతిధ్యమివ్వాలని ఎన్నో దేశాలు పోటీపడుతుంటాయి. ఆతిధ్యమిచ్చే అదృష్టం చిక్కితే మాత్రం గతం కంటే మరింత ఘనంగా ఆరంభ పోటీలు నిర్వహించాలని తహతహలాడుతుంటాయి.
ఒలింపిక్స్ లో దేనికదే స్పెషల్..
ఇప్పటివరకూ జరిగిన ఒలింపిక్స్ పోటీల ఆరంభ వేడుకలు....వేటికి అవే ప్రత్యేకమని చెప్పాలి. 1896లో మొదలైన ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ నుండి 2012 లండన్‌ ఒలింపిక్ గేమ్స్‌ వరకూ ఆరంభ వేడుకలు ...ఎప్పటికప్పుడూ నిత్యనూతనంగా నిర్వహిస్తూనే ఉన్నారు.

కోట్లాది మంది వీక్షకులు..
ఈ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ప్రత్యక్షంగా చూసేది కొద్ది మందే అయినా .... ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కోట్లాది మంది వీక్షిస్తుంటారు. 1896 ఏథెన్స్ ఒలింపిక్స్ ఆరంభమైన నాటి నుండి బ్లాక్‌ అండ్‌ వైట్‌కే పరిమితమైన ప్రత్యక్షప్రసారాలు...1948 లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి కలర్‌ఫుల్‌గా మారాయి .

ఒక్కో దేశానిది...ఒక్కో శైలి..ప్రతీది ప్రత్యేకమే....
ఒక్కో దేశానిది...ఒక్కో శైలి..ప్రతీది ప్రత్యేకమే....ప్రతీది ప్రతిష్టాత్మకమే...కొన్ని దేశాలు వినూత్నంగా నిర్వహిస్తే ....మరికొన్ని దేశాలు కనీవినీ ఎరుగనీ రీతిలో నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. తమ తమ దేశాల సాంస్కృతి,సాంప్రదాయాన్ని ప్రతిబింబిచేలా జరిపిస్తుంటారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహిస్తుంటారు. ఏ దేశంలో జరిగినా....ఎంత ఘనంగా నిర్వహించినా కలర్‌ఫుల్‌ కార్నివాల్‌ను తలపించే ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ....క్రీడాభిమానులకు కలకాలం గుర్తుండిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.  

13:08 - August 6, 2016

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్..డైరెక్టరర పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు శిరీష్ బ్యూటీ ఫుల్ హీరో యిన్ లావణ్య త్రిపాటీ.. నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్..ఈ సినిమా విశేషాలను మరింతగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..సినిమా విశేషలను తెలుసుకోండి...

13:04 - August 6, 2016

ఢిల్లీ : స్వచ్ఛ స్వేక్షణ్ అభియాన్ ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..500 పట్ణఆల్లో సర్వేక్షణ్ అభియాన్ ను ప్రారంభించామని తెలిపారు. మార్చి నెలలోపు స్వచ్ఛ భారత్ లో ఉత్తమ ఫలితాలు కనిపించాలని కోరారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పై గణాంకాలను ఎప్పటికప్పుడు ప్రజలముందుంచుతామన్నారు. ఇకముందు ప్రజాభిప్రాయం ప్రకారమే సర్వే చేపడతామన్నారు. స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. 

12:45 - August 6, 2016

ఫ్రాన్స్ : రోయిన్‌లోని ఓ బార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు వ్యాపించడంతో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

12:41 - August 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో ఉన్న జయశంకర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జయశంకర్ సార్‌కు నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకున్నారు. 

12:33 - August 6, 2016

హైదరాబాద్ : ఉమ్మడి సంస్థల విభజనాంశం కొలిక్కి వస్తోంది. ఇరు రాష్ట్రాల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇంతవరకూ 61 సంస్థల ఆస్తుల్లో దాదాపు 30 వేల కోట్ల రూపాయలను ఇరురాష్ట్రాలు పంచుకోగా మరికొన్న సంస్థల ఆస్త్తులపై క్లారిటీ రానుంది. ఈ మేరకు విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు కమిటీ వచ్చేవారం కీలక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తుది దశకు ఉమ్మడి సంస్థల విభజనాంశం..
తెలుగు రాష్ట్రల మధ్య సమస్యగా ఉన్న షెడ్యూల్ సంస్థల విభజనాంశం తుది దశకు చేరుకుంటోంది. దీనిపై ఏర్పాటైన షీలా బేడీ కమిటీ కాలపరిమితి ముగిసిపోగా, కొత్తగా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటైంది. సుమారు 60 వేల కోట్ల ఆస్తుల పంపకాలను తేల్చేందుకు రెడీ అవుతోంది.

విభనచట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థల సంఖ్య 89..
ఉమ్మడి సంస్థలకు సంబంధించి విభజన చట్టం షెడ్యూల్-9 విభాగంలో 89 సంస్థలున్నాయి. వాటిలో 61 సంస్థల ఆస్తుల అప్పులను రెండు రాష్ట్రాలకు షీలాబేడీ కమిటీ బదలాయించింది. జనాభా ప్రాతిపదికన పంపకాలు చేసింది. తరువాత ఈ కమిటీ కాలపరిమితి ముగియడంతో మిగతా ప్రక్రియకు బ్రేక్ పడింది.

30 సంస్థల ఆస్తుల పంపకాలపై ఏర్పడిన కొత్తకమిటీ
ఉమ్మడి సంస్థలపై ఏర్పడిన షీలా బేడీ కమిటీ కాలపరిమితి ముగియడంతో ఇప్పడు ఇరురాష్ట్రలకు చెందిన ఐఏఎస్ అధికారులతో కొత్త కమిటీ ఏర్పడింది. దీంతో మళ్లీ ఆయా సంస్థలపై కదలిక వచ్చింది. మిగిలిన 30 సంస్థల ఆస్తులు, అప్పులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల బదలాయింపులను పూర్తి చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. వీలైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు సిద్ధమవుతోంది ఉన్నాతాధికారుల కమిటీ.

12:29 - August 6, 2016

చెన్నై : రోజులు గడుస్తున్నాయి..తమవారు అసలు ఉన్నారో లేదో...వస్తారో రారో తెలియదు. దానికి సంబంధించి ఎవరూ సమాచారం ఇవ్వరు. అసలు మా వాళ్లు వస్తారా ? రారా.. ? వస్తే ఎప్పుడొస్తారు ? ఇది గల్లంతైన ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏఎన్ -32 విమానంలో ప్రయాణించిన ఉద్యోగుల బంధువుల ఆవేదన. విమానం గల్లంతై ఇప్పటికి 15 రోజులు గడుస్తున్నా..విమానానికి సంబంధించిన సమాచారం ఇంత వరకూ తెలియదు.

బయలుదేరిన అరగంటే రాడార్ నుండి తెగిపోయిన సంబంధాలు
గతనెల 21న చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెలుతున్న ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏఎన్ -32 విమానం గాల్లోకి ఎగిరిన అరగంటకే రాడార్ నుంచి అదృశ్యం అయింది. ఆ విమానంలో మొత్తం 29 మంది ఉండగా వారిలో విశాఖకు చెందిన ఏడుగురు ఎన్ ఏడీ ఉద్యోగులు ఉన్నారు. నమ్మి చిన్నారావు, వరప్రసాద్, నాగేంద్ర, గంటా శ్రీనివాస్, సాంబమూర్తి, చరణ్‌ మహారాణా, భూపేంద్ర సింగ్ విమానంలో ఉన్నారు. విమానం ఆచూకీ గల్లంతైనప్పటి నుంచీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తమవారి రాకకోసం ఎదురుచూస్తున్నారు. అసలు తమవారు ఉన్నారో లేరో తెలియక..ఉంటే ఎప్పుడొస్తారో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జులై 21న చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయల్దేరిన ఏఎన్ -32 విమానం
విమానం గల్లంతయిన 15 రోజులనుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విమానం ఆచూకీ కోసం భారత్‌తో సహా శ్రీలంక, మలేషియాకు చెందిన నేవీ విభాగాలు సంయుక్తంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. అంతేకాకుండా ఇటీవల భారత ప్రభుత్వం విమాణ గాలింపు కోసం అమెరికా సహకారాన్ని కూడా కోరింది. దాదాపు 20 విమానాలు, ఇతర నౌకలు, సబ్‌మెరిన్ లాంటి వాటితో విస్త్రతంగా గాలింపు జరుపుతున్నా..విమానం జాడ మాత్రం తెలియడంలేదు. ఇదే సమయంలో కొద్ది రోజులుగా వాతావరణం కూడా అనుకూలించడం లేదు. దీంతో అనుకున్న విధంగా గాలింపు చర్యలు జరగడంలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. అసలు వాళ్లు బతికి ఉన్నారా..? లేక చనిపోయారా..? అనే విషయం తెలియక కుమిలిపోతున్నారు.

15రోజులుగా గాలింపు చర్యలు..భారత్‌, శ్రీలంక, మలేషియా నేవీ
ఇదే సమయంలో వదంతులు కూడా బాధిత కుటుంబాలను మరింత అందోళనలకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం విశాఖ నర్సీపట్నం సమీపంలోని మడ అడవుల్లో భారీ శబ్ధం విన్పించిందని..అక్కడ గుర్తు తెలియని శకలాలను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వారికి అప్పగించారనే వదంతులు కూడా వినిపించాయి. దీంతో అసలు ఏం జరుగుతుంది అంటూ బాధిత కుటుంబసభ్యులు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. 

సమావేశమైన ఎంసెట్-3 కమిటీ..

హైదరాబాద్ : కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఎంసెట్-3పై నిర్వహణ కమిటీ సమావేశమైంది. సమావేశంలో ఎంసెట్-3 నిర్వహణ విధివిధానాలు, షెడ్యూల్‌పై చర్చిస్తున్నారు. సమావేశానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య హాజరయ్యారు.

విషాహారం తిని 35 జింకలు మృతి..

మహబూబ్‌నగర్ : విషాహారం తిని 35 జింకలు మృతి చెందాయి. ఈ విషాద ఘటన పెబ్బేర్ మండలం గుమ్మడంలో శనివారం చోటు చేసుకుంది. పొలాల్లో విష గుళికలు తిని జింకలు మృతి చెందినట్లు అటవీశాఖ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది విచారణ చేపట్టింది. చనిపోయిన జింకలను సిబ్బంది స్వాధీనం చేసుకుంది.

11:57 - August 6, 2016

హైదరాబాద్ : ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన ప్రొ.కోదండరాం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన పాత్ర కీలకమైనది ఆయన పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీమని ఆయన పేర్కొన్నారు. జయంశంకర్‌ సార్‌ను గుర్తుజేసుకోవడం అంటే.. ఆయనతో మరో 20ఏళ్లు కలిసి నడిచినట్టే ఉంటుందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణాను అభివృద్ధి చేయటానికి టీజాక్ కృషి చేస్తుందన్నారు. ఆయన ఆశపడిన తెలంగాణ అభివృద్ధి ఫలితాలను ప్రతీ తెలంగాణ బిడ్డలకు దక్కటానికి తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రాపాలకు పెత్తనికి వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా నిలబడి తెలంగాణ సాధించుకోవాలని ఆయన కోరుకునేవారని  కోదండరాం ఈ సందర్భంగా గుర్తు చేశారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రలజలను అభ్యున్నతి దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. 

11:15 - August 6, 2016

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కు సంబంధించిన కమర్షియల్ కాంపెక్సు భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారలు సీజ్ చేశారు. భవనంలో వున్న రెండు అంతస్తులకు మాత్రమే అనుమతి వుందని మిగతా అంతస్థులు అక్రమంగా నిర్మించటంతో భవనాన్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన ఎమ్మెల్యే వివేక్ పట్టించుకోకవటంతో భవనాన్ని సీజ్ చేశామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా జీహెచ్ ఎంసీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే తాను అనుమతులు తీసుకున్న తరువాతనే నిర్మాణాన్ని చేపట్టానని ఇప్పుడు కూల్చివేయమని నోటీసులు ఇవ్వటంపై తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆయన కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై సమగ్ర సమచారం కోసం ఎమ్మెల్యే అందుబాటులోకి వస్తేనే మరింత సమచారం తెలుస్తుంది. 

11:01 - August 6, 2016

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ మద్యం మాఫీయా చెలరేగిపోతోంది. మద్యానికి అలవాటు పడ్డవారి బతుకులతో చెలగాటమాడుతోంది. మద్యం అమ్మకాలు పెరగడంతో కాసుల కక్కుర్తి కోసం వ్యాపారులు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు..కల్తీ మద్యాన్ని ఖరీదైన బాటిళ్లలో పోసి అదే ధరకు విక్రయిస్తున్నారు.

కల్తీ మద్యం తయారు చేయడంలో అక్రమార్కుల వ్యూహాలు..
కల్తీ మద్యం తయారు చేయడంలో అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చన్న కక్కుర్తితో దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. మద్యం సీసా మూతలు తొలగించి..అందులోని మద్యాన్ని సగం తీసి నీళ్లు కలుపుతున్నారు. ఆ తర్వాత నిషాలో తేడా రాకుండా స్పిరిట్‌ కలుపుతున్నారు. మరికొందరు నాసి రకం మద్యం కలిపి మందుబాబుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులకు చిక్కకుండా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు....

ఆదిలాబాద్‌లో కల్తీ మద్యం వ్యాపారం జోరు..
ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది...హానికరమైన స్పిరిట్, నీళ్లు కలిపి దందా చేస్తున్నారు. కొన్నేళ్లుగా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ బాగోతం జిల్లాలోనూ ఊపందుకుంది..కాగజ్‌నగర్‌లో భారీగా పట్టుబడ్డ కల్తీ మద్యం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. కాపువాడలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్‌ అధికారులు.. కల్తీరాయుళ్ల గుట్టురట్టు చేశారు. 15 వేల ఖాళీ బాటిళ్లు, 15 వేల మూతలు, స్టిక్కర్లు, భారీ మొత్తంలో స్పిరిట్‌ బాటిళ్లు, కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కర్నాటక,మహారాష్ట్రాల్లో దందా..
మద్యం మాఫియాకు వైన్‌ షాపుల యజమానులు, ఎక్సైజ్‌ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. వీరి అండతోనే భారీ మొత్తంలో కల్తీ మద్యాన్ని తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి సంపాదన రోజుకు 4 లక్షల పైమాటేనట. కల్తీ సరుకును 400 నుంచి 600 పైగా బాటిళ్లు తయారు చేస్తున్నారట. ఈ దందాకు పెద్దగా మిషనరీ అవసరం కాకపోవడం..తక్కువ సిబ్బందితో పనిపూర్తి కావడంతో జిల్లాలో కల్తీ మద్యం దందా వేళ్లూనుకుంటుంది. కాగజ్‌ నగర్‌లో తయారైన మద్యాన్ని సిర్పూర్‌, కౌటాల, బెజ్జురు, దహెగాం, ఆసిఫాబాద్, వాంకిడి ప్రాంతాల్లోని వైన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మద్యం మాఫియాపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కొరడా ఝుళిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

10:56 - August 6, 2016

మహారాష్ట్ర : నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. కృష్ణా నది జన్మస్థలం మహాబలేశ్వర్‌లో రికార్డు స్థాయిలో గడిచిన నాలుగు రోజుల్లో 110 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు, రాష్ట్రంలోని జూరాల పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి తరలుతున్నది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉన్నది. ఇక ప్రాజెక్టుల నీటి మట్టాల విషయానికి వస్తే కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు 2.9 లక్షల క్కూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవడంతో వరదనీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యాంకు వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యాంలోకి 2.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో, మొత్తాన్ని జూరాలకు విడుదల చేస్తున్నారు. జూరాలకు సంబంధించి 14 క్రస్ట్ గేట్లను 5 మీటర్ల ఎత్తు ఎత్తి 2.68 లక్షల క్కూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో అటు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. 2.6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో విద్యుదుత్పత్తి ద్వారా దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 9 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు, ప్రస్తుతం 838 అడుగుల నీరుంది.

మహద్ ఘటనలో 22 మృతదేహాలు లభ్యం..

మహారాష్ట్ర : ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద వంతెన కుప్పకూలిన విషాద ఘటనలో సహాయక సిబ్బంది 22 మంది మృతదేహాలను వెలికితీశారు. సావిత్రి నది ఉద్ధృతికి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ కాలంనాడు నిర్మించిన వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో వంతెనపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు, పలు వాహనాలు నదిలోకి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 మంది నదిలో గల్లంతవ్వగా.. ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, కోస్ట్‌గార్డ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

8మంది విద్యార్థినులపై టీచర్ అత్యాచారం?!..

నెల్లూరు: ఉపాధ్యాయ విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. బీవీనగర్‌ మునిసిపల్‌ పాఠశాలలో పీఈటీ అజయ్‌కుమార్ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు. 8మంది విద్యార్థినులపై అత్యాచారం చేశాడు. గతంలో పనిచేసిన పాఠశాలలోనూ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. విద్యార్థుల తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అజయ్‌కుమార్‌ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. 

శ్రీవారి సేవలో ప్రముఖులు..

తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, కర్ణాటక రాష్ట్ర మంత్రులు పరమేశ్వర్‌, సీతారామ్‌ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన 'లిమా'..!

బ్రెజిల్ : రియోలోని మారకానా స్టేడియంలో ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలనతో విశ్వ క్రీడా పోటీలకు అంకురార్పణ జరిగింది. దాదాపు 12,000 మంది క్రీడాకారుల చేతులు మారి వచ్చిన టార్చ్‌ను మారథాన్‌ రన్నర్‌ వాన్డెర్లీ కార్డిరో డి లిమా చేతికి అందించారు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే తొలిసారి ఏర్పాటు చేసిన హైబ్రీడ్‌ జ్యోతిని కార్డిరో డి లిమా వెలిగించారు.

10:37 - August 6, 2016

గుంటూరు : అమరావతి..! నవ్యాంధ్రకు రాజధాని ప్రాంతం. ఈ ప్రాచీన చారిత్రక ప్రదేశం.. కృష్ణమ్మ పుష్కరాలకు సమాయత్తమవుతోంది. రాజధానిగా తమ ప్రాంతం ఎంపికైన తర్వాత వస్తున్న పుష్కరాలను ఇంటింటి పండుగలా జరుపుకునేందుకు స్థానికులు సన్నద్ధమయ్యారు. అధికారుల ఏర్పాట్లు ఒకవైపు.. స్థానికుల సన్నాహాలు మరోవైపు.. కృష్ణాతీర అమరావతి ప్రాంతంలో పుష్కర శోభ అలరారుతోంది.

భక్తులకు అన్ని వసతులూ కల్పించేందుకు సిద్ధమవుతున్న స్థానికులు
కృష్ణా పుష్కరాలకు.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం సన్నద్ధమవుతోంది. శాతవాహనులు ఏలిన ఈ నేల... నవ్యాంధ్ర రాజధానిగా ఎంపికయ్యాక వస్తోన్న తొలి పుష్కరాలివి. దీంతో తమ ప్రాంతానికి తరలివచ్చే భక్తులకు.. అపూర్వ ఆతిథ్యం ఇచ్చేందుకు ఈ ప్రాంత ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కృష్ణా పుష్కరాలను అమరావతి ప్రాంత ప్రజలు ఇంటింటి పండుగలా భావిస్తున్నారు. అందుకే ఎక్కడా ఏ లోపం జరగకుండా అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనవసతి కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి పుష్కరనగరి వద్ద, ఊరి మధ్యలోని సత్రాల్లో అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సుష్కరాలకు స్వచ్చంద సంస్థల ఏర్పాట్లు...
పుష్కరస్నానాల కోసం తమ ప్రాంతానికి తరలి వచ్చే దూర ప్రాంత భక్తులు బస చేసేందుకు వసతి సదుపాయాలనూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఆతిథ్యం మరెక్కడా చూడలేదన్న భావనతో భక్తులు తిరిగి వెళ్లాలన్న లక్ష్యంగా అమరావతి ప్రాంతవాసులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాటుపడుతున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవా కార్యక్రమాలు..
పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అటు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రహదారి వద్ద సైన్‌బోర్డులు, వాలంటీర్ల సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసినా పుష్కర ఏర్పాట్ల సందోహమే కనిపిస్తోంది. 

10:31 - August 6, 2016

నల్లగొండ : కృష్ణా పుష్కరాల ప్రారంభానికి గడువు కొన్ని రోజులే ఉంది. తెలంగాణలో కృష్ణవేణి ప్రవహించే నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పుష్కరఘాట్ల పనులు జోరందుకున్నాయి. నల్లగొండ జిల్లాలో ఒక్కటే మొత్తం 28 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి పుష్కర సన్నాహాలు ఏ స్థాయిలో సాగుతున్నాయి..? పనుల పూర్తికి ఇంకెంత కాలం పడుతుంది..? అన్నదానిపై 10tv వినూత్నంగా బైక్‌ యాత్ర ద్వారా చేపట్టిన గ్రౌండ్‌ రిపోర్ట్ ..!

10టీవీ బైక్ యాత్ర..
కృష్ణా పుష్కరాల సంబురాలకు నల్గగొండ జిల్లా ముస్తాబవుతోంది. పుష్కరాలకు ఇక వారం రోజులే గడువుంది. కానీ పనుల పూర్తిలో అలసత్వం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నల్లగొండ జిల్లాలో పుష్కర ఏర్పాట్లు ఎంతవరకొచ్చాయన్న దానిపై టెన్‌ టీవీ బైక్‌ యాత్ర ద్వారా ఆయా పుష్కర ఘాట్లను సందర్శించింది. సుమారు 350 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించింది.

22 ఘాట్లను పరిశీలించిన టెన్ టీవీ బృందం...
జిల్లాలోని నాగార్జునసాగర్.. అక్కడి నుంచి అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, ఇర్కిగూడెం ఘాట్ల మీదుగా వయా దామరచర్ల.. అక్కడి నుంచి మహంకాలిగూడెం ఘాట్ ను సందర్శించి అక్కడి నుంచి మట్టపల్లి.. తిరిగి దామరచర్ల గుండా వాడపల్లి చేరుకొని 22 ఘాట్లను పరిశీలించింది టెన్ టీవీ బృందం.

మౌలిక సదుపాయాల లేమి..
గడువు ముంచుకొస్తున్నా కొన్ని ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, దేవాలయాల మరమ్మత్తులు, సుందరీకరణ, స్నానపు గదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, అతిథి గృహాలు, మంచినీటి వసతి లాంటి పనులపై ఇంకా శ్రద్ధ పెట్టనేలేదన్నది ప్రతి చోటా కనిపించింది.

9 మండలాల పరిధిలో పుష్కరఘాట్లు..
9 మండలాల పరిధిలో పుష్కరఘాట్లు విస్తరించి ఉన్నాయి. ఒక్క దామరచర్ల మండలంలోనే 11 ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా.. వీటిలో ఎనిమిది వాడపల్లి చుట్టుపక్కలే ఉన్నాయి. ఘాట్ల నిర్మాణంలో అధికారుల ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సాగర్ క్రొకడైల్ జోన్ లో ఘాట్ ప్రతిపాదన ఎంతమేరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తింది. నల్లగొండ సమీపంలో చేపట్టిన పానగల్, దర్వేశపురం, కనగల్ వాగు ఘాట్లకు కృష్ణా నదికి ఏమాత్రం సంబంధం లేకపోవడం విశేషం.

అరాకొరగా పుష్కరపనులు..
నాగార్జునసాగర్, మట్టపల్లి, వాడపల్లిలోనూ పుష్కర పనుల్లో ఎలాంటి మార్పు లేదు. వాడపల్లిలో 8 ఘాట్లు ఏర్పాటు చేయగా అందులో చాలావరకు జల్లు స్నానాలతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. మట్టపల్లి లోని బ్రిడ్జికి ఎడమవైపు చేపట్టిన ఘాట్ పూర్తిగా కంపచెట్లతో నిండి ఉంది. ఇలా ఎక్కడ చూసినా అరకొర పనులే కనిపిస్తున్నాయి. పుష్కరాల నాటికైనా ఈ పనులు పూర్తవుతాయా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. 

10:26 - August 6, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఏపీలో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే మూడు జిల్లాల్లోనూ పుష్కర ఏర్పాట్లు జోరందుకున్నాయి. ప్రభుత్వం అధికారులను ఉరుకులు పెట్టిస్తోంది. అయితే.. క్షేత్రస్థాయిలో పనులు ఇంకా ఓ కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. పుష్కరాల నాటికైనా ఇవి పూర్తవుతాయా అన్న అనుమానాలున్నాయి. వేగిరం లోపించిన పుష్కర పనులపై టెన్‌ టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్ ..!

పుష్కర పన్లుల్లో అలసత్వం..
పుష్కరాల ప్రారంభానికి మరికొద్ది రోజులే గడువుంది. ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తే అవకాశం ఉంది. ఈపాటికే ఏర్పాట్లన్నీ పూర్తయి.. మాక్‌ డ్రిల్‌ చేసుకోవాల్సిన తరుణమిది. కానీ.. ఏపీలో పుష్కర ఏర్పాట్లు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఎక్కడ చూసినా అధికారుల అలసత్వం, ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

10 లోపు పుష్కర ఏర్పాట్లు పూర్తి చేయాలని లక్ష్యం..
ఈ నెల 10 లోపు పుష్కర పనుల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏపీలో కీలకమైన విజయవాడలోని దుర్గా ఘాట్‌ నుంచి భవానీపురం వరకు 2.1 కిలోమీటర్ల పొడవున ప్రధాన ఘాట్‌ను నిర్మించారు. దీంతో పాటు పద్మావతిఘాట్‌, పున్నమి ఘాట్‌, కృష్ణవేణి ఘాట్‌, గోదావరి జలాలు కలిచే చోట పవిత్ర సంగమం ఘాట్‌లను ఏర్పాటు చేశారు.

పుష్కరాలను ఏపీ సర్కార్ ప్రముఖులకు ఆహ్వానాలు..
కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే అనేకమంది ప్రముఖులను ఆహ్వానించింది. ప్రధాని, రాష్ట్రపతి, ఛీఫ్‌ జస్టిస్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు పంపించారు. వీరందిరి కోసం వీఐపీ ఘాట్‌ కంట్రోల్ రూమ్‌ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే పనులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకా పూర్తికాని 60 శాతం పనులు ...
విఐపీ ఘాట్‌ మినహా.. ఇప్పటి వరకు ఘాట్ల పనులు ఓ కొలిక్కి రాలేదు. పనులు ప్రారంభించి రెండు నెలలైనా ఇంతవరకు 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఘాట్లకు వెళేందుకు కొన్ని చోట్ల కనీసం దారులు కూడా సరిగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పనులు పూర్తవుతాయా లేదా అని అనుమానాలు
పుష్కరాల పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలు పునరావృతమవతుయేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అధికారులు వేగాన్ని పెంచి.. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. 

బార్ లో అగ్ని ప్రమాదం..13మంది మృతి..

ఫ్రాన్స్: రోయిన్‌లోని ఓ బార్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని 13 మంది దుర్మరణం చెందారు. పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

10:13 - August 6, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా నిఘావర్గాలు హెచ్చరించటంతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 31వరకూ సందర్శకులకు పాస్ లు నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్, ఆక్టోసర్ బృందాలు ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టాయి. కాగా రంజాన్ పండుగ సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు హైదరాబాద్ లో దాడులకు పాల్పడటానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఎన్ఐఏ అధికారులు వారి వ్యూహాలను ఛేదించి పలువురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ లో దాడులు జరుగే అవకాశాలున్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తోపాటు పలు సమస్యాత్మక ప్రదేశాలలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైఅలర్ట్..

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా నిఘావర్గాలు హెచ్చరించటంతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 31వరకూ సందర్శకులకు పాస్ లు నిలిపివేశారు.

09:59 - August 6, 2016

విజయవాడ: మానవ నాగరికత ఉద్భవించింది నదీ తీరాల్లోనే.. మహా నగరాలైనా, పుణ్య క్షేత్రాలైనా అన్నీ నదీ తీరాల్లోనే వెలిశాయి. నదితో మనిషికి విడదీయరాని అనుబంధం ఉంది. మన పురాణ ఇతిహాసాల్లోనూ నదుల ప్రాశస్త్యం ప్రతీ సందర్భంలోనూ కనిపిస్తుంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మొత్తం పన్నెండు ప్రధాన నదులను పుణ్య నదులుగా కీర్తించారు. ప్రతీ ఏడు ఒక్కో నదికి పుష్కరం నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ పన్నెండు రోజుల్లో కోట్లాది మంది భక్త జనం పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి టెన్‌ టీవీ ప్రేక్షకుల కోసం పుష్కరవేణి ప్రత్యేక బులెటిన్‌..

సమస్త జీవలోక పావని కృష్ణవేణి..!
కృష్ణవేణి..! సమస్త జీవలోక పావని. ప్రవాహ ఝరితో సిరులొలికించే విరిబోణి. సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక సుధల అలివేణి. తెలుగువారి సంస్కృతీ వైభవాన్ని చాటే తరంగిణి. ఈ సహజసిద్ధ పుణ్య స్రవంతి.. ఇప్పుడు పుష్కరశోభతో ఇంతింతలుగా వర్ణించలేనంతటి పావనిగా.. భక్తుల పూజలందుకోబోతోంది. కృష్ణాపుష్కరాల వేళ.. కృష్ణానది విశిష్టతలు.... పుష్కరుడి విశేషాలపై.. టెన్ టీవీ స్పెషల్ రిపోర్డ్ ..

బృహస్పతి.. కన్యారాశిలోకి ప్రవేశించే ముహూర్తమే.. కృష్ణా పుష్కరం
కృష్ణానదికి పుష్కరాలు..ఇంటింటి పండుగలా జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాలు..నవగ్రహాల్లో ఒకడు.. దేవగురువుగా భావించే బృహస్పతి.. కన్యారాశిలోకి ప్రవేశించే ముహూర్తమే.. కృష్ణా పుష్కర ఆరంభ కాలమన్నది భక్తుల నమ్మకం. బృహస్పతి ద్వాదశ రాశుల సంచారానికి పన్నెండేళ్లు పడుతుందని జోతిషశాస్త్రం చెబుతోంది. దాని ప్రకారం బృహస్పతి తిరిగి కన్యారాశిలో ప్రవేశించడానికి పట్టే పన్నెండేళ్ల కాలాన్ని పుష్కరకాలం అంటారు.
 

దేవలోక గురువు బృహస్పతి..
బృహస్పతి బ్రహ్మలోకానికి చెందినవాడని.. అతడు నదులకు వచ్చినప్పుడు సప్తర్షులు సూక్ష్మదేహాలతో ఆహ్వానం పలుకుతారని.. ఇందరు మహర్షుల స్పర్శతో నది సకల పాపాలూ హరించేంతటి పవిత్రంగా మారుతుందని వాయుపురాణం ద్వారా తెలుస్తోంది.

12ఏళ్ళ ఒకసారి పుష్కరాలు..
భారతదేశంలో పన్నెండేళ్లకు ఓసారి.. నదులకు పుష్కరాల పేరిట ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. ఈ కాలం.. పితృదేవతల స్మరణానికి, తర్పణాదులకు అత్యంత మంచి కాలమన్న భావన ఉంది. అత్యంత పవిత్రకాలంగా భావించే పుష్కరకాలంలో వివాహాది శుభకార్యాలను మాత్రం పూర్వీకులు నిషేధించారు. మరీ అవసరమైతే.. పుష్కరనదీ ప్రవాహం లేని ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

ప్రతి నదికీ ఆది, అంత్య పుష్కరాలు...
ప్రతి నదికీ ఆది, అంత్య పుష్కరాలుంటాయి. గురుడు నిర్దిష్ట రాశిలోకి ప్రవేశించే రోజు నుంచి పన్నెండు రోజుల పాటు ఆది పుష్కరాలు.. ఏడాది చివరలోని చివరి పన్నెండు రోజులూ అంత్య పుష్కరాలు జరుపుతారు. మిగిలిన పదకొండు నెలల ఆరు రోజుల.. మధ్యాహ్నకాలంలో రెండు ముహూర్తాల సమయం పాటు మాత్రమే పుష్కరుడు ఉంటాడని నమ్ముతారు.

పిండప్రదానం.. పితరులకు ఊర్ధ్వలోక గతులనూ కలిగిస్తాయని భక్తులు నమ్మకం
ఈ ఏడాది ఆగస్టు 12న బృహస్పతి.. పన్నెండేళ్ల తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తుండడంతో.. కృష్ణానదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ సమయానికి నారాయణుడి ఆనతి మేరకు.. అన్ని తీర్థాలూ కృష్ణలో వచ్చి కొలువై ఉంటాయనీ పండితులు చెబుతారు. తద్వారా కృష్ణానది పరమపావనిగా విరాజిల్లుతూ ఉంటుందని.. ఆసమయంలో చేసే కృష్ణా స్నానం.. అంతులేని పుణ్యాన్ని, పిండప్రదానం.. పితరులకు ఊర్ధ్వలోక గతులనూ కలిగిస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

2.50లక్షల చదరపు కిలోమీటర్ల కృష్ణానది పరివాహక ప్రాంతం
కృష్ణానదికి రెండున్నర లక్షల చదరపు కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతముంది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా ప్రవహించి.. ఏపీలోని హంసలదీవి వద్ద సాగరంలో కలుస్తోంది. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టల ద్వారా అందే సాగునీరు.. లక్షల ఎకరాల్లో సిరులను కురిపిస్తోంది. కృష్ణా తీరం వెంబడి లెక్కకు మిక్కిలిగా పుణ్యక్షేత్రాలున్నాయి. మనోవిజ్ఞానాన్ని పంచే అద్భుత యాత్రాస్థలాలూ ఉన్నాయి. పుణ్య స్నానాలతో పాటు.. యాత్రా స్థలాల దర్శనం ద్వారా విజ్ఞానాన్నీ పొందే అద్భుత అవకాశాన్ని కృష్ణా పుష్కరాలు కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు చక్కగా వినియోగించుకుంటారని ఆశిద్దాం. 

09:48 - August 6, 2016

హైదరాబాద్ : యూనివర్శిటీలో అడుగు పెట్టారో లేదో... అప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. అధ్యాపకులపై చర్యలు తీసుకుంటామన్నారు. నాన్‌ బోర్డర్స్‌ వెంటనే రూమ్స్‌ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ఆయన ఎవరు ..? వాచ్‌ దిస్‌ స్టోరీ..!

బాధ్యతలు చేపట్టగానే కీలక నిర్ణయాలు ..
రాంచంద్రయ్య.. ఉస్మానియా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఈ మధ్యే నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనివర్శిటీలో చదువు పూర్తై... ఇంకా హస్టల్స్‌లోనే ఉంటున్న నాన్‌ బోర్డర్స్‌ వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ బకాయిలు చెల్లించాలని హుకుం..
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల మెస్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రామచంద్రయ్య. విద్యార్థులు తప్పనిసరిగా క్లాసులకు హాజరుకావాలని, అధ్యాపకులు పాఠాలు బోధించాల్సిందేనని తేల్చి చెప్పారు. తాను వీసీగా నియమితులైనప్పటికీ.. క్లాసులు భోదిస్తానంటున్నారు.

అన్ని డిపార్ట్‌మెంట్లలో బయోమెట్రిక్ విధానం : రాంచంద్రయ్య
ఓయూలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని రాంచంద్రయ్య చెప్పారు. ఓయూకు ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ధీమాగా చెబుతున్నారు. యూనివర్శిటీలో స్కిల్ బేస్‌డ్ కోర్సులను ప్రవేశపెట్టి... ప్లేస్‌మెంట్స్‌ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

వర్శిటీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలి : రాంచంద్రయ్య
సెంటినరీ సెలబ్రేషన్స్ కోసం నివేదిక తయారు చేయనున్నట్లు.. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఓయూలో పరిశోధనలు పెంచేందుకు కృషి చేసి చేస్తామంటున్నారు. యూనివర్శిటీ అభివృద్ధికి... తాను తీసుకునే నిర్ణయాలకు అందరూ సహకరించాలని వీసీ రామచంద్రయ్య కోరుతున్నారు. 

09:42 - August 6, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణలో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీనికోసం భారత అంతరిక్షపరిశోధనా సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇస్రోఇస్తున్న సమాచారం గూగుల్‌ మ్యాప్‌లకంటే ఎంతో మెరుగ్గా ఉంటుందని... చీఫ్‌ఇంజనీర్‌ మొదలు.. ఫీల్డ్‌ఇంజనీర్‌ వరకు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి. దీనివల్ల నీటిపారుదల ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత పారదర్శకత వస్తుందని హరీశ్‌రావు అన్నారు. 

09:40 - August 6, 2016

బ్రెజిల్ : అతిపెద్ద విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్‌కు తెరలేచింది. రియో డిజెనీరోలోని మరకానా స్టేడియం శోభాయమానమైంది. బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడున్నర గంటలపాటు సాగిన ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యుత్ దీపాలు, బాణాసంచా వెలుగులతో స్టేడియం దేదీప్యమానమైంది. మైదానంలో ఆరువేల మంది కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. కల్చరల్ ఈవెంట్స్ అదుర్స్ అనిపించాయి. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించాడు.

భారత పతాకధారిగా ముందుకు నడిచిన అభినవ్‌ బింద్రా..
భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రా వేడుకల్లో జాతీయ జెండాతో భారత బృందాన్ని ముందుకు నడిపించారు. ఈ సారి ఒలింపిక్స్‌ బరిలో భారత్ నుంచి 118 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. వందమందికిపైగా భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.

ప్రధాన ఆకర్షణగా నిలిచిన  6వేలమంది కళాకారుల నృత్యాలు..
అతిపెద్ద విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్‌కు తెరలేచింది. రియో డిజెనీరోలోని మరకానా స్టేడియం శోభాయమానమైంది. బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడున్నర గంటలపాటు సాగిన ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యుత్ దీపాలు, బాణాసంచా వెలుగులతో స్టేడియం దేదీప్యమానమైంది. మైదానంలో ఆరువేల మంది కళాకారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. కల్చరల్ ఈవెంట్స్ అదుర్స్ అనిపించాయి. మైదానంలో 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

భారత్ నుంచి 118 మంది క్రీడాకారులు..
భారత్‌కు ఒలింపిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రా వేడుకల్లో జాతీయ జెండాతో భారత బృందాన్ని ముందుకు నడిపించారు. ఈ సారి ఒలింపిక్స్‌ బరిలో భారత్ నుంచి 118 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. వందమందికిపైగా భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.

09:35 - August 6, 2016

హైదరాబాద్ : తెలంగాణ స్టడీ సర్కిల్‌లో విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా... దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా... సంబంధిత అధికారులెవరూ విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడం లేదు. పోలీసులు దీక్షను భగ్నం చేసినా.. గదిలోనే నిరసన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.

డైరెక్టర్‌ను నియమించాలని విద్యార్ధుల డిమాండ్ ..
తెలంగాణ స్టడీ సర్కిల్‌కు ఇప్పటివరకూ డైరెక్టర్‌ను నియమించలేదని నిరసిస్తూ.. విద్యార్థులు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫ్యాకల్టీ లేక నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను భగ్నం చేసినప్పటికీ కొందరు విద్యార్థులు గదిలోనే హౌస్‌ అరెస్ట్‌ అయ్యి.. నిరసనను కొనసాగిస్తున్నారు.

దీక్షను పట్టించుకోని అధికారులు ఆందోళనలో విద్యార్ధులు..
గదిలో దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికీ 30శాతం సిలబస్ కూడా పూర్తికాకుండానే... శిక్షణ తరగతులు అయిపోయయాని అధికారులు చెబుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్దుల దీక్షకు మద్ధతు పలికిన వీహెచ్..
ఇటు విద్యార్థులు చేస్తున్న దీక్షకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు దీక్ష చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించకుంటే ఉద్యమం ఉదృతం : విద్యార్ధులు
ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే... పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

ఇస్రోతో టీ.సర్కార్ కీలక ఒప్పందం...

హైదరాబాద్ : ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జలవనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. ఉపగ్రహం సహకారంతో జలవనరుల సమాచారం విశ్లేషించనుంది. ఆచార్య జయశంకర్ జయంతి రోజున ఒప్పందం కుదుర్చుకున్నందురు సంతోషంగా వుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇదొక సరికొత్త అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ఇరిగేషన్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించుకున్న తొలిరాష్ట్రం అని ఆయన అన్నారు.   

చెట్టును ఢీకొన్న బస్సు..10మందికి గాయాలు..

కడప: కడప జిల్లా చిన్నమండెం సమీపంలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి కడప వస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

బురఖాలను కాల్చిన ముస్లిం మహిళలు..

హైదరాబాద్ : బురఖాలను కాల్చి సంబరాలు చేసుకున్నారంటే వారెంత నరకం అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లపాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రపాలనలో నలిగిపోయిన సిరియాలోని మాంబిజ్ నగరాన్ని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్‌డీఎఫ్) తిరిగి స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులను తరిమి తరిమి కొట్టింది. ఉగ్రవాదుల పీడ విరగడైపోవడంతో స్వేచ్ఛా వాయువులు పీల్చిన ప్రజలు ఆనందంగా రోడ్లపైకి వచ్చారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. మహిళలు తమ బురఖాలకు నిప్పటించి నాట్యం చేశారు. ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న నగరం రెండేళ్లలో తామెంత నరకం అనుభవించిందీ చెప్పుకొచ్చారు.

మాజీ మున్సిపల్‌ చైర్మన్ మృతి..

పశ్చిమగోదావరి : పాలకొల్లు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్టి సుజాత(57) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుజాత తుదిశ్వాస విడిచారు. 

నేడి నుండి వెబ్ ఆప్షన్ల నమోదు..

గుంటూరు : డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఎంబీబీస్‌, బీడీఎస్‌ వెబ్‌ ఆధారిత కళాశాలల ఎంపిక ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. 6 నుంచి 8వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. శనివారం ఉదయం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్టీఆర్‌ వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ టి.రవిరాజు వెల్లడించారు. 1 నుంచి 5వేల ర్యాంకుల వరకూ అభ్యర్థులు 6, 7 తేదీల్లో, 5వేల నుంచి చివరి ర్యాంకు వరకూ 7, 8 తేదీల్లో నమోదు చేసుకోవాలి. 10న కళాశాలలను కేటాయిస్తారు.

నేడే ఎంసెట్ -3 కమిటీ సమావేశం..

హైదరాబాద్‌: ఎంసెట్‌-3కు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు, పరీక్ష ఏర్పాట్లపై చర్చించేందుకు ఎంసెట్‌ కమిటీ శనివారం ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌లో భేటీ కానుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ ఛైర్మన్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్‌ యాదయ్య, ఇతర సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. ఎంసెట్‌-3 ప్రారంభం, హాల్‌టికెట్ల జారీ, ప్రాథమిక కీ, ఫలితాలు విడుదల తదితర షెడ్యూల్‌ వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం ఈనెల 8న నిర్వహించాలని నిర్ణయించారు.

'టీ' త్రాగి నలుగురు మృతి?!..

ఉత్తరప్రదేశ్ : నీరు ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆరైయా జిల్లాలోని బేలా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అమృత్‌పూర్ గ్రామానికి చెందిన రాణి(22) తన ముగ్గురు పిల్లలు మున్సి(8), ఉపాసన(3), కనహియా(7)టీ తయారుచేసి తాను తాగి పిల్లలకు కూడా ఇచ్చింది. టీ తాగిన అనంతరం అందరూ ఒక్కసారిగా కుప్పకూలి కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టీ విషపూరితంగా మారడం వల్లే వారు మృతి చెంది ఉంటారని సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

నేడు ఆచార్య జయశంకర్ జయంతి..

హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ జయంత్యుత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో జరిగే ఉత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొని నివాళులర్పినున్నారు. జయశంకర్‌ జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని సీఎస్‌ రాజీవ్‌శర్మ అన్ని శాఖల అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతీ కార్యాలయం, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని.. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన చేసిన కృషి వివరించాలని సూచించారు.

07:51 - August 6, 2016

ఏపీ రాజకీయాలు ఢిల్లీలో మరింత వేడెక్కాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ అధికార ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈక్రమంలో ప్రత్యేక హోదా బిల్లును బీజేపీ మరోసారి కోల్డ్ స్టోరేజీలో పడేసింది. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును మనీ బిల్లు అంటూ ఆర్థికమంత్రి జైట్లీ శుక్రవారం రాజ్యసబలో అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ ఏపీని మోసం చేసిందంటూ ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీతోపాటు పలువురు నేతలతో భేటీ అయ్యారు.ఈ పర్యటనలో పుష్కరాలకు పిలుపు ప్రధానంగా వున్నా ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్నే ప్రధాని మోదీతోనూ..భేటీ అయిన నేతలతోనూ చర్చించానని చంద్రబాబు పేర్కొంటున్నారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని ప్రధాని అన్నారంటూ ఈరోజు దినపత్రికల్లో వార్తలు హైలెట్ చేశాయి.ఏపీకి  ప్రత్యేక హోదాపై నెలకొన్న పరిస్థితులపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో కొండా రాఘవరెడ్డి (వైసీపీ నేత), చందు సాంబశివరావు (టీడీపీ నేత), నలబోలు విష్ణు (బీజేపీ నేత) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న నేతలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..మరింత సమాచారం తెలుసుకోండి..

07:40 - August 6, 2016

విజయవాడ :విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాల పనులలో భాగంగా విజయవాడకే తలమానికమైన ప్రకాశం బ్యారేజ్ కొత్త శోభను సంతరించుకుంది. పుష్కరాల సందర్భంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ కాంతులతో కనువిందు చేసింది. సీఎం చంద్రబాబు ఎల్‌ఈడీ బల్బుల లైటింగ్‌ను ప్రారంభించారు. బ్యారేజీ పొడవునా రకరకాల కాంతులతో విరజిమ్మిన లైటింగ్ చూపరులను ఆకట్టుకుంది. ఈ వెలుగులను చూడటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. 

07:38 - August 6, 2016

మెదక్ : ప్రధాని తెలంగాణ టూర్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని మెదక్ జిల్లా పర్యటనకు ఇంకా ఒక్కరోజే గడువు మిగిలి ఉండడంతో ప్రభుత్వం ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికగా చేస్తోంది. ప్రధాని సభకు సుమారు 2లక్షలమంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. జిల్లా మంత్రి హరీష్‌రావు, కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు.

పనులను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రోజ్..
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ప్రధాని రాష్ట్రంలో అడుగు పెడుతుండడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లను చేస్తోంది. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తోంది రాష్ట ప్రభుత్వం. ప్రధాని, ముఖ్యమంత్రి, పలువురు కేంద్రమంత్రులు రానుండంతో సభాస్థలి వద్ద 5 హెలీపాడ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 10 కిలోమీటర్లమేర బారీకేడ్లను నిర్మించారు. కోమటిబండ చుట్టూ 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని ప్రారంభించబోయే మిషన్‌ భగీరథ పైలాన్‌ నిర్మాణం పూర్తికావొచ్చింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, సభాస్థలి నిర్మాణం పనుల పురోగతిని మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ దగ్గరుండి పర్యవేక్షించారు.

10 కిలోమీటర్ల మేర బారీకేడ్లు..కోమటిబండ పరిసరాల్లో 40 సీసీ కెమెరాలు
ఇక భద్రతాధికారులు సభా ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. 5 హెలీప్యాడ్‌లలో దిగనున్న హెలికాప్టర్లపై ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ట్రయల్ రన్‌ కూడా నిర్వహించారు. అయితే వర్షాలు కురుస్తున్నందున సభా స్థలిని మొత్తం వాటర్‌ప్రూఫ్‌్ టెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ఫలాలను తొలిసారిగా గజ్వేల్‌ ప్రజలకు అందించేందుకు వస్తున్న ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు.

ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్ రావు..కలెక్టర్ రోనాల్డ్ రోజ్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని పర్యటన ఏర్పాట్లలో మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ ఇద్దరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. వీళ్లిద్దరు తప్ప ఇతర మంత్రులు కానీ, ఉన్నతాధికారులుగానీ ప్రధాని ఏర్పాట్లలో కన్పించడంలేదు. మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టరే దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు. 

07:07 - August 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయమని మోడీకి విన్నవిస్తున్నారు. పర్యటనకు వచ్చే ముందు ఇవన్నీ ఆలోచించండి అంటున్నారు హస్తం నేతలు..

7వ తేదీన రాష్ట్ర ప‌ర్యట‌న‌కు ప్రధాని మోదీ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ప‌ర్యట‌న‌కు రానున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత తొలిసారి రాష్ట్రానికి వ‌స్తున్న ప్రధాని ప‌ర్యట‌న‌కు కెసీఆర్ స‌ర్కారు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

మోడీ పర్యటనపై టీకాంగ్ అభ్యంతరం
ఇదిలా ఉంటే ప్రధాని ప‌ర్యట‌న‌పై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ మాయ‌మాట‌లను న‌మ్మి మిషన్ భ‌గీర‌థ ప్రారంభోత్సవానికి రావొద్దని పీసీసీ ముఖ్యనేత‌లు మోడీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. త‌మ అభ్యంత‌రాలు ఆరోప‌ణ‌ల‌ను ఏక‌రువు పెడుతూ .. ఇప్పడికే మోడీకి లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.

కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసమేనంటున్న కాంగ్రెస్ ...
కేసీఆర్ వ్యక్తిగత ప్రచారం కోసమే మెదక్ జిల్లాలోని గజ్వేల్ లో ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేపట్టారని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి పేరుతో కాంగ్రెస్ చేప‌ట్టిన ప‌థ‌కానికి పేరు మార్చి .. ప్రధానితో ప్రారంభించటం సరికాదని వాదిస్తున్నారు. హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చేందుకు 2008లోనే ఎల్లంపల్లి జలాశయం నుంచి మొదటి దశ ప‌నుల‌ను ప్రారంభించిన సంగ‌తిని గుర్తుచేస్తున్నారు.

హామీల‌ను గుర్తుచేస్తున్నారు హ‌స్తం నేత‌లు..
టీఆర్ఎస్ తీరును ఓ వైపు ప్రధానికి చెబుతూనే.. మ‌రోవైపు విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌కు ఇచ్చిన హామీల‌ను గుర్తుచేస్తున్నారు హ‌స్తం నేత‌లు. ఖాజీపేటలో రైల్వే కోచ్, సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం, ఉద్యాన వర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయంపై మోడీ స్పష్టమైన ప్రక‌ట‌న చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

06:58 - August 6, 2016

ఢిల్లీ : కృష్ణా పుష్కరాలకు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ,వెంకయ్యనాయుడులను కలిసారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలో పేర్కొన్న హామీల గురించి ప్రధానితో మాట్లాడారు. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని ప్రధాన విషయాలు గురించి ఇరువురు చర్చించారు.

విభజన హామీల అమలుపై ప్రధానితో చర్చించా-చంద్రబాబు
విభజనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించారు. విభజన బిల్లు సమయంలో అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి తప్పనిసరని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తెలంగాణ కంటే వెనుకబడి ఉందని.. మరో రెండేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు.దీనిపై మోదీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగకుండా చూస్తామని.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లా-బాబు
ఏపీకి లోటు బడ్జెట్‌ ఉందని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని.. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రపైనే ఉందనే విషయాన్ని బాబు గుర్తు చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ తరహాలో పరిశ్రమలకు ప్యాకేజీ ఇస్తామని ప్రధాని చేసిన హామీని ప్రస్తావించారు. పోలవరం 2018లోగా పూర్తి కావాలని.. దానికి అనుగుణంగా నిధులు ఇవ్వాలని మోదీని కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఆర్థిక లోటుతో ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. దీనిపై ప్రధాని, కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.

06:48 - August 6, 2016

బ్రెజిల్‌ : క్రీడా ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అతిపెద్ద సంబరం ఒలింపిక్స్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రెజిల్‌లోని మరకానాలో స్టేడియంలో ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడున్నర గంటలపాటు ఈ ఓపెనింగ్‌ వేడుకలు కొనసాగుతున్నాయి. దేశంలోని అత్యుత్తమ గాయకులు పాడే పాటలతో పాటు... దెబోరా కోల్కర్‌ నేతృత్వంలో 6 వేల మందితో ప్రత్యేక నృత్య ప్రదర్శన చేస్తున్నారు. ఇక ఈ క్రీడా సంబురంలో మొత్తం 206 దేశాలు పాల్గొంటున్నాయి. 42 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. మొత్తం 10,500 మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 37 వేదికల్లో పోటీలు జరగనున్నాయి. ఈ నెల 21 వరకు క్రీడాభిమానులను పోటీలు అలరించనున్నాయి. భారత్‌ నుంచి 118 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. 

విద్యుత్ షాక్ తో 6 గురు రైతులకు గాయాలు..

మహబూబ్‌నగర్ : ఊట్కూరు మండలం పులిమామిడిలో ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తుండగా షాక్‌తో ఆరుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని సప్పటిబండ పొలాలకు విద్యుత్‌సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ మూడురోజుల కిందట పాడైపోయింది. దీంతో మరమ్మతు చేపట్టిన రైతులు ట్రాన్స్ ఫార్మర్ బిగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జలగరి నర్సింహులు, మౌలాలి, రాములు, గాదం వెంకటప్ప, చాంద్, వెంకటేశ్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం మక్తల్ దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో మౌలాలి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

పాల కల్తీపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ఢిల్లీ : కల్తీపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీని నివారించటానికి కఠినమైన చర్యలను తీసుకోవాలని, ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో ఈ మేరకు అవసరమైన మార్పులు చేయాలని పేర్కొంది. ఆహారకల్తీకి పాల్పడిన వారికి యావజ్జీవ ఖైదును శిక్షగా విధించే రీతిలో ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో చేసిన మార్పులను పరిశీలించాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది. పాలకల్తీని, కృత్రిమపాల అమ్మకాలను అడ్డుకోవాలంటూ స్వామి అచ్యుతానంద్ తీర్థ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. 

అట్టహాసంగా ప్రారంభమైన ఒలింపిక్స్ సంబరాలు..

హైదరాబాద్ : రియో 31 ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరకాన స్టేడియంలో ఒలింపిక్స్ వేడుకలను వైభవంగా ప్రారంభించారు. 31వ ఒలింపిక్స్ వేడుకల్లో 206 దేశాలు పాల్గొంటున్నాయి. రియోలో మొత్తం 131 పురుషుల ఈవెంట్స్, 31 మహిళా ఈవెంట్స్ ఉన్నాయి. టోర్నీలో 0,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ నుంచి అత్యధికంగా 107 మంది పోటీలకు అర్హత సాధించారు. 15 క్రీడల్లో 66 విభాగాల్లో భారత ఆటగాళ్లు పోటీపడుతున్నారు. భారత్ తరపున ప్రముఖ ఆటగాళ్లు లియాండర్‌ఫేస్, సానియామిర్జా, రోహన్‌బోపన్న, సైనాలు పాల్గొంటున్నారు. రియో ఒలింపిక్స్‌లో రష్యా తరపున 270 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

Don't Miss